text: విడాకులు తీసుకుని తల్లిదండ్రులతో కలిసి కొంతకాలం ఉన్న డేవిడ్ వెర్కింగ్, తన 25 వేల డాలర్ల (రూ.18 లక్షలకు పైగా) విలువ చేసే పోర్న్ సినిమాల కలెక్షన్‌ను తల్లిదండ్రులు ధ్వంసం చేశారని ఆరోపించారు. తల్లిదండ్రులు మాత్రం వాటిని ఇంట్లోకి తీసుకురావద్దని అతడికి చాలా సార్లు చెప్పామని, కానీ వినలేదని వాదిస్తున్నారు. ఇంటికి యజమానులే అయినా కొడుకు వస్తువులను ధ్వంసం చేసే హక్కు తల్లిదండ్రులకు లేదని జడ్జి తన తీర్పులో చెప్పారు. విడాకులు తీసుకున్న వెర్కింగ్స్ 10 నెలలపాటు మిచిగన్‌లోని గ్రాండ్ హెవెన్‌లో తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నారు. 2017లో ఆ ఇంటి నుంచి వెళ్లిపోయాక, ప్రస్తుతం ఇండియానాలో ఉంటున్నారు. "ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు నా దగ్గరున్న అత్యంత అరుదైన సినిమాల కలెక్షన్‌ను తల్లిదండ్రుల ఇంట్లోనే వదిలి వెళ్లాను. ఆ తర్వాత వాటికోసం వస్తే, అవి కనిపించలేదు" అని వెర్కింగ్స్ చెప్పారని హాలెండ్ సెంటినల్ దినపత్రిక చెప్పింది. తల్లిదండ్రులు తన వస్తువులను అక్రమంగా ధ్వంసం చేశారని ఆరోపిస్తూ 2019 ఏప్రిల్‌లో వెర్కింగ్ కోర్టుకు వెళ్లారు. ఆ సినిమా కలెక్షన్‌ను ఇండియానాకు చేర్చాలని తమకు అనిపించలేదని, అవి ఇంట్లో కూడా ఉండకూడదని భావించామని అతడి తల్లిదండ్రులు కోర్టుకు చెప్పారు. వెర్కింగ్ సినిమాల కలెక్షన్‌లో 12 పెట్టల నిండా పోర్నోగ్రఫీ, రెండు పెట్టెల నిండా సెక్స్ టాయ్స్ ఉన్నట్లు తండ్రీ, కొడుకుల మధ్య నడిచిన ఈమెయిళ్ల ద్వారా తెలుస్తోందని సెంటినెల్ పత్రిక రాసింది. ఆ ఈ మెయిళ్లలో "వెళ్లేటపుడు ఇంట్లో 1600కు పైగా డీవీడీలు, వీడియో టేపులు వదిలి వెళ్లానని" వెర్కింగ్ చెప్పగా, "అవన్నీ తీసుకెళ్లి పుణ్యం కట్టుకోవాలని తండ్రి ఆయనను కోరారని" పత్రిక వివరించింది.. కోర్టు తీర్పుతో వెర్కింగ్‌కు జరిగిన నష్టం ఎంతో తెలుసుకునే పనిలో ఉన్నామని తల్లిదండ్రుల తరఫు లాయర్ చెప్పారు. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి నెవడాలోని ఒక మ్యూజియం నిపుణుడి సాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. వెర్కింగ్‌కు ఎంత నష్టం జరిగిందో తల్లిదండ్రులు ఫిబ్రవరిలోపు కోర్టుకు వివరాలు సమర్పించాలి. ఇవి కూడా చదవండి. (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 42 ఏళ్ల కొడుకుకు సంబంధించిన పోర్న్ సినిమాల కలెక్షన్‌ను ధ్వంసం చేసిన తల్లిదండ్రులు, అతడికి పరిహారం చెల్లించాలని మిచిగన్‌లో ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. | |