|
context: పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం వెలకు 250 రూపాయలు. answers: మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో పొట్టి శ్రీరాములు ఎక్కడ జన్మించాడు? |
|
context: జార్జి ఈస్ట్‌మన్ మరియు హెన్రీ ఏ. స్ట్రాంగ్ లు కలసి 1888 సెప్టెంబరు 4 న కొడాక్ సంస్థను ప్రారంభించారు. 20వ శతాబ్దంలో ఎక్కువ భాగం ఫోటోగ్రఫిక్ ఫిలింను కొడాక్ శాసించింది. అప్పట్లో కొడాక్ ఫిలింలో ఎంతగా వేళ్ళూనుకుపోయిందంటే, ఏదయినా ఒక ముఖ్య ఘట్టాన్ని నమోదు చేయటాన్ని కొడాక్ మొమెంట్ (కొడాక్ క్షణం) అని వ్యవహరించటం పరిపాటిగా ఉండేది. 1990 లో డిజిటల్ ఫోటోగ్రఫికి పెరుగుతోన్న ఆదరణతో, కొడాక్ ఈ మార్పుకు పరివర్తన చెందలేకపోవటంతో సంస్థను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనితో కొడాక్ డిజిటల్ ఫోటోగ్రఫి మరియు డిజిటల్ ప్రింటింగ్ ల పై దృష్టి కేంద్రీకరించింది. answers: జార్జి ఈస్ట్‌మన్ మరియు హెన్రీ ఏ. స్ట్రాంగ్ ఈస్ట్‌మన్ కొడాక్ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు? |
|
context: మేలవోయి, అనంతపురం జిల్లా, మడకశిర మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 515301.[1]ఇది మండల కేంద్రమైన మడకశిర నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హిందూపురం నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2466 ఇళ్లతో, 10715 జనాభాతో 4863 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5472, ఆడవారి సంఖ్య 5243. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2574 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 870. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595358[2].పిన్ కోడ్: 515301. answers: 4863 హెక్టార్ల మేలవోయి గ్రామ విస్తీర్ణం ఎంత? |
|
context: ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై పుప్పాల రమేశ్ నిర్మించిన సినిమా మిరపకాయ్. రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్, ప్రకాష్ రాజ్, నాగేంద్ర బాబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా జనవరి 13, 2011న విడుదలై ఘనవిజయం సాధించింది. answers: పుప్పాల రమేశ్ మిరపకాయ్ చిత్ర నిర్మాత ఎవరు? |
|
context: "ంమొబైల్ ఫోన్ " అనే ఇంగ్లీషు మాటని తెలుగులో దూరవాణి అంటున్నారు. "టెలి" అంటే దూరం, "ఫోన్" అంటే శబ్దం కనుక ఈ దూరవాణి అనే పేరు అర్థవంతంగానే ఉంది. పూర్వకాలంలో ఈ టెలిఫోనులు గోడకి తగిలించో, బల్ల మీదనో, కదలకుండా ఒక చోట పడి ఉండేవి. కనుక ఫోనులో మాట్లాడాలంటే మనం ఫోను దగ్గరకి వెళ్లాల్సి వచ్చేది. దరిమిలా ఫోనుని ఎక్కడకి పెడితే అక్కడకి చేత్తో పట్టుకుపోయే సౌకర్యం మొట్టమొదట జపానులోని టోకియో నగరంలో, 1979 లో, వచ్చింది. ఈ రకం టెలిఫోనుని ఇంగ్లీషులో "మొబైల్ ఫోన్" అనడం మొదలు పెట్టేరు. "మొబైల్" అంటే తేలికగా కదలగలిగేది లేదా చలించగలిగేది. కనుక ఈ జాతి టెలిఫోనులని న్యాయంగా "చలన వాణి" అనో "చలవాణి" అనో అనాలి. కాని ఎందుకనో దీనిని తెలుగులో "చరవాణి" అంటున్నారు. తీగలతో గోడకి అతుక్కుపోకుండా విశృంఖలంగా ఉండే సదుపాయం ఉంది కనుక వీటిని నిస్తంతి ("వైర్లెస్") పరికరాలు అని కూడా అననొచ్చు. టోకియోలో జరిగిన ప్రయోగం విజయవంతం అవడంతో ఈ పద్ధతి ఐరోపా లోని కొన్ని దేశాలలో వ్యాపించింది. చివరికి 1983 లో మోటరోలా కంపెనీ అమెరికాలో ఈ రకం టెలిఫోనులకి ప్రాచుర్యం కల్పించింది. అప్పుడు దీని బరువు 2.2 పౌండ్లు (1kg). అమెరికాలో పట్టణాలు విశాలమైన జాగాలలో విస్తరించి ఉండడం వల్ల, కారుల వాడకం ఎక్కువ అవడం వల్ల ఈ చేతిలో ఇమిడే టెలిఫోనులు ఇల్లు దాటి చాల దూరం వెళ్లే అవకాశం ఉంది. ఈ పరిస్థితులకి అనుకూలంగా ఉండాలని మోటరోలా కంపెనీ, తేనెపట్టులో