diff --git "a/te/shard-10.txt" "b/te/shard-10.txt" new file mode 100644--- /dev/null +++ "b/te/shard-10.txt" @@ -0,0 +1,20534 @@ + +ఇది స్వేచ్ఛానకలుహక్కులతో సమష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి + + +అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు పాండవులు విప్రవేషం +బున నేకచక్రపురంబునందు వేదాధ్యయనంబు సేయుచు విప్రగృహంబున +నున్న కొన్నిదినంబులకు నొక్కబ్రాహ్మణుండు ద్రుపదుపురంబుననుండి చను +దెంచి విశ్రమార్థి యైన నాగృహస్థుండు వాని నభ్యాగతపూజల సంతుష్టుం +జేసి యున్నంతఁ గుంతీదేవి గొడుకులుం దాను నవ్విప్రు నతి ప్రీతి నుపాసించి +యయ్యా మీర లెందుండి వచ్చితి రేదేశంబులు రమ్యంబు లెందులరాజులు +సొలయక యెల్ల దేశములుఁ జూచితి నందుఁ బ్రసిద్దు లైన రా +జుల సుచరిత్రసంపదలుఁ జూచితి నా ద్రుపదేశుదేశముం +బొలుపున నొండు దేశములు పోల్పఁగ నెవ్వియు లేవు సద్గుణం +బులఁ బరు లెవ్వరున్ ద్రుపదుఁ బోలఁగలేరు ధరాతలంబునన్. +ఆ ద్రుపదుండు దనకూఁతు నగ్నికుండసముద్భవ యైన దాని నయోనిజ నగణ్య +పుణ్యలావణ్యగుణసమన్విత సమరూపుఁ డైన రాజపుత్త్రునకు వివాహంబు +సేయంగానక స్వయంవరంబు రచియించుచున్నవాఁ డనినం గుంతియు ధర్మ +తనయుండును విస్మితు లై యది యేమి కారణంబున నయోనిజ యయ్యె +నక్కన్య నెవ్విధంబున ద్రుపదుండు వడసె దీని సవిస్తరంబుగాఁ జెప్పు +ఇట్లు దనవలన విలువిద్య గఱచిన పాండవకౌరవకుమారులం జూచి ద్రోణుండు +నా కవమానంబు సేసిన యప్పాంచాలు నోడించి పట్టికొని తెం డిదియ నాకు +గురుదక్షిణ యగు నని పంచిన వల్లె యని యందఱు నా ద్రుపదుపయిం బోయి +వానిచేత నిర్జితు లయిన నర్జునుండు ద్రుపదుతోడ మహాయుద్ధంబు సేసి +వానిం బట్టికొని వచ్చి ద్రోణున కొప్పించిన నతండును. +ఉల్లసంబు లాడి యోడకు పొ మ్మని +రణరంగంబున ద్రోణు వధియించునట్టి కొడుకును నర్జునునకు దేవి యగునట్టి +కూఁతునుం బడయుదు నని బ్రహ్మవిదు లయిన బ్రాహ్మణులనివాసంబులకుం +జని నిత్యంబును బ్రాహ్మణోపాస్తి సేయుచు నొక్కనాఁడు గంగాకూలంబు +నందు వానప్రస్థవృత్తి నున్న యాజోపయాజులనువారి నిద్దఱ ననవరత +వ్రతవ్యాసక్తులం గాశ్యపగోత్రులం గని వారికి నమస్కరించి యందుఁ +గొండుక యయ్యును దపోమహిమ నెవ్వరికంటెఁ బెద్ద యైనవాని నుపయాజు +అనిన నుపయాజుం డే నిట్టిఫలంబు న పేక్షించ నెవ్వరేని ఫలార్థు లగుదు +రందుల కేఁగు మనిన ద్రుపదుండు వెండియు వానిన యొక్కసంవత్సరం +బారాధించిన నమ్ముని వాని కి ట్లనియె. +జనుచు నొక్కనాఁ డొక్కపం డొనరఁ గాంచి +కొనియె శుచి యగు శుచియుఁ గ�� దని యెఱుంగఁ +ఫలార్థి యయినవాఁడు తత్ఫలానుబంధంబు లయినదోషంబులు పరికింపండు +గావున నమ్మునివరుండు నీ కభిమతంబు సేయుం బొ మ్మనిన ద్రుపదుం డరిగి +సంపాదితకుటుంబభారుం డై ఘోరతపోవృత్తి నున్న యాజుం గని నమ +జననం బగునట్టి క్రతువు సద్విధిఁ గావిం +అని ప్రార్థించి వెండియు నా ద్రుపదుండు యాజున కి ట్లనియె. +య్యెడ నజితుఁడు గాన వాని హీనుంగాఁ జే +వడయుట యని పృషతసుతుఁడు ప్రార్థించె మునిన్. +అయ్యాజుండును యాజకత్వంబున కొడంబడి నీకోర్కికిం దగిన యట్టి కొడు +కునుం గూఁతురు బుట్టుదు రోడకుండు మని యజ్ఞోపకరణద్రవ్యంబులు సమ +కట్టికొని యథావిధి నుపయాజుండు సహాయుండుగా సౌత్రామణి యయిన +కోకిలాదేవి పత్నిగా ద్రుపదుం బుత్రకామేష్టి సేయించిన నందు మంత్రాహుతు +తలవిభాసిని దివ్యతేజముఁ దాల్చి యొక్కకుమారి ద +ఇట్లు పుట్టినయక్కొడుకునకుం గూఁతునకు ధృష్టద్యుమ్నుండును గృష్ణయు +ననునామంబు లాకాశవాణి జనవిదితంబుగా నుచ్చరించె నట్లు ద్రుపదుండు +లబ్ధసంతానుం డయి సంతసిల్లి యాజునకు యథోక్తదక్షిణ లిచ్చి బ్రాహ్మణు +లం బూజించి ధృష్టద్యుమ్నుని ధనుర్వేదపారగుం జేయించి యున్నంత +మానితు లైన పాండవకుమారులుఁ గుంతియు లక్కయింట ను +గ్రానలదగ్ధు లై రని ధరామరముఖ్యు లెఱింగి చెప్పఁగా +నే నెట్టు లొరులకు నీ నేర్తు నని దుఃఖ +దత్పురోహితుండు దా నిట్టు లనియె న +నెగ్గు లేదు వారి కెల్ల లగ్గు. +తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బదృశ్యుం డై యుండిన నతని గానక +శచీదేవి శోకింపంబోయిన సుప్రశ్రుతింజేసి బృహస్పతి దానికి దేవేంద్రా +గమనంబు సెప్పె నని వేదంబుల వినంబడుం గావున నేను నుపశ్రుతిం +జూచితి నిది దప్పదు పాండవులు పరలోకగతులు గారు పరమానందంబున +నున్నవారు వార లెందుండియు నిందులకు వత్తురు నీవును సుచిత్తుండ వయి +స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు మిది కన్యాదానంబునందు +రాజులకు శాస్త్రచోదితం బనినం బురోహితువచనంబునం జేసి యూఱడి ద్రుప +దుండు నేఁటికి డెబ్బదియే నగు దివసంబునం బౌషమాసంబున శుక్ల పక్షంబున +నష్టమియు రోహిణినాఁడు స్వయంవరం బని ఘోషింపం బంచి. +దాని విని పాండునందను లందులకుం బోవనున్నఁ గొడుకుల యభిప్రాయం బెఱింగి కుంతీదేవి యిట్లనియె. +మొడఁబడి యిం దెంతకాల మున్నను మన క +దక్షిణపాంచాలంబు గరంబు రమ్యం బనియును బాంచాలపతి పరమధార్మికుం డనియుని వింటిమి మఱి యత్లుంగాక. + + +అక్కథకుండు శౌనక���దిమహామునులకుం జెప్పె నట్లు పాండవులు విప్రవేషం +బున నేకచక్రపురంబునందు వేదాధ్యయనంబు సేయుచు విప్రగృహంబున +నున్న కొన్నిదినంబులకు నొక్కబ్రాహ్మణుండు ద్రుపదుపురంబుననుండి చను +దెంచి విశ్రమార్థి యైన నాగృహస్థుండు వాని నభ్యాగతపూజల సంతుష్టుం +జేసి యున్నంతఁ గుంతీదేవి గొడుకులుం దాను నవ్విప్రు నతి ప్రీతి నుపాసించి +యయ్యా మీర లెందుండి వచ్చితి రేదేశంబులు రమ్యంబు లెందులరాజులు +సొలయక యెల్ల దేశములుఁ జూచితి నందుఁ బ్రసిద్దు లైన రా +జుల సుచరిత్రసంపదలుఁ జూచితి నా ద్రుపదేశుదేశముం +బొలుపున నొండు దేశములు పోల్పఁగ నెవ్వియు లేవు సద్గుణం +బులఁ బరు లెవ్వరున్ ద్రుపదుఁ బోలఁగలేరు ధరాతలంబునన్. +ఆ ద్రుపదుండు దనకూఁతు నగ్నికుండసముద్భవ యైన దాని నయోనిజ నగణ్య +పుణ్యలావణ్యగుణసమన్విత సమరూపుఁ డైన రాజపుత్త్రునకు వివాహంబు +సేయంగానక స్వయంవరంబు రచియించుచున్నవాఁ డనినం గుంతియు ధర్మ +తనయుండును విస్మితు లై యది యేమి కారణంబున నయోనిజ యయ్యె +నక్కన్య నెవ్విధంబున ద్రుపదుండు వడసె దీని సవిస్తరంబుగాఁ జెప్పు +ఇట్లు దనవలన విలువిద్య గఱచిన పాండవకౌరవకుమారులం జూచి ద్రోణుండు +నా కవమానంబు సేసిన యప్పాంచాలు నోడించి పట్టికొని తెం డిదియ నాకు +గురుదక్షిణ యగు నని పంచిన వల్లె యని యందఱు నా ద్రుపదుపయిం బోయి +వానిచేత నిర్జితు లయిన నర్జునుండు ద్రుపదుతోడ మహాయుద్ధంబు సేసి +వానిం బట్టికొని వచ్చి ద్రోణున కొప్పించిన నతండును. +ఉల్లసంబు లాడి యోడకు పొ మ్మని +రణరంగంబున ద్రోణు వధియించునట్టి కొడుకును నర్జునునకు దేవి యగునట్టి +కూఁతునుం బడయుదు నని బ్రహ్మవిదు లయిన బ్రాహ్మణులనివాసంబులకుం +జని నిత్యంబును బ్రాహ్మణోపాస్తి సేయుచు నొక్కనాఁడు గంగాకూలంబు +నందు వానప్రస్థవృత్తి నున్న యాజోపయాజులనువారి నిద్దఱ ననవరత +వ్రతవ్యాసక్తులం గాశ్యపగోత్రులం గని వారికి నమస్కరించి యందుఁ +గొండుక యయ్యును దపోమహిమ నెవ్వరికంటెఁ బెద్ద యైనవాని నుపయాజు +అనిన నుపయాజుం డే నిట్టిఫలంబు న పేక్షించ నెవ్వరేని ఫలార్థు లగుదు +రందుల కేఁగు మనిన ద్రుపదుండు వెండియు వానిన యొక్కసంవత్సరం +బారాధించిన నమ్ముని వాని కి ట్లనియె. +జనుచు నొక్కనాఁ డొక్కపం డొనరఁ గాంచి +కొనియె శుచి యగు శుచియుఁ గా దని యెఱుంగఁ +ఫలార్థి యయినవాఁడు తత్ఫలానుబంధంబు లయినదోషంబులు పరికింపండు +గావున నమ్మునివరుండు నీ కభిమతంబ��� సేయుం బొ మ్మనిన ద్రుపదుం డరిగి +సంపాదితకుటుంబభారుం డై ఘోరతపోవృత్తి నున్న యాజుం గని నమ +జననం బగునట్టి క్రతువు సద్విధిఁ గావిం +అని ప్రార్థించి వెండియు నా ద్రుపదుండు యాజున కి ట్లనియె. +య్యెడ నజితుఁడు గాన వాని హీనుంగాఁ జే +వడయుట యని పృషతసుతుఁడు ప్రార్థించె మునిన్. +అయ్యాజుండును యాజకత్వంబున కొడంబడి నీకోర్కికిం దగిన యట్టి కొడు +కునుం గూఁతురు బుట్టుదు రోడకుండు మని యజ్ఞోపకరణద్రవ్యంబులు సమ +కట్టికొని యథావిధి నుపయాజుండు సహాయుండుగా సౌత్రామణి యయిన +కోకిలాదేవి పత్నిగా ద్రుపదుం బుత్రకామేష్టి సేయించిన నందు మంత్రాహుతు +తలవిభాసిని దివ్యతేజముఁ దాల్చి యొక్కకుమారి ద +ఇట్లు పుట్టినయక్కొడుకునకుం గూఁతునకు ధృష్టద్యుమ్నుండును గృష్ణయు +ననునామంబు లాకాశవాణి జనవిదితంబుగా నుచ్చరించె నట్లు ద్రుపదుండు +లబ్ధసంతానుం డయి సంతసిల్లి యాజునకు యథోక్తదక్షిణ లిచ్చి బ్రాహ్మణు +లం బూజించి ధృష్టద్యుమ్నుని ధనుర్వేదపారగుం జేయించి యున్నంత +మానితు లైన పాండవకుమారులుఁ గుంతియు లక్కయింట ను +గ్రానలదగ్ధు లై రని ధరామరముఖ్యు లెఱింగి చెప్పఁగా +నే నెట్టు లొరులకు నీ నేర్తు నని దుఃఖ +దత్పురోహితుండు దా నిట్టు లనియె న +నెగ్గు లేదు వారి కెల్ల లగ్గు. +తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బదృశ్యుం డై యుండిన నతని గానక +శచీదేవి శోకింపంబోయిన సుప్రశ్రుతింజేసి బృహస్పతి దానికి దేవేంద్రా +గమనంబు సెప్పె నని వేదంబుల వినంబడుం గావున నేను నుపశ్రుతిం +జూచితి నిది దప్పదు పాండవులు పరలోకగతులు గారు పరమానందంబున +నున్నవారు వార లెందుండియు నిందులకు వత్తురు నీవును సుచిత్తుండ వయి +స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు మిది కన్యాదానంబునందు +రాజులకు శాస్త్రచోదితం బనినం బురోహితువచనంబునం జేసి యూఱడి ద్రుప +దుండు నేఁటికి డెబ్బదియే నగు దివసంబునం బౌషమాసంబున శుక్ల పక్షంబున +నష్టమియు రోహిణినాఁడు స్వయంవరం బని ఘోషింపం బంచి. +దాని విని పాండునందను లందులకుం బోవనున్నఁ గొడుకుల యభిప్రాయం బెఱింగి కుంతీదేవి యిట్లనియె. +మొడఁబడి యిం దెంతకాల మున్నను మన క +దక్షిణపాంచాలంబు గరంబు రమ్యం బనియును బాంచాలపతి పరమధార్మికుం డనియుని వింటిమి మఱి యత్లుంగాక. + + +అందులకుం బోవుద మనినం గొడుకులెల్ల వల్లె యని మీపంచినవిధంబ +చేయంగలవార మని యొడంబడి తమయున్న యింటి బ్రాహ్మణునకుం జెప్పి +పాండ���ులు ద్రుపదుపురంబున కరుగుచు వ్యాసమహర్షిం గనుట:- +ఉరుసరసీవనంబులు మహో గ్రనగంబులు నేఱులున్ సుదు +స్తరవిపినంబులుం గడచి ధన్యులు పాండుకుమారకుల్ నిరం +తరగతి నేఁగుచుం గనిరి ధర్మసమేతుఁ బితామహుం దమో +హరు హరిమూర్తి నార్తిహరు నాదిమునీంద్రుఁ బరాశరాత్మజున్. +కని వినయమ్మున నమ్మునీంద్రునకు నందఱు నమస్కారంబు సేసిన వారలం జూచి కరుణారసపూరితాంతఃకరణుం డయి వ్యాసభట్టారకుం డిట్లనియె. +వేఁడుము వర మన్న వేడ్కతోఁ బతిదాన +హరుఁడు కరుణ నిచ్చె నది యిప్డు పాంచాల +మీరు ద్రుపదుపురంబునకుం జక్క నరుగునది యందు మీకు ల గ్గగు నని +చెప్పి కృష్ణద్వైపాయనుం డరిగినఁ బాండునందనులు జననీసహితం బనవర +తంబు రాత్రులుం బగళ్ళును బయనంబు బోవువా రొక్కనాఁ డర్థరాత్రంబున గంగయందు సోమశ్రవం బను తీర్థంబున స్నానార్థు లై యర్జునుండు ప్రకాశార్థంబును రక్షణార్థంబునుం గా నొక్కకొఱవి సేతఁ బట్టుకొని ముందఱం బోవ నందఱు నరుగునెడ నంగారపర్ణుఁ డను గంధర్వుం డంగనాసహితంబు గంగకు నంతప్రొద్దు జలక్రీడార్థంబు వచ్చినవాఁ డప్పాండవుల పాదధ్వని విని యలిగి విల్లు గొని గుణధ్వనిం జేసి వారి కి ట్లనియె. +వెలయఁగ నిం దవనిచరులు వెఱతురు నడవన్. +ఇవ్వేళలయందుఁ గ్రుమ్మరియెడువారి నెంతబలవంతుల నైనను రాజుల నయినను నిగ్రహింతుము నన్ను డాయకుం డెడగలిగి పొం డే నంగారపర్ణుం డను గంధర్వుండఁ గుబేరుసఖుండ నెప్పుడు నిందు విహరించుచుండుదు నన్నెఱుంగరె యివ్వనంబును గంగాతీరంబును నంగారపర్ణంబులునా జగద్విదితంబులు దీని మానవులు సొరనోడుదు రనిన వాని కర్జునుం డి ట్లనియె. +నడ్వఁగ నోడుదు రశక్తనరు లొరులు భయం +నెడపక సేవ్యంబ కాక యిది నీయదియే. +నుండి భూమికి వచ్చి యుదధి గూడె +వతి యన నొప్పె నున్నతి నిట్లు త్రిభువన +వాస గంగ నాడ వచ్చి నీవు +వలవ దనిన నుడుగువారము గాము నీ +అనుచు నిజజననీభాతృసహితుం డయి గంగాభిషేకార్థంబు చనుదెంచు నయ్యర్జునుపయి నంగారపర్ణుం డతినిశితసాయకంబు లేసిన నర్జునుం డలిగి తనచేతికొఱవి విదిల్చి యయ్యమ్ములు దన్నుం దాఁకకుండం గాచికొని వానికి ట్లనియె. +యలును నేమి సేయు నస్త్ర విదులఁ +అగ్ని దేవుండు బృహస్పతి కిచ్చె ము +ముని కిచె నమ్మహాముని భార్గవున కిచ్చె +నమ్మహాత్ముండు నా కతిదయ నిచ్చె ని +గంధర్వుపై వైచె ఘనుఁ డింద్రసుతుఁ డంతఁ +గొప్పు వట్టి యీడ్చికొని వచ్చె ధర్మజు +దానము నా కిండు మీకు ధర్మువు పెరుఁగున్. +అనిన నరుఁడు వల్లె యని వాని కనియె గం +అని వాని నాశ్వాసించి విడిచిన నట్లు నిర్జితుం డై యర్జునున కంగారపర్ణుండి ట్లనియె. +అని నీచేతఁ బరాజితుండ నయి నాయంగారపర్ణత్వ మిం +కను దాల్పన్ మది నంత నిర్లజుఁడనే గర్వం బడంగన్ రణం +బున ము న్నోడియుఁ బూర్వనామనునఁ బెంపున్ గర్వముం దాల్చువాఁ +డనఘా సత్సభలందు మెచ్చబడునే హాసాస్పదీభూతుఁ డై. +నీయాగ్నేయాస్త్రంబున దగ్ధరథుండ నయ్యును గంధర్వమాయ ననేకరత్న విచిత్రితం బైన రథంబు వడసి యిదు మొదలుగాఁ జిత్రరథుండ నయ్యెద నీ పరాక్రమంబునకు మెచ్చితి నీతోడిసఖ్యంబు నాకభిమతం బయినది నాతపంబునం బడయంబడిన చాక్షుషి యనువిద్య నీ కిచ్చెద దీనిం దొల్లి మనువు వలన సోముండు వడసె సోమునివలన గంధర్వపతి యయిన విశ్వావసుండు వడసె నాతనివలన నేను బడసితి నెవ్వండేని మూఁడులోకంబులుం జూడనిచ్చగించు నాతండు దనయిచ్చకుం దగ నివ్విద్యపెంపున సర్వంబునుం జూచు నేము దీననచేసి కాదె మానవులకు విశేషుల మై వేల్పులచేత శాసింపబడక జీవించెద మిది కాపురుషప్రాప్తం బై ఫలియింపదు. నీవు తాపత్యవంశవర్థనుండవు మహాపురుషుండవు నీకు సఫలం బగు నీదివ్యవిద్య గొను మిచ్చెద దీనిఁగొనునుప్పుడు షణ్మాసవ్రతంబు సేయవలయు నీవు నాకు నాగ్నేయాస్త్రంబిచ్చునది మఱి మహాజవస్త్త్వంబులుఁ గామగమనంబులు నయిన గంధర్వ హయంబులు మీకేవురకుం బెఱు నూఱేసి యిచ్చెద. +గొనఁగ నొల్ల నాకుఁ గూర్తేని యనలాస్త్ర +మనఘ నీవు గొనుము హయము లిమ్ము. +నీతోడ సఖ్యంబుఁ జేసెద మఱి మమ్ముఁ బరమధార్మికులం బరమబ్రహ్మణ్యుల నేమికారణంబున నుదరిపలికి తనిన గంధర్వుం డి ట్లనియె. +ఏను మిమ్ము నెఱింగియు మీకు నగ్నిపరిగ్రహంబును బ్రాహ్మణసంగ్రహంబును లేమిం జేసి పరుసంబులు పలికితి మఱియును. +ఇంతులగోష్టి నున్నయతఁ డెంతవివేకము గల్గెనేని య +త్యంతమదాభిభూతుఁ డగు ధర్మువు దప్పు బ్రియం బెఱుంగఁ డే +నెంత వివేకినయ్యును సహింపక యింతులయొద్దఁ బల్కితిన్ +వింతయె కాముశక్తి యుడివింపఁగ శక్యమె యెట్టివారికిన్. + + +మీరు ధర్మానిలశ క్రాశ్వినులవరంబునం బాండురాజునకుం గుంతీమాద్రులకుం బుట్టినవారలు ధర్మవిదులరు వేదవేదాంగధనుర్వేదపారగుం డయిన భారద్వాజు శిష్యుల రఖిలలోకహితులరుం గావునం బురోహితరహితుల రై యుండఁదగదు. +నొడిచి తిందు రాత్రియుద్ధంబు సేసి కా +మఱియుఁ గామప్రవృత్తుం డయ్యును మహీపతి మహీసురవరపురస్సరుండగునేని యెల్లయుద్దంబ�� శత్రుల జయించు. +వేదము వేదియుం గలుగు విప్రవరేణ్యుఁ డగణ్యపుణ్యసం +పాది పురోహితుం డయినఁ బాపము వొందునె భూపతిం బ్రతా +పోదయ కాన మీదగుగుణోన్నతికిం దగ ధర్మత త్త్వసం +అనిన వానికి నర్జునుం డనియె మమ్ము +ననఘ తాపత్యు లని పల్కి తతిముదమున +నేము కౌంతేయులము మఱి యెట్లు సెప్పు +మయ్య తపతి కపత్యుల మైన తెఱఁగు. +అనిన నర్జునునకు నంగారపర్ణు డి ట్లనియె. +భక్తిఁ దపము సేసెఁ బ్రభుఁ డజామీఢనం +గగనమునందు నెందు నధిక ప్రభ నేను వెలుంగునట్టు లి +జ్జగతిఁ బ్రసిద్దుఁ డై వెలుఁగుసంవరణుండ మదీయపుత్త్రికిం +దగుపతి వీని కిచ్చెద ముదంబున నీలలితాంగి నంచు మా +నుగ నెడ నిశ్చయించెఁ దపనుండు దదీయతపః ప్రసన్నుఁ డై. +అంత నొక్కనాఁడు సంవరణుండు మృగయావినోదార్థి యయి వనంబునఁ బరిభ్రమించి యధికక్షుత్పిపాసాపీడితపతితతురంగుం డయి యేకతంబ పాద చారి యై చని యొక్క పర్వతవనోద్దేశంబునందు. +కని యనిమిషలోచనుండయి మనంబున నిట్లని వితర్కించె. +తెఱయును దీనియాననముతెల్వి కరంబు మనోహరంబు నా +యెఱిఁగినయంతనుండి సతి నిట్టి లతాలలితాంగిఁ జూచి యే +అని వితర్కించుచు మదనకర్కశమార్గణలక్షీభూతచేతస్కుం డయి తదీయ గుణమయపాశబధుండునుంబోలెఁ గదలనేరక తన్నివేశితచేతనుండునుం బోలెఁ ద న్నెఱుంగక తద్రూపామృతపానంబున ననిమిషత్వంబునం బొందిన తననయనంబులు దానియంద నిలిపి సంవరణుం డక్కన్యకకి ట్లనియె. +ఎఱుఁగఁ జెప్పు మబల యెవ్వరిదాన వి +మని వోలె నడంగె దృష్టిమార్గము గడవన్‌. +ఇట్లదృశ్యం బయిన యక్కన్యకం గానక మానవపతి మానరహితుం డయి మహీతలంబుపయిం బడి ప్రలాపించుచున్న నాతనినభినవయౌవనవిభ్రమోద్భాసితు నంగజాకారుం జూచి తపతి తానును మదనబాణబాధిత యై తనరూపంబుఁ జూపి మధురవచనంబుల ని ట్లేల మోహగతుండ వయి తని పలికిన దానికి సంవరణుం డి ట్లనియె. +ధరణి నతి ప్రతాపబలదర్పములన్‌ విన నేన పెద్ద నె +వ్వర్కిని మున్‌ భయంపడనివాఁడ భయార్తుఁడ నైతి నిప్డు పం +కరుహదళాయతాక్షి దయఁ గావుము నన్ను భవన్నిమిత్తదు +నన్ను గాంధర్వవివాహంబున వరియింపు మనిన సంవరణునకుఁ దపతి యిట్లనియె. +సవితృనకుఁ దనూజ మఱియు సావిత్రికి నే +నవనీశ్వర వినుము తపతి యను సురకన్యన్‌. +నాయందు నీకుం బ్రియంబు గలదేని మదీయజనకు నడుగుము న న్నిచ్చు నింతులకు స్వాతంత్ర్యంబు లేమి నీ వెఱుంగుదువు గాదె కావున ననవరత జప నియమ ప్రణిపాతంబుల నాదిత్యు నారాధింపు మని చెప్పి తపతి యాదిత్య మండలంబున కరి���ె నంత సంవరణుండు మూర్ఛాగతుం డయి పడియున్న +నాతనియమాత్యుండు వచ్చి శీతలపరిషేచనంబు సేసిన మూర్ఛదేఱి యమ్మహీపతి మహాభక్తి నప్పర్వతంబున నుండి సూర్యు నారాధించుచు. +వసిష్టుఁడు తపతినిఁ గొనితెచ్చి సంవరణునకు వివాహంబు సేయించుట +హితు నతిభక్తితోఁ దలఁచె నిష్ట మెఱింగి వసిష్టుఁడున్‌ సమా +హితమతి నేఁగుదెంచి కనియెం బ్రభు సంవరణుం బ్రియంబునన్‌. +ఇట్లు దలంచిన పండ్రెండగు దివసంబునకు వచ్చి వసిష్టుం డవిరతవ్రతోప +వాసకృశీభూతశరీరుం డయి యున్న సంవరణుం జూచి యాతండు తపనసుత యయిన తపతియందు బద్ధానురాగుం డగుట తనయోగదృష్టి నెఱింగి. +బొగి నొనరింప గా నయుతయోజనముల్‌ చని లోకలోచనుం +డగుదిననాథు నాతతసహస్రకరుం గని సంస్తుతించె న +సూర్యుండును వసిష్టమహాముని నతిగౌరవంబున సంభాచించి భవదాగమనప్రయోజనంబు సెప్పు మనిన వసిష్టుం డి ట్లనియె. +గావున నతనికి దేవిఁగాఁ దపతి నీ +నాదిత్యురథంబుతో నశ్రమంబున నరిగి తపనదత్త యయిన తపతిం దోడ్కొనివచ్చి వసిష్టుండు విధివంతంబుగా సంవరణునకుం దపతి వివాహంబు సేయించెఁ గావున మహాత్ము లయిన పురోహితులం బడసినరాజుల కభీష్టంబు లయిన శుభంబు లగుట నిశ్చయం బిట్లు సంవరణుండు దపతి వివాహంబయి. +దానంజేసి మహీతలంబున కనావృష్టి యయిన నెఱింగి వసిష్టుండు శాంతిక పౌష్టికవిధు లొనరించి సంవరణు దోడ్కొని హస్తిపురంబున కరిగిన నఖిల ప్రజలకు ననురాగం బయ్యె ననావృష్టిదోషంబునుం బాసె నంత సంవరణునకుఁ దపతికిం దాపత్యుం డై వంశకరుండు పుట్టె నదిమొదలుగా మీరును దాపత్యుల రయితి రని గంధర్వుండు చెప్పిన నర్జునుండు వెండియు నిట్లనియె. + + +హా నిపుణు లవార్యవీర్యు లనఁ దగువారిన్ +నీ నమ్మిన వారి మాననీయుల హితులన్ ! 31 +చ కడుఁ జనువాఁడు నై పురుషకారియ దక్షుఁడు నైనమంత్రి పెం +పడరఁగ రాజపుత్త్రుల మహాధనవంతులఁ జేసి వారితో +నొడఁబడి పక్ష మేర్పడఁగ నుండఁడుగా, ధన మెట్టి వారికిం +గడుకొని చేయకుండునె జగన్నుత గర్వము దుర్విమోహమున్. 32 +నితు లయు వర్తింతురయ్య నీ దైవజ్ఞుల్. 33 +యారఁగ వృద్ధోపసేన నౌషధ సేవన్. 35 +ఉ ఉత్తమమధ్యమాధమని యోగ్యత బుద్ధి నెఱింగి వారి న +ద్రోత్తమ! భృత్యకోటికి ననునముగాఁ దగు జీవితంబు లా +యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండఁగన్. 37 +శ్యము నెగ్గొనరించు నతఁడు శక్రుం డైనన్. 38 +క కుల పుత్త్రు లైన సద్భృ +త్యులకును సత్కార మర్థితోఁ జేయుదె వా +మ్ములఁ గృతము దలంచి ప్రాణములు విడుతు రనిన్. 39 +నని నీల్గిన వీరభటుల యనుపోష్యుల నె +దనముల వారలకు నెమ్మి దఱుఁగక యుండన్. 40 +ర్పని వారలఁ బగఱవలనివారల ధృతి చా +వారలచే ధనము గొని భవద్భృత్యవరుల్. 42 +ధరణి కవగ్రహభయంబు దనుకక యుండన్. 43 +నూనముగా ఋణములిత్తె యుత్తమ బుద్ధిన్. 44 +సంగర రంగమునఁ గాతె శరణం బనినన్. 45 +క కృత మెఱిఁగి కర్త నుత్తమ +మతుల సభల సంస్తుతించి మఱవక తగుస +పతియె జగజ్జనుల నెల్లఁ బరిపాలించున్. 46 +గాని మిక్కిలి సేయఁ గాదు వ్యయం +బని యవధరించితె బుద్ధి నవని నాథ! +ఆ గురుల వృద్ధ శిల్పి వరవణిగ్భాంధవ +సకల జనులు నిన్ను సంస్తుతింప 47 +గొలువుండు దె లోక మెల్లఁ గొనియాడంగన్ 48 +తర జనముల వలన సంతతము నిజరక్షా +చరితము వీక్షింతె నిపుణ చర నేత్రములన్. 49 +ఖ్యులతోడ నశేష ధర్మ కుశలుఁడ వయి యి +మ్ములు దయఁ బరికింతె నిత్యమును సమబుద్ధిన్. 50 +యదియు లేని నాఁడ యఖిల జనులు +వార్త నిర్వహింప వలయుఁ బతికి. 51 +ఆ దార సంగ్రహంబు ధరణీశ! రతిపుత్త్ర +దత్తభుక్త ఫలము ధనము, వేదము లగ్ని +హోత్ర ఫలము లనియు నొగి నెఱుంగు. 52 +చ బహుధన ధాన్య సంగ్రహము బాణశరాసన యోధ వీరసం +గ్రహము ననేక యంత్రంములుఁ గల్గి యసాధ్యము లై ద్విషద్భయా +వహు లగు చుండ నొప్పునె భవత్పరిరక్ష్యము లైన దుర్గముల్. 53 +చ వదలక బుద్ధి నంతరరివర్గము నోర్చి జితేంద్రియుండ వై +మొదలన దేశకాల బలముల్ మఱి దైవబలంబుఁ గల్గి భూ +విదితబలుండ వై యహితవీరుల నోర్వఁగ నుత్సహింతె దు +ర్మదమలినాంధ చిత్తులఁ బ్రమత్తుల నింద్రియనిర్జితాత్ములన్. 54 +తే కడిఁది రిపులపైఁ బోవంగఁ గడఁగియున్న +యోగమునఁ జేసి వర్తిల్లుచున్నె చెపుమ. 55 +వ మఱియు నాస్తక్యం, బనృతంబు, ప్రమాదం, బాలస్యం, బనర్థజ్ఞుల తోడి చింతనంబు, క్రోధంబు, దీర్ఘచింత, దీర్ఘసూత్ర్తత, యెఱుకగలవారి నెఱుంగమి, యర్థంబులయం దనర్థకచింత, నిశ్చిత కార్యంబులు సేయమి, మంత్రంబుల రక్షింపమి, శుభంబులఁ బ్రయోగింపమి, విషయంబులం దగులుట యనం బరఁగిన పదునాలుగు రాజదోషంబులఁ బరిహరింతె యని యడిగిన నారదునకు ధర్మరా జిట్లనియె. 56 +ఇట్టి సభ యెచ్చటనైన చూచితిరా యని ధర్మజుండు నారదు నడుగుట +తే నా యథాశక్తిఁ జేసి యన్యాయ పథముఁ +బుద్ధి నిలిపి మీ యుపదేశమున శుభంబు +లయిన వాని ననుష్ఠింతుఁ బ్రియముతోడ. 57 +వ అని కృతాంజలి యయి మునీంద్రా! యీ త్రిలోకంబులయందు మీ చూడనివి లే వెందే నిట్టి యపూర్వం బైన సభ చూచి యెఱుంగుదురే యని మయనిర్మితం బయిన సభ చూపినం జూచి విస్మితుం డయి నారదుండు ధర్మరాజున కి���్లనియె. 58 +క భూనాథ! యిది యపూర్వ మ +మానుషము, విచిత్ర రత్నమయ మిట్టి సభన్ +దే నెన్నఁడుఁ జూచి వినియి నెఱుఁగ ధరిత్రిన్. 59 +క సురపతి యమ వరుణ ధనే +శ్వర కమలాసనుల దివ్య సభ లెల్ల నరే + + +లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ + + +త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం +త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం 1) +త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః +తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం 2) +కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః +కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం 3) +కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం +ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం 4) +ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః +నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం 5) +రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా +తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం 6) +అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం +కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం 7) +ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ +భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం 8) +యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం 9) +దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ +కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం 10) +బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం +అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం 11) +అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం 12) +అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా +అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం 13) +బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ + + +యోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ +య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (1) +య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (2) +యో వాయోరాయతనం వేదా ఆయతనవాన్ భవతి +య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (3) +యోముష్యతపత ఆయతనం వేదా ఆయతనవాన్ భవతి +ఆపోవా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి +య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (4) +యః చంద్రమస ఆయతనం వేదా ఆయతనవాన్ భవతి +ఆపోవై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి +య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (5) +యో నక్ష్త్రత్రాణామాయతనం వేదా ఆయతనవాన్ భవతి +య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (6) +యః పర్జన్యస్యాయతనం వేదా ఆయతనవాన్ భవతి +య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (7) +యః సంవత్సరస్యాయతనం వేదా ఆయతనవాన్ భవతి +ఆపోవై సంవత్సరస్యాయతనం వేదా ఆయతనవాన్ భవతి +య ఏవ��� వేదా యోత్సునాభం ప్రతిష్ఠితాం వేదా ప్రత్యేవ తిష్ఠతి (8) + + +::వికీసోర్స్ నుండి వికీబుక్స్ లోకి వ్యాసాలను దిగుమతి చెయ్యాలని అనుకుంటున్నాను. సాధ్యంకాకాపోతే మళ్ళీ ఆ వ్యాసాలను ఇక్కడ సృష్టింవాల్సి వస్తుంది. నాఉద్దేశ్యము పూర్తి అయిన వ్యాసాలను పుస్తకములుగా (PDF Files) వికీబుక్స్ లో పొందుపరచాలని. మీరు ఏమంటారు? + + +నాన్నకు ఎనభైయ్యారేళ్ళు. మంచం పట్టాడు. ఏపని చెయ్యాలన్నా శరీరం సహకరించటం లేదు. తల దిమ్మెక్కినట్టుగా వుంటున్నదట. లేచి తిరగటం వీలుపడదు. ఈ అనారోగ్యానికి కారణం కేవలం వృద్ధాప్యమే కాదనీ, పొటాషియం లోపం కూడాననీ నాకు తెలుసు. దిళ్ల మీద ఒత్తిగిలి పడుకుని నాకు సలహాలిస్తుంటాడు. +"మరొక్క కధ రాయవా! నువ్విదివరకు రాసినట్లాంటి కధలు. మపాసా, చెహోవ్‌లు రాసినట్లాంటివి. మనంరోజూ చూసే మనుషుల గురించి. వాళ్ల జీవితాల్లో జరిగే సామాన్య సంఘటనల గురించి." +"ఓయస్‌ రాస్తాను. దానికేం భాగ్యం అన్నాను నాన్న తృప్తి కోసం. కాని నేను అలాంటి కధలు యింతవరకు రాస్తేగద అనగనగా ఒక ఊళ్లో ఒకావిడ వుండేది అంటూ ప్రారంభించి, ఒక ప్లాట్‌ తయారుచేసి కధ రాయాలనే వున్నది. కాని స్త్రీని ప్లాట్‌ అనబడే విధిలీలకు వదిలెయ్యటం ఎంత దుర్మార్గం! పాత్రలు మాత్రం మనుషులు కారా. వాళ్ల జీవితాలు గాలిలో దీపాలా? +మాయింటి కెదురుగా ఓ దంపతులుంటారు. రెండేళ్లుగా వాళ్లు గురించి రాయాలనుకుంటున్నాను. ప్రారంభించి, +"నాన్నా, యిలారాస్తే బావుంటుందా చూడు" అంటూ చదివాను న్యూయార్క్‌లోని ఒక చిన్న అపార్టుమెంటులో ఒకావిడుంటోంది. ఆవిడకో కొడుకు. పదిహేనేళ్లు నిండకుండానే ఆ కుర్రాడు మాదకద్రవ్యాల కలవాటుపడ్డాడు ఆ బస్తీలో చాలా మంది పిల్లలకా అలవాటుంది) కొడుకును దూరం చేసుకోవడం యిష్టం లేని తల్లి తనూ మాదకద్రవ్యాలు తీసుకోవటం ప్రారంభించింది. ఈ తరం పిల్లలంతా యిలాగేవున్నప్పుడేంచేస్తాం అంటూ సరిపెట్టుకుంది. కొన్నాళ్ల తరువాత, అనేక కారణాలవల్ల, కొడుకు ఆ అలవాటుమాని, నగరం విడిచి వెళ్లిపోయాడు. తల్లికి తనమీద తనకు అసహ్యం వేసింది. నిరాశానిస్ప్రహలు తప్ప మరేం మిగిలాయావిడకు. ఆమె గురించిన కధయిది +"చూశావా నాన్నా, ఏ నగిషీలు పెట్టకుండా సింపుల్‌గా రాశాను." +నేను చెప్పింది నీకర్ధం కాలేదు. ఇంకా రాయాల్సింది చాలావుంది. తుర్జెనీవ్‌ యిలాగే రాస్తాడు? చెహోవ్‌ అయితే అసలు యిలా ప్రారంభించడు. రష్యన్‌ శీతకాలాల గు��ించి విన్నావుగా సరళంగా కధ చెప్పటం ఆ చలివల్ల నేర్చుకుంటారేమో. శరీరాల్లేని, ఆత్మల్లేని మనుషులుంటారాకధల్లో! వాళ్లెవరు +"ఆ స్త్రీ ఎలా వుంటుందో చెప్పనేలేదు +"నల్లటి జుత్తు. పొడవాటి జడ. చిన్నపిల్లలేసుకున్నట్టుగా". +"ఆమె తల్లిదండ్రులు? వాళ్ల కుటుంబ నేపధ్యం? ఆమెనలా తయారుచేసిన పరిస్ధితులు అవన్నీ రాస్తే బావుంటుంది తెలుసా." +"వాళ్లు మరోవూరి నుండి వచ్చి యిక్కడ సెటిలయ్యారు. ఏదో పని చేసుకుని బతికేవాళ్లు. బహుశా భర్త ఆమెకు విడాకులిచ్చివుంటాడు. చాలా?" +"నామాటలన్నీ నీకు జోకులాగా వినిపిస్తున్నాయా ఏమిటి? ఆ కుర్రాడు తండ్రి గురించి ఒక్క మాటకూడా చెప్పలేదేం? అతడెవరు? ఏంచేస్తాడు? కుర్రాడు పెళ్లికి ముందర పుట్టాడా! తరువాత పుట్టాడా!" +"సరే. వాడు పుట్టేనాటికి తల్లిదండ్రులింకా పెళ్లి చేసుకోలేదు." +"నీ కధలన్నీ అంతే. నీదృష్టిలో ఆడా, మగా పెళ్లిళ్లు చేసుకోరాఏమిటి పెళ్లికి ముందే సంసారం, పిల్లలు +"వాస్తవానికి అలాజరగదులే. కాని నాకధల్లో మాత్రం సాధారణంగా పెళ్లిళ్లు జరగవు +"ఇదొక చిన్న కధ మాత్రమే నాన్నా. ఒక అందమైన, తెలివైన స్త్రీ, గుండెనిండా ఆశల్ని, కలల్ని మూటగట్టుకుని న్యూయార్క్‌ మహానగరానికి వచ్చింది. కొడుకును పెంచటానికి నానా కష్టాలు పడింది. ఆమెకు పెళ్త్లెందా లేదా అన్నది యిక్కడ అప్రస్తుతం కాదా?" +"ఎంత మాత్రం కాదు. అది చాలా ముఖ్యమైన అంశం" +"ఓకేగీకే కాదు జాగ్రత్తగా విను. ఆమె అందంగావుంటే వుండవచ్చుగాని తెలివైంది మాత్రం కాదు" +"నిజమే. కాని కధలో వచ్చిన చిక్కేఅది. పాత్రలగురించి గొప్పగా రాస్తాం. కాని వాళ్లు చాలాసాధారణ వ్యక్తులాగే బతుకుతారు. మూర్ఖుడిలా కనిపించే మరోవ్యక్తి కూడా వాళ్లను మోసం చెయ్యగలడు. ఇలాంటి కధలకు ముగింపు వెదకటం కష్టం." +"అయితే ఏంచేద్దామనుకుంటున్నావు నాన్న కొన్నాళ్లు డాక్టరుగా పనిచేశాడు. కొన్నాళ్లు ఆర్టిస్టుగా బతికాడు. శిల్పం, శైలి, కధనం, పరిశీలన అంటే యిష్టంయింకా. +"కొన్నాళ్లీ కధను పక్కన పెడదాం. ఈలోగా నీకూ ఆ జగమెండి హీరోకూ మధ్య సమోధ్య కుదరనీ." +"నాన్సెన్స్‌. కధ మళ్లీ రాయి. నాకూ ఈ సాయంత్రం వేరే పనేంలేదు. కమాన్‌, స్టార్ట్‌." +"ఓకే. కాని ఇది అయిదు నిమిషాల్లో తేలే విషయం కాదు అంటూమళ్లీ ప్రారంభించాను. +"పక్కింటావిడ అందమైన మనిషి. కొడుకంటే ఆమెకు ప్రాణం. కడుపులో పడినప్పటినుండి, నెత్తుటి గుడ్డగావున్నప్పుడు, పొత్తిళ్లనుంచి ఎదిగి తన చేతు���్లో యిమిడిపోయినప్పుడు, వాణ్ణి గుండెల మీద వేసుకొని పడుకున్న ఆక్షణాలు తన కళ్ల నిండా వాడే మీసాలన్నా రాలేదుగాని కుర్రాడప్పుడే మాదకద్రవ్యాల అడిక్టుగా మారాడు. మరీ అంత సీరియస్‌ కేసేమీకాదు. ఆశ వదులుకోవలసిన అవసరంలేదు! తను చదువుకొంటున్న హైస్కూలు పత్రికలో వ్యాసాలు రాసేవాడు. వాడి ప్రతిభకు ఆపత్రిక సరిపోలేదు. స్వయంగా ఒక మాగజైను తనే ప్రారంభించాడు. +మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవాళ్ళందరూ గిల్టీగా ఫీలవుతారు అమెరికాలో కాన్సర్‌తో బాధపడుతున్న వాళ్లతో పదింట తొమ్మిది మందికి ఈ గిల్టీ మనస్తత్వమే ప్రధాన కారణమని వైద్యులు నిర్ధారించారు కాని చిన్నచిన్న వ్యసనాలను ఆనందించటంవల్లనే మనిషి ఆనందంగా బతుకుతాడని తల్లి నమ్మకం. అందువల్ల ఆమె కూడా అడిక్టుగా మారింది. +మేధావి అడిక్టులందరికీ ఆమె యిల్లుకేంద్రమైంది. వచ్చినవాళ్లందరూ కోలరిడ్జులమనో (19721834;ఇంగ్లీషు కవి. నల్లమందు ప్రియుడు) టిమొదీలీరీ (జననం: 1920; హార్వర్డులో సైకాలజీ ఫ్రొఫెసర్‌. ఎల్‌.ఎస్‌.డి. వల్ల లాభాలున్నాయని ప్రచారం చేసినవాడు)లమనో అనుకునేవాళ్లు. స్వయంగా మత్తులో వున్నప్పటికి, తల్లితో సహజంగా వుండే సేవాభావం ఆమెను వీడలేదు. మంచి మంచి భోజనపదార్ధాలు, విటమిన్‌ మాత్రలు, ఆరెంజి జూస్‌ అందరికీ అందుబాటులో వుంచేది. తరాల అంతరాన్ని చెరిపేసి తనూ పడుచు పిల్లలలో ఒకటైపోయింది. +ఒకనాడు (మైకెలేంజిలో) ఆంటోనిమోనీ (ప్రముఖ యిటాలియన్‌ చలనచిత్ర కళాఖండాల సృష్టికర్త) సినిమా చూస్తున్నప్పుడు ఓ పిల్ల వాణ్ణి మోచేత్తో డొక్కలో పొడిచింది. పరిస్ధితి అర్ధం చేసుకొని, తల్లి, కొడుకుని మందలించి, యింటికి తీసుకెళ్లింది. +కొడుకు అభిప్రాయాలే తన అభిప్రాయాలు. వాడి ఆశయాలే తన ఆశయాలు. అనూహ్యమైన పద్ధతుల్లో తల్లి ప్రేమఫలించింది. కుర్రాడికి ఆరోగ్యం మీద శ్రద్ధకలిగింది. నరాలు వశం తప్పుతున్నాయని గ్రహించ గలిగాడు. +నిరాకారమైన ఆత్మ ఆనందించినంత మాత్రన సరిపోదు. +ఆరోగ్యవర్ధక ఆహారం తీసుకున్నాడు. ఆపిల్స్‌, రకరకాల మొలకధాన్యాలు, జీడిపప్పు, బాదం, సోయాబీన్స్‌. ఇదికూడా ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రయాణం అంటూ ప్రకటించాడు. +"అమ్మా, మరి నువ్వెప్పుడు మారతావు" అంటూ అమాయకంగా అడిగాడు. +కుర్రాడు త్వరలోనే కోలుకున్నాడు. మెహంలో కళ వచ్చింది. కండపట్టాడు. +కొడుకు సాంగత్యం లేని తల్లి ఏకాకిగానే కొకెయిన్‌ యింజక్షన్లు తీసుకుంది. +కుర్రాడు, వాడిగ��్ల్‌ఫ్రెండూ మరోచోట కొత్త జీవితం ప్రారంభించటానికి వెళ్లిపోయారు. మాదక ద్రవ్యాలకు బానిసఅయిన తల్లిని చూస్తే అసహ్యం ఈ అలవాటు మానకపోతే నీ మొహం చూడం' అన్నారు. +ఏకాంతంలో, ఫ్లాట్‌నిండా విస్తరించిన శూన్యంలో కొడుకు రాసిన వ్యాసాలు చదివి విలపించింది తల్లి. కుర్రాడిలో ఎంతనిజాయితీ వుంది! మేం అప్పుడప్పుడు ఆమెను ఓదార్చటానికి వెళ్లేవాళ్లం. పడుచుపిల్లలుఎవరైనా అడక్టులున్నారని వింటేచాలు ఆమెకు కన్నీరాగదు నా చిన్నినాన్నా ఈ అలవాటు మానరా" అని గుండెపగిలేలా రోదిస్తుంది. +కళ్లు మూసుకుని వింటున్న నాన్న "కధలో అంత హాస్యం, వ్యంగ్యంఎందుకే? మరోవిషయం, కాలయాపన చెయ్యికుండా సింపుల్‌గా కధ చెప్పలేవా? ఇక చివరి విషయం "అంటూ కాస్త వివరంగా అంటే యిక ఒంటరి జీవితమే ఆమెకు మిగిలిందా? ఆమె జబ్బు మనిషే అని నువ్వు చెప్పదలచుకున్నావు"అంటూ వ్యాఖ్యానించాడు. +"పాపం, ఎంత అర్థంలేని పనిచేసింది. మూర్ఖురాలు. మూర్ఖులమధ్య గడిపితే మరేమవుతుంది? మొత్తం మీద కధ ముగించావు. అవునా?" +"లేదునాన్నా. ఆమెకింకా నలభైకూడా నిండలేదు. ఇంకా ఎంతో జీవితం మిగిలివుంది. ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలదు. దురలవాట్లు మాని ఘనకార్యలు చేసినవాళ్లెందరులేరు! ఈ అనుభవం, యూనివర్సిటీలో బీయేలు,ఎమ్యేలు చేసిందానికన్నా ఎక్కువ పనికొస్తుంది." +"కాని రచయిత్రిగా నువ్వెదుర్కొంటున్న సమస్యే అది. ట్రాజెడీ కధలు రాయిటంలో వున్న మజా మనుషులు మారతారని రాయిటంలో లేదు. ఎంతగొప్ప ట్రాజెడీ అయితే అంత పాఠకరంజకంగా వుంటుంది. పరాజితులను గురించి చదవటం పాఠకుల కెంతయిష్టమో!" +"ఆమె మారే అవకాశముందని చెప్పానుగా నాన్న." +"కధల్లోనూ, జీవితంలోనూ బలహీనతలను అధిగమించి, పరిస్థితులను మార్చగలగిన మనుషులు కావాలి" అన్నాడు నాన్న. +ఆయన మాటకు ఎదురు చెప్పకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. కాని కధ పట్ల నా బాధ్యతను విస్మరించలేను. ఆమె నాకు పరిచయస్థురాలే. అయినా ఆమె నేను సృష్టించిన పాత్ర. ఆమెను చూస్తే బాధగావుంది. బోసిపోయిన ఆ యింట్లో రోదిస్తున్న ఆ మనిషిని అలా వదిలెయ్యటం నాకిష్టంలేదు. +"ఆమె వ్యసనాన్ని అధిగామించింది. కొడుకు తిరిగి రాలేదుఅది వేరేవిషయం. ప్రస్తుతం ఆమె మాదకద్రవ్యరోగుల చికిత్సాకేంద్రాంలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. పేషెంట్ల సమస్యల్ని అందరికన్నా బాగా అర్థం చేసుకోగలిగింది తనే." +"నీ లాంటి వాళ్లు మరో యిద్దరుంటే ఎంతబాగుం���ునో"అంటాడు డాక్టరు. +"డాక్టరు అలానిజంగా అన్నాడా? నువ్వు జోక్‌ చేస్తున్నావా అన్నాడు నాన్న. +"అలా జరిగే అవకాశముంది నాన్నా. లోకంలో చాలా చిత్రాలు జరుగుతున్నాయి, చూడటం లేదూ." +"లేదు పాత్ర స్వభావాన్ని బట్టి ఆమె అలవాటు మానుకునే అవకాశంలేదు." +"ఇప్పుడామెకు మంచి వుద్యోగం వచ్చింది. గతాన్ని మరచిపోగలిగిన శక్తి ఆమెకుంది." +"ఎన్నాళ్లులే. ఒకసారి అలవాటు పడితే మానటం ఎవరితరం. జీవితవాస్తవాల్ని ఎప్పుడర్థం చేసుకుంటావో అంటూ ఆక్సిజన్‌ ట్యూబులు ముక్కుపుటాల్లో అమర్చుకుని, నైట్రోగ్లిసెరిన్‌ బిళ్లలు రెండువేసుకుని కళ్లు మూసుకున్నాడు నాన్న. + + +కాంతారావు కారు పంపించాడు. పంపుతూ "మా అమ్మ కాలిఫోర్నియా నుంచి వచ్చింది. కార్తీకమాసం వరకు ఉంటుంది. నీతో మాట్లాడాలట. నేను పంపిన కారులో రా" అని కబురుపెట్టాడు. నాకేం అర్థంకాకపోయినా మిత్రుడు కదాని వైజాగ్‌ బయలుదేరాను. ఆ సాయంత్రం +కాంతారావు గేటు దగ్గరే ఎదురొచ్చి హాల్లోకి తీసుకెళ్ళాడు. అప్పటికే హాలులో నాగమ్మ గారు నాకోసం ఎదురుచూస్తున్నారు. అంతవరకు గుర్తురాని అతని తల్లిపేరు ఆమెను చూడగానే గుర్తొచ్చింది. ఆమె చూపులు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఆమె సోఫాలో కూర్చోడంలో ప్రత్యేకమైన 'రీ౮వి' ఉంటుంది. ఒకవేపు నుండి మరోవేపుకు తల తిప్పిందంటే అందులో 'దర్పం' ఉంటుంది. కోపమొచ్చిందంటే నాగుపాములా బుస కొట్టగలదు. పేరునుబట్టి ఆమె ఆ లక్షణాలు అలవరచుకున్నదో, లేక ఆ లక్షణాలబట్టి ఆమెకాపేరు పెట్టారో నాకు తెలియదు. కానీ, ఆమెకు ఆ పేరొచ్చిన కారణం అప్పుడే నాకు తెలుస్తుందని నేననుకోలేదు. ఆమెది మా అమ్మ వయసు. అరవైఅయిదు దాటాయి. కానీ, మా అమ్మకన్నా ఆరోగ్యంగా చలాకీగా ఉంటుంది. నన్ను 'ఏంఁవాయ్‌ మాష్ట్రూ అని ఏం పంతులూ' అని పిలుస్తుంది. నేనేమీ అనుకోను. చదువు చెప్పే మాస్టర్లంటే ఆమెకు చిన్నచూపే. ఆమె మూడోక్లాసు చదివేటప్పుడట అయిదో ఎక్కం సరిగా రాయలేదని మాస్టారు బెత్తం తీస్తే పలక అతనికేసి విసిరి చదువుకు భరతవాక్యం పాడిందట. కానీ, ఏమీ చదువుకోకపోయినా ఇంగ్లిషు, తెలుగు బాగా మాట్లాడుతుంది. కారణం సంవత్సరంలో సగభాగం స్టేట్స్‌లో కొడుకు దగ్గర ఉండటమే. నన్ను చూడగానే "రావోయి కిష్టారావూ! బాగున్నావా అని పలుకరించింది. ఏదో పెద్ద అవసరం ఉంటేగానీ ఆమె ఎవర్నీ గుర్తుపెట్టుకోదు, పేరుపెట్టి పలుకరించదు. అతిధి సత్కారాలు అయిన తరవాత "నీవో 'ఫేవర్‌' చేసిపెట్టాల���యి నాకు. మా 'కాంతం' వల్ల అవదు. పల్లెటూరిలో ఉంటావు కాబట్టి నీవల్ల అవుతుంది అని ఆగిందామె. +"నన్నంతా 'నాగమ్మ నాగమాంబ' అనేస్తున్నారు కానీ నా అసలు పేరు 'నాగేశ్వరి కీపింగ్‌ ఇట్‌ ఎపార్ట్‌ అసలు నాకా పేరు ఎలా వచ్చిందో తెలుసా ఆగిందామె. ఆమె అలా ప్రసంగం ప్రారంభించడంలో అంతరార్థం తెలియక గబుక్కున "ఫ్లాష్‌బ్యాకా అన్నాన్నేను. పొరపాటు ఆమె మాట్లాడేటప్పుడు ఆమె వెతుక్కునే పదాన్ని ఎవ్వరూ అందివ్వకూడదు దాన్ని ఆమె ఆమోదించదు. తన ప్రజ్ఞ ప్రదర్శించాలనే చూస్తుంది. +'సూర్యుడు తూర్పున ఉదయిస్తాడ'ని ఎవరన్నా 'కచ్చితంగా తూర్పే ఎప్పుడయింది? ఆగ్నేయమో ఈశాన్యమో కాలేదూ? నీకెదురుగా సూర్యుడుండేది ఎంతకాలం అని వాదిస్తుంది. ఏ విషయమైనా అంతే. +"ఫ్లాష్‌బ్యాక్‌ అనకు పుష్షింగ్‌ ది బాక్‌ టు ది ఫార్వర్డు' అను. ఎందుకంటే దీనికంత చరిత్ర ఉంది. విను నేను పుట్టకముందు మేమంతా ఓ పల్లెటూరిలో ఉండేవారమట. పల్లెలో మాది మాత్రం పెద్ద ఇల్లు పెద్ద వాకిలి పెద్ద పెరడు అంతా వాస్తు ప్రకారమే. మామిడి, కొబ్బరి, పనస, సపోటా, సీతాఫలం, అరటి వృక్షాలేకాక పూలమొక్కలు, పారిజాతాలు, ఫలసంపెంగ, పండ్ల సంపెంగ వృక్షాలూ ఉండేవి పెరట్లో. ఆ సంపెంగలపై నాగుపాముల జంట ఉండేదట. అందులో ఒకటి మా ఇంట్లోకీ మా గదుల్లోకీ వచ్చేదట. అప్పుడు మాది పెంకుటిల్లే. అలా వచ్చినా అది ఎవర్నీ ఏమీ చేసేదికాదట. మా నాన్నమ్మ గారు ఓ గిన్నెలో పాలు పోసి ప్రతీ రాత్రి గడప అవతల ఉంచితే, తాగేసి పోయేదట. +ఓసారి ఏమైందంటే ధనుర్మాసంలో మా నాన్నమ్మ యధావిధిగా మూడు గంటలకే లేచి స్నానాదికాలు ముగించుకుని వేణుగోపాలస్వామి కోవెలకు తిరుప్పావై వినడానికి వెడుతూ, ప్రతి రోజులాగే ఇంటిల్లిపాదికి సరిపడే నీళ్ళు డేగిసాలో మరగబెట్టడానికి కట్టె పొయ్యిలో నిప్పు వేసిందట. మా అమ్మ లేచి పెరట్లోకెళ్ళి కడుపు తిప్పేంత వాసనొచ్చి, వాంతి అయ్యేంత పర్యంతమై మరి పెరట్లో ఉండలేక మంచంమీద పడిపోయిందట. +'అమ్మకెందుకలాగయిందో' అని కంగారుగా అందరూ మంచం చుట్టూ చేరడం, వైద్యుడు రావటంతో పెరట్లో ఏమయిందో ఎవరూ గమనించలేదట. పాలు తీయడానికి వచ్చిన పనివాడు 'ఏంటమ్మా! ఈ కమురు కంపు అని అన్నాడే తప్ప వాడూ తెలుసుకోలేకపోయాడు. ఆ సాయంత్రం మాకు తెలిసిందేమిటంటే జంట పాముల్లో ఒకటి కప్పను తిన్నదో ఏమో కదలలేక పొయ్యిలో కర్రల మధ్య పడుకుని అగ్గికి ఆహుతి అయిపోయిందని. పాలు తాగే పాము ఆ రాత్రి రాలేదట. ఉదయం లేచి చూస్తే సంపెంగ దగ్గర రాతికి తల పగలగొట్టుకుని చచ్చిపడి ఉందట. మా నాన్నమ్మ గుర్తుపట్టి ఏడ్చింది. గంధంచెక్కల మధ్య అగ్ని సంస్కారాలు చేసినా ఎవరికీ శాంతి లేకపోయిందట. +మూడు నెలల మా అమ్మ గర్భం పోయిందట. అప్పటినుండి ప్రతీసారి అదే తంతు. ఎన్ని పూజలూ శాంతులూ చేయించినా లాభం లేకపోయిందట. చివరికి ఎవరో 'నాగులచవితినాడు నిష్ఠగా పూజ చేసి, పుట్టలో పాలుపోసి, జంటపాముల విగ్రహాన్ని పుట్టలోవేసి, ఉపవాసం ఉండి ప్రయత్నించండి' అన్నారట. మా నాన్నమ్మ అలాగే చేయించిందట. అద్భుతం పూజ ఫలించింది. మళ్ళీ నాగులచవితికి నేను నెల పిల్లనట. ఆనాటినుండి మా ఇంట్లో అందరి పేర్లకి 'నాగుడి' పేరు కలిపి పెట్టడం, ప్రతీ నాగులచవితికి పుట్టలో బంగారంతో చేసిన 'సర్ప మిధునం' వేయడం మాకు ఆనవాయితీ అయిపోయింది. +అయితే ఈమధ్య కొన్ని ఏళ్ళుగా నేను ఇండియాలో ఆ టైముకి లేకపోవడతో మిగతావాళ్ళు సరిగా పట్టించుకోలేదు. కొంత ఎగతాళి చేసినవాళ్ళూ ఉన్నారనుకో కీపిట్‌ ఎలూఫ్‌' ఈ సంవత్సరం ఎలాగైనా నాగులచవితి పండుగ యధావిధిగా జరపాలని స్టేట్స్‌ నుంచి వచ్చాను. ఈ పట్నాల సంగతి నీకు తెలుసుగా. ఈ అపార్టుమెంట్ల సంస్కృతిలో కర్మాగారాల కల్చరులో చెట్లు, పుట్టలు కరవైపోతూంటే ఇక నాగులచవితి ఎక్కడ? నాగమయ్య పూజలెక్కడ?అఫ్‌కోర్స్‌ అపార్టుమెంట్ల దగ్గరికీి పాములొస్తాయి తెస్తారు. అది నాకిష్టం లేదు. అందుకే నీకు కబురు పెట్టాను. +దీపావళి వెళ్ళగానే మేమంతా మీ ఊరొస్తాం. చవితి అక్కడ చేస్తాం. ఏర్పాట్లు నీవు చూడాలి. మేముండడానికి ఇల్లు పాలు పోయడానికి పుట్ట పుట్టలో పాముండాలి. ఇంకోమాట ఒకరు పాలుపోసిన పుట్టలో మేం పాలు పొయ్యం. అంతేకాదు. ఆ పుట్టలో మరెవ్వరూ ఆ రోజు పాలు పోయకూడదు అని ఆగిందామె. అంతవరకు ఆమె మాటలు వింటున్నట్టు నటిస్తున్న సీతాపతిరావు గారు "నీవలా చెయ్యాలి. ఎందుకంటే ఆమె నమ్మకాలు ఆమెవి" అన్నారు. ఆయన కాంతారావు తండ్రి. రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌. ఆ ఇంట్లో నాగమ్మ గారి మాట ఎవరూ కాదనరు. +వాళ్ళ మాటలు వింటూంటే నా గుండెలో రాయిపడినట్టయింది. మాది పల్లెటూరే. కానీ, ఇప్పుడు దాని స్వరూపమే మారిపోతోంది. తోటలు, చెరువులు మాయమయ్యాయి. చీమలు పెట్టిన పుట్లను పాములు ఆక్రమించినట్లు, కబ్జాస్వాములు మా ఊళ్ళోనూ అవతరించారు. పొలాలు బీడులవుతున్నా నీరందక పంటలు ఎండిపోతున్నా 'నాకో పెళ్ళాంనాకో ఇల్లు' సిద్ధాంతంతో వ్యష్టి కుటుంబ��లు బలపడటంతో మా పల్లెటూరు కూడా పట్నవాసపు వాసనలనందుకుంది. మిద్దెలు, మేడలు లేచాయి. ఖాళీ స్థలాల చుట్టూ ప్రహరీ గోడలూ ముళ్ళ కంచెలూ ఏర్పడ్డాయి మమ్మీడాడీ' బడులూ వచ్చాయి. +"అవునూ! మా వూళ్ళోనే మొక్కు తీర్చుకోవాలని మీకెందు కనిపించింది" అని అడిగాను ఆ రాత్రి భోజనాల దగ్గర. +"మీ వూళ్ళో శివాలయం వెనుక పెద్దపుట్ట ఉందనీ అందులో వూరిలో సగంమంది పాలు పోస్తారనీ విన్నాను" అన్నారు సీతాపతిగారు. +"అంతేకాదు. నేను ఫిలడల్ఫియాలో ఉన్నప్పుడు తెలిసివాళ్ళలో మా ఫ్రెండు నాకొక పార్శిల్‌ పంపింది. దాని రేపరు తెలుగు పేపరు. అందులో న్యూస్‌ ఏమిటో తెలుసా మారేడు వనంలో పాముకాటుకు ఒకరు మృతి' అని. ఆ వెంటనే మీ ఊరినే డిసైడ్‌ చేసేశాను. అంతేకాదు. తోడుగా నీవూ ఉన్నావు. మరి 'మారేడు వనం' మీ వూరేగా అంది నాగేశ్వరి గారు. +మా వూరిపేరు అమెరికాలో ఆ విధంగా ప్రతిధ్వనించినందుకు నవ్వాలో ఏడ్వాలో నాకు తెలియలేదు. మా ఊళ్ళో శివాలయం ఉందిగానీ పుట్టలేదు. అక్కడ సుబ్రహ్మణ్యస్వామి కోవెల కట్టారు. +'యధార్థస్థితి ఇది' అని చెప్పినా వాళ్ళు నమ్మరు. మరి నాకు తప్పలేదు. ఎందుకంటే ఆమె తన దగ్గరున్న పేపర్‌ కటింగ్‌నే నమ్ముతోంది. +"గోవరాజూ! అదిరా కధ. నీవు గొడ్లను కాయడానికి పొలాల వెంటా పుట్లవెంటా తిరుగుతుంటావు. ఒక పుట్టను వెతికిపెట్టరా బాబూ! నీకు పుణ్యముంటుంది. అందులో మాత్రం పాముండాలిరోయ్‌! నీ కష్టం ఉంచుకోను" అన్నాను. నా దగ్గర వాడికి చదువు బాగా రాకపోయినా నన్ను 'గురూ గారూ' అంటూ గౌరవిస్తూ చెప్పిన పని చేస్తూంటాడు. +గోవరాజు ఆలోచనలోపడ్డాడు. స్కూలు వరండాలో మసిబొగ్గుతో గీతలు గీస్తూ "బాబూ! ఇది సెరువుగట్టు ఇది బహిర్భూమి ఇటు పెద్ద ఇస్కూలు ఈ మూల టూరింగ్‌ టాకీసు ఇటు కొండ +"అదంతా ఎందుకురా! మన వూరివాళ్ళు పాలు పోసేందుకు ఎక్కడికి వెళతారు?" +"ఏడికెళ్తారు సావీ! కొండమీదిగ్గాదూ ఆడనే ఉండయికదా పుట్టలు. ఆయమ్మ ఎక్కలేరు గదా! పొలాల్లో ఉండయిగానీ మనదాక రానిత్తారూ అంటూ గొంతుకిల్లా కూర్చుని ఆలోచనలోపడ్డాడు గోవరాజు. +అంతలో కాంతారావు 'కార్యక్రమం అయ్యేంతవరకు ఉంచుకో' అని నాకిచ్చిన సెల్‌ మోగింది. సెల్‌ అందుకుని 'హల్లో' అన్నా. +"ఆ! నేనేరా మాష్ట్రూ! మొన్న మా అమ్మ ఒక విషయం చెప్పడం మరచిందట. మనకు కావలసిన పుట్ట వేపచెట్టు కిందదే అయ్యుండాలట" అన్నాడు. +నా గుండెలో రాయిపడింది. నోరు పెగుల్చుకుని "మా వూళ్ళో కరచిన పాము వేపచెట్టు కింద పు��్టలోనిది కాదేమోరా అన్నాను. +"నోరు ముయ్యి! పాము కుట్టడం ఎవరికి కావాలోయ్‌! వేపచెట్టు చెట్టుకింద పుట్ట పుట్టలో పాము ఆ పాముకే పాలు పొయ్యాలి" అంటూ కట్‌ చేశాడు. ఫ్లాష్‌బ్యాక్‌లోని పాము సంపెంగ చెట్టు మీద కదా ఉంది ఈ వేపచెట్టు ఎక్కడిది? అయినా ఇప్పుడు సంపెంగ గుర్తుచేస్తే కూడదు నేను ఏ సింహాచలమో వెళ్ళి సంపెంగ వృక్షాన్ని తేలేను. నోరు మూసుకుంటూ 'అదిరా కొత్త కధ' అంటూ వివరించా. +గోవరాజు విని, తల పంకించి, యుంకించి "సావీ! తవరు నిబ్బరంగా ఉండండి. ఆయమ్మగారు వచ్చేతలికి ఏపచెట్టు పుట్ట పాము యాడున్నా ఎతికిపెట్టే పూచీ నాది" అంటూ గేదెల్ని తోలుకుంటూ వెళ్ళాడు. +దీపావళి వెళ్లిన మూడో రోజున కాంతారావు, భార్య, సీతాపతిగారు, నాగమ్మగారు ఇద్దరు మనవలతో పడవలాంటి పెద్ద కారులో మా ఊరొచ్చారు. అంతకుముందే మా పక్కింటిని వాళ్ళకోసం ఏర్పాటుచేశాం. రాగానే అందులోకి ప్రవేశించి పద్ధతి ప్రకారం పాలు పొంగించారు. మా ఆవిడ, పిల్లలు ఒదిగి ఒదిగి వాళ్ళకు కాఫీలూ టిఫిన్లూ భోజనాలూ ఏర్పాటుచేశారు. +ఆరోజు సాయంత్రం ఆకాశదీపం పెట్టే వేళకు ముందుగా గోవరాజు వచ్చాడు. వస్తూనే "బాబూ! ఆయమ్మగారు గొప్ప అదృష్టవంతులండీ! గొప్ప జాతిపాము సావీ! గోధుమరంగు, మంచి పొగరులో ఉంది. మన పుట్టలోనే సావీ! అది సరింగా మన పుట్టమీదే పొర ఇడిసిపెట్టినాది. వచ్చి సూత్తారేటి అన్నాడు. నాగమ్మగారు, కాంతారావు, పిల్లలు వాడి మాటలకు లోపలి నుండి వచ్చారు. +"రాండి సూదురుగాని" అన్నాడు నాగమ్మగార్ని చూసి. +"నేనొస్తా పద" అన్నాడు కాంతారావు. నేనూ పిల్లలూ పుట్టను చూడ్డానికెళ్ళాం. మా ఇంటికి దగ్గరలోనే వేపచెట్టు కింద పుట్ట చాలా పెద్దది. పుట్టమీద పాము కుబుసం. ఎవ్వరూ దగ్గరికి చేరకుండా చుట్టూ తుమ్మకంచె పడేశాడు గోవరాజు. కాంతారావు తృప్తిపడ్డాడు. +"గోవరాజూ! పాము ఎప్పుడూ ఇందులోనే ఉంటుందా అని భయపడుతూ అడిగాను. +"మనం మనింటిలో ఉండక యాడికిపోతాం సావీ! ఇదీ అంతే" అన్నాడు. +పాము పాలు పోసేటప్పుడు బయటికి వస్తే భయపడుతూనే ఇల్లు చేరాను. +చవితినాడు దేవుడి గదిలో పూజకు ఏర్పాట్లు చేసుకున్నారు నాగమ్మగారు. వాళ్ళకు కావలసిన సరంజామా అంతా నేను సమకూర్చిపెడితే మా శ్రీమతి వాళ్ళకు పనుల్లో సాయపడింది. గోవరాజు ఉదయాన్నే ఆవుపాలు లీటరు సంపాదించి తెచ్చాడు. నువ్వులు, బెల్లం దంచి ఉండలు కట్టారు. అత్తా కోడళ్ళు నానబెట్టిన బియ్యం దంచి, నూరిన పంచదార, కొబ్బరికో��ు, యాలకుల పొడి కలిపి ఉండలు కట్టారు. ఇంటి దగ్గర గద్దె నాగయ్యకి పూజచేసి, పాలుపోసి, ప్రసాదం నివేదన చేసి అత్తా కోడళ్ళు పట్టుచీరలు కట్టుకుని పెద్ద వెండి పళ్ళాలలో పూలు, పళ్ళు, చలిమిడి, చిమ్మిలి, వడపప్పు, నాగుల గావంచా పట్టుకుని బయలుదేరగా, పట్టుపంచెలు కట్టుకుని తండ్రీ కొడుకులు, వెండి చెంబుల్లో పాలు, నీళ్ళు పట్టుకుని బయలుదేరారు. పుట్టకెళ్ళే ఆచారం మాకులేదు కనుక మావాళ్ళెవరూ బయలుదేరకపోయినా, కార్యక్రమం పూర్తయేంతవరకు ఉండాలి కాబట్టి నేనూ గోవరాజు వాళ్ళతో బయలుదేరాం. చెట్టు, పుట్ట, ఆ వాతావరణం చూసి అందరూ తృప్తిపడ్డారు. గోవరాజు ముళ్ళకంచె తొలగించి, పాము కుబుసాన్ని పైకి లాగి ఓ పక్కగా ఉంచాడు. +పూజ మొదలైన దగ్గర్నుండి నాకు భయంగానే ఉంది. ఒక్కసారి బుసకొడుతూ పాము బయటికి వస్తే 'ఏమిటో గతిరా దేవుడా' అని నేను భయపడుతూంటే గోవరాజు నా భయంతో నిమిత్తం లేకుండా దగ్గరుండి పూజ నడిపించాడు. పుట్ట దగ్గర నీళ్ళు చల్లి, ముగ్గులు పెట్టి, పసుపు కుంకుమలతో పూజలు చేసి "ఇన్ని కన్నాలున్నాయి కదా పాలు ఎందులో పోయమంటావు అని అడిగారు అత్తా కోడళ్ళు. +"ఏ పుట్టలో ఏ పాముంటాదో ఎవురికెరుక తల్లే! కాసినేసి పాలు అన్నిట్లా పోసేండమ్మా! అలాగే సనివిడి, సిమ్మిలీనూ అని సలహా ఇచ్చాడు గోవరాజు. +చేతులు కట్టుకుని, వాళ్ళలా చేసిన తరవాత సీతాపతిగారు, కాంతారావు అలాగే చేశారు. పిల్లలు వాళ్ళననుసరించారు. నాగుల గావంచా పుట్టమీద వేసి, పుట్ట మన్నుతీసి ఇచ్చారు నాగమ్మగారు అందర్నీ పెట్టుకోమని చెవికి. తరవాత అరతులంతో చేసిన బంగారపు సర్ప మిధునాన్ని నాగమయ్యని స్మరించుకుంటూ పుట్టలో వేశారు. పదేపదే దండాలు పెట్టుకుని తిరిగి వస్తూ మూడుచోట్ల నీళ్ళు చల్లి, మూడేసి చిన్నరాళ్ళను కుప్పగాపోసి, వరిపిండి జల్లి వెనక్కి చూడకుండా తిరిగివచ్చారు నాగమ్మగారు. వస్తూ +"ఒరేయ్‌ అబ్బాయ్‌! ఈ రోజున ఈ పుట్టలో మరెవరూ పాలు పోయకూడదు. పూజ చేయకూడదు. చూసే బాధ్యత నీది. ఇదిగో ప్రసాదం. ఇదిగో వంద ఇంద తీసుకో" అంటూ ప్రసాదం, ఓ వంద రూపాయల నోటు వాడి చేతిలోపెట్టి వచ్చారు. ఆరోజు పచ్చి మంచినీళ్ళయినా తాగకుండా అత్తా కోడళ్ళు ఉపవాసముండి నాగపంచమినాడు మాతో భోజనాలు చేసి ఆ మర్నాడు అందరూ వైజాగ్‌ బయలుదేరి వెళ్ళిపోయారు. +వెళ్తూ "నా పెద్ద మనుమరాలు కన్సీవ్‌ అయింది. సవ్యంగా పురుడు రావాలనమ్మా ఈనా తాపత్రయమంతా అని చెప్పిందామె. వెళ్ళిన తరవా�� ఏ కబురూ కాకరకాయ లేకపోయినా కొన్ని నెలల తరవాత ఆమె కాంతారావుచేత నాకు ఫోన్‌ చేయించి, పెద్ద మనుమరాలికి కూతురు పుట్టిందని చెప్పింది. నాకా వార్త ఆనందాన్ని కలిగించినా ఎక్కువ భయాన్నే కలుగజేసింది మొక్కు తీర్చుకోడానికి మళ్ళీ మా ఊరు ఎక్కడ వచ్చేస్తానంటుందో' అనే నా భయం. +ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన మూడో రోజు సాయంత్రం మా అబ్బాయి ఏదో చెబితే అటు వెళ్ళి చూశాను. +అక్కడ వేపచెట్టయితే ఉందిగానీ పుట్ట మాత్రం లేదు. గోవరాజు కూడా నాకు కనపడటం మానేశాడు. + + +అయ్యో! పారిపోతున్నాడు పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ అయ్యో! కాస్త పట్టుకోండయ్యా! దొంగ దొంగ పారిపోతున్నాడు. +బజార్లోని జనమంతా అతడ్ని తరుముకొస్తున్నారు. మధ్యాహ్నం దాటింది. అరగంట క్రితం వరకు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది. +"ఫాయిరెన్‌ మణిపురి క్యాలండర్‌ లోని పదకొండవ నెల) మాసంలో కురిసే వర్షాన్ని తలపిస్తోంది. ఈ రోజు కురిసే వర్షం. బురద ఎక్కడ అంటుకుంటుందోనని జనాలు చాలా జాగ్రత్తగా అటు, ఇటు చూసుకుంటూ పరిగెత్తుతున్నారు. ఆ బురదలో పరిగెట్టటం కష్టంగా ఉన్నా అతగాడు వాళ్లకి అందకూడదనే దృఢ నిశ్చయంతో శరవేగంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. నిజం చెప్పాలంటే జన సందోహంతో నిండిపోయిన ఆ బజార్లో ఎవరికీ చిక్కకుండా పరిగెట్టాలంటే అతడికి కష్టంగానే ఉంది మరి. ఇంతా కష్ట పడ్డాక ఏం జరిగింది పాపం సాలెగూటిలో చిక్కుకున్న ఈగలాగా జనాలకి చిక్కిపోయాడు. +అతగాడిని చూసిన ఎవరైనా అతను నగరానికి మొదటిసారి వచ్చాడని, పచ్చి పల్లెటూరి బైతని ఇట్టే చెప్పేస్తారు. +అందరూ అనుకున్నట్టుగానే అతను ఓ పల్లెటూరి రైతే. వచ్చిన పని త్వరగా ముగించుకొని గ్రామానికి వెళ్ళి పోవాలనీ అనుకున్నాడు. కాలం కలిసిరాక యిదిగో ఇలా ఈ జనాలకే చిక్కిపోయాడు. పట్టణానికి వచ్చి మూడు రోజులైనా, ఉండటానికి గూడు కానీ, తినటానికి తిండి కానీ లేక తెగ అవస్థ పడ్డాడు. అన్నం తిని మూడు రోజులు కావస్తోంది. ఆ రోజు బజార్లోకి వచ్చే ముందు యేదో కాస్త ఎంగిలి పడ్డానని అనిపించుకున్నాడు. పొలంలో కాయ కష్టం చేసుకుని ముతక బియ్యంతో వండిన అన్నంలో మిరపకాయ నంజుకుని తిని, పంచ భక్ష్య పరమాన్నం తిన్నంత ఆనందపడిపోయే అమాయకుడు అతను. +తినటానికి కడుపు నిండా తిండి దొరక్క పోయినా, కాయ కష్టం చేసుకుంటూ పోవటం తప్పించి మరొక ఆలోచన లేని, తెలియని బండోడు. బాధని, దుఃఖాన్ని సై���ం గుర్తించక పోవటం అతని ప్రత్యేకత అనుకోవాలా, లేక అమాయకత్వం అనుకోవాలా ఓ రెండున్నర ఎకరాల భూమిని కామందు దగ్గర కూలీకి తీసుకొని ఒంటరిగానే కష్టపడే కష్టజీవి అతగాడు. అద్దెకు తెచ్చుకున్న ఎడ్లని క్షణమైనా కూర్చోనివ్వకుండా పొలాన్ని దున్నిస్తాడు. మళ్లీ మళ్ళీ ఎడ్లని అద్దెకి తెచ్చుకుని డబ్బు ఇచ్చే స్తోమత అతగాడి దగ్గరెక్కడుంది? ఒకవేళ తన పని అయిపోతే అడిగినా అడక్కపోయినా పక్క వాళ్ల పొలం కూడా దున్ని పెట్టే యితగాడిని ఏమనాలండీ ఇంతా కష్టపడి యింటికొస్తే, వంట కాలేదని తెలిసిందా అంతే పార పట్టుకుని తన చిన్న తోటలోని మొక్కలకు బళ్లు కట్టి నీళ్లు పెట్టటంలో నిమగ్నమై పోతాడు. తిండి మీదకన్నా అతగాడికి పనిమీద ధ్యాసెక్కువని అర్థమవుతోంది కదూ ఇంత కష్టపడ్డా కూడ అతగాడు డబ్బులు బాగా సంపాదిస్తున్నాడా! అంటే అది ఆ భగవంతుడికే తెలియాలి. కాయ కష్టం చేసుకోవటం తప్పిస్తే, చక్కగా నలుగురితో కలిసి తిరగాలని. వాళ్ళతో మాట్లాడాలని గానీ బహుశా అతను ఎన్నడూ అనుకోలేదనుకుందాం. ఒకవేళ ప్రయత్నం చేసినా అది అంతగా రాణించదని అతగాడి భయం. పోయిన 'పోయినూ మణిపురి క్యాలెండర్‌ లోని 7వ మాసం) మాసంలో పంట కాస్తా చేజారిపోయింది. కామందు అగ్గిమీద గుగ్గిలమవుతూ "ఏంటిరాయిది? ఇలాగయితే నేను బతికినట్టే" అన్నాడు. +"ఏం చేయను బాబాయ్‌! నేపడుతున్న కష్టాన్ని నువ్వు చూస్తూనే వున్నావుకదా ఇంతకన్న నన్నేం చేయమంటావు?" +"లేదు, నన్ను నమ్ము బాబాయ్‌! వచ్చే ఏడాది ఈ లోటుని తప్పక తీరుస్తాను" +ఈ ఏడాది ఏం తిని బతకమంటావురా? గాలి భోజనం చేయమంటావా! నాకు పిల్లాజెల్లావున్నారు. వాళ్ళ కడుపులెలా నింపమంటావు? ఏదైనా అన్నానంటే చాలు, పెద్ద పెద్ద దణ్ణాలు పెడుతూ నా కాళ్ళమీద పడియేడుస్తావు. చచ్చే చావొచ్చిందిరా నాకు. ఈ మోటరు నీళ్ళతో నడుస్తుందనుకొంటున్నావా! ప్రతి సంవత్సరం ఏదో వంకతో ధాన్యం తగ్గిస్తూనే వస్తున్నావు. నీతో కాదుకానీ మరెక్కడైనా చూసుకో". +మరెక్కడైన పని దొరకడం అంటే మాటలా! బతిమిలాడటం, కాళ్ళావేళ్ళాపడటం యివేమీ చేతగాని పరమశుంఠ మనవాడు. రెండుమూడు సంవత్సరాల లోటు ఒక్క ఏడాదితో తీరుస్తానని గట్టిగా చెప్పటం అయితే చెప్తున్నాడు. ఇతగాడిని ఆ భగవంతుడే రక్షించాలి. +తాగుడు అలవాటులేదు. అనవసరంగా డబ్బు ఖర్చుపెట్టడం, శరీర శ్రమకు వెనకాడడం యివేమీ చాతకావు. ఎత్తలేని బరువుని ఎత్తటం మూలానే ఈ రోజు ఇంత అనర్ధం జరిగింది. అన్నీ బాగావున్నరోజులో 15 కి బదులు 10 బస్తాలు సేద్యం చేసేవాడు. కానీ ఈ రోజు కలిసిరాక యిన్ని తిప్పలు పడాల్సి వస్తోంది. ఏడాది, ఏడాదిన్నర వ్యత్యాసంలో ఒకరి తరువాత ఒకరు పిల్లలు పుట్టుకు రావటంతో చూస్తుండగానే సంతానం ఎనిమిది మందైకుర్చున్నారు. అందులోను ఆరుగురు ఆడపిల్లలు, యిద్దరు మగపిల్లలు. వీళ్ళందరితో పాటు అస్తమానం ముక్కుతు, మూలుగుతూవుండే యిద్దరు ముసలివాళ్ళు. వైద్యుడి అవసరం లేకుండా పూటకూడా గడవదు. +కేవలం తిండి వరకే అయితే ఫరవాలేదు. బడికూడా యింటికీ దగ్గర్లోనే ఏడ్చింది. ఇక పిల్లల్ని బడికి పంపక తప్పదుగా! చదువు, తిండి రెండు ఒకేసారి కావాలంటే కష్టమే మరి వసంతంలో శ్రీపంచమి ఎందుకొస్తుంది లమదా మణిపురి కాలెండర్‌లో చివరి నెల) మాసం గుట్టుచప్పుడు కాకుండా ఎందుకెళ్లిపోదో? వర్షం తన హద్దులో వుండకుండా కట్టలు తెంచుకుని ఎందుకు కురుస్తోందో? అదీ నగరంలోనో, గ్రామంలోని పోలాల్లోనో కాకుండా మాలతిపైనే ఎందుకు కురుస్తోంది? ఇవన్నీ అతగాడి బుర్రని తోలిచేసే ప్రశ్నలు. +మాలతి అతని పెద్దకూతురు. పక్క గ్రామంలోని స్కూల్లో చదువుకుంటోంది. తనకంటూ ఓ చిన్న గొడుగు కొనుక్కొవాలని ఎప్పటినుంచో ఆశ పడుతోంది. ఈ విషయమై తండ్రిదగ్గర చాలాసార్లు గొడవ పడింది కూడా. ఇదివరకటి లాగా యిప్పుడు స్నేహితురాలి గొడుగులో స్కూలుకెళ్లిరావటమో లేకపోతే వర్షం తగ్గేవరకు ఆగి వెళ్ళటమో చేయటంలేదు. వర్షం మరీ ఎక్కువగా పడుతుంటే స్కూలు మానేయటమో లేక తడుచుకుంటూ పోవటమో చేస్తోంది. తన స్నేహితురాళ్ళంతా చక్కగా గొడుగులో వెళుతుంటే ఆ పసి హృదయం పాపం బాధగా మూలిగేది. గొడవ చేస్తే గొడుగు వస్తుందన్న విషయం ఆ పసి మనసుకి తెలియక పోలేదు. నిజం చెప్పాలంటే అవసరమైనప్పుడు అలగడం, ఏడవడం, కోపగించుకోవడం సహజమే కదా! కోప తాపాలు మనిషి నైజంలో ఒక భాగమే అలాగే వాటిని ఉపయోగించుకునే హక్కు ప్రతి వారికీ ఉంది. +తండ్రి తన బిడ్డ కోరికని గుర్తించలేక పోతున్నాడనుకుంటే అది మీ అవివేకమే అవుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలపు మేఘాలు చూడగానే అతనిలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కానీ తిండి గురించి పట్టించుకునే అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి గొడుగు విషయం పక్కకి పెట్టాల్సి వస్తోంది అతగాడికి. +దేవుడి దయవల్ల ఈసారి అన్నీ కలిసొచ్చాయి. బహుశా ఆమె కోరిక తీరే రోజు దగ్గరకొచ్చిందేమో మాలతి తన పాత పుస్తకాలని అమ్మేసి కొంత సొమ్ము కూడబెట్టింది. దాన���కి తోడు పోయినసారి వర్షంలో బాగా తడిసి, ముద్దయి ఒణికి పోతూ, నీళ్ళు కారుకుంటూ వచ్చిన కూతుర్ని చూసి గొడుగు కొనాలనే నిశ్చయించుకొన్నాడు. అంతే కాదు అప్పు చేసైనా సరే గొడుగు కొనటానికి వెళ్లాలని తీర్మానించుకొన్నాడు. తన నిర్ణయాన్ని కూతురికీ చెప్పాడు. మాలతి ఆనందానికి హద్దులు లేకపోయాయి. కూని రాగాలు తీస్తూ పడుకోవటానికి వెళ్లిపోయింది. తెల్లారే లేచి స్నానం చేసి సంతోషంగా బస్సెక్కాడు. +"దీని బట్ట చూడండి ఎంత అందంగా ఉందో! పైగా గాజుతో చేసిన దీని పిడి చూస్తే దీని ఖరీదు తెలియటం లేదూ! +అతగాడు మారు మాట్లాడకుండా బయటికొచ్చేశాడు. పక్క కొట్లోకి వెళ్ళే ముందు ఓ సారి రొంటిన దాచుకున్న డబ్బును తడిమి చూసుకున్నాడు. డబ్బు మూట చేతికి బరువుగా తగలడంతో సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాడు. +చుట్టు పక్కల దుకాణాలలో సైతం గొడుగు ఖరీదు 25 రూ్హ్హ అనటంతో అతగాడికేం చేయాలో తోచలేదు. ఎలాగో అలా ధైర్యం కూడగట్టుకుని చివరికి మూలగా ఉన్న ఓ దుకాణంలోకి దూరి గొడుగు ఖరీదు అడిగాడు 25 రూపాయలు" అని అనేలోగానే అతని మాటలకు అడ్డం పడుతూ "కాస్త తక్కువ ధరలో చూపించవయ్యా" అన్నాడు. +"తక్కువ ధరా! ఎంతలో చూపించమంటావు 20 రూ 15 రూ అంటూ కొన్ని గొడుగులు చూపిస్తూ "ఇందులో యేది కావాలో యేరుకో అన్నాడు. +"నీ దగ్గర కాకపోతే కనీసం చుట్టు పక్కల యెక్కడా తక్కువ ధరలో గొడుగు దొరకదా? అన్నాడు నిరుత్సాహంగా. +అతని మాటల మీద విశ్వాసంతో పాపం అతనెంతో ప్రయత్నించాడు. కానీ ఫలితం శూన్యం. గొడుగులతో నిండిన దుకాణాలన్నీ దాదాపు అయిపోయాయి. ఆఖరికి ఓ మూలగా ఉన్న దుకాణంలో కొద్దిగా పాడైనా కాస్త నదరుగా ఉన్న గొడుగు అతని కంట పడింది. గొడుగు పిడి గాజుదై ఉండటమే కాకుండా లోపల విచ్చుకొన్న పువ్వు డిజైను ఉంది. లోపల దారాలు చెమ్కీతో చేసినవై ఉండటం మూలాన చక్కగా మెరుస్తూన్నాయి. పైగా ఖరీదు 8 రూ. 50 పైసలే! అతగాడి ఆనందానికి హద్దులు లేకపోయాయి. +అంత రద్దీలో దోవ చేసుకొంటూ పోతున్నప్పుడు కూడా గొడుగు చేతిలో ఉంది. కొత్త గొడుగు ఎక్కడ మాసిపోతుందోనని కాగితంలో చుట్టి పట్టుకున్నాడు. అతనికి ఒక్క సారిగా కూతురి ముఖం కనిపించింది. పిచ్చి తల్లి ఎన్ని రోజులుగా ఎదురు చూస్తోందో దీని కోసం" అనుకుంటూ వడి వడిగా బస్‌స్టాండ్‌ వేపుగా నడిచాడు. నడుస్తున్నంతసేపు సంతోషంతో వెలిగిపోయే కూతురి ముఖమే కనిపిస్తోంది అతగాడికి. రెండు మూడు రోజులదాకా చెప్పిన పనల్లా చేస��తుంది. తల్లిని నిర్లక్ష్యం చేయదు. నేను వెళ్లేసరికి గుమ్మంలోనే నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబోలు +హఠాత్తుగా ఆలోచనల లోంచి బయటికొచ్చిన అతనికి గొడుగు కనిపించలేదు. అతనికి ఒక్కసారిగా కళ్ళు చీకట్లో కమ్మినట్టయ్యాయి అయ్యో! నా గొడుగు! నా గొడుగు! అమ్మో మీరుగాని నా గొడుగుని చూశారా?" +"లేదు నాయనా! శనగలు కొంటూ నువ్వు రుమాల్లోంచి డబ్బులు తీయటం మాత్రమే చూశాను". +"అవును డబ్బు తీసిన మాట వాస్తవమే కానీ గొడుగు యిదిగో యిక్కడే ఈ పక్కకే పెట్టాను కొత్తది చిన్నది +కర్మగాలీ యెవరైనా ఎత్తుకుపోయారా! ఓరి భగవంతుడా ఏం చేయాలి?" +గొడుగు పోయిందని అతగాడికి అర్థం అయిపోయింది. ఎవరినడగాలో, ఏం చేయాలో తోచటం లేదు. బాధతో పెదవులు కొరుక్కున్నాడు చేసేది లేక బస్టాండ్‌ వదిలేసి బజారు వేపుగా కదిలాడు. +"నీ పేరేవిటిరా? దొంగ వెధవా గట్టిగా దవడ పగిలేలా కొట్టాడు. జవాబు చెప్పేలోగా ప్రశ్నల పరంపరలో అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు ఆ పోలీసు. ప్రతి ప్రశ్నకి ముందు వెనక లారీ౮ దెబ్బలతో ఒళ్లు హూనం అయిపోతోంది. దెబ్బలకి కళ్లు చీకట్లు కమ్ముతున్నాయి. భరించలేక అతను మోకాళ్ల మీద కూర్చున్నాడు. జేబులో చిరిగిన కాగితంలోంచి శనగ్గింజలు చుట్టు పక్కల దొర్లాయి. +"ఇవి ఎవరి దగ్గర కొట్తేశావురా దొంగ అంటూ ఠపేల్‌ మని ఎడమ కాలి మోకాలి చిప్ప మీద లారీ౮ దెబ్బ బలంగా పడింది. దెబ్బలు నొప్పికి నడుమ అంతరాత్మలోంచి ఓ నవ్వు బయటికెగసింది. కళ్లల్లోంచి కారుతున్న నీళ్లని చేతులతో తుడుచుకుంటూ +"నన్ను నన్ను తోమాల్‌ అంటారు" అంటూ జవాబిచ్చాడు. + + +గొని యెప్పటియట్ల యగుడు గురుఁ డతి రభసం +ముని ధర్మజుఁ బొదివి యుగ్రముగ నేసె నృపా. +యిభ తురఁగ స్యందనంబు లిలఁ బ్రోవులుగా +నభశ్చరులు వొగడ నీ సునం బోరాడెన్. +- ధృష్టద్యుమ్ను ద్రోణాచార్యుల యుద్ధము – +వ అట్టి సంకుల సమరంబున సుస్థిరోత్సాహుం డై నిజవ్యూహం బభేద్యం బగునట్లుగా శుంభదవష్టంభంబునం బేర్చి కుంభ సంభవుండు ధృష్టద్యమ్ను మిగిలి పాండవ సైన్యంబు దైన్యంబు నొందించుచున్న నప్పాంచాల కుల ప్రదీపకుండు గోపోద్ధీపితుం డయి పారావత వర్ణంబులగు తన రథ్యంబుల నగ్గురు నరుణాశ్వంబులన్ బెరయ నరతంబు వఱపించి పలకయు వాలును గొని సాహసికత్వంబున నతని తేరకడ నొగఁ ద్రొక్కి యెక్కి కాఁడిపయిం జిత్రగతులు మెఱసి తఱ చై తొరఁగు తదీయ శరంబులు నిజ శరీరంబుఁ జోఁకనీ కుండెడు నాలోఁ జేయార్పు రాకుండియుఁ దమకంబునం గృపాణంబు విసరినం దద్రథ తురంగంబుల యంగంబులు నెడవెడ దాఁకు కొలఁది నయ్యాచార్యుండు రయంబున. +తే అలుఁగు చెక్కలుగాఁ జేసి హఠుల సూతఁ +దునిమి సిడమును బలకయుఁ ద్రుంచి వైచి +నారసం బేయ సాత్యకి నడుమ నఱకె. +వ ఉట్లు శినిపుంగవుండు సింగంబు వొదివిన కురంగంబుఁ గాఁచు చందంబున ధృష్టద్యుమ్ను రక్షించి తొలంగం గొనిపోయె ననిన విని యాంబికేయుండు సంజయున కిట్లనియె. +వ అనుటయు నమ్మానస పతికి సూతసూనుం డిట్లను నట్లు సేసినం గినిసి గురుండు ఱెక్కలు గల పెనుఁబాము కైవడి సాత్యకిపై గవియుటయు నతండు నిజ సారథి నాలోకించి యివ్విప్రుండు ధర్మతనయ భయంకరుం డితని మార్కొన వలయు నని పలికి తేరు సమ్ముఖంబు సేయించె నిత్తంఱంగున. +గులగములుగ గుణ నితాంత ఘోషంబులు గ +జలదయుగము మెఱసి సాంద్ర శర వర్షములన్. +వ అంతకంతకుం గదిసి భల్లంబుల నేట్లాడం దొడంగిన. + + +అటుకారాదని బల్క నభిమానము లేకపోయెనా అ +ఏ వేల్పు సేయు చలమో దెలిసి అ + + +సాంప్రదాయమైన తెలుగు విద్యాభ్యాసములో పెద్ద బాలశిక్ష ఆది గ్రంథము వంటిది పూర్వము ఆంధ్ర దేశములోని ప్రతి విద్యార్ధి తన చదువు పెద్ద బాలశిక్షతోనే ప్రారంభించేవాడు. + + +15. పౌర్ణమి లేక అమావాస్య amavasya +ఇక్కడ pournami మరియు అమావాస్య అనడము బాగు + + +1. వసంత ఋతువు చైత్ర, వైశాఖ మాసాల +2. గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు +3. వర్ష ఋతువు శ్రావణ, భాద్రపద మాసాలు +4. శరత్ ఋతువు ఆశ్వయుజ, కార్తీక మాసాలు +5. హేమంత ఋతువు మార్గశిర, పుష్య మాసాలు +6. శిశిర ఋతువు మాఘం, ఫాల్గుణం మాసాలు + + +" తెలుగు వికిపుస్తకాలలో ప్రస్తుతం 27 వ్యాసములు ఉన్నాయి అని మొదటి +పేజీలో ఉన్నది అయితే ఏయే వ్యాసములు ఉన్నాయో తెలియడం లేదు +ఈ పుటలలొ చదవడమ్ కష్టముగా ఉన్ది. ఇక్కడి తెలుగులొ వత్తులు పొల్లులని దయఛెసి మార్ఛన్డి. తలకట్టులతొ దీర్ఘాలను కలపడమ్ షుభ్రపరిస్తె బాగున్టున్ది. +ఇక్కడ నెను ఛుడాలనుకున్టున్న కొన్ని విషయాలు: +కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నాం +; తెలుగు వికీపీడియా రచ్చబండలో ఎంపిక మండలి అధ్యక్షుడు వైజాసత్య గారి సందేశం +అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఫలప్రదం చేస్తారని ఆశిస్తూ + + +దీని తొలగింపునకు మీరు అంగీకరించకపోతే, ఎందుకు అంగీకరించడం లేదో స్విచ్ +case: బొమ్మ బొమ్మపై చర్చ PAGENAME ఈ బొమ్మ చర్చా పేజీ]] + + +ఈ నవో��య విద్యలయము 1992 లో వరంగల్ నగరంలోని హసన్పర్తి గ్రామము నందు ముందుగా నెల్కొల్పబదినది.అప్పుడు హసన్పర్థి నందు స్తిరమైన భవనములు లేవు ,కాని ప్రస్తుతం స్ఠిరమైన భవన సముదాయం లో నదుపబడుచున్నది.ప్రస్తుతము ఈ విద్యలయము మామునూరు పోలీసు క్యాంపు ప్రక్కన స్తలములో పెన్ షన్ పూర్ నందు నదుప బడుచున్నది. +ప్రస్తుతము ఈ విద్యలయమునకు ప్రిన్సిపాల్ గారు ఫి.వి.ఏన్.స్ రాజు గారు. + + +ఆది వారము, రవి వారము, భాను వారము సూర్యుడు. + + +మాది పొదలకూరు. ఇది నెల్లూరు జిల్లాలోని ఒక మండలము.నెల్లూరు నుంచి సోమశిల వెళ్ళవలెనంటే పొదలకూరు ద్వారా వెళ్ళాలి.సోమశిల పెన్నా నది పైన కట్టబడిన ఒక ప్రాజెక్టు. పొదలకూరు లో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కాలేజి కలవు. + + +*అపనమ్మకం అపనమ్మకము lack of trust + + +5. కేరట్లు తింటే కంటికి మంచిదంటారు. నిజమేనా? +కేరటు దుంపలు నారింజ రంగులో పొడుగ్గా ఏకుల్లా ఉంటాయి. ఇవి తింటే కంటికి మంచిది అంటారు. ఇది మంచో కాదో తర్వాత చూద్దాం. ముందు ఈ పుకారు ఎలా పుట్టిందో పరిశీలిద్దాం. కేరట్లలో ఉండే బీటా కేరొటేన్‌ అనే రసాయనమే విటమిన్‌ ఎ తయారీకి ముడి పదార్ధం. ఈ వీటమిన్‌ లోపిస్తే రేచీకటి అనే కంటి వ్యాధి వస్తుంది. ఈ విటమిన్‌ లేకపోతే కండ్లలో చెమ్మదనం పోయి, ఎండి పోతాయి. టూకీగా చెప్పాలంటే పోషక పదార్ధాలలో విటమిన్‌ ఎ చాల ముఖ్యం. అందులో ఢోకా లేదు. రోజుల తరబడి పొట్ట వీపుకి అంటుకుపోయే అంత గర్భ దరిద్రం అనుభవించే వారిని మినహాయిస్తే సామాన్యులు తినే ఆహారంలో ఈ విటమిన్‌ దండిగానే ఉంటుంది. కనుక సర్వ సాధారణంగా విటమిన్‌ ఎ కొరత రాకూడదు. చెప్పొచ్చేదేమిటంటే కంటికి మంచిదని కేరట్లని ప్రత్యేకం మనం తినక పోయినా పరవా లేదు. బీటా కేరొటీన్‌ ఇంకా అనేక ఆహార పదార్ధాలలో లభిస్తుంది. + + +ఇక్షు, క్షిర, ఘ్రుత, దధి, జల, లవణ, సురా సముద్రము + + +హిందీ తెలుగు వేవేరు భాషలైనా అనేక పదాలు రెండింటిలోనూ ఒకే అర్ధాన్ని స్పురింప చేస్తాయి.అవి ఏమిటో తెలుసుకుంటే భాష నేర్చుకోవడం కొంత సులువు చేసుకోవచ్చు.అలాగే దక్షిణ భారత భాషలైన తమిళం,కన్నడం,మళయాళం మరియు తెలుగు భాషలకు కొన్ని పోలికలు,కొన్ని తేడాలు ఉన్నాయి.మొదటిగా హిందీకి తెలుగుకి ఉన్న పోలికలను చూద్దాం. + + +తండ్రి కి అన్నయ్య లేదా తల్లి యొక్క అక్క భర్త + + +సహధర్మచారిని. ఒక స్త్రీ కి వ��వాహము ద్వారా పురుషునితో ఏర్పడిన బంధము + + +ఉమ్మడి కుటుంబాలలో పెద్దవాళ్ళు దగ్గర ఉన్నప్పుడు పిల్లలకు ఎక్కువగా సంరక్షణ ఉండేది. నేటి సమాజంలో చిన్నకుటుంబాలు ఎక్కువవుతున్న తరుణంలో, పిల్లలకు ఎటువంటి చిన్న జలుబు, దగ్గులాంటివి వచ్చినా ఏమిచేయాలో తెలీక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. +ఇంట్లో పెద్దవాళ్ళులేని కొరతను కొంతవరకైనా తీర్చడానికి, ఈ పుస్తకం సహకరిస్తుందని ఆశిస్తున్నాము. +చిన్న పిల్లలు వేడిని తట్టుకోలేరు. అందువల్ల జ్వరం రాగానే, వంటిమీద బట్టలు లేకుండా చేసి, తడిగుడ్డతో ఎప్పటికప్పుడు తుడవాలి. లేని పక్షంలో పిల్లలకు మూర్ఛలు వస్తాయి. మూర్ఛలు ఒకసారి వస్తే, ప్రతిసారి జ్వరం వచ్చినప్పుడల్లా మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మూర్ఛలు ఎంత ఎక్కువసార్లు వస్తే మెదడు అంతగా దెబ్బతింటుంది. పెద్దగా అయ్యాక వారి ఆలోచనా విధానంలోకూడా లోపం ఉంటుంది. +పోతపాలు తాగే పిల్లల విషయంలో, కొంత మంది తల్లులు, పాలడబ్బానోట్లో పెట్టి నిద్రపుచ్చుతారు. ఇలా రాత్రంతా నోట్లో ఉన్న పాలు, పిల్లల పళ్ళు పుచ్చిపోయేలా చేస్తాయి. రూట్ కెనాల్ థెరపీ అవసరమయిన రెండు సంవత్సరాల పిల్లలు ఉన్నారని గమనించండి. +మీపిల్లల పెరుగుదల ఉండవలసినంతగా లేకుంటే థైరాయిడ్ హార్మోన్ లోపం అయిఉండవచ్చని గమనించండి. చంటి పిల్లలకు (రెండు సంవత్సరాలలోపు) ఏడుపు అవసరం అని గమనించండి. ఏడవడం వల్ల తాగిన పాలు అరుగుతాయి, కావలసిన ఎక్సర్సయిజ్ అందుతుంది. థైరాయిడ్ స్టిమ్యులేట్ అవుతుంది. +వెనకట సంతానానికి, సంతానానికి ఎక్కువగా ఎడంలేనప్పుడు, ఉమ్మడి కుటుంబాలలో అదే వయసుగల అన్నదమ్ముల పిల్లలు ఉండటంవల్లనూ పిల్లల ఎదుగుదల ఎక్కువగా ఉండేది ఇప్పుడు సంతానానికి, సంతానానికి ఎక్కువగా ఎడం ఉండటం వల్లనూ, చిన్న కుటుంబాలవ్వడం వల్లనూ, పిల్లలకు త్వరగా మాటలు రాకపోవడం, పెరుగుదల మందగించడం జరుగుతుంది. పిల్లలను త్వరగా ply schoolకి పంపడం వల్ల కొంతవరకు సరిదిద్దుకోవచ్చు. + + +నేను Alcatel-Lucent లో ఆర్కిటెక్ట్ గా పని చేస్తున్నాను. + + +* కొబ్బరి తురుము 1 కప్పు +1:1 లో కొబ్బరి తురుము, పంచదారను కలిపి పొయ్యిమీద పెట్టి, గట్టి పడే వరకు కలుపుతూ ఉండాలి. +(మొదట నీరు నీరుగా మారి, తరువాత గట్టి పడుతుంది.) +తరువాత కిందకు దింపుకొని, నూనెరాసిన ప్లేట్ లోకి మార్చుకోవాలి. చల్లారిన తరువాత పిజ్జా కట్టర్ తో కాని, చాకుతో ��ాని ముక్కలుగా కత్తిరించుకోవాలి. అంతే! వడ్డించాడినికి సిద్ధం. + + +* కొత్తిమీర తరుగు 1 టీ స్పూను +* పంచదార 1/2 టీ స్పూను +* వెల్లుల్లి 2 పాయలు (రెకలు) +* వెన్న/నెయ్యి 1/2 టీ స్పూను +టొమాటో, క్యారెట్, నీళ్ళు, నల్ల ఏలకులు, మిరియాలు, బిరియానీ ఆకులు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పంచదార, ఉప్పు లను కుక్కర్ లో ఉడికించాలి కుక్కర్ 3 విజిల్స్ వస్తే సరిపోతుంది మెత్తగా అయిన టొమాటో మిశ్రమాన్ని వడ పోయాలి. మెత్తగా చేత్తో మెదిపి, ఆ గుజ్జును కూడా వడ పోయాలి. +ఫ్రయింగ్ పాన్ లో వెన్న/నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను వేయించాలి. వడ్డించే ముందు ఈ బ్రెడ్ ముక్కలను సూప్ లో వేసుకోవాలి. + + +అమ్మకు నాన్న లేదా నాన్నకు నాన్న + + +తన తల్లిన్డ్రులకు తన తరువాత జన్మించిన ఆడ సంతానము. + + +[[పిల్లలకు పేర్లను సహజంగా(అనాదిగా) pubbaజన్మ నక్షత్రం ఆధారంగా పెడతారు. తద్వారా, ఒక వ్యక్తి జాతకం తెలుసుకోవడానికి అతని పు12,5ట్టిన సమయం గుర్తుపెట్టుకోనవసరంలేదు. +క్రింద పట్టికలో నక్షత్రం పేరులోని మొదటి అక్షరం ఇవ్వబడినవి. శm +క్రింద పట్టికలో పేర్లు, వాటి అర్ధాలు వివరించబడినవి.ex +ఆద్రిక్ కొండల మధ్యగా ఉదయించే సూర్యుడు + + +తనకు తన భార్యకు కలిగిన పురుష సంతతి +తన అన్నదమ్ముల లేదా తన సోదర సమానుల పుత్ర సంతతి + + +# జంబూ ద్వీపం జంబూ అనగా నేరేడు అని అర్థం BR> + + +తల్లి సొదరుడు. మామయ్య అని సామాన్య వ్యవహారం. + + +తండ్రి సోదరి. అత్త అని, అత్తయ్య అని సామాన్య వ్యవహారం + + +భర్త తండ్రి, భార్య తంఢ్రి, మేనమామ, మేనత్త భర్త వీళ్ళను మామయ్య అనడం ఉంది భర్త తండ్రిని, భార్య తండ్రిని మామగారు అనడంలో చుట్టరికం స్పష్టమవుతుంది. + + +నిన్నెగాని మది నెన్నఁ జాల నొరుల +ప: పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే +చ 1: పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి +కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే +చ 2: ఇరువుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి +కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి పలుకే +చ 3: రాతి నాతిగజేసి భూతలమందున ప్ర +ఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే +చ 4: ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు +పంతము చేయ నేనెంతవాడను తండ్రి పలుకే +చ 5: శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావా +కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే + + +నా అనె పఊమ్ ఎ రాసి + + +మనుమడు అంటే, కూతురు లేదా కొడుకు యొక్క కొ��ుకు. + + +మనవరాలు అంటే తన సంతానానికి కలిగిన ఆడపిల్ల. + + +అన్నా అంటే అమ్మా నాన్న కి తనకంటే ముందు పుట్టిన మగ సంతానం + + +తల్లి తండ్రులకి తన తర్వాత జన్మించిన మగ సంతానం తమ్ముడు + + +నాన్న కి చెల్లెలు మావయ్య భార్య + + +అనూష =ఒక అల్లరి పిల్ల,ఒక పిడుగు,ఒక బాంబు , + + +ఉబుంటు తెలుగురూపంలో కూడా అందుబాటులో వుంది. దీనికొరకు స్థాపన సమయంలోనే తెలుగు ఎంచుకోవచ్చు లేక ఇంగ్లీషులో స్థాపన పూర్తయిన తర్వాత System->Administration->Language support లో Install/Remove Languages లో తెలుగు ని ఎంపికచేసుకొని స్థాపించుకోవాలి +ఉబుంటు ఒన్ (క్లౌడ్ నిల్వ స్థలము + + +నాకు తెలుగు అనువాదం లో తప్పులు కనబడ్డాయి. వాటిని సరిచేయటం ఎలా +తెలుగు టైపు చేయటానికి కీ బోర్డుపై తెలుగు అక్షరాలు ముద్రించి వుంటే బాగుంటుంది. దాని కేదైనా సూచన చేయగలరా== +తెలుగు అక్షరాలు ముద్రించిన కీ బోర్డులు అందుబాటులో లేవు. కాని దీనికోసం చిన్న చిట్కాలున్నాయి. అక్షరాలు గమ్ అతికించిన పేపర్ లేక ఫిల్మ్ పై ముద్రించుకొని మీ కీ బోర్డుపై అంటించుకోవచ్చు లేక చెరిగిపోని సిరా గల కలం తీసుకొని మీరే చక్కగా కీ బోర్డు పై తెలుగు అక్షరాలు రాసుకోవచ్చు. +==పుస్తకం చదివితే ఆసక్తిగా వుంది. కాని ఎవరైనా ఒక వర్క్‍షాప్ లో నేర్పించితే మాకు వుపయోగంగా వుంటుంది== +==PPA లు కనుబడుటలేదు లేదా మీ అనువర్తనాలు స్థాపించుటకు నిరాకరించాబడినదా== + + +* 1 GHZ ప్రాసెసర్ (ఇంటెల్ ఎఎమ్‍డి(AMD ) +* 15 GB హార్డ్ డిస్క్ ఖాళీస్థలం +* గ్రాఫిక్స్ కార్డ్ మరియు మానిటర్ విభాజకత 1024x768 +* సిడి/డివిడి డ్రైవ్ లేక/మరియు యుఎస్బి (USB) పోర్ట్ +* అంతర్జాల(ఇంటర్నెట్) సంపర్కం (వుంటే మంచిది) +సాధారణంగా విండోస్ XP ఆ పైన నిర్వహణ వ్యవస్థలు నడిచే ఏ కంప్యూటర్ ఐనా సరిపోతుంది. వాటికంటే వేగంగా పనిచేస్తుంది. అంతే కాకుండా మీ కంప్యూటర్ కి ఏ హానీ జరగకుండా ప్రత్యక్ష బూట్ సిడి/డివిడి తో పరీక్షించి ఆ తరువాత స్థాపించుకోవచ్చు. +ఒక వేళ మీకు వేగవంతమైన ఇంటర్నెట్ సంపర్కం లేకపోతే, కంప్యూటర్ పత్రికలతో పాటు అందచేసే ఉబుంటు డివిడిలు లేక కంప్యూటర్ దుకాణాలు ఇతర కంప్యూటర్ వాడే మిత్రుల నుండి పొందవచ్చు. +మీ డివిడి డ్రైవ్లో ఉబుంటు డివిడి అమర్చి లేక యుఎస్‍బి లో ఉబుంటు స్టిక్ చేర్చి, బయోస్ (‌BIOS) సెట్ అప్ లో వాటిని బూట్ కి చేతనం చేసి కంప్యూటర్ స్విచ్ ఆన్ చేయండి. +ఆ తరువాత కనబడే తెరలో బూట్ స��క్రీన్ లో భాష ఎంపిక కనపడుతుంది. తెలుగు ఎంచుకోండి త ె లుగు అని కనబడినా గాభరాపడవద్దు. టర్మినల్ లో తెలుగు లాంటి భాషలకు పూర్తి తోడ్పాటు రాలేదు. సాధారణ వాడుకరులు గ్రాఫికల్ అంతర్వర్తి వాడతారు (స్థాపనలో ఆ తరువాత వచ్చే తెరనుండి) కాబట్టి వాటిలో లోపాలు లేని తెలుగు కనబడుతుంది. +బూట్ మొదటి తెర బూట్ వ్యవస్థ వాడు విధం. దీనిలో మొదటి వరుస ప్రత్యక్ష అనుభవం (Try Ubuntu without Installing ఇతర ఎంపికలు నేరుగా స్థాపన, పాఠం విధానంలో స్థాపన, డిస్క్ లో దోషాల తనిఖీ, మెమరీ పరీక్ష, మొదటి హార్డ్ డిస్క్ నుండి బూట్ పనిచేయని వ్యవస్థను బాగుచేయు అనే ఇతర ఎంపికలు వుంటాయి వాటిని కీ బోర్డుతో (బాణంగుర్తులుగల కీలువాడి)ఎంచుకోవచ్చు ప్రత్యక్ష అనుభవం ఉద్దీపనం చేసి దాఖలు (ENTER) చేయండి ఎంచుకోండి. ఒక వేళ భాష ఎంపిక చేయుట మొదటి సారి తెర కనిపించిన 30 సెకండ్లలో చేయలేక పోయినట్లైతే F2 కీ వాడి భాష ఎంపిక చేయవచ్చు. +మీ హార్డ్‍డ్రైవ్ లో ఇప్పటికేవున్న నిర్వహణ వ్యవస్థల వివరాలు తెలిపి ఉబుంటుకోసం వాడవలసిన హార్డ్‍డిస్క్ విభజన(పార్టిషన్)ఎంపిక చేయటమే ఈ దశ ముఖ్యోద్దేశం. ఖాళీ వుంటే ఆ ఖాళీ స్థలము వాడుకొనేటట్లు చేయవచ్చు. లేకపోతే ప్రస్తుతమున్న విభజనలను కుదించి ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేసే ఎంపిక చేయవచ్చు. కాని ఇలా చేసేటప్పుడు ముందుగా మీ డాటాని భద్రపరచుకోండి. +ఇప్పటికే వాడుతున్న కంప్యూటర్ పై స్థాపించేటప్పుడు, సాధారణంగా ఉబుంటు మీ నిర్వహణ వ్యవస్థలను అలానే వుంచి కొత్త ఉబుంటు ని స్థాపించమనే ఎంపిక మొదటిదిగా చూపెడుతుంది. దీనిని మీరు ఎంచుకుంటే సులభంగా వుంటుంది. దీనికి కేటాయించిన నిల్వ మొత్తం ఒకే వేరుగల ఫైల్ వ్యవస్థగా వాడుతుంది ఇలాగా చేస్తే ముందు ముందు కొత్త ఉబుంటు వ్యవస్థలకు మారటానికి మీరు నివాస సంచయాన్ని భద్రపరచుకోవాలి. అలా కాకుండా మానవీయంగా ఈ క్రింది వేరులకు మీ నిల్వను కేటాయిస్తే ముందు ముందు తాజాకరణలు మీ నివాస సంచయం అలాగే వుంచుకొని చేసుకోవచ్చు. +సిఫారస్ చేయబడిన వేరులు మరియు వాటికి నిల్వలు క్రింది పట్టికలో ఉదాహరణగా ఇవ్వబడినవి. +! వేరు కనీస నిల్వ గురించి సూచనలు +| swap మీ రేమ్ మెమరీకి రెట్టింపు. ఉదాహరణకి మీ మెమరీ 1 GB ఐతే మీరు దీనికి 2 GB కేటాయించాలి +home మీ వ్యవస్థని వాడే వారికి ఒక్కొక్కరికి అవసరమైనది లెక్కించి కావలసిన నిల్వ నిర్ణయించవచ్చు. ఫొటోలు, సంగీతం, సినిమాలు వాడేవారికి చాలా ఎక���కువ నిల్వ అవసరము. సాధారణ వాడుకరికి 10 GB సరిపోతుంది. కాని మీ డిస్క్ నిల్వని బట్టి ఎక్కువ ఇచ్చుకోవచ్చు. +ఈ తెరలో మీ పూర్తి పేరు, వాడుకరి పేరు, సంకేత పదం (రెండు సార్లు) ప్రవేశ పెట్టవచ్చు. ప్రక్కన ఇచ్చిన ఫొటోలో అర్జున అన్న వాడుకరి పేరు ప్రవేశపెట్టటం చూడవచ్చు. మొదటి వరుసలో కావాలంటే తెలుగులో మీ పేరు రాసుకోవచ్చు. చాలా అరుదుగా వాడబడే టర్మినల్ లో తెలుగు తోడ్పాటు పూర్తిస్థాయిలో లేనందున మీ వాడుకరి పేరు ఇంగ్లీషులోనే వుంచుకోవటం మంచిది. సంకేత పదంలో అక్షరాలు, అంకెలు వుండేటట్లుచూసుకుంటే మంచిది. + + +ఉబుంటు రంగస్థలం యూనిటీ రెండు రూపాలలో లభిస్తుంది. పాత తరం కంప్యూటర్లలో 2D ప్రతిమల రూపంలో, మరియు కొత్తతరం కంప్యూటర్లలో 3D ప్రతిమలుమరియు సచేతనం (యానిమేషన్) ప్రభావాలతో కనిపిస్తుంది. +మీరు కంప్యూటర్ ప్రారంభించినపుడు, మీ కంప్యూటర్ పై ఉబుంటు మాత్రమే స్థాపించబడివుంచే ప్రవేశ తెర కనబడుతుంది. లేక ఇతర వ్యవస్థలు కూడా వుంటే వాటి ఎంపిక తెర (GRUB) కనబడుతుంది. దానిలో ఉబుంటు ఎంపిక చేసినపుడు, మీకు ప్రవేశ తెర కనబడుతుంది. గ్రబ్ తెర లో క్రింది విభాగంలో వివరణ తెలుగులో వున్నా కూడా సులభంగా చదవటానికి ఇబ్బంది. ఎందుకంటే గ్రబ్ లో అంతర్జాతీయ భాష ల తోడ్పాటు భాగంలో తెలుగు కి పూర్తిగా సరిగా లేదు. కాని ఇదేమీ గాభరాపడే విషయం కాదు. తెలుగు అక్షరాలు గుణింతాలు వత్తులు విడివిడిగా వస్తాయి కాస్త శ్రద్ధపెడితే అర్థమువుతంది. ఆ వివరం ఇంతకీ ఏమిటంటే బాణంగుర్తులు వాడి మీకు కావలసిన నిర్వహణ వ్యవస్థ ని వుద్దీపనం చేసి దాఖలు (ENTER) చెయ్యమనటమే. రద్దు చేయటానికి C నొక్కాలి ప్రవేశ తెర దగ్గరనుండి గ్రాఫికల్ వాడుకరి అంతర్వర్తి లో తెలుగు చక్కగా కనిపిస్తుంది. +దీనిలో మీరు వాడుకరి పేరు ని ఎంచుకొని ఆ తరువాత మీకు కావలసిన స్థానికత (తెలుగు లేక ఇంగ్లీషు కీ బోర్డునమూనా ఎంచుకొని దాఖలు (ENTER) చెయ్యవచ్చు, అదే కాక కంప్యూటర్ ని అనుకూలపరచుకోవచ్చు. తెలుగు కీ బోర్డు ఇక్కడి నుండే అందుబాటులో వుంటుంది. ఎడమవైపు పైఅక్షరాలమీట(Left Shift) మరియు ఆల్ట్ (Alt) మీట కలిపి నొక్కితే మీ కీ బోర్డు USA మరియు భారతదేశము(తెలుగు) అనగా ఇన్స్క్రిప్ట్ మధ్య మారుతుంది. అయితే మీ వాడుకరి పేరు, సంకేతపదం కొరకు ఇంగ్లీషు లోనే వాడుకోవటం మంచిది. టర్మినల్ అనువర్తనం లో తెలుగు మద్ధతు గ్రబ్ కన్నా మెరుగుగావున్న పూర్తి స్థాయిలో లేదు కన���క ఈ సూచన చేయడమైనది. మీరు తెలుగు ఎంపిక చేసినపుడు మీ కీ బోర్డులో మూడవ బల్బు (పెద్దబడి తాళం మరియు అంకెల తాళం బల్బు కాక చివరిది వెలుగుతుంది. తెరపై కనబడే కీ బోర్డు ఎంపిక తో పాటు ఇది మీ కీ బోర్డు స్థితిని తెలుసుకొని వాడుటలో సహాయం పడుతుంది. +పాత తరపు కంప్యూటర్లలో గ్రాఫిక్స్ ప్రభావాలు తక్కువ అనువర్తనాల ప్రతిమలు సమతల చిత్రాలు రూపంలో వుంటాయి. కావలసిన అనువర్తనము నడపటానికి లేక ఆదేశం ఎంపికకు పాఠ్య మెనూ వాడుతారు. +మెనూలో సిస్టమ్ ఎంచుకుంటే మీకు సహాయక అనువర్తనాలు కనబడతాయి. వాటిని వుపయోగించి వ్యవస్థని మీకు తగినట్లుగా మలచుకోవచ్చు, +మీ కంప్యూటర్ చేసే పనిని బట్టి అప్రమేయ అనువర్తనాలు స్వయం చాలకంగా చేతనం అవుతాయి. ఒకవేళ మీరు మానవీయంగా అనువర్తనం ప్రారంభించాలనుకుంటే, మీరు వాడే ఫైల్ లేక పరికరము పై మోస్ నిలిపి కుడి మీట నొక్కితే తెరుచు అన్న మెనూ కనబడుతుంది. దానితో మీకు కావలసిన అనువర్తనం ఎంపికచేసి ప్రారంభించుకోవచ్చు. ఇక మీరు కొత్త అనువర్తనం స్థాపించుకోవాలంటే సినాప్టిక్ పేకేజి నిర్వాహికి ని ప్రారంభించి దానిలో మీకు కావలసిన పేకేజి పేరుతో వెతకవచ్చు. లేకపోతే ఉబుంటుసాఫ్ట్వేర్ కేంద్రము లో వర్గాల వారీగా వున్న అనువర్తనాల నుండి మీకు కావలసిన దానిని స్థాపించుకోవచ్చు. దీనికొరకు పాకేజి పేరు తెలియాల్సిన పనిలేదు. +మీరు అనువర్తనాలు వాడినపుడు కొత్త ఫైళ్లు సృష్టించటమో మార్చటమో చేస్తారు. ఇటీవలే వాడిన పత్రాలు అనువర్తనాల లోపటి మెనూద్వారా తిరిగి వాడవచ్చు. భద్రపరచేటప్పుడు లేక ఇతరత్రా వాడాలనుకున్నప్పుడు, మెనూలో స్థలాలలో నివాసం ఎంపికచేసుకొని మీకు కావలసిన ఫైల్ కోసం వెతకవచ్చు. మీరు తొలగించే ఫైళ్లు చెత్తబుట్టలో చేర్చబడతాయి. అవసరమైనపుడు చెత్తబుట్టనుండి తిరిగి తెచ్చుకొనవచ్చు. +దీనిలో మీకు లోతుతో కూడిన బొమ్మలు, పారదర్శకమైన పొరలు కనబడతాయి ఇంతకు ముందల రూపంతో గల లక్షణాల కంటే ఇది విలక్షణంగా వుంటుంది తెర అంతా బొమ్మలు ప్రధానంగా వుంటాయి మౌస్ వాటిపై కదిల్చినపుడు మాత్రమే వాటి పేరు కనబడుతుంది వాటిపై నొక్కినపుడు, బొమ్మ నేపథ్యం వెలిగిఆరుతూ జరుగుతున్న పనిని సూచిస్తుంది. అనువర్తనం ప్రారంభమైనపుడు బొమ్మల లాంచర్ మెనూ ఎడమవైపుకు దాగుతుంది. +గత దశాబ్దకాలంలో కంప్యూటర్ వెబ్ వినియోగదారులకు వెతకటం అనే ప్రక్రియ సాధారణమయ్యింది. ఇదే పద్ధతిలో అనువర్తనాలకోసం లేక పత్రాలకోసం వెతకటం ఉబుంటులో సాధారణమవుతుంది. లాంచర్ మెనూలో అడుగున భూతద్దం గుర్తుతో కనిపించేదానిమీద నొక్కితే మీకు వెతుకు తెర కనపడుతుంది. వెతుకు పెట్టె స్వయంచాలకంగా చేతనం అవుతుంది. అందుకని టైపు చేయగానే ఆ పెట్టెలో అక్షరాలు కనపడతాయి. ఆ పెట్టెలో ప్రత్యేకంగా మౌస్ తో నొక్కి ఆ తరువాత టైపు చేయవలసినపనిలేదు. లాంచర్ లో వున్న వాటిని కీ బోర్డు తో నే వాడుకోటానికి దగ్గరిదారులు వున్నాయి. దీనికొరకు నిర్వహణ వ్యవస్థ మీట (సాధారణ కీ బోర్డులలో విండోస్ ప్రతిమ వున్న మీట దీనినే సూపర్ అంటారు) మరియు ఇంకొక మీట (పనిని బట్టి) తో త్వరగా పని చేయెచ్చు. +సిస్టమ్ లక్షణాలు పవర్ బటన్ ను మౌస్ తో కుడి క్లిక్ చేసినపుడు చివరి మెనూ అంశంగాకనబడుతుంది. దీనిలో సిస్టమ్ లక్షణాల అనువర్తనాలను ఎంపికచేసుకొని నడపవచ్చు. +కుడిపై మూలలో వున్న కంప్యూటర్ పవర్ ప్రతిమ పై నొక్కితే మీకు మెనూ కనబడుతుంది. దానిలో వ్యవస్థ అమరికలు(System Settings)వ్యవస్థని మీకు తగినట్లుగా మలచుకోవచ్చు. మీరు దీనిని వాడేటప్పుడు వెతకటానికి తెలుగు పేర్లు వాడవచ్చని గమనించండి. +మీ కంప్యూటర్ చేసే పనిని బట్టి అప్రమేయ అనువర్తనాలు స్వయం చాలకంగా చేతనం అవుతాయి. ఒకవేళ మీరు మానవీయంగా అనువర్తనం ప్రారంభించాలనుకుంటే, మీరు వాడే ఫైల్ లేక పరికరము పై మోస్ నిలిపి కుడి మీట నొక్కితే తెరుచు అన్న మెనూ కనబడుతుంది. దానితో మీకు కావలసిన అనువర్తనం ఎంపికచేసి ప్రారంభించుకోవచ్చు. ఇక మీరు కొత్త అనువర్తనం స్థాపించుకోవాలంటే వ్యవస్థ అమరికలు లో సినాప్టిక్ పేకేజి నిర్వాహికి ని ప్రారంభించి దానిలో మీకు కావలసిన పేకేజి పేరుతో వెతకవచ్చు. లేకపోతే కుడి వైపు డాక్ నుండి అనువర్తనాల వెతుకు ప్రతిమనొక్కి ఉబుంటుసాఫ్ట్వేర్ కేంద్రము లో వర్గాల వారీగా వున్న అనువర్తనాల నుండి మీకు కావలసిన దానిని స్థాపించుకోవచ్చు. దీని కొరకు పాకేజి పేరు తెలియాల్సిన పనిలేదు. ఇక్కడ వెతికేటప్పుడు ఇంగ్లీషు అక్షరాలు మాత్రమే పనిచేస్తాయి +మీరు అనువర్తనాలు వాడినపుడు కొత్త ఫైళ్లు సృష్టించటమో మార్చటమో చేస్తారు. ఇటీవలే వాడిన పత్రాలు అనువర్తనాల మెనూద్వారా తిరిగి వాడవచ్చు. భద్రపరచేటప్పుడు లేక ఇతరత్రా వాడాలనుకున్నప్పుడు, మెనూలో నివాస సంచయం ఎంపికచేసుకొని మీకు కావలసిన ఫైల్ కోసం వెతకవచ్చు. మీరు తొలగించే ఫైళ్లు చెత్తబుట్టల�� చేర్చబడతాయి. అవసరమైనపుడు చెత్తబుట్టనుండి తిరిగి తెచ్చుకొనవచ్చు. ఎడమవైపు డాక్ నుండి ఫైళ్లు వెతుకుటకు ప్రతిమ నొక్కి వెతకవచ్చుకూడా. +మీ డాష్ బోర్డు కుడి పై మూలలో కంప్యూటర్ శక్తి గుర్తు వృత్తంలో ఒక గీత గుర్తు పై నొక్కండి. దానిలో మూసివేయు ఎంపికతో మీ వ్యవస్థ ముగించవచ్చు. ఈ ఎంపికతో ఇటీవలి కంప్యూటర్లకు స్వయంచాలకంగా విద్యుత్తు సరఫరా కూడా నిలిపివేయటం జరుగుతుంది. లేకపోతే ముగింపు పూర్తి అయిందనేసందేశం తరువాత మానవీయంగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. ఇతరులు వాడాలంటే వారికి వేరేగా ఖాతాలు ఏర్పాటు చేస్తే మీరు లాగౌట్ చేసినప్పుడు కంప్యూటర్ వారు వాడటానికి సిద్దం అవుతుంది. + + +ఉబుంటు/తెలుగు లినక్స్ లోటైపింగు చేయు విధానాలు చాలా వున్నాయి. ఈ విభాగంలో భారతదేశం ప్రామాణిక ప్రవేశపెట్టుపద్దతి ఐన ఇన్స్క్రిప్ట్ గురించి వివరంగా మరియు ఇతర పద్ధతులుగురించి క్లుప్తంగా తెలుసుకుందాము. +ఉబుంటు తెలుగుతో స్థాపించినపుడు, లేక తెలుగు భాషా పాక్ స్థాపించినపుడు సహజంగా ఇన్‍స్క్రిప్ట్ కీ బోర్డు ఇండియా తెలుగు అనే పేరుతో లభ్యమవుతుంది. దీనిని అన్ని భారతీయ భాషలని విశ్లేషించి, ఒకేలా వుండేలా ప్రామాణీకరించారు. దీనిలో ఎడమవైపు అచ్చులు కుడివైపు హల్లులు వున్నాయి. అచ్చుల కీ ల లో గుణింతాలు మామూలుగాను, షిఫ్ట్ తో అచ్చులుగాను వస్తాయి. హ్రస్వ అచ్చులు ప్రధాన వరుసలో, దీర్ఘ అచ్చులు పై వరుసలో వున్నాయి d కు మామూలుగా హలాంత్ (్ న కార పొల్లు) వస్తుంది. దీనిని సంయుక్త అక్షరాలకు వాడతారు. +చాలా హల్లులకి హలాంత్ చేర్చినపుడు, లేకహల్లులకి గుణింతాలు రాసేటప్పుడు, ఎడమచేతి వేళ్ళు,తరువాత కుడిచేతి వేళ్ళు వాడాల్సి రావటంతో త్వరగా టైపు చేయటం కుదురుతుంది. +హల్లుల కీలలో 5 వర్గాల మొదటి అక్షరాలు ప్రధాన వరుసలో వున్నాయి. షిఫ్ట్ తో వాటి రెండవ అక్షరాలు వస్తాయి ముక్కుతో పలకని హల్లులను అ వర్గానికి దగ్గర కీ లలో ఇచ్చారు. ముక్కుతో పలికే హల్లులను ఎడమవైపు చివరి వరుసలో ఇచ్చారు. మిగతావి కుడివైపు ఇచ్చారు పై వరుసలో ఎక్కువగా వాడే సంయుక్త అక్షరాలని ఇచ్చారు. ఇవి నొక్కినపుడు, వాటి మూల అక్షరాల సమూహము వస్తుంది. +మామూలుగా వాడే ఇంగ్లీషు కీ బోర్డు నుండి దీనికి మారటానికి టాగుల్ కీ గా ఎడమవైపు షిఫ్ట్(Left Shift) మరియు ఆల్ట్(Alt) కీలను జతగా వాడతారు. దీని ప్రాధాన్యమేమంటే లాగిన్ స్టేజీ దగ్గర��ుండి తెలుగులో టైపు చేయవచ్చు. అంటే మీ వాడుకరి పేరు, సంకేత నామం కావాలంటే తెలుగు లో రాయవచ్చు. అలాగే టర్మినల్ లో కూడా వాడవచ్చు. +తెలుగు టైపు ఎంచుకున్నపుడు పై పేనెల్ లో కీ బోర్డు స్థితి Ind (India Telugu) గా మారుతుంది మరియు మీ కీ బోర్డుపైన చివరి బల్బు వెలుగుతుంది. వీటివలన మీరు ఏ కీ బోర్డు తీరు వాడుతున్నారో మీకు తెలుస్తుంది. +పారిభాషిక పదాలను తెలుగులిపిలో రాసేటప్పుడు ప్రత్యేక అక్షరాలు వాడితే చదవటానికి సులభంగా వుంటుంది. +*ఒక హల్లు కి చాలా వత్తులు వచ్చే అవకాశం వుంది. అప్పుడు చదవటం కష్టమవుతుంది కాబట్టి, ఒకటి లేక రెండు వత్తులు వచ్చిన తరువాత శూన్యవెడల్పుకలుపు (Zero Width Joiner(ZWJ లేక శూన్యవెడల్పు విరుపు (ZeroWidthNonJoiner(ZWNJ)వాడి రాయాలి. దీనికొరకు లినక్స్ వ్యవస్థలలో x కీ బోర్డు లో సదుపాయం లేదు. మీరు వాడే అనువర్తనంలో వున్న సదుపాయం వాడండి. +* సాఫ్ట్‍వేర్=meHd' + +వెబ్ వీక్షణం లేక విహరించడానికి ముఖ్యమైన సాఫ్ట్‍వేర్లు ఫైర్‌ఫాక్స్ మరియు క్రోమియమ్ +ఫైర్‌ఫాక్స్ ఉబుంటు అప్రమేయ విహారిణి. దీనిని లాంచర్ నుండి కాని లేక మెనూలో అంతర్జాలం నుండి నడపవచ్చు. ప్రారంభంలో ఉబుంటు పేజీ చూపిస్తుంది. మీకు కావలసిన విషయంకోసం వెతుకుపెట్టె లో వెతికితే ఫలితాలు హైపర్లింక్లతో కనబడతాయి. వాటిని నొక్కడం ద్వారా అ సైట్ పేజీలను చూడొచ్చు. నేరుగా చిరునామా పట్టీలో వెబ్ చిరునామాను టైప్ చేసి మీకు కావలసిన పేజీని చూడొచ్చు. +ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము ద్వారా క్రోమియమ్ స్థాపించుకొనవచ్చు. దీనినే స్వల్పంగా మార్పులతో గూగుల్ క్రోమ్ లాగా కూడా అందుబాటులో వుంది. + + +! తెలుగు English తెలుగు అర్థం +| సంచయం Folder/Directory ఫైళ్లు కలిగినది. దీనిలో ఇతర సంచయాలుకూడా వుండవచ్చు. +| అప్రమేయ Default ఎంపిక లేకుండా జరుగునది. +| లాంచర్ Launcher అనువర్తనాల ప్రతిమలు కలిగిన స్థలం.దీనిలోని ప్రతిమలపై నొక్కుటద్వారా సులభంగా అనువర్తనాలు ప్రారంభించవచ్చు + + +ఈమెయిల్ అనగా ఎలెక్ట్రానిక్ మెయల్. మన సందేశాలు ఇంటర్నెట్ ద్వారా క్షణాల్లో చేరే సౌకర్యము. ఛాట్ అంటే మన మిత్రులతో ఎలెక్ట్రానిక్ రూపంలో సత్వర సందేశాలు ఇచ్చి పుచ్చుకోవడం. ఇంటర్నెట్ ఖర్చు తప్ప ఏ ఇతర ఖర్చులు లేకుండా పరిమితి లేకుండా వాడుకోవచ్చు. వీటిని గురించి వివరంగా తెలుసుకుందాం. +ఈ-వుత్తరాలు మరియు ఛాట్ కు అంతర్జాల సంపర్కం కలిగివుండాలి. కంప్యూటర్ పై స్థాపించుకొనే మెయిల్ కక్షిదారు ఎవల్యూషన్ వాడవచ్చు. అయితే ఎక్కడనుండైనా వాడుకోగలగటం, బ్యాక్ అప్ కు కష్టపడాల్సిన పని లేకపోవడం వలన చాలామంది వెబ్ ఆధారిత మెయిల్ అనువర్తనాలు వాడుతున్నారు. వాటిలో తెలుగు ముఖాంతరంగా వుండేవాటిలో ముఖ్యమైనవి గూగుల్ మెయిల్ మరియు విండోస్ లైవ్ మెయిల్ (హాట్ మెయిల్) +గూగుల్ మెయిల్ తెలుగు వెబ్ పేజీ కనిపిస్తుంది. మీరు కొత్తగా వాడుతున్నట్లయితే ఒక ఖాతా సృష్టించండి అన్న బొత్తాము పై నొక్కిండి. మీ వివరాలు అనగా యూజర్ పేరు, పాస్వర్డ్ ఇతర వివరాలు ప్రవేశపెట్టి గూగుల్ షరతులు ఒప్పుకున్నట్లు చెక్ పెట్టెలో టిక్ పెట్టి దాఖలు పరిచినట్లయితే మీ ఖాతా సృష్టించబడుతుంది. ఒకవేళ అదే పేరుతో ఇంతకు ముందే ఖాతా ఎవరిదైనా వుంటే మీరు మార్చుకోటానికి సలహాలు ఇస్తుంది. ఆ తరువాత మీరు ఖాతా వివరాలు దాఖలుచేసి మీ ఖాతాలో ప్రవేశించవచ్చు. +అప్పడు కనిపించే తెరలో మీకు వచ్చిన ఈ-ఉత్తరాలు కనబడతాయి వాటిని చదివి ప్రత్యుత్తురాలివ్వ వచ్చు. కొత్త సందేశం సృష్టించాలంటే సందేశం సృష్టించు అన్న బొత్తాము నొక్కితే కనబడే తెరలో కి అన్నచోట మీరు పంపదలచుకున్న వారి ఈ-మెయిల్ చిరునామా విషయం సబ్జెక్టు వరుసలో సంక్షిప్తంగా వుత్తరం సమాచారం రాసి ఆ క్రింద వివరంగా సమాచారం రాసి దానిక్రింద వున్న పంపించు అన్న బొత్తాము నొక్కాలి అంతే మరి. గూగుల్ వాడటంవలన ఇంకా లాభమేంటంటే మీరూ రాసే వుత్తరము స్వయంచాల���ంగా దాచబడుతుంది. మీకిష్టమైతే గూగుల్ లిప్యంతరీకరణ సాధానాలు వాడుకోవచ్చు. మరిన్ని వివరాలకు గూగుల్ లో సహాయంపేజీలు చూడండి. +అప్పడు కనిపించే తెరలో మీకు వచ్చిన ఈ-ఉత్తరాలు కనబడతాయి వాటిని చదివి ప్రత్యుత్తురాలివ్వ వచ్చు. కొత్త సందేశాలు పంపవచ్చు మీకిష్టమైతే మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ సాధానాలు వాడుకోవచ్చు. మరిన్ని వివరాలకు మైక్రోసాఫ్ట్ సహాయంపేజీలు చూడండి. +ఛాట్ లో వ్యక్తగత ఖాతాలు ప్రసార ఖాతాలు అని రెండురకాలు. మీరు ఒక సమూహంలో చేరి పంపే సందేశాలు వ్యక్తిగత ఖాతాల క్రిందికి, మీరు ఎవరికి ప్రత్యేకించి వుద్దేశించకుండా పంపే సందేశాలు ప్రసారఖాతాలు క్రిందికి వస్తాయి. ఫ్రీనోడ్ (freenode సైట్ లో ఇంటర్నెట్ రిలే ఛాట్ (irc వ్యక్తిగత ఖాతాకి ఉదాహరణ, ట్విట్టర్ ప్రసార ఖాతాకి ఉదాహరణ. +మీ తెర పై పేనెల్ లో కుడివైపు కవరు ప్రతిమపై నొక్కి ఛాట్ మెనూ నొక్కితే మీరు ఖాతాలను జతపరచుకోవచ్చు. మీరు ఫ్రీనోడ్ ను ఎంచుకుంటే మీ నిక్ నేమ్ ప్రవేశపెట్టాలి. ఆ తరవాత నిక్ సర్వర్ లో /join ubuntu-in నొక్కితే మీరు ఆ ఛాటింగ్ గదిలో చేరతారు. దానిలోనున్న వారు పంపే సందేశాలు మీరు చూడవచ్చు. మీరు సందేశాలు పంపవచ్చు. +మీ తెర పై పేనెల్ లో కుడివైపు కవరు ప్రతిమపై నొక్కి ఛాట్ మెనూ నొక్కితే మీరు ఖాతాలను జతపరచుకోవచ్చు. మీరు ట్విట్టర్ ను ఎంచుకుంటే మీ వాడుకరిపేరు సంకేతపదం ప్రవేశపెట్టాలి. ఆ తరవాత ట్విట్టర్ విండో కనబడుతుంది. +వర్గం :ఉబుంటు| ఈ-ఉత్తరాలు మరియు ఛాట్]] + + +మీరు ప్రభుత్వాధికారికో, పత్రికా సంపాదకునికో ఉత్తరం లేక అద్దె ఒప్పందం పత్రము లేక మీ పరిశోధన నివేదిక తయారుచేయాలనుకుంటే మీకు ఉపయోగపడేది లిబ్రెఆఫీస్ రైటర్. ఇది ఓపెన్ఆఫీస్ నుండి వేరుపడి డాక్యుమెంట్ ఫౌండేషన్ వారిచే అభివృద్ధిచేయబడుతున్న కార్యాలయపు సూట్ లో పత్రాలు తయారు చేయటంకోసం అనువైనది. ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లోని వర్డ్ తో దీటైన లక్షణాలు గల సాఫ్ట్వేర్. విండోస్ వర్డ్ ఆకృతి గల ఫైళ్లు దీనితో తెరవవచ్చు, ప్రామాణికమైన ఓపెన్ డాక్యుమెంట్ తీరు లో రాయవచ్చు లేక మైక్రోసాఫ్ట్ యొక్క కొత్త డాక్యుమెంట్ ఫార్మాట్ లోనైనా రాయవచ్చు. దీనిని ఉపయోగించి ఒక చిన్న వుత్తరము ఎలా చేయాలో మనం పరిశీలిద్దాం. +లిబ్రెఆఫీస్ రైటర్ పై నొక్కి అనువర్తనం ప్రారంభించండి. మీకు ఒక ఖాళీ పత్రం కనబడుతుంది. +దానిలో ఈ క్రింద ఇవ్వబడిన వివరం టైప్ చేయండి +ఇంటి నెంబరు 24, 12 వ అడ్డ రోడ్డు +మా కాలనీలో విద్యుత్ సరఫరా గత కొన్ని రోజుల నుండి సక్రమంగా లేదు.చాలా అంతరాయాలున్నాయి. విద్యార్థులకు, వృద్ధులకు దీనివలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీలైనంత త్వరలో విద్యుత్ సరఫరా సక్రమం చేయవలసినదిగా కోరుచున్నాను. +తరవాత పై సమాచారాన్ని అకృతీకరించటానికి మెనూ నుండి లేక సాధనాల పట్టీనుండి అదేశాలు ఎంచుకోండి. +ఉదాహరణకు:తొలివరుసను ఎంచుకొని కుడివైపు అనుగుణం (ఆకృతీకరణ-అనుగుణం-కుడి) లేక కుడివైపు అనుగుణం చూపే ప్రతిమపై నొక్కితే ఆ పదం కుడివైపుకి జరపబడుతుంది.అలాగే మిగతా ఆకృతీకరణ పూర్తి చేయండి. + + +బార్య యెక్క అక్కా, చెల్లెల్ల భర్త + + +దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.) +* మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు వికీబుక్స్:అభిప్రాయాలు| ఇక్కడ వ్రాయండి + + +మీ దగ్గరున్న ఫైళ్లులేక సిడి(CD లేక అంతర్జాల రేడియో స్టేషన్ల నుండి ఉబుంటు లో సంగీతం వినటానికి వాడే అనువర్తనం బన్షీ మ్యూజిక్ ప్లేయర్. దీనితో పాటుగా చలనచిత్ర ప్లేయర్ తో కూడా శబ్ద పైళ్లు వినవచ్చు. +ఇది నేరుగా స్వేచ్ఛామూలాలు పేటెంట్ హక్కులు లేని ఆకృతిలో వుండే సంగీతాన్ని ogg format) వినవచ్చు. కొన్ని వుదాహరణ సంగీత ఫైళ్లు మీ నివాసం లో ఉదాహరణలు అనే సంచయంలో వున్నాయి. +సాధారణ ఆడియో సీడి లో ధ్వని సాధారణ కోడింగ్ లో వుంటుంది. ఇటువంటి సీడి పెట్టగానే ఇది ఆడియో డిస్క్ గా గుర్తించబడుతుంది. బన్షీలో ఆడియోసిడి ఎంచుకొని పాటలు వినవచ్చు. +సిడీలలో ఎమ్పి3 (mp3) ఫైళ్లు వుంటే వాటిని వినడానికి మీరు జిస్ట్రీమర్( gstreamer)విస్తరణ స్థాపించుకోవాలి. దీనిని మీరు ఉబుంటు స్థాపించుకునేటప్పుడు థర్డ్ పార్టీ ప్లగిన్లు స్థాపించు అన్న చెక్ బటన్ చేతనంచేస్తే సరి లేకపోతే మీకు ఇటువంటి మాధ్యమం వాడటం మొదలుపెట్టినపుడు, ప్లగిన్లు స్థాపించమనే విండో ప్రత్యక్షమవుతుంది. అప్పుడు అంతర్జాల సంపర్కంతో స్థాపించుకోవచ్చు. లేకపోతే ఈ క్రింది లింకు నుండి పాకేజీ తెచ్చుకుని స్థాపించుకోవచ్చు. ఇవి ఒకసారి స్థాపించుకుంటే చలనచిత్ర ప్లేయర్, ఫైర్ ఫాక్స్ లాంటి ఇతర అనువర్తనాలు కూడా వాడుకుంటాయి +CD ను��డి మీడియాను దిగుమతి చేసి (మెనూలో మీడియా మీడియాను దిగుమతి చేయి పాటల జాబితా తయారు చేసుకుంటే ఒక దానితర్వాత ఒకటి నడుపుతుంది. + + +ఉబుంటు తో అప్రమేయంగా సినిమాలను చూపించేది చలనచిత్ర ప్లేయర్ (టోటెమ్ దీనిలో నేరుగా స్వేచ్ఛా సాంకేతికాల ఆకృతిలో వున్న సినిమాలు చూడవచ్చు ఎమ్పెగ్(mpeg) లాంటి సాంకేతికాల ఆకృతిలో వున్న విసిడి/డివిడి మాధ్యమాలకోసం జిస్ట్రీమర్ (gstreamer)విస్తరణ స్థాపించుకోవాలి. దీనిని ఉబుంటు స్థాపించుకునేటప్పుడు థర్డ్ పార్టీ ప్లగిన్లు స్థాపించు అన్న చెక్ బటన్ చేతనంచేస్తే సరే లేకపోతే మీకు ఇటువంటి మాధ్యమం వాడటం మొదలుపెట్టినపుడు, ప్లగిన్లు స్థాపించమనే విండో ప్రత్యక్షమవుతుంది. అప్పుడు అంతర్జాల సంపర్కంతో స్థాపించుకోవచ్చు. లేకపోతే ఈ క్రింది లింకు నుండి పాకేజీ తెచ్చుకుని స్థాపించుకోవచ్చు. +మీ కంప్యూటర్లోని చలనచిత్ర ఫైళ్లు చూడటానికి, వాటిపై రెండు సార్లు నొక్కితే అప్రమేయ అనువర్తనంతో నడపబడుతుంది. వేరే అనువర్తనం వాడాలనుకుంటే మౌస్ కుడి మీట నొక్కి తెరచు ఎంచుకొని అప్పుడు కనబడే విండోలో మీకు నచ్చిన అనువర్తనం ఎంపిక చేసుకోవచ్చు. +సినిమా డివిడి మీరు ప్రవేశపెట్టగానే మీకు ఉపకరణాన్ని ఎంచుకొనే విండో కనబడుతుంది. +సరే నొక్కిన తరువాత మీ డివిడి నడపబడుతుంది. +విసిడి కూడా డివిడి లాగానే పనిచేస్తుంది. అయితే చలనచిత్ర ప్లేయర్ లో ని దోషాల కారణంగా స్వయంచాలకంగా సరిగా పనిచేయడంలేదు అందుకని విఎల్సి మీడియా ప్లేయర్(VLC media player స్థాపించుకుని దానిలో మెనూలో open disk అదేశం ఇచ్చి ఆ తరువాత వచ్చు సంవాదపెట్టెలో vcd ఎంచుకుంటే సరి. + + +ఇది జీవంగల పుస్తకం అనగా దీనిలో మార్పులు ఎల్లకాలం జరుగుతూ వుంటాయి. ఈ పనిలో మీరు రకరకాలుగా తోడ్పడవచ్చు: వ్యాసాలను వ్రాయటం సరిదిద్దటం, బొమ్మలను చేర్చటం, లేదా ఈ పుస్తకం లోని దోషాలను తెలపటం, ఈ పుస్తకాన్ని మెరుగు పరచడానికి మీ సలహాలను, సూచనలను తెలియజేయడం. దీని తయారీలో మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాం. +ఈ పుస్తకంలోని వివరాలు ప్రజలకు ఉపయోగంగా వుండగలవనే విశ్వాసంతో ఇవ్వబడినవి. వీటి నాణ్యతపై ఏ హామీలులేవు. ఒకవేళ మీ కంప్యూటర్ వ్యవస్థకు ఏదైనా హాని సంభవించిన దీని తయారీకి కృషిచేసిన వారు,పంపిణీ చేసినవారు, వికీమీడియాఫౌండేషన్ లేక ఇతర వికీమీడియా అనుబంధ సంస్థలు ఏ బాధ్యత వహించవు. దీనిలో చెప్పినవి ప్రయత్నిం��ేముందు మీ ఫైళ్లు భద్రపరచుకోండి. + + +ఫొటోలు కంప్యూటర్లో ప్రవేశపెట్టటానికి మీ డిజిటల్ కెమేరా కాని అనుసంధానించిన స్కానర్ వాడి చేయవచ్చు. ఉబుంటులో ఫోటోలని చక్కదిద్దటానికి షాట్వెల్ ఫొటో నిర్వాహకి వాడుతారు మరిన్ని సౌలభ్యాలకి గింప్ (GIMP) వాడవచ్చు. +మీరు కెమేరా అనుసంధానించినపుడు, అనువర్తనం ఎంపికకోసం పాప్ అప్ విండో కనబడుతుంది. ఆ తరువాత మీ కెమేరాలోని ఫొటోలు వీడియోలు చూపెడుతుంది. వాటిని ఎంపిక చేసుకొని మీ కంప్యూటర్ సంచయంలో పెట్టుకోవచ్చు. ఆ తరువాత వాటి ని చక్కదిద్దటం ఉదా: రెడ్ ఐ సరిదిద్దు, పరిమాణం మార్చు లాంటివి) చేయవచ్చు. +ఉబుంటులో సింపుల్ స్కాన్ అనే అనువర్తనంతో మీ దగ్గరవున్న స్కానర్ నుండి భౌతిక ఫొటో లేక పత్రాన్ని డిజిటల్ రూపంలో మార్చుకోవచ్చు. + + +మీ ముద్రణాయంత్రమును కంప్యూటర్ కు అనుసంధానించినపుడు స్వయంచాలకంగా అది కనుగొనబడి చోదకి చేర్చు విండో కనబడును. లేనిచో మీరు వ్యవస్థ అమరికలు(System Settings) లో ముద్రణ ఎంచుకుని ఆ తరువాత జతచేయు(Add) నొక్కి మీ ముద్రణా యంత్ర చోదకిని అమర్చుకోవచ్చును. ఒకవేళ మీ దగ్గర ముద్రణాయంత్రము లేనిచో pdf ముద్రణా చోదకిని అమర్చుకొని దాని సహాయంతో pdf పైల్ తయారు చేసి సమీపంలోని ముద్రణాయంత్రముకలిగిన వ్యవస్థలో ముద్రించుకోవచ్చును. తెలుగు ముద్రించునపుడు ఖతులు pdf ఫైల్ లో ఇముడ్చుకుంటే మీరు వాడిన ఖతులే ఇంకే వ్యవస్థపైన తెరచిన వాడబడుతాయి. + + +ఉబుంటుతో చాలా ఆటలు అందుబాటులోనున్నాయి. అప్రమేయంగా కొన్ని స్థాపించబడతాయి. వాటిలో సుడోకో ఒకటి. మిగతావి అవసరమైనపుడు స్థాపించుకోవచ్చు. అనువర్తనాలు వెతుకు అదేశం ఇచ్చిన తరువాత ఆటలు ఎంచుకొని స్థాపించబడనవి స్థాపించుకోవచ్చు. లేక ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము తెరచి మనకు కావలసిన వాటిని స్థాపించుకోవచ్చు. + + +లిబ్రెఆఫీస్ ఇంప్రెస్ తో చక్కనైన ప్రజంటేషన్లు తయారుచేయవచ్చు సులభంగా చేయటానికి ప్రజంటేషన్ విజర్డు వుంది. దీనిలోఖాళీ ప్రజంటేషన్ ఎంచుకుంటే సాధారణ మాదిరితో తరువాత మీరు సమాచారం చేర్చుటకు వీలుగా స్లైడ్ తయారవుతుంది. +మన ఇంతకు ముందు కేల్క్ లో వాడిన ఉదాహరణ పొడిగించుదాం. దానిలో వున్న సమాచారాన్ని ప్రసాద్ రేవుల కోశాధికారిగా ప్రజంటేషన్ తయారుచేసాడు. అప్పుడు ఎలా వుంటుందో బొమ్మలలో చూడండి. మీరు ప్రయత్నించండి. + + +ఆర్థిక మరియు ఇతర లెక్కలు చూస���కొనటానికి మరియ మన దత్తాంశాన్ని చిత్రాల రూపంలో మార్చుటకు సరియైన అనువర్తనం లిబ్రెఆఫీస్ కేల్క్. ఈ విభాగంలో దీనిని ఎలా వాడుకోవచ్చో పరిశీలిద్దాం. +తెలుగు కళాజ్యోతి, చిక్కడపల్లి సంస్థ 2010-11 వార్షిక ఆదాయ వ్యయాల చిట్టా వివరాలు ఇలా వున్నాయి. +| ఆంతర్జాల తెలుగు సంస్థ విరాళం 70000 +ఈ వివరాన్ని కేల్క్ లో ప్రక్కన బొమ్మలో చూపినట్లుగా ప్రవేశపెట్టండి. +మొత్తం కనుక్కోటానికి B9 లో SUM(B5:B7) అనే సూత్రాన్ని ప్రవేశ పెట్టండి. +మిగులు కనుక్కోటానికి D8 లో సూత్రం =D9-SUM(D5:D7) వాడండి. +ఆ తరువాత అదాయం పట్టిక లో ని దత్తాంశాన్ని ఎంచుకొని చిత్రం తయారు చేయండి. + + +ఉబుంటు/సాధారణ ఉత్తరాలు, లావాదేవీ పత్రాలు, నివేదికలు]] + + +భార్య యొక్క చెల్లెలుని "మరదలు" అంటారు. +అనగా మన భార్య యొక్క చెల్లెలు మనకు "మరదలు" అన్న మాట. + + +విష్వకవి రవిÔద్ర్దుని కవితలు మనకు వినిపిన్ధెన్తగ విన వలెను +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +:<విష్వ క వి ర వీ οద్రు దు >I + + +అసలు సంస్కృత టెక్స్ట్ నుండి ఆంగ్ల గద్య అనువదించబడింది +ఆపాదింపు ఈ నోటీసు చెక్కుచెదరకుండా ఎడమ ఉంది అందించిన ఏదైనా కాని వాణిజ్య ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. + + +మన జన్మకు కారణమైన స్త్రీ అమ్మ. + + +భార్య యొక్క చెల్లెలి లెద అక్క భర్త + + +(పెండ్లి అయిన తరువాత) కూతురు లేదా కొడుకు తండ్రి + + +(పెండ్లి అయిన తరువాత) కూతురు లేదా కొడుకు తల్లి + + +అన్నదమ్ముల భార్యలు ఒకరికొకరు తోటి కోడళ్లు అవుతారు. + + +అని పుటపేజీలో బొమ్మ వరుస (ఒకవేళ వుంటే) తర్వాత చేర్చాలి. + + +ఇది సుమారు 500 సంవత్సరాల క్రితం డొమింగో పేస్ మరియు నూనిజ్ రచించిన విజయనగర దర్శనం గురించిన విశేషాలకు ఎల్లంకి భాస్కరనాయుడు గారి స్వేచ్ఛా తెలుగు అనువాదం. +డొమింగో పీస్ మరియు నికొలీ కోంటి అనె ఇద్దరు విదేశీ యాత్రికులు 16 వ శతాబ్దంలో మొదటి భాగంలో విజయనగరాని కొచ్చి ఇక్కడి సామాజిక పరిస్థితులను రాజ్య పాలనను, ఇక్కడి వింతలు విశేషములను స్వయంగా చూసి గ్రంథస్తం చేసి తమ దేశంలోని తమ రాజుగారికి సమర్పించారు. దాన్ని ఆంగ్లీకరించి ఏషియన్ ఎడుకేషనల్ సర్వీసెస్, న్యూ డిల్లీ వారు ప్రచురించారు అందులోని కొన్ని భాగాలను తెలుగీకరించి ఇక్కడ పెట్టడం జరిగింది ఆయా గ్రంధాలలోని విషయాలను యధా తదంగా వున్నదున్నట్టు వ్రాయడం జరిగింది. ఇందులో నా స్వంత వివరణ ఎంత మాత్రము లేదు. ప్రతి విషయానికి అసలు గ్రంధంలోని పుట సంఖ్యను కూడ ఇవ్వడం జరిగింది సరి చూసు కోడానికి అలా పుటల సంఖ్యలను ఇవ్వడం జరిగింది. +సుమారు ఐదువందల సంవత్సరాల క్రితం ఇంచుమించు దక్షిణ భారత దేశమంతా వ్యాపించి సర్వతొ ముఖాభివృద్ది చెందింది విజయనగర సామ్రాజ్యం. కొన్ని శతాబ్దాల పాటు అఖండ వైభోగంతో విలసిల్లింది. ఈ సామ్రాజ్య ఘన చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఈ సామ్రాజ్యాన్ని అనేక మంది విదేశాల రాయబారులు, యాత్రికులు శతాబ్దాల క్రితమే ఈ విజయ నగరానికి స్వయంగా వచ్చి ఇక్కడి విశేషాలను చూసి వారి అనుభవాలను గ్రందస్తం చేసారు. వారు చెప్పిన ఈ విజయనగర విశేషాలు వారి మాటల్లోనే టూకీగా ౧) +నికోలో కొంటి యను ఇటలీ దేశస్తుడు 1420 లో విజయ నగరానికొచ్చి లాటిన్ భాషలో ఇలా రాసుకున్నాడు విజయ నగరము పర్వతముల సమీపమున కట్ట బడినది. చుట్టుకొలత 20 మైళ్లు. కొండలమద్య పల్లపు ప్రదేశములలో జన నివాసము లుండెను. ఉద్యాన వనములు, ఫల వృక్షములు, పంట కాలవలు మిక్కిలిగా కలవు. అచ్చటచ్చట ప్రసిద్ద దేవాలయములు కలవు +ఈ నగరానికొచ్చి తన గ్రంధంలొ ఇలా వ్రాసుకున్నాడు +;"విజయనగరము వంటి మహానగరమును మేమెన్నడు చూసి వుండలేదు. అటువంటి నగరము ప్రపంచమున మరి యొకటి వున్నట్లు కూడా విని యుండ లేదు. ఇది ఏడు ప్రకారముల మహా నగరము. మొదటి మూడు ప్రాకారములలో పంట పొలములు, గృహములు, ఉద్యాన వనములతో నిండి యుండెను. ఇందు బజారులు విశాలముగా వున్నవి. అందు ముత్యములు, కెంపులు, నీలములు, వజ్రములు మొదలగునవి బహిరంగముగా విక్రయించు చుండిరి +వీరిద్దరు 15 వ శతాబ్దం లొ విజయనగరాన్ని సందర్సించారు. వీరి తర్వాత 16 వ శతాబ్దంలో ఈ మహా నగరం అత్త్యున్నత స్థితిలో ఉన్నప్పుడు దాన్ని సందర్శించి తన బావాలకు అక్షర రూపమిచ్చిన వారిలో ఒకడు "డొమింగో ఫీస్. ఇతడు 1520 లో శ్రీక్రిష్ణ దేవరాయల కాలంలో ఈ సామ్రాజ్యాన్ని సందర్సించాడు. ఇతని తర్వాత "నూనిజ్" ఆనే అతడు 1535 1537 ప్రాంతంలో ఈ విజయ నగరాన్ని అచ్యుత రాయల కాలంలో ఈ విజయనగరాన్ని సందర్శించాడు. వీరిద్దరు తాము చూసిన విజయనగర విషేషాలను రాసి తమ దేశం లోని రాజులకు పంపించారు. వారు వ్రాసి గ్రందస్తం చేసిన విషయాలను క్లుప్తంగా వారి మ��టలోనే తెలుగు రాశాను. ఆ విషేషాలను చదవండి. పాఠకులకు అనుకూలంగా వుంటుందని అసలు ప్రతిలోని పుట సంఖ్యను కూడ సందర్బాను సారంగా ఇచ్చాను +"అలా ’మొదటగా డొమింగో’ పీస్ వ్రాసినది ఇతడు ఫోర్చ్ గీజు రాజు గారి అనుమతి మేరకు విజయ నగర సామ్రాజ్యానికి వచ్చి, ఇక్కడి విసేషాలను కూలంషంగా వివరించి తమ దేశంలోని రాజుగారికి ఒక నివేదికను రాసి పంపించాడు. ఆ విషయాన్ని యదాతదంగా చదవండి ఒకటవ భాగం.) +1 విజయనగర భౌగోళిక పరిస్తితి గురించి పుట..237) గోవా నుండి విజయనగరానికి బయలు దేరిన మాకు సముద్రంతీరం వెంబడి విస్తరించిన కొండల వరుసలు కనుపించాయి. ఆ కొండల వరుసలే విజయనగర సామ్రాజ్యానికి సరిహద్దు ఆ కొండల మద్యలో నుండే ఆ రాజ్యం లోనికి వెళ్లడానికి దారులున్నాయి. లోన కెళ్లగానె పెద్ద బండరాళ్లతో ఆవహించిన దట్టమైన అటవీ ప్రాంతం. ఈతీర ప్రాంతం వెంబడే విజయనగర సాంరాజ్యానికి చెందిన చాల ప్రాంతాలు కలవు. అవి బటేకల్లు, మంగళూరు, బికనీరు మొదలగునవి వీటిలో కొన్ని రేవు పట్టణాలు. అక్కడ కర్మాగారాలున్నాయి. ఈ కొండల వరుసలు దాటగానె అక్కడక్కడా కొన్ని కొండలు తప్ప మిగతా అంతా సమతల ప్రదేశమే అది మనదేశం లోని "సాంతారెం" లాగ వున్నది బలెచలా' టౌను నుండి జంబుజ అనే ఊరు వరకు కొన్ని కొండలు, అటవీ ప్రాంతం వున్నది. అయినా ఆదారి సమతలంగానె వున్నది. ఈ రెండు చిన్న పట్టణాల మద్య సుమారు 40 లీగుల దూరం వున్నది ఈ దారి వెంబడి అనేక వంకలు, వాగులు, సెలయేళ్లు, నీటితోనిండి వున్నాయి. ఆ కారణంగా ఆదారెంబడి ప్రతి సంవత్సరం అనేక ఎడ్లబండ్లు వివిద సరుకులను తీసుకెళ్లుతుంటాయి. ఈ దేశంలో (విజయనగర సామ్రాజ్యం) చిట్టడవు లెక్కువ. మిగిలిన ప్రాంతం రాళ్ళు గుట్టల మయం. కొన్ని ప్రాంతాల్లో బారులు తీరిన వృక్షాలున్నాయి. పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో జామ, మామిడి తోటలెక్కువ మరియు చింత చెట్లెక్కువ. ఇంకో రకమైన మహా వృక్షాలు కూడా వున్నాయి. ఈ వృక్షాలు ఆ దారెంబడి వెళ్ళే వర్తకులకు నీడ నిస్తున్నాయి. ఒక పట్టణ సమీపాన ఇటువంటి మహా వృక్షం క్రింద తమ తమ సామానులతో కొందరు వర్తుకులు సేద తీరుతున్నారు. వీరి 320 గుర్రాలు వారి గుర్రపు శాలలో వరుసగా నిలబడినట్లు ఆ చెట్టు క్రింద విశ్రమించడం నేను చూశాను. ఇటువంటి మహావృక్షాలు చిన్నవి, పెద్దవి ఈ దేశమంతటా వున్నాయి ఇవి మర్రి చెట్లు ఈ దేశంలోని భూములు సారవంతమై, వ్యవసాయ యోగ్యమైనవి. ఇక్కడి ప్రజలకు పశు సంపద ఎక్కువ. ఆ���ులు, బర్రెలు, గొర్రెలు, కోళ్ళు, మొదలైన వాటిని ఇళ్ళ మద్యలోను, అడవుల్లోను పెంచుతున్నారు. ఇవి మన పోర్చు గ్రీసు దేశంలో కన్నా ఇక్కడెక్కువ. ఇక్కడ భూములలో వరి ఎక్కువగా పండిస్తున్నారు మరియు మనదేశంలో లేని జొన్న, బీన్సు, ప్రత్తి వంటివి కూడా పండుతున్నాయి. దాన్యాన్ని ప్రజల అవస రాలకే గాక గుర్రాలకు, కూడా పెడుతున్నారు. ఎందుకంటే మనదేశం లో లాగ ఇక్కడ బార్లీ దాన్యం లేదు. ఇక్కడ గోదుమ పంట కూడా ఎక్కువే. ఈ దేశంలోని పల్లెల్లో పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువ. ఇక్కడి రాజు తమ పల్లె వాసులను వారి ఇళ్ళ చుట్టు మట్టితో మాత్రమే గోడ కట్టు కొనుటకు అనుమతిస్తాడు. ఏందుకంటే వారు తన కంటే బలవంతు లౌతారని భయం. కానీ దేశ సరిహద్దు సమీపాన గల పట్టణ వాసులకు మాత్రం తమ ఇళ్ళ చుట్టు రాతి గోడలను కట్టుకొనుటకు రాజు అనుమతిస్తాడు. కాని పల్లె వాసులకు ఆ అవకాశం లేదు. +(పుట 238) మన ఫొర్చుగీసు దేశం కన్నా ఈ దేశం చదునుగా నున్నందున గాలి వేగం ఎక్కువ. ఇక్కడి ప్రజలు తాము పండించిన నూనె గింజల నుండి తామె తయారు చేసుకున్న యంత్రాల తోనె నూనెను తీస్తారు ఇవి నూనె గానుగలు) ఈ దేశంలో నీటి కొరత వుంది. ఎందుకంటే విశాలమైన దేశంలో నదులు తక్కువ. అందుచేత ఇక్కడి ప్రజలు చెరువులను త్రవ్వి వర్షాకాలంలొ వచ్చే వాన నీటితో వాటిని నింపి తమ అవసరాలకు వాడు కుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీటి వూటలపై ఆదార పడి వున్నారు. ఇంకొన్ని ప్రాంతాలలో భూములు పూర్తిగా మెట్ట భూములు. వీరు ఇటువంటి భూములలో పంటలు పండించ డానికి వర్షాలపైనే ఆదార పడి వున్నారు. కొంత మంది ప్రజలు తమ పొలాలలొ గోతులు త్రవ్వి అందులో లబించిన నీటితో తమ అవసరాలను తీర్చు కుంటున్నారు.(ఇవి దిగుడు బావులు వీరికి వర్షాబావ మెందుకంటే. మన దేశంలో లాగా వీరికి చలి కాలంలేదు. కాని ఇక్కడ ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం తుపాను లొస్తుంటాయి. ఇక్కడి చెరువుల్లో నీరు మురుకిగా వుంటాయి. ఎందుకంటే దుమ్ము దూళి తో కూడిన బలమైన గాలులు నీటిని శుబ్రంగా వుండనీయవు అంతేగాక వీరి పశువులు, గొర్రెలు, బర్రెలు వంటి ఇతర జంతువులు కూడా ఈ నీటినే తాగుతుంటాయి +ముఖ్యమైన విషయ మేమంటే ఈ దేశ వాసులు ఆవులను, ఎద్దులను చంపరు ఎద్దులు వీరి సామనులను మోస్తాయి ఎద్దుల బండి గురించి అంతేగాక వీరు ఎద్దులను, ఆవులను పూజిస్తారు. దేవాలయాల్లో వీటి శిలా విగ్రహాలు కూడా వున్నాయి దేవాలయాల్లో వున్న నంది వి��్రహాల గురించి) వీరు కొన్ని ఎద్దులను దేవాలయాలకు అంకితమిస్తారు. అటువంటి ఎద్దులు ఎక్కడ తిరిగిన ఎవరూ వీటికి ఎటువంటి హాని చేయరు గతంలో ప్రతి వూరికి ఒక ”దేవరెద్దు వుండేది”. ఎవరూ దానికి ఎటువంటి హాని చేయక పోగా అది ఎవరింటి కొచ్చినా దానికి మంచి ఆహారమిచ్చి బొట్టుపెట్టి నమస్కరిస్తారు. ఇది ఆచారం) ఈ దేశంలో గాడిదలు కూడా వున్నాయి కాని వీటిని చిన్న చిన్న పనులకే వుపయోగిస్తారు. ముఖ్యంగా వుతికే బట్టలను తీసు కెళ్ళడానికి గాడిదలను ఉపయోగిస్తారు. +ఈ విజయనగర సామ్రాజ్యానికి 300 క్రోసుల సముద్రతీర ప్రాంతమున్నది పాల ఘాట్ నుండి చోళ మండలం వరకు ఇదంతా ఈ రాజ్యము లోని భాగమె. దీని వెడల్పు 164 క్రోసులుంటుంది ఆ విధంగా ఈ రాజ్యం తూర్పున ఒరియా వరకూ ఉత్తరాన దక్కన్ వరకూ వ్వాపించి వున్నది. ఇదిమన రాజ్యానికి కన్న పెద్దది. ఇక్కడి ప్రజలు రంగు తక్కువైనా శారీరిక దారుడ్యం కలవారు. వీరి రాజుకు అత్యంత ధన సంపద వున్నది. సైనిక భలం కూడ ఎక్కువె వీరి రాజు కంటే భలవంతుడు వేరొకడు లేరని అంటారు. కాని ఈ రాజుకు మన దేవునిపై నమ్మకంలేదు. +దార్వార్ నగరంలో అతి ఆరుదైన, అతి ముఖ్యమైన కట్టడం ఒకటుంది. ఈ నగరం చుట్టూ కోట వున్నా అది నేను పైన చెప్పిన కారణాల వల్ల రాతి కట్టడం కాదు. దీనికి పచ్చిమ దిశగా అందమైన నది వుండగా మిగతా దిక్కులందు మైదాన మున్నందున కోట గోడ దానికి అగడ్త వున్నాయి. ఈ నగరంలో వున్న ఆ అందమైన కట్టడం ఒక దేవాలయం. ఇది చాల అందమైనది. ఇటువంటిది ఆ చుట్టుపక్కల చాలా దూరం వరకు లేదు. ఇది ఏక శిలతో నిర్మితమై, వృత్తాకారం కలిగి అత్యంత కళాత్మక మైన శిల్ప కళ కలిగి వుంది. అందు లోని శిల్పాలు రాయి నుండి ఒక మూర ముందుకు వున్నందున ఆ ప్రతిమను అన్ని వైపుల నుండి చూడగలము. అవి ఎంత అందంగా వున్నాయంటే వాటిని అంతకంటే అందంగా చెక్కలేరు. రాతి స్థంబాలతో నిర్మితమైన ద్వారంలో దాని(పుట..241) పైనున్న శిల్ప కళను బట్టి ఇది ఇటలీలొ తయారయిన దేమోననిపిస్తుంది. దీనికున్న అడ్డ పట్టీలు, దూలాలు, అన్ని శిలా నిర్మితాలే. పలకలు గాని కర్రలు గానీ వాడలేదు. ఆవిదంగా లోపల గాని బయటగాని, అదే శిలలతో నిర్మితమైనది. ఈ కట్టడం మొత్తం బలిష్ట మైన ప్రహరీ గోడచే పరివేష్టింప బడియున్నది. ఇది పూర్తిగా రాతి మయం. ఈ దేవాలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఇవి చాల పెద్దవే గాక చాల అందంగా కూడా వున్నాయి. తూర్పు వైపున నున్న ద్వారానికి చిన్న వరండాలు ���ంటివి వున్నాయి. అందులో జోగినులు కూర్చొని వున్నారు. ఈ ఆవరణం లో ఎర్రటి చిన్న దేవాలయా లున్నాయి. అందులో ఓడ స్తంబం లాంటి రాతి స్తంబం వుంది. అది మొదట నాలుగు పలకలుగా వుండి తర్వాత ఎనిమిది పలకలుగా అకాశం వైపు నిలబడి వుంది. ఇలాంటి దాన్ని నేను ఇటలీలోని రోమ్ లో చూసి వున్నందున ఇది నాకు అంత ఆచ్చ్యర్యాన్ని కలిగించ లేదు.(ఇది ద్వజ స్థంబం ఈ దేవాలయాల్లో వున్న విగ్రహాలు కొన్ని ఆడ, మగ రూపంలో వుండగా ఇంకొన్ని ఎద్దు రూపంలోను కోతి రూపంలోను వున్నాయి. మరి కొన్నింటిలొ ఒక గుండ్రటి రాయి మాత్రమే వుంటుంది. వీటినే ఈ ప్రజలు పూజిస్తారు.(ఇక్కడ చెప్పిన విగ్రహాలు దేవతా మూర్తులు, ఎద్దు రూపం లోనిది నందీశ్వరుడు, కోతి రూపం లోనిది ఆంజనేయ స్వామి, గుండ్రటి రాయి శివ లింగం.) +ఈ దర్వార్ నగరంలో వున్న దేవాలాయం లోని విగ్రహం శరీరం అంతా మాన వాకారం లో వుండి ముఖం మాత్రం ఏనుగు ముఖం కలిగి వున్నది. దంతాలు కూడా వున్నాయి ఈ విగ్రహం వినాయకుడిదే ఈ విగ్రహానికి చేతులు మాత్రం మూడు మూడు ఆరు చేతులున్నాయి. ఇక్కడి ప్రజలు చెప్పేదాన్ని బట్టి ఆరు చేతులున్న ఈ విగ్రహానికి ఇప్పటికే నాలుగు చేతులు పడి పోయాయట. ఇక మిగిలిన చేతులు పడిపోతే అప్పుడు ఈ ప్రపంచం అంతా మునిగి పోతుందట. దీన్ని దైవ నిర్ణయంగా బావించి దీనిపై వీరందరికి మంచి నమ్మకం. వీరు ఈ విగ్రహానికి ప్రతి రోజు ఆహారం పెట్టి అది తిటుందని నమ్మతారు. భోజన సమయంలో ఈ దేవాలయానికి సంబందించిన స్త్రీలు నాట్యం ఆడతారు. ఈ స్త్రీలకు జన్మించిన ఆడపిల్ల లందరూ ఈ దేవాలయానికే చెందుతారు. వీరందరూ గుణ హీనులు. కానీ వీరు గౌరవ ప్రదమైన వీదుల లోనే మంచి గృహాలలోనే నివసిస్తారు. వీరికి సంఘంలో మంచి గౌరవం వుంది. వీరిలో కొందరు సేనా నాయకుల భార్యలు కూడా వున్నారు. అదే విదంగా గౌరవ ప్రద వ్యక్తులు కూడా నిస్సంకోశంగా ఈ స్త్రీల ఇంటికి వెళ్ళి వస్తారు. రాజు తన రాణుల తో వున్న సమయంలో కూడా తమలపాకులు నమలుతూ ఈ స్త్రీలు వెళ్ళి రావడానికి అనుమతి వుంది. ఇటు వంటి అవకాశం సంఘంలో ఎంతటి పరపతి వున్న వ్యక్తి కైనా వీలు కాదు +౩ విజయనగర కోటలు ప్రాకారాల వివరణ పుట..242) +ధార్వార్ నగరం నుండి విజయనగరం 15 లీగుల దూరంలో వుంది. అదే ఈ దేశపు రాజదాని. రాజైన శ్రీక్రిష్ణ దేవ రాయులు ఈ నగరం లోనే నివసిస్తాడు. విజయనగరం ఇంకా రెండు లీగుల దూరం వుందనగా, ఎత్తైన కొండ చరియల మద్య నుండి విజయ నగరానికి ప్రవేశ ద్వ���రం వుంది. ఇటువంటి ప్రవేశ ద్వారాల ద్వారా మాత్రమే ఈ నగరం లో ప్రవేశించ గలము. వేరు మార్గం లేదు. ఇటువంటి పర్వత శ్రేణులు నగరం చుట్టు 24 లీగుల పర్యంతం వుండగా, దీనిలోపల వృత్తకారంలో మరి కొన్ని పర్వత శ్రేణులున్నాయి. ఈ పర్వత శ్రేణుల వరుస ఎక్కడైనా లేనిచో అక్కడ బలమైన గోడతో పూరించి నందున అంతా కొండలతోనే చుట్టబడి వున్నట్లు కనిపిస్తుంది. ప్రవేశ ద్వారాలు తప్ప మిగాతా అంతా ఈ విదంగానే వుంటుంది. ఇటువంటి ప్రవేశ ద్వారాలను కొంత మంది కాపలా కాస్తుంటారు. ఇటువంటి రక్షణ వ్యవస్త అన్ని ప్రాకారాలకు వుంది. ఇటువంటి పర్వత శ్రేణుల ప్రాకారాల మద్య లోయలలో, మైదానాలలో వరి, మామిడి తోటలున్నాయి. ఈ కొండల మద్యలలో చెరువులుండి నీటి పారుదల కుపయోగ పడుతున్నాయి. ఈ కొడలలో ఎటువంటి చెట్లు గాని పచ్చదనం గాని లేదు. తెల్లటి పెద్ద బండ రాళ్ళు ఒక దాని పై ఒకటి ఏ ఆదారారం లేకుండా ఆకాశంలో అలా నిలబడి యున్నాయా అని అనిపిస్తున్నాయి. ఇటువంటి కొండల మద్యలోనే విజయనగరం వుంది. +(పుట..244)మొదటి ప్రాకారాని కున్న పశ్చిమ ద్వారం ప్రదానమైనది. గోవా నుండి వచ్చే వారికి ఇదే ప్రవేశ ద్వారం. ఈ ద్వారం వద్ద ఈ దేశపు రాజు బలిస్ష్ట మైన గోడలతో, ఎతైన గోపురాలతో, చక్కటి వీదులతో ఒక అందమైన నగరాన్ని నిర్మించాడు. ఈనగరంలో అనేక మంది వ్యాపారస్తులు, గొప్ప వ్యక్తులు నివసించడానికి రాజు ప్రోత్సహించాడు. అందు చేత ఈ నగరంలో జనసంఖ్య చాల ఎక్కువగా వుంది పుట. 245) నీటి అవసరాలకు ఈ దేశపు రాజు అతి పెద్ద చెరువును త్రవ్వు చున్నప్పుడు నేను చూసాను. సుమారు 15--20 వేల మంది పనిలో నిమగ్నమై వున్నారు వీరు చీమల్లాగా కనిపిస్తు వున్నారు. వారి కింద వున్న భూమి కనిపించ నంతగా వున్నారు. కూలీలను మూడు విభాగాలు చేసి ఒక్కొక్క విభాగాన్ని ఒక్కో సేనాపతికి అప్ప జెప్పి పని పూర్తి చేయించాడు రాజు. ఈ చెరువు రెండు మూడు సార్లు తెగిపోయింది. రాజు తన పురోహితులను పిలిపించి దీనికి కారణం కనుక్కోమన్నాడు. దానికి ఆ బ్రాంహణులు ఆలయం లోని మూల విగ్రహం స్తాన బ్రంశమైందని దేవుడు బలి కోరుచున్నాడని అందుకు, మనుషులను, దున్న పోతులను, గుర్రాలను దేవునికి బలి ఇవ్వాలని సలహా ఇచ్చారు. రాజుగారి అనుమతి మేరకు ఆలయం ముందు 60 మంది మనుషులను మరణ శిక్షకు సిద్దంగా వున్న ఖైదీలను, కొన్ని గుర్రాలను, అలాగే దున్న పోతులను బలి ఇచ్చారు. +(పుట 245) ఈ బ్రాంహణులు తమకు తాము అతి పవిత్రులమని భావిస్తారు. ఈ రాజ్యంలో ఇతర బ్రాంహణులున్నా వారు రాజు వద్ద, వివిద హోదాలలో అధికారులు గాను కొందరు వ్యాపారస్తులు గాను, ఇంకొందరు వ్యవసాయ దారులు గాను జీవిస్తున్నారు. ఈ పౌరోహిత్యం వహిస్తున్న వారు మాత్రం తమకు తాము అత్త్యున్నతులుగా భావిస్తారు. వీరు మాంసం, చేపలు వంటి మాంసాహారము తినరు. ఈ దేశంలో బ్రాంహణులు మని చెప్పుకునే వారు చాల మంది వున్నారు. కాని వారి జీవన విధానం కొంత ప్రత్యేకంగావుంటుంది. కాని వారు రాజునుండి ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుతున్నారు. +కొత్తగా నిర్మించిన ఈ నగరానికి రాజు తన భార్య మీదున్న ప్రేమకు చిహ్నంగా ఆమె పేరు పెట్టాడు. ఈ నగరంలో రాజు ఒక అందమైన దేవాలయాన్ని కూడా నిర్మించాడు. ఈదేవాలయంలో అనేకమైన విగ్రహాలున్నాయి ఆలయంలో వారి పద్దతి ప్రకారం నిర్మించుకున్న బావులున్నాయి ఈ నగరంలోని ఇళ్ళు ఒకే అంతస్తు కలిగి వున్నాయి. మనదేశంలో లాగ అంతస్తులు కలిగి లేవు పై కప్పు చదునుగా మన ప్రాంతంలో వున్నవాటికన్నా భిన్నంగా వున్నాయి. ఆ భవనాలకు స్థంబాలతో వరండాలున్నాయి. చూడ్డానికి రాజ భవనాల లాగ వున్నాయి రాజు నివసించే అంత:పురం చుట్టు ప్రహరి గోడవుండి లోపల ఆనేక వరుసల ఇళ్ళు వున్నాయి. ఈ అంత:పురానికి రెండు ప్రవేశ ద్వారాలున్నాయి ప్రవేశ ద్వారము విశాల ఆవరణము తో వరండాలతో, అవరండాలలో రాజుగారి పిలుపు కోసం నిరీక్షించే ప్రముఖులతో నిండి వున్నది. ద్వారాల ముందు అనేక మంది కాపలా దారులున్నారు కొత్తగా రాజు నిర్మించిన ఈ నగరాని నాగాలపురమని పేరు. ప్రస్తుతము దాని పేరు హోస్పేట..పైన చెప్పిన అందమైన ఆలయం ప్రస్తుతమున్న. అనంత శయన ఆలయం ఈ ఒక్క ఆలయమే కనబడుతున్నది. మిగతా భవనాలు గాని, రాజాంత:పురంగాని కనీసం వాటి పునాదులు కూడ ఇక్కడ కనబడవు +పుట..247 5 శ్రీక్రిష్ణదేవరాయలు ఎలా వున్నాడు +రాజు సాధారణ ఎత్తు కలిగి అంత సన్నగాను కాక లావు గాను కాక మద్యస్తంగా వున్నాడు. ఇతను ఇతర దేశస్తులను చాల మర్యాదగా గౌరవిస్తాడు. ఇతను ధర్మ బద్దుడైన గొప్ప పాలకుడు. ఇతనికి రారాజని, చక్రవర్తి అని, లార్డ్ ఆఫ్ సెవెన్ సీస్ అండ్ ల్యాండ్ అని. బిరుదులు గలవు. అతనికున్న రాజ్య విస్తరణాన్ని బట్టి, అతనికున్న సైనిక భలగాన్ని బట్టి అతన్ని మహా వీరుడని అంటారు. అతనికున్న శక్తి సామర్ద్యాలను బట్టి ఇతను ఒరియా రాజుతో సదా యుద్దాలు చేసే వాడు. ఆ రాజ్యంలోని చాల నగరాలను వశపరుచు కున్నాడు ఆ దేశపు రాజ కుమారులను బందీగా పట్టుకొని విజయనగరంలో చాల కాలం బందీగా వుంచగా అక్కడే అతను మరణించాడు. ఆతర్వాత సంధి ఒడంబిడకలో ఒరియా రాజు తన కుమార్తెను రాజుగారికిచ్చి వివాహం చేశాడు ఇతని పేరు "శ్రీ క్రిష్ణ దేవరాయలు "ఇతనికి పన్నెండు మంది భార్యలున్నా వారిలో ముగ్గురే మహారాణులు. ఈ మహారాణుల కొడుకులకే రాజ్యాధికారం వుంటుంది. మిగతా భార్యలలో ఎవరికైనా ఒకే కొడుకున్నచో అతనిక్కూడ రాజ్యాధి కారం వుంటుంది. ఈ మహా రాణులలో ఒకరు ఒరియా రాజ కుమార్తె, ఇంకొకరు శ్రీరంగ పట్నం రాజ కుమార్తె. మూడో మహారాణి, రాజు తన యుక్త వయస్సులో ప్రేమించిన అమ్మాయి. శ్రీ క్రిష్ణ దేవరాయలు తాను రాజైనప్పుడు ఈమెను పెళ్ళాడి మహారాణిని చేస్తానని మాట ఇచ్చి నందున ఆమె కోరికను నెరవేర్చాడు. ఆమెమీదున్న ప్రేమకు చిహ్నంగా రాజుగారు కొత్త నగరాన్ని నిర్మించాడు. +(పుట..248) రాజుగారి భార్యలు అందరికి ప్రత్యేకంగా భవనములు, స్త్రీజన పరివారము సేవకులు (స్త్రీలె) వారికి కావలసిన ఆవాసములు అన్ని వున్నాయి. పురుషు లెవ్వరు అందు ప్రవేశించరు. వీరు కూడ బయటకు వెళ్ళరు. తప్పని సరియై వెళ్ళ వలసి వస్తే మూసి వున్న పల్లకిలో వెళ్తారు. ప్రజలు కూడ వీరికి దూరంగా వుంటారు చాల మంది నపుంసకులు వీరికి రక్షణ గా వుంటారు. +నేను విన్నదాని ప్రకారం ఈ అంత:పుర స్త్రీలు అత్యంత ధన వంతులు. వీరి వద్ద ధనమే కాకుండ. బంగారు ఆబరణాలు, వజ్రాలు, ముత్యాలు వంటి జాతి రత్న సంపద అధిక మొత్తం లో వున్నది. ఒక వుత్సవ సందర్బంలో వారి అబరణాల అలంకారం చూసి నిస్చేష్టుడ నయ్యాను. ఆ సందర్బాన్ని తర్వాత వివరిస్తాను. ఈ స్త్రీజన పరివారంలో పన్నెండొందల మంది వున్నారని విన్నాను. వీరిలో కత్తి డాలు పట్టగలిగిన వీర వనితలు, కుస్తీ పట్టగల వారూ పాడగలవారు, నాట్య గత్తెలూ ఉన్నారు. వీరు వాడె సంగీత వాద్య పరికరాలు మనదేశంలో వాడె వాటికన్నా భిన్నంగా వున్నాయి ఈ ముగ్గురు మహారాణులుకు ఒకె విదంగా వుండే భవనాలు విడి విడిగా వున్నాయి. వీరు తమ మద్య ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా స్నేహ శీలురుగా మెలుగుచున్నారు. ఈముగ్గురు రాణులు, వారి పరిచారికలు వారి రక్షక భటులు, కాపలా దారులు, ఇతర పనివారు వీరందరు నివసించ డానికి భవనాలు, ఇతర నివాసాలు, ఎన్ని వుండాలి, ఎన్ని వీదులలో అవి వుండాలో వూహించుకోవలసినదే. +(పుట..249)రాజు మాత్రం తన అంత:పురంలో నివసిస్తుంటాడు. ఏ రాణితో నైనా కలవాలనుకుంటే ఒక నపుంసకున్ని పంపుత��డు. ఇతను కూడ రాణి అంత:పురం లోనికి ప్రవేశించ కూడదు. అక్కడున్న స్త్రీ పరిచారికకు విషయం చెఫ్తాడు. అప్పుడా రాణి గారి పరిచారిక బయటకు వస్తుంది. విషయం తెలుసుకుని రాణి గారికి తెలియజేస్తుంది. అప్పుడు రాణి, రాజు చెప్పిన చోటుకు వెల్లడమో లేక తన వద్దకు రాజుని రప్పించు కోవడమో చేస్తుంది. ఈ వ్యవహారం ఇంకొక రాణికి తెలియదు. ఇదంతా ఈ నపుంసకుల ద్వారా జరుగుతుంది. ఈ నపుంసకులు రాజు గారికి అత్యంత విశ్వాస పాత్రులై వుంటారు వీరి జీత బత్యములు కూడా ఎక్కువ గానే వుంటాయి. +(పుట..౨౪౯) ప్రతి రోజు సూర్వోదయానికి ముందే రాజు నిద్ర లేచి ఒక చిన్న గ్లాసుడు మంచి నూనె తాగి నడుంకు మాత్రం ఒక చిన్న గుడ్డను కట్టుకొని, శరీరమంతా నువ్వుల నూనెను మర్దనా చేయించుకొని రెండు చేతులతో మట్టితో చేసిన బరువులను ఎత్తుతాడు. ఆ తర్వాత కత్తి తీసుకుని చెమట పట్టునంత వరకు వ్యాయామం చేస్తాడు. అప్పటికి మర్దానా చేసిన నూనె అంతా చెమటతో బయటకు వస్తుంది. ఆ తర్వాత తన కుస్తీ వీరులలోని ఒకనితో కుస్తీ పట్టుతాడు. ఈ శ్రమ అయిన తర్వాత తన గుర్రమెక్కి మైదానంలో అటు ఇటు స్వారి చేస్తాడు. ఈ కార్య క్రమమంతా సూర్యో దాయనికి ముందే పూర్తవు తుంది. అప్పుడు ఒక బ్రాంహణుడు వచ్చి మంత్రోత్సారణ తో రాజు గారికి స్నానం చేయిస్తాడు. తర్వాత తన అంత:పురంలో నున్న ఒక ఆలయం లోనికి వెళ్ళి ప్రార్దన ఇతర పూజ కార్య క్రమాలు పద్దతి ప్రకారం చేస్తాడు. రాజు గారికి స్నానం చేయించే బ్రాంహణుడు చాలా ధన వంతుడు, ఇతనికి జీతం కూడా ఎక్కువే. ఇతన్ని రాజుగారు చాల పవిత్రునిగా జూస్తాడు. అక్కడనుండి రాజు గారు ఇంకొక భవనం లోనికి వెళ్ళతాడు. ఆ భవనం గోడలు లేకుండా అనేక స్తంబాలతో వున్నది. ఆ స్తంబాలకొక అందమైన, గుడ్డ పైనుంచి క్రింది వరకు చుట్టబడివుంది. దాని పై అందమైన చిత్రములు అద్దబడి వున్నాయి. రెండు స్త్రీ చిత్రములు అందంగా తీర్చ బడి వున్నాయి. ఈ భవనంలో పరిపాలన సంబందమైన అధికారులుంటారు. రాజు గారికి అత్యంత ప్రముఖుడైన "తిమ్మరుస" అనే వృద్దుడు వుంటాడు. ఇతను అంత:పురంలోని అందరిని శాసించ గల్గి వుంటాడు. పరిపాలనా సంబందమైన విషయాలు మాట్లాడిన తర్వాత, ఆ ప్రముఖులు శలవు తీసు కుంటారు. అప్పటి వరకు రాజు గారిదర్శనార్థం బయట వేసివున్న సామంతులు, సేనా నాయకులు ఇతర ప్రముఖులు ప్రవేసిస్తారు. వారు రాజుగార్కి నమస్కరించి గోడ వెంబడి నిలబడతారు. వారు తమ చేతులను జేబులో పె���్టుకుని నేల చూపులు చూస్తూ మౌనంగా రాజు గారికి దూరంగా వుంటారు. వారెవరూ తమలపాకులు నములుతూ వుండరు. రాజుగారు వారిలో ఎవరితో నైనా మాట్లాడా లనుకుంటే తన బటుడు అతనికి తెలియ జేస్తాడు. అపుడా వ్యక్తి తల పైకెత్తి అడిగిన దానికి సమాదానం చెప్పి తిరిగి తన యదా స్తితికి వస్తాడు. రాజు గారు వారందరికి శలవిప్పించు నంతవరకు వారు అలాగే వుంటారు. ఆ తర్వాత వారు రాజు గార్కి నమస్కరించి నిష్క్రమిస్తారు. ఈ నమస్కార విదానం ప్రత్యేకంగా వుంటుంది. రెండు చేతులు పైకెత్తి రెండు అరచేతులు కలుపుతారు వీరందరు ప్రతిరోజు ఈ నమస్కార కార్యక్రమం ఉదయం చేస్తారు. +మేము ఈ రాజ్యానికి వచ్చినప్పుడు రాజు గారు తన కొత్త నగరంలో వున్నారు. మేము మాతో కూడా వున్నా వారందరం మానాయకునితో కలిసి రాజు గారి దర్శనార్దం అక్కడికి వెళ్ళాం. మేమంతా మా పద్దతి ప్రకారం చాల ఆడంబరంగా దుస్తులు దరించి వెళ్ళాము. రాజు గారు మమ్ములను చాల మర్యాద పూర్వాకంగా ఆహ్వానించారు. మాపై అతను చాల దయ, కరుణ చూపించారు. ముఖ్యంగా మానాయకుడిని రాజు గారు చాల గౌరవంగా తన స్వంత మనిషిలాగ చూశారు మానాయకుడు మీరిచ్చిన లేఖను, ఇతర బహుమతులను రాజుగారికిచ్చాడు. మేము రాజు గారికి చాల దగ్గరగా వున్నాము +(పుట 252) రాజు గారు దవళ వస్త్రాలలో వున్నారు. ఆ వస్త్రాలు బంగారు దారంతో గులాబి పూలు ఎంబ్రాడిరి చేసి వున్నాయి. మెడలో వజ్రాల హారం అత్యంత విలువైనది ఉంది. తలమీద పట్టు బట్టతొ చేసిన, బంగారు జరీ పట్టితో వున్న కిరీటం వుంది. కాళ్ళకు చెప్పులు లేవు. రాజుగారి కాళ్ళకు చెప్పులు వుంటే ఎవరూ లోపలికి రారు. ఈ దేశంలో చాల వరకు ప్రజలు కూడ చెప్పులు దరించరు. రాజు గారు దరించే చెప్పులు రెండు రకాలు. ఒకటి ముందు మొనదేలి వుంటాయి. రెండో రకం దీని పాద బాగం తప్ప ఇంకేమి ఉండదు. ముందు భాగంలో ఒక చిన్న బుడిపి లాంటిది వుండి వేళ్ళ ఆదారంతో అది కాలికి వుంటుంది. ఇవి రోమనులు కొందరు వాడే వారని తెలుస్తున్నది. రాజు గారు మా అందరికీ ఒక్కొక్క నూతన వస్త్రాన్ని ఇచ్చారు. దాని మీద అందమైన బొమ్మలు కుట్టివున్నాయి. ఇది ఇక్కడి అచారమట. స్నేహానికి గుర్తుగా ఇస్తారట. రాజుగారి అనుమతి ప్రకారం మమ్ములను ఒక అందమైన భవనంలో విడిది ఏర్పాటు చేయించారు. అక్కడ మా నాయకుడు చాల మంది సేనాధిపతులను, ఇతర పుర ప్రముఖులను కలిశారు. అంతే గాక రాజు గారు మానాయకునికి కొన్ని కోళ్లను, పొట్టేళ్లను కొన్ని పాత్���ల నిండా పెరుగు, తేనె, నెయ్యి మొదలగు వాటిని తినటానికి పంపించారు. కాని మా నాయకుడు వాటిని అక్కడున్న సైనికులకు ఆ వస్తువులను తెచ్చిన వారికి పంచి పెట్టారు. ఇంకా రాజుగారు మీ క్షేమ సమాచాలను విచారించారు. మీగురించి మానాయకుడు చెప్పిన మాటలను విన్న రాజు గారు చాల సంతోషించారు. +(పుట 252)మేము శలవు తీసుకొని విజయనగరాని కొచ్చాం. ఈ రెండు నగరాల మద్య దూరం ఒక లీగ్ వుంటుంది.ఈ దారంతా ఇటువంటి వరుస ఇండ్లతొ విశాలంగా వుంది. అంగళ్ళ లో అన్ని రకాల వస్తువులు అమ్ము చున్నారు. ఈ దారెంబడి రాజుగారి అనుమతితో చెట్లునాటించ బడ్డాయి. ఇవి అటు వచ్చి పోయే వ్యాపారస్తులకు నీడ నిస్తున్నాయి. ఈ దారి లోనె రాజు గారు రాతి తో అందంగా నిర్మింప జేసిన పెద్ద ఆలయం వుంది ఇది ప్రస్తుతం వున్న అనంతశయన ఆలయము విజయనగరానికి ముందు ఒక కోట ద్వారం వుంది. ఈ కోట గోడ ఈ నగరం చుట్టు వ్వాపించి వున్నది ఈ గోడ మిక్కిలి బలిష్టంగానె కాక మంచి శిల్ప కళను కూడ కలిగి వున్నది. ప్రస్తుతం ఇది అక్కడక్కడ కొంత శిధిలమై వున్నది. ఇదే విజయనగరంలోనికి ప్రవేశించడానికి ప్రవేశ ద్వారం అదె విదంగా ఇక్కడ ఇతర ప్రముఖులు నిర్మించిన ఆనేక దేవాలయాలు వున్నాయి +పుట..253) 8. విజయనగర కోటల, భవనాల గురించి వర్ణన +గోడలపై బురుజు లున్నాయి. మైదాన ప్రాంతంలో నున్న ప్రహరి గోడకు నీటితో నిండిన అగడ్త వుంది. అంతేగాక గోడ వెంబడి సమాన దూరంలో మొన దేలిన ఎత్తైన రాతి బండలు సమాన దూరంలో పాతిపెట్ట బడి వున్నాయి. పల్లపు ప్రాంతంలో ప్రహరి గోడ కొండ బాగం వరకు వుంది. ఈ మొదటి ప్రకారం దాటగానె చాల దూరం వరకు వ్యవసాయ భూములు, వరి పంటలు, పండ్ల తోటలున్నాయి. సంవృద్దిగా నీరున్నది ఈ నీరు చెరువుల నుండి మొదటి ప్రాకారం ద్వారా వస్తుంది. +(పుట 258) తర్వాత ఇంకో ప్రహరి గోడ వస్తుంది. ఇది కూడా రాతి కట్టడంతో బలిష్టంగా వుంది. ఈ ప్రవేశ ద్వారానికి రెండు బురుజులున్నాయి. ఇది బలంగాను అందంగాను వున్నాయి. లోపలికి ప్రవేశించగానే రెండు ఆలయాలున్నాయి ఒకటి చుట్టూ గోడ లోపల చెట్లుండగా, రెండో దానిలో భవనా లున్నాయి. ఇంకొచెం ముందు కెళితే ఇంకో ప్రవేశ ద్వారం ఇంకో ప్రహరి గోడ వస్తుంది. ఈ ప్రకారం, మొదటి ప్రకారం లోపలున్న నగరం చుట్టూ వున్నది.ఈ ప్రకారంలోనే రాజాంత:పురం, ఇతర సేనా నాయకుల నివాసాలు, వున్నాయి. ఈ ఇళ్ళు వరుసలుగా వుండి, ముఖ్య వీది అందంగా శిల్ప కళతో మనోహరంగా వుంది. ఈ ఇళ్ళవరసలు దాటిన తర్వాత ఒక విశాలమైన మైదానం వస్తుంది. అందులో అనేక బండ్లు, వాటిలో అనేకరకాల సామానులు వున్నాయి. ఇది రాజాంత:పురానికి ఎదురుగా వుంది. ఈ మైదానం నగరానికి మద్యలో వున్నది. రాజు గారి ప్యాలెస్ బలిస్టమైన ప్రహారి గోడ గలిగి, ఫొర్చగీసు లోని కోటల కన్నా లోపల విశాల ప్రదేశమున్నది దీన్ని దాటి ఇంకొంచెం ముందుకెళితే అక్కడ రెండు దేవాలయా లున్నాయి. అందులో ఒక దేవాలయం ముందు ప్రతిరోజు ఆనేక గొర్రెలను బలి ఇస్తారు. ఇక్కడ తప్ప ఈ నగరంలో ఇంకెక్కడా గొర్రెలను గాని, మేకలను గాని చంపరు. వీటి రక్తంతో ఆ గుడిలోని దేవునికి ఆభిషేకం చేస్తారు. ఈ జంతువుల తలలను పూజారికి వదిలేస్తారు. +(పుట 255) ఆ పూజారికి ఒక్కో తలకు ఒక నాణెం కూడా ఇస్తారు.(సాకో) ప్రతి జంతువుని బలి ఇచ్చింతర్వాత పూజారి తన బూరను (జొగి) వూదుతాడు దానర్థం దేవుడు ఈ బలిని స్వీకరించాడని ఈ పూజారులను గురించి తర్వాత చెప్తాను రచయిత వీరిని గురించి తర్వాత చెప్తానన్నాడు గాని ఆ విషయం మరిచాడు) ఈ ఆలయానికి దగ్గర్లోనె అందంగా అనేక బొమ్మలతో చెక్కబడిన ఒక రధం వుంది. ఉత్సవ రోజుల్లో దీన్ని ప్రదాన వీదులలో త్రిప్పుతారు. ఇది చాల పెద్దదైనందున చిన్న వీదుల్లో తిరగదు. ఇంకొంచెం ముందుకెళితే అందమైన వరుసలుగా ఇళ్ళున్న వీది కనిపిస్తుంది. ఇందులోని ఇళ్ళు ఎలా వున్నాయంటే అందులో చాల ధనికులు మాత్రామే నివసించ గలరు. ఈ వీదిలో ఆనేక మంది వర్తకులు కూడ నివసిస్తున్నారు. అక్కడ వజ్రాలు, వైడుర్యాలు, ముత్యాలు ఇంకా అనేకమైన ప్రపంచంలో దొరికే అన్ని వస్తువులు కొనవచ్చు. ఈ మైదానంలో సాయంత్రం వేళ అనేక మైన సాదారణ వస్తువులను కూడ అమ్ముతారు. చిన్న గుర్రాలు, అనేకరకాల పండ్లు నిమ్మ, ఆరంజి, ద్రాక్ష) కర్ర వస్తువులు, వంటివి అన్ని ఇక్కడ దొరుకు తాయి. ఈ మైదానం చివరన ఇంకో ద్వారం వుంది. ఇది రెండో ప్రహరిగోడ ప్రవేశ ద్వారంతో కలుస్తుంది. ఈ విదంగా ఈ విజయనగరం, మూడు కోట గోడలతో లోపల అంత:పుర ప్రహరి గోడలను కలిగి వుంది. +(పుట..256)ఈ ద్వారం దాటగానే ఇంకో వీది వుంది. అందులో అనేక వృత్తి పనివారు నివసిస్తున్నారు. వారు అనేకస్తువులను అమ్ముతున్నారు ఈ వీదిలోనె అనేక దేవాలయా లున్నాయి. ఆ మాటకొస్తే ప్రతి వీదిలోను దేవాలయా లున్నాయి. ఇవి అక్కడి వ్యపారస్తులకు వృత్తిపని వారికి సమావేశ మందిరాల వలె కూడ ఉపయోగ పడు తుంటాయి. కాని ప్రముఖ మైన దేవాలయాలు నగరానికి వెలుపలే వున్నాయి. ఈ వీదిలోనే మా నాయకుడ���కి విడిది ఏర్పాటు చేసారు. ప్రతి శుక్ర వారం ఇక్కడ సంత జరుగుతుంది. అందులో సముద్రపు ఉప్పుచేపలు, పందులు, అనేక రకాల పక్షులు, ఇంకా ఆనేక రకాల అస్తువులు ఈ దేశంలో తయారయినవి అమ్ముతున్నారు. వీటిలోని చాల వస్తువులు పేర్లు నాకు తెలియదు. ఇదే విదంగా ఈ నగరంలో వివిద ప్రాంతాల్లో ఒక్కో రోజు సంత జరుగుతుంది. ఈ వీది చివరన ఆరబ్బు దేశస్తుల ఇళ్ళున్నాయి. వీరిలో చాలమంది ఈ దేశ పౌరులే. వీరు కాపలా దారులుగా రాజు గారి నుండి వేతనం పొందుతారు. ఈ నగరంలో వజ్రాలు, ముత్యాలు వంటి విలువైన వాటి వ్యాపారం జరుగు చున్నందున అనేక ఇతర దేశ వాసులు కూడ కన్పిస్తున్నారు. ఈ నగర వైశాల్యం గురించి నేను చెప్పను. ఎందుకంటే ఏ ఒక్క ప్రదేశంనుండి ఈ నగరాన్నంతటిని చూడ వీలు కాదు. అందు చేత నేను ఒక కొండ నెక్కాను. అక్కడి నుండి చాల వరకు నగరం కన్పించింది. ఈ ప్రాంతమంతా కొండలమయమై నందున నగరమంతా కనబడలేదు. అయినా నాకు కనుపించి నంత నగర భాగమే "రోమ్" నగరమంత వుంది. చూడడానికి చాల అందంగాను వుంది. అనేక పండ్ల తోటలతో, మద్యలో నీరు ప్రవాహిస్తున్న పంట కాలువలతో,అక్కడక్కడా చెరువులతోను, రాజాంత:పుర సమీపంలో తాటి తోపులు మరియు ముఖ్యమైన పండ్ల తోటలు కలిగి వున్నాయి. ఆరబ్బుల కాలని ప్రక్కన ఒక చిన్న నది వున్నది. దాని ప్రక్కన అనేక పండ్ల తోటలున్నాయి. ఎక్కువగా మామిడి, వక్క చెట్లు, జామ, నిమ్మ, ఆరంజి వంటి తోటలు ఒక్క దాని ప్రక్కన ఒక్కటి వున్నందున అదంతా కలిసి ఒక దట్టమైన అరణ్యంలాగ కనిపిస్తున్నది. +(పుట..257 ఇందులో తెల్ల ద్రాక్ష కూడ వున్నది. వీటి కంతటికి నీరు నేనిదివరకు చెప్పిన మొదటి ప్రహరి గోడకు ఆవల నున్న రెండు చెరువుల నుండి వస్తుంది. ఈనగర జనాబాను లెక్కించడం సాద్యం కాదు. జనాబా గురించి రాస్తే ఇదేదో కట్టు కధ లాగ అన్పిస్తుంది కాన దీన్ని గురించి రాయలేను. కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. వీదుల్లో నడుస్తున్న ప్రజలు, వారి ఏనుగులను తప్పించుకొని ముందుకు పోవడానికి సైనిక పటాలానికి గాని గుర్రపు దళానికి గాని అంత సులబం గాదు. అంటే అంత ఒత్తుగా జనం వీదుల్లో వున్నా రన్నమాట. ఈ నగరం ప్రపంచంలోనే మిక్కిలి స్వయం సంవృద్ది గలిగిన నగరం. ఇక్కడ ఆహార దాన్యాలు, వరి, గోదుమ, జొన్న, పెసలు, ఉలవులు, పప్పు దాన్యాలు అధిక మొత్తంలో నిల్వలున్నాయి. వీటిని నిల్వ చేయడానికి విస్తారమైన ఆవాసాలున్నాయి. వీటి ధరలు కూడ తక్కువె ఇక్కడ గోదుమలు తక్కువ. ఆరబ్బులు తప్ప ఇతరులు దీన్ని తినరు వీదుల్లో వచ్చిపోయే ఎద్దుల బండ్లు, వరసలు ఎక్కువగా వున్నాయి. వ్యాపార స్తలాలకు వెళ్ళే ఈ బండ్ల వరసలను దాటడానికి చాల సేపు ఆగవలసి వస్తుంది. లేకుంటే వేరే దారి గుండా వెళ్ళ వలసి వస్తుంది. కోళ్ళు కూడ ఎక్కువగా వున్నాయి. ఈ నగరంలో ఒక "పావో" కు ౩ కోళ్ళు. నగరం బయట ఐతే నాలుగు కోళ్ళు వస్తాయి. +(పుట 258 ఇదే వీదిలో అనేక రకాల సాధారణ పక్షులు, అడవి పక్షులు, ఇతర నీటి పక్షులు అమ్ముతున్నారు. వీటన్నింటిని వీరు బ్రతికిన వాటినే అమ్ముతున్నారు. ఇవి చాల తక్కువ ధరకే దొరుకు తాయి. ఇక్కడున్న పావురాలు రెండు రకాలు. ఒక రకం మన ఫోర్చగీసు దేశంలొ వున్న వాటి మాదిరిగా వున్నాయి. అవి ఒక పావోకు 12 నుండి 14 వరకు ఇస్తారు పొట్టేళ్లను ఎక్కువగా కోస్తున్నారు. వాటి మాంసం అమ్మే వారు అధికంగా వున్నారు ఆ మాంసం చాల శుబ్రంగా వున్నది. ఇంతకన్నా మంచి మాంసం మరెక్కడా దొరకదు. ఇక్కడ ఒక పంది వెల నాలుగైదు ఫణాలు మాత్రమె ప్రతి రోజు బండ్ల కొద్ది నిమ్మ కాయలు అరెంజీలు, వంకాయలు, ఇతర కాయలు వస్తుంటాయి ఇతర నగరాల వలె కాకుండా ఇక్కడ ఈ సరుకులు చాల ఎక్కువ పే.259) అంతే గాక పాలు, పెరుగు వెన్న, నెయ్యి కూడ నూనె కూడ ఎక్కువే దానిమ్మ కాయలైతె ఒక "ఫణాకు పది దానిమ్మకాయలు ఒక పణాకు మూడు ద్రాక్ష గుత్తులు వస్తాయి ఇక్కడికి ఉత్తర వైపున పెద్ద నది వున్నది. ఇందులో మత్స్య సంపద ఎక్కువ ఆనెగొంది" అనె నగరం ఈ నది ఒడ్డున వున్నది. వీరు చెప్పే దాన్ని బట్టి ఈ నగరం చాల పురాతన మైనది. గతంలో ఈ నగరమే ఈ రాజ్యానికి రాజదానిగా వుండేదట. కాని ఇప్పుడు ఇందులో కొద్ది మంది ప్రజలే వున్నారు. ఇప్పటికీ ఈ నగరంలో కోట గోడలు బలిష్టమైన రెండు కొండల మద్య వున్నవి. దీనికి రెండు ప్రవేశ ద్వారాలున్నాయి. ఇందులో రాజు తరుపున ఒక సేనాదిపతి ఇందులో నివసిస్తున్నాడు. నదిని దాటి ఈ నగరానికి రావడానికి ప్రజలు బుట్ట పడవలను వాడుతున్నారు. ఇది కర్రలతో చేసిన పెద్ద గుండ్రని బుట్ట. క్రింద చర్మం వేయబడివుండి ఈ పడవలు సుమారు15--20 మందిని తీసుక పోగలవు. అవసరాన్ని బట్టి గుర్రాలు, ఎద్దులను కూడ వీటి ద్వారా నదిని దాటిస్తారు. కాని ఎక్కువగా అవి నీటిలో ఈదుకుంటా ఇవతల గట్టుకు వస్తాయి ఈ పడవలను ఒకడు తెడ్డుతో నడిపిస్తాడు. ఇవి తిరుగుతూ వెళ్ళతాయి. ఈ దేశంలో ఇటువంటి పడవలే ఎక్కువ. +(ప్రస్తుతం కూడ తుంగ భద్రా నదిని దాటడానికి ఆనె గొంది వద్ద 500 సంవత్సరాల క్రితం డొమింగో పీసు చెప్పిన ఆ బుట్ట పడవలనే నదిని దాటడానికి వాడు తున్నారు. డొమింగో పీస్ చెప్పినట్లు ఆ రోజుల్లో అవసరాన్ని బట్టి గుర్రాలను, ఎద్దులను కూడ ఆ బుట్ట పడవల ద్వార నదిని దాటించే వారని అన్నాడు. కాని ఇప్పుడు అవసర నిమిత్తం మోటరు సైకిళ్లను, స్కూటర్లను ఈ బుట్టపడవల ద్వారా నదిని దాటిస్తున్నారు ఆ బుట్ట పడవలను "పుట్టి" అంటారు. ఇక్కడ చెప్పిన నది తుంగభద్రా నది +ఈ నగర ప్రహారీ గోడకు అవతల ఉత్తర దిక్కున మూడు అందమైన దేవాలయా లున్నాయి. ఒకటి విఠలాలయం. ఇది ఆనెగొంది కెదురుగా వుంది. రెండోది ఇది చాలా పురాతన మైనందున దీన్ని వీరు చాల పవిత్రంగా వావించి యాత్రికు లెక్కువగా వస్తుంటారు. ఈ ఆలయ ముఖద్వారాని కెదురుకా తూర్పు వైపుకు అత్యంత అందమైన ఇళ్ళతోను, వరండాలతోను అలరారుచున్న వీది ఉన్నది ఇందులో ఇక్కడికి వచ్చే యాత్రికులకు వసతి కల్పించ బడుచున్నది. ధనవంతులుకు కూడ వసతి గృహములున్నవి. రాజు గారికి బసకు కూడ ఇక్కడ ఈ వీదిలోనే ఒక పేలస్ కలదు ఈఆలయ ప్రదాన గోపురం చాల ఎత్తైనది. దానిపై అందమైన చెట్టు చుట్టూ స్త్రీ, పురుషుల చిత్రాలతో వున్నది అందులో మనుషులు, ఆడ, మగ, వేట చిత్రాలు వున్నాయి. ఈ గొపురం క్రింద నుండి పైకి పోను పొను సన్నంగా వున్నది. లోపలి కెళ్ళగానే విశాల మైన ఆవరణం అందులో ఇంకో ప్రవేశద్వారం వుంది. ఇది కూడ మొడటి దాని లాగే వుంది. కాని చిన్నది. లోపలికెళ్ళ గానే మరొ ఆవరణం. అందులో ఒక కట్టడం వరండాలతో చుట్టు స్తంబాలతో వుంది +(పుట 261) దీనికి మద్యలో గర్బగుడి వుంది. ఈ గర్బ గుడి ముందు నాలుగు స్తంబాలున్నాయి. అందులో రెండు బంగారు పూత తోను, మరో రెండు రాగి రేకు తాపడం తోను వున్నాయి. ఈ గుడి చాల పురాతనమై నందున, స్తంబాలపై నున్న బంగారు పూత కొంత భాగం పోయి లోపలున్న రాగి రేకు కన్పిస్తున్నది. అంటే ఆ నాలుగు స్తంబాలు రాగి వేనన్న మాట. డెవుడి కెదురుగా నున్న స్తంబాలు ప్రస్తుతం పరిపాలిస్తున్న రాజు శ్రీ క్రిష్ణ దేవరాయలు ఇచ్చాడు. మిగాతావి అతని పూర్వీకు లిచ్చారు. ద్వారానికి ముందు పై కప్పు వరకు రాగి తో తాపడంచేయ బడి వుంది. పై కప్పులో పులి లాంటి జంతువుల బొమ్మలు చిత్రించ బడి వున్నాయి. విగ్రహం ముందున్న స్తంబాలలో అక్కడక్కడా రంద్రాలున్నాయి. వాటిలో నూనెదీపాలు రాత్రులందు పెడ్తారని వీరు చెప్పారు. ఆ విదంగా రెండు మూడు వేల దీపాలు పెడ్తారట పైన ఉదహరించిన ఆలయం హంపి లోని విరూపాక్షాలయం. పైన చెప్���ిన ఆలయ వివరాలు నాలుగు వందల సంవత్సరా క్రితం పరిస్తిత దీని తర్వాత ఒక చిన్న భూగర్భ గది లాగ ఒకటున్నది. దీనికి రెండు తలుపులున్నాయి అందులొక విగ్రహం నిలబడివుంది. దీనికన్నా ముందు మూడు తలుపులున్నాయి. ఇది అంతా చీకటిగా వుంది. ఇక్కడ ఎప్పుడూ దీపం వెలుగుతూ వుంటుంది. మొదటి ద్వారం వద్ద వున్న ద్వార పాలకులు పూజారిని తప్ప ఎవ్వరిని లోపలికి పోనివ్వరు. నేను వారికి కొంత ధనం ఇచ్చి నందున నన్ను లోనికి పోనిచ్చారు. ఈ రెండు ద్వారాల మద్య చిన్న విగ్రహా లున్నాయి. ఇందులోని ప్రదాన విగ్రహం ఏ ఆకారము లేని గుండ్రటి రాయి మాత్రమే (౧ దీనికి వీరు చాల భక్తితో పూజ చేస్తారు ౧* ఇది శివ లింగం ఈ ఆలయం వెలుపల భాగ మంతా రాగితో తాపడం చేయబడి వుంది. గుడి వెనుక వైపున వరండాకు దగ్గరగా తెల్లని చలవరాతి విగ్రహం వుంది. దానికి ఆరు చేతులున్నాయి. ఒకచేతిలో ఇంకో చేతిలో కత్తి పుట 262) మిగతా చేతులలో ఎవో పవిత్రమైన వస్తువు లున్నాయి దాని పాదాల క్రింద ఒక బర్రె, ఇంకో జంతువు వున్నాయి ఈ జంతువు బర్రెను చంపడానికి సాహాయం చేస్తున్నట్టుంది ఇది మహిషాసుర మర్దిని విగ్రహం ఇది విరూపాక్షాలయం గర్బ గుడికి ఎడమ వైపున వున్న పెద్ద గాలి గోపురం బయట వున్నది. ఇక్కడే చిన్న చిన్న ఆలయాలు కొన్ని వున్నాయి వీటికెదురుగా లోతైన కోనేరు కలదు. దాని పేరు "లోకపావని డొమింగో ఫీస్ ఈ కోనేరు గురించి వ్రాయలేదు. ఇక్కడికి అతి సమీపంలో తుంగభద్రానది ప్రవహిస్తున్నది ఈగుడిలో నిత్యం నేతి దీపాలు వెలుగు తుంటాయి. ఈ చుట్టు పక్కల ఇతర ఆలయా లున్నాయి ఇవి కూడా అన్ని దేవాలయాల లాగే వున్నాయి. కాని ఇది ప్రదాన మైనది మరియు పురాతన మైనది. +(పుట 262 ఈ ఆలయాలకు చాల భవనాలు, భూములు, తోటలు, వున్నాయి. వాటిలొ బ్రాంహాణులు, తాము తినడానికి కూరగాయలు ఇతర పంటలు పండించు కుంటారు. ప్రత్యేక ఉత్సవాల సందర్బంలో చక్రాలున్న రధాన్ని లాగుతారు. ఆ సందర్బంలో నాట్యగత్తెలు నాట్యమాడగా, వాద్యకారులు వాద్యాలను మ్రోగించగా అత్యంత వైభవంగా ఈ రధాన్ని గుడి ముందున్న వీదిలో వూరేగిస్తారు. ఇటువంటి ఉత్సవ సందర్బం నేను ఈ నగరంలొ వుండగా రాలేదు కాబట్టి నేను చూడ లేక పోయాను. ఈ నగరంలో ఇంకా చాలా ఆలయాలున్నాయి. వాటి నన్నింటిని గురించి వ్రాయాలంటె చాల ఎక్కువ అవుతుంది. మన దేవుని నమ్మని వీరు మన లాగే కొన్ని దినాలలో విందులు చేసుకుంటారు. అలాగే కొన్ని రోజులు ఉపవాస ముంటారు. ఆ దినాలలో పగలం��ా ఏమితినకుండా ఆర్ద రాత్రి పూట మాత్రమే తింటారు. ముఖ్యమైన ఉత్సవం రోజున రాజు గారు తన కొత్త నగరం నుండి విజయనగరాని కొచ్చి, ఈ ఉత్సవంలో పాల్గొనడం ఒక ఆచారం. ఈ సందర్బంలో ఈ దేశంలో నాట్యగత్తె లందరు, ఇక్కడికి రావలి. అదే విదంగా, సైన్యాది పతులు సామంత రాజులు ఇతర ప్రముఖులు వారి సిబ్బందితొ సహా రావలసి వుంటుంది. కాని యుద్ద ప్రాంతంలో వున్న వారికి సుదూర ప్రాంతంలో వున్నవారికి యుద్ద భయం వున్న ప్రాంతాల వారికి రాకుండుటకు మినాహాయింపు వుంది. ఈ వుత్సావాలు సెప్టెంబరు 12 తారీఖున ప్రారంబమై, రాజాంత:పురంలొ తొమ్మిది రోజులపాటు జరుగుతాయి ఇవి దశరా ఉత్సవాలు.) +పుట 263 10 రాజాంత:పురంలో దసరా ఉత్సవాల వర్ణన +అంత:పుర ముఖ ద్వారం నేనిదివరకు చెప్పిన మైదాననానికి ఎదురుగా రాజాంత:పురమున్నది ఆ ముఖ ద్వారంపై చిన్న గోపురముంది. ఈ ద్వారం నుండే ప్రారంబ మయిన ప్రహరిగోడ అంత:పుర ప్రాంగణమంతా చుట్టి వున్నది. ఈ ద్వారం వద్ద చాల మంది కాపలా దారలున్నారు. వారు తమ చేతుల్లో కర్రలు, కొరడాలు, పట్టుకొని వున్నారు. వీరు తమ అధికారి చెప్పిన వారిని, ప్రముఖులను తప్ప మరెవ్వరిని లోనికి వంపరు. ఈ ద్వారం దాటి లోపలికెళితే ఒక మైదానం ఉంది. ఇక్కడ కూడా ద్వార పాలకులున్నారు. లోపలికెళ్ళగానే మారొమైదాన ముండి దీని చుట్టు వున్న వరండాలలో ఉత్సవాలను చూడ డానికి వచ్చినవారు, సేనాది పతులు ఇతర ప్రముఖులు ఉన్నారు. ఈ మైదానానికి ఉత్తరం ఎడం వైపున ఒక అంతస్తు కలిగిన ఒక పెద్ద భవనం కలదు. మిగతావి కూడా అదేవిదంగా వున్నాయి. ఏనుగు ఆకారం లో చెక్కిన శిలా స్తంబాలు ఇంకా ఇతర శిల్పాలతో నిండిన స్తంబాలాపై ఈ భవనం వుంది. ముందు భాగామంతా ఖాళీగా వుంది. అక్కడికెళ్ళ డానికి రాతి మెట్ల దారి వుంది. దీని చుట్టు వరండాలున్నాయి. ఇక్కడ కూడా ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన వారున్నారు. దీనిని "హౌస్ ఆఫ్ విక్టరి" అని పిలుస్తారు. ఈ రాజు గారు ఒరిస్సాను జయంచి తిరిగి వచ్చిన తర్వాత దీన్ని నిర్మించాడు దీన్నే ఇప్పుడు "దసరా దిబ్బ" అని అంటున్నారు ఈ మైదానానికి కుడి ప్రక్కనున్న స్తలంలో కర్రలతో ఏర్పాటు చేసిన ఎత్తైన వేదికలున్నాయి. ఇవి ఎంత ఎత్తున్నాయంటే ఇవి బయటి నుండి కూడా ప్రహారి గోడ పైన అవి కన్పిస్తుంటాయి. +(పుట 264)వీటిని ఈ దసరా వుత్సవానికి మాత్రమే ఏర్పాటు చేసారు. వీటి చుట్టు అందమైన ఎర్రటి, ఆకు పచ్చని రంగుల పట్టు బట్ట క్రింద నుండి పైదాక కప్ప బడి వుంది. ఇటువంటి కర్ర వేదికలు పదకొండున్నాయి. ఈ గేటు కెదురగా రెండు వృత్తాకార వేదికలున్నాయి. అత్యంత ఆడంబరంగా ముస్తాబైన, రత్న ఖచిత మైన ఆభరణాలు ధరించిన నాట్య గత్తెలు ఆ వేదికల మీదున్నారు. ఈ గేటు కెదురుగానే తూర్పు దిక్కున మద్యలో హౌస్ ఆఫ్ విక్టరి లాంటి వేదికలు రెండున్నాయి. వీటి పై కెక్కడానికి అందంగా చెక్క బడిన రాతి మెట్లున్నాయి. ఒకటి మద్యలో వుండగా రెండోది ఆ చివరనున్నది. దీనికి అన్నివైపుల, క్రింద, పైనా, అ స్తంబాలతో సహా అందమైన కుట్టుపని వున్న బట్టతొ కప్పబడి వుంది. ఈ రెండు భవనాల పై రెండు వేదికలు ఒకదాని పై ఒకటి కట్టబడి వున్నాయి. ఇవి కూడా అందమైన శిల్పకళతో వున్నాయి. ఈ వేదికలు రాజు గారి పుత్రులకు, వారి అంతరంగికులకు, కొన్ని సందర్బాలలో నపుంసకులకు ఉపాయోగిస్తారు. రాజుగారి అనుమతి ప్రకారం ఉత్సవం బాగా కనుపించే విదంగా రాజుగారికి దగ్గరగా, పైనున్న వేదిక మీద మాకొరకు స్థానం ప్రత్యేకించారు. నేనిదివరకే చెప్పినట్లు రాజుగారి అంత: పురంలో రాజు గారు, వారి రాణులు, వారి బటులు, పరిచారికలు సిబ్బంది అందరూ కలిసి పన్నెండు వేల మంది వుంటారు. వారు లోనికి వెళ్ళడానికి దారి వున్నది పుట..265) రాజాంత:పురానికి హౌస్ ఆఫ్ విక్టరి" వేదికకు మద్య ఒక దారి వుంది. దీని ద్వారా అంతఃపుర ప్రాంగణంలోనికి వెళ్ళవచ్చు లోపల 34 వీదులున్నాయి. ఈ దశరా వేదిక పై రాజుగారి కొక ప్రత్యేక మయిన గది వుంది. అది బట్టతో కప్పబడి వుండి తలుపులు కలిగి వుంది. అందులో దేవి విగ్రహం వుంది. వేదిక మద్యలో మెట్లకెదురగా చిన్న వేదికపై ఈ రాజ్యం యొక్క సింహాసనం వుంచబడి వుంది. నాలుగు అంచులు కలిగి మద్యలో గుండ్రంగా వుండి, ఇది అత్యంత నేర్పు గలిగిన చక్క పని తనంతొ వుండి పట్టుబట్ట కప్ప బడివుంది. చుట్టు బంగారపు సింహము బొమ్మలున్నాయి. బట్టల మద్య ఖాళిలలో ముత్యాలు, పరచి వాటిపై నున్న బంగారు పళ్లేలలో రత్నాలు, వజ్రాలు వంటి విలువైనవి పోసి వున్నాయి. చుట్టూ ప్రముఖ వ్యక్తుల బంగారు విగ్రహాలున్నాయి. ఈ ఆసనంపై పూలతో అలంకరించ బడిన బంగారు విగ్రహం వుంచబడి వున్నది. ఈ ఆసనం ప్రక్కన వేదికపై కిరీటం లాంటిది నిలబెట్ట బడివుంది. ఇది కూడ ముత్యాలు, వజ్రాలు, వైడుర్యాలు వంటివి పొదగబడి వున్నాయి. దీని మందం రెండు మూడు అంగుళాలున్నది. దీని ముందు రెండు మూడు దిండ్లు వున్నాయి. రాజుగారు ఉత్సవ సందర్బంలో ఇక్కడ కూర్చుంటారు. రాజు గారు కూర��చోగానె అంతవరకు బయట వేచి వున్న సేనాధిపతులు ఒక్కొక్కరుగా వారుసగా లోనికి ప్రవేసించి రాజు గారికి నమస్కరించి వారి వారి స్థానాలలో కూర్చుంటారు. తర్వాత సైనిక దళాధిపతులు వారి వారి హోదాకు సంబందించిన గుర్తులతో ఆ వేధిక చుట్టు ఏనుగుల ముందు బారులు దీరి రాజుగారికి రక్షణ కవచంగా ఏర్పడతారు. ఆ లోపలికి ఎవరు ఆయుదాలు ధరించి రాకూడదు ఆ తర్వాత అనాట్య గత్తెలు నాట్యం ప్రారంబిస్తారు. కొంత మంది స్త్రీలు ప్రవేశ ద్వారం ప్రక్కన వృతాకారంలో దీనికొరకు ఏర్పాటు చేసిన వేధికలపై నాట్యమాడుతారు వారు చాల ధన వంతులు రత్నాలు, మణులు మొదలగు విలువైన రాళ్లు పొదిగిన చేతి కడియాలు, కంకణాలు, కాళ్ల కడియాలు ధరించి వున్నారు. వారిలో కొందరు రాజు గారి నుండి మడులు, మాన్యాలు పొందిన వారూ వున్నారు. ఈ నగరంలో ఇటు వంటి ఒక స్త్రీ లక్షలాది బంగారు నాణేలు కలిగి విన్నదని విన్నాను గాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను +పుట 266) 11. ఉత్సవాలు ఎలా ప్రారంబమవుతాయంటే +రాజుగారు ఊదయాన్నే ఈ వేదికపైకొచ్చి దేవి విగ్రహం వున్న గదిలోనికి తన పూజారులతో వెళ్లి పూజాదికాలు నిర్వహిస్తాడు. బయట అంతరంగికులు, ప్రముఖులుంటారు. ఎదురగా నాట్య గత్తెలు నాట్యంచేస్తుంటారు. వరండాలలో ఉత్సావాన్ని చూడడాని కొచ్చిన సేనాదిపతులు ఇతర ప్రముఖులు వుంటారు. వేదిక ముందు అత్యంత ఆడంబరంగా అలంకరించ బడిన పదకొండు గుర్రాలు, వాటి వెనుక నాలుగు ఏనుగు లున్నాయి. దేవి గదిలో నుండి రాజుగారు బయటకు రాగానే వెంట వున్న పుజారి తన చేతిలో వున్న బట్టలోని తెల్లని గులాబి పూలతో వస్తాడు. రాజు గారు మూడు పిడికిళ్ల పూలు తీసుకుని గుర్రాలపై చల్లుతాడు. ఆదే విదంగా ఏనుగులపై కూడ చల్లుతాడు. ఆ తర్వాత పూజారిగారు క్రిందకి దిగి మిగతా గుర్రాలపై కూడ మిగిలిన పూలు చల్లుతాడు. తర్వాత రాజు గారు దేవి విగ్రహం వున్న గదిలోని కెళ్లగానే దాని కున్న పరదాలను తొలిగిస్తారు. రాజు ఆసీనులు కగానే రాజుగారు చూస్తుండగానె 24 ఎనుబోతులను, 150 పొట్టేళ్లను విగ్రహానికి బలి ఇస్తారు. తలారి ఆ జంతువుల తలలను ఒకే దెబ్బకు నరుకు తాడు. ఏ ఒక్క సారి కూడ అతని గురి తప్పదు. +(పుట 267 ఈ కార్యక్రమం పూర్తి కాగానె రాజు గారు ఇతర వేదికల పై అటు ఇటు తిరిగి వెళ్తాడు మెట్లెక్కే టప్పుడు పైన ఉన్న ఆ బ్రాంహణులు రాజు గారి మీద పూలు చల్లుతారు. అక్కడ రాజుగారు తన కిరీటం తీసి క్రింద పెట్టి తిరిగి దేవి విగ్రహం వున్న గదికి వస్తాడు. ఆక్కడ దేవికి నమస్కరించి ఇంకో ఆలయంలోని కెళ్తాడు. అక్కడున్న అగ్ని గుండంలో ఒక విదమైన పొడి చల్లుతాడు ఇది విభూతి/లేదా సాంబ్రాణి ఆ పొడి ముత్యాలు, రత్నాలు ఇతర సుగంద ద్రవ్వాలతో చేసినది. ఈ కార్యక్రమం తర్వాత రాజుగారు మరొక్క ఆలయంలోనికి ప్రవేశించి అక్కడ కొంతసేపు వుండి తన వారితో కలిసి దేవికి నమస్కరించి తిరిగి ఇదివరకు గుర్రాల పై పూలు చల్లిన ప్రదేశానికి వస్తాడు. అప్పుడు అక్కడున్న సేనధిపతులు, ఇతర ప్రముఖులు, సామంత రాజులు సమర్పించిన బహుమతులను, వారి నమస్కారలను స్వీకరించి నేనిది వరకు చెప్పిన రెండు భవనాల మద్యనున్న ద్వారంగుండా తన అంతఃపురం లోనికి వెళ్లిపోతాడు. ఈ విదంగా ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు జరుగుతుంది. +(పుట 268 సాయంత్రం 3 గంటలకు అందరు అంత:పురం ముందు హాజరవుతారు మమ్ములను కూడ ఆ ముదున్న మైదానంలోనికి పంపించారు. లోనికి కుస్తీ యోధులు, నాట్యగత్తెలు, అలంకరించ బడ్డ ఏనుగులు వాటిపై సాయుధులైన మావటీలు వెళతారు. ఈ మైదానంలో కొంత ప్రాంతం నాట్యానికి, కుస్తీలకు ఏర్పాటు చేశారు. ఆ భవనానికి ఎదురుగా ప్రవేశ ద్వారం వద్ద బ్రాహాణులు రాజుగారి బందు వర్గము, రాజ ప్రముఖులు మొదలగువారున్నారు. వారు వారి హోదాను బట్టి ఎవరికి కేటాయించిన స్థానలలో వారు ఆసీనులౌతారు. ఆ విధంగా వివిద వేదికలు ప్రత్యేకంగా వున్నాయి. ప్రతి దానికి ద్వారాలున్నందున ఆహ్వానితులు కాని వారు లోనికెళ్లరు అంత:పురంలో ప్రముఖ వ్వక్తి అయిన తిమ్మరుసు తిమ్మరుస ఆ భవనంలోనికి ప్రవేసించి ఇక్కడి నుండే కార్యక్రమాలను పర్వవేక్షిస్తాడు ఈ తిమ్మరుసే ప్రస్తుతమున్న రాజుగారిని పెంచి పోషించి రాజ్యాభిషిక్తుడిని చేశాడు. కాని రాజుగారు అతణ్ని పిలిచినపుడు తిమ్మరుసు "మహారాజా అని సంభోదిస్తుంటాడు ఇతర ప్రముఖులు అందరు తిమ్మరుసుకు అతి వినయంగా నమస్కరిస్తారు. ఇతను ఒక ద్వారం వద్ద నిలబడి ఈ ఉత్సవాలకు తగు సలహాలు, ఆదేశాల నిస్తుంటాడు అక్కడ ఆ మైదానంలో కూర్చున్న కుస్తీ వీరులు తమలపాకులు నములుతూ వుంటారు. రాజుగారి ముందు అలా తమలపాకులు నమలడము ఈ రాజ్యంలో ఎంత పరపతి వున్న వ్వక్తికి కూడ అనుమతి వుండదు ఒక్క కుస్తీ వీరులు, నాట్యగత్తెలకు తప్ప. రాజుగారు అలా కూర్చొని తన తోటి రాజులను కూడ కూర్చోమంటారు. వారు మహారాణుల తండ్రులు. స్వయాన రాజులు. అందులో ఒకరు శ్రీరంగ పట్నం రాజు కుమార రాజ రాజ కుమారుడు) మిగిలినవారు రాజుగారి వెనుక కూర్చున్నారు. అప్పుడు రాజు గారు గులాబి పూలు కుట్టిన తెల్లటి వస్త్రాలలో అనేక ఆభరణాలతో వున్నారు అతని చుట్టు అతని భటులు కత్తులు ధరించి నిలబడి వున్నారు చాల మంది బ్రాహణులు సింహాసనం మీద వున్న దేవి విగ్రహానికి వింజామరలతో వీస్తున్నారు. ఆ వింజామరలు గుర్రపు వెంట్రుకలతో చేసినవి పుట 270) ఇటువంటి వింజామరలను ఎవరికైనా బహుమానంగా ఇస్తే అది ఈ రాజ్యలో అత్యధికమైన గౌరవంగా భావిస్తారు. అటు వంటి వింజామరలతోనె రాజుగారికి కూడ వీస్తున్నారు +12 దసరా సందర్బం గా జరుగు వినోద కార్యక్రమాల +సాయంత్రం మూడు గంటలకు అందరూ ఈ మైదానంలో సమావేశ మవుతారు. ముఖ్యంగా సేనాదిపతులు, యువ రాజులు, పుర ప్రముఖులు, సామంతులు ఇలా అందరూ వారికి నిర్దేశించిన స్తలాలలో ఆశీనులై వుంటారు. స్త్రీలు, అనేక రకాలా వజ్రాబరణాలు, ముత్యాలు, బంగారు కడియాలు దరించి వచ్చారు. ఒక పైపు నాట్య గత్తెలు నాట్యం చేస్తుంటే మరో వైపు కుస్తీ పోటీలు జరుగుచున్నాయి. కుస్తీ పోటీలు చాల క్రూరంగా వుంటాయి. ఈ పోటీలలో పండ్లు రాలిపొవడం రక్తం కారడం, స్పృహ కోల్పోవడం వంటివి కూడా జరుగు చుంటాయి. సైనికులు వారి వారి ఆయుదాలతో విన్యాసాలు చేస్తుంటారు కీలు గుర్రం లాంటివి కూడ వున్నాయి. చీకటి పడగానే అనేక రంగు రంగుల దీపాల అలంకరణలతో ఆ మైదానమంతా పట్ట పగలుగా తోస్తిన్నది. వినోద కార్యక్రమాలు పూర్తవగానే బాణా సంచా సామాగ్రిని కాల్చడం ప్రారంబ మవుతుంది. అనేక రాకెట్లు, బాంబులు పేల్చారు. ఇది పూర్తయిన తర్వాత సైన్యాది పతులకు సంబందించిన అలంకరించిన రధాలు ప్రవేశిస్తాయి. కొన్ని రధాలు రెండు మూడు అంతస్తులు కలిగి వున్నాయి. వీటిలో నాట్యాలు వంటి వివిద విన్యాసాలు జరుగుతున్నాయి. ముందుగా రాజుగారి గుర్తుగా రెండు గొడుగులు వున్న గుర్రం వస్తుంది. తర్వాత ఇతర గుర్రాలు వస్తాయి. వాటి విన్యాసాలు అయిన తర్వాత గుర్రాలన్ని ఆరు వరుసలుగా రాజు గారి ముందు నిలబడతాయి. అన్నింటికన్నా ముందు రాజు గారి గుర్రం వుంటుంది. అప్పుడు లోపలనుండి ఒక బ్రాంహణుడు ఒక పళ్లెంలో, కొబ్బరి కాయలు, బియ్యం, పూలు ఇంకా కొన్ని వస్తువులు ఒక కుండలో నీళ్లతో వచ్చి గుర్రాల చుట్టు తిరిగి ఏదో కార్యక్రమం చేసి లోనికి వెళ్లిపోతాడు. ఇప్పుడు అనేక మంది స్త్రీలు, అనేక రక రకాల వాద్యాలతో ప్రవేసిస్తారు.(ఈస్త్రీలు దరించిన వివిద రకాల వస్త్రాలు, ఆబరణాలు వివరణ చాల వుంది. నాట్యం తర్వాత సైన్యం ప్రవేసిస్తుంది. సైన్యం వేష ధారణ గురించి చాల వివరణలున్నాయి) +పుట 273 13. ఈ దసరా సందర్బంగా అంతఃపుర స్త్రీలు బంగారు, వజ్రాబరణాలను ప్రదర్శించే తీరు +ఇరవై ముప్పై మంది స్త్రీలు చేతిలో బెత్తాలతో బుజాన కొరడాలతో లోపలి నుండి వస్తారు. వారి వెంబడి కొందరు నపుంసకులు కూడా వస్తారు. వీరందరు అనేక రకాల వాయిద్యాలను వాయిస్తుండగా వారి వెనక కొంత మంది స్త్రీలు ప్రత్యేకంగా అలంక రించుకుని వస్తారు. వారి అలంకరణ ఈ విదంగా వుంది వారు ధరించిన పట్టుబట్టలు చాల ఖరీదైనవి. తలకు పొడవాటి టోపి ధరించారు ఇవి కిరీటాలు ఈ టోపిలపై పెద్ద పెద్ద ముత్యాలతో చేసిన పుష్పాలు అమర్చబడి వున్నాయి. వారి బుజాలపై మరియు మెడకు వేసుకున్న అబరణాలు బంగారంతో చేసిన వజ్రాలు, వైడుర్యాలు, ముత్యాల వంటి విలువైన రాళ్లను పొదగబడి వున్నాయి. అంతే గాక వీరు బుజకీర్తులకు ముత్యాల హారాలు వేసుకున్నారు. ముంజేతులకు కంకణాలు కూడా వజ్రాలు వంటివాటితో తాపడం చేయబడి వున్నాయి. మోచేతి నుండి పైభాగం కొంత ఖాళీగా వున్నా క్రింద చేతికి వేసుకున్న కంకణాలు కూడ వివిద రకాల వజ్రాలతొ వున్నాయి. వారు వేసుకున్న కాళ్ల కడియాలు వాటికి పొదగబడిన పజ్రాలు మిగతా వాటికన్నా విలువైనవిగా వున్నాయి. వారు తమ చేతులతో బంగారు బిందెలను ఎత్తుకున్నారు. వాటికి ముత్యాలను లక్కతో తాపడం చేసి అందులో ఒక దీపం పెట్ట బడి వుంది. వీరందరు పదహారు ఇరవై సంవత్సరాల మద్య వయస్సున్నవారు. +(పుట 274 వీరు ధరించిన ఆ బంగారు ఆబరణాల బరువుతో వారు సరిగా నడవ లేక పోతున్నారు. అందు చేత వారి పక్కనున్న ఇతర స్త్రీలు వారి చేతులను పై కెత్తి నడవ డానికి సహాయ పడు తున్నారు. ఈ విదంగా వీరందరు ఆ గుర్రాల చుట్టూ మూడు సార్లు తిరిగి అంతఃపురం లోనికి వెళ్లిపోతారు. ఈ స్త్రీలందరు అంతఃపుర మహారాణుల చెలి కత్తెలు సహచరులు మాత్రమె. ఈ తొమ్మిది రోజుల ఉత్సవం లో ప్రతి మాహారాణి తనకు కేటాయించిన రోజున తన పరిజనాన్ని ఈ విదంగా ప్రదర్శనకు పంపుతుంది. ఈ విదంగా ఈ మహారాణులు ఆయా రోజుల్లో ఆబరణాలతో అలంకరించిన తమ చెలికత్తెలను పంపి తమకున్న ఆబరణాల, గొప్ప తనాన్ని ప్రదర్శించు కుంటారు. వీరందరు లోపలి కెళ్లగానె గుర్రాలు కూడ వెళ్లి పోతాయి. తర్వాత ఏనుగులు వచ్చి వందనం చేసి వెళ్లిపోతాయి. రాజు గారు కూడా వెళ్లి పోతాడు. తర్వాత పూజారులు వచ్చి దేవి విగ్రహ��న్ని తీసుకుని దశరా వేదికపై నున్న గదిలో పెడతారు. అప్పుడు రాజు గారు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. అపుడు ప్రతి రోజు లాగానె కొన్ని ఎను బోతులను, పొట్టేళ్లను అక్కడ బలి ఇస్తారు. బలి కార్య క్రమం జరుగు తున్నప్పుడు ఆ తర్వాత కూడ చాల సేపటి వరకు నాట్యగత్తెలు నాట్యం చేస్తూనే వుంటారు. ఈ తొమ్మిది రోజుల్లొ ఎవరూ పగటి పూట భొజనం చేయరు. ఉపవాస ముంటారు. రాజుగారి తో సహా అందరి భొజన సమయం ఈ కార్య క్రమాలన్ని అయిన తర్వాత ఆర్ద రాత్రి మాత్రమె. ఈ విదంగా ఈదసరా ఉత్సవాలు జరుగుగా తొమ్మిదో రోజు 250 దున్న పొతులను, 4500 గొర్రెలను బలి ఇస్తారు. +పుట 275.)14 దసరా ఉత్సవాల ముగింపు సందర్బంగా జరిగే సైనిక బలగాల సమీక్ష +దసరా ఉత్సవాలు ముగియగానే రాజు గారు తన సైనిక బలగాలను సమీక్షీస్తాడు ఇందుకోసం నగరానికి పది మైళ్ల దూరంలొ ఒక గుడారం ఏర్పాటుచేసి అందులో, ఇన్ని రోజులు పూజ లందుకున్న దేవివిగ్రహాన్ని వుంచుతారు. ఈ గుడారం నుండి అంతఃపురం వరకు సేనా పతులు, ఇతర సైనికాధికారులు తమ తమ సేనలతో వారి వారి హోదా ప్రకారం బారులు తీరుతారు. ఆ ప్రదేశం లో చెరువులుంటే దాని చుట్టు దారి వుంటె దాని వెంబడి, కొండల వాలులందు, అన్నింటా సైనిక దాళాలే. ఆ ప్రాంతం లో సైన్యం ఆక్రమించని ప్రాంతమే కనబదు. కాల్బలం సైనికులు ముందు వరుసలో వుండగా, వారి వెనక, గుర్రాలు, వారి వెనుక ఏనుగులు ఇలా వరుసలుగా నిలబడతారు. వారందారూ తమ తమ ఆయుదాల తోనూ, తమ హోదాను తెలిపేపట్టీల తోను అందమైన దుస్తుల తో వున్నారు. ఆగుర్రాలను అందంగా అలంకరించి వాటి ముఖాల ఒక ఫలకాన్ని దరింప జేసి వున్నారు. వాటి కళ్ళేలను అనేక రంగుల సిల్కు దారాలతో చేసి వున్నారు. +(ఫుట..276 గుర్రాల తలమీద పాము పడగలు, పెద్ద జంతువుల చిత్రాలు అలంకరించ బడివున్నాయి. సైనికులు ధరించిన శిరస్రాణాలు వారి ముఖానికి, మెడకు కూడా కప్పబడి చూడ చక్కగా నున్నారు గుర్రాలను కూడ రంగు రంగుల పట్టు బట్టలతో అలంకరించి వున్నారు. సైనికుల నడుముకు కత్తి, యుద్దాలలొ వుపయోగించే చిన్న గొడ్డలి వున్నాయి. చేతులలో పొడవాటి ఈటెలు వుండగా వాటికొనలు బంగారు, వెండి తో చేయ బడ్డాయి. రాజు హోదా తెలిపే గొడుగులు అనేక రంగుల పట్టు బట్టతో చేసి వున్నాయి. ఏనుగులను కూడా ఇదే విదంగా అలంకరించి మెడలో గంటలతో తలమీద రంగు, రంగు బొమ్మల గీసి వున్నాయి +(పుట 277 విలుకాండ్రు ధరించిన ధనస్సులకు బంగారు పూత పూయ బడి వుంది. తుపాకి ధరించిన సైనికులు ముదురు రంగు దుస్తులు ధరించి వున్నారు. ఈ సమీక్షలో వాడిన ఈటెలు, డాలు, విల్లులు, బాంబులు, ఇటువంటి ఆయుదాలను ఎలా తయారు చేసారా యని, మరి వాటిని వాడే విదానం చూసి నాకు చాల ఆచ్చ్యర్య మేసింది. సైనికులే ఇంతటి విలువైన దుస్తులు ధరిస్తుంటే ఇక రాజు గారు ఎలాంటి దుస్తులు ధరించే వారో ఊహించవచ్చు. రాజుగారు వెళుతుంటే పైన చెప్పిన విదంగా అలంకరించ బడ్డ కొన్ని ఏనుగులు, అదేవిదంగా ఇరవై గుర్రాలు వెంబడి వెళతాయి. గుర్రాల కళ్లాలు ఇతర అలంకరణలలో బంగారు, మరియు ఇతర విలువైన రాళ్లు పొదగబడి వున్నాయి. రాజుగారి దగ్గరగా ఒక పెద్ద పల్లకి వుంది అది రాగితోగాని, వెండితో గాని చేయ బడి వుంది. దానిని పదహారు మంది మోస్తుంటే ఇంకో పదాహారు మంది బరువు మార్చుకోడానికి సిద్దంగావున్నారు. అందులో ఇంతవరకు పూజలందు కున్న దేవి విగ్రహం వుంది. ఆ విదంగా రాజుగారు వెళుతుంటే సైనికు లందరూ తమ తమ ఆయుదాలను భూమికి తాకించి శబ్దం చేసారు. గట్టిగా నినాదం చేశారు గుర్రాలు గట్టిగా సకిలించాయి. ఏనుగులు ఘీంకరించాయి బాంబులు పేలాయి. తుపాకులు ఘర్జించాయి. ఈ శబ్దానికి నగరం అంతా తలకిందులై పోతుందా అని నాకు అనిపించింది. ప్రపంచం అంతా ఇక్కడే గుముగూడి వుందా? అని కూడ అనిపించింది. ఈ విదంగా రాజుగారు అమ్మ వారిగుడిలోని కెళ్లునంత వరకూ వుంది. రాజు గారు అలా లోపలి కెళ్లగానే సైనికులందరూ వెళ్లి పోతా రనుకున్నాను. కాని దానికి విరుద్దంగా అందరూ కదలకుండా రాతి బొమ్మల్లాగా నిలబడి పోయారు. గుడి లోపల రాజుగారు తన పూజా కార్యక్రమం పూర్తి గావించుకుని బయటకు వచ్చు నంతవరకు వారు అలాగే నిలబడి వున్నారు. పూజానంతరం రాజుగారు బయటకు వచ్చి తన గుర్రమెక్కి వచ్చిన దారి వెంబడే నగరాని బయలు దేరగానే సైనికు లందరూ తమ ఆయుదాలతో శబ్దం చేస్తూ కొడలలో, గుట్టలలో వున్నవారు క్రిందికి దిగుతున్నారు. ఈ దృశ్యం చూస్తుంటే నాకు "నేను కల గంటున్నానేమో" ననిపించింది. నేను అలా తలతిప్పి అటుఇటు చూస్తుంటే నేను నడుపుతున్న గుర్రం వెనకబడి పోయింది. సైనికాధికారు లందరూ నగరం వరకు రాజు గారి వెంబడి వెళ్లి తర్వాత విశ్రాంతికై వెళ్లి పోయారు. మిగతా సైనికులు తమ తమ గుడారాల వైపు వెళ్ళారు +15 డొమింగో ఫీస్ చూసిన శ్రీ కృష్ణ దేవరాయల రాజాంతపురం +శ్రీ కృష్ణదేవరాయలు క్రొత్త నగరంలో వున్నారని తెలిసి మేము మా గవర్నరుతో కలిసి రాజు గారి కొత్త నగరానికెళ్ళి విజయనగర రాజాంతపురాన్ని సందర్శించడానికి అనుమతి కోరాము. రాజుగారు సంతోషించి దయతో అంగీక రించారు మేము తిరిగి విజయనగరానికి రాగానే అంతపురానికి చెందిన అధికారి మాకు అంతపురాన్ని చూపించాడు. +ప్రధాన ద్వారంవద్ద మమ్ములను నిల్పి మేము ఎంతమందిమి వున్నామో లెక్కబెట్టుకొని ఒకరి తర్వాత ఒకరిని లోనికనుమతించారు అది ఒక గుడి లోపల నేల అంతా నున్నగా గచ్చు వేయ బడి వున్నది గోడలు తెల్లగా వున్నాయి ఆ ఎదురుగా నున్నది రాజుగారి నివాసము. దీని ప్రవేశద్వారం కిరువైపులా రెండు చిత్ర పటాలు చిత్రిచబడి వున్నాయి. కుడి చేతి వైపునున్నది ప్రస్తుతమున్న రాజు గారి తండ్రిది రెండోది ప్రస్తుత రాజు గారిది ఈ గది నుండి బయటకు రాగానే తిరిగి మమ్ముల్ని లెక్క బెట్టుకున్నారు ఆ తర్వాత ఇంకో చిన్న కట్టడం లోనికెళ్ళాము ఇందులోనికి రాగానే ఎడం వైపు రెండు గదులు ఒకదాని మీద ఒకటి వున్నాయి క్రిందున్న గది భూమట్టానికి కొంచెం దిగువున వున్నది రెండు మెట్లు దిగాలి. ఈ మెట్లు రాగితో తాపడం చేయ బడి వున్నాయి అక్కడి నుండి పైదాక అంతా బంగారంతో పూత పూయ బడి వుంది బయట ఇది గుమ్మటంలాక వున్నది ఔట్ సైడ్ ఈస్ డోమ్ డు షేప్ దీనికున్న నాలుగువైపుల తలుపులకు వజ్రాలు, రత్నాలు మాణిక్యాలు తాపడం చేయబడి వున్నాయి పైన బంగారం తో చేయబడిన రెండు దీపస్థంబాలు వేలాడుతున్నాయి వీటికి కూడ వజ్రాలు వంటివి పొదగబడి వున్నవి ఈ గదిలో ఒక మంచం వున్నది దాని కాళ్ళు కూడ గది తలుపులు లాగే వున్నాయి దాని పట్టీలకు బంగారు తాపడం చేయ బడి వుంది దానీ మీదున్న దుప్పటికి చుట్టు ముత్యాల వరుసలు కుట్టబడి వున్నాయి దీనిపైనున్న గదిలో ఏముందో నే ను చూడలేదు ఈ భవనంలోనె ఇంకో గది వుంది ఇది అందసంగా చెక్కబడిన రాతి స్థంబాలు కలిగి వుంది ఈ గదికి క్రిందా పైనా స్థంబాలకు కూడ, గులాబి, తామర పువ్వులు చెక్కబడిన దంతముచే కప్పబడివుంది ఇంతటి అందమైన గది మరొకటి నాకెక్కడా కనబడలేదు ఇందులో రెండు సింహాసనాలున్నాయి అవి బంగారంతో చేయబడినవి ఇంకో మంచం వెండి తో చేయబడినది ఇందులోనె ఒక చిన్న పలకం చూశాను. అది నీళాల తో చేయబడినది దాని క్రింద కొన్ని అర్చీలున్నాయి ఇది అంతపుర ద్వారానికి ప్రక్కనే వుంది దీని తలుపులు పెద్ద బీగాలతో మూయ బడి వుంది లోపల వెనకాటి తరాల రాజుల ఖజానా దాచ బడినదట +ఆ తర్వాత మేమొక పెద్ద హాలు లోనికి ప్రవేశిచాము. ఇదంతా అందంగా అగచ్చు చేయడి ఉవ��ంది మద్యలో కర్ర స్థంబాలున్నాయి వాటిపై భాగమంతా రాగితో తాపడం చేయబడివుంది వీటి మద్యలో నాలుగు వెండి గొలుసులు వాటి కొక్కేలు స్థంబాల పైబాగానికి తగిలించి వున్నాయి ఇది రాజుగారు తన రాణులతో ఉయ్యాల లూగటానికి చేసిన ఏర్పాటు ఈ హాలు ప్రవేశ ద్వారానికి కుడిప్రక్కనున్న నాలుగైదు మెట్లెక్కి ఇంకో అందమైన భవనం లోనికి ప్రవేసించాము వీరి ఇళ్ళన్ని ఒకే అంతస్తు కలిగి వైకప్పు చదునుగా వుంటుంది అక్కడున్న మరో భవనం రాతి స్థంబాలతో పైకప్పు మాత్రం చెక్కతో చేయబడి వుంది స్థంబాలు రాగి తో పూత పూయ బడి వున్నవి ఈ భవన ప్రవేశద్వారమందు నాలుగు ష్తంభాల మంటపం వున్నది స్థంభాలపై నాట్య కారుల ఇతర చిత్రాలు మలచబడి వున్నాయి ఈ చిత్రలన్ని ఎర్రటి రంగులో పూత పూయబడి వుంది ఈ భవనం దేవి విగ్రహాన్ని వుంచడానికి మాత్రమే వాడుతున్నారు ఇందులో చివరగా మూయబడిన గదిలో దేవి విగ్రహం వున్నది ఉత్సస్వాల సందర్బంలో ఈ దేవి విగ్రహాన్ని బంగారు సింహాసనంలో తీసుకెళ్ళతారు. +ఇంత కన్న వారు మాకు ఎక్కువగా చూపలేదు. రాణి వాస మందిరాల్లోనికి నపుంసకులు తప్ప ఎవ్వరికి అనుమతి లేదు ఇక్కడి నుండి మేము లోని కెళ్ళిన ద్వారం ప్రక్కనున్న రెండో ద్వారంగుండా బయటకు వచ్చాం అప్పుడు మేమెంత మందిమి లోనికెళ్ళామో మమ్ముల్ని తిరిగి లెక్కించుకున్నారు +పుట. 279)16. విజయనాగర సామ్రాజ్యం యొక్క సైనిక బలమెంత +రాజు గారి అధీనంలో ఒక మిలియన్ సైన్యం వుంది. అందులో ౩౫,౦౦౦ మంది సైనికులు ఏ క్షణం లోనైన పంపడానికి సిద్దంగా వున్న వారిని తన ఆధీనంలో వుంచుకుంటాడు. నేను ఈ నగరంలో వుండగా ఒక సందర్బంలో సముద్ర తీరంలో యుద్దం చేయడానికి ౫౦ మంది సైన్యాదిపతుల్ని,1,50,,౦౦౦ సైనికుల్ని రాజు గారు పంపారు, సరిహద్దులో ఉన్న ముగ్గురు సామంత రాజులకు, తమ సైనిక శక్తిని ప్రదర్శించా లనుకుంటే రెండు మిలియన్ల సైనికుల్ని యుద్ద భూమికి తరలించ గలరట. అందుచేత ఈ రాజుకు శత్రు భయంక రు''డని బిరుదు గలదు. ఇంత సైన్యాన్ని పోషించ డానికి రాజుగారికి ధనం ఎక్కడనుండి వస్తుందని ఎవరికైన సందేహం కలుగుతుంది. ఈ రాజ్యంలో అనేక మంది కోటీశ్వరు లున్నారు. ధనవంతులు, సైన్యాదిపతుల ఆధీనంలొ నగారాలు పల్లెలు వుంటాయి. ఎంతెంత సైన్యాన్ని వారు పోషించ వలసి వుంటుందో రాజు గారు నిర్ణయిస్తాడు. ఈ విదంగ సైన్యాన్ని ఇటువంటి ధనవంతులు, జమీందార్లు రాజుగారి తరుపున పోషిస్తుంటారు. రాజు గారి అవసరార్దం సైన్యం ఎప్పుడూ సిద్దంగా వుంటుంది. అదె విదంగా, రాజుగారు తన ఖజానా నుండి జీతం ఇచ్చే సైనికులు కూడా వుంటారు. ఆ విదంగా రాజుగారి వద్ద 8౦౦ ఏనుగులు, 5౦౦ గుర్రాలు ఎల్లప్పుడు సిద్దంగా వుంటాయి. సామంత రాజులు, జమీందార్లు ప్రతి సంవత్సరం కట్టే కప్పం బహుమతులు చాలా వుంటాయి. అదేవిదంగా దసరా సందర్బంగా కూడ ధనవంతులు రాజు గారికి అధిక మొత్తంలో బహుమతు లిస్తుంటారు. ఈ రాజ్యంలో ఒక పద్దతి ఉంది. ప్రతి రాజు తన ఏలుబడిలో వున్నప్పుడు ఒక పెద్ద ధన రాసిని కూడబెట్టి దాన్ని దాచి పెడ్తాడు. తన తర్వాత రాజ్యాని కొచ్చిన రాజు దాన్ని వాడడు. కనీసం అందులో ఎంత వుందో కూడ చూడడు. అత్యవసర మైతే తప్ప దాన్ని వాడడు. ఆ విదంగా తరతరాలుగా బద్ర పరచిన ధనాగారం చాల వుంది. +(ప్రస్తుతం ఇప్పుడున్న శిదిల హంపి విజయనగర విషేశాలను "హంపి విజయనగర పర్యటన లొ చూడండి.) +(పుట ౩61 ౩62 విజయనగరంలో శ్రీ క్రిష్ణ దేవరాయలు వయస్సులో వున్నప్పుడు చిన్నా దేవి అనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అప్పట్లో ఆమెతో సరదాకు "నేను రాజు నయ్యాక నిన్ను పేడ్లిచేసుకుని మాహా రాణిని చేస్తాను" అని అన్నాడు. నిజంగానే రాజు అయ్యాడు. కాని అతను తన మాటను మర్చిపోలేదు. ఆమెను పెళ్లాడి మహారాణిని చేసాడు. ఆమెపై తనకున్న ప్రేమకు గుర్తుగా నాగలాపురము" అనే పట్టణాన్ని కట్టించాడు. అందులో పెద్ద పెద్ద వీదులతో అందమైన భవనాలను నిర్మించాడు. అంతేగాక ప్రముఖులను ఇక్కడ భవనాలను నిర్మించమని ఆదేశించాడు ఈ నగరమే నేటి హోస్పేట. ఈ విషయం డొమింగో ఫీస్ చెప్పిన దానికి సరిపోయింది +పుట 369 ఆచ్యుత రాయలు కాలంలో రాజు ఉపయోగించే వస్తువులన్నీ బంగారు, వెండి తో చేసినవే. బేసిన్లు, గిన్నెలు, స్టూళ్లు, జగ్గులు వంటి పాత్రలన్ని బంగారు, వెండి తో చేసినవె. అతని భార్యలు పడుకునే పడకలు వెండి పలకలతొ కప్పబడి వున్నవి. అలాగే రాజు గారి మంచం కాళ్లు బంగారుపువి. మంచం మీద పట్టు బట్ట పైన నాలుగు తలగడలు, అదే విదంగా కాళ్లవద్ద నాలుగు దిండ్లు, అన్ని పట్టు బట్టతొ చేసినవి. ఇతనికి ఐదు వందలమంది భార్యలు. ఇతని మరణా నంతరము వీరందరూ అగ్ని ప్రవేశం చేయవలసిందే. ఇతను ఎప్పుడైనా ప్రయాణమైతే ఇతని వెంబడి సుమారు 25 30 మంది భార్యలు వెంబడిస్తారు. అందరికి తలా ఒక పల్లకి వుంది. మహా రాణి పల్లకి మాత్రం పట్టు బట్ట, దాని లో ముత్యాలు కుట్టబడి వున్నాయి. పల్లకి కర్ర బంగారం తో కప్ప బడి ఉంటుంది. రాజు గారు వుండే పల్లకి కుడివైపు వెళ్లుతుంది ఇది బంగారం తో అలంకరించబడి వున్నది. +పుట..371 రాజు గారి అంతఃపురంలో స్త్రీలు, సేవకులు, నపుంసకులు అందరూ కలిసి సుమారు 5౦౦ మంది వుంటారు. ఇతని భార్యలకు కూడ ఇదే విదంగా సేవకులుంటారు కాని వారందరు ఆడవారే.(పుట 372 రాజు గారికి నమస్కరించే విదానము. రాజు గారు ప్రతి రోజు ఉదయం పది పదకొండు గంటలకు బయటకు వచ్చి తన ఆసనంలో కూర్చోగానే, రాజ ప్రముఖులు, ఇతర అదికారులు ఒక్కొక్కరుగా వచ్చి రాజు గారి ముందు తలవంచి చేతులు జోడించి నమస్కారం చేస్తారు. అప్పుడు వారు ఇలా చెప్తారు పలనా పేరుగల నేను పలనా అధికారి యైన నేను ప్రభువులకు నమస్కారం చేస్తున్నాను ప్రస్తుతం అచ్యుతరాయలు అనే రాజు రాజ్యం చేస్తున్నాడు. ఇతని గుర్రపు శాలలో ఏడు వందల గుర్రాలున్నాయి. అలాగే నాలుగు వందల ఏనుగులున్నాయి.. +(పుట 375 రాజుగారు బయట ప్రదేశానికి ప్రయాణమైతే తన వెంట కొంత మంది అంతరంగికులని తీసుకెళ్తాడు రాజు గారు ఎవ్వరితొ ఏమి మాట్లాడినా ఎవరికి ఏమి హామీ ఇచ్చినా, ఇంకా ఎటువంటి వాగ్దానాలు చేసినా వీరు అన్నింటినీ ఒక పుస్తకంలో రాస్తుంటారు. వీరి మాటలకు చాల గౌరవం ఉంటుంది. కనుక రాజు గారిచ్చిన ఆదేశాలకు ఎటువంటి లిఖిత పూర్వకమైనది వుండదు. వీరు రాసిన పుస్తకం లో చూసుకుని గుర్తుంచు కుంటారు. కాని కొన్ని సందర్బాల్లో లిఖిత పూర్వక మైనది ఇవ్వాల్సివస్తే దాని మీద రాజుగారి ఉంగరం ముద్ర లక్క మీద వేస్తాడు.దాంతో ఆ పత్రానికి హాక్కు లబిస్తుంది పుట 375 విజయనగర రాజులు అన్ని రకాల మాంసం, చేపలు, పక్షులను తింటారు. కాని ఆవులను ఎద్దులను వీరు చంపరు, తినరు. వీటిని పూజిస్తారు. మాంసం కొరకు జంతువులను పక్షులను బ్రతి కుండగానె అమ్ముతారు. ఇక్కడ అనేక రకాల పండ్లు, కూడ చాల తక్కువ ధరకే దొరుకును. మార్కెట్టు లో ఒక "ఫర్దావ్" కు పన్నెండు గొర్రెలు కొనవచ్చు. అవే పల్లెలలో పదునాలుగు పదునైదు వస్తాయి. రాజు గారు తాను తాగే నీరు ఒక ప్రత్యేకమైన బావి నుండి తెప్పిస్తారు ఆ నీటిని ఒక పాత్రలో పోసి మూత పెట్టి దానికి సీలు" వేసి ఒక నమ్మకస్తు డైన వాని ఆదీనంలో వుంచుతారు +రాజుగారు ఎవరిపై నన్న ప్రత్యేక గౌరవం చూపాలంటే అతనికి బంగారు పిడి కలిగి దానికి వజ్రాల వంటివిలువైన రాళ్లు పొదిగిన తెల్లటి వింజామరను బహూకరిస్తాడు. ఇది అత్త్యున్నత మైన గౌరవం. విజయనగర రాజులు దశరా వుత్సవాల సందర్బంగా దేవి పూజానంతరం పవిత్రమైన రత్న ఖచిత సింహాసనం మీద కూర్చుంటాడు ధర్మ పారాయణుడై ఎల్లప్పుడు సత్యమునే పలుకు రాజులు మాత్రమే ఈ సింహాసానాన్ని అదిష్టించడానికి అర్హులు. అంచేత ప్రస్తుతం రాజ్యం చేస్తున్న రాజు గారు అచ్చ్యుత రాయలవారు అంత ధర్మ బద్దుడు కాదు గనుక సింహాసనం మీద కూర్చొన లేదు శ్రీక్రిష్ణ దేవరాయులు సింహాసనం మీద కూర్చున్నాడని డొమింగో ఫీస్ రాశాడు.) +పుట(381.)18. దొంగ తనాల నివారణ ఎలా జరిగేది +నగరంలో జరిగిన దొంగ తనాలగురించి కొన్ని వివరాలు, అనగా దొంగిలించ బడిన సరకు వివారాలు, దొంగ యొక్క ఆనవాలు చెప్ప గలిగితే వెంటనే మంత్ర గాళ్లను పిలిపించి దొంగ ఆచూకి కనుగొంటారు. ఇటు వంటి మంత్ర గాళ్లు ఈ దేశంలో చాల మంది వున్నారు. అందు చేత ఈ దేశంలో దొంగలు తక్కువ. +పుట 382 19. అంతఃపుర పరివారము +రాజుగారి అంతః పురంలో సుమారు 400 మంది స్త్రీ జన సేవికలుంటారు. వీరిలొ సేవకులు సహాయకులు, ద్వార పాలకులు, వంటవారు, నాట్యగత్తెలు శోది చెప్పెవారు ఇలాంటి వారుంటారు. అంతే గాక రాజుగారికి స్వంతంగా వంట చేయడానికి పది మంది వంటవారు వున్నారు. వంట గది ద్వారం వద్ద నపుంసకులు కాపలా వుంటారు. వీరు ఎవ్వరిని లోనికి అనుమతించరు. రాజుగారి భొజన సమయంలో కొంత మంది స్త్రీలు వచ్చి మూడు కాళ్ల గుండ్రని బల్ల మీద అన్ని సిద్దంచేస్తారు. అది బంగారం తో చేయ బడింది. వంట పాత్రలు కూడ బంగారంతొ చేయ బడినవి. ఈ రాజు ఒకసారి తొడిగిన బట్టలను టోపీలను మరొక్క సారి ధరించడు. ఇవి పట్టు బట్టతో చేసినవై అందులో బంగారు పనితనం కూడ వుంటుంది. విడిచిన బట్టలను ఇంకొకరికి ఇవ్వరు. +20 ఈ రాజ్యంలొ శిక్షలు ఎలా వూండేవి +ఈ రాజ్యంలొ శిక్షలు ఈ విదంగా వుంటాయి. దొంగకి కాలు చెయ్యి తీసెయ్యడం. దొంగతనం పెద్దదయితే లేక మానబంగం వంటి నేరాలకు మరణ శిక్ష. నమ్మక ద్రోహులకు బతికుండగానే కడుపులో ఒక కర్ర గుచ్చి నాలుగు వీదుల కూడలిలో నిలబెడతారు. ఇంకొన్ని శిక్షలు ఈ విదంగా వుంటాయి. ఎనుగులచే తొక్కించడము, వీపుమీద ఒక బండ రాయిని పెట్టి వీదులలొ నిలబెట్టడం వంటివి. నీచ కులస్తు లెవరైనా ఎటువంటి నేరాలు చేసినా నడివీదిలో వారి తల నరకడమే శిక్ష. +21 విజయనగర సామ్రాజ్యం లో సతీ సహగమనము జరుగు విదాన మెట్టిదనగా పూట 391 +ఈ రాజ్యంలోని ప్రజలందరూ విగ్రహా రాధకులే. స్త్రీలు చనిపోయిన తమ భర్తలతో బాటు చితిలో దూకి మరణించుటం వీరి అచారం దీన్ని వీరు గౌరవ ప్రదమైన చర్యగా భావిస్తారు. భర్త మరణించి నపుడు భార్య బందు వర్గంతో కల���సి రోదిస్తుంది. కానీ ఆ రోధన ఒక అ నిర్నీత స్థాయిని మించితే ఆ స్త్రీ తన భర్తతో బాటు సహాగమనానికి సిద్దంగా లేదని భావిస్తారు. ఆమె ఏడుపు మానగానే అమెను సహగమనానికి పురిగొల్పుతారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారానికి/ సంప్రదాయానికి బంగం కలిగించ వద్దని భోదిస్తారు. ఆ తర్వాత మరణించిన వ్యక్తిని చెట్టు కొమ్మలతో చేసిన వేదికపై (ఇది వెదురు కర్రల తో చేసిన పాడె అయివుండును పూలతో అలంకరిస్తారు. అతని భార్యను ఒక గుర్రంపై కూర్చో బెట్ట శవం వెంబడి పంపుతారు. అప్పుడామె తనకున్న అన్ని ఆభరణాలు ధరించి వుంటుంది. అన్ని రకాల పూలను కూడ ధరించి వుంటుంది చేతిలో అద్దంకూడ వుంటుంది. వెంబడి ఆనేక సంగీత వాయద్యాలు, బాజ బజంత్రీలు రాగా వెనుక బందుజన సముదాయం నడుస్తుంటుంది. వీ రందరూ చాల సంతోషంగా వుంటారు. ఒక వ్యక్తి ఒక వాయద్యాన్ని వాయుస్తూ ఆ స్త్రీ వైపు చూసి ఇలా పాట పాడుతాడు నీవు నీ భర్తను చేరడానికి వెళ్లుతున్నావు అని ఆ స్త్రీ దానికి సమాదానంగా "అవును నేను నా భర్త వద్దకు వెళుతున్నాను అని పాట ద్వారా తెలుపుతుంది. +(పుట 393 శవాన్ని స్మశానానికి తీసుకెళ్లి అక్కడ అదివరకే సిద్దంచేసిన వేదిక (చితి) పై పెడ్తారు. మరణించిన వ్యక్తి యొక్క దగ్గరి బందువు ఒకరు తలమీద ఒక నీటితో నిండిన కుండను ఎత్తుకొని చేతిలో ఒక కాగడా ధరించి ఆ వేదిక (చితి) చుట్టు మూడు సార్లు తిరుగుతాడు. ప్రతి చుట్టుకు ఆ కుండకు ఒక రంద్రం చేస్తారు. చివరగా ఆ కుండను అక్కడ పడేసి అ కాగడాను శవాన్ని పడుకోబెట్టిన కట్టెల వేదికపైకి విసురుతాడు. అప్పుడు అక్కడ వున్నవారు శవానికి నిప్పు పెడతారు. శవం కాలాక అతని భార్య పూజారులతొ కలిసి అక్కడ కొస్తుంది. వారు ఆమె పాదాలను కడిగి వారి ఆచారాలకు సంబందించిన కార్య క్రమాలు చేస్తారు. ఆప్పుడు ఆమె తన చేతులతో తన మీదున్న ఆబరాణాలను తీసి తన బందువులైన స్త్రీలకు పంచి ఇస్తుంది. ఆమెకు కొడుకులున్నచో వారిని తనకు ముఖ్యమైన బందువులకు అప్పచెప్తుంది. ఆమె శరీరం పైనున్న వన్ని తీసేశాక ఆమెకు ఒక సాదారణ పశుపు బట్టను కట్టబెట్టతారు. ఆమె బందువులు ఆమె చేతిని పట్టుకోగా ఆమె మరో చేతిలొ ఒక కొమ్మను పట్టుకొని వుంటుంది. ఆమెను మూడు సార్లు ఆ చితి చుట్టూ తిప్పుతారు. అప్పుడు ఒక చాపను ఆమెకు ముందు అడ్డంగా పట్టుకుని చితి మంటలు కనబడకుండా చేస్తారు. అప్పుడు ఒక బట్ట, బియ్యం, దువ్వెన, అద్దం, తమలపాకులు, వంటి వాటిని ఆ మం���లో పడేస్తారు. ఇవన్ని తన భర్త తరుపున వస్తువులని వారి నమ్మకం. చివరగా ఆమె అక్కడున్న వారందరి వద్ద శలవు తీసుకిని నెత్తిన నూనె తో నిండిన కుండతో తనంత తాను ధైర్యంగా మండుచున్న అగ్ని కీలలోనికి ప్రవేసిస్తుంది. వెనువెంటనే, అప్పటికే చేతులలో కర్రలతో సిద్దంగా వున్న ఆమె బందువులు అందరూ ఆ కర్రలతో ఆమెను కప్పేస్తారు. ఆ తర్వాత బిగ్గరగా తమ విచారాన్ని వ్యక్త పరుస్తారు. ఈ విదానము చాల ధైర్యంతో కూడుకున్నదే గాక నాకుచాల ఆచ్యర్యాన్ని కలిగించింది. ఈ పద్దతి ఇక్కడి అధికారులకే గాక రాజుకు కూడ వర్తిస్తుంది. ఒక వేళ ఎవరికైనా చాలా మంది భార్యలు వుంటే అతని మరణాంతరం వారందరిలా అగ్ని ప్రవేశం చేయవలసిందే. తెలుగు వారికి మాత్రం ఈ ఆచారం లో కొంత మార్పు వుంది. వారు శవాన్ని భూమిలో పూడ్చి పెడాతారు గనుక భర్త శవాన్ని పూడ్చి పెట్టే గోతిలోనే భార్య కొరకు ఇంకో స్తానం సిద్ద చేస్తారు. భర్త శవానికి ప్రక్కన భార్య ను పడుకోబెట్టి ఇద్దరిని పూడ్చి పెడ్తారు అప్పుడు భార్య కూడా మర్తణిస్తుంది. +పుట 393) 22. బ్రాంహణులు వారి మరణా నంతరం చేసె కార్యక్రామాలు +ఒక బ్రాంహాణుడు రోగ పీడితుడై చావుకు దగ్గరా నున్నప్పుడు అతని గురించి కొన్ని పూజా కార్యాక్రమాలు చేసి దేవున్ని ప్రార్దిస్తారు. అతనికి దాన ధర్మాలు చేయమని భోదిస్తారు. ఈ పూజానంతరం అతనికి శిరోముండనం చేసి వారి పద్దతి ప్రకారం స్నానం చేయిస్తారు. అప్పుడు ఒక ఆవు దూడను తీసుకొస్తారు. అక్కడ కొద్ది మంది బ్రాంహణులు మాత్రమే వుంటారు. వారు చాల బీద వారు పూట గడవని అతి బీద వారు. ఆవు మెడకు ఒక తలాపాగాను కట్టి ఇంకో కొసను ఆ బ్రాంహణుని చేతికిచ్చి దానిని అనగా ఆవు దూడను ఆ పూజా కార్య క్రమాలాను నిర్వ హించిన అ పూజారులకు దానమిప్పిస్తారు. ఆ సందర్బంగా ఆ బ్రంహణుడు తన శక్తి కొలది ఇతర బ్రాంహణులకు దాన ధర్మాలు చేస్తాడు. ఆ తర్వాత ఇందు కొరకు పిలిపించిన ఇతర బ్రంహణులకు అన్నదానం చేస్తాడు. ఈ కార్యక్రమం వలన ఆ రోగపీడితునికి ఆయుష్షు ఉంటే రోగం నయమయి సుఖంగా జీవిస్తాడు, లేనిచో త్వరలోనె మరణిస్తాడు, అని వారి నమ్మకం. ఒక వేళ ఆ బ్రాంహణుడు మరణిస్తే ఆతను మరణించిన ప్రదేశమంతా ఆవు పేడతో అలికి దాని మీద ఆతని శవాన్ని పడుకో బెడతారు. మరణించిన వారు భూమి మీద గాక మంచం మీదనో మారేదాని మీదనో తుదిశ్వాస విడిస్తే ఆతను చాల పాప కర్మలు చేసుంటాడని భావిస్తారు. ఆ మరణించిన వ్యక్తి శవాన్ని అత్తి చెట్టు కర్రలతో చేసిన వేదికపై పడుకోబెట్టి స్నానం చేయిస్తారు. తర్వాత కొన్ని సుగంద ద్రవ్యాలను చల్లి ఒక కొత్త బట్టను కప్పి పాడె మీద పెడ్తారు. మరణించిన వ్యక్తి దగ్గరి బందువు మొదటగా ఆ పాడిని ఒక ప్రక్కనుండి పైకెత్త తాడు అప్పుడు మరో ముగ్గురు అతనికి సహాయంగా వచ్చి పాడిని ఎత్తి మోసుకుంటూ శ్మశానానికి వెళతారు. శవం ముందు బ్రాంహణులందరూ పాటలు పాడుతు ముందుకు సాగుతారు. ఆందరి కంటే ముందు మరణించిన బ్రాంహణుడి కొడుకు గాని కొడుకు లేకుంటే తమ్ముడుగాని లేదా దగ్గరి బందువు చేతిలో నిప్పుల కుండను తీసుకుని నడుస్తాడు. శ్మశానాని కొచ్చిన వెంటనే అతని శక్తానుసారం డబ్బును వెద అల్లుతారు. శవం పూర్తిగా కాలి నంతవరకు వుండి తర్వాత అందరూ దగ్గరలోని చెరువు కెళ్ళి స్తానం చేస్తారు తల కొరివి పెట్టిన వ్యక్తి తొమ్మిది రాత్రుల పాటు ఏ ప్రదేశంలో ఆ వ్తక్తి మరణించాడో ఆ స్తానంలో నిద్రించాలి మరణాంతరము తొమ్మిది రాత్రులు గడిచిన తర్వాతా కొందరు పూజారులు వచ్చి తలకొరివి పెట్టిన వ్యక్తికి శిరో ముండనం చేయిస్తారు. ఈ తొమ్మిది రోజులు బీదసాదలకు అన్న దానం చేసి మరణించిన వ్యక్తికి సంబందించిన బట్టలు, మంచం, ఇతర వస్తువులను కొంత ధనంతో కలిపి బీదలకు దానం చేస్తారు. మరణించిన వ్యక్తి ధనవంతు డైనచో అతని స్తాయిని బట్టి పంట పొలాలు, తోటలు కూడా దానం చేస్తారు. పదో రోజున మరణించిన వ్యక్తిని కాల్చిన చితి ప్రదేశానికి వెళ్లి తలకొరివి పెట్టిన వ్యక్తితో అక్కడున్న చితా బస్మం పై కొన్ని పూజా కార్యక్రమాలు చేయిస్తారు. తర్వాత ఆ చితా బస్మాన్ని ఒక పాత్రలో సేకరించి అక్కడే ఒక గొయ్యి త్రవ్వి అక్కడె పూడ్చి పెడ్తారు. తర్వాత ఆ చితా బస్మాన్ని ఇక్కడికి చాలా దూరంలోవున్న పవిత్ర నదిలో నిమజ్జనం చేయడానికి దాన్ని జాగ్రత్తగా కాపాడుతారు. చాల దూరంలోవున్న ఆ పవిత్రనదీ ప్రాంతంలో అతి పెద్ద ఆలయం వుంది. అక్కడికొచ్చే భక్తులు అక్కడే మరణిస్తే వారు నేరుగా స్వర్గానికి వెళతారని వీరి నమ్మకం. అలాగె మరణించిన వ్యక్తి చితా భస్మాన్ని ఈ పవిత్ర నదిలో కలిపితే అమరణించిన వ్యక్తి కూడ పుణ్య లోకాలకు వెళతాడని కూడ వీరి నమ్మకం. అయినా అక్కడికెళ్లే వారి సంఖ్య చాల తక్కువ. ఎందు కంటే ఆ ప్రదేశం ఇక్కడికి చాలా దూరంలో వుంది ఇది కాశి గంగా నది మరణించిన వ్యక్తికి సంబందించిన వారసులు పదకొండు రోజులపాటు ఇరవై ఏడు మంది బ్రాంహణులకు, ఇరవై ఒక్క రోజులపాటు ముగ్గురు ఇతరులకు, పన్నెండు రోజుల పాటు ఏడుగురి బ్రాంహణులకు, ఇక ఇరవై ఏడు రోజులపాటు ముగ్గురి బ్రాంహణులకు నెలలో చివరి మూడు రోజులు ముగ్గురు ఇతరులకు అన్న దానం చేయడం వీరి అచారం. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు నెలకొకసారి ముగ్గురి బ్రాంహణులకు అన్నదానం చేస్తారు. ఆ తర్వాత నెలకొక సారి తప్ప అన్నదానాలుండవు, కానీ ప్రతి సంవత్స రానికి ఒకసారి మాత్రం అన్నదానం వుంటుంది. మరణించిన సంవత్సరాని కొక సారి ప్రతి యేడు ఆరుగురికి ఆన్నదానం చేయడం వీరి పద్దతి ఆ ఆరుగురిలో ముగ్గురు దేవతలు, మిగతా ముగ్గురిలో ఒకరు తనతండ్రి, ఒకరు తన తాత మరియు ఇంకొకరు తన ముత్తాత గా వీరు బావిస్తారు. ఒక వేళ ఈ అన్న దానాలు కార్య క్రమం చేయ డానికి శక్తి లేకుంటే ఇతర బ్రంహణులను బిక్షం కోరుతారు. ఈ ఆరుగురికి భోజనానికి ముందు వీరి కాళ్లు కడిగి పూజారులు చెప్పిన ఇతర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. +విజయనగర రాజవీధులను అబ్దుల్‌రజాక్ ఇట్లు వర్ణించుచున్నాడు +"రాజవీథులందిరుప్రక్కలను పుష్పలావికలు పరిమళము గ్రమ్ముకొను నానావిధపుష్పములను విక్రయించు చుందురు. అంగళ్ళవాండ్రు తమ యంగళ్ళముంగిట అందమైన మంచెలు గట్టుకొని అందు తమసరకుల నమ్ముకొను చుందురు. ఇట్లిరు ప్రక్కలను అంగళ్ళు, పుష్పలావికలు స్థలమాక్రమించు కొనినను, ఆశ్వికులు, కాలినడక వారు, యేనుగులు రథములు, శకటములు, పల్లకీలు మున్నగునవి గుంపులు గుంపులుగ నిసుకవైచిన రాలకుండ వచ్చుచు బోవుచుండుటకు వీలయినంత వెడల్పుగా నీరాజవీథులున్నవి. ఈవీధులు చాలపొడుగై కనుచూపుమేఱకు వ్యాపించియుండి నేడు మనోజ్ఞమయిన దృశ్యము నొసంగుచున్నవి. ఎచ్చట చూచినను పరిమళ భరతములయిన వివిధజాతుల దివ్య కుసుమములే కానవచ్చు చుండును. అన్ని పుష్పములలో నీదేశీయులకు గులాబి (గొజ్జంగి) పూవులన్న మిక్కిలి యిష్టము. అవి విశేషముగా దొరకును. ఇచ్చటి ప్రజలకు పువ్వులనిన బ్రాణము. ఆహారమెంత యావశ్యకమో పూవులంతావశ్యకము. భోజనమైన లేకుండ బోవుదురుగాని స్త్రీపురు షులు పూవులు ముడువకుండ, ధరింపకుండ, నెక్కడకు బోలేరు. ఒక్కొక్క విధమగు వస్తుచయమును విక్రయించు నొక్కొక వాడవర్తకులు ఒక్కొకచోట గుమిగూడి జుట్టుగా వ్యాపారము చేసికొందురు, ఏసరకుల వాడ యాసరకులదేగాని యింకొక సరకావాడలో దొరకదు. ఇచ్చటి రత్నవర్తకులు నిర్భయముగా తమసరకులను ఎంతవిలువగల వాటినైనను తమవజ్రవైడూర్య మాణిక్యములను, పచ్చలను, నీలములను, పద్మరాగములను, రత్నములను, మంచి ముత్యములను, పగడములను విచ్చలవిడిగా రాసులక్రింద బోసి నడివీథులందు విక్రయించుకొను చుందురు. +"అత్యంత రామణీయకమై మనోజ్ఞమైన యచ్చోట నగరివాకిట కెదురుగా నున్న నాలుగువీథులందును చక్కని నునుపైన ఱాతికాలువగుండ పరిశుద్ధజలము నగరులోనికి పట్టణము లోనికి నెడతెఱిపిలేక పాఱుచుండును. ఈఱాతికాలువలు పట్టణమునం దంతటను గానుపించును. రాయల సౌధమునకు కుడివైపున మంత్రి శేఖరుని సభాగారమంటపముకలదు. +ఇమ్మడి దేవరాయల పరిపాలనము శాంతిప్రదమై, యుండినట్లును, ప్రజలు యుద్ధముల వలనగాని, దండయాత్రల వలనగాని, యేయొత్తిడిలేక సుఖముగా నుండిరనియు విశ్వసించుటకు ప్రబల కారణముల నేకములు గన్పట్టుచున్నవి. అన్నిటికంటె పారశీక దేశమునుండి సుల్తానుషారుఖ్ ప్రౌడదేవరాయల కడకు రాయబారిగా, అబ్దుల్‌రజాక్‌ను బంపుట, ప్రధానమైనది. రాయలకీర్తి, దిగంత విశ్రాంతయైన దనుటకును, ఆతడు, మహా పరాక్రమశాలి యనుటకు నాతని తోడి నెయ్యము, దేశాంతరముల నుండురాజన్యు లపేక్షించిరనుటకు నింతకంటె వేఱె కారణమేమి గావలయును? అబ్దుర్ రజాక్ విజయనగరమును సందర్శించుటకు బూర్వము నికోలో కోంటి యని ఇటాలియా వాస్తవ్యుడొకడు, వచ్చియుండెను. ఆతడు ప్రౌడదేవరాయల గూర్చి "యాతడు హిందూదేశములోని నృపాలురందరి కంటెను ఎక్కు బలపరాక్రమ సమనిర్వతుడు" అనివ్రాసి యున్నాడు. నికోలో చేసిన విజయనగర వర్ణనము, మన రజాక్ చేసిన వర్ణనలను ఇంచుమించుగా బోలియుండెను. రాజ్యమంతయు శాంతి ప్రదమై, రాజ్యకాలమంతయు సౌఖ్యావహమై యుండుటచేతనే ప్రజలకు విద్యాగోష్ఠియుండుటకును, సాంఘికా చారములందు సంస్కరణములు చేసుకొనుటకు నవకాశము కలిగినది. ఈతని కాలమున, వడైవీడుసీమ బ్రాహ్మణలు కర్ణాటాంధ్ర ద్రావిడ లాట దేశీదేశీయులు నప్పటినుండియు క్రీ.శ. 1425) వివాహములందు, కన్యాశుల్కమును దీసుకొను నాచారము మానితిమనియు, వివాహములు, కన్యాదానములుగావున కన్యావిక్రయములుగా జరుగరాదనియు, నొడంబడిక జేసుకొనిరి. ఆకట్టడియందు, కులపెద్దలు వ్రాళ్ళుచేసియుండిరి. ఇమ్మడి దేవరాయల కాలమున, విదేశ వాణిజ్యము చక్కగా సాగుచుండెను. రాయలకు మూడువందల రేవులున్నవని రజాక్ వ్రాసినాడు. కాని అది అతిశయోక్తిగా గన్పట్టుచున్నది. ఆంధ్రదేశమున మోటు పల్లి మొదలుకొని తూర్పుతీరమున కన్యాకుమారి వరకును అచ్చటనుండి, పశ్చమతీరమున గోవ వఱకునుగల సముద్రపుటొడ్డు పట్టణములన్నియు రేవులేయని యెంచుకొన్నచో మున్నూరు రేవు లండుటలో నాశ్చర్యకరమైన దేమియు లేదు. విదేశ వాణిజ్యము విరివిగా సాగుటకై రాయల మంచి కట్టడులు చేసినట్లు గాన వచ్చుచున్నది. దేవరాయల కాలమున, రేవుపట్టణములకు అభయశాసనము వీయబడి, ఎగుమతి దిగుమతి సరకులపై సుంకములు, పూర్వ మర్యాదల ననుసరించి కట్టడలు చేయబడెను. ఆంధ్రదేశమున మోటుపల్లి రేవునందున్న దేవరాయల శాసనమందు, దిగుమతి, యెగుమతి సరకులపై సుంకాలు వివరింపబడి యున్నవి. ఇట్టి శాసనము లింకను ఇతర తావులం దెన్నిగలవో! +రాయలు, ఏనుగుల వేటయందు ఎక్కువ ప్రీతిగలవాడని అబ్దుర్‌రజాక్ చెప్పనమాటలు విశ్వసనీయములుగా గన్పట్టుచున్నవి. రాయలకు, తగినంత శాంతియుండిన గాని, ఏనుగులవేట యొకటి యాచారము చేసుకొనుటకవకాశ ముండదుగదా! అతడు ఏనుగుల వేటాడుట మొదట నెలకొల్పిన కారణమున గాబోలు తన నాణెములపై రాయ గజగండ భేరుండయనియు, గజబేటకారయనియు, బిరుదులు వ్రాయుంచు కొన్నాడు. దేవరాయలు, మహాసామ్రాజ్యమునుని నిర్మింప గలుగుటయేగాక దానికి సుస్థిరత్వమును సమకూర్చినగాని, గజకీట విలాసార్థముగా జేయుచుండుటకు తగిన యవకాశముండదు. +ఇమ్మడి దేవరాయలు కవితాప్రియుడు. రసజ్ఞుడు. విశేషించి కవియు గూడనై యుండి, తనయాస్థానమున బెక్కుమంది కవులను పండితులను ఆశ్రయమిచ్చెను. శ్రీనాధుడతని ముత్యాలశాలయందే క్రియాశక్తి ఒడయల సమక్షమున, గౌడడిండిమభట్ట కవి సార్వభౌముని యోడించి, యాతని కంచుడక్కను బగులగొట్టించి, కనకాభిషేకమును బడసినాడు. ఈతనికాలపు పరిస్థితులు శ్రీనాధుని చాటువుల కలసి తెలియ వచ్చుచున్నవి. దేవరాయలు సంస్కృత భాషయందు, కవియైయుండి మహానాటక సుధానిధి" యనునొక చంపూ కావ్యమును రచించి, అందు శ్రీరాముని చరిత్రము వర్ణించినాడు. +రాయలసోదరు డొకడు, రాయలపై కుట్రలుబన్ని, కౄరముగ వధింపనెంచినటుల, అబ్దుర్‌రజాక్ వ్రాసిన వ్రాతలు నిజము గావచ్చును. ఆదారుణకృత్యమును దలపెట్టిగ సోదరుడెవడో యింతవఱకు దెలియరాదు. ఆకుట్రలో, తగిలిన గాయములవలన రాయలు, వ్రణపీడితుడై యారుమాసములైన గతించక ముందె (1445 నందు) మరణించెను. ఈతని మరణమునకు బూర్వమె మన రాయబారి విజయనగరము నుండి, స్వదేశమునకు బయలుదేరినట్లు యాతడు వ్రాసిన వానినిబట్టి తెలియుచున్నది. +దేవరాయలు తన్ను జంపుటకు జరిగిన యాప్రయత్నమునందు బాల్గొన్నవారందఱిని చిత్రవధపాలుచేసెను. విజయనగరమిట్టి దురవస్థల��� నుండగా భామినీసుల్తానగు రెండవఅల్లా యుద్దీను డీసమాచారము నంతయుగూడ చారులవలన నాకర్ణించి, ధూరుడై యేడులక్షల దీనారములు కప్పము బంపవలసినదనియు, లేకున్న రాజ్యముపై దండెత్తి రాగలననియు వర్తమానమంపెను. రాయలా బెదరింపులకు జంకక, సైన్యమును గూర్చుకుని భామినీ రాజ్యముపై దండెత్తిబోయి మద్దకల్లు కోటనుగొట్టి రాచూరు, వెంగాపురపుకోటలను సాధించి, సాగరు బిజాపురము వఱకును గల తురుష్క రాజ్యమును గొల్లవెట్టుచు దేశమునల్లకల్లోలము చేసివైచెను. ఆయుద్ధములో మహమ్మదీయులకు విశేషముగా బ్రాణనష్టము సంభవించెననియు తుదకొండొరులకు హానికలుగజేసుకొనకుండ సంధిచేసుకొని యెవరిరాజ్యములకువారు వెడలిపోయిరని ఫెరిష్ టావ్రాయుచున్నాడు; గాని యది నిజమని విశ్వసింపజాలము. అబ్దుర్ రజాక్, ఆసమయమున, దేవరాయల యాస్థానమునందుండిన వాడగుటచే, నతడు దేవరాయల బ్రాహ్మణ మహాప్రధాని కలబరిగె రాజ్యముపై దండెత్తి, తురుష్కసేనలను జయించి విజయలక్ష్మీ సమేతుడై తిరిగివచ్చుచు, కొందఱి దురదృష్టవంతులగు వీరులను వెంటబెట్టుకొని వచ్చినాడని వ్రాసినది, యదార్థమని యొప్పుకొనక తప్పదు. +దేవరాయని సమకాలీనులలో, రాజమహేంద్రవరము రాజధానిగా, పూర్వాంధ్రదేశమును చిల్కసముద్రము పత్యంతమునేలిన అల్లాడ వీరారెడ్డి, వేమారెడ్లు, మిక్కిలి ప్రఖ్యాంతిగాంచినవారు. వారి యాస్థానమునందే, కవిసార్వభౌముడగు శ్రీనాథుడు తనకౌమార దశనంతయు, గడపి యుండెను. ఈ రెడ్లకును, భామినీ సుల్తానులకును గల స్నేహమువలన, కర్ణాట భూపాలునకు వీరు ప్రబలుశత్రువులుగావలసివచ్చెను. +మన అబ్దుర్ రజాక్, నికోలోకొంటి, విజయనగరమును సందర్శించి పోయిన ఇరువది సంవత్సరములకు పారశీక రాయబారిగా నేతెంచి యుండెను. ఆతడు రాయబారమునకై క్రీ.శ. 1442 వ సంవత్సరము జనవరి 13 వ తేదిని బయలుదేరి ఎట్లో, పడరాని పాట్లుపడి ఆసంవత్సరము నవంబరు మాసాదిని కళ్ళికోట రేవును, జేరగల్గెను. కాని కళ్ళికోటలో నాతడు 1443 వ సంవత్సరము ఏప్రిల్ మాసాదివఱకుండి పోవలసివచ్చెను. అంతట రాయలచే నాహ్వానింపబడి, కళ్ళికోటనుండి బయలుదేరి ఏప్రిల్ మాసాంతమున కచ్చటికిజేరి యది మొదలుకొని డిశెంబరు 5 వ తేది వఱకును విజయనగరము నందుండెను. ఈతడు మహర్నవమి యుత్సవములని, వర్ణించినాడుగాని యాతని వర్ణనలుబట్టి ఆతడు జూచినది, వర్ణించినది, నవరాత్రియుత్సవము లగునోకాదో యని సందియము గలు గుచున్నది. ఆతడు త్రిరాత్రయుత్సవములనే వర్ణిం���ి మహర్నవమి యుత్సవములని జెప్పినాడు. ఆతడు పొరబడి యుండవచ్చును లేదా యీతడు వ్రాసిన చరిత్రలో కొంతభాగము శిధిలముకాగా శేషించిన దానిని సంస్కరించి పూరించినవారు పొరబడియుందురు. అబ్దుర్ రజాక్ రాయల పరిపాలనావసానదశయందుండి, విజయనగర వైభవమునుకన్నులార గాంచి, వర్ణించిన యదృష్టవంతుడు. మన కందువలన చిరస్మరణీయుడు. +"వేశ్యవాటికనుగూర్చి యొకమాట మాత్రము చెప్పక తప్పదు. టంకసాల వెనుక నించుమించుగా నిరువదిగజముల వెడల్పును మూడువందల గజముల పొడవును గల యొక వీధిగలదు. ఆవీథి కిరుప్రక్కలను చక్కని పూబొదరిండ్లతో నిండిన ముంగిట వాకిళ్ళుగల శోభనగృహములు బారులు తీర్చి యున్నవి. ఆ ప్రాంగణములందు చంద్రకాంతశిలానిర్చితములయిన వేదికలు వరుసగా గలవు. ఆ వేదికలకువెనుక, మేడ గోడలపై సింహములు, పులులు, చిరుతపులులు, ఏనుగులు మున్నగు వన్యమృగము లనేకములు జీవము లుట్టిపనినట్టు చిత్రింపబడియున్నవి. అపరాహ్ణమున, ఎండవేడిమి యించుక తగ్గుచుండువేళ నీవారవిలాసినులు చక్కగా నలంకరింపబడిన తమయిండ్ల ప్రాంగణములందున్న చంద్రకాంతశిలావేదికలపై తివాసులమీదను, సోఫాలమీదను, విలాసముగ, హొయలు మీఱి చేటీజనముతో సుఖొపవిష్టులయి, యుందురు. ప్రతి వెలపడుచును ఒడలంతయు, నవరత్నఖచిత మూల్యాభరణములతో, మంచిముత్తెముల హారములతో కన్నులకు మిఱుమిట్లుగొల్పు చక్కదనముతో రంగురంగుల చీరెలుకట్టి యలకరించుకొని, చూచువారల హృదయములను జూఱగొను చుండును. అచ్చటివారందఱు, పదియాఱ్వన్నె కుందనపు శలాకలవలెనుండు నెఱజవ్వనపు సొగసుకత్తెలే! ఒక్కొక్క పడుపుటింటికి ఇద్దరు ముగ్గురు దాసీలుందురు. వారు తమ యజమాను రాండ్రకడ నిలువబడి, మార్గమున బోవువిట కాండ్రను తమనేర్పఱితన ముట్టిపడునట్లు, వెల్లాటకత్తెల సౌందర్య సముద్రములో ముంచివేయ బ్రయత్నించు చుందురు. ఆవీథిని మన్మధుడు తన చెఱకువింటిని, సంధించి, శరంపరలు గ్రుమ్మరించుచు రేబవలు సంచరించుచు యప్సరసలను బోలిన ఆకాంతల వలలోవిరహులగు వారిని బడద్రోయుచుండును. వెల యాండ్ర పొత్తుగూడి సుఖింపగోరువా డీవీధినిబోయి, తన యిచ్చవచ్చిన తరుణిని గోరుకొని బడయవచ్చును. వేశ్యాగృహములందు పరిచారికలు, దాసీలు, మిక్కిలి జాగరూకులయి యుందురు. పడపుటిల్లాండ్రకై వచ్చిన విటులసొ త్తేదయిన నొకగ్రుడ్డిగవ్వైన పోయినను పరిచారికల ప్రాణము మీదికి వచ్చును. వేంటనే వారు గృహమునుండి వెడలగొట్టబడుదురు. ఈనగరపు ఏడుప్రహరీల నడుమ లెక్కకుమించిన వేశ్యాగృహములున్నవి. ఈ వేశ్యలవలన రాబట్టబడిన పండ్రెండువేల పణము లనుదినమును నగరు కావలివాండ్ర జీతబత్తెములకై వినియోగింపబడును +పుట 402 23. 14 వ శతాబ్దంలో ధక్కన్ సామ్రాజ్యలలో వుండిన సంపద ఎంత +క్రీ.శ. 1310 వ సంవత్సరంలో ఢిల్లీలో అల్లాయుద్దిన్ ఖిల్జీ పరిపాలన కాలంలో మాలిక్ కాఫర్ ధక్కన్, మలబార్ తీర ప్రాంతం, మైసూర్ సామ్రాజ్యాల మీది దోపిడి యాత్రలు జరిపి అనేక హిందూ దేవాలయాలను కొల్లగొట్టి, అత్యధిక ధనకనక రాసులను ఢిల్లీకి తీసుక వచ్చాడని చెప్పబడింది ఫిరిష్టా అనే చారిత్రిక కారుడు చెప్పినదాని ప్రకారము హిందు దేవాలయాలలోని బంగారు విగ్రహాలు, రత్న ఖతిచమైన అనేక బంగారు వస్తువులను కొల్లగొట్టి ఆధన ,కనక వస్తు సంపదను 312 ఏనుగులు, 20 వేల గుర్రాలపై అనేక పెట్టలలో 96 వేల మణుగుల బంగారాన్ని ఢిల్లీకి త్రలించాడు. ఆ సంపదను లెక్కించాలని చూడగా చాల కష్టమైంది. ఎందుకంటే భారత దేశంలో అనేక రాజ్యాలలో మణుగు అనే దానికి వివిద రకాల పద్దతులున్నాయి. తిరువాన్కూరు లో ఒక మణుగు కు 10 పౌండ్లు, అహమద్ నగర్ లో ఒక మణుగుకు 163 1/4 పౌండ్లు, మద్రాసులో ఒక మణుగుకు 25 పౌండ్లు, బొంబాయిలో ఒక మణుగుకు 28 పౌండ్లు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పద్దతి వున్నది హాకిన్సు అనే అతను క్రీ.శ. 1610 వ సంవత్సరంలో 55 పౌండ్లు ఒక మణుగు అన్నాడు మిడిల్టన్ అనే అతను క్రీ.శ. 1611వ సంవత్సరంలో 33 పౌండ్లు అని అన్నాడు పరిస్టా అనే అతని లెక్క ప్రకారం తీసుకున్నా మాలిక్ కాఫర్ కొల్లగొట్టిన హిందూ దేవాలయాలోని సంపద 96,000 మణుగులు అనగా 1,56,72,000 పౌండ్లగా తేలుతుంది ఇదంతా తిరువాన్కూరు మణుగును లెక్కలోకి తీసుకుంటే బంగారం బరువు 2,400,000 పౌండ్లు అవుతుంది. +దీన్ని మనం లెక్కలోకి తీసుకున్నా తీసుకోక పోయినా ఒక్కటి మాత్రం నిజం హిందు దేవాలయాలు అత్యధిక ధన సంపదతో తుల తూగాయనె నిజం తెలుస్తున్నది హిందూ రాజులు తమ ధన రాసులన్ని ఏ ఏటికాఏడు పెంపొందించు కుంటూనె వుండేవారు. ఆలయ పూజారులు, బహుమానాలు, తమ వేతనాలను ప్రజల నుండే పొందేవారు రాజులు, పెద్ద వ్వపార వేత్తలు, భూస్వాములు, మొదలగు ఉన్నత వర్గంవారు పోటా పోటీగా తాము నమ్ముకున్న దేవాలయాలకు అధిక మొత్తంలో ధన రాసులను సమర్పించుకునే వారు ఇది తర తరలుగా జరుగుతున్న పద్దతే అలాంటప్పుడు దేవాలయాలు అధిక సంపదతో తుల గూఉతున్నాయని చెప్పడంలో ఆచ్చర్య మేమున్నది కొలినెల్ డౌ అనే చారిత్రిక కారుడు పిరి��్తా' రచనలను అనువదిస్తూ మాలిక్ కాపర్ కొల్లగొట్టిన ధన సంపద ఇంగ్లీషు డబ్బు ప్రకారం వంద మిలియన్ల స్టెర్లింగులుంటుందన్నాడు ఇది ఆగ్రందంలోని విషయం క్లుప్తంగా +ఏ రకంగా చూసినా మాలిక్ కాఫర్ హిందు దేవాలయాలలోకొల్లగొట్టిన ధన కనక సంపద ఎంతో వూహిచడానికి కూడ అంతు పట్టదు ఆయా ఆలయాలలో తర తరాలుగా దాచి పెట్టిన సంపద 'ఇంత' అని దాచి పెట్టిన వారికే తెలియదు. అలా చూసుకోక పోవడము వారి సంప్రాదాయం డొమింగో ఫీస్ విజయనగర రాజాంత:పురాన్ని చూస్తూ ఇలా అన్నాడు అదొక పెద్ద గది. దానికి తాళం వేసున్నది వీరు చెప్పిందాని ప్రకారం ఆ గదిలో జారుగారు పూర్వీకుల నుండి అందులో సంపదను దాచి పెడుతారు అత్యవసర పరిషితిలో తప్ప దాన్ని బయటకు తీయరు కనీసం అందులో ఎంత సంపద వున్నదో నని కూడ చూడరు అని అన్నాడు. అదే పద్దతి అలయాల్లోను రాజ మందిరాల్లోను కొన సాగి వుంటుందనె దాంట్లో అనుమానం అక్కర్లేదు. +నిన్న మొన్న మన కళ్లముందు కనిపించిన తిరువాన్కూరు లో అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో ఆరు గదులలో బయట పడిన అత్యధిక ధన సంపద చూసి యావత్ ప్రపంచమే దిగ్బ్రాంతి చెందింది అతి ముఖ్యమైన పెద్దదైన మరొక గదిని తెరవకుండానె అప్పటికే బయటపడిన ధన కనక సంపద ప్రపంచంలోనే అత్యధిక మొత్తమని తేల్చి చెప్పేశారు. వాటి సాధారణ విలువ లక్షకోట్లకు పైమాటే నని చెప్పారు. + + +కలల ఆకశాన కనుమరుగైన ఆ రూపమే నా కళ్యాణీ + + +తెలుగు లొ రాయడానికి ఏమి కావాలి + + +ముఖపత్ర పేజీ వికీబుక్స్ లో ప్రదర్శనకు + + +కొంచెం పొడి పొడి గా అన్నం వండుకొని చల్లారనివ్వాలి. పొయ్యి మీద కళాయి పెట్టి నూనె పొయ్యాలి. నూనె కొంచెం వేడి అయ్యాక పల్లీలు (వేరుశనగ గుళ్ళు) లేదా జీడిపప్పు, పోపు దినుసులు ఒకదాని తరువాత ఒకటి వెయ్యాలి. బంగారు రంగు వచ్చాక, ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి బాగా వేయించాలి. తరువాత తురిమిన మామిడి కాయ తురుము, పసుపు, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి చక్కగా కలుపుకోవాలి. రుచికరమైన మామిడికాయ పులిహోర సిధ్ధం. + + +చారిత్రాకాంశాలపై మక్కువ ఎక్కువగా నున్న నాకు ఒకనాటి మన తెలుగు సాంస్కృతిక రాజధాని అయిన హంపి చూడాలని వుండేది అది 2006 లోతీరింది మొదటిసారి చూసి ఆశ్చ్యర్య చికితుడనై వెంటవెంటనే మరో రెండు పర్యాలు పర్యటించాను మూడు రోజులు అక్కడే వుండి ప్రతి ��ిషయాన్ని విపులంగా వ్రాసుకున్నాను దానికి సంబందించిన చత్రిత పుస్తకాన్ని ఒకదాన్ని కొని దాన్ని విపులంగా చదివి మూడోసారి పరిశీలనాత్మకంగా ఆయా ప్రదేశాలను పర్యటించాను ఆవిషయాలన్నింటిని వ్రాసుకొన్నాను.ఇలా రెండు పుస్తకాలు తయారైనాయి ఒకటి ప్రస్తుతమున్న హంపి శిధిలాలు గురించిన వివరాలు దానిపేరు మాహమైన మహానగరం రెండోది విజయనగరం అత్యున్నత దశలొ వున్నపుడు విదేశీ యాత్రికులు వచ్చి చూసి ఉన్నదున్నట్టుగా వ్రాసుకొన్నారు దాన్ని తెలుగులో తర్జుమా చేశాను ఇలా ఈ రెండు పుస్తకాలను ఇంట్లోనే కంపూటర్లో ఎక్కించి సుమారు 15 పుస్తకాలుగా చేసుకొని తెలిసిన మిత్రులకిచ్చాను ఆ తర్వాత వికిపీడియాలో చేరాను ఆ రెండు పుస్తకాలను కొంత మార్పులతో వికీపీడియాలోనూ వికి బుక్సు లోను ఎక్కించాను + + +ఈ పీరు కు అర్దమ్ కావలెను. + + +పీల్లల పెర్లు ఆన్ని లెవు ఆన్ని పెత్తామ్ది + + +పాలక్ పనీర్ దోసె తయారు చేయు విధానము +==పాలక్ పనీర్ దోసె తయారికి కావలసిన పదార్థములు +మినప్పప్పు, బియ్యం, శనగ పప్పు ఈ మూడింటిని శుభ్రంగా కడిగి కనీసం ఆరు గంటల సేపు నానబెట్టి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమానికి ఉప్పు కలిపి రాత్రంతా అలాగే ఉంచితే ఉదయానికి పిండి గుల్లగా పొంగుతుంది. ముందుగా బంగాళ దుంపలతో కూర చేసి పక్కన పెట్టుకోవాలి బంగాళదుంపలను ఉడికించి పైన తొక్క ఒలిచి మెత్తగా చేసుకోవాలి. బాణలిలో నూనె కాగిన తరవాత అందులో పోపు వేసి ఉడికించిన బంగాళదుంపముద్ద, ఉప్పు, పసుపు వేసి బాగా మెత్తగా చేయాలి) పాలకూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరగాలి. టొమాటోలను కూడా ముక్కలు చేసుకోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలను వేసి ఈ మూడింటినీ కలిపి ఉడికించి గ్రైండ్ చేస్తే, పాలక్ పేస్టు తయారవుతుంది. పెనం మీద దోసె వేసుకుని కొద్దిగా కాలిన తరవాత దానిమీద ఈ పాలక్ పేస్టును పూసి, ఆ పైన సన్నటి పనీర్ తురుమును వేసి కొద్దిగా కాలిన తరవాత తీసేయాలి. + + +ముందుగా కోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి కొద్ది గా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి ఆరబెట్టు కోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఒక వంతుకు రెండొంతుల నీళ్లు పోసి పొయ్యి మీద రైస్ సగం మాత్రమే ఉడికించాలి. పొయ్యి మీద మరో మందపాటి పాత్ర ఉంచి సరిపడా నూనె వేసి పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా పాత్రలో వేసి దానిపై ఉడికించిన అన్నాన్ని వేయాలి. ఇలాగే ఇంకో పొరలా మిగలిన మాంసాన్ని, అన్నాన్ని వేసి మూత పెట్టాలి. పాత్ర నుంచి ఆవిరి బయ టకు పోకుండా ఉండటానికి మెత్తగా కలిపిన మైదాను మూత అంచుల చుట్టూ పెట్టాలి. మైదా పిండి మొత్తం ఆవిరైపోయి పెచ్చులుగా వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలను వేసి అలంకరించు కోవాలి. దీనికి సైడ్‌ డిష్‌గా గోంగూరను కానీ, వంకాయ కూరను కానీ వేసి సర్వ్‌ చేసుకోవచ్చు. + + +(తొక్కతీసిన) బెంగళూరు వంకాయ ముక్కలు 4 కప్పులు, పచ్చికొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, నూనె 4 టీ స్పూన్లు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అర టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి 1, కారం అర టీ స్పూను, అల్లం తురుము 1 టీ స్పూను, పసుపు చిటికెడు. +వంకాయ ముక్కల్లో పసుపు కలిపి కొద్ది నీటిలో ఉడికించి వార్చేయాలి. నూనెలో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కారం, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి వేగించి, చివర్లో ఉడికిన ముక్కలు కలపాలి. చిన్నమంటపై కూర చిక్కబడ్డాక పచ్చికొబ్బరి తురుము చల్లి దించేయాలి. పరాటాల్లోకి ఈ కూర బాగుంటుంది. +బెంగళూరు వంకాయ పై చెక్కు 1 కప్పు, వేరుశనగల పప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, జీలకర్ర అర టీ స్పూను, దనియాల పొడి అర టీ స్పూను, పచ్చిమిర్చి 2, ఆవాలు పావు టీ స్పూను, చింతపండు గుజ్జు 1 టీ స్పూను, బెల్లం అర టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, పసుపు చిటికెడు, నూనె 1 టీ స్పూను. +అర టీ స్పూను నూనెలో వేరుశనగ, మినప్పప్పు కొద్ది సేపు వేగించి తీసేయాలి. అదే కడాయిలో బెంగళూరు వంకాయ చెక్కు, ఉప్పు, పసుపు వేసి కొద్ది నీరు చిలకరించి మూతపెట్టి మగ్గనివ్వాలి. మిక్సీలో పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, దనియాలపొడి బరకగా తిప్పి, మగ్గిన చెక్కు, చింతపండు గుజ్జు, బెల్లం కలిపి పేస్టులా రుబ్బుకోవాలి. ఇందులో దోరగా వేగించిన తాలింపు కలపాలి. ఈ చట్నీ అన్నంతో పాటు, దోశల్లోకి కూడా బాగుంటుంది. +పెసరపప్పు 150 గ్రా బెంగళూరు వంకాయ 1, ఉల్లిపాయ 1, టమోటా చిన్నది) 1, పచ్చిమిర్చి 3, పచ్చి కొబ్బరి తురుము 3 టీ స్పూన్లు. +నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు అర టీ స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, జీలకర్ర, మెంతులు పావు టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి 3, ఇంగువ చిటికెడు. +పెసరపప్పులో చిటికెడు పసుపు కలిపి మూడు కప్పుల నీటిలో ఉడికించాలి. పప్పు మూడొంతులు మెత్తబడ్డాక బెంగళూరు వంకాయ, టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి, తగినంత ఉప్పు, ఒక కప్పు నీరు పోసి మూత పెట్టాలి. ముక్కలు మెత్తబడ్డాక మంట తీసేయాలి. ఇప్పుడు మరో కడాయిలో తాలింపు వేసి కూటులో కలపాలి. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా ఉండే వంటకం ఇది. + + +గుళ్ళపల్లి నాగేశ్వర రావు 5-36 దుర్గానగర్, దిల్ షుక్ నగర్, హైదరాబాదు 500060 చరవాణి: 9848211556 + + +ప్రియ మైన కస్టమర్లకు విజ్ఞప్తి ప్రతి 5000 కిలొ మీటర్లకు అలైన్మెట్ మరియు 4 వీల్స్ బాలన్సిగ్ + + +ప్రియ మైన కస్ ట మర్లకు విజ్ఞప్తి +ప్రతీ 5,000 కిలొ మీటర్లకు అలైన్ మెన్ ట్ మరియు +ప్రతీ 10,000 కిలొ మీటర్లకు అలైన్ మెన్ ట్ మరియు 4 వీల్స్ +బాలన్స్ గ్ బటన్ ఛీన్ జ్ టయర్ రొటెష్ న్ ఛెసుకొనవలెను. +అలైన్ మెన్ ట్ ఐన తరువాత రిపొర్ట్ ఆఫిసులొ ఇవ్వవలెను + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పు��ు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివర��ూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిల��నే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంద���. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పే��ుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవ��శించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +మీ ఖాతా ఎప్పటిలానే పనిచేస్తుంది, ఇప్పటివరకూ మీరు చేసిన మార్పుచేర్పులు కూడా మీకే ఆపాదించబడతాయి, కానీ మీరు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని ఉపయోగించాల్సివుంటుంది. + + +హిందూమతం భారత ఉప-ఖండంలో నున్న ఒక మతం ఇది ప్రార్థనా, అత్యంత కర్మతో కూడిన రూపం. ఒక పాలీ ఆస్తికుడు మానవరూప మతం పుస్తకాలు మరియు హిందూమతం నిర్వచించే పద్యాలు యొక్క రచనాధోరణి సంస్కృతంలో రాసి పూరాతన పొందాయి అని జీవితాల గురించి, పురాణాలు మొదలుకుని మరియు +దేవతలను ప్రేమించడం, అధిభౌతిక ప్రశ్నలు, తాత్విక గ్రంథాలు, మరియు చట్టం పుస్తకాల వంటివి ఉంటాయి హిందూ మతం జైనమతం, సిక్కుమతం, మరియు బౌద్ధమతం యొక్క మూలాలు అందించింది పశ్చిమంలో హరే కృష్ణ ఉద్యమంలో చూడవచ్చు హిందూమతం భారతదేశం, నేపాల్, మరియు మారిషస్ మెజారిటీ మతం మరియు ఫిజి, సురినామ్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, మరియు సింగపూర్ గణనీయమైన మైనారిటీ మతం. +హిందూ మతం పదాలుమరియు ఎటిమాలజీ హిందూమతం + + +సర్వదర్శన సంగ్రహం మాధవాచార్య విద్యారణ్యునిచే రచించబడిన నాస్తికవాద గ్రంథం. చార్వాకం, బృహస్పతి సూత్రాల నుండి ఇది గ్రహించబడినది. +మాధవ విద్యారణ్యుడు విజయనగర సామ్రాజ్యంలో హరిహరునికి, బుక్క రాయకీ రాచగురువు, మహర్షి. శృంగేరీ శారదా పీఠానికి 12వ జగద్గురువుగా 1380-1386 వరకూ వ్యవహరించారు. హంపి లో గానీ, వరంగల్లులో గానీ వీరు జన్మించి ఉండవచ్చునని ఒక అభిప్రాయము కలదు. + + +పండిత్ ఉదయ్ నారాయణ్ సింగ్ సంస్కృతం నుండి హిందీకి అనువదించిన గ్రంథము నుండి ఈ తెలుగు అనువాదం చేయబడినది. కొన్ని పేజీలలో అచ్చు సరిగా కనబడక హిందీ అనువాదం సరిగా అర్థమగుట లేదు. కావున E B Cowell రచించిన ఆంగ్ల అనువాదాన్ని కూడా చదివి, దాని తెలుగు అనువాదమును చేర్చవలసి వచ్చినది. +ఈ అనువాదాన్ని ఎవరైననూ శుద్ధి చేయవలెనన్నా, విస్తరించవలెనన్నా, దీని నాణ్యత పెంచవలెనన్నా, ఈ రెండు గ్రంథముల ఆర్కైవ్ లంకెలు ఇక్కడ పొందుపరుస్తున్నాను. + + +* ఫలితం అనెడిది ఆచరణకు ముందు గుర్తించబడలే��ు +* ఫలితం గమనించబడి దాని తర్వాత ఆ ఫలితం గుర్తించబడుతుంది +* భౌతిక కారకం ఎంతమాత్రం గుర్తించబడలేకపోయినపుడు +ఇలాగే కొన్ని లక్షణాలను గుర్తించి ద్వారా మనం ఒక కారకాన్ని కూడా గుర్తిస్తాం. ఉదా: ఒక చెట్టును, దాని ఆకులు, దానికి పూచిన పుష్పములు, దానికి కాసిన కాయల ద్వారా గుర్తిస్తాం. అయితే, ఎక్కడైతే అసంబద్ధత ఉన్నదో, అవినాభావ సంబంధం మరల మరల గమనించబడినదో, అవినాభావ సంబంధం యొక్క వైఫల్యం అనెడి సందేహాన్ని ఎవరు విస్మరించగలరు? కారకాల వలన ఫలితము చెప్పగలము గాని, ఫలితము వలన ఫలితము చెప్పలేము. గోవు వేరు, ఆశ్వము వేరు. రెంటినీ ఒక గాట కట్టలేము. +* అంతయు దాని యొక్క స్వలక్షణమే +ఈ బోధనలానుసారం, కళ్ళ ముందు కదిలిపోయే నీలవర్ణం (లేదే ఏ ఇతర వర్ణాలైనను) దాని (వాటి) ఉనికి నుండే గుర్తించబడతాయి. కాబట్టి మేఘాల వలె, అంతయు క్షణికమే. ఉనికి ఉన్న ఏ వస్తువునూ అస్థాపితం చేయలేం. ఉనికి ఉన్న వస్తువు యొక్క అనుభూతి యొక్క స్థాపన, నీల వర్ణం మరియు ఇతర తాత్కాలిత విషయాలలో కలిగి ఉంటుంది. తాత్కాలితం కాని దాని స్థాపన యాదృచ్చికత మరియు అతాత్కాలితం నుండి వేర్పడుతుంది. ఉనికి అనెడిది యాదృచ్చికత మరియు వారసత్వం క్రింద ఉంటాయి వీటి మధ్య మరేదీ ఉండదు. +"వర్షం, ఎండలతో ఆత్మకు ఏమి పని ఉన్నది? వాటి ప్రభావం మనిషి యొక్క చర్మము పైన మాత్రమే ఉంటుంది. ఆత్మయే చర్మము వలె ఉన్నపుడు, వాటి ప్రభావం ఆశాశ్వతం. చర్మమే ఆత్మ వలె ఉన్నపుడు, దానిపై వాటి ప్రభావమనేదే ఉండదు." +ఒకే వస్తువులో సగభాగాన్ని వదిలేసి, మిగత సగంతో అనుకొన్నది సాధించలేము. అదే విధంగా ఒక గుర్తించవలసిన వస్తువు యొక్క గుర్తింపు చే కలిగే ఆధారాలు గుర్తించే వారి స్వభావాన్ని బట్టి ఉంటుంది. + + +| parents తల్లి దండ్రుల పేర్లు + + +తయారు చేయుపద్ధతి ముందుగా సగ్గుబియ్యము ఒక గంట నానబెట్టిన తరువాత, ఒక వెడల్పాటి గిన్నెలో బియ్యపు పిండి వేసి దానిలో నానబెట్టిన సగ్గుబియ్యము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, సన్నగా తరిగిన 4 లేదా 5 ఛిన్న అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి వేడి నీళ్ళతో ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ లో ఆయిల్ వేసి ఆ నూనె కాగిన తరువాత కలుపుకున్న పిండిని చిన్నచిన్న వడలు లాగా ఒత్తుకుని బాండీ లో వేసి ఎర్రగా కాలగానే తియ్యాలి. వేడి వేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. + + +కావలసిన పదార్థములు 1. పావు కేజీ క్యారెట్ +2. 2 రామములగ కాయలు (టమాటాలు) +తయారుచేయు పద్ధతి ముందుగా క్యారెట్, టమాటా, పుదీనా ఆకులు, పచ్చి మిరపకాయలు శుభ్రంగా కడగాలి. క్యారెట్ ను తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలు కోయాలి. టమాటాలు కూడా ముక్కలుగా కోయాలి. +ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి దానిలో క్యారెట్, టమాటా ముక్కలు, పుదీనా ఆకులు కావలసిన పచ్చి మిరపకాయలు వేసి తగినంత నూనె వేసి ముక్కలు మాడకుండా తిప్పుతూ +వేయించాలి. కొంచెంసేపు చల్లారిన తరువాత రోటి లో గాని మిక్సీలో గాని వేసి తగినంత చింతపండు, ఉప్పు, వెల్లుల్లిరెమ్మలు, జీలకర్ర వేసి మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత గిన్నెలోకి +ఈ పచ్చడి అన్నంలో గాని దోసెలలో గాని లేదా ఇడ్లీలలో గాని తింటే బాగుంటుంది. + + +సాఫ్టువేరు రెండు రకాల స్థితులలో ఉంటుంది, ఒకటి సోర్స్ కోడ్ కాగా రెండవది బైనరీ సోర్స్ కోడ్ (మూల రూపకరణాలు) అంటే ప్రోగ్రామర్లు రాసేది, బైనరీ అంటే కంప్యూటర్‌లో ఎక్సిక్యూట్ చేయటానికి ఒకటి సున్నాల రూపంలో ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే స్క్రూలూ నట్లతో ఉన్న బండిని సోర్స్ కోడ్ అంటే, స్క్రూలూ నట్లూ లేకుండా వెల్డింగ్ చేసి యిచ్చిన బండిని బైనరీకి సమానం అనుకోవచ్చు. మనం ఎంత మంచి బండి అయినా సరే స్క్రూలు నట్లు లేనిదయితే కచ్చితంగా కొనము. మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు మనకి అమ్ముతున్నది మాత్రం ఈ రకమైనవే. మనకి మెకానిక్ పని రాకపోయినా, మెకానిక్ వద్దకెళ్ళి రిపెయిర్ చేయించుకుంటాము సాఫ్టువేరు రంగంలో ఈ రకమైన గుత్తధిపత్యానిని నిరసిస్తూ ‘source code’ తో కూడిన సాఫ్ట్వేర్ని అందించినది మాత్రమే స్వేచ్ఛా సాఫ్టువేరు. సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులోకి రావటం మూలంగా దీని అభివృద్ది వేగంగానూ అత్యంత నాణ్యంగానూ జరిగింది. వైరస్‌లు సైతం సోకలేని సాఫ్టువేరు ఇదంటే దీని నాణ్యతేమిటో మనకర్ధమవుతుంది. స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల తయారీలో ప్రపంచ వ్యాపితంగా రమారమీ 20లక్షల మంది పని చేస్తున్నారు. ఇది ఒక ఉద్యమంలా సాగుతున్నది. స్వేచ్ఛా సాఫ్టువేరుతో తయారయిన ఆపరేటింగ్ సిస్టం లు సుమారు 5 వందల రకాలు వాడకంలో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో తయారయిన ‘స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టం’ కూడా ఈ కోవకు చెందిందే. సోర్స్ కోడ్ అందుబాటులో ఉండటాన ఇది ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదింపబడుతున్నది. మాతృభాషలో విద్యనభ్యసించటంతో ఎన్ని ���పయోగాలున్నాయో, కంప్యూటర్ వెద్యను సైతం మాతృ భాషలో అభ్యసించటంలో అన్ని ఉపయోగాలుంటాయి. +ఏ సాఫ్ట్ వేర్నయినా స్వేచ్ఛా సాఫ్టువేరు అనాలంటే అది నాలుగు సూత్రాలకు నిలబడాలి +0. సాఫ్ట్ వేర్ని ఏ అవసరానికైనా స్వేచ్చగా వినియోగించుకునే హక్కుండాలి. +1. దానిని తమ అవసరాలకనుగుణంగా మలచుకునే అవకాశం ఉండాలి అంటే సోర్స్ కోడ్ ఇచ్చి తీరాలి. +2. దానిని అభివృద్ది చేసి ఇతరులకు రొక్కానికి గాని ఉచితంగా గానీ ఇచ్చే హక్కు ఉండాలి. +3. జత చేసిన, మలచిన, అభివృద్ది చేసిన సాఫ్ట్ వేర్నికూడా ఫ్రీసాఫ్ట్ వేర్‌గా ఇవ్వాలి . +స్వేచ్ఛా సాఫ్టువేరు ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మన దేశంలో కూడా అభివృద్ది అవుతున్నది. ఇంత పెద్దమొత్తంలో ప్రజలకందరికీ అందుబాటులోకి సాఫ్టువేరుని తీసుకు వచ్చింది ఏ ఒక్క కంపెనీ కాదు. ఇదంతా స్వేచ్ఛా సాఫ్టువేరు ఉద్యమకారులు అందుబాటులోకి తీసుకువచ్చారు మన రాష్ర్ట్రంలో కూడా తెలుగులోకి సాఫ్టువేరుని అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ ఉద్యమమే. వివిధ దేశాల్లో ఉన్న వారితో కలిపి షుమారు 10,00,000 మంది వాలంటీర్ల కృషి దీనివెనక ఉంది. + + +వేదాలలో ఋగ్వేదము అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం మండలాలుగా భాగించబడి ఉంటుంది. వేదాలలో ఋగ్వేదం మొదటిది. ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది. + + +కొత్త తెలుగు పదాల సృష్టి మరియు క్రోడీకరణ విషయమై జరిగే కృషికి ప్రచారం కల్పించడం. + + +కంప్యూటర్, జాల, మొబైల్ ఉపకరణాలను తెలుగు లోనికి తీసుకురావడంలో తోడ్పడే మార్గదర్శిని ఈ పుస్తకం. వివిధ ఉపకరణాల తెలుగీకరణకు ఉపయోగపడే అంశాలు, మార్గదర్శక సూత్రాలు ఈ పుస్తకంలో ఉంటాయి. +ఈ పుస్తకం ప్రధానంగా స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ఉపకరణాల స్థానికీకరణకు ఉద్దేశించాం. ఇతర స్థానికీకరణ/అనువాదాలకు కూడా ఉపయోగపడవచ్చు. +* పారిభాషిక పదాలు (సాంకేతిక భావనలకు, పదాలకు తగిన తెలుగు పదాలు) +అనువదించ కూడని అంశాలు| అనువదించ కూడని అంశాలు]] +* తేదీ, సమయం తదితర కాల సంబంధిత అంశాలు + + +తెలుగు మాత్రమే తెలిసినవారు కూడా కంప్యూటర్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తమ అవసరాలకు సమర్థవంతంగా వాడుకోగలగాలి. కంప్యూటరు వాడుకునేవారు తెరపై కనబడే సూచనలను, ఎంపికలను చదవలేకపోతే కంప్య���టరును వాడుకోవటమే కుదరదు. ఇందుకోసం ఆయా కంప్యూటర్లు, వాటిలోని అనువర్తనాలు తెలుగులో అందుబాటులో ఉండాలి. తెలుగులో ఉండటం అంటే కేవలం తెర మీద కనబడేవి తెలుగు లిపిలో ఉండటం మాత్రమే కాదు. అందులో వాడిన భాష, పాఠించిన సంప్రదాయాలు (దూరాలు కీ.మీ.లో, వెచ్చదనం సెల్సియస్ డిగ్రీలలో చెప్పడం వంటివి) తెలుగు ప్రాంతాలలో తెలుగువారు తమ రోజువారి వ్యవహారాలలో వాడుతున్నట్టు ఉండాలి. కంప్యూటరు వాతావరణం పూర్తిగా కొత్తగా కాకుండా ప్రజల రోజువారి జీవన వ్యవహారాలలో భాగంగా దానికి పొడగింపుగా అనిపించాలి. +కంప్యూటర్లు, ల్యాపుట్యాపులు, ట్యాబులు, చేతిఫోనులు, టీవీలు, భవిష్యత్తులో రాబోయే ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ సాఫ్ట్‌వేర్ మీదే నడుస్తాయి. వీటిని స్థూలంగా కంప్యూటర్లు అందాం. వీటిలో నడిచేవి కంప్యూటరు అనువర్తనాలు లేదా ఉపకరణాలు +గత పదేళ్ళలో చేతిఫోన్ల వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరగడం, కొన్నేళ్ళుగా అంతర్జాలం అందుబాటు క్రమంగా చవక అవుతూండడంతో చాలామంది తెలుగువారు ఇప్పుడు మునుపెన్నడూలేనంతగా కంప్యూటరు ఉపకరణాలను వాడుకుంటున్నారు. పచారీ సామాన్లు తెప్పించుకోవడం నుండి, బ్యాంకు వ్యవహారాల వరకూ అనేకం డిజిటల్ రూపంలోనే నడుస్తున్నాయి. కాబట్టి ఇవి తెలుగులో ఉండాల్సిన అవసరం ఇప్పుడు మరింతగా పెరిగింది. +ఇప్పటివరకూ కంప్యూటర్లను ఆంగ్లంలోనే చూసాం కాబట్టి అవి ఆంగ్లంలోనే ఉంటాయి, ఉండాలి అనుకోవడం తప్పు. కంప్యూటర్లు ఆంగ్లంలో మాత్రమే ఉండాలి అనే నియమం ఏమీ లేదు అందునా, ఏ భాషలో చూపిస్తుందో అని కంప్యూటరుకి అసలు పట్టదు, ఎందుకంటే చివరికి కంప్యూటరు తను పరిక్రియాపించే (ప్రాసెస్ చేసే) ప్రతి సమాచారాన్నీ సున్నాలు ఒకట్లుగా మార్చుకోవలసిందే. చూపించే విషయం వేరే భాషలో ఉన్నా, కంప్యూటరు ఇంతకుముందులానే నడుస్తూండగలదు. +ఇప్పటికే కంప్యూటర్లు పలు భాషలలో అందుబాటులో ఉన్నాయి. పలు కంపెనీలు తమ కంప్యూటరు ఉపకరణాలను స్థానిక మార్కెట్ల కోసం ఆయా భాషలలో అందించడం మొదలుపెట్టాయి. ఇందుకోసం ప్రతి భాషకు విడిగా సాఫ్ట్‌వేరును తయారుచేయాల్సిన అవసరం లేదు. సాఫ్ట్‌వేరును తయారుచేసినప్పుడు అది తెరపై చూపించే సమాచారం పలు భాషల్లో చూపించగలిగేలా తయారుచేస్తే, ఆ తర్వాత ఆయా అంశాలను పలు భాషలలో ఏమంటారో అనువదిస్తే సరిపోతుంది. +కంప్యూటరు లేదా సాఫ్ట్‌వేరు ఉపకరణాలను అనువదించడం అనేది కొత్త కాదు స్��ానికీకరణ'గా పిలవబడే ఈ ప్రక్రియ సాంకేతికంగా కష్టమైనదేమీ కాదు. కానీ దీనికి మంచి అనువాదకుల జట్టు, కాస్త నిర్వహణ అవసరం. +మామూలుగా వాణిజ్యపరంగా నడిచే కంపెనీలు తమ సాఫ్ట్‌వేరు లేదా ఉపకరణాలను అమ్మడం ద్వారా (లైసెన్సు ఫీజు వసూలు చెయ్యడం ద్వారా) వచ్చే ఆదాయంలో కొంతభాగాన్ని వారి సాఫ్ట్‌వేర్లను స్థానిక భాషలలో అందించడానికి ఖర్చు పెడతాయి. కానీ చాలా కంపెనీలు వారి ఉపకరణాలను స్థానిక భాషలలో (ప్రత్యేకించి తెలుగులో) అందించడం లేదు. ఇందువల్ల ఆంగ్లం రాని వారు కంప్యూటర్లను అసలు వాడుకోవడంలేదు లేదా తప్పనిసరి పరిస్థితులలో వచ్చీరానీ ఆంగ్లం తోనే నెట్టుకొస్తున్నారు. వాటిని సమర్థవంతంగా వాడుకోలేకపోతున్నారు. +అయితే, కంప్యూటరు ఉపకరణాలను పెద్ద కంపెనీలే కాదు చిన్న చిన్న వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కూడా రూపొందిస్తున్నారు. కొన్ని సంస్థలు తమ వ్యాపార విస్తరణ కోసం గానీ, సమాజ శ్రేయస్సు కోసం గానీ వారి ఉపకరణాలను ఉచితంగా అందిస్తున్నారు. వీరందరికీ పలు భాషలలో తమ సాఫ్ట్‌వేరును అందించేందుకు తగిన వనరులు, సమయం లేకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో తమ ఉపకరణాలను స్థానిక భాషల లోనికి అనువదించమని ఆయా సంస్థలు వాటి వినియోగదార్లనే కోరుతున్నాయి. ఇందుకు స్థానికీకరణ వేదికలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇలాంటి స్థానికీకరణ వేదికలలో ఔత్సాహికులైన తెలుగువారు పాల్గొని ఆయా సాఫ్ట్‌వేరు ఉపకరణాలను తెలుగు లోనికి తీసుకురావడానికి తోడ్పడుతున్నారు కూడా. +తెలుగులో ఇలాంటి స్థానికీకరణ వ్యాపారపరంగానూ (పెద్ద కంపెనీలు, ప్రభుత్వాలు తమ సాఫ్ట్‌వేర్లను అనువదించడానికి అనువాద సంస్థలకు కాంట్రాక్టు ఇవ్వడం స్వచ్ఛందంగానూ (అనేక ఓపెన్ సోర్సు ప్రాజెక్టులు, ఇతరత్రా క్రౌడ్‌సోర్సు ప్రాజెక్టులలోను ఔత్సాహికులు పాల్గొనడం) జరుగుతోంది. అయితే ఈ ప్రయత్నాల మధ్య సమన్వయం, ఇచ్చిపుచ్చుకోళ్ళు ఉన్నట్టు పెద్దగా కనబడదు. అందువల్ల, అనువాదాలలో నిలకడ లేదు. ఒకే భావానికి పలు మాటల వాడుక కనిపిస్తోంది. వాక్య నిర్మాణమూ అసహజంగా ఉంటుంది. అలానే కొత్తగా ఈ ప్రయత్నాలలో పాలుపంచుకునేవారికి అనువాదాలు ఎలా చేయాలి అనే విషయంలో బోలెడు సందేహాలు ఉంటున్నాయి. +కంప్యూటరు, మొబైలు, జాల ఉపకరణాల తెనుగింపులో పాల్గొనే వారందరికీ ఉపయోగడేలా ఈ స్థానికీకరణ మార్గదర్శిని ని రూపొందించాలనేది లక్ష్యం. +స్థానికీకరణ అంటే ఒక ఉత్పాదనను (ఇక్కడ సాఫ్ట్‌వేరుని) స్థానిక సంప్రదాయాలకు, భాషలకు, వ్యవహారాలకు తగ్గట్టుగా మలచుకోవడం లేదా అన్వయించడం. స్థానిక సంప్రదాయాలలో తేదీలు, అంకెలు, కరెన్సీ మొదలైనవి రాసే పద్ధతి, వాడే కొలతలు వంటివి కూడా ఉంటాయి. అంటే, సరిగా స్థానికరించబడిన కంప్యూటరు ఉపకరణాలు—అవి చూపించే/వినిపించే సూచనలు, సమాచారం—స్థానిక ప్రజలకు అర్థమయ్యే తీరులో ఉండాలి. +అంతర్జాతీయీకరణ అంటే కంప్యూటరు అనువర్తనాలను పలు భాషల లోనికి అనువదించుకోదగ్గట్టు, అన్వయించుకోదగ్గట్టు రూపొందించే ప్రక్రియ. అంతర్జాతీయీకరించిన అనువర్తనాలను మాత్రమే స్థానిక భాషలలోనికి అనువదించుకోగలం. +విషయ సూచిక పేజీ నుండి అతికింపు +గమనిక దీన్ని ఆయా విభాగాల లోనికి తరలించాలి. ఈ అంశాలను పైన పరిచయంలో అవసరమైన చోట ప్రస్థావించాలి +ఆధునిక వాణిజ్య, వ్యాపార, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో విస్తారంగా వాడుకలో ఉన్న ఇంగ్లీషుని సరళమైన, భావస్పోరకమైన, దేశీ నుడికారంతో ఉట్టిపడే తెలుగులోకి మార్చటంలో ఉన్న కష్టసుఖాలని విశ్లేషించి, ఆచరణయోగ్యమైన సలహాలు ఉత్పాదించాలనే కోరిక ఈ పుస్తక ప్రేరణ కారకం. తెలుగు స్థానికీకరణలో ఆయా సాంకేతిక ఉపకరణాలలో ఆ మెనూ మాడ్యుల్ అంశాలు ఇతర రంగాలలో ఉన్న ఇంగ్లీషుని తెలుగులోకి మార్చటంలో ఉన్న సమస్యలని, వాటి పరిష్కార మార్గాలని అభివర్ణించటం జరిగింది. తెలుగు స్థానికీకరణలో తెలుగు నుడికారం ఉట్టిపడాలంటే తెలుగు వాడకంలో దొర్లే ఇంగ్లీషు తత్సమాలు 25 శాతం మించకుండా ఉంటే బాగుంటుందని ప్రతిపాదించటం జరిగింది. ఈ గమ్యాన్ని చేరుకోవటం కష్టమేమీ కాదు. మొదట, ఇంగ్లీషు మాటలని యథాతథంగా పెద్ద ఎత్తున గుచ్చెత్తి వాడెయ్యకుండా, సాధ్యమైనంత వరకు ఉన్న తెలుగు మాటలని వాడటానికి ప్రయత్నం చెయ్యటం. రెండు, సమానార్థకమైన తెలుగు మాట లేకపోయినా, వెనువెంటనే స్పురించకపోయినా ఇంగ్లీషు తత్సమాలని వాడటం కంటే తెలుగు ఉచ్చారణకి లొంగే తద్భవాలని వాడటం. మూడు, సందర్భానికి సరిపోయే భావస్పోరకమైన తెలుగు మాటలని అవసర రీత్యా సృష్టించి వాడటం. నాలుగు, ఇంగ్లీషు వాడుకలో స్థిరపడిపోయిన దుర్నామాలని యథాతథంగా తెలుగులోకి దింపేసుకోకుండా జాగ్రత పడటం. చివరగా, ఈ ప్రయత్నాలన్నీ విఫలమైన సందర్భాలలో ఇంగ్లీషు మాటలని తెలుగు లిపిలో రాయటం ముద్రణకి వీలయినప్పుడు, పక్కని కుండలీకరణాలలో ఇంగ్లీషు లిపిలో చూపించటం ఈ సూచనలన్నీ ఆచరణయోగ్యాలేనని అనుభవం చెబుతోంది. ఇంగ్లీషు మూలాన్ని తెలుగులో తిరగ రాయడానికి ముందు సాధారణంగా ఇంగ్లీషు మూలాన్ని కేవలం అర్థం చేసుకునే నిమిత్తం రెండు, మూడు సార్లు చదువాలి. అప్పుడు ఆ పాఠాన్ని తెలుగులో చెప్పే నిమిత్తం కొన్ని ముఖ్యాంశాలని దృష్టిలో పెట్టుకుని తెలుగులో రాయటం మొదలు పెట్టాలి. +ఒక భాషనుండి మరొక భాషలోనికి అనువాదం చేసే టప్పుడు Transliteration ఎక్కువగా వాడవలసిన అవసరం ఉంటుంది దీనికి కారణం సాంకేతిక అంశాలు తెలుగు లోనికి అర్ధవంతంగా వివరించ వచ్చు అందుకు ప్రధానకారణం ఆ మూలభాషలోని సాంకేతిక అంశాల పేర్లు, ఆయా బ్రాండులు మరో భాషలోకి "అర్థవంతంగా" అనువదించే పనిలేకపోవటం. ఆ మాటలక్కూడా తెలుగులో సరిసమానమైన అర్థవిశేషపు పదాలు చెప్పవచ్చు + + +బాల స్వేచ్ఛ అనే గ్ను లినెక్స్ కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థ (నివ్య) ప్రత్యేకంగా బాలల కోసం రూపొందించబడింది.ఈ నిర్వాహకవ్యవస్తలో పిల్లల పాఠ్యాంశాలకు సంబంధించిన పలు విషయాలు అనువర్తనాలు(అప్లికేషన్స్) రూపంలో పొందుపరచబడినవి. విధ్యార్థులు కంప్యూటర్ సహాయంతో తమ పాఠ్యాంశాలను పరస్పర సంకర్షణతో నేర్చుకునే వెసులుబాటు కలిపిస్తుంది ఈ నివ్య. తద్వార విద్యార్థులు పాఠము యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సులభంగా అర్థంచేసుకోవడమేకాకుండా వాటిని తమ నిజ జీవితంలో ఎలా అనువర్తించాలో తెలుసుకుంటారు.ప్రాథమిక తరగతులు మొదలుకుని పదవ తరగతి వరకు విధ్యార్థులకు ఉపయోగపడె అనువర్తనాలు (అప్లికషన్స్) అన్ని పెన్సిల్ బాక్స్ లో ప్రభుత్వ పాఠ్య ప్రనాళికకు అనుగునంగా పొందుపరచబడినవి.గణిత, భౌతిక, రసాయన, భౌగోల శాస్త్రాలకు సంబంధించిన అంశాలు విధ్యార్థులకు ఆసక్తి కలింగించే విధంగా,వారి జిజ్ఞాసను పెంచే విధంగా, అతి సులభంగా తయారుచేయబడింది.వివిధ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులకు, కంప్యూటర్ బోధకులకు మరియు విధ్యార్థులకు ఈ కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థ పై అవగాహన కలిపించుటకు స్వేచ్ఛ సంస్థ పలు రకాల కార్యక్రమాలు చేపట్టింది. +ప్రభుత్వముచే ప్రారంభింపబడిన సర్వ శిక్షా అభియన్ ప్రాజెక్ట్ ని విధ్యార్థులకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడమే బాల స్వేచ్ఛ నివ్య యొక్క ముఖ్య ఉద్దేశం.ఆధునిక విధ్యా ప్రమానాలతో రూపొందించిన బాల స్వేచ్ఛ సామన్యులకు అందుబాటు��ొలేని ప్రైవేటు మరియు టెక్నో స్కూళ్ళ యొక్క బొధనాపద్ధతులను ఉచితంగా విధ్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సాంకేతికంగాను, విషయ పరిజ్ఞానం పరంగాను గ్రామీణ విద్యార్థులను పట్టణాలలో ఉన్న విధ్యార్థులకు ధీటుగా తయారుచేస్తుంది. వాడుకరులకు అన్ని రకాల స్వేచ్ఛలను అందిస్తూ,విధ్యార్థులకు ఉపయోగపడే అన్ని రకాల విద్యోపకరనాలతో వచ్చిన మొట్ట మొదటి నిర్వాహక వ్యవస్థ "బాల స్వేచ్ఛ." +తెలుగు మరియు ఇంగ్లీషు మాధ్యమాల విధ్యార్థుల దృష్ట్యా ప్రతి ఒక్కరికి సాంకేతిక విధ్యా ప్రమానాలు అందుబాటులొ ఉండాలని, ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందాలనె ఉద్దేశంతో స్వేచ్ఛ సంస్థ బాల స్వేచ్ఛ నివ్యను తెలుగు భాష లోకి స్థానికీకరించే ప్రనాళికలను తయారుచేస్తుంది. + + +కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నాం +; తెలుగు వికీపీడియా రచ్చబండలో ఎంపిక మండలి అధ్యక్షుడు వైజాసత్య గారి సందేశం +అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఫలప్రదం చేస్తారని ఆశిస్తూ +మూవ్‌మెంట్‌ చార్టర్ ముసాయిదా కమిటీ సభ్యుల ఎన్నిక కోసం ఓటింగ్ ఇప్పుడు తెరవబడింది +ఓటింగ్ అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 24, 2021 వరకు తెరవబడి ఉంటుంది ప్రపంచంలో ఎక్కడైనా +ఉద్యమ వ్యూహ మరియు పాలనా బృందం, వికీమీడియా ఫౌండేషన్ +మీ మూవ్‌మెంట్‌ స్ట్రాటజీ ప్రణాళికలను మూవ్‌మెంట్‌ స్ట్రాటజీ అమలు నిధులు ఎలా మద్దతిస్తాయో నేర్చుకోండి +నూతన మూవ్‌మెంట్‌ ఛార్టర్‌ ముసాయిదా కమిటీ సభ్యులతో సమావేశమవండి +మూవ్‌మెంట్‌ ఛార్టర్‌ ముసాయిదా కమిటీ ఎన్నికలు మరియు ఎపికల ప్రక్రియ పూర్తి అయింది. +కమిటి తన పనిని ప్రారంభించడానికి త్వరలోనే సమావేశమవుతుంది. వైవిధ్యత మరియు నైపుణ్య అంతరాలను పూరించడానికి మరో ముగ్గురు సభ్యులను కమిటీ నియమించవచ్చును. +బోర్డు ట్రస్టీల ఎన్నికల గురించిన ఫీడ్‌బ్యాక్‌ కోసం పిలుపు ఇప్పుడు బహిరంగం +ఫీడ్‌బ్యాక్‌ కోసం పిలుపు: బోర్డు ట్రస్టీల ఎన్నికలు ఇప్పుడు బహిరంగం మరియు 7 ఫిబ్రవరి 2022న సమాప్తి అవుతాయి. +ఈ ఫీడ్‌బ్యాక్‌ కోసం పిలుపుతో, మూవ్‌మెంట్‌ వ్యూహం మరియు పాలనా బృందం భిన్నమైన దృక్పథాన్ని తీసుకుంటున్నాయి. 