BUFFET / tydiqa /te /tydiqa_8_21_dev.tsv
akariasai's picture
Upload 204 files
479c437
question: కంప్యూటర్ నెట్‌వర్క్‌ ఏ సంవత్సరంలో ప్రారంభమయింది ? context: పర్సనల్ కంప్యూటర్లు వినియోగిస్తున్న పెద్ద పెద్ద సంస్థలలో వివిధ డిపార్టుమెంటులలో జరిగే ప్రక్రియలను ఒకరికొకరు తెలుసుకొనుటకు నెట్‌వర్క్ లు ఆభివృద్ధి చేయబడినాయి. వీటివలన వ్యక్తిగత కంప్యూటర్లను ఒకదానికొకటి అనుసంధానము చేయగలము. ఒక కంప్యూటరులో వున్న ఖరీదయిన, విలువయిన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాము భాషలను, ప్యాకేజీలను ఇతర కంప్యూటర్లు కూడా వినియోగించుకొనగలవు. ఒకేఫైలుని 2, 3 కంప్యూటర్లలో ఒకేసారి నిల్వచేయ వీలవుతుంది. ఒక కంప్యూటరు పాడయి పోయినను వేరొక దాని నుండి మనకు కావలసిన ఫైలును పొందగలము. దీనినే క్లయింట్ - సర్వర్ మోడల్ అంటారు. పెద్ద పెద్ద సంస్థలలో దూరముగా వున్న విభాగములలో పని చేయు ఉద్యోగస్థులు అనుసంధించబడిన కంప్యూటర్ల ద్వారా సంభాషించగలరు. 1970లలో ప్రారంభమయిన ఈ ప్రక్రియ మొదట పెద్ద కంపెనీల వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. 1990 దశకములో ఇళ్ళకు, వ్యక్తిగత అవసరములకు కూడా ఇంటర్నెట్ రూపములో లభ్యమగుచున్నది. 1970లలో
question: నందమూరి తారక రామారావు జన్మస్థలం ఏది ? context: నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మునిసిపలు ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన ఆయనకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నాడు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతి కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు
question: బోస్ కార్పోరేషన్ ని ఏ సంవత్సరంలో స్థాపించారు ? context: బోస్ కార్పోరేషన్ (స్పీకర్లు, ఆమ్ప్లిఫయర్లు, హెడ్ ఫోన్లు, విలాసవంతమైన కార్లు [7][8] కొరకు ఆటోమోటివ్ సౌండ్ సిస్టాలు [9]), ఆటోమోటివ్ సస్పెన్షన్ సిస్టంల వంటి ఆడియో పరికరాల అభివృద్ధి మరియు నిర్మాణంతోపాటు కొంత సాధారణ పరిశోధన కూడా జరుపును (డిబన్కింగ్ మరియు కోల్డ్ ఫ్యూషన్ వంటివి[10][11][12]). ఈ కంపెనీ మస్సాచుసెట్ట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీలో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ అయినటువంటి (2005 లో పదవీ విరమణ పొందిన) అమర్ జి. బోస్చే 1964 లో స్థాపించబడింది. బోస్ సంస్థకు అమెరికా సంయుక్త రాష్ట్రాల మిలిటరీ (నావికాదళం[13], వాయుదళం[14] మరియు పదాతిదళం[15]) మరియు నాసాలతో ఒప్పందాలు ఉన్నాయి.[16] అమర్ బోస్ ఇప్పటికీ ఈ సంస్థకు అధ్యక్షుడు మరియు ప్రధాన వాటాదారునిగానే కాక టెక్నికల్ డైరెక్టర్ పదవిలో కూడా ఉన్నారు.[17] 1964