గదుల మాదిరి, ఒక నిస్తంతి వలయం (సెల్యులార్ నెట్వర్క్) రూపొందించి, ఆ వలయంలో ఈ టెలిఫోనులు పనిచేసే సాంకేతిక వాతావరణం సృష్టించింది. అందుకని, అప్పటినుండి అమెరికాలో ఈ చరవాణిని "సెల్యులార్ ఫోన్" అనిన్నీ, "సెల్ ఫోన్" అనిన్నీ, చివరికి "సెల్" అనిన్నీ పిలవడం మొదలు పెట్టేరు. ఈ సాంకేతిక పరిధిని మొదటి తరం (1G or First Generation) అని కూడా అంటారు. తరువాత ఫిన్లండులో, 1991లో, రెండవ తరం (2G) ఫోనులు వచ్చేయి. అటు పిమ్మట 2001 లో మూడవ తరం (3G), తరువాత అంచెలంచెల మీద నాలుగవ తరం (4G) ఫోనులు వాడుకలోకి వచ్చేయి. ఈ తరాల మార్పుతో సరితూగుతూ కొత్త కొత్త వెసులుబాట్లు ("ఫీచర్స్") తో ఫోనులు బజారులోకి వస్తున్నాయి. ఎన్ని తరాలు మారినా, కొన్ని కనీస అవసరాలకి ఆసరగా ఈ చరవాణిలో కొన్ని వెసులుబాట్లు ఉంటూ వచ్చేయి: చరవాణి పని చెయ్యడానికి అత్యవసరమైన విద్యుత్తుని సరఫరా చెయ్యడానికి లిథియం అణుశకలాలతో పనిచేసే ఒక విద్యుత్ ఘటం (Lithium-ion battery cell). చేతిలో ఇమిడే అంత చిన్న చరవాణిలో టెలిఫోను నంబర్లు ఎక్కించడానికి కావలసిన మీటల ఫలకం ("కీ బోర్డ్") ఇమడ్చడానికి చోటు సరిపోదు. అందుకని స్పర్శతో స్పందించ గలిగే స్పర్శ ఫలకం లేదా తాకు తెర ("టచ్ పేడ్") కావలసి వచ్చింది. మన ఫోను నుండి ఇతరుల ఫోనులకి చేరుకోడానికి ఒక మార్గం సృష్టించడానికి ఒక "మధ్యవర్తి" ఉండాలి. ఈ మధ్యవర్తిని "సెల్యులార్ ఆపరేటర్" అంటారు. ఫోను వాడకానికి మనం రుసుం చెల్లిస్తే ఈ మధ్యవర్తి వాడుకరులకి ఒక "సిం కార్డ్" (SIM Card or Subscriber Identity Module card) ఇస్తాడు. ఈ సిం కార్డ్ ని చరవాణి లోపలికి దోపితే చరవాణి ప్రాణం పుంజుకుని పని చెయ్యడం మొదలు పెడుతుంది. సిం కార్డుల యొక్క సైజు తపాలా బిల్లా అంత ఉంటుంది. సిం కార్డులకు కూడా ఇండియాలో చాలా "సెల్యులార్ ఆపరేటర్" కంపెనీలు ఉన్నాయి. అందులో ఉన్న కొన్ని ముఖ్యమైనవి ఎయిర్టెల్, డొకమో, వోడాఫోన్ మొదలైనవి. answers: మోటరోలా మొట్టమొదటి మొబైల్ ఫోన్ ని ఏ సంస్థ తయారుచేసింది ? |
|
context: ఆనెపూడి (నడిమి ఖండ్రిక) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దొరవారిసత్రం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన దొరవారిసత్రం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గూడూరు నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 141 ఇళ్లతో, 541 జనాభాతో 374 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 259, ఆడవారి సంఖ్య 282. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 41 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 160. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 592697[1].పిన్ కోడ్: 524123. answers: 524123 ఆనెపూడి గ్రామ పిన్ కోడ్ ఏంటి? |
|
context: ఆనంది బెన్ పటేల్ మెహసాన జిల్లాలోని విజపూర్ తాలూకాకు చెందిన ఖరోడ్ జిల్లాలో నవంబరు 21 1941 న జన్మించారు. ఆమె తండ్రి జేథాభాయి ఒక సాధారన రైతు. ఆమె 4వ గ్రేడు వరకు విద్యను స్థానికంగా ఉన్న బాలికల పాఠశాలలో పూర్తిచేశారు. కానీ దగ్గరలో బాలికల పాఠశాల లేనందువల్ల తదుపరి విద్యాభ్యాసాన్ని బాలుర పాఠశాలలో చేరారు. ఆ పాఠశాలలో గల 700 మంది బాలురలో ఒకతే బాలిక ఆమె.ఆమె 8 వ గ్రేడు విద్యాభ్యాసం కోసం విశనగర్ లో గల సూతన్ సర్వ విద్యాలయంలో చేరారు. ఆమె అథ్లెటిక్స్ లో సాధించిన విజయాలకు గానూ "వీరబాల" అవార్డును అందుకున్నారు.[1] answers: నవంబరు 21 1941 ఆనందిబెన్ జేతాభాయి పటేల్ ఎప్పుడు జన్మించింది? |
|
context: శశిరేఖ పరిణయం 2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో తరుణ్, జెనీలియా ప్రధాన పాత్రలు పోషించారు. answers: కృష్ణవంశీ శశిరేఖా పరిణయం చిత్ర దర్శకుడు ఎవరు? |
|
|