2021 నుంచి వచ్చిన కమ్యూనిటీ ఫీడ్‌బ్యాక్‌ను ఈ దృక్పథం తనలో అంతర్భాగం చేసుకుంటుంది. ప్రతిపాదనలతో ముందుకు సాగడానికి బదులు, బోర్డు ట్రస్టీల నుంచి కీలక ప్రశ్నల చు��్టు పిలుపు రూపొందించబడింది.2021 బోర్డు ట్రస్టీల ఎన్నికల గురించి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ నుంచి కీలక ప్రశ్నలు వచ్చాయి. ఈ కీలక ప్రశ్నల గురించి సమష్టి సంభాషణ మరియు సహకార ప్రతిపాదన అభివృద్ధిని ప్రేరేపించడమే దీని ఉద్దేశ్యం. +మూమెంట్ చార్టర్ అభిప్రాయాల సేకరణ సమావేశం +మనందరికీ తెలిసినట్టు వికీమీడియా అనేది స్వేచ్ఛ విజ్ఞానాన్ని అభిరుద్ది పరిచే ఒక అంతర్జాతీయ ఉద్యమం, అయితే మన ఈ ఉద్యమం ముందుగు సాగుతున్న కొద్దీ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యే వారి పాత్రలు భాద్యతలు ఇతరాత్ర మరింత మెరుగ్గా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని గ్రహిస్తూ 2021 నవంబరు నెలలో వికీమీడియా మూమెంట్ చార్టర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. +ఈ మూమెంట్ చార్టర్ ద్వారా ఉద్యమ భాగస్వాముల భాద్యతలు, పాత్రలు రూపొందిస్తు, గ్లోబల్ కౌన్సిల్ ఒకటి స్థాపించుకోనున్నాము. మూమెంట్ చార్టర్ అనేది మూమెంట్ స్ట్రాటెజిలో ఒక ముఖ్య భాగం, ఈ మూమెంట్ స్ట్రాటజీ అనేది 2030 కల్లా వికీమీడియా ఉద్యమ రూపు రేఖలు ఎలా ఉండాలో వ్యూహ రచన చేయనుంది. +ఇక మన సమావేశం విషయానికి వస్తే మూమెంట్ చార్టర్ వారు రాసిన క్రింది అంశాలపై సముదాయంలో మనం చర్చించుకుందాం: +మూమెంట్ చార్టర్ అభిప్రాయాల సేకరణ సమావేశం +అలాగే నా చర్చా పేజీ ద్వారా కూడా మీ అభిప్రాయాలు తెలపవచ్చును. +ఈ చర్చలు జరపటానికి చాలా తక్కువ సమయం అందుబాటులో ఉంది, కావున తెలుగు వికీమీడియన్లందరు వీలైనంత త్వరగా (డిసెంబరు 15 లోగా) స్పందించగలరని మనవి. +తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఏర్పాటుపై చర్చ +తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రకరకాల కార్యకలాపాలు చేపట్టేందుకు, పనిచేసేందుకు తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఏర్పాటుచేయాలని తెలుగు వికీపీడియాలో గతం నుంచే చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ చర్చలు తుది దశకు వచ్చి తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఏర్పాటుచేసే దశకు వచ్చాయి. కనుక, ఈ చర్చలను గమనించి, పాల్గొని, మీమీ అభిప్రాయాలు, పనిచేసేందుకు ఆసక్తి ఉంటే ఆ వివరాలూ కూడా తెలియజేస్తారని ఆశిస్తూ సంబంధిత లంకెలు ఇక్కడ ఇస్తున్నాను. + + +కంప్యూటర్ ఉపకరణాల తెరలు వాడుకరులకు, ఆయా ఉపకరణాలకు మధ్య వారధులు. వాడుకరులు తమకు కావలసిన సమాచారాన్ని కోరడం, లేదా కంప్యూటరుకి ఆదేశం ఇవ్వడం అందుకు జవాబుగా కంప్యూటరు ప్రతిస్పం���ించడం, తిరిగి వాడుకరి స్పందించడం, ఇలా ఇది ఒక సంభాషణ. ఈ సంభాషణ వాడుకరికి సౌకర్యంగా, తేలికగా ఉండాలి. ఈ సంభాషణలో వాడుకరిని సంబోధించేప్పుడు భాష మర్యాదగా, గౌరవంగా ఉండాలి. కంప్యూటరుకి ఇచ్చే ఆదేశాలు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉండాలి. +కంప్యూటరు వాడుకరిని సంబోధించేటప్పుడు గౌరవవాచకం వాడాలి. ఉదాహరణకు, వాడుకరిని మీరు, అండి అని సంబోధించాలి. +* సమాచారం ఇవ్వడం మీకు రెండు సందేశాలు వచ్చాయి +* వాడుకరికి ఉన్న వికల్పాలను సూచించడం (ఇవి ఐచ్చికం నివేదికను చూడండి +* వాడుకరి ఉద్దేశాన్ని నిర్ధారించుకోవడం మీరు నిజంగానే ఈ ఫైలును తొలగించాలని అనుకుంటున్నారా +కంప్యూటరును ఉద్దేశించిన ఆజ్ఞలు, ఆదేశాలలో గౌరవవాచకం ఉండకూడదు. అనవసరం. గౌరవవాచకం ఉంటే, కొన్ని సందర్భాలలో వాడుకరి తనని ఉద్దేశించినట్టు పొరపడే అవకాశం ఉంది. +నన్ను ఈ విషయమై మరెప్పుడూ అడగకు'' +ఇవి కంప్యూటరుకు వాడుకరి ఇస్తున్న ఆదేశాలుగా భావించాలి. + + +* A, a 1) ఇంగ్లీషు వర్ణమాలలో మొదటి అక్షరం 2) పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి వచ్చే గురుతు; గ్రేడ్; +* aardvark, n. పిపీలికారి; పిపీలికాహారి; నాకువునాకు; చీమలయొక్క శత్రువు; చీమలని తినే ఒక జంతువు; +* abacus, n. పూసలపాటీ; పూసల పలక; గణక ఫలకం; +* abandon, v. t. వదలు, వదలిపెట్టు, మానుకొను; పరిత్యజించు; పరిహరించు; విసర్జించు; +* abandonment, n. వదలిపెట్టడం; మానుకొనడం; పరిత్యజించడం; పరిహరించడం; విసర్జించడం; +* abate, v. i. తగ్గు; తగ్గుముఖం పట్టు; ఉపశమించు; ఆగు; నిలచిపోవు; నివర్తించు; +* abate, v. t. తగ్గించు, దుర్భలపరచు; ఉపశమింపచేయు, రద్దు చేయు, తీసివేయు; +* abatement, n. తగ్గింపు, తగ్గుముఖం పట్టించడం; ఆపడం; అదుపులో పెట్టడం; +* abbreviate, v. t. కుదించు; క్లుప్తపరచు; సంక్షిప్తపరచు; సంక్షేపించు; +* abbreviation, n. కుదింపు; సంక్షిప్తం, క్లుప్తం; పుటాక్షరం; +* abdicate, v. t 1) ఉన్నతాసనాన్ని వదలి పెట్టు 2) బాధ్యతని తీసుకొనకుండా ఉండు; +* abdominal, adj. ఉదర; గర్భ; పొత్తికడుపుకి సంబంధించిన; +* abduct, v. t. అపహరించు; ఎత్తుకొనిపోవు; గొంపోవు; లేవదీసుకొని పోవు; బలవంతముగా కాని చట్టవిరుద్ధంగా కాని తీసుకొనిపోవు; +* abduction, n అపహరణ; బలవంతముగా తీసుకొని పోవడం; గ్రహణం; +* aberration, n. అసాధారణ సంఘటన; సామాన్యం కానిది; మార్గం తప్పినది; +* abet, v. t. మద్దతు నిచ్చు; ప్రోత్సహించు; ప్రేరేపించు; అపరాధం చెయ్యడానికి చెయ్యి కలుపు; +* abeyance, n. నిలుపుదల, ఆపుదల; అనిర్ణీత స్థితిలో ఉంచడం; +* ability, n. అర్హత, దక్షత, సామర్థ్యం, ���మర్థత, శక్తి, పటిమ, చాలిక; నలువు; ఆభూతి; ప్రౌఢి; +* abiogenic, adj. అజీవజన్య; జీవి ప్రమేయం లేకుండా పుట్టినది; +* abject, adj. నీచ; హీన; పరమ; నికృష్ట; తుచ్ఛ; దుర్భర; దుస్సహ; +abject poverty, ph. పరమ దరిద్రం; నిప్పచ్చరం; నిరుపేదతనం; కటిక దారిద్ర్యం; +* abkari, adj. మద్యపానీయాలకి సంబంధించిన; సారా, కల్లు, వగైరా అమ్మకాలకి సంబంధించిన; +* able, adj. సమర్ధత గల; సామర్థ్యం గల; +* ablution, n. ప్రక్షాళనం; హస్త ప్రక్షాళనం; పాద ప్రక్షాళనం; పూజ చేసే ముందు చేతులనీ కాళ్ళనీ కడుక్కోవడం; +* abnormal, adj. అసాధారణ; అస్వభావికమైన; విపరీత; +* abode, n. నిలయం; నెలవు; నెలకువ; ఆలయం; నివాసం; నికేతనం, ధామం; ఇల్లు; కాణాచి; ఆటపట్టు; +* abominable, adj. ఏహ్య; అసహ్యమయిన; వెగటు పుట్టించే; +* abortion, n. గర్భవిచ్ఛిత్తి; గర్భోత్పాటనం, కట్టుక, వైద్యుడి సహాయంతో, శస్త్రం వల్ల కాని, మందుల వల్ల కాని, కడుపులో ఉన్న పిండాన్ని చంపి బయటకి తియ్యడం; సహజం కాని గర్భస్రావం rel miscarriage; +* about, adj. సుమారు; రమారమి; చుట్టుపట్ల; ప్రాంతంలో; ఉరమరగా; +* above board, ph. దాపరికం లేకుండా; మర్మం లేకుండా; +* abrasion, n 1) ఒరిపిడి, రాపిడి 2) గీకుకొని పోవుట; +* abridge, v. t. సంక్షిప్తపరచు; క్లుప్తపరచు, క్రోడీకరించు, కుదించు; +* abrogation, n. రద్దు; కొట్టివేత; రద్దు చెయ్యడం; నిరాకరించడం; +* abruptly, adv. తటాలున; అకస్మాత్తుగా; హఠాత్తుగా; +* abscess, n. వ్రణం; చీముపట్టిన కురుపు; చీముగడ్డ; సెగ్గెడ్డ; విద్రధి; తిష్ట ప్రక్రియ ద్వారా శరీరపు కణజాలంలో చీము చేరుకొని వాచిన స్థితి; +* abscissa, n. x-అక్షం; x-నిరూపకం; మట్టపు నిరూపకము; అడ్డు నిరూపకం; గ్రాఫులో క్షితిజానికి సమాంతరంగా గీసిన గీత; గ్రాఫులో ఎడమ నుండి కుడికి గీసిన గీత; +* abscond, v. i. పారిపోవు; పరారీ అగు; కంటికి కనిపించకుండా పోవు; +* absence, n. నాగా; లేకపోవడం; రాక పోవడం; గైరుహాజరీ; +* absent-mindedness, n. పరాకు; పరధ్యానం; తత్పరత; వితాకు; ఏమరిక; ఏమరుపాటు; ఏమరపు; +* absolute, adj. కేవల; పరమ; నిస్తర; నిరపేక్ష; పూర్ణ; సంపూర్ణ; శుద్ధ; అసంబంధిక; నిరంకుశ ant relative; +absolute value, ph math నిరపేక్ష విలువ; ధన, ఋణ సంజ్ఞావాచకాలతో నిమిత్తం లేకుండా ఉన్న విలువ; +* absolve, v. t. తప్పించు; తప్పు లేదని ఒప్పుకొను; +* absorbent, n. అవచూషకం; పీల్చుకొనే పదార్థం; +* absorption, n 1) పీల్పు; శోషణం; అవశోషణం; అవచూషణం (2) విలీనం, లీనం అవడం; సమాధి; +absorption bands, ph phy శోషణ చారికలు; శోషణ పట్టీలు; వర్ణమాలలలో కనిపించే నల్లని గీతలు; +absorption spectrum, ph phy శోషణ వర్ణపటం; విచూషిత వర్ణమాల; ఈ వర్ణపటంలో గీతలు నల్లగా కనిపిస్తాయి; +* abstain, v. i. మానుకొను; తటస్థంగా ఉండు; ఓటు వెయ్యవలసి వచ్చినపుడు ఎటూ మొగ్గకుండా తటస్థంగా ఉండు rel for; against; +* abstinence, n. మానుకొనడం; ఉపవాసం; బ్రహ్మచర్యం; +abstract art, ph. నైరూప్య చిత్రం; నైరూప్య చిత్రకళ; +* abstract, n. సంగ్రహం; ముఖ్యాంశం, సారాంశం; ఉటంకం; +* abstraction, n. సంగ్రహణం, పరిగ్రహణం, భావ సేకరణం; +* absurd, adj. హేతువిరుద్ధమైన, పొసగని; అసంభావ్య, అసంబద్ధ, అనూహ్య; అర్థం లేని, నిరర్థక; +* abundance, n. బాహుళ్యం, సమృద్ధి, విస్తారం; కావలసినంత; మెండుతనం; పెల్లు; +* abundantly, adv. మస్తుగా; పుష్కలంగా, బహుళంగా, సమృద్ధిగా, మెండుగా, విస్తారంగా; అవారిగా; పెల్లుబికి; +* abuse, v. t 1) తిట్టు; చివాట్లు పెట్టు 2) దూషించు, దండించు; కొట్టు 3) పాడుచేయు; దుర్వినియోగం చేయు rel misuse; +* abuse, n 1) దూషణ 2) చేజిక్కిన అవకాశాన్ని పాడుచేసుకోవడం; +* abut, v. t. అండగా ఉండు; ఆనుకొని ఉండు; దన్నుగా ఉండు; +* abutment, n. అండగోడ; దన్నుగోడ; ముట్టుగోడ; +* abyss, n. అగాధం, అగాధ మండలం; పాతాళం; +* abysmal, adj 1) లోతు తెలియని; అగాధమైన 2) నికృష్టమైన; చాల చెడ్డదైన; +* acacia, n 1 తుమ్మ చెట్టు 2 కసింద చెట్టు; +* acacia arabica, n నల్ల తుమ్మ చెట్టు; బాబుల్ చెట్టు; దీని నుండి స్రవించే బంక నుండి అరబినోజు, రైబోజు అనే రెండు రకాల చక్కెరలు విడదీసేరు. DNA, RNA అన్న పేర్లకి మూలం ఇక్కడే! +* academic, adj 1) విద్వత్ సంబంధమైన; విద్యావిషయిక; పాఠశాలలకి సంబంధించిన 2) ప్రయోజనశీలి కాని; అక్కరకురాని విద్య అయిన; +academic year, ph. విద్వత్ సంవత్సరం; బోధనకై పాఠశాలలు తెరచి ఉండే కాలం; సాధారణంగా ఏడాదిలో తొమ్మిది నెలలు; +* academic, n. పుస్తకజ్ఞాని; పుస్తక జ్ఞానం తప్ప ప్రపంచ జ్ఞానం లేని వ్యక్తి; +* academician, n. విద్వాన్, విద్వాంసుడు, పండితుడు; +* academy, n. పరిషత్తు, పండిత సభ, విద్వత్ సభ; విద్యాసంస్థ; +* accelerate, v. t. తొక్కు; పెంచు; వేగాన్ని పెంచు; వేగవంతం చేయు; తొందరపెట్టు; త్వరితపరచు; +* acceleration, n త్వరణం తొరణం; సత్వరం; వేగాధిక్యత; వర్ధమానం; సంవేగం; +* accelerator, n. త్వరణిక; తొరణి; త్వరకారిణి; వేగవర్ధని; +particle accelerator, ph. రేణు తొరణి; పరమాణువుల స్వభావాన్ని పరిశోధించడానికి వాడే ఒక పరికరం; +* accent, n 1) యాస; ఫణితి 2) ఉదాత్తం; ఊనిక; ఒత్తి పలకడం; +* accept, v. i 1) అంగీకరించు; సమ్మతించు; ఒప్పుకొను 2) తీసుకొను; పుచ్చుకొను; గ్రహించు; స్వీకరించు; +* acceptable, n. అంగీకారానికి అనుకూలమైన; అంగీకారయోగ్యమైన; సమ్మతించదగిన; ఆమోదయోగ్యమైన; పరవాలేని; +* acceptance, n 1) అంగీకారం; సమ్మతి; ఆమోదం 2) స్వీకారం; స్వీకార సూచన; పుచ్చుకొనుట; కైకోలు; +* acceptor, n. గ్రహీత; ప్రతిగ్రహీత; స్వీకర్త; పుచ్చుకొనేది; +* access, n. ప్రవేశం; గమ్యత; అభిగమం; ఉపగమం; అందుబాటు; చనువు; చొరవ; +random access, ph comp ���నిర్ధిష్ట ప్రవేశం; యాదృచ్ఛిక ప్రవేశం; +access control method, ph. ప్రవేశ నియంత్రణ రీతి; ప్రవేశ నియంత్రణ పద్ధతి; +access privileges, ph. ప్రవేశ విశేషాధికారాలు; అభిగమన విశేషాధికారాలు; +access rights, ph. ప్రవేశ అధికారాలు; అభిగమన అధికారాలు; +* accessible, adj. అందుబాటుగా ఉన్న; సుగమ; అభిగమ్య; సులభ; ప్రవేశయోగ్య; +* accession, n 1) అధిరోహణ; ఆరోహణ; సింహాసనాధిరోహణ 2) కలుపుకొనుట; +* accident, n. ప్రమాదం; ఆపద; విపత్తు; గండం; వికారం; అనుకోకుండా జరిగిన కీడు; +* accidental, adj. యాదృచ్ఛిక; ఆగంతుక; అచింత్య; అనుకోకుండా జరిగిన; ప్రమాదవశాత్తూ జరిగిన; +* accidental, n. యాదృచ్ఛికం; అనుకోకుండా జరిగినది; కాకతాళీయం; +* accidentally, adv. అచింత్యంగా; ప్రమాదవశాత్తు; కాకతాళీయంగా; ఆదాటుగా; +* acclaim, v. t. మెచ్చుకొను; పొగుడు; శ్లాఘించు; హర్షించు; +* acclamation, n. హర్షణ; హర్షధ్వానం; కరతాళధ్వని; జయనినాదం; పొగడ్త; ప్రకటన; +* acclimatize, v. i. కొత్త వాతావరణానికి అలవాటు పడు; తట్టుకొను; +* acclimatize, v. t. కొత్త వాతావరణానికి అలవాటు చేయు; +* accomplice, n. తోడి దొంగ; అపరాధం చెయ్యడంలో సహకరించిన వ్యక్తి; సాపరాధి; +* accomplishment, n. సిద్ధి; కార్యసిద్ధి; సాధన; సాధించినది; +* accord, n. అంగీకారం; సమ్మతి; ఒప్పందం; +according to, ph. అనుసారంగా; ప్రకారంగా; అనుగుణంగా; +according to rule, ph. యథావిధిగా; యథాప్రకారంగా; నియమానుసారంగా; +* accordion, n. ఎకార్డియన్; హార్మనీని పోలిన ఒక పాశ్చాత్య వాద్య విశేషం; +* account, n 1) ఖాతా; జమాఖర్చు 2) లెక్క; పద్దు; హిస్సేబు 3) వివరణం; కథనం; ఉదంతం; +* accountant, n. లెక్కగాడు; గణకుడు; గణకి; ముసద్దీ; కరణం; కాయస్థుడు; +* accumulate, v. i. పోగుపడు; పోగవు; పుంజీభవించు; పేరుకొను; +* accurate, adj. కచ్చితమైన; సరియైన; నిర్ధిష్టమైన; +* accursed, n. m. శాపగ్రస్తుడు; f. శాపగ్రస్తురాలు; +* accusation, n. నింద; కొండెము; చాడీ; నేరారోపణ; అభియోగం; ఆక్షారణం; +* accuse, v. t. నిందించు; నేరారోపణ చేయు; చాడీ చెప్పు; అభియోగించు; +* accused, n. నిందితుడు; ముద్దాయి; నేరము మోపబడిన వ్యక్తి; ఆక్షారితుడు; +* accuser, n. అభియోగి; అభియోక్త; కొండెకాడు; ఫిర్యాదీ; నేరం మోపిన వ్యక్తి; +* acetic, adj chem అసిత; సౌరిక; సామ్ల; ఆమ్ల సంబంధమైన; పుల్లని; +* acetylene, n. ఎసిటిలీన్; ఒక ఉదకర్బన వాయువు; దీనిని ఆమ్లజనితో కలిపి మండిస్తే ఆ మంట వేడితో ఉక్కుని కూడా కొయ్యవచ్చు; +* achromatic, adj. వివర్ణమైన; రంగులేని; అవర్ణ; వర్ణరహిత; +achromatic lens, ph phy వివర్ణ కటకం; రంగులు విడిపోయి, చెదిరిపోకుండా, అన్ని రంగులూ ఒకే నాభి వద్దకి చేరేటట్లు నిర్మించిన కటకం; +* achromia, n. బొల్లి; శరీరానికి రంగు పోయి, తెల్లని మచ్చలు కనిపించడం; same as vitiligo; +* acid, adj. ఆమ్ల; పుల్లని; కాడి; కటుక; ద్రావక; +acid end, ph biol ఆమ్ల శీర్షం; ఎమీనో ఏసిడ్ యొక్క ఒక కొస; +strong acid, ph. త్రాణికామ్లం; ప్రబలామ్లం; గాఢామ్లం; సాంద్రామ్లం; +weak acid, ph. నిస్త్రాణికామ్లం; దుర్బలామ్లం; +* acidic, adj. సామ్ల; ఆమ్ల సంబంధమైన; కటుక; చురుకుమనే; +* acidity, n 1) ఆమ్లత్వం; ఆమ్లత; పులుపు 2) ఆమ్లపిత్తం; పులిత్రేనుపులు; +* acidulant, n. ఆమ్లకం; మనం తినే ఆహారంలో సహజంగా ఉండే పులుపు కంటె ఎక్కువ కావాలనుకున్నప్పుడు అదనంగా కలిపే ఆమ్ల పదార్థం; సాధారణంగా వాడుకలో ఉన్న ఆమ్లకాలు: టార్టారిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, వగైరాలు; +* acknowledgment, n 1) ఎకరారు 2) కృతజ్ఞతా నివేదనం 3) ముట్టిన రసీదు; అందిన నిర్ధారణ; చెల్లు చీటి; +* acme, n. పరాకాష్ఠ; శిఖరం; ఉత్కృష్ట దశ; +* acne, n. pl. మొటిమలు; పోతపొక్కులు; చర్మములోని కొవ్వు గ్రంథులు చీము పట్టి వాచగా వచ్చే పొక్కులు rel మెటికలు; పేతపొక్కులు; +* acorn, n. సింధూర వృక్షపు కాయ; ఓక్ చెట్టు కాయ చూ. బొమ్మ) +* acoustics, n. ధ్వనిశాస్త్రం; శబ్దశాస్త్రం; నిక్వణశాస్త్రం; నిక్వాణశాస్త్రం; +* acquaintance, n 1) పరిచయం; ముఖపరిచయం; ఎరుక; తెలివిడి; ప్రవేశం; నెళవు 2) m. పరిచయస్తుడు; f. పరిచయస్తురాలు; +* acquiesce, v. i ఎక్వియస్) సమాధానపడు; అయిష్టంగా ఇష్టపడు; అర్ధాంగీకారంగా సమ్మతించు; +* acquiescence, n. సమ్మతి; ఒప్పుదల; అర్ధాంగీకార సమ్మతి; +* acquire, v. i. పొందు; సంపాదించు; ఆర్జించు; సంగ్రహించు; సంతరించుకొను; +* acquisition, n. సంపాదన; ఆర్జన; ప్రాప్తి; సంగ్రహం; +acre feet, ph. ఎకరపుటడుగు; ఒక ఎకరం వైశాల్యం మీద ఒక అడుగు ఎత్తు ఉంటే వచ్చే ఘనపరిమాణం; +* acrimonious, adj. చురుక్కుమనే; ఘాటైన; తీవ్రమైన; కటువైన; +acrimonious debate, ph. ఘాటైన వాగ్వివాదం; తీవ్రమైన వాగ్వివాదం; +* acrimony, n. చురుక్కుమనిపించే తత్వం; ఖదిరత్వం; +* acronym, n. పొడిపేరు; ప్రథమాక్షర నామం; ప్రనామం; పొడి అక్షరాల పేరు; +* acropolis, n. గర్భగృహం; గ్రీకు శిథిలాల కేంద్రంలో ఉండే ముఖ్యమైన కట్టడం rel citadel; bulwark; +* acrostic, n. చిత్రబంధ కవిత్వం; బంధ కవిత్వం; ప్రతి పదం యొక్క మొదటి అక్షరంతో అర్ధవంతమైన మాట వచ్చేటట్లు పద్యం రాయడం; +* act, n 1) అంకం; నాటకంలో ఒక భాగం 2) శాసనం; చట్టం 3) పని; చర్య; చేష్ట; క్రియ; ఫలానాది అని చెప్పదగ్గ పని 4) వేషం; +* act, v. t. నటించు; ప్రవర్తించు; +* acting, adj. కార్యవాహక; తాత్కాలిక; స్థానీయ; +acting editor, ph. కార్యవాహక సంపాదకుడు; సంపాదకునికి బదులు పనిచేసే వ్యక్తి; +method acting, ph నటీనటులు ఓ పాత్రని సమర్ధవంతంగా పోషించాలంటే ఆ పాత్ర గుణగణాలని, అనుభూతులని ఊహిస్తే సరిపోదు. వాటిని స్వయంగా అనుభవించాలి అందువల్ల మెథడ్ యాక్టింగ్ ప్రక్రియలో నటి/నటుడు తను పోషించబోయే పాత్రని పూర్తిగా అర్ధం చేసుకోటానికి విపరీతమైన పరిశోధన, పరిశ్రమ చేస్తారు. వాళ్ల సన్నాహం ఔరా అనిపించే స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకి, ఓ పిచ్చివాడి పాత్ర పోషించాలంటే సదరు నటుడు మానసికరోగిలా పిచ్చాసుపత్రిలో చేరి ఏ నెలరోజులో గడపటం, టాక్సీ డ్రైవర్ పాత్ర పోషించాలంటే కొన్నాళ్లు స్వయంగా ఆ ఉద్యోగం చేసి ఆ జీవితాన్ని అనుభవించటం (ఇది ప్రసిద్ధ 'టాక్సీ డ్రైవర్' సినిమా కోసం రాబర్ట్ డినీరో చేసిన పని ఇలాంటివన్న మాట. చాలామంది మెథడ్ యాక్టర్లు కెమెరా ముందున్న కాసేపే కాకుండా ఆ పాత్ర పోషిస్తున్నన్ని రోజులూ నిజజీవితంలో కూడా ఆయా పాత్రల్లానే ప్రవర్తించటం సాధారణమైన విషయం; +action items, ph. విహిత కర్మలు; విధింపబడిన పనులు; చెయ్యవలసిన పనులు; +action at a distance, ph. సుదూర చర్య; అసమక్ష క్రియ; నిస్పర్శ్య కర్మ; నిస్పర్శ్య క్రియ; ఒక శక్తి ఒక వస్తువుని తాకకుండా ఆ వస్తువుమీద ప్రభావం చూపగలగడం. భూమ్యాకర్షణ శక్తి ఇటువంటి నిస్పర్శ్య క్రియకి ఒక ఉదాహరణ; +* activate, v. t. ఉత్తేజపరచు; విన్యసించు; సంక్రియపరచు; +activated charcoal, ph. ఉత్తేజిత అంగారం; ఉత్తేజించబడ్డ బొగ్గు; +activation energy, ph. ఉత్తేజన శక్తి; రసాయన శాస్త్రంలో ఒక రసాయన ప్రక్రియ ఊపు అందుకోడానికి కావలసిన కనిష్ఠ పరిమాణపు శక్తి; +* active, adj 1) చైతన్యవంతమైన; చురుకయిన; చలాకి అయిన; ఉత్తేజిత; ఉజ్వలమయిన; ఉత్సాహపూరిత; సోత్సాహ; నిరంతరం పాటుపడే 2) కర్తరి; +active voice, ph gram కర్ర్తర్ధకం, కర్ర్తర్యర్థకం; కర్తరి ప్రయోగం; కర్తరి; +* activism, n. సత్యాగ్రహం; సత్యాగ్రహవాదం; ఒక సామాకిక వ్యవస్థలో మార్పుని తీసుకురావడానికి బహిరంగ, సామూహిక ప్రయత్నాలు చెయ్యడం; +* activist, n. సత్యాగ్రహి; ఒక వ్యవస్థలో మార్పుని తీసుకురావడానికి సామూహిక ప్రయత్నాలు చేసే వ్యక్తి; ఉ. మహాత్మా గాంధి; మేధా పడ్కర్; +* activities, n. pl. కార్యకలాపాలు; క్రియాకలాపాలు; +* activity, n 1) చైతన్యత; చురుకుతనం; చలాకితనం; చర్యాశీలత; క్రియాశీలత; క్రియాపరత; రజస్సు 2) పని; పాటు; క్రియ; కార్యకలాపం; చేష్టితం; క్రియాకలాపం; +* actor, n. f. నటి; నటీమణి; అభినేత్రి; పాత్రధారిణి; +character actor, ph. గుణచిత్ర నటుడు; గుణచిత్ర నటి; ప్రధాన పాత్రలు కాకుండా ఇతర ముఖ్య పాత్రలు ధరించే నటుడు; +* actors, n. pl. నటీనటులు; నటీనటవర్గం; పాత్రధారులు; +* actress, n. f. నటి; అభినేత్రి; పాత్రధారిణి; +* actual, adj. వాస్తవమైన; యదార్థమైన; నిజమైన; +* actually, adv. వాస్తవంగా; యదార్థంగా; నిజంగా; +* actuator, n. ఒక వస్తువుని ��దిపే సాధకం; +* acumen, n. ఆలోచనలో చురుకుతనం; బుద్ధి సూక్ష్మత; బుద్ధి తీక్షత; +* acupuncture, n. చైనా దేశంలో పుట్టిన, సూదులతో పొడిచి చేసే ఒక రకం వైద్య విద్య; +acute condition, ph. ఉదాత్త పరిస్థితి; తీక్షణ పరిస్థితి; +* adamant, adj. వజ్ర; హీర; కఠోర; దృఢ; మొండి పట్టు గల; తన అభిప్రాయాన్ని మార్చుకోడానికి ఇష్టపడని; +* Adam's apple, n. కంఠమణి; కుత్తిక్కాయ; గొంతుక పోక; మనం మాట్లాడేటప్పుడు, మింగేటప్పుడు గొంతుకలో పైకి కిందకి కదలుతూన్నట్టు కనిపించేది; ఇది మగవారిలో ఎక్కువ స్పుటంగా కనిపిస్తుంది; +* adapt, v. i. అవలంబించు; సమయానుకూలంగా ప్రవర్తించు; ఇముడు; +* adapt, v. t. ఇముడ్చు; సమయానుకూలంగా మార్చు; +* adapter, n. సంయోక్త; సంయోజకం; వివిధ లక్షణాలున్న పరికరాలని తగిలించడానికి వాడే సంధి పరికరం; +* add, v. t. కూడు; కలుపు; చేర్చు; సంకలించు; +* addendum, n. అనుబంధం; పరిశిష్టం; తరువాత చేర్చబడినది; +* adder, n 1 comp సంకలని; కూడిక చేసే సాధనం 2 కట్లపాము +* addict, n. వ్యసని, వ్యసనదాసుడు; మందుభాయి; హాని చేసే అలవాటుకి బానిస అయిన వ్యక్తి; +in addition, ph. మీదు మిక్కిలి; పైపెచ్చు; ఇంకా; దీనికి తోడు; +* addition, v. t. కూడుట; కలుపుట; చేర్చుట; సంకలించుట; +additive property, ph. సంకలిత లక్షణం; సంకలిత స్వభావం; సంకలిత ధ్రర్మం; +* additive, n. సంకలితం; కలపబడ్డ వస్తువు; నిల్వ చెయ్య డానికో, పోషకశక్తి పెంచడానికో, తదితర కారణాలకో ఆహారంలో కలిపే పదార్థం; +food additive, ph. ఆహార సంకలితం; ఆహారంలో ఉద్దేశపూర్వకంగా కలపబడ్డది; +* address, n 1) విలాసం; చిరునామా; వక్కణ 2) సంబోధన; పిలుపు 3) ఉపన్యాసం; ప్రసంగం; +* addressee, n. చిరునామాదారు; సంబోధితుడు; +* address, v. t 1) సంబోధించు 2) ప్రసంగించు 3) పిలుచు 4) పట్టించుకొను; +* adequate, adj 1) చాలినంత; సరిపడినంత; తగినంత; తగుమాత్రం 2) బాగానే ఉన్న; +* adhere, v. i. ఆశ్రయించి ఉండు; అంటుకొని ఉండు; అనుసరించు; అవలంబించు; +* adhesive, n. బంక; జిగురు; జింక; అంటింత; అంటించడానికి పనికొచ్చేది; +* ad hoc, adj. తదర్థ; పెట్టు; ఒక పని కోసం నియమించబడ్డ; +ad hoc auspicious time, ph. పెట్టు ముహూర్తం; అనగా, పంచాంగంలో ఉన్న నిర్ధిష్ట ముహూర్తం కానిది; +ad hoc committee, ph. తదర్థ కమిటీ; ఒక పని కోసం నియమించబడ్డ కమిటీ; +* adiabatic, adj phy స్థిరోష్ణక; అతాపక; ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రత మారకుండా దాని ఘనపరిమాణం కాని పీడనం కాని మార్చగల; +* ad infinitum, n. నిరవధికం; పదే పదే జరిగేది; అంతులేకుండా జరిగేది; +* adipose, n. కొవ్వు; ఘనీభవించిన చమురు; +* adjacent, adj. పక్కన ఉన్న; పక్క; ఆసన్న; సమీప; సన్నిహిత; సాన్నిధ్య; సంలగ్న; +* adjective, n. విశేషణం; నామవాచకం యొక్క లక్షణాన్ని విశదీకరించేది; +* adjournment, n 1) వాయిదా వెయ్యడం 2) సమావేశాన్ని ముగించడం; +* adjure, v. t. ప్రమాణం చేయించు; ఒట్టుపెట్టించు; +* adjust, v. i. ఇముడు; సరిపెట్టుకొను; సర్దుకొను; +* adjust, v. t. సర్దు; సర్దుబాటుచేయు; సరిపుచ్చు; పరిష్కరించు; సవరించు; సరిదిద్దు; సరిచేయు; +* adjustment, n. సర్దుబాటు; సవరణ; సరిదిద్దిక; పరిష్కారం; +* adjuvant, n 1) సహాయక ఔషధం; ఒక ఔషధం తరువాత వాడే ఔషధం;(2) అనుపానం; ఒక ఔషధంతో పాటు తాగే ద్రవం; +* ad lib, adv. ఆశువుగా చెప్పేది; ముందుగా తయారవకుండా అప్పటికప్పుడు కల్పించి చేసిన (నటన; ప్రసంగం; కవిత్వం); +* administer, v. t 1) పాలించు; పరిపాలించు; నడుపు; జరిపించు; సంబాళించు 2) వాడు; ఉపయోగించు 3) మందుని ఇచ్చు; +* administrator, n. m. పాలకుడు; పరిపాలకుడు; వ్యవస్థాపకుడు; f. పాలకి; పరిపాలకి; +* admirable, adj. మెచ్చదగ్గ; హర్షింపదగ్గ; శ్లాఘనీయ; +* admire, v. t. మెచ్చుకొను; హర్షించు; శ్లాఘించు; +* admission, n 1) ప్రవేశం 2) ఒప్పుకోలు; ఒప్పుకోవడం; గ్రహణం; +* admit, v. i. ఒప్పుకొను; అంగీకరించు; +* admit, v. t 1) ప్రవేశపెట్టు; రానిచ్చు 2) దఖలు చేయు; +* admittance, n. ప్రవేశించడానికి అనుమతి; +no admittance, ph. ప్రవేశించడానికి అనుమతి లేదు; +* admonish, v. t. మందలించు; అదమాయించు; హెచ్చరించు; +* admonition, n. మందలింపు; అదమాయింపు; హెచ్చరిక; గద్దింపు; +* ado, n ఎడూ) ఆర్భాటం; హడావిడి; గాభరా; కంగారు; గందరగోళం; గొడవ; +* adobe, n ఎడోబీ 1) పచ్చి ఇటిక; ఎండిన ఇటిక 2) మట్టిని, గడ్డిని కలిపి కట్టిన గోడల ఇల్లు; +* adolescence, n. కౌమారం; అపరిపక్వత; కిశోరావస్థ; పదమూడు నుండి పదిహేడు సంవత్సరాల వయస్సు; +* adopt, v. i 1) స్వీకరించు; అంగీకరించు; అవలంబించు 2) పెంచుకొను; దత్తత చేసుకొను; దత్తు తీసుకొను; +* adoption, n 1) దత్తత స్వీకారం; పెంపకం 2) అంగీకారం; +* adrift, adj. లంగరులేని; తాడుతెగిన; కొట్టుకొని పోతూ ఉన్న; అసహాయ; +* adult, n. పెద్ద; పెద్ద మనిషి; యుక్త వయస్సు వచ్చిన వ్యక్తి; m. వయోజనుడు; యుక్త వయస్కుడు; తరుణ వయస్కుడు; +* advance, n. బయానా; అగావు; కొనుగోలుకి ముందు ఇచ్చే సొమ్ము; లావణి; సంతకారం; +* advance, v. i. ముందుకి జరుగు; అభివృద్ధి చెందు; +* advance, v. t. జరుపు; ప్రతిపాదించు; అభివృద్ధి చేయు; +* advanced, adj. పెద్ద; ఆధునిక; ఉన్నత; సునిశితోన్నత; +* advancement, n. బాగుపడడం; ముందుకి వెళ్ళడం; ముందజ; ముందడుగు; పురోభివృద్ధి; పురోగతి; పురోగమనం; ప్రగతి; అభ్యున్నతి; +* advantage, n. లాభం; సఫలత; అనుకూలత; సప్రయోజనం; సౌలభ్యం; ఉపయుక్తి; ఇతవు; +advantages and disadvantages, ph. లాభాలు, నష్టాలు; అనుకూలతలు, ప్రతికూలతలు; ఇతవులు, ఇక్కుపాట్లు; +* adventitious, adj 1) సంభవించే; ఆకస్మిక 2) బయటి; ఆగంతుక 3) అబ్బురపు; సహజం కాని; +* adverb, n. క్రియా విశేషణం; క్రియ యొక్క లక్షణాన్ని తెలియజేసేది; +* adversary, n. విరోధి; ఎదిరి; ప్రతిపక్షి; శత్రువు; ప్రతిరోధి; +* adverse, adj. ప్రతికూల; ప్రతికూలమైన; వ్యతిరేక; +* advertise, v. t. ప్రకటించు; సాటించు; ఆఖ్యానించు; వ్యజించు; +* advertisement, n. వ్యాపార ప్రకటన; సాటింపు; అఘోషణిక; ఉపఘోషణం; ఘోషణ ప్రకటన; డబ్బు ఇచ్చి చేసే ప్రకటన; +* advocacy, n. అధివక్తృత్వం; పరార్ధవాదం; అనుకూలవాదం; ఒకరి తరఫున వాదించడం; +* advocate, n. అధివక్త; ఒక పనిని ఒక విధంగా చెయ్యాలంటూ గట్టిగా మద్దత్తు ఇచ్చి మాట్లాడే వ్యక్తి; +* adze, n. బాడిస; తక్షణి; చిరు గొడ్డలిని పోలిన వడ్రపు పనిముట్టు; +* aerial, adj. గాలిలో ఉండే; పైనుండి కనబడే; +aerial roots, ph. ఊడలు; భూమిలో కాకుండా గాలిలోఉండే వేళ్ళు; +* aerobic exercise, ph. శరీరానికి ఆమ్లజనిని విస్తారంగా సరఫరా చెయ్యడానికి అనువైన వ్యాయామం; +* affair, n. వ్యవహారం; తంతు; తతంగం; కలాపం; +love affair, ph. ప్రేమ వ్యవహారం; ప్రేమ కలాపం; సరసోదంతం; రానికి తంతు; +* affect, v. t. మార్పు కలిగేలా చెయ్యడం; +* affection, n. అభిమానం; అనురాగం; అనురక్తి; రాగం; మమకారం; మక్కువ; +* afferent, adj. అంతర్ముఖ; స్పర్శకి సంబంధించిన; శరీరాంగములనుండి మెదడు దిశలో వెళ్లే ant efferent; +afferent nerves, ph phys అంతర్ముఖ నాడులు; స్పర్శ నాడులు; శరీర అవయవాలనుండి వెన్నుపామువైపు వాకేతాలని మోసుకెళ్లే నాడులు; +* affidavit, n. ప్రమాణ పత్రం; హలఫ్ నామా; ప్రమాణపూర్వకముగా న్యాయాధిపతియెదుట వ్రాసి సంతకముచేసియిచ్చినది; +* affiliated, adj. అనుబంధించబడ్డ; అనుబంధ; అనుబద్ధ; +* affinity, n. అనురాగం; స్నేహాకర్షణ; ఆపేక్ష; చెలిమి; మైత్రి; ఆకర్షణ; సంబంధం; +* affirm, v. t. రూఢిపరచు; ధ్రువపరచు; నొక్కివక్కాణించు; ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేయు; +* affix, v. t. అంటించు; తగిలించు; చేర్చు; +* afflictions, n. కడగండ్లు; ఇబ్బందులు; కష్టాలు; పరితాపాలు; +* affluence, n. ఐశ్వర్యం; భాగ్యభోగ్యాలు; సంపద; సిరిసంపద; భాగ్యం; సుభిక్షం; +* affluent, adj 1) సంపన్న; ధనిక; కలిమి గల; ధనస్వామ్య 2) ప్రవాహశీల; ప్రవాహానికి అనుకూలంగా ఉన్న; పుష్కలంగా ఉన్న; +affluent society, ph. ధనికవర్గ సమాజం; సిరిసంపద లతో ఉన్న సమాజం; ధనస్వామ్య సమాజం; +* affricates, n ling స్పర్శములుగా మొదలయి ఊష్మ శబ్దాలుగా అంతం అయేవాటిని సూచించే అక్షరాలు; ఉదా. దంత్య చ, జ లు; +* afterbirth, n. జరాయువు; మావి; ప్రసవం అయిన తర్వాత బయటకు వచ్చే "బిడ్డసంచి placenta; +* afterthought, n. అంతరాలోచన; అనుచింతన; తరువాత పుట్టిన ఆలోచన; +* afterwards, adv. తరువాత; తర్వాత; దరిమిలా; అనంతరం; తదనంతరం; పిదప; పిమ్మట; ఆనక; +* afterword, n. తుదిమాట; పుస్తకం మొదట్లో రాసేది "ముందు మాట" అయితే, చివర రాసేది "తుదిమాట"; +* again, adv. మళ్లా; తిరిగి; మరల; మరిన్నీ; వెండియు; +again and again, ph. మళ్లా మళ్లా; పదే పదే; పలుమార్లు; చీటికీ మాటికీ; +* against, adv. విరుద్ధంగా; ప్రతికూలంగా; ఎదురుగా; +* agar, n. అగార్, అగార్ అగార్; జున్నుగడ్డి; సముద్రపు నాచు నుండి తీసే ఒక రకమైన చక్కెర వంటి పదార్థం; ప్రయోగశాలలో సూక్ష్మజీవులని పెంచడానికి విరివిగా వాడే మాధ్యమం; వంటవస్తువులు పేరుకుని గట్టి పడడానికి విరివిగా వాడతారు; జున్నుపాలు దొరకకపోతే అగార్ ని పాలల్లో కలిపి జున్ను చెయ్యవచ్చు; అర లీటరు పాలు మరిగించి, అందులో 10 గ్రాముల అగార్ కలిపి, రుచికి 10 చెంచాల చక్కెర, సువాసనకి ఏలకపొడి వేసి బాగా కలిపి లోతుగా ఉన్న పళ్లెంలో పోసి గంట సేపు చల్లారనిస్తే గట్టి పడి జున్ను తయారవుతుంది; +* agate, n. గోమేధికం; ఒక విధమైన రత్నం; ఇదే జాతి రాతితో కల్వాలు, పొత్రాలు కూడా చేస్తారు; రసాయనికంగా "సిలికాన్‍ డై ఆక్సైడ్‍" +* agave, n. కిత్తనార; కిత్తలి; మొగలి ఆకారంలో ఉండే ఒక తుప్పకలబందని పోలిన మొక్క; ఈ మొక్క దక్షిణ అమెరికాలో విస్తారంగా పెరుగుతుంది; ఈ మొక్క నుండే టెకీలా అనే మాదక ద్రవ్యాన్ని తయారు చేస్తారు bot Agave tequilana; Agave americana; +* age, n 1) వయస్సు; ప్రాయం; పరువం 2) యుగం; కాలం; తరం; +age old, ph. పురాతనమయిన; బూజు పట్టిన; +old age, ph. ముసలితనం; వార్ధక్యం; ముదిమి; పెద్ద వయస్సు; +* aged, adj 1) వయసెక్కిన; ముసలి 2) నిల్వచేయబడిన; +* agency, n 1) ఏజన్సీ; ప్రాతినిధ్యం 2) మన్యప్రాంతం; +* agenda, n 1) చర్చనీయాంశ క్రమణిక; కార్యక్రమ క్రమం; సభానుక్రమం 2) అంతర్గతమైన కోరిక; మనస్సులో ఉన్న కోరిక; మనోభీష్టం; +* agglutinant, n. బంక; జిగురు; అంటించడానికి ఉపయోగించే పదార్థం; +* agglutination, n. విరగడం; గుచ్ఛకరణం; రక్తంలో ప్రతికాయాలు, ప్రతిజనులు కలసినప్పుడు రక్తం పాలు విరిగినట్లు విరిగిపోవడం; +* agglutinin, n. ఈ ప్రతికాయం రక్తంలో ఉంటే రక్తంలోని ఎర్ర కణాలు పాలు విరిగినట్లు విరిగి ఉండకట్టి పోతాయి; +* agglutinogen, n. రక్తంలో ప్రతికాయాల ఉత్పత్తికి దోహదం చేసే పదార్థం; +* aggrandizement, n. ఆత్మస్తుతి; ఆత్మ ప్రశంస; స్వోత్కర్ష; సొంత బాకా; డబ్బా; +* aggravate, v. t. పరిస్థితిని ప్రకోపింపజేయు; పాడుగా ఉన్న పరిస్థితిని ఇంకా ప్రకోపింపజేయు; +* aggregate, n 1) వెరసి; మొత్తం 2) సముదాయం; సమూహం; సముచ్ఛయం 3) కంకర; చిన్న రాళ్లు; +* aggression, n 1) దూకుడు; దూకుడుతనం 2) ఆక్రమణ; దురాక్రమణ; +* agile, n. చురుకైన, చలాకీ అయిన; కుప్పిగంతులు వేసే; +* agility, n. లాఘవం; లాఘవత్వం; చెంగత్వం; చురుకుతనం; +* agitate, v. t. త్రచ్చు; మథించు; చిలుకు; వేదించు; +* agitation, n. వేదన, ఆవేదన; క్షోభ; ప్రక్షోభము; కలత; కలవరం; ఆందోళన; +* agitator, n 1) ఆధూతి; సంక్షోభిని; గరిటె వంటి తిప్పే సాధనం 2) ఆందోళనకారి; +* agnostic, n. అజ్ఞేయుడు; దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయం ఇదమిత్థంగా తేల్చలేమని నమ్మే మనిషి; see also atheist; +* ago, adj. ఏదైనా విషయం ఎంత కాలం కిందట జరిగిందో తెలియజేయడానికి వాడే మాట; +* agrarian, adj. కార్షిక; వ్యావసాయిక, పాడిపంటలకు సంబంధించిన; పొలాలకి సంబంధించిన; +* agree, v. i 1) సమ్మతించు; ఒప్పుకొను; ఒడంబడు; అంగీకరించు 2) ఏకీభవించు; +* agreement, n 1) సమ్మతి; ఒప్పుదల; ఒప్పందం; ఒడంబడిక; ఒప్పుకోలు; ఒప్పాచారం; అంగీకారం; అంగీకృతి; రాజీ 2) ఏకీభావం 3) కరారునామా; పురోణి పత్రం; +* ague, n ఏగ్యు) ఒక రకం చలిజ్వరం; +* AI, n. కృతక ప్రజ్ఞ; విశ్వామిత్ర వివేకం; +* aide, n. ఉపకారి; సహాయకారి; పెద్ద ఉద్యోగులకి కుడి భుజంగా ఉండి సహాయం చేసే వ్యక్తి; +* aim, n. గమ్యం, ధ్యేయం; గురి; లక్ష్యం; +* aimless, adj. అగమ్య; నిరర్థక; నిష్ప్రయోజన; లక్ష్యరహిత; దిక్కుమాలిన; +* air, n. గాలి; వాయువు; వాతం; పవనం; +* air, v. t 1) ఆరబెట్టు 2) భావాలని వ్యక్తపరచు 3) రేడియో తరంగాలని ప్రసారం చేయు; +* aircraft, n. విమానం; గాలిలో ఎగరగలిగే యంత్రం; +* air-filled, adj. పవన కుంభిత; వాయు కుంభిత; గాలితో నింపిన; +* airline, n. విమానంలో ప్రయాణీకులని వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళే కంపెనీ; +* airliner, n. ప్రయాణీకులని వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళే విమానం; +* airport, n. విమానాశ్రయం; ప్రయాణీకుల విమానాలు ఆగే స్థలం; +* airstrike, n. విమానపుదాడి; విమానాలతో దాడి చేసి బాంబులు పడెయ్యడం; +* airstrip, n. విమానాలు ఎగరడానికి దిగడానికీ చదును చేసిన ప్రదేశం; +* aisle, n. నడవ; నడక; ఇటూ అటూ ఉండే కుర్చీ వరసల మధ్య నడవడానికి ఉండే నడవ; see also verandah; +* AC n. ఏకాంతర విద్యుత్తు; +* al, suff. ఆల్; ఆల్డిహయిడు జాతికి చెందిన రసాయనాల పేరు చివర విధాయకంగా వచ్చే ప్రత్యయం; ఉదా. మెతనాల్, క్లోరాల్; ప్రొపనాల్; +* alabaster, n. చంద్రకాంత శిల; విగ్రహాలు చెక్కడానికి వాడే ఒక రకం జిప్సం రాయి; రసాయనికంగా "కేల్సియం సల్ఫేట్‍ దెబ్బలు తగిలినప్పుడు మూస వేసి కట్టడానికి వాడే "ప్లేస్టర్‍ అఫ్‍ పేరిస్‍" అన్నా ఇదే పదార్థం; +* alarm, n. గడబిడ; హెచ్చరిక; తరతర; ఆమని; ప్రమాదాన్ని సూచించే ధ్వని; మేలుకొలుపు గంట; +alarm clock, ph. గడబిడ గడియారం; ఆమని గడియారం; మేలుకొలుపు గడియారం; తరతర గడియారం; +* alas inter. అయ్యయ్యో; అయ్యో; కటకటా; అక్కటా; రామరామా; శివశివా; హరిహరీ; +* albino, n. వర్ణరహితం, తెల్లని; పట్టుపాప; మెలనిన్ అనే రంగు పదార్థం లోపించడం వల్ల అతి తెల్లగా ఉన్న మనిషి కాని జంతువు కాని; +* albumin, n 1) శ్వే���కం; శ్వేతధాతువు; రక్తంలో ఉండే ఒక ప్రాణ్యం 2) తెల్ల సొన; గుడ్డులో తెల్లని ద్రవ భాగం; +* albuminuria, n. మూత్రములో శ్వేతధాతువు అధికంగా ఉండుట; +* alchemist, n. పరుసవేది; సువర్ణయోగి; పాదరసం నుండి బంగారం చేయగలమనే అపోహ గల వ్యక్తి రసయోగి, ఆ ప్రక్రియ రసవాదం; +* alchemy, n. పరుసవేదం; సువర్ణ యోగం; హేమతారక విద్య; ఇనుము వంటి క్షుద్ర ధాతువుల నుండి ’పరుసవేది’ సహాయంతో బంగారం వంటి మేలి ధాతువులని చేయగలమనే అపోహతో కూడిన కుశాస్త్రం; +* alcohol, n. మద్యం, మద్యసారం; ఆల్కహాలు; ఒలంతం; లేదా ఓల్ అనే శబ్దంతో అంతమయే రసాయనం; రసాయన శాస్త్రంలో ఆల్కహాలు అనేది ఒక జాతి పదార్థాల పేరు. ఈ జాతి పదార్థాల పేర్లన్నీ ఓల్ శబ్దంతో అంతం అవాలని జెనీవాలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో అంతా ఒప్పుకున్నారు; +methyl alcohol, ph. కరస్రారా; కాష్ఠాసవం; మెతనోలు; కాష్ఠోల్; +rubbing alcohol, ph. ఉద్వర్తన ఒలంతం; మృష్టాలంతం; కషణోలంతం; కషణోల్; +alcoholic spirits, ph. మద్యార్కములు; మద్యాన్ని బట్టీ పట్టగా వచ్చే పదార్థాలు; +* alcoholism, n. తాగుడు; తాగుబోతుతనం; మదాత్యం; +* Alcor, n. అరుంధతి నక్షత్రం; సప్తర్షి మండలంలో ఒక నక్షత్రం; ఈ నక్షత్రం కంటికి కనిపిస్తే దృష్టి బాగున్నట్లు లెక్క అనే అభిప్రాయం అరేబియాలో కూడా ఉంది; 80 Ursae Majoris; +* alcove, n 1) గూడుగది; గోడని వెనక్కి జరిపి కట్టిన చిన్న గది; పంచపాళీ 2) గజీబో; పొదరిల్లు; +* Aldebaran, n. రోహిణి నక్షత్రం; వృషభ రాసిలో ఉన్న ఒక అరుణ మహాతార ఆల్ఫా టౌరీ ఆకాశంలో ప్రకాశమానమైన తారలలో ఒకటి; అరబిక్ భాషలో "అల్డెబరాన్ అంటే (కృత్తిక) తరువాత వచ్చేది" అని అర్థం; +* aldehyde, n అలంతం మధ్యలో ఒక కార్బనిల్‍ గుంపు ఉండి, మరొక ఉదజని, పక్కని ఒక R గుంపు ఉన్న ఆంగిక రసాయనం; పక్కనున్న R గుంపు కేవలం ఉదజని అణువు అయితే ఇది ఫార్మాల్డిహైడ్‍ అవుతుంది; ఈ జాతి రసాయనాల పేర్లన్నీ ఆల్ ధాతువుతో అంతం అవాలని జెనీవాలో ఒప్పందం జరిగింది; మెతనాల్, ప్రొపనాల్ మొదలయిన పేర్లు ఆలంతాలకి ఉదాహరణలు; +* ale, n. దినుసుల నుండి తయారు చేసే బీరు వంటి ఒక మద్యపానీయం; +* alert, n. అప్రమత్తతతో ఉండమని చెప్పే హెచ్చరిక; +* algae, n. pl ఆల్గే) నాచు; నీటి పాచి; శైవలాలు; +* alias, n. మారుపేరు; మరోపేరు; ప్రతినామం; అపర నామం; నామాంతరం; ఉరఫ్; +* alien, adj. లాతి; పరాయి; విదేశీ; పరదేశీ; అన్య; +* alien, n. లాతివాడు; లాతీమరి; పరాయివాడు; విదేశీయుడు; పరదేశీయుడు; అన్యుడు; గ్రహాంతరవాసి; +* alienation, n. వైమనస్యత; లాతీకరణ; పరాయీకరణ; అన్యదేశీకరణ; దూరీకరణ; పరాధీనత; అన్యాక్రాంతం చెయ్యడం; పరాధీనం చెయ్యడం +* aliens, n. లాతులు; అన్యులు; పరాయివారు; తస్మదీయులు; విదేశీయులు; పరదేశీయులు; ఆగంతకులు;గ్రహాంతరవాసులు; +* alight, v. i 1) దిగు; వాలు 2) కాలు; మండు; రగులు 3) వెలుగు; ప్రకాశించు; +* alignment, n. ఒక వరుసలో అమరిక; తిన్నగా అమరిక; సమరేఖనం; +* alimentary, adj. పోషణకి సంబంధించిన; ఆహార సంబంధిత; +* alimony, n. మనోవృత్తి; భరణం; విడాకులిచ్చిన భార్యకు నెలనెలా భర్త ఇచ్చే భరణం; లేదా భర్తకు భార్య ఇచ్చే భరణం; see also palimony; +* Alioth, n. అంగీరస నక్షత్రం; సప్తర్షి మండలంలో ఉన్న ఒక నక్షత్రం; గరిటె ఆకారంలో ఉన్న ఈ మండలంలో హస్తకం చివర నుండి మూడో నక్షత్రం; ఎప్సిలాన్‍ ఉర్సే మెజోరిస్‍; +* alive, adj 1) సజీవ; ప్రాణంతో ఉన్న; జీవంతో ఉన్న 2) విద్యుత్ ప్రవాహంతో ఉన్న; +alkaline soils, ph. చౌటి నేలలు; చౌడు భూములు; క్షారవతులు; +* alkaloid, n. క్షారార్థం ety క్షారం వంటి పదార్థం; కాఫీలో ఉండే కెఫీన్‍, పుగాకులో ఉండే నికొటీన్‍, నల్లమందులో ఉండే మోర్ఫీన్‍ వగైరాలన్నీ ఉదాహరణలు; +* all, adj. సర్వ; అఖిల; యావత్; సమస్త; నానా; అస్తమానూ; +all hands meeting, ph. సర్వజనీన సమావేశం; సర్వసభ్య సమావేశం; అఖిల జన సమావేశం; +* all, pron. అందరూ; అంతా; అన్నీ; యావత్తూ; సమస్తం; +* allegation, n. అభియోగం; ఆరోపణ; నేరారోపణ; నిందారోపణ; +* alleged, n. అభియోక్త; అభియోగి; అభియుక్తుడు; +* allegiance, n. విశ్వాసపాత్రత; ప్రభుభక్తి; రాజభక్తి; ఒక ప్రభుత్వం ఎడల కాని, వ్యక్తి ఎడల కాని నమ్మక ద్రోహం తలపెట్టకుండా ప్రవర్తించడం; +* allegory, n 1) అర్థవాదం; అలిగొరి; ఒక ముఖ్యమైన విశేషాన్ని గాని, పారమార్థిక సత్యాన్ని గాని, నీతిని గాని తెలియజేయడానికి ఉపయోగించే సాహిత్య ప్రక్రియ. ఒక భావాన్ని పాత్రగా మార్చడం అలిగరి. ‘సమయం, సందర్భం కాకుండా ఇదేమిటి’ అనిపించే విధంగా చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. రామాయణంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్త్య మహర్షి వచ్చి రాముడికి ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించడం, కురుక్షేత్ర సంగ్రామం మధ్య శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతో పదేశం చేయడం ఇందుకు ఉదాహరణలు; కృష్ణమిశ్రుడనే సంస్కృత నాటకకర్త (11 12 శతాబ్దాలు) వివిధ మనోభావాలను పాత్రలుగా మార్చి ‘ప్రబోధ చంద్రోదయం’ అనే నాటకం రాసాడు. భావాల్ని పాత్రలుగా మార్చడం సాహిత్య శిల్పరీత్యా తక్కువస్థాయి శిల్పం. అందుకని అలిగరి అంటే రసజ్ఞుల దృష్టిలో తక్కువ అభిప్రాయమే ఉంటూంది 2) ధ్వన్యర్థం; రూపకం; రూపకాలంకారం; చెప్పదలుచుకున్న విషయానికి బదులు మరొక విషయాన్ని చెప్పి అర్థం ఆరోపించడం; పంచతంత్ర హ��తోపదేశాలలో మనుష్యులకి బదులు జంతుజాలం చేత కథ నడిపించడం దీనికి ఒక ఉదాహరణ; అర్థము అంటే వస్తువు, ప్రయోజనం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రయోజనంతో కూడిన ప్రక్రియ ఇది; +* allele, n. జంటలో ఒకటి; తల్లిదండ్రుల నుండి సంక్రమించే వారసవాహికలలో జంటలుగా కనిపించే జన్యువులలో ఒకటి; +* allergen, n. ఎలర్జీని కలుగజేసే ప్రతిజని; +* allergy, n. ఎలర్జీ; పడని వస్తువులు తిన్నప్పుడు కాని, రక్తప్రవాహంలోకి ప్రవేశించినప్పుడు కాని, శరీరం తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో మితిమీరి స్పందించటం; +* alleviation, n. ఉపశమనం; ఉప శాంతి; ప్రశమనం; తీవ్రత తగ్గించడం; +* alley, n 1) సందు; గొంది; సన్నటి దారి; ఇరుకైన వీధి 2) గంత; ఇంటి పక్కగా పెరట్లోకి వెళ్ళే దారి; +* alley cat, n. గంత పిల్లి; ఊర పిల్లి; యజమాని లేకుండా ఊరు మీద పడి తిరిగే పిల్లి; +* alliance, n. సమాశ్రయం; స్నేహసంబంధం; +* allied, adj. మిత్ర; స్నేహసంబంధం గల; సమాశ్రయ; +* alliteration, n. వృత్యనుప్రాస; ఛేకానుప్రాస; యమకం; ఆద్యక్షర సామ్యం; అనుప్రాస; +* allocation, n 1) వాటాలు వేయడం; కేటాయింపు చేయడం; పంపకం; విభాగ పంపిణీ; సంవిభాజనం; ఆరక్షణం;(2) వాటా; కేటాయింపు; +* allomorphs, n. pl. సార్థకాలు; సపదాంశాలు; వర్ణాకారప్రభేదాలు; శపథాంశాలు; ఒకే అర్థం కల మాటలు; +* allopathy, n. ఇంగ్లీషు వైద్య పద్ధతి; హోమియోపతీ, ఆయుర్వేదం, యునానీ మొదలైన పద్ధతులు కాని పాశ్చాత్య వైద్య పద్ధతి; +* allophone, n ling సవర్ణం; ధ్వనిప్రభేదం; ఒక "ఫోనీమ్‍"ని ఉచ్చరించడానికి చేసే శబ్దసముదాయం; +* allot, v. t. వాటాలువేయు; వంతులు వేయు; పొందింపజేయు; +* allow, v. t. ఒప్పుకొను; అనుమతించు; సమ్మతించు; +* allowance, n 1) భత్యం; భృతి; బత్తెం; బత్తా 2) జాగా; చోటు; కాపుదల; +* alloy, n. మిశ్రమలోహం; అకుందనం; కంచరలోహం; కంచు; ధాతుసమ్మేళనం; +* allude, v. i. ఉల్లేఖించు; ఒక విషయాన్ని గురించి డొంకతిరుగుడుగా కాని లేదా మాటవరసకి గాని ప్రస్తావించడం; +* alluringly, adv. ఒయ్యారంగా; వయ్యారంగా; ఊరింపుగా; +* allusion, n. ఉల్లేఖనం; మాట్లాడుతూన్నప్పుడు కాని రాస్తూన్నప్పుడు కాని చెప్పదలుచుకున్నదానిని పరోక్షంగా చెప్పడం; +alluvial soil, ph. ఒండుమట్టి; పాటిమట్టి; ఒండలినేల; +* ally, n. మిత్రరాజ్యం; మిత్రమండలి సభ్యుడు; +* Almagest, n. టోలమీ సా. శ. 150 ప్రాంతాలలో రచించిన ఖగోళశాస్త్ర గ్రంథం; +* alma mater, n. విద్యామాత; విద్యని ఇచ్చిన తల్లి; తను చదివిన పాఠశాల; +* almanac, n. కాల గణిత బోధిని; పంచాంగం; బాలశిక్షకీ, పంచాంగానికీ మధ్యేమార్గంగా ఉండే పుస్తకం; +* Almighty, n. ఈశ్వరుడు; సర్వేశ్వరుడు; పరమేశ్వరుడు; సర్వశక్తుడు; +* almirah, n. అలమారు; సామాను దాచుక��ందికి గోడని దొలిచి అరలు అరలుగా కట్టిన కట్టడం rel bureau; cabinet; chest; +* almost, adv. దాదాపుగా; ఇంచు మించుగా; దరిదాపుగా; సుమారుగా; +* alms, n. బిచ్చం; మధూకరం; మాదాకబళం; +giant aloe, ph. ఏనుగు కలబంద; పెద్ద కలబంద; బ్రహ్మరాకాసి; +are you alone ph. మీరు ఒంటరిగా ఉంటున్నారా మీరు ఒక్కరేనా?; +along the way, ph. దారిలో, దారి పొడుగునా; దారి వెంబడి; +* aloud, adv. బిగ్గరగా; గట్టిగా; పైకి; బయటకి; లోలోపలికి కాకుండా; +* alphabet, n. ఓనమాలు ety ఓం నమః యొక్క రూపాంతరం; అకారాదులు; అక్షరమాల; వర్ణమాల; అక్షర సముదాయం; వర్ణసమామ్నాయం; అక్షరక్రమం; +* alphabetical, adj. అకారాది క్రమంగా; వర్ణమాలానుసారంగా; +* alphanumeric, adj. అక్షరాంకిక; అక్షరములు కాని, అంకెలు కాని; +alphanumeric code, ph. అక్షరాంకిక సంక్షిప్తం; అక్షరాంకిక సంకేతం; కంప్యూటరు వంటి యంత్రాలలో అక్షరములని కాని, అంకెలని కాని సూచించడానికి వాడే ద్వియాంశ సంకేతం; +* already, adv. అప్పుడే, ఒక సమయానికి ముందు; +* Altair, n. శ్రవణం నక్షత్రం; తూపురిక్క; ఆల్ఫా అకీలా, అనగా అకీలా రాసిలో ఉన్న నక్షత్రాలు అన్నిటిలోను ఎక్కువ ప్రకాశవంతమైనది; +* altar, n ఆల్టార్) దైవపీఠం; బలిపీఠం; +* altercation, n. జట్టీ; జగడం; తగువు; వాగ్యుద్ధం; పోట్లాట; గలాటా; దెబ్బలాట; కలహం; తంటా; తకరారు; కజ్జా; రగడ, ragaDa +* alter-ego, n 1) శీలాంతరం; వ్యక్తియొక్క మరొక ముఖం; మరొక శీలం 2) ప్రాణమిత్రుడు; రెండవ ప్రాణం; +* alternate, adj 1) ఏకాంతర; ఒకటి విడచి మరొకటి 2) పర్యాయ; ప్రత్యామ్నాయ; వికల్ప; +alternate angle, ph. ఏకాంతర కోణం; రెండు సరళ రేఖలని (సమాతరంగా ఉండనక్కరలేదు) ఒక తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఆ సరళ రేఖలకి లోపల, ఆ తిర్యక్ రేఖకి ఇటూ, అటూ ఉండే కోణాలు ఏకాంతర కోణాలు; ఆ రెండు సరళ రేఖలూ సమాతరంగా ఉన్నప్పుడు, ఏకాతర కోణాలు సమంగా ఉంటాయి; +* alternative, n. ప్రత్యామ్నాయం; పక్షాంతరం; మరొక మార్గం; మరొక పద్ధతి; వైకల్పికం; విభాష: గత్యంతరం; మారుదీటు; +* altimeter, n. ఉన్నతమాపకం; ఎత్తుని కొలిచే పరికరం; +* altitude, n. ఉన్నతి; ఎత్తు; ఉన్నతాంశం; శిరోన్నతి; శీర్షోన్నతి; +* altruism, n. పరోపకార బుద్ధి; పరోపకారం; +alveolar ridge, ph. దంతమూలపు మిట్ట; నోటి లోపలి కప్పులో పైపంటి వరుసకి మీదగా ఉన్న గట్టి భాగం (బొమ్మలో 4 కి 5 కి మధ్య ఉన్న భాగం ఈ మిట్ట దాటి కొంచెం వెనక్కి వెళితే అంగుడి, ఇంకా వెనక్కి వెళితే కొండనాలుక వస్తాయి; +* alveolars, n ling దంత మూలీయాలు; నాలుక వెళ్ళి దంత మూలాలని తగలగా వచ్చే శబ్దములని సూచించే అక్షరాలు ఉదా త, ద, స; +* always, adv. ఎల్లప్పుడు; ఎల్లవేళలా; ఎప్పుడూ; అస్తమానూ; సదా; సర్వదా; నిత్యం; సతతం; కలకాలం; అజస్రము; అనవరతం; +* am, v. i. ���న్నాను; అయి ఉన్నాను; +* amalgam, n 1) రస మిశ్రమం; రస మిశ్రమ లోహం; పాదరసంతో కూడిన లోహం 2) నవనీతం; +* amanuensis, n. లేకరి; లేఖకుడు; రాయసం; రాయసకాడు; ఉక్త; లేఖకుడు; నోటితో చెబితే రాసే వ్యక్తి; +* amass, v. t. పోగుచేయు; కూడబెట్టు; సంచయించు; సంచితం చేయు; +* amateur, n 1) కళావినోది; ఔత్సాహికుడు; ఆర్జనపై దృష్టి నిలపకుండా కేవలం వినోద కాలక్షేపం కొరకు ఒక ప్రవృత్తిని చేపట్టిన వ్యక్తి 2) ప్రావీణ్యం లేని వ్యక్తి; +* amazement, n. నిర్విణ్ణత; దిగ్భ్రమ; దిగ్భ్రాంతి; విస్మయం; +* amber, n 1) తృణమణి; తృణస్ఫటికం; కర్పూరపూస; అంబరు; సీమగుగ్గిలం; అనాది కాలంలో చెట్ల నుండి స్రవించిన రసం శిలాస్థులుగా మారగా వచ్చేదే తృణస్ఫటికం; ఇది వజ్రాల కంటె అరుదైన పదార్థం; పాలిష్ పెడితే తళతళా మెరిసిపోయే ఈ రెసిన్ ని ఆభరణాల తయారీలో వాడతారు.(2) జేగురు రంగు; తేనె రంగు వంటి రంగు; +* ambergris, n. అంబరు; సౌగంధికం; స్పెర్మ్ వేల్ (Sperm Whale) అనబడే తిమింగలం పేగులలో తయారయ్యే ‘యాంబర్ గ్రిస్’ అనే ఈ చిక్కటి ద్రవం గట్టిపడి తునకల్లా అవుతుంది. బూడిదరంగులో ఉండే ఈ తునకలను వెచ్చచేస్తే పరిమళం ఇస్తాయి. మైనంలాగా ఉండే అంబరు తునకలు ఉష్ణప్రాంత సముద్రాల నీటిలో తేలుతూ దొరుకుతాయి. అంబరును సుగంధద్రవ్యాల పరిశ్రమలో ఉపయోగిస్తారు; +* ambi, pref. ఉభయ; సందిగ్ధ; ద్వంద్వ; రెండూ; రెట్టింపు; +* ambidextrous, n. సవ్యసాచి lit రెండు కుడి చేతులు కల వ్యక్తి; +* ambience, n. పరిసరాలు; పరివ్యాప్తం; చుట్టుకొని ఉన్న ప్రాంతం; కళాత్మకంగా, ఆహ్లాదకరంగా ఉండేట్లు అమర్చిన పరిసర వాతావరణం; +* ambient, adj. పరిసర; చుట్టుప్రక్కల; చుట్టుకొని ఉన్న; పరివ్యాప్తమైన; +* ambiguity, n. సంధిగ్ధత; అస్పష్టత; ద్వందార్థం; సందిగ్దార్ధం; సంశయాత్మకం; +* ambiguous, adj. సందిగ్ధమైన; అస్పష్టమైన; ద్వందమైన; సంశయాత్మకమైన; +* ambition, n. గాఢవాంఛ; చికీర్ష; కోరిక; ఉన్నత స్థితికి ఎదగాలనే కోరిక rel జిగీష; +* ambitious person, n. ఆశాపరుడు; ఆశాపాతకుడు; చికీర్షకుడు; జిగీషువు; ఉన్నత స్థితికి ఎదగాలనే కోరిక ఉన్న వ్యక్తి; +* American aloe, n. రాకాసిమట్ట; సాగనారమట్ట; పెద్దకలబంద; +* amethyst, n. నీలమణి; బచ్చలిపండు రంగులో ఉండే ఒక సైకతశిల; +* amiability, n. సరసత; సఖ్యత; సాత్వికం; మంచితనం; కలుపుగోలుతనం; +* amicability, n. సఖ్యత; సామరస్యం; కలుపుగోలుతనం; అన్యోన్యత; +* amine, adj biol నవ; అమినవ; అభినవ; నవాసారానికి సంబంధించిన; +amine end, ph. నవ శీర్షం; నవామ్లాలలో ఎమీనో ఏసిడ్ వైపు కొస; +* amino acid, n. నవామ్లం; అమినవామ్లం; ఎమీనో ఆమ్లం; +* amiss, adj. తప్పు; అసందర్భం; అనుచితం; +* amity, n. పొత్తు; పొందిక; పొంద��; స్నేహం; సయోధ్య; అభిప్రాయభేదాలని పక్కకి పెట్టి మైత్రీభావం పెంచుకోవడం; +* ammonia, n. నవజని; నవాసారం, సున్నం కలపగా వచ్చే వాయువు; +* amnesia, n. మతిమరుపు; గతాన్ని మరిచిపోయిన మనోస్థితి; +* amnesty, n. మాఫ్కీనామా; సకల అపరాధ విమోచనం; క్షమార్పణ; +* amnion, n. ఉల్భం; క్షీరదములలో గర్భస్థ శీశువు చుట్టూ ఉండే పొర; +* amorphous, adj. నిరాకారమైన; అమూర్తమయిన; రూపరహిత; +* ampere, n. ఆంపియరు; విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి వాడే కొలమానం; +* amphetamines, n. పౌరుష ఉత్తేజకాలు; కృతకంగా తయారు చేయబడి ఉత్తేజం కలిగించే రసాయన పదార్థాలు; +* amphi, pref. ఉభయ; సందిగ్ధ; ద్వంద్వ; రెండూ; రెట్టింపు; +* amphibian, n. ఉభయచరం; ఉభయ జీవి; నేల మీద, నీటి మీద బతక గలిగే జంతువు; +* amphitheater, n 1) చక్రీయ ప్రదర్శనశాల; గుండ్రంగా ఉండే ప్రదర్శనశాల; ప్రేక్షకులు కూర్చునే స్థలం 2) చుట్టూ కొండలు ఉండి మధ్యలో రంగస్థలం ఆకారంలో ఉండే లోయ; +* amplification, n. ప్రవర్ధకం; విస్తరణ; విస్తరించి చెప్పడం; విపులీకరించడం; ఘోష; +* amplifier, n. ప్రవర్ధకి; వర్ధకి; విస్తరి; ఘోషకి; +* amputation, n. అంగచ్ఛేదం; శరీరంలో ఒక భాగాన్ని కోసివేయడం; +* anabolism, n chem] నిర్మాణ ప్రక్రియ; జీవధాతు నిర్మాణమునకు జరుగు రాసాయనిక పరిణామము; ఉపచయం; +* anachronism, n. కాలవ్యతిక్రమం; ఒక కాలమందు జరిగిన సంగతిని (పొరపాటున) మరియొక కాలమునకు ఆరోపించి చెప్పుట; వృత్తాంతములను వరుసతప్పి తాఱుమాఱుగాఁజెప్పుట; +* anaconda, n. అనకొండ; దక్షణ అమెరికాలో తారసపడే కొండ చిలువ వంటి పెద్ద పాము; ఈ రకం పాములు బలిపశువుని తమ చుట్టలలో చుట్టి ఉక్కిరిబిక్కిరి చేసి చంపి తింటాయి see also python; +* anagram, n. పొడిపేరు; పొడి అక్షరాలతో చేసిన మాట; కనిష్ఠ సామాన్య గుణిజంని కసాగు అనీ, శ్రీరంగం శ్రీనివాసరావుని శ్రీశ్రీ అని అన్నట్లు; +* analgesic, n. నొప్పినివారిణి; నొప్పిమందు; నొప్పిని తగ్గించే మందు; see also anodyne; +analog computer, ph. సారూప్య కలనయంత్రం; సమ్మితీయ సంగణకం; +analog device, ph. సమ్మితీయ ఉపకరణం; సారూప్య ఉపకరణం; +* analogy, n. సారూప్యం, సాదృశం; సామ్యం; పోలిక; ఉపమానం; +* analysis, n. విశ్లేషణ; పరిశీలన; వివేచన;విభజన; విడమర్పు; వ్యవచ్ఛేదం; మీమాంస; అన్వయం; +analytic geometry, ph. విశ్లేష రేఖాగణితం; విశ్లేష క్షేత్రగణితం; +* anaptyxis, n. స్వరభక్తి; ఉచ్చారణ సౌలభ్యం కొరకు రెండు హల్లుల మధ్య ఒక అచ్చుని ఇరికించడం; +* anathema, n 1) శాపం; బహిష్కరణ: వెలి వేయడం 2) చెప్పరానిది; అనరానిది; వర్జ్యం; +* anatomy, n. దేహనిర్మాణ శాస్త్రం; శరీర నిర్మాణ శాస్త్రం; +* ancestors, n. పూర్వులు; పూర్వీకులు; పితరులు; పూర్వజులు; కూటస్థులు; జేజలు; ���వ్యాహరులు; +* ancestral, adj. పిత్రార్జిత; పూర్వుల; పూర్వీకుల; పితరుల; +* androgynous, adj. ఉభయలింగ; అర్ధనారీశ్వరాకృతిగల; పురుష, స్త్రీ లక్షణాలు రెండూ ఒకే వ్యక్తిలో ఉండడం; +* Andromeda galaxy, n. దేవయాని; దేవయానం; ఇంద్రమద; ఆకాశంలో కనిపించే ఒక క్షీరసాగరం; +* anecdote, n. ఉదంతం; ఆఖ్యాయిక; ఉపాఖ్యానం; ముచ్చట కథ; పొడికథ; పిట్టకథ; +* anemia, n 1) రక్తహీనత; రక్తలేమి; రక్తక్షీణత; వికీలాలం; విరక్తం; రక్తంలో ఎర్ర కణముల సంఖ్య తగ్గుట 2) పాండురోగం Gr no blood +* anemic, adj. రక్తపుష్టి లేమి; పాలిపోయిన; రక్తచందురం తక్కువగా ఉన్న; +* anemometer, n. వాతబల మాపకం; గాలి ఎంత జోరుగా వీచుతున్నదో తెలిపే సాధనం; +* aneroid barometer, n. వాయుభార మాపకం; ఒక ప్రదేశంలోని వాతావరణంలో గాలి ఎంత బరువుందో తెలిపే సాధనం; +* anesthetic, anaesthetic (Br n. సమ్మోహని; స్పర్శభంజని; స్పర్శనాశకం; విచేష్టితం; నిస్పృశ్యం; నిస్పృహ్యకి; చేతనాహారం; స్పృహని పోగొట్టేది; +* aneurysm, n. రోగాన్ని సూచించే విధంగా రక్తనాళపు గోడ ఉబ్బరించడం; సాధారణంగా ఈ పరిస్థితి ధమనుల గోడలలో కనబడుతుంది; +* anger, n ఏంగర్ కోపం; కినుక; అలక; రోషం; క్రోధం; ఆగ్రహం; ఆకరం; కాతాళం; +angina pectoris, ph ఏంజైనా పెక్టొరిస్ రొమ్ముశూల; గుండెలో వచ్చే ఒక రకమైన నొప్పి; +* angiosperm, n. పువ్వులు పూసే మొక్క; పూల మొక్క; +visual angle, ph దృష్టి కోణం; దూరంగా ఉన్న వస్తువుని చూసేటప్పుడు కంటి దగ్గర ఏర్పడే కోణం; మన కంటి నుండి ఒక వస్తువుని దాని వ్యాసానికి 57 రెట్ల దూరంలో పెడితే ఆ వస్తువు దృష్టి కోణం ఒక డిగ్రీ ఉంటుంది; +* Anglophobia, n. ఇంగ్లీషు అంటే భయం; ఆంగ్ల భాష అన్నా, ఆంగ్లేయులన్నా భయం; +* angst, n. భవిస్యత్తు ఏమవుతుందో అని ఆరాటం, ఆత్రుత, బెంగ; +* anicut, n. ఆనకట్ట; నదికి అడ్డుగా కట్టబడిన గోడ; +* animal, adj. జాంతవ; పశువుల; పసరపు; జంతు సంబంధమయిన; +animal charcoal, ph. జాంతవ అంగారం; జంతువుల ఎముకలని కాల్చగా వచ్చిన బొగ్గు; +* animal, n 1) జీవి 2) జంతువు; పశువు; గొడ్డు; మృగం; పసరం 3) పశుపక్ష్యాదులు; +antlered animal, ph. శృంగి; కొమ్ములు ఉన్న దుప్పి జాతి జంతువు; +* anisotropic, adj. దిశానుగత; కొలిచే దిశని బట్టి లక్షణాలు మారేటటువంటి; +* ankle, n. చీలమండ; మడమకీ, కాలి పిక్కకీ మధ్యనున్న కీలు భాగం; +* annals, n. ఏటేటా చారిత్రకంగా నమోదు చేసిన కవిలె కట్ట; +* annealing, n. మందశీతలీకరణం; వేడిచేసి నెమ్మదిగా చల్లార్చడం; +* annex, v. t. అంకించుకొను; ఆక్రమించు; కలిపేసుకొను; చేర్చు; +* annex, annexe (Br n. సౌధవాలం; ఒక భవనానికి అనుబంధంగా కట్టిన మరొక భవనం; +* annexure, n. పరిశిష్టం; ఒక వ్యాసానికి కాని, ఉత్తరానికి కాని అనుబంధంగా తగిలించిన మరొక రాత; +* annihilate, v. t. సర్వనాశనం చేయు; రూపుమాపు; సమూలంగా ధ్వంసం చేయు; +* annihilation, n. లయ; లయము; వినాశం; సంహరణం; సర్వనాశనం; నిర్ధూమధామం; తుడిచిపెట్టుకొని పోవడం; +* annotation, n. టిప్పణం; టిప్పణి; టీక; వ్యాఖ్యానం; సహటిప్పణి; +* announce, v. t. చాటు; చాటించు; ప్రకటించు; ఉగ్గడించు; +* announcement, n. ఉదఘోషణ; ఉద్ఘోషణ; ఉద్ఘాటన; ప్రకటన; టముకు; దండోరా; ప్రజాహిత ప్రకటన; ఈ ప్రకటనకి డబ్బు ఇవ్వక్కర లేదు; డబ్బులు పుచ్చుకొని చేసే ప్రకటనని advertisement అంటారు; +* annual, adj. వార్షిక; సాలుసరి; సన్వారీ; +* annuals, n. ఏయేటి కాయేడు నాట వలసిన మొక్కలు; వరి మొదలయిన ధాన్యాలు; బంతి మొదలయిన పూల మొక్కలు ఈ జాతికి చెందుతాయి; +* annuity, n. సొవాసొమ్ము; వర్షాశనం; ఏటేటా వచ్చే సొమ్ము; +* annul, v. t. రద్దుచేయు; కొట్టివేయు; +* annular, adj. వలయాకారపు; కడియాకారపు; కంకణాకార; అంగుళ్యాకార; +annular eclipse, ph. కంకణాకార గ్రహణం; ఈ రకం గ్రహణం ఒక్క సూర్య గ్రహణానికే సాధ్యం; +* anode, n electronics ధనధ్రువం; ధనాగ్రం; ధనోడు శూన్య నాళికలోకాని, విద్యుత్ ఘటములో కాని) ఎలక్ట్రానులని ఆకర్షించే ఒక పలక వంటి ఉపకరణం; +* anodyne, n. నొప్పిని తగ్గించే సాధనం; ఇది మందు అయినా కావచ్చు, మరే ప్రక్రియ అయినా కావచ్చు; see also analgesic; +* anoint, v. t. అభ్యంగనం చేయు; అవలిప్తం చేయు; +* anomalous, adj. అసంగతమయిన; క్రమరహిత; విపరీతమయిన; అసాధారణ; ఒక పద్ధతికి విరుద్ధమైన; +* anomaly, n. వైపరీత్యం; క్రమరహితం; అసంగతం; +* anonymous, adj. అనామయ; అనామక; అనామధేయ; అజ్ఞాత; ఊరు పేరు లేని; +* anorexia, n. అగ్నిమాంద్యం; ఆకలి లేకుండుట; అరుచి; +another person, m. ph. మరొకడు; వేరొకడు; ఇంకొకడు; లాతివాడు; పెరవాడు; +* answer, n. జవాబు; సమాధానం; ప్రత్యుత్తరం; బదులు; చెప్పుకోలు; +red ant, ph. ఎర్ర చీమ; రక్త పిపీలిక; తైల పిపీలిక; +ant colony, ph. చీమల పుట్ట; పిపీలిక సహనివేశం; +* ant-hill, n. చీమల పుట్ట; చెదలపుట్ట; పాము పుట్ట; చిలువ టెంకి; నాకువు; వల్మీకం; +* antagonism, n. విరోధం; వైరం; శత్రుత్వం; వైషమ్యం; +* antagonize, v. t. శత్రుత్వం తెచ్చు కొను; వైరము తెచ్చుకొను; ఎదిరించు; +* Antares, n. జ్యేష్ఠ నక్షత్రం; వృశ్చిక రాసి లోని అరుణ మహాతార; ఆల్ఫా స్కోర్పీ; ఇది భూమికి సుమారు 604 జ్యోతిర్వర్షాల దూరంలో ఉంది; +* ante, n. పూర్వపణం; అగావు; ఆట మొదలు పెట్టడానికి ముందు ఒడ్డే పణం; +* ante meridian, n. పూర్వాహ్నం; మధ్యాహ్నానికి ముందుగా; +* antecedent, n. పూర్వగామి; పూర్వాంశం; ముందు వచ్చేది; +* antechamber, n. ఎడసాల; ముందు వచ్చే చిన్న గది; విడిగా ఉన్న గది; +* anterior, adj. మొదలు; మొదట; పూర్వాంత; అగ్ర; ముందు; ముందరి; ముందు వేళ; ముందు భాగం ant posterior; +* anthem, n. జాతీయ గీతం, కీర్తన; గొప్పని పొగుడుతూ పాడే పాట; +* anther, n. పుప్పొడితిత్తి; పరాగ కోశం; +* anthology, n 1) పూలమాల; ఏర్చికూర్చిన పూలు 2) సంహితం; సంకలనం; సంపుటం; ఏర్చికూర్చిన కథల సంపుటి; సంకలన గ్రంథం; +* anthrax, n. దొమ్మతెగులు; గిల్టీతెగులు; గత్తి; సూక్ష్మజీవుల వల్ల కలిగే ఒక జబ్బు; +* anthropology, n. మానవశాస్త్రం; మానవ పరిణామ శాస్త్రం; నరశాస్త్రం; జాతులని, వారి సంస్కృతులని పరిశోధించే శాస్త్రం; +* anthropometry, n. మానవశాస్త్రం; మానవ శరీరమాన శాస్త్రం; మానవ జాతుల శరీర భాగాలని కొలిచి పరిశోధించే శాస్త్రం; +* anti, pref. వామ; ప్రతి; అ; ఎదురు; నిష్; భిన్న; అపసవ్య; విరుద్ధ; +* antichrist, n. ఏసు క్రీస్తు యొక్క ప్రతిద్వంది; ఇతనితో ఏసు క్రీస్తు చెయ్యబోయే యుద్ధం పేరే ఆర్మగెడ్డన్; +* anticlimax, n. ఆశాభంగం; ప్రతిసారాలంకారము; విలోమ పరాకాష్ఠ; +* anticlockwise, adj. ప్రతిఘడి; అపసవ్య; వామావర్త; అప్రదక్షిణ; +* anticoagulant, n. ప్రతిస్కంధకం; గడ్డకట్టకుండా ఆపేది; +* antidote, n. విరుగుడు; విషపదార్థానికి విరుగుడు; +* antigravity, adj. నిష్ గురుత్వం; విరుద్ధ గురుత్వం; +* antimatter, n phy నిష్పదార్థం; విరుద్ధ పదార్థం; ప్రతి పదార్థం; +Antimony sulfide, ph. సౌవీరాంజనం; సుర్మా; కాటుకరాయి; అంజన గంధకిదం; +* antipodes, n. pl. ప్రతిచరణాలు; ప్రతిచరణులు; మనం ఉండే భూభాగానికి అవతల పక్క ఉండేవారు; +* antipyretic, n. జ్వరాన్ని తగ్గించేది; జ్వరహరి; అవదాహి; తాపాన్ని పోగొట్టేది; +* antiquated, adj. పాతబడిన; పురాతనమైన; వాడుకలో లేని; +* antiseptic, n. చీము పట్టకుండా చేసే మందు; వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవుల పెరుగుదలని ఆపుచేసేది; +* antithesis, n. విరుద్ధ ప్రతిపాదన; పూర్వపక్షం; +* antitoxin, n med విషనాశకం; విషపదార్థానికి విరుగుడు; +* antonym, n. వ్యతిరేకార్థకం; విరుద్ధార్థకం; +binary antonym, ph. ద్వియాంశ వ్యతిరేకార్థకం చావుబతుకులు" ఈ జాతికి చెందిన సమాసం; oxymoron; +* anvil, n 1) దిమ్మ; దాగలి; పట్టెడ; సూర్మి 2) మధ్య చెవిలో ఉండే దాగలిని పోలిన చిన్న ఎముక; +* anus, n. ముడ్డి; గుదం; పాయువు; అపానం; మలద్వారం; ముడ్డివైపు ఆహారనాళం యొక్క రంధ్రం; +* anxiety, n. ఆందోళన; వేదన; ఆవేదన; ఆత్రుత; ఆరాటం; కలవరం; ఉద్వేగం; ఉద్విగ్నత; వ్యాకులత; ఆర్తి; పరివేదన; కలుచ; యాంగ్జిటీ, డిప్రెషన్ రెండూ ఒక లాంటివే. రెండు తలలున్న పాము లాగా. డిప్రెషన్ ఉన్నవాళ్లలో సుమారుగా నూటికి 60 మందికి యాంగ్జిటీ కూడా ఉంటుంది. ఇవి విడిగా ఉన్నదానికన్నా, కలసి ఉంటే మరీ కష్టం; see also "depression;" +* aorta, n anat బృహద్ధమని; మహాధమని; బ్రాహ్మణాడి; గుండె నుండి శరీరం అంతటికీ రక్తాన్ని తీసుకు వెళ్ళే రక్తనాళం; +* apart, adv. విడివిడిగా; ప్రత్యేకంగా; దూరంగా; +* apathy, n. నిర్లిప్తత; అవలిప్తత; ఉదాసీనత; ఉపేక్ష; అభిరుచులు, ఆసక్తులు లేకపోవడం rel carelessness; +* ape, n. ఏపు; కపి; ఏపుకోతి; మనిషిని పోలిన, కోతి వంటి, తోక లేని, ఒక జంతువు; ఏపులు నాలుగు రకాలు: చింపంజీ, గిబ్బన్, గొరిల్లా, ఒరాంగుటాన్; +* aperture, n. రంధ్రం; బెజ్జం; సూక్ష్మరంధ్రం; కంత; ద్వారకం; తొలి; గుబ్బ తొలి; +* aphelion, n. ఉచ్ఛ; దూరబిందువు; అపహేళి; ఒక గ్రహం సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యలో సూర్యుడికి గరిష్ఠ దూరంలో ఉన్న బిందువు ant perihelion; +* aphorism, n. సూత్రం; సూక్తి; నీతివాక్యం; నీతివచనం; చిత్రోక్తి; సూత్రోక్తి; క్లుప్తోక్తి; నిరుక్తోక్తి; +* aphrodisiac, n. వాజీకరం; కామోద్ధీపకం; శృంగారోద్దీపకం; +* apiary, n. తేనెటీగలని పెంచే గూళ్లు, స్థలం; +* apiarist, n. తేనెటీగలని పెంచే వ్యక్తి; +* apiculture, n. తేనెటీగల పెంపకం; మధుమక్షికా పాలనం; +* apogee, n. దూరబిందువు; మందోచ్ఛ; తుంగం; చంద్రుడు భూమి చుట్టూ తిరిగే దీర్ఘ వృత్తాకార కక్ష్యలో భూమికి (ఫోకస్ కి) బహు దూరాన వుండే బిందువు; భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేసే ఉపగ్రహాల దీర్ఘవృత్తపు కక్ష్యలో నాభికి (అనగా, భూమికి) అత్యంత దూరంలో ఉన్న బిందువు; సూర్యుడి చుట్టూ తిరిగే శాల్తీల విషయంలో ఈ మాటకి బదులు ephelion అన్న మాట వాడతారు; in general, the point on the circumference of an ellipse that is farthest from the focus ant perigee; +* apology, n. క్షమార్పణ; మాటతో కాని, రాతతో కాని మన్నించమని అడగడం; +* apogamy, n biol సంయోగబీజరాహిత్యం; ఫలదీకరణం లేకుండా పిండం పెరుగుదల; +* apoplexy, n. రుద్రవాతం; అతిరక్తపాతం; మెదడులో రక్తనాళం చిట్లడం వల్ల వచ్చే మూర్చ వంటి ఒక రకం రోగం; see also stroke; +* aposteriori, adj. ఫలితాన్ని చూసి దాని కారణాన్ని ఊహించే తర్క సంబంధమైన ant a priori; +* apothecary, n. అగదంకారుడు; మందులు కలిపే వ్యక్తి; కంపౌండరు; +* apparatus, n. pl. ఉపకరణాలు; సాధన సామగ్రి; పరికరాలు; +* apparel, n. దుస్తులు; ఉడుపులు; తొడుక్కోడానికి తయారుగా ఉన్న బట్ట; +* apparent, adj. దృశ్య; దృశ్యమాన; దృష్ట; కంటికి కనిపించే; స్ఫుట; +apparent depth, ph. కనిపించే లోతు; దృశ్య దఘ్నం; దృశ్యమాన దఘ్నం; దఘ్నకం; +apparent magnitude (of stars ph. దృశ్య ప్రకాశత్వం; కనిపించే ప్రకాశత్వం; ప్రకాశత్వకం; +* apparition, n. దయ్యం; ప్రేతాత్మ; అనుకోకుండా అకస్మాత్తుగా కనిపించేది; +* appeal, n. వినతి; విన్నపం; విజ్ఞప్తి; +* appear, v. i 1) అగపడు; కనపడు; అనిపించు; గోచరించు 2) హాజరగు; +* appease, v. t. సంతుష్టి పరచు; శాంతపరచు; శాంతింపజేయు; +* appearance, n 1) అగ్గపాటు; అభాసం; ప్రాదుర్భావం 2) ఆకృతి; ఆకారం; అవతారం; +* appetizer, n. అభిరుచ్యం, బుభక్ష్యం; అపదంశము; క్షుద్వర్ధకం; దీపనకారి; ఆకలిని ఉత్తేజపరచడానికి భోజనానికి ముందు తినే చిరుతిండి; +* applause, n. కరతాళధ్వని; హర్షధ్వని; హర్షధ్వానం; కేకిసలు; మెచ్చుకోలు; శ్లాఘన; +* appliance, n. పరికరం; ఉపకరణం; సాధనం; గృహోపకరణం; +* applicable, adv. వర్తించే; ఉపయోగ పడే; సంబంధముగల; చెందెడు; +* applicant, n. దరఖాస్తుదారు; అర్జీదారు; అభ్యర్థి; +* application, n 1) దరఖాస్తు; అర్జీ; మనవి 2) పూత; పట్టు; లేపనం; అపలేపనం 3) అన్వయం; యోజితం 4 comp వర్తనం; వర్తం; అనువర్తనం; అనుప్రయోగం; కంప్యూటరు రంగంలో ఒక నిర్దిష్టమైన పనిని చెయ్యడానికి రాసే క్రమణిక; అనువర్తనాలు (applications) నిరవాకి (operating system) అజమాయిషీలో పనిచేస్తూ ఉంటాయి; +application software, ph. అనువర్తిత తంత్రాంశం; అనుప్రయోగ తంత్రాంశ; +* apply, v. i. వర్తించు; అనువర్తించు; +* apply, v. t 1) అన్వయించు; యోజించు; ప్రయోగించు; ఉపయోగించు; వర్తింపజేయు; వర్తించు 2) దరఖాస్తు పెట్టు 3) పూయు; పూత పూయు; రాయు 4) మనస్సుని పెట్టు; +* appointment, n 1) అభిసారం 2) పని; ఉద్యోగం; నియామకం; నిర్ణీతం; +* appraisal, n 1) అంచనా; మదింపు; మూల్య నిర్ధారణ; వెలని నిశ్చయించడం 2) విషయ వివరణ; +* appraiser, n 1) అంచనాదారుడు; విలువని అంచనా వేసే వ్యక్తి 2) విషయవివరణ కర్త; +* apprehension, n 1) కీడుని శంకించడం; ఆందోళన; భయం 2) పట్టుకొనడం; నిర్బంధించడం; అరెస్టు చెయ్యడం; +* apprehensive, adj. కీడుని శంకించు; జరుగబోయేది ఏమవుతుందో అనే ఆందోళనతో కూడిన; +* apprentice, n. శిష్యవర్తి; శిక్షణా భ్యాసి; అంతేవాసి; పని నేర్చుకునే వ్యక్తి lit one who is near; +* apprenticeship, n. అంతేవాసిత్వం; శిష్యత్వం; శిష్యరికం; ఉమ్మేజువారీ; +* approach, v. t. సమీపించు; చేరువగు; డాయు; తారసిల్లు; అభిగమించు; దగ్గరగా జరుగు; కవియు; ఆసన్నమగు; సన్నిహితమగు; దరిజేరు; +* appropriate, adj. యధోచిత; ఉచిత; సముచిత; సందర్భోచిత; సమంజస; సరియైన; యుక్త; ఇతోధిక; తగు; తగిన; అనువు; సబబు; న్యాయ; +* appropriate, v. t. అంకించుకొను; స్వంతం చేసుకొను; స్వాయత్తం చేసుకొను; స్వాయత్తీకరించుకొను; +* appropriate, n. యధోచితం; ఉచితం; సముచితం; సందర్భోచితం; సమంజసం; యుక్తం; ఇతోధికం; తగినది; అనువైనది; సబబు; న్యాయం; +* approval, n. అనుమతి; సమ్మతి; ఆమోదం; సామరస్యం; +* approximate, adj. ఇంచుమించు; ఉరమర; సుమారు; రమారమి; దాదాపు; అందాజ; ఆసన్న; +* approximately, adv. ఇంచు మించుగా; ఉరమరగా; రమారమిగా; సుమారుగా; చూచాయగా; దరిదాపుగా; దాదాపుగా; ఉజ్జాయింపుగా; కనాకత్తుగా; అందాజుగా; +* approximation, n. ఉరమరిక; ఉజ్జ; ఉజ్జాయింపు; స్థూలఫలం; స్థూలమానం; మదింపు లెక్క; +* apricot, n. జల్ధారు పండు; ప్రీతి పండు; కుబానీ పండు; ఈ పండ్లు శీతల దేశాలలో దొరుకుతాయి; +* aquamarine, n. పచ్చ; పచ్చరాయి; నీలిపచ్చ; జలనీలం; +* Aquarii, n. శతభిషం; లాంబ్డా అక్వేరియస్; అనగా అక్వేరియస్ అనే గుంపులోని (కుంభరాశి లోని) నక్షత్రాలలో అక్వేరీ అనేది పదకొండవ స్థాయి నక్షత్రం, గ్రీకు భాషలో లాంబ్డా పదకొండవ అక్షరం కనుక; +* Aquarius Lambda, n. శతభిషం నక్షత్రం; కుంభ రాశిలో ప్రకాశించే వాటిలో ఇది పదకొండోది; దీనినే లాంబ్డా అక్వేరియస్ అని కూడా అంటారు; +* aquatic, adj. జల; జలసంబంధమైన; అంబు; అంభశ్చర; నీటికి సంబంధించిన; నీటిలో తిరిగే; +aquatic creature, ph. జలచరం; నీటిలో నివసించే జంతువు; అంభశ్చరం; అంబుచరం; యాదాంసి; +* aqueduct, n. పొర్లుమదుం; పొర్లుడు కట్ట; +* aqueous, adj. జల; జలాకార; నీటివంటి; నీటిని పోలిన; +aqueous humor, ph. జలాకార రసం; కంటిలో ఉండే ఒక రకం ద్రవం; +* arable, adj. దున్నదగిన; కృషి యోగ్యమైన; సేద్య; సేద్యయోగ్య; +* Arabic, n. అరబ్బీ; అరబ్బీ భాష; అరేబియా దేశపు భాష; +* arbitrary, adj. నిర్హేతుకమైన; నిబంధనలేని; అనియత; స్వచ్ఛందమైన; +arbitrary constant, ph. అనియత స్థిరాంకం; నిబంధన లేని స్థిరాంకం; +* arbitrator, n. తగవరి; మధ్యవర్తి; తీర్పరి; నిర్ణేత; పంచాయతీదారు; మాధ్యస్థుడు; +* arbitration, n. మధ్యవర్తిత్వం; మాధ్యస్థం; పంచనామా; +* arbor, n. పొదరిల్లు; ఆకుటిల్లు; +* arboreal, adj. పసిరిక; తరు; చెట్ల; చెట్టువంటి; చెట్టుకి సంబంధించిన; చెట్టుమీద నివసించే; వృక్షవాసి; +* arboretum, n. ఉద్యానవనం; తోట; రకరకాల చెట్లని ప్రదర్శించే స్థలం; +* arc, n. చాపం; ధనురాకారం; వృత్తం యొక్క పరిధిలో ఒక భాగం; +* arcade, n 1) సాల; పంచపాళీ; పైన టొపారం ఉన్న సన్నటి పొడుగాటి వసారా 2) ఇటూ అటూ దుకాణాలు ఉన్న సన్నటి అంగడి వీధి; +* arch, n. చాపం; కామాను; వంపు; విల్లు వంటి వంపు; విల్లులా వంపు ఉన్న కట్టడం; ఆర్చి; +* archaic, adj. వాడుకలో లేని; అమలులో లేని; పాతబడ్డ; ప్రాచీన; +* archeology, archaeology (Br n. పురావస్తుశాస్త్రం; ప్రాచీన కాలపు శిథిలాలనీ కట్టడాలనీ అధ్యయనం చేసే శాస్త్రం; +* archer, n. విలుకాడు; విల్తుడు; ధనుర్వేది; ధనుష్మంతుడు; ధానుష్కుడు; ధానుష్కురాలు; విలుకానిత; +* archery, n. విలువిద్య; ధనుర్వేదం; +* archetypal, adj. మూర్తీభవించిన; ఆదర్శవంతమైన; +* archetype, n. ప్రాగ్రూపం; నమూనారూపం; నమూనా; మూలమూర్తి; ఆదర్శం; ఒరవడి; మచ్చు; +* archipelago, n ఆర్కిపెలాగో ద్వీపసమామ్నాయం; సహస్రద్వీపాలు; లక్షద్వీపాలు; సముద్రంలో ఎన్నో దీవుల సమూహం; +* architect, n. స్థపతి; రూపశిల్పి; వాస్తుశిల్పి; +* architecture, n. వాస్తుశాస్త్రం; వాస్తుశిల్పం; స్థాపత్యం; రూపశిల్పం; నిర్మాణశిల్పం; నిర్మాణశాస్త్రం; +* archive, n. దండకవిలె; సంగ్రహాలయం; లేఖాగారం; పూరావృత్తం; ప్రాచీన పత్రాలని భద్రపరచే చోటు; +* Arcturus, n. స్వాతి; ఆల్ఫా బూటెస్; భూతేశ ��ండలంలో అగ్ర తార; +* area, n 1) స్థలం; చోటు; ప్రదేశం; ప్రాంతం (2) వైశాల్యం; విస్తీర్ణం 3) ఆయకట్టు 4) ఒక వ్యక్తి ప్రావీణ్యత సంపాదించిన లేక పనిచేస్తూన్న విభాగం; +* area-wise, adv. ప్రాదేశికంగా, ప్రాంతీయంగా; +* Argo Navis, n. వైవశ్వత నౌక; దైవనావ; ఆకాశంలో కనిపించే ఒక నక్షత్రమండలం పేరు; +* arguable, n. వాదాస్పదం; వివాదాస్పదం; +* arid, adj. జలశూన్యమైన; నిర్జల; ఎండుబారిన; ఎడారి; +Aries, Alpha, Beta of, n. అశ్వినీ నక్షత్రం; మేషరాశిలో ఉన్న రెండు తారలని ఆశ్వని నక్షత్రం అంటారు; +Aries, 35 of, n. భరణి నక్షత్రం; మేషరాశిలో ఉన్న 35 వ తారని భరణి నక్షత్రం అంటారు; +* aristocracy, n. కులీనులు; ప్రభువర్గం; జమీందారీ వర్గం; కులీనవర్గం; +* aristocratic, adj. కులీన; ప్రభువులకి సంబంధించిన; పెద్ద కుటుంబానికి చెందిన; +arithmetic operators, ph. pl. అంకగణిత పరికర్తలు; కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు చెయ్యడానికి వాడే గుర్తులు; +* armada, n. అర్మాదా; యుద్ధనావల సమూహం; +* armadillo, n. కవచమృగం; కవచకేసి; నఖమృగం; అమెరికాలో బొరియ లలో నివసించే ఒక స్తన్య మృగం; +* Armageddon, n. కల్పాంతం; ఏసు క్రీస్తుకూ ఆయన ప్రతిద్వందికీ జరగబోయే యుద్ధం పేరు; ఈ యుద్ధంలో ఏసు ప్రభువు గెలిచి వెయ్యి సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడని క్రైస్తవుల నమ్మకం; +* armature, n 1) కవచం; ఆయుధం 2) విద్యుత్తు పుట్టించడానికి ఒక క్రమ పద్ధతిలో చుట్టిన తీగల చుట్ట; +* armed, adj 1) చేతులుగల 2) ఆయుధం ధరించిన; సాయుధ; +* armory, armoury (Br n. తోపుఖానా; ఆయుధశాల; ఆయుధవాటిక; అస్త్రశాల; పేలుడు మందులను, ఆయుధములను భద్రపరచే భవనం; +* army, n. సైన్యం; దండు; పటాలం; పతాకిని; దళం; లసికిరి; లష్కర్; +* arouse, v. t 1) లేపు; నిద్ర లేపు 2) ప్రేరేపించు; రెచ్చగొట్టు; +* arraignment, n. నేరారోపణ చేసి న్యాయమూర్తి ఎదట నిలబెట్టడం; +* arrange; v. t 1) అమర్చు; కుదుర్చు; పేర్చు; సర్దు; సవరించు 2) ఒనగూర్చు; చేకూర్చు; అనుకూల పరచు; ఏర్పాటు చేయు; +* arrangement, n 1) ఏర్పాటు; సన్నాహం; పన్నుగడ; సొరిది 2) అమరిక; విన్యాసం; కుదిరిక; +* arrest, v. t. ఆపు, నిలుపు; నిలవరించు; నివారించు; అడ్డగించు; అడాయించు; పట్టుకొను; నిరోధించు; ఆటంకపరచు; అటకాయించు; మస్తరించు; +* arrival, n. రాక; రాకడ; చేరడం; ఆగమం; ఉపాగమం; ఆయాతం; +* arrive, v. i. చేరు; వచ్చి చేరు; ప్రవేశించు; ఏగుదెంచు; +arrogant person, ph. పెడసరపు వ్యక్తి; గీర గాడు; పొగరుబోతు; అహంకారి; +* arrogance, n. పొగరు; గీర; గీర్వాణం; అతి గర్వం; మదం; పెడసరం; పోతరింపు; అహంకారం; అతిశయం; కండకావరం; ఉద్ధతి; పోకదల; +* arrow, n 1) బాణం; సాయకం; అమ్ము; అంప; శరం; తూపు; తూణీరం; ములికి 2) బాణం గుర్తు; +arrowroot powder, ph. పాలగుండ; ఈ గుండని పాలల్లో వేసి ఉడకబెడితే పాలు గడ్డకట్టి బిళ్ళల్లా అవుతాయి; +* arsenal, n. తోపుఖానా; ఆయుధశాల; ఆయుధవాటిక; అస్త్రశాల; పేలుడు మందులను, ఆయుధములను భద్రపరచే భవనం; see armory; +* arson, n. దహనకాండ; ఇళ్లనీ, భవనాలనీ, నిప్పంటించిన నేరం; +* art, n 1) కళ; చిత్రకళ 2) చిత్రం 3) విద్య; నేర్పు; +* arteriole, n. ధమనిక; చిన్న ధమని; శరీరంలో శుద్ధరక్తాన్ని మోసుకెళ్ళే చిన్న గొట్టం; +* artery, n 1) ధమని; గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్ళే నాళం 2) పెనుమార్గం; పెద్ద రహదారి; +traffic artery, ph. పెనుదారి; ఎక్కువ వాహనాలని భరించే పెద్ద రహదారి; +* artesian, adj. పంపు సహాయం లేకుండా నీరు తనంత తానుగా బయటకి తన్నుకు వచ్చే సందర్భం; +* articulators, n. ఉచ్చారణాంగాలు; మాటని ఉచ్చరించడానికి వాడే అవయవాలు; ఉదా. పెదిమలు; నాలుక; పళ్ళు, మొ.; +* artifact, artefact (Br n. తయారు చేయబడ్డ వస్తువు; సహజ సిద్ధము కానిది; మిధ్యానిర్మాణం; +* artificial, adj. కృత్రిమ; కల్పిత; కాల్పనిక; కృతక; కూట; పౌరుష; కుహనా; ఏలి; మర; ఉమ్మాయ; అప్రాకృతిక +artificial intelligence, ph. కృత్రిమ మేథ; కృతక బుద్ధి; కృత్రిమ ప్రజ్ఞ; ప్రజ్ఞాకల్పన; పౌరుష ప్రజ్ఞానం; విశ్వామిత్ర విజ్ఞానం; విశ్వామిత్ర వివేకం; +* artificial, n. కృత్రిమం; కల్పితం; కాల్పనికం; పౌరుషం; చేతాళీయం; చేతాళము; +* artisan, n. హస్తకళాకారుడు శిల్పి; చేతిపనితో కళను సృష్టించువాడు; +* artist, n. m. కళాకారుడు; చిత్రకారుడు; రసజ్ఞుడు; శిల్పి; f. కళాకారిణి; +* artiste, n. లలిత కళలు వృత్తిగా కల వ్యక్తి; +* artistic, adj. కళాత్మకమయిన; సృజనాత్మకమయిన; +* artless, adj. నిష్కపటమైన; సాధారణ; నిరాడంబర; +fine arts, ph. లలిత కళలు; చిత్రలేఖనం, శిల్పం, వగైరాలు; +* as, adv. యథా; వలె; ప్రకారం; అప్పుడు; కనుక; +* as usual, ph. యథాప్రకారంగా; యథాతథంగా; +* asbestos, n. రాతినార; దీనితో చేసిన గుడ్డ నిప్పులో వేస్తే కాలదు; +* ascend, v. t. ఎక్కు; ఆరోహించు; అధిరోహించు; +* ascetic, n. వైరాగి; బైరాగి; తాపసి; వీతరాగి; +* asceticism, n. వైరాగ్యం; ప్రాపంచిక సుఖాలపై విరక్తి; +* ascites, n. జలోదరం; గర్భ కుహరంలో నీరు చేరడం; +* aseptic, adj క్రిములు లేని; క్రిమిరాహిత్యమైన; +* ash, n 1) బూడిద; భస్మం; బుగ్గి; నుసి; బూదె; నివురు; నీరు; క్షారం 2) ఒక జాతి చెట్టు; +* aside, adj. జనాంతికంగా; ప్రేక్షకులని మాత్రం ఉద్దేశించి పాత్రధారి రహశ్యంగా చెప్పే సంభాషణ; +* ask, v. t. అడుగు; కోరు; అర్థించు; విచారించు; +* asparagus, n. పిల్లిపీచర; పిల్లితేగ; శతావరి; +* aspect, n. ఆకారం; ఆకృతి; రూపం; దృష్ఠికోణం; కనబడు రీతి; +aspect ratio, ph. రూప నిష్పత్తి; బొమ్మ యొక్క నిడివికి, వెడల్పుకి మధ్య ఉండే నిష్పత్తి; +* aspersion, n. దూషణ; నింద; కళంకం; బురద జల్లడం; అధివాకం; అ��ివచనం; పైవాకం; పక్షపాతముతో చెప్పిన మాట; +* asphyxiate, v. t. ఉక్కిరిబిక్కిరి చేయు; ఊపిరి సలపకుండా చేయు; +* asphyxiation, n. శ్వాసావరోధనం; ఉక్కిరిబిక్కిరి అవడం; ఊపిరి ఆడకపోవడం; +* aspirate, n. ఒత్తక్షరం; ఒత్తు ఉన్న హల్లు; +* aspirate, v. i. పీల్చు; ద్రవ పదార్థాలని గొట్టంతో పీల్చే పద్ధతి; +* aspirated, adj. పీల్చబడ్డట్టి; మహాప్రాణాలయిన; +* ass, n. గాడిద; అడవి గాడిద; ఱేవుగుఱ్ఱము, గాలిగాడు; గార్దభం; ఖరం; +* assassinate, v. t. పరిమార్చు; దొంగ చాటుగా చంపు; ఖూనీ చేయు; హత్య చేయు; వధించు; +* assault, n. డమరం; దాడి చేయు; ఉద్దేశపూర్వకంగా హాని కలిగించడానికి ప్రయత్నించడం; +physical assault, ph. భౌతిక డమరం; ఉద్దేశపూర్వకంగా కొట్టడానికి ప్రయత్నించడం; +sexual assault, ph. లైంగిక డమరం; ఉద్దేశపూర్వకంగా లైంగికంగా దూషణ చేయడానికి ప్రయత్నించడం; +* assault, v. t. బెదిరించు; కొడతానని బెదిరించు; కొట్టు; +assault and battery, ph. కొడతానని బెదిరిస్తూ మరొక వ్యక్తిని తాకడం, కొట్టడం; +* assay, n. వన్నెని పరీక్షించు; పరీక్షించు; +* assembly, n. సమితి; సభ; సమాఖ్య; పరిషత్తు; గుంపు; సంసత్తు; తండము; ఓలగం; +* assent, n. సమ్మతి; అంగీకారం; ఒప్పందం; +* assert, v. t. నొక్కి వక్కాణించు; ఉద్ఘాటించు; ధృవీకరించు; ధృఢపరచు; +* assertion, n. వక్కాణింపు; స్థిరీకరణం; స్థాపన; +* assign, v. t. పురమాయించు; నియమించు; బెత్తాయించు; ఒప్పజెప్పు; అప్పజెప్పు; +* assignment, n. పురమాయించిన పని; ఒప్పజెప్పిన పని; పురమాయింపు; అప్పగింత; కేటాయింపు; +* assistant, n. సహకారకుడు; సహాయకుడు; నాయిబు; +* assuage, v. t. శాంతింపజేయు; సమాధానపరచు; +* assumption, n. ఊహనం; ఉపపాదన; ప్రతిపాదన; అనుకొనుట; అనుకోలు; వహించుట; స్వీకరణ; +* asteroid, n. క్షుద్రగ్రహం; గ్రహశకలం; తారకాభం; భూమి, అంగారక గ్రహాల కక్ష్యల మధ్య ఉండే రకరకాల కైవారాలు కల గ్రహశకలాలు; +* asthma, n. ఉబ్బసం; శ్వాసకాశ; తమక శ్వాస; +bronchial asthma, ph. శ్వాసనాళములోని కండరముల ఈడ్పుచే వచ్చే ఉబ్బసం; +spasmodic asthma, ph. పొర్లుపొర్లుగా ఉద్ధృతమయే ఉబ్బసం; +* astonishment, n. నివ్వెరపాటు; ఆశ్చర్యం; అబ్బురపాటు; వెరగుపాటు; +* astral, adj 1) నక్షత్రసంబంధమైన; నక్షత్ర 2) సహజాతీతమయిన; +astral projection, ph. కారణ శరీర విహరణం; స్వకాయ పలాయనం; శరీరాన్ని వదలి పెట్టి ఆత్మ బయటకు సునాయాసంగా తిరుగుతూన్నట్లు అనిపించడం; +* astrologer, n. జ్యోతిష్కుడు; జోస్యుడు; కాలజ్ఞాని; దైవజ్ఞుడు; +* astrology, n. జ్యోతిషం; జ్యోతిషశాస్త్రం; మానవ జీవితంలో సంఘటనలు గ్రహ గతులు నిర్ణయిస్తాయని నమ్మే పద్ధతి; +* astronaut, n. వ్యోమగామి; జ్యోతిర్గామి; +* astronomy, n. ఖగోళశాస్త్రం; ఖగోళం మీద సూర్య చంద్ర గ్రహ నక్షత్రాదుల స్థాన, గమన, ఆచ్ఛాదన, విస్ఫోటనాదులను నిర్ణయించే శాస్త్రం; +* astrophysics, n. నక్షత్రభౌతిక శాస్త్రం; నక్షత్రాల జీవిత దశలని అధ్యయనం చేసే శాస్త్రం; +* asylum, n. శరణాలయం; ఆశ్రయం; దిక్కు; +lunatic asylum, ph. పిచ్చాసుపత్రి; మానసిక వైద్యశాల; +* asymmetry, n. అసౌష్ఠవం; అసమసౌష్ఠవం; అసమత; విషమత; +* athlete, n. m. ఆటగాడు; క్రీడాకారుడు; f. క్రీడాకారిణి; +* atlas, n 1) కంధరపూస; చూడావలయం 2) దేశపటముల పుస్తకం; +* atmosphere, n. వాయుమండలం; వాతావరణం; నభోవరణం; వియత్తు; వియత్వరణం; ఉప్పరం; +* atoll, n. పగడపుదిబ్బ; గుండ్రంగా, అట్టులా ఉండే పగడపుదిబ్బ; +* atom, n. అణువు rel molecule; తన ఏకత్వాన్ని పోగొట్టుకోకుండా అత్యంత చిన్న రేణువు ప్రమాణంలో ఉండగలిగే రసాయన మూలకం; +atomic number, ph. అణుసంఖ్య; ఒక అణువు గర్భంలో ఉండే ప్రోటానుల సంఖ్య; +atomic size, ph. అణు పరిమాణం; అణుమాత్రం; అణుప్రమాణం; +* atomicity, n. అవిభాజ్యత; అణుప్రమాణత; అణువుని పోలి ఉండడం; అణుత్వం; +* atonement, n. నిష్కృతి; ప్రాయశ్చిత్తం; పరిహార క్రియ; పాప పరిహారం; +* atrophy, n. క్షీణించడం; శుష్కించడం; శరీర అవయవాలు పోషణ లేక, పరిశ్రమ లేక క్షీణించడం; +* atrium, n. ప్రాంగణం; చతుశ్శాలిక; నాలుగిళ్ల వాకిలి; +* attach, v. t. అతుకు; తగిలించు; జతపరచు; కలుపు; కట్టు; సంధించు; ముడిపెట్టు; జోడించు; +* attachment, n 1) తగిలించినది; జతపత్రం; జత చేసిన వస్తువు; ఉత్తరానికి జత చేసిన కాగితం; అనుబంధం; సంయోజితం; సంలగ్నం; పరిశిష్ఠం 2) మక్కువ; మమకారం; ఆపేక్ష; +* attain, v. i. సాధించు; సంతరించుకొను; పొందు; చేరు; +* attar, n. అత్తరు; పువ్వులనుండి తీసే ఒక సుగంధ తైలం; +neroli attar, ph. నారింజ పువ్వుల నుండి తీసే తైలం; +* attendant, n. m. పరిచారకుడు; ఉపచారి; ఉపచరించే వ్యక్తి; మాలి; కాసా; చాకరు; f. పరిచారిక; +* attendees, n. pl. హాజరు అయినవారు; వచ్చినవారు; ప్రేక్షకులు; వీక్షకులు; సభాసదులు; సభికులు; సభ్యులు; సభాస్తారులు; సామాజికులు; +* attention, n. అవధానం; సావధానం; శ్రద్ధ; ధారణ; పరామరిక; ధ్యాస; +* attenuate, v. t 1) నీరసపరచు; క్రమేపీ తగ్గించు; కుదించు; సంకుచించు 2) సున్నిత పరచు; సాగదియ్యు; +* attest, v. t 1) సాక్ష్యము చెప్పు; సాక్షి సంతకం చేయు 2) ధ్రువీకరించు; ప్రమాణీకరించు; +* attitude, n. వైఖరి; వరస; వాటం; వాలకం; వైనం; తరహా; తీరు; +* attorney, n. వకీలు; ముక్త్యారు; ప్లీడరు; +power of attorney, ph. ముక్త్యారునామా; వకాల్తా; వకాలతునామా; +* attribute, n. గుణం; లక్షణం; ధర్మం; ఆపాదన; ఆపాదితం; +* attribute, v. t. ఆరోపించు; ఆపాదించు; అంటగట్టు; కారణం చెప్పు; +* audible, adj. కర్ణగోచర; శ్రవణీయ; వినబడునట్టి; శ్రౌత; +audible sound, ph. వినిబడే శబ్దం; శ్రవణీయ శబ్దం; కర్ణగోచరం; +* audience, n 1) శ్రోతలు; వినేవారు 2) ప్ర���క్షకులు; సదస్యులు; సభకి హాజరయినవారు 3) లాంఛన ప్రాయమయిన దర్శనం; +* audio, adj. శ్రుత; శ్రవణ; కర్ణగోచర; శ్రవ్య; శబ్ద సంబంధమైన; +* audio-visual, adj. శ్రుతదృశ్య; దృశ్యశ్రవణ; దృశ్యశ్రవ్య; దర్శనశ్రవణ; ధ్వని-దృశ్య; +* audition, n 1) వినడం 2) స్వర పరీక్ష; గాత్ర పరీక్ష 3) నటీనటుల, గాయకుల పాటవాన్ని పరీక్షించడం; +* auditor, n. ఆయవ్యయ నిర్ణాయకుడు; మజుందారు; తనిఖీదారు; +* auditorium, n. ప్రేక్షకాగారం; ప్రదర్శనశాల; హాలు; +* augur, n. శకునం యొక్క ఫలితం చెప్పే వ్యక్తి; శోది చెప్పే వ్యక్తి; +* aunt, n 1) అత్త 2) పిన్ని 3) పెద్దమ్మ; దొడ్డమ్మ; +maternal aunt, ph. పిన్ని; పెద్దమ్మ; దొడ్డమ్మ; తల్లి తోబుట్టువు అయిన స్త్రీ; +paternal aunt, ph. అత్త; మేనత్త; తండ్రి తోబుట్టువు అయిన స్త్రీ; +* Aurora Borealis, n. సుమేరు జ్యోతి; ధ్రువజ్యోతి; భూమి యొక్క ఉత్తర ధ్రువ మండలమందు అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే కాంతి; +* auspicious, n. మంగళప్రదం; శుభప్రదం; శుభసూచకం; +* author, n. గ్రంథకర్త; రచయిత; కృతికర్త; కూర్పరి; కారకుడు; కర్త; f. రచయిత్రి; +* authorship, n. కర్తృత్వం; గ్రంథకర్తృత్వం; +* authority, n 1) అధికారం; పెత్తనం; దొరతనం; ప్రస్థానం; అధిష్ఠానం 2) ఆకరం; +* autobiography, n. ఆత్మకథ; స్వీయచరిత్ర; స్వచరిత్ర; +* autocrat, n. స్వేచ్ఛాధికారి; నిరంకుశ ప్రభువు; +* autoeroticism, n. హస్తప్రయోగం; స్వహస్తమైధునం; +* autogamy, n. స్వయంసంపర్కం; స్వయంసంయోగం; +* automatic, adj. స్వయంచర; స్వయంచాలిత; స్వయంచాలక; స్వచాలిత; స్వయంధువన; ఆత్మచల; ఆత్మగమ; నాంతరీయక; +* automation, n ఆటొమేషన్) స్వచాలినీకరణం; స్వయంచాలీకరణం; యంత్రీకరణం; +* automaton, n ఆటొమేటాన్) కీలుబొమ్మ; తతాతిపం; తనంత తానుగా తిరిగే పరికరం; +* automobile, n. స్వయంజంగమం; కామగమని; కారు; సపరాపేక్షకి; పరనిరపేక్షకి;జంతువులు; మనుష్యులు లాగవలసిన అవసరం లేకుండా, తనంతగా తాను కదలగలిగేది; +* autumn, n. శరత్ కాలం; శరదృతువు; శిశిరం; వర్షాకాలం తర్వాత వచ్చే రెండు నెలలు; ఆకురాలు కాలం; +* autumnal equinox, n. శరత్ విషువత్తు; శరద్ విషువత్; ఉత్తరార్థ గోళంలో రాత్రి, పగలు సమానంగా ఉండే రోజు; సెప్టెంబర్‍ 22; +* avail, v. i. వాడుకొను; ఉపయోగించు కొను; వినియోగపరచు; +* availability, n. దొరుకుబాటు; లభ్యత; లభ్యత్వం; ఉపలభ్యత్వం; సిద్ధత్వం; +* avalanche, n. హిమనీపాతం; మంచు కొండలమీద నిల్వ అయిన పొడిమంచు వెల్లువలా ప్రవహిస్తూ కిందకి జారి పడడం; +* avant-garde, adj. సంప్రదాయ శృంఖలాలని తెంచుకుని కొత్త పుంతలు తొక్కిన; విప్లవాత్మక సృజన; నవతరంగ; +* avenue, n. విశాలమయిన వీధి; రాజమార్గం; వీధి; +* aviary, n. గువ్వగూడు; కపోతపాలిక; విటంకం; పక్షులనుంచే పెద్ద పంజరం లాంటి ఇల్లు; +* avocado, n. అవకాడో; దక్షిణ అమెరికాలో విస్తారంగా పండే, ఆకుపచ్చగా ఉండే ఒక జాతి పండు; ఈ పండు మధ్య టెంక లాంటి పిక్క ఉంటుంది; ఒక అవకాడోలో 4 గ్రాముల ప్రాణ్యం, 975 మిల్లీగ్రాముల పొటాసియం (అరటి పండు కంటె రెట్టింపు ఉంటాయి కనుక ఇది మంచి పోషక పదార్థం bot Persea americana ety comes from the Aztec word āhuacatl which means “testicle;” +* awakened, n. ఉద్బుద్ధం; తలఁపునకు వచ్చినది; మేలుకొన్నది; వికసించినది; +* award, n 1) బహుమతి; బహుమానం; పురస్కారం; పురస్కృతి; అవార్డు 2) తీర్పు; +* awareness, n. స్పృహ; స్ఫురణ; గ్రాహ్యత; తెలివిడి; పరిజ్ఞానం; +* awe, n ఆ) ఆశ్చర్యంతో కూడిన భయం; +* awning, n. పెణక; పంచ; ఓరపాక; పరంజా; ముంజూరు; పంచపాళీ; చందువా; చాందినీ; అస్తరణం; ఉల్లడ; చూరు ముందు భాగం; కిటికీ దగ్గర కాని ద్వారం దగ్గర కాని ఎండ పొడ, వాన జల్లు తగలకుండా ఏర్పరచే ఒక కప్పు; +* axes, n. pl 1 ఏక్సెస్] గొడ్డళ్లు 2 ఏక్సీస్] అక్షములు; నిరూపకములు; +* axiom, n. విస్పష్ట సత్యం; స్వీకృతం; స్వీకరించబడినది; విస్పష్టన్యాయం; సూక్తి; ఉపజ్ఞ; నిశ్చిత పరిజ్ఞానం; నృతం; రుజువు లేకపోయినా సరే నలుగురూ నిజమేనని నమ్మే సూత్రం; +* axis, n 1) అక్షం; అక్షరేఖ; ఇరుసు; యష్టి; నేమి; నిరూపకము 2 anat మేరుపూస; +polar axis, ph. ధ్రువీయ అక్షం; ధ్రువయష్టి; ఉత్తర, దక్షిణ ధ్రువాల గుండా పోయే ఊహాత్నక రేఖ; +* axle, n. ఇరుసు, ఆణి; చక్రాలని కలిపి నిలిపే కడ్డీ; +* axon, n. లాంగూలం; మెదడులో ఉండే నూరానులు అనే జీవకణాల తోక; +* azimuth, n. దిగంశం; అజిమత్; గోళీయ క్షేత్రగణితంలో క్షితిజచక్రంలో కొలిచే కోణం; +* azoospermia, n. విలీనవీర్యం; రేతస్సులో వీర్యకణాలు చాల తక్కువగా ఉన్న స్థితి; ఒక మిల్లీ లీటరు రేతస్సులో 15 మిలియనులు వీర్యకాణాల కంటె తక్కువ ఉన్న స్థితి; +* azure, adj. నీలి; నీలి వర్ణమైన; ఆకాశపు రంగైన; + + +* B, b, ఇంగ్లీషు వర్ణమాలలో రెండవ అక్షరం; +* B, పరీక్షలలో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి వచ్చే గురుతు; +* B, symbol 1) ఒక జాతి రక్తం పేరు 2) ఒక విటమిన్ పేరు; +* baboon, n. ఆఫ్రికాలోను, అరేబియాలోనూ నివసించే కొండముచ్చు; గోలాంగూలం; సింగిలీకం; +* baby, n. పాప(స్త్రీ పాపఁడు(పుం పాపాయి(స్త్రీ బిడ్డ(స్త్రీ బిడ్డఁడు(పుం చంటి బిడ్డ(స్త్రీ చంటి పాప(స్త్రీ rel infant; child +baby linen, ph. పొత్తిళ్ళు; పొత్తిండ్లు; +* Babylon, n. బేబిలాన్; బేబిలోనియాలో ఒక ఊరు; ఇప్పటి ఇరాక్‍ దేశంలో ఈ ఊరు పూర్వకాలంలో ఉండేది; +* Babylonia, n. బేబిలాన్ నగరం ఉన్న ఒక పురాతన దేశం; ఈ దేశం ఈనాటి ఇరాక్ లో ఉంది; +* bachelor, n 1) బ్రహ్మచారి; పెళ్ళి కాని వ్యక్తి 2) చదువులో మొదటి పట్టా పుచ్చుకున్న వ్���క్తి; +* back, adv. తిరిగి; వాపసు; మరల; వెనుకకు; +* back, n. వీపు; నడుం; వీపు వెనుక భాగం; వెనుక భాగం; +* backdoor, n. పెరటి గుమ్మం; దొడ్డిదారి; దిడ్డి; +* backfire, v. i. బెడిసికొట్టు; అడ్డంతిరుగు; వికటించు; బుసిపోవు; చెడు; ఆరుమూడగు; కచ్చువిచ్చగు; +* background, n 1) నేపథ్యం; వెనుతలం 2) పూర్వరంగం; పూర్వభూమిక 3) పూర్వాపరాలు; ముందువెనుకలు; +* backing, n. దన్ను; మద్దత్తు; కాపు; కాపుదల; ఒత్తాసు; +* backlash, n 1) బెడిసికొట్టినది; బెడిసికొట్టిన స్పందన 2) యంత్రంలో రెండు కదిలే భాగాలు ఢీకొన్నప్పుడు వచ్చే స్పందన; +* backout, v. i. వెనుకంజ వేయు; వీగు; తగ్గు; వెన్నిచ్చు; +* backpack, n 1) పెరిక; వీపుకి తగిలించుకునే సంచి 2) అసిమి; మోత పశువుల వీపుకి తగిలించే సంచి; +* backtrack, v. i. వెనుకకి వెళ్ళు; వచ్చిన దారినే వెనకకి వెళ్ళు; పునశ్చరణ చేయు; +* backup, adj. నకలు; ప్రతిలిఖిత; ప్రతిలేఖన; +* backup, n 1) దన్ను 2) నిల్వ చేసిన నకలు; ప్రతిలిఖితం; +* backward, adj. బడుగు; వెనకబడ్డ; తిరోగమన; నిమ్న; +* backwardness, n. తిరోగామిత్వం; మాంద్యం; వెనకబడినతనం; +* backwaters, n. కయ్య; ఉప్పుటేరు; ఉప్పుకయ్య; సముద్రపు ఆటుపోట్ల ప్రభావం వల్ల నదిలో కాని, కాలువలో కాని ప్రవాహం స్థంభించిపోయిన ప్రదేశం; +* bacon, n. పంది కడుపు ప్రదేశంలో ఉండే మాంసంతో తయారు చెయ్యబడ్డ ఆహార పదార్థం; ఈ మాంసాన్ని ఉప్పులో ఊరవేసి, పొగ పట్టించి, సన్నటి ముక్కలుగా కోసి, ఆవంలో ఉడకబెట్టి, అమ్ముతారు; ఒక్కొక్క చోటునుండి వచ్చే మాంసానికి ఒక్కొక్క పేరు ఉంటుంది; పంది శరీరంలో వెనక కాళ్ల నుండి వచ్చిన మాంసాన్ని ఉప్పులో ఊరవేసి తయారు చేసిన పదార్థాన్ని "హేమ్ ham) అంటారు; +* bacteria, n. pl. బేక్టీరియా; బేక్టీరియంలు; కంటికి కనబడనంత చిన్న జీవులలో ఒక రకం; +* bacteriology, n. బేక్టీరియం అనబడే సూక్ష్మజీవులని అధ్యయనం చేసే శాస్త్రం; +* bacteriophage, n. బేక్టీరియాభక్షిణి; బేక్టీరియాలని తినే వైరసు అనబడే విషాణువు; +* bacterium, n. s. బేక్టీరియం; కంటికి కనబడనంత చిన్న జీవి; +* Bactria, n. బాహ్లీక దేశం; ప్రస్తుత మధ్యాసియాలోని చారిత్రాత్మక ప్రదేశం, నేటి ఆఫ్ఘనిస్థాన్-తజికిస్థాన్-ఉజ్బెకిస్థాన్ సమాహారం; +* bad, adj. చెడ్డ; బంజరు; చెడు; దుర్; పనికిమాలిన; +bad luck, ph. దురదృష్టం; కలిసిరాకపోవడం; ఎగ్గు; +* badger, n. బొరియలలో నివసించే ఒక చిన్న జంతువు; +* badger, adj. గూఠించు; సాధించు; నసపెట్టు; +* baggage, n 1) సామాను; సామానుతో నింపిన సంచులు rel luggage 2 idiom] పూర్వాశ్రమంలో చేసిన పనులు ప్రస్తుతం మోయరాని బరువై కూర్చోవడం; +* bail, n. జామీను; హామీ; హాజరు జామీను; ఒకరి కొరకు ఇంకొకరు పూచీ పడుట; +bail bond, ph. జామీను పత్రం; హామీ పత్రం; పూచీకత్తు; +non-bailable, ph. జామీను ఇవ్వకూడనిది; జామీనుతో విడిపించడానికి వీలుకాని నేరం; +* bailiff, n. అమలుదారు; అమీనా; కోలుకాడు; ముద్రమానిసి; హామీని అమలు పరచేవాడు; +* bailiwick, n 1) ప్రత్యేకత; ప్రావీణ్యత 2) పరగణా; ఒక అధికారి ఆధ్వర్యంలో ఉన్న ప్రదేశం; +* bakery, n. రొట్టెలకొట్టు; రొట్టెలు కాల్చే ప్రదేశం; రెట్టెల గిడ్డంగి; రోటీఖానా; +* baking, n. మంటకి తగలకుండా కాల్చడం; +* balance, adj. సంతులన; తూకపు; తూగు; తౌల్య; తోలన; సమీకరణ; +* balance, n 1) త్రాసు; తక్కెడ; తూనిక; కాటా; తుల; తరాసు; నారాచి; ఏషణిక 2) తుల్యత; సమత్వం 3) బాకీ; మిగిలినది; కురదా; అవశిష్టం; శేషం; +balance of trade, ph. వ్యాపార శేషం; రెండు దేశాల మధ్య జరిగే వ్యాపారంలో ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నారో తెలియజేసే సంఖ్య; +balance sheet, ph. తౌల్య పత్రం; ఆదాయ వ్యయాల పట్టిక; మిగులు తగులు పత్రం; అవశిష్ఠ పత్రం; తోలన పట్టీ; అడవా పట్టిక; బాకీ హిస్సేబు; +balanced budget, ph. సంతులిత బడ్జెట్; ఆదాయ వ్యయాలు సరితూగిన పట్టిక; +* balcony, n. పరజా; మేడ మీద గోడకి ఆనుకుని ముందుకి సాగి వచ్చే వసారా; see also awning; +* bald, adj. బట్ట; వెంట్రుకలు లేని; బోడి; +* balk, v. i. మొండితనం చేయు; సతాయించు; ముందడుగు వెయ్యడానికి జంకు; +* ball, n 1) బంతి; చెండు; కందుకం 2) ఉండ; గుళిక; మాత్ర; +* ballast, n. పడికట్టు సరుకు; ఓడ నిదానంగా ఉండి ఒక ప్రక్కకి ఒరిగి పోకుండా ఉండడానికి వేసే బరువు; +* ballet, n బేలే) పాశ్చాత్య సంస్కృతిలో ఒక రకం నృత్యనాటకం; రూపకం; +* ballistic, adj. విసరిన; రివ్వున విసరిన; గిరాటు వేసిన; ప్రాక్షేపిక; +ballistic missile, ph. ప్రాక్షేపిక క్షిపణి; ఈ రకం క్షిపణికి మొదట్లో కొద్దిగా తోపు ఇచ్చి ఒదిలెస్తారు; అటుపైన రాయి ప్రయాణం చేసినట్లే క్షిపణి నూటన్‍ సిద్ధాంతానికి తల ఒగ్గి ప్రయాణం చేస్తుంది; +* ballistics, n. రివ్వున విసరిన వస్తువుల స్థితిగతులని అధ్యయనం చేసే శాస్త్రం; ప్రాక్షేపిక శాస్త్రం; +* balloon, n. బుంగ; గుమ్మటం; గాలి గుమ్మటం; పొగ గుమ్మటం; బెలూను; +* ballot, n. ఓటు; ఓటు కాగితం; సమ్మతి పత్రం; ఎన్నికలలో అభిప్రాయ సేకరణకి వాడే సాధనం; +* ballpark, n 1) బంతులబీడు; బంతాట ఆడే స్థలం 2) ఉరమర లెక్క; +* balm, n. విలేపం; పరిమళ ద్రవ్యం; ఉపశమనానికి శరీరంపై పూసుకునేది; +* balsam, n 1) కాశీ తుమ్మ; నీలిగోరింట 2) సాంబ్రాణి; +* ban, n. వెలి; వెలి వేయడం; బహిష్కరణ; బహిష్కరణాజ్ఞ; నిషేధ ప్రకటన; +types of banana, ph. కొమ్మరటిపండు; పచ్చరటి; అమృతపాణి; కర్పూర చక్రకేళి; వామన చక్రకేళి; కొండ అరటి; బొంత అరటి; మొ. +* band, n 1) పట్టీ; కట్టు; దట్టి; బంధము; బంధనం; పటకా 2) మూక; మేళం; జట్టు; ద���ం 3) తూర్యనాదాలు; బేండుమేళం; +* bandage, n. కట్టు; గాయానికీ కట్టే కట్టు; +* bandicoot, n. పందికొక్కు; దిబ్బకొక్కు; +* bandit, n. బందిపోటు దొంగ; పట్టపగటి దొంగ; సాయుధుడయిన దొంగ; పశ్యతోహరుడు; +* bandwidth, n. వాహికావ్యాసం; వాహినీవిస్తారం; పట్టీ పన్నా; పట్టీ యొక్క వెడల్పు; విద్యుత్‍ వలయాలని అధ్యయనం చేసే సందర్భంలో పుట్టిన మాట ఇది. ఒక తీగ గుండా విద్యుత్‍ వాకేతాలు పంపినప్పుడు ఆ వాకేతాలలోని కొన్ని తరంగాలు చెక్కు చెదరకుండా ఇద్దరి నుండి అద్దరి చేరుకుంటాయి. అలా చేరుకున్న తరంగాల గరిష్ఠ తరచుదనం నుండి కనిష్ఠ తరచుదనాన్ని తీసివేస్తే వచ్చే "తరచుదనపు పట్టీ" యొక్క పన్నా; కలన యంతలు వచ్చిన తరువాత విద్యుత్‍ వాకేతాలని సున్నలతోటీ, ఒకట్ల తోటీ సూచించడం వాడుకలోకి వచ్చింది. పైన చెప్పిన తరచుదనం పట్టీ యొక్క పన్నా పెరిగే కొద్దీ ఆ రహదారి మీద క్షణంలో ఎక్కువ సున్నలని, ఒకట్లని పంపగలిగే సామర్ధ్యం పెరుగుతుంది. కనుక ఆ సామర్ధ్యానికి వాడే కొలమానాన్ని కూడా "పట్టీ పన్నా" అనే అంటారు; +* bang, v. t 1) బాదు; మోటుగా కొట్టు 2) గట్టిగా చివాట్లు పెట్టు; +* bangle, n. గాజు; ముంజేతికి వేసుకునే కడియం వంటి ఆభరణం; +* bangs, n. pl. ముంగురులు; కుంతలాలు; చూర్ణకుంతలములు; నుదురు మీద పడే జుత్తు; +* banians, n 1 Ind. Eng వైశ్యులు; కోమట్లు; వర్తకులు; మర్రి చెట్టు కింద కూర్చుని వ్యాపారం చేసేవారు 2 Ind. Eng బనీనులు; లోపల వేసుకొనే పొట్టి చేతుల జుబ్బాలు; tee shirts; under vests; +* banish, v. t. వెడలగొట్టు; తరుము; తగిలివేయు; దేశము నుండి వెళ్ళగొట్టు; బహిష్కరించు; +* bank, n 1) తీరము; నది ఒడ్డు; గట్టు; తటి; దరి; కరకట్ట; కూలం rel shore 2) బ్యాంకు; కోఠీ; ధనాగారము; పేఠీ; ఆర్ధిక సంస్థ 3) వరస; +blood bank, ph రక్తపు కోఠీ; రక్తపు పేఠీ; రక్తపు బ్యాంకు; +* bank, v. i. కైవాలు; పక్షులు, విమానాలు, కార్లు, మొదలయిన వాహనాలు మలుపు తిరిగేటప్పుడు పక్కకి ఒరుగుట; +* bank, v. t 1) బ్యాంకు వ్యవహారములు చూసుకొను 2) ఆధారపడు; +* bankruptcy, n. దివాలా; దివాలా ఎత్తడం; దివాలా తియ్యడం; +* banner, n. జెండా; పతాకం; ధ్వజం; బావుటా; పడిగె; +* banter, n. పిచ్చాపాటీ; బాతాకానీ; లోకాభిరామాయణం; +* banquet, n. విందు; అట్టహాసమైన విందు; ఆమిత; ఆవెత; +* banyan tree, n. మర్రి చెట్టు; వట వృక్షం; న్యగ్రోధం bot Ficus Benghalensis ety బనియాలు ఈ చెట్ల క్రింద కూర్చుని వ్యాపారం చేసేవారు కనుక పాశ్చాత్యులు ఈ పేరు పెట్టేరు; +* baptism, n జ్ఞానస్నానం; క్రైస్తవ మతంలో "బారసాల" వంటి కార్యక్రమం; +* bar, n 1) కమ్మీ; కడ్డీ; కంబీ; దండం; పట్టీ; శలాకం 2) పానశాల; గంజిక; మద్యశాల; ఆసవ గోష్ఠిక; +bar magnet, ph. అయస్కాంతపు కడ్డీ; దండాయస్కాంతం; శలాక అయస్కాంతం; +* bar, v. t. అడ్డగించు; నిరోధించు; నిషేధించు; +* barb, n. ముల్లు; ముళ్ల కర్ర; చిల్లకోల; కంటకం; +* barbarian, n 1) అనాగరిక వ్యక్తి; మోటు మనిషి 2) మ్లేచ్ఛుడు; +* barber, n. మంగలి; దివాకీర్తి; అంతావశాయి; క్షురకర్మ చేసే వ్యక్తి; m. క్షురకుడు; అంబష్ఠుడు; +* bard, n. కవి; దాసరి; పాటలు పాడే కవి; +* bare, adj 1) ఖాళీ, ఉత్త; రిక్త 2) నగ్న; దిగంబర 3) మొండి; ఎండిన; మొక్కపోయిన; +* bare-handed, adj. ఉత్త చేతులతో; ఖాళీ చేతులతో; రిక్త హస్తాలతో; +* barge, n. బల్లకట్టు; సరుకులు మోసే పడవ; +* baritone, n. బొంగురు గొంతుక; మగ గొంతుక; గంభీర నాదం; మందర స్వరం; +* barn, n. సాల; శాల; పశువుల సాల; పొలంలో పాక; కొట్టాం; +* barnacle, n. నత్త వంటి గుల్ల గల సముద్రజీవి; ఇవి పడవల అడుగు భాగాలకి అంటుకుని కనిపిస్తాయి; +* barnstorming, n. ఎన్నికల ప్రచారం కొరకు సుడిగాలిలా దేశం నాలుగు చెరగులా తిరగడం; +* barograph, n. భారలేఖిని; వాతావరణ పీడనంలోని మార్పులని కలంతో కాగితంమీద నమోదు చేసే పనిముట్టు; +* barometer, n. భారమితి; భారమాపకం; వాతావరణ పీడనాన్ని కొలిచే పనిముట్టు; +* baron, n. జమీందారు; చిన్న సామంత ప్రభువు; +* baroscope, n. భారదర్శిని; వాతావరణ పీడనాన్ని దృశ్యమానంగా చూపే పనిముట్టు; +* barracks, n. బారకాసులు; వసారా ఇళ్ళు; సైనికులు నివసించే వసారా ఇళ్ళు; +barrage of questions, ph. పుంఖానుపుంఖంగా వచ్చే ప్రశ్నలు; ప్రశ్నా పరంపర; ప్రశ్నల వర్షం; +* barrier, n. ఆటంకం; అగడ్త; అవరోధం; అడ్డు; అడ్డంకి; హద్దు; +* barricade, n. తాత్కాలికంగా కట్టిన అడ్డంకి; పోలీసులు, రహదారి పనివారు జన వాహన సందోహాలని అదుపులో పెట్టడానికి ఇటువంటి అడ్డంకులు కడుతూ ఉంటారు; +* bartender, n. కబ్బలి కబ్బలికాడు; ధ్వజుడు; పానుడు; పానశాలలో మద్యపానాలు కలిపి అమ్మేవాడు; +* bartizan, n. బురుజు; కోట బురుజు; కోట గోడకి బయట వేల్లాడే బురుజు; +* basal, adj. మూల; మౌలిక; ఆధారభూతమైన; పీఠాత్మక; పునాదియైన; కనీసపు; +basal ganglion, ph Anat మూల గుచ్ఛం; మెదడు పీఠంలో ఉండే ఒక ప్రత్యేకమైన కణజాలం; +basal granule, ph Anat పీఠ రేణువు; మెదడు పీఠంలో ఉండే ఒక ప్రత్యేకమైన కణం; +base metal, n. కుప్యలోహం; కుప్యం; క్షుద్ర లోహం; ఉ. ఇనుము; సీసం; +* base, n 1) అంశ 2) మూలం; ఆధారం; ధాతువు 3) మట్టు; మట్టం; అడుగు భాగం; పీఠం; పునాది; భూమి 4) క్షారం; భస్మం; లవణాధారం; +base forty, ph math ఖవేధాంశ; అష్టాంశ, దశాంశ పద్ధతులలాగే 40 గుర్తులతో లెక్కించే పద్ధతి; +base sixteen, ph math షోడశాంశ; అష్టాంశ, దశాంశ పద్ధతులలాగే 16 గుర్తులతో లెక్కించే పద్ధతి; +base ten, ph math దశాంశ; 10 గుర్తులతో లెక్కించే పద్ధతి; +base thirty, ph math త్రింశాంశ; అష్టా���శ, దశాంశ పద్ధతులలాగే 30 గుర్తులతో లెక్కించే పద్ధతి; +base twelve, ph math ద్వాదశాంశ; అష్టాంశ, దశాంశ పద్ధతులలాగే 12 గుర్తులతో లెక్కించే పద్ధతి; +base twenty, ph math వింశాంశ; అష్టాంశ, దశాంశ పద్ధతులలాగే 20 గుర్తులతో లెక్కించే పద్ధతి; +* basement, n. నేలమాళిగ; భూగృహం; భూమట్టానికి దిగువున ఉండే గది; +* basic, adj 1) క్షారాత్మక; భాస్మిక 2) మౌలిక; ప్రాథమిక; మూలమైన; ముఖ్యమైన 3) కనీసపు; see also basal; +basic education, ph. కనీసపు విద్య; మౌలిక విద్య; ప్రాథమిక విద్య; +* basin, n 1) పళ్లెం; కొప్పెర; హరివాణం; కరోటి; వెడల్పు మూతి ఉన్న పాత్ర 2) ఆయకట్టు; ఆరగాణి 3) ఆవాపం; కుదురు; +* bask, v. i 1) చలికాచుకొను; వెచ్చగా ఉండు (2) ఆనందించు note) చలి దేశాలలో ఉన్న వారికి వెచ్చగా ఉండగలగడమే ఆనందదాయకం; +bass relief, ph. శిలాఫలకం; ఉబ్బెత్తు చిత్రం; +* bassinet, n. తొట్టి; పసి పిల్లలని పడుక్కోబెట్టే తొట్టి; +* bastard, n. లంజాకొడుకు; కాణేలిమాతృఁడు; కంతిరీ కొడుకు; పెళ్ళి కానివారికి పుట్టిన బిడ్డ; సర్వసాధారణమైన పరిస్థితులలో తిట్టుగా ఉపయోగించబడినా, అప్పుడప్పుడు ముద్దుగా వాడడం కూడా కద్దు; +* baste, v. t 1) తడిపిపెట్టు; తడుపు; పిండిని కాని, మరేదయినా తినే పదార్థాన్ని కాని, నీళ్లతో కాని, నూనె నెయ్యిలతో కాని తడిపి నానబెట్టడం 2) పోగు వేయు; బట్టలని మిషను మీద కుట్టే ముందు పోగు వేయు; +* bastion, n. బురుజు; కోట బురుజు; కొత్తళం; +* bat, n 1) గబ్బిలం; ఋషిపక్షి 2) గోటీ; బేటు; +* bat and pellet, ph. గోటీబిళ్ల; బిళ్ళం గోడు; పిల్లలు ఆడుకునే ఒక ఆట; +* batch, n 1) వాయి; వంట, వార్పులలో ఒక తూరి వండిన వంటకం 2) జట్టు; కొంతమంది మనుష్యులని కాని, వస్తువులని కాని ఒక తూరి తీసుకొనడం; +* bath, n 1) స్నానం; జలకం; మజ్జనం 2) స్నానపు తొట్టి; మజ్జనపు తొట్టి 3) మజ్జని; +* bathe, v. t బేద్) స్నానం చేయించు; నీళ్లు పోయు; ద్రవంలో ముంచు; +* bathos, n. ఉదాత్తమైన స్థితి నుండి సామాన్యమైన స్థితికి దిగజారిపోవడం; +* bathroom, n. స్నానాలగది; స్నానాగారం; +* baton, n బటాన్) దండం; కోల; చిన్న కర్ర; లాఠీ; లోడీ; +* battalion, n. పటాలం; దండు; సిపాయిల దండు; సైన్యంలో కొన్ని దళముల సమూహం; +* batter, n 1) జారుగా తడిపిన లేక రుబ్బిన పిండి; ఇడ్లీ పిండి, దోసెల పిండి, వగయిరాలలా కలిపిన పిండి; see also dough 2) చోవి; బూర్లు; బొబ్బట్లు మొదలయిన వంటకాలలో పూర్ణంపైన పెట్టే ఆచ్చాదనం 3) ఆటలలో గోటీతో బంతిని కొట్టే ఆటగాడు; +* battery, n 1) మాల; ఘటమాల; విద్యుత్తును పుట్టించే సాధనం 2) ఆహతం; చట్ట విరుద్ధంగా మరొక వ్యక్తిని చేత్తోకాని, మరేదయినా ఆయుధంతో కాని కొట్టడం, గుద్దడం, బాదడం; +* battlefield, n. రణ రంగం; రణస్థ���ం; కదన రంగం; యుద్ధభూమి; +* bay, n 1) అఖాతం; ఉపసాగరం; సముద్రోపకంఠం; భూభాగం లోనికి చొచ్చుకొని వచ్చిన సముద్రం 2) గది; కొట్టు; +* bay leaves, n. ఆకుపత్రి; బిరియానీ వంటలో వాడే ఒక సుగుంధ ద్రవ్యం; +* bayou, n చిల్ల మొక్కలతోటీ, బురద తోటీ నిండిన కయ్య అనే అర్థంలో అమెరికాలో వాడుక ఎక్కువ; +* Bayur tree, n. కర్ణికార వృక్షం; కనకసంపంగి చెట్టు; +* beach, n. చెలియలికట్ట; సైకతస్థలి; బీచి; +* beak, n. పక్షి ముక్కు; చంచువు; త్రోటి; +* beaker, n. ముక్కుపాత్ర; గాజు కలశం; ప్రయోగశాలలో వాడే ముక్కు ఉన్న గాజు కలశం; ఒంపడానికి వీలుగా జారీ ఉన్న పాత్ర; జారీ చెంబు; గిండీ చెంబు; గరిగె; +* beam, n 1) దూలం; తనాబీ; వాసం; దండం; కాడిమాను 2) వారం; పుంజం; +beam of light, ph. కిరణ వారం; కాంతి పుంజం; తేజఃపుంజం; కిరణజాలం; +* beam, v. i. తల పంకించు; చిరునవ్వుతో తల ఆడించు; +* bean, n. చిక్కుడు; చిక్కుడు కాయ; చిక్కుడు గింజ; +* bear, n. ఎలుగుబంటి; ఎలుగుగొడ్డు; ఎలుగు; భల్లూకం; రుక్షం; +* bear, v. i 1) భరించు; తాళు; తాల్చు; సహించు; ఓర్చు; వహించు; నిభాయించుకొను 2) మోయు; ధరించు 3) కను 4) ఈను 5) కాయు; +* beast, n. గొడ్డు; మృగం; జంతువు; పశువు; +* beat, n. తాళం; లయ; దెబ్బ; స్పందన; విస్పందనం; +* beat, v. t 1) కొట్టు; తాటించు; వాయించు; ఉతుకు 2) చితగ్గొట్టు; చావగొట్టు 3) గిలక్కొట్టు 4) రెక్కలు ఆడించు 5) ఉతుకు; బాదు; ఏకు; +* beaten path, ph. నలిగిన దారి idiom] పాత చింతకాయ పచ్చడి; చర్వితచర్వణం; +* beau, n. m 1) చెలికాడు; మగ స్నేహితుడు 2) ధనవంతుడైన సొగసుగాడు; +* beautiful, adj. అందమైన, చక్కని; రమణీయమైన; సురుచిర; భువనమోహన; సుందర; సౌందర్య; +* beautifully, adv. అందంగా; చక్కగా; నదురుగా; రమణీయంగా; భువనమోహనంగా; +* beauty, n. అందం; సొగసు; సౌందర్యం; ఇంపు; ఇంపితం; సోయగం; చెలువం; చెన్ను; చక్కదనం జిగ; బిగి; హొయలు; డాలు; +* beckon, v. t. చేతితో కాని, తలతో కాని, కంటితో కాని రమ్మని సంజ్ఞ చెయ్యడం; +* bed, n 1) పరుపు, పక్క; పానుపు, శయ్య; మంచం మీద పరచిన పరుపు; తల్పం; సెజ్జ 2) మంచం; పడక; బిచానా 3) భూతలం; సంస్తరం; +* bedlam, n 1) గోల; గందరగోళం; చేపల బజారు 2) పిచ్చాసుపత్రి; +* bee, n. తేనెటీగ; మధుమక్షికం; భ్రమరం; తుమ్మెద; పెరీగ; అలి; +* beech, n. కానుగ; కానుగ చెట్టు; కరంజం; +* beef, n. గొడ్డుమాంసం; ఆవుమాంసం; పెద్దపొల; +* beehive, n. తేనెపట్టు; తేనెగూడు; పెర; అలిల్లు; అలికులం; +* bee's wax, n. మైనం; సిక్థం; మధూచ్ఛిష్టం; అలిమైనం; +* bee-stings, n. జన్నుపాలు; ముర్రుపాలు; ఆవు ఈనిన కొత్తలో వచ్చే పాల రసాయన సమ్మిశ్రమం తర్వాత వచ్చే పాలలా ఉండదు; +* before, adv. మునుపు; ఇంతకు ముందు; పూర్వం; గతంలో; +* beg, v. i. బతిమాలు; వేడుకొను; ప్రార్థించు; తిరిపమెత్తుకొను; +* beg, v. t. ముష్టియెత్తు; బిచ్చమెత్తు; +* beggar, n. f. ముష్టిది; ముష్టి పిల్ల; బిచ్చగత్తె; యాచకి; +* beggar, n. m. ముష్టివాడు; బిచ్చగాడు; యాచకుడు; బికారి; +* begin, v. t. ఆరంభించు; ప్రారంభించు; మొదలు పెట్టు; ఉపక్రమించు; అంకురార్పణ చేయు; +* beginning, n. ఆరంభం; ప్రారంభం; మొదలు; మొదట; ముందర; తొలుత; అంకురార్పణ; ఆది; ఉపక్రమణ; +* being, n. అస్తిత్వం; ఉండడం; బతకడం; జీవించడం; +* Bellatrix, n. పరివృత్త నక్షత్రం; మృగశిర (ఒరాయన్) రాశిలో ప్రకాశవంతమైన తారలలో మూడవ స్థానంలో ఉన్న నక్షత్రం; +* bell peppers, n. బుట్టమిరపకాయలు; సిమ్లా మిరపకాయ; కారం లేని మిరపకాయలు; కేప్సికం: అనేక రకాల మిరపకాయలు ఉండటం వల్ల వీటికి ప్రతి దేశంలోను వేర్వేరు పేర్లు ఉన్నాయి; +* bellows, n. కొలిమితిత్తి; భస్తిక; +* belongings, n. pl. తట్టుముట్లు; పెట్టె-బేడా; ఒక వ్యక్తికి చెందిన వస్తుజాలం; +* below, adv. కింద; కిందుగా; అడుగున; తక్కువ; తక్కువగా; +* belt, n 1) పటకా; చూషం; దట్టి; పట్టెడ; బెల్టు 2) ఉదర బంధం; కలాపము; +* bemoan, v. t. విచారించు; ఏడ్చు; సంతాప పడు; దుఃఖించు; +* Benetnash, n. మరీచి నక్షత్రం; గరిట ఆకారంలో ఉన్న సప్తర్షి మండలంలో కాడకి తూర్పు దిక్కుగా ఉన్న తార; also called Alkaid; +* bench, n 1) బల్ల; కవాచీబల్ల; బెంచీ; బెంచీబల్ల 2) న్యాయస్థానం; ధర్మాసనం; న్యాయాసనం; +* beneath, adv. కింద; కిందుగా; అడుగున; తక్కువ; తక్కువగా; +* benediction, n. ఆశీర్వచనం; ఆశీర్వాదం; ఆశీస్సు; స్వస్తి; స్వస్తివాచకం; +* beneficiary, n. అనుభోక్త; అనుభవించే వ్యక్తి; లాభం పొందే శాల్తీ; +* benevolent, adj. దయగల; ఉపకార బుద్ధిగల; ఔదార్యపూరిత; +* bent, n. అభిరుచి; ఇష్టత; ఆసక్తి; +benzene ring, గొగ్గి చక్రం; షడ్భుజి ఆకారంలో ఉండి ఏకాంతర స్థానాలలో జంటబంధాలతో ఒప్పారే నిర్మాణ క్రమం ఉన్న సగంధ ఆంగిక రసాయనం; +* bereaved, adj. నష్టపోయిన; పోగొట్టుకున్న; +* bereaved family, ph. ప్రాణ నష్టం వల్ల దుఃఖిస్తూన్న సంసారం; +* beret, n బెరే) టోపీ; గుడ్డతో చేసిన టోపీ; +* berserk, adj బిసర్క్) కోపోద్రిక్త, అనియంత్రిత; అదుపు తప్పిన; +* besiege, v. t. ముట్టడించు; ముట్టడి చేయు; చుట్టూ గుమిగూడు; +* best, adj. శ్రేష్టమయిన; అత్యుత్తమ; +* beta, n 1) గ్రీకు వర్ణమాలలో రెండవ అక్షరం 2) మొలక స్థాయి; క్షుణ్ణంగా పరీక్షలు అన్నీ పూర్తి చెయ్యకుండానే ప్రజాదరణ ఎలా ఉండో చూద్దామనే ఉద్దేశంతో విపణి వీఢిలో విక్రయానికి పెట్టిన వస్తువు; +betel nut palm, ph. పోకచెట్టు; క్రముకచెట్టు; గువాకచెట్టు; +* Betelgeuse, n బీటెల్‌జూస్) ఆర్ధ్రా నక్షత్రం; దీని మరొక పేరు Alpha Orionis అనగా ఒరాయన్ (మృగవ్యాధుడు) రాసిలో అత్యధిక తేజస్సుతో ప్రకాశించే తార; ఇది మనకి 640 కాంతి సంవత్సర��ల దూరంలో ఉంది; రాబోయే మిలియను సంవత్సరాల కాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ తార పేలిపోయి బృహన్నవ్య తార (supernova) గా మారిపోతుందని శాస్త్రవేత్తల అంచనా; +* betrayer, n. ద్రోహి; కావైరి; కాపురుషుడు; +* better, adj. మరియొకదాని కంటే మేలైన; పూర్వపు స్థితి కంటే మెరుగైన; +* beverage, n. పానీయం; పానం; సాధారణంగా మద్యం కలవని పానీయం అని అర్థం; +* beware, v. i. జాగ్రత్తగానుండు; అప్రమత్తతతోనుండు; +* bewilderment, n. దిగ్భ్రమ; దిగ్భ్రాంతి; కలవరపాటు; గాభరా; కర్తవ్యం తోచని పరిస్థితి; వ్యగ్రత; +* bezoar, n. గోరోచనం; నెమరు వేసే జంతువుల ఆహారనాళంలో జుత్తు వంటి పదార్థంతో చిక్కులు పడి ఉండలు కట్టిన గట్టి రాయి వంటి పదార్థం; పురాతన భారతదేశం లోనూ, చైనా లోనూ గోరోచనాన్ని మందుల తయారీలో వాడేవారు; +* bi-concave, adj. ద్వినతోదర; ద్విపుటాకార; యుగళనతోదర; +* bier, n. పాడె; శవాన్ని శ్మశానానికి తీసికెళ్లే వాహనం; +* biased, adj. పక్షపాతమైన; ఒక వైపు మొగ్గు చూపించే; +* bib, n. బిడ్డల చొల్లు గుడ్డ; తినే ఆహారం బట్టల మీద పడకుండా మెడకి కట్టుకునే గుడ్డ; +* bibliography, n. ఉపప్రమాణాలు; ఉపయోగపడ్డ గ్రంథమాల; సంప్రదించిన మూల పత్రాలు; +* bicentennial, n. ద్విశతజయంతి; రెండు వందల సంవత్సరాల జన్మదినోత్సవం; +* biceps, n. ద్విశిరం; ద్విశిర కండరం; జబ్బలో ఉండే కండరాలలో ఒకటి; +* bicycle, n. సైకిలు; రెండు చక్రాల సైకిలు; +* bid, n. కొనడానికి ఒప్పుకున్న ధర; ఏలం పాటలో పాడిన ధర; +* biennial, adj. ద్వైవార్షిక; ద్వివార్షిక; రెండేళ్లకి ఒకసారి; +* bifid, adj. ద్విశాఖీయ; రెండు కొమ్మలుగల; +* bifoliate, adj. ద్విపర్ణిక; ద్విపర్ణి; రెండు ఆకులుగల; +* Big Bang, n. మహా విస్పోటం; పెనుపేలుడు; బృహత్ విస్పోటం; బృహత్ విస్తరణ (Big Bang సృష్టి కార్యం మొదలయినప్పుడు విశ్వవ్యాప్తంగా జరిగిన పేలుడు వంటి విస్తరణ; +Big Bang Theory, ph. బృహత్ విస్తరణ వాదం; బృహత్ విస్ఫోట వాదం; బ్రహ్మాండ విచ్ఛిన్నవాదం; హఠాత్ పరిణామ వాదం; విశ్వ పరిణామవాదం; మొదట్లో బిందు ప్రమాణంలో ఉన్న విశ్వం ఎలా విస్తరించి ప్రస్తుత పరిస్థితిలోకి ఎలా పరిణతి చెందిందో చెప్పే వాదాలలో ప్రస్తుతానికి బాగా చలామణీలో ఉన్న వాదం; +* bigot, n. అసహని; తన జాతి మీద కాని, కులం మీద కాని దురభిమానం చూపుతూ మిగిలిన వర్గాలని ద్వేషించే వ్యక్తి; +* bilabial, adj ling ఉభయోష్ఠ్య; రెండు పెదవులకి సంబంధించిన; +* bilabials, n ling ఉభయోష్ఠ్యములు; రెండు పెదవులతోటీ ఉచ్చరించేవి; ఉదా, ప, బ, మ; +* bilateral, adj. ద్విపార్శ్వ; ద్విపక్ష; ఉభయ పక్ష; +* bile, n. పిత్తం; పైత్యరసం; కాలేయం చేత స్రవించబడే పసుపు పచ్చని జీర్ణరసం; +* bilingualism, n. ద్వ��భాషితం; రెండు భాషలలో ప్రావీణ్యత; +* bill, n 1) పత్రం; ఇవ్వవలసిన సొమ్ము చూపే చీటీ; హుండీ; బరాతం rel receipt 2) చిత్తు చట్టం 3) పక్షియొక్క ముక్కు; +* billion, n. శతకోటి; వెయ్యి మిలియనులు; అమెరికాలో ఒకటి తర్వాత తొమ్మిది సున్నలు చుడితే వచ్చే సంఖ్య; బ్రిటన్‌లో ఒకటి తర్వాత పన్నెండు సున్నలు చుడితే వచ్చే సంఖ్య; +* bimonthly, adj. ద్వైమాసిక; రెండు నెలలకి ఒకసారి; +* bin, n. కొల్లం; బుట్ట; తొట్టి; గాదె; +* binary, adj. ద్వియాంశ; జంట; యగ్మ; ద్విపద; ద్విభాగశీల; +binary code, ph math ద్వియాంశ సంక్షిప్తం; ద్వియాంశ కోడు; +binary coding, ph math ద్వియాంశ సంక్షిప్తీకరణ; ద్వియాంశ కోడీకరణ; +* bind, v. t. కట్టు; నిర్బంధించు; జతపరచు; జిల్లుకట్టు; +* binomial, adj. ద్విపాద; ద్వంద; ద్వి; ద్వినామీ; రెండు పేర్లుగల; +binomial nomenclature, ph. ద్విపాద నామకరణం; ద్వినామీ నామకరణం; మొక్కలకి, జంతువు లకి, అనుమానానికి ఆస్కారం లేకుండా, శాస్త్రీయమైన పద్ధతిలో పేర్లు పెట్టే పద్ధతి; ఈ పద్ధతి ప్రకారం ప్రతి జీవికి రెండు నామాలు ఉంటాయి. మొదటిది ప్రజాతి (genus రెండోది జాతి (species ఉదా. Anannas sativum; +* biochemistry, n. జీవరసాయనం; జీవరసాయన శాస్త్రం; ప్రాణి శరీరంలో జరిగే రసాయన ప్రక్రియలని అధ్యయనం చేసే శాస్త్రం; +* biodiversity, n. జీవవైవిధ్యం; ఈ ప్రపంచంలో ఉండే ప్రాణికోటిలో కనిపించే భిన్నత్వం; +cell biology, ph. కణ జీవశాస్త్రం; జీవకణాలలో ఉండే భాగాలని అధ్యయనం చేసే జీవశాస్త్రం; +molecular biology, ph. బణు జీవశాస్త్రం; బణువుల స్థాయిలో అధ్యయనం చేసే జీవశాస్త్రం అనగా, DNA ల స్థాయిలో; +* bipedal, n. ద్విపాది; రెండు పాదాలు కలది; +* bipolar, adj 1) ద్విధ్రువ; ఉత్తర, దక్షిణ ధ్రువాల మాదిరి కాని, ధన, రుణ తత్త్వాలు ఉన్న అంశాలు కాని 2) ద్వైధీభావం; రెండు విభిన్న మానసిక ఉద్రేకాలు ఒకే సారి అలుముకున్న స్థితి; +bipolar disorder, ph med మనస్సు ఉల్లాసం, విచారము అనే రెండు ఉద్వేగాల మధ్య ఊగిసలాడే మనోవ్యాధి; +bipolar signal, ph elec ద్విధ్రువ వాకేతం; సున్నలని, ఒకట్లని సూచించడానికి వాడే రకరకాల చతురస్ర విద్యుత్‍ తరంగాలలో ఒక రకం; +* birch tree, n. కొండరావి; భూర్జం; భుజపత్రి చెట్టు; బహుత్వచి; +* bird, n. పక్షి; పిట్ట; ఖగం; ఖచరం; విహంగం; పతంగం; +bird flu, ph. ఒక రకం ఇన్‍ప్లుయెంజా పేరు; ఇది HPAIA (H5N1 )అనే పేరుగల విషాణువు వల్ల వచ్చే జబ్బు; ఇది 2003 లో మొదటిసారి ప్రజలలో కనిపించింది; +* bird lime, ph. సప్తనళి; పక్షులను పట్టుకునేందుకు కొమ్మలకు, వలలకు పూసే జిగురు పదార్థము; +* birth, n. జననం; పుట్టుక; జన్మ; ప్రభవం; ఆవిర్భావం; ప్రాదుర్భావం; ఉద్గతి; ఉద్గమం; +birth control, ph. కుటుంబ నియంత్రణ; గర్భ న��రోధం; సంతాన నిరోధం; +birth order, ph. ఒకరి సంతానంలో ఒక వ్యక్తి ఎన్నవవాడో చెప్పే సంఖ్య; +* birthday, n. పుట్టినరోజు; జన్మదినం; +* bis, pref. twice; రెండు సార్లు అని చెప్పడానికి వాడే పూర్వప్రత్యయం; +* bisection, v. t. ద్విఖండనం; సమద్విఖండనం; రెండు సమభాగాలు చెయ్యడం; +* bisector, n. ద్విఖండిక; సమద్విఖండన రేఖ; ద్విభాజకం; విదళన రేఖ; రెండు సమభాగములు చేసేది; +* bit, n 1) పోచ; లేశం; పిసరు; ముక్క; తునక; తుత్తునక; ఖండము; చిధ్రువ; అరవర 2) ద్వింకం; ద్వియాంశ అంకం; సున్న, ఒకటి; +* bitch, n 1) ఆడకుక్క 2) శీలం లేని స్త్రీ; లంజ; +* bittern, n 1) కారుప్పునీళ్ళు; కారుప్పు 2) తుంపొడి పక్షి; +* biweekly, adj. పక్ష; రెండు వారాలకి ఒకసారి note) వారానికి రెండుసార్లు అనేది తప్పు అర్థం; +* blab, n. ఆలోచన లేకుండా మాట్లాడే వ్యక్తి; +* blabbermouth, n. వదరుపోతు; వాగుడుకాయ; వాతరట్టి; అధికప్రసంగి; ఆలోచన లేకుండా మాట్లాడే వ్యక్తి; +* black, adj. నలుపైన; నల్లని; కాల; కృష్ణ; అసిత; కర్రి; స్నిగ్ధ; శ్యామ; +black lamp, ph. కంటికి కనబడని అత్యూదకాంతిని వెదజల్లే దీపం; చీకటిలో ఈ రకం దీపం వేసి చూస్తే మామూలు కాంతిలో కనబడని బొల్లి మచ్చలు స్పుటంగా కనిపిస్తాయి; +black cotton soil, ph. నల్లరేగడి మట్టి; నల్ల రేగడి మన్ను; కృష్ణమృత్తిక; +* blackwood, n. ఇరుగుడు కర్ర; విరుగుడు చేవ; +* bladder, n 1) సంచి 2) ఆశయం 3) తిత్తి 4) మూత్రాశయం; ఉచ్చబుడ్డ; +* blame, n. తప్పు; నింద; నిష్ఠూరం; గర్హణము; దూరు; +* blame, v. t. తప్పుపట్టు; నిందించు; నేరారోపణ చేయు; నిష్టూరం వేయు; గర్హించు; దూరు; దెప్పు; +* blameworthy, n. గర్హనీయం; నిందావహం; నింద్యం; దూష్యం; +* blanched, adj 1) తెల్లబరచిన; పొట్టుతీసిన; చలువ చేసిన 2) మరుగుతున్న నీళ్లల్లో కొంచెం సేపు ముంచబడ్డ; +* bland, adj. అలంకారం లేని; రుచి లేని; చప్పని; చప్పిడి; +bland diet, ph. చప్పిడి ఆహారం; చప్పిడి పత్యం; +* blandish, v. t. భట్రాజు పొగడ్తలు చేయు; ముఖ స్తుతి చేయు; తైరు కొట్టు; +* blank, adj 1) ఖాళీ; రాత లేని 2) అలంకరణ లేని; బోడి 3) కళవళికలు లేని; +blank verse, ph. లఘువు, గురువు, ఐదు వరుసగా వచ్చి, అంత్యానుప్రాస లేని పాదాలతో కూడిన ఇంగ్లీషు పద్యం; +* blank, n 1) బోడి; ఖాళీ 2) ఖాళీ కాగితం 3) వాక్యంలో మాట రాయకుండా ఖాళీగా వదిలేసిన స్థలం; +* blanket, n 1) దుప్పటి; కంబళి 2) దట్టంగా కప్పిపుచ్చినది; +* blasphemy, n. దైవదూషణ; అనరాని మాట; చెయ్యరాని పని; +* bleach, v. t. బట్టలు చలువచేయు; తెలుపుచేయు; +bleeding edge technology, ph. ఉడుకుతూన్న సాంకేతిక విద్య; ఇంకా పరిపక్వం చెందని కొత్త విద్య; +* blessing, n. ఆశీర్వాదం; ఆశీస్సు; దీవెన; స్వస్తి; +* blinders, n. గంతలు; గుర్రాలకీ, గానుగెద్దులకీ కళ్ళకి కట్టే మూతలు; +* blinds, n. pl 1) ��ిటికీలకి వేసే ఒక రకం తెరలు 2) కళ్లకి కనబడకుండా కట్టే గంతలు; +* blink, v. t. మిటకరించు; చీకిరించు; చికిలించు; +* blinkers, n 1) గంతలు; కళ్లకి కట్టే గంతలు 2) మిటకరించే దీపాలు; చీకిరి దీపాలు; +* bliss, n. ఆనందం; మహదానందం; బ్రహ్మానందం; చిద్విలాసం; +* blister, n. బొబ్బ; పొక్కు; నీటితో నిండిన పొక్కు; +* block, v. t. అడ్డు; అడ్డగించు; అడ్డుపడు; అవరోధించు; +* blockade, n. దిగ్బంధం; లోనికీ బయటకూ వెళ్ళకుండా అన్ని వైపులా బంధించడం; +* blog, n. అభివేదిక; వ్యక్తిగత అభిప్రాయ వేదిక; సంపాదకుని వంటి మరొక వ్యక్తి వడపోతకి, అనుమతికి సంబంధం లేకుండా ఎవరికి వారే వారి అభిప్రాయాలని అంతర్జాలం ద్వారా ప్రచురించుకోడానికి ఒక సాధనం; +* blond, adj. మొక్కజొన్న పీచు వంటి బంగారపు రంగు కాని, తెల్లటి రంగు కాని జుత్తు గల; +* blond, n. m. మొక్కజొన్న పీచు వంటి బంగారపు రంగు కాని, తెల్లటి రంగు కాని జుత్తు గల మగాడు; +* blonde, n. f. మొక్కజొన్న పీచు వంటి బంగారపు రంగు కాని, తెల్లటి రంగు కాని జుత్తు గల ఆడది rel brunette; redhead; +* blood, n. రక్తం; నెత్తురు; ఎరుపు; రుధిరం; శోణితం; కీలాలం; నల్ల; అసృక్కు; అంకురం; +blood corpuscle, n. రక్త కణం; ప్రవాహంలో తేలుతూ ప్రయాణం చెయ్యగలిగే కణం అయితే దానిని కార్పసుల్ అంటారు; +blood pressure, n. నెత్తురు పోటు; రక్తపు పోటు; రక్తపు పీడనం; +* bloodhound, n. ఉడుపకుక్క; వేటకుక్క; వాసనని పట్టుకుని వేటాడే కుక్క; +* bloom, n 1) తారుణ్యం; పూత 2) ఇనప కడ్డీ; ఉక్కు కడ్డీ; +* blooming mill, ph ఇనప/ఉక్కు కడ్డీలని చేసే కర్మాగారం; +* blouse, n. చేలం; చోలీ; చోళకం; రవిక; జాకెట్టు; +* blowpipe, n 1) ఊదుడు గొట్టం; మంటని మండించడానికి వాడే గొట్టం 2) తిమింగిలం గాలిని పీల్చడానికి వాడే నాళం; +blue moon, ph idiom] అరుదైన సంఘటన; దరిదాపు ఎనభై ఏళ్ళకి ఒకసారి ఒకే నెలలో రెండుసార్లు పూర్ణచంద్రుడు కనిపించే అవకాశం ఉంది. ఆ రెండవ పూర్ణచంద్రుడిని బ్లూ మూన్ అంటారు; +* blues, n 1) విచారగ్రస్థమైన మనోస్థితి 2) ఆఫ్రికా నుండి అమెరికాకి బానిసలుగా వచ్చినవారు పాడుకుంటూ, బాగా ప్రచారంలోకి తీసుకువచ్చిన, విచారగ్రస్థమైన సంగీతపు బాణీ; +* blunt, adj. మొద్దు; నిర్మొహమాటమైన; ఉన్నదున్నట్టు; +* blush, v. i. బుగ్గలు ఎరబ్రారు; సిగ్గుపడు; +wild అడవి పంది; ఘార్జరం; కోరలు ఉన్న పంది; +* board, n 1) మండలి; వర్గం 2) బల్ల; చెక్క 3) వాహనం యొక్క తట్టు; +* boast, v. t. ప్రగల్భాలు పలుకు; గొప్పలు చెప్పు; గప్పాలు కొట్టు; +* boasting, n. స్వోత్కర్ష; గప్పాలు కొట్టడం; +* boatman, n. క్షపణికుఁడు; పడవరి; పడవవాఁడు; +* bobbed, adj. కత్తిరించిన; కురచ చేసిన; +bobbed hair, ph. కత్తిరించిన జుత్తు; కురచ చ��సిన జుత్తు; +* bobtail, n 1) కత్తిరించిన తోక 2) మొండి తోక గల జంతువు; +* body, n 1) శరీరం; ఒళ్లు; ఒడలు; కాయం; దేహం; క్షేత్రం; తనువు; మేను; మై; బొంది; గాత్రం; భౌతిక కాయం; భౌతిక దేహం; కళేబరం 2) వస్తువు; ఘటం 3) వర్గం; సంస్థ; మైతి (మై body. దాని ఔపవిభక్తిక రూపం మైతి. దాన్నే నామవాచకంగా తీసుకోవడమైనది; +body language, ph. హావభావాలు; మాటలతో కాకుండా, అప్రయత్నమైన చేష్టలతో మనోభావాన్ని వెలిబుచ్చడం; +body odor, n. చెమట కంపు; శరీరం నుండి వెడలే దుర్వాసన; +* bog, n. బురదనేల; బాడవనేల; బాడవతోట; +* bogie, n 1) రైలుపెట్టె 2) రైలుపెట్టెని మొయ్యడానికి కావల్సిన చక్రాలు, ఇరుసులు, వగైరా; +* bogus, adj. బూటకపు; దగా; దంభ; దొంగ; కపట; కృత్రిమమైన; +* boil, n. కురుపు; పుండు; వ్రణం; సెగ్గెడ్డ; గుల్ల; పొక్కు; చీముతో కూడిన సంక్రామిక కురుపు rel carbuncle; +* boil, v. t 1) మరిగించు; కాచు 2) ఉడికించు; పొంగించు; క్వథించు; +* boiled, adj. కాగిన; మరిగిన; క్వథిత; కాచిన; ఉడికించిన; నిష్పక్వ; తప్త; +* boiling, adj. కాగుతూన్న; మరుగుతూన్న; మరిగే; ఉడుకుతూన్న; +boiling water, ph. మరుగుతూన్న నీళ్లు; పొంగునీళ్లు; ఉడుకు నీళ్లు; చిట్టుడుకు నీళ్ళు; +bold lettering, ph ముద్ద అక్షరాలు; బొద్దు అక్షరాలు; +* bolt, n. గొళ్లెం; పరిఘ; గెడ; అడ్డ గడియ; అర్గలం (ప్రకృతి అగ్గలం (వికృతి బోల్టు; see also nut; +* bolus, n 1) ముద్ద; కరడు; కడి; గుటిక 2) నెమరువేసేటప్పుడు నోట్లోకి వచ్చే ముద్ద; +* bonanza, n. అకస్మాత్తుగా వచ్చిన సిరి; +* bond, n 1) బంధం; అనుబంధం; కట్టు 2) దస్తావేజు 3) ఒడంబడిక; +bail bond, ph పూచీకత్తు; జామీను పత్రం; ఒక ముద్దాయిని హాజరుపరుచుటకు జామీనుదారులు వ్రాసియిచ్చు పూచీకత్తు; +* bone, n. ఎముక; మక్కె; అస్థి; అస్థిక; శల్యం; +bone black, ph. అస్థ్యంగారం; ఎముకని కాల్చగా వచ్చిన బొగ్గు; +* bonfire, n. తంపటి; పెద్ద మంట; భోగి మంట; ౘలిమంట; +* bonus, n. కొసరు; కొసరు బహుమానం; ఒప్పందం ప్రకారం ఇచ్చే జీతమే కాకుండా పైగా ఇచ్చే బహుమానం; +* book, n 1) పుస్తకం; పొత్తం; ప్రోతం 2) గ్రంథం; కావ్యం; ప్రబంధం; ప్రహసనం; నాటకం; +text book, ph నేర్పుడు పుస్తకం; నేర్పుడు పొత్తం; పాఠ్య పుస్తకం; +notebook, n. అలేఖము; తెల్ల కాగితాల పుస్తకం; +* bookmark, n. పత్ర అభిజ్ఞానం; పుటచిహ్నం; పుటస్మారకం; పేజీక; ఇష్టాంశం; +* bookworm, n 1) చిమ్మట; ఒక విధమైన పుస్తకాల పురుగు 2) పుస్తకాల పురుగు; పుస్తకాల చదువులో మునిగిపోయిన వ్యక్తి; +* Boolean, adj. బౌల్య; జార్జ్ బూల్ ప్రవేశపెట్టిన ద్వియాంశ గణితానికి సంబంధించిన; +* boondocks, n idiom] శంకరగిరి మన్యాలు; మారుమూల ప్రదేశం; +* boor, n. మోటు మనిషి; మర్యాద తెలియని వ్యక్తి; +* boorish, adj. సారస్యం లేని; గౌరవం తెలియ���ి; +* boot, n 1) బూటు; పాదాన్ని పూర్తిగా కప్పే చెప్పు 2) డిక్కి; కార్లలో సామానులు పెట్టుకునే అర; +* Bootes, n. భూతేశ మండలం; ఆకాశంలో కనిపించే ఒక నక్షత్ర సమూహం; ఈ మండలంలో బండి కట్టుటకు పనికి వచ్చే ముసలి ఎద్దు, స్వాతి నక్షత్రం, చుట్టూ వానరాకార తారాగణం, ఉత్తరాన శేషుని ఏడు శిరస్సులు ఉంటాయి; +* bootstrap, n. చెప్పులని పాదాలకి బిగించి కట్టడానికి వాడే తాడు; +* bootstrap, v. t. కాలికి ఉన్న చెప్పుల తాడు చేత్తో పట్టుకుని పైకి లేవడం idiom] మరొకరి సహాయం లేకుండా ఎవరికి వారే పైకి లేవడం; +* booth, n. బడ్డీ; కాయమానం; తాత్కాలికంగా నిలిపే అంగడి; దుకాణం; +* booty, n. కొల్లగొట్టు; కొల్లగొట్టి సంపాదించిన సరుకులు; వేటకి వెళ్ళి పట్టుకొచ్చిన పంట; +* bop, n 1) జెల్ల; జెల్లకాయ; తలమీద సుతారంగా వేసిన దెబ్బ 2) బొప్పి; +* border, n 1) సరిహద్దు; పొలిమేర 2) అంచు; ఉపాంతం 3) ఎల్ల; +* borderline, n. సరిహద్దు రేఖ; పొలిమేర; ఉపాంతం; ఎల్లంచు; +borderline personality disorder, ph ఒక రకం మానసిక వ్యాధి; ఎల్లంచు వ్యక్తిత్వ వికారం; ఆత్మ విశ్వాసం లేకపోవడం, నిలకడ లేని ఉద్వేగత, ఇతరులతో నిలకడ లేని సంబంధ బాంధవ్యాలు ఈ వ్యాధి లక్షణాలు +* bore, n 1) రంధ్రం తుపాకీ) గొట్టంలోపలి వ్యాసం 2) నసమనిషి; విసిగించే వ్యక్తి; చికాకుపెట్టే వ్యక్తి; బోరుకొట్టే వ్యక్తి; +* bore, v. t 1) దొలుచు; తొలుచు; రంధ్రం చేయు 2) బోరుకొట్టు; సుత్తి కొట్టు; +* born, n. పుట్టినది; ఉత్పన్నం; +* Boron, n. టంకం; బోరాను; ఒక రసాయన మూలకం అణు సంఖ్య 5, సంక్షిప్తనామం B); +* borrow, v. t. అప్పు చేయు; అప్పు పుచ్చుకొను; ఎరువు తెచ్చుకొను; +* borrowed, n. ప్రతిదేయం; అప్పు చేసినది; +* bosom, n. రొమ్ము; స్తనద్వయం; చన్నులు; ఛాతీ; గుండె; +* boss, n. అధికారి; అధిష్ఠాత; అధినేత; యజమాని; పెద్ద; దేవర; అధినాధుడు; అధిపతి; +* bot, n. కూకరు; చాకరు; గణకరు; రోబాట్; స్వయం ప్రతిపత్తితో పనిచేసే కంప్యూటరు ప్రోగ్రాము; see also automaton, android, robot +* botanical garden, n. వనవాటిక; ప్రదర్శనోద్యానం; దివ్య వనవాటిక; +* botanicals, n. మూలికలు; మందులు చేయడానికి పనికివచ్చే ఆకులు, అలములు; +* botany, n. వృక్షశాస్త్రం; ఓషధిశాస్త్రం; +* bother, v. t. సతాయించు; పీడించు; వేధించు; +* botheration, n. సొద; బాదర; బాదరబందీ; సతాయింపు; బెడద; వెంపర్లాట; యాతన; +* botulism, n. డబ్బాలలో గాలి తగలకుండా నిల్వ చేసిన వాటిల్లో పాడైన ఆహార పదార్ధాలు తినడం వల్ల వచ్చే ఒక ప్రాణాంతకమైన జబ్బు; +* bougainvillea, n. కాగితం పూపు మొక్క; కాగితాల పూవు మొక్క; కాగితాల పువ్వులలా కనిపించే పువ్వులు పూసే మొక్క; +* boulevard, n. మార్గం; బాగా వెడల్పయిన రోడ్డు; రెండు పక్కల వెళ్లే శక���ాలని విడదీస్తూ మధ్యలో ఖాళీ ఉండేటట్లు నిర్మితమైన వీధి; +* bound, adj. నిబద్ధమైన; బద్ధ; పారమయిన; బౌండు; +* boundary, n. ఎల్ల; హద్దు; సరిహద్దు; సరుదు; ప్రహరి; అవధి; సీమ; మందల; మందడి; +* bouquet, n బొకే) గుచ్ఛం; గుత్తి; చెండు; స్తబకం; పుష్ప గుచ్ఛం; +* bouquets and brickbats, ph. పొగడ్తలు, తెగడ్తలు; భూషణ దూషణములు; మెప్పులు, దెప్పులు; +* bourbon, n. అమెరికాలో తయారయే ఒక జాతి విష్కీ, మొక్కజొన్నతో చేసిన బీరుని ధృతించి (బట్టీపట్టి) ఆల్కహోలు పాలు 51 శాతం వరకు పెంచినప్పుడు లభించే మాదక పానీయం; +* bourgeois, n. s బూర్ ష్వా, బూర్జువా) మధ్యతరగతి వ్యక్తి; సామాన్యపు వ్యక్తి; +* bourgeoisie, n. pl బూర్ ష్వాసీ) సామాన్యులు; మధ్యతరగతి జనులు; +* boutique, n బోటీక్) మారుతూన్న కాలానికి తగిన ఖరీదైన వస్తువులని అమ్మే దుకాణం; +* bovine, adj 1) ఆవుకి సంబంధించిన 2) ఎద్దు వలె; బద్ధకిష్టిగా; దున్నపోతు వలె; +* bow, n బో 1) ధనుస్సు; విల్లు; సారంగం; కమాను; సింగాణి 2) పడవ ముందు భాగం; +* bow, v. i బవ్ వంగు; వంగి నమస్కరించు; శిరస్సు వంచి నమస్కరించు; +* bowels, n. pl. ప్రేగులు; పెద్ద ప్రేగులు; ఆంత్రములు; +* bower, n. లతాగృహం; పొదరిల్లు; ఛత్వరం; +* bowstring, n. అల్లెత్రాడు; వింటి నారి; గొనయం; +* bowl, n బోల్) గిన్నె; చిప్ప; కరోటి; +* bowl, v. t బోల్) బంతిని విసరు; బంతిని దొర్లించు; +* box, n. పెట్టె; పెట్టి; పేటిక; మందసం; +box office, ph. సినిమా, నాటకం, వగైరా ఆడే చోట టికెట్లు అమ్మే గది; +* boxing, n. ముష్టాముష్టి; ముష్టియుద్ధం; +* boy, n. అబ్బాయి; కొడుకు; పిల్లడు; బుల్లోడు; కుర్రాడు; పాపడు; +* brace, n. అడ్డుకట్టు; కట్టు; బంధనం: +* bracelet, n. మురుగు; కంకణం; ముంజేతి గొలుసు; కేయూరం; +* bracket, n. కుండలి; వృత్తార్థం; కుండలీకరణం; +round bracket, ph. వృత్తార్ధం; వృత్తార్ధ కుండలి; చిప్పగుర్తులు; +* brackish, adj. ఉప్పని; కాసింత ఉప్పని; ఉప్పుటేరులో నీటి వంటి నీరు; +* brachydactyly, n. హ్రస్వాంగుళ్యం; చేతి వేళ్లు అతి పొట్టిగా ఉండే ఒక జన్యులోపం; +* bragging, n. గప్పాలు కొట్టడం; డంబాలు చెప్పుకొనడం; సొంతడబ్బా కొట్టుకొనడం; స్వోత్కర్ష; అహమహమిక; +* braid, n. జడ; అల్లిన జుత్తు; పేటలు తీసి అల్లిన జుత్తు; +* brain, n. మెదడు; మస్తిష్కం; మేధ; మేధస్సు; గోదం; +* brainchild, n. ఊహ; బురల్రో పుట్టిన బుద్ధి; స్వకపోల కల్పితం; +* brainwashing, n. భ్రమర కీటక న్యాయం; బంధితుల మనోభావాలని బలాత్కారంగా మార్చడం; +* brainwave, n 1) మేధాలహరి; మెధాతరంగం; అకస్మాత్తుగా వచ్చిన ఆలోచన 2) నాడీ తరంగాలు; తలకి తీగలు తగిలించి మెదడులోని నాడీ తరంగాలని నమోదు చెయ్యగా వచ్చిన రేఖా చిత్రం; +* brake, n. మరకట్టు; తిరిగే చక్రాన్ని ఆపే సాధనం; +* brand, n 1) వా��; శునకముద్ర 2) వ్యాపారపు గుర్తు; వాణిజ్య చిహ్నం; +* branding, v. t వాత వేయు; ముద్ర వేయు; గుర్తు పెట్టు; +branding iron, n. కరుగోల; వాత పెట్టడానికి వాడే ఇనప ఊచ; +* brandy, n. బ్రాందీ; సారాని దిగమరిగించగా వచ్చిన మాదక పానీయం; ఆల్కహోలుని 80 శాతం గాఢత వచ్చే వరకు దిగమరిగించి, 40 శాతం గాఢత దగ్గర సీసాలలో పోసి అమ్ముతారు ety In Dutch Brandewijn means "burnt wine"; +* brass, n. ఇత్తడి; పిత్తలం; రాగి, యశదం కలపగా వచ్చిన మిశ్రమ లోహం; +* bravado, n. బడాయి; ధైర్యం ప్రదర్శించడం; +* breach, n 1) పగులు; సందు; గండి; గండిక 2) కలహం 3) భంగం; ఉల్లంఘనం; అతిక్రమణ; +breach of faith, ph. నమ్మక ద్రోహం; నమ్మినవాడిని మోసం చెయ్యడం; +breach of promise, ph. ఇచ్చిన మాటని నిలబెట్టుకొనక పోవడం; +* breadth, n. వెడల్పు; పన్నా; అడ్డు కొలత; వరసు; +* break, n. విరామం; విరుపు; ఆటవిడుపు; +* break, v. t. విరుగ గొట్టు; విచ్ఛిన్నం చేయు; విరుచు; పగులగొట్టు 2) తెంచు; తెగగొట్టు; +* breakfast, n. బాలభోగం; చద్ది; సంగటి; ఉదయకాల ఉపాహారం; +* breakwater, n. అడ్డకట్టు; సేతువు; కెరటాల ధాటి నుండి రక్షించడానికి సముద్రంలోకి కట్టిన గోడ; +* breast, n 1) ఛాతీ; వక్షం; రొమ్ము; వక్షస్థలం; ఎద; ఉరస్సు 2) స్తనం; చన్ను; కుచం; +* breasts, n. pl. చన్నులు; రొమ్ములు; స్తనాలు; పాలిండ్లు; వక్షోజాలు; పయోధరాలు; +* breath, n బ్రెత్) ఊపిరి; శ్వాస; ఉసురు; ప్రాణం; ఉచ్ఛ్వాసనిశ్వాసాలు; ఎగఊపిరి, దిగఊపిరి; +* breathe, v. i బ్రీద్) ఊపిరిపీల్చు; శ్వాసించు; +fresh breeze, ph. పైరగాలి; వేసవికాలములో ఆగ్నేయ దిశనుండి (సముద్రము నుండి భూమి మీఁదికి) వీచు చల్లగాలి. +* brew, n. కషాయం; కాచగా వచ్చినది; సారా; +* brew, v. t. కాచు; మరగించు; ఉడకబెట్టు; +* brewery, n. సారాబట్టి; సారా కాచే భవనం; +* bride, n. పెళ్ళికూతురు; వధువు; +* bridge, n 1) వంతెన; వారధి; నదికి ఇటువైపు నుండి అటువైపు దాటే మార్గం 2) సేతువు (causeay మదుం (culvert 3) ఒక పేకాట పేరు 4) ముక్కు దూలం 5) సహజసిద్ధమైన పళ్లు ఇటూ, అటూ ఉండగా మధ్యలో ఉన్న కట్టుడు పళ్లు; +* brief, n. సంగ్రహం; ముక్తసరు; టూకీ; క్రోడిక; +* briefly, adv. టూకీగా; సంగ్రహంగా; సంక్షిప్తంగా; ముక్తసరిగా; +* brigade, n. సేనా వాహిని; పటాలము; దళం; చమువు; +* bright, adj. ప్రకాశవంతమైన; తెల్లనైన; దీప్త; ఉజ్వల; తేజస్వంత; జ్యోతిష్మంత; తారళ్య; +bright matter, ph. శుక్ల పదార్థం; నక్షత్రాల వంటి స్వయం ప్రకాశమానమైన పదార్థాలు; +* brightness, n. ద్యుతి; దీప్తి; ఉద్భాసం; తారళ్యం; కకుప్పు; కకుభము; +* brilliant, adj. ఉజ్వల; తెలివైన; సూక్ష్మబుద్ధి గల; +* brilliance, n 1) ద్యుతి; భాతి; భాసం 2) తెలివి; సూక్ష్మబుద్ధి; +* brimstone, n. గంధకశిల; గంధకాశ్మము; గడ్డకట్టిన గంధకం; +* brine, n. కారుప్పు నీళ్లు; ఉప్పు నీళ్లు; +* bring, v. t. ప��్టుకొనివచ్చు; తెచ్చు; తీసుకువచ్చు; కొనివచ్చు; +bring up, ph. పెంచు, పోషించు; విషయాన్ని తీసుకొని వచ్చు; +green brinjal ph. గుండ్రంగా, ఆకుపచ్చగా ఉండే మెట్ట వంకాయలు; +blue brinjal, ph. కోలగా, పొడుగ్గా, నీలంగా ఉండే నీటి వంకాయలు; +* brinkmanship, n. కయ్యానికి కాలుదువ్వే తత్వం; యుద్ధం చేసేస్తానని కత్తిని ఝళిపించే తత్వం; +* broach, v. t. ప్రస్తావించు; మాటల సందర్భంలో ప్రసక్తి తీసుకుని వచ్చు; +* broadband, n. విస్తృత పట్టీ; డిజిటల్ ప్రసార మాధ్యమం (ఒక తీగ కాని, రేడియో మార్గం కాని యొక్క "దత్తాంశాలని పంపగలిగే స్థోమత"ని విస్తృత పరచాలంటే దత్తాంశాలు అనేక, స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రసార మార్గాల గుండా ప్రయాణం చెయ్యగలిగే వెసులుబాటు ఉండాలి. ఆ రకం వెసులుబాటు ఉన్న మాధ్యమాన్ని "బ్రాడ్ బేండ్" అంటారు; ఈ రకం వెసులుబాటు లేకుండా ఒక తీగ మీద కాని, ఒక రేడియో మార్గం మీద కాని ఒకే ప్రసార మార్గం ఉంటే దానిని బేస్ బేండ్ అంటారు. +* broadcast, n 1) ప్రసారణ; పరిప్రేషణం 2) ఆకాశవాణి ప్రసారం; +* broadcast, v. t. ప్రసరించు; ప్రసారం చేయు; టముకు వేయు; +* brochure, n బ్రోషూర్) కరపత్రం; లఘుపొత్తం; +* broker, n. దళారి; అడితిదారు; ఆరిందా; మధ్యవర్తి; శరాబు; తరగిరి; +* bronchi, n. శ్వాసనాళపు కొమ్మల జత; +* bronchitis, n. కొమ్మవాపు; శ్వాసనాళపు కొమ్మ వాచడం; ఊపిరితిత్తులకి గాలి తీసుకెళ్లే రెమ్మల వాపు; +* bronze, n. కంచు; కాంస్యము; రాగి, తగరం కలపగా వచ్చిన మిశ్రమ లోహం; +* broil, v. t. కాల్చు; నిప్పులమీద వేసి కాల్చు; +* broker, n. దళారి; అడితిదారు; షరాబు; +* brooch, n. పైటపిన్ను; పయ్యెదకొక్కి; పమిటకొక్కి; +* broom, n. చీపురు; చీపురుకట్ట; పొరక; పొరకట్ట; +* brother, n. అన్న; తమ్ముడు; అన్నదమ్ముడు; తోడబుట్టినవాడు; సోదరుడు; సహోదరుడు; భ్రాత; అనుజుడు; +* brotherhood, n 1) భ్రాత్రీయం; సౌదర్యం; భ్రాతృత్వం 2) బరాదరి; జట్టు; తెగ; +* brow, n. కనుబొమ్మ; కనుబొమ; భృకుటి; +* brown, adj. గోధుమరంగు; పాలిత; బభ్రు; పింగళ; కపిల; +brown sugar, ph. కపిల చక్కెర; షాడబ చక్కెర; శుద్ధి చేసిన చక్కెర మీద షాడబం కొరకు కాసింత మొలేసస్‍ జల్లి, రంగు కలపగా వచ్చినది; ఇది బెల్లం కాదు; బెల్లంలో ఉన్నపాటి పోషక విలువలు ఇందులో లేవు; +* brown, n. కపిలవర్ణం; పొగాకు రంగు; +* browse, v. i 1) విహరించు; వీక్షించు 2) సావకాశంగా కొమ్మలని తినడం; +* browser, n. అంతర్జాల దర్శని; విహారిణి; వీక్షణి; వీక్షకి; అంతర్జాలంలో విహరిస్తూ అక్కడ ఉన్న సమాచారాన్ని పరికించి చూడడానికి వాడే క్రమణిక; +* bruise, n బ్రూజ్) అరవడి; కందిన చర్మం; కమిలిన గాయం; కదుము కట్టిన గాయం; చర్మం తెగకుండా తగిలిన దెబ్బ; +* bruise, v. i బ్రూజ్) కందు; కములు; కదుము; చర్మం తెగకుండా దెబ్బ తగలడం +* brush, n 1) కుంచె; కుచ్చు; మార్జని; ఈషిక; ఇషీక; బురుసు 2) ధావని; +tooth brush, ph. దంత మార్జని; పళ్ళు శుభ్రపరచుకొనే సాధనం; +* brush, v. i. తోముకొను; కుంచెతో తోముకొను; +* brutal, adj 1) పశుప్రాయమైన 2) చాల కష్టసాధ్యమైన; +* bubble, n. బుడగ; నీటి బుగ్గ; నీటి బుడగ; బుద్బుదం; అచిరాంశువు; +* bubbling, n. బుద్బుదీకరణం; బుడగలు వచ్చేలా చేయడం; +* bucket, n. బాల్చీ; బొక్కెన; చేద; నేచని; బకిట్టు; +* buckle, v. t. కట్టు note) ఇక్కడ బకుల్ అన్న మాటకి వ్యతిరేకార్థాలు గమనించునది +* bud, n. మొగ్గ; ముకురం; అంకురం; కలిక; బొడిపె; +* bud, v. i. మొగ్గతొడుగు; పొటమరించు; +* buddy, n. నేస్తం; స్నేహితుడు; స్నేహితురాలు; +* budget, n. ఆదాయవ్యయ పట్టిక; ఆదాయ వ్యయ పత్రం; యయవ్యం; ఆదాయాన్ని, ఖర్చుని సరితూగేటట్టు లెక్క వేసుకొనడం; బడ్జెట్; +* buffalo, n. గేదె; బర్రె; ఎనుము; మహిషి; పడ్డ; దుంత; లులాపం; +he buffalo, ph. గేదె; ఎనుబోతు; దున్నపోతు; దుంత; మహిషం; +she buffalo, ph. గేదె; బర్రె; ఎనుపెంటి; ఎనుపసరం; మహిషి; +* buffer, n. మధ్యస్థి; నిథికం; నిథానకం 1 comp జోరుగా నడిచే కంప్యూటరుకీ నెమ్మదిగా పనిచేసే ఉపకరణాలకీ మధ్యవర్తిగా పనిచేసే దత్తాంశ నిలయం; A small portion of storage that is used to hold information temporarily 2) రెండు అగ్రరాజ్యాల మధ్య ఇరుక్కున్న బడుగు రాజ్యం 3 chem ఒక ద్రావణం లోని సాపేక్ష ఆమ్లత, క్షారతల నిష్పత్తిని మార్చకుండా ఆ ద్రావణం లోని ఆమ్లాలనీ, క్షారాలనీ నాశనం చెయ్యగలిగే పద్ధతి; +* buffet, n బుఫ్ఫే) ఎవరి భోజనాలు వారే వడ్డించుకుని తినే పద్ధతి; +* buffoon, n. విదూషకుడు; హాస్యగాడు; +* bug, n 1) పురుగు; క్రిమి 2) నల్లి; మత్కుణం; కిటిభము; తల్పకీటం 3) దోషం; అన్యధాగ్రహణం; ప్రామాదికము; కైతప్పు; నేరమి; ఆగము; కలనయంత్రాల క్రమణికలు రాయడంలో దొర్లే తప్పు; +* bulimia, n. అతి ఆబగా తినడం, తిన్న దాన్ని బలవంతంగా కక్కుకోవడం వంటి చేష్టలతో ఉన్న ఒక రోగ లక్షణ సముదాయం; +* buggy, n. బగ్గీ; గుఱ్ఱపుబండి; +* bulb, n 1) పాయ 2) బుడ్డి; దీపపు బుడ్డి; బుగ్గ 3) మొగ్గ 4) గడ్డ; దుంప; +onion bulb, ph. నీరుల్లి పాయ; ఉల్లి గడ్డ; పలాండు; +* bulbul, n. పికిలి పిట్ట; బుల్బులు పిట్ట; +* bull, n. బసవడు; బసవన్న; ఎద్దు; గిత్త; కోడె; వృషభం; పోతు; ఆలపోతు; గిబ్బ; ఆఁబోతు; అనడుహం; అఘ్న్యం; +* bullet, n. గుండు; సీసపుగుండు; పడిగల్లు; తూటాలో ఉండే లోహపుగుండు rel cartridge; +* bullish, adj. భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉండడం; +* bully, n. కోరి జగడమాడి అల్లరి పెట్టు వ్యక్తి; +* bum, n. గోచిపాతరాయుఁడు; పనికిరానివాఁడు; +* bumper, n 1) సమృద్ధి 2) కారుకి దెబ్బ తగిలినప్పుడు కారుని లోపల ప్రయాణీకులకి దెబ్బలు తగలకుండా కాపు కాసే కడ్డీ; +* bumpkin, n. మోటు వ్యక్తి; నాగరికత తెలియని వ్యక్తి; బైతు; +* bunch, n 1) అత్తం; పెడ; చీపు; గెల; గెలలో చాలా పెడలు ఉంటాయి 2) గుచ్ఛం; +* bungalow, n. బంగళా; వెడల్పయిన వరండాలతో ఉండే పాక లాంటి ఇల్లు; +* buoy, n. బోయా; బోయాగుండు; బోలు గుండు; బోయాకట్టె; అలామతుకర్ర; ఉడుపు; ఉడుపం; తరండం; తేలుడు గుండు; రేవులలో మెరక ప్రదేశాలని సూచించడానికి వాడే తేలుడు గుండు; a float; a raft; +* buoyancy, n. తేలే గుణం; ప్లవనం; ఉత్‌ప్లవనం; ఉల్బణం; ఉడుపం; +* bureaucracy, n బ్యూరాక్రసీ) ఉద్యోగిస్వామ్యం; ఉద్యోగులచే పరిపాలన; +* burette, n. బురెట్, కొలగీట్లు ఉన్నటువంటిన్నీ, అడుగున మూయడానికీ, తెరవడానికీ కుళాయి వంటి సదుపాయం ఉన్నటువంటిన్నీ, సన్నటి, పొడుగాటి గాజు గొట్టం; +* burgeoning, adj బర్జెనింగ్) మొలకెత్తే; పెరుగుతూన్న; +* burglary, n. దోపిడీ; ఇంట్లోకి కాని, భవనంలోకి కాని చొరపడి దోపిడీ చెయ్యడం; +* burial, n. ఖననం; పాతిపెట్టడం; కప్పెట్టడం; +* burlesque, n 1) వెటకారం చేస్తూ అసంభవమైన సంఘటనలతో కూడిన హాస్య నాటక ప్రదర్శన కానీ, గ్రంథ రచన కానీ 2) నైట్ క్లబ్బులలో బట్టలు ఊడదీసుకుంటూ చేసే నగ్న నాటక ప్రదర్శన; +* burns, n. pl. కాలడం వల్ల కలిగిన పుండ్లు; +third-degree burns, ph. చర్మం లోపలి పొర (dermis) దాటి లోతుగా ఉన్న కణజాలం కాలడం వల్లకలిగిన గాయం; +* burnout, n. విరామం లేకుండా విపరీతంగా పని చెయ్యడం వల్ల పని మీద వెగటు కలిగిన మనోస్థితి; +* burrow, n. బొరియ; బిలం; నేలకన్నం; భూరంధ్రం; +* bursar, n. కళాశాలలో కోశాధిపతి; +* bursary, n. విద్యార్థి సహాయక భృతి; +* bury, v. t. పాతిపెట్టు; కప్పెట్టు; +* bushel, n. ధాన్యాన్ని కొలవడానికి ఒక కొలమానం; ఉరమరగా ఎనిమిది కుంచాలకి సమానమైన కొలత; +* bust, n 1) బుర్ర నుండి భుజముల వరకు ఉన్న ప్రతిమ 2) చనుకట్టు; చనుకట్టు చుట్టు కొలత 3) పోలీసు దాడి; +* bushy, adj. దుబ్బుగా; కుచ్చు; గుబురు; +* business, n 1) వ్యవహారం; పని; వేపకం; గరజు; యవ్వారం 2) వ్యాపారం; వర్తకం 3) ఉద్యోగం; +* businessman, n. వ్యాపారస్తుడు; వర్తకుడు; షావుకారు; +* bustle, n. హడావిడి; సందడి; ఆర్భాటం; గాభరా; కంగారు; హంగామా; +* busy, adj. పని ఒత్తిడితో ఉన్న; తీరిక లేని; ఊటగా ఉన్న; +* butcher, n. కసాయివాఁడు; సూనికుఁడు; +* butchery, n. సూనికము; జంతుమాంసాన్ని అమ్మకానికి వీలుగా తరిగి తయారుచేయు విధానం; +* butt, n 1) మూలం; అడుగు భాగం 2) పీక; సిగరెట్టు పీక 3) మడమ; తుపాకి మడమ 4) పిర్ర; పిరుదు; +* butterfly, n. సీతాకోకచిలుక; చిత్రపతంగం; పింగాణి; Lepidoptera జాతికి చెందిన నిలువు రెక్కల పురుగు; see also moth; +* button, n. బొత్తాం; గుండీ; బొత్తాయి; +* buyer, n. కొనుగోలుదారు; క్రీత; క్రేత ant విక్రేత; +* buzz, n. కోలాహలం; కలకలం; బహుజనధ్వని; +* buzzard, n 1) డేగ లాంటి పక్షి 2 idiom] ఆశ పోతు; దురాశాపరుడు; మూఢుడు; జడుడు; శుంఠ; +* by, prep. వలన; చేత; గుండా; ద్వారా; దగ్గర; వద్ద; +* bylaws, n. నియమావళి; ఉపనియమావళి; +* byproduct, n. ఉపఫలం; అనుజనితం; ఉపోత్పత్తి; అనుబంధ ఉత్పత్తి; ఉపలబ్ధి; +* bystander, n. దారిన పోయే దానయ్య; తటస్థుడు; +* byte, n అష్టకం; వరుసగా వచ్చే ఎనిమిది ద్వియాంశ అంకముల సముదాయం; Eight contiguous bits; + + +* cabal, n. బందుకట్టు; కుట్రదారులు; +* cabinet, n 1) మంత్రి మండలి; అమాత్య వర్గం 2) బీరువా; పెట్టె; +* cable, n 1) మోకు; తాడు; రజ్జువు 2) తీగ; తంతి; తంతిమోకు; +* caboose, n 1) కుంపటి; వంట గది 2) పూర్వపు రైలు బండ్లలో (ప్రత్యేకించి సామానులు మోసే బండ్లలో) చిట్టచివర వచ్చే పెట్టె; +* cacao, n. కకావ్; ఈ కకావ్ చెట్టు bot Theobroma cacao నుండి లభించే గింజలే కకావ్ గింజలు, లేదా కోకో (cocoa) గింజలు; ఈ గింజలలోని కొవ్వు పదార్థమే కోకో వెన్న; కోకో వెన్నతో పంచదార కలిపితే తెల్ల ఛాకొలేటు వస్తుంది; వెన్న తీసేసిన తర్వాత గింజలని వేయించి, పొడి చేస్తే వచ్చేదే కోకో. ఈ కోకోకి పంచదార, వెన్న కలిపితే వచ్చేదే బూడిద రంగులో ఉండే ఛాకొలేటు; ఈ చెట్టుకీ coca తుప్పకీ పేరులో పోలిక తప్ప మరే సంబంధమూ లేదు; +* cacography, n. పిచ్చిగీతలు; కెక్కిరిబిక్కిరి గీతలు; +* cacophony, n. కర్కశ ధ్వని; గోల; అపశ్రుతి; కర్ణకఠోరం; కాకిగోల; +* cactus, n. జెముడు; కంటాలం; బొమ్మజెముడు; +large cactus, ph. బొమ్మజెముడు; బొంతజెముడు; బ్రహ్మజెముడు; +* cad, n. నీతిమాలన వ్యక్తి; తుచ్ఛుడు; +* cadaver, n. కళేబరం; శవం; ప్రేతం; పీనుగు; కొయ్యడానికి సిద్ధపరచిన కళేబరం; +* cadaverous, adj. ప్రేతకళతోనున్న; ప్రేతసదృశం; పీనుగువంటి; మృతప్రాయం; +* cadjan, n. తాటాకు; తాటి ఆకు; తాళపత్రం; +* cadre, n కాడ్రే) బాపతు; ఉద్యోగులలో తరం; స్థాయి; +Caesium n. సీజియం; పసుపు డౌలుతో ఉన్న వెండిలా మెరిసే రసాయన మూలకం; సంక్షిప్త నామం, Cs; అణు సంఖ్య 55 గది తాపోగ్రత వద్ద ద్రవంగా ఉండే అయిదు లోహపు మూలకాలలో ఇది ఒకటి; +* cafeteria, n. కాఫీ కొట్టు; కాఫీ దొరకు స్థలం; కాఫ్యాగారం; స్వయంగా వడ్డన చేసికొనడానికి అమరిక ఉండే భోజన, ఫలహారశాల Spanish: cafe coffee; teria place]; +* cajole, v. t. బెల్లించు; లాలించు; సముదాయించు; బుజ్జగించు; కుస్తరించు; మోసగించు; +* cake, n 1) శష్కులి; కేకు; తీపి రొట్టె; కేకు 2) ఉండకట్టిన పిండి పదార్థం; +* calamity, n. ఆపద; ఉపద్రవం; అరిష్టం; విపత్తు; ముప్పు; పెద్ద ఆపద; అనర్ధం; ఉత్పాతం; ఉపహతి; +* calcination, n. భస్మీకరణం; బుగ్గి చెయ్యడం; నిస్తాపనం; +* calcined, adj. భస్మము చేయబడిన; బుగ్గి చేయబడ్డ; +* calculate, v. i. లెక్కించు; లెక్కకట���టు; గణించు; +* calculator, n 1) లెక్కిణి; కలని; గణక్; లెక్కలు చేసే యంత్రం 2) లెక్కలు కట్టే మనిషి; +* calculus, n 1) కలనం; కలన గణితం 2) మూత్రకృచ్ఛం; అశ్మరి; +renal calculus, ph. మూత్రపిండాశ్మరి; మూత్రపిండాలలోని రాయి; +urinary calculus, ph. మూత్రాశయాశ్మరి; మూత్రాశయంలోని రాయి; +* caldron, n. కాగు; డెగిసా; చరువు; బాన; ద్రవములని మరిగించడానికి వాడే లోహపు పాత్ర; +* Caledonian, adj. స్కాట్‍లండ్‍ దేశానికి సంబంధించిన; +* calendar, n 1) పంచాంగం; తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో హిందూ సాంప్రదాయ సిద్ధంగా వుండే పుస్తకం 2) ఇంగ్లీషు సంప్రదాయంతో, నెల, వారం, సెలవురోజులు, వగయిరాలతో వుండేది కేలండరు 3) రోజులు, వారాలు, నెలలు, ఋతువులు మొదలయిన కాలచక్ర విశేషాలని చూపే పుస్తకం; +calendar day, ph. పంచాంగ దినం; ఒక అర్ధరాత్రి నుండి తర్వాత అర్ధరాత్రి వరకు; ఒక రోజు; +calendar month, ph. పంచాంగ మాసం; నెల మొదటి రోజు నుండి, ఆఖరు రోజు వరకు; +calendar year, ph. పంచాంగ సంవత్సరం; జనవరి 1 నుండి డిసెంబరు 31 వరకు rel fiscal year అంటే 365 (లీపు సంవత్సరంలో అయితే 366) రోజుల వ్యవధి; దేశాచారాన్ని బట్టి ఎప్పుడేనా మొదలవవచ్చు; అమెరికాలో అక్టోబరు 1న fiscal year మొదలవుతుంది; +* calf, n 1) f. పెయ్య; ఆవుపెయ్య తువ్వాయి ఏనుగు పిల్ల; m. దూడ; క్రేపు; వత్సం 2) కాలిపిక్క; పిక్క; జంఘ; +* calibration, n. క్రమాంకనం; స్పుటీకరణం; ప్రమాణీకరణం; +* calipers, n. వ్యాసమితి; వ్యాసాన్ని కాని మందాన్ని కాని కొలవడానికి వాడే సాధనం; రెండు స్థానాల మధ్య దూరాన్ని కొలిచే సాధనం; +bird ph. కూత; పిట్టకూత; అభిక్రందం; +* callus, callous, n. కాయ; కిణకము; కఠిన వస్తువుల స్పర్శ వల్ల ఏర్పడే కాయ; అరికాలులో కాని, అరిచేతిలో కాని పెరిగే కాయ; గాయమును కప్పుతూ ఏర్పడిన కణజాలం; +* calm, adj. నిశ్చలమైన; నెమ్మదైన; ప్రశాంతమైన; గాలిలో కదలిక లేని; నీటిలో కెరటాలు లేని; +* calm, n. నిశ్చలత; ప్రశాంతత; +calm down, n. తగ్గు; నెమ్మదించు; నిమ్మళించు; ప్రశాంతపడు; +* calorie, n. కేలోరీ; వేడిని కొలిచే కొలమానం note) రెండు రకాల కేలరీలు ఉన్నాయి. వెయ్యి కేలరీలని పెద్ద కేలరీ (Calorie) అనీ కిలో కేలరీ (kilo calorie) అనీ అంటారు. ఆహారంలో పోషక శక్తిని కొలిచేటప్పుడు ఈ పెద్ద కేలరీలనే వాడతారు కానీ నిర్లక్ష్యంగా కేలరీ అనేస్తూ ఉంటారు; +* calorimeter, n. ఉష్ణతామాపకం; వేడిని కొలిచే సాధనం rel ఉష్ణోగ్రతని కొలిచేది తాపమాపకం (లేదా ఉష్ణమాపకం, థర్మోమీటర్); +* calve, v. i. ఈనుట; పశువులు పిల్లలని కనడం; +* calyx, n పుష్పకోశం ప్రమిద వలె ఉన్న పుష్పకోశం; రక్షక పత్రావళి; +* came, n. రెండు గాజు పలకలని పట్టి బంధించే సీసపు బందు; +* came, v. i. వచ్చెను; అరుదెం���ెను; వేంచేసెను; విచ్చేసెను; ఏగుదెంచెను; +* camel, n. ఒంటె; లొట్టపిట; లొట్టియ; క్రమేలకం; m. ఉష్ట్రము; f. ఉష్ట్రిక; +* camera, n 1) కేమెరా; ఛాయాచిత్రములు తీసే పరికరం 2) గది; +* camp, n. మకాం; మజిలీ; విడిది; శిబిరం; +* campaign, n 1) ఉద్యమం; పరికర్మ; ఎసవు 2) ప్రచారం 3) దండయాత్ర; +religeous camphor, ph హారతి కర్పూరం; ఇది తినడానికి పనికిరాదు; +* campus, n. ప్రాంగణం; పాఠశాల యొక్క ప్రాంగణం; +* can, v. i కెన్) శక్త్యర్ధకమైన క్రియావాచకం; కలను; కలడు; కలుగు; మొ.; +* can, n కేన్) డబ్బా; డబ్బీ; డిబ్బీ; డొక్కు; +* canal, n 1) కాలువ; కాల్వ; క్రోడు; కుల్యం; కుల్లె 2) నాళం; +irrigation canal, ph. సేద్యకుల్యం; సాగుకుల్లె; సాగుకాల్వ; +* candid, adj. నిష్కపటమైన; దాపరికం లేని; నిజమైన; +* candidate, n. అభ్యర్థి; దరఖాస్తు పెట్టిన వ్యక్తి; +* candle, n. కొవ్వొత్తి; మైనపు వత్తి; +* candor, n. నిష్కాపట్యం; నిజం; యదార్థం; +rock candy, ph. కలకండ; పటికబెల్లము; కండచక్కెర; కండ; కలకండ; ఖండశర్కర; పులకండము; మత్స్యందిక; +* Canis Major, n. శ్వానం; పెద్ద కుక్క; బృహత్ లుబ్ధకం; ఉత్తరాకాశంలోని ఒక నక్షత్ర రాశి; మృగశిరకి ఆగ్నేయంగా ఉన్న ఈ రాశిలోనే సిరియస్ నక్షత్రం ఉంది; +* Canis Minor, n. పూర్వ శ్వానం; చిన్న కుక్క; లఘు లుబ్ధకం; ఉత్తరాకాశంలోని ఒక నక్షత్రరాశి; మృగశిరకి తూర్పుదిశగాను; మిధునరాశికి దగ్గరగాను ఉన్న ఈ రాశిలోనే ప్రోకియాన్ నక్షత్రం ఉంది; +* canker, n 1) పుండు; కురుపు; నోటిలో పుండు 2) జంతువులలో కాని, చెట్లలో కాని గజ్జి కురుపుని పోలిన వాపు; +* canned, adj. డబ్బాలో నిల్వ చేసిన; డబ్బా; డబ్బీ; +canned food, ph డబ్బా ఆహారం; డబ్బా ఆహార పదార్థం; +* cannibal, n. నరమాంస బక్షకుడు; పొలదిండి; పొలసుదిండి; +* cannibalism, n. నరమాంస భక్షణ; పంచజనచర్వణం; పొలదిండిత్వం; +* cannot, aux. v. చెయ్యలేను అధికార రీత్యా చెయ్యలేకపోవడం చేయ వల్ల కాదు జరిగే పని కాదు చేతకాదు (చేసే సమర్ధత లేదు); +canola oil, ph. రేపు మొక్క విత్తనాలనుండి పిండిన నూనెకి కెనడాలో వాడే వ్యాపారనామం; can అంటే Canada, o అంటే oil, la అంటే low acid అని అర్థం; +* canon, n. సూత్రం; సూత్రవాక్యం; +* canonical, adj. శాస్త్రీయ; శౌత్ర; ధర్మశాస్త్ర ప్రకారం; ధార్మిక; +* Canopus, n. అగస్త్య నక్షత్రం; ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రాలలో సిరియస్ ప్రథమ స్థానంలో ఉంటే దక్షిణాకాశంలోని దైవనావ రాసిలో ఉన్న అగస్త్య నక్షత్రం రెండవ స్థానంలో ఉంది; +* canopy, n. చందువా; చాందినీ; పందిరి; మేల్కట్టు; ఉల్లడ; కురాళము; పందిరి; వితానం: +mobile canopy, ph. ఉల్లడ; మేల్కట్టు; శుభకార్యాలకు, సంబరాలకు, పూజ కోసం సామగ్రిని తీసుకువెళ్ళి నప్పుడు ఆ సామగ్రి పై ఎటువంటి దుమ్ము ధ���ళీపడకుండా, ముఖ్యంగా పక్షులు, కీటకాలు వాలకుండా, వాటి వ్యర్థాలు పడకుండా వుండటానికి ఒక వెడల్పాటి వస్త్రాన్ని నలుగరూ నాలుగంచులు పట్టుకొని ఆయా సామగ్రి పై రక్షణగా ఏర్పాటు చేస్తారు. అందులో వుండే వ్యక్తులకు, సామగ్రీకి వస్త్రం తగలకుండా మధ్యలో ఒక కర్రను ఎత్తిపట్టి గొడుగులా చేస్తారు. దీనినే ఉల్లెడ అంటారు; +tree canopy, ph. వృక్షప్రస్తారం; శాఖాఛాదితం; కురాళము కట్టినది; కొమ్మలచే కప్పబడ్డది; +* canthus, n. కనుకొలికి; కంటి ఎగువ రెప్పలు, దిగువ రెప్పలు కలిసే చోటు; +* canto, n. కాండం; సర్గం; అధ్యాయం; స్కంధం; ఆశ్వాసం; +* canvas, n. కిత్తనార గుడ్డ; కట్లంక; కేన్వాసు గుడ్డ; +* canyon, n. పెను లోయ; ప్రవహించే నీటితో దొలచబడి నిట్టనిలువుగా అటూ, ఇటూ కొండలు ఉన్న లోయ; +* capability, n. స్తోమత; సమర్ధత; సామర్ధ్యం; యోగ్యత; శక్తి; +* capacity, n. ఉరవ; స్తోమత; సత్తా; పరిమాణం; ధారణశక్తి; గ్రహణశక్తి; తాహతు; శక్తి; సామర్థ్యం; ఆభూతి; +heat capacity ph. ఉష్ణ ధారణశక్తి; ఉష్ణ గ్రహణశక్తి; +* cape, n 1) అగ్రం; త్రిభుజాకారపు భూభాగపు చివరి భాగం 3) భుజాలమీదుగా వీపు వైపు కిందకి దిగజారే ఒక వ విశేషం; +* capillary, n. కేశనాళిక; రక్తనాళములలో అతి సూక్ష్మమైన నాళిక; +capital appreciation, ph మూలధనపు వృద్ధి; వృద్ధి చెందిన పెట్టుబడి; +capital goods, ph. ఉత్పాదక వస్తువులు; ఉత్పాదక సరంజామా; +capital outlay, ph. పెట్టుబడిగా వినియోగించిన మూలధనం; +capital gains, ph. పెట్టుబడిలో లాభం; మూలధనం విలువలో పెరుగుదల; ఒక ఇల్లు ఆరు లక్షలకి కొని, పదిలక్షలకి అమ్మితే వచ్చిన నాలుగు లక్షల లాభం capital gains. ఈ ఇంటిని నెలకి వెయ్యి చొప్పున అద్దెకి ఇచ్చి ఉంటే, నెలనెలా వచ్చే అద్దె పెట్టుబడి మీద వచ్చే ఆదాయం మాత్రమే. ఈ అద్దె పెట్టుబడి మీద లాభం కాదు; +* capital, n 1) పెట్టుబడి; మూలధనం; మూలం; మదుపు; పరిపణం 2) ముఖ్యపట్టణం; రాప్రోలు; +* capitalism, n. పెట్టుబడిదారీ వ్యవస్థ; ధనస్వామ్యం; షాహుకారీ; +* capitalist, n. పెట్టుబడిదారు; ధనస్వామి; షాహుకారు; +* capitation, n తలసరి రుసుం; విద్యాలయాల్లోనూ, ఆసుపత్రులలోనూ అయే ఖర్చుని తలవారీ పంచి పన్నులా విధించడం; +capitation fee, ph. ప్రవేశ నిమిత్త రుసుం; తలపన్ను; తల ఒక్కంటికి అని విధించే రుసుం; +* capitulation, n. అంగీకారం; ఓటమి ఒప్పేసుకోవడం; రాజీపడడం; +* Capricorn, n. మకరరాశి lit. మేషరాశి దక్షిణాకాశంలో ధనుస్సుకీ, కుంభానికీ మధ్య కనిపించే రాశి; ఉరమరగా డిసెంబరు 22న సూర్యుడు ఈ రాశిలో ప్రవేశిస్తాడు; మకరం అంటే మొసలి. కేప్రికారన్ అంటే మేక. ఇక్కడ భాషాంతరీకరణంలో భావం దెబ్బ తింది see Aries); +* caprice, n. చాపల్యం; చాపల్యత; నిలకడ లేనితనం; +* capsicum, n. మిరప; మిరప శాస్త్రీయ నామం; +* capsize, v. i. తలక్రిందులగు; పల్టీకొట్టు; మునుగు; +* caption, n. వ్యాఖ్య; వ్యాఖ్యావాక్యం; శీర్షిక; +* capture, v. t. పట్టుకొను; హస్తగతం చేసుకొను; +* car, n. బండి; పెట్టె; రథం; శతాంగం; అరదం; వయాళి; కారు; +* carafe, n. గాజు కూజా; సారాని వడ్డించే గాజు కూజా; +* caramel, n 1) వన్నె; కల్తీలేని జీళ్లపాకం; ముదర పాకం 2) దోరగా మాడిన పంచదార; +* caravan, n 1) బిడారు; బిడారము; ఒంటెల వరస 2) ఊరేగింపులో ఒకదాని వెనక ఒకటిగా వెళ్లే వాహనాల సమూహం 3) పధికులు; తండా; +* carbohydrate, n. కర్బనోదకం; కర్బనోదజం; పిండి పదార్థం lit చెమర్చిన కర్బనం; +* carbolic acid, n. కార్బాలిక్ ఆమ్లం; ఆంగిక రసాయనంలో తరచుగా తారసపడే ఆమ్లం; +* carbuncle, n. వ్రణం; రాచకురుపు; రాచపుండు; ప్రమేహపిటకం; +* carburetor, carburettor (Br n. అంతర్‍దహన యంత్రాలలో ఇంధనాన్ని, గాలిని సరియైన పాళ్లల్లో కలిపి సిలిండర్‍లోకి పంపే ఉపకరణం; +* carcass, n. కళేబరం; డొక్కి; తినడం కోసం చంపిన జంతువుల మృత దేహం; +* carcinogen, n. కేన్సరుజని; కేన్సరు వ్యాధిని కలుగజేసే పదార్థం; +* card, n. కార్డు; అట్టముక్క; ముక్క; +credit card, ph. అరువు కార్డు; క్రెడిట్ కార్డు; +* cardamom, n. ఏలకి; ఏలకి కాయ; చిట్టేలకి; కోరంగి; +* cardiac, adj. హృదయ; హృద్; గుండెకి సంబంధించిన; +* cardigan, n. కార్డిగన్; ముందుభాగం తెరచివున్న స్వెట్టరు; +cardinal numbers, ph. ఉత్తమ సంఖ్యలు; వేదాంకములు; ఒకటి, రెండు, మూడు వగైరా అంకెలు; +* cardio, adj. హృదయ; హృద్; గుండెకు సంబంధించిన; +* cardiology, n. హృదయ వైద్యశాస్త్రం; గుండెకి సంబంధించిన వైద్య శాస్త్రం; +* care, n 1) జాగ్రత్త; లక్ష్యం 2) సంరక్షణ; చింత; +* care, v. i. ఖాతరు చేయు; లక్ష్యపెట్టు; +be careful, ph. జాగ్రత్తగా ఉండు; అప్రమత్తతతో ఉండు; ఒళ్లు దగ్గర పెట్టుకో; +* carefully, adv. జాగ్రత్తగా; అప్రమత్తంగా; ఊజ్జితంగా; +* carelessly, adv. అజాగ్రత్తగా; అలవోకగా నిర్లక్ష్యముగా; అసడ్డగా; +* carelessness, n. నిర్లక్ష్యం; అజాగ్రత్త; ప్రమత్తత; ఏమరుపాటు; పరాకు; హెచ్చరలేమి; ప్రామాదికము; +* caress, v. t. నిమురు; దువ్వు; లాలించు; ముద్దాడు; +* caret, n. హంసపాదుకి గుర్తు; హంసపాదు; అంచపదం; +* cargo, n. సరుకులు, ఓడలలోనూ, విమానాలలోనూ, తదితర వాహనాలలోనూ వేసే సరుకులు; +* caricature, n. తూలికాచిత్రం; వ్యంగ్య చిత్రం; వికట వర్ణన; +dental caries, ph. పుచ్చిపోయిన పన్ను; పుప్పి పన్ను; +* carnage, n. మారణహోమం; విధ్వంసకాండ; ఎంతోమందిని చంపడం, గాయపరచడం; +* carnivore, n. మాంసాహారి; శాష్కలి; క్రవ్యాదం; +* carousel, n 1) గుండ్రటి ఆకారం ఉండి గుండ్రంగా తిరిగేది; రాట్నం 2) రంగులరాట్నం; +* carp, n. గండుచేప; బెడిసమీను; శఫరం; +* carpal, adj. మణికట్టుకి సం���ంధించిన; మణిబంధిక; +carpal tunnel syndrome, ph. ఎక్కువగా టైపు కొట్టడం వంటి పనులు పదే పదే చెయ్యడం వల్ల కీళ్లల్లో నొప్పి మొదలగు లక్షణాలు పొడచూపుతూ వచ్చే సందర్భం; +* carpenter, n. వడ్రంగి; త్వష్ట్ర; సూత్రధారుడు; +* carrier, n 1) భారవాహుడు; రవాణాదారు 2) భారవాహిక; రవాణా సాధనం 3) మోపరి; రోగాన్ని మోసే వ్యక్తి; ఒక రోగంతో బాధ పడకుండా ఆ రోగాన్ని ఇతరులకి అంటించే స్తోమత ఉన్న జీవి; ఉదా. మలేరియా వ్యాధికి దోమ మోపరి 4) వాహకం; వాహకి; +* carrot, n, ఎర్ర ముల్లంగి; పచ్చ ముల్లంగి; గాజర; గాదెర; కేరట్‍; +* carry, n. బదిలీ; మిగులు; బదులు; కూడకంలో స్థానమందు వేసికొనే అంకె ant borrow; +* carrot, n. ఎర్రముల్లంగి; పచ్చముల్లంగి; కేరట్; +* cart, n. బండి; శకటం; బగ్గీ; రెండు చక్రాల బండి; కంచరం; +* cartel, n. ఉత్పత్తిదారుల ఉమ్మడి సంఘం; +* cartilage, n. తరుణాస్థి; ఉపాస్థి; మృదులాస్థి; కోమలాస్థి; కేకసం; +* cartridge, n. తూటా; తూటాలో మందుగుండు సామాను, సీసపు గుండ్లు ఉంటాయి; +* carton, n, డబ్బా; అట్టతో కాని, ప్లాస్టిక్‍తో కాని చేసిన డబ్బా; +* cartoon, n. కొంటెబొమ్మ; పరిహాసచిత్రం; వ్యంగ్యచిత్రం; +lower case, ph. చిన్నబడి; ఇంగ్లీషులో రాత అక్షరాలు; +special case, ph. పరిమితిగల సందర్భం; ప్రత్యేక సందర్భం; +upper case, ph. పెద్దబడి; ఇంగ్లీషులో అచ్చు అక్షరాలు; +* cash, n. నగదు; రొక్కం; పైకం; సొమ్ము; +petty cash, ph. దినవెచ్చం; చిన్న చిన్న ఖర్చులకు కేటాయించిన డబ్బు; +cash cow, ph. నగదు ధేనువు; వ్యాపారంలో ఎల్లప్పుడు లాభాన్ని తెచ్చే వస్తువు; +* cashews, n. జీడిపప్పు; ముంతమామిడి పప్పు; +* cashier, n. షరాబు; నగదు అధికారి; కేషియరు; +* cassava, n. ఒక రకం కర్ర పెండలం; సగ్గుబియ్యం చెయ్యడానికి వాడే దుంప; ఈ దుంప స్వస్థలం దక్షిణ అమెరికా; ఈ దుంపలలో సయనైడ్‍ అనే విష పదార్థం ఉంటుంది కనుక వీటిని నానబెట్టి, ఉడకబెట్టి, పిండి చేసిన తరువాతనే తినాలి bot Manihot esculenta +* Cassiopeiae, n astro కాశ్యపీయులు; కశ్యప ప్రజాపతి సంతానం; అప్సరసలు; శర్మిష్ఠ నక్షత్రం; +* cast, n 1) నటీనటులు; తారాగణం; నటీనటవర్గం 2) అచ్చు; ముద్ర; +* castoreum, n. సీమ కస్తూరి; కెనడా, రష్యా దేశాలలో తిరిగే బీవర్ జాతి జంతువుల పొట్ట దగ్గర ఉండే తిత్తులనుండి స్రవించే పదార్థం; దీన్ని సెంట్ల తయారీలో వాడతారు; +* castration, n. శస్త్ర చికిత్స ద్వారా వృషణాలని తీసివెయ్యడం లేదా పనిచెయ్యకుండా చెయ్యడం; +* cause, n. కారణం; హేతువు; నిమిత్తము; వ్యాజము; +* casual, adj దైవాధీనమైన; ఆకస్మికమైన; అచింతితమైన; యాదృచ్ఛికమైన; తాత్కాలిక; ప్రాసంగిక; +casual guest, ph. అనుకోకుండా వచ్చిన అతిథి; అభ్యాగతి; +casual leave ph. ఆకస్మికంగా కావలసి వచ్చిన ���ెలవు; +* casually, adj. ఆనుషంగికంగా; ఆషామాషీగా; యథాజ్లాపంగా; +* casualty, n 1) నష్టం 2) యుద్ధంలో కాని, ప్రమాదంలో కాని దెబ్బలు తగిలినవారు, చనిపోయినవారు; +* casuarina, n. సరుగుడు చెట్టు; సర్వీ చెట్టు; +* cat, n 1) పిల్లి, మార్జాలం; బిడాలం; ఓతువు 2) పులి; సింహం; +* cat's eye, n. వైడూర్యం; నవరత్నాలలో ఒకటి; +* catabolism, n. విచ్ఛిన్న ప్రక్రియ; జీవకోటి శరీరాలలో సజీవ కణజాలాన్ని రద్దు సామగ్రిగా మార్చే ఒక రసాయన ప్రక్రియ; same as destructive metabolism ant anabolism; +* catalysis, n. ఉత్ప్రేరణం; రసాయన సంయోగాన్ని త్వరితపరిచే ప్రక్రియ; +* catalyst, n. ఉత్ప్రేరకం; తోపు; రసాయన సంయోగాన్ని త్వరితపరచే పదార్థం; +* cataract, n 1) జలపాతం; పెద్ద జలపాతం 2) శుక్లం; కంటిలో పువ్వు; మోతిబిందు; మసక కమ్మిన కంటికటకం; +* catarrh, n కేటరా) శైత్యం; చలువ; జలుబు; పడిశం; పీనస; గొంతు, ముక్కులలో పొర వాపు; +* catastrophe, n. వినిపాతం; గొప్ప విపత్తు; ఆశనిపాతం; ఉత్పాతం; +catastrophe theory, ph ఉత్పాత వాదం; అకస్మాత్తుగా జరిగే ప్రక్రియల ప్రభావాన్ని గణిత సమీకరణాలతో వర్ణించే పద్ధతి; +* catch, v. t. అంటుకొను; పట్టుకొను; చేయు; +* catchment, n. ఆరగాణి; ఏటిదండి; పరీవాహక ప్రాంతం; నదులు, జలాశయాలలోనికి వర్షపు నీరు వచ్చి చేరే పరిసర ప్రాంతం; +catchment area, ph. పరీవాహక ప్రాంతం; నదులు, జలాశయాలలోనికి వర్షపు నీరు వచ్చి చేరే పరిసర ప్రాంతపు వైశాల్యం; +* categorical, adj. సంవర్గ; నిరపేక్ష, నిశ్చిత, స్పష్ట; రూఢియైన; నిశ్చయమైన; పరిష్కారమైన; నిస్సంశయమైన; +* categorically, adv. స్పష్టంగా; విపులంగా; వివరంగా; తేటతెల్లంగా; ఖండితంగా; +* categorization, n. వర్గీకరణ; కోవీకరణ; ఒక కోవలో పెట్టడం; +* catenary, n. రజ్జువక్రం; మాలావక్రం; రెండు రాటల మధ్య వేలాడే తాడు ఆకారపు వక్ర రేఖ; +* caterer, n. మోదీ; వండిన భోజన పదార్థాలని సరఫరా చేసే వ్యక్తి లేదా సంస్థ; +* cathartic, n. విరేచనకారి; విరేచనాలు అవడానికి వాడే మందు; భేదిమందు; +* catheter, n, సన్నని రబ్బరు గొట్టం; శరీరపు నాళాలలోనికి జొప్పించడానికి వాడే గొట్టం; +* cattle, n. పశువులు; గొడ్లు; పసరములు; +* caudal, adj. పుచ్ఛక; తోకకి సంబంధించిన; +* cauldron, n. బాన; కొప్పెర; కాగు; ఆండా; గాబు; మరిగించడానికి వాడే అండా; +* cauliflower, n. కోసుకూర; కోసుపువ్వు; పోట్లాపువ్వు; ముట్టకోసు; పువ్వుబుట్టకూర; కాలీఫ్లవర్; +* causal, adj కాజల్) కారణ; కారకమైన; నైమిత్తిక; +* causal body, ph. కారణ శరీరం; అంగ శరీరం; సూక్ష్మశరీరం; +* causal, n కాజల్) నైమిత్తికం; కారణభూతం; +* cause, n. కారణం; నిమిత్తం; హేతువు; హేతు కర్త; కతం; శకునం; ప్రేరణ; కారకం; +cause and effect, ph. కారణ కార్యములు; ప్రేరణ స్పందనలు; జనక జన్యములు; +* caustic, adj. దాహక; దహిం��ేది; కాల్చునట్టిది; తాకిడి వలన శరీరాన్ని పొక్కించేది; గాఢ; తీక్షణ; +* cauter, v. t 1) వాతలు పెట్టు 2) శస్త్ర చికిత్సలో శరీరాన్ని చిన్నగా కాల్చు; చిరిగిన చర్మాన్ని అతకడానికి చిన్నగా చురకలు పెట్టు; +* caution, v. t. మందలించు; హెచ్చరించు; జాగ్రత్త; భద్రత; +* cavalry, n. ఆశ్వికసేన; ఆశ్వికదళం; గుర్రపు దండు; సాహిణి; +* cave, n. గుహ; కుహరం; గహ్వరం; బిలం; కందరం; +* caveat, n కేవియాట్‍) షరతు; వివరణ; హెచ్చరిక; మెలి; మెలిక; ఆక్షేపణ; ఆటంకం; +caveat lector, ph. చదువరీ, జాగ్రత్త చదివిన అంశం లోని నిజానిజాలు నిర్ణయించే బాధ్యత చదువరిదే! +caveat emptor, ph. కొనుగోలుదారుడా, జాగ్రత్త కొన్న వస్తువు యొక్క మంచి చెడులు నిర్ణయించే బాధ్యత కొనుగోలుదారిదే! +* caviar, n కేవియార్) ఉప్పులో ఊరవేసిన కొన్ని రకాల చేప గుడ్లు; ఒకొక్క జాతి చేప కడుపులోంచి తీసిన గుడ్లతో చేసిన కేవియార్‍ లక్ష డాలర్ల వరకు పలకవచ్చు; +* cavity, n 1) కుహరం; గది; గహ్వరం; కోటరం; వివరం; బిలం; రంధ్రం 2) డొల్ల; పుచ్చు; పుప్పి పన్ను; నోటిలోని పన్ను పుచ్చడం; +* cayenne, n. బాగా కారంగా ఉండే ఒక రకం మిరపకాయల పొడి; +cayenne peppers, ph. బాగా కారంగా ఉండే ఒక రకం మిరపకాయలు +* cease and desist letter, ph చేసూన్న పని ఆపు, మళ్లా చెయ్యకు" అని ఆజ్ఞ ఇస్తూ రాసిన ఉత్తరం; పేటెంటు హక్కులని ఉల్లంఘించిన సందర్భాలలో ఇటువంటి ఉత్తరాలు ఎక్కువ వాడతారు; +* ceaselessly, adv. ఆపకుండా; అదేపనిగా; ఎడతెగకుండా; నిరంతరంగా; హోరాహోరీగా; +* cedar, n. దేవదారు; దేవదారు చెట్టు; +* celebrated, adj. ఖ్యాతివడసిన; వినుతికెక్కిన; కీర్తికెక్కిన; ప్రసిద్ధ; పేరున్న; విఖ్యాత; ఘనమైన; జేగీయమాన; +celestial body, ph. నభోమూర్తి; మింటిమేను; సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు; +celestial poles, ph. ఖగోళీయ ధ్రువములు; భూ అక్షాన్ని అనంతంగా పొడిగిస్తే ఖగోళాన్ని తాకే ఉత్తర, దక్షిణ బిందువులు; +celestial sphere, ph. ఖగోళం; ఆకాశం లోకి చూసినప్పుడు, వీక్షకుడు కేంద్రంగా కనిపించే మహాగోళపు లోపలి ఉపరితలం; ఈ ఉపరితలం మీదనే నక్షత్రాలు, గ్రహాలు, తాపడం పెట్టినట్లు కనబడతాయి; +* cell, n 1) కణము; జీవకణం 2) చిన్నగది; అర; అర్ర; కోషికం; కోష్టం 3) బందీగది 4) ఘటం; +* cellar, n. భూగృహం; నేలమాళిగ; భూమట్టానికి దిగువగా ఉన్న గది rel basement; +* cellophane, n. కణపత్రం; కణోజుతో చేసిన పల్చటి, పారభాసకమైన, కాగితం వంటి రేకు; +* cellulose, n. కణోజు; పేశిమయం; మొక్కల కణాలలో ఉండే ఒక పీచు పదార్థం కనుక కణోజు అన్నారు; +* cement, n. సిమెంటు; సీమసున్నం; సంధిబంధం; +* cemetery, n. క్రైస్తవ శ్మశానం; క్రైస్తవుల ఖనన భూములు; రుద్రభూమి same as graveyard); +* cenotaph, n. ఒక వ్యక్తి స్మారకార్థం నిర్మించబడే ఒట్టి ఖాళీ సమాధి; శత్రువుల చేతులలో మరణించిన సైనికుల శవాలు, విమాన, ఓడ ప్రమాదాలలో మృతుల దేహాలు ఒక్కోసారి కుటుంబ సభ్యులకు లభించవు.అలాంటి సందర్భాలలో ఖననం చేసేందుకు శవం లేకపోవడం చేత ఖాళీ సమాధి నిర్మిస్తారు. అలా ఒక వ్యక్తి స్మారకార్థం నిర్మించబడే ఖాళీ సమాధిని ‘సెనోటాఫ్' లేక 'కెనోటాఫ్' అంటారు; +* censer, n. ధూపపు పాత్ర; ధూపం వెయ్యడానికి వాడే పాత్ర; చిన్న ఆనపకాయ ఆకారంలో ఉండి వేలాడదీయడానికి వీలుగా ఒక గొలుసు ఉన్న పాత్ర: +* censor, v. t. కత్తిరించు; సెన్సారు; నిషిద్ధ దృశ్యాలని, రాతలని కత్తిరించే పద్ధతి; see also censure; +* censoriousness, n, రంధ్రాన్వేషణ; పనికట్టుకుని తప్పులు పట్టడం; +* censure, n. నింద; మందలింపు; అభిశంసనం; ఆక్షేపణ; ఆరడి; +* censure, v. t. దూషించు; నిందించు; మందలించు; అభిశంసించు; +* census, n. జనాభా లెక్క; జనపరిగణన; జనగణనం; జనసంఖ్య; +* cent, n. డాలరు వగైరా నాణేలలో నూరవ భాగం; పైస; +* centaur, n 1) నరతురంగం; గ్రీకు పురాణాలలో అగుపడే మనిషి తల, గుర్రపు శరీరం ఉన్న ఒక శాల్తీ 2) కింపురుషులు; హిందూ పురాణాలలో కనపడే మనిషి తల, గుర్రపు శరీరం ఉన్న ఒక శాల్తీ; see also satyr; +centigrade thermometer, ph. శతపద ఉష్ణమాపకం; సెంటీగ్రేడ్‍ ఉష్ణమాపకం; వేడిని కొలవడానికి సున్న నుండి వంద డిగ్రీల వరకు ఉన్న మేరని వంద భాగాలుగా విభజించబడ్డ పరికరం; +* centipede, n. జెర్రి; శతపాది; ఎన్నో కాళ్లుగల ఒక క్రిమి lit నూరు పాదములు కలది; నిజానికి శతపాదికి 32-40 కాళ్లే ఉంటాయి; +* centrifugal, adj. అపకేంద్ర; కేంద్రం నుండి బయటకు పోయే ;మధ్యత్యాగి; మధ్యస్థలాపకర్షిత; +* centripetal, adj. కేంద్రాభిముఖ; వృత్తంలో పరిధి నుండి కేంద్రం వైపు సూచించే దిశ; మధ్యాకర్షిత; మధ్యాభిగామి; +* cephalic, adj. కాపాలిక; కపాలానికి సంబంధించిన; +* ceramic, adj. పక్వమృత్త; కాలి గట్టి పడిన; +* ceramic, n. పింగాణీ; మృణ్మయం; మృత్తిక; మర్తబాన్; +* cerebellum, n. చిన్నమెదడు; అనుమస్తిష్కం; +* cerebral, adj. మస్తిష్క; మూర్ధన్య; మెదడుకి కాని బురక్రి కాని సంబంధించిన; +cerebral hemispheres, ph. మస్తిష్క గోళార్ధాలు; మెదడులో కనిపించే రెండు అర్ధ భాగాలు; +* cerebrals, n ling మూర్ధన్యములు; గొంతుక వెనక భాగం నుండి ఉచ్చరింపబడే హల్లులు; +* cerebrospinal, adj. మస్తిష్కమేరు; మస్తిష్కసుషుమ్న; +* cerebrum; n. పెద్దమెదడు; బృహన్మస్తిష్కం; +* ceremony, n 1) క్రతువు 2) ప్రత్యేకమైన పండుగ 3) ఆబ్దికం; +* certificate, n, నిర్ణయపత్రం; యోగ్యతాపత్రం; ధ్రువపత్రం; ప్రమాణపత్రం; మహాజరునామా; ఒరపురేకు; +* cesspool, n. గంధకుండం; పీతిరి గుంట; మురికి కుండీ; కూపం; +* chaff, n 1) పొట్టు; పొల్లు; పప్పుల మీద ఉండే తొక్క 2) ఊక; వరి మొదలైన ధాన్యాల మీద ఉండే తొక్క; +chain rule, ph. శృంఖల సూత్రం; పరంపర ప్రమాణం; గొలుసుకట్టు సూత్రం; +* chain, n 1) గొలుసు; చయనిక; శృంఖలం 2) నాను; హారము; పేరు; సరం 3) దామము; దండ; మాలిక 4) వరుస; పరంపర; +* chair, n. కుర్చీ; కుర్చీపీట; పీఠం; +* chairman, n. సభాపతి; అధ్యక్షుడు; పీఠాధిపతి; +* chalcedony, n. పుష్యరాగం; కురువిందం; కురింజి; +* chalice, n, పంచపాత్ర; కలశం; చర్చిలో మధుపానం కొరకు వాడే పాత్ర; +* chamber, n 1) వేశ్మము; గది; కోష్ఠం; కోష్ఠిక; పేటిక 2) మండలం; +* change, n 1) మార్పు; ఫిరాయింపు 2) పరిణామం; వికారం 3) చిల్లర డబ్బు; +* chapel, n. చర్చి భవనంలో ఒక మూల ఉండే గది; చర్చిలో చిన్న ప్రార్ధన మందిరం; +* chaos, n కేయాస్) కల్లోలం; అస్తవ్యస్తత; అవ్యక్త స్థితి; అయోమయం; గందరగోళం; గజిబిజి; అరాజకత్వం; +* chapter, n. అధ్యాయం; ప్రకరణం; ఆశ్వాసం; సర్గం; కాండం; పర్వం; స్కంధం; పరిచ్ఛేదం; వల్లి; +* character, n 1) శీలం; నడవడి; నడవడిక 2) స్వభావం; లక్షణం; తత్వం; గుణం; శీలత 3) మూర్తి; శాల్తీ; ఆసామీ; పాత్ర; శీలత 4) వర్ణం; అక్షరాంకం; +character actor, ph. గుణచిత్ర నటుడు; గుణచిత్ర నటి; ప్రధాన పాత్రలు కాకుండా ఇతర ముఖ్య పాత్రలు పోషించగలిగే నటుడు; +* characteristic, n. స్వభావం; ముఖ్య లక్షణం; తత్వం; గుణం; విశిష్టత; కారకత్వం; +* characterize, v. t. ఉపలక్షకరించు; వర్ణించు; చిత్రించు; +wood charcoal, ph. కర్రబొగ్గు; ద్రుమాంగారం; దార్వాంగారం; +charcoal grill, ph. కుంపటి; అంగారిణి; అంగారధానిక; బొగ్గుల కుంపటి; +* charge, n 1) ఘాతం; ఆవేశం; భాండం; విద్యుత్‍వంతం; తటిత్వంతం; తటి; ఛార్జి 2) అప్పగింత; హవాలా 3) ఫిర్యాదు 4) దాడి; +* charge, v. t. ఆరోపించు; నిందమోపు; మీదకి దూకు; మీద పడు 2) ఖాతాలో వేయు 3) అప్పగించు; భారం వేయు; +charge sheet, ph 1) ఆరోపణ పత్రం; నేరారోపణ పత్రం 2) అప్పగింత పత్రం; +* charisma, n సమ్మోహన శక్తి; జనాకర్షక శక్తి; +* charity, n. ఉదాత్తత; దాతృత్వం; ఈగి; తిరిపెం; +* charlatan, n. అల్పజ్ఞుడు; పండితమ్మన్యుడు; కుహనా మేధావి; దుర్విదగ్ధుడు; లోతైన జ్ణానము లేని వ్యక్తి; +* chasm, n కేజం) అగాధం; పెద్ద బీట; లోతైన గొయ్యి; +* chassis, n ఛాసీ) చట్రం; బండి చట్రం; కారు చట్రం; +* chaste, adj ఛేస్ట్) శీలవతి అయిన; నిర్దోషి అయిన; +* chastise, v. t ఛేస్టయిజ్) దండించు; తిట్టు; కొట్టు; +* chat, v. t. ముచ్చటించు; కబుర్లు చెప్పు; +* chatterbox, n. డబ్బా; వసపిట్ట; వాగుడునోరు; వదరుబోతు; +* chauffeur, n షోఫర్) కారు నడిపే వ్యక్తి; డ్రైవరు; +* cheat, v. t. మోసగించు; వంచించు; మస్కా కొట్టు; +* cheater, n. m. మోసగాడు; వంచకుడు; తక్కిడి; బకవేషి; అటమటీడు; f. మోసకత్తె; వంచకురాలు; +* checkers, n. చదరంగం బల్ల వంటి బల్ల మీద ఆడే ఒక ఆట; +* cheek, n. చె��ప; చెక్కిలి; బుగ్గ; లెంప; కపోలపాలిక; కపోలం; +* cheetah, n. చీతా bio Acinonyx jubatus ఇది ఎక్కువగా ఆఫ్రికాలో నివసించే జంతువు; లేత పసుపుపచ్చ చర్మం మీద నల్లటి మచ్చలు ఉంటాయి; చిన్న గుండ్రటి తలకాయ, రెండు కళ్ళ నుండి కన్నీటి ధారల నల్లటి గీతలు ఉంటాయి; ఇది భారతదేశంలో కనిపించే leopard (చిరుతపులి) జాతిది కాదు; చీటా అన్నది ఉత్తరాది భాషల్లో చీతా, సంస్కృతం చిత్రా నుంచి వచ్చింది. దాన్ని మనం చీటా అనడం కంటే చీతా అనటం మంచిది; +* chef, n. వంటరి; వంటమనిషి; సూనరి; m. వంటవాఁడు; సూదుఁడు; పాకశాసనుఁడు; f. వంటలక్క; వంటగత్తె; సూదురాలు; +* chemicals, n. రసాయనాలు; రసాయన పదార్థాలు; రసాయన ద్రవ్యాలు; +* chemist, n. రసాయనుడు; రసాయన శావేత్త; +inorganic chemistry, ph. వికర్బన రసాయనం; అనాంగిక రసాయనం; మూలక రసాయనం; +organic chemistry, ph. కర్బన రసాయనం; సేంద్రియ రసాయనం; ఆంగిక రసాయనం; భూత రసాయనం; +* chemotherapy, n. రసాయన చికిత్స; కేన్సరుకి వాడే మందులు; +* chest, n 1) రొమ్ము; ఛాతీ; అక్కు; బోర; ఎద; వక్షస్థలం; హృదయఫలకం; భుజాంతరం 2) పెట్టె; బీరువా; మందసం; +chiaroscuro effect, ph. ఛాయాచిత్రాలు తీసేటప్పుడు వెలుగు-నీడల ని కళాత్మకంగా ఉపయోగించుకోవడం; +* chicken pox, n. ఆటలమ్మ; తడపర; చిన్నమ్మవారు; పొంగు; వేపపువ్వు; ఒక వైరస్‍ వల్ల వచ్చే జబ్బు; varicella; +* chief justice, ph. ముఖ్య న్యాయాధిపతి; ప్రధాన న్యాయమూర్తి; +* chicory, n చికోరీ; కొందరు చికోరీ వేరుని పొడి చేసి కాఫీలో కలుపుతారు bot Cichorium intybus'' +* chilblains, n. ఒరుపులు; చలికి చేతి వేళ్లల్లోను, కాలి వేళ్లల్లోను రక్త నాళాలు సంకోచించటం వల్ల రక్త ప్రవాహం తగ్గి, ఆయా భాగాలు ఎర్రగా కంది, నొప్పితో బాధ పెట్టే వ్యాధి; +* child, n. బిడ్డ; పాప; శిశువు; కందు; కూన; బుడుత; బాల; పట్టి; బొట్టె; m. పిల్లడు; బిడ్డడు; డింభకుడు; బాలుడు; గుంటడు; f. పిల్ల; బాలిక; గుంట; శాబకం; మాటలు మాట్లాడడం వచ్చిన తరువాత దశ; +* childhood, n. బాల్యం; బాల్యావస్థ; చిన్నతనం; పసితనం; చిన్నప్పుడు; శైశవం; కైశోరం; చిరుత ప్రాయం; +* childish, adj. కైశోరక; కురత్రనపు; కుర్ర తరహా; +* chilly, n. చలి; చలిగానుండు; చలివేయు; +* chimney, n. పొగగొట్టం; పొగగూడు; చిమ్నీ; +* chip, n 1) బిళ్ళ; తునక; ముక్క 2) అవకర్త; అతి సూక్ష్మమైన ఎలక్ట్రానిక్ పరికరాలు చెయ్యడానికి వాడే సిలికాన్ బిళ్ళ; +* chirping, n, పక్షులు చేసే కిచకిచ ధ్వని; +* chit, n. చీటీ; కాగితపు ముక్క; ఉల్లాకి; +* chital deer, n, జింక; దక్షిణ ఆసియాలో కనబడే ఒక జాతి చుక్కల లేడి; +* chitchat, n. బాతాఖానీ; లోకాభిరామాయణం; చొల్లు కబుర్లు; +* chlorine, n. హరితం; హరిత వాయువు; ఒక రసాయన మూలకం అణుసంఖ్య 17, సంక్షిప్త నామం, Cl); +* chlorophyll, n. పత్రహరితం; పైరుపచ్చ; వృక్షజాతికి ఆకుపచ్చ రంగునిచ్చే పదార్థం; +* choir, n క్వాయర్) మేళపాటగాళ్లు; +* choke, n. ఊపిరి తిరగకుండా చేయు; ఉక్కిరిబిక్కిరి చేయు; +* choker, n. కుత్తిగంటె; మెడకు బిగుతుగా పట్టే ఆభరణం; +* cholagogue, adj. పిత్తహరి; పిత్తాన్ని హరించేది; +* cholera, n. వాంతిభేది; విషూచి; మహామారి; మరిడివ్యాధి; కలరా; ఒక రకమైన సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధి; +* cholesterol, n. పిత్తఘృతాల్; కొలెస్టరోల్; జంతువుల కొవ్వులో ఉండే ఒక ఘృతామ్లం; +* chord, n 1) జ్యా, జీవ; జీవన రేఖ; వృత్తపు పరిధి మీద రెండు బిందువులని కలిపే సరళ రేఖ 2) వాద్యసాధనం యొక్క తీగ; +* chordates, n biol మేరోమంతములు; తాత్కాలికంగాకాని; శాశ్వతంగాకాని వెన్నెముక ఉన్న జంతుజాతి; +* chordophones, n. pl. తంతు వాద్యములు; చేతి గోళ్లతో మీటి వాయించే వాద్యములు; ఉ. తంబురా; వీణ; సితార్; +* chores, n. pl. చిల్లరమల్లర పనులు; జీవితంలో దైనందినం చేసుకునే పనులు; +* choreography, n. నాట్యలేఖనం; నాట్యం ఎప్పుడు ఎలా చెయ్యాలో రాసుకోవడం; +* chough, n. లోహతుండకాకోలం; సువర్ణతుండ కాకువు; శీతల ప్రాంతాలలో కనిపించే ఒక రకం కాకి; +* Christian, adj. క్రైస్తవ; క్రీస్తవ; కిరస్థానీ; +* Christian, n. m. క్రైస్తవుడు; క్రీస్తవుడు; కిరస్థానీవాడు; +* chromosome, n. వారసవాహిక; వంశబీజం; జీవకణాలలో దారాల రూపంలో ఉండే జన్యు పదార్థం; డి.ఎన్.ఏ. అన్నా ఇదే; +* chronic, adj. దీర్ఘ; విలంబిత; జీర్ణించుకుపోయిన; జీర్ణ; సదా; పురాణ; జగమొండి; +* chronic disease, ph. దీర్ఘవ్యాధి; విలంబిత వ్యాధి; సదారోగం; జీర్ణించిన వ్యాధి; జగమొండి రోగం; ఏళ్ళ తరబడిగా ఉన్న జబ్బు; బాగా ముదిరిన వ్యాధి; +* chronological, adj. తిథివారీ; చారిత్రక క్రమవారీ; అనుపూర్విక; +* chronology, n. చారిత్రక క్రమం; తైధిక క్రమం; కాలక్రమం; అనుపూర్వికం; భూతకథానుక్రమణిక; కాలవృత్తాంతం; +* chronometer, n. కాలమాపకం; శ్రేష్ఠమైన గడియారం; +* chrysalis, n. పురుగుగూడు; పిసినికాయ; గొంగళీ; పట్టుపురుగు మొ. కట్టుకునే గూడు; +* chuckle, v. i. ముసిముసి నవ్వు; చిన్నగా నవ్వు; ఇకిలించు; సకిలించు; +* chum, n. దగ్గర స్నేహితుడు; ఆప్తుడు; దగ్గర స్నేహితురాలు; ఆప్తురాలు; +* church, n 1) క్రైస్తవుల సత్సంగం; క్రైస్తవుల సమావేశం 2) క్రైస్తవుల ప్రార్ధన మందిరం 3) క్రైస్తవ మత వ్యవస్థ యొక్క అధిష్టాన వర్గం; +* churn, v. t. మథించు; చిలుకు; త్రచ్చు; కవ్వించు; +* churning, n. మథనం; చిలకడం; త్రచ్చుట; త్రచ్చడం; తిప్పడం; +* cider, n. కొద్దిగా పులియబెట్టిన పళ్ళరసం; ముఖ్యంగా ఏపిల్ పళ్ళ రసం; +* cinchona, n. సింకోనా; మలేరియాకి వాడే ఒక ఔషధం; హోమియోపతీ మందులలో వాడే ఛైనా ఈ సింకోనా నుండే చేస్తారు bot China officinalis; +* cinder, n. దాలి; మావి పట్టిన నిప్పులు; +* cine, adj. చలనచిత్రాలకి సంబంధించిన; సినిమా; +* cinema, n. చలనచిత్రం; చిత్రకథ; సినిమా; తెరాట; +cinema hall, ph. చిత్ర ప్రదర్శనశాల; సినిమా హాలు; +* cinnamon, n. దాల్చినచెక్క; లవంగపట్ట; +* cipher, n 1) శూన్యం; సున్న; హళ్ళి; హుళక్కి; పూజ్యం; గగనం 2) రహస్యలిపి; +* circle, n. వృత్తం; వర్తులం; వలయం; చక్రం; మండలం; అల్లి; హళ్ళి; +excircle, ph. బహిర్‌ వృత్తం; ఒక త్రిభుజం బయట ఒక భుజాన్నీ, మిగిలిన రెండు భుజాల పొడుగింపులనీ స్పర్శిస్తూ ఉండగలిగే అతిపెద్ద వృత్తం; +incircle, ph. అంతర్‌ వృత్తం; ఒక త్రిభుజం లోపల మూడు భుజాలని స్పర్శిస్తూ ఉండగలిగే అతిపెద్ద వృత్తం; +inner circle, ph 1) అపసిద్ధ బిందువు; అంతర్‌లిఖిత వృత్తం 2) ఆంతరంగికులు; +inscribed circle, ph. అంతర్‌ వృత్తం; ఒక బహుభుజి లోపల అన్ని భుజాలని స్పర్శిస్తూ ఉండగలిగే అతిపెద్ద వృత్తం; +* circuitous, adj. డొంకతిరుగుడు; చుట్టుతిరుగుడు; +* circular, adj సర్క్యులార్) గుండ్రని; వృత్తాకారమైన; వర్తులాకారమైన; చక్రీయ; వట్రువ; బటువు; +* circular, n సర్క్యులర్) కరపత్రం; తాకీదు; వర్తులం; వర్తుల లేఖ; +* circulate, v. t. తిప్పు; నలుగురికీ చూపించు; చేతులు మార్చు; +* circumpolar stars, ph. ప్రరిధ్రువ తారలు; ధ్రువ నక్షత్రం చుట్టూ ప్రదక్షిణం చేసే తారలు; +* circumstantial, adj. స్థితిగత్యానుసార; అప్రత్యక్ష; పరిస్థితిసంబంధ; సంభవాత్మక; ప్రాసంగిక; +* circumstantial evidence, ph. స్థితిగత్యానుసార ప్రమాణం; ఉత్తరోత్తర ఆధారాలు; సంభవాత్మక ప్రమాణం; ప్రాసంగిక ప్రమాణం; +* cirrhosis, n. అవయవములు గట్టిపడి పరిమాణం తగ్గుట; +* cis fat, ph chem ఒక రకం కొవ్వు పదార్థం; ఈ రకం కొవ్వులలో జంట బంధం ఉన్న కర్బనపు అణువులకి ఒక పక్కనే గొలుసు పెరగటం వల్ల ఆ గొలుసు వంకరగాఉంటుంది; +* citation, n 1) చేసిన తప్పుని చూపి జరిమానా వెయ్యడం 2) ఉపప్రమాణం; ఒకరు చేసిన మంచి పనులని ఎత్తి చూపి సత్కరించడం 3) ఒకరి రచనలని ఎత్తి చూపి ఉదహరించడం; +* cite, v. t. ఉదహరించు; చూపించు; ఎత్తి చూపు; +* city, n. నగరం; పట్టణం; పురం; ప్రోలు; మహానగరం; బస్తీ; పెద్ద ఊరు; +* civet, n. జవాది; జవాది పిల్లి మర్మస్థానాల నుండి స్రవించే తేనె వంటి పదార్థం; దీన్ని సెంట్లు, అత్తరులలో వాడతారు; +* civet cat, n. జవాది పిల్లి; పునుగు పిల్లి; పునుగు; బూతపిల్లి; కమ్మపిల్లి; గంధ మృగం; గంధ మార్జాలం; మార్జారిక; ఆఫ్రికా, ఇండియా, మలేసియా దేశాలలో నివసించే ఒక మాంసాహారి; +* civetone, n. జవాది; జవ్వాది; సంకు; పునుగు పిల్లుల శరీరం నుండి స్రవించే కొవ్వు వంటి మదజలం [see also musk]; +civil engineering, ph సర్కారీ స్థాపత్యశాస్త్రం; పౌర స్థాపత్యశ���స్త్రం; +* clad, adj. ధరించిన; తొడుక్కున్న; పరివేష్టితమైన; +* claim, n. హక్కు; అర్హత; స్వత్వం; విల్లంగం; +* claim, v. i. తనకు రావలసినదాని కొరకు పోరాడు; దావా వేయు; +* clairvoyance, n. దివ్యదృష్టి; యోగదృష్టి; కంటికి ఎదురుగా కనిపించని వస్తువులని చూడగలిగే దివ్య శక్తి; +* clarify, v. t. విశదీకరించు; స్పష్టం చేయు; స్పష్టపరచు; వివరించు; +* clarity, n. స్పష్టత; సుబోధకత; తెరిపి; వ్యక్తత; +clarified butter, ph. నెయ్యి; ఘృతం; ఆజ్యం; హవిస్; శుద్ధి చెయ్యబడ్డ వెన్న; +* clash, v. i. డీకొట్టుకొను; వికటించు; +* classics, n. pl. సనాతన గ్రంథాలు; ప్రామాణిక గ్రంథాలు; గణనీయ గ్రంథాలు; శ్రేష్ఠసాహిత్యం; +* classified, adj 1) తరంవారీ; వర్గీకృత; తరగతులుగా విడగొట్టబడిన 2) రహస్యంగా ఉంచవలసిన; బహిరంగపరచకుండా ఉంచవలసిన; +classified research, ph. వర్గీకృత పరిశోధన; రహస్యంగా ఉంచవలసిన శాస్త్రీయ పరిశోధన; +* classifier, n. తరందారు; తరగతులుగా విడగొట్టునది; +* classify, n. వర్గీకరించు; తరగతులుగా విభజించు; +* claw, n 1) పక్షిగోరు, పులిగోరు, పిల్లిగోరు; పంజా 2) డెక్క; గిట్ట 3) పట్టుకొమ్ము; సుత్తిలో మేకులని ఊడబెరికే కొస; +* clay, n. బంకమన్ను; బంకమట్టి; రేగడిమన్ను; మృత్తిక; +white clay, ph. పాలమన్ను; సుద్ద; నాము; ధవళ మృత్తిక; +* clear, adj 1) స్పష్టమైన; స్ఫుటమైన; విశదమైన; స్వచ్ఛమైన 2) తెరిపి; మబ్బు లేకుండా; నిర్మల; స్వచ్ఛ; +* clear, n. కళంకం లేని స్థితి; స్పుటం; +* clearly, adv. విదితముగా; విశదంగా; స్పష్టంగా; +* clean, adj 1) శుభ్రమైన; శుచియైన; మృష్ట 2) నున్ననైన; బోడి; +* clean, v. t 1) శుభ్రం చేయు; శుభ్రపరచు 2) నున్నగా చేయు; +* cleanliness, n. శుచి; శుభ్రం; శౌచం; శుభ్రత; నైర్మల్యం; నిర్మలత; +* clear, v. t. శుభ్రం చేయు; తుడిచి వేయు; చెరుపు; చెరిపివేయు; +* clear, adj. తేరిన; తేట తేరిన; నిర్మలమైన; +* clearing nut, n. ఇండుప గింజ; చిల్ల గింజ; అందుగు గింజ; +* cleavage, n 1) చీలిక 2) ఆడదాని చన్నుల మధ్యనున్న చీలిక వంటి స్థలం; +* clemency, n. దయాభిక్ష; కనికరించి క్షమించడం; +* clergyman, n. క్రైస్తవుల చర్చిలో పురోహితుని వంటి మతాధికారి; +* clerical error, ph. హస్తదోషం; చేతప్పు; రాతలో జరిగిన తప్పు; +* clerk, n. గుమస్తా; ముసద్దీ; రాసేవాడు; లేఖరి; +* clerkship, n. రాయసం; రాతకోతలు నేర్చుకునే దశ; +* cleverness, n. వైదగ్ధ్యం; విదగ్ధత; నేర్పరితనం; నేర్పు; చాతుర్యం; +* climate, n 1) సదావరణం; ఒక ప్రదేశంలో దీర్ఘకాల సగటు పరిస్థితులు – అంటే దశాబ్దాలు, శతాబ్దాల తరబడి ఉండే పరిస్థితులని వర్ణించడానికి వాడతారు. “దీర్ఘకాలం” అంటే కనీసం 30 సంవత్సరాలు ఉండాలని ఒక ఒప్పందం ఉంది 2) వాతావరణం 3) శీతోష్ణస్థితి; ఇది వాతావరణం యొక్క పరిస్థితిని (state of the atmosphere) వర్��ించే మాట. తరుణకాల శీతోష్ణస్థితి అంటే వెదర్, దీర్ఘకాల శీతోష్ణస్థితి అంటే క్లయిమేట్ అని వివరణ చెప్పవచ్చు rel weather; +* climax, n. పరాకాష్ఠ; పతాక సన్నివేశం; బిగి; రసకందాయం; +* climb, v. i. ఎక్కు; అధిరోహించు; ఆరోహించు; +* cling, v. i. పట్టుకుని వేలాడు; కరచి పట్టుకొను; +* clinic, n 1) ఆరోగ్యశాల; వైద్యశాల; వైద్యాలయం; భేషజ శాల; ప్రజలకి వైద్య సహాయం దొరికే స్థలం; ఆసుపత్రి అంటే ఉపతాపిని 24 గంటలు పర్యవేక్షణలో ఉంచి చూడడానికి అనువైన స్థలం;(2) ఒక నిర్ధిష్టమైన పనిని సమర్ధవంతంగా చెయ్యడానికి కొంతమంది ఉమ్మడిగా సమావేశమయే ప్రదేశం; ఉ. టెన్నిస్ క్లినిక్ అంటే టెన్నిస్ ఆడడంలో చేసే తప్పులని సవరించుకోడానికి సమావేశమయే ఆట స్థలం; +* clip, n. కత్తిరించిన భాగం; +clip art, ph. అతకడానికి వీలైన చిన్న చిన్న బొమ్మలు; +* clique, n. సన్నిహితుల గుంపు; ఇతరులని చేరనీయని సన్నిహితుల గుంపు; +* cloak, n. కండువా వంటి బట్ట; మెడ దగ్గర ముడికట్టి వెనకకి జారవిడచే వం; +* clock, n. గడియారం; గంటల గడియారం; పెద్ద గడియారం; ఘడి; ఘటీకారం; +* clockwise, adj. అనుఘడి; దక్షిణావర్త; ప్రదక్షిణ; అవిలోమ; +* close, v. t. మూతవేయు; మూయు; మూసివేయు; మోడ్చు; ముకుళించు; నిమీలించు; +* closed, adj. మూతవేసిన; మూసిన; మూతపడ్డ; మూయబడ్డ; మోడ్చిన; ముకుళించిన; సంవృత; ఆవృత; నిమీలిత; +half closed, ph. అరమోడ్చిన; అర్ధ నిమీలిత; అర్ధ సంవృత; +* closet, n. చిన్న గది; కొట్టు; కొట్టుగది; అర; +* closure, n. సమాపకం; సంవృతం; వివారం; సమాప్తి; మూసివేత; +blood clot, ph. రక్తపు కదుం; గడ్డకట్టిన రక్తం; దొబ్బ; +* clot, v. i. పేరుకొను; గడ్డకట్టు; గరకట్టు; +* clotting, n. పేరుకొనుట; గడ్డకట్టుట; గడ్డకట్టడం; +* cloth, n క్లాత్) బట్ట; గుడ్డ; వలువ; చేలం; వస్త్రం; +* clothe, v. t క్లోద్) దుస్తులు తొడుగు; బట్టలు వేయు; +* clothed, adj. సచేల; దుస్తులతో ఉన్న; బట్టలు కట్టుకున్న; +* clothesline, n. దండెం; బట్టలు ఆరవేసుకొనే తాడు; +* cloud, n. మేఘం; మబ్బు; మొగులు; మొయిలు; ఖచరం; అభ్రం; పయోధరం; ఘనం; జీమూతం; జలధరం; అంబుడము; +cloud chamber, ph phy జీమూత కోష్ఠిక; భౌతిక శాస్త్ర పరిశోధనలో వాడే ఒక ఉపకరణం; +* cloudy, adv. మబ్బుగా; మసకగా; మెయిలుగా; ముసాబుగా; మొగులుగా; +* clover, n. గడ్డి మైదానాలలో పెరిగే ఒక జాతి కలుపు మొక్క; +* clown, n. m. విదూషకుడు; కోణంగి; గంథోళిగాడు; హాస్యగాడు; +* clue, n. ఆధారం; ఆచూకీ; ఆరా; జాడ; పత్తా; కిటుకు; సవ్వడి; +* cluster, n 1) గుంపు; గుచ్ఛం; రాశి; వితతి; గమి 2) సంయుక్తాక్షరం 3) గెల; అత్తం; గుత్తి; చీపు; +* coach, n 1) బండి; శకటం 2) శిక్షకుడు; తరిఫీదు ఇచ్చే మనిషి; +* coagulate, v. i. పేరుకొను; గడ్డకట్టు; గట్టిపడు; చిక్కపడు; +* coal, n. రాక్షసి���ొగ్గు; నేలబొగ్గు; రాతిబొగ్గు; గనిబొగ్గు; శిలాంగారం; రాక్షసాంగారం; +* Coal Sacs, n astro శ్యామ సీమలు; మిల్కీవే గేలక్సీలో నల్లటి భాగాలు; +* coarse, adj. స్థూలమైన; ముతక; ముదుక; కోరా; అనణువైన; మోటు; మడ్డి; గరుకు; బరక; +coarse paper, ph. ముతక కాగితం; మడ్డి కాగితం; గరుకు కాగితం; +* coast, n. కోస్తా; సముద్రతీరం; కరసీమ; +* coax, v. t. లాలించు; బెల్లించు; ఒప్పించు; పుసలాయించు; +* Cobalt, n. మణిశిల; నల్లకావి రాయి; గనిజం; కోబాల్టు; ఒక రసాయన (అణుసంఖ్య 27, సంక్షిప్త నామం, Co మూలకం Gr. cobalo mine]; +* cobbler, n. మాదిగ; చెప్పులు కుట్టేవాడు; +* cobweb, n. సాలెపట్టు; సాలెగూడు; దూగరం; ధుంధుమారం; +* coca, n. కోకా; ఈ తుప్ప ఆకులలో 14 రకాలైన ఔషధాలు ఉన్నాయి; ఈ ఔషధాలలో ముఖ్యమైనది కోకెయిన్; దక్షిణ అమెరికాలోని ఇండియన్లు ఈ ఆకులని తమలపాకులలా వాడతారు. ఈ ఆకులకి సున్నం రాసుకుని తింటే కొద్దిగా నిషా ఎక్కుతుంది; సా. శ. 1885 లగాయతు 1905 వరకు కోకా-కోలా కంపెనీ ఈ ఆకులనుండి కొన్ని రసాయనాలని సంగ్రహించి వారి పానీయాలలో వాడేవారు; +* cocaine, n. కొకెయిన్ 1) స్థానికంగా నొప్పి తెలియకుండా చెయ్యడానికి వాడే ఒక మందు 2) తెల్లటి గుండ రూపంలో దొరికే ఈ మందుని దురలవాటుగా, ముక్కుపొడుంలా వాడి, దుర్వినియోగం చేసుకునే ప్రమాదం కూడా ఉంది; +* coccyx, n. ముడ్డిపూస; అనుత్రికం; త్రోటిక; గుదాస్థి; +* cockatoo, n. కాకతువ్వ; చిలకని పోలిన దక్షిణ అమెరికా పక్షి; +coconut juice, ph. కొబ్బరి పాలు; కొబ్బరి ముక్కలని పిండగా వచ్చే తెల్లటి పాలు; +coconut milk, ph. కొబ్బరి నీళ్లు; కొబ్బరి కాయలో ఉండే నీళ్ళు; +* coconut, n. కొబ్బరికాయ; టెంకాయ; నారికేళం; +* code, n 1) ధర్మశాస్త్రం; స్మృతి; సంహిత 2) ఏర్పాటు; నియమం; నియమావళి 3) రహస్యలిపి; గుర్తు; సంక్షిప్తం; కోడు 4) కంప్యూటరులో వాడే క్రమణిక లేక ప్రోగ్రాము; +* codicil, n. వీలునామాకి అనుబంధించిన తాజా కలం; +* coding, v. t 1) రహస్యలిపిలో రాయడం; సంక్షిప్తంగా రాయడం 2) కంప్యూటరు ప్రోగ్రాము రాయడం; +coefficient of diffusion, ph. విసరణ గుణకం; ఒక నిర్దిష్ట కాల పరిమితి (ఉ. సెకండు) లో ఒక పదార్థం ఎంత ప్రాంతం లోకి వ్యాప్తి చెందుతుందో చెప్పే సంఖ్య; +coefficient of viscosity, ph. స్నిగ్ధతా గుణకం; చిక్కదనాన్ని తెలిపే గుణకం; నీటి చిక్కదనం 1 అనుకుంటే ఆముదం చిక్కదనం 1 కంటె ఎక్కువ ఉంటుంది, తేనె చిక్కదనం ఇంకా ఎక్కువ ఉంటుంది; +* coerce, v. t. జులుం చేయు; బలవంతం చేయు; మొహమాటం పెట్టు; +* coercion, n. జులుం; బలవంతం; బలాత్కారం; మొహమాటం; +* cog, n. పళ్ళ చక్రంలో పన్ను; +* cognac, n కోన్యాక్‍ ప్రాంసు దేశంలో, కోన్యాక్‍ అనే ప్రాంతంలో తయారయే బ్రాందీ; +cognitive cataclysm, ph అభిజ్ఞాత ఉత్పాతం; ఎరుకలో ఉత్పాతం; ఎరుకలో ప్రళయం; +* cognizable, adj legal] న్యాయస్థానంలో హాజరు పరచగలిగేటటువంటి అనే జ్ఞానం కల; నేరముగా గుర్తించబడ్డ; +cognizable offense, ph legal] న్యాయస్థానంలో హాజరు కావలసినటువంటి నేరం; నేరముగా గుర్తించబడ్డది; cognizable offence అంటే ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, పోలీసులు సమాచారం అందిన వెంటనే కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించాలి. +* coherent, adj. సంబద్ధం; సంగతం; పొంత; పొందిక; పొత్తు; సామరస్యం; +* coiffure, n. కొప్పు; కొప్పు ముడి; కేశాలంకారం; ముడి; మూల; ధమ్మిల్లం; +* coil, n. కుండలి; చుట్ట; తీగ చుట్ట; +rupee coin, ph. రూపాయి; రూపాయి కాసు; రూపాయి బిళ్ల; +* coin, v. t. తయారుచేయు; ప్రయోగించు; +* coincidence, n. కాకతాళీయం; యాదృచ్ఛికం; అవితర్కిత సంభవం; సంపాతం; +* coitus, n. రతి; సంభోగం; స్త్రీ పురుషుల మధ్య లైంగిక సంయోగం; +* colander, n. చాలని; కర్కరి; సిబ్బితట్ట; వంటకాలలోని నీటిని బయట పారబోయడానికి వాడే చిల్లుల పాత్ర; +cold-blooded animals, ph. బయట ఉండే శీతోష్ణతలతో శరీరం ఉష్ణోగ్రత మారే జంతుజాలం; +* colic, n. శూల; కడుపులో తీవ్రంగా వచ్చే నొప్పి note) పసిపిల్లలు పాలు తాగిన తరువాత త్రేనుపు చెయ్యకపోతే పాలతో మింగిన గాలి కడుపులో చిక్కుపడి ఈ రకం నొప్పిని కలుగజేస్తుంది; +* collate, v. i. పుటల వారీగా పత్రాలని అమర్చడం; +collateral damage, ph. అనుషంగిక నష్టం; అనుషంగిక హాని; అనుకున్నదానికే కాకుండా చుట్టుప్రక్కల వాటికి దెబ్బతగలడం; +* colleagues, n. pl. సహోద్యోగులు; ఒకే చోట పనిచేసే వ్యక్తులు; +* collect, v. t. దండు; పోగుచేయు; కూడబెట్టు; వసూలుచేయు; సేకరించు; సమాహరించు; +* collection, n 1) పోగయినది; వసూళ్లు; వసూలు చేసినది; సేకరించినది; జమా 2) సంహితం; సమాహారం 3) సమితి; సముదాయం; పటలం; పటలి; ఝాటం; వారం; తతి; కురుంబం; కూటమి; కూటువ; +* collections, n. pl వసూళ్ళు; పోగయిన మొత్తం; వసూలు చేసినది; సేకరించినది; +* collective, adj. సామూహిక; సమూహ; సమష్టి; సాముదాయిక; మూకుమ్మడి; బహుగత; +* collectively, adv. సామూహికంగా; సమష్టిగా; సాముదాయికంగా; +* collector, n. దండుదారు; సేకర్త; కలెక్టరు; +* collide, v. i. ఢీకొను; గుద్దుకొను; సంఘర్షించు; +* collision, n. అభిఘాతం; సంఘర్షణ; సంఘాతం; గుద్దుకోవడం; ఢీకొనడం; +* colloid, n. జిగార్ధం; జిగురువంటి పదార్థం; శ్లేషాభం; కాంజికాభం; see also gel; +colloidal clay, ph. జిగార్ధ మృత్తికం; బంధక మృత్తికం; +* colloquial, adj. వ్యావహారిక; ప్రచలిత; సంభాషణలో వాడే; +* collusion, n. లాలూచీ; గూడుపుఠానీ; కుట్ర; లోపాయకారీ; రహశ్య ఒప్పందం; కుమ్మక్కు; +* collyrium, n. సురుమా; కాటుక రూపంలో కళ్లకి పెట్టుకునే మందు; +* colon, n 1) పెద్దపేగు; బృహదాంత్రం 2) అటకా; న్య���న బిందువు; వాక్యంలో విరామ చిహ్నం; +* colonel, n కర్నెల్ సైన్యంలో లుటునెంట్ (లెఫ్టినెంట్) పై అధికారి; +* colophon, n. గద్య; శతకం చివర కాని, ఒక అధ్యాయం చివర కాని గ్రంథకర్త తన గురించి తెలిపే వాక్య సముదాయం; గ్రంథం చివరిలో ఉపసంహారము, మలిపలుకు, చివరిమాట, భరతవాక్యం, epilogue, colophon, వీటిని ఉత్తర పీఠిక అంటారు; +* color, colour (Br n. రంగు; వర్ణం; రాగం; కాంతి కిరణం యొక్క పౌనఃపున్యం; +color blindness, ph. వర్ణాంధత్వం; రంగులలో భేదం కంటికి కనిపించకపోవడం; +* colostrum, n. జున్నుపాలు; పశువులు ఈనిన తరువాత మొదటి రెండు, మూడు రోజులూ ఇచ్చే పాలు; ఈ పాలు చూడడానికి తెల్లగా ఉండవు; నీళ్లల్లా ఉంటాయి; +* colt, n. మగ గుర్రప్పిల్ల; +* column, n 1) స్తంభం; కంబం 2) దొంతి; కుందం; వరుస; నిలువు వరుస; నిరుస; మొగరం; స్థూపం; ధారణి; ఓజ; +* coma, n. అపస్మారకం; కుంభనిద్ర; స్థిరనిద్ర; చిరనిద్ర; స్మృతిరహిత నిద్ర; స్మృతివిహీనత; ఒంటి మీద తెలివిలేని స్థితి; కోమా; +* comatose, adj. అపస్మారక స్థితిలో ఉన్న; కుంభనిద్రలో ఉన్న;స్మృతిరహితనిద్రలో ఉన్న; స్మృతివిహీన; +* comb, n. దువ్వెన; పన్ని; చిక్కట్ట; కంకతము; +* combination, n. మేళనం; సంయోగం; సంమ్మిశ్రమం; సంచయము; +permutation and combination, ph క్రమచయసంచయము; క్రమవర్తనం, క్రమసంచయం; క్రమవర్తన క్రమసంచయాలు; +* combine, v. t. మేళవించు; సంయోగించు; సంయోగపరచు; కలుపు; కలబోయు; జమిలించు; జమాయించు; +* combined, adj. సంయుక్త; సమయోజిత; సమైక్య; కలసిన; కలసిపోయిన check this సమయోజిత +* combustion, n. దహనం; నిర్ధహనం; నిర్ధగ్ధం; జ్వలనం; ప్లోషం; మంట; జ్వాల; +* come, v. i. వచ్చు; అరుదెంచు; వేంచేయు; విచ్చేయు; ఏగుదెంచు; ఏతెంచు; అరుదెంచు; +* comedian, n. m. హాస్యగాడు; విదూషకుడు; ప్రహసనకుడు; +* comedy, n 1) ప్రహసనం; హాస్యరస ప్రధానమయిన నాటకం 2) సుఖాంతమైన నాటకం; +* comet, n. తోకచుక్క; ధూమకేతువు; +* come-upper, n idiom] అగస్త్యభ్రాత; అతి తెలివిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేసే వ్యక్తి; +* comfort, n. సౌకర్యం; సుఖస్థితి; నెమ్మి; +* comic, adj. హాస్యరస ప్రధానమయిన; హాస్య; హాస్య స్పోరక; నవ్వు పుట్టించే; +* comma, n. కొరాటిక; కామా; వాక్యాన్ని ఆపుదల చెయ్యడం కోసం వాడే సంజ్ఞ; +* command, n. అనుశాసనం; ఉత్తరువు; ఉత్తర్వు; ఆదేశం; నిర్దేశం; ఆనతి; ఆన; ముదల +* commander, n. దళవాయి; దళపతి; దండనాయకుఁడు; సేనాధిపతి; నిర్దేష్ట; వాహినీపతి; అవవాదుఁడు; +* commence, v. i. మొదలుపెట్టు; చేపట్టు; ఆరంభించు; ఉపక్రమించు; +* commentary, n. టీక; టిప్పణం; వ్యాఖ్యానం; వ్యాఖ్య; భాష్యం; +* commerce, n. వ్యాపారం; వాణిజ్యం; వర్తకం; +* commitment, n. నిబద్ధత; సంకల్పం; అంకితభావం; అభినివేశం; నిరతి; శ్రద్ధాభక్తులు; ప��రతిశబ్దత; +* common, adj 1) సామాన్య; లోక; సమాహారక; ఏకోను 2) ఉమ్మడి; ఉభయ; +* commotion, n. అలజడి; అలబలం; కలకలం; సంచలనం; గొడవ; గందరగోళం; +* communal, adj. సాముదాయిక; సంఘానికి సంబంధించిన; +* communalism, n. కులతత్త్వం; సామాజికవర్గ తత్త్వం; +communicable disease, ph. సంక్రామిక వ్యాధి, సంక్రామిక రోగం; అంటురోగం; +* communique, n. ప్రసారమాధ్యమాలకి అందించే అధికార ప్రకటన; +* commute, v. t 1) తగ్గించు 2) ఇంటి నుండి ఉద్యోగ స్థలానికి రోజువారీ ప్రయాణం చేయు; పాయకరీ; +* commuter, n. పాయకారీ; ఇటూ అటూ తిరిగేది; +* compact, adj. మట్టసమైన; చిన్నదైన; కుదిమట్టమైన; కురుచైన; సాంద్ర ant diffuse; +* company, n 1) తోడు; సహవాసం; సావాసం 2) నిగమ్; కంపెనీ; వ్యాపార బృందం; +* compare, v. t. పోల్చు; సరిపోల్చు; సరిచూచు; ఉపమించు; బేరీజు వేయు; తైపారు వేయు; +* compassion, n. కరుణ; దయ; జాలి; అనుకంపం; దాక్షిణ్యం; సంయమనం; +* compatibility, n. పొంత; పొందిక; పొత్తు; అవిరుద్ధత; క్షమత; +* competence, n. ప్రయోజకత్వం; సామర్ధ్యం; దక్షత; +* competitor, n. పోటీదారు; ప్రతియోగి; స్పర్ధాళువు; దంట; +* compiled, n. కూర్పబడినది; ప్రోతం; గ్రథితం; +* compiler, n 1) కూర్పరి; సంకలన కర్త 2) ఒక ఉన్నత భాష నుండి మరొక నిమ్న భాషకి తర్జుమా చెయ్యటానికి కంప్యూటరు వాడే క్రమణిక; +* complainant, n. ఫిర్యాది; ఫిర్యాదు చేసే వ్యక్తి; +complement addition, ph పూరక సంకలనం కంప్యూటర్లలలో సంకలన వ్యవకలనాలు చెయ్యడానికి అనువైన పద్ధతి; +* complete, adj. అంతా; పూర్తిగా; యావత్తు; నిండుగా; సాంగంగా; పరిపూర్ణంగా; సంపూర్ణంగా; +* complex, n. క్లిష్ట మానసిక స్థితి; జటిల మానసిక స్థితి; సంశ్లిష్ట మానసిక స్థితి; +* complex, adj. సంకీర్ణ; మిశ్రమ; క్లిష్ట; జటిల; సంశ్లిష్ట; జిలుగు; +complex number, ph. సంకీర్ణ సంఖ్య; సమ్మిశ్ర సంఖ్య; క్లిష్ట సంఖ్య; +diana complex, ph. మగ పోకడలకి పోవాలనే ఆడదాని కోరిక; మాటలలోను, చేతలలోను పురుషుడిలా ఉండాలనే కోరిక; +electra complex, ph. తండ్రితో కామ సంబంధాలు నెరపాలని కూతురు అంతరాంతరాలలో వాంఛించడం; +* complexion, n. ఛాయ; వర్చస్సు; వర్ణం; రంగు; శరీరపు రంగు; +* compliance, n. ఆచరణ; అనుసరణ; పాటింపు; కట్టుబడి; +* complement, n. పొగడ్త; మెచ్చికోలు; అభినందన; ప్రశంస; శుభాకాంక్ష; +* comply, v. t. పాటించు; ఆచరించు; అనుసరించు; అనువర్తించు; అనుష్టించు; అమలు చేయు; +composing stick, ph. మరబందు; అచ్చొత్తేముందు అక్షరాలని కూర్చడానికి వాడే పనిముట్టు; +* compositor, n. అక్షరసంధాత; అక్షరకూర్పరి; +* compost, n కాంపోస్ట్) ఆకుపెంట; పెంట; చీకుడు ఎరువు; +* compound, adj. మిశ్రమ; సంయుక్త; సమ్మిశ్ర; ద్వంద్వ; +compound eye, ph. సంయుక్తాక్షము; సంయుక్తాక్ష; +compound wall, ph. ప్రహరి గోడ; ప్రాకారం; ప్రాంగణ ప్రాకారం; +* compound, n 1) మిశ్రమ ��ాతువు 2) ప్రాంగణం; లోగిలి; +* compoundable, adj legal] రాజీ కుదుర్చుకోకూడనిది లేదా రాజీ కుదుర్చుకోడానికి వీలు కాని నేరం; +* comprehensible, n. సుబోధకం; అర్థం అయేవిధంగా ఉన్నది; +* comprehension, n. గ్రహింపు; గ్రహణం; ఆకళింపు; ఆకలనం; అవగాహన; అవగతం; +* comprehensively, adv. సమగ్రంగా; సర్వతోముఖంగా; సాంగోపాంగంగా; సాకల్యంగా; +* compulsory, adj. విధిగా; విధాయకంగా; వెట్టి; నిర్బంధ; అనివార్య; ఆవశ్యక; తప్పనిసరి; +* computational, adj. లెక్కింపు పద్ధతులకి సంబంధించిన; గణన పద్ధతులకి సంబంధించిన; +* computer, n 1) గణకుడు; గణకి; లెక్కలు చూసే వ్యక్తి 2) కలనయంత్రం; గణాంకయంత్రం; గణిత యంత్రం; సంగణకం; కంప్యూటరు; +* concede, v. i. ఒప్పేసుకొను; ఓటమిని అంగీకరించు; +* conceit, n. అతిశయం; టెక్కు; డాంబికం; అహమహమిక; +* conceited, adj. అతిశయంతో కూడిన; టెక్కుతో; ఆడంబరపు; +* conceive, v. i 1) గర్భం ధరించు; కడుపుతోనుండు 2) ఊహించు; భావించు; అనుకొను; +* concentrate, v. i. లగ్నముచేయు; ధారణ చేయు; కేంద్రీకరించు; +* concentration, n 1) అవధానం; ఏకాగ్రత; ధారణ; ధ్యానం; నిధిధ్యాసము; తితీక్ష 2) గాఢత; సాంద్రీకరణం 3) నిర్జలత; +* concept, n. భావం; భావన; పరిభావన; మనోగతి; ఊహ; ఊహనం; అధ్యాహారం; గ్రాహ్యం; సవీతటం; పోహ (అపోహ కానిది ప్ర ఊహ(ప్రశస్తమైన అంటే మంచి ఊహ ప్రోహ పోహ; +* conceptual, adj. అధ్యాహారిక; ఊహాత్మక; పోహిక; పౌహిక; +concession stand, ph. రాయితీ బడ్డీ; క్రీడా స్థలాల వంటి బహిరంగ ప్రదేశాలలో కిరాయికి కుదుర్చుకున్న కిరాణా దుకాణాల వంటి బడ్డీలు; +* conclave, n. సమాలోచన సభ; కొద్దిమంది ముఖస్థంగా మాట్లాడుకుందికి సమావేశమయే గది; +* conclude, v. t. ముగించు; ఉపసంహరించు; పూర్తిచేయు; విరమించు; నిష్కర్షించు; సమాప్తం చేయు; కడతేర్చు; +* conclusion, n. ముగింపు; పర్యవసానం; ముక్తాయింపు; ఉపసంహారం; ఉద్యాపన; సమాప్తి; నిష్కర్ష; విరమింపు; అవసానం; పిండితార్ధం ant beginning; takeoff; +* concomitant, adj. అనుషంగిక; ప్రధానం కాని; ముఖ్యం కాని; +* concubine, n. ఉంపుడుకత్తె; ఉపపత్ని; చేరుగొండి; ముండ; +* condemn, v. i. ఖండించు; దుయ్యబట్టు; నిందించు; గర్హించు; +* condemnatory, adj. నిందాత్మక మయిన; నిందించేటట్టి; గర్హనీయ; +* condensation, n 1) కుదింపు; సంగ్రహణ; సంధానం; బణుసంధానం; రెండు అణువులని జతపరచుట 2) ద్రవీభవనం; సంఘననం; సంక్షేపణం rel liquifaction; +* condense, v. t 1) కుదించు; సంగ్రహించు 2) గడ్డ కట్టించు; సంధించు; +* condensed, adj. గడ్డకట్టబడిన; సంఘటిత; సాంద్రీకృత; సాంద్రీకృత; +* condiments, n. సంభారములు; సంబరువులు; పరివ్యయములు; వంటలలో వాడే సుగంధ ద్రవ్యములు; +* condition, n 1) నిబంధన; నియమం; షరతు 2) పరిస్థితి; స్థితి; అవస్థ; +conditional sale, ph. నైబంధిక క్రయం; షారత క్రయం; మద్దతు అమ్మక��; +* condom, n. తొడుగు; లింగతొడుగు; పిల్లలు పుట్టకుండాను, సుఖరోగాలు రాకుండాను తప్పించుకుందికి రతి సమయంలో లింగానికి తొడిగే రబ్బరు తొడుగు; +* conduct, n కాండక్ట్) ప్రవర్తన; శీలం; నడవడిక; నడత; +* conduct, n కండక్ట్) జరిపించు; నడిపించు; నిర్వహించు; నెరపు; కానిచ్చు; +* conductor, n 1) వాహకి; వాహకం 2) యాజి; నిరవాకి; ప్రవర్తకుడు; వ్యవహర్త; కండక్టరు; +* conduit, v. t కాండూట్) కాలువ; తూము; గొట్టం; మార్గం; +* confection, n. మోదకం; చాకలేట్లు, బిళ్ళలు, మొ. తీపి సరుకులు; +* confidants, n. pl కాన్ఫిడాంట్‌‌స్) ఆంతరంగికులు; సన్నిహితులు; +* confidence, n. ధీమా; నమ్మకం; విశ్వాసం; దీలాసా; భరవసం; ధిషణ; +* confirm, v. t. ఖాయపరచు; ధ్రువపరచు; ధ్రువీకరించు; రూఢిపరచు; రూఢిచేయు; +* conflict, n. ఘర్షణ; సంఘర్షణ; లడాయి; విప్రతిపత్తి; +* conflicting, adj. పరస్పర విరుద్ధ; పొందిక లేని; పొందు పొసగని; విప్రతిపన్న; +* conformist, n. సాంప్రదాయదాసుడు; అనుసారి; +* confusion, n. కంగారు; గందరగోళం; తికమక; తొట్రుపాటు; కలత; ఆకులపాటు; గాసటబీసట; గజిబిజి; కకపిక; +* congeal, v. i. ముద్దకట్టు; గడ్డకట్టు; పేరుకొను; +* congenital, adj. జాయమాన; ఆగర్భ; ఆజన్మ; జన్మజ; పుట్టు; పుట్టుకతో వచ్చిన; జనుష; వంశ పారంపర్యంగా ఉన్నది కాదు; +congenital disease, ph. జాయమాన వ్యాధి; పుట్టుకతో ఉన్న రోగం; ఆగర్భ రోగం; +* congruent, adj. ఆనురూప; సమాన; సర్వసమాన; సమశేష; తాదాత్మ్య; +* conifer, n. పైను, ఫర్‍ జాతి శంఖాకారపు చెట్టు; కోను కాయలను కాసే చెట్టు; +* conjoint, adj. కూడిన; చేరిన; కలసి ఉన్న; కలసి ఒకటిగా ఉన్న; +conjoined twins, ph. కలసి ఒకటిగా ఉన్న కవలలు; అతుక్కుపోయిన కవలలు; +* conjugal, adj. జంటకి సంబంధించిన; వైవాహిక జీవితానికి సంబంధించిన; దాంపత్య; +* conjugated, adj. సంయుగ్మ; సంయుక్త; సంబద్ధ; అనుబద్ధ; సంయోగ; జంటకి సంబంధించిన; +* conjunction, n. యుతి; మిళితం; కలయిక; సంయోగం వ్యాకరణంలో) సముచ్ఛయం; పొంతనం; +* conjurer, n. మాయావి; మాయలమారి; మాంత్రికుడు; +* connect, v. t. అతుకు; కలుపు; తగిలించు; సంధించు; అనుసంధించు; అనుబంధించు; +* connecting rod, n. లంకె ఊస; సంసక్త ఊస; ఇంజనుని చక్రాలకి తగిలించే ఊస; +* connoisseur, n కానసూర్) m. రసికుడు; రసజ్ఞుడు; f. రసికురాలు; +* consanguinity, n 1) సగోత్రీయత; రక్తసంబంధం; వావి; వావి-వరస 2) మేనరికం; రక్త సంబంధం ఉన్న వారితో వివాహం; +* conscience, n కాన్‌షన్స్) అంతర్వాణి; అంతరాత్మ; మనస్సాక్షి; +* conscientious, adj కాన్‌షియన్‌షస్) మనస్ఫూర్తి అయిన శ్రద్ధ; మనస్సాక్షికి లోబడిన; +* conscious, adj కాన్‌షస్) వ్యక్తమైన; స్పృహతో; మెలుకువతో psych వైఖరి; చేతన; జ్ఞాత; +unconscious, adj. అవ్యక్తమైన psych సుప్తచేతన; సుప్తజ్ఞాత; అవ్యక్తచేతన; పర; ఇడ్; +conscious age, ph. బుద్ధి ఎరిగి��� వయస్సు; వ్యక్త వయస్సు; +* consciousness, n. తురీయం; చతుర్థం; చేతస్సు; చైతన్యం; చేతన; చిత్; వ్యక్తచేతనం; చిత్తాకాశం; పరిజ్ఞానం; ప్రజ్ఞానం; జ్ఞాతం; స్పృహ; స్మృతి; స్మారకం; మనస్సు; సైకీ; లిబిడో; +* consecutive, adj. నిరత; సతత; క్రమానుగత; పుంఖానుపుంఖంగా; ఒకదాని తర్వాత మరొకటి; +* consensus, n. అభిప్రాయసామ్యం; ఏకాభిప్రాయం; +* consent, v. i. ఒప్పుకొను; అంగీకరించు; ఎవరైనా ప్రతిపాదించిన దానిని గాని అడిగినదానిని కాని చెయ్యడానికి ఒప్పుకొనడం; అనుమతించు; see also assent, agree, concur, accede and acquiesce; +* conserve, n. నిల్వ పెట్టడానికి వీలుగా చేసిన సరుకు; ఊరగాయలు; అప్పడాలు; వడియాలు వంటి ఎండబెట్టిన సరుకులు; మురబ్బాలు; +* consistent, adj. అనుగుణ్యత; అవిరుద్ధ; అవిరోధత; సంగతత్వ; నియతి; నిలకడ; స్థిరత్వ; +* consistently, adv. నియతంగా; నియతికాలికంగా; నియమాను సారంగా; క్రమం తప్పకుండా; సంగతంగా; +* consolation, n. ఊరడింపు; ఓదార్పు; సాకతం; సాంత్వనం; సముదాయింపు; పరామర్శ; +consolation prize, ph. సాకత బహుమానం; సాంత్వన బహుమానం; ప్రోత్సాహక బహుమానం; +* console, v. t కన్‌సోల్) ఓదార్చు; సముదాయించు; ఊరడించు; పరామర్శించు; +* consolidated, adj. ఏకం చెయ్యబడ్డ; ఏకీకృత; సంఘటిత; సుసంఘటిత; +* consolidation, n. క్రోడీకరించడం; ఒక చోటకి చేర్చడం; +* conspicuous, adj. స్పష్టముగా; కొట్టొచ్చినట్లు; స్పుటంగా; +* conspiracy, n. కుట్ర; కుట్టరము; పన్నాగం; గూడుపుఠాణి; +* constant, adj. స్థిరమయిన; మారని; మార్పులేని; +* constant, n. స్థిరాంకం; స్థిరరాసి; స్థిరం; +* constellation, n. రాశి; రాసి; రిక్క; తారావళి; నక్షత్ర సముదాయం; నక్షత్రమండలం; చూసే వాళ్ల సదుపాయం కొరకు ఆకాశంలో ఉన్న నక్షత్రాలని కొన్ని గుంపులుగా విడగొట్టేరు; ఈ గుంపులే రాశులు; ఇటువంటి రాశులు 88 ఉన్నాయి; సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు పయనించే నభోపథంలో ఉన్న నక్షత్రాలకి ఒక ప్రత్యేక స్థానం ఉండబట్టి వీటికి పెట్టిన పేర్లు అందరికీ బాగా పరిచయం; అవే మేష, వృషభాది ద్వాదశ రాశులు; ఈ పథంలో ఉన్న 27 నక్షత్ర సమూహాలే అశ్వని, భరణి, మొదలయిన నక్షత్ర రాసులు; see also asterism; +* consternation, n. దిగ్‍భ్రాంతి; దిగ్‍భ్రమ; నివ్వెరపాటు; +* constituency, n. నియోజకవర్గం; ఎన్నికల సదుపాయానికిగా దేశాన్ని విడగొట్టిన పరిపాలనా భాగం; +* constraint, n. ఆంక్ష; నిబంధన; కట్టుబాటు; నియమం; నిరోధం; సంయమనం; షరతు; ఆసేధం; +* consult, v. t. సంప్రదించు; సలహా తీసుకొను; +* consume, v. i 1) తిను; భుజించు; ఆరగించు 2) వాడు; ఖర్చుచేయు; వినియోగించు వినియోగపరచు 3) దహించు; +* consumers, n. భోక్తలు; ఉపయోక్తలు; వినియోగదారులు; వినిమయదారులు; అనుభోక్తలు; +* consumption, n 1) వాడకం; వినియోగం; వినిమయం 2) క్షయ; బేక్టీరియా వల్ల కలిగే ఊపిరితిత్తులని తినేసే ఒక రోగం; +* contact, n. సన్నికర్షం; స్పర్శ; సంసర్గం; ఒరపు; +contact lens, ph. కంటి కటకం; స్పర్శ కటకం; సన్నికర్ష కటకం; +* contagious, adj. అంటు; సోకుడు; సాంక్రామిక; సంక్రామిక; సంకలిత; +contagious disease, ph. అంటురోగం; సోకుడు రోగం; సంక్రామిక వ్యాధి; +* contaminate, v. t. కలుషిత పరచు; పంకిలపరచు; మురికి చేయు; పాడు చేయు; +* contemporary, n. సమకాలికుడు; సమకాలిక వ్యక్తి; +* contempt, n. ధిక్కారం; తృణీకారం; ఏవగింపు; ఏహ్యం; అవజ్ఞ; +* context, n. సందర్భం; ఘట్టము; తరి; పూర్వాపర సంబంధం; +* continence, n. బ్రహ్మచర్యం; నిగ్రహం; ఆత్మనిగ్రహం; +* continuity, n. అవిరళత; నిరంతరత; అవిచ్ఛిన్నత; +* continuous, adj. నిత్య; నిరంతర; నితాంత; అవిచ్ఛిన్న; అనవరత; అనునిత్య; అఖండిత; అవిరళ; అవిరత; అవ్యాహత; అనుశ్రుత; ధారాళమైన; నిరత; అవిరామ; జడి; +continuous flow, ph. ధారాళమైన ప్రవాహం; అవిచ్ఛిన్న ప్రవాహం; +* continuously, adv. నిత్యం; సదా; ఎల్లప్పుడు; నితాంతంగా; నిరంతరాయంగా; అవిచ్ఛిన్నంగా; ఏకటాకీగా, ఏకథాటిగా; నిరాఘాటంగా; +* continuum, n phy సమవాయం; ఒకే స్థలానికి పరిమితం కాకుండా అవిచ్ఛిన్నంగా ఉన్న ప్రదేశం; +* contour, n. ఈనెగట్టు; ఆకార రేఖ; రూపురేఖ; +* contract, n. గుత్త; ఒడంబడిక; ఒప్పందం; ఏర్పాటు; కరారునామా; ముస్తాజరీ; +* contractor, n. గుత్తదారుడు; గుత్తేదారు; ముస్తాజరు; కంట్రాక్టరు; ఇంత అని ముందు ఒప్పుకొని పని సాంతం జరిపించే వ్యక్తి; +* contradict, v. t. ఖండించు; వ్యతిరేకించు; నిరాకరించు; +* contradiction, n. విరుద్ధం; విరుద్ధోక్తి; వ్యాఘాతం; వ్యత్యాస్తం; వ్యతిక్రమం; వ్యాఘాతం; ఏడాకోడం; ఖండన; +* contraindication, n med కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కలిగే ప్రమాదం; +* contrarily, adv. వ్యత్యాస్తంగా; విరుద్ధంగా; వ్యతిక్రమంగా; +* contrary, adj. విరుద్ధమయిన; వ్యతిరేకమైన; +* contrite, adj. పశ్చాత్తాపముతో నిండిన; అనుతాపముతో; +* contrived, n. ప్రకల్పితం; రూపొందించబడినది; +* control, n. ఆధిపత్యం; అధీనత; అదుపు; నియంత్రణ; ఖాయిదా; ఏలుబడి; నియతి; నియామకం; +* control, v. i. నిగ్రహించుకొను; తమాయించుకొను; +* control, v. t. నియంత్రించు; అదుపుచేయు; తమాయించు; చేవలించు; చెప్పుచేతలలో ఉంచుకొను; +* controller, n. యంత; నియంత; నియంత్రకి; నిర్వాహకుడు; చేవలి; నిర్వాహకి; నేత; నిరోధకి; దమనకి; అధిపతి; ఈశ్వరుడు; వశ్యకి +* contusion, n. బొప్పి; బొప్పికట్టిన దెబ్బ; కదుం; కమిలిన చర్మం; +* conundrum, n. పొడుపుకథ; ప్రహేళిక; కుమ్ముసుద్దు; కైపదం; పజిలు; పజిల్; తలబీకనకాయ; బురక్రి పని చెప్పే సమస్య; మెదడుకి మేతవేసే మొండి సమస్య; +* convection, n. సంవహనం; స్థితిభ్రంశవ్యాప్తి; పారప్రేషణం; +* convenience, n. సదుపా���ం; హంగు; సౌలభ్యం; వీలు; అనువు; అనుకూలం; వసతి; సానుకూలం; సుకరం: +* convenient, adj. అనుకూలమైన; అనువయిన; హంగులతో కూడిన; వీలయిన; సుకరమైన; +* convention, n 1) సభ; సమావేశం 2) ఆచారం; లోకసమ్మతి; లోకమర్యాద; +* conventions, n. ఆచారములు; ఆనవాయితీలు; మరియాదలు; లోకమర్యాదలు; +* converge, v. i. కూడు; గుమిగూడు; చేరు; కలియు; అభిసరించు; +* convergence, n. కూడిక; చేరిక; కలయిక; సంగమం; పరిచ్ఛిన్నం; అభిసరణం; కేంద్రాభిసరణం; +* converse, v. i కన్‌వర్స్) మాట్లాడు; సంభాషించు; +* converse, n కాన్‌వర్స్) విపర్యం; వ్యత్యాస్తం; +* conversion, n 1) మార్పు; పరివర్తన; సంయోజకం 2) మార్పిడి 3) మతం మార్పిడి; +* convert, n కాన్‌వర్ట్) మారిన మనిషి; మతం మారిన వ్యక్తి; +* convert, v. t కన్‌వర్ట్) మార్చు; పరివర్తించు; +* converter, n. మార్పరి; పరివర్తరి; సంయోజకి; +* convex, adj. కుంభాకారమైన; ఉబ్బెత్తు; ఉన్నతోదర; +convex mirror, ph. ఉన్నతోదర దర్పణం; కుంభాకార దర్పణం; +convex region, ph. ఉన్నతోదర ప్రదేశం; కుంభాకార ప్రదేశం; +* convexity, adj. కుంభాకారత్వం; ఉబ్బెత్తుతనం; ఉన్నతోదరత్వం; +* conveyance, n. యానం; ప్రయాణం చెయ్యడానికి అనుకూలమైన బండి; +* convict, n కాన్విక్ట్) దోషి; అపరాధి; శిక్షితుడు; నిర్వాది; +* convict, v. t కన్విక్ట్) దోషి అని నిర్ధారణ చేయు; +* conviction, n. నమ్మిక; నిర్వాదం; అధ్యవసానం; అధ్యవసాయం; +* cook, n. వంటరి; వంటమనిషి; వల్లవ; m. వంటవాడు; శూదుడు; f. వంటలక్క; వంటకత్తె; అడబాల; పాచకురాలు; +* cook, v. t. వండు; పచనముచేయు; ఉడికించు; +* cooked, adj. వండిన; పచనమైన; ఉడికించిన; పక్వ; +* cool, v. t. చల్లార్చు; చల్లబరచు; చల్లారబెట్టు; +* co-ordinate, v. t. సానుకూలపరచు; సంధాన పరచు; అనుసంధించు; +* Copper, n. రాగి; తామ్రం; ఉదుంబలం; ఒక రసాయన మూలకం అణు సంఖ్య 29, సంక్షిప్త నామం, Cu); +* copra, n. కొబ్బరి; కొబ్బరి కురిడీ; కొబ్బరికాయలోని తెల్లటి చెక్క; +* coprolite, n. శిలాజంగా మారిన మలాన్ని కాప్రలైట్ అంటారు; +* copy, n 1) నకలు; ప్రతికృతి; ప్రతిలేఖ;(2) ప్రతి; +* copy, v. i. నకలు తీయు; చూసి రాయు; అచ్చుదించు; +* copying, n. నకలు తీయడం; ప్రతిలేఖనం; +* copyright, n. ప్రచురణ హక్కు; గ్రంథప్రచురణ హక్కు; గ్రంథస్వామ్యం; సర్వాధికారం; +* coquetry, n. టెక్కు; బోగం టక్కులు; వగలమారితనం; లిటీలిట విభ్రమం; +red coral, ph. ఎర్ర పగడం; నవ రత్నాలలో నొకటి; +* cord, n 1) తాడు; పాశం; సూత్రం; పగ్గం; దారం కంటె ముతకగా ఉండేది, మోకు కంటె సన్నంగా ఉండేది 2) తీగ; తంత్రి 3) 128 ఘనపుటడుగుల పరిమాణం గల వంటచెరకు; +* cork, n 1) బెరడు; బెండు; త్వచము 2) బెండుబిరడా; బెండుతో చేసిన బిరడా; +* cormels, n. pl bot పిల్లదుంపలు; కంద, చేమ వంటి దుంపలు; దుంప పిలకలు; +* corn, n 1) మొక్కజొన్న 2) ఆనికాయ; కదర; అరికాలిలో వేసే ఒకరకమయిన ప��ండు; +ear of corn, ph. మొక్కజొన్న కంకి; మొక్కజొన్న పొత్తు; +pop corn, ph. మొక్కజొన్న పేలాలు; పేలాల మొక్కజొన్న; +corn on the cob, ph. మొక్కజొన్న పొత్తు; జొన్న పొత్తు; పొత్తు; +corn field, ph. మొక్కజొన్న చేను; జొన్న చేను; +corn flakes, ph. మొక్కజొన్న రేకులు; జొన్న రేకులు; +corn meal, ph. మొక్కజొన్న పిండి; జొన్న పిండి; +corn oil, ph. మొక్కజొన్న నూనె; జొన్న నూనె; +* corollary, n math ఉపసిద్ధాంతం; అర్ధాపత్తి; ఫలితం; +* corona, n. కిరీటిక; కాంతికిరీటం; కాంతివలయం; ఉపసూర్యకం; +* coronary, adj med 1) గుండెకు సంబంధించిన 2) సీసక; మకుట; కిరీట; కిరీటపు ఆకారంలో ఉన్న; +* coroner, n. మరణ విచారణాధికారి; రాజవైద్యుడు; మకుట వైద్యుడు; +* corporal, adj. శారీరక; శారీరకమైన; శరీర సంబంధమైన; +corporal punishment, ph బెత్తంతో కొట్టడం, శొంటిపిక్క పెట్టడం వంటి శారీరకమైన శిక్ష; +* corporate, adj. సభ్యులతో కూడిన; ప్రాతినిధ్య; +* corporation, n. ప్రతినిధి వర్గం; మండలి; సంస్థ; వాటాదారులు ఉన్న వ్యాపార సంస్థ; +* corporeal, adj. పాంచభౌతికమైన; శారీరక; పార్ధివ; +* corps, n కోర్) దండు; సైన్యం; పటాలం; +* correct, v. t. తప్పులు దిద్దు; సవరించు; సరిదిద్దు; +* correlate, v. t. సహసంబంధించు; సహసమన్వయించు; +* corrigendum, n. తప్పొప్పుల పట్టిక; అచ్చయిపోయిన పుస్తకంలో దొర్లిన తప్పులని సవరించిన పట్టిక; +* cortex, n. పట్ట; బెరడు; వల్కలం; దేహాంగాలని సంరక్షించే పొర; +* corundum, n. కురువిందం; కురింజిరాయి; +* Corvus, n. హస్త; ఈ రాసిలో ఉన్న 5 ప్రకాశవంతమైన నక్షత్రాల సమూహమే హస్తా నక్షత్రం; +* cosmetic, adj 1) సౌగంధిక 2) పై మెరుగుకి సంబంధించిన; +* cosmetics, n. సుగంధ ద్రవ్యాలు; సౌగంధికాలు; మైపూతలు; అంగరాగాలు; సురభిళ విలేపనాలు; అలంకరణ సామగ్రి; +* cosmic, adj. రోదసీ; రోదసికి సంబంధించిన; విశ్వ; కాస్మిక్‍; +cosmic dust, ph. విశ్వ పరాగం; విశ్వధూళి; కాస్మిక్ పరాగం; విశ్వ దూసరం +cosmic rays, ph. విశ్వకిరణాలు; కాస్మిక్ కిరణాలు; +* cosmogony, n. విశ్వోత్పత్తి; విశ్వసృష్టి శాస్త్రం; విశ్వనిర్మాణ శాస్త్రం; ఈ విశ్వం యొక్క సృష్టి ఎలా జరిగిందో అధ్యయనం చేసే శాస్త్రం; +* cosmology, n. విశ్వశాస్త్రం; విశ్వోద్భవ శాస్త్రం; రోదసీ శాస్త్రం; విశ్వాంతరాళాన్ని అధ్యయనం చేసే శాస్త్రం; +* cosmonaut, n. వ్యోమగామి; జ్యోతిర్గామి; +* cost, n. ఖరీదు; ఖర్చు; ధర; మూల్యం; దారణ; ఒక వస్తువుని కొనడానికి అయే డబ్బు; +* costume, n. వేషం; ఒక కాలానికి కాని, వ్యాపారానికి కాని సంబంధించిన దుస్తులు; +* costs, n. ఖర్చులు; తగులుబడి; తగులుబాటు; +* coterie, n. జట్టు; ముఠా; మూక; బృందం; ఒకే విధంగా ఆలోచించే సన్నిహిత బృందం; +cotton swab, ph. తూలినాళిక; చిన్నపుల్ల చివర దూదిని తగిలించగా వచ్చిన సాధకం; చెవులను శుభ్రపరచుకొనుటకు ఉపయోగించబడేది; +ginned cotton, ph. దూది; పిక్క తీసిన ప్రత్తి; పిక్క తీసి ఏకిన ప్రత్తి; +* cotyledon, n. నూగాకు; విత్తు మొలకెత్తేటప్పుడు మొదట వచ్చే ఆకు ant కోటాకు; +* council, n. సభ; సంఘం; సమితి; పరిషత్తు; మంత్రాంగ సభ; +privy council, ph. మంత్రి పరిషత్తు; అత్యున్నత న్యాయసభ; +* count, n. లెక్క; లెక్కింపు; పరిగణన; +* count, v. i. లెక్కించు; లెక్కపెట్టు; పరిగణించు; +* counter, n 1) లెక్కిణి; లెక్కపెట్టే పరికరం 2) మెత్తపలక; సొమ్ము లెక్కపెట్టుకుందికి వాడే బల్ల 3) పని చేసుకుందికి వీలుగా, చదునుగా ఉన్న తీనె 4) వ్యాపార స్థలాలలో డబ్బు చెల్లించే కిటికీ; +* counterfeit, adj. నకిలీ; దొంగ నకలు; మోసపుచ్చడానికి తయరు చేసిన నకలు; +* counterpart, n 1) ఉల్టాభాగం 2) ప్రత్యర్థి 3) సహస్థానీయుడు; +developing country, ph. వర్ధమాన దేశం; ‘వెనుకబడ్డ’ అనడానికి బదులు ‘వర్ధమాన’ అంటే బాగుంటుంది; +* countryside, n. పల్లెపట్టు; గ్రామీణ ప్రాంతం; జనపదం; +* coupe, n కూపె) కూపం; చిన్న గది, వాహనాలలో ఇద్దరు ప్రయాణీకుకి సరిపడే చిన్న గది rel bogie and compartment; +* couple, n 1) జంట; జోడీ; జత; యుగళం; యుగ్మము; ద్వయం; ద్వయి; దంట 2) ఆలుమగలు; మిథునం; దంపతి; దంపతులు note) couple అనేది ఇంగ్లీషులో ఏక వచనమే అయినా తెలుగులో దానికి అనువాదమయిన దంపతులు అనే మాట బహువచనం అన్నది గమనార్హం. +* couplet, n 1) ద్విపద; రెండు పాదాలు ఉన్న పద్యం 2) ద్వికం; +* coupling, n. జోడించేది; జంటపరచేది; జంటకి; ద్వికి; +* courage, n. ధైర్యం; సాహసం; నిర్భయం; నిబ్బరం; చేవ; కలేజా; దిలాసా; +* courier, n. m. జాంఘికుడు; వార్తాహరుడు; వార్తావాహకం; +* course, n 1) గతి; కదలికకి అనుకూలమైన బాట 2) పాఠావళి; విషయం; మందలం; విద్య నేర్చుకోడానికి కావలసిన పాఠ్యాంశాల సంపుటి 3) భోజనపు వడ్డనలో ఒక భాగం; +* court, n 1) కచేరీ; దర్బారు; దివాణం; మొగసాల 2) న్యాయస్థానం; ధర్మాసనం; ధర్మదర్భారు; కోర్టు 3) ఆటస్థలం; +* courtyard, n. నాలుగిళ్ల వాకిలి; ముంగిలి; చావడి; ప్రాంగణం; మండువా; చతుశ్శాలిక; అంకణం; అంగణం; హజారం; +* cousin, n. జ్ఞాతి; దాయ; సజన్ముడు; మాతృష్యస్రీ; పితృష్యస్రీ; +matrilateral cross cousins, ph. తల్లి అన్నదమ్ముల పిల్లలు; తెలుగు దేశంలో వరసకి మేనబావలు, మేనవదినలు, మేనమరదళ్ళు అవతారు; +matrilateral parallel cousins, ph. తల్లి అప్పచెల్లెళ్ళ పిల్లలు; తెలుగు దేశంలో వరసకి అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అవతారు; +patrilateral parallel cousins, ph. తండ్రి అన్నదమ్ముల పిల్లలు; తెలుగు దేశంలో వరసకి అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అవతారు; +* cover, n 1) మూత; కప్పు; ఉపదేహం 2) మూకుడు (మూయు కుడుక 3) కవరు; +* covering, n. ఆచ్ఛాదనం; ఆస్తరణం; తొడుగు; గుంఠనం; +well covering, ph. వా��ీ పోసనము; బావితొడుగు; బావిమూఁత; వీనాహువు; +* cow, n. ఆవు; గోవు; గిడ్డి; ధేనువు; మొదవు; అనడుహి; +* cowage, n. దూలగొండి; దురదగొండి; +* coward, n. పిరికి పంద; పారుబోతు; భీరువు; భీరుడు; m. పిరికివాడు; f. పిరికిది; +* cow-pox, n. గోస్తనవ్యాధి; గోసూచికం; +* coyote, n ఖయోటీ లేదా ఖయోడీ) గుంటతోడేలు; ఉత్తర అమెరికాలో తిరిగే చిన్న తోడేలు వంటి జంతువు; +* crab, n. పీత; ఎండ్రకాయ; కులీరం; కర్కటం; కర్కాటకం; +* crack, n 1) పగులు; బీట; నెరద; నెరియ; సరియ; ఓడు 2) పిచ్చి మనిషి; +* cradle, n. తొట్టి; డోల; ఊయల; ఉయ్యాల; లాలి; జంపాల; పిల్లలని పడుకోబెట్టే ఊయల; +* craft, n. చేతిపని; నైపుణ్యంతో చేసే పని; వృత్తి; +* craftsman, n. చేతిపనిలో నైపుణ్యం గల వ్యక్తి; +* cramps, n. pl. కండరములు బిగుసుకొని కొంకర్లు పోవడం; +leg cramps, ph. కాలు పిక్కలలోని కండరాలు బిగుసుకుని ముడి పెట్టినట్లు అయిపోయి నొప్పి పుట్టడం; +* crank, n 1) ముసలకం యొక్క ముందు, వెనక కదలికని చక్రాలని గిర్రున తిప్పడానికి వీలు చేసే పరికరం 2) తిక్కశంకరయ్య; +* cranky, adj. సులభంగా చిరాకు పడే స్థితి; +* crap, n. చెత్త; వ్యర్థం; బాగులేని పనితనం; +* crate, n, పెట్టె; కట్టె పెట్టె; సరకుల రవాణా కొరకు కర్రతో కాని, అట్టతో కాని, ప్లేస్టిక్‍తో కాని చేసిన పెట్టె; +* crayons, n. pl. మైనపు బలపాలు; బొమ్మలకి రంగులు వెయ్యడానికి వాడే సుద్ధ బలపాలు; +* craze, n. వేలంవెర్రి; కొత్త వస్తువుల మీద అలవాట్లమీద విపరీతమైన మోజు; +* creak, v. i. కిర్రుమను; కిర్రుమని చప్పుడు చేయు; +* cream, n 1) మీగడ; మస్తు; కోవా 2) బాగా చిక్కబరచబడ్డ పాలు 3) నూక; రవ్వ 4) సారం; సారాంశం; +* creation, n. సృష్టి; సృజనం; నిర్మాణం; ఏర్పాటు; అభిసర్గం; +* creativity, n. సృజనాత్మకత; స్రష్టత్వం; సర్జనశక్తి; కల్పనాశక్తి; +* creator, n. సృష్టికర్త; స్రష్ట; నిర్మాత; సృష్టికారకుడు; కల్పనకర్త; +* credit, n 1) పరపతి; ప్రతిష్ఠ 2) అరువు; అప్పు; ఉత్తమర్ణం;(3) జమ 4) నమ్మకం; +* creditor, n. అప్పిచ్చువాడు; అప్పులవాడు; రుణదాత; జమాజవాను; ఉత్తమర్ణుడు ety ఉత్తమర్ణ ఉత్తమ+ఋణ(గుణసంధి); +* creep, v. i. డేకురు; నేలకి కడుపుని కాని, ముడ్డిని కాని ఆనించి ముందుకు జారడం; +cremation grounds, ph. శ్మశానం; శ్మశాన వాటిక; దహనవాటిక; పురాంతక భూములు; రుద్ర భూములు; +* crepe, n 1) పల్చటి అట్టు ఫ్రాన్స్ దేశపు అట్టు; కాగితం దోసె 2) ఒక రకమైన పల్చటి గుడ్డ; +* crew, n. సిబ్బంది; సరంగులు; కర్మచారులు; +* crib, n. పసిపిల్లలు పడుక్కోడానికి కటకటాలు ఉన్న తొట్టి మంచం; +* cricket, n 1) కీచురాయి; చీరండ; ఇలకోడి; శలభం; కుమ్మరిపురుగు 2) క్రికెట్ అనే ఒక ఆట; +* criminal, adj. అపరాధ; హింశోధ్భవ; క్రిమినలు; +criminal code, ph. దండవిధి; దండన వ���యవహార సంహితం; శిక్షా స్మృతి; +* crimson, n. రక్తిమ; అరుణిమ; అరుణ వర్ణం; ఎరుపు; ఎరట్రి రక్తపు రంగు; కెంపు రంగు; +* crisis, n. విషమ పరిస్థితి; చిక్కు; సంక్షోభం; సంకటకాలం; +* criterion, n. ప్రమాణం; కొలబద్ధ; గీటురాయి; +* critic, n క్రిటిక్) విమర్శకుడు; విమర్శకురాలు; బెన్‌జాన్సన్ ‘విమర్శకుడు దోషాల్ని చెప్పడమే కాకుండా, దోష రహితంగా ఎలా ఉండాలో’ చెప్పాలన్నారు. +literary criticism, ph. సాహిత్య విమర్శ; ఒక గ్రంథంలోని లోపాలోపాలను, ఔచిత్య, అనౌచిత్యాలను, భావ గంభీరతను అలంకార రచనా పాటవాన్ని, ధ్వని విశేషాల్ని, శయ్యా సౌభాగ్యాన్ని, వస్తు నిర్మాణ సౌష్టవాన్ని, పాత్ర పోషణ, రస పోషణ, సన్నివేశ కల్పనలను, ఆ గ్రంథానికి సంబంధించిన సర్వ విషయాలను కూలంకషంగా చర్చించి సాహిత్యంలో ఆ గ్రంథానికి ఉన్న స్థానాన్ని నిర్ణయించడాన్ని సాహిత్య విమర్శగా పేర్కొనవచ్చు; +* critique, n క్రిటీక్) విమర్శ; వివేచన మృశ్’ అనే ధాతువుకు ‘వి’ అనే ఉపసర్గ చేరి ‘విమర్శ’ అనే పదం ఏర్పడింది. విమర్శ అనే పదానికి పరిశీలించడం, పరీక్షించడం, పరామర్శించడం, ఆలోచించడం, చర్చించడం అనే అర్థాలున్నాయి. ఒకరు చేసిన పనిలో బాగోగులను ఇంకొకరు వివేచించి తెలపడాన్ని ‘విమర్శ’ అంటారు; +* critter, n. జంతువు; పురుగు; పురుగు, పుట్ర; +* Cro Magnon, n క్రో మేన్యన్) ఐరోపా‌లో నియాన్‌డ్రథాల్ తర్వాత ప్రభవించిన ఒక జాతి మానవుల వంటి తెగ; ఈ జాతి ఇప్పుడు నశించిపోయింది; +crocodile tears, ph. మొసలి కన్నీరు; మకరాశ్రువులు idiom కడుపులో దుఃఖం లేకపోయినా కళ్ళ వెంబడి వచ్చే నీళ్ళు; +* crooked, adj. కుటిల; వంకర టింకర; అడ్డదిడ్డం; అష్టావక్ర; +* crooked, n క్రుకెడ్) అష్టావక్రం; +* crop, n 1) పంట; ఫలసాయం; సస్యం 2) కత్తిరించి తీర్చి దిద్దడం; +* Cross, n. శిలువ; క్రైస్తవ మతానికి గుర్తు; +cross multiplication, ph. వజ్ర గుణకారం; అడ్డ గుణకారం; ఒక భిన్న సమీకరణంలో ఒక పక్కనున్న లవాన్ని రెండవ పక్క ఉన్న హారంతో గుణించడం; +* cross, v. t 1) పరాగ సంపర్కం చేయు; రెండు మొక్కల జన్యుపదార్థాలని కలపడం 2) పొర్లించు; రెండు జంతువుల జన్యుపదార్థాలని కలపడం; +* crossroads, n. కూడలి; చౌరస్తా; శృంగాటకం; చతుష్పథం; నాలుగు రోడ్ల కూడలి; +* crossword, n. పదవిన్యాసం; గళ్లనుడికట్టు; పదకేళి; పలుకుల పందిరి; జల్లికట్టు; +* crotch, n. కచ్చ; కిస్తా; తొడలు, కటి ప్రదేశం కలిసే స్థానం; +* crow, n. కాకి; కాకం; భస్మచ్ఛవి కాకం; వాయసం; కరటకం; ఐంద్రి; బలిభుక్కు; బలిపుష్ఠం; అరిష్టం; కారవం; పికవర్ధనం; ధ్వాంసవర్ధనం; శీతర్తుబలీయం; చిరప్రాణం; పరభ్రుత్‍; ఆత్మఘోషం; ఏకాక్షి; ���కృత్‍ప్రజా rel raven; +* crowbar, n. గునపం; గడ్డపార; పలుగు; కుద్దాలం; +* crowd, n. గుంపు; మూక; జనసమ్మర్దం; గుమి; సంకులం; +* crown, n. శిఖ; కిరీటం; కోటీరం; మకుటం; బొమిడికం; +* crucible, n. మూస; ద్రోణి; దొన్నె; పుటం; ప్రమిద; దొప్ప; +* crude, adj. ముతక; ముడి; ఆమమైన; నాటు; కచ్చా; మోటు; చిత్తు; +crude oil, ph. ముతక నూనె; ముడి నూనె; మట్టినూనె; శిలతైలం; ఆమనూనె; +* cruelty, n. క్రూరత్వం; దౌష్ట్యం; దుష్టత్వం; +* cruise, n క్రూజ్) నౌకాయానం; షికారా; పడవ ప్రయాణం; +* crumb, n 1) చిన్న ముక్క; తిండి పదార్థాలని చిదిపినప్పుడు రాలే ముక్క 2 idiom] పిసరు; +* crush, v. t 1) పిండు; నలుపు 2) అణగదొక్కు; చిత్తుచేయు; +* crust, n. పటలం; పెచ్చు; ఉల్లె; అప్పం; +* crux, n. కీలకం; ఆయువుపట్టు; మర్మం; +* Crux Australis, n. త్రిశంకుడు; దక్షిణార్ధగోళంలోని ఆకాశంలో, శిలువ ఆకారంలో, స్పుటంగా కనిపించే నక్షత్ర మండలం; +* cry, n. ఏడ్పు; రోదన; అరుపు; బొబ్బ; కూత; +* cry, v. i. ఏడ్చు; రోదించు; అరచు; వాపోవు; అలమటించు; +* cryptic, adj. అంతర్నిహితమైన; నర్మగర్భమైన; +* cryptography, n. ఆరండకము; నర్మగర్భలేఖనం; గూఢలేఖనశాస్త్రం; +* crystalline, adj. స్ఫటికపు; స్ఫటికముతో చేయబడిన; స్ఫటికాకారముతో; +* crystalloid, n. స్ఫటికార్థం ety స్ఫటికం వంటి పదార్థం; +* crystals, n. స్ఫటికములు; స్ఫటికాదులు; +* cub, n. పులి పిల్ల; సింహపు పిల్ల; పాండా పిల్ల; మొదలైనవి; +* cube, n 1) ఘనం; ఘనచతురస్రం; సమఘనం; షణ్ముఖి; ఆరు ముఖాలు కలది; ఉదాహరణకి ఒక షణ్ముఖి(cube) తీసుకుంటే, దాని ప్రతి ముఖం చతురస్రాకారంలో ఉంటుంది. ప్రతి అంచు దగ్గరా రెండు ముఖాలు కలుస్తాయి. ప్రతి శీర్షం దగ్గరా మూడు ముఖాలు కలుస్తాయి 2) ముక్క; +* cuboid, n 1) దీర్ఘఘనం; ఆరు ముఖాలు, ప్రతి ముఖము దీర్ఘ చతురస్రాకారం అయిన ఒక ఘన రూపము 2) పాదములో ఉన్న ఒక ఎముక పేరు; +* cudgel, n. దుడ్డు; దుడ్డు కర్ర; లక్కక; +* cuffs, n 1) బేడీలు; అరదండాలు; నిగడాలు 2) పొడుగు చేతుల చొక్కాలకి పెట్టుకునే ఒక రకం బొత్తాములు; +* cuisine, n క్విజీన్) వంట; వండే పద్ధతి; కుశిని; +* cul-de-sac, n 1) ఒక పక్కనే తెరచి ఉన్న సంచి వంటి శరీర కట్టడం 2) సంచీ సందు; ఒక వైపు మాత్రమే తెరచి ఉన్న వీధి; +culpable homicide, ph. నిందార్హమైన నరవధ; దోషయుక్తమయిన హత్య; +* culprit, n. నేరస్థుడు; అపరాధి; నేరము చేసిన వ్యక్తి; +* cultivation, n. సాగు; సేద్యం; వ్యవసాయం; జిరాయితీ; +* culture, n 1) సంస్కృతి 2) తోడు; పాలని తోడు పెట్టడానికి వేసే మజ్జిగ 3) సూక్ష్మజీవులని ప్రయోగశాలలో పెంచే పద్ధతికి అనుకూలపడే మధ్యమం 4) పెంపకం 5) వ్యవసాయం; +monoculture, n. ఏకసాయం; ఒకే రకం పంటని పదేపదే పండించడం; +pisciculture, n. చేపల పెంపకం; మత్స్యసాయం; మత్స్యపరిశ్రమ; +polyculture, n. బహుసాయం; ఒకే పొ��ంలో ఒకదాని తర్వాత మరొకటి చొప్పున, పంటలని మార్చి పండించడం; +* cup, n. దొప్ప; దొన్నె; పిడత; చషకం; చమసం; చిట్టి; చిప్ప; మరిగ; కప్పు; +* cupboard, n. అలమారు; చిట్టటక; కప్పులు పెట్టుకొనే బీరువా; +* cupful, n. చిట్టెడు; కప్పుడు; కప్పు; +* curated, adj. వడపోసిన; సంస్కరించిన; మరమ్మత్తు చేసిన; +* curd, n 1) పెరుగు; దధి; కలుఁపు; ఆమిక్ష 2) కోలకం; గడ్డగా గట్టిగా ఉండేది; +* curdle, v. t. గరకట్టు; విరుగు; గడ్డకట్టు; పేరుకొను; +* cure, n 1) వైద్యం; మందు; నివారణ 2) స్వస్థత; +* curiosity, n. ఉత్సుకత; ఆసక్తి; బుభుత్స; వ్యాసక్తత; +* curlew, n. క్రౌంచపక్షి; కంకపక్షి +* curls, n. కురులు; ఉంగరాల జుత్తు; నొక్కుల జుత్తు; వక్ర కేశములు; కుటిల కుంతలములు; +curly hair, ph. కుటిల కుంతలాలు; ఉంగరాల జుత్తు; +* currency, adj. వాడుకలోనున్న; చెల్లుబడి అయే; చలామణిలో ఉన్న; +* currency, n. వాడుకలోనున్న డబ్బు; చెల్లుబడి అయే డబ్బు; +* current, adj. ప్రస్తుత; వర్తమాన; సమకాలీన; చాలూ; అర్జు; +* current, n 1) ప్రవాహం; విద్యుత్ ప్రవాహం; ఆపూరం; విద్యుత్తు; కరెంటు 2) సమకాలీనం; ప్రస్తుతం; +alternating current, ph. ప్రత్యావర్తక ప్రవాహం; ఏకాంతర ప్రవాహం; ఏకాంతార విద్యుత్తు; +direct current, ph. అజస్ర ప్రవాహం; అభిద్య ప్రవాహం; ఏకముఖ ప్రవాహం; +* curry, n 1) కూర; వండిన కూర 2) కూరలో వేసే మసాలా; +* curvature, n. వక్రత; వట్రువు; వంపు; వంకర; వంకీ; వంకరతనం; +* cushion, n. తలాపి; దిండు; కశిపు; మెత్త; గాది; ఉపధానం; +* custard, n. గుడ్లు, పాలు, చక్కెర, కలిపి చేసే మెత్తటి, జున్ను వంటి వంటకం; +* custody, n 1) స్వాధీనత; స్వాధీనం 2) నిర్బంధం; +* custom, n. ఆచారం; అలవాటు; వాడుక; రివాజు; సంప్రదాయం; ఆనవాయితీ; మామూలు; వ్యవహారం; +* customary, adj. మామూలు; రివాజు; వ్యావహారికం; యౌగికం; +* customer, n. ఖాతాదారు; రివాజురాజు; వినియోగదారు; ఒక దుకాణంలో సరుకులు కొనే వ్యక్తి కాని, సేవలు అందుకొనే వ్యక్తి కాని; +* cut, n 1) కత్తిరింపు; కోత; గాటు; గంటు; కచ్చు; పరిఖ 2) దెబ్బ; గాయం; +* cut, v. t. కత్తిరించు; ఉత్తరించు; కోయు; నరుకు; తరుగు; తెంచు; కొట్టు; ఛేధించు; +* cutting, n 1) కత్తిరింపు; ఖండం 2) కత్తిరించిన ముక్క; ఖండిక; +* cyanosis, n. శరీరం నీలివర్ణం పొందడం ety సయనైడు వల్ల మరణించిన వారి శరీరం ఇలా నీలంగా మారుతుంది కనుక ఈ పేరు వచ్చింది; +* cyber, adj. సమాచార సాంకేతిక రంగానికి సంబంధించిన; +* cycle, n 1) చక్రం; ఆవృత్తం; ఆవర్తం 2) సైకిలు; తొక్కుడుబండి; రెండు చక్రాల వాహనం; +* cyclopropane, n chem చక్రీయత్రయేను; చక్రీయప్రోపేను; +* cylinder, n 1) స్థూపకం; వర్తులస్తంభం 2) సిలిండరు; +* cymbal, n. చేతాళము; కాంస్యతలం; వాయించెడు తాళము; +* cytoplasm, n. కణసారం; జీవరసం; కణద్రవం; కోశరసం; ప్రోటోప్లా��మ్‌లో కణికని మినహాయించగా మిగిలినది; +* czar, n 1) పూర్వపు రష్యా దేశపు చక్రవర్తి 2) ప్రభుత్వంలో సర్వాధికారాలు గల వ్యక్తి + + +D, d symbol (1) ఇంగ్లీషు వర్ణమాలలో నాలుగవ అక్షరం 2) పరీక్షలలో బొటాబొటీగా మార్కులు వచ్చిన వారికి వచ్చే గురుతు 3) ఒక విటమిన్ పేరు; +* dab, v. t. ఒత్తు; అద్దు; పులుము; రాయు; అలుకు; +* dabble, v. i 1) ఉన్నాననిపించు; వేలు పెట్టు; కెలుకు 2 జలకాలాడు; +* dactyl, n prosody 1) ఛందస్సులో ఒక గురువు తర్వాత రెండు లఘువులు వచ్చే పద్ధతి; భగణం;(2) వేలు; +* dagger, n. బాకు; కటారి; మొలకత్తి; రెండు వైపుల పదునయిన కత్తి; +dagger mark, ph. హంసపాదుకి వేసే శూలం గుర్తు; అచ్చు పుస్తకాలలో పేజీ దిగువ ఉన్న వివరణకి వేసే గుర్తు; +* daily, adj. ప్రతిరోజు; దైనందినం నిత్యం; రోజువారీ; అహరహం; +* daintiness, n. నాజూకుతనం; సుకుమారం; స్వారస్యం; +dairy products, ph. పాడి దినుసులు; పయస్యములు; గవ్యములు; +* dairy, n డెయిరీ) పాడి; పాడి పరిశ్రమ; పయస్య పరిశ్రమ; +* dais, n డేస్) వేదిక; తిన్నె; గద్దె; అరుగు; జగిల; +* dame. n స్త్రీ; పెద్దింటి స్త్రీ; దొరసాని; అమ్మగారు; +* damp, adj 1) చిత్తడి; తేమగానున్న; తడిగానున్న 2) నిరుత్సాహ మయిన; +* damper, n. ఉత్సాహాన్ని చల్లార్చేది; +* dampness, n. తేమ; తడి; చెమ్మ; పదను; ఒరపదను; ఆర్ర్ధత; ఈకువ; ఇవుకు ఈమిరి; చిత్తడి; +* dance, n. నృత్యం; నాట్యం; లాస్యం; తాండవం; +* dandruff, n చుండు తలమీఁద పొరలు పొరలుగా లేచెడు చర్మపు కణాలు; +* danger, n. అపాయం; కీడు; విపత్తు; హాని; ఆపద; ముప్పు; సేగి; గండం; ఉపహతి; ప్రమాదం కలుగజేసే పరిస్థితి; see also accident; +* dare, v. i. తెగించు; సాహసించు; ధైర్యం చేయు; +pitch dark, ph. చిట్ట చీకటి; చీకటి గుయ్యారం; చిమ్మచీకటి; కటిక చీకటి; అంధకార బంధురం; +* dark, adj 1) చీకటి 2) అంధకార; నల్లనైన; నలుపు; కారు 3) ముదర; +dark matter, ph. కృష్ణ పదార్థం; విశ్వంలో కండ్లకి, పనిముట్లకి కూడ కనిపించని పదార్థం; +* darkness, n. చీకటి; చీకువాలు; తిమిరం; అంధకారం; తామసం; తమస్సు; తామిస్రం; నిశీథం; +* darling, n ముద్దులబిడ్డ బంగారు కొండ; బాచాల కొండ; +* dart, n. దూసి; భిండివాలం; చిన్న ఈటె; చిరుశూలం; వేసుడుబరచి; +* database, n comp దత్తాంశనిధి; దత్తనిధి; దత్తాకరం; దత్తాంశాలను తిరిగి వెతుక్కుని వెలికి తియ్యటానికి అనుకూలంగా ఒక క్రమ పద్ధతిలో నిల్వ చేసే స్థలం; +database administrator, ph. దత్తనిధి ప్రశాసకుడు; దత్తనిధి వ్యవస్థాపకి; +* date, n 1) తారీఖు; తేదీ; రోజు; తిథి 2) ఒక వేళప్పుడు కలుసుకొందామనే ఒప్పందం 3) నియమితమైన సమయంలో కలుసుకోడానికి ఒప్పుకున్న స్నేహితురాలు, లేదా స్నేహితుడు 4) ఖర్జూరం; +* daughter, n. పిల్ల; కూతురు; కుమార్తె; అమ్���ాయి; పుత్రిక; తనూజ; నందన; బిడ్డ; పట్టి; +* daunted, adj. భయపడ్డ; బెదిరిన; దిగులుపడ్డ; +* dawn, n. ఉషస్సు; ఉషోదయం; ప్రభాతం; ప్రత్యూషం; వేకువ; వేగుజాము; అరుణోదయం; ప్రాతఃకాలం తెల్లవారుజాము; +* day, n 1) రోజు; దినం; దివసము; దివస్సు; వాసరము; అహము అహస్సు; తేదీ; తారీఖు; వేళ 2) పగలు; పగటివేళ; పట్టపగలు; +day and night, ph. అహర్నిశలు; అహోరాత్రం; పగలనక, రాత్రనక; +* daybook, n దినవహి; కడితం; కవిలె; రోజు చిఠా; చిట్టా; +* daybreak, n. ఉషోదయం; ప్రభాతం; వేకువ; వేగుజాము; అరుణోదయం; ప్రాతఃకాలం +* deacon, n క్రైస్తవ చర్చిలో పని చేసే వ్యక్తి; పరిచారకుడు; సేవకుడు; +* dead, adj. చచ్చిపోయిన; ప్రాణం లేని; మృత; +* dead, n. కీర్తిశేషుడు; మృతుడు; స్వర్గస్థుడు; చచ్చిపోయినవాడు; +* deadpan, adj. ఉద్వేగరహితంగా; ఆవేశం లేకుండా; తాను ఉద్వేగం చూపించకుండా ఇతరులని నవ్వించే పద్ధతి; +* dead-reckoning, n. ఎంతదూరం ప్రయాణం చేసేమో,ఎక్కడ ఉన్నామో, ఉజ్జాయింపుగా లెక్క కట్టడం; +* deaf, n. చెవిటితం; చెవిటివాడు; +* deal, n. బేరం; ఒడంబడిక; ఒప్పుకోలు; +* deal, v. t 1) పంచు; పేక ముక్కలని పంచడం 2) లావాదేవీలు జరుపు; +* dealer, n. బేరగాడు; కమిషన్ వ్యాపారస్థుడు; వ్యాపారి; +* dealings, n. లావాదేవీలు; వ్యవహారాలు; ఆదానప్రతిదానాలు; ఇచ్చిపుచ్చుకోడాలు; +dear friend, ph. ఆప్తమిత్రుడు; ప్రియ మిత్రుడు; +* dearness, adj. ప్రియం; అధిక ఖరీదులు; కరువు; వస్తువులు దొరకక పోవడం; +* death, n. చావు; నిలుగు; మిత్తి; మరణం; మృత్యువు; పరాసత్వం; నిర్యాణం; నిర్గమం; మహాప్రస్థానం; +sudden death ph. కాకిచావు; ఆకస్మిక మరణం; హఠాన్మరణం; అపమృత్యువు; +* dearth, n. కరువు; లోటు; కొరత; అధిక గిరాకీ; +* debate, n. వివాదం; చర్చ; తర్జనభర్జన; +* debauchery, n. రంకుతనం జారత్వం; వేశ్యాలోలత్వం; +* debonair, adj. నాగరిక; సభ్య; మర్యాదతో కూడిన; సరస; +bad debt, ph. చెల్లించని బాకీ; రాని అప్పు; +consolidation debt, ph. రుణార్ణ; రుణ రుణ; చిన్న చిన్న అప్పులని తీర్చడానికి చేసే పెద్ద అప్పు; +national debt, ph. ప్రార్ణం; ప్రభుత్వం చేసిన అప్పు ety ప్రవత్సతర రుణ ప్రార్ణ, లేక పెద్ద అప్పు; సంస్కృతంలో ఈ సంధి కార్యం ఒక ప్రత్యేక నియమానికి లోబడి ఉంది. సర్వసాధారణంగా అకారాంత పదాల తర్వాత రు శబ్దం వస్తే, రు శబ్దమే మారుతుంది. ఉదా బ్రహ్మ రుషి బ్రహ్మర్షి. కాని అకారం తర్వాత రుణ అన్న మాట వచ్చినప్పుడు మాత్రం అకారానికి దీర్ఘం వస్తుంది. ఉదా ప్రవత్సతర రుణ ప్రార్ణ. +small debt, ph. వత్సరార్ణం; వత్సతర రుణ ఏడాదిలోగా తీర్చేసే చిన్న అప్పు; +* debtor, n డెటర్) బాకీదారు; రుణి; రుణికుడు; రుణగ్రస్తుడు; అరువరి; అప్పారావు; అప్పులపోతు; అధమర్ణ అధమ రుణ; +* debug, v. t. తప్పులేరు; దోషాలు వెతుకు; దోషనిరూపణం; +* debugging, n. తప్పుతీత కలుపుతీత లా తప్పులేరడం; క్రమణికలలో తప్పులు ఏరడం; దోషనిరూపణం; +* debunk, v. t. ఒక నమ్మకాన్ని వమ్ము చెయ్యడం; +* debut, n డెబ్యూ) రంగప్రవేశం; అరంగేట్రం; +* debutante, n. f డెబ్యుటాంట్‍) రంగప్రవేశం చేసిన అమ్మాయి; వయసొచ్చిన పిల్ల; పశ్చిమ దేశాలలో, సంపన్నుల సంసారాల్లో, ఇల్లు వదలి పార్టీల వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టిన పిల్ల; +* decagon, n. దశభుజి; దశకోణి; పది భుజాలు ఉన్న రేఖా చిత్రం; +* decant, v. t. తేర్చు; పైన ఉన్న తేటను విడతీయు; +* decantation, n. తేర్చుట; మడ్డి కిందకి దిగగా పైనున్న ద్రవాన్ని వేరు చేయుట rel filtration; +* decay, n. క్షయం; కుళ్లు; తగ్గుదల; +* decay, v. i. క్షీణించు; కుళ్లు; కృశించు; తగ్గు; +* Deccan, n. దక్షిణాపథం; దక్కను పీఠభూమి; +Deccan Traps, ph. దక్కను పీఠభూమిలో కనబడే శిలాద్రవపు రాళ్లు; +* deceased, n. పరాసు; మరణించిన వ్యక్తి; +* deceit, n. దగా; వంచన; మోసం; కుయుక్తి; కపటం; కైతవం; ప్రలంభం; +* deceive, v. t. దగా చేయు; వంచన చేయు; మోసం చేయు; మోసగించు; మభ్యపరచు; +* deceleration, n. ఋణత్వరణం; త్వరణం ఎంత జోరుగా తగ్గుతోందో చెప్పే సూచిక; +* decent, adj. పరవాలేని; బాగానే ఉన్న; మంచి; మర్యాద అయిన; +* decency, n. పరవాలేని ప్రవర్తన; మర్యాద; +* decibel, n. డెసిబెల్‍; శబ్దం ఎంత బిగ్గరగా ఉందో చెప్పే కొలమానం; +* decimate, v. t 1) నిర్మూలించు; ఓడగొట్టు 2) పదవ వంతు నాశనం చేయు; +* decimation, n. నిర్మూలన; పెద్ద ఎత్తున నిర్మూలన lit దశాంశ నిర్మూలన; పదవ భాగాన్ని నిర్మూలించడం; +* decision, n. తీర్మానం; తీర్పు; నిర్ణయం; పరిష్కారం; నిర్ధారణ; నిశ్చయం; +* decipher, v. t. గుప్త సంకేతంలోని అసలు సమాచారాన్ని విడదీయడం; +* deck, n 1) గట్టు; తేనె 2) దస్తా 3) మంచె 4) ఓడలో బయలు ప్రదేశం; +* declaration, n. ప్రకటన; నివేదన; ఆఖ్యానం; ప్రపచనం; +* declare, v. t. ప్రకటించు; ప్రవచించు; నివేదించు; సమాఖ్యించు; +* declension, n gram విభక్తి ప్రత్యయాన్ని చేర్చడం; +* decline, n. తిరోగతి; అవనతి; చ్యుతి; క్షీణదశ; క్షీణావస్థ; +* decomposition, n. వియోగం; కుళ్ళడం; శిధిలమవడం; పర్యూషితం; +* decorate, v. t. అలంకరించు; ముస్తాబు చేయు; సింగారించు; +* decoration, n. అలంకరణ; అలంకారం; అలంకృతి; సింగారింపు; కైసేత; ముస్తాబు; +* decoy, n. పరులని తప్పుదారి పట్టించడానికి వాడే వస్తువు; +* decree, n. తీర్పు; నిర్ణయం; శాసనం; జారీ; ఫర్మానా; +* dedication, n 1) అంకితం 2) కార్యదీక్ష; నిధిధ్యాసనం; నిరతి; పరాయణత్వం; +* deduce, v. t math సామాన్య సూత్రాల నుండి ప్రత్యేక లక్షణాలని తార్కికంగా నిర్ణయించడం; +* deduction, n 1) మినహాయింపు; తగ్గింపు 2) తీసివేత; తగ్గింపు; వ్యవకలనం 3 logic] నిగమనం; సా��ాన్య సూత్రాల నుండి ప్రత్యేక లక్షణాలని నిర్ణయించే తర్కం ant induction; +* deed, n 1) చేష్ట; చేసిన పని; కృత్యం; కార్యం 2) పత్రం; కాగితం; దస్తావేజు; +* deep, adj 1) లోతైన; గాఢమైన; గహన; గంభీరమైన 2) ముదురు; +deep seated, ph. పాతుకుపోయిన; సుస్థిర; అంతస్థిత; +* de facto, adj Latin] నిజానికి; నిజం చెప్పాలంటే; అసలైన; యదార్థ; వాస్తవిక; +* defamation, n. పరువు నష్టం; నగుబాటు; అపనింద; అపవాదు; +* default, n. గుజస్తు; అపక్రమం; తనంతి; చెయ్యవలసిన పనిని వేళకి చెయ్యలేక పోవడం; +default setting, ph. ఎలా ఉన్నదానిని అలాగే వాడుకోవడానికి వీలైన అమరిక; +public defecation, ph. బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చెయ్యడం; +* defect, n. లోపం; లోటు అచ్చిక; వికలం; ఓడు; మొర్రి; అరకొర; పొచ్చెం; ఢోకా; తఫావతు; +* defective, adj. లోపం ఉన్న; ఓటి; లోపభూయిష్టమయిన; కోరా; వికల; +* defense, defence (Br n 1) రక్షణ; కాపు 2) సమర్ధన; మద్దత్తు; ప్రతివాదం 3) ముద్దాయి పక్షం; +* deficit, n. లోటు; లోపము; వెలితి; కొరత; కొదవ; కొరవ; కొర; న్యూనత; +budget deficit, ph. బడ్జెట్ లోటు; ఆదాయం కంటె ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్‌లో లోటు వస్తుంది. ఆలోటుని భర్తీ చెయ్యడానికి అప్పు చెయ్యవచ్చు. +* defile, v. t. అపవిత్రం చేయు; ఎంగిలి చేయు; మలినం చేయు; భ్రష్టం చేయు; +* define, v. t. నిర్వచించు; విశదీకరించు; లక్షణములు చెప్పు; +* definitively, n. ఇదమిత్థంగా; నిశ్చితంగా; ఖరాఖండిగా; +* deformity, n. అవలక్షణం; అవిటితనం; అంగవైకల్యం; +* defy, v. i. ధిక్కరించు; ఎదిరించు; తిరస్కరించు; +* degradation, n. అధోకరణం; అధఃపతనం; శైథిల్యం; అరుగుదల; +* degreaser, n. అటకలి జిడ్డుని వదలగొట్టేది +* degree, n 1) అంశ 2) భాగ; డిగ్రీ; కోణ పరిమాణం 3) డిగ్రీ; పరిమాణం; +* deification, n దైవత్వాన్ని ఆపాదించడం; అవతారమెత్తిన వ్యక్తి అని కొనియాడడం; +* deism, n. ఈశ్వరజగద్భేదవాదము; ఈ వాదంలో ప్రపంచం, దేవుడు నడుమ స్పష్టమైన గీత గీయబడింది. దేవుడు సృష్టించేసి, ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయి, ఎక్కడో స్వర్గం వంటి చోట నివసిస్తున్నాడు. దేవుడు పరోక్ష భూస్వామి వంటి వాడు. సృష్టికి దేవుడు నిమిత్తకారణం (Efficient Cause) మాత్రమే. ఇక్కడ జరిగే విషయాల ఆయనకు ఏమాత్రం పట్టవు. ఇసాక్ న్యూటన్, చార్లెస్ డార్విన్ వంటి వారు ఈ వాదాన్నే సమర్ధించారు; +* dejection, n. విషణ్ణం; నిరుత్సాహం; చింత; వ్యాకులపాటు; +* de jure, adj Latin] న్యాయానికి; చట్టరీత్యా; పేరుకి మాత్రం; +* delay, n. ఆలస్యం; విలంబన; జాగు; జాప్యం; కాలయాపనం; కాలవిలంబన; కాలాతీతం; తామసం; +* delay, v. i. ఆలస్యం చేయు; జాప్యం చేయు; జాగు చేయు; +delay line, ph elec విలంబన మార్గం; విలంబన తంతువు; తామస తంతువు; +* delegate, n. ప్రతినిధి; సభ్యుడు; నియుక్తుడు; నియోగి; +* delegate, v. t. నియోగించు; పని మరొకరికి అప్పగించు; +* delegation, n. నియుక్త బృందం; సభ్య బృందం; రాయబార వర్గం; +* delete, v. t. కత్తిరించు; కొట్టివేయు; జాబితా నుండి తొలగించు; మినహాయించు; పాటాకొట్టు; పరిహరించు; +* deli, n, తినడానికి తయారుగా ఉన్న రొట్టె, చీజు, ఊరబెట్టిన మాసం; చేపలు, వగైరా అమ్మే స్థలం; short for delicatessen; +* delicacy, n. అపురూపమైన విలువ గలది; నాజూకైనది; +* delicate, adj. సున్నితమైన; నాజూకైన; సుకుమారమైన; కోమలమైన; మార్దవమైన; సుతారమైన; +* delicious, adj. కమ్మని; మంచి రుచిగల; హితవైన; స్వాదువైన; +* delirious, adj 1) సన్నిపాత జ్వరానికి సంబంధించిన; సన్నిపాతజ్వర రోగివలె 2) మితిమించిన సంతోషంతో; +* delirium, n. సన్నిపాతం; సంధి; సన్నిపాతజ్వరం; సంధిలో పేలాపన; జ్వరంచే గాని, నాడీ మండలం అదరడం వల్ల కాని ఒంటి మీద స్మారకం వస్తూ, పోతూ ఉండే రోగస్థితి; +* deliver, v. t 1) ప్రసవించు; ఈను; కను 2) ఇచ్చు; పలుకు; వచించు 3) విడుదల చేయు; బట్వాడా చేయు 4) పట్టుకొచ్చి ఇచ్చు; అందించు; చేర్చు 5) విడచిపెట్టు; విముక్తి చేయు; +* delivery, n 1) పురుడు; ప్రసవం; ప్రసూతి; కాన్పు 2) అప్పగింత 3) విడుదల; బట్వాడా; +* dell, n కోన; కొండలలో ఇరుకైన చోటు; లోయ; +* Delphinus, n. ధనిష్ట; ధనిష్టా నక్షత్రం; గోలోకం; +* delta, n. డెల్టా; నదులు సముద్రంలో కలిసే చోట త్రిభుజాకారంగా ఏర్పడ్డ ద్వీపం; +* deluge, n. వరద; జలప్రళయం; ముంపు; వెల్లువ; +* demand, n. గిరాకి; జరూరు; అవసరం; కొనుబడి; దాతవ్యం; +demand draft, ph. జరూరు హుండీ; డబ్బు ముందు పుచ్చుకుని బేంకు ఇచ్చే చెక్కు; +* demeanor, n. వాటం; వైఖరి; తీరు; హావభావాలు; చందం; +* dementia, n. బుద్ధిమాంద్యత; ముసలితనంతో వచ్చే బుద్ధిమాంద్యత; మెదడులోని కణజాలం పాడవడం వల్ల తర్కబద్ధమైన వీశ్లేషణ, జ్ఙాపక శక్తి విపరీతంగా తగ్గిపోయిన కారణంగా పొడచూపే ప్రవర్తన; బుద్ధిమాంద్యత అన్నా ఆల్జైమర్శ్ రోగం అన్నా ఒకటి కాదు; జ్ఞఆపకశక్తిని, భాషాపాటవాన్ని, అహం అనే భావాన్నీ నాశనం చేసే బుద్ధిమాంద్యతని ఆల్జైమర్శ్ రోగం అనొచ్చు; +* demigods, n. pl. ఉపదేవతలు; ఖేచరులు దైవము వంటివారు; +* demography, n. జనాభాశాస్త్రం; జనసంఖ్యాశాస్త్రం; +* demolish, v. t. పడగొట్టు; నిర్మూలించు; నాశనం చేయు; ధ్వంసం చేయు; నేలమట్టం చేయు; +* demon, n 1) భూతం; బ్రహ్మ రాక్షసి; దయ్యం; పిశాచం; సైతాను 2) f. డాకిని; శాకిని; +* demonstrate, v. t తార్కాణించు; ప్రత్యక్ష ప్రమాణంతో రుజువు చేయు; చేసి చూపించు; +* demonstration, n తార్కాణం; చేసి చూపించడం; రుజువు చేయడం; నిరూపించడం; ప్రదర్శించడం; +* demonyms, n. pl. ప్రజల పేర్లమీద ఏర్పడిన స్థలనామాలు; +* demur, v. i డిమర్ సందేహించు, సంశ���ించు; ముందు వెనుక లాలోచించు; తటపటాయించు; +* demure, adj డిమ్యర్ పుట్టముంగి వలె; నంగనాచిలా; సిగ్గుతో ఒక స్త్రీ ప్రవర్తనని వర్ణించేటప్పుడు) +* Denebola, n. ఉత్తరఫల్గుణి సింహరాసిలో ఒక నక్షత్రం; రాశిచక్రంలో కనిపించే నక్షత్రాలలో రెండవ స్థానంలో ఉన్న తార భూమికి 36 జ్యోతిర్‍ వర్షాల దూరంలో ఉంది; +* dengue fever, n డింగీ జ్వరం దుమ్ములనొప్పి జ్వరం; విషాణువు వల్ల ఒళ్లంతా నొప్పులతో వచ్చే జ్వరం; +* denominator, n math హారం; భిన్నంలో గీతకి దిగువ ఉన్న అంశం; +* dense, adj. దట్టమైన; సాంద్రమైన; కీక; సాంద్ర; ఆకీర్ణ; ఈరము; అవిరళ; నిబిడ; +* dental, adj. దంత; దంత్య; పంటికి సంబంధించిన; +* dentals, n ling దంత్యములు; దంత్యాక్షరాలు; పళ్ళ సహాయంతో పలికే వర్ణాలు; త, థ, ద, ధ, న, ల, స; +* dentist, n. దంతవైద్యుడు; దంత విశారద; +* dentures, n డెంచర్స్) కట్టుడుపళ్లు; +* deny, v. t. నిరాకరించు; లేదను; కాదను; ఒప్పుకొనకపోవు; +* deodorant, n. దుర్గంధనాశని; నిర్గంధి; కంపుని పోగొట్టడానికి వాడే వస్తువు; +* deodorization, n. నిర్గంధీకరణం; కంపుని పోగొట్టడం; +* depart, v. i. వదలిపెట్టు; వెళ్ళిపోవు; బయలుదేరు; +* departure, n. పోక; వెళ్లడం; యాతం; అపగమం; బయలుదేరడం; నిష్ర్కమణం; +* depend, v. i. ఆధారపడు; నమ్ముకొనియుండు; +* dependence, n. పరతంత్రత; పరాధీనత; పరాయత్తత; +* dependent, adj. పరతంత్ర ఆయత్త; పరాయత్త; పరాధీన; ఆధారపడ్డ; శ్రీత; ఆశ్రిత; సమాశ్రిత; +* dependent, n. పరతంత్రుడు; పరతంత్రి; శ్రీతుడు; ఉపజీవకుడు; ఆశ్రీతుడు; +* depict, v. i చిత్రీకరించు; చిత్రించు; వర్ణించు; +* deplore, v. i వాపోవు; విచారించు; చింతించు; విలపించు; +* deplorable, adj. శోచనీయం; దీనం; విషాదవంతం; వ్యధితం; ఆధ్వాన్నం; +* deponent, n. వాంగ్మూలం ఇచ్చే వ్యక్తి; +* depot, n డిపో 1) గోదాం; సరుకు నిలవచేసే చోటు 2) నెలవు; కొఠారు; స్టేషను; రైలు స్టేషను; బస్సు స్టేషను; వాహనాలను నిలిపే చోటు; +* depreciation, n. అపకర్షణం; తరుగు; తగ్గుదల; వాడుక వల్ల విలువ తగ్గడం; +* depressants, n. నిరుత్సాహకారకులు; ఆల్కహాలు, నిద్రమాత్రలు వగైరా; +* depression, n 1) గొయ్యి; నత 2) గుండం; పీడనగుండం; అవనతి; తుపాను 3) మాంద్యత; స్తబ్ధత 4) వ్యాకులత; వైరాగ్య వ్యాకులత; చింత; కుంగుబాటు; +mental depression, ph. మనో వ్యాకులత; మనోస్తబ్ధత; కుంగుబాటు ఈ మానసిక రోగానికి ఉండే లక్షణాలు: మనసు ఖాళీగా ఉన్నట్లు విచారంగా ఉండటం (empty mood నిరాశ, నిస్పృహ, ఎందుకూ పనికిరాననే భావం; దేనిమీదా అభిరుచి (interest) లేకపోవటం; నిస్సత్తువ, అలసట, నీరసం; ఏకాగ్రత లేకపోవటం; ఏదయినా నేర్చుకోవాలంటే కష్టమైపోవటం; చికాకుగా ఉండటం (irritability అతినిద్ర లేదా నిద్ర లేమి; అర్ధరాత్రి లేదా తెల్లవార�� ఝామున మెలకువ వచ్చి మళ్ళీ నిద్ర పట్టక పోవటం; ఆకలి పెరగటం లేదా తగ్గిపోవటం; ఇక్కడా అక్కడా నెప్పులు, చెప్పుకోలేని బాధలు; భవిష్యత్తు గురించి ఆలోచించ లేకపోవటం; ఆశలు ఆశయాలు లోపించడం; నిర్ణయాలు తీసికోలేకపోవటం; చనిపోవాలని అనిపించటం; see also "anxiety;" +depth gauge, ph. దఘ్నమాపకం; లోతుని కొలిచే ఉపకరణం; +depth indicator, ph. దఘ్నార్థకం; లోతుని చూపించే సూచిక; +* dequeue, v. t కంప్యూటరు పరిభాషలో) ఒక వరుసలోఉన్న శాల్తీలలో ముందున్న శాల్తీని బయటకి తియ్యడం; +* dereliction, n. ఉపేక్ష; శ్రద్ధ చూపకపోవడం; పరిత్యాగం; +* deride, v. t. గేలి చేయు; పరిహసించు; ఎద్దేవాచేయు; ఎగతాళిచేయు; +* derivative, n 1) పుట్టినది; ఉత్పన్నం వ్యుత్పన్నం; నిష్పాదకం; నిష్పన్నం; జన్యం; తద్ధితం 2) వాలుదల; ఒక ప్రమేయం విలువ ఏ దిశలో, ఎంత జోరుగా మారుతూందో (పెరుగుతోందో, తరుగుతోందో) తెలియజేసే సంఖ్య; ఒక ప్రమేయం కి ఒక బిందువు దగ్గర ఒక స్పర్శ రేఖ గీసినప్పుడు, ఆ రేఖ ఎంత వాలుగా ఉందో చెప్పే సంఖ్య 3) స్టాక్ మార్కెట్లో షేర్లు మూలాధారాలు (underlyings) అయితే, ఫ్యూచర్స్ ఆప్షన్స్ (F&O) వాటి వ్యుత్పన్నములు; షేర్ల గురించి అవగాహన ఉన్న ట్రేడర్లు తక్కువ మూలధనంతో ఎక్కువ లాభం ఆర్జించే సాధనాలు డెరివేటివ్స్; +dervative of a function, ph. ఒక ప్రమేయం ఒక బిందువు వద్ద ఎంత జోరుగా కదులుతొందో (పెరుగుతొందో, తరుగుతొందో) తెలిపే సంఖ్య; +derivative suffix, ph. నిష్పాదక ప్రత్యయం; తద్ధిత ప్రత్యయం; +* derive, v. t. సాధించు; వ్యుత్పన్నించు; నిష్పన్నం చేయు; +* derived, adj. ఉత్పన్న; వ్యుత్పన్న; సాధ్య; జన్య; +* derived, n. ఉత్పన్నం; నిష్పన్నం; సాధించినది; +* derogatory, adj. మర్యాద తక్కువైన; గౌరవలోపమైన; +* derrick, n. బకయంత్రం; బరువులని పైకెత్తే యంత్రం ety కొంగ మెడ వలె పొడుగాటి మెడ ఉన్న యంత్రం; +* design, n 1) పన్నుగడ 2) విన్యాసం; రూపం; రూపకల్పన; కూర్పు; +* desire, n. కోరిక; కాంక్ష; ఆకాంక్ష; వాంఛ; అభిలాష; అభిమతం; ఈషణము; ఇషణము; మనోరధం; ఇచ్ఛ; ఆసక్తి; ఆశ; +* desired, n. అభిలషణీయం; వాంఛనీయం; ఉద్దిష్టం; +* desolate, adj. నిర్మానుష్యమైన; నిర్జన; మానవ సంచారం లేని; +* despair, n. నిస్పృహ; నిరాశ; నిరుత్సాహం; +* desperate, adj. నిరాశాపూర్వక; హతాశమైన; అసాధ్య; భీషణ; +* desperation, n. నైరాశ్యం; నిరాశ వల్ల కలిగిన తెగింపు; +* dessert, n డెజర్ట్) భోజనానంతరం తినే తీపి పదార్థం; మోదకం; +* destiny, n. దైవగతి; విధి; రాత; తలరాత; అదృష్టం; నసీబు; +* destitute, n. బుక్కాపకీరు; ఇల్లు, వాకిలి లేని వాడు; +* destroy, v. t. నాశనం చేయు; లయించు; తెగటార్చు; నిర్మూలించు; ధ్వంసం చేయు; రూపుమాపు; +* destroyer, n. లయకారకుడు; నాశనం చేసేవాడు; +* destruction, n. నిర్మూలన; విధ్వంసన; లయ; వినాశం; క్షపణం; హననం; +* destructive, adj భంజక; నిర్మూలాత్మకమైన; విధ్వంసక; క్షపణ; హనన; +* detached, adj. వేరుగా; విడిగా; నిర్విణ్ణ; అసంహిత; నిస్సంగ; +* detective, n. పత్తేదారు; ఆచూకీదారు; అరీందం; అపరాధ పరిశోధకుడు; నిరూపకుడు; +* deter, v. t. భయపెట్టి మాన్పించు; ఆపు; అడ్డగించు; నివారించు; నిలుపు; +* determinant, n 1 math నిశ్చితార్థం; లెక్కలలో ఒక వ్యూహం (మాత్రుక) రీతిలో వేసిన అంకెల అమరిక యొక్క విలువ 2) నిశ్చయించేది; +* determinism, n. నిర్ణయవాదం; నియతవాదం ప్రతి సంఘటనకూ, కార్యానికీ ఏదో ఒక కారణం ఉంటుందనీ, సృష్టి సమస్తం కార్యకారణ సంబంధాల మూలంగానే జరుగు తుంటుందనీ తెలియజేసే సిద్ధాంతం; +* deviate, v. i. దారి తప్పు; మరొకదారి తొక్కు; +* device, n 1) తంత్రం; పన్నుగడ 2) సాధనం; ఉపకరణం; కందువ; దీవసం 3) జంత్రం; +* devil, n సైతాను; క్రైస్తవ మతంలో దేవుడికి చుక్కెదురు అయిన శక్తి; +* devote, v. t. లగ్నపరచు; కేటాయించు; వినియోగించు; +* devotee, n. ఉపాసి; m. ఉపాసకుడు, భక్తుడు; f. ఉపాసకురాలు; భక్తురాలు; +* devour, v. t. కబళించు; మింగివేయు; భక్షించు; మెక్కు; బుక్కు; అత్యాసతో, ఆత్రుతతో గబగబా తిను; +* dew, n. తుహినం; మిహిక; ధూమిక; నీటి బిందువులుగా మారిన గాలిలోని చెమ్మ rel తుషారం; +dew point, ph. తుహిన అంకం; తుహిన స్థానం; గాలిలోని చెమ్మ నీటి బిందువులుగా మారడానికి అనుకూలమైన ఉష్ణోగ్రత; +* dewlap, n 1) గంగడోలు; ఆవులకి ఎద్దులకి మెడ కింద వేలాడే ఒదులైన చర్మం 2) జోలుమెడ; ఇతర జంతువులకి, పక్షులకి మెడ కింద వేలాడే ఒదులైన చర్మం see also wattle; +* dexterity, n. హస్తకౌశలం; చాతుర్యం; నిపుణత్వం; నైపుణ్యం; వైదగ్ధ్యం; +* dextral, adj 1) కుడిచేతివైపు; దక్షిణ 2) కుడిచేతి వాటం 3) అనుశంఖ; శంఖం యొక్క మట్టం నుండి శిఖరానికీ వెళ్లేటప్పటి సర్పిలాకృతి ant sinistral; +* dextro, adj. దక్షిణ; కుడిచేతివైపు; కుడిచేతివాటపు; +* diacritical marks, n. లేఖన చిహ్నాలు; అక్షరాలు ఎలా ఉచ్చరించాలో సూచించడానికి వాడే గుర్తులు; +* diagonalization, n. వికర్ణీకరణం; ఒక మాత్రుకలో శూనం కాని అంశాలన్నీ కర్ణం మీద వచ్చేలా చెయ్యడం; +* diagnosis, n. రోగనిర్ణయం; సముత్థానం; కారణ నిర్ణయం; +* diagnostic, adj. రోగాన్ని నిర్ణయించే; కారణాన్ని కనిపెట్టే; +* dial, n. ఫలకం; ముఖఫలకం; బింబాననం; +* dial, v. t. ఫలికించు ఫలకమును వినియోగించు +* dialect, n. మాండలికం; ప్రాంతీయ భాష; విభాష; ఉపభాష; భాషలోని ప్రాంతీయ భేదాలనే మాండలికాలు అంటారు; వ్యక్తిపరమయిన శైలీ భేదాలకి అతీతమయిన భాష; ప్రధాన భాషలో భాగమై, కొన్ని స్థానిక విశిష్టతలతో కూడి వుండే భాషభేదాన్ని మాండలికం అంటారు rel idiolect; +* dialectic materialism, ph. గతి తార్కిక భౌతిక వాదం; హెగెల్ వాడిన తర్క శాస్త్రాన్ని భౌతిక తత్త్వశాస్త్రానికి అన్వయించగా లభించినది; ఇదే కమ్యూనిష్టు సిద్ధాంతాలకి మూలాధారం; +* dialecticism, n. విరోధవికాసం; విరోధోక్తి; విరోధభావంతో వికాసం కలిగించడం; గతి తర్కం; ప్రశ్నోత్తర విచారణ; ప్రశ్నోత్తరాల ద్వారా సత్యాన్వేషణ చేసే తర్కం; పరస్పరాత్మక తర్కశాస్త్రం; హెగెల్ వాడిన తర్క శాస్త్రం; +* dialog, n. సంభాషణ; ఇద్దరి మధ్య సంభాషణ; నాటకం, సినిమా వగయిరాలలో చెప్పే సంభాషణ; see also aside, soliloquy; +* diameter, n. వ్యాసం; కైవారం; అడ్డుకొలత; +* diamond, n 1) వజ్రం; రవ్వ; నవ రత్నములలో నొకటి 2) చీట్లపేకలోని నాలుగు రంగులలో ఒక రంగు; +diamond anniversary, ph. వజ్రోత్సవం; అరవైయ్యవ వార్షికోత్సవం; షష్టిపూర్తి; +* diamond jubilee, n. వజ్రోత్సవం; అరవైయ్యవ వార్షికోత్సవం; షష్టిపూర్తి; +* diaper, n. నాపి; అధోంగవం; పిల్లగోచీ; చంటి పిల్లలు మలమూత్రాదులు వదలినప్పుడు మలినం బయట పడకుండా గోచీలా కట్టే బట్ట; +* diaphoretic, n ఘర్మజనని; చెమట పట్టించే గుణం కలది; ఉదా: అల్లం; +* diaphragm, n anat వప; విభాజకం; హృదయకుహరాన్నీ గర్భకుహరాన్నీ విడదీస్తూ మధ్యలో ఉండే ఒక కణజాలపు పొర; +* diary, n. దినచర్య; దైనందిని; దినచర్య రాసిన పుస్తకం; +* diarrhea, n. నీళ్ల విరేచనాలు; ప్రవాహిక; +* diaspora, n. ప్రవాసులు; ప్రవాస గణాలు; మాతృభూమి వదలి వివిధ దేశాలలో చెల్లాచెదరిన ప్రజానీకం; +* diatom, n డయటామ్ ద్వంద్వకణం; అతి సూక్ష్మమైన నాచువంటి పదార్థం; ఈ కణాలలో ఉన్న జంట సంచులలో ఇసక లాంటి పదార్థం ఉంటుంది; +* diatribe, n. ఉతికెయ్యడం; తిట్లు లంకించుకోవడం; +* dice, n. pl. పాచికలు; నామరులు; అడ్డసారెలు; +* dice, v. t. చిన్న ముక్కలుగా కోయు; +* dichotomy, n. ద్వైధీభావం; ద్వయితం; ద్వైవిధ్యం; ద్విభాజనం; తర్కశాస్త్రంలో ఒక వర్గాన్ని రెండు పరస్పర విరుద్ధమైన వర్గాలుగా విడగొట్టడం; ఉదాహరణకి ఆత్మ, పరమాత్మ; పూర్వం; పరం; +* dictionary, n. నిఘంటువు; కోశం; పదార్థకోశం; పదకోశం; పదనిధి; శబ్దకోశం; శబ్దసంగ్రహం; శబ్దసాగరం; శబ్దమంజరి; తెల్లడి; +* didactic, adj. ఉపదేశాత్మక; ఉపదేశానికి అనుకూలమైన; నేర్పడానికి వీలయిన; నీతిబోధకమైన; +* die, n. s 1) పాచిక; అక్షం; see also dice 2) మూస అచ్చుదిమ్మ; కొలిమిలో కరిగించిన దానిని పోత పొయ్యడానికి వాడే సాధనం 3) కౌలుదిమ్మ; పడి అచ్చు; +* die, v. i 1) చచ్చు; చచ్చిపోవు; చనిపోవు; మరణించు; కడతేరు నీలుగు; ఈలుగు; పరమపదించు; తనువు చాలించు; అసుమలు బాయు; గుటుక్కుమను; టింగుమను; f. గౌరీసాయుజ్యం చెందు 2) ఆగిపోవు; పనిచెయ్యడం మానివేయు; +* diehard, adj 1) మొండి 2) పరమ ఛా��దసమైన 3) ఒకంతట ఒదిలిపెట్టని; చాలాకాలం మన్నే; +* diet, n 1) ఆహారం 2) పథ్యం; ఆరోగ్యం బాగులేనప్పుడు తినదగిన ఆహారం 3) ధారకం; ఆరోగ్యం బాగుకొరకు నియమితమైన రీతిలో తిండి తినడం; +* dietetics, n. ఆహారవిధులు; ధారక శాస్త్రం; +* difference, n. వ్యత్యాసం; వ్యత్యయం; భేదం; చయం; అంతరం; తేడా; తారతమ్యం; తరతమభావం; న్యూనాధిక్యం; +* differential, adj math అవకలన; రెండు రాశులకి మధ్యనున్న తేడాకి సంబంధించిన; +* difficult, adj. కష్టమైన; ప్రయాసతో కూడిన; దుర్లభమైన; +* difficulties, n. pl. కష్టాలు; ఇబ్బందులు; కడగండ్లు; ఇక్కట్లు; +* difficulty, n. కష్టం; ప్రయాస; ఇబ్బంది; శ్రమ; ఒరకాటం; ఇక్కట్టు; ఇడుము; అవస్థ; దుస్తరం; తంటా; ప్రతిబంధకం; రాయిడి; +* diffidence, n. అధైర్యం సంకోచం; న్యూనతశంక; తన సామర్థ్యం మీద నమ్మకం లేకపోవడం; +diffraction grating, ph. వివర్తన జాలకం డైఫ్రాక్షన్ గ్రేటింగ్ +* digest, n. స్మృతిసంహిత; ఎగ్గుర్తు; ఎగ్గురుతు; మరొక ప్రచురణలోని విషయాన్ని సంగ్రహపరచిన పుస్తకం +* digest, v. t సంగ్రహించు; సంక్షేపించు; +* digitized, adj. సాంఖ్యీకృత; అంకీకరించిన; అంకెల రూపంలోకి మార్చబడ్డ; +* dike, n. చెలియలికట్ట; కట్ట; సముద్రపుటొడ్డున నీళ్ళు పల్లపు భూముల లోపలికి రాకుండా కట్టే కట్ట; +* dilation, n 1) శరీరంలోని రంధ్రం కాని, నాళం కాని సాధారణ స్థితి కంటె ఎక్కువగా వ్యాకోచం చెందడం 2 వ్యాకోచం చెందడం; +* dilatometer, n. వ్యాకోచమాపకం; వ్యాకోచాన్ని కొలిచే శాస్త్రీయ పరికరం; +* dilemma, n. సందిగ్ధావస్థ; సందిగ్ధం; చిక్కు; ఇబ్బంది; ఇరకాటం; అన్యోన్యాశ్రయం; ఉభయ సంకటం; అభిశంకితం; +* dim, adj. నిస్తేజ; కాంతి లేని; మకమకలాడెడు; మసకగా ఉన్న; +* dimension, n. మాత్ర; కొలత; కొలమానం; పరిమాణం మితి; +* dimples, n. pl బుగ్గల మీద పడే సోట్టలు; ఇది ఒక జన్యు లోపం వల్ల కలిగే కండరాల దోషం కాని ఇది కొందరి ముఖానికి అందం చేకూరుస్తుంది; +* dinosaur, n. భూతబ్బల్లి; పెనుబల్లి; భీకరబల్లి; జురాసిక్ యుగంలో ఈ భూమి మీద వర్ధిల్లిన పెద్ద బల్లిజాతి జంతువులు; +* dinghy, n. డింగీ; తెప్ప; తెడ్డు వేసుకొని నడిపే చిన్న నావ; +* dinosaurs, n. pl. భూతబ్బల్లులు; రాకాసి బల్లులు; పెనుబల్లులు; +* diode, n. ద్విమూర్తి; ద్వియోడు; ఎలక్ట్రానిక్స్‌లో వాడే ఒక పరికరం; +* dip, n 1) అవపాతం; నతి; అయస్కాంతపు సూది ప్రదర్శించే ఒక లక్షణం 2) ముంచుకొని తినడానికి వీలయిన పచ్చడి లాంటి పదార్థం; +* diphthong, n. సంధ్యాక్షరం; జంటక్షరం; రెండక్షరాలని కలిపి ఒకటిగా రాయడం; ఇంగ్లీషులో f i లని కలిపి అచ్చుకొట్టినప్పుడు ఈ రకం జంటక్షరం వస్తుంది; +* diplomacy, n. దౌత్యం; దౌత్యనీతి; రాజతంత్రం; కూటనీతి; రాజనీతి; కార్యదక్షత; చతురత; +* diplomat, n. దూత; m. రాజ్యతంత్రజ్ఞుడు; వ్యవహారదక్షుడు; +* dipole, n. ధ్రువపుజంట; ద్విధ్రువం; +* dipper, n. గరిటె; ముంచేది; మునిగేది; +* Dipper, n. సప్తర్షి మండలం; గరిటె ఆకారంలో ఉన్న తారల గుంపు; +Big Dipper, ph. బృహదృక్షం; పెద్ద ఎలుగు; సప్తర్షి మండలం; పెద్ద గరిటె ఆకారంలో ఉన్న తారల గుంపు; +Little Dipper, ph. లఘదృక్షం; చిన్న ఎలుగు; చిన్న గరిటె ఆకారంలో ఉన్న తారల గుంపు; +* dire, adj. భయంకరమైన; భరించలేని; +* direct, adj. అజస్ర; అనులోమ; తిన్నగా; తిన్ననైన; నేరుగా; సరాసరి; ప్రత్యక్ష; ముఖాముఖీ; సురసూటి; +* direction, n 1) దిశ; దిక్కు; చెరగు 2) దర్శకత్వం 4) పద్ధతి; మార్గం 5) దారి; తోవ; +* directive, n. ఆజ్ఞ; ఏ విధంగా చెయ్యాలో చెబుతూ పై అధికారి ఉత్తర్వు చేసే ఆజ్ఞ; +* directory, n. దర్శని; మార్గదర్శిని; పేరు, ఉనికిపట్టు తెలియజేసే పట్టిక; సూచి; +* directorate, n. నిర్దేశక శాఖ; నిర్దేశకాలయం; +* dirt, n 1) మురికి; మలినం; మాలిన్యం; చిలుము; కసటు 2) మట్టి; మన్ను; +* dirty, adj మురికి; మురికి పట్టిన; మట్టి; మట్టి పట్టిన; ఖరాబైన; +* disabled, n. pl. అంగహీనులు; అవిటివారు; వికలాంగులు; +* disaccharide, n. జంటచక్కెర; ద్విచక్కెర; మాల్టోజు, సుక్రోజు, లేక్టోజు వంటి చక్కెరలు; వీటిని రసాయన విశ్లేషణ చేస్తే రెండు ఏకచక్కెరలు (గ్లూకోజు లాంటివి) వస్తాయి; ఉదా. రెండు గ్లూకోజు బణువులు కలిస్తే ఒక మాల్టోజు బణువు వస్తుంది; ఒక గ్లూకోజు, ఒక గేలక్టోజు కలిస్తే లేక్టోజు వస్తుంది; ఒక గ్లూకోజు, ఒక ప్రుక్టోజు కలిస్తే సుక్రోజు వస్తుంది; +* disadvantage, n. ప్రతికూలత; ప్రతికూల పరిస్థితి; అప్రయోజనం; హాని’ చెరుపు; నష్టం; +* disagreement, n. అసమ్మతి; స్పర్ధ; అభిప్రాయభేదం; భేదాభిప్రాయం; పొరపొచ్చెం; +* disappear, v. i. మాయమగు; మరుగుపడు; అంతర్ధానమగు; తిరోధానమగు; ఉడుగు, uDugu +* disappearance, n కనబడకపోవడం మరుగైపోవడం; మాయమైపోవడం; అంతర్ధానం; పారిపోవడం తిరోధానం; +* disarmament, n. అస్త్ర సన్యాసం; నిరాయుధీకరణ; నిరస్త్రీకరణం; +* disaster, n. అభాసు; వైపరీత్యం; ఉపద్రవం; విపత్తు; ఆపద; దుర్ఘటన; అనర్థం; +* disc, disk, n 1) పళ్లెం 2) బింబం 3) కంప్యూటరు రంగంలో డిస్కు; దత్తాంశాలని నిల్వ చెయ్యడానికి వాడే చదునుగా ఉండే పళ్లెం; +* discard, v. t. వదలిపెట్టు; విసర్జించు; విస్మరించు; పారవేయు; +* discharge, v. t 1) వదలు; విసర్జించు; విడుదల చేయు; విముక్తం చేయు; కొట్టివేయు; నెరవేర్చు; ఆచరించు; అనుష్టించు 2) స్రవించు; +* discharge, n. స్రావం; రజస్సు; వదలబడినది; విసర్జించబడినది; ఉత్సర్గం; విసర్జనము, విమోచనము, విడిచిపెట్టడము; +* disciple, n. శిష్యుడు; అంతేవాసి; ఛాత్రుడు; ఛాత్రి; +* discipline, n. క్ర���శిక్షణ; నియమపాలన; నిబద్ధత; క్రమబద్ధత; కాయిదా 2) శాస్త్రం; శిక్ష; ఉపదేశం; +* disclaim, v. t. పరిత్యజించు; తెంచుకొను; హక్కు వదలుకొను; +* discord, n. విరసం; అసమ్మతి; వైమనస్యం; +* discount, n. అడితి; కోత; ముదరా; ముజరా; వట్టం; తోపుడు; తగ్గింపు; +* discover, v. i. కనుగొను; కనుక్కొను; కనిపెట్టు; ఆవిష్కరించు; ఉన్న విషయాన్నే తెలుసుకొను; see also invent; +* discovery, n. ఆవిష్కరణ; ఆవిష్కారం; కనుగోలు; ఉన్న విషయాన్నే తెలుసుకొనడం rel invention; +* discreet, adj బుద్ధి ఉపయోగించి; తెలివితో; వివేక; +* discrepancy, n. విప్రతిపత్తి; తేడా; వ్యత్యాసం; +* discretionary, adj. విచక్షణాయుతంగా; తోచినవిధంగా ఇష్టం వచ్చినట్లు యధేచ్ఛగా స్వేచ్ఛగా; +* discriminate, v. t. విచక్షణ చూపు; పక్షపాతం చూపు; అంతరం చూపు; +* discrimination, n 1) వివక్ష; విచక్షణ; విచక్షత తేడా చూపడం; విచక్షణ ప్రేరితమైన జుగుప్స 2) బుద్ధి; తెలివి; వివేకం తేడా తెలుసుకోగలిగే శక్తి; +* discrepancy, n తేడా; వ్యత్యాసం; విప్రతిపత్తి; +* discuss, n 1) విష్ణుచక్రం 2) చిమ్ముబిళ్ల; ఆటలలో విసరడానికి వీలుగా ఉండే గుండ్రటి లోహపు బీళ్ల; +* discuss, v. i. చర్చించు; ముచ్చటించు; మంతనాలాడు; ప్రస్తావించు; ప్రసక్తం చేయు; విచారించు; +* discussion, n. చర్చ; గోష్ఠి; మంతనం; సంవాదం; ప్రసంగం; ప్రస్తావన; తర్జనభర్జన; సమాలోచన; +* disdain, n. తూష్ణీంభావం; చిన్నచూపు; అలక్ష్యం; ఉపేక్ష; తిరస్కారం; +* disease, n. వ్యాధి; రోగం; రుగ్మత; రుజ; సంకటం; జాడ్యం; జబ్బు; తెగులు; ఆంతకం; ఉపతాపం; ఆమయం సుస్తీ; అస్వస్థత; నలతగా ఉండడం; +congenital disease, ph. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి సంక్రమించిన రోగం; ఇది తల్లిదండ్రులనుండి వంశపారంపర్యంగా సంక్రమించేది కాదు; +contagious disease, ph. అంటురోగం; పొంగు, క్షయ, మశూచికం మొదలయినవి ఒకరినుండి మరొకరికి అంటుకుంటాయి, కనుక అవి అంటు రోగాలు; +genetic disease, ph. జన్యు రోగం; ఇది తల్లిదండ్రులనుండి వంశపారంపర్యంగా సంక్రమించే జబ్బు; +infectious disease, ph. తిష్ట; తిష్టరోగం; సూక్ష్మజీవుల వల్ల కలిగే జబ్బు; ఒక ప్రియాను వల్ల కాని, వైరస్ వల్ల కాని, బేక్టీరియా వల్ల కాని, ఫంగస్ వల్ల కాని, పేరసైట్ వల్ల కాని వచ్చే రోగం; +rust disease, ph. కుంకుమ తెగులు; మొక్కలకి వచ్చే ఒక రకమైన వ్యాధి; +smut disease, ph. కాటుక తెగులు; మొక్కలకి వచ్చే ఒక రకమైన వ్యాధి; +* disease-free, n. నిరామయం; జబ్బులేని స్థితి; రోగరహితం; అనామయం; +* disembodied, adj ముక్తదేహి అయున; శరీరమును విడచిన; +* disfigure, v. t. అందవికారముగా చేయు; అనాకారిగా చేయు; కురూపము చేయు; విరూపము చేయు; +* disgrace, n. పరాభవం; నామర్దా; ఆరడి అవమానం; +* disguise, n మారువేషం ప్రచ్ఛన్న వేషం; +* disgust, n. రోత; ఘృణ; జుగుప్స; అసహ్యం; బీభత్సం; +* dish, n 1) గిన్నె; పాత్ర; పళ్లెం; లొసన 2) వంటకం; +* dishes, n. pl 1) కంచాలు, పళ్లాలు, చె, కప్పులు, చెమ్చాలు, మొదలైన సామగ్రి 2) వంటకాలు; +disheveled hair, ph. చింపిరిగా ఉన్న జుత్తు; సంస్కారం లేని జుత్తు; +* disinfectant, n. శుచికరి; శుద్ధకారిణి; క్రిమి సంహారిణి; సంక్రమణ నిరోధిని; +* dislike, n. ఏవగింపు; అయిష్టం; విప్రియం; +* dislike, v. t. పీకు; పెళ్ళగించు; కుదుట్లోంచి పీకు; +* dismal, adj. నిరాశాజనక; అంధకారబంధుర; శోకమగ్న; +* disorder, n 1) క్రమరాహిత్యం; అల్లకల్లోలం; అబందరం; అవ్యవస్థ; అశాంతి; కలవరం; అనృతం; లొగ్గడి 2) జబ్బు; రుగ్మత 3) ఈరతార +* dispassionate, adj. నిష్పక్షపాత; నిరపేక్ష; అనాసక్త; తటస్థ; నిర్వికార; +* dispel, v. t చెదరగొట్టు; పోగొట్టు; నివృత్తి చేయు; నివారించు; బాపు; +* disperse, v. t. చిమ్ము; విరజిమ్ము; చెదరగొట్టు; విసరి చల్లు; +* displaced, adj 1) స్థలం తప్పించబడ్డ; కదల్చబడ్డ 2) నిర్వాసితులయిన; నిరాశ్రయులైన; +* displacement, n 1) కదలిక; చలనం 2) స్థానభ్రంశ దూరం; స్థానభ్రంశత; ఉద్వాసన; తొలఁగించుట; +* display, v. t. ప్రదర్శించు; విన్యాసించు; చూపించు; ఆడంబరంగా చూపించు జంభముగా చూపించు; అగుపరచు; +* disposable, adj 1) అవసరానికి మించి ఎక్కువగా ఉన్న 2) వాడి పారెయ్యడానికి వీలయిన; +* disproportionate, adj. అననుపాత అంగుగా లేని; అనుపాతంలో లేని తీరుగా లేని; ఎబ్బెట్టుగా ఉన్న; +* dispute, n. జట్టీ; తగువు; తగాదా; తగువులాట; వివాదం; తకరారు పొరపొచ్చెం; పోట్లాట; పోరు; +* disregard, n. ఉల్లంఘన; అవజ్ఞ; అలక్ష్యం; లెక్కలేకపోవడం; ఉపేక్ష; అనాదరణ; +* disrepair, adj. బేమరామతు; మరమ్మతులు లేకుండా ఉన్న; పాడుపడి ఉన్న; చెడిపోయిన; దురస్తు; +* disrepute, n. అప్రతిష్ట; అపకీర్తి; చెడ్డపేరు; +* dissection, n ఛేదన; ఛేదించి పరిశీలించడం; +* dissent, n. భిన్నాభిప్రాయం; అసమ్మతి; +* dissent, v. t. భిన్నాభిప్రాయం చూపు; అభిప్రాయభేదం ప్రకటించు; +* dissipation, n. వ్యాపనం; విసరణ; దుర్వ్రయము; దూపరదిండితనము; వ్యర్థపఱచుట; వృథావ్యయము; +* distill, distil (Br v. t 1) బట్టీపట్టు ధృతించు 2) కార్చు బొట్లు బొట్లుగా కార్చు; +* distillation, n. అభిషవం; ఆస్రవనం; మరగించి చల్లార్చడం; బట్టీపట్టుట; స్వేదనం; చుక్కలు చుక్కలుగా కారేటట్లు చెయ్యడం; +destructive distillation, ph. భంజక స్వేదనం; నిర్వాత స్వేదనం; గాలి తగలకుండా ఉడికించడం; +* distilled, adj. బట్టీపట్టిన ధృతించిన; అభిషవించిన; స్విన్న; +distilled water, ph. బట్టీపట్టిన నీరు; స్విన్న జలం ధృతి జలం; +distilled liquor, ph. అభిషవోల్; బట్టీపట్టిన సారా ఇలా బట్టీపట్టగా వచ్చినవే బ్రాందీ, విస్కీ వగైరాలు; +* distiller, n 1) బట్టీ బట్టీ పట్టే పరికరం 2) కలాలి బట్టీపట్టే వ���యక్తి; +* distinct, adj. ప్రత్యేకమైన; స్పష్టమైన; వేరైన భిన్నమైన; +* distinction, n 1) ప్రత్యేకత; విలక్షణత 2) విభేదం; వివక్ష 3) ఘనత; ప్రసిద్ధ; ప్రముఖ; విశిష్ట; +* distort, v. t విరూపించు; వికరించు వికారముగా చేయు వంకర చేయు; +* distraction, n 1) పరధ్యాన్నం; పరాకు; వ్యగ్రత; అన్యమనస్కత; ధ్యానభంగం 2) వికర్షణ. +* distrain, v. t. జప్తు చేయు; చరాస్తిని స్వాధీనపరచుకొను; +* distress, n. వ్యాకులం; వ్యాకులత; దుస్థితి; మనస్తాపం; క్షోభ; వ్యధ; వెత; ఉత్తలపాటు; కలత; అదవద; +* distribution, n. పంపిణీ; పంపకం; వంతులవారీ విభజన; బట్వాడా; వ్యాపన; వ్యాప్తి; వితరణ; +* district, n. పరగణా; జిల్లా; సర్కారు; మండలం; +ceded district, ph. దత్త మండలం; ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతానికి మరొక పేరు; +northern district, ph. ఉత్తర సర్కారు; ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరకోస్తా ప్రాంతానికి మరొక పేరు; +* disturb, v. t. కలత పెట్టు; భంగ పరచు; అంతరాయం కలిగించు; ఆటంక పరచు; విఘ్నపరచు; వ్యాఘాత పరచు; +* disturbance, n. కలత; సంక్షోభం; కలవరం; గల్లంతు; గలాటా; వ్యాఘాతం; భంగం; విఘ్నం; +* ditch, n. కందకం; గొయ్యి; అగడ్త; పరిఘ; కాలువ; +* diurnal, adj 1) అహోరాత్ర 2) పగలుఁదిరిగే; పగలుఁదిరిగెడి; దివాచర; దైనిక; +* diurnal, n. అహోరాత్రములు; రాత్రి, పగలు; ఇరవై నాలుగు గంటలు; +* diverse, adj. విభిన్న; వివిధ; బహువిధములైన; నానావిధ; పలురకాల; +* diversion, n 1) భిన్నమైన పద్ధతి; మరొక ప్రవృత్తి; మరొక దారి 2) వేడుక; లీలావినోదం; కేళీవినోదం; +* diversity, n. భిన్నత్వం; వైవిధ్యం; వైచిత్రి; +* divert, v. t. మరల్చు; మరలించు; మళ్ళించు; తిప్పు; క్రమ్మరించు; పెడదారి పట్టించు; నివర్తించు; +* dividend, n 1) విభాజ్యం; భాజ్యం; భాగింపబడవలసిన రాశి; భిన్నములోని లవం 2) లాభాంశం; లాభాగం; వ్యాపారంలో వచ్చే లాభంలో వాటాదారులకి వచ్చే కొంత భాగం; +annual dividend, ph. సాలుసరి వృద్ధి; సాలుసరి లాభాగం 2) వృద్ధి; లాభవిభాగం; లాభాంశం; లాభాగం; దామాషా; పంచేది; పంచబడేది; డివిడెండు; వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు వాటాదారుల మధ్య విభజించబడే లాభాన్ని డివిడెండు అంటారు; periodic return on investment as opposed to capital gains which refers to the growth in value of an investment; బేంకులో డబ్బు దాచుకుంటే మనకి వచ్చే ఆదాయం వడ్డీ అవుతుంది ety సంస్కృతంలో వృద్ధి అన్న మాట లోంచే వడ్డీ అన్న మాట వచ్చిందని అంటారు. కనుక dividend అన్న మాటని వృద్ధి అనీ, interest అన్న మాటని వడ్డీ అనీ తెలిగించేను; +* divination, n. భవిష్యత్కథనం భావి విషయ వ్యక్తీకరణం; సోది చెప్పడం; +* divine, adj. భగవత్; దివ్య; దేవుడికి సంబంధించిన; +* divine, v. t జోశ్యం చెప్పుట; శకునం చెప్పుట; +* diviner, n జోశ్యం చెప్పే వ్యక్తి; జోశ్యుడు; సోది చెప్పే వ్యక్తి శకున ఫలితం చెప్పే వ్యక్తి; +* division, n.(1) అంగం; భాగం; విభాగం; ఫిర్కా; డివిౙను 2) భాగారం; భాగహారం; విభజన; +* divisor, n. విభాజకం; భాజకం; భాగారించెడు సంఖ్య; హరించెడు సంఖ్య; భిన్నములోని హారం; +* divorce, n. విడాకులు; భార్యాభర్తలు ఒకరినొకరు విడచి పెట్టడం; ఘట శ్రాద్ధం చేయుట; +* divulge, v. t. వెల్లడిచేయు; రహశ్యం బయట పెట్టు; +* do, v. t. చేయు; ఒనరించు; ఒనర్చు; కావించు; సలుపు; ఆచరించు; చక్కబెట్టు; నడుపు; పాటించు; నిర్వహించు; +* docent, n చిత్రవస్తు ప్రదర్శనశాలలో ప్రదర్శించిన వస్తువుల గురించి ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి; మ్యూజియంలో గైడు; +* docile, adj విధేయమైన; చెప్పిన మాట వినే; నమ్రత కలిగిన; ధిక్కారం చూపని; +* dock, n 1) నావల దొడ్డి; నౌకా కేంద్రం 2) రేవు; నావలు నిలచే స్థలం 3) బోను; న్యాయస్థానంలో సాక్షి నిలబడే స్థలం; +* dock, v. i 1) లంగరు వేయు 2) ఒక నిర్ధిష్ట స్థానంలో అమర్చు; +* dockyard, n. నావల దొడ్డి; నౌకా నిర్మాణ కేంద్రం; +* doctor, n 1 భిషక్కు; ఆయుర్వేది; రోగహారి; డాక్టరు; m. వైద్యుడు; చికిత్సకుడు; ఓషధీధరుడు; f. డాక్టరమ్మ 2) పట్టపు పేరు; పాండిత్యానికి గుర్తుగా పేరు చివర శాస్త్రి అని తగిలించినట్లే ఇంగ్లీషు సంప్రదాయంలో పేరు మొదట డాక్టర్‍ అంటారు; +* document, n. పత్రం; దాస్తు; లేఖ్యం; లిఖితం; లిఖిత పత్రం; దస్తావేజు; నామా; +* dodecagon, n math ద్వాదశ భుజి; ఇరాఱఱకి(ఇరు ఆఱు అఱకి పన్నెండు అఱకలు (అనగా భుజాలు) కలిగినది); +* dodecahedron, n math ద్వాదశముఖి; ద్వాదశపీఠి; ఇరాఱుమోమి(ఇరు ఆఱు పన్నెండు మోములు కలది +* dodge, v. i. తప్పించుకొను; పక్కకి ఒరుగు; +* doer, n. కర్త; కార్యవాది; పనిచేసేవాడు; +* dog, n కుక్క శునకం; శ్వానం; వేపి; జాగిలం; గ్రామసింహం; +pet dog, ph. పెంపుడు కుక్క; సాకుడు కుక్క; +stray dog, ph. ఊరకుక్క; గ్రామసింహం; వీధి కుక్క; +dog days, ph. జూలై, ఆగష్టు నెలలలో వచ్చే వేడి రోజులు; ఈ రోజులలో సూర్యుడు, సిరియస్ (శ్వాన) నక్షత్రం ఒకేసారి ఉదయించి, ఒకే సారి అస్తమిస్తాయి; సిరియస్ నక్షత్రాన్ని "డాగ్ స్టార్" అని అంటారు కనుక ఈ పేరు వచ్చింది; +* dogma, n. సహేతుకం కాని సిద్ధాంతం; మూర్ఖవాదం; నమ్మకం; పట్టుదల; అంధవిశ్వాసం; పిడివాదం; నిశ్చితాభిప్రాయం; +* dogma, n. సిద్ధాంతం; నిబంధన; కట్టుబడ్డ సిద్ధాంతం; పిడి సిద్ధాంతం; +* doldrums, n 1) నిర్వాతమండలాలు; ఇవి భూమధ్యరేఖ ప్రాంతపు సముద్రాలలో గాలి వీచని ప్రదేశాలు 2 idiom] స్తంభించి పోయిన పరిస్థితులు; ఎటూ కదలని అయోమయ స్థితి; +* doll, n. బొమ్మ; సాలభంజిక; పుత్తళి; పుత్తడి; పుత్రిక; పాంచాలిక; +* domain, n. అధికార పరిధి; ఇలాకా; వ్యాప్తి; +* domestic, adj. దేశీయ; స్వదేశీయ; సొన్నాటి (సొంత నాటి; నాడు దేశం గృహస్థ; ఇంటి; గృహ; +domestic industry, ph. దేశీయ పరిశ్రమ; ఇంటలవు (ఇంటి అలవు, అలవు పరిశ్రమ); +domestic troubles, ph. గృహచ్చిద్రాలు; సంసారపు సమస్యలు; ఇంటి సమస్యలు; +dominant caste, ph. ప్రబల కులం; భారత రాజ్యాంగం దేశంలో ఉన్న కులాలని అగ్ర కులాలు (forward castes వెనకబడ్డ కులాలు (backward castes) అని స్థూలంగా రెండు వర్గాలుగా విడగొట్టి, వెనకబడ్డ కులాలని మళ్లా దళితులు (scheduled castes గిరిజనులు (scheduled tribes అని వర్గాలుగా విడగొట్టి వెనకబడ్డ కులాలకి ప్రత్యేక అవకాశాలు కల్పించింది. ఈ అవకాశాలని అందుకోడానికి అగ్ర కులాలలో కొందరు అలజడి చెయ్యగా వారిని మెప్పించడానికి ఇతర వెనకబడ్డ కులాలు (other backward castes) అని మరొక వర్గం సృష్టించి, వారికి కూడ ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఇటీవల అగ్రకులాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డవాళ్లు తమని కూడ ఇతర వెనకబడ్డ కులాలు జాబితాలో వేసి తమకి కూడ ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆరాటం చెయ్యడం మొదలు పెట్టేయి. వీరిని ప్రబల కులాలు అని సంబోధించడం మొదలు పెట్టేరు. +* donee, n. ప్రతిగ్రహీత; దానం పుచ్చుకొనేవాడు; +* donor, n. దాత; దాయకుడు; ప్రదాత; ఈవరి; ఉదారుడు వదాన్యుడు; దానమిచ్చువాడు; త్యాగి; విరాళం ఇచ్చే వ్యక్తి; +* doom, n 1) చెడ్డ తలరాత; దుష్కర్మ 2 చేసిన పాప ఫలితం అనుభవించవలసిన సమయం; +* doomsday, n. కల్పావసానం; మహాప్రళయ కాలం; +* door, n. తలుపు; కవాటం; అరళం; ద్వారం; ప్రతిహారం; +* doorkeeper, n. ప్రతిహారి; ద్వారపాలకుడు; వేత్రహస్తుడు; +* doping, n phy మాదీకరణం అర్థవాహక పదార్థాల ప్రవర్తనను మలినాలు కలిపి మార్చవచ్చు; ఈ పద్ధతిని మాదీకరణం అంటారు; +* dormitory, n. ఆవసధం; పలువురు ఎవరి గదులలో వారు నిద్రించడానికీ, నివసించడానికి వీలయిన వసతి గృహం; +* dorsal, adj. వెన్నుకి సంబంధించిన; వీపువైపు; +* dote, v. t. గారాబం చేయు; ముద్దుచేసి పాడు చేయు; +* double, n ఒక మనిషిని ముమ్మూర్తులా పోలిన మరొక మనిషి; +* double, adj. జంట; రెండింతల; రెండంతల; జవులి; ఇను; ఇనుమడి; ఇబ్బడి; రెట్టింపు; +double entendre, ph. శ్లేష; మాట విరుపులో రెండో అర్థం ధ్వనించడం; శ్లేషాలంకారంలో రెండవ అర్థం అశ్లీలంగా ఉండేది; ఉ. మీరు మాలా? President wins budget; mote lies ahead! +* double, n. రెండింతలు; రెట్టింపు; ఇబ్బడి; జమిలి; +* double, v. t. రెండింతలు చేయు; ఇనుమడించు; ఇమ్మడించు; ఇబ్బడించు; ద్విగుణీకృతం చేయు; రెట్టింపు చేయు; రెట్టించు; ఆమ్రేడించు; +* doubt, n. అనుమానం; సందేహం; సంశయం; శంక; విచికిత్స; వికల్పం; అరగలి; ఢోకా; +* doubtful, n. సందేహాస్పదం; సంశయాత్మకం; నిర్వికల్పం; అస��తినాస్తి; +* dough, n. గట్టిగా తడిపిపెట్టిన పిండి డో అని ఉచ్చరించాలి rel batter; +* doughnut, n డోనట్ ౘక్కెరయుబ్బి; ౘక్కెరగారి; గారె ఆకారంలో, మధ్యలో చిల్లు ఉన్న ఒక తియ్యటి వంటకం; +* douse, v. t. తడుపు; వరదచేయు; దిమ్మరించు; మంటలని నీళ్ళు పోసి ఆర్పు; +* dove డవ్) n. గువ్వ; కపోతం; పావురం; పావురాయి; +* dove డోవ్‍) v. i. past tense of dive 1) మునుగు; మునక వేయు; ఎత్తయిన చపటా మీదనుండి నీటిలోనికి దూసుకుపోతూ మునక వేయు 2) దూసుకు వచ్చు; +* down n. అంగరుహము; మెత్తనైన పిల్లపక్షి ఈకలు; +* down, adj. దిగువ; కింద; అడుగున; దిగుడు; +* download, v. t. దింపు; తెప్పించు; సమాచారాన్ని మన కంప్యూటర్‍ లోనికి దింపు ant upload; +* down payment, n. మొదటి వాయిదా; విలువైన వస్తువులని వాయిదాల పద్ధతి మీద కొన్నప్పుడు మొట్టమొదటి వాయిదాగా చెల్లించే సొమ్ము; +* Down's syndrome, ph. జన్యు లోపం వల్ల మానసికమైన ఎదుగుదల లేకుండా ఉండే రోగ లక్షణ సముదాయం; +* downward, adj. దిగువ దిశలో; అధోముఖ; కిందకి; దింపుడు; అవాచీన; +* doze, n. కునికిపాటు; ముచ్చిలిపాటు; +* draft, n 1) చిత్తు; చిత్తు ప్రతి; ముసాయిదా 2) గాలిసెగ 3) దుక్కి 4) బ్యాంకు పత్రం; బ్యాంకు హుండీ; +* drag, n. కర్పణం; కర్పణ శక్తి; ఈడ్పుదల; ప్రతిబంధం; +* dragnet, n 1) లాగువల; జలాశయాలలో చేపలు తప్పించుకుందికి వీలు లేకుండా అడుగంటే వరకు విసరి లాగడానికి వీలయిన వల 2) నేల మీద చిన్న చిన్న జంతువులని పట్టడానికి వాడే వల 3) తప్పించుకు పారిపోయే నేరస్తులని పట్టడానికి పోలీసులు పోలీసులు పన్నే పన్నాగం; +* dragon, n. నిప్పుబల్లి; కాళ్లు, కొమ్ములు కలిగి నిప్పును క్రక్కే ఒక ఊహాలోకపు చెడ్డ బల్లి; +* dramatization, n. నాటకీకరణ; కథ రూపంలో ఉన్న దానిని నాటక రూపంలోకి మార్చడం; +* drapery, n. పరదాలు; జాలరులు; తలుపులకి, కిటికీలకి వేసే తెరలు; +* draw, v. t 1) గీయు 2) తోడు; చేదు; బయటకు తీయు 3) పితుకు 4) ఈడ్చు 5) సాగదీయు; +* draw, n తట్టు; ఇటో, అటో తేలకుండా ఆగిపోయిన ఆట; +* drawbacks, n. pl. నిరోధకాంశాలు; లోపాలు; లోటుపాట్లు; ప్రతిబంధకాలు; +* dredging, n. అడుసు త్రవ్వుట; మేట త్రవ్వు; +* dress, n 1) ఆడవారి దుస్తులు 2) దుస్తులు; అంబరములు; +* dress, v. t. దుస్తులు ధరించు; దుస్తులు తొడుగు; +* dressed, n. సాంబరమైన; దుస్తులతోనున్న; సాంబరుఁడు; దిగంబరుఁడు కానివాఁడు; +* dressing, n 1) శోధనం; కట్టు కట్టడం 2) బట్టలు తొడుక్కోవడం; వస్త్రాలంకరణ 3) సంరక్షణ 4) అలంకరణ; కొన్ని తినుభండారాలపై అలంకరణ కోసం వాడే పదార్థం; +salad dressing, ph. పచ్చి కాయగూరల మీద రుచి కొరకు పోసే నూనె, సిరకా మిశ్రమం; +* drift, n 1) గాలికి ఎగిరి మేటలుగా పడ్డ ఇసక కాని, పొడిమంచు కాని 2) తాత్పర్యం; +* drill, n 1) కవాతు; డ్రిల్లు 2) బరమ; బెజ్జం పెట్టే సాధనం 3) మూడు పేటలు వేసిన దారంతో నేసిన గుడ్డ; see also twill; +soft drink, ph. పానీయం; సాధారణంగా సోడా వంటి బుడగలతో ఉన్న పానీయం; +* drip, v. i. కారు; బొట్టు బొట్టుగా కారు; +* drive, n 1) ప్రవణము; చొరవ; స్వయంచోదితంగా పూనుకుని పని చేసే స్వభావం; అభినివేశం 2) వాహనాలు నడపడానికి అనువైన మార్గం ఉ. Marine drive 3) చోది; నడపడానికి వాడే సాధనం; +disk drive, ph. డిస్కు చోది గ్రామఫోను రికార్డు ఆకారంలో ఉండే పళ్లేనిని ఉంచడానికి వాడే సాధనం; ఇది కలనయంత్రాలలో, కఠినాంగాలలో ఉండే భాగం; +printer drive, ph. ముద్రణ చోది; ఇది కలనయంత్రాలలో, కఠినాంగాలలో ఉండే భాగం; +* driver, n. చాలకుడు; చాలకి; యంత; నడపరి; చోదకుడు; చోదరి; చోపరి; చోదాళువు; తోలేవాడు; గమికాడు; ఈరణి సారధి; డ్రైవరు; +* driver, n comp కంప్యూటర్ రంగంలో అనువర్తనానికీ, కఠినాంగానికీ పొంత కలుపుతూ మధ్యవర్తిగా పనిచేసే మృదులాంగ క్రమణిక; +printer driver, ph comp కంప్యూటర్ రంగంలో అనువర్తనానికీ, ముద్రణ కఠినాంగానికీ పొంత కలుపుతూ మధ్యవర్తిగా పనిచేసే మృదులాంగ క్రమణిక; +* drop, n. బిందువు; బొట్టు; చుక్క; బిళ్ల; +tear drop, ph. కన్నీటి బిందువు; కన్నీటిబొట్టు; కన్నీటి చుక్క; అశ్రు బిందువు; అశ్రు కణం; +water drop, ph. నీటిబిందువు; నీటిబొట్టు; నీటిచుక్క; +* drop, v. t 1) దిగబెట్టు; వదలిపెట్టు; దిగవిడుచు; దించు; దింపు 2) వదలివేయు; జారవిడచు; జార్చు; పడవేయు; +dropdown list, ph దిగజారే జాబితా; కంప్యూటర్‍ తెర మీద ఎప్పుడు ఏయే పనులు చెయ్యగలమో చూపించే జాబితా; +dropdown menu, ph దిగజారే ఎంపిక జాబితా; కంప్యూటర్‍ తెర మీద ఒక మాట మీద ఒత్తినప్పుడు ఎప్పుడు ఏయే పనులు చెయ్యగలమో చూపించడానికి కిందకి దిగజారే అంశాల జాబితా; +* dropper, n. ద్రవ పదార్థాలని చుక్కలు చుక్కలుగా రాల్చే గొట్టం; +* drought, n. కరవు; కరువు; అనావృష్టి; వర్షాభావం; దుర్భిక్షం; కాటకం; +* drown, v. t. నీళ్ళల్లో మునిగి చచ్చిపోవు; +orphan drug, ph. అనాధ ఔషధం; అరుదుగా వచ్చే జబ్బులకి కావలసిన మందులు; బడుగు దేశాలలో వచ్చే రోగాలకి కావలసిన మందులు; +patented drug, ఏకస్వ ఔషధం; తయారీకి విశిష్టాధికారం ఉన్న ఔషధం; +drug store, ph. మందులంగడి; మందులాపణి; మందులకొట్టు; మందులషాపు; +* drum, n 1) డప్పు; డోలు; దుందుభి; భేరి; నగారా 2) డబ్బా; పీపా; తొట్టి; +* drunk, adj. ఉన్మత్త; త్రాఁగివున్న; +* drunkard, n. త్రాఁగుబోతు; ఉన్మత్తుఁడు; +* drupe, n. అష్టిఫలం; తొక్క; పీచు; టెంక; జీడి కల పండ్లు; కొబ్బరి కాయలు; మామిడి పండ్లు ఈ జాతికి చెందినవి; +* dry, adj 1) ఎండు; ఎండిన; వాడు; వాడిన; నంజ 2) నిస్సారమయిన 3) మెరక; పుంజ 4) పొడి; ��ొడిగానున్న 5) రుచి లేని; తీపిలేని; +dry ginger, ph. శొంఠి; అల్లాన్ని సున్నపు నీళ్లలో నాన్చి, పిమ్మట ఎండబెట్టగా వచ్చినది; +dry ice, ph. గడ్డకట్టిన బొగ్గుపులుసు గాలి; +* dual, adj. రెంౘ; ద్వైత; ద్వంద్వ; ద్వైదీ; +dual nature, ph ద్వంద్వ ప్రవృత్తి; ద్వైదీభావం; +* duality, n. ద్వైదీభావం; ద్వైవిధ్యత; రెంౘతనం; +* dub, v. t సినిమా ఫిల్ము మీద అసలు శబ్దాన్ని చెరిపేసి దాని స్థానంలో మరొక శబ్దాన్ని ప్రతిక్షేపించడం; +* dubious, adj. అనుమానాస్పదమైన; సందేహాస్పదమైన; నమ్మకం లేని; +* duel, n. ద్వంద్వ యుద్ధం; రెంబోరు (రెంౘ పోరు); +* duet, n. యుగళ గీతం; ఇద్దరు కలసి పాడే పాట; +* duck, v. i. మునుగు; జోరుగా కిందికి వంగు; +* dumb, adj డమ్ 1) మూఁగ; మాటలాడని 2) తెలివి తక్కువ; పస లేని; +* dumbbell, n. ఇటూ, అటూ బుడగలలా ఉండి, మధ్య సన్నంగా ఉన్న ఆకారం గల కసరత్తు చేసే సాధనం; +* dumplings, n. pl కుడుములు; ఉండ్రాళ్లు; పూర్ణం; ఆవిరి మీద ఉడకబెట్టిన పిండి ముద్దలు; +* dune, n. తిన్నె; సైకతం; ఇసుక దిబ్బ; సముద్రపుటొడ్డున ఇసుక తిన్నె; +* dungeon, n. చీకటి కొట్టు; కొట్టు; ఖైదు; +* duodenum, n. ఆంత్రమూలం; ద్వాదశాంగుళం; చిన్నప్రేగు మొదటి భాగం; ఉరమరగా పన్నెండు అంగుళాల పొడుగుంటుంది కనుక దీనికి ఈ పేరు వచ్చింది; +* duopoly, n ద్వంద్వాధిపత్యం; ఇద్దరు వ్యాపారుల మధ్య ఒడంబడిక ద్వారా ఏర్పడ్డ గుత్తాధిపత్యం; +duplex process, ph ద్వంద్వ యోగం; ద్వంద్వ ప్రక్రియ; రెంచాడ్పు (రెంౘ చాడ్పు, చాడ్పు విధానము, process); +full-duplex, పూర్ణద్వంద్వం; ఒకే సమయంలో ఇరువైపుల నుండీ సంభాషించ గలగడం; +half-duplex, అర్ధద్వంద్వం; ఒకే సమయంలో ఒకవైపు నుండీ మాత్రమే సంభాషించ గలగడం; +* dura, n anat డూరా; పుర్రెకి; మెదడుకి మధ్యనుండే కణజాలం; +* durability, n. మన్నిక; ఉఱిది; ఆనిక; దార్ఢ్యం; దృఢత్వం; +* duration, n. తడవు; సేపు; వ్యవధి; కాలపరిమితి; అవస్థితి; వ్యవధానం; కాలావధి; +* Durian, n. ముండ్లపనస; మలయా మొదలయిన ఆగ్నేయ ఆసియా దేశాలలో దొరికే పనసపండుని పోలిన పండు; ఈ పండు వెగటు పుట్టించే అంత తియ్యగా ఉండడం వల్ల అలవాటు లేని వారికి కంపుకొడుతూన్నట్లు అనిపిస్తుంది. +* dusk, n. సంజ చీకటి; సంధ్యాసమయం; కప్పిరి; మునిచీకటి; మునిచీకటి అంటే చీకటిపడడానికి ముందు అని అర్థం; +* dust, n 1) దుమ్ము; ధూళి; దూసరం; రజను; రజస్సు; పరాగం; మలోమలికితం 2) చెత్త; పాంశువు; +cosmic dust, ph. విశ్వ పరాగం; విశ్వపాంశువు; విశ్వ దూసరం +* dust, v. t 1) జల్లు; సముద్ధూళించు; పూయు 2) దుమ్ముని దులుపు note వ్యతిరేకార్థములతో ఉన్న మాట; +dust cover, ph. అట్ట; అట్ట కాగితం; పుస్తకానికి వేసే అట్ట; +* duster, n. తుడుపు గుడ్డ; అలుగ్గుడ్డ +* Dutch, adj. ఒళ��ద; పోర్చుగల్ దేశానికి చెందిన; +Dutch treat, ph ఎవరి ఖర్చులు వారే పెట్టుకుంటూ కలసి భోజనానికి వెళ్లడం; +* duty, n 1) ధర్మం; విధి; విధాయకం; కర్తవ్యం 2) సుంకం; శుల్కం; సరుకుల మీద వేసే పన్ను; ఇది సరుకు విలువలో ఫలానా శాతం అని ఉంటుంది; ఆదాయపు పన్ను బీదవారి మీద తక్కువ శాతంలోనూ, ధనవంతుల మీద ఎక్కువ శాతం లోనూ ఉంటుంది; +civic duty, ph. విధ్యుక్త ధర్మం; విధి చెప్పినట్లు చెయ్యవలసిన పని; +* dwarf, adj. బుడ్డ; చిన్న; పొట్టి; కురచయిన; కుబ్జ; గిడప; గున్న; బొంద; గిరక; +* dwarf, n. పొట్టి; గిడస; మరుగుజ్జు; +white dwarf, ph. శ్వేతకుబ్జం; శ్వేతకుబ్జ తార; ఒక రకం నక్షత్రం; +* dwelling, n. నివాసం; ఇల్లు; అవస్థానము; నెలవు; +* dynamic, adj. చైతన్యవంతమైన; పరిణామశీలమైన; శక్తికి సంబంధించిన; +* dynamics, n 1) చలనం; చైతన్యం 2) చలనశీలశాస్త్రం; గతిశాస్త్రం; ధృతిశాస్త్రం; చలనాలకు సంబంధించిన అధ్యయనం; వస్తువులపై బలములు ప్రసరించినప్పుడు అవి చలనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో విచారించే శాస్త్రం; +* dynamo, n. విద్యుచ్ఛక్తిని పుట్టించే యంత్రం యొక్క పాతబడ్డ పేరు; ఇప్పుడు ఎక్కువ వాడుకలో లేదు; +* dynasty, n. రాజవంశం; వంశం; రాజవంశ పరంపర; ఱేఁటివంగడం (రాజు(ప్రకృతి ఱేఁడు(వికృతి వంశం(ప్రకృతి వంగడం(వికృతి +* dysentery, n డిసెంటరీ) గ్రహణి; రక్త విరేచనాలు; జిగట విరేచనాలు; బంక విరేచనాలు; అతిసారం; పాచనాలు; +* dyspepsia, n. అజీర్ణం; మందాగ్ని; అగ్నిమాంద్యం; +* dysphoria, n. మనస్సులో చెప్పుకోలేని బాధ; + + +E, e, symbol (1) ఇంగ్లీషు వర్ణమాలలో అయిదవ అక్షరం 2) ఒక విటమిన్ పేరు; +* each, adj. ప్రతిఒకటి; ప్రతిఒకరు; ప్రతిఒక; తలా; తలా ఒక; చెరి; +* ear, n 1 చెవి కర్ణం; వీను; జునుగు 2) పొత్తు; కంకి; వెన్ను; బీజమంజరి; +ear of corn, ph. మొక్కజొన్న పొత్తు; జొన్న కంకి; +ear canal, ph. కర్ణ రంధ్రం; శ్రవణ కుహరం; శ్రవణ రంధ్రం; +ear rings, n. pl. కర్ణభూషణాలు; కుండలాలు; పోగులు; కమ్మలు; +* earlier, adj. మునపటి; మునుపు; లోగటి; తొల్లి; తొలి; తొలినాటి; +* early, adv. పెందలకడనే; మొదట; పెందరాళే; వేగిరం; +* Earth, n భూమి భూగోళం; భువి; ధర; ధరణి; పృథ్వి; ప్రపంచం; అవని; అవనీ మండలం; +* earthenware, n. కుండలు; మట్టితో చేసిన సామాను; మృణ్మయ సామగ్రి; చిళ్ళ; +* ease, n. సౌలభ్యం; సుఖం; సుళువు; అవలీల; +* easel, n. ఫలకం; రాత ఫలకం; ముక్కాలి ఫలకం; చిత్రఫలకం; +* easily, adv. తేలికగా; సులభంగా; చలాగ్గా; సుళువుగా; సునాయాసంగా; తేరగా; +* East, n. తూర్పు; ప్రాచ్యం; సూర్యుడు దూరి వచ్చే దిక్కు; +* easterly, adj. తూర్పు నుండి వచ్చెడు; తూర్పున ఉన్న; +* eastward, adv. పూర్వాభిముఖంగా; తూర్పువైపు; +* easily, adv. తేలికగా; సులభంగా; చులాగ్గా; ���ేరగా; +* easy, adj. తేలికయిన; సులభమయిన; చులాకయిన; సుళువైన; +* eat, v. i. తిను; భుజించు; ఆస్వాదించు; కుడుచు; మెసవు; సాపడు; ఎంగిలిపడు; +* eatable, n. తినుభండారం; తినడానికి వీలయినది; +* eaves, n. చూరు; వాచూరు; పెణక; చేతికి అందొచ్చే ప్రదేశం దగ్గర ఉన్న ఇంటి కప్పు; +* eavesdrop, n. చూరు చెంత చేరి వినడం; చాటుగా వినడం; చూచాయగా వినడం; +* ebony, n తుమికి కర్ర; తుమికి చెట్టు; తుమిద; నల్లచేవ; కోవిదారు; తిందుక వృక్షం; ఈ చెట్టుకర్ర నల్లగా ఉంటుంది Note ఈ చెట్టుని తునికి చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టుకి బీడీఆకు చెట్టు అనే పేరు ఉంది bot Diospyros melanoxylon Diospyros glutimosa Rex Embryopteris glutinofera Linn; +* eccentricity, n. చాదస్తం; పిచ్చి; విపరీత మనస్తత్వం; వైపరీత్యం; అసాధారణత; +* ecdysis, n. కుబుసం విడచుట; బాహ్యకవచ నిర్మోచనం; +* echo, n ఎకో) ప్రతిధ్వని; ప్రతిఘోష; అనునాదం; +* echo, v. i ఎకో) ప్రతిధ్వనించు; పిక్కటిల్లు; +* echo, v. t comp కీఫలకం మీద కొట్టినది తెర మీద కనిపించేలా చేయు; +* eclectic, adj. విశిష్టమైన; నాణ్యమైన రకరకాలతో; +eclipsing variables, ph. గ్రహణకారక తారలు; ఒక తార చుట్టూ మరొక తార ప్రదక్షిణం చేస్తూ ఒకదానిని మరొకటి అడ్డుకునే చుక్కలు; +* Eclipta alba, n bot గుంటకలగర గుంటగలగర; భృంగ; భృంగరాజ; నీటి కాలువలు, గుంటల పక్కన, తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంటగలిజేరు. గుత్తులుగా ఉన్న తెల్లని చిన్న పూలను పూస్తుంది. +* ecliptic, n astro క్రాంతివృత్తం; రవిమార్గం; దాక్షాయణీ చక్రం; భచక్రం; ఆకాశంలో సూర్యుడు పయనించే ఊహామార్గం; భూమి నుండి చూసినప్పుడు సూర్యుడు ప్రయాణం చేస్తూన్నట్లు కనబడే మహావృత్తం +pole of the ecliptic, ph. కదంబం; రవి మార్గపు అక్షం ఆకాశాన్ని తాకే ఊహాబిందువు; +* ecology, n. భూగృహశాస్త్రం; ఆవరణశాస్త్రం; జీవావరణశాస్త్రం; ఆశ్రమ శాస్త్రం; జీవులు నివసించే ప్రదేశాల గురించి విచారించే శాస్త్రం Gr. oikos family +* economic, adj. ఆర్థిక; అర్థశా సంబంధమయిన; లాభసాటి; +* economical, adj. పొదుపైన; పోడిమి అయిన; మితవ్యయ సంబంధమైన; దుబారా చెయ్యని; +* economics, n. ఆర్థిక శాస్త్రం; అర్థశాస్త్రం; +* economize, v. t. పొదుపుచేయు; మితవ్యయం చేయు; పోడిమిగా జరుపుకొను; +* economy, n 1) ఆర్థిక పరిస్థితి 2) పొదుపు; మితవ్యయం 3) సంక్షిప్తత; క్లుప్తత; లాఘవం; +* ecstasy, n. మహదానందం; దివ్యానుభూతి; పరవశత; ఆనందంతో పరవశించడం; +* ecstatic, adj. ఆనందభరితమైన; పరవశమైన; మైమరచిన; +* ectomorph, n. బక్కపలచని వ్యక్తి; సన్నటి శరీరం గల వ్యక్తి; పొడుగాటి కాళ్ళు చేతులు, సన్నటి కాళ్ళు, చేతులు, ఛాతీ, భుజస్కందాలు ఉన్న శరీరతత్వం; +* ectoparasite, n bio బాహ్య పరాన్నజీవి; బాహ్య పరాన్నభుక్కి; +* Eden, n నందనవనం; బైబిల్ లో ఏడం అనే వ్యక్తి ఈవ్ అనే అమ్మాయితో ఇటువంటి తోటలో ఉంటాడు; +* edge, n. అంచు; మొన; గట్టు; ఉపాంతం; కోటి; వోర; ధార; కొంగు; చెరగు; అంచలం; +* edible, adj. భోజ్య; ఆస్వాదనీయ; తినదగిన; భక్షించదగిన’ ఖాద్యమైన; ఖాదీ; +* edible, n. భోజ్యం; భోజ్యపదార్థం; భోక్తవ్యం; ఆస్వాదనీయం; ఆభ్యవహారికం; తినదగిన; తినడానికి వీలయినది; భక్షించదగిన’ ఖాద్యమైనది; ఖాదీ; +* edifice, n. దివ్యభవనం; భవంతి; కట్టడం; దొడ్డ ఇల్లు; +* edit, v. t. సరిదిద్దు; కూర్చు; గ్రంథాన్ని కాని, సినిమాని కాని కూర్చు; +* editing, n. కూర్పు; కూర్చడం; సవరించడం; అచ్చు వెయ్యడానికి గ్రంథముని సవరించడం; విడుదల అయేముందు సినిమా భాగాలని కూర్చి కథ నడిచే తీరుని తీర్చి దిద్దడం; +* edition, n. కూర్పు; ముద్రణకై చేసిన కూర్పు; +managing editor, ph. నిర్వాహక సంపాదకుడు; నిర్వాహక పరిష్కర్త; +* educate, v. t. విద్యనేర్పు; విద్యాబుద్ధులు గరుపు; చదివించు; +* educated, adj. విద్యనేర్చిన; చదువుకున్న; +* education, n. విద్య; చదువు; చదువు సంధ్యలు; శిక్ష; శిక్షా విధానం; +* educator, n. m. అధ్యాపకుడు; విద్య నేర్పువాడు; విద్య నేర్పే వ్యక్తి; +* eel, n. పాములా ఉండే చేప; మలుగు చేప; బుక్కడం; కొమ్ముచేప; గడ్డిపాము; దుండు పాము; పాపమీను; తవుటిపాము; +* effective, adj. సఫలమైన; సార్థకమైన; ఉపయోగపడే; ప్రభావశీల; +* effigy, n. మనిషి ఆకారంలో బొమ్మ; ప్రతిమ; పటం; +* effluent, adj. బయటకు వచ్చే; ఉత్పన్నమైన; నిర్గతమైన; నిసృతమైన; +* effluent, n. మురికి; మురికి జలం; బయటకు పోయే మురికి ద్రవం; +* effort, n. కృషి; పరిశ్రమ; యత్నం; ప్రయత్నం; పురుష ప్రయత్నం; పౌరుషం; ఎత్తికోలు; గురణం; ఉద్యతి; ఉద్యోగము; పూనిక; +* effortless, adj. అయత్న; అప్రయత్న; యత్నరహిత; కృషిమాలిన; సహజ; +* effortlessly, adv. సునాయాసంగా; అనాయాసంగా; అవలీలగా; అప్రయత్నంగా; +* effulgent, adj. దేదీప్యమానమైన; కాంతివంతమైన +* ego, n. అహం; అహంకారం; దాష్టికం; గర్వం; ఆస్మితం; తిమురు; +* egotism, n. అహంభావం; దురభిమానం; దాష్టికం; +* egregious, adj. అతిశయించిన; శృతిమించిన; మితిమీరిన; +* egress, n 1) బయటకుపోయే దారి 2) బయటకి వెళ్లడం; +* eight, n. ఎనిమిది; ఇరునాలుగు; అష్టకం; +* eighteen, n. పద్ధెనిమిది; పదునెనిమిది; అష్టాదశం; +* eighth, n 1) ఎనిమిదవది; అష్టమం 2) ఎనిమిదవ వంతు; +* either, pron. ఇదైనా, అదిఅనా; రెండింటిలో ఒకటి; +* eke, v. i. చాలీచాలని వనరులతో సర్దుబాటు చేసుకొను; +* elaboration, n 1) విపులీకరణ; విశదీకరణ 2) నెరవిలి; సంగీతంలో ఒక రాగాన్ని పలువిధములుగా నెరవిలి చేసి పాడడం; రాగం, తానం, నెరవిలి, కల్పనస్వరం, పల్లవి అనే భాగాలు సంగీత కచేరీలో తప్పనిసరి అంశాలు; +* elapsed, adj. గడచిన; భు���్తి అయిన; అతిక్రమించిన; +* elastic, adj. ప్రత్యాస్థ; స్థితిస్థాపక గుణం కల; +* ejaculate, v. i. వెలిగక్కు; స్కలించు; వీర్యమును జార్చు; +* elaborate, v. i. వివరించు; విస్తరించు; విశదీకరించు; విడమర్చి చెప్పు; +* elasticity, n. ప్రత్యాస్థత; స్థితిస్థాపకత; +* elder, adj. పెద్ద; కుల పెద్ద; జ్యేష్ఠుడు; +* elderly, n. పెద్దవారు; వయోధికులు; వృద్ధులు; +* elders, n 1) పెద్దవారు; గరువలు 2) వయోధికులు; వృద్ధులు; +electric spark, ph. విద్యుత్ చెణుకు; విద్యుత్ విస్ఫులింగం; +* electrode, n. విద్యుద్ధండం; విద్యుత్‌పాళా; +* electrodynamics, n. విద్యుత్ చలనం; విద్యుత్ గతిశాస్త్రం; +* electromagnet, n. విద్యుదయస్కాంతం; విద్యుత్ చుంబకం; +* electron, n ఎలక్ట్రాను; అణువులో కెంద్రకం చుట్టూ పరిభ్రమించే రుణావేశపు మేఘం; +electrostatic precipitator, ph. స్థిరవిద్యుత్‌ అవక్షేపకి; వాయువుల నుండి దుమ్ము, ధూళి, కల్మషాలు, వగైరాలని వడబోసి, విడదీసే పరికరం; +* electuary, n. లేహ్యం; తేనెతో కాని, మరేదయినా తీపి పదార్థంతో కాని కలిపిన మందు; +* elegy, n. సంస్మరణగీతం; శోకగీతిక; ఎలిజీ; +formed element, ph. సాకార ధాతువు; రక్తంలో కనిపించే ఆకారం ఉన్న ధాతువులు; +formless element, ph. నిరాకార ధాతువు; రక్తంలో ఉండే ఆకారం లేని ధాతువులు; +* elephant, n. ఏనుగు; కరి; కరటి; దంతి; గజము; సామజం; కుంజరం; ద్విరదం; మాతంగం; వేదండం; నాగం; +* elevate, v. t. లేవనెత్తు; పైకెత్తు; వృద్ధిలోనికి తెచ్చు; +* elevated, adj. పైకి ఎత్తిన; ఉన్నతమైన; ఘనమైన; సముక్షిప్త; +* elevator, n. సముక్షిప్తి; పైకి లేవనెత్తేది; +* eleven, n. పదకొండు; పదునొకటి; ఏకాదశం; +* elicit, v. t. రాబట్టు; పీకు; లోపలి నుండి పైకి లాగు; +* elision, n ling శబ్ద లోపం; ఒక మాటని ఉచ్చరించేటప్పుడు అన్ని అక్షరాలని పలకకుండా మింగేయడం; ఇంగ్లీషులో అయితే have not కి బదులు haven't అనడం, going to కి బదులు gonna అనడం వంటివి; +* elite, n. pl. శిష్టులు; శిష్టజనులు; విద్య వల్ల కాని, ధనం వల్ల కాని సంఘంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు; +* ellipse, n 1) దీర్ఘవృత్తం 2) శబ్దలోపం; వాక్యలోపం; +* ellipsis, n. అధ్యాహారం; వాక్యాన్ని మధ్యలో ఆపేసినప్పుడు, ఆ తర్వాత పెట్టే చుక్కలు; +* else, adv. లేకుంటే; లేకపోతే; కాకుంటే; కాకపోతే; +* elucidate, v. t. విశదీకరించు; విశదపరచు; వివరించు; తేటపరచు; +* elude, v. t. తప్పించుకొను; ఏమార్చు; అర్ధం కాకుండా తప్పించుకొని పోవు; అందుబాటులో లేకుండా పోవు; +* emaciated, adj. కృశించిన; బాగా చిక్కిన; బాగా నీరసపడిన; ఎండిపోయిన; +* emancipation, n 1) విమోచన; దాస్య శృంఖలాల నుండి విముక్తి 2) విముక్తి; ఆపవర్గం; +* embark, v. t 1) ఎక్కు; ఓడ ఎక్కు 2) ప్రారంభించు; మొదలు పెట్టు; +* embassy, n. దౌత్యాలయం; రాయబారి కార్యాలయం; +* embed, v. t. పొదుగు; ���ాపడం చేయు; సంస్తరించు; +* embedded, adj. సంస్తరిత; పొదుగబడ్డ; తాపడం చేయబడ్డ; +* embedding, n. సంస్తరించడం; పొదుగడం; తాపడం చేయ్యడం; +* ember, n. కణకణలాడే నిప్పు బొగ్గు; +* embers, n. pl. నివురు; కాలే బొగ్గులపై నుసి; మంట మండడం అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిపోయిన వేడి వేడి అవశేషాలు; +* embezzled, adj. అపహరించిన; తినేసిన; స్వామిద్రోహం చేసి దొంగిలించిన; +* Emblic myrobalan, n bot పెద్ద ఉసిరి; అమలకం ety ఎంబ్లికా అన్న మాటకి మూలం సంసృతంలోని ఆమ్లం; +* Emblica officinalis, n bot పెద్ద ఉసిరి; అమలకం ety అఫిసినేలిస్ అంటే ఉపయోగపడేదీ, దుకాణాలలో దొరికేదీ అని అర్థం; +* embodied, adj మూర్తీకరించిన; మూర్తించిన; దేహి అయిన; +* embrace, v. t. ఆశ్లేషించు; ఆలింగన చేయు; కౌగలించు; +* embroidery, n. బుట్టా; బుటేదారీ; బట్ట మీద పువ్వులు వేసి కుట్టడం; +* embryo, n ఎంబ్రయో) పిండం; అంకురం; భ్రూణం; అర్భకం; కలలం; 5 వ వారం నుండి 10 వ వారం వరకు కడుపులో పిల్ల; +* emergence, n. వెలువరింత; ప్రాదుర్భావం; జననం; ఉత్పన్నత; +emergency ward, ph. ఆత్యయిక వైద్యశాల; ఆపద్ధర్మ వైద్యశాల; సంకటశాల; +* emergency, n. అత్యవసరం; సంకటకాలం; ఆత్యయిక పరిస్థితి; +* emeritus professor, ph. గౌరవ ఆచార్యుడు; వానప్రస్థ ఆచార్యుడు; మాజీ ఆచార్యుడు; +* emetic, n. వమనకారి; వాంతిని కలుగచేసే మందు; +* emia, suff. ఒక ఇంగ్లీషు మాట చివర ఈ ప్రత్యయం వస్తే, ఆ మాట రక్త దోషాన్ని సూచిస్తుంది; ఉదా ఎనీమియా; లుకీమియా, మొ॥ +* emigrant, n. ప్రోషితుడు; ఇతర దేశాలకి వలస పోయిన వ్యక్తి; +* emigrate, v. i. వలస పోవు; ఒకరు తామున్న దేశాన్ని వదలి పెట్టి మరొక దేశానికి వలస పోవడం; +* emission, n. ఉద్గమం; ఉద్గమనం; ఉద్గతం; ఉద్గారం; త్రేనుపు; కక్కు; +* emit, v. i. ఉద్గారించు; బయటకు పంపు; వెలిగక్కు; వెల్వరించు; వెలార్చు; +* emmet, n. చీమ; పిపీలికం; ఇది ఇంగ్లండులో వాడుకలో ఉన్న ఒక ప్రాంతీయ పదం; +* emotion, n. ఉద్రేకం; ఉద్వేగం; ఆవేశం; ఆర్తి; భావోద్వేగం; భావావేశం; +* emotional, adj. ఉద్రేకపూరిత; ఉద్వేగాత్మక; ఉద్వేగవంత; +* emote, v. i. నటించు; ఆవేశంతో నటించు; అతిగా నటించు; +* empathy, n. సహానుభూతి; మరొక వ్యక్తి ఆలోచనలతోటీ, సంవేదనలతోటీ, అనుభూతులతోటీ ఏకత్వం చెందటం; +* emperor, n. m. సమ్రాట్టు; చక్రవర్తి; సార్వభౌముడు; రారాజు; +* empirical, adj. ప్రయోగసిద్ధ; అనుభవోత్పన్నమైన; అనుభావిక; అనుభవ; పామర; సాంఖ్య; +* employee, n. ఉద్యోగి; ఉద్యోగస్థుడు; పని చేసేవాడు; జీతగాడు; కొలువరి; +* employer, n. నియోగి; యజమాని; పని ఇచ్చేవాడు; +* empowerment, n. అధికారాన్ని ఇవ్వడం; పెత్తనాన్ని ఇవ్వడం; +* empty, adj. ఖాళీ; లొటారం; రిక్త; రిత్త; ఉత్త; శూన్య; +* empty, n. ఖాళీ; లొటారం; రిక్తం; శూన్యం; లేబరం; +* emulation, n 1) అహంపూర్వికం; ఇతరులతో సమానత్వం, ఆధిక్యత, సాధించటానికి చేసే ప్రయత్నం 2) అనుకరణం; ఒక కలనయంత్రం మీద మరొక కలనయంత్రపు స్వభావాన్ని ప్రతిసృష్టి చెయ్యటం; +* enamel, n 1) పింగాణి 2) దంతిక; పంటిపై నిగనిగలాడే తెల్లటి పదార్థం; +* en bloc, n ఆన్ బ్లాక్) మూకుమ్మడిగా; +* enchanted, adj. అభిమంత్రించబడ్డ; మంత్రానికి కట్టుబడ్డ; మంత్రముగ్ధుడైన; ఉల్లసించిన; ఆనందభరితుడైన; +* encircle, v. t. చుట్టుముట్టు; చుట్టుకొను; పరివేష్టించు; +* enclosure, n 1) ప్రావృతం; ప్రావృత పత్రం; కవరులో పెట్టిన ఉత్తరం 2) ప్రాంగణం; ప్రావృత ప్రదేశం; +* encompass, v. t. ఆవరించు; చుట్టుకొను; పరివేష్టించు; +* encounter, n 1) తారసం; తటస్థపాటు; అనుకోని సమావేశం 2) సంఘర్షణ; కొట్లాట; +* encounter, v. i. తారసపడు; కలుసుకొను; తటస్థపడు; దాపరించు; +* encourage, v. t. ప్రోత్సహించు; పురికొలుపు; ప్రేరేపించు; +* encroachment, n. కబ్జా; ఇతరుల లేదా ప్రభుత్వ స్థలాన్ని అనుమతి లేకుండా ఆక్రమించటం; +* encrypt, v. t. గుప్తీకరించు; రహశ్యలిపిలో రాయు; +* encyclopedia, n. విజ్ఞాన సర్వస్వం; సర్వశాస్త్ర సముచ్చయం; +* end, v. t. పూర్తిచేయు; కోసముట్టించు; ముగించు; +* end, n 1) అంతు; చివర; కొస; కొన; తుద; ముగింపు 2) మరణం; చావు; +endemic disease, ph. ప్రాంతీయ వ్యాధి; స్థానీయ వ్యాధి; ఒక ప్రాంతంలో పాతుకుపోయిన వ్యాధి; ఏజెంసీ ప్రాంతాలలో మలేరియా ఒక "ప్రాంతీయ వ్యాధి +endocrine glands, ph. వినాళ గ్రంథులు; అంతరస్రావ గ్రంథులు; +* endogamy, n. అంతర్వివాహం; సజాతిలోనే పెళ్ళి చేసుకొనుట; +* endorse, v. t 1) సమర్ధించు; బలపరచు 2) బేంకు కాగితం మీద సంతకం పెట్టు; +* endow, v. t. ఇచ్చు; దానమిచ్చు; వరమిచ్చు; +* endowment, n. ధర్మాదాయం; మాన్యం; శాశ్వత నిధి; శాశ్వతంగా ఆదాయాన్ని ఇచ్చే నిధి; +* endurance, n. తాలిమి; దమ్ము; సహనం; సహనశక్తి; ఓర్మి; ఓర్పు; ఓరిమి; నిభాయింపు; తాళుకం; సహిష్ణుత; +* enemy, n. శత్రువు; వైరి; విరోధి; పగవాడు; పగతుడు; మిత్తి; అరి; పరిపంధి; అరాతి; విపక్ష; జిఘాంసువు; అహితుడు; +kinetic energy, ph. గతిజ శక్తి; గతి శక్తి; కదలిక వల్ల సంక్రమించే శక్తి; +potential energy, ph. స్థితిజ శక్తి; స్థితి శక్తి; స్థాన శక్తి; గుప్త శక్తి; బీజరూప శక్తి; స్థానం వల్ల సంక్రమించే శక్తి; +* engagement, n 1) యుద్ధం 2) ప్రధానం; పెళ్ళి చేసుకుందామనే ఒడంబడిక note) ఒకే మాటకి రెండు వ్యతిరేకార్ధాలు ఉన్న సందర్భం ఇది; +* engineer, n. స్థపతి; యంత్రధారి; యంత్రధారకుడు; యంత్రకారుడు; మరకాను; మరగారి; బిసగారి; +* engineering, n. స్థాపత్యం; స్థాపత్యశాస్త్రం; తంత్రం; బిసగారం; బిసకానికం; కీల్కానికం; మరకానకం; +sound engineer, ph. ధ్వని స్థపతి; ధ్వని తంత్రవేత్త; ధ్వని తాంత్రికుడు; +* English, n 1) ఆంగ్లం; ఇంగ్లీషు 2) ఇంగిలీసులు; ఆంగ్లేయులు; +* Englishman, n. ఆంగ్లేయుడు; ఇంగ్లీషువాడు; ఇంగ్లండుకి చెందినవాడు note) బ్రిటిష్ వాళ్లు అంతా ఇంగ్లీషు వాళ్లు కాదు; +* engraver, n. పోగర; కంసాలి చెక్కడానికి వాడే పరికరం; +* enigma, n. ప్రహేళిక; పజిలు; పజిల్; తలబీకరకాయ; కైపదం; చిక్కు సమస్య; కుమ్ముసుద్దు; బురక్రి బుద్ధిచెప్పే సమస్య; మెదడుకి మేతవేసే మొండి సమస్య; +* enhance, v. t. అతిశయింపచేయు; పొడిగించు; పెంచు; అభివృద్ధి చేయు; మెరుగు పరచు; +* enjambment, n. ఒక వాక్యం కాని, సమాసం కాని, పద్యంలో ఒక పాదం నుండి తరువాతి పాదంలోనికి పదాంతంలో విరగకుండా ప్రవహించడం; +* enjoyment, n. అనుభుక్తి; అనుభూతి; అనుభోగం; ఆహ్లాదం; సంతోషం; +* en mass, adv ఆన్ మాస్) మూకుమ్మడిగా; ఓహరిసాహరిగా; ఆలండవలత్తు; ఒక్కుమ్మడి; +* enmity, n. వైరం; విరోధత్వం; శత్రుత్వం; వైషమ్యం; కంటు; పగ; పోరు; మచ్చరం; విప్రతిపత్తి; +not enough, ph. చాలదు; చాలలేదు; సరిపోలేదు; చాలవు; +* enquire, v. i. విచారణ చేయు; దర్యాప్తు చేయు; వాకబు చేయు; అడుగు; కనుక్కొను; +* enquiry, n. ప్రశ్నించడం; విచారణ; పృచ్ఛ; వాకబు; చర్చిక; దర్యాప్తు; ఆనుయోగం; ప్రశ్నించడం; +* enroll, v. t. చేర్చు; జాబితాలో వేయు; నమోదు చేయు; లావణములో చేర్చు; +* enter, v. i. ప్రవేశించు; చొరబడు; చొచ్చు; చొచ్చుకొనిపోవు; తూకొను; దూరు; లోనికి వెళ్లు; +* enteritis, n. ఆంత్రశోఫ; ఆంత్రప్రకోపం; పేగుల వాపు; +* enthusiasm, n. ఆసక్తి; ఉత్సాహం; ఉత్సుకత; ఔత్సుక్యం; అభినివేశం; వీరావేశం; +* entice, v. i. వలలో వేసికొను; ఆశ చూపి వంచించు; పుసలాయించు; నయనవంచన చేయు; +* entire, adj. యావత్తూ; అంతా; సాంతం; పూర్తి; సాకల్య; అఖిల; అశేష; +* entirely, adv. సాంగోపాంగంగా; సాంతంగా; పూర్తిగా; సాకల్యంగా; అశేషంగా; +* entitlement, n. హక్కు; అధికారం; లాంఛనంగా రావలసినది; లాంఛనం; ముట్టవలసినది; +* entry, n 1) ప్రవేశం 2) దఖలు; పుస్తకంలో రాసుకునే పద్దు 3) ఆరోపం; జాబితాలో వేసుకునేది; +* entwine, v. i చుట్టుకొను; పెనవే్సుకొను; మెలివేసుకొను; +* enunciate, v. t. ప్రవచించు; ప్రకటించు; ప్రచురించు; +* envelope, n ఆన్‌వొలోప్) సంచి; ఉత్తరాన్ని పెట్టడానికి వాడే సంచి; కవరు; లిఫాఫా; +* envelope, v. t. చుట్టుముట్టు; కప్పు; మరుగు పరచు; +* enviable, adj. ఈర్ష్యపడదగ్గ; ఈర్ష్య పొందదగిన; +* environment, n. పర్యావరణం; పరిసరప్రాంతాలు; +* ephemeral, adj. బుద్బుదప్రాయమైన; అల్పాయుష్షుతో; తాత్కాలికమైన; క్షణికమైన; అశాశ్వతమైన, నశ్వరమైన; క్షణిక; క్షణభంగుర; +* ephemeris, n. పంచాంగం; గంటల పంచాగం; నభోమూర్తులు ఆకాశంలో ఇప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కనబడతాయో సూచించే పంచాంగం; +* epic, n. ఇతిహాసం; పురాణం; మహ���కావ్యం; వీరగాథ; +* epicurean, adj భోగపరాయణ; విలాసభరిత; భోగలాలస; భోజనప్రియ; +* epidermis, n. ప్రభాసిని; బహిస్తరం చర్మం యొక్క పైపొర; +* epiglottis, n. పలక; తిన్న తిండి శ్వాస నాళికలోకి వెళ్లకుండా అడ్డుకునే చిన్న పలక ety epi మీద; glottis నాలుక కనుక epiglottis నాలుక మీద ఉన్నది అని అర్థం వస్తుంది. నోరు తెరిస్తే నాలుక మీద కనిపించేది కొండనాలుక (uvula కనుక కొందరు epiglottis అన్న మాటని కొండనాలుక అని అనువదించేరు, కాని అలా అనువదించడం తప్పు; uvula ఘంటిక; చిరునాలుక; కొండనాలుక; అంగిటిముల్లు; ఉపజిహ్విక; +* epilepsy, n. అపస్మారం; మూర్ఛ; సొలిమిడి; సొమ్మ; కాకిసొమ్మ; +* epilogue, n. భరతవాక్యం; తుదిపలుకు; ఆఖరి మాట; +* episode, n. ఉదంతం; ఉపాఖ్యానం; ఉప కథ; కథాంగం; సంఘటన; +* epistemology, n. జ్ఞానాన్వేషణ; జ్ఞానాన్వేషణ పద్ధతి; జ్ఞాన సాధన సామగ్రి శాస్త్రము; జ్ఞానమీమాంస; +* epitaph, n. స్మృత్యంజలి; చరమశ్లోకం; +* epithelium, n. శరీరంలో తారసపడే నాలుగు రకాల కణరాశులలో ఇది ఒకటి; శరీరపు అంగాలని కప్పిపుచ్చే పలచటి పొరలా ఉంటుంది; మిగిలిన మూడు నాడీ తంతులలోను, కండరాలలోను, నరాల లోను కనిపిస్తాయి; +* epithet, n. మారుపేరు; వర్ణనాత్మకమైన మరోపేరు; +* epitome, n ఎపిటమీ) సారాంశం; సంగ్రహం; +* equal, n. సమానం; సమం; సరి సమానం; సాటి; సదృశం; సరి; ఈడు; జోడు; జత; ప్రాయం; +* equality, n. సమానత; సమానత్వం; సమత; సామ్యం; సదృశం; సమీకరణం; తౌల్యం; +* equanimity, n. స్థితప్రజ్ఞ; సమభావం; కష్టసుఖాలని సమభావంతో ఎదుర్కొన గలిగే నిబ్బరం; +* equilibrium, n. నిశ్చలత; సమతౌల్యత; సమస్థితి; సమతాస్థితి; సరితూకం; +* equipment, n. pl. సరంజామా; సంభారాలు; సంపత్తి; పరికరావళి; సాధనసామగ్రి; సామగ్రి; +* equinox, n. విషువత్తు; విషువం; సూర్యుడు భూమధ్య తలాన్ని దాటే సమయం lit equi సమానమైన, nox రాత్రులు; ఈ రోజున రాత్రి, పగలు సమానమైన పొడుగు ఉంటాయి; +autumnal equinox, ph. శరద్ విషువత్తు; సూర్యుడు కన్యా రాసి నుండి తుల లోకి జరిగే సమయం; సెప్టెంబరు 23వ తేదీ; దక్షిణాయనం మొదలు; +spring equinox, ph. వసంత విషువత్తు; వసంత సంపాతం; సూర్యుడు మీన రాసి నుండి మేషం లోకి జరిగే సమయం; మహా విషువం; మార్చి 21 వ తేదీ; ఉత్తరాయణం మొదలు; +vernal equinox, ph. వసంత విషువత్తు; వసంత సంపాతం; సూర్యుడు మీన రాసి నుండి మేషం లోకి జరిగే సమయం; మహా విషువం; మార్చి 21 వ తేదీ; ఉత్తరాయణం మొదలు; +* equable, adj సరిసమానంగా; సమతుల్యంగా; +equitable distribution of wealth, ph. న్యాయంగా పంపిణీ జరిగిన ఆస్తి; అందరికీ సమానంగా ఇచ్చినది కాదు, ఎవ్వరికి డబ్బు ఎక్కువ అవసరం ఉందో వారికి ఎక్కువ ఇవ్వడం న్యాయం కదా! +* equity, n 1) న్యాయం; నిష్పక్షపాతం 2) నికరమైన రొక్కపు వి���ువ; ఒక ఆస్తి యొక్క బజారు విలువలో అప్పులు పోను నికరంగా చేతికి వచ్చే డబ్బు విలువ; +* equivalent, adj. తుల్యమైన; తత్తుల్యం; సమతుల్యమైన; తత్సమమైన; సమానార్థక; ప్రాయం; +* equivocal, adj. సంధిగ్ధ; అనిశ్చిత; అస్పష్ట; రెండు పక్కలా పలకడం; +* equivocate, n. సంధిగ్ధంగా మాట్లాడడం; గోడమీద పిల్లిలా మాట్లాడడం; తుని తగవు తీర్చినట్లు మాట్లాడడం; +* er, suff. అరి doer maker; ఇంగ్లీషులోని క్రియావాచకాన్ని నామవాచకంగా మార్చే ఉత్తర ప్రత్యయం; +Common era, ph. సాధారణ శకం; క్రీస్తు శకానికే మరోపేరు; +* eradicate, v. t. నిర్మూలించు; రూపుమాపు; ఉత్పాటించు; +* eradicated, n. నిర్మూలించబడినది; ఉత్పాటితం; రూపుమాపబడినది; +* eradication, n. నిర్మూలన; ఉత్పాటనం; రూపుమాపడం; పెరికివేయడం; +* erection, n 1) కట్టడం; నిర్మాణం 2) అంగస్తంభన; రిక్కింపు; పురుషుని లింగం గట్టిపడి నిటారుగా నిలబడడం; +* erosion, n. కోత; కృశింపు; నశింపు; క్రమక్షయం; +* errand, n. ప్రాతివేశం; చిన్న చిన్న పనులు చెయ్యడానికి వెళ్లే తిరుగుడు; +errand boy, ph. పనులు చెయ్యడానికి తిరిగే కుర్రాడు; +* error, n 1) తప్పు; పొరపాటు; తప్పిదం; స్ఖాలిత్యం 2) లోపం; లొసుగు; దోషం; +error correction, ph దోష పరిహరణం; దోష పరిహారం; లోపమును సవరించుట; దోషమును దిద్దుట; ప్రాయశ్చిత్తం; +* erythema, n. కందడం; చలితం; ఎలర్జీ వంటి ఒక చర్మ వ్యాధి; +* erythrocytes, n. ఎరక్రణాలు; రక్తంలో ఉండే ఒక రకం కణాలు; +escape velocity, ph. పలాయన వేగం; ఒక ఖగోళం యొక్క ఆకర్షణ శక్తిని తప్పించుకుని వెళ్ళడానికి కావలసిన వేగం; +* escort, v. t. దిగబెట్టు; తోడు వెళ్లు; సాయం వెళ్లు; +* espionage, n. గూఢచర్యం; వేగు; బాతిమ; చారచక్షుత; +* essence, n. సారం; సారాంశం; పస; పసరు; అంతస్సారం; +essential amino acids, ph. ఆవశ్యక నవామ్లాలు; ఇక్కడ essential అనే మాటకి "ఆరోగ్యానికి అత్యవసరమైన" అని అర్థం; +essential fatty acids, ph. ఆవశ్యక ఘృతికామ్లములు; ఇక్కడ essential అనే మాటకి "ఆరోగ్యానికి అత్యవసరమైన" అని అర్థం; +essential oils, ph. పుష్పసారములు; సారభూత తైలాలు; సుగంధ తైలాలు; అత్తరులు; ధృతులు; స్థిర తైలాలు; ఒక మొక్కకి తనదంటూ ఒక ప్రత్యేకమైన శీలాన్ని ఇచ్చే తైలం; ఇక్కడ essential అనే మాట essence నుండి వచ్చింది; ఈ తైలాలు తీయడానికి సాధారణంగా వేడి ఆవిరిని ఉపయోగిస్తారు; see also cold pressed oils; +* establish, v. t 1) నిర్ణయించు; నిర్ధారించు; నిర్ధారణ చేయు 2) స్థాపించు; నెలకొల్పు; నిర్మించు; +* established, adj. నిర్ణయించబడ్డ; స్థాపించబడ్డ; నెలకొన్న; సుస్థాపిత; పరినిష్టితమైన; పాతుకుపోయిన; +* ester, n. విస్పరి; ఆల్కహాలు; ఆమ్లము సంయోగం చెందగా వచ్చిన లవణం వంటి పదార్థం; +* esthetics, aesthetics (Br n. అలంకార తత్త్వశాస్త్రం; సౌ��దర్య తత్త్వశాస్త్రం; +* estimate, v. t. అంచనా వేయు; మదింపు చేయు; లెక్కకట్టు; ఉజ్జాయించు; +* estimate, n. అంచనా; మదింపు; ఉజ్జ; ఉజ్జాయింపు; అందాజు; అడసట్టా; ఎస్టిమేటు; +* estrangement, n వైమనస్యం; అభిప్రాయభేదం; విమనోభావం; దుఃఖమనస్కుని భావము; +* estrogen, n. స్త్రీ శరీరంలో తయారయే ఉత్తేజితపు జాతికి చెందిన ఒక రసాయనం; +* estrus, n. రుతుకాలం; పశుపక్ష్యాదులు ఈ కాలంలోనే లైంగిక వాంఛ చూపుతాయి rel rut; +* estuary, n. విశాలసంగమం; సంగమస్థానం; సాగర సంగమం; నదీ ముఖ ద్వారం; నది సముద్రంలో కలిసే చోట విశాలమైన సంగమ స్థలం rel backwater; fjord; sound; +* eternal, adj. అభంగురమైన; శాశ్వతమైన; నిత్య; అనశ్వర; సనాతన; +* eternal, n. అభంగురం; శాశ్వతం; అనశ్వరం; +* ethics, n 1) నీతిశాస్త్రం 2) pl. నడవడిని, ప్రవర్తనని నియంత్రించే ధర్మ పన్నాలు; +* ethic, n. నీతి, నియమం, నడవడి, ప్రవర్తన, మొదలైనవాటిని నియంత్రించే కట్టుబాటు; +* ethos, n. యుగధర్మం; జాతిశీలత; నైతిక, సామాజిక విలువల సముదాయం; +* etiology, n. కారణశాస్త్రం; ఏ జబ్బు ఎందువల్ల వచ్చిందో నిర్ణయించే శాస్త్రం; +* etiquette, n. మర్యాద; ఒకరినొకరు గౌరవించుకోడానికి పాటించే నియమావళి; +* etymon, n ling ధాతువు; అనేక భాషలలోని సజాతీయ మాటలకి మూలం; +* etymology, n. పదప్రవర; పదప్రవర శాస్త్రం; నిరుక్తం; శబ్దవ్యుత్పత్తి శాస్త్రం; ఏ మాట ఎక్కడనుండి వచ్చిందో నిర్ణయించే శాస్త్రం; +* etymologists, n. పదప్రవరులు; పదవ్యుత్పత్తి తెలిసిన పండితులు; +* eulogy, n. ప్రశంస; పొగడ్త; కీర్తిగానం; +* euphemism, n. సభ్యోక్తి; శిష్టోక్తి; తీపిమాట; చెవికింపుమాట; చెప్పదలుచుకున్న మాటని డొంకతిరుగుడుగా చెప్పడం; నాజూకుగా చెప్పిన మాట చచ్చిపోయాడు" అనడానికి "స్వర్గస్తుడయాడు" అనడం, ‘లేవు’ అనడానికి ‘నిండుకున్నాయి’ అనడం క్షయరోగం" అనడానికి బదులు ఇంగ్లీషులో "టి.బి అనడం ఉదాహరణలు +* euphony, n. శ్రావ్యత; ఇంపు; చెవులకు ఇంపైన స్వరం; స్వరసమత; +* European, adj. పరంగి; ఐరోపా ఖండానికి చెందిన; పరదేశాలకి చెందిన; +* Eustachian tube, n. కంఠకర్ణ నాళం; గొంతుకకి, చెవికి మధ్యనున్న గొట్టం; +* euthanasia, n. విపరీతంగా బాధ పడుతూన్న రోగి అవస్థ చూడలేక, జాలితో రోగికి సునాయాసంగా మరణం కలిగేటట్లు చూడడం; +* evade, v. i. తప్పించుకొను; ఠలాయించు; +* evaluate, v. i. వెలకట్టు; విలువ కట్టు; నాణ్యం కట్టు; +* evaluation, n. మూల్యాంకనం; వెల కట్టడం; విలువ కట్టడం; +* evangelist, n. క్రైస్తవ మత ప్రచారకుడు; క్రైస్తవ మతంలో చేరమని ఊరూరా తిరుగుతూ ప్రచారం చేసే వ్యక్తి; +* eve, n 1) ముందు రోజు; ఒక పర్వదినానికి ముందు రోజు 2) సాయంకాలం; +* evening, n. సాయంకాలం; సాయంత్రం; ప్రదోషం; ప్రదోషకాలం; మునిమాపు; మాపు; మునిచీకటి; అసురసంధ్య; +* event, n. సంఘటన; ఘటన; ఘట్టం; నడితి; సన్నివేశం; +* eventually, adv. ఎట్టకేలకు; ఆఖరికి; చివరికి; ఎప్పుడో ఒకప్పుడు; నిలకడమీద; +* evict, v. t. గెంటు; బయటకి తగులు; చట్టం ప్రకారం బయటకు వెళ్ళగొట్టు; +* eviction, n. గెంటడం; బయటకి తగిలెయ్యడం; జప్తు చెయ్యడం; +* evidence, n. నిదర్శనం; తార్కాణం; రుజువు; ప్రమాణం; సాక్ష్యం; దాఖలా; +circumstantial evidence, ph. ప్రాసంగిక సాక్ష్యం; సందర్భ ప్రమాణం; అప్రత్యక్షసాక్ష్యము; పరిస్థితిసంబంధసాక్ష్యము; సంభవాత్మకసాక్ష్యము. +* evil, n 1) అభం; చెడు 2) దౌష్ట్యం; దుష్కృత్యం; కంటకం; +* evil, adj. చెడు; దుర్మార్గమైన; అవినీతికరమైన; +* evolution, n. పరిణామం; ఊర్ధ్వముఖ పరిణామం; క్రమ పరిణామం; వికాశం; పరిణామ సృష్టి; +theory of evolution, ph. పరిణామ సృష్టి వాదం; పరిణామ సృష్టి సిద్ధాంతం; +* exact, adj. నిర్దిష్టంగా; సమంగా; సరిగ్గా; నిర్ధారణగా; +* exactly, adv. సమంగా; సరిగ్గా; కచ్చితంగా; అచ్చంగా; +* exaggeration, n. అతిశయోక్తి; కోత; కోతలు కోయడం; గోరంతని కొండంత చెయ్యడం; +in depth examination, ph. శలాక పరీక్ష; శల్య పరీక్ష; సూక్ష్మ పరిశీలన; పరామరిక; +* examine, v. t. పరీక్షించు; పరికించు; పరిశీలించు; పరకాయించు; +* example, n. ఉదాహరణ; దృష్టాంతం; నిదర్శనం; తార్కాణం; మచ్చు; ఉదాహారం; ఉదాహృతం; +* exceed, v. i. మించు; మీరు; మితిమీరు; అతిక్రమించు; అధిగమించు; పెచ్చుపెరుగు; పురివిచ్చు; విజృంభించు; +* excellent, adj. ప్రకృష్టమైన; బ్రహ్మాండమైన; లోకోత్తర; నెర; +* excellent, n. ప్రకృష్టము; బ్రహ్మాండము; లోకోత్తరము +* exception, n. మినహాయింపు; వినాయింపు; అపవాదం; భిన్నవాదం; కారణాంతరం; +* excess, n. అధికం; అదనం; ఉరవు; ఉల్బణం; ఉత్కటం; +* exchange, n. మారకం; వినిమయం; ఫిరాయింపు; వర్గావర్గీ; అదలుబదలు; ఇచ్చిపుచ్చుకోలు; సాటా: +* exchange, v. t. మార్చు; ఫిరాయించు; తారుమారు చేయు; +* excise, adj. అబ్కారి; వ్యాపారపు; ప్రత్యేక; +excise tax, ph. ఒక ప్రత్యేకమైన జాబితా ఉన్న అంశాల మీద వేసే అమ్మకపు పన్ను; ఈ జాబితాలో సాధారణంగా అత్యవసరం కాని విలాస వస్తువులు ఉంటూ ఉంటాయి; ఉదా. నగలు, అత్తరులు, సిగరెట్లు, మద్య పానీయాలు, కార్లు, వగైరా; అబ్కారి పన్ను; వ్యాపారపు పన్ను; +* excitation, n. ప్రేరేపణ; ప్రేరణ; స్ఫూర్తి; ఉద్విగ్నత; +* excite, v. t. ప్రేరేపించు; ఉద్రేకపరచు; ఉత్తేజపరచు; +* excited, adj. ఉద్రేకం చెందిన; ఉద్విగ్న; ప్రోద్ధుత; +* excitement, n. ఉత్సాహం; ఉత్తేజం; ఉద్విగ్నం; ఉద్వేగం; ఉద్విగ్నత; +* exclamation, n. రాగం; ప్రశంసార్థకం; ఆశ్చర్యార్ధకం; +* exclude, v. t. మినహాయించు; పరిహరించు; నిరవసించు; వర్జించు; +* excrement, n. అశుద్ధం; అమేధ్యం; పియ్యి; విరేచనం; +* excretions, n. విసర్జించబడినవి; మొక్కలనుండి కారే రసాదులు; +* excuse, n 1) నెపం; సాకు; మిష; వంక; సందు; అపదేశం 2) క్షమార్పణ; మన్నింపు; మాపు; +excuse me, ph. క్షమించండి; మన్నించండి; ఏమీ ఆనుకోకండి; +* execute, v. t 1) అమలుజరుపు; నెరవేర్చు; నిర్వహించు 2) ఉరితీయు; +* exemplar, n. మేలుబంతి; ఒజ్జబంతి, ojjabaMti; ఒరవడి; తలకట్టు; నమూనా; మాదిరి; ప్రతిరూపం; మోస్తరు; మచ్చుతునక; ఆదర్శవంతమైనది; అనుకరించడానికి వీలయినది; ప్రశస్తమయినది; శ్రేష్ఠం; +* exemption, n. మినహాయింపు; వినాయింపు; విముక్తత; +aerobic exercise, ph. వ్యాయామం; ఊపిరితీతకి ప్రాధాన్యం ఇచ్చే వ్యాయామం; +exercise notebook, ph. రూళ్ళు గీసిన కాగితాలతో కుట్టిన పుస్తకం; +* exhaust, n. రేచకం; రేచకధూమం; బయటకి పోయేది; +exhaust fumes, ph. రేచకం; రేచకధూమం; బయటకి పోయే వాయువులు; +* exhort, v. t. ఉద్బోధించు; ప్రోత్సాహ పరచు; +* exhume, v. t. పాతిపెట్టిన శరీరాన్ని తిరిగి వెలికి తీయు; +* existentialism, n. అస్థిత్వవాదం ఈ జీవితానికి అర్ధం/ప్రయోజనం లేవు. ఎవరో సృష్టికర్త మీ జీవితానికి ఒక లక్ష్యం/ప్రయోజనం నిర్దేశించి మిమ్మల్ని ఇక్కడికి పంపలేదు ఇదే అస్తిత్వవాదం యొక్క కీలకాంశం, సారం. దీనిని ఒక తత్వంగా కాకుండా జీవితం పట్ల ఒక దృక్పథం లాగ చూడాలి. ఇది నాస్తిక ఆలోచన కాదు; ఈ ఆలోచనకి చెందిన ప్రముఖ తత్వవేత్తలు సొరేన్ కీర్కిగార్డ్(Søren Kierkegaard మార్టిన్ హెడిగర్(Martin Heidegger ఫ్రీడ్రిక్ నీచె(Friedrich Nietzsche జీన్-పాల్ సార్ట్(Jean-Paul Sartre ఆల్బర్ట్ కాము(Albert Camus) మొదలైనవారు; +* exit, n. నిర్గమం; నిర్గతి; నిష్‌క్రమణం; నిష్క్రాంతి; బయటకు పోయే దారి; +* exogamy, n. బహిర్వివాహం; కులాంతర, మతాంతర వివాహం; +* exorcist, n. భూతవైద్యుడు; దయ్యములను బయటకు వెడలగొట్టేవాడు; +* exothermic, adj. తాపచూషక; బాహ్యతప్త; ఉష్ణమోచక; వేడిని వెలిగక్కే; +* expand, v. i. వ్యాకోచించు; విస్తరించు; వికసించు; +* expansion, n. వ్యాకోచం; వికాసం; విక్షేపం; విస్తరణ; పొలయిక; +* expect, v. i. ఆశించు; నమ్ము; నిరీక్షించు; ఎదురుచూచు; +expected value, ph. సగటు విలువ; సరాసరి విలువ; ఊహించిన విలువ; +* expectation, n 1) ఆశ; ఆకాంక్ష; నమ్మకం; అవుతుందని అనుకున్నది 2) సగటు; సరాసరి; +* expectorant, n. కఫహరి; కళ్లెని వెడలగొట్టేది; +* expedition, n 1) యాత్ర; ప్రయాణం; సాహస యాత్ర; పరిశోధక యాత్ర 2) దండయాత్ర; +* expel, v. t. బహిష్కరించు; తరిమివేయు; తొలగించు; +* expenditure, n. ఖర్చు; వ్యయం; వినియోగం; వెచ్చం; పోబడి; యాపన; +* expensive, n. ఖరీదయినది; బహుకం; బాగా డబ్బు పోసి కొన్నది; +transcendental experience, ph. ఆధిభౌతికానుభవం, అశరీరానుభూతి. దేహాతీత అనుభవం, దేహాతీత అనుభూతి; నిధిధ్యాసము; మేవెలి; +* expert, n. దిట్ట; నేర్పరి; శిఖామణి; ప్రోడ; ఘనాపాఠీ; చెయ్యి తిరిగిన మనిషి; ఆరిందా; ఫామేదా; నిపుణుడు; ప్రవీణుడు; నిష్ణాతుడు; విశారదుడు; కోవిదుడు; చాతురి, cAturi +* expertise, n. నిపుణత; నైపుణ్యత; ప్రావీణ్యత; వైదగ్ధ్యత; శేముషి; నేర్పరితనం; +* expiation, n. ప్రాయశ్చిత్తం; పాప పరిహారం; +* expire, v. i 1) మురిగిపోవు; కాలదోషం పట్టు; lapse 2) మరణించు; చచ్చిపోవు; +* explanation, n. వివరణ; స్పష్టీకరణ; విపులీకరణ; వివేచన; +* explicit, adj. సువ్యక్త; స్పష్టమైన; బహిర్గత; +* explosion, n. పేలుడు; పెట్లు; విస్పోటనం; స్పోటనం; +* exponent, n 1) భాష్యకారుడు 2) ఘాతాంకం; ఘాతం; ధ్వజాంకం; చక్రవృధ్యాంకం; +exponential growth, ph. ఘాతీయవృద్ధి; చక్రవృద్ధి; విశేష వృద్ధి; +* expose, v. t. బయట పెట్టు; చూపించు; బట్టబయలు చేయు; బయలుపరచు; వెలార్చు; +* exposition, n. వివరణ; భాష్యం; వ్యాఖ్యానం; ఉపన్యాసం; ప్రవచనం; ఆవిష్కరణ: +* express, v. i. వెలిబుచ్చు; వ్యక్తపరచు; వెల్లడి చేయు; అభివ్యక్తీకరించు; +* expression, n 1) సమాసం; ఉక్తి; ఉక్తిసమాసం; సముచ్ఛయం; సంహతి; పలుకుబడి 2) హావం 3) వ్యక్తీకరణం; అభివ్యక్తీకరణ; అభివ్యక్తం; +* expressionism, n. Expressionism అనేది ఒక కళా రీతి. ఉదాహరణకు ఒక అందమైన సాయంత్రాన, చల్లగాలిలో, పచ్చటి గడ్డిలో నలుగురు స్నేహితులు సరదాగా నడుస్తున్నారు. ఇంతలో ఒకడికి panic attack వచ్చింది. అంటే మానసిక అనారోగ్యము కారణముగా ఏ కారణము లేకుండా విపరీతమైన కంగారు పుట్టడము. వాడికి వాడి పరిసరాలు కనబడే దానికీ, ఇతరులకు కనబడే దానికి తేడా ఉంటుందనేది ఇక్కడ లెక్క. దూరాన నడుస్తున్న ఇద్దరికీ ఏ panic attack లేదు కనుక, ప్రకృతిలో ఉన్న ఆ తరంగాలు వారినేమీ ఇబ్బంది పెట్టట్లేదు. వారు మామూలుగా నడిచి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కల్లోలము ప్రకృతిలో లేదు. అతని మనస్సులో ఉంది. +* expunge, v. t. తీసివేయు; కొట్టివేయు; రద్దుచేయు; +* extempore, adj. ఆశువుగా; ముందుగా తయారవకుండా; +* extensively, adv. విరివిగా; విస్తారంగా; విస్తృతంగా; సమగ్రంగా; ముమ్మరంగా; అపరిమితంగా; సువిశాలంగా; సుదీర్ఘంగా; అధివ్యాపకంగా; విరివిడిగా; +* extinct, adj. చ్యుత; పరిచ్యుత; నిరాస్థులైన; అస్తిత్వం లేని; విలుప్తమైన; హరించిపోయిన; పరిమృత; సమూలంగా నాశనం అయిపోయిన; +extinct life forms, ph. నిరాస్థులైన జీవకోటి; హరించిపోయిన జీవకోటి; +* extra, adj 1) అదనపు; ఇతర; బాహిర; బయట 2) అసమానమైన; మహామానమైన; +* extract, n. సారం; అర్కం; ధృతి; కషాయం; సత్తు; అరఖు; సారభూతం; +* extract, v. t. గుంజు; పీకు; పిండు; రాబట్టు; వెలికి తీయు; నిష్కర్షించు; +* extraction, n. గుంజడం; పీకడం; పిండడం; రాబట్టడం; వెలికి తీయడం; నిష్కర్షణ; +* extradition, n. ప్రత్యర్పణం; విదేశాలలో దాగున్న నేరస్తుని పీకి స్వదేశానికి రాబట్టడం; +* extraordinary, adj. అసమాన్యమైన; అసాధారణమైన; మహామాన్యమైన; +extraordinary person, ph. అసమాన్యుడు; మహామాన్యుడు; అసమాన్యురాలు; మహామాన్యురాలు; +extrasensory perception, ph. అతీంద్రియ శక్తి; ఇంద్రియాతీతమైన గ్రహణ శక్తి; దివ్యదృష్టి; +* eye, n 1) కన్ను; నేత్రం; నయనం; అక్షి; చక్షువు; లోచనం; కక్ష; దేహదీపం 2) సూది బెజ్జం 3) తుపాను కేంద్రం; +* eyeball, n. కంటి గుడ్డు; నేత్ర గోళం; తెల్లగుడ్డు; +* eyelash, n. కనువెంట్రుక; కనురెప్పల చివర ఉండే రోమ విశేషం; +* eyeglasses, n. కంటద్దాలు; కళ్లజోడు; సులోచనాలు; +* eyes, n. pl. కళ్లు, కండ్లు; నయనములు; నేత్రములు; చక్షువులు; లోచనములు; +* eyesore, n. కంటికి ఇంపుగా లేని దృశ్యం; చూడ్డానికి అసహ్యంగా ఉన్నది; + + +F, f, symbol (1) ఇంగ్లీషు వర్ణమాలలో ఆరవ అక్షరం 2) పరీక్షలలో తప్పిన వారికి వచ్చే గురుతు; +* fabricate, v. t. తయారుచేయు; అల్లు; నిర్మించు; బనాయించు; ప్రకల్పించు; కల్పించు; +* fabricated, adj. ప్రకల్పిత; తయారు చేయబడ్డ; కల్పించిన; సృష్టించిన; +* fabrication, n 1) బనాయింపు; ఉత్పాదన 2) అల్లిక; కల్పన; ప్రకల్పన; తయారీ; +* fabulous, adj. నమ్మశక్యం కాని; అద్బుత; కల్పిత; అనూహ్యమైన; +* face, n 1) ముఖం; మోము; మోర; మొహం; మొగం; ఆననం; వదనం 2) ఫలకం; తలం; +face to face, ph. ముఖాముఖీ; ఎదురెదురుగా; ఎదురుబదురుగా; +face value, ph. అంకిత మూల్యం; ముఖ మూల్యం; నమోదు చేయబడ్డ విలువ; +* facet, n. కోణం; దృక్పథం; వేపు; పట్టె; +* facetious, adj. వెటకారంగా; వెక్కిరింపుగా; ఎగతాళిగా; +facetious comment, ph. ఒక రకం ఛలోక్తి బయట ఎండ వేడిగా ఉందా అని అడిగినప్పుడు "లేదు, వెన్నెట్లో తిరుగుతూన్నట్లు ఉంది అని చెప్పిన సమాధానం ఈ కోవకి చెందుతుంది వాడి లాంటి స్నేహితులు ఉంటే శత్రువులు అక్కరలేదు" అన్న వాక్యం sarcastic comment అవుతుంది; +* facile, adj. సులభసాధ్యం; చెయ్యి తిరిగిన; +* facilitate, v. t. అనుకూల పరచు; వసతులు కల్పించు; సులభం చేయు; +* facilities, n. సౌకర్యాలు; వసతులు; సదుపాయాలు; +* facsimile, n. సరి అయిన నకలు; మక్కీకి మక్కీ నకలు; తుల్యసమానం; తద్వత్తుగా ఉండేది; same as fax; +* fact, n. నిజం; సత్యం; వాస్తవం; వాస్తవికాంశం; నిజంగా జరిగిన విషయం; యదార్థం; +* faction, n. కక్షి; గుంపు; కూటమి; కలహాలలో ఒక గుంపు; +* factor, n 1) కారణాంకం; లబ్ధమూలం; భాజకం 2) కారకం 3) కారణాంశం; +* factorization, n. కారణాంకీకరణం; ఒక సంఖ్య యొక్క కారణాంకాలు కనుక్కోవడం; +* faculty, n 1) శక్తి; సామర్థ్యం; దార్‌ఢ్యము 2) అధ్యయన విభాగం 3) అధ్యాపక వర్గం; +* fad, n. వేలంవెర్రి; అస్తావెస్తం; +* fail, v. i. విఫలమగు; తప్పు; ఓడు; డింకీలు కొట్టు; +* faint, adj. నీరసమయిన; వెలవెలపోయిన; మసకగా ఉన్న; మంద; హీన; +* faint, v. i. ��్మృతితప్పు; సొమ్మసిల్లు; మూర్చపోవు; +* fair, adj 1) న్యాయమైన; సరసమైన; సముచితమైన 2) శుభ్రమైన; తెల్లనైన; సుందరమైన; సొగసైన; +* fairy, n. పిల్లల ఊహాలోకంలో ఉండే రెక్కలు ఉండి,మంత్ర శక్తి ఉన్న ఒక శాల్తీ; +fairy tale, ph. అద్భుత గాథ; నమ్మశక్యం కాని కథ; మాంత్రికులు, దేవదూతలు, వగైరా పాత్రలు ఉండే పిల్లల కథ; +* faker, n. మోసగాఁడు; ఫకీర్లంతా మోసగాళ్లనే అనుకుని ఇంగ్లీషు వాళ్లు ఈ మాటని తయారు చేసేరు; +* fake, n 1) నకిలీ; కృత్రిమం; బూటకం; నకిలీ నకలు; చవకబారు కాపీ 2) కపటి; మోసకారి; +* falcon, n. డేగ; సాళువ; బైరిపక్షి; భైరవ డేగ rel గద్ద]] +* fall, n 1 ఆకురాలు కాలం 2) పాతం; పతనం; సంపాతం; అభిపాతం; ఎక్కువగా పడుట; కెడవు; భ్రంశనం 3) చీర యొక్క అంచుల దగ్గర (పాదాల దగ్గర) వెనకభాగంలో కుట్టే బట్ట; +* fallacy, n. కుతర్కం; ఆభాసం; తర్కాభాసం: మిథ్యాహేతువు; తార్కికంగా తప్పుడు వాదన; see also paradox; +* fallow, n 1) కొవ్వు; గొడ్డుకొవ్వు 2) బీడు; బీడు పొలం; +* false, adj. కల్ల; బూటకపు; అబద్ధపు; తప్పు; మిథ్య; దంభ; కుహనా; +* false, n. కల్ల; బూటకం; అబద్ధం; తప్పు; మిథ్య; హుళక్కి; అప్రమాణికం; +* falsehood, n. అబద్ధం; బొంకు; అసత్యం; అనృతం; అళీకత; మిథ్య; +* falsetto, n. మగవాడి బొంగురు గొంతుక; మగ గొంతుక; +* fame, n. కీర్తి; ఖ్యాతి; విఖ్యాతి; పేరు; ప్రతిష్ఠ; ప్రశస్తి; యశస్సు; యశము; ప్రథ; +* familiarity, n. పరిచయం; చనువు; చొరవ; అతిపరిచయం; ప్రవేశం; అభినివేశం; విహితం; మాలిమి; +familiarity breeds contempt, ph. చనువు అలక్ష్యాన్ని పుట్టిస్తుంది; అతిపరిచయాదవజ్ఞా; +* family, n 1 కుటుంబం వంశం; అనూకం; జాతి 2) సంసారం; కాపురం 3) కుటుంబం; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు అయిదవ వర్గానికి పెట్టిన పేరు see also] genus, family, order, class, phylum and kingdom; +* famish, v. i. మలమలలాడు; ఆకలితో నకనకలాడు; ఆకలితో కృశించు; +* famous, adj. కీర్తికెక్కిన; పేరున్న; ఖ్యాతివడసిన; వినుతికెక్కిన; విజ్ఞాత; ప్రసిద్ధ; ప్రశస్త; +* fan, n 1) పంకా; విసనకర్ర; వీవెన; సురటి; వ్యజనం 2) ప్రేమాభిమాని; వీరాభిమాని; అభిమాని; అనుగరి ety fanatic అన్న మాటకి కుదింపు, కుదింపుతో అర్ధంలో మార్పు; +electrical fan, ph. విద్యుత్ పంకా; విద్యుత్ వీవెన; ఫేను; +* fanatic, n. ఉన్మాది; ప్రేమాభిమాని; గాఢాభినివేశి; మూర్ఖాభిమాని; మూఢభక్తి కలవాడు; దురభిమాని; +* fanny pack, n. నడి కట్టు; ఒడి కట్టు; నడుం చుట్టూ కట్టుకునే చిన్న సంచి; +* fantasy, n. ఊహాలోకం; భ్రమ; భ్రమకల్పితం; స్వైర కల్పన; +* farce, n. ప్రహసనం; కిలారం; హాస్య ప్రధానమైన నాటకం; నవ్వులాట; హాస్యోక్తి; ఫార్సు; +* fare, n. బాడుగ; కేఁవు; ఆతరం; ప్రయాణానికి చెల్లించే రుసుము; +* farewell, n. ఉద్వ���సన; సుఖప్రయాణ ఆశీర్వచనం; +* farmer, n. రైతు; సేద్యకాడు; కృషీవలుడు; కర్షకుడు; +* farmers, n. pl. రైతులు; రైతాంగం; కృషీవలులు; కర్షకులు; +* far-sighted, adj. దూర దృష్టిగల; దీర్ఘ దృష్టిగల; దూరంగా ఉన్న వస్తువులు బాగా కనిపించేటటువంటి; +* farsightedness, n. దూరదృష్టి, దూరపు వస్తువులని మాత్రమే చూడగలగటం; +* fashion, n 1) సోకు; సొగుసు; నాగరీకత; ఫేషను 2) తీరు; రీతి; వైఖరి; +* fast, n 1) ఉపవాసం; ఉపోషం 2) నిరాహార దీక్ష 3) పస్తు; లంఘణం; +* fasten, v. t. కట్టు; బంధించు; తాడుతో కట్టు; బిగించు; తగిలించు; +* fastidious, adj. ప్రతి చిన్న విషయాన్నీ నిశితంగా పరిశీలించే బుద్ధి గల; మెప్పించడం కష్టమైన; ప్రతీదీ అతి శుభ్రంగా ఉండాలనే తత్త్వం గల; +* fat, adj. కొవ్వు; కొవ్విన; బలిసిన; పీన; లావైన; పోతరించిన; బడ్డు; +fat tissue, ph. కొవ్వు కణరాసి; మేదోమయ కణజాలం; +* fat, n. కొవ్వు; గోరోజనం; ఆమికం; మేద; మదం; కావరం; పోతరం; హామికం; పిట; +* fatalism, n. దేవుడి మీద భారం వేసి మానవ ప్రయత్నం మానుకోవడం; అన్ని అదృశ్య శక్తులవల్లనే జరుగుతాయనే నమ్మకం; +* fate, n. కర్మ; రాత; ప్రారబ్దం; విధి; గ్రహపాటు; ఘటన; నియతి; వాసన; అదృష్టం; +* father, n. నాన్న; నాయన; తండ్రి; అయ్య; అబ్బ; అప్ప; పిత; జనకుడు; +* fathom, n. నిలువు; ఆరు అడుగులు; రెండు గజాలు; లోతు కొలవడానికి వాడే ఒక కొలమానం; +* fatty, adj. కొవ్వుతోకూడిన; కొవ్విన; బలసిన; పోతరించిన; +* fault, n. అవద్యం; తప్పు; దోషం; లొసుగు; లోపం; దబ్బర; +* fauna, n. జంతుకోటి; జంతుజాలం; జంతువర్గం; ఒక ప్రాంతంలో ఉన్న జంతుజాలం; +* favorite, n 1) ఇష్టుడు; ఇష్టురాలు 2) అభీష్టం; ఇష్టతమం; ప్రియం; +* fawn, n. లేడిపిల్ల; లేడికూన; +* fearlessness, n. నిర్భీతి; నిర్భయత్వం; నిర్భీకత్వం; నిబ్బరం; పరాక్రమం; +* feast, n. విందు; తద్దె; విందు భోజనం; ఆవెత; రసాయనం; పంక్తి భోజనం; +* feat, n. సాహసకృత్యం; అద్భుతకత్యం; విద్దె; +* feature, n 1) కళవళిక; తీరు; వైఖరి 2) ముఖ్యమైన లక్షణం; గుణం; +* febrifuge, n. జ్వరహరి; జ్వరహారిణి; జ్వరాన్ని తగ్గించేది; +* fee, n. రుసుం; జీతం; శుల్కం; మజూరి; దక్షిణ; ఫీజు; +tuition fee, ph. జీతం; పాఠశాలకి విద్యార్థి చెల్లించే రుసుము; +* feeble, adj. నీరసమైన; నిస్త్రాణమైన; +* feed, v. t. తినిపించు; మేపించు; భోజనం పెట్టు; +* feedback, n. పునర్భరణం; పతిపుష్టి; పునర్‌దాణా; +* feeling, n. అనుభూతి; సంవేదన; కనికరం; రసం; భావం; గుణం; +* feign, n. pl. నటించు; టక్కు చేయు; టక్కరి పనులు చేయు; +* felatio, n. పురుషుడి లింగాన్ని నోట్లో పెట్టుకుని నాకడం; +fellow worker, ph. సహోధ్యాయుడు; సహాధ్యాయి; తోటి పనివాడు; +* felon, n. అపరాధి; నేరస్థుడు; నేరస్తురాలు; +* felony, n. అపరాధం; నేరం; దండనార్హమైన నేరం; +* felt, n. ఒక రకం ఉన్ని బట్ట; నే�� లేకుండా ఉన్నితో చేసిన బట్ట; +* fence, n. కంచె; దడి; తట్టిగోడ; వృతి; అవహాలిక; అలవ; +palm leaf fence, ph. దడి note) దడి అవరోధం కల్పించడమే కాకుండా కొంత మరుగు కూడా ఇస్తుంది; +picket fence, ph. కటకటాల కంచె; కంచె అవరోధం కల్పిస్తుంది తప్ప మరుగు ఇవ్వదు; +* fencing, n. గరిడీ; కత్తిని కాని, కర్రని కాని లాఘవంగా తిప్పడం; +* fermentation, n. పులియబెట్టుట; విపాకం; కిణ్వప్రక్రియ; ఫేనీకరణం; +* ferocious, adj. ఉగ్రమైన; భయంకరమైన; ప్రచండ; క్రూరమైన; +* ferocity, n. ఉగ్రత; క్రౌర్యం; భయంకరత్వం; +* ferro, pref. అయస్; ఇనుముకి సంబంధించిన; +* ferrule, n. తొడి; పొన్ను; చేతికర్ర మొనకి తొడిగే కిరీటం; +* ferry, n. రహదారి పడవ; రాదారి పడవ; ఏరు దాటడానికి వాడే పడవ; దోనెపుట్టి; +* fetish, n. శరీరంలో ఏ భాగాన్ని అయినా సరే లైంగిక దృష్టితో చూసి ఆనందించడం; ఏ పని మీదనయినా అతిగా దృష్టి నిలపడం;i +religious fetish, ph. మన చుట్టూ ఉన్న సాధారణమైన వస్తువులకి మానవాతీతమైన శక్తులున్నాయని నమ్మి వాటికి దైవత్వం ఆపాదించడం; ఉదా. ఒక మత ప్రవక్త నఖ, కేశాలకి మహత్తు ఉందని నమ్మడం; +psychological fetish, ph. మన చుట్టూ ఉన్న సాధారణమైన వస్తువులని లైంగికమైన అనుభూతితో చూడడం; ఉదా. ఒక వస్తువుని స్త్రీగా భ్రమించి ఆ వస్తువుతో లైంగికమైన సంపర్కం పొందడానికి ప్రయత్నం చెయ్యడం; +* fetus, foetus (Br n. భ్రూణం; ఉలబము; అంకురం; అర్భకం; పదకొండవ వారం నుండి ప్రసవం అయి బిడ్డ భూపతనం అయేవరకు కడుపులో పిల్ల; +* feud, n. తగువు; తగాదా; సంసారంలో వచ్చే తగాదా; కుటుంబకలహం; +* feudalism, n. జాగిర్‌దారీ; జమీందారీ; మొఖాసా; +* fever, n. ఉష్ణం; ఊష్ణం జ్వరం రూక్ష; +hay fever, ph. పీన జ్వరం; గవత జ్వరం; ఒక రకం ఎలర్జీ; +typhoid fever, ph. సన్నిపాత జ్వరం; ఆంత్రిక జ్వరం టైఫాయిడ్ +* few, adj. కొద్ది; కొన్ని; కొందరు; +* fewer, adj. తక్కువ; లెక్కింపులో తక్కువ; +* fiance, n. పెండ్లాడబోయే కుర్రాడు; కాబోయే భర్త; +* fibrin, n. తాంతవం; రక్తములో నార వంటి పదార్థం; +* fibrinogen, n. తాంతవజని; రక్తములో నార వంటి పదార్థానికి ఆధారభూతమైన ప్రాణ్యపదార్థం; +* fibula, n. జానుక; బహిర్ జంఘాస్థి; అనుజంఘాస్థి; +* fickle, adj. చంచలమైన; స్థిరబుద్ధి లేని; నిలకడలేని; చపల; +* fiction, n. కల్పన; కల్పించిన కథ; కల్పిక; కట్టుకథ; ప్రబంధం; ప్రబంధ కావ్యం; సృజనాత్మక రచన; పరిక; +science fiction, ph. శాస్త్రీయ కల్పన; వైకల్పన; వైజ్ఞఆనిక కల్పన; +* ficus, n. చెట్లకి సంబంధించిన ఒక జాతి పేరు; +* fiddle, n. ఫిడేలు; వాయులీనాన్ని పోలిన వాద్యవిశేషం; +* fidgeting, n. బోరు కొట్టినప్పుడు కాని, ఆత్రుతగా ఉన్నప్పుడు కాని, కుదురుగా ఉండకుండా శరీరపు అంగాలని అనవసరంగా కదలించడం; ఉదా. పెదవులతో వికారపు చేష్టలు చెయ్యడం, కుర్చీలో కుదురుగా కూర్చోకుండా ఇటూ, అటూ కదలడం, కాళ్లని తాటించడం, మెటికలు విరవడం, మొదలైన చేష్టలు చెయ్యడం; +* fiduciary, adj. విశ్వాసాశ్రిత; ఒకరి తరఫున విశ్వసనీయంగా ప్రవర్తించే; +* fiduciary, n. విశ్వాసపాత్రుడు; ఒకరి తరఫున విశ్వసనీయంగా ప్రవర్తించే మరొక వ్యక్తి కాని, సంస్థ కాని; +* field, n 1) పొలం; చేను; మైదానం; మడి; బీడు; క్షేత్రం; కేదారం; శాకటం; హల్యం 2) రంగం; ప్రదేశం; స్థానం; +field glasses, ph. ఆరుబైట ఉపయోగానికి వీలయిన బైనాక్యులర్ టెలిస్కోపు; +* fifteen, n. పదిహేను; పదునయిదు; పంచదశ; +* fifth, adj. అయిదవ; అయిదో; అయిదింట ఒకటి; ఐదో; +fifth wheel, ph idiom] పానకంలో పుడక; పిలవని పేరంటం; నలుగురి మధ్య ఎవ్వరికీ అక్కర లేని వ్యక్తి; +* fifth, n. అయిదింట ఒకటి; అయిదో వంతు; +* fight, n. దెబ్బలాట; తగువు; లడాయి; పోట్లాట; కొట్లాట; కాట్లాట; జట్టీ; కజ్జా; జగడం; పోరాటం; యుద్ధం; +* fight, v. t. దెబ్బలాడు; పోట్లాడు; కొట్లాడు; తగువులాడు; జట్టీలాడు; +* fighting, v. t. దెబ్బలాడడం; పోట్లాడడం; కొట్లాడడం; తగువులాడడం; జట్టీలాడడం; +* figment, n. కల్పన; కట్ఠుకథ; నీలివార్త; +* figure, n 1) బొమ్మ; పటం; చిత్రం 2) విగ్రహం; రూపం; ఆకారం 3) అంకం; అంకె; సంఖ్య; +significant figure, ph. సార్థకాంశం; దశాంశ పద్ధతిలో దశాంశ బిందువు తర్వాత వచ్చే అంకెలలో ఒకటి; +* figure, v. i. కనపడు; v. t. లెక్కించు; లెక్కలోకి తీసుకొను; +figure head, ph idiom] ఉత్సవ విగ్రహం; ఉత్సవ మూర్తి; అధికారం లేకుండా మాటవరసకి పదవి అలంకరించిన వ్యక్తి; +* filament, n. పోగు; తంతువు; ఈనె; అకరువు; కేసరి; కింజిల్కము; +* file, n 1) దస్త్రం; దస్తరం: దొంతి 2) ఆకురాయి; పత్రపరశువు 3) చదరంగంలో నిలువు వరుస; +file format, ph. సంచికా ప్రారూపం; దస్త్రపు ప్రారూపం; +* file, v. t 1) దఖలు చేయు 2) దొంతిలో పెట్టు; దాచు 3) కంప్యూటరు పరిభాషలో ఒక రకం దత్తాంశ కట్టడం; +* filet, n ఫిలే] ఎముకలు తీసేసిన మాంసం, చేపలు; +* filigree, n. జరీ పోగు అల్లికతో అలంకరించబడ్డ వస్తువు; +* fill, v. t. నింపు; నింపిడి చేయు; పూడ్చు; పూరించు; భర్తీ చేయు; +* filling, n. కూరు; పూర్ణం; పూరణం; ఉంభనం; ఆపూర్తి; +* filter, n. వడపోతగిన్నె; గలని; సంగలని; +* filthy, n. మలంతో నిండిన; అసహ్యమైన; రోతపుట్టించే; +* filtrate, n. గాలితం; వడపోతలో కిందకి దిగినది; +anal fin, ph. కింది రెక్క; గుదము దగ్గర ఉన్న రెక్క; +* final, adj 1) ఆఖరు; చివర; చరమ; తుది; అంతిమ; కడపటి; కొస; అవసాన; దొన; తిరుగులేని; +* finalize, v. i. తుదిముట్టించు; పూర్తిచేయు; ఫైసలుచేయు; +* finally, adv. ఆఖరుకు; చివరకు; తుదకు; కట్టకడకు; కడాకి; +* financier, n. శ్రేష్ఠి; పెట్టుబడిదారుడు; +* find, v. i 1) నిశ్చయించు; నిర్ణయించు 2) కనిపించు; దొరుక��; +* find, v. t. కనుక్కొను; కనుగొను; వెతుకు; +* fine, adj. సున్నితమై; చక్కనైన; లలిత; బాగున్న; నాణ్యమైన; సన్నని; +* fine, n. జరిమానా; జుర్మానా; జుల్మానా; ధనదండన; +* finesse, n. నేర్పు; నేర్పరితనం; క్లిష్ఠ పరిస్థితులలో చూపే నేర్పరితనం; +* finger, n. వ్రేలు; చేతివ్రేలు; అంగుళం; కరజం; చేమున్ను; అణ్వి rel toe; +* finish, v. i. పూర్తిచేయు; కోసముట్టించు; సమాప్తి చేయు; +* finite, adj. పరిమితమైన; సాంతమైన; మితిగల; హద్దుగల; నిశ్చిత; సమాపక; +* fjord, n. సముద్రపు చీలిక; పర్వత పంక్తులకి మధ్యగా చొచ్చుకు వచ్చిన సముద్రం; +* fire, n. నిప్పు; అగ్ని; అగ్గి; మంట; చిచ్చు; వహ్ని; చిత్రమూలం; +* fire, v. t 1) అంటించు; తగులబెట్టు; ముట్టించు; కాల్చు 2) ఉద్యోగం నుండి తీసివేయుట 3) తుపాకితో పేల్చు; +* firecrest, n. అగ్గిపిచ్చుక; ఒక రకమైన పిచ్చుక; +* fireplace, n 1) అంతిక 2) నెగడి; క్రూర జంతువులని దూరంగా ఉంచడానికి వేసుకునే మంట; +* firewall, n 1) అగ్గోడ; అగ్గిగోడ; అగ్నికుడ్యం; ఒక పక్క నుండి మరియొక పక్కకు మంటలు వ్యాపించకుండా అడ్డంకిలా పనిచేసే గోడ 2) అధికారం లేకుండా కంప్యూటరు వలయాలలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించే వారిని నిరోధించే పరికర సముదాయం; +* firewood, n. వంటచెరకు; కరల్రు; కట్టెలు; చితుకులు; +* fireworks, n. బాణసంచా; చిచ్చుబుడ్లు; మతాబాలు; +* firm, n. వ్యాపార సంస్థ; వర్తక సంఘం; భాగస్వామ్యం; కంపెనీ; +* firmly, adv. ఖరాఖండిగా; నిర్మొహమాటంగా; నీళ్లు నమలకుండా; +* first, n. మొదటిది; ప్రథమం; ఆదిమం; అగ్రిమం; +* first, adj. మొదటి; ప్రథమ; ఆది; తొలి; తొలకరి; ఒకటవ; +first name, ph. పెట్టిన పేరు; కొన్ని సంప్రదాయాలలో పెట్టిన పేరు ముందు ఆ తర్వాత ఇంటిపేరు రాసుకుంటారు; +* fiscal, adj. దేశాదాయ; కోశాదాయ; రాజ్యాదాయ; రాజస్వ; ఆర్థిక; కోశ సంబంధ; రాబడికి సంబంధించిన; ఆర్థిక; ప్రజలనుండి వసూలుచేసిన డబ్బుకి సంబంధించిన; same as financial rel monetary; +fiscal year, ph. ఆర్థిక సంవత్సరం; సరాసరి 12 నెలల కాలం; అమెరికా ప్రభుత్వం వారి ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న మొదలయి, సెప్టెంబరు 30న అంతం అవుతుంది; అందరూ ఇవే తారీకులని అవలంబించాలని నియమం ఏమీ లేదు; +* fish, n. చేఁప; మత్స్యం; ఝషం; మీను; మీనం; శకులి; విసారం; చేపలలో ఉన్న రకాలకి ఎన్నో తెలుగు పేర్లు ఉన్నాయి కాని వాటి వాటికి సరి సమానమయిన ఆంగ్లం పేర్లు తెలియవు. ఉదా ఆకుజెల్ల; ఇంగిలాయి; ఇసుకదొందు; ఈసపిట్ట; ఉల్లాకుచేప; ఉల్లికుచ్చడం; కట్టచేప; కాగిస; కుంటముక్కు; కొరమ్రీను; గండుమీను; చావడాయి; జెల్ల; టేకి; తమ్మరొట్ట; నెత్తళ్లు; పండుగప్ప; పరిగ; పాలబొంత; పులస; పొనుగు చేప; పొరక చేప; పోసరెక్క; బెత��తలు; బేడిస; బొచ్చె; బొమ్మిడాయి; మట్టగిడస; మడవ చేప, మాగ; ములువాలుగ; మోజు; మోరపక్కె; రవ; రాతిగొరక; రామలు; లత్తిచేప; వంజరం; వాలుగ; వాలుగటెంకి; వాలుగపాము; వింజిలి; సొర; +* fish-less, n. నిర్మీనం; నిజ్ఝషం; నిర్మత్స్యం; చేఁపలులేని; మీనుల్లేని; +* fisherman, n. జాలరి; బెస్తవాఁడు; మైనికుఁడు; దాశుఁడు; కేవర్తుఁడు; చేఁపలబట్టువాఁడు; +* fission, n. విభాగం; విదారణం; విచ్ఛిత్తి; విఘటన; +* fist, n. పిడికిలి; ముష్టి; గుప్పెట; లస్తకం; +* fistfight, n. ముష్టియుద్ధం; పిడికిలి పోరు; +* fit, n 1) ఉచితరీతి; అనుకూలమైన; తగిన 2) సరిపడా; పట్టిన 3) మూర్ఛ; +* fit, v. i. అమురు; కుదురు; పొసగు; ఇముడు; +* fit, v. t. అముర్చు; సరిపుచ్చు; కుదుర్చు; ఇముడ్చు; పొసగనిచ్చు; +five year plan, ph. పంచవర్ష యోజనం; పంచవర్ష ప్రణాళిక; +* fix, v. t 1) కుదుర్చు; స్థిరపరచు; లగ్న పరచు 2) తయారుచేయు; అమర్చు 3) బాగు చేయు; మరమ్మత్తు చేయు; +* fixed, adj. స్థిరమైన; అచంచలమైన; స్థావర; అకుంఠిత; అచర; ధ్రువ; +fixed deposit, ph. స్థిరమయిన ధరావతు; స్థావర నిక్షేపం; ఉపనిధి; ఉపనిక్షేపం; +* fixtures, n. స్థావరాలు; ఇళ్లలోనూ, భవనాలలోనూ, గోడలకి, నేలకి స్థిరంగా అమర్చిన కుళాయిలు, దీపాలు, మొదలయిన పరికరాలు; +* flag, n. జెండా; పతాకం; ధ్వజం; బావుటా; కేతనం; సిడం; ప్రేంఖణం; +* flagging, adj. రెపరెపలాడుతూ ఉన్న; నీరసపడిపోతూ ఉన్న; +* flail, v. i. కొట్టుకొను; అసంకల్ప ప్రతీకార చర్యగా కండరాలు గిలగిలా కొట్టుకొను; +* flake, n. పొర; పెళ్ల; పెచ్చు; రేకు; చెక్క; దళం; తునక; తొరక; +* flake, v. i. పొరలు పొరలుగా ఊడు; పెచ్చుకట్టు; పొరలూడు; +* flame, n. మంట; తమట; చిచ్చు; జ్వాల; జ్యోతి; వహ్ని; కీల; అర్చి; +* flame of the forest, n. తురాయి చెట్టు; కోడిపుంజు చెట్టు; అరణ్య అగ్ని జ్వాల; +* flap, n 1) రెక్క; రెక్క వలె ఒక పక్క బందు ఉండీ ఇటూ అటూ ఊగిసలాడే పల్చటి వస్తు విశేషం 2 Ling తాడితం; +* flap, v. i. రెక్కల వలె రెపరెప కొట్టుకొను; +flash point, ph. జ్వలన బిందువు; ఒక వస్తువుని క్రమంగా వేడి చేస్తూ పోతే అది ఎప్పుడైతే భగ్గున మండుతుందో ఆ ఉష్ణోగ్రత; +* flashback, n. పూర్వకథాప్రకాశన; గతస్మృతి; +* flask, n. ఆపుకోరా; జాడీ; గాజుపాత్ర; కుప్పె; కొప్పెర; అడుగున గుండ్రంగా ఉన్న పాత్ర; +* flat, adj 1) చదునైన; బల్లపరుపైన; బిళ్ల; చిపిట; చప్పిడి 2) నిరుత్సాహమైన; +flat food, ph. చప్పడి తిండి; ఉప్పు, కారం లేని తిండి; +* flat, n. లోవరి; తొట్టికట్టు; అంకణం; నివాసభాగం; ఒక పెద్ద భవనంలో అద్దెకి ఉండడానికి అనువుగా కట్టిన భాగం; +* flatter, v. t. ఇచ్చకాలాడు; ఇచ్చకాలు చెప్పు; పొగుడు; తైరు కొట్టు; +* flattery, n. ముఖప్రీతి; ఇచ్చకం; పొగడ్త; తైరు; +* flatulence, n 1) కడుపుబ్బరం; కడుపులో అపాన���ాయువు 2) వాత ప్రకోపం; +* flea, n. జోరీగ; పశుమక్షికం; మిణ్ణలి; +* fledgling, n. శాబకం; కొత్తగా ఎగరడం నేర్చిన పక్షి పిల్ల; +* fleet, n. వాహనాల గుంపు; ఓడల గుంపు; విమానాల గుంపు; +* flight, n 1) ఎగరడం; విమాన ప్రయాణం 2) పారిపోవడం; పలాయనం 3) పక్షుల గుంపు 4) మెట్ల వరస; సోపానములు; +* flight, n 1) పలాయనం 2) విమానయానం; ఆకాశగమనం; గాలిలో ప్రయాణం చెయ్యడానికి వాడే విమాన సౌకర్యం; +* flip, v. t. తిరగవేయు; ఎగరవేయు; మొగ్గ వేయించు; పల్టీ కొట్టించు; బోల్తా కొట్టించు; +* flip, n. బోల్తా; పల్టీ; పరిసెనం; +* flip-flop, n. పల్టీ; ఇది ఒక రకమయిన విద్యుత్ పరివాహం; +* flippant, adj. బాధ్యతని పట్టించుకోకుండా; తిరస్కారభావంతో; అలక్ష్యముతో; +* flip side, n. కీడు వైపు; ఒక పని వల్ల జరగే మేలుని పరీక్షించిన తరువాత చూడబడే కీడు; +* floating-point, n math అస్థిర బిందువు; చలన బిందువు; చర బిందు; ప్లవ బిందువు; +* flock, n. మంద; గుంపు; పక్షుల గుంపు; కులం; +* floe, n. మంచుపొర; సరస్సులలో పైనున్న నీరు గడ్డకట్టగా వచ్చే పొర; +* flogging, n. శిక్షించడానికి కొరడాతో కొట్టడం; +* flood, n. వరద; వెల్లువ; వెల్లి; ప్రవాహం; ముంపుడు; ఔఘం; పెందడి; +* flop, v. i. నేల కరచు; విజయం కాకుండా పోవు; విఫలమగు; చీదేయు; +* floppy, adj. దిట్టతనం లేకుండా వేలాడిపోవు; +* flora, n. వృక్షవర్గం; వృక్షజాలం; ఉద్భిజ్జజాలం; ఒక దేశపు వృక్ష సంపద; +* florescence, n. పువ్వుల పూత; పూబూత; పువ్వులు పూసే కాలం; +* flour, n ఫ్లవర్) పిండి; సున్ని; +* flourish, v. i. ప్రభవిల్లు; వినుతికెక్కు; వెల్లివిరియు; విలసిల్లు; భాసిల్లు; కొమరారు; అలరారు; శోభిల్లు; పరిఢవిల్లు; నమనమలాడు; వర్ధిల్లు; +* flout, v. t. ధిక్కరించు; నిర్లక్ష్యం చేయు; +* flow, n. ప్రవాహం; స్రావం; అకిని; చాలు; +* flow, v. i. ప్రవహించు; స్రవించు; పారు; ఓడిగిల్లు; +* flower, n ఫ్లవర్) పువ్వు; పుష్పం; సుమం; కుసుమం; విరి; అలరు; +* flower, v. i. పూయు; విచ్చు; పుష్పించు; అలరారు; +* flu, n. ఇన్‌ఫ్లూయంజాని కత్తిరించగా వచ్చిన మాట; +* fluctuation, n. ఊగిసలాట; ఉచ్చావచం; హెచ్చుతగ్గులు; +* fluently, adv. ధారాళంగా; ఝరిగా; వాచాలకత్వంగా; +* fluency, n. ఒక భాషని తడబడకుండా మాట్లాడగలగడం; వాగ్ధాటి; వాగ్ఘరి; +* fluid, n. ఐర; ద్రవర్ధం; ద్రవపదార్థం; ద్రవద్రవ్యం; +* fluke, n. గుడ్డి గురప్రు తాపు; కలిసొచ్చిన అదృష్టం; +* fluorescence, n. ప్రతిదీప్తి విద్యుదయస్కాంత వికిరణాన్ని పీల్చుకుని తిరిగి పరావర్తనంగా ప్రకాశించడం; సాధారణంగా పతన కాంతి కంటే పరావర్తన కాంతి నీరసంగానూ, తక్కువ పౌనఃపున్యంతోనూ ప్రకాశిస్తుంది; అప్పుడప్పుడు పతన, పరావర్తన కాంతుల పౌనఃపున్యం సమానంగా ఉంటాయి; అప్పుడు దానిని అనునాద ప్ర���ిదీప్తి అంటారు; ఉదాహరణకి యశద గంధకిదం (ZnS) ప్రతిదీప్తి పదార్థం see also) phosphorescent; florescence; +* fluorine, n. ప్లవము; ఒక రసాయన మూలకం; సంక్షిప్త నామం F; అణు సంఖ్య 9; +* flurries, n. pl. మంచు పరకలు; మంచు రేకులు; చెదురుమదురుగా పడ్డ కొద్దిపాటి మంచు; +* flush, adj 1) సమతలంగా ఉండు 2) పుష్ఠిగా ఉండు; పిటపిటలాడుతూ ఉండు; +* flush, v. i. ఎరబ్రారు; సిగ్గుతో ఎరబ్రడు; +* flux, n. అభిప్రసారం; అభిప్రవాహం; +* fly, n 1) ఈగ; మక్షికం 2) పంట్లాం బొత్తాలు కనబడకుండా కప్పే గుడ్డ; +* fly, v. i. ఎగురు; ఉడ్డయనం చేయు; విమానంలో ప్రయాణం చేయు; +* flyer, n. పతంగిక; గోదకి సూదితో గుచ్చి వేలాడదియ్యడానికి వీలయిన కాగితం; +* flying fox, n. మాంధాలం; గబ్బిలం జాతిలోకెల్ల అతిపెద్దజంతువు; +* foal, n. గుర్రప్పిల్ల; గురప్రుజాతి జంతువుల పిల్ల; +* focus, n 1) తేజఃకేంద్రం; నాభి; కాంతి కేంద్రం 2) అవధానం; లక్ష్యం; +* fodder, n. మేత; గ్రాసం; పశుగ్రాసం; కసువు; దాణా; +* foe, n. శత్రువు; అరి; దాయ; పరిపంధి; +* foil, n 1) పల్చని రేకు; ముచ్చిరేకు; తగడు 2) మరొకరి తరఫున నిల్చిన వ్యక్తి; +* foil, v. t. పాడుచేయు; వమ్ము చేయు; చెడగొట్టు; భంగపరచు; అడ్డగించు; +* fold, v. i. ముడుచుకొను; ముకుళించు; +* foliage, n. ఆకుపసందు; పత్రసముదాయం; వృక్షాది పత్రసముదాయం; చెట్లమీదనున్న ఆకులు; +* folio, n. అర ఠావు పరిమాణంలో ఉన్న పుస్తకం; +* folk, adj. జానపద; గ్రామీణ; పల్లె; లోక; దేశీ; +* folk, n. జనత; ప్రజలు; వాళ్లు; లోకులు; +* follow, v. t 1) అనుగతించు; వెంబడించు; వెనుక వెళ్లు 2) అనుసరించు; పాటించు; అమలుపరచు; +* folly, n. అవివేకం; బుద్ధితక్కువ పని; తప్పు; పొరపాటు; +* foment, v. t. కిర్రెక్కించు; ద్వేషాన్ని రగుల్చు; +* fomentation, n. కాపడం; ఆవిరిలో గుడ్డని ముంచి, నీళ్ళు పిండి కాపడం పెట్టడం; +* fond, v. adj. ఇష్టపడు; ప్రేమ చూపు; అభిమానం చూపు; +* fondle, v. t. నిమురు; తడుము; ప్రేమతో తడుము; బుజ్జగించు; +* fondling, v. t. ప్రేమతో నిమరడం; ప్రేమతో తడమడం; +* fondness, n. ఎక్కువ ప్రేమ; విశేషమైన అభిమానం; +* fontanel, n. మాడ; మాడు; బ్రహ్మరంధ్రం; శిశువు నడినెత్తిమీది మెత్తటి భాగం; +* food, n 1) ఆహారం; తిండి; కూడు; ఓగిరం; వంటకం; ఇలి; ఓదనం; పాథేయం; అశనం; అన్నం 2) మేత; గ్రాసం; +* food for a journey, ph. పాథేయం; దారిలో తినడానికి పట్టుకెళ్ళే తిండి; +* foolishness, n. మూఢత్వం; తెలివితక్కువతనం; బుద్ధిహీనత; +* foot, n 1) పాదం; అడుగు; అంజ; హజ్జ 2) అడుగు; పన్నెండు అంగుళములు 3) పాదం; పద్యంలో నాల్గవ భాగం 4) మట్టు; పదతలము; +* footprint, n. పాద ముద్ర; పాదష్పదం; ఒక ఉపకరణం నేలమీద ఆక్రమించే స్థలం; +* footnote, n. అధోజ్ఞాపిక; అధోదీపిక; అధస్సూచిక; పాదటిప్పణి; షరా; +* footpath, n. కాలిదోవ; కాలిదారి; కాలిబాట; ఏకపది; +* footwear, n. pl. పాదరక్షలు; చెప్పులు; జోళ్లు; పాంకోళ్లు; +* forbid, v. t. నిషేధించు; కూడదని వారించు; +* force, n 1) బలం 2) జోరు; తడాఖా; జబర్దస్తీ; బలాత్కారం phy బలం; +electromagnetic force, ph విద్యుదయస్కాంత బలం; ప్రకృతిలోని చతుర్విధ బలాలలో ఒకటి; +gravitational force, ph. గురుత్వాకర్షక బలం; ప్రకృతిలోని చతుర్విధ బలాలలో ఒకటి; +strong force ph త్రాణిక బలం; ప్రకృతిలోని చతుర్విధ బలాలలో ఒకటి; +weak force, ph. నిస్త్రాణిక బలం; ప్రకృతిలోని చతుర్విధ బలాలలో ఒకటి; +* forceps, n. స్రావణి; స్రావణం; చిమట; కంకముఖం; +* forecast, n. రాబోయే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం; భవిష్యత్ సూచనం; భవిష్యత్ పురాణం; అనగాతవేద్యం; +* forecasting, n. పూర్వనుమానం; ప్రక్షేపణం; భవిష్యత్ సూచనం; భవిష్యత్ పురాణం; అనగాతవేద్యం; రాబోయే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం; +* forefathers, n. పూర్వులు; పితరులు; పితృదేవతలు; +* forehand, n 1) ముంజేయి; ప్రకోష్టము 2) టెన్నిస్ ఆటలో ఒకవిధంగా బంతిని కొట్టడం; +* forehead, n. నుదురు; నొసలు; నొష్ట; లలాటం; ఫాలము; +* foreign, adj. విదేశ; విదేశీ; పర; పరాయి; అన్య; భిన్నమైన; అపరంజి; +* foreigner, n. విదేశీయుడు; పరదేశి; అన్యదేశస్థుడు; ఫిరంగి; లాతివాడు; +* foreman, n. శ్రేష్ఠుడు; పనివారిలో పెద్ద; న్యాయస్థానంలో జూరీలో పెద్ద; +* forenoon, n. పూర్వాహ్నము; మధ్యాహ్నానికి ముందు వేళ; +* forensic, adj. న్యాయవిచారణకి అనుకూలమైన; రచ్చబండలో చర్చకి అనుకూలమైన; న్యాయసభా సమ్మతమైన; +* foreskin, n. ముందోలు; పురుషుడీ లింగాగ్రాన్ని కప్పి పుచ్చే చర్మం; +* forest, n. అరణ్యం; అడవి; కాననం; కాన; కాంతారం; వనం; వని; సానువు; అటవి; విపినం; కోన; +tropical forest, ph. అయనరేఖాంతర అరణ్యం ఉష్ణమండల అరణ్యం; +forest fire, ph. కార్చిచ్చు; కారగ్గి; ఎరగలి; వనవహ్ని; దావాగ్ని; దావవహ్ని; +* forestry, n. అటవీశాస్త్రం; తరుకృషి; +* foreteller, n. అనాగతవేది; భవిష్యత్తుని చెప్పేవాడు; +* forfeit, v. i. ఒదులుకొను; నష్టపోవు; పోగొట్టుకొను; +* forfeiture, n. ఒదులుకొన్నది; నష్టం; పోగొట్టుకొన్నది; +* forge, v. t 1) దొంగ సంతకం పెట్టు 2) కమ్మరి పని చేయు; +* forge, n. కమ్మరి కార్ఖానా; కమ్మరి కొలిమి; +* forged, adj. చేసిన; కల్పించిన; సృష్టించిన; కమ్మరి కొలిమిలో తయారు చేసిన; +* forged steel, ph. కొలిమిలో వేడి చేసి, సుత్తితో బాది తయారు చేసిన ఉక్కు; +* fork, n 1) పళ్ల చెంచా; ముక్కోల; మూడు పళ్ల చెంచా; చతుశ్శూలం; నాలుగు పళ్ల చెంచా 2) పంగ చీలిక; పాయ; +* forlorn, adj. దిక్కుమాలిన; నిరాధారమైన; +* form, n 1) మూర్తి; ఆకారం; ఆకృతి; రూపం; రూపు; స్వరూపం; పొడ 2) కాగితం; పత్రం; ప్రపత్రం; ఫారం 3) నిర్మాణం; +* formal, adj. నియత; పద్ధతి ప్రకారం జరిగే; క్రమబద్ధ; ఆచారబద్ధ; సంప్రదాయిక; లాంఛనప్రాయ; +* formaldehyde, n. పిపీలికాలంతం; హీరాలంతం; రంగులేని ఘాటైన వాయువు; శరీరాంగాలని భద్రపరచడానికి ఈ ద్రావణం వాడతారు; HCHO; +* formality, n. ఆచారం; లాంఛనం; నియమ ప్రకారంగా మర్యాదకి చేసే తంతు; +* formally, adv. మర్యాదపూర్వకంగా; నియమ ప్రకారం; +* formica, n 1) పిపీలికం; చీమ; హీరా 2) ఒక రకం ప్లేస్టిక్‍; +* formicary, n. చీమలపుట్ట; పిపీలికాలయం; హీరాలయం; +* formless, n. అమూర్తం; నిరాకారం; ఆకారవిహీనం; +* formula, n 1) సూత్రం; పద్ధతి; క్రమం; నియమం; వాడిక 2) మంత్రం; మనువు; +* fornication, n 1) పెళ్ళికాని పిల్ల పెళ్ళికాని పురుషుడితో లైంగిక సంబంధం కలిగి ఉండడం; రంకు; వ్యభిచారం; జారత్వం 2) సుఖ దాంపత్యానికి భంగం కలిగిస్తూ చేసే లైంగిక ప్రక్రియ; +* forswear, v. t. కాదని శపథము చేయు; కాదని ప్రమాణం చేయు; ఒట్టు పెట్టు; +* fortuitous, adj. కాకతాళీయం; యాదృచ్ఛికం; అనుకోకుండా ; +fortune teller, ph. సోదె చెప్పే వ్యక్తి; కాలవేది; జ్యోతిష్కుడు; ఎరుక చెప్పే వ్యక్తి; +* forward, adj. పురోగామి; అగ్ర; ముందరికి; ఎదటికి; +* foster, v. t. పాలించు; మంచిచెడ్డలు చూడు; పెంచు; సాకు; +foster child, ph. పెంపుడు బిడ్డ; తల్లిదండ్రులుకాకుండా మరొకరిచే పెంచబడ్డ బిడ్డ; +foster parent, ph. పెద్దదిక్కు; పిల్లల మంచి చెడ్డలు చూసే పెద్ద; +* foul, adj. చెడ్డ; మురికి; కుళ్ళు; బూతు; అశ్లీల; +* foundation, n 1) పునాది; అడుగుమట్టు; మూలబంధం; అస్తిభారం 2) సంస్థ; ఉట్టంకణం; ప్రతిష్ఠ; ప్రతిష్ఠానం; ఇష్టపూర్తం; మంచి పనులు చేసే సంస్థ ety ఆలయ, తటాక, భూదాన, ప్రతిష్ఠాపన; కృతి స్వీకరణ మొ॥ సప్తసంతానాలు; +* foundationalism, n. సంపూర్ణమూలవాదం; ఒక రకం సాహిత్య విమర్శ; +* founders, n. pl. ఆద్యులు; సంస్థాపకులు; ప్రవర్తకులు; +* foundry, n. లోహాలని పోత పోసే కార్ఖానా; +* fountain, n. బుగ్గ; ఊఁట; చెలమ; జలజంత్రం; అంబుస్పోటం; కారింజా; ఉత్సం; ఉద్వారి; +* four, n 1) నాలుగు 2) నలుగురు; చతుష్టయం; చతుష్కం; +* four corners, n. చత్వరం; శృంగాటకం; నాలుగు వీధుల కూడలి; చౌరస్తా; +* fourteen, n. పద్నాలుగు; పదునాలుగు; చతుర్దశ; +* fourth, n 1) నాలుగవది; చతుర్థం; తురీయం; తుర్యం 2) నాలుగింట ఒకటి; +* fowl, n 1) పక్షి 2) కోళ్లు 3) కోడి జాతి పక్షులు; +* fox, n. నక్క; జంబుకం; గోమాయువు; ఫేరవం; +* foxtail, n. గడ్డి మైదానాలలో పెరిగే ఒక జాతి కలుపు మొక్క; +mixed fraction, ph. మిశ్రమ భిన్నం; సాంశ సంఖ్య; అంశతో కూడిన సంఖ్య; +* fragment, n. శకలం; ముక్క; పలుకు; తునక; భాగం; వ్రక్క; భిత్తి; ఖండం; ఖండతుండం; +* fragrance, n. పరిమళం; తావి; సురభి; సౌరభం; గమ్ము; ఫల పుష్పాదులు ఇచ్చే సువాసన; see also aroma; +* frankincense, n. ఆఫ్రికాలోనూ, అరేబియాలోనూ ఉన్న కొన్ని చెట్లనుండి స్రవించే గుగ్గిలం, సాంబ్రాణి వంటి సుగంధ ద్రవ్య��� ety frank pure, incense bot Boswellia thurifera +* frame, n 1) చట్రం; చక్కీ; చౌకట్టు; బందు; ఆత 2) పన్నా; బట్టని నేసేటప్పుడు వాడిన చక్రం యొక్క పొడుగు కొలత 3) చంద్రిక; పట్టు పురుగులను పెంచే చట్రం 4) వ్యక్తి యొక్క అంగసౌష్టవం; +* frame, v. t 1) చట్రంలో బిగించడం 2) ఊహని కాని ప్రణాళికని కాని రూపుదిద్దడం 3) అన్యాయంగా నేరంలో ఇరికించడం; +* franchise, n 1) ఎన్నిక హక్కు; ఓటు హక్కు 2) మరొకరి వ్యాపార చిహ్నాన్ని కాని, పేటెంటుని కాని వాడుకుని స్వంత వ్యాపారం చేసుకోగలిగే వెసులుబాటు లేక హక్కు 3) ఒక వ్యాపార సంస్థగా ఉండడానికి ప్రభుత్వం ఇచ్చిన హక్కు; +* frankly, adj. నిష్కపటంగా; దాపరికం లేకుండా; +* fraternity, n 1)సౌభ్రాత్రుత్వం; సౌభ్రాత్రం; సోదరభావం 2) సహోదర సంఘం; +* frantic, adj. మయిమరచిన కంగారుతో; గాభరాగా; +* fraud, n. మోసం; దగా; బూటకం; వంచన; కూటకరణం; +free holdings, ph. మాన్యములు; ఉచితంగా లభించిన భూములు; +* freedom, n. స్వతంత్రం; స్వాతంత్య్రం; విముక్తి; విమోచనం; విచ్చలవిడితనం; నిరాటంకం; +freedom of press, ph. ముద్రణా స్వాతంత్య్రము; పత్రికా స్వాతంత్య్రము; +* freelance, adj. స్వతంత్ర; ఒక కక్షకి సంబంధించని; +* freelancer, n. స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యక్తి; ఒక కక్షకి సంబంధించని వ్యక్తి; ఒకరి దగ్గర ప్రత్యేకం ఉద్యోగం చెయ్యకుండా పని చేసుకునే మనిషి; +* freeze, v. i. గడ్డకట్టు; ఘనీభవించు; పేరుకొను; స్తంభించు; +* freezing, n. గడ్డకట్టుట; ఘనీభవనం; ఘనీకరణం; +* freight, n. కేవు; రవాణారుసుం; ఓడకూలి; +* French, n. పరాసులు; ఫ్రెంచివారు; +* frequency, n. ఆవృత్తి; తరచుదనం; మాటిమారు; వీపసం; బాహుళ్యం; స్థాయి; ద్విరుక్తం; పునఃపునం; పౌనఃపున్యం; శృతి; పదేపదం; అడుగడుగు; మాటిమాటి; +* frequently, adv. తరచుగా; బాహుళ్యంగా; మాటిమాటికీ; అడుగడుక్కీ; పదేపదే; +* fresh, adj 1) తాజా; తాజా అయిన; నూతన; నవీన 2) మంచి; శుభ్రమయిన; తాగడానికి వీలయిన; +* freshman, n. నాలుగేళ్లపాటు కొనసాగే విద్యార్థి దశలో మొదటి ఏటి విద్యార్థి; +* freshmen, n. pl 1) కళాశాలలో మొదటి సంవత్సరపు విద్యార్థి బృందం; +* fricative, n ling కషణాక్షరం; ఊష్మం; స్పృష్టోష్మములు; రాపిడీ వల్ల పుట్టే ధ్వని; కంఠనాళం నుండి బయటకు వచ్చే గాలిని పూర్తిగా ఆపకుండా తగుమాత్రం నిరోధించగా వచ్చే శబ్దాలు; చ వర్గీయ ధ్వనులు; +* friction, n. ఒరిపిడి; రాపిడి; ఘర్షణ; రంపు; కషణం; నికషం; కర్షం; +* Friday, n. శుక్రవారం; భృగువారం; +* friend, n. నేస్తం; m. స్నేహితుడు; చెలికాడు; మిత్రుడు; సఖుడు; సంగాతకాడు; సంగడికాడు; సోపతికాడు; f. స్నేహితురాలు; చెలియ; చెలి; చెలికత్తె; నెచ్చెలి; సఖి; +boy friend, ph. సంగడికాడు; సంగాతకాడు; చెలికాడు; సఖుడు; +* friendliness, n. స్నేహభావం; మైత్రీభావం; సౌమనస్యం; +* friendship, n. స్నేహం; మైత్రి; సఖ్యత; సఖ్యం; నెయ్యం; చెలిమి; పొందిక; పొత్తు; పొంతనం; కూరిమి; సౌహార్దం; సాంగత్యం; సంగాతం; సంగడి; సెరబడి; సయోధ్య; +* frigid, adj. శిశిర; అతి శీతలమైన; బాగా చల్లగా ఉన్న; +fringe benefits, ph. శివారు భత్యాలు; భత్య వేతనాలు; ఉద్యోగస్తునికి జీతంతోపాటు ఇచ్చే అమాంబాపతు భత్యాలు; +* frog, n. కప్ప; మండూకం; భేకం; భేకి; శాలూరం; +* frond, n. మట్ట; తాటి, ఈత, కొబ్బరి జాతి చెట్ల మట్ట; +front yard, ph. తలవాఁకిలి; ముంగిలి; ప్రాంగణం; +* front, n 1) ఎదురు; ముందఱి భాగం 2) యుద్ధ రంగం; +* frost, n. మిహిక; ఇగము; ఇవము;గడ్డకట్టడం; గడ్డకట్టినది; రాత్రి కురిసిన తుహిన బిందువులు చలికి గడ్డకట్టడం rel తుహినం; +* frostbite, n. మంచు కొరుకుడు; శరీర భాగాలు విపరీతంగా చలి బారి పడడం వల్ల కణజాలానికి కలిగే గాయం; +* frost line, n. మిహిక రేఖ; కొండలలో ఈ ఊహాత్మక రేఖకి ఎగువ చెట్లు బాగా పెరగవు; +* froth, n 1) నుఱగ 2) నోటినుండి వచ్చే నుఱగ; +* frown, v. i. భృకిటించు; భృకుటి ముకుళించు; కనుబొమలు ముడి వేయు; అయిష్టంగా చూడు; +* fructose, n. ఫలోజు; ఫలచక్కెర; ఫలశర్కర; పళ్లలో లభించే చక్కెర; +* frugal, adj. పొదుపు; పోడిమి; మితవ్యయం; దుబారా చెయ్యకుంఢా ఉండడం exp ఖరీదయిన వస్తువులమీద ఖర్చు కావచ్చు; దుబారా కాకుండా ఉండాలి; +* fruition, n ఫ్రూఇషన్) ఆపోక; నెరవేరుపు; ఈడేర్పు; ఫలవంతం; +* fruitless, n. నిరర్థకం; నిష్ఫలం; ప్రయోజనం లేనిది; +dried fruits, ph. మేవాలు; ఎండుపండ్లు; ఎండుపళ్ళు; +* frustration, n. నిష్ఫలతతో వచ్చే నిరుత్సాహం;నిస్పృహ; +* fry, n. వేఁపుడు; భృష్టి; సాతాళింపు; +stir fry, ph. సాతాళింపు; నూనె తక్కువగా వేసి వేయించడం; +deep fry ph. లోవేపుడు; మరిగే నూనెలో వేసి వేయించడం; +* fry, v. t. వేయించు; వేఁపు; సాతాళించు; +deep frying pan, ph. అంబరీషం; మంగలం; వేఁపుడు చట్టి; బాణలి; బాండి; మూఁకుడు; భ్రాష్టం; +frying pan to fire, ph idiom] అంబరీషం నుండి అగ్ని గుండం లోకి; పెనం నుండి పొయ్యిలోకి; అది కుమ్ము, ఇది దుమ్ము; +* fuel, n ఇంధనం వంట చెరకు, బొగ్గులు, పెట్రోలు, మొదలైన పదార్దాలు; +fuel cell, ph. ఇంధన కోషిక; ఇంధన కోష్టం ఇంధన కోష్టిక ఉదజని వాయువు సహాయంతో విద్యుత్తుని పుట్టించడానికి వాడే ఒక సాంకేతిక ఉపకరణం; +fuel oil, ph. ఇంధనపు ౘమురు; ఇంధనపు నూనె; +* fugitive, n. పరారీ; పారిపోయిన వ్యక్తి; పోలీసుల నుండి పారిపోయిన వ్యక్తి; +* full, adj. పూర్ణ; పూర్తి; నిండైన; నిండిన; కిక్కిరిసిన; పరిపూర్ణ; +* fully, adv. పూటుగా; పూర్తిగా; నిండుగా; +* fumble, v. t. తడమాడు; తవుళ్లాడు; పుణకరించు; +* fume, n. సెగ; కావిరి; ఘాటయిన వాయువు; బాష్పం; ధూమం; ఊదర; +* fumigate, v. t. ఊదరబెట్టు; ఊదరగొట్టు; పొగ���ెట్టు; ధూపము వేయు; +* fumigation, n ఊదరబెట్టడం పొగపెట్టడం; ధూపము వేయడం; +* fun, n 1) వేడుక; వినోదం; తమాషా 2) పరిహాసం; పరాచకం; ఎకసక్కెము; ఎగతాళి; +* function, n 1) పని; ప్రకార్యం; వృత్తి 2) ఉపయోగం 3 math ప్రమేయం సంబంధం; కార్యకరణం; నియోగం; నియోజ్యం; +* functional, adj 1) ఉపయోగకర మైన; జీవికోపయోగ; ప్రయోజనాత్మక 2) ప్రమేయాత్మక; +* fundamental, adj. ప్రాథమికమైన; మూలాధారమైన; మౌలిక; ముఖ్యమైన; +* funeral, n. అంత్యక్రియలు; ఉత్తర క్రియలు; +funeral pyre, n. చితి; చితి పేర్చే స్థలం; ఒలికి; వల్లకాడు; అంత్యక్రియల అగ్నిగుండం; +* funnel, n. గరాటు; గరగడ; గళ్ళా; పొన్న; పుటిక; +* funny, adj. హాస్యరసపూరితమైన; నవ్వించెడు; +* fur, n. బొచ్చు; బొచ్చుగల చర్మం; +* furious, adj. ఉగ్రమైన; ఆగ్రహముతో; ప్రచండమైన; +* furniture, n. తట్టుముట్లు; కుర్చీలు, సోఫాలు, బల్లలు, మొదలైనవి; +* furrow, n 1) నాగేటిచాలు; చాలు 2) వయస్సుతో మొహం మీద వచ్చే ముడత 3) నుదుటి మీద వచ్చే ముడత; +* furrows, n. pl 1) నాగేటిచాళ్ళు; చాళ్ళు 2) నుదుటి మీద వచ్చే ముడతలు; +* further, adv. పిమ్మట; తర్వాత; వెండియు; మళ్లా; +* furtively, adv. లోపాయకారీగా; రహశ్యంగా; గుప్తంగా; గుట్టుగా; జాగ్రత్తగా; +* fury, n. ఆగ్రహం; ఆగ్రహావేశం; క్రోధావేశం; కోపం; విపరీతమైన కోపం; రౌద్రం; +* futile, adj. నిరర్థకమైన; వ్యర్థమైన; పనికిమాలిన; +* future, adj. భావి; భవిష్యత్తు; రాబోయే; కాబోయే; కలగబోయే; + + +* gadfly, n 1) జోరీగ; పశువులని చికాకు పెట్టే ఈగ 2) అప్రస్తుత ప్రసంగి; చొప్పదంటు ప్రశ్నలతో చిరాకు పెట్టే వ్యక్తి; +* gadget, n. సదుపాయమైన పనిముట్టు; +* gadwall, n. కేకబాతు; అరుపుల బాతు; ఒక రకమైన బాతు; +* gaffe, n గ్యాఫ్) పొరపాటు; అనాలోచిత చర్య; +* gag, n. వాకట్టు; మాట్లాడడానికి వీలు లేకుండా నోటికి వేసే గుడ్డ కట్టు; +* gag order, ph. న్యాయస్థానంలో జరిగిన విషయాలు బయట మాట్లాడ కూడదని న్యాయమూర్తి వేసే ఆంక్ష; +* gain, n. లాభం; లబ్ధి; ఫలం ప్రయోజనం; పెరుగుదల; వృద్ధి; గెలుపు; నఫా; +* gainsay, v. t. కాదను; తిరస్కరించు; ఖండించు; +* gainsayer n. కాదనేవాడు; అడ్డుపెట్టేవాడు; అడ్డుపుల్ల వేసే వ్యక్తి; ఆక్షేపించే ఆసామీ; +* galaxy, n. గేలక్సీ; క్షీరసాగరం; ఆకాశగంగ; నక్షత్రవీధి; నక్షత్రసముదాయం; +strong gale, ph. ప్రభంజనం; ప్రచండ వాయువు; ప్రచండ పవనం; ఝంఝూమారుతం; +* galena, n. సౌవ్వీరాంజనం; సీసం యొక్క మూల ఖనిజం PbS; +* gall, n 1) పిత్తము; పైత్యరసం 2) కసి; కక్ష 3) తెగువు; +* gallbladder, ph. పిత్తాశయం; చేదుకట్టు; పసరు తిత్తి; +* gallstones, n. పిత్తపు బెడ్డలు; పైత్యపు బెడ్డలు; పిత్తాశ్మరి; గోరోజనం ఇవి రాళ్లుగా మారిన కొలెస్టరాల్ బెడ్డలు; +* gallery, n.(1) సరంబీ; తాళ్వారం; వారపాక; వసారా 2) చిత్రశ్రేణి; ���క్ష; చిత్రాలయం; +* gallon, n. గేలను; ద్రవ పదార్థాలని కొలిచే కొలత; +* galvanize, v. t 1) కళాయివేయు; పూతపూయు 2) విద్యుచ్ఛక్తి ప్రవహింప చేయు; +* gambit, n. ఎత్తు; ఎత్తుగడ; చదరంగంలో వేసే ఎత్తు; +* gambler, n జూదరి; జూడదగాడు; కితవుడు; అక్షదేవి; అక్షధూర్తుడు; +* gambling, n. జూదం; ద్యూతం; నెత్తం; దురోదరం; +gambling with animate "pawns ph. సజీవ ద్యూతం; కోడి పందేలు, పొట్టేలు పందేలు, గుర్రప్పందేలు, మొదలగునవి; +gambling with inanimate "pawns ph. నిర్జీవ ద్యూతం; కోడి పందేలు, పొట్టేలు పందేలు, గుర్రప్పందేలు, మొదలగునవి; +* gambols, n చెంగనాలు; గంతులు; పిల్ల పశువులు వేసే గంతులు; +* game, n 1) ఆట; కేళి; క్రీడ 2) లేడి; దుప్పి, అడవిపంది; మొదలయిన వేట జంతువులు; +* gamut, n 1) సప్తస్వరస్థాయిలు; స్వరసప్తకం; సరిగమలు; అన్ని స్వరాలు 2) సర్వం; అంతా; ఈ కొస నుండి ఆ కొస వరకు; +* gamete, n. సంయుక్త బీజం; మరొక లింగ బీజంతో సంయోగం చెందడానికి వీలయిన లింగ బీజం; +* gang, n. గుంపు; ముఠా; పనివారి ముఠా; +* ganglion, n. గుచ్ఛిక; నాడీసంధి; నాడిముడి; +* gangrene, n. శరీరం లోని మెత్తని ధాతువులు మృతి పొందుట; +* gap, n. ఎడం; తేడా: ఖాళీ; వెలితి; వారడి; వార; సందు; మొర్రి; గండీ; వ్యవధానం; అంతరం; అభ్యంతరం; అవకాశం; +* gape, v. i నోరెళ్లబెట్టుకుని చూచు; +* garb, n. ఉడుపు; దుస్తులు; వేషం; +* garbage, n. చెత్త; చెత్త, చెదారం; పెంట; తుక్కు; +* garden, n. తోట; వనం; ఆరామం; వృక్షవాటిక; ఉద్యానవనం; +* gargle, v. i. పుక్కిలించు; గండూషించు; +* garland, n. మాల; దండ; పూలచెండు; సుమమాలిక; సరం; తోమాల (తోట మాల దామం; +* garlic, n 1) ఉల్లి; ఉల్లిపాయ; ఉల్లిగడ్డ; అల్లియం 2 వెల్లుల్లి చిన్న ఉల్లి; రసోనకం; లశునం; పలాండు; గృంజనం; అరిష్టం; మహాకంద; ఉగ్రగంధం; +* garnish, n తినుభండారాలని అలంకరించడానికి వాడే మరొక తినదగ్గ పదార్థం; ఉదా. కొత్తిమిర, పుదీనా, +inert gas, ph. జడ వాయువు; విరళ వాయువు; ఆవర్తన పట్టికలో 0 గుంపు మూలకాలయిన He, Ne, Ar, Kr, Xe, Rn జడ వాయువులు; +perfect gas, ph. ఆదర్శ వాయువు; PV RT అనే సూత్రాన్ని అతిక్రమించకుండా ప్రవ్ర్తించే వాయువు; +rare gas, ph. విరళ వాయువు; జడ వాయువు; ఆవర్తన పట్టికలో 0 గుంపు మూలకాలయిన He, Ne, Ar, Kr, Xe, Rn వాయువులు; +* gasp, n. రొప్పు; ఒగర్పు; ఎగశ్వాస; +* gastritis, n. పరిణామ శూల; కడుపు లోపలి పొర వాపు; ఈ వాపు రకరకాల కారణాల వల్ల రావచ్చు; +* gate, n. ద్వారం; గవను; గవని; గేటు; దిడ్డి; తలవాకిలి; +gatekeeper, ph. ద్వారపాలకుడు; ప్రతీహారి; తలవాకిలి వాడు; సన్నిధానవర్తి; పూజారి; గేటు కాపరి; +* gateway, n 1) సింహద్వారం; ముఖద్వారం 2) రెండు విభిన్నమైన కంప్యూటరు వలయాల మధ్య సంభాషణకి అనుకూలంగా అమర్చబడ్డ మరొక కంప్యూటరు; +* gather, v. t 1) పోగుచేయు; సంత���ించు; సేకరించు; కూడగట్టుకొను; సంగ్రహించు 2) దండు; +* gauge, n గేజ్) కొలమాపకం; కొలమానం; మాపకం; +rain gauge, ph. వర్షమాపకం; వాన ఎంత పడ్డదో కొలిచే సాధనం; +* gauze, n గాజ్) గాజు గుడ్డ; దోమతెర గుడ్డ వంటి గుడ్డ; గాయాల మీద కట్టు కట్టడానికి వాడే ప్రత్యేకమైన గుడ్డ; +* gay, n. m. మరొక పురుషుని యెడల లైంగికమైన ఆకర్షణ పొందే పురుషుడు; see homosexual; +* gazebo, n మండపం; చదరం లేక అష్టభుజి ఆకారంలో ఉంది, పైన కప్పు ఉన్న కట్టడం; +* gazelle, n. హరిణం; దుప్పి; కణుచు; ఏణ; పెద్ద పెద్ద కళ్లు, ఒంకీలు తిరిగిన నిటారైన కొమ్ములు ఉండే ఒక జాతి లేడి; +* gazette, n ప్రభుత్వ వార్తాపత్రిక; ప్రభుత్వం వారు వారి సమాచారాలని ప్రకటించే పత్రిక; +gazetted officer, ph. భారత ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్నత శ్రేణి ఉద్యోగులు; +* gear, adj. దంతదారు; పళ్ళ చక్రం; ఉదా. కారులో ఇంజను నుండి బండికి శక్తిని అందించే యంత్రాంగంలో ఉండే పళ్ళ చక్రం; +* gel, v. i. గడ్డకట్టు; పేరుకొను; కరడు కట్టు; ముద్దకట్టు; ఘనీభవించు; తుట్టెకట్టు; +* gelatin, n. జాంతవం; రంగు, రుచి లేని జంతు సంబంధమైన జిగార్థం; తిక్తరసం; +* gem, n 1) రత్నం; మణి; మాణిక్యం 2) విలువైనది; +* Geminorum, n. పునర్వసు నక్షత్రం; పునర్వసు నక్షత్రాల గుంపు; ఇందులో ఆల్ఫా జెమినోరం ని Castor అంటారు; +* geminate, n. ద్విత్వాక్షరం; ద్విత్వం; +* gemination, n. ద్విరుక్తం ఒక హల్లుని రెండు మాత్రల కాలం పలకడం ఉదాహరణకి baggage బేగ్‍ గేజ్‍ అని పలకం, బేగేజ్‍ అంటాం. కాని cattail ని కేట్‍ టైల్ అని ట శబ్దాన్ని రెండు సార్లు పలుకుతాం; +తెలుగులో వ్యాకరణపరంగా మహత్, అమహత్ (masculine person, non-masculine) వాచకాలు మాత్రమే ఉన్నాయి. కనుక తెలుగు క్రియలు రెండు రకాలుగా మాత్రమే మారుతాయి. ఉదా: అతడు వచ్చాడు, ఆమె వచ్చింది, అది వచ్చింది; రాముడు వచ్చాడు, సీత వచ్చింది, ఎద్దు వచ్చింది, ఆవు వచ్చింది. లింగాలు రెండు రకాలు: వ్యాకరణ లింగాలు, ఆర్థిక లింగాలు అని (grammatical genders, semantic genders తెలుగు భాషలో ఇవి రెండూ వేరు వేరు. పదం యొక్క అర్థాన్ని బట్టి అది పుల్లింగమా, స్త్రీ లింగమా లేక నపుంసక లింగమా అన్నది మనం నిర్ణయించుకొంటాము. కానీ వ్యాకరణ పరంగా క్రియా పదాలను వాడేటప్పుడు మహత్, అమహత్ అనే రెండు లింగాలనే ప్రయోగిస్తాము. బహువచన ప్రయోగంలో మళ్లీ మహద్మహతీ వాచకాలు ఒకలాగా వాడతాం ఆ స్త్రీలు వచ్చారు' అంటాము గానీ 'ఆ ఎద్దులు వచ్చారు' అనం కదా. +* gene, n. జన్యువు; జీను; వారసవాహికలలో ఒక భాగం; వంశపారంపర్యంగా సంక్రమించే లక్షణాలని నిర్ణయించే అంశం; +* genealogy, n. ప్రవర; అన్వయం; వంశచరిత్ర; వంశవృక్షం; వంశ పరంపర; వంశావళి; +* general, adj 1) సాధారణమైన; ప్రాయికమైన; సార్వత్రిక; ఏకోను; అందరికీ సంబంధించిన; సర్వ 2) శారీరిక; +* generalization, n. సర్వసమన్వయం; సాధారణీకరణం; అజహరణ; +* generalize, v. t. అజహరించు; అజహర్లక్షణాన్నివాడు; అర్ధాంతరన్యాసాన్ని వాడు; +* generally, adv. సర్వసాధారణంగా; సర్వసామాన్యంగా; ప్రాయికంగా; +* generate, v. i. ఉత్పత్తి చేయు; ఉత్పన్నించు; పుట్టించు; +* generation, n 1) తరం; పురుషాంతరం; అంకెసం 2) ఉత్పత్తి; పుట్టుక; తయారీ; +* generator, n. జాతకరి exp జాత అంటే పుట్టిన అని అర్థం కనుక పుట్టించేది జాతకరి; జనకి; ఉత్పాదిని; ఉత్పాదకి exp ఉత్పాదకి అంటే ఉత్పత్తి చేసేది అని అర్థం వస్తుంది; +generic drug, ph సముదాయ ఔషధము; పేటెంటు లేని ఔషధము; +* generosity, n 1) ఉదారత; ఉదాత్తత; ఉదార స్వభావం; దాతృత్వము; దానగుణం; ఇందరికం; వదాన్యత; ఈగి; ఈవి; ఈవరికం; దిత్స 2) సౌజన్యం; +* genesis, n. జన్మ; పుట్టుక; ఆది; మొదలు; ఆవిర్భావం; ప్రాదుర్భావం; ప్రభవం; ప్రజననం; +parthenogenesis, n. అనుషిక్త జననం; ఫలదీకరణం అవసరం లేకుండా పిండొత్పత్తి, వృద్ధి జరుగుట; +genetic defect, ph. జన్యు లోపం; జన్యు దోషం; అనువంశిక దోషం; +genetic engineering, ph. జన్యు స్థాపత్యం; ప్రాణుల వారసవాహికలలోని జన్యుపదార్థాన్ని మార్పుచేసి వాటిని ఆరోగ్యవంతంగానూ, బలవర్ధకంగానూ తయారుచేసే సాంకేతిక శాస్త్రం; +* genitals, n. జననేంద్రియాలు; జననాంగాలు; ఉపస్థ; +* genius, n. మేధావి; మహా మేధావి; ప్రతిభాశాలి; +* genocide, n. జన్యుమేధం; జాతిమేధం; జాతిసంహారం; +* genome, n. జన్యు సంగ్రహం; జన్యు సముదాయం; జన్యుపదార్థం; ఒక జీవిలో ఉన్న మొత్తం జన్యు పదార్ధ సమాచారం; +* genteel, adj. మెత్తని; కోమలమైన; పెద్దమనిషి తరహా; మృదుస్వభావము గల; +* gentle, adj 1) కోమల; కోమలమైన; సాత్విక; సాత్వికమైన 2) మంద; మందమైన 3) పెద్ద; +* gentleman, n 1) పెద్దమనిషి; యోగ్యుడు; భద్రలోక్ 2) మగవాడు; +* gentry, n. pl పెద్దమనుష్యులు; పెద్దలు; మర్యాదస్తులు; +* genuflection, n మోకరిల్లడం; మోకాలు వంచి దండం పెట్టడం; +* genuine, adj. సిసలైన; అసలైన; నికార్సు అయిన; +* genuine, n. సిసలైనది; అచ్చమైన; వాస్తవమైన; +* geological, adj. భూగర్భశాస్త్రానికి సంబంధించిన; +geological calendar, ph. జీవ పరిణామ కాల విభజన; ఈ కాలెండర్ కాలాన్ని "దశ ERA) లుగా, దశలను "ఘట్టాలు PERIODS) గా, ఘట్టాలను "మహాయుగాలు EPOCHS) గా, మహాయుగాలను తిరిగి "యుగాలు AGES) లుగా విభజించారు; +1) Ezoic era నిర్జీవ దశ భూ ఆవిర్భావం నుంచి 260 కోట్ల సంవత్సరాలకు వరకు గల కాలాన్ని నిర్జీవ దశ అంటారు; ఈ దశలో జీవం గానీ జీవ పదార్ధం కానీ ఆవిర్భవించలేదు. +2) Archeozoic Era ప్రథమజీవ దశ; ఈ దశ 260-200 కోట్ల సంవత్సరాల వరకు కొనసాగింది. ఈ దశ���ోనే జీవ పదార్ధం ఆవిర్భవించి ఉంటుదని శిలాజాల ద్వారా చెప్పగలిగారు; +3) Proterozoic Era పూర్వజీవ దశ; సుమారు 200-50 కోట్ల సంవత్సరాల మద్య సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. ఏక కణ జీవులు ప్రారంభ దశలో వెన్నుముక లేని సముద్రజీవులు అంతిమ దశలో ఏర్పడ్డాయి; +c) అలిగో సీన్ ఎపాక్ (మహాయుగం) +ఈ టెర్షీయరీ కాలంలోనే ఆధునిక మానవుడిని పోలిన ఆంత్రోపాయిడ్ వానరాలు పరిణామం చెందాయి; ఈ కాలం చివరికొచ్చేసరికి పచ్చిక మైదనాలు అడవులు అవతరించి ఆధునిక జంతువులైన ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఇతర జీవులు ఈనాటి రూపాన్ని సంతరించుకున్నాయి; +ii) క్వేటర్నరీ పీరియడ్ (ఘట్టం నవ్య జీవదశలో రెండవ ఘట్టాన్ని క్వేటర్నరీ పీరియడ్ అంటారు; ఈ కాలం 10 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమయి ఇంకా నడుస్తున్నది; దీనిని రెండు ఎపాక్ లుగా విభజించవచ్చు . +a) స్లీస్టోసీన్ ఎపాక్: ఇది 10 లక్షల సంవత్సరాల నుంచి 25 వేల సంవత్సరాల వరకు కొనసాగింది; ఈ కాలంలోనే మానవ సాంఘిక జీవనచ్ఛాయలు కనిపించాయి; హిమయుగాలు అవతరించి అంతరించిపోవటం జరిగింది; +b) రీసెంట్ ఎపాక్: దీనినే ఆధునిక మహా యుగంగా చెప్పుకోవచ్చు; సుమారు 25 వేల సంవత్సరాల క్రితం ప్రారంభమయి ఇంకా నడుస్తుంది; హిమయుగాలు అంతరించి వెచ్చని శీతోష్ణ వాతావరణం ఏర్పడి మానవ మహా యుగం ప్రారంభమైంది; +ఇలా 450 కోట్ల సంత్సరాల క్రితం ఏర్పడిన భూ గ్రహం మీద వానరుడు నరునిగా పరిణామం చెందటం అనే ప్రకృియ 3 కోట్ల 90 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమై సుమారు 25 వేల సంవత్సరాల క్రితమే, ఆధునిక మానవుడిగా మార్పు చెందాడని చెప్పవచ్చు; +* geology, n. భూగర్భశాస్త్రం; గ్రహగర్భశాస్త్రం; భూవిజ్ఞానం; మృత్‍పాషాణ శాస్త్రం; +* geometric, adj గుణ; గుణోత్తర; జ్యామితీయ; ఉత్కలిత; +geometric growth, ph. గుణ వృద్ధి; గుణాత్మక వృద్ధి; ఉత్కలిత వృద్ధి; +geometric progression, ph. గుణ శ్రేఢి; గుణాత్మక శ్రేఢి; ఉత్కలిత శ్రేఢి; ఉత్కలితం; +* geometry, n. క్షేత్రగణితం; రేఖాగణితం; జ్యామితి lit భూమిని కొలిచే శాస్త్రం; +* germ, n 1) క్రిమి; సూక్ష్మజీవి 2) బీజం; అంకురం; +* germanium, n. శార్మణ్యం; ఒక రసాయన మూలకం అణుసంఖ్య 32, సంక్షిప్త నామం, Ge); +* germicide, n. క్రిమిసంహారి; క్రిమినాశకి; +* geriatrics, n. వయోవృద్ధుల ఆరోగ్యానికి సంబంధించిన వైద్యశాస్త్రం; +* German, n 1) జెర్మనీ దేశపు భాష 2) జెర్మనీ దేశపు నివాసి; +* gerontology, n. వయోశాస్త్రం; వృద్ధాప్య వైద్యశాస్త్రం; +* gerund, n భావార్థకం; నామవాచకంగా మారిన క్రియావాచకం; ఉదా. వెళ్ళడం; చెప్పడం, చెయ్యడం, మొ.; +* gesticulate, v. i చ��తులతో అభినయిస్తూ మాట్లాడు; +* gesture, n. ముద్ర; సైగ; సన్న; అభినయం; ఆంగికం; ముఖ కళవళిక; విచేష్టితం; చేష్ట; అంగవిక్షేపం; తల పంకించడం, చేతులతో చూపడం వంటి అభినయాలు; భావమును తెలుపుటకు శరీరాంగాలని కదలించడం; +hand gesture, ph. హస్త ముద్ర; కైసన్న; హస్త ఆంగికం హస్త చలనం వల్ల భావ వ్యక్తీకరణ; +* get, v. t. పొందు; తెచ్చు; సంపాదించు; +* ghat ghaut, n 1) కొండలోయ; పర్వతసరణి; కనుమ 2) ఘట్టము; నదిలోకి దిగి స్నానము చెయ్యడానికి వీలుగా కట్టిన మెట్లు; +ghat road, n. లోయలోంచి వెళ్ళే రోడ్డు; +* ghoul, n ఘూల్) పిశాచం; స్మశానాలలో తిరుగుతూ పాతిపెట్టిన శవాలని తినేది; +* giant, n 1) దైత్యుడు; చాలా భారీగా, పొడుగ్గా ఉండే వ్యక్తి 2) ఒక రంగంలో చాల పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి; +* giant, adj. రాక్షసి; భీమ; బండ; పొడుగైన; పెద్ద; +* gibberish, n జిబ్బరిష్ కొక్కిరిబిక్కిరి రాత; కొక్కిరింపు గాసట బీసట; అర్ధం పర్ధం లేని మాటలు, రాతలు, కూతలు; +* gibbon, n. తోకలేని కోతి; హైలోబాటిడే (Hylobatidae) కుటుంబానికి చెందిన ఈ గిబ్బన్ లలో 4 ప్రజాతులు, 18 జాతులు ఉన్నాయి. కొమ్మలనుంచి చేతులతో ఊగుతూ వేళ్ళాడటం (Brachiation) గిబ్బన్ ల ప్రత్యేక లక్షణం; జీవ పరిణామ క్రమంలో కోతులనుంచి తోకలేని కోతులు Apes) విడివడినప్పుడు ముందుగా గిబ్బన్లు రూపొందాయి. అందుకే వీటిని సాంకేతికంగా Lesser Apes లేక Small Apes అంటారు. తోకలేని కోతుల సముదాయానికి చెందిన చింపాంజీలు, ఒరాంగుటాన్ లు, గొరిల్లాలు, మానవులలో పరిమాణంలో ఇవే అత్యంత చిన్నవి; +* gibbous, adj. గుబ్బగా ఉండే; బోర్లించిన గిన్నెలా ఉండే; కుంభాకార; +* gibbous moon, ph. వృద్ధ చంద్రుడు అష్టమికి, పూర్ణిమ కి మధ్య ఉండే చందుడి ఆకారం; +* gift, n 1) కానుక; బహుమతి; బహుమానం; పారితోషికం; పసదనం; సూడిద; అరణము; నజరు 2) దాఖలు; దానం; +* gifted, adj. అంశీభూతమైన; భగవద్దత్తమైన; +* gills, n. pl గిల్స్) మొప్పలు; పువ్వారాలు; చేపల శ్వాసావయాలు; +* gilt, n. మెరుగు; పైపూత; పూతమెరుగు; +* gimmick గిమ్మిక్) n. ఎత్తు; జిత్తు; +ginger group, ph. స్వపక్ష విమర్శకులు; శొంఠికొమ్ము జట్టు; +* girdle, n. వేష్టం; మేఖలం; కచ్చడం కాసెకోక; ఆడువారు లోపల వేసికొనే ఇరుకైన లాగు; +hip girdle, ph. వస్తిక వేష్టం; వస్తిక మేఖలం; నితంబ మేఖలం; +* girl, n. అమ్మాయి; ఆడపిల్ల; పిల్ల; బుల్లి; బాలిక; చిన్నది; గుంట; పొట్టి; +* girth, n. చుట్టుకొలత; టంగువారు; +* gist, n జిస్ట్) సారాంశం; పిండితార్థం; అసలు విషయం; +* given, adj ఇచ్చిన; ఉద్దేశించిన; ఉద్దిష్టమైన; +* gizzard, n. అంతర్జఠరం; పక్షి కడుపులో ఉండే ఒక సంచి; +* glacier, n. హిమనీనదం; హిమాని; హిమప్రవాహం; మంచునది; నీటికి బదులు నదిలో మంచు ��ెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది; +* glade, n అడవిలో ఉండే బయలు; డొంక; +endocrine gland, ph. అంతర్‌స్రవణ గ్రంథి; అంతస్స్రావ గ్రంథి; వినాళ గ్రంథి; +* glare, n. జిగులు; వెదజల్లబడ్డ వెలుగు; సెగ; సెగవెలుగు; +* glasses, n. pl. అద్దాలు; కళ్లద్దాలు; కళ్లజోడు; కండ్లజోడు; సులోచనాలు; ముక్కద్దాలు; +* glee, n ఆనందం; ఆహ్లాదం; సంతోషం; +* glitch, n. రూపకల్పనలో దొర్లిన పొరపాటు; అనుకున్నట్లు పని చెయ్యకపోవడం; +* glitter, v. i. అలరు; అలరారు; మెరియు; తళుక్‍మను; జిగేల్‍మను; +* global, adj. ప్రపంచ; వసుధైక; సార్వత్రిక; +* gloom, n. చీకటి; దైన్యం; నిరుత్సాహం; +* glory, n. వైభవం; ప్రభ; ప్రకాశం; కీర్తి; +* gloss, n. పైమెరుపు; వ్యాఖ్య; టీక; టిప్పణి; భాష్యం; +* glossary, n. అపూర్వ పదార్థకోశం; అపూర్వ శబ్దసంగ్రహం; పదపట్టిక; పదకోశం; టిప్పణం; +* glossary, n పదకోశం; ఒక పుస్తకంలోని కీలకమైన మాటల అర్థాలు; +* glottals, n. pl ling కంఠమూలీయములు; స్వరతంతువుల మధ్యనున్న జాగా ద్వారా గాలిని వదలడం వల్ల వచ్చే శబ్దాలని సూచించే అక్షరాలు; ఉదా, హ; +* glottis, n. శ్వాసనాళ ద్వారం; కంఠమూలం; కంఠబిలం; స్వరతంతువుల మధ్యనున్న జాగా rel epiglottis; +* glow, n. వెలుగు; వర్చస్సు; డాలు; +* glowworm, n. మిణుగురు పురుగు; ధ్వాంతమణి; ఖద్యోతం; జ్యోతిరింగణం; +* glucose, n. మధోజు; గ్లూకోజు; రక్తంలో ఉండే చక్కెర; +* glum, adj. విచారవదనంతో ఉండు ముసురుమూతితో ఉండు; +* glut, n. అపరిమితం; కూరుడు; కావలసిన దానికంటె అత్యధికం; +* gluttons, n. pl. తిండిపోతులు; బోరెంపోతులు; కుక్షింబరులు; ఉదరంభరులు; అద్మరులు; ఆబూతికాళ్లు; +* glycemic index, ph. ఒక పదార్ధాన్ని మనం తిన్న తరువాత ఎంత త్వరగా మన రక్తంలో గ్లూకోజు స్థాయిని పెంచుతుందో ఆ సూచీని glycemic index అంటారు. అయితే ఆ సూచీ మనం ఆ పదార్ధాన్ని ఎంత తింటున్నామన్నది పరిగణనలోకి తీసుకోదు; +* glycemic load, ph. ఆహారపదార్ధం ఎంత తింటే ఎంత గ్లూకోస్ పెరుగుతుంది అని తెలుసుకోవడానికి glycemic load (GL) అనే మరొక సూచీ వాడతారు; GL విలువ 10 లోపు ఉంటే తక్కువ, 11 19 ఉంటే మధ్యస్థం, 20 పైన ఉంటే అధిక glycemic load; +* glycogen, n. మధుజని; జంతువుల కండలలో ఉండే చక్కెర వంటి పిండిపదార్థం; +* glyphs, n. pl. మూలరూపాలు; మూలాకారాలు; ఒక వర్ణమాలలోని అక్షరాలని రాసే బాణీలో ఉన్న మౌలికమైన ఆకారాలు; +* gnomon, n. నిట్రాట; విష్కంభం; గుంజ; శంకు; ఈ నిట్రాట నీడ పొడుగుని కొలిచి వేళ ఎంత అయిందో చెప్పవచ్చు. మిట్ట మధ్యాహ్నం ఈ నిట్రాట కింద పడే నీడ (విషువచ్ఛాయ) పొడుగుని కొలిచి ఆ ప్రదేశం యొక్క అక్షాంశం కనుక్కోవచ్చు ety ఈ మాటకీ జ్ఞానంకీ సంబంధం ఉంది. కాలజ్ఞానం ఇచ్చే రాట; +* gnu, n. ఆఫ్రికా దేశపు దుప్పి; +* go, inter. వెళ���లు; వెళ్లండి; పో, పొండి; +* go, v. i. వెళ్లు; చనుదెంచు; పోవు; పయనించు; ఏగు; ఏగుదెంచు; ఏతెంచు; +* goad, n. ములుకోల; ముల్లుకర్ర; +* goad, v. t 1) రెచ్చగొట్టు; కిర్రు ఎక్కించు; ఉసి కొలుపు; పురి ఎక్కించు 2) పొడుచు; +* goal, n. గమ్యం; గంతవ్యం; ఆశయం; ధ్యేయం; లక్ష్యం; +* goblet, n. పానభాజనం; పానీయాలు తాగే గుండ్రని చిన్న గిన్నె; +* goblin, n. అల్లరి దయ్యం; పిల్ల దయ్యం; +* god, n. m. దేవుడు; వేలుపు; దైవం; భగవంతుడు; ఈశ్వరుడు; పరమేశ్వరుడు; దేవర, కడవలి; అప్పడు; +* God-given, n దైవదత్తం; దేవిడిచ్చినది; +* god-sent, adj. ఆధిదైవిక; దైవానుగ్రహం వల్ల కలిగిన; +* godown, n. గిడ్డంగి; కొటారు; కోష్ఠం; కొట్టడి; గోదాం; గోడౌను; మండీ; +* godspeed, n శుభం క్షేమంగా వెళ్లి లాభంగా రా ప్రయాణం అయే ముందు ఇచ్చే శుభాకాంక్షలు; +* gold, n. బంగారం; సువర్ణం; స్వర్ణం; కాంచనం కనకం; పసిడి; పైడి; పుత్తడి; కుందనం; అపరంజి; హాటకం; భృంగారం; పారణ్యం; ఒక రసాయన మూలకం అణుసంఖ్య 79, సంక్షిప్త నామం, Au [Sans jval, shining like a flame Lat aurum, shining dawn; +gold standard, ph. సువర్ణ ప్రమాణం; బంగారం ధరని బట్టి, చలామణీలో ఉన్న డబ్బు విలువని నిర్ణయించే పద్ధతి; +24 carat gold, ph. మేలిమి బంగారం; కుందనం; అపరంజి; తప్తకాంచనం; +* golden, adj. బంగారు; పొన్నారి; సువర్ణ; కనక; హాటక; +golden jubilee, ph. స్వర్ణోత్సవం; ఏభయి ఏళ్ల వార్షికోత్సవం; +golden ratio, ph math స్వర్ణనిష్పత్తి; సమబాహు పంచభుజములో స్వర్ణ నిష్పత్తి, దాని ద్వారా హేమచంద్ర-ఫిబొనాచ్చి (Hemachandra-Fibonacci numbers) సంఖ్యలు అంతర్గతమై ఉన్నాయి; ఈ స్వర్ణ నిష్పత్తి, హేమచంద్ర-ఫిబనాచ్చి సంఖ్యలు ఎన్నో రంగాలలో పదే పదే దర్శనమును ఇస్తాయి; శిల్పములలో, పూలలో, పండ్లలో, సంగీతములో, అలలలో, సర్పిలములో (spiral ఛందస్సులో, ఇలా ఎన్నో రంగాలలో ఇవి గోచరిస్తాయి; +goldfinch, n. బంగారు పిచ్చుక; పయిడికంటి పిట్ట; +* goldsmith, n. కంసాలి; నగసాలి; అగసాలి; స్వర్ణకారుడు కమ్మటీడు; +* Gondwanaland, n. గొంద్వానా ఖండం; కొన్ని మిలియన్ల సంవత్సరాల కిందట భారతదేశం, ఆస్ట్రేలియా, మొదలైన భూభాగాలన్నీ కలిసి ఉండిన రోజులలో ఒక భాగం పేరు; +* gonorrhea, n. సెగ; సవాయి; పూయ మేహం; సుఖరోగం; గనేరియా; +* good, adj. మంచిదైన; మంచి; చక్కని; శుభమైన; బాగుగా; బాగైన; +good morning, ph. శుభోదయం; సుప్రభాతం; మేలుపొద్దులు; +* goods, n. దినుసులు; వస్తువులు; సామాను; సరకులు; సరంజామా; +* goodwill, n. సౌజన్యం; సౌహార్దం; ఆదరాభిమానాలు; +* goose, n 1) చక్రవాకం; బాతు రూపంలో, బాతుకంటె పెద్దది, ఈ పక్షులు వలస వెళుతూ వందల కిలోమీటర్లు ఎగర గలవు ety cognate of హంస; In Indo-European languages "ga ha 2) దేబె; దేభ్యం; వెర్రి ముఖం; +* goosebumps, ph. గగురుపాటు; రోమాంచం; రోమోద్గమం; +* gore, n. నెత్తురు; కారి, గడ్డకట్టిన రక్తం; +* gorge, n. లోయ; గండి; కంధరం; రెండు ఎత్తయిన కొండల మధ్య ఉన్న ఇరుకైన ప్రదేశం; +* gorilla, n 1) గొరిల్లా; మహావానరం; మనిషిని పోలిన, కోతి వంటి, తోక లేని, ఆఫ్రికా ఆదవులలో నివసించే పెద్ద జంతువు bio Gorilla gorilla of the Pongidae family 2) ప్రచ్ఛన్న యుద్ధం చేసే సైనికుడు; +* gosling, n. పిల్ల చక్రవాకం; బాతు పిల్ల; +* gospel, n. దైవ వాక్యం; సువార్త; బైబిల్ లోని కొత్త నిబంధనలలో నాలుగు సువార్తలు ఉన్నాయి: మత్తయ్ (Matthew మార్క్ (Mark లూకా (Luke జాన్ (John ఈ నాలుగు సువార్తలూ చెప్పేది ఒకే కథ, నాలుగు భిన్న కోణాల నుండి; +* gossamer, n. సన్నటి తంతువు; సాలెపట్టు లోని దారము వంటి దారం; +* govern, v. t. పరిపాలించు; పాలించు; ఏలు; చెలాయించు; +* governor, n. పరిపాలకుడు; పాలకుడు; ఏలిక; గవర్నర్; +* government, n 1) ప్రభుత్వం; దొరతనం; ప్రాభవం; సర్కారువారు; గవర్నమెంటు 2) పరిపాలన; దౌలతు; +* grace, n 1) ఒయ్యారం; సొంపు; సోయగం; హొయలు; నయగారం 2) కటాక్షం; అనుగ్రహం 3) భోజనం చేసే ముందు చేసే ప్రార్థన; +* gradation, n. స్తరీకరణ; ఒక వరుస క్రమంలో అమరేలా చెయ్యడం; +density gradient, ph. సాంద్రతా ప్రవణత; సాంద్రతా నతిక్రమం; +* gradually, adv. క్రమేపీ; క్రమేణా; క్రమంగా; క్రమస్యా; రానురాను; అంతకంతకు; కాలావధికంగా; +* graduated, adj. కొల; అంశాంకన; గీతలు గీయబడ్డ; క్రమాంకిత; క్రమముగా విభాగించబడ్డ; +food grains ph. తిండి గింజలు; ఆహార ధాన్యాలు; +* gram, n 1) బరువుని తూచడానికి వాడే కొలమానం 2) కాయధాన్యం; +* grammar, n. వ్యాకరణం; భాష యొక్క అంతర్గత కట్టడిని అధ్యయనం చేసే శాస్త్రం; +* grammarian, n. వైయ్యాకరణి; వ్యాకరణకర్త; వైయ్యాకరణుడు; లాక్షణికుడు; +* grand, adj. వైభవంగా; గొప్పగా; ఘనంగా; అద్భుతంగా; +* grand, n. వైభవం; గొప్ప; ఘనం; అద్భుతం; +* granddaughter, n 1) మనుమరాలు 2) పౌత్రి; కొడుకు కూతురు 3) దౌహిత్రి; కూతురు కూతురు; +* grandfather, n 1) తాత; జేజె; అబ్బ; ఆర్యకుడు 2) పితామహుడు; తండ్రి యొక్క తండ్రి 3) మాతామహుడు; తల్లి యొక్క తండ్రి; +great grandfather ph. ముత్తాత; ప్రపితామహుడు; ప్రమాతామహుడు; +* grandmother, n 1) మామ్మ; నాయనమ్మ; బామ్మ; అవ్వ జేజెమ్మ; పితామహి; తండ్రి యొక్క తల్లి 2) అమ్మమ్మ; అవ్వ; బాప్ప; నానక్క; మాతామహి; తల్లి యొక్క తల్లి; +* grandson, n 1) మనుమడు 2) పౌత్రుడు; కొడుకు కొడుకు 3) దౌహిత్రుడు; కూతురు కొడుకు; +* granite, n. నల్లసేనపు రాయి; నల్లసేనం; నల్లరాయి; అగ్నిశిల; +* grant, v. t. మంజూరు చేయు; అనుగ్రహించు; +* granular, adj. పూసకట్టినట్లు; కరకట్టినట్లు; +* grape wine, n. ద్రాక్ష సారా; ద్రాక్షారిష్టం; +* grapefruit, n. పంపరపనస; చకోర్త పండు; తియ్య నారింజని, పంపరపనసని జోడించగా వచ్చిన కంచర జాతి పండు; +* graphic, adj 1) రేఖాత్మక 2) వివరణాత్మక; విపులంగా; కళ్ళకి కట్టినట్లు; +* graphology, n. దస్తుశాస్త్రం; దస్తూరీని పరిశీలించే శాస్త్రం; +* grapnel, n. గాలం: చాలా కొక్కెములు కల లంగరు; +* grasp, n. గ్రహణశక్తి; అవగాహన; పట్టు; +* grass, n. గడ్డి; పచ్చగడ్డి; పచ్చిక; కసవు; పూరి; కుశ; తృణం; గ్రాసం rel hay; +* grate, n. గ్రాది; ఇనుప చువ్వల వరుస; +* grater, n. కోరాం; తురుమిక; తురుముడు పీట; +* grating, n 1) కటకటాలు 2) రూళ్లపలక; జాలకం; కటకటాల ఆకారంలో సన్నటి గీతలుతో ఉన్న గాజు పలక; +diffraction grating, ph. వివర్తన జాలకం; వివర్తన రూళ్లపలక డైఫ్రాక్షన్ గ్రేటింగ్]] +* gratings, n 1) కోరు; తురుము 2) కటకటాలు 3) జాలకం; కటకటాల ఆకారంలో సన్నటి గీతలు గీసిన గాజు పలక; +* gratuity, n. బక్షీసు; ఈనాము; డబ్బురూపంలో ఇచ్చే పారితోషికం; బహుమానం; టిప్పు; +* grave, adj. ముఖ్యమైన; గంభీరమైన; ఉపేక్షించడానికి వీలుకాని; +* gravel, n. గులకరాళ్లు; మొరపరాళ్లు; కంకర; +universal Law of gravitation, ph. విశ్వవ్యాప్తమయిన గురుత్వ నియమం; విశ్వవ్యాప్తమయిన గురుత్వ సూత్రం; +* gravity, n. గురుత్వం; గురుత్వ ఆకర్షణ; గరిమ; +micro gravity, ph. సూక్ష్మ గురుత్వం; నభోనౌకలలో అనుభవానికి వచ్చే అతి తక్కువ గురుత్వ బలం; +gray matter, ph. ధూసరాంశం; దూసరద్రవ్యం; మెదడులోని బూడిదవన్నె పదార్థం; +* gray, n. బూడిద రంగు; ధూసర వర్ణం; +* grease, n. జిడ్డు; కందెన; కందెన చమురు; +greater Delhi, ph. బృహత్తర ఢిల్లీ; ఢిల్లీ; శివార్లు కలుపుకొని అని అర్థం; +* Grebe, n. వజ్జులి పక్షి; బాతు కుటుంబానికి చెందిన ఒక రకమైన నీటిపక్షి; +* green, adj 1) పచ్చ; పచ్చని; ఆకుపచ్చ; హరిత; ఆకు; పసిరిక 2) పచ్చి; కసరు; +* greenhouse, n. హరితగృహం; పచ్చటి ఉష్ణమండలపు మొక్కలని పెంచడానికి ప్రత్యేకంగా తయారు చేసిన గాజద్దాల గది; +greenhouse gases, ph. హరితగృహ వాయువులు; ఈ వాయువులు మన వాతావరణంలో పెరిగిపోతే మన భూగ్రహం హరితగృహంలా వేడిగా తయారవుతుందని సిద్ధాంతం; +* greet, v. t. పలకరించు; ఆహ్వానించు; వందనము చేయు; +greeting card, ph. ప్రత్యుత్థాన పత్రం; ఆహ్వాన పత్రం; +grey hair, ph. పండిన జుత్తు; నెరిసిన జుత్తు; +* grid, n. జాలకం; గ్రాది; కటకటాలు; కటాంజనం; జల్లెడ ఆకారంలో నిలువు, అడ్డుగీతలు కాని, బద్దీలు కాని ఉన్న అమరిక; +iron grid, ph. ఇనప కటకటాలు; ఇనప గ్రాది; ఇనప కటాంజనం +* gridlock, n. దిగ్బంధం; నాలుగు వీధుల మొగలో వాహనాలు ఎటూ కదలలేని పరిస్థితిలో ఇరుక్కుపోయిన పరిస్థితి; +* grief, n. విచారం; సంతాపం; దుఃఖం; శోకం; ఖేదం; చింత; వగ అలమట; విషాదం; మనస్తాపం; విషణ్ణము; అంగలార్పు; వ్యాకులం; మనికితం; +* grieve, v. i. విచారించు; వగచు; శోకించు; ఖేదించు అలమటించు; అలమరించు; అంగలార్చు; దుఃఖి���చు; ఉమ్మలించు; దురపిల్లు; +* grill, n 1) అంగారిణి; కుంపటి 2) కటాంజనం; కటకటాలు; ఇనప తడక; +* grill, v. t 1) పుంఖానుపుంఖాలుగా ప్రశ్నలవర్షం కురిపించు; సతాయించు; ఎడతెగని విచారణ చేయు 2) కుంపటి మీద కాని ఇనప చట్రం మీద కాని వంట వండు; +* grind, v. t 1) రుబ్బు; నూరు; విసరు 2) సానపట్టు 3) అరగదీయు; చాదు; +* grindstone, n 1) సాన; రుబ్బురోలు; సన్నికల్లు 2) తిరగలి 3) ఆకురాయి; +* grinder, n 1) తిరగలి; ఘరట్టం; విసర్రాయి; రాగిన కల్లు 2) రుబ్బురోలు; సన్నికల్లు; పేషణి; +* gripe, n. కడుపునొప్పి; నొప్పి; బాధ; +* groceries, n. దినుసులు; అంగడి దినుసులు; పచారీలు; +* groom n. పెండ్లి కొడుకు; పెండ్లి కుమారుడు; +* groom, v. t. దువ్వు; మాలీసు చేయు; తయారు చేయు; తరిఫీదు చేయు; +* grope, v. t. తడుము; మరొకరి మర్మస్థానాలని చేతితో తడుము; +* ground, adj. నూరిన; నూరబడ్డ; గుండ కొట్టబడ్డ; +* group, n 1) గుంపు; గణం; కులం రాసి; తతి; దండు; మేళం; బృందం; సమూహం; సందోహం; కురుంబం; పటలి నికాయం; నిచయం; నివహం; కూటువ 2 Math ఒక సమితిలో ఏ రెండు సభ్యులని తీసుకుని ఒక ప్రక్రియ ద్వారా పుట్టించిన మూడవ సభ్యుడు కూడ ఆ సమితికే చెందితే ఆ ప్రక్రియతో కలసిన సమితిని గుంపు అంటారు. ఉదాహరణకి పూర్ణాంకములు, సంకలన ప్రక్రియ ఒక గుంపు అవుతుంది; +* grove, n. తోట; తోపు; వనం; ఆరామం; వాటిక; వృక్షవాటిక; +sacred grove, ph. దేవాలయాలకి సంబంధించిన వనాలు; +* grow, v. i. పెరుగు; ఎదుగు; పెంపుచెందు; ప్రబలు; బలియు; తామర తంపరగు; కొనసాగు; +* growth, n. పెరుగుదల; పెరుగుడు; ఎదుగుదల; వృద్ధి; అభ్యుదయం; +* grunt, n. పంది చేసే గుర్రు శబ్దం; +* guarantee, n. జామీను; జామీను పత్రం; హామీ; పూచీ; జవాబుదారీ; భరోసా; పూటవాటు; +* guard, n. కాపలాదారు; కాపలా వాడు; కాపరి; కావలి వాడు; +* guard, v. t. కాపలా కాయు; సంరక్షించు; కాపాడు; +* guardian, n. పెద్దదిక్కు; సంరక్షకుడు; +* guess, n. అంచనా; ఊహ; బద్దింపు; ఉజ్జాయింపు; +* guest, n. అతిధి; భోజనానికి వచ్చిన వ్యక్తి; +unannounced guest, ph. అభ్యాగతి; చెప్పకుండా భోజనానికి వచ్చిన వ్యక్తి; +* guide, n 1) చింతామణి; దారి చూపేది; దారి చూపే పుస్తకం 2) దారి చూపే వ్యక్తి; +* guided, adj మార్గణ: వెతుక్కుంటూ వెళ్లే; +* Guinea pig, n. గినీ పంది; బొచ్చు, చిన్న చెవులు ఉండి, తోక లేని, ఎలకని పోలిన చిన్న జంతువు; కొత్త మందులని ముందస్తుగా ఈ జంతువుల మీద ప్రయోగించి చూస్తూ ఉంటారు; +* gulf, n 1) సింధుశాఖ; సముద్రపు పాయ; దూసేరు 2) ఖేదం; వ్యత్యాసం; +* gum, n.(1) బంక; చెట్ల నుండి కారే జిగురైన పదార్థం 2) ఇగురు; చిగురు; పంటి చిగురు; +* gum arabic, ph. తుమ్మబంక bot Acacia senegal of the Mimosaceae family; తుమ్మ జాతికి చెందిన చెట్ల నుండి స్రవించే జిగురుని గమ్ అరబిక్ అంటారు. సుడాన్ లో ఈ చెట్లు విస్తారంగా పెరుగుతాయి; భారతదేశంలోని రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతాలలోను, పంజాబ్, హర్యానాలలో కూడా పెరుగుతాయి; వీటిని స్థానికంగా ఖేర్ అని పిలుస్తారు; ఈ చెట్ల కాయలు పక్వానికి వచ్చే దశలో వాటి కాండానికి గాట్లు పెట్టి వాటినుండి స్రవించే జిగురుని సేకరిస్తారు క్రీ. పూ. 2000 సంవత్సరం ప్రాంతాలనుండి ఈజిప్టులో గమ్ అరబిక్ ను ఉపయోగించినట్లు, సూడాన్ తదితర ఆఫ్రికన్ దేశాల నుంచి ఈ జిగురు అరేబియాకు, అక్కడి నుంచి అరబ్ వర్తకుల ఓడలలో యూరప్ కు రవాణా అయ్యేదనీ తెలుస్తున్నది. వాణిజ్యపరంగా మూడు ముఖ్యమైన జిగుర్లు మనం ఉపయోగిస్తాం. అవి తుమ్మ జిగురు (Arabic Gum or Gum Arabic Gum Tragacanth, కరాయా గమ్ (Karaya Gum ఈ జిగుర్లు రకరకాల పరిశ్రమలలో (అద్దకాలు, కాగితాలు, గోడలకి వేసే రంగులు, చాకోలెట్లు, వగైరా) వాడతారు; ఆహార పరిశ్రమలలో (సాస్ లు, సిరప్ లు, చల్లని పానీయాలు, వగైరా ఔషధ పరిశ్రమలలో గుండలని బిళ్ళలుగా రూపొందించడంలో కూడా జిగుర్లు ఉపయోగిస్తారు. +* gumption, n. చొరవ; ప్రపంచ జ్ఞానం; లోక జ్ఞానం; ధైర్యం; దమ్ములు; +* gunner, n. తోపుదారు; ఫిరంగి పేల్చే వ్యక్తి; +* gunpowder, n. అగ్నిచూర్ణం; తుపాకిమందు; +* guru, n 1) గురువు 2) ప్రవీణుడు; సర్వజ్ఞుడు; +* gust, n. గాలితెర; తటాలున వీచే గాలి; +* gutter, n 1) కాలువ; జలదారి; ఒప్పరం; తూము 2) ఇంటి కప్పుపై పడ్డ నీటిని కిందకి పారించే గొట్టం 3) మురికి వాడ; +* guts, n idiom] దమ్ములు; ధైర్యం; చొరవ; ప్రపంచ జ్ఞానం; లోక జ్ఞానం; +* gutturals, n. కంఠ్యములు; కంఠం లోంచి పుట్టిన హల్లులు; +* guzzler, n. పెట్రోలుని గటగట తాగే కారు; పెట్రోలు పొదుపు లేని కారు; +* gymnasium, n. మల్లశాల; వ్యాయామం చెయ్యడానికీ, ఆటలు ఆడుకోడానికి సదుపాయాలు ఉన్న స్థలం; జింఖానా; +* gyration, n. విఘూర్ణనం; బొంగరంలా తిరగడం; వర్తుల భ్రమణం; +* gyroscope, n విఘార్ణిక; ఒక చట్రంలో గిరగిర తిరిగే బరువైన చక్రం చక్రం ఉన్నా లేక పోయినా ఒక వేదికని నిలకడగా నిలపడానికి వాడే పనిముట్టు + + +* habeas corpus, n. నిందితుని న్యాయస్థానానికి తీసుకు రమ్మన్న ఆనతి; +* habit, n. అలవాటు; ఆచారం; అభ్యాసం; +bad habit, ph. దురలవాటు; దురాచారం; వ్యసనం; దురభ్యాసం; +* habitat, n. ఉనికిపట్టు; సహజావరణం; ఆవాసం; అవసదము; జంతువులు, మొక్కలు సహజంగా పెరిగే ఆవరణం; +habitual offender, ph. అపరాధానికి అలవాటు పడ్డ వ్యక్తి; కేడీ; +* hackneyed, adj 1) సర్వసాధారణమైన; పాతబడిపోయిన; నవ్యత లేని 2) అలవాటుపడ్డ; మరిగిన; +* hadrons, n phy మోటురేణువులు; రేణు భౌతిక శాస్త్రంలో తారసపడే ఒక రకం మోటు రేణువులు; రెండు కాని, అంతకంటె ఎక్కువ కాని క్వార్కులని త్రాణిక బలంతో బంధించినప్పుడు మోటురేణువులు పుడతాయి (బణువులలోని అణువులు విద్యుదయస్కాంత బలంతో బంధించబడినట్లు ఉపమానం చెప్పుకోవచ్చు +* hair, n. జుత్తు; కేశములు; కురులు; రోమాలు; వెంట్రుకలు; చూడ; తల; +curly hair, ph. ఉంగరాల జుత్తు; నొక్కుల జుత్తు; +gray hair, ph. పండు జుత్తు; నెరిసిన జుత్తు; +hair dresser, కేశకర్త; తల వెంట్రుకలని కత్తిరించి అందంగా అమర్చే వ్యక్తి; +* haircut, n. క్షవరం; ఆయుష్కర్మం; తల వెంట్రుకలని కత్తిరించడం; +* hairs, n. జుత్తు; వెంట్రుకలు; రోమాలు; +* half, n. సగం; సంగోరు; అర్ధం; అర్ధభాగం; +* half-life, n. అర్ధాయువు; అర్ధాయుశ్శేషం; రేడియో ధార్మికత్వం ఉన్న మూలకాల విచ్ఛిత్తిని కొలవడానికి ఉపయోగించే ఒక కొలమానం; +* half-mast, adj. అవనతం చేయబడ్డ; అవాగ్రం చేయబడ్డ; +* halfway, n మధ్యేమార్గం; మధ్యస్థం; +halfway house, ph ఖైదు నుండి విడుదలయి బయటకి వచ్చిన వ్యక్తి సంఘ జీవితానికి అలవాటు పడే వరకు పోలీసుల పర్యవేక్షణలో నివసించే ఇల్లు; +* half-yearly, adj. షాణ్మాసిక; అర్ధసంవత్సరానికొకసారి; +* hall, n. మందిరం; పడసాల; చావడి; హాలు; వసారా; +* hallucination, n, భ్రమ; భ్రాంతి; మానసిక భ్రాంతి; దృక్‌భ్రమ; +* halo, n. కాంతివలయం; ఉపసూర్యకం; కాంతి కిరీటం; గాలిగుడి; +* halophyte, n చవిటి నేలలలో పెరిగే మొక్క; ఉప్పు నీటిలో సాగు చెయ్యడానికి అనుకూలమైన మొక్క; +* halter, n. పొట్టి రవిక; మగవారిని నిలువరించగలిగే రవిక; +* halva, n. హల్వా; కేసరీ బాత్; గోధుమ రవ్వతో చేసిన ఒక తీపి వంటకం; +* ham, n. పంది పిరుదుల దగ్గర వెనక కాళ్ల దగ్గర నుండి వచ్చిన మాంసాన్ని ఉప్పులో ఊరవేసి తయారు చేసిన పదార్థాన్ని "హ్యామ్ ham) అంటారు rel బేకన్" అనేది పంది కడుపు దగ్గర నుండి వచ్చిన మాంసాన్ని ఉప్పులో ఊరవేసి, పొగ పెట్టి తయారు చేసిన పదార్థం; సహజంగా లభ్యం అయే పంది మాంసాన్ని "పోర్క్" అంటారు; +* hamlet, n. గూడెం; పల్లి; పల్లెటూరు; కుగ్రామం; కుప్పం; కండ్రిగ; +* hammock, n. ఉల్లడ; రెండు రాటల మధ్య వేల్లాడగట్టిన ఊయల; +* hand, n 1) చేయి; చెయ్యి; కరం; పాణి; హస్తం; కేలు; కై; మనికట్టు కింద భాగం; మనికట్టుకి మోచేయికి మధ్యనుండేది మీజెయ్యి 2) గడియారం ముల్లు; +hour hand, ph. చిన్న ముల్లు; గడియారంలో గంటలు చూపే చిన్న ముల్లు; +left hand, ph. ఎడమ చెయ్యి; పుర్ర చెయ్యి; వామహస్తం; +minute hand, ph. పెద్ద ముల్లు; గడియారంలో నిమిషాలు చూపే పెద్ద ముల్లు; +second hand, ph. పరుగు ముల్లు; గడియారంలో సెకండ్లను చూపే ఎర్ర ముల్లు; +* handbag, n. కరతిత్తి; చేతిసంచి; హస్తసేవకం; +left handedness, ph. పుర్ర చేతివాటం; ఎడమ చేతివాటం; వామకర��్వం; +* handful, n 1) చేరెడు; పిడికెడు; పట్టెడు 2) చేతినిండా; +* handicrafts, n. హస్తకళలు; చేతితో చేసిన వస్తువులు; +* handle, n. పిడి; గురుజు కొమ్ము; చేపట్టు; హస్తకం: దండం; తండూకం; మేడి; హలాంగం; +* handlebar, n. పిడిదండం; హస్తమాను; కొమ్ముల కడ్డీ; +* handsome man, n. రూపవంతుడు; రూపసి; స్పురద్రూపి; +* hangar, n. విమానశాల; విమానాలని భద్రపరచే విశాలమైన శాల; +* haphazard, adj. అకటావికట; చెల్లాచెదురు; అరకొర; +* happen, v. i. తటస్థించు; తటస్థపడు; జరుగు; సంభవించు +* harbinger, n 1) వైతాళికుడు; అగ్రగామి 2) రాబోవుదానిని సూచించేది; పురోసూచకం; +* harass, v. t. వేధించు; బాధించు; క్షోభపెట్టు; పీడించు; +* harbor, v. t. రక్షణ కల్పించు; దాచు; ఆశ్రయమిచ్చు; +* hard, adj. గట్టి; గడ్డు; కఠినమైన; క్లిష్టమయిన; పటు; దృఢమైన; అసాధ్యమైన; దుర్ఘటమైన; దుస్తరమైన; కష్టమైన; ప్రయాసతో కూడిన; +hard facts, ph. నిర్వివాదములైన నిజాలు; కఠిన సత్యాలు; కఠోర వాస్తవాలు; +hard water, ph. కఠిన జలం; చవిటి నీళ్ళు; సున్నపు నీళ్లు; సబ్బు నురుగ రాని నీరు; కేల్సియం, మెగ్నీసియం లవణాలు ఎక్కువగా కరిగిన నీరు; ఈ లవణాలు మరీ ఎక్కువగా లేనంతసేపూ తాగడానికి ఇదే మంచిది; కాని యంత్రాలకి వాడే ఆవిరి తయారీలో ఈ నీరు మంచిది కాదు; +* hardship, n. ఇబ్బంది; కష్టం; రాయిడి; కక్కసము; +* hardened, adj. కరడు కట్టిన; గట్టిబడ్డ; తోడుకున్న; బిళ్లకట్టిన; +* hardness, n. గట్టితనం; కక్కరం; కాఠిన్యత; ధృతగుణం; బిరుసుతనం; కఠినత్వం; +* hardware, n 1) గట్టిసరుకు; ఇనపసామాను; ఇత్తడి సామాను 2) కాయం; దేహం; బొంది 3) యంత్రాంశం; యంత్రసామగ్రి బహిర్యామి; స్థూలకాయం; కలనయంత్రాంగాలలో క్రమణికలు కానివి; కంప్యూటర్లలో చేతితో ముట్టుకోడానికి అనువైన భాగాలు; ఉ. కలన కలశం ఉన్న సిలికాన్‌ చితుకు, దత్తాంశాలు దాచుకోడానికి నిర్మించిన వ్యవస్థలు, మీటల పలకం; తెర; మూషికం, తీగలు, వగైరాలు; +* harem, n. అంతఃపురం; అంతర్మందిరం; +harem attendant, ph. m. సౌవిదల్లుఁడు; f. సౌవిదల్లిక; అంతఃపురంలో సేవచేసేవారు; +* harm, n. హాని; అపకారం; కీడు; చెరుపు; చెడు; +* harmonic, adj 1 music] సరళ; సరళావర్త; కల; శ్రావ్యమైన; మధురమైన; సామరస్య; స్వరాత్మక; శ్రావ్యమైన; మధురమైన 2 math] హరాత్మక; +harmonic motion, ph. హరాత్మక గమనము; సరళావర్త గతి; సమతాళ గమనము; +* harmonics, n. అతిస్వరాలు; స్థూలంగా చెప్పాలంటే ప్రాధమిక ధ్వని తరంగం (fundamental దాని అతిస్వరాలు (harmonics) కలిపి అనుస్వరాలు అవుతాయి; ఇక్కడ అతిస్వరాల పౌనఃపున్యం, ప్రాథమిక స్వరాల పౌనఃపున్యం మధ్య ఉండే నిష్పత్తి పూర్ణాంకం అయి ఉండాలి అప్పుడే ఆ స్వర సమ్మేళనాలు శ్రావ్యంగా ఉంటాయి; +* harness, v. t 1) జీను తొడుగు; జీను వేయు 2) సజ్జీకరించు; ఉపయోగించు; నియంత్రణకి తెచ్చు; +* harpoon, n. పంట్రకోల; రువ్వుటీటె; చేపలని పట్టడానికి ఈటెకి తాడు కట్టి నీళ్ళల్లోకి రువ్వే ఈటె; +* harrow, n గుంటక గొఱ్ఱు; మత్యం; మత్తెం; నాగలి పెళ్లగించిన బెడ్డలని గుండగా చేసే పనిముట్టు; +* harsh, adj. గడ్డు; పరుషమైన; నిర్దయతోకూడిన; కఠోరమైన; కఠోర; తీవ్రమైన; తీవ్ర; కటువైన; +* hartal, n Ind. Engl హర్తాల్ Hin హట్ట తాళ; అంగళ్ళకి తాళాలు వెయ్యడం; సమ్మె; పని మానెయ్యడం; +* hashish, n గంజాయి; భంగు; హషీష్ అన్నది గంజాయి మొక్క నుండి స్రవించే పాలని ముద్దలా చేసి అమ్ముతారు; దీనిని కూడా చుట్టల మాదిరి చుట్టి కాల్చుతారు; మేరువానా అనేది గంజాయి మొక్క ఆకులని, మొగ్గలని ఎండబెట్టి తయారు చేస్తారు note) The word assassin is derived from "hassasin" which is related to hashish; +* hashtag, ph. n ఒక గుర్తు; కంప్యూటర్ కీ ఫలకం మీద ఉండే రెండు అడ్డ గీతలు, వాటి మీద రెండు నిలువు గీతలు ఉన్న ఒక గుర్తు; +* haste, n. తొందర; తొందరపాటు; ఉరవడి; జోరు; +* hatchet, n. పరశువు; చిన్న గొడ్డలి; చేతి గొడ్డలి; +* hater, n. ద్వేషి; విరోధి; గిట్టనివాడు; +* haunt, n చుట్టుకొని తిరిగే చోటు; సంచరించే చోటు; ఇరువు; విహార స్థలం; +* have v. ఉండు, ఉండుట, కలిగి ఉండుట, +* haven, n హేవెన్‍ రేవు; ఆశ్రయం; నివాసం; +* hawk, n 1) డేగ; జాలె; కురుజు; సాళ్వం; వేసడం; ఒరణం 2) కయ్యానికి కాలు దువ్వే వ్యక్తి; యుద్ధానికి సిద్ధపడే వ్యక్తి; +* hay, n. ఎండుగడ్డి; గాదం; గవతం; +hay fever, ph. గవత జ్వరం; గడ్డి జాతి మొక్కల పుప్పొడి పడక వచ్చే ఒక రకం ఎలర్జీ; +* haystack, n. గడ్డిమేటు; గడ్డివాము; యావసం; +* hazard, n. ప్రమాదం; అపాయం; గండం; విపత్తు; +* hazardous, adj. ప్రమాదకరమైన; ప్రమాదపూర్వకమైన; ప్రమాదకారకమైన; హాని కలిగించే; +* headline, n. శీర్షిక; వార్తాశీర్షిక; ముఖ్య సమాచారం; +* heads, n. బొమ్మ; నాణెం యొక్క బొమ్మ వైపు; +* heap, n. కుప్ప; పోఁగు; ప్రోఁవు; గుట్ట; వామి; తిట్ట; రాశి; చయం; నివహం; గుమి; ఉత్కరం; +* heaping, v. t. పోగు చెయ్యడం; చయనం; ప్రోవించుట; +* hearsay, n. వినికిడి; విన్నమాట; జనశ్రుతి; కింవదంతి; శ్రుతపాండిత్యం; +hearsay evidence, ph. వినికిడి సాక్ష్యం; శ్రుతం; శ్రుత సాక్ష్యం; చూసినది కాదని అర్థం; +* hearse, n. శవపేటికని లాగే బండి; పాడె; +* heart, n 1) హృదయం; గుండె; గుండెకాయ 2) మది; డెందం; ఉల్లం; ఎద; +heartbeat, ph. హృదయ స్పందనం; గుండె కొట్టుకోవడం; +* heartburn, ph 1) ఆమ్లపిత్తం; గుండెమంట; అజీర్తి వల్ల ఛాతీలో కలిగే మంట 2 idiom] అక్కసు; +* heartfelt, adj. మనస్పూర్తిగా; హృదయపూర్వకంగా; హార్ధిక; +* heat, n. వేడి; ఉడుకు; సెగ; ఉబ్బ; ఉక్క; ఉమ్మ; వడ; ఉష్ణం; ఊష్మం; తాపం; ఆతపం; దగ; ఆవి; కాక; విదాహం; +latent heat, ph. గుప్తోష్ణం; తాపోగ్రత మారకుండా ఒక పదార్థాన్ని ఘన రూపం నుండి ద్రవ రూపం లోకి కానీ, ద్రవ రూపం నుండి వాయు రూపం లోకి కాని మార్చడానికి కావలసిన వేడి; +latent heat of melting, ph. ద్రవీకరణ గుప్తోష్ణము; ఉదా: నీరు ద్రవరూపం నుండి ఘన రూపంలోకి మారేటప్పుడు శక్తిని విడుదల చేస్తుంది; +latent heat of vaporization, ph. బాష్పీభవన గుప్తోష్ణం; ఉదాహరణకు 100°C వద్ద 1 గ్రాము నీరు పూర్తిగా ఆవిరిగా మార్చడానికి 540 కేలరీలు కావాలి; +specific heat, ph. విశిష్ట ఉష్ణం; ఒక (గ్రాము) పదార్థపు తాపోగ్రతని ఫలానా (ఒక డిగ్రీ) మేరకి పెంచడానికి కావలసిన వేడి; +* heat, v. t. వేడిచేయు; కాచు; కాగబెట్టు; +* heave, v. t 1) లాగు; ఎత్తు; లేవనెత్తు; విసరు; రువ్వు; తోయు; పనులని ఎక్కువ శ్రమతో చేయు; +* heaven, n. స్వర్గం; దివి; సురలోకం; నాకం; పరమపదం; వినువు; +heavenly body, ph. నభోమూర్తి; సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు; +heavy elements, ph. భారీ ధాతువులు; భారీ మూలకాలు; అణు సంఖ్య 92 ని మించి ఉన్న రసాయన మూలకాలు; +heavy metals, ph భారీ లోహాలు; ఎక్కువ సాంద్రత కలిగి, తక్కువ మోతాదులో కూడ విష పదార్థాలయిన రసాయన మూలకాలు; ఉదా: పాదరసం; కేడ్మియం; ఆర్సెనిక్, క్రోమియం; థేలియం; +heavy water, ph. భారజలం; బరువునీరు; నీటి బణువులో ఉదజని అణువుకి బదులు "భారీ ఉదజని" అణువు ఉంటే దానిని భారజలం అంటారు; +* heavy-duty, adj. దిట్టమైన; భారీ; రాటుకీ పోటుకీ ఓర్చుకోగల; +* hedge, n. కొరడు; దడి; కంచె; మొక్కలతో నిర్మించిన కంచె; +* hedonism, n హీడనిజం) భోగలాలసత్వం; భోగలాలసత; స్వయంసుఖవాదం; ఆనందమే జీవిత పరమావధి అని నమ్మే తత్త్వం; +* heifer, n హీఫర్) గృష్టి; కుర్రి; ఇంకా ఈనని ఆవు పెయ్య; +* height, n 1) ఎత్తు; ఉన్నతి; పొడుగు; పొడవు; తనర్పు; ఉద్దము 2) ఔన్నత్యం; పరాకాష్ఠ; +* heirloom, n. మిరాసి; వారసత్వపు సొత్తు; పారంపర్యంగా వచ్చు సరుకు; +* helianthus, n. సూర్యకాంతపు పువ్వు; పొద్దు తిరుగుడు పువ్వు; +* heliotropic, adj. ప్రకాశానువర్త; సూర్యానువర్త; పొద్దుతిరుగుడు; +* heliotropism, n. ప్రకాశానువర్తనం; పొద్దుతిరుగుడుతనం; వెలుతురు వచ్చు దిశకు తిరిగే స్వభావం; +* Helium, n. రవిజని అణుసంఖ్య 2, సంక్షిప్త నామం, He ety రవి పుట్టుటకు కారణమైనది; ఒక రసాయన మూలకం Gr. helios Sun]; +* Hellenic, adj. యూనాని; గ్రీకు నాగరికతకు సంబంధించిన; +* helmet, n. శిరస్త్రాణం; శిరస్కం; శిరస్త్రము; నెట్టము; బొమ్మకము, బొమ్మిడీకము; బొమడిక; బొమ అడ్డము → బొమడము → బొమడికము → బొమడిక కనుబొమలకి కాఁపుదల; బొమడము తలకి దెబ్బ తగలకుండా వేసుకొనే (లోహపు) టోపీ; +* help, n 1) సహాయం; సహకారం; సాయం; బాసట; తోడ్పాటు; ఉపకారం; కూడుదల 2) ఉపకారి; సహాయపడే వ���యక్తి; +* help, v. t. సహాయం చేయు; సహాయపడు; సాయపడు; తోడ్పడు; ఉపకారం చేయు; +* haematology, n. రక్తశాస్త్రం; అసృక్ శాస్త్రం; +* hemoglobin, n. రక్తచందురం; రక్తములోని ఎర్రకణములకు రంగునిచ్చు పదార్థము; +* hemorrhoids, haemorrhoids Br n. మూలశంక; మొలలు; అసౌకర్యం, రక్తస్రావం కలిగించే పురీషనాళం లో వాచిన సిరలను పైల్స్ అంటారు. దీనిని హీమోరాయిడ్స్ అని కూడా అంటారు +* hen, n. f. పెట్ట; కోడిపెట్ట; కుక్కుటి; pl. కోళ్లు; +* henotheism, n. ఏకదేవవాదము; ఒకటే దేవుడిని ఆరాధించడం. దేవుళ్ళు అనేకం ఉండొచ్చు కానీ ఆరాధన మాత్రం ఎంచుకున్న ఒక్కరికే. ఇంతేకాక, ఏకదేవవాదులైన కొందరు సందర్భం బట్టి ఒక దేవుడికి పెద్ద పీట వేస్తారు. వేరే సందర్భంలో ఉంకో దేవుడికి పెద్ద పీట; +* hepatic, adj. కాలేయానికి సంబంధించిన; కాలేయ; +* hepatitis, n. కాలేయపు వాపు; కాలేయశోఫం; కామెర్లు; పచ్చ కామెర్లు; ఇది సాధారణ హెపటైటిస్. ఇది కాకుండా హెపటైటిస్ A, B. C. Delta అని రాకరకాల పేర్లతో హెపటైటిస్ చెలామణీలో ఉంది. వీటికీ పచ్చ కామెర్లకీ పేరులో పోలిక తప్ప మరేవిధమైన సంబంధమూ లేదనే చెప్పుకోవచ్చు; +* heralder, n. యుగకర్త; వైతాళికుడు; ఆద్యుడు; +* herb, n ఎర్‌బ్ 1) మూలిక; శాకం; ఆకు; పత్రం; ఆకుపత్రి; వంటలో సువాసన కొరకు వాడే మొక్క 2) ఓషధి; మందులలో వాడే మూలిక; +* herbicide, n. గుల్మసంహారిణి; గుల్మనాశని; కలుపు మొక్కలని చంపే రసాయనం; +* herbivore, n ఎర్బివోర్) తృణాహారి; శాకాహారి; +* Herculean task, ph. కష్టసాధ్యమైన పని; భగీరధ ప్రయత్నం; +* herd, v. t. మందని తోలు; మందని కాపలా కాయు; +* hereabouts, adv. ఈ చుట్టుప్రక్కల; ఇక్కడిక్కడ; +* hereditary, adj. వంశపారంపర్య; వారసత్వ; ఆనువంశిక; పరంపరాగత; +* heredity, n. వారసత్వం; అనువంశికత; పారంపర్యం; వంశపారంపర్యం; పారంపర్య బలం; వంశానుగతం; +* heredity, n. వారసత్వం; వంశపారంపర్యం; వంశానుగతం; +* heresy, n. సంప్రదాయ విరుద్ధత; వ్యతిరేకత; నాస్తికత్వం; +* heritage, n. వారసత్వం; వారసత్వంగా లభించినది; అనువంశికం; +* hermit, n. వానప్రస్థి; వనవాసి; రుషి; ఒంటరిగా జీవించు రుషి; +* hernia, n. గిలక రోగం; ఆంత్రవృద్ధి; +* hero, n. m 1) నాయకుడు; కథానాయకుడు 2) వీరుడు; ధీరుడు; యోధుడు; +* heron, n. బకం; కొంగ; కొక్కెర; కొక్కిరాయి; నారాయణపక్షి; +* herpes, n. విసర్పిణి; సర్పివ్యాధి; చప్పిరోగం; +herpes zoster, ph. మేఖలిక విసర్పిణి; దద్దురులతో వచ్చే ఒక వైరసు వ్యాధి; +* hesitate, v. i. తటపటాయించు; తడబడు; జంకు; అర్రాడు; అల్లాడు; సంశయించు; సందేహించు; సంకోచించు; +* hesitation, n. తటపటాయింపు; జంకు; నదురు; బెరుకు; అరమరిక; +* heteronym, n 1) ఒకే వర్ణక్రమం ఉండి, ఉచ్చారణలోనూ, అర్థం లోనూ తేడా ఉన్న ఇంగ్లీషు మాటలు; ఉ��ా: tear (టేర్ చించు; tear (టియర్ కన్నీటి బొట్టు primer (ప్రిమర్ మొదటి పుస్తకం, primer (ప్రైమర్ రంగులు వేసేటప్పుడు వాడే మొదటి పూత; +* heterosexual, n. పరలింగాళువు; వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తితో రతిని కాంక్షించే వ్యక్తి; +* hexadecanoic acid, n. షోడశోయిక్‍ ఆమ్లం; పదహారు కర్బనపు అణువుల గొలుసు ఉన్న గోరోజనామ్లం +* hexanoic acid, n షష్ఠోయిక్‍ ఆమ్లం; మేషిక్‍ ఆమ్లం; కేప్రిలిక్‍ ఆమ్లం; +* hey, inter ఏయ్ ఇదిగో; ఇదిగో నిన్నే; ఇటు చూడు; +* hexose, n. షడోజు; షడ్భుజి ఆకారంలో నిర్మాణక్రమం ఉన్న చక్కెర జాతి రసాయనం; +hexose sugar, ph. షడ్‌చక్కెర; ఆరు కర్బనపు అణువులు ఉన్న చక్కెర జాతి; +* hiccups, n. ఎక్కిళ్లు; వెక్కిళ్లు; హిక్కలు; +* hidden, adj. దాక్కొన్న; నక్కిన; గుప్తపరచిన; గర్భిత; +* hidden, adv. గుప్తంగా; రహస్యంగా; ప్రచ్ఛన్నంగా; +* hide, n. చర్మం; పశువుల చర్మం; +hide and seek, ph. దాగిలిమూతలు; దాగుడు మూతలు; గుప్త కేళి; దొంగాట; +* hierarchy, n. తరతమశ్రేణి; తరతమ అంతస్తు; సోపానక్రమం; పదానుక్రమం; అనుక్రమం; అనువంశం; +* hieroglyphs, n. చిత్రలిపి; రూపసంకేతాలు; ఈజిప్టులో కనిపించిన అతి పురాతనమైన రాతలు; +* high, adj 1) ఎత్తయిన; మిట్ట; ఉత్తుంగ; ఉన్నతమైన 2) మేలి; మంచి 3) అధిక; +* highlights n. ముఖ్యాంశాలు; అగ్రవర్చస్సులు; +* high-speed, adj. విక్రమ; శరవేగ; జోరుగా నడచే; జవాతిశయ; +* highway, n. రహదారి; రాజమార్గం; రస్తా; హట్టమార్గం; బండిబాట దండుబాట; రోడ్డు; ఒక ఊరినుండి మరొక ఊరికి వెళ్లే రోడ్డు; +* hillbilly, n. బైతు; పల్లెటూరి బైతు; చదువు, నాగరికత లేని వ్యక్తి; +* hinge, n. బందు; అరరి; మడతబందు; ఉత్తరాసి; ఉతక; తలుపుని దర్వాజాకి బిగించే సాధనం; +* hippie, n. హిప్పీ; 1960 దశకంలో, ముఖ్యంగా అమెరికాలో, సంఘపు కట్టుబాట్లు నిరసిస్తూ, సంస్కారం లేకుండా జుత్తు పెంచడం, చిరిగిన బట్టలు వేసుకోవడం, చట్టవిరుద్ధమైన మందులతో ప్రయోగాలు చెయ్యడం వంటి పనులు చేసే వ్యక్తి; +* hire, v. t. కిరాయికి కుదుర్చు; బాడుగకి కుదుర్చు; అద్దెకి తీసుకొను; +* hireling, n. కిరాయికి దుర్మార్గాలు చేసే వ్యక్తి; కిరాయికి ఖూనీ చేసే వ్యక్తి; బాడుగబందీ; క్షేత్రదాసుడు; +* histology, n. ధాతుశాస్త్రం; కణజాల శాస్త్రం; +* historic, adj. ప్రసిద్ధికెక్కిన; జ్ఞాపకం ఉంచుకోదగ్గ; చారిత్రాత్మక; +* history, n. చరిత్ర; ప్రవర; ఇతిహాసం; చరితం; +* histrionics, n. వేషాలు; కృత్రిమ ప్రవర్తన; నాటకీయత; అభినయం; +* hit, n. కొట్టు; మొత్తు; బాదు; +* hoard, n. కూడబెట్టి దాచినది; నిక్షేపం; సంచితం; +* hoarfrost, n. ఠారం; శీతలప్రాంతాలలోని ఆకులపై సూదిగా కప్పబడిన మంచు స్ఫటికాలు; +* hoax, n. లాభాపేక్షతో కాకుండా, కేవలం అల్లరి చేసే ఉద్దేశంతో చేసిన మోసకారి పని; +* hobby, n. వ్యావృత్తి; అభిరుచి; +* hogweed, n. పునర్ణవా అనే మూలిక; గలిజేరుపల్లి; జీవలోధసి; +* holding, n. కమతం; వ్యవసాయం చేసే భూమి; +* hole, n. కన్నం; బెజ్జం; బొక్క; బొరియ; కలుగు; కంత; లాగ; బిలం; రంధ్రం; వివరం; లొటారం; ఛిద్రం; సుషిరం; గర్త; +* holidays, n. పర్వదినాలు; పండుగ రోజులు; అనధ్యానాలు; ప్రభుత్వముచే ప్రకటింపబడిన శలవు దినాలు; see also vacation; +* hollow, adj. గుల్లగానున్న; డొల్లగా ఉన్న; పస లేని; +* holocaust, n. మారణహోమం; ప్రత్యేకంగా జెర్మనీ నియంత హిట్లరు యూదుల యెడల చేసిన మారణహోమం; +* holograph, n. చేవ్రాలు; స్వహస్తంతో రాసినది; +home remedy, ph. ఇంటి వైద్యం; గృహవైద్యం; కరక్కాయ వైద్యం: గోసాయి చిట్కా; +* home, n. ఇల్లు; కొంప; నివాస స్థలం; ఉనికిపట్టు; నెలవు; గృహం; మనుకువ; ధామం; నికేతనం; నివసనం; నివాసం; నివేశనం; నిలయం; +* homeopathy, n. హోమియోపతి అను చికిత్సా విధానం; +* homely, adj 1) అందముగా లేని; అనాకారమైన 2) సంసారపక్షమైన; +* homespun, n 1) ఖద్దరు; ఇంటనే వడికినది 2) ముతకైనది; +* homework, n. చింతనం; ఇంటి దగ్గర చెయ్యవలసిన పాఠ్యాంశాలు; +culpable homicide, ph. సదోష నరమేధం; దోషయుక్త నరహత్య; దండార్హ నరహత్య; +* Hominid n. నరవానర గణం; మానవులు, మానవులని పోలిన వానరగణాలు; వివేక మానవులు, దాక్షిణాత్య వానరాలు, మొదలైన జాతులన్నిటిని గుత్తగుచ్చి వాడే పదం; ఒరాంగ్-ఉటాన్‍, గిబ్బన్‍, గొరిల్లా, చింపంజీ, మొదలైనవి; +homogeneous equation, ph. సమాంగ సమీకరణం; ఒక గణిత సమీకరణంలో "కుడి వైపు" సున్న ఉన్నచో దానిని సమాంగ సమీకరణం అంటారు +homogenized milk, ph. సమాంగపరచిన పాలు; సమాంగ పాలు; పాలల్లో వెన్న పైకి తేలిపోకుండా అతి సూక్ష్మమైన జల్లెడ గుండా, అధిక పీడనంతో పోనిచ్చి, సూక్ష్మమైన రేణువులుగా మార్చగా వచ్చిన పాలు; ఈ పద్ధతిలో "తయారు చేసిన" పాలు మంచి తెలుపుతో, చిక్కగా ఉంటాయి; +* homologous, adj. సధర్మ; సంగత; సమజాత; స్థానంలో కాని, విలువలో కాని, కట్టడిలో కాని గట్టి పోలికలు ఉన్న; +* homologue, n. సంగతకం; ఒకే జాతికి చెందినవి; ఒకే కుటుంబానికి చెందిన; +* homonyms, n. pl. వర్ణక్రమంలో తేడా ఉన్నా ఒకే విధంగా ఉచ్చరించే మాటలు; +* homophile, n. స్వలింగాళువు; స్వలింగ వర్గులలో మఱొక వ్యక్తితో రతిని కాంక్షించే వ్యక్తి ant heterophine; +* homosexual, n. స్వలింగాళువు; స్వలింగ వర్గులలో మఱొక వ్యక్తితో రతిని కాంక్షించే వ్యక్తి ant heterosexual; +* homosexuality, adj. స్వలింగ ఆకర్షణ స్వలింగాళువులతో సంపర్కం పొందాలనే ఆకాంక్ష; +* homosporous, adj. సమసిద్ధబీజవంత; ఒకే రకపు "స్పోరులని" ఉత్పత్తి చేసే: +* hone, v. t. పదునుపట్టు; సానపట్టు; మెరుగులు దిద్దు; +* honest, adj ఆనెస్ట్) సచ్చీల; అవ్యాజ్య; నిజాయతీ; అకుటిల; +* honesty, n ఆనెస్టీ) నిజాయితీ; సచ్ఛీలత; చిత్తశుద్ధి; ఆర్జవం; అక్కలత; +* honey, n. తేనె; మధువు; మకరందం; భామరం; పుష్పరసం; క్షౌద్రం rel nectar; +* hoof, n. డెక్క; గిటీ; గొరిజ; రింఖ; గిట్ట; ఖురం; +* hook, n 1) కొంకి; కొక్కెం; ఒంకీ 2) క్రికెట్‌లో బంతిని వెనక్కి కొట్టు పద్ధతి; బేస్కెట్‌బాల్ ఆటలో ఒక విధంగా బంతిని విసిరే పద్ధతి; +* hop, v. i. కుప్పించు; జవుకళించు; ఎగురు; దూకు; గెంతు; +* hopeless, adj. నిరాశాపూరిత; హతాశులయిన; నిరాశావహ; +* hopelessness, n. నిరాశ; నిరాశావహం; నిరాశావహ పరిస్థితి; +* hopper, n. శంకుతొట్టి; గరాటుతొట్టి; గరాటు; +* horizon, n. క్షితిజం; దిగ్మండలం; దిగంతం; దిక్‌చక్రం; చక్రవాళం: +* horizontal, adj. క్షితిజ; క్షితిజ సమాంతర; సమతల; అడ్డుగా; +* hormone, n. ఉత్తేజితం; అంతర్గత స్రావం; గ్రంథులచే తయారుకాబడ్డ ఒక రకం ఉత్తేజపరచే రసాయన పదార్థం; శరీరంలో ఒక చోట తయారయి, రక్తప్రవాహంలో ప్రయాణం చేసి, వాటి కార్యస్థానాలని చేరుకుని వాటి విధిని నిర్వర్తించే రసాయన బణువులు; ఉదాహరణకి ఒక్క పిట్యూటరీ గ్రంధి ఏడు ఉత్తేజితాలని రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తుంది; మూత్రపిండాల మీద టోపీలా ఉండే కణజాలం ఎడ్రీనలిన్ అనే ఉత్తేజితాన్ని తయారు చేస్తుంది; ఇలా ఎన్నో ఉత్తేజితాలు ఉన్నాయి; +* horn, adj. కొమ్ముతో చేసిన; శృంగ; విషాణ; శింగాణి; +* hornbill, n. ధనేశ పక్షి; ఎబ్బెరపక్షి; +greater hornbill, ph. మహాధనేశ పక్షి; రాజధనేశ పక్షి; కొండయెబ్బెర పక్షి; +* horrible, adj. భీషణ; బీభత్సకరమైన; భయంకరమైన; తీవ్రమైన; దారుణమైన; ఉచ్ఛండ; +* horror, n. బీభత్సం; భీకరం; భయానకం +* hors d'oeuvres, n. pl ఆర్డొర్వుస్‍ భోజనం ముందు తినే వెచ్చవెచ్చటి చిరు భక్ష్యాలు; చల్లగా ఉన్న చిరు భక్ష్యాలని "ఆంటీపాస్తో" అంటారు; +* horse, n. గుర్రం; అశ్వం; హయం; తురంగం; ఘోటకం; ఘోటం; వాజి; గుండు; వారువం; మయం; యయువు; +horse power, ph. అశ్వ సత్వం; 550 పౌనుల బరువుని ఒక సెకండు కాలవ్యవధిలో ఒక అడుగు పైకి లేవనెత్తడానికి కావలసిన సత్వాన్ని అశ్వ సత్వంఅని నిర్వచించేరు; ఒక సామాన్యుడి శరీరంలో ఉరమరగా ఒకటింట పదోవంతు అశ్వశక్తి ఉంటుంది; +* horseradish, n. మునగవేరు; బాగా ఘాటుగా ఉండే ఒక రకం దుంప; +* horticulture, n. ఉద్యానకృషి; వనసాయం; తోటల పెంపకం; +* hosiery, n. లోపలి దుస్తులు; లోదుస్తులు; +rubber hose, ph. రబ్బరు గొట్టం; ఎలా కావలిస్తే అలా ఒంగడానికి వీలయిన పొడుగాటి రబ్బరు గొట్టం; +* hospital, n. ఆసుపత్రి; వైద్యశాల; వాసిలి; +* hospitality, n. ఆదరణ; మర్యాద; ఆతిథ్యం; అతిథి సత్కారం; అతిథిధర్మం; అతిథేయత; +* host, n. అతిధేయుడు; అతిథిని ఆదుకునే మనిషి; +* hostage, n. జామీనుగా ఉంచబడిన వ్యక్తి; బందీ; +* hostel, n. వసతిగృహం; ఆవసధం; సదనం; ఉంగడ; విద్యార్థులు నివసించే వసతి గృహం; +* hostile, adj. ప్రతికూల; విరుద్ధ; వ్యతిరేక; వైర; +* hostility, n. వైరం; విరోధం; ప్రాతికూల్యం; +* hotel హొటేల్) n. హొటేలు; పడక సదుపాయాలని అతిథులకి అందించే భవనం; హొటేలులో పడక గదులే కాకుండా, ఫలహారశాలలు, తదితర సదుపాయాలు ఎనై్ననా ఉండవచ్చు note) ఈ మాటని హోటల్ అని ఉచ్చరించే అలవాటు ఆంధ్రదేశంలో ఉంది కానీ, హొటేలు అన్నది అసలు ఉచ్చారణకి దగ్గర; see also restaurant; motel; +* hound, n. వేటకుక్క; గాలికుక్క; సారమేయము; ఉడుప కుక్క; +* hourly, n. గంట గంటకీ; గంటకొకమారు; ప్రతిగంటా; +* house, n. ఇల్లు; గృహం; అగారం; లోఁగిలి; ఆలయం; కొంప; పంచ; నెలవు; +* householder, n. గృహపతి; గృహస్థువు; గృహస్థు; గృహమేధి; గేస్తు; ఇంటిదొర; +* housewife, n. ఇల్లాలు; ఇంటికి ఆడది; గృహిణి; గరిత; +* howdah, n. అంబారీ; ఏనుగు మీద సవారీ చెయ్యడానికి వీలయిన కుర్చీ; +* hub, n 1) నడిబొడ్డు; నాభి; చక్రనాభి; బండికన్ను; నట్టు; చక్రంలోకి ఇరుసు వెళ్లే స్థానం 2) కూడలి; రహదారులు కానీ, తీగలు కానీ ఒక చోట కలుసుకునే స్థలం; +* hubbub, n. హంగామా; హడావిడి; గడబిడ; అలజడి; కోలాహలం; గలభా; సందడి; +* hubris, n గర్వం; అతిశయం; గర్వంతో కూడిన అతిశయం; ధీమా; పొగరు; +* hug, n. ఆలింగనం; కౌఁగిలింత; పరిష్వంగం; +* hum, n 1 రొద; సన్నని శబ్దం 2) కూనిరాగం 3) కలకలం; కోలాహలం; సందడి; +human rights, ph మానవ హక్కులు; మానవాధికారాలు; +* humane, adj. కరుణామయ; మానవత్వం గల; దయాళు; కృపాళు; సహృదయ; దయామయ; మానవోచిత; +* humanism, n. మానవతా వాదం; మానవతావాదం నీతి తత్వములకు సంబంధించిన ఒక విశాలమైన భావం. ఈ వాదం ప్రజలందరి హుందాతనాన్ని ప్రకటిస్తుంది. ప్రత్యేకంగా మానవత్వాల హేతువులను మూలం చేసుకుని విశ్వమానవ విశేషాలను ముందుంచుతుంది. మానవత్వపు ఉత్తమ లక్షణం సహనం. ఏ సమాజంలోనైనా భిన్న నమ్మకాలు, విభిన్న తాత్విక దృక్పథాలు తప్పక ఉంటాయి. వాటి మధ్య ఐక్యతను సాధించడానికి ఉపయోగపడే సాధనమే సహనం. మనిషిలోని సహనం సామాజిక శాంతికి కారణమవుతుంది. మనిషిలోని అసహనం సమాజంలోని అల్లకల్లోలాకు కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సంఘంలో ప్రభవించడానికి సహనం తప్పని సరి; +* humanitarian, n. మానవతావాది; ఉపకారి; కరుణాళువు; +* humanities, n. మానవీయ శాస్త్రాలు; మానవ అనుభవాలని, మానవ సంస్కృతులని వర్ణించే అధ్యయనాంశాలు; తత్త్వం, శిల్పం, కళలు, సాహిత్యం, సార్స్వతం, తర్కం, వగైరాలు ఈ శాఖలోకి వస్తాయి +* humanity, n 1) మానవాళి; మానవకోటి; నరజాతి; మానవజాతి 2) మానుషత్వం; మానవత్వ��; మానవత; భూతదయ; కనికరము; పరహితేచ్ఛ; +* humidity, n. తేమ; చెమ్మ; చెమ్మదనం; తడి; ఆర్ద్రత; ఈకువ; +* humiliate, n. అవమానపరచు; చిన్నబుచ్చు; +* hump, n 1) మూపురం; పశువుల వీపు మీద ఎత్తుగా ఉండే అవయవం 2) దిబ్బ; ఎత్తుగా ఉన్న ప్రదేశం 3) చిన్న అవరోధం; +* hunger, n. ఆఁకలి; క్షుత్తు; క్షుధ; అంగద; +* hunter, n. వేటగాఁడు; వ్యాధుఁడు; కిరాతుఁడు; బోయవాఁడు; భిల్లుఁడు; మృగయుఁడు; చెంచుఁడు; +* huntress, n. f. వేటగత్తె; కిరాతకి; బోయది; భిల్లి; చెంచి; +* husband, n. మగఁడు; పెనిమిటి; భర్త; పతి; నాధుఁడు ఏలిక; +* husk, n. ఊఁక; పొట్టు; పొల్లు; చిట్టు; +* hut, n 1) గుడిసె; కుటి; కుటీరం 2 పర్ణశాల; +* Hyades, n. రోహిణీ సహిత నక్షత్రాలు; సప్తర్షి నక్షత్రాలు; +* Hydra, n 1) ఆశ్రేష నక్షత్ర సమూహం; హైడ్రాలోని డెల్టా, ఎప్సిలాన్, ఈటా, రో అనే నక్షత్రాలని గుత్తగుచ్చి ఆశ్రేష అంటారు 2) ఒక జంతువు; +* hydraulics, n నీటిలోని ఒత్తిడిని శక్తిగా మార్చే విధానాన్ని అధ్యయనం చేసే శాస్త్రం; +hydrocarbon radical, ph. ఉదకర్బన రాశి; ఒకటికి మించి ఉదజని అణువులని తొలగించగా రిక్త హస్తాలతో మిగిలిన ఉదకర్బనపు బణువు; +* hydrocephalus, n. జలశీర్షం; మస్తిష్కశోఫ; శీర్షబూదరం: +* hydroelectricity, n. జలోద్భవ విద్యుచ్ఛక్తి; జలవిద్యుత్తు; +* hydrogen, n. ఉదజని ety నీటియొక్క జననానికి కారణమైనది; ఒక రసాయన మూలకం అణుసంఖ్య 1, సంక్షిప్త నామం, H) +hydrogen bond, ph. ఉదజని బంధం; రెండు బణువుల మధ్య ఉండే విద్యుదయస్కాంత తత్త్వంతో కూడిన ఆకర్షక బంధం; ఒక కర్బనం అణువుతో ఉదజని అతుక్కుని ఉదకర్బనాలుగా తయారయేటప్పుడు ఈ రకం బంధం కనిపిస్తుంది; +hydrogenated oil, ph. ఉదజనీకృత తైలం; వనస్పతి వనస్పతి అంటే ఉదజనీకృత శాకజనిత తైలం); +* hydrogenation, n. వనస్పతీకరణం; ఉదజనీకృతం; నూనెలలోకి ఉదజనిని పంపి గడ్డకట్టించడం; +* hydrology, n. జలరాశిశాస్త్రం; జలతంత్రం; +* hyena, n హయీనా దుమ్ములగొండి; గాడిదపులి; కొర్నవగండు; సివంగి; +* hygiene, n. ఆరోగ్యశాస్త్రం; ఆరోగ్య సూత్రాలు; +* hymen, n. కన్నెతెర; యోనిమార్గంలో ఉండే పొర; +* hymn, n. కీర్తన; స్తోత్రం; దండకం; పొగుడుతూ పాడే పాట; +* hyperbole, n హైపర్ బొలీ) అతిశయోక్తి; ఉన్నదానిని గొప్పగా వర్ణించుట; +* hyper-correction, n. దురతి సవరణ; అతిశోధితం; ఉదా: కొన్ని పదాల్లో హ-కారం లేని చోట కూడా హ-కారాన్ని చేర్చడం; +* hyperlink, n అధిలంకె; పరిలంకె; పరిసంధి; అతిఅంకె; కంప్యూటర్లలో ఒక పుటలోని ఉన్న పాఠ్యాంశాన్ని మరొక చోట విపులంగా వివరించడానికి గాను రెండు పాఠ్యాంశాలని బంధించే లంకె; +* hypnosis, n. నిద్ర తెప్పించే శాస్త్రం; నిద్ర తెప్పించి వశీకరించుకునే వైద్య పద్ధతి; +* hypnotize, v. t నిద్ర తెప్పించి వశీకరించు; +* hypo, pref. తక్కువ; దిగువ; కింద; చిన్న; లోనికి; లోనికి వెళ్ళే; లోనికి పీల్చుకునే; +* hypocrisy, n. కాప్యకారము; ఆత్మవంచన; జిడికిరింత; డంభాచారం; బూటకం; కైతవం; కాపట్యం; కపటత్వం; ఛలం; మిథ్యాచారం; ధ్వంధ్వ వైఖరి; +* hypocrite, n. కాప్యకారి; రుద్రాక్షపిల్లి; బూటకాలమారి; ఆత్మవంచకుడు; కపటశీలి; డంభాచారి; +* hypotenuse, n. కర్ణం; దీర్ఘ కర్ణం; సమకోణ త్రిభుజంలో లంబకోణానికీ ఎదురుగా ఉన్న భుజం; +* hypothesis, n. s. ప్రాతిపదిక; ప్రతిపాదన; ప్రాక్కల్పన; ఉపపాద్యం; పరికల్పన; ప్రకథనం; అభిప్రాయం; pl. hypotheses; +* hysteria, n. కాకిసొమ్మ; అపస్మారం; అపస్మారకం; + + +* iamb, n. పద్యంలో వచ్చే లగం అనే గణం; ఒక లఘువు, తరువాత ఒక గురువు ఉన్న గణం rel foot అంటే గణం; iamb అంటే లగం; line అంటే పాదం; +* iambus, n. లగం; ఛందస్సులో లఘువు వెంబడి గురువు ఉన్న గణం; +* iatrogenic disease, n. వైద్యుడి వల్ల కాని వైద్య సిబ్బంది వల్ల కాని కలుగజేయబడ్డ రుగ్మత; వైద్యం చెయ్యడం వల్ల వచ్చిన వ్యాధి; +* ibex, n. స్కీను మేషం కాప్రా; హిమాలయాలలో ఉండే మేకని పోలిన జంతువు; +* ibis, n కంకణపు కొంగ; ఒక జాతి కొంగ; పొడవాటి ముక్కు చివర కిందికి తిరిగి ఉండడం ఐబిస్ ల ప్రత్యేకత; సైబీరియా ప్రాంతాలలోని విపరీతమైన చలికి తట్టుకోలేక ఈ పక్షులు చలికాలంలో దక్షిణభారత దేశానికి వలస వస్తుంటాయి; +white ibis, ph. తెల్ల కంకణము తెల్ల కంకణపు కొంగ; ఎర్ర కాళ్ళ కొంగ; +* ice, n మంచు మంచుగడ్డ; హిమం; గడ్డమంచు; +* iceberg, n. సముద్రంలో తేలియాడు మంచుకొండ; +* ichthyology, n. మత్స్య శాస్త్రం; మీను శాస్త్రం; మీన విజ్ఞానం; చేపల శాస్త్రం; +* icicle, n. మంచుకాడ; పొడుగ్గా కాడ రూపంలో పేరుకున్న నీరు; సాధారణంగా చూరుల వెంబడి కారే నీరు గడ్డ కట్టి ఇలా తయారవుతుంది; +* icon, n 1) ప్రతిమ; విగ్రహం; అర్చ; మూర్తి; చిత్రకం 2) గురుతు; +* icosahedron, n math వింశతిముఖి; ఇరవై ముఖములు ఉన్న ఘన బహుముఖి; +* idea, n. ఊహ; భావం; భావన; ఆలోచన; ఉద్దేశం; వెరవు; సాధనం; తలపు; స్ఫురితం; ఉపాయం; అవపారిక; +* ideal, n. ఆదర్శం; ఆదర్శ ప్రాయం; ఆశయం; +* idealism, n 1) ఆదర్శవాదం; భావవాదం 2) ఒక తత్త్వం; మౌలికంగా “స్వయానుభవ ఆధ్యాత్మిక వాదం.” ఇది జ్ఞానానికి సంబంధించినది; అనగా, వాస్తవికత అనేది ఏదో విధంగా మనస్సు (consciousness) మీదనే ఆధారపడి ఉంటుంది. అనగా, తన అనుభవంతో మేళవించినదే ప్రపంచం (సృష్టి) అని చెప్పేది. అనగా, స్థూల ప్రపంచం కల్ల, ఒక మాయ అని చెప్పేది. అనగా, బల్ల మీద పండు అక్కడ ఉందా, లేదా అనేది చూసేవాడి మీద ఆధారపడి ఉంటుంది. చెట్టు కూలినప్పుడు పుట్టిన శబ్ద తరంగాలు ఒక చెవి లోని కర్ణభేరి��ి తగిలి అది ప్రకంపించి ఆ ప్రకంపనలు ఒక మెదడులోని శ్రవణ నాడీ కేంద్రాలని ఉత్తేజపరచినప్పుడు ఆ మెదడు చెప్పిన భాష్యమే శబ్దం. అనగా మెదడులోని చేతన (consciousness) ఏది చెబితే అదే మనకి ద్యోతకమవుతుంది కాని నిజంగా ప్రపంచం ఎలా ఉందో అన్నది "అజ్ఞేయం unknowable జీవితం గానీ, లోకం గానీ ఆదర్శప్రాయంగా ఉండటం ఎలాగో చిత్రించి చెప్పే నిర్వచనం ఆదర్శవాదం; తన అనుభవంతో మేళవించినదే ప్రపంచమని చెప్పే సిద్ధాంతం కనుక స్వీయానుభవ ఆధ్యాత్మిక వాదమని అనవచ్చు; స్థూల ప్రపంచము కల్ల యను వాదము; see also realism; +subjective idealism, ph. స్వీయాత్మక ఆదర్శవాదం స్వీయాత్మక భావవాదం; +* identification, n 1) గుర్తు; ఆనవాలు; అభిజ్ఞానం 2) తాదాత్మ్యం; సాయుజ్యం; +* identify, v. t 1) గుర్తుపట్టు; గుర్తించు; పోలిక పట్టు; పోల్తి పట్టు 2) తాదాత్మ్యం చెందు; +* identify, n 1) సర్వసమానత్వం; తాదాత్మ్యం; ఏకత్వం; సర్వసమానత్వం 2) తత్సమరాశి 3) గుర్తు 4) వైయక్తికత; +* idiocy, n 1) మూఢత్వం; వెర్రిబాగులతనం 2) పిచ్చితనం; బుద్ధిమాంద్యం; +* ideogram, n చిత్రలిపి; భావలిపి; భాషతో నిమిత్తం లేకుండా ఒక భావాన్ని తెలిపే బొమ్మ; +* idiopathic, adj. తెలియని కారణం వల్ల; కారణరహితంగా; +* idiolect, n. వైయక్తిక వ్యావహారికం; వ్యక్తిపరమైన శైలీ భేదాల సంపుటి rel dialect; +* idiot, n. ఒక రకమైన బుద్ధిమాంద్యతతో పుట్టిన వ్యక్తి; +* idiom, n. జాతీయం నుడికారం పలుకుబడి; భాషీయం; భాషాసంప్రదాయం; +* idiosyncrasy, n. విలక్షణం; విలక్షణ స్వభావం; తిక్క; ఉలిపికట్టెతనం; చమత్కార స్వభావం; +* idle, adj. సోమరి; అక్రియ; ఏ పనీ చెయ్యకుండా ఉన్న స్థితి; +* idol, n. ప్రతిమ విగ్రహం అర్చ; మూర్తి; +* ignite, v. i. రాజుకొను; రగులుకొను; అంటుకొను; +* ignite, v. t. రగుల్చు; రగిలించు; అంటించు; ముట్టించు; వెలిగించు; మండించుట; +* ignition, n. రగుల్పాటు; రగుల్చుట; జ్వలనం; ప్రజ్వలనం; +* ignorance, n. అజ్ఞానం; అగ్రహణం; అవజ్ఞాతం; ఎరుకమి; తమస్సు; అవిద్య; అరయమి; తెలియమి; మరకువ; see also nescience; +* ignore, v. i. విస్మరించు; ఉపేక్షించు; నిర్లక్ష్యం చేయు; ఆధారం లేదని ఒదిలిపెట్టు; +* ileum, n. తుంటి ఎముక; కుండలిని; శేషాంత్రం; +* ill-bred, adj. వెకిలి; మోటైన; సరి అయిన పెంపకం లేని; +* illegal, adj. అక్రమమైన; చట్టవిరుద్ధమైన; వికర్మ; దొంగ; +illegal act, ph. అక్రమం; చట్టవిరుద్ధం; వికర్మం; అడ్డగోలు; +* illegible, adj. అస్పష్టమైన; చదవడానికి స్పష్టత లేని; కొక్కిరి బిక్కిరి; +illegitimate child, ph. చట్టవిరుద్ధమైన వివాహం వల్ల పుట్టిన బిడ్డ; జారజుడు; +* Illiad, n ఇలియాడ్) ట్రాయ్ నగరపు యుద్ధం గురించి గ్రీకు మహాకవి హోమర్ రాసిన గ్రంథం; +* ill-fated, adj. దుర్గతికీ పాలైన; అదృ��్టం వక్రించిన; దైవోపహతులైన; +* illicit, adj. నిషిద్ధమైన; చట్టవిరుద్ధమైన; దొంగ; దొంగచాటు; +* illiteracy, n నిరక్షరాస్యత చదువనేర్చని; +* illiterate, n. నిరక్షరాస్యుడు; చదవడం రాయడం తెలియని వాడు; +* illuminated, adj. ద్యోతితం; జ్వలితం; కాంతివంతం చేయబడ్డ; +* illumination, n. ఉద్దీపనం; వెలుగు; వెలుతురు; ప్రకాశం; ఉద్భాసం; ద్యోతకం; ద్యూతి; పొద్దు; +* illustration, n 1) బొమ్మ; చిత్రం; చిత్తరువు 2) ఉదాహరణ; దృష్టాంతం; ఆఖ్యాయికం; +* illustrious, adj. ఘనతకెక్కిన; ప్రఖ్యాత; ప్రముఖ; ప్రసిద్ధ; +* image, n. ప్రతిరూపం; ప్రతిబింబం; ప్రతిమ; బింబం; చిత్రం; +* imagery, n 1) బొమ్మకట్టుడు; పదచిత్రం 2) ఉత్ప్రేక్ష; ఉత్ప్రేక్షాలంకారం; +* imaginary, adj. కాల్పనిక; కల్పిత; అసత్య; ఊహ్య; భావుక; భావకల్పిత; ఊహాత్మక; +imaginary axis, ph. కాల్పనిక అక్షం; భావుకాక్షం; ఊహాత్మక అక్షం; కల్పన అక్షం; +imaginary number, ph. కాల్పనిక అంకం; భావుకాంకం; ఊహాత్మక సంఖ్య; కల్పన సంఖ్య; +* imagination, n. ఊహ; ఊహాశక్తి; భావన; కల్పన; భావుకత్వం; కల్పనాశక్తి; ఊహాశీలత; ఉత్ప్రేక్ష; +* imbibe, v. t. తాగు; పీల్చు; సేవించు; ఆస్వాదించు; +* imbue, v. t. నానబెట్టు; నాటు; మనస్సులో ఉంచుకొను; +* imitate, v. t. అనుకరించు; పోలునట్లు చేయు; ప్రతిరూపం నిర్మించు; +* imitation, n. అనుకరణ; అనుకారం; అనుకృతి; నకిలీ; అనుసృజన; +* immanent, adj. అంతర్భూతమైన; లోనున్న; అంతర్వ్యాప్తమైన; స్వాభావికమైన; +* immanent, n. అంతర్యామి; అంతర్భూతుడు; +God is immanent, ph. దేవుడు సర్వాంతర్యామి; దేవుడు అన్నిటిలోను ఉన్నాడు; +* immeasurable, adj. అప్రమేయ; అపరిగణనీయ; కొలవలేనంత; కొలతకు రాని; +* immediately, adv. వెంటనే; తక్షణం; ఎకాయెకీ; సత్వరం; అవశ్యం: అప్పటికప్పుడు; అవ్యవధానంగా; +* immobile, adj. స్థిరమైన; స్థావర; నిశ్చలమైన; అచల; అచర; కదలని; కదల్చలేని; ప్రచలిత; +* immolate, v. t. త్యాగం చేయు; అగ్ని ప్రవేశం చేయు; +* immorality, n. దుర్నీతి; అవినీతి; వ్యభిచర్యం; +* immortality, n. అమరత్వం; అమర్త్యం; నిత్యత్వం; చావులేకపోవడం; +immune response, ph. రక్షక ప్రతిస్పందన; రోగనిరోధక స్పందన; +* immunity, n. రోగ నిరోధక శక్తి; అసంక్రామ్యత; రక్షణ; రక్షకశక్తి; రక్షరేకు; అభయప్రదానం; శరీరం రోగగ్రస్తం కాకుండా రక్షించుకోగలిగే శక్తి; +* immunization, n. అసంక్రమకరణం; అభయప్రదానం; రోగం సంక్రమించకుండా శరీరాన్ని పదిలపరచడం; +* immutable, adj. మార్పుచెందని; మార్పులేని; స్థిరమైన; +* impact, n. తాకిడి; ప్రభావం; అభిఘాతం; +* impair, v. t. బలహీనపరచు; పాడుచేయు; చెడగొట్టు; విలువ తగ్గించు; +* impartial, adj. సమశీల; నిష్పాక్షిక; పక్షపాత రహిత; +impartial person, ph. సమశీల వ్రతయుతుడు; పక్షపాత రహితుడు; నిష్పాక్షికుడు; +* impassable, n. దుస్తరం; దాటరానిది; చొ���రానిది; +* impasse, n ఇంపేస్ కఠిన పరిస్థితి; విషమ స్థితి; దిగ్బంధ స్థితి; తప్పించుకోలేని పరిస్థితి; +* impassioned, adj. ఉద్రేకముతోఁ గూడిన, మనస్సునకు తగులునట్లు చెప్పిన, +impassioned plea, ph. మనస్సునకు తగులునట్లు చెప్పిన విజ్ఞప్తి; +* impatience, n. ఆతురత; ఓరిమి లేకపోవడం; విసుగు; చిరాకు; +* impeccable, adj. మచ్చలేని; నిష్కళంకమైన; దోషం లేని; తప్పులెన్నరాని; +* impede, v. t. అడ్డగించు; నిరోధించు; అవరోధించు; +* impedance, n. అవరోధకం; అవరోధం; అర్గళం; అంకిలం; క్లేశకం; స్తోభకం; స్తోభం; +* impediment, n. ప్రతిబంధకం; ఆటంకం; అంకిలి; విఘాతం; అర్గళం; పురోగతికి పెద్ద దెబ్బ; +* impel, v. t. ప్రేరేపించు; ముందుకు తోయు; +* impeller, n. ప్రేరేపకి; ముందుకు తోసేది; +imperative mood, ph gram విద్యర్ధకం; విధివాచకం; ప్రార్థనార్ధకం; ఉభయ ప్రార్థనార్ధకం; +* imperfect, adj. అసంపూర్ణమైన; అసమాప్త; అసమగ్ర; లోపం ఉన్న; కొరత ఉన్న; లోపభూయిష్టమైన; +* imperial, adj. సార్వభౌమత్వ; సామ్రాజ్యవాద; +* imperishable, adj. నాశనం లేని; కుళ్ళని; పాడుకాని; నిల్వ చేసినా పాడు కాని; +* impersonal, adj. అవ్యక్త; వ్యక్తి సంబంధం లేకుండా; +* impervious, adj. అప్రవేశ్య; అభేద్యమైన; లోనికి చొరజాలని; +* impish, adj. చిలిపి; తమాశాకి అల్లరి చేసే తత్త్వం; +* implant, v. t. రోగి శరీరాన్ని వైద్యుడు కోసి లోపల మరొక వస్తువుని పెట్టడం; +* implement, v. t. ఉపయోగించు; వాడు; వాడుకలో పెట్టు; అమలు చేయు; అమలు పరచు; ఆచరించు; +* implication, n. అన్యాపదేశం: అంతస్సూచన; ధ్వనింపు; +* implicit, adj. అవ్యక్త; అంతర్లీన; అంతర్గత; గర్భితమైన; +* implore, v. t. ప్రార్థించు; బ్రతిమాలు; బుజ్జగించు; విన్నపం చేసుకొను; విన్నవించుకొను; +* imported, adj. సీమ; కిరానా; దిగుమతి చేసికొన్న; +* impose, v. t. ఇబ్బంది కలిగించు; పిలవని పేరంటం వలె వచ్చు; శిక్షించు; +* impossible, adj. అసంభవమైన; అసాధ్యమైన; దుస్సాధ్యమైన; వల్లమాలిన; +* impossible, n. అసంభవం; అసాధ్యం; దుస్సాధ్యం; మృగ్యం; +* impostor, n. మరొకరివలె నటించేవాడు; దొంగ; మోసగాడు; దగుల్బాజీ; +* impotence, n. నపుంసకత్వం; నిర్వీర్యత్వం; పుంసత్వలోపం; ధ్వజభంగం; పిరికితనం; క్లెబ్యం; +* impotency, n. ధ్వజభంగం; నపుంసకత్వం; నిర్వీర్యత్వం; క్లీబ్యం; +* impotent, adj. నిర్వీర్యం; శక్తిహీనం; బలహీనం; +* impound, v. t. దాచిపెట్టు; బంధించు; సామానులని అటకాయించి బంధించు; +* impoverish, v. t. దారిద్య్రం కలిగించు; శక్తిహీనం చేయు; క్షీణింపజేయు; +* impregnate, v. t. సిక్తం చేయు; నింపు; గర్భం కలిగించు; గర్భాదారణ చేయు; +* impress, v. t. ముద్ర వేయు; మనస్సుకి హత్తుకునేటట్లు చేయు; మంచి అభిప్రాయం కలుగజేయు; +* impressed, adj. ముద్ర వేయు; ముద్రాంకిత; నిహిత; నచ్చు; మంచి అభిప్రాయం కలుగు; +* impression, n 1) ముద్ర; ముద్రణ; గురుతు 2) ముద్రాంకితం; వాసన; సంస్కారం 3) అభిప్రాయం; భావముద్ర; భావం; +* imprinting, n. మనోముద్రణ; జంతువులలో పిల్ల మనోఫలకం మీద తల్లిదండ్రుల ముద్ర పడటం; +* imprisonment, n. నిర్భంధం; కారాగార శిక్ష; ఖైదులో పెట్టడం; +* improbable, adj. అసంభవమైన; అసంభావ్యమైన; సత్యదూరమైన; +* improper, adj. అనుచిత; అపసవ్య; తగని; అక్రమ; అపక్రమ; విషమ; +* improper, n. అనుచితం; తగనిది; అక్రమమైనది; +* improve, v. t. బాగుపరచు; అభివృద్ధి చేయు; పురడించు; +* improved, adj. మెరుగుపరచబడ్డ; పురడించిన; +* improvement, n. అభివృద్ధి; మెరుగుదల; బాగుపడడం; +* improvisation, n. మనోధర్మం; ఆశువుగా ప్రామాణికమైన సంగీతానికి చిలవలు, పలవలు చెక్కడం; ముందుగా తయారవకుండా అక్కడికక్కడ కల్పించి ప్రదర్శించడం; అభివృద్దీకరణ; +* improvise, v. t. మనోధర్మం చేయు; ఆశువుగా విద్యని ప్రదర్శించు; ముందుగా తయారవకుండా అక్కడిక్కడ కల్పించి ప్రదర్శించు; +* impudence, n 1) నీలుగడం; అమర్యాదకరమైన ప్రవర్తన 2) సిగ్గు లేకపోవడం; +* impure, adj. కల్తీ; అశుద్ధ; అవిశుద్ధి; స్వచ్ఛం కాని; ములుకువ; +* impurity, n. అశౌచం; కల్మషం; అపరిశుద్ధం; కల్తీ పదార్థం; +* inadvertently, adv. ఏమరుపాటున; పరాకుగా; అనుకోకుండా; అనవధానంగా; +* inapplicable, n. అవర్తితం; వర్తించనిది; పొసగనిది; ఉపయోగించనిది; +* inappropriate, adj. సరికాని; అసందర్భ; అసమంజస; అక్రమమైన; తగని; అయుక్త; యుక్తముకాని; +* inauguration, n. ప్రారంభోత్సవం; అంకురార్పణం; స్నాతకం; స్నాతకోత్సవం; +* inborn, adj. సహజమైన; జన్మసిద్ధ; పుట్టుకతో వచ్చిన; స్వాభావిక; +* incandescent, adj. తాపదీప్త; వేడి చేత వెలుగు పుట్టించే; +* incentive, n. ప్రచోదనం; ప్రోత్సాహకం; ఉసి కోల్పేది; ప్రేరేపకం; ప్రేరకం; +* incessant, adj. ఎడతెగని; నిరాఘాటంగా; అనవతరంగా; +* incest, n. వావిడికము; వావివరసతప్పడము; అగమ్యాగమనము; ఒకే కుటుంబ సభ్యుల మధ్య లైంగిక సంబంధం; వివాహము కూడని వరుస (వావి) గలవారితోడి వ్యభిచారము; +* incidental, n. ఆగంతుకం; అప్రధానం; అనుషంగికం; +* incidental, adj. అనుషంగిక; అప్రధాన; ప్రధాన కార్యక్రమంతోపాటు, అప్రయత్నంగా జరిగిన అనగా, ప్రమాదవశాత్తూ కాదు +* incipit, n. ప్రారంభ వాక్యం; కథన ప్రారంభం; +* incite, v. t. రేకెత్తించు; రెచ్చగొట్టు; ప్రేరేపించు; ఉసికొలుపు; ఉత్తేజపరచు; +* inclement, adj. పాడుగా ఉన్న; జడివాన, తుపాను మొదలైన పరిస్థితుల వల్ల పాడుపడిన; +* inclination, n 1) అభిమతం; అభిరుచి; చిత్తవృత్తి 2) అభిలాష; ఉబలాటం 3) వాలు; మొగ్గు; నతి; +inclined plane, ph. వాలు తలం; దోర తలం; మొగ్గుబల్ల; తొంగలి బల్ల; ఆస్థ ఫలకం; +* incognito, n. ఇతరులకి దొరకకుండా తప్పించుకోగల జ్ఞానం; మారువేషం; +* incoherent, adj. అసంబద్ధమైన; పొంతనలేని; అకటవికటమైన; అసంగతమైన; +* incomparable, adj. సాటిలేని; అనన్య సామాన్యమైన; అసదృశమైన; అసమానమైన; నిరుపమాన; +* inconceivable, n. అచింత్యం; ఊహించడానికి కూడా వీలు లేని; +* inconsistent, adj. అసంగతమైన; అసంబద్ధమైన; పరస్పర విరుద్ధమైన; +* incontinent, n. మల మూత్ర విసర్జనలపై పట్టు తప్పటం; +* incorporate, v. t. సంస్థీకరించు; వ్యవస్థీకరించు; +* incredible, adj. నమ్మశక్యంకాని; వింతైన; విడ్డూరమైన; అపురూపమైన; +* indebted, adj. రుణపడియుండు; రుణగ్రస్తమైయుండు; అప్పుపడి ఉండు; +* indefinite, adj. అస్పష్టమైన; అపారమైన; అనిర్దిష్ట; +* indentation, n 1) లోత్త 2) గంటు; పేరా మొదటి వరసని మార్జిన్ నుండి దూరంగా జరిపి రాయడం; +* indenture, n. ఒడంబడిక; ఒప్పందం; ఖరారునామా; ముచ్చిలికా; +* index, n. సూచిక; పదపట్టిక; అనుక్రమణిక; పదసూచి; చింతామణి; ఒక పుస్తకంలోని ముఖ్యమైన మాటలు ఏయే పుటలలో కనిపిస్తాయో చెప్పే సూచిక; సాధారణంగా ఈ సూచిక పుస్తకం చివర ఉంటుంది; +India ink, ph. త్వరగా ఆరే (నల్ల) సిరా; భారతీయులలా నల్లగా ఉంటుందని మొదట్లో ఈ సిరాకి ఈ పేరు పెట్టారు, బ్రిటీష్‌వారు. దరిమిలా ఈ రకం సిరాని అన్ని రకాల రంగులలోనూ చేస్తున్నారు. పిల్ల చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్లు ఈ పేరు మాత్రం మిగిలింది. +* Indian, adj. భారత్; భారతీయ; భారతదేశానికి సంబంధించిన; ఇండియా ఉపఖండానికి సంబంధించిన; +Indian Subcontinent, ph. ఇండియా ఉపఖంఢం; ఈ ఉపఖండంలో భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక; భూటాన్, పాకిస్తాన్, మయాన్‌మార్, హిందూ మహాసముద్రంలోని చిల్లర దీవులు ఉన్నాయి; +* indicator, n. సూచి; సూచిక; సంసూచిక; ముల్లు; అర్థకం; స్పోరకం; +* indigestion, n. అజీర్ణం; అగ్నిమాంద్యం; అజీర్తి; +indigo plant, ph. నీలిమొక్క; రంజని; నీలిగోరింట; మధుపర్ణిక; అవిరి; +* indiscreet, adj. విచక్షణారహిత; ఆలోచనలేని; అనాలోచిత; +* indispensable, adj. అనివార్య; ఆవశ్యక; అపరిహార్య; తప్పనిసరి అయిన; +* indoctrinate, v. t. బోధించు; బోధచేయు; బలాత్కారంగా సమ్మతింపజేయు; +* induce, v. t. ప్రేరేపించు; ప్రోత్సహించు; ఉన్ముఖుని చేయు; లోభపెట్టు; +* induction, n. అర్థాపత్తి; ఆగమనం; నిగమనం; వ్యష్టి సంఘటనల పరంపర నుండి సాధారణ సూత్రాన్ని ప్రతిపాదించే పద్ధతే ఆగమనం ant deduction +* industrialist, n. పారిశ్రామికుడు; పారిశ్రామికవేత్త; +* industrialization, n. పారిశ్రామికీకరణం; పరిశ్రమల విస్తరణ; +* inedible, adj. అఖాదీ; తినడానికి పనికిరాని; +ineffable, adj వర్ణనకి లొంగని; వర్ణింఫశక్యముకాని; వాచామగోచరమైన; అనిర్వచనీయమైన; చెప్పనలవికాని +* inelastic, adj. అస్థితిస్థాపక; స్థితిస్థాపక రహిత; స్థితిస్థాపకత లేని; +* inept, adj అప్రయోజక; చతురత లేని; నైపుణ్యం లేని; +inert gas, ph. జడ వాయువు; మందవాయువు; స్తబ్దవాయువు; +* inertia, n. జడత్వం; జడత; జడిమ; స్తబ్ధత; తమస్సు; +* inequality, n. అసమానత్వం; విసమీకరణం; వైషమం; న్యూనాధిక్యత; +* infamy, n. అపకీర్తి; అప్రతిష్ఠ; దుర్యశం; +* infant, n. శిశువు; పసిబిడ్డ; పసికందు; నెత్తురుకందు; నెలకూన; చిరుత; బుడుత; బొట్టె; కిశోరం;కందు; పసివాడు; ప్రసవం అయినప్పటినుండి మాటలు వచ్చేవరకు శైశవ దశ; +* infarct, n. శరీరంలో రక్తపు సరఫరా లేక కొద్ది మేర చచ్చిపోయిన భాగం; ప్రాణరహిత కణజాలం; +* infarction, n. శరీరంలో రక్తపు సరఫరా లేక కొద్ది మేర చచ్చిపోవడం; కణజాల మరణం; +coronary ph. గుండెలోని కండరాలకి రక్తపు సరఫరా లేక కొద్ది మేర చచ్చిపోవడం; +* infatuation, n. మోహం; చిత్తమోహం; వ్యామోహం; మూఢ ప్రేమ; అభినివేశం; తేలగింపు; +* infect, v. t. సూక్ష్మజీవులని శరీరంలో చొరబడేట్టు చేసి రోగం కలిగించడం; +* infection, n. తిష్ట; తిష్ట రోగం; లాతికణావేశం; అన్యకణావేశం; సోకుడు; అంటునలత; జాడ్యం; సూక్ష్మజీవులు శరీరంలో చొరబడి ఒక చోట స్థావరం ఏర్పరచుకోవడం; see also infestation; +* inference, n. అనుమాన ప్రమాణం; అనుమితి; అనుభావనము; అర్థాపత్తి; ఉత్తరపక్షం; గ్రాహ్యం; ఒక అంశం నుండి గ్రహించే సారాంశం, ఆకళింపు, +* inferior, adj. చవకబారు; తీసికట్టు; తక్కువైన; నీచ; నీచమైన; కింది; బీడు; అల్కా; హీన; అధో; కీత; న్యూన; అవాచీ; అవద్య; +* infestation, n. సూక్ష్మజీవులు, పరభుక్కులు జీవి ఉపరితలం మీద స్థావరం ఏర్పరచుకోవడం; see also infection;36. +* infinite, adj. అనంతమైన; అనంత; అపరిమిత; అంతూ దరీ లేని; +infinite regress, ph అనవస్థా దోషం; ఏదైనా ప్రతిపాదన మరొక ప్రతిపాదనపై ఆధారపడి, ఆ ప్రతిపాదన ఇంకొక దానిపై, అది మరొక దానిపై, ఇలా అనంతంగా ఆధారపడుతూ పోవడాన్ని అనవస్థా దోషం (Infinite Regress) అంటారు. అలాంటి దోషమున్న ప్రతిపాదన తర్కసమ్మతం కాదన్న మాట. +* infinitive, n. తుమర్థం; తుమున్నర్థకం; క్రియ యొక్క సామాన్య రూపం; క్రియ యొక్క దాత్వర్ధక రూపం; +* infinity, n. అనంతం; దిగంతం; మహత్తు; అంతులేనిది; +* infix, adj. మధ్యలో వేసిన; మధ్యలో వచ్చే; +* inflammatory, adj 1) వేడిని పుట్టించే; తాపజనక 2) కోపం కలిగించే; రెచ్చగొట్టే; +* inflation, n. ద్రవ్యోల్బణం; దివాలేషం; డబ్బు సరఫరా ఎక్కువవడం వల్ల వస్తువుల ధరలు, చాకిరీల ధరలు అదేపనిగా పెరుగుతూ పోవడం; దివాలేషం అంటే కరువు కాదు. కరువు రోజులలో ధరలు పెరగడానికి కారణం వస్తువులు దొరకక పోవడం; +* influence, n. ప్రభావం; ప్రభ; ప్రాబల్యం; పలుకుబడి; మాట చెల్లుబడి; +* information, n. సమాచారం; వార్త; విశేషం; వక్కాణం; తెలిమానం; +* infrastructure, n. అవస్థాపన సౌకర్యాలు; ఉపనిర్మాణం; ఉపకరణ సౌకర్యాలు; +* ingenious, adj అబ���రుచి చూపించు; తెలివయిన; ఊహాశక్తితో నిండిన; +* ingenuous, adj అమాయకమయిన; నిగర్వమయిన; దర్పములేని; +* ingrained, adj అస్థిగతమైన; గట్టిగా పట్టిన; +* ingredients, n. pl. అంశములు; ఘటకద్రవ్యములు; ఘటకాంశాలు; అంగములు; సంబారాలు; సరంజామా ఒక అంశాన్ని తయారు చెయ్యడానికి కావలసిన వస్తువులు; +* inherent, adj. స్వతస్సిద్ధమైన; స్వాభావికమైన; ప్రాకృతిక; స్వయంసిద్ధ; సిద్ధం; +* inheritance, n. వారసత్వం; వంశానుగతం; పారంపర్యం; ఉత్తరాధికారం; మిరాసి; దాయభాగం; దాయం; తల్లిదండ్రులనుండి పిల్లలకి సంక్రమించే సొత్తు; +* initiation, n ప్రారంభ ఉపదేశం; దీక్ష; ప్రారంభ కార్యక్రమం; +* injure, v. i. గాయపడు; దెబ్బ తగిలించుకొను; +* inland, adj. దేశాంతర్గత; అంతర్దేశీయ; +* inlet, n 1) సముద్రం భూమి లోనికి చొచ్చుకు వచ్చిన చోటు 2) యంత్రం లోనికి వాయువుని గాని ద్రవాన్ని గాని పంపే గొట్టం; +* inmate, n. బందీ; ఖైదులోగాని, పిచ్చాసుపత్రిలోగాని బందీ అయిన వ్యక్తి; +* innate, adj. సహజమైన; అంతర్జనిత; అంతర్లీన; +* inner, adj. అంతర్గత; అంతర్గతమైన; అంతర్భూత; అంతరంగ; +* innocent, adj. దోషము లేని; నేరములేని; అపకారము చెయ్యని; తప్పులేని; నిరుపద్రవమైన; అమాయక; సాధువైన; +innocuous, adj. అపకారము చేసే సమర్ధత లేని; అపాయకరంగాని; హాని చేయని; అమాయకపు; +* innuendo, n. వ్యాజ్యోక్తి; చాటూక్తి; అన్యాపదేశం; ఉపాలంభం; ఆక్షేపణ; అసలు అనుభూతిని మనస్సులో దాచిపెట్టి పైపైన మరొక విధంగా ప్రవర్తించడం; +* innumerable, adj. అసంఖ్యాక; అసంఖ్యేయ; హేరాళము; లెక్కలేనన్ని; లెక్కపెట్టలేనన్ని; +inoculate, v. t 1) రోగకారక పదార్థాన్ని కానీ ప్రతిజనిని కాని శరీరం లోకి ప్రవేశపెట్టే ప్రక్రియ; వైద్య రంగంలో ఈ "రోగకారక" పదార్థం సర్వసాధారణంగా "వేక్సీను" అవుతుంది. ఆ పరిష్తితులలో inoculation ని vaccination అంటారు 2) ఒక సూక్ష్మజీవిని లాతి పర్యావరణంలోకి ప్రవేశపెట్టడం; +inorganic chemistry, ph. అనాంగిక రసాయనం; వికర్బన రసాయనం; అసేంద్రియ రసాయనం; +* input, adj. అంతర్‌హిత; అంతర్యాన; అంతర్యాగ; ఆగత; నివిష్ట; నివేశ్య; +input data, ph. దాపతాంశాలు ప్రవేశాంశాలు; ఆగతాంశాలు; ప్రవేశిక దత్తాంశాలు; అంతర్యానాంశాలు; అంతర్యాగాంశాలు; +input device, ph నివేశ్యన సాధనం; నివేశ్యనోపకరణం; +* input, n. దాపలం; ఆదానం; ప్రవేశాంశం; ప్రవేశికం; నివేశ్యనం; ఆగతం; ఆన; అంతర్యానం; అంతర్యాగం; లోరవానా (లోనికి రవానా మేత; పెట్టు; అంతర్హితం; యాతం +* inquest, n. పంచాయతీ; అపమృత్యు విచారణ; +* insanity, n. వెర్రి; పిచ్చి; ఉన్మాదం; చిత్తవిభ్రమం; చిత్తచాంచల్యం; +* insert, v. t. దోపు; దూర్చు; జొప్పించు; జొనుపు; ఆగమించు; +* insert, n. జొప్పించబడ్డది; దో��ినది; ప్రక్షిప్తం +* insertion, n. దోపడం; దూర్చడం; జొప్పించడం; జొనుపడం; ఆగమనం; +* insight, n. సూక్ష్మాక్షిక; లోచూపు; దివ్యచక్షువు; +* insipid, adj. చప్ప; చప్పని; చప్పనైన; చప్పిడి; నిస్సారమైన; రుచిలేని; పేలవమైన; +* insist, v. t. పట్టుబట్టు; బలవంతం చేయు; హఠం చేయు; +* insomnia, n. నిద్రలేమి; నిద్ర పట్టకపోవటం; +* inspiration, n 1) ప్రేరణ; ఉత్తేజం; స్ఫూర్తి; ఉద్దీపనం; దైవావేశం 2) ఉచ్ఛ్వాసం; గాలి పీల్చడం; +* install, v. t. తురుము; కూర్చు; కీల్కొల్పు; సంఘటించు; సిద్ధపరచు; +* installments, n. విడతలు; వాయిదాలు; దఫాలు; కిస్తీలు; కంతులు; +by installments, ph. వాయిదాల మీద; కిస్తీ బందీ; కంతులవారీగా; +* instead, prep. బదులుగా; మారుగా; ప్రతిగా; ప్రత్యామ్నాయంగా; +* instigate, v. t. ప్రేరేపించు; ప్రోద్బలం చేయు; పురికొలుపు; ఉసిగొలుపు; +* instigation, n. ప్రేరేపణ; ప్రోద్బలం; దుర్బోధ చేసేవ్యక్తి; పుల్లలు పెట్టే వ్యక్తి; +* instill, v. t 1) బొట్లు బొట్లుగా దిగజార్చు 2) బోధ చేయు; +* instinct, n. ఉపజ్ఞ; సహజేచ్ఛ; సహజజ్ఞానం; సహజాతం; సహజ స్ఫురణ; వాసన; ప్రవృత్తి; అంతఃప్రవృత్తి; ఇంగిత జ్ఞానం; జంతుజ్ఞానం; +killer instinct, ph. జిఘాంస; యుయుత్స; గెలిచే వరకు పోరాడాలనే కోరిక; +* instruction, n 1) ఉపదేశం; బోధన; అధ్యాపన 2) ఆదేశం; సమాదేశం; నిర్దేశం; +* instrument, n 1) సాధకం; సాధనం; ఉపకరణం; పనిముట్టు; కొరముట్టు; పరికరం; ఎత్తళి; జంత్రం; ఆతోద్యం 2) దస్తావేజు; +* insult, n. అవమానం; పరాభవం; తిరస్కారం; న్యక్కారం; +* integer, n. పూర్ణాంకం; పూర్ణసంఖ్య; అభిన్న సంఖ్య; అభిన్నాంకం; +* integrable, adj. సమాకలనీయ; సమాకలన ప్రక్రియకి లొంగే; +* integrand, n. సమాకల్యం; సమాకలన ప్రక్రియకి లొంగబడ్డది; +* integration, n 1) సమాకలనం; చయనకలనం 2) కలపడం; వీలీనత; ఏకీకరణ; సమన్వయం; +* integrity, n. చిత్తశుద్ధి; న్యాయవర్తన; పెద్దమనిషితనం; +* intellect, n 1) బుద్ధి; జ్ఞానశక్తి; ధిషణ; చిత్తం 2)బుద్ధజీవి; +* intelligence, n 1) వివేకం; తెలివి; తెలివితేటలు; ప్రజ్ఞానం 2) గూఢసమాచారం; వర్తమానం; అపసర్పము; వేగు; +* intention, n. ఉద్దేశం; సంకల్పం; తలపోత; వివక్షత; మనోగతం; +* intentionally, adv. ఉద్దేశపూర్వకంగా; సంకల్పశుద్ధితో; బుద్ధిపూర్వకంగా; చెయ్యాలని చేసిన; +* inter, adj. అంతర్; పరస్పర; ఒండొంటి; అన్యోన్య; +* inter, v. t. పాతు; పాతిపెట్టు; భూస్థాపితం చేయు; +* intercalary month, n. అధిక మాసం; లుప్త మాసం; పురుషోత్తమ మాసం; మల మాసం; మలిమ్లుచం; సూర్యసంక్రమణం లేని చంద్ర మాసం; +* inter-crop, n అంతర పంట ఒక పొలంలో ఒక జాతి మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో మరొక పంట వెయ్యడం; ఉదాహరణకి అల్లం, పసుపు, జొన్న పొలాలలో పెండలం వేసి పండించడం; +* interdependence, n. పరస్పరావలంబనం; అన్యోన్యాశ్రయం; పరస్పర��ధీనత; +* interface, n. అంతరాననం; అంతరముఖం; అంతరవదనం; అంతరవర్తనం; వినిమయసీమ; +* interest, n 1) వడ్డీ; మిత్తి; తేమానం; ఫాయిదా 2) శ్రద్ధ; మొగ్గు 3) అభిరుచి; ఆసక్తి; +* interface, n. అంతరాననం; అంతరముఖం; అంతరవదనం; అంతరవర్తనం; అంతర్ముఖం; పరస్పర ఫలకం; ప్రతిముఖం; కలనయంత్రా నికి బాహ్య ప్రపంచానికి మధ్య సంభాషణలు జరగడానికి మధ్యవర్తిగా పనిచేసే శాల్తీ; +* interjection, n. సాధువాదార్థకం; ఆశ్చర్యార్థకం; +* intermediate, adj. మధ్యంతర; మాధ్యమిక; అంతస్థ; నడుమంతరపు; +* intermediate, n. మధ్యంతరం; మాధ్యమికం; అంతస్థం; నడుమంతరం; మధ్యస్థం; +* interment, n. పాతిపెట్టడం; శవాన్ని భూస్థాపితం చేయడం; +* intermittent, adj. విడచి విడచి వచ్చే; అడపా తడపా వచ్చే; అంతరాయిక; +* intermittently, adv. అంతరాయికంగా; అప్పుడప్పుడు; ఒక్కోసారి; +* internal, adj. ఆంతరంగిక; అంతరంగ; అంతర్గత; అంతర్ గర్భిత; అంతర్; అంతర; అంతర్భూత; లోపలి; +internal planets, ph. అంతర్ గ్రహాలు; సౌరకుటుంబంలో సూర్యుడికి, గురుడికి మధ్యనున్న గ్రహాలని అంతర్‌గ్రహాలు అంటారు; +* Internet, n అంతర్జాలం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కలన యంత్రాలు ఒకదానికొకటి సమాచారం పంపుకుందుకి వీలుగా ఉండే ప్రసారక సదుపాయం; మనుష్యులు మాట్లాడుకుందికి టెలిఫోను సౌకర్యం ఎలాగో అలాగే అంతర్జాలం కలనయంత్రాలు మాట్లాడుకుందికి ఉపయోగపడుతోంది; +* interpret, v. t. వివరించు; వ్యాఖ్యానించు; అనువదించు; +* interpreter, n. ద్విభాషి; దుబాసీ; ఒకరి నోటి మాటని తన నోటితో అనువాదం చేసే వ్యక్తి; see also translator; +interrogation mark, ph. ప్రశ్నార్థక చిహ్నం; క్వొశ్చెన్ మార్కు; +* interval, n. అంతరం; వ్యవధి; వ్యవధానం; మధ్యకాలం; ఎడతెరిపి; +* intestate, n. మరణశాసనం లేని పరిస్థితి; +* intonate, v. t. స్వరభేదాలని పాటిస్తూ మాట్లాడు; నొక్కవలసిన చోట నొక్కుతూ మాట్లాడు; +* intoxicant, n. మత్తుపదార్థం; నిషాపదార్థం; మద్యం; +* intoxication, n. ముయికం; మత్తు; మత్తా; కైపు; నిషా; దిమ్ము; లాహిరి; +intoxicating drink, ph. మత్తు ఎక్కించే పానీయాలు; మద్యం; కల్లు; సారా మొదలయినవి; +* intrigue, n తంత్రం కుతంత్రం; గూడుపుఠానీ; +intrinsic value, ph. సహజమైన విలువ; సహజసిద్ధమైన విలువ; యదార్థమైన విలువ; నిజం విలువ; +* introspection, n. ఆత్మపరిశోధన; ఆత్మశోధన; అంతర్లోకన; ఆత్మావలోకనం; +* introvert, n. అంతర్ముఖత్వం; m. అంతర్ముఖుడు; f. అంతర్ముఖి; +* intuition, n. ఉపజ్ఞ; ఉపజ్ఞాతం; అంతర్బుద్ధి; అంతఃప్రబోధం; అంతఃస్పురణ; అర్ధాపత్త; కారణ కార్య సమీక్ష లేకుండా సూక్ష్మగ్రాహ్యత ప్రదర్శించడం; knowledge acquired without instruction; +* intuitive, adj అతీంద్రియ సూక్ష్మగ్రాహ్య; ఉపజ్ఞామూలక; +* invade, v. t. దండెత్తు; దాడి చేయు; ముట్టడించు; +* invalid, adj ఇన్ వేల��డ్) చట్టపరంగా ఆమోదయోగ్యం కాని; +* invalid, n ఇన్ వెలిడ్) అనారోగ్యం వల్ల కాని, ముసలితనం వల్ల కాని తన పని తాను చేసుకోలేని వ్యక్తి; +* invariant, adj. కూటస్థ; మార్పు చెందని; గణిత ప్రక్రియల వల్ల మార్పు చెందని; +* invective, n. దూషణ; సాధించు; తిట్టు; కించపరచేలా విమర్శ; +* invention, n. సంజనితం; అభిసర్గం; సృజనం; పరికథ; పరికల్పనం; ఉపేతం; ఒనరిక; ఆవిష్కరణ; ఆవిష్కారం; +* inventor, n. స్రష్ట; ప్రణేత; నిర్మాత; సృష్టికారకుడు; కల్పనకర్త; ఉపేత; ఆవిష్కర్త; +* inverted, n. వ్యత్యాస్తం; తలకిందులు; +* invertebrate, n. అకశేరుకం; అపృష్ట వంశి; వెన్నుపూస లేని జంతువులు; +* invest, v. t మదుపు పెట్టు; పెట్టుబడి పెట్టు; +* investigation, n. పరిశోధన; దర్యాప్తు; విచారణ; అరయిక; అన్వేషణ; +* investigator, n. m. పరిశోధకుడు; శోధకుడు; అన్వేషకుడు; విచారకుడు; +* invisible, adj. అదృశ్య; అశరీర; అసదృశ; కనపడని; అగుపడని; ప్రచ్ఛన్న; +* invocation, n. ఆవాహన; ప్రార్థన; నాందీశ్లోకం; +* invoice, n. ఉల్లాకు; కొన్న సరకుల పేర్లు, ధరలు చూపించే జాబితా; +* involuntary, adj. అసంకల్పిత; అసంకల్ప; అప్రయత్న; అనైచ్ఛిక; అనియంత్రిక; ఐచ్ఛికం కాని; +* ion, n. అణుశకలం; అణువులో భాగం; అణువులోని ఎలక్ట్రానులని కొన్నింటిని విడగొట్టినప్పుడు మిగిలిన శకలాలు; +ionizing radiation, ph. ప్రోద్ధుత వికీర్ణం; ప్రోద్ధుత వికిరణం; +* ionosphere, n. అణుశకలావరణం; శకలావరణం; అయనోవరణం; +* ionization, n. శకలీకరణం; అణువులు విద్యుదావేశం పొందడం; +* iota, n 1) గ్రీకు భాషలో ఒక అక్షరం 2) పల్లెత్తు; కించిత్తు; ఈషత్తు; ఇంచుక; ఇసుమంత; రవంత; లవలేశం; +* IOU, n. రిణపణ్ణా; రుణపత్రం; +* iris, n 1) కానీనికా పటలం; నేత్ర విభాజకం; కంటిపాప చుట్టూ ఉండే గుండ్రని పొర; ఈ పొరకి ఉండే రంగే కంటి రంగు 2) ఇంద్ర ధనుస్సు; హరివిల్లు 3) శీతల దేశాలలో పూసే ఒక రకం పువ్వు; +* Iron, n 1 ఇనుము అశ్మసారం; ఆయసం; ఒక రసాయన మూలం అణుసంఖ్య 26, సంక్షిప్త నామం; Fe Lat ferrum 2) ఇస్థిరి 3) ఇస్థిరి పెట్టి; +cast iron, ph. పోత ఇనుము; దుక్క ఇనుముని కరిగించి, అందులో తుక్కు ఇనుముని, తదితర లోహాలని కలిపి, దానిని రకరకాల ఆకారాలు ఉన్న అచ్చులతో పోసి చల్లార్చగా వచ్చినది +pig iron, ph. దుక్క ఇనుము; దంప ఇనుము; blast furnace నుండి వచ్చిన కచ్చా ఇనుముని పోత పోసినప్పుడు వచ్చే దుక్కలు పందిపిల్ల ఆకారంలో ఉండేవిట; అందుకని pig iron అన్న పేరు వచ్చింది +wrought iron, ph. చేత ఇనుము; దుక్క ఇనుముని బొగ్గుల కొలిమిలో వేడి చేసి, సుత్తితో బాది, మలినములను పోగొట్టగా మిగిలిన ఇనుము; +Iron Age, ph. ఆశ్మయుగం; ఇనప యుగం; క్రీ.పూ.1000 నుండి క్రీ.శ. 100 వరకు; కంచుయుగం తరువాత వచ్చిన కాలం; +* irony, n. వ్యాజస్త���తి; వక్రోక్తి; వ్యంగ్యం; ఇత్సితం; అన్నది ఒకటి, దానివల్ల స్పురించే అర్ధం మరొకటి అవడం; +* irrational, adj 1) అకారణమైన; హేతుబద్ధం కాని; తర్కబద్ధం కాని 2) అనిష్ప; నిష్పత్తిలా రాయడానికి వీలు పడని; +* irregular, adj. వ్యతిక్రమ; క్రమభంగ; క్రమవిపర్య; అవకతవక; అపవాద; ఉచ్చావచ; +irregular form, ph. అపవాద రూపం; వ్యతిక్రమ రూపం; క్రమభంగ రూపం; +* irregularity, n. వ్యతిక్రమం; క్రమభంగం; క్రమవిపర్యం; అవకతవకతనం; +* irregularly, adv. అడ్డగోలుగా; వరసావావీ లేకుండా; తర్కరహితంగా; +* irrigated, adj. సాగు; సాగు చెయ్యడానికి సమకూర్చే నీటి పారుదల; +* irrigation, n. సాగు; సేద్యం; నీటి పారుదల; నీటికట్టు; +lift irrigation, ph. కపిలె సాగు; ఎత్తిపోతల సేద్యం; ఎత్తిపోతల సాగు; +* island, n ఐలెండ్) దీవి ద్వీపం లంక +* ism, suff. ఇజం; ప్రపంచాన్ని ఒక మూస పోసిన దృష్టితో చూసే తత్త్వం; +* isobar, n. సమవాయి; సమభార రేఖ; సమపీడన రేఖ; +* isogloss, n ling భేదకరేఖ; ఒక భాషలో గమనించదగ్గ మార్పులని విడదీసే భౌగోళిక రేఖ; గోదావరి దాటితే భాషలో మార్పు వినిపిస్తుంది కనుక గోదావరిని ఒక భేదక రేఖగా పరిగణించవచ్చ; +* isolated, adj. వియుక్త; వివిక్త; వ్యష్ఠి; విడిగా ఉంచిన; +isolated system, ph వివిక్త వ్యవస్థ; వియుక్త వ్యవస్థ; వ్యష్ఠిగా ఉంచిన వ్యవస్థ; +* isomerism, n. సమభాగత్వం; సమాంగత; సమాంగత్వం; సాదృశ్యం; అనేక భాగములతో రకరకాల విన్యాసాలు కలిగిన నిర్మాణ క్రమాలతో ఒప్పారే రసాయనాలు; రెండు మూలకాల సాంఖ్య క్రమాలు ఒక్కటే అయి, నిర్మాణ క్రమాలు తేడాగా ఉంటే ఆ రెండింటిని సమభాగులు అంటారు; +chain isomerism, ph. శృంఖల సమాభాగత్వం; శృంఖల సమాంగత; శృంఖల సమాంగత్వం; శృంఖల సాదృశత్వం; +group isomerism, ph. సామూహిక సమభాగత్వం; సా. సమాంగత; సా. సమాంగత్వం; సా. సాదృశ్యం; +optical isomerism, ph. దృక్ సమభాగత్వం; దృక్ సమాంగత; దృక్ సమాంగత్వం; దృక్ సాదృశ్యం; +positional isomerism, ph. స్థాన సమభాగత్వం; స్థాన సమాంగత; స్థాన సమాంగత్వం; స్థాన సాదృశ్యం; +stereo isomerism, ph. ప్రాదేశిక సమభాగత్వం; ప్రా. సమాంగత్వం; +structural isomerism, ph. నిర్మాణాత్మక సమభాగత్వం; ని. సమాంగత; ని. సమాంగత్వం; +* isotherm, n. సమతాపి; సమతాపరేఖ; ఒక మేపులో ఒకే తాపోగ్రత ఉన్న బిందువలని కలుపుతూ గీసే గీత; +* isotope, n. ఏకస్థాని; ఆవర్తన పట్టికలో ఒకే గదిలో ఉంచవలసిన రసాయన మూలకాలు; +* isotropic, adj. సమదైశిక; ఏ దిశలో కొలిచినా లక్షణాలలో మార్పు లేకపోయే; +* isotropy, n సమదైశికత ఏ దిశలో కొలిచినా లక్షణాలలో మార్పు లేకపోవడం; +* itch, n. దురద; గుల; జిల; దూల; తీట; కండూతి; కసిమిరి; +* item, n. మూర్తి; శాల్తీ; అంశం; ఉరువు; +iterative method, ph. పునరుత్థాన పద్ధతి; చేసిన లెక్కనే చిన్న చిన్న మార���పులతో పదే పదే చేయడం; +ivory tower, ph idiom] దంతపు మేడ; ఒంటి స్తంభపు మేడ; విశ్వవిద్యాలయం; + + +* jack, n 1) పనస 2) జాకీ; పేకముక్కలలో ఒకటి 3) బండి యొక్క ఇరుసును పైకెత్తు సాధనం; +* jackal, n. గుంటనక్క; కొంకనక్క; వరడు; +* jacket, n. రవిక; చోళకం; చోళీ; తొడుగు; కంచుకం; కంచెల; కుప్పసం; పేరణం; చట్టి; +* jaggery, n బెల్లం గుడం; గడోలం; చెరకడం; ద్రుపజం; అమృతరశాజం; +* jaguar, n. దక్షిణ అమెరికాలో నివసించే చిరుతపులి; +* jail, n. ఖైదు; కారాగారం; చెరసాల; జైలు; +* jailer, n. కారాగారపు అధికారి; చెరసాలని నడిపే అధికారి; +traffic jam, ph. ఇరకాటంలో చిక్కుకున్న వాహనాలు; +* jam, v. t. అడ్డగించు; నొక్కు; బంధించు; +* jamboree, n. మహానాడు పెద్ద సభ; సమారోహం; తిరణాలు; +* janitor, n. ఊడిగాడు; భవనాలని లోపల శుభ్రం చేసే వ్యక్తి; +* jargon, n. పరిభాష; ఏదైనా ఒక శాస్త్రంలో ఒక మాటని ఒకే ఒక అర్థంతోనే వాడుకోవాలని నిర్ణయించగా తయారైన భాష; +* jasper, n. సూర్యకాంతం; పచ్చరాయి; క్వార్జ్ జాతి పొడి; +* jawbreaker, n 1) నమలడానికి కష్టమైన పదార్థం 2) ఉచ్చరించడానికి కఠినమైన మాట; +* jealousy, n. ఈర్ష్య; అసూయ; మాత్సర్యం; ఓర్వలేనితనం; ఎరుసు; కాంతాళం; +* jeer, v. t. వెక్కిరించు; కూతలు కూస్తూ వెక్కిరించు; +* jest, v. i. నవ్వులాటలాడు; సరదాకి కొంటె పని చేయు; ఆగడం చేయు; +* jester, n. విదూషకుడు; హాస్యగాడు; +jet propulsion, ph. ధారా చాలనం; ఇంధనం మంటతో బాగా వ్యాకోచం చెందిన గాలిని వెనకకి తోస్తూ బండిని ముందుకు నడిపే పద్ధతి; +* jeweler, n. నగలు అమ్మే వ్యక్తి; జవాహర్ వాలా; +* jihad, n జిహాద్) విశ్వాసులు అవిశ్వాసులపై జరిపే మత యుద్ధాన్ని అరబ్బీ భాషలో 'జిహాద్ అంటారు. ఈ యుద్ధంలో పాల్గొనే యోధుడిని 'ముజాహిద్' అంటారు; మౌలిక ముస్లింలలో మతం కోసం ఏంచేసినా తప్పులేదనే అభిప్రాయం ఉంది. మతేతరులంతా ముస్లిం మౌలికవాదుల దృష్టిలో కాఫిర్లు. సాతాను ప్రభావంలో ఉన్న తమ మతస్థులను కాపాడుకోవడం మాత్రమేకాదు. సాతాను ప్రభావంలో ఉన్న మతేతరులను నిర్మూలించడం ఇస్లాం మౌలికవాదులు తమ పవిత్ర కర్తవ్యంగా భావించి అందుకు మతయుద్ధం చేయడం తప్పనిసరి అని భావిస్తారు. అందుకే వారు మతం విషయంలో సహనం తక్కువగా ఉన్న వారిగా పేరొందారు; +* jinx, n. అచ్చిరాని మనిషి లేక వస్తువు; అపశకునం; అపశకునపక్షి; +* jog, v. i. వ్యాయామం కొరకు నెమ్మదిగా పరుగెత్తు; +* join, v. i. చేరు; అంటుకొను; కలుసుకొను; కూడు; జతగూడు; కవయు; కవగొను; +* join, v. t. చేర్చు; కలుపు; లకించు; తగిలించు; జోడించు; జతగూర్చు; సంధించు; అంటించు; జమిలించు; జమాయించు; +* joint, adj. ఉమ్మడి; పొత్తు; సంయుక్త; సమష్టి; తొల్లుగడ; +joint family, ph. సమష్టి కుటుంబం; ఉమ్మడి కుటుంబం: +* joint, n 1) కీలు; అస్థి సంధి; బంధు; సంధికర్మ; గణుపు 2) స్థలం; ప్రదేశం; +* joke, n. హాస్యోక్తి; సయ్యాట; వేళాకోళం; పరిహాసం; పరాచకం; ఛలోక్తి; చమత్కారం; చమత్కార బాణం; ఆగడం; ఉపహాసం; ఉక్కిదం; హాస్యవాదం; +* joke, v. t. సయ్యాటించు; పరిహసించు; +* journal, n 1) పత్రిక 2) చిట్టా 3) దినచర్య రాసిన పుస్తకం; +* journalist, n. పత్రికా రచయిత; పత్రికా విలేఖరి; m. పాత్రికేయుడు; +* journalists, n. పాత్రికేయులు; పత్రికా రచయితలు; పత్రికా విలేఖరులు; +* journey, n. ప్రయాణం; పయనం; పైనం; యాత్ర; యానం; ప్రస్థానం; +* jubilant, adj. ప్రఫుల్ల; ఉల్లాసప్రద; అత్యధిక సంతోషమును చూపే మనోస్థితితో; +* jubilee, n. వార్షికోత్సవం; ఉత్సవం; +* judge, n. న్యాయమూర్తి; నిర్ణేత; న్యాయనిర్ణేత; తగవరి; తీర్పరి; జడ్జి; see also arbitrator; +* judge, v. t. న్యాయవిచారణచేయు; తీర్పుచెప్పు; +* jug, n. కూజా; ద్రవ పదార్ధాలు పోసుకుందుకి చిన్న మూతి, చేత్తో పట్టుకుందుకి హస్తకం ఉన్న లోతైన బిందె వంటి పాత్ర; +* jugglery, n. గారడీ ఇంద్రజాలం కనుకట్టు; +* jumbo, adj. బృహత్; మహాత్; పెద్ద; చాలా పెద్ద; ఏనుగంత పెద్ద; +* jumbled, adj. జమిలి; కలగాపులగం చేయబడ్డ; +* jump, v. i. ఉరుకు; దుముకు; దూకు; దాటు; గెంతు; కుప్పించు; జవుకళించు; +* junior, n 1) తండ్రి పేరు పెట్టుకున్న కొడుకు 2) నాలుగేళ్లపాటు కొనసాగే విద్యార్థి దశలో మూడవ ఏటి విద్యార్థి; +* Jupiter, n 1) శుక్రగ్రహం; రోమనుల పురాణాలలో రాజు 2) గురుడు; బృహస్పతి; ఈ రెండు మాటలకీ ఎంతో పెద్ద అనే వాచ్యార్థం; +* jurisdiction, n. పరిధి; అధికార పరిధి; ఇలాకా; చట్టసమ్మతమైన పరిధి; అధికార మండలం; అజమాయిషీ; హయాం; +* jurisprudence, n. న్యాయశాస్త్రం; న్యాయశీలం; న్యాయశీలత; ధర్మశాస్త్రం; న్యాయమీమాంస; +* just, adj 1) సమర్ధించదగిన; న్యాయమైన 2) సరియైన; +* justice, n 1) న్యాయం; ధర్మం; ధర్మబలం; పాడి 2) న్యాయమూర్తి; +* jut, v. i. ముందుకి పొడుచుకొని వచ్చు; +juvenile offenders, ph. తరుణాపరాధులు; నేరము చేసిన పిల్లలు; బాల నేరస్థులు; +kafkaesque, adj. కలతతో కూడిన పీడకలవంటి వాతావరణం; కాఫ్కా రచనలలో కనిపించే లాంటి వాతావరణం; +* kaleidoscope, n. కదంబిని; వర్ణకదంబిని; వర్ణపగడము; సాధారణంగా మూడు దీర్ఘచతురస్రాకారపు అద్దపు బద్దీలని, వాటి మధ్య 60 డిగ్రీలు కోణం వచ్చేటట్లు అమర్చి, ళోపల రెండు మూడు రంగు పూసలని వేసి కట్టకట్టి పిల్లల ఆట వస్తువుగా అమ్ముతారు; +* keel, n. పడవ యొక్క మట్టు; వెన్నుదూలం; +* keen, adj. వాడి; చురుకైన; నిశితమైన; +* keep, v. t. ఉంచు; నిలుపు; ఉంచుకొను; సంరక్షించు; +* keeper, n. కాపాడువాడు; కావలివాడు; +* kennel, n 1) కుక్కలదొడ్డి 2) కుక్కలగుంపు; +* kernel, n 1) గుజ్జు; గిం��; విత్తు; పప్పు టెంక కురిడి; నుంగు 2) ప్రధానాంశం; +* kerosene, n. గడ్డనూనె; మట్టినూనె కిరసనాయిలు +* key, n 1) తాళంచెవి; బీగపు చెవి; బిస; తల్లిక 2) కీలకం; మూలం 3) కుంచిక; కీ 4) చింతామణి; +* keyboard, n 1) కుంచికాఫలకం; కుంచిక పలక; కీపలక; కీఫలకం; బీగం పలక 2) హార్మనీ బల్ల; +* keystone, n 1) టాకీరాయి; కొలికి పూస 2) మూలవిషయం; మూల సూత్రం; +* khaki, n. ఖాకీ; లేతాకు పచ్చ, బూడిద రంగు కాని, లేదా లేత పసుపు, బూడిద రంగు ఉన్న ముతక రకం బట్ట ety Hindi, Persian, Urdu; +* kid, n 1) మేకపిల్ల 2) m. కుర్రాడు; పిల్లవాడు; f. కురద్రి; బొట్టె; పిల్ల 3) శాబకం; +* kidnapping, n. నరస్తేయం; శాబకగ్రహణం; దొంగతనంగా పిల్లలని ఎత్తుకుపోవుట; +* kidney, n మూత్రపిండం వృక్కం; వస్తి; గురదం; +* kill, v. t. చంపు; సంహరించు; వధించు; హతమార్చు; పరిమార్చు; తెగటార్చు; మన్ను కరిపించు; వెంపరలాడు; +* killer, n. సంహర్త; నిహంత; m. హంతకుడు; f. హంతకురాలు; +potter's kiln, ph. కుమ్మరావం; కుమ్మరాము; కుమ్మరి బట్టీ; +* kilobits, n. వెయ్యి ద్వింకములు; కంప్యూటరు రంగంలో మాత్రం 1024 ద్వింకములు note) ఇక్కడ కిలో అంటే వెయ్యి కాదు, 1024; +* kilogram, n కిలో వెయ్యి గ్రాములు; ఇక్కడ కిలో అంటే 1,000; +* kilometer, n. కిలోమీటరు; వెయ్యి మీటర్లు; ఇక్కడ కిలో అంటే 1,000; +* kin, n. దగ్గర బంధువులు; +* kindergarten, n. బాలవిహార్; చిన్నపిల్లల పాఠశాల; +* kindle, v. t. రగుల్చు; రగిలించు; రాజవేయు; అంటించు; ముట్టించు; +* king, n. m. నృపతి; రాజు; మహారాజు; సమ్రాట్టు; సార్వభౌముడు; +* kinsman, n. సగోత్రుడు; సగోత్రీకుడు; జ్ఞాతి; బంధువు; దాయాది; +* kiss, v. t. ముద్దు పెట్టుకొను; చుంబించు; +* kitchen, n. వంటగది; వంటయిల్లు; వంటిల్లు; వంటసాల; పొయ్యిల్లు; బానసం; మహాసనం; కుసిని; పాకగేహం; పాకశాల; అడసాల; +* kitten, n. పిల్లిపిల్ల; పిల్లికూన; కూన; +* kleptomania, n. చౌర్యోన్మాదం; దొంగతనం చెయ్యవలెనన్న హేతురహిత బుద్ధి; +* knead, v. t. పీండ్రించు; మాలీసు చేయు; పిసికికలుపు, మర్దింౘు, నొక్కు; అప్పడాల పిండి, చపాతీల పిండి వంటి పదార్థాన్ని చేతితో మర్దనా చెయ్యడం; +* knife, n. కత్తి; కఠారం; ఛురిక; చాకు; క్షురము; చురకత్తి; సూరకత్తి; తమాలం; ఆడిదము; ధారాధరం; రిష్టి; ఇవన్నీ చిన్న కత్తుల పేర్లు; see also sword; +knife edge, ph. క్షురధార; అసిధార; వాదర; సున్నితపు త్రాసులో కాడిని నిలిపే ప్రాపు; +* knock-knees, n. ముడిగాళ్లు; ఈ రకం కాళ్ళు ఉన్నవాళ్ళు నడిచినప్పుడు మోకాళ్ళు కొట్టుకుంటాయి ant bow-legs; +* knocking, n 1) కొట్టుకొనుట; విస్పోటనం 2) పెట్రోలు నిలచి కాలకుండా టప్ అని పేలిపోవడం; +* knoll, n. తిప్ప; ఎత్తయిన ప్రదేశం; ఎత్తయిన మైదానం; +* knotty, adj. ముడిపడ్డ; చిక్కుపడ్డ; క్లిష్ట; ఇబ్బందికరమైన; +* know, v. i 1) తెలుసుకొను; తెలుసు; ఎరుగు 2) వచ్చు; +* knowledge, n 1) జ్ఞానం; బోధము; పరిజ్ఞానం; వైదుష్యం; పాండిత్యం; ప్రమ; సాంఖ్యం 2) సారస్వతం; సాహిత్యం; విద్య; వేదం 3) ఎరిక; ఎరుక; వేత్తృత; +domain knowledge, ph ప్రాదేశిక జ్ఞానం; విషయ పరిజ్ఞానం; +* knuckles, n. pl. చేతివేళ్ల కణుపులు; అంగుళీపర్వాలు; మెటికలు; +* knurled, adj. కల్దారు; రూపాయ కాసు వంటి నాణేల అంచు చుట్టూ ఉండేటటువంటి గరుగ్గా ఉండే నగిషీ; +* kosher, adj 1) యూదుల మతాచారం ప్రకారం వండబడ్డ 2) న్యాయబద్ధం, చట్టబద్ధం, సాధు సమ్మతం అయిన; +* kymograph, n. తరంగలేఖిని; ఒక డ్రమ్ము చుట్టూ కాగితం చుట్టి దాని మీద కలంతో రాయడనికి వీలుగా అమర్చిన పరికరం; దీనితో పైకీ కిందకీ ఉన్న కదలికని కాగితం మీద చూపడానికి వీలు అవుతుంది + + +label, n. ఉల్లాకు; చీటీ; బంగీ మీద అంటించే చీటీ; +* labial, adj. ఉభయోష్ఠ్య; ఓష్ఠ; పెదవులకి సంబంధించిన; +* labiodentals, n. pl. ఓష్ఠదంత్యములు; అడుగు పెదవి, పై పళ్ళ సహాయంతో ఉచ్చరించే వర్ణాలు; ఉ. ఇంగ్లీషులో ఎఫ్, తెలుగులో వ; +* labor, n 1) కృషి; కూలి; శ్రమ; పాటు; కష్టం 2) నొప్పులు; ప్రసవ వేదన 3) కర్షకులు; కార్మికులు; కూలివారు; +false labor, ph. దొంగ నొప్పులు; నిజమైన ప్రసవ వేదన కాకుండా అప్పుడప్పుడు వచ్చే నొప్పులు; +* laborer, n. కృషీవలుడు; కూలివాడు; కూలిది; +* laborious, adj. విసుగు పుట్టించే; బోరుకొట్టే; +lacerated wound, ph. విదారిత క్షతము; చర్మం చిరగగా అయిన గాయం; +* laceration, n. చిరిగిన చర్మం; అంచులు తిన్నగా లేకుండా చర్మం తెగిన గాయం; +lachrymal glands, ph. బాష్పజల గ్రంథులు; కన్నీటి గ్రంథులు; +* lackadaisical, adj. ఉత్సాహం లేని; నిరుత్సాహంగా; ఉదాసీన; ఉపేక్షిత; నిరపేక్ష; +* lactation, n. స్తన్యోత్పాదన; చనుబాలు జారుట; +* lactic, adj. క్షీర; పాలకి సంబంధించిన; +* lactometer, n. పాలమాపిని; దుగ్ధమాపకం; క్షీరమాపకం; పాలు నాణ్యతను పరీక్షించే సాధనం; ఈ జాతి పరికరాలన్నీ ఆర్కిమిడీస్ సూత్రం మీద ఆధారపడతాయి rel hydrometer; +* lactose, n. క్షీరోజు; పాలచక్కెర; పాలల్లో ఉండే చక్కెర; +* lad, n. చిన్న బాలుడు; డింభకుడు; శాబకుడు; +* ladder, n. నిచ్చెన; నిఃశ్రేణి; తాప; +* ladle, n. తెడ్డు; అగప; దర్విక; పెద్ద గరిటె; దర్వి; కంబి; +* lady, n. స్త్రీ; పెద్దింటి పడుచు; యజమానురాలు; దొరసాని; +* lagoon, n. మడుగు; ఉప్పునీటి కయ్య; +* laissez-faire, ph లెస్సే ఫెయిర్) స్వేచ్ఛా వ్యాపార పద్ధతి; విచ్చలవిడి వ్యాపారం; నిబంధనలు లేని పద్ధతి; +* lake, n. సరస్సు; చెఱువు; హ్రదం; వెంచ; +* lakh, n Ind. Eng లక్ష; నూరువేలు; మిలియనులో పదో వంతు; +* lament, v. i. బాధపడు; విచారించు; సంతాపపడు; దుఃఖాన్ని బయట పెట్టు; విలపించు; అంగలార్చు; అఘోరించు; అలమటించు; +laminar flow, ph ర��జు ప్రవాహం; ప్రశాంత చలనం; ప్రశాంత ప్రవాహం; +* lamp, n. దీపం; దీపిక; జ్యోతి; తిర్లిక; బెళుకు; +lamp bulb, n, వెలుఁగు బుడ్డి; దీపపు బుడ్డి; +land breeze, ph. భూమారుతం; మలయమారుతం; నేల తెమ్మెర; +* land, n. భూమి; నేల; జియా; పుడమి; భువి; ధరణి; వసుంధర; క్ష్మా; ఞ; +* land, v. i. భూమిమీఁదకి దిగు; గట్టు ఎక్కు; వాలు; +* land, v. t. భూమిమీఁదకి దింపు; గట్టు ఎక్కించు; +* landing, n. మెట్టు; గట్టు; ఒడ్డు; దింపుగడ; +* landlady, n. ఇల్లుగలది; ఇంటి యజమానురాలు; +* landlord, n 1) బుగత; జమీందారు; భూస్వామి; కామందు 2) ఇల్లుగలవాడు; ఇంటి ఓనరు; +* landmark, n. కొండగుర్తు; బండగుర్తు; ఆనవాలు; నేలగుర్తు; +* landscape, n. భూదృశ్యం; ప్రకృతి దృశ్యం; ప్రకృతి దృశ్యాన్ని చూపే చిత్రపటం; +* landslide, n 1) భృగుపాతం; భూపాతం; నేలకెడవు; కొండచరియలలో భూమి దిగజారిపోవడం 2) అత్యధిక సంఖ్యాబలంతో ఎన్నిక నెగ్గడం; +* lands, n. భూములు; నేలలు; పుడములు; +dry lands, ph. నంజభూములు; నంజనేలలు; ఎండునేలలు; ఎండుభూములు; +wetlands, ph. పుంజభూములు; పుంజనేలలు; తడిపుడములు; తడినేలలు; తడిభూములు; +* lane, n. సందు; గొంది note) సందు కంటె వీధి వెడల్పయినది, వీధి కంటె మార్గం వెడల్పయినది 2) బాట; పట్టా; కార్దారి; లేను; +rustic language, ph పామరోక్తి; అశ్లీలం; అణక నుడి; అణకుఁగు; +* lanky, adj. సన్నగా, పొడుగ్గా ఉన్న; రివటలా ఉన్న; +* lantern, n. లాంతరు; హస్తకం ఉన్న దీపం; +* lapidary, n. వైకటికుడు; రత్నములను సానపట్టేవాడు; +* lapis lazuli, n. రాజావర్తం; ఇంద్రనీలమణి; వైడూర్యం; నవరత్నములలో ఒకటి; +* laparoscope, n. లాపొరోస్కోప్ అనేది ఒక వైద్య పరికరం. ఇది గొట్టంలా ఉండి అందులో ఓ కెమెరా ఉండి చీకట్లో చూసేందుకు ఒక దీపం కూడా ఉంటుంది చర్మం మీద చిన్న రంద్రం మాత్రం చేసి ఆ రంధ్రం గుండా ఈ బుల్లి లాపొరోస్కోప్ ని పంపి దాని ద్వారా చూస్తూ మరో వైపు నుండి బుల్లి సూదీ, చాకూ వంటివి పంపి అవసరమైన వరకూ కోయడమో, శుభ్ర పరచడమో చేస్తారు; ఇది ఓ రకం శస్త్ర చికిత్సా పద్దతి సాధారణంగా శస్త్ర చికిత్సలoటే కత్తితో కొయ్యడం చర్మం, కండలను చీల్చి లోపల అవయవాలకు మరమ్మత్తు చేయడమో లేదా పాడయితే తీసివేయడమో చేస్తారు. వైద్యుడి చేయి పట్టేంత మేర కోయవలసి ఉంటుంది. ఇటువంటి ప్రొసీజర్స్ తర్వాత రోగి కొలుకోవడానికి చాలా సమయం పడుతుంది.) +* lapse, v. i. మురిగిపోవు; కాలదోషం పట్టు; +* laptop, n. ఉరోపరి; అడ్డాల కలని; ఒడిలో పట్టే కంప్యూటరు; +* larceny, n. దొంగతనం; చోరీ; చౌర్యం; స్తేయం; మ్రుచ్చిమి; +* lard, n. కొవ్వు; పంది కొవ్వు; ఆవు, మేక మొదలగు గడ్డిఁదిను జంతువుల మూత్రపిండాల చుట్టూన్న కొవ్వుపదార్థము; +* large, adj. పెద్ద; పెను; గోదురు; స్థూల; గొప్ప; విస్తారమైన; అధికమైన; విశాలమైన; +large intestine, ph. పెద్దప్రేఁగు; స్థూలాంత్రం; పెంబ్రేఁగు; +* Lark, n. భరతపక్షి; భారద్వాజం; కులాసాగా కూజితాలు చేసే చిన్న పక్షి; +* larva, n. డింభం; పూర్తిగా ఎదిగిన తర్వాత ఉండే రూపానికి విరుద్ధంగా ఉండే పెరగని పిల్ల జంతువు; +* laryngitis, n. కంఠార్తి; స్వరపేటిక వాపు; గొంతుక్రోవి; +* Larynx, n. స్వరపేటిక; మాటల పెట్టె; శ్వాసనాళానికి ఘంటికకీ మధ్యనున్న ప్రదేశం; కృకాగ్రం; కంఠనాళిక కొన; గొంతుకలో ధ్వని పుట్టించే కట్టడం; +* Lascar, n. కళాసుఁడు; ఓడమీద పనిచేసేవాఁడు; పనివాఁడు; +* lash, v. t. కొరడాతో కొట్టి దండించు; +* lassitude, n. నిస్త్రాణ; నీరసం; అలసట; గ్లాని; +* lasso, n. పాశం; త్రాఁడు; ఉచ్చుతాడు; +* last, adj 1) ఆఖరు; కడపటి; కడ; చివరి; ఒక వరుసలో చిట్టచివరిది 2) గత; క్రిందటి; మునుపటి rel) latest; +last year, ph. గత సంవత్సరం; క్రిందటి ఏఁడు; నిరుడు; మున్నేఁడు; +* late, adj 1) ఆలస్యమైన; జాప్యమైన; జాగైన(2) వెనుకటి; గతించిన; చనిపోయిన; దివంగతులైన; +* latent, adj. దాౘబడిన; గుప్తమైన; అంతర్గత; గూఢ; అవ్యక్త; +latent heat, ph. గుప్తోష్ణత; గుప్తోష్ణం; గూఢోష్ణం; అంతర్గతోష్ణత; దాపువేడిమి; +* lateral, adj. పార్శ్వ; ప్రక్కనున్న; ప్రక్కటి; +* latest, adj. గత; క్రిందటి; ఒక వరుసలో అప్పటికే చివరిది; +* latex, n. దుగ్ధరసం; మొక్కలనుండి కారే పాలు; +* lath, n. పెండికట్టు; తడప; పలచటి, పొడుగాటి రేకు; తాటి, కొబ్బరి మొదలైన చెట్ల మట్టల నుండి పీకిన పలచటి, పొడుగాటి పీలిక; +* lathe, n. తరిమెన; తరివిరి; ఒక యాంత్రిక పనిముట్టు; +* lather, n. నురుగు; సబ్బు నురుగు; ఫేనం; +* Latin America, n. లాటినమేరికా దేశం; మెక్సికో, మధ్య అమెరికా; బ్రెజిల్ మినహాయించి మిగిలిన దక్షిణ అమెరికా ప్రాంతం; +* latitude, n 1) అక్షాంశం; అక్షాంశరేఖ; ఇరుసంకె; ఒక చేతిని క్షితిజం వైపు, మరొక చేతిని ధ్రువ నక్షత్రం వైపు సారించినప్పుడు ఆ రెండు చేతుల మధ్య ఉండే కోణం; ఉత్తర ధ్రువం యొక్క అక్షాంశం 90 డిగ్రీలు; భూమధ్య రేఖ యొక్క అక్షాంశం సున్న డిగ్రీలు 2) ఉదారత; స్వతంత్రం; మెదలడానికి చోటు; +* laudable, adj. వంద్యం; స్తుతించదగ్గ; ఈడ్యము; పొగడదగిన; +money laundering, ph. నల్లబజారులో గణించిన డబ్బుని చెలామణీలోకి తీసుకురావడానికి పన్నే కుట్రలు; +* laundromat, n. చాకిరేవు కొట్టు; చాకిమర; మిషనులో డబ్బులు వేసి బట్టలు ఉతుక్కునే స్థలం; +* laureate, n. పుష్పగుచ్చమును గ్రహించిన వ్యక్తి; గండపెండేరమును తొడిగించుకున్న వ్యక్తి; అభిషిక్తుడు; ప్రసిద్ధుడు; +* laurel, n. పత్రగుచ్ఛం; పురస్కారం: మెప్పుకోలు; +* lavish, adj. డాబుగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన; +law of diminishing returns, ph econ క్షీణోపాంత ప్రయోజన శూత్రం; హీన ప్రయోజన న్యాయం; క్షీణ ప్రయోజన న్యాయం; +law point, ph. ధర్మసూక్తి; ధర్మసూక్ష్మం; +* lawful, n. చట్టసమ్మతం; ధర్మసమ్మతం; +* lawlessness, n. అశాంతి; అవ్యవస్థ; న్యాయరాహిత్యం; +* lawn, n. పచ్చిక; పచ్చికచెక్క; ఇంటి ముందు వాకిట్లో గడ్డి; +lawn mower, ph. లవనకి; గడ్డిని కత్తిరించే పనిముట్టు; +* lawyer, n. న్యాయవాది; వకీలు; లాయరు; ప్లీడరు; +* laxative, n. మృదువిరేచనకారి rel Purgative అంటే ఇంకా శక్తిమంతమైన ఔషధం. వీటిని కడుపునంతటినీ శుభ్రం చెయ్యడానికి వాడతారు. +* layman, n పామరుఁడు; సామాన్యుఁడు; ఒక రంగంలో ప్రవీణుఁడు కాని వ్యక్తి; +lazy fellow, ph. బద్ధకిష్టి; బద్ధకస్తుఁడు; సోమరి; +* laziness, n 1) బద్ధకత్వం; బద్ధకం; సోమరితనం; ప్రాలుమాలిక 2) బద్ధం; సుస్తీ; +* leaching, n. జలూకా ప్రయోగం; జబ్బు కుదిర్చే నిమిత్తం జలగల చేత నెత్తురు త్రాగించడం; +* Lead, n లెడ్ 1) సీసం; ఒక రసాయన మూలకం అణుసంఖ్య 82, సంక్షిప్త నామం, Pb Lat. Plumbum (2) పెన్సిలు ములుకు; పెన్సిలు ములుకులో ఉండే గ్రాఫైటు; +* lead, v. i లీడ్ దారితీయు; త్రోఁవ చూపు; +* leader, n. ఆరెకుఁడు; తలారి; పురోగామి అగ్రణి అగ్రిముఁడు; m. నాయకుఁడు; నేత; f. నాయకురాలు; +* leadership, n. నేతృత్వం; నాయకత్వం; ఆరెకతనం +* leaf, n. ఆకు; పత్రం; పర్ణం; గాదం; పల్లవం; +quadrifoliate leaf, ph. చతుర్దశ హస్తాకార సంయుక్త పత్రం; ఉ. నీటి చెంచలి కూర ఆకు; +tender leaf, ph. చిగురు; పల్లవం; ఇగురు; తలిరు; తలిరాకు; కవటాకు; +trifoliate leaf, ph. త్రిభిన్న పత్రం; మూడు ఉప పత్రములు గల భిన్న పత్రం; +* League of Nations, n. నానారాష్ట్ర కూటమి; నానారాజ్యసభ; దీని స్థానంలో ఇప్పుడు ఐక్యరాజ్యసమితి లేదా యునైటెడ్ నేషన్స్ ఉంది; +* leak, v. i. కారు ఓడిగిల్లు; నిష్యందించు; +* lean, adj. సన్నని; బక్కపలచని; చిక్కిన; కొవ్వు తక్కువగా ఉన్న; +* leap, v. i. గెంతు; లంఘించు; ఉరుకు; దుముకు; +leap year, n. లంఘ వర్షం; దీర్ఘ సంవత్సరం; అధిక సంవత్సరం; +* learn, v. i. నేర్చుకొను; కరచు; అభ్యసించు; +rote learning, ph. లొట్టాబట్టీయం; కంఠస్థం చెయ్యడం; +* lease, n. గుత్త; కౌలు; బాడుగ; పట్టా; ఇజారా; +* least, adj. కనిష్ఠ; కనీసపు; లఘిష్ఠ; లఘుతమ; అత్యల్పమైన; +* leave, v. t. వదలు; వదలిపెట్టు; విడుచు; మానుకొను; +* leavening, n. గుల్లపొడి; పొంగుపొడి; పిండివంటలు గుల్లబారడానికి; పిండి పొంగడానికీ వాడే పదార్థం; +* lectern, n. వ్యాసపీఠం; ఉపన్యాసకుడి ముందు కాగితాలు పెట్టుకుందికి ఉండే బల్ల; +* ledger, n. కాతా పుస్తకం; ఆవర్జా; ముఫర్జు; పద్దు పుస్తకం; వర్గు లెక్కల పుస్తకం; కవిలె కట్ట; +left hand, ph. సవ్యకరం; డాచేయి; ఎడమ చేయి; పుఱ చేయి; +left handed, ph. సవ్యకరం; వామకరం; వామావర్తం; పుఱ చేతి వాటం; +left wing, ph. వామపక్షం; డావైపు; రాజకీయాలలో "మార్పు" ని కోరే, సంప్రదాయ విరుద్ధ పద్ధతులని ప్రోత్సహించే పక్షం; సంఘంలో విశాల భావముగల; విశాల దృక్పథముగల పక్షం; +* left-handed, n. కవ్వడి; పుఱచేతివాటం ఉన్న మనిషి; +* leftovers, n. తినగా మిగిలిపోయినవి; భక్షితావశిష్టాలు; +* legacy, n. వారసత్వపు సంక్రమణ; ఉత్తరదాయిత్వం; వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి; +* legal, adj. చట్టబద్ధ; న్యాయాత్మక; న్యాయసంబంధిత; +* legend, n. ఒక వ్యక్తి చేసిన విశిష్టమైన పని గురించి గొప్పగా చెప్పే కథ కాని కథలు కాని; ఈ కథలు నిజంగా జరిగిన సంఘటనలు కావచ్చు, ఉత్ప్రేక్షలు కావచ్చు; ఉదా. శంకరాచార్యులవారు పరకాయ ప్రవేశం చేసేరన్న కథ; +* legume, n. కాయ ధాన్యం; చిక్కుడు జాతి గింజలు; +* leisure, n. తీరిక; తీరుబడి; తీరుబాటు; తీరిక సమయం; వ్యవధానం; సావకాశం; విరామం; ఉబుసు; ఎసలిక; +* leisurely, adv. తాపీగా; నెమ్మదిగా; తీరుబాటుగా; తీరుబడిగా; సావకాశంగా; వ్యవధానంగా; +* lemon, n. గజనిమ్మ; పసుపుపచ్చగా ఉండే నిమ్మపండు; ఆకుపచ్చగా ఉండే నిమ్మని పంపరపనసతో జోడించగా వచ్చిన కంచర జాతి మొక్క అని ఒక నమ్మకం ఉంది bot Citrus limon rel lime; +* lender, n అప్పిచ్చువాడు; ఉత్తమర్ణుడు; +* lending, adj. ప్రదాతృ; అప్పు ఇచ్చే; ఎరవిచ్చే; +* length, n. పొడవు; పొడుగు; నిడివి; నిడుద; చాపు; ఉద్దము; +* lens, n. కటకం; తాలం; ఓకు; వక్రీభవనం కారణంగా కాంతి కిరణాల మార్గాన్ని కేంద్రాభిసరణం (converge) చేసేది కాని, కేంద్రావసరణం (diverge) చేసేది కాని అయిన పరికరం కటకం అనబడుతుంది; +contact lens, ph. సన్నికర్ష కటకం; స్పర్శ కటకం; అంటోకు(అంటు ఓకు); +convex lens, ph. కుంభ కటకం; కుంభాకార కటకం; కుండోకు(కుండ ఓకు); +double convex lens, ph. ద్వికుంభ కటకం; రెంగుండోకు(రెండు కుండ ఓకు); +* Leonis, n. పూర్వ ఫల్గుని; ఉత్తర ఫల్గుని; +* leopard, n. చిఱుతపులి; వింబులి (వింత పులి); +* leprosy, n. కుష్ఠు; కుష్ఠువ్యాధి; కుష్ఠురోగం; +stone leprosy, ph. రాతి కుష్టు; పాలరాయి వంటి రాళ్లు ఆమ్ల వర్షంలో తడిసినప్పుడు రాయి క్రమేపీ క్షీణించి పోవడం; +* lesbian, n. f. స్వలింగాళువైన స్త్రీ; మరొక స్త్రీ తో మైథున సహచర్యం కోరే స్త్రీ; +* lesion, n. గాయం; క్షతం; దెబ్బ; కడి; పుండు; కోత; +* less, adj. తక్కువ; కొలతలో తక్కువ; +* lessee, n. అద్దెకున్న వ్యక్తి; అద్దెకి పుచ్చుకున్న వ్యక్తి; +* lessor, n. అద్దెకి ఇచ్చిన వ్యక్తి; +* lethal, adj. ప్రాణాంతకమైన; మరణకారకమైన; మారక; మారణ; +* levee, n. గట్టు; వరదలనుండి కాపాడడానికి నది ఒడ్డు వెంబడి కట్టిన కట్ట; +* level, n 1) మట్టం; మట్టపలక; ఒక ప్రదేశం చదునుగా ఉందో లేదో చూడడానికి తాపీమే వాడే పనిముట్టు (2) స్థాయి; ఎత్త��; సమత్వం 3) పరిమాణం; +* levitation, n వస్తువులని గాలిలో తేలేటట్లు చెయ్యడం; వాయుస్తంభనం; +* levulose, n. వామోజు; ఎడం చేతి వాటపు చక్కెర; పళ్లలో ఉండే చక్కెర (ఫలోజు) ఈ జాతిది; గ్లూకోజు, మాల్టోజు కుడి చేతి వాటం చక్కెరలు see also) dextrose; +* lewd, adj. అశ్లీలమైన; అవాచ్యమైన; సాధుసమ్మతంకాని; బూతు; +* lexical, adj. మాటలకి సంబంధించిన; నిఘంటు సంబంధిత; నైఘంటుక; +* lexicographer, n. నిఘంటుకారుఁడు; నైఘంటికుఁడు; ఆభిదానికుఁడు; +* lexicography, n. నిరుక్తం; నిరుక్త శాస్త్రం; నిఘంటు నిర్మాణ శాస్త్రం; శబ్దసంగ్రహ శాస్త్రం; +* lexicon, n. శబ్దసంగ్రహం; పదకోశం; శబ్దకోశం; నిఘంటువు; +* liability, n. భారం; బాధ్యత; జవాబుదారీ; పూచీ; అచ్చుకోలు; +* liar, n. కల్లరి; అబద్ధాల కోరు; బొంకులాడు; కోతల రాయుడు; జులాయి; +* libation, n 1) దేవుడికి నైవేద్యంగా అర్పించిన ద్రవరూపంలో ఉన్న పదార్థం 2 వెటకారంగా) అతిథులకి ఇచ్చే మద్యపానీయాలు; +* liberal, adj. విశాల భావముగల; విశాల దృక్పథముగల; వదాన్య; ఉదార; +* liberal, n. వదాన్యుడు; ఈవరి; ఉదారవాది; విశాల భావముగల వ్యక్తి; విశాల దృక్పధముగల వ్యక్తి; +* liberty, n. స్వతంత్రం; స్వేచ్ఛ; యథేచ్ఛ; +* libido, n psych కామాతురత; లైంగిక వాంఛ; లైంగిక బుభుక్ష; లైంగిక క్రియపై కోరిక; అచేతనంలో ఉండే తర్కాతీతమైన కోరికల పుట్ట; +* library, n. గ్రంథాలయం; పుస్తక భాండాగారం; లైబ్రరీ; +* licit, adj. చట్టసమ్మతమైన; చట్టబద్ధమైన; +* lick, v. t. నాకు; నాలికతో నాకు; లేహించు; +* lie, n. అబద్ధం; అసత్యం; కల్ల; బొంకు; కోత; హుళక్కి; అనృతం; +white lie, ph. శుద్ధ అబద్ధం; పచ్చి అబద్ధం; +* lie, v. i. పరుండు; పండుకొను; పవళించు; +lie down, ph. పరుండు; పండుకొను; పవళించు; +* lien, n. తత్వాక్కు; తాత్కాలిక స్వత్వం; తాత్కాలిక హక్కు; +* life, n 1) జీవి; జీవం 2) జీవితం; జీవనం; మనుగడ; బతుకు 3) ప్రాణం; జీవుడు; హంస; అసువు; ఉసురు; +* life, adj. జీవ; జీవిత; ప్రాణ; యావజ్జీవ; +life cycle, ph. జీవిత చక్రం; జీవన చక్రం; జీవిత వలయం; +life expectancy, ph ఒక వయస్సు వరకు బతికిన వ్యక్తి సగటున ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో లెక్క కట్టి చెప్పే సంఖ్య; ఒక వ్యక్తి వయస్సు పెరిగే కొలదీ, బాలారిష్టాలు తగ్గుతాయి కనుక, ఈ సంఖ్య మారుతూ ఉంటుంది +life span, ph. ఆయువు; ఆయుర్దాయం; జీవన పరిమితి; ఈ మాట ప్రాణం ఉన్న శాల్తీలని, లేని జడ శాల్తీలనీ ఉద్దేసించి వాడవచ్చు; ఒక జనాభాలోని ప్రజల యొక్క పుట్టిన తేదీ, గిట్టిన తేదీ తెలిస్తే ఆ జనాభాలో సగటు వ్యక్తి జీవన పరిమితి లెక్క కట్టవచ్చు; ఒక విద్యుత్ బల్బు ఎన్ని గంటలు వెలుగుతుందో అది ఆ బల్బు యొక్క జీవన పరిమితి; +* lifebuoy, n. ఈతకాయ; నీటిలో తేలడానికి వాడే ఒక ఉపకరణం; +* lifeless, adj. అచేతన; చచ్చిన; ప్రాణాలు పోయిన; నిర్జీవ; +life-long imprisonment, ph. యావజ్జీవ కారాగార శిక్ష; జన్మాంతర కారాగారం; +* lifespan, n. ఆయువు; ఆయుర్దాయము; ఆయుస్సు; జీవితకాలం; +* lift, n 1) మోట; చేదుపెట్టి; నీటిని పైకి ఎత్తే సాధనం; లేపే సాధనం 2) ఎత్తుపెట్టి; మోట పెట్టి; ఎత్తుబండి 3 phys ఉద్ధరణ aerodynamic lift; +* liger, n. సింలి; మగ సింహానికీ ఆడ పులికీ పుట్టిన పిల్ల; రెండు మాటలని జత చేసి కొత్త మాట సృజించటాన్ని “పోర్ట్ మాంటో“ (Portmanteau) అంటారు. ఇంగ్లీషులో ఇలాంటి పదాలు ఇంకా స్మాగ్ (smog SMoke+Fog బ్రంచ్(Brunch Breakfast+Lunch see also tigon; +* light, adj 1) వెలుగు; వెలుతురు; కాంతి; ద్యుతి 2) తేలిక; లలిత; దోర; లఘు; +* light, n 1) కాంతి; వెలుగు; వెలుతురు; ప్రభ; ప్రకాశం; భాతి 2) దీపం; జ్యోతి; దివ్వె; లైటు 3) తేలిక; చులకన; +moonlight, n. వెన్నెల; చంద్రకాంతి; సుధాకర భాతి; +* lighthouse, n. దీపస్తంభం; ఆకాశదీపం; రేవుదీపం; బంకోలా: ఓడలకు దిక్కు తెలియజేయుటకై రేవున బెట్టిన ఎత్తయిన దీపస్తంభము; +* lightning, n. మెరుపు; విద్యుల్లత; సౌదామిని; అశని; తటిత్తు; తటిల్లత; తటిత్తు; +* light-year, n. జ్యోతిర్‌వర్షం; కాంతి సంవత్సరం; దూరాన్ని కొలవడానికి ఖగోళశాజ్ఞులు వాడే కొలమానం; కాంతి ఒక ఏడాదిలో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అంత దూరం; ఉరమరగా 6,000,000,000,000 మైళ్ళు; +* lignite, n. కపిల; అంగారం; నాసిరకం నేలబొగ్గు; +* limbo, n idiom] త్రిశంకు స్వర్గం; త్రిశంకు స్థితి; +* lime, n 1) నిమ్మపండు; ఆకుపచ్చగా ఉండే నిమ్మపండు 2) సున్నం; గుల్ల సున్నం; పొడి సున్నం; ముగ్గు; +lime mortar, ph. సున్నం; చెక్క సున్నం; గానుగ సున్నం; సున్నపురాయి గని నుంచి తెచ్చి సున్నపు బట్టీలలో కాలుస్తారు. అది బాగా విరిగి వేడిగా ఉంటుంది. అది తీసుకొని కట్టు సున్నం లాదు సున్నం తయారు చేస్తారు. ఒక బస్తాకు 8 బస్తాలు (6 పైన) ఇసుక పోసి, గానుగలో వేసి ఎద్దుల చేత కొన్ని చుట్లు తిప్పిస్తారు. అది బాగా కలిసి పదును ఔతుంది. అది ఇపుడు సిమెంట్ మాదిరిగా (మళ్ళీ ఇసుక కలపక) వాడుకోవచ్చు. మిగిలినది రాశిగా పోసి కొద్ది నీళ్లు పైన కొద్దిగా గుంట చేసి పోస్తే పదును పోదు. ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. సిమెంట్ మాదిరి ఏ రోజు కారోజు ఖాళీ చేయబనిలేదు. లాదు అంటే ఇంటి పై కప్పు. లాదు (ఇపుడు స్లాబ్) పోయడానికి వాడేది — లాదు సున్నం. +* limit, n. మితి; పరిమితి; పారం; అవధి; హద్దు; సరిహద్దు; మందల; మేయం; +* limitless, n అపరిమితం; అమేయం; అపారం; అమందలం; +clothesline, ph. బట్టలు ఆరవేసుకొనే తాడు; దండెం; +line of luck, ph. అదృష్టరేఖ; చేతిలో కనిపించే ఒక రేఖ; +* linen, n 1) తువ్వాళ్ళు; దుప్పట్లు వగైరా 2) నారబట్ట; +* linger, v. i. ఆలశ్యం చేయు; జాప్యం చేయు; వెనకబడు; +* lingo, n. పరిభాష; ఒక వృత్తికి కాని ఒక జాతికి కాని చెందిన భాష; నలుగురికీ అర్థం కాని పరిభాష; +* lingual, adj. నాలుక వైపు; నాలుకకి సంబంధించిన; జిహ్వకి సంబంధించిన; భాషకి సంబంధించిన; +lingual side, ph నాలుక వైపు; నోటిలో పళ్ళకి రెండు పార్శ్వాలు ఉంటాయి: బుగ్గ వైపు, నాలుక వైపు; +* lining, n. అస్తరు; దుస్తుల లోపల పల్చటి పొరలా వేసే మరొక బట్ట; +* link, n. లంకె; మెలుసు; కీలు; లింకు; +* link, v. t. లంకించు; లంకె పెట్టు; అనుసంధించు; లింకించు; +* linseed oil, n. సీమఅవిసె నూనె; ఎల్లగిసె విత్తుల నూనె; +* lion, n. m. సింహం; కేసరి; హర్యక్షం; కంఠీరవం; +* lip, n 1) పెదవి; పెదిమ; మోవి; ఓష్ఠం; వాతెర; పలువలువ 2) అంచు; గిన్నె యొక్క అంచు; +* liquidation, n. ఒక వ్యాపారంలోని ఆస్తులని అమ్మేసి ద్రవ్యరూపంలోకి మార్చేయడం; అలా మార్చేసి అప్పులు తీర్చేయడం దివాలా ఎత్తేముందు చెయ్యవలసిన మొదటి పని; +* liquidity, n 1) ద్రవ్యత; ద్రవత్వం; ద్రవరూపంలో ఉండగలగడం 2) ద్రవ్యత; ద్రవ్యత్వం: ఆస్తి ధనరూపంలో ఉండడం; +* liquor, n. మద్యం; ఈ మాటని సారా, కల్లు మొదలైనవాటికి వాడవచ్చు కాని, ముఖ్యంగా బ్రాందీ, విస్కీ మొదలైన అభిషవోల్ జాతి మద్యాలని ఉద్దేశించి వాడతారు; +distilled liquor, ph. అభిషవం; అభిషవోల్; బట్టీపట్టగా వచ్చిన మద్యం; +* list, n. జాబితా; పట్టీ; లావణి; చలానా; లిస్టు; +* listen, v. i. విను; ఆలకించు; ఆకర్ణించు; అవధరించు; +* literacy, n. అక్షరాస్యత; అక్షర జ్ఞానం; +* literal, adj. మాటకుమాటగా వుండే; శాబ్దిక; ఉన్నదున్నట్లు; అక్షరాక్షరం; +literal meaning, ph. వాచ్యార్థం; మూలార్థం; సామాన్యార్థం; +* literate, n. సారస్వతులు; అక్షరాస్యులు; +* literature, n. సాహిత్యం; సారస్వతం; రచనా సంపుటి; వ్రాయాది; వాఙ్మయం (vaa~mmayaM); +* lithography, n. శిలా లేఖనం; రాతి పలక మీద కాని లోహపు పలక మీద కాని అక్షరాలని అమర్చి దాని సహాయంతో అద్దకం అద్దినట్లు అచ్చు గుద్దడం; +* litigation, n. వ్యాజ్యం; కేసుని కోర్టుకి తీసుకెళ్లే పద్ధతి; +* litmus paper, n. లిట్మస్ కాగితం; ఆమ్లములు తగిలిన ఎరగ్రానూ, క్షారములు తగిలిన నీలంగానూ మారే ఒక రసాయనంతో పూయబడ్డ కాగితం; +* little, adj. చిన్న; బుల్లి; ఇసుమంత; ఇంచుక; కొంచెం; కొద్ది; స్వల్ప; అల్ప; +* littoral, n. తీరగత; సముద్రతీరం దగ్గరి; +* live, v. i లివ్) బతుకు; జీవించు; నివసించు; +* live, adj లైవ్) సజీవ; ప్రాణముతోనున్న; అప్పుడే జరుగుచున్న; +live cinder, ph. నివురుగప్పిన నిప్పులు; పూర్తిగా భస్మంకాని నిప్పు; సజీవాగ్ని; +live program, ph. రేడియోలో కాని టి.వి. మీద కాని అప్పటికప్పుడు జరుగుతూన్న కార్యక్రమం; +* livelihood, n. ఉపాధి; జీవనోపాధి; జీవిక; భుక్తి; జరుగుబడి; జరుగుబాటు; జీవనాధారం; +* liver, n. కాలేయము; యకృత్తు; కర్జ; +* livery, n. దవాలీ; దుస్తులు; ఉద్యోగపు దుస్తులు; నౌకరీదుస్తులు; సేవకులకు యజమానులిచ్చు ఉడుపులు; +* livestock, n. పశుసంపద; పశువులు; పశుగణం; అనగా, పెంపుడు జంతువులు; అనగా, ఆవులు, గేదెలు, పందులు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, కోళ్లు, బాతులు, పట్టుపురుగులు, తేనెటీగలు, వగైరా; +* livid, n కమిలిన రంగు; నీలి నలుపు రంగు; +* lividity, n కమిలిన రంగుని పొడచూపడం +postmortem lividity, ph. ప్రాణం పోయిన తరువాత చర్మం రంగు మారడం; తెల్లగా ఉన్న వారి శరీరం లేత బచ్చలిపండు రంగులోకి మారినట్లు కనబడడం +* Llama, n. ఏడగొఱ్ఱె; దక్షిణ అమెరికాలో ఉండే ఒంటెని పోలిన జంతువు; +* load, v. t. బరువు ఎక్కించు; సామాను ఎక్కించు; +* loan, n. అప్పు; రుణం note) సంస్కృతంలో సర్వసాధారణంగా అకారాంత పదాల తర్వాత రు శబ్దం వస్తే, రు శబ్దమే మారుతుంది. ఉదా. బ్రహ్మ రుషి బ్రహ్మర్షి అవుతుంది కాని అకారం తర్వాత రుణ అన్న మాట వచ్చినప్పుడు మాత్రం అ కారానికి దీర్ఘం వస్తుంది. ఉదా. ప్రవత్సతర రుణ ప్రార్ణ, అంటే భారీ ఎత్తున చేసే అప్పు. ప్రపంచ బ్యాంకు దేశాలకి ఇచ్చే అప్పులాంటిది. +consolidation loan, ph. రుణార్ణ; రుణ రుణ; చిన్న చిన్న చిల్లర అప్పులని తీర్చడానికి చేసే పెద్ద అప్పు; +home loan, ph. గృహార్ణ; గృహ రుణ; ఇల్లు కొనడానికి చేసే అప్పు; ఉద్దర; +* lobe, n. తమ్మె; శరీరం నుండి కాని అంగం నుండి కాని ఉబికి వచ్చిన గుండ్రని భాగం; +* lobule, n. పాలిక; తమ్మెక; చిన్న తమ్మె; +* local, adj. ప్రాంతీయ; స్థానిక; ప్రాదేశిక; స్వదేశీ; దేశవాళీ; +* locus, n 1) బిందుపథం; నిధానం; జాడ 2) ఒక వారసవాహిక మీద ఒక జన్యువు ఆక్రమించే స్థానం; +* lofty, adj. ఉదాత్తమైన; ఒప్పిదముగల; గొప్ప; +* log, n 1) దుంగ; మాను 2) చిట్టా; అంశ సమీకరణ పత్రం; అంశ పత్రం; ఏయే పనులు ఎప్పుడెప్పుడు జరిగేయో చూపించే జాబితా 3 పద్దు; +log book ph కవిలె; పద్దు పుస్తకం; దుంగ పొత్తం; +* logarithm, n. ఘాతాంకం; లఘుగణకం; సంవర్గమానం; +* logic, n. తర్కం; తర్కశాస్త్రం; +circular logic, ph. చక్రీయ తర్కం; విత్తు ముందా చెట్టు ముందా అనే చర్చలో కూరుకుపోయి, సమాధానం దొరక్క పడే అవస్థ అనవస్థ; వాదోపవాదాలలో పాల్గొంటున్న వారికి ఇలాంటి అనవస్థ కలగడం అనవస్థా దోషం; ఎంతకీ తెగని చర్చలలో, పరిశీలనలో కూడుకుని పోవడం అనవస్థా దోషం; +* logical, adj. తార్కికమైన; తర్కబద్ధమైన; +* logistics, n. సేవాతంత్రాలు; ఏ పని ఎప్పుడు, ఎలా చెయ్యాలో సూచించే నియమావళి; +* logographs, n. pl అర్థసంకేతాలు; అంకెలు, అక్షరాలతోపాటు రాతలో వాడే ���ిరామ చిహ్నాలు, గణిత సంకేతాలు, కీ ఫలకం మీద కనబడే మరి కొన్ని సంకేతాలు; +* long, adj. పొడుగైన; దీర్ఘమైన; లంబమైన; ఉత్తాల; చిర; +long sight, ph. చత్వారం; దూరముగానున్న వస్తువులు మాత్రమే కనబడుట; +* longevity, n 1) దీర్ఘాయువు; లంబజీవితం 2) ఆయుష్కాలం; +* longhand, n. చేవ్రాలు; కంప్యూటరో, టైపు యంత్రమో వాడకుండా చేతితో రాసిన రాత rel shorthand; ok +* longitude, n. రేఖాంశం; దీర్ఘాంశం; తులాంశం; విషువాంశం; ధ్రువకం; +longitudinal line, ph. రేఖాంశం; దీర్ఘాంశం; తులాంశం; విషువాంశం; ధ్రువకం: +* look, v. i చూడు; అవలోకించు; వీక్షించు; +* loose, adj. వదులుగానున్న; బిగుతులేని; విశృంఖలమైన; బులబులాగ్గా; +* loosen, v. t. వదులించు; వదులు చేయు; సడలించు; సూత్రించు; +* loot, n. లూటీ; దొంగిలించిన సొమ్ము; +* lose, v. i. పోగొట్టుకొను; కోల్పోవు; నష్టపోవు; పోకార్చు; +* lot, n 1) స్థలం; ఇల్లు కట్టుకోడానికి ఉపయోగపడే స్థలం 2) కర్మ; +* loud, adj. పెద్ద; బిగ్గర; తీక్షణమైన; పెను; గట్టి; +* lounge, n. విశ్రాంతి వసారా; లౌంజి; +* love, n. ప్రేమ; మమకారం; అనురాగం; రాగం; వలపు; ఈషణం; ఆపేక్ష; కూరిమి; కాదిలి; గాదిలి నెమ్మి; నెనరు; నెర్లు; నెయ్యము; +love affair, ph. ప్రేమకలాపం; సరసోదంతం; ప్రేమాయణం; +* love, v. t. ప్రేమించు; అభిమానించు; ఇష్టపడు; పడిచచ్చు; ముద్దు చేయు; +* lover, n. అభిమాని m. ప్రియుడు; ప్రేయసుడు; అభిమతుడు; f. ప్రేయసి; ప్రియురాలు; అభిమతి; +* lower, adj. క్రింది; దిగువ; అడుగు; హీన; లఘు; సరాజిత; అపర; +* luck, n. అదృష్టం; ప్రాప్తం; +* luckily, adv. అదృష్టవశాత్తు; అదృష్టవశాన; +* Luddite, n. పారిశ్రామికీకరణని వ్యతిరేకించే వ్యక్తి; +* luggage, n. సంచులు, పెట్లు, వగైరాలు; వీటిని సామానుతో నింపితే అప్పుడు అది బేగేజి అవుతుంది; +* lukewarm, adj. నులివెచ్చ; గోరువెచ్చ; చిట్టుడుకు; కదుష్ణ; +* lumbar, adj. కటిస్థ; నడుముకి సంబంధించిన; +* luminary, n. జ్యోతిర్మయి; తార; నక్షత్రం; ప్రశస్తి కల వ్యక్తి; +* luminous, adj. ప్రకాశమానమైన; ప్రభాసితమైన; కాంతియుత; +luminous zone, ph. ప్రభాసిత ప్రాంతం; దీప్తి మండలం; +* lump, n. లప్ప; గడ్డ; ముద్ద; కడి; కరడు; కదుం; +* lunar, adj. చంద్ర; చాంద్ర; ఐందవ; చంద్రుడికి సంబంధించిన; +lunar mansion, ph. నక్షత్రం; నక్షత్ర సమూహం జాతకాలలో) ఇల్లు; గది; +* lunatic, n. ఉన్మాది; m. పిచ్చివాడు; ఉన్మత్తుడు, f. పిచ్చిది; +* lunation, n. చాంద్రమాసం; ఒక అమావాస్య నుండి తరువాత అమావాస్య మధ్య గల వ్యవధి; +* lunch, n. సంకటి; మధ్యాహ్నపు భోజనం; +* lung, n. ఊపిరితిత్తి; పుప్ఫుసం; +* luxuries, n. pl. విలాస వస్తువులు; భోగభాగ్యాలు; అంగరంగ వైభవాలు; +* lynch pin, n కడచీల; సాయిమేకు; చక్రాన్ని ఇరుసుకి తగిలించడానిలి వాడే చీల; +* lyric, n. పాట; గీతం; పాటలోని సాహిత్యం; వ��క్కు; +* lysosome, n. విలీనకాయి జీవకణాలలోని కనసారంలో తేలియాడుతూ ఉండే ఒక గుండ్రని భాగం lit lose body + + +* mace, n 1) గద 2) జాపత్రి; జాజికాయ లోపల ఉన్న గింజ చుట్టూ వలలా ఉన్న కవచమే జాపత్రి; జాజికాయ ని nutmeg అనిన్నీ, జాపత్రిని mace అనిన్నీ అంటారు +machine learning, ph. యాంత్రికాభ్యాసం; యాంత్రిక అభ్యాసం; యంత్రాలకి స్వయం ప్రతిభతో పనులు చెయ్యడం ఎలాగో నేర్పే శాస్త్రం; +* machinery, n. యంత్రాంగం; యంత్రసముదాయం; +* Machiavellian, n. మేకీవిల్లియం; కౌటిల్యం; కుటిల రాజనీతి; +* macrocosm, n. స్థూలప్రపంచం; విశ్వం; ప్రపంచం; +* macrophage, n. మహాబక్షణి; కణబక్షక కణాలలో కల్లా పెద్దగా తినమరిగిన కణం; ఈ కణాలు పైనుండి చొరబడ్డ సూక్ష్మజీవుల వంటి లాతి జీవులని, చచ్చిపోయిన స్వంత కణజాలన్నీ కబళించెస్తాయి +* mad, n. పిచ్చి; వెర్రి; ఉన్మత్తత; +* mademoiselle, n మేమ్యుజెల్) కుమారి; అవివాహిత; +* madness, n. పిచ్చితనం; వెర్రితనం; ఉన్మత్తత; +* maelstrom, n 1) సుడిగుండం 2) గందరగోళమైన పరిస్థితి; +* mafia, n. ముష్కరమూక; చట్టవ్యతిరేకమైన పనులు చేసే రహస్య ముఠా +* magazine, n 1) పత్రిక; సంచికల వారీగా ప్రచురితమయే పత్రిక 2) తుపాకీలో గుళ్ళు అమర్చే సొరుగులాంటి సదుపాయం; గుళ్ళగిడ్డంగి; +* maggot, n. ఈగ గుడ్డు; మక్షిక డింభం; +* magic, n. ఇంద్రజాలం; కనికట్టు; మాయ; మంత్రం; +* magician, n. ఇంద్రజాలికుడు; మాంత్రికుడు; మాయలాడి; +* magnate, n. ఘనుడు; అగ్రగణ్యుడు; పెద్ద; +* magnet, n. సూదంటురాయి; అయస్కాంతం; స్కాంతం; లోహకాంతం; చుంబకం; +bar magnet, ph. అయస్కాంతపు కడ్డీ; అయస్కాంత దండం; దండాయస్కాంతం; +* magnetic, adj. అయస్కాంత తత్వం; చుంబక; చుంబకీయ; +* magnetism, n 1) అయస్కాంత తత్వం; లోహచుంబకత్వం 2) ఆకర్షణ; +* magnetization, n. అయస్కాంతీకరణం; స్కాంతీకరణం; ఒక వస్తువుకి అయస్కాంతపు లక్షణాలు వచ్చేలా చెయ్యడం; +* magnetosphere, n. అయస్కాంతావరణం; భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం; +* magnitude, n. పరిమాణం; పరిమేయత; స్థూలత్వం; కాయస్తం; మహత్వం; ప్రాముఖ్యం; తరగతి; +magnitude of a star (apparent ph. దృష్ట ప్రకాశత్వం; మామూలుగా నక్షత్రాన్ని కంటితో చూసినప్పుడు కనిపించే ప్రకాశత్వం; ఇది ఆ నక్షత్రం యొక్క స్వయం ప్రకాశత్వం మీదా, ఆ నక్షత్రానికీ, ప్రేక్షకునికీ మధ్య ఉండే దూరం మీదా ఆధారపడి ఉంటుంది; దీనిని బట్టే నక్షత్రం యొక్క తరగతి నిర్ణయిస్తారు; +* maid, n 1) కన్య; వివాహము కాని బాలిక 2) ఇంట్లో చిల్లరపనులు చేసే పనిమనిషి; +maid servant, ph. దాసి; పనిమనిషి; ఇంట్లో చిల్లరపనులు చేసే పనిమనిషి; +* maiden, n. కన్య; పెళ్లి కాని పిల్ల; +* maim, v. t. గాయపరచు; అంగవైకల్యం చేయు; అవిటిగా చేయు; +* maintainer, n. పరిపోషణ క��్త; సంరక్షకుడు; పోషకుడు; +* maintenance, n 1) పరిపోషణ; సంరక్షణ; పోషణ; కాపు; భృతి; ఆలన 2) భరణం; మనువర్తి 3) నిర్వహణ; +* major axis, n. దీర్ఘ అక్షం; బృహదక్షం; దీర్ఘ వృత్తంలో కేంద్రం నుండి దూరబిందువు దిశలో గీసిన రేఖ; +* majority, n 1) సంఖ్యాధికత్వం; అధికసంఖ్యాకులు; మెజారిటీ 2) యుక్తవయస్సు; మెజారిటీ; +* makeup, n 1 cinema] ముస్తాబు; అలంకరణ; అంగరచన; రూపశిల్పం; కైసేత 2 నిర్మాణం; నిర్మాణక్రమం; +* malaria, n. మన్నెపు జ్వరం; కొండ జ్వరం; చలిజ్వరం; మలేరియా lit చెడుగాలి; +* male, n. మగవాడు; పురుషుడు; మగ జంతువు; +* malice, n. ద్వేషం; కార్పణ్యం; ఈర్ష్య; జుగుప్స; శత్రుత్వం; పగ; దుష్టభావం; +* mall, n. అంగడిల్లు ఒకే చోట అనేక విక్రయ సాలలు ఉన్న భవనం; +* malleable, adj. సుతిమెత్తని; సుత్తితో కొట్టుటవలన సాఁగునట్టి; అవాంతరనీవ్యత; ఒత్తిడి వల్ల రూపం మారే గుణం కల; +* mallet, n. కొయ్యసుత్తి; కొయ్యగూటం; కర్ర సమ్మెట; కాజం; +* malleus, n. కూటకము; మధ్య చెవిలో సుత్తి ఆకారంలో ఉండే ఒక చిన్న ఎముక; +* malnutrition, n. కుపోషణ; పోషణ చాలకపోవడం; పోషణచాలిమి; +* malodor, n. దుర్వాసన; దుర్గంధం; కంపు; నీచుకంపు; గవులు; పూతిగంధం; వసాగంధం; గబ్బు కంపు; +* malodorous, adj. పూతిగంధిల; వసాగంధిల; దుర్గంధ పూరిత; దుర్గంధమైన; కంపుకొట్టే; +* malt, n. నారు; మొలక; మోక; నిసువు; ఈరిక; ఉప్పిళ్లు; +malt liquor, ph. నారునీరా; మొక్క మొలిచే వరకు బార్లీ గింజలని నానబెట్టి, వాటితో చేసిన సారా; +* mammal, n. s. క్షీరదం; స్తన్యదం; పిల్లలకి పాలిచ్చే జంతువు; జరాయుజములు; +* man, n 1) మానవుడు; మనిషి; జంతువు కాదనే భావం 2) మగాడు; పురుషుడు; స్త్రీ కాదనే భావం 3) పెద్దవాడు; పిల్లవాడు కాడనే భావం; +* manage, v. t. నిర్వహించు; పెత్తనముచేయు; పరిపాలించు; అదుపులోపెట్టు; నడిపించు; నెట్టుకువచ్చు; అజమాయిషీ చేయు; +* manager, n. నిర్వాహకుడు; అధినేత; పెత్తందారు; అజమాయిషీదారు; వ్యవహర్త; ప్రవర్తకుడు; ఉపదర్శి; మేనేజరు rel యజమాని; +* management, n. అజమాయిషీ; అధ్వర్యం; నిర్వాకం; పెత్తనం; యాజమాన్యం; యోజన; +* mandate, v. t. శాసించు; విధించు; ఆజ్ఞాపించు; +* mane, n. జూలు; గుర్రం, సింహం మొ. జంతువుల మెడమీద వెంట్రుకలు; +* man-eater, n 1) నరమాంసానికి మరగిన పులి 2) నరమాంస భక్షకుడు; పొలదిండి; +* manger, n. కొల్లం; పశువులకు మేత వేసే తొట్టి; +* mango, n 1) మామిడి; మావి; రసాలం; మాకంద పండు (2) మామిడిపండు; మామిడికాయ; +* mangoes, types of, ph. పలురకాల మామిడిపళ్ళు; చెరకు రసాలు; పెద్ద రసాలు; చిన్న రసాలు; పంచదార కలశ; ఎండ్రాసు; నూజివీడు రసాలు; సువర్ణరేֻఖ; బంగినపల్లి; కలక్టరు; జహంగీరు; కోలంగోవా; నీలాలు; +* mangrove, n. మడ; మడచెట్టు; నల్లమడ; సముద్రపు ఉప్పునీటి వాతావరణంలో పెరిగే నీటి చెట్లు; +(4) చాలా గొప్పవాడిని/దానిని అని భ్రమించడం (Delusions of grandeur 5) ఆలోచనల పరంపరలు (Flight of ideas ఒక ఆలోచన పూర్తికాకముందే మరొక ఆలోచన, ఏకాగ్రత లోపించడం; +kleptomania, ph. దొంగతనం చెయ్యాలనే వెర్రి కోరిక; చౌర్యోన్మాదం; +* maniac, n. వెర్రివాడు; అదుపులో లేని బుద్ధులు కలవాడు; ఉన్మాది; +* manifestation, n. సాక్షాత్కారం; వ్యంజితం; వివర్తం; వ్యాకృతం; ఆవిర్భావం; వ్యక్తి; +* manifesto, n. ఆదర్శ తరంగిణి; ఆదర్శాలు రాసిన ప్రచురణ; ప్రణాళిక; +communist manifesto, ph. కమ్యూనిష్టు వారి ఆదర్శాలు రాసిన ప్రచురణ; +* Manila envelope, ph. టపా చెయ్యడానికి అనుకూలమైన గోధుమ రంగు కాగితపు సంచి; +* manner, n. తీరు; తరహా; వరస; వాటం; వైఖరి; వ్యవహారం; రీతి; విధం; ఫక్కీ; ప్రకారం; బాపతు; పగిది, pagidi +* mansion, n. భవనం; సౌధం; హర్మ్యం; పటారం; హవేలీ; +* mantle, n 1) ముసుగు; కప్పు; పైపొర; ప్రావారం; ఉత్తరీయం; వల్కలం; ఆచ్ఛాదనం 2) ఒక రకం దీపపు వత్తి 3) భూగర్భంలో ఉండే ఒక పొర; +* manual, adj.