question: రేడియోను మొదటగా ఎవరు కనుగొన్నారు? context: మార్కోనీ కనుగొన్న పరికరం మాత్రం విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. ప్రజా జీవనంలో దీని మహత్తర ఉపయోగాన్ని ఎలుగెత్తి చాటే సంఘటనలు కొన్ని జరిగాయి. 1909 లో రెండు పడవలు సముద్ర మద్యంలో ఢీ కొన్నాయి. వైర్ లెస్ ద్వారా తీరానికి సమాచారం వెంటనే అందించకపోయి ఉంటే 1700 మంది ప్రయాణీకులు మునిగిపోయే వారు. ఒకసారి డాక్టర్ క్రిపెన్ అనే హంతకుడు ఇంగ్లండ్ నుండి కెనడాకి వెళ్ళే ఓడలో ప్రయాణం చేస్తుండగా ఆ ఓడ అధికారి వైర్ లెస్ ద్వారా ఈ సమాచారాన్ని స్కాట్లండ్ యార్డ్ కి తెలిపాడు. ఫలితంగా ఆ ఓడ కెనడా చేరగానే పోలీసులు అతడిని బంధించారు. మార్కోనీ
question: వన్డే వరల్డ్ కప్ ని భారతదేశం ఏ సంవత్సరంలో గెలుచుకుంది ? context: 1983 టోర్నీకి కూడా ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చింది, ఇంగ్లాండ్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈసారి టోర్నీ సమయానికి శ్రీలంక టెస్ట్ హోదా పొందింది, ICC ట్రోఫీ ద్వారా జింబాబ్వే ప్రపంచ కప్‌లో ఆడేందుకు అర్హత సాధించింది. ఈ టోర్నీ నుంచి ఫీల్డింగ్ సర్కిల్‌ను పరిచయం చేశారు, స్టంప్‌లకు ఇది 30 yards (27m) దూరంలో ఉంటుంది. అన్ని సమయాల్లో ఈ వలయానికి లోపల నలుగురు ఫీల్డర్లు ఉండాలి.[16] ఈ టోర్నీ ఫైనల్‌లో భారతదేశం 43 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.[10][17] 1983
question: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటి? context: రాష్ట్ర రాజధాని షిమ్లా. ధర్మశాల, కాంగ్ర, మండి, కుల్లు, చంబా, డల్‌హౌసీ మరియు మనాలీ ఇతర ముఖ్య పట్టణాలు. రాష్ట్రములో చాలామటుకు ప్రాంతము పర్వతమయము. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన శివాలిక్ పర్వతశ్రేణులు ఉన్నాయి. శివాలిక్ శ్రేణి ఘగ్గర్ నది జన్మస్థలము. రాష్ట్రములోని ప్రధాన నదులు సట్లెజ్ (భాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు ఈ నది మీదే ఉన్నది) మరియు బియాస్ నది. సట్లెజ్ నది మీద కంద్రౌర్, బిలాస్‌పూర్ వద్ద నున్న బ్రిడ్జి ఆసియాలో కెళ్లా ఎత్తైన వంతెనలలో ఒకటి. షిమ్లా
question: జీవన తరంగాలు చిత్ర దర్శకుడు ఎవరు? context: జీవన తరంగాలు తాతినేని రామారావు దర్శకత్వంలో 1973 సంవత్సరంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి యద్దనపూడి సులోచనారాణి రచించిన ఇదే పేరు గల నవల ఆధారం. సురేష్ మూవీస్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి జె. వి. రాఘవులు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. తాతినేని రామారావు
question: భారతదేశ రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? context: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India-RBI) భారతదేశపు కేంద్ర బ్యాంకు. ఈ బ్యాంకును 1935, ఏప్రిల్ 1 న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 ప్రకారము స్థాపించారు. స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన స్థావనం కోల్‌కతలో ఉండేది. తర్వాత ముంబాయి నగరంలో ఉంది. ప్రారంభంలో ఇది ప్రైవేటు అజమాయిషిలో ఉన్ననూ 1949లో జాతీయం చేయబడిన తర్వాత భారత ప్రభుత్వం అధీనంలో ఉంది. ముంబాయి