(1) కై; చేతి; కాయిక; చేతికి సంబంధించిన 2) మానవీయ; ఆటోమేటిక్ కాని; +* manual, n. చేతి పుస్తకం; కైపొత్తం; +* mantle, n 1) ముసుగు; కప్పు; వల్కలం; ఆచ్ఛాదనం 2) ఒక రకం దీపపు వత్తి; +* manufacturers, n. ఉత్పత్తిదారులు; తయారీదారులు; +* manure, n. ఎరువు; గత్త; గొబ్బరం; పాంశువు; +cow manure, ph. పేడెరువు; సస్యార్ధసంచిత గోమయం; +many people, ph. ఎంతోమంది; పెక్కురు; పలువురు; అనేకులు; +* map, n. దేశపటం; నక్ష; మానచిత్రం; మేరతేనం; మేపు; +* mar, v. t. పాడుచేయు; చెడగొట్టు; +* marble, n 1) పాలరాయి; చలువరాయి; సున్నపురాయి; సంగమల 2) గోలీకాయ; అల్లికాయ; +* mare, n 1) ఆడగుర్రం; ఘోటిక; గోడిగ; బడబ 2) ఆడ గాడిద; +* margin, n. బద్దె; అంచు; ఉపాంతం; వార; మార్జిన్; +right margin, ph. కుడి బద్దె; కుడి అంచు; దక్షిణోపాంతం; +top margin, ph. మీద బద్దె; మీద అంచు; శీర్షోపాంతం; +* marginal, adj 1) ఉపాంతర; అంచున వ్రాసిన 2) బొటాబొటీ; పరిమిత; నామమాత్ర; +* marginalization, n. ఉపాంతీకరణ; ఒక సమూహంలో కొందరిని తక్కువ ప్రాముఖ్యత లేదా ద్వితీయ స్థానానికి బదిలీ చేసే ప్రక్రియ; +* marginalize, n. ఉపాంతరీకరించు; ఉపాంతీకరించు; +* marijuana, n. గంజాయి; మేరువానా bot Cannabis sativa గంజాయి మొక్క నుండి వచ్చిన మొగ్గలు, పువ్వులు, ఆకులు, వగైరా ని ఎండబెట్టి. చుట్టల మాదిరి చుట్టి కాల్చుతారు rel హషీష్ అన్నది గంజాయి మొక్క నుండి స్రవించే పాలని ముద్దలా చేసి అమ్ముతారు; దీనిని కూడా చుట్టల మాదిరి చుట్టి కాల్చుతారు; +* mark, n 1) సూచిక; కెతనం; ఆనవాలు 2) మరక 3) గుణాంకం; మార్కు; +* Markab, n. పూర్వాభాద్ర; ఒక నక్షత్రం పేరు; +* market, n. సంత; అంగడి; బజారు; విపణి; మార్కెట్; +black money, ph. అక్ర��� సంపాదనలో వచ్చిన డబ్బుని నల్ల డబ్బు అంటారు; నల్ల డబ్బును ఆదాయ వనరులలో చూపకుండా దాచిపెట్టు విధానము +మనీ లాండరింగ్ అంటారు; మన దేశమున దీనిని హవాలా కార్య కలాపాలు అని కూడా పిలుస్తారు; +* marks, n. గుణాంకాలు; అంకాలు; పరీక్షలో వచ్చే “మార్కులు”; +* marrow, n 1) మజ్జ; మూలుగు; మేద; మేదస్సు; కుల్యిక; అస్థిసారం; ఎముక సొన; ఎముకల లోపల ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం 2) దవ్వ; +* marry, v. i. వివాహమాడు; చేపట్టు; పెండ్లి చేసుకొను; పెండ్లాడు; చేసుకొను; +* marry, v. t. వివాహం చేయు; పెండ్లి చేయు; +* Mars, n. అంగారకుడు; అంగారక గ్రహం; మంగళ గ్రహం; కుజుడు; +* marsh, n. చిత్తడినేల; పంకభూమి; మురుగునేల; ఉబ్బనేల; పర్ర; కరవాక; +marsh gas, ph. చిత్తడి వాయువు; పంక వాయువు; +* marshalling yard, n. మారుగుళ్ల దొడ్డి; రైలు పెట్టలని ఒక వరసలో అమర్చడానికి వాడే ప్రదేశం; +* mart, n. వ్యాపారస్థలం; కొట్టు; షాపు; +* martyr, n. త్యాగాళువు; త్యాగి; తన లక్ష్యసిద్ధికి ప్రాణాన్ని త్యాగం చేసిన వ్యక్తి; +* marvel, n. వింత; విడ్డూరం; విచిత్రం; అద్భుతం; +* mascara, n. కాటుక; కళ్ళకి పూసుకునే ఒక అలంకారం; అంజనం; +macerated ginger, ph. భావన అల్లం; పంచదారలో ఊరబెట్టిన అల్లం; +* mask, n. ముసుగు; ప్రచ్ఛాదకి; బురఖా; +* mask, v. t. ముసుగు వేయు; కప్పు; ప్రచ్చాదించు; +* masochist, n. మజోకిస్టు; శరీరానికి బాధ కలిగించే పనులు జరిగితేనే కాని రతి క్రీడను ఆనందించలేని వ్యక్తి; తనకే హాని జరిగే విధంగా ప్రవర్తించే వ్యక్తి; +* mason, n. తాపీ పనివాడు; కాసీదు; కాసే పనివాడు; రాతి పనివాడు; ఇటిక పనివాడు; కుడ్యకారుడు; +* masonry, n. కట్టడం; రాతి కట్టడం; ఇటిక కట్టడం; +mass arrests, ph. మూకుమ్మడి నిర్భంధాలు; మూకుమ్మడి ఆపుదలలు; +mass number, ph గరిమ సంఖ్య; ఒక మూలకపు అణుగర్భంలో ఉండే ప్రోటానులు, నూట్రానుల మొత్తపు సంఖ్య ఉదాహరణకి సాధారణ కర్బనంలో 8 ప్రోటానులు, 4 నూట్రానులు ఉంటాయి కనుక కర్బనం గరిమ సంఖ్య 12; ఒక మూలకానికి సమభాగులు ఉన్నయెడల ప్రోటానులని, నూట్రానుల సగటు విలువని కలపగా వచ్చిన సంఖ్య; +* mass, n. రాసి; ద్రవ్యరాసి; ధుర; తండం; పుద్గాలం; గరిమ; ముద్ద; భారం; కాయస్థం; +* massage, v. t. మర్దనా చేయు; మాలీసు చేయు; ఒత్తు; పిసుకు; +* masseur, n. m. సంవాహకుడు; అంగమర్ధనుడు; మర్దనా చేసే పరిచారకుడు; +* masseuse, n. f. మర్దనా చేసే పరిచారిక; సంవహనకి; +* masses, n. జనాలు; ప్రజ; ప్రజానీకం; మంది; జనసామాన్యం; జనబాహుళ్యం; జనసందోహం; +* mast, n. కూపకం; స్తంభం; తెరచాప కొయ్య; కంబం; +* master, n 1) యజమాని; ఓజు; ఖామందు 2) గురువు; ఆచార్య 3) ప్రవీణుడు; నేర్పరి 4) సంధాత; +master plan, ph. బృహత్ ప్రణాళిక; పెద్ద ప్ర��ాళిక; +* masturbation, n. ముష్టిమైథునం; హస్తప్రయోగం; మర్మస్థానాలని చేతితో తాకి లైంగిక కోర్కెలు తీర్చుకోవడం; +* match, n 1) అగ్గిపుల్ల 2) ఉజ్జీ ఉద్ది; జత; సమానమైనది; ఎన; పొంతన 3) ఆట; పందెం; ఎదురు; పోటీ 4) సంబంధం; వివాహనిర్ణయం; +* mate, n. భార్య; సహధర్మచారిణి; భార్య; సహధర్మచారుడు; సహాధ్యాయి; సహాధ్యాయుడు; +* mate, v. i. జత చేరు; వివాహం చేసికొను; రతిక్రీడ చేయు; +* Materia medica, n. పదార్థ గుణ సంహిత; ఔషధ లక్షణ సంగ్రహం; వస్తుగుణ ప్రకాశిక; వస్తుగుణ దీపిక; +* material, adj. భౌతికమైన; స్థూల; వస్తు; ఉపాదాన; పాదార్థిక; +material cause, ph ఉపాదాన హేతువు; పాదార్థిక హేతువు; +raw material, ph. ముడిపదార్థం; ముడిసరుకు; ముడి సంభారాలు; +* materialist, n. కుక్షింభరుడు; కుక్షింభరి; భౌతికవాది; ప్రత్యక్షంగా కనిపించేదే ప్రధానమని వాదించే వ్యక్తి; అనాత్మవాది; లోకాయతికుడు; +* materialism, n. కుక్షింభరత్వం; భౌతికవాదం; లోకాయతం; భోగలాలసం; +* materialize, v. i 1) జరుగు; సంభవించు 2) మూర్తీభవించు; కార్యరూపం దాల్చు; అకస్మాత్తుగా కనబడు; +* maternal, adj. తల్లివైపునుండి; తల్లికి సంబంధించిన; +* maternity, adj. గర్భవతికి సంబంధించిన; ప్రసవానికి సంబంధించిన; పురిటికి సంబంధించిన; ప్రసూతి; +* mathematics, n. గణితం; లెక్కలు; గణిత శాస్త్రం; అంకశాస్త్రం; అంకవిద్య; అంకతంత్రము; ధూలికర్మ; +* matriarch, n. f. మూలమగువ; కుటుంబానికి అధిపతిగా ఉన్న స్త్రీ; +* matriarchal, n. మాతృస్వామ్య; మాతృతంత్ర; మాతృయజమాన; +* matriarchy, n. మాతృస్వామ్యం; మాతృతంత్రం; మాతృ అధికారం; +* matrix, n 1) అచ్చు; మూస; వరుధారణి; ప్రస్థారం 2) చిక్కు; అల్లుడు; పడుగు, పేకలతో అల్లబడ్డది 3) మాతృక; అడ్డు వరుసలు, నిలువు వరుసలు ఉన్న ఒక గణిత విన్యాసం ety an arrangement of ites with rows and columns 4) ఖనిజ నిక్షేపాలతోపాటు కనిపించే శిలామయ, మృత్తికామయ నేపథ్య పదార్థం; +* matter, n 1) పదార్థం; ద్రవ్యం; మూర్త వసువు 2) విషయం; బాపతు; ఎడాటం; +* matty, adj. చాపీయ; చాపలా ఉన్న; అల్లబడ్డ; +matty cloth, ph. అల్లినట్టు కనిపించే బట్ట; +* mature, adj. ఎదిగిన; ఈడువచ్చిన; ముదిరిన; పక్వమైన; పండిన; ముగ్గిన; సిద్ధమైన; తయారైన; ప్రౌఢ; +* maturity, n. ఈడు; పరిపక్వత; పరిపాకం; ప్రౌఢిమ; ప్రౌఢత్వం; +* mausoleum, n. మసోలీ; అద్భుతమైన గోరీ; సమాధి; +* maxim, n. సూక్తి; నీతివాక్యం; పన్నా; నిజం అని అందరూ ఒప్పుకున్న సూత్రం; see also paradox; +* maximum, n. అత్యధికం; గరిష్ఠం; పరమం; మహత్తమం; ఊర్ధ్వతమం; +* meadow, n. మైదానం; పచ్చిక బయలు; క్షేత్రం; బీడు; +* meager, n. చాలీచాలని; బహుకొద్దిగా; +* meal, n 1) భోజనం; బోనం; భుక్తి; కూడు; ప్రాశనం; ఒక నిర్ధిష్టమైన వేళకి తినే తిండి 2) పిండి; +* meaning, n. అర్థం; ఉద్దేశం; భావం; తెల్లం; +* meaningfulness, n. సార్థక్యం; అర్థవంతం; అర్థయుక్తం; +* meaningless, adj. అర్ధంలేని; అర్థరహిత; నిరర్థక; భావశూన్య; కదర్థ; +* means, n. సాధనం; తెరువు; మార్గం; వెరపు; +* measure, n 1) కొలత; మానం; ప్రమ; ప్రమాణం; ప్రస్థం; తన్మాత్ర 2) కొలబద్ధ; +* meat, n. మాంసం; పొలసు; పిసితం; పలం; +* mechanic, n. యంత్ర సూరి; యంత్రములని మరమ్మత్తు చేసే వ్యక్తి; +celestial mechanics, ph. ఖగోళ యంత్రగతి శాస్త్రం; ఖగోళ యంత్రశాస్త్రం; నక్షత్రాలు, గ్రహాలు, ఇతర ఖగోళ శాల్తీల కదలికలకి సంబంధించిన శాస్త్రం +classical mechanics, ph. సంప్రదాయక యంత్రగతి శాస్త్రం; సంప్రదాయక యంత్రశాస్త్రం; +orbital mechanics, ph కక్ష్యలని నిర్ణయించే యంత్రశాస్త్రం; +quantum mechanics, ph. గుళిక యంత్రశాస్త్రం; క్వాంటం యంత్రశాస్త్రం; +relativistic mechanics, ph. సాపేక్ష యంత్రగతి శాస్త్రం; సాపేక్ష యంత్రశాస్త్రం; కాంతి వేగం దరిదాపుల్లో ప్రయాణించే రేణువుల కదలికలకి సంబంధించిన శాస్త్రం +statistical mechanics, ph. సాంఖ్యక యంత్రశాస్త్రం; పదార్థాల సమూహ ఉష్ణగతి లక్షణాల గురించి వివరించే శాస్త్రం; +* medal, n. పతకం; బిరుదుబిళ్ళ; మెడలు; +yellow media, ph. పచ్చ మాధ్యమాలు; ప్రజలని ఉద్రేకపరచడానికి నిజంతో నిమిత్తం లేకుండా రంగురంగుల బొమ్మలతోటీ, పతాక శీర్షికలతోటీ వార్తలని ప్రసారం చెయ్యడం; +* median strip, ph. రహదారి యొక్క ఇరువైపుల బాటలకీ మధ్యనున్న జాగా; +* mediation, n. మాధ్యస్థం; మధ్యవర్తిత్వం; +* mediator, n. మధ్యవర్తి; మాధ్యస్థుడు; +* medical, adj. వైద్యసంబంధమైన; ఆరోగ్య సంబంధమైన; +* medicine, n 1 మెడ్సిన్) మందు; ఔషధం; ఆయుర్‌ద్రవ్యం 2)(మెడిసిన్) వైద్యశాస్త్రం; వైద్య విద్య; +* medicinal, adj. ఔషధీయ; రోగనాశక; మందులకు పనికివచ్చే; +* Medulla, n. దవ్వ; దూట; ఏ శరీరాంగానికి అయినా అంతర్భాగంలో ఉండే కట్టడం; +Medulla oblongata, ph. మజ్జా ముఖం; మెదడు వెనక ఉండి మన శ్వాసని నియంత్రించే ఒక కట్టడం; +* medulloblastoma, n. చిన్న పిల్లలకి మెదడులో వచ్చే ఒక రకమైన కేన్‌సరు కంతి; +* Megabits, n. మిలియను ద్వింకములు; కంప్యూటరు రంగంలో మాత్రం 1,048,576=220 ద్వింకములు; మెగా బిట్లు; +* Megrez, n. అత్రి నక్షత్రం; సప్తర్షి మండలం (Big Dipper) లో కాంటివిహీనమైన తార; +* melanosis, n శరీరపు రంగు నల్లగా మారటం; మెలనిన్ తయారీ ఓపం వల్ల వచ్చే లక్షణం; +* melodious, adj. శ్రావ్య; శ్రవణపేయ; కర్ణపేయ; సుశ్రావ్య; +* melon, n. కర్బూజా; పుచ్చపండు; తర్బూజా; +* melting point, ph. కరుగు స్థానం; ద్రవీభవన స్థానం; కరిగే ఉష్ణోగ్రత; +* member, n. సభ్యుడు; సభ్యురాలు; కూటరి; మెంబరు; +* membrane, n. పొర; త్వచం; త్వక్కు; పటలం; కుబుసం; జిలి; +* memento, n. జ్ఞాపిక; స్మృతి చిహ్నం; +* memorandum, n. నివేదిక; వినతిపత్రం; విన��నపం; మనవి; విజ్ఞాపన; యాదాస్తు; జ్ఞాపిక; స్మరణలేఖ్యం; గిల్లుపత్రం; దరఖాస్తు; తాఖీదు; మెమో; మెమొరాండం; +* memory, n 1) జ్ఞాపకం; జ్ఞాపకశక్తి; స్మృతి; ధారణ 2 comp కొట్టు; కోఠీ; గరిస; కంప్యూటరులో దత్తాంశాలని, ఆదేశాలని దాచే ప్రదేశం; +* memoirs మెమ్వార్స్) n. pl జీవితానుభవాలు; పూర్వస్మృతులు; +* men, n. పురుషులు; మగవారు note) man అన్నది ఉభయ లింగాలకీ వర్తిస్తుంది కాని, men అంటే మాత్రం పురుషులు అనే అర్థమే వస్తుంది; +* menarche, n. సమర్తాడడం; పెద్దమనిషి అవడం; రజస్వల అవడం; పుష్పవతి అవడం; +* menorrhagia, n. ఎరక్రుసుమ; రక్తప్రద; స్త్రీ రుతు కాలంలో అతిగా జరిగే రక్త స్రావం; +* mend, v. t. మరమ్మత్తు చేయు; బాగు చేయు; +* menopause, n. రజోనివృత్తి; ముట్లుడుగు కాలం; +* menstruation, n. రుతువు; రుతుకాలం; బయటుండడం; వాకిటుండడం; ముట్టవడం; +* mensuration, n. మాపన శాస్త్రం; మాపనం; కొలతలకి సంబంధించిన లెక్కలు; కొలత; భూమి కొలత; క్షేత్రమితి; +* mentality, n. మానసికతత్వం; మనస్తత్వం; మనోగతి; చిత్తవృత్తి; +* menthol, n. పుదీనా కర్పూరం; పుదీనా ఆకులలో నుండి తీసిన ఒక సుగంధ ద్రవ్యం; రసాయన శాపు దృష్ట్యా ఇది ఒక ఒలంతం (alcohol see also mint camphor; +* menu, n మెన్యూ 1) వడ్డనకి తయారైన వంటకాల జాబితా; వాటి ధరలు; మెన్యూ 2) ఎంపిక అంశాల పట్టిక; ఎంపిక జాబితా; +* mephitic, adj. దుర్గంధభరితమైన; దుర్వాసనతోకూడిన; కంపుకొట్టే; +* mercenary, n. కిరాయి సైనికుడు; కూలికి యుద్ధం చేసే వ్యక్తి; +* merchandise, n. సరుకులు; సామానులు; దినుసులు; వస్తువులు; సామగ్రి; సార్థములు; +* merchant, n. వణిజుడు; వ్యాపారస్తుడు; సార్ధవాహుడు; సెట్టి; సాహుకారు; +* Mercury, n 1) బుధుడు; బుధగ్రహం 2) పాదరసం; రసం; పారదం రసపతి; రసరాట్టు; తడివెండి; ఒక రసాయన మూలకం అణుసంఖ్య 80, సంక్షిప్తనామం Hg Lat. hydrargyrum liquid silver]; +* merger, n. కలిసిపోవుట; ఐక్యమగుట; లయమగుట; లీనీకరణ; +* meridian, n 1) మధ్యాహ్న రేఖ; యామ్యోత్తర రేఖ 2) ధ్రువవృత్తం; మయామ్యోత్తర రేఖ; ఖగోళంలో ఉత్తరం నుండి దక్షిణానికి ప్రేక్షకుని శిరస్సు మీదుగా వెళ్లే ఊహా వృత్తం; +* merits, n. యోగ్యతలు; సలక్షణాలు; +* mesa, n. నెత్తం; పీఠభూమి సానువు; కొండ మీద చదునైన ప్రదేశం; +* mesmerism, n. మెస్మరీయం మెస్మరిజం ఒక వ్యక్తికి ఒక విధమైన మైకం కల్పించి ఆ వ్యక్తిచేత చెప్పిన విధంగా ప్రవర్తింపజేసే పద్ధతి; +* mesoblast, n. మధ్యాస్తరం; అంతశ్చర్మానికి, బహిశ్చర్మానికి మధ్యనున్న పొర; mesoderm; +* mesosphere, n. మధ్యావరణం; ఆస్తరావరణము పైన 85కి మీ వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇదే భూ వాతావరణంలోో చల్లని పొర. ఇక్కడే వా��ావరణంలో ప్రవేశించిన ఉల్కలు కాలి మండిపోయేది; +* mess, n 1) భోజనశాల; పాకశాల; మెస్సు 2) చాలా చిందరవందరగా ఉన్న స్థితి; +* message, n. సందేశం; వర్తమానం; వార్త; వేగు; మాట; దూతిక; దూతం; కబురు; సమాచారం కచేలం; +* messenger, n. వార్తాహరుడు; దూత; వార్తికుడు; చారుడు; pl. హర్కారాలు అనగా వార్తాహరులు; +* meta, pref 1) మధ్య; తో; ఆవలి; సంబంధించిన; అసలుది కానిది 2) లోకోత్తర; బీజాతీత; అధిభౌతిక; ఉన్నత; +meta data, ph డేటా" కి సంబంధించిన సమాచారం; ఉదా. సినిమా ని "డేటా" గా ఊహించుకుంటే ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు "మెటా డేటా" అవుతుంది; +metaverse, ph. అసలది కాని విశ్వం; ఊహాత్మక విశ్వం; +* metabolism, n. పాచకం; జీవనప్రక్రియ; చయాపచయం; +* metacarpals, n. కరభాస్థికలు; పాణి శలాకలు; అరచేతిలోని ఎముకలు; +metacarpal bones, ph. పాణిశలాకలు; కరభాస్థికలు; అరచేతిలోని ఎముకలు; +metatarsal bones, ph. ప్రపాదాస్థికలు; పాద శలాకలు; పాదము లోని ఎముకలు; +* metastasis, n. శరీరంలో వ్యాధి ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణం చేయుట; ముఖ్యంగా కేన్సరు వ్యాధి యెడల ఈ పదం ఉపయోగిస్తారు +base metal, ph. హీన ధాతువు; పరుష లోహం; ఇనుము, రాగి, సీసము, మొ.; +* metamorphosis, n. మార్పు; పరిపూర్ణమైన మార్పు; రూపవిక్రియ; రూపపరిణామం; +* metaphor, n. రూపకాలంకారం; అధ్యారోపం; +* metathesis, n ling వర్ణవ్యత్యయం; శబ్ద ఉచ్చారణలో అక్షరాల వరస మారుగుళ్లు అవడం; ఉదా: ఇంగ్లీషులో రెండు హల్లులని వరస తప్పించి ఉచ్చరించడం (ask ని aks అని ఉచ్చరించడం +* meteor, n. ఉల్క; వాతావరణం లోనికి ప్రవేశించిన తల తెగిన తోకచుక్క; అంతరిక్షం నుండి వాతావరణం గుండా కిందకి పడే ఒక ఘన పదార్థం; +* meteorite, n. ఉల్కాశిల; భూపతనమైన ఉల్క; కింద పడ్డ ఉల్క; +* meteoroid, n. తల తెగిన తోకచుక్క; శిధిలమైన తోకచుక్క; సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూన్న రాయి వంటి ఘనపదార్థం; సౌర కుటుంబంలో ఇటువంటివి చాలా ఉన్నాయి; ఇవి భూమి వాతావరణంలో ప్రవేశించి భూపతనమైతే అప్పుడు వాటిని ఉల్కలు అంటారు; +* meter, metre [Br n 1) మీటరు; మాపకం; కొలమానం; మితి 2) పద్యపాదంలో ఉన్న గణాల సమాఖ్య; +barometer, n. భారమితి; వాతావరణంలోని గాలి బరువుని కొలిచేది; +thermometer, n. ఉష్ణమితి; ఉష్ణంపుల్ల; వేడిని కొలిచేది; థర్మామీటరు; +* methanoic acid, n. పాడోయిక్ ఆమ్లం; పిపీలికామ్లం; ఫార్మిక్ ఆమ్లం; HCOOH; +* method, n. పద్ధతి; మార్గం; విధి; విధానం; +* methyl alcohol, n. కాష్టోల్; పాడోల్; కర్రసారా; మెతనోలు; మెతల్ ఆల్కహాలు; +* metonymy, n. ఇంగ్లీషు భాషలో ఒక అలంకారం; ఒక మాటకి బదులు దానికి దగ్గర సంబంధం ఉన్న మరొక మాటని వాడడం; ఉ. సనాతన ధర్మం నశించి పోతోందని శృంగేరీ మఠం ఆక్రోశించింది అన్నప్పుడు శృంగేరీ మఠాధిపతి సంతాపం వెలిబుచ్చేరని అర్థం చెప్పుకోవాలి; +* metre, n. మీటరు note) మెట్రిక్ పద్ధతిలో ఈ వర్ణక్రమాన్నే వాడాలి; +* metric system, n. మెట్రిక్ పద్ధతి; శతాంశ పద్ధతులని ఉపయోగించి, బరువులని, దూరాలని కొలవడం; +* metropolis, n. మహానగరం; ప్రధాన నగరం; కస్బా; ముఖ్య పట్టణం; +* miasma, n. దోషం; మౌలిక దోషం; రోగకారణం; హోమియోపతీ శాస్త్రం ప్రకారం, శరీరంలో ఒక మౌలికమైన దోషం ఉన్నప్పుడు శరీరం రోగగ్రస్త మవుతుంది; +* mica, n. అభ్రకం; గిరిజం; కాకిబంగారం; గనులలో దొరికే ఒక రకం అల్లూమినో సిలికేటు అనే ఖనిజం; +* microgravity, n. సూక్ష్మ గురుత్వం; ఒక కక్ష్యలో తిరుగుతున్న నభోనౌకలో అనుభవానికి వచ్చేఅతి కొద్ది గురుత్వ బలం; +* micrometer, n. మీటరులో మిలియనో వంతు పొడుగు; మైక్రాను; +* micron, n. మీటరులో మిలియనో వంతు పొడుగు; మైక్రోమీటరు; +* microorganism, n. సూక్ష్మజీవి; మైక్రోబు; బేక్టీరియాలు, వైరసులు, రికెట్సియాలు, స్పైరోకీట్లు, ప్రోటోజోవాలు సూక్ష్మజీవులకి ఉదాహరణలు; +* microprocessor, n. సూక్ష్మసంకలిని; మైక్రోప్రాసెసర్; వేలి గోరు ప్రమాణంలో ఉన్న అర్ధవాహిని చితుకు మీద నిర్మించిన కలన యంత్రం; +* microscope, n. సూక్ష్మదర్శిని; కంటికి కనబడనంత చిన్నగా ఉన్న వస్తువులని చూడడానికి వాడే పరికరం; +* midnight, n. అర్ధరాత్రి; నడురేయి; నడిరేయి; +* migrain, n. అనంతావర్తం; పార్శ్వపు నొప్పి; ఒక రకమైన విపరీతమైన తలనొప్పి; ఉదయం మొదలై రోజంతా ఉంటుంది. వెలుగు, ధ్వనులు నొప్పిని అధికం చెయ్యొచ్చు. ఒక్కోసారి నొప్పి రావడానికి ముందు వాంతిరావడం, కడుపులో తిప్పినట్లుంటుంది. +* migrant, n. ప్రవాసి; వలస పోయిన వ్యక్తి; +* mil, n. సహస్రాంశము; వెయ్యవ భాగం; +* mildew, n. బూడిద తెగులు; మజ్జిగ తెగులు; +* mile, n. మైలు note) 8 కిలోమీటర్లు 5 మైళ్లకి సమానం; దూరాన్ని కొలిచే ఒక కొలమానం; +* milieu, n. సంగతి, సందర్భం; సామాజిక వాతావరణం; +* milk, n. పాలు; క్షీరం; దుగ్ధం; పయస్సు; +homogenized milk, ph. పాలని అతి సన్నటి బెజ్జాలు ఉన్న జల్లెడ గుండా ఎక్కువ పీడనంతో పోనిచ్చి, వెన్నని అతి సూక్ష్మ కణాలుగా విభజించి, పాలు, వెన్న విడిపోకుండా చేసే పధ్ధతి; +Pastuerized milk, ph. పాలని వేడి చేసి పాలల్లోని సూక్ష్మజీవులని చంపగా మిగిలిన ఆరోగ్యకరమైన పాలు; +milk products, ph. పయస్యములు; పాలనుండి వచ్చే పదార్థాలు; పెరుగు, వెన్న, నెయ్యి, చీజు, వగైరాలు; +* milkshake పాలసుగంధి; పాలల్లో ఐస్‌క్రీమ్ కలిపి రంగరించగా వచ్చినది; +* Milky Way, n. పాలపుంత; పాలవెల్లి; పాలకడలి; ఆకాశ గంగ; సోమధార; దివిజ గంగ; మన క్షీరసాగరం (గేలక్సీ) పేరు; +* mill, n. మర; గానుగ; తిరుగలి; మిల్లు; +* mill, v. t మరపట్టు; ఆడించు; మరపట్టించు; ఆడు; ఆడించు; +* millennium, n. సహస్రాబ్దం; వెయ్యి సంవత్సరముల కాలం; +* millipede, n. రోకలిబండ; గాజుపురుగు; సహస్ర పాది; ఎన్నో కాళ్లుగల ఒక క్రిమి lit వెయ్యి పాదములు కలది; నిజానికి సహస్రపాదికి 200-400 కాళ్లే ఉంటాయి; ప్రతి శరీర ఖండానికి (body segment) రెండు జతల కాళ్ళు ఉండటం వీటి లక్షణం; +* millstone, n. తిరగలి; తిరుగలి; తిరుగలి రాయి; +* mimicry, n. పరిహాసానుకరణ; స్వరవంచన; ధ్వన్యనుకరణ; +* mince, v. t. పొట్టుచేయు; చిన్న ముక్కలుగా తరుగు; +* mind, n. మనస్సు; మది; అంతఃకరణం; అంతరంగం; ఉల్లము; డెందము; ఎద; ఎడద; చేతనం; చేతస్సు; చిత్తము; భౌతికమైన మెదడులో, కంటికి కనపడని విధంగా భౌతికమైన ఉనికి లేని మనస్సు ఉంటుందనే భావం ఒకటి ఉంది; ఈ మెదడుకి, మనస్సుకీ మధ్య ఉండే లంకెనే ఆత్మ అంటారని తాత్వికుడు రెనే డెకార్ట్ అంటారు; ఇంగ్లీషులో mind అనే మాటలో వేదాంతం నాలుగు స్థాయిలను గుర్తిస్తుంది 1) మనస్సు ఆలోచనలకు మూలం 2) బుద్ధి అంటే వివేకము. అనగా, ఈ ఆలోచన మంచిది, ఆ వాక్యము సత్యము అనుకునే తెలివితేటలు 3) చిత్తము. ఇంగ్లీషు అనువాదం consciousness. Krishna consciousness అంటే చిత్తములో కృష్ణునికి తప్ప ఎవరికీ స్థానం ఉండకపోవడం. అందుకే ఆయన చిత్తచోరుడు 4) అహంకారము. అహం అంటే నేను. మమ అంటే నాది. నేను చాలాగొప్పవాణ్ణి అనుకోవడం అహంకారం. అన్నీ నావి అనుకోవడం మమకారము. +* minimize, v. t. అత్యల్పించు; కనిష్ఠీకరించు; +* minimum, n. అత్యల్పం; కనిష్ఠం; కనీసం; అధమం; +* minister, n 1) మంత్రి; అమాత్యుడు; సచివుడు 2) క్రైస్తవ మత గురువు; చర్చిలో ఒక మతాధికారి; +* ministry, n 1) మంత్రివర్గం; అమాత్య కూటమి 2) మంత్రిత్వం; +* minor, n. చిరుత; అయుక్తుడు; బాలుడు; బాలిక; 18 సంవత్సరముల వయస్సు నిండని వ్యక్తి; మైనరు; +* minorities, n. బడుగు వర్గాలు; అల్పసంఖ్యాక వర్గాలు; +* minority, n 1) చిరుత ప్రాయం; బాల్యదశ; లేబ్రాయము; అయుక్తవయస్సు; కౌమారత్వం 2) అల్పసంఖ్యాక వర్గం; +* minuend, n. వియోజ్యం; శోధనీయము 4 నుండి 3 ని తీసివేసినప్పుడు, 4 వియోజ్యం; 3 వ్యవకలితం; see also subtrahend; +* minute, adj మైన్యూట్) స్వల్పమైన; అతిచిన్నదైన; సూక్ష్మమైన; అణు; +* minute, n మైన్యూట్) స్వల్పం; అల్పం; అల్పిష్ఠం; ఆణకం; అణుప్రమాణం rel tiny; subtle; +* minute, n మినిట్ 1) నిమిషము; గంటలో అరవైయ్యవ వంతు; లిప్త; కల 2) డిగ్రీలో అరవైయ్యవ వంతు; +* minutes, n. pl మినిట్స్) సభలలో జరిగే వ్యవహార సంగ్రహం; +* miracle, n. మహాత్మ్యం; మహాద్భుతం; +* mirage, n. ఎండమావి; మృగతృష్ణ; మరీచిక; మంచి ఎండలో కళ్ళకు దూరంలో నీళ్ళు ఉన్నట్టు గోచరించడాన్ని ఎండమావులు అ���టారు. ఎడారుల్లో ఈ స్థితి ఏర్పడుతుంది. తృష్ణ అంటే దప్పిక. మృగతృష్ణ అంటే జంతువులకు దప్పిక కలిగించేది; +* mire, n. రొంపి; ఊబి; బురదనేల; రొచ్చు; అడుసు; పంకం; పంకిలం; జంబాలం; ఉబ్బలి; +* mirror, n. అద్దం; దర్పణం; కర్కరం; ఆదర్శనం; ముకురం; +* miscarriage, n 1) గర్భస్రావం; గర్భపాతం; అకాల ప్రసవం; కట్టుక 2) అక్రమరీతి; అక్రమ వైఖరి; అన్యాయం; భంగపాటు; వ్యాఘాతం; విఘాతం; +* miscellaneous, adj. వివిధ; చిల్లర మల్లర; చిల్లర; నానా; నానావిధ; +* miscellaneous, n. అమాంబాపతులు; చిల్లర మల్లర; చిల్లర; మ్రుక్కడి; +* mischief, n. పెంకితనం; అల్లరి; దుండగం; ఆగడం; రాలుగాయితనం; ఆకతాయితనం; తుంటరితనం; +mischief maker, ph. పెంకి పిల్ల; అల్లరి పిల్ల; పెంకివాడు; అల్లరివాడు; దుండగీడు; +* mischievousness, n. పెంకితనం; రాలుగాయితనం; ఆకతాయితనం; తుంటరితనం; దుడుకుతనం; +* misconception, n. అపోహ; భ్రమ, తప్పుభావము; అపార్థము; దురూహ; +* misdeed, n. పొరపాటు; చెడ్డపని; దుష్కృత్యం; కాకృత్యం; +* misdemeanor, n. కపటచేష్ట; చెడ్డపని; కీలు; అకృత్యం; దుష్‌కృతం; దుష్‌ప్రవర్తన; దురాకృతం; దుశ్చేష్ట; వికర్మ; ఉన్మార్గం; చెడు దారి; చట్టవిరుద్ధమైన పని; +* miser, n. లోభి; పిసినిగొట్టు; పిసినారి; పీనాసి; కింపచానుఁడు; అడియరి; టక్కుఁడు; +* miserliness, n. లోభం; లోభత్వం; కాపీనం; పిసినారితనం; పిసినిగొట్టుతనం; +* mishap, n. దుర్ఘటన; విపత్తు; అశ్రి; +* misinterpretation, n. వక్రీకరణం; తప్పు అర్థం చెప్పడం; దురర్థం చెప్పడం; +* mislead, v. t. తప్పుదారిలో పెట్టు; మభ్యపరచు; +* misnomer, n. దుర్నామం; లక్షణాలకి సరిపడని పేరు; +* misogynist, n. ఆడవారంటే చులకన భావం కల వ్యక్తి; పురుషాహంకారి; ఆడ జాతి యెడల వివక్ష చూపే వ్యక్తి; +* misprint, n. అచ్చుతప్పు; ముద్రారాక్షసం; +* misrepresentation, n. మభ్యపరచుట; అసత్యకథనం; తప్పుగా వర్ణించడం; +* missionaries, n. మతబోధకులు; మతప్రచారకులు; మిషనరీలు; +* mist, n. కుహేళి; తుషారం; సూక్ష్మమైన బిందువులు గాలిలో తేలియాడిన పరిస్థితి; +* mistletoe, n. బదనిక; పరభుక్కి అయిన ఒక జాతి మొక్క; +* mistress, n. ఉపపత్ని; ఉంపుడుకత్తె; దయిత; ధర్మకార్యాలకు పీటల మీద భర్త ప్రక్కన కూర్చునే అర్హత గల వాళ్లనే ధర్మపత్నులంటారు. +* mix, v. t. కలుపు; రంగరించు; కలబోయు; మిళాయించు; మేళవించు; +* mix, n. మాదక ద్రవ్యాలలో కలిపే పళ్లరసం వంటి పానీయం; +* mixed, adj. కలగలసిన; కలగలుపు; కదంబ; మిళిత; చంపూ; +* mixture, n. మిశ్రమం; కలగలుపు; కరంబం; కదంబకం; మిళితం; +* mix-up, n. తారుమారు; గందరగోళం; తికమక; +* mnemonics, n. pl. స్పోరకములు; జ్ఞాపకార్థం ఉంచుకొనే గుర్తులు; +* moan, n. మూలుగు; నిట్టూర్పు; +* moat, n. కందకం; ఆగడ్త; పరిఖ; దవంత్రి; +* mob, n. మూక; దండు; తొంబ; మూ��ప్రజ; గుంపు, అల్లరిమూక; క్రమశిక్షణ పాటించని జన సమూహం; +* mobile, adj. చర; చలన; చంచత్; జంగమ; జంగమాత్మక; చరిష్ణు; గమనశీల; కదలాడునట్టి; +* mobility, n. చలనశీలత; చంచలత; జంగమత్వం; కదలే గుణం; గమనశీలత; +* mock, v. t 1) పరిహసించు; ఎకసక్కేలాడు; ఎగతాళి చెయ్యు; ఎద్దేవాచేయు 2) అనుకరించు +mock parliament, ph. శాసన సభని అనుకరిస్తూ విద్యార్థులు తరగతిలో చేసే ప్రయోగం; +mock trial, ph. న్యాయస్థానంలోని విచారణని అనుకరిస్తూ విద్యార్థులు తరగతిలో చేసే ప్రయోగం; +mock theta function, ph శ్రీనివాస రామానుజన్ కనిపెట్టిన కొత్త రకం ప్రమేయం +* model, n 1) నమూనా; మాదిరి; మచ్చు; మూదల; ప్రతిరూపం; మోస్తరు 2) మేలుబంతి; ఒరవడి; +* modern, adj. అధునాతన; ఆధునిక; నూతన; నవీన; నవయుగ; అభినవ; నాజూకైన; కొత్త; ఇందీవలి; +* modernization, n. నవీకరణ అధునీకరణం; ఆధునికీకరణ; ఇందీవలింపు; +modest person, ph. వినీతుడు; సొంత డబ్బా కొట్టుకోని మనిషి; +* mogul, n. వ్యాపార రంగాన్ని ఎక్కువగా ప్రభావితం చెయ్యగల వ్యాపారస్తుడు see also tycoon; +* moist, adj. తేమగల; చెమ్మగిల్లిన; తడిసిన; క్లిన్న; +* moisten, v. t. తడుపు; తడిపి పెట్టు; పదును పెట్టు; +* molar, adj 1) బుగ్గకి సంబంధించిన 2) రసాయనశాస్త్రంలో మోల్ అనే కొలమానానికి సంబంధించిన; +* molars, n. దంతములు; చర్వణకములు; బుగ్గవైపు పళ్లు; +* mold Br mould, n 1) బూజు; బూడిద తెగులు; చెమ్మగానున్న ఆహారపదార్థాలపై మొలిచే బూజు; ఒక రకం శిలీంధ్రం 2) అచ్చు; మూస; +* mole, n 1) పుట్టుమచ్చ 2) భూమిలో బొరియ చేసికొని బతికే ఒక ఎలుక జాతి చిన్న జంతువు 3) మన మధ్యలో చేరిన శత్రుపక్షం వారి గూఢచారి 4) ఒక బణువులో పదార్థం ఎంతుందో చెప్పే ఒక కొలమానం; +* molecule, n. బణువు ety బహుళంగా, అంటే మెండుగా, ఉన్న అణు సముదాయం; +* molt, n. పాము కుబుసం; పాము పొర; నిర్మోకం; +* molten, adj. కరిగించిన; కరగబెట్టిన; +* momentum, n 1 Phy భారగతి exp భారం అంటే weight గతి అంటే motion అనీ అనుకోవాలి రయజాతం exp రయం అంటే velocity కనుక రయం నుండి పుట్టినది రయజాతం; ద్రవ్యవేగం exp ద్రవ్యం అంటే mass, వేగం అంటే velocity అనీ అనుకుంటే దీని అర్థం అవగతం అవుతుంది; momentum mv mass x velocity 2) ఊపు; ఉద్వేగం; ఆవేగం; +orbital angular momentum, ph. గతి కోణీయ ఉద్వేగం; ప్రదక్షణం చెయ్యడం వల్ల కలిగే కోణీయ ఉద్వేగం; +spin angular momentum, ph. భ్రమణ కోణీయ ఉద్వేగం; ఆత్మభ్రమణం వల్ల కలిగే కోణీయ ఉద్వేగం; +* monarch, n. m. ఏకరాజు; సార్వభౌముడు; చక్రవర్తి; +* monastery, n. విహారం; సాధువులు, భిక్కులు, మొదలైన మత నిష్ఠాపరులు నివసించే చోటు; +* monetary, adj. ద్రవ్యసంబంధ; డబ్బు సరఫరా, ప్రసరణలకి సంబంధించిన rel fiscal; +* money, n. డబ్బు; ధనం; ద్రవ్యం; సొమ్ము; అర్థం; పైకం; రొక్కం; విత్తం; దుడ్డ���; +black money ph. నల్ల ధనం; అక్రమంగా ఆర్జించిన డబ్బు; +coin money, ph. నగదు; నాణేల రూపంలో ఉన్న డబ్బు; +hush money, ph. నోరు మూసుకుని ఉన్నందుకు ఇచ్చే లంచం; +money laundering ph. అక్రమ ఆర్జనలపై పన్నులు కట్టకుండా తప్పించుకోడానికి నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చే పద్ధతి; +* mongrel, n. కంచరం; వేరు వేరు జంతువులకి పుట్టినది; +* monism, n. అద్వైతవాదం; ఏకేశ్వరవాదం; ఏకసత్తావాదం; +* monitor, n. పరివీక్షకి; పరివీక్షకుడు; +* monkey, n. కోతి; మర్కటం; వానరం; తిమ్మడు; తిమ్మి; మల్లు; +* monogram, n. ఏకరాత; గొలుసుకట్టు రాత; కలం పైకి ఎత్తకుండా పేరు రాయడం; పేరులోని పొడి అక్షరాలని ఈవిధంగా రాయడం; +* monograph, n. ఒకే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ రాసిన గ్రంథం; +* monopolist, n. గుత్తదారు; గుత్తాధిపతి; ఏకాధికారి; మస్తాౙరు; ఒక సరకును తాను మాత్రమే అమ్ముటకు అవకాశము పొందినవాఁడు; +* monotheism, n. ఏకేశ్వరోపాసన; ఏకేశ్వరవాదం; ఒకడే దేవుడు ఉన్నాడు అనే నమ్మకం; +* monotonous, adj. ఏకస్వన; ఏకరూప; ఒకే విధంగా ఉండడం వల్ల విసుగు పుట్టించెడు; +* monotype, n. అక్షరాల కూర్పు; పాత రోజులలో అచ్చు వేసే పద్ధతి rel linotype; +* monsoon, n 1) వర్షాకాలం; వర్షరుతువు 2 రుతుపవనాలు; +per month, ph. నెలకి; నెలసరి; నెల ఒక్కంటికి; మాసానికి; +* monthly, adj. నెలవారీ; నెలసరి; నెల ఒక్కంటికి; +* monument, n. స్మారకం; స్మారక భవంతి; స్మారక కట్టడం; +* mood, n. మనస్సు; మనస్థితి; మనోభావం; మనోదశ; మానసికావస్థ; భావావేశం; +* moody, adj. ముసురు మూతితో ఉండు; మూతి ముడుచుకుని ఉండు; +* moon, n. చంద్రుడు; నెల; నెలరాజు; రేరాజు; జాబిల్లి; శశి; ఇందు; ఉడుపతి; కడలి మీగడముద్ద; కడలి వెన్న; +crescent moon, చంద్రవంక; నెలవంక; శశిరేఖ; బాలచంద్రుడు; +full moon, ph. పూర్ణచంద్రుడు; రాకాచంద్రుడు; నిండు చంద్రుడు; +* moonlight, n. వెన్నెల; నెలవెలుగు; రేయెండ; చంద్రరశ్మి; చంద్రకాంతి; చంద్రిక; చందిరిక; చంద్రగోళి; చంద్రద్యుతి; చంద్రబాల; చంద్రశాల; చంద్రాతపము; చంద్రాలోకము; చాంద్రి; చార్వి; సుధాకర భాతి; కౌముది; అకల్క; అమృతతరంగిణి; ఐందవాతపము; కామవల్లభ; కైరవి; జ్యోత్స్న; జ్యోత్స్నిక మాలతి; శాతపత్రకము; శాతపత్రకి; హేల; +* moonshine, n. పరిపక్వం చెందని విష్కీ జాతి మాదక ద్రవ్యాలు +* mop, n. అలుగ్గుడ్డ; అలుకుజుట్ట; +* moral, n. నీతి; కథయొక్క ముఖ్య ఉద్దేశం; +* morbid, adj 1 అనారోగ్యాన్ని సూచించే; రోగాన్ని సూచించే; రోగసూచక 2) మరణసూచక; +* morbidity, n. అనారోగ్యం; రోగగ్రస్తం; అనారోగ్యానికి కారణం; +* more, adj. మరిన్ని; మరికొంచెం; ఇంకా; హెచ్చుగా; +more or less ph. ఇంచుమించుగా; దాదాపు; ఉరమరగా; దరిదాపుగా; +* morning, n. ఉదయం; ప్రొద్దు; ప్రభాతం; వర��వాత; వేఁకువ; ప్రాతఃకాలం; దివాది; +early morning, ph వేఁకువ; ప్రభాతం; తెల్లవారుజాము; +* moron, n. మొద్దు; మొద్దావతారం; పశుప్రాయుడు; +* morphemes, n. pl ling పదాంశాలు; ఒక్క మాటలో అర్థవంతమైన కనిష్ఠాంశాలు; ఉ. చురుకుతనం అనే మాటలో "చురుకు తనం" అనే రెండు పదాంశాలు ఉన్నాయి; +bound morpheme, ph. నిబద్ధ రూపం; విసంధి లేని మాటలు; ఉదా. ఇంగ్లీషులో inept ని in, ept అని విడదీసి అర్థాలు చెప్పలేము; తెలుగులో చెలులు అన్న మాటని చెలు, లు అని విడదీయలేము; +* morphine, n. అభిని; నొప్పిని తగ్గించే ఒక బలమైన మందు; +* morphology, n. రూపనిర్మాణ శాస్త్రం; రూపనిర్మాణం; స్వరూప శాస్త్రం; +* mortal, adj. మరణించేది; మరణం కలిగించేది; +* mortality, adj. మరణించేది; చావు; మృత్యువు; మర్త్యత్వం; +* mortar, n 1) పొత్రం; ఱోలు; గార; కల్వం 2) బెందడి; సున్నం; చెక్కసున్నం; సిమెంటు; ఱాతి సున్నం; గార; +mortgage loan, ph. ఆయకం; గృహార్ణ; ఇల్లు కొనడానికి చేసే అప్పు; +* mortician, n. శవసంరక్షకుడు; కాటికాపరి; +* mortise, n కుసి బెజ్జం; వడ్రంగంలో రెండు కర్రలని అతకడానికి ఒక కర్రలో పెట్టే బెజ్జం; రెండవ కర్రకి ఉండే ముక్కుని కుసి అంటారు; +* mote, n. నలుసు; త్రసరేణువు; చూరు చోంచి వచ్చే కిరణవారంలో తేలియాడుతూ కనిపించే దుమ్ము రేణువు; +* motel, n మొటేల్) కార్లలో ప్రయాణం చేసే ప్రయాణీకుల సౌకర్యం కొరకు కట్టిన హొటేల్; motor hotel; +* moth, n. చిమ్మెట; చిల్లక; శలభం; వడ్లచిలుక; బట్టలను తినే పురుగు; ఇవి రాత్రించరులు; Lepidoptera జాతికి చెందిన పరుపు రెక్కల పురుగు; see also butterfly; +hawk moths, ph. ఆరు అంగుళాల వరకు పరిమాణం కలిగి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎగురగలవు. పూదేనియ కోసం మూగే హమ్మింగ్ బర్డ్స్ (Hummingbirds) లాగే ఈ హాక్ మాత్స్ కూడా తరచుగా పూలచెట్ల వద్దనే కనిపిస్తాయి; +vampire moth, ph. మరో రకం వడ్లచిలుకలు తమ ముల్లువంటి పదునైన తొండాన్ని మనుషులు, పశువుల చర్మం మీద గుచ్చి రక్తం తాగుతాయి. ఈ రక్తపిపాసి మాత్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి; +mother board, ph. మాతృ ఫలకం; కంప్యూటర్ లోపల ఉండే ప్రాథమిక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ మదర్‌బోర్డులు చిప్స్, మెమరీ స్లాట్‌లు, ఫర్మ్‌వేర్ చిప్స్ మరియు పవర్ కనెక్టర్ కోసం సాకెట్‌లను కలిగి ఉంటాయి. +* mother, n. అమ్మ; అంబ; తల్లి; మాత; జనని; జనయిత్రి; ధాత్రి; తాయి; +* mother-of-pearl, n. ముత్యపు చిప్ప; ఆలిచిప్ప; ముత్యపు చిప్పలో ఉండే పొర; +* motif, n. పదే పదే ప్రత్యక్షమయే ప్రసక్తి; కళాత్మక రచనలో ప్రధాన ఆంశం; +* motion, n 1) గతి; చలనం; గమనం; కదలిక; చారణం; చోపనం 2) విరేచనం 3) అర్జీ దాఖలు చేయుట; ప్రతిపాదన; +retrograde motion, ph. వక్రగతి; పశ్చగమనం; గ్రహచ���ష్ట; గ్రహం వెనక్కి నడచినట్లు కనబడడం; +* motivate, v. i అభిముఖీకరించు; అంగీకరించునట్లు చేయు; ప్రేరేపించు; +* motivation, n. ప్రచోదనం; ప్రేరణ; ప్రేరణకారణం; +* motive, n. ప్రేరణ; ప్రేరణకారణం; ఉద్దేశము; నిమిత్తము; +motor strip, ph. చలనచార; మెదడులో ఈ చెవి వద్దనుండి ఆ చెవి వరకు ఉన్న మేర; +* mount, n. వాహనం; తత్తడి; సవారీ చెయ్యడానికి అనువైన సాధనం; +* mouse, n. చుంచు; చుంచెలుక; చిట్టెలుక; అంజలిక; గిరిక; ఆఖువు; +* move, v. i 1) జరుగు 2) కదులు; మెదులు; అదురు; చలించు 3) తిరుగు; మసలు; చెరలాడు; త్రిమ్మరు; క్రుమ్మరు; +* move, v. t. జరపు; కదపు; మెదపు; తరలించు; నప్పు; +* movement, n 1) చలనం; కదలిక ఇసిరింత; ధూపనం; గతి; గమనం 2) ఉద్యమం 3) ఆందోళన; +* mrigal, n. ఎర్రమీసు; ఎరమీను; ఒక రకం చేప; +* mucus, n. అమత్వక్కు నుండి స్రవించే ద్రవం; ఇది శ్లేష్మం, కఫం, కళ్లె, చీమిడి, ఏదయినా కావచ్చు; see also phlegm; +* mud, n. బురద; బెందడి; పంకము; అడుసు; ఉబ్బలి; +* mug, n. పాన పాత్ర; చేతితో పట్టుకోడానికి చెవి ఉన్న పాత్ర; ఒక రకం కప్పు; +* muggy, adj. ఉక్కగా ఉన్న; ఉమ్మదముగా ఉన్న; వాతావరణంలో వేడి, చెమ్మదనం ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉండే అనుభూతి; +* mujahideen, n ముజహిదీన్) విశ్వాసులు అవిశ్వాసులపై జరిపే మత యుద్ధాన్ని అరబ్బీ భాషలో 'జిహాద్ అంటారు. ఈ యుద్ధంలో పాల్గొనే యోధుడిని 'ముజాహిద్' అంటారు; బహువచనంలో ముజహిదీన్; +* mule, n. కంచర గాడిద; వేసడం; వేష్ట్రం; +* multiplexer, n. బహుముఖి; ఒక వాకేతాన్ని అనేక దిశలలో పంపిణీ చేసే యంత్ర సాధనం; +* mummy, n. చిరకాలం శిధిలమైపోకుండా ఉన్న శవం; +* mumps, n. గవదలు; గాలిబిళ్లలు; పాషాణగర్ధభం; చెవుల వెనక ఉన్న గ్రంథులు వాచడం; ఒక వైరస్‍ వల్ల వచ్చే జబ్బు; +* mundane, adj 1) ప్రాపంచిక; లౌకిక; ఇహలోక సంబంధమైన 2) నిరుత్తేజమైన; ఉత్సాహం లేని; బోరు కొట్టే; +* murals, n. భిత్తి చిత్రాలు; గోడ మీద చిత్రించబడే చిత్రాలు; +* murmur, n. మురముర; గుసగుస; ముర్మర ధ్వని; గొణుగుడు; +* museum, n. సంగ్రహాలయం; చిత్రవస్తు ప్రదర్శనశాల; +* mushroom, n. పుట్టగొడుగు; పుట్టకొక్కు; అహిచ్ఛత్రం; కవకం; క్యాకువు; ఒక రకమైన శిలీంధ్రం see also toadstool +* music, n 1) సంగీతం; గీత వాద్య సమ్మేళనం 2) స్వరకల్పన; +Carnatic music, ph lit చెవికి ఇంపైన సంగీతం; దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంగీతపు బాణీ: +orchestra music, ph. బహువాద్య సమ్మేళన సంగీతం; బహువాద్య సమ్మేళనం; +musical notes, ph. స్వరములు; భారతీయ సంగీతంలో స, రి, గ, మ, ప, ద, ని అనే 7 స్వరములు వాడతారు. పాశ్చాత్య సంగీతంలో అదే వ్యవధిలో 12 స్వరములు వాడతారు; స, రి, రి, గ, గ, మ, ప, ప, ద, ద, ని, ని అని వాడతారు; +* musician, n. పాటకుడు; గాయకుడు, గాయని, సంగీత వేత���త/శాస్త్రజ్ఞుడు; భాగవతార్; +* musk, n. కస్తూరి; మృగనాభి; కురంగనాభం; ఇఱ్ఱి గోరజం; హరిణమదం; ఒక జాతి లేడి పొట్ట దగ్గర ఉండే తిత్తులలో దొరికే ఎరుపు రంగు బంక లాంటి పదార్థం; దీన్ని సుగంధ అత్తరుల తయారీలో వాడతారు; +* musk deer, n. కస్తూరి మృగం; కుచ్చుల మెకం; కస్తూరి కురంగం; ఇఱ్ఱి; +* muster, n. పనివాళ్ల పేర్ల జాబితా; +* musty, adj. గవులు కంపు; ముక్క వాసన; గుహల వాసన; +* mutation, n. ఉత్పరివర్తన; యాధృచ్ఛిక పరివర్తన; మార్పు; +* mutton, n. మేకమాంసం; గొర్రె మాంసం; +* mutual, adj. పరస్పర; పారస్పర్య; అన్యోన్య; ఉభయ; +mutual agreement, ph. పరస్పర అంగీకారం; ఒకరితో మరొకరు అంగీకరించడం; +* muzzle, n 1) ముట్టె; పశువుల మూతి భాగం 2) తుపాకి; ఫిరంగి మొదలైన ఆయుధాల మూతి; +* myna, n. మైనా పిట్ట; గోరువంక; గోరింక; +* myopia, n. హ్రస్వదృష్టి; దగ్గర వస్తువులు మాత్రమే కనబడే దృష్టి దోషం ant presbyopia; +* myriad, n. అయుతం; చెప్పలేనన్ని; బోలెడు; లెక్కకు మీరిన; +* myrrh, n సాంబ్రాణి; బోళము; గోపరసము; పరిమళము గల ఒక రకం బంక; +* mystery, n 1) హేత్వాతీతం; హేతువుకి అందనిది; గుహ్యము 2) అపరాధ పరిశోధక కథ; +* mystic, n. m. తాంత్రికుడు; ఆధ్యాత్మికుడు; మార్మికుడు; +* mystique, n మిస్టీక్)(1) కొందరి వ్యక్తుల చుట్టూ ఉండే భయ-భక్త వాతావరణం 2) కొన్ని కార్యక్రమాలచుట్టూ ఉండే రహశ్య వాతావరణం; +* mystical, adj. ఆధ్యాత్మిక; తాంత్రిక; దురవగాహమైన; సులభంగా ఆకళింకు లొంగని; +* mythology, n. పౌరాణిక కథ; పురాణ గాథా సర్వస్వం; పురాణం + + +* nag, v. t. సాధించు; నసపెట్టు; సణుగు; వేధించు; +nail clipper, ph. నఖోత్పాటని; గోళ్ల కత్తెర; కరజ కత్తెర; +* naive, adj నయీవ్) అమాయకపు; కుటిలం కాని; వెర్రిబాగుల; పిచ్చి; కపటరహిత; బోళా; పున్నపూస; +naive man, ph. వెర్రిబాగుల వాడు; అమాయకుడు; +naive woman, ph. వెర్రిబాగులది; అమాయకురాలు; +* naivetè, n నయీవెట్టే) అమాయకత్వం; ముగ్ధత్వం; బోళాతనం; సరళత; +* naked, adj 1) నగ్న; దిగంబర; దిసమొల; అంగమొల దడ్డు; అనావృత బిత్తలి 2) అలంకారంలేని; +naked man, ph. దిగంబరుడు; నగ్నుడు; అవధూత; బిత్తలి; +christian name, ph. పెట్టిన పేరు ఇంటి పేరు కాదని తాత్పర్యం); +first name, ph. పెట్టిన పేరు; సంప్రదాయికంగా మొదట రాసుకునే పేరు; +last name, ph. ఇంటి పేరు; సంప్రదాయికంగా చివర రాసుకునే పేరు; +* name, v. t. పేరుపెట్టు; నామకరణం చేయు; +* namesake, n. పేరింటిగాడు; పేరింటిగత్తె; +* nano, adj. pref. నేనో; అత్యాతి సూక్ష్మ; బిలియనులో ఒక పాలు మోతాదులో ఉన్న భాగాలని సూచించే ప్రత్యయం; +* nanosecond, n. నేనో సెకండు; సెకండులో బిలియనో వంతు; +* nap, n. కునుకుబాటు; అల్పనిద్ర; +* nape, n. మెడ; కంధరం; గ్రీవం; గొంతుక యొక్క వెనుక భాగం; +* napkin, n. చిరుతుండు; చిన్న తువ్వాలు; +* naphthalene, n. నేఫ్తలీను; ఘాశ్టుగా వాసన వేసే ఒక రసాయనం; +naphthalene balls, ph. pl. కల్రా ఉండలు; చిమ్మెటలని రాకుండా ఈ ఉండలని బట్టలలోనూ, పుస్తకాల బీరువాలలోనూ వేసేవారు; +* narcissism, n. ఆత్మవ్యామోహం; ఆత్మధీమతాభావం; తానే గొప్ప అని అతిగా అనుకునే ఒక మానసిక రుగ్మత. ఈ జబ్బు ఏ కారణం లేకుండా శరీర తత్త్వం వలన కూడా రావచ్చును; +* narcissist, n. స్వయంమోహితుడు; మోతాదు మించిన ఆత్మాభిమానం కలిగి ఉండే వ్యక్తి; సహానుభూతి లేకపోవడం, గర్వంతోటీ, అహంభావంతోటీ ఉండడం, తానే మొనగాడినని అనుకోవడం, ఇతరుల ప్రశంశలకొరకు ఎదురు చూడడం, వంటి లక్షణాలు ప్రదర్శించే ఒక మానసిక రోగి; ఈ వ్యక్తి ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు నలుగురిలోనూ తలెత్తుకు తిరగడానికి ఆత్మాభిమానం అడ్డు వస్తుంది rel psychopath కూడా స్వయం మోహితుడే కాని ఈ వ్యక్తి చెడ్డ పని చేసినప్పుడు నలుగురు ఏమనుకుంటాఋఓ అనే భయం ఉండదు;(see also sociopath and psychopath); +* nares, n. ముక్కురంధ్రములు; చెరమలు; ముక్కుపచ్చలు; +* narration, n 1) కథ 2) కథనం; కథాగమనం; కథితం; ఆఖ్యానం; చెప్పడం; +* narrative, n. కథనం; కథని చెప్పే విధం; కథితం; విశదీకరణ; వర్ణన; కథనం ఒక క్రమబద్ద వ్యక్తీకరణ; +narrative therapy, ph. కథన చికిత్స; అటు మానసిక వైద్యం లోను,ఇటు వ్యక్తిత్వ వికాస విద్యలోనూ,బహుళ ప్రాచుర్యంలోకి ,ప్రాబల్యంలోకి వస్తోన్న ఒక వైద్యవిధానం +* narratology, n. కథన శాస్త్రం కథనాలలోని సాధారణ, తార్కిక, నిర్మాణ ధర్మాలని అధ్యయనం చేసే శాస్త్రం; కథని ఎలా చెబుతారు అనే అంశాన్ని అధ్యయనం చేసే శాస్త్రం +* narrator, n ఆఖ్యాత m. కథకుడు; కథావాచకుడు; ఆఖ్యాయికుడు; f. కథావాచకి; +* narrow, adj. సన్నని; ఇరుకైన; సంకుచితమైన; వెడల్పు కాని; +narrow mindedness, ph. సంకుచిత మనస్తత్వం; సంకుచిత స్వభావం; +* nasal, adj. అనునాసిక; నాసికా; ముక్కుకి సంబంధించిన; +* nasals, n. అనునాసికములు; ముక్కుతో పలికే అక్షరాలు; ణ, న, మ, ం; +* nascent, adj. నవజాత; సద్యోజాత; ఉద్భవ; ప్రారంభ దశలో ఉన్న; అప్పుడే పుట్టిన; +nascent state, ph. నవజాత స్థితి; ఆరంభ దశ; సద్యోజాత స్థితి; +* natal, adj. పుట్టుకకి సంబంధించిన; జన్మకి సంబంధించిన; +* natation, n. ఈత కొట్టడం; నీళ్ళల్లో తేలడం; +* native, adj. సహజ; స్వంత; సొంత; ప్రాకృత; దేశీ; దేశవాళీ; స్వదేశీ; మాతృ; నాటు; నిసర్గ; +* native, n. s 1) ఒక ప్రదేశానికి చెందినది 2) జాతకుడు; +* natural, adj. ప్రకృతి సిద్ధమైన; ప్రాకృతిక; స్వతసిద్ధమైన; స్వభావ సిద్ధమైన; స్వభావికమైన; సిద్ధ; సహజమైన; నైజ; నైసర్గిక; ఆధిభౌతిక; +natural period, ph gram సిద్ధ బిందువు; వాక్యం చివర వచ్చే విరామ సంకేతం; +natural selection, ph. నైసర్గిక నిర్ణ���ం; ప్రాకృతిక వరణం; ప్రకృతి వారణం; సహజ సంవరణ; +* nature, n 1) ప్రకృతి; నిసర్గము 2) స్వభావం; స్వయంభు; నైజం; స్వతహా; సహజం; లక్షణం; ప్రవృత్తి; +* naturopathy, n. ప్రకృతి వైద్యం; కూరగాయ వైద్యం; +* nausea నాసియా) n. కడుపులో తిప్పు; వికారం; వమనేచ్ఛ; +* nauseating, adj. కడుపులో తిప్పు కలిగించే; వికారం కలిగించే; అసహ్యకరమైన; +* nauseous నాషస్) adj. కడుపులో తిప్పుపెట్టు; అసహ్యం కలిగించు; +* nautical, adj. నావిక; సముద్రానికి సంబంధించిన; +* naval, adj. నావిక; నౌకాదళానికి సంబంధించిన; +* navigable, n. నావ్యం; పడవలు వెళ్లడానికి వీలైనది; +* navigation, n. మాలిమి; మార్గనిర్దేశకం; నౌకాగమనశాస్త్రం; +* navigator, n. నియామకుడు; మార్గదర్శక్; మాలిమి; మాలిమికాడు; నావని నడపడానికి దారి చూపే వ్యక్తి; +* nearsightedness, n. హ్రస్వదృష్టి, దగ్గర వస్తువులని మాత్రమే చూడగలగటం; myopia; +* nebula, n. నీహారిక; తేజోమేఘం; జ్యోతిర్మేఘం; వెలిమబ్బు; శుక్లపటలం; ఆకాశంలో, కొద్ది కాంతితో తెల్లని మబ్బులా కనిపించే నభోమండలాలకి ఇది సామాన్య నామం; +* necessity, n. ఆవశ్యకత; తప్పనిసరి అవసరం; జరూరు; +* neck, n. మెడ; గొంతు; పీక; కంఠం; కుత్తుక; అర్రు; +* necklace, n. నేవళం; తావళం; కంఠహారం; గొలుసు; ప్రాలంబం; నెక్లేసు; త్రిసరం; +* necromancy, n. భవిష్యత్తుని చెప్పించడానికి ప్రేతాత్మని పిలవడం; +* nectar, n. మకరందం; మరందం; పూదేనె; శీధువు; +* need, n. అవసరం; అక్కర; జరూరు గర్జు; ప్రయోజనం; +* needy, n. అవసరం ఉన్నవారు; బీదవారు; లేనివారు; +* negate, v. t. ఖండించు; తిరస్కరించు; రద్దు చేయు; +* negative, n. వ్యతిరేకం; వ్యతిరేకార్థం; +* neglect, v. i. అశ్రద్ధ చేయు; ఉపేక్షించు; తాత్సరం చేయు; +* negligence, n. అశ్రద్ధ; ఉపేక్ష; తాత్సారం; యాలం; +* negligible, n. అశ్రద్ధచేయదగినంత; ఉపేక్షణీయమైన; ఉపేక్షించదగినంత; స్వల్పమైన; +* neighborhood, n. ఇరుగు; పొరుగు; నికటం; వాడకట్టు; చేరువు; చేరుబడి; పరిసరం; పేట; సామంతి; ఆజుబాజు; +* neighbors, n. పొరుగువాళ్లు; ఇరుగువాళ్ళు; ఇరుగు పొరుగులు; సామంతులు; +* nematode, n. నులిపురుగు జాతి పురుగు; +* neo, adj. నూతన; కొత్త; నవ; నవ్య; అధునాతన; +* Neodymium, n నియొడీమియం Nd అణుసంఖ్య 60, విరళ మృత్తిక మూలకం, ఇది నిజానికి అంత అరుదైన (విరళ) మూలకం కాదు కాని ఆ పేరు అలా స్థిరపడిపోయింది note నియోబియం Niobium) అనేది 41వ మూలకం, దీని హ్రస్వనామం Nb) +* nephron, n మూత్రపిండం]]లోని సూక్ష్మ కణం; +* nephritis, n. మూత్రపిండముల వాపు; వృక్కశోఫ; +* nepotism, n. బంధు పక్షపాతం; ఆశ్రీత పక్షపాతం; +* Neptune, n. సగరుడు; యముడు 1) సౌర కుటుంబంలో ఒక గ్రహం 2) రోమను పురాణాలలో సముద్రాలకి అధిపతి; +* nerve, n. నరం; నాడీతంతువు; మజ్జాతంతువు; నాడి; +* nervous, adj 1) నాడీ మండలాన��కి సంబంధించిన 2) ఆత్రుతతో చిరచిరలాడు; +* nest, n. గూడు; పక్షుల నివాసం; +* nettle, n. దురదగొండి మొక్క; దూలగొండి మొక్క; +* neuralgia, n. నాడీ తంతులు పాడవడం వల్ల వచ్చే పోటు, మంటతో కూడిన నొప్పి; నాడీ తంతులు పాడవడానికి అనేక కారణాలు ఉండొచ్చు; +trigeminal neuralgia, ph. వాచిన రక్తనాళం మెదడు నుండి ముఖం మీదకి వచ్చే నాడీ తంతిని తాకి ఒత్తిడి పెడితే ఈ రకం నొప్పి వస్తుంది; +* neurosis, n. భౌతిక లక్షణాలు బయటకి పొడచూపని మానసిక రోగం; +* neurotmesis, n శరీరంలో ఉపరితలానికి చేరువలో ఉన్న నాడీతంతువు తెగిపోవడం; ఇలా జరిగినప్పుడు శరీరం పూర్తిగా కోలుకోలేదు; +* neutral, adj. తటస్థ; ఉదాసీన; ఉపేక్ష; నిష్పాక్షిక; మధ్యస్థ; +* neutralization, n. తటస్థీకరణ; ఉదాసీనకరణ; నిర్బలీకరణ; నిరాకరణ; +* neutralize, v. t. తటస్థీకరించు; ఉదాసీనపరచు; నిర్బలీకరించు; +* new moon, n. కొత్త చంద్రుడు; బాల చంద్రుడు; నెలవంక; +* news, n. వార్త; వార్తలు; సమాచారం; ఉదంతం; వృత్తాంతం; కబురు; కబుర్లు; విశేషాలు; సుద్ది; వర్తమానం; వక్కాణము, వాచికం; జనశ్రుతి; మతలబు;(note) news అనేది ఇంగ్లీషులో ఏక వచనమే అయినా దీనిని తెలుగులో వార్త అని ఏక వచనంలో అనవచ్చు లేదా వార్తలు అని బహు వచనంలో అనవచ్చు; +* newsletter, n. వార్తాపత్రం; చిన్న వార్తాపత్రిక; +* next, adj. మరుసటి; తర్వాత; వచ్చే; రాబోయే; +next day, ph. మరునాడు; తర్వాత రోజు; మరుసటి రోజు; +next of kin, ph. ఆప్తులు; సన్నిహితులు; తర్వాత వారు; +* nice, adj. మంచి; బాగున్న; ఉల్లాసకరమైన; +* niche నీచ్) n. ఉనికిపట్టు; స్థావరం; గూడు; అరగూడు; గోడలో దొలిచిన బెజ్జం; +* Nickel, n. నికెల్; ఒక రసాయన మూలకం అణుసంఖ్య 28, సంక్షిప్త నామం, Ni); +* nickname, n. ముద్దుపేరు; వేడుక పేరు; మరోపేరు; +* night, n. రాత్రి; రేయి; నిసి; నిశీధి; మాపు; నక్తము; తమి; రాతిరి; నిశ; విభావరి; రజని; యామిని; +* nightshade vegetables, n. pl. Solanaceae కుటుంబానికి చెందిన మొక్కలని nightshades అని కూడా అంటారు. ఈ కుటుంబంలోని మనం తినే కొన్ని కురగాయలకి nightshade vegetables అని పేరు; బంగాళా దుంపలు, టొమేటోలు, వంకాయలు, మిరపకాయలు, వగైరా ఈ కుటుంబానివే; +* nimbus, n 1 దీప్తి మండలం; దేవతామూర్తుల చుట్టూ ప్రకాశించే దీప్తి మండలం 2) వర్షాకాలపు మేఘం; +* nipple, n 1) తిత్తి; పీక; చూచుకం 2) చనుమొన; కుచాగ్రం; స్తనాగ్రం; +* nirvana, n. నిర్వాణం; అపవర్గం; మోక్షం; మహదానందం; +* nit, n పేను గుడ్లు; ఈపి కట్టు; +* nitre, n. సురేకారం; పెట్లుప్పు; +* Nitrogen, n. నత్రజని; రంగు, రుచి, వాసన లేని ఒక రసాయన మూలక వాయువు అణుసంఖ్య 14, సంక్షిప్త నామం, N); +nobility particle, ph. పేరులో ఎక్కడో ఒక చోట గౌరవ సూచకంగా తగిలించే ప్రత్యయం; ఉదా. టంగుటూరి ప్రకాశం పంతులు మహర్షి బులుసు సాంబమూర్తి; వాస్కో డి గామా; పియర్ డి ఫెర్మా; మొదలైనవి; ఇవి దేశ, కాల, పరిస్థితులని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని దేశాలలో వీటిని కేవలం మర్యాదకి మాత్రమే వాడి, చట్టపరమైన దస్తావేజుల వంటి కాగితాలలో వాడరు; +* nobility, n 1) ప్రభువులు; గొప్పవారు; ఆర్యులు; గౌరవనీయులు 2) ఉదారత; +* nobleman, n. ప్రభువు; ఘనుడు; ధనికుడు; గొప్పవాడు; అమీరు; +* nod, v. t. తల పంకించు; తల ఆడించు; తల ఊపు; సమ్మతి తెలుపుతూ తలని పైకీ కిందికీ ఆడించడం; see also shake; +* node, n 1) ముడి; కణుపు; గ్రంధి; స్కంధాంతం; స్కంధశిఖరం; గంటు; పర్వం; కన్ను 2 astron గ్రహపాతం; కక్ష్యాపాతం; +* nodes, n. pl astron రాహు,కేతువులు సూర్య, చంద్రుల కక్ష్యా ఖండన బిందువులు; +* noir, n French, న్వా అని కానీ న్వార్ అని పలకాలి) చీకటి; నలుపు; +films noir, ph. న్వార్ సాహిత్యమూ, hardboiled సాహిత్యమూ ఆధారంగా తయారైన కథలను, అప్పటి black and white చిత్రాల్లో expressionism cinematography పద్ధతులలో చూపించిన చిత్రాలే న్వార్ చిత్రాలు. +noir fiction, ph. చీకటిని ఆలంబనంగా చేసుకున్న ఒక సాహిత్య శైలి; ఇందులో సంప్రదాయ రీతిలో లాగా మంచివాళ్ళూ, చెడ్డవాళ్ళూ ఉండరు. మంచికీ-చెడుకూ మధ్యన ఉండే సన్నని గీత మీద పాత్రల చేష్టలు నడుస్తాయి. కథానాయకులు మానసిక నిస్పృహ లో ఉండి, అంతర్గత సంఘర్షణలూ, ఒంటరితనమూ వంటివాటితో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమాజము వారికి అన్యాయము చేయడముతో వారు ఆ దారి ఎంచుకుంటారు. నెమ్మదిగా పూర్తిగా పతనమైపోతారు. ఇదీ న్వారు సాహిత్యమంటే. +* noise, n. రొద; గోల; శబ్దం; సద్దు; సవ్వడి; చడి; సడి; చప్పుడు; ధ్వని; అలికిడి; అలబలం; కలకలం; గొల్లు; +* nomad, n. దిమ్మరి; దేశ దిమ్మరి; సంచారి; +* nominal, adj. నామకః; నామకార్థం; నామమాత్రం; పేరుకి మాత్రం; నామ్‌కే వాస్తే; +* nominate, v. i. ప్రతిపాదించు; నియమించు; నియోగించు; పేర్కొను; నామినేటు చేయు; +* nomination, n. ప్రతిపాదన; నియామకం; నామనిర్దేశం; నామినేషన్; +* nominator, n. ప్రతిపాదకుడు; ప్రతిపాదకి; +* nominee, n. ప్రతిపాదితుడు; నియుక్తుడు; నియోజితుడు; +* non-stop, adj. ఎకాయకీ; ఎడతెరపి లేకుండా; ఆగకుండా; ఏకబిగిన; ఏకధాటిగా; +* nonane, n. నవేను; తొమ్మిది కర్బనపుటణువులు ఉన్న ఉదకర్బనం; +* non-metal, n. అలోహం; లోహం కానిది; ఉ: ఉదజని, కర్బనం, మొదలైనవి 20+ ఉన్నాయి; +* non-stop, adj. ఏకధాటిగా; ఏకబిగిన; నిరంతరం; అవిరతం; అశ్రాంతం; +* noon, n. మధ్యందినం; మిట్టమధ్యాహ్నం; మధ్యాహ్నం; +* normal, adj 1) సాధారణమైన; ప్రమాణాంకిత; ప్రమాణయుక్త 2) అభిలంబ; నిట్ర; +* normal, n 1) సామాన్యం; ప్రాయికం 2) లంబం; నిట్రం; +* normalization, n. ప్రమాణాంకితం; ప్రమాణాంకీకరణ; +* north, n. ఉత్త���ం; ఉత్తరపు దిక్కు; +* northeast, n. ఈశాన్యం; ఈశాన్య దిశ; ఈశాన్య మూల; +* northwest, n. వాయవ్యం; వాయవ్య దిశ; వాయవ్య మూల; +northern lights, ph. ఉత్తర జ్యోతులు; ఉదీచీన ఉద్యోతాలు; ఉదీచీన జ్యోతిర్వస్త్రాలు; ఉత్తర ధ్రువ జ్యోతులు; +* northerner, n. ఉత్తరాదివాడు; ఔత్తరాహ్యుడు; +* nose, n. ముక్కు; నాసిక; ఘ్రాణం; +* nostalgia, n. జ్ఞాపకాలు; భావోద్రేకంతో కూడిన జ్ఞాపకాలు; +* nostril, n. ముక్కు చెరమ; ముక్కు రంధ్రం; నాసాపుటం; మంజెరం; +* notable, n. గమనార్హం; గణనీయం; గుర్తింపదగ్గది; +* note, n 1) చీటీ; పత్రం; కాగితం; యాదాస్తు; పురోణి; నోటు 2) గమనిక; షరా 3) స్వరం 4) షడ్జమం (స రిషభం (రి గాంధారం (గ మధ్యమం (మ పంచమం (ప దైవతం (ద నిషాదం (ని స; +non-movable note, ph. అచల స్వరం; ఉదాహరణకి స, ప లు అచల స్వరాలు; స, ప ల తరచుదనం (frequency) ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది; +pure note, ph. శుద్ధ స్వరం; శుద్ధ స్వరం కంటే తక్కువ తరచుదనం ఉన్నదానిని కోమల స్వరం అంటారు; +sharp note, ph. తీవ్ర స్వరం; మ కి తీవ్ర స్వరం ఒక్కటే ఉంది; మ కి కోమల స్వరం లేదు; +* notebook, n. పుస్తకం; యాదాస్తు పుస్తకం; నోటు పుస్తకం; +* noted, adj. పేరున్న; ప్రసిద్ధికెక్కిన; +* notice, n. ప్రకటన; గమనిక; తాఖీదు; నోటీసు; +* notification, n. తెలియపరచుట; చాటింపు; ప్రకటన; విజ్ఞాపన; అధిసూచన; +* notion, n. తలంపు; భావం; ఊహ; కల్పన; అభిప్రాయం; +* noun, n gram నామవాచకం; విశేష్యం; వాచకం; +* nove, n. pl నోవీ) నవ్యతారలు; కొత్తగా పుడుతూన్న నక్షత్రాలు; +* novelty, n 1) కొత్తదనం; నవ్యత; అభినవత్వం 2 తాయం; తాయిలం; +* novice, n 1) శిశువు 2) కొత్తగా నేర్చుకున్న వ్యక్తి; ప్రావీణ్యత లేని వ్యక్తి 3) m. అర్భకుడు; +* nucleic acid, n. కణికామ్లం; కణామ్లం; కదష్ఠికామ్లం; +* nucleolus, n. గర్భకణిక; గర్భాష్ఠి; కేంద్రకాంశం; +* nuclear, adj biol జీవకణ కేంద్రానికి (కదష్ఠికి) సంబంధించిన phys అణు కేంద్రకానికి సంబంధించిన; అణుకేంద్ర; అణుకేంద్రక; +nuclear device, ph. కేంద్రక విస్పోటన పరికరం; అణు బాంబు; +* nudge, v. i తొయ్యడం; తట్టి లేపడం; ఉసి కొల్పడం; మోచేత్తో తోసి ప్రేరేపణ చెయ్యడం; +* number, adj నమ్మర్ ఎక్కువ తిక్కిరిగా ఉండు; ఎక్కువ అచేతనంగా ఉండు; +* number, n నంబర్ 1) సంఖ్య; నెంబరు; అంకె; అంకము 2) వచనం; +complex number, ph. సమ్మిశ్ర సంఖ్య; సంకీర్ణ సంఖ్య; జంట సంఖ్య; +prime number, ph. ప్రధాన సంఖ్య; అభేద్య సంఖ్య; అభేధ్యాంకం; ప్రధానాంకం; అవిభాజ్యం; అభాజ్య సంఖ్య; +number theory, ph. సంఖ్యా శాస్త్రం; అంకెలలో కాని, సంఖ్యలలో కాని కనిపించే బాణీలని అధ్యయనం చేసి గణితశాస్త్ర సూత్రాలని వెలికి లాగే శాస్త్రం; +* numeral, n. అంకె; అంకం; సంఖ్యావాచకం; అంకెల రాత గుర్తు; అంకెల లేఖా సంకేతం; +* numerology, n. సంఖ్యల వరుసలలో ఏదో మార్మికత ఉందని నమ్మి సంఖ్యలలో కనిపించే బాణీని బట్టి జోశ్యం చెప్పడం; ఇది ఒక నమ్మకమే కాని శాస్త్రం అనిపించుకోదు; +* numismatics, n. రూప్యశాస్త్రం; నాణెముల గురించిన శాస్త్రం; +* nurse, n ఉపమాత; నర్సు; f. దాది; పరిచారిక; నరసమ్మ; m. పరిచారకుడు; నరసయ్య; +* nurse, v. t. శుశ్రూష చేయు; పరిచర్య చేయు; +* nursery, n 1) వృక్ష సంవర్ధని; మొక్కలను పెంచి అమ్ము స్థలం 2) బాలవిహార్; క్రీడాగృహం; పసి పిల్లలకి నర్సు పర్యవేక్షణలో ఆటలు, పాటలు నేర్పే స్థలం; +* nut, n 1) పిక్క; గింజ చుట్టూ పెంకు లాంటి కవచం ఉన్న విత్తు; ఉ. చింత పిక్క; బాదం పిక్క; జీడి పిక్క 2) మరచుట్టు; మర ఉంగరం rel bolt; screw 3) పిచ్చి మనిషి; +* nutcracker, n. అడకత్తెర; వక్కలని, పిక్కలని విరగ్గొట్టడానికి వాడే కత్తెర వంటి ఉపకరణం; +* nutmeg, n. జాజికాయ; ఈ జాజికాయ తొక్కనే జాపత్రి అంటారు; +* nutrient, n. పోషకం; పోషక పదార్థం; పోషకాహారం; +* nymphomaniac, n. f. రిరంసువు; కాముకి; విపరీతమైన కామేచ్ఛ గల స్త్రీ; వివిధమైన పురుషులతో రతిని కోరే స్త్రీ +* oar, n. తెడ్డు అల్లీసకర్ర; క్షేపణి; +* oasis, n. విరామారామం; ఇసువాద ఇసుము వాద sand pond; ఎడారిలో నీళ్లు, నీడ దొరికే ప్రదేశం; +* oatmeal, n 1) అటుకులులా దంచబడ్డ ఓటు బియ్యం 2) ఓటు బియ్యాన్ని బాగా చిమడబెట్టి అంబలిలా కాచిన భోజన పదార్థం; +* obese, adj. లావైన; స్థూలమైన; వలంగా; బడ్డుగా; +* obesity, n. స్థూలకాయత్వం; స్థౌల్యం; +* obey, v. i. కట్టుబడియుండు; పాటించు; చెప్పినట్లు నడుచుకొను; +* obituary, n. వార్తాపత్రికలో ప్రచురించబడ్డ మరణ వార్త; సంస్మరణ; స్మృతి; +* object, n ఆబ్‌జెక్ట్ 1) భౌతిక పదార్థం; వస్తువు 2) కర్మ, వ్యాకరణంలో ant subject; +* object, v. t అబ్‌జెక్ట్) వారించు; అభ్యంతరపెట్టు; ఆక్షేపించు; +* objection, n. అభ్యంతరం; ఆక్షేపణ; ప్రతిబంధకం; +* objective, n. వస్తుగత గమ్యం; లక్ష్యం; ఆశయం; ప్రయోజనం; గమ్యం ఎంతవరకు చేరుకున్నామో కొలిచి చెప్పడానికి వీలయిన చలరాసి rel goal; +* oblation, n. నైవేద్యం; నైవేద్యాది ఉపచారం; +* obligation, n 1) అనివార్యకార్యం; తప్పనిసరి అయిన పని 2) మొహమాటం; నిర్బంధం; విద్యుక్తం విధాయకం; +* obliterate, v. t. సర్వనాశనం చేయు; తుడిచిపెట్టు; +* obscene, adj. అసభ్యమైన; అసహ్యకర మైన; అశ్లీలమైన; అవాచ్యమైన; సాధుసమ్మతంకాని; బూతు; +* obscure, adj. స్పష్టతలేని; ఎక్కడో మారుమూలని ఉన్న; +* obsequies, n. అపరకర్మలు; ఉత్తర క్రియలు; మరణానంతరం చేసే కర్మ; +* observable, adj. గమనార్హమైన; అవలోకనార్హమైన; +* observation, n 1) పరిశీలనం; అవలోకనం; వీక్షణ; విలోకనం; ప్రేక్షణం; దృశ్యం 2) పరిశీలన; +* observe, v. i. పరిశీలించు; గమనించు; అవలోకించు; వీక్షించు; పాటించు; పారజూచు; +* observer, n. ��రిశీలకుడు; ప్రేక్షకుడు; ద్రష్ట; పారజూడరి; +* obsession, n. రంధి; యావ; పరమ చాదస్తం; స్వీయభావ అవరోధం; దూరంగా ఉన్న, అర్ధం లేని, చొరబడే (intrusive పదేపదే వచ్చే ఆలోచనలను ఆబ్సెషన్ లేదా స్వీయ భావ అవరోధం అంటారు. అనుచితమైనవి, ప్రేరేపించేవి, అసమంజస మైనవి, పునరావృతం అయ్యేవి, నిషిద్ధమైనవి అయిన ఆలోచనలు; +obsessive compulsive disorder, ph స్వీయభావ అవరోధ రుగ్మత; ఉదా 1) మెట్లు ఎక్కేటప్పుడు లెక్క పెట్టడం పెట్టకపోతే ఎదో జరుగుతుంది అనుకోవడం, ఫోన్ ఒక కోణంలో పెట్టక పొతే ఎదో దుర్వార్త వస్తుందని నమ్మటం. అలా పెట్టక పొతే ఆందోళన చెందటం 2) అశుభ్రత, క్రిమి సంకులత, దుమ్ము, ధూళి, అంటువ్యాధుల పై మితిమీరిన భయం 3) తమకి, తమవారికి, ఇతరులకి హాని జరుగ బోతుందనే అకారణ భయం +* obsolete, n. విలుప్తం; వ్యవహారబ్రష్టం; వ్యవహారచ్యుతం; అప్రచలితం; వాడుకలో లేనిది; +* obstacle, n. అడ్డంకి; అవరోధం; అవాంతరం; ప్రతిబంధకం; విఘ్నం; విష్కంభం; +* obstetrics, n. సూతిక శాస్త్రం; ప్రసూతి శాస్త్రం; ప్రసవ శాస్త్రం; పురిటి వైద్యం; +* obstinacy, n. మొండితనం; పిడివాదం; మూర్ఖపు పట్టు; +* obstruct, v. t. అడ్డు; ఆటంకపరచు; అటకాయించు; అవరోధించు; నిరోధించు; అభ్యంతరపెట్టు; వారించు; +* obstruction, n. అడ్డంకి; ఆటంకం; రోధం; రుద్ధం; అవరోధం; నిరోధం; ఆక; ప్రతిఘాతం; ప్రతిబాధకం; ప్రతిబాధి ప్రతిబంధం; ప్రతిబంధకం; ప్రతిరోధకం; +* obtrude, v. i. ముందుకు చొచ్చుకొని వచ్చు; +* obvious, n. స్వయంవిదితం; విదితం విస్పష్టం; వివరణ లేకపోయినా అర్థం అయేది; +* occasional, adj. అప్పుడప్పుడు; కాదాచిత్క; నైమిత్తిక; +* occasionally, adv. అప్పుడప్పుడు; అడపాదడపా; కదాచిత్తుగా; +* occident, n. పాశ్చాత్య దేశాలు; పశ్చిమ దేశాలు; +* occidental, adj. పాశ్చాత్య; పశ్చిమ దేశాలకి సంబంధించిన; +* occipital, adj. కపాలాస్థి; కపాలాస్థిక; తల వెనక భాగాన్ని ఉన్న ఎముకకి సంబంధించిన; +occipital lobe, ph. కపాలాస్థిక తమ్మె; మెదడులో ఒక భాగం; +* occult, adj. నిక్షిప్త; రహస్య; మానవుడి అవగాహనకి అందని; +* occultation, n. ఒక్కొక్కసారి చంద్రుడు బుధ శుక్ర, కుజ, గురు, శని గ్రహాలను కప్పివేయడం కూడా జరుగుతుంది. ఉదాహరణకు శుక్రునికి, భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినపుడు దానిని శుక్రుని గ్రహణం (eclipse) అని అనరు; Lunar occultation of Venus అంటారు; +* occupant, n. ఆక్రమించినవాడు; ఆక్రమితుడు; +* occur, v. i. సంభవించు; తట్టు; స్ఫురించు; తటస్థించు; +* ocean, n. మహాసముద్రం; మహార్ణవం; అబ్రాసి; కడలి; విషధి; ఉదధి; అంబుధి; జలధి; సాగరం; +* ochre, n. గోపీచందనం; ఒక రంగు పదార్థం; +* octahedron, n. అష్టముఖి; ఎనిమిది సమత్రిభుజములు ముఖములుగా గల ఒక ఘనరూపము; +octane number, ph. అష్టేను సంఖ్య; పెట్రోలు నాణ్యతని కొలిచే సూచికాంకం; +* octave, n 1) సప్తకం; సంగీతంలో f అనే పౌనఃపున్యం నుండి 2f పౌనఃపున్యం వరకు ఉన్న మధ్య దూరం; ఈ దూరంలోనే సప్త స్వరాలు ఇమిడి ఉంటాయి; భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఈ దూరాన్ని సరిగమపదని వరకే లెక్కపెడతారు, పాశ్చాత్య సంగీతంలో సరిగమపదనిస అని లెక్క పెడతారు 2) అష్టపది; అష్టకం; +* octet, n. అష్టకం; అష్టకి; ఎనిమిది అంశాలు కలది; +* octanoic acid, n అష్టనోయిక్‍ ఆమ్లం; కేప్రిలిక్‍ ఆమ్లం; ఎనిమిది కర్బనపు అణువుల దండ ఉన్న గోరోజనామ్లం; +* odd, adj 1) బేసి; బేసరి; ఓజ; విషమ; సరి కాని 2) వింతైన; ఎబ్బెట్టు; విజ్జోడు 3) విషమ; చికై్కన; +* ode, n. కీర్తన; స్తుతి; పదం; భావగీతం; +* oeuvre, n ఓవ్ర ఒక కళాకారుని (కవి) సంపూర్ణ రచనా సంపుటి; +* offend, v. t. నేరం చేయు; కోపం పుట్టించు; నొప్పించు; +cognizable offense, ph. వారంటు లేకుండా అరెస్టు చెయ్యడానికి పోలీసులకి హక్కు ఉన్న నేరం; ఇండియాలో ఇటువంటి నేరం జరిగిందని అనిపించగానే పోలీసులు తప్పనిసరిగా FIR (first information report) నమోదు చేసి తీరాలని చట్టం చెబుతోంది; +* offer, v. t. అర్పించు; సమర్పించు; భక్తితో ఇచ్చు; కానుకగా ఇచ్చు; +* office, n. కచేరీ; కార్యాలయం; పనిపట్టు; కృత్యాగారం; దప్తరు; ఆఫీసు; +* officer, n. అధికారి; ఉద్యోగి; సచివుడు; ఆఫీసరు; +* officinalis, n. ఉపయోగం ఉండి దుకాణాలలో కొనుగోలుకి దొరికేది; +* ogre, n. మనుష్యులను తినే రాక్షసుడు; +* oil, n. నూనె; చమురు; తైలం; ఆయిలు; +oil cake, ph. తెలక పిండి; పిణ్యాకం; నూనె చెక్క; +* oily, adj. నూనెలా ఉండే; జిడ్డుగా ఉండే; జిడ్డయిన; +* ointment, n. అంజనం; లేపనం; విలేపనం; మలాము; పైన పూసే మందు; +* okra, n. బెండ; ఎద్దునాలుక చెట్టు; గంబో; +* ol, suff. ఆల్కహాలు జాతికి చెందిన రసాయనాల పేరు చివర విధాయకంగా వచ్చే ప్రత్యయం; ఉదా. alcohol; menthol; phenol; +old age, ph. ముసలితనం; వృద్ధాప్యం; ముదిమి; +old people, ph. ముసలివారు; వృద్ధులు; వయోవృద్ధులు; +* oligarchy, n. స్వల్పజన పరిపాలనం; స్వల్పజనాధిపత్యం; +* olive, n జిత చెట్టు; జిత వృక్షం; మానుగాయ; కుదురు జువ్వి; ఆలివ్; మధ్యధరా వాతావరణాలలో కాసే ఒక చిన్న కాయ; +* oma, suff med వైద్య రంగంలో వచ్చే ఈ ఉత్తర ప్రత్యయానికి అర్థం "కంతి అనగా, శరీరంలోని జీవకణాలు మితిమీరి పెరిగి కాయలా తయారవడం; ఈ కంతి కేంసరు కావచ్చు, కాకపోవచ్చు; +carcinoma, ph. అంగాలని చుట్టి ఉండే పొరలలో కాని, చర్మపు పొరలలో కాని వచ్చే కేంసరు; +cytoma, ph. కణాలకి సంబంధించిన కంతి; +melanoma, ph. మెలనిన్‌ అనే రంగు పదార్థం ఉన్న చోట (సాధారణంగా చర్మం) పెరిగే కంతి; +sarcoma ph. శరీరపు కట్టడానికి ఉపయోగపడే భాగాలకి (అనగా, ��. ఎముకలు, కండరాలు, వగైరాలకి) వచ్చే కేంసరు; +bad omen, ph. అపశకునం; దుర్నిమిత్తం; దుశ్శకునం; +* omit, v. t. మినహాయించు; పరిహరించు; వదలివేయు; విడచిపెట్టు; +* omission, n. పరిహార్యం; మినహాయింపు; పరిహరింపు; చేయమి; +* omniscient, n. సర్వజ్ఞుడు; అన్నీ తెలిసినవాడు; +* omnipotent, adj. సర్వశక్తిసంపన్నత; సర్వసమర్ధత; సర్వశక్తిత్వం; +* omnipotent, n. సర్వశక్తిసంపన్నుడు; సర్వసమర్ధుడు; +* omnipresence, n. సర్వవ్యాప్తి; సర్వవ్యాపకత్వం; +* omnipresent, n. సర్వోపగతుడు; సర్వవ్యాపకుడు; +* omnivore, n. సర్వభక్షిణి; సర్వాహారి; సర్వభక్షకి; +* once, adv 1) ఒకప్పుడు; ఒకానొకప్పుడు 2) ఒకసారి; ఒకమారు; ఒకతడవ; ఒక పర్యాయం; ఒక తూరి; +increment by one, ph. ఏకోత్తరించు; ఏకోత్తరవృద్ధి; ఒకటొకటిగా పెంచు; +one-by-one, ph ఒకదాని తరువాత మరొకటి చొప్పున; ఐకాఇకంగా; +* onion, n 1) ఉల్లి; ఉల్లిపాయ; ఉల్లిగడ్డ; అల్లియం 2) నీరుల్లి; పెద్ద ఉల్లి; ఎరగ్రడ్డ; సుకంద; +onion bulb, ph. ఉల్లిపాయ; ఉల్లిగడ్డ; అల్లియం; ఎరగడ్డ; +* onlooker, n. చూపరి; దారిన పోయే దానయ్య; కలుగజేసుకోకుండా పక్కనుండి చూసే వ్యక్తి; ప్రేక్షకులు; +* onomastics, n సంజ్ఞానామ పరిశీలన; పేర్ల పూర్వాపరాలని పరిశీలించే శాస్త్రం; +* onomatopoeia, n. ధ్వన్యనుకరణం; భావమును వ్యక్తపరచు శబ్దం; ఒక రకమైన శబ్దాలంకారం; అన్నం కుతకుత ఉడుకుతున్నది అన్నప్పుడు ‘కుతకుత’ అన్నం ఉడికే శబ్దాన్ని అనుకరించడమే ఈ అలంకారం లక్షణం; +* ontology, n. లక్షణ శాస్త్రం; సత్త్వమీమాంశ; దృశ్యమాన ప్రపంచంలో వస్తువుల మూల స్వభావాన్ని తెలుసుకొనడానికి ప్రయత్నించే ఆధిభౌతిక విజ్ఞాన శాస్త్రం; +* oology, n. అండాధ్యయనం; గుడ్లని అధ్యయనం చేసే శాస్త్రం: +* ooze, v. i. ఒలుకు; కారు; చెమర్చు; ఊరు; శ్రవించు; +* opal, n. క్షీరోపలం; ఒక విలువైన రాయి; +* opaque, n. కాంతి కిరణాలని చొరనీయని లక్షణం గల; +* open, adj. తెరచిన; తీసిన; విడిన; వికసించిన; విప్పిన; వివృత; విరళ; ఉపరితల; +wide open, ph. బార్లా తెరచిన; బారుగా తెరచిన; బార్లా తీసిన; +* open, v. t. తెరుచు; విప్పు; విడదీయు; పెగుల్చు; పెగలదీయు; +* opening, n 1) వివారం; వివరం; కన్నం; బెజ్జం 2) ఖాళీ; ఖాళీ స్థలం; సందు; బీటిక 3) ఎత్తుబడి; మొదలు; +* openly, adv. బాహాటంగా; బహిరంగంగా; వెల్లడిగా; దాపరికం లేకుండా; నిష్కపటంగా; +* operation, n 1 math సంక్రియ; పరిక్రియ; పరికర్మ; సముచ్చయం 2) శస్త్ర చికిత్స; కోత 3) చర్య; కార్యము; +* operator, n math పరికర్త; కర్మచారి; నిర్వాహకుడు; +* opinion, n. అభిప్రాయం; మతం; ప్రవాదం; అనుకోలు; +* opium, n. నల్లమందు; అభిని; అహిఫేనం; +* opponent, n. ప్రత్యర్థి; ప్రతిద్వంది; ప్రతిస్పర్ధి; ప్రతిపక్ష; ప్రతికక్షి; ఎదిరి; వ్యతిరే���ి; ప్రతికూలుడు; విరోధి; ప్రతిరోధి ప్రతిరోధి, pratirOdhi +* opposite, adj. విరుద్ధ; విపరీత; అభిముఖ; వ్యతరిక్త; వ్యతిరేక; ప్రాభిముఖ; ఎదురెదురుగా; ఎదుటి; +* optician, n. కళ్లద్దాలని తయారు చేసే వ్యక్తి; +* optics, n 1) కాంతిశాస్త్రం; నేత్రజ్ఞానశాస్త్రం; దృశాశాస్త్రం; తేజశ్శాస్త్రము 2) ప్రచారం కొరకు ఛాయాచిత్రాలలో కనబడే తీరు; +* optimization, n. ఉన్న ప్రత్యామ్నాయాలలో సర్వోత్తమమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే పద్ధతి; +* option, n. వైకల్పికం; వికల్పం; వైభాషికం; ఐచ్ఛికం; ఐచ్చికాంశం; +* optional, n. వైకల్పికం; వికల్పం; వైభాషికం; ఐచ్ఛికం; ఐచ్చికాంశం; +* ophthalmologist, n. కంటివైద్యుడు; కంటి జబ్బులని నయం చేసే వైద్యుడు; +* option, n. వికల్పం; విభాష: అభిరుచి; కోరి ఎన్నుకున్నది; +* optometrist, n. దృష్టిదోషాన్ని కొలచి కళ్లజోడుని అమర్చే వ్యక్తి; +* opulent, adj. విలువైన వస్తువులతో అలంకరించబడ్డ; +* or, conj కాని; లేక; కానిపక్షంలో; లేకపోతే; లేనియెడల; +* oracle, n. సర్వజ్ఞుడు; ద్రష్ట; ప్రవక్త; గ్రీకు గాథలలో వచ్చే అన్నీ తెలిసిన వ్యక్తి; +* oral, adj 1) నోటిద్వారా; వాక్; వాగ్రూపంగా; వాచా; వాచ్య; వాచారంభ; మౌఖిక; మూజువాణీ 2) నోటికి సంబంధించిన; నోటితో; ఆశ్య; +oral cavity, అంగిలిగుంట; ఆశ్య కుహరం; +oral medicine, ph. నోటిద్వారా వేసికొనే మందు; మూజువాణీ మందు; +* orange, n. నారింజ; నాగరంగం; కిచ్చిలి; +* orbit, n. కక్ష్య; చారగతి; వివర్తకం; భచక్రం; +* orbital, adj. కక్షీయ; కక్ష్యకి సంబంధించిన; గ్రహగతికి సంబంధించిన; +* orbital, n. విగతి; విస్తృతమైన గతి; ఒక ఎలక్ట్రాను ఎక్కడ ఉందో సూచించడానికి వాడే తరంగ ప్రమేయపు లక్షణం; గుళిక వాదంలో వచ్చే ఒక సంక్లిష్ట భావన; +* orchestra, n. వాద్యబృందం; భజంత్రీలు; పక్కవాద్యాలు; +* order, n 1) ఆనతి; ఆన; ఆజ్ఞ; ఆజ్ఞాపన; అనుశాశనం; ఉత్తర్వు; తాకీదు 2) ఆజ్ఞా పత్రిక; ఫర్మానా 3) క్రమం; వరుస 4) క్రమం; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు నాలుగవ వర్గానికి పెట్టిన పేరు see also] genus, family, order, class, phylum and kingdom; +* orderly, n. ఆసుపత్రిలో పనివాడు; +* ordinal, adj. వరసవారీ; వరసలోని; వరసలోనుండి ఎంచిన; క్రమ; +* ordinary, adj. సామాన్య; సాధారణ; సాదా; లౌకిక; మామూలు; తందురుసు; +ordinary person, ph. సామాన్యుడు; సామాన్యురాలు; తందురుసు రెంచ; తందురుసువాడు; +* oregano, n పాశ్చాత్య దేశాల వంటకాలలో వాడే ఒక సుగంధ పత్రి bot Origanum; +* organizers, n. pl. కార్యకర్తలు; నిర్వాహకులు; వ్యవహర్తలు; సంధాతలు; +* orgasm, n. రతిక్రీడలో పరాకాష్ఠని అందుకున్న సన్నివేశం; +* oriel, n. వీధి అరుగు; వీధి వసారా; చీడీ; +* origin, n. మూలం; ప్రభవం; ప్రభూతి; సంభవం; పుట్టుక; హేతువు; మ���ల బిందువు; +* Orion, n. మృగవ్యాధుడు; వృత్రాసురుడు; మృగశిర; మృగశీర్షం; అగ్రహాయిణి; ఇది క్రమంగా అగ్రాయిని, తరువాత ఒరాయన్ అయేయని అంటారు; నిజానికి మృగశిర అనే కూటమి మృగవ్యాధ రాశిలో ఒక భాగమే; +Orion's Belt, ph. త్రిపురములు; ఇన్వకములు; గొల్లకావడి చుక్కలు; +* ornament, n. నగ; భూషణం; ఆభరణం; తొడవు; రవణం; అలంకారం; +* ornamentation, n. అలంకారం; సంగీతంలో అలంకారం అంటే సాదా, సీదాగా పాడకుండా స్వరాలకి చిన్న ఊపో, గమకమో, కంపిత గమకమో, వగైరాలు చేర్చి పాడడం; భాషలో అలంకారం అంటే ఉపమ, రూపక, మొదలైన అలంకారాలు వాడడం; +* orphans, n. అనాథలు; తల్లిదండ్రులు లేని పిల్లలు; +* orthodontist, n. ఎత్తుపల్లాలు ఉన్న పంటి వరసని తిన్నగా చేసే వైద్యుడు; +* orthodox, adj. పూర్వాచార; సదాచార; శ్రోత్రియ; ఆస్తిక; +* orthodoxy, n. పూర్వాచార పద్ధతి; శ్రోత్రియ సంప్రదాయం; ఆస్తికత్వం; ఛాందసం; వేదాలని ప్రమాణంగా నమ్మడం; +* orthography, n. వర్ణక్రమం; వర్ణక్రమదోషం లేకుండా రాయడం; +* oscillation, n. స్పందనం; డోలనం; నివర్తనం; ఊగడం; ఆందోళనం; +* osmosis, n. అభిసరణం; ఉత్సరణం; ద్రవాభిసరణ; +* osteomalacia, n. అస్తిమాల్యం; ఎముకల బలహీనతకు చెందిన వ్యాధి; +* ostrich, n. నిప్పుకోడి; ఉష్ట్రపక్షి; ఆఫ్రికాలో ఉండే ఎగరలేని పెద్ద పక్షి bio Struthio camelus +* otter, n. ఆటర్; నీళ్ళల్లో ఉండే కుక్కని పోలిన ఒక క్షీరదం; +* otherwise, adv. అలాకాని పక్షంలో; అట్లుకాకున్న; కానిచో; అన్యథా; అథవా; పక్షాంతరమున; +* ounce, n. అవున్సు 1) ద్రవ పదార్థాలని కొలవడానికి వాడే ఒక మానం 2) బరువుని కొలిచేటప్పుడు పౌనులో పదహారో వంతు; +* outcast, n. అప్రాశ్యుడు; వెలి వేయబడ్డవాడు; +* outcropping, n. గుట్ట; మట్టిలోంచి బయటికి పొడుచుకు వచ్చిన శిలా సంస్తరం; +* outfit, n 1) దుస్తులు 2) సరంజామా; సాధన సంపత్తి; +* outlay, n. పెట్టుబడి; మొత్తపు ఖర్చు; వ్యయం; +* outlet, n. నిర్గమ ద్వారం; నిర్గమం; +* output, adj. వెలపట; బహిర్గత; అంతర్యాన; అంతర్యాగ; +output data, ph. బహిర్గత దత్తాంశం; బహిర్యానాంశం; బహిర్యాగాంశం; +* output, n. వెలపలం; వెలపటంశం; నిర్గమాంశం; నిర్గతం; బహిర్గతం; బహిర్హితం; బహిర్యానం; బహిర్యాగం బరవానా; పోత; ఫలితం; పరిణామం; ఉత్పన్నం; ఉత్పాదన; ఫలోత్పత్తి; నిర్గళితం; ఆయాతం; ప్రదానం; బైపెట్టు; +* outrage, n. దౌర్జన్యం; దురంతం; దురాగతం; +* ovary, n. స్త్రీబీజకోశం; అండకోశం; గర్భాగారం; +* oven, n అవెన్) ఆవం; ఆశ్మంతం; హసంతి; కమటం; పొక్కలి; పొయ్యి; +* over-bar, n math శిరోవారం; గణితంలో బీజాక్షరాల తల మీద గీసే అడ్డు గీత; +* overcast, adj. మబ్బు కమ్మిన; మందారముగానున్న; +* overcome, v. i. అధిగమించు; నిస్తరించు; గెలుచు; జయించు; +* overhead, n. అమాంబాపతులు; పై ఖర్చు��ు; +* overlook, v. t 1) చూడకపోవు; గమనించకపోవు 2) ఒకరు చేసిన తప్పుని పట్టించుకోకుండా వదలిపెట్టు 3) పైనుండి కిందకి చూచు; +* oversight, n 1) ఏమరుపాటు ఏమరుపాటుతో చేసిన పొరపాటు 2) ఏమరుపాటుతో పొరపాట్లు జరగకుండా అజమాయిషీ చేయు note) a word with opposing meanings; +* overtake, v. t. అధిగమించు; అతిక్రమించు; పట్టుకొను; +* overtone, n. అతిస్వరం ప్రాధమిక ధ్వని తరంగం కంటె ఎక్కువ తరచుదనం (పౌనఃపున్యం) తో కంపించే తరంగం; +* overture, n 1) పూర్వరంగం 2) ఆరంభవాద్యం; సంగీత సభలలో ఉపోద్ఘాతంగా వాడే సంగీతం 3 స్నేహభావాన్ని ప్రదర్శించడం; +* overturn, v. t 1) తలకిందులు చేయు; బోల్తా కొట్టించు 2) దిగువ కోర్టులో చేసిన తీర్మానాన్ని ఎగువ కోర్టువారు కొట్టివేయు; +* overview, n. పర్యావలోకనం; విహంగావలోకనం; +* Ovoviviparous, adj. అండజ సజీవ సంతానోత్పత్తి; తల్లి కడుపులో ముందు అండం ఏర్పడి, ఆపైన అక్కడే బాగా అభివృద్ధి చెంది లార్వా, లేదా ఆపై దశల్లో తల్లి కడుపులోంచి బయటకు రావటం ఇందులో కనపడుతుంది. +* ovoparous, adj. అండజమైన; గుడ్డులోంచి పుట్టిన; ovum అనేది అండం. గుడ్లుగా తల్లి కడుపులోంచి బయటకు తెచ్చి వదిలేస్తే, వాటిని మరలా పొదిగితేనే పిల్లలు అవుతాయి. అంటే సగం అభివృద్ధి మాత్రమె తల్లి కడుపులో జరుగుతుంది. +* ovum, n. స్త్రీబీజం; అండం; శోణితం; +* owl, n. గుడ్లగూబ; పులుగుపిట్ట; ఘూకం; ఉలూకం; దివాంధం; వాయసారాతి వాయసారి; ధ్వాంక్షారాతి; పేచకం; +* owner, n. స్వామి; కామందు; యజమాని; స్వంతదారు; సొంతదారు; పట్టాదారు; +* oxidant, n భస్మీకరి; భస్మం చేసేది; +* oxide, n. ఆమ్లజనితో సంయోగం చెందగా వచ్చిన తుప్పు; +oxy-acetylene torch, ph. ఆమ్లవిదీను దివ్వె; ఈ రకం దివ్వెతో ఉక్కుని సునాయాసంగా కోయవచ్చు; +* Oxygen, n. ఆమ్లజని; ప్రాణవాయువు; రంగు, రుచి, వాసన లేని ఒక రసాయన మూలక వాయువు అణుసంఖ్య 8, సంక్షిప్త నామం O) +* oxymoron, n. విరుద్ధోక్తి; విరోధాభాసాలంకారం; సంసృష్టి; రెండు విరుద్ధమైన అర్థాలు వచ్చే మాటలని ఒకే సందర్భంలో వాడడం; ఉ. మా చెడ్డ మంచోడు; +* oyster, n. సీపి; గుల్లచేప; ఆల్చిప్ప; +* ozone layer, n. ఓజోను పొర; అంతరిక్షం నుండి హాని చేసే కిరణాలు భూమిని సోకకుండా ఆపు చేసే వాయువుల పొర; + + +* pachyderm, n. మందమైన చర్మం గల జంతువు; ఏనుగు; ఖడ్గమృగం; +* pacifier, n. m. పాలతిత్తి; పాలపీక; పసిపిల్లలని శాంతింపజేయడానికి నోట్లో పెట్టే తిత్తి; +* pacifist, n. శాంతికాముకుడు; యుద్ధ వ్యతిరేకి; +* pacify, v. t. శాంతింపజేయు; సమాధానపరచు; +* pack-animal, n. బరువులు మోసే జంతువు; గాడిద; కంచర గాడిద, ఎద్దు, మొ. +* packet, n. చిన్నబంగీ; పెద్ద పొట్లం; +* pack-horse, n. కంట్లపు గుర్రం; పెరికె గ���ర్రం; +* pact, n. ఒప్పందం; ఒడంబడిక; కరారు; +* paddy, n 1) వడ్లు; వరి; ధాన్యం; శాలి 2) వరి పండే పొలం; +* pagan, n 1. క్రైస్తవమతేతరుడు; ఏ మతం లేని వ్యక్తి; క్రైస్తవుల, యూదుల, ముసల్మానుల సమష్టి దృష్టిలో వారి మతం కానివాళ్ళంతా ఏ మతం లేని వాళ్ళ కిందే లెక్క; 2. ధర్మాన్ని అతిక్రమించే వ్యక్తి; అనాగరికుడు; 3. బహుదేవతారాధకుడు; మత వ్యతిరేకవాది; +* pageantry, n. ఉత్సవం; సమారోహం; సంబరం; సోకులయెన్నిక; +* pail, n. బొక్కెన; బాల్చీ; చెంబు; ముంత; +* painless, adj. నొప్పిలేని; నిష్కంటక; నాక ety నా అక; నిరుపహతి (నిర్ ఉపహతి ప్రమాదం లేని); +* painter, n 1 m. చిత్రకారుడు; f. చిత్రకారిణి 2) గోడలకి రంగులు వేసే వ్యక్తి; m. రంజకుడు; f. రంజకి; +* painting, n 1) వర్ణచిత్రం; చిత్తరువు 2) చిత్రలేఖనం; +* pair, n. జత; జంట; జోడీ; కవలలు; దంపతులు; యుగ్మం; యుగళం; యుక్కు; కవ; ద్విత్వం; రెంట; దోయి; +* palace, n. ప్రాసాదం; సౌధం; ధామం; రాజగృహం; దేవిడీ, +palace politics, ph రాచకోట రాజకీయాలు; రాచనగరి రాజకీయాలు; కోటలో కుతంత్రాలు; కోటలో కౌటిల్యాలు; +* palatable, adj. భోజ్య; తినదగ్గగా; తినడానికి వీలుగా; రుచిగా; +* palatals, n. తాలవ్యములు; నాలుక, అంగుడి సహాయంతో పలికే హల్లులు; చ, ఛ, జ, ఝ, ఞ; +* palate, n 1) అంగుడు; అంగిలి; తాలువు; కాకుదు; మూర్థం; నోటి కప్పు భాగంలో దంతమూలాలకీ కొండ నాలుకకీ మధ్యనున్న భాగం 2) అభిరుచి; +hard palate, ph. కఠిన తాలువు; అంగిలిలో గట్టి భాగం; మూర్థం; +soft palate, ph. మృదు తాలువు; అంగిలిలో మెత్త భాగం; +* pale, adj. పాలిపోయిన; వివర్ణమైన; రంగులేని; +* paleobotany, n. పురా వృక్షశాస్త్రం; పురాతన కాలంలో బతికిన చెట్లని, వాటి శిలాస్థుల ద్వారా గుర్తించి, అధ్యయనం చెయ్యడం; +* paleontology, n Br paleontology; పురాజీవ శాస్త్రం; ప్రాక్తన శాస్త్రం; లుప్త జంతు శాస్త్రం; శిలాజాలను గురించి చదివే శాస్త్రాన్ని శిలాజ శాస్త్రం అంటారు; మరణించిన జీవులు శిలాజాలుగా మారే ప్రక్రియల గురించి తెలియజేసే శాస్త్రాన్ని 'Taphonomy' అంటారు. +Micro-Palaeontology, ph. పెద్ద జీవులే కాకుండా సూక్ష్మ జీవుల మూలంగా తయారయ్యే శిలాజాలను అధ్యయనం చేసే శాస్త్రం కూడా ఉంది. దాన్ని సూక్ష్మ శిలాజ శాస్త్రం అంటారు; +* palimony, n. వివాహ బంధం లేకుండా ఇద్దరు కొన్నాళ్లు కాపురం పెట్టిన తరువాత విడిపోయినప్పుడు ఒకరు మరొకరికి ఇచ్చే భరణం; +* palindrome, n. కచికపదం; కచిక; భ్రమకం; అనులోమ విలోమాలు; ఎటునుండి చదివినా ఒకే మాట వచ్చే పదాలు, పాదాలు, పద్యాలు, మొ ఉ. వికటకవి; +line palindrome, ph పాద భ్రమకం; ఎటునుండి చదివినా ఒకే పంక్తి లేదా పద్యపాదం వచ్చే అమరిక; +stanza palindrome, ph. పద్య భ్రమకం: ఎటునుండి చది���ినా ఒకే పద్యం అమరిక; +* palliative, n. ఉపశమనకారి; ఉపశాంతిని ఇచ్చేది; +* pallid, adj. పాలిపోయిన; వెలవెలబోయిన; +* palm, n పామ్ 1) అరచేయి; చేర; కరతలం 2) తాళద్రుమం; తాళవృక్షం 3) తాటి, ఈత, కొబ్బరి, జీలుగ, పోక (వక్క) మొదలైన చెట్లు పామ్ (Palm) తరహాకు చెందినవే; +palm leaf, ph. తాటాకు; తాటియాకు; తాటిఆకు; తాళపత్రం; +Talipot Palm, ph. తాళపత్ర వృక్షం; సీమ తాడి; శ్రీతాళము bot Corypha umbraculifera of the Arecaceae family; ఈ వృక్షం మాత్రం నలభై, యాభై సంవత్సరాలు పెరిగి, జీవితంలో ఒకేసారి పుష్పించి, ఫలించి, ఆ తరువాత చచ్చిపోతుంది. ఇలాంటి వృక్షాలను వృక్షశాస్త్ర పరిభాషలో మోనోకార్పిక్ (Monocarpic) వృక్షాలంటారు. సెంచరీ ప్లాంట్స్ (Century Plants) పేరిట ప్రసిద్ధమైన యాస్పరాగేసీ (Asparagaceae) కుటుంబానికి చెందిన ఎగేవ్ అమెరికానా (Agave americana) మొక్కలు, చాగ నార, కలబంద తరహాకు చెందిన కొన్ని ఇతర మొక్కలు కూడా ఇలాగే జీవితకాలంలో ఒకేసారి పుష్పించి, ఫలించి, ఆ తరువాత చచ్చిపోతాయి; ఈ సీమ తాడి వృక్షం పూలలో ఒకే పువ్వు మీద స్త్రీ, మరియు పురుష జననాంగాలు రెండూ ఉంటాయి. ఇలాంటి పూవుల్ని Bisexual Flowers అంటారు. కాయలు చిన్నవిగా, గుండ్రంగా మూడు లేక నాలుగు సెంటీమీటర్ల వ్యాసం కలిగి, ఆలివ్ కాయల రంగులో ఉంటాయి.లోపలి గింజలు గుండ్రంగా, నున్నగా మెరుస్తూ, గట్టిగా ఉంటాయి; +* palmate, adj. హస్తాకార; అరచేతి ఆకారంలో ఉన్న; +* palmistry, n. హస్తసాముద్రికం; చేతిలో రేఖలని బట్టి జాతకం చెప్పే పద్ధతి; +* palpable, adj. ప్రత్యక్షమైన; స్పష్టమైన; +* palpate, v. t. అప్పళించు; నొక్కు; వైద్యుడు పరీక్ష నిమిత్తం నొక్కడం; +* palpitation, n దడ; గుండె దడ; గుండె వడిగా కొట్టుకొనుట; +* pampas, n. pl. పంపాలు; దక్షిణ అమెరికాలోని విశాలమైన మైదానాలు; +* pan, n. పెనం; మూకుడు; చట్టి; తప్పేలా; +* Panache, n 1) తురాయి; కలికి తురాయి 2) ఆత్మ స్థైర్యం; +* pancreas, n. క్లోమం; వృక్వకం; స్వాదుపిండం; అగ్నాశయం; +* pandemonium, n. దొమ్మీ; అల్లకల్లోలం; గలభా; కోలాహలం; నలబలం; +* pandiculation, n 1) ఒళ్లు విరుచుకోవడం; లేవగానే ఒళ్లు విరుచుకోవడం 2) ఆవలింత; +* panentheism, n. జగదతీత దైవభావం; విభుత్వవాదము; ప్రతి వస్తువులోనూ దేవుడు ఉన్నాడనే భావన; సర్వేశ్వరవాదంలోని కొన్ని లోపాలను పూడ్చే ప్రయత్నమే ఇది అన్నిట్లో దేవుడు ఉంటాడు, దేవుడులో అన్నీ ఉంటాయి" అన్నది నిజమే కాని దేవుడు ఇంతవరకే పరిమితం కాదు. సమస్త సృష్టి దేవుడులోనే ఉంది కానీ మొత్తం దేవుడు సృష్టికి పరిమితం కాదు. పోలుస్తూ చెప్పాలంటే దేవుడు పెద్ద వృత్తము, ప్రపంచం ఆ వృత్తంలో ఒక చిన్న వృత్తం; +* panhandler, n. ముష్టివాడు; ముష్టిది; తిరిప���ం: +* panic, n. భయాందోళన; కంగారు; గాభరా; +* panorama, n. విశాల దృశ్యం; విస్తృత దృశ్యం; దృగావరణం; +* panoramic, adj. విశాల; విస్తృత; దిగ్దర్శక; పరితోదర్శక; +* panoramic view, ph. దిగ్దర్శక దృశ్యం; విస్తృత దృశ్యం; +* panpsychism, n సర్వాత్మ సిద్ధాంతం విశ్వమంతా ఆత్మల సముచ్ఛయం అనే సిద్ధాంతం; +* pant, v. i. ఎగరొప్పు; రొప్పు ఒగర్చు; +* pantheism, n. సర్వేశ్వరవాదం; జగదభిన్న దైవభావం; భగవంతుడిలోనే అంతా ఉంది అనే భావన; దేవుడే ప్రపంచం, ప్రపంచమే దేవుడు అనే నమ్మకం; విశ్వస్వరూపమే విష్ణుస్వరూపం అన్నిట్లో దేవుడు, దేవుడులో అన్నీ భగవత్గీతలోని వాక్యం ఈ వాదాన్ని తేటతెల్లం చేస్తుంది ఎవరైతే నన్ను అన్నిట్లో(అన్నీ చోట్ల) చూస్తాడో, ఎవరైతే నా లో అన్నీ చూస్తాడో, అటువంటి వాడికి నేను ఎప్పుడూ దూరం కాను, వాడు నాకెప్పుడూ దూరం కాడు దేవుడు ఈ సృష్టి మొత్తంలో అంతర్వ్యాప్తమై ఉంటాడు. తూర్పులో ఆది శంకరాచార్యులు వంటి తత్వవేత్తలు, పశ్చిమాన బరూక్ స్పినోజ(Baruch Spinoza) వంటి వారు సర్వేశ్వరవాదులే; +* pantheon, n. దేవుళ్ళు; దేవగణాలు; సకల దేవ సమూహం; అఖిల దేవతా గణం; +* pantomime, n. అభినయం; మూకాభినయం; నటీనటులు మాట్లాడకుండా హావభావాలతో ప్రదర్శించే నాటకం; +* pantry, n. ఉగ్రాణం; వంట వార్పులకి అవసరమైన దినిసులని దాచుకునే గది; +* pantry, n. ఉగ్రాణం; కొట్టుగది; వంట ఇంటికి ఆనుకుని ఉన్న కొట్టుగది; +* pap, n. ఓదనం; దుఃఖంలో గాని భయంలో గాని ఉన్న ఒకరిని ఓదార్చడానికి వీఁపు నిమిరుట లేదా వెన్నుదట్టుట; +* papa, n. అయ్య; అప్ప; నాన్న; తండ్రి; +* papal, adj. పోపుకి సంబంధించిన; రోమన్ కేథలిక్ మతాధికారి అయున పోపుకి సంబంధించిన; +* papaya, n. బొప్పాయి; పరంగి కాయ పరింది; మదనానప కాయ; +* paper, n. కాగితం; పత్రిక; పత్రం కాకలం; పేపరు; +white paper, ph. తెల్ల కాగితం; అలేఖం; శ్వేత పత్రం; +* parable, n. దృష్టాంతం; ఉదాహరణ; నీతిబోధ; దృష్టాంత కథ; నీతి కథ; ఈ కథలలో సాధారణంగా మానవ్ పాత్రలే ఉంటాయి; see also fable; +* parachute, n. గాలిగొడుగు; మరోగుమ్మటం; పేరాషూట్; +* paradigm, n విశ్వవీక్షణం; రూపావళి; లక్షణసముదాయం; అందరూ ఒప్పుకున్న సమష్టిస్వీకరణలు (shared assumptions) “పేరడైమ్‌” అని థామస్‌ కూన్‌ (Thomas Kuhn)అంటాడు. +paradigm shift, ph విశ్వవీక్షణ విస్థాపనం; ఒక రూపావళికున్న విశ్వాసం, ఆధీనతల నుంచి మరొక రూపావళి విశ్వాసానికి బదిలీ కావటం మతపరివర్తనానుభవం (religious conversion experience) లాంటిది. అయితే, ఇది బలవంతంగా జరిగేది మాత్రం కాదు. +* paradise, n. పరంధామం; స్వర్గధామం; స్వర్గం; స్వర్గలోకం; నాకం; నాకలోకం; దివి; భోగభూమి; +* paradox, n. సత్యాభాసం; విరుద్ధోక్తి; విపర్య���క్తి; విరోధాభాసం; విరుద్ధమైన అభిప్రాయాలని ఒకే సందర్భంలో ఇరికించి చెప్పే ఉక్తి; ఉ. నీటిలో రాసిన మాటలు ఎన్నటికీ చెరిగిపోవు; +* paragraph, n. అనువాకం; పేరా; పేరాగ్రాఫు rel విభాగం; పరిచ్ఛేదం; +* paragon, n. ఆదర్శప్రాయమైనది; ఆదర్శం; +* parallax, n. దృక్ఛాయ; కోణభ్రంశం; దూరములో ఉన్న వస్తువుని చూసినప్పుడు మన కదలిక వల్ల కోణములో కనిపించే మార్పు; +* parallel, adj 1) సమాంతర; సమానాంతర 2) సాటి; తుల్య; సరిపోలే; పోటీ 3) ఏకకాలిక; సమకాలిక; +* parallelogram, n. సమాంతర చతుర్భుజం; రెండు ఎదురెదురు భుజాలు సЮాంతరంగా ఉన్న చతుర్భుజం; +* paralyze, v. t 1) స్తంభింపజేయు; అశక్తం చేయు 2) పక్షవాతం కలుగజేయు; +* paranoia, n. ఇతరులు తనకి హాని చేద్దామని అనుకుంటున్నారనే ఆధారం లేని నమ్మకం; +* paraphernalia, n. సరంజామా; సాధన సంపత్తి; హంగులు; హంగూ, ఆర్భాటం; +* paraphrase, n. దండాన్వయం; భావానువాదం; మరొకరకం మాటలతో రాసిన అన్వయం; +parasitic plant, ph. బదనిక; పరాన్నభుక్కుగా జీవించు ఉద్భిజ్జం; +* parasite, n. ఉపజీవి; పరభాగ్యోపజీవి; పరాన్నభుక్కి; పరభుక్కి; పరాన్నజీవి; see also predator; +* parasol, n. అరిగె; ఛత్రం చిన్న గొడుగు; ఎండ గొడుగు ఆతపత్రం రాజుల సింహాసనాల మీద, దేవుడి విగ్రహాల దగ్గర అలంకారానికి వాడే గొడుగు; +* parapsychology, n. అతీత మనస్తత్వ శాస్త్రం; మరొక రకం మనస్తత్వ శాస్త్రం; అసహజ/ అసాధారణ ఇంద్రియ సామర్థ్యాల వలన జరిగిన సంఘటనలను, అటువంటి దృగ్విషయాలను వాటి ఉనికిని సామర్ధ్యాల స్వభావాన్ని పరిశోధించడం, అధ్యయనం చేయటమే పారాసైకాలజీ ఉద్దేశం; +* paratyphoid, n. అతీత టైఫాయిడ్; మరొక రకం టైఫాయిడ్; +* parboiled, adj. కొద్దిగా ఉడికించిన; సగం ఉడికిన; +* parchment, n. చర్మపత్రం; ఉల్లిపొర చర్మం; +* pardon, n. క్షమాభిక్ష; క్షమాపణ; మాఫీ; మన్నింపు; +* pardon me, ph. క్షమించండి; క్షమించాలి; మాఫ్ చెయ్యండి; మన్నించండి; +* parenthesis, n. s. కుండలీకరణం; వృత్తార్ధం; చిప్పగుర్తు; చిప్ప; +* parentheses, n. pl. కుండలికరణాలు; వృత్తార్ధాలు; చిప్పగుర్తులు; చిప్పలు; +* parents, n. pl. తల్లిదండ్రులు; మాతాపితలు; జననీజనకులు; +* pariah, n పరయ్యా) వెలివేయబడ్డ వ్యక్తి; బహిష్కృతుడు; చండాలుడు; +* park, n. వనం; ఉపవనం; ఉద్యానవనం; ఎలదోట; +* parliament, n. శాసన సభ; అంటే లోక్‌సభ, రాజ్యసభ, రాష్టప్రతుల సముదాయం; +parochial school, ph. సంకుచిత దృక్పథం ఉన్న పాఠశాల; ప్రాంతీయ దృక్పథంతో నడిపే పాఠశాల; ఉ. కేథలిక్‌ చర్చి నడిపే పాఠశాల; +* parody, n. హాస్యానుకృతి; వ్యంగ్యానుకరణ; ఎగతాళి; +* parrot, n. చిలుక; రామచిలుక; శుకం; కీరం; +* parse, v. t. అన్వయించు; అన్వయం చెప్పు; వాక్యంలోని కర్త, కర్మ, క్రియలని విశ్లేషించు; వ్యా���రించు rel ప్రస్తరించు అంటే గురు లఘువులని గుర్తించి పద్యపాదాన్ని గణ విభజన చేసి విశ్లేషించడం; +* parsimonious, adj. మితవ్యయ; ఎక్కువ ఖర్చుకాని; క్లుప్త; +* parsimony, n. లోభత్వం; పిసినిగొట్టుతనం; క్లుప్తత్వం; +* parsley, n. పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా వండిన వంటకాలని అలంకరించడానికి వాడే కొత్తిమిర లాంటి ఆకు పత్రి bot Petroselinum; +* part, n 1) భాగం; వంతు; వాటా; పాలు; అంశం; అంశ; కోరు 2) పాపిడి; కేశవీధి; +* parthenogenesis, n bio అనిషిక్తజననం; పురుష సంపర్కం లేకుండా జరిగే పుట్టుక; +* partial, adj. అర్ధాంతర; పార్శ్వ; పాక్షిక; ఆంశిక; +* partiality, n. పక్షపాతం; పక్షపాత బుద్ధి; వలపక్షం; +* partially, adv. పాక్షికంగా; ఆంశికంగా; అర్ధాంతరంగా; +* participate, v. t. పాల్గొను; పాలుపంచుకొను; పూనుకొను; +* participle, n. క్రియావాచకాన్ని విశేషణాన్ని పోలిన క్రియాజన్యమైన పదం; +* particle, n. నలుసు; రేణువు; సూక్ష్మకణం; శకలం; పీలు[ +* partisan, n. పక్షవాది; రెండు పక్షాలలో ఒక వైపు మొగ్గు చూపే వ్యక్తి; +* partition, n. మందడి; భిత్తి; విభాగం; అంతరావేది; +* partner, n. భాగస్వామి; భాగస్థుడు; పాలి; పాలేరు; +life's partner, ph. జీవిత భాగస్వామి; సహధర్మచారి; సహధర్మచారిణి; +* partnership, n. భాగస్వామ్యం; పాలివ్యాపారం; పొత్తు; +* partridge, n. కౌజు; కోడిని పోలిన ఒక పక్షి; చందమామ పులుగు; +* party, n 1) పక్షం; కక్షి; దళం; వైపు; తరఫు; జట్టు; పెళ్లివారు; మేళం; బృందం 2) వేడుక; విందు; +third party, ph. అన్యుడు; ఇతరుడు; ఇరు పక్షాలకీ చెందని పైవాడు; +* pass, v. i 1) ఒదులు 2) కృతార్థుడగు; ఉత్తీర్ణుడగు; +* passage, n 1) ప్రయాణం 2) దారి; మార్గం; నడవ 3) ప్రయాణానికయే ఖర్చు 4) ప్రయాణానికి కావలసిన టికెట్టు; +* passe, n పస్సే idiom] పాతచింతకాయ పచ్చడి; పాడిన పాటే పాడడం; +* passenger, n. ప్రయాణీకుడు; యాత్రి; రధి; ముసాఫిర్; బండిలో ప్రయాణం చేసే వ్యక్తి; +* passer-by, n. దారి వెంబడీ పోయేవాడు; దారిన పోయే దానయ్య; +* passive, adj. కలుగజేసుకోకుండా ఊరక ఉండు; రికాం; +* passport, n గుర్తుపొత్తం; ఒక మనిషి ఎవ్వరో నిర్ద్వంద్వంగా గుర్తించడానికి, ఆ వ్యక్తి ఫొటో, పుట్టిన తేదీ, పౌరసత్వం వగైరాలతో ప్రభుత్వం ఇచ్చే చిరుపొత్తం; ఈ పుస్తకం లేకుండా దేశం వదలి ప్రయాణం చెయ్యడం కుదరదు; +* passphrase, n. సంకేత సమాసం; గమన సమాసం గమనాన్ని- pass కొనసాగించటానికి సహకరించే సమాసం) +* password, n. సంకేతపు మాట; సంకేతపదం; గమనపదం (గమనాన్ని- pass కొనసాగించటానికి సహకరించే పదం) +* past, adj. జరిగిపోయిన; గతించిన; గడచిపోయిన; ఆగత; భూత; +* past, n. జరిగిపోయినది; గతం; గతించినది; +past perfect, ph gram గతంలో జరిగిన రెండు సంఘ్టనల గురించి చెప్పేటప్పుడు, రెండింటిలో ముందు జరిగిన సంఘటనని చెప్పే కాలం; ఉదాహరణకి మూర్తి వచ్చేసరికి నేను భోజనం చేసేసేను" అన్న దానిని ఇంగ్లీషులో "I had finished my meal before Murthy came” అన్నప్పుడు "had finished” అన్న పదబంధం past perfect tense లో ఉందన్నమాట ఈ భావానికి సరితూగే భావం తెలుగు వ్యాకరణంలో లేదు; +* pasta, n. సేమ్యాని పోలిన పిండితో చేసిన ఇటలీ దేశపు తినుబండారం; మనకి అన్నం ఎలాగో ఇటలీ వారికి పాస్టా అలాంటిది; +tooth paste, ph. దంతధావన ఖమీరం దంతశుభ్ర కల్కం; పన్నులుతోము ముద్ద; +* pastel, n. రంగుల బొమ్మలు గియ్యడానికి రంజన ద్రవ్యాన్ని నీళ్లల్లో కలిపి చేసిన ముద్ద; +pastel colors, ph. లేతరంగులు; లేత నీలం కాని, లేత గులాబీ కాని; +* pastime, n. కాలక్షేపం; విరామ క్రీడ; క్రీడలు; ఆట; వినోద కాలక్షేపం; +* pastor, n. క్రైస్తవ పురోహితుఁడు; ప్రొటెస్టెంట్ తెగకి చెందిన పురోహితుడిని పేస్టర్ అంటారు; ఇతను వివాహం చేసుకుని, సంసారం చెయ్యవచ్చు; +* pastry, n. ఆపూప్యం; పిండి, పాలు, వెన్న మొదలైన ఘటక పదార్ధాలతో చేసిన రొట్టెలు, పూర్ణానికి చుట్టే తావి, మొదలైన వంటకాలు, తియ్యటి కేకు, వగైరా; +* pasteurization, n. సూక్ష్మజీవులని చంపడానికి పాల వంటి పదార్థాలని వేడి చేసి చల్లార్చే పద్ధతి; +* pasture, n. పచ్చిక పొలం; పచ్చిక బయలు; అజ్రం; +* patch, n 1) అతుకు; మాసిక; టాకా 2) ముక్క; చిన్న ప్రదేశం; +* patella, n. మోకాటిచిప్ప; మోకాలిచిప్ప; +* patent, n. ఏకస్వం; విశిష్టాధికారం; సన్నదు; +paternal aunt, ph. మేనత్త; తండ్రికి అక్క లేదా చెల్లెలు; +* path, n. బాట; పథం; మార్గం; దారి; తెరువు తెన్ను; తోవ; అయనం; పుంత; డొంక; సరవి; చనుప; నడవ; చొప్పు; జాడ; +* pathetic, adj. దయనీయ; కనికరపు; విషాదకరమైన; జాలి పుట్టించే; మనస్సుని కరిగించే; +* pathetic, adj. దయనీయ; కనికరపు; మనస్సుని కరగించెడు; +pathogenic bacteria, ph. రోగాన్ని కలిగించే సూక్ష్మజీవులు; రోగకారక సూక్ష్మజీవులు; +* pathology, n. రోగనిదాన తంత్రము; రోగ నిర్ణయ శాస్త్రం; +* pathological liar, ph. రోగ లక్షణం అనిపించే విధంగా అబద్ధాలు చెప్పే వ్యక్తి; +* patience, n. ఓరిమి; ఓర్మి; ఓర్పు; సహనం; సహన శక్తి; క్షమ; తాలిమి; సైరణ; క్షాంతి; +* patient, n. రోగి; అస్వస్థుడు; వ్యాధిగ్రస్తుడు; రుజాగ్రస్తి; అభ్యమితి; నోవరి; నొప్పిగుంటి; ఉపతాపి; పరితాపి; ఆమయాని; ఆతురుడు; పీడితుడు; +* patriarchal, adj. పితృస్వామ్య; పితృతంత్ర; పితృయజమాన; +* patriarchy, n. m. పితృస్వామ్యం; పితృతంత్రం; పితృ అధికారం; +* patrol, v. t. గస్తీతిరుగు; ప్రహరించు; ప్రహరితిరుగు; కాపలా కాయు; +* patron, n. m. ఘటకుడు; ప్రాపకుడు; ప్రాపు; పోషకుడు; f. ప్రాపకురాలు; +* patronize, v. i 1) జాలిపడ్డట్టు నటించడం; ఎదటివాడు అంతటి ముఖ్యుడు కానట్టూ, అంత త���లివైనవాడు కానట్టూ అనిపించేలా ప్రవర్తించడం; అభిమానం ఒలికిపోతున్నట్లు అభినయించడం 2) రివాజుగా ఒకే వ్యాపార సంస్థకి బేరాలు ఇవ్వడం; +* pattern, n. బాణీ; నమూనా; మచ్చు; మాదిరి; ప్రకారం; కైవడి; +* paucity, n. సంక్షోభం; ఎద్దడి; దొరకక పోవుట; కొరత; స్వల్పత; +* pauper, n. అర్థహీనుడు; బీదవాడు; బికారి; దరిద్రుడు; నిరాధారి; అకించనుడు; +* pause, v. t నిలుపు; ఆపు; తాత్కాలికంగా ఆపు చేయు; +* paw, n. పంజా; పాదం; జంతువుల పాదం; +* pawn, n 1) బంటు; కీలుబొమ్మ 2) పావు; పిక్క; నప్పు 3) కుదువ; తాకట్టు; +* pawn, v. t. కుదువబెట్టు; తాకట్టుబెట్టు; +* pay, v. t. చెల్లించు; కట్టు; ఇచ్చు; తీర్చు; +* payee, n. గ్రహీత; సొమ్ము పుచ్చుకొనేవాడు; +* payer, n. దాయకుడు; దాత; సొమ్ము ఇచ్చేవాడు; +* peacock, n. m. నెమలి; నెమలిపుంజు; మయూరం; శిఖి; కేకి; నీలకంఠం; +* peahen, n. f. నెమలి; నెమలిపెట్ట; మయూరి; నెమ్మి; +* peak, n. శిఖరం; శృంగం; కొన; అగ్రభాగం; +* pearl, n. ముత్యం; మంచి ముత్యం; నవ రత్నములలో నొకటి +* peasant, n. m. పల్లెటూరివాడు; కృషీవలుడు; +* pectoral, adj. గుండెవైపు; ఛాతీకి సంబంధించిన; కడుపువైపు; ఉదర; +* peculiar, adj. విచిత్రమైన; అసమాన్యమైన; అనుకౢప్తమైన; +* peculiarity, n. విచిత్రం; అసామాన్యం; అనుకౢప్తి; +* pedagogue, n. ఉపాధ్యాయుడు; శిక్షణ ఇచ్చే వ్యక్తి; ఒక నిర్ణీత పద్ధతిలో బోధన చెయ్యాలని చాదస్తపడే వ్యక్తి; +* pedal, n. పాదుక; సైకిలు, కుట్టుమిషను, పియానో వగైరాలలో పాదంతో తొక్కే తులాదండం; +* peddler, n. వీధుల వెంబడి తిరుగుతూ సరుకులు అమ్ముకునే వ్యక్తి; +* pedestrian, n. పాదచారి; పదస్తలి; పాంథుడు; పథికుడు; +* pedicel, n. పుష్పవృంతం; తొడిమె; పువ్వుకి ఉండే కాడ; +* pedigree, n. వంశవృక్షం; వంశావళి; ప్రవర; వంగడం; +* pedophile, n. లైంగిక దృష్టితో చిన్న పిల్లలని ప్రేమించే తత్వం ఉన్న వ్యక్తి; +* peelings, n. తొక్కు; ఒలచగా వచ్చిన తొక్కు; తొక్కలు; +* peeping Tom, n. తలుపు కన్నాలనుండీ, కిటికి సందులనుండీ ఇళ్ళల్లోకి చూసే వ్యక్తి; busybody; rubberneck; +* peer, n. సాటి; సహపాఠి; సహాధ్యాయి; తుల్యుడు; +* peers, n. pl. సాటివారు; సహాధ్యాయులు; తుల్యులు; +* peg, n 1) సీల; చీల; గుంజ; కర్ర మేకు; దబ్బ 2) వీణ వంటి వాయిద్యాలలోని తీగలని బిగించడానికి చేత్తో పట్టుకుని తిప్పే చీల 3) అంచనా వేసేటప్పుడు మెట్లవారీగా పైకో కిందికో మారే పరిమాణం 4) మాదక ద్రవ్యాలని సేవించేటప్పుడు వాడే కొలమానం; +* Pegasus, n 1) ఉత్తరాభాధ్ర 2) పేధ్వఘాశ్వం; అహిహననం; +* pejorative, adj. పాడైన; అపకర్ష; ఒక మాట యొక్క అసలు అర్థం కంటె చెడ్డ అర్థాన్ని ఆపాదించే; +* pelican, n. గూడకొంగ; పెద్దేటి కొంగ; +* pelt, n. చర్మం; బొచ్చు ఉన్న జంతువుల చర్మం; సాన పట్టడానికి అనుకూలంగా తయారుచేయబడ్డ చర్మం; +* penal, adj. శిక్షా; శిక్షకి సంబంధించిన; +* pencil, n 1) కుంచిని; పెన్సిలు; కూఁచి 2) శలాకం; +* pendant, n. పతకం; తరళం; లంబనం; బావిలీ; కుండలం; వేలాడే వస్తువు; +* penicillin, n. బేక్టీరియా జాతి సూక్ష్మజీవులని హతమార్చడానికి వాడే ఒక మందు; ఇది వైరసు జాతి సూక్ష్మజీవుల మీద పని చెయ్యదు; +* penis, n. పురుషాంగం; శిశ్నం; శిశ్ఞం; లింగం; మేఢ్రం; పురుషుని జననాంగం; +* peninsula, n. ద్వీపకల్పం; మూడు పక్కల నీటితో సమావృతమైన భూభాగం; +* penitence, n. పశ్చాత్తాపం; అనుతాపం; తాను చేసిన తప్పు గురించి పడే చింత; +* penitentiary, n. జైలు; ఖైదు; కారాగారం; శిక్షాగృహం; పశ్చాత్తాపగృహం; +* penknife, n. అసిపుత్రి; చురకత్తి; చిన్న కత్తి; +* pensively, adv. సాలోచనగా; విచారగ్రస్తంగా; చింతగా; +* pentode, n. పంచోడు; ఐదు అంశాలు ఉన్న శూన్య నాళిక; +* pentose, n chem పాంచక్కెర; పంచభుజి ఆకారంలో నిర్మాణశిల్పం ఉన్న ఒక రసాయనం; +* penultimate, adj. ఉపాంత్య; ఉపధా ఊనాంత, UnAMta; ఒకటి మినహాయించి ఆఖరుది; పెనాది; చివరిదాని ముందున్నది; +penultimate Saturday, ph. ఉపాంత్య శనివారం; సాధారణంగా ఇది నెలలో మూడవ శనివారం అవుతుంది; +* penury, n. బీదరికం; పేదరికం; లేమి; బీదతనం; దరిద్రం; +* peon పియాన్, ప్యూన్) n. బంట్రోత్తు; +* people, n. జనం; జనాలు; ప్రజలు; ప్రజ; ప్రజానీకం; మనుషులు; జనత; లోకులు; +green pepper, ph. పచ్చి మిరపకాయలు; పచ్చ మిరపకాయలు; +red pepper ph. మిరపకాయలు; ఎర్ర మిరప కాయలు; +* per, adv. చెరి; చొప్పున; ఒక్కంటికి; +* perambulate, v. i చుట్టు తిరుగు; ప్రదక్షిణం చేయు; +* percent, n. శాతం; శతాంశం; నూటికి నూర్పాలు; ప్రతిశతం; డోకడా; శేకడా; +* percept, n. పసిదం; తన్మాత్ర; శబ్ద, స్పర్శ, రస్, రూప, గంధాలని తన్మాత్రలు అంటారు; +* perception, n. పశ్యత; గోచరత్వం; గోచరింపు; గ్రాహ్యత; నిర్వికల్పం; అవగతి; అభిదర్శన; +* perch, n. వాలుకొయ్య; పక్షులు వాలడానికి అనువైన కొయ్య; +* percussion, n. సంఘట్టనం; వేళ్ళతో మీటడం; వేళ్ళతో కొట్టడం; +percussion instruments, ph. pl. వేళ్ళతో మీటడం వల్ల శబ్దం పుట్టించే వాద్యాలు; వీణ, మద్దెల మొ.; +* peregrine, adj తిరుగాడే; వలస పోయే; యాత్రలు చేసే; +* peremptory, adj. ప్రశ్నించడానికి వీలులేని; ఖండితమైన; +perennial rivers, ph. జీవనదులు; సంవత్సరం పొడుగునా ప్రవహించే నదులు; +* perfect, adj. పూర్ణ; పరిపూర్ణ; బ్రహ్మాండ; సమగ్ర; +* perforated, adj. చిల్లుల; చిల్లులు ఉన్న; చిల్లు చేయబడ్డ; జల్లి; సచ్ఛిద్ర; +perforated cathode, ph. సచ్ఛిద్ర రుణధ్రువం; బెజ్జాలు ఉన్న రుణధ్రువం; జల్లి రుణధ్రువం; +* perforation, n. చిల్లు; జల్లు; రంధ్రము; బెజ్జం; ఛిధ్రం; +* perforator, n. చిల్లు కారి; చిల్లులు పొడిచే పనిముట్టు; చిల్లులు పొడిచేవాడు; +* perform, v. t. నిర్వర్తించు; నిర్వహించు; నెరవేర్చు; చేయు; +performing arts, ph. ప్రదర్శక కళలు; ప్రేక్షకుల ఎదుట ప్రదర్శించడానికి అనువైన సంగీతం, నాట్యం నాటకం, మొదలైన కళలు; +* perfume, n. సుగంధ ద్రవ్యం; పరిమళ ద్రవ్యం; +* perfunctory, adj. మొక్కుబడికి చేసినట్లు; శ్రద్ధలేని; +* periastron, n. నక్షత్రసమీప బిందువు; నక్షత్రం చుట్టూ ప్రదక్షిణాలు చేసే గ్రహాల దీర్ఘవృత్తపు కక్ష్యలో నాభికి (అనగా, నక్షత్రానికి) అత్యంత సమీపంలో ఉన్న బిందువు; the point nearest to a star in the path of a body orbiting that star; +* perigee, n. పరిజ్యము; భూసమీప బిందువు; భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేసే ఉపగ్రహాల దీర్ఘవృత్తపు కక్ష్యలో నాభికి (అనగా, భూమికి) అత్యంత సమీపంలో ఉన్న బిందువు; సూర్యుడి చుట్టూ తిరిగే శాల్తీల విషయంలో ఈ మాట కి బదులు perihelion అన్న మాట వాడతారు ant apogee; +* peril, n. ప్రమాదం; విపత్తు; ఆపద; బారి; ఉపద్రవం; గండం; సంకటం; +* perimeter, n. చుట్టు ఉండే అవధి కైవారం; చుట్టుకొలత; +* period, n 1) బిందువు; వాక్యం చివర వచ్చే బిందువు 2) ఆవర్తన కాలం; ఆవర్తి; గచ్ఛాంకం 3) కాలం; వ్యవధి; గడువు; సేపు 4) సమయం; దశ; కాలాంశ 5) బహిష్టు అయే వేళ; +* periodic, adj. నియత్‌కాలిక; ఆవర్తన; ఆవర్తిక; గచ్ఛిక; ముహుర్ముహు; +* periodical, n 1) పత్రిక; వార్తాపత్రిక; వారంవారీగా కానీ, నెలవారీగా కాని వచ్చే పత్రిక 2) ఆవర్తకం; +* periodicity, n. ఆవర్తన కాలం; ఆవర్తత; అవర్తిత్వం; గచ్ఛత్వం; +* perishable, adj. కుళ్ళిపోయే; పాడయిపోయే; పాడయే; క్షర; నశించే; నశ్వర; +* perjury, n. అబద్ధపు సాక్ష్యం; దొంగ సాక్ష్యం; అప్రమాణం; అబద్ధం; కూటసాక్ష్యం; +* permanent, adj. శాశ్వత; శాశ్వతమైన; నియతం; అతైంతిక; పక్కా; +* permeability, n 1) ప్రవేశ్య శీలత; ప్రవేశ్యత; పారగమ్యత; వ్యాప్తి; భేద్యత; చొరనిచ్చెడు గుణము; ద్రవాలని కాని, వాయువులని గాని ఒక పదార్థం తన గుండా చొరనిచ్చెడి గుణం 2) అయస్కాంత ప్రవాహాన్ని తనగుండా పారనిచ్చే లక్షణం; దీనిని గ్రీకు అక్షరం 'మ్యు" తో సూచిస్తారు see also) permittivity; +* permission, n. అనుమతి; ఆనతి; అంగీకారం; అనుమోదం; సెలవు; +* permit, n. అనుమతి పత్రం; అంగీకార పత్రం; ఫర్మానా చీటీ; ఒప్పునామా; సరాటిక; పెర్మిట్; +* permit, v. t. అనుమతించు; ఉత్తరువు ఇచ్చు; అనుజ్ఞ ఇచ్చు; +* permittivity, n. ఒక మాధ్యమం తనలో విద్యుత్ తలీకరణాన్ని ప్రోత్సహించే లక్షణం; దీనిని గ్రీకు అక్షరం 'ఎప్సిలాన్" తో సూచిస్తారు see also) permeability; +* permutation, n. క్రమవర్తనం; క్రమచయనం; ప్రస్తారము; ప్రస్తారణ; వినిమయం; ఫిరాయింపు; తారుమారు; ఒక వస్తు సముదాయపు వరుస క్రమాన్ని తారుమారు చెయ్యడం; +permutation and combination, ph క్రమచయసంచయము; క్రమవర్తనం, క్రమసంచయం; క్రమవర్త��� క్రమసంచయాలు; +* permute, v. t. ప్రస్తారించు; తారుమారు చేయు; +* pernicious, adj. ప్రమాదకరమైన; అతి హానికరమైన; ప్రాణాంతకమైన; +pernicious anemia, ph ప్రమాదకరమైన రక్తలేమి; ప్రాణాంతకమైన రక్తలేమి; +* perpetual, adj. సదా; నిరంతర; అనుశృత; శాశ్వత; అనవరత; సతత; ఎల్లప్పుడూ; +perpetual motion machine, ph. సదా గతి యంత్రం; అనుశృత చలన యంత్రం; నిరంతర చలన యంత్రం; సతత చలన యంత్రం; +* Perseus, n. యయాతి; నక్షత్రములో ఒకటి; +* perseverance, n. నిష్ట; పట్టుదల; తితీక్ష; అధ్యవసాయం; ఓర్పు; అభినివేశం; +* Persia, n. తురక దేశం; తురక నాడు; ప్రస్తుత ఇరాను; +* person, n 1) వ్యక్తి; ఆసామీ; శీలి; ఘటం 2) పురుష; పురుషం 3) పురుషుడు; స్త్రీ; +* person, suff. అళువు; శాలి; శీలి; కోరు; వంతుడు; పరుడు; అయ్య; అమ్మ; వతి; ఘటం; +good-natured person, ph. మనస్వి; సౌమ్యుడు; సౌమ్యురాలు; సౌశీల్యుడు; సౌశీలి; +good person, ph. మంచి మనిషి; సత్పురుషుడు; సాధ్వి;;్ +naive person, ph. వెర్రినాగమ్మ; అమాయకుడు; అమాయకురాలు; +timid person, ph. భయస్థుడు; భయస్థురాలు; భీరువు; పిరికి; బెదురుగొడ్డు; +* personal, adj. వ్యక్తిగత; వ్యక్తిగతమైన; స్వకీయమైన; స్వంత; సొంత ఏదర; పురుషవాచక; +* personal, n. వ్యక్తిగతం; స్వకీయం; స్వంతం; ఏదర; +* personification, n 1) మూర్తి 2)మూర్తిమత్వారోపణ జీవం లేని వస్తువుకి చైతన్యం ఆపాదిస్తూ చెప్పే అలంకారం; +* personnel, n. సిబ్బంది; పనివారు; పని చేసేవారు; ఉద్యోగస్తులు; +* perspiration, n. చెమట; స్వేదం; స్వేదజలం; స్వేదోదకం; ఘర్మజలం; +* pervasive, adj. అభివ్యాపకమైన; వ్యాప్తి చెందే; +* pervert, n. విపరీత బుద్ధులు కల వ్యక్తి; +* pessimism, n. నిరాశావాదం; నైరాశ్యం; శల్య సారధ్యం; +* pest, n 1) తెగులు; చీడపురుగు; తెవులు; చీడ; మరి 2) కలుపు; కలుపు మొక్క; అలం; సస్యంలోని గాదం +* pester, v. t. వేధించు; పీడించు; పీకుకొని తిను; నసపెట్టు; సతాయించు; షంటు; +* pesticide, n. అరిష్టారి; క్రిమి సంహారిణి; +* pestle, n. పొత్రం; రోకలి; బండ; గూటం; పేషణి; +* pet, adj. పెంపుడు; ప్రీతిపాత్రమైన; అనుంగు; +* pet, n. పెంపుడు జంతువు; సాధారణంగా ఇంట్లో ఉంచుకొనే కుక్కలు, పిల్లులు, చిలుకలు, మొదలైన వాటిని ఉద్దేశించి వాడతారు rel domesticated ant wild; +* pet, v. t. దువ్వు; నిమురు; ముద్దు చేయు; +* petal, n. దళం; రేకు; పత్రం; పుష్పదళం; ఆకర్షణపత్రం; +* petite, adj. సన్నంగా; కురచగానే ఉన్నప్పటికీ అందంగా ఉన్న ఆడదాన్ని ఉద్దేశించి వాడే విశేషణం; +* petit mal, n. బాలపాపచిన్నె; చిన్న పిల్లలకి వచ్చే మూర్చ రోగం; +* petition, n. దరఖాస్తు; విన్నపం; మనవి; అర్జీ; +* petitioner, n. అర్జీదారు; దరఖాస్తుదారు; విన్నపస్థుడు; +* petrified, adj 1) శిలీభవించిన; శిలగా మారిన; రాయి అయిన; ప్రస్తరీభూత 2) కోపంతో కాని ఆశ్చర్యంతో కాని స్థాణువుగా మారిన 3) ��యకంపితమగు; భయంతో అవాక్కగు; +* petrol, n. పత్తరాయిల్; పెట్రోలు పెట్రోల్ +* petroleum, n. శిలతైలం; రాతిచమురు; రాతి నూనె; మట్టినూనె; ముడి చమురు; +petroleum jelly, ph. శిలతైల ఖమీరం; దీనినే వెసలీను అనే వ్యాపారనామంతో అమ్ముతారు; +* petticoat, n. లంగా; పావడా; శాటం; అంగదట్టం; తాబందు; లోపల వేసుకొనే పరికిణీ; +* pettifogger, n. చిల్లర మోసగాడు; చిల్లర మోసకత్తె; +* petting, n 1) దువ్వడం; పెంపుడు జంతువుల శరీరం మీద చెయ్యివేసి దువ్వడం 2) ప్రేమికులు ఒకరి శరీరం మీద మరొకరు చెయ్యివేసి దువ్వడం; +* petty, adj 1) చిన్న; చిల్లర; ముఖ్యమైనది కాని 2) చవకబారు; స్వల్ప బుద్ధితో; +* phagocytes, n. కణభక్షకులు; భక్షక కణములు; రక్తంలోని తెల్ల కణములు ఈ భక్షక కణముల జాతివి; +* phallus, n. లింగం; లింగానికి ప్రతిరూపమైన విగ్రహం; శివలింగం వంటి ఆకారం; +* pharmacist, n. అగదంకారుడు; మందులు కలిపే వ్యక్తి; +* pharmacopoeia, n. ఔషధ సంగ్రహం; ఔషధ కోశం; భేషజకల్పసూత్ర సంహితం; +* pharmacy, n. దవాఖానా; ఔషధశాల; మందులని అమ్మే స్థలం; మందుల కొట్టు; +* pharynx, n. సప్తపథ; గొంతుకలోని కండరాల కట్టడం; +* phase, n. దశ; కళ; దఫా; ఘట్టం; ఒక ఆవర్తన ప్రమేయంలో ఒక మూల బిందువు నుండి ప్రస్తుతం ఉన్న బిందువు దగ్గరకి ఉన్న దూరం; +phase velocity, ph phys దశ వేగం; ఉదా: సైను ప్రమేయంలో ఈదో ఒక నిర్దిష్టమైన బిందువు, మచ్చుకి శిఖ, ఎంత జోరుగా కదులుతున్నాదో చెప్పే వేగం; +* phenomenon, n. దృగ్విషయం; దృగంశం; ఆదిభౌతికం; జ్ఞానేంద్రియాలతో గ్రహించి మాటలతో వర్ణించగలిగే ప్రకృతి సంభవమైన విషయం; ఉ. సూర్యగ్రహణం; ఇంద్రధనుస్సు మొ. +* phenomenal, adj 1) దృగ్విషయాత్మక; ఆధిభౌతిక 2) అసాధారణ; మెచ్చదగ్గ; హర్షణాత్మక; +* philatelist, n. తపాలా బిళ్లలని సేకరించే వ్యక్తి; తపాలా బిళ్లల మీద ప్రేమ; +* philanthropist, n. దాత; లోకోపకారి ety philein అంటే ప్రేమించడం; anthropos అంటే మనిషి; సాటి మనిషిని ప్రేమించే వ్యక్తి అని అర్థం; +* philology, n. భాషాశాస్త్రం; శబ్దశాస్త్రం; లక్షణశాస్త్రం; భాష మీద ప్రేమ; +* philosopher, n. తత్త్వవేత్త; తాత్త్వికుడు; దార్శనికుడు; వేదాంతి; +* philosopher's stone, n. స్పర్శవేది; పరసువేది; నీచ లోహాలని ఉత్తమ లోహాలుగా మార్చగలిగే మహత్తర శక్తి ఉన్న రాయి; ఇటువంటి రాయి ఇంతవరకు ఎవ్వరికీ తారసపడలేదు; +* phlegm, n ఫ్లెమ్) శ్లేష్మం; కఫం; తెమడ; కళ్ల; +* phobia, n. భయం; జడుపు; అర్థంలేని భయం; మానసిక బలహీనత; +cynophobia n. కుక్కలంటే భయం; కుక్కజడుపు; +* phoneme, n. వర్ణం; వాక్‌శబ్దం; ప్రాథమిక శబ్దం; హలంతాక్షరం; +* phonetics, n. శిక్షాశాస్త్రం; శబ్దశాస్త్రం; +* phony, adj. నకిలీ; అవాస్తవిక; నిజం కాని; +* phonology, n. శబ్ద శాస్త్రం; ఉచ్చారణ శాస్త్��ం; ఉచ్చారణ నియమాలని అధ్యయనం చేసే శాస్త్రం; +* photograph, n. ఛాయాచిత్రం; ప్రతిచ్ఛాయ; ఫోటో; +* photon, n. ఫోటాను; కాంతికణం; తేజాణువు; +* photosynthesis, n. రవిసంధానం; కిరణజన్య సంయోగక్రియ; కిరణ సంధానం; +* phrase, n. పదబంధం విస్తృతపదబంధం; క్రియలేని మాటల సముదాయం పదబంధాలు నాలుగు రకాలు, సమాసం, నుడికారం, శబ్దపల్లవం, నుడికారం; +* phyllosphere, n. పత్రావరణం; భూతలానికి పైన ఉన్న వృక్షసంబంధమైన, సూక్ష్మజీవుల భుక్తికి అనువిన పదార్థం; +* physical, adj 1) భౌతిక; ప్రకృతి సంబంధమైన 2) ఐహిక; శారీరక; కాయ; +* physics, n. భౌతికశాస్త్రం; ప్రకృతి లక్షణాలని అధ్యయనం చేసే శాస్త్రం; +* physiology, n. శరీర శాస్త్రం; ఇంద్రియ శాస్త్రం; +* pial, n. అరుగు; తిన్నె; జగిలె; ఇంటి ముందు కూర్చునే తీనె వంటి వసారా; +* pick, v. t 1) ఏరు; ఎంచు; ఎన్నిక చేయు; కోయు 2) పొడుచు; గొలుకు; +* pick axe, n. గడ్డపలుగు; గడ్డపార; పికాసి; గుద్దలి; +* pickle, n. ఊరుగాయ అవదంశం; ఉపదంశం; +* pickling, n. ఊరబెట్టడం; భావన చెయ్యడం; +* pickpocket, n. జేబుదొంగ; కత్తెరదొంగ; ఎత్తుబరిగాడు; +* picnic, n. వనభోజనం; వినోదయాత్ర; పిక్‌నిక్; +* picture, n. బొమ్మ; చిత్రం; చిత్తరువు; +* piece, n 1) ముక్క; ఖండం; తునక; తుత్తునియ; శకలం; నుగ్గు 2) కాయ; పిక్క; పావు; ఆటలలో వాడే పిక్క 3) ఉరువు; +* piecemeal, adv. ముక్కలు ముక్కలుగా; ఇదో పిసరు, అదోపిసరు మాదిరి; ఏకాండీగా కాకుండా; +* piecemeal, n. ముక్కలు ముక్కలుగా; విడివిడిగా; ఏకాండీగా కాకుండా; +* pier, n 1) రేవు; ఓడలు నిలిచే స్థలం 2) వంతెన కట్టడానికి వాడే స్తంభం; +* piety, n. భక్తి; భగవంతుని యెడల, తల్లిదండ్రుల యెడల, సంప్రదాయాల పట్ల భక్తి విశ్వాసాలు; +* piezoelectricity, n. పీడన విద్యుత్తు; దాబ విద్యుత్ ప్రభావం; కొన్ని పదార్థాల మీద పీడనం ప్రయోగించినప్పుడు పుట్టే విద్యుత్తు; +* pig, n. పంది; ఊరపంది; సూకరం; వరాహం; పోత్రి; విట్చరం; +passenger pigeon, ph. పాంథ పావురం bio Ectopistes migratorius ఈ పావురం జాతి 1 సెప్టెంబరు 1914 తేదీన అమెరికాలోని సిన్‌సినాటీ జంతు ప్రదర్శన శాలలో విలుప్తం అయిపోయింది; +* pigheaded, adj. మొండి; ఉలిపి దూరాలోచనలేని; మూర్ఖపు; +* pika, n. కులింగం; శీతలప్రాంతాలలో నివసించే కుందేలు జాతికి చెందిన ఒక తోకలేని చిన్న ఎలుకవంటి జంతువు; పోకిమాన్ టీ.వీ. షోలోని పికాట్చూ అనే కార్టూన్ జంతువు దీని ఆధారంగానే చిత్రీకరించబడినది; +* pile, v. t. పోగుచేయు; పేర్చు; బొత్తిపెట్టు; +* pile, n. పోగు; కుప్ప; తిప్ప; రాశి; బొత్తి; దొంతర; దొంతి; ఒలికి; కట్ట; వామి; మేటు; +* piles, n. మూలశంక; మొలలు; hemorrhoids; దానిమ్మ తొక్కల పొడి (Powdered pomegranate peel ఆయుర్వేద మందుల దుకాణాల్లోనూ, ఆన్లైన్ లోనూ దొరుకుతుంది. ఉదయం సాయంత్రం ఒకో చెంచాడు చూర్ణం నీటితో కలిపి తాగితే విరేచనం అయేటప్పుడు రక్తం పోకుండా ఆపుతుంది. +* pilferer, n. లూటీకోరు; పశ్యతోహరుడు; +* pillage, n. దోపిడీ; అలజడి సమయాలలో జరిగే దోపిడీ; +* pilot, n. కర్ణధారి; వైమానికుడు; చోదకుడు; మాలిమి; పీలిగాడు; పడవని కాని విమానాన్ని కాని తోలే వ్యక్తి; +* pimento, n. ఒక రకం తియ్య మిరపకాయలు పెప్పర్‍" అంటే మిరియాలా, మిరపకాయలా అని స్పష్టత పోయేసరికి బుడతగీచులు పిమెంటో అనే మాటని తయారు చేసి మిరపకాయలని ఆ పేరుతో పిలవమన్నారు కాని ఆ పేరు ఒక రకం తియ్య మిరపకి స్థిరపడి పోయింది; +* pimp, n. తాపిగాడు; తార్పుడుకాడు; వేశ్యలకు విటులని సంపాదించి పెట్టేవాడు; +* pimples, n. pl. మొటిమలు; యవగండాలు; అవగండాలు; చెమరకాయలు; సూరీడుకాయలు; పులిపిరి కాయలు; +* pin, n. సూది; గుండుసూది; పిన్ను; పిన్నీసు; +headed pin ph. గుండుసూది; అల్పీ; అల్పనాతు సూది; +* pinch, v. t. గిల్లు; చిదుము; నొక్కు; పిండు; గిచ్చు; +* pine, v. i. బెంగపెట్టుకొను; తపించు; +* pineal gland, n. త్రికోణ కుండలి; మెదడులో వెన్ను పాము బయలుదేరే సంగమ స్థానంలో ఉండే వినాళ గ్రంథి; ఇక్కడ తయారయే "మెలటోనిన్ సెరటోనిన్" అనే హార్మోనులు నిద్రా చక్రాన్ని నియంత్రిస్తాయి; +* pineapple, n. అనాస; అనాస పండు; మొగలిపనస; అనాసపనాస; +* ping, n పింగు; కంప్యూటర్‍ రంగంలో, అంతర్జాలంలో సమాచార రవాణా సాధనాలలో ఎక్కడ లోపాలు ఉన్నాయో కనుక్కుందుకి వాడే ఒక ఉపయుక్తి; ఒక స్థలం నుండి మరొక స్థలానికి చిన్న సమాచారపు పొట్లం పంపుతారు. అది అద్దరి చేరుకుని సురక్షితంగా తిరిగి వస్తే "పింగ్‍" అని శబ్దం చేస్తుంది అప్పుడు సమాచారం ప్రయాణం చేసే దారి సుగమంగా ఉందని నిర్ధారణ అయినట్లు లెక్క; +* pint, n పైంట్) పన్నెండు అవున్సుల ద్రవ్యమానం; +* pipette, n పైపెట్) బుల్లిగొట్టం; చిరుగొట్టం; +* piscivorous, adj. మత్స్యభక్షక; మీనఖాద్య; చేపలని తినేటి; +* pistil, n. గర్భకేసరం; పువ్వులలో ఒక భాగం; +* pistol, n. పిస్తోలు; చేతి తుపాకీ; +* piston, n. ముషలకం; ముసలకం; పిస్టను; +* pit, n 1) గొయ్యి; దాలిగుంట; కూపం; ఖాతం; గాతం; బొంద; గర్తం; కేవటం 2) పిక్క; గింజ; విత్తు; టెంక; +* pitch-in, v. t 1) సాయం చేయు; ఒక చెయ్యి వేయు 2) బిఛాణా వేయు 3) బంతిని రువ్వు 4) అమ్మకానికి పథకం వేయు; +* pity, n. దయ; కనికరం; సానుభూతి; కారుణ్యం; అక్కటికం; +* pivot, n. కీల; కీలకం; భ్రమక కీలకం; ఉతక rel ఇరుసు; +* placate, v. t. శాంతింపజేయు; ఊరడించు; ఉపశమింపజేయు; అనునయించు; +* place, n. స్థలం; స్థానం; చోటు; తావు; జాగా; ఎడ; వంక; చక్కి; ప్రదేశం; ప్రోలు; ఇరవు; ఇక్కువ; నెలవు; +* placebo, n. తథాస్తు; తథాస్తు మాత్ర; తథాస్తు మందు; +* plaintiff, n. వాది; ఫిర్యాది; దావాదారు; దాయి; అర్ధి; అభియోక్త; అభియోగి; అభియోగం తీసుకొచ్చిన వ్యక్తి; దావా వేసిన వ్యక్తి; నేరం మోపినవాడు; అభిశంసి; అభిశంశకుడు; క్రిమినల్ కేసుల్లో నిందితుడు నేరం చేశాడని నిరూపించవలసిన బాధ్యత (న్యాయ పరిభాషలో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్) ప్రాసిక్యూషన్‌/ప్రభుత్వానిదే. ఈ కేసుల్లో అనుమానానికి తావు లేకుండా నిందితుడు నేరం చేశాడని నిరూపించవలసి ఉంటుంది Beyond reasonable doubt క్రిమినల్ కేసుల్లో వాది (plaintiff) ప్రభుత్వమే (State ప్రభుత్వం తరఫు వాదించే లాయర్నే పబ్లిక్ ప్రాసిక్యూటర్ (కొన్ని దేశాలలో డిస్ట్రిక్ట్ అటార్నీ) అంటారు; +* plan, n. పథకం; ప్రణాళిక; పన్నిక; పన్నుగడ; యోజనం; యుక్తి; +five-year plan, ph. పంచ వర్ష పథకం; పంచ వర్ష ప్రణాళిక; పంచ వర్ష యోజనం; +* planar, adj. సమతల; తలానికి పరిమితమైన; +* plane, n 1) తలం; సమతలం 2) విమానం 3) చిత్రిక; దువ్వోడ; +* planer, n. చిత్రిక; దువ్వోడ; వడ్రంగి వాడే పరికరం; +* planet, n 1) గ్రహం; సూర్య ప్రదక్షిణాలు చేసే భారీ ఖగోళ పిండం 2) దిమ్మరి; తిరుగుబోతు; +* planetoid, n. గ్రహశకలం ఏస్టరోయిడ్" కి మరొక పేరు; +inner planets, ph. అంతర్ గ్రహాలు; సూర్యుడికీ, గురుడుకీ మధ్యనున్న గ్రహాలు; +mother planets, ph. మాతృ గ్రహాలు; చంద్రుడికి భూమి మాతృ గ్రహం; +primary planets, ph. ప్రథాన గ్రహాలు; సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు; +inferior planets, ph. భూమి కక్ష్య లోపల ఉన్న గ్రహాలు; ఉదా. శుక్రుడు, బుధుడు; +superior planets, ph. భూమి కక్ష్య బయట ఉన్న గ్రహాలు; ఉదా. ాంగారకుడు, గురుడు, శని, మొ. +* plank, n 1 బల్లచెక్క 2) ఎన్నికలలో ఒక పార్టీ మద్దతునిచ్చే ముఖ్యాంశం; +* plankton, n. ప్లవకం; సముద్రాలలోను, సరస్సులలోను, నదులలోను తేలియాడుతూ ఉండే ఒక రకం సూక్ష్మజీవులు; +* plant, n 1) మొక్క; ఉలూపం; కంకోలం; కంకు 2) కర్మాగారం; కట్టడం; +* plantain, n. బొంత అరటి; కూర జాతి అరటి; కదళీఫలం; +* plaque, n 1) పతకం; బహుమాన పతకం 2) పంటిగార; పిప్పిక; పంటి మీద చేరే కల్మషం; +* plasma, n 1) రసి; జీవద్రవ్యం; ప్లాస్మా 2) భౌతిక పదార్థాల తురీయ స్థితి; ఘన, ద్రవ, వాయు స్థితులకు అతీతమైన తురీయ స్థితి; +* plaster, n 1) గిలాబి; గోడలకి పూసే సున్నం; గార 2) పాలాస్త్రి; దెబ్బలకి వేసే కట్టు; +* plastic, adj. ప్రహత; మైశీల; స్నిగ్థ; స్థితిస్థాపక గుణం లేని; అనుభూతులు లేని; ప్లేస్టిక్; +* plastic, n. మైశీలి; మైశీలం; మైనం వంటి స్వభావం కలది; కుమ్మట్టి; కుమ్మరి మట్టి వంటి గుణం కలది; స్నిగ్ధం; జారుగా ఉండేది; అంకవంకి; +* plate, n. పళ్లెం; తాంబాళం; ఫలకం; కంచం; పళ్లెరం; తలియ; తటి; రేకు; తగడు; తళిగ; +* plated, adj. ఛ���రిత; కప్పబడిన; మలామా చేయబడ్డ; +* plate tectonics, ph పలక విరూపణ; భూమి అశ్మావరణం బీటలు పడి పళ్ళేల మాదిరి ఉంటుందనే వాదం; +* platform, n 1) వేదిక 2) చప్టా; చపటా; రైలు ఆగే స్థలం 3) భావవేదిక 4) మంచె; ఇలారం; పొలాలలో కాపు కాయడానికి వాడే బడ్డీ; +* plating, n. మలామా; లేపనం; లేపరం; జలపోత; ఒక వస్తువుమీద లోహపు పూత పుయ్యడం; +electroplating, ph. విద్యుత్ లేపనం; విద్యుయిత్ ఛురితం; +* Plato, n గ్రీసు దేశపు తత్త్వవేత్త; +* Platonic solids, ph. ప్లేటో ఘన స్వరూపాలు; ఉదా: చతుర్ముఖి, ఘన చతురం, అష్టముఖి, ద్వాదశముఖి; +* platter, n భాజనం; పెద్ద పళ్లెం; వడ్డన సమయంలో వాడే పెద్ద పళ్లెం; +* plaudit, n. సన్నుతి; స్తుతి; ప్రశంస; స్తోత్రం; స్తవము; +* play, n 1) ఆట; క్రీడ; కేళి; విలాసం; చెలగాటం 2) నాటకం; రూపకం; +* play, v. t 1) ఆడు 2) ఊదు; వాయించు; కొట్టు 3) వ్యవహారంలో పాల్గొను; +* player, n 1) ఆటగాడు; క్రీడాకారుడు 2) పాత్రధారి; +* playground, n. ఆటస్థలం; బంతులబీడు; క్రీడా మైదానం; కేళీరంగం; ఆయాట; ఆడేవనం; ఆడేటి వనం; +* pleasant, adj. ఆహ్లాదకరమైన; మనోహరమైన; హాయిగల; నిరుపహతి; బాధలేని; +* plebiscite, n. సర్వజన తీర్మానం; జనవాక్యం; ప్రజాభిప్రాయం; ప్రజావాణి; +* pledge, n 1) వాగ్దానం; ఉపనిధి; ప్రతిజ్ఞ 2) కుదువ; తాకట్టు; +* Pleiades, n ప్లయేడ్స్, ప్లయెడీస్‍ కృత్తిక; కృత్తికలు; వృషభరాశిలో కంటికి కనిపించే ఆరు చుక్కల గుంపు; 430 జ్యోతిర్ వర్షాల దూరంలో ఉన్న ఒక నక్షత్ర సమూహం; దూరదర్శనిలో చూస్తే ఈ గుంపులో వేల కొద్దీ తారలు కనిపిస్తాయి; +* plenary, adj. సమగ్ర; సంపూర్ణ; సర్వజన; అవధులు లేని; +* plentiful, n. అక్షయం; కొల్లలు; పుష్కలం; ఎక్కీతొక్కి; +* plentifully, adv. మస్తుగా; పుష్కలంగా; బాహుళంగా; సమృద్ధిగా; మెండుగా; విస్తారంగా; అవారిగా; దండిగా; మెండుగా; అగ్గవగా; +* plenty, adj. సమృద్ధిగా; కొల్లలుగా; విశేషంగా; ఎక్కువగా; పుష్కలంగా; విస్తారంగా; లావుగా; అక్షయంగా; భూరి; మెండు; +* pleura, n. పునవేష్ట్రం; ఊపిరితిత్తులని పరివేష్టించి ఉండే పల్చని పొర; +* pleurisy, n. పునవేష్టప్రు వాపు; పార్శ్వ శూల; ఊపిరి తిత్తులని పరివేష్టించి ఉండే పొర వాపు; +* plight, n. గోడు; రోదన; దీన స్థితి; దురవస్థ; +* plot, n 1) కథాకథనం; ఇతివృత్తం; వృత్తాంతం; భూమిక; కథ యొక్క బందుకట్టు 2) బొమ్మ; చిత్రం 3) కుట్ర; పన్నాగం; కుయుక్తి; దురాలోచన 4) స్థలం; నేల; +main plot, ph. అధికారిక వృత్తాంతం; సంస్కృత నాటకాలలో అసలు కథాకథనం; +sub plot, ph. ప్రాసంగిక వృత్తాంతం; సంస్కృత నాటకాలలో కథలో పిట్టకథ; +* plow Br plough, n 1) నాగలి; మడక; నడుకసిరి; అరక; హలం గొర్రు 2) సప్తర్షి మండలం; పెద్ద ఎలుగుబంటి; Ursa Major; +* plug, v. t. బిరడా పెట్టు; బిగించు; మూయు; +* plum, n bot Prunus domestica; అల్బుకారీ పండు; శీతల దేశాలలో దొరికే ఒక పండు; ఎండబెట్టిన ద్రాక్షని కిస్‌మిస్ అన్నట్లే ఎండబెట్టిన ప్లమ్‌ని ప్రూన్ అంటారు; +* plump, adj. పొతకలాంటి; దుబ్బుగా ఉన్న; బొద్దుగా ఉన్న; కండ పట్టిన; +* plural, n. బహువచనం; నామవాచకాలైన మాటలకే బహువచనాలు ఉంటాయి; +* plurality, n. చాలామంది; చెప్పుకోదగ్గంత మంది; +* Pluto, n. ప్లూటో గ్రహం; ప్లూటో; +* plutocracy, n. ధనికవర్గాధిపత్యం; ధనికస్వామ్యం; ధనస్వామ్యం; ధనికులచే పరిపాలన; +* PM, n. అపరాహ్ణము; మధ్యాహ్నము; మద్దినాల; +* pneumatic, adj. వాత; సంపీడన; వాయుపూరిత; గాలికి సంబంధించిన; ఎక్కువ పీడనముతో నింపిన గాలితో చేయబడ్డ; +* pneumonia, n. నుమోనియా; పుఫూజ్వరం; రక్తష్ఠీవి సన్నిపాతం; +* pod, n. కాయ; చిక్కుడు; బటానీ కంది మె. దినుసు మొక్కల కాయ; +* podiatrist, n. పాదాలకి వచ్చే జబ్బుల మీద ప్రావీణ్యత ఉన్న వ్యక్తి; ఈ వ్యక్తి అసలయిన వైద్యుడు కానక్కర లేదు; +* poet, n. m. కవి; f. కవయిత్రి; కవికి ఉండాల్సిన లక్షణాలు: క్రాంత‌ దర్శనత్వం, వర్ణనా నిపుణత్వం, రసభావ ప్రతిపాదక విశ్లేషణాశక్తి, మనీషా సంపన్నత, మొదలైన లక్షణాలుండాలని ఆలంకారికుల అభిమతం. +poet laureate, ph. ప్రతిభావంతమైన కవిగా పురస్కారం అందుకున్న వ్యక్తి ఆస్థాన కవి; +* pointer, n. చూపుడుపుల్ల; సూచి; సూచిక; తర్జని; +* Polaris, n. ధ్రువనక్షత్రం; ధ్రువతార; ఉత్తర ధ్రువ నక్షత్రం; ప్రస్తుతం ఔత్తానపాది లేదా Polaris అనే నక్షత్రం ఉత్తర ధ్రువతారగా చెలామణీ అవుతోంది; దక్షిణ ధ్రువ తారగా చెలామణీ అవడానికి ప్రకాశవంతమైన తార ఏదీ లేదు; +pole of celestial equator, ph కదంబం రవిమార్గ అక్షాన్ని అనంతంగా పొడిగిస్తే ఖగోళానికి తగిలే బిందువు; +pole of Ecliptic, ph ధ్రువం భూ అక్షాన్ని అనంతంగా పొడిగిస్తే ఖగోళానికి తగిలే బిందువు; +* polemics, n. తర్కవితర్కాలు; వాదవివాదాలు; వాదప్రతివాదాలు; +* Polestar, n. ధ్రువనక్షత్రం; ధ్రువతార; +* policy, n 1) పట్టా; పట్టా పత్రం; పాలసీ 2) అమలులోనున్న పద్దతి; +* polish, v. t. మెరుగు పెట్టు; సాన పట్టు; నున్నపరచు; +* Polish పోలిష్) adj. పోలండ్ దేశానికి సంబంధించిన; +palace politics, ph రాచకోట రాజకీయాలు; రాచనగరి రాజకీయాలు; కోటలో కుతంత్రాలు; కోటలో కౌటిల్యాలు; +* pollen, n. పరాగం; పుప్పొడి; రజం; రజను; మధూళిక; +self pollination, స్వజాతి సంపర్కం; స్వపరాగ సంపర్కం; +* polluter, n. పాంసాళువు; పాంసవుడు; కలుషితం చేసే వ్యక్తి; +* pollution, n. కల్మషం; కాలుష్యం; కశ్మలం; పంకిలం; పాంశువు; +* Pollux, n. పునర్వసు చుక్కలలో ఒకటి; మిథునరాశిలో ఒక నక్షత్రం; +* poltergeist, n. పెంకి దయ్యం; ఈ రకం దయ్యం; చప్పుడు చేయడం, రాళ్ళు విసరడం, సామానులు విరగ్గొట్టడం వంటి పెంకి చేష్టలు చేస్తుంది; +* polyculture, n. బహుసాయం; ఒక పొలంలో పంటలని మార్చి వేసే ఆచారం; +* polyglycine backbone, ph. బహుగ్లయిసీను కాండం; బహుగ్లయిసీను వెన్ను; +* polymer, n. బహుభాగి; గొలుసులా ఎన్నో భాగాలు ఉన్న ఒక ఆంగిక రసాయనం; +* polymerize, v. t chem దండించు; దండలా చేయు; బణువులని దండలా గుచ్చు; బహుభాగి వలె మార్చు; +* polynomial, adj. బహుపద; బహునామ; రెండు కాని అంతకంటె ఎక్కువ పదాలు ఉన్న గణిత సమాసానికి సంబంధించిన; +* polynomial, n బహుపాది బహునామి; రెండు కాని అంతకంటె ఎక్కువ పదాలు ఉన్న గణిత సమాసం; +* polyolefin, n. బహుతైలం; రెండు, మూడు రకాల చమురుల సముదాయం; +* polyploids, n. బహుస్థితికాలు; జీవకణాలో ఉండే వారసవాహిక లలో ఒక రకం; +* polytechnic college, n. బహుకళాశాల; రకరకాల వృత్తి విద్యలు నేర్పే కళాశాల; +* polytheism, n. బహుదేవత్వం; బహుదేవతారాధన; బహుదేవతావాదం; ఒకటి కంటే ఎక్కువ దేవతలను ఆరాధించడం; +* polyvinyl, n. బహువినైల్; ఎన్నో వినైల్ బణువులని దండించగా ఏర్పడ్డ రసాయన పదార్థం; +* pomology, n. ఫలశాస్త్రం; ఫలవిజ్ఞానం; +* pomp, n. ఆడంబరం; అంగరంగవైభవం; పటాటోపం; పటారం; అట్టహాసం; +* pompelmos, n. పంపరపనస; పెద్ద దబ్బపండంత ఉండే నారింజ జాతి పండు; +* pond, n. చెరువు; చెలమ; వాద; కొలను; కాసారం +* ponder, v. i. ఆలోచించు; పర్యాలోచించు; మననం చేయు; వితర్కించు; +* pony, n. తట్టు; పొట్టి గుర్రం; +* pool, v. i. చందావేసుకొని; కలుపుకొని; +* poor, n. pl. బీదవారు; పేదవారు; దరిద్రులు; +* popcorn, n. లాజలు; లాజజొన్నలు; పేలాలు; +* populace, n. ప్రజానీకం; జనానీకం; లోకం; ప్రజ; జనబాహుళ్యం; +popular opinion, ph. ప్రజాభిప్రాయం; జనాభిప్రాయం; లోక ప్రవాదం; +* population, n. జనాభా; జనసంఖ్య; జనులు; జనాలు; ప్రజలు; +* populous, adj. జనసమ్మర్దమైన; జనసంకీర్ణమైన; జనాకీర్ణమైన; +* porch, n. మొగిసాల; తలవాకిటి వసారా; వరండా; సరంబీ; పయాలు; మండపం; +* porcine, adj. సూకర; వరాహ; పోత్ర; పందికి సంబంధించిన; +* porcupine, n. ఏదుపంది; ముండ్లపంది; ముళ్ళపంది; శల్యసూకరం; +* pore, n. బెజ్జం; రంధ్రం; సుషి; తూటు; +* pornography, n. అశ్లీల రచనలు; లైంగికలేఖనం; బూతులు; బూతుబొమ్మలు; +* port, n 1) రేవు; ఓడరేవు; బందరు 2) ఓడకిగాని విమానానికిగాని ఎడమవైపు భాగం 3) చిక్కని ఎరుపు రంగు వున్న తియ్యని ద్రాక్ష సారా 4) కంప్యూటరు లోపలికి వెళ్ళే ద్వారం, బయటకు వచ్చే ద్వారం; +* portal, n. దేవిడి; ద్వారం; గుమ్మం; చిన్న ద్వారం; ద్వారకి; +* portent, n. దుశ్శకునం; వ్యతీపాతం; గండం; +* porter, n 1) ద్వారపాలకుడు; గేటు కాపరి 2) సామానులు మోసే కూలివాడు; +* portrait, n. రూపచిత్రం; పటం; బొమ్మ; చిత్తరువు; చిత్రం; +* positive, adj 1) ధన; ధనాత్మక; ఆస్థి 2) నమ్మకమైన; నమ్మదగ్గ 3) సవ్యమ���న; సానుకూల; ఆశాజనకమైన; ఉత్తేజకరమైన; +positive sign, ph. ధన సన్న; ఆశాజనక అభిజ్ఞానం; సానుకూల అంశం; +positive thoughts, ph సవ్యమైన ఆలోచనలు; ఉత్తేజకరమైన ఆలోచనలు; ఆశాజనకమైన ఆలోచనలు; +* post, n 1) రాట; స్తంభం 2) స్థానం; ఉద్యోగం 3) టపా; తపాలు; +post natal, ph. పుట్టుక తర్వాత; జన్మానంతర; +post precipitation, ph. ఉత్తర అవక్షేపణ; మడ్డి కిందకి దిగిన తర్వాత; +* postfix, n. ప్రత్యయం; ఉత్తరపదం; వెనక అంటించేది; +* posthaste, adv. హుటాహుటిగా; అతిత్వరగా; వెంటనే; +posthumous child, ph. తదనంతర సంతానం; తండ్రి మరణించిన తర్వాత పుట్టిన బిడ్డ; m. గోలకుడు; పౌనర్భవుడు; f. గోలకి; పౌనర్భవి; +* postmortem, n 1) అన్వీక్షణ; చూసిన తరువాత, విన్న తరువాత 2) శవపరీక్ష 3) పరామర్శ; +* post office, n. టపా ఠానా; తపాలా ఆఫీసు; పోస్టాఫీసు; +* postpartum blues, ph. బాలెంతరాళ్ళు అనుభవించే నిస్పృహ, వెలితితనం; +* postulate, n. స్వీకృతం; స్వీకృత సిద్ధాంతం; +* pot, n. పాత్ర; వంట గిన్నె; ముంత; కుండ; కడవ; కుంభం; స్థాలి; గూన; బాన; డేగిసా; కాగు; ఘటం; పరవ; గరగ; కలశం; +earthenware pot, ph. కుండ; మట్టికుండ; మండ; మృత్పాత్ర; మృణ్మయపాత్ర; +* potash, n. సర్జిక; కుంభస్మము; పొటాసియం నైట్రేటు; పొటాష్ ety pot ash; +* potato, n. బంగాళాదుంప; ఉరలగడ్డ; ఆలుగడ్డ; +* Potassium, n. పొటాసియం; పటాసు అణుసంఖ్య 19, సంక్షిప్త నామం, K); +* potbelly, n. బొజ్జ; గుండ్రటి బొజ్జ; బీరుబొజ్జ; +* potential, n 1) విభవం; పీడనం; శక్మం 2) అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యం; +potential difference, ph. విపీడనం; పీడన తారతమ్యం; విభవ వ్యత్యాసం; శక్మాంతరం; +* potholes, n. గతుకులు; వీధులలో గతుకులు, గోతులు; +* potluck, n. సమేతం; ఎవరి మేత వారు తెచ్చుకుని, నలుగురూ కలసి భోజనం చేసే వేడుక; +* potpourri, n పో పురి) కలగూరగంప; కలగాపులగం కలగలుపు; కరంబము; కదంబము; +* potshot, n 1) గుడ్డి గురప్రు తాపు 2) పరోక్ష విమర్శ; +* pouch, n 1) సంచి; తిత్తి; పొంకణం 2) శిశుకోశం; మర్సూపియం; +* poultice, n. పిండి కట్టు; కురుపుల మీద వేసి కట్టే పిండి కట్టు; +* pound, n 1) పౌను; బరువును తూచే కొలమానం 2) పౌను; ఇంగ్లండులో డబ్బుని కొలిచే ద్రవ్యమానం; +* poverty, n 1) బీదరికం; బీదతనం; పేదరికం; లేమి; ఎద్దడి; దరిద్రం; నిప్పచరం; అనగా ఒక వ్యక్తి మనుగడకి కావలసిన కనీస అవసరాలు, అనగా తినడానికి తిండి, కట్టడానికి బట్త, ఉండడానికి వసతి సౌకర్యం లేకపోవడం; కటిక దరిద్రం అంటే ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా సరిపోయే అంత తిండి (కేలరీలు, పోషకాలు) కూడ దొరకకపోవడం; సాపేక్ష దరిద్రం అంటే అదే సంఘంలో ఉన్న మిగిలిన వారితో పోల్చినప్పుడు సరిపోయే వసతులు, వనరులు లేకపోవడం 2) గ్రాసవాసోదైన్యం; తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేని దీన స్��ితి; +* powder, n 1) గుండ; పిండి; పొడి; చూర్ణం; నుగ్గు; నలి; తుమురు 2) బుక్కా; పౌడరు; +power house, ph. పాటవ గృహం; విద్యుత్తుని తయారుచేసే భవనం; +* practical, adj. ప్రయోగాత్మక; ఆచరణాత్మక; ఆచరణీయ; ప్రాయోగిక; కార్యశీల; కార్యవాద; ఔపయోగిక; వ్యవహారిక; +* practicals, n. ప్రయోగాలు; అభ్యాసాలు; పరీక్షలలో ప్రయోగాల భాగం; +* practice, n 1) సాధకం; సాధన; అభ్యాసం; ఆచరణ; వ్యాసంగం 2) వాడుక; సంప్రదాయం 3) పద్ధతి; విధానం; +* pragmatics, n. వాడుక; వాడుక శాస్త్రం; భావాన్ని వెల్లడి చెయ్యడానికి భాషని ఎలా వాడాలో తెలిపే శాస్త్రం; +* prairie, n. ప్రయరీ; అమెరికాలోని విశాలమైన గడ్డి మైదానాలు; +* praise, v. t. మెచ్చుకొను; కొనియాడు; పొగడు; కొండాడు; కీర్తించు; శ్లాఘించు; ప్రశంసించు; స్తోత్రం చేయు; స్తుతించు; వినుతించు; కైవారం చేయు; భూషించు; అభినుతించు; +* praise, n. మెచ్చుకోలు; పొగడ్త; ప్రశంస; మన్నన; స్తుతి; స్తవం; స్తోత్రం; శ్లాఘన; భూషణ; కైవారం; వినుతి; అభినుతి: +* praiseworthy, adj ప్రశంసాత్మకమైన; కొనియాడతగిన; వినుతికెక్కిన; +* praiseworthy, n. ప్రశంసాత్మకం; శ్లాఘనీయం; కొనియాడదగ్గది; వినుతి; స్తవనీయం; +* prank, n. జిత్తు; టక్కరి పని; ఠవళి; +* preacher, n. ఉపదేశకుడు; ప్రబోధకుడు; ప్రబోక్త; +* preamble, n. ప్రస్తావన; ఉపోద్ఘాతం; అవతారిక; పీఠిక; ఉద్దేశ వివరణం; +* precaution, n. ముందుజాగ్రత్త; అప్రమత్తత; చేకాపు; +* preceptor, n. ఆచార్యుడు; కుల గురువు; ఉపదేశికుడు; విద్యాదాత; +precession of the equinoxes, ph. విషువత్ చలనం; అయన చలనం; భూ అక్షం నక్షత్రగోళం మీద స్థిరంగా నిలవక, బహు నెమ్మదిగా, రాశి చక్రానికి వ్యతిరేక దిశలో అంటే మేషం, మీనం, కుంభం అనే విలోమ క్రమంలో తిరుగుతూ, ప్రతి 25,800 సంవత్సరాలకి ఒక వృత్తం పూర్తి చేస్తుంది ఈ కదలిక వలన విషువత్ సంక్రమణ స్థానాలు కూడ కదులుతాయు; +* precipitation, v. t. మడ్డిలా కిందకి దిగేటట్టు చేయడం అవక్షేపణ అనగా ఒక ద్రవములో కరగని పదార్థము దాని మీద గల అనేక శక్తుల వల్ల ఆ పదార్థపు కణాలు ఆ ద్రవము నుంచి వేరు కావడము. ఆ శక్తులు వివిధ రకాలుగా ఉండొచ్చును. ఉదా: గురుత్వాకర్శణ శక్తి, అపకేంద్ర శక్తి, విద్యుతయస్కాంత శక్తి; +* precipitation, n. అవపాతనం; ఆకాశం నుండి కిందకి పడే నీరు; వాన, మంచు, వగైరా; +* precocious, adj. వయస్సుకి మించిన తెలివి, నైపుణ్యం కల; +* predation, n. దొంగిలించి బతకడం; ఒకరిది తస్కరించి బతకడం; మరొక జీవిని తిని బతకడం; పొంచార్పు; +* predator, n. పిండారి; తస్కరి; దొంగ; పొంచార్చి; మరొక జంతువుని పొంచుండి వేటాడేది; see also parasite; +* predicament, n. దురవస్థ; అవస్థ; క్లిష్టపరిస్థితి; +* predicate, n. అఖ్యానం; అఖ్యాతం; వాక్యంలో కర్తను గురించి చెప్పేది; +* prefix, n. ఉపసర్గ; పూర్వప్రత్యయం; ఉపపదం; ప్రాదు; పూర్వలగ్నం; తల; దాపలతోక; +* pregnancy, n. గర్భం; కడుపు; చూలు; గర్భధారణ; కడుపుతో ఉండడం; +pregnant woman, ph. గర్భిణి; గర్భవతి; కడుపుతోవున్న మనిషి; చూలింతరాలు; చూలాలు; గర్భశ్రాంత; +* premature, adj. పరిపక్వము కాని; పూర్తిగా ఎదగని; నెలలు నిండని; +* premeditated, n. పూర్వసంకల్పితం; ప్రయత్నపూర్వకం; +* premise, n. s. ఆధార వాక్యం; పూర్వ సిద్ధాంతం; +* premium, n 1) అడితి; బీమా కిస్తు; ప్రీమియం 2) నిజమైన విలువ కంటె ఎక్కువ చెల్లింపు; +* preposition, n. విభక్తి ప్రత్యయం note) ఇంగ్లీషులో preposition అంటే విశేష్యానికి ముందు వచ్చేది అని అర్థం, కాని తెలుగులో విభక్తి ప్రత్యయం నామవాచకానికి తర్వాత వస్తుంది; ఒక విధంగా చూస్తే విభక్తి ప్రత్యయానిది post position; ఇదే ఇంగ్లీషులో వాక్య నిర్మాణానికీ, తెలుగులో వాక్య నిర్మాణానికీ మధ్యనున్న ఒక పెద్ద తేడా; +* presbyopia, n. దీర్ఘదృష్టి; దూరపు వస్తువులు కనిపించడం, దగ్గరవి బాగా కనిపించకపోవడం; +* prescient, adj ప్రెషెంట్) భవిష్యత్ జ్ఞానము గల; కాలజ్ఞానము తో; +* prescribed, adj. నిర్దేశిత; విధించబడ్డ; నియోగింపబడ్డ; విహిత; +* prescription, n. నిర్దేశం; అనుశాసనం; విహితం; మందుచీటీ; +* prescriptive, adj. నిర్దేశాత్మక; శాసనాత్మక; అనుశాసన; విహితాత్మక; +* prescriptive, n. నిర్దేశాత్మకం; శాసనాత్మకం; విహితాత్మకం; +* presence, n 1) స్పూర్తి; ఉనికీ; హాజరు; సమక్షం; సముఖం 2) ప్రత్యక్ష ఉపస్థితి; +* present, n 1) ప్రస్తుతం; వర్తమానం; ఇప్పుడు 2) బహుమానం; ఈనాం; +* preserve, v. t 1) కాపాడు; రక్షించు; సంరక్షించు; పరిరక్షించు 2) నిల్వ చేయు; +* preserve, n. బచావు; నిల్వ ఉంచినది; ఊరుగాయ; +* preserver, n. స్థితికారకుడు; రక్షకుడు; సంరక్షకుడు; +* president, n 1) అధ్యక్షుడు; అధ్యక్షురాలు; సభాపతి 2) రాష్టప్రతి; +* press, n 1) గానుగ 2) అచ్చు యంత్రం; ముద్రకి 3) విలేకరులు; పాత్రికేయులు; పత్రికలవారు; +* press, v. t 1) నొక్కు; ఒత్తు 2) పట్టుబట్టు 3) ఇస్త్రీచేయు; +* pressman, n. విలేఖరి; పాత్రికేయుడు; +press reporter, ph. పత్రికా విలేఖరి; పాత్రికేయుడు; +* pressure, v. t. పీడించు; ఈండ్రించు; ఒత్తిడి చేయు; తొందర పెట్టు; ఈండ్రము చేయు; +* pressure, n. పీడనం; పోటు; భారం; ఒత్తిడి; ఈండ్రము; ఆమర్దం; నొక్కుడు; తొందర; +partial pressure, ph. అంశిక పీడనం; వాయుమిశ్రమంలోని ప్రత్యేకంగా ప్రతివాయువూ ఇచ్చేటి పీడనం; +* presumption, n 1 అహంకారం 2) పురాభావన; బహుశా అవునని నమ్ముట; +* prevalent, adj. చలామణీలో ఉన్న; అమలులో ఉన్న; వచ్చేటటువంటి; +* prevailing, adj. అక్కడ వుండే; ప్రస్తుతపు; అమలులలోవున్న; +* prevaricator, n అబద్ధాలు చెప్పే వ్యక్తి; నిజాన్ని కప్పిపుచ్చే వ్యక్తి; +* prevent, v. t. నివారించు; వారించు; ఆపు; అడ్డు; అడ్డగించు; నిరోధించు; అటకాయించు; +* price, n. ధర; మూల్యం; కిమ్మత్తు; వెల; అర్జు; +* pride, n 1) అతిశయం; స్వాతిశయం; గర్వం; పొగరు; అహంకారం; డాంబికం 2) అభిమానం; స్వాభిమానం 3) సింహాల గుంపు; సటాఝూటం; +* priest, n. m. పురోహితుడు; కేథలిక్ తెగకి చెందిన పురోహితుడిని ప్రీస్ట్ అంటారు. ఇతను వివాహం చేసుకోకూడదు, జీవితాంతం బ్రహ్మచర్యమే పాటించాలి; చర్చిలో హోదా పెరిగే కొద్దీ బిషప్, కార్డినల్ వగైరా బిరుదులు కనిపిస్తాయి. వీటిలో అత్యున్నతమైన స్థానం పోప్; +* prig, n. పొగరుబోతు; అహంకారి; గర్విష్థి; +* prima facie, adj. మొదట ఏర్పడిన అభిప్రాయం ప్రకారం; తొలి చూపులో ఏర్పడిన అభిప్రాయం ప్రకారం; +* prima para, n 1) తొలిౘూలు; మొదటి కాన్పు 2) తొలిౘూలు స్త్రీ; +* primate, n 1) ప్రాగ్వానరం; నరవానరం; మనిషి, కోతి జాతులకి చెందిన జంతువులని సూచించడానికి కలగలుపుగా వాడే మాట 2) ప్రధాన శాల్తీ; ప్రధాన గురువు; +* prime, n. ప్రధానాంకం; ప్రధాన సంఖ్య; అభేద్య సంఖ్య; +* prime number, ph. ప్రధానాంకం; ప్రధాన సంఖ్య; అభేద్య సంఖ్య; +* primer, n 1 ప్రిమర్) శిశుబోధ; బాలబోధ; ప్రాథమిక వాచకం 2) గోడలకి, ఇనప సరంజామాకి రంగులు అద్దే ముందు, వేసిన రంగు బాగా హత్తుకోడానికి, వేసే మొదటి పూత 3) జీవకణాలలో వారసవాహికల తయారీకి ఓం ప్రధమంగా వాడే కణికామ్లాల దండ (పాలని పెరుగు చెయ్యడానికి తోడు వాడమూ! అలాగ అన్న మాట +* primordial, adj. ప్రప్రథమ; ఆదికి ముందే ఉన్న; ప్రాంకుర; +* prince, n. యువరాజు; రాకుమారుఁడు; రాజకుమారుఁడు; రాజతనయుఁడు; రాజసుతుఁడు; రాజజుఁడు; రాజతనూభవుఁడు; రాజపుత్రుఁడు; భూవరసుతుఁడు; భూపాలతనయుఁడు; రాచకొమరుఁడు; రాచకొడుకు; రాజుకొడుకు; రాచబిడ్డఁడు; ఱేఁటిౘూలు; ఱేఁటికొడుకు; +* princess, n. యువరాణి; రాకుమార్తె; రాజకుమారి; రాజతనయ; రాజసుత; రాజజ; రాజతనూభవ; రాజపుత్రి; రాజపుత్రిక; భూవరసుత; భూవరపుత్రి; భూపాలతనయ; రాచకొమరి; రాచకూతురు; రాచకూఁతు; రాచబిడ్డ; ఱేఁటిౘూలు; ఱేఁటికూఁతు; +* principal, adj. ప్రథానమైన; ముఖ్యమైన; కూకటి; అసలైన; +* principal, n 1) ప్రథాన అధ్యాపకుడు; ప్రధాన ఆచార్యుడు; ప్రాంశుపాలుడు 2) అగ్రణి; అగ్రిముడు; అగ్రిమము 3) అసలు; అసలు సొమ్ము; మూలధనం; పరిపణం; +* principle, n 1) సూత్రం; నియమం; తత్వం 2) నైతికమైన విలువ; +in principle, ph. సూత్రప్రాయంగా; సూత్రానుగుణంగా; పద్ధతి ప్రకారం; +* print, v. t 1) అచ్చువేయు; ముద్రించు; అచ్చొత్తు; అచ్చుకొట్టు 2) చెక్కు; గొలుసుకట్టుగా కాకుండా అచ్చువేసినట్లు రాయు; +* printer, n 1) ముద్రాపకుడు 2) ముద్రాపకి; ���ుద్రణ యంత్రం; ముద్దరి; +* prior, adj. మొదటి; ముందటి; పూర్వ; పురోగామ్య; +* prison, n. ఖైదు; కారాగారం; కారాగృహం; బందిఖానా; బందె; చెరసాల; బుయ్యారం; జైలు; +* pristine, adj. నిష్కల్మష; పాడు కాని; ప్రత్యగ్ర; +* private, adj 1) స్వంత; సొంత; వ్యక్తిగత; స్వకీయ; వ్యష్టి; ఏకాంత; ఛన్న; గుట్టు 2) ఖానిగీ; ఖాసా; తారియోక; తరోక తారు (తాము) అనే ప్రాచీన తెలుఁగు సర్వనామపు ఔపవిభక్తిక రూపమైన [తర] కు [యొక్క] చేర్చి తరోక (తమ యొక్క/తమ స్వంతమైన private ant ప్రభుత్వానికి చెందిన; రట్టు; +* privation, n. లేమి; జీవితంలో నిత్యావసరాల లేమి; శూన్యత; హీనత; +* pro, pref. తొలి; ప్రథమ; ప్రథాన; ముఖ్య; ప్రాణ్య; +* probe, v. t. తరచి చూడు; తరచి తరచి పరీక్షించు; +* problem, n. సమస్య; ప్రశ్న; ఉపపాద్యం; కైపదం; +prokaryotic cell, ph. కణికలేని కణములు; కణిక రహితములు; కణిక రహిత కణములు; +* procedure, n 1) విధానం; పద్ధతి; వ్యవహార పద్ధతి; విధివిధానం; తంతు; రీతి; ప్రక్రియ 2) శస్త్ర చికిత్సా విధానం; +* process, n. ప్రక్రియ; గతి; పద్ధతి; సంవిధానం; పరికర్మ; క్రమం; గత్వం; వ్యాపారం; ఔనోజ; +thought process, ph. ఆలోచనా విధం; ఆలోచనా ప్రక్రియ; తలపుల బాట; +* proclamation, n. ప్రకటన; చాటింపు; నివాకం; ఇస్తిహారు; +* procrastinate, v. t. నాన్చు తాత్సారం చేయు; చెయ్యవలసిన పనిని వెంటనే చెయ్యకుండా బకాయి వేయు; +* procrastinator, n చిరకారి; చెయ్యవలసిన పనిని వెంటనే చెయ్యకుండా బకాయి పెట్టే వ్యక్తి; +* prod, n ములుకు; ముల్లు; సూది; ముల్లు కర్ర; అంకుశం; +* prodigy, n. ఉత్పాతపిండం; విశిష్ట వ్యక్తి; బాల మేధావి; +* produce, n ప్రోడ్యూస్) పంట; సస్యం; కాయగూరలు; పండ్లు వగైరా; +* produce, v. t ప్రొడ్యూస్ 1) హాజరుపరచు 2) నిర్మించు; తయారు చేయు 3) ఉత్పన్నం చేయు; ఉత్పత్తి చేయు; ఉత్పాదించు; +* producer, n. నిర్మాత; ఉత్పత్తిదారుడు; ఉత్పాదకుడు; ఉత్పాదాళువు; +* product, n 1) పంట; ఉత్పాదితం; ఉత్పన్నం; ఉత్పత్తి ఉత్పత్తి చేయబడినది 2) లబ్దము; లభించినది; ఫలితం; +* production, n. ఉత్పత్తి; ఉత్పాదన; నిర్మాణం; +* productive, adj. ఉత్పాదక; ఉత్పాదకమైన; ఫలప్రదమైన; +* profane, adj అసభ్యమైన; అశ్లీలమైన[ బూతు; అపవిత్రమైన; సాధారణంగా ఈ విశేషణాలు భాషని గురించి మాట్లాడేటప్పుడు వాడతారు; +* profanity, n. అసభ్యం; అశ్లీలం; బూతు; అసభ్యపు మాట; బూతు మాట; బజారు భాష; మోటు భాష; +* profession, n. వృత్తి; ఉద్యోగం; జీవిక; జీవనోపాయం; కాయకం; పని; +* professional, adj. వృత్తి; వృత్తిపరమైన; ఉద్యోగపరమైన; వృత్తిగత; వృత్తిసంబంధిత; వ్యావసాయిక; +* professionally, adv వృత్తిగతంగా; వృత్తిపరంగా; వ్యావసాయికంగా; +* profile, n 1) వైఖరి; సరళి 2) పార్శ్వవైఖరి; కపోలము; పక్కనుండి చూస్తే కనిపించే వైఖరి; +* profit, n. లాభం; లబ్ది; ఫాయిదా; ఆదా; ఫలం; ఫలోదయం; కిట్టుబాటు; గిట్టుబడి; కూడుదల; +* progenitors, n. pl. పూర్వులు; పితరులు; పితృదేవతలు; నేటి సంతతికి నాటి కారణభూతులు; +* progeny, n. సంతానం; సంతతి; పిల్లలు; పరంపర; +* prognosis, n ముందుగా చెప్పగల జ్ఞానం +* program, n 1) కార్యక్రమం; ప్రోగ్రాం 2) క్రమణిక; +* programmer, n. క్రమకర్త; విధికర్త; సంవిధానకర్త; క్రమణికలు రాసే వ్యక్తి; +* progress, n 1) ప్రగతి; అభ్యుదయం; మెరుగుదల; అభివృద్ధి; పురోభివృద్ధి; పురోగతి; పురోగమనం; వికాసం; ఉత్కర్ష 2) గమనం; +* progression, n 1) ప్రగతి పథం 2) పరంపర; అనుపాతం; ముందుకి నడుచుకుంటూ వెళ్ళేది; ఒక శ్రేఢిలో ఒకదాని వెంబడి మరొక అంశం వస్తూన్న సందర్భంలో ఆ అంశాల మధ్య నిర్ధిష్టమైన గణిత సంబంధం ఉంటే ఆ శ్రేఢిని పరంపర అంటారు; +arithmetic progression, ph. అంకలితోత్తర పరంపర; సంకలితం; ఒక క్రమంలో అంకెలని కలుపుకుంటూ వెళ్ళడం; +geometric progression, ph. గుణోత్తర పరంపర; ఉత్కలితం; ఒక క్రమంలో వర్గీకరించిన అంకెలని కలుపుకుంటూ వెళ్ళడం; +* progressive, adj. అభ్యుదయ; పురోగమన; పురోగామి; ప్రగతిశీల; ఊర్ధ్వగమన; +* project, v. i ప్రొజెక్ట్) ముందుకు పొడుచుకుని వచ్చు; +* project, v. t ప్రొజెక్ట్) ముందుకు దూసుకుని వచ్చేలా చేయు; +* project, n పోజెక్ట్) పథకం; సాధించవలసిన పని; +* projectile, n. ప్రక్షేపకం; ముందుకు దూసుకుని వచ్చే వస్తువు; విసరిన వస్తువు; ఎగరవేసిన వస్తువు; +* projection, n. విక్షేపం; ముందరకి తొయ్యడం; +* projector, n. విక్షేపణి; ముందరకి తోసేది; +* prolapse, n. భ్రంశం; చ్యుతి; దిగజారుట; జాకారుట; పతనం; +* proliferation, n. బహుదాకరణం; తామరతంపర వలె వృద్ధి చెందడం; +* proletariat, n. శ్రామిక వర్గం; పాటకజనం; శ్రామికులు; కార్మికులు; +* prolific, adj. విరివిగా సృష్టించగలిగే సామర్థ్యం గల; +* prominent, adj. పేరున్న; స్పుటమైన; బాగా కనిపించే; +* promise, n 1) బాస; మాట; వాగ్దానం 2) బాగుపడే అవకాశం; వృద్ధిలోకి వచ్చే అవకాశం; +* promising, adj. బాగుపడే అవకాశం ఉన్న; వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉన్న; +* promotion, n 1) పదోన్నతి; ఉద్యోగపు హోదా పెరగడం 2) వ్యాపారంలో వస్తువుల అమ్మకం వృద్ధి పొందడానికి చేసే హడావిడి; +* promptly, adv. అవ్యవధానంగా: అవిలంబంగా; వెనువెంటనే; వెంటనే; ఆలశ్యం చెయ్యకుండా +demonstrative pronoun, ph. సూచక సర్వనామం; ఏతత్తదర్ధక సర్వనామం; నిర్దేశక సర్వనామం; +interrogative pronoun, ph. ప్రశ్నవాచక సర్వనామం; యత్కిమర్ధక సర్వనామం; +personal pronoun, ph. పురుషవాచక సర్వనామం; పురుష బోధక సర్వనామం; యుష్మదస్మదర్థక సర్వనామం; పురుష బోధక సర్వనామాలలో లింగభేదాలకు ప్రత్యేక పదాలు ఉండవు. ఉదా. నేను, మేము, మనం, నువ్వు, మీరు మొ.వారిని ఏ లింగానికి చ���ందినవారో చెప్పనవసరం లేదు. సంభాషణ లో పాల్గొన్న మాట్లాడే వ్యక్తీ, వినే వ్యక్తీ ఒకరికొకరు తెలిసినవారే అవుతారు. +* proof, n. ఋజువు; దాఖలా; నిదర్శనం; ప్రమాణం; తార్కాణం; నిరూపణం; ఉపపత్తి; దృష్టాంతం; మూదల; మూదలిక; +* proofs, n. అచ్చు చిత్తులు; చిత్తు ప్రతులు; +* prop, n. ఊత; ఊతం; చేయూత; ఊతకోల; కైదండ; అండ; దండ; దన్ను; ఆనురాట; ఆలంబం; ఆలంబన; ప్రాపు; ఆధారం; పట్టుగొమ్మ; అవష్టంభం; +* propellant, n. క్షేపణ పదార్థం; చోదక ద్రవ్యం; +* proper, adj. తగిన; క్రమమైన; క్రమ; స్వకీయ; నిజ; యుక్తమైన; వెరవైన; +proper motion of a star, ph. తార యొక్క స్వకీయ గమనం; నిజ గతి; నక్షత్రాలు ఏవీ స్థిరంగా లేవు; అవి వేరు వేరు దిశలలో వేరు వేరు వేగాలతో సెకండుకి అనేక కిలోమీటర్ల వేగంతో కదులుతున్నాయి; +* proper, n. భావ్యం; సరైనది; యుక్తం; వెరవు; +* property, n 1) లక్షణం; గుణం; ధర్మం 2) ఆస్తి; సొత్తు; సంపద; సంపత్తి; కించన్యం; +emergent property, ph. హఠాదుత్పన్న లక్షణం; హఠాత్తుగా పుట్టుకొచ్చే లక్షణం; తాపోగ్రత (temperature) అనే భావం ఉంది. ఒకే ఒక బణువు (molecule)ని తీసుకుని దాని “తాపోగ్రత” గురించి మాట్లాడడం అర్థ రహితం. ఒక్క బణువుకి తాపోగ్రత ఉండదు. ఒక చోట కోట్ల కొద్దీ బణువులు, ఒక దానిని మరొకటి గుద్దుకుంటూ ఉంటేనే వేడి (heat) పుడుతుంది, దాని ఉగ్రతని మనం తాపోగ్రత అంటున్నాం. కనుక తాపోగ్రత అన్నది హఠాదుత్పన్న లక్షణం; +* prophase, n. తొలిదశ; కణ విభజన జరిగే సమయంలో తొలి దశ; +* prophecy, n. అనాగతం; భవిష్యద్వాక్యం; సోదె; +* prophet, n. అనాగతవేది; భవిష్యత్తును చెప్పు వ్యక్తి; సోదె చెప్పు వ్యక్తి; +* propitiate, v. t. సంతోషపెట్టు; శాంతింప చేయు; పొగుడు; కీర్తించు; పొంగించు; +* proportion, n. అనురూప్యం; అనుపాతం; వాటా; పాలు; వంతు; నిష్పత్తి; దామాషా; +direct proportion, ph. క్రమ అనుపాతం; సరళ అనుపాతం; అనులోమ అనుపాతం; +* proportionately, adj. అనురూప్యంగా; అనురూప్యేణా; వాటాలవారీగా; వంతుల ప్రకారం; నైష్పత్తికంగా; పరస్పరానుగుణంగా; +* propose, v. t 1) ప్రతిపాదించు; ఉపపాదించు 2) పెండ్లాడమని అడుగు; +* proposer, n. ప్రతిపాదకుడు; ప్రస్థావకుడు; +* proposition, n. ప్రాతిపదిక; ఉపపాద్యం; ప్రవచనం; +pros and cons, ph. అనుకూల ప్రతికూలతలు; ముందువెనుకలు; లాభనష్టాలు; మంచి చెడ్డలు; +* prosaic, adj. పస లేని; నీరసమైన; చప్పగా ఉన్న; సాదాసీదాగా; కవిత్వం లేకుండా; వచనధోరణిలో; +* prosecution, n 1) జరిపించడం; పని జరిపించడం; కృషి 2) ఒక వ్యక్తి నేరస్తుడని రుజువు చెయ్యడానికి ప్రభుత్వం తరఫున జరిగే కృషి; +* prosecutor, n. కృషీవలి; ఒక వ్యక్తి నేరస్తుడని రుజువు చెయ్యడానికి ప్రభుత్వం తరఫున కృషి చేసే వ్యక్తి; +* prosody, n. ఛందస్సు; పద్యరచనకి నియమావళి; +* prospective, adj. భవిష్యత్తుకు సంబంధించిన; కాబోయే; +* prospectus, n. పరిచయ పత్రం; పరిచయ పొత్తం; వివరణ పత్రం; +* prosperity, n. ఐశ్వర్యం; సౌభాగ్యం; క్షేమం; శ్రేయస్సు; అభివృద్ధి; +* prostitute, n. వ్యభిచారిణి; జారిణి; ముండ; రండ; లంజ; తొత్తు; రంకులాడి; వాడవదిన; గణిక; +* prostitution, n. వ్యభిచారం; పడుపు వృత్తి; జారత్వం; లంజతనం; రంకుతనం; +* protect, v. t. రక్షించు; పోషించు; కాపాడు; ఏలు; గుప్తించు; ఓము; +* protection, n. రక్ష; రక్షణ; సంరక్షణ; పరిరక్షణ; కాపు; కాపుగడ; ప్రోపు; పోషణ; గుప్తి; పాకన; అనుపాలన; ఓమిక; +* proteins, n. ప్రాణ్యములు; మాంసՠуత్తులు; +* protocol, n. పద్ధతి; ప్రవర్తనా నియమావళి; మర్యాద; అంతస్తుకి తగిన మర్యాద; ఇచ్చి పుచ్చుకొనే పద్ధతి; +* protagonist, n. నాయకుడు; నాయకురాఉ; ప్రథాన పాత్రధారి; +* protozoa, n. ఆదిజీవులు; ఆదిజంతువులు; తొలేలులు (తొలి ఏలులు ఇవి బేక్టీరియా కంటె పెద్దవి; ఎమీబా వల్ల కలిగే గ్రహణి, మలేరియా మొదలైన వ్యాధులు ఈ రకం సూక్ష్మజీవుల వల్లనే కలుగుతాయి; +* protractor, n. కోణమాని; కోణమితి; కోణవిపరికరం; +* proud, adj 1) అభిమానం గల; ఆత్మాభిమానం గల 2) గర్వం గల; +* prove, v. t. రుజువు చేయు; నిరూపించు; మూదలించు; +* proverb, n. సామెత; సామెం; లోకోక్తి; ఆభాణకం; సుభాషితం; సూక్తి; నుడికారం; నానుడి; జాతీయం; చాటువు; పలుకుబడి; సుద్దిన్యాయం; జనశ్రుతి; +* provision, n. ఏర్పాటు; సదుపాయం; నియమం; నిబంధన; +* provisions, n. కిరానా; చిల్లర దినుసులు; రస్తు; +* provoke, v. t. రేకెత్తించు; రెచ్చగొట్టు; ప్రకోపింపచేయు; ఉత్తేజపరచు; +* prowler, n. పొంచి సంచరించే జంతువు లేదా వ్యక్తి; +* proximate, adj. ఉప; సమీపపు; సన్నిహితమైన; ఔపశ్లేషిక; సన్నికృష్ట; +* proximity, n. చెంత; చేరువ; చెంగలి; పొడ; తరి; దరి; దాపు; సరస; సమీపం; సామీప్యం; సన్నిధి; సాన్నిధ్యం; సన్నిధానం; దరిదాపు; దండ; అంతికం; నేదిష్టం; అందిక; నైకట్యం; +* proxy, n ఒకరి తరఫున వ్యవహరించడానికి మరొకరికి ఇచ్చే అధికారం ప్రాతినిధ్యం; వకీల్తా: అటువంటి అధికారం పొందిన వ్యక్తి; వకీలు; +* prude, n. అతివినయం ప్రదర్శించే వ్యక్తి; +* prunes, n. ఎండిన ఆలూబుఖారా పండు; ఎండిన ప్లమ్ bot Prunus domesticus; జ్వరము తగ్గిన తరువాత నోటికి రుచిగా ఉండడానికి వాడతారు; +* prune, v. t. కత్తిరించు; త్రుంచు; పత్రించు; మొక్కల కొమ్మలను కత్తిరించు; తగ్గించు; +* pruning, n. పత్రింపు; ఎదిగేదానిని కత్తిరించడం; +* psalm, n. ప్రార్ధనా గీతం; బైబిలులో ఒక భాగం; +* pseudonym, n సూడోనిం) గోప్యనామం; కుహనా నామం; మారుపేరు; కలం పేరు; +* pseudopod, n. కూటపాదం; జీవకణాలు కదలికకు కణసారం కోలగా సాగి పాదం మాదిరి ఉపయో��పడే సాధనం; +* psychiatrist, n. మానసిక వైద్యశాస్త్రం ప్రకారం మానసిక రోగాలకి మందులిచ్చి కుదిర్చే వైద్యుడు; +* psychic, n. అతీంద్రియాళువు; అతీంద్రియ శక్తులు ఉన్న వ్యక్తి; +* psychoanalysis, n. మానసిక విశ్లేషణ; మనస్తత్త్వ విశ్లేషణ; +* psychologist, n. మనస్తత్వ శాస్త్రం ప్రకారం మానసిక దౌర్బల్యాలని విశ్లేషించే వ్యక్తి; ఈ వ్యక్తి మందులు ఇవ్వడానికి వీలు లేదు; +* psychology, n 1) మనస్తత్వ శాస్త్రం 2) మనస్తత్వం; మనుస్స్వభావం; +* psychosomatic, adj. మానసిక రుగ్మతకి భౌతికమైన లక్షణాలు పొడచూపే; +* psychosis, n. గజిబిజగా, ఆందోళనకరంగా ఉండే ఆలోచనలు, లేనివి ఉన్నట్లు అనిపించే భ్రాంతి మొదలైన లక్షణాలు ఉన్న మనో స్థితి; +* puberty, n. తారుణ్య దశ; ఈడు; యవ్వనం; శరీరం మీద వెంట్రుకలు కనబడే వయస్సు; +pubescent hair, ph. తరుణ వయస్సులో శరీరం మీద కనబడే వెంట్రుకలు; +* public, adj 1) బాహాటపు; బాహాటమైన; బహిరంగ; బహిరంగమైన; రట్టయిన; రట్టు; రచ్చ; పబ్లిక్‌గా 2) ప్రజా; పౌర; జనహితైక; సర్వజనిక; పరియోక; పరి 3) ప్రభుత్వ; రాజ్యస; దివాణపు; సర్కారు; +public decency ph. నలుగురిలో మర్యాద; ఔచిత్యం; పరి మర్యాద; +public officer, ph ప్రభుత్వోద్యోగి; ప్రజాధికారి; రట్టడి; రెడ్డి; +public servant, ph. ప్రజా సేవకుడు; ప్రభుత్వోద్యోగి; +* public, n జనసామాన్యం; ప్రజలు; పౌరులు; పురజనులు; +* publication, n 1) ప్రచురణ; వెలయింపు; ప్రచురించబడినది 2) గ్రంథం; వార్తాపత్రిక; ఇస్తిహారు; +* publicity, n. ప్రచారం; ప్రాచుర్యం; బాహాటం; వెల్లాటకం; +* puddle, n. నీటి గుంట; కూపిక; వర్షపు నీరు చేరిన గుంట; +* pudding, n. పిండి, పాలు, ధాన్యాలు, పండ్లు, గుడ్లు మొ. పదార్థాలతో చేసే తియ్యని మెత్తని వంటకం; +* puerperal, adj. పురిటికి సంబంధించిన; పురిటి; ప్రసూతి; సూతికా; +* puff, v. i. గుల్లబారు; గుల్లవిచ్చు; ఉబ్బు; పొంగు; +* pugilistic, adj. జట్టి పెట్టుకునే తత్త్వం కల; పేచీకోరు; జట్టీకోరు; +* pull-ups, n. pl. దండీలు; ఒక రకం వ్యాయామం; ఎత్తుగా, క్షితిజ సమాంతరంగా వేల్లాడదీసిన చిన్న కర్రని పట్టుకుని వేల్లాడుతూ, గడ్డం కర్రకి తగిలే వరకూ శరీరాన్ని లేవనిత్తడం; +* pulmonary, adj. పుఫుస; ఊపిరితిత్తులకి సంబంధించిన; +* pulse, n. నాడి; ధాతునాడి; ఆరోగ్యమైన మగవాడి నాడి నిముషానికి డెబ్భయ్‍ సార్లు కొట్టుకుంటుంది; +* pulverize, v. i. గుండగు; పిండగు; నుగ్గగు; చూర్ణమగు; +* pulverize, v. t. గుండచేయు; నూరు; పిండిచేయు; నుగ్గుచేయు; చూర్ణముచేయు; పేషించు; +* pulverizer, పేషకి; పేషకం; పేషణ యంత్రం; పిండి మర; +* pump, n. పంపు; బొంబాయి; తోడిక; చాలకం; +sump pump, ph. కూప తోడిక; మురికి నీళ్లు ఒక గోతి (కూపం) లోకి చేరుకున్నప్పుడు ఆ నీటిని బయటకు తోడ��� సాధనం; +* pumpkin, n. గుమ్మడి; తియ్య గుమ్మడి; భద్రపర్ణి; కూశ్మాండం; +* pun, n. అక్షరక్రీడ; శ్లేష; ఒకే మాటని రెండర్ధాలు వచ్చేలా ప్రయోగించటం; +* punch, n 1) పిడిగుద్దు 2) పంచి; అయిదు రుచులతో కూడిన పానీయం 3) పడి అచ్చు; లోహపు రేకులమీద అచ్చువేసే పనిముట్టు; +* punctilious, adj. సూక్ష్మాచార; సూక్ష్మాచారపరాయణ; +* puncture, n. తూటు; బెజ్జం; చిల్లు; పంక్చరు; పంచేరు; +* punk, n. పనికిమాలినది; పనికిమాలినవాడు; +* puny, adj. బుల్లి; అల్పరూపి అయిన; +* pup, n. కుక్కపిల్ల; కుక్కజాతి జంతువుల పిల్ల; +* pupil, n 1) కంటిపాప; కంటిగుడ్డు; కన్నుయొక్క నల్లగుడ్డు; అక్షకూటం; తారక; కనీనిక 2) అంతేవాసి; విద్యార్థి; m. శిష్యుడు; f. శిష్యురాలు; +* puppet, n. కీలుబొమ్మ; తోలుబొమ్మ; సాలభంజిక; +* pure, adj 1) పవిత్రమైన; నిష్కళంకమైన; పావన 2) శుద్ధ; పరిశుద్ధ; స్వచ్ఛ; స్వచ్ఛంద; అమల; మృష్ట; జాను; పాళా; ప్రత్యగ్ర; అప్పటము; కల్తీకాని; నిష్కల్మషమైన ఔపపత్తిక; చొక్కం; +pure science, ph. ఔపపత్తిక శాస్త్రం; జాను శాస్త్రం; +* puree, n. కట్టు ఎక్కువ నీళ్ళతో ఉడికించి, బాగా జారుగా అయేవరకూ ఎనిపిన వంటకం; +* purge, v. t. పరిహరించు; కత్తిరించు; శుద్ధిచేయు; ప్రక్షాళించు; +* purple, n. ఊదా; ఎరుపు, నీలం కలసిన రంగు; ధూమ్రవర్ణం; +* purport, n. తాత్పర్యం; సారాంశం; ఫలితార్థం; +* purpose, n. ప్రయోజనం; ఉద్దేశం; ఉపయోగం; +* purse, n. ముల్లె; డబ్బు సంచి; కీసా; పొంకణం; +* push-ups, n. pl. బస్కీలు; ఒక రకం వ్యాయామం; కాళ్లతోటీ, చేతుల తోటీ నేలని దన్ను చేసుకొని, బోర్లా ఉన్న భంగిమలో, నేలకి మోకళ్లు తగలకుండా, శరీరాన్ని పైకి లేపడం; +* pursue, v. t 1) వెంబడించు; వెంటతరుము; అనుసరించు 2) అనుకున్న పనిని సాధించడానికి ప్రయత్నం చేయు; +* purulent, adj. చీము కలిగినట్టి; చీము పట్టిన; +* purview, n. పరిధి; దృక్ పరిధి; చూపుమేర; ఎరికె; +* pussyfoot, v. i. నాన్చు; వివాదాస్పదమైన విషయంలో ఎటూ మొగ్గకుండ నాన్చు; +* pustule, n. చీముతో నిండిన, చిన్న, గుండ్రని పొక్కు; +* putch, n పుచ్) విప్లవోద్యమం; +* puzzle, n. అరోచకం; ప్రహేళిక; పజిలు; పజిల్; +* pyol, n. అరుగు; చీడీ; ఇంటిని ఆనుకుని ఉండే ఎత్తయిన తీనె; +* pyol, n. అరుగు; ఇంటి ముందు, ఇంటికి ఆనుకుని ఉన్న ఎత్తయిన తిన్నె; +* pyroelectricity, n. తాప విద్యుత్తు; అగ్నివిద్యుత్తు; ఉష్ణవిద్యుత్తు; +* pyrometer, n. బాగా ఎక్కువ వేడిని కొలిచే తాపమాపకం; ఉడుకుతున్న వస్తువుల వేడిని కాని, మండుతున్న వస్తువుల వేడిని కాని కొలిచే తాపమాపకం; +* python, n. కొండచిలువ; పెనుబాము; మచ్చల కొండచిలువ (reticulated python) అన్నిటికంటె పొడవైన పాము; + + +sac, n. సంచి; తిత్తి; బస్తా; గోతం; +* sacrilege, n. దేవదూషణ; చెయ్యరాని పని; అపవిత్రం; ధర్మోల్లంఘన; +* sadism, n. హనన క్రౌర్యం; ఒకరిని హింసించి చూసి ఆనందించడం; రతి క్రీడలో ఎదుటి వారి శరీరానికి బాధ కలిగే పనులు చేసి ఆనందం పొందడం see also masochism; +* sadist, n. హింసాళువు; ఎదుటి వారి శరీరానికి బాధ కలిగే పనులు చేసి ఆనందం పొందే వ్యక్తి ety Marquis de Sade అనే వ్యక్తి పేరు మీదుగా వచ్చిన మాట; +* safe, adj. సురక్షితమైన; నిరపాయమైన; +* safe, n 1) ఇనప్పెట్టి; మందసం; ఖాయిదా 2) నిరపాయం; +* safely, adv. క్షేమంగా; భద్రంగా; పదిలంగా; +* safety, n. క్షేమం; యోగక్షేమం; భద్రత; +* saffron, n. కుంకుమ పువ్వు; కేసరి; అగ్నిశిఖ; +* sagacity, n. జాణతనం; సూక్ష్మగ్రాహత్వం; గడుసుతనం; +* Sagittarius, n 1) ధనూరాశి 2) ఉత్తరాషాడా నక్షత్రం; ధనూరాశిలో ఉన్న ఒక చిన్న నక్షత్ర సమూహం; +* sago, n. సగ్గుబియ్యం; కొన్ని తాళ జాతుల మొక్కల కాండములలో లభించే పిండి పదార్థముతో చేయబడ్డ కృత్రిమ ధాన్య విశేషం; see also tapioca; +* saint, n. m. పుణ్యాత్ముడు; దైవసమానుడు; f. పుణ్యాత్మురాలు; దైవసమానురాలు; +* sale, n 1) అమ్మకం; విపణం; వ్యాపారం; విక్రయం 2) తెగుబడి; ప్రత్యేకంగా తగ్గింపు ధరకి అమ్మకం; +* saliva, n. లాలాజలం; ఉమ్మినీరు; నోటూట; చొంగ; +* salivation, n. నోటి ఊట; లాలాస్రావం; చొంగ కారడం; +rock salt, ph. రాతి ఉప్పు; సైంధవ లవణం; గని ఉప్పు; రవుమకం; రోమక లవణం note) రాతి ఉప్పుని సైంధవ లవణం అంటారు. సింధువు అంటే సముద్రం కనుక సైంధవ లవణం అంటే సముద్రపు ఉప్పే. కాని గనిలోకి మాత్రం ఉప్పు ఎక్కడనుండి వచ్చింది? అక్కడ ఒకానొకప్పుడు సముద్రం ఉండడం వల్లనే కదా. +sea salt, ph. సముద్రపు ఉప్పు; సైంధవ లవణం; +* saltpeter, n. యవక్షారం; సురేకారం; పెట్లుప్పు; +* salutation, n. అభివందనం; వందనం; నమోవాకము; జోత; నమస్కారం; కయిమోడ్పు; ప్రణతి; ప్రణామం; +* salvation, n. నివృత్తి; నిర్వృతి; నిష్కృతి; మోక్షం; కైవల్యం; +* salve, n. లేపనం; గాయాలకి పూయు మందు; +* sample, n. మచ్చు; మాదిరి; మచ్చుతునక; ప్రతిరూపం; +* sampling, n. మచ్చు చూడడం; స్థాలీపులక న్యాయం; +sampling theory, ph. స్థాలీపులాక సిద్ధాంతం; స్థాలీపులాక వాదం; +* sanction, v. t 1) మంజూరు చేయు; ఆమోదించు; అనుమతించు 2) సరఫరాని నిలిపివేయు; ఆంక్షలు విధించు note) ఒకే మాటకి వచ్చిన వ్యతిరేకార్థాలు గమనించునది; +* sanctuary, n 1) శరణ్యం; శరణాలయం; ఆశ్రయం; అభయాలయం 2) పుణ్యస్థలి; గర్భగుడి; +* sand, n. సైకతం; సికత; వాలుక; ఇసుక; కూర్పం; +sand clock, ph. వాలుకాయంత్రం; ఇసక గడియారం; ఇసుక గడియారము; +sand dune, ph. ఇసక దిబ్బ; ఇసక తిన్నె; సైకతం; ఇసుక దిబ్బ; ఇసుక తిన్నె; +sandalwood paste, ph. చందనం; గంధం; మంచిగంధం; గంధపు ముద్ద; చందన ఖమీరం; +sandalwood tree, ph. చందనపు చెట్టు; గంధపు చెట్టు; పటీరవిటపి; భద్రశ్రీ; +* sandpaper, n. ఉప్పుకాగితం; గరుకుకాగితం; హంస కాగితం; +* sanity, n. స్థిరచిత్తత; చిత్త స్థిరత; +* sapphire, n. నీలం; ఇంద్రనీలం; నీలమణి; నవరత్నాలలో ఒకటి ety Sans. శనిప్రియా; +* sarcasm, n. ఎత్తిపొడుపు; ఉపాలంభం; వ్యంగ్యం; వక్రోక్తి; సంతక్షణ; +* Satan, n. సైతాను; క్రైస్తవ మతంలో మంచికి చుక్కెదురు; మానవుని శత్రువు; ఇస్లాం మతంలో సైతాను అంటే మానవుని శత్రువు; ఈ సైతానునే Devil అని కూడా అంటారు; +* satire, n. వక్రోక్తి; ఆక్షేపం; అధిక్షేపం; వ్యంగ్యం; వ్యంగ్యకావ్యం; +* satisfaction, n. సంతృప్తి; సంతృష్టి; తృప్తి; తనివి; తుష్టి; ఆపోక; +* Saturday, n. శనివారం; స్థిరవారం; మందవారం; +* satyr, n సేటర్ 1) కామాతురుడు, రిరంసువు 2) గ్రీకు పురాణ గాథలలో కనిపించే ఒక శాల్తీ 3) కిన్నరుడు; హిందూ పురాణాలలో కనపడే మనిషి శరీరం, గుర్రపు చెవులు, గుర్రపు తోక ఉండి, కామాతురతతో ఉండే ఒక శాల్తీ; see also centaur; +* saunter, v. i నెమ్మదిగా, తొందర లేకుండా, నడుచు; పెళ్లి నడకలు నడచు; +* saute, v. t. వేయించు; దోరగా వేయించు; వేపు; +* savings, n. ఆదా; నిల్వలు; పొదుపు మొత్తాలు; +* savory, n. రుచ్యం; రుచి అయిన పదార్థం: +* saw, v. i. చూసెను; చూసితిని; చూసేడు; చూసింది; +* sawtooth, n. రంపపుపన్ను; క్రకచదంతం; +* say, v. t. చెప్పు; అను; ఉటంకించు; ఆడు; వచించు; వ్రాక్కుచ్చు; నుడువు; +* saying, n. నానుడి; సామెత; లోకోక్తి; కింవదంతి; +* scab, n. పక్కు; పుండు మీద గడ్డకట్టిన రసి; +* scalding, adj. మరుగుతూన్న; సలసల మరుగుతూన్న; కాగుతూన్న; దాహక; +* scale, v. t 1) ఎక్కు; అధిరోహించు 2) చేప పొలుసులని ఒలుచు;(3) సంగీతంలో కొన్ని స్వరముల కలయిక; +* scales, n 1) తక్కెడ; త్రాసు; తుల; కాటా; కాకిణి; తూనిక 2) తక్కెడలో ఇటూ అటూ ఉండే సిబ్బిలు 3) పొలుసులు; చేపల వంటి జీవుల శరీరంమీద ఉండే పొలుసులు; +* scalp, n. మాడు; కపాలం; జుత్తు గీకేసిన తర్వాత కనిపించే శిరోభాగం; +* scapula, n. అంసఫలకం; రెక్క ఎముక; భుజంలో ఉన్న పలక వంటి ఎముక; +* scar, n. మచ్చ; కిణం; గాయం మానగా మిగిలే చర్మపు ముడత; +* scarce, adj. అరుదైన; అపురూపమైన; దొరకకపోవడం; +* scarce, adv. అరుదుగా; అపురూపంగా; కదాచిత్తుగా; +* scarcity, n. ఎద్దడి; కొరత; చాలమి; లేమిడి; సంక్షోభం; దొరకకపోవుట; +* scare, v. t. భయపెట్టు; హడలగొట్టు; బెదిరించు; +* scatter, v. t. జల్లు; విరజిమ్ము; పరిక్షేపించు; +scatter diagram, ph. వ్యాకీర్ణ పటం; పరిక్షేప పటం; వ్యాపక పటం; +* scattered, adj. చెదురు మదురుగా; ప్రకీర్ణ; వ్యాకీర్ణ; పరిక్షిప్త; అవకీర్ణ; ప్రకిరణ: ఉద్ధూత; +* scattering, n. జల్లు; చెదరడం; విరజిమ్ముట; పరిక్షేపణం; జల్లడం; +back scattering, ph. అప పరిక్షేపణం; వెనకకి జల్లడం; పతన వికిరణం పరావర్తనం చెందినప్పుడు, పరావర్తన కోణం ���తన కిరణం దిశ నుండి 90 డిగ్రీలకి మించి ఉంటే దానిని అప పరిక్షేపణం అంటారు; +* scavenger, n. బలిభుక్కు; బలిభుజం; చచ్చిపోయిన జీవులని తినే జంతువు; +* scene, n 1) దృశ్యం; ఈక్షితం; సన్నివేశం 2) ఘట్టం 3) రాద్ధాంతం; +* scent, n 1) వాసన; సుగంధం 2) తావినూనె; అత్తరు; సెంటు; +* schadenfreude, n. ఎదుటివాడికి తగిన శాస్తి జరిగిందని సంతోషించడం +* schedule, n. కాలసూచి; కాలపట్టిక; అనుసూచి; సమయాపన; సేపరము; షెడ్యూలు 2) అధికరణం; రాజ్యామ్గంలో ఒక భాగం; +* scheduling, n సేపరణ; ఒక సమయం ఎన్నుకుని ఏర్పరచు; +* schematic, n. ఒక పథకాన్ని నఖచిత్రంలా చూపించే బొమ్మ; +* scheme, n. ఎత్తు; పద్ధతి; ఉపాయం; పథకం; తంత్రం; వ్యూహం; వ్యూహరచన; యుక్తి; పన్నాగం; కుట్ర; +* schizophrenia n. మనోవిదళనం; ఒక రకమైన మానసిక వ్యాధి; వాస్తవమేదో, భ్రమ ఏదో తెలియకుండా, ఏవేవో అపోహలతో, సాంఘికమైన లంకెలు లేకుండా ఉండే ఒక తత్త్వం; +* scholar, n. m. పండితుడు; ప్రాజ్ఞుడు; పారంగతుడు; విబుధుడు; భట్టారకుడు; మనీషి ధీమతి; దీర్ఘదర్శి; f. పండితురాలు; ప్రాజ్ఞి; విదుషి; విదుషీమణి; +* scholarship, n 1) పాండిత్యం; వైదుష్యం; ప్రజ్ఞ; విద్వత్తు; వేత్తృత్వం 2) విదార్థి వేతనం; +* school, n. బడి; పాఠశాల; విద్యాలయం; పడగసాల; +* science, n. శాస్త్రం; విజ్ఞానం; విన్నాణం; నీతి; +scientific method, ph. శాస్త్రీయ విధానం; శాస్త్రీయ పద్ధతి; +* scion సియన్ n వారసుడు; వంశోద్ధారకుడు; +* scold, v. t. తిట్టు; నిందించు; మాటలు అను; ఆడిపోసికొను; +* score, n 1) అంకాలు; ఆటలలో వచ్చే “గెలుపులు ”; స్కోరు; ఆటల పోటీలలో జట్లకి వచ్చే మార్కులు 2) స్వరకల్పన; సంగీత దర్శకుడు కుదిర్చే వాద్య సంగీతం 3) ఇరవై; కోడిగ; +* Scorpio, n వృశ్చికరాశి ఆకాశంలో కనిపించే ద్వాదశ రాశులలో ఒక రాశి; +* scoundrel, n. తులువ; కుత్సితుడు; దగుల్భాజి; +* screen, n 1) తెర; తెరచీర; యవనిక; ప్రతిసీర; కనాతి 2) అడ్డు; వ్యవధానం; ముసుగు 3) గాజుతెర; +* screen, v. t 1) తెరమీద బొమ్మ వేసి చూపించు 2) అడ్డు పెట్టు 3) వైద్య పరీక్ష చేసి ఫలానా జబ్బు ఉందో లేదో నిశ్చయించు; వడకట్టు; ఎంపిక చేయు; +* screenplay, n. చిత్రానువాదం; చిత్రానుకరణ; చిత్రానుసరణ; ఒక కథని సినిమా తియ్యడానికి వీలుగా మలచి రాసిన రాత; +* screenshot, n. తెరపట్టు; కంప్యూటర్ తెర మీద కనిపించే అంశాన్ని బొమ్మ రూపంలో పట్టుకునే ప్రక్రియ ద్వారా సేకరించిన బొమ్మ; +* screw, n. నీల; కీలం; మర; మరమేకు; చీల; మరచీల; మరచుట్టు; +* screwdriver, n. మరచుట్టు ని తిప్పే కొరముట్టు; +* scribe, n. లేఖరి; లేఖకుడు; రాయసకాడు; రాతకాడు; వ్రాయసకాడు; నోటితో చెబితే కాగితం మీద రాసే ఆసామీ; +* script, n 1) లిపి; వ్రాత; లేఖనము; అక్షర విన్యాసము; see also font 2) రాతప్రతి; సంభాషణలు రాసిన పుస్తకం; +* scroll, n 1) కాగితపు చుట్ట; చుట్ట చుట్టిన పొడవైన కాగితం 2) చుట్టచుట్టిన పొడవైన కాగితం మీద రాసిన రాత 3) జాబితా; +* scroll, v. i జరుపు; పొడవైన జాబితాని చిన్న తెర మీద చదవడానికి వీలుగా పైకి, కిందకి జరపడం; +scroll bar, ph. జరుపుడు పట్టా చిన్న కంప్యూటర్ తెర మీద పొడుగ్గా ఉన్న రాతని పైకి, కిందకి జరపడానికి వాడే ఉపకరణం; +* scum, n 1) తెట్టు; జల పదార్థాలమీద తేలే మరొక పదార్థం; సాధారణంగా మలిన పదార్థం 2) మడ్డి; జల పదార్థాలని నిలబెడితే దిగువకి దిగే మరొక పదార్థం; సాధారణంగా మలిన పదార్థం 3) పాచి; నిల్వ ఉన్న మురికి నీటిలో కనబడే ఆకుపచ్చని పదార్థం; +* scurvy, n. శీతాదం విటమిన్ సి లోపం వల్ల కలిగే ఒక జబ్బు; +* Scuttlebutt, n. వ్యర్థప్రసంగం, జల్పనం. సుద్దులు; వదంతి; వినికిడి; జనప్రవాదము; లోకవార్త కిం)వదంతి పుకారు; rumor; gossip; +sea, n. సముద్రం; సింధువు; మున్నీరు; సాగరం; జలనిధి; జలధి; జలరాశి; అర్ణవం; కడలి; కంధి; +sea breeze, ph. సముద్ర మారుతం; కడలి తెమ్మెర; +sea shore, ph. సముద్రపుటొడ్డు; పారావారం; చెలియలికట్ట; కడలిటొడ్డు; +* seafood, n. మీనాద్యాహారాలు; కడలి తిండి; +* seal, v. t 1) అతుకు; అంటించు 2) ముద్రవేయ; సికా వేయు; +* search, v. t. వెతుకు; అన్వేషించు; శోధించు; గవేషించు; గాలించు; దేవు; తనిఖీ చేయు; నెమకు; +* search, n. అన్వేషణ; శోధన; సోదా; గవేషణ; వెతుకుడు; +rainy season, ph. వర్షాకాలం; వర్షర్తువు; వానత్తడి; +summer season, ph. ఎండాకాలం; వేసవి; గ్రీష్మర్తువు; ఎండత్తడి; +* seasonable, adv. కాలానుగుణ్యంగా; అత్తడికి అనువుగా; +* seasoning, n. మసాలా; సాంబారం; రుచి కొరకు వేసే ఉప్పు; కారం, వగైరాలు; +* seat, n 1) ఆసనం; పీఠం; పీట; ఠేవిణి; వితర్థిక; ఉపవిష్టిక; అదివాసం; కూర్చునే చోటు; ఇరువు; సీటు 2) ఇరువు; స్థానం; సీటు; కళాశాలలో ప్రవేశార్హత; +sebaceous glands, ph. చమురు గ్రంథులు; తైల గ్రంథులు; నూనె కంతులు; చర్మం కింద ఉండే ఈ గ్రంథులలో ఊరే చమురు వల్లనే మన శరీరాలు ఎండి పోకుండా ఉంటున్నాయి; +* secant, n 1) ఖండన రేఖ; కోత గెర; ఒక వక్రరేఖని రెండు చోట్ల ఖండించే గీత 2) ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం పొడుగుకీ, లఘు కోణానికి ఆసన్నంగా ఉన్న చిన్న భుజం పొడుగుకీ ఉన్న నిష్పత్తి కోసైను యొక్క వ్యుత్క్రమము; +* second, n 1) లిప్త; క్షణం; సెకను; నిమిషంలో అఱవైయవ వంతు 2) రెండవది; ద్వితీయం; +second hand, ph. గడియారంలో సెకండ్లు చూపించే ముల్లు; +* secondary, n. అప్రధానం; గౌణం; ద్వితీయం; రెండవది; +* secrecy, n గుప్తత; గోప్యత; గుట్టుతనం; గోపనీయత; విషయాన్ని దాచి పెట్టడం; +* secret organs, ph. మర్మేంద్రియాలు; మర్మావయవాలు; +* secret, n. రహస్యం; గుట్టు; మర్మం; గుప్తం; గోప్యం; గాయకం; గుహ్యం; +open secret, ph. బహిరంగ రహస్యం; రట్టైన గుట్టు; +* secretly adv రహశ్యంగా; చాటుగా; దొంగచాటుగా; గుంభనంగా; గోప్యంగా; గుప్తంగా; గుట్టుగా; +* secretariat, n. సచివాలయం; కార్యదర్శుల కార్యాలయం; ఏలుబడి నెలవు; +* secretary, n. కార్యదర్శి; సచివుడు; ఏలుదోఁడు; +* section, n 1) సర్గం; పరిచ్ఛేదం; భాగం; గణం; ప్రకరణం; స్కంధం; పాదం; ఖండం; సంపాతం 2) కోత; +* secular, adj 1) లౌకిక; ప్రాపంచిక 2) మతాతీత; మత సంబంధం కాని; +* security, n 1) భద్రత; బందోబస్తు 2) జామీను; తాకట్టు; హామీ; ధరావతు; జమానతు; +* sedative, n. శమనకారి; ఉపశమనికం; ఉపశమనాన్ని ఇచ్చే ఔషధం; +* sedentary, adj. నిలగ్న; ఒకే స్థానమందు ఉండేది; +* sedition, n. రాజద్రోహం; దేశద్రోహం; అధికారధిక్కారం; +sedimentary rock formation, ph. కల్కిక ఛిలా విన్యాసం; అవక్షేప శిలా విన్యాసం; మస్టు శిలా విన్యాసం; +* sedimentation, n. కల్కనం; మట్టి దిగజారడం; గసికట్టడం; అవసాదనం; +* seduce, v. t. చెరచు; భ్రష్టం చేయు; మరులుగొల్పు; +* seductively, adv. ఒయ్యారంగా; వయ్యారంగా; విమోహకంగా; కామోద్రేకకరంగా; +* see, v. t. చూడు; కను; కాంచు; అవలోకించు; వీక్షించు; దర్శించు; తిలకించు; +* see v. t 1) చూడు; కను; కాంచు; అవలోకించు; వీక్షించు; దర్శించు; తిలకించు; ఆలోకించు 2) అమర్చు; చక్కబెట్టు; +* seed, n. గింజ; విత్తనం; విత్తు; బీజం; రేతస్సు; పిక్క; టెంక; +orthodox seed, ph. చెట్టునివీడి, ఎండిపోయిన తరువాత కూడ ఎన్నో సంవత్సరాలు మొలకెత్తే శక్తిని కలిగి ఉండే విత్తనం; ఖర్జూరం ఈ రకం విత్తనాలని ఇస్తుంది; +recalcitrant seed, ph. కొత్తగా, చెమ్మగా ఉన్నప్పుడే మొలకెత్తగల విత్తనాలు; అవకాడో ఈ జాతిది; +* seeded, adj 1) గింజలతో కూడిన 2) గింజలు తీయబడ్డ 3) విత్తులు నాటబడ్డ note) వ్యతిరేకార్థములతో ఉన్న మాట; +* seeding, n. నాట్లు; విత్తులు నాటడం; +* seeing, adj. దృష్ట; చూసే వ్యక్తికి సంబంధించిన; +* seek, v. i. వెతుకు; కోరు; ఆపేక్షించు; +* seen, adj. దృశ్య; చూస్తున్న వస్తువుకి సంబంధించిన; +* seer, n. ద్రష్ట; ప్రవక్త; అన్నీ తెలిసిన వ్యక్తి; +* seethe, v. i. ధుమధుమలాడు; కుతకుతలాడు; మండు; +* seldom, adv సకృత్తుగా; అప్పుడప్పుడు; ఎప్పుడైనా; ఎప్పుడోకప్పుడు; +* segment, n. తొన; భాగం; ముక్క; ఖండం; పరిచ్ఛేదం; +* seismology, n. గ్రహకంప శాస్త్రం; భూకంప శాస్త్రం; +* seize, v. t 1) పట్టుకొను ఆక్రమించు 2) జప్తుచేయు; +* seldom, adv. అరుదుగా; కదాచిత్తుగా; క్వాచిత్కంగా; సకృత్తుగా; +* self, pref. ఆత్మ; స్వ; స్వయం; స్వార్థ; సొంత; స్వంత; తాఁ; +* self-esteem, n. ఆత్మగౌరవం; అభిజాత్యం; అతిశయం; ప్రకర్ష; +* self-less, adj. స్వార్థరహితమైన; నిస్వార్థమైన; +* self-pity, ph. ఆత్మకారుణ్యం; ఆత్మానుకంపం; +* self-pollination, n. స్వపరాగ సంపర��కం; స్వజాతి సంపర్కం; ఆత్మపరాగ సంపర్కం; +* self-respect, n. ఆత్మాభిమానం; ఆత్మగౌరవం; తన్నదటు (తన అదటు); +* selfish person, n. ఆత్మంభరి; m. స్వార్థపరుడు; స్వార్థకాముడు; +* selfishness, n. స్వార్థం; స్వార్థపరత్వం; ఆత్మంభరత్వం; ప్రలోభం; ఒంటెత్తుతనం; ఒంటెత్తు బుద్ధులు; +* selflessness, n. స్వార్థరాహిత్యం; నిస్వార్థం; +* semanticist, n. మాటల యొక్క అర్థం గురించి కాని, ఆ అర్థం యొక్క మార్పుకి సంబంధించిన విషయాలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి; +* semantics, n అర్థం; పదార్థశాస్త్రం; మాటలయొక్క అర్థానికి సంబంధించిన శాస్త్రం; +* semaphore, n. రెక్క; రెక్కమాను; రెక్కపేడు; లలామం; సంబావుటా; టెక్కెం; వాకేతం; +* semen, n. రేతస్సు; వీర్యం; సాఁడు; పురుష జననాంగాలలో తయారయే తెల్లటి ద్రవం; +* semi, pref. అర్ధ; అసంపూర్ణ; పూర్తికాని; పదార్థం; ఈ ద్రవంలో వీర్య కణాలు ఉంటాయు see also sperm; +* semicolon, n. అర్ధ బిందువు; వాక్యంలో విరామ చిహ్నం; +* seminal, adj 1) ప్రబలమైన; వ్యాపకత్వము గల 2) వీర్య సంబంధమైన; +* semivowels, n. అంతస్థములు; లఘువులు; అలఘువులు; +* senate, n. శిష్టసభ; పరిషత్తు; భారతదేశంలోని రాజ్యసభ అమెరికాలోని సెనేటుకి సమానం; +* senator, n. శాసనసభలో సభ్యుడు లేదా సభ్యురాలు; +* sender, n. పంపువాడు; ప్రేషకుడు; ప్రేషకం +* sendoff, v. t. సాగనంపు; వీడుకొలుపు; పంపించు; +* senility, n. వార్ధక్యంతో వచ్చే మనోదౌర్బల్యం; వార్ధక్యం; వృద్ధాప్యం; ముసలితనం; +* senior, n 1) పెద్ద; జ్యేష్ఠుడు; గరిష్ఠుడు 2) నాలుగేళ్లపాటు కొనసాగే విద్యార్థి దశలో నాలుగవ ఏటి విద్యార్థి 3) పై తరగతి విద్యార్థి 4) పెద్ద వకీలు; +* senna, n. నేల తంగేడు; సునాముఖి; +* sense, n 1) ఇంద్రియం; తన్మాత్ర; ఆద (2) తెలివి; జ్ఞానం 3) భావం; ఉద్దేశం; +sensor array, ph. సంవేదక శ్రేణి; గ్రాహక శ్రేణి; గోచర శ్రేణి; +* sensual, adj. శృంగార; విషయాసక్తి గల; ఇంద్రియ సుఖ సంబంధమైన; కామాతురమైన; +* sensuous, adj. ఇంద్రియాలని ఆకర్షించేటటువంటి శృంగార; +* sentient, adj. స్పర్శజ్ఞానము కల; చక్షు, శ్రవణ, ఘ్రాణ స్పర్శలతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుభవించగల able to perceive or feel things; +* sentiment, n 1) మనోభావం, భావవృత్తి, చిత్తవృత్తి, భావానుబంధం, సంవేదన; ప్రబల విశ్వాసం 2) రసం; ఆర్ద్రత; రాగం; +sentiment analysis, ph మనోభావ విశ్లేషణ; వినియోగదారులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం; +* sentimental, adj. రసస్పూరిత; మనోభావాలని ప్రదర్శించే విధంగా; లోపలలేని భావాలని పైపైన ప్రదర్శించే విధంగా; +* sentinel, n. కాపు; కావలివాడు; పహరాదారు; రక్షకుడు; సిపాయి; +* separate, v. t. వేరు చేయు; విడగొట్టు; విడదీయు; వింగడించు; అన్యథాకరించు; +* sepsis, n. కుళ్లు; విషపూరితం; పూతిదోషం; +* septic, adj. కు��్లిన; విషపూరిత; కలుషమైన; పూతిదోష; పూతికర ant anti-septic పూత్యారి; +* septuagenarian, n. డెబ్బది, ఎనబది ఏండ్ల మధ్య వయస్సులో ఉన్న వ్యక్తి; +* septum, n. పటి; రెండు కుహరములు మధ్యనున్న గోడ; +* sequel, n. తరువాయి; తరువాయి కథ; తరువాయి గ్రంథం; పరిణామం; ఫలం; +* serenade, v. t. పాటలతో ప్రేమను వ్యక్తపరచుట; +* serendipity, n. కాకతాళీయంగా కలిసొచ్చిన అదృష్టం; +* serial, n. శ్రేణిక; ఖండకథ; స్రవంతి; సానుక్రమికం; +* sericulture, n. పట్టుపరిశ్రమ; పట్టుపురుగుల పెంపకం; +* serious, adj 1) ప్రమాదకరమైన; ఘోరమైన 2) నిజమైన; హాస్యంకాని; గంభీరమైన; +* sermon, n. ధర్మోపదేశం; ధర్మప్రవచనం; +* serpent, n. సర్పం; పాము; పన్నగం; వ్యాళం; హవ్వరం; ఉరగం; +serpent stone, ph. మణి; నాగమణి; గోరోచనం ని అరగదీసి నున్నగా చేసిన రాయి; గ్రీకు పురాణగాథ "ఇలియాడ్" లో ఫిలోక్టిటీస్ అనే యోధుడిని పాము కరిస్తే ఆ విషం దిగడానికి మెకేయాన్ అనే వైద్యుడు ఈ రకం నాగమణిని ఉపయోగించేడుట; +* serrated, adj. దంతురిత; ఱంపపు పళ్ళ వంటి పళ్ళు కల; +* serum, n. లసి; రక్తపు రసిలో కరిగిన ఫిబ్రినోజస్‌ని తీసివేయగా మిగిలినది; +* servant, n. f. సేవకి; సేవకురాలు; పనిమనిషి; కింకరి; భృత్యురాలు; దాసి; పారిక; తొత్తు; చేటకుఁడు; చేటకి; +* servant, n. m. సేవకుడు; పనిమనిషి; భృత్యుడు; దాసుడు; లెంకఁడు; బంటు; కింకరుడు; డింగరి; గులాం; పారికాపు; +* serve, v. t. వడ్డించు; సేవ చేయు; కైంకర్యం చేయు; శుశ్రూష చేయు; ఉపచారం చేయు; +* server, n 1) ఉపచారి; కింకరి; చేటి; చేటిక; పరిచారిక; సేవిక 2) ఉపచారం చేసే వ్యక్తి; కైంకర్యం చేసే వ్యక్తి; వడ్డన చేసే వ్యక్తి; +* service, n 1) సేవ; సపర్య; పరిచర్య; సహాయం 2) కైంకర్యం; ఉపాసన; పూజ 3) నౌకరీ; ఊడిగం; దాస్యం; ఒంటరికం 4) శుశ్రూశ; చాకిరీ; పని 5) అనువృత్తి; ఉపచర్య; ఉపచారం 6) క్రియ; +* sesame seed, n. నువ్వులు; తిలలు; నువ్వు పప్పు; నూపప్పు; తెలికలు; +* set, n 1) సమితి; వర్గం; గణం; సమూహం; తతి; సంపుటం; పటలి; చయము 2) దృశ్య బంధం; రంగాలంకరణ విశేషం; +* set, v. i. అస్తమించు; క్రుంగు; మునుఁగు; క్రిందకు దిగు; +* settle, v. i. స్థిరపడు; ఇరవుపడు; నెలకొను; అధివసించు; +* settle, v. t. స్థిరపరచు; పరిష్కరించు; తీర్పు చెప్పు; తేల్చు; +* settlement, n 1) స్థిరనివాసం; స్థావరం 2) పరిష్కారం; ఫైసలా; +* seven, n. ఏడు; ఆరున్కొక్కటి; సప్తకం; +* sever, v. t. త్రెంపు; నరుకు; తెగగొట్టు; తెగటార్చు; +* several, adj. చాలా; పెక్కు; పలు; వేఱ్వేఱు; తమతమ; ఆయా; కొన్ని; కొందఱు; +several people, ph. చాలామంది; పలువురు; అనేకులు; పెక్కండ్రు; వేవురు; +* severally, adv. ఎవరిమట్టుకు వారు; ఎవరితోవన వారు; +* Seville orange, n. ఇటలీలోని సెవిల్ ప్రాంతంలో దొరికే నారింజ; నారదబ్బ; +* sewage, n. మురుగు; మురుగునీరు; మురికి నీరు; +* sewer, n. మురుగు గొట్టం; మురుగు కాలవ; మురుగునీటి గొట్టం; +* sewerage, n. మురుగు నీటిని మోసుకుపోయే, శుభ్రపరచే అవస్థాపన వ్యవస్థ; +* sex, adj. లింగ; లైంగిక; శృంగార; కాయువ; +* sex, n 1 gram లింగము; ఆడో మగో తెలిపే పదం 2) రతిక్రియ; స్త్రీ పురుష సంయోగం; +* sexagecimal, adj. షష్టాదశాంశ; షష్ట్యంక; అరవై అంశలు ఉన్న; +sexagecimal system, ph. షష్టదశాంశ పద్ధతి; షష్ట్యంక పద్ధతి; అరవై అంశలు ఉపయోగించి లెక్కపెట్టు పద్ధతి; +* sextant, n షడ్భాగి; వృత్తంలో ఆరో భాగం ఆకారంలో ఉన్న ఒక ఖగోళ పనిముట్టు; +* sextuplets, n. pl. షష్ఠకం; షష్ఠకులు; ఒకే కాన్పులో పుట్టిన ఆరుగురు పిల్లలు; +* sexy, adj. కాముక; కామోద్దీపిక; కామప్రేరిక; +* shag, n. ఒత్తుగా, చిందరవందరగా ఉన్న ఉన్ని; ఒత్తుగా చిందరవందరగా పెరిగిన జుత్తు; +* shake, v. t 1) రంగరించు; గిలకరించు; చిలకరించు 2) ఊపు; ఝళిపించు; కుదుపు; ఆడించు; కంపించు 3) అసమ్మతిని తెలియజేయడానికి బురన్రి అడ్డుగా ఆడించడం; +* shallow, adj. కాకపేయ; కాకి స్నానం చెయ్యడానికి సరిపడే లోతు గల; లోతు తక్కువైన; సారహీనమైన; +* shambles, n. s 1) కసాయి గూడెం 2) చిందరవందరగా, చేపల బజారులా ఉన్న స్థలం; +* shame, n 1) తలవంపు; అవమానం అపత్రప 2) లజ్జ; సిగ్గు; +* shamelessly adv సిగ్గు లేకుండా; నిస్సిగ్గుగా; +* shampoo, n. కేశకాంతి; జుత్తుని శుభ్రపరచడానికి వాడే కుంకుడురసం లాంటి పదార్థం; +* shape, n. ఆకారం; ఆకృతి; మూర్తం; రూపం; రూపధేయం; +* shaped, adj. సాకార; ఆకారంతో కూడిన; రూపధేయ; +* shapeless, n. నిరాకారం; నిరాకృతి; అమూర్తం ant సాకారం; +* shards, n. పెంకులు; విరిగిన ముక్కలు; +* share, n. వాటా; భాగం; వంతు; పాలు; భాగధేయం; దాయం; అంశ; దామాషా; దాయం; హిస్సా; షేరు; +* sharecropper, n. పాలేరు; కౌలుకి తీసికొన్న రైతు; కామందు దగ్గర పొలాన్ని "అద్దెకి" తీసుకుని, పంటలో ఒక భాగం శిస్తు చెల్లించే వ్యక్తి; +* shareholder, n. వాటాదారుఁడు; భాగస్వామి; భాగస్థుఁడు; భాగధేయుఁడు; పాలివాఁడు; అంశకుఁడు; +* shark, n. ఏలాం; ఏలాంచేప; సొఱచేఁప; +* sharp, adj. వాడిగా; వాడియైన; పదునుగా; పదునైన; చురుగ్గా; చురుకైన; తీక్షణంగా; తీక్షణమైన; తీవ్రంగా; తీవ్రమైన; నిశితమైన; ఉదాత్తమైన; లఘు; +* shavings, n. కోరు; ఛాతనములు; చిత్రిక పట్టడం వల్ల వచ్చే బీడు; +* shears, n. పెద్ద కత్తెర; మొక్కలని కత్తిరించడానికి వాడే పెద్ద కత్తెర; +* shed, n. పాక; పంచ; శాల; సాల; కొట్టం; గుడిసె: +* shed, v. t. రాల్చు; కార్చు; జల్లు; వదలిపెట్టు; +* sheep, n. గొర్రె; గొర్రెలు; పొట్టేలు; తగరు; ఏడిక; మేషం; +* shelf, n 1) అలమారు; అరమారు; బీరువా; గూడు 2) స్తరిక; అలమారులో ఒక సొరుగులాంటి అంతస్తు 2) మేట; ఇసక మేట; +* shell, n 1) గుల్ల; చిల్లగ���్వ; గవ్వ; చిప్ప; డొల్ల; కంబు; కర్పరం; కోశం; కర్క 2) కవచం; స్పోటం; తొబక 3) ఫిరంగిలో గుండు; +electron shell, ph. ఎలక్ట్రాను కవచం; విద్యుత్కణ కవచం; +outer shell, ph. బాహ్య కవచం; బాహ్య కోశం; పైగవ్వ; పైగుల్ల; +pearl shell, ph. ముక్తాస్పోటం; ముత్యపు చిప్ప; +sea shell, ph. సముద్రపు గుల్ల; సింధుస్పోటం; కడలి గవ్వ; కడలి చిప్ప; +* shellac, n. పెల్లక్క; అటుకుల లక్క; శుద్ధమైన లక్క; ముడి లక్కని కరగించి, వడపోసి, పెల్లల వలె పోయబడ్డ లక్క; +* shepherd, n. m. గొర్రెల కాపరి; గొఱ్ఱెలవాడు; కురుమువాడు; +* sherry, n. సారాయి; స్పెయిన్‍ దేశంలో తయారయే తెల్ల సారాని, బ్రాందీని కలపగా వచ్చే ఒక మాదక పానీయం; +* shift, n. విస్థాపనం; స్థలం మార్చడం; +* shin, n. క్రీగాలి ముందు భాగం; మోకాలికీ మడమకీ మధ్యనున్న కాలి ముంభాగం; +* shine, n. ప్రకాశం; రుచి; తేజం; వెలుగు; +* shine, v. i. ప్రకాశించు; రాణించు; భాసిల్లు; అలరు; తేజరిల్లు; వెలుగు; ఉద్యోతించు; హవణిల్లు; పరిఢవిల్లు; +* shingles, n. ఇంటికప్పుకి వాడే పెంకుల వంటి ఉపకరణాలు; +* shining, adj. తేజస్సుతో కూడిన; విద్యోతమాన; ఉజ్వల; +* ship, n. ఓఁడ; నావ; నౌక; తరణి; తరండం; తరి; కలం; కప్పలి; +* shipment, n. ఎగుమతి; ఎగుమతి చేయబడ్డ వస్తువు; +* shipworm n సముద్రంలో మునిగిపోయిన కొయ్య పడవలని తినే ఒక రకం సూక్ష్మజీవి bio Teredo navalis +* shipwreck, n. నౌకాభంగం; ఓడ పగిలిపోవడం; ఓడ కెడవు; +* shirk, v. t. తప్పించుకొను; కర్తవ్యం త్యజించు; +* shirt, n. చొక్కా; లాల్చీ; కమీజు; జుబ్బా; కంచుకం; అంగీ; ఆంగరకం; +* shiver, v. i. వణుకు; కంపించు; కంపరమెత్తు; +* shoal, n. మెరక; మేట ఎక్కిలి; గాధం; లోతు తక్కువగా ఉన్న జలభాగం; +* shock, n 1) ఘాతం; ఆఘాతం; దెబ్బ; గుభిల్లు 2) నిర్ఘాతం; అకస్మాత్తుగా రక్తపు పోటు పడిపోవడం వల్ల స్మారకం పోయిన పరిస్థితి 3) మనోఘాతం; విభ్రాంతి; +electrical shock, ph. విద్యుత్ ఘాతం విద్యుదాఘాతం; విద్యుత్ ప్రకోపం; విద్యుత్ గుభిల్లు; షాకు; +shock absorber, ph. ఘాత శోషణి; చక్రాలున్న బండి కుదుపు లేకుండా నడవడానికి ప్రతి చక్రానికీ తగిలించబడే ఉపకరణం; +* shoe, n. చెప్పు; పాదుక; పాదరక్ష; +* shoes, n. pl. చెప్పులు; జోళ్లు; పాదుకలు; పాదరక్షలు; పాంకోళ్లు; మెట్లు; +* shoot, n. మొలక; అంకురం; నారు; నవోద్భిజం; అభినవోద్భిజం; ఈరిక; కందళికం; sprout; +* shoot, v. i. మొలకెత్తు; అంకురించు; ఈరికలు ఎత్తు; ముందుకు వచ్చు; +* shoot, v. t. బాణంతో కొట్టు; తుపాకితో కొట్టు; +* shop, n. కొట్టు; దుకాణం; అంగడి; విక్రయశాల; విపణి; జన్యం; ఆదణం; ఆపణం; +* shopkeeper, n. కొట్టువాఁడు; దుకాణదారుఁడు; ఆపణికుఁడు; వైపణికుఁడు; +* shoplifting, n. దుకాణాలలో వస్తువులని దొంగిలించడం; +* shore, n. తీరం; ఒడ్డు; గట్టు; తటి; తటం; దరి; ఈ ���ాటని పెద్ద పెద్ద జలాశయాల తీరాలని సూచించడానికి వాడతారు rel beach; bank; coast; +sea shore, ph. సముద్రతీరం; సముద్రపుటొడ్డు; చెలియలికట్ట; +* short, adj 1) పొట్టి; కురుచ; గిడస; బుడుగు; నన్న; కుదిమట్టం; లఘు; వామన; హ్రస్వ 2) తక్కువ; కొరత; +* shortage, n. కొరత; కొదవ; వెలితి; సంక్షోభం; ఎద్దడి; అభావం; తక్కువ; +* short-circuit, n 1) అడ్డుదారి; దగ్గరదారి; ఉన్మార్గగమనం 2) లఘు వలయం; ధన, రుణ ధ్రువాల మధ్య అవరోధం లేకుండా విద్యుత్తు ప్రవహించడానికి సులభమైన మార్గం ఏర్పడ్డ పరిస్థితి; +* short-lived, n ఆకాలికం; పుట్టిన వెంటనే నశించేది; +* shortly, adv. కొద్దిసేపట్లో; త్వరలో; స్వల్పకాలంలో; +* shorts, n. లాగు; చల్లడం అర్ధోరుకము; నిక్కరు; +* shot, n 1 సీసపుగుండు; పడిగల్లు 2 cinema] సన్నివేశం లో భాగం; +* shoulder, n. అంసము; భుజం; భుజశిరం; బాహుశిరం; భుజస్కందం; మూఁపు; అఱక; +* shoulder, v. t. కొమ్ముకాయు; బాధ్యత తీసుకొను; సహాయ పడు; +* shrapnel, n తూటాతునకలు; తూటాబీడు; +* shred, v. t ముక్కలు ముక్కలుగా చేయు; +* shredder, n కాగితాలని చిన్న చిన్న ముక్కలుగా చేసే యంత్రం; +* shrewdness, n. గడుసుతనం; యుక్తి; సూక్ష్మబుద్ధి; చాణక్యం; వైదగ్ధ్యం; +* shrike, n. కసాయి పిట్ట; కళింగ పక్షి; +* shrine, n. చిన్న దేవాలయం; పుణ్యక్షేత్రం; +* shrink, v. t. కుంచించుకొను; తీసిపోవు; ముడుచుకొనిపోవు; +* shrug the shoulders, ph భుజాలు ఎగురవేయు; సందిగ్ధతని తెలియజెయ్యడానికి చేసే చేష్ట; +* shutters, n. తలుపులు; కిటికీ తలుపులు; +* shyness, n. సిగ్గు; బిడియం; మొగపిరికితనం; మొహం చూపించడానికి పిరికితనం; +* shyster, n. నిజాయతీ లేని వ్యక్తి; నిజాయతీ లేని వకీలు; +* siblings, n. pl. తోఁబుట్టువులు; తోడఁబుట్టువులు; అనుజులు; ఏకోదరులు; ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు; సైఁదోఁడులు; +* sic, adv. ఇలా; ఉన్నది ఉన్నట్లు; యథాతథంగా ety Lat అసలులో ఉన్న తప్పుని యథాతథంగా నకలు తీసినప్పుడు కుండలీకరణంలో sic అని రాస్తారు. +* sick, adj జబ్బు; జబ్బు పడ్డ; రోగగ్రస్త; +* sickness, n. అస్వస్థత; అనారోగ్యం; జబ్బు; వ్యాధి; రోగం; రుగ్మత; సుస్తీ; తెగులు; కాయిలా; +* side, n. పక్క; సరస; వంక; ఓర; పార్శ్వం; పక్షం; తట్టు; చెంప; గరువు; వాక; +* side-effect, n. అవాంఛనీయ ఫలితం; ఒక రోగాన్ని కుదర్చటానికి మందు ఇచ్చినప్పుడు ఆశించని మరొక ఫలితం; +sidereal day, ph. నాక్షత్ర దినం; నడినెత్తి మీద ఉన్న నక్షత్రం మళ్ళా నడినెత్తి మీదకి రావడానికి పట్టు కాలం; నక్షత్రాల నేపథ్యంలో భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం; 23 గంటల 56 నిమిషాలు; భూమి ప్రదక్షణం కారణంగా ఇది 24 గంతల కంటె తక్కువగా ఉంది; +* sight, n. దృష్టి; లోచనం; దృశ్యం; వీక్షణం ఈక్షణం; చూఁపు; చూఁడ్కి; +long sight, ph. దీర్ఘ దృష్టి; దూరపు వస్తువులే కనిపించడం; చత్వారం; దౌఁజూఁపు; +short sight, ph. హ్రస్వ దృష్టి; దగ్గర వస్తువులే కనిపించడం; +* sigmoid, adj ఆంగ్లాక్షరం S' ఆకారంలో ఉన్న; +* sign, n 1) గుర్తు; సన్న; సంజ్ఞ; చిహ్నం; జాడ; సంకేతం; అభిజ్ఞ 2) రాశి; +sign language, ph. సన్నభాష; కుమ్ముసుద్ధి; సంకేత వృత్తాంతం; +* signal, n. సంకేతం; సంజ్ఞ; సూచకి; వాకేతం వార్త సంకేతం; +* signature, n. సంతకం; చేవ్రాలు; హస్తాక్షరం; దస్కతు; +* signet, n. ముద్ర; రాజముద్ర; అభిజ్ఞానం; +* significance, n. ప్రాముఖ్యం; మహత్వం; ముఖ్యత; సార్థకత; +* significant, adj. ముఖ్యమైన; విశేష; సార్ధక; గణనీయమైన; అన్వర్థక; +* Silicon, n. సైకతము; సిలికాను; ఒక రసాయన మూలకం అణుసంఖ్య 14, సంక్షిప్త నామం; Si Lat] silex; +* silhouette, n సిలూయెట్) ఛాయారూపం; పొడ; నీడబొమ్మ; +* silly, adj. చిలిపి; తెలివితక్కువ; బుద్ధిలేని; +* silo, n. గాదె; ధాన్యాగారం; ధాన్యపు గిడ్డంగి; కోష్ఠాగారం; కొటారం; లిబ్బి పాతర; అంబారం; అంబర్‌ఖానా; +* silt, n. ఒండుమట్టి; ఒండు; వండలి; పూడిక; +* silt, v. i. పూడు; పూడిక; ఒండలి; ప్రవాహంలోని బురద, ఇసుక, వగైరా; +* silting, n. పూడిక; ఒండుమట్టితో పూడిపోవడం; +* similar, adj. సరూప; సారూప్య; పోలినటువంటి; +* similarity, n. సారూప్యం; సాపత్యం; సాదృశ్యం; పోలిక; ఉపమితి; +* simile, n సిమిలీ) ఉపమాలంకారం; ఉపమానం; +* simmer, v. i. ఉడుకు; మరగు; నెమ్మదిగా సన్నటి సెగ మీద మరుగు; +* simple, adj. వ్యస్త; సాదా; సాధారణమైన; బారు; అవ్యాజ; అలతి; +* simple, n. వ్యస్తం; సాదా; సాధారణం; బారు; అవ్యాజం; +* simpleton, n. దద్దమ్మ; వెర్రిబాగులవాడు; వెర్రిబాగులది; +* simulated, adj. పెట్టుకోలు; అభికరణ; అసలు దానివలె; +* simulation, n. పెట్టుకోలు; అభికరణ; అసలు దానివలె ప్రవర్తించడం; +* sin, n. పాపం; పాతకం; భవం; కసటు; కావలం; +heinous sin, ph. మహాపాపం; మహా పాతకం; పెంగసటు; పెంగావలం; +* sincere, adj. నిష్కపటమైన; కపటములేని; హృదయపూర్వక; చిత్తశుద్దిగల; విశ్వాసపాత్ర; +* sincerely, adv. చిత్తశుద్ధిగా; హృదయపూర్వకంగా; +* sincerity, n చిత్తశుద్ధి; నిష్కాపట్యం; ఆర్జవం; +* sine, n. శంకువు; జ్యా; త్రిజీవా; త్రిజ్యా; కోణం యొక్క ఉన్నతి; లంబకోణ త్రిభుజంలో కోణము ఎదురుగా ఉన్న భుజం; కర్ణము పొడుగుల నిష్పత్తి; +* sinew, n 1) స్నాయువు; నరం 2) బలం; శక్తి; త్రాణ; సామర్ధ్యం; +* singer, n. పాటరి; m. గాయకుడు; పాటగాడు; గాణ; గాణుడు f. గాయని; పాటకత్తె; గాణ; గాణీ; +* singularity, n. ఏకైకత్వం; ఏకత్వం; వైపరీత్యం; విశిష్టస్థితి; చోద్యం; +* sink, n. మునుఁగుతొట్టి; శింకు; +* sinner, n. m. పాపాత్ముఁడు; f. పాపాత్మురాలు; కాసటుఁడు; కావలుఁడు; +* sit, v. i. కూర్చొను; కూర్చుండు; +* sitomania, n. ఆకలిగొట్టుతనం; తిండిపోతుతనం; తిండిమీద ధ్యాస; +* situation, n 1) పరిస్థితి; అవస���థ; స్థితిస్థానం 2) స్థానం; ఉద్యోగం; +* six, n. ఆఱు; ఇరుమూఁడు; ఇత్తిగ; షట్కము; షష్ఠి; +six-pack, ph 1) ఆరు బీరు సీసాల బంగీ 2) నిత్యం వ్యాయామం చేస్తూ, మంచి దేహసౌష్టవం ఉన్న వారి పొట్ట మీద స్పుటంగా అందంగా కనిపించే ఆరు కండరాల సముదాయం; +sixth sense, ph. దివ్యదృష్టి; షష్ఠేంద్రియం; +* sixty, n. అఱవై; షష్టి; ఇరుముప్ఫై; +* size, n. కైవారం; కొలత; పరిమాణం; మట్టు; సైజు; +* skein, n. ఉండ; దారపుండ; బంతి; నూలుకండె; బుడఁత; +* skeleton, n. అస్థిపంజరం; కంకాళం; ఎమ్మూట; ఎముకల మూట; +* skeptic, sceptic, n. సంశయవాది; సంశయాళువు నిత్యశంకితుఁడు; సందేహశీలుఁడు; ప్రతిదానిని శంకించే వ్యక్తి; +* sketch, n 1) రేఖాకృతి; రేఖాపటం; నఖ చిత్రం; గెఱపటం (2) గల్పిక; చిత్రణ; +* skill, n. నైపుణ్యత; కౌశలం; నేర్పు; చతురిమ; చాతుర్యం; పాటవం; ప్రావీణ్యం; చాకచక్యం; దక్షత; విన్ననువు; +* skim, v. t 1) మీగడతీయు 2) పైపైన తాకు, స్థూలదృష్టితో చూచు; +* skin, n. చర్మం; తొక్క; తోఁప త్వక్కు; తోలు; ప్రభాసిని; చమడా; +* skin, v. t. ఒలుచు; చమడాలు ఒలుచు; చర్మం తీయు; +* skink, n, బిందిపాము; నలికళ్ళ పాము; రక్తపుచ్చం; ఇది చిన్న పాములా కనిపించే బల్లి; రక్తపుచ్చం అంటే ఎర్రని తోక గలది అని అర్థం; బిందిపాము గాఢమైన ఆకుపచ్చ, నలుపు రంగులలో మధ్య నిలువు లేత రంగు చారలతో మెరుస్తూ ఎరుపు తోకను కలిగివుంటుంది. కొన్ని మొత్తం ఒకే రంగులో కూడా వుంటాయి. దీనికి రెండు జతల కాళ్లు తల వెనుక, తోక ముందు భాగంలో వుంటాయి. చిన్న చిన్న కీటకాలు వీటి ఆహారం; +* skirmish, n. కన్నెకయ్యం; కలఁత; వివాదం; చిన్న యుద్ధం; +skirt, v. t తప్పించు; చుట్టుతిరుగు; దాటు; +* skit, n. నాటిక; తక్కువ నిడివిలో నాటకం; ప్రహసనం; హాస్యనాటిక; వ్యంగ్యకావ్యం; +* skull, n. పుర్రె; కరోటి; కరంకం; కపాలం; పునుక చర్మ, మాంసాదులని తీసివేయగా మిగిలిన శిరోభాగం) +* sky, n. ఆకాశం; అంబరం; గగనం; నింగి; నభం; విను; మిన్ను; అంతరిక్షం; వ్యోమం; ఖ; దివి; +* skyscraper, n. అంబరచుంబితం; అభ్రంకషం; ఆకాశాన్నంటే భవనం; నింగిని తాకే మిద్దెలు; +* sky way, n. వినువీథి; గగనమార్గం; నింగిత్రోవ; దివిబాట; +* sky wheel, n. అరఘట్టం; ఆకాశ చక్రం; వినోదవనాలలో తరచు కనిపించే పెద్ద చక్రం; +* slag, n. తెట్టు; చిట్టెం; మండూరం; లోహమలినం; ధాతుమలం; +* slat, n. బద్ద; సన్నని కర్ర; చీరిక; +* slate, n 1) పలక 2) నాపరాయి 3) అభ్యర్థుల జాబితా; +* slather, v. t. పులుము; ఒంటి మీద లేపనం పుష్కలంగా పులుము; +* slave, n. బానిస; గులాం; m. దాసుడు, భృత్యుడు; f. దాసి; +* slay, v. t. చంపు; సంహరించు; హతమార్చు; +* slayer, n. సంహర్త; చంపువాడు; నిహంత; హంతకుడు; హంతకి; +* sleep, n. నిద్ర; సుప్తం; సుప్తి; కునుకు; +sleeping beauty, ph. సుప��త సౌందర్యవతి; కునుకు వన్నెలాడి; +* sleet, n. మంచువాన; తుషారవృష్టి; హిమవర్షం; +* sleeves, n. pl. చేతులు; దుస్తులలో చేతిమీదకి వచ్చే భాగం; +* sleuth, n. అపరాధ పరిశోధకుడు; గూఢచారి; +* slime, n. పాకుడు; బంకబురద; బెందడి; ఱొంపి; విజ్జలి; +* sling, n 1) ఉండేలు; వడిసెల ఒడిసెల; క్షేపణి; పిట్టలబారు; కేటిల్‌బారు; చిన్న చిన్న ఱాళ్ళు ఱువ్వడానికి వాడే ఉపకరణం 2) భుజంమీద నుండి వస్తువులని వేలాడదీయడానికి వాడే ఉపకరణం; +* slip, n 1) అమ్మాయిలు లోఁపల వేసుకొనే మెత్తటి దుస్తులు 2) తప్పు దొర్లడం 3) కాగితం ముక్క; +* slip, v. i. జారు; స్ఖలించు; జారవేయు; జారవిడుచు; +* slipshod, adj. బిగుతులేని; ఒదులుగా ఉన్న జోళ్ల వలె; పనితనం లేని; +* slit, n. కంత; సన్నంగా, కోలగా ఉన్న రంధ్రం; బీట; చీలిక; +* slope, n. నతి; వాలు; వాలుతనం; వాలుదల; ఏటవాలు; గండీ; ప్రవణత నతిక్రమం; +* slouch, v. i. నడుం వంచి కూర్చొను; నిటారుగా కాకుండా భుజాలు వేలాడేసిన భంగిమ; +* slough, n 1 స్లఫ్) కుబుసం; జీవం లేని కణజాలం; అవసరంలేని పైపొర కాని వస్తువు కాని, ఏదైనా సరే 2 స్లవ్) రొంపి; బురద భూమి; +* slough, v. i స్లఫ్) రాలు; రాలిపోవు; మాను, మానిపోవు; +* slough, v. t స్లఫ్) పారవేయు; రాల్చు; పేకాటలో పట్టు మనదే అయినప్పుడు అక్కరలేని ముక్కని పారవెయ్యడం see also rough; +* slowly, adv. నెమ్మదిగా; నింపాదిగా; మెల్లగా; మందముగా rel నిదానంగా; +* sluice, n అలుగు; మదుం; తూము; వరద గేటు; నీటిగండి; పరివాహం; తూపరాణ; దేవరాతం; +* slump, n. ధరలు పడిపోయిన పరిస్థితి; +* slur, n 1) సరిగా ఉచ్చరించకుండా మాటలని నమిలేయడం 2) సంగీతంలో ఒక రాగంలోంచి మరొక రాగంలోకి జారి స్వరసంకరం చెయ్యడం 3) దూషణ; +racial slur, ph. జాత్యహంకారంతో పలికే దూషణ వాక్యం; దూషణ భాషణం; +* slut, n. లంజ; నీతి లేని ఆడుది; పలువురు మగవారితో కులికే ఆఁడది; +sly fox, ph. టక్కరి నక్క; వంచన శృగాలం +* small, adj. చిన్న; చిరు; చిట్టి; చంటి; పిట్ట; లఘు; లవ; లేశ; సన్నకారు; +* smallpox, n. స్పోటకం; మసూచికం; పెద్దమ్మవారు; +* smartness, n. తెలివితేటలు; గడుసుతనం; వైదగ్ధ్యం; ప్రోడతనం; +musty smell, ph ముక్క వాసన; గబ్బు కంపు; గబ్బిలాయి కంపు; +* smelter, n. లోహాలని కరిగించే చోటు; కొలిమికొట్టు; కొలిమి; +* smile, n. చిరునవ్వు; మందహాసం; దరహాసం; స్మితం; హసితం; విహసితం; +* smith, n. కంసాలి; కమ్మరి; బత్తుఁడు; శిల్పి; కార్మారుఁడు +wordsmith, n. పదశిల్పి; మాటలని తూచి తూచి వాడడంలో నేర్పరి move to W +* smithereens, n. pl తునాతునకలు; చిన్న చిన్న ముక్కలు; +* smuggling, n. దొంగవ్యాపారం; దొంగరవాణా; +* smut, n.(1) లైంగిక విషయాల గురించి అశ్లీలంగా చెప్పే పుస్తకాలు, సినిమాలు; వగైరా 2 bot కాటుక; కాటుక తెగులు; +* snack, n. చిరుతిండి; ఉపాహారం; పలహారం (ఫలహారం కాదు అల్పాహారం; తాయిలం; తినుబండారం; నలితిండి; నాస్తా; +* snail, n. నత్త; కురుమింద; శంఖనఖం; +* snake, n. పాము; చిలువ; చిల్వ; సర్పం; చక్షుశ్రవం; భుజంగం; ఉరగం; దందశూకం +asp, n. నైలు నదీ ప్రాంతాలలో కనబడే ఒక పాము; +cobra, n. నాగుపాము; త్రాచుపాము; కృష్ణసర్పము; నల్లనాగు; ఫణకరము; ఫణి; +types of snakes, కూకవేటు; సముద్రపు పాము; రక్తపెంజర; జెర్రిగొడ్డు; గడ్డపాము; గుఱ్ఱపుబెరజు; తుట్టెపురుగు; దాసరిపాము; దుంపనాగులు; పలుగుడుబాము; పుల్లురుకుపాము; పుష్కరము; పెరజు; పొడపాము; బొక్కబెరడు; ముడినాగు; మొగలిత్రాచు(మిన్నాగు); +snake stone, ph. నాగమణి; మణి; ఇది నున్నగా అరగదీసిన రాయి కాని ఎముక కాని అయి ఉంటుందని కొందరి అభిప్రాయం; దీని ప్రభావం వల్ల పాము విషం దిగిపోతుందనే నమ్మకం కేవలం గుడ్డి నమ్మకమే; +* snap, n. చిటికె; అంగుళిస్పోటనం; +* snap, v. t. తెంచు; తెంపు; ఛేదించు; తునియు; +* snare, n. ఉచ్చు; వితంసము; గుబ్బిక; పక్షులని జంతువులని పట్టే సాధనం; +* snip, v. t. కత్తిరించు; చిదుము; తుంచు; తునియు; +* snob, n. గర్విష్ఠి; ఎదుటివారిని చులకన చేసే వ్యక్తి; +* snore, v. i. గుర్రుపెట్టు; గురక పెట్టు; +* snot, n. చీమిడి; ముక్కులోని అమత్వక్కు నుండి స్రవించే ద్రవం; +* snout, n. ముట్టె; మోర; కుక్క, పంది, మొ. జంతువుల మూతి భాగం; +* snow, n. హిమం; పొడిమంచు; పిండిమంచు; మంచు; మిహిక; నీహారం; ప్రాలేయం; ధూమిక; తుషారం; +* snuff, n. ముక్కుపొడుం; నస్యం; +* soak, v. t. నానబెట్టు; తడుపు; తడిపిపెట్టు; +* soaked, adj. నానిన; నానబెట్టిన; తడిసిన; సిక్తం; +* socialism, n. సామాజిక వాదం; సమాజవాదం; సామ్యవాదం; +* sociology, n. సాంఘిక శాస్త్రం; సామాజిక శాస్త్రం; +* sock, n. కాల్తిత్తి; మేజోడు; +* sod, n. గరికచెక్క; గడ్డ్డి విత్తులు మొలిచిన మట్టి చెక్క; +* soda, n 1) చవుడు; సోడా ఉప్పు 2) తాగే సోడా నీళ్లు; కొద్దిగా కార్బన్‍ డై ఆక్సైడ్‍ కరిగించిన నీళ్లు; +* sodomy, n. పుమ్మైధునం; అసహజమైన రతి క్రీడ; ఆడువారి మధ్యకాని, మగవారి మధ్యకాని, మనుష్యులకీ, జంతువులకీ మధ్యకాని జరిగే మైధునం; +* soft, adj. మృదువైన; మెత్తనైన; కోమలమైన; కఠినంకాని; వంగెడు; సుకుమారమైన; దయగల; సుతారమైన; మృదుల; +soft drink, ph. ఆల్కహాలు లేని పానీయం; ఉదా. సోడా, కోకాకోలా, మొదలైనవి; +soft palate, ph. మెత్తని అంగులి; నోటి కప్పు వెనక భాగం; +soft water, ph సాధు జలం; నిజమైన శసాధు జలంలో ఒక్క సోడియం అయానులు తప్ప మరే ఇతర లవణాలు ఉండవు; ఈ నీటికి కాసింత ఉప్పదనం ఉంటుంది; +* softly, adv సాఫీగా; మెత్తగా; సున్నితంగా; నెమ్మదిగా; బిగ్గరగా కాకుండా; +* software, n. తంత్రాంశం; సూక్ష్మకాయం; మృదులా���గం; కోమలాంగం; మెత్తసరుకు; తోయం; దేహి; కంప్యూటర్ల చేత పనులు చేయించుకోడానికి రాసే క్రమణికలు; +* soil, n. మట్టి; మన్ను; మురికి; నేల; +* soil, v. t. మురికిచేయు; మాపు; ఖరాబుచేయు; +* sojourn, n. మజిలీ; ప్రయాణంలో ఆగడం; కొద్ది కాలం పాటు ఇంటి దగ్గర కాకుండామరొక చోట బస చేయడం; +* sol, n. అంగారక గ్రహం మీద ఒక రోజు, అనగా తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం; 24 గంటల 39 నిమిషాల 35 సెకన్లు; +* solar, adj. సౌర; సూర్య; సౌరమాన; ఖద్యోత; మార్తాండ; +solar day, ph సౌర దినం; ఒక సూర్యోదయం నుండి తరువాత సూర్యోదయం వరకు ఉన్న మధ్య కాలం; ఇది దినంవారీగా మారుతూ ఉంటుంది; +solar system, ph. సౌర కుటుంబం; సూర్యగ్రహ మండలి; ఖద్యోత మండలం; మార్తాండ మండలం; +* solder, v. t మాటు వేయు; మాటు పెట్టు; టంకం వేయు; +* sole, n. అరకాలు; పాదము అడుగు భాగం; +* solenoid, n. తీగచుట్ట; చుట్ట ఆకారంలో చుట్టిన తీగ; తూణం; ఇటువంటి చుట్ట గుండా విద్యుత్తుని పంపితే ఆ చుట్ట అయస్కాంతం వలె పనిచేస్తుంది; +* solicit, v. t 1) వేడుకొను; ప్రార్థించు; విన్నవించు; అర్థించు 2) న్యాయ సలహాదారుగా పని చేయు; +* solidify, v. i. గడ్డకట్టు; పేరుకొను; ఘనీభవించు; ముద్దకట్టు; +* solitaire, n ఒంటాట; ఏకాంతపు ఆట; ఒక్కరూ కూర్చుని ఆడుకునే ఒక రకం పేకాట; +* solitary, adj. ఏకాంత; ఐకాంతిక ఉపాంశు; వివిక్త; ఒకే ఒక్క; ఒంటరి; +summer solstice, ph. ఉత్తరాయనాంతం; గ్రీష్మ సంక్రమణం; జూన్ 22; ఉత్తరార్థ గోళంలో ఈ రోజున పగలు పొడుగు అత్యధికం; రాత్రి పొడుగు అత్యల్పం; ఈ రోజున సూర్యుడు కర్కాటక రేఖకి నడినెత్తి మీద ఉంటాడు; గ్రీష్మ సంక్రమణం ఏటేటా ఒకే తారీఖున రావాలని నిబంధన లేదు; కొంచెం ఇటూఅటూగా జూన్ 21-23 మధ్య తారట్లాడుతూ ఉంటుంది; +winter solstice, ph. దక్షిణాయనాంతం; హిమ సంక్రమణం; డిసెంబరు 22; ఉత్తరార్థ గోళంలో ఈ రోజున పగలు పొడుగు అత్యల్పం, రాత్రి పొడుగు అత్యధికం; ఈ రోజున సూర్యుడు మకర రేఖకి నడినెత్తి మీద ఉంటాడు; ఈ రోజున ఉత్త ధృవం దగ్గర సూర్యుడు నామమాత్రం ఉదయించి, ఆకాశంలో పైకి లేవకుండానే అస్తమించెస్తాడు; హిమ సంక్రమణం; ఏటేటా ఒకే తారీఖున రావాలని నిబంధన లేదు; కొంచెం ఇటూఅటూగా డిసెంబరు 21-23 మధ్య తారట్లాడుతూ ఉంటుంది; +* solution, n 1) పానకం; ద్రావణం 2) పరిష్కారం; తెన్ను; సమాధానం; జవాబు; పూరణం; +* solvent, n. ద్రావణి; పంచదారని నీళ్లల్లో కరిగించినప్పుడు నీరు ద్రావణి, పంచదార ద్రావితం, పానకం ద్రావణం; +somatic cell, ph. తనుకణం; శోమకణం; పునరోత్పత్తి చేయలేని కణం; +* some, adj 1) కొంత; కొంచెం; కాస్త; ఇంచుక 2) కొన్ని 3) కొందరు; +* sometime, adv. ఎప్పుడో ఒకప్పుడు; కదాచిత్తుగా; +* son, n. కొడుకు; కుమారుడు; అబ్బాయి; పుత్రుడు; బిడ్డడు; సుతుడు; తనయుడు; ఆత్మజుడు; బొట్టె; పట్టి; +* sonic, adj శబ్దానికి సంబంధించిన; శబ్ద తరంగాలు కదిలే విధానానికి సంబంధించిన; +hypersonic, adj. శబ్ద తరంగాల వేగానికి 5 రెట్లు మించిన వేగంతో; +supersonic, adj. శబ్ద తరంగాల వేగానికి మించిన వేగంతో; శబ్ద తరంగాల వేగానికి మించి, శబ్ద తరంగాల వేగానికి 5 రెట్లు తక్కువగా ఉన్న వేగాలు; +* soon, adj. త్వరగా; వేగిరం; శీఘ్రం; సత్వరం; +* soothsayer, n. f. ఎరుకలసాని; ఎరుకత; సోది చెప్పే మనిషి; m. ఎరుకల వాడు; +* sops, n. pl. ప్రోత్సాహకాలు; తాయిలాలు; +* sophism, n. వంచితర్కం; వంచన తలపుతో చేసే కుతర్కం; +* sophomore, n. నాలుగేళ్లపాటు కొనసాగే విద్యార్థి దశలో రెండవ సంవత్సరపు విద్యార్థి; +* sorcerer, n. మంత్రగాడు; మాంత్రికుడు; +* sordid, adj. క్షుద్ర; అసహ్య; నీతిబాహ్య; +* sore, adj. బాధ కలిగించే; నొప్పి పుట్టించే; నొప్పి పెట్టే; +mouth sores, ph. నోటిలో పుండ్లు; నోటి పూత; జిహ్వాపాకం; +* sorrow, n. విచారం; వ్యాకులం; చింత; వగపు; +* sorry, inter. మన్నించండి; క్షమించండి; +* sort, v. t 1) రకాలవారీగా విడగొట్టు 2) పేర్చు; క్రమర్చు; క్రమంలో అమర్చు; +* sorting, v. t. విడగొట్టడం; పేర్చడం; క్రమపర్చడం; +* sotto voce, ph సాటో వోచే) తగ్గు స్వరంలో; మనలో మనమాట; +* soul, n. ఆత్మ; అంతర్యామి; దేహి; క్షేత్రజ్ఞడు; +* sound, adj. మంచి; దృఢమైన; ఆరోగ్యకరమైన; +* sound, n 1) ధ్వని; శబ్దం; సడి; చప్పుడు; క్వాణం; సద్దు; అలికిడి; సవ్వడి; నాదం; మోత; రొద; రవము; రవళి; నినాదం; మొరపం rel resound 2) ఇరుకు మూతి గల సముద్ర శాఖ rel fjord; +ultrasound, ph. అతిధ్వని; అత్యధికంగా ప్రకంపించే శబ్ద తరంగం; +* sound, v. t. కదిపి చూడు; కనుక్కుని చూడు; +* soup, n. సూపం; పులుసు; కట్టు; పలచగా చేసిన పప్పు; +sour belch, ph. పులి తేనుపు; పుల్లత్రేన్పు; +* source, n. మాతృక; జనకం; కాణాచి; ఆధారం; ఆకరం; మూలం; ఉత్పత్తి స్థానం; జనకస్థానం; +* southern, adj. దక్షిణ; దాక్షిణాత్య; అవాచీన; తెంకణ; సరాజిత; +* Southern Cross, n. త్రిశంకు నక్షత్రం; దక్షిణార్థ గోళంలో ఉన్న వాళ్లకి శిలువ ఆకారంలో కనిపించే నాలుగు నక్షత్రాల సమూహం; +* southwest, n. నైరృతి దిక్కు నైరృతి; నైఋతి; సోకుమూల; +* souvenir, n. స్మారక సంచిక; స్మృతి చిహ్నం; జ్ఞాపిక; +* sovereign, n 1) సార్వభౌముడు; రాజరాజు; చక్రవర్తి; ప్రభువు; అధిపతి 2) నవరసు; కాసు; +* sovereignty, n సార్వభౌమత్వం; సార్వభౌమాధికారం; ఆధిపత్యం; పాలనాధికారం; సర్వసత్తాధికారం; రాజ్యాధిపత్యం; +* sow, n. ఆడ పంది; ఈడొచ్చిన ఆడ పంది; +* soybean, n. సోయాచిక్కుడు; హరేణుచిక్కుడు +* spark, n. నిప్పుకణం; విస్పులింగం; చురక; అగ్నికణం; +* space, n 1) స్థలం; జాగా; ఎడం; చోటు; దిక్కు; అంతరం 2) బయలు; ఆవరణ 3) ఖ; రోదసి; నభం; వ్యోమం; అంతరిక్షం; విష్ణుపదం; అంతరాళం; ఆకాశమండలం; +* spaceship, n. వ్యోమనౌక; నభోతరంగిణి; నభోతరణి; అంతరిక్ష నౌక; +* space-time, n. స్థలకాలం దిక్కాలం; కాలస్థలం; అంతరాళ కాలం; +* spade, n 1) తౌగోల (తవ్వు కోల 2) చీట్లపేకలో నలుపు రంగులో ఉండే ఆకారం; +* span, n 1) జానెడు పొడుగు; జాన 2) వంతెనలో రెండు స్తంభాల మధ్య దూరం; +* spark, n. నెరుసు; నిప్పురవ్వ; విస్పులింగం; ఆచిరాంశువు; +spark plug, ph. నెరసు బిరడా; పెట్రోలు కారు ఇంజనులో ఒక భాగం; +* spasm, n. ఈడ్పు; దుస్సంకోచం; అదుపుతప్పి కండరం సంకోచ వ్యాకోచాలు చెందడం; +vascular spasm, ph. రక్తనాళ దుస్సంకోచం; రక్తనాళాల ఈడ్పు; +* speaker, n. వాగ్మి; వాచకుడు; వాచకి; అభిభాషి; +* special, adj. విశిష్ట; విశేష; ప్రత్యేక; పరిమిత; +special case, ph. విశిష్ట వ్యవహారం; విశిష్ట సంఘటన; +special dualism, ph. విశిష్ట అద్వైతం; రామానుజాచార్యుల మత సిద్ధాంతం; +* species, n 1) తెగ; జాతి; ఉపజాతి; వర్గం 2) జాతి; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు ఏడవ వర్గానికి పెట్టిన పేరు see also] genus, family, order, class, phylum and kingdom; +* specific, adj. నిర్ణీతమైన; నిర్ధిష్టమైన; అవశ్యమైన; +specific gravity, ph. విశిష్ట గురుత్వం; విశిష్ట గరిమ; అవశ్య గరిమ; తారతమ్య గరిమ; +* specification, n. తబ్సీల జాబితా; చెయ్యవలసిన పనుల పట్టిక; +* specify, v. t. వివరించు; నిర్దేశించు; కరతలించు; +* spectacles, n. pl. కండ్లజోడు; ముక్కద్దాలు; సులోచనాలు; ఉపనేత్రాలు; +* spectrograph, n. వర్ణపటలేఖిని; వర్ణమాలాచిత్రం; వర్ణలేఖిని; +* spectroscope, n. వర్ణపటదర్శని; వర్ణమాలాదర్శని; +* spectroscopy, n వర్ణమాలాదర్శనం; వర్ణమాలని అధ్యయనం చేసే శాస్త్రం; +* spectrum, n. వర్ణపటం; వర్ణమాల; కాంతిని గాజు పట్టిక ద్వారా పంపితే కనిపించే సకలవర్ణ పటం; +* speech, n 1) ప్రసంగం; ఉపన్యాసం 2) వాక్కు; ఉక్తి; +* spell, n. మంత్రశక్తి; మంత్రం; +* spell, v. i. వర్ణక్రమం చెప్పగలుగు; +* spelling, n. వర్ణక్రమం; పదగుణితం; వ్రాకట్టు; స్పెల్లింగు; +* spend, v. i. ఖర్చుపెట్టు; వ్యయపరచు; +* sperm, n. శుక్రం; శుక్లం; రేతస్సు; +* spend, v. i 1) ఖర్చు పెట్టు; వెచ్చించు; వ్యయపరచు 2) గడుపు; +* sperm, n. వీర్యం; పురుష జననాంగాలలో తయారయే వీర్య కణాలు; rel semen; +* Spica, n. చిత్ర; చిత్రా నక్షత్రం; కన్యారాశిలో నక్షత్రం; +* spider, n. సాలీడు; సాలెపురుగు; నేతపురుగు; అష్టపాది; తంతునాభం; ఈగపులి; లూతపురుగు; అల్లికపురుగు; +* spill, v. t. ఒంపు; తొళికించు; ఒలికించు; +* spillway, n. పొర్లుకట్ట; పొర్లుమదుం; తొళకరి తోము; ఒలుకుదారి; ప్రవాహ మార్గం; మరిగొమ్ము; అలుగు; పరీవాహం; +* spin, n 1) ఆత్మభ్రమణం; భ్రమణం 2 idiom] ఉన్న విషయాన్ని తనకి అనుకూలంగా మలిచి చెప్పడం 3 phy ���ణుప్రమాణంలో ఉండే రేణువులకి సహజసిద్ధంగా ఉండే ఒక లక్షణం; ఒక ఎలక్ట్రానుకి "స్పిన్" ఉందంటే అది బొంగరంలా తిరుగుతోందని వ్యాఖ్యానించకూడదు; బొంగరం లాగనే కొన్ని పరమాణు రేణువులు కూడ సహజసిద్దమైన కోణీయ భారవేగం intrinsic angular momentum) అనే గణిత లక్షణాన్ని ప్రదర్శిస్తాయి కనుక వాటికి "స్పిన్" ఉందని చమత్కరిస్తాము; +spinal cord, ph. వెన్నుపాము; మజ్జా రజ్జువు; సుమామ్న నాడి; కశేరుక నాడి; మేరువు; కుండలి; +* spindle, n. కదురు; తుర్కం; నూలు వడికే కదురు; తంతుకాష్ఠం; +* spinster, n 1) అవివాహిత; బ్రహ్మచారిణి; ప్రస్తుతం పురుష సంపర్కం లేని ఆడది; భర్త లేని స్త్రీ; విధవ కాదు, కన్య కాదు 2) నూలు వడికే స్త్రీ; +* spiral, n. సర్పిలం; మురి; శంఖావర్తం; +* spiral, adj. సర్పిల; శంఖాకార; శంఖావర్త; +* spirit, n 1) ఆత్మ; జీవాత్మ; అంతరాత్మ; మూలశక్తి 2) ప్రేతాత్మ; పిశాచం; దయ్యం 3) మూలార్థం; అంతరార్థం; పరమార్థం 4) సారా; మద్యం; ద్రావకం 5) స్పూర్తి; ఉత్సాహం; +spirit lamp, ph. సారా దీపం; మద్యార్కదీపం; స్పిరిట్ దీపం; +* spiritual, adj. ఆధ్యాత్మిక; పారమార్థిక; ఆధిదైవిక ఆత్మజ్ణాన; ఆత్మిక; +* spite, n. కార్పణ్యం; జుగుప్స; +* spittoon, n. కాళంజి; తమ్మ పడిగె; ఉమ్మి వేసే గిన్నె; +* spleen, n. ప్లీహం; గోళాకారపు ఎరన్రి గ్రంధి; +* splint, n. బద్ద; కొయ్య బద్ద; దెబ్బలు తగిలినప్పుడు కట్టు కట్టడానికి అప్పుడప్పుడు వాడే సాధనం; +* split, v. t. చీరు; చీల్చు; చించు; వ్రచ్చు; వ్రక్కలించు; ఛేదించు; +* spoil, v. i. చెడు; పాడగు; బెడియు; ఆరుమూడగు; బుసిపోవు; కర్యావైకల్యమగు; +cervical spondylosis, ph. మెడలో వస్తే సెర్వికల్ స్పాండెలోసిస్ అంటారు; స్పాండెలోసిస్ వలన మెడలో వెన్నుపాము నలిగితే దాన్ని మైలోపతి (myelopathy) అంటారు. +lumbar spondylosis, ph. నడుములో వస్తే లంబార్ స్పాండెలోసిస్ అంటారు. +* sponge, n 1) స్పంజి; నీటిని పీల్చే పదార్థం 2) ఒక రకం సముద్రపు జంతువు; +* sponsored, adj ప్రాయోజిత; మనకు ఉచితం, వారికి భవిష్యత్తులో ప్రత్యక్షం గా కానీ పరోక్షంగా కానీ ఆర్జనం; +* spontaneous, adj. అయత్నకృత; ఆకస్మిక; ఐచ్ఛిక; సద్యస్పూర్తితో; +* spoon, n. చెంచా; ఉద్దరిణి; గరిటె; పాణికి; స్పూను; దర్వి; +* sport, n. సయ్యాట అలవోక క్రీడ; కేళి; హేల; లీల; చీటకం; ఆట; +* spp suff. జాతిది; ద్వినామ పద్ధతిలో జంతువుల పేర్ల చివరకాని, మొక్కల పేర్ల చివర ఈ అక్షరాలు వస్తే ఆ ప్రాణి జాతి ఇదమిత్థంగా తేలలేదని అర్థం; +* spray, v. t. చిమ్ము; జల్లు; ఎగజల్లు; చిలకరించు; +* sprayer, n. చిమ్మనగ్రోవి; చిమ్ముకారి; +* spread, v. i. వ్యాపించు; విస్తరించు; అత్తమిల్లు; ఉ అంగళ్ల ముంగిళ్ల నత్తమిల్లిన ముత్తియంపు రంగవల్లుల మీద జైమిని భారతం +* spread, v. t. పరుచు; నెరుపు; వెదజల్లు; జల్లు; పంచారించు; పంచు; +* spread, n 1) పరుచుకొనేది; నెరుపుకొనేది; పులుముకొనేది 2) విస్తృతి; +bed spread, ph. పరుపుమీద పరుచుకొనేది; దుప్పటి; +* sprig, n 1 రెమ్మ; రెబ్బ 2) మొలక; పిలక 3) పిల్లకాయ; వంశాకురం; +* spring, n 1) వసంతం; వసంత కాలం; వసంత రుతువు 2) నీటిబుగ్గ; జల; జెల; ఊట; ఎగదట్టిక; ఉద్గమం 3) తీగచుట్ట; స్ప్రింగు; +spring tide, ph. నిండు పోటు; పౌర్ణమికి, అమావాస్యకీ బాగా ఉదృతంగా వచ్చే పోటు; +* sprinkle, v. t. జల్లు; ఎగజల్లు; చిలుకు; చిలికించు; చిమ్ము; ప్రోక్షించు; +* sprinkler, n. ప్రోక్షకి; ప్రోక్షకుడు; +* sprint, n. పరిగెత్తు; దౌడుతీయు; +* sprout, v. i. మొలుచు; అంకురించు; పొటమరించు; కందళించు; +* sprouts, n. మొలకలు; నారు; నవోద్భిజాలు; అభినవోద్భిజాలు; అంకురాలు; ఈరికలు; కందళికాలు shoot; +* spy, n. చారుడు; చారిణి; గూఢచారి; +* squall, n. జడిజల్లు; జడివాన; కొద్దికాలంపాటు ఉధృతంగా పడే వాన; +* squander, v. t. దుర్వినియోగం చేయు; దుర్‌వ్యయం చేయు; వృధా చేయు; నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టు; +* square, n 1) చతురస్రం; సమచతురస్రం; చదరం; నలుచదరం; చవుకం; చచ్చవుకం; ఎదురెదురు భుజాలు సమంగానూ, సమాంతరంగానూ ఉండి నాలుగు సమకోణాలు ఉన్న చతుర్భుజం 2) వర్గం 3) కూడలి; శృంగాటకం; రచ్చబండ; +perfect square, ph 1) చచ్చవుకం; నలుచదరం; సంపూర్ణ చతురస్రం 2) సాంగమైన వర్గు; +* squat, v. i. గొంతుక్కూర్చొను; గొంతుకలా కూర్చొను; +* squishy, adj. పిసపిసలాడు; పిసకడానికి వీలుగా ఉండు; మెత్తగాను, తడిగాను ఉండు; +* stability, n. నిశ్చలత; స్థిరత్వం; సుస్థిరత్వం; నిలకడ; స్థయిర్యం; స్థాయిత్వం; ప్రతిష్ఠ; +* stable, n 1) నిశ్చలం; స్థిరం; సుస్థిరం 2) గుర్రాలసాల; అశ్వశాల; కొట్టం; మందడి; లాయం; +* stack, n. దొంతర; దొంతి; బొత్తు; వాము; +* staff, n 1) దండము; కర్ర; గడ 2) సిబ్బంది; అధికారవర్గం; నౌకర్లు; +* stage, n 1) దశ; మజిలీ; అంచె 2) వేదిక 3) రంగం; రంగస్థలం; నాటకరంగం; +stage fright, ph సభాకంపం; సభలో మాట్లాడడానికి భయపడడం; +* stagnation, n. స్తబ్దత; ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోవడం; +* stainless, adj. నిష్కళంకం; మచ్చలేని; అకళంకము; +* staircase, n. మేడ మెట్లు; సోపానశ్రేణి; మెటికలు; తాపలు; +* stairs, n. మేడ మెట్లు; సోపానశ్రేణి; మెటికలు; తాపలు; +* stake, n 1) శంకువు 2) పణం; పణితం; ఒడ్డిమి; ఒడ్డిదం; పన్నిదం; జూదంలో ఒడ్డే పందెం; +* stale, adj. అడవ; పాచిపోయిన; తాజాతనం కోల్పోయిన; పాతబడిన; +* stall, n. బడ్డీ; వ్రజం; దుకాణం; అంగడి; కొట్టు; ఖద; +* stamen, n. కేసరములు; కింజిల్కములు; పురుషపత్రములు; +* stamina, n. ఓపిక; సత్తా; సహనశక్తి; సామర్థ్యం; +* staminode, n. వంధ్యకేసరం; పుప్పొడితిత్తిలేని పుంకేసరం; +* stamp, n 1) త��ాలాబిళ్ల; సికా; స్టేంపు 2) ముద్ర; మొహరు; +* stamp, v. t. ముద్రకొట్టు; ముద్రవేయు; టపటపా బాదు; +* stamping, n. ముద్రకొట్టుట; ముద్రవేయుట; +* stand, n 1) నిలిపే స్థలం; స్థావరం 2) బడ్డీ మంచె 3) దిమ్మ; +* standard, n 1) స్థాయి; అంతస్తు; తరగతి 2) ప్రమాణం; ప్రామాణికం; ఆదర్శం; +* standardization, n. స్థాయీకరణం; స్థిరీకరణం; ప్రామాణీకరణం; +* standardize, v. t. స్థాయీకరించు; ప్రమాణీకరించు; స్థిరీకరించు; +* standing, adj. నిలబడి ఉన్న; ప్రస్తుతం అమలులో ఉన్న; +* stapes, n. అంకెవన్నె ఎముక; రికాబు; మధ్య చెవిలో ఒక ఎముక; ఇదే మానవ శరీరంలో అతి చిన్నదైన ఎముక; +* staple, n 1) నాగవాసం మడతపిన్ను; కాగితాలని కట్టడానికి వాడే పిన్నులాంటి ఉపకరణం 2) పింజ; పత్తి గింజల పరిమాణాన్ని తెలిపే ఒక కొలత; +* star, n. నక్షత్రం; తార; తారక; చుక్క; +* starch, n. పిండి; పిండి పదార్థం; గంజి; మండము; +* start, v. i 1) ఉలిక్కిపడు; తుళ్లిపడు; భయపడు 2) బయలుదేరు; +* start, v. t 1) మొదలుపెట్టు; ఆరంభించు; ఉపక్రమించు; ప్రారంభించు; కానివ్వు 2) నడపడం మొదలు పెట్టు; +* startle, v. i. ఉలికిపడు; తుళ్లిపడు; అదరిపడు; భయపడు; +* starve, v. i. పస్తు ఉండు; తిండి లేకుండా ఉండు; +* starve, v. t. పస్తు పెట్టు; తిండి లేకుండా మాడబెట్టు; +* starveling, n అక్కుపక్షి; ఆకలికి బక్కచిక్కిన జీవి; +* state, n 1) స్థితి; సంస్థితి; పరిస్థితి; దశ; స్థాయి; అవస్థ 2) రాజ్యం; రాష్ట్రం; +excited state, ph. ఉద్రిక్త స్థాయి; ఉద్రిక్త స్థితి; +* state, v. t. చెప్పు; నుడువు; వక్కాణించు; +* statement, n 1) ప్రవచనం; సూక్తం; కంఠోక్తి 2) వాంగ్మూలం 3) యాదాస్తు; హిస్సాబు; memorandum; +* statesman, n. రాజ్యతంత్రి; రాజ్యాంగవేత్త; +* statesmanship, n. రాజ్యతంత్ర చతురత; రాజనీతిజ్ఞత; రాజకీయ కుశలత; +* statics, n స్థితి శాస్త్రం; సమతౌల్యం యొక్క లక్షణాల అధ్యయనం; వస్తువులపై బలములు ప్రసరించినప్పుడు అవి సమతౌల్యం మీద చూపే ప్రభావాన్ని గురించి విచారించే శాస్త్రం; +* station, n. తావు; నిలయం; ఆగాణం; స్థలం; ప్రదేశం; స్థావరం; ఇరవు; చావడి; వ్రజం; ఠాణా; స్టేషను; +police station, ph. కొత్వాలు చావడి; పొలీసు ఠాణా: ప్రోపోరు ఆగాణం; +* stationary, adj. స్థావర; స్థిర; స్థాన్ను; స్తంభ; స్తబ్ధ; ప్రతిష్ఠిత; అచల; నిష్పంద; నియత; నిలకడ అయిన; చలనం లేని; ప్రచలిత; +* stationary, n. అచలనం; స్థావరం; స్థిరం; నియతం; స్తబ్ధం; ప్రచలితం; +stationery store, ph. కాగితాలు; కలాలు; మొదలైన రాత పనిముట్లు దొరికే కొట్టు; +* statue, n. ప్రతిమ; విగ్రహం; మూర్తి; +* status, n. అంతస్తు; హోదా; పరపతి; స్థితి; పదవి; ప్రతిపత్తి; +special status ph. ప్రత్యేక ప్రతిపత్తి; ప్రత్యేక హోదా: +* statutory, adj. విధ్యుక్త; చట్టబద్ధ; చట్టసమ్మత; శాసనాత్మక; శాసనప్రోక్త; శాస�� విహిత; +* steady, adj. నిదానమైన; స్థిమితమైన; అచ్యుతమైన; +* steadily, adv. నిలకడగా; నిదానంగా; స్థిమితంగా; నెమ్మదిగా; +* steady state, adj. కూటస్థ; సర్వకాలములలో ఒకేలా ఉండునది; +* steal, v. t. దొంగిలించు; ఎత్తుకెళ్ళు; తస్కరించు; అపహరించు; +* stealing, n దొంగిలించడం; తస్కరించడం; అపహరణం; హరణం; +* stealthy, adv. దొంగచాటుగా; గుప్తంగా; గూఢంగా; నక్కినట్లు; అదృశ్యమానంగా; మరొకరి కంట పడకుండా; +* steam, n. ఆవిరి; నీటి ఆవిరి; ఊష్మం; +* steamer, n 1) ఆవిరిని పుట్టించే పాత్ర 2) పొగ ఓడ; ఆవిరి యంత్రంతో నడిచే ఓడ; +* steeped, adj. భావన; నానబెట్టిన; తడిప్పేట్టిన; +* steerability n. చోదనార్హత; చోదకశక్తి; చోదకత్వం; +* stele, n. ప్రసరణ స్తంబం; పొడుగాటి రాయి +* stellar, adj. నాక్షత్ర; నక్షత్రాలకి సంబంధించిన; +* stem, n 1) కాడ; కాండం; బోదె 2) వంశమూలం; అంకురం; +* stem, v. t 1) అదుపులో పెట్టు; ఆపు నిరోధించు 2) పుట్టు; ఉద్భవించు note విరుద్ధార్థములతో ఉన్న మాట; +* stench, n. కుళ్లుకంపు; దుర్వాసన; కంపు; +* stenosis, n. రక్తనాళపు ద్వారం సన్నబడుట; నాళపు ద్వారం సన్నబడుట; +step forward, ph. ముందంజ వేయు; ముందుకి వచ్చు; ముందడుగు వేయు; +* steps, n 1) మెట్లు; సోపానాలు; పావంచాలు 2) అడుగులు; +* stereotype, n. గతానుగతికం; మార్పులేనిది; +* sterilization, n. బంజరు చెయ్యడం; వంధ్యీంచడం; సంతాన నిరోధక చికిత్స; +* sternum, n. ఉరస్థి; రొమ్ము ఎముక; బోర ఎముక; +* steroid, n. ఘృతార్ధం; నెయ్యివంటి పదార్థం; +* stethoscope, n. పరిశ్రావకము; గుండె, ఊపిరితిత్తులు, పొట్త, మొదలైన అంతర్గత అంగధ్వనులని వినడానికి వైద్యులు ఉపయోగించు శ్రవణ పరికరము; +* stiffness, n. ధార్‌ష్ట్యము; బింకం; ధారుడ్యం; బటుత్వం; +* still, n. బట్టీ; దిగమరిగించే సాధనం; బీరు ని బట్టీ పట్టగా విస్కీ వస్తుంది; +* stills, n cinema] నిశ్చల చిత్రాలు నిశ్చలన చిత్రాలు; +bee sting, ph. తేనెటీగ కుట్టు; తేనెటీగ కాటు; +* stipulated, adj. విహిత; నిర్ణీత; నిర్దేశించిన; విధించబడ్డ; శాస్త్రోక్తంగా చెప్పబడ్డ; +* stirrer, n. తిప్పుడు పుడక; గరిటె; కలువరి; కల్వరి; కలివెన; +* stirrup, n. రికాబు; అంకెము; అంకవన్నె; +* stock, n 1) నిల్వ; నిలువ; సరకు 2) కంపెనీలో వాటా; +* stoic, n. విరాగి; స్థితప్రజ్ఞ; +* stoicism, n. వైరాగ్యం; విరాగం; స్థితప్రజ్ఞతావాదం; +* stomach, n 1) కడుపు; పొట్ట; డొక్క; కుక్షి; ఉదరం గర్భం 2) జీర్ణాశయం; జీర్ణకోశం; జఠరం; ఆమాశయం; +* stomata, n. పత్రరంధ్రములు; ఆకుబెజ్జములు; +* stone, n 1) రాయి; శిల; అశ్మము; పాషాణం; ప్రస్తరం; పత్తర్; కాంతం 2) రత్నం; +stone age, ph. రాతియుగం; శిలాయుగం; అశ్మయుగం 3) టెంక; +stone smith, ph. వడ్డెరవాడు; ఱాతి కార్మారుఁడు; +* stop, n 1) ఆగే చోటు; మజిలీ 2 ling స్పర్శము; కంఠనాళంలో నుండి బయటకు వచ్చే గాలిని రెండు ఉచ్చారణాంగాల సహాయంతో ఆపడం; +* stop, v. t. ఆపు; అరికట్టు; కట్టిపెట్టు; మాను; చాలించు; నిలుపు; నిలువరించు; అడ్డగించు; +* stopover, n. మజిలీ; మకాం; ప్రయాణంలో ఆగేచోటు; +* store, n 1) కొట్టు; కొట్టుగది; లిబ్బి కోఠీ; కోష్ఠాగారం; ఖానా; భాండాగారం; గరిస 2) ఉగ్రాణం; అంగడి; సినం; +data store ph. దత్తాలయం; దత్తాఖానా; దత్తాకోఠీ; గరిస; +* stork, n. గూడకొంగ; పెనుకొంగ; పెద్దకొంగ; +* stoutness, n. లావుతనం; స్థౌల్యం; స్థాలిత్యం; +* straight, adj. తిన్ననైన; సరళ; రుజు; నేరు; నిటారైన; సీదా; సూటి; +* strainer, n 1) చిల్లుల సిబ్బి; సిబ్బితట్ట; జల్లిమూకుడు; కర్కరి చాలని 2) వడపోత గుడ్డ; వడపోత కాగితం; +* straits, n. s. జలసంధి; రెండు సముద్రాలని కలిపే సన్నటి జలమార్గం; +* strange, adj. విచిత్రపు; వింత; పరిచయము లేని; అపరిచిత; +* strangeness, n. విచిత్రం; వైచిత్రి; వింత; ఎల్లిదం; +* stratagem, n. s. తంత్రం; పన్నాగం; పన్నుగడ; ఎత్తుగడ; దూరదృష్టితో చేసే తంత్రం; see also tactic; +* strategy, n. pl. పన్నాగాలు; ఎత్తుగడలు; వ్యూహాలు; స్ట్రాటజీ అనేది అంతిమ లక్ష్యాన్ని ఛేదించటానికి ఉండాల్సిన కార్యాచరణ ప్రణాళిక; స్ట్రాటజీ ప్లానింగ్ కి సంబంధించినది. అంటే స్ట్రాటజీ అనేది "ఎందుకు" అనే ప్రశ్న మీద ఆధారపడి "ఎందుకు" చేస్తున్నాం అనేది బయటకు కనిపించదు, నాయకుడికి తప్ప మరొకరికి తెలిసే అవకాశం ఉండదు see also tactics; +* stratosphere, n. ఆస్తరావరణం; చైతన్యావరణము పైన 51 కిమీ వరకు విస్తరించి ఉంటుంది. ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది, అందుకనే ఇక్కడ కల్లోల స్థితి తక్కువ. ఇక్కడే వాణిజ్య విమానాలు తిరిగేది. ఓజోన్ పొర కూడా ఇక్కడే ఉంటుంది; +* stream, n. వాహిని; నది; అర్ణం; ఏఱు; ధుని; జంబాలిని; ప్రవాహిక; +* streamers, n. pl తలాటాలు అలంకారానికి వాడే సన్నటి రంగురంగుల నగిషీ కాగితాలు; గుర్రాల తలలపై ఎగెరే అలంకారాలు; +* strengthen, v. t. శక్తివంతం చేయు; పటిష్టపరచు; దిట్టం చేయు; బలపరచు; నిబిడీకరించు; +* stress, n 1) ఒత్తిడి; రాపాటు 2) మానసిక ఒత్తిడి 3) ఊనిక; ఊత; +* stress, v. t. నొక్కి వక్కాణించు; మరీ మరీ చెప్పు; ఒత్తిడి చేయు; +* strike, v. i. తట్టు; అనిపించు; స్పురించు; +* strike out, ph. కొట్టివేయు; అడ్డుగా గీత గీయు; +* string, v. t దారముతో దండగా గుచ్చు; మాల కట్టు; +* stroke, n (1 దెబ్బ; గాతం; ఆఘాతం; ఆహతి; ఉపహతి; కిల్ల 2 మస్తిగాతం; మెదడులో రక్తనాళం పూడుకుపోవడం వల్ల కలిగే పరిస్థితి 3 రుద్రవాతం; మస్తకాఘాతం; మెదడులో రక్తస్రావం జరగడం వల్ల కలిగే పరిస్థితి; +* strong, adj బలమైన; బలిష్టమైన; పటిష్టమైన; దృఢ; శక్తివంతమైన; త్రాణ కలిగిన; త్రాణిక; తీక్షణమైన; ప్రబలమైన; ��్రగాఢ; నిబిడమైన; +* Strontium, n. రేడియో ధార్మికశక్తి ఉన్న ఒక రసాయన మూలకం అణుసంఖ్య 38, సంక్షిప్త నామం, Sr); +* structure, n కట్టడం; కట్టడి; నిర్మాణం; రచన; ఆకారం; ఆకృతి; +structural formula, ph. నిర్మాణ క్రమం; ఒక బణువులో అణువులు ఎలా అమర్చబడి ఉన్నాయో చూపే బొమ్మ; +* structuralism, n నిర్మాణక్రమవాదం; ఒక రకం సాహిత్య విమర్శ; +* strychnine, n. ముషిణి; ఒక విషపదార్థం; నక్స్ వామికా గింజలలో ఉండే విషం; +* stubble, n 1) దుబ్బు; కొయ్యగా మిగిలినది 2) కొద్దిగా పెరిగిన గెడ్డం; +* student, n. అధ్యేత; అభ్యాసి; అంతేవాసి; m. విద్యార్థి; f. విద్యార్థిని; +* study, n 1) చదువుకొనే గది 2) పఠన; చదువు; అధ్యయనం; +* study, v. i. చదువు; పఠించు; నేర్చుకొను; అభ్యసించు; అధ్యయనం చేయు; అవగాహించు; గరచు; గ్రహించు; ప్రాపించు; +* stun, v. i. నివ్వెరపడు; మ్రాన్పడు; రిచ్చపడు; స్తంభించు; నిర్ఘాంత పోవు; +* stupefy, v. t. నిర్విణ్ణుని చేయు; స్తబ్ధుని చేయు; +* stupid, n. శుంఠ; మొద్దు; జడ్డి; మూఢమతి; m. మూర్ఖుడు; బుద్ధిహీనుడు; వివేకహీనుడు; +* stupidity, n అవివేకం; బుద్ధిహీనత; తెలివితక్కువతనం; మూర్ఖత్వం; జడ్డితనం ఎడ్డమి; +* stupor, n. మూర్చ; మత్తు; మైకం; జడత్వం; స్తబ్దత; +* stupor, n. మూర్చ; మత్తు; మైకం; జడత్వం; స్థబ్దత; లాహిరి; ఇంచుమించు స్పృహ లేని స్థితి; +* style, n 1) వాటం; వైఖరి; తీరు; పద్ధతి; రీతి; పగిది; చందం; బాణీ; ఫక్కి; పంథా; హావభావాలు; ధోరణి; తరహా; లక్షణం; ఫణితి; శైలి 2) కీలం; పువ్వుల అండాశయంలో ఉన్న కాడ; +* stylus, n. గంటం; కలం ఆకారంలో ఉండే ఒక లోహపు పనిముట్టు; +* suave, adj. సారస్యము; సరసత; లోలోపల ఎలా ఉన్నా పైకి మాత్రం తేలిపోకుండా మాట మంచితో ఉండే ప్రవర్తనతో కూడిన; +* subaltern, adj. అధీన; పరాధీన; వలస రాజ్యాలలో బ్రిటిష్‍ మిలటరీ వారు తరచుగా వాడిన పదం; +* subconscious, adj. వ్యక్తావ్యక్తమైన; సుప్తచేతనమైన; ఉపచేతన; +* subcontinent, n. ఉపఖండం; ఖండంలోని మిగిలిన ప్రాంతం నుంచి ఏదోక భౌగోళిక అడ్డంకుల కారణంగా (గొప్ప పర్వత శ్రేణులో, మహా నదులో, ఎడారులో) విడిపోయినట్టుగా ఉండే భారీ ద్వీపకల్పాలను ఉపఖండాలు అంటారు. ఇలా భౌగోళికంగా మిగిలిన ఖండం నుంచి విడిగా ఉంటూ, ఆ ప్రాంతం అంతా కలిసి ఉండడమే ఆ ప్రాంతానికి ప్రత్యేక సంస్కృతినీ, ఉమ్మడి చరిత్రనీ ఇస్తుంది; +* subdue, v. t. అణచు; లోబరచుకొను; వశపరచుకొను; జయించు; +* subject, n 1) కర్త; వాక్యమందలి కర్త 2) విషయం; కథావిషయము 3) విశేష్యం; వ్యాప్యము 4) అంశం; పాఠ్యాంశం 5) వ్యవహర్త; పాలితుడు +* subjective, adj. ఆత్మగత; ఆత్మాశ్రయ; స్వీయాత్మక; వ్యక్తినిష్ట; వ్యక్తిగత; ఆధ్యాత్మిక; ప్రాతీతిక; +subjective idealism, ph స్వీయాత్మక భావవాదం; ��త్మాశ్రయ భావవాదం; +* subjectivity, n. స్వీయాత్మకం; ఆత్మాశ్రయత్వం; వ్యక్తినిష్టత; +* sublimation, n. ఋష్వం; ఉత్పాదం; ఉత్పతనం; ఘనరూపం నుండి నేరుగా వాయురూపంలోకి మారే భౌతిక ప్రక్రియ; +* submarine, n. నిమజ్జిత నావ; దొంగోడ; జలాంతర్గామి; +* submarine fire, n. బడబాగ్ని; బడబానలం; ఔర్వాగ్ని; అవ్వాగ్గి; +* submit, v. t దాఖలు చేయు; దఖలు పరచు; ఒప్పగించు; +* subpoena, n సపీనా) సాక్షి సమను; శిక్షా నిర్ణయముతో సాక్షిని రమ్మని పంపు ఉత్తరువు rel summons; +* subscript, n. పాదాక్షరం; పాదిక; పాదాంకం అంత్య ప్రత్యయం; +* subsequently, adv. తదుపరి; పిదప; అనంతరం; తర్వాత; కడపట; దరిమిలాను; +* subsidy, n. ప్రభుత్వం ప్రసాదించే సహాయం; +* subsistence, n. ఉపాధి; కనిష్ఠ జీవనాధారం; జీవక; భృతి; +* substitute, v. t. ప్రతిక్షేపించు; బదలాయించు; ఆదేశించు; +* substitution, n. ప్రతిక్షేపణ; ఆదేశం; అనుకల్పం; బదిలీ చర్య; మార్పిడి; +* subtext, n అంతరార్థం; గూఢార్థం; అన్యాపదేశం; +* subtle, adj సటుల్) సూక్ష్మ; పట్టుకు దొరకనిది; +* subtle, n. సూక్ష్మం; వైదగ్ధ్యం +* subtract, v. t. తీసివేయు; కొట్టివేయు; వ్యవకలించు; +* subtraction, n. తీసివేత; కొట్టివేత; వ్యవకలనం; +* suburb, n. శాఖాగ్రామం; మదురువాడ; శాఖానగరం; pl. శివార్లు; +* success, n. జయం; విజయం; ఉత్తీర్ణం; సఫలం; కృతార్ధత; +* succession, n 1) వంశపారంపర్యం; దాయాధికారం; వారసత్వం; ఉత్తరాధికారం 2) పరంపరాక్రమం; +* successive, adj. ఉత్తరోత్తర్యా; పరంపరానుగత; అనుక్రమ; +* succinct సక్సింట్‍) adv. ముక్తసరిగా; సంగ్రహంగా; టూకీగా; +* succubus n కామినీ మగవాడితో రతిని కాంక్షించే ఆడ దయ్యం ant incubus; +* sucrose, n. ఇక్షోజు; పంచదారలో ఉండే చక్కెర; +* suddenly, adv. అకస్మాత్తుగా; ఆకస్మికంగా; అమాంతంగా; అనుకోకుండా; హఠాత్తుగా; ఉన్నపాటున; ఉన్నట్టుండి; గభీమని; గభాలున; పుసుక్కున; చివాలున; చటుక్కున; చట్టున; తటాలున; తటుక్కున; చటాలున; ఠక్కున; దిగ్గున; గ్రక్కున; చివ్వున; జివ్వున; కాదాచిత్కంగా గుప్పున గుబుక్కున; గబుక్కున; +* sudorific, n. ఘర్మకారి; చెమటని పుట్టించే పదార్థం; +* suds, n. నురుగ; నురగ; సబ్బు నురగ; +* sue, v. t. దావా వేయు; నష్టపరిహారం కోసం కోర్టులో దావా వేయు; +* sufficient, adj. చాలినన్ని; సరిపడినన్ని; సరిపడా; పర్యాప్తమైన; +* suffix, n. ఉపప్రత్యయం; పరప్రత్యయం; ఉత్తరపదం; అపదం; అంతాంగమమం; తోకమాట; వాలం; వెలపలి తోక; +* sugar, n. పంచదార; చక్కెర; శర్కర; తీరవ్వ; +blood sugar, ph. రక్త శర్కర; రక్తంలో గ్లూకోజ్ మట్టం; +brown sugar, ph. శుద్ధి చేసిన తెల్ల చక్కెరకి కపిల వర్ణపు రంగు, షాడబం కొరకు మొలేసస్‍ కలపగా వచ్చినది; +raw sugar, ph. బూరా చక్కెర; బూరా పంచదార; ముడి చక్కెర; +sugar candy, ph. పటికబెల్లం; పటికపంచదార; కలకండ; +* suicide, n. ఆత���మహత్య; ప్రాణత్యాగం; +* suit, n. అభియోగం; దావా; వాజ్యం; +* suitability, n. అనువు; ఉరవు; అవుచిత్యం; ఔచిత్యం; ఉచితం; ఒనరిక; +* suite స్వీట్) n 1) హొటేళ్లలో కాని, కచేరీ భవనాలలో కాని రెండు మూడు గదులతో కూడిన వాటా 2) సంగీతంలో రెండు, మూడు రాగాలతో కూడిన పాట 3) కంప్యూటర్లలలో రెండు, మూడు అనువర్తన క్రమణికలని గంపగుత్తంగా అందించడం మైక్రోసాఫ్ట్ ఆఫీస్‍ లో వర్డ్, పవర్ పోయింట్, ఎక్సెల్‍ అనే అనువర్తన క్రమణికలు గంపగుత్తంగా ఉంటాయి. +* sulk, v. i. గునుసు; చిటపటలాడు; అలుగు; ముఖము మాడ్చుకొను; కోపముగానుండు; +* sum, n. మొత్తం; కలయిక; కూడిక; +* summarize, v. t. క్రోడీకరించు; సంగ్రహించు; టూకించు; ముక్తాయించు; ఉటంకించు; +* summary, n. సారాంశం; సంగ్రహం; క్రోడిక; సంక్షిప్తం; ఉటంకం; టూకీ; ముక్తసరు; ముక్తాయింపు; +* summer, n 1) వేసంగి; వేసవి కాలం; ఎండాకాలం; యాసంగి; ఊష్మకం 2) సంకలని; కూడేది; +* summit, n. శిఖరాగ్రం; నగాగ్రం; శృంగం; +* summon, v. t. పిలుచు; పిలిపించు; రమ్మని కబురు పెట్టు; కేకేయు; ఆకరితం; +* summons, n. పిలుపు; తాకీదు; ఫర్మానా; సమను; కోర్టులో హాజరు కమ్మని పంపిన అధికార పత్రం rel subpoena; +sump pump, ph. కూప తోడిక; ఒక గోతి (కూపం) లోకి చేరుకున్న మురికి నీటిని బయటకు తోడే సాధనం; +* sun, n 1) సూర్యుడు; పొద్దు; మిత్ర; రవి; భాను; భగ; పుష; హిరణ్యగర్భ; నరీచి; ఆదిత్య; సవిత్ర; అర్క; భాస్కర; తరణి; ఖద్యోతుడు; మార్తాండుడు; గ్రహపతి; ప్రభాకరుడు; ద్యుమణి; దినకరుడు; పగటివేల్పు (పగలు వేల్పు Day God ఇరులగొంగ (ఇరులు గొంగ Enemy of Darkness కాకవెలుగు (Light of Heat మింటితెరువరి (మిన్ను తెరువరి Sky Traveller 2) ఎండ; +the sun sank, ph. ప్రొద్దు వాలింది; ప్రొద్దు వాటారింది; ప్రొద్దు గ్రుంకింది; +* Sunday, n. ఆదివారం; రవివారం; భానువారం; భట్టారక వారం; సూర్యవారం; +* sunflower, n. సూర్యకాంతం; ప్రొద్దుతిరుగుడు పూవు; +* sunlight, n. ఎండ; సూర్యరశ్మి; రవిరశ్మి; ఆతపం; +* sunstroke, n. ఎండదెబ్బ; వడదెబ్బ; వడతాకు; వేడిదెబ్బ; +* superficial, adj 1 బాహ్య; పైపైని; ఉపరితలానికి సంబంధించిన 2)సారం లేని; +* superfluous, adj అపేక్షాధిక; అవసరానికి మించిన; +* super-food, n భృహదాహారం భృహదాన్నం; ఎక్కువ పోషకశక్తి గల ఆహార పదార్థం; +* supernumerary, adj. అధికమాసం; అధిక; లెక్కకు మించి; అనుకున్నదానుకంటె ఎక్కువ; +* superposition, n. అధ్యారోపితం; ఆచ్ఛాదనం; ఉపరిస్థాపకం; అధిస్థాపనం; ఒకే స్థానంలో, ఒకటి కంటె ఎక్కువ స్థితులు ఆక్రమించి ఉండడం; +principle of superposition, ph. ఆచ్ఛాదన సూత్రం; ఉపరిస్థాపక సూత్రం; అధ్యారోపనం; అధ్యాస; +* superstition, n. పిచ్చి నమ్మకం; మూఢ నమ్మకం; గుడ్డి గురి; అంధ విశ్వాసం; +* supervisor, n. పర్యవేక్షకుడు; ఉపద్రష్ట; +* supply, v. t. సరఫరా చేయు; సమకూర్చు; అందించు; పోషించు; +* support, n. అండ; దన్ను; ఊత; ఊతం; ఊనిక; ఆసరా; ఆనిక; ఊనిక; ఊత; ఆకరం: ప్రాపకం; ప్రాపు; ఆధారం; ఆస్కారం; దిక్కు; ఆలంబనం; బాసట; ఉద్ధరణ; కాపు; తోడు; మద్దత్తు; జీవగర్ర; +* suppressed, adj 1) అణగఁద్రొక్కబడిన; అణచబడిన; దళిత; వినతములైన 2) అణగారియున్న; +* surfboard, n. ఫేనపు చెక్క; సముద్రపు కెరటాల మీద సవారీ చెయ్యడానికి వాడే బల్ల; +surge tank, ph. తరగ కుండీ; జలవిద్యుత్ కేంద్రాలలో నీటిని ఉత్పాదక యంత్రాల మీదకి మళ్ళించే దారిలో ఉండే ఒక కుండీ; +* surgery, n. శచికిత్స; శల్యక్రియ; శల్యశాస్త్రం; +* surprise, n. ఆశ్చర్యం; అచ్చెరువు; నివ్వెర; విస్మయం; అక్కజము; +* surreal, adj. అధివాస్తవిక; కాలాతీత; నమ్మశక్యం కాని; కలో నిజమో తెలియరాని; +* surrealism, n. అధివాస్తవికత; అచేతనమైన మనస్సు ఎలా పని చేస్తున్నాదో వ్యాఖ్యానించడం; కథా వస్తువుని కలలో మాదిరి అసంబద్ధ ధోరణిలో వర్ణించడం; +* surrogate, n ఒకరి స్థానంలో మరొకరు నిలవడం; +surrogate mother, n ప్రతినిధి మాత; ఒక స్త్రీ పిల్లని కనలేని పరిస్థితిలో ఆమె తరఫున ఆ బిడ్డని మోసిన కన్నతల్లి; +* surround, v. i. మూగుకొను; ముసురుకొను; ఆవరించుకొను; +* surround, v. t 1) మూగు; ముసురు; గుమిగూడు; ఆవరించు; పరివేష్ఠించు; పరిక్షేపించు 2) ముట్టడించు; చుట్టుముట్టు; +* surrounded, n. నివృతం; సమావృతం; పరివేష్ఠితం; +* survey, n. అవలోకన; అవలోడన పైమాయిషీ; సర్వేక్షణం; +* susceptibility, n. గ్రహణశీలత; మార్పుకి వీలు కల్పించడం; వివశత; +* suspect, v. t. శంకించు; అనుమానించు; భావించు; +* suspend, v. t. లంబించు; ప్రలంబించు; వేలాడదీయు; +* suspended, n. లంబితం; లంబించబడినది; ప్రలంబితం; వేలాడదీయబడినది; విలంబితం; +* suspenseful, adj. ఉత్కంఠితమైన; ఉత్కంఠభరితమైన; +* suspension, n. ఆపుదల; నిలుపుదల; వ్యాక్షేపం; +* sustainable, adj. పాలనీయ, భరణీయ, నిర్వహణీయ, ధారణీయ, సహనీయ, రక్షణీయ; +* suture, n. సీమంతిక; సీవని; సంధి; కుట్టు; స్యూతము; +the sagittal suture, ph. బ్రహ్మరంధ్రం; పసికందుల నడినెత్తిమీద ఉండే మెత్తటి ప్రదేశం; +* sutures, n. స్యూతులు; కుట్లు; సీమంతికలు; +* suzerainty, n. సర్వసహాధీశత్వం; విదేశాంగ వ్యవహార్రాలలో ఒక రాజ్యం పై అదికారం; +* swallow, v. t. మింగు; కబళించు; గుటుక్కుమనిపించు; గుటకాయిస్వాహా చేయు; +* swamp, v. i. రొంపిలో దిగబడు; తలమునకగు; ఊపిరాడనంత పనిలో పడు; +* swap, v. t. మార్చు; తారుమారు చేయు; ఇచ్చిపుచ్చుకొను; +* swarthy, adj. చామనచాయ; ఎండకి నల్లబడ్డ శరీర చాయ; +* sweat, n. చెమట; ఘర్మజలం; శ్వేదనజలం; శ్వేదం; +sweat glands, ph. స్వేదగ్రంథులు; చెమటబొడిపెలు; చెమటకంతులు; +* sweat, v. i. చెమట పట్టు; చెమరు; చెమర్చు; చెమరించు; +* sweeper, n. m. ఊడ్పుకాడు; f. ఊడ్పుగత్తె; ఝాడమాలిని ety. ఝాడూ చీపురు) +* sweet, adj. తీయనైన; తియ్యనైన; తియ్యని; మధురమైన; మధురం; +sweet potato, ph. తియ్యదుంప; చిలగడదుంప; గెనుసుగడ్డ; రత్నపురిగడ్డ; తన జన్మ స్థానమైన దక్షిణ అమెరికా నుండి ఇది ప్రపంచం అంతా వ్యాపించింది;[bot Ipomoea batatas +* sweetmeat, n. తీపితిండి; తీపి తినుబండారం; మిఠాయి; +* sweets, n. మిఠాయిలు; మోదకాలు; తీపి సరుకులు; బిళ్లలు; +* swell, n. పొంగు; బూరటి కెరటం; ఉల్భణం; +* swell, v. i. వాచు; పొంగు; ఉప్పొంగు; ఉబుకు; ఉబ్బు; ఉబ్బరించు; ఉబ్బరిల్లు; బూరటిల్లు; +* swelling, n. వాపు; పొంగు; కదుము; ఉబ్బకం; ఉబ్బరింత; +swine flu, ph ఒక రకం ఇన్‍ప్లుయెంజా పేరు; ఇది H1N1/09 అనే పేరుగల విషాణువు వల్ల వచ్చే జబ్బు ఇది 2009 లో మొదటిసారి ప్రజలలో కనిపించింది; +* switch, v. t. మార్చు; మారుగుళ్లు చేయు; తారుమారు చేయు v. i. మారు; +switching yard, n. మారుగుళ్ల దొడ్డి; రైలు బండిలో పెట్టెల స్థానాలని మారుగుళ్లు చేసే స్థలం; +* swoon, v. i. మూర్చిల్లు; సొమ్మసిల్లు; +* sword, n. కత్తి; ఖడ్గము; బాకు; అడిదం; +long sword, ph. అఘాయువు; అసితాంగము; అసిధేనుక; అసిపుత్రి; కఠారము; +* sycophant, n సైకఫేంట్) భట్రాజు; భజనదాసు; చెంచారాయుడు; ముఖస్తుతిచేసి లాభం పొందేవాడు; +* syllable, n. శబ్దగణం; మాత్ర; మాత్రకం; కారం; అక్షరం; +* syllabus, n. ప్రణాళిక; పాఠ్య ప్రణాళిక; సంగ్రహం; సంక్షేపం; +* syllogism, n. త్రియాంశతర్కం; పంచావయవం; ఉదా. మానవులకి మృతి ఉంది. భారతీయులు మానవులు. కనుక భారతోయులకి మృతి ఉంది, అని తర్కించడం. +* sylvan. adj. మొక్కలతో నిండిన; వన సంబంధమైన; +* symbiosis, n. సహజీవనం; పరస్పరసేవ; అంధపంగున్యాయం; +* symbol, n. గుర్తు; ప్రతీక; చిహ్నం; సంకేతం; +graphic symbol, ph. రేఖాత్మక చిహ్నం; రేఖాత్మక సంకేతం; +* symbolic, adj. సాంకేతిక; లాక్షణిక; ప్రతీక; ప్రతీకాత్మక; +* symbolical, n. సాంకేతికం; ప్రతీకాత్మకం; +* symbolism, n. ప్రతీకాత్మకత; ప్రతీకాత్మకం; ప్రతీక వాదం; భావ ప్రకటన గాక భావ సూచనేు ప్రధానమైన పద్ధతి; +* sympathy, n. సానుభూతి; అనుతాపం; పరితాపం; కనికరం; దయ; +* symptom, n. లక్షణం; సూచకం; గురుతు; గుర్తు; +* synchronous, adj. ఏకకాలిక సమకాలిక; ఒకే సమయంలో జరిగే; +* syndrome, n. లక్షణగుచ్ఛం; కొన్ని రోగ లక్షణాల సముదాయం; +* synecdoche, n. అజగర్లక్షణం వంటి అలంకారం; అంతా చెప్పడానికి బదులు కొంచెమే చెప్పడం కాని, కొంచెం చెప్పడానికి బదులు అంతా చెప్పడం కాని ఈ అలంకారం లక్షణం; ఉ. నలుగురితోటీ చెప్పి చూడు అన్నప్పుడు, నలుగురు మనుష్యులతోటే చెప్పమని కాదు, పలువురితో సంప్రదించమని. ఇది అజహర్లలక్షణం. ఉ. రంజి ట్రోఫీ ఆంధ్రా గెలిచిందంటే, ఆంధ్రులంతా అని కాదు, ఆంధ్ర�� జట్టు అని మాత్రమే అర్థం; ఈ రెండింటినీ ఇంగ్లీషులో సినక్‌డకీ అనే అంటారు. తెలుగులో మాత్రం మొదటిదానినే అజహర్లక్షణం అంటారు; +* synonym, n. పర్యాయపదం; సమానార్థకం; ప్రతిపదం; రూపాంతరం; +* syntactic, adj. క్రమబద్ధ; వాక్యనిర్మాణ; భాషానిర్మాణ; +* syntax, n. వాక్యనిర్మాణం; భాషానిర్మాణ సిద్ధాంతం; +* synthesis, n. సంధానం; సంశ్లేషణ; సంయోగం సమన్వయం ant.)విశ్లేషణ; +synthetic chemistry, ph. పౌరుష రసాయనం; సంధాన రసాయనం; సంశ్లేష రసాయనం; +synthetic fibers, ph. పౌరుష తంతులు; సంధాన తంతులు; సంశ్లేష తంతులు; +* synonym, n. పర్యాయపదం; ప్రతిపదం; నానాఅర్థం; +* syphilis, n. కొరుకు సవాయి; ఉపదంశ రోగం; ఫిరంగి రోగం; సవాయి; +* system, n. వ్యవస్థ; పద్ధతి; క్రమం; విధం; సరణి; తంత్రం; మండలం; శరీరం; +* systematically, adv. లాంఛనంగా; క్రమపద్ధతిలో; పద్దతి ప్రకారం; +* systemic, adj. దైహిక; దేహం అంతటికి సంబంధించిన; +* systole, n. ముకుళింత; హృత్సంకోచం; గుండె ముకుళించుకోవడం; +* syzygy, n సిజిజీ) పర్వస్థానం; సూర్యచంద్రులు ఎదురెదురుగా కాని, ఒకే వైపు కాని ఉన్నప్పటి స్థానాలు; + + +1) apartment; flat; నలుచదరపుచోటు; తొట్టికట్టు 2) 8 square yards of land; పన్నెండడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పు గలిగి 72 చదరపు అడుగుల వైశాల్యం ఉంటే ఇంటి కట్టుబడి స్థలమని నెల్లూరు జిల్లా వ్యవహారం; తిరుపతి ప్రాంతాల వారు 6 అడుగులు x 6 అడుగుల అంటే 36 చదరపు అడుగుల వైశాల్యాన్ని ఒక అంకణం గా తీసుకుంటారు 3) The space between any two beams, or pillars. రెండు దూలముల, లేక స్తంభముల, నడిమి ప్రదేశము. +Syn కొండజెముడు, గిరిమల్లిక; కొండ మల్లె; కూటజం పాలచెట్టు; +2 bot Wrightia tinctoria ఈ వృక్షం పాలలో, ఆకులలో, పూలలో ఉండే ‘పాల ఇండిగో’ (Pala Indigo అనే ఒక విధమైన నీలి అద్దకపు రంగు (Blue Dye) కారణంగా దీనికి టింక్టోరియా అనే పేరు ఏర్పడింది. టింక్టోరియస్ అంటే లాటిన్ భాషలో ‘నీలిరంగు కలిగిన‘ అని అర్థం. దీని కర్ర తేలికగా, మెత్తగా ఉండే కారణంగా బొమ్మల తయారీకి, తరిణె పట్టే పనుల (Turnery) కూ ఇది చాలా అనువుగా ఉంటుంది. ఈ కర్రతో అగ్గి పెట్టెలు, అగ్గి పుల్లలు కూడా తయారు చేస్తారు; ఏటి కొప్పాక లోని లక్క బొమ్మలు ఈ కర్రతోనే చేస్తారు; +అంకురం లేకుండా (సమూలంగా) నాశనం అయిపోయింది destroyed without a trace. +తలలోన్న పేల గుడ్లని ఈరు లేక ఈపి అంటారు. ఈళ్లు అనేది దానికి బహువచనం జుట్టు నుండి ఈళ్లని +తొలగించడానికి ఈరుపెన లేక ఈర్పెన అనే ప్రత్యేకమైన దువ్వెన వాడతారు. గుడ్ల నుండి పుట్టిన పేలు తొలి దశలో చర్మానికి అంటుకుని ఉంటాయి కనుక వీటిని అంటు పేలు అంటారు.. +సంపాదిత శంపావలి, బెంపారిన్ మేఘ ���యము పృథివియు నభముం, గంపింపగ బెట్టురుముచు, నంపాచారంపు వానలప్పుడు కురిసెన్ విష్ణు పురాణం; వెన్నెలకంటి సూరన్న. +అంపెలుగట్టి చేత యష్టి ధరించి విక్రమార్క చరిత్ర: కొండమీది గోపురాజు +నీ వెక్కడనుండి వచ్చితిది యేటికి నుస్సురుమంటి మంటి నీకునీ యక్కస మేల వచ్చెను’ ” పింగళి సూ. కళాపూర్ణోదయం; +1) syllable; letter of an alphabet lit అ నుండి క్ష వరకు ఉన్న అక్షర సముదాయం సున్న లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు ఒక అచ్చు' కలసి అక్షరాలు ఏర్పడతాయి ఒక అక్షరంలో ఒకటికన్న ఎక్కువ అచ్చుకు ఉండడానికి అవకాశం లేదు దీనిని ఆంగ్లంలో syllable అంటారు A syllable can have one and only one vowel-sound and zero or more consonants గుణింతాలు (గుణితాక్షరాలు అనాలి సంయుక్తాక్షరాలు, అన్నీ ఈ కోవలోకే వస్తాయి; +ఆస్యమునందు అక్షరము కలిగి యుండుట. అంటే అక్షరం పలికే శక్తి ఉండుట; ఆస్యము అంటే నోరు; +స అక్షరత సాక్షరత అన్నా అక్షరాస్యత అన్నా ఒకటే. +అక్షరాస్యుడు అక్షరము ఆస్యమునందు కలవాడు బహువ్రీహి సమాసం); +2) idler useless fellow; తెలివిలేనివాడు; చవట; కొరకురానివాడు; దిక్కుమాలినవాడు; చాతకానిది/చాతకానివాడు; మూర్ఖుడు; +3 bio Jacobin Cuckoo; చాతక పక్షి; ఈ 'చాతక' పక్షి నేల మీద నీటిని తాగక కేవలం వర్షపు నీటితోనే దాహం తీర్చుకుంటూ వర్షం కోసమే ఎదురు చూస్తూ, ఎదురు గా నీరు ఉన్నా తాగక బక్కచిక్కి రొమ్ము/ఛాతీ భాగం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. +పేరూ ఊరూ లేనివాణ్ణి అంటే అప్రసిద్ధుణ్ణి అగస్త్య భ్రాత అంటారు ఎవరో ఒకరు — అప్పటి వరకూ అప్రసిద్ధుడు" అనే అర్థంలో అగస్త్య భ్రాత అనడం ఈ నాటికీ ఉంది. +రాజు బ్రాహ్మణులకిచ్చు యీనాము, బ్రాహ్మణులు మాత్రము నివసించు గ్రామమును అగ్రహారం అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, బ్రాహ్మణుల ఇండ్లవరుస (వీథి)ని అగ్రహారము అని పిలుస్తున్నారు. సర్వసాధారణంగా ఈ ఇండ్లు ఒకదానిని ఒకటి ఆనుకొని వుంటాయి. మధ్యలో ఖాళీ స్థలమేదీ వుండదు Row Houses); +కూచిపూడి అగ్రహారం, తాళ్ళపాక అగ్రహారం, ముంగండ అగ్రహారం; +అగార్ అనే పదార్ధము గ్రసిలరియా అనే సముద్రపు నాచు నుండి వస్తుంది. ఇది ఒక జిగురు పదార్ధం లాటిది. ఎక్కువగా మైక్రోబయాలజీ ప్రయోగశాలలో ఉపయోగిస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది నీటిలో మరిగించి నప్పుడు కరిగి నీటి లాగే ఉంటుంది. తిరిగి చల్లార్చే సరికి జెల్లీ లాగా గడ్డకడుతుంది. అందుచేత దీన్ని జెల్లీ గా, ఐస్ క్రీమ్, లలో వాడతారు. ఇప్పుడు జెలటిన్ కి బదులుగా విజిటబల్ జెలటిన్ గా మనం తరచు చూస్తూ ఉ���టాం తింటూ ఉంటాం కూడా. దంత వైద్యులు కూడా వాడే వారు అచ్చు పోయటానికి; +ఈ మొక్క మన ప్రాంతం అంతటా రహదారుల పక్కన, పెరటి దొడ్లలో, తోటలలో, పొలాల్లో కలుపుమొక్కగా పెరుగుతుంది. ఈ మొక్క నేలను అంటుకుని చుట్టూ వ్యాపిస్తుంది. వేళ్ళు నేలలో బాగా లోతుకు వ్యాపిస్తాయి. +an important medicinal plant; ఈ మొక్క మొత్తం పచ్చిది కానీ, ఎండుది కానీ మూత్రకారిగా పేరొందిన పునర్నవా' అనే ఔషధానికి ప్రధానమైన వనరు. కాండం కంటే ఆకులు, పూలు, వేళ్ళు ఔషధపరంగా ప్రయోజనకరమైనవి పునర్నవా పాండురోగాన్నీ, రక్త పిత్తాన్నీ,వాపులనూ, వ్రణాలనూ, శ్లేష్మాన్నీ పోగొట్టి మూత్రం జారీచేస్తుంది. +అటిక మామిడి; గుడ్ల మల్లి Sans పునర్నవా; శ్వేత పునర్నవా; రక్త పునర్నవా; +same as అడవి బూరుగ; కొండగోగు; కొండ బూరుగ; +ఏనుగబాదం లేక గుర్రపు బాదం చెట్టు; +--2 మానికలు (శేర్లు 1 అడ్డ; 2 అడ్డలు 1 కుంచం; +సాధారణంగా ఆకులన్నీ నిలువుగా వుంటాయి. కొద్ది రకాలు మాత్రం అడ్డంగా వుంటాయి. అందులో Bauhinia vahlii అనే తెగకు చెందిన ఒక భారీ తీగ తాలూకు ఆకులు దృఢమైన కాడ కలిగి, పెద్దవిగా వుంటాయి. ఈ తీగ నార కూడా పటిష్ఠంగా వుండి బలమైన తాళ్లలా ఉపయోగపడతాయి. వీటి ఆకు వెడల్పుగా వుండి రెండు భాగాలుగా విడిపోయి, రెండాకులులా కనిపిస్తాయి. అందుకే వీటిని "అడ్డాకులు" అంటారు. చెట్టు నుండి విడదీసిన తర్వాత కూడా పటిష్ఠంగా వుండే ఈ ఆకులు ఎండినా కూడా చిరగకుండా వుంటాయి. అందుకే వీటితో భోజనానికి ఉపయోగించే విస్తరాకులను తయారుచేస్తారు. +అడవ బాకీ కాలదోషం పట్టిన బాకీ; +4 గిద్దలు 1 సోల; 2 సోలలు 1 తవ్వ; 2 తవ్వలు 1 మానిక; 2 మానికలు 1 అడ్డ; 2 అడ్డలు 1 కుంచం; +పుడికా అంటే లేటిన్ భాషలో సిగ్గు అని అర్ధం; +ఈ మొక్క ఆకులు తాకిన వెంటనే లోనికి ముడుచుకుంటాయి. ఎందుకంటే అవి వాటిని తినే జంతువులుకు అందకుండా, ఆకు ముడుచు కోడం వల్ల ఎండింది అని భ్రమ కలిపించడం ఒక కారణం. ఇంకా కీటకాలు చేరకుండా ఉండటం ఇంకో కారణం. ఇది భక్షక జంతువుల నుంచి రక్షక చర్య (predator avoidance mechanism ఇలా ఆకులు /లేదా శరీర భాగాలు బాహ్య ప్రేరణకి ప్రతిస్పందించ దాన్ని అదిశ ప్రేరణ గతి (nastic movement) అంటారు. ఇక్కడ ఈ మొక్కలో ఉన్నట్టు స్పర్శకి, లేదా గాలికి స్పందిస్తే దాన్ని seismo nastic movement అనీ, వేడికి స్పందిస్తే thermo nastic అనీ, రాత్రి వేళ ముడుచుకుంటే nictonastic అనీ అంటారు. ఇక్కడ ఈ మొక్కలో స్పర్శ, నిశా ప్రేరిత చలనం ఉంటుంది (seismo nictonastic movement). +అలంబుస; ముడుగుదామర; సోకుముడుగు; సిగ్గాకు; నిద్ర గన్నిక; నీ సిగ్గు చితక Hindi] లాజవంతి; +మానవాతీత శక్తులు మనుషుల శక్తికి మించిన శక్తులు (దేవుళ్ళు, దెయ్యాలు, మాజిక్కులు, మహిమలు లాంటివి) +1) teaching; instruction 2) బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులకు చెప్పిన ఆరు విధులలో అధ్యాపనం ఒకటి. ఇక్కడ అధ్యాపనం అంటే వేదాన్ని బోధించడం. మిగతా ఐదు విధులు 1. అధ్యయనం (వేదం చదవడం 2. యజనం (యజ్ఞం చేయడం 3. యాజనం (యజ్ఞం చేయించడం 4. దానం (దానం ఇవ్వడం 5. ప్రతిగ్రహం (దానం తీసుకోవడం); +--a state of ruin; utterly spoiled condition lit అధవ అన్నం food cooked by a widow; శ్రీనాథుడు తన అవసానదశలో విశ్వస్త (విధవ) వడ్డించిన అన్నం తినాల్సిన అధ్వాన్న స్థితి ఏర్పడిందని వాపోయిన చాటు పద్యం ప్రసిద్ధమే కదా?; +మలమాసం; సంసర్పం; see also క్షయమాసం; లుప్తమాసం; అంహస్పతి మాసం; +వేదకాలం నాటికే అధిక మాసాల లెక్క ఉండేది. అప్పట్లో నెలల పేర్లు మధు, మాధవ, శుక్ర, శుచి, నభ, నభస్య, ఇష, ఊర్జ, సహ, సహస్య, తప, తపస్య. అధిక క్షయ మాసాలను సంసర్పం, అంహస్పతి అనే వారు.(డా. సాగి కమలాకర శర్మ రచించిన ‘‘జ్యోతిర్మయం వాఙ్మయం’’ గ్రంథం ఆధారంగా.) +భర్త తోపాటు చితి ఎక్కడం సహగమనం భర్త వేరే చోట మరణించాక వార్త తెలిసి అగ్ని ప్రవేశం చేస్తే అనుగమనం; +1. అనుభవింపఁబడినది; 2. తినఁబడినది; 3. వాడుకొనఁబడినది. +అపరరాత్రి దానికంటే తరువాత లేని రాత్రి; +usage note) ఆపేక్ష తప్పు, అపేక్ష ఒప్పు; +ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం, శ్రవణా నక్షత్రంలోని మొదటి పాదంలో 15వ వంతు భాగాన్ని అభిజిత్ నక్షత్రం అంటారు; +ప్రతీ రోజూ మధ్యాహ్నం 12 గం. కి 16 ని. ఇటు నుంచి అటు వరుకూ; వారం, వర్జ్యం, తిథి —- ఇవేవీ చూడకుండా ఏ రోజైనా ఈ సమయం చాలా మంచిది అని అంటారు. శ్రీరాముడి జననం, సీతారాముల కల్యాణం, భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన సమయం, ఇవన్నీ ఈ ముహూర్తంలోనే జరిగాయి. +అభిసారం' అంటే ప్రేమికులు సంగమార్థం కలుసుకుందాం అని చేసుకునే నిర్ణయం. అభిసారిక అంటే ప్రియుడి కోసం దొంగచాటుగా చీకట్లో రకరకాల అడ్డంకులన్నీ ఎదుర్కొంటూ వెళ్ళే స్త్రీ; కావ్యాలలో నాయకుడిని వెదుకుతూ (సంకేత స్థలానికి) వెళ్ళే నాయికను 'అభిసారిక' అనేవారు; +ఒకే కాన్పులో ఒకటి కంటే ఎక్కువ బిడ్డలు పుడితే వారిని "అమడలు" అంటారు; +examples of fruit varieties of banana అమృతపాణీ, కర్పూరపు చక్రకేళి; వామన చక్రకేళి; పచ్చ అరటి; కొమ్మ అరటి. +రాజు గారి చిన్న భార్య మంచిది" అన్నప్పుడు, పెద్ద భార్య మంచిది కాదు అనే అర్థం స్పురించిడం అర్థాపత్తికి ఒక ఉదాహరణ; +ఛేకా���ుప్రాస occurrence of pairs of consonants repeatedly in close proximity with different meanings. ఉ. కాళింది మడుగున కాళియుని పడగల ఆబాల గోపాల మాబాల గోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి చిత్రం సప్తపది, రచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్, గానం సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం); +వృత్యానుప్రాస occurrence of one or two consonants cyclically. ఉ. అవునే తానే నన్నేనే నిజమేనే అంతా కథలేనే అమ్మో ఎన్నెన్ని వగలోనే, అబ్బ ఏమని చెప్పేనే నీకేమని చెప్పేనే చిత్రం ఒకే కుటుంబం, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం కోదండపాణి, గానం సుశీల); +యమకం occurrence of a word, or a vowel and a consonant, repeatedly with a difference in meaning. ఉ. నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా, వేణువు విందామని, నీతో వుందామని నీ రాధ వేచేనయ్యా రావయ్యా చిత్రం: మల్లెపువ్వు, సంగీతం: చక్రవర్తి రచన: ఆరుద్ర, నేపధ్య గానం: వాణీజయరాం. +Sans శృంగవేరు; ఆర్ర్దక; కటుక; భద్రం +అంజని కరంద" అన్నా ఇదే; ఇనుములా గట్టిగా ఉంటుందని ఆపేరు వచ్చింది. ఇవి వర్షాకాలంలో జూన్, జూలై, ఆగస్ట్ మాసాల్లో పండి మనకి లభిస్తాయి. పూలు కూడా ఊదా రంగులో భలే అందంగా ఉంటాయి. చిన్న పిందేలేమో పింక్ రంగులో ఉంటాయి. అవి నెమ్మదిగా నీలం రంగులోకి మారి, చివరిగా నలుపుకి తిరిగినప్పుడు, పక్వానికి వచ్చినట్టు గుర్తు. తియ్యగా కొంచెం పులుపుగా ఉండే ఈ పళ్ళు అటవీ ప్రాంతాల్లో ఎక్కువ గా లభించేవి. తిన్నాక నేరేడులాగా నోరంతా నీలంగా మారిపోతుంది. +ఈ 'ఽ' గుర్తును 'అవగ్రహం' అంటారు. ఇది సంస్కృత పదాల మధ్య విసర్గ సంధి జరిగినప్పుడు వస్తుంది. సంధి జరిగి అకారం లోపమైనప్పుడు అక్కడ నిజానికి ఒక 'అ' అన్న అక్షరం ఉండేది, సంధివలన అది పోయింది కానీ దానిని ఉన్నట్లుగా భావించి ఉచ్చారణలో కలుపుకోవాలి' అని చెప్పడానికి ఈ అవగ్రహ చిహ్నాన్ని ఉంచుతారు. +జన్మ సంబంధంగా వచ్చిన సంబంధాలను, బంధాలనూ పూర్తిగా విడిచిన వాడు. దేహాభిమానం పూర్తిగా వదిలించుకొని ఎప్పుడూ పరమాత్మ చింతనలో ఉండే వాడు అవధూత. కామ మోహాలు గూడా జయించిన వాడు గాబట్టి శరీర రక్షణకు గూడా ప్రయత్నించడు. వస్త్రాచ్ఛాదన గూడా కోరడు. భోజనాపేక్ష గూడా జయిస్తాడు; +వినాభావం లేకుండా ఉండడం అవినా భావం అది లేకుండా ఉండడం అనేది లేదు" అని అర్థం. ఉదా. చంద్రుడికీ వెన్నెలకూ అవినాభావ సంబంధం అంటే "చంద్రుడు వెన్నెలను విడిచి ఉండడం ఉండదు" అని అర్థం; +యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహా��, ధ్యాన, ధారణ, సమాధి అనే ఎనిమిది అంగములు గల యోగం; +ఇది జపాన్ మరియు చైనా దేశాల కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది; తెల్లగా పల్చటి రేకులు కలిగిన ఈ పుష్పం వర్షం పడినప్పుడు లేదా నీరు తగిలినప్పుడు పారదర్శకంగా మారిపోతుంది. మళ్ళీ ఎండ వేడికి, తడి ఆరినప్పుడు మాములుగా అయిపోతుంది; పొడి వాతావరణంలో ఈ పూల రేకుల్లోని air-liquid interface వద్ద జరిగిన పరావ్ర్త ప్రక్రియ వల్ల ఈ పువ్వులు తెల్లగా కనిపిస్తాయి. నీరు తగలగానే అవి నీటి అంతర్ముఖం (water interface) వద్ద జరిగిన ప్రక్రియ వల్ల పారదర్శకంగా మారిపోతాయి; +అసూయ అంటే తనకు కావలసినంత ఉన్నా ఒకరికున్నదే అని ఏడవడం. దీనివంటిదే ఇంకొకటి ఉంది. అది ఈర్ష్య. +note) నేను చాలా గొప్పవాణ్ణి అనుకోవడం అహంకారం; నేను ఆత్మనే అని తెలుసుకొనడం అహంభావం; అన్నీ నావి అనుకోవడం మమకారం; +note) నేను ఆత్మనే అని తెలుసుకొనడం అహంభావం; +నకులిక mangoose; అహి-నకులిక బంధం పరస్పర విరోధంతో ఎపుడూ ప్రవర్తించే జాతి వైరం. ఒకరిని చూడగనే మరొకరికి అతణ్ణి చంపివేయాలనేటంత కోపం; + + +ఆచంద్రతారార్కం, ఆసేతుహిమాచలం, ఆసాంతం, ఆకుమారకం, మొదలగునవి +ఆపాదమస్తకం పాదం నుండి మస్తకం (తల) వరకు +ఆచంద్రార్కం చంద్రార్కులు ఉండే వరకు. అర్కుడు అంటే సూర్యుడు +ఆజన్మం lifelong; జన్మమంతా. జన్మమంటే జీవితం. +స్వాతి నక్షత్రానికి మరో పేరు ఆణి .చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉన్న రోజున వర్షం వచ్చి ఆ వర్షపు చినుకు ముత్యపు చిప్ప లో పడితే అట్ల తయారయ్యేదాన్ని ఆణిముత్యము అంటారు. +మన ఆలోచనలను మనం వడగట్టి చూసుకోవడం; +మన శక్తియుక్తులను మనమే తక్కువగా అంచనా వేసుకుని క్రుంగిపోవడం; +తన కోసమే చేసేది; ఉదా: చదువుకొను; +--subjective; ఆత్మవలనఁ గలిగినది; మనస్సుకు, శరీరమునకు సంబంధించినది. మనస్సు శరీరముల వలన కలుగు సుఖదుఃఖాదులు; తన బుద్ధి, ఆత్మ, శరీరం ల వల్ల తనకే ఏర్పడే కష్టాలు; ఆధి ఆత్మిక బాధలు. +--physical; phenomenal; materialistic; having to do with the physical world; వ్యాఘ్రసర్పాదుల ద్వారా కలుగు కష్టములు, దుఃఖములు; బయటి జీవుల వల్ల అంటే మృగాలు, పక్షులు, ఇతర మనుష్యుల వల్ల వచ్చే కష్టాలు; +--విపరీతమైన ఎండ, గాలి, అతి వృష్టి, అనావృష్టి, కలరా, మశూచి, కరోనా వంటి — మనతో సంబంధం లేకుండా వచ్చిన కష్టాలు; +ఆపః అంటే నీళ్ళు. అశనం అంటే ఆహారం. నీళ్ళు ఆహారం గా గ్రహించడం ఆపోశనం. భోజన సమయం లో విస్తరిలోని అన్నాన్ని గాయత్రీ మంత్రంతో నీళ్ళు చల్లి సంప్రోక్షణ చేసి, పరిషేచనం చేసి( కొద్ద��� నీళ్ళు వలయంగా విస్తరి చుట్టూ పోసి ఉద్ధరిణెడు నీళ్ళు అరచేతిలో వేసికొని నోటిలో పోసుకొంటారు. ఇది ఆపోశనం. దీని తర్వాత ప్రాణాహుతులు ఉదరంలోని వైశ్వానరాగ్నికి సమర్పిస్తారు తదనంతరం భోజనం చేస్తారు. చివరలో ఉత్తరాపోశనం(ఉత్తర ఆపోశనం అమృతమస్తు ……అంటూ ఉద్ధరిణెడు నీళ్ళు గ్రహిస్తారు. +అచ్చోసిన ఆంబోతు branded bull; ఒకప్పుడు గ్రామాల్లో గోసంపద బాగా ఉన్న కాలంలో ఎవరైనా మోతుబరి రైతు తన మంద లోని ఆరోగ్యకరమైన, బలిష్టమైన, యుక్తవయసులో ఉన్న కోడె గిత్తను ఒక దానిని గ్రామంలో జరిగే ఏదైనా ఉత్సవ సమయంలో మొక్కుబడి చెల్లింపుగా దేవుని పేరు మీద వదిలివేసేవారు. ఆ సందర్భంగా దాని ఒంటి మీద బాగా కాల్చిన ఇనుప అచ్చుతో శంఖ చక్రాల ముద్ర వేసేవారు, అది దేవుని పేరు మీద ఊరి మీద విడిచిపెట్టిన ఆంబోతు అని తెలియడానికి. అప్పటినుంచి ఇక ఆ ఆంబోతుతో దున్నించడం, బండి కట్టడం వంటి ఎటువంటి పని చేయించడం ఉండదు. ఆ ఆంబోతు ఆ ఊర్లో గానీ, ఆ చుట్టూ పరిసర పంటచేలల్లో గానీ తన ఇష్టానుసారం తిరగవచ్చు, మేయవచ్చు దానిని ఎవరూ ఏమీ అనరు. అలా ఆ ఆంబోతు ఆ ఊర్లో యథేచ్ఛగా బ్రతుకుతూంటుంది. ఈ సంప్రదాయం వెనుక గల అసలు ప్రయోజనం ఏంటంటే ఊరివారందరి చేతా ఉమ్మడిగా పోషింపబడే ఆ ఆంబోతు ఆ ఊర్లోని ఆవులన్నిటితోనూ జతకట్టి ఆ ఊర్లో తరువాత పుట్టబోయే ఒక మంచి ఆరోగ్యకరమైన మందకు కారణం అవుతుంది అన్నమాట. తెలుగునాట ఓ సామెత ఉంది. అదే ‘అచ్చోసిన ఆబోతులా తిరుగుతున్నాడని’ అంటూ ఉంటారు. పనీపాటా, భయమూ లేకుండా ఊరి మీద పడి ఆవారాగా తిరిగే వారిని అలా వ్యవహరిస్తుంటారు; +ఒకే పదం అవ్యవధానంగా (టైం గ్యాప్ లేకుండా) పలికితే ఆ రెండవ దాన్ని ఆమ్రేడితము అంటారు. ఎక్కడెక్కడ, ఏమేమి, ఔరౌర, ఆహాహా మొదలైన వాటిలో ఒకే పదం రెండు సార్లు ప్రక్క ప్రక్కన వస్తూన్నది; +జుట్టు కత్తిరించుకోడాన్ని ఆయుష్కర్మ అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా పని చేయరాదు. ముందుగా గడ్డం, ఆపైన మీసం, ఆ తరువాత తలమీద ఉన్న జుట్టూ తీయించుకోవాలి. ఆపైన చేతి గోళ్లు, చివరగా కాలిగోళ్ళు తీయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వరుసను అతిక్రమించరాదు. +--ఈయన రచించిన ఆర్యభటీయం భారతదేశ ఉన్నతిని సూచిస్తుంది. ఆ రచన కనపడలేదు కానీ వరాహమిహార -భాస్కర-బ్రహ్మగుప్త గ్రంధాలలో ఆ సిద్ధాంతం గురించి రాసిపెట్టారు. +2) 1975 లో ప్రయోగించిన భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆ���్యభట; +మే నెల చివరలో తొలకరి వానలకు ముందు ఇవి విపరీతంగా పుట్టుకొస్తాయి కనుక వీటిని May Bugs అని కూడా అంటారు. ఆరుద్ర కార్తె లో పుడతాయి కనుక వీటిని ఆరుద్ర పురుగులు అంటారు. +ఆరె అనగొమ్మలు వేస్తూ పెరిగే అందమైన పొద మొక్క. దీని కొమ్మలు బాగా పక్కలకు విస్తరిస్తూ పెరుగుతాయి. సాధారణంగా ఆరె పొదలు మూడు నుంచి పది అడుగులకు మించి ఎత్తు పెరగవు. అయితే అక్కడక్కడా అనుకూల పరిస్థితులలో అరుదుగా ఇవి ఇరవై అడుగుల వరకూ కూడా ఎత్తు పెరుగుతాయి. ఉత్తర భారత దేశమంతటా సర్వసాధారణంగా, ప్రత్యేకించి హిమాలయాలలో విస్తారంగా కనిపించే ఆరె చెట్లు దక్షిణభారత దేశంలో మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. వేసవిలో నిండుగా పూసే అందమైన పుష్పాల కారణంగా ఆరె చెట్లను పూల తోటలలో పెంచుతున్నారు. +Sans అశమాంతక; చాంద్రక; తాంర పత్రికా; వాలుకా పర్ణ; శ్వేత కాాంచన; +--ఆరోగ్యమంటే “అరోగస్య భావః” అని అర్థం. “నాకేమీ లేదు” అనే అరోగభావనే “ఆరోగ్యం” అన్నమాట; న రోగం అరోగం అరోగస్య భావం ఆరోగ్యం; Heal అయినప్పటి భావమే health. రోగం వచ్చి, ఆపై నయమైనప్పటి స్థితి హెల్త్ అవుతుంది ant అనారోగ్యం; +Sans ఆసురీ; కృష్ణ సర్షప; తీక్షణ గంథా; సుముఖా; సుప్రశస్తా; శోఫహారీ; నిద్రాకరా; దాహకారీ; +ఆషాఢమే భూతిగా సంపదగా) కలవాడు; ఆషాఢం అంటే మోదుగ చెట్టు. వడుగు చేసినపుడు బ్రహ్మచారి కౌపీనం, ఆషాఢం (మోదుగ కర్ర) ధరించి, వేదాధ్యయనం చేయబోతాడు. సంధ్యావందనానికీ, తదనంతర అగ్ని కార్యం చేసేటప్పుడు అది తప్పక దగ్గర ఉండాలి; మోదుగ పుల్ల తప్ప మరేదీ అతడు కోరడు; ఎవరైనా నోట్లో వేలు పెడితే కొరకలేని వాడుగా నటిస్తూ ఉంటే వాణ్ణి "వీడు ఆషాఢ భూతి రా — అంటూ ఉంటారు. +పారశీకంలో హషాష్- hashāsh అంటే తేలికైన, హాస్యము, Joy, exultation, cheerfulness; lightness; soft అన్న అర్థాలున్నాయి. హషామ్+హష్+ఇ హషామాషీ నుండే ఆషామాషీ వచ్చిందని ఊహించవచ్చు هشاش hashāsh); + + +సర్కారీ తుమ్మ Hindi] విలాయతీ కిక్కర్; +Sans హింగు; హింగు నిర్యాసం; సుగంధికం; బాహ్లీకం; రామఠం; అత్యుగ్రం: జంతుఘ్నం; జంతుకం; హృద్యం; శతవేదీ; సహస్రవేదీ; +fogbow శుక్లధనుస్సు; తెల్లటి ఇంద్ర ధనుస్సు; నీటి బిందువుల వల్ల కాకుండా మంచు బిందువుల వల్ల ఏర్పడే తెల్లటి ఇంద్రధనుస్సు; +వీటి పూలను వివిధ రకాలుగా ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. పచ్చి పూలను బాలింతలకు పాలు పడేదానికి వాడుతున్నారు. పూలను వేయించి శ్వాశ్వాసకో వ్యాధులకు, పూలను పాలల్లో కలిపి వ్యంధత్వ నివారణలో, పూలను నేతిలో దోరగా వేయించి పైల్స్ వ్యాధికి వాడుతున్నారు; +Sans మధూక; మాధాకా; మడకం; మహువా; మహ్వా; మొహులో; +--ఇపెకాక్; వెఱ్ఱిపాల; వాంతి చేయించడానికి, దగ్గు తగ్గడానికి కూడా పూర్వం వాడేవారు; ఇప్పుడు వాడుకలో లేదు bot Cephaelis ipecacuanha Carapichea ipecacuanha +ety ఇరు పంది ఇర్పంది ఇబ్బంది; అడవిపందికిని ఊరఁబందికిని పుట్టిన పంది; +--ఇది V ఆకారంలో వున్న బలమైన కొమ్మను పాతిగానీ, లేదా రెండు మూడు రాతి స్థంబాలను దగ్గర దగ్గరగా నాటిగానీ మధ్యనుండి దారి ఏర్పాటు చేస్తారు. అందులోంచి మనుషులు మాత్రమే వెళ్ళగలిగేలా, పశువులు వెళ్ళలేని విధంగా చేసే ఏర్పాటు. +తూర్పు, దక్షిణ భారతంలో వర్షాలు బాగా కురిసే ప్రదేశాల్లో ఈ వృక్షం షుమారు 40 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. కలపను గృహోపకరణాలకువాడుక చేస్తున్నారు, చెట్టునుంచి ఆయుర్వేద వైద్యులు మందులు తయారు చేస్తున్నారు. +Sans శింశుపా వృక్షం; రామాయణంలో సీతమ్మ అశోకవనంలో శింశుపావృక్షం క్రీంద కూర్చొన్నట్లు ఉంది. భేతాళ పంచవింశతి కథల్లో భేతాళుడు శింశుపావృక్షం క్రింద శవంలో ఉండి విక్రమార్కుణ్ణి పరీక్షించినట్లు ఉంది. లలితా సహస్రనామంలో, మరెన్నో ప్రాచీన గ్రంథాల్లో ఈ వృక్షం ప్రస్తావనలున్నాయి. భారతీయులకు ఈ చెట్లు పవిత్ర మైనది. +3) one of the houses in a horoscope; ప్రతీ క్షణమూ రాశిచక్రంలో ఏదో ఒక బిందువు తూర్పున ఉదయిస్తూనే ఉంటుంది. అదే క్షణంలో పడమటి దిక్కున సరిగ్గా దానికి ఎదురుగా (180 డిగ్రీలు ఎదురుగా) ఉండే బిందువు అస్తమిస్తూ ఉంటుంది. అదే క్షణంలో నడినెత్తిన మరొక బిందువు ఉంటుంది. అలాగే దానికి ఎదురుగా మన కాళ్ళకింద (భూమికి అడుగున) మరొక బిందువు ఉంటుంది. తూర్పున ఉదయించే బిందువుకీ నడినెత్తిన ఉన్న బిందువుకీ మధ్య ఉన్న ఆకాశపు భాగాన్ని మూడు సమాన భాగాలు చేసి, అలాగే మిగతా మూడు బిందువులకీ మధ్యనున్న భాగాల్ని మూడేసి సమాన భాగాలు చేస్తే మొత్తం పన్నెండు భాగాలు అవుతాయి. వీటినే భావములు లేక ఇళ్ళు అంటారు. +ఈడవ పొలం అంటే భూసారం, నీటి వనరులేని మెట్టపొలం; +ఈర్ష్య అంటే తనకు లేకుండా ఉండి, ఒకరికి ఉందే అని ఏడవడం; + + +మలబార్ ఉడుత Malabar Squirrel; Indian Giant Squirrel bio Ratufa indica of the Sciuridae family; ఈ ఎగిరే ఉడత ఒక చెట్టు మీదనుంచి మరో చెట్టు మీదికి అలవోకగా ఎగరగలవు; ఈ ఉడతలు ఎత్తైన వృక్షాల మీద సన్నటి చిటారు కొమ్మలపైన తమ గూళ్ళు నిర్మించుకుంటాయి; +ఉడుతలు ఇయోసిన్ యుగం అంటే 56 నుంచి 34 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఉన్న��యి; +పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస తత్వాలు, సనాతన హిందూ భావనలలో, ఆచరణల్లో పరిణామాన్ని (evolution) ని సూచిస్తాయి. పూర్వ మీమాంస తరువాత కాలగమనంలో ఋషుల కొత్త భావనలతో వేద వాంగ్మయం విస్తృతం అయింది. అప్పటికే వున్న బ్రాహ్మణికాలకి కొత్త సంహితలు చేర్చబడ్డాయి. కొత్తగా అరణ్యకాలు ప్రతిపాదించబడ్డాయి. వీటిలో పరబ్రహ్మ స్వరూపం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. అది నిరాకారం నిర్గుణం, నిర్విశేషం అన్న ప్రతిపాదన చేయబడింది. గుణాలూ, రాగ ద్వేషాలు లేనిదానిని సంతోష పెట్టడం ఎలాగ? అలాగైతే కర్మకాండకు అర్థం లేదు కదా. మరి జన్మ రాహిత్యం ఇచ్చే ముక్తి ఎలాగ వస్తుంది? పరబ్రహ్మని తెలుసుకోవడమే మానవజన్మ లక్ష్యం అనీ, అదే ముక్తి అని చెప్పబడింది. ఈ నవ్య ఆలోచనా భాగం ఉత్తర మీమాంస అని ప్రసిద్ధి చెందింది. ఇందులో జ్ఞానానికి పెద్దపీట. ఈ ఉత్తర మీమాంస పునాదులమీద ఉపనిషత్ లు నిర్మించబడ్డాయి.వీటన్నిటి సారాన్ని బ్రహ్మసూత్రాలలో, శ్రీ వ్యాస మహర్షి ఆవిష్కరించారు. +Sans కీశవల్లి, ఉత్తరేణి; అపామార్గము Hin chinchari; +--ఈ మొక్కకున్న వైద్యపరమైన విలువలను గుర్తించి వినాయక చతుర్థి రోజున గణేశపూజకు వాడే 21 రకాల పత్రి మొక్కలలో ఉత్తరేణిని కూడా చేర్చారు. ఈ మొక్క లేత ఆకులను కొందరు ఆకు కూరగా వాడుకుంటారు.ఈ ఆకుల్ని పశువులు, మేకలు ఇష్టంగా తింటాయి. దీని గింజలకున్న సన్నటి నూగు ముళ్ళ కారణంగా ఇవి బట్టలమీద, ఒంటిపైన చిక్కుకుంటాయి. +--ఈ మొక్క ఆకుల రసం శరీరంలోని స్రావాలను అరికడుతుంది. మూత్రాన్ని జారీ కావిస్తుంది. ఈ రసం స్త్రీల ఋతుస్రావాన్ని క్రమబద్ధీకరిస్తుంది. మూల వ్యాధి (పైల్స్)ని, చర్మ రోగాలనూ నివారిస్తుంది. గనేరియా, ఉబ్బసం, కుష్ఠు వంటి మొండి వ్యాధులను నయం చేస్తుంది. దీని వేళ్ళను మెత్తగా నూరి కళ్ళలో పెట్టుకుంటే చూపు మందగించినవారికి ఎంతో ప్రయోజనకరం. ఈ వేళ్ళ కషాయం తాగితే ఉదర కోశ సంబంధమైన వ్యాధులు, మూత్ర పిండంలోని రాళ్లు నివారణ అవుతాయి. +డబ్బు ఇయ్యకుండా వెచ్చాలు కొని తెచ్చుకుని తరువాత చెల్లించే పద్ధతి; పద్దులో రాయించుకుని తెచ్చుకోవడం; +note] ఉద్దేశం cause అయితే ఉద్దేశ్యం effect; ఉద్దేశము అభిలాష అయితే ఉద్దేశ్యము అభిలాషకు విషయమైన వస్తువు. పండు తినడం ఉద్దేశమైతే, పండు ఉద్దేశ్యము అన్నమాట; +note] ఉద్దేశం cause అయితే ఉద్దేశ్యం effect; ఉద్దేశము అభిలాష అయితే ఉద్దేశ్యము అభిలాషకు విషయమైన వస్తువు. పండు తినడం ఉద్ద��శమైతే, పండు ఉద్దేశ్యము అన్నమాట; +ఉభయకుశలోపరి మేము క్షేమం, మీరూ క్షేమం అనుకొంటాను" అని యోగ క్షేమ విచారణ చెయ్యడం; +ఈ జాతి గడ్డిలో అరుగుదల అయ్యే ముడి ప్రాణ్యములు (Digestible Crude Proteins) చాలా ఎక్కువ శాతంలో ఉండటంవల్ల పశువుల మేతగా ఉప్పుగడ్డి శ్రేష్ఠమైనది. అయితే ఉప్పుగడ్డి యొక్క పోషక విలువలు అది కంకులు వెయ్యక ముందే ఎక్కువగా ఉంటాయి; కలుపు నివారణకు గ్లైసెల్ వంటివి చల్లితే గాని ఈ ఉప్పు గడ్డి చావదు. ఈ ఉప్పుగడ్డి ఎంత మొండిదంటే ఒకసారి పుష్పించిన తరువాత వెనువెంటనే దాని విత్తనాలు త్వరత్వరగా అంతటా వెదజల్లబడతాయి. కలుపుమందు +ప్రభావానికి ఇప్పుడు ఉన్న ఉప్పుగడ్డి మొత్తం చచ్చిపోయినా, అంతకుముందే జరిగిన విత్తనవ్యాప్తి కారణంగా ఆ తరువాత వెంటనే కొత్త మొక్కలు మొలుచుకొస్తాయి; +నీలం, వయొలెట్ వర్ణపు గొట్టం పూలతో ఆకర్షణీయంగా ఉండే ఈ మొక్క యొక్క దాదాపు అంగుళం పొడవుండే ఎండు కాయలను నోట్లో పెట్టుకుంటే ఠాప్మంటూ నోట్లోనే పేలి గింజలను వెదజల్లుతాయి. ఎండి నల్లగా అయిన కాయలు తడి తగిలితే టపాకాయలలా పేలి గింజలను వెదజల్లుతాయి కనుక ఈ మొక్కలను ఉమ్మి టపాకాయల మొక్కలు అంటారు; +నవధాన్యాలలో ఉలవలు ఉన్నాయి; పది గ్రామ్య ధాన్యాలలో ఉలవలు ఉన్నాయి; +--ఆఫ్రికాలో ఉండే ఎగరలేని పెద్ద పక్షి; ఎగరలేని పక్షిజాతులు 40 దాకా ఇంకా భూమిమీద ఉన్నాయి. న్యూజిలాండ్ లో కనిపించే కివి (Kiwi) పక్షులు, ఆస్ట్రేలియాలో కనిపించే ఈమూ (Emu) పక్షులు, దక్షిణ అమెరికా ఖండంలో కనిపించే రియా (Rhea) పక్షులు, ఈశాన్య ఆస్ట్రేలియాలోనూ, న్యూ గినీ పరిసర దీవులలోనూ కనిపించే కసావరీ (Cassowary) పక్షులు, ఒకప్పుడు న్యూజిలాండ్ లో జీవించి, ఆ తరువాత అంతరించిపోయిన మోవా (Moa అలాగే ఆఫ్రికాలోని మడగాస్కర్ దీవిలో జీవించి అంతరించిన ఎలిఫెంట్ బర్డ్స్ (Elephant birds) కూడా ఎగరలేని పక్షులే; +--officinalis అంటే ఉపయోగపడేది, విపణివీధిలో దొరికేదీ అని అర్థం; Phyllanthus (phillon antos) అంటే చిరు కొమ్మల చివర పూలు పూసేది అని అర్థం; +చ్యవనప్రాశ ఉసిరి దశమూలాలు కర్కాట శృంగి అగరు కరక్కాయ తిప్ప తీగ కచ్చూరాలు యష్టి మధుకం వస అశ్వగంధా శతావరీ అభ్రకం భస్మం నెయ్యి a popular Ayurvedic tonic; +తీగలు సాగుతూ పెరిగే ఈ ముళ్ల పొదమొక్కకు ఒళ్ళంతా ముళ్లే. కాండం మీద మాత్రమే కాక ఈ మొక్క ఆకుల మీదకూడా మెలితిరిగిన కొక్కెం ముళ్లు ఉంటాయి. అనుకూల పరిస్థితులలో రెండు మీటర్ల ఎత్తు వరకూ కూడా ఈ పొదలు పెరుగుతాయి. ఈ పొద ఆకులు త��రిభుజాకారంలోనూ, డెల్టా ఆకారంలోనూ ఉంటాయి. ఈ ఆకులను నీడలో ఆరబెట్టి లేక నేతిలో వేయించి పొడి కొట్టి నిల్వచేసుకుంటారు. సాధారణమైన జలుబు, దగ్గులకు, జ్వరాలకు ఈ పొడి బాగా పనిచేస్తుంది. ఈ ఆకులను పొడిచేయబోయే ముందు వాటి మీద ఉండే విషతుల్యమైన ముళ్ళను తొలగించాలి. లేత వంగపండు రంగులో ఉండే ఈ మొక్క పూలు అచ్ఛం వంగపూలలాగే ఉంటాయి. గుండ్రంగా, చిన్నవిగా, గుత్తులుగా కాసే ఈ మొక్క కాయలు పండితే చూసేందుకు రక్తవర్ణంలో చిట్టి టొమాటోలలాగా అనిపిస్తాయి. చేదుగా ఉండే ఈ మొక్క వేళ్ళ కషాయం లేక చూర్ణం, దీని పూలు, కాయల రసం దగ్గు నివారణకు బాగా పనిచేస్తాయి; +ముండ్ల ముష్టి; అలర్క పత్రము; ఉచ్చింత; కొండ ఉచ్చింత; ఉస్తి, ఉస్తె అన్నీ ఒకటే; +Sans అలర్క; అగ్నిదమ; వల్లీ కంటకారికా; +వానలు కురిసే సమయాల్లో ఒక్కోసారి వీటి పుట్టలు పూర్తిగా తడిసిపోయి వాసయోగ్యంగా లేకుండాపోయిన కారణంగా ఇసుళ్లు లేక ఉసుళ్ళు తమ పుట్టలలోంచి బయటికి వచ్చి రాత్రిళ్ళు విద్యుద్దీపాల వద్దకు ఎగురుకుంటూ వస్తాయి. అవి దీపాల కాంతికి ఆకర్షించబడినా, ఆ వేడికి వాటి రెక్కలు కాలిపోయి అవి ఎగరలేక కిందపడి పోతాయి; +ఉసురు అంటే ఊపిరి, ప్రాణం; ఏదైనా చేయగూడని పెద్ద అపకారం చేస్తే వాడి ఉసురు కొడుతుంది జాగ్రత్త" అంటాం. వాడు తన అశక్తత వల్ల ఏమీ చేయలేక పోయినా వాడి ప్రాణశక్తి పనిచేసి నీ ప్రాణం తీస్తుంది, అని అర్థం; +మామిడికాయలతో ఆవకాయ, నిమ్మ పళ్ళతో నిమ్మకాయ, దబ్బకాయ, వగైరాలు ఊరగాయలు. ఊరుతుంది కనుక ఊరగాయ, బాగా మాగుతుంది కనుక మాగాయ పచ్చడి అప్పటికప్పుడు బండమీద నూరుకొనో, రోటిలో దంచుకొనో తినేది; పచ్చళ్ళు నాలుగైదు రోజులు నిల్వ వుంటాయి. +ఊసరవెల్లులలో 202 జాతులున్నాయి. వెయిల్డ్ కెమెలియన్ (Veiled Chameleon జాక్సన్స్ కెమెలియన్ (Jackson's Chameleon పాంథర్ కెమెలియన్ (Panther Chameleon) వీటిలో చెప్పుకోదగినవి; +గ్రీకు భాషలో 'ఖమాయ్ khamai) అంటే నేలమీద' అనీ లియోన్ leon) అంటే 'సింహం' అనీ అర్థాలు కనుక ఇది 'నేలమీది సింహం + + +--ఎరిణమ్మ/ ఎనెమ్మ/ ఎన్నెమ అనే పేర్లతో వ్యవహరించే ఒక భూతం పురిటిలో పిల్లలను చంపుతుందని ఒక (మూఢ) విశ్వాసం కొన్ని చోట్ల ఉంది; ప్రజలు తమను సరిగా ఆరాధించని పక్షంలో వారి పురిటి బిడ్డలను చంపడానికి మాతృగణ దేవతలకు కుమారస్వామి అనుమతి ఇచ్చినట్టు భారత గాథ; +Sans సర్వదా; సదా; కదాచిత్; కదాపి; సతతం; నిత్యదా; అనిశం; అనవరతం; నిరంతరం; సర్వక్షణే; +ఎనిమిది మీటర్ల (ఇరవయ్య���రు అడుగులు) వరకు పెరిగే మొక్క. దక్షిణ తూర్పు కనుమలు ఈ మొక్క పెరగటానికి ఎక్కువ అనువైన వాతావరణం. మొత్తం దక్షిణ భారత దేశమంతటా ఇది కనిపించినా శేషాచలం అడవులు దీనికి బాగా ప్రసిద్ధి. ఎర్ర చందనం పెరగటానికి మట్టిలో స్ఫటిక శిల (Quartz) ఉండాలి. అలాగే వాతావరణ పరిస్థితులు కూడా సరిపోవాలి.ఈ మొక్క అంతరించే ప్రమాదం ఉన్నదిగా ప్రకటించారు. తర్వాత 2018 లో “అపాయం అంచున ఉన్నవి” (nearly threatened) గా దీన్ని మార్చారు. +గ్రీకు భాషలో ‘glis’(గ్లిస్) అంటే ‘ఎలుక' అనీ, ‘cida’(సిడా) అంటే ‘killer’ (చంపేది) అనీ అర్థాలు; ‘సెపియం’ అంటే ‘కంచెమొక్క’ అని అర్థం. మొత్తం మీద దీని అర్థం "ఎలుకలని చంపే కంచె మొక్క" అని; వీటి కాయలలోని గింజలని బియ్యంతో కలిపి నూరిన పిండిని ఎలుక కన్నాలలో వేస్తే వాటిని తిని ఎలుకలు చచ్చిపోతాయి; కనుకనే దీనికి ‘ఎలుక చంపు చెట్టు’ అని పేరు వచ్చింది; +నేల పొన్న; నేల తంగేడు; స్వర్ణపత్రి; భూమిచారి; +ఎలుఁగుబంటి అనేది విశేషణమే (adjective) తప్ప నామవాచకం (noun) కాదు; ఎలుఁగు గొంతుక/ గొంతు; బంటి వరకు ఉన్నది గొంతు వరకు మోము కలిగినట్టిది; ఎలుఁగుబంటిని చూస్తే దానికి మెడే ఉన్నట్టు తోచదు. మెడా, మొండెమూ కలిసిపోయినట్లు ఉంటుంది; +ఒకే సారి పుట్టిన కవలలలో రెండు రకాలుంటాయి. ఒక అండం, రెండుగా విడిపోయి, రెండు శుక్ర కణాలతో సంయోగం చెందితే, అలా ఏర్పడ్డ పిల్లలని, ఏక సంయుక్త బీజ కవలలు అంటారు. ఇక్కడ పుట్టిన పిల్లలు, ఒకే లింగం కలిగి, ఇరువురు, ఎక్కువ పోలికలతో కనిపిస్తారు. ఇలా కాకుండా ఒకే సమయంలో రెండు అండాలు, రెండు శుక్ర కణాలతో, సంయోగం చెందితే, అప్పుడు ఏర్పడ్డ సంతానాన్ని, ద్విసంయుక్తబీజ కవలలు అంటారు. ఇక్కడ వేర్వేరు లింగాలు, తక్కువ పోలికలు కనిపిస్తాయి; +ఆల్ స్టన్ అనే శాస్త్రవేత్త పేరిట దీనిని అలా పిలుస్తున్నారు. ఒకప్పుడు ఈ వృక్షాల కలపను బడిపిల్లలు రాసుకునే పలకలు తయారు చేయటానికి వాడేవారట. అందుకే దీని శాస్త్రీయ నామంలో స్కాలరిస్ (scholaris) అనే శబ్దం వచ్చి చేరింది; +ఏతాము; see also మోటబావి; దిగుడు బావి; +అనాది; యానాది; గిరిజన తెగ నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. వీరు పుట్టలు పొడిచి పాములనుచంపి, ఉసిళ్ళు లేక ఇసుళ్ళను, ఎలుకలు, పందికొక్కులవంటి rodents ని తింటారు; యానాదులు అనాదిగా పాములను చంపుతూ, వాటిని తింటూ నాగజాతి వారుగా, ఖాళీ పుట్టలలో నివసిస్తూ Mound Dwellers గానూ పేరొందారు; +--sausage tree bot Kigelia pinnata హస్తి మేఢ్రపు చెట్టు; ఈ చెట్టు కాయలు ఏనుగు పురుషావయవాన్ని పోలి ఉండే కారణంగా దీనికాపేరు వచ్చింది; +ఆమడ/నాలుగు కోసులు (8 మైళ్ళు) కన్న ఎక్కువ దూరం ప్రవహించే ఏటిని నది అంటారని నిఘంటువులో వివరణ. +ఏరు, సెలయేరు అనేవి ఎత్తైన ప్రదేశంనుండి పల్లపుప్రదేశంలోకి ప్రవహించే నిరంతర నీటిప్రవాహం. ఏరుకూ సెలయేరుకూ గల తేడా ఏమిటంటే సెలయేరు అనేది కొండలమీదనుండి, గుట్టలమీదుగా జలజలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి ఏ నదిలోనో ఉపనదిలోనో కలసిపోయేది. మిగిలిన వాటికి దీనికి ఉన్న ప్రత్యేక భేదం ఏమిటంటే సెలయేరు చేసే ఆహ్లాదకరమైన 'గలగల' శబ్దం. +ఏరు అంటే దున్నడానికి సిద్ధంగా ఉన్న నాగలి. ఏరువాక అంటే దున్నడానికి మొదలయే సమయం; ఆషాడ మాసం అనేది వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే సమయం. ఆషాడ మాసం పక్షం రోజులు ముందే జ్యేష్ట పౌర్ణమిని ఏరువాక పున్నమిగా పిలుస్తారు. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం; అపుడే దుక్కి దున్నడం మొదలు పెడతారు; +పచ్చవి పచ్చిగా ఉన్నప్పుడే సేకరించి ఎండబెడతారు. నల్లవి పండేదాక ఆగి మంటమీద వేడి చేస్తారు. నల్లవి తీపి వంటకాల్లో ఎక్కువ వేస్తారు. దాన్లో ఉన్న పొగ రుచి, మెంతాల్ ఫ్లేవర్ అందుకు సరిపోతుందిట. పచ్చవి పైన తోలు వలిచి గింజలు నలగగొట్టి వాడుకుంటే, నల్లవి మొత్తం కాయ అంతా వాడుతారు. +Sans ఏలా; సూక్ష్మ ఏలా; స్థూల ఏలా; తృటీః; ద్రావిడీ; త్విషా; +astrol జన్మ రాశి నుంచి 12, 1, 2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని దీనిని ఏలినాటి శని అంటారు. +శని జన్మరాశిలో (అంటే శని ఒకటో స్థానంలో) సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలపనిందలు, భాగస్వాములతో వివాదాలు, మనశ్సాంతి ఉండకపోవడం, ధనవ్యయం, రుణబాధలు,వృత్తి-ఉద్యోగం-వ్యాపారంలో చికాకులు, స్థానచలన సూచన ఉంటుంది. శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, మందులు వాడకం, తరచూ ప్రయాణాలు ఉంటాయి; శని రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు అనుకున్నట్టే అనిపిస్తాయి కానీ ఏదీ పూర్తికాదు. అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తాడు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన ఉంటుంది. +ఐక్యత సరి అయిన ప్రయోగం కాదు; + + +ఉద్ధతత్వము; ఏపు; బలుపు; అతిశయము; గర్వము; పొగరు; పొగరుబోతుతనం; +తనకూ, తన ధర్మ పత్నికీ ప��ట్టిన వాడు; +ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, క్రీతుడు, స్వయం దత్తుడు, మొదలైన 8 విధాల సంతానాలను మనుస్మృతి చెప్పింది; + + +పెద్దగా ఉపయోగం లేని పని, బండ చాకిరి లాంటిది చేసి దాని నుండి ఏమాత్రం లాభం, ఫలితం లేకపోతే అలాంటిదాన్ని "కంచి గరుడ సేవ" అని అనడం జనవ్యవహారం లోకి వచ్చింది. +గ్రీకు భాషలో ‘ఎమార్ఫోస్' అంటే ‘ ఒక నియమిత ఆకారం లేని' అని అర్థం. ‘గంట ఆకారంలో ఉన్న’ దీని పుష్ప గుచ్ఛాన్ని బట్టి దీనికి ‘కాంపాన్యులేటస్’ అనే పేరు వచ్చింది; +కందలో తీట కంద, తియ్య కంద అని రెండు రకాలున్నాయి. తీట కంద గడ్డ (Corm) అర్ధ గోళాకారంలో, ముదురు గోధుమ వన్నెలో నున్నగా ఉంటుంది. దాన్ని చిన్నచిన్న ముక్కలుగా కోసి నేలలో పాతిపెడితే ప్రతి ముక్క నుంచి మొక్క మొలుస్తుంది. తీట కందలోని దురద దాన్ని ముక్కలు కోసి నీళ్ళతో వండి పారవంచితే పోతుంది. అప్పుడే తవ్వి తీసిన తీట కంద గడ్డలు మరింత దురదగా ఉంటాయి. వాటిని కొంతకాలం నిల్వ ఉంచితే వాటిలోని దురద కొంతమేరకు తగ్గుతుంది.ఇక తియ్య కంద గడ్డకు మొత్తం ఒళ్లంతా కాయల్లా చిన్న గడ్డలుంటాయి. ఈ చిన్న గడ్డల్ని పిల్ల గడ్డలు (Cormels అంటారు. పాతిపెట్టిన ఇలాంటి ప్రతి చిన్న గడ్డ నుంచీ ఒక తియ్య కంద మొక్క మొలుస్తుంది. +కంద దుంపలో ఉండే కాల్షియం ఆగ్జలేట్ (Calcium Oxalate) అనే రసాయనిక పదార్ధం కారణంగా పచ్చి కంద తింటే, నోటిలోనూ గొంతులోనూ విపరీతమైన వికారంతో కూడిన దురద వస్తుంది. తియ్య కందలో ఈ దురద కలిగించే స్వభావం తక్కువగా ఉంటుంది. తీట కందలో దురద ఎక్కువ. ఇక అడవి కందలోనైతే దురద విపరీతం; +Sans సూరణ అర్శోఘ్న తీటకంద; తియ్యకంద; వజ్రకంద; వనకంద +ety కచ్చ అడ్డం కచ్చకి అడ్డంగా ఉన్నది; +1 a cash gift కట్నం' అన్నది ఒక కానుక లేక బహుమతి. సాధారణంగా తక్కువ స్థాయిలో ఉన్నవారు ఎక్కువ స్థాయిలో ఉన్నవారికి సమర్పించుకొనేది కట్నం. సామంత రాజులు చక్రవర్తికి, ఉద్యోగులు అధికారికి ఇచ్చే బహుమతిని కట్నం అనొచ్చు. అలాగే పెళ్లికూతురి తండ్రి వరునికి ఇచ్చుకొనే సొమ్ము, కానుకలు 'వరకట్నం' అయింది; కనుక వరకట్నం ఎంత ఇచ్చినా అది ఆ మగవాడి 'ఎంటైటిల్మెంట్' అవుతుంది కానీ అతడు అమ్ముడు పోయినట్లు కాదు; see also శుల్కం; +పారశీకంలో కమాయిష్- అంటే వ్యవహారము. వ్యవహారము నిర్వహించుట. అదే తెలుగులో కమాయిష్షు, కమామిషు అయ్యింది کمایش kamāyish, Affairs, business; the management of affairs); +కథ సంస్కృతంలోని కథం-/కథా- అంటే 'ఎందుకు ఎట్లా అన్న ప్రశ్నార్థక శబ్ద�� నుండి వచ్చింది. సంస్కృతంలోనూ, ప్రాకృతంలోనూ మాట్లాడడానికి (conversation చర్చకు, కథకు (story) ఈ పదాన్ని వాడినా, తెలుగులో ఇది స్టోరీ అన్న అర్థంలోనే స్థిరపడిపోయింది. +కథా కమామీషు అంటే, కథ, వ్యవహారం ఎంతదాకా వచ్చింది అని వాకబు చేయడం సురేశ్ కొలిచాల); +కపాల మోక్షం శిరస్సు పై భాగం లో చిన్న బిడ్డపుడు మెత్తగా ఉండి క్రమంగా గట్టిబడి పోయె భాగం కపాలం; దాన్ని భేదించుకొని ప్రాణోత్క్రమణం ఐతే మోక్షం పొందాడు అంటాము; +1) encroachment; possession by force స్థిరమైన ఆస్తి సంబంధంగానే దీనికి ప్రయోగం; ఈ భూమి పదేళ్లనుండీ నా కబ్జాలో ఉంది. +మూత్రపిండాల పనితీరులో లోపాలున్నవారు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు స్టార్ ఫ్రూట్స్ తినకూడదు. తింటే వాటిలోని కరంబాక్సిన్ (Caramboxin ఆగ్జాలిక్ యాసిడ్ (Oxalic Acid) కారణంగా వారి ఆరోగ్యానికి మరింత చెడు జరుగుతుంది; +see also కారయిత, ప్రేరకుడు, అనుమోదకుడు; +కరివేప ఆకులలో కాల్షియం, ఫాస్ఫరస్, పీచు పదార్ధం, విటమిన్- ఎ, విటమిన్- సి పుష్కలంగా ఉన్నందున అవి ఆహారపరంగా విలువైనవి. కరివేప ఆకులను డిస్టిలేషన్ చేసి కర్రీ లీఫ్ ఆయిల్ అనే నూనె తయారుచేస్తారు. ఈ నూనెను సబ్బుల తయారీలో వినియోగిస్తారు. కరివేప చెట్టు వేళ్ళు, కాండం బెరడు, ఆకులు వైద్యపరంగా విలువైనవి. ఇవి శరీరపు కాకను తగ్గించి చల్లబరుస్తాయి. జ్వరాలనూ, కడుపులోని క్రిములను పోగొట్టి, పొట్టలోని గాస్ ను వెడలించి, ఆకలి పుట్టిస్తాయి. నొప్పులు, వాపులు పోగొడతాయి. కుష్ఠు, ప్రూరిటస్, ల్యూకోడెర్మా వంటి మొండి చర్మవ్యాధులకు కరివేప దివ్యౌషధంగా పనిచేస్తుంది. భోజనంలో ముందుగా కొద్ది అన్నంతో కరివేప కారం నెయ్యి వేసుకు తింటే కడుపు ఉబ్బరం, అగ్నిమాంద్యం, నోటి అరుచి తగ్గిపోయి ఆకలి పెరుగుతుంది. కరివేప పచ్చడి నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలను అరికడుతుంది. కరివేపాకు పచ్చడి వాంతులను, వాపులను పోగొడుతుంది. మూత్రపిండాల వాపులు, నొప్పులను కరివేప వేళ్ళ రసం పోగొడుతుంది. కరివేప మాను చెక్క అరగదీసి రాస్తే ఒంటిమీది పొక్కులు తగ్గుతాయి. కరివేప పళ్ళు నల్లగా, రుచిగా ఉంటాయి. దాహాన్నీ, రక్తపైత్యాన్నీ అవి పోగొడతాయి. +కర్పూరం చెట్టు 40 మీటర్ల ఎత్తు పెరిగి, వెయ్యేళ్ళు దాకా బతికే, సతత హరిత మొక్క. ఇది టర్పెనాయిడ్ అనే రసాయనంని తయారు చేస్తుంది. +కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చ���ర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. +హారతి కర్పూరం పొరపాటన తింటే చాలా ప్రమాదం. చిన్నపిల్లలకు అతి తీవ్ర సమస్యలు వస్తాయి. మనం తినే లడ్డు లో, పాయసం లో, తాంబూలంలో కూడా పచ్చ కర్పూరం వేసుకుంటాం. +కర్పూరంలో పదిహేను రకాలు (జాతులు) ఉన్నాయి. అవి: 1. ఘన సారం, 2. భీమసేనం, 3. ఈశావాసం, 4. ఉదయ భాస్కరం, 5. కమ్మ కర్పూరం, 6. ఘటికం, 7. తురు దాహం, 8. తుషారం, 9. హిమ రసం, 10. హారతి, 11. శుద్ధం, 12. హిక్కరి, 13. పోతాశ్రయం, 14. పోతాశం, 15. సితా భ్రం +పటికబెల్లము; కండచక్కెర; కండ; ఖండశర్కర, మధుశర్కర; పులకండము; ఇసుకపులకండము; మత్స్యందిక; +రాకాసి కలబంద; పెద్ద కలబంద; చిన్న కలబంద; ఈనెల కలబంద; +2) catchu; తుమ్మ గణమునకు చెందిన నల్లచండ్ర లేక కాచుతుమ్మ (Acacia catechu) అను చెట్టు యొక్క చేవకఱ్ఱ నుండి తీసిన ద్రవ్యము; +తపసి వృక్షం యొక్క తెల్లని కాండం మీద గాట్లు పెడితే వాటి నుంచి ఈ తెల్లటి జిగురు స్రవిస్తుంది. ఈ జిగురును గమ్ కరాయా అనీ కడాయా అనీ కటీరా అనీ అంటారు. మెత్తటి శుభ్రమైన ఈ జిగురును చాకొలెట్లు, చూయింగ్ గమ్స్ తయారీలో వినియోగిస్తారు. దీనికి ఔషధపరమైన విలువలూ ఉన్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర సుగంధ సోడా అమ్మే బండ్లలో కటీరా గమ్ ను 'కఠోరా అనే పేరుతో శీతల పానీయాలలో కలుపుతారు. మనం కటీరా కలిపిన పానీయం తాగగానే మనకు కళ్ళు చల్లబడి ఒక చల్లటి అనుభూతి కలుగుతుంది; +కసివింద Sans కాసమర్ద; కాసారి; సంస్కృతంలో దీని పేర్లు బట్టి ఇది ప్రధానంగా దగ్గు (కాస)ను నయంచేసే స్వభావం కలిగి ఉంటుందని గ్రహించవచ్చు; +note 1] పునుగు పునుగు పిల్లి లేక మార్జారిక (Civet Cat) అనే జంతువు నుంచి సేకరించే సుగంధద్రవ్యం. దీనినే జవాది, జవాజి, జవ్వాజి, జవ్వాది, సంకు మదము అనే పలు పేర్లతో పిలుస్తారు. వేంకటేశ్వరునికి నిత్యం చేసే అలంకరణలలో సంకుమదం అలదడం కోసం తిరుమల కొండలమీద పునుగు పిల్లుల్ని ప్రత్యేకంగా పెంచుతారు. +note 2] చట్టము అన్నా పునుగు చట్టము అన్నా పునుగు పిల్లి శరీరంలో ఉండే ఒక గ్రంథి లేక సంచి. దీనిని పిండి, పునుగు అనే సుగంధ ద్రవ్యాన్ని సేకరిస్తారు. +note] హరిణమదము ఇర్రి లేక కురంగము అని పిలువబడే కస్తూరి మృగం (ఒక జింక) నుంచి నుంచి సేకరించే కస్తూరి అనే సుగంధ ద్రవ్యం; చైనా, రష్యా, మధ్య ఆసియా, భారతదేశం ప్రత్యేకించి అస్సాం రాష్ట్రాలలోని పైన్ అడవుల (Pine Forests లో కస్తూరి మృగ��లు కనిపిస్తాయి. హిమాలయాల్లో 8,000 అడుగుల ఎత్తున ఉండే చొరరాని పైన్ అడవులు కస్తూరి మృగాల ఆవాసాలు. ఇవి జతకూడే ఋతువు (Rutting Season)లో ఆడ కస్తూరి మృగాలను ఆకర్షించడం కోసం మగ కస్తూరి మృగం నుంచి వెలువడే ఈ పరిమళ ద్రవ్యం యొక్క సువాసన తోడ్పడుతుంది. మగ కస్తూరి మృగం వృషణాలనుంచి తయారయ్యే ఈ ద్రవ్యాన్ని ఆ మృగం దాదాపు రెండు అంగుళాల వ్యాసం కలిగిన ఒక కోశము (సంచి)లో నిల్వచేసుకుంటుంది. కస్తూరిలో ఉండే అమ్మోనియా, ఓలీన్ (Oleine కొలెస్టరిన్ (Cholesterine) వంటి గాఢమైన వాసన కలిగిన ద్రవ్యాల కారణంగా కస్తూరికి అంత చక్కని పరిమళం వచ్చింది. కస్తూరి ద్రవ్యానికి పరిమళం కలకాలం నిలిచి ఉండటమే కాదు. అది అలదుకున్నవారిని కూడా ఆ పరిమళం అత తేలిగ్గా వదలిపోదు. అందుకే కస్తూరికి పరిమళద్రవ్యంగా అంతటి ప్రాముఖ్యం ఏర్పడింది. +కస్తూరిలో మూడు ముఖ్యమైన రకాలున్నాయి. కామరూప దేశం అంటే అస్సాం లో లభించే కస్తూరి ఘాటైన పరిమళం కలిగి నల్లని రంగు కలిగి ఉంటుంది. దీనిని కాల కస్తూరి లేక కృష్ణ కస్తూరి అంటారు. ఇది మిగిలిన రెండు రకాలకంటే ఎంతో ప్రశస్తమైనది, ఖరీదైంది కూడా. నీలవర్ణం నలుపుల మిశ్రమ వర్ణంలో ఉండే నేపాళ కస్తూరి పరిమళంలో రెండవ తరగతికి చెందినది. ఇక మూడవదైన కాశ్మీర కస్తూరి పరిమళంలో తక్కువ స్థాయికి చెందినట్టిది. రష్యన్ కస్తూరి చాలా బలహీనమైన పరిమళం కలిగి ఉండే కారణంగా దానిని పరిమళ ద్రవ్యంగా గుర్తించరు. +క్షత్ త్రియుడు క్షతముల నుండి త్రాణ (అంటే రక్షణ) చేసేవాడు; తన ప్రజలను ఇతరుల నుండి రక్షించే వాడు; +ఒకే చాంద్రమాసములో రెండు సూర్య సంక్రమణములు ఉన్నచో దానిని క్షయమాసం అంటారు; +పొదలు పొదలుగా పెరిగే ఈ మొక్కలు ఒక మీటరుకు మించి ఎత్తు పెరగవు. కాండం పొడవునా నిలువుగా గాళ్ళు (Longitudinal Grooves) ఉంటాయి. ఆకులు ఒక క్రమ పద్ధతి లేకుండా చీలి ఉంటాయి. వాటిపై మెత్తటి నూగు (soft down) ఉంటుంది. చివళ్ళలోనూ, కణుపులవద్దనూ పూలు వస్తాయి. అవి 5 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి, తెల్లగా ఉంటాయి. కాయలు ముదురు గోధుమరంగులో ఉంటాయి. +బలవర్ధకమైనది (tonic) గా, జ్వరహారిణి (febrifuge) గా, బహిష్టు స్రావాన్ని కలిగించేది (emmenagogue) గా ఈ మొక్క కి పేరుంది. ఈ మొక్క వేళ్ళ కషాయం నరాల నొప్పులు (neuralgia) నివారిస్తాయి. ఈ మొక్కలో పార్థెనిన్ (Parthenin) అనే ఒక చేదు గ్లైకోసైడ్ (glycoside కొన్ని ఆల్కలాయిడ్లు (alkaloids) ఉన్నట్లు కనుగొన్నారు. +ఈ మొక్కను పలు ప్రాంతాల్లో పలు పేర్లతో పిలుస్తున్నారు. ���ీని పూలు ముక్కుపుడక లేక ముక్కుపోగు లేక నత్తు ను పోలి ఉండే కారణంగా ఈ మొక్కను "ముక్కుపుడకల మొక్క" అనీ ముక్కుపుల్లల మొక్క" అనీ కూడా అంటున్నారు వయ్యారిభామ" మరొక పేరు; +ఆగాకర memordica diioica; లేటిన్ లో డయోయికా అంటే ఆడ, మగ మొక్కలు వేర్వేరు అని అర్థం; +కాకి (crow) భారత ఉపఖండంలో కనపడేది రేవెన్ కన్నా)చిన్న పరిమాణంలో ఉంటుంది; ప్రధానంగా ముక్కు, తలలో కొంత భాగం, రెక్కలు నలుపుగా ఉండి, మెడ, పృష్ట భాగం, బూడిద రంగులో కనిపిస్తుంది. దీన్ని "శ్రీలంక కాకి" అనికూడా పిలుస్తారు, ఇంకో పేరు "బూడిద రంగు మెడ కాకి" +రేవెన్ raven Corvus corax ఇది ఎక్కువ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరోపు, అమెరికా దేశాల్లో ఎక్కువ కనపడుతుంది. హిమాలయాల్లో కూడా ఉంది. పరిమాణంలో పెద్దది; శరీరం మొత్తం నలుపే దీనికి. పెద్ద రెక్కలు ఉండటం, పరిమాణంలో కుడా పెద్దది అవటం మూలాన గుర్తు పట్టడం సులభమే. +శోకభయాదులచేత కలుగునట్టి ఒక విధమైన ధ్వని భావ ద్యోతకానికి ఉచ్చారణలో చూపే ఒడుపు; ఒక భాషా సామర్ధ్యం ఆ భాషలోని కాకువులు ద్వారా తెలుస్తుంది అంటారు విశ్వనాథ సత్యనారాయణ +--కానుగ గింజలలో 27 నుంచి 39 శాతం వరకు లభించే కొవ్వు (Pongam oil)కు పారిశ్రామికంగానూ, వైద్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలున్నాయి. పచ్చి తోళ్ళను ఊనిన తరువాత ఈ నూనెను డ్రెస్సింగ్ గా వాటిపై రాసేందుకు ఉపయోగిస్తారు. పరిశ్రమలలోనూ, వాహనాలకూ ఈ నూనెను కందెన(lubricant)గానూ ఉపయోగిస్తారు.నూనె దీపాలలోనూ, సబ్బుల తయారీలోనూ కూడా గానుగ నూనె వాడతారు. గ్రామాలలోని గానుగలలో కానుగ గింజల్ని ఆడించి తీసే నూనెను దీపపు నూనెగానూ, కందెనగానూ, డీజిల్ ఇంజన్లలో ఇంధనంగానూ స్థానికంగానే జనం వాడుకుంటారు; కానుగ చెట్టుపై ఉపయుక్తమైన లక్క పురుగులు కూడా పెరుగుతాయి కనుక ఇవి ఆధార వృక్షాలు (Host Trees) గానూ విలువైనవి; +కాటుక చెట్టు చీకటి చెట్టు Sans కరంజః; నక్తమాలః; చిరబిల్వక; తమాల వృక్షం; +1) a caste in Andhra Pradesh; నిజానికి కాపు అనేది ఒక కులం కాదు. అది అనేక కులాలకు సాధారణ ప్రాచీన నామం. ఒకప్పుడు జైనం స్వీకరించి కోమట్లుగానూ తర్వాత సంస్కృతీకరణంతో వైశ్య లేక ఆర్యవైశ్యులుగా పేరుపొందేరు; +ఒక లోకోపకారం జరగడానికి పుట్టిన వాళ్ళు. స్వాతంత్ర్యం రావడానికి గాంధీజీ, సంఘ సంస్కరణ లక్ష్యంగా, వీరేశలింగం గారు ఉదాహరణలు. శాస్త్ర పరిశోధనలో అనేక నూతన ఆవిష్కరణలు చేసిన వాళ్లూ కారణ జన్ములే. వాళ్ల అన్వేషణలు భవిష్యత్ తరాల జీవితాలనే మార్చివేసేవ���గా ఉంటాయి; +see also కర్త, ప్రేరకుడు, అనుమోదకుడు; +1) delay; out of time; సమయం ఇప్పటికే చాలా అయింది. ఇక తర్వాత పని మొదలు పెట్టాలి అనే సందర్భం లో వాడతాము. +2) out of step with the times; కాలంతో సంబంధం లేకండా ఎవర్ గ్రీనుగా ఉండటాన్ని కాలాతీతమయినదిగా చెప్తారు. అది మనిషి యొక్క కీర్తిప్రతిష్ఠలు కావచ్చు,పుస్తకం కావచ్చు, సినిమా కావచ్చు, నవల కావచ్చు, నాయకులు చేపట్టే మంచి పథకాలు కావచ్చు. +3) Beyond time; దేవుడు కాలాతీతమయినవాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఆయన ప్రభ శాశ్వతంగా ఓకే లాగ ఉంటుంది. +వాక్యం రసాత్మకం కావ్యం" అని పెద్దల మాట. అంటే రసాత్మకంగా ఉండి మనసును స్పందింపజేసే ఒక వాక్యమైనా కావ్య గౌరవాన్ని అందుకొంటుంది. కావ్యం అందమైన ఊహలతో, వర్ణనలతో, అర్థ గాంభీర్యంతో, ఔచిత్యంతో చదవగానే మనసులో రసాలు ఊరేలా ఉండాలి. కవి భావనలతో మన హృదయం కూడా స్పందించేలా చేయగలిగిన ఏ రచనైనా కావ్యమే; +భూతకాలిక అసమాపక క్రియ; ఉదా. వచ్చియిచ్చెను. ఇందులో 'వచ్చి' క్త్వార్థకము. +--alkali ety భూతిర్బసిత భస్మనీక్షారో రక్షా (అమరకోశము); +కిరసనాయిలు సహజంగా రంగు లేని ద్రవం. కేవలం మన దేశంలోనే, ప్రజాపంపిణీకి ఉద్దేశించిన కిరసనాయిలు నల్ల బజారు పాలు కాకుండా రక్షించడానికి అందులో నీలి రంగు 'డై' ని, ఇంకా 'పర్ఫ్యూరాల్''అనే మరో రసాయనాన్ని కలుపుతారు. ఆ రంగును సులభంగా పోగొట్టగల రసాయనాలు లేవు. ఉన్నా వాటిని వాడడం చట్ట ప్రకారం నేరం +కిలకిల నవ్వించేది; రూపకాలలో ఒక రకం; +చెందిరం; సిందూర వృక్షం; కమల; కపిలి; +Sans అగ్నిశిఖ; కుంకుమం; కాశ్మీరం; బాహ్లీకం; అస్రం; +ఈ పూల పురుష కేసరాలు పసుపుపచ్చగా ఉంటే, స్త్రీ కేసరాలు ఎర్రగా ఉంటాయి. ఒక్కో పువ్వులో మూడు స్త్రీ కేసరాలుంటాయి. కీలాగ్రాలు (Stigmas వాటి పొడవాటి కాడలు (కీలములు Styles) కూడా ఎర్రగా రక్తవర్ణంలో ఉంటాయి. వీటిని వేరుచేసి ఎండబెట్టి దాన్నే కుంకుమపువ్వు పేరుతో మార్కెట్లో విక్రయిస్తారు. కుంకుమ పువ్వు అని మనం వాడుకునేది ఆ మొక్క పువ్వును కాదు; పూల కీలములు, కీలాగ్రాలను మాత్రమే అని గ్రహించాలి. +లేటిన్ ”సాఫ్రానం” అనే పదం, ఇటాలియన్ "జాఫ్రానో" అనే పదం అరబ్బుల "అల్ జేఫరిన్" నుంచి వచ్చినవే. వీటన్నిటికి "బంగారు రంగు" అని అర్ధం. సంస్కృత పదం "కుంకుమం" నుంచి ఆ మొక్క పేరు క్రోకస్ వచ్చిందనిన్నీ, దాని అర్ధం "పసుపు రంగు" గా మారిందని చరిత్ర కారులంటారు; +గరిసె అంటే పెద్ద ధాన్యపు గంప అనీ ధాన్యపు కొట్టు అనీ అర్థం. ఈ గంప��ు, ధాన్యపు కొట్లు వివిధ ప్రాంతాలలో వివిధ పరిమాణాలలో ఉండే కారణంగా గరిసె ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది. +మన దేశంలో గుహల్లో వేసినవి, బాగా ప్రాముఖ్య మైనవి -భింభేత్క, అజంతా,ఎల్లోరా, సిత్తనవాసల్ వంటి చోట్ల ఇలాంటి చిత్రాలు కనిపిస్తాయి. ప్రపంచంలో గోడ చిత్రాలను ఫ్రెస్కో అంటారు. ఇది ఇటాలియన్ పదం. తాజా అయిన అని అర్ధం; +మొదటి రకమైన ఫ్రెస్కో బ్యునో (fresco-buno) అనేది తడి/తేమ పద్ధతి .ఇందులో సున్నపు పొర తడిగా ఉన్నప్ప్పుడే, రంగు పొడులను నీటితో కలిపి దాని మీద వివిధ ఆకారాల్లో సిద్ధంగా ఉంచుకున్న ఆకార రేఖల పై పూస్తారు. అప్పుడు రంగులు లోపలికి చొచ్చుకుని పోయి చిత్రానికి ధృడత్వాన్ని,మన్నికని ఇస్తాయి. వాటికన్ సిస్టిన్ చాపెల్ లో మైకలాంజేలో వేసింది ఇలానే. +రెండోది ఫ్రెస్కో సెక్కో (fresco-secco) రకం. ఇది పొడి/ఎండు పద్ధతి. తెల్లటి సున్నపు పొర(గార లేక గచ్చు) ఆరిన తర్వాత రంగు పొడులను,ఇతర పట్టీ ఉంచే పదార్ధాలతో(నూనెలో,బంకగా ఉండే మరేదో కలిపి చిత్రిస్తారు. ఇది మన అజంతా రకపు చిత్రాలలో వేసినది. వీటిలో చివరగా, నునుపు రాయితో మెరుపు వచ్చే వరకు, రుద్దుతారు. +మురిపింటి; పిప్పింటి; మూర్కొండ; ఈ మొక్కను ఎన్నో వైద్య యోగాలలో వినియోగిస్తారు. ఇది నిటారుగా పైకి పెరిగే వార్షిక మొక్క- అంటే ఏటా పడి మొలుస్తుంది. 30 నుంచి 100 సెంటీమీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. తోటలలో కలుపు మొక్కగా, ఖాళీ స్థలాలలో, రోడ్లవెంట పిచ్చి మొక్కగా భారతదేశం అంతటా కనిపిస్తుంది; +మాడు మీఁద పెరిగిన జుట్టునకు కూకటి అని పేరు. అట్లే పీచుపీచుగా ఉన్న దేనికైనను కూకటి అనియే పేరు. +కృతం అంటే చేసినది. జ్ఞ అంటే తెలిసిన. కృతజ్ఞత అంటే చేసిన సహాయం మరచిపోకుండ ఉండడం. +ఏదైనా పని చేయడంలో ఎటు చేయనూ తోచక ఆలోచిస్తూ ఉంటే "కృత్యాద్యవస్థ అనుభవిస్తున్నాడు" అంటారు. +మాణిక్యం అన్నది సంస్కృత పదం. అది కెంపుకు పర్యాయ పదమే మాణిక్య వీణాముపలాలయంతీం. మదాలసాం మంజుల వాగ్విలాసాం" అన్న కాలిదాస కృత దేవీ స్తోత్రం వినే ఉంటారు. కన్నడ భాషలో కెంపు అన్న మాట మాణిక్యానికే కాక 'ఎరుపు రంగు' అన్న అర్థంలో కూడా వాడుతారు. కెంపు యొక్క నాణ్యతను, రంగులోని స్వచ్ఛతను బట్టి 'పద్మ రాగం కురువిందం సౌగంధికం నీలగంధి' అన్న పేర్లతో కూడా పిలుస్తారు; +ఈ పదాన్ని మోసగాళ్ళని, అతితెలివి ప్రదర్శనలు చేసేవాళ్ళని ఉద్దేశించి వాడుతుంటాం. Known Dacoit లేదా Known Depradator అనే పదాలకి కుదింపు పేరు; +saffron; కుంకుమ పువ్వు; కష్మీర్ లో సాగుచేసే Crocus sativus అనే శాస్త్రీయ నామం కల ఒక మొక్క నీలిరంగు పుష్పాలలోని ఎర్రటి కీలములు, కీలాగ్రములను సేకరించి, సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు. దానినే కుంకుమ పువ్వు అంటారు; +త్రిగుణాతీత స్థితి కైవల్యం. సుఖ, దుఃఖ, మోహ రహిత స్థితి అది. మళ్ళీ పుట్టుక లేని స్థితి కైవల్యం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ" అని భగవద్గీత. +--అల్పుడు; దుష్ట బుద్ధి; స్వార్థ పరుడు; +మాట్లాడే గోరింకకి ముఖాన ఉండే బొబ్బలనుబట్టి ఋగ్వేద కాలంలోనే సంస్కృతంలో దానిని ‘రోపణాకా’ అన్నారు. ఆ తరువాత కాలంలో ఆ కారణంగానే దానిని వరణ్డ (వరండ అంటే ముఖం మీద వచ్చే మొటిమ లేక బొబ్బ) అనే పేరుతో పిలిచారు. మాట్లాడే మైనాను సంస్కృతంలో ‘మదన శలాక’ (మన్మథ బాణం) అని కూడా అంటారు. రోపణ అనే సంస్కృత శబ్దానికి బాణము అని అర్థం ఉంది కనుక మన్మథుడి బాణం అనే అర్థంలోనే దీనిని రోపణాకా అనివుంటారు. మాట్లాడే మైనాను మదన శారికా, మదన సారికా అని కూడా అంటారు. దీని మెరిసే నల్లని ఈకలనుబట్టి దీనిని సంస్కృతంలో ‘ కాదంబరీ’ అంటారు కద్ అంబర Black-plumaged నల్లని ఈకలు కలిగినది ప్రేయసీ ప్రియులకు దౌత్యం నెరపుతుంది కనుక దీనికి ‘దూతీ’ అనే పేరూ ఉంది. ప్రయాసపడి ప్రేమికులను కలుపుతుంది కనుక దీనిని ‘యాసా’ అనికూడా అంటారు. తమను పెంచుకునే యజమానులకు ఆనందాన్ని ఇస్తుంది కనుక దీనికి కంజక, కంజన అనే పేర్లూ ఏర్పడ్డాయి. ఈ మైనా ‘మాటల పోగు’ లేక ‘కబుర్ల పోగు’ కనుక దీనికి ‘వచా’ అనే పేరు సార్థకం. మన ప్రాచీనులు గుర్తించిన చతుష్షష్ఠి (అరవై నాలుగు) కళలలో శుకశారికములకు (చిలుకలు, గోరింకలకు) మాటలు నేర్పటం కూడా ఒకటి. +కొండ తంగేడు వృక్షం ఎర్రటి పూల రసాన్ని, కోడిగుడ్డు తెల్ల సొనతో కలిపి విరిగిన ఎముకలకు కట్టు వేస్తారు. +ఏరు అంటే దున్నడానికి సిద్ధంగా ఉన్న నాగలి. ఏరువాక అంటే దున్నడానికి మొదలయే సమయం. కోటేరు అంటే దున్నడానికి సిద్ధంగా లేని నాగలి. +1) coconut flower 2) coconut sprout that grows inside a mature coconut; బాగా పండిన కొబ్బరికాయకు తేమ తగిలినప్పుడు కొబ్బరికాయ నుండి మొలక వస్తుంది, కొబ్బరికాయ కన్నుల నుంచి అన్ని విత్తనాల లాగానే. ఆలా కొబ్బరికాయలో మొలక వచ్చినపుడు కొబ్బరికాయ లోపల పువ్వులాంటి తెల్లని పదార్థం లోపల పెరుగు తుంది. దీన్నే కొబ్బరి పువ్వు అంటారు. దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే అదృష్టం అని చెబుతారు. +నల��లి మరింతగా విస్తరించకుండా ముందుగా నల్లి సోకి రాలిన పిందెల్ని ఏరి ఒకచోటపోసి తగలబెట్టాలి. వేపమందు (అజాడిరాక్టిన్) ఒక లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి గెలలపై పిచికారీ చెయ్యాలి. నాలుగు నెలలకు ఒకసారి ఇదే మందును నీటిలో కలిపి వేరు ద్వారా కూడా ఎక్కించాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ (NPK) ఎరువులు, సేంద్రియ ఎరువులు నిర్దేశిత మోతాదులలో వాడుకుంటే నల్లి ఉద్ధృతిని తగ్గించవచ్చు. +నక్కతోక బియ్యం; పంటకి వచ్చిన వెన్నులు నక్క తోక ఆకారంలో ఉంటాయి; +--రోజూ కొర్ర జావ కాచుకుని దానిలో పాలు కలుపుకుని తాగుతుంటే కొద్ది రోజులలోనే విరిగిన ఎముకలు అతుక్కుంటాయి. +శీర్షాసనం వెయ్యడంరాని పిల్లలకు, పెద్దలే కాళ్ళు పట్టుకొని తలక్రిందులుగా కొంతసేపు ఉంచడమే కోదండం. కోదండం అనేది కొరత వేయడం లాంటి క్రూరమైన శిక్ష యేమీకాదు. ఏమాత్రం జాలిపడవలసిన విషయమూ కాదు. క్రమశిక్షణతో పాటు జ్ఞానాన్ని కూడా పెంచే ప్రయత్నం మాత్రమే! +శీర్షాచ్చాదనం; ఆలవట్టం; ఉల్లడ; టోపీ; కుల్లా; +ఒక తరహా సముద్రపు పక్షి; ఉల్లంకాయ; నల్లకంకణము; వడ్లకంకణము; బలాకము; + + +దేవతలలో ఒక తెగవారు; హాహాహూహూ ప్రభృతులు; కశ్యపునికి, దక్ష ప్రజాపతి కూతురు అయిన అరిష్టకు (ప్రధ కు) పుట్టినవారు గంధర్వులు; +2) ఇంద్ర సభలో గానము చేయు ఒక తెగ దేవతలు; గంధర్వుడు మధురంగా పాటలు పాడువాడు అని నిఘంటు అర్థం. గంధర్వ జాతిలో ఆడవారు నృత్య కళల్లో ప్రావీణ్యం కలిగి వుంటారు. వీరు అమరలోక సభాసదులను తమ గాన మాధుర్యంతో, నృత్యంతో తన్మయత్వంలో విహరింపజేసెదరు. +3) గాంధార దేశానికి చెందిన ప్రజలు; వేదాలు, మహాభారత గ్రంధాలలో గంధర్వుల ప్రస్తావన ఉంది. పురాణాలలో తుంబురుడు అను విద్వాంసుడు (గుర్రము తల కలిగి వుండును) గంధర్వ జాతిలో శ్రేష్ఠుడిగా ప్రసిద్ధి గాంచారు. +గాయపాకు; ఇది విస్తృతంగా పెరిగే కలుపు మొక్క ఈ మొక్క ఆకులు రసం గాయం దగ్గర రాస్తే ఒక అరగంటలో నొప్పి మాయం అవుతుంది; +గుడి గన్నేరు bot Thevetia peruviana గుడి గన్నేరు కాయలలోని పప్పు విషపూరితం. +పప్పు మాత్రమే కాదు, ఆకులు, కాండంలో ఉండే పాలు కూడా విషపూరితమే. ఈ కాయ పప్పు లో ఉండే కార్డియాక్ గ్లైకోసైడ్స్ (Cardiac Glycosides) ప్రాణాంతకమైనట్టివి. ఈ పప్పు తిన్న వ్యక్తి వాంతులు చేసుకుని అంతిమంగా మరణిస్తాడు. సకాలంలో వైద్యసేవలు అందిస్తే విషహరణం సాధ్యం కావచ్చు. Cerberocide, Thevetin, Peruvoside మొదలైనవి గన్నేరు పప్పులో ఉండే విషప���రితమైన గ్లైకోసైడ్స్; +కరవీరం; కరవీ వృక్షం; తెల్ల గన్నేరు, పచ్చ గన్నేరు; +1 గరిసె 400 తూములు 1600 కుంచములు; +గసగసాలను అన్ని దేశాల్లో పండించరు. పండించకూడదనే ఒడంబడిక ఉంది. కేవలం అనుమతి ఇవ్వబడిన దేశాల్లో (టర్కీ అందులో ఒకటి UN ఆధ్వర్యంలో మాత్రమే పండించాలి. కొన్ని రకాల వంటకాలలోనూ, కొన్ని జగమొండి జబ్బుల నియంత్రణకై వాడటం కోసమే పరిమిత మొత్తంలో పండిస్తారు; +గ్రాహయతీతి గ్రహ: – అంటే ప్రభావం చూపేది గ్రహము అని. జ్యోతిషం ప్రకారం సూర్య చంద్రాదులకు మనమీద ప్రభావం ఉన్నది కాబట్టి వాటినికూడా జ్యోతిషం గ్రహాలుగానే వ్యవహరిస్తుంది; +5 Note ఎంతటి ఎండల్లోనూ ఈ చెట్టు ఆకులు రాల్చదు. ఇది ఎప్పుడూ పచ్చగా ఉండే సతత హరిత వృక్షం. ఈ చెట్టు ఆకులకూ, కాండం పైని బెరడుకూ, గింజల నుంచి తీసే తైలానికీ వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. సంస్కృత మహాభారతంలోని శల్య పర్వంలోని 36 వ అధ్యాయంలో 58 వ శ్లోకంలో సరస్వతీ నదీ తీరంలో ఇంగుదీ వృక్షాలున్నట్లు పేర్కొనబడ్డది; దగ్గుకూ, తీవ్రమైన కడుపునొప్పి(Colic) కి గార గింజల కషాయం ఇస్తారు. కాండం పైని బెరడు, పచ్చి కాయలు, ఆకులు పిల్లల కడుపులోని క్రిములను వెడలింపజేసేందుకు వాడతారు. గార పళ్ళను పాముకాటుకు విరుగుడుగా వాడతారు. కాలిన గాయాలు, పుళ్ళు తగ్గించడానికి గార గింజల నుంచి తీసిన నూనెను పూస్తారు; +6 Note ఇంగుదీ వృక్షం అంటే 'గార చెట్టు కణ్వ మహర్షి శకుంతలను దుష్యంతుడి వద్దకు సాగనంపే దృశ్యమది. తాను కట్టుకున్న నారచీరను ఎవరో పట్టుకుని వెనక్కి గుంజినట్లు అనిపించి శకుంతల వెనక్కి తిరిగి చూస్తుంది. తన చీర కొంగును పట్టుకుని లాగింది మరెవరో కాదు తాను కొంతకాలంగా పుత్రసమానంగా పెంచుకుంటున్న లేడి పిల్లేనని ఆమె గ్రహిస్తుంది. +అప్పుడు కణ్వ మహర్షి ఆమెతో ఇలా అంటాడు - +తైలమ్ న్యషిచ్యత ముఖే కుశసూచి విద్ధే +శ్యామాక ముష్టి పరివర్థిత కో జహాతి +సోయం న పుత్ర కృతకః పదవీమ్ మృగస్తే +(బిడ్డా! పచ్చి గడ్డి మేస్తున్న ఈ లేడి పిల్లకు నోటిలో దర్భ ముల్లు గుచ్చుకున్నప్పుడు, దాని గాయం మాన్పడానికి ఇంగుదీ కాయల తైలం పూసి చికిత్స చేశావు. నోటి గాయంతో అప్పుడది గడ్డి మేయడం సాధ్యంకాదని దానికి ప్రేమమీరగా శ్యామాకాలు సామలు లేక చామధాన్యం గుప్పెళ్ళతో తినిపించావు. అలా నీవు పుత్ర సమానంగా పెంచుకున్న ఈ లేడి నిన్ను నీ మార్గాన ఎలా వెళ్ళనిస్తుంది +గ్రామం అంటే వందకుటుంబాలు పైన ఉంటాయి (��ుమారు 200 లేదా ఆ పైనే )కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రo ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల (అరవతరగతి నుంచి పదవతరగతి వరకు సర్పంచ్ కూడా గ్రామం లోనే ఉంటారు.పల్లెకి సంబందించిన ఏవైనా సమస్యలున్నా గ్రామo లో ఉన్న పంచాయితీ ఆఫీస్ దగ్గర తెలుపుకోవాల్సిందే.ఓట్లు లెక్కింపులన్నీ గ్రామం లో నే జరుగుతాయి. +తనది కానిదాని కోసం అనేక రకాలుగా అరిచి ఆగం చేస్తూ ఉంటే గింజుకుంటున్నాడు అంటాం; +--a volumetric measure of pre-independence India; 4 గిద్దలు 1 సోల; 2 సోలలు 1 తవ్వ 2 తవ్వలు 1 మానిక (సేరు 2 మానికలు 1 అడ్డ; 2 అడ్డలు 1 కుంచం; 4 కుంచాలు 1 తూము; 5 తూములు 1 ఏదుము (ఐదు తూము లేదా ఏను తూము 10 తూములు 1 పందుము (పది తూము 2 పందుములు 4 ఏదుములు 20 తూములు 1 పుట్టి; గరిసె అంటే పెద్ద ధాన్యపు గంప అనీ ధాన్యపు కొట్టు అనీ అర్థం. ఈ గంపలు, ధాన్యపు కొట్లు వివిధ ప్రాంతాలలో వివిధ పరిమాణాలలో ఉండే కారణంగా గరిసె ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది; +మందార పూలు వంటి ఎర్రని పూలని పూసే మొక్క; +గుంట గలగరాకు రసం తీసి తలచమురులో కలిపి కాస్తారు. జుట్టు నల్లబడడానికి ఆ రసం పనికివస్తుంది. అది పిండేటప్పుడు చెయ్యి అంతా నల్లగా వస్తుంది; +తియ్య గుమ్మడి గింజలు చూసేందుకు చిన్నవిగానే కనిపించినా, అవి విలువైన పోషకాలతో నిండి ఉన్నాయి. రోజూ కాసిని గుమ్మడి గింజలు తిన్నా మన శరీరానికి ఎంతో అవసరమైన కొవ్వు పదార్థాలు, మెగ్నీసియం, పొటాసియం, కాల్షియం, జింకు వంటి ఖనిజాలన్నీ వీటి నుంచి లభిస్తాయి. ఇవి రోజూ తింటే గుండె పని తీరు మెరుగు పడుతుంది. ప్రోస్టేట్ గ్రంథి కి రక్షణ లభిస్తుంది. ఇంకా కొన్ని తరహాల కాన్సర్ల నుంచి ఇవి మనల్ని కాపాడతాయి. పచ్చి విత్తులు ఒట్టివే తినవచ్చు. లేక ఏ ఆహార పదార్థాలలోనైనా వీటిని వేసుకోవచ్చు. లేక కాస్త నెయ్యి లేక నూనెలో వేయించి ఉప్పు కారం చేర్చి తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇరవై ఎనిమిది గ్రాముల గుమ్మడి పప్పులో ప్రోటీన్లు, ప్రయోజనకరమైన కొవ్వులతో కూడిన రమారమి 151 కాలరీల శక్తి ఉంటుంది. ఇంకా వీటిలో శరీరానికి ఎంతో అవరమైన పీచు పదార్ధం, ఫాస్ఫరస్,మాంగనీస్, ఇనుము, రాగి వంటివి కూడా ఎక్కువ. మనకు గాయాలు అయినప్పుడు రక్తస్రావం ఆగటానికి, గాయం త్వరగా మాని, చర్మం మూసుకొనేందుకు ఉపయోగపడే విటమిన్ కె కూడా ఈ విత్తనాలలో ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ ఇ కూడా ఎక్కువే. శరీరానికి ఎంతో అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫాటీ యాసిడ్స్, రైబోఫ్లేవిన్ (Vitamin B2) వంటివి కూడా వీటిలో ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని జీవకణాలను ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ బారినుంచి కాపాడతాయి. అందుకే గుమ్మడి గింజలకు మన ఆరోగ్య రక్షణలో అంత ప్రాముఖ్యం ఏర్పడింది. గుమ్మడి గింజలు క్రమం తప్పకుండా తింటూ ఉంటే రొమ్ము కాన్సర్, ఊపిరి తిత్తుల కాన్సర్, ప్రోస్టేట్ గ్రంథి కాన్సర్ వంటివి మనజోలికి రావు. +తోటకూర జాతికి చెందిన మొక్క Sanskrit] వితున్న rel కోడిజుత్తు తోటకూర; +కొన్ని పూలు తెల్లగా ఉంటే ఇంకొన్ని ఎర్రగా గులాం (గులాల్) రంగులోనూ, కొన్ని రక్త వర్ణం లోనూ ఉంటాయి. పూల రంగును బట్టే కాయల రంగు ఉంటుంది. ఈ పండ్లనుంచి కొన్ని దేశాలలో వైన్ (Wine) తయారు చేస్తారు. మలేషియా, ఆస్ట్రేలియాలు ఈ పండ్ల మొక్క తొట్టతొలి జన్మస్థానాలు. +గృహస్థు దైనందిన జీవితంలో ఏయే కర్మలు ఎలా చేయాలి, శుభాశుభ కర్మలు ఎలా చేయాలి, ఒకటేమిటి, మొఖం కడగడం ఎలా అనే విషయం దగ్గర్నుండీ సమస్త కర్మాచరణ విధానం గృహ్యసూత్రాలలో ఉంటుంది. వీటిని రచించినవారిలో ఇద్దరు ప్రముఖులు. ఒకరు ఆపస్తంబుడు, రెండవవారు అశ్వలాయనుడు ఆంధ్రులలో ఎక్కువమంది ఆపస్తంబ గృహ్యసూత్రాలను అనుసరిస్తారట. అందుకని ఆపస్తంబుడు ఆంధ్రుడు అయి ఉంటాడని తిరుమల రామచంద్ర గారి అభిప్రాయం.) +Sans పీలుః; ఉష్ణప్రియా; నాళిత Hindi] అంబారీ; +Notes] గోంగూర రక్తవృద్ధికి పేరొందిన ఆకుకూర. గోగు పూల రసంలో పంచదార, మిరియాల పొడి కలుపుకుని తాగితే కాలేయ సంబంధిత వ్యాధులు నయమౌతాయి. గోంగూర ఉడికించి, ఆముదం కలిపి సెగగడ్డల మీద కట్టుకడితే అవి పక్వానికొచ్చి పగుల్తాయి. +ముదిరిన గోగు మొక్కలను నీటిలో నానబెట్టి నార తీస్తారు. గోగు నార (Kenaf Hemp) ను గోనె సంచుల తయారీలో వాడతారు. పాడి పశువులకు గోంగూర మేపితే అవి పుష్కలంగా పాలు ఇస్తాయి. గోగు విత్తులను పశువుల దాణాలో కలుపుతారు. గోగు గింజలను కొందరు వీర్యవృద్ధికి నేతిలో వేయించి చూర్ణంచేసి తేనెతో కలిపి తింటారు. ఈ విత్తుల నుంచి తీసే పసుపు పచ్చని, వాసనలేని నూనె కందెన (lubricant) గానూ, దీపాలు వెలిగించడానికి కూడా వాడతారు. ఆ నూనెను సబ్బులు, పెయింట్లు, వార్నిష్ ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. +మీ జన్మ నక్షత్ర/నామ నక్షత్ర రాశి నుండీ లెక్కించ్చినపుడు నవ గ్రహాలు ప్రస్తుతం (మనం జాతకానికి గోచారం చూడాలని అనుకున్న రోజుకు) ఎక్కడెక్కడ ఉన్నాయో దానినే 'గోచారం' అని పిలుస్తారు. ఉదాహరణకి, అశ్వని జన్మ నక్షత్రంగా గల వ్యక్తి రాశి మేషం. ఈ మేష రాశి నుంచీ ఈ రోజు (అంటే, 14 ఆగస్టు 2022 న) ఏ గ్రహం ఎక్కడ ఉన్నదో లెక్క వేస్తే ఇక్కడ చూపిన విన్యాసం వస్తుంది: మేషంలో రాహువు, వృషభంలో కుజుడు, మిథునంలో ఏ గ్రహమూ లేదు, కర్కాటకంలో శుక్రుడు, రవి, సింహంలో బుధుడు, కన్యలో ఏ గ్రహమూ లేదు, తులలో కేతువు, వృశ్చికంలో ఏ గ్రహమూ లేదు, ధనుస్సులో ఏ గ్రహమూ లేదు, మకరంలో శని, కుంభంలో చంద్రుడు, మీనంలో గురువు. ఈ సమాచారమే అంటే. +ఒకప్పుడు మనందరిదీ వ్యావసాయిక సమాజం. అప్పుడు సమాజంలో అందరికీ తమతమ గోవుల మందలు ఉండేవి. గోవులు అనే మాటను ఆవులు, ఎద్దులకు కలిపి వాడతారనేది తెలిసిందే. ఒకే మందలోని గోవులు గనుక కలసినట్లయితే, ఆ జాతి క్రమంగా క్షీణించిపోయే ప్రమాదం ఉన్న కారణంగా, వేర్వేరు మందలలోని గోవులను కలిపేవారు. దీనివల్ల జన్యుపరంగా కూడా ఆ జాతి వృద్ధి పొందేది. కనుక, ఏ గోవు ఏ మందలోదో తెలుసుకోవటం అవసరంగా ఉండేది. అందుకే, ఒక్కొక్క గోవుల మందకు, ఒక్కొక్క పేరుండేది. సాధారణంగా, ఆ మందకు నాయకత్వం వహించే వారి పేరుమీదుగా ఆ మందను వ్యవహరించటం పరిపాటి. అలా, ఏ గోవును చూసినా, అది ఏ మందకు చెందిందో తెలుసుకోవటం సులభంగా ఉండేది. ఆ పద్ధతిలోని ప్రయోజనాలను గుర్తించి, వాటిని క్రమంగా మనుషులకూ వర్తింపజేయటంతో, మనుషులు సైతం 'ఫలానా గుంపు'లోకి చెందినవారని గుర్తించటం ఆరంభమయింది. ఆ 'ఫలానా గుంపు' క్రమంగా 'గోత్రం' అయి ఉండవచ్చు. +Lawsone; hennotannic acid (2-hydroxy-1,4-naphthoquinone) అనే ధాతువు గోరింటాకులో వుంటుంది. అది చర్మము పైన, గోళ్ళపైన, జుట్టుపైన ఎక్కడ అంటినా పండుతుంది; +Note] ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మారింది. దీని వెనుక పలు కారణాలున్నాయి. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా డాక్టర్లు కూడా చెప్తున్నారు. +Sans బకుచీ; గోరక్షా ఫలినీ; గోరాణీ; క్షుద్ర శింబీ; +5) arrogance; pride; uppityness; గర్విష్టివాళ్ళని "వీడికి గోరోజనం ఎక్కువరోయ్" అనడం వినే ఉంటారు. +--Royal road; నిస్సందేహమగు మార్గము; పది విల్లుల వెడల్పు గల రోడ్డు; +1 రోజు 60 ఘడియలు; 1 ఘడియ 60 విఘడియలు 24 నిమిషాలు +--షష్టి ఘడియలు 24 గంటలు రోజల్లా +1) an expert in the Vedas; వేదమును చదవడానికి 'పద పాఠము' తో మొదలై 'ఘన పాఠము' వరకు మొత్తం 11 పద్దతులు వుంటాయి. అవి ఒకదానికంటే ఒకటి కష్టతరమైనవి. అన్నింటిలో ఆఖరిదైన 'ఘనము' అనే పద్దతి వరకూ నేర్చుకున్నవారిని 'ఘనపాఠి' అంటారు. ఈ పద్ధతిలో వేదాన్ని నేర్చుకోవాలంటే కనీసం ఒక వెయ్యిసార్లు అయినా పఠించాలి; +అపారమైన ప్రతిభాసంపత్తి కలిగినవారు అని ఎవరినయినా పొగడాలనుకున్నప్పుడు మన తెలుగు పత్రికలవారు వాడుతున్న పదాలు ఘనాపాఠి లేదా ఘనాపాటి. +1) good at doing bad things 2) related to a house; ఉత్తర భారతంలో ఒక సంగీత కళాకారుడు ఘరానా గాయకుడు అంటే ఒక స్థిరపడిన సంగీత సంప్రదాయానికి చెందిన వాడు అన్న అర్థమే కాకుండా పేరుమోసిన గాయకుడు అన్న అర్థాల్లో వాడుతారు; +గొల్లవారుండే పల్లె ప్రాంతాన్ని "ఘోష" అంటారు. వీరున్న చోట పశుసంపద ఉండి, అవి శబ్దం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ పేరు వచ్చిందట. + + +according to Hindu Puranas, another interpretation goes like this: పద్మాకారమైన భూమి మధ్య జంబూద్వీపం తామరరేకు వలె గుండ్రంగా కనిపిస్తుంది. అది లక్ష యోజనాల పొడవు, లక్షయోజనాల వెడల్పు కలిగి ఉంటుంది. +పొట్టలో పుట్టే అగ్ని జఠరాగ్ని; దీన్ని వైశ్వానరాగ్ని అంటారు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామి అన్నం చతుర్విథం" అని గీతా వాక్యం. +also known as సీతమ్మవారి జడబంతి; ఈ మొక్క ఆకులను ఆకుకూరగానూ వండుకుంటారు. దీనికెన్నో వైద్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి; +కుచ్చుల మెకము; చమరము; చమరీమృగం; జల్లిమెకము; సవరపుమెకము; సృమరము; +అవిచ్ఛన్న వర్షము; దట్టమైన వాన; ఒకే ఊపులో పడే పెద్ద వాన; ఎడతెగని వాన; +ప్రాచీన భరత ఖండమున వెలసిన చిన్న చిన్న రాజకీయ వ్యవస్థలు; వేద కాల సాహిత్యం ప్రకారము అలీన, అను, గాంధారి, కళింగ, మత్స్య దేశాలు (జనపదాలు సింధు నాగరికత ప్రాభవం అంతరించి జైన-బౌద్ధాలు వేదకాల సనాతన పద్దతులపై తిరుగుబాటు జరిగిన కాలమున మహాజనపదాలు (City states) వృద్ధి చెందినవి; ఛేది, గాంధార, కోసల, మగధ ఉదాహరణలు. +--horoscope chart; జాతకుడు పుట్టిన సమయంలో, సూర్యుడు, చంద్రుడు గురుడు, శుక్రుడు శని, కుజుడు, బుధుడు, అనే 7 గ్రహాలు, రాహు, కేతువులు అనే రెండు ఛాయా గ్రహాలు, ఆకాశవృత్తం లో ఏయే స్థానాలలో ఉన్నాయో చెప్పేది; పుట్టిన సమయం తెలిస్తే జన్మ కుండలి వేయటం వరకు అనుమానం లేని సైన్సు; +తమిళ జాతికే ప్రత్యేకమైన క్రీడలు రెండున్నాయి 1)‘జల్లికట్టు’ అంటే పరుగెత్తి వస్తున్న ఒక బలిష్టమైన ఎద్దును ఒట్టి చేతులతో ఆపడం. ఇది మనిషిలోని ధైర్యం, బలం, పరాక్రమం, నేర్పు వంటి శారీరక సామర్థ్యాలకు పరీక్ష 2 పట్టి మండ్రం' లేదా వాగ్వాదం/ చర్చ ఇది జ్ఞానం, తెలివి, వివేకం, చాతుర్యం, హాస్యం, ఇతరులను ఒప్పించే సామర్థ్యం, ​​భావోద్వేగ సమతుల్యత మొదలైన మానసిక సామర్థ్యాలకు పరీక్ష; +నవాబులు బహుమానముగా ఇచ్చిన భూమి (లేదా మాన్యం లేదా జమీ)ని జహగీరు లేదా జాగీరు అంటారు. +రాజు బ్రాహ్మణులకిచ్చు యీనాము, బ్రాహ్మణులు మాత్రము నివసించు గ్రామమును అగ్రహారం అంటారు. +Sans జాతీ ఫలం; సౌమన ఫలం; మాలతీ ఫలం; +జాపత్రీ, జాజి కాయా ఒకే చెట్టునుండి వస్తాయి, నిజానికి ఒక దానికి ఒకటి అతుక్కొని ఉంటాయి. కానీ వేరే సుగంధ ద్రవ్యాలు గా పరిగణిస్తాము ఈ చెట్టు కేరళా లో ఎక్కువ. +Sans జాతిపత్రీ; మాలతీ పత్రికా; సౌమనసాయనీ; +తడిగా ఉన్నప్పుడు జారుతుంది slippery when wet. +నిజాం పాలనలో శిస్తు కోసం నిర్ణయించిన భూమి విభజన. భగాయత్ (తోట భూమి జిరాయత్ (సాధారణ సాగు భూమి) అని రెండు రకాల భూములకు వేరు వేరు శిస్తు ఉండేది. జిరాయత్ తో పోలిస్తే భగాయత్ పన్ను ఒకటిన్నర రెట్లు ఉండేది. +Sans జీరక; జీరణ; అజాజీ; శుక్ల జీరకం; +Genus Sesbania కు చెందిన మొక్క; దీనిని సేంద్రియ ఎరువుగా వాడతారు; ఒక ఎకరానికి 10 కిలోల జీలుగ గింజలు వేస్తారు. సరిగ్గా నలభై రోజులకి మొక్కలు పెరిగతాయి. తర్వాత వర్షం పడ్డాక, పొలాన్ని దున్నుతారు. దున్ని, భూమిలోకి వెళ్ళేటట్లుగా అణగదోక్కుతారు. ఇది మరి కొద్దిగా తడిసి తర్వాత కుళ్ళుతుంది భూమిలో. అసలు జీలుగలో ప్రోటీన్ ఎక్కువ. కుళ్లిన తర్వాత మరింత పోషకాలు పెరిగి భూమిని మరింత పటిష్టం చేస్తుంది ఈ పంట. +note spp. అన్న సంక్షిప్తం కనిపించినప్పుడల్లా, అది ఫలానా జాతికి చెందినదని అర్థం చేసుకోవాలి. Brachirus spp. అన్నప్పుడు, ఆ చేప బ్రాకీరస్ జాతిది అని చెబుతున్నామన్న మాట; +వానపాములు, జెలగలు జంతుజాలపు ఫైలం అనెలిడా లోని క్లైటెల్లేటా తరగతికి Class Clitellata) కి చెందుతాయి; +దాయాది; అన్నదమ్ముల బిడ్డలు; ఆస్తికి వారసులు; +లాటిన్ భాషలో ఫ్రూటెక్స్ (frutex) అంటే పొద అని అర్థం. పొదలా పెరిగే ఈ మొక్క స్వభావాన్నిబట్టి దీనికి ఫ్రూటికోసా (fruticosa) అనే పేరు, రసభరితంగా కండక���ిగి ఉండే దీని వేరు దుంపల (fleshy roots) నుబట్టి దీనికి కార్డిలైన్ (Cordyline) అనే పేరూ వచ్చాయి. +--కొబ్బరి, తాటి, ఈత వంటి పామ్ (Palm) ల లాగే కాండం చివర మాత్రమే ఆకులు, పూలు, కాయలు గుత్తులుగా వస్తాయి కనుక ఇది నిజంగా పామ్ కాకున్నా దీనిని పామ్ అనే పేరుతోనే వ్యవహరిస్తున్నారు; +టమాటా; రామ్ములక్కాయ; కర్ఫూరపు వంకాయ; సీమ తక్కిలి కాయ; +--పొమేటో టొమేటో పొటేటో; సంకర జాతి ఫలం; +ఇది బంతి, చేమంతి, పొద్దుతిరుగుడు (Sun Flower) జాతికి చెందినదే. + + +దీని మొగ్గల్ని కషాయంగా కాచుకుని తాగితే చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. ఈ మొక్క పుల్లలతో పళ్ళు తోముకుంటే చిగుళ్లు బలపడతాయి. ఈ మొక్క ఆకులతో శ్రీలంకలో టీ కాచుకు తాగుతారు. దీని గింజల పొడితో కాఫీ కాచుకు తాగుతారు. +--తలపోటకం; మాదిగ తంగేడు; మెట్ట తంగేడు; మెరక తంగేడు Sans ఆవర్తకీ; హేమపుష్పమ్ Tamil అవరమ్; +--తేగలను కుండలో ఉంచి, తేగలపై కొంచెం నీళ్లు జిలకరిచి గడ్డి చుట్టతో కుండా మూతిని మూసి, ఈ కుండను బోర్లించి చుట్టూ గడ్డి చిన్న చిన్న పుల్లలు వేసి మంట పెడతారు. బోర్లా ఉంచిన కుండలో ఉన్న తేగలు బాగా ఉడుకుతాయి. ఈ పద్దతిని "తంపటి" వేయడం అంటారు. తంపటి వేసిన తేగలు రుచిగా ఉంటాయి, పైగా ఎక్కువ రోజులు బంక, బూజు పట్టకుండా ఉంటాయి. +ety మరాఠీ భాషలో తడ్-తడ్ (तड! तड అన్నది కొట్టడాన్ని సూచించే ధ్వన్యనుకరణ శబ్దం. తడాఖా (तडाखा) అంటే ఆ కొట్టడానికి క్రియానామవాచకం. నా తడాఖా చూపిస్తాను అంటే నా కొట్టే శక్తిని చూపిస్తాను అని అర్థం.కొట్టడానికే కాకుండా సాధారణంగా ఏ విషయంలోనైనా సామర్థ్యాన్ని తెలుపడానికి కూడా ఈ పదాన్ని ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. గాణ్యాచా-తడాఖా (गाण्याचा-तडाखा) అంటే పాడడంలో సామర్థ్యం అన్నమాట; +అనుభవ ఆధారితమైన ఒక పిండితార్థము; ఉదాహరణకు సూర్యుఁడు ఱేపు ఉదయించుట తథ్యము; +ఇది "అతను" లేదా "ఆమె" వంటి లింగ సర్వనామాలకు బదులుగా ఉపయోగించవచ్చు. లింగ-తటస్థ సర్వనామాలను ఉపయోగించడం అనేది మీకు ఖచ్చితంగా తెలియని లేదా మగ లేదా స్త్రీ అని గుర్తించని వ్యక్తులను సూచించడానికి మరింత సమగ్ర మార్గం. +తప్పేలా అంట్లు a kind of rice cake; బియ్యం పిండి, కొబ్బరి సన్న ముక్కలు, సెగగ పప్పు చేర్చి తడిచేసి బాగా కలిపి తప్పెల లోపల చుట్టూరా అంటించి మూతబెట్టి సన్న సెగ మీద ఉడికిస్తారు. +తమలపాకులో పిండిపదార్త్తలని అరిగించే డయాస్టేజ్ అనే ఎంజైమ్ ఉంది. బహుశా అందుకే భోజనం తర్వాత తాంబూలం తీసు��ుంటారు. +ఎన్నోవ్యాధులకు వాడడమే కాక సెగ గడ్డలు వగైరా వ్రణాలు పక్వానికి రావడానికి వేసే మలాం పట్టీలలో కూడా తమలపాకులు వాడతారు. +భారతదేశంలో సుమారుగా 35 తమలపాకు రకాలు సాగవుతున్నాయి. అయితే 'తెల్లాకులు' లేక 'తెలనాకులు' లేక ధవళ నాగవల్లి దళములు అని పిలువబడే పలుచని లేత తమలపాకులు తాంబూలానికి శ్రేష్ఠమైనవి; +తస్స అంటే మనలో వుండే జీవము, ప్రాణశక్తి; దీని ప్రకారం తస్సాదియ్య అంటే "నువ్వు చచ్చిపోనూ" అనే అర్థం వస్తుంది నీ యిల్లు దొంగలుదోల నీ కడుపుడక నీ దుంప తెగ" లాంటి తిట్టు; +దీనిని ఆయుర్వేద గ్రంథాలు విభీతకి అనే పేరుతొ వర్ణించాయి. దీనితో ఉదర సంబంధ వ్యాధులు, చక్కర వ్యాధి, కీళ్ళనొప్పులు నయమవుతాయి. దగ్గును తగ్గించడంలో దీనికి ప్రత్యేక పాత్ర వుంది. త్రిఫల చూర్ణంలో వాడబడే మూడింటిలో ఇదొకటి. +మితంగా సేవిస్తే తాంబూలం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. తాంబూలం నోటి దుర్వాసనను పోగొట్టి నోటికి పరిమళం కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఉత్ప్రేరకం (stimulant) గానూ, కడుపులోని గ్యాస్ ను వెడలించేది (carminative) గానూ కూడా పనిచేస్తుంది. శరీరానికి అత్యంత ఆవశ్యకమైన కాల్షియం ను, ఎ, బి, సి విటమిన్లను తాంబూలం మనకి అతి చవకగా అందిస్తుంది. +త్రిఫల చూర్ణంలో ఒక ఎత్తు తాని కాయ, ఒక ఎత్తు కరక్కాయ, రెండు ఎత్తు ఉసిరి కాయ ఉంటాయి; +గలాపగోస్ తాబేలు bio Chelonoidis Nigra of the Testudinidae family; ఈ తాబేళ్ళు ప్రపంచంలో ప్రస్తుతం జీవించివున్న తాబేళ్ళ జాతులన్నింటిలో పరిమాణంలో అతి పెద్దవి. ఇవి టెస్టూడినిడే కుటుంబానికి చెందిన సరీసృపాలు (Reptiles జంతుప్రపంచంలో అతి దీర్ఘ కాలం జీవించేవి ఇవే. వీటి సగటు ఆయు: ప్రమాణం 100 సంవత్సరాలు. ఈ తాబేలు జాతి స్వస్థలం పసిఫిక్ మహాసముద్రం లో దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వడార్ దేశ తీరం నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరాన విసిరేసినట్టుగా ఉండే గలాపగోస్ దీవులు. అగ్ని పర్వతాలతో నిండిన ఈ దీవుల పేరిటే ఈ అతిపెద్ద తాబేళ్ళను గలాపగోస్ తాబేళ్ళు అంటున్నారు; +ఆర్' అన్న ప్రత్యయం తమిళంలో గౌరవ వాచకం, తెలుగు 'గారు' లాగా తాయ్' అంటే తమిళంలో తల్లి తాయార్' అంటే తల్లిగారు. సాధారణంగా దేవతల పట్ల ఈ మాట వాడుతారు అమ్మవారు అన్నట్లు; +తమిళంలో 'తాయ్' అంటే తల్లి అత్తు' అంటే ఖండించడం. తాయత్తు అన్న మాటకు అర్థం తల్లి (నుండి) ఖండించినది అని. ఏమిటది? బొడ్డుతాడు. ప్రాచీనకాలంలో బిడ్డ పుట్టగానే మంత్రసాని బొడ్డుతాడ��� నుండి సేకరించిన రక్తాన్ని కొన్ని పసరులతో కలిపి ఒక గొట్టంలో పోసి మూతపెట్టి ఉంచేది. బారసాల అయినాక ఆ గొట్టాన్ని ఒక త్రాటికి కట్టి దానిని మొలత్రాడుగా కట్టేవారు. అదే తాయత్తు. +తిను అన్న ప్రత్యయం అనుకోని, ఆకస్మిక పరిణామాన్ని సూచించడానికో, తీవ్రమైన దెబ్బ (దేహానికి గాని, మనసుకు గానీ) తాకిన పరిణామాన్ని సూచించడానికో వాడుతారు: +ఉదా. ఢక్కామొక్కీలుతిను, దెబ్బతిను, చీవాట్లుతిను, జంగుతిను (తప్పుబట్టు టోకరాతిను, తన్నులుతిను, తిట్లుతిను, దెబ్బతిను, దొబ్బులుతిను, సొమ్ముదిను, బుద్ధి గడ్డితిను, చివాట్లుతిను, టోకరాతిను, వేపుకుతిను, మొదలైన పదాలన్నీ ఈ రకమైన అర్థాన్ని ఇస్తాయి; +మన శరీరానికి సహజసిద్ధంగా ఉండే రోగనిరోధక శక్తిని పెంపొందించటంతోపాటు, తిప్ప అన్నిరకాల జ్వరాలను పోగొట్టే అద్భుతమైన జ్వరహారిణి (Febrifuge) గానూ పేరొందింది; తిప్పతీగ లోని ఔషధ గుణాలను అన్నిటినీ అమృతారిష్ట అనే ఆయుర్వేద ఔషధం వాడితే పొందవచ్చు. ఈ ఔషధం తయారీలో తిప్పతీగతోపాటు దశమూలాలు, ఏడాకులపొన్న, కటుకరోహిణి, నాగకేసరములు, అతివస, కొడిశపాల విత్తులు, తుంగముస్తలు, జీలకర్ర, త్రికటుకములు (మిరియాలు, శొంఠి, పిప్పళ్ళు) మొదలైనవన్నీ వేసి పాత బెల్లంతో కాస్తారు. ప్రతిరోజూ రెండు పూటలా భోజనం తరువాత మూడు నుంచి ఆరు టీ స్పూనుల అమృతారిష్టను అంతే మొత్తం నీటితో కలిపి తాగితే ఎంతో ప్రయోజనకరం; ఆర్యులు త్రాగిన సోమరసం తిప్పతీగ నుంచే అనే వాళ్ళు కూడా ఉన్నారు. +కడుపులో తిప్పుతున్నది I am nauseous. +తల తిప్పుతున్నది I am dizzy. +ఇక్కడ కుడిపక్కకి తిరుగు turn right here. +--కరక్కాయ 3 పాళ్లు, తానికాయ 6 పాళ్లు, ఉసిరికాయ 12 పాళ్లు కలిస్తే దానిని త్రిఫలం అంటారు; +నీటిని ‘ఓమ్‌ కేశవాయస్వాహా’, ‘ఓమ్‌ నారాయణాయస్వాహా’, ‘ఓమ్‌ మాధవాయ స్వాహా’’ అని జపిస్తూ తీసుకోవడం ఆచ మించడం. ఈ సందర్భంలోనే అరచేతి లోని ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్ని పురాణం గుర్తించింది. చూపుడు వ్రేలి క్రింది ప్రదేశం బ్రహ్మస్థానం. అదే బ్రహ్మతీర్థం. చిటికెన వ్రేలి మూలస్థానం ఋషితీర్థం. అదే ప్రజాపతి స్థానమనీ, ప్రజాపతి తీర్థమనీ అంటారు. అరచేతి మధ్య పల్లపు ప్రదేశం అగ్నిస్థానం. అదే అగ్నితీర్థం. చూపుడు వ్రేలి నుంచి, చిటికెన వ్రేలి వరకు నాలుగు వ్రేళ్ళకొనల భాగం దేవస్థానాలు. అవే దేవ తీర్థాలు ఎడమ అరచేతిలోని పల్లపు ప్రదేశాన్ని సోమతీర్థం అంటారు ఆచమనం చేసేటప్పు��ు మణికట్టు వైపు బొటన వ్రేలి క్రింద ఉండే ప్రదేశం నుంచి నీటిని గ్రహిస్తాం. కనుక అది బ్రహ్మతీర్థం అవుతుంది. సంధ్య వార్చేటప్పుడు వ్రేళ్ల చివరల నుంచి ‘తర్పణం’ జలాన్ని విడుస్తాం గనుక అది దేవతీర్థం అవుతుంది. పితృ కర్మలలో తర్పణాలకు వదలే జలం పితృ తీర్థం ఆధారం: పారమార్థిక పదకోశం +నేల మీద కూర్చొనడానికి అవసరమైన చాపలు తుంగ గడ్డితో చేసినవి మెత్తగా ఉంటాయి; +తుంగలో తొక్కు తుంగలో తొక్కకడం అంటే విసుక్కుంటూ పని చేయడం. ఇంక దీనితో నాకు పనిలేదు అనే విసుగు ఆ పనిపట్ల చూపడం అని ఈ జాతీయం అర్థం. +తు, చ తప్పకుండా అంటే అక్షరం గూడా పోకుండా అనే అర్థం లో వాడుతూంటాము; చ, వై, తు హి అనే పదాలు సంస్కృత శ్లోకాలలో పాదపూరణకు ఊత పదాలుగా (అర్థ వంతం కాకుండా ఊరక) వాడుతారు; సంస్కృతంలో తు అంటే ఐతే అని, చ అంటే మరియు అని అర్థం. హి అంటే కదా అని, వై అనేది గూడా తు అనే అర్థం లోనే వాడబడుతూంటుంది; ఇవి చిన్న పదాలు గాబట్టి పాదపూరణకోసం అవసరం లేకపోయినా చేరుస్తూ ఉంటారు; +సన్నంగా వేలెడంత పొడవు మాత్రమే వుండే చిన్న చిన్న మంచినీటి చేపలను తురంజీలు అంటారు. ఇవి కొండవాగుల్లో, కొండ కొలనుల్లో ఎక్కువగా కనబడతాయి. అరుదుగా దొరికే ఈ చేపలు ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ చేపలను చెరువుల్లో కృత్రిమంగా పండించలేరు. రూపంలో చిన్న బొమ్మిడాయిలలా కనిపిస్తాయి కాబట్టి వీటిని ఉత్తరాంధ్రలో 'చీకు బొమ్మిడాలు' అంటారు. నెల్లూరు ప్రాంతంలో 'ఉలుసులు' అంటారు; +1) రామతులసి bot Ocimum gratissimum same as నిమ్మతులసి; రామ తులసి భారతదేశంలో ఇంటింటా కనపడే రకం, భక్తి పూర్వకంగా కొలవబడుతుంది. ఆకుపచ్చని ఆకులతో ఘాటైన వాసన కలిగి ఉంటుంది; +5) సబ్జా తులసి నానిన సబ్జా విత్తులు మూత్రకారి (diuretic)గానూ, శృంగారోద్దీపకాలు(aphrodisiac)గానూ, చెమట పట్టించేవి (diaphoretic) గానూ, కడుపులోనుంచి గ్యాస్ ను వెడలించేవి (carminative) గానూ పేరొందాయి. ఈ మొక్క ఆకుల రసం కడుపులో క్రిమిదోషాన్ని నివారిస్తుంది. దీని వేళ్ళు జ్వర హారిణి (febrifuge) గా పనిచేస్తాయి. ఈ వేళ్ళ రసాన్ని పాము విషానికి విరుగుడు (Antidote to Snake poison) గానూ ఉపయోగిస్తారు. కామ కస్తూరి, కమ్మ గగ్గరాకు, రుద్రజడ వంటి పేర్లతో దీన్ని పిలుస్తారు. +--కొండపిండి మొక్క Sans పాషాణ భేది; +ఈ చెట్టు కాండం నుంచి స్రవించే జిగురు వంటి కొవ్వు గట్టిపడి తెల్ల డామర్ అనే రెజిన్ గా మారితే, దానిని గుగ్గిలంలా ధూప ద్రవ్యంగానూ, అగరు వత్తులు, మైనపు వత్తులు, సబ్బులు, వార్నిష్ లూ మొదలైనవాటి తయారీలోనూ వినియోగిస్తారు. +తెల్ల డామర్ కి వైద్యపరమైన ప్రయోజనాలూ ఉన్నాయి. ఆయుర్వేదంలో దానిని బలవర్ధకంగానే కాక, కడుపులోనుంచి గ్యాస్ ను వెడలించే (Carminative కళ్లెను వెడలించే (Expectorant) గుణాలు కలిగిన ఔషధంగానూ భావిస్తారు. గొంతుకు సంబంధించిన వ్యాధుల్లో, దీర్ఘకాలిక బ్రాంఖైటిస్, కీళ్ల సవాయి, మొలలు (Piles) వంటి వ్యాధులకు ఔషధంగానూ ఉపయోగిస్తారు. నువ్వుల నూనెతో కలిపి గనోరియా +(Gonorrhoea) కు, నెయ్యి, పిప్పళ్లు, డామర్ కలిపి సిఫిలిస్ కు ఔషధంగానూ ఆయుర్వేదంలో వినియోగిస్తారు. +Sans ‘అజాకర్ణ’ వీటి కాయలు మేక చెవులలాగా ముడతపడి ఉండటాన Hindi] ‘సఫేద్ డామర్’; +కొండపల్లి బొమ్మలను తెల్ల పునికి అనే మెత్తటి తేలికపాటి కర్రతో తయారు చేస్తారు; ఏటికొప్పాక బొమ్మలు స్థానికంగా విరివిగా లభించే తేలికపాటి అంకుడు కర్రతో చేస్తారు; +గుండె జబ్బులకు అద్భుతంగా పనిచేసే అర్జునారిష్ట అనే ఆయుర్వేద ఔషధం దీని కాండం పైబెరడుతో తయారు చేస్తారు; +ఆఫ్రికా ఖండంలో జన్మించిన ఈ మొక్క ప్రపంచమంతా విస్తరించి చాలా దేశాలలో బెడద మొక్క (Invasive Plant) గా పరిగణించబడుతున్నది. ఆఫ్రికాలోని గుడ్ హోప్ అగ్రం (Cape of Good Hope) ప్రాంతం నుంచి ప్రపంచమంతా విస్తరించిన కారణంగా దీనికి కేప్ హనీసకిల్ (Cape Honeysuckle) అనే పేరు వచ్చింది. దీని శాస్త్రీయ నామంలోని టెకోమారియా (Tecomaria) అనేది ఈ మొక్క యొక్క మెక్సికన్ పేరు కాగా, Capensis అంటే Cape నుంచి వచ్చిన మొక్క అని అర్థం. ఈ టెకోమారియా ప్రజాతిని ఒకప్పుడు టెకోమా (Tecoma) ప్రజాతిలో అంతర్భాగమని భావించేవారు. అయితే తదుపరి పరిశోధనలు ఈ మొక్కల్ని పొడ్రానియా Podranea) ప్రజాతిలో ఒక అంతర్భాగమని తేల్చాయి. ఈ మొక్కలు దాదాపు నిత్యం పూస్తూనే ఉంటాయి; +Sans సరటము (జరజరా (సరసరా) పాకేది కృకలము; కృకలాసము (కంఠాన్ని పైకీ, కిందికీ ఆడిస్తుంది కనుక కృకలాశము; +కేవలం తొండల్ని వేటాడి చీల్చి తినేసే ఒక గద్ద +తోటకం' అన్నది ఒక సంస్కృత ఛందస్సు (prosody) పేరు. నాలుగు సగణాలుంటాయి నననా నననా నననా నననా" అనే మాదిరిలో నాలుగు పాదాలతో ఉంటాయి. ఇలాంటి పద్యాలు ఎనిమిది ఉంటే అది తోటకాష్టకం. వేంకటేశ్వర సుప్రభాతంలో వినిపించే "కమలా కుచ చూచుక కుంకుమతో…" అని సాగేది కూడా తోటకమే; +--ఆకుకూరల్లో ఇది 'రాణి' వంటిదని అంటారు; + + +మాదీఫలం; వృక్ష ప్రపంచంలో డజన్ల కొద్దీ రకాల దబ్బ జాతి వృక్షాలున్నాయి. పలు సంకర జాతులూ రూపొంద��ంచబడ్డాయి. మాదీఫలం కూడా కొద్దిపాటి తేడాలతో ఇవే లక్షణాలు కలిగి ఉంటుంది. నోటి అరుచి (Anorexia పైత్యం, ఆకలి లేమి, తల తిప్పట వంటి వాటికి అద్భుతంగా పనిచేసే 'మాదీఫల రసాయనం' అనే ఆయుర్వేద ఔషధం మాదీఫలాల రసంతోనే తయారు చేస్తారు. +rel బీదరికం; పేదరికం ant ఐశ్వర్యం; +ety పారశీకంలో దర్- అన్నది సప్తమీ విభక్తిని తెలిపే పూర్వప్రత్యయము (preposition దాని అర్థం -అందు లోన. మియాన్- అంటే మధ్య, middle. దర్-మియాన్ అంటే మధ్యలో; ఏ కారణం చేతనో దర్-మియాన్ అన్నపదం తెలుగులో దర్-మిలా(న్) గా మారిపోయింది. అంతే కాక, ఆమధ్య కాలంలో అన్న అర్థం నుండి తదుపరి, పర్యవసానంగా అన్న అర్థవిపరిణామం కూడా జరిగింది. +--string rel పోగు fiber, తాడు rope, మోకు cable def పోగుకి పురి ఎక్కిస్తే దారం అవుతుంది; పురి ఎక్కించిన దారాలతో తాడు పేనుతారు; పురి ఎక్కించడానినే పేనడం అని కూడ అంటారు; +దీని ఆకులు ద్రాక్ష తీగ (Vitis vinifera) ఆకుల్లా ఉండే కారణంగా దీనికి విటిఫోలియా అనే పేరు వచ్చింది; విశాఖ జిల్లా నక్కపల్లి సమీపంలోని అడ్డరోడ్డు జంక్షన్ నుంచి ఏటికొప్పాక వెళ్ళే మార్గంలో రోడ్డుకి ఇరువైపులా ఈ మొక్కలే విస్తారంగా కనిపిస్తాయి; +ఈ మొక్కల కాండంపైని బెరడులోని నారతో దృఢంగా ఉండే తాళ్ళు పేనతారు. ఆ తాళ్ళు లేత రంగులో మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ మొక్క ఆకులను పశువులు ఇష్టంగా తింటాయి ఈ ఆకుల పసరును పాలతో కలిపి తాగితే నీళ్ల విరేచనాలు కట్టుకుంటాయి. వేళ్ళ రసాన్ని తలకి రాసుకుంటే తలలోని పేలు నశిస్తాయి. వేళ్ళ కషాయాన్ని తాగితే స్త్రీల రక్త ప్రదర వ్యాధి (Menorrhagia- ఋతురక్తం అధికంగా స్రవించే ఎర్రబట్ట వ్యాధి) నశిస్తుంది. ఈ మొక్క వేళ్లపైని బెరడు రసం లోనికి ఇస్తే పచ్చ కామెర్లు, వాపులు, సుగర్ వ్యాధి వంటివి తగ్గుతాయి. +ఇది నాలుగు మీటర్ల నుంచి ఇరవయి మీటర్ల దాకా పెరుగుతుంది. దీని జన్మస్థలం, ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ప్రాంతాలు; ఇటీవల వీటిని రోడ్లకి ఇరుపక్కలా నాటుతున్నారు; ఇది నీటి ఎద్దడికి బాగా తట్టుకోగలదు. పైకి ఎంత పెద్దదిగా పెరుగుతుందో లోపల అంత వేరు బలంగా సాగుతాయి. అవి కూడా భూమికి సమాంతరంగా నీటికొరకు వెతుకుతూ పెరిగేస్తాయి. మధ్యలో ఉండే స్టీలు, ప్లాస్టిక్, సిమెంట్ ఇలాంటి వేవీ దీని వేర్లను ఆపలేవు. అందుకని వీటిని భవనాల దగ్గర, డ్రైనేజి, నీటి గొట్టాలు, ఎలెక్ట్రిక్, ఇతర సరఫరా గొట్టాల పక్కన వేయకూడదు. +--dust storm ety దుమ్ము ఆరం; ఆరం అంటే అచ్చ తెలుగులో చక్ర��; +--సన్మానంలో ఒకశాలువ కప్పడం సరే.మహా గౌరవాన్ని ప్రకటించాలనుకుంటే రెండు శాలువలు కప్పే సంప్రదాయం ఉత్తరాది ఆచారం. +తెలుగు పదాలన్నీ (1) న్/ను చివర గలవీ 2) అలా ఉండనివి అని రెండు రకాలు న్/ను చివర గలవి ద్రుత ప్రకృతికములు. మిగిలినవి కళలు: వాడు, వచ్చి, రాడు, సీత, పురాణము, కావ్యాలు — ఇలాంటివి. +గ్రీకు భాషలో ఆక్సీ స్టెల్మా అంటే పుల్లని పాలు కలిగినది అని అర్థం. అంటే దీని పాలు చేదుగా ఉండటంతో పాటు, కొంత పుల్లగా కూడా ఉంటాయని గ్రహించాలి. లాటిన్ భాషలో ఎస్కా అంటే ఆహారం అని అర్థం. ఎస్కులెంటమ్ అంటే తినదగినది. ఈ మొక్క ఆకులు, పూలు, కాయలను కూరగా వండుకుంటారు. ఈ మొక్కను వండుకు తింటే బాలింతలకు పాలు సమృద్ధిగా పడతాయి. +నోటి పూత, నోటిలో పుళ్ళు, గొంతువాపు ఉన్నవారు ఈ మొక్క కషాయాన్ని పుక్కిట పడితే తగ్గిపోతాయి. ఈ మొక్క తాజా వేళ్ళ కషాయాన్ని తాగిస్తే పచ్చ కామెర్లు నయమౌతాయి. గాయాలు, పుండ్లను శుభ్రపరచేందుకు (Depurative) ఈ మొక్క కషాయాన్ని వాడతారు. ఈ మొక్క పాలు ఋతు రక్త స్రావాన్ని ఆపుతాయి. +Sans దుగ్ధికా (పాలు కలిగినది తిక్తదుగ్ధా (చేదుపాలు కలిగినది); +దెప్పుడు మాటలు అంటే తప్పుని ఎట్టి చూపిస్తూ వెటకారంగా మాట్లాడటం; +గ్రీకు భాషలో డైయాంథస్ అంటే 'దేవుని పువ్వు' అని అర్థం. గ్రీకుల దేవదేవుడు జూస్ (Zeus) కి ఇదెంతో ఇష్టమయినదనే నమ్మకం కారణంగా ఈ మొక్కను అందరూ ఎంతో పవిత్రమైనదిగా భావించేవారు. చినెన్సిస్ అంటే 'చైనాకు చెందినది' అని అర్థం. కారియోఫిల్లస్ అంటే 'లవంగమొక్క ఆకులవంటీ అని. +దేవతలు దివ్య' అనే పదం నుండి వచ్చింది.దివ్య' అంటే 'ప్రకాశవంతమయిన' అని అర్ధం; దేవతలు అనగా ప్రకాశవంతమయిన లేదా తెల్లని ఛాయ కలిగిన శరీరం కలవారు నరకం' అంటే 'చీకటి,అంధకారం నలుపు రంగు శరీరవర్ణం' కలవారు నివసించే ప్రాంతాలే 'నరకం'; +Note) Hyper-correction అంటే దురతిసవరణ. సరిగా పలకాలన్న మిషతో లేని శబ్దపరిణామాన్ని తీసుకురావడం. ఉదా: మామిడి మావిడి; మామయ్య మావయ్య; అవుతుంది. కాని చెవుడు hyper-correction) చెముడు; దేవుడు hyper-correction) దేముడు గా పలకడం తప్పు; ఇక్కడ చెవుడు, దేవుడు అన్నవే సరైన ఉచ్చారణలు. కానీ మావిడి' అన్నదానికి సరైన ఉచ్చారణ 'మామిడి' కాబట్టి దేముడు' కూడా 'దేవుడు' అన్న పదానికి సరైన ఉచ్చారణ అన్న భ్రమతో 'దేముడు' అని పలకడం దురతిసవరణ. +దక్షిణ అమెరికా లోని పెరు, బోలీవియా, కొలంబియా మొదలైన దేశాలలో ఈ మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి; దీనిని భారతదేశపు ���ద్యానవనాలలోనూ పెంచుతున్నారు; ఈ మొక్క పూల గెల కిందికి వేలాడే అరటి పువ్వు గెలను తలపింపజేస్తుంది; పూలు మాత్రం కిందికి వేలాడకుండా నిటారుగా పైకి తిరిగి ఉంటాయి; ఆ పూల దొప్పలలో నిలిచే వాన నీటిని పక్షులు, కీటకాలు తాగుతాయి; +దేశవాళీ లేదా చిన్న దొండ లేదా నైజాక దొండ; బొబ్బిలి దొండ; ఆర దొండ; పాము దొండ; జయపూరు దొండ; తియ్య దొండ లేదా కూర దొండ లేదా మంచి దొండ; +also దొగ్గలి కూర; ముళ్ళతోటకూర; రక్తబాష్పము; +దాదాపు 3000 species దోమలు గుర్తింప బడ్డాయి. ఇందులో 3 రకాల దోమలు, ఏడిస్ (Aedis కులెక్స్ (Culex) మరియు అనోఫిలుస్ (Anpohelus) తెగలు మాత్రము రోగ కారకులు. ఇన్ని రకాల దోమలలో కొన్ని నిశాచరులు (nocturnal వీటికి దీపం పడదు. కానీ కొన్ని అన్ని వేళలా తిరుగుతాయి. +దేశవాళీ దోస; నక్క దోస (చిన్న కాయలు ములు దోస; పందిరి దోస; బుడెం దోస లేదా కీర దోసకాయ; +Sans ధాన్యకం; దానకం; ధాన్యం; ధానీ; ధానేయకం; కుస్తుంభరీ; +పాత కాలంలో సామాన్య ప్రజలలో వాడుకలో ఉన్న న్యాయమైన వడ్డీ రేటు ఇది; +నవధాన్యాలు వడ్లు, యవలు, మినుములు, పెసలు, గోధుమలు, నువ్వులు, అనుములు, శనగలు, ఉలవలు; +దశ గ్రామ్య ధాన్యాలు వడ్లు, యవలు, మినుములు, మసూర్ పప్పు, గోధుమలు, నువ్వులు, సన్న ఆవాలు, ప్రియంవద, కందులు, ఉలవలు; + + +* ఈ నిఘంటువు, ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ వారు 2002 లో ప్రచురించిన ముద్రిత ప్రతి కంటే మెరుగైనది (విస్తరించాం, లోపాలను సవరించాం, కొత్త అంశాలను చేరుస్తూ ఉన్నాం) +* మీరూ దీన్ని విస్తరించవచ్చు. కానీ తొలగింపులేమీ చెయ్యకండి లోపం దొర్లిందని మీకు కచ్చితంగా, నిర్ద్వంద్వంగా, నిరాక్షేపణీయంగా తెలిస్తే తప్ప. +* ఇక్కడ ఇచ్చిన పదాలు, వాటి అర్థాలూ వ్యక్తిగతంగా మీకు అంగీకారం కాదు కాబట్టి వాటిని తొలగించకండి. +* ఇంగ్లీషు భాష యొక్క అమెరికను స్పెల్లింగును వాడాం. +* ఇక్కడి తెలుగు పదాల అమరిక గురించిన వివరణ సుదీర్ఘమైనది కాబట్టి ఇక్కడ చర్చించలేం. +2) rein; halter; the rope used to control a horse or an ox; ఎద్దుల ముగుదాళ్లకుగాని, కొమ్మల మొదళ్లకుగాని కట్టి బండితోలే మనిషి పట్టుకొనే తాడు; ఇది బండిని మలుపుకోటానికి, కావలసినప్పుడు ఆపటానికి అవసరం; +అగడ్తలు చుట్టూ ఉండే నగరం అనే నిర్వచనం ఒకటి ఉంది; ముఖ్య నగరం పట్ట్ణణం అని మరొక నిర్వచనం ఉంది; +పటము ఆటోపము; ఆటోపం అంటే హడావిడి, సంభ్రమము గర్వం ఆడంబరము అని నిఘంటువు చూపిన అర్థాలు. +మనిషిలో పస ఏమీ లేకపోయినా పైకి డాబుసరిగా పెద్ద హోదాల��� ఉన్నట్టు నటించడం పటాటోపం; +తీగె ప్రాకడానికి ఆధారమైన చెట్టు కొమ్మను పట్టుగొమ్మ అంటారు. అదే విధంగా ఒక కార్యానికి ముఖ్యంగా సహకరించే వ్యక్తిని పట్టు గొమ్మ అనవచ్చు . +--boat rel తెప్ప, నావ; బల్లకట్టు; పుట్టి; లాంచీ; +అంకిలిబడు అంకిలి పడు అడ్డుపడు to block; +చొప్పడు చొప్పు+పడు సరిపడు, అమరిఉండు to suit; +--thesaurus; పదార్థ భాండాగారం def నిఘంటువు పదాలకి అర్థాలు చెబితే, పదకోశం అర్థాలకి పదాలేమిటో చెబుతుంది; +మారు; పాలి; సారి; తూరి; విడత; +యజ్ఞాలలో ఆర్యులు జంతుబలి ఇచ్చిన తరువాత బలి పశువు మాంస ఖండాలను మంటలపై కాల్చి తినే పలలములు "కబాబ్" ల వంటివే; పలలాహారం నుంచే పలహారం అనే శబ్దం ఏర్పడింది. +పల్లె అంటే వంద కుటుంబాలు లేదా అంతా కన్నా తక్కువ కుటుంబాలు జీవనం సాగిస్తూ వుంటాయి, ఇక్కడ ప్రభుత్వానికి సంబందించిన ప్రాధమిక పాఠశాల (ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు మాత్రమే, అంగన్వాడీ స్కూల్ మాత్రమే వుంటాయి. +ప్రత్యగాత్మ అంటే "అసలు సిసలు నేను" అని అర్థం. ప్రత్యగాత్మా ప్రతి+అక్+ఆత్మా. ప్రతి అంటే వెనుకకు అని. అక్ అంటే వెళ్ళుట. అక్ అనేది అఞ్చ్ అనే ఒక ధాతువు నుండి వచ్చింది. అఞ్చ్ గతౌ అని ధాతుపాఠం. వెనుకకు వెళ్ళటం అంటే ఏ వెనుకకు వెళ్ళాలి? ఏదైతే దేహము కాదో, దేహానికి సాక్షియో, ఏది కర్మేంద్రియములు కాదో, కర్మేంద్రియములకు సాక్షియో, ఏది జ్ఞానేంద్రియములు కాదో, జ్ఞానేంద్రియములకు సాక్షియో, ఏది మనస్సు కాదో, మనస్సుకు సాక్షియో, ఏది బుద్ధికాదో, బుద్ధికి సాక్షియో, ఏది అహంకారము కాదో, అహంకారమునకు సాక్షిగా నిలచియున్న ఏ చైతన్యము కలదో, ఆ ఎరుక, అదియే ప్రత్యగాత్మ. ఆ ప్రత్యగాత్మయే అసలు సిసలైన నేను. అటువంటి ప్రత్యగాత్మగా, అసలు సిసలు నేనుగా విరాజిల్లుతున్నదే ఆ పరమాత్మ; +--ఉదా. ఒక క్రియా పదం మీద ప్రత్యయాన్ని చేర్చి నామవాచకంగా మార్చినప్పుడు ఆ ప్రత్యయాన్ని కృత్ప్రత్యయం అనిన్నీ అలా వచ్చిన నామవాచకాన్ని కృదంతం అనిన్నీ అంటారు; అలుగు అలక; ఎన్ను ఎన్నిక; +ఏదన్నా వినకూడని మాట, అశుభం అనిపించే మాట విన్నప్పుడు "అమంగళం ప్రతిహాతం అవుగాక అంటే అది మాటతోనే ఆగాలి, జరగకూడదు అని చెప్పటం. +అప్రతిహతంగా సాగింది అంటే "ఆటంకం లేకుండా జరిగింది" అని అర్థం; +ప్రమథ అంటే భూతపతి శివుడి గణాలలోని ఒక రకం భూతం. +see also చేతబడి; కట్టుమోను; బాణామతి; గండభేరుండం; +a suffix to a village name; గుల్లిపాడు; కంకిపాదడు; పాడు చివర వచ్చే గ్రామనామాలు జైనమత సంబంధాన్ని సూచిస్తాయి. ఆంధ్రదేశంలో 12వ శతాబ్ది వరకు జైనం బాగా వర్ధిల్లింది; +Note) శివలింగానికి కింద ఉండే పళ్ళెం పేరు పానపట్టం; అభిషేకం చేసిన ద్రవ్యాలు బయటకి వచ్చే మార్గం సోమసూత్రం; శివాలయాలు తూర్పు ముఖం గానూ, పశ్చిమ ముఖం గానూ ఉంటాయి; అవి ఏ ముఖంగా ఉన్నా సోమసూతం మాత్రం ఎల్లప్పుడూ ఉత్తరం వైపునే ఉంటుంది; +భారతదేశంలో విషపూరితమైన 50 జాతుల పాములున్నాయి. అయితే వీటిలో ఎక్కువభాగం జాతులవల్ల మనిషికి ఎలాంటి ప్రమాదం లేదు. +బంగారు కట్ల పురుగు Banded Krait bio Bungarus fasciatus నల్లని లేక ముదురు గోధుమ వర్ణం శరీరం మీద బంగారు పసుపు రంగు పట్టీలు కలిగి ఉండే ఈ పాములు మనిషితో తలపడే సందర్భాలు చాలా అరుదు. +బొక్క బెరడు Pit Viper; కోరలలో తాను ఆహారంగా తీసుకునే కప్పలు, తొండల వంటి చిన్న జంతువులను చంపేందుకు అవసరమైన తేలికపాటి విషం మాత్రమే ఉంటుంది. బొక్కబెరడు కరిస్తే పెద్ద జంతువులు లేక మనుషులకు వాపు, నొప్పి తప్ప ప్రాణానికి మాత్రం ఎలాంటి ప్రమాదమూ ఉండదు; +రక్త పెంజెరి కాటుక రేకుల పొడ Russell’s Viper bio Vipera russelli of the Viperidae family; a venomous snake; ఇది కరచినప్పుడు దీని విషం కారణంగా రక్తం విరిగి పల్చబడి పోతుంది.రక్తపోటు తగ్గిపోయి, గుండె బలహీనపడుతుంది. ఎర్ర రక్త కణాలు ధ్వంసమౌతాయి.రక్తంయొక్క గడ్డకట్టే స్వభావం తగ్గిపోయి శరీరంలో అంతర్గత స్రావాలు పెరిగిపోతాయి. ఒళ్ళంతా పోట్లు, వాంతులు మొదలౌతాయి. ఇది కరచిన చోట త్వరత్వరగా వాచుకొచ్చి, గాయం నుంచి పల్చబడిన రక్తం స్రవిస్తుంది. శరీరం చల్లబడి ఒళ్ళంతా చెమటలు పట్టుకొస్తాయి. గుండె, శ్వాసకోశ సమస్యలు, సెప్టిసీమియా (Septicaemia) మొదలైనవాటి కారణంగా ఆ వ్యక్తి 1 నుంచి 14 రోజులలోపు మరణించడం జరుగుతుంది. ముంబాయిలోని హాఫ్^కిన్ ఇన్స్టిట్యూట్ తయారుచేసే పాలీవాలెంట్ సీరం (Polyvalent Serum) రక్త పెంజెరి విషానికి ప్రభావవంతమైన విరుగుడు. సకాలంలో చికిత్స చేస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఇది మిగిలిన చాలా పాములలాగా అండజము (Oviparous) కాదు. వాటిలా ఇది గుడ్లు పెట్టక, నేరుగా పిల్లల్ని కనే జరాయుజము (Viviparous దీని గర్భంలోనే గుడ్లు పగిలి పిల్లలు బయటికొస్తాయి; కొన్నిటికి కంటికి సమీపంలో అటూఇటూ రెండు రంధ్రాలు ఉంటవి కనుక పిట్ వైపర్లంటారు; +రాచనాగు King Cobra bio Ophiophagus hannah బాగా దట్టమైన, ఎప్పుడూ ఆకుపచ్చగా ఉండే సతతహరితారణ్యాలలోనే ఉంటుంది; +note) పాము కరచిన వ్యక్తి బతకాలంటే కేవలం పెద్ద పెద్ద వైద్యశాలలలో మాత్రమే లభించే పాముకాటు ���ీరం (Antivenom Serum) వాడటం మినహా మార్గం లేదు; మంత్రాలకి విషం దిగదు; +పారశీకంలో హోష్ (هوش) అంటే తెలివి, సృహ. హోషియార్ (هوشيار) అంటే తెలివి కలిగి ఉండడం. అప్రమత్తంగా ఉండే స్థితి. హోషియార్ అన్న పదమే తెలుగులో హుషార్ గా మారిపోయింది. తెలుగులో ఉషారు అన్న పదం కూడా హోషియార్‌కు రూపాంతరమే. +--ప్రహర అన్న సంస్కృత పదానికి దినములో ఎనమిదోవంతు భాగం లేదా ౙాము అన్న అర్థం ఉంది. నిజానికి ప్రహార అంటే దెబ్బ. రోజులో ఒక ౙాము గడిచిందని సూచించడానికి ఢక్కా నాదం చేసేవారు. ఆ దెబ్బ పేరుమీదే ప్రహర అంటే రోజులో ౙాముకు సమానార్థకంగా మారిపోయింది. ఆ ప్రహర అన్న పదమే ప్రాకృతాల్లో పహరగా మారిపోయి, తెలుగులో -హ-కారం లేదు గాబట్టి పార-గా రూపాంతరం చెందింది సురేశ్ కొలిచాల); +కికి, కిదివి, చాషము, చిత్రవాజము, చిత్రవాలము, పాలగుమ్మ, పూర్ణకూటము, సుపర్ణము; నీలకంఠ; +ety పాప కి అడ్డంగా ఉన్నది; +పెద్ద పావిలాకు; బొడ్డు పావిలాకు; గంగ పావిలాకు; +కొండపిండి మొక్క; తెలగపిండి కూర మొక్క +గింజలో నుండు ప్రాథమికాక్షము మొక్క భూమి పైకి పెరుగు కొన; +ప్రాణ ప్రద ఔషధములు అనవచ్చు (ప్రాణాలు నిలిపే మందులు.) +ఉచ్చారణలో ఒకే విధంగా వుండే పదాలను వాడడం. తెలుగు, హిందీలలోో అంత్య ప్రాసకు (तुकान्त) చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తారు +note) మానవులలో యుగాండం (zygote) అన్న పేరు శిశుసంకల్పన (conception) సమయం నుండి ఐదో వారం వరకు వర్తిస్తుంది. ఐదవ వారం నుండి పదవ వారం వరకు దీనిని పిండం (embryo) అని పిలుస్తారు. పదకొండవ వారం నుండి ప్రసవం అయి బిడ్డ భూపతనం అయేవరకు భ్రూణం (ఇంగ్లీషులో ఫీటస్, fetus) అంటారు ప్రసవం అయినప్పటినుండి మాటలు వచ్చేవరకు శిశువు (infant) అంటారు ఇంగ్లీషులో ఇన్^ఫెంట్ అంటే మాటలు రాని పసిబిడ్డ అని అర్థం. మాటలు మాట్లాడడం మొదలు పెట్టిన తరువాత బిడ్డ (child) అంటారు. బిడ్డ అనే మాట ఆడ, మగ కి వర్తిస్తుంది. +దీని లేత మొగ్గలలో నీరు ఉంటుంది. వాటి చివళ్ళు గిల్లి ఆ మొగ్గల్ని నొక్కితే పిచికారీ లాగా నీళ్లు చిమ్ముతాయి; +ఊర పిచ్చుకలు సాధారణంగా 15 సెంటీమీటర్ల పొడవు ఉండి గుండ్రని శరీరం, గుండ్రని తల కలిగి ఉంటాయి. మగ ఊరపిచ్చుక వీపు భాగం చెస్ట్ నట్ రంగులో అక్కడక్కడా నల్లని చారలు కలిగి ఉంటుంది. గొంతు, ఎగువ రొమ్ము భాగం నల్లగా ఉంటుంది. పొట్ట, దిగువ భాగం ముదురు బూడిద రంగులో ఉంటుంది. తోక ఈకలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఆడ పిచ్చుకల వీపు భాగంలోని ఈకలు మట్టి రంగులోనూ, లేత గోధ��మ రంగులోనూ ఉంటాయి. పొట్ట భాగం లేత బూడిద వన్నెలో ఉంటుంది. పిచ్చుక దృఢమైన ముక్కు ఎంత గట్టి గింజలనైనా చీల్చి పొట్టు తీయడానికి అనువుగా ఉంటుంది. +పిత్తల అంటే ఇత్తడి. హాటకము అంటే బంగారం. ఇత్తడిని చూపించి బంగారం అని నమ్మించే ప్రయత్నం చేయటం పితలాటకం. ప్రస్తుతం ఈ మాటని ఇబ్బంది, సమస్య, సందేహం అనే అర్థాలలో వాడుతున్నాము. +పితూరీ శబ్దం అరబ్బీ ఫితూర్ శబ్దం నుండి వచ్చింది; ఫితూర్ అనగా అశాంతి, అలజడి, అరాచకం అని అరబ్బీ లో అర్థాలు. ఇది మానసికమైన అలజడి కావచ్చు, బాహ్య పరిస్థితులు బాగుగా లేక చెలరేగే అశాంతి కావచ్చు. కాలక్రమేణా ఇది ఉర్దూ ద్వారా తెలుగులోకి దిగుమతి అయి తిరుగుబాటు, దోపిడీ, రాజ ద్రోహం, కుట్ర, అరాచక శబ్దాలకు సమానార్థకంగా మారింది; +పిప్పలమోడి, ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించే ఒక రకమైన వేరు. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాలలో ఏడాదికి పది కోట్ల రూపాయలకు పైగా అమ్ముడౌతున్న వేరు ఇది. గిరిజనులు చట్టబద్దంగా చేస్తున్న సాగు; +--దీని ప్రతి ఆకు అంచు (leaf margin) మీద ప్రతి నక్కునుంచి వచ్చే వేలాది లేత గులాబి రంగు చిట్టి ఆకులు తడినేలమీద పడి కొత్తమొక్కగా రూపొందుతాయి. అందుకే ఈ మొక్కని 'పింక్ మదర్ ఆఫ్ థౌజండ్స్' అనడం. సీతాకోక చిలుకలలగా ఉండే ఈ చిట్టి పింక్ ఆకుల్నిబట్టి ఈ మొక్క ను పింక్ బటర్ ఫ్లైస్ (Pink Butterflies) అని కూడా అంటారు; +Sans పిల్లిని సంస్కృతంలో మార్జాలము అంటారు మార్జనమ్' అంటే శుభ్రం చేసుకోవడము. కాబట్టి పిల్లి పేరులోనే ఉంది అది 'పరిశుభ్రమయినది అని. +a medicinal root; సన్న ముళ్ళు కలిగిన దీని ఆకు పచ్చని కాండాన్ని పుష్పాలంకరణలో వాడతారు. దుంపలలాగా ఊరే దీని +వేళ్ళను పురుషుల శక్తి పెంపొందించే చికిత్సలలో వాడతారు +పిశాచం అంటే తీరని కోరిక ఉండి ఆయువు పూర్తి కానివి. వీటినే కామపిశాచి లేదా కామినీ అంటారు; కామం అంటే కోరిక. ఏదైనా కావొచ్చు. ఇవన్నీ శివుడిని (రుద్రుడిని)ఆశ్రయించి ఉంటాయి. దిక్కు లేని వాటికి దేవుడే దిక్కు కదా; +lit పిండిని పిసకడం; చెప్పిందే చెప్పడం; బోర్ కొట్టించడం; +గ్రంథరచనకు 'ఆధారము' అనే అర్థంలో ఈ పీఠిక అనే పదాన్ని వాడతారు; రచవల్లో ఆ రచన ఆకృతి దాల్చడానికి ప్రధాన కారణాలూ, రచనా సందర్భం మొదలైన వివరాలున్న భాగాన్ని పీఠిక అంటారు. గ్రంథరచనకు చేసిన ప్రయత్నాలు, పడిన కష్టాలు, సాఫల్యం మొదలైనవన్నీ ఇందులో చోటు చేసుకొంటాయి; కృతికర్త, కృతిభర్త, ప్రోత్సాహకులూ ���ాళ్ల వివరాలుంటాయి. అవన్నీ రచయితే స్వయంగా చెప్పేవి కావచ్చు, ఇతరులెవరైనా రచయిత కోరిక మీద వ్రాసినవీ కావచ్చు; +గ్రంథ ప్రారంభంలో కనిపించే తొలిపలుకు, ముందుమాట, భూమిక, ఉపోద్ఘాతం, పస్పశము, ప్రస్తావన, ఉపక్రమము, అవతారిక, నాంది introduction, preface, prelude, prologue, Preamble నే పీఠిక అని కూడ అంటారు; +గ్రంథం చివరిలో ఉపసంహారము, మలిపలుకు, చివరిమాట, భరతవాక్యం, epilogue, colophon, వీటిని ఉత్తర పీఠిక అంటారు; +ety పుండా అంటే మరాఠీలో దొంగ కోరు అన్న ప్రత్యయం పారశీకంలోని ఖువర్ నుండి వచ్చింది; అబద్ధాల కోరు, ఖూనీకోరు, దగాకోరు, దివాళాకోరు మొదలైన పదాల్లో కనిపించే కోరు ఇటువంటిదే; +వేయించిన శనగపప్పు; మూకుడులో ఇసక వేసి, ఆ వేడి ఇసకలో శనగలు వేయిస్తారు; +భారతీయ పద్ధతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే పధ్ధతి: +జన్మదినమిదం అయి ప్రియసఖే శం తనోతు తే సర్వదా ముదమ్ +ప్రార్థయామహే భవ శతాయుషి ఈశ్వరస్సదా త్వాం చ రక్షతు +పుణ్యకర్మణా కీర్తిమార్జయ| జీవితం తవ భవతు సార్థకం +ఓ ప్రియమైన మిత్రమా, ఈ పుట్టినరోజు నీకు ఎప్పటికీ ఐశ్వర్యాన్ని మరియు ఆనందాన్ని తెచ్చుగాక! +నీ దీర్ఘాయువు కోసం మేమంతా ప్రార్థిస్తున్నాము; దేవుడు నిన్ను ఎల్లప్పుడు రక్షించుగాక! +పుణ్యకర్మల ద్వారా నేవు కీర్తిని పొందుము; నీ జీవితం సార్థం అగుగాక! +note 1] పునుగు పునుగు పిల్లి లేక మార్జారిక (Civet Cat) అనే జంతువు నుంచి సేకరించే సుగంధద్రవ్యం. దీనినే జవాది, జవాజి, జవ్వాజి, జవ్వాది, సంకు మదము అనే పలు పేర్లతో పిలుస్తారు. వేంకటేశ్వరునికి నిత్యం చేసే అలంకరణలలో సంకుమదం అలదడం కోసం తిరుమల కొండలమీద పునుగు పిల్లుల్ని ప్రత్యేకంగా పెంచుతారు. +note 2] చట్టము అన్నా పునుగు చట్టము అన్నా పునుగు పిల్లి శరీరంలో ఉండే ఒక గ్రంథి లేక సంచి. దీనిని పిండి, పునుగు అనే సుగంధ ద్రవ్యాన్ని సేకరిస్తారు. +--ఇవి రాత్రివేళల్లో తిరిగే Viverridae కుటుంబానికి చెందిన పిల్లి తరహా జంతువులు. వీటిలో మొత్తం పన్నెండు ఉపజాతులున్నాయి. సుగంధభరితంగా ఉండే వీటి మదాన్ని సేకరించి సుగంధద్రవ్యంగా ఉపయోగిస్తారు. దీనినే సంకు మదము, జవ్వాజి, పునుగు వగైరా పేర్లతో పిలుస్తారు. ప్రపంచంలోనే అతి పరిమళభరితమైన, అత్యంత ఖరీదైన కాఫీ (Civet Coffee) ఈ పునుగుపిల్లుల నుంచి తయారు చేస్తారు. +కాఫీ పళ్ళ (Coffee Berries) ని పునుగు పిల్లుల చేత తినిపించి, అవి విసర్జించిన కాఫీ గింజల (Coffee Beans) ను సేకరించి, +శుభ్రపరచి, వేయించి, పొడిచేస్తారు. పర���మళభరితమైన ఈ కాఫీ ప్రపంచంలో అతి ఖరీదైన కాఫీ. చైనా, ఫిలిప్పీన్స్, వియత్‌నామ్ వంటి ఆసియా దేశాలలోని ధనికులు ఈ కాఫీ తాగుతారు. +బ్రహ్మ పురాణం; పద్మ; విష్ణు; శివ; భాగవత; నారదీయ; మార్కండేయ; భవిష్యత్తోత్తర; ఆగ్నేయ బ్రహ్మవైవర్త; లింగ; వరాహ; స్కాంద వామన; మత్స్య కూర్మ గరుడ; బ్రహ్మాండ పురాణములు; +పప్పు లో వేసుకుంటే ఈ ఆకుకూర చాలా రుచిగా ఉంటుంది. కొందరు పాలకూర, తోటకూర వంటి పులుపులేని ఇతర ఆకుకూరలతో దీనిని పులుపుకోసం కలిపి కలగూరగా వండుకుంటారు; +--tamarind rice ety పులి ఓగిరము పులిహోరిగము పుకిహోర పులిసిన ఓగిరం; పులియబెట్టిన అన్నం; +పుల్లలతో కుట్టిన విస్తరాకులు; పుల్లాకులు; అడ్డాకులు; +3) పొట్లపు రిక్క; తొండరూపు రిక్క; +తాళపత్ర, ఇతర చేతివ్రాత గ్రంధాలలో చివరిలో కనిపించే గ్రంథరచయిత వివరాలు, గ్రంథరచనకు కారకులైనవారి వివరాలు, గ్రంథ రచనా కాలం, మొదలయిన వివరాలు కలిగిన పుష్పిక (colophon)లు ఆ గ్రంథానికి ఉత్తర పీఠికలు అవుతాయి; +ety పుస్తె కమ్మ తాడుతో కట్టిన తాటి ఆకులు; +మంగళసూత్రం; తాళి; తాళిబొట్టు; పసుపుకొమ్ము కలిగిన తాడు పసుపుతాడు. +పుస్తె కమ్మ పుస్తకం తాడుతో కట్టిన తాటాకుల కట్ట; కమ్మ అంటే తాటాకు; +మీమాంస శాస్త్రంలో ఒక విషయాన్ని నిర్ధారించడానికి, ముందుగా ఒక విషయాన్ని తీసుకుంటారు. ఆ తరువాత ఆ వాక్యానికి ఇదే అర్థమంటూ ఒక సమస్యని లేవనెత్తుతారు. ఆ తరువాత, ఆ అర్థానికి వ్యతిరేకంగా వాదిస్తారు. దీనిని పూర్వపక్షం అంటారు. తరువాత పూర్వపక్షంలో చెప్పిన దానిని ఖండిస్తూ మాట్లాడతారు. దీనిని ఉత్తరపక్షమంటారు. +పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస తత్వాలు, సనాతన హిందూ భావనలలో, ఆచరణల్లో పరిణామాన్ని (evolution) ని సూచిస్తాయి. పూర్వ మీమాంస, భగవంతుడికి వ్యక్తిత్వం (రాగద్వేషాలున్న పర్సనాలిటీ) ఉందని, మనం ఆయన్ని సంతోష పెట్టవలసిన అవసరం వుందని చెప్తుంది. అందుకు మనం చేయ వలసిన పనులు (కర్మ కాండలు వాటిని చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు తెలుపుతుంది. వీటిని పాటించడం ద్వారానే ఆయనను చేరుకోగలమన్న భావన వ్యాప్తి చెందింది. అంటే నియమాలతో చేసే కర్మ కాండలే ముక్తికి మార్గమని చెప్పబడింది. +Sans అలూకం; పిండాల్‍ (పిండ ఆలు పెండలం; +ఇది తడి నేలలలో పెరిగే బెడద మొక్క (Invasive Plant పదునైన ముళ్ళు కలిగి త్వరత్వరగా వ్యాపించి, పొదలా పెరిగే ఈ చెట్టు ఆకులు అత్తపత్తి (Touch me- not or Mimosa pudica) ఆకులలాగే స్పర్శ తగలగానే సిగ్గుతో ముడుచుకుపోతాయి. అయితే అత్తపత్తి కంటే ఈ మొక్క పెద్ద పొదలాగా అనుకూల పరిస్థితులలో వృక్షంలాగా కూడా పెరుగుతుంది. ప్రపంచంలో వ్యవసాయదారుల పాలిట శాపంగా మారిన చకచకా పెరిగే 100 బెడద మొక్కలలో ఇది ఒకటిగా పేరొందింది. నల్ల తుమ్మ బెరడు లాగే ఈ మొక్క బెరడులోనూ టానిన్లు (Tannins) ఉన్న కారణంగా తోళ్ళు ఊనడం కోసం వినియోగించడం, వేరు కంతులలో నత్రజని స్థిరీకరించే కారణంగా భూసారాన్ని పెంచేందుకు తోడ్పడటం మినహా ఈ మొక్కలకు ప్రత్యేకించి ప్రయోజనాలు ఏవీ లేవు. ఈ మొక్క తొట్టతొలి జన్మస్థలం మధ్య అమెరికాలోని మెక్సికో ప్రాంతం. తూర్పు ఆసియా దేశాల్లో ఈ మొక్కని వియత్నమీస్ థార్న్ (Vietnamese Thorn) అంటారు. అత్తపత్తి లాగే లేత పింక్ రంగు పూలు, ముడుచుకుపోయే స్వభావం కలిగిన ఆకులు కలిగి ఉండటాన్నిబట్టి జనం దీనిని 'పెద్ద అత్తపత్తి' అంటున్నారు. +ఉసిరి గింజల పొడిని, అశ్వగంధ వేళ్ళ పొడిని సమ పాళ్ళల్లో కలిపి, తేనెతో తింటే వీర్య పుష్ఠి కలుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది; +పెరుగుని లాక్టోబాసిలస్ అనే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాతో పాలను పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు Sans దధి; +ప్రేరణ అనేది బాహ్యంగా ఏర్పడిన పరిస్థితుల ప్రభావం. ఉదా: మందర ప్రేరణ వల్ల కైక బుద్ధి చెడింది. +‘ఎలెంజి’ అనేది దీని మలయాళీ పేరు యొక్క లాటిన్ రూపం; మలయాళంలో ‘ఇలాంజి’ లేక ‘ఎలాంజి’ అంటారు; +పొగడ చెట్టు పెద్ద సతతహరిత (ఎప్పుడూ ఆకుపచ్చగా ఉండే) వృక్షం ఇది అరుదుగా 120 అడుగుల ఎత్తువరకూ కూడా పెరుగుతుంది. మొదలు చుట్టుకొలత 9 అడుగులుండే వృక్షాలు కూడా అక్కడక్కడా కనుపిస్తాయి. దీని కాండం ముదురు చాక్లెట్ రంగులో నెర్రెలు విచ్చి ఉంటుంది. చెట్టంతా ఎప్పుడూ ఆకులు ఒత్తుగా ఉంటాయి. అందుకే నీడనిచ్చే వృక్షాలలో పొగడది ఓ ప్రత్యేకమైన స్థానం. +పిచ్చుక పొట్ల pointed gourd bot T. dioica dioica అంటే ఆడ పూలు, మగ పూలు వేర్వేరు మొక్కలకి పూసేవి అని అర్థం; +ఈ లాటిన్ పేరుకు మూలం ‘కాలోస్’ (అందమైన ‘ఫిల్లం’ (ఆకు) అనే గ్రీకు పదాలు. పొన్న చెట్టు అందమైన ఆకులనుబట్టి దానికి ‘కాలో ఫిల్లం’ అనే పేరు వచ్చింది. గ్రీకు భాషలో ‘ఐనోస్’ (inos) అంటే ‘బలమైన’ అని అర్థం. దీని బలమైన, పెద్ద ఆకుల్నిబట్టి దీనికి ‘ఐనో ఫిల్లం’అనే పేరు వచ్చింది; +see also కుంపటి; దాలి; అధిశ్రయిణి; అంతిక; +వక్క; పీటీచెక్క rel ఉప్పుచెక్క; బంగారు వక్క; +ప్రతిఏటా కొత్త చోట అడవి నరికి వ్యవసాయం చేయటం; ఆనాటి 1882 మద్రాసు ఫారెస్ట్ యాక్���్ గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకోకుండా నిషేధించింది. దానికి వ్యతిరేకంగానే అల్లూరి సీతారామరాజు ఉద్యమించాడు; +పోపు ఎందుకు వేస్తారు? నూనె ఎమోలియంట్, అంటే ఒక్క చుక్క వేగముగా పరుచుకోగలదు! మంచి సాల్వెంట్, అంటే ఆర్గానిక్ పదార్ధాలని సులువుగా తనలో విలీనము చేసుకోని ఆ పదార్ధము మూలలలోకీ తీసుకెళ్ళగలదు! అంటే పోపులోని కరివేపాకు లేదా ఇంగువ తమతమ సువాసనలను మంచి గుణాలనూ కూరలోని అన్ని చోటలకు మోసుకెళ్ళ అశక్తులు, ఇక్కడ నూనె ఆపని చేయించిపెడుతుంది! +ఏ ప్రయోజనం లేకుండా నిరుపయోగంగా ఊరి బయట పడియున్న ఖాళీ స్థలాలకు ద్రవిడ భాషల్లో "పోరంబొక్కు" అన్న పదం ఉన్నది; +బ్రోచేవారెవరురా is incorrect usage; it should be ప్రోచేవారెవరురా ప్రోచేవారెవరురా నిను వినా రఘువరా +నను బ్రోచేవారెవరురా" అన్నప్పుడు నను లేక నన్ తఱువాత వచ్చే ప్రోచేవారు నను బ్రోచేవారు అవుతుంది. మొట్టమొదటనే బ్రోచేవారు అని ఆరంభించుట తప్పు. + + +ety నంగి a person who speaks or utters through the nose; నాచు a thief; నమ్మకము పుట్టించి ద్రోహము చేయఁబోవువారు నంగినంగిగా మాటలాడుచు నక్క వినయము చూపెదరు. అట్ల నక్కవినయము చూపు మోసగానికి ’నంగినాచు’ అని పేరు; +భవిష్యత్‌లో ఏం జరుగుతుందో మనం ఊహించలేం" అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.ఆశావాద దృక్పథం మంచిదనీ, ఆశావాద దృక్పథం వల్ల విజయం, ఆనందం కలుగుతాయని ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆశావాదాన్ని సూచించడానికి మనవాళ్ళు నందోరాజా భవిష్యతి అంటారు; +జన్మనక్షత్రం జన్మరాశి asterism at birth; the position of the moon at the time of birth; పుట్టిన సమయంలో క్షితిజం (Horizon) వద్ద ఉదయిస్తున్న రాశిని, లేక ఉన్న రాశిని జన్మ లగ్నం అంటారు. ఒకొక్క రాశి క్షితిజాన్ని దాటడానికి ఉజ్జాయింపున 2 గంటలు తీసుకుంటుంది. +ఉత్తర సర్కారులలో కొండలలో పెరుగు చెట్టు. +లౌకికార్థంలో నర్మగర్భంగా మాట్లాట్టం అంటే మనసులో ఉన్నదాన్ని సూటిగా కాకుండా మరోరకంగా అర్థమయ్యేట్టు ఎదుటి వాళ్ళకు చెప్పటం; నిగూఢమైన అర్థముతో నిండినది; అవమానపరచే దృష్టి లేకుండా చమత్కారంగా నవ్వు వచ్చేట్టు మాట్లాడడం నర్మ గర్భ సంభాషణం నర్మం అంటే పరిహాసము, వినోదము, సంతోషము అని అర్ధాలు; +బిందిపాము; రక్తపుచ్చం; ఇది చిన్న పాములా కనిపించే బల్లి; రక్తపుచ్చం అంటే ఎర్రని తోక గలది అని అర్థం; బిందిపాము గాఢమైన ఆకుపచ్చ, నలుపు రంగులలో మధ్య నిలువు లేత రంగు చారలతో మెరుస్తూ ఎరుపు తోకను కలిగివుంటుంది. కొన్ని మొత్తం ఒకే రంగులో కూడా వుంటాయి. దీనికి రెండు జతల కాళ్లు తల వెనుక, తోక ముందు భాగంలో వుంటాయి. చిన్న చిన్న కీటకాలు వీటి ఆహారం; +పాత విషయాలే అయినప్పటికీ, వాటిని స్వంత పద్ధతిలో చెప్పడాన్ని నవనవోన్మేషశాలిత్వం అంటారు. అదే నైపుణ్యము లేదా ప్రజ్ఞ; +పామురాయి; పాము ముత్యం; పాము యొక్క ఉపయోగించబడని విషం కొంతకాలానికి ఇలా రాయిగా మారుతుంది; ఇది విలువైన రాయీ కాదు, ముత్యం అంతకన్నా కాదు. దీనితో ఎవరిని వశపరుచుకోవటమూ సాధ్యం కాదు, విషానికి విరుగుడూ కాదు. +--జిబిలిక మొక్క; నిత్యమల్లె జాతి మొక్క ఇది; దీని ఆకుల్ని బెల్లంతో కలిపి మెత్తగా నూరి, ఒక పల్చటి గుడ్డకు మందంగా పూసి విరిగిన చెయ్యి లేక కాలి ఎముకల మీద దానిని ఉంచి, వెదురు బద్దలతో గట్టిగా కట్టు కడతారు. విరిగిన ఎముకలు చాలా త్వరగా అతుక్కుంటాయి; +వరదాప్రియ రంగనాయకి- వాంఛిత ఫలదాయకి" లో రంగనాయకి, ఫలదాయకి అన్నవి రెండూ సంస్కృతంలో అసాధువులే. రంగనాయిక, ఫలదాయిక అని ఉండాలి. +వరదాప్రియ రంగనాయకి- వాంఛిత ఫలదాయకి" లో రంగనాయకి, ఫలదాయకి అన్నవి రెండూ సంస్కృతంలో అసాధువులే. రంగనాయిక, ఫలదాయిక అని ఉండాలి. +జలము నివాస స్థానంగా కలవాడు' అనే వ్యుత్పత్తి అర్థాన్ని చెప్పి విష్ణువు, సూర్యుఁడు, చంద్రుఁడు, బ్రహ్మ, శివుఁడు, అగ్ని, రావిచెట్టు వీరందరికీ కూడా ఆ అర్థం వర్తిస్తుందని చెప్పారు గ్రంథాలలో; +మద గజం మావటి అంకుశానికి లొంగుతుంది. అంకుశం లేనివాడు నిరంకుశుడు. అంటే అతణ్ణి అదుపు చేసేవాడు ఎవడూ లేనివాడు. ఎవరి మాటను వినని పాలకుడు అనే అర్థం లో వాడు నిరంకుశుడు అంటాము. +--జాతి, గుణ, క్రియ, సంజ్ఞల చేత ఒక గుంపు నుండి ఒకదాన్ని విడదీయడాన్ని నిర్ధారణ అంటారు. +1) removal 2 math elimination; సమీకరణముల నుండి కొన్ని రాసులను లోపింపచేయు ప్రక్రియ. +నీర్కావి నీరు కావి; ప్రతిదినము తడుపుచుండుటచేత పట్టిన ఎఱుపువన్నె; +--పెద్ద ఉల్లి; ఉల్లి గడ్డ; ఎర్ర గడ్డ; ఉల్లిపాయ; +Sans పలాండు; సుకంద; యవనేష్ట; ముఖదూషణ; దుర్గంధా; +సామెతలను, జాతీయాలను కలిపి నుడికారం అంటారు; +నూ నెయ్ నువ్వుల నుండి తీసిన చమురు; +--శరీరానికి అత్యంత ఆవశ్యకమైన ఒమేగా-3, ఒమేగా-6 ఫాటీ యాసిడ్స్, ఏ, డి, ఇ మరియు కె విటమిన్లు నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు. స్వచ్ఛమైన నేతిలో కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (CLA ఏంటీ ఆక్సిడెంట్లు ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉండే కారణంగా నేతి మిఠాయిలు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. నెయ్యి అరుగుదలకు తోడ్పడడమే కాక దీర్ఘాయుష్షునూ, చురుకైన బుద్ధినీ, ధాతుపుష్టినీ కూడా ఇస్తుంది. శుద్ధమైన ఆవునెయ్యి కళ్ళకూ, చర్మానికి మేలు చేస్తుంది. +Sans ఘృతకోశాతకీ దీర్ఘ పటోలికా (పొడుగు పొట్ల ఘృతము' అంటే 'నెయ్యి ఆ కాయల యొక్క నునుపుదనం వల్ల వాటికి ఆ పేరు వచ్చింది; +1) నేపాళం మొక్కల్ని మనదేశంలోకి పోర్చుగీసు వారు తెచ్చారు. విత్తనాల ద్వారా వ్యాప్తి కావడమే కాక ఈ మొక్కలు కొమ్మ పాతిపెట్టినా బతుకుతాయి. గుత్తులు గుత్తులుగా కాసే నేపాళం కాయలలో చిన్న ఆముదం గింజల వంటి విత్తనాలుంటాయి. ఈ గింజల నుంచి నూనె తీస్తారు. మలబద్ధకం ఉన్నవాళ్ళకి ఈ గింజలు విరేచనకారిగా పనిచేస్తాయి. మూడు నుంచి ఐదు గింజలను దోరగా వేయించి పొట్టు తీసి వాడుకోవాలి. మోతాదు ఎక్కువైతే కళ్ళు తిరగడం, వాంతి కావడం, కడుపులో మంటగా ఉండడం కూడా జరగవచ్చు 2) ఈ గింజలని పామోలిన్ ఆయిల్ తో కలిపి నూరి ఎలుకల్ని చంపే మందుగా వాడతారు. ఈ విత్తనాల నుంచి తీసే నూనె ఆముదమంత చిక్కగా ఉండదు. గానుగ కాయల నుంచి తీసే నూనెలాగే ఈ నూనెను కూడా బయో డీజిల్ గా వాడతారు. ఇది లైట్ పెట్రోలియంలో తేలిగ్గా కలుస్తుంది. దీపపు నూనెగానూ ఇది పనికొస్తుంది. కందెన (lubricant)గానూ, సబ్బుల తయారీలోనూ ఈ నూనెను ఉపయోగిస్తారు. స్త్రీలకు గర్భస్రావం అయ్యేందుకు, సయాటికా, పక్షవాతం వంటి వ్యాధులకు ఔషధంగానూ ఈ నూనె పనిచేస్తుంది. ఈ మొక్క అన్ని భాగాలనుంచి ఒక జిగురు స్రవిస్తుంది. దీని పుల్లలతో పళ్ళు తోముకుంటే చిగుళ్ళు గట్టిగా తయారవుతాయి. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్క లేత ఆకులను ఆకుకూరగా వండుకుంటారు. కీళ్ళ సవాయి, కుష్ఠు వంటి వ్యాధులకు ఈ మొక్క వేళ్ళ కషాయం పనిచేస్తుంది. ఈ మొక్కను అస్సామీ భాషలో 'బొంగాలీ భొతోరా' అంటారు. +ఒక ఔషధ మొక్క; దీనిలో కాడ యొక్క రంగును బట్టి ఎరుపు, తెలుపు అని రెండు రకాలు; +మాదిగ తంగేడు; చిన్నతంగేడు Sans ఆకుల్యం; స్వర్ణపత్రి; భూమిచారి; సునాముఖి; +--same as కాకి నేరేడు Sans భూమిజంబుక; +same as కోలపొన్న Sans ఆఘ్రివర్ణిక; + + +--ఈ వృక్షం గాలిలోని జైలీన్ (Xylene టాల్యూన్ (Toluene) వంటి ప్రమాదకర ఆవిరులను సమర్థవంతంగా శుద్ధిచేస్తుందని నిరూపించారు. జైలీన్ ఆవిరిని పీల్చడం కారణంగా కేంద్ర నాడీ వ్యవస్థ (Central Nervous System) పై దుష్ప్రభావం పడి, తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతులు, చిరాకు, బలహీనత, అలసట, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, ఆందోళన, చేతులు వణక���ం వంటివి వస్తాయి. టాలీన్ పీల్చడం కారణంగా కూడా దాదాపు ఇవే దుష్ఫలితాలు; ప్రాణవాయువును ఎక్కువగా వెలువరించే ఈ జాతి మొక్క ఇంటిలోపల కుండీలలో పెంచుకోదగిందనడంలో ఎలాంటి సందేహం లేదు +దీని తొట్టతొలి జన్మస్థలం ఉత్తర అమెరికా ఖండం. అయినా ఇది ప్రస్తుతం ఐరోపా, ఆసియా ఖండాలలోని పలు దేశాలకు విస్తరించింది. ఆ యా దేశాలలో ఇది మొండి బెడద మొక్క (Invasive Plant) గా పేరొందింది. దీని విస్తరణకు తట్టుకోలేక చైనాలోని షాంఘైలో 30 కి పైగా స్థానిక మొక్కల జాతులు నశించిపోయాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అటవీ ప్రాంతంలో ఈ మొక్కల్ని లేళ్ళు, దుప్పులు వంటివి ఇష్టంగా తింటాయి. పాడి పశువులు, గుర్రాలకు ఈ మొక్కలు మేతగా వేస్తారు. ఈ పూలలో తేనె ఎక్కువగా ఉంటుంది. ఈ తేనెకోసం తేనెటీగలు (Honey Bees తుమ్మెదలు (Bumble Bees) వంటివి ఈ మొక్క పూల చుట్టూ మూగుతాయి; +పేరుకు పిట్టేకానీ మగపక్షి నాలుగడుగులు, ఆడుపక్షి మూడున్నర అడుగుల పొడవు, 15-20 కిలోల బరువు ఉంటుంది. దీని ఆకారం వల్ల వేటగాళ్ళు మాంసంకోసం సులభంగా వేటాడి నిర్మూలించారు. బట్టమేకపిట్ట పూర్వం గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మొదలయిన 12 రాష్ట్రాల్లో కనబడేదని తెలిసింది. ఈ పక్షిజాతి విస్తృతమైనది. ఎటువంటి ఆటంకాలు, ఇది మనుషుల పొలుపులేని ఏకాంత వ్యవసాయయోగ్యమైన పొలాల్లో, బీళ్ళల్లో నివాసం ఉంటుంది. దీని జీవితకాలం షుమారు 12 సంవత్సరాలు. గూడు కట్టకుండా మట్టిలో ఒకేగుడ్డు పెట్టి, 27 రోజులపాటు పొందుతుంది. మగపక్షి కూడా గుడ్డును సంరక్షించడం లో సహకరిస్తుంది .కుక్కలు వీటి శత్రువులు, ఇప్పడు కొత్తగా ఏర్పాటయిన గాలిమరలు, గాలి విద్యుత్ కేంద్రాలు, హై టెన్ షన్ తీగలు పక్షులు సంచరించే దారుల్లో అడ్డదిడ్డంగా వేయడంతో చాలా పక్షులు చనిపోయాయి. చాలా రాష్ట్రాలలో అంతరించిపోయాయి. దాదా సలీం అలీ ప్రమేయంతో కర్నూల్ జిల్లా రోళ్ళపాడు గ్రామం వద్ద బట్టమేక పక్షి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఇవి రయితు నేస్తాలు, పంటలను పాడుచేసే క్రిమి కీటకాలను భక్షించి రైతుకు సాయపడతాయి. +--మనం తినే బటానీలకూ, ఈ పూలతీగకూ ఎలాంటి సంబంధమూ లేదు; దీని పూలు చూసేందుకు ఆకర్షణీయంగా ఉన్నా ఇది త్వరత్వరగా వ్యాపించి ఖాళీ స్థలాలను, ఇతర మొక్కలను ఆక్రమించివేస్తుంది కనుక దీనినొక బెడద మొక్క (Invasive Plant) గా భావిస్తారు; +rel అణువు; పరమాణువు; పరమాణు రేణువు; +కుటిలమైన బ్రతుకు బతికే వాడు; కుటిలు���ు; +బద్ అంటే పర్షియన్ భాషలో చెడ్డ ,కుటిల అన్న అర్థం; మాష్ అంటే అరబిక్ లో జీవితం, బతుకు అని అర్థం. +బర్తరఫ్' అనునది ఫార్శీభాష నుండి ఉత్పన్నమైన ఉర్దూ మాట. ఇది 'బర్' అను ఉపసర్గ (prefix) తో కూర్చిన 'తరఫ్' అను నామవాచకము (noun దీనికి గల నిౙమైన అర్థము వేఱు చేయుట/ ప్రక్కకు తీసిపెట్టుట +దీనికి తెలుఁగులో మన పత్రికలవారు 'ఉద్వాసన' అను ఆధ్యాత్మిక శబ్దమును వాడుచున్నారు. ఉద్వాసన అనఁగా ఉద్యాపన. పండుగ నాడు ప్రతిష్ఠించిన దేవుని/ దేవిని పునఃపూజ చేసి, నైవేద్యము పెట్టి, హారతి పాడి పునరాగమనాయ చ మరల రండి) అని చెప్పి కదిలించుట. అనఁగా సాఁగనంపుట. ఇది 'ఆవాహన’ కు విపర్యయమన్నమాట; +దీని ఆకులు బాగా గరుకుగా ఉండి బొమ్మలను నున్నగా పాలిష్ చేసేందుకు పనికివస్తాయనీ, అందుకని ఆ ఆకుల్ని Sandpaper Leaves అంటారు; ఏటికొప్పాక లో ఆ వృక్షాలను పెంచుకుంటే బాగుంటుంది; +Sans బల్యతే దీయతే దేవతాదిభ్యః దేవతలకు ఇచ్చునది బల్యతే దీయతే రాజ్యే రాజగ్రాహ్యా భాగః' రాజ్యమునందు ఇవ్వబడునది. రాజు తీసుకొను పన్ను. +బంజరునేలల్లో పొదగా పెరిగే ముళ్ళకంచె మొక్క; పసుప్పచ్చటి పూలు పూస్తుంది; దీని పళ్ళు తింటారు; ఆకును కూరగా వండుకొంటారు; కరువుకాలాల్లో బీదలు ఈ ఆకును తింటారు; +బ్రతికుంటే బలుసాకు తినవచ్చు" అనేది సామెత; +బంజరునేలల్లో పొదగా పెరిగే ముళ్ళకంచెమొక్క; పసుప్పచ్చటి పూలు పూస్తుంది; దీని పళ్ళు తింటారు; ఆకును కూరగా వండుకొంటారు; కరువుకాలాల్లో బీదలు ఈ ఆకును తింటారు; +హిమాలయ పర్వత సానువుల్లో సముద్రమట్టానికి 4500 మీటర్ల పైన ఈ మొక్క కనిపిస్తుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి, ముఖ్యంగా టిబెట్ లో ఇది ఒక ముఖ్యమైన మూలిక. ఇది యురోజెనిటల్ రుగ్మతలు, కాలేయ తిష్టలు, లైంగిక సంక్రమణ వ్యాధులు, ఎముక నొప్పులు, జలుబు, దగ్గుకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చేదు రుచిని కలిగి ఉంటుంది. మొత్తం మొక్క ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కలను ఎక్కువగా ఔషధాలలో వాడడం వల్ల, బ్రహ్మ కమలాలు అంతరించే ప్రమాదం లేకపోలేదు; దీనిని పారసీక భాషలో గుల్-ఎ-బకావళి అంటారుట! +దీని ఆకులను కూరగా, పులుసుగా, పప్పుతో కలిపి వండుకుంటారు. పుల్లగా ఉండే ఈ ఆకుల కారణంగా ఈ చెట్టుకు ‘బ్రహ్మ ఆమ్లిక ‘బ్రహ్మ చింత ‘సీమ చింత' అనే పేర్లు వచ్చాయి. కొందరు దీనినే ‘బ్రహ్మమాలిక' అని కూడా అంటున్నారు. +ఈ వృక్షం ఆకులను వెచ్చజేసి ఆ గాయాలమీద కడతారు. జ్వర నివారిణి (Febrifuge) గానూ, స్రావాలను నిరోధించేది (Astringent) గానూ, చెమట పట్టించేది (Sudorific) గానూ, బలవర్ధక ఔషధం (Tonic) గానూ ఈ ఆకుల రసానికి పేరుంది. చెవి పోటుకూ, కళ్ళు వాచి నొప్పి పెడుతున్నప్పుడు ఈ ఆకుల పసరు పిండి పోస్తే ప్రయోజనం ఉంటుంది. శ్వాస సంబంధమైన, జీర్ణకోశ సంబంధమైన అవ్యవస్థలకు ఈ వృక్షం ఆకులు, పూల కషాయం బాగా పనిచేస్తుంది. +హిందూ బోధనల ప్రకారం, బ్రహ్మ జ్ఞానం అనేది ఆధ్యాత్మిక జ్ఞానోదయం, విముక్తి (మోక్షం) మరియు జనన మరణ చక్రం (సంసారం) ముగింపుకు దారితీసే అత్యున్నత జ్ఞానంగా పరిగణించబడుతుంది. ఇది ఒక వ్యక్తి యొక్క అవగాహనలో లోతైన పరివర్తనను తీసుకువస్తుందని చెప్పబడింది. ద్వంద్వత్వం యొక్క భ్రాంతిని విచ్ఛిన్నం చేస్తుంది. అన్నిటి ఉనికిలో గల అంతర్లీన ఐక్యత మరియు దైవత్వాన్ని బహిర్గతం చేస్తుంది. +ఈ జగత్తుకు బ్రహ్మము కంటే వేరుగా విలక్షణమైన ఉనికి లేదు; సత్, చిత్, ఆనందముల స్వరూపము; +ఒక ముహూర్తం అంటే రెండు ఘడియల సమయం. ఒక ఘడియ అంటే 24 నిమిషాలు. అంటే ముహూర్తం అంటే 48 నిమిషాలన్నమాట. సూర్యోదయానికి ముందు 30 నిమిషాల పాటు ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు. ఈ సంధ్యాకాలానికి ముందు 30 నిమిషాలను ఉషోదయం అంటారు. దానికి ముందు ఉండే 48 నిమిషాల సమయాన్నే బ్రహ్మముహూర్తం అంటారు. అంటే సూర్యోదయానికి దాదాపుగా 2-3 గంటల ముందు సమయాన్ని బ్రహ్మమూహూర్తంగా చెప్పుకోవచ్చు; +బాడవ పొలం అంటే వాకపొలం, పల్లపు పొలం, ఏటి ఒడ్డున ఉండే కారణంగా ఎప్పుడూ తేమగా ఉండే భూమి (మాగాణి పొలం); +బాణామతి ఒక క్షుద్ర విద్య; చేతబడి ఒక మనిషికి కీడు చెయ్యడానికి చేస్తే బాణామతి తో మొత్తం ఊరంతటికి కీడు చెయ్యడానికి చేస్తారు; ఇది ఒక రకమైన మూఢ నమ్మకము +ety ‘బారా బందీ’ పన్నెండు బొందె ముడులు వేసిన అంగీ; నవాబుల కాలంలో (బహుశా గోలకొండ నవాబుల కాలం కావచ్చు) ఒక ప్రత్యేకమైన శైలిలో ఉడుపులు ధరించి దర్బారుకో/కార్యాలయానికో వెళ్ళాల్సినపుడు లేక కార్యార్థమై ఏ ముఖ్యవ్యక్తినో కలవాల్సిన అవసరం కలిగినపుడు ఈ మాట తెలుగులో ప్రవేశించి ఉండచ్చు … మామూలు కుర్తా /లాల్చీ కాదు ఇది. దాదాపు మోకాలిని దాటి కిందకి వచ్చే గల్లాబందు పై ఉడుపు. ఇందులో పై నుండి కిందికి పన్నెండు వరసల కాజాలు… అందునా పన్నెండు వరసలతాళ్ళు; +ety ఇది మరాఠీ బారసా (ద్వాదశ 12వ రోజు) నుండి వచ్చింది; మనకూ మాహారాష్ట్రీయులకూ, శాతవాహనుల కాలంనుంచీ, గాథాసప్తసతి కూర్చిన కాలం నాటి నుంచీ సంబంధం ఉంది ��దా! +ety 2) బారసాల ఒక అచ్చ తెలుఁగు మాట. దీనికి సంబంధించిన మరొక మాట బాలింత. ఈ రెండు మాటలకు మూలమైన మాట 'పాలు బారసాల వాస్తవముగా 'పాలసారె చూలాలికి వివిధ దశలలో వివిధమైన వేఁడుకలున్నవి. సీమంతము మొ౹౹ వాటిలో పాలసారె ఒకటి. క్రొత్త తల్లికి పాలు వచ్చిన సందర్భముగా పాల సారె. ఈ వేడుకకు గల పాల ప్రస్తావన వలన కాలక్రమములో స్త్రీలకు సిగ్గు కలిగి దీనిని బాలసారెగా 'బాలునికి' సంబంధించినదిగా మార్పు చేయడమైనది. పాలసారె అంటే పాలు వచ్చిన సందర్భముగా ఇచ్చు కానుకలు; +బ్రాహ్మణుని స్థాయిని బట్టి ధర్మశాస్త్రాలు అతనిని 8 విధాలుగా వర్ణించాయి. +🌷 మాత్రుడు బ్రాహ్మణకులంలో జన్మించినా ఉపనయనము, అనుష్ఠానము లేనివాడు. +🌷 బ్రహ్మణుడు వేదాలను కొంతమేరకే అధ్యయనం చేసినవాడు. అయితే ఆచారము, శాంతి, సత్యము, దయ కలవాడు, బుద్ధి కలిగినవాడు. +కనీసం ఒక వేదం శాఖను కల్ప సూత్రాలతో, షడంగములతో,అధ్యయనం చేసి, యజ్ఞాది షట్కర్మలను చేసేవాడు. +వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేసి అర్థం చేసుకున్నవాడు, నిర్మలమైన చిత్తం కలిగి శ్రోత్రియ లక్షణాలు కలవాడు. +యజ్ఞయాగాదులు, వేదాధ్యయనము, వ్రతాలు చేస్తూ, ఇంద్రియాలను జయించినవాడు. అనుశాసనుడి లక్షణాలు కలవాడు. +వైదిక, లౌకిక వ్యవహారములు తెలిసి, గృహస్థుగా ఉన్నవాడు బ్రూణుడి లక్షణాలు కలవాడు. +తపస్వి, కామమును, ఆకలిని జయించినవాడు, సత్యసంధత కలిగినవాడు. వరములను, శాపములను ఇవ్వగలిగినవాడు. +అరిషడ్వర్గములను, ఇంద్రియములను, జయించినవాడు. వస్తుసంపదలపై మోహము లేనివాడు. మౌనియై సమాధి స్థితి పొందినవాడు. +బే నామీ (అసలు మనిషి పేరు కాకుండా, ఇంకొకరి పేరు పై) +బిర్రు అడ బిరడా బిగించే పనిముట్టు; +రాచ ఉసిరి చెట్టుకి, స్టార్ ఫ్రూట్ చెట్టు (కరంబోలా- Carambola) కి దగ్గర బంధువు అనదగిన ఈ చెట్లు అందరి పెరటి దొడ్లలో పెంచేవారట. అప్పట్లో అందరూ ఈ పుల్లటి కాయల్ని కూరలలో వాడుకునేవారట. ప్రస్తుతం ఈ చెట్లు అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. +ఈ మొక్కలలోని ఆకులు, పూలు, వేర్లు మొదలైన అన్ని భాగాలలో చాలా ఎక్కువగా ఉండే ఆల్కలాయిడ్స్ వైద్యపరంగా ఎంతో విలువైనవి. విన్ బ్లాస్టిన్ (Vinblastine విన్ క్రిస్టిన్ (Vincristine ల్యూరోసైడిన్ (Leurosidine ల్యూరోసైన్ (Leurosine) వంటి ఆల్కలాయిడ్స్ కాన్సర్ నివారణకు అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధనలలో తేలింది. ల్యుకేమియా (Leukaemia) కూ, హాడ్కిన్స్ డిసీజ్ (Hodgkin's disease విల్మ్స్ ట్యూమర్ (Wilms' Tumour న్యూరోబ��లాస్టోమా (Neuroblastoma) వంటి వాటికి ఈ ఆల్కలాయిడ్స్ దివ్యౌషధాలుగా పనిచేస్తాయని వైద్య పరిశోధనలలో తేలింది. +Sans స్వాదు కోశాతకీ తిక్త కోశాతకీ; కటు కోశాతకీ; ఘృతకోశాతకీ; +ఇది దొండ, ఆనప, గుమ్మడి జాతికి చెందిన ఒక రకం దోసకాయ +రకాలు: కూతురు బుడమ; కోడి బుడమ; వెర్రి పుచ్చకాయ; +తాటికాయలు కోయకుండా చెట్టుకే వదిలేస్తే పండిన తరువాత ముంజలు ముదిరి గట్టి టెంకలుగా మారుతాయి. వాటిని భూమిలో పాతితే కొన్నిరోజుల తరువాత వాటినుంచి వేరు (అదే తేగ అవుతుంది) వస్తుంది. అలాగే వదలి వేస్తే ఆ వేరు తాటి చెట్టు అవుతుంది. తేగలు కొంత పక్వానికి వచ్చిన తరువాత భూమిలో నంచి వాటిని తవ్వి, టెంకలు పగల గొట్టినప్పుడు టెంకల లోపల ఉన్న లేత కొబ్బరి లాంటి పదార్థమే బుర్రగుజ్జు. తేగ బలమయ్యే కొద్ది బుర్రగుంజు తగ్గుతుంది. తేగ మధ్యలో వివిధ పొరలతో కూడిన మెత్తని పుల్ల లాంటిది ఉంటుంది దాన్ని చందమామ అంటారు. దాని చివరన మెత్తగా ఉండి చాల తీయగా ఉంటుంది. తేగని భూమి నుంచి తీయకుండా ఉంచి ఉంటే ఈ చందమామే తాటి ఆకు చిగురు అవుతుంది +--2. పరాటాని పోలిన ఒక ఆఫ్ఘనిస్థాన్ వంటకం; +Sans శ్వేత కూష్మాండః; కూష్మాండః; కకుభాండ; పుష్యఫలం; +స్తోత్రపాఠకుఁడు; భట్రాజు; మాగధుడు; వంది; వర్ణకుడు; స్తుతిపాఠకుడు; స్తుతివ్రతుడు; స్వస్తికారుడు; +బెత్తాన్ని బొత్తిగా వాడకపోతే పిల్లాడు పూర్తిగా పాడయిపోతాడు spare the rod and spoil the child. +ఊరికినే, పనీపాటా లేకుండా తిరిగే; బాదరబందీ లేకుండా; +ety బే అనేది పర్షియన్ లో "లేని, లేమి, కాని" వంటి అర్థాలలో వాడతారు. వారిస్ అనేది అరబిక్ లో వారసుడు బే- వారీస్" అంటే పిల్లలు లేని వాడు అని అర్థం. +బొంగు వెదురు; ముళ్ళ వెదురు; పెంటి వెదురు; +చిరు తీపి, ఎక్కువ వగరు వుండే బొగడ పండ్లు నోటి ఆరోగ్యానికి, ముఖ్యంగా చిగుళ్ళకు చాలా మంచివి. ఈ చెట్టు పుల్లలను వేప పుల్లలలాగే పళ్ళు తోముకోడానికి వాడవచ్చు నోటి దుర్వాసన పోవడం, చిగుళ్ళ ఆరోగ్యం పెరగడం జరుగుతుంది; +బొగడబంతి మొక్కకు పువ్వులే వుంటాయి. ఇది అందానికి ఆహ్లాదానికి పెంచుకొనే మొక్క. చెట్టు కాదు. కాయలు కాయవు. Globe amaranth అని పిలువబడే ఈ మొక్క తోటకూర జాతికి చెందిన మొక్క. ఇది అమెరికా నుండి మన దేశం వచ్చిందట. దీనికి కూడా ఆరోగ్యపరమైన ఉపయోగాలున్నాయని అమెరికా వారే చెప్పారు. +మూతి వెడల్పుగా, లోతు తక్కువగా ఉండు మట్టి పాత్ర. +ఇతర భారతీయ భాషలలో ఇది బూతు పదం; సరి అయిన అర్థం తెలియక కోస్తా ఆం���్రలో దీనిని ముద్దు పేరుగా వాడెస్తూ ఉంటారు; +సంసారం అనే సముద్రం; కష్ట సుఖాలతో నిండింది జీవితం; ఈ చావు పుట్టుకల క్రమం అనంతం, సముద్రం అంత; +భ్రమరకీటక న్యాయం. ఆకుపురుగు (కేటర్ పిల్లర్) శరీరంలో తన గుడ్లను పెట్టి తుమ్మెదో (కందిరీగో) మట్టితో దాన్ని మూసేస్తుంది. నాలుగు వారాల్లో ఆకుపురుగు దేహంలో కందిరీగ పెట్టిన గుడ్లు పిల్లలై ఆకుపురుగు దేహాన్నే ఆహారంగా భుజించి ప్యుపా దశకు చేరి అందమైన భ్రమరాలుగా కందిరీగలుగా) మట్టిని తొలుచుకొని వెలుపలికి వస్తాయి. ఆకుపురుగు తుమ్మెదగా మారుతోందని భ్రమపడ్డాము. ఇది కేవలం కవిసమయం; +భావకవిత్వంలో శాఖలు ప్రణయకవిత్వము (Love Poetry ప్రకృతికవిత్వము (Nature Poetry భక్తికవిత్వము (Mystic Poetry దేశభక్తికవిత్వము (Patriotic Poetry సంఘసంస్కరణ కవిత్వము (Reformative Poetry స్మృతికావ్యములు (Elegies +భావకవిత్వంలో కవినక్షత్రములు రాయప్రోలు, విశ్వనాథ, వెంకటపార్వతీశులు, కృష్ణశాస్త్రి, దువ్వూరి, బసవరాజు, నండూరి, వేదుల, నాయని, పింగళి, కాటూరి, జాషువా, తుమ్మల, తల్లావజ్ఝల, బాపిరాజు; +భావకవులవలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్ ఎవరికీ తెలియని లేదా అర్థంకాని పాటలు రాసేవాళ్లే భావకవులు +భిన్నము అంటే భేదింపబడినది. అంటే పగలగొట్ట బడినది. దుర్భిన్నము అంటే పగలగొట్ట డానికి వీలుకానిది; +ఒక పెద్ద దుంగలాంటి చెట్టు కాండాన్ని రామ్ కంద అంటారు. దీన్ని చిరుతిండిగా చాలా ప్రాంతాలలో అమ్ముతారు. ఈ దుంగ మొత్తం కొబ్బరి మొవ్వలా మెత్తగా వుంటుంది. రుచిగా, తియ్యగా కూడా వుంటుంది. రామ్ కంద దుంగను పలుచని పొరలుగా, ముక్కలు కోసి అమ్ముతారు. దీన్ని కంద అని పిలుస్తారు గాని నిజానికి ఇది చెట్టు కాండమే. మన దేశపు అడవుల్లో ఇవి విరివిగా దొరుకుతాయి; +భూతం (Sanskrit దయ్యం (Telugu ఆత్మ of a dead person; ప్రేతం అన్నా ఆత్మ అనే లెక్క. కానీ సంస్కరించనిది; +భూత ప్రేతాలకు యజ్ఞ, యాగాదుల్లో బలి వేస్తారు. ఆ ధర్మ కార్యం లో ఇయ్యబడిన తిండి వాటికి కడుపు నింపుతుంది. ప్రపంచాన్ని పీడించకుండా ఉంటాయి. ఇదే కాక బ్రాహ్మణులు భోజనం తర్వాత వదిలిన ఉత్తర పరిషేచనం, వారు వదిలిన అన్నం కూడా తిని సంతృప్తి చెందుతాయి ట; +పూజాది కార్యక్రమాలు చేసేటప్పుడు "ఉత్తిష్ఠ న్తు భూత పిశాచా అనే మంత్రం చదువుతాము. వాటిని, మేము పూజ చేసుకుంటాం దయచేసి ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళమని విజ్ఞప్తి చేయడం; +note) మానవులలో యుగాండం (zygote) అన్న పేరు శిశుసంకల్పన (conception) సమయం నుండి ఐదో వారం వరకు వర్తిస్తుంది. ఐదవ వారం నుండి పదవ వారం వరకు దీనిని పిండం (embryo) అని పిలుస్తారు. పదకొండవ వారం నుండి ప్రసవం అయి బిడ్డ భూపతనం అయేవరకు భ్రూణం (ఇంగ్లీషులో ఫీటస్, fetus) అంటారు ప్రసవం అయినప్పటినుండి మాటలు వచ్చేవరకు శిశువు (infant) అంటారు ఇంగ్లీషులో ఇన్^ఫెంట్ అంటే మాటలు రాని పసిబిడ్డ అని అర్థం. మాటలు మాట్లాడడం మొదలు పెట్టిన తరువాత బిడ్డ (child) అంటారు. బిడ్డ అనే మాట ఆడ, మగ కి వర్తిస్తుంది. +2) meals; సేంద్రియముల ద్వారా గ్రహించునది; +మధ్యాహ్న మందార; రిక్షమల్లి Sans అర్కవల్లభ; బంధూకమ్ Hin దో పహరియా; +ఐదు రేకుల పువ్వునుబట్టి పెంటాపెటెస్ అనీ, పువ్వుల రక్తవర్ణాన్నిబట్టి దీనికి ఫీనీషియా అనీ దీని లాటిన్ పేరు ఏర్పడింది. మంకెన ఆకులతో కొందరు టీ కాచుకుంటారు. మంకెన కాయలలోని గింజలను ఉదరసంబంధమైన వ్యాధులలో కషాయం కాచుకుని తాగుతారు. మంకెన వేరు కషాయం శరీరంలో స్రావాలను నిరోధిస్తుంది. జ్వరహారిణిగా పనిచేస్తుంది. వాతరోగాల నివారణకు కూడా పనిచేస్తుంది. అజీర్తి కారణంగా వచ్చే తీవ్రమైన కడుపునొప్పి, జ్వరాలను మంకెన వేర్ల కషాయం పోగొడుతుంది. +పుట్టతేలు; మండ్రగబ్బలు నల్లగా వుంటాయి ఇవి తేలు కన్నా చాలా విషపూరితమైనవి. వీటిని చంపినపుడు రక్తం నల్లగా బురదలాగ వస్తుంది; ఇవి తేలు కంటె కొంచెం లావుగా వుంటాయి; +మననాత్ త్రాయతే ఇతి మంత్రం" అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది అని అర్ధం; గురుముఖంగా పొందేది మంత్రం. మంత్రం కొన్ని బీజాక్షరాల సంపుటీకరణం. దాని అర్ధం తెలియవలసిన అగత్యం లేదు; అది శ్లోక రూపంలోగూడా ఉండవచ్చు. విష్ణు సహస్రనామం 108 శ్లోకాలున్న మహా మంత్రం. శివుడు పార్వతికి ఉపదేశించింది గాబట్టి మంత్రం అయింది; +మోతాదులో తినేది మందు; మూలికలతో (వృక్షజాతుల నుండి) తయారు చేసినది మందు; ఓషధి అంటే మూలిక; ఓషధులతో తయారయినది ఔషధం; మాను నుండి తయారు చేసినది మాకు; మందు మాఁకు అన్నప్పుడు "మాఁకు" పదానికి చెట్టు బెరడో, వేరో అనుకోవచ్చు. +సగటు సముద్ర మట్టం mean sea level; ససమట్టం. +కలవాడు, కలది, మంతుడు, వంతుడు, కాడు, కత్తె, మొదలగునవి; +--same as మదుగు; అనుకదనము; అనుకు; తొళక; +మధు అంటే తేనె కానీ అన్ని తియ్యటి పదార్థాలకూ మధు శబ్దం వర్తిస్తుంది. మేహము అంటే మూత్రము, మూత్ర వ్యాధి, మూత్ర విసర్జనము అని శబ్దార్థ చంద్రిక చెప్పింది. +మనువు అంటే పెళ్లి. కుడుపు అంటే తినిపించటం. పూర్వకాలం పెళ్లి అయిన తరువాత అల్లుడు అత్తగారింట్లోనే ఆరునెలలు వుండేవాడట. ఈ సమయంలో అతనికి చిన్నమెత్తు పని చెప్పరు. వీర్యవృద్దికరమైన ఆహారపదార్థాలు చేసి బాగా తినబెడుతుంటారు. దీనితో నవదంపతులు యిద్దరూ బాగా పుష్టిగా ఆరోగ్యవంతంగా తయారవుతారు. పెళ్లి అయింతర్వాత జరిగే మర్యాదలు కాబట్టి మనువు కుడుపు (మనుగుడుపు) అన్నమాట ఇదంతా. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అల్లెం అంటారు; +కోరిక; మనసే రథముగా గలది … బహువ్రీహి సమాసం. +కలిసిపోవటం; ఒకటైపోవటం; విడతీయలేని భాగం అవడం; +మమ ఏకం మమైకం ఔతుంది (మేక కాదు వృద్ధి సంధి; +మరొకరితో అవినాభావంగా -— అతడూ నేనూ ఒకటే, ఆ వస్తువు నేనూ ఒకటే అనన్న అర్థంలో వాడుతూ ఉంటాము. ఇది తెలుగువాళ్ల వాడుక. తప్పు కాదు; +పచ్చ; దట్టమైన ఆకుపచ్చని రంగు గల ఒకానొక రత్నము; +మరకతశ్యామా అంటే పచ్చ అనే రత్నపు ఛాయతో ఒప్పారుతున్న నలుపురంగు; +ఈ మాటల వెనక ఏదో ఉంది అనిపించేట్టు మాట్లాడడం మర్మ గర్భ సంభాషణ. తాను చెప్పేది అందరూ కాక తాను ఉద్దేశించిన వాళ్ల కే అర్థం అయ్యేట్టు మాట్లాడడం అది. మర్మం అంటే రహస్యం. +మలయా యాపిల్ పళ్లను మన ప్రాంతంలో గులాబ్ జామూన్ పళ్లు అని కూడా అంటారు. వీటి పూలు పౌడర్ పఫ్ (Powder Puff) లాగా అనిపిస్తాయి. కొన్ని పూలు తెల్లగా ఉంటే ఇంకొన్ని ఎర్రగా గులాం (గులాల్) రంగులోనూ, కొన్ని రక్త వర్ణం లోనూ ఉంటాయి. పూల రంగును బట్టే కాయల రంగు ఉంటుంది. ఈ పండ్లనుంచి కొన్ని దేశాలలో వైన్ (Wine) తయారు చేస్తారు. మలేషియా, ఆస్ట్రేలియాలు ఈ పండ్ల మొక్క తొట్టతొలి జన్మస్థానాలు. ఇక సాధారణ నేరేడు వృక్షం శాస్త్రీయ నామం Syzygium cumini కాగా ఇదే కుటుంబానికి చెందిన లవంగ వృక్షం శాస్త్రీయనామం Syzygium aromaticum +మరుమల్లె, బొండుమల్లె; సన్నజాజి; విరజాజి; కాగడా మల్లె; వగైరాలు మల్లెలలో రకాలు రేకలు ఎంత ఒత్తుగా ఉన్నాయో, ఎంతలా విచ్చుకుంటాయో వగైరాలలో తేడాలు;Pass +తులసి, చియా జాతి మొక్క; రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అని అంటారు. సబ్జా గింజలు నానితే ఎలా ఉంటుందో అలాగే ఈ మహాబీర గింజలు కూడా ఉంటాయి; +మహీ ఇంద్రుడు మహీంద్రుడు భూ పాలుడు రాజు సవర్ణ దీర్ఘ సంధి) +మహా ఇంద్రుడు మహేంద్రుడు గొప్ప వాడైన ఇంద్రుడు (గుణ సంధి) +ప్రాంతీయ మాండలికం regional dialect; ఉదా: ఉర్ల గడ్డలు — బంగాళా దుంపలు; +2) medicine; drug esp herbal medicine; వృక్షజాతుల నుండి తయారు చేసినది మందు; మాను నుండి తయారు చేసినది మాకు; +anterior fontanelle; పసిపిల్లల నడినెత్తి మీద ఉండే మెత్తటి ��ాగం; +మాణిక్యం అన్నది సంస్కృత పదం. అది కెంపుకు పర్యాయ పదమే మాణిక్య వీణాముపలాలయంతీం, మదాలసాం మంజుల వాగ్విలాసాం" అన్న కాలిదాస కృత దేవీ స్తోత్రం వినే ఉంటారు. కన్నడ భాషలో కెంపు అన్న మాట మాణిక్యానికే కాక 'ఎరుపు రంగు' అన్న అర్థంలో కూడా వాడుతారు. కెంపు యొక్క నాణ్యతను, రంగులోని స్వచ్ఛతను బట్టి 'పద్మ రాగం కురువిందం సౌగంధికం నీలగంధి' అన్న పేర్లతో కూడా పిలుస్తారు; +రత్నగిరి (Alphonso కేసరి; దశేరి; హిమసాగర్; బాదామి; బంగినపల్లి; తోతపురి; మల్గోబా; ఇమామ్ పసంద్; అమరపాలి; మల్లిక; ముంత మామిడి; కొత్తపల్లి కొబ్బరి; పెద్ద రసాలు; చిన్న రసాలు; చెరుకు రసాలు; సువర్ణరేఖ; నీలాలు; +పిల్లిని సంస్కృతంలో మార్జాలము అంటారు మార్జనమ్' అంటే శుభ్రం చేసుకోవడము. కాబట్టి పిల్లి పేరులోనే ఉంది అది 'పరిశుభ్రమయినది అని. +మాహిషం అనేది మూడో ఈత ఆవు మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవలం దధి" కాళిదాసు ఆభాణకానికి ఈ అర్థమే! +అడ్డికి పావుశేరు మిత్తి అడ్డ అంటే రెండు శేర్లు అడ్డకి పావుశేరు మిత్తి" అంటే ఎనిమిదో వంతు వడ్డీ. పన్నెండున్నర శాతం. +మిర్చి అన్నా మిరప అన్నా ఒక్కటే; గుంటూరు మిర్చి ఎర్ర తోలుతో ఉంటే గొల్లప్రోలు మిర్చి నారింజ రంగులో ఉంటుంది; +పాప్రికా paprika కారం తక్కువ ఉన్న మిరప; +పిమెంటో red pimento కారం లేని మిరప; +నకులిక; అహి-నకులిక బంధం పరస్పర విరోధంతో ఎపుడూ ప్రవర్తించే జాతి వైరం. ఒకరిని చూడగనే మరొకరికి అతణ్ణి చంపివేయాలనేటంత కోపం; +ety ముఖ్తసర్ (مختصر) అన్నదానికి సంగ్రహించు, సంగ్రహం అన్న అర్థం అరబ్బీలో ఉంది; +ముట్టె అనేది మామిడి టెంకకు వాడుక; అలాగే తాటి ముట్టె (తాటిచెట్టు నాటేదానికి గింజ తలకూ పర్యాయపదం (సన్నివేశాన్ని బట్టి వాడికి ముట్టె పొగురు (తల పొగరు అనే అర్థంలో విడిగా ముట్టె అంటే తల అని కాదు. +ఇది వంగ, పొగాకు జాతికి చెందిన మొక్క; +3) ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ము��దు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. +4) అమావాస్య నాడు సూర్యుడి తో కలిసి ఉదయించిన చంద్రుడు 30 రోజుల పాటు, తిథికి 48 నిముషాలు చొప్పున ముందర ఉదయించి 30 తిథుల అనంతరం మళ్లి సూర్యుడి తో ఉదయిస్తాడు. 48 నిమిషాల కాలం ఒక ముహూర్త కాలం; కాల గమనానికి ముహూర్తం ఒక ఏకకం (Unit +మూఢము అనగా ఒక గ్రహం సూర్యునికి దగ్గరగా రావడం. లేదా ఒకే రాశి యందు ఉండడం; శుభకార్యము చేయఁగూడని కాలము; +--ద్రావిడ భాషలలో మూర్ధన్యాక్షరాలు (ట,ఠ, డ, ఢ, ణ, ళ, ఴ లు ర-ఱ-లలు ప్రథమాక్షరంగా ఉండడానికి వీలులేదు. విశేషణంగా తెలుగులోనూ, ఇతర ద్రావిడ భాషలలోనూ హల్లుల ముందు ఇరు అచ్చులముందు ఈరు- అన్న రూపాలే కనిపిస్తాయి. ఇరువంకలు అంటే రెండు పక్కలు. ఇరువురు అంటే ఇద్దరు. +ఒక విషయం/సమాధానం లోని సత్తా ఏమిటో అంచనా వేయడం; పరీక్షలో ఎన్ని మార్కులు ఇవ్వవచ్చునో చెప్పడం మూల్యాంకనమే. +నత్తలలాగే ఇవి కూడా అతి మెల్లగా ప్రయాణిస్తాయి. అయితే నత్తలకి ఉన్నట్లు వీటికి గుల్లలు (Shells) ఉండవు. నత్తలలాగే మెట్ట జలగలు కూడా గాస్ట్రోపోడా (Gastropoda) తరగతిలోని సిగ్మురెత్రా (Sigmurethra) కుటుంబానికి చెందుతాయి. నీటి జలగల (Leeches) లాగా వీటికి రక్తం పీల్చే స్వభావం లేదు; +దీని ఆకుల పసరు తామర, గజ్జి, చిడుము వంటి మొండి చర్మవ్యాధులకు, సర్పి Herpes zoster) వంటివాటికి దివ్యౌషధంగా పనిచేస్తుంది; +గోమాంసం తినేవారు, సంస్కృతం కాక పలురకాల భాషలు మాట్లాడేవారు, మన ఆచారాలను వేటినీ పాటించని వారిని మ్లేచ్ఛులని అంటారు అని బౌధాయనుడు మ్లేచ్ఛ శబ్దాన్ని నిర్వచించాడు; +గోధుమలు పిండిమరలో పిండి పట్టించినప్పుడు అందులోనే మైదా కూడా ఉంటుంది. ఆ పద్దతిలో గోధుమ పొట్టు, గోధుమ రవ్వ, బొంబాబు రవ్వ (సమొలిన వగైరాలతోపాటు, చివరకు మెత్తగా మిగిలిన మైదాను కొన్ని రసాయనాలతో శుద్ధి చేసి తెల్లగా తీర్చిదిద్దుతారు. +ఇది ఆవృతబీజ జాతి (Angiosperms) సతత హరిత వృక్షం; ఇది 15-20 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది. +మొగలిపువ్వు వాసనకు పాములు వస్తాయని అంటారు కానీ దీనికి శాస్త్రీయమైన రుజువు లేదు; ఈ పూల వాసనకి ఆకర్షింపబడి వచ్చాయనేదానికి ఇదమిద్ధంగా ఋజువులేమీ లేవు +దానిమ్మ తొక్కల పొడి (Powdered pomegranate peel ఆయుర్వేద మందుల దుకాణాల్లోనూ, ఆన్లైన్ లోనూ దొరుకుతుంది ఉదయం సాయంత్రం ఒకో చెంచాడు చూర్ణం నీటితో కలిపి తాగితే విరేచనం అయేటప్పుడు రక్తం పోకుండా ఆపు���ుంది. +కపిలబావి, మోటనుయ్యి; నీళ్ళు తోడటానికి మోట అమర్చిన బావి; +attachment సాంగత్యం వల్ల ఒక వస్తువు తనదే అనే భావన; +మొగము ఓటమి మొగమోటమి ఉచ్చారణ లో గూడా మొహమాటం అయి పోయింది. అంటే మొగం చూడడానికి చెల్లకపోవడం; ఇప్పటి వాడుకలో — మారుమాట చెప్పలేక, ఒప్పుకోవడం అనే అర్థం లో వాడుతున్నాం; అయిష్టంగానే ఎదుటివాడి మాటను అంగీకరించడం మొహమాటమౌతుంది. దీనిమీద సంస్కృత ఉపసర్గ ^నిర్^ చేర్చి "నిర్మొహమాటం" గా అనేది గూడా వాడుకలోకి వచ్చింది. +ఆహారే వ్యవహారే చ త్యక్త లజ్జః సుఖీ భవేత్ ఆహారం విషయంలోను, వ్యవహారం విషయంలోనూ మొహమాట పడకూడదు; + + +1 యకరం 100 సెంట్లు 40 గుంటలు 1210 అంకణాలు; +1 యకరం 4840 చదరపు గజాలు +ఇంద్ర సభలో వీరు నాట్యం చేస్తారు; +కశ్యపునికి సురస యందు జన్మించినవారు యక్షులు. వీరు పుట్టగానే ఆకలితో 'యక్షామ అన్నారని, అందువల్ల వారికి యక్షులని పేరు వచ్చిందనిన్నీ రక్షామ' అన్న వాళ్ళు రాక్షసులు. వీళ్ళకి నాయకుడు కుబేరుడు, పట్టణం అలకాపురి; +see also గంధర్వులు; కిన్నెరలు; కింపురుషులు; +ఒకే పదం ఊనికలో తేడా యాస; ఉదా: ఏమి, ఏమిటి, ఏంటి? +Note) మానవులలో ఈ యుగాండం (zygote) అన్న పేరు శిశుసంకల్పన (conception) సమయం నుండి ఐదో వారం వరకు వర్తిస్తుంది; ఐదవ వారం నుండి పదవ వారం వరకు దీనిని పిండం (embryo) అని పిలుస్తారు. పదకొండవ వారం నుండి ప్రసవం అయి బిడ్డ భూపతనం అయేవరకు భ్రూణం (ఇంగ్లీషులో ఫీటస్, fetus) అంటారు ప్రసవం అయినప్పటినుండి మాటలు వచ్చేవరకు శిశువు (infant) అంటారు ఇంగ్లీషులో ఇన్^ఫెంట్ అంటే మాటలు రాని పసిబిడ్డ అని అర్థం. మాటలు మాట్లాడడం మొదలు పెట్టిన తరువాత బిడ్డ (child) అంటారు. బిడ్డ అనే మాట ఆడ, మగ కి వర్తిస్తుంది. +యోగర్ట్ ని తయారు చెయ్యడానికి వాడే "తోడు"లో లాక్టోబాసిలస్ అనే లాక్టిక్ యాసిడ్ బేక్టీరియాతో పాటు లాక్టోబాసిలస్ బల్గారిస్, స్ట్రెప్టోకాకస్ థెర్మోఫిలస్ అనే మరి రెండు బేక్టీరియాలని కలుపుతారు. ఈ రెండింటి వల్ల యోగర్ట్‌లో సరైన మోతాదులో సరైన బ్యాక్టిరియా ఉంటుందన్న మాట. ఈ బేక్టీరియాలని ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు తయారు చేస్తారు. +ఉసిరి గింజల పొడి, రక్తచందనం పొడి సమపాళ్ళల్లో కలిపి, తేనెతో తింటే వాంతులు, తలతిప్పు తగ్గిపోతాయి అని ఆయుర్వేదం చెబుతోంది; +చిదంబర రహస్యం a non-secret; ఏదైనా రహస్యం చెప్పకూడని చోట ఏమీ లేదు అని చెప్పడానికి ఇలా చిదంబర రహస్యం అంటారు; +--filings ety రాపిడి వల్ల వచ్చే పొడి; +bot Maerua oblongifolia; ఆవాల��� జాతికిచెందిన మొక్కలు ఈ కుటుంబమునకు చెందుతాయి; +ఈ దుంగ మొత్తం కొబ్బరి మొవ్వలా మెత్తగా వుంటుంది. రుచిగా, తియ్యగా కూడా వుంటుంది. రామ్ కంద దుంగను పలుచని పొరలుగా, ముక్కలు కోసి అమ్ముతారు. ఇలా ఒక్కొక్క దుంగ నుండి కొన్ని వేల ముక్కలు కోస్తారు. ఈ పొరల పొరల ముక్కలకు కొంతమంది ఉప్పు కారం రాసుకొని తింటారు. దీన్ని కంద అని పిలుస్తారు గాని నిజానికి ఇది చెట్టు కాండమే. మన దేశపు అడవుల్లో ఇవి విరివిగా దొరుకుతాయి. తెలుగు ప్రాంతాల్లో వీటిని భూచక్ర గడ్డ, రామ కందమూలం అంటారు. +Sanskrit] కృష్ణబీజ (నల్లని గింజలు కలది మృదుఫలమ్ (మృదువుగా ఉండేది); +దూరాన నా రాజు కేరాయిడౌనో ” నండూరి సుబ్బారావు: ఎంకి పాటలు +భూమధ్యరేఖను ఆకాశం మీదకి పొడిగించండి. గ్రహాలన్నీ ఈ రేఖకి కొంచం అటూ ఇటూలో తిరుగుతూ కనిపిస్తాయి. ఆ కొంచం ఒక 8 డిగ్రీలు పైకీ ఒక 8 కిందకీ ఉంటుంది. ఈ పదహారు డిగ్రీలు కలిపి ఈ రేఖని ఒక పటకా (బెల్టు) లాగా ఊహించుకోవాలి. అది సూర్య చంద్రాదులతో సహా, ఆకాశంలో గ్రహాలన్నీ తిరిగే మార్గం (బాట లాంటిది అదే రాశి చక్రం; +astron ascending and descending nodes of the moon; సూర్యుడు-భూమి ఉన్న అక్షాన్ని చంద్రుడి కక్ష్య ఖండించుకొనే రెండు బిందువులు; చంద్రుడు రాహుకేతువుల స్థానంలోకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం కాని, సూర్య గ్రహణం కాని వస్తుంది; +గ్రీకు భాషలో elaia అంటే ఆలివ్ (Olive కార్పోస్ (karpos) అంటే కాయ; ఆలివ్ కాయల్లా అనిపించే ఈ జాతి వృక్షాల కాయల్నిబట్టి వీటికి ఎలీయోకార్పస్ అనే పేరు వచ్చింది. +రెడ్డి అనే పదం రడ్డి, రట్టడి, రట్టగొడ్డు, రట్టకుడు, రాష్ట్రకూటుడు అనే పదాలనుంచి క్రమంగా తయారైనట్లు మన ప్రాచీన శాసనాల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, రాఠోడ్, రాఠోర్ మొ. గుజరాత్, రాజస్థాన్లో ఇంటిపేర్లు. ఇవి రాష్ట్రకూటుల సామ్రాజ్యంలో అధికారిక బిరుదు. +Gr Nyct (నిక్ట్ రాత్రి; Alaos (ఎలావోస్ అంధత్వం Sans నక్తాంధము నక్తం రాత్రి nyct. +దీని కలప దృఢంగా, మన్నికగా ఉండే కారణంగా గృహనిర్మాణంలో గుంజలుగానూ, బీరువాలకీ ఈ కలపను వినియోగిస్తారు. ఈ వృక్షం కాండం బెరడులో ఉండే టానిన్లు (Tannins) కారణంగా దీనిని తోళ్ళు ఊనడానికి (Tanning of raw hides and skins) వినియోగిస్తారు. కాండం పై బెరడులో ఎన్నో ఔషధ విలువలున్నాయి. అది బలవర్ధకమైనది. చర్మరోగాలను నివారిస్తుంది. అతిసారము, గ్రహణిని పోగొడుతుంది. కాండం కషాయం కామెర్లు, కుష్ఠు, సిఫిలిస్, గుండెజబ్బులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కడుపు��ొప్పి నివారణకు దీని కాండం పై బెరడును పచ్చిదే తింటారు. పశువులకు కూడా ఈ కాండం కషాయం విరేచనకారిగా వాడతారు. సుఖ విరేచనం కోసం రేల ఆకు, పళ్ల గుజ్జుతో పచ్చడి చేసుకుతింటారు. దీని గింజలు, ఆకులను దంచి దానితో షర్బత్ తయారు చేస్తారు. ఆ షర్బత్ జ్వరహారిణిగా, విరేచనకారిగా పేరొందింది. మలబద్ధకం పోగొడుతుంది. +మలయా యాపిల్ నీ రోజ్ ఏపిల్ నీ కూడా గులాబ్ జామూన్ పళ్లు అనే పిలుస్తారు. సాధారణ నేరేడు వృక్షం శాస్త్రీయ నామం Syzygium cumini కాగా ఇదే కుటుంబానికి చెందిన లవంగ వృక్షం శాస్త్రీయనామం Syzygium aromaticum. +తూర్పున ఉదయించే బిందువు ఉన్న భాగాన్ని లగ్నము అంటారు. అక్కడినుండి ఆకాశంలో పడమటివైపుకి వరసగా వెనక్కి లెక్క పెట్టుకుంటూ పోతే, లగ్నం పైన పన్నెండో ఇల్లు (లేక భావము ఆపైన పదకొండు, ఆపైన పదవది నడినెత్తి మీదకి వచ్చేస్తాము. నడినెత్తిమీద ఉన్న భావాన్ని దశమము (లేక పదో ఇల్లు) అంటారు. అక్కడినుంచి పడమటికి దిగుతుంటే తొమ్మిది, ఎనిమిది ఇళ్ళు వస్తాయి. సరిగ్గా పడమటన అస్తమిస్తున్న బిందువు కలిగిన ఇల్లు ఏడవ ఇల్లు (లేక సప్తమ భావం ఇంకా కిందకి దిగిపోతే ఆరో ఇల్లు, ఐదో ఇల్లు, నాలుగో ఇల్లు వస్తాయి. నాలుగో ఇల్లు అట్టడుగు స్థానం. దాని తరవాత మూడు, రెండు వచ్చి మళ్ళా తూర్పున లగ్నం (లేక ఒకటోఇల్లు) లోకి వచ్చేస్తాయి; +Sans వరాళ; లవంగ; దేవకుసుమ; పారిజాత; ఇంద్రపుష్ప; కరంబువు; +ముత్యములా మెరిసే చర్మ సౌందర్యం; సైంధవ లవణం అనేది ఉప్పగా ఉండే తెల్లని కొండరాయి. పెద్ద ఉప్పురాయిని పగలగొట్టినప్పుడు అది పగిలి, దాని స్నిగ్ధత్వం చేత సూర్యకాంతికి తళతళా మెరుస్తుంది. ఆ మెరుపుని ‘లావణ్యం’ అంటారు. +నీచుడు; దుష్టుడు; కుత్సితుడు; కూళ; పోకిరి; పలుగాకి; తుంటరి; సిగ్గిడి; తుచ్ఛుడు; +--baton; కర్రసాము చేసేవాడు తిప్పే కర్ర; + + +వంగసం; పశుజాతినుండిగాని వృక్షజాతినుండిగాని యెంచబడిన ప్రత్యేక లక్షణములుగల తరగతి (వంశము ప్రత్యేక లక్షణములను కలిసియున్న ఉపజాతిలోని రకము. +--అట్టెడ; పాలి; వారధి; సేతకము; సేతువు; +వంది and మాగధుడు are the titles of "praisers" in a king's court; their job is to constantly praise the king for all his good deeds; వందిమాగధులు ఎవరివద్ద కొలువు చేస్తున్నారో వారిని మాత్రమే స్తుతిస్తుంటారు. శృంగేరీ మఠంలో వారు గురువులను, దేవుళ్ళను స్తుతిస్తుంటారు; క్షత్త్రియ స్త్రీకిని వైశ్యునకును బుట్టినవాఁడు; వంశావళిఁ జదువువాఁడు; +మమ్మటుడు వక్రోక్తిని ఇలా నిర్వచించాడు యదుక్��మన్యథా వాక్యమన్యథాన్యేన యోజ్యతే. శ్లేషేణ కాకా వా జ్ఞేయా సా వక్రోక్తిస్తథా ద్విధా కావ్య ప్రకాశ -9). +అందరూ పెద్దమనుషులే! మరి గల్లా పెట్టెలో చిల్లర ఏమైంది వంటి ప్రయోగాలలోని 'వక్రోక్తి' ని గమనించండి. +కురువేరు; అవురుగంట వేరు; ఉసీరం; లఘులయము; అవదాహం; +వడ్ల చిలక bio Sitoroga cereallela; వరి, గోదుమ, ఇతర ధాన్యాలను ఆశ్రయిస్తూ బ్రతికే ఒకరకమైన చిన్న రెక్కల పురుగును 'వడ్లచిలుక' అంటారు. వడ్లు అంటే ధాన్యం కాబట్టి ఈ కీటకాలకు ఆ పేరు వచ్చింది.ఇవి బూడిద రంగులో, మాడు ఎరుపు, లేత నలుపు రంగుల్లో కనబడుతుంటాయి. వీటి లార్వాలు (క్రిమి దశ) కూడా ధాన్యాలలోనే సాగుతుంది. ఇవి ధాన్యాలలో సారాన్ని పూర్తిగా పీల్చేసి నిస్సారం చేస్తాయి; +రుద్రజెడ; దీని గింజలనే సబ్జా గింజలు అంటారు; +అమెరికా నుంచి దిగుమతైన పిఎల్.480 గోధుమలతో పాటు ఈ కలుపు మొక్కలు దిగుమతయ్యాయి. అక్కడ ఈ కలుపు మొక్క ను తినే పురుగులు ఉన్నాయి. ఇక్కడ లేవు. ఏటికేడు విస్తరిస్తోంది. దీని పుప్పొడి ఉబ్బసం వ్యాధిని కలిగిస్తుంది. +రోడ్లకిరువైపులా విరగబూసిన వరగోగు వృక్షాలు గువాహాటి నగరానికి ఎంతో శోభను తెచ్చాయి; ఆ వృక్షం గువాహాటిలో సర్వ సాధారణం; +ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలలో స్థానికులు ఈ వృక్షం లేత ఆకుల్ని ఆకుకూరగా వండుకుంటారు. ఈ ఆకులు వైద్యపరంగా విరేచనకారిగా, మూత్రకారిగా పేరొందాయి. వీటి ముదురు ఆకులలో చేదుగా ఉండే ఇన్సులిన్ వంటి పదార్ధం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు రుజువుచేశాయి. పండుటాకుల్నీ, ముదురు కాయల్నీ అక్కడి స్థానికులు వైద్య చికిత్సలో ఉపయోగిస్తారు. వీటి ముదురు ఆకులు చక్కెర వ్యాధిగ్రస్థులలో రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని తగ్గించడానికి పనిచేస్తాయట. బౌద్ధంలో ఈ వృక్షాలకు పవిత్రమైన స్థానముంది. +1) language character that can be uttered in one unit; అచ్చులు, అచ్చు కలవని హల్లులు 'వర్ణములు' అనబడతాయి. వర్ణముల సంఖ్య చాలా పరిమితంగా వుంటుంది.తెలుగులో 36. సంస్కృతం నుండి అప్పు తెచ్చుకున్నవాటితో కలిపి 56. +వర్ధంతి అను శబ్దము వృధు, వృద్ధా అను ధాతువులనుండి నిష్పన్నమైనది. అది వృద్ధి అను అర్థమును చెప్పును ఆయుర్వృద్ధికి హోమాదులు ఒనరింతురుగావున వర్ధంతి అను పదము "పుట్టినరోజు" కి వాడుట యోగ్యము; +--ప్రాసంగులు (రాజనాలు కర్పూర భోగులు, వంక సన్నాలు, కుంకుమ పూలు, గుండ్ర సాంబవలు, మొలకొలుకులు, కుసుమలు, సన్న కొనామణులు, చిన్న పిషాణీలు, పెద కాకిరెక్కలు, పిన్న కుసుమలు, పాలాట్రగడ్డలు, బంగారు తీగలు, సన్న ముత్యాలు, జున్నుబాలు, వంకెలు, పగడాలు, ఢిల్లీ భోగాలు, రామసాగరాలు వంటి పలు ఇతర జాతులు కూడా ఉన్నాయి; ఇవికాక సాంబవ (సాంబ) మషూరీ, జీలకర్ర సన్నాలు, కృష్ణ కాటుకలు, సన్న కృష్ణ కాటుకలు, అక్కుళ్ళు, నెంబర్లు, ముదుగులు, బుడమలు, కోడి బుడమలు, జిలమలు, ఎరడాములు, కిచిడీలు, ఆట్రగడ్డలు, సన్నాట్రగడ్డలు, జయపూరు సన్నాలు, వంక సన్నాలు, కర్నూలు సోనా మషూరీ, చిట్టిముత్యాలు, కాకి రెక్కలు, ఈత గొల్లలు,గొర్తివడ్లు, స్వర్ణ, హంస, జయ, కేసరి, చెన్నంగి, రాజభోగాలు, బాస్మతి వంటి వరి వంగడాలు ఇంకా ఎన్నో; వరి ధాన్యంలో కొన్ని వేల రకాలు ఉన్నాయి; +వల్ల కాడు ఒలికి కాడు సొద (చితి) పేర్చెడి చోటు +ఒలికికాడు → ఒలిక్కాడు → వలిక్కాడు → వలక్కాడు → వల్లకాడు. +ఒలికికాడు' లేదా 'ఒలుకులమిట్ట' అనే పదానికి 'చితిపేర్చెడు చోటు సొదపేర్చెడు చోటు' అని అర్థం. +Sans సుషేణ; కరమర్దకః; అవిగ్నః; కృష్ణపాక ఫలమ్‍; +--130 కుటుంబాలకు పైగా ఉన్న వానపాములలో 12 వేలకు పైగా జాతులున్నాయి. మెగాస్కోలెసిడే కుటుంబానికి చెందిన మెగాస్కోలెక్స్ మారిటీ అనే శాస్త్రీయ నామం కలిగిన వానపాములు మన ప్రాంతంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి నేలలో వానపాములు ఎంత ఎక్కువగా ఉంటే రైతుకు అంత మేలు జరుగుతుంది +Sans యువానీ దీపక; దీప్య; ఓమము; శూల హంత్రీ; +వార వనిత అంటే ఒక రోజు వరకు గడపఁదగ్గ మగువ (వెలయాలు); +1 సప్తమాతలలో ఒకరైన దేవత 2 ఆడ అడవి పంది; +బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ వీరు సప్తమాతలు. దుర్గా సప్తశతిలో వీరు దుర్గాదేవి ప్రతిరూపాలుగా వచ్చి రాక్షస సంహారం కావిస్తారు; +--weather ety వాన, గాలి, మబ్బు, ఎండల సముదాయం; +ప్రామాణిక వ్యాఖ్యానం standard (regular) commentary; ప్రామాణిక వ్యాఖ్యానంలో గ్రంథంలో కవి ఉపయోగించిన కష్టమైన ప్రయోగాలను, సూత్రాలను (అనగా కుదించి వ్రాసిన విషయాలను) విడమరచి విపులంగా వివరించడం జరుగుతుంది +సర్వంకష వ్యాఖ్యానం interpretation with word-for-word translation and purport; శిశుపాలవధ అనే మాఘకావ్యానికి (మాఘుడు వ్రాసినది) మల్లినాథుడు వ్రాసిన వ్యాఖ్యానమును సర్వంకషము అంటారు. అనగా పదచ్ఛేము, పదార్థోక్తి (అందులో వాడిన పదాల యొక్క వివిధ అర్థాలు, విగ్రహం (విడి విడి పదాలను కలిపినపుడు వచ్చే సమాస పదానికి ఏర్పడే ప్రత్యెక అర్థపు వివరణ వాక్యయోజన (వాక్యాలు విడి విడిగా ఉన్నపుడు వేర్వేరు అర్థాలను సూచించినప్పటికీ వాటిని ��్రక్క ప్రక్కన వ్రాయడం వలన వాటి సమూహానికి కొత్త అర్థం ఏర్పడవచ్చు ఆపేక్ష సమాధానం (వ్యాఖ్యాకారుడే స్వయంగా ప్రశ్నలు వేసి, వాటికి తనే సమాధానం ఇవ్వడం ద్వారా వివరణను ఇవ్వడం ఇలా వివిధ రకాలుగా గ్రంథం యొక్క విషయాన్ని కూలంకషంగా చర్చించి వివరించేదే 'సర్వంకష' వ్యాఖ్యానము. +సంజీవినీ వ్యాఖ్యానం continuous commentary; టీకా అనగా నిరంతర వ్యాఖ్యానం. గ్రంథంలోని ఏ ఒక్క పదాన్ని విడిచిపెట్టకుండా కఠినమైన పదాలకూ, తేలికైన పదాలకూ కూడా అర్థాన్ని వివరించేదానిని టీకా అంటారు. మల్లినాథుడు కాళిదాసు యొక్క వివిధ కావ్యాలకు వ్రాసిన టీకాలకు 'సంజీవనీ' టీకా అని పేరుపెట్టాడు. +ఒక మిశ్రమ జంతువు. ఇందులో కొమ్ములు, కోరలు, ఏనుగు తొండం, సింహపు జూలు, పాము తోక, ఇలా అనేక జంతువుల లక్షణాలు కలిసి ఉన్న ప్రత్యెక జంతువు. ఒకవేళ ఏనుగు తొండం ఉంటే గజ వ్యాళ అని, సింహం ముఖం తో ఉంటే సింహ వ్యాళ అనీ,మనిషి ముఖం ఉంటే నర వ్యాళ అనీ ఇలా విభిన్న రూపాల్లో శిల్పాలు చెక్కటం మనం గమనించ వచ్చు. కొందరి సిద్ధాంతం ప్రకారం మొహెంజుదారో M-౩౦౦ ముద్రలో ఉన్నది వ్యాళి జంతువు. ఎందుకంటే కొమ్ములు, కోరలు, ఏనుగు తొండం, సింహపు జూలు, జింక శరీరం, పులి కాళ్ళు ,పాము తోక అందులో కనిపిస్తాయట గుప్తులకాలంలో,ఇంకా గుజరాత్ ,మధ్య దేశం అంతటా ఈ జంతువు గుడులలో కనిపిస్తుంది. అయితే దేవాలయ శిల్ప కళలో మాత్రం పల్లవ రాజుల కాలం నుండి ఇవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మామల్లపురం లో వ్యాళ/యాళి మండపం ఉంది. నాయక రాజుల కాలంలో ఇవి ముంగాళ్ళ మీద నించుని నోరు తెరచిన రూపంలో ఉంటాయి. విజయనగర రాజులు, కన్నడ నాట, ఇలాంటి జంతువు దేవాలయ శిల్పాలలో చెక్కడం సాధారణమే. బౌద్ధంలో కూడా వ్యాళ జంతువు ఉంది. +పూర్వం భార్యాభర్తలు ఒకే విస్తరాకు లో భోజనం చేసేవారు; వారు విడిపోయినప్పుడు మాత్రమే వేర్వేరు విస్తరాకుల్లో భోజనం చేసేవారు. అందుచేత జీవితంలో శాశ్వతముగా విడిపోయినప్పుడు "విడాకులు" తీసుకున్నారు అనే మాట ప్రచారం లోకి వచ్చింది; +చదువుకొనే శ్రద్ధ లేకుండా విజ్ఞులతో మొండిగా వాదం చేయడం; +వితథం తు అనృతం వచః" అని అమరం; +an Ayurvedic herb bot Ipomoea digitata విదారి తో కలిసిన అశ్వగంధాది చూర్ణం శరీరానికి రోగ నిరోధక శక్తి తో పాటు ధాతుపుష్టినీ, సత్తువనూ ఇస్తుంది. సుఖనిద్రను కలిగిస్తుంది; +--మంట; భగభగ మండుతూన్నట్లు అనుభూతి burning sensation; +బహు శాస్త్ర జ్ఞానం కలిగినది; మణి, రత్నం, తిలకం, మొదలైన పదాల�� శ్రేష్ఠతా వాచకాలు. ఈ రెండవ పదానికి వాచ్యార్థం చెప్పకూడదు విద్వాంసురాండ్రలో శ్రేష్ఠురాలు" అని మాత్రమే చెప్పాలి; +ఎవరు ఏ స్థితిలో ఏ పని చేయవలెనని (శాస్త్రం) నిర్దేశించిందో ఆ పని; కొడుకుగా, తండ్రిగా, భర్తగా, గృహస్ధుగా పౌరుడుగా …..ఈ విధంగా. వివిధ పరిస్థితులలో, దశలలో ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాలో అది; +వందలో నాలుగో వంతు పాతిక; పట్టికలో సగం పరక; పరకలో సగం వీసం; వీసం అనగా 100లో 16 వ వంతు; +కంద, చేమ కుటుంబానికి చెందిన ఈ ఆకర్షణీయమైన మొక్కలు మీటర్ ఎత్తు వరకూ పెరుగుతాయి. కొన్నేళ్ళు పెరిగిన తరువాత ఈ మొక్కలు పుష్పిస్తాయి. అస్సాం, ఇండోనేషియాలలోని చిత్తడి అడవులలో ఇవి కనిపిస్తాయి; +తెలుగులో కొన్ని వృత్తాల పేర్లు: చంపకమాల, ఉత్పలమాల, శార్దూల విక్రీడితము, మత్తేభ విక్రీడితము, తరళం, తరలము, తరలి, మాలిని, మత్తకోకిల, ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము, కవిరాజవిరాజితము, తోటకము, పంచచామరము, భుజంగప్రయాతము, మంగళమహశ్రీ, మానిని, మహాస్రగ్ధర, లయగ్రాహి, లయవిభాతి, వనమయూరము, స్రగ్ధర; +వెండితెర అనే ప్రయోగం ఆంగ్లం లోని Silver Screen నుండి వచ్చించి. 1910 లో బొమ్మను సిల్క్ గుడ్డపై ప్రదర్శించేవారు. బొమ్మ స్ఫుటంగా కనిపించడానికి తెరపై సిల్వర్ మెటాలిక్ పెయింట్ వేసేవారు. ఈ పద్ధతిలో తెరపై పడిన బొమ్మ తెరకు దగ్గరగా, ఎదురుగా కూరుచున్న వారికి మాత్రమే కాకుండా రెండు ప్రక్కల ఉన్నవారికి, దూరంగా బాల్కనీలో ఉన్నవారికీ కూడ ఒకేలా కనిపిస్తుంది. +గ్రీకు భాషలో టెఫ్రోస్ Tephros) అంటే 'బూడిద వర్ణపు' అని అర్థం. ఈ ప్రజాతిలోని కొన్ని మొక్కలలో ఆకుపచ్చని ఆకులపై ఉండే బూడిదవర్ణపు పూత కారణంగా ఆ పేరు. పూల Purple colour ని బట్టి purpurea అనే పేరు ఏర్పడింది. +ఇది ఖాళీ స్థలాలలో, బాటల వెంబడి పిచ్చి మొక్కగా పెరిగే ఒక బహువార్షిక మొక్క; వెంపలి మొక్కలలో నూగు వెంపలి, ములు వెంపలి, జిడ్డు వెంపలి, వెలి వెంపలి, పెద్ద వెంపలి వంటి పలు రకాలున్నాయి; వెంపలికి వైద్యపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి; +Note) లేత వెదురు చిగుళ్ళు ఆకుకూరగా వాడతారు. ఈ చిగుళ్ళు అజీర్తిని తొలగించి, ఆకలిని పెంచుతాయి. కొందరు ఈ చిగుళ్ళతో ఊరగాయ పచ్చళ్ళు కూడా పడతారు. ఏనుగులు, అడవి దున్నలు ఈ వెదురు చిగుళ్ళను ఆసక్తిగా తింటాయి. +Note) వైద్యంలో ఈ చిగుళ్ళను స్త్రీలకు ఋతురక్త స్రావం సక్రమంగా అయ్యేందుకు, క్రిమిదోష నివారణకు, జ్వర నివారణకు ఉపయోగిస్తారు. అతిసార వ్యాధిని నయ��� చేసేందుకు ఈ వెదురు చిగుళ్ళను మిరియాలు, ఉప్పుతో కలిపి నూరి పశువులచే తినిపిస్తారు. ఈ వెదురు చిగుళ్ళను ఆయుర్వేద వైద్యంలో రక్తశుద్ధికి, శ్వేత కుష్ఠు (ల్యూకో డెర్మా) నివారణకూ వినియోగిస్తారు. ఈ ఆకుల పసరును బ్రాంకైటిస్, గనేరియా, జ్వరం నివారణకు ఉపయోగిస్తారు. ఈ వేళ్ళను కాల్చి, తామరకు పైపూత మందుగా ఉపయోగిస్తారు. +--moonlight def నెల (చంద్రుడు) యొక్క వెలుగే వెన్నెల; +కృష్ణకు దక్షిణంగా, పెన్నకు ఉత్తరంగా ఉన్న ప్రాంతానికి వెలనాడు అని పేరు. నేటి రేపల్లె తెనాలి చుట్టూ ఉన్న ప్రాంతం. కాకతీయ సామ్రాజ్యం పడిపోయిన తర్వాత తిరిగి తెలుగు వారి రాజ్యం ఏర్పరచే ప్రయత్నం చేసిన ప్రోలయ నాయకుడు, కాపయ నాయకుడు ఈ ప్రాంతం వారే. +తెల్ల గడ్డ; వెల్లిపాయ; చిన్న ఉల్లి; +Sans రసోన; లశున; మత్స్యగంధా; మహౌషధ; +వివిధ తాళాలతో, మంగళ వాయిద్యాలతో మేలుకొలుపు వాడు; ఒక జాతి మొత్తం నిద్రావస్థలో ఉన్నప్పుడు వారిని మేల్కొలిపి కొత్త దా +--asceticism note) ప్రాపంచిక సుఖాలపై విరక్తి; పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, స్మశాన వైరాగ్యం అని మూడు రకాల వైరాగ్యాలు ఉన్నాయి; +విశ్వేదేవతలను ఉద్దేశించి చేసే హోమం వైశ్వ దేవం. ఈ దేవతలకు అన్నం హోమంలో బలి ఇస్తారు బలి అంటే బలకరమైనది దీనితోబాటు ఇతర దేవతలకు గూడా భోజనానికి ముందు బలి ఇస్తారు. దీనివల్ల అన్నం పవిత్రమై భోజన యోగ్యం అవుతుంది. ప్రతి దినమూ గృహస్థులు కొన్ని దోషాలు చేస్తూనే ఉంటారు. ఉదాహరణ: వంట చేయడంలో కట్టెలను ఆశ్రయించి క్రిమి కీటకాలు ఉండవచ్చు. ఈ హింస లు జరగనిదే వంట సాగదు. ఈ దోషాలు అన్నాన్ని చేరుతాయి గాబట్టి పరిహారంగా పంచ మహాయజ్ఞాలు, వైశ్వదేవమూ చేసి భోజనం చేయాలి. +శఠము అరి శఠారి మాయకు శత్రువు; గుడికి వెళ్లినప్పుడు తీర్థం అయ్యాక ఈ శఠారి పెట్టేటప్పుడు "స్వామీ! నా శఠాన్ని తొలగించి నీ నిజ రూపం చూపించు. నాకు ఈ మాయ నుంచి విముక్తి కలిగించి జ్ఞానం కలిగించు" అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. శఠగోపం విష్ణుని ఆలయాలలో మాత్రమే ఉంటుంది; +శతావరి కి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క ను తవ్వి, లాగితే తేగల్లాగా సన్నంగా వేళ్ళు వస్తాయి. ఈ వేళ్ళని చిన్న ముక్కలుగా తరుగుతారు. తరిగిన ముక్కల్ని తొక్క నుండి వేరు చేస్తారు. ఈ ముక్కల్ని ఎండలో ఎండబెడతారు. ఎండిన ముక్కలు మార్కెట్ లో అమ్ముతారు. ఇందులో "శతావరిన్" అనే పదార్ధం ఉంటుంది. ఇది పాలు పెరగటానికి ఉపయోగ పడుతుంది. దీంతో తయారు చేసిన మందు కొన్ని హర్మోన్లను ప్రేరేపించి పాలను పెంచుతుంది. +శనైః చోరుడు శనైశ్చరుడు; శనైః అంటే నెమ్మదిగా, చరః అంటే చరించే (అంటే కదిలే); +5) a fabulous animal described in Hindu Puranas said to have eight legs and to be stronger than a lion or tiger వేయి చేతులతో, జడధారియై, చంద్రరేఖాజూటుడై, సువిశాలమైన రెండు రెక్కలతో, పొడవైన ముక్కుతో, పెద్ద పెద్ద కోరలతో, వజ్రభాలైన గోళ్ళతో, నీలకంఠంతో, నాలుగు కాళ్లతో, మూడు కళ్ళతో, హుంకారాలు చేస్తూ విజృంభించాడు. అటువంటి శరభ రూపాన్ని కనబడగానే తన బల సామర్థ్యాలను కోల్పోయాడు నరసింహుడు. అతని శక్తులన్నీ లాగేసాడు. శరభవతారుడైన ఆ వీరభద్రుడు ఆ నరసింహుని చేతులు పట్టుకున్నాడు. రెక్కలతో అతని నాభిని, పాదాలను తాడిస్తూ, పుచ్ఛంతో అతనిని బంధించాడు." +శల్యపరీక్ష అనే జాతీయం పూర్తిరూపం స్తనశల్యపరీక్ష. స్తనంలో శల్యం (ఎముక) ఉండదు. లేదు అని తెలిసి కూడా అతిజాగ్రత్తపరులు కొందరు సోదా చేస్తూ ఉంటారు. ఫలితం తెలిసి కూడా చేసే వృథా పరీక్ష అనే అర్థంలో పై జాతీయాన్ని ఉపయోగిస్తారు. +ప్రయోజనం లేని తిరకాసులతో కూడిన చర్చలు; +--ఎగువసభ, శాసననిర్మాణమునకు అనుభవజ్ఞులతో కూడిన సభ రాష్ట్రానికి పరిమితమైన) విధానసభ; +--ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టాలు చేసి, ప్రభుత్వ విధానాలను రూపొందించి నిర్ణయించే (రాష్ట్రానికి పరిమితమైన) విధానసభ; +పితృ కార్యాలకు దైవ కార్యాలకంటే నియమాలు ఎక్కువ. అందుచేత శ్రాద్ధం (శ్రద్ధతో చేసేది) అంటాం. +దిరిసెన; దిరిసెన పువ్వు; శృ ఈషన్ అని వ్యుత్పత్తి. తొందరగా వాడిపోయేది అని దాని అర్థం; ఈ చెట్టుకు, దాని ఆకులు, కాయలు, పూవులకు ఆయుర్వేదంలో విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఎన్నో రోగాలకు దివ్యౌషధంగా ఈ చెట్టు తాలూకు భాగాలు పనిచేస్తాయి. +ఇది నల్లగా, మెరుస్తూ, మైనంలా ఉంటుంది. శిలాజిత్ నీటిలో వేయగానే ఆ నీళ్ళు ఎర్రగా మారతాయి. శిలాజిత్ గాయాలు మాన్పుతుంది. విరిగిన ఎముకలను బాగుచేస్తుంది. ఎముకలు విరిగిన వారికి త్వరగా కట్టుకొనడానికి, నొప్పులు తగ్గడానికి గురిగింజ ఎత్తు శిలాజిత్ ని నేతిలో కలిపి కొన్ని రోజులపాటు తీసుకోవాలి. దానినే కాస్త విరిగిన ఎముకలమీద రాస్తే మరింత ప్రయోజనం; అలసట, నిస్సత్తువ వంటివి మధుమేహం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటిని తగ్గించడానికి సిలాజిత్తును వాడుతుంటారు; +ప్రతినెలా అమావాస్య ముందు చతుర్దశిని శివరాత్రిగా పరిగణిస్తారు. కాని, మాఘమాసంలో అమావాస్యకు ముందు రాత్రిని మహాశివరాత్రి అంటారు. మాసశివరాత్రి: ప్రతినెలా కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి (అనగా అమావాస్యకు ముందురోజు మహాశివరాత్రి: మాఘబహుళ చతుర్దశి. +note).మానవులలో యుగాండం (zygote) అన్న పేరు శిశుసంకల్పన (conception) సమయం నుండి ఐదో వారం వరకు వర్తిస్తుంది. ఐదవ వారం నుండి పదవ వారం వరకు దీనిని పిండం (embryo) అని పిలుస్తారు. పదకొండవ వారం నుండి ప్రసవం అయి బిడ్డ భూపతనం అయేవరకు భ్రూణం (ఇంగ్లీషులో ఫీటస్, fetus) అంటారు ప్రసవం అయినప్పటినుండి మాటలు వచ్చేవరకు శిశువు (infant) అంటారు ఇంగ్లీషులో ఇన్^ఫెంట్ అంటే మాటలు రాని పసిబిడ్డ అని అర్థం. మాటలు మాట్లాడడం మొదలు పెట్టిన తరువాత బిడ్డ (child) అంటారు. బిడ్డ అనే మాట ఆడ, మగ కి వర్తిస్తుంది. +--turpentine; దేవదారు మొక్కలనుండి కారే రసం; +శుచి అంటే అగ్ని. అది అన్నిటినీ పవిత్రం చేస్తుంది. ప్రదేశమూ, వస్తువూ, ఆర్జన ఇవన్నీ పవిత్రం అయినపుడే ఆ వస్తువు శుచి ఔతుంది. పుణ్య కార్యానికీ వాడదగినది శుచి యైన వస్తువే మంత్రం చేత అభిమంత్రితమైనది శుచి. చక్కగా చేసిన వంట శుభ్రం అది భగవన్నివేదితమై శుచి ఔతుంది. +2) dowry శుల్కం' అన్నది ఒక వెల, డిపాజిట్, టాక్స్. వేశ్యకు ఆమె సేవలకు గాను ఇచ్చే డబ్బును కూడా శుల్కం అంటారని నిఘంటువులు చెబుతున్నాయి కన్యా శుల్కం' అంటే ఒక కన్యను తెచ్చుకోవడానికి ఆమెను కన్నవారికి ఇచ్చే ధర, లేక డిపాజిట్; కన్యాశుల్కం ఇచ్చి కొన్నాడు కనుక ఆ కన్యపై సర్వాధికారాలు ఆ పురుషుడికి జమ అయిపోయాయి. అదే వరకట్నం విషయంలో అది వెల యిచ్చి పురుషుని కొనడం కాదు. అతనికి భక్తితో సమర్పించుకొన్న కానుక. కనుక వరకట్నం ఎంత ఇచ్చినా అది ఆ మగవాడి 'ఎంటైటిల్మెంట్' అవుతుంది కానీ అతడు అమ్ముడు పోయినట్లు కాదు. +Sans విశ్వభేషజం; మహౌషధం; కటుభద్ర; ఆర్ద్రక; శృంగిబేర; +ety శృంగిబేర Gr జింజిబెరి Lat జింజిబర్ Eng జింజిర్ +శోధన నాళిక test tube; పరీక్ష నాళిక. +nuptials; శోభ కలిగించేది /ఆనంద దాయకము అని శబ్దార్థం; +శ్లోకం అనుష్టుప్ అనే 8 మాత్రల ఛందోవర్గానికి చెందిన ఒక రూపం. ఉత్పలమాల, శార్దూల విక్రీడితం లాగా అది కూడా ఒక కావ్య రచనకు ఉపయోగపడే పద్యం. శ్లోకంలో నాలుగు పాదాలు. ప్రతీ పాదంలోనూ ఐదవ అక్షరం లఘువు అయి ఉండాలి. రెండు, నాల్గవ పాదాలలో ఏడవ అక్షరం లఘువు అయి ఉండాలి. ప్రతీ పాదంలోనూ ఆరవ అక్షరం గురువు అయి ఉండాలి. మిగిలిన చోటులలో నియమమేమీ లేదు. అంటే, నియమం 5,6,7 అక్షరాలలోనే కనపడుతుంది. దీనిని ఈ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు బేసిపాదాలలో 5,6,7 అక్షరాలు యగణం (లఘువు-గురువు-గురువు) కావాలి. సరిపాదాలలో జగణం(లఘువు-గురువు-లఘువు) కావాలి. పాదం చివరి అక్షరం (ఎనిమిదవది) కూడా గురువే కావాలి. ఇలాంటి లక్షణాలున్న పద్యాన్ని 'శ్లోకం' అంటారు. రామాయణం శ్లోకాలతోనే వ్రాయబడింది. కాలిదాసు రఘువంశం ఎక్కువ భాగం శ్లోకాలలోనే వ్రాయబడింది. +మంత్రం శ్లోకం రూపంలో కూడా ఒక్కోసారి ఉండవచ్చు. ఐతే అన్ని మంత్రాలూ శ్లోక ఛందస్సులోనే ఉండనవసరం లేదు. అలాగే శ్లోకాలన్నీ మంత్రాలు కావు. మంత్రానికి గురూపదేశం అవసరం; +అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము. దానము, ప్రతిగ్రహము అనేవి ఆరూ బ్రాహ్మణ విధులు. +1. వేద శాస్త్రాలను గురుముఖంగా నేర్చుకోవడం, 2. నేర్చుకొన్న విద్యలను విద్య నేర్పమని ఆశ్రయించిన విద్యార్థులకు వాళ్ల యోగ్యతననుసరించి బోధించడం, 3. యజ్ఞాలు చేయడం, వైశ్వదేవము, అగ్ని ష్టోమము, సోమయాగము వంటివి. 4. తనను యజ్ఞం చేయించమని అడిగినపుడు యాజకత్వం వహించడం. యజ్ఞ దక్షిణలు ప్రతిఫలంగా గ్రహించడం. 5. దానములు చేయడం, గో భూ హిరణ్యాది దానాలు కాలోచితంగా చేయడం. 6. ఇతరులు ఇచ్చే దానాలు స్వీకరించి, వాళ్లను దోష విముక్తులను చేసి, జప తపాదులతో తనలో ఆ దోషం లేకుండా చేసుకోవడం — ఇవన్నీ బ్రాహ్మణుడు తప్పక చేయవలసినవి; +షష్టిపూర్తి రోజున మనం పుట్టినప్పటి తిథి పక్షం మాసం సంవత్సరం అన్నీ మళ్ళీ కలసి వస్తాయి. ప్రభవ, విభవ, … నుండి మొదలై లెక్కించగలిగిన సంవత్సరాలు మనకు మొత్తం 60 ఉన్నాయి. ఆ 60 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ మనం పుట్టినప్పటి తిథి పక్షం మాసం సంవత్సరాల కలయిక వచ్చే సందర్భమే షష్టిపూర్తి. +ఈ విధంగా ఆనందంతో అత్యంత వైభవంగా జరుపుకొనే పుట్టినరోజున ఆనందంతో పాటు జీవితంలో సగానికి పైగా గడచిపోయింది, ఇక అంతిమ ప్రయాణానికి రోజులు దగ్గర పడుతున్నాయి అనే ఆలోచన కూడా రాక మానదు. ఈ ఆలోచనవల్ల కలిగే భీతిని సమాధాన పరచడానికి కొన్ని కార్యాలు చేయడం పరిపాటి. అవి ఉగ్రరథ శాంతి, మహా మృత్యుంజయ హోమం, నవగ్రహ, చండి, సుదర్శన, లక్షినారసింహ మొదలగు హోమ క్రతువులు చేయడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని దానధర్మాలు చేయడం. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం: మనిషి పూర్తి జీవితంలో జరుపవలసినవిగా నిర్ధారించిన 16 సంస్కారాలలో 'షష్టిపూర్తి' అనేది లేదు! దానిని మరో వివాహ దినోత్సవంలా జరుపుకోవడం అనేది అసలే లేదు!! + + +the prolog to many Hindu rituals where the person performing the rite identifies himself/herself by telling the space, time, and genetic coordinates in the universe using the following statement అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే,కలియుగే,ప్రథమపాదే జంబూద్వీపే,భారతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణదిగ్భాగే,కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరే (ఉత్తర/దక్షిణ) అయనే ఋతౌ మాసే పక్షే తిథౌ వాసరే శుభ నక్షత్రే శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం,అస్యాం శుభతిథౌ,శ్రీమాన్ గోత్రస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం +సూర్యాది గ్రహములు ఒక రాశిని విడిచి మరియొక రాశికి పోవడము. +తర్పణము అంటే తృప్తి పరచడం. తర్పణం శ్రద్ధగా చేయడం సం తర్పణము; అన్న సంతర్పణ అంటే ఎక్కువ మందికి అన్నం పెట్టి తృప్తి పరచడం; +పుట్టినది మొదలు ఆయా వయసులలో మంత్రపూర్వకంగా చేసే క్రియలు సంస్కారాలు. జాతకర్మ మొదలు అంత్యేష్టి వరకూ 16 సంస్కారాలు చేస్తారు. అన్నప్రాశనం, చెవులు కుట్టడం, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం, మొదలైనవి సంస్కారాలు; +సజ్జలు బలవర్ధకమైన ఆహారం. సజ్జలతో చేసిన ఆహారపదార్థాలు రుచితో పాటు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి; సజ్జలు ప్రాణ్యములని సరఫరా చేసే చక్కటి ఆహారం వంద గ్రాముల సజ్జలు 378 కేలరీల శక్తిని ఇస్తాయి. వీటిలో ఖటికం, ఇనుము అధికంగా ఉంటాయి. భాస్వరం శాతం అధికంగా ఉన్న సజ్జలు కణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి; సజ్జలతో రొట్టె, చపాతీ, దోశ ఇలా రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. +--nascent ety సద్యః జాతః అప్పుడే పుట్టిన; +lambent light సన్నని వెలుగు; చల్లని వెలుగు; +lambent candle light రెపరెపలాడే కొవ్వొత్తి వెదజల్లే సన్నని వెలుగులో +కల్లు అనగా తమిళం, కన్నడ భాషలలో రాయి అని అర్థం. +సప్తాహం అంటే ఏడు రోజుల (పగళ్ల) పాటు జరిగే కార్యక్రమం. ఉదాహరణకు భాగవత సప్తాహం అంటే ఏడు రోజులపాటు భాగవతాన్ని చెప్పుకోవడం; +సబ్జాగింజలు నీటిలో నానే సరికి వాటి మీద తెల్లటి గుజ్జు వంటి మ్యూకస్ పొర ఏర్పడుతుంది. నానిన సబ్జా విత్తులు మూత్రకారి (diuretic)గానూ, శృంగారోద్దీపకాలు (aphrodisiac)గానూ, చెమట పట్టించేవి (diaphoretic) గానూ, కడుపులోనుంచి గ్యాస్ ను వెడలించేవి (carminative) గానూ పేరొందాయి. ఈ (తులసి) మొక్క ఆకుల రసం కడుపులో క్రిమిదోషాన్ని నివారిస్తుంది. దీని వేళ్ళు జ్వర హారిణి (febrifuge) గా పనిచేస్తాయి. ఈ వేళ్ళ రసాన్ని పాము విషానికి విరుగుడు (antidote to snake-poison) గానూ ఉపయోగిస్తారు; సబ్జా విత్తులు తీసుకుంటే అవి శరీరంలో అతికాకను తగ్గిస్తాయి. సబ్జా నీళ్ళు తాగిన వెంటనే కళ్ళు చల్లబడతాయి. ఈ విత్తులు గనేరియా (Gonorrhoea) నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి. ఒకప్పుడు పశ్చిమ ఆశియా దేశాలలో గనేరియా విపరీతంగా వ్యాపించి అపారమైన జన నష్టం జరిగిందట. అప్పటి నుంచీ ముస్లిం కుటుంబాలలో సబ్జా విత్తుల వాడకం, వారి ఇళ్ళలో సబ్జా తులసి మొక్కల పెంపకం ఒక తప్పనిసరి విషయంగా అలవాటయిందని అంటారు; +బాల్యంలో ఒకప్పుడు ఆటలమ్మ (Chickenpox) వచ్చి తగ్గిన వారిలో కొందరికి, రక్త నాళాలలో దాగి ఉన్న వ్యాధికారక సూక్ష్మక్రిములు, సాధారణంగా ఆ వ్యక్తి వయస్సు అరవై ఏళ్ళు దాటాక రక్తనాళం పొడవునా సర్పి బొబ్బల రూపంలో బయటపడి తీవ్రమైన బాధకలిగిస్తాయి +అ, ఆ లు, ఇ, ఈ లు, ఉ, ఊ లు సవర్ణములు; +భర్త తోపాటు చితి ఎక్కడం సహగమనం భర్త వేరే చోట మరణించాక వార్త తెలిసి అగ్ని ప్రవేశం చేస్తే అనుగమనం; +--witness ety స అక్షి ప్రత్యక్షంగా చూచిన వ్యక్తి; +జింక, ఏనుగు, తుమ్మెద, వాన కోయిల; సారమైన అంగములు కలది సారంగం; +దేవతలు ఒకసారి యజ్ఞం చేస్తూ రుద్రుని మహిమ తెలియక ఆయనకు యజ్ఞ భాగం ఇవ్వలేదు. అశివమైన ఆ యజ్ఞాన్ని శివుడు రౌద్రాస్త్రంతో భేదించగా యజ్ఞం జింక "రూపం ధరించి పరుగుదీసింది. అపుడు దాన్ని తన చేత్తో పట్టుకొన్నాడు .అందుచేత శివుడు సారంగపాణి అయ్యాడు. +సరస్వతీ సంబంధమైనది సారస్వతం. తెలుగు సారస్వతం అంటే కావ్యాదులతో పాటు విమర్శలూ, కథలూ, రూపకాలూ, ఆయా శాఖలలో వెలువడే వ్యాసాలూ, పరిశోధనలూ, హరికథాదులూ, అన్నీ. సంగీత సారస్వతం అంటే కృతులూ, పదాలూ, ఆ గాన ఆలాపనలూ. వైదీక సారస్వతం అంటే వేదాలూ, మంత్రాలూ, వాటి వ్యాఖ్యానాలూ, ఉపన్యాసాలూ, మొదలైనవన్నీ. +హిందూ దేవాలయాలలో విష్ణుమూర్తి ప్రతిరూపంగా పూజింపబడే ఒక రకమైన నల్లని రాళ్ళని సాలిగ్రామాలు/సాలగ్రామాలు అంటారు. ఇవి నేపాల్ లోని గండకీ నది పరీవాహక ప్రాంతమైన 'సాలిగ్రామం' అనే గ్రామం లో విరివిగా లభిస్తాయి. ఈ రాళ్ళు నునుపుగా అక్కడక్కడా కొన్ని గుర్తులతో అండాకారం లో ఉంటాయి. ఆ గుర్తులు విష్ణువు యొక్క ఆయుధాలని చెప్పబడే శంఖం,చక్రం, గదలను మరియు విష్ణువు అవతారాలైన మత్స్య,కూర్మావతారాలను తలపించే విధంగా ఉండటం వలన ఆ రాళ్ళకు దివ్య శక్తులున్నట్లు ప్రజలు విశ్వసిస్తారు. +సర్జకము; ఈ చెట్టు నుండి కారే రసం గడ్డకట్టినప్పుడు సాంబ్రాణి అవుతుంది; కాని అద���మిటో దీనిని గుగ్గిలం చెట్టు అని అంటారు; గుగ్గుల్‍ చెట్టు (Caommiphora mukul" of Burseraceae family)నుండు స్రవించే జిగురు వంటి పదార్థం గుగ్గిలం; +“సాల”(Shorea robusta) అనే వృక్షానికి ఆనుకుని నిలబడి ఉన్న ఆడ రాతి బొమ్మని సాలభంజిక అని పిలవడం కనిపిస్తుంది. మొత్తం పదానికి అర్ధం చూస్తె సాల్ చెట్టు కొమ్మ వంచుతున్న/విరుస్తున్న స్త్రీ అని చెప్పుకోవచ్చేమో. మౌర్యులు, శాతవాహన కాలాలనుంచి ఇలాంటి శిల్పాలు కనిపిస్తాయి. బౌద్ధ సాహిత్యంలో కూడా దీని ప్రసక్తి ఉంది; +1) literature; సాహిత్యం, సారస్వతం, వాఙ్మయం అనేవి మూడు. ఇవి ఒక దానికంటే మరొక దాని పరిధిని బట్టి విస్తృతమైనవి. హితబోధ లక్ష్యంగా కలది సాహిత్యం. ఉదా. కావ్య నాటకాదులు. సరస్వతీ సంబంధమైనది సారస్వతం. తెలుగు సారస్వతం అంటే కావ్యాదులతో పాటు విమర్శలూ, కథలూ, రూపకాలూ, ఆయా శాఖలలో వెలువడే వ్యాసాలూ, పరిశోధనలూ, హరికథాదులూ అన్నీ. వాఙ్మయం అంటే పైవన్నీ. వినోదం కోసం ఆనందం కోసం ఉన్న రచనలే కాక, నిత్య జీవితానికి ఉపకరించే అనేక విషయాల సమాహారం వాఙ్మయం ఔతుంది. వివిధ శాస్త్ర గ్రంథాలూ, జీవిత చరిత్రలూ, పత్రికలూ, వార్తలూ, చర్చలూ అన్నీ. తెలుగు భాషలో కనబడేవీ ,వినబడేవీ సమస్తమూ … వాగ్రూపం లో ఉండేవన్నీ— తెలుగు వాఙ్మయమే. +శివకేశవులనిద్దరినీ బేధం లేకుండా ఆరాధన చేసేవారు; శ్రుతి-స్మృతి-పురాణాలన్నిఁటినీ సరిసాటిగా నమ్మి సమగ్రంగా అనుసరించి ఆచరించే వారే స్మార్తులు. వీరంతా సర్వ సాధారణంగా శాంకర అద్వైతులై ఉంటారు. అద్వైతమంటే దేవుఁడూ, జీవుఁడూ పరమార్థంలో ఒకఁడేననీ, జీవులందఱిలోనూ, మానవులందఱిలోనూ ఉన్నది ఒకటే బ్రహ్మం అని నమ్మడం. అలాగే, శ్రుతి అంటే వేదాలు. స్మృతి అంటే ధర్మశాస్త్ర్రం తెలుఁగు బ్రాహ్మణులది పరాశర స్మృతి వారి నిత్య నైమిత్తిక విధులకు స్మృతీ, సూత్రమూ పరమ ప్రమాణాలు. +ఎరుపురంగు గింజలు కలిగిన చిన్న ఎరుపురంగు కాయలను ఇంగ్లీషులో జాఫ్రాకాయలు (JAFRAS) అని, ఉత్తర భారతదేశంలో సిందూరీలని అంటారు. ఈ కాయలు పరిమాణంలో, ఆకారంలో ఆగాకరకాయను పోలివుంటాయి. వీటి గింజలు కూడా ఆగాకరకాయ గింజల్లానే వుంటాయి. లిప్ స్టిక్ తయారీ కోసం ప్రత్యేకంగా వీటిని రంగుకోసం వాడతారు కాబట్టి వీటిని "లిప్ స్టిక్" గింజలు (Lip Stick Seeds) అని కూడా అంటారు. వీటితో వంటకాల కోసం వాడే రంగులు, వస్త్రాలపై వాడే రంగులు కూడా తయారు చేస్తారు. ఈ చెట్టు తాలుకు ప్రతి భాగం ఆయుర్వేద వైద్యానికి పనికి వస్తుంది. +నిత్య యవ్వనంలో ఉంటూ ఆకాశంలో యథేచ్చగా సంచరించగల శక్తులు ఉన్నవారు సిద్ధ చారణులు; +అభిమతం అంటే థియరీ అని, సిద్ధాంతం అంటే థీరం అనీ ఒక వివరణ ఉంది. +ఈ పెద్ద వృక్షం కాండం నుంచి స్రవించే జిగురును గమ్ ఘట్టి (Gum Ghatti) అంటారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి +కీ. శే. డా. వై. యస్. రాజశేఖరరెడ్డి ప్రయాణించిన హెలికాఫ్టర్ కర్నూలు జిల్లా పావురాల గుట్ట దగ్గర ఒక పెద్ద సిరిమాను వృక్షాన్ని గుద్దుకునే పేలిపోయిందని అంటారు +తోటకూర జాతికి చెందిన ఈ మొక్క ఆకుల్ని కొందరు కూరగా వండుకుంటారు. దీనికి వైద్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మొక్కలలో లేత ఎరుపు, పసుపు, రక్తవర్ణం వంటి పలు రంగుల పూలు పూసే రకాలున్నాయి; +సిత white, bright, clear, pure) అనే పదానికి 'పలక బొడిపెల తొక్కు) అనే పదం చేరి ఆ పండుకు ఆ పేరు ఏర్పడింది. అది రూపాంతరం చెంది 'సీతా ఫలం'గా మారింది. +ఈ మొక్క ఆకుల రసం మొండి చర్మ వ్యాధి తామరకు దివ్యౌషధం అయిన కారణంగా దీనిని ‘సీమ మెట్టతామర’ అని పిలుస్తున్నారంతే కాని దీనికి మెట్ట తామరకీ ఏ సంబంధమూ లేదు; ఈ మొక్క ఆకులలో ఉన్న పసుపుపచ్చటి క్రిసోఫానిక్ యాసిడ్ (Chrysophanic Acid) చక్కటి ఫంగిసైడ్ (Fungicide) గా పనిచేసి ఎంతటి మొండి చర్మవ్యాధులనైనా మాడ్చేస్తుంది; +తన మనసులో ఏర్పడేది. ఇతరుల ఉత్సాహం, కార్య కుశలత చూచి తాను గూడా ఆ విధంగా తన జీవితం మలచుకోవాలని అనుకోవడం స్ఫూర్తి. ఉదా: బాల గంగాధర తిలక్ స్ఫూర్తితో గాంధీజీ భారత రాజకీయాలలోకి వచ్చారు; +అతి ప్రాచీన కాలంలో బలిజలు మొదలైనవారు సంస్కృతీకరణంతో శ్రేష్ఠి బిరుదు పొందారు. అదే శెట్టి, సెట్టి గా మార్పు చెందంది. ఉత్తరాదిన సేఠ్ గూడా ఈ కోవకు చెందినదే. ఈ బలిజ శబ్దం వణిజ, వాణిజ్య, వణిక్ లాంటి సంస్కృత పదాలకు చుట్టం కావచ్చు. +same as ఆనపకాయ; అలాబువు; ఆనుగం; +Sans అలాబు; కోశాలబు; తుంబీ; ఆనుగం; +1. A vessel with a spout; సోమసూత్రము వంటి ముఖ భాగము గలిగిన లోహపాత్ర; +Note) శివలింగానికి కింద ఉండే పళ్ళెం పేరు పానపట్టం; అభిషేకం చేసిన ద్రవ్యాలు బయటకి వచ్చే మార్గం సోమసూత్రం; శివాలయాలు తూర్పు ముఖం గానూ, పశ్చిమ ముఖం గానూ ఉంటాయి; అవి ఏ ముఖంగా ఉన్నా సోమసూతం మాత్రం ఎల్లప్పుడూ ఉత్తరం వైపునే ఉంటుంది; see also పానవట్టము +- too bad I am dead lit. Sans I am dead; హతః అస్మి హతోఽస్మి; హతః చంపబడిన వాడు(గా అస్మి ఐతిని; నేను చంపబడినవాడిని అయ్యాను చచ్చేన్రోయ్" అనేది తెలుగు నుడికారానికి సరిపోయే మాట. +మూఢ నమ్మకాలకు సరియైన నిరూపణ కో��ే వారిని హేతువాదులు (rationalist) అంటారు. +హైరాన్ (حيران) అన్న పారశీక పదానికి దిగ్భ్రమ చెందడం, ఆందోళన చెందడం, శ్రమ పడడం అన్న అర్థాలున్నాయి. అదే హిందుస్థానీ/ఉర్దూ ద్వారా తెలుగులోకి హైరానాగా ప్రవేశించింది. +దీని మూల ధాతువు అరబ్బీ హైర్ حير హైరత్ حيرة ఆశ్చర్యం, దిగ్భ్రమ, కలవరము' అన్నది కూడా ఈ ధాతువుకు చెందినదే (సురేశ్ కొలిచాల + + +Sans గంధసారం; మహార్హం; భద్రప్రియం; మలయజం; +చంద్రుడికో నూలు పోగు A small gift to a great person; గొప్ప వారికి చిరు కానుక సమర్పించుకుంటున్నప్పుడు చెప్పే మాట; తెలుగువారి సంప్రదాయంనుంచి ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది. 1960 ప్రాంతాల వరకు విదియ చంద్రుణ్ణి సాయంసంధ్యలో పశ్చిమాకాశంలో దర్శించి, వంటిమీద చీర లేదా పంచనుంచి ఒక నూలుపోగు తీసి "చంద్రునికి నూలుపోగు" అని నోటితో చెప్పుకొని గాలిలోకి విడిచిపేట్టడం సంప్రదాయం. ఇది కులాలకు అతీతమైన ఆచారం. అయితే క్రమంగా ఈ ఆచారాన్ని మనందరం మరచిపోయాము. +నువ్వు చక్రం తీసికో you drive. +ముక్తిచతుష్టయం the four types of salvation, namely సామీప్యం, సాలోక్యం, సారూప్యం, సాయుజ్యం. +winged ants; Isoptera ఆర్డర్ కి చెందిన ఉన్నత తరగతి రెక్కల చీమలనే సాధారణ పరిభాషలో మనం చలిచీమలని వ్యవహరిస్తాం; +ఇవి చెద పురుగుల (termites) కంటే బాగా పెద్దవి; +ety చమరీ మృగం తోక లోని రోమములతో చెయ్యబడ్డ విసనకర్ర; +తెల్లని చామరాన్ని వింజామరం (విరి చామరం) అంటారు; +--other varieties include ఎర్ర చిక్కుడు; తెల్ల చిక్కుడు; గోరు చిక్కుడు; ఆనప చిక్కుడు; ఏనుగు చిక్కుడు; కోడి చిక్కుడు; తొండ చిక్కుడు; +వండ్రంగులు కలప వస్తువులు తయారు చేసే క్రమంలో భాగంగా ఎత్తుపల్లాలు వుండే కలపను చదును చేయడాన్ని 'చిత్రికపట్టడం' అంటారు. +నేను చిత్తు అయిపోయేను I am defeated. +--ఈ తులసి జాతి (Mint Family)మొక్క జన్మస్థలం మధ్య అమెరికా లోని దక్షిణ మెక్సికో, గ్వాటెమాలా దేశాలు. ఒకప్పుడు అక్కడి అజ్టెక్(Aztec జాతులకు మొక్కజొన్న, బీన్స్ తరువాత ఈ చియా గింజలే ప్రధాన ఆహారం. కొన్ని దక్షిణ అమెరికా దేశాలలో నేటికీ వీటిని పండిస్తారు. ఆహార పానీయాల తయారీలో వీటిని వినియోగిస్తారు. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ Omega -3 Fatty acids పుష్కలంగా ఉండే కారణంగా ఇప్పుడు అందరూ వీటి సాగు, వినియోగం మీద దృష్టి పెడుతున్నారు. ఈ గింజల్ని ఏదైనా ద్రవపదార్థంలో నానబెడితే ప్రతి గింజ చిత్రంగా తన బరువుకి పన్నెండు రెట్ల బరువుగల ద్రవాన్ని పీల్చుకుంటుంది. ఆ గింజలపైన తె���్లటి గుజ్జు వంటి మ్యూకస్ పొర ఏర్పడుతుంది; +కొందరు వీటిని సబ్జా గింజలుగా పొరబడుతుంటారు. నానబెట్టినప్పుడు గింజల మీద గుజ్జువంటి మ్యూకస్ ఏర్పడడం సబ్జా, చియా గింజలలో సామాన్య లక్షణం.ఈ రెండు మొక్కలూ తులసి జాతికి చెందినవే. అయితే ఈ రెండూ వేర్వేరు. చియా గింజలు ఎండువి కూడా ఆహారంగా ఉపయోగపడతాయి. సబ్జా గింజలు నానబెట్టి మాత్రమే వినియోగించాలి. సబ్జా తులసి మొక్క శాస్త్రీయ నామం Ocimum basilicum; +ఇది ఉసిరిక జాతికి చెందిన మొక్క; +rel నేల ఉసిరిక; ఉచ్చి ఉసిరిక; ఎత్త ఉసిరిక; +--చిలక ముక్కు గన్నేరు పూలు; చిలక ముక్కు గోరింట పూలు; దీని ఆకులు పూలను రుబ్బి అరచేతులు చేతుల, కాళ్ళ వేళ్ళకు పెట్టుకుంటే అవి ఎర్రగా పండుతాయి. దీని కాయలు చిలుక ముక్కు ఆకారంలో ఉండటంవల్ల దీనికి చిలకముక్కు మొక్క అనే పేరు వచ్చింది; హిందీలో గోరింటను మెహందీ (Mehandi) అన్నట్లు దీనిని గుల్ మెహందీ (Gul Mehandi) అంటారు. ఈ మొక్క కాయలు పక్వానికి రాగానే టప్ మనే చిన్న శబ్దంతో పగిలి లోపలి విత్తనాలను వెదజల్లుతాయి. ఇలా పగిలి విత్తనాలను వెదజల్లే కాయలను ఆంగ్లంలో డెహిసెంట్ ఫ్రూట్స్ (Dehiscent Fruits) అంటారు. +--ఈ మొక్క పూలకు యాంటిసెప్టిక్ (Antiseptic) గుణం ఉంది. అవి రోగకారకమైన బాక్టీరియా, శిలీంధ్రాలవంటి వాటిని నశింపజేస్తాయి. ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో ఈ మొక్క ఆకులను ఆకుకూరగా వాడుకుంటారు. ఈ మొక్క ఆకుల రసం మూత్రకారిగా (Diuretic విరేచనకారి (Cathartic)గా, వాంతి కలిగించే వమనకారి (Emetic) గానూ పనిచేస్తుంది. సెగగడ్డలు, పగలని మొండి వ్రణాలపై ఈ ఆకుల రసంతో మలాం పట్టీ వేస్తే, అవి త్వరగా పక్వానికొచ్చి పగుల్తాయి. +also known as పుల్ల బచ్చలి; ఈ మొక్కలో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్- సి ఉన్నాయి. ఈ ఆకుకూర పైత్యరోగ నివారిణిగా పేరొందింది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది; +పప్పు లో వేసుకుంటే ఈ ఆకుకూర చాలా రుచిగా ఉంటుంది. కొందరు పాలకూర, తోటకూర వంటి పులుపులేని ఇతర ఆకుకూరలతో దీనిని పులుపుకోసం కలిపి కలగూరగా వండుకుంటారు; +సర్వే మరియు సరిహద్దులు చట్టం" ప్రకారం ప్రతీ ముప్పై సంవత్సరాల కు ఒక సారి వ్యవసాయ భూములు తిరిగి సర్వే చేయాలి. బ్రిటిష్ వారి కాలంలో జమీందారీ వ్యవస్థ ఉండగా 1903–08 మధ్య కాలం లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు లో మొదటి సర్వే జరిగింది. ఈ సర్వే లో ఎవరు ఎంత విస్తీర్ణం ఏ నెంబర్ లో సాగు చేస్తున్నారు అనేది మాత్రమే పన్ను వసూలు సులభంగా చేయడం కోసం నిర��ణయించారు. తరువాత 1949–56 మధ్య ప్రభుత్వం జమీందారీ వ్యవస్థ రద్దు చేసి ఎస్టేట్ లు హస్తగతం చేసుకుని వ్యక్తిగత సర్వే జరిపి పాత జమీందారీ రైతులు అందరినీ పట్టా దారుగా గుర్తించి రైత్వారీ పట్టాలు ఇచ్చి శాశ్వత రికార్డ్ తయారు చేసారు. +తరువాత 1986 లో తిరిగి సర్వే చేయాలి. తెలంగాణా, రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో రెండవ విడత సర్వే జరిపినపుడు (కోస్తా లో ప్రస్తుతం జరుగుతోంది రీసెటిల్మెంట్ రిజిస్టర్" తయారు చేసిన సమయం లో (సర్వే సమయంలో రైతు హాజరయి హక్కు పత్రాలు చూపించని సందర్భాలలో) ఆపుస్తకం లో అన్ని వివరాలు రాసి చివరన ఉన్న "పట్టాదారు" కాలమ్ వద్ద రైతు పేరు ఖాళీగా వదలి …………………… అని చుక్కలు పెట్టి వదలి వేసారు. వీటినే "డాటెడ్ లేండ్స్ అని పిలుస్తారు. ఇలాంటివి తక్కువగానే ఉన్నా రిజిస్ట్రేషన్ నిషేదించబడినది; +మన పంచేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మములతోనే కాకుండా, మనస్సు, బుద్ధి, అహంకారము వంటి ద్వారా విషయ జ్ఞానాన్ని పొందడం కూడ చూడడమే అవుతుంది. +క్షుద్రదేవతారాధన వలన ఏర్పడిన శక్తితో విరోధులపై మంత్ర ప్రయోగము చేయుట; మనిషికుండే భయాన్ని ఆసరా చేసుకునే చేతబడి అనే అశాస్త్రీయ విశ్వాసం ప్రబలింది. ఇది అవాస్తవమే అయినాసరే ప్రజలలో ప్రబలిన విశ్వాసమే ఆలంబనగా తాము చేతబడి చేస్తామని కొందరూ, ఇతరులు చేసిన చేతబడిని తిరగగొడతామనీ ఇంకొందరూ సొమ్ము చేసుకుంటున్నారు. మెదడుకు వచ్చిన పక్షవాతం కారణంగా కోమాలోకి జారుకుని అంతిమ ఘడియలలో ఉన్నవారిని సైతం ఎవరో చేతబడి చేసిన కారణంగానే వారలా అయ్యారని నమ్మజెపుతూ, ఆ చేతబడిని తాము తిప్పికొట్టగలమని బీరాలు పలుకుతుంటారు. ఒక ఎండు కొబ్బరికాయను ‘మంత్రించి’ ఇచ్చి, దానిని రోగి మంచం కింద ఇరవైనాలుగు గంటలపాటు ఉంచి ఆ తరువాత పగులగొట్టి చూస్తే లోపల ఎర్రగా ఉంటే, ఆ వ్యక్తికి ఎవరో చేతబడి చేసినట్లేనని నమ్మబలికిన మంత్రగాడి’ గుట్టును రట్టు చేశారు. ఆ టెంకాయ కుండే ‘కళ్ళు’ ఒక పిన్నీసుతో పొడిచి అతడు ఆ కాయ లోపలికి తెల్లని ఫెనాల్ఫ్థలీన్ (Phenolphthalein C20 H14 O4) పొడిని జొనిపాడనీ, కొబ్బరి నీటిలో ఉండే క్షారగుణం కారణంగా ఆ పొడి తగిలిన కాయ లోపలి భాగమంతా అప్పటికే ఎర్రగా మారిపోయిందనీ, అతడిచ్చిన కొబ్బరికాయను అక్కడే పగులగొట్టి మరీ రుజువుచేశారు; +see also కట్టుమోను; బాణామతి; గండభేరుండం; ప్రయోగం; +Sans తిక్త కోశాతకీ; కటు కోశాతకీ; +--fish; a generic name for all fishes; see other entries for specific types such as నెత్తళ్లు; బెత్తలు; రొయ్యలు; సిందువాలు; మలుగు; జల్లకాయ; గండెచేప; మట్టాలు; దువ్వెన చేప; కుంటం పాము; వాలుగ; బురదమట్టి; కల్లింట; బాడిస; ఎండ్రగిత్త; బొమ్మిడాయి; కొరమ్రీను; గండుమీను; +ఎండిపోయిన జొన్న కాండం లోపల తెల్లగా, మెత్తగా ఉండే భాగాన్ని చొప్పదంటు అంటారు. దీన్ని పశువులకు ఆహారంగా వేయడం జరుగుతుంది. అయితే ఈ దంటులో రుచిగానీ, పోషక విలువలుగానీ ఏమీ ఉండవు. అది కేవలం పశువులు నమిలి నెమరువేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. +చాందినీ చౌక్; సామారంగం చౌక్; ఆసీల చౌక్; +కేవలం ఛందస్సును మాత్రం పాటిస్తూ, సాహిత్య విలువలను పట్టించు కొనకపోవడం వ్యవహారంలో ఛాందసం అనిపించుకొన్నది. లోక జ్ఞానం లేకపోవడం అని కూడా ఛాందసానికి అర్థం రూఢమైంది; +శ్రోత్రియుడైన వేదపండితుడిని "ఛాందసుడు" అంటారు; వైదిక ఆచారాలను ఉన్నది ఉన్నట్లుగా నియమబద్ధంగా పాటించడాన్ని ఛాందసము అనేవారు; + + +తెలుగు భాషకి, ఆధునిక అవసరాలకి సరిపోయే, ఒక నిఘంటువు (dictionary పర్యాయపద కోశం (thesaurus శైలి లక్షణ గ్రంథం (style manual) ఉండాలన్నది నిర్వివాదాంశం. వీటికి తోడు కాలంతో మారుతూన్న భాష స్వరూపానికి అద్దం పడుతూ ఒక ఆధునిక వ్యాకరణం కూడా ఉంటే బాగుంటుంది. +మాతృభాష అబ్బినంత తేలికగా, దేశ భాషలు నేర్వగలిగినంత తేలికగా, పాశ్చాత్య భాషలలో పాండిత్యం రాదు. మేథా వర్గాలలో ఉన్న బహుకొద్ది శాతం ఇంగ్లీషు తప్పనిసరి అని ఎంతగా అనుకున్నా, ప్రజలందరినీ పండితుల నుండి పామరుల దాకా, అందరినీ ఇంగ్లీషు నేర్చేసుకోమంటే అది జరిగే పని కాదు. కనుక ఈ నాటి శాస్త్రం, సాంకేతికం, వైద్యం, వ్యాపారం ఇలా ఏ రంగంలోనైనా ఆవిష్కరణ జరుగుతూన్న క్రొంగొత్త విషయాల గురించి తెలుగులో చెప్పవలసిన అవసరం ఉంది. సెల్ ఫోనుల వాడకం దగ్గరనుండి, రైలు టికెట్టు కొనుక్కోడం దాకా ఇంగ్లీషులోనే పని జరగాలంటే ఎలా? +ఆధునిక అవసరాలకి తెలుగుని వాడేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏ విషయం గురించి ఏది రాయాలన్నా తెలుగు వాళ్ల బుర్రకి ఇంగ్లీషు మాట తట్టినంత జోరుగా తెలుగు మాట తట్టదు. తెలుగులో పదసంపద లేకపోలేదు. వేళకి సరి అయిన మాట తట్టకపోవడమే పెద్ద సమస్య. పత్రికా విలేఖరులు, చలా చిత్రాలకి సంభాషణలు రాసే వారు, విద్యుత్ ప్రసార మాధ్యమాలలో మాట్లాడే లంగరయ్యలు, లంగరమ్మలు సరి అయిన, సులభమయిన తెలుగు వాడకపోతే వ్రతం చెడుతుంది, ఫలం దక్కదు. +ఇటువంటి నిత్యావసరాలు ప��రేరణ కారణాలు కాగా, ఆధునిక సాంకేతిక శాస్త్రాన్ని నలుగురికీ అర్థమయే తేలిక శైలిలో చెప్పాలనే కోరిక శ్రీ వేమూరికి 1967 లో పుట్టింది. అప్పటి నుండి తెలుగులో శాస్త్రం గురించి, తెలుగు భాష మీద ఎన్నో వ్యాసాలు, కథలు, పుస్తకాలు రాస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆయనకి అవసరమైన పదజాలాన్ని స్వయంబోధకంగా ఉండేటట్లు ఆయనే సమకూర్చుకునేవారు. మొదట్లో చిల్లర కాగితాల మీద రాసుకున్న ఈ పదజాలం, ఇంతింతై, ఎంతో పెద్దదై, వందల కొద్దీ కాగితాలు నిండిపోయాయి. కంప్యూటర్లు కొత్తగా వస్తూన్న ఆ రోజులలో, తెలుగు ఖతులు అప్పుడప్పుడే పుడుతూన్న ఆ కాలంలో, ఈనాటి సాంకేతిక వెసులుబాట్లు లేని ఆ రాతియుగంలో మొదలు పెట్టిన ఈ ప్రయత్నాన్ని చూసి స్నేహితులు అచ్చు కొట్టించమని హితోపదేశం చేసేరు. అదే 2002 లో ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుగా వెలువడింది. గత 12 సంవత్సరాలలో ఈ నిఘంటువులో చొరబడ్డ అచ్చు తప్పులు సరిదిద్దడం, కొత్త మాటలు చేర్చడం వంటి పనులతో ఈ నిఘంటువుని మెరుగు పెరిగి పెద్దదయింది. అచ్చు ప్రతిలో కంటే ఆయన వద్ద ఉన్న కంప్యూటర్లో ఉన్న మూల ప్రతిలో కనీసం 25 శాతం ఎక్కువ మాటలు, తక్కువ తప్పులు ఉన్నాయి. ఇలా మెరుగు పరచిన నిఘంటువులో తెలుగు-ఇంగ్లీషు భాగాన్ని వికీబుక్స్ చదువరుల ముందు ఉంచుతున్నాం. ఇదే వికీబుక్స్ లో మరొక చోట ఇంగ్లీషు-తెలుగు భాగం కూడా వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు అన్న లంకెలో చూడవచ్చు. +నిఘంటు నిర్మాణం ఒకరి వల్ల అయే పని కాదు. నిఘంటువు వాడుకలో ఉన్న మాటలని అక్షరబద్ధం చేయగలదు కాని, వాడుకని శాసించలేదు. భాష వాడుతూన్నకొద్దీ వాడితేరుతుంది; వాడకపోతే వాడిపోతుంది. ఈ నిఘంటువులో ప్రయోగాత్మకంగా వాడిన మాటలు చాల ఉన్నాయి. ఇవి అన్నీ వేమూరి వారి స్వకపోలకల్పితాలు కావు. పలువురు అరుదుగా వాడిన మాటలు, మరుగున పడిపోతూన్న మాటలు, పాత మాటలని కొత్త అర్థాలతో వాడినవి కూడా ఉన్నాయి. ఆసలు మాటలు ఎలా పుడతాయి? ప్రజలు పుట్టిస్తే పుడతాయి. ఎప్పుడు పుడతాయి? వాడుకలో అవసరమైనప్పుడు సందర్భోచితంగా పుడతాయి కాని కమిటీలలో కాదు. అందుకని తెలుగులో రాయాలని కోరిక ఉన్న వారి సౌకర్యం కోసం ఈ నిఘంటువుని వారు తయారు చేసేరు. ఇచ్చిన ఇంగ్లీషు మాటకి సమానార్థకమైన తెలుగు మాటలకీ, వాటిని ఉపయోగించే తీరుకీ పెద్ద పీట వేసేరు. +తెలుగులో అకారాది క్రమం ఏమిటి? అన్న ప్రశ్నకి ప్రమాణాత్మకమైన సమాధానం ఉన్నట్లు లేద��. ఇక్కడ వాడిన క్రమం టూకీగా ఇది: +గుణింతాలు; కం, క, క్క కాం, కా, క్కా కిం, కి, క్కి +* వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగు లిపి: ఆధునిక అవసరాలు, తెలుగుభాషా పత్రిక, సం. 3, స. 2, పు. 9-13, అక్టోబరు 1973. +* వేమూరి వేంకటేశ్వరరావు, పారిభాషా పదాల తెలుగు అనువాదానికి కొన్ని సలహాలు, తెలుగు పలుకు, 5వ. ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం, లాస్ ఏంజిలిస్, 5-7 జూలై 1985, +* వేమూరి వేంకటేశ్వరరావు, శిష్టవ్యవహారికం, తెలుగు జ్యోతి (నూ జెర్సీ పు. 23, ఫిబ్రవరి 1992 4వ ప్రపంచ తెలుగు మహాసభ ప్రత్యేక సంచిక,నూ యార్క్, పు. 484, జూలై 1992. +* వేమూరి వేంకటేశ్వరరావు, అమెరికాలో తెలుగు నేర్పడం, తెలుగు జ్యోతి (నూ జెర్సీ పు. 13-19, ఆగస్టు 1994. +* వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగు లిపి సూక్ష్మీకరణ, రచన ఇంటింటి పత్రిక, పు. 9-11, నవంబరు 1995. +* వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగు లిపి స్థాయీకరణ, రచన ఇంటింటి పత్రిక, పు. 60-64, అక్టోబరు 1996. +* వేమూరి వేంకటేశ్వరరావు, ఇతర భాషలలోని మాటలని తెలుగులో ఉచ్చరించడం, తెలుగు జ్యోతి (నూ జెర్సీ పు. 23-25, మే 1997. +* వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగులో అక్షరాలు ఏవేమిటి తెలుగు జ్యోతి (నూ జెర్సీ పు. 16-17, జూన్ 1997 రచన ఇంటింటి పత్రిక, పు. 74-75, మార్చి 2000. + + +తెలుగు భాషకి, ఆధునిక అవసరాలకి సరిపోయే, ఒక ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (dictionary పర్యాయపద కోశం (thesaurus శైలి లక్షణ గ్రంథం (style manual) ఉండాలన్నది నిర్వివాదాంశం. వీటికి తోడు కాలంతో మారుతూన్న భాష స్వరూపానికి అద్దం పడుతూ ఒక ఆధునిక వ్యాకరణం కూడా ఉంటే బాగుంటుంది. +మాతృభాష అబ్బినంత తేలికగా, దేశ భాషలు నేర్వగలిగినంత తేలికగా, పాశ్చాత్య భాషలలో పాండిత్యం రాదు. మేథా వర్గాలలో ఉన్న బహుకొద్ది శాతం ఇంగ్లీషు తప్పనిసరి అని ఎంతగా అనుకున్నా, ప్రజలందరినీ పండితుల నుండి పామరుల దాకా, అందరినీ ఇంగ్లీషు నేర్చేసుకోమంటే అది జరిగే పని కాదు. కనుక ఈ నాటి శాస్త్రం, సాంకేతికం, వైద్యం, వ్యాపారం ఇలా ఏ రంగంలోనైనా ఆవిష్కరణ జరుగుతూన్న క్రొంగొత్త విషయాల గురించి తెలుగులో చెప్పవలసిన అవసరం ఉంది. సెల్ ఫోనుల వాడకం దగ్గరనుండి, రైలు టికెట్టు కొనుక్కోడం దాకా ఇంగ్లీషులోనే పని జరగాలంటే ఎలా? +ఆధునిక అవసరాలకి తెలుగుని వాడేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏ విషయం గురించి ఏది రాయాలన్నా తెలుగు వాళ్ల బుర్రకి ఇంగ్లీషు మాట తట్టినంత జోరుగా తెలుగు మాట తట్టదు. తెలుగులో పదసంపద లేకపోలేదు. వేళకి సరి అయిన మాట తట్టకపోవడమే పెద్ద సమస్య. పత్రికా విలేఖరులు, చలన చిత్రాలకి సంభాషణలు రాసే వారు, విద్యుత్ ప్రసార మాధ్యమాలలో మాట్లాడే లంగరయ్యలు, లంగరమ్మలు సరి అయిన, సులభమయిన తెలుగు వాడకపోతే వ్రతం చెడుతుంది, ఫలం దక్కదు. +ఇటువంటి నిత్యావసరాలు ప్రేరణ కారణాలు కాగా, ఆధునిక సాంకేతిక శాస్త్రాన్ని నలుగురికీ అర్థమయే తేలిక శైలిలో చెప్పాలనే కోరిక శ్రీ వేమూరికి 1967 లో పుట్టింది. అప్పటి నుండి తెలుగులో శాస్త్రం గురించి, తెలుగు భాష మీద ఎన్నో వ్యాసాలు, కథలు, పుస్తకాలు రాస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆయనకి అవసరమైన పదజాలాన్ని స్వయంబోధకంగా ఉండేటట్లు ఆయనే సమకూర్చుకునేవారు. మొదట్లో చిల్లర కాగితాల మీద రాసుకున్న ఈ పదజాలం, ఇంతింతై, ఎంతో పెద్దదై, వందల కొద్దీ కాగితాలు నిండిపోయాయి. కంప్యూటర్లు కొత్తగా వస్తూన్న ఆ రోజులలో, తెలుగు ఖతులు అప్పుడప్పుడే పుడుతూన్న ఆ కాలంలో, ఈనాటి సాంకేతిక వెసులుబాట్లు లేని ఆ రాతియుగంలో మొదలు పెట్టిన ఈ ప్రయత్నాన్ని చూసి స్నేహితులు అచ్చు కొట్టించమని హితోపదేశం చేసేరు. అదే 2002 లో ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుగా వెలువడింది. గత 12 సంవత్సరాలలో ఈ నిఘంటువులో చొరబడ్డ అచ్చు తప్పులు సరిదిద్దడం, కొత్త మాటలు చేర్చడం వంటి పనులతో ఈ నిఘంటువుని మెరుగు పెరిగి పెద్దదయింది. అచ్చు ప్రతిలో కంటే ఆయన వద్ద ఉన్న కంప్యూటర్లో ఉన్న మూల ప్రతిలో కనీసం 25 శాతం ఎక్కువ మాటలు, తక్కువ తప్పులు ఉన్నాయి. ఇలా మెరుగు పరచిన నిఘంటువులో ఇంగ్లీషు-తెలుగు భాగాన్ని వికీబుక్స్ చదువరుల ముందు ఉంచుతున్నాం. +నిఘంటు నిర్మాణం ఒకరి వల్ల అయే పని కాదు. నిఘంటువు వాడుకలో ఉన్న మాటలని అక్షరబద్ధం చేయగలదు కాని, వాడుకని శాసించలేదు. భాష వాడుతూన్నకొద్దీ వాడితేరుతుంది; వాడకపోతే వాడిపోతుంది. ఈ నిఘంటువులో ప్రయోగాత్మకంగా వాడిన మాటలు చాల ఉన్నాయి. ఇవి అన్నీ వేమూరి వారి స్వకపోలకల్పితాలు కావు. పలువురు అరుదుగా వాడిన మాటలు, మరుగున పడిపోతూన్న మాటలు, పాత మాటలని కొత్త అర్థాలతో వాడినవి కూడా ఉన్నాయి. ఆసలు మాటలు ఎలా పుడతాయి? ప్రజలు పుట్టిస్తే పుడతాయి. ఎప్పుడు పుడతాయి? వాడుకలో అవసరమైనప్పుడు సందర్భోచితంగా పుడతాయి కాని కమిటీలలో కాదు. అందుకని తెలుగులో రాయాలని కోరిక ఉన్న వారి సౌకర్యం కోసం ఈ నిఘంటువుని వారు తయారు చేసేరు. ఇచ్చిన ఇంగ్లీషు మాటకి సమానార్థకమైన తెలుగు మాటలకీ, వాటిని ఉపయోగించే తీరుకీ ప��ద్ద పీట వేసేరు. +* వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగు లిపి: ఆధునిక అవసరాలు, తెలుగుభాషా పత్రిక, సం. 3, స. 2, పు. 9-13, అక్టోబరు 1973. +* వేమూరి వేంకటేశ్వరరావు, పారిభాషా పదాల తెలుగు అనువాదానికి కొన్ని సలహాలు, తెలుగు పలుకు, 5వ. ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం, లాస్ ఏంజిలిస్, 5-7 జూలై 1985, +* వేమూరి వేంకటేశ్వరరావు, శిష్టవ్యవహారికం, తెలుగు జ్యోతి (నూ జెర్సీ పు. 23, ఫిబ్రవరి 1992 4వ ప్రపంచ తెలుగు మహాసభ ప్రత్యేక సంచిక,నూ యార్క్, పు. 484, జూలై 1992. +* వేమూరి వేంకటేశ్వరరావు, అమెరికాలో తెలుగు నేర్పడం, తెలుగు జ్యోతి (నూ జెర్సీ పు. 13-19, ఆగస్టు 1994. +* వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగు లిపి సూక్ష్మీకరణ, రచన ఇంటింటి పత్రిక, పు. 9-11, నవంబరు 1995. +* వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగు లిపి స్థాయీకరణ, రచన ఇంటింటి పత్రిక, పు. 60-64, అక్టోబరు 1996. +* వేమూరి వేంకటేశ్వరరావు, ఇతర భాషలలోని మాటలని తెలుగులో ఉచ్చరించడం, తెలుగు జ్యోతి (నూ జెర్సీ పు. 23-25, మే 1997. +* వేమూరి వేంకటేశ్వరరావు, తెలుగులో అక్షరాలు ఏవేమిటి తెలుగు జ్యోతి (నూ జెర్సీ పు. 16-17, జూన్ 1997 రచన ఇంటింటి పత్రిక, పు. 74-75, మార్చి 2000. + + +quack, n. కపటవైద్యుడు; తరిఫీదు లేకుండా వైద్యం చేసే వ్యక్తి; +* quackery, n. విద్య నేర్వని వ్యక్తి చేసే వైద్యం; +* quad, n. చతుశ్శాల; నాలుగిళ్ళ వాకలి; చౌకి; ముంగిలి; చత్వరం; పాఠశాలలో నాలుగు భవనాల మధ్య ఉండే ప్రదేశం; +* quadrangle, n. చతుర్కోణి; చతుర్భుజం; నాలుగు కోణాలు గల రేఖాగణిత చిత్రం; +* quadrant, n 1) పాదం; పాదుక; చరణం; వృత్త చరణం; వృత్తంలో నాల్గవ భాగం 2) కాష్ఠ; ఒక చదునైన ప్రదేశంలో రెండు పరస్పర లంబ రేఖలు గీయగా ఏర్పడే నాల్గవ భాగం 3) తురీయం; నభోమూర్తుల కోణాలు కొలవటానికి వాడే పరికరం; +quadratic surd, ph. వర్గ కరణి; ఒక పూర్ణాంకపు వర్గ, ఘన మూలాదులని నిష్ప సంఖ్యల వలె రాయలేనప్పుడు వాటిని కరణీయ సంఖ్యలు అనేవారు కాని ఇటీవల ఈ మాట వాడుకలో లేదు +* quadrature, n. వర్గీకరణం; వైశాల్యం కట్టడం; +* quadrilateral, n. చతుర్భుజం; చతుర్కోణి; నాలుగు భుజాలు గల రేఖాగణిత చిత్రం rel square; +* quadruped, n. చతుష్పాది; నాలుగు కాళ్లు కలది; +* quadriplegic, n. రెండు కాళ్లు, రెండు చేతులు పనికిరాకుండా పోయిన వ్యక్తి; +* quadruplets, n. pl. చతుష్కులు; జంట కవలలు; ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లలు; +* quadruplex, adj. నాలుగు పేటల; నాలుగు వాకేతాలని ఒకే తీగ మీద కాని, ఒకే రేడియో చానల్ మీద కాని పంపేటప్పుడు వాడే ఒక నియమం; +* quadruplex, n. ఒకే చూరు కింద నాలుగు వాటాలు కలసి ఉన్న ఇల్లు; +* quail, n. గిన్నెకోడి; పూరీడు పిట్ట; +* quaint, adj వింతైన; అపురూపమైన; ముచ్చటైన; కొంచెం వింతగా, కొంచెం ఆకర్షణీయంగా పాత కాలపు పద్ధతిలో ఉన్న; +* qualified, adj 1) అర్హతలు కల 2) పరిమితం చేసే note) విరుద్ధార్థములు కల మాట; +* qualifier, n. ఒక మాట యొక్క అర్థాన్ని పరిమితం చేసే విశేషణం; +* quality, n 1) గుణం; లక్షణం; స్వభావం 2) నాణ్యత; శ్రేష్టత; వాసి; +* qualm, n. మనోవ్యధ; తప్పుచేసేమేమో నన్న బెంగ; +* quantitative, adj. పరిమాణాత్మక; రాశికి సంబంధించిన; +* quandary, n. ఇరకాటం; ఇబ్బంది; చిక్కు; సందిగ్ధం; ఎటూ తోచని అయోమయ స్థితి; +* quarantine, n. పరదేశం నుండి వచ్చే యాత్రికులని కాని, జంతువులని కాని నలభయి రోజుల పాటు విడిగా ఉంచే పద్ధతి; +* quantum, adj 1) ఒక్కుదుటున జరిగిన పని 2) గణనీయమైన; చెప్పుకోదగ్గ; గుళిక మాత్రపు; గుళిక; పరిమాణిక; +* quantum, n చిటికెడు; గుళిక; మాత్ర; పరిమాణం; క్వాంటం; +* quarrel, n. కయ్యం; దెబ్బలాట; తగవు; జగడం; పెనకువ; కలహం; కుమ్ములాట; కజ్జా; రగడ, ragaDa +* quarry, n 1) రాతిగని; అశ్మాగారం; అశ్మాశయం 2) వేటాడబడే జంతువు; +* quart, n. గేలనులో నాల్గవ వంతు; రెండు పైంట్లు; +* quartet, n 1) చతుష్టయం; చతుష్కం; నాలుగింటి సమాహం; నలుగురు 2) నలుగురు కలసి పాడే పాట; +* quarters, n. ఇల్లు; బసచేసే స్థలం; ఆగారం; ఉద్యోగం ఇచ్చినవాడు ఉండడానికి ఇచ్చే ఇల్లు; +* quarterly, adj. త్రైమాసిక; ఏడాదికి నాలుగు సార్లు వచ్చే; +quartic equation, ph. ద్వివర్గ సమీకరణం; చతుర్‌ఘాత సమీకరణం; +* quasar, n క్వేజార్) నభోమండలంలో, చాల దూరంలో, చాల కాంతితో ప్రకాశించే సూర్యుడు వంటి తేజోగోళం; +* quash, v. t. అణగదొక్కు; నొక్కు; నొక్కిపెట్టు; +* quay, n కీ నావికా ఘట్టం; రేవు; +* queer, adj. విచిత్రమైన; వింతయైన; విపరీతమైన, వికారమైన, అద్భుతమైన; +* quell, v. t. అదుపులో పెట్టు; శాంతింపజేయు; +* quesadilla, n కేసదీయా) పరోటా వంటి మెక్సికో దేశపు వంటకం; పరోటాలో కూరకి బదులు చీజు పూర్ణంగా పెట్టి చేసిన వంటకం; +* querulous adj. అభియోగించే; ఫిర్యాదులు చేసే; తప్పులు పట్టే; +* question, n. ప్రశ్న; పన్నం; అడుక్కోలు; మల్క; +* questionable, adj. ప్రశ్నార్థకమైన; అనుమానాస్పదమైన; +* questionable, n. ప్రశ్నార్థకం; అనుమానాస్పదం; +* quiddity, n. సూక్ష్మం; ధర్మ సూక్ష్మం; +* quibble, n. చిన్న విషయం మీద వాగ్వాదం; +* quick, adv. త్వరగా; తొందరగా; వేగిరి; చప్పున; గభాల్న; చురుగ్గా; +* quicklime, n. పొడి సున్నం; సున్నం; చురుకుసున్నం; దాహక చూర్ణం; నీటి తాకిడి వలన త్వరగా శిథిలమయే సున్నం; see also slaked lime; +* quickly, adv. త్వరగా; తొందరగా; వేగిరం; వడిగా; చప్పున; దబ్బున; గభాల్న; గ్రక్కున; చయ్యన; రివ్వున; దిగ్గున; శీఘ్రంగా; చరచర; గబగబ; బిరబిర; +* quicksand, n. ఊబి త్వరగా లోనికి లాగే ఇసక; +* quid-pro-quo, ph. పరస్పర వీపుగోకుడు; నువ్వు నా వీపు గోకు, నేను నీ వీపు గోకుతాను అనే బేరం; ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం; +* quiet, n. స్థిమితం; ప్రశాంతం; +* quietly, adj. చడీచప్పుడు కాకుండా; పెద్ద హడావిడి చెయ్యకుండా; +* quinoa, n కినోవా; దక్షిణ అమెరికాలో పెరిగే, జొన్న గింజల వంటి, మెట్ట పంట; బలవర్ధకమైన పోషక పదార్ధాలు కల ఈ గింజలని భృహదాహార పదార్థమని కొనియాడుతూ బియ్యము, గోధుమ వలె వాడుతున్నారు; +* quintuplets, n. pl. పంచకులు; పంచకం; ఒకే కాన్పులో పుట్టిన అయిదుగురు పిల్లలు; +* quip, n. ఛెణుకు; ఛలోక్తి; ద్వర్థి; వాక్బలం; చమత్కారపు మాట; +* quire, n. దస్తా; ఇరవై నాలుగు ఠావు కాగితాల లెక్క; +* quisling, n. దేశద్రోహి; పంచమాంగదళ సభ్యుడు; +* quixotic, adj క్విహాటిక్) వెర్రి ప్రయత్నం చేసెడు; +* quorum, n. కోరం; కనీస సభ్యుల సంఖ్య; +* quota, n. వాటా; భాగం; వంతు; హిస్సా; కోటా; +* quotation, n 1) అమ్మదలుచుకున్న ధర; ఇచ్చే ధర 2) ఉల్లేఖనం; సంవాదాంశం; +* quote, v. t 1) ధరలు తెలియబరచు 2) మరొకరి మాటలని దృష్టాంతంగా ఎత్తి చూపు; ఉల్లేఖించు; +* quotidian, adj. రోజూ; ప్రతిరోజూ; రోజువారీ; అనుదినము; దైనందినం; దైనిక; +* quotient, n. విభక్తం; భాగలబ్దం; భాగహార లబ్దం; భాగించగా లభించిన సంఖ్య; +intelligence quotient, ph. వివేక విభక్తం; వివేక లబ్ధం; మానసిక వయస్సుని భౌతిక వయస్సుతో భాగించగా వచ్చిన లబ్దం +* rabid, adj. వెర్రి; పిచ్చిపట్టిన; హింసాత్మకమైన; +* rabies, n. కుక్కవెర్రి; మాంసం తినే జంతువులకి వచ్చే ఒక రకమైన వైరస్ వ్యాధి; ఈ విధంగా వ్యాధిగ్రస్తులైన జంతువులు కరిచినప్పుడు ఈ వ్యాధి మనుష్యులకి సోకుతుంది; వెనువెంటనే చికిత్స చేయించకపోతే ప్రాణహాని కలుగుతుంది; see also hydrophobia; +* race, n 1) పందెం; పరుగు పందెం 2) ప్రజాతి; జాతి; తెగ; వంశం; +* racist, n. జాత్యహంకారి; పరజాతి ద్వేషి; +* racket, n 1) కోలాహలం; అల్లరి 2) చెండు చట్రం; కొన్ని రకాల ఆటలలో బంతిని కొట్టు సాధనం 3) కుంభకోణం; కూటవ్యవహారం; +* raconteur, n. కథకుడు; కథలు బాగా చెప్పే వ్యక్తి; +* radial, adj 1 త్రైజ్య; త్రిజ్య 2 ప్రకోష్టీయ; +* radiance, n. తేజం; కళ; దృశానం; జ్యోతిర్మయం; భాతి భర్గం; +* radiant, adj. ఉజ్వలమానమైన; భాసమానమైన; తేజోవిరాజితమైన; సముజ్వల; వికీర్ణ; కళకళలాడే; జ్యోతిర్మయమైన; +* radiate, v. i. ప్రసరించు; విరజల్లు; వ్యాపించు; +* radiation, n. వికిరణం; వికీర్ణం; జ్యోతం; ప్రభ; ప్రణితద్యుతి; భాసం; దృశానం; తేజస్సు; జ్యోతిస్సు; అర్చి; అర్చస్సు; ప్రసరణ; కిరణవ్యాప్తి డాలు; త్విట్టు; రస్ముద్గారత +electromagnetic radiation, ph విద్యుదయస్కాంత వికీర్ణం; విద్యుదయస్కాంత వికిరణం; +* radiator, n. ప్రభాకరి; ప్రసారిణి; తాపప్రసా��ిణి; +* radical, adj 1) మౌలిక మౌలికమైన; ప్రాథమిక; ప్రాథమికమైన; సమూల; సామూల్య; ముఖ్యమైన; సంపూర్ణమైన 2) అసాధారణమైన; విపరీతమైన 3) విప్లవాత్మకమైన; +radical leaf, ph. వేరు నుండి మొలిచే ఆకు; సామూల్య పత్రం; +* radical, n 1 chem రాశి; అణు సమూహం; ముఖ్యంగా ఒక ఎలక్‍ట్రాను తక్కువైన అణుసమూహం 2) మౌలికం; మూలానికి సంబంధించినది 3 math మూలానికి root కి) సంబంధించినది; వర్గమూలానికి గుర్తు 4) సంప్రదాయానికి విరుద్ధమైనది 4) ప్రజాదతరణ లేని విపరీత రాజకీయ భావం కల వ్యక్తి; +free radical, ph. విడి రాశి; స్వేచ్ఛా రాశి; విశృంఖల రాశి; +* radio, adj 1) రేడియోకి సంబంధించిన 2) రేడియం అనే మూలకానికి సంబంధించిన; కిరణ ప్రసార శక్తి గల; ఉత్తేజిత; +* radio, n 1) రేడియో; గగనవాణి; ఆకాశవాణి 2) నిస్తంతి; +radio receiver, ph. రేడియో; రేడియో తరంగ గ్రాహకి; కిరణగ్రాహకి; +* radioactive, adj. రేడియోధార్మిక; వికిరణ ఉత్తేజిత; వికీర్ణ ఉత్తేజిత అకస్మాత్తుగా, బాహ్య శక్తుల ప్రేరేపణ లేకుండా అణుగర్భం విచ్ఛిన్నమయే లక్షణ గల; +radioactive carbon, ph. ఉత్తేజిత కర్బనం; వికీర్ణ ఉత్తేజిత కర్బనం; +* radioactivity, n. రేడియోధార్మికత్వం; వికిరణ ఉత్తేజం; వికీర్ణ ఉత్తేజితం; కిరణ విసర్జనం; అకస్మాత్తుగా అణుగర్భం విచ్ఛిన్నమయే లక్షణం; ఈ లక్షణం రేడియం అనే మూలకంలో చూడడం తటస్థించింది కనుక దీనికి పేరు వచ్చింది. కానీ, వార్తలు వచ్చే రేడియోకీ, ఈ మాటలోని రేడియోకీ ఏమీ సంబంధం లేదు. +* radius, n 1) వ్యాసార్థం; కర్కటం 2) రత్ని; బాహ్య ప్రకోష్టిక; త్రిజ్య; ముంజేతిలో ఒక ఎముక; +radius vector, ph. సృతి; కేంద్రం నుండి పరిధి వైపు గీసిన గీత; కిరణరేఖ; +* Radon, n. రాడాన్; ఒక రసాయన మూలకం అణుసంఖ్య 86, సంక్షిప్త నామం, Rn); +* raft, n. బల్లకట్టు; కట్టుమాను; తెప్ప; దోనె; తారకం; +* rafter, n 1) వాసం; సరంబి; త్రావి; కప్పుకి వేసే దూలం 2) దంతె; అడ్డుగా వేసే పట్టె; +* rag, n. చింకి గుడ్డ; గుడ్డ పేలిక; +* raga, n రాగం; సప్త స్వరముల సమ్మేళనం; స్వరములు ఏడే అయినా వాటి నుండి పుట్టే రాగాలు ఎన్నో ఉన్నాయి; స, రి, గ, మ, ప, ద, ని, స అనే స్వరములని ఎన్నో విధాలుగా సమ్మిశ్రమం చేసి రాగాలు పుట్టించవచ్చు; 5 స్వరాలు, 6 స్వరాలు, 7 స్వరాలు మాత్రమే వాడి రాగాలు పుట్టించవచ్చు; ఆరోహణంలో కొన్ని స్వరాలని, అవరోహణంలో మరికొన్ని స్వరాలని కూడ వాడవచ్చు; సర్వసాధారణంగా ఒక రాగంలో కనీసం 5 స్వరాలైనా ఉంటాయి; ప్రతి రాగంలోను స ఉండి తీరుతుంది. ప్రతి రాగంలో కనీసం మ కాని ప కాని ఉండాలి; రెండూ ఉండవచ్చు; +* rage, n. కోపోద్రేకం; ఆగ్రహం; ఉగ్రత; +* rags, n. చిరిగిన బట్టలు; చింపిరి బట్టలు; జీర్ణవములు; గుడ్డ పేలికలు; +* raid, v. t. దాడిచేయు; దండెత్తు; మోహరించు; +* rail, n 1) పట్టా; కమ్మి; గ్రాది 2) రైలు; రైలు బండి; కమ్మిబండి; +* railroad, n. రైలుకట్ట; రైలుమార్గం; ఇనుపదారి; +* railway, n. రైలుమార్గం; అమోమార్గం; +railway line, ph. ఇనుపదారి; రైలుమార్గం; అయోమార్గం; +rain gauge, ph. వర్షమితి; వర్షమాపకం; వానమితి; +* rainbow, n. ఇంద్రధనుస్సు; అరివిల్లు; వానవెల్లి; సురచాపం; హరిచాపం ety అరి అంటే చివర అని అర్థం. అరివిల్లు అంటే ఆకాశం చివర కనిపించేది అని కాని వాన చివర కనిపించేదని కాని అర్థం; +* raise, n. పెరుగుదల; పెంపు; జీతంలో పెరుగుదల; +* raise, v. t 1) ఎత్తు; లేపు; లేవనెత్తు; పైకి ఎత్తు 2) పెంచు; వర్థిల్లజేయు; +* raisins, n. కిస్‌మిస్ పళ్లు; గింజలులేని ఎండిన ద్రాక్షపళ్లు; సా. శ. పూ 2000 నుండీ ఈ పండ్ల గురించి మానవులకి తెలుసు; +* rake, n 1) దంతెన; పళ్ళకర్ర; పండ్లకోల; గడ్డిని కాని మట్టిని కాని తిరగెయ్యడానికి వాడే పళ్ళకర్ర 2) మలారం; వీధులని తుడవడానికి, ఆకులని కుప్పలా వెయ్యడానికి వాడే పళ్ళ చీపురు; +* rally, n 1) బహిరంగ సమావేశం 2) కారులతో వీథుల మీద వేసే పరుగు పందెం; +* ram, n. పొట్టేలు; గొర్రెపోతు; తగరు; హుడు; ఉరణం; +* ramp, n. తొంగలి; నతిగతి; తటం; వాలుబల్ల; వాలువీధి; +* rampart, n. ప్రాకారం; కోట బురుజు; కొత్తళం; అలంగము; +* rancid, adj. కుళ్లిన; కంపుకొట్టే; కొవ్వు పదార్థాలు నిలవ ఉంచడం వలన వచ్చే చెడ్డ వాసనతో కూడిన; +* random, adj. క్రమరహిత; అనిర్ధిష్ట; తకపిక; యాధృచ్ఛిక; +* range, n 1) మేర; వ్యాప్తి 2) పంక్తి; వరుస; శ్రేణి 3) పొయ్యి; గాడి పొయ్యి; +range finder, ph. ఒక స్థలం నుండి గమ్యానికీ ఉండే దూరాన్ని కొలిచి చెప్పే సాధనం; +* ranger, n. అడవుల మీద ప్రభుత్వం వారి అధికారి; అరణ్య పాలకుడు; +* rank, n 1) తరగతి; అంతస్తు; పదవి; హోదా; శ్రేణి; కోటి 2) చతురంగంలో అడ్డు వరుస; +* rank and file, ph. పిన్న, పెద్ద; అధికారులుకాని సిబ్బంది; పనివారు; +* rank, v. t. శ్రేణీకరించు; వరుసక్రమంలో పెట్టు; +* ransack, v. t. గాలించి వెదకు; మూలమూలలా వెదకు; చిందరవందర చేయు; +* ransom, n. బంధవిమోచన ధనం; విడుదల కొరకు చెల్లించే డబ్బు; +* rant, v. t. తిట్టు; నిందించు; కూతలు కూయు; +* rap, v. t. దబదబా కొట్టు; తలుపు దబదబా కొట్టు; తలుపుని టకటకా కొట్టు; +* rapid, adj. తొందరగా; త్వరగా; వేగం; అవిలంబన; ఆశు; +* rapid, n. ఝరి; ఉరకలు వేసే కొండ కాలువ; +* raptor, n వేటాడే పక్షి; ఉదాహరణకి గద్ద డేగ, సాళువ, గూళి, మొదలైనవి. +* rapture, n 1) మహదానందం; ఆనందం; తన్మయత్వం 2) నిర్వాణం; +* rare, adj 1) అపురూపమైన; విలువైన 2) అరుదైన; సామాన్యంగా దొరకని; విరళ; దుర్లభం; సకృత్తు 3) పూర్తిగా పచనం కాని; బాగా కాలని; పచ్చి పచ్చి; +* rare-earth elements, ph. విరళ మృత్తిక మూలకాలు; అణు సంఖ్య 57 లగాయతు 71 వరకు గల రసాయన మూలకాలు; ఇవి అరుదైన (విరళ) మూలకాలు కాదు కాని ఆ పేరు అలా స్థిరపడిపోయింది; +* rarely, adv. అరుదుగా; కదాచిత్తుగా; సకృత్తుగా; అప్పుడప్పుడు; ఎప్పుడో ఒకప్పుడు; +* rash, adj. తొందరపాటుతనం; దుడుకైన; +* rash, n. చర్మం కందినట్లవడం; పేత పొక్కుల వంటి పొక్కులు; పేత; +* raspy, adj. గరుగ్గా ఉండు; గరగరలాడు; +* rat, n. ఎలుక; మూషికం; 20-40 సెంటీమీటర్లు పొడుగు, చిన్న చెవులు ఉంటాయి; +* rate, n 1) దల; చొప్పు; తరబడి; ఏసి; రేటు 2) ధర 3) ప్రమాణము; నిష్పత్తి; +* ratification, n. అంగీకారం; సమ్మతి; ధ్రువపరచడం; ధ్రువీకరణ; ఆమోదం; +* ratify, v. t. ఆమోదించు; స్థిరపరచు; ధ్రువపరచు; నిశ్చయించు; +* ratio, n. నిష్పత్తి; రెండు సంఖ్యల మధ్యనున్న ఒక రకమైన గణిత సంబంధం; +* rational, adj రేషనల్ 1) హేతుబద్ధమైన; వివేచనాత్మక; తర్కబద్ధ; యుక్తియుక్తమైన 2) నిష్పత్తిలా రాయగల; కరణీయ; +rational number, ph. నిష్పసంఖ్య; మూలక సంఖ్య; అకరణీయ సంఖ్య; +* rationale, n రేషనేల్) సోపపత్తిక వివరణం; కారణ వివరణం; సమర్ధించదగ్గ కారణం; +* rationalism, n. హేతువాదం; రెనే డెకా, స్పినోజా, గలెలియా మొదలైన వారి సిద్ధాంతాలకి పునాదిగా అలరారిన వాదం; +* rattle, n 1) గిలక; పసిపిల్లలు ఆడుకొనే ఒక ఆటవస్తువు 2) ఆఘాటం; +* rattlesnake, n. గిలకపాము; ఆఘాట సర్పం; ఉత్తర అమెరికా నైరుతి ఎడారులలో విరివిగా కనిపించే ఒక విషసర్పం; ఈ పాము తోక గిలకలా చప్పుడు చేస్తుంది; +* raven, n కృష్ణశకుని; ద్రోణకాకం; అసురకాకోలం; ఇది ఎక్కువ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరోపు, అమెరికా దేశాల్లో కనపడుతుంది. భారతదేశంలో హిమాలయాల్లో కూడా ఉంది. పరిమాణంలో పెద్దది. దీని శరీరం అంతా నల్లటి నలుపే; పెద్ద రెక్కలు ఉండటం, పరిమాణంలో కుడా పెద్దది అవటం మూలాన గుర్తు పట్టడం సులభం bio corvus corax see also) మాలకాకి; బొంతకాకి; +* ravine, n రెవీన్) లోతైన లోయ; కోన; కనుమ; +* raw, adj 1) పచ్చి; పండని; కసరు 2) అపక్వపు; ఉడకని 3) ముడి; ముతక; కోరా; చలువ చేయని; +* ray, n 1) కిరణం; అంశువు; మయూఖం 2) ఒక జాతి చేప; టెంకి చేప; టెంకి; +ray of light, ph. కాంతి కిరణం; మరీచి; అంశువు; త్విట్టు; +* razor, n. అసి; మంగలి కత్తి; క్షురిక; +* reaction, n 1) ప్రతిస్పందన; ప్రతిచర్య; చర్య; ప్రతీకార శక్తి; ఇది ప్రతీకారాన్ని పోలి ఉంటుంది. ఒకరు మనకు నచ్చని మాటంటే వెంటనే మాటకు మాట సమాధానం ఇవ్వడం రియాక్ట్ అవటం.(2) ప్రక్రియ; అభిక్రియ; +chain reaction, ph. శృంఖల ప్రక్రియ; శృంఖలా క్రియ; శృంఖలిత చర్య; +combination reaction, ph. సంయోగ ప్రక్రియ; రెండు రసాయనాల కలయిక వల్ల ఒకే రసాయనం పుట్టడం; +decomposition reaction, ph. వియోగ ప్రక్రియ; ఒక రసాయనం రెండింటిగా విడిపోవడం; +* reactionary, n. మార్క్స్ సిద్ధాంతంలో ప్రగతి నిరోధక వాది; +* reactionary, adj. అభివృద్ధి నిరోధక; సామాజిక; రాజకీయ మార్పులకి విముఖత చూపే; +* reactivity, n. ప్రతిచర్యాశీలత; చర్యాశీలత; +* reactor, n. క్రియాకలశం; ప్రక్రియ కలశం; +* read, v. t రీడ్) చదువు; పఠించు; నేర్చుకొను; +* readers, n. pl 1) చదువరులు; పాఠకులు; వాచకులు 2) చదివే పుస్తకాలు; +* reading, n. విలోకనాంకం; కొలత కొలవగా వచ్చిన సంఖ్య; ఉపలక్షణం; +* ready, n. తయారు; సిద్ధం; సంసిద్ధం; +* reagent, n. కారకి; కారకం; ఒక రసాయనిక ద్రవ్యమందు మార్పుతేగల ఇంకొక రాసాయనిక ద్రవ్యము; +* realist, n వాస్తవవాది వాస్తవికవాది; +* realm, n. రంగం; రాజ్యం; ప్రపంచం; హయాం; +* ream, n. కాగితాల పరిమాణం; ఇరవై దస్తాలు; +* reason, v. t. నచ్చజెప్పు; తర్కించు; వాదించు; +* reasonable, adj. సబబైన; తగిన; సమంజస; హేతుపూర్వక; న్యాయమైన; +* reasoning, n. వాదం; వాదసరళి; హేతువాదం; అనుమానం; అవమర్షం; తర్కించడం; +* rebate, n. ముజారా; ముదరా; ధరలో తగ్గింపు; వస్తువు కొన్న తర్వాత వ్యాపారి తిరిగి ఇచ్చే పైకం; +* rebuke, v. t. తిట్టు; చివాట్లుపెట్టు; కోప్పడు; +* recall, v. t 1) వెనుకకు పిలచు; అమ్మకానికి పెట్టిన సరకులని వెనుకకు పిలచు; రద్దు చేయు 2) జ్ఞాపకం తెచ్చుకొను; +* recapitulate, v. t. పునశ్చరణ చేయు; జ్ఞప్తికి తెచ్చు; క్రోడీకరించు; +* receipt, n. రసీదు; చెల్లుపత్రం; చలానా; +* receive, v. t. అందుకొను; గ్రహించు; పుచ్చుకొను; +* receiver, n. గ్రాహకం; గ్రాహకి; గ్రహీత; గ్రాహకుడు; గ్రాహి; +* recension, n. శాఖ; పరిష్కృత గ్రంథం; పాఠాంతరం; +very recently, ph. మొన్ననీమధ్య; మొన్నమొన్న; ఇటీవల; +* receptacle, n. గ్రాహకి; మరొక వస్తువుని తనలోకి తీసుకొనేది; +* reception, n. ఎదురు సన్నాహం; స్వాగతం; సన్మానం; ఉద్గ్రాహం +* recess, n 1) మారుమూల; వెనకకి జరిగి ఉన్న; గూడు 2) పాఠశాలకి వచ్చు శలవు కాలం; +* recharge basins, ph. pl ఇంకుడు గుంటలు; భూజల మట్టం అడుగుకి దిగిపోకుండా ఉపరితలపు జలాన్ని భూమిలోకి ఇంకడానికి తవ్విన గుంటలు; +* recidivism, n. నిత్యాపరాధం; పాత అలవాటు ప్రకారం అపరాధం చెయ్యడం; +* recipe, n రిసపీ) ఉపాయం; వంటకాలని చేసే పద్ధతి; పచన యోగం; ఔషధ యోగం; +* reciprocal, adj 1) అన్యోన్యమైన; పరస్పర; ఇచ్చి పుచ్చుకొనే; అనుగుణ 2) తిరగబెట్టిన; తిరగబడ్డ 3) విలోమ; +reciprocal causes, ph. అన్యోన్యమైన కారణాలు; పరస్పరమైన కారణాలు; +* reciprocity, n. ఆదాన ప్రదానం; అదలు బదులు; అన్యోన్యత; +* reckon, v. t. పరిగణించు; లెక్కించు; అభిప్రాయపడు; +* recluse, n. ఏకాంగి; ఏకాకి; ఒంటరి; కోరి ఒంటరిగా జీవించే వ్యక్తి; +* recognition, n 1) గుర్తింపు; ప్రతిపత్తి; అభిజ్ఞానం 2) పోలిక; +* recollect, v. i. జ్ఞాపకం తెచ్చుకొను; స్మరణకి ��ెచ్చుకొను; +* recompense, n. పాపపరిహారం; చెల్లుకి చెల్లు; +* reconcile, v. i. రాజీపడు; సమాధానపడు; సమన్వయపడు; +* reconcile, v. t. సఖ్యపరచు; పునర్ ఘటించు; సమన్వయం చేయు; +* record, n రెకర్డ్) కవిలె; కవిలెకట్ట; దస్తావేజు; పుస్తకం; +* record, v. t రికార్డ్) నమోదు చేయు; రికార్డ్ చేయు; +* recorder, n. లేఖరి; కాయస్థుడు; ముద్రాపకం; రికార్డరు; +* recover, v. i 1) కోలుకొను; తేరుకొను; తెప్పరిల్లు 2) సంగ్రహించు; రాబట్టు; +* rectangle, n. దీర్ఘచతురస్రం; రెండు జతల ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండి, నాలుగు సమ కోణాలు ఉన్న చతుర్భుజం; +* rectification, n. దిద్దుబాటు; సరిచేయుట; సవరించుట; చక్కబెట్టుట; +* rectifier, n. దిద్దరి; పరిష్కర్త; సరిచేరి; సరిచేయునది; +* rectify, v. t. దిద్దు; సరిచేయు; సరిదిద్దు; సవరించు; చక్కబెట్టు; +* recurring, adj. పునరావృత; ఆవర్తక; తిరిగివచ్చు; +* recycle, n. పునరావృత్తం; పునర్వినిమయం; పునరోపయోగం; ఒకసారి వాడి పారెయ్యకుండా మళ్లా వాడడం; +* red, adj. ఎర్రనైన; అరుణ; పింగళ; జేగురు; +* red, n. ఎరుపు; కెంపు; తొగరు; కెంజాయ; +* redden, v. i. ఎర్రబడు; కందు; కమలు; తొగరించు; రంజిల్లు; జేవురించు; +* red-eye, n 1) జేవురుగన్ను 2 idiom] రాత్రల్లా చేసే ప్రయాణం; +* redeem, v. t. విమోచన చేయు; విలువని రాబట్టు; +* redemption, n. విమోచన; విడుదల; విలువను రాబట్టడం; +* redolent, adj. ఘుమఘుమలాడే మంచి లేక ఘాటైన వాసనతో కూడిన; +* redress, v. t. దిద్దు; సరిదిద్దు; నష్టం భర్తీ చేయు; +* reduce, v. t. తగ్గించు; కోయు; హరించు; సంగ్రహించు; +reducing agent, ph. ఆమ్లక్షయకరణి; ఆమ్లజని హారిణి; ఆమ్లజనిని హరించునది; +* reductio ad absurdum, ph. అనిష్టాపత్తి; అభిషవ శశవిషాణం; అభిషవం అంటే మరగ బెట్టడం. శశవిషాణం అంటే కుందేటి కొమ్ము. కనుక దిగమరిగించి కుందేటి కొమ్ముని సాధించడం అన్నమాట. తర్కశాస్త్రంలో ఒక ప్రవచనాన్ని రుజువు చెయ్యవలసి వచ్చినప్పుడు, సదరు ప్రవచనానికి విరుద్ధమైన ప్రవచనంతో మొదలుపెట్టి, దానిని మర్ధించి, మర్ధించి చివరికి ఆ విరుద్ధ ప్రవచనం అసాధ్యం అని రుజువు చెయ్యడం; తార్కిక గణితంలో ఈ రుజువు పద్ధతి ఎక్కువ ప్రచారంలో ఉన్న పద్ధతులలో ఒకటి; అర్ధప్రసంగం; +* reduction, n 1) తగ్గింపు; కోత 2 chem క్షయీకరణం ఆమ్లజని వాటాని తగ్గించడం; ఆమ్లజనిని తొలగించడం; ఉదజనికరణ ant oxidation; +* redundant, n. రెండోసారి; చర్విత చర్వణం; దుబారా; అధికం; అనావశ్యకం; +* reef, n. సముద్రంలో మెరక ప్రదేశాలు; +* refinery, n. శుద్ధిచేసే కర్మాగారం; +* sugar refinery, చక్కెర శుద్ధికర్మాగారం; +* reflection, n 1) పరావర్తనం; వెనకకి మళ్ళడం 2) ప్రతిబింబం; ప్రతికృతి; అభివ్యక్తి 3) మీమాంస; తార్కికంగా ఆలోచించడం; +total internal reflection ph. సంపూర్���ాంతర పరావర్తనం; ఎండమావి ఏర్పడినప్పుడు ఇటువంటి పరావర్తనమే జరుగుతుంది; +* reflex, adj. ప్రతివర్తిత; ప్రతీకార; +reflex action, ph. ప్రతీకార చర్య; అనిచ్ఛా ప్రవర్తన; +* reflex, n. ప్రతివర్తిత; ప్రతీకార చర్య; +* reflexes, n. ప్రతివర్తితలు; ప్రతీకార చర్యలు; +* reform, n. సంస్కరణ; దిద్దుబాటు; +* reform, v. t. సంస్కరించు; దిద్దు; చక్కబెట్టు; +* refracted, adj. వక్రీభవన; వక్రీభూతమైన; వక్రీభవనమైన; +index of refraction, ph. వక్రీభవన గుణకం; వక్రీభవన సూచకి; వక్రీభవన తర్జని; +* refractoriness, n. మొండితనం; దుర్గలనీయత; రాపిడిలో పుట్టిన వేడిని తట్టుకో గలిగే స్థోమత; +* refrain, n. పల్లవి; పాటలో మొదటి చరణం; వంతపాట; పునరావర్తన; +* refreshment, n. ఉపాహారం; శ్రాంతి; శ్రాంతి పానీయం; +* refrigerant, n శిశిరోపద్రవ్యం; శిశిరోపద్రవం; +* refrigerator, n. శిశిరోపచారి; శీతలీకరణి; హిమకరి మంచుబీరువా; చలిమర; +* refuge, n. శరణం; శరణాలయం; ఆశ్రయం; ఏడుగడ; +* refugees, n. కాందిశీకులు; శరణాగతులు; +* refusal, n. అసమ్మతి; నిరాకరణం; తిరస్కారం; నిరసన; ఉపాలంభం; +* refuse, v. t. నిరాకరించు; తిరస్కరించు; +* regent, n. ప్రభుత్వ ప్రతినిధి; వకీలు; +* regime, n. పరిపాలన; పాలన; హయాం; ఏలుబడి; +* register, n 1 comp పల్టీపేరు 2) పద్దుపుస్తకం; పట్టిక; కవిలె; దండకవిలె; +* registration, n. నమోదు చెయ్యడం; గ్రంథస్థం చెయ్యడం; +infinite regression, ph. అనంత అపకర్షకం; కౌపీన సంరక్షణార్థ న్యాయం; +* regret, v. i. చింతించు; విచారించు; ఖేదపడు; పస్తాయించు; +* regular, adj. క్రమ; సమ; సాధారణ; నియతమైన; నియమానుసార; అనుస్యూత; +regular hexagon, ph క్రమ షడ్భుజి; ఆరు భుజాల పొడుగు సమానంగా ఉన్న షడ్భుజి; +* regularly, adv. వతనుగా; క్రమవశాత్తూ; అలవాటు ప్రకారం; నియమానుసారంగా; నియతంగా; సాధారణంగా; నియతికాలికంగా; యథావిధిగా; +* regulation, n. కట్టుబాటు; నిబంధన; నియంత్రణ; నియతి; +* regulations, n. కట్టుబాట్లు; నిబంధనలు; నియమావళి; ప్రభుత్వ పద్ధతులు; చట్టములు; శాసనములు; వ్యవస్థాపనలు; +* regulator, n. వ్యవస్థాపకి; నియంత్రకం; +* Regulus, n. మఘ; మఖ; సింహ రాసిలో మొదటి నక్షత్రం; +* rehearsal, n. ఒద్దిక; పూర్వప్రయోగం; పూర్వనటనం; +* reign, n రెయిన్) ఏలుబడి; ఏలిక; రాజ్యం; +linear regression, ph సరళ తిరోగమనం; దత్తాంశ బిందువుల స్థానంలో, వాటికి సమదూరంలో, ఉజ్జాయింపుగా ఒక సరళ రేఖని గీసే పద్ధతి; +* reiterate, n. పునరుద్ఘాటించు; ద్విరుక్తించు; ఆమ్రేడించు; మళ్లా మళ్లా చెప్పు; +* reiteration, n. పునరుద్ఘాటన; వీసనం; ముహుర్భాష; పౌనఃపున్యం; పౌనరుక్త్యం; ద్విరుక్తం; +* reject, v. t. తిరస్కరించు; వదలిపెట్టు; నిరాకరించు; నిరసించు; త్రోసివేయు; ఆక్షేపించు; +* rejoinder, n. ప్రత్యుత్తరం; సమాధానం; ఎదురు జవాబు; బదులు; +* relapse, n. తిరగబెట్టు; పునర్ ప్రకోపించు; +* relationship, n 1) సంబంధం; సంపర్కం; ఇలాకా 2) బంధుత్వం; చుట్టరికం; +distant relative, ph. దూరపు బంధువు; అత్తప్పగారి పిత్తప్ప; అంతల పొంతల వాడు; +* relativism, n దృక్పథవాదం; ఒక రకం సాహిత్య విమర్శ; +* relativity, n. సాపేక్షత్వం; పరస్పరత్వం; పరస్పర సంబంధం; +* released, adj. విడుదల చేయబడ్డ; ప్రోత్సారిత; +* release, v. t. విడుదల చేయు; విడుచు; విమోచన చేయు; +* relish, n. ఉపదంశం; నంచుకోడానికి వీలయిన పచ్చడి వంటి పదార్థం; +* remainder, n. శేషం; శిష్టపదం; బాకీ; మిగిలినది; +* remaining, adj. తక్కిన; తరువాయి; మిగిలిన; మిగత; తతిమ్మా; +* remind, v. t. స్మరణకు తెచ్చు; జ్ఞాపకం చేయు; +* remission, n. తగ్గుదల; తగ్గించుట; తగ్గింపు; తగ్గుముఖం; +* remorse, n. పశ్చాత్తాపం; శోకం; అనుతాపం; ఖేదం; +* remove, v. t. తొలగించు; వదలించు; ఊడ్చు; విఘటన చేయు; హరించు; +* remuneration, n. ప్రతిఫలం; ప్రత్యుపకారం; చెల్లింపు; ముట్టింపు; +* renaissance, n రినసాన్స్) పునరుద్ధరణ; పునరుజ్జీవనం; కొత్త జన్మ; కొత్త జీవితం; నవజాగృతి; +* rendering, n. వర్ణన; వ్యాఖ్య; పాటని పాడడం; బొమ్మని గియ్యడం; భాషాంతరీకరణం చెయ్యడం; +* rendezvous, n రాండెవూ) ముఖాముఖీ; కలిసే స్థానం; సంకేత ప్రదేశంలో కలుసుకోవడం; +* rent, n. అద్దె; అద్దియ; బాడుగ; బేడిగ; భాటకము; కిరాయి; మక్తా; శిస్తు; +* renter, n. అద్దెకున్నవాడు; మక్తేదారు; ముస్తాజరు; భాటకుడు; +* renounce, v. t. త్యజించు; పరిత్యజించు; ఒదలిపెట్టు; +* repartee, n. ఎదురుదెబ్బ; చతురోక్తి; బ్రహాణకం; +* repeatedly, adv. మళ్ళీ మళ్ళీ; మాటిమాటికీ; పునరుక్తంగా; +* repentance, n. పశ్చాత్తాపం; నొచ్చుకోలు; +* repertoire, n. సంగీత కచేరీలు; నాటకాలు, మొదలైన కళాఖండాలకి కాణాచి అయిన వ్యాపార బృందం see also) repertory +* repetition, n. పునరుక్తి; వల్లె; జపం; చర్వితచర్వణం; ద్విరుక్తం; పర్యాయోక్తి; అనుప్రాస; +* replication, n. ప్రతిసృజన; తనని తాను తనంతగా సృష్టించుకోగలిగె సత్తా; +* reply, n. సమాధానం; జవాబు; బదులు; ప్రత్యుత్తరం; ప్రతివచనం; ప్రతివాదం; మాటకి తిరుగు మాట చెప్పడం; +* repose, v. i. నడ్డి వాల్చు; విశ్రాంతికై జేరగిలబడు; +* reprehend, v. t. కోపించు; నిందించు; అభిశంసించు; +* represent, v. t 1) ప్రాతినిధ్యం వహించు 2) వర్ణించు; నివేదించు; సంకేతించు; +* reprimand, v. t. తిట్టు; చివాట్లుపెట్టు; కోప్పడు; కసురు; మందలించు; నిందించు; +* reprint n 1) పునర్ముద్రణ 2) పునర్ముద్రణ పత్రం; +* reproduction, n. పునరోత్పత్తి; సంతానోత్పత్తి; ప్రత్యుత్పత్తి; పిల్లలు పుట్టుట see also regeneration; +reproductive hormones, ph. ప్రత్యుత్పత్తి హార్మోనులు; ప్రత్యుత్పాదక హార్మోనులు; +* reprove v. t. కోప్పడు; కూకలేయు; చివాట్లు పెట్టు; గద్దించు; +* republic, n. గణరాజ్యం; గణతంత్ర రాజ్యం; +* repudiate, v. t. నిరాకరించు; సమర్థించకుండా ఉండు; తోసిపుచ్చు; విడనాడు; +* repulse, v. t. ఓడించు; తోసివేయు; వికర్షించు; +* repulsion, n 1) వికర్షణ 2) ప్రతిహతం; అసహ్యం; ఏవగింపు; +* reputation, n. పరపతి; పరువు; ప్రతిష్ట; కీర్తి; ఖ్యాతి; +* reputed, adj. కీర్తికెక్కిన; కీర్తివంతమైన; వాసికెక్కిన; +* request v. t కోరు; అడుగు; మనవి చేయు; విన్నపించు; అభ్యర్ధించు; +* requiem, n సంతాప గీతం; శోక గీతం; చనిపోయిన వారి యెడల సంతాపం ప్రకటిస్తూ చదివేది; +* request, n. మనవి; విన్నపం; నివేదన; ప్రార్థన; కోరిక; అభ్యర్థన; +* requirements, n. కావలసినవి; ఆపేక్షితాలు; కాంక్షితాలు; +* rescue, n. పరిత్రాణం; రక్షించడం; +* research, n. పరిశోధన; శోధన; పునస్సంశోధన; కృషి; అన్వేషణ; అన్వీక్షణ: అరయిక; +* researcher, n. జిజ్ఞాసువు; m. పరిశోధకుడు; పునస్సంసోధకుడు f. పరిశోధకురాలు; ఆదిత్సువు; +* reservation, n. ప్రత్యేకింపు; కేటాయింపు; రిజర్వేజన్; +* reserved, adj 1) ప్రత్యేకింపబడ్డ; రిజర్వు చెయ్యబడ్డ 2) ముభావంగా ఉన్న; +* reservoir, n 1) నిధి; టెంకి; తొట్టి; ఆశయం 2) తటాకం; చెరువు; కొలను; సరస్సు; సముద్రం; జలాశయం; సాగరం; తొట్టి; +* residence, n. నివాసం; నివేశనం; ఉండేచోటు; ఉనికిపట్టు ఇల్లు; ఇరవు; అవస్థానము; +* resident, n. నివాసి; స్థాత; వాస్తవ్యుడు; ఉండువాడు; సాకీను; +* residents, n. pl. నివాసులు; వాస్తవ్యులు; మనికులు; ఉండువారు; +* residue, n. మిగిలినది; లోతక్కువ; అవశేషం; అవశిష్టం; అవక్షేపం; శేషం; ఉచ్ఛేషం; గసి; పిప్పి; +* resign, v. i. రాజీనామాచేయు; విసర్జించు; వదలుకొను; +* resist, v. i. ఎదిరించు; ప్రతిఘటించు; నిరోధించు; మొరాయించు; +* resistance, n 1) అవరోధం; ప్రతిఘటన; నిరోధం; అడ్డగింత 2) భౌతిక చలనంలో ఎలా ఐతే ఘర్షణ చలనాన్ని నిరోధిస్తుందో, అలాగే పదార్థములందు ఎలక్ట్రాన్ల చలనాన్ని కూడా నిరోధించే గుణాన్ని రెసిస్టెన్స్ అంటారు; +* resistivity, n. అవరోధకత్వం; నిరోధకత్వం; ఒక ధాతువు ఎంత మేరకు కరెంటు పంపగలదు (పంపలేదు) అన్నదానికి కొలమానం ఈ రెసిస్టివిటీ; +electrical resistivity, ph. విద్యున్నిరోధకత్వం; విద్యున్నిరోధక గుణం; +* resistor, n. అవరోధకి; నిరోధకి; నిరోధకం; +* resolution, n 1) నిశ్చయం; నిశ్చితార్థం; నిర్ణయం; పరిష్కారం; తీర్పు; తీర్మానం; సంకల్పన 2) వియోజనం; +* resolve, v. i 1) సంకల్పించు 2) పరిష్కరించు; పొక్తుపరచు 3) విడదీయు; +* resolved, n. నిశ్చితం; నిర్ణయించబడినది; +* respect, n. గౌరవం; అభిమానం; ప్రతిపత్తి; పరువు; పేరిమి; +* respectable, adj. గౌరవించదగిన; గౌరవనీయమైన; మాననీయమైన; మర్యాద చూపదగిన; +* respectively, adv. ఆదిమధ్యాంత్య మంత్యంగా; యథాసంఖ్యానుసారంగా; క్రమానుసారంగా; వరుసగా; +* resplendent, adj ఉజ్జ్వల; జిగేలుమనే; ���ిరుమిట్లుగొలిపే; +* response, n. ప్రతిస్పందన; జవాబు; ప్రత్యుత్తరం; ప్రతికార్యం; ప్రతికరం; ప్రతికర్మం; ప్రతిక్రియ; ఆలోచన, వివేచనతో కూడిన ప్రతిస్పందన; +* responsibility, n 1) కర్తవ్యం 2) బాధ్యత; పూచీ; జవాబుదారీ; ధుర్యత; ధుర; మోపుదల; ఉత్తరవాదం; +* rest, adv. మిగతా; మిగిలిన; తతిమ్మా; +* rest, n 1) విరామం; విశ్రాంతి; విశ్రమం; విరతి; ఊరట; ఉడుకువ 2) నిశ్చలత్వం 3) తరవాయి; మిగిలినది; +* rest, v. i. విశ్రమించు; విరమించు; +* resume, v. i రెసూం) తిరిగి ప్రారంభించు; మధ్యలో ఆపిన పనిని తిరిగి చేయడం మొదలు పెట్టు; +* retaliation, n. ప్రతీకారం; ప్రతిఘటన; కసితీర్చుకొనడం; ప్రతిహింస; దెబ్బకు దెబ్బ తియ్యడం; +* reticence, n. మాట్లాడకుండా తటస్థంగా ఊరుకోవడం; మౌనం వహించడం; గుట్టుగా ఉండడం; +* reticent, adj గుట్టు; ముభావం; తటస్థం; బయటకి తేలకుండా ఉండే స్వభావం వ్యక్తం చెయ్యడం; +* retina, n. అక్షపటలం; మూర్తీపటలం; +* retinitis, n. అక్షపటలదాహం; అక్షపటలం వాపు; +* retinue, n. భృత్యబృందం; భృత్యవర్గం; పరిజనం; మంది; బలగం; మందిమార్బలం; పరివారం; వందిమాగదులు; +* retire, n. విరమించు; నిష్ర్కమించు; పదవీవిరమణ చేయు; +* retort, n 1) బట్టీ 2) తోకబుడ్డి; ఝారీ 3) ప్రత్యాక్షేపం; తిరుగు జవాబు; +* retreat, v. i. తగ్గు; సన్నగిల్లు; వెనుకంజ వేయు; +* retroflex, adj ling ప్రతివేష్టిత; మూర్థన్య; ఒంచిన; ఒంపు తిరిగిన; వెనక్కి తిరిగిన; ఉచ్చరించేటప్పుడు నాలుకని వెనక్కి తిప్పి పై పంటి ఎగువని ఆనించడం; ఉ: ట ఉచ్చారణ; +retroflex flap, ph. ప్రతివేష్టిత తాడితం; మూర్థన్య తాడితం; +retroflex stop, ph. ప్రతివేష్టిత స్పర్శం; మూర్థన్య స్పర్శం; +* retroflexes, n. మూర్థన్యములు; ప్రతివేష్టితములు; నాలుకని మడత పెట్టి నోటి కప్పుకి తగిలించి పలికేవి; ట, ఠ, డ, ఢ, ణ; +retrograde motion, ph. తిరోగమనం; పశ్చగమనం; వక్రగతి; వక్రించిన గమనం; వెనక్కి నడవడం; +* retrospection, n. సింహావలోకనం; పునర్విమర్శ; పునఃపరిశీలన; వెనక్కి చూడడం; +* rev. v. t. తిరిగే చక్రం యొక్క జోరు పెంచడం; యంత్రం యొక్క జోరు పెంచడం; +* reveal, v. i. వెలరించు; వెలార్చు; బయటపెట్టు; +* revelation, n. వెలరింపు; వెలవరింపు; ద్యోతకం; శృతి; +* revenge, n. ప్రతీకారం; ప్రతిహింస; కసితీర్చుకొనడం; పగ సాధించడం; +* revenue, n. కోశాదాయం; ఆయం; రాజస్వం; పరుపతం; ప్రభుత్వ కోశానికి వచ్చే ఆదాయం; +* reversible, adj. ఉత్క్రమణీయ; తిరగెయ్యడానికి వీలైన; +* revetment, n. రాతిచపటా; రాతిమలామా; నెలకట్టు; బందోబస్తు చెయ్యడానికి కట్టే రాతికట్టడం; +* review, n 1) సమీక్ష; పరిశీలన; గ్రంథ పరిచయం 2) పునర్విచారణ; పునర్విమర్శ; పునశ్చరణ; పునరావలోకనం; ప్రత్యాలోచన; +* review, v. t 1) సమీక్షించు 2) పునర్విచారణ చేయు; చింతన చేయు; +* revision, n. సవరింపు; సవరణ; సంస్కరింపు; సంస్కరణ; +* revolt, n. విప్లవం; తిరుగుబాటు; పితూరి; +* revolution, n 1) విప్లవము; తిరుగుబాటు 2) పరిభ్రమణం; చుట్టుతిరగడం; +clockwise revolution, ph. ప్రదక్షిణం; గడియారపు ముల్లు తిరిగే దిశలో చుట్టి రావడం; గుడుల చుట్టూ గానీ, అగ్ని హోత్రుని చుట్టూగానీ, మహనీయుల చుట్టూగానీ కుడివైపుగా తిరగడం; +counter clockwise revolution, ph. అప్రదక్షిణం; గడియారపు ముల్లు తిరిగే దిశకి ఎదురు దిశలో చుట్టి రావడం; +* revolve, v. t. చుట్టుతిరుగు; ప్రదక్షిణచేయు; +* revolver, n. తిరుగుడు పిస్తోలు; ప్రయత్నం లేకుండా తూటాలను ప్రక్షేపణ స్థానానికి సరఫరా చేసే పిస్తోలు; +* reward, v. t. అనుగ్రహించు; బహూకరించు; +* reward, n 1) ప్రతిఫలం; ఫలం 2) పారితోషికం; పసదనం; +* Rh-factor, n రీసస్ కారణాంశం; రక్తంలోని ఎర్ర కణాల మీద కనిపించే ఒక రకం ప్రాణ్యపు బణువు (protein molecule ఈ రకం ప్రాణ్యపు బణువు రీసస్ జాతి కోతులలో కనిపించింది కనుక ఈ పేరు పెట్టేరు; +* rhapsody, n. అసంగతకావ్యం; తల తోకలేని కావ్యం; +* rhetoric, n. భాషాలంకార శాస్త్రం; అలంకార శాస్త్రం; సలక్షణ పదాల ఎంపిక, చాతుర్యయుక్తమైన వాక్య నిర్మాణం, గుణ-రసాదులు సాహిత్యంలో ఉండేలా చూడడమంటే ఆ వ్రాతను సాహిత్య ఆభరణాలతో అలంకరించడమే! అందుకే ఈ శాస్త్రాన్ని 'అలంకార శాస్త్రం' అంటారు; +* rhetorical, adv. అలంకారయుక్తంగా; భాషాభేషజం తప్ప భావశూన్యంగా ఉండడం; కేవలం తన వాదనని బలపరచడానికి మాత్రమే వాడబడిన భాషావిశేషాలతో కూడి ఉండిన; +* rhino, adj. ముక్కుకి సంబంధించిన; +* rhinoceros, n. ఖడ్గమృగం; గండ మృగం; ముక్కొమ్మమెకము; ఏకశృంగం; శ్వేతవరాహం; +* rhizoid, n. దుంప; నులివేరు; మూల తంతువు; +* rhombus, n. రాంబస్; సమాంతర చతుర్భుజం; ఎదురెదురు భుజాలు సమాంతరంగాను, సమంగానూ ఉన్న చతుర్భుజం; +* rhombohedral, adj సమాంతరచతుర్ముఖ; ఎదురెదురు ముఖాలు సమాంతరంగాను, సమంగానూ ఉన్న చతుర్భుఖం; +* rhubarb, n. రేవలచిన్ని; రేవల్చిన్ని; తోటకూర వంటి ఈ ఆకుకూర కాడలు వండుకు తినవచ్చు కానీ, ఆకులు తినకూడదు; ఆకులలో ఆగ్జాలిక్ ఆమ్లం అత్యధికంగా ఉండడం వల్ల అవి విష తుల్యం; +* rib, n. పక్క ఎముక; పర్శుక; పార్శ్వాస్తి; డొక్క; +* rice, n 1) బియ్యం; తండులం; దంచిన ధాన్యం 2) అన్నం; ఉడకబెట్టిన అన్నం; +cooked rice, ph. వరి అన్నం; అన్నం; శాల్యోదనం; ఓగిరం; బోనాలు; అత్తు; +* rich, adj. గొప్ప; మోతుబరు; సంపన్నమైన; +* rickettsiae, n. pl. రికెట్సియే; బేక్టీరియాకీ, వైరసులకీ మధ్యగా ఉండే సూక్ష్మ జీవులు; వీటివల్లనే టైఫస్ జ్వరం వస్తుంది; +* riddles, n. పొడుపు కథలు; తలబీకరకాయలు; కైపదాలు; ప్రహేళికలు; చిక్కు ��మస్యలు; కుమ్ముసుద్దులు; బురక్రి బుద్ధిచెప్పే సమస్యలు; మెదడుకి మేతవేసే మొండి సమస్యలు; +* rider, n 1) రౌతు; సవారీ చేసేవాడు 2) తాజాకలం; అనుబంధ సిద్ధాంతం; +* ridicule, v. t. పరిహసించు; అపహసించు; ఎకసక్కేలాడు; ఎద్దేవాచేయు; +* ridiculous, adj. హాస్యాస్పదమైన; నవ్వు పుట్టించే; +* Rigel, n రైజెల్ వృత్రపాద నక్షత్రం; +* right, n 1) ఒప్పు; తప్పుకానిది 2) హక్కు; స్వామ్యం 3) సమమైన; సరి అయిన 4) కుడి; వల; వలవల; దక్షిణ; +right hand, ph. కుడిచేయి; వల కేలు; దక్షిణ హస్తం; +right-wing, ph. దాక్షిణ్య భావాలున్న పక్షం; +* rigmarole, n సోది; గొడవ; తల, తోక లేని వాక్ ప్రవాహం; +* rigor mortis, n. మరణావష్టంబనం; శవం కొయ్యబారడం; +* rim, n 1) అంచు 2) నేమి; టైరు అతికించడానికి వాడే చట్రం 3) కప్పీ; +* rind, n. పండ్లయొక్క తొక్క; +* ring, n 1) వలయం; వర్తులం 2) ఉంగరం; అంగుళి; అంగుళీయకం 3) శబ్దం 4 Math చక్రం గణితంలో వచ్చే ఒక ఊహనం; ఉదాహరణకి పూర్ణాంకముల సమితి (అనగా 3 2 1, 0, 1, 2, 3 ని చక్రం అంటారు. మరొక విధంగా చెప్పాలంటే ఒక సమితిలోని సభ్యులతో కూడికలు, గుణకారాలు చెయ్యగా వచ్చే సమాధానం కూడ ఆ సమితిలోనే ఉంటే ఆ సమితిని "చక్రం" అంటారు; ఉదాహరణకి పైన చూపిన సమితిలో ఏ రెండు సభ్యులని తీసుకుని కలిపినా, గుణించినా వచ్చే సమాధానం ఆ సమితిలోనే దొరుకుతుంది; +* ringer, n. నాగవాసం; ఘంటా ప్రతీకం; గంటలో మధ్య వేలాడే కాడవంటి లోహ విశేషం 2) ముమ్మూర్తులా మరొక వ్యక్తి రూపంలో ఉన్న మనిషి; +* ringing, n. హోరు; గింగురుమను శబ్దం; మారుమోత; +* rinse, v. t. జాడించు; తొలుచు; ప్రక్షాళించు; పుక్కిలించు; గండూషించు; +* rip, v. t. చింపు; చించు; చీల్చు; విదారించు; +* riparian, adj. నదీతీరానికి సంబంధించిన; +riparian rights, ph. నదీజలాలపై నదీతీరవాసుల హక్కులు; +* ripe, adj. పండిన; ముగ్గిన; మాగిన; పక్వమైన; పరిపక్వం చెందిన; +half ripe, ph. దోరగా పండిన; దోరగా ముగ్గిన; +* ripen, v. t. పండబెట్టు; ముగ్గించు; ముగ్గబెట్టు; మాగబెట్టు; +rise and fall, ph. లేవడం; పడడం; ఉదయాస్తమయాలు; ఎగుడు, దిగుళ్లు; హెచ్చుతగ్గులు; నిమ్నోన్నతలు; ఉత్థానపతనాలు; +* risk, n. నష్టభారం నష్టాన్ని భరించగలిగే స్థోమత; తెగింపు; తెగించగలిగే స్థోమత; +* ritual, n. కర్మకాండ; తంతు; సంస్కారవిధి; ఆచారం; +* rival, n. ప్రతిద్వంది; ప్రత్యర్థి; ప్రతిస్పర్ధి; స్పర్ధాళువు; పోటీదారుడు; దంట; +* rivalry, n. పోటీ; విజిగీష; ప్రతిస్పర్ధ; దంటతనం; +perennial river, ph. నిత్య తరంగిణి; నిత్య ప్రవాసిని; జీవనది; ఎల్లసావిని; ఎల్లేఱు; +* rivettment, n. కరకట్ట; జల ప్రవాహానికి ఒడ్డు కోసుకుపోకుండా ఉండడానికి వేసే తాపడం; +* road, n. వీధి; మార్గం; దారి; తోవ; తెరువు; రహదారి; బాట; రస్తా; రోడ్డు; +main road, ph. పెద్దవీధి; ప్రతోళి; రహదారి; +* roam, v. i వలితిరుగు; తిరుగు; చరించు; అభిచరించు; +* roar, n 1) గర్జన; బిగ్గరైన నవ్వు 2) హోరు; +* roar, v. i 1) గర్జించు; గాండ్రించు; బిగ్గరగా నవ్వు 2) హోరు పెట్టు; +* roaring, n. గర్జించడం; హోరు పెట్టడం; బిగ్గరగా నవ్వడం; +* rob, v. t. దోచు; కాజేయు; దొంగిలించు; +* robot, n. కూకరు; చాకరు; గణకరు; రోబాట్; కూలి పనిచేసే కంప్యూటరు; చాకిరీ చేసే కంప్యూటరు see also automaton, android, bot +* rod, n. దండం; చువ్వ; ఊస; కమ్మి; కోపు; పాళా; శలాకం; +* rodent, n. పళ్లతో కొరికే సామర్ధ్యం ఉన్న ఎలుక, ఉడుత జాతి చిన్న జంతువు; +* rogue, adj. శరండు; దగుల్బాజీ; మదించిన; +rogue elephant, ph. మదించి, పిచ్చెక్కిన ఏనుగు; మంద కట్టడికి దూరంగా ఉండి విచ్చలవిడిగా తిరిగే ఏనుగు; +rogue nation, ph. శరండ దేశం; కట్టుబాట్లలో ప్రవర్తించని దేశం; +* rogue, n. త్రాష్టుడు; వెధవ; శరండుడు; దగుల్బాజీ; కట్టుబాటుని తోసిపుచ్చి ప్రవర్తించు వ్యక్తి; +* roll, v. t. చుట్టు; దొర్లించు; పొర్లించు; ఉరలించు; +* roll, v. i. చుట్టు; దొర్లు; పొర్లు; ఉరలు; +rolling pin, ph. అప్పడాల కర్ర; లట్టనిక; లత్తపిడి; +* romantic, adj 1) ప్రేమ 2) కాల్పనిక; భావనాత్మక; రసాస్వాదక; +* romanticism, n. కాల్పనికవాదం; కాల్పనికోద్యమం; భావుకత ఉద్యమం; ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి, ఆనందించే ఉద్యమం; +* rome, n. రోమా నగరి; ఇటలీదేశ రాజధాని నగరం; +* roof, n 1) కొప్పు; కప్పు; ఇంటి కప్పు; నీధ్రం 2) మిద్దె; +* rook, n 1) చదరంగంలో ఒక పిక్క (ఏనుగు 2) సితనీల చంచు కాకం; తెలుపు, నలుపు కలిసిన చంచువు (ముక్కు) కల ఒక రకం కాకి biol] Corvus frugilegus; +* root, n 1) మూలం; మొదలు; మాతృక; ధాతువు; కుదురు 2) వేరు 3) అంశ; +* rosary, n. జపమాల; అక్షమాల; అక్షసరం; అక్షసూత్రం; +* roseola, n. వేపపువ్వు; పసితనంలో వచ్చే ఒక జబ్బు; గులాబీ రంగులో ఉన్న పేత వంటి రోగ విశేషం see also rubbeola and rubella; +* rosemary, n. రస్మేరీ bot Rosemrinus officinalis; పాశ్చాత్యదేశాలలోని వంటలలో వాడే ఒక ఆకు సుగంధ ద్రవ్యం; +* roster, n. ఆసామీవారీ; సిబ్బంది జాబితా; +* rotation, n. భ్రమణం; ఆత్మభ్రమణం; ఆత్మప్రదక్షిణం; తిరుగుడు; చక్రగతి rel revolution; +rotation of earth, ph. భూభ్రమణం; భూమి యొక్క ఆత్మప్రదక్షిణం; +* rotor n. కదురు; యంత్రంలో గిరగిర తిరిగే భాగం; +* rouge, n రూజ్) బుక్కా; బుగ్గలకి రాసుకొనే ఎరన్రి గుండ; +* rough, adj రఫ్) రూక్ష; స్థూల; చిత్తు; గరుకు; కచ్చా; ముతక; మొరటు; బరక; +* round, adj. గుండ్రం; గుండ్రని; ఉండ్రం; అల్లి; హల్లి; గుబ్బ; బొండు; బటువు; +* round, n. దఫా; సారి; తూరి; చుట్టు; ఆవృత్తి; ఆవర్తనం; +second round, ph. రెండవ దఫా; రెండవ సారి; రెండవ తూరి; రెండవ ఆవృత్తి; రెండవ ఆవర్తనం; +* roundabout, adj. చుట్టుతిరుగుడు; డొంకతిరుగుడు; +* roundabout, n. నాలుగైదు రోడ్ల కూడలిలో వాహనాలు సజావుగా మలుపు తిరగడానికి ఏర్పాటు చెయ్యబడ్డ వలయాకారపు రోడ్డు; +* rounds, n. చుట్లు; ఆవృతులు ప్రహార్లు; వైద్యులు రోగులను చూడడానికి తిరిగే తిరుగుళ్లు; +* routine, n 1) రివాజు; పరిపాటి; నిత్యవిధి; నిత్యకృత్యం 2) క్రమణిక; చర్యాక్రమం; పరిపాటి; కంప్యూటరు ప్రోగ్రాం; +* routing, n. వెళ్ళగొట్టడం; మళ్ళించడం; +flood routing, ph. వరదలని మళ్ళించడం; ప్రవాహాన్ని మళ్లించడం; +* rovibronic, adj phys భ్రమణకంపన; ఎలక్ట్రానిక్ స్థితి లోని కంపన మట్టంలో భ్రమణ ఉపమట్టం; రెండు బంతులని ఒక రబ్బరు తాడుతో కట్టి వాటిని గిరగిర తిప్పితే ఆ రెండు బంతుల మధ్య భ్రమణం (తిప్పడం వల్ల కంపనం (రబ్బరు తాడు వల్ల) కలిసిన భ్రమణకంపనం ఉంటుంది a rotational sublevel of a vibrational level of an electronic state; +* row, n 1) పంక్తి; బంతి; బారు; బరి; వరుస; శ్రేణి; క్రమం; ఒగి; ఓలి; ఓజ; ఆవలి; ఆళి; రాజి; ధారణి; తతి; ఛటం 2) జట్టీ; తగువులాట; +* rub, v. t. పాము; తోము; పిసుకు; రాయు; రుద్దు; మాలీసు చేయు; మర్దనా చేయు; ఉద్వర్తించు; +rubbing alcohol, ph. మర్దనోలు; ఉద్వర్తన ఒలంతం; కషణాలంతం; కషణోల్; ఐసో ప్రొపైల్ ఆల్కహాలు; +* rubeola, n. మీజిల్స్; జ్వరం, దగ్గు, రొంప మొదలైన రోగ లక్షణాలు కనిపించేసరికి పదిరోజులు పడుతుంది. తర్వాత కళ్లు పుసి కట్టడం, తర్వాత కళ్లలోనూ, బుగ్గలమీద, చిన్న చిన్న తెల్లని మచ్చలు వస్తాయి. తర్వాత ఒళ్లంతా పేత పేసినట్టు; చిన్న చిన్న పొక్కులు వస్తాయి; see also rubella and roseola; +* rubella, n. జర్మన్ మీజిల్స్; గర్భవతులకి ఈ జబ్బు వస్తే పుట్టబోయే పిల్లకి చాలా ప్రమాదం. కనుక రజస్వల అయేలోగానే ఆడపిల్లలు వేక్సినేషన్ చేయించుకోవాలి. see also rubbeola and roseola; +* rubbish, n. చెత్తా చెదారం; తుక్కూ దూగరా; చెత్త; +* ruby, n. కెంపు; మాణిక్యం; పద్మరాగం; నవరత్నములలో ఒకటి; +* rudder, n. చుక్కాని; పీలి; కర్ణం; అరిత్రం; +rudimentary property, ph. తన్మాత్ర; హిందూ శాస్త్రాల ప్రకారం శబ్ధం ఆకాశం యొక్క, స్పర్శ వాయువు యొక్క, రూపం అగ్ని యొక్క, గంధం పృధ్వి యొక్క, రసం జలం యొక్క తన్మాత్రలు; +* rudiments, n. ప్రాథమిక సూత్రాలు; మూల సూత్రాలు; తన్మాత్రలు; బీజాలు; +* ruff, v. t. కోయు; కోసు; తురుపు ముక్కతో కోయు; +* ruins, n. ఉత్సన్నముల; శిధిలములు; +* rule, v. t. ఏలు; పాలించు; పరిపాలించు; +* rule, n 1) సూత్రం; నియమం; నియతి; నిబంధన; కట్టడి; అనుశాసనం; విధి; విధాయకం; ఖాయిదా; చౌకట్టు; రూలు 2) తిన్నని గీత; కాగితం మీద రాత సౌలభ్యానికి గీసిన గీత; పంక్తి; +according to rule, ph నియమానుసారం; చౌకట్టు ప్రకారం; చౌకట్టును బట్టి; +ruled paper, ph. రూళ్ళ కాగితం; తిన్నని గీతలుతో ఉన్న కాగితం; +* ruler, n 1) ఏలిక; పాలకుడు; పరిపాలకుడు 2) రూళ్ళకర్ర 3) కొలబద్ద; +* rules, n. విధులు; నియమాలు; నిబంధనలు; +* rum, n. శీధు; మైరేయం; చెరకు రసాన్ని పులియబెట్టి చేసే సారా; +* ruminant, n. రోమంధము; నెమరువేయు జంతువు; +* ruminate, v. t. నెమరువేయు; రోమంధించు; ఒక విషయాన్ని గురించి నిదానంగా ఆలోచించు; +* rumor, n. పుకారు; వినికిడి; వదంతి; లోకవార్త; ప్రవాదం; లోకప్రవాదం; గాలికబురు; నీలివార్త; పోవిడి; +* rump, n. పిర్ర; పిరుదు; నితంబం; +* run, v. i. పరుగెత్తు; పారు; ఉడాయించు; +* rung, n. మెట్టు; సోపానం; నిచ్చెన మెట్టు; +* runway, n. పరుగుబాట; విమానాలు ఎగిరే ముందు; వాలిన తర్వాత వాడుకునే పరుగు బాట; +* rural, adj. గ్రామీణ; జానపద; పల్లెటూరి; +* rushes, n. సంరంభ ప్రదర్శనం; సినిమాలో భాగాలు తియ్యగానే ఎలా వచ్చిందో చూడడానికి వేసే ప్రదర్శన; +* rust, n 1) తుప్పు; ఆశ్మరాగం 2) చార తెగులు; +* rustic, adj. పామర; గ్రామీణ; అసభ్య; సంస్కృతి లేని; పల్లెటూరి తరహా; +* rustic, n. పామరుడు; పల్లెటూరు ఆసామీ; బైతు; +* rut, n 1) రుతుకాలం; జంతువులలో లైంగిక ప్రకోపన జరిగే రుతువు; see also estrus 2 విసుగు పుట్టించే దైనందిన కార్యక్రమం; +rye grass, ph. ఒక రకం గడ్డి మొక్క; ఈ గడ్డికి, రై ధాన్యానికి ఏ విధమైన సంబంధము లేదు bot Lalium temulentum + + +* table, n 1) బల్ల; మేజా; భోజనాల బల్ల 2) పట్టిక; పట్టీ; సారణి; సరణి 3) ఎక్కం; +water table, ph. జలమట్టం; భూమిలో ఈ మట్టానికి దిగువ నీరు సంతృప్తంగా ఆవరించి ఉంటుంది; నుయ్యి తవ్వినప్పుడు నీరు ఈ మట్టానికి నిలుస్తుంది; +table salt, ph. ఉప్పు; వంటలో వాడే ఉప్పు; కూర ఉప్పు; +* tablet, n 1) బిళ్ల; గుటిక; మాత్ర; మింగడానికి అనుకూలంగా ఉన్న మోతాదు మించని మాత్ర 2) పలక; కర్రతో కాని, మట్టితో కాని, రాయితో కాని చేసి, రాతకి అనుకూలంగా చదునుగా ఉన్న వస్తువు; +* taboo, n. అశ్లీలం; బూతు; సాధు సమ్మతం కానిది; చెయ్యకూడని చేత; రాయకూడని రాత; +* tabula rasa, n. ఖాళీ పలక; తెల్ల కాగితం; అలేఖ్యం; అలేఖం; +* tacit, adj. అనుక్త; ప్రత్యేకంగా చెప్పని; ఉద్ఘాటించని; ముభావంగా ఊరుకున్న; అంతర్లీనమైన; +* taciturn, adj. ముభావంగా ఉన్న; తక్కువగా మాట్లాడే తత్వం కల; +* tack, n. పూతిక నాటు; చిన్న మేకు; +thumbtack, ph. బొత్తాం నాటు; సుత్తి అవసరం లేకుండా వేలితో గోడకి గుచ్చగలిగే సదుపాయం ఉన్న మేకు; +* tact, n. యుక్తి; ఒడుపు; వెరవు; నేర్పు; చాతుర్యం; +* tactic, n. లఘుయుక్తి; లఘుతంత్రం; పన్నాగం; సమీప భవిష్యత్తుకి కావలసిన ఎత్తు; టాక్టికల్ వ్యూహాలు అంతిమ లక్ష్యానికి చేర్చే వ్యక్తిగత దశలు లేదా చర్యలు. టాక్టిక్స్ ఆచరణకు సంబంధించినవి. టాక్టిక్స్ "ఎలా ఎవరు" అనే ప్రశ��న మీద ఆధారపడి ఉంటుంది ఎలా" చేస్తున్నారు ఎవరు" చేస్తున్నారు అనేది మాత్రం అందరికి కనిపిస్తుంది. see also stratagey; +* tadpole, n. తల కప్ప; భేకడింభం; చిరు కప్ప; పిల్ల కప్ప; +* tail, n 1) తోక; పక్షి తోక; జంతువుల తోక; విమానపు తోక 2) వాలం; లాంగూలం; జంతువుల తోక 3) బొరుసు; +hairy tail, ph. లాంగూలం; గురప్రు తోక లాంటి కుచ్చు తోక; +* tail, v. t. వెంటాడు; తోకలా వెంటాడు; వెన్నంటి వెళ్లు; +* tailor, n. దర్జీ; తున్నవాయుఁడు; కుట్టరి; +* taint, v. t. కల్తీ చేయు; కళంకం తీసుకొని వచ్చు; +* take, v. t 1) తీసుకొను; కైకొను; చేపట్టు 2) సేవించు; తిను; తాగు; +* talent, n. నేర్పు; కుశలత; కౌశల్యం; ప్రతిభ; ప్రజ్ఞ; ‘జన్మతః సంక్రమించే నైసర్గిక లక్షణం’ అనేదే ప్రతిభ అన్నారు దండి; అభినవ గుప్తుడు ‘అపూర్వ వస్తు నిర్మాణ ప్రజ్ఞ’గా చెప్పారు +* talisman, n. తావీజు; తాయెత్తు; రక్షామణి; రక్ష; మైరేకు; +* talkies, n. మాట్లాడే బొమ్మలు; సినిమాలు; +talkative person, ph. వాగుడుకాయ; వాచాలుడు; వాచాటుడు; జల్పకుడు; +* tall, adj. పొడవైన; పొడుగైన; ఎత్తయిన; +* tally, v. t. బేరీజు వేసి చూడు; తైపారు వేసి చూడు; +* tamper, v. t. జోలికి పోవు; జోక్యం కలుగజేసుకొను; లంచం ఇచ్చు; +* tan, n 1) లేత గోధుమ రంగు; కడారు వన్నె 2) పదును; కురటము; చర్మాన్ని తోలుగా మార్చే పద్ధతి; +* tan, v. t 1) ఎండలో కూర్చుని శరీరాన్ని లేత గోధుమ రంగు లోకి మార్చు 2) ఊను; ఊన్‌చు; పదును పట్టు; కురటించు; చర్మాన్ని తోలుగా మార్చు; +* tangent, n 1) స్పర్శరేఖ 2) స్పర్శాంశం; త్రిభుజంలో ఒక కోణానికి ఎదురుగా ఉన్న భుజం లవంలోనూ, పక్కగా ఉన్న భుజం హారంలోనూ వేసినప్పుడు వచ్చే నిష్పత్తి; లంబకోణ త్రిభుజంలో లంబకోణం కాని ఒకకోణానికి ఎదురుగా ఉన్నభుజం లవం లోను, ప్రక్కగా ఉన్న( కర్ణం కాని) భుజం హారం లోను వేసినప్పుడు వచ్చే నిష్పత్తి; +* tangible, adj. స్పర్శనీయ; అనుభవనీయ; సాకారమైన; స్పష్టమైన; +* tank, n 1) చెరువు; తటాకం; కోనేరు; టెంకి; పుష్కరిణి 2) తొట్టి; +* tanner, n. కురటుడు; చర్మాన్ని తోలుగా మార్చే వ్యక్తి; +* tannery, n. కురట శాల; తోళ్లని పదును చేసే కర్మాగారం; +* tantamount, adj. నిజానికి; వాస్తవానికి; మొత్తంమీద; సమానార్ధకమైన +* tap, v. t 1) తట్టు 2) చిన్న గంటు పెట్టి వెలికి తీయు; +* tap, n 1) కుళాయి; నల్ల; గొట్టానికి గంటు పెట్టి నీళ్లని బయటకు తీసే సాధనం; పంపు 2 phonetics] అల్ప కంపితం; +* tape, n. పట్టెడ; నవారు; బద్దీ; నాడా; టేపు; +* tapestry, n. చిత్ర యవనిక; గుడ్డ మీద వేసిన వర్ణ చిత్రం; +* tapioca, n. సగ్గుబియ్యం కఱ్ఱపెండలం జాతి పిండి పదార్థంతో చేసే ఒక ధాన్య విశేషం; తాళజాతి చెట్ల నుండి వచ్చే పిండితో చేస్తే దానిని "సేగో" అ���టారు; see also sago; +* tar, n. తారు; కీలు; గంజిత్తు ety గని జిత్తు; +* tare, n. తారం; తారా; పడికట్టు ఎత్తు; తూనిక తోపుడు; సరుకులు బుట్టలో వేసి తూచేటప్పుడు ఖాళీ బుట్ట బరువు; +* tariff, n 1) సుంకం; ఎగుమతి దిగుమతుల మీద ప్రభుత్వం వేసే సుంకం 2) హొటేలు గదులకి పుచ్చుకొనే అద్దె 3) సుంకాల పట్టీ; సుంకసూచిక; +* tarnish, n. మెరుపు తగ్గుట; కిలుం పట్టుట; +* tartar, n 1) ద్రాక్ష ఉప్పు 2) పండ్లమీద చేరే మలినం; పాచి; +* taste, v. t. రుచిచూడు; చవిచూడు; ఆస్వాదించు; +taste buds, ph. రుచిబొడిపెలు; స్వాదుముకుళాలు; +* tattle, v. t వదరుట; పేలుట; వాగుట; ఉపయోగం లేని కబుర్లు, చాడీలు; +* taunt, n. దెప్పు; ఎత్తిపొడుపు; ఉపాలంభం; +* taupe, n. తోపు; తోపురంగు; ముదర ఎరుపు; +* Tauri Beta, n. అగ్ని నక్షత్రం; వృషభ రాశి లోని ప్రకాశవంతమైన నక్షత్రాలలో రెండవది +* Tauri Gamma, n. రోహిణి నక్షత్రం; వృషభ రాశిలోని ప్రకాశవంతమైన చుక్కలలో మూడవది +* Tauri Pi, n. కృత్తిక నక్షత్రం వృషభ రాశిలో ఒక తార; +* tautology, n. అనులాపం; పునరుక్తి దోషం; అనవసరంగా ఒకే భావాన్ని ఒకే వాక్యంలో మరొకసారి చెప్పడం; ఉదా. చొక్కా ఇరుకుగా ఉండి పట్టడం లేదు; +* tawny, adj చామనచాయ; ధూసరవర్ణం గోధుమ రంగు; సింహం రంగు tan color; +excise tax, ph. ఒక ప్రత్యేకమైన జాబితా ఉన్న అంశాల మీద వేసే అమ్మకపు పన్ను; ఈ జాబితాలో సాధారణంగా అత్యవసరం కాని విలాస వస్తువులు ఉంటూ ఉంటాయి; ఉదా. నగలు, అత్తరులు, సిగరెట్లు, మద్య పానీయాలు, కార్లు, వగైరా; అబ్కారి పన్ను; వ్యాపారపు పన్ను వ్యాపారపు పన్ను; అబ్కారీ పన్ను +* taxi, n. కిరాయికారు; టేక్సీ; టేక్సీకేబ్ అన్న మాటని కత్తిరించగా వచ్చిన మాట; +* taxonomy, n. వర్గీకరణ; వర్గీకరణ శాస్త్రం; +* teach, v. t. నేర్పు; బోధించు; బోధన చేయు; బోధపరచు; ప్రబోధించు; +* teacher, n. గురువు; అఖ్యాత; బోధకుఁడు; m. పంతులు; ఉపాధ్యాయుఁడు; ఒజ్జ; అధ్యాపకుఁడు; ఆచార్యుఁడు దేశకుఁడు; అయ్యవారు; f. పంతులమ్మ; గుర్వి; ఉపాధ్యాయిని; ఒజ్జసాని; +* teak, n టేకు టేకు కర్ర; టేకు చెట్టు; +* teal, n. నీలపచ్చం; నీలహరితం; +* tear, n 1) కన్నీరు; అశ్రువు; అశ్రుజలం; బాష్పం; బాష్పజలం 2) చిరుగు; +tear gland, ph. అశ్రుగ్రంథి; కన్నీటి కంతి; +* teardrop, n. అశ్రుబిందువు; అశ్రుకణం; కన్నీటిబొట్టు; +* teargas, n. బాష్పవాయువు; కన్నీరువాయువు; +* tears, n. అశ్రువులు; అశ్రుబిందువులు; కన్నీటిబొట్లు; కన్నీళ్లు; కన్నీరు; బాష్పములు; +* tease, v. t 1) చిక్కులు విడదీయు 2) ఏడిపించు; ఉడికించు; ఆగడం చేయు +tease the hair, ph. చిక్కులు విడదీయడానికి చిక్కట్టతో జుత్తుని దువ్వడం; +* teaspoon, n. మిళ్లిగరిటె; చాచెంచా; చిన్నచెమ్చా; +* technical, adj. సాంకేతిక; తాంత్రి���; పారిభాషిక; +* technicality, n. నిమిత్తమాత్రపు లొసుగు; పారిభాషికత; +* technique, n. పద్ధతి; కిటుకు; సంవిధానం; శిల్పం; విద్యామర్మం; కళాత్మకమైన ప్రయోగ విధానం; +* technology, n. సాంకేతికం; సాంకేతికత; సాంకేతిక తంత్రం; సంవిధాన శాస్త్రం; +* tedious, adj. విసుగు పుట్టించే; బోరు కొట్టించే; ఎప్పటికీ తెమలని; +* teething troubles, ph idiom] బాలారిష్టాలు; వాచ్యర్థం చిన్నపిల్లలకి వచ్చే రోగాలే అయినప్పటికీ ఏ పని చెయ్యడానికైనా మెదట్లో ఎదురయే ఇబ్బందులని సూచించడానికి గౌణ్యర్థంతో వాడే మాట; +* teetotaler, n idiom] మద్యం ఎన్నడూ ముట్టని వ్యక్తి; మాదక పానీయాలు ముట్టని వాడు; మందు ముట్టని మందభాగ్యుడు; +* telepathy, n. దూరానుభూతి; దివ్యానుభూతి; ఇంద్రియముల ప్రమేయం లేకుండా రెండు మనస్సులకు మధ్య జరిగే వార్తా ప్రసరణ; +* telephone, n. దూరవాణి; దూరశ్రవణి; శ్రవణి; టెలిఫోను; +* telescope, n దుర్భిణి దూరదర్శని; ఓఁకుమర; చుక్కీ; టెలిస్కోప్; +* temp n. కైజీతగాఁడు తాత్కాలికంగా పనిచేసే వ్యక్తి; +* temper, n. పోఁపు; తాలింపు; తిరుగబోత; +* temper, v. t 1) పోఁపు పెట్టు 2) గట్టిపరుచు; మలుచు 3) మెత్తపరచు; ఇక్కడ ఒకే మాటకి రెండు వ్యతిరేక అర్థాలు గమనించునది; +* temperature, n. ఉష్ణోగ్రత; తాపమానం; తాపక్రమం; తాప తీక్షణాన్ని తెలిపే సంఖ్య; శీతోష్ణ పరిమాణం; శీతోగ్రత; +* temple, n.(1) గుడి; కోవెల; దేవాలయం; దేవళం; మందిరం 2) కణత; నుదిటికి ఇరువైపులా ఉండే శిరోభాగం; +* temporal, adj 1) కర్ణాస్థులకి సంబంధించిన 2) ఐహికమైన 3) కాలానికి సంబంధించిన; +* tempt, v. t. పురిగొలుపు; ఊరించు; ఆశపెట్టు; ఉసిగొలుపు; ప్రేరేపించు; +* tenant, n. నెలసరి; అద్దెకున్నవాఁడు; భూమి కౌలుకి తీసికొన్నవాఁడు; +* tendency, n. వాటం; ప్రవృత్తి; ఉన్ముఖత; పోబడి; జాడ; ధోరణి; ఆసక్తి; +tender age, ph. ఎలప్రాయము; చిరుతప్రాయము; +* tender, n. కొనుగోలుకి సిద్దంగా ఉన్నామని తెలియజేసే లాంఛన పత్రం; +* tender, v. t. ఇచ్చు; లాంఛనంగా ఇచ్చు; దఖలు పరచు; +* tendon, n. స్నాయువు; స్నాయుబంధనం; +* tenement, n. చిన్న చిన్న వాటాలుగా కట్టిన అద్దె కొంపలు; +* tenon, n కుసి; వడ్రంగంలో రెండు కర్రలని అతకడానికి ఒక కర్రకి ఉండే ముక్కు రెండవ కర్రకి ఉండే బెజ్జాన్ని కుసి బెజ్జం అంటారు; +* tension, n. బిగి; బిగితం; బిర్రు; జిగి; పట్టు; తన్యత; ఆతతి; ఉద్రిక్తత; +* tent, n. డేరా; గుడారం; పటకుటిరం; షామియానా; +* tentative, adj. ప్రస్తుతానికి ఉపయోగపడే విధంగా; +* tepid, adj. నులివెచ్చ; గోరువెచ్చ; కదుష్ణ; కోష్ణమైన; +* tera, pref. టెరా; ట్రిలియనుని సూచించడానికి వాడే పూర్వ ప్రత్యయం; +* term, n 1) పదం; మాట 2) నియత కాలం; కందాయం 3) విశ్వవిద్యాలయాల్లో అర్ధ సంవత్���రం 4) గణితంలో చలరాశి కాని చలరాశుల సముదాయం కాని; +first term, ph మొదటి కందాయం; మొదటి పదం; మొదటి అంశం +* terminal, n. కడ; కాడు; కొస; కొన; చివరకు; అంతు; అంతం అడంగు; అవధి; అవసాని; అవసానిక; గణి; శీర్షం; కోటి +* terminate, v. t. కడతేర్చు; కొసముట్టించు; అంతుచూడు; ఉపసంహరించు; చంపు; చాలించు; +* termination, n. ఉపసంహారం; ముగింపు; కడతేర్చడం; కొసముట్టించడం; అంతుచూడడం; పూర్తిచేయడం; +* terminator, n. ఉపసంహార రేఖ; ఒక గ్రహం మీద పగటికి, రాత్రికి మధ్య ఉండే ఊహాత్మక రేఖ; +* termite, n. చెదపురుగు; ఘణ; ఇవి చూడడానికి తెల్లటి చీమలలా ఉంటాయి కాని, ఇవి చీమలు కావు, బొద్దెంక జాతివి, చీమలకీ చెద పురుగులకీ మధ్య వైరం, చీమలు చెదపురుగులని తినేయ గలవు; +* terrace, n. డాబా; అలిందం; బోడిమిద్దె; గదులు లేని మీది అంతస్థు; +* terrible, adj. భీషణ; భీభత్సకరమైన; భయంకరమైన; తీవ్రమైన; దారుణమైన; ఉచ్ఛండ; ఉగ్ర +* terrific, adj. భయంకరమైన; తీవ్రమైన; అద్భుతమైన; +* territorial, adj. ప్రాదేశిక; నేలవీటు భూభాగానికి సంబంధించిన; దేశాధికారానికి సంబంధించిన; +* terse, adj. క్లుప్తమైన; సంక్షిప్త; +* test, v. t. పరీక్షించు; శోధించు; పరిశీలించు; +New testament, ph. మలి ఒప్పందం; క్రైస్తవుల నమ్మకం ప్రకారం మానవుడికి, దేవుడికీ మధ్య రెండవసారి జరిగిన ఒప్పందం; +Old testament, ph. తొలి ఒప్పందం; క్రైస్తవుల నమ్మకం ప్రకారం మానవుడికీ, దేవుడికీ మధ్య జరిగిన తొలి ఒప్పందం; +* testator, n. మరణశాసనం రాసి చనిపోయిన వ్యక్తి; +* testes, n. బీజాండాలు; వృషణాలు; వట్టలు; వట్టకాయలు; ముష్కగోణులు; +* testicle, n. వట్ట; వట్టకాయ; వట్రకాయ; బీజాండం; వృషణం; ముష్కం; కర్పూరం; +test tube baby, ph. కుంభ సంభవుడు; భౌతికంగా స్త్రీ పురుష సంయోగం లేకుండా ప్రయోగశాలలో పురుష బీజాన్ని స్త్రీ అండంలో ప్రవేశపెట్టి కొత్త జీవిని సృష్టించడం; +* tether, n. సందము; కట్టుతాడు; కన్నెతాడు; పగ్గం; +* tethered, n. సందానితము; తాడుతో కట్టబడ్డది; +* tetrahedron, n. చతుర్ముఖి; నలుమోమి; సమత్రిభుజాకారంలో నాలుగు ఫలకాలు (ముఖాలు) గల ఘన వస్తువు; +* text box, ph పాఠ పేటిక; కంప్యూటర్‍ తెర మీద అక్షరాలని రాయడానికి వీలుగా ఏర్పాటు చేసిన పెట్టె; +* textiles, n. నేతబట్టలు; నేతసరకులు; జవళి; +* texture, n. అల్లిక; వ్యూతి; నేత నేసిన పద్ధతి; కూర్పు; కూర్పరితనం; ఒక ఉపరితలం ఎలా ఉందో జ్ఞానేంద్రియాల స్పర్శకి కలిగే అనుభూతి; ఉ. ముతకగా ఉంది, మెత్తగా ఉంది, పిండిలా ఉంది, మొరుంలా ఉంది అంటూ ఆ ఉపరితలం కట్టడి ఎలా ఉందో వర్ణించడానికి వాడే మాట; +* thank v. t. కృతజ్ఞత తెలుపు; ధన్యవాదాలు చెప్పు; +* thanks, n ధన్యవాదాలు; మెప్పిదాలు; నెనర్లు; కృతజ్ఞతల��; +* thatched, adj. గడ్డితో నేయబడ్డ; గడ్డితో కప్పబడ్డ; పూరి; +* thaw, v. i. కరుగు; ద్రవించు; మంచుతో గడ్డకట్టుకుపోయిన వస్తువు ద్రవించు; +* theater, n 1) శాల; నాటకశాల ఆటపాక; హాలు 2) నాటకశాస్త్రం; +* theism, n. ఆస్తిక మతం; భగవంతుడనే సృష్టికర్త ఉన్నాడని, అతడు దయామయుడు, మన మంచిచెడ్డలని చూస్తూ మనని కనిపెట్టుకుని ఉంటాడనే నమ్మకం; +* theistic, adj. ఈశ్వరుడు ఉన్నాడనే నమ్మకంతో; సేశ్వర; +* then, adv. అప్పుడు; అంతట; అటు పిమ్మట; ఆ తర్వాత; అనవుడు; +* thence, adv. అక్కడనుండి; అప్పటినుండి; +* theocracy, n. మతవర్గాధిపత్యం; మతధర్మ స్వామ్యం; +* theology, n మతధర్మ శాస్త్రం; దేవుడికీ, మతానికీ, మనిషికీ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలని విచారించే శాస్త్రం; +* theorem, n. ప్రమేయం; నియమం; సిద్ధాంతం; రుజువు అయినది +* theorize, n. సిద్ధాంతీకరించు; సూత్రీకరించు; వాదించు; +* theory, n వాదం; ప్రతిపాదించబడ్డది +in theory, ph. సిద్ధాంతరీత్యా; శాస్త్ర ప్రకారం; +* theosophy, n. దివ్యజ్ఞానం; దైవసంబంధమైన జ్ఞానం; +* therapeutic, adj. జబ్బుని కుదిర్చే; చికిత్సకి సంబంధించిన; +* thereby, adv. తద్వారా; ఆ దారి వెంబడి; ఆ మూలాన్న; +* therefore, adv. కనుక; కాబట్టి; కావున; అందువల్ల; అందుచేత; తస్మాత్; +* thermals, n. తాపీయాలు; భూతాపీయాలు; తాపవనాలు; భూమి వేడిమికి భూమినుండి పైకెగసే వేడి గాలి ప్రవాహాలు; +* thermodynamics, n. ఉష్ణగతిశాస్త్రం; తాపగతిశాస్త్రం; ఉష్ణ చలనం; +* thermometer, n. తాపమాపకం; ఉష్ణమాపకం; తాపక్రమమాపి; ఉష్ణోగ్రతని కొలిచేది; +* thermosphere, n. ఉష్ణావరణం; ఇక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఈ పొర ఉష్ణోగ్రత 1,500°C వరకూ ఉండే అవకాశం ఉంది. ఈ పొరలో గాలి సాంద్రత తగ్గుతుంది ఈ పొరలోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పరిభ్రమిస్తుంటుంది; +* thermostat, n. తాపస్థాపకి; ఉష్ణోగ్రతని ఒక చోట స్థిరంగా నిలిపే ఉపకరణం; +* thesaurus, n. సంబంధి పదకోశం; పదార్థ భాండాగారం; +* thick, adj. దట్టమైన; మందమైన; చిక్కనైన; చిక్కని; అవిరల; +* thicket, n. గుబురు; తుప్ప; చిట్టడవి; చిన్న అడవి; +* thief, n. దొంగ; తస్కరుడు; పాటచ్ఛరుడు; తాయువు; అధశ్చరుడు; మ్రుచ్చు; హర్త అపహర్త; కేడీ; +* thigh, n. తొడ; పెందొడ; కురువు; ఊరువు; జంఘిక; ఊర్వి; అంకం; +thighbone, n. తొడ ఎముక; జంఘికాస్తి; ఊర్వికాస్తి; ఉరోస్తి; +* thin, adj. పలుచని; సన్నని; బక్కపలుచని; పేలవ; పీల +* think, v. i. ఆలోచించు; ఆలోచనచేయు; స్మరించు; తలపెట్టు; తలపోయు; యోచించు; భావించు; +* thinker, n. m. భావుకుడు; ఆలోచనాపరుడు; తలపోతరి; +* third, n. మూడవది; తృతీయం; తార్తీయం; +* thirst, n. దాహం; దప్పిక; దాహతి; పిపాస; తృష్ణ; ఉదన్యత; +* thirty, n. ముప్పయి; ముప్పదియవ; త్రింశత్; +* Thorium, n. దురం; ఒక రసాయన మూల���ం అణసంఖ్య 90, సంక్షిప్త నామం, Th +* thoroughbred, n. మేలుజాతి గుర్రం; రెండు వైపులా మంచి ప్రవర ఉన్న గుర్రం; +* thoroughly, adv. క్షుణ్ణంగా; పూర్తిగా; సంపూర్ణంగా; కూలంకషంగా; సమగ్రంగా; +* thought, n. చింత; ఆలోచన; తలపు; తలపోత; భావం; మనోభావం; చిత్తం; చిత్; స్పురణ; +* thrash, v. i. కొట్టుకొను; గిలగిలలాడు +* thread, n 1) దారం; సూత్రం; నూలిపోగు; తంతువు 2) కడ్డీ మీద సర్పిలాకారంలో కోయబడ్డ వెన్నుపట్టె; +* three, n 1) మూడు; తిగ; త్రి 2) ముగ్గురు; మువ్వురు; +* three-dimensional, adj. త్రిదిశాత్మక; త్రిమితీయ; త్రిపరిమాణిక +* thrice, n. మూడు సార్లు; ముమ్మారు; ముమ్మడి; +* thrift, n. పొదుపు; మితవ్యయం; పోడిమి; ఊజ్జితం; +* thrive, v. i వర్ధిల్లు; బాగుపడు; వృద్ధి చెందు; నమనమలాడు; +* thrombosis, n. రక్త నాళంలో రక్తపు కుదువ ఏర్పడుట +* throne, n. సింహాసనం; గద్దె; అధికార పీఠం; +* thrush, n. కస్తూరి పిట్ట; కస్తూరి పక్షి; +* thumb, n తమ్) బొటనవేలు; అంగుష్ఠం; చేతి బొటన వేలు; +thumbnail sketch, ph. చిన్నది; క్లుప్తంగా చెప్పబడ్డది; నఖచిత్రం అంగుష్ఠ చిత్రిక; కరరుహ చిత్రం; ఒక ఊహకి టూకీగా ఇచ్చిన రూపురేఖలు; +* thumbtack n. బొత్తాంనాటు; సుత్తి అవసరం లేకుండా బొటనవేలితో గోడకి గుచ్చగలిగే సదుపాయం ఉన్న మేకు; +* Thursday, n. గురువారం; లక్ష్మివారం; బృహస్పతి వారం; బేస్తవారము; బృహస్పతి వార బిహస్త వార బియస్తవార బేస్తవార బేస్తార; +* thus, adv. కావున; అని; ఇట్లు; ఈ తీరున; ఈవిధంగా; +* thyme, n. వాముపువ్వు ఉగ్రగంథం; వంటలలో వాడే ఒక సుగంధ ద్రవ్యం bot Thymus vulgaris; +* thyroid, n. కాకళగ్రంథి; అవటుగ్రంథి; గొంతుకలో ఉండే ఒక వినాళ గ్రంథి; +* tiara, n. లలాటపట్టం; చిన్న కిరీటం; కిరీటిక; +* tibia, n. జంఘాస్తి; అంతర్ జంఘాస్తి; తొడలో ఉండే ఒక ఎముక; +* ticket, n. టికెట్టు; కట్టిన డబ్బుకి రసీదు; చీటీ; +* tidal wave, ph. ఉప్పెన; సముద్రంలో ఆటు పోట్లు, తుపాను కలిసినప్పుడు సముదమట్టంలో ఉన్న తీర ప్రాంతాలు ములిగిపోవడం rel tsunami; +* tide, n. పోటు సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమి, సముద్రపు మట్టాల పెరుగుదల +neap tide, ph. అష్టమినాడు వచ్చే ఆటుపోట్లు; +spring tide, ph. నిండు పౌర్ణమికి, అమావాస్యకీ బాగా ఉధృతంగా వచ్చే ఆటుపోట్లు; +* tides, n. ఆటుపోట్లు; సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమి, సముద్రపు మట్టాల పెరుగుదల తరుగుదలలు; ఇవి భూమి మీద ప్రతి 24 గంటల 58 నిముషాలలో రెండుమార్లు వస్తాయి; +* tie up, v. t. అన్వయించు; ముడిపెట్టు; రెండింటికి మధ్య సంబంధాన్ని చూపు; +* tier టియర్) n 1) మెట్టు; ఆంచె; అంతస్థు; పావంచా; సోపానం 2) వరుసల శ్రేణి +* tiger, n. పెద్దపులి; బెబ్బులి; కోలుపులి; పులి; మువ్వన్నెమెకము; శార్దూలం; పుండరీకం; పంచనఖము; భయానకము; భేలకము; మృగశ్రేష్ఠము; వ్యాఘ్రము; +* tighten, v. t. బిగించు; ఉగ్గగట్టు; ముద్రించు; +* tigon, n. పుహం; మగ పులికి, ఆడ సింహానికి పుట్టిన కంచర జంతువు; see also liger; +Mangalore tile, ph. బంగాళా పెంకు మంగుళూరు పెంకు అనడానికి బదులు బంగాళా పెంకు అన్నారు) +* till, n. సొమ్ము సొరుగు; గల్లాపెట్టి సొరుగు; గల్లాపెట్టి; +* tillable, n. నావ్యం; దున్నడానికి వీలైనది; +* timbre, n టేంబర్) ధ్వనిగుణం; నాదగుణం; సంగీత వాద్యవిశేషం పుట్టించే తరంగాలు చెవికి తగినలినప్పుడు మన అనుభూతిలో కలిగే వైవిధ్యత; తరచుదనం, బిగ్గతనం ఒకేలా ఉన్నా చెవికి వినబడినప్పుడు ధ్వనిలో తేడా; +* time, n 1) కాలం; వేళ; సమయం; గంట; పొద్దు; సేపు 2) తీరిక; వ్యవధి; సేపు; అదను 3) మారు; మాటు; తపవ; తూరి; తడవ; సారి; చుట్టు; పాలి; విడత; దఫా; పర్యాయం; +one time, ph. ఒక మారు; ఒక పరి; ఒక సారి; ఒక తేప; ఒక తూరి; ఒక తడవ; ఒక విడుత; +time stamp, ph కాల ముద్ర; వేళ ముద్ర; ఒక పని ఎప్పుడు మొదలయిందో ఎప్పుడు పూర్తయిందో సూచించడానికి వేసే ముద్ర +* timely, adj. కాలోచిత; సమయోచిత; సందర్భానికి అనుకూలమైన; +* times, adj. సార్లు; మార్లు; చుట్లు; తడవలు; తూర్లు; ఆవర్తులు; +many times, ph. చాలాసార్లు; చాలా తడవలు; చాలా చుట్లు; పలుమారులు; చాలా పర్యాయములు; +two times, ph. రెండు ఆవర్తులు; రెండుసార్లు; రెండు తూర్లు; +* timidity, n. పిరికితనం; భీరుత; భీరుత్వం; బేలతనం; +* tin, n 1) కళాయి 2) డబ్బా; కళాయి పూసిన ఇనుప రేకుతో చేసిన డబ్బా; +* tin-can, n. డబ్బా; కళాయి పూసిన ఇనుప రేకుతో చేసిన డబ్బా; +* tincture, n. ద్రావణం; ఒలంతం (ఆల్కహాలు)తో కలిపిన మందు; అరఖు; +* tinsel, n. కాకి బంగారం; ముచ్చె బంగారం; +* tintinnabulation, n గంటారావం; టింగు మనే చప్పుడు; గంట చేసే ధ్వని +* tiny, adj. బుల్లి; ఆణక; బుచ్చి; చిరుతుక; +* tion, n టియాన్) పుహం; మగపులికి ఆడసింహానికి పుట్టిన కంచర జంతువు, ఈ జాతులు(పుహాలు) పునరుత్పత్తి చేయలేవు, ఇవి సంతానహీన జాతులు; రెండు మాటలని జత చేసి కొత్త మాట సృజించటాన్ని “పోర్ట్ మాంటో“ (Portmanteau) అంటారు. ఇంగ్లీషులో ఇలాంటి పదాలు ఇంకా స్మాగ్ (smog SMoke+Fog బ్రంచ్(Brunch Breakfast+Lunch see also liger; +* tip, n 1) మొన; కొన; కొడి; ముల్లు; అగ్రం 2) బక్షిస్; ఈనాం; +* tirade, n. దూషణ పరంపర; దుష్ర్పచారం; +* tire, v. i. అలసిపోవు; డస్సిపోవు; డీలాపడు; +* tireless, adj. అలుపుఎరుగని; నిర్విరామమైన; +* tissue, n. కణజాలం; కణతండము; కణసంహతి; కణరాశి; కులాయం; ధాతువు; పేసీజాలం; అంగాంశం +* tits, n. pl. ౘన్నులు; సళ్లు; ఉరోజాలు; స్తనాలు; వక్షోజాలు +* titles, n 1) బిరుదులు 2) పేర్లు 3) సినిమాలలో చూపించే నటీనటుల పేర్లు, సాంకేతిక నిపుణుల పేర్లు; +* titter, v. i ఇకిలించు; భయంతో ���ూడిన భావంతో నవ్వు; +* titular, adj. నామకః; నామకార్థం; నామమాత్రపు; పేరుకి మాత్రం; నామ్‌కే వాస్తే; +* toad, n. గోదురుకప్ప; కప్ప రూపంలో ఉండే ఒక భూచరం; +big toe, ph. కాలి బొటనవేలు; అంగుష్ఠం; +toe rings, ph. pl. మట్టెలు; చిట్టిబొద్దులు; స్త్రీలు ధరించే ఆభరణాలు; +* toil, v. i. ప్రయాసపడు; శ్రమపడు; శ్రమించు; పాటుపటు; కష్టపడు; +* toilet, n 1) సైరంధ్రి; అలంకరణకి ఉపయోగించే గది 2) మరుగు గది; మరుగు గదిలో మలమూత్రాదుల విసర్జనకు వాడే గది లేక ఉపకరణం; +* toiletries, n. pl ధావన సామగ్రి; పళ్లు, ఒళ్లు తోముకోడానికి కావలసిన పళ్లపొడి, సబ్బు, వగైరా +* tofu, n. టోఫూ; సోయాపాల జున్ను; సోయా చిక్కుడు పాల నుండి తీసిన పెరుగు వంటి పదార్ధాలతో చేసిన జున్ను వంటి పదార్థం; +* token, n. అడియాలం; గురుతు; చిహ్నం; ఆనవాలు; సైగ; కందువ +* tolerance, n. సహనం; సహనశక్తి; ఓర్మి; ఓర్పు; నిభాయింపు; తాళుకం; సహిష్ణుత; క్షమ; +* tolerate, v. t. తాళుకొను; తట్టుకొను; సహించు; భరించు; ఓర్చుకొను; నిభాయించు; +* toll booth, n. చవుకీ; సుంకరి మెట్టు; ఆసీల మెట్ట; ఆసీల చౌకు; రహదారిలో పన్నులు వసూలు చేసే స్థలం; +* tomatillo, n టొమేటిల్లో; జాంబెరీ పండు bot Physalis ixocarpa ఇక్సోకార్పా అంటే జిగురుగా ఉన్న పండు అని అర్థం; +* tome, n. పెద్ద పుస్తకం; ఉద్గ్రంథం; దస్తరం; +* ton, n. టన్ను; బరువుని తూచే కొలత; +long ton, ph. పెద్దటన్ను; 2,240 పౌనులు; ఇంగ్లండులోను, తదితర కామన్వెల్తు దేశాలలోను వాడుకలోనున్న కొలమానం; +short ton, ph. చిన్నటన్ను; 2,000 పౌనులు; అమెరికాలోను, కెనడాలోను వాడుకలోవున్న కొలమానం; +* tone, n 1) స్వరం; ఒక శబ్ద తరంగం ప్రకంపించే పౌనఃపున్యం 2) శరీరావయవాలకి, కండరాలకి ఉండే బిగి; +* tongs, n. స్రావణం; చిమటా; నిరుకారు rel పటుకారు; +* tonsils, n. గవదలు; నోటిలో కొండనాలుకకి ఇరుపక్కలా ఉండే కణజాలం; +* tonsure, n. గుండు చెయ్యడం; గుండు కొట్టించడం; శిరోముండనం; వపనం +* tool, n. పనిముట్టు; సాధనం; కరణం; ఉపకరణం; పరికరం; +* toot, n 1) బూరా 2) కూత; గుడ్లగూబ అరుపు; ఘాత్కారం; +* toothbrush, n. దంతమార్జని; దంతకాష్టం; పళ్ళు తోముకునే కుంచె; +* toothpick, n. దంతకాష్టం; పళ్లు కుట్టుకునే పుల్ల; +* top, n. బొంగరం; బ్రమరకం; విఘూర్ణి; +* topaz, n. గోమేధికం; పుష్యరాగం; పీతస్పటికం; +* topic, n. అంశం; చర్చనీయాంశం; సంగతి; విషయం; +* topography, n. నైసర్గిక స్వరూపం; స్థలాకృతి; +* topper, n. అగ్రగణ్యుడు; అగ్రగామి; అగ్రేసరుడు; అగ్రణి; చిటారి; +* torch, n. దివ్వె; దివిటీ; కాగడా; దీపం; ఇలాయి; +* torch, v. t. అంటించు; ముట్టించు; నిప్పుపెట్టు; +* torment, v. t. ఆరడిపెట్టు; హింసించు; యాతనపెట్టు; +* tornado, n. సుడిగాలి; చక్రవాతం; నిర్ఘాతం; ఉత్పాత పవనం; పెనుగాలి +* tortoise, n టార్డస్) తాఁబేలు; కూర్మం; కచ్చపం; కమఠం నేల తాబేలు; +* toss, v. i. అల్లాడు; అల్లల్లాడు; దొర్లు; +* tot, n. m. కుర్రాడు; పిల్లాడు; డింభకుడు; +* totally, adv. పూర్తిగా; పరిపూర్ణంగా; ఆసాంతంగా; అచ్చంగా; బొత్తిగా; సుతరామూ; వడసారంగా; +* toucan, n శరారి; ఆడేలు; దక్షిణామెరికా అడవులలో ఉండే ఒక పెద్దముక్కు గల పక్షి +* touch, v. t. తగులు; తాకు; సోకు; అంటుకొను; ముట్టుకొను; స్పర్శించు; స్పృశించు; +* touch, n. స్పర్శ; అభిమర్శం; అభిమర్శనం +* touch-me-not, n 1) సోకుడుముడుగు; అత్తిప్రత్తి; ఏటేటా పాతే రంగురంగుల పువ్వుల పూసే ఒక రకం మొక్క 2 idiom] నన్ను ముట్టుకోకు నా మాల కాకి; +* touchstone, n 1) స్పర్శవేధి; పరసువేది; నీచలోహాలను బంగారంగా మార్చగల దివ్యశక్తి ఉన్న ఒక రాయి 2) ఒరగల్లు; గీటురాయి; బంగారం వన్నె చూడటానికి వాడే గీకుడు రాయి; +* tough, adj. దిట్టమైన; దృఢమైన; బిరుసైన; +* toughness, n. దిట్టతనం; దృఢత్వం; బిరుసుతనం; +* toupee, n టూపే మగవారి బట్ట తలని కప్పిపుచ్చే "విగ్గు +* towel, n. తువ్వాలు; తుండు; తుండుగుడ్డ; తుండు రుమాలు; +* tower, n. శిఖరం; గోపురం; బురుజు; సిగము; +* town, n. పట్టణం; పట్నం; నగరం; పురం; ద్రంగం; పెద్ద ఊరు; బస్తీ; +* trace, n 1) పత్తా; అయిపు; ఐపు; ఆచూకీ; జాడ; ఆరా; అడా, పొడా; అజా, పతా; పొలకువ 2) లేశం; +without a trace, ph. పత్తాలేకుండా; అయిపు లేకుండా; అడా, పొడా లేకుండా; అజా, పతా లేకుండా; +* trachea, n. శ్వాసనాళం; గాలిగొట్టం; ఊపిరితిత్తులకి గాలిని తీసుకెళ్ళే గొట్టం; +* trachea, n. శ్వాసనాళం; గాలిగొట్టం; ఊపిరితిత్తులకి గాలిని తీసుకేళ్లే గొట్టం; +* trade, n. వ్యాపారం; వాణిజ్యం; బేహారం; +* trade, v. t. వ్యాపారం చేయు; ఇచ్చిపుచ్చుకొను; చేతులు మార్చు; +trade winds, ph. వ్యాపార పవనాలు; రుతుపవనాలు; +* trader, n. వ్యాపారి; వ్యాపారస్తుడు; సార్థవాహుడు +* tradition, n. ఆచారం; సంప్రదాయం; ఆనవాయితీ; రివాజు; +* traffic, n. సంచారం; రాకపోకలు; యాతాయాతాలు; క్రయవిక్రయాలు; +* traffic jam, ph. ప్రతిష్టంబించిన సంచారం; వాహన సంచార ప్రతిష్టంభనం; +* trafficking, n దొంగ రవాణా; మాదక ద్రవ్యాల దొంగ రవాణా +* tragedy, n 1) విషాద పూరితం; దుఃఖపూరితం 2) విషాదాంతం; దురంతం; +* train, n 1) రైలుబండి 2) జూటం; వెనక వేలాడేది 3) పరంపర; పుంఖానుపుఖం; గొలుసుకట్టుగా అమర్చబడినవి 4) పక్షి తోక; పురి; +* traitor, n. దేశద్రోహి; ద్రోహి; కావైరి; కాపురుషుడు; +* tragedy, n. విషాద సంఘటన; దుస్సంఘటన; విషాద రచన; విషాద వార్త; +* trance, n వివశత; వివశత్వం; సమాధిస్థితి లాంటిది; పూనకం; +* trans fat, ph. అనుప్రస్థ కొవ్వు; ఒక రకం కొవ్వు పదార్థం; ఈ రకం కొవ్వులలో జంట బంధం ఉన్న కర్బనపు అణువులకి ఇటూ అటూ గొలుసు పెరగటం వల్ల �� గొలుసు తిన్నగా ఉంటుంది; ఈ రకం జంట బంధాలు ఉన్న కొవ్వులు తినటం గుండె ఆరోగ్యానికి మంచిది కాదు; +* transaction, n. బేరం; లావాదేవీ; ఇచ్చిపుచ్చుకొనడం; ఇచ్చిపుచ్చుకోలు; బేరసారాలు; వ్యవహారం; వాణిజ్యం; వినిమయం; +* transcendental, adj 1) బీజాతీత 2) అత్యుత్తమ; ఉత్తమోత్తమ; లోకోత్తర 3) తారక; అనుభవాతీత; +* transgender, n. హిజ్రా; వీరు పుట్టుకతో మగ (ఆడ) వారిగా ఉన్న కూడా వీరికి ఆడ (మగ) వారికున్న లక్షణాలు వారి ప్రవర్తన ఆలోచనలు ఆడవారి (మగవారి) లాగా ఉంటాయి; +* transgression, n. తప్పు; పాపం; అపరాధం; వ్యతిక్రమం; అతిక్రమణం; ఉల్లంఘనం; అతిచారం; +* transient, adj. తాత్కాలిక; క్షణిక; క్షణభంగుర; అనిత్య; భంగుర; దంధన; తైంతిక; క్షర; అధ్రువ; +* transient, n. తాత్కాలికం; దంధనం; భంగురం; అనిత్యం; క్షణికం; క్షణభంగురం; తైంతికం; నశ్వరం; +* transit, n 1) పోక ప్రయాణం 2) ప్రయాణ సాధనం 3) దాటు; దాటడం; అంతర్యానం +rapid transit, ph. జోరుపోక; ఊరులోని రద్దీని దాటుకు పోవడానికి రైలుబండి వంటి సదుపాయం; +transit of a planet across Sun's disk, ph. గ్రహం సూర్యబింబాన్ని దాటడం గ్రహ అంతర్యానం; బుధుడు, శుక్రుడు భూమి కంటే సూర్యునికి దగ్గరగా వుండే కక్ష్యలలో తిరుగుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడూ ఇవి కూడా భూమి సూర్యుల మధ్యకు వచ్చే అవకాశాలు వున్నాయి. అయితే, ఈ గ్రహాలూ రెండూ భూమి నుండి చాలా ఎక్కువ దూరం వున్నాయి కాబట్టి అవి మనకు కనిపించే పరిమాణం చాలా చిన్నది. అందుకే అవి మధ్యలోకి వచ్చినా సూర్యుడిని పూర్తిగా కప్పివేయలేవు. అవి సూర్యుడి మీదుగా ప్రయాణిస్తున్న చిన్న చుక్కలాగ మాత్రమే కనిపిస్తాయి. అలా బుధుడు గాని శుక్రుడు గాని సూర్యుని మీదుగా చేసే ప్రయాణాన్ని eclipse అనరు; transit అంటారు; +* transition, adj. సంక్రమణ; సంధి; స్థిత్యంతర; అవస్థాంతర; +* translate into Telugu, ph. ఆంధ్రీకరించు; తెలిగించు; తెలుగులోకి మార్చు; +* translation, n 1) తర్జుమా; భాషాంతరీకరణం; అనువాదం 2) జరుపుట; +* translator, n. అనువాదకుడు; అనువాదకి; అనువాదకం; దుబాషీ; దుబాసీ; తొపాసి; ఒక భాషని మరొక భాషలోనికి మార్చే వ్యక్తి లేక పరికరము లేక అనువర్తనం; see also interpreter; +* transliteration, n. లిప్యంతరీకరణం; ప్రతిలేఖనం; ఒక భాషని మరొక భాషయొక్క లిపిలో రాయడం; +* translucent, adj. మసకైన; మసక; మునిమసక; పాల; పారభాసక; పాక్షికపారదర్శక; వెలుగు వెళుతుంది కాని అవతలి వాళ్లు కనబడరు; +* transmission, n. ప్రేషణం; ప్రేషితం ప్రసారం; ఒక మాధ్యమం గుండా పంపించడం, ప్రసారం చెయ్యడం, లేదా సరఫరా చెయ్యడం; +transmission line ph. ప్రేషణ తంతువు; పంపించడానికి మాధ్యమంగా వాడిన తీగలు; +* transmit, v. t. పంపించు; ప్రేషించు; ప్రసరించు; +* transmitter, n. పంపేది; ప్రేషకి; ప్రసారిణి; ప్రేషకుడు; +* transparent, n. పారదర్శకం; అడ్డుగా వెలుగుని పోనిచ్చేది; తన గుండా వెలుగుని ప్రసరించనిచ్చేది; +* transparency, n 1) పారదర్శకత; తన గుండా వెలుగుని పోనిచ్చే గుణం 2) పారదర్శక పత్రం; తన గుండా వెలుగుని పోనిచ్చే గుణం కల కాగితం లాంటి పత్రం; +* transpiration, n. చెమర్చడం; ఆకులు చెమర్చడం; పత్రశ్వేదనం; ఉత్‌స్వేదనం; తన గుండా చెమ్మని పోనిచ్చే పద్ధతి; చెట్లయొక్క ఆకుల గుండా చెమ్మ బయటకి వెలిగక్కబడే ప్రక్రియ; +* transplantation, n 1) ఊడుపు; తిరగనాటడం; వరి నారుని తిరిగి నాటడం 2) ఒకరి శరీర అవయవాలని మరొకరి శరీరంలో పొదగడం; +* transportation, n. యానం; రవాణా పద్ధతి; ప్రజలని కాని, సరుకులని కాని, ఒక చోటు నుండి మరొక చోటుకి రవాణా చేసే పద్ధతి; +* transpose, n. తారుమారు; పరావర్త్యం; ఇటునుండి అటు మార్పిడి; +* transverse, adj. తిర్యక్; అడ్డు; పేక పడుగు పేకలో వలె అనుప్రస్థ +* trap, v. i. బోనులోపడు; ఇరుకుకొను; చిక్కుకొను; వలలోపడు; +* trap, v. t. బోనులో పట్టుకొను; వలలో పట్టుకొను; +* trapezium, n. విషమ చతుర్భుజం; ఏ రెండు భుజములూ కూడ సమాంతరంగా లేని చతుర్భుజం; +* trapezoid, n. అర్థసమాంతర చతుర్భుజం; ఏవో రెండు భుజములు సమాంతరంగా ఉన్న చతుర్భుజం; +* travails, n. pl 1) సమస్యలు; ఇబ్బందులు 2) నొప్పులు; ప్రసవ వేదన; +* traveler, n. m. ప్రయాణీకుడు; బాటసారి; తెరువరి; పాంథుడు; +* traveling, adj. సంచార; ఆధ్వనీన; ప్రయాణీకులకి సంబంధించిన; +* trawler, n. చేపలు పట్టడానికి ప్రత్యేకంగా అమర్చబడ్డ పడవ; +* tread, v. t. తొక్కు; మట్టు; కాలితో తొక్కు; +* tread, n. తొక్కు; మట్టు; రబ్బరు చక్రాలు భూమిని కరిచిపెట్టుకు ఉండడానికి వీలుగా వేసిన మట్టు; +* treasurer, n. కోశాధికారి; ఆయతికాడు; పోతేదార్; +* treasury, n. బొక్కసం; కోశం; ఖజానా; భండారం; భాండాగారం; ధనాగారం; ఉగ్రాణం; +* treatment, n 1) చికిత్స 2) చూపు; ఉపచారం; పరిపోషణ; అభిచర్య; +* tree, n. చెట్టు; వృక్షం; ద్రుమం; తరువు; దరువు; అగం; నీవం; మహీరుహం; భూరుహం; సాలం; విటపం; మ్రాను; మ్రాకు; +avenue tree, ph. రహదారి చెట్టు; రహదారులకి ఇరుపక్కలా ఉండే చెట్టు; +deciduous tree, ph. పతయాళువు; ఆకులు రాల్చే స్వభావం గల చెట్టు; +evergreen tree, ph. సతతహరితం; ఎల్లప్పుడు ఆకులు పచ్చగా ఉండే చెట్టు; +* trefoil, n. త్రైపత్రిణి; మువ్వాకి; మూడు ఆకులు తమతమ కాడల వద్ద కలిసి ఒక వలయాకారంలోనున్న గుర్తు; +* trellis, n. పాకిడ; పందిరి; పాదు పాకడానికి వీలుగా అమర్చిన చట్రం +* trend, n. పంథా; పథం; బాణి; ధోరణి; వరస; పోకడ; రీతి; +trend setter, ph. పథనిర్దేశకుడు; వైతాళికుడు +* trial, n 1) న్యాయవిచారణ; విచారణ 2) యత్నం; ప్రయత్నం; +trial and error method, ph. నేతి నేతి పద్ధతి; నేతి నేతి మార్గం; ప్రయత్న వైఫల్య పద్ధతి; అవక్షేప పద్ధతి +* triangle, n. త్రిభుజం; ముయ్యంచు; త్రికోణి; ముక్కోణి; +equilateral triangle, ph. సమబాహు త్రిభుజం; సమకోణ త్రిభుజం; సమ త్రిభుజం; త్రస్రం; +scalene triangle, ph. విషమబాహు త్రిభుజం; అసమభుజ త్రిభుజం; +* triangular, adj. త్రిభుజాకారపు; ముక్కోణాకారపు; +* tribunal, n. త్రిమూర్తి న్యాయస్థానం; +* tribute, n 1) కప్పం; ఉపప్రదానం; పెద్దలకి సంప్రదాయానుసారంగా ఇచ్చే బహుమానం; లంచం 2) పొగడ్త; ప్రశంస; +* trickle, v. i. కారు; స్రవించు; బొట్టుబొట్టుగా కారు; +* trickster, n. టక్కరి; నమ్మరానివాడు; మాయావి; జిత్తులమారి; టక్కులమారి; దందనకాడు; దందనకత్తె; +* triennial, adj. త్రైవార్షిక; తిస్సాలా; మూడేళ్లకి ఒకసారి +* trifle, n. కల్యవర్తం; ఒక రకమైన తీపి తినుబండారం; +* trifling, adj. పేలవంగానున్న; చాలా కొంచెం; ఇసుమంత; ఈషత్తు; తృణప్రాయం; +* trigonometry, n. త్రిగుణమాత్రకం; త్రికోణమితి; త్రిభుజ శాస్త్రం; త్రికోణ గణితం; +* trillion, n. ట్రిలియను; ఖర్వం; ఒకటి తర్వాత పన్నెండు సున్నలు; +* trim, v. t 1) కత్తిరించు; కురచ చేయు; త్రుంచు; తగ్గించు; పత్రించు 2) అలంకరించు +* trimer, n. త్రిభాగి; త్రితయాణువు +* trimester, n 1) ఒక కాల పరిమితిలో మూడవ భాగం 2) తొమ్మిది నెలలలో మూడవ భాగం; గర్భిణి ఎన్నవ నెలలో ఉన్నదో చెప్పడానికి వాడతారు 3) కందాయం; జ్యోతిషంలో సంవత్సరంలో మూడవ భాగం; నాలుగు నెలలు; +* trimester n. కందాయం; సంవత్సరంలో మూడవ వంతు; +* triode, n. త్రయోడు; మూడు ముఖ్య భాగాలు ఉన్న శూన్య నాళిక; ట్రాన్సిస్టర్లు వాడుకలోకి వచ్చిన తర్వాత వీటి వాడకం తగ్గిపోయింది కాని, అంతకు పూర్వం ఇవి ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తప్పనిసరి అయిన భాగాలుగా ఉండేవి; +* trip, n. చిన్న ప్రయాణం; ప్రయాణం; పర్యటనం; +* trip, v. i. పడు; కాలితో దేన్నయినా తన్నుకుని పడు; +* tripod, n. త్రిపాది; ముక్కాలిపీట; టీపాయి; తీపాయి; +* troika, n. ముగ్గురి ముఠా; ముగ్గురి గుంపు; త్రిష్టయం +* troll, n 1) పిల్లల కథలలో వచ్చే పొట్టిగా, కురూపిగా ఉండే ఒక పాత్ర 2) అంతర్జాలంలో జరిగే "సంభాషణలలో" మధ్యలో తలదూర్చి, అసందర్భపు వ్యాఖ్యలు చేసి దీశని మార్చడానికి ప్రయత్నించే వ్యక్తి; పానకంలో పుడక; పుల్లారిబుడ్డి; +trophic web ph పోషక వలయం; పోషక జాలం; జీవనాధార జాలం; ఆధారజాలం; ఏ జంతువుకి ఏది ఆహారమో తెలియజేసే వలయాకారపు బొమ్మ +* troposphere, n. చైతన్యావరణం; సామీప్యావరణం; భూ ఉపరితలం పైన 7 నుంచి 17 కి మీ వరకు విస్తరించి ఉంటుంది. దీని కింది భాగం వేడిగా ఉండి ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది; +* trouble, n. ఇబ్బ���ది; శ్రమ; యాతన; గొడవ; కిరికిరి; ఉపహతి; +* troubles, n. pl. ఇబ్బందులు; యాతనలు; తిప్పలు; పుర్రాకులు; అగచాట్లు; కడగండ్లు; అరిష్టాలు; +* trough, n ట్రఫ్‍ 1) గోలెం; తొట్టె; గాడి 2) గర్తం; ఉద్ది 3) ద్రోణి; తరంగం దిగువ భాగం; అల్పపీడన ప్రాంతం; +* truant, n. బడి ఎగ్గొట్టిన విద్యార్థి; +* truism, n నిర్వివాదమైన నిజం; సర్వసాధారణమైన సత్యం; +* trumps, v. t. పేకాటలో తురఫు పెట్టి కోయు; +* trunk, n 1) పెట్టె 2) మొండెం 3) మాను; మోడు; స్థాణువు; స్కంధము 4) తొండము; కరము; +* truss, n 1) పటకా; ఇంటికప్పుకి ఆధారంగా దూలాలతో కట్టే పటకా 2) ఆంత్రనిరోధక పటకా; శరీరాంగాలు జారిపోకుండా వైద్యుడు వేసే పటకా; +* trust, n 1) నమ్మకం; విశ్వాసం; పూచీ; నమ్మిక 2) విశ్వాస నిక్షేపం; విక్షేపం; ధర్మనిక్షేపం 3) బ్యాంకు; +* trustee, n. ధర్మకర్త; ధర్మవ్యవహర్త; +* truth, n. నిజం; సత్యం; నిక్కం; నిబద్ధం; రుతం; యథార్థం; యథాతథం; వాస్తవం; నిలవరం; సమీచీనం +truth table, ph. రుత పట్టీ; నిజంపట్టీ; నేటుపట్టీ; సత్యపీఠం; +* try, v. i ప్రయత్నించు; ఉంకించు ఉద్యోగించు; తివురు +* tryst, n ట్రిస్ట్) ముఖాముఖీ; +* tube, n. గొట్టం; నాళం; నాళిక; సానిక; క్రోవి; గ్రోవి; +* Tuesday, n. మంగళవారం; భౌమ్యవారం; భౌమవాసరం; +* tundra, n. నీహారమండలం; శీతలమండలం; టండ్రా; ఆర్కిటిక్ చక్రం ప్రాంతాలలో వుండే చెట్లులేని విశాలమైన చెమ్మ మైదానాలు; see also savanna; prairie; +* tune, n. వరస; పాట పాడే వరస; ఒకదాని తరువాత మరొక స్వరం వరసగా రావడం; భారతీయ శాస్త్రీయ సంగీతంలో పాట పాడినప్పుడు ఏదో ఒక వరస ఎంచుకుని పాడతారు ఉదా. కేవలం అన్నం తిన్నట్లు లేదా కేవలం చపాతీ తిన్నట్లు; పాశ్చాత్య సంప్రదాయంలో అనేక వరసలు కలిసి వినిపిస్తాయి; అనంలో ముక్కల పులుసు కలుపుకుని తిన్నట్లు;) +* turbulence, n 1) ఉరవడి; సమీరితం; అనిశ్చలం 2) వాతావరణంలో అనిశ్చలత 3) సంక్షోభం; +turbulent flow, ph. అనిశ్చల ప్రవాహం; గజిబిజి ప్రవాహం; ఉరవడి ప్రవాహం; +* turgid, adj 1) వాచిన; బలిసిన 2) అనవసరమైన ఉత్ప్రేక్షలతో కూడిన; +* turkey, n 1) టర్కీ; కోడి లాంటి పక్షి 2 idiom] అసమర్ధుడు; చేతకానివాడు; +* turn, n 1) మలుపు; క్రాంతి 2) పర్యాయం; సారి; చుట్టు; ఆవర్తి 3) వంతు; +* turn, v. t 1) తిప్పు; మళ్లించు; మరలించు 2) మార్పు; మార్పు చేయు 3) చుట్టు; చుట్టబెట్టు; +turning point, ph. మలుపు తిరిగే స్థానం; విశ్రమ స్థానం; క్రాంతి బిందువు; పరివర్తన స్థానం +* turtle, n నీటి తాబేలు; ఇది సాధారణంగా నీటిలో నివసిస్తుంది; నేల తాబేలుకీ, దీనికి కొన్ని పోలికలు కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి; +* tutor, n శిక్షకుడు; శిక్షకురాలు; బోధకుడు, బోధకురాలు; +* twice, n 1) రెండు సార్లు 2) రెండింతలు; రెట్టింపు; +* Twill, n. గెంటెం; జంటనేత బట్ట; రెండు పేటల దారంతో నేసిన గుడ్డ యొక్క వ్యాపార నామం; +* twig, n. రెమ్మ; పరిగె; ఉపశాఖ; కొమ్మ రెండుగా చీలడం వల్ల వచ్చిన ఉపశాఖ; +evening twilight, ph. మలి సంధ్య; మునిమాపు; మునిచీకటి ప్రదోష కాలం; +* twine, n. జమిలిదారం; రెండు పేటలు వేసి పేనిన దారం; +identical twins, ph. సారూప్య కవలలు; ఏక రూప కవలలు; ఏక సంయుక్త బీజ కవలలు; ఇందులో ఒక అండం ఒక శుక్ర కణం ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. అయితే ఏర్పడిన తర్వాత విభజన జరిగి రెండు లేదా మూడు అండాలు ఏర్పడ వచ్చు. ఇలా విభజనకు ముందే దాని లింగ నిర్ధారణ జరిగి ఉంటుంది గనక, వీరు ఒకే పోలిక ఉన్న, ఒకే లింగానికి చెందిన కవలలు. వీరి జన్యువుల్లో చాలా సామ్యం ఉంటుంది. అందుకే ఎవరు ఎవరో గుర్తు పట్టలేనంత పోలికలు ఉంటాయి; +fraternal twins, ph. భ్రాతృ కవలలు; సోదర కవలలు; ద్వి సంయుక్త బీజ కవలలు; ఇక్కడ రెండు లేదా ఎక్కువ అండాలు +రెండు లేదా ఎక్కువ శుక్ర కణాలు రెండు అంతకన్నా ఎక్కువ సంయుక్త బీజాలు; +* twitch, v. i. కండరాలలో వచ్చే చిరు స్పందన; +* two, n 1) రెండు; ఇరు; ఈరు; జమిలి; ద్వ; ద్వయం; ద్వయి; దో 2) ఇద్దరు; +* tycoon, n. వ్యాపార రంగాన్ని ఎక్కువగా ప్రభావితం చెయ్యగల వ్యాపారస్తుడు see also mogul; +* typhoid, n. సన్నిపాత జ్వరం; టైఫాయిడ్; +* typhoon, n. ప్రచండ తుఫాను; ప్రచండ వాయువు; చైనాలో వచ్చే గాలివాన పేరు; ఇండియాలో వచ్చే గాలివానని సైక్లోను అనీ, అమెరికాలొ వచ్చే దానిని హరికేను అనీ అనడం ఆచారం; +* typo, n. టైపాటు; టైపు చేసేటప్పుడు దొర్లిన పొరపాటు; +* ubiquitous, adj. సర్వాంతర్యామి అయిన; సర్వవ్యాప్తమయిన; అన్నిచోట్లా ఉన్న; బాగా వాడుకలో ఉన్న; విభుత్వ; +* ugliness, n. అందవికారం; అనాకారిత్వం; +* ulcer, n. గుల్మం; వ్రణం; పుండు; కొరుకుపుండు; +* ultimate, adj. చిట్టచివరి; కడపటి; చరమ; కొస; ఆఖరు; తుది; అంతిమ; పరిపూర్ణ; కేవల; +* ultimatum, n. తుది హెచ్చరిక; మాట; ఆఖరి మాట; కడపటి కబురు; ఉల్లాకి; అంత్య సందేశం; +* ultramarine, adj. అతినీల; చిక్కటి నీలిరంగు ety సముద్రాంతరాలనుండి (ఆఫ్గనిస్థాన్ నుండి) వచ్చిన నీలిరంగు; +* ultrasound, n 1) అతిధ్వని; ధ్వని తరంగాల కంటే వేగంగా కంపించే తరంగాలు 2) శబ్ద తరంగాలని ఉపయోగించి శరీరపు లోపలి భాగాలని చూసే పద్ధతి; +* ultraviolet, adj. అత్యూద; అతినీలలోహిత; ఊర్ధ్వనీలలోహిత; వర్ణమాలలో ఊదా రంగు కంటె ఎక్కువ పౌనఃపున్యముతో ప్రకంపించే కాంతి కిరణాలు; ఈ తరంగాల పొడుగు 10 400 నేనోమీటర్లు ఉంటాయి; +* umbilical, adj. బొడ్డుకి చెందిన; నాభికి సంబంధించిన; +* umbrage, n 1) నీడ; నీడనిచ్చే గుబురైన పెరుగుదల 2) కోపగించుకోవడం; చిరాకు పడడ��� resentment; +* umpire, n. మధ్యవర్తి; ఆటల పోటీలలో ఇరు పక్షములకి మధ్యవర్తి; అంపైరు; +* unaccented, adj. అనుదాత్త; అస్వరిత; తేలికగా పలికే; +* unambiguously, adv. నిర్ద్వందంగా; స్పష్టంగా; అసందిగ్ధంగా; ఎటో ఒక పక్కకి తేల్పి; +* unattainable, adj. అందరాని; అందుబాటులో లేని; అప్రాప్యమైన; +* unavoidable, adj. అనివార్య; అనివార్యమైన; అపరిహార్య; +* unbiased, adj. నిష్పాక్షికంగా; పక్షపాతం లేకుండా; +* uncertainty, n. విచికిత్స; సంశయం; అశంక; అనిశ్చితత్వం; వికల్పం; +* uncle, n 1) మావయ్య; తల్లి సోదరుడు 2) పెదనాన్న 3) చిన్నాన్న; బాబయ్య; కక్క 4) అత్త భర్త 5) భార్య తండ్రి; భర్త తండ్రి; +* unconcerned, adj. నిర్లిప్త; పట్టించుకోకుండా; +* unconscious, adj. స్మృతివిహీన; స్మృతిలేని; స్మృతితప్పిన; మైకం కమ్మిన; అచేతన; +unconscious presumption, ph అచేతన అహంకారం; అచేతన పురాభావన; బహుశా అవునేమో అనే అచేతన నమ్మకం; +* unconsciously, adv 1) అపగత చేతనంగా; అచేతనంగా; స్మృతివిహీనంగా 2) అప్రయత్నంగా; అనుకోకుండా; +* uncountably, adv. అసంఖ్యాకంగా; లెక్కించడానికి వీలుపడని; +under employment, n. అల్పోద్యోగం; చదివిన చదువుకి కాని, ఉన్న తెలివితేటలకి గాని తగని చిన్న ఉద్యోగం; +* underdog, n. పోటీలో వెనకబడ్డ వ్యక్తి; అణచబడ్డ వర్గంలోని వ్యక్తి; +* understanding, n. అవగాహన; అవగతం; గ్రహణశక్తి; ఒప్పందం; +* understatement, n నిమ్నోక్తి; సరసోక్తి; చెప్పదలుచుకున్న దానిని బాధించకుండా చెప్పడం పాట బాగు లేదు" అనకుండా "పాట ఎదో కొత్త పంథాలో ఉన్నట్లు ఉంది" అనడం ఒక ఉదాహరణ; నిజాన్ని కాస్త మెత్తబరచి చెప్పడం; +* underwear, n. చెడ్డీ; లోదుస్తులు; చల్లాడం; +* unequal, adj. అసమానమైన; అసమమైన; విసమ; విషమ; ప్రతిసమ; +* unequivocal, n. అసందిగ్ధంగా; నిస్సంశయంగా; +* uneven, adj. ఒడిదుడుకులతో; ఎగుడు దిగుడులతో కూడిన; ఎత్తుపల్లాలతో; మిట్టపల్లాలతో; దంతుర; దంతురిత; ఉచ్ఛావచ; నిమ్నోన్నతమైన; న్యూనాధిక; +* unexpectedly, adv. అనుకోకుండా; అవశాత్తుగా; ఉభేతుగా; +* ungual, adj. గోరుకి సంబంధించిన; డెక్కకి సంబంధించిన; +* unhappy, adj. నిస్సంతోషంగా; సంతోషం లేని; విచారంగా; +* unification, n. సంధానం; సంయోగం; ఏకీకరణ; ఏకీకృతం; ఏకీభూతం; +* unified, adj. తాదాత్మ్య; సమీకృత; తదేక; కూటస్థ; ఏకరీతి; ఏకవాక్య; ఏకరూప; ఏకీకృత; +* uniform, adj. తదేక; కూటస్థ; ఏకరీతి; ఏకవాక్య; సరూప; ఏకరూప; +* unimpeded, adj. ధారాళంగా; అవ్యాహతంగా; అడ్డు లేకుండా; +* uninterruptedly, adv. అవిచ్ఛిన్నంగా; నిర్విరామంగా; నిరాఘాటంగా; నిరంతరాయంగా; +* union, n 1) సంఘం; సమాఖ్య 2) యోగం; సంయోగం; మేళనం; సంగమం; సంధానం; సంసర్గము; సంసక్తం; +* unique, adj. ఏకైక; అనన్య; సాటిలేని; అపూర్వ; అనన్యసామాన్య; అనన్యాదృశ్య; అద్వితీయ; అనుపమాన; +* unreachable, adj. అగమ్య; అందని; అందుబాటులో లేని; చేరలేని; +* unit, n 1) ఒకటి 2) ఘటికం; మూలఘటికం; అంశం; మూలాంశం; మూర్తం; ఏకాంకం; కొల ప్రమాణం; +* unite, v. t. సంధించు; కలుపు; ఉజ్జీచేయు; కలుపు; +* unity, n 1) ఏకత్వం; ఒరిమిక; ఐకమత్యం; ఐక్యత; సంఘీభావం; అవినాభావం; సమైక్యత; కట్టు; కలిసికట్టుతనం 2) ఒకటి; +* universal, adj. విశ్వ; విశ్వతోముఖ; విశ్వజనీన; వసుధైక; సర్వతోముఖ; జగత్; సర్వసామాన్య; సార్వజనిక; సర్వజనీన; సర్వత్ర; సార్వత్రిక; వ్యాప్తిలోనున్న; +universal adult suffrage, ph. సార్వజనిక వయోజన నియోజనం; సావని; విశ్వజనీన వయోజన వియోజనం; +* universals, n. pl సార్వత్రికలు; సార్వత్రికాలు; +* universe, n. విశ్వం; జగత్తు; జగం; జగతి; సృష్టి; బ్రహ్మాండం; +* university, n. విశ్వవిద్యాలయం; విశ్వకళాపరిషత్తు; విద్యాపీఠం; +* unlawful, adj చట్టవిరుద్ధమైన; చట్టబద్ధము కాని; దొంగ; +* unlimited, adj. అపరిమితమైన; పరిమితిలేని; అమితమైన; +* unlimited, n. అపరిమితం; అనవధికం; అమితం; అపారం; +* unlucky, adj. ముదనష్టపు; దురదృష్టపు; అదృష్టవిహీన; +* unmount, v. t. దింపు; పెట్టిన స్థానం నుండి తీయు; +* unobstructedly, adv. అనర్గళంగా; నిరర్గళంగా; అప్రతిహతంగా; నిరాఘాటంగా; +* unripe, adj. అపక్వ; అపరిపక్వ; పచ్చి; పండని; +* unrivalled, adj. పోటీలేని; సాటిలేని; అప్రతిమాన; అప్రతిమ; +* unsigned, adj 1) సంతకం లేని; సంతకం చెయ్యని 2) ధన, రుణ సంకేతాలు లేని; +* unsplit, adj. ఏకాండీ; విరగ్గొట్టని; చింపని; సంయుక్త; సమైక్య; +* untrue, n. అబద్ధం; అసత్యం; కల్ల; నిజం కానిది; సత్యదూరం; +* unutterable, adj. అవాచ్య; అనరాని; ఆడరాని; అశ్లీలమైన; ఉచ్చరింపగూడని; +unwell person, ph నలతరి; అస్వస్థుడు; అస్వస్థురాలు; నలతరాలు; +* unwise, adj. తెలివి తక్కువ; అజ్ఞానం; లౌక్యం తెలియని; +* up, adj 1)లేచి ఉండు 2) పనిచేసే పరిస్థితిలో ఉండు; పడుక్కోకుండా ఉండు; +* up, adv 1) ఎగువకెళ్లే 2) ఉత్తర దిశలో; +* update, v. t. తాజించు; తాజా చేయు; తాజీకరించు; +* upend, v. t. తిరగబెట్టు; బోల్తాకొట్టించు; ఉల్టా-సీదా చేయు; +* upgrade, v. t. మెరుగు పరచు; నాసి రకం వస్తువులని తీసేసి, వాటి స్థానంలో మెరుగైన వాటిని ప్రతిక్షేపించు; +* upliftment, n. ఉద్ధరణ; సముద్ధరణ; ఉద్ధరింపు; +* uproot, v. t. పెకలించు; పెల్లగించు; పెరకు; పీకు; +* upset, v. t. తలకిందులు చేయు; తిరగబెట్టు; పాడుచేయు; వమ్ముచేయు; +upward arrow, ph. ఊర్ధ్వముఖ సాయకం; పైకి చూపే బాణం; +* Uranium, n. వరుణము; ఒక రసాయన మూలకం అణుసంఖ్య 92, సంక్షిప్త నామం, U); +* Uranus, n యూరెనస్) వరుణుడు; వరుణగ్రహం; +* urban, adj. పౌర; నాగర; నగర; నగరీణ; నైగమ; పట్టణానికి సంబంధించిన ant rural; +* urchin, n. కుంక; కురక్రుంక; అల్లరి పిల్లాడు; +* urethra, n. మూత్రమార్గం; మూత్రం బయటకు వెళ్లే మార్గం; +* urgent, adj. అత్యవసరమైన; అవశ్యం; అర్జంటు; +* urinary, adj. మూత్రానికి సంబంధించిన; +* urinate, v. t. ఉచ్చపోయు; మూత్రవిసర్జన చేయు; అల్పాచిమానం చేయు; +* urine, n. ఉచ్చ; నీరుడు; మూత్రం; పంచితం; అల్పాచిమానం; ప్రస్రావం; +* urn, n. కూజా; కలశం; మట్టు ఉన్న చిన్న పాత్ర; +* Ursa Major, n. బృహదృక్షం; పెద్ద ఎలుగుబంటి; ఎలుగుబంటి ఆకారంలో ఉన్న ఒక నక్షత్ర సముదాయం; ఈ ఎలుగుబంటి తుంటి భాగంలోనూ, తోక భాగంలోనూ కనిపించే కొన్ని తారలని సప్తర్షి మండలం అంటారు. దీనినే big dipper అనీ plow అనీ కూడా అంటారు; +* Ursa Minor, n. లఘుదృక్షం; ఒక నక్షత్ర సముదాయం; +* usage, n. వాడుక; వాడకం; ప్రయోగం; ప్రయుక్తం; ఎసవాడుక; +* use, n యూస్) ఉపయోగం; ప్రయోజనం; వాడుక; +* use, v. t యూజ్ ఉపయోగించు; వాడు; వ్యవహరించు; +* useful, adj. పనికొచ్చే; ఉపయోగపడే; ఉపయుక్తమైన; కార్యకారకంగా; ఉపయోగకరంగా; ఉపాదేయంగా; +* useful, n. పనికొచ్చేది; ఉపయోగపడేది; ప్రయోజనకారి; కార్యకారి; +* useless, adj. అప్రయోజనమైన; పనికిరాని; అక్కరకురాని; పనికిమాలిన; చవట; నిరుపయోగమైన; నిష్ప్రయోజనమైన; కొరగాని; చిల్ల; పుంజులూరు; +* useless, n. నిరర్థకం; నిష్ప్రయోజనం; నిరుపయోగం; వ్యర్థం; పనికిమాలినది; అక్కరకురానిది; +* user, n. వినియోగదారుడు; ఉపయోగించువాడు; ప్రయోక్త ఆచరణాఖ్యుడు; ఆచరణాఖ్యి; వాడుకరి; +* usual, adj. యథాప్రకారం; ఎప్పటివలె; +as usual, ph. యథాప్రకారం; యథావిధిగా; ఎప్పటిఉపయోక్త; +* user, n. వాడుకరి; ఉపయోక్త; వినియోగదారు; +* user-friendly, adj. ఉపయోక్త సఖ్యత్వ; తేలికగా ఉపయోగించడానికి వీలయే; +* usurer, n. వడ్డీ వ్యాపారస్థుడు; +* usury, n యూషరీ) ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారం; ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారస్థుడు; +* usurp, v. t. అపహరించు; లాక్కొను; మింగు; +* usury, n. వడ్డీవ్యాపారం; వడ్డీ వ్యాపారస్తుడు; +* utensils, n. పాత్రసామాను; వాడుక గిన్నెలు; ముంతా తప్పేలాలు; తట్టుముట్లు; +* uterus, n. గర్భాశయం; గర్భకోశం; బిడ్డసంచీ; జరాయువు; +* utility, n 1) ఉపయుక్తి; ఉపయోగం; ప్రయోజనం 2) టెలిఫోను, నీటి సరఫరా; విద్యుత్తు, మొదలైన సౌకర్యాలు; +* utilize, v. t. వినియోగించు; వినియోగపరచు; ప్రయుక్తపరచు; +* utter, v. i. ఉచ్చరించు; అను; ఉటంకించు; వ్రాక్కుచ్చు; +* utterance, n. ఉటంకంపు; ఉక్తి; పలకబడ్డది; ఉదీరణం; +* utterly, adv. సుతరాము; బొత్తిగా; పరిపూర్ణంగా; శుద్ధ; +* uvula, n. కొండనాలుక; చిరునాలుక; లంబిక; కాకలం; ఉపజిహ్విక; ఘంటిక; అంగిటిముల్లు; ఉపజిహ్విక; +* uvulitis, n. కొండనాలుక వాపు; ఉపజిహ్వాదాహం; + + +* vacant, adj. ఖాళీగానున్న; శూన్యమైన; +* vacate, v. t 1) ఖాళీచేయు 2) రద్దుచేయు; న్యాయస్థానంలో తీర్పుని రద్దు చేయు; +* vacation, n. విశ్రాంతికి గాని వ్యాహ్యాళికి గాని, వినోదానికి గాని, చేసే పని నుండి తీసుకొనే శలవులు; శలవులు; see also holidays; +* vacuum, n. శూన్యం; శూన్యప్రదేశం; నిప్పచ్చరం; రిక్తాకాశం; లేబరం; పీడనం లేని ప్రదేశం; +* vacuous, adj. శూన్యమైన; అస్పష్ట; సందిగ్ధ; +* vagabond, n. బికారి; దిమ్మరి; దేశదిమ్మరి; తిరుగుమోతు; ఆవారా; ఇల్లు, వాకిలి లేని వాడు; +* vagina, n. యోని; భగరంధ్రం; భగం; పత్త; స్త్రీ జననాంగం; +* vagrant, n. బికారి; నిలకడ లేకుండా తిరిగే వ్యక్తి; +* vain, adj 1) వ్యర్థమైన; వృధా; నిష్ప్రయోజనమైన; నిష్ఫలమైన 2) అహంభావంతో; గర్వ పూరితమైన; స్వాతిశయ; ఆడంబర; ఆత్మస్తుతివంత; సొంత డబ్బా కొట్టుకునే; +* valedictory, adj. వీడ్కోలుకి సంబంధించిన; ఆమంత్రణ; +* valency, n 1 chem] బాహుబలం; బాలం; సంయోగ సామర్థ్యం; సంసా; సంయోజకత; ఒక రసాయన మూలకం ఇతర మూలకాలతో సంయోగపడడానికి చూపే సంసిద్ధత 2 ling భాషాశాస్త్రంలో ఒక క్రియా వాచకాన్ని ఎన్ని విధాలుగా వాడకలమో సూచించే సంఖ్య; +* valet, n వేలే) అంగసేవకుడు; పరిచారకుడు; +* valice, n, చిన్న చేతి సంచి; చిక్కం; +* valid, adj. యుక్తియుక్తమైన; సమ్మతమైన; +* validation, n. క్రమబద్ధీకరణం; నిబద్ధీకరణం; +* validity, n. సక్రమత; సప్రమాణత; చట్టబద్ధత; క్రమబద్ధత; నిబద్ధత; +* valor, n. పరాక్రమం; పౌరుషం; మగటిమి; మగతనం; +* valuables, n. జవాహరీ; విలువైన వస్తువులు; నగలు; +* valve, n. కవాటం; కపాటిక; పిధానం; అరరం; మీట తలుపు; ఒక వైపు మాత్రమే తెరచుకొనే తలుపు; +heart valve, ph. హృదయ కవాటం; గుండేలో ఉండే మీద గదులకి, కింది గదులకి మధ్య ఉండే తలుపు లాంటి వ్యవస్థ: +* vamp, n. తన అందచందాలతో పురుషులని వంచించు సాహసురాలు; +* van, n. బండి; పెట్టె బండి; పెట్టె ఆకారంలో ఉన్న కారు; +* vane, n. గాలి కోడి; గాలి ఎటు వీచుతున్నదో తెలియజేసే సాధనం; +* vanguard, n 1) వైతాళికులు 2) ఎదురు సన్నాహులు; +* vanish, v. i. మాయమగు; అంతర్ధానమగు; అదృశ్యమగు; హరించిపోవు; కరగిపోవు; +* vanity, n. స్వాతిశయం; ఆడంబరం; ఆత్మస్తుతి; అహంబ్రహ్మత్వం; +* vanquished, n. పరాజితుడు; పరాజేత; ఓడిపోయిన శాల్తీ; +* variable, n. చలరాశి; చలనరాశి; చలాంశం; చరరాశి; చరాంకం; చరాంశం; అస్థిరరాశి; +* variables, n. pl math చలరాశులు 2 astron హెచ్చుతగ్గు కాంతితో ప్రకాశించే నక్షత్రాలు; +* variant, n 1) అసలు కంటే కొద్ది భేదముతో ఉన్నది 2) ఒక కొత్త సూక్ష్మజీవి, ఒక అసలు సూక్ష్మజీవి నుండి వచ్చి, జన్యు పరంగా కొన్ని వేరే లక్షణాలు ఉన్నది. కానీ ఈ కొత్త సూక్ష్మజీవిని వేరే తెగకు చెందినది అనలేము, అసలు సూక్ష్మజీవితో జన్యుపరంగా పోలికలు వల్ల +* variation, n. మార్పు; వ్యత్యాసం; చలత్వం; వికారం; విచలనం; +* variety, n 1) వైవిధ్యత; భిన్నత్వం; మార్పు 2) కలగూరగంప 3) రకం; రకరకాలు; +* variola, n. మసూచికం; పెద్ద అమ్మవారు; +* various, adj. వివిధ; రకరకాల; పరిపరి; నానావిధ; +* vasectomy, n. శుక్రనాళాన్ని కత్తిరించడం rel పేగు మెలిక; +* vaso, adj. ధమనులకి సంబంధించిన; రక్తనాళాలకి సంబంధించిన; +* vasodilation, n. రక్తనాళాలు (ధమనులు) ఉబ్బేటట్లు చెయ్యడం; +* vassal, n. సామంతరాజు; కప్పం కట్టే రాజు; పాలెగాడు; +* vast, adj. అపార; అపారమైన; మిక్కిలి; +* vault, n. ఇనప్పెట్టె; రహస్య స్థలంలో దాచిన పెట్టె; +* vector, n 1) దిశమాణి; సదిశరాశి; సాయకం; తూపు; విహిత రేఖ; కాయత్వం; దిశ కలిగిన చలనరాశి; నాభిశ్రుతి 2) రోగవాహకం; ఆరోహకం; జబ్బులని ఒక చోట నుండి మరొక చోటికి మోసుకుని వెళ్లే జీవి; +vector field, ph phy సాయక క్షేత్రం; a space in which each point represents a vector quantity; ఉదా. ఒక ప్రదేశంలో ఎక్కడెక్కడ ఎంతెంత జోరుగా, ఏ దిశలో గాలి వీచుతునాదో చెప్పాలంటే ఆ ప్రదేశంలో ప్రతి బిందువు దగ్గర ఒక సాయకం (బాణం గుర్తు) వేసి చెప్పవచ్చు; +* Vega, n వీగా) అభిజిత్; బొమ్మచుక్క; రాత్రి ఆకాశంలోని ప్రకాశవంతమైన తారలలో ఇది అయిదవది; +vegetable fat, ph. ఉద్భిజ్జ మేదం; శాకీయ మేదం; శాకీయ గోరోజనం; +* vegetables, n. శాకములు; కాయగూరలు; కూరగాయలు; ఉద్భిజ్జములు; +bell pepper బుట్ట మిరప, కాప్సికం (రాజకోశతకీ) +* vegetate, v. t. ఈడిగిలపడు; బద్ధకంగా పడుండు; +* vegetation, n. ఉద్భిజ్జ సంపద; చెట్టుచేమలు; +* vehicle, n 1) బండి; యానం; వాహనం; శకటం; తేరు; యుగ్యం 2) అనుపానం; చేదు మందుకి తేనె అనుపానంగా వాడతారు; +* veil, n. మేలిముసుగు; ముసుగు; పరదా; బురకా; తెర; +* vein, n 1) ఈనె 2) సిర; మలిన రక్తాన్ని మోసుకెళ్లే నాళం 3) ధోరణి; పంథా 4) చారిక; రాళ్ళల్లో కనిపించే చారలు; +jugular vein, ph. గళ సిర; శిరస్సునుండి మలిన రక్తాన్ని మోసుకెళ్లే నాళం; +* velars, n. కంఠ్యములు; హనుమూలీయములు; నాలుక, మీద అంగుడి సహాయంతో పలికే అక్షరాలు; క, ఖ, గ, ఘ, ఙ same as) gutturals; +* velocity, n phys వేగం; రయం; వడి; ధృతిగతి; వేగం; గమనవేగం exp రయం ఉంటే రంయిమని వెళుతుంది; +angular velocity, ph. కోణీయ ధృతిగతి; కోణీయ వేగం; గిరగిర ఆత్మభ్రమణం చేస్తూన్న వస్తువు ఎంత జోరుగా తిరుగుతోందో చెప్పే చలరాశి; +constant velocity, ph. స్థిర వేగం; స్థిర ధృతిగతి; ఒక వస్తువు ఒకే దిశ లో ఒకే వేగం తో ప్రయాణం చేస్తూ ఉంటే అది స్థిర ధృతిగతి తో ప్రయాణం చేస్తున్నాదని అంటాం; +linear velocity, ph. రేఖీయ ధృతిగతి; రేఖీయ వేగం; నేరుగా ఒక సరళరేఖ వెంబడి ప్రయాణం చేస్తూన్న వస్తువు ఎంత జోరుగా పరిగెడుతోందో చెప్పే చలరాశి; +group velocity, ph. గుంపు వేగం; తరంగ చలనాన్ని వర్ణించేటప్పుడు ఎదురయే ఒక సంక్లిష్ట ఊహనం; +phase velocity, ph. దశ వేగం; తరంగ చలనాన్ని వర్ణించేటప్పుడు ఎదురయే ఒక సంక్లిష్ట ఊహనం; +uniform velocity, ph. తదేక వేగం; తదేక ధృతిగతి; ఒక వస్తువు చలనంలో దిశ లో మార్పు లేకుండా వేగం లో మార్పు లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటే అది తదేక ధృతిగతి తో ప్రయాణం చేస్తున్నాదని అంటాం; +* velum, n. మెత్తని అంగులి; నోటి కప్పు వెనక భాగం; కొండనాలుక; +* Vena Cava, n. బృహత్ సిర; బృహన్నాళం; మలిన రక్తాన్ని గుండెకి చేరవేసే రక్త నాళం; +inferior Vena Cava, ph. అధో బృహత్ సిర; గుండె దిగువ భాగాన ఉన్న శరీరం నుండి మలిన రక్తాన్ని గుండెకి చేరవేసే రక్త నాళం; +superior Vena Cava, ph. ఊర్ధ్వ బృహత్ సిర; గుండె ఎగువ భాగాన ఉన్న శరీరం నుండి మలిన రక్తాన్ని గుండెకి చేరవేసే రక్త నాళం; +* Vena Portae, n. జీర్ణాశయ సిర; జీర్ణాశయం నుండి వచ్చే రక్తాన్ని గుండెకి చేరవేసే రక్త నాళం; +* vendor, n. విక్రేత; విక్రయదారుడు; అమ్మకందారు; అమ్మేమనిషి; +* Venn diagram, n. వెన్నబొమ్మ; తర్కంలోను; బౌల్య బీజగణితంలోను వాడుకలో ఉన్న ఒక రకం బొమ్మ; +* venom, n. విషం; జంతువుల శరరం నుండి స్రవించి కాటు ద్వారా కాని, పోటు ద్వారా కాని మన శరీరాలలోకి చేరే విష పదార్థం; ఉదా: పాము విషం; +neurotoxic venom, ph. నరాల ద్వారా వ్యాప్తి చెందుతుంది; మనం సాధారణంగా భారత దేశంలో చూసే పాములు గోధుమ వన్నె త్రాచు (కోబ్రా కట్ల పాము(red-banded kraits, yellow-banded kraits నల్ల త్రాచు (కింగ్ కోబ్రా) ఈ రకమైన విషాన్ని కలిగి ఉంటాయి; +heemotoxic venom, ph. రక్త నాళాల ద్వారా వ్యాప్తి చెందుతుంది; Vipers (ఇవి ఎక్కువగా కొండలు, రాళ్ళు, రప్పలు దగ్గర ఉంటాయి సముద్ర పాములు; +* ventilation, n. వాయుప్రసరణం; గాలి వసతి; గాలి ప్రవహించేలా చెయ్యడం; +* ventilator, n 1) గాలి ప్రవహించేలా చెయ్యగలిగే సదుపాయం; చిన్న కిటికీ; ఉపవాతాయనం; పంకాలు వగైరా 2) ఆసుపత్రిలో రోగి ఉచ్ఛ్వసనిశ్వాసాలకి సహాయపడే యంత్రం, మొ. see also window; +* ventral, adj. పొట్టవైపు; కడుపుకి సంబంధించిన; ఉదర; జఠర ant dorsal అంటే వీపు వైపు అని అర్థం; +* ventricle, n. జఠరిక; గుండెలోని కింది గది; జవనిక; వివరం; +* ventriloquist, n. రకరకాల గొంతుకలని అనుకరిస్తూ, పెదిమల కదలిక కనబడకుండా మాట్లాడడంలో ప్రావీణ్యత ఉన్న వ్యక్తి; +venture capital, ph. తెగింపు మదుపు; తెగింపు పెట్టుబడి; +venture capitalist, ph. తెగుదారి; తెగుదారు; తెగువరి; తెగింపు మదుపరి; తెగింపు పెట్టుబడిదారు; ఉంకించు పెట్టుబడిదారు; తెగువ ఉన్న పెట్టుబడిదారు; +* venue, n. సభాస్థలి; కార్యరంగం; చోటు; +* Venus, n. శుక్రుడు; శుక్రగ్రహం; +* veracity, n. యదార్థత; సత్యవాదిత్వం; +* verb, n. క్రియ; క్రియావాచకం; +* verb, n. క్రియ; క్రియావాచకం; +* verbal, adj 1) వాగ్రూపంగా; వాచా; వాచిక; నోటితో; శాబారంభ 2) క్��ియకి సంబంధించిన; +* verbatim, adj. మాటకి మాటగా; చెప్పినది చెప్పినట్లుగా; +* verbomania, n. ఆపకుండా మాట్లాడే తత్త్వం; +* verbosity, n. శబ్దపుష్టి; అవసరం కంటె ఎక్కువ మాటలు; +* verdigris, n. కిలుం; చిలుం; ఇత్తడి, రాగి, వగైరా పాత్రలలో పులుపు పదార్థాలని ఉంచడం వల్ల కలిగే విషపూరిత మాలిన్యం; +* vermicelli, n వెర్మిఛెల్లీ) సేమియా; అతి సన్నగా ఉన్న స్పగేటీ; +* vermilion, n 1) ఇంగిలీకం; రంగులకి వాడే ఎరుపు రంగు ఉన్న రసగంధకిదం 2) కుంకం రంగులో ఉన్న ఎరుపు రంగు గుండ, ఏదైనా సరే; +* vernacular, n. వ్యావహారికం; వ్యావహారిక భాష; దేశభాష; ప్రాంతీయ భాష; +* vernal, adj. వాసంతిక; వసంత; వసంత రుతువుకి సంబంధించిన; +vernal equinox, ph. వసంత విషువత్తు; వసంత సంపాతం; వసంతకాలంలో రాత్రి, పగలు సమంగా ఉండే రోజు; +* versatility, n. ప్రజ్ఞానం; చాతుర్యత; బహుముఖ ప్రజ్ఞ; సర్వతోముఖ ప్రజ్ఞ; +* vertebrate, n. కశేరుకం; పృష్టవంశి; వెన్నుపూస వున్న జంతువులు; +* vertex, n. శీర్షం; అగ్రం; శిఖ; శిరోస్థానీయ బిందువు; +* vertical, adj. నిటారైన; నిట్ర; శీర్షలంబ; క్షితిజలంబ; +vertical line, ph. లంబరేఖ; నిట్రరేఖ; క్షితిజలంబ రేఖ; నిలువు గీత; +* vessel, n 1) పాత్ర; కలశం 2) బిందె; అండా; డెయిసా; గుండిగ; గంగాళం 3) పడవ; నౌక 4) నాళం; గొట్టం; రక్తనాళం; +* vest, n. అంగరక్ష; కబ్బా; చేతులు లేని బిగుతైన చొక్కా; +* vested, adj 1) పరిపూర్ణంగా; శాశ్వతంగా; నిబంధనలు లేకుండా; పించను వంటి డబ్బు పొందడానికి సంపాదించుకున్న హక్కు వంటి పరిపూర్ణత; +vested interest, ph. స్వలాభాపేక్ష; స్వామికార్యంతో జరుపుకునే స్వకార్యం; +* veteran, n 1) అనుభవజ్ఞుడు 2) యుద్ధం చవిచూసిన వ్యక్తి; డక్కామక్కీలు తిన్న వ్యక్తి; +veterinary science, ph. పశువుల వైద్యం; జంతువైద్య శాస్త్రం; అశ్వ శాస్త్రం; +* vex, v. t. చీకాకు పెట్టు; విసిగించు; +* viaduct, n. లోతైన లోయ మీద కట్టిన వంతెన; +* vibrate, v. i. కంపించు; వీగు; స్పందించు; చలించు; +* vice, adj. ఉప; ఇంకొకరికి బదులుగా; +* vice, n. వ్యసనం; దురలవాటు; దురభ్యాసం; దుర్గుణం; అవగుణం; సీదనం; +* vicissitudes, n. pl. సుఖదుఃఖాలు; మంచిచెడ్డలు; పరిణామాలు; +* victuals, n. pl. దినుసులు; వంటకాలు; ఆహారపదార్ధాలు; +* video, n 1) కదిలే బొమ్మలని నమోదు చేసి, తిరిగి తెరమీద చూపించగలిగే సాంకేతిక ప్రక్రియ 2) తెర మీద కనిపించే బొమ్మలు; +* view, v. t. చూడు; చూచు; దర్శించు; సందర్శించు; +* view, n 1) దృశ్యం 2) వీక్షణం; దృష్టి 3) అభిప్రాయం; +* viewer, n 1) చూడడానికి వాడే పరికరం; చూసేది; దర్శని; వీక్షకం;(2) చూసే వ్యక్తి; దిదృక్షువు; +* viewers, n. pl 1) వీక్షకులు; చూపరులు; చూసేవారు; దుర్భిణి, సూక్ష్మదర్శని, దూరదర్శని వంటి పరికరాలతో చూసేవారు 2 ప్రేక్షకులు; +* vigesimal, adj. వింశాంశ; ఇరవై అంశలు కల; దశాంశ పద్ధతికి ప్ది అంశలు ఉంటే వింశాంశ కి ఇరవై అంశలు; to the base twenty +* vigil, n. జాగరం; పారా; కాసుకొని కూర్చోవడం; కాపు; కాపలా కాయడం; మెళుకువతో ఉండటం; +* vignette, n విన్యట్ 1) పదచిత్రం 2) నేపథ్యంలో కలిసిపోయే (అంచులు లేని) చాయాచిత్రం; +* vilify, v. t. ఆడిపోసుకొను; నిందించు; దూషించు; +* village, n. పల్లె; పల్లెటూరు; గ్రామం; ప్రోలు; ఊరు; జనపదం; +* villagers, n. pl. పల్లెటూరు జనం; జానపదులు; గ్రామస్థులు; +* villain, n. కూళ; కూళుడు; తులువ; ప్రతినాయకుడు; +* villose, n. నూగు; సన్నని జుత్తు వంటి పదార్థం; +* vinculum, n math] శిరోవారం; గణితంలో కొన్ని చలరాసుల నెత్తిమీద గీసే చిన్న గీత; +* violate, v. t. అతిక్రమించు; హద్దుమీరు; ఉల్లంఘించు; జవదాటు; మేరమీరు; ఒత్తరించు; +* violation, n. అతిక్రమణ; ఉల్లంఘన; జవదాటడం; +* violence, n. హింస; హింసాకాండ; చిత్రహింస; అంకపొంకాలు; +* violent, adj. హింస; హింసాయుత; అంకపొంకంగా; +* violet, n. ఊదా; నీలలోహిత; లేత ఎరుపు నీలం కలసిన రంగు; బచ్చలిపండు రంగు; +* violin, n. వాయులీనం; వయలిన్; వయలిన్‌కి నాలుగు తీగలు ఉంటాయి; ఫిడేలుకి నాలుగు కంటె తక్కువ తీగలు ఉంటే ఉండొచ్చు; +* viper, n. పాము; సర్పం; ఒక జాతి విష సర్పం; అమెరికాలో ఉండే గిలక పాములు, ఆఫ్రికాలో ఉండే నల్ల మాంబా పాములు ఈ జాతి పాములే; ఈ జాతి పాములు సర్వసాధారణంగా గుడ్లు పెట్టడానికి బదులు పిల్లల్ని కంటాయి; అందుకనే వీటికి "viper" అన్న పేరు వచ్చింది ety Lat. vivo live, partus birth; +pit viper, ph. ఈ జాతి విష సర్పానికి తలమీద రెండు గంట్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది; +* viral, adj. జనబాహుళ్యంలోకి జోరుగా వెళ్ల్లగలిగే సమర్ధత గల; +* virgin, adj. అనుభవం లేని; దున్నని; పరిశోధించని; పచ్చి; +* virgin, n. కన్య; లైంగిక అనుభవం పొందని యువతి; +* Virgo, n 1) కన్యారాశి; పరిమాణంలో దీనిది ద్వాదశ రాశులలో రెండవ స్థానం 2) హస్తా నక్షత్రం; +* virility, n. మగటిమి; మగతనం; మగపోడిమి; వీర్యపటుత్వం; +virtual reality, ph. కాల్పనిక వాస్తవత్వం; మిథ్యా వాస్తవం; ఊహాత్మక వాస్తవం; +* virus, n 1) విషాణువు; వైరస్; జన్యు పదార్థము, దానిని రక్షిస్తూ కొంత ప్రాణ్యము ఘటకద్రవ్యాలుగా కలిగి ప్రాణం ఉందా లేదా అనే త్రిశంకులోకంలో ఉన్న పదార్థం; క్షీరదాల జీవకణాల కంటె, బేక్టీరియాల కంటె, ఎన్నో రెట్లు చిన్నదయిన విషాణువు; ఇవి జీవకణంలో తిష్ట వేసినప్పుడు తప్ప స్వయంప్రతిపత్తితో జీవించలేవు 2) కంప్యూటరులో ఉన్న క్రమణికలు చెయ్యవలసిన పనులు చెయ్యటానికి వీలులేకుండా పాడుచెయ్యగల మరొక క్రమణిక; +* visa, n. గుత్తుపొత్తంలో వేసే అధికార ముద్ర; ఒక వ్యక్తి మరొ��� దేశం వెళ్లేటప్పుడు ఆ అతిథేయ దేశం ఆ వ్యక్తికి ప్రవేశార్హత ఇస్తూ గుర్తింపు పుస్తకంలో వేసే రాజముద్ర rel passport; +* vis-a-vis, adv. సంబంధించిన; పోల్చి చూడదగ్గ; పక్కపక్కన; ఎదురెదురుగా; +* viscera, n. పేగులు; ఉదర కుహరంలోని అవయవాలు; +* viscid, adj. జిగట; జిగురుగానున్న; స్నిగ్ధత ఉన్న; +* visible, adj. దృగ్గోచర; దృశ్యమాన; దృశ్యమైన; దృశ్య; దృష్ట; గోచరమగు; కనబడే; అగపడే; ఆదరక: +visible light, ph. దృశ్య కాంతి; దృష్ట కాంతి; కంటికి కనబడే కాంతి; అగపడే కాంతి; +visible universe, ph. దృశ్య విశ్వం; దృష్ట విశ్వం; దృగ్గోచర విశ్వం; కంటికి కనబడే విశ్వం; అగపడే విశ్వం; +* vision, n 1) దృష్టి; చూపు 2) దూరదృష్టి; ముందుచూపు; +* visionary, n. ద్రష్ట; దూర దృష్టి, ఊహాత్మకమైన దృష్టి ఉన్న వ్యక్తి; ముందు చూపు గల మనిషి; +* vista, n. దృశ్యం; దిగంతర దృశ్యం; +* visual, adj. కంటికి సంబంధించిన; దృష్టికి సంబంధించిన; చక్షుష; +* visualize, v. i. ఊహించు; కంటికి ఎదురుగా ఉన్నట్లు ఊహించు; +vital parts, ph. మర్మస్థానములు; మర్మావయవములు; +vital records, ph. జనన మరణాలకి సంబంధించిన; వివాహ విడాకులకి సంబంధించిన కాగితాలు; +vital signs, ph. కీలక ముఖ్యమైన ఆరోగ్య సూచికలు; శరీరపు తాపోగ్రత, నాడి రేటు, శ్వాస రేటు, రక్తపు పోటు ఈ నాలుగు ముఖ్యమైన ఆరోగ్య సూచికలు; +* vital, n. ప్రాణాధారం; మూలాధారం; +* vitiligo, n. బొల్లి; చర్మంలో మెలనిన్‍ అనే రంజన రసాయనం లోపించినప్పుడు చర్మం మీద తెల్లటి మచ్చలు కనబడడం; +vitreous humor, ph. స్పటికాకార జలం; కాచాభ ద్రవం; గాజు సొన; +* vitriol, n. తుత్తం; తుత్తము; అక్షము; గంధకము, ఆమ్లము, లోహము కలసిన సంయోగ పదార్థం; +* vivid, adj. ప్రభూత; స్పష్టమైన; జీవకళతో తొణికిసలాడేటంత స్పష్టమైన; +* viviparous, adj. జరాయుజ; గుడ్డు నుండి కాకుండా గర్భం నుండి పుట్టిన జీవి; సజీవ సంతానోత్పత్తి; vivum అంటే జీవం అంటే జీవం ఏర్పడిన ,పూర్తిగా పెరిగిన పిల్లలని కనటం. ఇది క్షీరదాలలో మనుషుల్లో, మనం చూసే బోలెడు జంతువులలో కనపడుతుంది. +* vocabulary, n. పదజాలం; పదావళి; పదసంపద; పదనిధి; శబ్ద సంగ్రహం; శబ్దజాలం; +* vocalization, n. సంసర్గం; గొంతుక; కంఠం; వాక్కు; వాణి; ఎలుగు; +* voice, n. గొంతుక; గాత్రం; కంఠం; స్వరం; గళం; నాదం; ఎలుగు; +voice box, ph. స్వరపేటిక; గొంతుకలో ధ్వనిని పుట్టించే యంత్రాంగం; +* voiced, adj ling స్వరిత; నాద; హల్లులని పలికేటప్పుడు స్వరతంతువులు కంపిస్తే అవి స్వరిత లేదా నాద హల్లులు; +* voiceless, adj. నిస్వర; స్వరం లేని; శ్వాస; పరుష; హల్లులని పలికేటప్పుడు స్వరతంతువులు కంపించని యెడల అవి నిస్వర హల్లులు లేదా శ్వాసలు; +* volatile, adj. బాష్పశీల; వాయుపరిణామశీల; లఘిమశీల; హరించిపోయెడి; +* volley, n. వేటు; గుప్పించబడ్డ పరంపర; +* volume, n 1) ఘనపరిమాణం; ఆయతనం 2) ఘనం; స్థూలత; ఎక్కువ శబ్దం; ఆమంద్రణం; క్వణం; మోత; ఉరువు;(3) సంపుటం; సంపుటి; పుస్తకం; +* voluntary, adj. అయిచ్ఛిక; స్వచ్ఛంద; కామ్య; ప్రతిఫలాపేక్ష లేకుండా; ఉమేదువారీగా; బలవంతం లేకుండా; తనుగా తాను; తనంతట; +voluntary control, ph. అయిచ్ఛిక నియంత్రణ; స్వచ్ఛంద నియంత్రణ; +* volunteer, n. m. ఉపకర్త; కామ్యకారు; అయిచ్ఛికుడు; స్వచ్ఛంద సేవకుడు; ఉమేదువారీ; వాలంటీరు; +* vomit, v. i. కక్కు; డోకు; వాంతి చేసుకొను; డోకుకొను; +* vortex, n. సుడి; సుడిగుండం; నీటి సుడిగుండం; +* vote, n. ఓటు; సమ్మతి; సమ్మతి పత్రం; మతం; +* voter, n. ఓటరు; మతదాత; నియోజకుడు; నిర్వాచకుడు; +* vowels, n. pl. అచ్చులు; ప్రాణములు; ప్రాణాక్షరములు; స్వరములు; +back vowels, ph. తాలవ్యేతరాచ్చులు; తాలవ్యేతర స్వరములు; పశ్చిమాచ్చులు; అ, ఆ, ఉ, ఊ, ఒ, ఓ లు; +front vowels, ph. తాలవ్యాచ్చులు; తాలవ్య స్వరములు; అగ్రాచ్చులు; ఇ, ఈ, ఎ, ఏ లు; +* Vulcan, n. రోమనుల అగ్నిదేవుడు; +* vulcanization, n. వల్కనీకరణం; పుఠం పెట్టడం; పుఠీకరించడం; వేడిచేసి చల్లార్చడం; గంధకం కలిపి వేడి చేసి చల్లార్చడం; పెళుసుతనం తగ్గించడం; +* vulnerability, n. భేద్యత; హానిపొందే అవకాశం; దుర్బలత్వం; దుర్బలం; +* vulnerable, adj. భేద్యమైన; హానిపొందే; దాడికి అనువైన; దుర్బల; +* vulture, n. రాబందు; బోరువ; తెల్ల గద్ద; పీతిరిగద్ద; +* wade, v. i. మొలబంటి నీటిలో నడుచు; +* wadi, n. దొంగేరు; అరబ్బీ భాషలో లోయ అని అర్థం; అరుదుగా వర్షాలు పడ్డప్పుడు ఈ లోయ గుండా పొంగి పొర్లే ఏరు; +* wag, v. i. ఆడించు; ఊపు; కదుపు; విక్షేపించు; +* wage, n. వేతనం; కూలి; జీతం; భృతి; దినభత్యం; బత్తెం; భర్మం; కర్మణ్యం; సాధారణంగా ఏరోజుకారోజు కాని వారానికొకసారి కాని ఇచ్చేది rel salary; stipend; +daily wage, ph. రోజుకూలి; కైకిలి; కైకూలి; దిన సంపాదన; +wage earner, ph. జీతగాడు; ఆర్జించేవాడు; సంపాదించేవాడు; భరటుడు; భ్హృత్యుడు; +* wage, v. t 1) జరుపు; చేయు; నడిపించు 2) పందెం వేయు; పందెం కాయు; +wage a war, ph. యుద్ధం చెయ్యడం; కయ్యానికి కాలు దువ్వడం; +* wager, n. పణం; పందేనికి ఒడ్డే డబ్బు; +* wagtail, n. టిట్టిభం; ఉయ్యాల పిట్ట; కాటుక పిట్ట; కణాటీర పక్షి; జిట్టంగి; ఖంజరీటం; దాసిరిపిట్ట; కంప జిట్టిపిట్ట; లకుముకి పిట్ట; +* waif, n. ఈబరి; పనికిరానివాడు; అప్రయోజకుడు; +* wail, v. i. విలపించు; ఏడ్చు; కుంయ్యిమను; +* wait, v. i. వేచియుండు; కనిపెట్టుకుని ఉండు; కాచుకొనియుండు; నిరీక్షించు; ప్రతీక్షించు; పడిగాపులు పడియుండు; +waiting room, ph. వేచియుండు గది; నిరీక్షామందిరం; +* waiter, n. m. భోజన ఫలహారశాలలో వడ్డన చేసేవాడు; +* waitress, n. f. భోజన ఫలహారశాలలో వడ���డన చేసేది; +* waive, v. t. పరిత్యజించు; హక్కులను వదలిపెట్టు; +* wake, n 1) అబ్లోసు; ఓడ వెనుక నీళ్లలో కనబడే జాడ 2) శవ సందర్శనం; చనిపోయిన వ్యక్తి శరీరాన్ని బంధుమిత్రులు వచ్చి చూడడానికి వీలుగా ఏర్పాటు కాబడ్డ సాంఘిక ఆచారం; +compound wall, ph. ప్రహారీ గోడ; ప్రాకార కుడ్యం; కంథావారం; +* wallet, n. ఆసిమిసంచి; డబ్బుసంచి; +* walnut, n. అక్రోటు; అక్షోడం; కొండగొనుగు పిక్క; +* wander, v. i. తిరుగు; తిరుగాడు; సంచరించు; +waning moon, ph. క్షీణ చంద్రుడు; క్షీణించే చంద్రుడు; క్షయించే చంద్రుడు; కృష్ణపక్ష చంద్రుడు; +* wanton, adj. కావాలని దురుద్దేశంతో చేసే; +wanton act, ph. కావాలని దురుద్దేశంతో చేసే పని; +wanton woman, ph. విచ్చలవిడిగా తిరిగే ఆడది; లైంగిక కట్టుబాట్లు లేకుండా తిరిగే స్త్రీ: +* wants, n. కోరికలు; వాంఛలు; పురుషార్ధాలు; +* war, n. యుద్ధం; సంగ్రామం; పోరు; పోట్లాట; కలహం; +* ward, n 1) సాల; శాల 2) ఒకరి రక్షణలో ఉన్న వ్యక్తి; +* wardrobe, n. దుస్తులు; ఒక వ్యక్తి యొక్క దుస్తుల సముదాయం; +* wares, n. సరుకులు; వస్తువులు; సామానులు; బండారాలు; +* warehouse, n. గిడ్డంగి; గాదె; గోదాం; కోపు; కోష్ఠం; కోఠా; భాండాగారం; మండీ; +* warm, adj 1) వెచ్చనైన; వెచ్చగా నున్న; వెచ్చని 2) ప్రేమపూరితమైన; +* warn, v. t. హెచ్చరించు; హెచ్చరిక చేయు; +* warp, n. పడుగు; నేతలో నిలువు పోగు; +* warp, v. i. వంగు; నలుగు; వేడికి, చెమ్మకి ఆకారం పోగొట్టుకొను; +* wart, n. మొటిమ; ఉలిపిరి కాయ; చర్మకీలం; నారికాయ; సురుగుడు కాయ; పులిపిరి కాయ; +* wash, v. t. ఉతుకు; కడుగు; శుభ్రపరచు; ధావనం చేయు; +* washer, n 1) ఉతకరి; ధావకి; బట్టలు ఉతికే యంత్రం 2) కందెన బిళ్ల; కందెనకి తగిలించే బిళ్ళ; +washing soda, ph. చాకలి సోడా; బట్టల సోడా; సోడా ఉప్పు; సోడియం కార్బనేటు; +* washerman, n. m. చాకలి; చాకలివాఁడు; ధావకుఁడు; రేవడి; రజకుఁడు; మడివేలు; +* waste, n. దండుగ; వృథా; దుబారా; విభవం; వ్యర్ధం; రద్దు; బీడు; వమ్ము; వ్యర్ధ పదార్థం; ఏబ్రమ్ +* waste, v. i. వృథాయగు; వ్యర్ధమగు; రిత్తపోవు; బీరుపోవు; వమ్మగు; +* watch, v. t. కాపలా కాయు; చూడు; చూచు; పారాకాయు; పారాయిచ్చు; +* watcher, n. కాపు; కాపలా కాసే వ్యక్తి; పారావాడు; +* watchman, n. కాపలావాడు; కాపరి; కాపు; తలారి; తలవరి; +* waterwheel, n. నీటిచక్రం; జలచక్రం; అరఘట్టం; +* water, adj. నీటి; జల; ఆప్య; ఉదక; అంబు; తోయ; సలిల; తీర్థ; వాః; +* water, n. నీరు; నీళ్లు; ఉదకం; జలం; తీర్థం; వారి; వాః; పుష్కరం; నీరం; వానం; అప్పు; అంబువు; తోయం; సలిలం, +distilled water, ph స్విన్న జలం; హంసోదకం; మరగించి చల్లార్చిన నీళ్ళు; బట్టీపట్టిన నీళ్లు; +drinking water, ph మంచినీళ్లు; మంచి తీర్థం; తాగునీరు; +hard water, ph కఠిన జలం; చౌటి నీరు; కేల్సియం, మెగ్నీసియం లవణాలు ఎక్కువగా కరిగిన నీరు; ఈ లవణాలు మరీ ఎక్కువగా లేనంతసేపూ తాగడానికి ఇదే మంచిది; కాని యంత్రాలకి వాడే ఆవిరి తయారీలో ఈ నీరు మంచిది కాదు; +potable water, ph మంచినీళ్లు; మంచి తీర్థం; తాగే నీరు; +soft water, ph సాధు జలం; నిజమైన శసాధు జలంలో ఒక్క సోడియం అయానులు తప్ప మరే ఇతర లవణాలు ఉండవు; ఈ నీటికి కాసింత ఉప్పదనం ఉంటుంది; +* waterfowl, n. చక్రచక్రాంగాలు; నీటి పక్షులు; +* watermelon, n. పుచ్చకాయ; కాలిందపండు; కల్లంగడీ పండు; ఖర్బూజా; +* wattle, n 1) జోలుమెడ; కొన్ని జంతువులకి, పక్షులకి మెడ కింద వేలాడే ఒదులైన చర్మం 2) గంగడోలు; ఆవులకి ఎద్దులకి మెడ కింద వేలాడే ఒదులైన చర్మం see also dewlap; wattle; +transverse wave, ph. తిర్యక్ తరంగం; అక్షాంశ తరంగం; పీడన తరంగం; +* wavelength, n. తరంగ దైర్ఘ్యం; తరంగం పొడుగు; +* wax, n. మైనం; పింజూషం; మదనము; +wax paper, n. మైనపు కాగితం; పద్మపత్రం; +waxing moon, ph. శుక్లపక్ష చంద్రుడు; రాకా చంద్రుడు; +* way, n 1) దారి; మార్గం; తోవ; దోవ; తెరువు; బాట; తెన్ను; రహదారి; రోడ్డు 2) విధం; పద్ధతి; తీరు; ప్రకారం; పంథ; +usual way, యథా ప్రకారం; మామూలుగా; +* wayward, adj. అదుపులో ఉండని, దారితప్పిన; చెప్పిన మాట వినని; మొండి; +* weak, adj. బలహీనమైన; నిస్త్రాణమైన; నీరసపు; అబలమైన; దుర్బలమైన; విలీన; విబల; ఈరు; +weak acid, ph. నిస్త్రాణికామ్లం; దుర్బల ఆమ్లం; +* weakness, n. బలహీనత; దౌర్బల్యం; దుర్బలత్వం; నిస్త్రాణ; నీరసం; నిస్సత్తువ; డిల్ల; అపాటవం; అవుకు; +* wealth, n. సంపద; ఆస్తి; సిరి; కలిమి; భాగ్యం; ధనం; ధనికత; ఐశ్వర్యం; +* wealthy, n. pl. సంపన్నులు; సామంతులు; ధనవంతులు; ధనికులు; శ్రీమంతులు; కలిగినవారు; ఉన్నవారు; +* weaponization, n ఆయుధీకరణ; ఆయుధం కాని దానిని ఆయుధంగా మార్చడం; +* wearer, n. ధారి; ధరించిన వ్యక్తి; +* weather, n. శీతవాతతాపాలు; దైనందిన వాతావరణం; పవనస్థితి; వాలిమండ; మవుసం; వియత్తు; వాన, గాలి, మబ్బు, ఎండల స్థితి; వాతావరణం; +weather vane, ph. గాలికోడి; వాతసూచి; గాలి ఎటునుండీ వీచుతున్నదో సూచించే సాధనం; +* weaver, n. మగ్గరి; సాలె; నేత నేసే వ్యక్తి; +* wearer, n. m. కువిందుడు; ధరించువాడు; f. కువిందురాలు; ధరించునది; +* web, n. పట్టు; గూడు; సాలె పట్టు; సాలె గూడు; జాలం; బూజు; +* website, n. జాలస్థలం; జాలస్థలి; జాలగూడు; ఆటపట్టు; అటక note) మన సరుకులు దాచునే స్థలాన్ని అటక అన్నట్లే మన సమాచారాన్ని దాచుకునే స్థలం కనుక దీన్ని కూడ అటక అనొచ్చు; అంతే కాదు (వెటకారంగా) వెబ్ అంటే సాలెగూడు కనుక సాలెగూళ్లు ఉండే స్థలం అటక కనుక మాటలతో ఆట; +* wedding, n. పెళ్లి; పెండ్లి; మనువు; లగ్గం; కళ్యాణం; కళ్యాణ ఉత్సవం; పెండ్లి వేడుక; పాణిగ్రహణం; పరి��యం rel marriage; +civil wedding, ph. అమంత్రకం; మంత్రములు లేని వివాహ ఉత్సవం; +traditional wedding, ph. సమంత్రకం; మంత్రములతో కూడిన వివాహ ఉత్సవం; +* wedge, n. గసిక; వారిణిసీల; వారిణిపీట; కీలం; +* weed, n. కలుపు మొక్క; అలం; సస్యంలోని గాదం; +* weekday, n. వారపురోజు; శని ఆది వారములు కాక మిగిలిన రోజులు; +* weep, v. i. ఏడ్చు; రోదించు; బావురుమను; +* weevil, n. ముక్కపురుగు; బీటిల్ జాతికి చెందిన ఈ పురుగులు రకరకాల పంటలకి తీరని నష్టం కలుగజేస్తాయి; +* weft, n. పేక; నేతలో అడ్డుగా వచ్చే పోగుని పేక అంటారు, నిలువు పోగుని పడుగు అంటారు; +* weight, n బరువు భారం; తూనిక; తూకం; గరిమ; ధురం: మోపుదల; +* welcome, n. ఆహ్వానం; పలకరింపు; ఎదుర్కోలు; ప్రత్యుద్థానం; +* welfare, n. యోగక్షేమం; సంక్షేమం; శ్రేయస్సు; కుశలత; అనామయం; హితం; కంత్వం; +* welfare, n. యోగక్షేమాలు; సంక్షేమం; +are you doing well? ph. బాగున్నారా; బాగున్నావా; కులాసాగా ఉన్నారా/ఉన్నావా; +* well, n. నుయ్యి; బావి; వాపి; కూపస్థము; కూపం; +* well-to-do, n. స్థితిపరులు; భాగ్యపరులు; +* well-wisher, n. హితుడు; హితాభిలాషి; శ్రేయోభిలాషి; హితైషి; హితవును కోరే వ్యక్తి; మన మంచిని కోరే వ్యక్తి; +* welt, n 1) దద్దురు; క్రిమి కీటకాదులు కుట్టడం వల్ల కాని ఎలర్జీ వల్ల చర్మం వాచి పొంగడం 2) బొప్పి; దెబ్బ వలన చర్మం వాచడం 3) చెప్పులని కాలికి కట్టుకొనడానికి వాడే తోలు పటకా; +* went, v. i. వెళ్ళెను; ఏగెను; ఏగిరి; పోయిరి; పోయెను; చనియెను; వెళ్ళేరు; m. వెళ్ళేడు; f. వెళ్ళింది; +* west, n. పడమర; పశ్చిమం; ప్రతీచి; ఉదీచి; +* western, adj. పాశ్చాత్య; పశ్చిమ; శ్చిమార్ధ; ప్రతీచీన; సాయన; పడమటి; +* westward, adv. పశ్చిమాభిముఖంగా; పడమటివైపు; +* wet, adj. పదును; పుంజ; తడిసిన; తడిగానున్న; చెమ్మ; +* wet, v. t. పదును పెట్టు; తడిపి పెట్టు; +* wetlands, n. pl. చిత్తడి నేలలు; బీఅ భూములు; బాడవ భూములు; పుంజనేలలు; +* wetness, n. పదును; తడి; చెమ్మతనం; సంసిక్తత; +* wetted, adj. ప్లుత; సంసిక్త; సిక్త; తడిపిన; తడిపిపెట్టిన; +* wharf, n. రేవు; బందరు; పడవలు, ఓడలు ఆగు స్థలం; +* wheezing, n. ఊష్మ ధ్వనులు; ఊపిరి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు, పిల్లి కూతలలా వచ్చే చప్పుళ్లు; +* whenever, adv. ఎప్పుడైనా సరే; ఎప్పుడైతే అప్పుడు; +* whereabouts, n. విశేషాలు; ఆచూకీ; పత్తా; చిరునామా వగైరా; +* whey, n 1) పాలవిరుగుడు 2) కుంపెరుగు; పెరుగులో నీళ్ల వంటి భాగం; +* whip, n. కొరడా; కమ్చీ; చెలకోల; చెర్నకోల; చబురు; +* whip, v. t. చిలుకు; బాదు; కొట్టు; పీండ్రించు; +whipped butter, n. చిలికిన వెన్న; పీండ్రించిన వెన్న; +* whiskers, n. బుగ్గమీసాలు; పిల్లి జాతి జంతువులకి ఉండే మీసాలు; +* whiskers, n. pl. మీసాలు; పిల్లులకి, ఎలకలకి మూతి మీద ఉండే పొడుగాటి వెంట్రుకలు; +* whiskey, whisky, n. విష్కీ, బార్లీతో చేసిన బీరుని ధృతించి (బట్టీపట్టి) ఆల్కహోలు పాలు 40 శాతం వరకు పెంచినప్పుడు లభించే మాదక పానీయం; +* white, adj. శుక్ల; తెల్ల; తెల్లని; శ్వేత; ధవళ; +white paper, ph 1) శ్వేతపత్రం; ఒక ఊహని కాని ప్రతిపాదనని కాని రాసిన కాగితం 2) తెల్ల కాగితం; +* whitewash, n 1) వెల్ల; గోడలకి వేసే తెల్లటి సున్నపు నీళ్ల పూత 2 idiom] చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నం; +* whitewaters, n. తెల్లటి నురగలు కక్కుతూ రాళ్ల మీద ప్రవహించే నది; +* whitlow, n. గోరుచుట్టు; గోరు మట్టు దగ్గర చీము చేరి వాచడం; +* whiz kid, n. తెలివితేటలతో అతి త్వరగా ముందుకి దూసుకు పోగలిగే వ్యక్తి; +* whole, adj. నిండు; పరిపూర్తి; పూర్ణ; అఖండ; అఖిల; +whole blood, ph. నిండు రక్తం; కణాలేవీ తీసెయ్యకుండా, యథాతథంగా ఉన్న రక్తం; +* whole, n. మొత్తం; అంతా; యావత్తూ; సమస్తం; అఖిలం; +* wholeheartedly, adj. నిండు హృదయంతో; హృదయపూర్వకంగా; మనస్పూర్తిగా; మనసా; +* wholesome, adj 1) ఆరోగ్యదాయకమైన; ఆరోగ్యాన్ని ఇచ్చే 2) నీతి నియమాలు పాటించే; +* widespread, adj. విస్తార; విస్త్రృత; బహువ్యాప్త; ప్రచలిత; +* widespread, n. విస్తారం; విస్త్రృతం; బహువ్యాప్తం; ప్రబలం; +* widow, n. f. విధవ; వితంతువు; విశ్వస్త; అధవ; పూర్వ సువాసిని; రండ; భర్త పోయిన స్త్రీ; విగతభర్తృక; గంగాభాగీరధీ సమానురాలు; +* widowhood, n. వైధవ్యం; వెధవరికం; ఛత్రభంగం; +* wife, n. భార్య; పెళ్లాం; ఆవిడ; ఇంటావిడ; ఆలు; మగనాలు; ఇల్లాలు; అర్ధాంగి; కళత్రం; గృహిణి; సతి; పత్ని; సహధర్మచారిణి; చేడి; చేడియ; ఊఢ; గేస్తురాలు; దార; దయిత; వల్లభ; ధర్మ కార్యాలలో పీటల మీద కూర్చొనే హక్కు పత్నులకే ఉంటుంది. వాళ్లకు కలిగే సంతానానికే పితృకార్యాలు, కర్మ క్రతువులు చేసే అధికారం; +* wig, n. టోపా; అసలు జుత్తుని కప్పిపుచ్చడానికి వాడే సవరం లాంటి ఉపకరణం; +* wild, adj. క్రూర; వన్య; అడవి; అదుపులేని; మచ్చిక చెయ్యబడని; +wild animal, ph. అడవి జంతువు; వన్య మృగం; క్రూర మృగం; +* wildfire, n. కార్చిచ్చు; అదుపులోకి రాని మంటలు; +* wilderness, n. అడవి; అరణ్యం; కాంతారం; అటవీ ప్రాంతం; ఎడారి; సముద్రం; బీడు; బంజారా; సేద్యసంస్కారాలు లేకుండా, నిర్వాసమైన ఏ ప్రదేశం అయినా సరే; +* will, n 1) వీలునామా; మరణాశాసనం; విల్లు 2) పట్టుదల; ఇచ్ఛ; ఈప్స, Ipsa; సంకల్పం; కోరిక 3) ఇష్టం; అభిమతం; అభీష్టం; చిత్తం; +* win, v. t. గెలుచు; గెలుపొందు; జయించు; నెగ్గు; +* win-win strategy, ph. ఉభయార్ధ సాధకమైన ఉపాయం; స్వామి కార్యంతో స్వ కార్యం కూడా; +* wind, n విండ్) గాలి; పవనం; పయ్యెర; వాయువు; మారుతం; ములాయం; వాతం; ఈద; కరువలి; అనిలం; తెమ్మెర; ప్రభంజనం; +wind instrument, ph. తాషామర్పా; బూరా; సన్నాయి వంటి వాయిద్యాలు; +* windfall, adj. గాలిపంట; గాలివాటుగా వచ్చిన; కలిసొచ్చిన; +windfall profit, ph. గాలివాటు లాభం; కలిసొచ్చిన అదృష్టం; +* windsock, n. గాలి గొట్టం; వాత సూచి; గాలి ఎటు నుండి వీచుతోందో, ఎంత జోరుగా వీచుతోందో సూచించడానికి విమానాశ్రయాలలో వేల్లాడదీసే గొట్టం ఆకారంలో ఉండే గుడ్డ; +* windvane, n. వాతసూచి; గాలికోడి; గాలి ఎటు నుండి వీచుతోందో, సూచించడానికి కోడి ఆకారంలో ఉండే బొమ్మ: +* wine, n. సారా; ద్రాక్ష సారా; ద్రాక్షాసవం; ఫలాసవం; మార్ద్వీకం; పండ్ల రసాలని పులియబెట్టగా వచ్చే మత్తెక్కించే పానీయం; see also liquor; +* wing, n 1) రెక్క; గరుత్తు 2) పార్శ్వం; పక్షం 3) పంచపాళీ; +* winnowing, n. ఎగరబోత; తూర్పారబట్టడం; చెరగడం; +* winter, n. చలికాలం; శీతాకాలం; హేమంతం; +* wisdom, n. వివేకం; విజ్ఞత; విచక్షణ; ప్రాజ్ఞత; తెలివి; తెలివితేటలు; +worldly wisdom, ph. లోక వ్యవహారజ్ఞత; లోకజ్ఞానం; లౌక్యం; +wise person, ph. ధీమతి; వివేకవంతుడు; తెలివైనవాడు; తెలివైనది; +* wish, n. కోరిక; అభిమతం; అభీష్టం; వరం; మనోరధం; ఆకాంక్ష; అభిలాష; అశంస; +* wish, v. t. కోరు; తివురు; అభిలషించు; కాంక్షించు; ఆకాక్షించు; +* wit, n. ఛలోక్తి; వాక్చాతుర్యం; పరిహాసాత్మకమైన వాక్చాతుర్యం; +* withdraw, v. i. విరమించు; విరమించుకొను; ఉపసంహరించు; +* witness, n. సాక్షి ety స అక్షి కంటితో చూసిన వ్యక్తి; కనుకాపు; +prairie wolf, ph. కయోటీ; ఉత్తర అమెరికా మైదానాలలో తిరిగే నక్క వంటి జంతువు; +* woman, n ఉమన్) స్త్రీ; మనిషిని; ఆడది; ఆలు; వనిత; నాతి; నారి; అతివ; అంగన; అంగయాన; పడతి; మగువ; కాంత; భామ; భామిని; ఉవిద; తలోదరి; శర్వరి; తోయజాక్షి; తెఱువ; ముద్దియ; యోషిత; కొమ్మ; ప్రౌఢ; దంట; చామ; గరిత; తెరవ; మరీచిక; నవల; మెలత; నెలతుక; పైదల; పొలతి; అన్నువ; అలివేణి; ఇంచుబోడి; +ఇంతి; ఉఙ్మలి; ఎలనాగ; ఏతులి; గుబ్బెద; అలరుబోడి; ముద్దరాలు; అన్నువి; +* womanizer, n. స్త్రీలోలుడు; ఇంద్రియలోలుడు; +* womb, n. గర్భాశయం; బిడ్డసంచీ; +* women, n. pl విమెన్) స్త్రీలు; ఆడంగులు; ఆడవారు; జనానా; +* wonder, n. అద్భుతం; అబ్బురం; చోద్యం; విస్మయం; వింత; విచిత్రం; చిత్రం; +* wonder, n. అద్భుతం; అబ్బురం; చోద్యం; విస్మయం; +* wood, n 1) కర్ర; కొయ్య; చెక్క; దారువు; కాష్టం; యష్టి 2) కలప 3) గుబురుగా పెరిగిన చెట్లు; వనం; అడవి; +* woodpecker, n. వడ్రంగిపిట్ట; ద్వారాఘాటం; +* woof, n. పడుగు; నేతలో నిలువు దారాలు; +harsh word, ph. దురుక్తి; దురుక్తం; పరుషోక్తి; +* wordsmith, ph. భాషాభిషక్కు; మాటల వాడకంలో దిట్ట; +* work, n. పని; క్రియ; కార్యము; కృత్యము; చర్య; చాకిరి; కర్మము; +* workbench, n. దాయి; దాతిమాను; వడ్రంగి పని చేసే కర్ర దిమ్మ; +* working, adj. పరిమిత; పనికి సరిపడా; కార్యకారి; +* workman, n. పనివాడు; కర్మారుడు; కార్మికుడు; కర్మి; +* workshop, n 1) కార్యశాల; ఒక పని నేర్చుకోవడం కొరకు సమావేశం అయే స్థలం 2) ఒక పని నేర్చుకోవడం కొరకు సమావేశం; +* world-wide, adj. ప్రపంచ విస్తృతమైన; విశ్వ వ్యాప్త; +* world-wide web, n. విశ్వవ్యాప్త వ్యూహం; ప్రపంచంలోని కంప్యూటర్లన్నిటిని ఒకదానికొకదానిని తగిలించగా వచ్చిన జ్ఞాన భాండాగారం; +* worry, n. బెంగ; కలత; దిగులు; సంక్షోభం; +* worry, v. i. బెంగపెట్టుకొను; కలతపడు; దిగులుపడు; ఆరాటపడు; సంక్షోభించు; +* worthless, adj. పొల్లు; నిరర్థక; నిష్ప్రయోజన; +* worthless, n. నిరర్ధకం; నిష్ప్రయోజనం; +* wound ఊండ్) n. గాయం; క్షతం; దెబ్బ; కడి; పుండు; ఈర్మము; +* wounded people, ph. క్షతగాత్రులు; దెబ్బలు తగిలినవారు; +* wounded, n. క్షతగాత్రులు;దెబ్బలు తగిలినవారు; +* wrath, n. రుష; కోపం; ఆగ్రహం; క్రోధం; రోషం; మంట; +* wreath, n. మాలిక; తోమాల; ఒక వృత్తాకార ఆకారంలో పువ్వులు, ఆకుల అమరిక, ఒక అలంకరణగా ఉపయోగించబడుతుంది లేదా మరణించిన వ్యక్తికి గౌరవం, గుర్తుగా సూచించబడుతుంది see also] garland; +* wrench, n. పానా; మరచీలను తిప్పే పనిముట్టు; +* wretch, n నిర్భాగ్యుడు; దేబిరిగొట్టు; నీచుడు; నీచురాలు; హీనుడు; +* wrist, n. మణికట్టు; మనికట్టు; +* writer, n 1) రచనాశీలి; m. రచయిత; f. రచయిత్రి 2) రాయసకాడు; ముసద్దీ; +writer's block, ph. కృత్యాద్యవస్థ; కృతి ఆది అవస్థ, అంటే ఏ పనైనా ప్రారంభించేటప్పుడు కర్త అనుభవించే మానసిక పరిస్థితి; +* wrought, adj. చేసిన; మలచబడిన; సుత్తితో రూపుదిద్దబడిన; +* xenophobia, n. పరాయి వారంటే భయం లేదా అయిష్టత; అపరిచితులంటే భయం; కొత్తవారంటే భయం Gr. xexon stranger +* xerophthalmia, n. కండ్లలో చెమ్మ ఎండిపోవడం; కండ్ల దురద; కంటిపువ్వు; +* xylophagous, adj. దారుభక్షక; కొయ్యని తినే; కరన్రి తినే; +* xylum, n. దారువు; కొయ్య; కర్రచెక్క; +* yam, n. మోహనపుదుంప; ఒక రకం ఎర్రటితియ్యదుంప; ఇది దక్షిణ ఆఫ్హ్రికాలో దొరికే ఒక రకం దుంప; +* yard, n 1) గజం; మూడడుగుల ప్రమాణం; ఉరమరగా మీటరు 2) పెరడు; దొడ్డి; అంగణం; +* yarn, n. నూలు 1) దారం; వడికిన దారం; నేతకి పనికివచ్చే దారం 2) కథ; +* yean, v. t ఈను; కను; జంతువులు పిల్లలని కనడం; +* year, n. సంవత్సరం; ఏడాది; ఏడు; వర్షం; సాలు; పన్నెండు నెలలు; 52 వారాలు; ఫసలీ; +last year, ph. నిరుడు; కిందటి ఏడు; గత సంవత్సరం; గైరుసాలు; +per year, ph. సాలు ఒక్కింటికి; సంవత్సరానికి; +* yearling, n. కొదమ; ఏడాది నిండిన పశుపక్ష్యాదులు; శకలార్భకం; +* yearly, adj. సాలుసరి; సాలుకి; సాలీనా; సాంవత్సరిక; +* yeast, n. మధుశిలీంద్రం; రొట్టెల పిండి పొంగడానికి వాడే ఒక రకం సూక్ష్మజీవులు; ఈస్టు; +* yell, v. t 1) కసురు; కోప్పడు 2) అరుచు; బొబ్బ పెట్టు; గద్దించు; +* yellow, adj. పసుపు పచ్చని; పచ్చని; పీత; హరిద్ర; +* yellow, n 1) పసుపురంగు; పసుపు పచ్చ; పీత 2) పచ్చ సొన; +* Yiddish, n. యూరప్ లో ఉన్న యూదులు మాట్లాడే జెర్మన్ భాషని పోలిన భాష rel Hebrew; +* yield, v. i.(1) లొంగు; లోనగు; వంగు; ఒదుగు; అవుకు 2) ఇచ్చు; పండు; ఫలించు; +* yield, n. దిగుబడి; రాలుబడి; ఫలసాయం; లాభం; ప్రాప్తి; లబ్ధి; +* yoke, n. కాడి; కాడిమాను; బండి కట్టినప్పుడు ఎడ్ల మెడమీద వేసే కర్ర; +* youth, n 1) పడుచుతనం; ప్రాయం; యవ్వనం; పరువం 2) f. యువతి; ఉవిద; జవ్వని; పడుచుది; పడుచుపిల్ల 3) m. పడుచువాడు; యువకుడు 4) pl. యువత; +* Ytterbium, n. ఇతర్యం; ఒక రసాయన మూలకం అణుసంఖ్య 70, సంక్షిప్త నామం, Yb); +* Yttrium, n. ఇత్రము; ఒక రసాయన మూలకం అణుసంఖ్య 39, సంక్షిప్త నామం, Yt); +* zeal, n. ఆసక్తి; అభినివేశం; ఉత్సాహం; ఉద్విగ్నత; +* zealot, n. ఉన్మాది; వీరభక్తుడు; అమితోత్సాహి; +* zebu, n. పెద్ద మూపురం ఉన్న ఒక జాతి ఆవు కాని ఎద్దు కాని bio Bos indicus +* Zen Buddhism, n. మహాయాన బౌద్ధమతంలో ఒక శాఖ; ఈ శాఖలో ధ్యానానికి ప్రాముఖ్యత ఎక్కువ; జెన్ అన్న మాట ధ్యానం నుండి వచ్చినదే;్ +* zenith, n. ఉచ్ఛ; శిరోబిందువు; ఊర్ధ్వబిందువు; ఆకాశంలో నడినెత్తిమీది బిందువు; +* zero, n. సున్న; సూన్యం; పూజ్యం; హళ్లి; హుళక్కి; +* zig-zag, n. చీకిలి మాకిలి; అడ్డదిడ్డం; వంకర టింకర; +* Zinc, n. తుత్తునాగం; యశదం; ఒక రసాయన మూలకం అణుసంఖ్య 30, సంక్షిప్త నామం, Zn); +* zone, n. మండలం; ప్రాంతం; ప్రదేశం; +* zygote, n. యుగాండం; యుగ్మ+అండం; సంయుక్త బీజం; + + +ఈ మూసతో పుస్తకపు పేజీలలో వెతకవచ్చు. bookroot=<పుస్తకపు మూలపేజీ> పరామితి ఇస్తే దాని ఉప పేజీలలో లేకపోతే ఈ మూస వుంచిన పేరుతో ప్రారంభమయ్యే పేజీయొక్క ఉపపేజీలలో వెతకవచ్చు. + + +ఈ మూస కొత్త సభ్యులను వికీబుక్స్ కి ఆహ్వానించుట కొరకు ఉపయోగించవచ్చు. దీనిని వాడుటకు మీరు కొత్త సభ్యుల చర్చా పేజీలో +దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.) +* మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు వికీబుక్స్:అభిప్రాయాలు| ఇక్కడ వ్రాయండి + + + + + +దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.) +* మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు వికీబుక్స్:అభిప్రాయాలు| ఇక్కడ వ్రాయండి + + + + + +ఈ మూస చేర్చిన పేజీలు వర్గం:సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి +తెవికీలో రచ్చబండ సముదాయపందిరిలో దీని గణాంకాలను తద్వారా అవసరమైన పేజీలకు లింకులను చేరే సౌకర్యం కలిగించటమైనది. + + +దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.) +* మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు వికీబుక్స్:అభిప్రాయాలు| ఇక్కడ వ్రాయండి + + +దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.) +* మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు వికీబుక్స్:అభిప్రాయాలు| ఇక్కడ వ్రాయండి + + +* స్థానికీకరణ అనేది వాడుకరి అనుభూతి''లో భాగమే (user experience దీని గురించి రెండు మూడు వాక్యాలలో తెలియజేయాలి. +* కథల, వార్తల అనువాదానికి కంప్యూటరు ఉపకరణాల అనువాదానికి మధ్య భేదాలు తక్కువ చోటు, నిలకడ, సందర్భ లేమి అవసరమయితే దీన్ని మరో పేజీగా చేయవచ్చు. +* తెలుగింపు గురి ఎవరు: తెలుగు వార్తాపత్రికలు, పుస్తకాలు చదవి అర్థం చేసుకోగలిగేవారు తెలుగు కొద్దిగా చదవడం వచ్చినవారు—వారు తెలుగు పత్రికలు చదివి అర్థం చేసుకోలేరు—తెలుగించిన అనువర్తనాలను వాడి నిరాశ చెందే అవకాశం ఉంది. తెలుగులో ఉపకరణాలను వాడేవారు కనీసం తెలుగు పత్రికలు, పుస్తకాలు చదివి అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఉండాలని ఆశించడం తప్పుకాదనుకుంటాను. తెలుగు చదివి అర్ధం చేసుకోగలిగేవారికి తెలుగింపును గురిపెడితే, మాములుగా తెలిసిన మాటలకు కూడా ఆంగ్ల పదాలు వాడే బాధ తప్పుతుంది.) + + +పుప్పొడి అనేది మగ పువ్వులమీద ఉండే జీవాణువుల సమూహం వీటినే ఆంగ్లంలో Pollen అంటారు. ఈ అణువులు సాధారణంగా పసుపు రంగులో ఉంటాయి. వీటిని తమ జాతికే చెందిన ఇ���ర ఆడ పువ్వలమీదకు పంపి ఫలదీకరణం చెందించటానికి మొక్కలు, పువ్వులు ఎన్నో దారులు వెతుకుతాయి, ఎన్నొ ఎత్తులు వేస్తాయి. కొన్ని గాలి వాటం మీద ఆధారపడతాయి, కొన్ని కీటకాలమీద ఆధారపడతాయి. ఇందుకోసం తేనెని ఎరగా వేస్తాయి. ఆ పుప్పొడిని ఆయా కీటకాలు, పక్షులు తేనె తాగేటప్పుడు వాటి శరీరానికి అంటుకునే ఏర్పాటు చేసుకుంటాయి ఆ మొక్కలు. అలా ఆ కీటకాలు, పక్షులూ వేరే వేరే చెట్లమీద, పువ్వులమీదా వాలి ఫలదీకరణం అయ్యేట్లు చేస్తాయి. ఇంకొన్ని మొక్కలు వాటి పువ్వులు కుళ్ళిపోయిన జంతు కళేబరంలాగా వాసన వచ్చేట్లు చేస్తాయి. ఆ వాసనకి ఈగలు చేరి ఆ పుప్పొడిని వళ్ళంతా పూసుకుని వేరే పువ్వులమీదకు వెళ్ళి ఫలదీకరణానికి సహకరిస్థాయి. ఇంకొన్ని మొక్కలు వాటి పువ్వుల్ని ఆడ కీటకాల్లాగా ఆకారాన్ని చేసుకుని, ఇంకా ఆడ కీటకపు వాసనని వెదజల్లి మొగ కీటకాలను ఆకర్షిస్థాయి. ఉదాహరణకి: Bee orchids. + + +# జీలకర్ర పావు టీ స్పూన్ +# కారం ఒక టీ స్పూన్ +* ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. +* ఒక గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. పిండి కాస్త గట్టిగా ఉండేట్లుగా చూడాలి. +* దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అన్నాన్ని వేసి బాగా కలపాలి. +* ఇప్పుడు కడాయిలో నూనె పోసి కాగాక పిండిని ముద్దలుగా చేసి నూనెలో వేసి వేయాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. +* వేడి వేడిగా తింటుంటే రైస్ పకోడీలు చాల బాగుంటాయి. + + +ఆడవాళ్ళ వయస్సు, మగవాళ్ళ సంపాదన అడగకూడదు. +==ఆకలి ఆకలి అత్తగారు అంటే రోకలి మింగమన్నదట== +==ఆడవాళ్ళ వయస్సు, మగవాళ్ళ సంపాదన అడగకూడదు +అత్యాశ గలవాడు చేసె పనులను గూర్చి సామెత వాడుతారు. +==ఆకాశం మీదికి ఉమ్మేస్తే అది మన ముఖం మీదె పడుతుంది== +==ఆకు ఇస్తే అన్నం పెట్టినంత పుణ్యం== +విస్తరాకు ఉన్నప్పుడే భోజనం వడ్డించటం తినటం జరుగుతుంది.అవకాశాలను ఉపాయాలను ఎదుటివారికి తెలియచెప్పి వారి జీవితం సుఖంగా సాగేందుకు తోడ్పడాలని +ఈయ‌న‌ అదే పార్టీకి చెందిన‌ వాడు అని చెప్ప‌డం +టాను అంటే వ‌స్త్ర‌ము యొక్క‌ పెద్ద‌ క‌ట్ట‌ అని +అందులోంచి చిన్న‌ముక్క‌ క‌త్తించినా అది దానిలోదే అవుతుంది +==ఆ మొద్దు లోదే ఈ పేడు== +"అంతా ఒక్క‌టే" అనే అర్థాన్ని క‌లిగించే సామేత‌ ఇది +మొద్దు అంటే పెద్ద‌ కొయ్య‌, అందులోంచి తీసిన‌ చిన్న‌ ముక్క‌ అంటే పేడు +ఒంటరిగా కన్నా మరొకరి సహాయంతో ఎంత పనైనా సులభముగా చేయ వచ్చునన�� ఈ సామెత అర్థం. +ఆంబోతులను ప్రాథమికంగా పని చేయించకుండా, సంతానవృద్ధి కొరకు బాగా మేపి ఆరోగ్యవంతంగా ఉంచుతారు. కానీ, ఇదే విషయాన్ని ఓ పనీపాట లేకుండా తిని తిరిగే వ్యక్తిని ఉద్దేశించి వ్యంగ్యంగా ఈ సామెత ద్వారా దెప్పిపొడుస్తారు. +==ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు== +ఎంతటి అత్యవసరమయిననూ, కొన్ని పనులు పరిమితులను అతిక్రమించి ప్రకృతి విరుద్ధముగా చేయరాదు. ఈ సామెత కూడా అటువంటి ఒక ఉదాహరణను గుర్తు చేస్తోంది. అమితమైన ఆకలిగా ఉన్నదని భోజనము రెండు చేతులతో చేయలేము కదా. కారణము పెట్టే చేతులు రెండైనా తినగలిగే నోరు ఒక్కటే కదా! +==ఆకలి ఆకాశమంత గొంతు సూది బెజ్జమంత== +ఆశ ఎక్కువ అవకాశాలు మాత్రం చాలా తక్కువ +బాగా ఆకలి వేసి ఉన్నప్పుడు తిన్న తిండి ఎలా ఉన్నప్పటికినీ ఎంతో రుచిగా అనిపిస్తుంది. అలాగే బాగా అలసినప్పుడు మంచం, పరుపు, దిండు, ఫ్యాన్ మొదలైనవి లేకపోయినా కటికనేల మీద పడుకున్నా మంచిగా నిద్ర పడుతుంది అనే భావంతొ ఈ సామెత వాడతారు. రైలులో దూర ప్రయాణం చేసేవారు ఎలాగో ఒకలా కునుకు తీస్తారు. వారికే ఇంట్లో అన్ని సదుపాయాలున్నప్పటికీ నిద్ర పట్టపోవచ్చును. +"ఆకొన్న కూడె అమృతము" అని సుమతీ శతకము]]లో ఒక పద్యం ఉంది. +ఆరోగ్యరీత్యా కూడా ఆకలి లేనప్పుడు అన్నం తినకూడదు. శ్రమ చెయ్యకుండా సరైన నిద్ర రాదు. +ఇది ప్రాస కొరకు వాడిన మాట. +పైకి మేకపోతు గాంభీర్యాన్ని ఒలకపోస్తూ, లోపల ఏమాత్రం విషయం లేని వానిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు. +పైకి మేకపోతు గాంభీర్యాన్ని ఒలకపోస్తూ, లోపల ఏమాత్రం విషయం లేని వానిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు. +==ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం== +ఓ బలహీనుడు తనకు తానుగా బలవంతునితో తలపడినా, లేదా బలవంతుడే వచ్చి బలహీనునితో తలపడినా జరిగే నష్టం బలహీనునికే. కావున బలహీనుడు తన పరిమితులను గుర్తెరిగి ప్రవర్తించవలెను. +ఆకు వెళ్ళి ముల్లు మీద పడినా లేదా ముల్లు వచ్చి ఆకు మీద పడినా చిరిగేది ఆకు మాత్రమే. ముల్లుకేమి నష్టము లేదు. +ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వచ్చాడట== +మిక్కిలి కష్టములలో ఉన్న వ్యక్తి వద్దకు మరొకడు సహాయమును ఆశించి వచ్చినపుడు, కష్టములో నున్న వ్యక్తి వ్యంగ్యముగా ఆ రెండవ వ్యక్తికి తన పరిస్థితిని ఈ సామెత ద్వారా తెలియచేయుట పరిపాటి. +==ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు== +స్త్రీ, ��ురుషుల విధులను పూర్వకాలంలో ముందుగానే నిర్వచించారు. దాని ప్రకారం స్త్రీ ఇంటికి పరిమితమయ్యేది, పురుషుడు సంపాదనకై బయటకు వెళ్ళి వచ్చేవాడు. బయటకు వెళ్ళే స్త్రీని చెడుగానూ, ఇంటిపట్టునే ఉండే పురుషుణ్ణి అసమర్ధునిగానూ చిత్రీకరించేవారు. ఈ భావాన్నే ఈ పై సామెత తెలుపుతుంది. +==ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు +ఆడపిల్ల పెళ్ళి, నీటి జాడే కానరాని బావి రెండూ అత్యంత కఠినమయిన కార్యములు అని ఈ సామెత తెలుపుచున్నది.వరకట్నం, బంధువులకు, స్నేహితులకు పెట్టిపోతల వంటి ఖర్చులూ ఆడపిల్ల తండ్రిని విపరీతంగా కుంగదీస్తాయి.ఎంతలోతుగా వెళ్ళినా బావి అడుగు తగలకపోతే బావి తవ్వుతున్న వ్యక్తికి ప్రాణాంతకంగా పరిణమించే స్థితి కలిగినట్లుగానే, ఆడపిల్ల పెళ్ళికోసం పిల్ల తండ్రి డబ్బు సమకూర్చటం కానీ, పిలుపులు, మర్యాదలు వంటివి చెయ్యటంకానీ మొదలుపెడితే వాటికి ఎక్కడా అంతం ఉండదని, అలా అవి పెరిగిపోతూ చివరకు ఆ తండ్రిని శారీరకంగా, మానసికంగా ఎంతగానో పిండివేస్తాయని ఈ సామెత భావన. +[[వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అనే సామెత కూడా ఇదే కోవకు చెందినది. మనమేదైతే కోరుకుంటున్నామో అది అయాచితంగా, అప్రయత్నంగా లభ్యమైతే ఈ సామెతను ఉటంకిస్తారు. +తాను సరిగా పాట పాడలేక, మద్దెలను బాగా వాయించలేదని నిందించాడు ఓ ఘనుడు. తన అసమర్ధతకు ఇతరులను నిందించే వాణ్ణి ఉద్దేశించి ఈ సామెతను వాడటం పరిపాటి. +మద్దెల దరువుకు తగినట్టు నాట్యం చేయాలి. అందుకే అతడు మద్దెల వాయిస్తున్నాడు. ఆడే వాడు మద్దెల దరువుకు తగినట్టు ఆడడంలేదు. ఏమయ్యింది అలా ఆడు తున్నావంటే అతడు "నేను బాగానె ఆడుతున్నాను, నీ మద్దెలే ఓడు బోయి. సరిగా పలకడం లేదు" అన్నాడు. అనగా తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఇతరులపై నెపం మోపేవారిని గురించి ఈ సామెత పుట్టింది ఆడ లేక మద్దెల ఓ డన్నట్టు" +స్త్రీలు పురుషులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేరు. మనసులో ఒకటి ఉంచుకొని పైకి మరోటి చెప్పుతారు. అంటే ఆడవారు పురుషులకు తేలికగా అర్ధం కారని ఈ సామెత చెబుతుంది. +ఎప్పుడు చూసినా తొందరగా పని ముగించుకోవాలని చూసేవాడు లోతుగా ఆలోచించలేడని దీని భావం. +==ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు== +వెనకటికి ఆత్రంగా ఉన్న పెళ్ళికొడుకు ఒకడు తాళి తీసుకొని కాబోయే భార్యకి బదులు అత్తకి కట్టేశాడు. తొందరపాటుతో చేసే పనులు ఎప్పుడూ ���క్రమంగా జరగవు అని ఈ సామెత చెబుతోంది. +ఆదివారం అందలం ఎక్కనూ లేదు, సోమవారం జోలె కట్టనూ లేదు== +జీవితంలో ఎప్పుడూ ఒకే స్థితిలో ఆనందంగా కాలం గడపటం +==ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట== +పెళ్ళి అయిన తరువాత శోభనం ముచ్చట జరుపుతారు. శోభనం కార్యక్రమంలో ముందు పూజ, తరువాత ముత్తయిదువులకు తాంబూలం వంటి ఆచారాలు ఉంటాయి. ఇవి అయినతరువాతనే అమ్మాయిని అబ్బాయిని గది లోకి పంపుతారు. ఈలోపున, పెళ్ళికొడుకుకి ఆత్రం ఎక్కువయి, అంతవరకు ఆగలేక, పేరంటానికి వచ్చిన మహిళల వెంట పడ్డాడట. +ఈ సామెత ఏదయినా పని సాంతము జరిగేవరకు ఆగలేక, ఫలితం కొరకు ఊరికే ఆత్రపడే వారి గురించి గేలి చెయ్యటానికి ఈ సామెతను వాడతారు. +ఏదైనా పని మొదలు పెట్టిన వెంటనే విఘ్నాలు కలిగితే ఈ సామెతను వాడతారు. +దేవాలయాలలో జరిగే ఉత్సవాల సమయంలో ఉత్సవ మూర్తులకు వివిధ వాహనాలపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. గ్రామోత్సవ సమయంలో వాహనాన్ని కొంతమంది భక్తులు తమ భుజంపై మోస్తూ ఉంటారు. +గ్రామోత్సవం జరుగుతున్నంత సేపు వాహన బరువు మోతాన్ని తమ భుజముపై ఉంచడం చాలా కష్టం కాబట్టి కొంత వెసులు బాటు కోసం ఏర్పరచుకున్న పరికరాన్ని హంసపాదు అంటారు. హంసపాదు T, Y ఆకారానికి మధ్యస్తంగా ఉంటుంది. వాహనసేవ జరిగే సమయంలో వాహనాన్ని సరిగా నిలబెట్టేందుకు 4 నుంచి 8 హంసపాదులు అవసరమవుతాయి. +ప్రారంబంలోనే అవాంతరం ఏర్పడితే ఈ సామెతను ఉపయోగిస్తారు. +ఆపదలలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్మరించి, ఆపదల నుంచి బయటపడ్డ నాడు దేవుని మరవటం అన్నది స్వార్థం, అవకాశవాదం అని ఈ సామెత ద్వారా తెలుయుచున్నది. +ఎవరికైనా ఆపదలోనె దేవుడు గుర్తుకి వస్తాడు. అన్ని సక్రమంగా జరుగు తుంటే దేవున్ని మరిచిపోతారు. ఇది మానవ నైజం. ఆ విధంగా పుట్టినదె ఈ సామెత. +==ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు== +ఆ మరకా ఈ మరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి== +ఆయనే ఉంటే మంగలెందుకు అనేది తెలుగు భాషలో వాడే ఒక సామెత అనవసరపు సలహాలు ఇవ్వరాదు అనే దానికి ఈ సామెత ఉదాహరణ. +పాత కాలం నాటి ఒక ఆచారం ఆధారంగా వాడుక లోకి వచ్చిన సామెత ఇది. పూర్వకాలంలో భర్త చనిపోయిన స్త్రీ బొట్టు పూలు ఆభరణాలను విసర్జించటంతో పాటు నెత్తిమీద జుట్టును కూడా కూడా త్యజించవలసి వచ్చేది వితంతువులు జుట్టు పెంచుకోకూడదనే నియమముండేది నిందార్థకంగా వాడే "బోడి ముండ" అనే మాట కూడా ఈ ఆచారంలో నుంచి పుట్టిందే. వాళ్ళకున్న కట్టుబాట్లకు తోడు వీధిలో వాళ్ళకు ఎదురైన వాళ్ళు "అపశకునం" అని ఈసడించుకునే వాళ్ళు. అందువల్ల జుట్టు పెరిగినప్పుడల్లా వితంతు స్త్రీలు గుండు చేయించుకోవడానికి మంగలి దగ్గరకు వెళ్ళలేరు. అందుబాటులో ఉన్న చిన్న పిల్లలను పంపి మంగలిని ఇంటికి పిలుచుకురమ్మనే వాళ్ళు. ఒకసారి అలా జుట్టు పెరిగిన వితంతువు ఒకామె మంగలికి కబురు చేయబోతే, అందుబాటులో చిన్న పిల్లలెవరూ లేరట. అప్పుడామె "నా మొగుడే బ్రతికి ఉన్నట్లైతే వెళ్ళి పిలుచుకు వచ్చేవాడు కదా అని వగచిందట ఆయనే ఉంటే తాను గుండు చేయించుకోవలసిన అవసరమే ఉండేది కాదని మరిచిపోయి. +ఒకవితంతువు గుండు చేయించుకోవటం కోసం మంగలిని పిలువవలసిందిగా దారిన పోయే దానయ్యను అడిగింది. అతను విసుగుగా నాకు చెప్పకపోతే మీ ఆయనకు చెప్పరాదా అన్నాడు. దానికి ఆవిడ ఆయనే ఉంటే మంగలి ఎందుకు అని అన్నది. అంటే ఆయన (భర్త) ఉంటే మంగలిని పిలిచి గుండు చేయించుకునే అవసరమే రాదుకదా! ఉచిత సలహాలు ఇవ్వటం ఎందుకు? అనేదానికి ఈ సామెత చెబుతారు. +ఇలా కార్య-కారణ సంబంధాన్ని మరచిపోయి ఆలోచించేటప్పుడు ఈ సామెతను వాడుతారు. +'ఆయన అనగా ఆమె భర్త) ఉన్నప్పుడు మంగలితో అవసరమేమిటి? ఏదైనా పూర్తికాని పనిని ఇలా ఫలాన వస్తువుతోనో, ఫలానా వ్యక్తుల సహాయ సహకారాలతో, ఇలాకాకుండా వేరే విధంగా సాధించవచ్చుకాదా అన్నవారికి అసహనంతో ఈ సామెతను ఉదహరిస్తారు. ఉదాహరణకు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే, గ్యాసు పొయ్యిమీద చెయ్యవచ్చుగదా అంటే "గ్యాసు పొయ్యే ఉంటే కట్టెల పొయ్యి ఖర్మ యెందుకు"? +ఒక వ్యక్తి బాగా డబ్బు అవసరం ఉండి బ్యాంకుకు వెళ్ళి అప్పు అడిగాడు. అప్పుకు హామీగా ఏవైనా "ఫిక్స్‌డ్ డిపాజిట్లు" చూపగలరా అని బ్యాంకు మేనేజరు అడిగాడు ఆయనే ఉంటే మంగలెందుకు నా దగ్గర డబ్బులు నిలవ ఉంటే అప్పు ఎందుకడుగుతాను? అని అర్ధం. +తన ఆర్థిక స్తోమతను బట్టి అలవాట్లు లేని వారిగురించి ఈ సామెత వాడతారు పిండికొద్ది రొట్టె అనే సామెత దీనికి సమానార్థం]] +దీపం ఆరిపోయేముందు తనలో ఉన్న తైలాన్ని (శక్తి) ఒక్కసారిగా మండించి పెద్ద వెలుగు వెలుగుతుంది. అదే విధముగా నిజజీవితంలో సర్వశక్తులు ఒడ్డి పోరాడి ఓటమి ముంగిట ఉన్న వానిని ఉద్దేశించి ఈ సామెతను వాడుదురు. +==ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు== +విభిన్నమయిన వ్యక్తులు కలిసి కొంతకాలం ఉంటే, ఒకరి గుణాలు (మంచైనా, చెడైనా) మరొకరికి అలవడతాయి అని చెప్పటమే ఈ సామెత యొక్క సారాంశము. +==ఆరు రాజ్యాలు జయించవచ్చును కానీ అల్లుణ్ణి జయించలేము== +అల్లుళ్లతో విసిగి వేసారి వారిని సంతృప్తిపరచటం తమవల్ల కావటం లేదని అనుకోటం. ఇది చాల కష్టమైన పని అని అర్థం చెప్పడానికి ఈ సామెతను వాడుతారు. +[[ఆరోగ్యం Health) లేకుండా ఎన్ని సిరిసంపదలున్నా వాటిని అనుభవించలేము. ఆరోగ్యం లేని భాగ్యము దరిద్రంతో సమానము. కాన ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు అనుభవజ్ఞులైన పెద్దలు. +వివరణ దేవ దానవులు పాల సముద్రాన్ని చిలికి నప్పుడు అమృతము పుట్టింది. దానిని దేవ దానవులకు పంచడానికి శ్రీహరి పూనుకున్నాడు. మహావిష్ణువు ముందుగా దేవతలకు అమృతాన్ని పంచుతు మధ్యలో దానవులు వస్తే ఆగమని చెప్పుతూ వచ్చాడు. వారు ఆలాగె ఆగారు. చివరకు అమృతం అంతా దేవలకే సరిపోయింది. దానవులకు మిగలలేదు. తీసుకోవడములో ఆలస్యం చేస్తే అమృతం విషం అవుతుందని ఈ సామెత పుట్టింది. +ఆలస్యం చేస్తే అమృతం అయినా విషం అవుతుందని ఈ సామెత]]కు అర్థం. చేయవలసిన పని నిర్దిష్ట సమయానికి చేయని యెడల జరుగు అనర్థమును హెచ్చరించు సందర్భములో ఈ సామెతను వాడెదరు. +పెళ్ళి అయిన తర్వాత అప్పటి వరకు అమ్మ చీర కొంగు పట్టుకుని తిరిగే మగ పిల్లలు పెళ్ళాం మోజులో పడి అమ్మని నిర్లక్ష్యం చేస్తారు.ఆలి మాటకి విలువ ఇస్తూ అమ్మ మాటని పెడ చెవిన పెట్టే కొడుకులను ఉద్దేశించి ఈ సామెత వాడతారు. ఆలి తీపి (బెల్లం అమ్మ ఘాటు (అల్లం) లా అనిపిస్తోంది అని ఈ సామెత అర్ధం. +==ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట== +కొంత మంది తను చేయాల్సిన కనీస బాధ్యతలు చేయడం కూడా ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటారు. భార్యను పోషించడం భర్త కనీస బాధ్యత. తను, తన సంసారం కాకుండా, లోకానికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తే అర్ధం ఉంది. కాని, తన వాళ్ళకి పెట్టుకుని లోకాన్ని ఉద్దరించినట్టు మాట్లాడే వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ సామెత చెప్తారు. +==ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట +తన ఇంటిని చక్కదిద్దుకోకుండా ఊళ్ళో వాళ్ళ బాగోగులు చూసొస్తా అంటూ బీరాలు పలికేవాడిని ఉద్దేశించి పలికే సామెత ఇది. ఇతరులకు నీతి చెప్పే ముందు నిన్ను నీవు సరిదిద్దుకో అన్న భావంలో కూడా ఈ సామెతను వాడవచ్చు. +ఏమీ లేకుండా గాలిలో మేడలు కట్టేవారిని గురించి ఇలా అంటారు. +ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే అసలు పెళ్ళి చేసుకోకుండా, ఆవిడకి కడుపు రాకుండానే, కొడుకు పుట్టక ముందే వాడికి ఏమి పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నాడు అని భావము. +ఈ సామెత]]కు ఒక కథ చెబుతారు (చాలా రూపాంతరాలున్నాయి) +ఒకడు ఒక మట్టి ముంతలో పెట్టుకొని పేలాల పిండి అమ్మడానికి వెళుతున్నాడు. దారిలో ఒకచెట్టుక్రింద ఆగి విశ్రాంతి తీసుకుంటూ పగటికలలు కనసాగాడు. +ఈ పేలపిండి అమ్మితే నాకింత డబ్బొస్తుంది. దానితో మరింత పిండి కొని, అమ్మి బాగా డబ్బు సంపాదిస్తాను. ఆ డబ్బుతో ఒక ఆవునుకొని, పాల వ్యాపారం చేసి, గొప్ప పశుసంపదను సాధిస్తాను. ఇంకా వ్యాపారాలు చేసి, బాగా ధనవంతుడనై మేడలూ, మిద్దెలూ, వస్తువాహనాలూ కూర్చుకొంటాను. +అప్పుడు నాకు చక్కని చుక్కతో పెళ్ళి అవుతుంది. మాకు పుట్టే కొడుకుకు సోమలింగం అని పేరు పెట్టుకుంటాను. ఎప్పుడైనా నా భార్య కొడుకును కోప్పడితే, దానిని ఇలా కొడతాను అనుకొంటూ వాడు తన కాలును జాడించాడు. దాంతో పేలపిండి ముంత కాస్తా ముక్కలయ్యింది. +==ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా +తల్లి తండ్రులు పిల్లలకు మంచిబుద్ధులు చెప్పాలి. కొంతమంది పెద్దవాళ్ళు పెడత్రోవన పడుతుంటారు వారిని చూసి వారి పిల్లల్లుకూడా కొన్ని సమయాలలో పెడత్రోవన పడ్తే వారిని చూసి ఈసామెత చెప్తారు. +ఇదే అర్థంతో మరొక సామెత ఉంది. అది అసలు కన్న కొసరు ఎక్కువ మరొక సామెత కోడి చారణా మసాలా బారణా]] +ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో +==ఆవలింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు== +ఎవరైనా ఆవలించారంటే పక్కన వాళ్ళకు కూడా ఆవులింతలు రావడం మీరు చాలా సందర్భాలలో గమనించే ఉంటారు. కానీ తుమ్ముకు అలా కాదు. ఈ సామెతకు ఆధారం అదే. +==ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం== +చిన్నపాటి కలయిక లేక కొద్దిపాటి సాంగత్యం చేతనే ఎదుటి వ్యక్తిని పరిపూర్ణముగా ఆకళింపుచేసుకొను గుణముగల వ్యక్తిని ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు. +కడుపులో ఉండే ప్రేగులను నోటి ఆవులింత ద్వారా లెక్క వేయ గల సమర్థత కల వ్యక్తి (బాగా సూక్ష్మ దృష్టి కలవాడు) అని భావము. చిన్న సంకేతం ద్వారా ఏంతో గొప్ప విషయాన్ని గ్రహించగల మేధావి అని అర్థము. +==ఆశ సిగ్గెరుగదు ఆకలి రుచి ఎరుగదు== +దురాశను అణచుకోలేక చెయ్యకూడని పనులు చేస్తూ దోషికావటం.ధర్మసత్రాలలో అన్నదానం జరుగుతుంటే పూటకూళ్లమ్మ పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని అమ్ముకొంటూ ఒక్కముద్ద దానం చెయ్యమని ఎవరడిగినా ధనాశతో కసిరికొడుతుందే తప్ప దానం చెయ్యదు. ధనాశతో ఉన్నవారు దానధర్మాలు చెయ్యలేరు అని ఈ సామెత అర్ధం. +తన ఆర్థిక పరిస్థితికి మించి ఆశలు పెట్టుకునే వారిని గురించి ఈ సామెత వాడతారు. + + +సామెతలు లేదా లోకోక్తులు Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అంటారు సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. +రచయితలు గమనించండి క్రొత్త సామెతలు అక్షర క్రమంలో చేర్చండి. ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది. సంక్షిప్తమైన వివరణ ఈ పేజీలోనే వ్రాయవచ్చును. సుదీర్ఘమైన వివరణాదులు వ్రాయదలచుకొంటే ఆ సామెతకు వేరే పేజీ ప్రారంభించండి + + +కంప్యూటరు తెరపై మనం చూసేవాటిలో, లేదా అది మనకు వినిపించే మాటలలో ప్రోగ్రాములు నడిచేటప్పుడు మాత్రమే తెలిసే సమాచారం కొంత ఉంటుంది. ఉదాహరణకు వాడుకరి పేరు (ఎవరు ఈ ప్రోగ్రామును వాడుతున్నారో ముందే తెలియదు ఫైలు పరిమాణం (ప్రతి ఫైలు పరిమాణం వేరుగా ఉంటుంది ప్రస్తుత ఉష్ణోగ్రత. ప్రోగ్రాములు వ్రాసేటప్పుడు ఆయా పదబంధాలలో వీటి విలువలను నేరుగా వాడకుండా ప్లేస్‌హోల్డర్లు వాడతారు. ప్రోగ్రాము నడిచినపుడు ఆ ప్లేస్‌హోల్డర్ల స్థానంలో అసలు విలువను నింపుతుంది. కనుక స్థానికీకరణ చేసేటప్పుడు ఈ ప్లేస్‌హోల్డర్లను అనువదించకుండా అలానే వదిలేయాలి. +అయితే, ప్రోగ్రామింగు భాషను బట్టీ ఆయా అనువర్తనాలు వాడిన అంతర్జాతీయీకరణ విధానాన్ని బట్టీ ఈ ప్లేస్‌హోల్డర్లు, వాటి రూపాలు మారవచ్చు. ఇవి కొన్ని ఉదాహరణలు: +అనువదించదగిన పాఠ్యం క్రింద ఉదాహరణలలో పచ్చరంగుతో గుర్తించబడింది. + + +శివలింగానికి   అంకము (సంఖ్యా విలువ కానీ పొంకము (గర్వము ఉండవు అని అర్థం అంటే అది మిక్కిలి గొప్పది అని మానవ సంఖ్యా శాస్త్రం లేదా సాధారణ గర్వానికి అతీతం అని వివరణ . +ఈశ్వరుని గొప్ప తనాన్ని తెలియచేయుటకు వాడుతారు. +==అంకెకు రాని ఆలి కీలెడలిన కాలు== +భార్య అంటే భర్తను అర్థం చేసుకొని భర్తకు అణిగిమణిగి ఉండాలి అని నానుడి అలా ఉండకపోతే కాపురం నిలువదు అని అందుకే భార్య అంకెకు రావడం (వశమగు ఉండడం) మంచిది. అలా వశమవ్వకపోతే, ఎడలి పోయిన (విడిపోయిన) కీలు లాగ బాధిస్తూ ఉంటది అని వివరణ ఆ కాలితో ముందుకి సాగలేము వెనక్కు వెళ్లలేము. +==అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు== +సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు కాని ఎన్ని చేసిన ఏదోకారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు. +ఈ జాతీయానికి సరైన అర్ధం మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నా ఏ అవకాశం అందని పరిస్థితి. అంగడి అంటే సరుకులు అమ్మే చోటు. కొత్త అల్లుడు అత్తవారి ఇంటికి వచ్చినపుడు మర్యాదలు సహజం. కొన్నాళ్ళకు పాతబడ్డ ఆ అల్లుడు అత్తవారి ఇంట్లోనే తిష్ట వేస్తే ఆ మర్యాదలు పెద్దగా జరగవు. అప్పుడు అంగట్లొ అన్నీ ఉంటాయి కాని అత్త వారింట్లో ఎవరూ వాటిని కొనరు. అల్లుడికి పెట్టరు. అలా రూపొందినదే ఈ సామెత. ప్రభుత్వ నిధులు ఎన్ని ఉన్నా ఆ ఫలాలు సామాన్యులకు అందవు. ఈ సందర్భంలో కూడా ఈ సామెతను గుర్తు చేసుకోవచ్చు. +మన దేశంలో అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నాయి. కాని లంచగొండితనం వలన దేశం అభివృద్ధి కావడం లేదు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది'' +==అంగటి వీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టావురా కొడకా అన్నట్లు== +దీనికి పెద్దగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంగట్లో (ఇంటి బయట లేదా దారిలో) ఏదయినా దెబ్బ తగిలి అబ్బా అంటే ఏ అబ్బని తలిచావురా అని అన్నట్టు. దీనిని నలుగురిలో మాట్లాడేప్పుడు భాషా విశేషాలను గుర్తించి మాట్లాడాలి లేదంటే దానిని గుర్తించి కించపరిచే వాళ్ళు వేచి ఉన్నారు అని లేదా ఒకడి నొప్పి ఇంకొకడి వెటకారానికి నాంధి అనికూడా చెప్పుకోవచ్చు. +==అంగట్లో అరువు తల మీద బరువు== +అరవు అనగా అప్పు అని అర్థము అంగట్లో అప్పువుంటే తలమీద బరువు వున్నట్లే అని అర్థము +==అంగట్లో అష్ట భాగ్యం అల్లుని నోట్లో అష్ట దరిద్రం== +అన్నీ వున్నాయి కాని అల్లుని నోట్లో శని వున్నది అనే సమానార్థంతో ఈ సామెతను వాడుతారు. +ఏదైనా సరకులు అవసరానికి వాటిని కొనేవారికన్న తక్కువైతే ఆ వస్తువుకొరకు అందరు ఎగబడి అంగడికి ఎగబడతారు అప్పుడు దాని ధర కూడా అమాంతం పెరిగి పోతుంది. అవే వస్తువులు అవసరానికన్నా ఎక్కువయితే అవే వస్తువులు అనేక రాయితీలతో మన ఇంటిముంగిటకే వస్తాయనే అర్థంలో ఈ సామెతను వాడుతారు. +పయోముఖ విష కుంభం అనే సంస్కృత సామెత లాంటిదే ఇది కూడాను. నోటితో తియ్యని మాటలు మాట్లాడుతున్నా మనసులో మాత్రంచాల చెడు భావన వున్నదని అర్థం. +ఇది కూడా పై సామెత లాంటి అర్థాన్నే ఇస్తుంది. పైపైన మంచిగా మాట్లాడుతు లోన చెడు భావన కలిగి వున్న వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు. +స్వంతంగా ఎంత బలం వున్నా ఎన్ని వున్నా దైవ బలం కూడా వుండాలని దీని అర్థం. +==అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే== +అంచు డాబే గాని కోక డాబు లేదు== +[[కోక అనగా చీర అని అర్థం. దానికున్న అంచు మాత్రం మహా బాగావుండి అసలు చీరలో పస లేదు అని అర్థం. ఇలాంటి సమానర్థంలో మరొక సామెత కూడా ఉంది పైన పఠారం లోన లొఠారం]] +అంటుకోను ఆముదం లేకుంటే మీసాలకు సంపెంగ నూనెట== +ఇదే అర్థంలో మరొక సామెత వుంది: అది: మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె +అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టవచ్చు== +ఒంటరిగా కన్నా మరొకరి తోడుతో పనులను చక్కగా అవుతాయి ఆదుకొనేవారుంటే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా చెయొచ్చని +ఈసామెత అర్థం. దీనికి సమానర్థంతో ఐకమత్యమే మహా భలము అనే సామెతకూడ ఉంది. +సహాయంగా ఎవరైనా వుంటే ఎంతపనైనా చేయ వచ్చు అనే అర్థంలో ఈ సామెతను వాడుతారు ఐక మత్యమే మహాబలము అని దీకిని గూడార్థము. +==అంతనాడు లేదు, ఇంతనాడు లేదు,సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు== +సాధారణంగా ఏటువంటి అలంకారాలు చేసుకోనివారు ఏమైనా ఉత్సవాలు, ఊరేగింపులు, పదిమందిలో కలిసే పెళ్ళిళ్ళలో మాత్రం విశేషంగా అలంకారాలు చేసుకొని అందరిలోకి ప్రత్యేకంగా కనిపించాలని ప్రయత్నాలు చేస్తుంటారు.ఒకామె చిన్నప్పుడుగానీ, మరీ వయస్సులో ఉన్నప్పుడుగానీ, మరి ఏ ఇతర సందర్భాలలోగానీ పెద్ద కొప్పు పెట్టి, అందంగా కనిపించడానికి ప్రయత్నం చేయలేదట. ఆ ఊరిలో సంత జరుగుతుందని తెలిసి ఆ సంతలో ఎంతోమంది కొత్తకొత్త వారు వస్తారని వారందరి చూపు తనపైన పడాలని అందంగా పెద్దగా ఉండే కొప్పు పెట్టుకొని వెళ్ళిందట. సందర్భానుసారంగా మాత్రమే అలంకరించుకోవాలని ఈ సామెత +==అంత ఉరుము ఉరిమి ఇంతేనా కురిసేదన్నట్టు== +అమితంగా వాగ్దానాలు చేసి చాలా స్వల్పంగా దానాలు చేసేవారిని గురించి, ఎంతెంతో పనిచేస్తామని చెప్పి చాలాకొద్దిగా పనిచేసేవారిని గురించి, ఎక్కువగా హెచ్చులు చెప్పి తక్కువ పని చేసే పద్ధతి సందర్భంగా వాడె సామెత ఇది. ఇలాంటిదే మరొక సామెత ఇంత ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు]] +==అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా +లావుగా వున్నంత మాత్రాన అన్ని విద్యలు తెలిసివుండవు. ఒక అమాయకుడు లావుగా వున్నతన్ని చూసి ఇతడు అంత లావున్నాడు కనుక అన్ని విద్యలు తెలిసి వుంటాయని భావించి తనకు తేలు కుట్టింది మంత్రం వేయమని అడిగాడట. ఆ లావుటతను తనకు తెలియదనగా "అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా" అని వెళ్లి పోయాడట అమాయకంగా. +==అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు== +ఒక పనిని మొదలుపెట్టే ముందు దాని పర్యవసానాలు బాగా ఆలోచించి, ముందుగానే ఊహించి, సంబంధిత వ్యక్తులతో దానిని గురించి చర్చించి మొదలుపెట్టమని చెప్పేందుకు ఉద్దేశించినదే ఈ సామెత. +మనకి అందవు లేదా దొరకవు అని తెలిసినా వాటి మీద ఆశ పెట్టుకోడం అనేది అందని పండ్లు కోసం అర్రులు చాచటం లాంటిది అని అర్థం. +ఒక నక్క ఒక రైతు యొక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది.అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి.ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు, నోరు ఊరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది. మామూలుగా అయితే ఆనక్కకు పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి ఆ పళ్ళను అందుకోబోయింది. కానీ, పాపం దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్ష పళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక యెగరలేక విసిగి ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి అని గొణుక్కుంటూ వెళ్ళిపొయింది. అలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి అది దొరకక పోతే, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశామో అది ఎంత చెత్తదో, ఎంత పనికిరాదో చెప్పటం మొదలుపెడతాము. అప్పుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు. +==అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం== +తాము శ్రీవైష్ణవులము, మాంసాహారం తినము అని చెప్పుకుంటూ బుట్టలో చేపలన్నీ ఖాళీ చేసారు అని అర్ధం. అందరూ గొప్పవాళ్ళే కాని చేసేవన్ని తప్పుడు పనులే. ఎవరికి వారే తమకి తాము గొప్ప వాళ్ళమని చెప్పుకుంటారు కాని ఎవరి తప్పులు వారికే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ సామెత వాడుతార +==అందితే జుట్టు అందక పోతె కాళ్లు== +అవకాశవాది తన పని పూర్తి చేసుకోటానికి ముందు గడ్డం పట్టుకు బ్రతిమిలాడతాడు, అయినా పని కాకపోతే కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడటానికి కూడా వెనకాడడు. ఈ సామెత ఒక అవకాశవాది తత్వాన్ని తెలియచేస్తోంది. +ఐకమత్యమే మహా భలము అని దీనికి అర్థము. +==అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత +==అంత నీతే వుంటే ఇంత సంతెందుకు +==అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా +ఇదే అర్థంలో మరొక సామెత వున్నది: అది ఇంతలావున్నావు తేలు మంత్రం తెలియదా +==అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు== +మానవులలో ప్రతి విషయము పూర్తిగా తెలిసిన వాడున్నూ, ఏవిషయము కొంతైనా తెలియని వాడున్నూ లేడని దీని అర్థము. +==అంతా బాపలే, మరి కోడిపెట్ట ఏమైనట్లు +దీనికి సమానమైన అర్థంలో మరొక సామెత ఉంది అందరూ వైష్ణవులే బుట్టలో రొయ్యలు మాయం అయ్యాయి బాపన వాళ్లైనా చాటు మాటుగా మాంసం తింటారని దీనికి గూఢార్థము. +==అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్ళు లేరు== +[చూపులకు చుట్టాలు రమ్మంటే కోపాలు అనే సామెత లాంటిదే ఈదీను. +==అందం చందం నావంతు ముద్దూ మురిపెం నీవంతు అన్నదట== +==అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు== +అకార పుష్టి నైవేద్య నష్ఠి అనే సామెత లాంటిదే ఇదీను. +మనకి అందవు లేదా దొరకవు అని తెలిసినా వాటి మీద ఆశ పెట్టుకోడం అనేది అందని పండ్లు కోసం అర్రులు చాచటం లాంటిది అని అర్థం. +==అందరికీ శకునం చెప్పే బల్లి తాను బోయి కుడితి తొట్లో పడ్డట్లు== +అందరికి రాబోవు కష్టాలను చెప్పేవారు తమకు రాబోవు కష్టాలను ఎరుగరు అని దీని అర్థము. అనగా ఈ శకునాలు వట్టి భూటకమని అర్థము. +==అందరికీ అన్నం పెట్టే వాడు రైతే== +==అందరినీ మెప్పించడం అలవి గాని పని== +అందరినీ మెప్పించడము ఎంతమాత్రము వీలుకాదని దీని అర్థము. ఎంత మంచి విషయమైనా దాన్ని కూడా వ్వతిరేకించే వాడొకడుంటాడని దీని భావము. +==అందరూ ఒక ఎత్తు అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు== +==అందానికి పెట్టిన సొమ్ము ఆపద]]కు అడ్డం వస్తుంది== +==అందాల గంధాలు, అధరాల మధువులు కౌగిలింతల పాలన్నట్లు== +==అందాల విందులు, అధరాల మధువులు నీకే అన్నదట== +==అందాలు నావి సంబరాలు నీవి అందిట== +అవకాశాన్ని బట్టి ఎదిరించడమో, కాళ్ల బేరానికి రావడమో చేసె వారిగురించిన సామెత ఇది. ఇదే సమానార్థంలో మరొక సామెత ఏ ఎండకాగొడుగు పట్టినట్టు. +అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి ఏ ఎండకు ఆ గొడుగు పట్టి నట్టు సమానర్థంలో మరొక సామెత +[అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే సామెతకు సమానర్థ���లో ఈ సామెతను వాడుతారు. ఎంత ప్రయత్నించినా ద్రాక్ష పళ్ళు అందక పోతే తన ప్రయత్నము విపలమైనదని ఒప్పుకోక ఆ ద్రాక్ష పళ్ళు పుల్లనివి అని తన ఓటమిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం ఇది. +==అందీ అందని పరువాలు ఉసికొలిపే కాముని కవ్వింతలు== +కొంతమంది ఎంత వివరంగా విషయాన్నంతా చెప్పినా గ్రహించలేరు. అలాంటి వారి జ్ఞానాన్ని సూచించడానికి ఈ సామెత ఉపకరిస్తుంది. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఎంత శ్రమపడినా శ్రమను ఎదుటివారు గుర్తించక నిర్లిప్తంగా, నిరాసక్తంగా తోసివేసినప్పుడు కూడా ఈ సామెతను సందర్భానుసారం చెప్పటానికి ఉపయోగపడుతుంది. అంధుడికి ఎంత మాత్రమూ ఎదుటి వస్తువులు కనిపించక పోవటం సర్వసాధారణం. అటువంటిది అందాన్ని ఒకటికి పది సార్లు చూసుకోడానికి నేత్ర దృష్టి బాగా ఉన్నవారు ఉపయోగించే అద్దాన్ని అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన. +అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను పాండిత్యం]]తోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన.. +==అంబటిలోకి ఉప్పే లేకుంటే పిండి వంటల మీదకు పోయిందట మనసు== +తాను తాగే అంబలిలో ఉప్పు తక్కువైనందున అందులో ఉప్పు కూడా తెచ్చి వేసుకోలేని వాడు పిండి వంటలు కోరుకున్నట్లు అని దీనికి అర్థము. +==అంబలా అంటే ముఖాలే చెప్తాయి అన్నట్లు== +గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు వంటిదే ఈ సామెత. తన స్థాయికి మించి పనులు చేసే వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు. +లేక లేక పుట్టిన పిల్లలను గారాబంగా పెంచినప్పుడు ఈ సామెత వాడతారు +==అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్లు== +అ ఆ" లు రావు గానీ అ���్రతాంబూలం కావాలట== +అనర్హులు కూడా అందలం ఎక్కాలనే ప్రయత్నం చేయడాన్ని ఈ సామెత తెలియ జేస్తుంది. +అ ఆ" లు రావు గానీ అమరం చదువుతాడట== +==అకట వికటపు రాజుకు అవివేకపు ప్రధాని, చాదస్తపు పరివారము== +==అక్క ఆరాటమే గానీ బావ బ్రతకడన్నట్లు== +==అక్క కాపురం అడగక్కర లేదు చెల్లెలి కాపురం చెప్పక్కర లేదు== +==అక్కచెల్లెళ్ళకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు +సొంత వాళ్లకు, అయిన వాళ్లకు పెట్టిన ఖర్చును కూడా లెక్కగడితే ఇలాంటి సామెతలు వాడతారు. +==అక్క మనదైతే బావ మన వాడవుతాడా +==అక్కర వున్నంతవరకూ ఆదినారాయణ అక్కఱ తీరిన తర్వాత గూదనారాయణ== +దీనికి సమానర్థంలో మరికొన్ని సామెతలు: 1. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. 2. ఏరు దాటునంత వరకు ఓడ మల్లయ్య గారు ఏరు దాటాక బోడి మల్లయ్య. +ఇది సుమతీ శతక పద్యంలోని భాగము అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీయని వేల్పు, యుద్ధమునందు పారిపోయిన గుర్రము మొదలగు వాటిని వదిలి పెట్టాలని దీని అర్థము. +==అక్కర తీరితే అల్లుడు అశుద్ధంతో సమానమన్నట్లు== +ప్రతి వస్తువు కూడా పనివచ్చేదే అనే అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తారు శ్రీ శ్రీ కవితలోని కొన్ని మాటలను ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు: అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవితకనర్హం +అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా +అగడ్త]]లో పడ్డ పిల్లి]]కి అదే వైకుంఠం== +అగడ్త అనేది పూర్వం కోటల పరిరక్షణకు ప్రహారి చట్టూ తీసిన గొయ్యి లాంటిది. అగడ్తలు చాలా లోతుగా ఉంటాయి. అగడ్తలో పడ్డ పిల్లి అదే సర్వసం అనుకుంటుంది. ఇదే అర్థములో మరొక సామెత ఉంది. అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం +==అగడ్తలో పడ్డ కప్ప]]కు అదే వైకుంఠం== +==అగసాలి పొందు, వెలమల చెలిమి నమ్మరాదు== +ఇది సమాజములోని కొన్ని కులాలకు చెందిన సామెత: అగసాలి అనగా బంగారపు పని చేసే కంసాలి. వెలమ అనగా సమాజములో ఒక ఉన్నత కులము. +అగ్గి చూపితే వెన్న అడక్కుండా కరుగుతుంది== +==అగ్నిచెంత వెన్న ఎంత తడవాగో ఆడవారి కోపము అంత తడవాగు== +అగ్ని చెంతే వెన్న వెంటనే కరిగి పోతుంది. అదే విధముగా ఆడవారి కోపము కూడా అతి స్వల్ప కాలమే అని ఈ సామెతకు అర్థము. +==అగ్నిదేవుడు చలికాలంలో చిన్నవాడు ఎండాకాలంలో ఎదిగినవాడు== +[ అగ్నికి వాయువు తోడైనట్లు] అనే సామెత లాంటితే ఈ సామెత కూడాను. +అగ్ని పూర్తిగా ఆర్పకుంటే తిరిగి రగులుకుంటుంది, అప్పు పూర్తిగా తీర్చకుంటే వడ్డీ రూపంలో ఎక్కువ తీర్చవలసి వస్తుంది. అలాగే ఒక్క శత్రువు మిగిలివున్నా ప్రాణానికి ముప్పు తప్పదు. అందుకే దేని శేషాన్ని మిగల్చకూడదు. +అగ్గిపక్కన వెన్న ఆడవారి కోపం ఒకటే== +పురుషుడికి కోపం వస్తే ప్రతీకారం తీర్చుకొనేదాకా వూరుకోడు. కానీ స్త్రీల కోపము తాత్కాలికమే వేడి తగిలిన వెన్నలాగా స్త్రీ మనస్సు కరిగిపోతుంది అని ఈ సామెతకు అర్థము. +అగ్నిని ఎవరైన చల్లార్చడానికే ప్రయత్నిస్తారు. అలాంటి అగ్నికి వాయువు తోడైతే చల్లార్చడం చాలా కష్టం. మన కోపాన్ని అగ్నితో పోలుస్తారు. ఎవరైనా ఎవరి మీదైనా అగ్నిలాంటి కోపంతో ప్రజ్వరిల్లుతూ ఉన్నప్పుడు పక్కన ఉండే వాళ్ళు కావలసినవాళ్ళైతే ఆ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు కాని మధ్యన ఉండేవాళ్ళు కానివాళ్ళు ఐతే ఆ కోపాన్ని ఉన్నవీ లేనివి చెప్పి పెంచడానికి చూస్తారు. ఇలాంటి సమయంలో ఈసామెతని వాడుతారు. +అగ్నిలో ఆజ్యం పోసినట్లు అనే సామెతను కూడా ఇలాంటి సందర్భంలో వాడుతారు. +==అగ్గువ అయితే అంగడికి వస్తుంది అన్నాడట== +==అగ్రహారం పోతే పోయింది గానీ చట్టం మొత్తం తెలిసింది== +==అచ్చట్లు ముచ్చట్లు ఎదనిండా వెన్నెల్లు అన్నట్టు== +==అచ్చట్లు ముచ్చట్లు దుప్పట్ల ముసుగులో అన్నదట== +==అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం అన్నట్లు== +[[గంగి గోవు పాలు గరిటెడైనా చాలు అన్న సామెత లాంటిదే ఇదీను. +==అచ్చివచ్చే కాలానికి నడిచివచ్చే కొడుకు పుడతాడట== +గతంలో కొన్ని పల్లెల్లో ఒక కోడెను ఇది ఆబోతు అని పేరు పెట్టి వూరి మీదకు వదిలి పెడతారు. అది అందరిదీను. అది ఎక్కడ తిరిగినా ఎవరింటికి వెళ్ళినా దానిని ఏమీ అనరు. ఇది ఆనాటి ఆచారము. ఏపనీ లేకుండా ఊరు మీద పడి తిరిగే వారిని ఈ సామెతతో పోల్చి చెపుతుంటారు. +అజీర్ణము అనగా తిన్నది అరగక పోవడము. దానికి మందు ఏమిటంటే ఉపవాసముండడమే అని అర్థము. +ఒక పనిని ఒక పద్ధతిలో చెయ్యడం కుదరకపోతే వేరే విధంగా చెయ్యమని చెప్పే సందర్భంలో ఈ సామెతను ప్రస్తుతం వాడుతున్నారు. +==అటైతే వైద్యకట్నం యిటైతే వైతరిణీ గోదానం== +==అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనబడతారు== +==అట్లు వండే అత్తకు అరవైఆరు ఎత్తులు పెట్టినట్లు== +==అడక్కుండా చెప్పులిచ్చాడు అడిగితే గుర్రం యిస్తాడేమో అన్నట్లు== +==అడిగిందే పాపం అనుగ్రహించటం తన స్వభావం అన్నట్లు== +కావాలని కష్టాలు తెచ్చుకోనేల? ఆ తర్వాత బాధ పడనేల అని అర్థం. +అడకత్తెరలో చిక్కిన పోకచెక్కకి వత్తిడి రెండు వైపుల ఉండి తప్పించుకోలేని ��రిస్థితి కలుగుతుంది. అలాగే జీవితంలో బాగా కావలసిన ఇద్దరు వ్యక్తుల కలతల మధ్య చిక్కుకొని ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఈ సామెత వాడుతుంటారు. +==అడవిలో కాచిన వెన్నెల ముదిమిన చేసిన పెళ్ళి రెండు ఒకటే== +అడవిలో కాచిన వెన్నెల ఉపయోగం లేనట్లే ముసలి వానికి పెళ్ళి చేస్తే ఫలితం ఉండని దీని అర్థం. +ఏదైనా నిరుపయోగము అని చెప్ప దలిస్తే ఈ సామెతను వాడుతారు. అడవిలో కాచిన వెన్నెల మానవులకు ఉపయోగము కాదు వయస్సు మీరిన తర్వాత చేసిన పెళ్ళి కూడా అక్కరకు రాదు అని దీని అర్థము. +ఎవరైనా ఎవరిని అయినా ఎదైనా అడిగితే వారు చెప్పేటప్పుడు వీడు నాకు చెప్పేదేంటి అనే భావన ఉంటుంది. అందుకే అడిగేవాడికి చెప్పే వాడు లోకువ అంటారు. +ఇంట్లో వంట చేసుకునే వారికి ఒకటి లేదా రెండు కూరలూ అదే అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు అని అర్థం. ఇలాంటిదే మరొక సామెత: అద్దెకుండే వానికి అరవై ఇండ్లు, స్వంతగానికి ఒకటే ఇల్లు. +ఆకులు నాకే వాడి దగ్గర మూతులు నాకే వాడు +ఇదే అర్థము మరొక సామెత వున్నది: అది అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు]] +ఇంట్లో వంట చేసుకునే వారికి ఒకటి లేదా రెండు కూరలూ అదే అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు అని అర్థం. ఇలాంటిదే మరొక సామెత: అద్దెకుండే వానికి అరవై ఇండ్లు, స్వంతగానికి ఒకటే ఇల్లు. +==అడుక్కుతినేవాడికి ఆలయ్యేకంటే ధనవంతుడికి దాసి అయ్యేది మేలు +==అడుక్కోవటానికి ఈ గడప కాకపోతే యింకో గడప +అడుసు అంటే బురద (బాడి బురదను ముట్టుకుంటే అంటుకుంటుంది. ఈ విషయం తెలిసీ దాన్ని తొక్కటం ఎందుకు, తర్వాత అంటుకుంది అని బాధపడి కడుక్కోవటం ఎందుకు అని పూర్తి అర్ధం. అంటే, తెలిసి తప్పు చేయటం ఎందుకు తర్వాత బాధపడటం ఎందుకు అనే అర్ధం కోసం వాడతారు. +==అడ్డ జామీనులకు పోతే తెడ్డు దెబ్బలు తప్పవు== +==అడ్డం దిడ్డం తిరిగే తెడ్డుకు రుచేం తెలుసు +కూరలలో తిప్పే గరిటెను తెడ్డు అని అంటారు. అది కూరలలో తిరుగుతున్నా ఆ కూర రుచి దానికి తెలియదు అని అర్థము. +==అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా +ఉయ్యాలలో ఉన్నప్పుడైతే మాట వింటారు గానీ, గడ్డాలు, మీసాలు వచ్చిన తరువాత వింటారా? అని మొక్కై వంగనిది మానై వంగునా]] +==అడ్డెడు తినేవాడికి ఆలెందుకు? యిద్దుము మోసేవానికి ఎద్దెందుకు== +==అడ్డెడు వడ్ల ఆశకు పోతే తూమెడు వడ్లు గొడ్డు తినిపోయిందిట +అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న== +ఎవరికి వారు తామె గొప్పవారమని విర్ర వీగుతుంటారు. ఒకరికి మించిన వారు మరొకరు వుంటారని వారు ఎరుగరు. అలా విర్ర వీగే వారి గురించి ఈ సామెత వాడతారు. అలాంటిదే మరో సామెత ఉంది. అది. తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడు మరొకడుంటాడు. +ఏ పనైనా ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. హద్దులను పాటించాలి. అలా కాకపోతే అన్నీ అనర్థాలే +అవసరం అయిన దానికన్నా అధికంగా వినయాన్ని చూపేవారి గురించి ఈ సామెత వాడతారు. ఇలా అతి వినయం చూపుట దుష్టుల యొక్క లక్షణం అని అర్ధం. హృదయంలో లేని గౌరవాన్ని ప్రవర్తనలో చూపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో కూడా వాడతారు నక్క వినయం అనే జాతీయం దీనికి దగ్గరగా ఉంటుంది. +వర్షము ఎక్కువైనా అసలు వర్షము లేకపోయినా కరువు తప్పదని దీని అర్థము. +ఏదైనా విషయం రహస్యంగా ఉంచే ప్రయత్నంలో అతిగా ప్రయాసపడి, అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే, ఆ రహస్యం కాస్తా బట్టబయలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించటానికి ఈ సామెతను వాడుతారు. +==అత్త అడుక్కొని తింటుంటే అల్లునికి మనుగుడుపా +==అత్త కాలము కొన్నాళ్ళు కోడలి కాలము కొన్నాళ్ళు +==అత్తకు మంచి లేదు చింతకు పచ్చి లేదు +==అత్తకు లేక చస్తుంటే అల్లుడు వచ్చి దీపావళి పండగన్నాడట +==అత్త కొట్టిన కుండ అడుగోటికుండ, కోడలు కొట్టిన కుండ క్రొత్తకుండ +ఇదే అర్థాన్నిచ్చె మరొక సామెత ఉంది. అది ఉంటే లిక్కి పోతే కొడవలి అత్త పగలగొట్టిన కుండ ఓటుది అని కోడలు పగల గొట్టిన కుండ ఓటుదైనా అది కొత్త కుండ అని అత్తగారు కోడలిని దెప్పి పొడుస్తుందని భావము. +==అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు +ఇది ప్రాసకొరకు వున్న సామెత మాత్రమే కాని అర్థవంతమైనది కాదు. +==అత్తను కొట్టి అటకెక్కింది మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కింది +==అత్త పెట్టే ఆరళ్ళు కనబడతాయిగానీ, కోడలి కొంటె పనులు కనబడవు +==అత్త పేరు పెట్టి కూతుర్ని కొట్టినట్లు== +ఆత్తలందరూ చెడ్డవారని ఈ సామెతకు అర్థము. +==అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు== +ఒకరి మీద కోపమొస్తే చేతిలోని వస్తువులను విసిరికొట్టడము మానవ సహజము. అదే విధంగా ఒక కోడలు తన అత్తమీద కోపంతో చేతిలోనున్న దుత్తను పగలగొట్టిందట. దుత్త అనగా ఒక చిన్న మట్టి కుండ. +==అత్త మెత్తన, కత్తి మెత్తన ఉండవు== +[[అత్త మంచీలేదు వేప తీపీలేదు అనే సామెత లాగే ఈ సామెతకు ఆత్తలందరూ చెడ్డవారని ఈ సామెతకు అర్థము. +==అత్త రంకుకు పోతూ కోడలికి బుద్ధి చెప్పిందట== +[ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులున్నాయి] అనే సామెత అ��్థము దీనికి వర్తిస్తుంది. అత్త చెడు పనులు చేస్తూ తన కోడలికి చెడు పనులు చేయకు అని చెప్పి నట్లు. +దుత్త అంటే మట్టితో చేసిన చిన్న కుండ. మజ్జిగ వంటి వాటిని నిలవ ఉంచేందుకు వాడుతారు. కోడలికి అత్త మీద కోపం వచ్చిందంట, కానీ ఏమి చేస్తుంది పాపం అత్తేమో పెద్దావిడ, ఏమన్నా అందామా అంటే మొగుడు ఊరుకోడు అందుకని ఆ కోపాన్ని చేతిలో ఉన్న దుత్త మీద చూపుతూ విసిరి పగలకొట్టిందట. +అందుకనే సాధారణంగా ఒకరి మీద కోపం మరొకరి మీద చూపించినప్పుడు అంటారు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు" అని. +ఉదాహరణకు ఆఫీసులో బాసు తిట్టాడని ఇంట్లో భార్యని విసుక్కునేవారు. +==అత్తవల్ల దొంగతనము, మొగుడి వల్ల రంకుతనం నేర్చుకున్నట్లు== +==అత్తవారింటి అల్లుణ్ణీ ఆముదాల చేలో ఆబోతునూ చూడాలి== +==అత్తవారింటి ఐశ్వర్యంకన్న పుట్టింటి గంజి మేలు== +==అత్తవారింటి సుఖం మోచేతి దెబ్బ వంటిది== +==అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు +తనది కాని సొమ్మును దానమిచ్చు వారిని ఉద్దేశించి ఈ సామెత చెప్పబడింది ముడ్డి తనది కాకపోతే గోదావరి దాక దేక మన్నాడట అనే సామెత దీనికి సమానార్థము. +; ఒకరి సొమ్ముని వేరొకరు ఖర్చు పెట్టినా, ఒకరి సొమ్ముని వేరొకరు ఇంకొకరికి దానంగా ఇచ్చినా ఈ సామెతనుపయోగించి ఎక్కిరించడం అలవాటు, బహుశా ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళ గురించి మొదట ఈ సామెత మొదలయి ఉండవచ్చు! +అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు== +మొగలి పూల సువాసనలు గుబాళింపులు అత్తరు పన్నీరుల గుబాళింపుల లాగానే ఉంటాయి. అయితే ఆ మొగలి పూల పొద దగ్గరకు వెళ్లాలంటేనే ముందు భయం వేస్తుంది. ధైర్యం చేసి మొగలి పూవును ఎలాగో ఒకలాగా తెచ్చుకున్నా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మొగలిపూవుకు ఉండే ముళ్లలాంటివి గుచ్చుకుని లబలబలాడాల్సి వస్తుంది. +==అత్తా! నీ కొంగు తొలిగిందన్నా తప్పే, లేదన్నా తప్పే== +==అత్తింటి కాపురం కత్తి మీద సాములాంటిది== +అతిథి అంటే తిథి, వారం, వర్జ్యములు లాంటివి ఏమీ చూడకుండా, అనుకోకుండా వచ్చేవాడు అని. ఇది కొంచెం వ్యంగ్యంగా, అలాంటి వాళ్ళకోసమే తిథులుంటాయి అని వచ్చిన సామెత. +==అదును లేని పైరు ముదిమిలోని బిడ్డ ఒక్కటే +అదనుకు అనగా సమయానికి పైరు వేయక పేతే సరైన ఫలితమివ్వదు. అలాగే ముసలి వయస్సులో పిల్లలు పుడుతే వారు తల్లి దండ్రులకు సేవ చేసే వయసులో వుండరు అని ఈ సామెతకు అర్థం. +==అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు== +కోడలు ఎంత ఉత్తమురాలైనా అత్త మెప్పు పొందడం అరుదు. అదే అత్త లేని ఇంట్లో కోడలిదే పెత్తనం కాబట్టి ఇక ఆమెకు ఎదురేముంటుంది? ఇక ఆమె ఏం చేసిన గొప్పే! అత్త లేని ఇంట మంచి పేరు తెచ్చుకోవడం కోడలికి బహు సులువు. అదే విదంగా కోడలిని ఆరళ్ళు పెట్టని అత్తలూ అరుదే. కోడలు కాపురానికి రానంతవరకూ అత్తలందరూ గుణవంతులే కోడలు వస్తే గానీ అత్తల గుణం బయట పడదు. అత్తలేని కోడల్ని, కోడలులేని అత్తని ఎవరైనా మెచ్చుకుంటే ఆ అదృష్టానికి నోచుకోని కొందరు అక్కసు వెళ్ళబుచ్చుతూ ఈ సామెతని వాడతారు. +ఒక జానపద గేయం ఈ సామెతతో మొదలవుతుంది దంపుడు పాట]]గా బాగా ప్రసిద్ధి చెందింది ఘంటసాల గానం చేసిన రికార్డు బాగా జనాదరణ పొందింది. +::ఆహూ ఊహూ అత్త లేని కోడలుత్తమురాలూ కోడల్లేనత్త గుణవంతురాలూ ఆహూ ఊహూ.. +గయ్యాళి అత్త పాత్ర తెలుగు సాహిత్యం]]లోనూ తెలుగు సినిమా]]లలోనూ, ప్రత్యేకించి జానపద సాహిత్యం]]లో అతి సాధారణం. +ప్రస్తుతము అత్తగా వున్న అకామె గతంలో ఒక ఇంటి కోడలే అనే విషయం మరచిపోయి ప్రవర్తించడాన్ని ఈ సామెత తెలియ జేస్తుంది. +==అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు== +అసలు అక్కడ జరిగేది ఏమి లేకుండానే, ఏదో ఉందని చెప్పే వారి పక్కన దానికి మరో నాలుగు కలిపి చెప్పే వాళ్ళు ఉంటారు. అదిగో తెల్లకాకి అంటే ఇదిగో దానికి పుట్టిన పిల్ల కాకి అని, ముందు చెప్పినదే పెద్ద తప్పు దాన్ని సమర్థిస్తూ చెప్పేది ఇంకాపెద్ద తప్పు చెప్పే వారు కూడా ఉంటారు. +==అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు== +ఒక అసత్యం గురించి, లేని విషయం గురించి ఒకరు చెప్పే విషయాన్ని మరొకరు గుడ్డిగా నమ్మి అది నిజమేననేందుకు ఋజువులు వెదకడం, లేక దొరికే ప్రతిదాన్నీ ఋజువుగా భావించే సందర్భంలో ఇలా అంటారు. అబద్ధం వ్యాప్తి జరిగే విధానం ఇది. అయితే ఇందులో అమాయకత్వం, తెలియనితనం కనిపిస్తాయే గానీ కావాలని ఇతరులను వంచించే ప్రయత్నం కాదు. తాము విన్నదీ, కన్నదీ అబద్ధమని తరువాత తెలుసుకున్నపుడు అనుకుంటారు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లయింద ని +కావాలని అబద్ధాన్ని నిజంగా చూపే ప్రయత్నాన్ని వర్ణించడానికి ఒక సామెత ఉంది ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట]] +అతి నిదానంగా పని చేసె వారిని గురించి ఈ సామెత వాడతారు. అలాంటి వారు ఇప్పుడే వస్తా నని మరలా రారు. అలాంటి వారి గురించి ఈ సామెత వాడతారు. +అద్దంలో ��ూస్తే చూచిన వారి ముఖం ఎలా వుందో అదేవిధంగా కనబడుతుంది కాని అంతకన్నా అందంగానో లేదా అంద విహీనంగానో కనబడదు. అందుచేత అద్దం అబద్ధం చెప్పదంటారు. +==అద్దెకు తెచ్చిన గుర్రం అగడ్త దాటుతుందా== +అద్దెకు గాని, అరువుకు గాని ఉచితంగా గాని పనులకు తెచ్చుకొన్న వస్తువులు పెద్ద పెద్ద పనులకు ఉపయోగించవని ఈ సామెతకు అర్థం> +ఒక వస్తువును ఉపయోగించడానికి వీలులేకపోతే ఎంత విలువైనదైనా ఏం ప్రయోజనం? ఏమీలేదు; అనే అర్థంలో వాడతారు. ఆడాళ్లు ఈ సామెత ఉపయోగిస్తే విపరీతమైన అర్థం స్ఫురిస్తుంది. +==అనగా అనగా రాగం తినగా తినగా రోగం== +సాధనతొ ఏదైనా సాధ్యమే అని దీని భావం. పాడగా పాడగా సంగీతం రాగం వస్తుంది. అలాగే అతిగా తింటూ కూర్చుంటే రోగాలు వస్తాయని అర్ధం. +ఈ అర్థానికి దగ్గరగా వేమన పద్యం ఒకటి ఉంది: +ఉపకారికి అపకారము చేసినట్టి సందర్భంలో ఈ సామెతను చెబుతారు తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు అనే మరొక సామెత ఇలాంటిదే. +==అన్నం అడిగిన వాడికి సున్నం పెట్టినట్లు== +నిరంతరం ద్రోహచింతనతో ఉండేవారి గురించి.ఉపకారం చేయమని అడగటానికి వెళ్ళిన వ్యక్తికి ఉపకారం చేయకపోగా చేస్తున్నట్లు నటించి అపకారం చేసి అవమానించటం.అందని పూలు దేవుడికి అర్పణం అన్నట్టు. స్వార్థపరులు, అవకాశవాదుల మనస్తత్వం . +==అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అప్పచెల్లెళ్ళ పొత్తు పెద్దప్పుడు== +==అన్నదీక్షే కానీ అక్షర దీక్ష లేదు== +==అన్న ద్వేషం, బ్రహ్మ ద్వేషం పనికిరావు +==అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట== +ఒక జంట పక్క ఊరు వెళ్ళేందుకు బట్టలు సర్దుకొని ప్రయాణము అవుతారు. దారిలో మరొక జంట వీరిని కలిసి, ఇప్పుడే వస్తాము మా సామాను చూస్తూ ఉండమని చెప్పి పాత బట్టలు ధరించి కొత్త బట్టలను మూట గట్టి ఆ మూటను చూస్తూ వుండమని చెప్పి వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు కొత్త బట్టలు తీసుకొని వస్తారు! ఇది చూసి ఆశ్చర్యపోయిన మన పాత జంట "ఏమిటి విషయము" అని అడిగితే ఫలానా జమిందారు పేదవారికి అన్న వస్త్రాలు దానం చేస్తున్నాడు అని చెప్పి, అందుకనే మేము పేదవారిలాగా వెళ్ళి అతను ఇచ్చిన కొత్త బట్టలు తెచ్చుకున్నాము అని చెప్తారు. దీనితో మన జంటకి కూడా ఆశ పుట్టి బట్టలన్నీ మూట కట్టి వారికి అప్పగించి పాత దుస్తులు ధరించి వెళ్తారు. వెళ్తే ఏముంది జమీందారూ లేడు కొత్త బట్టలూ లేవు. ఈసురోమంటూ వెనక్కి వచ్చి చూస్తే వాళ్ళ దుస్తులు తీసుకుని క��త్త జంట ఎప్పుడో ఉడాయించారట. +మేలు జరుగుతుందని ఆశపడివెళితే అనుకున్న మేలు జరగకపోగా మరికొంత కీడు వచ్చిపడటం. ఓ వ్యక్తి దరిద్రంతో బాధపడుతూ తనకు కావలసిన అన్నం, వస్త్రాలు ఎవరో దానం చేస్తానంటే వెళ్ళాడట. కానీ అక్కడి పరిస్థితి మారిపోయి ఆ ప్రదేశంలో ఎదురైన కొంతమంది ఉన్న వస్త్రాన్ని కూడా లాక్కున్నారట. లాభం వస్తుందనుకున్నప్పుడు ఆశించిన లాభం రాకపోగా అనుకోని నష్టం ప్రాప్తించటం. +==అన్నవారూ, పడినవారూ బాగున్నారు, మధ్యవారు పడిచచ్చారు== +ఇరు వర్గాల మధ్య పోట్లాట జరిగితే తీర్పు చెప్పడానికి మద్యలోకి వెళితే వారికి జరిగే అపనింద గురించి ఈ సామెత పుట్టింది. మాటలు అన్నవారుగాని, పడిన వారుగాని బాగుంటారు మద్యలో వెళ్ళినవారు నింద మోయాల్చొస్తుందని దీని అర్థం కోడెల పోట్లాటలో దూడలు నలిగినట్లు అనే సామెతతో దీనికి పోలిక ఉంది. +;ఎవరైనా వేరే వాళ్ళని తిడితే, అలా తిట్టాకూడదని సర్దిచెప్పే వారు మధ్యలో తిట్లుతింటారు. అటు అన్న వాళ్ళని ఎవరూ ఏమి అనరు ఇటు తిన్న వాళ్ళని ఎవరు ఏమి అనరు కాని మధ్యలో తగువు తీర్చటానికి వచ్చిన వాళ్ళు మాత్రం మాటలు పడతారు. దానివలన మధ్యలో వెళ్ళిన వ్వక్తి ఆ ఇద్దరికి శత్రువౌతాడు. ఈ సామెత అర్థం అదె. +అన్యాయపు ఊరిలో ఆలూ మగలకే రంకు== +అన్యాయంగా సంపాదించిన సొమ్ము అక్కర తీర్చదని దీని అర్థము. ధన సంపాదనకు అన్యాయ మార్గాన్ని ఎంచుకోరాదని ఇందులోని గూడార్థం. +==అన్నీవేసి చూడు నన్ను వేసి చూడు అన్నదట ఉప్పు== +అన్ని దినుసులు వేసినా ఉప్పు వేయక పోతే వంటలకు రుచి రాదు అనే అర్థంలో ఈ సామెతను వాడుతారు. +==అన్నీ సాగితె రోగమంత భోగం లేదు== +రోగికి అన్ని సపర్యలు సక్రమంగా సాగి పోతుంటే రోగమె మంచిదని ఈ సామెత అర్థం. +==అన్ని కార్తెలు తప్పినా హస్త కార్తె తప్పదు== +==అన్ని రోగాలకు వాతలు పెట్టే వైద్యుణ్ణి దూరంగావుంచాలి== +==అన్నీ అమర్చిన తర్వాత అత్తగారు వేలు పెట్టినట్లు== +==అన్నీ అయిన తర్వాత అగ్ని వైద్యం== +==అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు== +పని ఇఛిన వాణ్ణి దగ్గరగా ఉంచు, భజనపరులను దూరంగా ఉంచు అన్న మాటను ఈ సామెత తెలియచేస్తుంది. +==అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు== +తినే తిండి మీద ఉన్న యావ లేక శ్రద్ధ చదవాల్సిన చదువు మీద లేదు అని ఈ మాటకు అర్థం. +==అన్నం తిన్నవాడు తన్నులు తిన్నవాడు మరచిపోడు== +ఉపకారం పొందినా అపకారం పొందినా మరచ��పోవటం సాధ్యం కాదని +కొంతమంది బద్ధకస్తులు తాము చేసిన పనులను సమర్ధించుకుంటూ ఎదుటి వారెవరైనా ఈ పని చెయ్యటంలో ఆలస్యం ఎందుకయిందని ప్రశ్నించినప్పుడు నిదానమే ప్రధానమని దబాయిస్తుంటారు. +అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది== +కొందరు తమకు ఏమీ తెలియకపోయినా అన్నీ తమకే తెలుసునన్నట్లుగా ఏకథాటిగా మాట్లాడుతూ ఊదరగొడుతూ ఉంటారు. వారిని గురించి ఈ సామెత వాడతారు. కొందరు తమకు అన్నీ తెలిసినా మౌనంగా ఏమీ తెలియనట్లుగా ఉంటారు. +అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు చస్తే ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందన్నట్టు== +చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు అమావాస్య మంచిదికాదని ఆ రోజున మరణించటం మంచిది కాదని భావిస్తారు.ఏకాదశి మాత్రం ఉత్తమమైన తిథి, శుభకరమైనది ఆ రోజున మరణిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుందంటారు. ఇన్నీ తెలిసినామె అమావాస్యనాడే పోతే ఈ విషయాలేవీ తెలియని ఆమె మాత్రం ఏకాదశినాడే ప్రాణం విడిచిందట. అన్నీ తెలిసినవారు చేయకూడని తప్పు చేస్తారని, ఏమీ తెలియని వారు మాత్రం మంచే చేస్తుంటారని.బాగా చదువుకున్న వాళ్లు లేదా అన్ని విషయాలు బాగా తెలుసనుకున్నవారు తప్పు చేసినట్లు. +==అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు== +ఎవరికైనా జబ్బు చేసినప్పుడు వారి అవసరాలని కనిపెట్టుకుని చూసేవారుంటే, రోగంతో బాధపడుతున్నప్పటికీ రోజులు మాత్రం సుఖంగా గడిచిపోతాయని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు. +==అన్నీ ఉన్నాయి కాని అల్లుడి నోట్లో శని ఉంది +అన్నింటిని అనుమానించే వాడు ఏ పని చేయలేడు. అనుమానమే వాడిని కుంగ దీస్తుంది. అదెంత మాత్రము పనికిరాదని దీనర్థం. +==అనుమానం ముందుపుట్టి ఆడది తర్వాత పుట్టింది +ఆడడి అన్ని విషయాలను అనుమానిస్తుందని ఈ సామెత అర్థం. +==అనుభవం ఒకరిది ఆర్భాటం, ఆయాసం ఇంకొకరివంతు== +==అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది== +అనూరాధ కార్తెలో పంట వేస్తే పుష్కలంగా పండుతుందని రైతుల నానుడి. +అనూరాధ కార్తెలో పడిన వర్షంలో తడిస్తే పౌరుషం పెరుగుతుందని దీని అర్థం. +==అన్నం అరిగిపోతుంది ఆదరణ శాశ్వతంగా వుంటుంది +అన్నదానం చాల ఉత్తమ మైనదని అంటారు గాని తిన్న ఆ అన్నం ఒక పూటలో అరిగిపోతుంది. తిరిగి రెండో పూటకు ఆకలౌతుంది. కాని ఆపదలో వున్నవాడిని ఆదరిస్తే అతడు ఆ ఆదరణను తన జీవితాంతం గుర్తుంచుకుంటాడు. +అన్నం అరిగిపోతుంది ఆదరణ శాశ్వతంగా వుంటుంది. అన్నదానం చాల ఉత్తమ మైనదని అంటారు గాని తిన్న ఆ అన్నం ఒక పూటలో అరిగిపోతుంది. తిరిగి రెండో పూటకు ఆకలౌతుంది. కాని ఆపదలో వున్నవాడిని ఆదరిస్తే అతడు ఆ ఆదరణను తన జీవితాంతం గుర్తుంచుకుంటాడు. +==అన్నం వుడికిందో లేదో చూడాలంటే అంతా పట్టి చూడక్కరలేదు +==అన్నం కోసం వచ్చి కంచం కోసం పోట్లాడుకున్నట్లు +==అన్నం వండని ఆడదీ, మంచం నేయని మగవాడూ వుండడు== +==అపనింద అవతలకిపోతే, నింద వచ్చి తలమీద పడిదట== +==అప్పచెల్లెలు బ్రతక గోరితే తోడికోడలు చావు కోరుతుంది== +దీనికే, బావలు బ్రతుకు కోరతారు దాయాదులు చావు కోరతారు అనే రూపాంతరం కూడా ఉంది. +==అప్ప సిరి చూసుకుని చెల్లెలు మడమలు విరగ త్రొక్కుకుందట== +==అప్ప సంపాదించిన ఆస్తి మనుమడితో మట్టిపాలు== +==అప్పు ఆదా కాదు వాపు బలుపూ కాదు== +==అప్పు ఆరు తెన్నులు ముప్పు మూడు తెన్నులు== +==అప్పు యిచ్చి చూడు పిల్ల నిచ్చి చూడు== +అప్పు గాని, పిల్లను గాని మరొకరికిస్తే అవి తిరిగి రావనే అర్థంలో ఈ సామెతను వాడుతారు +==అప్పు ఇచ్చినవాడు బాగు కోరితే తీసుకున్నవాడు చెడు కోరతాడు== +==అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు== +ఎవరికైనా జబ్బు చేసినప్పుడు వారి అవసరాలని కనిపెట్టుకుని చూసేవారుంటే, రోగంతో బాధపడుతున్నప్పటికీ రోజులు మాత్రం సుఖంగా గడిచిపోతాయని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు. +ఏదో చలికి బాధ పడుతున్నాడని దుప్పటి ఇచ్చారు. దానిని ఆసరాగా చేసుకొని ఇంకా కొన్ని సౌకర్యాలు కావాలని కోరే వారి గురించి ఈ సామెత వాడతారు. +అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది== +సుమతీశతకం సృష్టించిన జాతీయాలు, సామెతల్లో ఇది ఒకటి. శతకం చెప్పిన రూపం మారిపోయి దీనికి మరో అర్థం తోడవుతున్న సమయమిది. పద్యమిలా ఉంది. +:ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్ +పై పద్యానికి అర్థం తెలిసిపోతూనే ఉంది. అప్పిచ్చేవాడు, వైద్యుడు, సమృద్ధిగా నీరు, బ్రాహ్మణుడు మొదలైనవి దొరికే ఊళ్ళోనే ఉండాలి. అవి లేని ఊళ్ళో ఉండరాదు. +అయితే, ప్రస్తుతం మొదటి పాదానికి అర్థం మారిపోతూంది. వైద్యుడంటే అప్పిచ్చేవాడనే అర్థంలో కొందరు వాడుతున్నారు. పద్యం తెలిసినవారు శ్లేషార్థంలో వాడుతుంటే పూర్తి పద్యం తెలియనివారు వైద్యుడికి అప్పిచ్చే బాధ్యత కూడా ఉంది కామోసనీ, అప్పిచ్చేవాడు వైద్యుడితో సమానం కాబోలనీ, వైద్యుడికి అప్పిచ్చే బాధ్యతను ఎందుకు పెట్టారబ్బా మనవాళ్ళు అనీ అనుకుంటూ ఉంటారు. +నిప్పు ఎలా అయితే ముట్టుకుంటే కాలుతుందో అలాగే అప్పు కూడా. నిప్పుని ముట్టుకోకుండా ఉండడం లాటిదే అప్పు చెయ్యకుండా ఉండడం కుడా. +అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా +అప్పు ఇచ్చేటప్పుడు ప్రోనోటు లాంటి వ్రాత పూర్వక రుజువు వుండాలని చేప్పేదే ఈ సామెత. +అప్పు చేసి సంబరాలు చేసుకోకూడదని ఈ సామెతకు అర్థం. +ఆడంబరంగా జీవించడం వివేకమైన విషయం కాదు. ఆడంబరం అనేది వ్యసనం లాంటిది దానికి అలవాటు పడిన వాళ్ళు సంపదను శీఘ్రంగానే కోల్పోతారు. స్వంత ధనంతో ఆడంబరంగా ఉన్నని రోజులు అంతగా పట్టించుకోరు కాని అప్పు చేసి ఆడంబరంగా జీవించేవారిని సమాజం గౌరవించదు. +==అప్పు తీసుకుంటే చెప్పు చేతలలో ఉండాలి== +అప్పులేని వాడు సుఖంగా ఉన్నది తిని సుఖంగా నిద్ర పోతారు. కాని అప్పు వున్నవాడికి నిద్రలోకూడ అప్పు సంగతి గుర్తుకు వచ్చి సరిగా నిద్ర పట్టదు. ఆ విషయం చెప్పేదే ఈ సామెత. +అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు== +మన దగ్గర అప్పు తీసుకున్న వాణ్ణి నమ్ముకుని (అంటే వాడు ఇస్తాడని నమ్ముకుని) బజారుకెళ్ళి వస్తువులు కొనుక్కొంటే, వాడు ఇవ్వకపోతే కష్టం. అలాగే, ఉంచుకున్న మొగుడితొ జాతరకెళ్తే తెలిసినవాళ్ళు చూస్తారని సిగ్గుతో ఆ మొగుడు అటు ఇటు పరుగెత్తుతుంటే చాలా కష్టం. +బాగా అప్పులు చేసే వాడితో స్నేహం చేస్తే వాడి అప్పులు తీర్చటానికి మనల్ని అప్పు అడుగుతాడు. +అలాగే చెప్పులున్నవాడు కూడా ముళ్ళున్నా నడిచి వెళ్ళతాడు. కనుక వీళ్ళతో నడవొద్దు +అబద్ధము ఆడుచున్నట్లు ఇతరులు గ్రహించిన సందర్భము +==అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే దిబ్బడి నెత్తి సుబ్బడు కొట్టాడన్నట్లు== +తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఎవరూ ఎవరికంటే అధికులు కారని, తామే గొప్ప అని ఎవరూ ఎప్పుడూ గర్వాహంకారాలకు పోకూడదని ఈ సామెతకు అర్థం. +తప్తపరశుగ్రహణన్యాయము=క్రమక్రమముగ వేడివస్తువులను పట్టుకొనుట అలవాటు చేసిన చివఱకు కాలుచూఉన్న ఇనుపగొడ్డలిని కూడా పట్టు కొనవచ్చును +[[అందని ద్రాక్షపండ్లు పుల్లన అనే సామెతకు సమానార్థం ఈ సమెతకు ఉంది. +==అమ్మ కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది== +తల్లి తన కొడుకు వచ్చాడంటే ఎప్పుడు తిన్నాడో, ఏం తిన్నాడో నని అతని కడుపుని, అనగా ఆకలిని గమనిస్తుంది. కాని అతని భార్య ఇంటికొచ్చిన భర్థను ఎంత డబ్బు తెచ్చాడని అతని జేబును చూస్తుంది అని అర్థము. +==అ���్మకు నోటి వాడి అయ్యకు చెయ్యి వాడి== +==అమ్మ గృహ ప్రవేశం అయ్య అగ్ని ప్రవేశం +నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరును అని ఈ సామెత అర్థము. ఈ సామెతను వివరించే పద్యం వేమన శతకం]]లో ఒకటి ఉన్నది అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన'' +==అమ్మ పుట్టిల్లు ఘనత మేనమామకు తెలియదా +అమ్మ పుట్టింల్లు మేనమామ ఇల్లే కనుకు అమ్మ పుట్టింటి గురించి మేనమామ దగ్గర గొప్పలు చెబితే ఎలా ఉంటుందో మన గురించి అన్ని తెలిసిన పాత పరిచయస్తులకు కల్పించి లేనిపోని గొప్పలు చెప్పినప్పుడు అలానే ఉంటుంది. అలాటి సమయంలో ఈసామెతను వాడుతూ ఉంటారు. +==అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు== +కొందరు మనకు సహాయం చెయ్యకపోగా, వేరే మార్గాల ద్వారా కూడా సహాయం పొందనీయరు. ఈ సందర్భాలలో ఈ సామెతను ఉపయోగిస్తారు. +తానూ చేయక, ఇతరులనూ చెయ్యనివ్వక అడ్డుపడే వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు. +==అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు== +ఆచరించవలసిన ధర్మం నిర్వర్తించకుండా అన్య ధర్మాలు పాటించేవాళ్ళనుద్దేశించిన సామెత ఇది. మన తల్లికి కనీసావసరమైన తిండి ఇవ్వడం మన కనీస కర్తవ్యం. మన పెద్దమ్మ (అమ్మకి అక్క) బాగోగులు మన ప్రాథమిక కర్తవ్యం కాదు. మనమీద ఆధారపడిన వాళ్ళ సంగతి చూసాక చేయవలసిన పని. కాని, తల్లికి కూడు పెట్టకుండా, పెద్దమ్మకి బట్టలు కొనడం ఎంత ఉచితం? +ఈ సామెతకి ఇంకో రూపాంతరం ఉంది. అది: అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతాడా? అసలు ధర్మమే నిర్వర్తించని వాడి నుండి వేరేమి ఆశించగలం అని భావం. +ఇది రైతులకుసంబందించిన సామెత. తాము ఉత్పత్తి చేసిన సరుకులు అనగా కూరగాయలు, ధాన్యం మొదలగు వాటిని అమ్మబోతె సరకు నాణ్యత లేదని, ఇప్పుడు ధరలు లేవని ఎన్నో సాకులు చెప్పి వ్వాపారస్తులు వాటికి అతి తక్కవ ధరకు కొంటారు. కాని రైతులు తమకు కావలసిన వస్తువులు కొనబోతె, ఆ వస్తువుల గొప్పదనాన్ని, వాటి రూపు రేఖలను వర్ణించి చెప్పి అమాయకులైన రైతులను నమ్మించి అధికరకు విక్రయిస్తారు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత. +అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది== +కంచంలో ఉన్న అన్నాన్ని చేతికున్న అయిదువేళ్ళు కలిసి ముద్దచేసి నోట్లోపెడితే నోట్లో ఉన్న ముఫ్పై రెండుపళ్ళు ఆ అన్నం ముద్దను బాగా రుబ్బితే ఆ రుబ్బిన ముద్ద���ు నాలుక లోపలికి తోస్తుంది. అప్పుడు అన్నంముద్ద అగ్నిగుండంలాంటి పొట్టలోపడుతుంది. +అయిదోతనం అంటే భర్తను కలిగి ఉండటం. భార్య అందచందాలు భర్తకు మోదం కలిగించేందుకే. ఐదోతనమే లేనప్పుడు అంటే భర్తే లేనప్పుడు ఇంక ఆ అందం ఉండీ ప్రయోజనం లేదు అని ఈ సామెత భావం. ఏ లక్ష్యం కోసం ఓ పనిచేస్తున్నామో ఆ లక్ష్యం ఉనికిలోనే లేనపుడు ఆ పని నిరర్థకం అని చెప్పదలచిన సందర్భంలో ఈ సామెతను వాడతారు. +==అయ్యకు రెండు గుణాలే తక్కువ తనకు తోచదు, చెబితే వినడు== +అయ్యవారు ఎందుకు కొరగాడని అర్థంలో ఈ సామెతను వాడుతారు. +==అయ్యకు వణుకు ప్రాయం అమ్మకు కులుకు ప్రాయం== +==అయ్యగారికి ఆరు ఎడ్లు, మూడు దొడ్లు== +ఒకరికొరకు సమయము ఆగదు అనే అర్థం ఈ సామెతలో ఉంది. పూజలకొరకు పంతులుగారిని పిలిస్తే అయ్యవారు తీరుబడిగా వస్తే అంతవరకు అమావస్య ఆగదు గదా +==అయ్య దాసర్లకు పెడితే అమ్మ జంగాలకు పెట్టిందట== +==అయ్య దేశ సంచారం అమ్మ గ్రామ సంచారం== +==అయ్య వాత పెట్టనూ బర్రె బ్రతుకనూనా +==అయ్యవా రంతంత అయ్యవారి పెళ్ళాం ముంతంత +==అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు== +అయ్యవారు అంటే ఉపాధ్యాయుడు అని అర్థం. ఇతరుల తప్పులు దిద్దవలసిన వ్యక్తి తాను చేసిన తప్పులను తానే దిద్దుకొనే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆతనిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు. +వారు ఎంతటి వారైనా కాలము వారిగురించి ఆగదు అని చెప్పడాని ఈ సామెత వాడతారు. +==అయ్యవారులకు ఐదు వరహాలు వారి పిల్లలకు పప్పుబెల్లాలు== +దసరా సందర్భంగా ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకొని విద్యార్థుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు. విద్యార్థులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. గృహస్తులు అయ్యవారికి ధనరూపంలోనూ, పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. +==అయినవాడని ఇంటికి రానిస్తే ఇంటి దానికి కన్ను కొట్టాడట== +==అయినవారు లోపలకు తోస్త�� కానివారు బయటకు తోస్తారు== +==అయ్యోపాపం అంటే ఆరు నెలల పాపం పైన పడ్తుంది== +ఎదుటి వాడిపై జాలి తలిస్తే వాడే తనకు నష్టం కలిగిస్తాడని ఈ సామెత అర్థము. +==అరకాసు పనికి ముప్పాతిక బాడుగ ఖర్చు== +[[ఆవు పాతిక బందె ముప్పాతిక అనే సామెతకిచ్చే అర్థమే ఈ సామెతకు కూడా వర్తిస్తుంది. +==అరగదీస్తే గంధపు చెక్కకు వాసన పోతుందా +వేశ్యాలోలుడు అరగడి సుఖం కొరకు వెళ్ళి రోగం తెచ్చుకొని జీవిత మంతా బాదపడుతారని హెచ్చరించే సామెత ఇది. +మోసగాళ్ళు మాట్లాడే మాటలను ఈ విధంగా ఈ సామెతను వర్తింప జేస్తూ అంటుంటారు. +==అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు +మతిమరుపు మనుషుల నుద్దేశించి ఈ సామెతను వాడుతారు. ఇదే అర్థంలో మరో సామెత: సంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు. +అరటిపండు తినాలనుకుంటే ఎవరైనా తొక్క ఒలుచుకుని తినాల్సిందే. కానీ ఎవరైనా తొక్క ఒలిచి మన చేతిలో పెడితే ఆ పాటి శ్రమ కూడా తప్పుతుంది. అదే విధంగా మనం చేయవలసిన పనులను ఎవరైనా మనకు బాగా సులభతరం చేసినప్పుడు ఆ ప్రక్రియ అరటిపండు ఒలిచి చేతిలో పెట్టడం వంటిదని చెబుతూ ఈ సామెతను వాడుతారు. +అవసరమైన వస్తువు మన దగ్గరే ఉన్నప్పటికీ గాభరా పడి, అయోమయ పడి, అంతటా వెదికి చివరగా "అయ్యో మన దగ్గరే ఉంది కదా అని తెలుసుకోవటానికి ఈ సామెత వాడుతారు. కళ్ళజోడు, పెన్ను, టెలివిజన్ రిమోట్ వంటి వస్తువులను వెతికేవారికి ఈ అనుభవం తరచు ఎదురవుతుంటుంది. +ఇలాంటిదే మరొక సామెత చంకలో బిడ్డ నుంచుకుని, ఊరంతా వెతికినట్లు +కొన్ని కుక్కలు మనుషులు కనపడగనే తీవ్రంగా అరుస్తాయి, దగ్గరికి వెళ్తే కరుస్తాయి అని భయం వేస్తుంది. తీరా దగ్గరకు వెళితే పారిపొతాయి. అలాగే కొంతమంది ఏదైన విషయంలొ కొపం వస్తే వాడిని కొడతాను, వీడిని తిడతాను, రక్తం కళ్ళచూస్తాను అని అరుస్తారు. తీరా సందర్భం వచ్చినపుడు ఏమీ మాట్లాడరు. ఇటువంటివారిని అరిచే కుక్కలతొ పోలుస్తూ ఈ సామెత వాడతారు +==ఆరాటపు పెళ్ళి కొడుకు పేరంటాళ్ళ వెంట పడ్డాడట== +==ఆరికకు చిత్త గండం ఆడదానికి పిల్ల గండం== +==ఆరు కార్తెలకు పోతు ఆరుద్ర కార్తె== +అన్ని కార్తెలకన్నా ఆరుద్ర కార్తె రైతులకు/పంటలకు చాల మంచిదని దీనర్థం. +==ఆరుద్ర కార్తె విత్తనానికీ అన్నం పెట్టిన యింటికీ చెరుపు లేదు== +==ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయి== +ఇది వ్యవసాయ దారుల సామెత ఆరుద్ర కార్తెలో వర్షం కురిస్తే పంపటలు బాగ పండ���ాయని అర్థం. +==ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు== +==ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడతాయి== +==ఆరుద్రలో అడ్డెడు చల్లితే, సులువుగా పుట్టెడు పండుతుంది== +పంటలు బాగా పండాలంటే ఆరుద్ర కార్తే చాల మంచిదని ఈ సామెతకు అర్థం. +ఆరుద్ర కార్తెలొ కురిసిన వర్షం రైతులకు/పంటలకు చాల మంచిదని దీనర్థం. +==ఆరు నెలలకు చచ్చేవాడికి అరుంధతి కనపడదు== +==ఆరునెలల సహవాసం చేస్తే వారు వీరవుతారు== +==ఆరు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మతో యుద్ధం చేసినట్లు== +==ఆరు రాజ్యాలను జయించవచ్చు కానీ అల్లుడిని జయించలేం== +==ఆలిఅలుక అరవైఏండ్లు, మగనిఅలుక ముప్పై ఏండ్లు, బాలప్రాయం పదేళ్ళు== +ఏదైన ఒక పని కొరకు ప్రభుత్వ కార్యాలల్లో అర్జీ పెట్టుకుంటారు. ఆ అర్జీని పరిశీలించి తగిన సహాయము చేయాలి ప్రభుత్వ అధికారులు. ఇది పద్దది. కాని ఈ కాలంలో అర్జీ పెట్టుకున్నంత మాత్రానా పనులు కావు దాని వెంబడి పడి అధికారులకు లంచ మిచ్చి పని చేయించు కొంటేనే గాని పనులు కావని ఈ కాలపు పరిస్థితిని తెలియ జెప్పే సామెత ఇది. +అర్ధరాత్రి అందరూ ఆదమరచి నిద్రపోవలసిన సమయం. ఆసమయంలో ఎవరైనా అనవసర విషయాలకు హడావిడి చేస్తుంటే ఇలా ఈ సామెతను కొంచెం విసుగ్గాను చిరాకుగాను చెప్తారు. +==అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా +ధనానికి అధిపతి అయిన కుబేరుడు అలకాపురి నగరానికి రాజు. ఎంతటి ధనవంతుడయిననూ అవసరమును మించి ధనమును ఖర్చు చేయకూడదు అన్న నీతిని అడ్డూఅదుపూ లేకుండా ధనమును విచ్చలవిడిగా ఖర్చు చేసే ఓ డబ్బుగల వానిని ఉద్ధేశించి ఈ సామెతను వాడుట ద్వారా మన పూర్వులు తెలియజేసినారు. +==అలకపాన్పు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారు పడినట్లు== +==అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనునికి దక్కేదేమీ వుండదు== +==అలిగే బిడ్డతోనూ పొడిచే గొడ్డుతోనూ కష్టం +==అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం== +పదే పదే సమస్యలు సృష్టించే వారిని ఉద్ధేశించి ఈ సామెతను వాడతారు. అలిగే బిడ్డ, చెలరేగే గొడ్డు ఈ కోవలోకి వస్తారు. అందుకే ఈ సామెతలో వాటిని ప్రస్తావించారు. +==అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట== +ఇది అజ్ఞానానికీ, అతి తెలివికీ పరాకాష్టగా చెప్పే సామెత. తెలియక పోయినా తెలిసినట్లు నటించేవారి అంటించే చురక. +అల్లం కారంగా, ఘాటుగా ఉంటుంది; బెల్లం తీయగా ఉంటుంది. ఇక పుల్లగా ఉండేవి వేరే పదార్ధాలున్నాయి అల్లం అంటే నాకు త���లీదా బెల్లంలా పుల్లగా ఉంటది అని ఎవరైనా అంటే వారికి అల్లం రుచి తెలియదు. బెల్లం రుచి తెలియదు. పుల్లగా ఉండేదేమిటో తెలియదు. కనుక ఒకటి అడిగితే మూడు విషయాలు తెలియవని చెప్పుకున్నారు. కనీసం తన తెలియనితనాన్ని దాచుకోవాలన్న జ్ఞానం కూడా వారికి లేదన్న మాట. +ఇదే అర్ధంలో చెప్పే మరొక సామెత: +[[పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు +అవసరానికి ఏదో ఒకటి సర్థగలరు పుణ్యానికి కాని అన్నీవ్వలేరు గదా ఆ విషయాన్ని చెప్పేదే ఈ సామెత. +==అయ్యే మంటే ఆరు నెలల పాపం తగులు కొందట== +ఒకడు కష్టాలలో వున్నాడని సాయం చేయబోతె వాడి కష్టాలు వీడికి తగిలించాడట. అది దీనర్థం. +మామూలుగానే కోతి ఒక అతి చంచలమయిన జంతువు. ఇక అటుపై అది కల్లు (తాడి చెట్టు నుండి లభించు ఒక మత్తును కలిగించు ద్రవ పదార్థము) త్రాగినచో, దాని ప్రవర్తన అత్యంత విచిత్రముగా, విధ్వంసకరముగా ఉండును. ఇదే విధమయిన లక్షణములు గల వ్యక్తిని ఉద్ధేశించి ఈ సామెతను వాడెదరు. కోతికి అసలే చిలిపి చేష్టలు ఎక్కువ. కల్లు తాగిన తరువాత ఆ మత్తులో అది చేసే చిలిపి పనులు ఇంకా ఎక్కువ అని అర్థము. ముఖ్యంగా చిన్నపిల్లల అల్లరిని ఉద్దేశించి ఈ సామెత వాడడం జరుగుతుంది. +* ఈ సామెత లోని అర్థానికి మరింత గాఢతనిస్తూ ఇలా కూడా చెప్తారు అసలే కోతి, పైగా పిచ్చెక్కింది, ఆపై కల్లు తాగింది, ఆపై నిప్పు తొక్కింది +* ఒకో మారు ఆఫీసులో బాసు ప్రవర్తన (మరీ రెచ్చిపోయినట్లు ఉంటే) కూడా ఈ సామెత వాడుతారు. +* ఎక్కువగా వాడుకలో అసలే కోతి అని చెప్పి ఆపేస్తారు. తక్కిన భాగం అర్ధం చేసుకోవాలన్నమాట కొందరు సందర్బాను సారంగా సామెతలను ఉటంకిస్తూ సగం సామెతనే చెప్పి ఆపేస్తారు. మిగతా సామెతను ఊహించు కోవలసినదే ఈ పద్దతి మొత్తం సామెత చెప్పిన దానికన్న చాల గొప్పగా వుంటుంది) +==అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట== +తన యొక్క వాస్తవ పరిస్థితితో నిమిత్తం లేకుండా, గొంతెమ్మ కోర్కెలు కోరే వాణ్ణి ఉద్ధేశించి పలికే సామెత ఇది. +==అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వున్నట్లు +చేతిలో ధనం వున్నా కొనాలన్న ఆలోచన లేని వాళ్ల గురించి ఈ సామెత పుట్టింది. +==అలెగే బిడ్డ చెలిగే గొడ్డు ఒకటే +{{ఒకడు తనకు ఇంకా వివాహం కాకముందే వివాహం అయినట్లు, తన భార్య గర్భం దాల్చినట్లు, ఆమెకు సుఖ ప్రసవమై ఒక బాలుడు జన్మించినట్లు, ఆ బాలుడికి సోమలింగం అని పేరు పెట్ట���నట్లు కలలుకంటూ కల్లలైన ఆ ఆలోచనలను నిజమైనవిగా ప్రచారం చేసుకుంటూ గడపడటం. ఈ కథలోని వ్యక్తిలాగే వ్యర్థంగా మాటలు చెబుతూ కాలం గడిపే వారిని వ్యంగ్యధోరణిలో విమర్శిస్తున్నట్లు ఈ సామెత కనిపిస్తుంది}} +==ఆహారం పట్ల వ్యవహారం పట్ల మొగమాటం పనికిరాదు +అంకెకు రాని ఆలి కీలెడలిన కాలు== +అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు== +సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు కాని ఎన్ని చేసిన ఏదోకారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు. +ఈ జాతీయానికి సరైన అర్ధం మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నా ఏ అవకాశం అందని పరిస్థితి. అంగడి అంటే సరుకులు అమ్మే చోటు. కొత్త అల్లుడు అత్తవారి ఇంటికి వచ్చినపుడు మర్యాదలు సహజం. కొన్నాళ్ళకు పాతబడ్డ ఆ అల్లుడు అత్తవారి ఇంట్లోనే తిష్ట వేస్తే ఆ మర్యాదలు పెద్దగా జరగవు. అప్పుడు అంగట్లొ అన్నీ ఉంటాయి కాని అత్త వారింట్లో ఎవరూ వాటిని కొనరు. అల్లుడికి పెట్టరు. అలా రూపొందినదే ఈ సామెత. ప్రభుత్వ నిధులు ఎన్ని ఉన్నా ఆ ఫలాలు సామాన్యులకు అందవు. ఈ సందర్భంలో కూడా ఈ సామెతను గుర్తు చేసుకోవచ్చు. +మన దేశంలో అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నాయి. కాని లంచగొండితనం వలన దేశం అభివృద్ధి కావడం లేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది +అంగటి వీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టావురా కొడకా అన్నట్లు== +==అంగట్లో అరువు తల మీద బరువు== +అరవు అనగా అప్పు అని అర్థము అంగట్లో అప్పువుంటే తలమీద బరువు వున్నట్లే అని అర్థము +==అంగట్లో అష్ట భాగ్యం అల్లుని నోట్లో అష్ట దరిద్రం== +అన్నీ వున్నాయి కాని అల్లుని నోట్లో శని వున్నది అనే సమానార్థంతో ఈ సామెతను వాడుతారు. +ఏదైనా సరకులు అవసరానికి వాటిని కొనేవారికన్న తక్కువైతే ఆ వస్తువుకొరకు అందరు ఎగబడి అంగడికి ఎగబడతారు అప్పుడు దాని ధర కూడా అమాంతం పెరిగి పోతుంది. అవే వస్తువులు అవసరానికన్నా ఎక్కువయితే అవే వస్తువులు అనేక రాయితీలతో మన ఇంటిముంగిటకే వస్తాయనే అర్థంలో ఈ సామెతను వాడుతారు. +366 అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే +స్వంతంగా ఎంత బలం వున్నా ఎన్ని వున్నా దైవ బలం కూడా వుండాలని దీని అర్థం. +అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే== +అంచు డాబె గాని కోక డాబు లేదు== +కోక అనగా చీర అని అర్థం. దానికున్న అంచు మాత్రం మహా బాగావుండి అసలు చీరలో పస లేదు అని అర్థం. ఇలాంటి సమానర్థంలో మరొక సామెత కూడా ఉంది. పైన పఠారం లోన లొఠారం +==అండ ఉంటే కొండనైనా బద్దలు కొట్టవచ్చు== +ఒంటరిగా కన్నా మరొకరి తోడుతో పనులను చక్కగా అవుతాయి ఆదుకొనేవారుంటే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా చెయొచ్చని ఈసామెత అర్థం. దీనికి సమానర్థంతో ఐకమత్యమే మహా భలము అనే సామెతకూడ ఉంది. +అంతనాడు లేదు, ఇంతనాడు లేదు,సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు== +సాధారణంగా ఏటువంటి అలంకారాలు చేసుకోనివారు ఏమైనా ఉత్సవాలు, ఊరేగింపులు, పదిమందిలో కలిసే పెళ్ళిళ్ళలో మాత్రం విశేషంగా అలంకారాలు చేసుకొని అందరిలోకి ప్రత్యేకంగా కనిపించాలని ప్రయత్నాలు చేస్తుంటారు.ఒకామె చిన్నప్పుడుగానీ, మరీ వయస్సులో ఉన్నప్పుడుగానీ, మరి ఏ ఇతర సందర్భాలలోగానీ పెద్ద కొప్పు పెట్టి, అందంగా కనిపించడానికి ప్రయత్నం చేయలేదట. ఆ ఊరిలో సంత జరుగుతుందని తెలిసి ఆ సంతలో ఎంతోమంది కొత్తకొత్త వారు వస్తారని వారందరి చూపు తనపైన పడాలని అందంగా పెద్దగా ఉండే కొప్పు పెట్టుకొని వెళ్ళిందట. సందర్భానుసారంగా మాత్రమే అలంకరించుకోవాలని ఈ సామెత +==అంత ఉరుము ఉరిమి ఇంతేనా కురిసేదన్నట్టు== +అమితంగా వాగ్దానాలు చేసి చాలా స్వల్పంగా దానాలు చేసేవారిని గురించి, ఎంతెంతో పనిచేస్తామని చెప్పి చాలాకొద్దిగా పనిచేసేవారిని గురించి, ఎక్కువగా హెచ్చులు చెప్పి తక్కువ పని చేసే పద్ధతి సందర్భంగా వాడె సామెత ఇది. ఇలాంటిదే మరొక సామెత: ఇంత ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు +==అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా== +లావుగా వున్నంత మాత్రాన అన్ని విద్యలు తెలిసివుండవు. ఒక అమాయకుడు లావుగా వున్నతన్ని చూసి ఇతడు అంత లావున్నాడు కనుక అన్ని విద్యలు తెలిసి వుంటాయని భావించి తనకు తేలు కుట్టింది మంత్రం వేయమని అడిగాడట. ఆ లావుటతను తనకు తెలియదనగా "అంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా" అని వెళ్లి పోయాడట అమాయకంగా. +అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు== +ఒక పనిని మొదలుపెట్టే ముందు దాని పర్యవసానాలు బాగా ఆలోచించి, ముందుగానే ఊహించి, సంబంధిత వ్యక్తులతో దానిని గురించి చర్చించి మొదలుపెట్టమని చెప్పేందుకు ఉద్దేశించినదే ఈ సామెత. కీడెంచి మేలెంచమనే సామెతకు ఇది కాస్త దగ్గరగా ఉంటుంది. +మన���ి అందవు లేదా దొరకవు అని తెలిసినా వాటి మీద ఆశ పెట్టుకోడం అనేది అందని పండ్లు కోసం అర్రులు చాచటం లాంటిది అని అర్థం. +ఒక నక్క ఒక రైతు యొక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది.అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి.ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు, నోరు ఊరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది. మామూలుగా అయితే ఆనక్కకు పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి ఆ పళ్ళను అందుకోబోయింది. కానీ, పాపం దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్ష పళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక యెగరలేక విసిగి ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి అని గొణుక్కుంటూ వెళ్ళిపొయింది. అలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి అది దొరకక పోతే, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశామో అది ఎంత చెత్తదో, ఎంత పనికిరాదో చెప్పటం మొదలుపెడతాము. అప్పుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు. +==అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం== +తాము శ్రీవైష్ణవులము, మాంసాహారం తినము అని చెప్పుకుంటూ బుట్టలో చేపలన్నీ ఖాళీ చేసారు అని అర్ధం. అందరూ గొప్పవాళ్ళే కాని చేసేవన్ని తప్పుడు పనులే. ఎవరికి వారే తమకి తాము గొప్ప వాళ్ళమని చెప్పుకుంటారు కాని ఎవరి తప్పులు వారికే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ సామెత వాడుతార +==అందితే జుట్టు అందక పోతె కాళ్లు== +అవకాశవాది తన పని పూర్తి చేసుకోటానికి ముందు గడ్డం పట్టుకు బ్రతిమిలాడతాడు, అయినా పని కాకపోతే కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడటానికి కూడా వెనకాడడు. ఈ సామెత ఒక అవకాశవాది తత్వాన్ని తెలియచేస్తోంది. +పయోముఖ విష కుంభం అనే సంస్కృత సామెత లాంటిదే ఇది కూడాను. నోటితో తియ్యని మాటలు మాట్లాడుతున్నా మనసులో మాత్రంచాల చెడు భావన వున్నదని అర్థం. +ఇది కూడా పై సామెత లాంటి అర్థాన్నే ఇస్తుంది. పైపైన మంచిగా మాట్లాడుతు లోన చెడు భావన కలిగి వున్న వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు. +==అంటుకోను ఆముదం లేకుంటే మీసాలకు సంపెంగ నూనెట== +ఇదే అర్థంలో మరొక సామెత వుంది: అది: మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె +సహాయంగా ఎవరైనా వుంటే ఎంతపనైనా చేయ వచ్చు అనే అర్థంలో ఈ సామెతను వాడుతారు. ఐక మత్యమే మహాబలము అని దీకిని గూడార్థము. +==అండలేని ఊళ్ళో ఉండ దోషం ఆశలేని పుట్టింట అడగ దోషం== +ఐకమత్యమే మహా బలము అని దీనికి అర్థము. +అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత== +==అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు== +==అంత నీతే వుంటే ఇంత సంతెందుకు +అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా +ఇదే అర్థంలో మరొక సామెత వున్నది: అది. ఇంతలావున్నావు తేలు మంత్రం తెలియదా? +అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు== +మానవులలో ప్రతి విషయము పూర్తిగా తెలిసిన వాడున్నూ, ఏవిషయము కొంతైనా తెలియని వాడున్నూ లేడని దీని అర్థము. +అంతా బాపలే, మరి కోడిపెట్ట ఏమైనట్లు +దీనికి సమానమైన అర్థంలో మరొక సామెత ఉంది. అందరూ వైష్ణవులే బుట్టలో రొయ్యలు మాయం అయ్యాయి బాపన వాళ్లైనా చాటు మాటుగా మాంసం తింటారని దీనికి గూఢార్థము. +==అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్ళు లేరు== +[చూపులకు చుట్టాలు రమ్మంటే కోపాలు అనే సామెత లాంటిదే ఈదీను. +==అందం చందం నావంతు ముద్దూ మురిపెం నీవంతు అన్నదట== +==అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు== +అకార పుష్టి నైవేద్య నష్ఠి అనే సామెత లాంటిదే ఇదీను. +మనకి అందవు లేదా దొరకవు అని తెలిసినా వాటి మీద ఆశ పెట్టుకోడం అనేది అందని పండ్లు కోసం అర్రులు చాచటం లాంటిది అని అర్థం. +అందరి కాళ్ళకు మ్రొక్కినా అత్తగారింటికి పోకతప్పదు== +పెళ్ళికూతురు పెళ్ళైయ్యాక అత్తావారింటికి వెళుతూ అందరి కాళ్ళకు మొక్కుతుంది. కాని చివరకు అత్తవారింటికి వెళ్ళక తప్పదు +==అందరికీ శకునం చెప్పే బల్లి తాను బోయి కుడితి తొట్లో పడ్డట్లు== +అందరికి రాబోవు కష్టాలను చెప్పేవారు తమకు రాబోవు కష్టాలను ఎరుగరు అని దీని అర్థము. అనగా ఈ శకునాలు వట్టి భూటకమని అర్థము. +==అందరికీ అన్నం పెట్టే వాడు రైతే== +అందరినీ మెప్పించడం అలవి గాని పని== +అందరినీ మెప్పించడము ఎంతమాత్రము వీలుకాదని దీని అర్థము. ఎంత మంచి విషయమైనా దాన్ని కూడా వ్వతిరేకించే వాడొకడుంటాడని దీని భావము. +అందరూ ఒక ఎత్తు అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు== +==అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అడ్డం వస్తుంది== +అందాల గంధాలు, అధరాల మధువులు కౌగిలింతల పాలన్నట్లు== +==అందాల విందులు, అధరాల మధువులు నీకే అన్నదట== +అందాలు నావి సంబరాలు నీవి అందిట== +అవకాశాన్ని బట్టి ఎదిరించడమో, కాళ్ల బేరానికి రావడమో చేసె వారిగురించిన సామెత ఇది. ఇదే సమానార్థంలో మరొక సామెత ఏ ఎండకాగొడుగు పట్టినట్టు. అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి/ ఏ ఎండకు ఆ గొడుగు పట్టి నట్టు సమానర్థంలో మరొక సామెత +53 అందితే తియ్యన అందకుంటే పుల్లన +[అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే సామెతకు సమానర్థంలో ఈ సామెతను వాడుతారు. ఎంత ప్రయత్నించినా ద్రాక్ష పళ్ళు అందక పోతే తన ప్రయత్నము విపలమైనదని ఒప్పుకోక ఆ ద్రాక్ష పళ్ళు పుల్లనివి అని తన ఓటమిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం ఇది. +అందీ అందని పరువాలు ఉసికొలిపే కాముని కవ్వింతలు== +కొంతమంది ఎంత వివరంగా విషయాన్నంతా చెప్పినా గ్రహించలేరు. అలాంటి వారి జ్ఞానాన్ని సూచించడానికి ఈ సామెత ఉపకరిస్తుంది. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఎంత శ్రమపడినా శ్రమను ఎదుటివారు గుర్తించక నిర్లిప్తంగా, నిరాసక్తంగా తోసివేసినప్పుడు కూడా ఈ సామెతను సందర్భానుసారం చెప్పటానికి ఉపయోగపడుతుంది. అంధుడికి ఎంత మాత్రమూ ఎదుటి వస్తువులు కనిపించక పోవటం సర్వసాధారణం. అటువంటిది అందాన్ని ఒకటికి పది సార్లు చూసుకోడానికి నేత్ర దృష్టి బాగా ఉన్నవారు ఉపయోగించే అద్దాన్ని అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన. +అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన.. +==అంబటిలోకి ఉప్పే లేకుంటే పిండి వంటల మీదకు పోయిందట మనసు== +తాను తాగే అంబలిలో ఉప్పు తక్కువైనందున అందులో ఉప్పు కూడా తెచ్చి వేసుకోలేని వాడు పిండి వంటలు కోరుకున్నట్లు అని దీనికి అర్థము. +==అంబలా అంటే ముఖాలే చెప్తాయి అన్నట్లు== +గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు వంటిదే ఈ సామెత. తన స్థాయికి మించి పనులు చేసే వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు. +లేక లేక పుట్టిన పిల్లలను గారాబంగా పెంచినప్పుడు ఈ సామెత వాడతారు +అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్లు== + + +==ఇచిత్రాల పెళ్ళికొడుక్కి అక్షింతలు పెడితే నొసలు దురద అని నోట్లో వేసుకున్నాట్ట== +==ఇచ్చకాలకు ఉచ్చతాగితే గచ్చు కంపు కొట్టిందట== +==ఇచ్చకాలవారూ బుచ్చకాలవారూ పొట్టకోసం పొక్కులు గోకుతారు== +==ఇచ్చితినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్లు== +==ఇచ్చేవాణ్ని చూస్తే చచ్చిన వాడు కూడ లేచి వస్తాడు== +==ఇచ్చింది యిచ్చి పుచ్చిన దాన్ని కొన్నట్లు== +==ఇచ్చిన నిష్ఠూరం కన్నా యివ్వని నిష్ఠూరమే మంచిది== +==ఇచ్చేవి అందాలు పుచ్చుకునేవి తీర్థాలు అన్నట్లు +ముందు ఇంట్లో అన్ని కార్యాలు చక్కబెట్టుకొని ఆతర్వాతనె ఊరి వారి విషయం చూడాలని అర్థం +==ఇంటాయనకు మగతనమేవుంటే పొరుగింటాయన పొందెందుకు? అందట +==ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు== +సాధారణముగా మనము దొంగను ఒక అపరిచితుని రూపంలో ఊహిస్తాము. కానీ, సొంత ఇంటిలో వ్యక్తే ఇతర కుటుంబ సభ్యులను మోసము చేయుచున్నయెడల, అట్టి వానిని ఉద్దేశించి ఈ సామెతను ప్రస్తావించెదరు. +==ఇంటింటా ఒక పొయ్యి మా యింట మరో పొయ్యి +==ఇంటికి అవ్వ కొలతకు తవ్వ కావాలి +==ఇంటికి ఈల కత్తి పొరుగుకు బంగారు కత్తి +==ఇంటికి ఒక పువ్వు ఈశ్వరుడికి ఒక మాల== +==ఇంటి కూటికీ, బంతి కూటికీ రెంటికీ చెడినట్లు== +==ఇంటి పేరు పుణ్యాల వారు చేసేవేమో పాపపు పనులు== +==ఇంటి మొగుడు చెమటకంపు పొరుగింటి మొగుడు పూలవాసన== +==ఇంటివాడు ఒసే అంటే, బయటివారూ ఒసే అంటారు== +==ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలు చూపుతారు== +==ఇంటివాడివలె చేసేవాడూ లేడు బయటివాడివలె తినేవాడూ లేడు== +==ఇంటివాడు ఈకతో కొడితే పొరుగువాడు పోకతో కొడతాడు +==ఇంటికి పెద్ద కొడుకు, పెద్ద అల్లుడే లెక్కపడేది== +==ఇంటికి పెద్దకొడుకై పుట్టటం కంటే చాకలివాడి గాడిదగా పుట్టటం మేలు== +==ఇంటికి ముసలి మడుగుకు మొసలి కీడు +==ఇంటివారు గొడ్డు గేదంటే పొరుగువారు పాడి గేదె అన్నట్టు== +తన ఇంట్లో దేనికీ పనికిరాడన్న చీత్కారాలను పొందుతూ బయట పదిమంది ముందూ ప్రశంసంలందుకున్నట్లు +==ఇంటివాణ్ణి లేపి దొంగ చేతికి కట్టె ఇచ్చినట్టు== +[[గృహమే కదా స్వర్గసీమ అని ఆర్యోక్తి. అటువంటి ఇల్లు సమస్యలకు నిలయమై నరకప్రాయమైనపుడు ఇంటిలోని వారు ���మ పరిస్థితిని ఈ సామెత ద్వారా వ్యక్తము చేయుట సర్వసాధారణము. గొడవలతో అశాంతికి నిలయమైన ఇంటి కన్నా ప్రశాంతమయిన గుడి ఎంతో మేలు అని అర్థము. +ఇంట్లో గౌరవం పొందక బయట ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకునే వారు. +==ఇంటికి గుట్టు రోగానికి రట్టు ఉండాలన్నారు== +ఇంటి విషయాలు బయటకు చెప్పకూడదు దాని వల్ల పోయేది ఇంటి వారి పరువే. కాని రోగమొస్తే అందరికి చెప్పాలి. ఎవరో ఒకరు రోగాన్మీ మందివ్వక పోరు. దాని వల్ల రోగము కుదుట పడగలదు. +==ఇంటిపేరు కస్తూరి ఇంట్లో గబ్బిలాల కంపు== +పైన పటారం లోన లొటారం లాంటిదే ఈ సామెత. +ఇంటి లోని వస్తువుల అమరికను బట్టి ఆ ఇంటి ఇల్లాలి ప్రవర్థనను గ్రహించ వచ్చు అని ఈ సామెత అర్థం. +==ఇంటి చక్కదనం ఇల్లాలిని చూస్తే తెలుస్తుంది== +==ఇంటి ముందు ములగ చెట్టు వెనుక వేప చెట్టు ఉండరాదు== +ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత== +ఇంట్లో పరిస్థితి బాగా లేకున్నా బయట మాత్రం అందరి ముందు గొప్పగా వున్నట్టు నటించడం +==ఇంట్లో ఇగురు కూర కంటే పొరుగింటి పుల్లకూర రుచి== +==ఇంట్లో ఇల్లాలి పోరు బయట బాకీల హోరు +వీధిలో గాంభీర్యంగా తిరిగె చాలా మంది ఇంట్లో పెళ్ళాం దగ్గర పిల్లి లా తిరుగుతుంతటారు +==ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు== +ఏ ప్రదేశంలో అయితే బాగా బ్రతికావో (స్థితి పరంగా అక్కడే పరిస్థితుల ప్రభావము వలన హీనంగా బ్రతకాల్సిన పరిస్థితిని ఈ సామెత ద్వారా వ్యంగ్యంగా చెప్పుచున్నారు. +ఇంత లావున్నావు తేలు మంత్రం కూడ రాదా== +లావుగా భలంగా వున్నావారు అన్ని విద్యల్లో ఆరి తేరి వుంటారని అమాయక పల్లె ప్రజలు ఆ రోజుల్లో నమ్మేవారు. అలా ఒక పల్లే వాసి ఒకణ్ని పట్టుకొని తేలు మంత్రం వేయమని కోరాడట. అతను తేలు మంత్రం తనకు రాదనగానె ఇంత లావు వున్నావు తేలు మంత్రం కూడా రాదా అని వెళ్లి పోయాడు. ఇది హాస్వోక్తిగా చలామణిలో ఉంది. +==ఇత్తడి పుత్తడీ కాదు తొత్తు దొరసానీ కాదు +కుటుంబనియంత్రణ శాఖవారి నినాదం.ఇప్పుడు ఒక్కరు చాలు లేదా అసలేవద్దు (one or none) గా మారింది. +==ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు== +సాధారణంగా మనుషులు భూమిపై జీవించివున్న వారిలో తమకు నచ్చినవారిని మాత్రమే గొప్పవారిగా అభివర్ణిస్తారు. అలా కానపుడు ఇంకా పుట్టనివారిని మాత్రమే వారు సత్పురుషులుగా భావించే అవకాశం ఉందని (అనగా వేరెవరినీ సత్పురుషులుగా భావించరని) వివరిస్తూ, సామాన్య మానవ నైజం ఎటువం��ిదో చెప్పటానికి ఈ సామెతను వాడుతారు. +==ఇనుము విరిగితే అతకవచ్చు మనసు విరిగితే అతకలేము +==ఇనుప గుగ్గిళ్ళుకానీ మినప గుగ్గిళ్ళు కావు అన్నట్లు +==ఇనుము కరిగే చోట ఈగలకేమి పని +==ఇనుము విరిగితే అతకవచ్చు మనసు విరిగితే అతకలేము +==ఇరుగును చూచి పొరుగు వాత పెట్టుకొన్నట్లు== +పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అనే సామెత లాంటిదే ఇదీను. +ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె== +ఇంటిలో తలెత్తిన తగాదాలను, ఒంటికి వచ్చిన నొప్పులను వెంటనే నయం చేసుకోవాలి +కొందరు ఏదన్నా పని మొదలు పెట్టి అంతా సాధించినట్టు ఆనుకొంటారు. అలాంటివారినుద్దేశించి హెచ్హరికగా ఇది ఆరంభం మాత్రమే చెయ్యవలసినది ఎంతే ఉంది అనే ఉద్దేశముతో ఈ విధముగా అంటారు. +ఏదైనా ఒక ప్రారంబించ గానే అది పూర్తవుతుందని అనుకుంటుంటారు కొంత మంది. ఆ పనిలో రాబోవు సవాళ్ళు ఎన్నో ఉండ వచ్చు. అది గ్రహించలేని వారి గురించి ఈ సామెత వాడుతారు. +మతి మరుపు ఎక్కువయిన వారి గురించి ఈ సామెత వాడతారు. +ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు== +ఎంత మంచిగా ప్రవర్తించినా, ఎదుటివారికి ఎంత అనుకూలంగా ఉన్నా మాటపడాల్సి రావటం.ఆధిక్యభావాన్ని ఎంతగా అణచుకొని కలుపుగోలుతనంగా ప్రవర్తిస్తున్నా చుట్టుపక్కల వాళ్ళెవరూ ఆ మంచితనాన్ని గుర్తించక ఏదో ఒక వంకపెట్టి బాధించటం.ఓ వ్యక్తి తాను అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి యజమాని తనను పెట్టిన బాధలు గుర్తించుకొని తానొక సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు తన ఇంట్లోకి అద్దెకు వచ్చినవారిని కష్టపెట్టకుండా జాగ్రత్తపడ్డాడట. అయినా ఆ అద్దెకొచ్చిన ఆసామి ఆ యజమానిని ఏదో ఒకటి అననే అన్నాడట. పాడి బాగా ఉన్నవాళ్ళు ఆ ఊళ్ళో పాడిలేని వాళ్ళకు 'పోనీలే' అని ఉచితంగా మజ్జిగ పోస్తే తాము పొందిన సాయానికి కృతజ్ఞతగా ఉండకపోగా నీళ్ళమజ్జిగ అని, చాలలేదని వంకలు పెట్టారట. +==ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట== +కొంతమంది ఎదుటి వాళ్ళు ఎంత బాధలో ఉన్నా పట్టించుకోరు సరికదా తమ అవసరాలకు లోపంవచ్చిందని సాధిస్తుంటారు.అలాంటి సందర్భంలో ఈసామెతను చెబుతారు.దీనికో చిన్న కద ఉంది.ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకుని వెళ్ళి అర్ధరాత్రి ఆ ఇంటిని సమీపించేసరికి ఆ ఇల్లు కాలిపోతూ ఉంది.ఆ ఇంటిలో వాళ్ళు అందరూ ఇల్లు అగ్నికిఆహుతి అయినందుకు గోడుగోడున విలపిస్తుంటే దొంగ ��ూడా తాను అనుకున్నట్లు దొంగతనం చేయడానికి వల్లకాలేదని పెద్దగా ఏడ్చాడు. +==ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట== +==ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు== +ఇతరుల కష్టాలను తమ స్వార్థానికి వాడుకునేవారి గురించి ఈ సామెత పుట్టిదింది. +==ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట== +==ఇల్లు ఇరకాటం, ఆలి మర్కటం ఉండాలంటారు== +ఈ సామెత పాతకాలపు సమాజంలోని అభద్రతా భావాన్ని సూచిస్తుంది. ఇల్లు ఇరుకుగా ఉంటే బంధువులు వచ్చి తిష్ట వేయడానికి వీలుండదని, పెళ్ళాం అందవికారంగా ఉంటే వేరే మగవాడెవడూ తన భార్యపై కన్ను వేయడని దీని అర్ధం. +ఇల్లు ఇరుగ్గ వుంటే బందువులు ఎక్కువగా రారు. వచ్చిన రాత్రి బస చేయరు. ఎందు కంటే ఇరుగ్గా వున్న ఇంట్లొ సరైన వసతి వుండదు. అదే విదంగా భార్య అంద విహీనంగా వుంటే పరాయి మగవారు కన్నెత్తి చూడరు. కనుక ఇతరలతో సమస్య లేదు. ఆ సందర్భంలో ఈ సామెత పుట్టింది ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం" +ఇల్లెక్కి కొరివి తిప్పితే ఇంటికి అతనికి కూడా ప్రమాదమే. అది తెలియక అమాయకపు వాళ్ళ గురించి ఈ సామెత చెబుతారు. +ఎ పని చేయకుండా ఇంటిలో తిని పడుకొనే వాళ్ళకు సరిపోతుంది. +==ఇలను నమ్మి చెడినవాడు కలికానికి కూడా కన్పించడు== +==ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు కొమ్ముల బర్రె కొట్టానికి చేటు== +==ఇల్లలికి ముగ్గులు పెడితే ఈగల బాధ== +==ఇల్లాలి శుచి యింటిని చూడగానే తెలుస్తుంది== +==ఇల్లాలు లేని యిల్లు భూతాలకు నిలయం== +==ఇల్లాలు గుడ్డిదయితే ఇంటి కుండలకు చేటు +==ఇల్లు యిచ్చినవానికీ, మజ్జిగ పోసిన వానికీ మంచి లేదు== +ఇల్లు ఇరుగ్గా వుంటే చుట్టాలు రారు. అదే విధంగా భార్య అందంగా లేకుంటే ఇతరుల కన్ను ఆమె మీద పడదు కనుక అది మంచిదే అని అర్థము ఈ సామెతకు. +అమాయకుల నుద్దేశించిన సామెత ఇది. ఇల్లెక్కి కొరివి తిప్పితే ఇల్లు కాలిపోతుందని తెలియక ఒక అమాయకుడు ఆ పనిచేశాడట +==ఇల్లు కట్టి చూడు పెళ్ళిచేసి చూడు== +ఇల్లు కట్టినా, పెళ్ళి చేసినా ఆర్థికంగా దెబ్బ తినడము సహజమని ఈ సామెతకు అర్థం. +అమాయకుల నుద్దేశించి ఈ సామెతను వాడుతారు. అర్థం. ఇల్లు కాలిపోతుంటే ఇంటిని ఆర్పడానికి నీళ్ళకొరకు బావిని త్రవ్వడము ప్రారంబించాడు ఒక అమాయకుడు. +==ఇల్లాలు గుడ్డిదయితే ఇంటి కుండలకు చేటు +''ఆవు పాతిక బందె ముప్పాతిక అన్న సామెత అర్థం దీనికి వర్తిస్తుంది +==ఇల్లు తీరు వాకిలి తల్లి తీరు పిల్ల== +==ఇల్లు దాటిన ఆడది లోకానికి లోకువ== +==ఇల్లు మ్రింగే అత్తకు యుగం మ్రింగే కోడలు== +ఒకరికి మించిన వారు ఇద్దరూను అని అర్థము +==ఇల్లు లేనమ్మ హీనం చూడు మగడు లేనమ్మ మానం చూడు== +==ఇల్లు విడిచిన ఆడది చెట్టు విడిచిన కోతి ఒకటే== +==ఇల్లే తీర్థం వాకిలే వారణాసి కడుపే కైలాసం అన్నట్లు +==ఇల్లుకట్టి చూడు పెళ్ళి చేసి చూడు== +ఇల్లు కట్టు కోవడము, పెళ్ళి చేయడము ఈ రెండు పనులు చాల ఖర్చుతో కూడుకున్నవి. అందో ఏపని చేసినా చాల కాలంవరకు ఆర్థికంగా కోలు కోలేరు. ఆవిషయాన్ని చెప్పడానికి ఈ సామెతను వాడ తారు. +ఇంటి ముందు ములగ చెట్టు వెనుక వేప చెట్టు ఉండరాదు== +==ఇడిసేసింది ఈదికి పెద్ద ఉంచుకున్నది ఊరికంతా పెద్ద== +ఇడిసేసింది అనగా మొగుణ్ణి వదిలేసిన స్త్రీ అని అర్థము. ఉంచుకున్నది అనగా వేరొకరిని ఉంచుకున్న స్త్రీ అని అర్థము. +==ఇవ్వడమన్నది ఈ యింట లేదు, తే అన్నది తరతరాలుగా వస్తున్నదన్నట్లు== +==ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు? రేపు జోలె పట్టడమెందుకు +==ఇవిగో పూలంటే అందుకో అందాలు అందట== +==ఇష్టంలేని పెళ్ళాన్ని ఒసే అన్నా తప్పే అమ్మా అన్నా తప్పే +==ఇసంట రమ్మంటే ఇల్లంతా నాది అన్నట్లు== +==ఇస్తే చేసేది లేదు చస్తే వచ్చేది లేదు== +==ఇహం పరం లేని మొగుడు ఉంటేనేమి? పోతేనేమి + + +==ఉంచుకున్నవాడు మొగుడూ కాదు పెంచుకున్నవాడు కొడుకూ కాదు +వివరణ: లిక్కి అనగా ఒక కొడవలి (గడ్డి కోయడానికుపయోగ పడే పరికరం) కొంత పెద్దగా వుంటుంది. కాలానుగుణంగా దానికి పదను (కక్కు) తగ్గగా తిరిగి పదను పెట్టిస్తారు. అలా పలుమార్లు పదును పెట్టగా ఆ కొడవలి చిన్నదైపోతుందు. అప్పుడు దాన్ని లిక్కి అని అంటారు. ఒక రైతు మరొక రైతుకు తన లిక్కిని అరువు ఇచ్చాడు. పొరబాటున అది ఎక్కడో పోయింది. ఆ విషయాన్ని మొదటి రైతు చెప్పగా ఆ రైతు 'అలాగా ఎంత మంచి కొడవలి పోయిందా మరో కొత్త కొడవలి నైనా కొనివ్వు అని అంటాడు. ఒక వేళ ఆ లిక్కి దొరికివుంటే అదే తనది అనేవాడు. అది లేదు గనుక పోయిన లిక్కిని కొడవలిగా చపుతాడు. అలా పుట్టింది ఈ సామెత. +==ఉండనీయదు ఊరి శని ,తిననీయదు నోటి శని +==ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితే వింటారు +==ఉండ ఇల్లు లేదు పండ మంచం లేదు +అతి దైన్యమైన పరిస్థితి అని అర్థము +==ఉండవే పెద్దమ్మా అంటే కుండ పుచ్చుకు నీళ్ళు తెస్తానందట +==ఉండమనలేక వూదర, పొమ్మనలేక పొగ పెత్తినట్లు +చుట్టాలోస్తే వారు పోయేంతేవరకు వారికి మర్యాదలు చేయాలి. కాని పొమ్మనలే��ు. అలాంటప్పుడు వంట చేసేటప్పుడు కట్టెల పొయ్యి) పొగ ఎక్కువ వచ్చేటట్టు చేస్తే ఆ పొగ]]ను భరించలేక వారే వెళ్ళి పోతారని ఈ సామెతకు అర్థము. +==ఉండి చూడు వూరి అందం నానాటికీ చూడు నా అందం అన్నట్లు +==ఉండి చూడు వూరి అందం నానాటికీ చూడు నా అందం అన్నట్లు +==ఉండ్రాళ్ళ మీద భక్తా? విఘ్నేశ్వరుడి మీద భక్తా +==ఉండ్రాళ్ళూ ఒక పిండి వంటేనా? మేనత్త కొడుకూ ఒక మొగుడేనా +==ఉగ్గుతో నేర్చిన గుణం నుగ్గు]]లతోగానీ పోదన్నట్లు +పుట్టినప్పటి బుద్దులు పుడక]]లతో గాని పోవట అనగా పుట్టినప్పుడున్న బుద్ధులు చనిపోయే దాక పోవని అర్తము. పై సామెత అర్థం కూడా ఇటువంటిదె. +==ఉడకవే ఉడకవే ఓ ఉల్లిగడ్డా! నీవెంత వుడికినా నీ కంపు పోదే +==ఉడకవే ఉడకవే ఉగాది]]దాకా అంటే నాకేం పనిలేదు యేరువాక దాకా అందట +తన శక్తి మేరకు సాయం/దానం చేయాలని ఈ సామెతకు అర్థం. రామాయణంలో వున్నట్టు చెప్పబడే ఒక కథ ఈ సామెతకు ఆధారం. కథ: శ్రీరామ చంద్రుడు లంకను చేరడానికి సముద్రం మీద వారధి కడుతున్నాడు. ఆ కార్యక్రమంలో ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక ఉడుత తాను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని తలచి సముద్రం]]లో మునిగి నీటితో తడిసిన తన శరీరంతో పొడి ఇసుకలో పొర్లి తన శరీరానికి అంటిన ఇసుకను కడుతున్న వారధి పైన విధిలించేదట ఆ విధంగా అల్ప జీవి అయిన ఉడుత కూడా ఆ పవిత్ర కార్యంలో తన వంతు సాయం చేసిందట. +ఉట్టి గొడ్డు (వట్టి గొడ్డు) అంటే పిల్లలు పుట్టని ఆవు అని అర్థము. సంతానవృద్ధికి ఏ మాత్రం ఉపయోగం లేకపోయినా అరుస్తుంది అని ఇక్కడ భావము. చేయవలసిన పని చేయకుండా ఉత్తిగా వేషాలు వేసేవాడిని ఉద్దేశించి కూడా ఈ సామెత వాడతారు. +ఏదైనా ఒక పని చెయ్యాలంటే ప్రతీ మనిషికి ఎంతో కొంత సామర్థ్యం వుండాలి. ప్రతిపనీ చేసేస్తానని గొప్పలు పోతే అందరిలోను నవ్వులపాలు కాక తప్పదు. అలాంటి సందర్భంలో వచ్చే సామెతే ఇది.ఇంట్లో చూరికి వున్న ఉట్టి ఎగిరి అందుకోలేని ఆవిడ ఆకాశం లోని స్వర్గాన్ని అందుకోలేదుకదా. అలాగే చిన్న పని చెయ్యలేని వారు వారి సామర్ధ్యానికి మించిన పని చేస్తానంటే వారిని వేళాకోళం చేస్తూ అనే మాట ఇది. +చిన్న పని కూడా చేయలేని వారు పెద్ద పనిని ఎలా చేయ గలరు అని అర్థము ఈ సామెతకున్నది. +ఉడుత చాల అల్పజీవి. ఊర్లో విషయాలు దానికెందుకు. అదే విధంగా పెద్ద వాళ్ళ వ్వహారాలలో అల్పులు తల దూర్చరాదని ఈ సామెతకు అర్థం. +ఉడుత చిన్న జీవి. అది చెట్టు ��ొమ్మను ఊపినంత మాత్రాన దానిలోని కాయలు రాలవు. అదే విదంగా బలహీనులు పెద్ద పెద్ద కోరికలు కోరితె వృధా అని అర్థం. +==ఉత్త కుండకు వూపు లెక్కువ ఉత్తగొడ్డుకు అరుపు లెక్కువ +''నిండు కుండ తొణకదు అనే సామెత లాంటిదే ఈ సామెత కూడ. కుండ నిండా నీళ్ళు వుంటే ఆ కుండ తొణకదు దాన్ని ఎత్తుక రావడం కొంత తేలికైన పని. అదే కుండలో సగం వరకే నీళ్ళు వుంటే కొంత బరువు తక్కువైన అందులోని నీళ్ళు తొణికిసలాడుతున్నందున కుండను మోసేవానికి కొంత ఇబ్బంది కరమైన విషయము. +==ఉత్తర ఉరిమి కురిసినా, త్రాచు తరిమి కరిచినా తిరుగులేదు +ఇది వ్యవసాయ ధారులకు సంబంధించిన సామెత. ఉత్తర అనగా ఉత్తర కార్తే. ఉత్తర కార్తెలో ఎత్తర గంప అనగా విత్తనాలు చల్లడానికి గంప నెత్తమనడమని అర్థం. +ఇది వ్వసాయ ధారుల సామెత. ఉత్తర కార్తెలో ఉలవలకు అదును అని దీని అర్థము. +==ఉత్తరలో పూడ్చేకంటే గట్లమీద కూర్చుని ఏడ్వటం మేలు +==ఉత్తరాన మబ్బు పట్టితే వూరికే పోదు +ఉత్తర దిక్కున వాన మబ్బు పట్టితే తప్పకుండ వర్షం వస్తుందని ఈ సామెతకు అర్థం. ఇది వ్యవసాయ ధారులకు సంబంధించిన సామెత. +==ఉత్తరపు వాకిలి యిల్లు వూరికే యిచ్చినా తీసుకోరాదు +==ఉత్తరలో చల్లిన పైరు కత్తెరలో నరికిన కొయ్య +ఉత్తరాయణం వచ్చింది ఉరి పెట్టుకో మన్నాడుట== +ఉదయం ముద్దుల ఫలహారం మధ్యాహ్నం కౌగిలి భోజనం రాత్రికి అందాల విందులు అందట +కోటివిద్యలు కూటి కొరకే అనే సామెత లాంటిదే ఈ సామెత కూడ. ఎన్ని వేషాలేసినా కడుపు తిండి కొరకే అని దీని అర్థం. +ఉద్దర అయితే వూళ్ళు కొంటారు, నగదు అయితే నశ్యం కూడా కొనరు +==ఉద్యోగం పురుష లక్షణం గదా! గొడ్డలి తేరా నిట్రాడు నరుకుదాం అన్నాడట +గుడిసెకు మధ్య నాటిన ఆధార స్తంభం నిట్రాయి - +==ఉద్యోగికి ఒక వూరనీ లేదు ముష్టివానికి ఒక యిల్లనీ లేదు +ఉద్యోగికి ఒక వూరని లేదు ఎక్కడ వేస్తే అక్కడికి వెళ్ళి పని చేయాలి అది దూరామా దగ్గరా అని ఆలోసించే అవకాశమే లేదు. ఆ విధంగా పుట్టినది ఈ సామెత. +పురుషుడన్నవాడు ఏదో ఒక పని చేయాలని దీనర్థం. పనీ పాట లేకుండా వుండకూడదని గూఢార్తం. +==ఉన్న దుండగా పైన ఉపాకర్మ యింకొకటి== +య మపరో గండస్యోపరి స్ఫోటః అనగా కాలుటచే గలిగిన పుండుపై ఈబొబ్బ యింకొకటికూడ సంస్కృత న్యాయములు]] +కరువులో అధికమాసమన్నట్లు అన్న సామెతె లాగానే ఇదీను ఉన్న కష్టాలకు తోడు మరి కొన్ని కష్టాలోస్తే ఈ సామెతను వాడుతారు. +ఎదుటి వ్యక్తితో అతని గురించిన చేదయిన నిజం మాట్లాడినపుడు, నిజం ఒప్పుకునే ధైర్యం లేక ఉలికిపాటుతో మాటలతో ఎదురుదాడి చేస్తాడు. ఆ సందర్భంలో ఈ సామెత వాడుతారు నిజం చెప్పితే నిష్ఠూరం అన్న సామెత అర్థమే దీనికి వర్తిస్తుంది. +==ఉన్న వూరికి చేసిన ఉపకారం శవానికి చేసిన సింగారము వృధా +ఉన్న వూరికి ఏదేని ఉపకారము చేస్తే వూరి వారు దాని ఉపకారముగా భావించరు. అదేదో అతని బాధ్యతగా భావిస్తారు. అదే విధంగా శవానికి ఎన్ని అలంకారాలు చేసినా కొద్ది సేపె ఆ తర్వాత వృధా +==ఉన్న ఊరిలో ముష్టి అయినా పుట్టదు== +==ఉన్న వూరివాడికి కాటి భయం పొరుగూరు వాడికి నీళ్ళ భయం== +ఉన్న ఊరి వాడు రాత్రులందు వెళ్ళాలంటే దయ్యాలుంటాయని కాటి వైపు వెళ్ళడు. కాడు ఎక్కడుందో అతనికి తెలుసు పొరుగూరునుండి వచ్చిన వాడికి ఈ వూర్లో కాడు ఎక్కడుందో తెలియదు వెళ్ళవలసి వస్తే కాడు ప్రక్కనుండే వెళ్ళతాడు. కానీ నీళ్ళున్న చోట వెళ్ళాలంటే అవి ఎంత లోతులో వున్నాయో ఆ వూరి వారికి తెలిసినంతగా పొరుగూరి వారికి తెలియదు. కనుక ఆ నీళ్ళలో వెళ్ళాలంటే పొరుగూరు వానికి భయం ఇది ఈ సామెతకు వివరణ.\ +==ఉన్న వూరూ కన్న తల్లీ ఒక్కటే +అత్యాశకు పోకూడదని ఈ సామెతకు అర్థం. +==ఉన్నది ఉన్నట్లంటే వూరొచ్చి మీద పడింది== +==ఉన్నది ఒక కూతురు వూరంతా అల్లుళ్ళు== +==ఉన్నదే మనిషికి పుష్టి తిన్నదే గొడ్డుకి పుష్టి== +==ఉన్నమ్మ గాదె తీసేసరికి లేనమ్మ ప్రాణం పోయిందనట్టు== +==ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టే, లేనమ్మా ఉన్నమ్మకే పెట్టే== +==ఉన్నవాడు వూరికి పెద్ద చచ్చినవాడు కాటికి పెద్ద +చేసి పెడతానన్న పని చెప్పిన సమయానికి చేయక, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా అర్థులను తమ చుట్టూ విపరీతంగా తిప్పుకోటం. +==ఉన్న ఊరిలో ముష్టి అయినా పుట్టదు +==ఉన్న వూరివాడికి కాటి భయం పొరుగూరు వాడికి నీళ్ళ భయం +ఉన్న ఊరి వాడు రాత్రులందు వెళ్ళాలంటే దయ్యాలుంటాయని కాటి వైపు వెళ్ళడు. కాడు ఎక్కడుందో అతనికి తెలుసు పొరుగూరునుండి వచ్చిన వాడికి ఈ వూర్లో కాడు ఎక్కడుందో తెలియదు వెళ్ళవలసి వస్తే కాడు ప్రక్కనుండే వెళ్ళతాడు. కానీ నీళ్ళున్న చోట వెళ్ళాలంటే అవి ఎంత లోతులో వున్నాయో ఆ వూరి వారికి తెలిసినంతగా పొరుగూరి వారికి తెలియదు. కనుక ఆ నీళ్ళలో వెళ్ళాలంటే పొరుగూరు వానికి భయం ఇది ఈ సామెతకు వివరణ.\ +==ఉన్న వూరూ కన్న తల్లీ ఒక్కటే +==ఉన్నది ఉన్నట్లంటే వూరొచ్చి మీద పడింది +==ఉన్నది ఒక కూతురు వూరంతా అల్లుళ్ళు +==ఉన్ననాడు ఉట్ల పండుగ లే��ినాడు లొట్లపండుగ +[[తెలివి లేని వాడు ఉదర పోషణార్థం ఏపనీ చేయలేడు కనుక తిండి లేక చస్తాడని ఈ సామెతకు అర్థం. +==ఉపాయం లేని వాణ్ణి ఊర్లో నుండి వెళ్లగొట్టమన్నారు== +తెలివి తేటలు లేని వాడు ఊర్లో బ్రతకడం కష్టం అని దీని అర్థం +మంచి సలహాలు ఉపాయాలు చెప్పేవాడు పనీపాట చేయకుండా తన మాటకారి తనంతో ఊరిమీద బ్రతికేస్తాడని అర్థం. +==ఉప్పుతో తొమ్మిది, పప్పుతో పది అన్నట్లు +==ఉప్పు లేని కూర పప్పు లేని పెండ్లి +==ఉప్పు రుచులకు రాజు రోగాలకు రా రాజు== +ఉప్పు రుచులకు రాజు. అది లేని వంట లేదు. కాని అది ఎక్కువయితే అన్ని రోగాలకు అదే కారణమవుతుందని తెలియ జెప్పుతున్నది ఈ సామెత. +==ఉభయ భ్రష్టత్వం ఉప్పరి సన్యాసం అన్నట్లు +ఉమ్మడి పనికి బడుగు సొంత పనికి పిడుగు +==ఉమ్మడి బేరం ఉమ్మడి సేద్యం యిద్దరికీ చేటు +వ్యాపరమైనా వ్యవసాయమైనా ఉమ్మడిగా చేయ కూడదని ఈ సామెతకు అర్థం. ఉమ్మడిగా చేస్తే చేయ వలసిన పని వాడు చేస్తాడని వీడు వీడి చేస్తాడని వాడు ఇలా ఎవరికి వారు అనుకుంటుంటే ఆ పని కాస్తా అసంపూర్ణంగా మిగిలి పోతుంది. నష్టం వస్తుంది. +ఉయ్యాల]]లో బిడ్డను పెట్టి వూరంతా వెదకినట్లు +ఎదురుగా ఉన్న విషయాన్ని/నిజాన్ని విస్మరించి, పరిష్కారం కొరకు ఎక్కడెక్కడో తిరిగి అలసిన వ్యక్తిని ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు. +==ఉరిమిన మబ్బు, తరిమిన పాము వూరికే పోవు +ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు== +ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు మంగలం అంటే ఏమిటో పట్టణాలలో ఉండే వారికి తెలియదు. కానీ గ్రామాలలో ఉండేవారికి తెలుసు. సాధారణంగా పాత కుండను (ఓటికుండ, కొంచం పగులిచ్చిన కుండ) తీసుకుని దానికి ప్రక్కన చేయి పట్టేంత రంధ్రం చేస్తారు.కుండకు ప్రక్కన రంధ్రంతో ఇంకా బలహీనమౌతుంది. మంగలంలో ఎండు మిరపకాయ]]లు పేలాలు లాంటివి వేయించుతారు. ఇలా మంగలం దాదాపుగా అత్యంత బలహీనమైన వస్తువు అవుతుంది. అత్యంత శక్తివంతమైన ఉరుము (పిడుగు) మంగలం మీద పడితే, నష్టం ఏమి లేదు. కేవలం పోయేది ఒటి కుండే. +ఉలవ చేను పెట్టే మగడు వూరకుండక ప్రత్తిచేను పెట్టి ప్రాణం మీదకు తెచ్చాడు== +ఉలి దెబ్బ తిన్న శిలే శిల్పమౌతుంది +కష్టాలకోర్చుకున్నచో సుఖాలు లభిస్తాయి అని అర్థం చేప్పేదే ఈ సామెత సుత్తి దెబ్బలు తగిలితేనే బంగారం మెరుస్తుంది అనే సామెత లాంటిదే ఈ సామెత కూడాను. +==ఉలిపి కట్టె కేలరా వూళ్ళో పెత్తనాలు +==ఉల్లి వుంటే మల్లి కూడా వంటలక్కే +==ఉల్లి చ���సే మేలు తల్లికూడా చెయ్యదు== +ఉల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పేదే ఈ సామెత. ఉల్లి అంటే వెల్లుల్లి అని నిఘూడార్థం గమనించవలెను. +==ఉల్లి ఊరినా మల్లి పూసినా మంచి నేలలోనే== +==ఉల్లి ఎంత ఉడికినా కంపు పోదు== +==ఉల్లి గడ్డంత కోడలు వస్తే స్మశానంలో వున్న అత్తగారు వులిక్కిపడిందట== +==ఉల్లి తిన్న కోమటి నోరు మూసుకున్నట్లు== +==ఉల్లినీ తల్లినీ నమ్మి చెడినవారు లేరు== +[[ఉల్లి లేక ఉల్లిపాయ యొక్క ఉపయోగాలు నిత్యజీవితంలో వంటల్లో వాడుకపరంగా, మూలికా ఔషధపరంగా ఎన్నో ఉన్నాయి. ఉల్లిని తల్లితో పోల్చటంలోనే ఉల్లి గొప్పతనం తెలుస్తోంది. +==ఉల్లి మల్లె కాదు కాకి కోకిల కాదన్నట్టు== +పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఎంత ప్రయత్నం చేసినా మారవని.ఎన్ని నీతులు చెప్పినా మారని వారిని గురించి ఈ సామెత వాడుతారు . +==ఉల్లిపాయంత బలిజ వుంటే వూరంతా చెడుతుంది +''కాకి కోయిలౌతుందా అలాగే ఉంచుకున్నది పెళ్ళాము కానేకాది. దేని ప్రాముఖ్యత దానిదే అని చెప్పేదే ఈ సామెత. + + +==ఈ ఇంట ఆచారమా మా గ్రహచారమా +==ఈ ఊరు ఆవూరికెంత దూరమో ఆవూరు ఈ వూరికి అంతే దూరం== +==ఈ ఊపుడుక్కాదు ఆ ఊపుడుకు తట్టుకోవాలన్నాడట== +==ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు దాతలెవరంటే చాకళ్ళు== +==ఈగ వ్రణం కోరు నక్క పీనుగ కోరు== +==ఈగను కప్ప మ్రింగితే కప్పను పాము మ్రింగుతుంది== +==ఈ చీరెట్లా వుందంటే, చీరే లేకుంటే నువ్వు మరీ బాగుంటావన్నాడట== +==ఈ చేత చేస్తారు ఆ చేత అనుభవిస్తారు== +==ఈటె పోటు మానుతుంది గానీ మాట పోటు మానదు== +==ఈడు చూసి పిల్లని యివ్వాలి పిడి చూసి కొడవలి కొనాలి== +==ఈడ్పు కాళ్ళు, ఈడ్పు చేతుల ఇతడేనమ్మా యిల్లరికపుటల్లుడు== +==ఈతచెట్టు ఇల్లు కాదు తాడిచెట్టు తల్లి కాదు== +==ఈతచెట్టు క్రింద పాలు త్రాగినా కల్లే అంటారు== +==ఈత నేర్చిన వాడికే నీటి చావు== +==ఈ దెబ్బెలా వుందని అడిగితే నిన్నటి దెబ్బే బాగుందన్నదట== +==ఈ నొక్కుళ్ళకన్నా ఆ దెబ్బలే బాగున్నాయందట== +==ఈ జొన్న కూటికా ఈ స్తోత్ర పాఠమన్నట్టు== +కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కకపోతే, ఎంతో ఎక్కువ ఆశించినా కొద్దిగా మాత్రమే దక్కితే. అటువంటి సందర్భాలలో ఈ సామెత వాడతారు. +కొంత ఇచ్చి ఎక్కువ మొత్తం లాగే వాడని అర్థం. +ఈనగాయటం అంటే పశువును దూడను కనేంత వరకు పోషించి రక్షించటం అని అర్థం. ఆవు దూడను కనేంత వరకు రక్షించి తన పని అయిపోయిందనుకొని వెళ్ళి పోతే నక్కలు వచ్చి ఆదూడను తినేస్తాయి అలాకాక ఎల్లప్ప���డు రక్షణా వుండాలని ఈ సామెత అర్థము. +; పండించిన పంటను పరులపాలు సేయుట ఈనగాచి పొలమును నక్కలకుఁ బెట్టినట్లు బాహుబలాధిక్యంబు పేరిమిని గష్టపడి రణంబునం గెలుచుకొన్న రాజ్యంబును ఫలకాలంబున నొరుల పాలు సేయనేల నీతిచంద్రిక సంధి ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953 +==ఈతకు మించిన లోతూ గోచికి మించిన దారిద్ర్యం లేవు== + + +ఒకడి సుఖము మరొకడి కష్టము అని ఈ సామెత అర్థము. కొన్ని సందర్భాలలో,ఒకరికి సుఖం ఆతనికి తెలియకుండానే మరొకనికి కష్ట కారణమగును. ఆ సందర్భమున ఈ సామెత వాడుట పరిపాటి. +పరమ లోభి, పిసినారిని ఇలా వర్ణిస్తారు. కాకిని తోలేందుకు ఎంగిలిచేతిని విదిలిస్తే ఆ చేతికి అంటుకుని ఉన్న అన్నపు మెతుకులు రాలిపోతాయేమోనని ఆలోచించేవాడని దీనర్థం. దీనికి సమానార్థకమైన సామెత మరొకటుంది పిల్లికి బిచ్చం పెట్టనివాడు]] +==ఎంగిలికి ఎగ్గు లేదు తాగుబోతుకు సిగ్గు లేదు +==ఎంచిన ఎరువేదంటే యజమాని పాదమే అన్నట్లు +ఎవరి ఆర్థిక పరిస్థితుల కనుగుణంగా వారు నడుచు కోవాలి. గొప్పలకు పోకూడదని ఈ సామెత అర్థం. పిండి కొద్దీ రొట్టె అనేది కూడా దీనికి సమానర్థమె. +==ఎంత నేర్చినా, ఎంత జూచినా,ఎంత వారలైనా కాంతా దాసులే +దీనికి సమానార్థంలో మరొక సామెత వున్నది: అది ఎంతవాడయినా ఆడదానికి లోకువే]] +ఒక చిత్ర గీతంలో ఈ సామెత ఎంత వారు గాని, వేదాంతులైన గాని వాలు చూపు సోక గానె తూలి పోదురూ +==ఎంత కరవొచ్చినా పులి గడ్డి మేయదు== +నీతిమంతుడు ఎంత కరవుకాలం, కష్టకాలం వచ్చినా అవినీతికి మాత్రం పాల్పడడని, నీతినిజాయతీలతోనే ఉంటాడని +==ఎంత పెరిగినా గొర్రెకు బెత్తెడే తోక +==ఎంత ప్రొద్దుండగా లేచినా సందు చివరే తెల్లవారినట్లు +తన ప్రాప్తాన్ని బట్టి ఫలితముంటుందని దీనికి అర్థం. +==ఎంతమంచి గొల్లవాడికైనా వేపకాయంత వెర్రి వుండకపోదు +పరాతు సొత్తుకు ఆశపడే వారిని గురించి ఈ మాటను ఉపయోగిస్తారు. +దీనికి సమానార్థంలో మరొక సామెత ఉంది ఎంత నేర్చినా, ఎంత జూచినా,ఎంత వారలైనా కాంతా దాసులే]] +సంపద ఎక్కువయితే ఆపద ఎక్కువని దీనర్థం. సంపదను దోచుకోడానికి వచ్చే దొంగల వల్ల ప్రాణ భయమున్నదని ఈ సామెత అర్థం. +==ఎంత సంపాదించినా కూటికే ఎంత బ్రతికినా కాటికే +==ఎందుకు ఏడుస్తున్నావంటే, మొగుడు కొట్టబోయే దెబ్బలకందంట +==ఎండు నేలమీద ఎండ్రకాయ కనబడితే వాన పడుతుంది +==ఎండా వాన కలిసివస్తే కుక్కా నక్కల పెళ్ళంట +==ఎక్కడున్నావె గొం���ళి అంటే వేసిన చోటే వున్నానన్నదట== +కొందరి జీవితాలలో ఎంత మాత్రము ఎదుగు దల వుండదు. వారి ఆర్థిక పరిస్థిలో ఎన్నటికి అభివృద్ధి లేక పోతే ఈ సామెతను వాడుతారు. +వంగ చెట్టు దురద స్వభావము కలిగి ఉంటుంది అందుకే వంగతోట]]లో సరసాలు ఆడకూడదు. +మరొక అర్థంలో కూడా ఈ సామెతను వాడుతుంటారు. బావ వరస అయిన వాడు వంగ తోట వద్దకు వస్తే ఎక్కడ వంకాయలు అడుగతారేమోనని ముఖం చాటేస్తారని ఈ సామెకు అర్థం. +==ఎక్కడికి పోయినా ఏలినాటి శని తప్పదన్నట్లు +ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది== +ఎక్కలేని చెట్టు మీద ఏది గుడ్డు పెట్టితే నేమి? అది మనకు అందదు కదా? అలా నిరుపయోగమైన పని అని అర్థం. +==ఎక్కడికి పోయినా చేసుకున్న ఖర్మం ఎదురు వస్తుంది +==ఎక్కడిదిరా ఈ పెత్తనమంటే మూలనుంటే నెత్తినేసుకున్నానన్నాడట +ఇలాంటిదే మరొక సామెత ఉంది నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు]] +==ఎక్కమంటే ఎద్దుకు కోపం దిగమంటే కుంటికి కోపం== +కుంటివాడు నడవలేక పోతుంటే పక్కనే వెళ్ళే ఎద్దును పైకిఎక్కిస్తాడు ఒక దారిన పోయే దానయ్య. కొంత దూరమెళ్ళాక ఇక కుంటివాడిని దిగమనదామనుకుంటాడు. ఆ సందర్భంలో ఆ దానయ్య ఆలోచనే ఈ సామెత. ఎద్దుమీద ఎక్కమంటే నామీద బరువు వేస్తావా? అని ఎద్దుకు కోపం వస్తుందని, దిగమంటే కుంటి వాడిని నడవమంటావా అని కుంటికి కోపమొస్తుందని అనుకుంటాడు/ +==ఎక్కి కాయను చూసి, దిగివచ్చి రాయి రువ్వినట్లు +==ఎక్కువగా తిన్న పొట్ట ఏకులు పెట్టిన బుట్ట చిరుగవు +==ఎక్కువ తెలివి ఏడ్పుల కారణం తక్కువ తెలివి తన్నుల కారణం +==ఎక్కువ వెల పెట్టి గుడ్డును, తక్కువ వెల పెట్టి గొడ్డును కొనరాదు +==ఎగదీస్తే బ్రహ్మ హత్య దిగదీస్తే గో హత్య +==ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరక దంచినా అంతే కూలి +==ఎగిరి పడే గొడ్డే మరి మానెడు మోస్తుంది +==ఎట్లాంటి కోమటికైనా నిమ్మకాయంత బంగారం వుంటుంది +ఎంతటి బీద కోమటైనా అతని వద్ద ఎంతైనా కొంత బంగారముంటుందని ఈ సామెత అర్థం. +అనాచితంగా వచ్చిన సంపద నిలువదు అని అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. +==ఎడమచేత్తో తెలియక చేసేది కుడిచేత్తో తెలిసి అనుభవించాలి +ఎవరు చేసిన కర్మ ఫలం వారు తప్పక అనుభవించాలని చెప్పేది ఈ సామెత. +ఎడ్డె తిక్కలామె తిరణాల పోతే, ఎక్కా దిగా సరిపోయింది== +అవునంటే కాదనే వితండ వాదన చేసే వారితో మాట్లాడటం కష్టం. అనే అర్థంతో ఈ సామెతను వాడ తారు/ +==ఎంత వుంటేనేం తినేది అన్నమే, బంగారం కాదు +==ఎంత ఉప్పు తింటే అంత దాహం +==ఎంత తొండమున్నా దోమ ఏనుగు కాదు +==ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితేనేమి +కొత్తగా కాపురానికి వస్తున్న ఆడపడుచును అత్తవారింట ముందుగా కుడికాలు ఇంటిలోపల పెట్టించి ఆహ్వానించటం ఆచారం. కానీ, వివిధ కారణాలచేత కాపురము ఎంతో కాలం సాగదని ముందుగానే తెలిసినపుడు, ఏ కాలు ముందు పెట్టి లోనికి వచ్చినా ఉపయోగం లేదు. ఈ విషయాన్నే ఏదేని మంచికార్యం చెడుతుందని ముందుగానే తెలిస్తే, ఈ సామెతను ఉటంకిస్తారు. +==ఎత్తివచ్చిన కాపురానికి ఏ కాలూనినా ఒక్కటే +కాపురానికొచ్చిన కొత్త కోడలు తొలిసారి ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు వారి సంసారం చక్కగా సాగాలని కుడి కాలు ముందు పెట్టి లోపలికి రమ్మనడం ఒక ఆచారం. కాపురం ఎలా అయితేనేం? అనుకొనే వారికి ఏ కాలు పెడితే ఏమి? అనే అర్థం ఈ సామెతలో ఉంది. +==ఎత్తెత్తి అడుగులేస్తే పుల్లాకుల మీద పడ్డాయట +ఒకడు ఎక్కడ బురదలో కాలు వేస్తానో యని అతి జాగ్రత్తగా అడుగులు ఎత్తి ఎత్తి వేస్తూ నడుస్తున్నాడట. చివరకు బురదకన్న హీనమైన పుల్లాకులమీద అతని అడుగు పడిందని ఈ సామెత అర్థం. అతి జాగ్రత్తకు పోతే అనర్థం జరుగుతుందని ఇందులోని పరమార్థం. +==ఎద పొంగుతోంది నా వన్నెలు చిన్నెలు చూడమన్నదట +==ఎదురు అన్నది మాట ఎదాన పెట్టింది వాత +==ఎదురు అన్నది మాట ఎదాన పెట్టింది వాత +==ఎదురింట్లో పొయ్యి మండితే తన పొయ్యిలో నీళ్ళు పోసుకున్నట్లు +==ఎదురు తిరిగిన కుక్క, ఏదుపంది ఒక్కటే +==ఎదురు పడిన వాడే నా మొగుడు అన్నట్లు +==ఎద్దు ఎండకు లాగు దున్న నీడకు లాగు +==ఎద్దు కొద్దీ సేద్యం చద్ది కొద్దీ పయనం +==ఎద్దు క్రొవ్వి ఆబోతుపై రంకె వేసినట్లు +==ఎద్దుగా కలకాలం బ్రతికేకంటే ఆబోతుగా ఆరు నెలలు బ్రతికితే చాలు +సాధారణంగా ఎద్దు]]లతో వెట్టి చాకిరీ చేయించుకుంటాం వాటికి సరిపడే తిండి మాత్రమే పెడుతూ. కానీ ఆంబోతు]]లు ఏ పనీ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అంటే బానిస]]గా కష్టాలు పడుతూ ఎక్కువ కాలం ఉండడం కంటే స్వేచ్ఛగా, దర్జాగా కొద్ది కాలం ఉండడం ఉత్తమం అని దీని అర్థం. +ఒకనికి చిన్నపాటి పెర్మనెంట్ ఉద్యోగం, మంచి హోదా గల తాత్కాలిక ఉద్యోగం ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను తన మిత్రుని సలహా అడిగితే ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు అని చెప్పాడు. +==ఎద్దున్నవాడి సేద్యం చూడు మంది వున్నవాడి బలం చూడు +==ఎద్దు మంచిదయితే సంత కెందుకు వెళుతుందిట +==ఎద్దులా తిని మొద్దులా నిద్ర పోయినట్లు +==ఎద్దువలె కుక్కను పెంచి తానే మొరిగినట్లు +==ఎద్దు లేని సేద్యం చద్ది లేని పయనం +==ఎద్దు లేని సేద్యం చద్ది లేని పయనం +ఎన్నడూ దొరకనమ్మకు ఏగానీ దొరికితే ముడిమీద ముడి ఏడు ముళ్ళు వేసిందట +==ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట== +ఒకరు చెప్పే పచ్చి అబద్ధాన్ని మరొకరు గుడ్డిగా సమర్థిస్తున్నారనే అర్థంలో దీన్ని వాడుతారు. +ఎద్దు ఈనడమనేది ప్రకృతికి విరుద్ధం. అది ఘోరమైన అబద్ధం, అసంబద్ధం చిన్నపిల్లలు కూడా నమ్మరు. అంతటి దారుణమైన అబద్ధం ఒకరు చెప్తే దాన్ని నిజమేనని భావించి గానీ, ఈ అబద్ధానికి గౌరవాన్ని ఆపాదించే ఉద్దేశంతో గానీ, ఇతరులచేత ఈ అబద్ధాన్ని నమ్మించే దురాలోచనతో గాని, దానికి మరింత మసాలా జోడించే సందర్భంలో ఈ సామెతను వాడతారు. సాధారణంగా అబద్ధాన్ని ఇతరులచేత నమ్మించే ప్రయత్నం జరిగిన సందర్భంలోనే వాడతారు. +ఇటువంటిదే మరో సామెత ఉంది అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు అయితే ఇది వాడే సందర్భం మాత్రం వేరు. +==ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి +ఎద్దు సాధారణంగా అటుకులు దాని జీవితకాలములో రుచి చూడదు. అట్టి దానికి అటుకుల రుచి తెలియదు. ఈ విషయమునే వ్యంగ్యముగా, ప్రావీణ్యతను బట్టి వ్యక్తులను సందేహములు అడుగవలెను అని సామెత రూపములో చెప్పుచున్నారు. +ఎద్దుకు అయిన గాయం కాకికి ఆనందదాయకం. ఎందుచేతంటే, కాకి ఆ గాయాన్ని తొలుస్తూ ఆహారంగా స్వీకరిస్తుంది. ఒకని కష్టం మరొకని సుఖంగా అయిన వేళ ఈ సామెతను ఉదహరించటం పరిపాటి. +==ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు== +సాధారణంగా ఎద్దు]]లతో వెట్టి చాకిరీ చేయించుకుంటాం వాటికి సరిపడే తిండి మాత్రమే పెడుతూ. కానీ ఆంబోతు]]లు ఏ పనీ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అంటే బానిస]]గా కష్టాలు పడుతూ ఎక్కువ కాలం ఉండడం కంటే స్వేచ్ఛగా, దర్జాగా కొద్ది కాలం ఉండడం ఉత్తమం అని దీని అర్థం. +ఒకనికి చిన్నపాటి పెర్మనెంట్ ఉద్యోగం, మంచి హోదా గల తాత్కాలిక ఉద్యోగం ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను తన మిత్రుని సలహా అడిగితే ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు అని చెప్పాడు. +==ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆబోతుగా ఆరునెలలు బతికినా చాలు== +సాధారణంగా ఎద్దు]]లతో వెట్టి చాకిరీ చేయించుకుంటాం వాటికి సరిపడ�� తిండి మాత్రమే పెడుతూ. కానీ ఆంబోతు]]లు ఏ పనీ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అంటే బానిస]]గా కష్టాలు పడుతూ ఎక్కువ కాలం ఉండడం కంటే స్వేచ్ఛగా, దర్జాగా కొద్ది కాలం ఉండడం ఉత్తమం అని దీని అర్థం. +==ఎద్దుల పోట్లాటలో దూడలు నలిగి పోయినట్లు== +గొప్పవారు పోట్లాడుకుంటుంటే బీదవారు వారి మధ్యకు వెళ్లకూడదని దీని అర్థం. +ఒకనికి చిన్నపాటి పెర్మనెంట్ ఉద్యోగం, మంచి హోదా గల తాత్కాలిక ఉద్యోగం ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను తన మిత్రుని సలహా అడిగితే ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు అని చెప్పాడు. +==ఎన్ని పుంగునూరు లైతే ఒక బెంగుళూరుతో సమానం== +==ఎన్ని పుటాలు పెట్టినా పుట్టుకతో వచ్చిన బుద్ధి పోదు +==ఎన్ని విద్యలయినా కుల విద్యకు సాటిరావు== +==ఎన్నో వ్రణాలు కోసానుగానీ, నా వ్రణమంత బాధలేదు అన్నాడట +==ఎప్పుడు బిచ్చం పెట్టని మహా తల్లి ఈరోజు కూడ బిచ్చం వేయలేదు రోజు బిచ్చం పెట్టే ఈ బొచ్చు ముండకు ఈ రోజు ఏమైందో +తనకు నష్టం కలిగించేదైనా సరే తర తరాలుగా ఆచరిస్తుంటే అదే సిద్దాంతమై కూర్చుంటుంది. ఇది ఆర్థిక శాస్త్రంలో సిద్దాంతం; అలాగే బొచ్చగాడి ప్రతి రోజు +బిచ్చం వేసే ఇల్లాలను అది ఆమె విద్యుక్త ధర్మమని అనుకొన్నాడు. ఎప్పుడు బిచ్చం వేయని ఆమెను కూడా అది ఆమె విద్యుక్త ధర్మమని నమ్మాడు. అందు చేత +రోజు బిచ్చంవేసే ఆమెను ఒక రోజు వెయ్యక పోతే బొచ్చుముండ అయ్యింది ఏ రోజు బిచ్చం వేయని ఆమె మహా తల్లి అయింది. +==ఎప్పుడు సంపద కలిగితే అప్పుడు బందువులు వస్తారు== +సంపద కలిగినప్పుడే బంధువులు వస్తారు. ఇది లోక సహజము: ఇది సుమతీ శతక పద్య పాదము: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులోత్తురు అది ఎట్లన్నన్ తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పది వేలు చేరు గదరా సుమతీ +==ఎముకలేని నాలుక ఎట్లా త్రిప్పినా తిరుగుతుంది +==ఎముక లేని నాలుక ఏమయినా పలుకుతుంది +==ఎరను చూపి చేపను లాగి నట్లు== +==ఎరువుసొమ్ములు బరువుచేటు తియ్యా పెట్టా తీపులచేటు అందులో ఒకటి పోతే అప్పుల చేటు== +==ఎరువు పెట్టిన చేను ఏలుబడి అయిన కోడలు +==ఎరువు లేని చేను వేగంలేని ఏరూ ఒకటే +==ఎరువు లేని పైరు పరువు లేని వూరూ ఒక్కటే +==ఎఱ్ఱ కోమటినీ నల్ల బ్రాహ్మడినీ నమ్మరాదు +==ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు== +ఒక మూర్ఖుడిని మార్చటానికి ఎంత ప్రయత్నించినా అతడు మా���డు. ఎలుక తోకని ఎంత ఉతికినా రంగు మారనట్లే మూర్ఖుని మనస్సు ఎంత ప్రయత్నించినా మారదు. +==ఎల్లయ్యకు ఎడ్లు లేవు, మల్లయ్యకు బండ్లు లేవు తెల్లవార్లూ బాడుగ తోలారుట +==ఎలాంటి వాడికైనా వేపకాయంత వెర్రి వుంటుంది== +==ఎవడు త్రవ్వుకున్న గోతిలో వాడే పడతాడు +అందరు కలసి వుంటే దాని భలం అధికం. అలా కాకుండ ఎవరికి వారే వుంటే ఎదుటి వాడిచేత చాల సులభంగా ఓడి పోతారని దీని అర్థం. +# ఎవరికి వారే యమునా తీరే # +ఎవరి దారి వారిది, ఒకరి గురించి ఇంకొకరు పట్టించుకోకపోవటం. ఉదాహరణ:సరయిన రజులేనందువల్ల ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రజలు మారుతారు. +==ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఎక్కి ఏడ్వటానికి +==ఎవరికి పెట్టావే దండమంటే మీలో బుద్ధిహీనుడికి అన్నదట +==ఎవరు తీసిన గోతిలో వారే పడతారు +ఎవరికో మోసం చేయాలని తలస్తే వారే మోస పోతారు అనే అర్థంతో దీన్ని వాడుతారు చెడపకురా చెడేవు" అనే సామెత కూడా ఇలాంటిదె. +==ఎవరూ లేకపోతే అక్క మొగుడే దిక్కు +ఎవడి నెత్తి మీద వాడే చెయ్యి పెట్టుకున్నట్లు +భస్మాసురుడు తన నెత్తి మీద తానే చెయ్యి పెట్టుకుని బూడిద అయినట్టు తనకు తానే ప్రమాదం కొని తెచ్చుకొవటం అనమాట. + + +==ఏ అన్నమైతేనేం వరి అన్నమే పెట్టమన్నట్టు== +జొన్న అన్నం తినేవాళ్ళ దగ్గర మీరు ఏది తింటే అదే పెట్టండి కానీ వరి అన్నం పెడితే బాగుంటుందేమో అని లౌక్యంగా చెప్పి తనకు కావలసింది పెట్టించుకొని తినటం. +==ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు +==ఏ కర్రకు నిప్పంటుకుంటే ఆ కర్రే కాలుతుంది +==ఏ కాలు జారినా పిర్రకే మోసం +చిన్న తప్పుకు పెద్ద శిక్ష వెయ్యటం +==ఏ గూటి పక్షి ఆ గూటికే +==ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది +==ఏ గ్రహం పట్టినా ఆగ్రహం పట్టరాదు +==ఏ చెట్టూ లేనిచోట ఆముదపుచెట్టు మహావృక్షం +==ఏటవతల యిచ్చేకన్నా యేట్లో పారేయటం ఉత్తమం +==ఏటి ఈతకు లంక మేత సరి +==ఏటి వొడ్డు చేను ఏరు వస్తే ఉంటుందా +==ఏటి వొడ్డు చేనుకు మాటిమాటికీ భయం +==ఏటికి లాగితే కోటికీ కోటికి లాగితే ఏటికీ అన్నట్లు +==ఏటిగట్టు దాని మాట యెన్నడూ నమ్మరాదు +వివరణ: ఏతులు అనగా గొప్పలు అని అర్థం. ఏమీ లేనమ్మ అన్నీ గొప్పలే చెపుతుంది. అని అర్థం. అన్ని వున్న విస్తరి అణిగిమణిగి వుంటుంది ఖాళీ విస్తరే ఎగెరెగిరి పడుతుందీ ఈ సామెత కూడా ఒకే అర్తంలో వాడతారు. +==ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు== +పూర్వకాలంలో చెల్లెలికి పెళ్ళికావటం కష్టమయిన పరిస్థి���ిలో, అక్క మొగుడికే ఇచ్చి పెళ్ళి చేసేవారు.ప్రయత్నించిన పని బయటివారి వల్ల కాక చివరగా సొంతవారి సహాయము కోరవచ్చినవాడిని ఉద్దేశించి +==ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు== +ఎక్కడికక్కడ పరిస్థితిని అర్థంచేసుకుని, దానికి తగినట్లుగా ఆయా ప్రదేశాల్లో ప్రవర్తించాలని ఈ సామెతకు ఒక అర్థం. మరొక అర్థం ఏమంటే అవసరాన్ని బట్తి రంగులు మార్చే మొసగాడ్ని కూర్చి కూడా ఈ సామెతను వాడుతారు. +==ఏగూటి చిలక ఆగూటి పలుకులే పలుకుతుంది== +==ఏగూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి== +==ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము== +పెద్దగా విషయ పరిజ్ఞానం లేనివారిదగ్గర మిడిమిడి జ్ఞానంతో డంబాలు పలికేవాడు అమాయకుల మధ్యనున్నంతవరకూ అతడే మేధావి +==ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు అన్నట్లు== +ఎన్ని పాట్లు పడినా ఆవన్నీ తిండి కొరకే అనే అర్థం ఈ సామెత చెపుతున్నది. +ఎవరి మనసులో ఏ ఆలోచనలున్నాయో ఎవరు తెలుసుకోలేరు +==ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం== +ఏటి ఇసుకని కొలవటము, తాటిమానుని తన్నటము, ఈతమానునని విరిచే ప్రయత్నము చేయటం, ఈ మూడు అసాధ్యమయిన, మూర్ఖమయిన పనులు. ఓ మూర్ఖుని బుద్ధిని మార్చేప్రయత్నము +==ఏటికవతల ముత్యాలు తాటికాయంత వున్నాయి అన్నడట== +==ఏట్లో వేసే టప్పుడు కూడ ఎంచి వేయాలి +ఏరు, నదిని దాటె టప్పుడు అందులో చిల్లర నాణేలను వేయడం సాంప్రదాయం. అలా వేసెటప్పుడు కూడా ఇంత వేస్తున్నాను అని ఎంచి వేయాలని ప్రతి ఖర్చుకు లెక్క వుండాలని డబ్బు విషయంలో బాధ్యతాయుతంగా వుండాలని చెప్పెదే ఈ సామెత. +==ఏట్లో పారే నీరు యెవరు త్రాగితేనేం +==ఏడు కురచలు చూచి యెద్దు కొనాలి +==ఏడు మాటలు మాట్లాడినా ఏడడుగులు నడిచినా గుణం తెలుస్తుంది +==ఏడు మెతుకులు కతికితే ఏనుగంత బలం +==ఏడుస్తూ ఏరువాక సాగిస్తే కాడీ, మోకూ దొంగలు యెత్తుకుపోయారట +==ఏడ్చేదాని ఎడమచేతి క్రిందా, కుట్టేదాని కుడిచేతి క్రిందా కూర్చోరాదన్నట్లు +==ఏడ్చేదాని మొడొస్తే నామొగుడు వస్తాడన్నదట ఒక ఇల్లాలు +ఇద్దరు మగ వాళ్లు కలిసి వేటకు వెళ్లారట: వారు ఎంత కాలానికి తిరిగి రాక పోయే సరికి అందులో ఒకని భార్య తన మొగుడి గురించి ఏడవ సాగింది. +ఆడపిల్లలు పెళ్ళి వయసుకి ఎదిగినా కొంతమంది తల్లితండ్రులకు వారికి పెళ్ళిచెయ్యాలి అన్న ఊహ రాదు. తెలుగు వారింట సాంప్రదాయంగా పెద్దపిల్లలకు పెళ్ళిచేసి గాని చిన్న పిల్లలకు చేయరు. అందుకని అక్కకు పెళ్ళి అయితే తన��ు కూడా అవుతుంది అనే ధైర్యంతో కొంతమంది చెళ్ళెళ్ళు ఆ విషయాన్ని పట్టింఛుకోరు. అలాగే కొంతమందికి ఒకే రకమయిన సమస్యలు వున్నా కానీ అందరూ వాటిని పరిష్కరించటానికి నడుము కట్టరు. తోటివారు పరిష్కరిస్తే మనకి కూడా పరిష్కారమవుతుందని ఎదురు చూస్తూ వుంటారు. అటువంటి వారిని పోల్చి చెప్పటానికి ఈ సామెత . +==ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు== +==ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చొన రాదు== +ఏడ్చేవాడు ముక్కు చీది ఎడంపక్కకు వేస్తాడు.అంచేత ఏడ్ఛే వానికి ఎడం పక్కన కూర్చో రాదు.సూదితో కుట్టే వాడు ప్రతి కుట్టుకు సూదివున్న చేతిని దారాన్ని బిగదీసేందుకు పొడుగ్గా చాపుతాడు. అంచేత కుట్టేవానికి కుడి పక్కన కూర్చో రాదు అని అని అర్థం. +ఎవరు ఏపని చేసినా తిండి కొరకే. అందరికి తిండి తప్పదు.'కోటి విద్యలు కూటి కొరకే' +==ఏ దారి అంటే గోదారి అన్నట్లు +==ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే +ఐదు తూములు తిన్నా, పది తూములు తిన్న ఏమీ తిననట్లే। మరీ తిండిబోతుని, పొద్దాకా ఏమన్నా పెట్టు, ఏమన్నా పెట్టు అని ఏడిపించే పిల్లలని ఇలా అంటూ ఉంటారు +==ఏ దేముడు వరమిచ్చినా మొగుడు లేందే పిల్లలు పుట్టరు +==ఏనుగుల పోట్లాటకు ఎర్ర చీమ రాయబారమన్నట్టు== +సమఉజ్జీగా లేని వ్యవహారం. స్థాయిని మించి చేసే వ్యర్థ ప్రయత్నం. +==ఏనుగంత తండ్రి ఉండే కంటే ఎలుకంత తల్లి మేలు +==ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు== +మంచి షడ్రుచులతో తినడము అలవాటయినవాడు పచ్చడి మెతుకులు తిని ఉండలేడుకదా. ఎక్కువ మోతాదులో తినడం అలవాటయినవాడికి కొద్ది మోతాదులో తిండి పెట్టటాన్ని +ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు వంటిదే ఈ సామెత. +ఏనుగు బ్రతికున్నప్పుడు దానితో బరువైన పనులెన్నో చేయించవచ్చు. అది చనిపోయాక దాని శరీరభాగాలను అమ్మి ధనము సంపాయించవచ్చు. ఈ విధంగా ఎవరైనా బ్రతికున్నప్పుడూ, మరణించిన తరువాతా ఉపయోగపడినప్పుడు ఈ సామెత +==ఏనుగు వెళు తుంటే కుక్కలు మొరిగి నట్టు== +ఏనుగులు మందగమనంతో నడుస్తుంటే ఎన్నో కుక్కలు మొరుగుతాయి. కాని ఏనుగులు వాటిని కించెత్తైనా గమనించవు. నిజాయితీ పరులైన నాయకులు ఎవరెన్ని అన్నా తమ పనులు తాము చేసుకొని పోవాలి. ఎవరో ఏదో అన్నారని దాని గురించి విచారించరు అని ఈ సామెత అర్థము +మంచి పనిని చేస్తున్నప్పుడు నీచులు, దుర్మార్గులు అనే మాటలన��� విని దడుచుకోకూడదు. ధైర్యంతో ముందుకు సాగుతూనే ఉండాలి +==ఏనుగు నెక్కి దిడ్డి లోకి వెళ్ళినట్లు== +==ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు== +భస్మాసురుడు తన నెత్తి మీద తానే చెయ్యి పెట్టుకుని బూడిద అయినట్టు తనకు తానే ప్రమాదం కొని తెచ్చుకొవటం +==ఏనుగు మీద దోమ వాలి నట్లు== +==ఏనుగు బ్రతికినా వెయ్యే చచ్చినా వెయ్యే +==ఏనుగులే గాలికి కొట్టుకు పోతుంటే, పుల్లాకు నా సంగతేమిటి అన్నదట +==ఏ పని చేసినా పొయ్యిలో ఏకులు దాచుకున్నట్లే +==ఏ పూజ తప్పినా పొట్టపూజ తప్పదు +==ఏ మందలో పట్టినా, మన మందలో ఈనితే సరి +==ఏమి చేసుకుని బ్రతకనమ్మా అంటే నోరు చేసుకుని బ్రతకమన్నట్లు +==ఏమి చేస్తున్నావురా అంటే పారబోసి యెత్తుతున్నా అన్నాట్ట +==ఏమీ ఎరుగని పిల్ల మామను మరిగిందట +==ఏమీ ఎరుగని వాడు చీరముడి, పోకముడి విప్పి ఆశ్చర్యంగా చూసాడట +==ఏమీ తోచనమ్మ తోటికోడలు పుట్టింటికి పోయిందట +==ఏమీ లేకపోతే మూట విప్పి మళ్ళీ కట్టమన్నట్లు +==ఏమీ లేనివానికి ఏతులు లావు స్వాములవారికి జడలు లావు +==ఎముకలు విరిగేటట్లు పనిచేస్తే దంతాలు అరిగేటట్లు తినవచ్చు== +ఏమండీ కరణం గారూ పాతర లో పడ్డారే అంటే, కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట== +==ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి పడుంది== +ఖాళీగా ఏమీ వడ్డించని విస్తరాకు గాలికి ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అదే అన్ని పదార్థాలు వడ్డించిన విస్తరాకు ఎగరకుండా స్థిరంగా ఉంటుంది. మిడిమిడి జ్ఞానం గలవాడూ, స్థితప్రజ్ఞుడినీ పోల్చుతూ ఈ సామెత . +==ఏరా బడాయిబావా అంటే ఏమే గుడ్డి కంటి మరదలా అన్నాడట +==ఏరా పడ్డావా అంటే లేదు అదొక లగువు అన్నాడట== +చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలనే వారి గురించి చెప్పినది ఈ సామెత. +==ఏ రాయి అయితేనేమి పండ్లూడ గొట్టుకోవటానికి +==ఏ రేవుకు వెళ్ళినా ముళ్ళపరిగే దొరికిందన్నట్లు +==ఏరు యెన్ని వంకలు పోయినా కలిసేది సముద్రంలోనే +ఏరు ఏడామడలుండగానే చీర విప్పి చంకన బెట్టుకొందట== +ఏరు ఏడు ఆమడలు దూరంలో ఉండగా అప్పుడే చీర తడిసి పోతుందేమో అన్న భయంతో చీర విప్పి చంకన పెట్టుకున్నట్టు, అతి జాగ్రత్త +==ఏరు ఏడామడలదూరం వుండగానే చీరవిప్పి చంకలో పెట్టుకున్నదట +==ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు== +అవసరం తీరిన తర్వాత సహాయం చేసిన వాళ్ళకు హాని తలపెట్టడం .ఏరు దాటడానికి తెప్పను వాడుకుని, అవతలి ఒడ్డుకు చేరిన తర్వాత ఇంక ఆ తెప��పతో మనకు అవసరం లేదని దాన్ని తగలబెట్టినట్లు +==ఏరు పోయిందే పోక యేలిక చెప్పిందే తీర్పు +==ఏరు మూరెడు తీస్తే కొలను బారెడు తీస్తుంది +ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య== +పొందిన సహాయాన్ని మరిచిపోయి కృతఘ్నతతో వ్యవహరించటం. అవసరం తీరేవరకూ ముఖస్తుతి చేసి ఆపై హేళన చేసే నీచబుద్ధి +==ఏలటానికి వూళ్ళు లేకపోవచ్చుకానీ బిచ్చమెత్తుకు తినటానికి వూళ్ళే లేవా +==ఏలేవాడి యెద్దు పోతేనేం కాచేవాడి కన్ను పోతేనేం +==ఏవాడ చిలుక ఆవాడ పలుకు పలుకుతుంది +==ఏ వేషం వచ్చినా దివిటీ వానికే చేటు +==ఏ వేషం వేసినా గ్రాసం మాత్రం రావాలన్నట్టు== +==ఏ వేషం వేస్తేనేం? గ్రాస మొస్తుంది గదా +==ఐదు నిముషాల సుఖానికి మరుజన్మ నెత్తాలి అందిట== +==ఐశ్వర్యానికి అంతం లేదు దారిద్ర్యానికి మొదలూలేదు + + +ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు +==ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు== +==ఒకడి పాటు పది మంది సాపాటు అన్నట్టు== +ఒకరిపై ఎక్కువ మంది ఆధారపడి బతకటం. +కష్టాలలో ఉన్నవానికి ఇవన్నీ మామూలే అంటూ ఉచిత సలహాలివ్వటం +ఒకే పనితో రెండు కార్యములు చేయ ప్రయత్నించి, అవి నెరవేరిన సందర్భములో ఈ సామెతను ఉటంకించెదరు. అంటే ఒకే పనికి రెండు ప్రయోజనాలు కలగడం అని ఈ సామెత చెబుతోంది. +ఒల్లని భార్య చేయి తగిలినను ముప్పే, కాలు తగిలినను తప్పే== +==ఒల్లని మగడా వండి పెట్టరా అంటే చేతకాని పెళ్లామా చేర్చి పెట్టవే అన్నాడట== +ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు== +మతిమరుపు వారిని గురించి ఈ సామెత పయోగిస్తారు. +ఒళ్ళు బలిసిన పూజారి అమ్మవారిని పట్టుకున్నాడట== +ఆపని అసాధ్యము అని చెప్పడనికి ఈ సామెతను ఉపయోగిస్తారు + + +==ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య== +ఎవరైనా చేసిన సహాయాన్ని మరిచిపోయి కృతఘ్నతతో వ్యవహరించే వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు. అవసరం తీరే వరకూ ముఖ స్తుతి చేసి ఆపై హేళన చేసే నీచ బుద్ధి కలవారిని ఉద్దేశించినదీ సామెత. +* ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య +==ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి== +పేదరికంనుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితినుంచి పేదరికానికి మారిన వారినుద్ధేశించి ఈ సామెత వాడతారు. ఎంతో ఉన్నత స్థితిలో బతికిన కుటుంబం కొన్ని కారణాలవల్ల బాగా చితికిపోయి పేదరికాన్ని అనుభవిస్తుంటే అది ఓడ బండి అవటం. అదే ఓ కుటుంబం పేదరికం నుంచి ఆర్థికంగా బాగా ఉన్నత స్థితికి చేరితే దానిని బండి ఓడ అవటం అనీ అంటారు. +==ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు== +అసూయతో ఇతరుల సుఖాన్ని చూసి ఓర్వలేని వారి ప్రవర్తనని ఈ సామెత ద్వారా వివరిస్తున్నారు. అసూయాపరుల నోటికి కట్టుబాట్లు ఉండవనీ, కోరని వస్తువులు ఉండవనీ వ్యంగ్యంగా చెబుతున్నారు. +==ఓబీ ఓబీ నీవు వడ్లు దంచు నేను పక్కలెగురవేస్తా== +నీరు మలినముగా ఉన్నపుడు పటిక లాటి పదార్థం వేసి, కాసేపు వేచి చూస్తే తేటనీరు పైకి చేరుతుంది. అలాగే జీవితంలో ఓర్పు ఉన్న వాళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి అని ఈ సామెత అర్ధం. +==ఓలి సరసమని గిడ్డి దాన్ని పెళ్లాడితే కుండలన్ని ఒక్కలు కొట్టిందట== +గతంలో ఆడపిల్లలకు ఎదురు డబ్బులిచ్చి పెళ్లాడే వారు. దానినే ఓలి అని అనేవారు. ఒకడు ఓలి తక్కువని ఒక గుడ్డి పిల్లను పెళ్లాడాట. ఆ పిల్ల ఇంటికొచ్చి గుడ్డిదైనందున ఇంట్లో వున్న కుండలన్ని పగల గొట్టిందట, ఇది ఈ సామెతకు నిజార్థము. +ఏవస్తువైనా కొనే ముందు దాని ధరను కాకుండా దాని గుణగణాలు చూడాలని సూచించేదే ఈ సామెత. ఇది సామెతలో వున్న మర్మార్థం. + + +==అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని== +ఇది తెలుగు భాషలో ఒక సామెత]] +సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు కాని ఎన్ని చేసిన ఏదోకారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు. +ఈ జాతీయానికి సరైన అర్ధం మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నా ఏ అవకాశం అందని పరిస్థితి. అంగడి అంటే సరుకులు అమ్మే చోటు. కొత్త అల్లుడు అత్తవారి ఇంటికి వచ్చినపుడు మర్యాదలు సహజం. కొన్నాళ్ళకు పాతబడ్డ ఆ అల్లుడు అత్తవారి ఇంట్లోనే తిష్ట వేస్తే ఆ మర్యాదలు పెద్దగా జరగవు. అప్పుడు అంగట్లొ అన్నీ ఉంటాయి కాని అత్త వారింట్లో ఎవరూ వాటిని కొనరు. అల్లుడికి పెట్టరు. అలా రూపొందినదే ఈ సామెత. ప్రభుత్వ నిధులు ఎన్ని ఉన్నా ఆ ఫలాలు సామాన్యులకు అందవు. ఈ సందర్భంలో కూడా ఈ సామెతను గుర్తు చేసుకోవచ్చు. +మన దేశంలో అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నాయి. కాని లంచగొండితనం వలన దేశం అభివృద్ధి కావడం లేదు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది'' +అంగడి వీధిలో అబ్బా! అంటే, ఎవడికి పుట్టేవురా కొడుకా? అన్నట్లు== +��ంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే== +==అంచు డాబే కాని, పంచె డాబు లేదు== +పంచె అంచులో ఉన్న డాబుసరి (గొప్పదనం) మిగతా పంచెలో లేదు అని అర్థం. పైకి అన్నీ తెలిసినవారిలా కనపడుతూ లోపల మాత్రం విషయపరిజ్ఞానం లేని వాడిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు. +==అంటుకోను ఆముదం లేదుకాని,మీసాలకు సంపెంగ నూనె +తన వాస్తవ పరిస్థితితో నిమిత్తం లేకుండా, విపరీతముగా ఖర్చు చేసేవాడిని ఉద్దేశించి ఈ సామెతను వాడటం పరిపాటి. +==అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు +అంతలావున్నావు తేలు మంత్రం తెలియదా అన్నట్టు ఈ సామెత కూడాను/ +ఒక వస్తువును పొందుటకు దాని యొక్క వాస్తవమయిన విలువ కన్నా ఎక్కువ ఖర్చుచేసి ఆ వస్తువును సొంతం చేసుకొనేవాడిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు. +అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతంత కొప్పు== +==అంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు== +దీనికే మరొక రూపం కూడా ఉంది ఏది జరిగినా మన మంచికే అని. +సాధారణంగా, ఏదన్నా చెడు జరిగి ఎవరన్నా బాధపడుతున్నప్పుడు ఇలా సర్ది చెప్పడం జరుగుతుంది. దిని వెనక ఒక కథ కూడా ఉంది. +అనగా అనగా ఒక రాజు, ఆ రాజు దగ్గర ఒక తెలివైన మంత్రి. మంత్రి చక్కని సలహాలతో రాజును సమస్యలనుండి తప్పిస్తూ ఉంటాడు. ఒకనాడు పండ్లు తింటుండగా కత్తివాటుకు పొరపాటున రాజుగారి వేలు తెగింది. పక్కనే ఉన్న మంత్రి "అంతా మన మంచికే" అన్నాడు. వేలు తెగి బాధ పడుతుంటే, ఈయనేమిటి అంతా మంచికేనంటాడు అని రాజుకు కోపం వచ్చింది! ఎలాగైనా మంత్రికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. +ఆ తరువాత రోజు అందరూ కలసి వేటకి వెళ్తారు. రాజు, మంత్రి దారి తప్పి పోతారు. రాజు మంత్రిని ఒక బావిలోకి (నూతిలోకి) తోసి "ఏది జరిగినా మన మంచికే, నువ్వు చెప్పిందే గదా" అని వెటకారంగా అని వెళ్ళిపోయాడు. కానీ దురదృష్టవశాత్తూ, రాజును ఒక అటవిక జాతివారు బంధించి కాళికాదేవికి బలి ఇవ్వబోయారు. ఇంతలో అతని వేలికి ఉన్న గాయాన్ని చూసి బలి ఇవ్వడానికి పనికిరాడు అని వదిలేసారు. +వేలు తెగినపుడు మంత్రి అన్న మాట గుర్తుకు వచ్చి, రాజు అతనిని బావినుండి వెలుపలికి తీసాడు. రాజు "నా వేలి గాయం నాకు మంచిదే అయింది, కానీ నిన్ను నూతిలోకి నెట్టడం నీకు మంచి ఎలా అయింది అని అడిగాడు. అప్పుడు మంత్రి "నన్ను నూతిలోకి పడెయ్యకపోతే, మీతోపాటు నన్నూ పట్టుకునేవాళ్ళు. అప్పుడు మిమ్మల్ని వదిలేసి నన్ను బలి ఇ���్చేవారే కదా ప్రభూ" అని బదులిచ్చాడు. +అందుకే అంటారు అంతా మన మంచికే ఏది జరిగినా మన మంచికే" +==అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు +ఒక పనిని మొదలుపెట్టే ముందు దాని పర్యవసానాలు బాగా ఆలోచించి, ముందుగానే ఊహించి, సంబంధిత వ్యక్తులతో దానిని గురించి చర్చించి మొదలుపెట్టమని చెప్పేందుకు ఉద్దేశించినదే ఈ సామెత. +==అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు== +బంగారం కేవలం అందం కోసం ధరిస్తారు. కానీ క్లిష్టపరిస్థితుల్లో ఆ బంగారమే అక్కరకొచ్చి ఆదుకుంటుంది. ఈ విషయాన్నే, కొన్ని వస్తువులపై పెట్టిన ధనము లేదా శ్రమ, కేవలం వాటి యొక్క ప్రాథమిక వినియోగమునకే కాక, అవసరమును బట్టి ఇతరత్రా కూడా పనికివచ్చును అని సామెత ద్వారా చెప్పుచున్నారు. +ఒక నక్క ఒక రైతు యొక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది.అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి.ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు, నోరు ఊరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది. మామూలుగా అయితే ఆనక్కకు పళ్ళు అందవు. అందుకని, అది తన ముందు కాళ్ళ మీద లేచి ఆ పళ్ళను అందుకోబోయింది. కానీ, పాపం దానికి ద్రాక్ష పళ్ళు అందలేదు. ఆపైన నక్క ఎగిరి అందుకోవాలని తెగ ఆరాటపడింది. ఎంత ఎగిరినా దానికి ఆయాసం వచ్చింది కానీ, ద్రాక్ష పళ్ళు మాత్రం అందలేదు. ఎగిరి, ఎగిరి ఆయాసంతో ఇక యెగరలేక విసిగి ఛీ ఛీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయట నేను తినడమేమిటి అని గొణుక్కుంటూ వెళ్ళిపొయింది. అలాగే, ఎవరైనా ఏదో పొందాలని ప్రయత్నించి అది దొరకక పోతే, అప్పటివరకు దేని కోసం అయితే తీవ్ర ప్రయత్నం చేశామో అది ఎంత చెత్తదో, ఎంత పనికిరాదో చెప్పటం మొదలుపెడతాము. అప్పుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని నలుగురు నవ్వుకుంటారు. +==అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు +పెళ్ళయిన ఆడపిల్ల పుట్టంట అందరి కాళ్ళకి మ్రొక్కి, చివరకు అత్త వారింటికి చేరుకుంటుంది. ఈ విషయాన్నే చమత్కారంగా, ఒక ముప్పు తప్పించుకోటం కోసే ఏవేవో ప్రయత్నాలు చేసి, చివరికి ఆ ముప్పు తప్పించుకోలేనివాణ్ణి ఉద్దేశించి ఈ సామెత చెబుతారు. +==అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు== +నలుగురికీ నీతులు చెప్పే వాడు తానే తప్పులు చేస్తే, ఆతణ్ణి ఉద్దేశించి ఈ సామెత వాడతారు. +==అందరూ శ్రీవైష్ణవులే- బుట్టెడు రొయ్యలు మాయ మయాయి +శ్రీవైష��ణవులు బ్రాహ్మణులలో ఒక తెగ. బ్రాహ్మణులు మాంసం భుజించరు. అందరూ వైష్ణవులే శాకాహారులే ఉన్న చోట బుట్టలో ఉన్న రొయ్యలు మాయమయ్యాయి. ఉన్నవాళ్ళలోనే ఎవరో తీసి ఉండాలి, అంటే వారిలో ఎవరో ఒకరో, కొందరో మాంసాహారులై ఉండాలన్న మాట. కానీ ఆ విషయం ఎవరూ ఒప్పుకోరు. అలాగే, ఎక్కడైనా ఒక తప్పు పని జరిగినప్పుడు అక్కడ వున్నవారంతా 'నేను కాదంటే నేను కాదు' అని అనే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. తప్పు జరిగిపోయింది, అక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరు ఆ పనిచేసి ఉండాలి. చేసినట్లు ఎవరూ ఎవరూ ఒప్పుకోవడం లేదు అందరూ శ్రీవైష్ణవులే, బుట్టెడు రొయ్యలు మాత్రం మాయమయ్యాయి. +బ్రాహణులు మాంసాహారం తినరు. అక్కడున్న వారందరు బ్రాహలే. కాని రొయ్యలు మాయమైనాయి. అంటే ఆ బ్రాంహలల్లో ఎవరో ఒకరు రొయ్యలను తస్కరించారని అర్థం వచ్చే టట్లు ఈ మాట పుట్టింది. ఇలాంటిదే ఇంకొకటి కూడా ఉంది. అది అందరూ బ్రాంహలే కాని గంప కింది కోడి మాయం అయినది +అవకాశవాది తన పని పూర్తి చేసుకోటానికి ముందు గడ్డం పట్టుకు బ్రతిమిలాడతాడు, అయినా పని కాకపోతే కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడటానికి కూడా వెనకాడడు. ఈ సామెత ఒక అవకాశవాది తత్వాన్ని తెలియచేస్తోంది. +ఈ సామెత అర్థమే కలిగిన మరో సామెత అందితే జుట్టు అందకపోతే కాళ్లు]] +కొంతమంది ఎంత వివరంగా విషయాన్నంతా చెప్పినా గ్రహించలేరు. అలాంటి వారి జ్ఞానాన్ని సూచించడానికి ఈ సామెత ఉపకరిస్తుంది. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఎంత శ్రమపడినా శ్రమను ఎదుటివారు గుర్తించక నిర్లిప్తంగా, నిరాసక్తంగా తోసివేసినప్పుడు కూడా ఈ సామెతను సందర్భానుసారం చెప్పటానికి ఉపయోగపడుతుంది. అంధుడికి ఎంత మాత్రమూ ఎదుటి వస్తువులు కనిపించక పోవటం సర్వసాధారణం. అటువంటిది అందాన్ని ఒకటికి పది సార్లు చూసుకోడానికి నేత్ర దృష్టి బాగా ఉన్నవారు ఉపయోగించే అద్దాన్ని అంధుడి ముందు పెట్టి చూసుకోమంటే దానివల్ల అంధుడికి కలిగే ఆనందం శూన్యం. అతడి ముందు అద్దాన్ని ఉంచడం వల్ల పడిన శ్రమ కూడా వృథా అవుతుంది. ఈ సామెతలో అద్దం విజ్ఞానంతోను, పాండిత్యంతోనూ కొంతమంది పోల్చి చెబుతుంటారు. అంధత్వమనేది అజ్ఞానానికి, పామరత్వానికి నిదర్శనం. అద్దంల్లాంటి పాండిత్యం కలిగిన వారు, అంధుడిలాంటి అజ్ఞాని ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించడం వల్ల ఫలితం శూన్యమనేది సామెత భావన. +చిన్నపని కోసం ఎంతో మంది సాయాన్ని అడిగే వాడుకలో ఈ సామెతను వాడతారు. అంబలి తగిన తరువాత మీసాలు తుడుచుకోవడం పెద్ద పని కాదు కానీ ఈ పనికి కూడా వేరే వాళ్ల సాయమడగడం బద్ధకాన్ని తెలియ జేస్తుంది. బద్ధకస్తులను ఉద్దేశించి ఈ సామెత వాడతారు. + + +సాయి విజ్ఞేష్ మాడ ని నోట్లో పెట్టినట్టు +==కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు== +బాగా అవసరమయిన వాటిని అవివేకముతో నిర్లక్షముచేసి, అనవసరమయిన వాటిని కూడబెట్టు వానిని ఉద్దేశించి ఈ సామెతను చెప్పుదురు. +==కంచం నిండా తిని, మంచానికి అడ్డంగా పడుకున్నట్లు== +ఏ పని చెయ్యకుండా, తిని పడుకునే వాళ్ళ గురించి ఇలా అంటూ ఉంటారు. +కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని== +ఒకరు సంపదను కూడబెడితే మరొకరు దానిని వృధా చేస్తే ఆ సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. +కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు== +అత్యంత అమాయకపు చక్రవర్తిని గురించి ఈ సామెత వాడతారు. +పైపై దర్పం ప్రదర్శించేవారు తమలో ఏమీ లేకపోయినా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. బుద్ధిమంతులయినవారు తమకు ఎంతో తెలిసినా గర్వం ప్రదర్శించకుండా సౌమ్యంగా ఉంటారు. ఇది వేమన శతక పద్య భాగము. +==కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే== +ఏ విధముగా నయితే కంచె లేని చేను రక్షణ లేక పశువుల పాలవునో, అటులనే తల్లి అండ లేని బిడ్డ అధోగతి పాలవునని ఈ సామెత అర్థం. +[[కంచె అంటే చేనుని రక్షించేది, కాని ఆ కంచే చేనుని మేసిందంటే చేనుకి మఱి రక్షణ లేదుకదా? అలాగే రక్షణ కల్పించ వలసిన వారే ఆపద కలిగించినప్పుడు ఈ సామెతను వాడుతారు. +దొంగ పశువులు పంటను మేయకుండా పంట చేలకు కంచె వేస్తారు. కానీ ఆ కంచే చేను మేస్తే ఎవరు ఏమి చేయలేరని భావము. +==కంచె మంచిది కాకపోతే చేను కొల్లబోతుంది +ఇది వ్యవసాయదారుల సామెత. పొలానికి కంచె గట్టిగా వుండాలి. లేకుంటే దొంగ గొడ్లు వచ్చి పంటను నాశనం చేస్తాయని దీనర్థం. +==కంచెమీద పడ్డ గుడ్డను మెల్లగా తీయాలి +ముళ్ళ కంప పైన పడిన గుడ్డను మెల్లగా తీయాలి. లేకుంటే చిరిగి పోతుంది. అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా మెలగి దానినుండి బయట పడాలని ఈ సామెత అర్థము. +తినే పదార్థము ఏదైననూ ముందుగా నోటికంటే కూడా కంటికి బాగుండాలి (శుచి, శుభ్రముగా ఉండాలి ఆపైనే అది నోటికీ ఇంపుగా ఉంటుంది. అదే అసలు కంటికే బాగా లేకపోతే, రుచితో నిమిత్తం లేకుండా పారవేచెదరు. +==కంటికి తగిలే పుల్లను కాలికి తగిలే పుల్లను కనిపెట��టి తిరగాలి +తన చుట్టుప్రక్కల పొంచి వున్న ప్రమాధములను కనిపెట్టుకొని తిరగాలని దీని అర్థము +కంటికి రెప్ప ఏ విధముగా నయితే రక్షగా ఉండునో, చెప్పు కాలికి అదే విధముగా రెప్పవలె ఉండునని ఈ సామెత అర్థం. +కంటి రెప్ప కంటిపైనే వుండి కంటికి రక్షణగా వుంటుంది. అది దూరము కాదు అనే అర్థంతో ఈ సామెతను ఉపయోగిస్తారు. +==కంటివంటి ప్రకాశం లేదు మంటివంటి ఆధారం లేదు +బలం లేని వారికే ప్రమాదమని ఈ సామెత అర్థం. +కంతి తలగడ కాదు చింత తీరిక కాదు== +కణితి లావుగా ఉంది కదాని అదంతా శరీర బలానికి సంబంధించింది కాదు. అలాగే చింత విచారం కలిగిన మనిషి వూరకనే ఖాళీగా కూర్చున్నాడు కదా అని అనుకుంటే అది పొరపాటే. పరిశీలించి జాగ్రత్తగా వాస్తవాలను తెలుసుకోవాలని, భ్రమలకు గురికాకూడదని +==కందకి లేని దురద కత్తిపీట కెందుకు +కందను కత్తిపీటతో తరిగి వంట చేస్తారు. తరగబడ్డ కందకు లేని బాధ, తరిగిన కత్తిపీటకు ఉండదు కదా. ఈ విషయాన్నే, ఎవడైనా బాధితుడికి, తాను పడిన కష్టం తాలూకు బాధ లేకపోయిన సందర్భములో ఈ సామెతను వాడెదరు. +==కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద== +ఇదే అర్థము తెలియచేసే మరో సామెత చూడండి. కందకి లేని దురద కత్తిపీటకెందుకు? +*కంద దుంప, చేమ దుంపకు కొంత దురద వుంటుంది +కందం చెప్పినవాడు కవి పందిని పొడిచినవాడు బంటు +కందెన వేయని బండికి కావలసినంత సంగీతం== +కందెన వేయని బండి నడుస్తున్నప్పుడి ఇరుసు ఒరిపిడికి కీస్ స్ స్స్ అనే శబ్దం నిరంతరాయంగా వస్తుంటుంది. దానికి కందెన వేస్తే ఆ శబ్దం రాదు. ఆవిదంగా వచే శబ్దాన్నే సంగీతం పాడుతున్నదే ఈ బండి అని వేళాకోలంగా అంటుంటారు. +ముళ్ళకంపలో పడిన గొడ్డు, తెలివిలేక తప్పించుకును ప్రయత్నములో మరింత బాధకు లోనవును. అదే విధముగా అవివేకులయిన వారు, కష్టములనుండి బయటపడు మార్గము తెలియక మరింత కష్టముల పాలగుదురు. అటువంటి సందర్భంలో చెప్పేదే ఈ సామెత. +==కంసాలింటికెడితే బంగారమంటదుగానీ, కుమ్మరింటికెడితేమాత్రం మట్టి అంటుకుంటుంది +కంసాలి బర్రెనమ్ముతున్నాడు, లోపల లక్కవుందేమో చూడరా అన్నట్లు +కంసాలి అనగా బంగారపు పనిచేసే వాడు. అతను చేసే బంగారము దొంగతనము ఎవరు కనిపెట్టలేరనిదీనర్థం. +మనపై ఇష్టం లేని వారి వద్ద ఎదైనా ఆశించడం. +కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్పిబాధ ఎరుగడు== +డబ్బుకు కక్కుర్తి పడే మొగుడు, పెళ్ళానికి కడుపు నొప్పి వచ్చినా, డబ్బు ఖర్చు అవుతుందని ఆమె బాధను ఎరగనట్టు నటించును. డబ్బుకు కక్కుర్తి పడే వాళ్ళను ఉద్దేశించి ఈ సామెతను వాడెదరు. +==కక్కుర్తి పడ్డా కడుపు నిండాలి ఆకలి మంట ముందు కక్కుర్తి కానరాదని అర్ధం +కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగవు అంటే ఏదైనా పని జరిగే సమయం ఆసన్నమైనప్పుడు ఆ పని జరగక మానదు. కొన్ని పనులు ప్రారంబమైతే ఆతర్వాత ఆ పనులు ఎవరి ప్రాబల్యంలేక పోయినా అవి పూర్తవుతాయి. అలాంటి సందర్భంలో చేప్పేదే ఈ సామెత. +==కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము== +వరద కట్ట లేని నది అదుపు లేని నోరు ప్రమాదములే అని ఈ సామెత అర్థము. +==కట్టిన యింటికి వంకలు చెప్పేవారు మెండు +==కట్టిన వారు ఒకరైతే కాపురం]]చేసేవారు ఇంకొకరు +==కట్టినవాని కొక యిల్లయితే అద్దెకున్న వానికి అన్నీ యిళ్ళే +==కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట== +సొంత వాళ్ళని పట్టించుకోక గాలికి వదిలేసి, పరాయి వారికి సేవలు చేసే బుద్ధిలేని వానిని ఉద్దేశించి ఈ సామెత చెప్పుదురు. +==కట్టుకొన్న పెండ్లామే చేయాలి కన్నతల్లే చేయాలి +==కట్టుకొన్న వాడికంటే వుంచుకున్న వాడి మీదే ప్రేమ ఎక్కువ +==కట్టు లేని ఊరు గట్టు లేని చెరువు +ప్రతి వూరికి కొన్ని కట్టుబాట్లు వుండాలి. అనగా కొన్ని పద్ధతులు. అలా లేకపోతే ఆ వూరు చెడిపోతుందని దీని అర్థము. ఎలాగంటే గట్టులేని చెరువు నిండదు కనుక. +==కట్టేవి కాషాయాలు చేసేవి దొమ్మరి పనులు== +శ్రీరంగడు అంటే శ్రీ మహా విష్ణువు శ్రీరంగనీతులు అంటే శ్రీ మహా విష్ణువు పేరుతో చెప్పే నీతులు దొమ్మరి కులస్తులలో కొంత మంది పేదరికం, ఆకలి వల్ల మనసు చంపుకుని వ్యభిచారం చేస్తారు. కొంత మంది తాము గౌరవంగల మనుషులమని చెప్పుకుంటూనే అందుకు విరుద్ధంగా వ్యభిచారిణులతో పడుకుంటారు. శ్రీరంగ నీతులు చెపుతూ దొమ్మరి గుడిసెలలో దూరడం అంటే దేవుని పేరుతో నీతులు చెపుతూ అందుకు విరుధ్ధముగా పాడు పనులు చెయ్యడం అని అర్థం. +==కడగా పోయే శనీశ్వరుడా మా యింటిదాకా వచ్చి పొమ్మన్నట్లు +ఏరి కోరి కష్టాలు కొని తెచ్చుకునేవారినుద్దేశించి చెప్పిన సామెత ఇది. +గతం గతః. గతించిన దానికి చింతించి ప్రయేజనము లేదని ఈ సామెతకు అర్థం. +గుమ్మడికాయ కూరగాయలలో పెద్దది. ఐనా కత్తి పీటతో దానిని తరగటం సులభమే. అలాగే, బయటి వారిలో ఎంత పేరుప్రతిష్ఠలు సంపాదించినా ఇంట్లో వారు చనువుగాను కొన్ని సందర్భాలలో చులకనగాను చూస్తా��ు. అలాంటి సమయంలో ఈ సామెత చెప్తారు. +కడివెడు పాలలో అయినా ఒక్క చిన్న ఉప్పు కల్లు పడితే ఆ పాలన్ని విరిగి పోతాయి. +బాన కడుపు వున్నవారినుద్దేశించి చెప్పినదీ సామెత. +తిండి ఎక్కువ తినే వారినుద్దేశించి చెప్పినది ఈ సామెత. +==కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది +==కడుపు చించుకున్నా గారడీ విద్యే అన్నట్లు +కడుపుతో వున్నామె తప్పక కంటుంది. ఇది తప్పక జరుగు తుంది అని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. +==కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకు ఏడ్చి నట్ట్లు== +ఎవరి అవసరం వారిది. అవసరం లేనిదాన్ని ఎంతిచ్చినా వృధా. +==కడుపు నిండిన వానికి గారెలు చేదు== +సంతృప్తిగా తిన్నవారికి మరేది రుచించదు. ఎంత రుచిగా వున్నా మరేమి తినలేరు. ఆ సందర్భంలో చెప్పేదే ఈ సామెత. +ఈ సామెత పైపై ప్రేమలు ప్రదర్శించే వారికి వర్తిస్తుంది. మనసులో ఎలాంటి ప్రేమ లేకపోయినా ప్రజల మెప్పు కోసం బాధల్లో ఉన్నవారిని కౌగిలించుకున్నంత మాత్రాన వారికి సాంత్వన చేకూరదు. లేని ప్రేమలు ప్రదర్శించవద్దని దీని అర్థం. +==కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది== +కడుపును నిజంగా చించుకున్నట్లయితే, పడేదేదయినా మన కాళ్ళ మీదే కదా! నష్టం మనకే కదా. ఈ విషయాన్నే, మనకే నష్టం కలిగించే నిజాన్ని ఇతరులకు తెలియచేసే సందర్భంలో ఈ సామెత ద్వారా చెప్పుచున్నారు. +==కడుపు నొప్పికి కంట్లో కలికం పెట్టినట్లు +==కడుపున పుట్టిన బిడ్డ కొంగున కట్టిన రూక ఆదుకుంటాయి +==కడుపు నిండిన బేరాలు కడుపు నిండిన మాటలు +==కడుపులో ఎట్లా వుంటే కాపురమట్లా వుంటుంది +ఏమాత్రం కష్టం చేయకుండా అని అర్థము. +==కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా +==కడుపులో లేని శాంతి కౌగిలింతలో దొరుకుతుందా +తిండి ద్యాస ఎక్కువ వున్నవారినుద్దేశించి చెప్పినది ఈ సామెత. +కణత తలగడ కాదు. కల నిజం కాదు== +కలలు నిజమవుతాయని నమ్మేవారి నుద్దేశించి చెప్పినది ఈ సామెత. +కత్తిమీద సాము చేస్తే తెగుతుంది. ప్రమాధకరమైన పనిచేస్తున్నవారినుద్దేశించి చెప్పే సామెత ఇది +==కత్తి తలగడకాదు కల నిజం కాదు +==కత్తిపోటు తప్పినా కలం పోటు తప్పదు +ఇది వ్యవసాయ ధారుల సామెత. కత్తెర కార్తె పంటలు వేయడానికి చాల మంచి అధను అని దీని అర్థము. +==కథకు కాళ్ళు లేవు ముంతకు చెవులు లేవు +==కనిపెంచిననాడు కొడుకులుగానీ, కోడళ్ళు వచ్చాక కొడుకులా +కనులు మూడు గలవు కాడు త్రినేత్రుండు +కొబ్బరి కాయ (కొబ్బరికాయకు మూడు కన��నులుంటాయి +కనుమ పండగనాడు అందరూ స్నానం చేయాలని చెప్పే సామెత ఇది. +==కన్నతల్లికి కడుపుకు పెడితే, పినతల్లికి పిర్రకాలిందట +కన్నుబోయేటంతటి కాటుక అనవసరమన్నట్టు. అతి ఎప్పుడు అనర్థమే అని. ఎప్పుడైనా, ఎక్కడైనా ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటేనే క్షేమదాయకమని ఈ సామెత అర్థం. +==కన్ను చూచి కాటుక పిర్ర చూచి పీట +==కన్ను చూచిన దానిని నమ్ము చెవి విన్నదానిని నమ్ము +చెప్పుడు మాటలు విని చెడిపోవద్దని హెచ్చరించే సామెత ఇది. +==కన్నె నిచ్చినవాణ్నీ, కన్ను యిచ్చినవాణ్నీ కడవరకూ మరువరాదు +==కన్నూ మనదే వేలూ మనదే అని పొడుచుకుంటామా +==కన్యలో చల్లితే ఊదుకుని తినటానికయినా ఉండవు +కన్యా రాసిలో పంట పెడితే ఫలితముండని తెలియ జెప్పే సామెత ఇది. +==కన్నొకటి లేదు గానీ కాంతుడు కాడా +==కపటము బయట దేవుడు ఇంట్లో దయ్యము +ఇది వ్యవసాయధారుల సామెత. కప్పలు అరిస్తే వర్షం వస్తుందని రైతుల నమ్మిక. +==కమ్మ అండ గాదు తుమ్మ నీడ కాదు +==కమ్మకు వరస లేదు కప్పకు తోక లేదు +ఇది కులాల గురించి చెప్పిన సామెత. కమ్మవారి ఇండ్లలోని విషయాలు బయటకు తెలియవు అని దీని అర్థం. +==కమ్మని రోగాలూ, తియ్యని మందులూ వుంటాయా +ఇంగ్లీషులో ఇలాంటి సామెత ఒకటున్నది Carrying coal to NewCastle' అని. అంటే న్యూకాజిల్ అనే ఊరికి బొగ్గు మోసుకు పోయినట్టు అని. ఇంగ్లండులో న్యూకాజిల్ అనేది బొగ్గు గనులకు ప్రసిద్ధి. +కరక్కాయ ఆయుర్వేధంలో వాడే ఒక దినుసు కాయ. ఇది వంటికి చాల మంచి చేస్తుంది. ఎలాగంటే తల్లి లాగ అని దీని అర్థము. +==కరణం, కాపూ నా ప్రక్కనుంటే కొట్టరా మొగుడా ఎట్లా కొడతావో చూస్తా అందట +==కరణంతో కంటు కాటికి పోయినా తప్పదు== +==కరణం సాధువూ కాడు కాకి తెలుపూ కాదు +కరణము ఏనాటికి మంచి వాడు కాడు. తెల్లని కాకి ఎలా వుండదో మంచి కరణం కూడా వుండడని దీని అర్థం. +==కరణానికీ కాపుకీ జత ఉలికీ గూటానికీ జత +==కరణానికి తిట్టు దోషం చాకలికి ముట్టు దోషం లేదు +కరణం చేసే మోసపు పనులకు అతని ఇలాక లోని ప్రజలందరు తిడుతారు. చాకలి అన్నిరకాల బట్టలను ఉతుకు తాడు. అలా కరణానికి తిట్టు దోషం, చాకలికి ముట్టు దోషం వుండదని అర్థం. +==కరణాన్ని, కంసాలిని కాటికి పోయినా నమ్మరాదు== +ఇది కులాలకు సంబంధించిన సామెత. కరణం ఎప్పుడు ఒకరికొకరికి తగాదాలు పెట్టుతుంటాడు. అదే విధంగా కంసాలి అనగా బంగారపు పని చేసే వాడు ఇతడు తన తల్లి తాళిబొట్టులోనుండి కూడా కొంత బంగారాన్ని తస్కరిస్తాడని నానుడి. ఈవిధంగా ఈ సామెత పుట్టింది. +==కరణాలూ కాపులూ ఏకమయితే కాకులు కూడా ఎగురలేవు +కరణము, కాపు (మునసబు) వీరిద్దరు గ్రామ పెద్దలు. వీరిద్దరు కలిస్తే ఏమైనా చేయగలరిని దీనర్థం. +కరతల (అరచేతిలోని) ఆమలకము (ఉసిరికాయ) వలె. స్పష్టముగనున్నదని భావము. +కరస్థబిల్వన్యాయము నిశ్శేపోపనిషత్సార స్తదేత దితి సాంప్రథమ్‌, ఉక్త్వా విష్క్రియతే సాక్షా త్కరవిన్యస్తబిల్వవత్‌ +==కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం== +ఒక కప్పని పాము నోటిలో కరుచుకోని ఉన్నదంట అటువంటి సమయంలో అటుగా వెళ్తున్న దానయ్యని తీర్పు అడిగినాయంట +పామేమో తినాలి అదే న్యాయం, ఇది నా ఆహారం అని అన్నదంట! +కప్పేమో నేను బలహీనుడిని, మైనారిటీ వాడిని నన్ను కాపాడాలి రాజ్యాంగం ప్రకారం అన్నదంట! +దానయ్యకేమి చెప్పాలో అర్థం కాలేదంట, అందుకే అతను ఉన్న స్థితిలో ఎవరు ఉన్నా ఇలా అంటారు +"కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం" +==కరువుకాలంలో ఒల్లనివాడు పంటకాలంలో పంపమని వచ్చాడట +==కరువునాటి కష్టాలుండవు గానీ కష్టాలనాటి మాటలుంటాయి +==కరువు మానుప పంట మిడతల మానప పంట +==కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది== +పరిస్థితులు అనుకూలముగా లేనపుడు, ఎన్నడూ కూడా జరగని విచిత్ర పరిస్థితులను ఎదురుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్నే, చేతిలో కర్ర లేని కాపరికి సాధు జంతువయిన గొర్రె కూడా కరుస్తుంది, అన్న నిత్యజీవిత సత్యము ద్వారా ఈ సామెత వివరిస్తోంది. +ఎటూ తేలని వ్యవహారము గురించి చెప్పినది ఈ సామెత. +==కర్మ ఛండాలుని కంటే జాతి ఛండాలుడు మేలు +==కర్ణుడు లేని భారతం శొంఠి లేని కషాయం ఒక్కటే +==కర్ణునితో భారతం సరి కార్తీకంతో వానలు సరి +==కలిగినింటి బిడ్డ కాకరకాయ పైకి కనపడవు== +కాకరతీగకు కాసే కాయలు ఆకులు దట్టంగా ఉండటం వల్ల ఆకు మాటున ఉండి పైకి వెంటనే కనిపించవు. అలాగే ధనవంతుల ఇంట పుట్టిన బిడ్డ సామాన్య ప్రజల బిడ్డలాగా వీధుల్లో అంత తొందరగా కనిపించడు. +==కలల అలజడి కవ్వింతల రాజ్యం అన్నట్లు== +==కలిగినదంతా కడుపు కోసమే ఎంత పెంచినా కాటి కోసమే +==కలిగినమ్మ గాదె తీసేటప్పటికి లేనమ్మ ప్రాణం పోయిందట +==కలిగినమ్మ రంకు కాషాయ బొంకు ఒక్కటే +కష్టలు ఎల్లకాలముండవని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు. +==కలిసొచ్చే కాలానికి కుందేలు వంటింట్లోకి వస్తుంది +నకిలి బంగారానికి మెరుగు ఎక్కువని అర్థం. +కలిసిమెలిసి వుంటే వారికి సుఖం వుంటుంది. విడిపోతే కష్టాలు తప్పవు. అలా పుట్టింది ఈ సామెత. ఇలాంటిదే మరో సామెత ఐకమత్యమే మహా బలం' +==కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు== +పుట్టుకతోనే ఏ బిడ్డా నడవలేడు. కానీ ఈ సామెతను (కాలం కలిసివస్తే నడిచివచ్చే కొడుకు పుడతాడు) అనుకోనిరీతిలో సహాయం కలిసివచ్చే సందర్భములో ఉదహరిస్తారు. అనగా కష్టకాలములో అందిన ఆశించని సహాయము, నడచి వచ్చే కొడుకు యొక్క పుట్టుకతో సమానము అని పోల్చుచున్నారు. +==కలుపు తీయని మడి దేవుడు లేని గుడి== +అసలే అది కోతి, అది చేసే పనులు అల్లరి చిల్లరగా వుంటాయి. అలాంటిది కల్లు తాగితే ఇక దానిని ఆపడం ఎవరి తరం కాదు. ఈసామెతను ఇంకొంత పొడిగించి ఇలా కూడా అంటుంటారు అసలే కోతి కల్లు తాగింది దాన్ని తేలు కుట్టింది పైగా నిప్పు తొక్కింది అతిగా ఆగడం చేసె వాళ్లకు ఈ సామెత వర్తిస్తుంది +ఇది లోక సహజం: ధనవంతుని అందరు చుట్టాలే. అందుకే సుమతీ శతక కారుడన్నాడు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బందువులు వత్తురు అని +==కల్యాణానికి ఒకరు వొస్తే కన్నం వేయటానికి ఇంకొకరొస్తారు== +==కళ్ళలో నీటిని తుడవగలంగానీ కడుపులో బాధ తుడవలేం== +==కళ్ళు ఆర్పే అమ్మ ఇళ్ళు ఆర్పుతుంది== +==కళ్ళు కళ్ళు సై అంటే కౌగిళ్ళే మల్లెపందిరి అన్నట్లు +ఆశకొద్దీ ఎక్కువ పదార్థాలు వడ్డించుకున్నా తినలేకపోటం. ఆకలితో వున్నప్పుడు ఎంతో తినాలని ఆశ పడతారు. తీరా తినడానికి కూర్చున్నాక తన కడుపు పట్టినంత మాత్రమే తినగలరు. ఆ వుద్దేశముతో చెప్పినదే ఈ సామెత. +ఎక్కువ ఆశపడి తక్కువ ఫలితం పొందటం. కంటికి కనిపించిందంతా సొంతం కాదు. +==కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ వుండాలంటారు +ఏపని చేయడానికైనా తనకు సమానమైన వాడిని ఎంచు కోవాలని +==కవితకు మెప్పు కాంతకు కొప్పు అందం +చెడు పనులకు, దుర్మార్గాలకు అవకాశం ఇవ్వటం. పనస కాయను కసవున్నచోట తరిగితే దుమ్మూధూళి అంటుకొని అది తినటానికి పనికిరాకుండా పోతుంది. +==కష్టపడి ఇల్లు కట్టి, కల్లుతాగి తగలబెట్టినట్లు +కష్టంచేయ కుండా ఎవరికి ఫలితము దక్కదు. వూరక సంపదలు కలుగవు కష్టపడితేనె ఫలితముంటుందని చెప్పేదే ఈ సామెత అర్థం. +తల్లికి బిడ్డ ఎల్లప్పుడూ ముద్దే అని దీని అర్ధం. నల్లగా లేదా అంద విహీనంగా ఉన్న బిడ్డను ఎదుటి వారు చిన్నచూపు చూసినా ఆ తల్లికి మాత్రం బిడ్డ ముద్దుగానే ఉంటుంది. అందుకే ఎదిటి వారికి ఆ తల్లీ బిడ్డల ముద్దుముచ్చట్లు కాకి పిల్ల కాకికి ముద్దు లా అనిపిస్తాయి +సమంగా లేని జంటను ఇల��� అంటారు. +==కాకి అరిస్తే భయపడి పక్కింటాయన్ని కౌగలించుకున్నదట +ఫలితం లేని పనిచేసి నప్పుడు ఈ మాటను వాడుతారు నీపని ఎలా వుందంటే కాకులను కొట్టి గద్దల కేసి నట్టుంది +==కాకై కలకాలం మన్నేకంటే హంసై ఆరునెలలున్నా చాలు +ఇది మహాభారతంలోని ఓ ఘట్టం నుండి వచ్చింది. పాడవులు అరణ్యవాసం చేస్తూ ఉండగా, వారికి తమ గొప్పదనం చూపించి అవమానించటానికి దుర్యోధనుడు తదితరులు ఘోషయాత్ర పేరిట వారున్న అరణ్య ప్రాంతానికి వస్తూ ఉండగా, గంధర్వ రాజు వారిని ఎదిరించి, యుద్ధం చేసి, ఓడించి, తన రథంలో కట్టిపడేసి తీసుకొనివెళ్ళిపోతాడు. ఈ హడావిడిలో, దుర్యోధనుడి అనుచరుడు ఒకడు తప్పించుకొని, పాండవులను శరణుజొచ్చి, తమ రాజును కాపాడమని కోరతాడు. గంధర్వుల చేతిలో పరాజయం పాలయిన దుర్యోధనుడి భంగపాటును పాండవులు చర్చించుకునే సందర్భంలో, భీముడు అన్న మాటలివి. అనగా మనం ఏదైనా కార్యాన్ని తలపెట్టినపుడు అనుకోకుండా అది మరో విధంగా లేదా మరొకరిచే విజయవంతంగా పూర్తిచేయబడటం. +కాయలు కాచే చెట్టుకు రాళ్లు కొట్టి కాయలను రాల్చు కుంటారు పిల్లలు. కాయలు కాయని చెట్టుకు కాయలు లేవు రాళ్ల దెబ్బలు వుండవు. +అదే విదంగా ఇంకో సామెత కూడా ఉంది దున్నే ఎద్దునే పొడుస్తారు' ఆ విధంగా పుట్టినదే ఈ సామెతకాటికి కాళ్ళు చాచినా కుటిలత్వం పోలే +==కాటికి కాళ్ళు చాచినా కుటిలత్వం పోలేదు +==కాటిదగ్గర మాటలు కూటి దగ్గర వుండవు== +==కాటుక కళ్ళ వాడూ కళ్ళార్పు వాడూ కొంపలు ముంచుతారు +==కాడిక్రిందకు వచ్చిన గొడ్డు చేతికంది వచ్చిన బిడ్డ +==కాని కాలానికి కర్రే పామై కరుస్తుంది== +==కాని కూడు తిన్నా కడుపు నిండాలి +==కానీకి కొబ్బరికాయ యిస్తారని కాశీదాకా పోయినట్లు +కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది== +పచ్చగా కాపురం చేయాలని వచ్చిన పెళ్ళి కూతురు అతి జాగ్రత్తగా అందంగా కాళ్లకు పారయణం పెట్టుకొని వస్తుంది. ఇష్టంలేని పెళ్ళికూతురు ఏదో మొక్కుబడిగా పారాణి పెట్టుకొని వస్తుంది. ఆ విషయం గ్రహించిన పెద్దలు ఈ సామెతను చెప్తారు. +==కాపు కరణం ఏకమయితే నీళ్ళు కూడా దొరకవు +==కాపుకు విశ్వాసం లేదు కందికి చమురు లేదు +==కాపురం చేసే కళ కాలు త్రొక్కేవేళే తెలుస్తుంది +==కాపుల చదువులు కాసుల నష్టం బాపల సేద్యం భత్యం నష్టం +==కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడుతుంది +దొంగోనికి అందరు దొంగల్లాగా మంచోనికి అందరు మంచి వారుగా కనబడతారు. అలా పుట్టిందే ఈ సామెత. +==కాయలో పత్తి కాయలో ఉండగానే సోమన్నకు ఆరుమూరలు నాకు పదిమూరలు అన్నట్లు +కార్చిచ్చు అడవికి ఓ అనర్ధము, దానికి గాలి కూడా తోడైతే ఇక అంతా భస్మీపటలమే. ఒక కష్టానికి మరొకటి తోడైన సందర్భములో ఈ సామెతను ఉదహరిస్తారు. +==కార్యం అయ్యేదాకా తలవంచుకుంటే, కలకాలం తలెత్తుకు తిరగవచ్చు +==కార్తీక మాసాన కడవలు కడిగే పొద్దుండదు +==కార్తె ముందు ఉరిమినా, కార్యం ముందు వదరినా చెడుతాయి +==కాలం గడిచి పోతుంది మాట నిలిచిపోతుంది +==కాలం తప్పిననాడు పై బట్టే పామై కరుస్తుంది +==కాలం వచ్చి చిక్కింది గానీ లేడికి కాళ్ళు లేక కాదు +==కాలమొక్కరీతిగా గడిపిన వాడే గడిచి బ్రతికిన వాడు +==కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు +==కాలికి రాని చెప్పును కడగా వుంచమన్నారు +==కాలికి వేస్తే మెడకు మెడకు వేస్తే కాలికి +కాలు కాలిన పిల్లి ఒక చోట నిలవకుండా, అటూ ఇటూ తిరుగుతూ గంతులు వేయును. ఈ విషయమునే ఓ నిలకడలేని వ్యక్తిని ఉద్దేశించి వ్యంగ్యముగా ఈ సామెతను పలికెదరు. +==కాలూ, చెయ్యి ఉన్నంతకాలం కాలం గడుస్తుంది +==కాలు జారితె తీసుకోవచ్చు నోరుజారితె తీసుకోలేరు== +నోరు జారడమంటే ఒక మాట అనడము. మాట బయటకు వచ్చిందంటే అది ఎవరో ఒకరు వింటారు. దాన్ని వెనక్కి తీసుకోలేము అనగా ఆమాట అనలేదు అని అనలేరు. అని అర్థము +==కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది== +కాలం కలిసి రాకపోతే ఏ పని చేపట్టినా అది పూర్తి కాదు సరికదా వ్యతిరేక ఫలం వస్తుంది కర్రే పామై కరిచినంత విచిత్రంగా! +==కాలు తడవకుండా సముద్రం దాటొచ్చుగానీ కన్ను తడవకుండా జీవితం దాటలేం +ఏపని కావాలన్నా శ్రమతో పాటు కాలంకూడ కలిసి రావాలనే చేప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. +==కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది== +ఇదే అర్థం చెప్పే మరో సామెత కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు. +==కాలువ దాటలేని వాడు కడలి దాట గలడా== +(ఉట్టికెక్కలేనమ్మ స్వర్గాని కెక్కగలదా అలాంటిదే ఈ సామెత కూడా) +==కాలు త్రొక్కిన వేళ కంకణం కట్టినవేళ +==కాలు నొచ్చినా, కన్ను నొచ్చినా చేసేవాళ్ళు కావాలి +ఆకలి రుచి ఎరుగదు అనే సామెత లాంటిదే ఈ సామెత కూడ. కడుపు ఆకలితో కాలుతుంటే ఏదైనా తిని ఆకలి తీర్చుకోవాలి అని అర్థం. +==కాలే గుడిసెకు పీకే వాసమే లాభం +వేడిచేసినప్పుడు కళ్ళమంటలు, ఒళ్ళు నొప్పులు లాంటి బాధలు కలుగుతుంటాయి. ఆముదాన్ని అరికాళ్లకు మర్దన చేస్తే ఆ వేడి తగ్గి కళ్లమంటలు పోయి చల్లగా హాయిగా ఉంటుంది. అరికాలిలో శరీరానికి సంబంధించిన నాడీమండలం కేంద్రీకృతం అయి ఉంటుంది. ఆముదం మర్దించినందువల్ల నాడీ మండలం ద్వారా నాడులు చల్లబడి దాని ద్వారా వేడి తగ్గుతుందని చిట్కా వైద్యం ఈ సామెత. +కావడి వంకరైనా గమ్యం చేరడం ముఖ్యం== +==కావలసినవన్నీ తాకట్టు పెడతా స్వంతం చేసుకుంటావా అందిట +==కాళ్ళ తంతే పెరిగేది పుచ్చకాయ కుళ్ళేది గుమ్మడి కాయ +==కాళ్ళ దగ్గరకు వచ్చిన బేరం కాశీకి వెళ్ళినా దొరకదు +==కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్లు +==కాశీకి పోయి కొంగ పియ్య తెచ్చినట్లు +==కాశీకి పోయినవాడూ కాటికి పోయినవాడూ ఒక్కటే +ఒకప్పుడు యాత్రలు చేయడానికి ఇప్పుడున్నన్ని ప్రయాంణ సాధనాలు లేవు. యాత్రీకులు ఎడ్లబండ్లమీదను, కాలి నడకనో తీర్థ యాత్రలకు వెళ్ళేవారు. తెలుగు రాష్ట్రానికి కాసి చాల దూరం. కనుక కాశీకి వెళ్ళడానికి కొన్ని నెలలు పట్టేది. కనుక ఆ వెళ్ళిన వారు తిరిగి రావచ్చును, లేదా అక్కడే మరణించ వచ్చు. పైగా కాసీలో మరణిస్తే పుణ్యమని ప్రజల నమ్మిక. ఆ విధంగా పుట్టినది ఈ జాతీయము. +==కాసిలో దొంగతనం చెయ్యడానికి ఇక్కడి నుండే వొంగొని వెళ్లాడట== +మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె లాగా కొంతమంది చేతిలో ఏ కొద్దిపాటి ధనం లేకపోయినా గొప్పలు చెప్పుకుంటూ బ్రతుకుతుంటారు. అలాగే ఆదాయానికి ఎటువంటి అవకాశం, వనరులూ లేకపోయినా ముందుచూపు లేకుండా స్థాయికి మించిన అప్పులు చేస్తుంటారు. దగ్గర కనీసం నామమాత్రంగా ధనం లేకపోయినా ఎంతెంతో సంపద ఉన్నట్లు ఆడంబరంగా పలికే పద్ధతి మంచిది కాదని ఈ సామెత. +==కాసుకు గతి లేదు గానీ కోటికి కొంగు పట్టాడట +==కాసులుగలమ్మ కట్టా విప్పా వేషంకలమ్మ విడవా మడవా +==కాషాయంపైన, కషాయంలోపల వుంటే ప్రయోజనం లేదు +ఇతరులకై కాయలు కాసే చెట్టు ఆ కాయలు తినాలనుకునే వారిచేతనే రాళ్ళదెబ్బలు తింటుంది. అంటే, పరోపకారి అయినా కష్టాలపాలు అవుతోంది. అలానే, మెత్తనివాళ్ళనే లోకులు వారి మంచితనం ఆసరాతో మోసగిస్తారు. ఈ విషయాన్నే ఈ సామెత తెలియజేస్తోంది. +==కావడి వంకరైనా గమ్యం చేరడం ముఖ్యం== +==క్రింద పడ్డావేమంటే మీసాలకు మట్టి అంట లేదుగా అన్నాట్ట== +తాను చేసిన చెడుపనిని కూడా సమర్థించుకునే వారి గురించి ఈ సామెతను ఉటంకిస్తారు +==క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడట== +ఓటమిని అంగీకరించని వితండ వాధుల నుద్దేశించి చెప్పినదీ ఈ సామెత +==కింద పెట్టిన పంటలుండవ�� పైన పెట్టిన వానలుండవు +ఏ పనైనా సమయం చూసి అనుకూలమై నప్పుడే చేయాలని ఈ సామెత అంతరార్థం. +కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే అంటే 'స్వరూపాలెంచటానికి అందిట +==కుంచెడు గింజల కూలికి పోతే తూమెడు గింజలు దూడమేసినట్లు== +వెనకటికి ఎవరో కుంచెడు తిండి గింజల కోసము కూలికెళితే, ఇంట్లోని తూమెడు గింజల్ని దూడ మేసిందిట. అనగా, సంపాదించిన దాని కన్నా ఎక్కువ పోగొట్టుకున్నదనమాట. ఈ సామెతను ఈ విధమయిన సందర్భములో వాడెదరు. +==కుంటివాడి తిప్పలు కుంటివాడివి గూనివాడి తిప్పలు గూనివాడివి +ఎవరి తిప్పలు వారికుంటాయి అని ఈ సామెతకు అర్థము. +==కుంటి వాడయినా ఇంటి వాడే మేలు +==కుండ ఎప్పుడు వేరో కుదురూ అప్పుడే వేరు +==కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె== +కుండలో కూడు కుండలోనే ఉండాలి, బిడ్డలు మాత్రం దుడ్డుల్లాగా ఉండాలి +ఇంట్లో వున్న తిండి గింజలు ఖర్చు కాకుండా అనగా అన్నం వండకుండానే పిల్లలు మాత్రం లావుగా తయారు కావలని కోరుకోవడం లాంటి వారిని గురించి ఈ సామెత వాడతారు. +==కుండలు మూయను మూకుళ్ళున్నాయి కానీ నోళ్ళను మూయ మూకుళ్ళు లేవు== +==కుండలు, చాటలు లేవని వండుకుతినటం మానుతామా +==కుండలో కూడు కుండలో వుండాలి బిడ్డలు గుండ్రాయిల్లాగా వుండాలి== +కుక్క ఎవర్నైనా కరచినప్పుడు దాన్ని చెప్పుతో కొడితే, అది చేసిన తప్పుకు శిక్షించినట్టు అవుతుంది. అదే విధంగా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు తగ్గ ఫలితం వెంటనే అనుభవిస్తే ఈ సామెతను వాడుతారు. +==కుక్క కి చెప్పు తీపి తెలుసు కానీ చెరకు తీపి తెలుస్తుందా== +==కుక్కకు ఏ వేషం వేసినా మొరగక మానదు +==కుక్క తోక పట్టి గోదారి దాటాలనుకొన్నట్లు== +==కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు +==కుక్కను తెచ్చి అందలంలో కూర్చోపెడితే కుచ్చులన్నీ తెగ కొరికిందట +==కుక్కను ముద్దు చేస్తే మూతంతా నాకుతుంది +==కుక్కలూ కుక్కలూ కాట్లాడుకుని కూటిలో దుమ్ము పోసుకుంటాయి +==కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్కరాదు +అన్ని వసతులు ఒక్కసారి ఒనగూరవని తెలియ జెప్పేదే ఈ సామెత +కుక్క తోక మనం నిటారుగా ఉంచడానికి ఎంత ప్రయత్నించినా అది మరలా వంగి పోతుంది. అలాగే మూర్ఖుడికి మనం ఎంత చెప్పినా వాడి దారి వాడిదే! +==కుట్టని రవిక చేతిలో వున్నా ఒకటే ఏలని మొగుడు ఊరిలో వున్నా ఒకటే +==కుట్టితే తేలు కుట్టకుంటే కుమ్మరి పురుగు +==కుట్టేవాడి కుడిచేతి క్రింద చీదేవాడి ఎ���మచేతి క్రింద ఉండరాదు +==కుడికాలు పెడితే కుల క్షయం ఎడమకాలు పెడితే వంశ క్షయం +==కుడిచేత్తో చేసే దానం ఎడమచేయికి తెలియరాదు +ఈ సామెత ఒక అవివేకిని ఉద్దేశించి చెప్పబడింది. వెనకటికొకడు, ధాన్యాలు ఉన్న కుప్పను తగలబెట్టి, ఆ కాల్చటము వలన తయారయిన పేలాలు తింటూ కూర్చున్నాడట. కాలిన ధాన్యం విలువ పేలాల కంటే ఎన్నో రెట్లు విలువయినవి కదా. పేలాల కొరకు ధాన్యమును తగులబెట్టుట అవివేకము. +==కుమ్మరి వారి కోడలు ఆము దగ్గరైనా కన్పించదా +==కుర్రవాడి గూర్చి అడగండిగానీ చెవుల కమ్మల విషయం మాత్రం అడగొద్దు అన్నట్లు +==కులుకులాడి సంతకు పోతె ఎక్కా దిగా సరిపోయిందట== +==కులము చెరిచేవారే గానీ కూడు పెట్టే వారుండరు +==కులము తక్కువ వాడు కూటికి ముందు +==కుల మెరిగి కోడలిని జాతి నెరిగి గొడ్డును తీసుకోవాలి +==కుళ్ళే వాళ్ళ ముందే భగవంతుడు కులుకుతాడు +==కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసిందట +ఇదే అర్థము గల మరో సామెత ఇచట ఉంది. మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె +==కూటికి తక్కువైనా గుణానికి తక్కువేం కాదు== +==కూటికి గతి లేదు గానీ మీసాలకు సంపంగ నూనె +==కూటికి పేదయినా చేతకు బీద కాదు +అన్నీ ఉన్నా వాటిని అనుభవించక లేనివారిలాగానే ఉండటం. గంజి మాత్రమే దొరికేవారికి బియ్యం సరిపోయినంతగా లభించినా అన్నం వండి, ఆ అన్నం తినకుండా గంజి మాత్రమే తాగి పూర్వంలాగానే లేమితో బాధపడ్డారట. +==కూడు పెట్టినామెను తొడ పొందు అడిగినట్లు +==కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట== +కూడూ గుడ్డా అన్నవి మనిషికి కనీస అవసరములు. అవి లేనిచో జీవించుట కష్టము. అవి అడగనిచో బాగుగా చూసుకొందును అనుటలో, ఆ వ్యక్తికి ఇతరులకు సహాయము చేయు ఆలోచన లేదని తెలియుచున్నది. ఈ విషయమునే పై సామెత తెలుపుచున్నది. +==కూడే కూడే కాపురాన్ని కూలదొయ్యకపోతే నేను నీ రంకు మొగుణ్ణే కాదు అన్నాడుట +==కూతురని కుంచడిస్తే, తల్లని కంచెడు యిచ్చిందట +==కూతురి పురుడు యింట్లో కోడలి పురుడు అడవిలో +==కూతురు కనకపోతే అల్లుడిమీద పడి ఏడ్చినట్లు +కూనను పెంచితే గుండై కరవ వచ్చినట్లు== +శ్రమించకుండా తాతలు, తండ్రులనుండి సంక్రమించిన ఆస్తులను ఖర్చుపెడుతూ జీవిస్తే అవి ఎంతో కాలం మిగలవు అని చెప్పటానికి ఈ సామెతను ఉపయోగిస్తారు. +==కూనలమ్మ సంగీతం వింటూంటే కూడు దొరికినట్లే +==కూరిమిగల దినములలో నేరము లెన్నడును తోచవు== +==కూర్చుంటే లేవలేడు గానీ, ఎగిరెగిరి తంతాడట +==కూర్చుని తింటుంటే గుళ్ళూ, గోపురాలూ ఆగవు +సంపదల వృద్ధికి మూలమయిన శ్రమ చేయకుండా ఉన్న సంపదలు అనుభవిస్తుంటే కొండంత సంపదయినా కొద్ది కాలములోనే నశిస్తుంది అని ఈ సామెత భావము. అంటే శ్రమ చేయకుండా సంపదను అనుభవించే హక్కు ఎవరికీ లేదు అని ఈ సామెత తెలుపుతున్నది. +పనీ పాటా లేకుండా తిరుగుతూ, చక్కగా పని చేసుకుంటున్న వారిని చెడగొట్టే వారి గురించి ఈ సామెత వాడతారు. +==కొన్నది వంకాయ కొసరింది గుమ్మడి కాయ== +చిన్న వస్తువు కొని పెద్ద వస్తువును కొసరు అడిగే వారుంటారని దీని అర్థం. ఇలాంటిదే మరొక సామెత 'అసలు కంటే కొసరు ఎక్కువ +==కొంగు తడిస్తే చలిగానీ కోకంతా తడిస్తే చలేమిటి +==కొంగులాగితే రానిది కన్ను గీటితే వస్తుందా +==కొండ ఎక్కేవాడి నడుమును కొడవలి చెక్కినట్టు== +అదనపు భారం, పడుతున్న కష్టానికి తోడు మరో కష్టం తోడు కావటం +==కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు== +చెడిన ఒక పనిని బాగుచేయబోతే, అది బాగుపడకపోగా మరో పెద్ద పని కూడా దాని వలన చెడితే, ఆ సందర్భములో ఈ సామెతలు ఉదహరిస్తారు. +==కొండమీద మా గుండోణ్ని చూసారా? అని అడిగి నట్టుంది== +తిరుమల కొండ మీద అందరు గుండోళ్లే వారిలో వీరి గుండోణ్ని ఎలా గుర్తు పట్టడం? అలాంటి అమాయకులగురించి చెప్పినదే ఈ సామెత. +ఎవరైనా వారి వారి బుద్ధులను బట్టే కలిసి ఉంటారు. ఇది వేమన సూక్తి. +==కొండను త్రవ్వి ఎలుకను పట్టి నట్టు== +అతి పెద్ద కష్టమైన పనిచేసి అతి స్వల్ప ఫలితం పొందితే ఈ సామెతను వాడుతారు. +==కొండంత తెలివికంటే గోరంత కలిమి మేలు +==కొండంత దేవుణ్ణి కొండంత పత్రితో పూజించగలమా +==కొండంత మొగుడే పోగా లేంది ఇవన్నీ యెందుకు అన్నదట +==కొండంత రాగంతీసి గోరంత పదం చెప్పినట్లు +==కొండకు వెంట్రుక ముడివేసి లాగితే, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది +==కొండగాలికి పైట జారితే, అందగాడి చూపుకి చీర జారిందట +==కొండ నాలుకకి మందువేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట +==కొండ మీద గోలేమిటంటే కోమటాళ్ళ రహస్యాలన్నట్లు +==కొంపకాలి ఏడుస్తుంటే నీళ్ళు కాచుకోనా అని అడిగినట్లు +==కొక్కిరాయీ కొక్కిరాయీ ఎందుకు పుట్టావంటే చక్కని వాళ్ళను వెక్కిరించటానికి అన్నదట +==కొట్టా వద్దు తిట్టా వద్దు వాడి చావు వాడే చస్తాడన్నట్లు +==కొడితే కొట్టాడు కానీ క్రొత్తకోక పెట్టాడు +==కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట== +ఈ సామెత ఒక అమాయక మనస్తత్వాన్ని తెలుపుతుంది. భర్త కొట్టిన దెబ్బలు మరచి, ఆతడు తెచ్చిన చీరను చూసుకు మురిసిపోయిందిట వెనకటికొక అమాయకపు భార్య. +ఏదైనా కొత్తగా వున్నప్పుడు వింతగాను, ఆనందంగాను వుంటుంది. రాను రాను అది పాతబడితె దానిమీదున్న ఇష్టం రాను రాను తగ్గుతుంది. ఇది లోక రీతి. ఆ విధంగా పుట్టినదే ఈ సామెత. +==కొత్త అప్పుకు పోతే పాత అప్పు పైన బడ్డదట +==కొత్త కాపురం, కొత్త కత్తిపీట కొత్తలో కంటే కొంచెం పదును పడ్డాకే బాగుంటాయి +==కొత్త కుండలో నీళ్ళు, కొత్త పెళ్ళాం బహు తీపి +==కొత్తంత పండుగా లేదు తల్లంత దయా లేదు +==కొత్త నీరు వచ్చి పాతనీరు కొట్టుకుపోయినట్లు +కొత్తగా బిచ్చం అడుక్కోటము మొదలు పెట్టిన వాడికి, ఏ సమయములో అడుక్కోవాలో తెలియక పొద్దస్తమానం అడుక్కుంటూ ఉంటాడు. అదే విధముగా, కొత్తగా ఏ పనయినా మొదలు పెట్టినవాడు, అదేపనిగా ఆ పనే చేస్తుంటే ఈ సామెతను వాడటము పరిపాటి. +==కొత్త వైద్యుని కంటే పాత రోగి మేలు +==కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు== +కొత్తగా పెళ్ళి అయినవాడికి, సమయమూ సందర్భమూ లేకుండా సంసారసుఖానికై పరితపిస్తూ ఉంటాడు. అదే విధముగా, కొత్తగా ఏ పనయినా మొదలు పెట్టినవాడు, అదేపనిగా ఆ పనే చేస్తుంటే ఈ సామెతను వాడటము పరిపాటి. +కొత్తఅల్లుడుకి పూర్వకాలములో అత్తవారింట రాజభోగాలు అమర్చేవారు. కొత్త అల్లుడు పనీ పాటా లేకుండా సపర్యలు అందుకుంటూ ఉండేవాడు. ఇదే విషయముగా, పనీపాట లేకుండా సోమరిగా తిని తిరిగే వాడిని ఈ సామెత ద్వారా దెప్పిపొడుస్తారు. +==కొన్న దగ్గర కొసరుగానీ, కోరిన దగ్గర కొసరా +==కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నాడట== +దీనికి సమానార్థంలో సంస్కృత న్యాయము: నారికేళతృణన్యాయము=కొబ్బరిచెట్టు నెందుల కెక్కెదవనిన దూడ గడ్డికొఱకు అనినట్లు. +==కొయ్యరా కొయ్యరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాడట== +==కొర్ర గింజంత కోడల్ని చూస్తే కొండంత అత్తకు చలిజ్వరం వచ్చిందట== +==కొల్లేటి వ్యవసాయానికి కోత కూలి దండుగ== +==కొసరి భోజనం పెట్టావ్‌ -మరి ఆ ముచ్చట కూడా తీర్చమన్నాడట +==కోకలు వెయ్యి ఉన్నా కట్టుకొనేది ఒకటే== +కోకలన్నిటినీ ఒకేసారి కట్టుకోలేరు. ఎన్ని సంపదలున్నా పొట్టపట్టినంత వరకు మాత్రమే ఎవరైనా తినగలరు. అవకాశం ఉన్నంతవరకు మాత్రమే ఎవరైనా ఏపనైనా చేయగలరు +==కోకా, రైకా కలవని చోట చూపి ఊరించినట్లు== +మనిషి ఎన్ని విద్యలు నేర్చినా అవన్నీ కడుపు నింపుకోవడానికి ��ాత్రమే ఈ సామెత భావం. +==కోడలా! కోడలా! నీ భోగమెంతసేపే అంటే మా అత్త మాలపల్లినుంచి తిరిగి వచ్చిందాకా అందిట== +కోడలా కోడలా నీ భోగ మెన్నాళ్లంటే మా అత్త సంతకు పోయి వచ్చిందాక" అన్నదట== +కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్టు== +ఒకరికి తప్పు చేయ వద్దని చెప్పి అదే తప్పు చెయ్యటం. తెడ్డు నాకటమంటే అందరూ తినాల్సిన ఆహారపదార్ధాలను ఒకరు ఎంగిలి చేయటం. ఎంగిలి పదార్థాలను వేరొకరికి పెట్టకూడదు. అలా చేస్తే పాపం మూటకట్టుకున్నట్టవుతుంది అని ఓ అత్త తన కోడలికి ముందు బుద్ధులు చెప్పి తర్వాత తానే ఆ పనిచేసిందట. ఎదుటి వారికి నీతులు చెప్పి తాము ఆ నీతులను పాటించకపోవటం +==కోడలి కన్నీళ్ళు కనబడతాయిగానీ, అత్త పెట్టే ఆరళ్ళు కనబడవు== +==కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు== +==కోడలికి బుద్ధి చెప్పి అత్త ఱంకు పోయిందట== +==కోడలు గృహ ప్రవేశం అత్త అగ్ని ప్రవేశం== +==కోడలు వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ +==కోడికి కులాసా లేదు కోమటికి విశ్వాసం లేదు +==కోడికి గజ్జెలు కడితే కుప్ప కుళ్లగించదా +కోడి కాళ్ళకు గజ్జెలు కట్టినా కసువు కుప్పలను కుళ్లగిస్తూనే ఉంటుంది. అలవాటు మారదు. +==కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం== +కోడిగుడ్డుకి ఈకలే ఉండవు. అలాంటిది వాటి మీద ఈకలు పీకడంలో అర్థం లేదు. కొంతమంది తమ దర్పం చాటుకోవడం కోసం అర్థంలేని వితండవాదం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని ఈ సామెతతో పోలుస్తాం. +అక్కడ ఏమి లేకున్నా ఏదో వున్నట్టు బ్రమింప జేసి నమ్మించే ప్రయత్నంచేసే వారిని ఇలాగంటారు. వీడొట్టి కోడి గుడ్డు పనీ ఈకలు పీకే రకం అని. +==కోడి గుడ్డు పగలకొట్టేందుకు గుండ్రాయి కావాలా +చిన్న పనులకు పెద్ద ప్రయత్నం అనవసరం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా?అల్పులను శిక్షించేందుకు అధికమైన బలం అక్కరలేదని, అల్పుడైన శత్రువును కొట్టడానికి అధిక బలం అనవసరమని +==కోడి పియ్య మందు అంటే కొర్రెక్కి ఏరిగిందట== +కోలతో భయపెడితేనే గాని కోతి ఆడమన్నట్లు ఆడదు. ఈ విషయాన్నే, పనిదొంగయై ఎల్లప్పుడూ ఒకరి పర్యవేక్షణలో తప్ప స్వతహాగా పనిచేయలేని వానిని ఉద్దేశించి పాడెదరు. +==కోతికి బెల్లం, కోమటికి ధనం చూపరాదు== +==కోతి చావు, కోమటి ఱంకు ఒక్కటే +==కోతి రూపుకు గీత చక్కన పాత గోడకు పూత చక్కన +==కోపం గొప్పకు ముప్పు హంగు అల్లరికి ముప్పు +==కోపానికి పోయిన ముక్కు శాంతానికి రాదు +==కోమటి ఊరందరికీ ఇస్తాడు కానీ తాను తినడు== +==కోమటితో మాట కో���ితో సయ్యాట ప్రమాదాలు +==కోమటికి లేమి కంసాలికి కలిమి వుండదు +==కోమలాంగి సోకు కోనసీమ కొబ్బరి లాంటిదిట +కొరివితో తల తోక్కుంటే జుట్టు, తల కాలుతాయి. కోరి ఎవరూ ఆ పని చెయ్యరు. ఈ విధంగా ఎవరైనా కోరి ఆపదలుకాని, ప్రమాదముగాని కొనితచ్చుకుంటే ఈ సామెతను వాడుతారు. +==కోరి నెత్తికెత్తుకున్న దేవర దయ్యమై పట్టుకున్నట్టు +==కోరి పిల్లనిస్తామంటే కులం తక్కువ అన్నట్లు== +==కోరుకున్న కోడలు వస్తే, నెత్తిమీద నిప్పులు పోస్తుం== +==కోర్టులో గెలిచినవాడు యింట్లో ఏడిస్తే, ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు +==కోతి పుండు బ్రంహ రాక్షసి అయినట్టు +కోతికి పుండు అయితే అది మానదు సరికదా ఇంకా పెద్దదవుతుంది. ఎలాగంటే దాని సహచర కోతులు అన్ని ఆ పుండును గీకి ఏదో బాగు చేద్దామని ప్రయత్నిస్తాయి. +ఆ విధంగా ఆపుండు మరింత పెద్దదవుతుంది. అలా పుట్టినదే ఈ సామెత. +కోతికి కొబ్బరి కాయ ఇస్తే దాన్ని తినడానికి చేసే వృధా ప్రయాసతోనే కాలం గడిచి పోతుంది. అలా పుట్టినదే ఈ సామెత. +==కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గట్టి కొసమన్నాడట== +ఆబద్దం కూడా అతికినట్టు చెప్పలేని వారి గురించి ఈ సామెత వాడతారు +(ఇది పొడుపు కథ. దీనిని పొడుపు కథలు వర్గంలో చేర్చ వచ్చు +==కౌగిలింతకన్న సుఖం లేదు కాపురమంత మజా లేదు== +==కౌగిలింతలకే కన్నె తాపాలు (చెల్లు) అన్నట్లు== +==కౌగిలింతల బిగువెంతంటే నచ్చినవాడి శక్తంత అందిట== +==కౌగిలిహోరూ మల్లెలజోరూ తప్పితే కడుపుపండే మాటేమైనా వుందా? అందిట== +==కౌగిళ్ళ బంధాలేసి బుగ్గల్లో మందారాలు పూయిస్తే అందాల గంధాలు పూస్తా అందిట +==కౌగిళ్ళ స్వర్గాలు కాముని రాజమార్గాలు అన్నట్లు + + +బ్రాంహలు తమ గుర్తింపు కొరకు జందెం వేసు కుంటారు. అయితే పలాన వ్యక్తి బ్రాంహడు అని జగమంతా తెలుసు, అతని గుర్తింపు కొరకు ప్రత్యేకంగా జందెం ధరించ నవసరం లేదు. ఈ సందర్భంగా పుట్టినదే ఈ సామెత. +==జగడమెట్లొస్తుందిరా జంగమయ్యా అంటే బిచ్చం పెట్ట వే బొచ్చు ముండా అన్నాడట== +==జగడమెట్టొస్తుంది జంగమయా అంటే బిచ్చం పెట్టవె బొచ్చు ముండా అన్నాడట +వివరణ: జగడం ఎవరి మధ్యనయినా పోట్లాట ఎలా వస్తుందో తెలియని ఓ అమాయకురాలు భిక్షం అడగడానికి వచ్చిన జంగమయ్యను అడిగింది. దానికి వాడు బిచ్చం పెట్టవే బొచ్చుముండా అన్నాడట. జంగమయ్య మాటలతో ఆ అమాయకురాలికి కోపం వచ్చింది. అనవసరంగా తనను నిందించినందుకు జగడానికి దిగింది నీ ప్రశ్నకు సమాదానమిదే అని జంగమయ్య సమాధానం చెప్పాడు. ఆలా పుట్టిందట ఈ సామెత. +పోట్లాటకు ఎప్పుడు సిద్దంగావున్న స్త్రీ/పురుషుడు: ఉదా: వాడొట్టి జగడాల మారి. +అందరికి తెలిసిన విషయమే: ఉదా: వాడు చెప్పింది జగమెరిగిన సత్యమే. +పెద్ద మొండి వాడు. ఉదా: వారు మహా జగమొండి. +మోస గాళ్లు ఉదా: వారు జగత్ కిలాడీలు. మోస గాళ్ల గురించి ఈ సామెత +ముగింపు పలికేశారు. ఉదా: ఆ వుషయానికి వారెప్పుడో జనగణమన పాడేశారు పని పూర్తయినప్పుడు ఈ మాట వాడతారు. +బహు అరుదుగా జరిగే సంఘటనల గురించి ఈ సామెతను వాడతారు. +బలవంతం చేస్తున్నాడు. ఉదా: ఏరా? బలే జబర్దస్తీ చేస్తున్నావు. +ధనవంతులు ఎంతపనైనా చేయగలరని ఈ సామెత అర్థం. +ఎక్కువగా బాధిస్తున్నాడని అర్థం: ఉదా: వాడు నన్ను జలగలా పీడిస్తున్నాడు. +జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు== +జలుబుకు మందు లేదు అనే అర్థంతొ ఈ సామెత పుట్టింది. జలుబుకు మందు వేసినా వేయకపోయినా అది ఏడు రోజులుంటుందని అందరికి తెలుసు +==జాతి కొద్దీ బుద్ధి కులం కొద్దీ ఆచారం +==జ్ఞాతి గుఱ్ఱు అరటి కఱ్ఱు వదలవు +==జాతి నాగులను చంపుతూ ప్రతిమ నాగులకు పాలు పోసినట్లు +==జానెడు ఇంట్లో మూరెడు కర్ర వున్నట్లు== +తలకు మించిన భారము అన్న అర్థంలో ఈ సామెతనుపయోగిస్తారు. +==జాబు రాసిపెట్టమంటే కాళ్లునొప్పులంటే వాటితో పనేమిటంటే నేను రాసింది నేనే చదవాలి అన్నాడట +పిట్ట కొంచెం కూత ఘనం వంటి సామెత ఇది కూడాను. +పట్టు కుంటే వదలడు: ఉదా: వాడు మహా జిడ్డుగాడు, పట్టు కుంటే వదలడు. వారిని గురించి ఈ సామెత వాడతారు. +ఉత్తుత్తి పెళ్ళి: వివరణ: కొందరికి శాస్త్రప్రకారం మొదటి పెళ్ళి కలిసి రాదని వస్తుంది. అటు వంటప్పుడు మొదటిగా వారికి జిల్లేడు చెట్టుతో పెళ్ళి చేసి రెండో పెళ్ళిగా అసలు పెళ్ళి చేస్తారు. ఆ విధంగా మొదటి పెళ్ళి వలన జరగవలసిన అనర్థము జిల్లేడు చెట్టుకు జరుగుతుంది. +వాళ్ల నాన్న దుర్మార్గుడు. అందుకే ఆ లక్షణాలన్నీ ఇతడికొచ్చాయి. మంచి లక్షణాలు ఎందుకొస్తాయి అన్నట్లు +ఒక్కొక్క వ్యక్తికి నచ్చే ఆహారపదార్థాలు, వచ్చే ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఒకరికి నచ్చే పదార్థాలు మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి వచ్చే ఆలోచనలు మరొకరికి రుచించకపోవచ్చు. అంతమాత్రాన ఒకరి రుచులూ, అభిరుచులూ, ఆలోచనలు, అభిప్రాయాలూ వేరొకరి వాటికంటే గొప్పవని ఎవరూ భావించరాదు అని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు. +==జీతం బత్తెం లేకుండ��� తోడేలు గొర్రెలను కాస్తానందట +==జీతం లేని నౌకరు, కోపం లేని దొర లేరు +జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు== +జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు== +ధనం వుంటే ఏ పనైనా చేయవచ్చు అనే అర్థంతో ఈ సామెత వాడతారు. +జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే== +అన్ని ఆదాయ వనరులు సక్రమంగా వుంటే ఏ పనైనా చేయ వచ్చు. అసలు జుట్టంటూ వుంటే ఏ కొప్పు అయినా వేయ వచ్చు. జుట్టు లేకుంటే ఏ కొప్పు కూడా వేసే అవకాశమే లేదు. ఆ విధంగా పుట్టినదె ఈ సామెత. +ధనం వుంటే ఏ పనైనా చేయవచ్చు అనే అర్థంతో ఈ సామెత వాడతారు. +తీవ్రంగా ఆలోసిస్తున్నారని అర్థం: ఉదా: వారు ఆ విషమై జుట్టు పీక్కొంటున్నారు. +==జుట్టు పట్టుకుని తంతే జూటూరులో పడి పోవాలి +పని పాట లేకుండా తిరుగు తున్నాడని అర్థం: ఉదా: వాడు జులాయిగా తిరుగు తున్నాడు. +[[ఇది జాతీయము. దీనిని ఆ జాబితాలో చేర్చ వచ్చు. +==జెముడు కంచెకు శ్రేష్ఠం రేగడి చేనుకు శ్రేష్ఠం +==జ్యేష్ఠ చెడకురియును మూల మురుగ కురియును +==జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు== +ఎవరైనా ఏదైనా పని చేయడానికి ఎంచుకున్నపుడు ఆ జట్టులో ఎవరికీ సరైన అవగాహన లేకపోతే ఈ సామెతను వాడతారు. పూర్వకాలంలో సన్యాసులు తమ ఒంటికి బూడిద రాసుకోవడం మీకు తెలిసే ఉంటుంది. +* అదే విధంగా పుట్టిన మరో సామెత సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంట]] +దొంగ బుద్ధి గల వాడు ఉదా: వాడొట్టి జేబులు కొట్టే రకం. +==జోడు లేని బ్రతుకు తాడు లేని బొంగరం +మంచి ఊపుమీదున్నాడని అర్థం: ఉదా: ఏరా మంచి జోరు మీదున్నావు, ఏంది సంగతి? +ప్రమాదంలో వున్నాడని అర్థం: ఉదా: జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నావు జాగ్రత్త. +==జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం== +నాతో పెట్టుకోకు. ఉదా: నా జోలికి రాకు. +(ఇది జాతీయము. దీనిని ఆ జాబితాలో చేర్చ వచ్చు + + +| fix fullurl FULLPAGENAME action=edit ఈ వ్యాసాన్ని మెరుగు పరచడంలో] తోడ్పడండి. వ్యాసంలో ఉన్న పాఠ్యం నుండి వ్యాస విషయానికి సంబంధించిన అంతర్గత లింకులను చేర్చండి +| cat తక్కువ వికీలింకులున్న వ్యాసాలు +| all తక్కువ వికీలింకులున్న వ్యాసాలు + + +తంగేడు చెట్టు విపరీతంగా పూస్తుంది. ఎవరికైన అధిక సంపద చేకూరితే ఈ సామెతను ఉపయోగిస్తారు. +తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపం== +==తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది +==తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది తల్లి చస్తే కాపురం తెలుస్తుంది +తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునా== +అనుకోని అదృస్జ్టము కలిగిన వారి నుద్దేశించి ఈ సామెతను వాడుతారు. +అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చిన వారునుద్దేసించి ఈ సామెత చెప్తారు. +తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు== +తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వచ్చునా== +తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య ఇచ్చిన మనుముకూ== +తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట== +తన ప్రశ్నలోనే జవాబున్నది. నర్మగర్బంగా చెప్పిన సమాదనమిది. +==తగులుకున్న మొగుడినీ, తాడిచెట్టు నీడనూ నమ్ముకోరాదు +==తడిక కుక్కకు అడ్డంగానీ, మనిషికి అడ్డమా +==తడిక తోసిన వాడిది తప్పు అన్నట్లు +తడి గుడ్డతో గొంతు కోయడం అసాద్యం: అలాంటి దుర్మార్గపు పనులను గుట్టు చప్పుడు కాకుండా చేసేసి ఏమి ఎరనట్టు వుండె వారిని గురించి ఈ సామెత పుట్టింది. +''వీడు తడి గుడ్డతో గొంతు కోసె రకం అని అంటారు. +తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగానీ మొగ్గడు== +దెబ్బ తగిలితే గాని జాగ్రత్త పడని వారి గురించి ఈ సామెత పుట్టింది. +ఏదైనా దారం కట్లు తడిసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువగా బిగుసుకుంటాయి. +ఇలాంటి సామెతే మరొకటి నిండా మినిగిన వాడికి చలేమిటి? +అమాయకుల గురించి ఈ సామెతె పుట్టింది +కోరి కష్టాలను కొని తెచ్చుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది. +==తద్దినపు భోజనానికి పిలిస్తే, రోజూ మీ ఇంట ఇట్లాగే జరగాలని దీవించాడట +తనకంపు తనకింపు, పరులకంపు తనకు వొకిలింపు== +==తన కంట్లో దూలాలు పెట్టుకుని, పరుల కంట్లో నలుసులు ఎంచినట్లు +==తన కడుపు పండితే పక్కింటాయన తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకుందిట +==తన కలిమి ఇంద్రభోగం, తన లేమి లోకదారిద్ర్యం అనుకున్నట్లు +తన కాళ్లకు బంధాలు తానే తెచ్చుకొన్నట్టు== +ఏరి కోరి కష్టాలను తెచ్చుకొని నెత్తిన వేసుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది. +తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును== +అందని ద్రాక్ష పండ్లు పుల్లన అన్న సామెత లంటిదే ఇదీను. +==తనకు కాని రాజ్యం పండితేనేం? పండక పోతేనేం +==తనకు మాలినధర్మము మొదలు చెడ్డ బేరము లేవు +==తనకు లేదనేడిస్తే ఒకకన్ను పోయింది ఎదుటివానికున్నదని ఏడిస్తే యింకోకన్ను పోయింది +==తన కొంగున కట్టిన రూక తనకు పుట్టిన బిడ్డ== +ఇది సుమతి శతక పద్య భాగము తన కోపమె తన శతృవు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ, తన సంతోషమె స్వర్గము తద్యము సుమతీ.. +==తన గుణం మంచిదయితే, సానివాడలో కూడా కాపురం చేయవచ్చు +==తన తప్పు తప్పు కాదు తన బిడ్డ దుడుకూ కాదు +==తనదీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు కాలాయట== +==తన బలముకన్నా స్థాన బలము మిన్న== +==తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము== +==తన యింటితలుపు ఎదురింటికిపెట్టి, తెల్లవార్లూ తనింట్లో కుక్కలు తోలుతూ కూర్చున్నట్లు +==తనవారి కెంత వున్నా తన భాగ్యమే తనది +ఇది సుమతి శతక పద్య సారాంశము ధనపతి సఖుడై వుండిన యనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్ తనవారికెంత గలిగిన తన భాగ్యము తనకు గాక తద్యము సుమతీ +==తన సొమ్ము అల్లం పరుల సొమ్ము బెల్లం +==తనువుల పాలపుంత సొగసుల తాంబూలం అన్నట్లు +==తనువులు దగ్గరైతే పరువాల పోరు తగ్గుతుందన్నట్లు +==తప్పు చేసినవానికీ అప్పుచేసిన వానికీ ముఖం చెల్లవు +ఇది వేమన శతక పద్యము తప్పులెన్ను వారు తండోప తండంబు, లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పు లెరుగరు విశ్వదాభి రామ వినుర వేమ. +==తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రువులగును +ఇది సుమతి శతక పద్య భాగము కమలములు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమిలిన భంగిన్, తమ తేమ నెలవులు దప్పిన తమ మిత్రులె శత్రులగుదురు తద్యము సమతీ. +==తమలపాకులో సున్నమంతటివాడు తక్కువయినా ఒకటే ఎక్కువయినా ఒకటే +==తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పాలి +అర్ధం మనిషి మనవాడు అయిన ధర్మం తపితే సహించ కూడదు +==తరతరాల ఆస్తే నిలిచివున్న ప్రశస్తి అన్నట్లు +ఇది సుమతి శతక పద్య భాగము. +దీనికి సమానర్థంలో మరో సామెత ఉంది అది. పక్కలో బల్లెం లాగా. +==తల గొరిగించు కొన్నాక తిథి, వార, నక్షత్రాలు చూచినట్లు +''చింత చచ్చినా పులుపు చావది లాంటిదే ఈ సామెత కూడాను. +తల లేదు కానీ చేతులున్నాయి కాళ్లు లేవు కానీ కాయం ఉంది +ఎవరైనా ఏదైనా పనిని అతి కష్టం మీద సాధించినప్పుడు తమ పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు. +==తల పాగ చుట్టడం రాక తల వంకర అన్నాడట== +పని చేతగాక ఎదుటి వారిపై నిందలు వేసె వారిని బట్టి ఈ సామెత వాడతారు. +తలనుంచి పొగలు చిమ్ముచుండు భూతము కాదు, కనులెర్రగనుండు రాకాసి కాదు, పాకిపోవుచుండు పాముకాదు== +==తలమాసిన వాడెవడంటే ఆలి చచ్చినవాడే అన్నట్లు +ఆలి చచ్చిన వాడు అందరికీ అలుసే అన్నట్టు +చింత చచ్చినా పులుపు చావదు అనే సామెత లాంటిదే ఇదీను. +పంచాయతీ కార్యదర్శులు తలలో నాలుక లాగా ప్రగతి లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. +==తల్లి కడుపు చ��స్తే పెళ్ళాం జేబు చూస్తుంది +==తల్లికి కూడు పెట్టడుగానీ, పిలిచి పినతల్లికి చీరపెడ్తాడట +తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట== +==తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా== +==తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా==మొగుడు పెళ్ళాల మధ్య సరసం, గిల్లికజ్జాలు సర్వసాధారణం. మాటకు మాట అనుకుంటారు. కానీ, గడుసుదైన పెళ్ళాం మాత్రం ఒకటికి రెండు అంటుంది. సమతుల్యం కాని షరతులున్నప్పుడు ఈ సామెతను వాడతారు. +జూదం ఆడేటప్పుడు ప్రత్యర్థులు తమ్ములైనా, బంధుమిత్రులైనా వారు ఓడితే పందెంగా ఒడ్డిన సొమ్ములను వదులుకోవాల్సిందే అని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు. +తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది== +కన్న తల్లి తన బిడ్డ చిన్న వాడైనా పెద్ద వాడైనా ఇంటి కొచ్చిన వెంటనే తిన్నావా? అని అడుగుతుంది. కాని అతని భార్య మాత్రం భర్త జేబు చూస్తుంది. ఎందుకంటే డబ్బులేమైనా సంపాదించి తెచ్చాడా? అని ఆ సందంర్బంగా పుట్టిన సామెత ఇది. +==తల్లికి కూడు పెట్టని వాడు తగవు చెప్పేవాడా +==తల్లి గుణం కూతురే బయట పెడుతుంది +==తల్లి గూని అయితె పిల్లలు గూని అవుతారా== +==తల్లికి తిండి పెట్టలేనివా పినతల్లికి చీర పెడతానన్నాడట== +==తల్లి చనిపోతే తండ్రి పినతండ్రితో సమానం +==తల్లి చస్తే నాలుక చచ్చినట్లు తండ్రి చస్తే కళ్ళు పోయినట్లు +==తల్లి చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా +==తల్లి తండ్రి అల్లము పెళ్లామంటే బెల్లము== +పెళ్లాం పై ప్రేమతో తల్లి దండ్రులను నిరాదరించే వారికి ఈ సామెత వాడతారు. +==తల్లితండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు +==తల్లిని చూచి పిల్లను తరిని చూచి బర్రెను ఎంచుకోవాలి +==తల్లిని నమ్మినవాడూ, ధరణిని నమ్మిన వాడూ చెడడు +==తల్లి పిత్తి పిల్ల మీద పెట్టినట్లు +తన తల్లి ఆమె పుట్టింటిలో వివాహం వరకే ఉంటుంది. మేనమామలు జీవితాంతం ఉంటారు. అటువంటి మేనమామలకు తన తల్లి పుట్టింటిను గురించి చెప్పవలెనా. తెలిసిన వారికి ఏదో కొత్తగా చెప్పబోయే ప్రయత్నం అని భావం. +==తల్లి పుట్టిల్లు మేనమామ దగ్గర పొగడినట్లు +==తల్లి పెంచాలి ధరణి పెంచాలి అంతేగానీ బయటివారు పెంచుతారా +==తల్లి ముఖం చూడని బిడ్డ వాన ముఖం చూడని పైరు +==తల్లి ముక్కు కోసిన వానికి మేనత్త ముక్కు బెండపువ్వు +==తల్లి రోసిన బిడ్డను దాది రోయదా +==తల్లి లేని పిల్ల ఉల్లిలేని కూర +==తల్లి లేని పిల్ల దయ్యాల పాలు +పిల్ల కూడా తల్లిలాగె వుంటుంది విత్తు ఒకటి వేస్తే చెట్టు మరొకటి మొలుస్తుందా ఈ సామెత లాంటిదె అది కూడ +==తల్లిని బట్టి బిడ్డ నూలును బట్టి గుడ్డ== +==తల్లిని బట్టి బిడ్డ విత్తును బట్టి పంట +==తా వలచింది రంభ తా మునిగింది గంగ +చేసేది వెదవ పనైనా బడాయి పోయే వారి గురించి ఈ సామెత చెప్తారు. +==తాగను గంజి లేదు తలకు సంపంగి నూనెట +==తాగపోతే నీరు లేదుగానీ ఈద పోయినట్లు +==తాగిన వాడిదే పాట సాగిన వాడిదే ఆట +తాగిన మందు ఉంచుకొన్నదాని పొందు ఎలాంటి పనైనా చేయిస్తుంది== +మధ్యం అలవాటు, పరస్త్రీ గమనం చాల కష్టాలు తెప్పిస్తాయని హిత బోధ చేస్తున్నది ఈ సామెత. +==తా జెడ్డ కోతి వనమెల్లా చెరచిందిట +==తాటి చెట్టుకింద పాలు తాగినా కల్లే అంటారు +==తాటి చెట్టుకి తేనె పట్టుపడితే ఈతచెట్టుకు ఈగలు ముసిరాయట +==తాటిచెట్టు నీడ గాదు తగులుకున్నది పెండ్లామూ గాదు +==తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కొరకు అన్నాడట== +అబద్ధం చెపితే అతికి నట్టుండాలి. అలా చాత కాని వారికి ఈ సామెత వాడతారు +==తాటి చెట్టు కింద పాలు తాగినా ఎవరు నమ్మరు== +ఏపని చేసినా సమయము, సందర్భము చూసుకోవాలని ఈ సామెత అర్థం. +==తాడి తన్నే వాడుంటే తల తన్నే వాడుంటాడు +==తాతా చార్యులకు పీర్ల పండక్కి పొంతనేమిటి== +ఒక దానికొకటి పొంతన లేని మాటలు మాట్లాడె వారిని గురించి ఈ సామెత వాడతారు. +==తాతాచార్యుల ముద్ర భుజం తప్పినా వీపు తప్పదు== +==తాతలనాడు నేతులు తాగాం, మా మూతులు వాసన చూడండి +బుర్రకత చెప్పేటప్పుడు ప్రధాన గాయకుడు ఒక వచనం చెప్పితె వంత పాట గాళ్లు వెంటనే తందాన తానా అంటారు. అనగా వాడు చెప్పిందే నిజమని వంత పాడడ మన్న మాట. ఇలాంటిదే ఇంకో సామెత అదిగో పులి అంటే ఇదిగో తోక'' +==తాను త్రవ్విన గోతిలో తానే పడతాడు +==తాను తిన తవుడు లేదు వుంచుకున్న దానికి వడియాలు +==తాను తుమ్మి తానే శతాయుశ్షు అనుకున్నట్లు +==తాను దూర సందులేదు మెడకో డోలు +==తాను మింగేదాన్నీ తనను మింగేదాన్నీ చూచుకోవాలి +తాను వలచినది రంభ, తాను మునిగింది గంగ== +తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే సామెత లాంటిదే ఇదీను. మొండి వాడు, ఎవరి మాట వినని వాని గురించి వాడే సామెత ఇది. +తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు== +తన మాటే చెల్లాలనే మొండి వాళ్ల గురించి ఈ సామెత పుట్టింది. +==తాను మెచ్చ తినాలి పరుల మెచ్చ నడవాలి +==తాను పట్టిన కుందేలుకు మూడె కాళ్లు అనే రకం== +తన మాటనే నెగ్గించుకోవాలని చేసె వారి గురించి ఈ సామెత వాడతారు +తాను వలచింది రంబ తాను మునిగింది గంగ== +మొండి వాళ్ల గురించి వాడె సామెత. +తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు== +అన్ని పనులు తాననుకున్నట్టు జరగవని చెప్పేదే ఈ సామెత +తాను తలిచినట్లే అన్ని జరగవని హిత బోధ చేయడమే ఈ సామెత లక్ష్యం. +==తాళ్ళపాక వారి కవిత్వం కొంత నా పైత్యం కొంత +తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి అని కూడా అనటం కద్దు. +అగ్నిహోత్రావధాన్లు అనే ఒక పాత్ర, కన్యాశుల్కం మీది పేరాశతో భార్య ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమెకు తెలియకుండా, తమ కూతురుకి ఒక ముసలివాడితో పెళ్ళి నిశ్చయిస్తాడు. దానికి భార్య, బావమరిది అభ్యంతరం చెప్పినపుడు, ఆసక్తికరమైన సంభాషణ వారి ముగ్గురి మధ్య జరుగుతుంది. ఆ సందర్భంలో అగ్నిహోత్రావధాన్లు చేత గురజాడ ఈ మాట అనిపిస్తాడు. +తాంబూలాలివ్వడమనేది భారతీయ సాంప్రదాయంలో పెళ్ళి నిశ్చయం చేసుకోవడం. అక్కడి వరకూ వచ్చాక ఇక ఆ పెళ్ళి ఆగటం సాధారణంగా జరగదు, పెళ్ళి దాదాపు జరిగినట్లే. నేను తాంబూలాలు కూడా ఇచ్చేశాను, ఇక మీరెంత గింజుకున్నా ఒరిగేదేమీ లేదని ఆ పాత్ర భావం. +చెయ్యాల్సిందంతా చేసేశాను, ఇంక ఎన్ననుకున్నా ఏమీ లాభం లేదు అని చెప్పాల్సిన సందర్భంలో దీనిని వాడతారు. +తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు== +తాను తాగుతున్నది మజ్జిగే అయినా ఆస్థలం తాటి చెట్టు క్రింద అయినందున అతడు తాగుతున్నది కల్లే అనుకుంటారు. ఏ పనిచేసినా సమయా సందర్భాన్ని అనుసరించి చేయాలి అనే భావం ఈ సామెతలో దాగున్నది. +తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు== +ఒకరికి మించిన వారు ఇంకొకరు వుంటారు. తానె గొప్పవాడినని విర్ర వీగే వారికి గుణ పాటంగా ఈ సామెత చెప్తారు. +ఒక పద్ధతిలో పని కాక పోతె వేరొక మార్గంలో ఆలోసించాలి గాని అసలు పని మానుకోకూడదని హితవు చెప్పేదే ఈ సామెత. +ఎవరి అదుపులో లేకుండా గాలికి తిరిగేవాడని అర్థం. +సాధారణంగా తాతలు ఎక్కువగా దగ్గుతూ ఉంటారు. వారికి ఎలా దగ్గాలో ఛెప్పటం హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే అపార అనుభవం కలిగిన విషయ పరిజ్ఞానికి అదే విషయంపై బోధలు చేయటం తాతకు దగ్గులు నేర్పటం లాంటిదే అని దీని అర్ధం. +==తాత చస్తే బొంత నాది అనే రకం== +తాదూర సందు లేదు, మెడకో డోలు== +తన పరిస్థితె అంతంత మాత్రము. దానికి తోడు ఇంకొడిని ఇంటికి భోజనానికి ఇంటికి పిలిస్తే ఎలా? +ఇలాంటి సందర్భాలలో పుట్టినదే ఈ సామెత తాదూర సందు లేదు, మెడకు ఒక డోలు" +తామ రాకు మీద నీటి బొట్టు స్థిరంగా వుండదు. ఆకుకు అంటు కోదు. పాదరసం లా కదులు తుంటుంది. ఏదైనా వ్యవహారంలో అంటి ముట్ట నట్లు వ్వవహరించి కష్టాల పాలు గాకుండా వుండాలని దీని అర్థం. +సంపాదన లేకుండా తండ్రులు సంపాదించారని తింటూ కూర్చుంటే అది ఎంతోకాలం వుడదని చెప్పేదే ఈ సామెత. +==తింటేగానీ రుచి తెలీదు దిగితేగానీ లోతు తెలీదు +తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి== +గారెల రుచి గొప్ప తనాన్ని మహాభారతం విశిష్టతను చెప్పేదె ఈ సామెత. +తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట== +==తిక్కోడి పెళ్ళిలో తిన్నవాడిదే లాభం అన్నట్లు +తిట్టను పోరా అంటూనె గాడిదా అని తిడు తున్నాడు. ఒక మాటమీద నిలబడని వారి గురించి ఈ సామెత పుట్టింది. +==తిట్టబోతే అక్కబిడ్డ కొట్టబోతే బాలింత అన్నట్లు +==తిట్టితే చచ్చేవాడూ దీవించితే బ్రతికేవాడూ లేడు +తిట్టే నోరు, తిరిగే కాలు చేసే చెయ్యి ఊరకుండవు== +==తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట== +మామూలుగా కోడిపుంజు దిబ్బలో మేస్తుంది, ఇంటి కప్పు ఎక్కి కూస్తుంది. అనుకూలంగా ఉందికదా అని దిబ్బెక్కి కూయదు. ఆ విధంగా ఎవరైనా పనిని చేయవలసిన విధంగా కాకుండా తమ సుఖానికి అనుకూలమైన విధంగా చేసినప్పుడు ఈ సామెతను వాడుతారు. +==తినగల అమ్మ తిండి తీర్థాలలో బయటపడుతుంది +ఈ సామెత వేమన శతకంలోని ఒక పద్యం నుంచి ఉద్భవించింది. +సాధన చేస్తూ ఉంటే పనులు సులభతరమౌతాయని దీని అర్థం. +చాలామంది భోజనానికి కూర్చున్నప్పుడు, ఎలాగూ తాము తినబోతున్నా, వంటకాల రుచి ఎలా ఉందని ఇతరులను అడుగుతుంటారు. ఈ విధంగా తాము స్వయంగా కాసేపట్లో తెలుసుకోబోయే విషయాలను ఇతరుల ద్వారా తెలుసుకోవాలని ఎవరైనా ప్రయత్నించినప్పుడు ఈ సామెతను వాడుతారు. +==తిని వుండలేక, తాగి బొందలో పడినట్లు +అన్నం పెట్టిన వారికే ద్రోహం చేయాలనే బుద్ధి గలవారి గురించి ఈ సామెత పుట్టింది. +==తినే తినే కూడులో మన్ను పోసుకున్నట్లు +==తినేది గొడ్డు మాంసం పైగా విభూతి రేఖలు +==తిమ్మన్నా! తిమ్మన్నా! నమస్కారం అంటే నా పేరు నీకెలా తెలిసిందని అడిగితే నీ ముఖం చూడగానే తెలిసిందని అన్నాడట +==తిమ్మిని బ్రహ్మి, బ్రహ్మిని తిమ్మి చేసినట్లు +==తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి +సముద్రంలోని తిమింగలాలకు టన్నులకొద్దీ చేపలు ఆహారంగా అవసరం అవుతాయి. అంత పెద్ద మొత్తంలో చేపల్ని తినే తిమింగలాలకు ఏ చేప అయినా ఒకటే. ఈనాటి కొంతమంది రాజకీయ నాయకులకు ఇది సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వం విడుదల చేసే ఏ రకం నిధులైనా వారి అవినీతికి అతీతం కాదు. +==తియ్యని ముద్దులకు మురవాలో, అదిరే దెబ్బలకు అరవాలో తెలియటం లేదన్నదట +==తిరిగి రైతు తిరక్క బైరాగి చెడతారు +==తిరిగే కాలూ, తిట్టే నోరు వూరుకోవు +==తిరుగానాం మరగానాం తీపి వాయనం అన్నట్లు +==తిండికి ముందు తగువుకు వెనకాల వుండాలంటారు== +ఒక్కోసారి ఏదైనా చిన్న తీగను అవసరంకొద్దీ లాగినప్పుడు అనూహ్యంగా ఆ తీగతోపాటు డొంకంతా కదలడం జరుగుతుంది. ఈ విధంగా ఏదైనా చిన్న విషయం గురించి ఆరా తీస్తున్నప్పుడు పెద్ద విషయం బయటపడితే ఈ సామెతను వాడుతారు. +==తీట గలవానికి తోట గలవానికి తీరికుండదు +==తీయగా తీయగా రాగం మూలగ్గా మూలగ్గా రోగం +==తీరు తీరు గుడ్డలు కట్టుకొని తీర్థానికి పోతే, ఊరికొక గుడ్డ వూడిపోయిందట +==తీర్చే వారుంటే ఎన్ని బెట్టులైనా పోవచ్చు +==తీసినవాడూ బాగానే వుంటాడు చూచినవాడూ బాగానే వుంటాడు ఎదుటివాని మీద పడుతుంది ముట్టుపుల్ల== +==తుంగభద్రకు మంగమ్మ పోతే భంగము తప్పుతుందా +==తుండూ పిండం చిక్కిన వెనుక ముండకు దిక్కెవరు +==తుట్టె పురుగుకు రెక్కలొచ్చినా, ముసలాడికి ప్రాయం వచ్చినా పట్టపగ్గా లుండవు +==తుప్పరల పసే గానీ మంత్రాల పస లేదు +==తులసి వనంలో గంజాయి మొక్క వున్నట్టు== +==తుమ్మ దుడ్డు వలె కాపు కదురు వలె +==తుమ్ముకు తమ్ముడు లేడు గానీ ఆవలింతకు అన్న వున్నాడు +తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి== +అసందర్బ ప్రేలాపన చేసే వారి గురించి ఈ సామెత పుట్టింది. +రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్లు +==తురకలలో మంచివాడెవరంటే తల్లిగర్భాన వున్నవాడు, పుడమిగర్భాన ఉన్నవాడు +==తురక లేని వూళ్ళో దూదేకులవాడే ముల్లా +==తురకవాడికి గంగిరెద్దు పోతే కోసుకుని తిన్నారట +చిన్న చిన్న నష్టాలను కలిగించే వాటిని పట్టించుకొని పెద్ద నష్టాలు కలిగించే విషయాల జోలికెళ్లని వారి గురించి ఈ సామెత చెప్తారు. +ఇది రైతుల సామెత: ఒక్కో సారి తూనీగలు గుంపులు గుంపులుగా ఎగురు తుంటాయి. అప్పుడు రైతులు వర్షం వస్తుందని భావిస్తారు. +రెండు ఒక్కటే అని చెప్పే సామెత ఇది +==తూర్పున ఇంద్ర ధనుస్సు దూరాన వర్షం +==తూర్పున ఇంద్ర ధనుస్సుకు దుక్కిటెద్దు రంకె వేస్తుంది +==తూర్పున కొరడు వేస్తే దుక్కెద్దు రంకె వెయ్యునా +==తెగించి దానం చేస్తా తేరా పిడిక���డు రాళ్ళు అన్నాడట +==తెల్లనివన్నీ పాలు -నల్లనివన్నీ నీళ్ళు అనుకున్నట్లు +తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య== +ఏదైనా ఒక విషయం తెలియనంత వరకు అదేదో మహా విద్య అనుకుంటారు. అది తెలిశాక ఒహో ఇంతేనా అను కుంటారు. ఈ సామెత అర్థం ఇదే. +==తెలివికి తల లేకపోయినా, భోజనానికి పొట్ట వుంది +==తెలియని దయ్యంకన్నా తెల్సిన దయ్యం మేలు +==తెలిసే వరకే బ్రహ్మ విద్య తెలిసిన తర్వాత కూసు విద్య +==తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పది వేలు చేరు== +ఇది సుమతి శతక పద్య భాగము. +==తేనెటీగల పని తీరుబడి లేని పని +==తేనె పోసి పెంచినా వేపకు చేదుపోదు== +దుర్మార్గులకు ఎంతగా నీతులు బోధించినా మనసు మారదు. +దొంగతనానికి ఇంట్లో దూరిన దొంగ తేలు కుట్టినా (పట్టుబడతాడు కాబట్టి)అరవలేడు. అదే విధంగా తాము ఉండకూడని పరిస్థితిలో ఉన్నవారు అట్టి సమయంలో తమకు ఏదైనా నష్టం జరిగినప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఏమీ చెయ్యలేరు +==తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లూ తెగ కుట్టిందట +==తేలు తేలండీ! అంటూ అరిస్తే మొగాళ్ళను పిలవ్వే అన్నాట్ట +==తేలు మాదిరి కుట్టటం బల్లి మాదిరి అణగటం +==తేలేనయ్యకు తిండి మెండు వండలేనమ్మకు వగలు మెండు +==తొలకరిలో చెరువు నిండినా తొలిచూలు కొడుకు పుట్టినా లాభం +ఆర్తిక పరిస్థితులు బాగు పడితే వారి బుద్ధులు కూడా మారతాయి అని చెప్పేదె ఈ సామెత. +==తొందరగా రమ్మంటే, తిరగమూత వేసి వస్తానన్నట్లు +అసలే అది కోతి. క్షణమైనా తిన్నగా వుండదు. దాని తోక తెగితే ఇక ఎలా గంతు లేస్తుందో కదా. ఈ సామెత అర్థం అదె. +తోక ముడుచుట అనగా ఓడి పోవుట లేదా పారి పోవుట అని అర్థం జంతువులు పోట్లాటకు దిగే టప్పుడు తమ తోకను పైకెత్తుకొని రంగంలోకి దిగుతాయి. అందులో ఏదైనా ఓడి పోతే తన తోకను తన కడుపు క్రిందికి దాచుకొని పారి పోతాయి. కుక్కలు, ఎద్దులు, పులులు, మొదలగు జంతువులలో ఈతతంగం బాగా గమనించ వచ్చు. దాని నుండి పుటినదే ఈ సామెత. +==తోచీ తోయనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు== +కొంతమంది ఏమీ తోచక విచిత్రమైన పనులు చేస్తుంటారు. చూసేవాళ్ళకు ఆ చేష్టలు వింతగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎంతో హాస్యరసపూరితంగా చెప్పడానికి తోచీ తోచనమ్మ తన తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టుంది అంటారు. +తెలుగు సామెతలలో చమత్కారం మేళవింపుకి ఇది ఒక మచ్చుతునక. +==తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటి కెళితే చూచీ చూడనట్లు చూచారట +==తోటకూర నాడైనా చెప్పవైతివ��రా కొడకా అన్నట్లు +==తోట మీద వారికి, పీట మీద వారికి మొగమాట ముండదు +==తోలు కొరికే వాడు పోతే ఎముక కొరికే వాడు వస్తాడు +ఇలాంటిదే మరొ సామెత: తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నె వాడు మారొకదుంటాడు. +==తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సు మనుట ఖాయం== +మానవ శరీరాన్ని గురించి వైరాగ్యంతో అనే మాటలు. ఇది బ్రంహయ్య గారి తత్వాలలోని భాగము. + + +==దగ్గరకు పిలిచి నీ కన్ను గుడ్డి అన్నట్లు +==దగ్గుతూ పోతే సొంటి కూడ ప్రియమే== +==దత్తత మీద ప్రేమా? దాయాది మీద ప్రేమా +==దమ్మిడీ ఆదాయం లేదు క్షణం తీరికలేదు +==దమ్మిడీ పెళ్ళికి ఏగానీ బోగం మేళం +దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట== +==దయలేని అత్తకు దణ్ణం పెట్టినా తప్పే లేకున్నా తప్పే +==దరిద్రానికి మాటలు హెచ్చు తద్దినానికి కూరలు హెచ్చు +==దరిద్రుడికి అంటనప్పుడు ఆముదం రాచినా అంటదు +==దరిద్రుడు తలగడుగబోతే వడగండ్ల వాన కురిసిందట +==దశకొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు +దానం చేయని చెయ్యి కాయలు కాయని చెట్టు +==దానం చేయని చెయ్యీ కాయలు కాయని చెట్టూ ఒక్కటే +==దాన్ని నమ్ముకొని దడి కింద దాక్కొని వుంటే ఈదుర గాలికి ఇచ్చుకొని చచ్చాడట== +ఎవరో ఏదో ఇస్తారని ఆశపడి పడిగాపులు పడే వారి గురించి చెప్పే సామెత ఇది. +==దారం లేని సూదిని దయ్య మెత్తుకుపోతుంది +==దారిన పోయె కంపను ముడ్డికి తగిలించు కొన్నట్లు +అనవసరమైన విషయాలలో తల దూర్చి కష్టాలను కొని తెచ్చుకొనే వారిని ఇలా అంటారు. +==దారినపోయే తద్దినాన్ని పిలిచి నెత్తి కెక్కించుకున్నట్లు +==దారినిపోయే శనీశ్వరాన్ని పిలిచి పీట వేసినట్లు +మనకు సహాయం అవసరమయినప్పుడు ఎవరి సహాయం అందకపొతే ఆ దేవుడి మీదే భారం వేయమని దీని అర్థం. +==దిక్కు లేని యిల్లు దయ్యాల నిలయం +సాధారణంగా ఏదైనా చెరువునిగాని మడుగునిగాని బయటినుండి చూసి లోతు అంచనా వేయలేము. అలాగే ఏ విషయమైనా మనం స్వయంగా పాల్గొంటేగాని అందులోని సాధక బాధకాలు తెలీవని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు. +దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు== +ప్రతి రోజు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో వున్నప్పుడు ఏ రోజుకారోజు ప్రాణాపాయం తప్పిందని బయట పడ్డామని సంతోష పడేవారి నుద్దేసించి ఈ సామెత వాడతారు. +==దిబ్బ మీద కూర్చొని మేడమీదున్నట్లు కలలు కనడం== +ఎవరి స్థాయికి తగ్గ కోరికలు వారు కోరాలని హితవు చెప్పే సామెత ఇది. +దీపం కాంతులను వెదజల్లుతున్నప్పుడు ఆ వెలుగులో మన పనులను చక్కపెట్టుకుంటాం, కాంతి తోలగిపోతె ఎ పని చేయలేము. అంటే ఏ సమయానికి ఏం చేయాలో ఆలోచించుకొని ఆలస్యం చేయకుండ మనిషి జీవితాన్ని సాగించాలని ఈ సామెత పరమార్దం. +==దీపం ఆరిన తర్వాత దినుసంతా ఒక్కటే +==దీపం పేరు చెబితే చీకటి పోతుందా +==దుక్కి కొద్ది పంట బుద్ది కొద్ది సుఖము== +==దుక్కికొద్దీ పంట బుద్ధి కొద్దీ సుఖం +==దుక్కి చాలని చేనుకు ఎరువు ఎంత పెట్టినా వట్టిదే +==దుక్కిటెద్దు చావు పక్కలో పెళ్ళాం చావు వంటిది +==దున్నటం ఎవడైనా దున్నుతాడు పంట పండించేవాడే కావాలి నాకు అందిట +దున్నపోతు ఈనదు. ఎవరైనా అది ఈనిందంటే దూడను కట్టెయ్యమనడం అసందర్భ ప్రలాపన. అంటే ఎవరైనా ఒక అసందర్భమైన విషయాన్ని చెప్పినపుడు మరొకరు దానితో ఏకీభవించడం లేదా సమ్మతించడం జరిగితే ఈ సామెతను ఉపయోగిస్తాం. +దున్న పోతు మీద వాన పడితే దానికి చాల హాయిగా వుంటుంది. అంతవరకు కాస్తనన్నా తొందరగా నడిచేది వర్షంలో అసలు నడవదు. అనా నిదానంగా పనిచేసే వారి గురించి ఈ సామెత వాడతారు. +దున్నపోతు మీద ఎంత వాన కురిసినా వాటికి ఏమీ పట్టదు. అలాగే ఎంత చెప్పినా వినక పోయే వారిని ఈ సామెతతో పోలుస్తారు. +==దున్నబోతె దూడల్లో మేయ బోతె ఎద్దుల్లో== +వివరణ: ఇంకా పని నేర్వని పెద్ద కోడెదూడ పని తప్పించుకోవడానికి దున్నబోతె తాను దూడనంటూ దూడల్లో కలిసి పోతుంది మేతకు వెళ్లేటప్పుడు పనిచేసె ఎద్దులకు మంచి మేత పెడతారు గనుక ఆమేత కొరకు ఎద్దులతో వెళ్లుతుంది +ఎవరన్నా పని చేయకుండా తిని కూర్చుంటే ఈ సామెతను వాడతారు. +==దున్నుతూ వుంటే నాగళ్ళు పారుతూ వుంటే నీళ్ళు +దున్నే ఎద్దులకు నక్కలను చూపి నట్లు== +పని చేసుకునే వారి పనిని చెడగొట్టే వారి గురించి సామెత పుట్టింది. దున్నె ఎద్దులకు నక్కలను చూపితె అవి బెదిరి పనికి ఆటంకం కలుగుతుంది. +పని చెడగొట్టే వారి గురించి ఈ సామెత వాడతారు. +వ్యవసాయం అంత లాభదాయకం కాదు అనే ఆర్థంలో ఈ సామెతను వాడుతారు. +==దున్నేవానికి దడవనా తొక్కేవానికి వెరవనా అన్నదట +అత్యాశ ఎప్పటికైనా కష్టం కలిగిస్తుందని తెలియ జెప్పడం. +==దూకుతా దూకుతానన్న సవితే కానీ దూకిన్నా సవితి లేదు== +ఊరికూరికే బెదిరిస్తూ అది నిజంగా చేసి చూపని వాళ్ళని సూచిస్తూ వచ్చిన సామెత ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన బాపూరమణల చిత్రం "అందాల రాముడు"లో దీనిని వాడుకున్నారు. +==దూకు దూకుమనే వాళ్ళేగానీ, దూకే వాడు ఒక్కడూ లేడు +దూరాంగా కని���ించే కొండలు నునుపుగానే కనిపిస్తాయి. కొండలమీదున్న ఎగుడుదిగుడు ప్రదేశలు, పెద్ద రాళ్ళు, వృక్షాలు అన్ని కలిపి చదునుగానె కనిపిస్తాయి. దగ్గరికి పోతే గాని అసలు సంగతి తెలియదు. ఏదైనా అంతే దగ్గరికిపోతేగాని అసలు సంగతి కనబడడు. ఆ ఉద్దేశంతో చెప్పినదే ఈ సామెత. +మాటలకు లొంగని వారు దెబ్బలకు లొంగుతారని చెప్పే సామెత ఇది. +మంచి మాటలతోకాకపోతే దెబ్బలతో పని జరిపించ వచ్చని ఈ సామెత అర్థం. +మంచి మాటలతో చెపితే వినని వారు కూడా దెబ్బలకు లొంగు తారని అర్థం. +వేదాలు అతి పవిత్రమయినవి. అలాంటి వేదాల్ని దెయ్యాల వల్లిస్తుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో అలానే దుర్మార్గులు, మూర్ఖులు ఇతరులకు సన్మార్గబోధ చేస్తుంటే మనకు విచిత్రంగానే ఉంటుంది. దీనినే దెయ్యాలు వేదాల వల్లించినట్లు అంటారు. +రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అనే సామెత లాంటిదే ఇదీను. +దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు== +గుళ్లో దేవునికి పెళ్ళికి వూరి వారందరు పెద్దలే +==దొడ్డివాకిట దయ్యాన్ని తరిమితే, తలవాకిట వచ్చి నిల్చిందట +==దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకుపోతే గొడ్డు గేదే శ్రీమహాలక్ష్మి +చెల్లని కాసులు దేవునికి అనే సామెత లాంటిదే దీను. +==దొరల చిత్తం చెట్టు నీడ నిలకడ లేనివి +ఎక్కడైనా దొంగ తనము చేసిన వాడిని అడిగితే తాను దొంగతనము చేసినట్లు ఒప్పుకొనడు. దొంగతనము చేసినప్పుడు దొరికితేనే అతను దొంగ అని నమ్మకంగా చెప్పగలము. దొరకనంత వరకు అతను దొరే. ఆ సందర్భంలో చెప్పేదె ఈ సామెత. +దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు== +అతి నిదానంగా పనిచేసె వారిగురించి ఈ సామెత వాడతారు. +==దొంగలు పడ్తారని కొబ్బరి చెట్టుకు మడి బట్ట కట్టిందట== +పరమ అమాయకుల గురించి చెప్పే సామెత ఇది. +దొంగ తనానినికి వెళ్లిన వానికి తేలుకుట్టితే నెప్పికి వాడు అరిస్తే పట్టు బడి పోతాడు నెప్పికి అరవలేకుండా వుండ లేడు +==దొంగగడ్డి మేసే గొడ్డయినా కట్టుకొయ్య వద్దకు రాక తప్పదు +==దొంగకు భయము లంజకు సిగ్గు లేవు +==దొంగతనానికి పోతూ డోలు చంకన పెట్టుకుని పోయినట్లు +==దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు +==దొంగలూ దొంగలూ కలిసి వూళ్ళు పంచుకున్నట్లు +==దొంగలందరూ దుష్టులు కారు దుష్టులందరూ దొంగలే +==దొంగండీ అంటే ముక్కు కరుస్తాడేమో జాగ్రత్త అన్నాడట +ఎవరో ఇద్దరు మాటలు సరిగ్గా రాని వాళ్ళు మాట్లాడుకుంటుంటే వారిని వెక్కిరిస్తూ మూడవ వ్యక్���ి అయిన వాడు వాడి స్నేహితునితో అన్న మాట ఇది "దొందూ దొందేరా తొందప్పా" అని. +అసలు వాడు "రెండూ రెండేరా కొండప్పా" అనాలి. కానీ వాడికి కూడా సరిగ్గా అనడానికి నోరు తిరగలేదు. +తన చేతకాని తనాన్ని చూసుకోలేని వాడు ఎదుటి వాళ్ళ లోపాలను వెక్కిరించితే వాడే నవ్వుల పాలు అవుతాడు అని నీతిని బోధించే సామెత ఇది. +==దోసకాయ తిన్న కడుపూ, దొంగలు దోచిన యిల్లూ ఒక్కటే + + +==ధనమొస్తే దాచుకోవాలి రోగం వస్తే చెప్పుకోవాలి== +కాపురంగుట్టు, రోగం రట్టు.సమానార్థంతో ఇది మరొక సామెత. ధనం వస్తే పది మందికి చెప్పుకోకూడదు. దానివలన దొంగల భయం ఎక్కువ. కాని రోగ మొస్తే పది మందికి చెప్పాలి. ఎవరో ఒకరు ఆ రోగానికి తగిన మందు చెప్పక పోరు అని ఈ సామెత అర్థం. ముందూ వెనుకా చూసుకోకుండా ఖర్చుపెట్టకూడదు రోగం వస్తే తగిన మందు తీసుకుని రోగాన్ని తగ్గించుకోవాలి. +అన్నింటికి ధనం మూలము. అని అర్థం. +==ధర్మానికి చీర యిస్తే, యింటికి వెనక్కి వెళ్ళి మూర వేసిందట +ధర్మాన్ని మనం కాపాడితె అది మనలను కాపాడుతుంది. ధర్మాన్ని తప్పవద్దు అని ఈ మాట ఉపదేశం. +ధైర్వ వంతునికి అన్ని విజయాలె అని చెప్పె సామెత ఇది. + + +నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట== +==నక్క జిత్తులన్నీ నాదగ్గరుండగా తప్పించుకుపోయెరా తాబేటిబుఱ్ఱ +==నక్కపుట్టి నాలుగు వారాలు కాలేదు నేనింత ఉప్పెన ఎన్నడూ చూడలే దన్నదట +==నక్క పోయిన తర్వాత బొక్క కొట్టుకున్నట్లు +నట్టేట చేయి విడిచినట్లయితె మునిగి పోతాడు. అలా చేస్తే నమ్మించి మోసము చేయడమని అర్థము. +==నట్టేట పడ్డ సొమ్ము నట్టింటికి నడిచి వచ్చినట్లు +==నగుబాట్ల పెళ్ళికి పెళ్ళినాడే నాగవల్లి అన్నట్లు +మధ్యలో సంపదలు కలిగిన వారికి గర్వ మెక్కువ అని అర్థము +నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది== +అల్పుడికి ఐశ్వర్యం వేస్తే అర్దరాత్రి గొడుగు పట్టమన్నాడట. +మధ్యలో సంపదలు కలగ్గానే పొగరెక్కి అర్థ రాత్రి గొడుగు అవసరం లేకున్నా గొప్ప కోసము గొడుగు పట్టమన్నాడట +==నడమంత్రపు సిరి వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట== +మధ్యలో సంపదలు కలగ్గానే పొగరెక్కి అర్థ రాత్రి గొడుగు అవసరం లేకున్నా గొప్ప కోసము గొడుగు పట్టమన్నాడట +==నడమంత్రపు సిరి వస్తే నడుము లిరుగ పడ్డట్లు +అలసట ఎక్కువైతే తనపైనున్న గుడ్డ కూడా బరువని పిస్తుందని అర్థము. +==నడుము మునిగేదాకానే చలి నలుగు��ూ వినేదాకానే సిగ్గు +నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు +==నడిరాత్రి దుప్పట్లో యౌవ్వన మద్దెల మోతలన్నట్లు +కష్టాల్లో మునిగి ఎటు దిక్కు తోచని స్థితిలోవున్న వారి గురించి ఈ సామెత వాడతారు. +==నత్తగుల్లలన్నీ ఒకచోట ముత్యపు చిప్పలన్నీ ఒకచోట +ఏగూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అనే సామెత లాంటిదే ఈ సామెత. +==నన్ను ఎరిగినవాడు లేకపోతే నా బడాయి చూడమన్నట్లు +తనగురించి తెలిసిన వారు లేక పోతే ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చని అర్థము +==నన్ను ముట్టుకోకు నా మాలకాకీ అన్నట్లు +నిరుపయోగమైన పనిని గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను వాడుతారు +==నయాన కాని పని భయాన అవుతుంది +నయమున పాలుం ద్రావరు, భయంబున విషంబు నైన బక్షింతురుగా అనే పద్యమే ఈ సామెత మూలము. +==నరకానికి నవ ద్వారాలు స్వర్గానికి ఒక్కటే +==నల్ల బంగారం యిస్తా సాన పెట్తావా అందిట +==నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోమటిని నమ్మకూడదట== +సామాన్యంగా బ్రాహ్మణులు ఎర్రగానూ కోమటి]]వారు నల్లగానూ ఉంటారని ఒక నానుడి. అలా కాకుండా, బ్రాహ్మణుడు నల్లగానూ, కోమటి ఎర్రగానూ ఉంటే, సామాన్యంగా జరిగే దానికి వ్యతిరేకముగా ఉండటంవల్ల, అలా ఉన్నవాళ్ళని నమ్మకూడదని సామెతే తప్ప మరింకేమీ కాదు, ఇందులో ఉదహరించబడిన కులాల మీద ఎటువంటి వ్యాఖ్య అంతకన్నాకాదు. +==నలుగురి తర్వాత ఆడపిల్ల పుడితే నట్టింట బంగారం +అందరూ వెళ్ళే దారిలోనె వెళ్ళమని దీనర్థము +==నలుగురూ నడిచిందే బాట పలికిందే మాట +పదుగురాడు మాట పాటియై ధర జెల్లు అనే వేమన పద్యం ఈ సామెతకు ఆధారము +==నలుపో తెలుపో నలుగురు పిల్లలు ముతకో సన్నమో నాలుగు చీరలు +అతిసులభముగా పని జరిగితే ఈ సామెతను వాడుతారు. బండి వెళ్ళే దారిలో నల్లేరు అడ్డు వుంటే బండి కేమి నష్టముండదు. +==నవాబు పొట్టకూ, తమలపాకు కట్టకూ ఎప్పుడూ తడుపు కావాలి +==నవ్వే వాళ్ళ ముందు జారి పడ్డట్టు== +ఏదో కారణంగా వారు ముందుగానే నవ్వుతున్నారు. అంతలో ఆదారిన వెళ్ళే వాడు వారి ముందు కాలి జారి పడ్డాడు. దాంతో వారి నవ్వు పరాకాష్ఠకు అందుకుంది. +==నవ్వే ఆడదాన్నీ ఏడ్చే మగవాణ్ణీ నమ్మరాదు +==నరకానికి నాలుగు ద్వారాలు స్వర్గానికి ఒకటే దారి== +==నరము లేని నాలుక నాలుగు విధాలు== +నోట్లో నాలుక లేక పోవటం అంటే సరిగా మాట్లాడలేకపోవటం నరము లేని నాలుక నాలుగు విధాలు అంటే మాట నిలకడలేని తనం.మాట నిలబెట్టుకోలేని తనం, నిమిషానికి ఒక రకంగా మాట మారుస్తూ ఉండటం.ఎప్పుడేం మాట్లాడత���రో అర్థం కాకుండా ఉండటం. +కాలం అంతా ఒక్కలాగ వుండదు. ఈ రోజు పనికి రాదనుకున్న వస్తువు రేపు విలువైనదిగా వుండవచ్చు. ఆలాంటి దాన్ని గురించి ఈ సామెత. +==నంగిమాటల వాడినీ దొంగ చూపుల వాడినీ నమ్మరాదు +==నందిని పంది పందిని నంది చేయగలిగినవాడు +==నంబివాడు ఎదురైనా నాగుపాము ఎదురైనా కలిసిరావు +==నంబీ నంబీ నా పెళ్ళికేమి సహాయం చేస్తావంటే నీ పెళ్ళికి ఎదురు రాను పో! అన్నాడట +==నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు== +అన్ని వదిలేసిన వారిని గూర్చి ఈ సామెత వాడతారు. ఎవరు ఏమనుకున్నా నాకేమి అని మొడితనముతో వుండేవారిని ఉద్దేశించినది ఈ సామెత. +==నాకు లేక ఆకులు నాకుతుంటే నీకెక్కడ పెట్టేది +==నా కోడీ, కుంపటీ లేకుంటే ఎలా తెల్లారుతుందో, నిప్పెట్లా దొరుకుతుందో చూస్తానందట +ఈ సామెతకు ఆధారంగా ఒక కథ వున్నది: ఒక ఊరిలో ఒక ముసలామె వుండేది. ఆమె వద్ద వంట చేసుకోడానికి ఒక కుంపటి వుండేది. అదే విధంగా ఒక కోడి పుంజు వుండేది. ప్రతి రోజు ఊరివారు ముసలమ్మ కోడి కూయంగానే నిద్రలేచి మగవాళ్ళందరూ వారి వారి పనులకు వెళ్ళే వారు. ఆడవారు మాత్రం ఈ ముసలమ్మ కుంపటిలోని నిప్పు తీసుకెళ్ళి తమ ఇంట పొయ్యి వెలిగించుకునేవారు. ఇది గమనించిన ఆ ముసలమ్మ నా కోడి పుంజు కూత తోటే ఈ వూర్లో తెల్లవారుతుంది నా కుంపటిలోని నిప్పుల వల్లనే ఈ వూరి వారందరి పొయ్యి వెలుగు తున్నదని భావించి నేనే గనుక లేకుంటే ఈ ఊర్లో ఎలా తెల్లవారుతుందో వూర్లో వారు వంట ఎలా చేసుకుంటారో చూస్తానని ఎక్కడికో వెళ్ళి పోతుంది. కొన్నాళ్ళ తర్వాత ఆ వూరి వారి బ్రతుకులెలా వున్నాయో చూద్దామని తిరిగొచ్చింది ఆ ముసలామె. ఆ వూరిలో ప్రజలు యధావిధిగానె వుండటం చూచి నివ్వెర పోతుంది. +ఎవరి మాట వినని మొండి వాని గురించి ఈ సామెత వాడతారు. +==నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నాడట +==నా చేను నీకు రాసిస్తా దున్నుకుని పంట పండిస్తావా? అని అడిగిందట +==నాది కాదు నా అత్త సొమ్ము అన్నట్లు +==నా దెబ్బకు గోలకొండ కూడా అబ్బా అంటుంది +==నా నోట్లో నీ వేలు పెట్టు నీ కంట్లో నా వేలు పెడతా అన్నట్లు +==నా పాతివ్రత్యం గూర్చి నా మొదటి మొగుణ్ని అడగరా రెండో మగడా అందిట +==నా పెనిమిటికి లేనిది నీకుంది అందుకే నీ పక్కలోకొచ్చా అందిట +==నా మొగుడికే పసవుంటే నీ దగ్గరెందుకు పడుకుంటానని అందిట +==నాయనకు పెళ్ళి సంబరం అమ్మకు సవతి సంకటం +==న్యాయదేవత కళ్ళు విప్పనంతవరకే అన్యాయం ఆగడాలు +==న్యాయాన్ని రక్షిస��తే, అది నిన్ను రక్షిస్తుంది +==నారా అనరా అంటే పీచు అనే వాడు== +==నారి తెగినా కష్టమే నారి తిరిగినా కష్టమే +నారి అనగా వింటి నారి అని అర్థం. మరొక అర్థము స్త్రీ అని. వింటి నారి తెగితే విల్లు నిరుపయోగము అలాగే స్త్రీ బయట తిరిగితే పరువుండదని అర్థము +==నారు పోసిన వాడు నీరు పోయక పోతాడా +==నాలిముచ్చు వెధవనీ, నీళ్ళు నమిలేవాణ్నీ నమ్మరాదు +నోటి మాత్రమే కఠినంగా వుండి మనస్సు మెత్తనయితే ఈ సామెతను వాడుతారు +==నాలుకా! నాలుకా! వీపుకు దెబ్బలు తేకే +==నాలుక మీద తేనె మనసులో విషం +==నాలుక వుంటే అన్ని దిక్కులూ తిరుగగలడు +==నా వ్రేలితో నా కన్నే పొడిచినట్లు +==నా సింగారం చూడరా నా బంగారు మగడా! అన్నట్లు +చన్నీళ్లలో దిగేటప్పుడు మొదట్లో చలిగా వుంటుంది. పూర్తిగా దిగాక చలి వుండదు. కష్టాలు ఒకటి రెండు వస్తే మనిషి తమాయించుకోగలడు. అన్ని కష్టాలు ఒక్కసారిగా వస్తే అతనికి తెగింపు వచ్చేస్తుంది. ఆ అర్థంతో ఈ సామెత పుట్టింది. +==నిండిన కడుపుకు అన్నం బట్టతలకు నూనె అన్నట్లు +అన్ని వున్న విస్తరి అణిగి మెణిగి వుంటుంది ఎంగిలాకు గాలికి ఎగిరి పడుతుంది. అనే సామెతె లాంటిదే ఇది కూడ. గొప్పవారు చిన్న చిన్న విషయాల గురించి పట్టించు కోరు అని చెప్పే సామెత ఇది. +గంగ పారు చుండు కదలని గతి తోడ మురుగు పారు మ్రోత తోడ అనే పద్య పాదమే ఈ సామెతకు మూలం. +అప్పటికప్పుడు అసలు విషయం తెలియకున్నా తర్వాతన్నా నిజం తెలుస్తుందని ఈ సామెత అర్థం. +కొన్ని సార్లు నిజం చెపితే కూడా తగువులు వస్తాయి అని చెప్పే సామెత ఇది. +==నిజం మాట్లాడితే ఉన్న ఊరు అచ్చిరాదు +అన్ని సక్రంగ జరుగుతూ సంసారం సక్రమంగా జరుగుతుంటే ఈసామెత వాడుతారు +==నిద్ర పోయేవాణ్ని లేపొచ్చు గాని నిద్ర నటించే వాణ్ణి లేప లేము== +నిజముగా నిద్ర పోయే వాడు కాస్త అలికిడికి లేస్తాడు. అలా కాకుండా నిద్ర పోతున్నట్టు నటిస్తున్న వాడిని బలవంతంగా లేపాలని ప్రయత్నించినా వాడు లేవడు. ఎందుకంటే అది కపట నిద్ర. +==నింద వస్తుంది గానీ అవమానం రాదు +దేనికయినా ఒక కారణముంటుందని చెప్పేదే ఈ సామెత. +బయటకు కనబడని ప్రమాదమని అర్థం. నిపురు కప్పిన నిప్పు నిప్పుగా పైకి కనిపించదు. అలాగని దాన్ని ముట్టుకుంటే కాలక మానదు. +==నిమ్మ చెట్టు నీడా కాదు నిండు మనిషి తోడు కాదు== +ఉపయోగము లేని పని అని అర్థం. +==నియమం కోసం నామం పెడితే, నామం నా కొంపముంచింది అన్నట్లు +==నిలకడ లేని మాట నీళ్ళ మూట +==నీ ఎడమ ��ెయ్యి తియ్యి నా పురచెయ్యి పెడతాను అన్నట్లు +నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట== +ఆమె కాపురము కూలిపోయిన తర్వాతనే రంకు మొగుడయ్యాడు. ఇక ప్రత్యేకంగా ఆమె కాపురం కూల్చాల్చిన పని లేదు. ఆ సందర్భానికి ఈ సామెత వాడతారు. +==నీకు ఎక్కడ సంశయమో, నాకూ అక్కడే సందేహం +==నీకు బెబ్బెబ్బే నీ యబ్బకు బెబ్బెబ్బే +==నీ కూడు తింటూ, నీ బట్ట కడుతూ, నాతో కాపురం చెయ్యి అన్నట్లు +==నీకో దణ్ణం నీ పెద్దకొక దణ్ణం +==నీకోసం పుట్టా, నీకోసం పూచా, దొరలా దోచుకో అందట +==నీటికి నాచు తెగులు మాటకు మాట తెగులు +==నీటికి నాచు తెగులు నాతికి రంకు తెగులు +==నీతి లేని మాట రాతి వేటు +నీతి లేని వారు పొరుగున వుంటే ఏనాటికైనా ముప్పే. జాగ్రత్తగా వుండమని హెచ్చరిక +==నీతో కాపురం ఒంటికి కంపరం అన్నట్లు +==నీ పప్పు నా పొట్టు కలిపి ఊదుకు తిందాం రా! అన్నట్లు +ఎదుటివారి సొమ్మును ఏదో ఒక విధంగా కాజేద్దామని ఎదుటివారికి మేలు చేసి పెడతామంటూ వారికి మాయమాటలు చెప్పి వారి చేత ఖర్చు పెట్టించి తమ పని చేసుకుపోవటం.ఎదుటివారి చేత ఖర్చు చేయించి చివరకు డబ్బంతా తామే సమకూర్చినట్లుగా ప్రచారం చేసుకోటం. +పెండ్లాం ముండ మొయ్యడమంటే భర్త చావడమని అర్థము. కాని మొగుడే ఆ మాటంటే అతడొక అమాయకుడని అర్థము +==నీ పెండ్లి ఎట్లాగో పాడయింది, నా పెండ్లికి రా అన్నాడట +==నీరు వుంటేనే పల్లె నారి వుంటేనే యిల్లు +==నీవు నేర్పిన విద్యయే నీర జాక్ష== +==నీవు పాడిందానికీ, నేను విన్నదానికి సరి. తలవూపిన దానికి తంబూర పెట్టిపో! అన్నట్లు +==నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో== +ఉపకారికి అపకారం చేసిన సందర్భాన్ని ఈ సామెతతో పోలుస్తాం. నీ వేలితో నాకు తినిపిస్తే నా వేలితో నీ కంట్లో పొడుస్తా అన్నట్లు!! +==నీవు ఒక అందుకుపోస్తే, నేను ఒకందుకు తాగుతున్నా +==నీళ్ళ మూట వంచకుడి మాట ఒక్కటే +ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పకపోవటం సంబంధం లేని మాటలు ఏవేవో చెబుతూ అసలు విషయం చెప్పకపోటం.ఒకవేళ ఏదైనా చెప్పినా ఆ మాటలో కచ్చితమైన విషయాలుండవు. అలాంటివారి మాటలను నమ్మవద్దని ఆ మాటల ఆధారంగా గట్టి నిర్ణయాలు ఏవీ తీసుకోవద్దని +==నీళ్ళు లేని పైరు నూనె లేని జుట్టు +==నీ సరి వేల్పులు నా సరి దాసులు లేరు +==నీ సొమ్ము ఆదివారం నా సొమ్ము సోమవారం +[[వడ్లు నువ్వు దంచు, నేను దంచుతున్నట్లు అభినయిస్తూ భుజాలు ఎగరేస్తాను .పని నువ్వు చెయ్యి, నేను ఎగ్గొడతాను అనటం. +==నువ్వు దంచుత�� వుండు నేను పక్కలెగరేస్తాను అన్నట్లు +==నూతి కప్పకు సముద్రపు సంగతేం తెలుస్తుంది +==నూరు అబద్ధాలాడి అయినా ఒక యిల్లు నిలుపమన్నారు +ఒక మంచి పని చెయ్యడానికి అబద్దం ఆడినా తప్పు లేదని అర్థము ఈ సామెతకున్నది +==నూరు కీళ్ళు ఓరిస్తేగానీ ఒక మేలు దక్కదు +==నూరు కొరడా దెబ్బలైనా ఒక బొబ్బట్టుకు సరిరావు +నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లు== +ఎంతటి భలవంతుడైనా కాలం కలిసి రాకపోతే ఒక్కోసారి కుక్కచావు చస్తాడని అర్థం. +పల్లె ప్రాంత ప్రజల ఉహా ధోరణి విచిత్రంగా ఉంటుంది. వారికి తెలిసిన వస్తువులను వారికి తెలిసిన వాటితో పోల్చి చెపుతుంటారు. ఈ పొడుపు కథ కూడా అలా ఒక వస్తువుతో పోల్చి చెప్పుకొనగా ఉద్భవించినదే. నూరు చిలకలు ఉంటే వాటికి ఒకటే ముక్కు ఉండటం సృష్టిలో చాలా విచిత్రమైన విషయమే. ద్రాక్షపండ్ల గుత్తిలోని ద్రాక్ష పళ్ళన్నీ పచ్చగా గుత్తిగా ఒద్దికగా ఒకే చోట ఉండటం పొడుపు కథ. ద్రాక్ష పళ్ళన్నీ చిలకలుగా వాటిని కలుపుతూ ఉన్న ఒకే తొడిమ ముక్కుగా సృష్తికర్త భావం. అందుకే దీనిని విడుపు ద్రాక్ష గుత్తి అంటుంటారు. +==నూరు నోములు ఒక్క రంకుతో సరి +==నూరు మాటలు ఒక వ్రాతకు సరికావు +==నూరేళ్ళు వచ్చినా నుదుటి వ్రాతే గతి +లక్షసద్గుణములను ఒక దోషము తుడిచివేయును నూఱు వ్రతములు ఒకఱంకుతో పోయినట్లు" అని తెనుఁగు సామెత. కడవెఁడు పాలు ఒకవిషబిందువుతో పాడయినట్లు ఏకోఽపి హన్తి గుణలక్ష మపీహ దోషః సంస్కృత న్యాయములు]] +==నెత్తిన రూక పెట్టినా కాసుకు కొరగాడు== +తన క్రింది వారితొ కొంత కఠినంగా వ్వవరిస్తేనె సంస్థ అభివృద్ధి చెందు తుందని అర్థం. +నెమలికంటిలో నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు== +==నేతి కుండను నేలబెట్టి, ఉత్త కుండను ఉట్టి మీద పెట్టినట్లు +పేరుకేగాని అసలు సరకు లేదనే అర్థంలో ఈ సామెత చెప్తారు. నేతి బీరకాయలో నెయ్యి లేదు, మైసూరు పాకులో మైసూరు లేదు. +నేతిబీర అనేది ఒక బీరకాయ రకము. పేరుకే ఇందులో నేతి అని ఉంది కానీ బీరకాయలో నెయ్యి (నేతి) ఉండదు. కేవలం పేరుకే ఏదైనా ఉంటే దాన్ని నేతి బీరకాయలో నేతి చందానా అంటారు. +* గొప్ప కోసం కబుర్లు చెప్పేవార గురించి నీతి బీరకాయ కబుర్లు చెపుతాడు అంటారు. +==నేను పుట్టకపోతే నువ్వెవరిని పెళ్ళి చేసుకునేవాడివని అడిగితే, నీతల్లిని పెళ్ళాడేవాడిని అన్నాడట +==నేను వెళితే లేదుగానీ నా పేర చీటీ పంపితే పని జరుగుతుందా +నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు== +ఇక్కడ "నోటికి అదుపు" అన్న మాటకు రండు అర్ధాలు తీసుకొనవచ్చును. ఒకటి నోటితో మనము ఏది మాట్లాడినా ఎంత పడితే అంత మాట మాట్లాడ రాదు ఐతే సందర్భానికి తగినట్లుగా ఆలోచించి మాట్లాడాలి.రెండవది నోటితో మనము తినేది తగినంత కన్నా ఎక్కువ తిన రాదు. అలా చేయకున్న అది మనిషికి చేటు తెచ్చును. అలాగే ఇంటిలోని వారికి కూడా పొదుపు వుండాలి. అది లేకపొయిన మొత్తం కుటంబానికే కాక వారి తరువాతి తరాల వారికి కూడా మంచిది కాదు. +==నేలచూపు పోతే వాలుచూపు సై అంటుంది +==నేల విడిచి సాము నీరు విడిచి ఈత +==నేర్చి చెప్పిన మాట నెరవాది మాట +==నేసేవాణ్ని నమ్ముకుని పొలిమేర జగడం ఒప్పుకోరాదు +==నొప్పించక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు +ఇది సుమతీ శతక పద్య భాగము. +==నొసట వ్రాసిన వ్రాతని చెరిపే దెవరు +==నోటితో లేదనేది చేతితో లేదంటే సరి +==నోట్లో వేలు పెట్టినా కరవలేని నంగనాచి +==నోరు అప్పాల పిండి చెయ్యి బలుసు ముల్లు +==నోరు చేసే అఘాయిత్యాన్ని పొట్ట భరించలేదు +మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడే వారినుద్దేశించి ఈ సామెత వాడతారు +==నోరు మూస్తే మూగ నోరు తెరిస్తే గయ్యాళి +తాను మంచిగా వుంటే ఎదుటివారుకూడ మంచిగానె వుంటారని అర్థం. అందరూ స్నేహ భావంతో వుండాలని అర్థం ఈ సామెతలో ఉంది. +==నొసట పళ్ళు నోట్లో కళ్ళు లేవు +మనసులో ఒకటి పెట్టుకొని, పైకి మరొకటి మాట్లాడె వారినిగురించి ఈ మాట పుట్టినది. + + +మనసులో చెడు ఆలోచనలు పెట్టుకని పైకి పంచదార లాంటి తియ్యని మాటలు మాట్లాడేవారి సంర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. +మనసులో చెడు ఆలోచనలు పెట్టుకని పైకి పంచదార లాంటి తియ్యని మాటలు మాట్లాడేవారి సంర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు +==పంచాంగం పోగానే తిథీ వారాలూ పోతాయా +పెంట అనగా ఎరువు అని మంట అనగా నిప్పు అని అర్థము. పంటకు ఎరువు అవసరం అలాగే వంట చేయడానికి మంట అవసరము అని దీని అర్థము +==పండగ నాడు కూడా పాత మొగుడేనా +సామెతను మార్చేసి పలుకుతున్నారు. పండగ పూట పాత "మడుగేనా" అన్నది అసలైన సామెత. మడుగు అంటే వస్త్రం అని అర్థం. పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ. ఆ అర్థంలో పుట్టిన సామెత పండగ పూట పాత బట్టలు కాదు కొత్త బట్టలు కట్టుకోవాలి అని. +ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు. సరైన రీతిలో నే పలుకుదాం, పలికిద్దాం. +వివరణ: గతంలో రవికల పండుగ అని ఒక ఉత్సవం జరిగేది. భార్య భర్తలు ఒక నది ఒడ్డు చేరుకొని నది ఎగువన భార్యలు తమ రవికలు తీసి నది]]లో వేసేవారు. కొంత దూరంలో వున్న భర్తలు నదిలో కొట్టుకొని వస్తున్న రవికలను ఒక్కొక్కదాన్ని ఒకడు చేత చిక్కించు కోవాలి. అలా ఎవరి రైక ఎవరికి దొరుకుతుందో ఆ రవిక స్వంత స్త్రీ రవిక దొరికించు కొన్న పురుషునితో ఆ రాత్రి సంబోగంలో పాల్గొనాలి. అదీ ఆ పండగ తీరు. అలా ఒక పురుషునికి ఒక రైకి దొరికింది. ఆ రవికకి సంబంధించిన స్త్రీ ఆ పురుషుని వద్దకు వచ్చింది. తీరా చూస్తే ఆ పురుషుడు తన సొంత మొగుడే ఆ విధంగా పుట్టినదే ఈ సామెత దీనికి మూల: పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు రచన తాపీ ధర్మారావు) +పండితుని కొడుకు పరమ మూర్కుడవుతాడని ఈ సామెతకు అర్థం. ఇది ప్రాస కొరకు మాత్రమే పుట్టిన సామెత. +ఈ సామెతకు వ్వతిరేఖార్థంలో ఒక సామెత ఉంది. అది పండిత పుత్ర శుంఠః దానికి వ్వతిరేకార్థంలో కల్పించిన సామెత ఇది. +==పంది ఎంత బలిసినా నంది కాదు +ఎప్పుడూ బురదలో దొర్లుతూ మురికి వాసనలో జీవించే పందికి పన్నీరు సువాసన తెలియదు. అలానే విలువ తెలీని మూర్ఖులకు విలువైన బోధలు చేసినా లేదా విలువైన వస్తువులను ఇచ్చినా వారికి వాటి విలువ తెలియక దుర్వినియోగం చేస్తారు. +పందిని వేటాడ్డం అంత సులభం కాదు. దాని శరీరానికి ఎంత దెబ్బ తగిలినా సులభంగా చావదు. క్రింద పడిపోడు. అలాగే పారిపోగలదు లేదా మీదికి దాడి చేయగలదు. అందుచేతనే పందిని పొడిచే వాడే బంటు అని సామెత పుట్టింది. +==పకపకా నవ్వేవారూ, గబగబా అరిచేవారూ కపటమెరుగరు +==పక్కమీద పూలు నలిగినట్లు నీవూ నలిగితే ఎట్లా అన్నాడట +పొరుగు వారు పోట్లాడుకుంటుంటే ఇరుగు పొరుగు వారికి అదొక వేడుక. ఇది మానవ సహజం. ఆ విధంగా పుట్టినదే ఈ సామెత/ +==పగ గలిగి బ్రతకటం పామున్న యింట్లో బ్రతకటం ఒక్కటే +అనవసరమైన కబుర్లతో కాలక్షేపం చేయటమని అర్థం. ఇలాంటి కాలక్షేపాల మాటలు పగటిపూట పెట్టుకుంటే తాను చేసే పనితోపాటు ఇతరుల పనిని కూడా చెడగొట్టినట్టవుతుంది. +త్రాసు పాము పగ బట్టితే ఎప్పటికి మరచిపోక తన పగ తీర్చు కోవడానికి వేచి చూస్తుంటుందని ప్రజల మూడ విశ్వాసము. ఆ విధంగా ఈ సామెత పుట్టింది. పాములు పగపట్టడం ఒక మూడ నమ్మిక మాత్రమే +==పగలు చెయ్యి లాగితే రానిది, రాత్రి కన్నుగీటితే వస్తుందా +==పగలు చూస్తే రాత్రికి కలలోకి వస్తుంది అన్నట్లు +చాల వికారంగా/ అనాకారిగా వున్నదని ఈ సామెతకు అర్థం. +==పగలెల్లా ���ారెడు నేశాను దీపం తేరా దిగనేస్తాను అన్నాడట +==పగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే మరణం అన్నాడట +మంచి వానికి అందరు మంచి వారుగానె చెడు వానికి అందరు చెడ్డగానే కనబడతారని దీని అర్థం. +ప్రారంభంచిన అన్ని పనులు సక్రమంగా జరుగు తుంటే వారి గురించి ఈ సామెత వాడతారు. +==పట్టినదంతా బంగారం ముట్టినవల్లా ముత్యాలు అన్నట్లు +ప్రారంభంచిన అన్ని పనులు సక్రమంగా జరుగు తుంటే వారి గురించి ఈ సామెత వాడతారు. +==పట్టుకొన్నవాడు మట్టగుడిశ అంటే పైనున్నవాడు జెల్ల అన్నాడట +==పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకొని వెనకాలె తిరిగినట్టుంది== +మొగ మోటానికి పోయి ఒకామె మరొకామెకు పట్టు చీర అరువిచ్చిందట. ఆమె ఎక్కడన్నా కూర్చుంటే తన చీరకు మట్టి అంటుతుందని ఒక పీట తీసుకొని ఆమె ఎక్కడ కూర్చుంటుందో అక్కడ పీట వేసేదట. మొగమాటానికి పోయి కష్టాలు తెచ్చుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది. +==పట్టెడు బొట్టుంటే పది లక్షలు స్త్రీకి +==పడమట కొర్రువేస్తే పందిళ్ళమీద రాజనాలు పండుతాయి +==పడమట కొర్రువేస్తే పాడి ఆవు రంకె వేస్తుంది +==పడ్డ గోడలు పడ్డట్టుండవు చెడిన కాపురం చెడినట్లుండదు +పడిశం అనగా జలుబు పడిశం పట్టితే పది రోగాలు పట్టుకున్నంత బాధ అని ఈ సామెతకు అర్థం. +==పడుచులతో సయ్యాట పాములతో చెలగాటం ఒకటే +==పడుపడు అన్న నాసవితే గాని పడ్డ నాసవితి లేదు== +అందరూ సలహాలిచ్చి వారేగాని ఆచరించేవారులేరు అని సామెత అర్థము +==పడమట పిసరంత మబ్బు నడిస్తే పాతాళందాకా వాన +==పడమట మెరిసిన పది ఘడియలకు వాన +==పడమట మెరిస్తే పంది కూడా నీళ్ళలో దిగదు +==పణత పడే జాగాకే కాళ్ళు ఈడ్చుకుపోతాయి +==పత్రి దేవుని మీద భక్తి చెప్పులమీద +==పద్మాసనం వేసుకుని కూర్చుంటే పరమాన్నం వడ్డిస్తారా +==పదిమంది కళ్ళ పడ్డ పాము చావక బ్రతుకుతుందా +==పది మందిలో పడ్డ పాము తప్పించు కుంటుంది== +పది మందిలో పడ్డ పాము తలో మాట చెపుతూ అలజడి సృష్టిస్తారు. ఇంతలో ఆ పాము తప్పించు కుంటుంది. ఒక నాయకత్వంపై ఏదైనా పని చేయాలని ఈ సామెత అర్థం. +==పది రాళ్ళు వేస్తే ఒక రాయైనా తగులుతుంది +==పదుగురు నడిచిన దారిన పులు మొలవదు== +పులు అనగా గడ్డి అని అర్థం. పలువురు నడిచే దారిలో గడ్డి మొలవదు అనిఅర్థం. అనగా పదిమందిలో చెడుగా ముద్ర పడివ వాదు అభివృద్ధిలోకి రాడని అర్థం. +==పదుగురాడు మాట పాటిపై ధర చెల్లు +పది మంది చెప్పిన మాటే చల్లు తుంది. ఇది ఒక పద్య పాటము పదుగురాడు మాట పా���ియై ధరచెల్లు, ఒక్కడాడు మాట ఎక్కదెందు ఒక్కడే ఎంత మొత్తుకున్నా వాని మాట చెల్లదని అర్థం. +==పనికి పంగనామం పెట్టి గంపజాతర నెత్తికెత్తుకున్నట్లు +పని చేయడానికి మొండికేసి తిండికి మాత్రం ముందుండే వారి గురించి ఈ సామెత ఉపయోగిస్తారు +==పనికి పాతిక నష్టం పరక లాభం +==పనిగలవాడు పందిరేస్తే పిచ్చుకలు వ్రాలగానే పడిపోయిందట +పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లు== +సాధారణంగా బజారులో అన్ని దుకాణందారులు తమ అంగడికి రమ్మని పిలుస్తూ ఉంటారు ఒక్క మంగలి తప్ప. జుత్తు పెరిగితే మనమే మంగలి దగ్గరికి వెళ్ళలి +పనిలేని మంగలి పిల్లి తల గొరిగినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ పనీ లేనివారు ప్రజల మెప్పుకోసం ఎవరికీ ఉపయోగపడని పనిచేస్తుంటే వారిని ఉద్దేశించి ఆ సామెత ప్రయోగిస్తాం. నిర్వ్యాపారాంబష్టన్యాయము +ఒక పనిలో ఎంతో ఆరి తేరిన వాడనని చెప్పుకునే వానిని నమ్మి పనిచెపితే ఆ పని తర్వాత ఆపనిలోని డొల్లతనం తెలిసి పోతుంది. ఆ సందర్భంలో ఈ సామెత వాడతారు. +==పన్నెండామడల మధ్య బ్రాహ్మణుడు లేకపోతే యజ్ఞం చేయిస్తానన్నాడట +==పప్పుకూటికి ముందు చాకిరీకి వెనుక వుండాలి +==పప్పులో ఉప్పు వేసేటప్పుడు చెప్పెయ్యవే కోడలా అంటే పప్పులో చెప్పువేసి, అత్త కంచంలో అంచున పెట్టిందట +పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు== +అపసోపలు పడి అధికంగా సంపాదించ డానికన్నా కొంచెమైనా నిదానంగా సంపాదించడం మేలని దీని అర్థం. +పరువం మీద వున్నపుడు పంది కూడా అందంగా ఉంటుంది== +పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు +(ఇది పొడుపు కథ దీనిని ఆ వర్గంలో చేర్చ వచ్చు) +నోట్లో ఉన్న పళ్ళు ఊడగొట్టుకోదలచినప్పుడు ప్రత్యేకమైన రాయి అవసరంలేదు. అందుకు ఏ రాయైనా సరిపోతుంది. అదే విధంగా తనకు తాను స్వయంగా నష్టం కలిగించుకుంటున్నప్పుడు అది ఏ పధ్ధతిలో జరిగినా ఒకటేనని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు. +పైకి చూడ్డానికి చాల అమాయకంగా కనిపిస్తూ లోన దుర్భుద్దులున్న వారినుద్దేశించి ఈ సామెత వాడుతారు +అత్యంత అమాయకుల గురించి ఈ సామెత ఉపయోగిస్తారు. పరమానందయ్య శిష్యులు చాల అమాయకులు +==పరుగెత్తి పాలు త్రాగేకన్నా, నిలబడి నీళ్ళు త్రాగటం మేలు +==పరువాల పోరు మధువుల పుంత అన్నట్లు +==పరువు లేని బ్రతుకు పరమ రోత +==పసుపు, కుంకుమల కోసం పది క్రోసులయినా వెళ్ళాలి +దేవునికి ప్రదక్షిణాలు చ���స్తే పిల్లలు పుడతారని ఎవరో చెప్పితే ఒక ఇల్లాలు దేవునికి ప్రదక్షిణాలు చేస్తూ చుట్టు చుట్టుకూ కడుపు చూసుకున్నదట కడుపు వచ్చిందస లేదాయని. అనగా అమాయకురాలని అర్థము. +==ప్రమిదలో వత్తేసి కళ్ళలో దీపాలు వెలిగించు అందిట== +==ప్రసూతి వైరాగ్యం పురిటి పచ్చి ఆరేదాకానే +పశువులు తమకు వేసిన మేతను బట్టి పాలిస్తాయని అర్థము +==పాచిపండ్లవాడు కూడబెడితే, బంగారు పండ్లవాడు అనుభవించాడట +ఏపని చేసినా పొట్ట కూటికే అనే అర్థం ఈ సామెకు వున్నది +అసలు కన్నా కొసరు ఎక్కువని దీనర్థం. +అసలు కన్నా కొసరు ఎక్కువ అని ఈ సామెతకు అర్థం. +రైతు ఇంట్లో వున్న పిల్లలను\పశువులను సమానంగా చూస్తాడని/ఆదరిస్తాడని అర్థము +చెప్పిన విషయాన్నే పదే పదే అదే పనిగా చెబుతూ ఉంటే వినే వారికి విసుగొస్తుంది. ఈ సందర్భాన్ని ఈ సామెతతో చెబుతాం. +==పాతది పనికి రాదు కొత్తది కొరగాదు +==పాత్ర యెరిగి దానం యివ్వాలి వంశ మెరిగి బిడ్డను తెచ్చుకోవాలి +పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేసుకుందట== +దానమిచ్చిన వస్తువుయొక్క మంచి చెడులు బేరీజు వేయడం. +==పాపమని పాలు పోస్తే, ఒద్దని ఒలకపోశాడట +==పాపమని భోజనం పెడితే పక్కలోకి రమ్మన్నాడట +==పాపి సముద్రానికి పోతే అరికాలు తేమ కాలేదుట +==పాముకు పళ్ళలో విషం జ్ఞాతికి కండ్లలో విషం +==పాముకు పాలు పోసి పెంచి నట్టు== +దుర్మార్గులను చేరదీస్తే ఏనాటికైనా ప్రమాదమనిసూసించే సామెత ఇది. +==పాము పడగ నీడను కప్ప చందాన +అత్యంత ప్రమాద పరిస్థితిలో వున్నాడని ఈ సామెతకు అర్థము. +==ప్రాణముంటే శివం ప్రాణం పోతే శవం +ప్రాణం కన్నా పరువు గొప్పదని ఈ సామెతకు అర్థము +తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు అనే సామెత లాంటిదే ఇది కూడ +==పాండవుల సంపాదన దుర్యోధనుల వారి పిండాకూళ్ళకు సరి +చిన్నవయసులో పెద్ద ఘనత సాధించిన వారిగురించి ఈ సామెత వాడతారు +ఎన్ని రొట్టెలు కావాలో వాటికి సరిపడా పిండిని కలుపు కోవాలి. తక్కువ పిండి కలిపి ఎక్కువ రొట్టెలు కావాలంటే అది అసాద్యం. అలాగే కొంచెం పిండి కలిపి పెద్ద రొట్టె చేయాలంటే కూడా కుదరదు. +పిండి ఎంత ఎక్కువ వుంటే అన్ని రొట్టెలు చేసుకో వచ్చు అలాగే ఆవుకు ఎంత తిండి పెడితే అన్ని పాలిస్తుందని ఈ సామెతకు అర్థము. +==పిండి బొమ్మ చేసి ఆడబిడ్డంటే, ఆడబిడ్డ తనాన అదిరదిరి పడిందిట +==పిండీ, బెల్లమూ ఇచ్చి పిన్నమ్మా నీ ప్రసాదం అన్నట్టు== +చిన్న విషయానికి, పెద్ద విషయానిక��� ఒకే పనితనము పనికిరాదని చెప్పేదే ఈ సామెత. +==పితికే బర్రెను యిచ్చి పొడిచే దున్నను తెచ్చుకున్నట్లు +పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు== +ఎటు వంటి పరిష్కారం దొరకని సమస్య వచ్చినప్పుడు ఈ సామెత వాడతారు. +పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట== +అనగా వానికి ఇంకా పిచ్చి తగ్గ లేదని అర్థం. +పిచ్చి వాడు తన చేతిలోని రాయిని ఎవరి మీదకు విసురుతాడో తెలియదు. +పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు== +గోటితో పొయ్యేదానికి గొడ్డలి ఎందుకు? అనే సామెత లాంటిదే ఇదీను కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు +పిచ్చోడు రాయితో ఎవరిని గురి పెట్టి కొట్టడు. ఎవరిని కొట్టాలో అతనికే తెలియదు. అతడు విసిరిన రాయి ఎవరికైనా తగలవచ్చు. అందరు జాగ్రత్తగా వుందాలని దీని అర్థం.. +==పిల్ల గలవాడు పిల్లకేడిస్తే కాటివాడు కాసుకేడ్చినట్లు== +==పిల్ల చచ్చినా పురుటి కంపు పోలేదు +==పిల్ల చచ్చినా పురుటి కంపు పోలేదు +==పిల్లను సంకలో పెట్టుకొని ఊరంతా వెతికినట్టు== +అతిగా మతిమరుపు గలవారిగురించి ఈ సామెత చెప్పతారు +==పిల్లా అని పిలిస్తే పెళ్ళి చేసుకుంటావా అని అడిగిందట +==పిల్లి ఎదురైతె తల్లి గూడా శత్రువవుతుంది +ప్రయాణమై వెళుతుంటే పిల్లి ఎదురు రాకూడదని ప్రజల్లో ఉన్న మూడ నమ్మకానికి ఈ సామెత పుట్టింది +==పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటుందట S +మహా పిసినారి గురించి ఈ సామెత పుట్టింది +ఒకప్పుడు బాగా బతికిన కాలంలో ఎవరికైనా కీడు చేసి వుంటే అతడు బలహీనుడవగానే అతని శత్రువులు అతని పనిపడతారు. అది ఈ సామెత అర్థము +పిల్లి తాను పెట్టిన పిల్లలను కుదురుగా ఒక చోట వుండనియ్యదు. పిల్లల బద్రత కొరకు తన పిల్లలను మూడు రోజులకొకసారి స్థానాన్ని మారుస్తుంది. ఆవిధంగా తమ స్థానాన్ని మార్చు వారినుద్దేశించి ఈ సామెతను ఉటంకిస్తారు +వివరణ: ఎలుకలని చంపుతున్న పిల్లి బాధ పడలేక ఎలుకలన్నీ ఒక సమావేశము ఏర్పాటు చేసి ఒక నిర్ణయానికొచ్చాయి. అదేమంటే ఎవరైనా పిల్లి మెడలో గంట కడితే అది మనమీద దాడి చేసేందుకువచ్చేటప్పుడు గంట శబ్దం విని మనం దాక్కో వచ్చు అని వాటి అభిప్రాయము. కాని అలా పిల్లి మెడలో గంట కట్టేదెవరు ఇది అసాద్యం అసాద్యమైన పని గురించి చెప్పే సామెత ఇది. +==పిల్లిని చంకలో పెట్టుకుని పెళ్ళికి వెళ్ళినట్లు +==పిల్లిని చంపిన పాపం గుడి కట్టించినా పోదు +పిల్��ిని చంపకూడదని ప్రజల్లో వున్న నమ్మకాన్ని బట్టి ఈ సామెత పుట్టింది +==పిల్లిని సంకలో పెట్టుకొని రామేశ్వరం పోయినట్లుంది== +వివరణ: ఉట్టి మీదున్న పాల కుండను చూసి పిల్లి ఈ ఉట్టి తెగిపోవు గాక" అని శాపంపెట్టి అది తెగి పాల కుండ పగిలి పోతే పాలు తాగ వచ్చునని దాని ఆశ. అలా స్వార్థానికి పెట్టే శాపాలు తిట్లు పని చేయవని ఈ మాటకు అర్థం +==పిలిచి పిల్లనిస్తానంటే కులమేమి గోత్రమేమని అడిగాడట== +పెళ్ళి చేసుకోవడానికి పిల్ల దొరకడమే గగనంగా వున్న రోజుల్లో ఒకడు పిలిచి పిల్లనిస్తానంటే వారి కులగోత్రాలు ప్రశ్నించాడట ఒకడు. +భక్తి కలిగిన కూడు పట్టెడైన చాలు అనే నానుడి లాంటిదే ఈ సామెత కూడాను +==పుండు మీద కారం చల్లి నట్లు== +కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతుంటే ఈ సామెతను వాడతారు +==పుట్టని బిడ్డకు పూసల దండ అల్లినట్టు== +ఏమీ జరగకుండానే ఏదో జరిగిపోయినట్టు తెగ హడావుడి .బిడ్డ పుట్టడని తెలిసినా బిడ్డ కోసం పూసలదండ అల్లుతూ కూర్చోవటమంటే లేనిపోని హడావుడి చేయటమే +ప్రతి ఒక్కరు పాపం చేసిన వారే అని ఈ సామెతకు అర్థము +==పుట్టెడు నువ్వుల్లోపడి దొర్లినా అంటేగింజే అంటుతుందిగానీ అంటనిది అంటదు +==పుచ్చుకున్నప్పుడు కొడుకుపుట్టినంత సంతోషం, యిచ్చేటప్పుడు మనిషిపోయినంత బాధ +==పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదు== +ఎవరికైనా చిన్ననాటి నుండి వచ్చిన అలవాట్లు అంత సులభంగా పోవని ఈసామెత అర్థం. +తండ్రి కొడుకులు ఆస్తి పంపకాలు కోడళ్ళు ప్రేమ వివాహాలు మొదలైన విషయాల్లో మనస్ఫర్ధలకు లోనవుతారు. ఆ మనస్ఫర్ధలే ఇద్దరినీ శత్రువులుగా మార్చేస్తాయి. చిన్నప్పుడు ముద్దు మురిపాలు పంచుకున్న ఆ ఇద్దరే ఒకరి ఊసంటే ఒకిరికి పడక బద్ధ శత్రువుల్లాగా మారిపోతుంటారనే వైరాగ్య భావనతో ఈ సామెత +పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు== +పుణ్య కార్యాలు చేసె వారికి జీవితం సుఖమయమౌతుందని చెప్పే సామెత ఇది. +==పుణ్యానికి పిలిచి కొలిస్తే పిచ్చికుంచమని పారపోశాడట +==పువ్వులా విచ్చుకుంటా తుమ్మెదలా దోచుకో అందట +==పుబ్బ ఉబ్బిబ్బి కురిసినా చెట్టు క్రింద గడ్డనానదు +పుబ్బ కార్తెలో వర్షాలు కురవవు అనడానికి ఈ సామెత వాడుతారు. +==పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒక్కటే +ఇది వ్యవసాయ సంబంధిత సామెత పుబ్బ కార్తెలో విత్తనాలు చల్లితే పంట రాదని దీనర్థము +==పుబ్బలో చల్లేదానికంటే దిబ్బలో చల్లేది మేలు +ఇది ఒక వేమన పద్య భాగము. +మనుషులు అందరు ఒక్కటి కాదు. ఎవరి బుద్దులు వారివి అనే అర్థం లో ఈసామెత వాడుతారు. +పుంగనూరు జవాను లాగా అనే సామెత లాంటిదే ఇదీను వివరణ ఒక రైతు తన పాలేరుని రేపు ఏదో పనిమీద వేమారం గ్రామానికి పంపదామని తన బార్య తో అంటుండగా ఆ మాట పుల్లయ్య విన్నాడు అతి నమ్మకస్తుడైన పుల్లయ్య ఎలాగు వేమారం వెళ్ళమంటాడని పెందలకడనే బయలు దేరి వేమారం వెళ్ళి వచ్చాడు పుల్లయ్య తెల్లవారి పుల్లయ్యను వేమారం పంపుదామని చూస్తుంటే పుల్లయ్య కనిపించలేదు కొంత సేపటికి రానే వచ్చాడు ఎక్కడికి వెళ్ళావని అడిగితే తమరు నన్ను వేమారం పంపుదామని అనుకుంటే విన్నాను అందుకని వేమారం వెళ్ళి వచ్చేశాను అన్నాడు. అమాయకుడని అర్థము +వివరణ. పులిమీద స్వారి చాల ప్రమాదకరము.పులి మీద ఎక్కినవాడు అలా స్వారి చేస్తూనే వుండాలి దిగాడంటే పులి వాడిని తినేస్తుంది.మిక్కిలి ప్రమాదకరమైన పని చేస్తున్న వారినుద్దేశించి చెప్పేసామెత ఇది. +==పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు== +పులిచారలను పోలిన విధంగా వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాజాలదు. గొప్పవారిని అనుకరించినంత మాత్రాన సామాన్యులు గొప్పవారు కాలేరని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు. +'పుల్లాయావారం చేసావ్ ఇది మాట వాడుక. సరిగా జరగని లేదా ప్రయోజనము లేక జరిగిన పనిని గురించి వాడబడు పదం ఆచంట షావుకారు తన పనివాడు పుల్లయ్యకు చెప్పాడు ఇలా "ఒరే పుల్లయ్యా రేప్పొద్దున్నే ఓసారి వేమారం వెళ్ళిరావాల్రా పెందలకడనే లేచి అప్పుడు పుల్లయ్య "సరేనండయ్యా" అని పుల్లయ్య ఇంటికెళ్ళి పడుకొని మరునాటి ఉదయమే లేచి వేమవరం వెళ్ళి వచ్చేసాడు.తాపీగా మధ్యాహ్నానానికి వచ్చిన పుల్లయ్యను చూసి "ఏరా పుల్లయ్యా ఎక్కడికి పోయావ్ పొద్దున్నే వేమవరం వెళ్ళాలన్నానుగా అన్నాడు షావుకారు. అప్పుడు పుల్లయ్య "అయ్య నేను పొద్దున్నే లేచి ఎల్లొచ్చేసేనయ్యా ఏమారం" అన్నాడు మన పిచ్చి పుల్లయ్య నేను పనేంటో చెప్పకుండా ఎలా వెళ్ళావు. ఎందుకెళ్ళావు ?ఎందుకొచ్చావు? నీకు చెప్పడం నా తప్పు అని వాపోయాడు షావుకారు. +:పై కథనం మీదుగా ఈ సామెత పుట్టిందని ఒక వాదన. +==పూచిన పువ్వంతా కాయలైతే చెట్టు మనునా +==పూజకన్నా బుద్ధి మాటకన్నా మనసు ప్రధానం +స్థాయిమరచి వ్యవహరించటం, స్తోమతకు మించి ఆలోచించటం కూడదని ఈ సామెతకు అర్థం. +==పూర్ణం లేని బూరె వీరణంలేని పెళ్ళి +==పూబోడీ అంటే, ఎవర్రా బోడి? నీ ���మ్మబోడి, నీ అక్కబోడి అందట +మనసులో కల్మషం పెట్టుకొని పైకి బాగా మాట్లాడే వారిని గురించి ఈ సామెత చెప్తారు. +==పెద్దలు లేని యిల్లు సిద్ధులు లేని మఠము +పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు== +భోజనాల బంతిలో మొదట కూర్చోవాలనేది ఒక సూక్తి. ఎందుకంటే చివర్లో కూర్చుంటే వడ్డించే ఆహార పదార్థాలు తనదాక వస్తాయే లేక మధ్యలోనే అయిపోతాయేమోనని సందేహం. కాని వడ్డించే వాడు మనవాడైతె పదార్థాలు సరిపడక పోయినా మిగిల్చుకొని తనదాక వస్తాడస్ని ఈ సామెత అర్థం. +==పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు== +పొయ్యిమీద ఉన్న పెనం కన్నా పొయ్యిలోని మంట ఇంకా చాలా వేడిగా ఉంటుంది. ఏదైనా వస్తువు పెనం మీదినుండి పొయ్యిలో పడితే ఇంకా ఎక్కువ కాలుతుంది. ఈ విధంగా ఎవరైనా ఉన్న బాధల కంటే ఎక్కువ బాధలలోకి దిగజారితే వారి పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు. +ఏదైనా మితంగా వుండాలి. అతిగా పోతే నష్టపడక తప్పదని చెప్పెదే ఈ సామెత. +==పెళ్ళి అయిన యింటిలో ఆరునెలలు కరువు +''పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనే నానుడి లాంటిదే ఈ సామెత. పెళ్ళికి, ఇంటికి చాల ధనము ఖర్చు అవుతుంది ఆ దెబ్బ నుండి కోలుకోవాలంటే చాల కాలం పడుతుందని ఈ సామెతకు అర్థం. +==పెళ్ళి ఒకరితో శోభనం మరొకరితో అన్నట్లు +==పెళ్ళికి వచ్చినవారే చేస్తారు పెళ్ళి పనులు, పెళ్ళామా! నీ ఒళ్ళు అలిపించుకోకు అన్నాడట +పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టు== +బయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎదురైతే శుభశకునం కాదన్నది ఒక మూఢనమ్మకం. పిల్లి ఎదురైనప్పుడు బయలుదేరవలసిన వాళ్లు ఆగిపోవటం జరుగుతుంటుంది. అలాంటిది పిల్లిని చంకనపెట్టుకుని పెళ్ళికి వెళితే పిల్లితోపాటు ఆ పిల్లిని ఎత్తుకుని వస్తున్న వ్యక్తిని కూడా తిడతారు.అసలు సంగతి పిల్లిలాగా అపశకునకారిలాగా ఉండే వ్యక్తిని పక్కనపెట్టుకుని బయలుదేరితే ఆ వ్యక్తితోపాటు తీసుకెళ్ళిన మంచి వ్యక్తి కూడా మాటపడవలసి వస్తుంది. కనుక ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు, కలిసి తిరిగేటప్పుడు సమాజం వాళ్లు చేసే పనులను హర్షిస్తుందా? నిరసిస్తుందా? అనే విషయాలను గమనించుకుని స్నేహం చేయాలి. ఒకవేళ సమాజం వ్యతిరేకించే వ్యక్తులు గనుక అయితే వారిని వెంటపెట్టుకుని నడవటం మంచిదికాదన్నది ఈ సామెత చెప్పే సత్యం. +==పెళ్ళికొడుకు కుడికాలు చూచి అత్త ఏడుస్తుంటే, +ఏడ్పులో ఏడ్పు ఎడమకాలూ చూడమన్నాడట తోడపె���డ్లికొడుకు +==పెళ్ళికొడుకు మావాడేగానీ, చెవి పోగులు మాత్రం మావిగావు అన్నట్లు +==పెళ్ళిని చూస్తూ ఒకడుంటే, పెళ్ళాన్ని చూస్తూ ఒకడున్నాడట +==పెళ్ళాం పోతే పురుషుడు మళ్ళీ పెండ్లికొడుకు +==పెదవి దాటితె పృధివి దాటు తుంది== +ఏదైన రహస్యాన్ని మనసులోనే దాచుకోవాలి. దాన్ని ఎవరికైన చెప్పామొ తప్పక అది బహిర్గతం అవుతుందని అర్థం. +==పెళ్ళికి బొట్టుపెట్టి పిలిస్తే వెళ్ళక, పెంకుపట్టుకుని వెనుకదారిన పులుసు కోసం వెళ్ళిందట +==పెళ్లికి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు== +ప్రతి పని చాల ఆలస్యంగా చేసే వారిని గురించి ఈ సామెతను వాడతారు. +==పెట్టనమ్మ పెట్టనే పెట్టదు పెట్టే ముండ కేమొచ్చింది రోగం అన్నాడట +==పెట్టినదే తనది కూడ బెట్టినది యితరులది +[[నాదత్త ముపతిష్ఠతి సంస్కృత న్యాయములు లాగ +ఈయనిది రాదు పెట్టి పుట్టలేదు నాదత్త ముపతిష్ఠతి సంస్కృత న్యాయములు లాగ +==పెదవీ పెదవి కలిస్తే మధువులు ఒంపూ సొంపూ దక్కితే శోభనం +==పెదవుల పరిచయం ఎదలకు పరిణయం అన్నట్లు +==పెదవుల మధువులు, కౌగిలి విందులు మల్లెల జాతరలో అందట +==పెద్ద యింటి గోత్రాలు దేవుడి కెరుక +==పెద్ద యింటి రంకు, పెద్ద చెరువు కంపు తెలియవు== +==పెద్దలు లేని యిల్లు సిద్ధులు లేని మఠము +==పెరుగుతూ పెరుగుతూ పెదబావ కోతి అయినట్లు +ఇదొక సుమతీ శతక పద్య భావము పెరుగుట విరుగుట కొరకే, ధర తగ్గుట హెచ్చు కొరకే తద్యము సుమతీ +డబ్బుతో ముడిపడిన ఏ వ్యవహారం లోనైనా నిక్కచ్చిగా వుండాలని అర్థం. బందుత్వాలను కూడా చూడొద్దని ఈ మాటకు అర్థం. +==పేడ తక్కెడ ఇసుక తక్కెడ వాటం== +వివరణ: ఒకడు పేడను మూట కట్టుకొని వెళ్లుతూ ఒక మర్రి చెట్టుక్రిండ విశ్రమిస్తాడు. అక్కడికే మరొకడు ఒక ఇసుక మూటను తెచ్చి పక్కన పెట్టుకొని విశ్రమిస్తాడు. ఎవరికి వారు ఎదుటి వాని మూటలో ఏదో గొప్ప వస్తువులున్నాయని దాన్ని ఎలాగైనా దొంగిలించాలని పన్నాగం పన్ని నిద్ర నటిస్తున్నారు. ఒక మెల్లగా లేచి ఎదుటి వాని మూటను తీసుకొని పారి పోతాడు. ఇది గమనిస్తున్న రెండో వాడు నిద్ర నటిస్తూ వుంటాడు. వాడటు వెళ్లగానే, అక్కడ మిగిలిన మూటను పట్టుకొని వేగంగా పారిపోతాడు. చాల దూరం వెళ్లి మూటలు విప్పి చూసి ఎవరికి వారు తెల్లమొఖం వేస్తారు. ఇది ఈ సామెత వివారణ. +==పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ గొరిగిందట +==పేద వాని కోపం పెదవికి చేటు== +పేదవానికొచ్చిన కోపం వలన అతనికే నష్టం. కోపంతో తన పెదవి కొ���ుక్కొని గాయం చేసుకుంటాడు తప్ప ఫలితముండదని అర్థం. +పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట== +అర్హత లేని వారికి అధికారము ఇవ్వరాదని దీని అర్థం. అలాఇస్తే వ్వహరామంతా నష్టమొస్తుందని అర్థం. +==పేరు పల్లకీ మీద కాలు నేల మీద +==పేరు పల్లకీ మీద కాలు నేల మీద +తాము ఏమీ చేయలేమని తెలిసి కూడా కొంతమంది అధికులమని గొప్పలు ఛెప్పుకుంటారు. తీరా అవసరం వచ్చేసరికి మెల్లగా జారుకుంటారు. అలాంటి వారిని ఉద్ధేసించి ఈ సామెతను ఉపయోగిస్తూ ఉంటారు. మెరిసే దంతా బంగారం కాదు అనే సామెత లాంటిదే ఈ సామెత +==పైన (అదనంగా) మనిషుంటే పగలే తల నెప్పి వస్తుంది== +వ్వవ సాయం పనులలో అందరికి పని వుంటుంది. పైగా ఒకడు వుంటే అబ్బ నాకు తలనెప్పిగా వున్నదీ అని వెళ్లి చెట్టుకింద పడుకుంటాడు. పైగా మనిషున్నాడు గదా పని ఎలాగు జరుగుతుందని అతని భావన. పైగా మనిషి లేకుంటే అతను తల నెప్పి సాకు చెప్పి తప్పించు కోడు. ఆ సందర్భంగా పుట్టింది ఈ సామెత. +==పైపనీ, క్రింద పనీ నేను చూచుకుంటా సహకరించు అన్నాడట +==పైపై పనేనా అసలు పనేమైనా వుందా అని అందిట +==పొగచుట్టకు, పడతి యోనికి ఎంగిలి లేదు +==పొగాకు కొనుక్కోవాలి అందలం బయటపెట్టరా అన్నాడట +నిరక్షరాస్యులను గురించి ఈ సామెతను వాడుతారి/ +పొట్టిగా వున్న వారిని సమాజం చిన్న చూపు చూస్తుంది. వారికి ఓదార్పుగా ఈ సామెత వాడతారు. +ఇది ప్రాస కొరకు వాడిన మాటేగాని అర్థంలేదు +==పొదుగులేని ఆవు పాలిస్తే నాలుకలేని పిల్లి నాకి పోయిందట +==పొద్దున్నే వచ్చిన వాన ప్రొద్దుగూకి వచ్చిన చుట్టం పోరు +==పొద్దెప్పుడు కుంకుతుందా ముద్ద ఎప్పుడు మింగుతానా అన్నట్టు== +పనిదొంగలు, తిండిపోతుల వ్యవహార శైలి. వారి గురించి ఈ సామెత పుట్టింది. +వంట చేయలేదని ఈ సామెతకు అర్థం. అనగా కడు బీద వారినుద్దేశించి ఈ సామెత పుట్టింది +ఇష్టం లేకుండా పనిచేస్తుంటే వారిని గురించి ఈ మాట పుట్టింది. ఇష్టం లేని చుట్టాలు ఇంటికొస్తే వారిని పొమ్మలేరు. అందుచేత పొగబెడితే అనగా వంట చేస్తున్నట్టు నటిస్తూ పొగ ఎక్కువ పెట్టితే ఆ పొగకు వారు భరించలేక వారే వెళ్ళి పోతారని అర్థం. +అగ్గిపుల్ల అగ్గిపెట్టెకు రాచగానే ఒక్కసారి భగ్గుమంటుంది.పోలీసుల్లో చాలామంది భేషజంతో అలా పలకరించి, పలకరించకముందే మండిపడుతూ ఉండేవారు.అగ్గిపుల్ల అగ్రభాగాన నల్లటి గుండులాగా ఉండే మందు పోలీసు నెత్తిన పెట్టుకునే టోపీ.అగ్గిపుల్లను అలా గీసే గీయకము���దే భగ్గున మండటం వల్ల పొయ్యి వెలిగించటానికి సిద్ధంగా పెట్టుకొనే అగ్గిపుల్లను పొయ్యి దగ్గర పోలీసు అన్నారు. +==పొయ్యి ప్రక్కన వెన్న ముద్ద పెట్టినట్లు +==పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదు అన్నాడట +==పొరుగింట చూడరా నా పెద్ద చెయ్యి +చాలామందికి ఇంట్లో వండే వంటలకంటే పొరుగింటి వంటలు రుచిగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే ఎవరికైనా తమ స్వంతవారు చేసిన వస్తువులూ, విషయాలకంటే పొరుగువారివి మిన్నగా తోచినపుడు వారిని నిందిస్తూ ఈ సామెతను వాడుతారు. +==పొరుగింటి పొయ్యి మండితే తన పొయ్యిలో నీళ్ళు పోసుకున్నట్లు +పరమ అసూయ పరుల గురించి ఈ సామెత వాడుతారు. +==పొరుగూరి వ్యవసాయం ఇద్దరు భార్యల సంసారం ఒక్కటే +==పొంకణాల పోతురెడ్డికి ముప్పై మూడు దొడ్లు మూడు ఎడ్లు +==పొంగే పాలను వూదరాదు వెలిగే దీపాన్ని ఆర్పరాదు +==పోకముడి విప్పుతూ కోక వెల అడిగినట్లు +==పోనీలెనని పాత చీర ఇస్తే ఇంటెనకాలకెళ్లి మూరేసిందట== +దానమిచ్చిన వస్తువుకు కూడా వంకలు బెట్టే వారికి చెప్పే సామెత ఇది. +''గత జల సేతు బందనము అన్న సంస్కృత సామెతకు అనువాదము ఇది. +==పోయిన మగడు పోయినా పొన్నకాయలాంటి గుండు దొరికిందన్నదట +==పోరాని చోట్లకు పోతే రారాని నిందలు వచ్చినట్లు +==పోరిన పొరుగు దాచిన కుండలు మనవు +==పోరుకు సిద్ధమయితే పోటుకు సిద్ధం అన్నాడట +విరోధము నష్టాన్ని స్నేహం లాబాన్ని కలిగిస్తుందని దీనర్థం. +==పోలీ! పోలీ! నీ భోగమెన్నాళ్ళే అంటే మాఅత్త మాలవాడనుండి వచ్చేదాకా అన్నదట + + +==బంధువుతో అయినా పాలి వ్యవసాయం చేయరాదు +==బంధువులంతా ఒక దిక్కు బావమరిది ఇంకొక దిక్కు +==బంగారు పళ్లానికైనా గోడ వాలు కావలసిందె +ఎంత గొప్పవారికైనా మరొకరితో అవసరము వుంటుందనిచెప్పే సామెత ఇది. +==బట్టలిప్పి నీళ్ళు పోసుకుంటూ బావగారు వచ్చారని సిగ్గుతో చేతులెత్తి నుంచున్నదట +ఒకప్పుడు బడి పంతుళ్లకు జీతాలు అంతంత మాత్రమే: అవి కూడా సకాలంలో వచ్చేవి కావు. అయినా బ్రతడానికి చేతనైన పనిచేసి బ్రతకాలి గనుక వారు బడి పంతులు పనిచేసి బ్రతికే వారు. కాని ఇప్పుడు బడి పంతుళ్లకు మంచి జీతాలున్నాయి. కనుక ఈ సామెతెను తిరగ రాయాలి. అవిదంగా వచ్చిందే ఈ నాటి సామెత: అది బ్రతక నేర్చిన వాడు బడి పంతులు' +బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయంట== +==బతికి చెడినవారితో వుండొచ్చుకానీ చెడి బతికిన వారితో వుండరాదు +==బతికి చెడినవాడ��� బాధలు చూడు చెడి బతికిన వాడి చేష్టలు చూడు +బతికి పట్నం చూడాలి చచ్చి స్వర్గం చూడాలి== +పుట్టిన ఊళ్ళోనే చచ్చిందాకా కూర్చోక దేశంలోని ప్రధానమైన పట్టణాలను చూడాలని, సన్మార్గ వర్తనంతో జీవించి స్వర్గాన్ని చేరాలని బోధిస్తుంది ఈ సామెత. +==బతుకంత భయం లేదు చావంత కష్టం లేదు== +గుట్టుగా చేయవలసిన పనిని బహిరంగంగా నలుగురికీ తెలిసేట్టు అమోదయోగ్యం కాని రీతిలో చేయటం +''చారనా కోడికి బారనా మసాలా లాంటిదే ఈ సామెత. +బతికుంటే ఏపనైనా చేసి బతకొచ్చు. చచ్చి సాధించేదేమి లేదనే అర్థంతో ఈ సామెత వాడాతారు. +బతికుంటే ఎపని చేసైనా బతకొచ్చు: చచ్చినాక చేసేదేమి వుండదని అర్థం. +==బయటొక మాట లోపల యింకో మాట +==బయట తన్ని, యింట్లో కాళ్ళు పట్టుకున్నట్లు +[[చచ్చిన వాడి కండ్లు చారెడు అనే సామెత లాంటిదే ఇదీను. +==బ్రతికితే వైద్యుడు బ్రతుకుతాడు చస్తే బ్రాహ్మణుడు బ్రతుకుతాడు +==బ్రతికిన బ్రతుకు చెప్పుకుందాం, బయట ఎవ్వరూ లేకుండా చూడమన్నాడట +==బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరావు +==బ్రహ్మజ్ఞానుల వారు వచ్చారు, పట్టుబట్టలు జాగ్రత్త అన్నట్లు +==బ్రహ్మ తలిస్తే ఆయుష్షుకు కొదవా? మొగుడు తలిస్తే దెబ్బలకు కొదవా +==బ్రాహ్మణుడి నోరు, ఏనుగు తొండం వూరుకోవు +==బర్రె, దూడ వుండగా గుంజకేలరా గురక రోగం +==బలపం పట్టి భామవొళ్ళో ఓనమాలు దిద్దినట్లు +==బల్లి పడిందని బావ ప్రక్కలో దూరినట్లు +చేసే ప్రయత్నాలు విఫలం అవ్వటమే కాక అప్పటిదాకా అనుభవిస్తున్న కష్టాలకన్నా మరిన్ని కష్టాలు కూడా వచ్చిపడటం.ఒక ఉద్యోగంలో అధికంగా శ్రమిస్తూ అక్కడ తనకు వచ్చే ఆదాయం సరిపోవటంలేదని వేరొకచోట ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని భావించి వెళ్ళినప్పుడు ఆ భావన అంతా ఉత్త భ్రమగా మిగిలి అంతకుముందు ఉద్యోగంలో ఉన్న సుఖము, సంపాదన కూడా కొత్త ఉద్యోగంలో కరవవటం. +==బాపన సేద్యం బత్తెం చేటు కాపుల చదువులు కాసుల చేటు +==బాపని సేద్యం బతకటానికీ రాదు చావటానికీ రాదు +బారు బంగాళాఖాతం, కొంప దివాలా ఖాయం== +పరభాషా పదాలతో సామెత. బార్ ఆంగ్లపదం, దివాలా ఉర్దూ పదం.బ్రాందీ సారా దొరికే బార్‌ ఎప్పుడూ బంగాళాఖాతం లాగా నిండుగానే ఉంటుందనీ ఆ బార్‌లో పడి తాగుతూ ఉంటే ఆ దురలవాటు వల్ల ఆస్తి అంతా నాశనమై దివాలా తియ్యటం జరిగితీరుతుందని హెచ్చరిస్తుంది ఈ సామెత. +==బావా! అంటే, ప్రక్కలోకి రావా! అన్నాడట +==బావా! అని చూడబోతే, రావా? అని కొంగు లాగాడుట +==బావి లోతు ���ెలుస్తుంది గానీ మనసు లోతు తెలియదు +==బాహువుల పందిరిలో అధరాల ఆరాటం అందాల విందుకోసం అన్నట్లు +==బిచ్చగాణ్ణి పొమ్మన్నా, ఉండమన్నా అత్తే చెప్పాలి +==బిచ్చానికి పోయినా బిగువు తగ్గలేదు, దుప్పటి పోయినా పల్లెవాటు తప్పలేదు +==బిడ్డ చచ్చినా ఉయ్యాల మీద తీపి పోలేదు +==బిడ్డలను కన్నమ్మా భిక్షం వేసినమ్మా చెడరు +==బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ +==బీద కూటికి గానీ గుణానికి గారు +==బిందెడు ధనమిచ్చినా బావమరిది లేని సంబంధం వద్దు +ఏడ్చే పిల్లలను వూరుకోబెట్టడానికి జోల పాడతారు. బుగ్గ గిల్లితే ఏడుస్తారు. అలా ఏడిపించి జోల పాడడం వ్వర్థం. ఉపయోగం లేని పని చేయడం +==బుధవారం పుట్టిన ఎద్దు భూమిని దున్నినా, త్రొక్కినా భూమి పొర్లి పొర్లి పండుతుంది +==బుద్ధి భూమినేలుతూంటే రాత గాడిదలు కాస్తోంది +==బుద్ధుంటే బువ్వ తింటావు లేకుంటే గడ్డి తింటావు +==బూడిదను నాకే కుక్కను పిండికి కాపుంచకూడదు== +==బెల్లం ఉన్నంతసేపే ఈగలు సిరి వున్నంతసేపే బలగం +==బెల్లం వండిన పొయ్యి ఇంగువ కట్టిన గుడ్డ +==బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరావు== +ముదిరిన బెండకాయను కూరకు పనికిరాదని ఎవరూ కొనరు. అలాగే వయసు ముదిరిన బ్రహ్మచారికి ఎవ్వరూ పిల్లను ఇవ్వరని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు. +సంపదలు కలిగినప్పుడే బంధువులు వస్తారని దీని అర్థం. +==బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడట== +బొంకు అంటే అబద్ధం. అబద్ధం చెప్పినా, అతికినట్లుగా, గోడ కట్టినట్లుగా ఉండాలి అని అంటారు. వినేవారిని ఇట్టే నమ్మించేటట్లు ఉండాలి. కానీ ఇలా మిరియాలు తాటికాయలంత ఉంటాయి అని అంటే ఎవరూ నమ్మరు. తప్పు పని చెయ్యడం చేతకానివాడి చేత ఆ పని చేయించబోయినపుడు, వాడా పని సరిగా చెయ్యలేడు. ఆ సందర్భంలో ఈ సామెత వాడుతారు. +==బోగందాని చళ్ళకూ, సంతలో సొరకాయలుకూ గోటిగాట్లు ఎక్కువ +==బోడి గుండుకి మోకలికి ముడి వేసె రకం== +చేయ లేని పనిని చేసి నట్టుచెప్పినప్పుడు ఈ సామెతను వాడుతారు. +==బోడి గుండంత సుఖం లేదు ఊరుకున్నంత ఉత్తమం లేదు +భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంట== + + +==భక్తి వచ్చినా, పగ వచ్చినా పట్టలేరు +==భక్తి లేని పూజ పత్రి చేటు +==భయమైనా ఉండాలి భక్తి అయినా ఉండాలి== +==భరణి ఎండలకు బండలు రోహిణి ఎండలకు రోళ్ళు పగులుతాయి== +==భరణిలో చల్లితే కాయకు చిప్పెడు పంట== +==భర్త లోకం తన లోకం ���ొడుకు లోకం పరలోకం== +==భాషకు తగిన వేషం ఈడుకు తగిన ఆచారం +==భోజనానికి వద్దంటే పట్టుచీర కట్టుకుని వస్తానన్నట్లు +==భోజనానికి పిలిస్తే రాకుండా దొడ్డిదారిన వచ్చి రోలు నాకినట్లు +==భోజునివంటి రాజుంటే కాళిదాసువంటి కవీ వుంటాడు + + +ఈ పేజీలో కేవలం పాఠ్యము మాత్రమే ఉన్నది. దీన్ని విజ్ఞానసర్వస్వపు వ్యాసంగా తీర్చిదిద్దటానికి వీలైతే అలా చేసి, ఈ మూసను తొలగించండి. లేకపోతే, ఈ వ్యాసాన్ని వికీకోట్ (వికీవ్యాఖ్య) కు తరలించాలి. + + + +==మంగలిని చూచి ఎద్దు కాలు కుంటినట్లు +పూర్వ కాలం మంగలి వాళ్లు పల్లె వాసులకు గోళ్లు తీసేవారు: అలాగే కాలిలో ముల్లు గుచ్చుకుని విరిగితే దాన్ని కూడా తీసేవారు. ఆ విధంగా ఒక ఎద్దు మంగలిని చూసి తన కేదో ముల్లు గుచ్చు కున్నట్టు నటించిందట కుంటుతూ: +==మంగలి వాడి దృష్టి అందరి జుట్టుమీదే +==మంగలివాని యింటివెనుక దిబ్బ తవ్వినకొద్దీ వచ్చేది బొచ్చే +==మంచం మీద వున్నంతసేపే మగడు కిందికి దిగితే యముడు +==మంచం వేసేంతవరకే ఇద్దరం మంచం ఎక్కాక ఒక్కరవుదాం అందట +==మంచమంతా మదన రాజ్యమే నడచిరారా ఏలుకుందాం అందట +==మంచి ఆలి కొక మాట మంచి ఎద్దు కొక వాత +==మంచి గొడ్డుకొక దెబ్బ మంచి మనిషికొక మాట +==మంచి మాటకు మంది అంతా మనవాళ్ళు +==మంచివాడు మంచివాడు అంటే యిల్లంతా నాశనం చేశాడట +==మంత్రం లేని తీర్థం మరి బక్కెడు== +==మంత్రం లేని సంధ్యకు మరి చెంబుడు నీళ్ళు +==మంత్రంలో పస లేకపోయినా తుంపర్లకు కొదవలేదు +==మంత్రసాని పనికి ఒప్పుకొన్నాక ఏది వచ్చినా పట్టాలి +మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు== +మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంట== +==మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి తూలుతున్నడు== +==మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి== +==మందికి నీతి చెప్పాను కానీ నీకూ నాకూ కాదు అన్నాడట +ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు వున్నాయని చెప్పే సామెత ఇది +==మందిని మ్రింగే యిల్లుండాలి గానీ ఇంటిని మ్రింగే మంది ఉండరాదు +మనకి లేదు అని ఏడిస్తే ఒక కన్ను పోయిందంటా ఎదుటి వాడికి ఉందీ అని ఏడిస్తే రెండో కన్ను పోయిందంటా +మంచి వాణ్ణి డబ్బిచ్చైనా కొనుక్కోవాలి, చెడ్డవాణ్ణి డబ్బిచ్చి వదిలించు కోవాలి +మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి== +మంత్రాలు పనిచేస్తాయనేది ఒట్టి మూడ నమ్మకమని దీని అర్థ���: మంత్రాలకు చింత కాయలు రాలవు. ఇంత చిన్న పని కూడా చేయలేని మంత్రాలు ఇంకేం పని చేయగలవు. +భోజనాల సమయంలో వచ్చిన అతిథులకు సరిపడా వంట కాలుంటాయి. అను కోకుండా అంతకన్నా ఎక్కువ మంది వస్తే ఉన్న మజ్జిగలో ఇంకో రెండు చెంబుల నీళ్లు పోస్తారు అందరికి సరిపోవడానికి. ఆ విధంగా మందెక్కువయితే మజ్జిగ పలచనవుతుంది. ఆ సందర్భంగా పుట్టినదే ఈ సామెత. +మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట== +అసలుకే లేదురా మొగుడా అంటే పెసర పప్పు వండ మన్నాడట. అలాంటిదే ఈ సామెత కూడ +==మగడు విడిచిన ముండ మబ్బు విడిచిన ఎండ +==మగని చుట్టాలు చెప్పులు ముంగిట్లో విడిస్తే ఆలి చుట్టాలు వంటింట్లో విడుస్తారు +==మగనికి మాడు చెక్కలు మిండడికి పంచభోజ్యాలు +==మగ్గం చేసిన తప్పు సాలె తీర్చాలి== +ఏపనిలో తప్పు జరిగితే ఆ పనిలో నేర్పు ఉన్నవారు మాత్రమే సరి చేయగలరు. వేరెవ్వరు చేయలేరు ఆ సందర్భంగా ఈ సామెతను వాడతారు. +==మఘ ఉరిమితే మదురు మీద కర్ర అయినా పండుతుంది +==మట్టెల చప్పుడే కానీ చేసే పనేమీ లేదు +==మడికి గట్టు, యింటికి గుట్టు, మాటకు మంచి కావాలి +==మతము తలకు ఎక్కితె బుద్ది పదాలకు దిగులు +==మద్దెల పోయి రోలుతో మొర పెట్టుకున్నట్లు +మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి +తప్పు మన దగ్గర పెట్టుకొని ఇతరులను నిందించ తగదు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత. +==మన బంగారం మంచిదయితే కంసాలిని వన్నె అడగడం దేనికి +==మన్మథ రాజ్యంలో ముద్దుల మద్దెల మోతలే వుంటాయన్నట్లు +ఏపనికైనా మనసు లగ్నము చేసి పని చేయాలని అర్థం. +==మనసు మనువు కేడిస్తే వీపు దెబ్బల కేడ్చిందట +==మనసు మహామేరువు దాటుతుంది కాలు కందకం దాటదు +==మనసులో ఏముంటే సోదిలో అదే వస్తుంది +==మనసు కుదిరితే మల్లి కుదరకుంటే ఎల్లి +==మనసైన అమ్మాయి నవ్వు మన్మథుని శరమైన పువ్వన్నట్లు +==మనసైన చినదాని చూపు కోటి కోర్కెల పిలుపు +==మనిషికి ఉన్నది పుష్టి గొడ్డుకు తిన్నది పుష్టి +==మనిషికి కాక మానులకు వస్తాయా కష్టాలు +మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు== +మనిషి బయటకు ఎలా కనబడుతున్నా లోన అతని అంతరంగం ఎలా ఉంటుందో బయటకు తెలియదు. అలాగే మానుకు లోన ఎంత చేవ ఉన్నదో బయటకు తెలియదు. +మనిషి తెలివున్న వాడు వానికి మాటలు అర్థం అవుతాయి. పశువుకు మాటలు రావు. తెలివి లేదు. దానికి ఒక దెబ్బ వేస్తే అది చెప్పిన మాట వింటుంది. ఆ విధంగా ఈ సామెతను వాడు తారు. +==మనుగుడుపుల అల్లుడూ చెరకు తోటలో ���నుగూ ఒక్కటే +==మనువాడిన తర్వాతే అందాల విందులు అందిట +==మన్ను పడితే బంగారం బంగారం పడితే మన్ను +మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలక బోసుకున్నట్లు== +అత్యాశకు పోతే మిగిలేదేమి ఉండదని చెప్పే సామెత ఇది. +==మరదలి సరసం మొగలి పువ్వుల వాసన వంటిది +==మర్రి చెట్టు కింద మొక్క మొలవదు +==మృగశిర కురిస్తే ముసలి ఎద్దు రంకె వేస్తుంది +==మృగశిరలో వేసిన పైరు, మీసాలు రావడంతో పుట్టిన కొడుకు మేలు +==మరో లోకానికి వెళ్ళినా మారుటి తల్లి వద్దు +==మల్లెల జ్వరానికి అందాల గంధమే మందు అన్నట్లు +==మల్లెల మంచం మీదే మన్మథ లంచం అన్నదట +==మల్లెల వేళలో వయసు సొగసుల విందు లన్నట్లు +==మసి పూసి మారేడు కాయ చేసినట్లు +మోసము చేసే వారి గురించి ఈ సామెతను చెప్తారు +==మసి మొగంగాడూ, చమురు కాళ్ళవాడూ జతకలిసినట్లు +==మహారాజని మనవి చేసుకుంటే, మరి రెండు తగిలించమన్నాడట +==మహా వ్యసనాలుంటే గానీ మహాత్ములు కాలేదన్నట్లు +==మాంసం తింటున్నామని ఎముకలు మెళ్ళో వేసుకుంటామా +==మాంసం తినేవాడు పోతే ఎముకలు కొరికే వాడు వస్తాడు +==మా ఆయనే ఉంటే మంగలి వాణ్ణయినా పిలుచుకొని వచ్చేవాడు అన్నదట +అమాయకపు స్త్రీల గురించి ఈ సామెత చెప్తారు. వివరణ. పూర్వం మగడు చనిపోయిన స్త్రీలు గుండు గీయించుకునే వారు. ఆ విధంగా ఒక విధవ స్త్రీ గుండు గీయించు కోడానికి మంగలిని పిలవాలని చూసి చూసి ఎవరు దొరకలేదట అప్పుడు తన మగడు ఉండుంటే మంగలిని పిలుచుక వచ్చే వాడు గదా అని వాపోయిందట. మగడు వుంటే గుండు గీయించుకో నవసరము లేదనే జ్ఞానం ఆమెకు లేది. +==మా ఇంటి కొస్తే ఏం తెస్తావు? మీ ఇంటి కొస్తే ఏం పెడ్తావు +అంతా ఎదుటి వారినుండి రాబట్టడమే గాని తననుంచి ఏమి ఇవ్వని వారి గురించి ఈ సామెత పుట్టింది +==మా గేదె చస్తే చచ్చిందిగానీ ఎదురింటి గేదె పాలివ్వకపోతే చాలు +ఇతరులకు కష్టాలు రావాలనే వారి నుద్దేశించి ఈ సామెత పుట్టింది +==మాఘమాసపు చలి మంటలో పడ్డా తీరదు +==మాఘమాసపు వాన మగడు లేని జాణ +మాఘ మాసంలో చలి అత్యధికంగా వుంటుందని ఈ సామెతకు అర్థము. +మాచకమ్మ అనగా మీసాలున్న స్త్రీ అని అర్థము. అన సౌందర్యవతి కాదని అర్థము. +==మాటకు మాట తెగులు నీటికి నాచు తెగులు +==మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి +==మాటకు ముందు ఏడ్చేవాడిని నవ్వే ఆడదానిని నమ్మరాదు +హరిశ్చంద్రుడిలాగా అబద్దం చెప్పని వాడని అర్థము. +==మాట గొప్ప చెప్ప మాటలు చాలవు +==మాట పోయాక ప్రాణం వున్నా ఒకటే పోయినా ఒకటే +నిజాయితీగా వుండే వారు మాటకు ప్రాణంకన్న విలువిస్తారని ఈ సామెతకు అర్థము. +==మాటల పసేగానీ చేతల పస లేదు +మాటలు ఎక్కువ పని తక్కువ చేసే వారి గురించి ఈ సామెతను వాడుతారు +==మాటలు కోటలు దాటుతాయ్‌ కాళ్ళు గడప దాటవు +==మాటలు చెప్పే మొనగాళ్లేగానీ బత్తెమిచ్చే పుణ్యాత్ములు లేరు +==మాటలు నేర్చిన కుక్కల్ని వేటకు తీసుకెళితే యిస్కో అంటే యిస్కో అన్నాయట +==మాటలు, పాటలు మాయింట్లో, మాపటి భోజనం మీ యింట్లో +==మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు== +కొంతమంది వారి తాతలు, ముత్తాతలు, తండ్రుల గూర్చి లేనిపొని గొప్పలు చెబుతారు, కాని ప్రస్తుతం వారేమి చేస్తున్నారో చెప్పారు. వాళ్ళ తాతలు చేసిన గొప్ప పనులకు వీళ్ళని పొగడాలని వీరి కోరిక. అటువంటివారిని ఎవరూ మెచ్చరు. అలాంటివారిని ఉద్దేశించి చెప్పినదే ఈ సామెత. +==మానం పోయిన తర్వాత ప్రాణం ఎందుకు +==మాపటికి మనసు రేపటికి సొగసు అన్నట్లు +==మాపటేళ ఆకలి, పెదవుల దాహం తీరవన్నట్లు +మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు== +తన వారి గురించి లేని పోని గొప్పలు చెప్పుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది. +మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటనట్లు== +లేని పోని గొప్పలు చెప్పుకునే వారిని బట్టి ఈ సామెత పుట్టింది. +==మాటలు కోటలు దాటుతాయి కాని చేతలు గడప దాటవు== +ప్రగల్భాలు పలికే వారిని గురించి ఈ సామెతను వాడతారు. +==మాతాకబళం తల్లా అంటే మా ఆయనెక్కడైనా కనిపించాడా అన్నదట ఆ ఇల్లాలు +అత్యంత చమత్కార వంతమైన ఈ సామెతకు కొంత వివరణ కావాలి. అదేమంటే ఒక బిచ్చగాడు ఒకరి ఇంటి ముందు నిలబడి మాదాకవళం తల్లా అన్నాడట. దానికి ఆ ఇల్లాలు అతనితో మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడా అని బదులిచ్చింది. దానికి ఆ బిచ్చగాడు కనిపిస్తే పంపిస్తాలే తల్లీ అని అక్కడి నుండి వెళ్లి పోతాడు. ఆ ఇల్లాలి మాటలోని మర్మం బిచ్చగానికి బాగా అర్థం అయింది. ఆ ఇల్లాలు తన గుట్టును విప్పిచెప్పకుండా చెప్పిన సమాధానం ఎంతో చమత్కార వంతమైనది. అసలు విషయం ఏమంటే ఆ ఇల్లాలు భర్త కూడా బిచ్చగాడే. అతను బిచ్చం తెస్తేగాని ఇంట్లో తినడానికి ఏమి లేదు. ఆమె అన్న ఆమాటతో పరిస్థితి అర్థమైన ఆ బిచ్చగాడు +సరైన సమాధానం చెప్పి వెళ్లి పోతాడు. +==మామ బంతిన కూర్చుని అత్త బంతిన లేచినట్లు +అత్తా ఒకింటి కోడలే అన్న సామెత లాంటిదే ఇదీను +==మామిళ్ళకు మంచు చెరుపు కొబ్బరికి కుడితి చెరుపు +మార్గసిరలో సూర్యుడు తొందరగా అస్తమిస్తాడని అర్థము పగటి సమయం తక్కువ) +==మాల బడాయి పాటి మీద మొగుడి బడాయి ఆలి మీద +==మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె== +తినటానికి తిండి లేనపుడు మీసాలకి సంపెంగ నూనె కావాలనడం వినేవారికి హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే ఉన్నదానితో సంతృప్తి పడక అతిగా ఆశ పడే వారిని ఈ సామెతతో పోలుస్తారు. +పని చేతకాక పోతే తనకు చేతకాదని ఒప్పుకోడానికి అహం అడ్డు వస్తుంది. అందుకని ఏదో సాకు చెప్పి తప్పించుకుంటారు. అంతే గాని వారి అసమర్థతను బయట పెట్టరు. అలాంటి వారికి ఈ సామెత. ఇదే అర్థంతో మరొక సామెత ఉంది. అది ఆడ లేక మద్దెల ఓడు అన్నాడట" +==మిండలను మరిగినమ్మా, మీగడ తిన్నమ్మా ఊరుకోరు +==మిధునంలో పుట్టిన మొక్కా, మీసకట్టుతో పుట్టినకొడుకూ అక్కర కొస్తారు +==మీ ఇంట్లో తిని మా యింట్లో చేయి కడుగమన్నట్లు +==మీఊరు మాఊరికెంత దూరమో మాఊరు మీవూరికంతేదూరం== +అంతా ఒకటే ఆనే అర్థంలో చెప్పే సామెత ఇది. ఇలాంటిదే మరొక సామెత కూడా ఉంది. అది ఈ గుడ్డ ముక్క కూడ ఆ తాను లోనిదే ఈ పేడు కూడ ఆ మొద్దులోనిదే +ముంజేతి కంకణం అద్దం లేకుండానే మామూలుగా చూసు కోవచ్చు. అనవసరమైన పని చేయకూడదని అర్థం. +==ముండ మొయ్యవచ్చు గానీ నింద మొయ్యరాదు +==ముడ్డి తనది కాక పోతే గోదావరి దాక డేక మన్నాడట== +ఇతరులు కష్ట పడు తుంటే చూసి ఆనందించే వాళ్ల గురించి ఈ సామెత పుట్టింది. +==ముడ్డి తనది కాకపోతే తాడికి ఎదురు దేకమన్నాడట== +ఇతరులు కష్ట పడు తుంటే చూసి ఆనందించే వాళ్ల గురించి ఈ సామెత పుట్టింది. +==ముందు ఆకు తెచ్చుకుంటే ఎప్పుడైనా తినవచ్చు +==ముందుకు పోతే మురికి ముండ వెనుకకు పోతే వెర్రి ముండ +ఎటు పోవడానికి దారి లేదని అర్థం. అన్ని దారులు మూసుకపోయాయని దీని అర్థం. +ఇది ఎంత మాత్రము మొసళ్ళ పండగ కాదు. not crocodile +ముసలం అంటే రోకలి అని అర్థం. +రోకళ్ళ పండగ ముందు ఉంది అని అర్థం. +==ముందూ నడిచే ముతరాచువాణ్ణీ వెనుకనడిచే ఏనాది వాడినీ నమ్మరాదు +==ముందు పెళ్ళాం బిడ్డలు మెతుకులేక ఏడుస్తుంటే ఉంచుకున్నదానికి పిల్లలులేరని పూజలు చేసాట్ట +==ముందు మురవబోకురా ముతరాచు వాడా అన్నట్లు +==ముందు మూడుముళ్ళ ముచ్చట తర్వాత సోయగాల జాతర అందట +==ముందు వాళ్ళకు మూకుళ్ళు వెనుక వాళ్ళకు నాకుళ్ళు +ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి== +దూడలకు పుట్టి నప్పుడే చెవులు ఉంటాయి. ఆ తర్వాతనే కొమ్ములు మొలుస్తాయి. కాని చెవులకన్నా ఆ తర్వాత వచ్చిన కొమ్ములు వా���ిగా ఉంటాయి. +==ముక్కు ఉండేంత వరకే పడిశ ముంటుంది +==ముక్కు ఏదంటే తల చుట్టూ త్రిప్పి చూపినట్లు +==ముక్కు కోసినా మొదటి మొగడే మేలు +==ముక్కులో ఏ వేలు పెట్టినా సరిపోతుంది +==ముక్కులో చీమిడుందంటే, నీ చేత్తోనే తీయమన్నట్లు +==ముఖంలో సుఖంలేదు మోకాళ్ళలో బిగువు లేదు +==ముగ్గురికి తెలిస్తే మూడు లోకాలకు ప్రాకుతుంది +ఏదైనా రహస్యం ఇద్దరి మద్యలోనే వుండాలని అర్థం. మూడో వానికి తెలిస్తే అందరికి తెలిసిపోతుందని ఈ సామెతకు అర్థము +==ముడ్డి గిల్లి జోల పాడటమంటే ఇదే== +==ముడ్డిక్రిందకు నీళ్ళు వస్తే కానీ లేవరు +==ముడ్డి మీద తన్నితే మూతి పళ్లు రాలాయట== +==ముత్యపుచిప్పలన్నీ ఒక చోట నత్తగుల్లలన్నీ ఒకచోట +==ముత్యమంత పదునుంటే మూల కార్తెలో చల్లినా ఉలవచేను పండుతుంది +==ముద్దంటే ఒకింత మత్తు ఒద్దంటే మరింత కోపం +==ముద్దుగుమ్మ కౌగిలింత నిద్రరాని ఆవులింత అన్నట్లు +==ముద్దున పేరు, మురిపాన నడక చెడతాయి +==ముద్దూ, మురిపెం మావంతు ముడ్డీ, దొడ్డీ మీవంతు +అవకాశం ఉన్నప్పుడే పనులు చక్కబెట్టుకోవాలని ఈ సామెత అర్థం. +మునిగి పోయే వాడికి గడ్డి పోచ దొరికినట్లు== +ప్రమాదంలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ఎంత చిన్న సాయమైనా ఆశిస్తారు. ఆ సందర్భంలో పుట్టినది ఈ సామెత. +==మునిగే వాడికి తెలుసు నీటి లోతు +==ముప్పొద్దు తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదు +==మురిపాలు, ముచ్చట్లు అంటే ముసుగు పెడతాడన్నట్లు +==మురిపెం తిరిపెం చేటు ముసలి మొగుడు మంచానికి చేటు +==ముల్లు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముల్లు మీద పడ్డా అరిటాకుకే నష్టం +ఎటు తిరిగి తనకే నష్టం కలిగే పనుల మాటల గురించి ఈ సామెత పుట్టింది +==ముళ్ళు వేయటం చేతగాదుగానీ కోక ముడి విప్పనా అంటాడట పాపం +ఏవయసులో చేయాల్చిన పనులు ఆ వయసులోనే చేయాలని లేకుంటే నవ్వుల పాలవుతారని చెప్పే సామెత ఇది. +==ముసలివాళ్ళ మాట ముళ్ళు లేని బాట +పెద్దల మాట సద్దికూటి మూట అనే సామెత లాంటిదే ఈ సామెత. +ముహూర్తం చూసుకుని యాత్రకు బయల్దేరితే ముందరి మొగుడు ఎదురు వచ్చాడట== +చింతామణి పాత్రను వెయ్యడానికి నవనవలాడుతూ నాజూకుగా ఉండి యవ్వన ప్రారంభ దశలో ఉన్న స్త్రీలే అర్హులౌతారు. అలాకాక వయసు ఉడిగి, ముసలితనం ముఖంలో స్పష్టంగా కనిపించేవారు చింతామణి పాత్ర వేస్తే ప్రేక్షకులకు చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏ సమయానికి ఏ వయసుకు తగిన పనిని వారుచేయాలికానీ, వేరొకరు చేస్తే బాగుండదు. కొంతమంది ఏ ���నికైనా తామేనంటూ ముందుకు వస్తారు. అలా వచ్చేవారు ఆ పనిని తాము చేసినందువల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోవడం అవసరమని ఈ సామెత +ఎదుటివారికి కోపం తెప్పించే వారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు +==మూట పోతే పోయింది మాట పోరాదు +==మూడు కొప్పులు కూడితే పట్టపగలే చుక్కలు పొడుస్తాయి +==మూడు కొప్పులు ఏకమైతే ముల్లోకాలూ ఏకమౌతాయి +==మూడు పువ్వులు ఆరు కాయల్లా వెలిగిపోతున్నట్లు +==మూడు నెలలు సాముచేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్లు +==మూతి ముద్దుల కేడిస్తే వీపు గుద్దుల కేడుస్తుంది +==మూచ్చూడను ముక్కాలు దుడ్డు లేదు ముండను చూస్తే దుఖం వస్తుందట== +మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు +మూరెడు పోనేల బారెడు కుంగనేల?సరైన అంచనాలు లేకుండా ముందుకు వెళ్తే బాధపడతారు +అసలే జబ్బుపడి మూలుగుతున్న నక్కమీద తాటిపండు పడితే దాని బాధ అధికమౌతుంది. ఇదే విధంగా బాధలతో సతమతమౌతున్న వ్యక్తి మీద మరిన్ని బాధలు పడ్డప్పుడు అతని పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు . +==మూసి పెడితే పాసి పోయి నట్లు== +అనుభవించక దాచి పెట్టి దొంగల పాలు చేసే వారినుద్దేశించి ఈ సామెత వాడుతారు. +మెడలో వేసుకున్న పాము ఎప్పటికైనా కరవక మానదు +పరుగెత్తే వాడిని చూస్తే తరమాలనిపిస్తుంది అనే సామెత లాంటితే ఈ సామెత +[[యాదృశం ముఖం తాదృశీ చపేటికా సంస్కృతన్యాయములు +ముఖమును బట్టియే చెంపకాయ మెత్తని చెప్పుతో కొట్టుము" అని సామెత. +పై మెరుగులు చూసి మోస పోవద్దని అర్థం> +==మెరుపు దీపం కాదు మబ్బు గొడుగు కాదు +పైకి మంచిగా నటిస్తూ లోన మొసపూరిత బుద్ధి గల వారిని గురించి ఈ సామెత చెప్తారు. +==మేత కరణంగానీ కూత కరణం కాదు +తినడం తప్ప పని చేయడని అర్థం. అలాంటి వారినుద్దేశించి ఈ సామెత పుట్టింది +తిండికి ముందు పనికి వెనుక వుండే వారినుద్దేశించి ఈ సామెత పుట్టింది. +==మొండికి సిగ్గులేదు మొరడుకు గాలి లేదు +==మొండిచేతి వానికి నువ్వులు తినటం నేర్పినట్లు +యాచకుల్లో ఒక రకమైన వారున్నారు. వారు రక్త సిక్తమైన తమ పసి బిడ్డను చేటలో పెట్టుకొని ఒకరి ఇంటి ముందు పెట్టి మగ వాడు పెద్ద కొరడాతో తనను తాను కొట్టుకుంటూ భయంకరంగా అరుస్తూ ఉండగా ఒక స్త్రీ ఒక వాయిద్యాన్ని భయంకరంగా వాయిస్తూ వుంటుంది. ఆ ఇంటి వారు బిచ్చం పెట్టునంత వరకు వారు అలా భయంకరమైన నృత్యాన్ని చేస్తూనే ఉంటారు. వారి భయంకర కృత్యాలను భరించ లేక ఆ ఇంటి వ���రు తప్పక బిచ్చం వేస్తారు. అలా వారికి ప్రతి ఇంటి వారు బిచ్చం వేస్తారు. ఆలా వారు బిచ్చం వేయనిదే కదిలి వెళ్ళరు. దీని నుండి పుట్టినదే ఈ సామెత. +వెతకబోయిన తీగ కాళ్ళకు అడ్డం పడ్డట్టి అనే సామెత లాంటిదే ఈ సామెత +మొక్కగా ఉన్నప్పుడు వంచితే ఏ మొక్కైనా మనకు కావలసిన రీతిలో వంగుతుంది. అదే మొక్క పెరిగి పెద్ద వృక్షమయ్యాక వంచాలని ప్రయత్నిస్తే అది వంగదు. ఆదే విధంగా పిల్లలను బాల్యంలోనే కావలసిన రీతిలో తీర్చిదిద్దుకోవాలి. వారు పెరిగి పెద్దవారైనాక వారి అలవాట్లు, పధ్ధతులు మార్చలేమని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు. +==మొగమోటానికి పోతే ముండకు కడుపు వచ్చిందట== +ఏ విషయంలోనైనా మొగమోటము పనికి రాదని చెప్పే సామెత ఇది. వివరణ: కొండంత రెడ్డి కొంగు పట్టుకున్నాడట పాపం ఆమె మొగమోటానికి పోయి సరే నన్నది. దాంతో కడుపు వచ్చింది. మొగమోటానికి పోయినందుకు కలిగిన కష్టం. +==మొగబుద్ధి మోటబుద్ధి ఆడబుద్ధి అపర బుద్ధి +==మొగుడికి దిండు వుంచుకున్న వాడికి దేహం +==మొగుడికే మగతనం ఉంటే పొరుగింటాయనతో పనేంటి? అందిట +==మొగుడితో పెళ్ళికీ, పిల్లలతో తీర్థానికీ వెళ్ళరాదు +మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు== +భార్య భర్తల మధ్యన ఎన్నో గొడవలుంటాయి. తిట్టు కుంటారు, కొట్టు కుంటారు. ఆ తర్వాత కొంతసేపటికే ఒక్కటవుతారు. ఇది సహజం. కాని ఈ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇతరులు చూస్తుండగా జరగ రాదు. ఆ వ్యవహారం ఇంటిగుట్టు. ఇతరులు చూస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఆ సందర్భంగా పుట్టినదే ఈ సామెత. తన మొగుడు తనను కొట్టుతుండగా తోడికోడలు చూస్తే ఆ అవమానం భరించ రానిది. అందుకే మొగుడు తనను కొట్టినందుకు కాదు, దీన్ని తన తోటి కోడలు చూసి నవ్వినందుకు బాధ ఎక్కువ. +==మొగుడు కొద్దీ వన్నెలు సిరి కొద్దీ చిన్నెలు +మొగుడు పోయి తానేడుస్తుంటే ఉంచుకున్నవాడు ఊటీవెడదాం అన్నాడట== +==మొగుడే ముండా అంటే ముష్టికి వచ్చినవాడూ ముండా అంటాడు +==మొదటి దానికి మొగుడులేడు కడదానికి శోభనమట +==మొదటి ముద్దుకే మూతి పళ్ళు రాలినట్లు +మొదటి దానికి మొగుడు లేడు కాని, కడదానికి కళ్యాణము అన్నట్లు== +మొదలు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు== +==మొదటే కోతి, పైగా కల్లు తాగింది, ఆపై నిప్పులు త్రొక్కింది +మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి జేబులో పెట్టుకున్నాడుట== +మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు== +మోకాలికి బోడి ���ుండుకు ముడి వేయడం అసాద్యం. అలా చేశానన్నాడంటే అది అబద్దమని అర్థం. +==మోటువాడికి మొగలిపువ్విస్తే మడిచి ముడ్డిలో పెట్టుకున్నాడట +==మోచేతి దెబ్బ మొగుడి కాపురం ఒకటి +ఎన్నో బరువు బాధ్యతలు మోసే వారిని చూసి ఎదుటివారు తేలికగా తీసుకునే సందర్భంలో ఈ సామెత వాడతాం. కావిడి మోసే వాడికే దాని బరువు తెలిసినట్లు బాధ్యతలని మోసేవాడికే వాటి బరువు తెలుస్తుంది. చూసేవాడికి అది అనుభవంలోకి రాదు. +సాధారణంగా మనం నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో మౌనంగా ఉంటాం. అంటే ఆ విషయాన్ని మనం పూర్తిగా తిరస్కరించినట్టూ కాదు, అంగీకరించినట్టూ కాదు. అందుకీ మౌనంగా ఉంటే దానిని ఎదుటివారు అర్ధాంగీకారంగా భావిస్తారు. +కలహాలకు కారణము వాగ్వివాదము. అసలు మాట్లాడకుంటే వివాదమే లేదు. దీనినే ఊరకుండు వాడు ఉత్తమోత్తముడయా అని అన్నారు. + + +నిజం మాట్లాడితే నిష్టూరం అనే సామెత లాంటిదే ఇదీనూ. +==యథా పతీ తథా సతీ అన్నట్లు +రాజు ఎలా వుంటాడో ప్రజలు కూడా అలాగే వుంటారు అని అర్థం. అనగా పాలకులు ఎలా వుంటారో ప్రజలు కూడా అలాగే వుంటారని అర్థం. +ఎద్దుకున్న పుండును పొడుస్తూ కాకి ఆనంద పడుతుంది. కాని అది ఎద్దుకు చాల బాదాకరమైన విషయము. అలా ఒకరి కష్టాలను చూసి ఆనంద పడేవారినుద్దేశించి ఈ సామెతను చెప్పతారు. +==యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు== +==యోగికీ, రోగికీ, భోగికీ నిద్ర వుండదు + + +==రంగడికీ రంగికిస్నేహం లుంగీకి లంగా కిబంధం +==రతిలో సిగ్గు రణములో భీతి కొరగావు +==రసదెబ్బ తగలినిదే రంకు పుండు మానదు +==రహస్యం ఏమిటంటే, వడ్లగింజలోనిది బియ్యపుగింజ అన్నట్లు +రహస్యం ఏదైనా వుంటే అనగా విషయం తెలియకుంటే అందులో ఏదో వుందని బ్రమపడతారు. అసలు విషయము తెలిశాక ఇంతేనా అని అనిపిస్తుంది. +==రాగల శని రామేశ్వరం వెళ్ళినా తప్పదు +==రాగం తీయనివాడు, రోగం రానివాడు లేడు +==రాగంలేని భోగం, త్యాగం లేని మనస్సు== +ఎంతగా భోగాలను అనుభవిస్తున్నా బంధుమిత్రుల అనురాగం లేకపోతే ఆనందమే ఉండదు.ఎలాంటి త్యాగమూ లేకుండా జీవితం గడుస్తూ ఉంటే మనస్సుకు ఆనందం ఉండదని +పాత వాసనలు మరవలేని వారి గురించి +==రాజు కొడుకైనా కావాలి సానిదాని తమ్ముడైనా కావాలి +==రాజుగారి పెద్ద భార్య పతివ్రత అన్నట్లు +==రాజుగారు వస్తున్నారంటే, పెళ్ళాంవంక అనుమానంగా చూసినట్లు +రాజు తలుచుకొంటే ఏమైనా చేస్తాడు అని అర్థం, అలాగే ఉన్నవాడు తలుచు కుంటే కూడ��� ఎమైనా చేస్తాడు అని అర్థము +రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే, మొత్తబుద్ది అవుతుంది== +==రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుంది== +సమాజంలో సత్యం, ధర్మం నిరంతరం ఉండాలని.కరవుకాటకాలు దేశంలో ప్రబలుతున్నప్పుడు దానికి కారణం దేశాన్ని ఏలే నేతల అధర్మ ప్రవర్తనేనని.రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలానే ఉంటారు.అంతా అధర్మంతో ఉన్నప్పుడు భూమి కూడా ప్రజలకు సాయం చేయదని, సారం కోల్పోతుంది కనుక దేశనేతలు ధర్మాన్ని తప్పకూడదని హెచ్చరిక. +రాజుల సొమ్ము రాళ్ళ పాలు,దొరల సొమ్ము దొంగల పాలు== +రాజుల సొమ్ము రాళ్ళ పాలు,బలిజల సొమ్ము భోగాల పాలు +పూర్వం రాజవంశీయులు మనదేశంలో తమ ధనాన్ని ఎక్కువగా రాళ్ళు (అనగా రత్నాలు) కొనుగోలుకు ఖర్చు చేసేవారు. ఈ వజ్రాలు, రత్నాలు క్రయ విక్రయాలు చేసేవారు రత్న బలిజలు అనే వారు. వీరు బలిజలు లేదా వణిజులలో అత్యంత శ్రేష్ఠులు, ధనికులు. వీరు రత్నాలను రాజులకు ధనికులకు విక్రయించి మంచి ధనాన్ని గడించేవారు. ఆ ధనంతో అపారమైన భోగాలు విలాసాలు అనుభవించేవారు. ప్రజలనుండి పన్నులరూపంలో వసూలుచేసిన సొమ్ములు రాజులు ప్రజావసరాలకు ఖర్చు చేయకుండా తమ విలాసాలకు రత్నాలు కొనుగోలు చేయడానికి ఖర్చు చేసేవారు. ఆ రత్నాలు అమ్మి సొమ్ములు గడించే రత్న బలిజలు ఆ సొమ్ములతో ప్రజావసరాలకు ఉపయోగించకుండా రకరకాల భోగాలు అనుభవించేవారు. కడకి ఎవరికీ సొమ్ములు మిగిలేవి కావు. అందుకే రాజుల సొమ్ము రాళ్ళపాలు బలిజల సొమ్ము భోగాల పాలు అని ప్రజలు చెప్పుకునేవారని, అందుకే ఈ సామెత పుట్టిందని గోదావరి జిల్లాల్లో నివసిస్తున్న రత్నబలిజ కులస్తులైన పోలిశెట్టివారి వంశ చరిత్రలో ఉన్నది. +అనగా ఆ ధనాన్ని ప్రజావసరాలకు ఉపయోగించిన సద్వినియోగపడేదని హెచ్చరిక. +రాత రాళ్ళేరమని ఉంటే రాజ్యాలెలా ఏలుతారు +జ్యోతిష్యం, జాతకాలు నమ్మి జీవితాన్ని గడిపేవాడు కష్టం వాటిల్లినప్పుడు, ప్రయత్నాలన్నీ విఫలమై ప్రయోజనం కలగనప్పుడు బ్రహ్మదేవుడు తనను సృష్టించినప్పుడే రాళ్ళేరుకుని బ్రతకమని రాసివుంచాడని తాను రాజుగా మారి రాజ్యాన్ని ఏలడం అందుకే వీలుపడడంలేదని అంటాడు. +==రానప్పుడు బ్రహ్మ విద్య వచ్చినప్పుడు కూసు విద్య +సూక్ష్మముగా పరిశీలించినచో సంహిత బ్రాహ్మణము లును, భగవత్ బోధకములను జ్యోతి సంహితా ప్రతిపాదితములు నగు రహస్యములు ఇందు కనబడును రహస్యము లని అనినంతనే ఎవరికిని చెప్పదగనివి కాబో���ు, అట్టి వున్న నేమి లేకున్ననేమి? అని పలువురు అనుకొనుట వినుచున్నాము. అది లెస్స కాదు. జ్ఞానులందరును ముందు నీ మనమును కనుగొనుము, పిదప నిన్ను కనుగొనుము అని చెప్పుదురు. మనకు మనసే దొరకదాయె; ఇక నేను దొరుకుటెచట? ఇట్టివే రహస్యము లన్నియు. మన అధికారమునకు మించినది రహస్యము. మనకు తెలియినది బ్రహ్మ విద్య తెలియనిది కూసు విద్య +==రానున్నది రాక మానదు పోనున్నది పోకమానదు +==రామ రామ అంటే రోమ రోమానికీ ఎక్కిందట +==రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు== +రామాయణం విన్న తరువాత ఎవరైనా రామునికి సీత ఏమౌతుందని అడిగితే ఆ ప్రశ్న విన్నవారికి విచిత్రంగా ఉంటుంది. అదే విధంగా ఏదైనా వెషయం కూలంకుశంగా విన్న తరువాత ఆ విషయం గురించి ఏమీ తెలియనట్టు ఎవరైనా ప్రవర్తిస్తే ఈ సామెతను వాడుతారు. +రామాయణ కథకు మూలం రంకు. అదే విధంగా భారత యుద్ధానికి అబద్ధం మూలం అని ఈ సామెతకు అర్థం. +==రామాయణంలో పిడకల వేట ప్రేమాయణంలో పడతుల వేట అన్నట్లు +==రామునివంటి రాజుంటే హనుమంతునివంటి బంటూ వుంటాడు +ఒక పీడ నుంచి ఎంతకు ముక్తి కలగనిచో ఈ సామెతను వాడుతారు. +==రావాలంటే త్రోవేలేదా, కావాలంటే కరుణే రాదా +రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టు చుట్టుకూ పొట్ట చూసుకుందట== +అతిగా మూడనమ్మకం వున్నవారికి సంబంధించిన సామెత ఇది. +==రాసుకుంటే రంగూకాదు పూసుకుంటే పుణ్యం రాదు +==రుచీపచీలేని కూర కంచానికి చేటు అందం చందంలేని పెళ్లాం మంచానికి చేటు +రోజూ కాయ కష్టం చేస్తేగానీ కడుపు నిండని పరిస్థితిలో ఎవరైనా ఉన్నప్పుడు ఈ సామెతను వాడుతారు. +రేవడు అంటే చాకలి అని అర్థము. దీని వెనక ఒక చిన్న కథ ఉన్నది:- +అనగా అనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక రేవు. ఒక చాకలి అతను రోజూ ఆ రేవుకి వచ్చి బట్టలు ఉతుకుతుండేవాడు. ఒకరోజు సగం బట్టలు ఉతికి ఒడ్డున ఆరేస్తుంటే, అకస్మాత్తుగా వాగు పొంగింది అయ్యో! అయ్యో! నా బట్టలు" అంటూ, వాగులోనికి పరుగెత్తాడు. కానీ అప్పటికే కొన్ని బట్టలు వాగులో కొట్టుకోని పోయాయి. +ఇంతలో వాగు మరింత ఉదృతంగా పొంగినది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఒడ్డున ఉన్న మిగిలిన బట్టల్ని కూడా వదిలేసి, పరుగెత్తుకొని దగ్గరలోని గుట్ట ఎక్కాడు. వాగు ఉధృతికి మిగిలినా ఆ బట్టలు కూడా కొట్టుకు పోయాయి. +మొదటే ఒడ్డున ఉన్న బట్టలు తీసుకోని పరుగెత్తితే కనీసం అవన్నా దక్కేవి కదా! అందుకే అంటారు "రెడింటికి చెడిన రేవడి అని. +ఇటువంటి అర్థములోనే మరొక సామెత కూడా వాడతారు ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది అని. +సంస్కృతంలో "రేవణ" శాబ్దానికి సరిగ్గా పోల్చదగిన శబ్దము సాధు శబ్దము. కాని ఏకారణం చేతనో ఇది తెలుగులోకి "రేవడ"గా మారింది. రేవణ శబ్దము పూర్వము ఒక మనుష్యుని పేరు. ఈయన పూర్వమీమాంస పునరుద్ధారణ కర్తలైన శ్రీ కుమారిల భట్టపాదుల శిష్యులని అందురు. కుమారిలానుయూయ లవలంబించే మతానికి భాట్ట మీమాంస అని అంటారు. ఇందులో ఒక కారిక కనబడుతుంది. +ఉంవేకునకు కారికము మాత్రము తెలియును. ప్రభాకరునకు తంత్రము తెలియును. మండనునకు ఈ రెండును తెలియును. రేవణునికి ఈ రెండుని తెలియవు అని దీని అర్ధము. +[[జైమిని వ్రాసిన పూర్వమీమాంస సూత్రములకు శబరస్వామి భాష్యం వ్రాసాడు కుమారిలభట్టు ఆభాష్యం మీద వార్తికాలు రచించాడు. ఆవార్తికాలను మూదు భాగాలుగా విభజింపవచ్చును. ప్రథమ తర్క పాదానికి కారికా రూపంలో శ్లోకవార్తికం వ్రాయటంచేత దీని కారికా అనేపేరు వచ్చింది. ఈ ఉంవేకుడు మండనుడు కుమారిలుని శిష్యుడు. వీరిరివును పూర్వమీమాంస మీద పనిచేసారు. తంత్ర వార్తికం పూర్తిగా తెలుసుకున్నవాడు ప్రభాకరుడు ఇతనికే గురు వని ఇంకొక పేరు ఉంది. ఇతని మతాన్ని ప్రభాకర మీమాంస అనీ, గురుమత మనీ వ్యవహరిస్తారు. ఇతడు భాట్ట మీమాంసకుల మతాన్ని ఒప్పుకోకుండా వేరే మతాన్ని స్థాపించటానికి పూనుకొని శ్బరభాష్యానికి వ్యాఖ్య వ్రాసాడు. ఈ వ్యఖ్యనే బృహతీ అని అంటారు మండనుడు ప్రాంచకరాద్వైతమున బ్రహ్మసిద్ధి వ్రాసినాడు. కుమారిలుని శిష్యుడు. శ్లోకతంత్ర వార్తికాలు రెండును ఇతనికి బాగా తెలుసునట. +రేవణుడు కుమారిలుని శిష్యుడో, పూర్వమీమాంసలో కృషి సల్పినవాడో అయివుంటాడు. ఈయనకు శ్లోక వార్తికము, తంత్ర వార్తికము తెండును తెలియవు. పాపం, ఎన్నేళ్ళు శుశ్రూష చేసినా, ఎంత కాలం చదివినా ఈవంకివేమీ తలకెక్కలేదు. అందుచే ఉభయభ్రష్టుడయినాడు.అందుకే "రెంటికీ చెడ్డ రేవణు" డని సామతలోనికి దిగినాడు. +==రెండు పడవల పైన కాళ్ళు పెట్టినట్లు +రెండు పడవల పై కాళ్ళు పెట్టి పడవ ప్రయాణము చేయడము అసాద్యమైన పని. అలా అసాద్యమైన పని చేయడానికి పూనుకున్న వారినుద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయేగిస్తారు. +ఏపూటకాపూట కష్టపడితేనే గాని తిండి దొరకనివారి నుద్దేశించి వాడే జాతీయమిది. +ఒక నాట్యగత్తె వీధిలో నాట్యమాడు తున్నది. కొంత సమయాని ఆ వూరి రెడ్డి గారు వచ్చారు. ఆ ఆట���ి తాను మొదటినుండి చూడలేదని మొదటినుండి ఆడమన్నాడట. ఆ తర్వాత కొంత సమయాని మరొక రెడ్డి వచ్చి తాను మొదటినుండి చూడలేదని తిరిగి మొదటి నుండి ఆడమన్నాడట. ఆ విధంగా మళ్లి మళి ఆట పలుమార్లు మొదలెట్టగా ఆ ట పూర్తిగాకుండానే తెల్లారి పోయింది. అలా ఈ నానుడి ప్రచారంలోనికి వచ్చింది. +==రేపటి నెమలికంటే నేటి కాకి మేలు +==రేపటి నొప్పుల మాటెలా వున్నా ఈ పూట ఈ నొక్కుళ్ళే బాగున్నాయి అందిట +==రేపు రేపంటే రేప్‌ చేసి చూపించాడట +==రైతు లెక్కచూస్తే నాగలి కూడా మిగలదు +ఎవరైనా తాము తినాలనుకున్న రొట్టె తనంతట తాను విరిగి నేతిలో పడితే దాని రుచి పెరుగుతుంది, దాన్ని త్రుంచే శ్రమ తప్పుతుంది. అదే విధంగా అనుకున్న పని వేరొక సంఘటన వలన మనకు సౌకర్యంగాను, సులభతరంగాను మారితే ఈ సామెతను వాడుతారు. +;దాచి పెట్టిన రొట్టే పొరబాటున విరిగి నేతిలో పడింది. ఇక దాన్ని తిరిగి దాచ లేము. తినాల్సిందే. అసంకల్పితంగా ప్రయోజనం కలిగినప్పుడు ఈ సామెతను వాడుతారు. +రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే== +==రోగాలు మనుషులకు కాక మానులకు వస్తాయా +==రోగి కోరుకుందీ పాలే వైద్యుడు చెప్పిందీ పాలే +రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట== +==రోజు చచ్చే వానికి ఏడ్చే వారెవరు ఉండరు== +ఎవరైనా ఒకసారికి అవసరానికి సహాయం చేస్తారు. ప్రతి సారి చెయ్యరని చెప్పేదే ఈ సామెత. +రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరువ తగునా +రోట్లో తల పెట్టితే రోకటి పోటుకు సిద్ద పడి నట్లే. అందు చేత భయ పడ కూడదు. ఏదైనా పని ప్రారంబించేటప్పుడు దాని పర్వవసానంగా వచ్చే కష్టాలకు వెరవ కూడదు. ఆ సందర్భంలో ఈ సామెత చెప్తారు. +రొలుకి ఒక పక్కనే వాయిస్తారు కాని మద్ధెలకు రెండు పక్కల వాయిస్తారు. ఒక బాధ ఉన్నవాడు తన బాధలను రెండు బాధలున్న వాడితొ చెప్పుకున్నట్టు. +==రోత ముండకైనా రాత బాగుంటే చాలు== +ఎంతటి వారికైనా తలవ్రాత బాగుంటే బాగా రాణిస్తారని చెప్పే సామెత ఇది +అనగా రోహిణి కార్తెలో ఎండలు ఎక్కువగా వుంటాయని అర్థము. +==రోహిణిలో రోకళ్ళు చిగుర్చనన్నా చిగురిస్తాయి, రోళ్ళు పగులనన్నా పగుల్తాయి +==రోహిణిలో విత్తటం రోళ్ళు నిండని పంట +ఇది వ్యవసాయ దారులకు సంబంధించిన సామెత. రోహిణి కార్తెలు విత్తనాలు చల్లితే పంట సరిగా రాదు అని చెప్పే సామెత ఇది. +==రోహిణి ఎండకు రోళ్ళో పాయసం ఉడుకుతుంది +==రోహిణిలో రోకళ్ళు చిగిర్చనన్నాచిగిరిస్తవి ,రోళ్ళు పగలనన్నా పగు���ుతవి== +==రోహిణిలో విత్తులో రోయక వేస్తారు,మృగశిరలో ముంచి పోస్తారు== +==రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు== +రౌతు అనగా గుర్రపు స్వారీ చేసేవాడు. అలాంటి రౌతు మెత్తనివాడైతే గుర్రము అతని ఆదేశాలని సరిగా పాటించదు. అదే విధంగా అధికారంలో ఉన్న వ్యక్తి మెత్తనివాడైతే అతని కింద పని చేసేవాళ్ళు సరిగా పనిచేయరని చెప్పడానికి ఈ సామెతను వాడుతారు. +[[రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు వంటిదే ఈ సామెత +==రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్లమీద నడుస్తుంది== +రౌతు మెత్తగా వుంటే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుంది. అనగా నిదానంగా నడుస్తుంది. అదే రౌతు గట్టి వాడైతే నాలుగు దెబ్బలు తగిలిస్తాడు. దాంతో అది పరుగు అందుకుండుండి. ఏపని చేసేటప్పుడైనా కొంత కఠినంగా వుండాలని ఉద్దేశించినది ఈ సామెత. + + +==లంజకు పెట్టిన సొమ్మూ గోడకు వేసిన సున్నం తిరిగి రావు +==లంజను లంజా అంటే రచ్చకెక్కుతుంది ఇల్లాలిని లంజా అంటే యింట్లో దూరుతుంది +ఏదైనా పని ప్రారంభించే ముందు, దాని గురించి సరిగా అలోచించ కుండా పని మొదలు పెట్టినప్పుడు ఈ సామెత వాడతారు +లేని దాత కంటే ఉన్న లోభి నయం== +==లేనిదాని కోసం పోతే ఉన్నది కాస్తా ఊడిపోయిందట +==లేనివాడి తెగింపు కంటే ఉన్నవాడి పిరికితనం మేలు +==లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాటట +మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడే వారిని గురించి చెప్పిన సామెత. +హరి నామం లంకలో వినపడకూడదు అని రావణాసురుడు శాసించాడు. అందువలన 'హరి' అనే శబ్దం (పేరును బయటకు అనడం) లంకలో వినపడదు. అయితే తలవకూడని వ్యక్తి గురించి ఎవరైనా ఎక్కడైనా తలచుకుంటే దానిని 'లంకలో హరిశవబ్దం'లాగ అంటాం. +==లంక మేత గోదారి ఈతకు సరి పోయింది== +గోదావరి గట్టున వుండే పల్లెల లోని గేదెలు నది మధ్యలో వుండే లంకలలోని ఏపుగా పెరిగిన పచ్చ గడ్డిని మేయడానికి అంత దూరం గోదావరి ఈదు కుంటూ వెళ్లి బాగా మేసి తిరిగి గోదారిని ఈదు కుంటూ ఇంటికి వస్తాయి. ఆ పచ్చ గడ్డిని మేయగా వచ్చిన శక్తి గోదారిని ఈదడానికి సరిపోతుంది. పలితమేముంది. ఆ సందర్భంగా పుట్టిందే ఈ సామెత. ఫలితం లేని పని చేసే వారిని గురించి ఈ సామెత చెప్తారు. + + +ఇంత సేపు ఏం చేస్తున్నారని ఈసడింపుగా అనడం. +==వంటి మీద ఈగను కూడ వాలనీయను== +==వండలేనమ్మకు వగపులు మెండు తేలేనమ్మకు తిండి మెండు +==వండాలేదు, వార్చాలేదు ముక్కున మసెక్���డిది అన్నట్లు +==వండుకున్నమ్మకు ఒకటే కూర అడుక్కునే అమ్మకు ఆరు కూరలు +==వంద మాటలు చెప్పొచ్చు ఒక్కనికి పెట్టేదే కష్టం +==వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లు== +==వంపుసొంపులే ఫలపుష్పాలు లేత పెదిమలే తమలపాకులు అన్నట్లు +==వంపూసొంపుల సేవలు వలపు పాన్పు మీదే అన్నట్లు +==వంశమెరిగి వనితను వన్నెనెరిగి పశువును తెచ్చుకోవాలి +==వచ్చింది పాత చుట్టమే పాత చేట గొడుగు పట్టండి అన్నట్లు +==వచ్చిననాడు వరాచుట్టం మరునాడు మాడ చుట్టం మూడవనాడు మురికి చుట్టం +==వచ్చేకాలం కన్నా వచ్చిన కాలం మిన్న +==వచ్చేటప్పుడు వెంట తీసుకురారు పోయేటప్పుడు వెంట తీసుకుపోరు +==వచ్చిపోతూ వుంటే బాంధవ్యం ఇచ్చి పుచ్చుకుంటూంటే వ్యాపారం +==వచ్చీరాని మాట ఊరీ ఊరని ఊరగాయ రుచి +==వట్టి నిందలు వేస్తే గట్టి నిందలు వస్తాయి +==వడ్డించినదంతా మేం తింటాం ఆకులు మీరు నాకండి అన్నట్లు +==వడ్డించేవాడు మనవాడయితే ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు +==వయసుకోట వాయనం, సొగసుతోట పాయసం అన్నట్లు +==వయసుపడే ఆరాటం సోయగాల సమర్పణకే అన్నట్లు +వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి== +==వరహాకన్నా వడ్డీ ముద్దు కొడుకుకన్నా మనమడు ముద్దు +==వలచివస్తే మేనమామ కూతురు వరుస కాదన్నట్లు +==వలపులు మనసుల్ని తడితే కోరికలు తనువుల్ని తడతాయట +==వాచినమ్మకు పాచినన్నం పెడితే పరమాన్నం పెట్టారని ఇరుగుపొరుగులకు చెప్పుకొన్నదట +ఎంతటి వానికైనా ఒక్కోసారి కాల కలసి రాకపోతె చాల కష్టాలు పడవలసి వస్తుంది. ఈ సామెతలో అదే అర్థం వున్నది +==వస్తూ ఏమి తెస్తావు? పోతూ ఏమిస్తావు +ఒక వెంట్రుకతో కొండను లాగడానికి ప్రయత్నించినప్పుడు వస్తే కొండ వస్తుంది, పోతే ఒక వెంట్రుక పోతుంది. చిన్న పెట్టుబడితో దాదాపుగా అసాధ్యమైనంత పెద్ద లాభం సంపాయించడానికి ఎవరైనా ప్రయత్నించినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. +వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు== +భోజనాలకు బంతిలో కూర్చున్నప్పుడు మొదటగా వున్నావారికి అన్ని పదార్థాలు వడ్డిస్తారు. చివరకు వచ్చేసరికి కొన్ని పదార్థాలు అయిపోవచ్చు. ఆ కారణంగా చివర బంతిలో కూర్చున్న వారుకి అన్ని భోజన పదార్థాలు అందక పోవచ్చు. కాని వడ్డించే వాడు మన వాడైతే మనం చివరన లేదా వెనకగా కూర్చున్నా మన కోసమని మనవాడైన వడ్డించే వాడు మన వద్దకు వచ్చి కావలసిన పదార్థములను వడ్డిస్తాడస్ని అర్థము. +వాడికి సిగ్గు నర��ే లేదు- అంటే వాడికి సిగ్గు అనేదే లేదు, సిగ్గు వాడి నైజం కాదు ఎందుకంటే వాడికి సిగ్గు పుట్టించే నరం లేదు. ఇది ఇండోనేసియాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న సామెతకు స్వేచ్ఛానువాదం original in Indonesia Dia Tidak ada urat malu') +అనవసరపు మాటలతో విసిగిస్తున్నాడని అర్థం: ఉదా:గంట నుండి వాడు నా మెదడు తింటున్నాడు. +==వానవుంటే కరువులేదు మగడు వుంటే దరిద్రం లేదు +==వాపు బలుపు కాదు వాత అందం కాదు +==వాములు తినే స్వాములవారికి పచ్చగడ్డి ఫలహారం అన్నట్లు +==వ్యాధికి రట్టు, సంసారానికి గుట్టు కావాలి +==వ్యాపారం జోరుగా సాగుతోంది, రెండో బర్రెను అమ్మి డబ్బు పంపమన్నాడట +ఉదా: వాలు చూపులతొ గాలమెసి వలపులోకి దింపు వారు మీరుగాదా ఆడ వారి గురించి ఒక పాటలో) +గంభీరంగా విగ్రహం వలే ఉండి పని తనం లేకుండా ఉండేవారికి ఉపయోగించే సామెత. +విగ్రహం ఉంది కాని ఆ విగ్రహాన్ని రోజు నైవేద్యం పెట్టి సేవించడం వల్ల ఉపయోగం లేదు. నైవేద్యం మాత్రం నష్టం. +==వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి== +వియ్యం అనగా పెళ్ళి. కయ్యం అనగా యుధ్ధం, పోరాటం. పెళ్ళి సంబంధం వెతికేటప్పుడు తమ ఆస్తీ అంతస్తులకు సరితూగే కుటుంబాన్ని వెతకాలి. లేదా నూతన వధూవరుల కాపురంలో ఆ అసమానతల కారణంగా కలతలు రావచ్చు. అలాగే ప్రత్యర్థి మనకు భుజబలంలోనూ, బుధ్ధిబలంలోనూ సరిసమానుడైతేనే పోరు రక్తి కడుతుంది. బలహీనుని ప్రత్యర్థిగా ఎంచుకొనడం వీరుల లక్షణం కాదు అని చెప్పటానికి ఈ సామెతను ఉపయోగిస్తారు. +విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది== +==వ్రాత కరణమా? మేత కరణమా? అన్నట్లు +==వ్రాయగా వ్రాయగా కరణం దగ్గగా దగ్గగా మరణం +విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు== +ఒకవేళ నమ్మితే ఆ మాటలను మనసులోనే ఉంచుకోవాలి కానీ దాన్ని మరొకరి దగ్గర చెబితే కొన్ని సందర్భాల్లో దోషరహితులను దోషులుగా ప్రచారం చేసినట్లు అవుతుంది. +==విందు అయినా మూన్నాళ్ళు మందు అయినా మూన్నాళ్ళు +==విడవమంటే పాముకు కోపం పట్టమంటే కప్పకు కోపం +==విడిచినమ్మలు వియ్యమందబోతే అంతకంటే అడ్డాలమ్మ వచ్చి హారతిపట్టిందట +==విదియనాడు రాని చంద్రుడు తదియనాడు తనకు తానై కనబడతాడు +==విన్న మాట కంటే చెప్పుడు మాట చేటు +==విన్నమ్మ వీపు కాలింది కన్నమ్మ కడుపు కాలింది +==వినాయకుడి మీద భక్తా? ఉండ్రాళ్ళ మీద భక్తా +==విరిగిన వేలు మీద ఉచ్చ పోయనన్నట్లు +==విరుచుకుని విరుచుకుని వియ్యాలవారింటికి పోతే పలుగురాళ్ళతో నలుగు పెట��టారట +==విస్తరి కొదవా, సంసారపు కొదవా తీర్చేవారు లేరు +అన్ని ప్రయత్నాలు చేసి విసిగి పోయారని అర్థం: ఉదా: ఇక ఆ ప్రయత్నం చేయ లేను నేను విసిగి వేశారి పోయాను. +==వీధిలో చెప్పుతో కొట్టి, ఇంట్లో కాళ్ళు పట్టుకున్నట్లు +పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తుంటే పెద్దవారు కొట్టడానికి ముందు భయపెడుతూ వీపు విమానం మోత మోగిపోతుంది అని అంటారు. దీని అర్థం విమానం బయలు దేరేటప్పుడు చాలా శబ్దం చేస్తుంది. ఇప్పుడు అల్లరి ఆపక పోతే నే వీపు మీద వేసే దెబ్బలు, అంత గట్టి శబ్దం చేస్తూ, బాధ కలిగిస్తాయి అనే అర్థం ఆధారంగా వచ్చిన సామెత వీపు విమానం మోత మోగుతుంది +==వృష్టికి ప్రమాణాలు ఉత్తర, హస్త కార్తెలు +==వెంట పోయైనా చూడాలి వెంట వుండయినా చూడాలి +==వెధవముండ కాళ్ళకు మ్రొక్కితే నాలాగే వర్ధిల్లమని దీవించిందట +==వెనక నొక్కుళ్ళేనా ముందు పనులున్నాయా అందిట +==వెన్న అరచేతిలో పెట్టుకుంటే అడక్కుండానే కరుగుతుంది +==వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్లత్రాగిన వాడ్ని కొట్టినట్లు +==వెయ్యి అబద్ధాలు చెప్పయినా ఒక పెళ్ళి చేయాలి +==వెర్రి కుదిరింది తలకు రోకలి చుట్టమన్నాడట +==వెర్రివాడా వెర్రివాడా అంటే వెక్కెక్కి ఏడ్చాడట +మనకున్న వనరులను బట్టి పని చేయాలి. అంతే గాని ఆశగా మనకున్న వనరుల కన్న ఎక్కువున్న పనిని చేయ కూడదు: అలాంటి సందర్భాలలో పుట్టినదే ఈ సామెత. వెండ్రుకలున్న అమ్మ ఏ కొప్పైనా వేయ గలదు. సరిపడ వెండ్రుకలు లేనిదే కొప్పేం వేయ గలదు? +==వేలు వంక పెడితేగానీ వెన్న రాదు +==వేలు మీద గోరు మొలిచింది ఏం చేతు మొగుడా అన్నట్టు== +ఏదో ఒక వంక చెప్పి చెయ్యాల్సిన పనిని తప్పించుకోటం +వాహనాలు నడిపే వారికి ఈ పలుకుబడి వర్తిస్తుంది. ప్రయాణము వేగవంతమైతే ప్రమాదాలు జరుగుతాయి గనుక, వేగం కన్నా ప్రాణం మిన్న అని అంటారు. అనగా మితిమీరిన వేగం ప్రాణ హాని అని అర్థము. +ఒకరికొకరు తోడుగా వుండి ఐకమత్యంగా పని చేసుకోవాలని దీని అర్థం> +==వేడినీళ్ళకు ముందు, పంక్తి భోజనానికి వెనుక పోగూడదు +==వేలు పెట్టేందుకు చోటిస్తే తల దూర్చినట్లు +==వేలు మీద గోరు మొలిచింది వేరుపోదాం రారా మగడా! అన్నదట +==వేలు వాచి రోలంతయితే, రోలు వాస్తే మరెంత కావాలి +==వేషాలమారికి వేవిళ్ళొస్తే, ఉన్నచోటు విడవను అన్నదట +==వేసిన వత్తికి పోసిన చమురుకు సరి +==వేసిందే ఒక గంతు దిగిందే ఒక బుడ్డ +==వేసిందే ఒక గంతు విరిగిందే ఒక కాలు== +మామూలుగా మనం ఎక్కి తొక్���ే వేపకొమ్మనే పదిమందీ కూడి ఒకచోట ప్రతిష్ఠించి అమ్మవారుగా భావించి పూజలు పునస్కారాలు జరపడం ప్రారంభించిన తర్వాత ఆ కొమ్మ దేవతామూర్తి అవుతుంది. దానిని బలవంతంగా అక్కడి నుంచి తొలగించదలిస్తే ఆ దేవతను కొలిచే అక్కడి జనంలో ఆగ్రహం రగిలి శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుంది +==వేసేది విషముష్ఠి విత్తనాలు ఆశించేవి మధుర ఫలాలు +==వేసిన వత్తికి పోసిన చమురుకు సరిపోయిందన్నట్టు== +ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండటం. పడిన శ్రమకు దక్కిన ఫలితానికి సరిపోయిందని చెప్పటం. +==వైద్యం నేర్వనివాడూ వానకి తడవనివాడూ వుండడు +==వైదీకి వైద్యంలో చచ్చినా ఒక్కటే బ్రతికినా ఒక్కటే +==వైద్యుని పేరు చెపితే రోగాలు పారిపోతాయా +==వైద్యుడు రోగాలు కోరు వైశ్యుడు కరువు కోరు== +==వైరాగ్యం ముదిరితే వారవనిత కూడా తల్లితో సమానం +కష్టాలలో చిక్కుకున్నాడు అని అర్థం: ఉదా: అతడు విషవలయంలో చిక్కుకున్నాడు. + + +==క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు== +కొంత మంది ఎప్పుడు చూసినా చాలా హడావుడిగా వుంటూ తీరికేలేనట్లే కనిపిస్తారు, కానీ వారు చేసేపని వల్ల కొంచెం కూడా ఉపయోగం ఉండదు. అటువంటి వాళ్ళను ఉద్దేసించి అనేదే ఈ సామెత దీనిలో దమ్మిడీ అంటే అతి తక్కువ ధనం. పాతకాలంలో డబ్బును దమ్మిడీ, కానీ, అర్దణా, అణా ఇలా లెక్కపెట్టేవారు. ఎంత కష్టపడినా ఫలితం రానప్పుడు కూడా ఈ సామెతను ఉపయోగిస్తారు. ఇలాంటిదే మరో సామెత వున్నది అరకాసు ఆదాయం లేదు అర గడి తీరుబడి లేదు కాసు అనగా గతంలో చలామణిలో వున్న ఒక నాణెం. +పొద్దు పోవడం చాల కష్టంగా ఉంది. ఉదా: ఈ నాలుగు రోజులు నాకు క్షణమొక యుగంలా గడిసింది. +==క్షామానికి జొన్న వర్షానికి వరి పండుతాయి== +క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం వెయ్యాలి== +ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆశీర్వచనంగా ఈ మాట అంటారు. + + +దేనికైనా స్థానం, సమయం, సందర్భం లాంటి వాటిని బట్టి వాటి విలువ వుంటుందని అర్థం. చెంబులో వున్నప్పుడు నీళ్లు అంటారు. అదే నీరు శంఖంలో పోస్తె తీర్థం అవుతుంది ఆ నీరుకు భక్తి ఆపాదించబడుతుంది. +శతకోటి దరిద్రాలుంటే వాటిని తీర్చటానికి అనంతకోటి ఉపాయాలు కూడా ఉంటాయి అని అర్ఢం. ఎన్ని సమస్యలున్నా వాటికి తగిన పరిష్కారాలుంటాయని చెప్పటానికి ఈ సామెతను ఉపయోగిస్తారు. +అందరిలో నువ్వూ ఒకడివి అన్న భావం వ్యక్తపరచడానికి ఈ సామెతను వాడతారు. +==శతకోటి లింగాల్లో నా బోడి లింగ మెక్కడ అన్నట్లు +అతి సులబంగా చేసిన పని అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయేగిస్తారు. +==శనిపడితే ఏడేళ్ళు నేను పడితే పధ్నాలుగేళ్ళు +==శాపాలకు చచ్చినవాడూ దీవెనలకు బ్రతికినవాడూ లేడు +అతిగా నిరుత్సాహ పరిచే వారి గురించి దీనిని వాడుతారు. భారత యుద్ధంలో కర్ణుడికి సారది అయిన శల్యుడు కర్ణుడిని అన్ని విధాల నిరుత్సాహ పరుస్తాడు. +అంతా వృధా అయిందని అర్థం అనే అర్ధంలో ఈ సామెతను వాడతారు. +శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట== +ఎల్లప్పుడూ అశుభం పలికే వారి గురించి ఈ జాతీయాన్ని వాడుతారు. +శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికొచ్చినోళ్లంతా నా పెద్దపెళ్లాలు అన్నాడట== +==శృంగారానికి సమయం సరసానికి సందర్భం అక్కరలేదన్నట్లు +==శృంగారానికి సిగ్గూ ముద్దుకు బుద్ధీ లేవన్నట్లు +శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా ఈ ప్రకృతిలో జరిగే పనులన్ని దైవాజ్ణ ప్రకారమే manku untayani తున్నాయని అర్థం. +==శుభం పలకరా పెళ్లి కొడకా అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట +మరణం తర్వాత ఏమి వుండదని అర్థం. +==శ్రావణంలో శనగల జోరు భాద్రపదంలో బాధల పోరు +==శివరాత్రితో చలి శివ శివా అంటుంది +==శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు +==శిష్యునికెక్కడ సందేహమో గురువుకీ అక్కడే అనుమానం +==శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండెక్కడన్నాడట +శెనగలు తింటూ ఉలవలని చెప్పి పత్తివిత్తులు చేతిలో పెట్టినట్లు== +==శోభనం గదిలో తొక్కుడు బిళ్ళాట నేర్చుకున్నట్లు +==శోభనం గదిలో సిగ్గు యౌవ్వనానికి ముప్పు +==శోభనం నాటి ముచ్చట్లు లంఖణంనాడు గుర్తొచ్చినట్లు +==శోభనం రోజే శ్రీవారికి నడుం పట్టేసినట్లు +==శోభనాల వేళ సురాలోక మార్గం అన్నట్లు +తనకు ఉపయోగంలేని వస్తువు చేతికి దొరికి నట్లు. + + +పిసినారి వాడిని ప్రతిఫలం అడిగితే ఇలాగే జరుగుతుందని అర్ధం. +==సంక్రాంతి పండుగకు సంకెళ్ళలోనివారూ బయటకు వస్తారు +==సంగీతానికి గాడిద, హాస్యానికి కోతి అన్నట్టు== +వివరణ: ఒక ఆడ కూలి తాను పని చేసె రెడ్డి వద్దకు వెళ్లి దొరా నాకు గాజులు వేయించు అని అడిగిందట. దాంతో ఆ రెడ్డి గారు సంతకు ఒక చీటి వ్రాసి ఇచ్చి దీన్ని సంతలో ఇస్తే నీకు గాజులు వేస్తారని అన్నాడట. దాంతో ఆ అమాయక రాలు ఆనందంతో సంతకు వెళ్లి ఆ చీటీని ఎవరికివ్వాలో తెలియక ఏడిచిందట మాయకులు అమాయకులను ఎలా వేదిస్తారో తెలిపే సామెత ఇది. +==సంతానంకోసం సప్త సముద్రాల్లో స్నానం చేస్తే,(సప్తసాగర యాత్రకెళితే) ఉప్పునీరు తగిలి ఉన్నదికాస్తా ఊడ్చుకుపోయిందట +మొన్నటిదాకా ఎవరైనా పెద్దలు నూతన వధువరూలను ఆశీర్వదించేటప్పుడు గంపెడు బిడ్డలను కనమని ఆశీర్వదించేవారు. ఇప్పుడు పెరుగుతున్న జనాభా దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టుఅంటున్నారు.ఒకరు లేక ఇద్దరు పిల్లలు ఉండడం సబబని, అంతకన్నా ఎక్కువైతే సంసారం నడపటం యజమానికి కష్టమవుతుందని నిన్నటివరకు ప్రచారంలో ఉంది. కానీ ప్రస్తుతం ఇద్దరు కూడా అనవసరమని, ఒకరుంటే సరిపోతుంది అంటున్నారు. +ఎల్ల వేళలా ఆనందంగా సంతోషంగా వుండమని దీని సందేశం. +==సంతోషానికి సాకు ఆలోచనకు ఆకృతి లేదు +సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట== +==సంద్య వార్చినావురా అంటే ఊరివెలుపల గుంటలో వార్చినానులే అన్నాడట== +==సందు దొరికితే చాలు మూడంకె వేస్తాడన్నట్లు +==సగం సాలె నేత, సగం మాలనేత +==సత్యం చెప్పుల్లో కాళ్ళు పెడుతూంటే, అసత్యం ప్రపంచమంతా చుట్టి వస్తుంది +==సత్రంలో ఉచ్చ బోస్తున్నావేమిరా అంటే దేవాలయం అనుకున్నానులే అన్నాడట== +==సత్యం నావద్ద దండిగా వుంది, చెప్పులు తేరా మగడా! నిప్పులో దూకుతా అందట +==సన్నపని చెయ్యబోతే సున్నం సున్నం అయ్యిందట== +==సన్నసన్నగా కాపుతనం వచ్చింది సన్న బియ్యం వండవే పెళ్ళామా అన్నాట్ట +==సన్నెకల్లు కడగరా సయ్యదాలీ అంటే కడిగినట్లే నాకినా ఖుదా తోడు అన్నాడట== +==సన్యాసం పుచ్చుకున్నా కావడి బరువు తప్పలేదు +==సన్యాసి పెళ్ళాం విధవా కాదు పునిస్త్రీ కాదు +==సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలుతుంది +==సరదాకి సమర్థాడితె చాకల్ది చీర పట్టు కెళ్లిందట== +ఆడపిల్లలు సమర్తాడినప్పుడు వారి ఒంటి పై నుండే బట్టలు చాకలి చెందు తాయి. ఇది ఆచారము. అలా ఒక అమ్మాయి సరదాకి సమర్తాడిందట. సాంప్రదాయం ప్రకార చాలల్ది వచ్చి చీర పట్టు కెళ్లిందట. ఇందులో సరదాకి కూడా అబద్ధం చెప్ప కూడదు అనే భావం దాగుంది. +==సమయం తప్పితే కాళ్ళు సమయం వస్తే రాళ్ళు +==సముద్రం మధ్యన వున్నా మంచినీళ్ళు కరువే +==సముద్రమైనా ఈదవచ్చు గానీ సంసారం ఈదలేరు +==సరదాకి సమర్తాడితే చాకలిది చీర, రవిక లాక్కున్నదట +==సర్కారుకు చాటుగానూ, షావుకారికి ఎదురుగానూ వుండాలి +==సర్వేజనాసుఖినో భవన్తు అంటే ,సర్వే వాళ్ళేనా ?మాసంగతేంటి అన్నారట రెవిన్యూ వాళ్ళు +==సంపద, సాని రెండూ నిలకడగా వుండవు +సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్��ంలో కూడ వసంతాలన్నడట== +సుపుత్రుడి కోసం సప్తసముద్రాలు ములిగితె,ఉప్పు కలుగు తగిలి వున్నది కాస్తా ఊడింది== +==సంసారి తిరిగి, సన్యాసి తిరగక చెడతారు +సత్రం లో భోజనం మఠం లో నిద్ర అన్నట్లు== +కార్యాభారం ఎక్కువై ఇళ్ళు కూడా పట్టకుండా నిర్వర్తించాల్సిన పనిమీదనే ఎక్కడెక్కడో తిరుగుతుండటం. ఇంట్లోనివారి ప్రేమలు, అనురాగాలు, బయట దొరకవు. +సన్నాయి నొక్కులే గానీ సంగీతం లేదన్నట్లు +ఆరంభశూరత్వం.ఒక పని ప్రారంభించినట్లు చెప్పుకోవటానికి కొన్ని ఉదాహరణలను మాత్రం చూపుతూ తర్వాత ఎంతకాలానికి ఆ పనులను ముగించక కాలాయపన చేయటం .సంగీత కచ్చేరి జరిగేటప్పుడు సన్నాయి ఆలపించే వ్యక్తి ముందుగా సన్నాయిని పీకపెట్టి శృతి చేసుకుంటూ ఉంటాడు. పూర్తిగా సంగీత జ్ఞానం లేనివాడైనా, లేక తానెందుకు కచ్చేరికి సహకరించాలి అనే అనుకునేవాడైనా సన్నాయి నొక్కులు (శృతి చేస్తూ) నొక్కుతూ కూర్చుంటాడే తప్ప అసలు పూర్తి పాటను పాడే స్థాయికి రాడు. +==సద్ది తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదన్నట్లు== +''జోగి జోగి రాసుకొంటే బూడిద రాలింది అన్నట్లు.జట్టులో ఎవరికీ సరైన అవగాహన లేకపోవటం.అందరూ వట్టి చవటాయలేనని +సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టం== +అన్ని ఇంద్రియాలలోకీ (అవయువాలు) కన్ను అతి ముఖ్యమైనదని దీని అర్థం. +నయనం అంతె కన్ను మాత్రమే కాదు నయనం అంతె ఆత్మ అందుకె నయనం చిందంసి సస్త్ర్రాని ఇంద్రియాల్లింతికి ఆత్మ ప్రదానం +సర్వేజనా:సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా? మరి మా సంగతేమిటి? అన్నాడట== +అందరూ సుఖంగా ఉండాలని దాని అర్ధం అయితే సర్వే డిపార్టుమెంటు వాళ్ళేనా మిగతా వాళ్లెవరూ సుఖంగా ఉండక్కర్లేదా? అని ఓవ్యక్తి ఆ పదానికి అర్ధం తెలియక ప్రశ్నించాడు. ఈ ప్రశ్నే సామెతగా అవతరించింది. చెపుతున్న విషయాన్ని సరిగావినక, అర్ధంచేసుకోక తొందరపాటుగా మాట్లాడే వారు అని +==సమయానికి లేని భాకా చంక నాకనా +నిష్ప్రయోజనమైనది అని త్యజింపఁబడినవస్తువే మఱొకపుడవసర మవుచుండును. వేళకు లేనందువలన దత్ఫలము భ్రష్టమైనట్లు భ్రష్టావసరన్యాయము]] +==సలిలం కం లంజలం అని అమరం చదువగా కమ్మలంజలేనా?కాపు లంజలెందుకు కాకూడదన్నాడట +==స్వర్గానికి పోయినా సవతి పోరు తప్పలేదన్నట్లు== +==సాగినమ్మ చాకలివానితో పోతే అదీ ఒక వ్రతమేమో అనుకున్నారట +సాయిబు సంపాదన బూబు కుట్టు కూలికి సరిపోయినట్లు== +సాధారణంగా పండుగలైనా, ఏదైనా క్రొత్త పని ���్రారంభించడానికి మంచిరోజు తెసుసుకోవడానికి పురోహితుణ్ణి గాని, పూజారిని గాని అడుగుతాం. కాని వీటిగురించి బొత్తిగా తెలియని వారిని అడిగినప్పుడు సాయబూ! గోకులాష్టమి ఎప్పుడన్నట్లు' ఆయనను అడిగితే ఏం ప్రయోజనం అన్న సందర్భంలో ఈ సామెత వాడతాం. అంటే వేరే మతస్తునికి ఇంకొక మతపు పండుగలు ఎలా తెలుస్తాయన్న సందర్భంలో.\ +==సాయిబు గడ్డంకాలి ఏడుస్తుంటే చుట్ట అంటించుకోను నిప్పు అడిగినట్లు== +==సాయిబు సంపాదన బూబు కుట్టుకూలికే సరి +==సామెతలేని మాట ఆమెత లేని ఇల్లు +==సాలెవాడి భార్య సరి మీద పడింది +==స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి== +==స్వాతీ నేను జరుపుకు వస్తాను, విశాఖా నీవు విసురుకురా +==సింగి కంటే సింగడు పత్యం చేసినట్లు== +==సాక్షికాళ్ళు పట్టుకోవడంకన్నా వాదికాళ్ళు పట్టుకోవడం మేలు +==సిగ్గు చిన్ననాడే పోయె ,పరువు పందిట్లో పోయె,కోరావా సరవా ఉంటే గదిలో పోయె +==సిగ్గెందుకు లేదురా జగ్గా అంటే ,నల్లటివాణ్ణి నాకెందుకు సిగ్గు?అన్నాడట +సింగడు అద్దంకి వెళ్లినట్టు సిద్దడు అద్దంకి వెళ్ళొచ్చినట్టు యజమానుల దగ్గర సిద్దడు పనివాడు, ఏంచెప్పినా సరిగా చేయడని అనుకొంటుంటారు. ఒక రోజు రాత్రి యజమానులు తనను ప్రొద్దున్నే అద్దంకి పంపించాలనుకోవటం విని, ఎలాగైనా మెప్పు పొందవచ్చని, అక్కడ పనేంటో తెలుసుకోకుండానే వాళ్ళు లేచే సరికి అద్దంకి వెళ్ళి వచ్చాడు. వివరం /ఉపయోగం లేకుండా ఎవరైనా వ్యక్తి పనిని చేసే సందర్భంలో ఈ సామెతను వాడతారు. +అసలు సామెత సింగడు అద్దంకి పోనూ పోయాడు రానూ వచ్చాడు అని. దీని వివరం ఒక భార్యా భర్త పొద్దు పోయిన తరువాత రేపు సింగడిని (తమ పాలేరు) అద్దంకి పంపాలి అని అనుకోవడం విని. అద్దంకి వెళ్ళవలసిన అవసరం ఏమిటో తెలుసుకోకుండా, తెల్లవారకముందే సింగడు అద్దంకి వెళ్ళి వస్తాడు. తొందరపాటుతో అసలు విషయం తెలుసుకోకుండా నిష్ప్రయోజకరమైన పనులుచేసే వారికి ఈ సామెత వాడతారు. రవి కుమార్ పెనమకూరి. హైదరాబాదు దీనినే 'పుల్లయ్య వేమవరం వెళ్ళినట్లు' అని కోస్తాప్రాంతంలో వాడతారు) +ఒకప్పుడు జీలకర్ర వర్తకులు తమ రాకకు గుర్తుగా శ్రుంగనాదం కొమ్ము బూర ఊదేవారు.పాతకాలములో జీలకర్ర వర్తకులు పడవలో వేసుకుని ఆ పడవలో కాలువలో వెళుతూ, ఏదైనా ఊరు వచ్చినప్పుడు బూర ఊదేవారట. అది విని కావలిసినవారు జీలకర్ర పడవ వచ్చిందని తెలుసుకొని కొనుక్కోవటానికి వెళ్ళేవాళ్ళు. దీన్ని ఆసరాగా తీసుకుని దొంగలు కూడా బూర ఊది, వచ్చిన జనాల్ని దోచుకునేవారు.ఆ విధంగా శ్రుంగనాదం-జీలకర్ర ఒకటయ్యాయి. కాలక్రమాన, శ్రుంగనాదం-జీలకర్ర కాస్తా సింగినాదం జీలకర్రగా వాడుకలో మారిపొయింది.ఇలా నిజమో అబద్ధమో తెలియని మాటలను సింగినాదం జీలకర్ర అని కొట్టి పారవేస్తుంటారు. +==సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి== +సీత చరిత్రలో నిలిచిపోయిన ఒక మహా సాధ్వి. పీత ఒక సామాన్య జీవి. కాని ఎవరి కష్టాలు వారివి. ఎవరికైనా సరే ఇతరుల సమస్యలు మన సమస్యలతో పొలిస్తే తక్కువగానే కనపడతాయి. +ఒకరి కష్టాన్ని ఇంకొకడు తింటుంటే ఈ మాట అంటారు. +సాటివారితో సరిగంగ స్నానాలాడబోతే ముసలి మొగుడ్ని మొసలి ఎత్తుకెళ్ళిందట== +==స్థాన బలిమి కాని తన బలిమి కాదు +సిరికొద్దీ చిన్నెలు, మొగుడి కొద్దీ వన్నెలు== +==సుఖం మరిగినమ్మకు మొగుడి కష్టమేం తెలుస్తుంది +==సుఖం మరిగిన దాసరి పదం మరిచాడట +==సూది పోయిందని సోదెకు వెడితే పాతరంకులు బయట పడ్డాయట +==సూర్యుని మీద ఉమ్మేస్తే నీ ముఖానే పడుతుంది +==సెట్టి తక్కెడ సేరుకు ముప్పావు తరుగు== +==సొమ్ము సొమ్ముగా వుండాలి బిడ్డలు గుండ్రాళ్ళలాగా వుండాలి +==సెబాష్ (శబాష్) మద్దెలగాడా అంటే అయిదువేళ్లూ పగలగొట్టుకున్నాడట +హనుమంతుడు అంటే కోతి కదా. కోతి అంటేనే కుప్పి గంతులు వేసి ఇల్లు పీకి పందిరి వేసి అల్లరి చేసేది. అలాటి కోతి జాతి నుండి పుట్టిన హనుమంతుడి ముందు కోతి చేష్టలు చేస్తే విచిత్రంగా ఉంటుంది కదా. ఏదైనా విషయం బాగా తెలిసిన వారి దగ్గర దాని గురింఛి చెప్పే సందర్భంలో ఈ సామెత వాడతారు. +హనుమంతుడు ఏమాత్రం అందంగా ఉంటాడో అందరికీ తెలుసు. హనుమంతుడు బ్రహ్మచారి. ఒక్క బ్రహ్మచారి వందకోతులతో సమానమంటారు. హనుమంతుడు ఏదో కొద్దిగా కోతిచేష్టలు చేస్తాడు కానీ మంచిఅందగాడే అని అర్ధం. +హరిశ్చంద్రుని కన్నా సత్య ప్రవర్థనుడని అర్థం. + + +==గంగలో మునిగినా కాకి హంస కాదు +ఈ సామెత వేమన శతకంలో ఒక పద్యం నుంచి స్వీకరించబడింది. +అంటే నాణ్యత కలది, లేదా ప్రేమతో ఇచ్చింది కొద్దిగానైనా చాలుగానీ నాణ్యత లేనివి లేదా మనసులో కుళ్ళుకుంటూ ఇచ్చినవి ఎంత ఎక్కువైనా వ్యర్థం అని దీని భావం. +అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. +==గజమూ మిధ్య పలాయనమూ మిధ్య అన్నట్లు +గంజి మాత్రమే తాగగలిగే స్తోమత కలిగినవాడు, తాను గంజి తాగేటప్పుడు తన మీసాలు ఎత్తి పట్టుకోవటానికి ఇంకో మనిషిని నియమించుకోల���డు. అలాగే తమ ఆర్థిక స్తోమతే బాగాలేని వారు, వేరొకరిని తమకింద పనికిగాని, పరపతి కోసంగాని నియమించుకున్నప్పుడు వారిని విమర్శిస్తూ ఈ సామెతను ఉపయోగిస్తారు. +ఎవరికి తగిన వారు వారికి దొరకక పోతారా అని +==గట్టిగా ఆయుష్యముంటే గరిక నూరిపోసినా బ్రతుకుతాడు +==గట్టిగా తిడితే గాలిలో కలిసిపోతుంది తనలో తిట్టుకుంటే తనకు తగుల్తుంది== +==గడ ఎక్కు తిమ్మన్నా గంతులు వేయి తిమ్మన్నా అన్నట్లు +==గడియ పురసత్తు లేదు గవ్వ ఆదాయం లేదు +తాను తినదు తినే ఆవును దగ్గరకు రానీయదు +==గడ్డ గడ్డకు గ్రుక్కెడు నీళ్ళు త్రాగినా రెడ్డే వ్యవసాయం చేయాలి +==గడ్డ పలుగులు గాలికి కొట్టుకుపోతూంటే పుల్లాకు నా గతేంటి అన్నదట +వనరులు ఉన్నచోటే నివాసం ఉండటం మేలు, సహాయకులున్నచోటే నివాసం ఉండటం మేలు అని చెప్పే సామెత ఇది. +ఏదైన ఒక సంఘటన జరిగితే దాన్ని గురించి సదా ఆలోచించ కూడదని ఈ సామెత అర్తం. జరిగి పోయినది దాన్ని గూర్చి ఆలోచిస్తూ సమయం వృధా చేయకూడదు. జరగ వలసి వున్న దానినిగురించి ఆలోచించాలని ఈ సామెత అర్థం. +నీరు పోయాక ఆనకట్ట కట్టిన అనవసరం అలాగే అంతా అయిపోయిన తర్వాత ప్రయత్నాలు చేసినా లాభం ఉండదు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు +తిండికి గతి లేని వానికి గంజియే పానకము రుచిలేనిదయిననూ దొరికిన పదార్థమును మిక్కిలి ఇష్టముగా తినటం. +==గానుగవాడి ఎద్దుగానూ చాకలివాడి గాడిదగానూ పుట్టరాదు +==గబ్బిలంలాగా అటు పక్షీ కాదు ఇటు జంతువూ కాదు +==గురుడాయ లెస్సా అంటే శేషాయ లెస్సా అన్నట్లు +==గర్భాదానం నాటి ముచ్చట్లు లంఖణాలలో తలచుకొన్నట్లు +==గర్భాదానానికి రమ్మని జాబువ్రాస్తే నాకు తీరికలేదు నేనున్నట్లుగానే జరిపించండని జాబు వ్రాసాట్ట +==గ్రహచారం చాలకపోతే తాడే పామై కరుస్తుంది +==గ్రహాలు గతులు తప్పినా, ఆడినమాట తప్పరాదు +ఎన్ని మంచి మాటలు చెప్పినా మరెంతమంది సత్పురుషులు వారి చుట్టూనే ఉన్నా వారి మనస్సు మాత్రం మారని, అటు వంటి వారి గురించి ఈ సామెత పుట్టింది ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ఈ సామెత కూడా అదే అర్థంలో చెప్పినదే. +సరిపడ ఆదాయము లేని వ్యాపారాన్ని చేసే వారిని గురించి ఈ సామెత వాడతారు. +==గాజుల చెయ్యి గలగల్లాడితే యిల్లు కళకళలాడుతుంది +==గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన== +మంచి విషయాల విలువ అర్హత ఉన్నవాళ్ళకే తెలుస్తుంది, అనర్హులకు, కుమతులకు వాటి విలువ తెలీదనే అర్థంలో ఈ సామెతను వాడుతారు పందికేం తెలుసు పన్నీరు వాసన అని కూడా అనడం కద్దు. +==గాడిదకు భోగినీళ్ళు పోస్తే బూడిదలో పొర్లాడిందట +వట్టిది, లేనిది, శూన్యము నిస్సారతను సూచించుటలోను, తిరస్కారములోను, అహంభావములోను వక్రగతిని పోవువారలపట్ల ఉపయోగించు ఊతపదము.] +"వాని దగ్గఱేముంది గాడిదగుడ్డ వానికేం తెలుసు గాడిదగుడ్డు" మొ వ్యవ) +==గాడిదలతో సేద్యం చేస్తూ కాలి తన్నులకు జడిస్తే ఎట్లా +గాడిద, సంగీతము, ఒంటె, అందము పూర్తిగా భిన్న ధ్రువాలు. వేటిలోనూ ప్రావీణ్యత లేని ఆ రెండూ, ఒకరినొకరు ప్రశంశించుకోవటం అర్థంలేని పని. ఈ విషయాన్నే, పాండిత్యము లేని వారు పరస్పరం ఒకరినొకరు పొగుడుకునే సందర్భములో ఈ సామెత ద్వారా వ్యక్తపరుస్తారు. +==గాదె క్రింద ఎలుక గాదె క్రిందే బ్రతకాలి +==గారెలు చేయవే పెండ్లామా అంటే వేలు మాత్రం చూపిందట +ఇలాంటిదే మరొక సామెత బిడ్డ ముద్దొచ్చినప్పుడే చంక నెక్కాలి. +==గాలి కబుర్లు అంటే నిజం లేని మాటలు అబద్దాలు అని అర్థం దీనికి పుకార్లు ప్రచారం చేయటం అని కూడా పిలుస్తారు లేనిపోనివి కల్పించడం విషయానికి సంబంధించి మనకు స్పష్టమైన సమాచారం లేకుండడం +==గాలికి పోయిన కంపను కాలికి తగిలించుకొన్నట్లు +==గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట== +గాలిలో దీపం పెట్టి, ఆర్పకుండా ఉండాలని దేవుని ప్రార్థించాట్ట వెనకటికెవడో. కనీస మానవ ప్రయత్నం చేయకుండా పూర్తిగా దేవునిపై భారం వేసే వ్యక్తిని ఉద్దేశించి ఈ సామెత వాడతారు. ఒక పని చేసే టప్పుడు ఆపని సక్రమముగా పూర్తి కావడానికి తాను చేయ వలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఆతర్వాత దేవునిపై భారం వేయాలని బోధించేది ఈ సామెత. +==గాలిలో మాట రాసినట్టు నీరు మూటకట్టినట్టు== +వృథా కార్యాలు, వ్యర్థ ప్రయత్నాలు చేసే వారిని గూర్చి ఈ సామెతను ఉపయోగిస్తారు. +సాధ్యంకాని పనిని సులభముగా చేస్తామని కోతలు కోసే వారి నుద్దేశించి ఈ సామెతను చెప్తారు. +==గాలిని మూట కట్టగలం గానీ, గయ్యళి నోరు మూయలేం +==గ్రాసంలేని కొలువు మీసంలేని బ్రతుకు రసం లేని కావ్యం ఒక్కటే +అసత్యం చెపితే అది నమ్మదగినదిగా ఉండాలి. ఇనుప గుళ్ళు నీట తేలుట అసాధ్యము, అటులనే కొయ్యతో చేసిన బెండ్లు మునుగుట అసాధ్యము. ఇది నిజమని నమ్మజూపు వాడు పరమ అసత్యవాది. ఈ సామెత ఈ విషయమునే తెలుపుచున్నది. +==గుండెల ఊపుడుకాదు తొడల తొక్కుడుకు తయారుకా అన్నాడట +*ఎక్క���వమంది గుమిగూడిన చోట ఎదైనా జరిగితే అది ఎవరు చేసారో కనిపెట్టడం కష్టం. దీనినే గుంపులో గోవిందా అని వ్యవహరిస్తాం. +* గుంపుగా వెళుతున్న వెంకన్న భక్తులలో ఒక్కడు గోవిందా అని అరిస్తే అందరు గోవిందా అని అరుస్తారు. వారిలో ఏ ఒక్కడు అరవక పోయినా అది తెలియదు. +==గుగ్గిళ్ళకు కొన్న గుఱ్ఱాలు అగడ్తలు దాటుతాయా +==గుడినే మింగే వానికి గుడిలోని లింగం ఓ లెక్కా== +పెద్ద పెద్ద దొంగ తనాలు చేసే వానికి చిల్లర దొంగ తనాలు ఒక లెక్కా అనే అర్థంతో ఈ సామెత వాడతారు. +==గుడిని మింగే వాడికి తలుపులు అప్పడాలు +==గుడిని మింగే వాడికి లింగం అడ్డమా +==గుడ్డి కన్నా మెల్ల నయము కదా== +పూర్తిగా అంధకారమయమయిన గుడ్డితనము కన్నా, అంతో ఇంతో కనపడు మెల్లతనము ఎంతో మిన్న. ఈ సత్యమునే ఈ సామెత ద్వారా పలు సందర్భాలలో చెప్పుదురు. ఒక ఉదాహరణ, పది రూపాయలు నష్టపోయే సందర్భంలో మరో చిన్న పని చేయటము ద్వారా ఆ నష్టాన్ని తొమ్మిది రూపాయలకు తగ్గించుకోగలిగే పరిస్థితిలో, ఈ సామెతను వాడవచ్చు. +==గుడ్డి కన్ను తెరిసినా ఒకటే మూసిన ఒకటే== +ఉపయోగం లేని పనిచేసి నపుడు ఈ మాట అంటారు. +==గుడ్డివాడి ఉపాయం గుడ్డివాడిది, గూనివాడి ఉపాయం గూనివాడిది +==గుడ్డివాళ్ళు ఏనుగులను తడిమి చూచి వర్ణించినట్లు +==గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒక్కటే +ఆతల్లికి పుట్టిన పిల్లలు తిరిగి ఆ తల్లినే వెక్కిరించడము. అలాంటి వారిని గురిం చి ఈ సామెతను వాడతారు. +==గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టుంది== +సమాదానము లేని ప్రశ్నలు వేసి నప్పుడు ఈ సామెతను వాడతారు. +సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్లు అలాంటిదే పై సామెత కూడ. +గుడ్డి ఎద్దు చేలో పడితే, అంతా విధ్వంసమే. దారీతెన్నూ తెలియక మొత్తం పైరుని నాశనం చేస్తుంది. కళ్ళు కనబడని కారణంగా అది పైరును మేసి నష్టపరచింది తక్కువైనా అది అటు ఇటు తిరిగి తొక్కి పైరుకు చేసిన నష్టం చాల ఎక్కువ. ఈ విషయాన్నే, తీరూతెన్నూ లేక అటూ ఇటూ పనిలేక తిరిగే వాణ్ణి ఉదహరిస్తూ చెబుతారు. ఆ సందర్భంలో చెప్పినదే ఈ సామెత. +==గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు== +వెనకటికెవరో గుమ్మడికాయల దొంగెవరు అంటే తన భుజాలు తడుముకున్నాట్ట. అంటే, తాను దొంగిలించి భుజాలపై మోసుకెళ్ళిన తాలూకు చిహ్నాలు భుజాలపై ఉన్నాయేమో అని చూసుకుంటున్నాడుట. నిజముగా దొంగతనము చేయనివాడయితే కదలక మెదలక ధైర్యంగా ఉండాలి. ఎవరైనా తప్పు చేసి తట్ర��పాటులో ఉంటే ఈ సామెతను వాడ్తారు. +==గురి తప్పినా పులినే కొట్టాలి గుంటనక్కను కాదు +గురివింద గింజ ముందు భాగమంతా ఎరుపుగా ఉండి, వెనుక వైపున ఓ నల్లటి మచ్చ కలిగి ఉండును. కానీ, ఆ నలుపు సంగతి ఎరుగక అది తనని తాను ఓ గొప్ప అందగత్తె నని భ్రమపడుతుంది. అదే విధముగా, తమలోని లోట్లు తెలుసుకోలేక, ఇతరులను తప్పు పట్టువారిని ఈ సామెతతో పరిహసించుట పరిపాటి. +==గురువుకే పంగ నామాలు పెట్టే రకం వాడు== +మోసం చేయడానికి తన, పర భేదం పాటించని వాడిని గురించి ఈ సామెత వాడతారు. +==గురువు నుంచుని త్రాగితే, శిష్యుడు పరిగెడుతూ త్రాగుతాడు +గుర్రం ఎక్కుతా, గుర్రం ఎక్కుతా అని, గుద్దంతా కాయకాసి కూర్చున్నడంట +==గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు== +గుడ్డి గుర్రం ఏ పనికీ, ఎందుకూ పనికి రాదు. అయినా దానికి దాణా పెట్టడం తప్పదు. అలాగే కొంతమంది ఇంట్లో ఏ పనీ చేయకుండా జులాయిలా తిరుగుతూ తిండి తినే సమయానికి మాత్రం ఇల్లు చేరతారు. ఇంట్లో మనిషి కాబట్టి తిండి పెట్టడం ఎలాగూ తప్పదు. అలాంటి వారికి ఉద్దేశించిందే ఈ సామెత. +==గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా +జన్మత: అబ్బే లక్షణాలను నేర్పనవసరము లేదని ఈ సామెత భావము. గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినడము అన్నది స్వత:సిద్ధముగా వస్తుంది. అది మరొకరు నేర్పనవసరము లేదని ఈ సామెత చెబుతోంది చేప పిల్లకుఈత నేర్పవలెనా అన్న సామెత కూడా ఇలాంటిదె. +గుర్రం తిండి గుర్రానిదే, ఆవు తిండి ఆవుదే. ఒకరికి సహాయపడి మరొకరి నుంచి ప్రతిఫలం ఆశించటం మూర్ఖత్వము. ఈ విషయాన్నే ఈ సామెత తెలియచేస్తోంది. +==గుర్రానికి ముడ్డిలో కాలితే వరిగడ్డి తింటుంది +==గుర్రానికి సకిలింత సంగీతానికి ఇకిలింత వుండాలి +==గుర్రాన్ని యేటివరకూ తీసికెళ్ళగలమే గానీ నీళ్ళు త్రాగించగలమా +==గుళ్ళో దేవుడికి నైవేద్యమే లేకుంటే పూజారి పులిహోర కోరాడట +==గుళ్ళో పిత్తక పోతే గుగ్గిలం వేసినంత పుణ్యం +గూబ అనగా గుడ్లగూబ అని అర్థం. గుడగూబ ఇంటిలోకి వస్తే ఆ యింటికి అరిష్టమని అందరి నమ్మకము. ఆ నమ్మకానికి ఈ సామెత సమాధానం. +==గేదె, దూడ వుండగా గుంజకు వచ్చెరా గురక వాయువు +==గొడుగుమీద గొడుగుంటే పిడుగుమీద పిడుగు పడినట్లే +==గొడ్డుకు ఒక దెబ్బ మనిషికి ఒక మాట +==గొడ్డుకి తిన్నది పుష్టి మనిషికి ఉన్నది పుష్టి +పశువులు రైతులకు తమ పిల్లలతో సమానమని అర్థము. +==గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ +ఒక ఇంట్లోకి పెళ్ళై ఒక ��డ పిల్ల వచ్చిన వేళ అదే విధంగా ఒక పశువు వచ్చిన వేళ మంచిదయితే ఆ యిల్లు బాగుపడుతుందని ఈ సామెతకు అర్థము. +==గొడ్డువాడు గొడ్డుపోయి ఏడుస్తుంటే మాదిగవాడు తోలు పోయిందని ఏడ్చాడట +పిల్లలను కాన్నామెకు కనేటప్పుడు వచ్చే ప్రసవ నొప్పులు ఎలావుంటాయో ఆమెకే తెలుస్తాయి. గొడ్రాలికి అనగా పిల్లలు కలగని స్త్రీకి ఆ నెప్పులు ఎలా వుంటాయో తెలియదని అర్థం. +==గొఱ్ఱు గుచ్చిన నేలకు కొరత వుండదు +==గొర్రె ఎంత పెరిగినా తోక బెత్తెడే +==గొర్రెలు గుంపు కూడితే గొప్ప వర్షం +==గొల్లల గోత్రాలు గొర్రెల కెరుక, గొర్రెల గోత్రాలు తోడేళ్ల కెరుక== +==గొల్లల గోత్రాలు గొర్రెలకు తెలిస్తే గొర్రెల గోత్రాలు గొల్లల కెరుక +తక్కువ కులం వారు ఆర్థికం బలపడితే తమ కులం చెప్పుకోడానికి ఇష్టపడరు. అంచేత వారు తమ పేర చివరన వేరే కులంవారి మకుటాన్ని పెట్టు కుంటారు రావు" అనేది ఒకప్పుడు ఒక ప్రత్యేక కులానికి మాత్రమే సంబంధించింది. కాని ఇప్పుడు అన్ని కులాల వారు దాని వాడు కుంటున్నారు. అలా వచ్చిందే ఈ సామెత. +==గొళ్ళెం లేని తలుపు కళ్ళెం లేని గుర్రం +==గొంగళిలో తింటూ వెండ్రుకలు ఏరి నట్లు== +గొంగళి అంటేనే వెంట్రుకలో చేసింది దానిలో అన్నం తింటే వెండ్రుకలు రావడము సహజమే వాటిని ఏరడము వృధా ప్రయాస. అలాంటి పని చేశే వారినుద్దేసించి ఈ సామెతను వాడతారు. +గోటితో పోయేదానికి గొడ్డలిని ఉపయోగించాల్సిన పని లేదు. అలాగే చిన్న విషయాల్ని చిన్నగానే సామరస్యంగా పరిష్కరించుకొవాలేగానీ అనవసర రాద్ధాంతం చెసుకోకూడదు అని దీని అర్థం. +రహస్యాన్ని రహస్యంగానే వుంచాలి. బయటకు చెప్పకూడదు అని అర్థం. +==గోడ మీద పిల్లి వాటం వాడు== +గోడ మీద వున్న పిల్లి ఎటు దూకుతుందో చెప్పడం కష్టం. అలాగే నీతి నియమం లేకుండా ఎటు అవకాశము వుంటే అటు వైపు వెళ్లే వారిని గురించి ఈ సామెత వాడతారు +==గోడకు కొట్టిన సున్నం, లంజకు పెట్టిన సొమ్ము తిరిగిరావు +ఏ విధముగా నయితే ఓ జిత్తులమారి నక్క ఓ గోతి వద్ద దాగి కూర్చోని, అందులో పడ్డ వారిని సంహరించి తింటుందో, దుష్టులు కూడా చెడు పనులు చేయుటకు సర్వధా తగ్గ అవకాశమునకై వేచిచూచుదురు అని ఈ సామెత తెలుపుచున్నది. +కష్టాలలో చిక్కుకున్నాడని అర్థం. ఉదా వాడు తెలిసి తెలిసి గోతిలో పడ్డాడు +(ఇది జాతీయము. దీనిని ఆ వర్గంలో చేర్చ వచ్చు) +కొంచెం ఆలస్యంతో బారి నష్టం జరిగే సందర్భాలు చాలమందికి అనుభవమే. ఆ సందర్భంగా వాడేది ఈ సామెత. +దీపం చిన్నదైనా అవసరంలో అదే అతి పెద్ద దిక్కు. స్వల్పమని దేనిని చీత్కారము చేయ కూడదు. గోదావరిలో పడ్డ వానికి గడ్డి పోచ చిక్కిన ప్రమాదంనుండి బయట పడే అవకాశమున్నది. కొంచెమే నని దేన్ని హీనంగా చూడకూడ దని ఉపదేశించేదే ఈ సామెత. +అతి చిన్న విషయాన్ని చిలువలు పలవలుగా వర్ణించి పెద్ద విషయంలాగా చేసే వారిని గురించి ఈ సామెత వాడతారు +ఒక దాని వెంట మరొక సమస్య ఎవర్నైనా చుట్టుముట్టినపుడు ఈ సామెతను ఉదహరిస్తారు. +గోరుచుట్టు అంటే చేతివేళ్ళు వాచి నొప్పి పెట్టే ఒక జబ్బు. ఇక ఆ వేలి మీద రోకలి పడిందంటే ఆ బాధ చెప్పనక్కర లేదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆవిధంగా దెబ్బ మీద దెబ్బ తగిలితే ఈ సామెత వాడతారు. +గోడ మీదున్న పిల్లి ఏ వైపుకు దూకుతుందో ఎవరూ ఊహించ లేరు అలాగే ఏ లక్ష్యం లేని పని చేసే టప్పుడు ఈ మాటను వాడతారు. +నీవు విసిరిన రాయి నీకే తగులుతుందని చెప్పడానికి ఈ మాటను వాడతారు. +ఏపని లేదని అర్థం. ఉదా: వాడు ఏ పనీ లేక గోళ్ళు గిల్లుకుంటున్నాడు. పని పాట చేయని వారినుద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు. +==ఘడియ వెసులుబాటు లేదు దమ్మిడీ రాబడి లేదు + + +చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు== +తెలివి తక్కువ వారిని గురించి చెప్పిన సామెత ఇది. ఇలాంటిదె మరొకటి చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికిందట ఒక అమ్మ' అలాంటి మతిమరుపు వారిని గురించి ఈ సామెత వాడతారు. +==చంకలో పిల్లను వుంచుకుని సంతంతా వెతికినట్లు +మతి మరుపు వారిని గురించి ఈ సామెతను వాడుతారు. +"నా బిడ్డేది నా బిడ్డేది" అని వెనకటికి ఒకామె ఊరంతా వెతకసాగిందంట. చివరకి ఎవరో చెప్తే కానీ చూసుకోలేదు, బిడ్డ తన చంకలోనే ఉందని! +చేతిలోనే ఏదన్నా ఉంచుకోని వెతికేవారిని చూసి, ఇలా అంటారు. కళ్ళజోడు, పెన్ను, టెలివిజన్ రిమోట్ వంటి వస్తువులను వెతికేవారికి ఈ అనుభవం తరచు ఎదురవుతుంటుంది. +ఇలాంటిదే మరొక సామెత అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు +==చంద మామను చూసి కుక్కలు మొరిగినట్లు== +మంచికి, చెడుకి ఒకే విధంగా స్పందించే వారి గురించి ఈ మాట అంటారు. కుక్కలు దొంగలు వచ్చినా మొరుగుతాయి, చందమామము చూసి కూడా మొరుగు తాయి. వాటికి ఆ తేడా తెలియదు. +దానం, ధర్మం, తమ శక్తానుసారం చేసే వారి గురించి ఈ సామెత చెప్తారు. +అందమైన స్త్రీ ఏ కారణం చేతనైనా సన్నబడినా ఆమెలోని అందం, ఆకర్షణ తగ్గవని చెప్పడానికి ఈ సామెతను ��పయోగిస్తారు. +చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు== +దోసకాయ (దీనిని పొడుపు కథలు జాబితాలో చేర్చ వచ్చు) +==చక్కని రాజమార్గం వుండగా గోడలు దూకట మెందుకు +==చక్కనైన చుక్క కోసం లెక్కలేని యిక్కట్లన్నట్లు +==చక్రవర్తి చేస్తే శృంగారం చాకలాడు చేస్తే వ్యభిచారం +==చచ్చిన తరువాత తెలుస్తుంది శెట్టిగారి బండారం +==చచ్చినదాని పిల్లలు వచ్చినదాని కాళ్ళ క్రింద +==చచ్చిన పామును కొట్టటానికి అందరూ మొగాళ్ళే +ఇస్తానన్న కట్నం ఇవ్వకుండానె చచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు ఎంతో కొంత ఇస్తానన్న దాంతో తృప్తి పడి తీసుకోవడం ఉత్తమం అని దీని అర్థం. +చని పోయిన వారి గురించి అన్ని మంచి విషయాలు మాత్రమే చెప్పతారు. వారు జీవించి వున్నప్పుడు చేసిన తప్పుడు పనులను చెప్పారు. అలా చెప్పేదె ఈ సామెత. +==చచ్చే కాలానికి సత్యభామ వేషం వేసినట్లు +బాగా చదివినవాడు, చిన్న చిన్న తప్పులు చేస్తే ఉపయోగంచే సామెత ఇది. చదివేస్తే ఉన్నమతి పోయింది అని +చదువు రాక ముందు కాకరకాయ చదువు వచ్చాక కీకరకాయ== +చదువు రాక ముందు అందరి లాగె కాకర కాయ అన్నాడు. చదువుకున్నాక అందరిలాగె కాకరకాయ అని అంటె తన ప్రత్యేకత ఏముంటుందని దాన్ని కీకరకాయ అన్నాడట. ఎవరైనా బడాయికి పోయి నప్పుడు ఈ సామెతను వాడుతారు. +చదువు రాని చాకలి ఊరందరి బట్టలు వుతికి వాటిని తిరిగి వారికెచ్చే టప్పుడు ఎక్కడ పొరబడకుండా ఎవరి బట్టలు వారికె ఇస్తాడు. ఎంత చదివిన వాడైన ఇలా కలిసి పోయిన బట్టలను ఎవరివి వారికి గుర్తించి ఇవ్వలేదు. ఆ విధంగా పుట్టినదే ఈ సామెత. +తాను మాత్రం సుఖంగా ఉండేందుకు కావల్సిన ఏర్పాట్లన్నీ సరిచూసుకొని ఎదుటి వారు ఏమైపోతే నాకెందుకు అని అనుకునే వారిని విమర్శిస్తున్నట్లు కనిపిస్తుంది ఈ సామెత. ఈ సామెత రూపకల్పనలో అచ్చ తెలుగుతనం, జానపద హృదయ స్పందన, తెలుగింటి ఆహార అలవాట్ల వివరణ కనిపిస్తుంటాయి. ఉదయాన్నే చద్దెన్నం తినడమనేది పల్లెటూళ్ళలో నిత్యం కనిపించే ఒక విషయం. నేటి ఆధునిక సమాజంలో తిన్నట్లుగా 'టిఫిన్‌'ల పేరుతో ఏవేవో వంటకాలు తినడం కాక ఆరోగ్యానికి హాని కలిగించని విధంగా రోజంతా మనిషికి ఉత్సాహాన్ని కలిగించేందుకు దోహదం చేసే చద్దెన్నం తినడం ఎంతో మంచిది. ఈ అన్నం తిన్న వారికి మళ్ళీ మిట్ట మధ్యాహ్నం వరకు ఆకలీ, అలుపు ఉండవు. ఒక ఇంట్లో కొద్దిగా స్వార్థపరురాలైన ఒక ఇల్లాలు ఉదయాన్నే తాను మాత్రమే చద్దెన్నం తి���ి ఎంతసేపైనా తన భర్త ఆకలిని గుర్తించక వేరే ఆహార పదార్థాలు వండక కూర్చున్నదట. ఈ విషయాన్ని కొంత నిశితంగా పరిశీలిస్తే తన స్వార్థం తాను చూసుకొని ఎదుటివారు ఎంత ఇబ్బంది పడుతున్నా చూస్తూ కూర్చొనే వారు ఎంత మతిమాలిన వారోననే విషయం అర్థమవుతుంది. +==చదివింది, చదవనిది ఒకటిగా ఉండటమే పండిత లక్షణం +==చదివిన వాడికన్నా చాకలాడు మేలు చాకలాడికన్నా మేకలాడు మేలు +==చద్దికూడు తిన్నమ్మ మగడి ఆకలి ఎరుగదు +==చదువక ముందు కాకర కాయ చదివిన తర్వాత కీకరకాయ +==చదువరి మతికన్నా చాకలి మతి మేలు +==చదువు చన్ను విడిచి చన్ను పట్టుకునే లోపలే రావాలి +ఏమి తెలియని వయసులో అమ్మ చన్ను ఆసరాగా ఉంటాడు పిల్లాడు. కల్మషము తెలియని ఆ వయసు నుండి పెద్దయ్యాక భార్య వచ్చే వరకే బాధ్యతారహితంగా ఉండగలడు. +ఈ మధ్య సమయంలోనే చదువు మీద ఏకాగ్రత చూపగలడు. అందుకే ఈ సమయంలోనే చదువు ఒంటబట్టాలని పెద్దలు హితవుగా చెప్పే సామెత ఇది. +==చదువు మా యింటా వంటా లేదు +కనీసం సంధ్యావందనం కూడా లేదని దానర్థము.చదువు లేకపోయినా కనీసం ఆచారమన్న ఉందా అని!లేదా కనీసము అది కూడా లేదు అని భావం +చని పోయిన వారెవరైనా వాని మంచి గుణాలను మాత్రమే చెప్తారు. చెడుగుణాలను చెప్పారు. ఇది ఒక సంప్రదాయం. ఆ చనిపోయిన వాడు తన జీవిత కాలంలో ఎలాంటి ఘన కార్యాలు చేయక పోయినా కనీసం అతని కన్నులనైనా పొగడాలనే అర్థం ఈ సామెతలో ఉంది. ఆ విధంగా పుట్టినదే ఈ సామెత. +==చన్ను, తోటకూర చేయి తగలందే పెరగవు +==చన్ను, తోటకూర చేయి తగలందే పెరగవు +==చల్ల ఎట్లా వున్నయిరా అంటే చల్లకన్నా గొల్లదే బావుంది అన్నాట్ట +==చల్ల కుండకు, చంటి బిడ్డకు చాటుండాలి +కొంతమంది మజ్జిగ కోసం పొరుగింటికెళ్ళి, మొహమాటంవల్లగాని వేరే ఏదైనా కారణంవల్లగాని అడగలేక తీసుకొచ్చిన ముంతను దాస్తుంటారు. ఎవరైనా ఈ విధంగా ఏదైనా సహాయంకోరి వచ్చి ఆఖరి నెముషంలో విషయాన్ని నానుస్తున్నప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. +==చలిరాత్రి విరహాలకు కౌగిళ్ళే దుప్పట్లు అన్నట్లు +వివరణ: ఒక భర్త తన భార్యకు ఒక రహస్యంచెప్పి ఎవ్వరికి చెప్పవద్దన్నాడట. ఆమె ఒక్కచాకలి దాంతో మాత్రమే చెప్పి ఇంకెవ్వరికి చెప్పలేదట. తెల్లారె సరికి ఆ విషయం ఊరంతా తెలియడంతో అతను తన భార్యను ఆరా తీశాడు. దానికి ఆమె ఒక్క చాకలి దానికి మాత్రమె చెప్పాన ని అన్నదట. చాకలిది ప్రతిరోజు ప్రతి ఇల్లు పలుమార్లు తిరిగే వ్వక్తి. అలాంటి వారికి చెప్పితే ఊరంతా ��ెలియకుంటుందా ఈ సామెత ఆ విధంగా పుట్టింది. +==చాకలి తెలుపు, మంగలి నునుపు తప్ప అయ్యవద్ద పసేంలేదు +==చాకలిది సందె ఎరుగదు మాలది మంచమెరుగదు +==చాకలి వాడు ఏ రేవున వుతికితేనేం +==చాకలి-మంగలి పొత్తు ఇంటికి రాదు సొత్తు +==చాదస్తపు మొగుడు చెపితే వినడు చెప్పకపోతే కరుస్తాడు +==చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు== +ఈ సామెత కొద్దిగా అమాయకపు మొగుడి గురించి, పది మందిలో ఉన్నప్పుడు ప్రక్కవారిని అర్ధం చేసుకోకుండా, ప్రక్కవారి సున్నితపు సంకేతాల్ని పట్టించుకోకుండా, లౌక్యం లేకుండా ప్రవర్తించె వారిని ఉద్దేశించి అసహంగా వాడుతారు. +ఇది నిజానికి శృంగారానికి సమయం అయినప్పుడు మెల్లిగా చెవిలో గొణుగుతుంది. అది పట్టించుకోని భర్తకు పైకి గట్టిగా చెప్పలేక పది మందిలో ఉన్న భర్తను పడక గదికి పిలువలేక తొడగిల్లుతుంది. దానిని అర్ధంచేసుకోలేని భర్త "అబ్బ ఏమిటే అలా గిల్లావు" అని ఏడుపు మోఖం పెడతాడు. ఆ సందర్భం నుండి పుట్ట్టిన సామెత ఇది. నర్మగర్భంగా చెబుతున్న విషయాన్ని అర్ధం చేసుకొని వారి పట్ల ఈ సామెతను వాడుతారు. అసలు సామెత "ఛాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు" +చాప కింద నీరు దాని మీద కూర్చున్న వారికి తెలియ కుండా వస్తాయి. ఆ విధంగా ఎవరికీ తెలియ కుండా తన ఉనికిని తెలియనీయకుండా ఇరువురి మధ్య కలహాలు పెట్టడాన్ని ఈ సామెతతో ఉదహరిస్తారు. +ఉడుత పాపడుకి చారల శరీరంతోపాటు తోక దూదితో చేసిన కుచ్చులాగా ఉంటుంది. +అసలు కన్నా కొసరెక్కువని ఈ సామెతకు అర్థం: ఇలాంటి అర్థాన్నిచ్చేదే ఇంకొక సామెత గేదె పాతిక, బందె ముప్పాతిక'' +==చాలని బట్ట కొంటే చినిగేవరకూ దుఃఖం చాలని మగడిని చేసుకుంటే చచ్చేవరకూ దుఃఖం +==చాలుపై చాలు దున్నితే చచ్చుచేనైనా పండుతుంది +ఏదైనా ప్రమాదం నుండిగాని, విపత్కర పరిస్థితి నుండిగాని ఎవరైనా అతి కష్టమ్మీద బయటపడినప్పుడు తమ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు. +==చావుకు పెడితే గానీ లంఖణాలకు దిగడు +==చింతకాయలమ్మేదానికి సిరిమానమొస్తే, చింతకాయను చూసి టుంకిరి బింకిరికాయ ఇదేమి కాయ అన్నదట +==చింతకాయలు బేరం చేస్తూ వంకాయల్ని ఏరినట్లు +చింత చెట్టు చచ్చినంత మాత్రాన అదివరకే దానికి కాచిన చింతకాయల పులుపు చావదు. కొంత మంది వయసు మీద పడినవారు కూడా ఇంకా యౌనపు వేషాలెఏస్తుంటే ఈ సామెత చెప్తారు. +==చింత చెట్టు టూటిందంటే టూటేకాలమొస్తే టూటదా అన్నదట +==చింతలు లేక పోతే సంతలో నైనా నిద్ర పోవచ్చు== +ఎంతటి మెత్తటి పరుపులపై పడుకున్నా మనస్సు నిలకడగా లేక పోతే నిద్ర పట్టదు. కాని మనస్సులో ఏలాంటి కలతలు లేకుంటే సంతలోకూడ నిద్ర పోవచ్చుననేది ఈ సామెత అర్థం. సంత అన అనేక రణగొణుల ద్వని మయం. అయినా సరే నిద్ర పోవచ్చుననేది ఈ సామెత అంతరార్థం. +==చింతాకంత బంగారంతో మెడచుట్టూ గొలుసు కావాలన్నట్లు +==చిక్కినవాడు సిగ్గెరుగడు బలిసిన వాడు వావి ఎరుగడు +==చిత్తం వనితల మీద ధ్యానం దేవుడి మీద +==చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పంటిస్తాను అంటుంది వరి +==చిత్త చినుకు తన యిష్టమున్న చోట పడుతుంది +==చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే వీసానికి పుట్టెడు పండుతానంటుంది జొన్న +==చిత్త స్వాతులు చిత్తగించి విశాఖ విసురుతే మొదలు తంతే ఏడు గింజలు రాలుతాయి +==చితి చచ్చినవాణ్నీ, చింత బ్రతికిన వాణ్నీ కాలుస్తుంది +దేవుడి దగ్గరకు వెళ్ళినపుడు కొంతమందికి దృష్టి దేవుడి మీద కన్నా బయట వదలిన చెప్పుల మీదనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళను ఉద్దేశించి చెప్పినదే ఈ సామెత. +==చిత్తం చెప్పుల మీద భక్తి శివుడి మీద +==చిత్తం వనితల మీద ధ్యానం దేవుడి మీద +పూజా సమయంలో మనసు దేవునిమీద నిలిపి వుంచాలి. అలా లేనప్పుడు ఆ పూజ ఫలితానివ్వదు. ఏపని చేసినా దాని మీద ద్యాస వుంచాలి. ఇది ఈ సామెత అర్తం. +==చిన్నమ్మ సింహద్వారాన వస్తే పెద్దమ్మ పెరటిద్వారాన పోతుంది +==చిన్నమ్మ చిందేస్తే, చీరదారి చీరది ,సింగారందారి సింగారానిది== +==చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి== +ఎంత చిన్న పనైనా పూర్తి శక్తితో శ్రమించాలని ఈసామెతలోని అర్థం: +==చిన్నవాళ్ళు తింటే చిరుతిండి పెద్దవాళ్ళు తింటే ఫలహారం +==చిమడకే చిమడకే ఓ చింతకాయా! నీవెంత చిమిడినా నీ పులుపు పోదే +==చిలిపి వూహల వయ్యారికి చిలిపిదనాల శృంగారం అన్నట్లు +==చిలుం వదిలిస్తే గానీ చీద్రం వదలదు +==చీకటింటికి పోతే సిగ్గైతది అంటే,అట్లైతే సంసారమెట్లైతది అన్నారట== +కష్టాలు కొన్నాళ్లు సుఖాలు కొన్నాళ్లు అని అర్థం. ఎల్లప్పుడు కష్టాలె వుండవని చెప్పే సామెత ఇది. +==ఛీ! కుక్కా అంటే, ఏమక్కా! అని అన్నదట +చీదితే ఊడిపోయే ముక్కు తుమ్మితే ఉంటుందా +శాశ్వతము కానికి అని అర్థం. శాశ్వతము కాని విషయము చెప్పేటప్పుడు ఈ సామెతను వాడుతారు. +==చీమ ఒళ్ళు చీమకు బరువు ఏనుగు ఒళ్ళు ఏనుగుకు బరువు +��ల్పులకు సహాయం చేసినందువల్ల సంపన్నులకు ఎలాంటి నష్టమూ ఉండబోదు. +==చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలు +==చీర కట్టినమ్మ శృంగారం చూడు గుడ్డ కట్టినమ్మ కులుకు చూడు +==చీర సింగారించేటప్పటికి ఊరు మాటు మణిగింది +==చీరకు సిగ్గులు రవికకు ముద్దులు నేర్పినట్లు +==చుట్టు అయినా సులువు దారే మంచిది +చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు== +చుట్టుగుడిసె అనగా అతి చిన్న నివాసము. అది వుంటే దాన్ని శుభ్రం చేసుకోవడము చాల సులభము. అలాగే బోడి గుండు వుంటే తల స్నానము చేయడము అతి సులభము అలా పుట్టినదే ఈ సామెత. +==చుట్టతాగి చూరులో పెడితే ఇల్లు కాలిందట +==చుట్టూ చూరు మంగళం నడుమ జయమంగళం +==చుట్టూ శ్రీవైష్ణవులే కల్లుకుండ కనబడటం లేదు +ఇలాంటిదే మరో సామెత: అందరూ వైష్ణవులే రొయ్యల బుట్ట మాయమైనదట +==చూచేవారుంటే సొమ్ములు పెట్టాలి చేసేవారుంటే పిల్లల్ని కనాలి +==చూడ చుట్టము లేదు మ్రొక్క దైవము లేదు +==చూపితే మానం పోయె చూపకపోతే ప్రాణం పోయె +==చూపులకే ఆబోతు రూపం పనిలో నీరసాలరాజు +అవసరంలో ఆదుకోకుండా ముఖం తిప్పుకొని వెళ్లి పోయే బంధువులు. అలాంటివారిగురించి ఈ సామెత పుట్టింది +''పైన పటారం లోన లొటారం లాంటిదే ఈ సామెత. +==చూపులకు కడుపులొస్తాయా? ముద్దులతో ఆకలి తీరుతుందా +==చూపులు దేవుని మీద చిత్తం బయట వదిలిన చెప్పుల మీద== +దేవుని మీత చిత్తం నిలపలేక పోవటము. వారినుద్దేసించిన సామెత ఇది. జనం గుడిలోనికెళ్ళెటప్పుడు చెప్పులు బయట వదిలేసి లోపలికి వెళ్ళతారు. ఇదే అదనుగా భావించి కొందరు ఆ చెప్పులను ఎత్తుకొని వెళుతుంటారు. అలా చెప్పులు బయట వదిలి లోనికి వచ్చిన భక్తులకు మనసులో వారు బయట వదిలిన చెప్పులు ఎవరైనా ఎత్తుకెళ్ళారో యని అలోచిస్తూ దేవునిపైన మనస్సు నిలుపలేక పాతారు. ఆ విధంగా పుట్టినది ఈ సామెత. +==చూపుల మగవాడే కానీ సుఖాల మగడు కాదు అన్నట్లు +==చూపుల పసే గానీ చేతల పసలేదన్నట్లు +==చూరుకత్తి తెగుతుంది కానీ చూపుకత్తి తెగుతుందా +రామాయణంలో రాముడు హనుమంతున్ని సీత ఎక్కడుందో చూసి రమ్మని పంపితే, హనుమంతుడు లంకలో ఉన్న సీతను చూడటమేకాకుండా లంకానగరం మొత్తాన్ని కాల్చి రావడం మనకు తెలిసిందే. అదే విధంగా, ఎవరైనా చెప్పిన పని మాత్రమే కాకుండా చెప్పని పనులు కూడా చేసి వచ్చినప్పుడుగాని, అలా చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పడు గాని ఈ సామెతను వాడుతారు +సౌమ్యంగా కన్పిస్తూ భయంకరంగా పోట్లాడేవారిన��� గురించి ఈ సామెతను వాదతారు. +==చెంబు అమ్మి తపేలా తపేలా అమ్మి చెంబు +==చెంబు చేతిలో ఉంటే కంభము వరకు పోయిరావచ్చు== +==చెక్కెర పందిట్లో తేనెల వాన కురిసి నట్లు== +అన్ని విషయాలు కలిసి వస్తుంటే ఈ సామెత వాడతారు. అతనికి పట్టిందల్లా బంగారమె అనే సామెత లాంటిదె ఇది. +==చెట్టు ఎక్కేవాడికి ఎంతదాకా ఎక్కుడు మెట్లు పెట్టగలం +విపరీత కాలానికి విపరీతమైన బుద్ధులు పుడుతాయని అర్థం. అలా విపరీతంగా ప్రవర్తించే వారి గురించి ఈ మాట వాడతారు. +==చెక్కకపోతే దిమ్మ చెక్కితే బొమ్మ గుళ్ళో వుంటే అమ్మ అన్నట్లు +==చెట్టు నాటేదొకడు ఫలం అనుభవించే దొకడు +==చెట్టు నీడకు పోతే కొమ్మ విరిగి మీద పడ్డట్లు +==చెట్టులేని చేను చుట్టాలు లేని ఊరు +==చెట్టు వెనుకాల చందమామ తొంగి తొంగి చూస్తుందని, గుడిసె వెనుకాల కోడి గుడ్డు పెట్టనందట== +అత్యంత అమాయకుల గురించి ఈ సామెత పుట్టింది. +మోసకారి మాటలతో మోసంచేసె వారి గురించి ఈ సామెత పుట్టింది. +అసంబద్దమైన ప్రశ్నలు వేసె వారిని గురించి ఈ సామెత పుట్టింది +ఇతరులకు చెడు తలపెడితె తానె చెడి పోతాడనె అంతరార్థం ఈ సామెత భోదిస్తున్నది. +==చెడిన కాపురానికి ముప్పేమిటి? చంద్రకాంతలు వండవే పెళ్ళామా అంటే== +==చెడిన చేనుకు ముప్పేమిటి? మొండికాలికి చెప్పేమిటి +==చెడిన శ్రాద్ధం చెడనే చెడింది పిత్తరా పీట పగుల అన్నట్లు +==చెడినా, పడినా చేసుకున్న మొగుడు తప్పడు +==చెడినా శెట్టి శెట్టే చినిగినా పట్టు పట్టే +==చెడి బ్రతికినమ్మ చేతలు చూడు బ్రతికి చెడ్డమ్మ చేతులు చూడు +==చెడి స్నేహితుని ఇంటికి పోవచ్చుకానీ చెల్లెలింటికి పోరాదు +==చెడుచెడుమనే వారేగానీ చేతిలో పెట్టేవారు లేరు +==చెప్పి చెప్పి చెప్పుతో తన్నించుకో మళ్ళీ వచ్చి మాతో తన్నించుకో +==చెప్పుడు మాటలకన్నా తప్పుడు మాటలు నయం +==చెప్పులున్న వాడితోనూ, అప్పులున్న వాడితోనూ పోరాదు +==చెప్పులు కుట్టేవాడి దృష్టి నడుస్తున్న వాళ్ళ కాళ్ళమీదే +==చెప్పులోని రాయి ఇంటిలోని పోరు ఒక్కటే +ఇలాంటిదె మరొక సామెత చెప్పే వాడికి వినే వాడు లోకువ +==చెప్పేవాడికి చాదస్తమయితే వినేవాడికి వివేకం ఉండొద్దా +==చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు== +శ్రీరంగడు అంటే శ్రీ మహా విష్ణువు శ్రీరంగనీతులు అంటే శ్రీ మహా విష్ణువు పేరుతో చెప్పే నీతులు దొమ్మరి కులస్తులలో కొంత మంది పేదరికం, ఆకలి వల్ల మనసు చంపుకుని వ్యభిచారం చేస్తారు. కొం�� మంది తాము గౌరవంగల మనుషులమని చెప్పుకుంటూనే అందుకు విరుద్ధంగా వ్యభిచారిణులతో పడుకుంటారు. శ్రీరంగ నీతులు చెపుతూ దొమ్మరి గుడిసెలలో దూరడం అంటే దేవుని పేరుతో నీతులు చెపుతూ అందుకు విరుధ్ధముగా పాడు పనులు చెయ్యడం అని అర్థం. అలాంటి వారినుద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు. +కఠినంగా ప్రవర్తించటానికి వెనకాడితే ఫలితాలు చేతికందవు.బెల్లం కావాలి అంటే చెరకు గడను పిండి పిప్పి చేసి రసం తీసి వండాలి. +చెవిటివాడి ముందు శంఖం ఊదితె అందులోని మాధుర్యం వాడు గ్రహించ లేడు. అలా నిరర్థకమైన పనులు చేసే వారి గురించి ఈ సామెత చెప్తారు. +చెవిలో దూరిన జోరీగ మనిషికి నాన ఇబ్బంది పెడుతుంది. ఆవిధంగా తనకు ఉపయోగం లేకున్న ఇతరులను ఇబ్బంది పెట్టె వారి గురింది ఈ సామెత పుట్టింది. +చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు +ఎదుటి వాడికి చెడు చేయాలని తలిస్తే తానె చెడి పోతాడు. అనే అర్థంతో ఈ సామెత పుట్టింది ఇలాంటిదే ఇంకో సామెత వుంది: అది తాను తీసిన గోతిలో తానె పడ్డట్టు]] +==చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి దొమ్మరి పనులు +==చెమటే చందనం అధరమే అమృతం అన్నట్లు +==చెయ్యిని దాచుకుంటాం గానీ కులం దాచుకుంటామా +==చెయ్యి పుచ్చుకు లాగితే రాలేదుగానీ రమ్మని చీటీ వ్రాశాట్ట +==చెరపటానికి చేతులు వస్తాయి గానీ నిలపడానికి చేతులు రావు +==చెరువుకు గండిపడి నీళ్ళు పోతుంటే, పీత బొక్కలు పూడ్చినట్లు +==చెరువుకు చేరువ చుట్టాలకు దూరం ఉండాలి +సుమతీ శతకంలో పద్యం తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ +==చెరువు నిండితే కప్పలు సంపదలోనే చుట్టాలు +సుమతీ శతక పద్యం ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బందువులొత్తురు, తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ +చెరువు మీద అలిగి స్నానం చేయనట్లు== +చెరువు మీద అలిగి స్నానం చేయకపోతె చెరుకేమి నష్టం లేదు. అది గ్రహించని అమాయకుల గురించి ఈ సామెత పుట్టింది. +==చెరువులో వున్న గేదెను కొమ్ములు చూసి బేరమాడినట్లు +==చెల్లని కాసూ ఒల్లని మొగుడూ ఒక్కటే +==చెల్లని దాన్ని చేనికాడ పెడితే అయిన కంకులన్నీ అమ్మగారింటికి పంపిందట +==చెల్లెలు మొగుణ్ణి చూసుకొని చెయ్యిరగ బడిందట +==చెవిటి చెన్నప్పా అంటే సెనగల మల్లప్పా అన్నట్లు +==చెవిటిదానా సేసలు పట్టమంటే బియ్యం తినిఉంటే అశుద్ధం తిన్నట్లే అందట +==చెవిటివాని ముందు శంఖమూదితే దాన్ని కొరకను నీ తాతలు ద���గి రావాలన్నాడట +==చెవిటి వానికి వినిపించాలంటే శంఖు చక్రాలవాడు దిగిరావాలి== +==చెవిలో గుబిలికి ఏ పుల్లైతేనేం గెలుక్కోను +==చేటూ పాటూ లేనమ్మ ఇల్లెక్కి పిండి కొట్టిందట +==చేతికి పట్టిన జిడ్డు లెక్కకు రాదు== +==చేతిలో వుంటేనే అర్థం పక్కలో వుంటేనే పెళ్ళాం== +==చేతి వ్రేళ్ళు అయిదూ ఒక రీతిగా ఉన్నాయా +==చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు +ఏదైనా ఒక పని చేయడానికి చేత కాక పోతె తప్పించు కోడానికి ఏదో సాకు చెప్పే వారిని గురించి ఈ సామెత పుట్టింది. +జరగాల్సిన నష్టం జరిగి పోయాక ఆ తర్వాత తీరిగ్గా నివారణ చర్యలు చేపట్టే అమాయకులను మేల్కొనడానికి ఈ సామెతను చెప్తారు. +చేతిలో చిల్లిగవ్వ లేదు మీసాలకు సంపెంగ నూనె== +==చేతిలోని అన్నం చెరువులోకి విసిరి చెయ్యి నాకి చెరువునీళ్ళు తాగినట్లు +==చేతి సొమ్ము ఇచ్చి చెప్పుతో కొట్టించుకున్నట్లు +==చేతైన మగోడు చాలా పొద్దున లేచి ఊడ్చుకొని చల్లుకొని ఇంకోచోట పడుకున్నాడట +చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి== +మనిషికైనా ఊరికైనా మరేదేనికైనా ఒక పద్ధతి కట్టు బాటు వుండాలని ఈ సామెత నిర్థేసిస్తున్నది. +==చేయలేనమ్మకు కులుకులు మెండు వండలేనమ్మకు వగపులు మెండు +==చేలో పుట్టిన బీడు ఎక్కడికి పోను +==చేలో లేనిది చేతిలో కెలా వస్తుంది +==చేసిన చేష్టలు ఎవరూ చూడరు, కోసిన ముక్కు అందరూ చూస్తారు +==చేసిన చేతికి చేవ చేయనిచేతికి చీకు +==చేసిన పాపాలకూ పెట్టిన దీపాలకూ సరి== +==చేసిన మేలు వృధా కాదు చేసిన కీడు వృధా పోదు== +ఎవరు చేసుకున్న పాప పుణ్యాల మేరకు వారికి ఫలితము వస్తుందని ఈ సామెత చెప్పుతున్నది +==చేసేది శివ పూజ దూరేది దొమ్మరి గుడిసె +==చేసే పని చేయమంటే నేసేవానివెంట పోతానన్నట్లు== +==చేసేవి నాయకాలు, అడిగేవి తిరుపాలు, పెట్టకుంటే కోపాలు== +==చేస్తే మంచిపని చేయాలి బ్రతికితే మంచిగా బ్రతకాలి== +==చోటే లేదంటే మూల కూర్చోనా అన్నట్లు== +శత్రువును తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నష్టమే కలుగుతుందని తెలిపే సామెత ఇది. చొప్ప వామిలో నిప్పు దాచుకుంటే ఆ వామి అంతా కాలిపోతుందు. అనగా అలాంటి అమాయకపు పనుల వలన విపరీతమైన నష్టము వస్తుందని చెప్పడము ఈ సామెత ముఖ్యోద్దేశము. + + +==డబ్బు దాచిన వాడికే తెలుసు లెక్క వ్రాసిన వాడికే తెలుసు +డబ్బు కోసం గడ్డి తినే రకం== +డబ్బుకోసం ఎంతటి నీచపు పనికైనా సిద్ధపడే వారినుద్దేశించి చేప్పే సామెత ఇది. +డబ్బుకు లోకం దాసోహం అ���టే ధనానికి అంతా దాసులవుతారని. దాసః అహం దాసోహం అనగా నేను దాసుడను అని అర్ధం. తెలుగు పదాలనూ, సంస్కృత సమాసాన్నీ కలగలపడం ఈ సామెతలో ఒక ప్రత్యేకత. +దాదాపు అందరికీ తెలిసిన జీవిత సత్యాన్ని చాటే నానుడి ఇది. ఇదే అర్ధంలో ఎన్నో పాటలు, పద్యాలు, వాడుక పదాలు ఉన్నాయి. +* ధనమేరా అన్నిటకీ మూలం అనే తెలుగు సినిమా పాట +* పైసా మే పరమాత్మా అన్న నానుడి +* అర్ధము పురుషార్ధములలోనుత్తమము. అర్ధవంతునకసాధ్యము లోకమందేదియును కానరాదు అని చిన్నయసూరి రచించిన మిత్రలాభము]]లో ఉంది. +==డబ్బు ఉంటే కొండమీది కోతి కూడా దిగి వస్తుంది +అన్నింటికన్నా డబ్బే ప్రధానమని చెప్పే సామెత ఇది. +==డబ్బు మాట్లాడుతూంటే సత్యం మూగ పోతుంది +అన్నింటికన్నా డబ్బే ప్రధానమని చెప్పే సామెత ఇది. +డబ్బు లేని వానికి బోగముది తల్లి వరస== +డబ్బు లేని వాడు బోగము దాని వద్దకు పోలేడు. కనుక ఆమె తల్లి వరస అవుతుందని అర్థం అందని ద్రాక్ష పళ్లు పుల్లన అనే సామెత లాంటిదే ఇది కూడ/. +==డబ్బు సభ కడుతుంది ముద్ద నోరు కడుతుంది +==డాబుసరి బావా! అంటే డబ్బులేదే మరదలా! అన్నాడట +==డూ డూ బసవన్నా అంటే తలూపినట్లు +డొంకలో షరాఫు ఉన్నాడు, నాణెము చూపుకో వచ్చును== +ఇప్పటికే కష్టాలలో ఉన్నవాడు వచ్చి ఇంకా కష్టాలలో ఉన్న మరోక్కడితో తన కష్టాలు మొరపెట్టుకొంటే ఈ సామెత వాడుతారు. +డోలుకి ఒక ప్రక్కనే దరువు పడుతూ ఉంటుంది. మద్దెలకి రెండు ప్రక్కల దరువు పడుతుంది. తక్కువ దరువు తింటున్న డోలు, ఎక్కువ దరువు పొందుతున్న మద్దెలకు చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి +పైన పటారం లోన లొటారం అనే సామెత లాంటిదే ఈ సామెత కూడ ఇంట్లో పస్తులున్నా బయట మాత్రం డంబంగా తిరిగే వారినుద్దేసించి ఈ సామెత చెప్తారు. +==ఢిల్లీ రాజు కూతురైనా పెళ్ళి కొడుకుకు లోకువే +ఢిల్లీ అంతటి నగరానికి రాజైనా ఓ తల్లికి కొడుకే. అలాగే మనం ఎంత గొప్పవారమయినా మన మూలాల్ని, గతాన్ని మర్చిపోకూడదు అని దీని అర్థం. + + +==ఊకదంపుడు మాటలు పనికిరాని,ఉపయోగం లేని మాటలు +ఊక అనగా బియ్యంలేని పొట్టు. బియ్యంకొరకు దానిని దంచడము వృథా. ఉపయోగములేని పని చేయడాన్ని వృథాప్రయాసను ఈ సామెత తెలియజేస్తుంది +==ఊగే పంటి కింద రాయి పడ్డట్టు== +అసలే కష్టాలలో ఉన్నప్పుడు దానికి తోడు మరిన్ని కష్టాలు వచ్చిపడి భరించలేని స్థితి. అటువంటి సందర్భాలలో ఈ సామెతను వాడుతారు. +==ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు== +ప్రాణా���ికి తెగించి దేన్నో సాధించ ప్రయత్నించి, ఆ ప్రయత్నములో ప్రాణములే ప్రమాదములో పడినప్పుడు, ఈ సామెతను చెప్పుదురు. అసలు ప్రాణం అంటూ ఉంటే ఉప్పుకల్లు అమ్ముకోవటంతో సహా ఏదో ఒక పని చేసుకు బ్రతకవచ్చు అని ఈ సామెత యొక్క అర్థం. +ఎవడో ఒక ప్రబుద్ధుడు ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్నవాడి ముక్కు మూసాట్ట. అవివేకముతో చేసే వారి పనులు ఏ విధముగా ఉండునో ఈ సామెత తెలియచెప్పుచున్నది. +==ఊపిరి వుంటే ఉప్పుగల్లు అమ్ముకొని బ్రతకవచ్చు== +ఊపిరి అనగా ప్రాణం అని అర్థము. దానికున్న విలువను తెలియ జేస్తున్నది ఈ సామెత. అసలు ప్రాణమంటూ వుంటే ఏ పని చేసైనా బ్రతక వచ్చు అని ఈ సామెత అర్థం. +ఊపిరి (గాలి) బిగబట్టితే కడుపు గాలితో నిండుతుంది. అంతమాత్రం చేత ఆకలి తీరదు అని ఈసామెత అర్థం. +==ఊరంతా ఉత్తరం వైపు చూస్తే అక్కుపక్షి దక్షిణం వైపు చూస్తుందిట== +==ఊరంతా చుట్టాలే వుట్టి కట్టుకోను చోటు లేదు== +==ఊరంతా తిరిగి యింటి ముందుకు వచ్చి పెళ్ళాంబిడ్డలను తలచుకుని కాళ్ళు విరగబడ్డాడుట== +==ఊరంతా నాన్నకు లోకువ నాన్న అమ్మకు లోకువ +ప్రతి పనికి టింగురంగ అంటు బయలుదేరే వారిని ఈ విధంగా అంటారు. +ఎవరేది మంచి చెప్పినా వినకుండా మూర్ఖంగా తన దారిన తను పోయేవాడిని ఉద్దేశించి ఈ సామెతను చెపుతారు. +ఈ రెండు మాటలకు ఒకటే అర్థం. వృద్దులు అవసాన దశలో నిరాశ నిస్పృహలో ఈ మాట అంటుంటారు +ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు== +ఏపనైనా చేస్తే అందులో ఏమైనా తప్పులు దొర్ల వచ్చు. అసలు పనేచేయకుంటే తప్పులు దొర్లే అవకాశమే లేదు. అందుకే అన్నారు ఊరకున్న వాడు ఉత్తమోత్తముడు అని. +==ఊరు మీద ఊరు పడ్డా కరణం మీద కాసు కూడ పడదు== +పల్లటూళ్ళలో పెళ్ళి జరిగినప్పుడు భోజనాలు ఆరుబయటగాని, పందిరివేసి గాని విస్తళ్ళలో వడ్డిస్తారు. విందుభోజనాల ఘుమఘుమలకు ఊళ్ళోని కుక్కలన్నీ భోజనాల పందిరి దగ్గర చేరి విసిరేసిన విస్తళ్ళ దగ్గర కాట్లాడుకుంటూ తెగ హడావిడి చేస్తాయి. పెళ్ళివారికీ ఊళ్ళొని కుక్కలకీ ఏ సంబంథం ఉండదు. అలాగే తమకు సంబంధంలేని విషయాల్లో తలదూర్చి కొందరు హడావిడి చేస్తుంటారు. అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారు. +==ఊరంతా వడ్లెండ బెట్టుకుంటుంటే, నక్క తోక ఎండ బెట్టుకున్నదట== +==ఊరంతా తిరిగి యింటి ముందుకు వచ్చి పెళ్ళాంబిడ్డలను తలచుకుని కాళ్ళు విరగబడ్డాడుట +==ఊరంతా నాన్నకు లోకువ నాన్న అమ్మకు లోకువ +==ఊరంతా వడ్లెండ బెట్టుకుంటుంటే, నక్క తోక ఎండ బెట్టుకున్నదట +ఊర పిచ్చుక ఒక అల్ప జీవి. దాని అతి పెద్దదైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడము మూర్ఖత్వమని అర్థము. +==ఊరికి చేసిన ఉపకారం శవానికి చేసిన సింగారం వృధా +శవానికి ఎన్ని అలంకారాలు చేసినా కొన్ని గంటల్లో అవన్ని శ్మశానంలో కాలి పోవాల్సిందే. అలాగే స్వంత వూరికి చేసిన ఉపకారం కూడా వృధా అని అర్థం. +ఇంటి పనుల కన్నా బయట వాళ్ళ పనులు ఎక్కువ చెసే మనిషిని ఉద్ధేసించి ఈ మాటలు అంటారు +ఉచితంగా ఏదైనా ఇస్తున్నారంటే దానికొరకు ఆ వస్తువు అవసరమున్నా లేకున్నా అందరూ దానికొరకు ప్రయత్నిస్తారని ఈ సామెత అర్థము +==ఊరంతా చుట్టాలే ఉట్టి కట్ట తావే లేదు== +==ఊరికే పెట్టే అమ్మను నీ మొగుడితో పాటు పెట్టమన్నట్లు +==ఊరికే కూర్చునేవాడికి వురిమినా వుత్తేజం రాదు +==ఊరి దగ్గరి చేనుకు అందరూ దొంగలే +==ఊరి మీద వూరు పడ్డా కరణం మీద కాసు పడదు +==ఊరి ముందర చేను ఊళ్ళో వియ్యము అందిరావు +==ఊరి ముందరి చేను వూరపిచ్చుకల పాలన్నట్లు +==ఊరి వారి పసుపు ఊరి వారికుంకుమ అన్నట్లు +==ఊరి వారి వత్తి, వూరి వారి చమురు, వూగు దేముడా వూగు అన్నట్లు +==ఊరుకు చేసిన వుపకారం పీనుగుకు చేసిన శృంగారం ఒకటే +==ఊళ్ళేలని ఏలని వాడు రాజ్య మేలుతాడా +==ఊళ్ళో లేని మొగుడుకన్న ఉపాదానమెత్తే మొగుడు మేలు +==ఊళ్ళో యిల్లు లేదు పొలంలో చేను లేదు +==ఊహ వూళ్ళేలుతుంటే రాత రాళ్ళు మోస్తున్నదిట +==ఋణ శేషము శత్రు శేషము వుండ కూడ దంటారు +==ఋణ శేషము, వ్రణశేషము, శత్రుశేషమూ వుండరాదు +==ఋషీ మూలం, నదీ మూలం, స్త్రీమూలం విచారించరాదు + + +సామెతలు లేదా లోకోక్తులు Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. ఆంగ్లంలో సామెతను byword లేదా nayword అని కూడా అంటారు. సామెతలలో ఉన్న భేదాలను బట్టి వాటిని "సూక్తులు జనాంతికాలు లోకోక్తులు" అని కూడా అంటుంటారు. +"లోకోక్తిముక్తావళి" అనే సంకలనం ఉపోద్ఘాతంలో రచయిత సామెతను ఇలా నిర్వచించాడు + +అ, అం, అః అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్ధం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్ధం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్ధం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్ధం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +[[వేటూరి ప్రభాకర శాస్త్రి నేదునూరి గంగాధరం బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు. +తానీషా కొలువులోని అక్కన్న మాదన్నలులా అని అర్థము. +ఎదుటి వానిపై వున్న తన కోపాన్ని బయట పెట్టాడు. +చాల కష్టాలు పడ్డాడు. ఉద: వీణ్ని పెంచడానికి నేను నానా అగసాట్లు పడ్డాను. +అగస్త్య భ్రాత రామాయణంలో పేరు లేని పాత్ర +ఏదైనా చౌకగా వస్తుంటే దాని కొనేసి ఆ తర్వాత ఆ వస్తువు ఉపయోగానికి పనికి రాక పోతే విలపించ వలసి వస్తుంది. అలాంటి సందర్భములో చేప��పేది ఈ జాతీయము. ఇదే అర్థంలో మరొక సామెత ఉంది. అది ఓలి సరసమని గుడ్డి దాన్ని పెళ్ళాడితే కుండలన్ని పగల గొట్టిందట]] +ఉదా: నాకు పని చెప్పి అగ్ని పరీక్ష పెట్టాడు. +పెద్ద గౌరమమిచ్చారు. ఉదా: రాజ సూయ యాగంలో శ్రీకృష్ణునకు అగ్ర తాంబూలమిచ్చారు. +క్రోధం, ద్వేషం, పగ, కక్ష లాంటివన్నీ అగ్ని లాంటివి. నిప్పు ఎంతటి వాటినైనా దహించినట్టే పగ కూడా అగ్నిలాంటిదే కనుక ఎంతగొప్ప వారి మధ్యనైనా అశాంతి అనే మంటలను రేపుతుంది. కనుక అగ్గిలాంటి పగను ఎవరూ పెంచుకోకూడదు. +కస్టాలు: ఉదా: వాడు నాలుగు రూకల కొరకు నానా అగసాట్లు పడు తున్నాడు: +కోపంతో ఉడికి పోవటం నిప్పులు కక్కడం అగ్గి అంటే అగ్ని బుక్కు అంటే బొక్కటం +కోపంతో మండిపోవటం దీపావళి సందర్భంగా మైనాన్ని నూనెలో కరిగించి దానిలో తెల్లటి గుడ్డలను నానపెట్టేవారు. ఆ తర్వాత వాటిని గుడ్డ పుల్లలకు చుట్టేవారు.వాటిని అగ్గితో అంటించేవారు. మైనం, నూనె కలిసి బాగా మండుతూ ఉండేది ఆ పుల్ల. దాని మీద గుగ్గిలపు పొడి చల్లితే అది మరింత భగ్గున మండేది. +తహతహలాడడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. తీరని కోరికలు మనిషిలో, మనసులో అగ్నిలాగా బాధ పెడుతూ ఉంటాయి. ఈభావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది మధ్య నిషేధం అమలు కారణంగా జనాలలో సారా అగ్గి దాగి పోయినట్టయింది' అనేలాంటి +మొదటి స్థానము ఇవ్వు, అందరి కంటే ఎక్కువగా గౌరవించు। +కృష్ణున్ని ధర్మరాజు మయసభలో "అగ్రతాంబూలం" ఇచ్చి సత్కరించాడు। +ఉదా: వానికి ఏ అచ్చట ముచ్చట తీరనే లేదు. అప్పుడే పోయాడు. +ఉదా: వారిద్దరు అచ్చంగా అచ్చు గుద్దినట్లు అమ్మ పోలికె. +ఉదా: వానికి ఈ ఇల్లు అచ్చిరాలేదు కలిసి రాలేదు) +అందరూ దోషులే అనటం. అట్లకు తూట్లు (చిల్లులు) ఉంటాయి. అట్లు ఎవరేసినా, ఎన్నేసినా ఈ తూట్లు లేకుండా ఉండవు. అలాగే ఒకచోట ఉన్నవారు అందరూ దోషులే అయినప్పుడు 'అట్టట్టుకూ తూట్లేనన్నట్లు అక్కడ ఉన్న వారంతా అలాంటివారే' అనటం కనిపిస్తుంది. +అటు పొద్దు ఇటు పొడిచినా సరే +ఎట్టి పరిస్థితిలోను ఉదా: అటు పొద్దు ఇటు పొడిచినా సరే నేను వానితో మాట్లాడను. +మహానుబావుల యొక్క నడవడికను అనుసరించమని ఈ జాతీయం యొక్క ముఖ్య ఉద్దేశం. కేవలం వారు నడిచిన అడుగు జాడలలో అడుగులు వేసి నడమని కాకు వారి జీవిత విధానాన్ని అనుకరించమని అర్థం. +అతి తక్కువ స్థాయి, నీచాతి నీచం.కింద ఏడులోకాల్లో ఎంతో అడుగున ఉండే పాతాళంలో కూడా ఇంకా అడుగు భాగం +ప్రతిరో��ూ చేసే దినచర్యలోని విషయాలేవీ పట్టించుకోకుండా ఏదో ఒక్క విషయాన్నే పట్టుకుని, అదే ధ్యాసలో ఉండడం అనే అర్థంలో ఈ +జాతీయం ప్రయోగంలో ఉంది. సాధారణంగా ఏ మనిషైనా ఎంత కష్టపడి ఏకాగ్రతతో పనిచేస్తున్నా ఏదో ఒక సమయానికి ఎంతోకొంత +తినడమో, తాగడమో చేస్తుంటాడు. అలా ఆహారం స్వీకరించడానికి కూడా సమయాన్ని వెచ్చించకుండా సమయాన్నంతటినీ అనుకున్నపనికే +వెచ్చిస్తున్నాడని ఒక వ్యక్తి కార్యదీక్ష గురించి చెప్పేందుకు ఈ జాతీయ ప్రయోగాన్ని చేయడం కనిపిస్తోంది తిండి, నీళ్లు మాని కష్టపడి సంపాదించి పిల్లలను పైకి తెచ్చాడాయన' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. +ఎత్తిపొడుపు మాటలు దెప్పినట్టుగా మనసుకు తగిలే విధంగా ఆ మాటల తీవ్రత ఉంటుంది. +తీవ్ర స్థాయిలో దరిద్రం, ధనలేమి. వస్త్రధారణ, గోచీ స్థాయికి వచ్చిందంటేనే అది దరిద్రానికి చిహ్నం. పోనీ ఆ గోచి అన్నా సరిపోయినంతగా లేదట. ఎలాగో ఒకలాగా సర్దుకుందామన్నా మొలతాడూ చివికి చివికి ఉందట. +తనకు దక్కనిది మంచిది కాదని. అవకాశవాదం, స్వార్థం, పలాయనవాదం అందని పూలు దేవుడికే అర్పణం అన్నట్టు. +అశక్తుడు. ఎన్ని మంచి అవకాశాలు కల్పించినా వాటిని అందిపుచ్చుకోలేని వాడు. అంధుడి చేతికి దీపాన్నిస్తే దానివల్ల ప్రయోజనం పొందలేడు. +అలవరచుకోవడం, ఒకరి నుంచి మరొకరు ఏదైనా అలవాటు చేసుకోవటం వీడి సహాయాన్ని అంది పుచ్చుకొని పైకెదిగాడు. +అరివీరుడు అంటే వీరుడైన శత్రువు అని అర్థం. అలాంటి బలమైన శత్రువులకు అంతకంటే బలమైనవాడు ఎదురైతే వాడిముందు ఆ వీరులైన శత్రువులంతా నశించిపోవలసిందే. ఈ భావం ఆధారంగానే గొప్ప గొప్ప శత్రువులను, మహాబలవంతులైనవారిని మించిన బలవంతుడు, అత్యంత సమర్ధుడు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది వాడి జోలికి వెళ్లొద్దు, వాడసలే అరివీర భయంకరుడు సుమా అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. +అదుపు చేయడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఒక ప్రవాహాన్ని ఆపడానికి అడ్డుకట్ట వేయడం అందరికీ తెలిసిందే. ఆ అడ్డుకట్టతో నీటి ప్రవాహాన్ని అదుపుచేసినట్లే ఒకరు మరొకరిని అదుపులో పెట్టే సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది వాడి దూకుడుతనానికి వాళ్ల నాన్న అడ్డుకట్ట వేసి ఓ మంచి పనిచేశాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం కనిపిస్తుంది. +దిగజారిపోవడం, పతనమవ్వటం అనే అర్ధాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉ���ది. పాతాళం ఎక్కడో అడుగున ఉంటుంది. అంత అట్టడుగుకు చేరటమంటే ఇక కనిపించకుండా పోవటమనే ఓ భావన ఉంది. ఎంతో గొప్పగా, ఉన్నతంగా ఉండాల్సినవారు తప్పులుచేసి నైతికంగా విలువను కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయ ప్రయోగం కనుపిస్తుంది నిన్నటి ఆయన ప్రవర్తన ఆయనను అధఃపాతాళానికి చేర్చింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. +అందరికి దాన మిచ్చేవాడు అని అర్థము. ఉదా: వాడిని అడగని వాడు పాపాత్ముడు అడగని వాడు లేడని అర్థం) +వృధా అయింది. ఉదా: నేను వానికి చేసిన సాయం అడవి కాచిన వెన్నెల అయ్యింది. +అక్రమ పద్ధతులను అనుసరించడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మనిషి ఒక గమ్యాన్ని చేరుకోవడానికి ఒకదారి నిర్దేశితమై ఉంటుంది. ఆ దారిలో పదిమంది నడుస్తూ ఒక క్రమపద్ధతిని అనుసరిస్తే అంతా సక్రమంగా ఉంటుంది. అలా కాక అందులో ఎవరైనా స్వార్థబుద్ధితో ప్రవర్తించి అందరికంటే ముందుగా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరడానికిగాను నిర్దేశించిన మార్గంలో కాక వెళ్లకూడని విధంగా అడ్డదోవలో వెళ్లినప్పుడు అతడు లక్ష్యాన్ని చేరవచ్చేమోకానీ ఆ అడ్డదోవలో వెళ్లినప్పుడు చాలామందికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది. ఎవరి ఇళ్ల మధ్య నుంచి వెళ్లడమో, లేదా మరెవరి పొలం మధ్యనుంచో వెళ్లడమో చేస్తే ఆయా వ్యక్తులకు అసౌకర్యం కలగవచ్చు. ఎదుటివారి అసౌకర్యాలను లెక్కించక తన లాభం కోసం ప్రయత్నించడం పదిమందినీ బాధిస్తుంది కూడా. ఇలాంటి భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది అడ్డదారులు తొక్కి, ఎంతమందినో బాధించి సంపాదించాడు.ఇప్పుడు పట్టుబడి జైలుపాలయ్యాడు' అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. +అయిపోయింది, బావిలో గాని, చెరువులోగాని నీరు అయిపోతే దానిని అడుగంటింది అని సామాన్యర్థం. అదే భావంతో ఇంట్లో ఏదైనా వస్తువులైపోతే అదే అదే అర్థంలో అడుగంటింది అని గూడంగా అంటుంటారు. ఖాళీ అయిపోయిందని అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. +;ఆశీర్వదించు కాదు ఇక్కద ఆక్షతలు అర్థం ఆశీర్వదించు, +పలాన కేసు విషయంలో కోర్టు వారికి అక్షింతలు వేసింది. అనగా తప్పు పట్టిందని అర్థం. +ముద్దూ మురిపము అచ్చటా ముచ్చటా తీరకనే వానికి నూరేళ్లు నిండాయి. +ఊరిమీదకు జులాయిగా (ఏ పనీ పాట లేకుండా) తిరగడానికి వదిలేసినట్లు. +అజగళ స్థనము అనగా కొన్ని జాతి మేకలకు మెడకింద రెండు వ్రేళ్ళ లాంటి చన్నులుంట���యి. అవి చూడడానికి మేక చన్నులు లాగే వుంటాయి. కాని వాటిలో పాలుండవు. అనగా ఉపయోగము లేనిదని అర్థము. +ఎవరికంట పడకుండా ఎంతో జాగ్రత్తగా చేసేది. పాండవులు విరాట మహారాజు కొలువులో అజ్ఞాతవాసం చేసిన తీరు.ఏమాత్రం కొద్దిపాటి సమాచారం బయటకొచ్చినా మళ్ళీ సుదీర్ఘకాలంపాటు అరణ్యవాసం చేయాల్సిన దుస్థితి వచ్చేది. +అందరికి చర్చనీయాంశం కావడం వాడు చేసిన నిర్వాకంతొ ఊరంతా అట్టుడికినట్టు ఉంది. +అప్పుడప్పుడు ఉదా అడప దడప ఇద్దరూ అలిగితేనె అందం, ఆ అలకతీరాక కలిసేదే అందమైన బంధం' ఒక పాట. +అడకత్తెరలో పోక చందాన. అనగా ఎటు తప్పించుకోలేని స్థితి అని ఆర్థము. +తప్పించుకోడానికి ఏ మాత్రం అవకాశం లేనప్పుడు ఈ మాటను వాడతారు. +వాడు అడకత్తెరలో పోక చెక్కలాగ చిక్కుకున్నాడు. +అడవి ఉసిరి, సముద్రపు ఉప్పు కలిసినట్లు +ఎక్కడెక్కడివారో ఒకచోట కలుసుకోవడము అడవిలో పుట్టిన ఉసిరి, సముద్రంలో పుట్టిన ఉప్పు కలిసి నట్టు. +ఎంతో విలువైన వస్తువు వృధా అయిపోతున్నదనే అర్ధంలో వాడతారు. +అణగి మెణిగి వుంటున్నాడు. ఉదా వాడు అతని అడుగులకు మడుగులోత్తుతున్నాడు అడుగులకు మడుగులు]] +;వివరణ గత కాలములో రాజులు, ఇతర ప్రముఖులు సభామందిరమునకు వచ్చేటప్పుడు చాకలివారు ముందుగా చీరలను పరుస్తుంటే వాటిమీద రాజు గారు నడుస్తుండే వాడు. ఈ సంప్రదాయము ఇప్పటికి కొన్ని కులాలలో కొన్ని సందర్భాలలో (ఉత్సవాలలో) జరుగు తున్నది. ప్రముఖుల కాళ్ళు కంది పోకుండా ఇలా వస్త్రం పై నడుస్తుంటారు. దానినే అడుగులకు మడుగు లిడుట అని అంటారు. ఇలా అడుగులకు మడుగులిడిచేవారు చాకలి వారు. అందుకే చాకలిని మడేలు అని అంటారు. లవకుశ సినిమా లోని ఒక పాటలో పద ప్రయోగము చూడండి. చదివినోడికన్నా ఓరన్నా మడేలన్న మిన్నా +శ్రమ లేని పని. అటుకులు తింటే చేతికి ఏమి అంటదు. కడుక్కోక పోయినా పర్వాలేదు. +చక్కగా విడమరచి అర్ధమయ్యేలా చెప్పడం. అసలు అరటిపండు తినడమే చాలా సులభం. అది కూడా వలిచి పెడితే ఇంక తినేవాడికి ఏ మాత్రం కష్టం ఉండదు. అలాగే అరటిపండు వలిచిపెట్టినట్లు చెప్పితే వినేవాడికి అర్ధం కాకపోవడం జరగదు. +చాల వినయం, మర్యాదగా ప్రవర్తించడం వాని అడుగులుకు మడుగులోత్తు చున్నాడు. +ఆధారం పోవటం పాత్ర పనికిరాకుండా పోవటం. అధికారాలు పోయినవారిని, ఆదరణ నశించిన వారిని, పైకి ఎదిగేందుకు ఆధారం కోల్పోయిన వారిని అడుగు ఊడిన మనిషి అంటారు. +ఒక వూళ్ళో ఒక మంచి ఆసామి అడిగినవ���డికల్లా అప్పులో, దానాలో, సలహాలో దండిగా ఇచ్చేవాడు.అడగనివాడికి ఏమీ ముట్టి ఉండదు. మిగిలినవాళ్ళు పుణ్యం చేసుకొన్నారు గనుక కష్టపడకుండా లాభం పొంది ఉంటారు. అడగనివాడు పాపాత్ముడు గనుక సులభంగా ప్రయోజనం పొందే అవకాశం జారవిడుచుకొన్నాడు. +విచక్షణా రహితంగా అడవిలో ఉండే జంతువుల్లాగా విచక్షణ అనేది లేకుండా ఎలాపడితే అలా ప్రవర్తించటం +తప్పు చేయటం .అడుసు తొక్క నేల, కాలు కడుగనేల .బురద అని తెలిసి దాన్ని తొక్కటమెందుకు, తర్వాత దాన్ని వదిలించుకోవటానికి కష్టాలు పడటమెందుకు అని +నియమ రహితంగా కార్యాన్ని సాధించుకు రావటం ఈ పని సాధించాలంటే అడ్డంగా నరుక్కురావాలి. +ఏది పడితే అది వాడు అడ్డమైన గడ్డి తింటున్నాడు అక్రమార్జనతో జీవిస్తున్నాడని అర్థం. +ఆటంకపరచడం నీవు పని చేయకపోగా అడ్డు పుల్లలు వేస్తున్నావు. +నిరాటంకంగా వాడి ప్రవర్తనకు అడ్డు అదుపు లేదు. +కలత గీ. కీలిఁగబళించి యాతమ్మిచూలిమించి, శూలిఁగదలించి యుగ్రగ్రహాళినొంచి, యెందునున్నను దెత్తునీయిందువదన, నదన ననుఁజూడు మదవదల్‌ వదలియధిప రామా. ౫, ఆ. +సంకటస్థితి కొత్తగా పెళ్లయిన ఓ కోడలు, ఆమె అత్త ఇద్దరూ కలిసి వేరొక చోటికి వెళ్ళారట. అక్కడ అత్తగారు మైమరిచిపోయి అందరితోనూ మాట్లాడుతున్నప్పుడు ఆమె కొంగు పక్కకు తొలగిందట. కొంగు సరిచేసుకో అని చెప్పేటంతటి చొరవ ఇంకా ఆ కొత్త కోడలికి రాలేదు. చెప్పకపోతే అత్తగారి పరిస్థితి పది మంది ముందూ బాగుండదు కదా అని ఆమె అత్తతో చెప్పాలా, వద్దా? చెబితే ఏమో, చెప్పకపోతే ఏమో, ఆ మాత్రం నాకు తెలియదా అని అందరిముందూ తనను కసురుకుంటుందేమోనని ఆ కోడలుపిల్ల వ్యధ చెందిందట. +అత్తమీద చూపులు, అంగటి మీద చేతులు +సరియైన సమయము అదనుపదును చూసి విత్తనం వేయాలి. +;తగు సమయము, తగు సందర్భము అదను పదనునె కూర్చి మా యప్పు దీర్చి, సొమ్ము నీవన్నబోమె యీ పోరు మాని హరి.-4-37] +గర్వం అణచాలి: ఉదా: వానికి పొగరెక్కువయింది. అణగ దొక్కాలి. +చాల మంచి వాడని అర్థం: ఉదా: అతని మనసు వెన్న: చాల మంచి వాడు. +చెడగొట్ట బడింది. ఉదా: వాడు పనిచేస్తుంటే వీడొచ్చాడు. పనంతా అతాలాకుతలమైంది. +రాజకీయ పోరాటాల్లో రాటుదేలి పేరెన్నికగన్న నాయకులు stalwarts అతిరథ మహారథులైన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి బన్సీలాల్, లోక్‌దళ్ (బి) నాయకుడు దేవీలాల్‌ రాష్ట్ర బి.జె.పి. అధ్యక్షుడు మంగల్‌ సేన్, మాజీ ముఖ్యమంత్రి బి.డి.గుప్తా తదితర మాజీ మంత్రుల భవితన��� నిర్ణయించే ఎన్నికలు ఇవి ఈ. 18-6-87) +భయపడటము వానికెక్కడికి కెళ్లడానికైనా అదురు బెదురు లేదు అదురుబెదురు లేని వాడు. +బాగా బతిమలాడు కోవటం, తమనుతాము తగ్గించుకొని ఎంతో నిదానంగా మాట్లాడటం +అద్దంలో కనబడేది ఆయా వస్తువుల నీడ మాత్రమే. లేదా ప్రతిమ మాత్రమే. అది చేతికిదొరకదు. దానికి ఆశ పడడమంటే, లేని దానికి ఆశ పడడమని అర్థం. వృధా ప్రయాస. +ఉదా: వీరు పోలీసు వారి అదుపులో ఉన్నారు. +అదెప్పుడు నీళ్ల కుండ నెత్తిన పెట్టుకొని వున్నది +ఏడవడానికి సిద్దంగా వుందని అర్థం ప్రతి చిన్న విషయానికి ఏడ్చే వాళ్ల గురించి ఈ మాట వాడతారు. +అందెవేసిన చేయి మిక్కిలి నైపుణ్యం కలిగిన ప్రహేళికలు విప్పడంలో మా మామయ్యది అందెవేసిన చేయి.) +ఉదా: వాడిని అధ: పాతాళానికి అణగ దొక్కాలి. +పనిచేయకుండా తప్పించుకు తిరగటం.ఎద్దు పనిచేయకుండా మొండికేసి కూర్చున్నప్పుడు ఎద్దు అనుకేసింది అంటారు. +అనుభవించని వస్తువు ఉదా: ఆ అమ్మాయి అనాఘ్రత పుష్పము. +అన్యాయము, న్యాయము తెలీకుండుట ఉదా వాడికీవిషయంలో అన్నెము పున్నెము తెలీ దు అమాయకుడు +చక్కగా అణిగి మణిగి ఉండటం. అన్ని ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటే ఎంగిలాకు ఎగిరెగిరి పడుతుందంటారు. +చాల అందమైన అమ్మాయి. ఉదా: ఆ అమ్మాయి అపరంజి బొమ్మలాగున్నది. +చాల కష్టపడి వచ్చాడు అని అర్థం: ఉదా: వాడు అపసోపాలు పడి వచ్చాడు +ఉచితంగా దొరికింది: సులభంగా దొరికింది. ఉదా: +అప్పులు అప్పొ సప్పో చేసి తన పిల్లలను చదివించాడు. +ప్రాచ్య అంటే తూర్పు దిక్కు. అప్రాచ్యం అంటే తూర్పుకి వ్యతిరేకమైన పడమర దిక్కు. అప్రాచ్యులు అంటే పడమటిదిక్కునుంచి వచ్చినవారు. మన దేశానికి పశ్చిమదిక్కునుంచి వచ్చిన పాశ్చాత్యులు అప్రాచ్యులు. +మన సంప్రదాయవాదులు ఆంగ్లేయుల్ని అనుసరిస్తున్న వారిని అప్రాచ్యుడు అని అంటారు. ఇది నిందా వాచకము. +అభావం అంటే లేకపోవడం. ప్రత్యామ్నాయం అంటే ఏదైనా లేనిదానికి బదులుగా అని అర్థం. ఏదైనా ఉండవలసిన వస్తువు లేకపోతే దానికి బదులుగా ఇంకొకటి వాడడాన్ని ప్రత్యామ్నాయం అంటాం. పూజలు, యాగాలు చేసినప్పుడు చాలా వస్తువులు దాన ధర్మాలుగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఖర్చు భరించలేకపోతే దానికి బదులు మరొక తక్కువ ఖర్చుతో వచ్చే వస్తువును దానంగా ఇస్తారు. +ఆవులను కొని దానం చేయలేని వారు అభావ ప్రత్యామ్నాయంగా ఒక రూపాయి బిళ్ళను ఇస్తుంటారు. +భావం అంటే ఉండడం. అభావం అంటే లేకపోవడం. విరక్తి అం��ే కోరిన వస్తువు దొరకనప్పుడు అది అక్కరలేదనుకోవడం. అందుబాటులో లేదు, అది దొరకదు అని తెలిసినప్పుడు దానిమీద విరక్తి పెంచుకోవాడాన్ని అభావ విరక్తి అంటారు. +ఒట్టు పెట్టడం: ఎక్కువగా చిన్నపిల్లలు అంటుంటారు: ఉదా: అమ్మతోడు వాడిని నేను కొట్టలేదు. +ఎలపట దాపట తెలియనివాడు, కుడి, ఎడమలు తెలియనివాడు +ఏదేని ఒక పని సాధించాక చవరన అమ్మయ్య సాధించాను అని అనుకొంటారు. +చుట్టు పక్కల పరిచయమున్న అడవాళ్ళు అమ్మ"'లు అక్క"'లు) +అమ్మలక్కలంతా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. +చాల అరుదుగా వస్తాడు: ఉదా: వీడు బడికి అమావాస్యకు పౌర్ణానికి వస్తాడు. +అటో, ఇటో నువ్వో నేనో సందిగ్ధతను పోగొట్టి విషయాన్ని అటో ఇటో తేల్చేసుకోవడమనే అర్థంలో ఈ పదాన్ని వాడతారు. హిందీ లేదా బెంగాలీ నుండి చేరిన మాటగా అనిపిస్తుంది. +ఉదా: నేనెంతగా అడుగుతున్నా బాసు ఏ విషయమూ తేల్చడం లేదు. ఇక లాభంలేదు, ఇవ్వాళ అమీ తుమీ తేల్చుకోవాల్సిందే. +;కష్టసమయము దాఁటి ప్రాణము గూటఁబడగానే పలికెడు శబ్దము. +అరణ్యం అంటే అడవి. రోదనం అంటే ఏడుపు. అడవిలో ఏడిస్తే వినేవారు ఉండరు. కాబట్టి ఎవరూ ఓదార్చలేరు, సానుభూతి చూపించలేరు. అందువల్ల ఏడ్చినా ప్రయోజనం లేదు.అనవసరమైన శ్రమ అని ఈ జాతీయానికి అర్థం. +; అడవిలో ఏడ్చినట్లు నిష్ప్రయోజనమని భావం.] +కోపము ఎక్కువగు ఉదా: వాడు చేస్తున పనిని చూస్తుంటే అరికాలి మంట నెత్తికెక్కుతున్నది. +కల్లబొల్లి కబుర్లతొ మాటకారి తనంతో ఎదుటి వాడిని తన వైపుకు తిప్పుకొనుట +కొన ఊపిరితో వుండడం ఉదా పాపం వాడు అరచేతిలో ప్రాణాలుంచుకొని వచ్చాడు. +మహా మాట కారి. తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడు: +చాల గొప్ప యోధుడు అని అర్థం: +సమయము సందర్భం లేకుండా చేసే పని. +చాలి చాలని. ఉదా: వారు నాకు అరకొర తిండి పెట్టి అరవ చాకిరి చేయిస్తున్నారు. +ఎంతో జాగ్రత్తగా పరిరక్షించటం.ప్రమిదలో దీపం వెలుగుతున్నప్పుడు గాలి తాకిడికి అది ఆరిపోకుండా అరచేతులడ్డుపెట్టి కాపాడుతుంటారు. +ఎక్కువ పని: వాళ్లు అరవ చాకిరి చేస్తున్నారు. +ఎక్కువగా ఆశపడ ఉదా: వాడు అన్నింటికి అర్రులు చాస్తున్నాడు. +అలిగాడు: ఉదా: కొత్తల్లుడు కారు కొనివ్వలేదని అలకపానుపు ఎక్కాడు. +అతి సులభంగా: ఉదా: అతడు ఆ పనిని చాల అలవోకగా చేసెయ్య గలడు. +ఎక్కువ మురిపెంగా పెంచటం ఉదా: వారు తమ పిల్లలిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. +కల్లబొల్లి పలుకులు వాడు అల్లి బెల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నాడు. +బాగా కలిసి పోయాడు వెంటనే నేర్చు కుంటాడు. ఉదా: వాడు ఆపనిలో కొంత చూపిస్తే చాలు అల్లుక పోతాడు. +అల్లుడు బెట్టుగా వ్యవహరిస్తుండాలని, ఇల్లాలు ఇంటిలో ఉన్న లొసుగులు బయటపడకుండా గుట్టుగా వ్యవహరిస్తుండాలని +రాజ జంబూ వృక్షము (నేరేడు చెట్టు) +; 2. లోకజ్ఞానము లేనివాఁడు. ఇది కూపస్థమండూకమువంటిది. +ఉదా: వాడొట్టి అయోమయం జగన్నాధం గాడు/ +అశ్వత్థ వృక్ష మంటే రావిచెట్టు. ఆ చెట్టు చుట్టూ తిరగటమే అశ్వత్థ ప్రదక్షిణం. ఎంతకాలమైనా సంతానం కలగని వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారన్నది ఒక మూఢనమ్మకం. +ఏకపాదునికి సుజాతయందు పుట్టిన కొడుకు. ఇతఁడు గర్భమున ఉండుకాలమున అనవరతము శిష్యులచే వేదాధ్యయనము చేయించుచు ఉండు తన తండ్రితో శిష్యులు నిద్రలేమింజేసి జడమతులై చదువు తప్పఁజదువుచున్నారు అనిన, తండ్రి కోపగించి 'నీవు అధ్యయనంబునకు వక్రముగా పలికితివి కావున అష్టవక్రుండవై జన్మింపుము' అని కొడుకునకు శాపము ఇచ్చెను. ఇతఁడు అతితేజస్వియును లోకపూజితుఁడును అయి ఉండెను. ఈతని కురూపము చూచి ఒకప్పుడు రంభాద్యప్సరసలు నవ్వినందున, వారు దొంగలచే పట్టుపడునట్లు శపింపఁబడిరి. అది కారణముగ కృష్ణనిర్యాణానంతరము గోపికారూపులై ఉండిన అతని భార్యలు అగు నప్సరసలు అర్జునిని వెంట వచ్చునవసరమున దొంగలచే పట్టుబడిరి. +అనేక పనులు ఒకేసారి చేయటం, అష్టావధానంలో అవధాని ఎనిమిది మందికి సమాధానాలు చెప్పగలగాలి. +అలా ఒక్కడే అనేకమైన పనులు చేస్తుంటే వాడిని అష్టావదానం చేస్తున్నాడని అంటారు. +భుక్తాయాసం .భుక్తాయాస స్థితిలో ఉన్న వారు అస్సు, అస్సో అంటూ పడే ఆపసోపాలు +ఉత్కృష్టమైన వ్రతము. సౌందర్యవతియు, యౌవనవతియు నైన స్త్రీతో నేకశయ్య యందు శయనించి యామెయందు మనసైన బ్రసరింపకుండుట కత్తిమీది సాము.) +నిరంతరం ఒకే విషయాన్ని మాట్లాడడం, పదేపదే చెప్పిందే చెబుతూ ఉండడం అనేలాంటి అర్థాలతో ఈ జాతీయం కనిపిస్తుంది. కొంతమంది ఎదురైన ప్రతివారి దగ్గర తమకు కావలసిన దాన్ని గురించి విసుగూ విరామం లేకుండా చెబుతుంటారు. అలాంటి పరిస్థితులలో 'వాడు అహరహం జపించే ఆ విషయాన్ని గురించి కాస్త మీరైనా పట్టించుకోండి' అనేలాంటి ప్రయోగాలు ఉన్నాయి. +[[తిరుమల]]లో బ్రహ్మోత్సవములు]]కు అంకురార్పణము చేయుట అనునది ఈ జాతియానికి చాలా ప్రముఖ ఉపయోగము +లెక్కలలో తేడా చూపాడు: ఉదా: అ���ను అంకెల గారడి చేశాడు. అవకతవలు చాల ఉన్నాయి. +''అం అంటే ఢం రాదు''అని కూడా దీన్ని వాడతారు. అంటే కొంచెం కూడా చదువు రాదు అనే అర్థంలో వాడతారు పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదు అనే జాతీయం కూడా ఇదే సందర్భంలో వాడతారు. +అంకురార్పణము అనగా ప్రారంభ మని భావము. +ఏదేని శుభకార్యము చేయునపుడు మొదలుపెట్టుటకు దీనిని ఉపయోగిస్తారు. +అంగట్లో ఆనపకాయను ముదురుదా, లేతదా అని చూడటానికి కొనడానికి వచ్చిన వారంతా గోరుపెట్టి గిల్లి చూస్తుంటారు. దీనిమీద అలా గాట్లు పడుతుంటాయి. వేశ్యలను కూడా అలాగే వాడుతుంటారు. +అంగడి అనగా దుకాణము లేదా కొట్టు ఏదన్నా విషయాన్ని అనవసరంగా నలుగురితో చెప్పడాన్ని/బహిరంగపరచడాన్ని అంగడి పెట్టడం, లేదా దుకాణం పెట్టడం అని అంటారు. +ఉదా: వారి పెళ్ళి అంగ రంగ వైభవంగా జరిగింది +అతిగా ఆశపడటం. ఎక్కువగా ప్రతికూలార్ధంలో వాడతారు. +ఏ మాత్రం స్థాయి లేనివారు బొటనవేలు అన్నివేళ్ళ కంటే పొట్టి.వేలెడంతలేవు నీ కెందుకింత పొగరు అని, నా బొటనవేలంత కూడా లేవు నువ్వేంటి నాకు చెప్పేది అని అంటారు. +దీనికి ముంజేతి కంకణమునకు అద్దమేల సమానార్దముగా చెప్పుకొనవచ్చు +"భద్రాచలం కొండా కావాలా నీకండా దండా అను చిరంజీవి పాట గుర్తు రావడంలేదూ! +అంతూ పొంతూ లేకుండా సాగిపోతున్న మన టీ వీ సీరియల్లు లాగా అన్నమాట +మొండి వారి ఆగడాలకు అంతు పొంతు వుండదు. +తిరిగి రాదు: ఇక మర్చి పోవాలసిందే ఉదా: వానికి ఏమైనా ఇచ్చినామా ఇక అంతే సంగతులే. +అవి తనకు అందలేదు కాబట్టి అవి వుల్లగా వున్నాయని అనడం. ఆవిధంగా మనసును సమాదాన పరచుకోవడం. +వీలు ఐతే అధికారం చేయడం లేకపోతే కాళ్ళు పట్టుకోవడం. ఉదా వాడు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం. +మంచి పదవిలోకి వచ్చాడని అర్థం: ఉదా: వాడు అందలం ఎక్కాడు. +బాగా అనుభవము ఉన్న: అందెలు కాళ్ళకు, చేతులతో కూడా వేసుకునేవారు గత కాలంలో. ముఖ్యంగా ఏదైన ఒక విద్యలో ప్రావీణ్యత సాధించిన వారికి ఆవిషయానికి గుర్తింపుగా చేతికి ఒక అందే తొడిగేవారు గౌరవ చూచకంగా అనగా ఆ అందే తొడిగిన వాడు ఒక గొప్ప వాడని అర్థం. అదే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతారు. +ఉదా అతను సంగీతంలో అందే వేసిన చేయి +అడ్డు అదుపు లేకుండా తిరుగు తున్నాడు: ఉదా: వాడు అచ్చోసిన ఆంబోతులా తిరుగు తున్నాడు. +మేలు చేస్తున్నట్లు నటించి కీడు తలపెట్టడం. ఓ వ్యక్తి పేదవాడిని అంబలి పోస్తాను రా రమ్మని ప్రేమగా పిలిచాడట. ఆకలి మీద ఉన్న ఆ వ్యక్తి అంబలి తాగుతుండగా అతడి దగ్గర ఉన్న గొంగళిని కాజేశాడట. +సాధారణంగా పిల్లలు ఎరిగెతే వారి ముడ్డిని నీళ్ళు పెట్టికడుగుతారు. కాని నీళ్ళకంటే ఖరీదైన ఆముదంతో ముడ్డిని కడుగటం ఓ వింత. ఈ సామెతను పిల్లలను బాగా గారాబం పెట్టినప్పుడు వాడతారు. +చీవాట్లు పడ్డాయి అని అర్థం: ఉదా: బడికి ఆలస్యంగా వచ్చినందుకు ఆ పిల్లవాడికి అక్షింతలు పడ్డాయి. + + +ఆ అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +[[వేటూరి ప్రభాకర శాస్త్రి నేదునూరి గంగాధరం బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు. +ఆకాశరామన్న పేరు లేని, చెప్పని. ఎవరో గాని అతనంటే గిట్టని వాళ్ళు ఆకాశ రామన్న లేఖలు వ్రాస్తున్నారు. +అతిగా పొగడటం: ఉదా: వాడిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. +చాల పెద్ద పందిరి వేశారు అనిఅర్థం. ఉదా: వారి పెళ్ళికి ఆకాశమంత పందిరి వేశారు. +కష్టాలను పోగొట్టడం, కాపాడటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలోఉంది. కష్టాల వల్ల కలిగే బాధను సమసింపజేసి ఊరట కలిగించి చేయూతనిచ్చే సమయంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది ఇన్నాళ్ళూ నా కష్టాలను ఆర్చేదెవరో తీర్చేదెవరోనని మదనపడ్డాను. ఇన్నాళ్ళకు ఈయన కనిపించాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. +అజాగ్రత్తగా ఉండటం వాడు ఆదమరచి నిద్ర పోతున్నాడు ఇంట్లో దొంగలు పడ్డారు. +అనుకున్నది జరగలేదు ఉదా: నీ ఆటలు ఇక్కడ సాగవు. +మనుషుల తీరు.మేలు చేసిన వారిని నాలుగు డబ్బులు కనిపించేసరికి మరచిపోవటం +సంతకం లేకుండా వ్రాయు ఉత్తరాలు తమ పేరు బయట పెట్టకుండా ఒకరిని నిందిస్తూ ఉత్తరాలు రాసే వారు. +శివాలయాల్లో ధ్వజ స్తంభంపైన గుమ్మటంలో ఉండే దీపం చుట్టూ గుమ్మటం ఎంతగా రక్షణగా ఉన్నా గాలి తాకిడికి అది వెంటనే ఆరిపోతుంది.అతి తక్కువ సమయంలో ఎక్కువ సంపదల్ని సమకూర్చుకొని అంతలోనే ఆ సంపదలన్నీ నశించిపోయి దరిద్రులుగా మారేవారు. +"నాకు ఆకులు అలములు వేసి పెట్టినారు ఆ అడవిలో భోజనము"। మహర్షులు అడవిలో వుండి ఆకులలములు తిని బ్రతికారంట. +ఆకు చాటు నున్న పిందెలు, ఎండ వాన తగలకుండ సున్నితముగా ఉంటాయి। +అలా ఒకరి రక్షణలో ఉన్న అమాయకపు, సున్నితపు వారిని ఆకు చాటు పిందెలలాగా అని అంటారు। +అతి వేగము వాడు ఆగమేగాల మీద వచ్చాడు' +ఆడలేక మద్దెల ఓడు అన్నాడట దీన్ని సామెతగా కూడా వాడవచ్చు) +తన తప్పును కప్పిపుచ్చుకోడానికి ఎదుటి వాడిని నిందించటము. +ఆగం చేసి సంపాదించిన అక్రమ సంపాదన గండాన చేతికి అందకుండా పోతుందని +కలకాలము: ఉదా: అతని కీర్తి ఆచంద్రార్కం నిలచి వుంటుంది. +జాగ్రత్తగా మాట్లాడాలి: ఉదా: వానితో ఆచి తూచి మాట్లాడాలి. +సరదాకి ఏడిపించాడు: ఉదా: అందరు కలిసి ఆ చిన్న పిల్ల వాన్ని ఆట పట్టిస్తున్నారు. +విశ్రాంతి దినము ఒకప్పుడు బడులలో, ఇప్పుడు ఆదివారం లాగా, ఏ అమావాశ్యకో పౌర్ణమికో ఆటవిడుపు ఇచ్చేవారు దానినే ఆటవిడుపు రోజు అని అంటారు। +సముద్రములో వచ్చునవి జీవితములో కష్టాలను ఆటుపోటులతో పోల్చడము సర్వసాధారణము। +ఆటలు, పాటలు ఉల్లాసకరమైన క్రీడలు చిన్నపిల్లలు ఆట పాటలతో కాలం వెళ్లబుచ్చు తారు. +చిన్నపిల్లలకు ఆటలో దెబ్బ తగిలితే,బాధపడకుండా అరటిపండు తొక్కినట్లు భావించటం.ఎవరన్నా సరిగ్గా ఆడకపోయినా ఆటలో అరటిపండు అంటారు. +వాడి వేడి మాటల యుద్దంజరిగిందని అర్థం: ఉదా: ఈ రోజు అసెంబ్లీ అట్టుడికినట్టు ఉడికింది. +కాలం కలసిరావటం,శ్రమ తగ్గటం,కావాలసిన వారెవరైనా అనుకోగానే ఎదురుగా రావటం, చేద్దామనుకున్న పనిని అప్పటికే ఎవరైనా చేసి పెట్టటం. +నలుగురు చేయాల్సిన పనిని ఒక వ్యక్తి చేయాల్సి రావటం +ఇష్టానుసారంగా ఉదా ఇంత కాలం నీవు ఆడిందే ఆట గా సాగింది ఇకపై అలా కుదరదు. +శ్రమ తెలవకుండా సంతోషంగా హాయిగా చేసే పని ఆడుతు పాడుతు పనిచేస్తుంటె అలుపు సొలుపు ఏ మున్నది ఇది ఒక సినీ గీతం. +గాఢంగా నిద్రించు తన చుట��టు ప్రక్కలా ఏమి జరుగు తున్నదో గ్రహించ లేని స్థితి. +తన రక్షణగురించిన చింత కూడా లేకుండా నిద్రించు +పుట్టుపూర్వోత్తరం ఉదా: వాని అనుపానులన్ని మాకు తెలుసు గుట్టుమట్లు +ఉదా: ఆరుగాల కష్టపడి పండించిన పంట వరదలకు కొట్టుక పోయింది. +అలసట చెందినవారికి ఇది ఉపయోగిస్తారు ఉదా ఈ చిన్న పని చేయడానికి వాడు ఆప సోపాలు పడుతున్నాడు. +ఆణిముత్యాల్లాగా మారవు.మంద బుద్ధులు, దుర్మార్గులు ఎంతగా చెప్పినా మంచిగా మారరు. +బిక్షగాడు.ఆముదపాకు తెరచి ఉంచిన యాచకుడి అరచేయిలా కనిపిస్తుంది. +ఎవరికీ దొరక్కుండా తిరగటం జారి తప్పించుకుని పారిపోవటం దొంగలు ఒంటికి ఆముదము రాసుకొని వుంటారు. +ఆంధ్రులు ఆరంభశూరత్వము అనే అపవాదు తెలిసినదే కదా ఒకపనిని ఆడంబరంగా ప్రారంబించి ఏ చిన్న ఆటంకం వచ్చినా ఆ పనిని అపేస్తారు. +మిక్కిలి నైపుణ్యం సంపాదించడం. విలువిద్యలో అర్జునుడు ఆరితేరిన వాడు. +ఓదార్చు నీవేమైనా ఆర్చే వాడివా తీర్చే వాడివా? +ఎట్టిపరిస్థితుల్లోనైనా ఆరు నూరైనా నూరు ఆరైనా నేను ఈ పనిచేసి తీరుతాను. +వచ్చేవారు వస్తున్నారు పోయేవారు పోతున్నారు ఎవరూ పట్టించు కోవడం లేదు. +కలయిక అసాధ్యం.విభిన్న మనస్తత్వాల వారిని ఒక చోటకు చేర్చి ఒకే అభిప్రాయానికి తేవటం, ఐక్యత, అనుసంధానాలు కుదరవని +ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేవాడంటే చాలా తెలివి గలవాడనీ, చురుకైనవాడనీ అర్థం వాడు ఆవులిస్తే పేగులు లెక్కించ గలడు. +అత్యాశకు పోయి నోరు, గొంతు పట్టణంత ఆహార పదార్థాన్ని తినాలని ప్రయత్నించినా అది వీలుకాదు.గొంతులో ఎంతవరకు పడుతుందో అంత పదార్థాన్ని స్వీకరిస్తే మంచిది. +అత్యాశ ఎవరి స్తోమత ప్రకారం ఆశలు పెట్టుకోవాలి. స్తోమతకు మించిన ఆశలు వుంటే ఈ మాటను వాడతారు. + + +ఇ అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధా��్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +[[వేటూరి ప్రభాకర శాస్త్రి నేదునూరి గంగాధరం బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు. +ఇదొక ఊత పధం: చెప్పింది చాలు అని వ్యంగ్యంగా అనడం. +పరాధీనంగా బతికేవారు.కొంత మంది నిరంతరం ఎదుటివారినడిగి తమకు కావలసినవన్నీ సమకూర్చుకుంటుంటారు. అంతే కానీ తమకు తాముగా సంపాదించటం, ఖర్చు పెట్టడం అనేవి చేయరు.అన్నీ ఉచితంగా కావాలనుకునే వారి గురించి ఈ జాతీయాన్ని వాడు తుంటారు. +ఇడిచేసింది ఈ దికి పెద్ద వుంచుకున్నది ఊరికే పెద్ద +పూర్వం ఎవరైనా, తీర్థయాత్రలకు పోతూ తిరిగి వచ్చే దాకా తమ దగ్గరున్న విలువైన వస్తువులను, ధనాన్ని తెలిసిన వారి వద్ద భద్రంగా ఉంచమని చెప్పి వెళుతుండేవారు. ఇలా తమ సొమ్ము తాత్కాలికంగా భద్రతను కల్పించుకోవడాన్నే ఇల్లడ పెట్టడం అంటారు. +ఇంటిలోకి కావలసిన వన్నీ మంచిగానే ఉన్నాయి అని +ఇల్లు ఇరుకుగా ఉంటే చుట్టాలెవరూ రారు ఒక వేళ వచ్చినా పొద్దు పోకముందే వెళ్ళిపోతారు. అలా వుంటే రాత్రి పడుకోడానికి స్థలం వుండదు. ఎక్కువకాలం ఆ ఇంట్లో ఉండలేరు. దాంతో వారికి వండిపెట్టే ఖర్చు, శ్రమ తగ్గుతాయి. ఆలి మరకటం అంటే భార్యరూపం కోతి రూపంలాగా వికృతంగా ఉంటే ఆమె వంక ఎవరూ చూడకపోతే ఆ భర్తకు మనశ్శాంతిగా ఉంటుంది. ఈ అర్థంతో ఈ జాతీయాన్ని వాడుతారు. +కేవలం ఇల్లు ఒక్కటి అలికి కూర్చుంటే పండుగ ఎలా పూర్తికాదో అలానే ఏదో ఒక చిన్నపని చేసి ఇక అంతా అయిపోయిందిలే అనుకోవటం కూడా సమంజసంకాదని +స్వార్థపరులు.ఎదుటివారు ఎంతగా కష్టనష్టాలకు గురౌతున్నాపట్టించుకోక పీడించి తెచ్చుకోవటం. +అడ్డూ, అదుపూ లేకుండా అవగాహనా రాహిత్యంతో అల్లరి చేయటం +ఇల్లు ఆరోగ్యము రెండు పాడయాయని అర్థం. దుర్వ్యసనాలకు బానిసలయిన వారి ఇళ్ళు, ఒళ్ళు గుల్లవడం ఖాయం అనే అర్ధంలో ఈ జాతీయాన్ని వాడుతారు. +వారే. కుటుంబంలో స్త్రీకి వున్న ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది ఈ జాతీయము. +అతి చిన్న విషయానికి నానా రబస చేయడము: అలాంటి వారినుద్దేసించి ఈ జాతీయాన్ని వాడుతారు. ఉదా: వాడు చి���్న విషయానికి ఇల్లు పీతకి పందిరి వేశాడు. +చాల కష్టమొచ్చింది ఉదా: ఈ వరదలతో మా ఇల్లు గుల్లయింది. +అన్ని విడిచేసిన ఆడది అందరికి పెద్ద. అనగా ఆమెకు ఎవరు ఎదురు మాట్లాడ సాహసించరు. అందుచేత ఆ వీధివారందరు ఆమె నోటి దురుసుకి భయపడి వూరుకుంటారు. దాంతో ఆమె తనెంతో గొప్పదాన్నని గర్వపడుతుంటుంది. ఇక్కడ ఇడిసేసింది అనగా భర్తను వదిలేసినదని అర్థం. +స్వయంగా పరీక్షించి తెలుసుకోవచ్చు అనే అర్థం.గుర్రం నీ ఎదురుగానే ఉంది. మైదానం కూడా ఎదురుగానే ఉంది, ఎక్కి స్వారీ చేసి పరీక్షించి నువ్వే తెలుసుకో +దరిద్రదేవతకు ఇది మారు పేరు. ఆ ఇంట్లో ఇనుపగజ్జెల తల్లి నాట్యమాడుతున్నది. అని అంటారు. అనగా ఆఇంట్లో దారిద్ర్యం ఉన్నదని అర్థం. +అత్యంత కష్టమైన పని చేయటం ఎంతగా ఉడికించినా అవి ఉడికేదీ లేదు, మెత్తపడేదీ లేదు. వాటిని ముందు పెట్టి తినమన్నప్పుడు ఎంత కష్టమైన పనో +వెతకనక్కరలేదు.ప్రతిభావంతుడికి పరీక్షలు పెట్టడం అనవసరం.ఇప్ప పూలకు వాసన వెదకాలా అన్నట్టు +ఇంటి చుట్టు పక్కల వారు అని అర్థం. ఇరుగు పొరుకు వారితో అన్యోన్యంగా వుండాలని ఈ జాతీయం యొక్క గూఢార్థం. +ఇంటిలో ఉన్న ఆస్తి మొత్తం నాశనం చేయుట అని అర్థము. ఉదా: వాని వల్ల ఇల్లు గుల్ల అయింది అని అంటుంటారు. +శ్రమ ఎక్కువగా ఉండే పని, విసుగు, చిరాకు కలిగించేపని. పూర్వం వస్తువులను దాచుకోవటం కోసం నేలను తవ్వి ఆ గుంతలో దాస్తుండేవారు. దీనినే పాతర అని అంటారు. ఇసక నేలలో గొయ్యి తీసేటప్పుడు పైనుంచి ఇసక జారి మళ్ళీ ఆ గోతిలో పడుతుంటుంది. పని ముందుకు సాగనివ్వక అడ్డుపడే వ్యవహారం. అటువంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతారు. +ఎంతో పురాతనమైనది. కృతయుగం నాటిది. ప్రాచీనమైనది +ఇంగువ అయిపోయినా కూడా అది కట్టిన గుడ్డలో ఇంగువ ఉన్నట్లుగానే అనిపించేలా చాలాకాలంపాటు వాసన వస్తుంటుంది. +విపరీతంగా పొగడడం భోగాలను అనుభవించడంలో ఇంద్రుడికి, అందంగా ఉండడంలో చంద్రుడికి ఎవరూ సాటి లేరు. +సుమారుగా అని అర్థము: ఉదా: ఇంచుమించుగా వారిద్దరు ఒకటే అని అంటుంటారు. +ఇంటి సంగతులు: ఉదా: ఇంటి గుట్టు రట్టు చేయ కూడదు. అనగా ఇంతి విషయాలు బయటికి తెలియకూడదు అని అర్తంలో ఈ జాతీయాను వాడుతారు. +అయినవారి దగ్గర, కాని వారి దగ్గర, స్వదేశంలోనూ, విదేశంలోనూ .తన వారి దగ్గర, బయట వారి దగ్గర కూడా ఇంట గెలిచి రచ్చ గెలవటం లాగా +పని చేసిన వ్యక్తికి నష్టం, పొరుగువారికి లాభం. కొందరు ఇంట్లోని విషయాలను పట్టించుకోకుండా పొరుగు వారికి ఉపయోగించే పనులు చేస్తుంతారు వారి గురించి ఈ జాతీయాన్ని వాడుతుంటరు. +ఆ ఇంటికి తలుపు లేదు ఈ ఇంటికి గడియ లేదు అన్నట్టు .ఒకదానికంటే మరొకటి మరీ నాసి రకమైనది అని. +ఇంటిదొంగ కన్నుండగానే గుడ్డుమాయం చేస్తాడని కూడా అంటారు. అంటే అన్ని విషయాలు బాగా తెల్సిన సొంతవ్యక్తే నమ్మకద్రోహాన్ని తలపెట్టిన పరిస్థితుల్లో ఇలా అంటారు.అవినీతి పరుడు, అవినీతి అధికారి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని సామెత. అతడు లోపలి వ్యక్తే కదా. అతడికి అలా చెయ్యాల్సిన అవసరం ఉండదు అనే నమ్మకం +[[ఇల్లాలు ఇంటికి దీపం ఇల్లాలు .ఇల్లు మొత్తానికి దీపం లాగా కాంతినిచ్చేది కీర్తిప్రతిష్ఠలు కలిగించేది ఇంటికి కీర్తిని తెచ్చిపెట్టే పని ఎవరు చేసినా వారంతా దీపాల్లాంటి +ఇంట్లో దొంగలు పడి దోచుక పోయారని అర్థం. +సవరించటమంటే చక్కదిద్దటమని అర్థం. అయితే జాతీయంగా దీని అర్థం ఇంటిని సవరించటం అన్నప్పుడు దొంగలు దోచుకుపోయారు అని. + + +ఈ అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +[[వేటూరి ప్రభాకర శాస్త్రి నేదునూరి గంగాధరం బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు. +ఏ పార్టుకు ఆ పార్టు విడతీయుట +కురూపిగా ఉండటం, అందహీనత, బలహీనత .కోడి ఈకలన్నీ పీకేస్తే చూడబుద్ధి కాదు. ఆ జ్వరం వచ్చిన నాటి నుంచి ఇదిగో ఇట్లా ఈకలు పీకిన కోడిలా అయ్యాడు' అంటారు. +అంగట్లో బేరం లేదని అర్థం: ఉదా: వానికి బేరంలేక ఖాళీగా ఈగలు తోలుకుంటున్నాడు. +వాడెంత వాడి బతుకెంత అని ఈగ చిన్న ప్రాణి, ఇక దాని లోపలి పేగు ఎంత చిన్నదిగా ఉంటుందో చెప్పనక్కర లేదు. ఈగ లాంటి అల్పుడు అని +సరి, సమానము వీరి ఈడు జోడు బాగున్నది. +మోసకారి వ్యవహారం మాయమాటలు చెప్పి ఎదుటివారికి ఏ కొద్దిగానో ఇచ్చి వారి నుంచి ఎక్కువ కాజేయటం +అదుపు లేని ఆగ్రహంతో తన, మన చూసుకోకుండా ప్రవర్తించటం.పులి తాను ఈనిన పిల్లల్ని కూడా తినేస్తుందట +ఎంతో వూహించుకొంటే కొద్దిగా ప్రతిఫలం లభించటం. + + +ఉ అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.ఈ అక్షరానికి సంబంధించిన జాతీయాలు కొన్ని వు అక్షరజాబితాలో కూడా కనిపిస్తాయి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +[[వేటూరి ప్రభాకర శాస్త్రి నేదునూరి గంగాధరం బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు. +రాతకోత లేవీ లేకుండా, మరేసాక్ష్యాలు లేకుండా ఇచ్చిపుచ్చుకోవటాలు.తక్కువ ఇచ్చి ఎక్కువ మొత్తాన్ని దబాయించి తీసుకోటం.కొడవలి అరిగి చిన్నదైనప్పుడు లిక్కి అంటారు. ఓ వ్యక్తి ఓ సారి తన లిక్కిని ఎదుటివారు అడిగినప్పుడు ఇచ్చాడట. ఆ తీసుకొన్న వారు ఆ లిక్కిని ఎక్కడో పారేశారట. అప్పుడు లిక్కి ఇచ్చిన వ్యక్తి ఆ విషయాన్ని తెలుసుకొని తన కొడవలిని తనకు ఇమ్మన్నాడట. అదేమిటయ్యా నువ్విచ్చింది లిక్కి కదా, కొడవలిని అడుగుతావేమిటి అనంటే నే���ిచ్చింది కొడవలే అని తగాదాకు దిగితే తీసుకొన్న వ్యక్తి లిక్కి పోయింది కనుక వాస్తవమేమిటో రుజువు చెయ్యలేక కొత్త కొడవలి కొనిచ్చాడట. +ఎప్పుడు రాలిపోతుందో తెలియని బలహీన పరిస్థితి +కొద్దిగా సహాయం చేస్తే ఇంకా ఇంకా సహాయం చేయమని వెంబడి పడటం.కష్టాల్లో నుంచి బయటపడ్డ తర్వాత కూడా ఇంకా ఆ చేరదీసిన వారి దగ్గరే ఉంటూ వారికి ఇబ్బందులు కలుగచేయటం. అలాంటి వరినుద్దేశించి ఈ మాటను వాడుతారు. +కయ్యానికి సిద్దం గట్టి పట్టుదల గల వాడు. +ఉక్కుపాదం మోపడం, తీవ్రంగా అణచివేయటం పోలీసులు తీవ్రవాదంపై ఉక్కు పాదం మోపారు. +అతి బలవంతం మీద కోపం ఆపు కొని వున్నాడు: ఉదా: వానికి కోపం వచ్చింది కాని ఉగ్గబట్టుకొని ఉన్నాడు. +పరమ నీచుడుడు: ఉదా: వాడు ఉచ్చగుంటలో చేపలు పట్టే రకం. +గౌరవ, అగౌరవములు ఉచ్చనీచములు ఎరిగి సరైన వారితో స్నేహం చేయాలి. ఆసందర్భంలో ఈ మాటను వాడుతారు. +మోసంచేయాలని చూడటం పాపం అమాయకుడు. వాడినికూడ ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. అలాంటి వారినుద్దేశించి ఈ మాటను వాడతారు. +పని ఒత్తిడేమీ లేకుండా సాఫీగా కాలం సాగిపోవటం హాయిగా కావాల్సింది వండుకుని తినటం, చక్కగా నిద్రపోవటం +ఉడ్డ అనగా నాలుగు అని అర్థం: లెదా నలుగురు అని అర్థం: కూలీలు ఎంత మంది వచ్చార్రా అని అడిగితే ఉడ్డకు ముగ్గురు తక్కువ" అని జవాబుచెప్పాడు. అనగా ఒకడే వచ్చాడని అర్థం. హాస్యంగా చెప్పడం. +ఏ పనీ చెయ్యనివాడు, సోమరిపోతు అని అర్థం. దీనిని నిందా వాచకంగా కూడ వాడుతారు. అనగా ఎందుకు పనికి రాని వాడని అర్థంలో కూడ వాడతారు. +చేతనైన సాయం చేయటం.సేవాభావంతో చేసే చాల చిన్ని సహాయాన్ని ఉడుతాభక్తి అంటారు. +పట్టిన పట్టు వదలకపోవటం,మొండిపట్టు ఉదా ఈ విషయంలో వాడిది ఉడుము పట్టు. గట్టి పట్టుదల గల వారి గురించి ఈ మాట వాడతారు. +బాగా చీవాట్లు పెట్టారు; ఉదా: అసెంబ్లీలో ప్రతి పక్షాలు ఎదుటి వారిని ఉతికి ఆరేశారు. +చేసినది చాలు ఇక వెళ్లు అని అర్థం> +ఉదా: వారిద్దరు కలిస్తే ఉప్పు నిప్పే: శతృత్వం, చిట పట లాడ తారు. ఆ సందర్భంలొ ఈ మాటను వాడుతారు. +పూర్తిగా నిరుపయోమైన వాడని అర్థం. ఉదా: వాడు ఉప్పు రాతికికూడ కొరగాడు. అలాంటి వారిని గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +పనేమి లేదని అర్థం ఉదాహరణకు ఒక సామెత వున్నది ఉప్పురాతి పనిలేదు అరగడి తీరిక లేదు ఇది ఒక సామెత. +ఉదా: నిన్ను వానిపైకి ఉసి గొల్పుతున్నారు జాగ్రత్త. +ఊరికే వుండకుండా ఏదో ఒక పని చేస�� చిన్న చిన్న కష్టాలను కొని తెచ్చుకొనే వారిని గురించి ఈ మాటను వడతారు. +ఉడుము గుడ్లగూబ ఇంట్లోకి వస్తే అశుభం అని మూఢనమ్మకం. ఆసూయపరులు, దుర్మార్గులు ఇళ్ళలోకి రావటం అసలు అశుభం +గొప్పలు చెప్పేవారు.బడాయిపోయేవారు.ప్రేయసీ ప్రియుల నడుమ ఉత్తరాలందిస్తూ వారి ప్రేమ పెరగటానికి సహకరించేవాడు ఉత్తరాన్ని రహస్యంగా తీసుకెళ్ళి ఇచ్చేవాడు +పిరికివాని ప్రగల్భాలు వాని మాటలు వట్టి ఉత్తరకుమార ప్రగల్బాలు. +ఉత్తుత్తి విగ్రహాలు.అసలు విగ్రహాలు వేరే.బ్రహ్మోత్సవాల్లో గర్భగుడిలోని మూలవిరాట్టుకు బదులుగా వూరేగింపునకు వచ్చిన విగ్రహాలు ఉదా:వాడొట్టి ఉత్సవ విగ్రహం ఉత్సవ విగ్రహాన్ని కేవలం ఊరేగింపుకు మాత్రమె వాడతారు. పూజాదులకు మాత్రం. గర్బగుడిలోని మూల విగ్రహానికె. +ధాన్యాన్ని చెరిగితే పొట్టు, పొల్లు ఎగిరిపోయి గట్టి గింజలు మాత్రం మిగులుతాయి. పోయిన వస్తువులు పొట్టుతో సమానమని అనుకోవాలి. +అడ్డు అదుపు లేని నోరు గురించి దీనిని వాడతారు +"మీ ఉప్పు తిన్న విశ్వాసం" అంటరు చూడండి ఆ సందర్భంలో ఈ మాటను వాడతారు. +పొగిడి సంతోషపెట్టటం,ఉబకెయ్యటం,విపరీతంగా పొగడటం వాడు నిన్ను బాక ఉబ్బేస్తున్నాడు. +ఇద్దరు మిత్రులు.అనుకొన్న పని చేయటానికి కలిసికట్టుగా తిరుగుతారు,పని అయిపోయాక ఎవరి దారి వారిదే.ఉమామహేశ్వరుడు, జగన్నాథుడు అనే పదాల నుంచి ఉమ్మాయ్‌ జగ్గాయ్‌ అనే పదాలొచ్చాయి. శివుడు, విష్ణువు రాక్షసుల నుంచి ఒకరినొకరు రక్షించుకోవటానికి ఒకటౌతారు ఆ తర్వాత ఎవరి తీరున వారు ఉండిపోతారు. +చిన్న పిల్లలను ఆడిస్తూ పాటపాడుతూ ఉయ్యాలలో ఊపుతూ నిద్రపుచ్చటం +కోపంతో గట్టిగా అరవటం వాడు నీమీదెందుకు అలా ఉరుముతున్నాడు.? +బాధ పెట్టడం ఉరి తీసినా, తీయక పోయినా అంతటి బాధను అనుభవించి కుమిలి పోయేలా చేయటం +అత్యంత శీఘ్రంగా వేగంగా వారంతా ఉరుకులు పరుగులు మీద వచ్చారు. +చెప్పాడు, చెప్పింది, ఒకరు చెప్పిన మాట, ఒకరి మాటల్లోని భావం: భగవద్గీతలో శ్రీ కృష్ణ ఉవాచ అనే మాటను ఇక్కడ ఉపయోగిస్తారు. +నిరాశ చెందటం ఉదా: వారు వెళ్లిన పని కాక పోయె సరికి 'ఉసూరు మంటు' తిరిగి వచ్చారు. వెళ్లిన పని కాకుండ తిరిగి వచ్చిన వారి గురించి ఈ మాటను వాడతారు. +బాగా పనిచేసి అలసినవారు బడలిక తీర్చుకోటానికి చేసే నిట్టూర్పు + + +ఊ అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. అది నిజార్థం. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" ఇది అసాధ్యం. కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. ఇది గూడార్థం. ఇదే అందరికి అర్థమవుతుంది. ఆ అర్థంలోనే ఈ మాటను ఉపయోగిస్తారు. సామెతల కన్నా ఎక్కువగా జన బాహుళ్యంలో విరివిగా ఉపయోగములో వున్నవి జాతీయాలే. +సామెతల వలెనే జాతీయములు కూడా ఎవరో పని గట్టుకొని సృష్టించినవి కావు. జనాల మాటలలో, వారి సామాజిక వ్వవస్థ నుండి పుట్టినవే. కొన్ని సామెతలు జాతీయములు]]గా కూడా చలామణిలో ఉన్నాయి. వాటిని ఇట్టే గుర్తించ వచ్చు. +ఊక అనగా వడ్లగింజపైనుండే పొట్టు. వడ్లను దంచితే పైపొట్టు పోయి బియ్యం బయడ పడతాయి. అందుకే వడ్లను దంచుతారు. కానీ ఊకను దంచితే ఏమి ఫలితముండడు. ఆ అర్థంలో అనవసరంగా వ్వర్థ ప్రసంగం చేసేవారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ఉటంకిస్తారు. వ్వర్థం అనే అర్థంలో. +నిర్మూలించడానికి వీలులేని విధంగా విస్తరించినది అని +ఊ అన్నా ఆ అన్నా తప్పే +మాటమాటకీ, తరచుగా అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ప్రత్యేకించి ఏ భావమూ వ్యక్తపరచకపోయినా ఏమాత్రం మాట్లాడినా ఆ మాటలకు కొంతమంది పెడార్థాలను చెప్పుకున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది వాడితో అసలు మాట్లాడలేము. వూ అన్నా కోపమే, ఆ అన్నా కోపమే, ఆ ఇంట్లోవాళ్ళు ఎలా భరిస్తున్నారో మరి" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. +ప్రోత్సాహమివ్వడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. స్తబ్ధంగా ఉన్నప్పుడు ఒకచోట పడిఉండడం తప్ప మరేవిధమైన పని జరగడానికి వీలుండదు. అదే కదలికలో ఉన్నప్పుడు, అది కూడా మంచి వూపుతో ఉన్నప్పుడు కార్యసాధనకు వీలు కలుగుతుంది. ఈ చలనాత్మక దశలో ఉన్న శక్తిని సూచించే విధంగా వూపునివ్వడం అనేది కార్యసాధనకు ఉద్యమించేలా చేయడం, కదలికను తెప్పించడం, ప్రోత్సాహాన్ని కలిగించడం అనేలాంటి అర్థాలలో ప్రయోగంలోకి వచ్చింది ఆ నాయకుడి ప్రసంగం అందరికీ మంచి ఊపునిచ్చింది' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది. +కుంభకర్ణుడు లాగానే లక్ష్మణుడి భార్య వూర్మిళ కూడా ఎక్కువగా నిద్రపోయేది.అలా ఎక్కువ సేపు నిద్ర పోయే ఆడవారిది ఊర్మిళనిద్ర అంటారు +పేదరికంతో ఉన్న కొందరికి రోషం ఉంటుంది. భిక్షాటన చెయ్యటమంటే తప్పని వారు భావించి ఎలాగోలా ఒళ్ళొంచి పనిచేసి తమ జీవనభృతిని సంపాదించుకొంటారు. కానీ కొంతమంది కన్ను, కాలు అన్నీబాగున్నా బద్దకంతో ప్రవర్తిస్తూ భిక్షాటనకు దిగుతారు. అలాగే ఏ మఠంలోనో, గుళ్ళోనో తలదాచుకుంటారు. ఇదంతా వారి సోమరితనానికి గుర్తేతప్ప మరొకటికాదు. ఇలా ఎవరైనా అన్నీ బాగుండి కూడా సోమరితనంతో ప్రవర్తిస్తున్నప్పుడు "వాడికేంలే వూళ్ళోబిచ్చం, గుళ్ళోనిద్ర. ఇల్లూవాకిలి పట్టకుండా తిరుగుతుంటాడు. వాడితో నీకెందుకు" అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది. +అనవసరమైన మాటలు అతిగా వాగుతున్నాడు అని అర్థం. +గొప్పవాడని అర్థం: దీన్ని నిందా వాచకంగా కూడా వాడతారు. +ఊరు ఉసిరి కాయంత తగువు తాటికాయంత + + +ఋ, ౠ అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. + + +ఎ, ఏ, ఐ అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాట]]లు మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +ఎగ్గు అంటే కీడు అని అర్థం. ఎవరి ఎంగిలి అయినా తిన్నంత మాత్రాన కీడేమీ జరగదు. +బాగా బాధించటం, తీవ్రంగా విమర్శించటం ఈ నాడు దేశంలో పాతుకు పోయిన అవినీతిని అన్నా హజారే ఎండగడుతున్నాడు. +అతిగా స్పందించే గుణం .కొద్దిగా గాలి వీచినా పెద్దగా శబ్దం చేస్తుంది. +బక్కచిక్కి, నీరసంగా ఉండటం.నునుపు నిగనిగ తగ్గిపోయి ఎండిపోయి కనిపించటం. +ఎంత పండినా కూటిలోకే, ఎంత ఉండినా కాటిలోకే .పంట ఎంత పండినా దాన్ని కలకాలం నిల్వ ఉంచరు. ఆహార పదార్థంగా ఆ పంట మారాల్సిందే.అలాగే నూరేళ్లు బతికినా అంతకంటే ఎక్కువ బతికినా, అంత ఎక్కువకాలం బతికాడని మరణించాక అతడిని ఇంట్లో ఉంచుకోరు. కాటికి పంపాల్సిందే. అంటే ఎప్పటికో ఒకప్పటికి మరణం తప్పదు కనుక ప్రాణం ఉన్న రోజుల్లోనే జీవితాన్ని పదిమందికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలనే సూచన +జన్మస్థలాలను విడిచి వెళ్ళక జననం నుంచి మరణం దాకా ఒకే వూళ్ళో ఉండేవారు.ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండేవారు +కోపంతొ ఎక్కడున్నావూ' ఇంతసేపు అనడానికి ఇలా అంటారు. +"పల్లెలోకి క్రొత్తగా వచ్చిన వారిని ఎగదిగ చూడటం సర్వసాధారణం" +విద్వేషాలను రెచ్చగొట్టడం వారిరువురు పోట్లాడుకుంటుంటే వీరు పక్కన చే ఎగదోస్తున్నారు. +తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వకుంటే వాడు నాకు ఎగనామం పెట్టాడూ' అంటారు. +అప్పు తీసుకొని ఇవ్వక పోతే ఎగరేశాడు అని అంటారు. +అధిక సంతోషంగా వున్న వాణ్ని చూసి ఇలా అంటారు. +తెలివి తక్కువ వ్యవహారం, విఫల ప్రయత్నం చేయడం +సాబు అంటే సాహెబ్, సాయుబు, గొప్పవాడు, పాలకుడు.ఓడినా, గెల్చినా నేను గొప్ప అని .కిందపడ్డా, మీదపడ్డా నాదే పైచేయిఅని. +విలువలేనివాడు, నిరర్థక జీవితాన్ని గడిపేవాడు .అంకెలకు కుడివైపు ఉన్న సున్నాలు అంకెకు విలువను పెంచుతూ ఉంటాయి. అదే ఎడమ పక్కన పెట్టిన సున్నాకు విలువ ఉండదు. +ఒకరి మీద ఒకరికి ఇష్టం లేనప్పుడు వారిద్దరు ఎడమొఖం పెడమొఖంగా వున్నారూ అని అంటారు. +అటు ఇటు రెండు వైపులా అని అర్థం. +ఉదా: వాణ్ణి ఎడా పెడా వాయించారు. రెండు వైపులా అని అర్థం. +లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించక పోవటం, అనుకున్నది సాధించే వరకూ వూరుకోక పోవటం +మనసు గాయపడేలా సూదితో గుచ్చినట్లు మట్లాడటం వారు సూటి పోటి మాటలతో ఎత్తి పొడుస్తున్నారు. +కొరకలేరు, నమలలేరు. పళ్ళు ఉన్నా ప్రయోజనం శూన్యమే.పని జరగదు. ఎత్తు పళ్ళతో కొరికినట్త్టెంది అంటారు +భయపడాల్సిన పనిలేదు.మేకపోతు గాంభీర్యం పోకట అంటే పొగరు .చూడ్డానికి ఓ రకంగానూ, కార్యసాధనలో మరో రకంగానూ కనిపించటం. +ప్రముఖ స్థానం, అగ్రాసనం, ఎత్తుపీట పెద్దకుర్చీ వేసి గౌరవించడం +ఒకే చోట విభిన్న లక్షణాలుండటం.ఆకాస్తలోనే తేడాలు చూపించటం +అభివృద్ధి లేకుండా వుండడము వాడి ఉద్యోగం ఎదుగు బొదుగు లేక ఎక్కడ వేసిని గొంగళి చందాన అక్కడే ఉంది. +ఏమిచెప్పినా అర్థం కాకపోవడం, ఏంతచెప్పినా వినిపించుకోకపోవటం. +ఎంత ధైర్యం రా నీకు అని అడుగుట నీకెన్ని గుండెలురా నాతోనే వాదనకొస్తావా? +ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా ఆయువు ఉన్నంతకాలమే అదంతా ఆ తర్వాత ఎవరైనా సరే పోయేది ఒక చోటుకే. +ఎన్నుఅంటే వెన్ను కంకి, వెన్ను ఎర్రపడటం అంటే పంట,,4125 +చెయ్యకూడని పనిని బాహాటంగా చేస్తూ ఉండటం.చేసిన పనికి సిగ్గుపడక అందరికీ చెప్పుకోవటం +చాలా ఎక్కువ చలి అని అర్థం. +అనగా గొప్ప దాత అని అర్థము ఉదా: వాని చేతికి ఎముక లేదు అని అంటుంటారు. +ఒకరికొకరు సహకరించు కోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎవరిష్టం ప్రకార వారు నడుచు కోవడం. +తెలియక వచ్చి ఆపదలో చిక్కుకున్నారు అని అర్థమొచ్చే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. +మిత్రలాభం.ఎరిగి ఉండటం.బాగా తెలిసి ఉండటం, పరిచయమై ఉండటం.తెలిసినవారుంటే సరుకు అప్పు తెచ్చుకొనే వీలుంటుంది. +నామమాత్రపు చదువు, మనుషుల పేర్లు మాత్రమే రాసే వరకూ వచ్చి ఆగిపోయిన అక్షర జ్ఞానం +లేనిపోనిది కొని తెచ్చుకున్నట్టు, వెల ఇచ్చి మరీ తగాదాను కొని తెచ్చు కోవటం +చాలాసేపు జరిగే పని.ఎల్లమ్మ కొలుపుల్లా ఇంకా ఎంతసేపు ఆ పని చేస్తారు, త్వరగా కానీయండిఅంటారు. +ఎదురు లేని అడ్డు అదుపు లేని అని అర్థం. +చిన్న తప్పు కోసం పెద్ద ముప్పుల్ని సంకల్పించటం చిన్న తప్పు దొర్లినప్పుడు సహన గుణం ప్రదర్శించకుండా పెద్ద ముప్పును తల పెట్టటం +నాగలికి దుంపను సరిగా అమర్చకపోతే నేలను దున్నటం వీలుకాదు.దుంప వదులుగా ఉన్నా బా��ా ముందుకు బిగిసి ఉన్నా రెండూ ఇబ్బంది.ఎలుగు ఎక్కువైతే నాగలి కర్ర నేల మీద ఆనదు.పనిలో జాగర్తగా ఉండమని, ఎలుగు సలుగెరిగి చేస్తేనే పనిసులువుగా జరుగుతుందని. +వృధా ప్రయాస. ఎంత తీవ్రంగా పనిచేసినా దానికి తగిన ప్రతిఫలం దక్కదు. అసలు పని చేయలేదేమోనన్న భావన ఎదుటి వారికి కలిగి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తుంటాయి.త్వరగా అయ్యేపనికాదు +ప్రాణం పోవటం, వెళ్ళటం, పారిపోవటం .ఏదో ఈ జీవితం ఇలా ఎళ్ళబారిపోతే చాలు +పచ్చి అవకాశ వాధి అని అర్థం. +ఉత్తములు కాలం కలిసిరాక కష్టాలపాలైనా వారి వ్యక్తిత్వం, సమాజంలో వారంటే ఉన్న మంచితనం ఏవీ పూర్తిగా తరిగిపోవు.మంచివారు ఒక్కోసారి కలిసిరాక చతికిలపడ్డా వారి పరువు పోదు. +ఎవరైనా తప్పులు చేసినప్పుడు ఆ తప్పులన్నిటినీ ఎదుటివారు ఏ ఒక్కదాన్నీ విడిచి పెట్టకుండా అన్నిటినీ తీవ్రంగా విమర్శిస్తున్న సందర్భం.దూదిని పరుపులు లేదా దిండ్ల కోసం సిద్ధం చేసేటప్పుడు దానిలో ఉన్న దుమ్ము, ధూళిని పోగొట్టటానికి ఏకుతుంటారు. ఏకిన తర్వాత దూది శుభ్రపడుతుంది.చేసిన తప్పులు దూదికంటుకున్న దుమ్ము, ధూళి లాంటివి. ఆ తప్పులను విమర్శించి చేసిన వారికి అవి తప్పులని తెలియచెబితే వాటికి దూరంగా ఉండే ప్రయత్నం జరుగుతుందన్న భావన +మెత్తగా వచ్చి, గట్టివాడై ద్రోహం చేయటం..అల్పుడు అధికుడై, బలహీనుడు బలవంతుడై ఎదురు తిరగటం. +ఏకులు పెట్టిన బుట్ట చాలా ఏకులు తనలో ఇముడ్చుకోగలుగుతుంది. కష్టాలొచ్చినా దిగమింగుకుంటూ ఎప్పుడూ బయట పడకుండా ఉండే వ్యక్తులు +పనికి రాకుండా వృధాగా ఉండటం .ఏకులే లేనప్పుడు ఇక ఆ రాట్నం వృథాగా పనికి రాకుండా ఉండిపోవాల్సిందే. +సాహసోపేతం.దూర ప్రాంతాల్లో ఉండి ఆత్మీయుల దగ్గరకు సమయానికి చేరుకోలేని పరిస్థితి +ఏనుగు తిన్న వెలగ పండు పేడలో కాయ లాగానే బయటకు వస్తుంది. కాని దాని లోపలి పదార్థమంతా మాయ మై ఖాళీగా వుంటుంది ఇది ఈ జాతీయం నిజార్థం. అసలర్థం ఏమంటే ఎదుటి వాడికి తెలియకుండా మోసం చేసి అతడిని నష్టపరిచే వారి గురించి ఈ జతీయము చెప్తారు.) +అత్యాశ, అధిక దాహం అనే సందర్భాలలో వాడుతారు. +ఏనుగుకు కాలు విరగటం దోమకు రెక్కవిరగటం ఒకటే +కష్టాల తీవ్రత పెద్దవారికొకలాగా చిన్నవారికొకలాగా ఉండవు.కష్టాలు అందరూ అనుభవించాల్సిందే +ఏనుగు కోసం రాజు, పంది కోసం దొమ్మరి బాధపడినట్లు +కష్టాలు ఎవరి స్థాయిలో వారికుంటాయి.'రాజు ఏనుగుపోయి బాధపడితే దొమ్మరి పందిపోయి బాధపడ్డట్టు +సింహభాగం అధిక భాగం లాగ. ఏనుగు దాని ఆకారానికి తగ్గట్టుగానే మేత మేస్తుంది. ఏనుగంత మేత ఏనుగు మేసేంత ఎక్కువమేత అని, +నేనెక్కడా తనెక్కడ నాతో నీవు ఏవిషయంలోను సమ ఉజ్జీ కాదని చెప్పడమే ఈ జాతీయం యొక్క అర్థం.) +ఒకడు చేసిన తప్పును కప్పిపుచ్చుకొనడానికి అబద్ధం చెప్పి ఆతర్వాత అసలు విషయం తెలిసి పోతే ఈ మాట వాడతారు. +ఏపూరి వంశం వారు ప్రజలను ఇబ్బందులపాలు చేయటంతో ఆ బాధలు తట్టుకోలేక ఆ గ్రామాల్లోని ప్రజలంతా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళారట. ఆ ప్రజల ఉసురు తగిలి ఆ వంశం అంతా నిర్వంశం అయిందట. ఆ ఇళ్ళలో దీపం మలగలేదు (వెలిగించే వారే లేకుండా పోయారని అంటారు నిర్వంశం కావటం లేదా దీపం వెలిగించే దిక్కు లేకుండా పోవటం +సమ ఉజ్జీగా ఉండేవాళ్ళే ఒకటిగా కలిసిపోగలరని చెప్పటం.ఏ గూటి పక్షి ఆ గూటికి చేరినట్టు . +ఏలాంటి నింద అతని మీద పడలేదు: ఉదా: ఈ వ్యవహారంలో అతనికి ఏ మరకా అంటలేదు. +తమ ఇంటికి వచ్చిన ఒకరిని వెళ్ల గొట్టి ఆతర్వాత అవసర నిమిత్తం వారింటి వెళ్లవలసి వస్తే ఇలా అనుకుంటారు. +అవకాశవాదం నీతి నియమాలు మాని సందర్భాను సారం తనకు లాబమైన పని చేసే వారిని గురించి దీన్ని వాడతారు +తక్కువ స్థాయి సిగను వేలుతో ముడివేసుకోవటం +ఏ పని చేయాలన్నా తగిన సమయానికే చేయాలి. సమయం మించి పోయాక అవకాశాలన్నీ అయిపోతాయి.వయస్సు మీరిన తర్వాత, నది ఎండిపోయిన తర్వాత చెయ్యగలిగింది ఏమీ లేదు అని +ఏసు అంటే అభివృద్ధి, ఎదుగుదల లేని ఇల్లు +ఓడిపోవటం రెండు చేతుల్నీ ఒక చోటికి చేర్చినమస్కారం పెట్టడం అనేది ఓడిపోవటానికి, పారిపోవటానికి, లొంగిపోవటం లేదా మర్యాదపూర్వకంగా దండం పెట్టడాన్ని ఇలా అంటారు నిఘూడంగా. +మోయలేని భారం దేవేంద్రుడి వాహనం ఐరావతం ఇది తెల్ల ఏనుగు. ఇది దైవంతొ సమానం. దీని చేత పనులు చేయించ కూడదు. అయినా మంచి ఆహారం పెట్టలి. అది మోయ లేని భారం. +కలిసి రావటం, లాభపడటం.అయి వచ్చింది, అయ వచ్చింది, ఐ వచ్చింది అంటారు. +అయిసర బజ్జా అని ఊపుతెచ్చుకొని దూకటం లేదా భారమైన పనిచేసెటప్పుడు పాట పాడుతు ఈ మాట అంటారు./ +ఐలెస్సా ఐలెస్సా అని పూపు తెచ్చుకిని అందరు కలిసి బరువులను లాగటము. ఐసర బొజ్జా లాంటిదే ఈ మాట కూడ./ + + +ఒ, ఓ, ఔ అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +అసంభవం, ఎటువంటి పరిస్థితులలోనూ జరగటానికి వీలు లేదు వాస్తవదూరం +ఒంటి మీద ఒకటి బండ మీద ఒకటన్నట్టు +స్వతహాగా కాకుండా ఎవరి సహాయం తోనైనా విలువను పెంచుకొనే వ్యక్తి.ఒంటు అంటే అంకె.అంకెకు ఎడమవైపున ఎన్ని సున్నాలు పెట్టినా విలువ ఉండదు.ఒంటుకు కుడివైపున ఏ ఒక్క అంకె వేసినా, లేదంటే ఒక్క సున్నా పెట్టినా దాని విలువ అధికమౌతుంటుంది. +ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రవర్తించే తీరు తానొక్కడే ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఒంటెద్దు పోకడ +ఎవరి మాట వినని వాడని అర్థం ఉదా: వానిది అంతా ఒటెద్దు పోకడ: ఎవరి మాట వినడు. +వెళ్లి పోవడానికి చాల తొందర పడుతున్నాడు: ఉదా: వాడు ఒంటి కాలు మీద నిలబడ్డాడు ఎప్పుడు వెళ్లి పోదామా అని. +ఒక పని అయింది. ఉదా: ఆ పనిలి ఇప్పటికి ఒక అంకం ముగుసింది. +అనిశ్చిత స్థితి, సరిగా లేని సహాయం, క్షణానికో రకంగా ప్రవర్తించటం.ఒకసారి అనుకూలంగానూ, ఒకసారి ప్రతికూలంగానూ వ్యవహరించట +పని చివరి దశకు వచ్చిందని అర్థం. +ఏమాత్రం చాలవు, చాలా కొద్దిగా ఉన్నాయి. +అయిష్టం, కోపం రావడం వీడంటే వాడికి బలే ఒళ్లు మంట +ఒరగటం వాడొచ్చి ఒరగ బెట్టిందేమి లేదు) +సమకూరటం, ప్రాప్తించటం, పరిస్థితులు సానుకూలంగా మారటం, లాభం రావటం ఈ ప్రభుత్యం వచ్చి మాకు ఒరగ బెట్టినదేమి లేదు. +చాల కోపంగా వున్నదని అర్థం: ఉదా: వాన్ని చూస్తుంటే నాకు వళ్లు మందు తున్నది. +సంతాన భాగ్యం కలగటం, గోద్ భరనా +ఓ అనిన వ రాదు అన్నట్టు + + +క, ఖ అక్షరాలతో మొదలయ్యే జాతీయాలు +అన్నింటిని ఆశించేవాడు. అలాంటి వారిని గురించి ఈ మాటను వాడతారు. ఆబగా అన్నం తినే వార��ని ఉద్దేశించి కూడా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +ముక్కలు ముక్కలుగా ఉదా: ఈ చింత కాయలను కచ్చా పచ్చాగా దంచి తీసుక రా +పనికిరాని పని, వృధాశ్రమ, ప్రయోజనం లేని పనులు.పచ్చిమట్టితో గోలీలాట ఆడితే ఆ మట్టి ఉండలు విచ్చిపోతాయే తప్ప ఆట సాగదు. +దీనికి జైలు కెళ్ళాడని అర్థము. జైలులో కటకటాలు తప్ప ఇంకేమి కనిపించవు. వాటిని లెక్కబెట్టడము తప్ప వేరే పని వుండదని దీనర్థం. జైలు కెళ్ళిన వాళ్ళగురించి వాడినదీ ఈ జాతీయము. +నీతిని తప్పు. ప్రతి ఊరికి కొన్ని కట్టు బాట్లుంటాయి. అక్కడ నివసించే వారు ఆ వూరి కట్టు బాట్లకు అనుకూలంగా నడుచుకోవలసి వుంటుండి. అలా కాకుండా ఆ కట్టు బాట్లకు విరుద్ధంగా ప్రవర్తించెతే వారిని కట్టు తప్పాడు అని అంటారు. దానికి తగు పరిహారము చేయ వలసి వుంటుంది. +బాసనం అంటే వంట. గెలిచిన తండావారు ఓడిన తండా వారి చేత వంట చేయించుకొని తింటూ ఉండేవారు.బానిస అంటే అణిగిమణిగి చాకిరీ చేసే వ్యక్తి +ఏమి లేకుండా వచ్చాడు అని అర్థం. చేతిలో చిల్లి గవ్వ లేకుండా వచ్చిన వారినుద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయొగిస్తారు. +అందరు ఒక్కసారె రావడం. ఏదైనా ఒక చిన్న విషయాన్ని చర్చించడానికి చాల మంది వస్తే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +అంతా ఒక్కసారి వస్తే ఇలా అంటారు. +పద్ధతిని అతిక్రమించాడని అర్థం. ఉదా: వారు కట్టు తప్పారు. ఇక్కడ కట్టు అనగా వూరికొరకు ఏర్పాటు చేసుకొన్న పద్ధతి అని అర్థము +జీతభత్యాలు లేకుండా వెట్టిచాకిరీ చేసే సందర్భంలో ఈ జాతీయం వాడతాం. +అతి కష్టంతో కూడిన పనిని ధైర్యంతో చేసేటపుడు ఈ జాతీయం ఉపయోగిస్తాం. +తెగేసి నట్లు మాట్లాడడం ఉదా: వానివి కట్టె విరుపు మాటలు. +చాల స్వచ్ఛంగా ఉన్నాడు. ఉదా: ఈ వ్యవహారంలో వాడు కడిగిన ముత్యంలా ఉన్నాడు. ఏ మరకా అంట లేదు. స్వశ్చతకు ముత్యాన్ని పోలుస్తుంటారు మాటల్లో. అనగా చాల స్వచ్ఛంగా వున్నదని అర్థం. అలా పుట్టినదే ఈ జాతీయము. +అతి పవిత్రంగా వున్నాడని అర్థం. చాల శుభ్రంగా వున్నాడని కూడా అర్థం. ముత్యం శ్వచ్చతకు చిహ్నం. +బాగా చీవాట్లు పెట్టారు; ఉదా: శాసనసభలో ప్రతి పక్షాలు అధికార పక్షాన్ని కడిగేశారు. దేన్నైనా కడిగే దానిలోని మలినమంతా పోయి శుభ్రంగా వుంటుండి. అలాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఇదే అర్థంలో మరి కొన్ని జాతీయాలున్నాయి ఉతికి ఆరేశారు అనేది మరొక జాతీయము. +అసూయగా వుందా ఉదా: నన్ను చూస్తే వానికి బలే కడుపు ఉబ్బరం. ఇతరుల ఉన్నతిని చూచి ఓర్చు కోలేని వారిని గురించి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. +విపరీతంగా కోపం రావటం ఆకలి ఎక్కువై కడుపులో కాలటం +అర్థ:ఓరువలేనితనము, ఈర్ష్య. అసూయ పడటం: ఉదా: వానికి నామీద బలే కడుపు మంట. +ఒకరిని చూసి ఓర్వలేకున్న వానినుద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +తిండి లేక వున్నాడు అని అర్థం. సాధారణంగా తిండి లేక ఎక్కువ ఆకలిగా వున్నపుడు నీరసంగా వుంటుంది. ఆ కారణంగా వారు నిలబడలేరు, కూర్చోనూ లేరు. పడుకొని వుంటారు. ఆ పడుకోవడం కూడా కాళ్ళు ముడుచుకొని వుంటారు. ఆ సందర్భాన్ని బట్టి ఈ సామెత పుట్టింది. +సుఖంగా వున్నాడని అర్థం. ఉదా: వానికేం? కడుపులో చల్ల కదలకుండా ఉన్నాడు. ఎటువంటి శారీరిక కష్టం చేయ నక్కర లేకుండా జీవితం సుఖంగా నడిచిపోతుండే వారినుద్దేశించి ఈ జతీయాన్నుపయోగిస్తారు. +చాల ఆకలిగా వున్నదని అర్థం. ఉదా: నాకు కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయి. త్వరగా అన్నంపెట్టు. +చాల ఆకలిగా వున్నదని అర్థం నాకడుపులో రైళ్లు పరిగెడుతున్నాయి ఏదైనా తినాలి చాల ఆకలిగా వున్నవారు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. దీనికి సమానర్థంలో మరొక జాతీయం కూడా ఉంది. అది కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి] +బేరం బాగా జరిగిందని అర్థం. అన్ని కార్యాలు సక్రమంగా జరిగి నిచ్చింతగా వున్న వారిని గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +వాడు తన కడుపు కక్కుర్తికి ఈ నీచపు పనిచేసాడు. అత్యాశ గల వారినుద్దేశించి ఈ మాటను వాడుతారు. +ఏ రహస్యాన్ని దాచుకోలేక పోవు స్థితి। +హాయిగా సంతోషంగా వుండటం మంచి మాట చెప్పావు. ఇప్పుడు నాకడుపు చల్లగా వుంది నాయనా అని అంటుంటారు. +కడుపు పండటము అనగా స్త్రీ గర్భము దాల్చి పిల్లలు కలగడమని ర్థము. ఉదా: ఇంత కాలానికి ఆమె కడుపు పండింది. అని అంటుంటారు. +ఎక్కువగా ఆకలి కావడం నాకడుపులో ఎలుకలు పరుగెడుతున్నవి. నేను ముందుగా అన్నం తినాలి. దీనితో సమానర్థంలో మరొక జాతీయం ఉంది కడుపులో రైళ్ళు పరుగెడుతున్నాయి] +అతి రహస్యం: ఎవరికి చెప్పొద్దు. ఎవరైనా ఒక రహస్యాన్ని చెప్పి దాన్ని ఎవరికి చెప్పొద్దని చెప్పుతూ ఈ రహస్యాన్ని నీ కడుపులో దాచుకో అని చెపుతుంటారు. అంటే దాన్ని మరెవ్వరికి చెప్పవద్దని హెచ్చరిక. ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +కడుపుతో ఉండటం, గర్భం దాల్చటం ఉదాహరణ: కాసింత నలుసు నాకడుపున పడితె దేవుని తలనీలాలిస్తానని మొక్కు కున్నాను. +సంతానం కలగటం/ ఇన్నాళ్లకు ఆమె కడుపు పండింది. +కడుపు పండింది ఆమె తల్లి అయింది. +కడుపులో దాచుకొ ఎవ్వరికి చెప్పొద్దు/ రహస్యం +ఇంట్లో ఉండటం వైకుంఠంలో ఉన్నంత సుఖం గాను, కడుపునిండితేనే కైలాసంలో ఉన్నంత సంతోషంగా ఉండటం.తృప్తిగా ఉండటం. +కడుపులో చేయి పెట్టి కెలికి నట్టుంది +మిక్కిలి కష్టపెట్టు నీమాటలు వింటుంటే నాకు కడుపులో చేయి పెట్టి కెలికి నట్టుంది అతి ఘోరమైన విషయాన్ని విన్నప్పుడు కలిగే మానసిక పరిస్థితిని తెలియ జేయడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +అక్కరలేని బేరము వాడికేమిలే వాడిది కడుపు నిండిన బేరం. అని అంటుంటారు. +కోపంగా వున్నాడు: ఉదా: వాడు నాపై కత్తి నూరు తున్నాడు. +నిరోధించటం, అభివృద్ధికి భంగం కలిగించటం, చంపటం +భరించరాని పరిస్థితులు. వాడిప్పుడు కత్తుల బోనులో ఇరుక్కున్నాడు. చాల ప్రమాదములో ఇరుక్కున్న వారి నుద్దేశించి ఈ మాటను వాడుతారు. +కక్షతో బలాబలాలను ప్రదర్శించుకోవటం. వాడు నీపై కత్తి నూరు తున్నాడు/ +పైకి బాగా కనిపించినా కష్టాలు తెచ్చిపెట్టే మోసపూరిత వ్యవహారాలు..పైకి మంచిగా లోపల చెడుగా ప్రవర్తించే వ్యక్తులు +కత్తులు దూశారు పోరాటానికి సిద్దం అన్న అర్థం; +పోట్లాడుకున్నారు అని అర్థం: ఉదా: పలాన విషయంలో వారిద్దరు కత్తులు దూసు కున్నారు. పోట్లాటలో నిజానికి కత్తులు దూసక పోయినా ఆ పోట్లాటను చెప్పేటప్పుడు వారు కత్తులు దూసుకుంటున్నారు అని అంటుంటారు. +పని అయిపోయింది. ఉదా: ఆ కథ ఎప్పుడో కంచికి చేరింది. దాని సంగతి ఇప్పుడెందుకు. +అనవసరమైన మాటలు చెప్పొద్దు ఉదా: కథలు చెప్పొద్దు. అవి వినడానికి ఇక్కడెవ్వరు లేరు. లేని పోని విషయాలు చెప్పుతున్నా అబదాలు చెపుతున్నా ఎదుటి వాడికి అసలు విషయం తెలిసి పోయిన తర్వాత వారి నుద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. +కల్లబొల్లి కబుర్లు చెప్పేవాడని అర్థం. లేని పోని విషయాలను బహు సమర్థంగా అల్లి వినటానికి ఇంపుగా చెప్పే వారి నుద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు. +చుట్టూ తిరిగినా, కుట్టినా భరించటం కష్టం. కదిపామంటే పెనుప్రమాదమే.క్రోథ స్వభావులు, వూరకనే కయ్యానికి కాలు దువ్వే వారిని కదిలించకుండా పక్కకు తప్పుకొని పోవటమే మేలు +అహంకారంతో కన్నులు కనిపించ క అని అర్థము. +తొట్టతొలిగా వచ్చిన ఆకు, ప్రధాన పాత్ర +ఎలాంటి శబ్దమూ, అలికిడి తెలియకుండా చౌర్యాలకు పాల్పడే నేర్పరితనం +ఎక్కువగా ఏడ్చారు అని అర్థం: ఉ��ా: వారి తండ్రి చావును చూసి వారు కన్నీటి వరద పర్యంత అయ్యారు. కన్నీళ్ళతొ వరద రాదు. కానీ ఎక్కువగా ఏడుస్తుంటే ఈ జతీయాన్ని వాడుతారు. +ఎక్కువగా ఏడ్చారు. వారు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు అని అంటుంటారు. ఉదా: +ఎక్కువగా ఏడ్చారు అని అర్థం. అతిగా ఏడ్చారని అర్థము. +అసూయ పడ్డాడు. ఉదా:వీరి అభివృద్ధి చూసి వానికి కన్ను కుట్టింది. +సందేహంగా ఉంది. అనుమానంగా వున్నదని అర్థం: ఎవరికైనా ఏవిషయంలోనైనా సందేహం కలిగితే మనకు తెలియకుండానే కనుబొమలు దగ్గరవుతాయి. ఆ విధంగా పుట్టినది ఈ జాతీయము. +విదేయతగా వుండడం: చెప్పిన మాట వినడం: వారితని కను సన్నలలో మెలుగు తుంటారు అని అంటుంటారు. అలాంటి వారిని గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు +కళ్ళలో నిప్పులు పోసుకోవడం అసూయ పడడం. +అధికంగా అసూయ పడుతున్నారని అర్థం. ఎక్కువగా ఈర్ష్య పడే వాళ్ళనుద్దేశించి ఈ మాటలనుపయోగిస్తుంటారు. ఉదా వారు పచ్చగా బచుతు తుంటే వీళ్ళు కళ్ళలో నిప్పులు పోసు కుంటారు అని అంటుంటారు. +అంతులేని ఆనందం. అక్కడ తిరుణాల్లు కన్నుల పండుగగా జరిగాయి. +చూసిందంతా కావాలనుకున్నా ప్రాప్తించేది కొద్దిగా మాత్రమే ఎంత ఆశపడ్డా మనకు ఎంతవరకు దక్కాలో అంతవరకే దక్కుతుంది. ఆశపోతులనుద్దేశించి ఈ మాటను ఉపయోగిస్తారు. +ఎలాగైన స్వంతం చేసుకోవాలని ఆశపడటం. ఉదా: వాడు దానిమీద కన్నేశాడు అని అంటుంటారు +పొగరెక్కువయింది: ఉదా: నాలుగు రూకలు చేతికొచ్చేసరికి వానికి కన్ను మిన్ను కానడం లేదు +అసూయ పడటం. ఒక పాటలో పద ప్రయోగము. మన జంట అందరికి కన్ను కుట్టు కావాలి, ఇక ఒంటరిగా వున్న వారు జంటలై పోవాలి +నీకొరకు ఎదురు చూసి చూసి నాకన్నులు కాయలు కాచాయి. +ఎదుటి వాని కన్నులుమూసి తప్పించు కున్నారని అర్థం గాదు. చాల తెలివిగా తప్పించుకున్నారని అర్థం. ఉదా: ఆ దొంగ మాకన్నులు గప్పి ఇంట్లోకి చొరబడి అంతా దోచుకున్నాడు అని అంటుంటారు. +చాల పొగరెక్కిందని అర్థం ఉదా: నడిమంత్రపు సిరి తో వానికి కన్నులు నెత్తి మీదికి వచ్చాయి అని అంటుంటారు. +పొగరెక్కువగా గలవాడిని ఇలా అంటారు: వాడికి కన్నులు నెత్తికి వచ్చాయి. +కళ్లు నెత్తిమీదికి వచ్చాయా పొగరు ఎక్కువయందా అని అర్థం +దానిమీద ఆశ పడుతున్నాడని అర్థం: ఉదా: వాడికి దాని మీద కన్ను పడింది.సామాన్యంగా దొంగ బుద్ధి గల వారిని గురించి ఈ మాట అంటుంటారు. +హద్దులులేని అహంకారం. వానికి అహంకారంతో కన్ను మిన్ను కాన రావడంలేదు. మిన్ను అనగా ఆకాశము అని అర్థము ఎవరైనా అతి గర్వంగా ప్రవర్తిస్తుంటే వారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు. +కన్నెర్ర తనం.అసూయ,ఎదుటివారి అభివృద్ధి చూసి ఓర్వలేనివారు క్రోధంతోనో, అసూయ ద్వేషాలతోనో రగిలి పోతుంటారు. అలాంటి సమయాలలో కళ్ళు ఎర్రబడతాయని. కోపం వచ్చిందని అర్థం: ఉదా: వాడు నామీద కన్నెర్ర చేశాడు. +ఆశించటం, గమనించటం ఓ వస్తువును చూసి ఎలాగైనా దాన్ని తన సొంతం చేసుకోవాలని ఎవరైనా అనుకొంటున్నప్పుడు వాడు దాని మీద కన్నేశాడు, వాడి కన్ను పడింది అంటారు. అలాగే ఏదైనా విషయాన్ని జాగ్రత్తగా గమనించటం అనే అర్థంలో ఓ కన్నేసి ఉంచు అంటారు. +కన్నెర్ర తనం.అసూయ,ఎదుటివారి అభివృద్ధి చూసి ఓర్వలేనివారు క్రోధంతోనో, అసూయ ద్వేషాలతోనో రగిలి పోతుంటారు. అలాంటి సమయాలలో కళ్ళు ఎర్రబడతాయని. +కోపం వచ్చిందని అర్థం: ఉదా: వాడు నామీద కన్నెర్ర చేశాడు. +ఎవరికైనా కోపం వస్తే వారి కన్నులు ఎరుపెక్కుతాయి. దాన్ని బట్టి వారికి కోపం వచ్చిందని అర్థము. ఆవిధంగా ఈ జాతీయము పుట్టుంది. వాడు నామీద కన్నెర్ర జేశాడు అని అంటుంటారు. +సమస్య నుంచి తప్పించుకు తిరగడం వాని మాటలు వినకు వాడిదంతా కప్పదాటు వ్వవహారం.) +కప్పను మింగిన పాము లాగ వున్నాడు +ఒక చోట కుదురుగా వుండక అవకాశమున్న చోటుకు గెంతేసే వారి గురించి ఈ సామెత వాడతారు. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి వెళ్ళడాన్ని కప్ప దాటులు వేయడము అని అంటుంటారు. +కప్పల తక్కెడ స్థిరంగా వుండదు. కప్పలను తక్కెడలో (త్రాసులో) వేచి తూచడము అసాద్యం. అవి ఎగిరి పోతుంటాయి అలా స్థిరంగా లేని వ్వక్తుల గురించి ఇలా అంటరు. +బద్దకంగా వున్నాడని అర్థం: ఉదా: వాడు కప్పను మింగిన పాములా బద్దంకంగా వున్నాడు. కప్పను తిన్న పాము రెండు మూడు రోజులు బద్దకంగా పడుంటుంది. +అచేతనత్వానికి, బద్దకానికి, నిద్రాణ స్థితికి గుర్తు. +ఒక పద్దతి ప్రకారం నడవని వాడు +నిర్ధయుడైన వ్యక్తి ఆధీనంలోకి వెళ్ళి అనేకానేక ఇబ్బందులు పడుతుండటం +కమ్మేయటం, కమ్ముకుపోవటం, కమ్ముకురావటం పూర్తిగా ఆవరించటం +పోట్లాటకు పిలుస్తున్నాడు: ఉదా: వాడు కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. +కనీసం భార్యతో మాట్లాడే తీరిక కూడా లేకుండా పోయేంత పని, +సర్వస్వం, అంతా తానే చేసేవాడు, చేయించేవాడు, చేసేది అంతా ఒకడే అని +తోడుదొంగలు, మోసగాళ్ళు ఎదుటి వారిని మోసం చేయటానికి ఒకరు ఆ ఎదుటి వ్యక్తికి విరోధిగానూ, మరొకరు మిత్రుడిగానూ నటిస్తుంటారు. విరోధిగా నటించే వాడైనా, మిత్రుడిగా నటించే వాడైనా ఆ ఇద్దరిదీ ఎదుటి వ్యక్తిని మోసం చేసి లాభపడాలన్నదే ఆలోచన. +స్పష్టంగా,కళ్ళకెదురుగా గుప్పిట తెరిచిన స్థితిలో,అరచేతిలో ఉన్న ఉసిరికాయలాగా. అతి సులభంగా అని అర్థం. ఆ విద్యార్ధికి పాటలన్ని కరతలామలకములే. +మార్గదర్శకం. కరదీపిక అనగా చేతిలోని దీపం అని అర్థము. చీకట్లో వెళుతున్నప్పుడు చేతిలో దీపం వుంటే గమనము సులభ మౌతుండి. అలాగే ఏదైన వస్తువు మనకు ఉపయోగ కరంగా వుంటే ఆ సందర్భాన్ని బట్టి ఈ జాతీయాన్ను వాడు తుంటారు. +కర్ర లేని వాణ్ని గొర్రె అయినా కరుస్తుంది అనేది ఒక సామెత..ఏ అధికారమూ, ఆదరణా, ఆధారమూ లేనివారి గురించి ఈ మాటను వాడతారు. +ఆనోటా ఈనోటా వినటం. ఈ విషయం కర్ణాకర్ణిగా విన్న మాటె. +కర్కటి గర్భం, వృశ్చికి గర్భం. ఎండ్రకాయ, తేలు గర్భం ధరించి పిల్లలు పుట్టేడప్పుడు ఆ తల్లులు పొట్టలు చీలి మరణిస్తాయి. ఎవరైనా పుట్టగానె తల్లి మరణిస్తే వారి నుద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు. +ఆనోట ఈనోటా విన్నాను: ఉదా: ఆ విషయం కర్ణా కర్ణిగా విన్నాను. +రుచీపచీ లేని కూరలాగా. కర్ణుడు లేకుండా భారతాన్నె ఊహించ లేము. అది అతి ముఖ్యమైన పాత్ర. అది లేకుంటే +కలహాలను పెట్టేవాడని అర్థం ఉదా: వాడొట్టి కలహాల మారి. వాని మాటలను నమ్మొద్దు. +అబద్ధం అని అర్థం: ఉదా: వాడు ఇక్కడకు వస్తాడనేది కలలోని మాట. +చాల దాన గుణం కలవాడు కల్పతరువు అనగా కోరిన కోరికలన్నీ తీర్చేదేవతా వృక్షం. అదే విధంగా ఎవరైన్నా ప్రతి వారికి సహాయాన్ని కాదనకుండా చేసే వారినుద్దేశించి ఈ జాతీయాన్ని వాడు తుంటారు. ఉదా: +కల్పవల్లి కల్పవృక్షం ఎవరైనా అడగంగానే కావాల్సినవన్నీఇచ్చేది.కల్పతరువు అనగా కోరిన కోరికలన్నీ తీర్చేదేవతా వృక్షం. అదే విధంగా ఎవరైన్నా ప్రతి వారికి సహాయాన్ని కాదనకుండా చేసే వారినుద్దేశించి ఈ జాతీయాన్ని వాడు తుంటారు. +ఒక సామెతలో కలిసొచ్చిన కాలానికి నడిసొచ్చే పిల్లలు పుడుతారు అని అంటారు. ఆ విధంగా ఎవరికైన అన్ని కలిసొచ్చి సంపద చేకూరితే ఈ జాతీయాన్ని వాడుతుంటారు. +ధర్మం తప్పిన కాలంగా ఈ మాటను వాడతారు. కలికాలంలో ధర్మము ఒంటికాలిమీద నడుస్తుందని నానుడి. అధర్మ ప్రవర్థనను చూచినప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +ఊహించని సంపద కలిసి రావడము/ దీనికి సంబందించిన ఒక సామెత కూడ ఒకటున్నది కలిసొచ్చిన కాలనికి నడిసొచ్చే కొడుకు పుడుతారట +కలిమి సంపద కలిగి ఉన్న వాడికి తలచుకొన్న పనులన్నీ వెంటనే నెరవేరుతుంటాయి.కలిమి లేనివాడు నిస్సత్తువ ఆవరించి ఆ మనిషి ఏపనీ చేయలేక దిగాలు పడి కూర్చుంటాడు. మళ్ళీ కాస్త ధనం చేకూరగానే ఓపిక వచ్చినట్త్టె పదిమందిలోకి వచ్చి కనిపిస్తుంటాడు. +అన్ని సక్రమంగా జరుగు తున్నాయని అర్థం అదృష్టంకలిసివచ్చిందని ఆర్థం కలిసొచ్చిన కాలానికి నడిసొచ్చే కొడుకు పుట్టాడట అనేది సామెత) +ఇరువర్గాలవారు విభేదాలను మరిచి స్నేహంగా కలిసిన సందర్భంలో ఇచ్చే విందు +అసూయ గల వారు ఉదా: వారు వీరి అభివృద్దిని చూసు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అని అంటుంటారు. +బ్రతకడానికి ఏదో ఒకటి తినాలి అని అర్థం. +తదేకంగా చూస్తున్నాడు అని అర్థం. ఉదా అక్కడ కోడెలు పోట్లాడుకుంటే ఆపిల్లలు కళ్ళప్పగించి చూస్తున్నారు అని అంటుంటారు. +చాల స్పష్టంగా అని అర్థం ఉదా: వాడు ఏమి చెప్పినా కళ్ళకు కట్టి నట్లుంటుంది. ఉదా: ఆ తెలుగు పండితుడు పాటాలు చెప్పుతుంటే కళ్ళకు కట్టి నట్లుంటుంది అని అంటుంటారు. +పొగరెక్కువయిన వారిని గురించి చెప్పే మాట కళ్ళున్నా చూడలేని వాడని అర్థం. గర్వం ఎక్కువయి కళ్ళముందున్నది కూడా కాన లేక పోవడము అని అర్థము +ఎదురు చూసి. ఉదా: నీకోసం ఎదురు చూసి కళ్లు కాయలు కాసాయి. +ఏడుపొస్తున్నది: ఉదా వారి బాధ చూస్తుంటే కళ్లు చెమర్చాయి అని అంటుంటారు. +చాల అందమైనదని అర్థం: ఉదా: ఆ అమ్మాయిది కళ్లు చెదిరె అందం. +పొగరెక్కిందా ఉదా: ఏరా కళ్లు నెత్తికెక్కాయా పిలిస్తె పలకవు. +ఎక్కువ ఆశ గలవాడు: ఉదా: వానికి కళ్లు పెద్దవి కడుపు చిన్నది. +పొగరెక్కిందా ఉదా: ఏరా కళ్లు మసక బారాయా, చూసి చూడనట్టు పోతున్నావు. +అసలు విషయం చెప్పాడు. ఉదా: వాడు అసలు విషయం చెప్పి నాకళ్లు తెరిపించాడు. అసలు విషయం తెలియక సదిగ్దంలో కొట్టు మిట్టాడుతుంటే ఆ సందర్భంలో మంచి సలహా ఇచ్చి సహాయ పడితే అటు వంటి సందర్భంలో ఈ జతీయాన్ని ఉపయోగిస్తారు. +పొగరు కనబరచు. ఎన్ని సార్లు పిలిచినా రావడంలేదు. కళ్లు నెత్తికెక్కాయా? +ఎదురు చూడడము. ఉదా: వాడికొరకు ఎదురు చూసి కళ్లు కాయలు కాచాయి. +అదుపులో పెట్టాలని అర్థం. ఉదా: వాని దూకుడుకు కళ్లెం వేయాలి. +అదుపులో పెట్టాలి: ఉదా: వాడు చెప్పిన మాట వినడం లేదు వానికి కళ్లెం వేయాలి. +ఒకరు పడుతున్న బాధను మరొకరు కూడా పడటం +పంతం పట్టాడు. ఉదా: వాడు ఆ పని ఇంత లోపల పూర్తి చేయాలని కంకణం కట్టు కున్నాడు. +ఉపయోగం లేని పని: ఉదా: ఆ పని వట్టి కంచి గరుడ సేవ. +కష్టమైనా ఉపయోగం లేకపోయినా తప్పనిసరై చేసే పని. కంచిలో గరుడ విగ్రహము చాలా పెద్దది, ఒక రథము అంత ఉంటుంది దానిని సేవకు తరలించుట కొద్దిగ కష్టం గరుడుడు విష్ణువు]]కు వాహనం. ముందుగా గరుడునికి దండం పెట్టాకే విష్ణువు దగ్గరకెళ్ళాలి. అతనికి నమస్కారం చెయ్యకుండా యజమాని దగ్గరకు నేరుగా వెళితే ఏమి కోపం పెట్టుకుంటాడో. ఒకవేళ నమస్కరించినా పెద్దగా ఒరిగేదీ లేదు. ఒక నమస్కారం పెడితే పోలా, ఎందుకొచ్చిన బాధలెమ్మని చేసే సేవ. +ఎంత వెతకినా దొరకడు అని అర్థం. +ఎవరికైన ఒక ప్రాంతంలో వారిమాటకు ఎదురులేకుంటే, వారి మాట చెల్లుబాటు అవుతుంటే ఆ ప్రాంతాన్ని వారి కంచు కోటగా అంటుంటారు. ఉదా: ఈ నియోజిక వర్గము కాంగ్రెసు వారికి కంచు కోట +అవకాశం కొరకు ఆశగా ఎదురు చూడటము. +కాపాడుకోవటం పిల్లి తన పిల్లల్ల్ని కంటికి రెప్ప లాగ కాపాడు కుంటుంది. +తేలికైనదే బరువవటం.తల్లికి పిల్లలు, భూమికి కొండలు, కొండలకు చెట్లు, చెట్లకు కాయలు భారం కావు అంటారు. +వేమన పద్యం చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ, కంటి లోన నలుసు, కాలి ముల్లు, ఇంటి లోన పోరు ఇంతింత కాదయా విశ్వ దాభిరామ వినుర వేమ." +విరామమే లేదు.కాస్త కూడా తీరిక లేనంత పనివుంటే ఈ మాటను ఉపయోగిస్తారు. +మోసం చేసాడని అర్థం: ఉదా: వాడు నాకంట్లో కారం కొట్టి తప్పించు కున్నాడు. +చీకాకు కలిగించే విషయం: ఉదా: వాడు చెప్పింది వింటే కంట్లో నలుసు పడ్డట్టుంది. ఆ సందర్భంగా ఈ జాతీయాన్ని వాడుతారు. +పొగరెక్కువయింది: ఉదా: ఏరా? కండ కావరం ఎక్కువయిందా పిలిస్తే పలకవు? +కందకు విత్తులుండవు: అనగా చెపుతున్నది అబద్ధం అన్న మాట. +ఉండి కూడా ఉపయోగించుకోలేనిది.ముళ్ళ కంప మధ్యలో అందుబాటులో లేకుండా కాసిన కాయ. దాన్ని కోయడానికి వీలుపడదు. అందుబాటులో లేని సంపద ఉద్దేశించి ఈ మాటను వాడుతారు. +అటు ఇటు కాని స్థితి కష్టాలు చుట్టు ముట్టాయి. కంపలో పడ్డ కాకి తప్పించుకునే ప్రయత్నంలో మరి కొన్ని ముళ్ళు గ్రుచ్చు కుంటాయి. ఆలా ఎక్కువ కష్టాలు చుట్టుముట్టితే ఈ జాతీయాన్ని వాడుతారు. +పని పాడుచేయటం నీకేదయినా పని ఇస్తే దాన్ని కంపు కంపు చేసిపెడతావు. +న విషయాల్లో ఏమాత్రం లోటు పనికిరాదని హెచ్చరిక. +తప్పించుకోలేని విషమ పరిస్థితులు ఏర్పడడం. కబందుడు రామాయణంలో ఒక రాక్షసుడు. అతని చేతికి చిక్కితే ఇక తప్పించు కోవడానికి వీలు పడదు. పురాణాల లోను���డి జన బాహుళ్యంలోనికి వచ్చిన జాతీయ మిది. తప్పించుకోలేని చిక్కుల్లో పడిన వారినుద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు. +ఉపయోగం లేని పని, మొక్కుబడిగా చేసిన పని కాకి స్నానమైతే చేస్తుంది కానీ ఆ చేసే స్నానం దాని శరీరాన్ని శుభ్రపరచదు.రెక్కల చివరను కొద్దిగా తడిపి ఆ తర్వాత విదిలించుకొని వెళ్ళిపోతుంది. +పికము అంటే కోకిల. కాకి కాకే, కోకిల కోకిలే ఆరెంటికి పోలిక లేదు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +అనుభవం.కాకలు అంటే కష్టాలు, నష్టాలు, తాపాలు. +అనుకోకుందా జరిగిన సంఘటనను ఇలా అంటారు. +దీనికి సంబంధించిన కథ: తాటి చెట్టుపైన ఒక తాటి పండు మాగి పోయి పడిపోవడానికి సిద్దంగా ఉంది. అదే సమయానికి ఒక కాకి దానిపై వాలింది. వెంటనే ఆ తాటి పండు రాలి కింద పడి పోయింది. ఆ విధంగా అనుకోకుండా జరిగిన దానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +లేని పోని విషయాలు; కల్పితాలు చెప్పేవారిని ఇలా అంటారు. +ఉపయోగంలేని మాటలు మాట్లాడొద్దు. అని అర్థం. +ఇది ఒక సంస్కృత న్యాయం. కాకి ఒకటి వచ్చి తాటిచెట్టుమీద వాలింది. తాటిపండు నేలరాలింది రెండూ ఒకేసారి జరిగినంత మాత్రనా కాకి వచ్చి వాలినందుకే తాటిపండు రాలిందని అనుకోకూడదు అది కేవలం అనుకోకుండా జరిగిన సంఘటనల కలయిక అని చెప్పడం ఈ న్యాయం ఉద్దేశం. +అలా యాధృచ్ఛికంగా జరిగిన సంఘటనను కాకతాళీయం అంటారు. +బిడ్డలు పదే పదే పుడుతూ చనిపోతూ ఉన్న తల్లి.కాకి తన గూట్లో ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా కోయిలో, మరో పక్షో, చెట్ల మీదకు పాకే పాముల వల్లనో ఆ గుడ్లన్నీ నశించి పోతుంటాయి +పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తుంటే ఈ మాట వాడతారు. +కాకులు గుంపులుగా చేరి గోల గోలగా అరుస్తుంటాయి. ఆ విధంగా క్రమశిక్షణా రాహిత్యం, అసందర్భ ప్రేలాపన చేస్తున్న వారినుద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు. +నల్లని కాకిముక్కుకు ఎర్రని దొండ పండు పొంతన కుదరదు. పొంతన లేని వాని గురించి దీన్ని వాడుతారు. ఎక్కువగా సరి జోడి లేని దంపతులనుద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు. +ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి సొమ్ము కూడబెట్టి దాచటం చేపలను, మాంసాన్ని కోసేటప్పుడు పసిగట్టిన కాకులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కోసిన ముక్కల్ని ఎగరేసుకుపోతాయి.అలాంటి కాకులకు ఏ పరిస్థితుల్లోనూ అందకుండా జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్ళటం.సంపాదన ఇతరుల చేతికి దక్కకుండా జాగ్రత్త చేయటం +చాల దట్టమైన అడవి అని ��ర్థం. +ఉదా: ఈ రోజుల్లో నీతిమంతులు కాగడా వేసి వెతికినా కనిపించరు. +చూపులకు మాత్రమే ఆకారంతో ఉండి దేనికీ పనికిరానిది. పేరుకు మాత్రమే పలుకుబడి ఉన్న వాళ్ళలాగా, సహాయం చేసే వాళ్ళలాగా కనిపిస్తూ సమయానికి ఆదుకోలేని వారు +జాగ్రత్తగా పరిశీలించారు: ఉదా: ఆ పార్టీవారు అభ్యర్థుల ఎంపికలో కాచి వడబోసి నిర్ణయించారు. +ఉదా: పెద్దలు వారి అనుభవాల నుండి కాచి వడపోసి మంచి విషయాలను పిల్లలకు చెప్తారు. +ఒకే పనిని పదే పదే చేయడం ద్వారా ఆ పనిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడాన్ని కూడా కాచి వడబోయటం అనవచ్చు. +ఉదా: ఇరవై ఏళ్ళుగా పిల్లలకు పాఠాలు చెప్తున్న ఆవిడ పిల్లల మనస్తత్వాలన్ని కాచి వడపోసింది. +పూర్తిగా సారాన్ని గ్రహించడం, అవగాహన చేసుకోవడం. విద్యార్థులందరు పాఠాలను కాచి వడబోచారు. +జగడాల మారి: ఉదా: వాడొట్టి కాట్ల కుక్క +మంచి వ్యక్తిని బతికున్నప్పుడు బాగా గౌరవించి నమస్కరించిన వారు ఆయన పోయాక కూడా ఆయనను దహనం చేసిన ప్రదేశానికి సైతం మొక్కటం. +మరణానంతరం కూడా ఓ మంచి వ్యక్తి చేసిన మేలును సంస్మరించుకోవటం, కృతజ్ఞతలు తెలుపుకోవటం +ఉదా: రాఘవ ను అతని తల్లి దండ్రులు కానా కష్టం చేసి చదివించారు. +కోపంగా వున్నాడని అర్థము: ఉదా: వాడు నీమీద కారాలు మిరియాలు నూరు తున్నాడు అని అంటారు. అనగా వాడు నీమీద చాల కోపంగా వున్నాడని అర్థము. +ఉదా: వాడు కారు కూతలు కూస్తున్నాడు. తిడుతున్నాడని అర్థం. +కార్యం ముందు వదరటం.రోహిణి కార్తెకు ముందు ఉరిమినా, వర్షం పడ్డా కార్తెలో వర్షాలు పడక ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటుంటారు. +[[ఘర్షణ]]కు సిద్ధపడడం/ పోట్లాటకు పిలవడము: పశువులు పోట్లాటకు సిద్దమవు తున్నప్పుడు కాలు దువ్వుతాయి. వాటిని బట్టి ఈ మాట పుట్టినది. +పాల్గొనటం, లెగ్గు పెట్టడం, పాదం మోపటం, కాలు మోపడమే వ్యతిరేక, వ్యంగ్యార్థంలో కనిపిస్తుంటుంది. +''వాడు ఇక్కడ కాలు పెట్టాడు ఆ పని అంతా పాడై పోయింది +జయమా అపజయమా? ఉదా: పని మీద వెళ్ళావు గదా: కాయా పండా? ఆ సందర్భంగా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +కోపంగా వున్నాడు: ఉదా: వాడు నామీద కారాలు మిరియాలు నూరు తున్నాడు. +ఉదా: నేను చెప్పిన సలహాలన్నీ కాలరాచాడు అనగా ఏ మాత్రం పాటించ లేదని అర్థం. +అసలు విషయం నిదానంగా తెలుస్తుందని అర్థం. ఏదేని సమస్యకు అప్పటికప్పుడు సమాదానము దొరక్కపోతే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. +కాలికి బలపం కట్టుకొని తిరుగు తున్నాడు +చాల చోట్ల తిరిగాడు: ఉదా: అతను తన కూతురి పెళ్ళి సంబంధం గురించి కాలికి బలపం కట్టుకొని తిరుగు తున్నాడు. +తంటాలు పెట్టి తప్పించుకునే రకం ఇదే అర్థంతో సమెత కూడా ఉంది. అది. కాలికేస్తే వేలికేస్తాడు, వేలికేస్తే కాలికేస్తాడు. +ఉదా: వాడు నా కాలిగోటికి సరి పోలడు. అల్పుడు అని అర్థం. +మాట జారింది: తప్పు జరిగింది: తప్పు చేశాడని అర్థము. +ఏ పని చేయడని అర్థం. అన్ని సక్రమంగా జరిగి పోతుంటే/ కావలసినపనులన్నీ జరిగి పోతుంటే చేయ వలసిన పనులేవి లేకుంటే/ఐశ్వర్య వంతుల గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదా: వాడికేం కాలుకింద పెట్టకుందా జరిగి పోతున్నది అని అంటుంటారు. +ఇది తెలంగాణా ప్రాంతంలో వాడె ఒక ఊత పదం. ఎక్కువగా దళితులు ఈ పదాన్ని వాడతారు. +కష్టంగా బతుకీడుస్తున్నాడు. ఉదా: ఎదో ఇలా కాలం వెళ్ల దీస్తున్నాను. చావలేక బ్రతుకుతున్నాడని అర్థము. +సమయం అనుకూలంగా లేదు: ఉదా: వానికి కాలం కలసి రాలేదు. +అడ్డు కున్నాడు. ఉదా: వాడు నాకాళ్లకు బందం వేశాడు. +పారి పోయాడు అని అర్థం: కాళ్లకు పని చెప్పాడు అని కూడా అంటారు. +దిగి వచ్చాడు. క్షమించమని కోరాడు. ఉదా: వాడు ఇన్ని మాటలని ఇప్పుడు కాళ్ల బేరానికొచ్చాడు. +చాల కష్టపడి వచ్చాడు. చాల దూరంనుండి అధిక ప్రయాసతో వచ్చాడని అర్థము. +పిల్లలు పలుమార్లు డబ్బులడిగితే వారిని విసుక్కుంటూ అనే మాట. +ఓ బిడ్డను కను. ఉదా: ఇన్నాళ్లకు ఆమె కడుపున ఒక కాయ కాసింది. పిల్ల పుట్టడాన్ని ఈ జాతీయంతో పోల్చి చెప్పడము రివాజు. +అవునో కాదో, పని అయితే పండు అని, పని కాకపోతె కాయ అని అంటారు. ఒక పని మీద వెళ్ళివచ్చిన వాడిని ఏమయ్యింది అని అడిగే బదులు కాయా పండా అని అడుగుతారు. +కోపగించు అని అర్థము. వారు వీనిమీద కారాలు మిరియాలు నూరుతున్నారు అని అంటుంటారు +సమయం అయి పోయింది అని అర్థం +ఎక్కువగా తిరిగే వారిని గురించి ఇలా అంటారు. +జిత్తుల మారి పనులు చేసె వారిని ఇలా అంటారు +చాల స్వల్పమని అర్థం. వాడెంత వాడి బ్రతుకెంత వాడు నా కాలి గోటితో సమానము అని ఇతరులను నిందిస్తుంటారు. +కాలికి వేసిన వేలికి, వేలికి వేసిన కాలికి +తగవును ఏదో విధంగా మెలికబెట్టి పరిష్కారం కానీయకుండా చేసే నేర్పును +''వాడు కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేసె రకం'' +పోట్లాటకు పిలవడం "వాడు నామీదికి కాలు దువ్వుతున్నాడు'' +అసహనంగా తిరగటం. ఒక చోట నిలకడగా వుండక, అసహనంగా అటు ఇటూ తిరుగు తుంటే ఈ జాతీయాన్ని ఉ��యోగిస్తారు. +ఉదా: వాడిక్కడ కాలు పెట్టాడు సర్వ నాశనమైపోయింది. +అధిక కష్టాలు ఆవరించాయని అర్థం. అనుకోకుండా ఎవరికైనా అనేక కష్టాలు వస్తుంటే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +చాల బాదిస్తున్నాడని అర్థం: ఉదా: వాడు నన్ను కాల్చుకు తింటున్నాడు/ ఎవరైనా ఒకరిని ఎక్కువగా బాదిస్తుంటే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. +కుతంత్రంతో ఎదుటివారిని అపజయం పాలుచేయటం .కాళ్ళు పట్టుకోవటం అంటే ప్రాధేయపడటం కానీ కాళ్లు పట్టుకొని లాగటం అంటే ఓ వ్యక్తి జీవనాధార వనరులను చెడగొట్టి నష్టం కలిగించటం. +సరైన సమయం రాలేదని అర్థం; ఏ పని చేపట్టినా సక్రమముగా జరగ అన్ని అవాంతరాలు వస్తుంటే నాకు కాలం కలిసి రాలేదంటూ ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +సక్రమంగా వ్యవహరించక పోవటం, రసజ్ఞత లేకపోవటం కాళ్ళకట్టవైపు తలపెట్టుకుని పడుకున్నాడంటే వాడికి ఏమీ తెలియదని అర్థం. అడ్డదిడ్డంగా ప్రవర్తించటం +ఎక్కువగా తిరిగుట: ఉదా: అతను తన కొడుకు పెళ్లి సంబంధం కొరకు కాళ్లు అరిగేలా తిరిగాడు +చాల ప్రయాస పడి వచ్చాడని అర్థం: +చాల ఎక్కువ చీకటి అని అర్థం. +బాగా చీకటి పడింది అని అర్థం: జీవితంలో కష్టాలు ఎక్కువగా చుట్టు ముట్టితే ఈ జాతీయాన్ని వాడుతారు. +బాగా వేగంగా పరుగెత్తటం. పరుగు లంకించుకోవటం +కిందఉన్న ఆకు ముందుగానే ముదిరి రాలిపోతుంది. దానిపై ఇంకో చిగురుటాకు పుట్టుకొచ్చి నవనవలాడుతూ నవ్వుతున్నట్టు కనిపిస్తుంది.కొంత కాలానికి ఆ ఆకు కూడ ముదిరి రాలి పోవలసినదే. అదే విధంగా వృద్ధులను చూసి యువకులు నవ్వుతుంటారు. అయితే ఆ యువకులు తాము కూడా మరికొద్ది కాలానికి వృద్ధులవుతామని అనుకోరు. అటు వంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. +ఏమి చేయకుండా వుండడం నేనిన్ని మాట్లాడుతున్నా కిమ్మనకున్నావు +ఉదా: వాడొట్టి కిరి కిరి గాడు తగాదాలు పెట్టుకునే వాడు. +ఏమి అనలేదు: ఉదా: ఇన్ని మాటలంటున్నా వాడు కిమ్మనలేదు. +మోసపూరిత మాటలు: ఉదా: వాడి మాటలు అన్నీ కిలాడి మాటలు. +కిందఉన్న ఆకు ముందుగానే ముదిరి రాలిపోతుంది. దానిపై ఇంకో చిగురుటాకు పుట్టుకొచ్చి నవనవలాడుతూ నవ్వుతున్నట్టు కనిపిస్తుంది.వృద్ధులను చూసి యువకులు నవ్వుతుంటారు. అయితే ఆ యువకులు తాము కూడా మరికొద్ది కాలానికి వృద్ధులవుతామని అనుకోరు. +పోట్లాడు కుంటున్నారు: ఉదా: ఆభార్యా భర్తలిద్దరు ఎప్పుడు కీచులాడు కుంటున్నారు. +సొంత వ్యక్తిత్వం లేకుండా ఇతరుల మీద ఆధారపడి ��ారెలా చెప్తే అలా చేసే వాడు ఒకరు ఆడించినట్టే ఆడేవాడు. +ఉదా వాడు వీని చేతిలో కీలు బొమ్మ" +సమయం చూసి దెబ్బతీయాలి. ఉదా: వానికి కీలెరిగి వాత పెట్టాలి +పడుకుని ఉన్న కుక్కను చూసినప్పుడు పక్కకు తప్పుకొని పోవటమే మేలు. అలాకాక కాకినో, పిట్టనో తోలినట్టు దాన్ని కూడా తోలితే లేదా కదిలించే ప్రయత్నం చేస్తే అది కయ్ కయ్‌మని అరిచి మీద పడి కరిచే ప్రమాదం జరగవచ్చు. +ఎన్నిసార్లు క్రమశిక్షణలో ఉంచాలని ప్రయత్నం చేసినా ఆ కాసేపు మాత్రమే చక్కగా ఉండి తర్వాత తనదైన సహజ పద్ధతిలో వ్యవహరించేది +ప్రతిదానికీ అనవసరంగా మాట్లాడడం, పెద్దాచిన్నా భేదం చూసుకోకుండా వాడెంత, వీడెంత అని ఎగతాళి చేయడం +కాలం కలిసి రావటం. అనుకోకుండా జరిగిన సంఘటనతో మంచి ఫలితముంటే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +చెప్పిన మాట వింటు పడి వుండడం: ఉదా: వాడు కుక్కిన పేను లాగ పడి ఉన్నాడు. +అదుపాజ్ఞలకు భయపడి కదలక మెదలక చేష్టలుడిగి పడి ఉండటం. వాడిప్పుడు కుక్కిన పేనల్లె పడి ఉన్నాడు. +మోసం చేశాడని అర్థం: ఉదా: వాడు కుచ్చుల టోపి పెట్టాడు. +మోసం చేశాడు: ఉదా: వాడు అప్పు తీసుకొని కుచ్చుల టోపి పెట్టాడు. +తెలివి తెక్కువ పని .పేలాలు కావాలంటే కాసిని జొన్నలు తీసుకొని కావలసినన్ని పేలాలను చేసుకొని తినవచ్చు. అలాకాక జొన్న కుప్పకు నిప్పుపెట్టి ఆ నిప్పుతో కాలిన గింజలన్నీ పేలాల్లాగా వస్తాయి తిందామనుకోవటం. +పూర్తిగా ఓడి పోయాడు. ఉదా: ఈ ఎన్నిల్లో ప్రత్యర్తులు కుప్ప కూలి పోయారు. +ఆపక్క ఈపక్క ఎలపట దాపట పెద్ద తేడాలేదని అర్థం ఉదా: వారిద్దరు చదువులో కుడి ఎడమగా ఉన్నారు.) +ఎప్పుడూ ఎవరి దగ్గరైనా తీసుకోవటమే కాదు అలా ఇచ్చిన వారికి తీసుకున్నవారు ఎంతో కొంత తిరిగి ఇస్తూనే ఉండాలని. +''కుదురు లేని కుండ కుదురుగా నిలబడి వుండడు. అలా నిలకడగా వుండని మనిషిని ఇలా అంటారు. +దీన్ని చాల సందర్భాలలో వాడుతారు. బాగా కొట్టాడు అనె అర్థంలో వాడు అందర్నీ కుమ్మేశాడు అని అంటారు. తిండి బాగా తిన్నాడనే అర్థంలో కూడా వాడు బాగ కుమ్మేశాడూ అని కూడా అంటారు. +సొంతఇళ్ళలో పిసినారి తనం ప్రదర్శిస్తూ పొరుగిళ్లకు వెళ్ళినప్పుడు పుట్టుభోగుల్లా వ్యవహరించటం. సొంత ఇళ్ళలో ఏమాత్రం ఖర్చు పెట్టకుండా బయటకు వెళ్ళి మాకు అవి కావాలి ఇవి కావాలి అంటూ అన్నీ తెప్పించుకొనే వారిని గురించి +ఒక కుటుంబంలోని సోదరీ సోదరులను మరో కుటుంబంలోని సోదరీ సోదరులు వ��వాహం చేసుకోవటం.పెళ్ళి ఖర్చులు తగ్గుతాయి. +తప్పించుకోను వీలు గాకుండా దొరికి పోయాడు. ఉదా: వాడు కుడితిలో పడ్డ ఎలక లాగ బలే దొరిగి పోయాడు. తప్పించుకోలేని విధంగా దొరికిపోతే ఈ సామెతను వాడుతారు. +ఒక నష్టం జరిగినా మరొక లాభం కలిగింది. ఈ మాటను సామెత లాగ కూడా వాడవచ్చు. +కష్టాలను దిగమింగుతూ లోలోపల మధన పడటం +పని ఎగ్గొట్ట డానికి ఎవేవో సాకులు చెప్పి తప్పించుకో జూడడం: ఉదా: తప్పించు కోవడానికి కుంటి సాకులు చెప్పొద్దు. +ఇద్దరు అక్క చెల్లలను మరో ఇద్దరు అన్న తమ్ములు పెళ్ళి చేసు కుంటే దాన్ని కుండ మార్పిడి సంబంధం అంటారు. +అందమైన అని అర్థం: ఉదా: ఆ అమ్మాయి కుందనపు బొమ్మలాగ వున్నది: +బాగా కొట్టాడు అని అర్థం: ఉదా: వాణ్ని బాగా కుమ్మేశారు. +నూతనోచ్చాహంగా వున్నాడని అర్థం. ఆ సందర్భంలో వాడెదె ఈసామెత. +చైతన్యం కలిగిన స్థితి. పాము శరీరం మీద కుబుసం ఉన్నంతసేపూ నిస్తేజంగా ఉంటుంది. ఆ కుబుసం విడిచి పెట్టగానే దానికి గొప్ప చైతన్యం కలిగి హుషారుగా ఉంటుంది. మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఉన్న వ్యధలు తొలగిన తర్వాత హుషారుగా పనిచేసినట్లు. +బాగా కొట్టారు ఉదా: వాణ్ణి బాగా కుమ్మేశారు. +కంచాల పోసింది తప్పుతుంది గానీ, కుంచాల పోసింది ఎవరినైనా పిలిచి కంచం పెట్టి అందులో అన్నం పెట్టి తినమన్నప్పుడు ఆ అన్నానికి ఖరీదు కట్టడం కానీ, మరెలాంటి వ్యాపార సంబంధమైన విషయాలుకానీ మిత్ర బంధువర్గాల్లో ఉండనే ఉండవు. కంచంలో ఎంత పెట్టినా తిరిగి తనకు ఇవ్వమని ఎవరూ అడగరు. కానీ కుంచంలో ఆహారపదార్థాలను ఓ కొలతగా కొలిచి వేరొక వ్యక్తికి ఇవ్వడమంటే దాన్ని మళ్లీ తిరిగి ఎప్పుడో ఒకప్పుడు ఇవ్వాల్సిందేనని అర్థం. +ఎంతో కొంత అనే అర్థంతో ఈ మాటను వాడతారు. గతంలో కుంచె, మానిక, ఫలము ఇవి కొలతలకు వాడే వారు. +కీ ఇవ్వటం.బాగా ప్రోత్సహించటం, ఉసిగొలపటం కుంజి అంటే తాళపు చెవి .ఆ తాళపు చెవితో బాగా మెలితిప్పి వదిలితే ఆట బొమ్మ ఆడుతుంది. +ఏ పనీ చేయుకుండా బయటకు వెళ్ళి పైసా సంపాదించుకు రాకుండా బద్ధకంగా వంటింట్లోనే కూర్చొని తింటూ, వంటవాళ్ళతో కబుర్లాడుతూ కాలక్షేపం చేయటం. +గుడ్లలో నీరు గుడ్లలోనే కుక్కుకోవటం, బాధను బయటపడనివ్వకుండా లోలోపలే కుమిలిపోవటం. +సుఖం అనుకొని వెళ్ళి కష్టాలపాలు కావటం +స్థిరబుద్ధి లేనివాడు.విడిగా కుండను నేల మీద ఉంచితే దొర్లి పోతుంది. +ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోవటం, క్షీణించటం, ���రణించటం, పతనం కావటం, విలువ పడిపోవటం +సంతోషం వెలిబుచ్చడం: ఉదా: వాడు ఆనందం పట్టలేక కుప్పి గంతులేశాడు. +కొత్త ఉత్సాహంతో: కొత్త భలంతో: ఉదా: +అసలు నిజము బయట పెట్టినప్పుడు ఈ మాటను వాడతారు. +ఒక ఇంటి అన్నదమ్ములు వేరొక ఇంటి అక్కా చెల్లెలని పెండ్లాడటము. +అందమైన అమ్మాయి: ఉదా: ఆ పెళ్ళి కూతురు కుందనపు బొమ్మలాగుంది. +కుందేలుకు కొమ్ము లుండవు. అసాద్యమైన పని అని అర్థం. ఇది ఒక నీతి పద్యం లోని భాగం. కవి తన పద్యంలో తివిరి ఇసుమున తైలమ్ము తీయ వచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించ వచ్చు ఎరికి మూర్కుల మనసుల రంజింప లేరు ఎంతటి అసాద్యమైన పనిని కూడా సాధించ వచ్చును కానీ మూర్కుల మనసును మాత్రం మార్చ లేము అనే అర్థం. +పొద్దు కుంకుతున్న వేళ. బారెడు పొద్దెక్కింది, మిట్ట మధ్యాహ్నం, పట్టపగలు లాంటి కాలసూచిక .కుందేళ్ళు సాయంసంధ్య వేళ చీకటి ఆవరిస్తున్న సమయంలో ఆహారాన్వేషణకు బయలు దేరతాయి. +అంతా కలిసికట్టుగా ఉండి ఒకే అభిప్రాయానికి రావటం +అంతా ఒక్కసారిగా జనం వచ్చినప్పుడు ఈ మాటను ఉపయోగిస్తారు. +ఏడ లేక ఎడవడం: ఎమరేమన్న అనుకుంటారేమోనని లేని ఏడుపును తెచ్చుకొని ఏడ్వటము. ఆ సందర్భంలో ఈ సామెత వాడుతారు. +దగ్గరలో. పోలీసు స్టేషనుకు కూత వేటు దూరంలోనె ఈ హత్య జరిగింది. +ఏం చేయాలో తోచని స్థితి, చేయాల్సిన పని చాలా కష్టంగా ఉండటం .కృతి, ఆది, అవస్థ .కృతి అటే కావ్యం లేదా గ్రంథం. ఆది అంటే ప్రారంభం. అవస్థ అంటే పరిస్థితి. కావ్యాన్ని లేదా గ్రంథాన్ని ప్రారంభించబోయే ముందు ఆ కవి లేదా రచయిత ఎలా ప్రారంభించాలా అని చాలా అవస్థ (కష్టం) పడుతూ ఉంటాడు. +ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ, హాస్యాలాడుతూ కనిపించే విదూషకుడు హాస్యగాడు. తిండిపోతు, సోమరిపోతు అసమర్థుడు +ఉపాధినీ, ఆనందాన్నీ, ఆహారాన్ని సమకూర్చిపెట్టే స్థానం. +మోసపూరితంగా ప్రవర్తించటం కొంగ నీళ్ళలో ఒంటికాలి మీద నిశ్చలంగా నిలుచొని తనకు కావాల్సిన చేప దగ్గరకు వచ్చదాకా కాపుకాసి దాన్ని పట్టుకొని తింటుంది.మంచి వారుగా ప్రవర్తిస్తూ అమాయకులను మోసం చేయటం. +అవసరానికి అందుబాటులో వున్న సంపద అని అర్థం. +తక్కువ స్థాయి మనస్తత్వం కలిగి ఉండటం, నీచంగా ప్రవర్తించటం +ధరలు పెరగటం. కొంగున ముడి వేసుకొన్న డబ్బంతా ఇచ్చినా కూరలు, వస్తువులు మళ్ళీ ఆ కొంగులో ముడి వేసుకోవటానికి సరిపోయినన్ని కూడా రాలేదని, ఎంతో డబ్బిస్తే కాసిని మాత్రమే వస్తువులు వచ్చాయని. +అతి ప్రయాస కోర్చి చేసిన పని వలన అతి స్వల్ప ప్రయోజనం కూరితె కొండను త్రవ్వి ఎలుకను పట్టి నట్లు అంటారు. +చాల కష్టమైన పని అని అర్థం: ఉదా: వాడు చాల బలవంతుడు: కొండలను సైతం పిండి చేయగలడు. +ఎంత చెట్టుకు అంత గాలి అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. +పాపం నీవు ఏదైనా సాయం చేస్తావని కొండంత ఆశతో వచ్చాడు. +శ్రమతో కూడినది, దీపం ఆరిపోవటం, ప్రాణం పోవటం +కొండకు వెంట్రుక వేసి లాగు తున్నాడు +వివరణ: చిన్న శ్రమతో పెద్ద ఫలితాన్ని ఆసిస్తున్నాడు. వేసింది వెంట్రుక లాగింది కొండను వస్తే కొండ వస్తుంది పెద్ద నిధి పోతే వెంట్రుకెగా పోతే పోయింది ఇలాంటి వారి గురించి ఈ సామెత చెప్తారు. +నీతి బాహ్యమైన పని, నీచమైన, అసాంఘికమైన పని కొంచెపు దాని కొంగుపడితే మంచోని మానంబాయే' అనే ఓ సామెత కూడా ఉంది. +కొంప దీసి వాడు వీడు కాదు గదా ఇది ఊత పదం) +ఏదో ఘోరం జరిగి పోయింది అని అర్థం: ఉదా అయ్యా కొంప మునిగిందయ్యా వాడు ఊరు విడిచి పారి పోయాడు" +"కొంప ముంచావు గదయ్యా ఎదుటి వారికి ఏమి సమాదానము చెప్పను." +తెలిసిన విద్య అని అర్థం. ఉదా: ఈ పని వానికి కొట్టిన పిండి +సందేహిస్తున్నాడు. ఉదా: వాడు ఏదో చెప్పడానికి కొట్టు మిట్టాడు తున్నాడు/. +పెద్ద దెబ్బ: ఉదా: వానికి ఈ సంఘటన కొరడా దెబ్బ లాంటిది. +అత్యల్పము: ఉదా: వాడు నాకొన గోటికి సరి రాడు +పొగరెక్కువయిందా: ఉదా: వాడికేమైనా కొమ్ములు మొలిచాయా? +కష్టాల్లో ఇరుక్కొని దారి కానక దిక్కుతోచని స్థితి. వాడు కష్టాల్లో ఇరుక్కొని కొట్టు మిట్టాడు తున్నాడు. +చాల స్పస్టంగా వున్నదని అర్థం: ఉదా వాని మొఖంలో ద్వేషబావం కొట్టొచ్చినట్టు కనబడుతున్నది చూడు. +ఏ పనీ దొరక్కుండా ఖాళీగా ఉండటం, ఏమీ తోచకుండా ఉండటం +ఎక్కువగా మర్యాదలు, అధిక గౌరవం పొందుతున్న వ్యక్తి. అన్నీ చక్కగా అమరుతున్నవాడు. +ఏదైనా ఓ వస్తువును కొనుక్కున్నప్పుడు వాటి వల్ల అపకారం కలిగితే అయ్యో డబ్బు పోయింది కష్టాలొచ్చాయి అని బాధ కలుగుతుంది. +కష్టపడకుండా ఎవరికీ ఏదీ దక్కదు.అడుక్కొని బతకడం మంచిది కాదు. +అనగా సహాయంగా అండగా వున్నారని అర్థము: ఉదా: వానికి చాల మంది కొమ్ము కాస్తున్నారు. +ఉదా: వాడికేమన్నా కొమ్ములు మొలిచాయా పొగరెక్కిందా అని అర్థం) +నిశ్చేష్టుడై పోవటం, చేష్టలుడిగి పోవటం పాపం వాడు ఆ చావు కబురు వినగానె కొయ్యబారి పోయాడు. ఏదైనా భయంకరమైన దృశ్యం చేస్తే శరీరం చలనం లేకుండా కొయ్యబారి పోయిందంటుంటారు. అలా పుట్టిందే ఈ సామెత. +మౌనంగా వుండటం: ఉదా: ఇందరు ఇన్ని మాట్లాడుతున్నా కొయ్య బొమ్మలా నిల్చున్నావేందిరా? +ఏపని చెప్పినా చెయ్యకుండా మాట వినకుండా తిరిగే వాడిని కొరకరాని కొయ్య అంటారు. +పొగరెక్కిందని అర్థం. ఉదా: ఏరా కొవ్వు తలకెక్కిందా బాగా పొగరుగా వుండే వారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +వివరణ: ఒక బర్రె చెరువులో మునిగి వున్నది దాని కొమ్ములు పెద్దవి అవి మాత్రమే కనిపిస్తున్నాయి. కొమ్ములను బట్టి బర్రె ఎంత పెద్దదోనని బేరం చేయడమన్న మాట. +ఏది కొనబోయినా ఒక్క విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటే నష్టపోతారు అనిచెప్పేసామెత ఇది. +ఒక పట్టాన మాట విననివాడు. వాడొట్టి కొరకరాని కొయ్యి. కొయ్యను కొరికితే అది ముక్కలు కాదు. అది ఏమాత్రము వీలు పడని పని. అదే విధంగా ఎవరైనా చెప్పిన మాట వినకుంటే వారినుద్దేశించి వాడొట్టి కొరక రాని కొయ్య అని అంటారు. అనగా వాడు ఎవరి మాట వినడు అని అర్థము. ఆ విధంగ పుట్టినదే ఈ జాతీయము. +ముగింపు ఉదా: ఆ పని ఒక కొలిక్కి వచ్చింది. ఏదైనా ఒక క్లిష్టమైన పనిచేస్తుంటే దాని క్లిష్టత వలన ఆ పని అంత తొందరగా పూర్తి కాదు ఆపనిలోని లోపాలను కనిపెట్టితే ఆపని చేయడము సులబ మవుతుంది. అలా దానిలోని లోపాలను కనిపెట్టి నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగించి ఈ పని ఒక కొలిక్కి వచ్చింది. అని అంటుంటారు. అనగా ఇక త్వరలో ఈ పని పూర్తవుతందని అర్థం. +దీనికి కొంత వివరణ కావాలి: అదేమంటే గతంలో ఇప్పుడు కూడ/ చెరువులు, కుంటలు మొదలగు నీటి వనరులలో చేపల పెంపకం సాగించే వారు. బెస్త వారు గాని మిగతా వారు గాని ఆ చెరువును వేలం పాటలో పాడుకొని అందులోని చేపలను పట్టుకొని అమ్ముకొని తమ పెట్టు బడిని రాబట్టు కునే వారు. ఆ చెరువులో నీరు తగ్గి ఇక చేపల పెంపకానికి వీలు పడదని తెలిసినప్పుడు వున్న పెద్ద చేపల్ని పట్టేసుకుని చెరువు కొళ్ల బోయిందని ప్రకటిస్తారు. దాంతో ఆ చుట్టు పక్కల పల్లె వాసులు ఆ చెరువులో మిగిలిన చిన్న చిన్న చేపలను ఉచితంగా పట్టు కొనుటకు అనుమతి లభించి నట్లే. ఆ విధంగా చెరువు కొళ్ల బోగా వూరి జనాలు చేపలు పట్టాడానికి చెరువుకు వెళ్లతారు. ఇదీ చెరువు కొళ్ల బోవడం అంటారు. +మోసగాడని అర్థం: ఎవరైనా మోసంతో ఇతరులకు నష్టం వాటిల్ల జేస్తే అలాంటి వాని నుద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. వాడొట్టి కొంప లార్పే రకం అని. +పొగరెక్కువయింది. పొగరుగా వుండే వారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +పెద్ద ఘోరం జరిగి పోయిందని అర్థం. వరదల్లో కొంపలు మునిగి పోతాయి. అలా కొంపలు (ఇండ్లు) మునిగి పోతో సర్వం కోల్పోయినట్టే సర్వం అనగా డబ్బులు ఆహార దాన్యాలు, వస్త్రాలు ఒక్కొక్క సారి కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకోవలసి వస్తుంది. అలాంటి వారి కేవలం కట్టు బట్టలతోనే మిగిలి వుంటారు. అలా సర్వం పోగొట్టుకుంటే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +[[వివాహం జరిపించడం. ఒక పాటలో ఈ జాతీయ ప్రయోగము: అహో ఆంధ్ర భోజా శ్రీ కృష్ణ దేవరాయా ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా అనే పాటలో కొంగు ముడి వేసుకుని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలనీ కోరు తున్నారనీ +ఉదా: ఆమె తన మొగుడిని కొంగున ముడి వేసుకున్నది తన అదుపులో ఉంచుకున్నదని అర్థం +ఏమి మాట్లాడ కుండా మిన్న కున్నాడని అర్థం. +కొంగున బంగారం వుంటే అవసరానికి సిద్దంగా వున్న ధనం లాంటిదె అన్న అర్థం: +(దీపం) దీపం ఆరి నప్పుడు దీపం ఆరి పోయింది అనరు అది నిందా వాచకం అవుతుంది. కనుక దాని దీపం కొండెక్కింది అంటారు. +చాల పొడవైన అని అర్థం: అక్కడ లైను (క్యూ) కొండవీటి చాంతాడంత ఉంది. +ఉదా: కొంప దీసి వాడు వీడు కాదు గదా +పెద్ద మోసం చేశాడు: ఉదా: వాడు మా కొంప కూల్చాడు. +సర్వ నాశనమైందని అర్థ: ఉదా: వాడి కొంప కొల్లేరయింది. +చాల పెద్ద సహాయం చేశాడు అని అర్థం: +మోస గాడు: ఉదా: వాడు కొంఫలార్పే రకం. +లెక్కలేనంత మంది ఉన్నారని అర్థం. ఉదా: నాకు కో అంటే కోటి మంది ఉన్నారు +పెద్ద విజయ సాధించారు అని అర్థమ్. +ఎంత ప్రయత్నించినా సరే ఉదా: కోట్లు కుమ్మరించినా నీ లాంటి వాడు దొరకడు. +ప్రగల్బాలు పలికే వాడు అని అర్థం. +పనికి రాని పని ఉపయోగంలేని పని అని అర్థం. +ఉదా: నామొఖంలో కోతులాడు తున్నాయా అలా చూస్తున్నారు. +గర్వం అణచ బడిన వ్వక్తిని ఇలా అంటారు: ఉదా: వాడిప్పుడు కోరలు తీసిన పాములాగ పడి ఉన్నాడు. +ఎక్కువ కోపం వచ్చింది: ఉదా: వాడి కోపం నసాళానికెక్కింది. +చాల పొడవైన అని అర్థం: అక్కడ లైను (క్యూ) కొండవీటి చాంతాడంత ఉంది. +పురుషాహంకారం.స్త్రీలు అసమర్థులు అబలలు శక్తిహీనులని.గాజులుతొడుక్కోటం అనికూడా అంటారు. నేనేమి కోక కట్టుకొని గాజులు తొడుక్కొని కూర్చోలె. నాకు పౌరుషం వుంది అని తన గొప్పను చెప్పుకునే సందర్భంగా ఈ సామెతను వాడతారు. +తెల్లవారు జాము వరకు ఉదా: కోడి కూసె జాము దాక తోడు రార చందురూడా ఒక పాట) +వృధాప్రయాస, అసంభ���ం, కోడిగుడ్డు మీద వెండ్రుకలు వెతకటం, కోడిగుడ్డు మీద వెండ్రుకలు పీకటం, ప్రయోజన శూన్యమైన పని, వృధా ప్రయత్నం +[వాడు కోడి గుడ్డుపైన ఈకలు మొలిపించ గలడు అని అంటారు. అనగా వాడు ఏ పనైనా చేయగలడని అర్థం. వ్వతిరేకార్థంలో వాడు తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయ గల సామర్థుడు అని అర్థం. ఆ సందర్భంలో ఈ సామెతను వాడుతారు. వాడెంతటి పనైనా చేయగల సామర్థం కల వాడు వానితో జాగ్రత్త అని హెచ్చరిక ఈ సామెతలో ఉంది.] +కోడి గుడ్డు మీద ఈకలు పీకే రకం +లేనివి ఉన్నట్టు, వున్నవి లేనట్టు చూపే వాడు, అని అర్థం. +ప్రగల్బాలు పలకటం. వాడి మాటలన్ని ఒట్టి కోతలె. +అవసరంలేని వీలు కాని వస్తువును వదలకపోవటం కోతికి కొబ్బరికాయ దొరికితే అది దాన్ని పెద్ద సంపదగా భావిస్తుందే తప్ప దాన్ని పగల గొట్టి తినలేదు. అనగా ఉపయోగంలేని సంపద అలాంటి సందర్భంలో ఈ సామెత వాడతారు) +విలువైన వస్తువు అనర్హుడి చేతికి చేరటం కోతికి పూలదండ ప్రదాన్యత, దాని ఉపయోగము తెలియవు. అలా ఒక వస్తువును దాని వుపయోగం ప్రదాన్యత తెలియని వానికిస్తే ఈసామెత వాడతారు.) +అసంబద్ధమైన, అనవసరమైన పని (కోతికి ఎన్ని అలంకారాలు చేసినా అది దాన్ని చూసుకొని మురిసి పోదు పైగా తీసి పడేస్తుంది ఆపని అనవసరమైన పని ఉపయోగం లేని పనిచేస్తున్న వారిని గురించి ఈ సామెత వాడతారు.) +పాముకు కోరలున్నప్పుడు దాన్ని సమీపించటం కానీ, దానికి ఎదురు నిలిచి ఉండటం కానీ ప్రాణాంతకమవుతుంది. అదే కోరలు తీసినప్పుడు అంత ప్రమాదం కాదు అధికారం పోవటంతో కోరలు తీసిన పామయ్యాడు' అంటారు +అధికారాలను, ప్రభావాన్ని, పౌరుషాన్ని, గర్వాన్ని తగ్గించటం అతనికి పదవి పోగానె కోరలు పీకినట్టయింది. +కోపంతో అరవడం ఉ: వాడిని ఒక్కమాట అన్నానొ లేదో ఖయ్యిమని నామీది లేశాడు. + + +గంటవాయించు అనే జాతీయాన్ని మరిచిపోయాడు, లేదా మోసగించాడు అనే సందర్భాలలో వాడతారు. దేవుడికి గంటవాయిస్తూ నైవేద్యం పెడతారు. ఆయన ఎటూ ఆరగించడు. పేరుకు భగవంతుడికి నైవేద్యమే కానీ ఆరగించేవారు భక్తులే.అనవసర ఆర్భాటం చేసి అసత్య ప్రమాణాలు చేసేవారిని గంటవాయించడం అనే జాతీయంతో పోల్చుతారు. +కష్టాలు తొలిగాయాయని అర్థం. ఆ సందర్భంలో ఈ మాటను వాడతారు +ఉదా: వాని రాబడికి గండి పడింది. ఆదాయం తగ్గితే ఈ మాట వాడతారు కాలవకు గండి పడితే అందులోని నీరంతా పక్కదారి పట్టి వృధాగా పోతుందు. అదేవిధగా ఒకరి సంపాదన అంతా వృధాగా పోతుంటే ఈ ���ాతీయాన్ని వాడుతారు. +ఎంతో ఆశ పెట్టుకొని వచ్చారు: ఉదా: వారు నీమీద గంపెడంత ఆశతో వచ్చారు. +ఎవరికి తగ్గది వారికి: ఉదా: గంతకు తగ్గ బొంత ఎక్కడో ఒక చోట రాసి పెట్టే వుంటుంది సంబందాల గురించి) +క్షీణించిపోవు ఈ రోజుల్లో నిజాయితి పరులు గగనమై పోయారు ఏదైనా అరుదుగా వుంటే ఈ మాటను వాడతారు. +ఏనుగులు స్నానం చేయడమనేది ఒక దీర్ఘ కాలిక క్రీడ. అవి మడుగు జొచ్చి గంటల తరబడి స్నానం చేస్తాయి. అలా ఎవరైనా ఎక్కువ సేపు స్నానం చేస్తే గజ స్నానం అంటారు. +అందరికీ తెలిసిందే తెలుసుకోవటం.అనవసరమైన పని ఏనుగుకు ఉండే దంతాలేవో పైకి కనిపిస్తూనే ఉంటాయి. అయినా పనిగట్టుకొని మరీ దగ్గరకు కూడా వెళ్ళి ఎన్ని దంతాలున్నాయని పరీక్షించటం అనవసరమైన పని . +ముందుగా జరిపేది గణపతి పూజ. ప్రమద గణాలకు అధిపతి కనుక వినాయకుడిని గణపతి అని అన్నారు. +వారు గట గటా నీరు త్రాగు తున్నారు. +దీనికి అర్థం: కష్టాలు తొలగి పోయాయని అని అర్థం; హమ్మయ్య అతని కష్టాలు నేటితో గట్టెకాయి అని అంటుంటారు. +ఉదా: వాడు గడ కర్రలా పెరిగాడు ఏం లాభం ఒక మనిషి ఒడ్డూ పొడువు బాగా వుండి ఏ పనీ చేత కాక పోతే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +బాగా ఆదుకునే మనిషి ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు దూకే ప్రయత్నం చేసేటప్పుడు ఆధారంగా గట్టి కొమ్మ దొరికితే క్షేమంగా అవతల వైపునకు చేరవచ్చు. అదే వోటి కొమ్మ అయితే మధ్యలోనే విరిగి ప్రమాదం సంభవించవచ్చు. +చాల తెలివైన వాడిని గురించి ఈ మాట వాడతారు. ఉదా: వాడు గట్టివాడె పరీక్షల్లో మంచి మార్కులే తెచ్చుకున్నాడు. +విజయ గర్వాన్ని ప్రకటించటం, సంతోషాన్ని వ్యక్త పరచటం. మీసం మెలేయటం, గడ్డం దువ్వటం +లంచం మేయటం, అవినీతికి పాల్పడటం. వాడు నానా గడ్డి తింటున్నాడు. +ఏమిచేస్తున్నావు ఇంత సేపు అని అడగడానికి కోపంగా అనండము. ఉదా: గడ్డి పీకు తున్నారా ఇంత సేపు +గడ్డి పోసకు కూడ సరి పోలరు +(తను తినదు, ఆవులను తిననీయదు వాడు తినడు వేరెవరిని తిననీయడు. అటువంటి సందర్భంలో ఈ మాట వాడతారు +ప్రాణం పోయే ముందు గడ్డిపైన పడుకో బెట్టడం (ఇది ఓ ఆచారం) +అంతా చెప్పాక నాలిక్కరుచుకున్నాడు. గతుక్కమన్నాడు. చెప్పకూడనిదేదో పొరబాటున చెప్పేస్తే అప్పుడు అతని మనస్సులో జరిగే ఘర్షణకు ముఖంలో కనబడే ఆందోళనను ఈ జాతీయం ద్వారా చెప్తారు. +ఘుమఘుమ సువాసనలు ఘుమఘుమలాడటం, పరిమళాలు వ్యాపించటం +తన గురించి గొప్పలు చెప్పు కుంటున్నాడు. +గబ్బిలాయి ని అపశకునపు ప���్షిగాను, అందవికారమైనది గాను, దురదృష్ణమునకు మారు పేరుగాను దారిద్ర్యానికి కారణంగాను ఉటంకిస్తుంటారు. నిజానికి గబ్బిలము అందవికారముగాను, అది పూర్తి స్థాయి జంతువుగాను కాకుండా ఒక పక్షిగాను కాకుండ వుంటుండి. అది కనబడిన వెంటనే దానిని వెంబడించి తరుముతారు. అది ప్రవేశించిన ఇంటిలో దరిద్రము తాండవిస్తుందని నమ్ముతారు ప్రజలు. ఆవిధంగా నిందా వాచకముగా ఇతరులను నించించే టప్పుడు గబ్బిలాయి మొఖం, అని. తెలివి లేనివాడనే అర్థంలోను ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. +అసూయ పడటం కళ్ళలో దుమ్ము, ధూళి పడ్డప్పుడు లేదా కంటికేవైనా అంటువ్యాధుల్లాంటివి సోకినప్పుడు గరగరలాడుతున్నాయంటారు. ఎదురుగా ఉన్న దాన్ని అలాంటి స్థితిలో ఎవరూ చూడలేరు. ఎంతో బాధగా ఉంటుంది. ఎదుటివారి అభివృద్ధి చూడలేని, ఓర్వలేని అసూయాగుణం ఉన్న స్థితి. +కోపంగా ఉన్నాడు. ఎవరైనా కోపంగా వున్నారంటే వాడు గరంగరంగా వున్నాడు జాగ్రత్త అని ముందుగానే హెచ్చరిస్తారు. ఆ సందర్భంగా ఈ మాటను వాడుతారు. +అభివృద్ధి క్షీణించటం, ఎలాంటి ఎదుగుదల లేకపోవటం తేజోవిహీనమై ఉండటం. ఉదా: వానికి గ్రహణం పట్టినట్లుంది. వాని చేసే పనులన్నీ విఫలమౌతున్నాయి. అని అంటుంటారు. +ఉదా: సూర్య కాంతం గయ్యాళి గంప పాత్రకు పెట్టింది పేరు. ఎక్కువగా నోరు చేసుకునే స్త్రీనిగురించి ఈ మాట వాడతారు +''సూర్యకాంతం పేరు ఎంత అందమైనదో ప్రతి ఒక్కరికి తెలుసు. కాని ఆ పేరును తమ పిల్లలకు పెట్టుకునేందుకు జనం జంకుతారు. కారణం? సూర్య కాంతం గారు గయ్యాళి పాత్రలో జీవించిన విధానం. ఆమె నటనా కౌశల్యానికి ఎన్ని బిరుదులిచ్చినా అవన్ని దీనికంటే పెద్దవి కావు. అవునా? కాదా అది ఎవరో పనిగట్టుకొని ఇచ్చిన బిరుదు కాదు. జనబాహుళ్యంలో అనుకోకుండా ఆమెకు సహజంగా అమరిన బిరుదు. +కనబడకుండా పోయాడు. ఉదా: ఆ వరదల్లో ఇద్దరు మరణించగా మరొకడు గల్లంతయ్యాడు. +కష్టాలు తొలిగి పోయాయని అర్థం: ఉదా: ఈ దెబ్బతో వాని గ్రహణం వీడింది అని అటుంటారు.అటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +రణ గొణ శబ్దం తర్వాత ప్రశాంతత ఏర్పడితే ఈ మాట వాడతారు +ఉదా: వాని నడత సరిగా లేదు: వాడిని గాట్లో పెట్టాలి. చక్కదిద్దాలి అని అర్థము. +ఇది విరివిగా వాడె ఊత పదం. +గాడిద బూడిదలో, మట్టిలో పొర్లుతుంటుంది. దున్నపోతులు, పందులు బురదలో పొర్లుతుంటాయి. అలా పొర్లటం వాటికి అసహ్యం అనిపించదు. పైగా ఆనందాన్నీ అనుభవిస్���ుంటాయి. ఎక్కడపడితే అక్కడ పొర్లి మర్యాదను పాడుచేసుకోవటం. +దారిలో పడింది. ఉదా: వాడి నడవడిక ఇప్పుడు గాడిలో పడింది. +నివురుకప్పిన నిప్పు .దోస తీగకు పిందెలొచ్చి ఓ మోస్తరు కాయలయ్యేదాకా దట్టమైన ఆకుల మధ్యనే ఉండి ఎవరికీ కనిపించవు. అప్పటివరకు ఏమీ లేదనుకున్న వాడికి గొప్ప సంపదలున్నాయని తెలియటం +డబ్బు విషయంలో లెక్కలు వ్రాసెటప్పుడు ఎటూ తేలని పద్దులను గాంధీ లెక్కలో రాసెయ్ అని అంటుటారు. అనగా అది అంత ప్రధానమైనది కాకపోవడమో లేక దొంగ లెక్కలు వ్రాయడానికి అవకాశము కల్పించేదో అయి వుంటుందని అర్థం. ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. +అల్లరి, లోల్లి, సందడి .విపరీతంగా అల్లరి చేయటం. +ఏదో పన్నాగం పన్నాడు: ఉదా: వాడు ఆ అమ్మాయికి గాలం వేశాడు. +ఎవరూ పట్టించుకోనిది, ఉపయోగములేనిది అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతారు. +పుకారు: ఆధారం లేని మాట. కల్పితం/ +ఒక పద్ధతి లేకుండా ఎటు పడితె అటు పోయేవాడు. ఆ అర్థంలో ఈ మాటను వాడుతారు +పని పాట లేకుండా బేవార్సుగా తిరిగే వాళ్ళ గురించి ఈ జాతీయాన్ని వాడుతారు. +ఉదా: వాడు గాల్లో తేలి యాడు తున్నాడు ఊహల్లో విహరిస్తున్నాడని అర్థం., +ఎవారిమాట వినకుండా తన దారినే తాను నడచే వాడిని గురించి ఈ మాట వాడతారు. +అనవసరపు తగాదాలు తెచ్చుకోకు అని అర్థం. +వాడు పొదుపుగా ఖర్చు పెడు తున్నాడు. అని ఈ జాతీయానికి అర్థం. +చెప్పిన మాట వింటాడు. ఉదా: వాడు నేను గీచిన గీత దాటడు. +ఊపిరి ఆడనివ్వడు: ఉదా: వాడు వచ్చాడంటే ఊపిరాడ నివ్వడు. +ఏదో చెప్పడానికొచ్చి సందేహిస్తున్నాడు: ఉదా: ఏరా గుటకలు మింగు తున్నావు. ధైర్యంగా చెప్పు. +క్షీణ దశకు చేరుకోవటం, క్షీణించి పోవటం .గుంటలో పెట్టడం అంటే సమాధి చేయటం +సర్వం నశించటం. అగ్ని గుండంలో ఏ వస్తువైనా పడితే నిప్పుల సెగకు అది నామరూపాల్లేకుండా పోతుంది. ఆ సందర్భంలో ఈ మాటను వాడతారు. +దుఖాన్ని దిగమింగు కొని అందరు నన్ను మోసం చేసినా గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను.) +అన్నింటికి తెగించిన వాడని ఎలాంటి పనైనా చేయగల సమర్థుడని అర్థం. అలాంటి వారినుద్దేశించి ఈ మాటను వాడతారు. +నిబ్బరించుకో: ఉదా: కష్టాలు మనుషులకు కాక మానులకొస్తాయా? గుండె దిటవు చేసుకో? +కష్టాలలో వున్న వారిని ఓదార్చడానికి ఈ మాటను వాడతారు. +ఉదా: అసలు విషయం చెప్పు. గుండె లోతుల్లోనుండి రావాలి. +మనసులో బాధగా ఉంది. ఉదా: వాని మాటలు వింటుంటే గుండె మండుతున్నది. +ఉదా: వాడు చేసిన పని వింటుంటే నా గుండెల్లో రాయి పడింది భయమేసింది) +బొద్దుగా, బలంగా ఉండటం ఏ పని చేయకుండా బెల్లం కొట్టిన రాయిలాగ ఒకేచోట కూర్చొని వుండటం. +చదువు తొలిమెట్టు గతంలో పిల్లలకు చదువు నేర్పేటప్పుడు వారిని ఇసుకలో అక్షరాలు రాయించే వారు. వాటినే గుంత ఓనమాలు అనేవారు. +నిజం దాచి అబద్దాలు చెపుతుంటే కలిగే పరిస్థితి అసలు విషయం చెప్పమంటే గుటకలు మింగు తున్నావు అంటుంటారు. +రహస్యం: వాని గుట్టు మట్లు అన్ని నాకు తెలిసాయి. +అసంబద్ధమైన వ్యవహారం, అనవసరమైన అలంకారం .చిన్న గుడిసె ముందు అందమైన చాందినీని వేస్తే నిరర్థకంగా అనిపిస్తుంది. +తదేక దృష్టితో చూడటం అలాగే చూస్తూ ఉండిపోవటం. +మధ్నాన్నం రెండున్నరకి పెళ్ళిభోజనం, గుడ్లు పేలిపోయాయి +స్వేచ్ఛకు అడ్డు తగిలేది. దొంగ గొడ్డుకి ఒక కొయ్యను మెదకు కడతారు. దాంతో అది ఇష్టం వచ్చినట్టు పరుగులెత్తకుండ అన్ని పశువులతోటి నడుస్తుంది. +అడ్డు అదుపు లేకుండా తిరిగే వారిని అదుపులో పెట్టేందుకు ఈ మాట వాడతారు. +తామే గొప్ప అని భావించుకొనే వారు తమకంటే గొప్పవారి దగ్గర అల్పమైన తమ గొప్పతనాలను ప్రకటించుకోవటం.మంత్రజపం, సాధన చేయటంలో గురువు ఎప్పుడూ ముందడుగులోనే ఉంటాడు. కానీ ఓ శిష్యుడు తాను గురువును మించిన వాడినని భావించుకొంటూ ఆ గురువుకే మంత్రోపదేశం చేయబోయాడట. +తన తప్పులు తెలుకోకుండా ఇతరుల తప్పులు వెతికేవారి గురించి ఈ మట వాడతారు +బాగ తాగి వచ్చిన వాడిని గురించి ఈ మాట వాడతారు +గువ్వ అంటే గుడ్లగూబ గుడ్లగూబ ఏదైనా ఇంట్లోకి ప్రవేశిస్తే అశుభం అని భావించి పాడు పెట్టిన కళావిహీనంగా, అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు. +రహస్య కార్యక్రమం చేస్తున్నాడు. ఉదా: వారు ఏదో గూడు పుఠాణి చేస్తున్నారు. +కొడ్తానని బెదిరించడం. ఉదా: పిల్లలూ అరవకండి. అరిస్తే గూబ గుయ్యి మంటుంది. +ఇలాంటిదే మరొక్క మాట కూడా ఉంది. అది వీపు విమానం మోత మోగుతుందీ' +అన్నింటికి తెగించిన వాడని ఎలాంటి పనైనా చేయగల సమర్థుడని అర్థం. అలాంటి వారినుద్దేశించి ఈ మాటను వాడతారు. +అమితమైన శ్రమ ఎంత ఎక్కువ పని అప్ప చెప్పినా గొడ్డు లాగా శ్రమిస్తూ పని చేయటం +అదే విదంగా తగినంత ఫలితం లేని శ్రమ చేస్తే కూడా గొడ్డు చాకిరి అంటారు. +సంరక్షణ బాధ్యతలను శత్రువులకు అప్పగించటం . +ఉదా: వాడు మాగొంతు కోశారు మోసం చేసారని అర్థం. +తీర్చలేని కోరికలు: ఉదా: వారివన్ని గొంతెమ్మ కోరికలు. +మాట పెగలడం లేదు. ఉ���ా: వాడన్న మాటలకు మాకు గొంతు పట్టేసి నట్టుంది. +దాహంగా వున్నదని అర్థం. బాగా దాహంగా వుంటే ఈ మాటను వాడతారు. +నీళ్లు తాగారని అర్థం. దాహం తీర్చుకున్నారని అర్థం. +గొడ్డు, గొడ్డుమోతుతనం. వంధ్యత్వం: బిడ్డలు పుట్టక పోవడం ఆమె గొడ్రాలు.) +పద ప్రయోగం దేశం గొడ్డు పోలేదు ఈ మాత్రం పని ఎక్కడైనా చేసుకొని బ్రతగ్గలను +ఎన్నటికి తిరిగి రానిది ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఉదా: వాడికి డబ్బు ఇచ్చామంటే అది గోడకు కొట్టిన సున్నమె. +నిరర్థక కార్యం, వృధాశ్రమ, ప్రయోజన శూన్యం, స్పందించనితనం +ఉదా: నీకు చెప్పినా ఒకటే ఆగోడకు చెప్పినా ఒకటే.. +గోడ మీదున్న పిల్లి ఎటు వైపు దూకు తుందో ఇదిమిద్దంగా చెప్పలేం. అలా స్పస్టత లేని విషయం చెప్పినప్పుడు ఈ మాటను వాడతారు. +వారిది గొర్రె దాటు వ్యవహారం అంటుంటారు. అనగా స్వంత అభిప్రాయం లేకుండా ఎవరో చెప్పిన దాని ప్రకారము నడుచుకునే వారిని గురించి ఈ మాట వాడతారు. వివరణ. గొర్రెల గుంపులో ఒక్క పొట్టేలు వుంటుంది. అది ఆ గొర్రెల గుంపుకు నాయకత్వం వహిస్తుంటుంది. అది ముందు నడుస్తుంటే మిగతా గొర్రెలు తల వంచుకొని దాని వెంబడే నడుస్తుంటాయి దారి మద్యలో ఏదేని చిన్న కాలువ గాని, చిన్న కంచె గాని అడ్డువస్తే గొర్రెలన్ని సందేహిస్తాయి దానిని దాటడానికి పొట్టెలతో సహా. కాని ఆ గొర్రెల కాపరి ఆ పొట్టేలుని దాన్ని దాటిస్తే మిగా గొర్రెలన్ని దాన్ని అనుసరించి వాటంతట అవే దాన్ని దాటేస్తాయి. దాన్ని అనుసరించి ఈ జాతీయం పుట్టింది. +పోట్లాటకు సిద్ధపడ్డారని అర్థం: ఉదా వారిపై పోట్లాటకు వీరు గోచీలు ఎగ్గట్టారు. +అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడని అర్థం చెడుపనికి) +కష్టాలలో పడ్డాడని అర్థం. ఉదా: వాడు ఎంతో ఆలోసించి పనిచేసినా చివరకు గోతిలో పడ్డాడు. +వృధా చేయడం: గోదాట్లో కలిపెయ్. ఏదైనా వృధా అయిందంటే గోదాట్లో కలిసిపోయిందని అంటుంటారు. +గీచి గీచి బేర మాడుతున్నాడని అర్థం. +ఈ రహస్యాన్ని మరొకరు వింటున్నారని అర్థం. +గోడ మీద పిల్లి ఎటువైపు దూకుతుందో తెలియదు. అలా సందేహాస్పదంగా వున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. +ఎవరికో కష్టాలు కలిగించే పనిచేస్తున్నాడని అర్థం ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఉదా: వాడు వెనక గోతులు త్రవ్వుతునాడు. +స్వల్ప పరిమాణంలో ఉన్నది, చాలాకొద్దిగా, చిన్నది. కొండంత అంటే ఎంతో పెద్దది అని +''గోరంత దీపం కొండంత వెలుగు" ఒక సామెతలో ఈ పద ప్రయోగమ�� +అతి చిన్న విషయాన్ని ఎంతో పెద్దదిగా చెయ్యటం +గోవు పిత్తాశయం నుంచి వెలువడే పదార్థమిది. వైద్యంలో దీనికి గొప్ప విలువే ఉంది. అహంకారం, తల బిరుసు తనం లాంటి అర్థాల్లో వాడికి గోరోజనం ఎక్కువే లేండి' అంటారు. +పని పాట లేకుండా వూరికె కాల యాపన చేసె వారిని ఇలా అంటారు. +అంతా అయి పోయిందని అర్థం: ఉదా: వాని పని అయి పోయింది గోవింద గోవింద. +అనుకున్న పని జరగకపోవటం, ఎంత తప్పించుకుందామనుకున్నా దొరకకూడదనుకొన్న వారికి దొరికి పోవటం .ఘట్టం పన్నులు వసూలు చేసే ప్రదేశం, కుటీ అంటే గుడిసె, ప్రభాతం అంటే ఉదయం .ఓ వ్యాపారి సరుకు అమ్ముకొని వచ్చేటప్పుడు కాపలా వాళ్ల నుంచి తప్పించుకొని కోటలోకి వెళ్ళటానికి ఏవేవో పక్కదారుల్లో ఆ రాత్రంతా తిరిగాడట. ఎటు తిరిగినా మళ్ళా కోటసింహం ద్వారం దగ్గరకు చేరాడు. అయితే అక్కడికి చేరేసరికి ప్రభాతం (సూర్యోదయం) అయింది. కాపలావాళ్ళు అతడిని చూడనే చూశారు. రాత్రంతా ఎంత శ్రమపడ్డా ఫలించకపోగా పన్ను కట్టాల్సి వచ్చిందట. + + +తొందరగా వేగంగా అని అర్థం: ఉదా చకచకా ఈ పని చేసేయాలీ'' +తాత్కాలిక ఆనందం కొంతమంది తమపని చేయించుకొనేందుకు ముఖస్తుతి మాటల్ని మాట్లాడుతూ పొగుడుతుంటారు. ఆ పొగడ్తలు కాసేపే ఉంటాయి. ఇది ఎలాంటిదంటే చక్కలిగిలి పెట్టినప్పుడు కాసేపు నవ్వనిపిస్తుంది. చక్కలిగిలి ఆపగానే నవ్వూ ఆగిపోతుంది. +ఆతను చక్రమేమి తిప్పడంలేదు కాని రాజ్యమేలుతున్నాడు. అన్నింటా అతని మాటే చెల్లుబాటవు తున్నదని అర్థం. +==చక్కర్లు కొడుతున్నాడు అనగా ఏమీ పని లేకుండా ఊరికే తిరగటం అనే సందర్భంలో వాడుతారు +చాల కష్ట పడి వచ్చాడు అని అర్థం: ఉదా: వాడు చచ్చి చెడి వచ్చాడు. +చాల కష్ట పడ్డాడని అర్థం: ఉదా: దాన్ని సాధించడానికి చచ్చి బతికినంత పనైంది. +గతకాల వైభవం, మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి లాగా. +ఉదా: నేను నిజమే చెపుతున్నాను చచ్చినంత ఒట్టు. +ఘోర ప్రమాదం నుంచి బయటపడటం.బతికి బయటపడటం. తిరిగి పుట్టడంతో సమానం. +నిస్సారంగా ఉండడం రుచీపచీ లేకపోవటం: అతని ఉపన్యాసము చాల చప్పగా ఉంది. ఇక్కడ రుచితో పనిలేదు చప్పగా అంటే గొప్పగా లేదని అర్థము +హర్షాన్ని ప్రకటించటం ఆనందం, సంతోషం లాంటివి కలిగినప్పుడు కరతాళ ధ్వనులు చేస్తూ ఎదుటివారిని మెచ్చుకోవటం, తమ సంతోషాన్ని ప్రకటించటం +అంతకుముందు నమిలిన దాన్నే మళ్ళీ మళ్ళీ నమలటం, నెమరు వేయటం, మళ్ళీ మళ్ళీ చెప్పటం, చేసి�� పనే మళ్ళీ మళ్ళీ చేయటం +ఆవేశం తగ్గటం ఉదా: వాడిప్పటికి చల్ల బడ్డాడు. +ప్రశాంతమైన కుటుంబ జీవనం .ఏ గొడవలూ లేకుండా హాయిగా గడిచిపోయే చల్లని సంసారం +చెయ్యని తప్పునకు శిక్ష అనుభవించటం అనుకోకుండా అపవాదులొచ్చి పడటం లాంటివి .శ్రీకృష్ణుడు అనాడు పాలు పితుకుతూ పాల కుండలో చవితి చంద్రుడిని చూసినందు వల్లనే నిందల పాలయ్యాడన్న మూఢనమ్మకం. +ఉదా: వాడొట్టి చంచాగాడు: ఒకరి మాటలను మరొకరికి చెప్పి కాలం వెళ్ల దీశె వాడు.అలాంటి వారిని గురించి ఈ మాట వాడతారు +అతిగా సంతోష పడు తున్నాడు. ఉదా: వాడు సంతోషంతో చంకలు గుద్దుకుంటున్నాడు. +చారెడంత కన్నులు ఎక్కడా వుండవు. అతిశయోక్తిగ చెప్పేటప్పుడు అలా అంటారు. అనగా చాల పెద్ద కన్నులున్నవని అర్థము +పేకముక్కలలో ఉన్న జాకి, రాజు, రాణి వంటి బొమ్మలు ఉండే కార్డులన్నీ నాలుగు వైపులా మొఖాలను తిప్పు ఉంటాయి. కనుక పేకముక్కలు ఆడడాన్ని గురించి చతుర్ముఖ పారాయణం అని అంటున్నారు. +ఎక్కువగా అభిమానించటం, గౌరవించటం ఆ విద్యార్థి గురువు గారి చంకనెక్కాడు +చాకలి కూరలో అన్ని రకాల కూరలు కలసి వుంటాయి. ఆ విదంగా అన్ని విషయాలు/పనులు కలగా పులగంగా చేస్తే ఈ మాటను వాడతారు. +రహస్యమైన విషయాన్ని అందరికి చెప్పేశాడు. ఉదా: ఎవ్వరికి చెప్పొద్దని వానికి ఈ మాట చెపితే వాడు చాకి రేవు పెట్టాడు. +అసహ్యించు కోవటం చి ఛీ అవతలికి పో అనడం. చ అక్షరానికి గుడి ఇస్తే చీ అవుతుంది అలా నిఘూడంగా చెప్పడం. +తిరిగిరాని అప్పు .చేపాయి అంటే చేబదులు బస్తా ధాన్యం అప్పు తీసుకుంటే ఎవరికైనా లెక్కగా గుర్తుంటుంది. అలాకాక అప్పుడప్పుడు ఓ చాటెడు ధాన్యం అప్పు తీసుకుంటే ఇచ్చిన వారు కూడా త్వరగా అడగరు. ఇలా ఆ అప్పు తిరిగిరాని ఖాతాలో పడిపోతుంది. +భూమ్మీద పడ్డవేళ, పుట్టిన మరుక్షణం .శిశువునుపుట్టగానే పూర్వం చాటలో ఉంచేవారు.. +సర్వం సిద్ధం అని, అన్నీ అమరి ఉండటం, సులువైనపని +చాపకిందికి నీరు చేరే టప్పుడు ఏ మాత్రం తెలియదు. చాపంతా తడిసి పోయేంత వరకు తెలియదు. అలాకె కొంత మంది మనవైపున చేరి మనకు తెలియకుండానె మన విషయాలను గ్రహించి మన శత్రువులకు చెప్తారు. ఆ సందర్భంగా ఈ మాటను వాడ తారు. +అర్థం: అతి ప్రాముఖ్యమైన విషయాన్ని సాధారణ విషయం లాగ చెప్పాడు అని అర్థం. +ఉదా: ఎన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాట? ఈ సారి చావో రేవో తేల్చుకోవలసిందె +నాగటిచాలు పొలం దున్నేటప్పుడు ఒక చాలు పక్కన ఉండే చాలు మళ్ళీ అలాగే ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే అలవాట్ట్లు లక్షణాలు .నీవు నీ అయ్యకు చేసిన మర్యాదనే నేను నీకు చేస్తున్నాను అన్నాడట కొడుకు. +అతి పొడవైన: అక్కడ క్యూ చాంతాడంత పొడవుంది. +==చిలికి చిలికి గాలి వాన గా మారింది== +విజృంబించాడు అని అర్థం: ఉదా: సచిన్ ఈరోజు ఆటలో చించేశాడు. అటువంటి సందర్భంలో వాడే మాట ఇది. +అల్పమైనది, చాలా చిన్నది అరిటాకు, తామరాకు పెద్దవి +ఏ చెట్టు కాయలైనా అవి పండినతర్వాత ఆచెట్టులోని కాయలు ఒకటో రెండో రాలి పడతాయి. మిగతావాటిని మనుషులే చెట్టెక్కి కోసుకోవాలి. కాని చింత చెట్టు కాయలు పండినతర్వాత బలమైన గాలి వీస్తే ఆ చెట్టులోని కాయలన్ని టప టప మని అన్ని ఒక్కసారిగా రాలి క్రింద పడతాయి. అలా అన్నీ ఒక్క సారిగా రాలిపోతే చింతకాయలు రాలినట్లు అని ఈ జాతీయాన్ని వాడుతుంటారు. +చాల భయ పడుతున్నాడు; ఉదా: వారు చిగురుటాకులా వణికి పోతున్నారు. +అల్లరి పిల్ల వాడని అర్థం: ఉదా: ఆ పిల్లవాడు చిచ్చర పిడుగు. +రెండో భార్య ఇల్లు, చిన్నభార్య ఉండే ఇల్లు, వివాహేతర సంబంధం +చులకన చేయు. ఆ మంత్రి గారు బడుగు జీవులను చిన్న చూపు చూస్తున్నాడు. +అవమానకరమైన మాటలు అని అర్థము: ఎవరైన అవమాన కరమైన మాటలు మాట్లాడుతుంటే ఈ సామెతను ఉదహరిస్తారు. +ఉత్తుత్తి మాటలు చెప్పటం, క్రియా శూన్యం. పందిరంటే గుంజలు పాతటం, వాసాలు కట్టి ఆకులు కుట్టడం లాంటి పనులన్నీ చేయాలి. అలాకాక కేవలం అవన్నీ చేసినట్టు గాలిలో చిటికలు వేసి అభినయం చేసినంత మాత్రాన అక్కడ నిజంగా పందిరి ఏర్పడదు. చేయాల్సిన పని చేయక మాటలతో కాలక్షేపం చేయటం. +స్వల్ప వ్యవధిలో ఉదా: చిటికెలో వచ్చేస్తా +కలహించటం, ఎప్పుడూ అసహనంగా, దురుసుగా మాట్లాడటం +కోపతాపాలు, అల్లరులు వంటకోసం పొయ్యిలో రాజేసిన మంట సజావుగా వెలుగుతూ ఉంటే వంట త్వరగా అయిపోతుంది.మంటకు బదులు చిటపటమంటూ నిప్పురవ్వలు వెలువడుతూ ఉంటే ఇబ్బంది. +బ్రతుకు పోరాటంలో ఓడి పోయాడని అర్థం: +బాగ కొట్టాడని అర్థం. ఓడించాడని కూడా అర్థం. +కోపంగా వున్నాడు అని అర్థం. ఉదా: వాడెప్పుడూ చిర్రు బుర్రు లాడుతుంటాడు. +చిల్లరగా అతి తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసే వారికి పెద్ద నష్టాలేమీ ఉండవు.ఖర్చులుపోగా మిగిలిందంతా లాభమే. రొట్టెలవాడి కన్నా ముక్కల వాడి పనే నయం అన్నట్లు. +వచ్చిందేదీ నిలవకపోవటం.అధికంగా ఖర్చు చేస్తూ ఆస్తిని హరించటం +నష్టాన్ని కలిగించటంలో అందరూ సమానులేనని .రంధ్రం, ���ిల్లు, చిల్లి, బొక్క అర్థాలన్నీ నష్టం అనేకదా? +==చిల్లి కాసుకు కూడ సరి రాడు== +పూర్తిగా నిరుపయోగమైన వాడని అర్థం. ఉదా: వాడు చిల్లి కాసుకు కూడా సరి రాడు. +ఏదైనా ఒకటే అనే అర్థంలో పై మాటను వాడతారు +అలంకార ప్రాయం, నిరుపయోగమైనా అలాగే ఉంచుకోటం.బతికుంటే చాలని అనుకోవటం +కరువుకాలం.చిలుకకు సాధారణంగా ఎప్పుడూ కరవు పరిస్థితి ఎదురు కాదు.అన్ని రుతువుల్లోనూ పంటలు, పండ్లు ఆహారంగా దొరుకుతూనే ఉంటాయి. అయితే ఒక్కోసారి చిలుకకు కూడా ఆహారం దొరకదు. ఆ సందర్భంగా ఈ మాటను వాడుతారు. +{{చిప్పకూడు చిప్పలో ఎవరు అన్నం తినరు. దీని అర్థం: వాడు జైలు కెళ్ళాడు అని. +ఆనందంగా వున్నాడు అని అర్థం. ఉదా: వాడెప్పుడు చీకు చింత లేకుండా ఉన్నాడు. +అనుభవం లేని వ్యక్తి కార్యాచరణకు పూనుకోవటం .ఆత్రం కొద్దీ వెలుతురున్నప్పుడే దొంగతనానికి వెళ్ళి పట్టుబడటం +ఉదా: వాడు చీడపురుగు ధుర్మార్గుడు అని అర్థం. +అసహ్యించు కున్నాడని అర్థం. ఉదా: వానికెమైనా చెపితె చీదరించు కుంటాడు. +పెద్ద పెద్ద ప్రమాదాలు, బాధలు వచ్చినా ఏ మాత్రం చలించకుండా, ప్రతిస్పందించకుండా ఉండటం.బాధ్యత లేకుండా ప్రవర్తించటం +(ఇంత చెప్తున్నా వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.) +స్వల్ప అవకాశం అక్కడ చీమ దూరె సందు కూడా లేదు ఎలా వెళ్ళను?) +పట్టుదలకు నిదర్శనం. చీమ తనకంటే ఎక్కువ బరువున్న ఆహారపు గింజను మోసుకుంటూ చాలాసార్లు జారి కిందపడుతుంటుంది. అయినా పట్టు వదలకుండా తనకు కావలసిన ఆహారాన్ని చేర్చుకుంటుంది. +సిగ్గు లేని వాడని అర్థం: ఉదా: వాడినెన్నన్నా సిగ్గు లేదు; వాడు చీము నెత్తురు లేని వాడు. +చీములాంటి అసహ్యకరమైన పనులుచేసి, అవినీతి పద్ధతుల్లో బాగా ధనాన్ని సంపాదించినవాడు. +ఒక్క విషయం పదే పదే వినిపించడం. +ఎక్కువ దానాలు చేశే వారిని గురించి ఈ జాతీయాన్ని వాడుతారు. +మేలు జరగటం, కలిసి రావటం, అదృష్టం వరించటం. చుక్క అంటే శుక్రగ్రహం.శుక్ర గ్రహానికి ఎదురుగా ప్రయాణం చేయటం కీడును కలిగిస్తుందంటారు. అయితే ఆ శుక్ర గ్రహానికి ఎదురుగా కాక దానికి భిన్నంగా వాలుగా ప్రయాణం చేస్తే కీడుకు బదులు మేలు జరుగుతుందని మూఢభావన. +అనుకున్న దానికి వ్వతిరేకంగా జరిగింది ఉదా: అతనికి కోర్టులో చుక్కెదురైంది. బైల్ దొరకలేదు. +కుతి అంటే కోరిక పొగాకు చుట్టను తాగటానికి అలవాటు పడి, దాన్ని విడిచి పెట్టలేకపోవటం +అప్పుడప్పుడు ఎప్పుడో కుదిరినప్పుడు ఎప్పుడ��� ఒకసారి వచ్చి వెళ్ళటం ఏరా? బడికి చుట్టపు చూపుగా వస్తున్నావు +మిత్రుడిగా వచ్చి శత్రువుగా ప్రవర్తించటం .అనురాగం పొందేవాడిలాగా ముందుగా ప్రవర్తించి, ఆ తర్వాత శత్రువుగా మారి పీడించటం +బయట ఒకలా, అంతరంగంలో మరోలా ప్రవర్తించే మోసకారి.నమ్మి వెంట వెళితే మోసపోవాల్సి వస్తుంది. పైపై మెరుగులు చూసి మోసపోవద్దని ఈమాటకు అర్థం. +చెప్పిన దానికన్నా అధికమైన అక్కరలేని పనిని కూడా చేయడం, అమితోత్సాహంతో ప్రవర్తించడం +జరగటానికి వీలులేని పనులు.ఇంటిచూరు వెన్నుగర్ర కంటే చాలా కిందకు ఉంటుంది. చూరు నీళ్ళు అక్కడి నుండి ఇంకా కిందికి దిగుతాయేకాని పైనున్న వెన్నుగర్ర వైపు వెళ్ళ లేవు. +ఒకరికి వంత పాడుతున్నారని అర్థం. ఉదా: వాడొట్టి చక్క భజన గాడు. +పెద్దవాడయాడు: ఉదా: వాడు చెట్టంత ఎదిగాడు ఏం లాభం ఏ పని చేత కాదు. ఆ సందర్భంలో ఈ మాటను వాడుతారు. +ఒకరి మీద ఆధారపడి జీవించేవాడు, నిరుపయోగి .దట్టమైన చెట్లకింద గడ్డి అంతగా మొలవదు. ఒక వేళ మొలిచినా ఆరుబయట మొలిచిన గడ్డిలాగా ఉపయుక్తంగా ఉండదు. నిస్సహాయుడై ఒకరి పంచన చేరిన వ్యక్తి కూడా అలాగే ఏ మాత్రం గుర్తింపు లేకుండా పడిఉంటాడు. +ఎంతో దూరదూరంగా చెల్లాచెదురై పోవటం .అప్పటి దాకా కలిసి ఉన్నవారు ఒకరికొకరు సంబంధం లేకుండా దూరదూరంగా విడిపోవట +దుర్మార్గులు అచ్చంగా చెడు పురుగుల్లాంటి వారే. పచ్చటి చెట్టులాంటి సమాజంలో ఆ చెడు పురుగులుంటే పురుగులు కనిపించకుండా చెట్టునెలా తొలచి నిర్వీర్యం చేస్తాయో దుర్మార్గులు సమాజాన్ని అలా నాశనం చేస్తారు. +అలిగాడని అర్థం: ఉదా: ఆ కొత్తల్లుడు కారు కొనివ్వలేదని చెట్టెక్కి కూర్చున్నాడు. +ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోని సందర్భం. విసిగివేసారటం. +చెప్పు కిందనున్న తేలు పూర్తిగా చిక్కినట్టే. అది తప్పించుకోలేదు. అలా తప్పించుకోలేని పరిస్థితిలో వున్న వారి గురించి ఈ మాట వాడతారు. +వెళ్లి పోవడానికి సిద్దంగా వున్నాడని అర్థం: ఉదా: వాడప్పుడే చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని ఉన్నాడు./ +చెప్పు ఎంత కోపంగా విసిరినా ఒక్క కుండకూ తగిలే అవకాశం లేని, కుండలు కూడా లేని దుర్భర దారిద్య్రం ఉన్న ఇల్లు. నీ ఇంట్లో చెప్పేస్తే కుండకు తగలదు అంటారు. +చాల ప్రయాస పడి తిరిగాడని అర్థం: ఉదా: ఆ సంబంధం కొరకు చెప్పులరిగేలా తిరిగాను. +మోసపోయామని బయటకు చెప్పుకోటానికి సిగ్గు, చెప్పకుండా మనసులోనే దాచుకుంటే దుఃఖం +సామాన్���ంగా చెమట పట్టింది అంటే అతిగా ఎండలో తిరగడమో, అతిగా శ్రమ చేయడమో వాతావరణము అతి వేడిగా వుండడమో వంటి కారణాలుంటాయి. ఒకరు మరొకరిని చెమటలు పట్టించ లేరు. మాటలతో గాని, చేస్టలతో గాని ఆపని చేయలేరు. కానీ కొందరు ఎదుటివారికి అతి భయంకరమైన వార్తలు చెప్పితే ఎదుటి వాడు నమ్మితే ఆ సందర్భాన్ని వాడికి చెమటలు పట్టించాడు అని అంటుంటారు. నిజంగా ఆభయానక సందర్భంలో కూడా చెమటలు పట్టవు. కాని జాతీయ ప్రయోగమున్నది. ఒక జాతీయము యొక్క నిజార్థం మొకటి వుంటే దాని ప్రయోగార్థం మరొకటుంటుంది. అలాంటివి నిజమైన జాతీయాలు. అలాంటి వాటిలో ఇది ఒకటి. +చేస్తున్న పనికి బాగా అంతరాయం కలగటం, పనివాడు, పనిముట్టు పోవటం. ఆ సందర్భంగా ఈ మాటను వాడతారు. ఉదా ఈ రోజు పని వాడు రాక పోయే సరికి చెయ్యి విరిగి నట్టుంది +ఉదా: ప్రతి పక్షాలు అధికార పార్టీ వారిని చెరిగేశారు. +సువిశాలమైనది, చాటంత, ఎకరమంత, లంకంత .గుండె చెరువైంది అనేటప్పుడు మాత్రం చాల ఎక్కువ దుఃఖం కలిగినదని అర్థం. +==చెరువులో పడ్డ వాణ్ణి తీసి బావిలో వేసినట్లు== +సహాయమడిగితే చేతిలో ఉన్నది కూడా లాక్కుపోవటం.చెరువు విశాలంగా ఉంటుంది. బావి ఇరుకుగా ఉంటుంది.చెరువులో పడ్డప్పుడు దెబ్బలేం తగలవు కానీ బావిలో పడ్డప్పుడు దెబ్బలు తగలొచ్చు. తక్కువ కష్టాల నుంచి తప్పిస్తామని చెప్పి ఎక్కువ కష్టాలను కలిగించటం. +ఇలాంటిదే మరొక సామెత పెనంలో నుండి పొయ్యిలో పడ్డట్టు +అదృష్టం మీద ఆధారపడటం.పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకున్నా, అంతా బాగానే జరుగుతుందనుకున్నా అనుకోని అవాంతరాలు సంభవించటం వల్ల ముందు అనుకున్నదంతా తారుమారవుతుంది. +విజృంబించాడు. ఉదా: ధోని ఆటలో చెలరేగి పోయాడు. +విలువలేనిది పనికిరానిది ఉదా: వీడొక చెల్లని కాసు. ఎవరికి పనికి రాడు. +నిరంతరం చెబుతుండటం వినేదాకా విసుగులేకుండా చెప్పటం నీ చెవిన ఇల్లు కట్టుకొని చెప్పాను నామాట విన్నావా? ఇప్పుడు చూడ ఎలా అయిందో?) +వినబడిందా ఉదా: నేను చెప్పింది చెవి కెక్కిందా? +ఉదా: అతను చెవి కోసిన మేకలా అరుస్తున్నాడు. ఎవరైనా పిల్లలు ఎడతెరిపి లేకుండా ఏడుస్తుంటే ఈ మాట అంటారు. +నేనేమన్న అమాయకుడినా ఉదా: నేనేమైనా చెవిలో పూలు పెట్టుకొని వున్నానా +అమాయకత్వం, చాదస్తం .అర్చకుడు పువ్వునిచ్చినప్పుడు స్త్రీలైతే జడలో ముడుచుకుంటుంటారు. పురుషులకు అలాంటి అవకాశం లేదు. కానీ ఆ పువ్వు పవిత్రమైంది. దాన్ని శిరస్సున ���రించే తీరాలి అని అనుకొని చెవిలో ఉంచుతుంటారు. +ఫలితం లేని పని చేసే వారినుద్దేశించి ఈ సామెత వాడతారు +==చెవిటి వాని ముందు శంఖం ఊది నట్టు== +ప్రయోజనం లేని పని.చెవిటివాడి ముందు శంఖం వూదితే దాన్ని కొరకటం నీ అబ్బ తరం కాదు అన్నాడట +ఉపయోగంలేని పని చేస్తే ఈ మాట వాడతారు. +శ్రవణ శక్తి లోపించటం, చెబుతుంటే వినిపించుకోకపోవటం, మాట్లాడుతున్నప్పుడు పరధ్యానంగా, ఏదో ఆలోచిస్తూ ఉండటం +రహస్యంగా మాట్లాడు కుంటున్నారు. ఉదా: వారిద్దరు చెవులు కొరుక్కుంటున్నారు. రహస్యంగా మాట్లాడుకుంటుంటే ఈ మాటను వాడతారు. +గుణ పాటము: ఉదా: వానికి ఇది చెంప పెట్టు లాంటిది. +ఒక విషయాన్ని బాగా విస్తరించి చెప్పటం, ఏదైనా విషయాన్ని ఆపకుండా చెప్పటం +ఒట్టి మాటల మనిషి అని అర్థం: ఉదా: వాని మాటలు నమ్మకు, వాడు చేతల మనిషి కాడు. +నీరసం వచ్చింది: ఉదా: చేతలుడిగి పోయాయి నేను ఆ పని చేయలేను. +తగినంత వాడికి చేతి నిండా పని ఉంది.) +సొంతం కావటం, చేతికొచ్చేదాకా నమ్మకం లేదంటారు +అప్పగించడం పిల్లను ఓ అయ్య చేతిలో పెట్టాము అంటారు +దొంగ తనం చేశాడని అర్థం: ఉదా: వాడు సందట్లో సమారాధనంగా తన చేతి వాటం ప్రదర్శించాడు. +ఉదా: ఆ డాక్టర్ చేతి వాసి మంచిది. +ధర్మాత్ముడు అని అర్థం: ఉదా: అతను అడిగిన వారి కాదనడు: అతని చేతికి ఎముక లేదు. +ఎదిగిన కొడుకు. ఉదా: వాడికేం పర్వాలేదు కొడుకులందరు చేతికి అంది వచ్చారు. +ఉదా: ఆ పని కావడానికి అతనికి చేతి చమురు బాగానె వదిలింది. బాగా నష్టపోయాడని అర్థం. +సహాయకుడు అని అర్థం. ఒక పనిలో సహాయకునిగా వున్న వాడిని చేతి కింది మనిషి అంటారు. +చేతు అంటే చేతులు సాపు అంటే సాధన బాగా ఉండటం చేతాళం పేతాళం. ఒక పని చేయటానికి చేతులు బాగా అలవాటుపడటం, చేతులతో పని బాగా చేసే సాధన లేక నేర్పరితనం కలిగి ఉండటం +విస్తృతంగా వ్యాపించటం, ఆహ్వానించటం దీన్ని నిందా వాచకంకా గూడ వాడుతారు) ఉ: వాడు అందరిదగ్గరా చేతులు చాస్తున్నాడు. +పని విరమించు కున్నారు. ఉదా: ఈ పని తమ వల్ల కాదని వారు చేతులెత్తేశారు. +విధేయతతో ప్రవర్తించటం, అణిగి ఉండటం. పని లేక పోవటం పని లేక పోవడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఇలా వాడుతారు అలా చేతులు కట్టుకుని కూర్చోక పోతె వచ్చి వాళ్లకు సాయం చేయవచ్చు గదా +పని లేక పోవడం: ఉదా: నాలుగు రోజుల నుండి పనిలేక పోయే సరికి చేతులు కట్టేసి నట్టుంది. +నష్ట పోయాడు. ఉదా: అతను వ్వాపారంలో బాగా చేతులు కాల్చుకున్నాడు. +తీరిక లేదు అని అర్థం: ఉదా: చేతులు ఖాళీగా లేవు పక్కింటికి వెళ్లు. +పని చేయలేక పోవడం: ఉదా: పనిచేసి, చేసి చేతులు పడి పోయాయి. నిందా వాచకముగా కూడా ఈ మాటను వాడుతారు నీ చేతులు పడిపోనూ'' +జాగ్రత్తగా: ఉదా: అతడు ఏ పనిచేసినా చేతులకు మట్టి అంట కుండా చేస్తాడు. నింద పడడు అని అర్థం మంచికి, చెడుకి కూడా ఈ జాతీయాన్ని వాడుతారు +చేయి కలపడం, ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒకటి కావడం. ఒకరికొకరు సాయం చేసు కోవడం వారందరు చేతులు కలిపితేనె నా గెలుపు సాద్యమైంది చెడు పనికి కూడా ఈ మాటను వాడతారు: ఉదా ఆ దొంగలిద్దరు చేతులు కలిపారు +గుణ పాటం: ఉదా: ఆ పని నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. +అసలు విషయం: ఉదా: ఇప్పటికైనా ఆ చేదు నిజం చెప్పావు సంతోషం. +బాధాకరమైన విషయం ప్రయోజనం కూడా ఉంటుంది. ఆ సందర్భంగా ఈ మాటను వాడతారు. +ఎవరూ నేర్పనక్కరలేదు తాతకు దగ్గులు నేర్పినట్టు అలాంటిదె. +గోలగా వున్నది: ఉదా: ఇదేమన్నా క్లాసా లేక చేపల మార్కెట్టా అలా అరుస్తున్నారు. +నిరంతరం ఒకరికి జవాబుదారీగా ఉండి బతకటం, స్వేచ్ఛ లేకుండా జీవించటం, ఇంకొకరి సూచనల మేరకు వ్యవహరిస్తూలెక్క చెప్పాలి. +వధూవరులు ఒకరి చేతిని ఒకరు పట్టుకోవడంతోటే వారికి వివాహ బంధం ఏర్పడుతుంది.చేయి పట్టి, జీవిత భాగస్వామిగా చేసుకోవటం +అడగటం అర్థించటం, యాచించడం. ఉదా: వాడెప్పుడు ప్రతి ఒక్కరిదగ్గర చేయి చాస్తుంటాడు. +ఎదుటివ్యక్తిపై ఆగ్రహంతో చేయి చేసుకోవటం, కొట్టటం, తన్నటం +చాల పని మంతుడని అర్థం వాడు ఈ పనిలో బాగా చేయి తిరిగిన వాడు.) +ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్తంత వెసులుబాటు కలగటం ఉదా: నాకష్టాలు తీరాయి. ఇప్పుడు నా చేయి కొంత వదులయ్యింది. +ఉదా: వాడు సినిమాకు వస్తానని చెప్పి నాకు చెయ్యిచ్చాడు. +విరామం లేకుండా మేస్తూనే ఉండటం. నిరంతరం ఏదో ఒకటి నములుతూ, ఏదో ఒక పని నిర్విరామంగా చేస్తుండటం. ఆ సందర్భంగా ఈ జాతీయాన్ని వాడుతారు. +ఇరుగు పొరుగు చేలల్లోది ఒక చోటకు చేర్చి కలిపితే ఏ చేలోది ఏ చొప్పో అంత తొందరగా కనుక్కోలేరు.చొప్ప అంతా ఒకలానే ఉంటుంది. ఇలా రెండు కుటుంబాల్లోని సభ్యులు ఇరుగు పొరుగునే ఉండి వారంతా కలివిడిగా తిరుగుతున్నప్పుడు 'చొప్పలో చొప్ప కలిసినట్లు వారంతా కలిసిపోయారు అంటారు +తమాషా చూస్తున్నారు; ఉదా: పని చేయ కుండా చోద్యం చూస్తున్నారా? +==ఛీ కుక్కా అంటే ఏమక్కా అన్నదట +==ఛీఛీ అనేదీ ఈ నోరే శివశివా అనేదీ ఈనోరే + + +పట్టిన పట్టుదల��ు ఎటువంటి పరిస్థితులలోనూ విడిచిపెట్టని వారు +అందరికి తెలిసిన విషయమే: ఉదా: వాడు చెప్పింది జగమెరిగిన సత్యమే. +ఎదురు తిరగటం జవాబు, సవాలు అనే రెండు పదాలు కలిసి జవసాలు అనేది ఏర్పడింది. అడిగిన దానికి జవాబు ఇవ్వటానికి బదులు సవాలు చేయటం +మోస గాళ్లు ఉదా: వారు జగత్ కిలాడీలు. +ఒప్పుకోవటం లేదా అంగీకరించటం.బలికోసం సిద్ధం చేసిన జంతువు నీళ్ళు, కుంకుమలాంటివి చల్లినప్పుడు వాటి ఒళ్ళు జలదరిస్తుంది. అలా జలదరిస్తే జంతువు ఒప్పుకున్నట్టు, జలదరించకపోతే ఒప్పుకోనట్టు లెక్క. +ముగింపు పలికేశారు. ఉదా: ఆ వుషయానికి వారెప్పుడో జనగణమన పాడేశారు,. +అందరూ అభిమానించే వ్యక్తి, జనరంజకుడు దాత, అందరితోనూ అన్యోన్యంగా ఉంటూ స్నేహభావంతో జీవించే వాడు. +తొందరతొందరగా వేగంగా వెళ్ళే నడక పరుగు గబ గబ +బలవంతం చేస్తున్నాడు. ఉదా: ఏరా? బలే జబర్దస్తీ చేస్తున్నావు. +జామాత అంటే అల్లుడు. వేధించే అల్లుడే పదో గ్రహం +ఓ పట్టాన వదలనివాడు.ఎదుటి వ్యక్తులను ఏదో వంకతో పలకరించి, గంటల తరబడి ఆ మాటా ఈ మాటా చెబుతూ కాలక్షేపం చేసేవాడు.తీరిక లేదని చెప్తున్నాపట్టించుకోరు.ఇంకోపనేదీ చేసుకోనివ్వరు.వదిలి వెళ్ళరు. +దొంగ పెళ్ళి .నిత్య పెళ్ళి కొడుకులు చేసుకునే వివాహం. మొదటి ఇద్దరు భార్యలు విడిచి వెళ్ళినప్పుడు మూడో పెళ్ళిలో జిల్లేడు చెట్టుకు ముందుగా తాళి కట్టడం ఆచారం. మూడు సంఖ్య అంత మంచిది కాదని జిల్లేడును మూడో పెళ్ళి కూతురుగా భావించి తాళి కడితే ఆ తరువాత పెళ్ళి చేసుకునే స్త్రీ నాలుగో భార్యగా వరుస క్రమంలో నిలుస్తుందని దురభిప్రాయం జిల్లేడుకు తాళి కట్టడం నామకార్థం. అంతా దొంగ వ్యవహారమే +పాడుబడి పోవటం ఎవరూ నడవని ప్రాంతాల్లో, ఇళ్లను పాడుపెట్టినప్పుడు ఆ ఇళ్ళలో జిల్లేడు జీలుగ మొక్కలు మొలుస్తుంటాయి. +ఎంతో ఎత్తుగా ఉంది అని తాటిచెట్టు మొవ్వు మీదకు చీమ]]ల లాంటివి వెళ్ళి పాడు చేయకుండా ఆ తాటి చెట్టు మధ్య భాగంలో బాగా జగటగా ఉండే జీడికట్టును కడుతారు. దాంతో చీమలు పైకి పోలేవు. +జీతం లేకుండానె తోడేలు గొర్రెల్ని కాస్తానన్నదట +తీవ్రంగా విభేదించటం బాహా బాహీ, కొట్లాడుకోవటం, విమర్శించుకోవటం, +చాల తెలివైన వాడని అర్థం: ఉదా: వాడు మహా తెలివైన వాదు. వీడి జుట్లో దూరి పోగలడు +అతిగా పొందటం, సంపూర్ణంగా ఆనందంగా ఆస్వాదించటం పళ్ళ రసాలు, పాయసాలను నోటితో జుర్రుకుంటే అందాలను కళ్ళతోటే జుర్రుకొంటుంటారు +��ుయ్‌ జుయ్‌ మని తొందరగా భూమిలోకి ఇంకటం +తీవ్రంగా ఆలోసిస్తున్నారని అర్థం: ఉదా: వారు ఆ విషమై జుట్టు పీక్కొంటున్నారు. +పని పాట లేకుండా తిరుగు తున్నాడని అర్థం:లా ఉదా: వాడు జుయిగా తిరుగు తున్నాడు. +దొంగ బుద్ధి గల వాడు ఉదా: వాడొట్టి జేబులు కొట్టే రకం. +ఎక్కడో కొద్దిగా నష్టం వచ్చినా ఏమీ ఇబ్బంది లేదని, జెర్రికి వంద కాళ్లు వుంటాయి. అందులో ఒక కారు విరిగినా వచ్చిన నష్టం ఏమి లేదు. +కార్యభారాన్ని భరించటం, ఆయా పక్షాల బాధ్యతలన్నింటినీ భుజాన వేసుకుని పనిచెయ్యటం +చాలామంది మనుషులు ఒక చోట కూడితే గుంపు అంటారు. పశువులు ఉంటే మంద అంటారు. విపరీతంగా కుప్పలు కుప్పలుగా ఎక్కడైనా ఈగలు ముసిరితే జొబ్బుజొబ్బుగా ఈగలున్నాయి అంటారు. +రమాదంలో వున్నాడని అర్థం: ఉదా: జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నావు జాగ్రత్తరో? +మంచి ఊపుమీదున్నాడని అర్థం: ఉదా: ఏరా మంచి జోరు మీదున్నావు, ఏంది సంగతి? +రెండు పనులు ఒకేసారి చెయ్యటం రెండుగుర్రాలపై చెరి ఒకదానిపై ఒక కాలు వుంచి పరుగు తీస్తే ఖచ్చింతంగా ప్రమాదమే.. + + +ట ఠ అక్షరాలతో మొదలయ్యే జాతీయాలు +==టక్కు టమార విద్యలు నేర్చిన వాడు== +చాల జిత్తుల మారి అని అర్థం. ఉదా: వాడు చాల టక్కు టమార విద్యలు నేర్చిన వాడు. వానితో జాగ్రత్త. +మోస గత్తె: ఉదా: ఆమె బలే టక్కులాడి. +వెంటవెంటనే, వేగంగా టపటప రాలిపోయారు టపటప చినుకులు పడ్డాయి కాయలన్నీటపటప రాల్చేశారు అని అంటుంటారు. +అపోహలు.వాస్తవ దూరంగా అసహజంగా ఉండే మాటలు, అబద్ధాలు అతిశయోక్తులు +అతుక్కుపోవటం: విడదీయ లేనంతగా అతుక్కు పోవడము. +అనగా చనిపోయాడని అర్థం: ఉదా: వాడు టపా కట్టేశాడు: +ఏపని పట్టించు కోకుండా జల్సాగా తిరుగు తున్నాడని అర్థం ఉదా: వాడు ఇంటి పనులు పట్టించు కోకుండా టింగు రంగ అంటు తిరుగు తున్నాడు. +టి ప్పు టాపుగా తిరుగుతున్నాడు . +దొంగలకేమీ అడ్డంకాదు: మడి గుడ్డను ఎవ్వరు తాకరు. ఒక అమాయకురాలు టెంకాయ చెట్టును దొంగలు ఎక్కకుండ వుండాలని దానికి మడి గుడ్డ కట్టిండట +ఎవరూ ఆధారం లేని వాడు: ఉదా: వాడు ఠికాణ లేని వాడు. + + +జీవితంలో చాల దెబ్బలు తిన్నాడు: ఉదా: వాడు చాల డక్కా మొక్కీలు తిన్నాడు. +తన గురించి తాను గొప్పలు ప్రచారం చేసుకోవడం +ఆచరణ శూన్య ప్రచారం .పనికొచ్చేది ఏమీ ఉండదు +నాటకాలేస్తున్నాడు: ఉదా: వాడి మాటలు నమ్మకు, వాడు డ్రామాలేస్తున్నాడు. +పోట్లాటకు సిద్దం అంటున్నారు: ఉదా: వారు కొ��్టు కోడానికి డీ అంటే డీ అంటున్నారు. +బడి పిల్లలు బడికి రాక పోతె "డుమ్మా కొట్టాడు" అని అంటారు. +సునిశిత పరిశీలనా జ్ఞానం, సూక్ష్మ దృష్టి, జాగ్రత్తగా గమనిస్తూ ఉండటం +మోసగించి పారి పోయారు: ఉదా: వారు రాత్రికి రాత్రే డేరా ఎత్తేశారు. +పసలేని మాటలు, కాలక్షేపానికి చెప్పే మాటలు .డొల్ల కావటమంటే లోపల ఏమీ లేకుండా ఖాళీగా ఉండటం. చెప్పే కబుర్లలో కూడా పనికొచ్చే విషయాలు ఏవీ లేనప్పుడు వాటిని డొల్లకబుర్లు అంటారు. +సరైన సమాధానం చెప్పడం లేదని అర్థం: ఉదా: వాన్ని నమ్మడానికి వీల్లేదు: వానివి అన్ని డొంక తిరుగుడు సమాదానాలె. + + +ఒకచోట తిరస్కారం పొందినవాడు ఇంకోచోట గొప్ప గౌరవాన్ని పొందటం +తల్లిచాటు బిడ్డ నిర్ణయాలు తీసుకొనే శక్తి, స్వేచ్ఛలేని అమాయకుడు. +తండ్రి పై ఎంత ప్రేమాభిమానాలున్నా తండ్రి తవ్విన నుయ్యి కదాయని అందులో దూకలేము. ఇలాంటిదే మరొక జాతీయము +అనుకూలంగా మాట్లాడటం.బుర్రకథలో ప్రధాన కథకుడు తందాన తాన అంటే వంతలు కూడా తందాన తాన అంటూ ఉంటారు. ఇలాగే ఒక వ్యక్తి చెబుతున్న విషయాన్ని అతడి పక్కనున్నవారు సమర్థించటం +దారిన పోయె కంపను ముడ్డికి తగిలించు కోకు, అనగా అనవసరమైన విషయాలలో వేలు పెట్టకు అని అర్థం. +తడి గుడ్డతో గొంతులు కోసే రకం +ఆధారాలు లేకుండా ఇతరులకు హాని చేసె వాడు. +చేయాల్సిన పనులేవైనా ఉన్నా వాటన్నిటినీ పక్కనపెట్టి హాయిగా విశ్రాంతి తీసుకోవటం లేదా నిద్రపోవటం +చాల ఎక్కువైందని అర్థం: ఉదా నీవు చేసిన చిల్లర అప్పులన్ని తడిసి మోపెడైంది. +ఆమోదించటం, అట్లే అగుకాక అని అర్థం. తథాస్తు దేవతలుంటారన్నది ఓ నమ్మకం. మనుషులు ఏది అనుకుంటున్నా దానికల్లా ఆ దేవతలు తథాస్తు అని అంటుంటారని కనుక ప్రతివారు చెడు అనుకోకుండా మంచిమాత్రమే అనుకోవాలని, సర్వ వేళలలోకూడ మంచి ఆలోచనలు కలిగి వుండాలని ఈ జాతీయములోని అంతరార్థము. +సన్నటి, పల్చటి రకరకాల వెదురు బద్దలు విడివిడిగా ఉన్నప్పటి కన్నా తడికెగా అల్లిన తర్వాతలాగా విడివిడిగా జరిగిన తప్పులు అంతగా గుర్తింపులోకి రాకపోయినా ఒకదాని వెంట ఒకటి వరుస క్రమంలో..ఓ రూపానికొచ్చి గట్టిగా ఉన్నట్టనిపిస్తాయి. +లెక్క కోసం కనిపిస్తున్నా దేనికీ పనికి రాని డొల్లలు తడిసి ముక్కిపోయిన గింజలు.తప్ప తాలు, +నాణ్యత లేకపోవటం లోపల గింజేమీ లేకుండా కేవలం పైతొక్కు, పొట్టుతో మాత్రమే ఉండటం.విలువ లేని తనం +పిండికొద్దీ రొట్టె, గంత���ు తగ్గ బొంత ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం లభిస్తుంది, ఎంత ఎక్కువ ఇస్తే అంత బాగా పని చేస్తారు.తర్ర అంటే తాలు, తప్పు, నాణ్యత లేని, సారం లేని, గట్టిగా లేనివి. తర్రవడ్లు అంటే నాణ్యత లేని ధాన్యం ఓ వ్యక్తి కల్లు దుకాణం దగ్గర తర్రవడ్లునిచ్చి కల్లు పోయమన్నాడట. ఆ దుకాణదారుడు కూడా దానికి తగ్గట్టుగానే మంచి కల్లును కాక నీళ్ళు కలిపిన కల్లును ఇచ్చాడట. +తలవొగ్గు అనగా ఓడిపోవడము అని అర్థం. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆ పరిస్థితులకు ఎదురొడ్డక తల వంచుకొని వెళ్ళి పోవడమే మంచిదని ఈ జాతీయానికి అర్థం. +ఉండాల్సిన తీరులోకాక అందుకు భిన్నంగా ఉండటం, అనుకోని సంఘటనలు జరిగి సాధారణ స్థితిగా కాక అసాధారణ స్థితిగా కనిపించటం, ప్రవర్తించటం ఖంగుతినటం, డీలాపడిపోవటం +పట్టుదలతో కృషి చేయటం ఉదా: నీవు తలకిందుల జపం చేసినా నానుండి ఏమి రాలదు. +అర్థమయిందా? ఉదా: అయ్యవారు చెప్పింది నీకేమైనా తలకెక్కిందా? +అవమానమైనది: అర్థమయ్యిందా? అని అర్థం ఉదా: వాడు చేసిన పనితో నా తల కొట్టేసి నట్టుంది. +(పక్కలో బల్లెం అలాంటిదే ఈ జాతీయం) +తల తోక లేని పనులు చేయకు +పనికి రాని పనులు చేయకు అని అర్థం. ఉదా: వాడు చేసే పనులన్నీ తలాతోకా లేనివి అని అంటుంటారు. +తెలివితేటలుండి సంపాదన సరిగా లేనివాడిని ఉద్దేశించి ఈ మాట వాడతారు +పరువు పోయినట్టు, అవమానం జరిగినట్టు, తల కొట్టేసినట్టు, మరణ శిక్ష అనుభవించినట్టు +ఉపయోగం లేని పనులు. ఉదా: వాడు చేసె పనులన్ని తలా తోక లేని పనులే.. +అవమానంగా భావించుకోవటం, అవమానం పాలు కావటం ఉదా నీవు చేసిన పనులకు సమాజంలో నేను తల దించు కోవలసి వచ్చింది. +ఎక్కువ అనుభవం కలిగి ఉండటం.జ్ఞాన వృద్ధులు, అనుభవం సంపాదించి ఉండటం, పక్వం చెందటం పరిపూర్ణతను సాధించటం, ఫలవంతం కావటం, జుట్టు తెల్లబడటాన్ని కూడా తలపండటం అంటారు. +అయినవాళ్ళకు ఆకుల్లో కానివాళ్ళకు కంచాల్లో.సొంత రక్తసంబందీకులను శత్రువుల్లాగా చూస్తూ పరాయివాళ్ళను మిత్రులుగా చూడటం +ఇక్కడ తల వున్నది అంటే తెలివి వున్నదని అర్థం. ఉన్న తలగాక దాని పై మరొక తల వచ్చిందని అంటే అధికంగా తెలివి రావటమని అర్థము. రెండు తలలు అనగ తెలివి రెట్టింపు కావడమని అర్థం. అత్యధిక తెలివిగా ప్రవర్థింస్తుంటె ఈ జాతీయాన్ని వాడుతారు. +ఎట్టి పరిస్థుతులలోను ఉదా: తల తాకట్టు పెట్టైనా నీ అప్పు తీరుస్తాను. +వారితో కలుస్తున్నావు: ఉదా: నీవు అనవసరంగా వారి పనిల��� తల దురుస్తున్నావు. +శిరస్సు తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టడం .తలపు+పెట్టడం తలపెట్టడం= ఏదైనా ఒక పని చేయాలన్న ఆలోచనకు రావటం +కఠినంగా వ్యవహరించటం, పొగరుగా ప్రవర్తించటం ఉదా: వానికి తలబిరుసు తనం ఎక్కువ. +ఏమీ తోచని దిక్కుతోచని స్థితిలో ఉండటం. జుట్టు పట్టుకోవటంమంటే తగాదా పడటం, పోట్లాడుకోవటం. +నాయకత్వాన్ని మార్చటం (నిందా వాచకంగా కూడా దీన్ని వాడతారు ఉ వాడు తలలు మార్చే రకం: మోసగాడని అర్థం.) +ఉదా: నన్ను ఓడించాలంటే నీ తల్లో జేజెమ్మ దిగి రావాలి. +విపరీతంగా విసుగు పుట్టడం, భరించలేని స్థితి (ఉదా: వాడి తల వాచి పోయేటట్లు చీవాట్లు పడ్డాయి) +అర్ధంలేని, ఆదీ అంతంలేని ఉ: వాడి మాటలకు తలా తోకా వుండదు. +అనుమతివ్వటం, ఒప్పుకోవటం. ఉదా: వాడు అన్నింటికి తలూపు తున్నాడు. నమ్మడం ఎలా? +ప్రధానమైన ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాలు.అమ్మకు పెట్టే అన్నం. +గుంట చిన్నదిగానే ఉన్నా అందులో చల్లని, తియ్యని నీరు తవ్విన కొద్దీ వూరుతూనే ఉంటుంది.విద్య ధర్మం చేసిన కొద్దీ చలమలో నీరు వూరినట్టే వృద్ధి చెందుతుందని అర్ధం +గర్వంగా ధైర్యంగా ఉదా: వాడు చేసిన వెదవ పనికి నేను సమాజంలో తలెత్తుక తిరుగ లేకున్నాను. +హాని కలిగించేవారు, యజమానికి కూడా దెబ్బలు తగిలేలా చేసేవారు +ధాన్యం కాక తవుడు మాత్రమే ఆహారంగా లభించడం, హీనస్థితి.వెట్టిచాకిరీ.ఇళ్లలో పని చేయించుకొని కూలి కింద ధాన్యాన్ని ఇవ్వకుండా లోభగుణంతో ఉండే యజమానులు తవుడు తీసుకువెళ్ళమని కూలీలను బెదిరించేవారు.పశువులు తినే తవుడు ఆహారపదార్థంగా ఇంటికి తీసుకువెళ్ళి పిల్లాపాపలతో ఎలా తినాలా అని కూలి వ్యథ చెందుతూ ఉండేవాడు.ఎంత కష్టించి పనిచేసినా కష్టానికి తగిన ప్రతిఫలంకాక హీనమైన ప్రతిఫలం లభించటం +కాలం కలసి రాకుంటే తాడె పామై కరుస్తుందంటారు. +చాలా నెమ్మదిగా నడవటం, నత్తనడక (పెండ్లినడక) +మోసగించే మనస్తత్వం.తాకట్టు పెట్టుకున్న వ్యక్తి అప్పు తీసుకొనేవాడి అవసరాన్ని, ఆత్రాన్ని గమనించి అధిక వడ్డీ కోసం మోసం చేస్తాడు.పెళ్ళాన్నికూడా తాకట్టు పెట్టే రకం కొందరు. +ఎవరికైన పెద్దగా కోపం వచ్చి వెంటనే శాంత పడితే వారిని గురించి ఈ జాతీయాన్ని వాడు తుంటారు. దీనికి సమానార్థంలోనే మరొక జాతీయమున్నది. అది వరిగడ్డి మంట]] +తోల వలుస్తా అని అర్థం. కోపంతో అనే మాటలు. నీ తాట తీస్తా అని అంటుంటారు +పెద్ద పెద్దవి, చక్కగా దూరానికి కూడా కనబడేవి. ఉదా: వాడు వ్ర���సే అక్షరాలు తాటికాయలంత వుంటాయి. +అసంబద్ధమైన, లోభ పూరితమైన పనులు. చేంతాడుకు బావిలోని నీరు అందకపోతే బావిని కొంత మేర పూడిస్తే ఆ నీరు కొంత పైకి వస్తుంది అప్పుడు చేదకు నీరు అందుతుంది అని మోసపూరిత సలహా చెప్పేవారిని గురించి చెప్పే సామెత ఇది. +వెనక ముందు ఎవరు లేని వాడు. జులాయిగా తిరిగే వాడని అర్థం. ఉదా: వాడికేం తాడు బొంగరము లేని వాడు. +''తాడు తెగిన గాలి పటం లాగ ఒక గమ్యం లేక వ్వర్థంగా తిరిగే వాడిని ఇలా అంటారు. +ఏదో ఒకటి తేల్చు కోవాలి: ఉదా: ఈ రోజు వానితో తాడో పేడో తేల్చు కోవాలి. +ఏమాత్రం కష్టపడకుండా సంక్రమించే ఆస్తి. నిజాం ప్రభువుల పరిపాలనా కాలంలో కొంతమందికి జాగీరులుగా కొన్ని గ్రామాలను ఇస్తుండేవారు. వారు రాజుకు కప్పం చెల్లిస్తూ ఉండేవారు. ఆ గ్రామాల మీద అధికారం, మిగిలిన ఆదాయం అంతా ఆ జాగీరును పొందిన జాగీర్దారులకే ఉండేది. అదంతా ముత్తాత నుంచి తాతకు, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుకుకు ఆనువంశికంగా వస్తుండేది. కొడుకు తరం వారు జాగీరును సంపాదించటానికి ఎలాంటి కష్టమూ పడాల్సిన అవసరం ఉండదు. ఏ శ్రమా లేకుండా వచ్చే ఆస్తి అని +ఒకరికి నష్టం కలిగించి లాభం పొందడము. +ఒకరు చెప్పినదాని వంత పాడడం/ స్వంత అభిప్రాయం లేని వారి గురించి ఈ మాట అంటారు. బుర్ర కథ జట్ట్లు లోని ముగ్గిరిలో కథకుడు ఏది చెప్పినా తనకిరువైపులా వున్నవారు తందాన అని అంటుంటారు. ఆ విధంగా ఎవరేమి చెప్పినా దానికి సరే నని వంత పాడేవారిని గురించి చెప్పే జాతీయం ఇది. అంటే వానికి స్వంత అభిప్రాయము అనేది అసలు లేదని అర్థము. +తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనె రకం +మొండి వాడు, తాను చెప్పినదే వేదం అనే రకం దీనిని సామెతగా కూడా వాడతారు.) +తాబేలు అతి మెల్లగా నడుస్తుంది. ఆవిధంగా మెల్లగా నడిచే/ పనిచేసే వారినుద్దేశించి ఈ జాతీయాన్ను ఉపయోగిస్తారు. రెండో విధం: తాబేలు తనకు ఏదైన ఆపద కలిగితే తన అవయవాలను తన డిప్పలోనికి లాక్కొని నిచ్చలంగా రాయిలాగ పడి వుంటుంది. ఆ పరిస్థితిలో దానికి ఎలాంటి ప్రమాదము జరగదు. ఇలాంటి జాగ్రత్త మానవులకు అవసరమిని కూడా ఆయా సందర్భంలో ఈ జాతీయాన్ని వుపయోగిస్తారు. +మనిషిలోని స్వార్థ గుణం. తాను లెస్సగా ఉంటే మిగతా వారంతా మహా లెస్సేనని. తాను బాగుంటే మిగతా అంతా బాగేనని భావించటం ఎదుటి వాడి బాధలను గ్రహించుకోక స్వార్థంతో ప్రవర్తించటం +ఒకరు చెప్పినదానికి వంత పాడే వాడు. స��వంత అభిప్రాయం లేని వాడు +ఇదొక నీచపు మాట. తిట్టుతో సమానం. దీనిని నిందా వాచకముగా వాడుతుంటారు. +తరాజు ముల్లు తీరు ధర్మం తప్పని మనిషి, కచ్చితంగా ఉండేది. ధర్మం తప్పకుండా నీతి నిజాయితీతో వ్వవహరించే వారినుద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతారు. +సమర్ధించటం, వంత పలకటం. పాడుతున్న రాగానికి అనుగుణంగా ఉండే తాళం వేయటం. స్వంత వ్వక్తిక్తం లేని వారని అర్థము. +ఉదా: వీడు వాడు చెప్పినదానికంతా తాళం వేస్తుంటాడు. +బాగ అయ్యింది తగిన శిక్ష పడింది. ఉదా: వాడు చేసిన వెదవ పనికి తిక్క తిన్నగా కుదిరింది. +ఏం పొగరుగా వున్నాదా అని అడగడం +జీవిత కాలాన్ని ఏ పనీ చేయకుండా, సోమరిగా ఉంటూ తింటూ గడపటం.బకాసురుడి తిండి ఆరు నెలలు. పడక మరో ఆరు నెలలు.సగం నిద్రకు మరో సగం తిండికి సరిపోతే చేసేది ఏమీ లేదు. +ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఏదైనా పని చేసుకురావాలనుకున్నప్పుడు ఒక్కోసారి కష్టాలు, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి కష్టనష్టాలను ఎదుటివారు అనుభవించి కార్యాన్ని సాధించుకొస్తే దాని వల్ల కలిగే సత్ఫలితాలను అనుభవించటానికి స్వార్థబుద్ధితో ప్రవర్తించే వ్యక్తులు అప్పుడు ముందుకొస్తుంటారు. కష్టాల నుంచి తప్పించుకుంటూ స్వార్థబుద్ధితో ప్రవర్తిస్తూ తేరగా ఫలితాలను తాము అనుభవిస్తూ అందులో వచ్చిన దుష్ఫలితాలను ఎదుటివారిపైకి తోసేస్తూ వుంటారు. వారినుద్దేశింది ఈ జాతీయాన్ని వాడుతారు. +తన తప్పులను దాచి ఎదుటి వారి తప్పులను చూపడం. తాను తిట్టుతూ తిట్టనని చెప్పడం. +సొంత వ్యక్తిత్వం లేనివాడు, ఎప్పుడూ ఎవరి మీదనో ఆధారపడి జీవించే తక్కువ స్థాయి వాడు. సన్నాయికి శ్రుతి పెట్టే తిత్తిగాడు మేళంలో సొంత రాగాలు తీయలేడు. +నిందించడము: ఉదా: అనవసరమైన పనిచేస్తున్నావు ఏం తిన్నది అరగడము లేదా? +కృతజ్ఞత లేకుండా ప్రవర్తించటం తమకు కావాల్సినవన్నీ సమకూర్చుకొనే దాకా ఎంతో వినయంగా ప్రవర్తించి చివరకు కనీసం కృతజ్ఞత అయినా ప్రకటించకుండా పైపెచ్చు తమను సరిగా చూడలేదని తిట్టి వెళ్లిపోతుంటారు. తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టడం, పాలుతాగి రొమ్ము గుద్దటం లాంటిదే ఇది. +మంచి ఆరోగ్య వంతుడు ఏ శారీరక, మానసిక బాధలు లేని వాడని అర్థం. +(దీన్ని సామెతగా కూడా వాడవచ్చు) మోస గాడని అర్థం. +బోడి తలకు నూనె పెట్టటం లాంటిది.వృథా తప్ప ప్రయోజనమేమీ ఉండదు. +తలలు మార్చే రకం, మోస గాడు. ఉదా: వాడు తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడు. +ప��గరెక్కిన వాడు. ఉదా: వానికి బాగా తిమురు పట్టినట్టుగా ఉంది. +లోన దురుద్దేశము పెట్టుకొని పైకి మంచిగా మాట్లాడే వాడు. +ఎటూ కాని పరిస్థితి అని అర్థం +అసందర్భంగా ప్రవర్తించడం, లేనిపోని గొప్పలకు పోయి కావలసిన పనిని చెడగొట్టుకోవటం +సగం పని.పూర్తిగా నష్టపోవటం.తిరుపతిలో క్షురకుడు ఒక భక్తుడికి సగం క్షౌరం చేసి అక్కడికి ఆపి, మరో భక్తుడిని లాక్కొచ్చి కూర్చోపెట్టి క్షౌరం ప్రారంభింస్తే మొదటి భక్తుడు సగం క్షౌరంతో అలాగే కూర్చోవలసి వచ్చేది.తిరుమలకు వెళ్ళి తలనీలాలర్పించే భక్తులు సంపూర్ణంగా గుండు గీయించుకుంటారు కాబట్టి పూర్తిగా మునిగిపోయినవాడికి తిరుక్షౌరం అయ్యింది అంటున్నారు. +నష్ట, కాలంలోనే అధికమైన ఖర్చులు, అవసరాలు రావటం. తుట్టి అంటే నష్టం నష్టంలో నష్టమని అనుకొని చందా ఇవ్వటం. +వూరు, పేరు లేనివారు, జనాభా లెక్కల కోసమని ఉండే వారు +స్థిరం లేనిది, ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది +కులం కంటే ధనమే విలువైనది. ఒకే కులం వారు కలిసికట్టుగా ఉంటూ ఒకరికొకరు సాయం చేసుకున్నా ఈ సాయం పేదవారికి కాక ధనవంతులకే అందటం జరుగుతుంటుంది. తులం అంటే తులం బంగారం అని ఎంత కులమున్నా తులం లేకపోయే సరికి వాళ్ళనెవరూ లెక్క చేయరు. +చాలా తక్కువ కాలం.రెండు పరమాణువులు ఒక అణువు. మూడు అణువులు ఒక త్రసరేణువు. మూడు త్రసరేణువులు ఒక త్రుటి. +ఉదా: వాడు త్రుటిలో తప్పించు కున్నాడు కాలమానం తామర తూడును త్రెంచ డానికి పట్టే కాలం.) +తుర్ర్ ర్ మని పారి పోయాడు +ఉదా: ఆ పిల్ల వాడు తుర్ర్ ర్ మని పారి పోయాడు. +తగిన శాస్తి జరిగింది. ఉదా: ఈ దెబ్బతో వాడి తుప్పు వదిలింది. రోగం కుదిరింది. +వృధా చేశాడు అని అర్థం: ఉదా: నేను చెప్పిన మంచి మాటలన్నీ వాడు తుంగలో తొక్కాడు. +తక్కువగా చేసి మాట్లాడడం, గడ్డిపోచకు ఇచ్చే విలువకూడా ఇవ్వకపోవటం +నియమ నిబంధనలు పాటించకుండా ఉండు; బొత్తిగా ఖాతరు చేయకపోవు +ఏదో పని అయిందని పించడము: ఉదా: వారు ఆ పనిని తూ తూ మంత్రంగా పని కానిచ్చారు. +చక్కటి నీటి వసతి, సకల సౌకర్యాలు గల పొలం. చెరువులో చారెడు నీరు మిగిలినా తూము దగ్గరి పొలానికి అందుతాయి. ఈ పొలానికి నీళ్ళు పెట్టడం మరచిపోయినా పడిన నీళ్ళతోనో, భూమిలో ఉన్న తేమతోనో పండుతుంది. +గొడవలు సృష్టించడం. దీనికి మరొక అర్థం: సూటి పోటి మాటలనడం వాడు మాటల తూటాలు పేసుస్తున్నారు.) +వాదోపవాదాలలో ఇరుపక్షాల వారు చెప్పింది ఒకటే అవటం.త���టు, బెజ్జం, రంధ్రం, బొక్క, బొరియ, చిల్లి అర్థం మాత్రం ఒకటే. +హాయిగా హుషారుగా చలాకీగా తిరుగటం. స్వేచ్ఛగా తిరగటాన్ని తూనీగ గమనంతో పోల్చి చెబుతారు +ఇంతటితో వదిలేయాలి. ఉదా: వానికేమైన ఇస్తే ఇక అంతె తూర్పుకు తిరిగి దండం పెట్టాలి. ఇచ్చింది తిరిగి రాదు అనే భావనతో ఈ మాటలను వాడుతారు. +చెడామడా తిట్టారు, బాగా చీవాట్లు పెట్టారు: ఉదా: శాసన సభలో ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని తూర్పార బట్టింది. +అనవసరంగా మాట్లాడు తున్నాడు. ఉదా: వాడు తెగ పేలుతున్నాడు. నోరు అదుపులో పెట్టుకోమను. +పనికిరాని వస్తువు, నిరుపయోగకరం, చిల్లుల కడవలాగా +మంకుపట్టు పట్టి పనిచెడగొట్టటం.గట్టిగా లాగితే తాడు కాస్త తెగి కావాల్సిన పని కాస్త చెడిపోతుంది. ఇరు పక్షాల మధ్య వాదన వచ్చినప్పుడు సామరస్యంగా మాట్లాడి పనులు చక్కబెట్టు కోవాలి. ఏ ఒక్కరు ఒకే పట్టు దలతో వుండకూడదు. పట్టు విడుపు వుండాలి. ఆ సందర్భంలో ఈ మాటను వాడతారు ఈ వాఖ్యంలో వాడిన మాట "పట్టు విడుపు వుండాలి అనేది కూడ జాతీయమె.) +ఇక్కడ తాడు తెగటం కాదు అర్థం: ఏదేని ఒక క్లిష్టమైన వ్వవహారం గురించి చర్చింస్తున్నప్పుడు కొంత పట్టు విడుపు ప్రదర్సించి దానికి పరిష్కార మార్గాన్ని కనుగొలాలి. అంతె గాని ఎవరికి వారు పంతానికి పోయి ఇరువైపుల వారు ఏమాత్రం పట్టు సడలక వాగ్వివాదం చేస్తూనె వుంటే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు అనగా ఇరువైపుల వారు ఎంతో కొంత వారి పంతాన్ని కొంత సడలించితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాకాక చర్చలు అలా సాగుతూనె వుంటె ఒక దశలో ఆ సమస్య కు చిక్కుముడి పడి పోతుంది. ఆ తర్వాత ఎవరు ఏమి చేయ గలిగింది ఏమి వుండదు. అలా తెగిందాక లాగడం అనర్థదాయకం అని అర్థం. +అడ్డు అదుపు లేకుండా ఉదా: వాడు తెగిన గాలి పటంలాగ పని పాట లేకుండా తిరుగు తున్నాడు. గాలిపటం గాలి వాటంతో ఎగురుతుంది. ఆవిధంగా ఒక గమ్యం లేకుండా తిరిగేవారి గురించి ఈ మాటను వాడుతారు. +కట్టుబాట్లు తెగిననాడు అథోగతిపాలవటం జరిగి తీరుతుంది. తాడు తెగిపోతే నీటితో పైకొచ్చే బొక్కెన బావిలోకి పడిపోతుంది. అలాగే కట్టుబాట్లను, లేదా మంచివారితో బంధాలను తెంచుకొన్న వ్యక్తి అథోగతిపాలవుతాడు. +తోసిరాజు చదరంగంలో రాజుకు ఎదురుగా ఉన్న పావును పక్కకు తీసి ఆపక్కన ఉన్న ఏనుగు లాంటి వాటితో ఎదుటి రాజును బంధించటాన్ని తెరచి రాజు అంటారు.ఎత్తుకుపై ఎత్తు వేస్తూ ఎదుటి వారిని కష్టాల ప��లు చేయటం. +సందేహం తీరటం ఏవో సందేహాలతో ఇంత కాలం ఏదో అనుమానించిన వారు అసలు విషయం తెలుసుకొన్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతారు. +ప్రారంభించటం,తెరతీయటం,మొదలుపెట్టటం ఈ గొడవలకు తెర లేపింది వాడె) +ముగింపు పలకడం: ఉ ఈ గొడవకు ఇకనైనా తెర దించు తారా లేదా? +వృధా ఖర్చు. తెల్ల ఏనుగు అంటే దేవతా ఏనుగు. పూజ్యనీయమైనది. దానితో పని చేయించ కూడడు. అయినా దానికి కావలసిన తిండి మాత్రము ఎక్కువగానె పెట్టాలి. అటు వంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడు తారు. +ఎంత కష్టించి పనిచేసినా యజమానికి తృప్తి లేకపోవటం .తెల్లటి గుర్రానికి ఎంత నూనె రాసి మాలీష్ చేసినా ఎక్కడో చోట మురికి కనిపిస్తూనే ఉంటుంది.యజమానిని సంతృప్తి పరచటం సాధ్యపడదు. +గుడ్డి నమ్మకం వూహామాత్రంగా చెప్పిన విషయాన్ని అదే నిజమని కచ్చితమైనదని నమ్మే అమాయకత్వం.తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అని అనుకోవటం విషయ పరిజ్ఞానం పూర్తిగా లేకుండా ప్రవర్తించటం +తెల్లనివన్ని పాలు కావు నల్లనివన్ని నీళ్లు కావు +రంగును బట్టి వాటి గుణాన్ని నిర్ణయించలేమని చెప్పేదే ఈసామెత. +అసిధార మధులేపన న్యాయం .పైకి తియ్యని మాటలుచెబుతూ గోతులు తీసేరకం సుఖంతో పాటు కష్టం కూడా కలగటం.పదునెక్కిన కత్తి అంచుమీద ఉన్నది తియ్యటి తేనే కదా అని నాలుకతో నాకితే తేనె తియ్యదనం తెలిసే లోపునే నాలుక కూడా తెగుతుంది. ఓ పని చేస్తే లాభం వస్తుంది కదా అని దిగితే ఆ లాభంతోపాటు నష్టం కూడా కలుగుతుంది. +దుష్టుడు చెడగొట్టేది పాడుచేసేది.చెడు బుద్ధితో ప్రవర్తించేవాడు ఒక్కడు చేరితే, మెల్లమెల్లగా మంచి వాళ్ళుకూడా చెడిపోతారు అనే అర్థంతో ఈ మాటలను ఉపయోగిస్తారు. +మోస గాడు. లోన దురుద్దేశం వుండి పైకి బాగా మాట్లాడె వాడు. ఉదా: వాడు తేనె పూసిన కత్తి లాంటి వాడు. +ఇంత కాలం రహస్యం వుంచి ఇపుడు స్పష్టంగా వివరించటం +స్నేహాన్ని నటిస్తూ మోసం చేయటం.తీయం/తేయం అంటే తియ్యనిది, మధురమైనది .స్నేహం మధురమైనది, తీయనైనది . +ఒక వస్తువును ఎవరి దగ్గర నుంచో వూరకనే ఏ ఖర్చు, శ్రమ లేకుండానే తెచ్చుకుని అడ్డదిడ్డంగా వాడుకోటం. +విపరీతమైన వ్యామోహం.ఏ మాత్రం శ్రమపడకుండా వూరకనే వచ్చి పడిన దాని మీద వ్యామోహం ఎక్కువ. తేరగా వచ్చిపడింది పొరపాటున పోతే కలిగే బాధ అంతా ఇంతా కాదు.బీరకాయలో ఉండే పీచు బాగా పెనవేసుకొని ఉంటుంది. +దుర్మార్గులు కల్పించుకొని తగాదాకు దిగి నష్టపరుస్తుంటారు.తేలు తనకు కనిపించిన వస్తువునల్లా తన కొండితో కొడుతూ వెళుతుంటుంది. అదే తీరులో దుర్మార్గులు ప్రవర్తిస్తుంటారు. +దుష్ట స్వభావంతో ఉండటం. తేలు అడ్డం వచ్చిన ప్రతిదాన్నీ అవసరం ఉన్నా లేకపోయినా కొండితో కుడుతూనే ఉంటుంది. దుష్ట స్వభావం ఉన్నవాడు కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్లు అనే తేడా ఏమీ చూడకుండా తమకు ఎవరు కనిపిస్తే వారినల్లా బాధిస్తూనే ఉంటారు. +మానసిక ఆందోళన. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురవుతుందని అనుకొన్నప్పుడు గడువు దగ్గర పడుతుండే సరికి పనులు కాలేదనే భావనతో మనిషి అటూ ఇటూ తచ్చాడుతూ తెగ తొక్కులాడుతూ తిరుగుతుంటాడు. +చిల్లర గాళ్ల ముఠా ఉదా: మీ పిల్లవాడు ఆ తొట్టిగాంగుతో తిరుగు తున్నాదు. చెడి పోతాడు. +పోట్లాటకు పిలవడము: ఉదా: వాడు నామీదకు తొడకొట్టి పిలుస్తున్నాడు. +ఉదా: తొడ పరిచయము తొంబై ఏళ్లు అని అంటారు. అక్రమ సంబంధం గురించి ఈ మాట వాడతారు. +గొప్పల కోసం నష్టపోవటం.భూస్వామికి చుట్ట నోటికందించే వాడొకడు, చుట్టకు నిప్పంటించే వాడొకడు ఇలా ఎందరో ఉండేవారు. ఓ దొర అలా చుట్ట తాగే ప్రయత్నంలో నిప్పు కణిక అతడి తొడ మీద పడి తొడ కాలుతున్నా ఆ నిప్పు కణికను తాను పక్కకు తోసేయకుండా మరొక వెట్టిని పిలిచి నిప్పు కణికను తీసేయమని చెప్పాడట. కొంతమంది ఇలాగే ప్రతి చిన్న పనినీ నౌకర్ల చేత చేయించుకోవటానికి అలవాటు పడి తమకు బాధ కలుగుతున్నా సరే తమ పనులన్నీ ఇంకెవరో చేస్తేనే హుందాతనమని భావిస్తూ గొప్పలకు పోతుంటారు. +మరణించడం. పక్వానికొచ్చిన పండు చెట్టు నుండి తొడిమ వీడి క్రింద పడుతుంది. +పొగరణస్తా: ఉదా: నీవు ఎక్కువగా మాట్లాడుతున్నావు: తోక కత్తరిస్తా +పొగరణచాలి. ఉదా: వానికి తోక కోసి సున్నం పెట్టాలి. +వేలు విడిచిన బంధుత్వం.అవసరం కోసం తమ పనులు నెరవేర్చుకోవాలన్న స్వార్థం కోసం ఉన్నత పదవులలో, స్థాయిలలో ఉన్నవారిని తమ బంధువులుగా చెప్పుకోవటం.దూరపు బంధుత్వాలను కలిపి చుట్టమని అంటే అదే తోకచుట్టం +పొగరెక్కువవు తున్నదే అనే అర్థంతో ఈ జాతీయాన్ని వాడుతారు +అత్యంత కోపంగా ప్రవర్తించటం ముందు, వెనకలేవీ ఆలోచించకుండా అత్యంత వేగంగా స్పందించి తమ కోపాన్ని ప్రకటించటం, వేగంగా శత్రువును ఎదుర్కోవటం +పనికిరాని పనులకు విపరీతంగా హడావుడి అనవసరమైన ఆయాసం, శ్రమ +ధారాళంగా, అమితంగా దేన్నైనా, ఎవరికైనా ఇవ్వటం +పొగరణస్తా: ఉదా నీకు పొగరెక్కువయింది. తోలు తీసి కర్ర కేస్తా ఏమనుకున్నావో ఏమో అబు అంటుంటారు. +ఒకరికొకరు తోడుగా వుండడము మంచికి, చెడుకి కూడా ఈ పదాన్ని వాడతారు) +తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది +మానవ శరీరాన్ని పోల్చడము: వైరాగ్యంలో మానవుని పోలికను చెప్పడము. +ఎదుటి వ్యక్తులు ఎలా చెబితే అలా చేసేవారు .సొంత బుద్ధితో ఆలోచించక ఎదుటివారు చెప్పినట్లు ప్రవర్తించే వారు +మానవ దేహం తోలుతో కప్పి ఉంటుంది.మనుషులే తోలుబొమ్మలు.దేవుడు ఇలా ఈ తోలు బొమ్మలను చేసి తన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నాడు అంటారు. +బద్దకస్తుడు. ఉదా: వాడు తోలు మందం వాడు. ఏ పనికి ఓ పట్టాన పూను కోడు. + + +చాల ప్రమాదకరమైనదని అర్థం. తప్పించుకొన వీలు కానిది. +విచక్షణారహితంగా కొట్టడం. రోటిలో వడ్లనో, మరే ఇతర ధాన్యాన్నో పోసి రోకలితో దంచిన తరువాత ఆ ధాన్యం తన రూపాన్ని కోల్పోయి పిండిగా మారుతుంది. అంతలా రూపం మారిపోయేటట్లుగా కొట్టడం. ఉదా: వాడు చేసిన తప్పుకు బాగా దంచి వదిలిపెట్టారు. +ఒక క్రమ పద్ధతిలో వేగంగా చెప్పటం +ధనమొస్తే దాచు కోవాలి రోగమొస్తే చెప్పుకోవాలి +తొందరగా, దబదబ, దబ్బున. ఉదా: దబ్బున రావాలి పిలిసినప్పుడు. +దీనికి వెళ్లమని అర్థం: రమ్మని కూడా అర్థం వస్తుంది. +ఉన్నట్టుండి ఎవరికైన అదృష్టం కలిగి సంపద సమకూరితే వారిని గురించి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఉదా: వాడి దశ తిరిగింది. అని. దీనికి సమానార్థమైనదే మరొక జతీయము: అది. పంట పండింది. అని. +సందేహిస్తున్నాడు. ఉదా: వాడు ఎదో చెప్పడానికొచ్చి దాగుడుమూతలాడు తున్నాడు. +పని పాటు లేక ఇంట్లో కూర్చొనేవాడిని, ఇతరులు పని చేసుకొంటున్నప్పుడు ఆటంకం కలిగిస్తున్నప్పుడు దీన్ని వాడతారు.. +ఊరు పేరు లేని వాడని అర్థం ఎవడో ఒకడు. +నిజం నిప్పులాంటిది .ఎప్పటికైనా వాస్తవం తెలియక మానదు. అసత్యం ఆడిన వారికి బాధలు తప్పవు. +అతిగా ఆశపడి సంపాదించి కూడపెట్టటం శ్రేయస్కరం కాదని.అందరూ తినాల్సిన పదార్థాన్ని తానొక్కడే తినాలనుకొని రహస్యంగా దాచిపెడితే అది ఎన్నో రోజులు నిలువ ఉండదు. ఆ తర్వాత పాచిపోయి తినటానికి పనికిరాకుండా పోతుంది. +అరక కట్టినప్పుడు ఎడమవైపు ఉండే ఎద్దును దాపటెద్దు, దాటలెద్దు అని అంటుంటారు. దాపట, దాపల అనే పదాలకు ఎడమవైపు అని అర్థం. వెలపట, వెలపల అని అంటే కుడివైపు అని అర్థం. నాగలి చాలు వంకర లేకుండా చక్కగా ఉండాలంటే ఎడమవైపు నుండే ఎద్దు హుషారుగా, ఓపికగా తెలివిగా ఉండాలి. కుడి వైపు ఉన్న ఎద్దు కాస్త పక్కకు జరుగు��ుంటే ఎడమవైపు పగ్గం వేసి ఉన్న ఎద్దు దాన్ని అదుపులో పెడుతూ పొలంలో నాగలి చాళ్ళన్నీ సక్రమంగా వచ్చేందుకు దోహదపడుతుంటుంది. ఈ విషయంలో కుడివైపు ఉండే ఎద్దు బలహీనంగా ఉన్నా సరిగ్గా పనిచేయలేకపోయినా పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కానీ దాపటెద్దు బలంగానూ, తెలివిగల దానిగానూ ఉండాలి. దాపటెద్దు తీరులో బాగా బలంగానూ, మంచి తెలివి తేటలు ఉన్న వ్యక్తి కనిపించినప్పుడు 'వాడిదంతా దాపటెద్దు తీరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాడు' అంటారు. +ప్రతిభావంతుల ముందు, శక్తిసామర్థ్యాలు ఎక్కువగా ఉన్నవారి ముందు తక్కువ ప్రతిభ, తక్కువ శక్తిసామర్థ్యాలు ఉన్న వారు గుర్తింపు పొందలేరని +ఏమి తోచడం లేదు; ఉదా: ఇన్ని కష్టాలనెలా ఎదుర్కోవాలో దిక్కు తోచడం లేదు. +ఉదా: ఆ పని నేను చేసేది లేదు: నీకు దిక్కున్న చోట చెప్పుకోపో. +ఉదా: వాడు ఇంత బతుకు బతికి దిక్కు లేని చావు చచ్చాడు. +తక్కువే; ఇద్దరిని పోల్చేటప్పుడు ఒకనికన్నా మరొకడు అతి తక్కువ స్థాయిలో వున్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిసారు. ఉదా: వానిముందు వీడు దిగదుడుపే. +సిద్ధంగా అందు బాటులో వున్న వస్తువు, ధనము. +చివరి ఆశ. వివరణ: పూర్వం ఎవరైనా మరణిస్తే వారు మరణించారని నిర్ణయించ డానికి వైద్యులు వుండే వారుకాదు. +శవ యాత్రలో వూరు బయట శవాన్ని దించి శవం చెవిలో అతని పేరు పెట్టి పిలుస్తారు. ఒక వేళ బతికి వుంటే అతను పలుకతాడు. అలా కొన్ని సందర్భాలలో జరిగింది. దాన్నే దింపుడు గాల ఆశ అంటారు. ఈ పద్ధతి ఈ నాటికి కొన సాగుతున్నది. ఇప్పుడు ఒకడు మరణించాడని వైద్యుడు నూటికి నూరు పాళ్లు నిర్ణయించినా పాత పద్ధతి ప్రకారం దింపుడు గాలం పద్ధతిని ఈ నాటికి కొనసాగిస్తున్నారు. +ధుర్మార్గుడు: ఉదా: వాడు దీపాలార్పే వాడు వాన్ని చేరదీయకండి. లేని పోని మాటలు చెప్పి ఇతరులను మోసపుచ్చి వారిని నాశనము చేయడమో లేక అనవసర భయబ్రాంతులను కల్పించి ఇతరుల మనసు విరిచి జీవితం పై విరక్తి కలిగేటట్లు చేసి వారిని ఆత్మ హత్యకు పురికొల్పేటట్లు చేయడమో కొంతమంది చేస్తుంటారు. అలాంటి వారి గురించి ఈ జాతీయము వాడుకలో ఉంది. +సమాలించు కున్నారు ఉదా: అతని మరణం వీరికి తీరని లోటే. విధిలేక దుఃఖాన్ని దిగ మింగు కున్నారు. +ఉదా: వారితో పోట్లాడాలని నీకు అంత దురదగా వున్నదా? +సమూలంగా నాశనమై పోవటం, నిశ్శేషంగా నశించి పోవటం ఉదా: వాడు చేసిన పని దుంప నాశనమై పోయింది. +కుక్కను కొట్టటానికి దుడ్డే కావాలా ఏదో ఒక వ���క పెట్టి చెప్పిన పనిని చెయ్యకుండా తప్పించుకోటం +సోమరులు తినటానికే పుట్టినట్టు ఎప్పుడూ తింటూ పనిచేయమంటే శక్తి లేని దూడల్లాగా కూర్చుంటారు. ఎద్దులాగా ఎక్కువగా తింటారే కానీ దానికి తగ్గట్టు పనిచేయరు. +దులపటం అంటే శుభ్రం చేయటం. తిట్టడం, విమర్శించటం కూడా. ఉదా: వాడు చేసిన తప్పుకు పట్టుకొని దులిపి వదిలి పెట్టారు. +చెడతిట్టు, దూషించు. అని అర్థము వాడు దుమ్ము తూరుపెత్తు చున్నాడు అని అంటే వాడు తిడుతున్నాడని ఆర్థము +దెబ్బకు దెయ్యం కూడ వదులు తుంది +ఉదా: వాడు నిజం చెప్పడం లేదు: రెండు తగిలిస్తే వాడె నిజం చెప్పతాడు. దెబ్బకు దెయ్యంకూడ వదులుతుంది. +ప్రతీకారం తీర్చు కున్నారు. ఉదా: వారు దెబ్బకు దెబ్బ తీశారు. +దబాయించడం, అతిగా బొంకడం, అడ్డూ అదుపూ లేకుండా మోసం చేసి తాను మోసగాడిని కాదని నమ్మబలకడం.దోషి దేవుడి మీద అబద్ధపు ప్రమాణాలు చేస్తే దేవుడు శిక్షిస్తాడని కొందరు నిజాలను ఒప్పుకునేవారు. కానీ మరికొందరు తప్పు చేసినా చేయలేదని దబాయించి గుళ్లో దేవుడి మీద ప్రమాణం చేయడమే కాక ఆ దేవుడి విగ్రహాన్ని కూడా ఎత్తుకొచ్చి తాము తప్పు చేయలేదని నమ్మపలుకుతుండేవారు.నిజం చెప్పమని అడుగుతున్నప్పుడు తప్పు చేసినప్పటికీ చేయలేదని తనను తాను సమర్ధించుకోటం. +ఉదా: ఈ పని పూర్తయ్యే సరికి దేవుడు కనిపించాడు. చాల కష్టమైందని అర్థం. +ఉదా: దేవుడు చల్లగా చూడ బట్టి ఈ పని సక్రమంగా జరిగింది. +ఎంతో ధైర్యంగా అందర్నీ పనులు చేయమని ప్రోత్సహిస్తూ కొద్దిపాటి సాయం కూడా చేయక మొహం చాటుచేయటం. +దొప్పెడం బలి కోసం దోసిడంబలి ఒలకపోయటం +అత్యాశకు పోయి నష్టాల పాలు కావటం.ఓ వ్యక్తి తన దోసిట్లో అంబలి పోస్తే తాగకుండా ఇంతలో ఇంకా ఎక్కువ అంబలి ఆ పక్కనెక్కడో ఉందని ఎవరో చెప్పింది విని దోసిట్లో ఉన్న దాన్ని కిందపారబోసి దొప్ప కోసం వెళ్ళాడట. తీరా అక్కడకు పోతే దొప్పాలేదు, దాంట్లో అంబలీ లేదు. +కొంతమంది ఏదైనా నష్టం జరుగుతున్నంతసేపూ ఏమీ చేయకుండా వూరుకొని, ఆ తర్వాత ఆ నష్టానికి కారకులైన వారిని అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతుంటారు. ఓ వ్యక్తి ఇంట్లో దొంగలుపడి దోచుకుంటున్నంత సేపూ భయం వల్ల ఏమీ మాట్లాడకుండా కూర్చుని, దొంగలెంచక్కా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళను పట్టుకొంటానంటూ పంచె ఎగ్గట్టి అందరి ముందూ బీరాలు పలికాడట. ఇలాంటిదే మరొకటున్నది దొంగలు పోయిన ఆర్నెల్లకు కుక్కలు మొరిగి నట్టు +దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు +చాల ఆలస్యంగా పనిచేసే వారని అర్థం. +బలహీనుడు వెంటపడి ఎంతో పెద్దవారిని, బలవంతులను వేధించటం. దోమ అన్నిటా చాలా అల్పజీవి. మనిషి తలుచుకుంటే ఒక్క దెబ్బతో దాన్ని నలిపేయగలడు. కానీ అంతటి మనిషిని గదిలో ఉన్న ఒక్క దోమ శబ్దం చేస్తూనో, కుట్టి పారిపోతూనో తెగ వేధిస్తుంది. +కార్యసాధకుడు, కార్యదక్షుడు.కాళ్ళు పట్టుకునో, బతిమిలాడో, దండించో అనుకున్న పనిని మాత్రం సాధించుకొచ్చేవాడు.వాడికి పని అప్పజెప్తే అది అయిపోయినట్టే. +మనిషి మంచివాడు మాట దురుసు.దోసకాయ అంతా బాగున్నా దాన్ని అగ్రభాగాన చేదుగా ఉంటుంది. +అందంగా, ఆరోగ్యంగా, బంగినపల్లి మామిడి పండులా ఉండటం +కన్నం వేయటం అంటే దొంగతనం చేయటం.ధన వంతుల ఇళ్ళల్లో దొంగతనాలు చేసి ఆ ధనాన్ని పేదలకు పంచితే ధర్మ కన్నం అంటారు. + + +మహా మాయ గాడని అర్థం: ఉదా: వాడు నందిని పందిని చేయగల సామర్థుడు. +వృథా ప్రయాస, దండగమారి పని .బొక్కలో నక్క ఉన్నప్పుడు వెతికితే లాభం ఉంటుంది కానీ, అది పోయిన తర్వాత పొదను వెతకటమంటే వృథా ప్రయాసే. +మహా మోసగాడు: ఉదా: వాడిని నమ్మకండి వాడు నక్క జిత్తుల వాడు. +అదృష్ట వంతుడు: ఉదా: బలే బహుమానం కొట్టేశావురా నక్కతోక తొక్కివచ్చావులె. +అతి వినయం చూపడం; ఉదా: వాడు బలె నక్క వినయం చూపు తున్నాడే. +దొంగ తనంగా చూస్తున్నాడు. ఉదా: అటు చూడు వాడు నక్కి నక్కి చూస్తున్నాడు. +నమ్మించి మోసం చేయటం: ఉ వాడు నన్ను నట్టేట ముంచాడు. +పని సక్రమంగా జరుగుతున్నప్పుడు ఇంకా ఇంకా బాగా జరగాలని తమ ఇష్టం వచ్చినట్టు అధికారం చలాయిస్తూ పని చేసేవారిని ఇబ్బంది పెట్టటం.ఒకటికి పదిసార్లు హెచ్చరిస్తు అసలు పనిచేయటమే మానేసేలా చేయటం. +విపరీతంగా నష్టం కలిగించటం, కోలుకోలేని స్థితికి తీసుకెళ్ళటం +మధ్యలో అబ్బిన సంపద అనుకోకుండా వచ్చిన సంపదతో ఉదా: నడి మంత్రపు సిరితో వాడు విర్ర వీగు తున్నాడు. +సోమరిపోతు. వారిని గురించి పుట్టినది ఈ మాట. +ఎవరేమనుకున్నా సరే తన పని అయి తీరటమే ముఖ్యం అనుకొనే వ్యక్తి.ఏదో ఓ రకంగా ప్రలోభపెట్టి తమకు కావాల్సిన ఆ పనిని సాధించుకోవటం, యాచించైనా సరే తమ పనిని తాము పూర్తి చేసుకోటం, మరీ దిగజారిపోయి ప్రవర్తించటం శమనుడు అంటే యముడు మరణించాక నరకానికి వెళితే యముడు శిక్షిస్తాడు కదా అందుకని బతికి ఉండగా ఇతర దేవుళ్ళకు లాగానే యముడికి కూడా నమస్కారాలు పెట్ట�� రకం. అభిమానాన్ని చంపుకొని, కాళ్ళు పట్టుకొని అయినా సరే తనకు కావాల్సిన దాన్ని సాధించుకొనే వాడిని 'వాడొట్టి నమశ్శమనాయ రకం. అడిగిన డబ్బులిచ్చే దాకా నిన్నొదిలి పెట్టడు' అంటారు +విపరీతంగా హింసించటం వధించిన జంతువు మాంసాన్ని పోగులు పెట్టినట్లు +పేదరికం.పొగాకు తోటలో ముందు వరుసలో ఉండే పొగాకులు పెద్దవిగా సారవంతంగా ఉంటాయి. అవి ధర ఎక్కువ పలుకుతుంటాయి. ఆ తర్వాత పంట చివరలో చిన్న చిన్న ఆకులు కూడా వస్తుంటాయి. అయితే అవి అంత నాణ్యంగా ఉండవు. వాటినే నలక ఆకులు, కవుటు పొగాకు అంటారు.చుట్ట తాగే పేద వారు నలక ఆకులతోనే సరిపెట్టుకుంటుంటారు.ఏదో నలక పొగాకు తాగినట్టు డబ్బు లేక నామమాత్రంగా కార్యాలను జరుపుతారు +పరాభవం కలగటం ప్రభవ విభవ మొదలగు తెలుగు సంవత్సస్రాలలో నలభయ్యో సంవత్సరం పేరు పరాభవ పరాబవం అనగా అవమానము అని అర్థము: గుప్తంగా పరాభవము జరిగినది అని చెప్పడానికి ఈ జాతీయాన్ని వాడుతారు. +నల్ల రేగడిలో చల్లినా తెల్ల జొన్నలే పండతాయి +[[సమాజం]]లో అందరూ నడుచుకొన్నట్టే మనమూ నడుచుకోవాలని, భిన్నంగా ప్రవర్తించకూడదని అనటం.తనకు నచ్చినా, నచ్చకపోయినా చుట్టూ ఉండే వారి కోసమైనా కొన్ని కొన్ని పనులు చేయాల్సి రావటం ఆ కాసేపూ నలుగురితో నారాయణ కులంతోపాటు గోవింద మనకెందుకొచ్చిన గొడవ అనుకోవటం +[[నా చేతి మాత్ర వైకుంట యాత్ర +ఇది హాస్వాస్పదంగా చెప్పే మాట. ఆ వైద్యుడు రోగానికి మాత్ర ఇస్తే ఇక అంతె సంగతులు. ఆ రోగి చావడమే ఖాయం: ఆ అర్థంలో ఈ మాట ఉపయోగిస్తారు. +అందరు నడిచే దారినే మనము నడవాలి: పదిమందిని వ్వతిరేకించడం మంచిది కాదని దీనర్థం. +నలుగురు ఒక విషయాన్ని వింటే నాలుగు లోకాలు విన్నట్లే అని అర్థం. +నలుపు నారాయణుడు మెచ్చు ఎరుపు ఎరిముండ మెచ్చు +నల్లగా వుండే మనుషులను మెచ్చని వారికి చెప్పె సామెత ఇది. శరీరం రంగు నల్లగా వుండే వారు కొంత న్యూన్యతకు లోనై లోలోన కొంత వరకు బాధపడుతుంటారు. అలాంటి వారిని ఊరడించ దానికి నలుపును నారాయణుడు అనగా శ్రీమన్నారాయణుడు (దేవుడు) మెచ్చునని వూరడింపుగా చెప్పుతూ ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +అతి సులబమైన పని అని అర్థం: వివరణ బండి నడిచే దారిలో నల్లేరు అడ్డంగా వుంటే బండి నడకకు అడ్డమేమి కాదు. దాన్ని తొక్కు కుంటూ అతి సులభంగా బండి పెళ్ళి పోతుంది. +సమయం, సందర్భం లేకుండా నవ్వటం ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది.నవ్వు నాలుగు విధాలా చేటు.సమమం, సందర్భం చూసుకోకుండా నవ్వే నవ్వులు ఒక్కోసారి అపార్థాల్ని కలిగిస్తాయి. మొదట నువ్వు హేళన చేశావంటే నువ్వు హేళన చేశావు అని పోట్లాడుకునే వరకు వస్తాయి. +తన మాటలతో విసిగిస్తున్నాడని అర్థం: ఉదా: వాడు నస పెడుతున్నాడు. +నసీవ, నసీబు అంటే అదృష్టం అని అర్ధం.భగవంతుడి మీద భారాన్ని వేసి అదృష్టాన్ని వెతుక్కోవటం.నసీవ నారాయణ అనుకొని ఈ వ్యాపారం మొదలెట్టినా. ఎట్త్లెతే అట్లయితది అంటారు. +వదలకుండా వెంటపడి పీడించి ఏడిపించేవాడు .అప్పులవాడు ఉదా: నక్షత్రకుడిలా నావెంట పడ్డావేందిరా? +నాకు ముగ్గురైతే నీకు ఆరుగురు కదా అన్నట్టు +ఒకరి దోషాల్ని మరొకరు ఎత్తిచూపే సందర్భం: ఒకరిమీద మరొకరు నిందలు వేసుకొని తిట్టు కోవడము. నిందా వాచకంగా ఈ జాతీయాన్ని వాడుతారు. +ఎంత బాగా పనిచేసినా బాగా చేయలేదని అనటం పెళ్లి]]లో నాలుగో రోజున జరిగే కార్యక్రమమే నాగవల్లి. మగ పెళ్ళివారు ఆడపెళ్లి వారిని ఆడే నిష్టూరాలు. +అప్పు ఎగవేయడము (డబ్బు అప్పుతీసుకొని తిరిగి ఇవ్వక పోతే ఇలా అంటారు) +బెదిరించడం: ఉదా: నాతో పెట్టుకోకు అసలే నేను మంచి వాణ్ని గాను/ +ఇది ఒక సినిమా డైలాగ్ నేను నిఖార్సయిన మనిషినని" చెప్పడం. +పొంచి ఉండటం, పొంచేసుకొని కూర్చోవటం. ఎలుకను పట్టడం కోసం పిల్లి, చేపను పట్టడం కోసం కొంగ, జంతువును వేటాడటం కోసం వేటగాడు నాచు పెట్టుకుని కూర్చున్నట్లు +మాటలతొ ఎక్కువగ విసిగిస్తుంటే ఈ మాటంటారు: ఉదా: ఇక వెళ్లరా నామెదడు తినకురా +అసంబద్ధంగా, అసంపూర్ణంగా జరిగిన పని వెలితి. +నారదుని వలె మాటలు చెప్పి తప్పించుకొనేవారు. +నారు పోసిన వాడు నీరు పోయడా +దైవాను గ్రహంతో ఎలాగైనా బ్రతక వచ్చు అనే అర్థంతో ఈ మాటను చెప్తారు. దేవుడు తమను పుట్టించాడు బ్రతకడం కూడా తనే చూసు కుంటాడు. అని అర్థం. +ఎంత సంపాదించినా కొంతైనా ధనాన్ని దాచుకోవాలని చెప్పడం. ఇక్కడ నాలుగు రాళ్లు అంటే కొంత ధనం అని అర్థం: +లేనిపోనివి కల్పించి మాట్లాడటం, అబద్దాలు ఆడటం, మాట మార్చటం +అధికంగా మాట్లాడటం, దూషించటం: ఉదా: వాడి నాలుక చాల పొడవు. చాల ఎక్కువ మాట్లాడ తాడు. +తొందరగా ఒక నిర్ణయం తీసుకొలేని వాడు. ఉదా: వాడొట్టి నాంచుడుబేరంగాడు. ఒక పట్టాన ఏవిషయం తేల్చడు. +ఎగ్గొట్టాడు: ఉదా: వాడు నేనిచ్చిన అప్పుకు ఎగ నామం పెట్టాడు. +ఇదంతా సర్వసాధారణంగా జరిగేదే అని.అంగడి పగలంతా వచ్చీ పోయేవారితో సందడి సందడిగా ఉంటుంది. రాత్రి అయిన తర్వాత మూతపడి ఆ అం��డి సద్దుమణిగి ఉంటుంది. మళ్ళీ తెల్లవారాక మామూలే. ఈ జీవితం కూడా అంతే. అంగడికి వచ్చే వాళ్ళు వస్తూ పోయేవాళ్ళు పోతూ ఎలా ఉంటారో, మరణించేవారు మరణిస్తుంటే పుట్టి జీవించేవారు జీవిస్తుంటారు. మళ్ళీ వారూ మరణిస్తుంటారు.పోయినోళ్ళకోసం అంతగా బాధపడాల్సిన పనిలేదు. +ఆకాశాన్ని అంటుకోవటమంటే అది అయ్యే పనికాదు. అతిశయోక్తి .ఎంత ఎత్తున కట్టిన భవనమైనా ఆకాశాన్ని తాకటమనేది అతిశయోక్తే అవుతుంది. నింగినంటిన ధరలు అంటే ఆకాశాన్ని ఎవరూ అందుకోలేనట్టే పెరిగిన ఆ ధరలను కూడా ఎవరు అందుకోలేక పోతున్నారని. +వివరణ; నిజం అన్నది నిప్పు లాంటిది. అది ఏ నాటికైనా దహించక మానదు. ఆ నిజం తెలుసుకొని ప్రవర్తించాలి అనే సందేశం ఇందులో ఉంది. +సమృద్ధిగా ఉండటం, సమయానికి ఆదుకునే శక్తి ఉందన్న నమ్మకం కలిగి ఉండటం వూళ్ళో చెరువు నిండుగా ఉంటే ఆ చెరువు కింద చాలా పొలం సాగవుతుంది. దాంతో ఆ వూరి జనానికి కరవు భయం ఉండదు. +నిజం ఏనాటికైనా బయట పడుతుంది. అది తెలియక ప్రస్తుతానికి దాన్ని దాచి పెడితే ఆ తర్వాత అసలు విషయం బయట పడి ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ఆ సందర్భంలో ఈ మాటను ఉపయోగిస్తారు. +మోసం చేశాడని అర్థం: ఉదా: వాడు నన్ను నిట్ట నిలువునా ముంచాడు. +ప్రధానమైన వ్యక్తి మరణించటం. గుడిసెల నట్టనడుమ ఉండే నిలువు స్తంభాన్ని నిట్టాడి నిట్టాడు, నిట్రాడి అంటారు.నిట్టాడి కూలితే మొత్తం గుడిసె కుప్పకూలిపోతుంది.ప్రధానమైన వ్యక్తి మరణిస్తే అతడిని ఆధారంగా చేసుకొని ఉన్న వారంతా అథోగతి పాలై కోలుకోలేని స్థితిలో కుమిలిపోతారు +సంసారంలో సకల కార్యాలు సక్రమంగా జరిగి పోతుంటే ఈ మాట వాడతారు: ఉదా: వాడికేం వాని సంసారం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉంది. +ఏదైనా విషయాన్ని అమలు జరుగకుండా చూడటం, స్తబ్ధంగా ఉంచటం, మాయమాటలు చెప్పి అభివృద్ధిని ఆపేయటం అచేతనావస్థకు తీసుకెళ్ళటం. బబ్బోపెట్టడం +ప్రయోజనం లేని పని. వచ్చిన వాడు తన కాళ్లకు మొక్కాడా లేదా తన తప్పును తెలుసుకున్నాడా ఇవేమి గ్రహించని మొక్కి ప్రయోజనమేమి? +చైతన్యం పొందటం, ఉద్యుక్తులు కావటం ఉ నిద్ర లేచింది మహిళా లోకం సినీ గేయం.) +బద్దకంగా పడుకున్నవారిని పనికి లేపటం పడుకున్న వారిని నిద్రలేపడం అనేది సాధారణ అర్థం. కాని జాతీయాలకు మరొక అర్థంవుంటుంది. ఇక్కడ నిద్ర పోతున్న వాడిని నిద్ర లేపడం కాదు. ఒకడికి మంచి సలహా ఇచ్చి కాగల కార్యానికి ఉసి గొల్పడం.) +[[నిద్ర]]కు త���ండి]]కి దూరం కావటం, మనశ్శాంతి లేకుండాపోవటం. +''నిర్విరామంగా అనే అర్థంలో కూడా ఈ మాటను వాడు తారు: ఉ: వారు నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు. +పైకి తెలియని, లోలోన మండుతున్న. ఉదా: వాడు తనలో వున్న పగను బయటకు తెలియనీయడు. నిపురు గప్పిన నిప్పు లాంటి వాడు. +పైకి కనపడని ప్రతీకారం, క్రోధం, పగ క్రోధాన్నిలోపల దాచుకొని పైకి శాంతంగా కనబడేవారు నిప్పు పైబాగాన బూడిద పొర వున్న లోన నిప్పు వుంటుంది. అది గమనించని వారు నిప్పు లేదని అనుకుంటే అది పొరబాటే అవుతుంది. ఆ సందర్భంలో చెప్పినదే ఈ మాట. +లోలోన రగులుతున్న కోపం గలవారిని గురించి ఈ మాట అంటారు అది ఏనాటికైనా ప్రమాధకరమనే భావన) +కష్టాలతో కూడిన పరిస్థితులు.మేలు చేస్తున్నట్లు కన్పిస్తూ కీడు తలపెట్టటం.నిప్పులకంకర నడక. +ప్రమాధకరమైన పనిచేస్తున్నాడని అర్థం పులినోట్లో తల పెట్టాడు లాంటిదే ఇది కూడాను. +ఎదుటివారి మీద తీవ్రమైన ఆగ్రహాన్ని చూపించటం, నిప్పుకలు విసరమంటే నిప్పుకణికలు విసరటం +చాల కోపంగా వున్నాడు అని అర్థం: ఉదా వాడు నాపై నిప్పులు చెరుగు తున్నాడు. +చాల వేడిగా వున్నదని అర్థం: ఉదా: సూర్యుడు ఈ రోజు నిప్పులు చెరుగు తున్నాడు +అతి వేడి: ఉదా: ఈ ప్రాంతం ఎండలకి నిప్పుల కొలిమిని తలపిస్తుంది. +నీతి, నిజాయితీ, న్యాయంగా నిక్కచ్చిగా వ్యవహరించటం, ధర్మాన్ని అనుసరించే పవిత్రులు. ఉదా: వాడు నిప్పులాంతి మనిషి +ఏ పనైనా సులభంగా చేయగలగటం .చేతిలో ఇమిడి పోయేంత నిమ్మకాయ]]ను ఎటువైపు కావాలంటే అటు వైపు, ఎలా కావాలనుకుంటే అలా ఎంచక్కా విసిరేయొచ్చు. +సావధానంగా: ఉదా: వాడు నిమ్మకు నీరెత్తి నట్టు వస్తున్నాడు. +అండగా ఉండటం సమర్థిస్తూ సంపూర్ణ సహకారాన్ని అందించటం +ఓర్పు లేని మనిషి అని అర్థం. +ఉండడానికి ఇల్లు లేదు: ఉదా: వానికి నిలువ నీడ లేదు. అనాథ అని అర్థం +నిండా మునిగి పోయాడు. ఉదా: వాడు అప్పుల్లో నిండా మునిగి పోయాడు./ +ఎల్లప్పుడూ నీవెంటనే వుంటానని చెప్పడం ఉదా: నిన్ను నీడలా వెంటాడుతునే వుంటాను. +నిందా వాచకం; ఒక తిట్టు. ఒక స్రీని తన భర్తను చావమని తిట్టడము +నీరులేని పైరు నూనె లేని జట్టు +పైరు ఏపుగా పెరిగి పంట పండాలంటే నీరు ఉండాలి. నెత్తిమీది జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే దానికి నూనె రాస్తుండాలి. +నీళ్ల కుండ నెత్తిన పెట్టుకుని వున్నది +ఏడవ డానికి ఎల్లప్పుడు సిద్దంగా వుంటుందని అర్థం: ఉదా: ఆమె నీళ్ల కుండని నెత్తిన ప���ట్టుకుని వుంటుంది. +అధికంగా, అనాయాసంగా ధనాన్ని ఖర్చు చేయటం. ఉదా వాడు డబ్బుని నీళ్లలాగ ఖర్చు చేస్తున్నాడు అని అర్థం. +నిరుత్సాహ పర్చ డాన్ని ఈజాతీయం ద్వారా వెల్లడిస్తారు. ఉత్సాహంగా పనిచేస్తున్న వారిపై నీళ్ళు చల్లారు అని అంటుంటారు. నిజంగా నీళ్ళు చల్లారని కాదు వారు ఉత్సాహాన్ని నీరు గార్చారని అర్థం. +సంపూర్ణ సుఖమయ జీవితం. నిద్ర సుఖం ఎరగదు ఆకలి రుచి ఎరగదు లాంటిది ఇది. ఏ చీకూచింతా లేకపోతే ఎక్కడ పడుకున్నా నీళ్ళల్లో పడుకున్నా సరే మంచి నిద్ర పడుతుంది అని. +ఉన్నదేదో చెప్పలేకపోవటం.భావ వ్యక్తీకరణ సరిగా లేకపోవటం, అసమర్థంగా మాట్లాడటం. +(అసలు విషయాన్ని చెప్పడానికి సందేహిస్తు మాట్లాడటాన్ని ఇలా అంటారు.) +స్థానికంగా ఉన్న కొన్ని ప్రత్యేకతలు అలవాటు కావటం. ఆయా ప్రాంతాల్లో లభించే నీరు తాగినందువల్లనే అలాంటి ప్రత్యేక లక్షణాలు అలవడ్డాయన్న భావన పైన చెప్పిన అర్థం ఆజాతీయానికి నిజార్థం. కాని జాతీయాలకు నిజార్థం వుండదు. మరొక అర్థం వుంటుంది. అలా వాడక పోతె అది జాతీయం కాదు. సాధారణమే. దీనర్థం కొత్తగా ఒక ప్రాంతానికి వచ్చి అతి తెలివి ప్రదర్శిస్తుంటే ఈ మాటను వాడతారు.) +ఇదొక ఊత పదం: కొంత మంది ప్రతి దానికి 'నీతలకాయ అని అంటుంటారు. +అనగా నిరుత్సాహ పర్చారని అర్థము. వారి ఉత్సాహాన్ని నీరు గార్చారు అని అంటుంటారు. +పొరపొచ్చాలు, విభేదాలు అన్నీ మరిచిపోయి హాయిగా కలిసి పోవటం, భేద భావాలు పోగొట్టుకొని మనస్పర్ధలు మానుకొని అంతా హాయిగా కలసి ఉండటం +చనిపోయాడని అర్థం: ఉదా వాని ఈ భూమి మీద నూకలు చెల్లాయి. చనిపోయాడని అర్థం +శ్రీనాధుడి రచనల్లో శివుడు మాయ బ్రహ్మచారి రూపంలో వచ్చి ఏవేవో ప్రశ్నలు వేస్తున్నప్పుడు తపోదీక్షలో ఉన్న పార్వతి తన ఆశ్రమంలోని చెలికత్తెలతో ఇతడిని మెడ పట్టి బయటకు నెట్టండి అనే అర్థంలో మెడపెట్టి నూకండ''న్నది.ఒక్కదెబ్బ కొడితే చాలు నూరు యోజనాలు దూరం పోయి పడతావు అంటారు. +చాలా అరుదుగా ఎక్కడో ఎప్పుడో ఎన్నటీకో ఒకటి అన్నట్లు +వినసొంపుగా లేని హీనస్వరం, హృదయ విదారకంగా వినిపించే గొంతు, బాధాతప్తంగా ఉన్న వారి ఆర్తనాదం.గొర్రె బావిలో పడి ప్రాణభయంతో అరుస్తుంటే హృదయ విదారకంగా ఉంటుంది. +వస్త్రం: వాని ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. +అనవసరంగా ఎవరికైనా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఆ తర్వాత వారి వల్లనే చులకన అయితే అనవసరంగా నెత్తికి ఎక్కించుకున్నవు అం���ారు. +ఒక వ్యక్తిని పూర్తిగా అధీనంలోకి తీసుకోవటం, అదుపులో పెట్టడం, తన ఇష్టం వచ్చినట్టు ఆ వ్యక్తి చేత చేయించటం +ఒక వ్యక్తి మీద పూర్తిగా ఆధిపత్యాన్ని సాధించటం, నెత్తినెక్కాడు, ఎక్కేశాడు, ఎక్కాడు అనికూడా అంటారు. +అన్ని పోగొట్టు కున్నాడని అర్థం: ఉదా: వానికి నెత్తి మీదకు చేతులు వచ్చాయి. +హత్యలు, దుర్మార్గాల వల్ల లభించే ధనం దానితో ఉపాధి ఉపాది పొందడము. లంచగొండి +విశేషమైన నేర్పరితనం, సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండటం. +చాల సంక్లిష్టమైన పరిస్థితి, పగ తీర్చుకోవటానికి వీలుకాని పరిస్థితి.ఏమీ చేయకుండా కోపాన్ని దిగమింగుకొని ఉండిపోవాలి.కొట్టబోతే గర్భవతి, తిట్టబోతే అక్కకూతురు అన్నట్లు. +పేరుకు మాత్రమే గొప్ప: నేతి బీరకాలో నెయ్యి వుండదు. ఆ విధంగా పేరుకు మాత్రమే గొప్ప అసలు విషయం ఏమి లేదని అర్థం>. +సందేహిస్తున్నాడు: ఉదా: ఏదో చెప్పడానికి వచ్చి నేల చూపులు చూస్తున్నావేంది? చెప్పు. +అనుభవజ్ఞులు, పెద్దలు తప్పులు చేసినా ఒప్పులేనని సమర్థించుకున్నట్లు. చక్కనమ్మ చిక్కినా అందమే.కరణం పాతరలో పడి కూడా మషాకత్తు చేస్తున్నాను అన్నట్లు +అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తటపటాయిస్తూ ఉండటం, కాలి వేలితో నేల మీద గీతలు గీస్తుండటం +గతజన్మలో నోములు నోచినందువల్లనే ఈ జన్మలో మంచి ఐశ్వర్యం సుఖాలు, సౌభాగ్యాలు లభించాయని నమ్మకం. +నిర్విరామంగా తినటం. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉండటం. +అతని నొరు మూయించాలని అర్థం. అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతున్న వారిని గురించి ఈ మాట వాడతారు. +రాతపూర్వకంగా లేనిది, అంతగా విలువలేనిది ఎంతవరకు నమ్మకం? +బాగా జ్ఞాపకం ఉండటం నాలుక మీద ఆడటం, నోట్లో ఉండటం +ఎల్లప్పుడు ఏదో ఒకటి తింటు వుండే వారిని గురించి ఈ మాట పుట్టింది. +ఎక్కువగా మాట్లాడని వారిని గూర్చి ఈ మాట అంటారు. +కొంత మందికి అన్ని సక్రమంగా అమరి వున్నా వాటిని అనుభవించే అవకాసమత్రము వుండదు. అటు వంటి వారిని గురించి ఈ జాతీయాన్ని వాడుతారు. తెలుగు నాట దీనికి సమాంతరమైన ఒక సామెత ఉంది అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వుంది అని. +బాగా అల్లరి అల్లరిగా, వదరు బోతుతనంగా ఎవరైనా మాట్లాడటం ఇప్ప కాయను నోట్లో వేసుకొని నమిలేటప్పుడు ఎక్కువగా చప్పుడు అవుతూ ఉంటుంది. ఇప్పకాయ తింటున్న వ్యక్తికి నోరు తీయగా బాగానే ఉన్నా ఆ చప్పుడు మాత్రం ఎదుటివారికి వినడానికి కటువుగా ఉంటుంది. అలాగే కొంతమంది గ���లగోలగా తెగ మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడేవారికి తాము మాట్లాడుతున్నది బాగానే ఉన్నా ఎదుటివారికి మాత్రం వినసొంపుగా ఉండదు. +ఎంతో ప్రేమగా జాగ్రత్తగా అవసరాలన్నీ సమకూర్చటం. చిన్న పిల్లలకు తల్లి నోట్లో పెట్టిన ఆహారం సులభంగా లోపలికి వెళ్ళేందుకు నీరు కూడా తాగిస్తుంది. +నోట్లో మాట నోట్లోనె వుండి పోయిందేం +చెప్పడానికి ఏమి సమాధనము లేదని అర్థం. +ఒట్టి అమాయకుడని అర్థం: ఉదా: వాడు నోట్లో వేలు పెట్టినా కొరకడు. +అడిగిన దానికి సమాదానము చెప్పబోతే పెద్ద వారు చిన్న వారిని ఇలా అంటుంటారు. అనగా నోరు మూసుకో అని అర్థము. +ఎదుటివారిని భయపెట్టేది గానో, బెదిరించేదిగానో, వశీకరించుకొనే లాగా వాక్‌శక్తి ఉన్న వాడే సమాజాన్ని శాసించగలడని +అనవసరంగా దూషించటం. ఉ: అనవసరంగా నోరు పారేసు కోవద్దు. +మాటలు తియ్యతియ్యగా చెబుతూ తమ పనులను మాత్రం చేసుకెళ్ళే మాయగాళ్ళు.ఎదుటి వ్యక్తులకు బాగా ఆశలు కల్పించి వారికి కావాల్సిన పనులు చేసి పెడతామన్న భ్రమ కల్పించి నమ్మకం కుదిరేలా మాట్లాడి వారి పని అయిపోయాక మళ్ళీ కనిపించనివారు. +మాట్లాడొద్దని హెచ్చరించడం నోరు "ముయ్యి అనటం + + +తీవ్రమైన కష్టాలు చుట్టిముట్టిన స్థితి.నాలుగు దిక్కులతో పాటు నడినెత్తిన అగ్నిసెగ +ఎవరికైనా అనుకోకుండా అధిక సంపద చేకూరితే వారిని గురించి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదా: వాని పంట పండింది అని. ఇక్కడ పంట చేలు పండడము కాదు అర్థము. +పంచ పాండవులు ఎంత మంది అంటే +సమయానికి తగినట్లుగా ప్రవర్తించకపోవటం, డబ్బులన్నీ అయిపోయి ఏమీ చేయలేని పరిస్థితి. +ఉదా: వాని పంట పండింది. వానికి అన్ని లాబాలె. +అవరోదము పానకం లో పుడక లాగ అలాంటిదే ఈ జాతీయం కూడా. ఉదా: +పందిని నందిని, నందిని పందిని చేసేవాడు +ఎంతో సమర్థుడు, ఎలాంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొని విజయాన్ని సాధించేవాడు +దీనినే నిందా వాచకంగా కూడా వాడుతారు; అర్థం: మోసగాడు: ఉదా: వాడు పందిని నందిగా, నందిని పందిగా మార్చగల సమర్థుడు. +పంది ఎంత బలిసినా నంది కానేరదు +ఎన్ని పుంగునూరులైతే కూడా ఒక బెంగుళూరు కానేరదు అనే సామెత లాంటిదే ఇది కూడాను. +ఉదా: పంది లాగ తిని పని పాట లేకుండా కూర్చున్నావు. +పొరుగునే ఉన్న శత్రువు: ఉదా: వానితో జాగ్రత్త; వాడు పక్కలో బల్లెం లాంటి వాడు. ఇలాంటిదే మరో జాతీయము: దిండు కింది పాము లాగ +దారి తప్పించాడు: ఉదా: వాడు నన్ను పక్కదారి పట్టించాడు. +ఊహల���లో విహరిస్తున్నాడు: ఉదా: వాడు పగటికలలు కంటున్నాడు. +ప్రకృతిని కూడా శాసించేలా విర్రవీగటం, తన ప్రతాపాన్ని భీకరంగా ప్రదర్శించటం, అతి దుర్మార్గంగా వ్యవహరించటం +అదుపు చేయటం, ముందుకు వెళ్ళనివ్వకపోవటం. ఒక సినీ గీతంలో: పరుగులు తీసె నీ మనసునకు పగ్గం వేసెను నావయసు +అదుపు చెయ్యకపోవటం స్వేచ్ఛనివ్వడ: ఉదా పశువుల పండగ నాడు ఎద్దులకు ముకుతాడు, పగ్గాలు తీసేసి స్వేచ్ఛగా వదిలేస్తారు. +అందంగా, ఆరోగ్యంగా ఏ బాధలూ లేకుండా ఉండడం; ఉ మీకాపురం చల్లగా పచ్చగా కలకాలం వుండాలని అశీర్వదిస్తారు. +చీకు చింత లేని కాపురం: ఒద్దికైన కాపురం +పక్షికి వచ్చిన కష్టం, బాధ, ఆపద. రావణుడిని జటాయువు ఎదిరించి చావు దెబ్బలు తింది. +విభేదాలు, వైషమ్యాలు, విరోధాలు తీవ్రస్థాయిలో ఉండటం. +పచ్చి వెలక్కాయ చాల వగరు. తింటే గొంతు పట్టేస్తుంది. అనగా మాట పెగలదు. ఏదైనా చెప్పాలను కున్నప్పుడు మాట పెగలక అవస్త పడు తుంటే ఈ మాటను ఉపయోగిస్తారు. +వివరణ: అతనికి నిజం తెలుసు. కాని చెప్పలేడు. చెప్పితే చాల గొడవలౌతాయని చెప్పలేక పోతున్నప్పుడు ఈ మాట అంటారు +విర్ర వీగు తున్నాడు: ఉదా: వాడు పట్ట పగ్గాల్లేకుండా విర్ర వీగు తున్నాడు. +అన్ని పనులు సక్రమంగా జరిగి అన్నింట్లో లాభం వస్తుంటే ఇలా అంటారు. ఉదా: వానికేం? వాడు పట్టిందల్ల బంగారమె. +ఉదా: ఇప్పటికి ఈ పనిలో పట్టు దొరికింది. +ఉదా: ఎలాగైనా దీనిలో పట్టు సాధించాలి. +ఉదా: దేనికైనా పట్టు విడుపు వుండాలి. ఇద్దరి మధ్య వాదనలు జరిగే టప్పుడు ఇద్దరు ఎవరికి వారు మొండి పట్టుదలతో వాదిస్తుంటే వ్యవహారం తెగదు. ఇద్దరిలోను కొంత సడలింపు వుండాలి. ఆ సందర్భంగా చెప్పేదే ఈ జాతీయం. ఇదే అర్థంతో మరొక జాతీయం ఉంది. అది తెగిందాక లాగకు +గట్టి పట్టుదల కలవాడు: ఉదా: వాడు పట్టు వదలని విక్రమార్కుడు: ఏపనినైనా పట్టుకున్నాడంటే దాని అంతు చూడంది వదలడు. +ఉదా: వానికి పట్టుమని పదేండ్లు లేవు వాని మాటలు చాల దూరం పోతున్నాయి. +నష్టపోవటం ఎలాంటి అభివృద్ధి లేకుండా స్తబ్దంగా ఉండిపోవటం +పూర్తిగా నిమగ్నం కావటం, ఒక విషయాన్ని గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉండటం, ఒకరి ప్రభావంలో పూర్తిగా ఉండిపోవటం +మరీ మరీ అంత దూరాన్నుంచి నీకోసం పడీ పడీ వచ్చాను. నువ్వంటే పడీ పడీ చస్తాలే, పడీపడీ నవ్వకు లాంటి ప్రయోగాలు. +తనకే మాత్రం కష్టనష్టాలు కలగకుండా ఎదుటివారి చేత పని చేయించుకోవటం, ఆ కష్టనష్టాలేవో ఎదుటి వ్యక్త���లు పడతారని, తాను మాత్రం హాయిగా ఉండవచ్చని అనుకోవటం . +ఎవరైనా దుర్మార్గంగానీ, అన్యాయంగానో ప్రవర్థిస్తుంటే వారిని అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో ఈ జాతీయాన్ని వాడుతుంటారు ఈసారి ఎలాగైనా వాడి పని పట్టాలి అని. అనగా వాడిని అదుపులో పెట్టాలని అర్థము. +నీమాట ఇక్కడ చెల్లుబాటు కాదు అని చెప్పటం: ఉదా నీపప్పులు ఇక్కడ వుడకవు'' +తప్పు చేశాడు: ఏదైనా తప్పు చేస్తే పప్పులో కాలేశావు అని అంటారు. +పని జరిపించు కున్నాడు: ఉదా: వాడు ఎలాగోలా పబ్బం గడుపు కున్నాడు. +విషం నింపిన కుండ (కుంభం) విషకుంభం. దాని ముఖంలో (పైభాగాన) పయస్సు (పాలు) పోసి ఉంచితే అది పయోముఖమవుతుంది. మనసులో విషం పెట్టుకుని పైకి తియ్యని మాటలు మాట్లాడేవాళ్లని పయోముఖ విషకుంభము అంటారు. +చింపివేయటం పరపర అనేది వస్త్రం, కాగితం లాంటివి చింపేశారు అని చెప్పటానికి అలా పరపరా చింపేస్తే ఆ వస్త్రం ఇంక దేనికీ పనికి రాదు అని +అంతా కాలి పోయింది అని అర్థం: ఉదా: వాని ఇల్లు పరశురామ ప్రీతి అయ్యింది. +చెప్పిన పని చెప్పినట్లుగా చేయని అవివేకులు +ఏదైనా అగ్నికి ఆహుతి ఐతే ఈ సామెతను వాడుతారు +అమాయకమైన వారినుద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు పరమానందయ్య శిష్యులు అమాయకులు గనుక) +ఉదా: ఇది పరాచికాలకు సమయం కాదు. +ఇతరుల మీద ఆధార పడి బతికే వాడు. +జాగ్రత్తగా గమనిస్తున్నాడని అర్థం: ఉదా వాడు పరికించి చూస్తున్నాడు. +నిజార్థంలో పరిగిలేరడం" అంటే వరి పైరు కోసిన తర్వాత ఆ పొలంలో విరిగి రాలి పోయిన వరి కంకులను ఏరుకోడానికి కొంత మంది బీద వారు వస్తారు. దానిని పరిగెలేరడం అని అంటారు. అదేదో ఆ పూటకు కూడా గడవని బీద వారు చేసే పని. అన్ని ఉం డి కూడా ఇతరులను యాచించే వాడిపై ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +వెంపర్లాడు తున్నారు: ఉదా: ఈ రోజుల్లో ప్రజలు అన్నింటికి పరుగులు తీస్తున్నారు. +యుక్త వయస్సు అని అర్థం. ఒక పాటలో పద ప్రయోగము: పరుగులు తీసె నీవయసునకు పగ్గం వేసెను నామనసు. +సాంద్రత కోల్పోవటాన్ని పలచబడటం అంటారు. పాలు లాంటి పదార్థాలు చిక్కగా ఉన్నప్పుడు మంచివన్నది భావన. నీళ్ళు కలిసి పాలు, మజ్జిగ లాంటివి పలచగా మారినప్పుడు వీటి విలువ కూడా తగ్గుతుంటుంది.మనిషిలోని శక్తి, పరపతి, పరువు పోయినప్పుడు చేయకూడని పనిచేసినపుడు పదిమందిలో పలచన ఔతాడు. +మాట మార్చటం బాణీ మార్చటం ఒకసారి ఈ పనిచేస్తాను అని చెప్పిన మాటను మర్చిపోయి లేదా నిర్లక్ష్యంగా వ్���వహరించి చేయకుండా అవకాశవాదంగా వ్యవహరించటం. +అమాయకుడు అని అర్థము. అమాయకుల గురించి ఈ సామెతను వాడుతారు. +విపరీతంగా ఉక్రోషం, క్రోథం, కోపాన్ని ప్రదర్శించటం +కనిపెట్టేశాడని అర్థం. ఉదా: ఎంత రహస్యంగా చేసినా వాడు పసి గట్టేశాడు. +పండిన చెట్టు మీదనే బండలు పడేది +కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. చెట్టుమీద పండ్లు వుంటే దారిన పోయే పిల్లలు పండ్ల కొరకు రాళ్ళను విసురుతారు పండ్లు లేని చెట్టుపైకి ఎవరూ రాళ్ళు విసరరు. +వేచిన పధకం ఫలించిందని అర్తం. ఈ విషయంలో వాని పాచిక పారింది. +ఎప్పుడూ ఎంతో కొంతైనా ఉండేది. తరగని సంపద, ఎప్పుడైనా, ఏ కాలంలోనైనా అందుబాటులో ఉండే భాగ్యాలు ఏ సమయంలో కావాలన్నా కొద్దోగొప్పో తీసుకొని వాడుకోవటానికి అవకాశం ఉండేది. +బాగా స్థిరపడటం ఉదా: వాడు ఒట్టిచేతులతో వచ్చాడు; ఇప్పుడు బాగా పాతుక పోయాడు. +విపరీతమైన తాగుబోతు. వాస్తవానికి ఇది ఎంతో పవిత్రంగా భావించుకొనే మంగళగిరి నరసింహస్వామిని సూచించే నామం. ఆ స్వామికి ఎంత పానకం పోసినా కడుపు నిండదు. ఎంత తాగినా తనివి తీరని తాగుబోతుల్ని సూచించే పదంగా మారిపోయింది. +లేకపోయినా ఉందన్నట్టు చెప్పటం. పాముకు ఇతర జంతువుల లాగా కాళ్ళు ఉండవు. అది పొట్ట సాయంతో ముందుకు పోతూ ఉంటుంది. పాము ముందుకు పోతోందంటే దీనికీ కాళ్ళు ఉండే ఉంటాయి అనుకోవటం పాముకాళ్ళ వ్యవహారంలాంటిది. +వాడు పాముచెవులవాడు అనగా వాడు మనసులోని మాటను కూడా పసిగట్టగలడని అర్థం. +ఒక పద్ధతి ప్రకారం కాక వంకర టింకరగా అడ్డదిడ్డంగా నడిచే తీరు, వక్రత +కాసేపు ఇటు, కాసేపు అటు ఉంటూ సరిగా న్యాయం చెప్పని వాడు +చివరిగట్టుదాకా పూర్తిగా చూడటం: నిశితంగా చూడడము: ఉదా: వాడు తేరి పార జూస్తున్నాడు +పనికిరాని వారిని సయితం గౌరవించాల్సి రావటం. కావడిలో ఒక వైపే బరువుంటే మోయడం కుదరదు. సమతూకం కోసం ఓవైపు బండరాయిని పెట్టుకోటం. +డబ్బులున్నప్పుడు మాత్రమే భోగాలనుభవించటం.దాపుడుగుడ్డలు కట్టుకోవటం, విత్తనాలగింజలు వండుకుతినడం లాగా.పాశాన్ని వండటానికి పాలు కావాలి. పాలు కూడా కొనలేని స్థితిలో ఉన్నవారికి పాశం వండుకోవటం అంటే కచ్చితంగా భోగమే. +శుభ సూచికం.పాలు చాలా వేగంగా పొంగుతాయి. పాలు పొంగినంత త్వరగా ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందాలన్న ఆకాంక్షతో గృహ ప్రవేశ సమయాల్లో పాలను పొంగిస్తారు. +విపరీతంగా పీడించటం, బాధించటం ఉదా: వీరు పిల్లలు గారు పిడుగులు: నాప్రాణ��లు తోడేస్తున్నారు. +కష్టాలు తెచ్చుకున్నాడని అర్థం: వాడు చేయరాని పనిచేసి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు. +అధికంగా బాధించడం బాగా పిండి రసమంతా తీసేసి పిప్పిచేయటం +చిన్నవయసులోనే ఎక్కువ విజ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను సంపాదించుకొన్న వాడు. +సంస్కారం లేనివాడు, అమాయకుడు పది మందిలోనూ కలిసిమెలిసి తిరిగే అర్హత లేని వాడనే భావం +ఉదా: వాడొట్టి పిచ్చి మాలోకం: వాడిని పట్టించు కోకు. +ఓ గమ్యం కానీ, లక్ష్యం కానీ ఏదీ లేకుండా కొన్నిసార్లు ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టే విషయం. మతి స్థిమితం లేని వ్యక్తికి స్థిర లక్ష్యం ఉండదు. అతడి చేతిలోని రాయి ఎదురుగా ఉన్న మరిదేనికైనా తగిలి నష్టం కలగొచ్చు. +అన్నీ ప్రగల్భాలే .విన్నవారికి పనులు చేయటం సాధ్యం కాదని తెలిసిపోతూనే ఉంటుంది పిట్టలదొర ఇది తెలుగునాట జానపద వేషము. పిట్టలదొర ఉట్టొట్టి ప్రగల్పాలు చెప్పి పొట్టపోసుకుంటుంటాడు. ఆ విధంగా పుట్టినది ఈ సామెత. +వూహించని విధంగా క్షణాల్లో నష్టం సంభవించటం. ఉ: ఈ వార్థ వానికి పిడుగు పాటుతో సమానం: +పూర్తిగా నాశనం చేయటం. చెరకు గడను గానుగలో పెట్టి ఆడించినా దాని సారాన్నంతా పీల్చినమిలేసినా పిప్పే మిగిలేది. +ఇంట్లో ఉన్న వారంతా, ఇంటిల్లిపాదీ, కుటుంబ సభ్యులంతా .పూర్వం మేకలు, కోళ్ళు, గేదెలులాంటి వాటిని పెంచుతూ వాటిని కూడా ముద్దు ముద్దు పేర్లతో ఇంట్లో మనుషులలాగానే ప్రేమతో పిలుస్తుండేవారు. ఒక వేళ వాటిని విడిచిపెట్టి రాలేక పోతే వాటితో సహా రావచ్చు పిల్లా మేకతో సహా రండి, ఏం అభ్యంతరం లేదు అనేవారు. +ప్రత్యేక స్థానం కల్పించటం పెద్దపీట వేయటం, అగ్ర తాంబూలం ఇవ్వటం ఎంతో గౌరవాన్నిచ్చి ఆహ్వానిస్తున్నట్టు లెక్క. +ఆగర్భ శత్రుత్వం, సహజ శత్రుత్వం పిల్లి కంటబడ్డ ఎలుక ఎంత మంచిదైనా, ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నా పిల్లి దాన్ని చంపి తీరుతుంది. ఎలుక తననేమీ చేసినా, చేయకపోయినా పిల్లి ఎలుక ప్రాణాన్ని తీస్తుంది. +తగని సాక్ష్యం, సముచితంగా లేని సాక్ష్యం. పిల్లి, ఎలుక రెండూ పుట్టుకతోనే వైరం ఉన్న జంతువులు, అటువంటప్పుడు పిల్లిని సమర్థిస్తూ ఎలుక వచ్చి సాక్ష్యం చెప్పిందంటే అది ఎంత వరకూ సమంజసమో ఎవరైనా వూహించవచ్చు +పిల్లి నడిచేటప్పుడు చప్పుడు రాదు. ఆ విధంగా చప్పుడు కాకుండా వచ్చేవారినుద్దేశించి ఈ సామెతను వాడుతారు. +మహాపిసినారి ఎవరినీ ఏ ఒక్క రోజున కూడా పిలిచి బిచ్చం పెట్టలేదట. ��లా పిలిచి బిచ్చం పెట్టకపోవటమే పిల్లికి బిచ్చం పెట్టనివాడు అనే రూపంగా మారింది. +మార్జాల కిశోర న్యాయం అంటారు. పిల్లి తన పిల్లలను నోట కరచుకొని తాను ఎక్కడికి వెళితే అక్కడికల్లా వాటిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి రక్షిస్తూ పెంచుతుంటుంది. +పిల్లి పిల్లలను పెట్టిన తర్వాత వాటిని చాలా చోట్లకు మారుస్తుంటుంది. అలాగే ఒకచోట స్థిరంగా ఉండక ఎప్పుడూ ఇళ్ళు మారుతుండే వారిని పిల్లి సంసారంలా ఎప్పుడూ ఇళ్ళు మారుతుంటారు అంటారు. +పూర్తిగా మునిగిపోవటం. నష్టపోవటం, కష్టాల పాలు కావటం గొంతుదాకా మునిగిన వాడు ఇక పూర్తిగా మునిగిపోవటం జరుగుతుందన్నది భావన. +చాల కష్టాలలో వున్నాడని అర్థం: ఉదా: వాడు పీకల్లోతు కష్టాలలో మునిగి ఉన్నాడు. +ఉదా: వానికి ఒక చిన్న పని చెప్పాను. దానికి వాడు పీకి పందిరేశాడు. +ఉదా: ఎందుకురా వాన్ని అలా పీక్కొని తుంటావు వదెలెయ్. వాడి పాపాన వాడే పోతాడు. చాల బాధించడమని అర్థము. +అడ్డంకులు కలిగాయి అని అర్థం: ఉదా: వాడు చేస్తున్న పనికి పీట ముడు పడింది. +అంతా తెలివిలేని పనికిమాలినవాళ్ళే చేరిన కార్యాలయం +కష్టాలలో ఉన్నవారిని మరింత కష్టాలపాలు చేయడం. పుండు మీద కారం చల్లితే ఇంకాస్త మంటెక్కువైతుంది. +కంఠతాపట్టటం, గడగడా చెప్పేయటం/ ఉ: వాడు పాటాలన్ని పుక్కిట పట్టేశాడు. +లేని విషయాలు ఉన్నట్టు చెప్పటం. ఉదా: నీ పుక్కిటి పురాణాలు ఇక్కడ వినేవారెవ్వరు లేరు. +నోటిలో నీళ్ళు పోసుకొని గళగళ తిప్పడం +వర్షాకాలంలో ఊసుళ్ళు పుట్టలోనుండి ఏకదాటిగా వస్తుంటాయి. ఆ విధంగా జనము ఎక్కువగా వస్తుంటే పుట్ట పగిలినట్టు ఒకే జనం వస్తున్నారు అని ఈ జాతీయాన్ని వాడుతారు. +వాని పని అయిపోయింది: ఉదా: వాని పుట్టి మునిగింది. పాప వాని పని అయి పోయింది. +తెంచటం, తుంచటం. టుపుక్కున, చంపటం. శిశువులను, పురిటిలోనే పుటుక్కుమనిపించే దుర్మార్గం చంపటం. +అసలు ఏమీ వినిపించని స్థితి .పుట్టుకతోనే వచ్చిన చెవుడు, ఏ వైద్యానికి చికిత్సలకు నయం కాని చెవుడు.ఎంతగా అభ్యర్థిస్తున్నా విన్నవించుకొంటున్నా బాధలను, రోదనలను వినిపించుకోని వారిని పుట్టు చెవుటోడి తీరు అంటారు. +నీ పుట్టు పూర్వోత్తరాలు నాకు బాగా తెలుసు అని అంటుంటారు. అనగా నీ జాతకమంతా నీవ్వవహారమంతా నాకు బాగా తెలుసు అని అర్థము. అ సందర్భంగా ఈ జాతీయాన్ని వాడుతారు. +అప్పుచేసి పప్పుకూడు అప్పుతో భోగభాగ్యాల్ని అనుభవించటం +చాల తెలివైన వాడని అర్థం. ఉదా: వాడు పొట్టోడైనా వానికి పుట్టెడు బుద్ధులున్నాయి. +అన్ని కష్టాలను తట్టు కున్నాడు: ఉదా: పాపం వాడు పుట్టెడు దుఖాన్ని దిగమింగి ఉన్నాడు. +కోరి కష్టాలు తెచ్చు కున్నాడని అర్థం: ఉదా వాడు ఊరుకోకుండా పుట్లో వేలు పెట్టాడు. కష్టాల్లో ఇరుక్కున్నాడు. +అసలు విషయం బయట పడు తున్నది: ఉదా వారి పునాదులు కదులుతున్నాయి. అసలు విషయం ఇప్పుడు బయట పడుతుంది. చూస్తూ వుండండి. +ఉసి గొల్పడం: ఉదా ఎందుకు రా వాన్ని అలా పురి గొల్పుతావు వాడి మీదకు? +సంధి అనేది ఒక వ్యాధి. ఇది ఇచ్చినవారు, బ్రతకరు. ఈ వ్యాధి వృద్ధాప్యంలో వస్తుంది సంధి' అనగా మతి చెలించడం. ఈ వ్యాధి పురిటి బిడ్డకు (అప్పుడే పుట్టిన బిడ్డకు) వస్తే కష్టం. పని ప్రారంభించగానే ఆ పనికి విఘ్నం కలిగి ఆగిపోయే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +కార్యోన్ముఖుల్ని చేయటం, బాగా ప్రోత్సహించటం .గట్టిగా పేనటాన్నే పురిపెట్టడం అంటారు. +ఒక్కో మనిషి బుద్ధి ఒక్కొ విధంగా వుంటుందని అర్థం. +అధికంగా సంతోషం కలగటం, ఆనందం అతిశయించటం, గగుర్పాటు చెందటం, శరీరం మీద వెండ్రుకలు నిక్కపొడుచుకోటం +ఉదా: జాగ్రత్త వానితో తలపడటమంటే పులితో చెలగాట మాడటమె. +చాల ప్రమాదకరమైన పనిచేస్తున్నావని అర్థం. ఎవరయినా ప్రమాధకరమైన ప్రని చేస్తుంటే హెచ్చరికగా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. +చాల పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నావని అర్థం. +చాల ప్రమాదంలో ఉన్నాడు అని అర్తం. ఉదా వాడు పులిమీద స్వారి చేస్తున్నాడు. దిగనంత వరకు వాడు చాల గొప్ప వాడు. దిగితే పులి వాడిని తినేస్తుంది. దిగ కుండా వుండ లేడు. +చిన్నవాడు పెద్దవాడిని నిరోధించగలిగాడు అని. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ అని .నీటి ప్రవాహం ఒక్కసారి చిన్నపుల్ల అడ్డుపడ్డా ముందుకు వెళ్ళక ఆగిపోతుంది. కనుక అధిక ప్రమాణంలో ఉన్న నీరు అల్ప ప్రమాణంలో ఉన్న పుల్ల అడ్డు తగిలి ఆగిందని అర్థం +ఎదుటి వారికి బాధ కలిగించే తీరులో మాట్లాడటం పెడసరంగా మాట్లాడటం లేక ప్రవర్తించటం పుల్ల విరిచినప్పుడు ఫెళ్ళుమని శబ్దం వస్తుంది. విరిగిన పుల్ల అతుక్కోదు.పుల్ల విరిగిన శబ్దం వినటానికి ఇంపుగా ఉండదు. +తగాదా రావటం గంగిరెద్దుల వాళ్ళలో తీర్పు కోసం ముందుగా ఒక వ్యక్తి కులపెద్ద దగ్గర కొచ్చి తనకు ఏ వ్యక్తితో తగాదా వచ్చిందో చెప్పి కులపెద్దకు ఒక పుల్లను విరిచి ఇస్తాడు. కులపెద్ద అవతల వ్యక్తిని రమ్మని కబురు పెడతాడు. ఆ వ్యక్తి కూడా తగాదామాట వాస్తవమేనని ఒక పుల్లను విరిచి ఇస్తాడు. అలా ఇద్దరూ పుల్లలు విరిచి ఇచ్చాక కులపెద్ద న్యాయ విచారణ చేస్తాడు. +కొట్లాటకు ఉసి గొల్పడం: ఉదా వాడు పుల్లలను ఎగదోసి వారి కొట్లాటను మరింత పెద్దది చేసి తమాష చూస్తున్నాడు. +అతి జాగ్రత్తలకుపోయి తప్పులో కాలెయ్యటం.తప్పులు చేయకూడదను కొంటూనే తప్పులు చేయటం.పులి విస్తరి, పుల్లాకు అంటే ఎంగిలాకు.ఒకడు ఎంతో జాగ్రత్తగా నడుచుకొంటూ ఏమీ తొక్కకుండా వెళ్ళాలని అనుకుంటూ మట్టికుప్ప మీద నుంచి ఎగిరి అవతలికి దూకి ఆ పక్కనే ఉన్న పుల్లాకుల మీద పడ్డాడట. +అభద్రతా భావం పెరగటం, విభేదాలు కలగటం ఇరుసు నుంచి చక్రం విడిపోకుండా ఇనుప సీల ఒకటి ఉంటుంది. అయితే ఈ సీల ఒక్కోసారి అనుకోకుండా ఊడిపోయి బండి, చక్రం విడిపోయి ప్రమాదం సంభవిస్తుంది. అప్పుడు విరిగిపోయి ఊడి పోయిన ఆ సీల ప్రదేశంలో తాత్కాలికంగా ఏదో ఒక పచ్చి పుల్లను పెట్టి బండి నడుపుతుంటారు. అయితే ఇనుప సీల ఉన్నప్పటిలా పుల్ల ఉన్నప్పుడు బండిని వేగంగా తోలరు. పుల్ల విరిగి పోతుందన్న అభద్రతా భావంతో నిదానంగా నడుపుతుంటారు. ఇలా సీల స్థానంలో పుల్ల వచ్చిన స్థితే పుల్లసీల పుట్టటం. సీల సిలగా అయింది. +అసంభవం, సాహసోపేతం, ఆశ్చర్యకరం. అసాద్యమైన పని అని అర్థము. పులిని గొర్రె కరవడము అసాధ్యము. అలా అసాధ్యమైన దానిని పోలికగా చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. +సాహసోపేతమైన చర్య, అదుపు తప్పితే అపాయం కలిగేపని. వివరణ: పులి మీద స్వారి చేస్తుంటె చాల గర్వంగా వుంటుంది ఎందుకంటే అది ఎవరూ చేయలేని పని. కాని పులి మీద అలా స్వారి చేస్తూనె వుండాలి. దిగాఢంటే పులి వాడిని తినేస్తుంది. అలాగని వాడు దిగ కుండా ఎంతకాలమని పులి మీద ఉండగలడు?. +అత్యంత ప్రమాద భరితమైన చర్య పులి నోట్లో తల పెట్టటం లాంటిదే ఇది కూడా. +ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా పోవటం .పులుసులోకి అనేక రకాల కూర ముక్కలను తరిగి వేస్తే ఆ ముక్కలన్నీ పులుసులో ఉడకక ముందు విడివిడిగా గుర్తించటానికి అవకాశం ఉంటుంది. ఉడికాక వాటికి గుర్తింపు అంతగా ఉండదు. అన్నిటినీ కలిసి పులుసే అంటారు. కొన్నిపనులు కోసం విడిగా ప్రత్యేకంగా దాచిన డబ్బు లెక్కలు సరిగా రాసుకోకుండా ఖర్చు చేస్తే ఆ సొమ్ము ఏది ఎక్కడ నుంచి ఎంత తీసి ఖర్చు చేసిందీ అంతు పట్డదు. అలాంటి సందర్భాల్లో సొమ్మంతా పులుసులో కలిసినట్టయింది. ఆ ఖర్చుకు ��� ఖర్చుకు అంతా అయిపోయింది అంటారు +పుండు మీద కారం చల్లి నట్లు +ఉదా వాని మాటలు వింటుంటే నాకు పుండు మీద కారం చల్లి నట్లుంది. పుండు మీద కారం చల్లితే బాధ మరికొంత ఎక్కువవుతుంది. అలా బాధ పడేవారిని మరికొంత బాధకు గురిచేస్తే ఈ మాటను వాడుతారు. +అతి స్వల్పమైనది: ఉదా వాడు పూచికపుల్లంత పని కూడా చేయడు. +ఏమి ఇవ్వను: ఉదా: నీకు పూచిక పుల్ల కూడా ఇవ్వను: ఏం చేసుకుంటావో చేసుకో +సంపన్నత. తంగేడు మొక్క పూలు ఆ మొక్క నిండా ఒక్క ఆకు కూడా కనిపించని తీరులో విరగ పూస్తాయి. కలవారి ఇంటి ఇల్లాలు ఒంటినిండా నగలు అలంకరించుకొని మితి మీరిన భోగభాగ్యాలతో ధన ధాన్యాలతో విలసిల్లటం. సిరి సంపదలతో తుల తూగు తున్న సంసారాన్ని పూచిన తంగేడు అనిఅంటారు +మాట మీద నిలకడ లేని వాడు: ఉదా వాడు పూటకో మాట చెప్పి పబ్బం గడుపు కుంటున్నాడు. +సరిదిద్దుకోవటం .గుంతలు, పల్లాలు ఉన్న మార్గంలో లోతుల్ని పూడ్చి దోవంతా సరిదిద్ది ప్రయాణం సుగమంచేయటం.లోటు పూడ్చుకోవటం +పూత అంటే మాట మాటలు చెప్పిన దానికన్నా లిఖిత పూర్వకంగా ఇచ్చిందే ఏనాటికైనా మేలు అని అని అర్తం. నోటి మాటలు ఎప్పుడైనా, ఎన్నైనా చెప్పొచ్చు. ఇప్పుడని మరికాసేపటికి నేనలేదని తప్పించుకోవచ్చు. కానీ కాగితం మీద రాసి ఉంటే మాత్రం దాని తర్వాత ఎప్పుడైనా రుజువుగా చూపించవచ్చు. ఏ విషయంలోనైనా రుజువులు, సాక్ష్యాలు కావాలన్నప్పుడు నోటి మాటకాదూ ఏదైనా రాసిన కాగితాలుంటే తీసుకురా అని పూత కన్నా రాత మేలు అంటారు. +అదృష్టం ఉదా వానికి అంతా కలిసి వచ్చింది> అదంతా వాని పూర్వ జన్మ సుకృతం. +సుఖప్రథమైనది: ఉదా: వాని జీవితమే ఒక పూల పానుపు. చాల సుఖంగా ఉన్నాడు. +అన్ని పనులు సక్రమంగా జరిగితే ఈ మాట వాడతారు. +ఎప్పుడు టింగు రంగా అంటూ సరదాగా తిరిగేవాడని అర్థము +ఒక వరుసక్రమంలో చెప్పటం పూసలను దండగా గుచ్చేటప్పుడు ఏ పూస పక్కన ఏది బాగుంటుందో చూసి ఓ పద్ధతి ప్రకారం గుచ్చుతుంటారు. విషయాన్నంతా చక్కగా పూస గుచ్చినట్టు వివరించి చెప్పటం +ఉదా: వానికి పూస గుచ్చి నట్లు చెప్పాను వానితో తగువులకు వెళ్లొద్దని. ఇప్పుడు చూడు ఏమయ్యిందో? +ఉదా: వారిద్దరు రాసుక పూసుక తిరుగు తున్నారు కలిసి మెలిసి వుండడము) +గొప్పగా భోజనాలు పెట్టినా ఇంతేనా అని నసగటం. మేలు చేసినవారు మేలు పొందిన వారి నుంచి మాట పడటం. +చెప్పిన మాట వినలేదని అర్థం: ఉదా వాడు నామాటను పెడ చెవిన పెట్టాడు. ఇప్పుడు చూడు ఏమైందో? +వక్ర మార్గం పట్టించాడు: ఉదా: వాడు నన్ను పెడ త్రోవ పట్టించాడు. లేకుంటే ఈ పని ఎప్పుడో అయిపోయేది. +తన స్వార్థం కోసం సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని స్తుతించటం లేదా నిందించటం. +మనసులోని మాట బహిర్గతం కావటం అంతర్గత ఆలోచనలు బయటకు రావటాన్ని పెదవి దాటటం అంటారు +నాయకుడు లేదా అధినేత కష్టాలపాలై అతడి అనుచరులు ముందుకు సాగలేని స్థితి. పెద్దగొడ్డలితో ముందు చెట్టుకు గాటుపెట్టి ఆ తర్వాత చిన్నగొడ్డళ్ళతో ఆ గాటును పెద్దది చేస్తూ చెట్టు నరకుతారు. పెద్దగొడ్డలినొక్కు పడిపోయి నిరుపయోగమైతే చిన్న గొడ్డళ్ళున్నా పెద్దగొడ్డలి చేసే పనిని అవి చేయలేవు. +ఉదా: పనంతా అయి పోయాక ఇప్పుడు పెద్ద చెప్పొచ్చాడు? +ఉన్నది అని చెప్పటమేగానీ ఎప్పుడూ ఎవరూ చూడనిది, ఎవరి అనుభవంలోనికి రానిది. పెదగంగ అంటే ఆకాశగంగ అని అర్థం. అది స్వర్గలోకంలో ఉంటుంది అని చెబుతారు. భూమ్మీద మరణించి స్వర్గానికి వెళ్ళిన పుణ్యాత్ములు, దేవతలు ఆ ఆకాశగంగలో స్నానం చేస్తారట. ఆ నదిలో బంగారం తామర పువ్వులు ఉంటాయని కూడా అంటారు. ఆకాశంలో కనిపించే పాలపుంతే ఆ పెదగంగ, లేదా ఆకాశగంగ అని కూడా చెబుతుంటారు. నిజంగా ఆ ఆకాశగంగలో నీళ్ళున్నాయా? బంగారు పద్మాలున్నాయా? అని తేల్చి చెప్పిన వారు, నిరూపించిన వారు ఎవరూ లేరు. ఏదైనా ఓ విషయం జరిగింది అని చెప్పటానికి రుజువులు, సాక్ష్యాలు ఏవీ లేకపోయినా, అది జరిగింది అని చెప్పటం, అదేదో ఉంది అని అనటం అవును కాదు అని నిగ్గు తేల్చటం ఎవరి వల్లా కాదు. +చిన్నవారిని తరచూ విసుక్కోవటం, లెక్క చేయకపోవటం. కుటుంబంలో సంతానంలో పెద్దవాడైన వ్యక్తి తన తర్వాత పుట్టిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళలాంటి వారిని అదుపు చేయటానికి ప్రయత్నిస్తుంటాడు. చిన్నవారేదైనా చెప్ప బోతుంటే వారికేమీ తెలియదని, తనకే అంతా తెలుసునని వాదించి కూర్చోబెడుతుంటారు. కొందరు అధికారులు తమ కిందిస్థాయి ఉద్యోగులు ఏది చెప్పబోతున్నా వినిపించుకోకుండా, లెక్క చేయకుండా కూర్చోమంటుంటారు. అలాంటి వారిది పెద్దన్నయ్య పోకడ అంటారు. +పెద్దరికం తండ్రి తరువాత పెద్ద కుమారుడు (పెద్దన్న) కు మళ్ళీ అంతటి స్థానం . +ప్రముఖమైన పాత్ర అని అర్థం: ఉ ఇతడు ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. +పెద్దపులి కేవలం తన కంటికెదురుగా ఉండే వాటిని మాత్రమే చూడగలదు. అటు పక్క, ఇటు పక్క ఏం జరుగుతున్నా అది గమనించలేదు. అదే తీరులో కొంతమంది తమ కళ్ళెదుట జరుగుతున్న విషయాల్ని తప్ప, వాటికి సంబంధించిన ఇతర విషయాల్ని గ్రహించే స్థితిలో ఉండరు. +అసాద్యమైన విషయమని అర్థము. పెద్ద పులి పాలు తేవడం అసాద్యం గనుక. అసాద్యమైన ప గురించి చెప్పాలంటే ఈ సామెతను ఉపయోగిస్తారు. +ఉదా: వాడొచ్చి ఈ విషయాన్ని పెడదారి పట్టించాడు./ +శక్తి మంతమైంది, శక్తినిచ్చేది, శ్రేష్ఠమైనది.పెన్నేరు అంటే అశ్వగంధం. దీన్ని ఒంట్లో బలం చేకూరేందుకు చూర్ణంగా వాడతారు. +పెళ్ళి వారు చాల నిదానంగా నడుస్తారు. అలా నడిచే వారినుద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు. +వివరణ పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగి పెట్టిందట ఇది ఒక సామెత. అల్పునకు అధికారం ఇవ్వకూడదు అనే సందేశం ఇందులో వున్నది కొన్ని సామెతలలో సగ భాగాన్ని మాత్రమే వాడు తుంటారు. అలాంటివి జాతీయాలు ఈ ప్రయోగం అన్ని సందర్భాలలో కుదరదు. అరుదుగా కొన్ని సామెతలలో కొంత భాగం జాతీయాలుగా వాడ బడు తుంటాయి) +పైకి భయం నటిస్తూ ఎదుటివారిని మోసం చేసి తమ పని తాము చేసుకువెళ్ళే మోసకారితనం. పెయి అంటే శరీరం గుబులు లేదా బుగులు అంటే భయం అని అర్థం. శరీరం అంతా భయకంపితమవుతున్న స్థితిని పెయిబుగులు అని అంటారు. ఓ రంకులాడి తన భర్తను చూసి విపరీతంగా భయం నటిస్తూ ఉండేదట. ఆ భర్త అంటే ఆమెకు అమ్మో ఎంత భయమోనని అందరూ అనుకుంటూ ఉండేవారట. అలా భయపడుతున్నట్టు నటిస్తూ ఇద్దరు మగవారిని ఇంటి వెనుకకు రమ్మని సైగ చేస్తూ వారితో ఆనందించేదట. +ఎంతో ఆత్మీయత, అనుబంధం ఉంది. పెరుగు వ్యాపారం చేసేవారి దగ్గర పెరుగును కొలిచి అమ్మేందుకు కొలమానంగా ఒక గురిగి (మట్టిపాత్ర) ఉండేది. పెరుగు వ్యాపారం చేసే సందర్భాలలో ఒక్కోసారి అజాగ్రత్తగానో, మరొకలాగానో పెరుగుతో నిండిన గురిగి కిందపడి పగలటం జరుగుతుండేది. అలా పగిలినప్పుడు పెరుగు పోయినందుకు కాదు కానీ, ఎంతోకాలంగా అలవాటై తనది అనుకున్న గురిగి పగిలిపోయినందుకు పెరుగు అమ్మేవారు బాధ పడుతుండేవారు. ఆ గురిగి చాలా కాలం నుండి తన దగ్గరే ఉన్నందువల్ల, వ్యాపారానికి ఉపకరించినందు వల్ల దానిమీద ఒక మమకారం ఏర్పడి ఉంటుంది. దాంతో గురిగి పగిలిపోయినందుకు ఎంతగానో మనసులో బాధ కలుగుతుంది. +ఏ విషయాన్నైనా చక్కగా అస్వాదిస్తున్నప్పుడు మధ్యలో కలిగే అవాంతరం.పని సక్రమంగా జరుగుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా వచ్చి ఆ పనిని చెడగొట్టడం.చాలా రుచిగా ఉన్న పెరుగును ఇష్టపడి తింటున్నప్పుడు దానిలో ఓ రాయిత���ిలితే ఎలా ఉంటుందో అలా. +ఇష్టం లేదని/ అబద్దమని అర్థం: అన్నంలోనో కూరల్లోనొ వచ్చినట్లు పెరుగులో రాళ్లు రావు. అలా అన్నాడంటే వడ్డించే వారిమీద ఇష్టంలేదని లేదా అబద్ధం చెపుతున్నడని అర్థం. +అత్యంత అస్థిరాలు ఏమాత్రం కొద్దిపాటి గాలి వీచినా అది కూలిపోయే స్థిరంగా లేని విషయాలు +సంతతి, సంతానం. పేగుబంధం సంతానం అనుబంధం రక్తసంబంధ అని అర్తం. +చాల బాధగా వున్నదని అర్థం ఉదా: వాని మాటలు వింటుంటే నాకు పేగులు మెలివేసి నట్లుంది. అని అంటుంటారు. +రక్తసంబంధం పేగుబంధం అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు లాంటి అత్యంత సన్నిహిత బంధువులు .దూరపు చుట్టాలైతే మనస్పర్థలు వస్తే చాలా సందర్భాలలో మళ్ళీ కలవటం అనేది ఉండదు. కానీ సోదరులైతే ఓసారి తగాదా పడ్డా మళ్ళీ ఏదో ఓ సందర్భంలో కలిసిపోతూ ఉంటారని. +సంతానం అనుబంధం రక్తసంబంధం, పేగు సంబంధం +పటుత్వాన్ని సంతరించుకోవటం, యౌవన దశకు రావటం +తలలో వున్న పెనును తీసి రెండు బొటన వ్రేళ్ళ గోరుల మధ్యన వుంచి నొక్కుతారు. అలా చేయడాన్ని కుక్కడం పేను కుక్కడము అని అంటారు. దానికి పట్టే సమయం అతి స్వల్పము. అలా అతి స్వల్పమైన కాలాన్ని చెప్పడానికి ఈ జాతీయాన్ని వాడుతారు. ఇదే అర్థంలో మరొక జాతీయం ఉంది వక్కకొరికినంతలో అనగా వక్క కొరకడానికి అతి స్వల్ప సమయము పడుతుంది. ఉదా: వక్కకొరికినంతలో వచ్చేస్తా అని అంటారు. ఈ జాతీయము రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ వాడుకలో ఉంది. ఇలా అతి తక్కువ సమయాన్ని సూచించడానికి ఈ జాతీయాన్ని వాడుతారు. +చాలా తేలికైన విషయాలు అసలు లెక్క చేయాల్సిన అవసరమేలేని విషయాలు +చావుకు దగ్గరలో వున్నాడు అని అర్థం: ఉదా అతని ముఖంలో ప్రేత కళ వచ్చేసింది ఇక లాభం లేదు. బంధువులకు కబురు పంపండి. +ఒకరు చేసే పనికి వూతంగా ఉంటూ ప్రోత్సాహాన్నిస్తూ ఉండటం. పర్యవేక్షణ, పరిశీలన, దిశానిర్దేశం జ్ఞానంలోనూ, అనుభవంలోనూ అధికులైన వారు జరగాల్సిన పనిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండటమే పైఎత్తున ఉండటం +ఆధిక్యం ఉదా: ఆటలో ఈ జట్టు పై చేయి సాధించింది. +లోన విషయం ఏమి లేకున్నా పైకి డాంబికంగా కనబడటానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. వారిని ఉద్దేసించి ఈ జాతీయాన్ని వాడుతారు. +చాల భయమేసిందని అర్థం: ఉదా: జూ పార్కులో పులి బోను వద్ద నిలబడ్డాను. ఉన్నట్టుండి పులి గాండ్రించింది. నాకు పైప్రాణాలు పైనే పోయి నంత పనైంది. +ఉదా: వాడు పని పాట లేకుండా పైలా పచ్చీసు లాగ తిరుగు తున్��ాడు. +అత్యంత కష్టసాధ్యమైన పని. ఉ: వీడు ఈ చిన్న పని చేయడానికి ప్రసవ వేధన పడు తున్నాడు. +పైలా అనేది పెహ్లో అనే ఉర్దూ పదం. పెహ్లా నుంచి పైలాగా మారిన పదానికి అర్థం మొదటిది, ముందుగా ఉన్నది అని.పచ్చీస్ అంటే ఇరవై అయిదు అని అర్థం. అంటే పాతికేళ్ళ నిండు యౌవన వయస్సు అనే అర్థం +పొగుడుతున్నారు కదా ఇక మనమేమీ చేయకపోయినా ఫర్వాలేదని, గర్విస్తే జీవితంలో వృద్ధి చెందలేరు.అగడ్తలో పడితే బతికేపని ఉండదు. పొగడ్తలు కూడా అగడ్తలతో సమానమైనవని హెచ్చరిక +ఎదుగుదల లేని జీవితం, అభివృద్ధిలేని బతుకు .ఏ మాత్రం కొద్దిగా కూడా పొదుపు చేసుకోవటానికి వీలు లేకుండా ఆ పూటకు తినటానికి, ఆ రోజుకు కట్టుకోవటానికి కావాల్సినంత తిండి, బట్ట మాత్రమే దొరికే వారిని గురించి ఈ జాతీయం +పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదు +అస్సలు చదువు రాదు అనే ప్రయోగంలో ఉపయోగిస్తారు. +చాల ఎక్కువగా నవ్వాడు: ఉదా ఏందిరా సంగతి, పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వు తుండావు? +బ్రతుకు తెరువుకొరకు వచ్చారు అని అర్థం: ఉదా: వీరు వూరుకాని వూరికి పొట్ట చేత్తో పట్టుకొని పని కోసం వచ్చారు. ఏదైనా పని కల్పిద్దాం వారికి. +ఎవరి స్వార్ధం వారు చూసుకోవటం..ఈ నాయకులు వారి పొట్టలు నింపుకోవటం తప్ప ప్రజల కోసం ఆలోచించటం లేదు అంటారు. +పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు +చదువు రాని వాడని అర్థం: ఉదా: వానికి పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు. ఎలా బతుకుతాడో ఏమో ? +వెలువడటం, బహిర్గతం కావటం. అంతర్గతంగా ఉన్నది బహిర్గతమై స్పష్టంగా ఎదుటివారికి కనిపించటం.'వాడిని అంటే నీకెందుకు అంత పొడుచుకొచ్చింది' అంటారు. +పరిష్కారానికి వీలున్నా ఎవరూ పట్టించుకోని సమస్యలు.ఉమ్మడి మీద చేయాల్సిన పని. ఒకరి మీద ఒకరు వంతులేసుకుంటూ మీరు చేయండి మేమెందుకు చేయాలి అని అనుకొంటూ చిన్న పనైనా దాన్ని చక్కదిద్దకుండా కాలక్షేపం చేస్తూంటారు +పొత్తుల పని అని అంటే వేరొకరితో కలిసి ఏదైనా పనిని సాధించేందుకు సిద్ధం కావటం. ఒకరే ఏ పనినైనా చేయాలంటే కార్యభారం ఎక్కువై ఇబ్బంది కలగవచ్చు. అదే పనిని పది మందితో పొత్తు పెట్టుకొని చేస్తే సుఖంగా ఉంటుంది.అందుకే 'పొత్తుల పని సుఖం, ఒంటిగా తిండి సుఖం అంటారు +ఎప్పుడూ నిద్రలో జోగుతూ బద్ధకంగా ఉన్నట్టు కనిపించటం +తెలివి తక్కువతనం, అత్యాశ, ఉదయాన అందరూ మేల్కొనే దాకా దొంగతనం చేస్తూ పట్టుబడటం, అత్యాశకుపోయి అవస్థల పాలవటం +బ్రతుకు భారంగా వున్నదని అర్థం: ఉదా: ఈ చాలి చాలని సంపాదనతో నాకు పొద్దు పోవడము కష్టంగా ఉంది. +పొన్ను అంటే రోకలి పొన్ను, పొడు అంటే పొన్ను దగ్గరి నుంచి పైకి ఉండే పొడవాటి కర్ర భాగం .ఆది నుంచి అంతం దాకా అని. +పొయ్యిలో ఉప్పు పోసుకున్నట్లు, మండుతున్న పొయ్యిలో ఉప్పు వేస్తే వచ్చే చిటపటలు. బహిర్గత కోపాతాపాలకు, పోట్లాటలకు, తగాదాలకు ఎదురుపడి పెద్ద పెద్దగా తిట్టుకోవటం, అరుచుకోవటం +పొయ్యి రాజేసి వూది మంట చేయటం +వంట చేయ లేదు అని అర్థం: వివరణ: పల్లెల్లో కట్టెల పొయ్యితో వంట చేసుకునే వారు. రాత్రులందు పొయ్యి చల్లారిన తర్వాత, వెచ్చగా వుంటుందని ఆ ఇంటి వారి పిల్లి పొయ్యిలో దూరి ఆ బూడిదలో నిద్ర పోతుండేది. అలా పొయ్యిలో పిల్లి లేవలేదంటే ఆ రోజువంట చేయ లేదని అర్థం. +ఉండేదొకచోట, ఉద్యోగం మరోచోట చెయ్యటం, చాలా కష్టమైన పని.సమయం అంతా రాకపోకలకే సరిపోతుంటుంది. +పసలేని మాట చెప్పటం ధాన్యాన్ని నూర్చిన తర్వాత మిగిలే కట్టలే పొల్లు కట్టలు. ఆ పొల్లు కట్టలను కొట్టడం, దంచటం లేదా నూర్చటం లాంటివి ఏం చేసినా ధాన్యం రాలటం జరగదు. +అసాధ్యమైన పని పొల్లును ఎంత దంచినా బియ్యపు గింజలు రావు. వూకదంపుడు +అంతా ఒక్కసారిగా వచ్చారని అర్థం: ఉదా చెరువు కొళ్ల బోయిందని తెలవగానె ఊరి వారందరూ పొలోమని వచ్చారు. +అనగా ఏ పనిలో నష్టపోయామో ఆ పనిలోనె సంపాదించాలని అర్థం. ఆ విషయం మనకు తెలిసిన విద్య. తెలియని కొత్త విద్యలో ప్రారంబిస్తే అంత అనుకూలంగా వుండదు గాన పాత విద్యలోనె ప్రయత్నం చేయడం సులభం గాన అందులోనె ప్రయత్నం చేయమని సలహా ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. +బాగా ఉత్సాహంగా ఉండటం, బాగా అభివృద్థిలో ఉండటం పౌర్ణమి లాంటి రోజుల్లో సముద్రం బాగా పొంగుతుంటుంది. అలలు ఉవ్వెత్తున లేస్తుంటాయి. ఈ పొంగునే పోటు అంటారు. +వివరణ: లిక్కి అనగా ఒక కొడవలి దాని కక్కు అరిగి పోతున్న కొద్ది కొత్త కక్కు వేయిస్తుంటారు. కొంత కాలానికి అది చిన్న కొడవలిగా తయారవు తుంది. ఆ చిన్న కొడవలిని లిక్కి అంటారు. ఇజ రైతు తన లిక్కిని ఇంకొకనికి బదులిచ్చాడు. తీసుకున్న వాడు దాన్నెక్కడో పడేశాడు. ఇచ్చిన రైతు నేనిచ్చింది కొడవలి దాన్నె ఇమ్మంటాడు. ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. +మన చేతి నుంచి దాటిపోయిన ఆస్తులు కానీ, అనుభవించాల్సినవి కానీ పొల్లు లాంటివి, మన దగ్గర మిగిలిందే గట్టి విత్తనాలతో సమానం. పోయిన పొల్లు కోసం ఎలా బాధపడమో అలాగే మనం అనుభవించకుండా పోయినవాటి గురించి కూడా +వృథా ప్రయాస, దండగమారి పని .పొదలో కుందేలు ఉన్నప్పుడు వెతికితే లాభం ఉంటుంది కానీ, అది పోయిన తర్వాత పొదను వెతకటమంటే వృథా ప్రయాసే. +పోరాని చోటుకు పోతే రారాని నిందలు +ఆలోచించకుండా ముందుకు వెళితే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి + + +గతంలో తోలుబొమ్మలాటలు అధిక ప్రచారంలో వున్నప్పుడు ఆ ఆటలో బంగారక్క కేతిగాడు అనే రెండు పాత్రలుండేవి. ఆ పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించేవి. హాస్య రసాన్ని పలికించడానికి మారు పేరుగా ఆ పాత్రలు ప్రజల మనస్సులో స్థిర స్థానం సంపాదించాయి. ఆవిదంగా సమాజంలో హాస్య రసాన్ని వ్వక్త పరిచే స్త్రీలను ఆ పాత్ర పేరుతో అనగా బంగారక్క అని పిలవడము పరిపాటైనది. ఇది ఈ జాతీయానికి వున్న వెనకటి కథ. +మత్తులో పిచ్చిగా ప్రవర్తిస్తుంటే ఈమాటను వాడతారు +మూర్ఖంగా, మొరటుగా, అనాగరికంగా .శిల్పంగా మారకముందు బండ అందం, ఆకారం లేకుండా మొరటుగా ఎలా ఉందో అలాంటి మొరటు మనిషి .బండగాడు, బండబండగా రాయటం అంటారు. +శిలాసదృశంగా అవటం, రాయిలాగా స్పందన లేకుండా పోవటం.ఎంత కొట్టినా కదలక మెదలక ఉండటం.కళ్ళముందు ఏం జరిగినా స్పందించకుండా ఉండటం +కచ్చితంగా అమలయ్యేది, చెరిపితే పోదు వీటినే శిలా శాసనాలు అంటారు. +బండిసెల అనగా వడిసెల అని కూడా అంటారు. రెండు దారాల మద్యలో చిన్న వలలాగ వుండి అందులో ఒక రాయి పెట్టి రెండు దారాలను ఒకటిగా పట్టుకొని గిరగిరా తిప్పి ఒకదారాన్ని వదిలితే అందులో పెట్టిన రాయి అతి వేగంగా వెళ్ళి దూరాన పడుతుంది. పొలాల్లో పిట్టలను బెదరగొట్టడానిని ఈ సాధనాన్ని రైతులు వాడుతారు. బండిసెల లోని రాయి అతి వేగంగా పోతుంది. అలా ఎవరైనా వేగంగా పరుగెడుతుంటే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +బండి విరిగి పోయినప్పుడు ఎద్దులను మాత్రమే కాచుకొని రావచ్చుఅని. పని చేయకుండా ఏదో ఒక వంకన తప్పించుకొనే పని దొంగ గురించి +ఊపిరి సలపకుండా కష్టాలలో ఉండటం, వరుసగా బాధలను, ఇబ్బందులను అనుభవించటం, +క్రమశిక్షణ రాహిత్యంతో అడ్డదిడ్డంగా ప్రవర్తించే వారితో ఉన్న ప్రదేశం +భగీరథ ప్రయత్నం అనగీ అతి పెద్ద ప్రయత్నం అని అర్థము. భగీరథుడు స్వర్గంలో ఉన్న గంగను భూలోకానికి తేవడానికి చాల ప్రయత్నము చేసి సాధించాడు. అలాంటి పెద్దప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం అని అంటారు. +వేరొకరు చెప్పిన దానికి వంత పాడడం: ఉదా: వాడు చెప్పిందానికి వీడు భజన చేస్తున్నాడు. +పరువు తీశాడు అని అర్థం: ఉదా: వాడు నన్ను చిన్న విషయానికి బజారు కీడ్చాడు. +లోడలోడ వూరక సందర్భ శుద్ధి లేకుండా వాగటం +గొప్పలు పోతున్నాడు అని అర్థం: ఉదా: ఏంరో పెద్ద బడాయి పోతున్నావు, పిలిస్తే పలకడం లేదు. +ఉదా హమ్మయ్య గండం నుంచి గట్టెక్కాను: బతికి పోయాను. +బతుకు బజారు పాలైంది బతుకు బస్టాండైంది) +పరువు పోయిందని అర్థం: ఉదా: వాడి బతుకు బజారు పాలైంది. +బతక లేక పోవడం: ఉదా: వారికి సరైన ఆదాయం లేక బతురు బారమైంది +బతుకు భారము కావడమని అర్థం: వాని బతుకు తెల్లారింది అంటుంటారు. +శత్రువులను లోబర్చుకొనే శక్తి ఉన్న వ్యక్తి. బదనిక తీగ వాసన తగిలిన సర్పం తలవంచి తీరుతుందట. +కష్టాల నుండి బయట పడ్డాడని అర్థం: ఉదా: ఇప్పటికి నాకష్టాలన్ని తీరాయి. బయట పడ్డాను. +వాడికి బ్రహ్మరధం పట్టారు అని అంటారు. +తిరుగు లేనిది, మార్చడానికి వీలు పడనిదాని బ్రహ్మ రాత అని అంటారు. +అత్యంత ప్రయాసతో కాని వంట బట్టని విద్యను బ్రహ్మ విద్య అని అంటారు. +అతి పెద్దది అనే అర్థములో వాడుతారు. +వాని పని పట్టాలి: ఉదా: వానికి పొగరెక్కువయింది వాని భరతం పట్టాలి. +ఉదా: వాడితో పెట్టుకోకు, వాడి అన్నింటికి బరితెగించాడు. +పనిలోకి దింపటం, కష్టాలలోకి ప్రవేశం. రంగస్థలం (బరి) మీద నటుల నటనను చూసిన ప్రేక్షకులు బాగుందంటూ ఎంత మెచ్చుకొనేవారో, బాగోలేకపోతే అంత తీవ్రంగా విమర్శించే వారు. తన ప్రదర్శన ప్రేక్షకులకు నచ్చితీరాలి. లేకపోతే వారి చీవాట్లు తప్పవు, +పాలు కావాలంటే (గేదె) కు కూడా బానిసలాగా సేవ చేస్తేనే ఆ బర్రె పాలిచ్చేది. +భవిష్యత్తులో సహాయం చెయ్యనని చెప్పి ప్రస్తుతానికి ఎదుటివారిని ప్రలోభపెట్టి లేదా బెదిరించి తమ పని చేయించుకోవటం. +''బలిపశువును చేశారు అనవసరంగా ఒకడిని ఇరికించి అన్ని నిందలను అతనికిపైకి తోసెయ్యడం అని అర్థం. +గొప్ప గౌరవం .సన్యాసులు మరణించినప్పుడు వారి భౌతికకాయాన్ని తీసుకువెళ్ళే వాహనాన్ని బ్రహ్మరథం అంటారు. +విశ్వాసం ఆధారంగా అవతరించిన జాతీయాల్లో ఇదొకటి. మనిషిని సృష్టించేటప్పుడు బ్రహ్మదేవుడు నుదుటి మీద ఆ మనిషికి సంబంధించిన జీవితం ఎలా సాగాలనే విషయాలను రాస్తాడని, పుర్రె మీద ముందు భాగంలో కనిపించే గీతలే ఆ రాతలని కొందరి విశ్వాసం. అయితే ఆ రాత ఎవరికీ అర్థంకాదు. ఈ అర్థంకాక పోవటం అనే దాని ఆధారంగానే బ్రహ్మరాత అనే జాతీయం ప్రయోగంలోకొచ్చింది. కొంతమంది చేతిరాతలు ఎవ��ికీ అర్థం కావు. అలాంటి రాతలను చూసి వ్యంగ్యధోరణిలో 'ఇదెక్కడి బ్రహ్మరాతరా బాబూ' అని అనటం కనిపిస్తుంది. +చాలా గొప్పగా, ఎంతో పెద్దగా, అన్నిటికంటే ఉత్తమంగా +ఎవరికీ సాధ్యం కాని పనిని చేసి ఘన విజయం సాధించటం +ఓ విషయాన్ని ప్రకటించటం వల్ల ఉన్నట్టుండి కలిగిన మార్పు +ఎంతో కాలంగా రహస్యంగా దాచి వుంచిన పెద్ద విషయాన్ని ఉన్నట్టుండి బయట పెట్టడం. +చేసిందేమీ లేకపోయినా గొప్పగా ప్రచారం చేయటం, ఉన్నదాని కన్నా పెచ్చుగా చెప్పుకోవటం డప్పు కొట్టుకోవటం, డప్పు కొట్టటం +తుపాకీ రాముడు, పిట్టలదొర, గొప్పలు చెప్పే వారు +నిర్మలమైన మనస్సుతో, నిష్కల్మషమైన బుద్ధితో చెప్పే మాటలు +అత్యంత స్వార్థముగా ప్రవర్థించే వారిని గురించి ఈ మాటను వాడుతారు. పులి ఈనినప్పుడు చాల ఆకలితో వుంటుండి. ఆకలికి తాళలేక తన పిల్లలనే తాను తింటుంది. ఇది అత్యంత స్వార్థపూరితమైన పని. ఆ విధంగా ప్రవర్థించే వారిని గురించి ఈ జాతీయాన్ని వాడుతారు. +కాలం కలిసిరాక పోవటం, కష్ట కాలంలో మరిన్ని కష్టాలు సంక్రమించటం బిచ్చపు కూడు కూడా తిననివ్వకుండా శని అడ్డుపడటం +బిచ్చమెత్తుకొని తినటం కంటే పేదరికం ఏముంటుంది?గోచి కన్నా దరిద్రం లేదు . +ఆశాభంగం .అనుకొన్న దానికి భిన్నంగా జరగటం.అనుకోని విధంగా వూహలు, అంచనాలు తారుమారవటం.గర్భవతి కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదని, గడ్డ అని తెలిసి బాధపడ్డట్టు +మూలిగే నక్కమీద తాటిపండు పడటం. ఒక కష్టం నుండి తప్పించుకోబోతూ మరో కష్టానికి గురవటం. బిల్వం అంటే మారేడు, ఖల్వాటం అంటే బట్టతల బట్టతల వ్యక్తి మండుటెండలో నడుస్తూ నెత్తిమాడుతూ ఉంటే ఓ మారేడు చెట్టు కింద నీడలోకి చేరాడు. అంతలోనే ఓ మారేడు కాయ బట్టతల ఉన్నవాడి నెత్తిన పడిందట. అటు ఎండదెబ్బ, ఇటు మారేడు కాయ దెబ్బ . +యాచకులు ధనహీనుల్ని లెక్కచేయరు. భిక్షను భారీగా ఇచ్చే వారినే బిచ్చగాళ్ళు లెక్క చేస్తుంటారు. +వివరణ: పశువులకు ప్రత్యేకమైన ఆహారంగా వేరు శనగ పిండి, రుబ్బిన ఉలవ పిండి, బెల్లం కలిపి బుట్టిలోవేసి పెడ్తారు. దానిని బుట్టి మేత అంటారు. దానినే మనుషులకు ఆపాదించి ఎవరికైనా మంచి ఆహారం అందు తుంటే వాని గురించి ఈమాటను వాడతారు: ఉదా: వానికి బుట్టి మేత బాగా అందు తున్నట్టుంది కొంచెం వళ్లు చేసింది. +ఏదైనా రహస్యం మెల్లగా బహిర్గతం కావటం +బుడుబుంగ నల్లటి రంగులో ఉండే పక్షి. నీళ్ళలోని చేపలను పట్టుకొని తింటూ బతుకుతుంటుంది ఇది. దీని ప్రత్యేకత ఏమిటంటే నీళ్ళ లోపలికి మునిగి చేపలను పట్టుకొని మళ్ళీ కొంత దూరంలో పైకి తేలుతుంటుంది. ఇలా ఆహారం కోసం నీళ్ళల్లోకి మునగటం, మళ్ళీ మరో చోట పైకి తేలటం. కొంతమంది పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లూ పట్టుకు తిరుగుతుంటారు. తమకు కావలసినవన్నీ ఆ ఇళ్ళలోనే గడుపుకొని పోతుంటారు. ఏ గృహంలో ఉన్నాడో అని తెలుసుకొని వెళ్ళే లోపు మరో ఇంటికి వెళుతుంటాడు. అలాంటి వాడిని బుడుబుంగ లాంటివాడు అంటారు. +తప్పు చేయటం, పొరబడటం .అడుసు తొక్కనేల కాలు కడుగ నేల ? +దోషాలను అంటకట్టటం ఎదుటివాడిపై నిందలు వేయటం: +తప్పు, పొరపాటు నీతిమాలిన పని అనే వాటికి సూచిక +లేని నిందలను ఇతరులపై మోపడమని అర్థం: ఉదా ప్రతి పక్షాలు మాపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు అని అంటారు. +స్థిరంగా నిలవదు. చివరిదాకా నిలబడని వాడు, మధ్యలోనే తప్పించుకొని పోయి పని చేయకుండా మోసం చేసేవాడు +కోపంగా వున్నాడని అర్థం: ఉదా: వాడు ఈ చిన్న మాటకే బుస కొడుతున్నాడు. +ప్రస్తుత కాలానికి అనుగుణంగా లేని విషయాలు, కాలదోషం పట్టిన ప్రమాద హేతువులు +ప్రయోజనం లేని పని.బూడిదలో పోసిన పన్నీరు +బూతు పడ్డా బుట్టలో ఇత్తు పడాల +వ్రతం చెడ్డా ఫలితం దక్కాలి. అడ్డంకులు, అవాంతరాలు, అవమానాలు లెక్కచేయకుండా కావాల్సిన దాన్ని సాధించుకోటం +ఇలాంటిదె మరోమాట కులం చెడ్డా సుఖం దక్కింది +అరచేతిలో వైకుంఠం చూపినట్టు, ఏమీ లేకపోయినా అంతా ఉన్నది అని ధ్వనింపచేసేలా ప్రవర్తించే తీరు +కదలకుండా మెదలకుండా. ఉదా: ఏరా బెల్లంకొట్టిన గుండ్రాయిలా అలా వుండిపోయావేం? +కంగారు పెట్టించాడు. ఉదా: ఈ కాస్త దానికే అలా బెంబేలు పడితే ఎలా? +అన్యాయంగా ఆర్జించటం, ఆహారాన్ని ఓ క్రమపద్ధతి ప్రకారం తినకుండా ఎక్కువెక్కువ తీసుకొని అందరికంటే ముందే అంతా తినెయ్యాలన్న ఆత్రంతో తినటం, అందరిలా సక్రమంగా కాక అక్రమంగా అంతా ఆర్జించాలనుకోవటం +జీవితం తారు మారైంది: ఉదా: వాడు వ్యాపారంలో బొక్క బోర్ల పడ్డాడు. +దుర్మార్గుల మధ్య సజ్జనుడు, అందవిహీనుల మధ్య అందగాడు +బొటన వేలి కింద పెట్టుకోవటం, అధీనంలో ఉంచుకోవటం +బాగా కన్నీరు పెట్టడం, దుఃఖం పెల్లుబుకి కన్నీరు బొట్లుబొట్లుగా రాల్చటం +లోకజ్ఞానం లేనివాడు, అమాయకుడు, లోకం పోకడ తెలియనివాడు +సంపూర్ణంగా, అధికంగా, బాగా ఒకేచోట చేరి ఉండటాన్నిబొత్తుగా, బొత్తిగా ఉండటం అంటారు. +పూర్తిగా అని అర్తం: ఉదా వాడు ఈ మధ్యన బొత్తిగా ఏ పని చేయడం లేదు అంటారు. +అవాస్తవం, ఆధారం లేనిది, నమ్మశక్యం కానిది ప్రామాణికతలేని విషయాలు +దరిద్ర స్థితి. లోపల ఏమీ లేకుండా ఖాళీగా ఉన్న మట్టి వంటపాత్రను బోకె అంటారు. కేవలం ఖాళీ మట్టి పాత్రల కోసమే కొట్లాట' అని +ఏమాత్రం ఉపయోగంలేని వాటిగురించి పెద్ద పోట్లాటకు సిద్దమైతే ఈ మాటను వాడతారు. +పుట్టుకతోనే ధనవంతులు. బాగా ధనవంతుల ఇంట్లో పుట్టిన బిడ్డ +అసలు సాధ్యం కాని పని బోడిగుండు మీద, మోకాలి మీద కేశాలు ఉండవు. ఆ రెండిటికీ ముడివేయాలని చేసే ప్రయత్నం ఫలించదు. +అనామకుడు 'శతకోటి లింగాల్లో ఓ బోడిలింగం. శివలింగాలు నునుపుగా ఒకేలా ఉంటాయి. వాటికి ఒక్కో దానికి ప్రత్యేకమైన గుర్తులేమి ఉండవు. ఓ చోట ఉన్న ఎన్నెన్నో శివలింగాల్లో ఒక శివలింగాన్ని ఎవరైనా తీసుకెళ్ళినా పెద్దగా నష్టం ఏమీ ఉండదు. +ఎలాంటి వారినైనా కాచి కాపాడుతూ ఎవరడిగినా కాదనని వాడు +సాధ్యమైన దానిని కూడా ప్రయత్నం పూర్వకంగా సాధించడం అంటే ఎంత కష్టమైన పనినైనా పట్టువిడవకుండా సాధించడం +పొగడ్త ఏదో ఒక స్వార్ధాన్ని దృష్టిలో ఉంచుకొని విపరీతంగా పొగడటం. ఆ సందర్భంలో ఈ మాటను ఉపయోగిస్తారు. +పర్యవేక్షణ సరిగా లేనిపాలన .నామ మాత్రపు రాజు పాలన వల్ల సరైన పర్యవేక్షణ ఉండదనే భావం. ఆపద్ధర్మ పరిపాలన +సాధించాలి/ అంతు చూడాలి అనే అర్థంలో కూడా వాడతారు ఉదా ఎలాగైనా వాని భరతం పట్టాలి" అని అంటారు. +భల్లూకము అంటే ఎలుగుబంటి. ఎలుగుబంటి ఏదైనా పట్టుకుంటే నిలువుగా నిలిచి గట్టిగా కౌగలించుకుని చంపటానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఎవరేం చెప్పినా వినకుండా తన పట్టుదల వదలని వ్యక్తి పట్టుదలను భల్లూకపు పట్టు అంటారు. +తమంతా తాముగా నష్టపోయేవారు.ఎవరినో నష్ట పరచాలనుకొని తమను తామే నష్టపరచుకొనే వారు ఆసందర్భంలో ఈ మాటను వాడుతారు. +అవసరం కోసం, స్వార్ధం కోసం సంబంధాన్ని కలుపుకోవటం +గుమ్మడి కాయల దొంగెవరో అంటే తన భుజంపై గుమ్మడి కాయ వున్నదేమోనని భుజాలు తడుముకున్నాడట +గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడట. ఈసామెతను తలపిస్తుంది ఈ మాట. సామాన్యంగ సామెతలను చెప్పేటప్పుడు పూర్తి సామెతను చెప్పకుండా సగం సామెతను మాత్రమే చెప్పి వూరకుంటారు. మిగతాది అందరికి తెలిసిందే మిగతా సామెతను ఊహించుకోవలసినదే. ఆ విధంగా చెప్పడంతో పూర్తి సామెత చెప్పినదానికంటే ఎక్కువ భావన కలుగుతుంది. ఆ సగం సామెత జతీయం లాగ వుంటుంది. ఇక్కడ ���ెప్పిన జాతీయం అలాంటిదె. తన భుజాన దొంగలించిన గుమ్మడి కాయ వున్నదేమోనని భుజాలు చరుచు కోవడండం. పైన చెప్పిన వివరణ అనగా తనకు తానుగా గొప్పలు చెప్పుకోవటం అనే అర్థం రావాలంటే జబ్బలు చరుచు కోవడం అని అంటే బాగా సరిపోతుంది. +సమర్థించడం జాగ్రత్తగా కాపాడుతూ ముందుకు తీసుకు వెళ్ళడం +శౌర్యాన్ని ప్రదర్శించకపోవటం, ప్రతాపాన్ని తగ్గించుకొని బతకటం, మెత్తమెత్తగా ఉండటం +నిరుపయోగమైన మనిషి: ఉదా: వాడి పుట్టుకే భూమికి భారం. ఉపయోగం లేని వాడు +ఎవరిని లెక్క చేయని వాడు: ఉదా: వానికి పెద్దల యడ భయము భక్తి లేవు. ఎవరిని లెక్క చేయడు. +చెప్పిన పని చేయని వాడు, మాట వినని వాడు ఉదా: వాడు నామాటను భే ఖాతరు చేశాడు. + + +ఏవిధమైన అధికారిక హోదా లేకపోయిన పెత్తనం చెలాయించేవారినుద్దేశ్యించి "మకుటం లేని మహారాజు" అనటం వాడుక. +కూలీ బతుకులు, అల్పాదాయ వర్గాల వారు.ఇళ్ళ ప్రహరీ గోడలు నానిపోకుండా ఈ గోడ మీద రెండు వైపులా ఏటవాలుగా అంటే త్రిభుజాకారంలో ఉండేలా ఒత్తుగా గడ్డి వేసేవాళ్ళు. ఆ గడ్డి లేవకుండా బరువుగా ఉండేందుకు తాళ్ళతో రాళ్ళను కట్టి అటూ ఇటూ వేలాడదీస్తుండేవారు.ఈ మగుల వల్ల మట్టిగోడ నానకుండా ఉండేది. అయితే వర్షం పడ్డప్పుడు ఆ గడ్డి మీద ఉండే గింజలు మట్టి తగిలి ఉండి నాని మొలకెత్తుతుండేవి. వర్షం పడ్డంతసేపూ నవనవలాడుతూ ఆ గడ్డి మొక్కలు బాగానే ఉండేవి. కానీ ఎండ రాగానే వెంటనే వాడిపోతూ ఉండేవి. +తాత్కాలికంగా లభించిన సంపద: ఉదా: వానిది మధ్యాహ్న బోగం. ఎంత కాలముంటుంది లే. +ప్రేమించాడని అర్థం: ఉదా: అతను నా మనసు దోచు కున్నాడు. +మనసంతా కాక వికలంగా వున్నదని అర్థం: ఉదా: ఆ మాట విన్నప్పటినుంది నామనసు మనసులో లేదు. +ఊహల్లో విహరిస్తున్నాడని అర్తం: ఉదా: వాడు ఆ మాట విన్నప్పట్నించి మబ్బుల్లో తేలి పోతున్నాడు. +వెనువెంటనే .మరతుపాకిని పేల్చితే దాని తూటా వెనువెంటనే ఎంత వేగంగా బయటకు వెళుతుందో అంతటి వేగమని +అనుచరగణాన్ని ఎదగనీయని నాయకుడు.మర్రిచెట్టు నీడన మరేమొక్క బతకదని, పెరగదని చెబుతారు. +ఆకలితో వున్నాడని అర్థం: ఉదా: వాడు ఆకలికి మల మల మాడు తున్నాడు. +తీవ్రంగా ఆలోచిస్తున్నారు: ఉదా: వారు పలాన విషయమై మల్ల గుల్లాలు పడుతున్నారు. +పరువు, ప్రతిష్ఠలను కోల్పోవటం, పొగచూరటం, మట్టిపట్టటం, పొగకమ్మటం లాగా. +కష్టాలొచ్చాయని అర్థం: ఉదా: వారి జీవితం మసి బారి పోయింది. +మసి పూసి మారేడు కాయను చేయడం +ఆగ్రహించటం ఉదా: వాడునామీద మండి పడుతున్నాడు. +నాశనమైనది. ఉదా ఇంత సేపు ఆ పనిచేశానా? అంతా మంట కలిసి పోయింది. +కిందనుండి పైదాక మిక్కిలిగా, ఉదా: వారు మంటికి మింటికి ఏకథాటిగా విలపిస్తున్నారు. +కోపంగా వున్నడని అర్థం: ఉదా: వాడు నామీద మండి పడ్డాడు. +చెప్పుడు మాటలతో ఎదుటివారి మనసును మార్చటం +గుంపులో గోవిందా సొంత ఆలోచన లేకుండా ఎదుటివారు ఏం చేస్తే అలా చేస్తూపోతూ ఉండే స్థితి. దేవాలయాలలో గుంపులు గుంపులుగా భక్తులున్నప్పుడు ఒకరు గోవిందా అంటే పరిసరాలలో ఉన్నవారు కూడా గోవిందా అని అరుస్తుంటారు. సభలు, సమావేశాలప్పుడు ఎవరైనా ఉపన్యాసం చేస్తున్న సందర్భంలో ఒకరు చప్పట్లు కొడితే మిగతా వారంతా చప్పట్లు చరుస్తుంటారు. ఎందుకు, ఏమిటి అని ఆలోచించకుండా కారణలేవీ తెలుసుకోకుండా ఎదుటివారిని బట్టి చేయటం. +మోసం చేయడం: ఉదా: వాడు చేసిన పని బాగా లేదు ఏదో మసి బూసి మారేడు కాయను చేసినట్లున్నది. +మాఊరు మీఊరికెంత దూరమో మీఊరూ మా ఊరికి అంతే దూరం +నిజం చెప్పడం లేదు. ఉదా: వాడు నిజం చెప్పలెక మాటను మింగేస్తున్నాడు. +ఉదా: ఇంత సేపు ఏదేదో మాట్లాడావు. ఇప్పుడు నిజం తెలిసే సరికి మాట పడి పోయిందా? +ఉదా: వాడు మాట పడడు. చాల నిజాయితీగా వుంటాడని అర్థం. +నిజాయితీ పరుడని అర్థం: ఉదా: అతను ఏదన్నా అన్నాడంటే మాట మీద నిలబడతాడు. +గొప్పలు చెప్పుకోవడం: ఉదా: వానిమాటలు కోటలు దాట తాయి మాటలు కోటలు దాటాయి కాలు మాత్రం గడప దాటదు ఇది సామెత. సామెతలో కొంత భాగాన్ని జాతీయంగా వాడడానికి ఇదొక ఉదాహరణ.) +చెప్పడానికి ఏమి లేదని అర్థం: ఉదా: అప్పుడన్ని మాటలన్నావు? ఇప్పుడు మాట పెగలడం లేదేమి? +చేసిన తప్పులు బయట పడితే కలిగె పరిస్థిని తెలియ జేసె మాట. +మాధవుడు యాచకుడి రూపంలో కూడా వస్తూ ఉంటాడని, అందుకే యాచకులను ఇప్పుడు కాదు, లేదు, పో అని అనకూడదంటారు. యాచకుడు కూడా తనకు వేసిన కబళం (ముద్ద) ఆ దేవునికే చెందుతుందన్నట్టు తీసుకొంటాడు. +అంతు తెలియని రోగం: ఉదా: ఈ మాయ దారి రోగంతో చస్తున్నాను. +సరైన ప్రయత్నం, పథక రచన లేకుండా కార్యసిద్ధి కోసం ప్రయత్నం చేయటం.కార్యసిద్ధిని వూహించి దురాశతో ప్రవర్తించటం .ఓ వేటగాడు తన భార్యను పిలిచి పిట్టమాంసంతో పులుసు పెట్టమన్నాడట. మరి పిట్టమాంసం ఏదయ్యా అని ఆమె అడిగితే అదిగో ఆకాశంలో పిట్టలెగురుతున్నాయి కదా! వాటిని పట్టుకొని తెస్తాను. ఇంతలోపల పులుసు కాస్తూ వుండు అని చెప్పాడట. ఇంటర్వ్యూకు వెళ్���కుండానే ఉద్యోగం వచ్చేసినట్టు తెగ సంబరపడిపోయినట్టు, ఎదురింటి అట్లకు నెయ్యికాచినట్లు, ఆలూలేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్లు, మబ్బుల్లో నీళ్ళుచూసి ముంతవొలకబోసుకున్నట్లు. +కష్ట పడి వచ్చాడు: ఉదా: అప్పుడనంగా రమ్మంటే ఇప్పుడు ముక్కి మూలిగి వచ్చాడు. +అదుపులో పెట్టాలని అర్థం: ఉదా: వాడు చాల విర్ర వీగు తున్నాడు. వానికి ముక్కు తాడు వెయ్యాలి. +తొందరగా కోపం వస్తుందని అర్థం. ఉదా: వానికి కోపం ముక్కు మీదనె వుంటుంది. +కొత్త వారు: ఉదా: వాని ముక్కు మొఖం నాకు తెలియదు నేనేం మాట్లాడను వానితో +ఓపిక లేకపోవటం, బలహీనంగా ఉండటం .ముక్కెద్దు అని అంటే ముసలి ఎద్దు అని అర్థం. ముక్కాయన, ముక్కది ముసలాడు, ముసల్ది +అన్ని దేవుల్లకు మొక్కు కున్నానని అర్థం: +తప్పించుకోవాలని చూడడం. ఇష్టం లేదని అర్థం. ఉదా: నేను మాట్లాడుతుంటే వాడు ముఖం అటు తిప్పుకున్నాడు. ఇష్టం లేదేమో +వెళ్లిన పని కాలేదని అర్థం: ఉదా: వాడు వెళ్లిన పని కాక పోయే సరిగి ముఖం వేళ్లాడేసుకొని వచ్చాడు +కర్ర పెత్తనం చేయటం, కేవలం పర్యవేక్షిస్తూ, అధికారాన్ని చలాయిస్తున్నట్టు అందరి చేత పనులు చేయిస్తూ తాను మాత్రం తప్పించుకు తిరగటం +వివరణ: ఒక వడ్రంగి ఒక దుంగను సగం వరకు కోసి సమయం అయినందున కోత మధ్యలో ఒక కర్ర మేకును పెట్టి వెళ్లి పోయాడు. ఇంతలో ఒక కోతి వచ్చి కోసిన దుంగ సందులో కాలు పెట్టి మేకును పీకింది. ఇంతలో ఆదుంగ రెండు బాగాలు దగ్గరై కోతి కాలు అందులో ఇరుక్కున్నది కోతి పనులు అని చెప్పడానికి ఈ సామెతను వాడ్తారు. +నోటి ముందరి కూడు తీసేయటం. అవమానించటం.ముంగటి+ఇత్తారి (విస్తరి నలుగురితోపాటు భోజనానికి విస్తరి ముందు కూర్చున్నప్పుడు విస్తరిని లాక్కువెళ్ళటం లేదా ఆ కూర్చున్న వ్యక్తిని లేచిపో అని కసురుకోవటం. +ఆటంక పరిచాడు: ఉదా: ఈ విషయంలో నేను మాట్లాడదామని వస్తే వాడు నా ముందరి కాళ్లకు బందం వేశాడు. +ముందుకి పోతే ఇరుకు వెనక్కి పోతే కొరుకు +ఎటు వెళ్ళాలో తేల్చుకోలేని సందిగ్ధ స్థితి.అసలు ఎటు వెళ్ళినా, ఏ నిర్ణయం తీసుకొన్నా, ఏదో ఒక ప్రమాదం తప్పదని. ముందు నుయ్యి, వెనుక గొయ్యి +ఉదా: దేనికైనా ముందు చూపు వుండాలి. +బాగా విశ్లేషించి ఆలోచించటం: ఉదా ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడే టప్పుడు ముందు వెనకా చూసి మాట్లాడాలి అంటరు. +పెళ్లిచేయడం దీన్ని నిందా వాచకంగా కూడా వాడతారు వాడు ఇద్దరి జుట్లు ముడివేసే రకం) +చూసీ చూ��నట్టు ఉండడం, అయిష్టతను ప్రకటించడం +మృత నష్టం .మృత్యువును మించిన నష్టం కలిగించేది మరొకటేదీ ఉండదు. +చెట్టు ఎంత ముదిమిదైతే అది బాగా చేవ పట్టి అంత గట్టిగాను, ఉపయోగ కరంగాను వుంటుంది. అదే విధంగా ముదిమిన వున్న మనిషి ఎంతో అనుభవం కలిగి వుంటాడని అతని సూచనలు అనుసరణీయమైనవని ఈజాతీయాన్ని ఆ అర్థంలో వాడుతారు. +ఏదో మాయ మాటలతో ఉబ్బేస్తున్నాడని హెచ్చిరక చేయడం. +చాల కష్టంగా ఉంది. ఉదా: వాని మాటలు వింటుంటే ముళ్లమీద కూర్చున్నట్లుంది +ములి పుచ్చ గింజలు ఎన్నాళ్ళయినా పుచ్చిపోవడం కానీ, కుళ్ళు పోవడం కానీ జరగదు. చుక్క నీరందని బీడు భూముల్లో పడ్డా ఆ గింజలు మొలకెత్తి మొక్కలవుతాయి. ఇలా అన్ని రకాల పరిస్థితులకు తట్టుకుంటూ పుట్టుకొచ్చే ఈ మొక్కల వల్ల ఏ ఉపయోగం ఉండదు.ఎవరికీ ఏ విధంగానూ ఉపకరించక సోమరి పోతుల్లా తిని తిరిగే వాడికి ఏ రోగాలు రానప్పుడు ములిపుచ్చ గింజలాంటి వాడు అంటారు. +ధనాన్ని కూడబెట్టడం. మరీ పిసినారితనంగా ప్రవర్తిస్తూ, తిండి కూడా సరిగా తినకుండా కూడబెడుతూ ఉంటే దాన్ని ముల్లెగందులతనం అని అంటారు. +తాను ఎన్నుకున్న జీవన మార్గం అంత సక్రమమైనది కాదు. అందులో ఎన్నో కష్టాలున్నాయని అర్థం, +అయోమయ పరిస్థితి. ముసుగులో ఎవరు ఎవరిని కొడుతున్నారో తెలియని పరిస్థితి. +నీచంగా, తక్కువ స్థాయిలో ఉండటం.ముష్టి అంటే పిడికిలి. +ఏదేని ఒక కార్యం ప్రారంబించే ముందు దాన్ని గురించి చక్కగా విష్లేచించి తర్వాత దానిలోకి దిగాలి. అలా ముందు చూపుతో వుంటే కార్యం నెరవేరు తుంది. +అన్ని కష్టాలు ఒక్క సారె వచ్చాయి: ఉదా: వానికి కష్టాలన్ని ఒక్కసారె ముసురుకున్నాయి. +కప్పి ఉంచడం ఏదేని విషయాన్ని బయటకు చెప్పకుండ దాచి వుంచడం; +ఉదా: వానికి అన్ని లాబాలె వాని వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. +చాల కష్ట పెట్టాడు: ఉదా: వాడు నన్ను మూడు చెరువుల నీళ్లు తాగించి గాని ఇచ్చిన డబ్బు ఇవ్వలేదు. +పని ఆగిపోవడం లేదా ఏదైనా పనికిరాకుండా పోవడం +మూలకు నక్కటం.భయం, బెరుకు ఉన్న వారు నలుగురు ముందుకు వచ్చి ధైర్యంగా నిలుచోవటం కానీ, మాట్లాడటం కానీ చేయలేక ఏ గదిలోనో, మరో చోటనో మూలమూలల్లో నక్కి కూర్చొంటుంటారు. +ఉదా వాడు పాపాలన్ని మూట గట్టు కుంటున్నాడు అని అంటారు. +అతి రహస్యంగా; ఉదా: ఈ పని మూడో కంటికి తెలియకుండా చేయాకి. +ముసలివాళ్ళు తూలిపడిపోకుండా ఊతంగా వాడే చేతి కర్రే మూడోకాలు. +చూపులకు చిన్న ప్���తిభాశక్తి ఎంతో ఎక్కువ +అసలు విషయం బయట పడుతున్నది. ఉదా: మూలాలు కదులుతున్నాయి. ఇక తొందరలోనె అసలు విషయం తెలుస్తుంది. +అన్ని విధాల నష్టం జరిగిందని అర్థం: +మూతి మూరెడు పొడవు పెట్టుకొని వచ్చాడు +నిజంగా మగవాడివే అయితే అని అర్థం. +చాల అన్యోన్నంగా కలిసి మెలిసి వుంటున్నారని అర్థం. +శాంతించాడు అని అర్థం: ఉదా: వాడు ఇప్పటికి శాంతించి మెత్త బడ్డాడు. +తెలివి తక్కువ వాడు: ఉదా: వానికి మెదడు మోకాళ్లలో ఉంది. +తాత్కాలికమైనవి ఏవీ శాశ్వత ప్రయోజనాలను చేకూర్చలేవు. క్షణకాలంపాటు మెరిసే మెరుపులు దీపాలకు ప్రత్యామ్నాయంగా వాడాలంటే సాధ్యమయ్యే పనికాదు. +బలవంతంగా లొంగదీయడం (గర్వం అణచాలి అనే అర్థంలో కూడా వాడతారు) +పైకి మాత్రమే ధైర్యంగా కనబడే వారు +పని మీద ద్యాస లేకుండా పనిచేస్తున్నారు: ఉదా: పని చేయడం ఇష్టంలేకుంటే మానేయండి. మొక్కుబడిగా పని చేయడమెందుకు? +ప్రారంభ దశలోనే అంతమైపోవటం, పండుస్థాయి దాకా వెళ్ళకుండానే మొగ్గగా ఉన్నప్పుడే రాలిపోవటం, జరగాల్సిన పనంతా ఆగిపోవటం +చీవాట్లు పడ్డాయని అర్థం: ఉదా: ఆ విషయంలో వారికి కోర్టు వారు మొట్టికాయలేశారు. +మొండి కేస్తున్నాడు: ఉదా: ఆ పిల్లవాడు బడి కెళ్లడానికి మొరాయిస్తున్నాడు. +దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు అని అర్థం: +వార్ధక్యం వచ్చిందని చెప్పటం.వయస్సులో ఉండి ఓపిగ్గా ఉన్న వ్యక్తులు నిటారుగా నిలుచుంటారు. అదే వయస్సుడిగి ముసలితనం వస్తే బాగా వంగిపోతారు. అప్పుడు మోకాళ్ళు ముందుకు, మోచేతులు వెనక్కు వచ్చినట్లు కనిపిస్తాయి. +ఇంకొకరిమీద ఆధారపడటం.హీన స్థితిలో ఒకరి కింద బతుకుతూ ఉండటం. దోసిలి పట్టి ఓ వ్యక్తి నీరు తాగుతుంటే అతడి చేతి నుంచి నేలకు జారే కొద్దిపాటి ఎంగిలి నీళ్ళ చుక్కలను మరో వ్యక్తి తాగే ప్రయత్నం చేస్తుండే స్థితి ఎంత నీచమైందో +పూర్తికావడమనే అర్ధం. ఉదా ఈపనికి ఈ నాటికి మోక్షం కలిగింది అంటుంటారు. +ముందు, వెనుక ఎవరూ లేకపోయినా మహా మొండిగా ప్రవర్తిస్తూ ఎవరినీ లెక్కచేయకుండా తిరిగేవాడిని మొండి రావిచెట్లు అంటుంటారు. +మోదుగ చెట్లు ఆకులతో, బాగా పూసిన పూలతో నిండుగా ఉంటాయి. అది వైద్యానికి కూడా ఉపకరిస్తుంది. ఆ చెట్లుంటే అడవి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ చెట్టు ఆకులు నేలరాలి మట్టిలో కలిస్తే భూమి సారవంతంగా అవుతుంది. మొగుడున్న ఇల్లు కూడా సంపాదనతో కళకళలాడుతుంటుంది. అందుకనే అడవిలో మొదుగ ఉంటే ఎంత విలువో ఇంటికి మొగుడు ఉంటే అంతే విలువ. +మాట్లాడం లేదు: ఉదా: మౌన వ్రతం పట్టారా? ఒక్కరు మాట్లాడరు. + + +య అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +[[ఆంగ్ల భాష]]లో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +సంప్రదాయాన్ని అగౌరవపరచటం, అశ్రద్ధతో కూడిన పని. పెద్దలకు యాతాంతో తోడి నీళ్లను తర్పణమివ్వడం. +వాటంతట అవే జరిగే పనులు.యత్+అనంతరం యదనంతరం, ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి జరగటం +ఎల్లప్పుడు వెంట బడి విసిగించే వాడినుద్దేసించి ఈ మాట వాడుతారు. +భరించరాని కష్టాలు .నరకంలో రంపాలతో కోయటం, నూనెలో వేయించటం లాంటి బాధలను యమ దూతలు పెడతారట. +క్రూరత్వంతో నిండి ఉండటం, వికృత, హింసాత్మక చర్యలు చేస్తుండటం +భరించరాని కష్టం చెప్పుకోలేని బాధ విపరీతమైన వ్యథ +తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడటం.యవల చేను పాడుచేసిన అడవి పంది తప్పించుకోగా వూరపందికి శిక్షపడ్డట్టు + + +ర అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +[[ఆంగ్ల భాష]]లో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్ధం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్ధం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్ధం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్ధం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +తెలుగు భాషకు అలంకారలనదగిన పదాలనేకం. అవి లేకుండా తెలుగు భాషలో పట్టు మని పది నిముషాలు కూడా మాట్లాడ లేరు. ముఖ్యంగా పల్లె ప్రజలు నిరక్ష రాసులు మరీను. ఇటువటి వదాలు ప్రస్తావించకుండా అసలు మాట్లాడ లేరు. ఇటు వంటి పదాలను పండితులు "జాతీయాలు" అని అన్నారు. శ్రీమాన్ బూదరాజు రాధాకృష్ణ గారు ఇలాంటి అనేకమైన పదాల పుట్టు పూర్వోత్తరాలను విశదీకరించారు. అవి ఎక్కువగా పండితులకు, పరిశోధకులకు విద్యార్థులకు మాత్రమే ఉపయోగ కరం. అందు చేత అటు వంటివి కాకుండా సాధారణంగా సామాన్య ప్రజలు సైతం అలవోకగా ఉపయోగించే పదాలను మాత్ర్రమే కూర్చడం జరిగింది. జాతీయాలనబడే ఈ పదాలను ఎవరో పనిగట్టు కొని కనిపెట్టలేదు. సాదారణ ప్రజల నోళ్లలో తమ వాడుకలో అసంకల్పితంగా పుట్టు కొచ్చినవే. కాని భాషపైవాటి ప్రభావం చాల ఎక్కువ. అటు వంటి పదాలున్న వాఖ్యల అర్థం మరింత భలంగా వుంటుంది. ఆ పదాలకున్న అసలైన అర్థం ఇక్కడ కనబడదు. వేరె అర్థం లోనె వుంటాయి. వాటి అర్థాలు ఇవీ అని కూడా చెప్పలేము. ఇలాంటి పదాలకు/వాఖ్యలకు అర్థం విడమరిచే వివరణ కూడా చాల వరకు అవసరం లేదు. కాన సందర్భాన్నిబట్టి చిన్నవివరణ ఇచ్చుకోవచ్చు. +ఒక పదానికి దనికున్న నిఘంటువు లోని అర్థంలో కాకుండా అనగా నిజార్థం కాకుండా విభిన్న అర్థంతో అదే భావాన్ని మరి కొంత ప్రస్పుటంగా అర్థం అయి, వినడానికి కూడా మరికొంత సొంపుగా వుండేవే జాతీయాలు. జాతీయాలు లేని కొన్ని వాఖ్యలు పరిపూర్ణ అర్థం కలిగి వుంటాయి. కాని జాతీయం కలిసిన వాఖ్యం అర్థం మరింత అందంగా, అర్థం మరింత ప్రస్పుటంగా వుంటుంది. కొన్ని సందర్భాలలో జాతీయమనదగిన పదం వాడకుంటే అర్థం పూర్తిగా అవగాహన కాదు. ఉదాహరణకు వాడు నాచెంతన వుంటే కొండంత అండ. ఈ వాఖ్యంలో కొండంత అనెది జాతీయ పదం. పూర్తి పదం కొండంత అండ జాతీయం లేకుండా వాడు నా చెంత వుంటే నాకు పెద్ద అండ అనొచ్చు. జాతీయంతో కలిస్తే వాడు నా చెంతన వుంటే నాకు కొండంత అండ దీని అర్థంలో భలమెంతో ప్రస్పుటంగా కనబడుతుంది అం�� అనే దాన్ని కొండంతో గోరంతో పది కిలోలో మరెంతో అలా కొలవరు. అందుకే అది జాతీయం అయింది. ఇలా చెప్పుకుంటూ పోతె భాషలో జాతీయాలకున్న భలమెంతో చాల చెప్పవలసి వస్తుంది. అంతా ప్రధానమె. మరొక్క ఉదాహరణ మాత్రం చూడండి వాడు నాకు చుక్కలు చూపించాడు ఈ వాఖ్యంలోని అర్థం పండిత, పామరులకందరికీ సులబ గ్రహ్యమే. దీని అర్థం వాడు నన్ను చాల కష్ట పెట్టాడు అని చెప్పుకోవచ్చు. ఆ మాటలో వున్న బలమెంత ఇక్కడ వున్న జాతీయం చుక్కలు చూపించాడు అని. చుక్కలను ఎవరు చూపించరు అవసరం లేదు కూడా ఆ జాతీయ నిజార్థం ఇక్కడ అసమంజసం అనవసరం కూడా చుక్కలు చూపించడం అనె అర్థం సోది లోకి కూడా రాదు. కాని ఆ పూర్తి వాఖ్యంలోని అర్థం ఎంత భలీయంగా వున్నది గ్రహించ వచ్చు. అదే జాతీయాలకున్న గొప్ప తనము. +కొన్ని సామెతలను కూడా జాతీయాలుగా ఉన్నదున్నట్టు ఉన్నాయి. కొన్ని సామెతల లోని సగ భాగాన్ని జాతీయంగా చూపారు. ఇది కొంత వరకు సమంజసమె కాని అన్ని సందర్భాలలో కాదు ఇంకొన్ని పదాలున్నాయి. అవి కూడా జాతీయాలె. అవి జంట పదాలు. జంట పదాలు చాల వుంటాయి ఆ జంట పదాలలోఒక పదానికి అసలు అర్థం వుండదు. కాని ఆ రెండు కలిస్తేనె సరైన అర్థం వస్తుంది. ఉదాహరణకు వంటా వార్పు/ చీకు చింత చెట్టు చేమ/ కొంప గోడు మాట మంతి/గొడ్డు గోదం పిల్ల పిసురు ఇలాంటి వి చాల వుంటాయి. ఈ జంట పదాలలో ఒక్క పదానికి అది పూర్వ పదమైనా ఉత్తరపదమైనా ఒక దానికి అర్థం వుండక పోవడాన్ని గమనించ వచ్చు. ఇవి జాతీయల కోవలోకి రావనిపిస్తుంది. ఇంకో విషయంఏ మంటే జాతీయాలు అని ఆ పదాలలు చూపెడుతున్నప్పుడు వాటిని యదాతదంగా అనగా పుట్టెడు బుద్ధులు/ కాలు కాలిన పిల్లి అలక పాన్పు/ సొంత డబ్బా కొట్టుట తెగిందాక లాగుట/ కొంప కొల్లేరు ఇలా ఉదహరించారు. ఇది కొంత అసమగ్రం. అలా కాకుండా వాటికి తోక పదాలు తగిలించి సంపూర్ణ అర్థం వచ్చేలా చెప్పితేనే దానికి పరిపూర్ణత వస్తుంది ఎలా గంటే పుట్టెడు బుద్ధులు గలవాడు కాలు కాలిన పిల్లి లాగ అలక పాన్పు ఎక్కాడు/ సొంత డబ్బా కొట్టు తున్నాడు/ తెగిందాక లాగకు/ కొంపకొల్లేరయింది ఆ విధంగా వుంటే బాగుంటుందని పిస్తుంది. ఈ జాతీయాలు చాల వరకు స్వయంభోదకాలె అయినా కొన్నింటికి ఒక ఉదాహరణగా ఒక చిన్నవాఖ్యాన్ని చేర్చితె అది చాల సమగ్రంగా వుంటుంది. ఎక్కడో అరుదుగా తప్ప జాతీయాలకు ఎక్కువ వివరణ అవసరము వుండదు. ఇలాంటి వ్యాఖ్యానాలు అన్నింటికి వ్రాసుకుంటు పోతె అది ఒక పెద్ద దొంత��గా తయారు కాగలదు. ఒక జాతీయాన్ని ఎన్నో విధాలుగా వాడు తారు. కాని స్థూలంగా అర్థం ఒక్కటే. ఉదహరించే టప్పుడు ఒక చిన్న మాటను వాడితె సరి పోతుందని. ఆ విధంగా జాతీయాలు భాషకు భలాన్ని, అందాన్ని, ఆతిశయోక్తి కాకపోతె ప్రాణాన్ని కూడా పోస్తున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. +కలహాల మారి స్త్రీకి పర్యాయ పదమే రంక లాడి. +రంగడికీ లింగడికీ స్నేహం రొట్టెకాడ గిజగిజలు +ప్రతిష్ఠ కోల్పోవడం. ఇంత కాలం రహస్యంగా సాగిన వ్యవహారం బయట పడి అసలు విషయం తెలిసి పోవడం +లోపాలను వెతకటం/ ఇతరులు చేసిన పనిలో తప్పులను వెతకడం +అసలు విషయము తెలిసి పోయిందని అర్థము: కొంత కాలంగా దాచిపెట్టిన విషయము బయట పడితే ఈ మాటను వాడుతారు. +తీవ్రమైన బాధ రంపం]]తో దుంగలను కోసేటప్పుడు ఒక్కసారిగా దుంగ తెగి పడక చాలాసేపు పదునైన రంపపు పళ్లు కోతకు గురవుతుంటాయి. ఆ స్థితి మానవ శరీరానికి మనసుకూ కలిగితే ఆ బాధ వర్ణనాతీతం. శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎవరైనా మరొకరిని తీవ్రంగా బాధించటం. ఆ సందర్భంలో ఈ మాటను వాడుతారు. +రంభ గూడు అంటే స్వర్గం.రంభను కూడడం అంటే రంభను చేరడం రంభ ఉండేది స్వర్గలోకంలో కనుక అక్కడికి వెళ్ళాడు అంటే స్వర్గస్తుడయ్యాడు, మరణించాడు అని. +లోపాలను వెతకటం/ ఇతరులు చేసిన పనిలో తప్పులను వెతకడం. +దోచుకుతినడం నిజంగా మనిషి శరీరంలోని రక్తాన్ని బయటకు తీసి తాగకపోయినా అలా హింసిస్తే ఎంతటి బాధ కలుగుతుందో ఉదా: వాడొట్టి రక్తం తాగె రాక్షసుడు. ఎవరినైనా ఎక్కువగా బాదిస్తుంటే ఈ జాతీయాన్ని వాడుతారు. +రతిలో సిగ్గు రణములో భీతి కొరగావు +రాందాళి .రామరావణ యుద్ధంలో రామదండు, వానరసేన చేసిన దాడి.తగాదా, కొట్లాటలు .అందరూ వచ్చి ఒక్కసారి మీద పడి దాడిచేయటం. +[[నాటకం సవ్యంగా సాగితే రససిద్ధి కలిగి ప్రేక్షకులు ఆనందిస్తారు. ప్రదర్శనలో అపశ్రుతులు ఎదురైతే ప్రేక్షకులు నవ్వుతారు. దీన్నే రసాభాసం అంటారు. ఆటంకం కలిగి కార్యం చెడిపోవటం అన్నదానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +అమిత వేగంగా వెళ్ళటం, అభివృద్ధి బాగా జరగటం, దూసుకువెళ్ళటం +ఎక్కువగా గౌరవ, ఆదరాలను రాజుగారికి జరిగినంత గొప్పగా చూపటం ఉదా: వానికి రాచమర్యాదలు బాగా జరిగాయి. +చాల కష్టపెడుతున్నారని అర్థం: ఉదా: ఆ అత్తగారు కోడలిని రాచి రంపాన పెడుతున్నది. +లోకం తీరు.పెద్ద పెద్ద వాళ్లను, నీతీనిజాయితీపరులను వాస్తవాలు ఏవీ లేకుండానే పరోక్షంగా నిందించటం.చక్కగా ప��ిపాలించే రాజును కూడా అసూయాపరులు పరోక్షంగా ఆయన వ్యక్తిగత విషయాలనూ, ఆయన తల్లి, భార్య లాంటి వారి ప్రవర్తననూ విమర్శిస్తుంటారు.చాటున ఎన్నైనా అంటుంటారు. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు +మంచికిపోతే చెడు ఎదురైందన్న భావన గోస అంటే కష్టం శ్రీరామచంద్రుడు చాలా మంచివాడే. ఆయన తన తండ్రిమాట వినాలనుకుని మంచికిపోయి వనవాసం, భార్యావిరహం లాంటి కష్టాలను పొందాడు. ఇదంతా మంచికోసం పోయినందువల్లనే జరిగింది. +చక్కని సంసారానికి, చక్కని జంటకు, చక్కని సంసారానికి, అందానికి సీతా రాములతో పోల్చడము జనవాడుక. అలాగే మరేదైనా అన్ని విధాల చాల చక్కగా అమరి వుంటే దానిని ఈ జాతీయంతో పోల్చి చెప్పడం ఆనవాయితీ అయిపోయింది. ఈ నాటికి ఈ జాతీయము చక్కని వాడుకలో ఉంది. +రాముడికి సహకరించిన వానరసేన లేక కోతిమూక అయితే ఇది సామాన్యమైన కోతి మూక కాదు. ఆంజనేయ, సుగ్రీవ, జాంబవంతాది మహా బలవంతులున్న కోతి మూక. ఎవరికైనా అండదండగా అధికసంఖ్యలో సహాయకులు కానీ, సమర్థించే వారు కానీ ఉన్నప్పుడు అలాంటి వారిని రామదండు అంటారు. +అంతా సుభిక్షమైన పాలన అని అర్థం. +రావణుడి సంతతి కూడా దుర్మార్గాలకే పాల్పడుతుంది అని. +రావణుడిలాగా అధర్మంగా, అడ్డ దోవల్లో అనైతికంగా ప్రవర్తించటం. విచ్చలవిడిగా తిరగటం. +ఎడతెరపి లేకుండా సదా రగులుతూనె వుందని అర్థ; ఉదా: ఆ వ్యవహారం రావణ కాష్టంలాగ ఎంత కాలమైనా రగులుతూనె ఉంది. +''తెలగాణ సమస్య రావణ కాష్టంలాగ ఇంకా రగులుతూనె ఉంది." +ప్రయత్నం చేయటం ఉదా: ఉద్వోగానికి అన్ని పరీక్షలు రాయి. ఏదో ఒకటి తగలక పోదు. ఒక రాయి విసిరి నందున నష్టం లేదు కదా +విమర్శించడం ఉదా: అందరు వాని నెత్తిన రాళ్లు వేస్తున్నారు. +మితి మీరిన అనుబంధం కలిగి ఉండటం ఎంతో స్నేహపూర్వకంగా ఆప్యాయత అనురాగాలు అవధులు లేకుండా ఉండటం వంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +అవాంతరాలు, అడ్డంకులు కలగటం, అభివృద్ధికి ఆటంకం ఏర్పడటం +దుర్మార్గుడు. ఎవరైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఈ జాతీయాన్ని వాడుతారు. +ఎదుటివారు భయంతో బాధపడుతుంటే చూసి ఆనందించే నీచ స్వభావం +పూర్తిగా అవగాహన చేసుకోవటం, దానిమీద సాధికారత సంపాదించటం, ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ విషయాన్ని చెప్పగలగటం. +అణచివేయటం, అభివృద్ధి జరగకుండా నిరుత్సాహ పరచటం, ఎదుగుదలకు ఉపకరించే వాటిని, అభివృద్ధికి అవసరమయ్యే వాటిని అందుబాటులో లేకుండా అడ్డుకొనే స్థితి +చాల ఎక్కువ కస్టపడి అని ఈ జాతీయానికి అర్థం> +రొట్టెలోడి కంటే ముక్కలోడి పని హాయి అన్నట్లు +పెద్దపెద్ద పనులు చేసి కొద్దిగా సంపాదించే వారికన్నా చిన్న చిన్న పనులు చేసి ఎక్కువగా సంపాదించేవారే నయం అని. ఓ చోట రొట్టెల దానం జరుగుతోందట. ముందొచ్చిన వారందరికీ పూర్తి రొట్టె ఒక్కొక్కటి లభించింది. చివరికొచ్చేసరికి ఒకడికి ఒక్క రొట్టె కూడా మిగలకుండా పోయిందట. దాంతో అందరూ అతడికి తమ రొట్టెలోని ఒక్కొక్క ముక్క తీసి ఇచ్చారట. +పనిని బట్టి పాట. కోతలు కోసేకాలంలో ఆడ కూలీలు శ్రమని మరచి పోయేందుకు పాడినట్లు.అలాగే రోట్లోవేసి దంచేదప్పుడు పాడే పాట. సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా సువ్వీ కావేటిరంగా, ఆటలలో, పాటలలో ఆయాసం మరచిపోయి ఆనందం పొందగలుగు ధన్యజీవులు. +ధాన్యం రోట్లో వేసి రోకళ్ళతో దంచుతూ ఉండే సమయంలో కొన్ని ధాన్యపు గింజలు ఎగిరి రోలున్న పరిసర ప్రాంతాల్లో పడుతూ ఉంటాయి. అక్కడికొచ్చిన కోళ్ళకు శ్రమ పడకుండానే ఆహారం లభిస్తుంది. శ్రమ లేకుండా సుఖభోగాలు, సంపదలు వూరకనే లభించటం. అలాంటి వారి గురించి ఈ మాట పుట్టింది. +ప్రమాదంలో ఇరుక్కోవటం రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరవటమేమిటి? అనే సామెత ఉంది. రోట్లో తలదూరిస్తే వూపిరాడక పోవటం సహజం. ఆ తలను బయటకు తీయాలన్నా శ్రమతో కూడిన పనే. ఎటు చూసినా అలా కష్టాలే. అలాంటి కష్టాల్లో ఇరుక్కోవటం + + +ల అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +[[ఆంగ్ల భాష]]లో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +చాల పెద్��� ఇల్లని అర్థం: ఉదా వారిది లంకంత ఇల్లు. +లంకల్లో పచ్చ గడ్డి బాగా వుంటుంది. ఆ గడ్డి మేయడానికి ఈదు కుంటూ గోదారి దాటాలి. అలా బాగా మేసి తిరిగి గోదారి ఈదు కుంటూ వచ్చేసరికి ఆ తిన్నదంతా ఈద డానికి సరిపోయింది. ఇక మిగిలింది ఏమి లేదు. +ఇది వ్వాపారంలో వచ్చే లాభం కాదు. దీనికి ఉపయోగము లేదని అర్థం: ఉదా: లాభంలే వాడు దొరకడు గాని మనం తిరిగి ఇంటికెళ్లి పోదాము. +కుమ్మక్కయ్యారు: ఉదా: ఆ దొంగలు పోలీసులతో లాలూచి పడ్డారు. +మెడలో శివలింగాన్ని ధరించిన జంగందేవర ఓ దొంగ కంటపడ్డాడు. ఆ దొంగ నుంచి తప్పించుకోవడానికి పరుగు లంకించుకుని ఇల్లు చేరాడు కానీ పరుగెత్తేటప్పుడు అతడి మెడలో ఉన్న శివలింగం అటూ ఇటూ ఊగుతూ డొక్కల్లో పొడుచుకుని పోటు పెట్టిందట దొంగపోటు కంటే లింగపోటు ఎక్కువ య్యిందని ఆ జంగం పరుగెత్తుతూ అనుకుంటాడు. +మరణించడం మనిషిగా పుట్టిన తరువాత ఈ లోకంలో చేయాల్సినవన్నీ దేవుడి ఆజ్ఞ మేరకు చేసినట్లు, ఆయన లెక్కకట్టిన విధంగా జీవించాల్సిన రోజులు గడిచిపోయాక మరణం ప్రాప్తిస్తుందనే భావన +ఖాతరు చేయడము లేదు ఉదా: నేనంటే వానికి లెక్కేలేదు. +వాడికంటూ ఏమీ లేదు అంతా ఇతరులదే.ఇతరుల మీద ఆధారపడి పని చేసేవాడు, అస్వతంత్రుడు, నిష్ప్రయోజకుడు. అంకె మీద ఆధారపడి మాత్రమే సున్నా తన విలువను పెంచుకొంటుంది. +పారి పోయింది: ఉదా: ఆమే అతనితో లేచి పోయింది. +అనవసర ఇబ్బందులు తలనొప్పిని ఎవరూ కావాలని తెచ్చుకోరు. ఇబ్బందులను, అడ్డంకులను కోరి మరీ తెచ్చుకున్నట్టుగా ఎవరైనా ప్రవర్తించిన సందర్భం +పేదరికం అభివృద్ధికి ఆటంకం, ఏ రంగంలో అభివృద్ధి చెందాలన్నా ఎంతో కొంత సంపదలు కలిగి ఉండాలన్న భావన +లేవనెత్తటం, విషయ ప్రస్తావన, ప్రశ్నలను లేవదీయటం, సమస్యలను లేవనెత్తటం చర్చలో అప్పటివరకు అక్కడ లేని సమస్యలను సృష్టించి ప్రస్తావించటం +ప్రస్తావించడం, కిందపడిన దేన్నైనా పైకి ఎత్తడం, పదిమంది మధ్యలో ఉన్నప్పుడు అందరికీ తెలిసేలా చెప్పడం +పట్టించు కోకు. ఉదా: వాని మాట్లను లైట్ తీస్కో. +బాగా ఆనందించడం .మనసుకు నచ్చిన, రుచికరమైన పదార్ధాలను, విషయాలను చూస్తున్నప్పుడు అసంకల్పితంగానే నోట్లో లాలాజలం ఊరడం, లొట్టలేసుకుంటూ తినటం . +పటుత్వం రహితం, వదులుగా ఉండటం ఎక్కువగా మాట్లాడె వాళ్ల గురించి ఈ మాటను వాడతారు. ఉదా: వాడు లొడ లొడ వాగు తున్నాడు. +లారీ మీద ఎక్కువ లోడు ఉండటం చేత భారంగా కదలాల్సివస్తోంది.మద్యపానం చేసిన వ్యక్తి కూడా బరువుగా కదులుతూ వస్తున్నట్టు కనిపిస్తాడు. వాడు లోడు మీదున్నాడు, వాడితో నీకెందుకు తప్పుకో' అంటారు +అన్ని అంతరంగంలో దాచుకునే వాడు: ఉదా: వాడు లోతైన మనిషి. ఎవ్వరికి అర్థం కాడు. + + +వ అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +[[ఆంగ్ల భాష]]లో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +మెలికలు, మెలికలుగా ఉండటం, ఎక్కువ వంకరలు తిరిగి ఉండటం అడ్డదిడ్డంగా నడవటం +అతి వినయంగా బానిసలా వంగి వంగి దణ్ణాలు పెట్టడం +అనుకోకుండా దొరికింది: కూరకు ఏమి లేదే అని అనుకుంటుంటే ఒక కుందేలు వంటింట్లోకి వచ్చినట్ట్లు. +ఒకరు ఒక విషయాన్ని ప్రతిపాదిస్తే ఇంకొకరు దాన్ని సమర్థించటం బుర్రకథలో ప్రధాన కథకుడికి అటూఇటూ ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. +నటన. పదిమంది ముందూ సోదరిగా పిలుస్తూ, అలా భావిస్తున్నట్టు నటిస్తూ ఆమె ఏకాంతంగా దొరికినప్పుడు దుర్భుద్ధితో ప్రవర్తించటం. +వెంటనే, క్షణాలలో, శీఘ్రంగా. ఉదా వక్కకొరికినంత సేపట్లో వచ్చేస్తా వక్కకొరికినంతలో అనగా వక్క కొరకడానికి అతి స్వల్ప సమయము పడుతుంది. ఉదా: వక్కకొరికినంతలో వచ్చేస్తా అని అంటారు. ఈ జాతీయము రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ వాడుకలో ఉంది. ఇలా అతి తక్కువ సమయాన్ని సూచించడానికి ఈ జాతీయాన్ని వాడుతారు. +పనికిరాని వాటిని పక్కన పెట్టి పనికొచ్చే వాటిని మాత్రమే ఎంపిక చేయటం +బంగారమంటేనే అధిక విలువైనది అని అర్థము. కాని బంగారంతో నగలలో కొంతైనా రాగి లాంటి ఇతర లోహాలు కలిసి వుంటాయి. ఆయా ��స్తువుల గట్టితనానికి ఆమాత్రం కలపడం తప్పని సరి. అల కాకుండా దాన్ని కూడా వడబోస్తే బంగారాన్ని వడపోస్తే వచ్చేది స్వశ్చమైన బంగారం. దానిని అపరంజి బంగారం అని కూడా అంటారు. దానిలో ఏ మాత్రం కల్తీ లేదని అర్థం. అటువంటి స్వశ్చతను తెలియ జేయడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదా: ఒక పురుషున్ని, స్త్రీని గాని పోల్చాలంటే అతను వడబోసిన బంగారం. అని అంటుంటారు. +వేగంగా దూసుకుపోవటం. వాడిని చూడు వడిసెల రాయిలా దూసుకుపోతాడు' అంటారు +అయిన వారందరికీ దూరంగా పోయి కష్టాల పాలవటం. +వరిగడ్డి మంట పెడితే కట్టెలులాగ అది నిలచి మండదు మంట పెట్టిన వెంటనే పెద్దగా మండి చప్పున చల్లారి పోతుంది. అలాగే పెద్దగా కోపం వచ్చి వెంటనే తగ్గిపోతే అలాంటి వారిపై ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. దీనికి సమానార్థంలో మరొక జాతీయమున్నది అది తాటాకు మంట]] +తమ వైపు ఆకర్షించటానికి చేసే ప్రయత్నం. ఉదా ఆ పార్టీ వారు మన వాళ్లకు వల వేసి లాగుతున్నారు. +విపరీతంగా ఏడవటం వారు వల వల ఏడుస్తున్నారు) +వయస్సులో ఉన్నప్పుడు తాను ఎన్నెన్నో గొప్ప గొప్ప పనులు చేశానని ముసలాయన గర్వపడుతూ కబుర్లు చెప్పటం. +ప్రేమకొద్దీ కడుపార తినబెట్టడం అత్తగారింటికి కొత్త అల్లుడు వచ్చినప్పుడు ఆ అత్త ఆల్లుడికి ప్రేమకొద్దీ తెగ తినపెట్టిందట. దాంతో అల్లుడు బయటకు రావాలంటే ఆ ఇంటి వాకిళ్ళను వూడబెరికి పెద్ద ద్వారాలు పెట్టాల్సి వచ్చిందట. +శక్తిహీనుల అతిశయం.ఏమాత్రం హానికరం కాని బెదిరింపులు ఎదుటి వారికి ప్రమాదమేమీ లేని శక్తిహీనుల కోప ప్రదర్శన/ చేత కాని వాని కోపము/ ఇలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. +అనగా మాట్లాడలేక పోతున్నాడని అర్థము. మాట్లాడడానికి సందేహిస్తున్నాడు. అటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు.వాని నోట్లో కరక్కాయపడ్డది/వానినోట కరక్కాయ కొట్టినాను +ఎంతో ఎంతో ఎక్కువ అని వాముల కొద్దీ తెచ్చి పడేసినా వీళ్ళు తినడానికి చాలడంలేదు అంటారు. +సరైన జోడి .వాసానికి తగిన విధంగా కూసాన్ని చెక్కి అమర్చితే తప్ప సరైన అమరిక కుదరదు. గంతకు తగ్గ బొంత లాంటిది +ఎంత పెద్ద మర్రిచెట్టు విత్తనమైనా చిన్నదిగానే ఉంటుంది.అలాగే మనసులో విచారం కలిగిందంటే అది మనసంతా ఆవరించే పెద్ద బాధనే కలిగిస్తుంటుంది. +సమానంగా పెట్టుబడి పెట్టకుండా నామమాత్రపు పెట్టుబడి పెట్టి చివరకు లాభాలు మాత్రం అందరితో సమంగా కావాలని కోరటం.ఎ��పెట్టే రోజున వచ్చి కాసిని విత్తనాలు చల్లి వెళ్ళిపోయి పంటకుప్ప నూర్చే సమయానికొచ్చి మిగతా అందరితో సమానంగా వాటా కావాలని పట్టుపట్టడం. +ఏ విత్తనం విత్తితే ఆ మొక్క మొలిచి చెట్టవుతుంది పెద్దలు తమ పిల్లలకు ఎలాంటి అలవాట్లను పద్ధతులను నేర్పితే పెద్దయ్యాక వారు ఆ పద్ధతులతోనే కనిపిస్తారు. +దృఢ నిశ్చయంతో ఉంటే చిన్న చిన్న చికాకులు, అడ్డకుంలు ఏవీ లెక్కలోకి రావు.డొంకలో దాక్కుంటే పిడుగుపాటు తప్పుతుందా?పిడుక్కి గొడుగు అడ్డమా? +ధర్మపాలన కోసం సొంత వారిని త్యాగం చేసేవాడు. ఒక రాజకీయ పక్షంలో ఉండి అక్కడి విషయాలన్నింటినీ ఎదుటి పక్షం వారికి తెలియజెప్పి స్వపక్షాన్ని దెబ్బ తీసేవాడు. అటువంటి వారినుద్దేసించి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. +గర్వించటం బోర విరుచుకు తిరగటం, నడ్డి విరుచుకు తిరగటం +ద్వేషాన్ని ప్రదర్శించడం, కల్లోలం చేయడం, ఇతరుల గురించి చెడునే ప్రచారం చేయడం +అత్యంత ఆసక్తితో చూస్తుంటే ఈ మాట వాడతారు. +విపరీతంగా నవ్వుతుంటే ఈ మాట అంటారు +మిత్రపక్షాలవారి మధ్య వచ్చే తగాదా .సరదా కోసం చిలిపి తగాదాలు గొడవలను అంతగా పట్టించుకోవల్సిన పనిలేదు. +పిల్లల్ని కొడతానని బెదిరించడము. ఉదా: పిల్లలూ అల్లరిచేస్తే వీపు విమానం మోత మోగుతుంది. సాధారణంగా బడి పిల్లలనుద్దేశించి పంతుళ్ళు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. +అభిప్రాయ భేదాలు బయటపడడం అల్లరి చేయడం/ ఇంటి గుట్టు అందరికి చెప్పేయడం. +అధికమైన కోపావేశాలతో ప్రవర్తింఛటం. వీరభద్రావతారం ఎత్తడం .దక్షయజ్ఞం విధ్వంస సమయంలో వీరభద్రుడు మహా ఉగ్రుడుగా ఉంటాడు +విజయాలను ఎదురులేకుండా సొంతం చేసుకోవడం శత్రువులను జయిస్తూ ఆనందంగా ఎలా ముందుకు వెళ్ళటం, వెళ్ళిన ప్రతిచోటా విజయాలను సాధించటం +అసహాయ స్థితికి చేరడం. ఇల్లూ వాకిలి అన్నిటినీ పోగొట్టుకుని వీధిలోనే గడపాల్సిన పరిస్థితి +సారంలేని పని, ప్రయోజనంలేని వ్యవహారం, విషయంలేని మాటలు, పొట్టు వూక దంపుడు ప్రయోజన శూన్యమైన పని.ఊక అనగా వడ్లగింజపైనుండే పొట్టు. వడ్లను దంచితే పైపొట్టు పోయి బియ్యం బయడ పడతాయి. అందుకే వడ్లను దంచుతారు. కానీ ఊకను దంచితే ఏమి ఫలితముండడు. ఆ అర్థంలో అనవసరంగా వ్వర్థ ప్రసంగం చేసేవారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ఉటంకిస్తారు. వ్వర్థం అనే అర్థంలో. +సాంబ్రాణి పొగ పూనకం రావటానికి ఆ వూదు పొగే కారణమన్న భావనతో ఒకరు ఇంకొకరిని ఏదైనా పనికి ఉసిక��ల్పినప్పుడు 'వాడొచ్చి ఏదో వూదు పొగేశాడు. అప్పటి నుంచి వీడు ఇలా అంటున్నాడు అంటారు. +వూరట చెందడం తెరిపిన పడటం ఉదా: వాడు నన్ను ఊపిరికూడ పీల్చుకోనివ్వకుండా తొందర పెడుతున్నాడు +అస్థిత్వం కాపాడు కోవటం వూపిరులూదటం అంటే ప్రాణం పోయటం. +ప్రోత్సాహాన్ని ఇవ్వటం .చెప్పిన మాటలు వినగానే మంచి వూపు మీద వెళ్ళాడు అంటారు +ఎక్కువ సంతోషంగా ఉండటం అనుకూల పరిస్థితులు ఉండటం +నిర్లక్ష్య బుద్ధిని ప్రదర్శించటం, అసమర్థంగా వ్యవహరించటం తన సొంతపనిని బాగా చేసుకోవటం పది మందితో కలసి చేసే పనిలో శ్రద్ధ వహించక పోవటం. గుంపులో గోవిందం లాంటిది. +వూరి వారి బిడ్డ ,వేశ్య అతి సామాన్యులు, అంతగా గుర్తింపు లేనివారికి జన్మించిన సంతానం వూరి వారి బిడ్డను రాచబిడ్డ కొడితే రాచవారి బిడ్డను దేవుడే కొడతాడు అని సామెత. +వెతకబోయిన తీగ కాలికే తగిలినట్టు.పరిస్థితులు సంపూర్ణంగా అనుకూలించడం, కాలం కలసిరావడం.కావల్సినవి సమీపంలోనే ఉన్నాయని తెలుసుకోటం,వెతుకున్నవారు ఎదురవటం +దడపుట్టటం విపరీతమైన భయం కలగటం భయంకరమైన పరిస్థితులు ఎదురవటం +ప్రధానమైనది, ఆధారమైనది. వెన్నెముక శరీరంలో ప్రధానమైనదే. కాని ఇక్కడి విషయం అది కాకూడదు. ఉదా ఈ వ్యవహారంలో పలాన వ్వక్తి వెన్నెముక లాంటి వాడు అంటారు. +సందర్భానికి తగని పని మొత్తుకోవటమంటే రోదించటం అని అర్థం. ఇంట్లో దొంగలు పడ్డారని అలికిడై తెలిసినప్పుడు పెద్దగా మొత్తుకుంటే ఆ శబ్దం విని ఇరుగుపొరుగు వారు వచ్చి రక్షించటానికి అవకాశం ఉంటుంది. ఇది సందర్భోచితమైన పని. అదే ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు తగలబడుతుంటే ఎలాగో ఒకలాగా బయటకు పరుగెత్తి రావాలి కానీ, అక్కడే కూర్చొని రోదిస్తూ ఉంటే ఎవరో వచ్చే దాకా మంటలు ఆగవు. కనుక అప్పుడు మొత్తుకోవటం సందర్భోచితం కాదు. అలాంటి వారిని గురించి ఈ జాతీయము పుట్టినది. +తీవ్రత తగ్గటం, వైరం తగ్గటం, కోపం తగ్గటం +సహాయంగా ఉండటం .తోడ్పడటం. ఉదా: వాడు చేసిన సహాయం మాకు వేన్నీళ్లకు చన్నీళ్లు కలిపినట్లున్నది +అంతర్గత కలహాలతో విడిపోవడం వేరుకుంపటి.విడిపోయి ఎవరికి వారు స్వతంత్రంగా ఉండడం ఉమ్మడి కుటుంబం విడిపోయినప్పుడు ఎవరికివారు వేరుగా కుంపట్లు పెట్టుకుని ఎవరి వంట వారు వండుకుంటారు. +తప్పు పట్టలేరని అర్థం: ఉదా: వాని పనిలో ఎవరూ వేలు పట్టి చూపలేరు. అంత కచ్చితంగా పని చేస్తాడని అర్థం. +ఇతరుల పనులలో అనవసరంగా కల్పించు కున్న���డని అర్థం. ఉదా: వాడు అనవసరంగా వారి పనిలో వేలుపెట్టి మాటలు పడ్డాడు. +అతిజాగ్రత్తగా పరిశీలించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మామూలుగా రెండుకళ్లతో సునిశితంగా పరిశీలిస్తేనే చాలా విషయాలు ఇట్టే తెలిసిపోతుంటాయి. అలాంటిది వేయికళ్లతో పరిశీలిస్తే ఏ విషయంలోని సారమైనా ఇట్టే అవగతమవుతుంది. +తప్పనిసరిగా ఆచరించి తీరాల్సింది వేదాలు ప్రమాణాలు. అలాంటి వేదాలు చెప్పింది ఎవరైనా ఆచరించి తీరాల్సిందే అనే భావన +ఉద్ధృతం కావటం ఉదా; వారి మాటలు రాను రాను వేడెక్కుతున్నాయి +విపరీతంగా కష్టాలకు గురిచేయటం, బాధలు పెట్టడం .మొక్కపాదులో వేడివేడి నీళ్ళను పోస్తే ఆ మొక్క బతకదు.వేరు తవ్వి వేణ్ణీళ్ళు పోయటం.= +వెనకా ముందు అలోచించ కుండా వెళ్లి పోవడాని వేలం వెర్రి అంటారు. +చాల చిన్న వాడని అర్థము ఉదా: వాడు వేలెడంత లేడు అప్పుడే వాని కెన్ని బుద్ధులో అని అంటుంటారు.. +అత్యంత సాధారణం, సహజం అదేమంత గొప్ప విషయం కాదులే అని +చేతికుండే అయిదు వేళ్లూ ఒకలాగా ఉండవు.లావుగా, పొడవుగా ఉండే వేళ్ళను మాత్రమే ఉంచుకుని మిగతా వాటిని తీసేస్తే ఎలా ఉంటుందో మనుషుల మధ్య అంతరాలను పాటిస్తూ పేదవారిని నిరాదరించటం కూడా అలాగే ఉంటుంది. దేని విలువ దానిదే, ఎవరి విలువ వారిది. +వేసిందే ఒక గంతు విరిగిందే ఒక కాలు +అనుభవ రాహిత్యం.శాస్త్ర బద్ధంగా కాక ఏదో వచ్చీరానట్టు చేయటం.అరకొరగా పనిచేశానని అనిపించటం. +చాలా మితంగా, పరిమిత సంఖ్యలో ఉండేవి: ఉదా: ఆ సభకు వచ్చిన వారిని వేళ్లపై లెక్కించ వచ్చు. +చేసిన పనిలో వంకలు పెట్టలేరని అర్థం; ఉదా: వాడు పని చేస్తే ఎవరు వేలు పెట్టి చూప లేరు. +చాల బాదిస్తున్నారని అర్థం. ఉదా: వారు తన తండ్రిని బాక వేయించుక తింటున్నారు. +ఉదా: ఎరా చెప్పిన పని చేయ కుండా వేషాలేస్తున్నారు. + + +శ అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +[[ఆంగ్ల భాష]]లో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +అంచనాలకు అందనిది .శనగలు కాసినప్పుడు అవి ఆకుల కిందకు ఉంటాయి. ఆకు పచ్చరంగులోనే అవి ఉంటుంటాయి. శనగ పంటను పీకే సమయానికి ఆకులు ఎండి ఉంటాయి. అప్పుడు కాయలు కూడా ఆ ఆకుల రంగుకే వస్తాయి. ఇలా శనగ పంట ఎంతపండింది అని అంచనా వేయటానికి మొక్క ఆకు పచ్చగా ఉన్నప్పుడు, మొక్కను పీకినప్పుడు కూడా సాధ్యపడదు +పెద్దలిచ్చిన ఆస్తుల్ని శనగపప్పుల్లా నమిలేసి వ్యర్థం చేసి దరిద్రాన్ని అనుభవించటం. అల్లాలు బెల్లాలైంది, హారతి కర్పూరమైంది అనికూడా అంటారు. +కష్టాలెక్కువైతే ఈ మాట వాడతారు: ఉదా: వానికి శని పట్టినట్టుంది. వానికి అన్ని కష్టాలె. +గట్టిగా పట్టుబట్టడం ఉదా: వారు ఆ పనికొరకు శత పోరుతున్నారు +చాల నిసితంగా పరిశీలించారు అని అర్థం: ఉదా: అతనిని శల్య పరీక్ష చేసి గాని లోపలికి పంప లేదు. +ఆంగ్లభాష లో bone test అనగా (ఎముక పరీక్ష) దానినే మనం శల్య పరీక్ష అని అంటున్నాం. +తప్పకుండా చేస్తాననడం: ఉదా: నీమాట నాకు శిరోధార్యం: తప్పక చేస్తాను. +ఇదొక ఊత పధం: చాల వాటికి శివ శివా అని సంభోదిస్తుంటారు. ఉదా: శివ శివ ఎంత పని జరిగింది. +ఉదా: వాడెందుకు శివాలెత్తినట్టు ఊగి పోతున్నాడు. +తారుమారు కావడం తల కిందకు, కాళ్లు పైకి ఉండేలా ఆసనం వేస్తారు. అంటే కాళ్లు ఉండాల్సినచోట తల, తల ఉండాల్సినచోట కాళ్లు ఉంటాయి. ఉదా: ఒక పనిని సాదించ డానికి తలకిందులుగా అనగా పెద్ద ప్రయత్నం చేయడం. +ఎదుటి వారికి మాత్రమే చెప్పె నీతులు. ఉదా: వాడు చెప్పేవన్ని శ్రీ రంగ నీతులు. వాడు చేసేవన్ని దొంగ పనులు. + + +ష అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +[[ఆంగ��ల భాష]]లో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +దెబ్బ తీశాడని అర్థం: ఉదా: వాడు నాకు బలే షాక్ ఇచ్చాడు. +షష్ఠి తిథి నాడు ఏపనిచేసినా ముష్ఠి యుద్ధం లాంటి తగాదాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. +అంతా ఒకటే అని అర్థం: ఉదా: వాడేం ఎక్కువ గాదు వీడు తక్కువ గాదు అంతా షరా మామూలె. + + +స అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +[[ఆంగ్ల భాష]]లో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +ఇదొ ఊత పధం: చాల సందర్భాలలో దీన్ని వాడతారు. +చాల కష్టపడి అని అర్థం ఉదా: వాడు ఎట్టకేలక్లు సచ్చీ చెడి వచ్చాడు. +ముగింపు చెప్పడం. స్వస్తి చెప్పడం ఉదా: వారు ఆ పనికి స్వస్తి పలికి వెళ్లి పోయారు. +సరకులు అయి పోయాయని అర్థం: ఉదా: ఇంట్లో సరకులన్నీ నిండు కున్నాయి +జగన్నాథుడు కొలువుండే పూరీ క్షేత్రంలో అన్ని కులాల వారూ ఆ దేవుడి ముందు సమానమే. అక్కడ ఒకే విస్తరిలో అందరూ కలిసి ప్రసాదం తింటారు. +ఏమాత్రం వీలు కాదు అని అర్థం: ఉదా: నేనక్కడికి వచ్చే సమస్యే లేదు. +పూర్తిగా ఇచ్చివేయడం: ఉదా: వాడు ఆ పనికి లంచం సమర్పించుకున్నాడు. +సంస్కృతంలోని పంచతంత్రంలో ఈ మాట కనిపిస్తుంది. +ఒక రాజకుమారుడు అడవికి వెళ్లి పెద్ద పులి వచ్చేసరికి భయంతో చెట్టుపైకి ఎక్కాడు. ఆ చెట్టుమీద అంతకుముందే ఉన్న ఎలుగుబంటు భయపడకు అని అతనికి ఆశ్రయం ఇచ్చింది. చెట్టుకింద ఉన్న పులి చెట్టు ఎక్కలేక, ఆ ఎలుగుబంటును కిందకి తోసి తన ఆకలి తీర్చమని, ఆలా చేస్తే రాజకుమారుడిని తను ఏమీ చేయనని చెప్పింది. రాజకుమారుడు ఎలుగుబంటును కిందకి తోసేసాడు. అయితే ఆ ఎలుగు అదృష్టం బాగుండి, కొమ్మలను పట్టుకుని కిందపడకుండా ప్రాణాలు కాపాడుకుంది. తనకు నమ్మకద్రోహం చేసిన రాజకుమారుడు తన గతం అంతా మర్చిపోతాడని శపించింది. రాజుగారు అడవిలో వెతికించి రాజకుమారుడిని కోటలోకి చేర్చాడు. కానీ అతను ససేమిరా అనే మాట తప్ప మరొక మాట మాట్లాడేవాడు కాదు. తరువాత మంత్రి ద్వారా జరిగిన విషయం తెలుసుకుంటూ ఉండగా ఆ విషయాలన్నీ రాజకుమారుడు కూడా వింటూ ససేమిరా, సేమిరా, మిరా, రా అంటూ ఒక్కో మాటతో పూర్వ స్థితికి వచ్చాడుట. ఈ గాథ క్రమంగా జనవ్యాప్తిపొంది కథలో శాప ఫలితం వల్ల కాక రాజు కొడుకు మొండితనం వల్ల, అజ్ఞానం వల్ల ససే మిరా అనేవాడని భావించి, ఏం చెప్పినా, ఎవరు చెప్పినా వినని వాడిని ససేమిరా ఒప్పుకోడని చెప్పడం జాతీయంగా మారింది. +ప్రేమ ఎక్కువైతే ఈమాట వాడతారు: ఉదా: వాడు గురువు గారి సంకనెక్కాడు. +అడ్డంకులు తొలగడం: ఉదా: వాడి సంకెళ్లు ఈ నాటికి తెగి పొయాయి. ఇక వానికేఅడ్డంకి లేదు +ఎక్కువగా అల్లరి చేస్తుంటే ఈ మాట వాడతారు. ఉదా: సంత గోల లాగ వున్నది. అందరు కొంత సేపు నిశ్శబ్దంగా వుండండి. +ఇదొక ఊత పదము ఏదైనా కాస్త నిరుత్సాహానికి గురైతే సచ్చింది గొర్రె అని అంటుంటరు. +సొర్రకాయలు కోయటం.గొప్పలు చెప్పుకోవటం, కోతలు కోయటం +ఉదా: నీళ్లు సల సల కాగుతున్నాయి. +ఇంతటితో వదిలేశారు అని అర్థం: ఉదా: ఆ పనికి వారు స్వస్తి పలికారు. +ఇంకా పొడిగించకు అని అర్థం ఉదా: ఇక ఆపెయ్. దాన్ని ఇంకా సాగదీయకు. +పంపించి వేయాలి అని అర్థం: ఉదా: వాడిని సాగనంపాలి. +[[నాయకుడు రథాన్ని తోలేవాడు ఉదా: ఈ వ్వవహారంలో సారధి వాడె. +ఇదొక ఊత పదం: చాల సందర్బాలలో దీని వాడుతారు. +అన్నం అంతా చూడక్కర్లేదు. ఒక్క మెతుకును పట్టిచూస్తే చాలు.స్థూలంగా పరిశీలించినా సులభంగా విషయమంతా అర్థమయ్యే పరిస్థితి. +ఉదా: ఆర్నెల్లు వానితో కలిసి వుంటే వాడు వీడౌతాడంటారు. ఆ సందర్భంలో ఈ మాట పుట్టింది. +ఆర్నె���్లు సావాసం చేస్తే వాడు వీడౌతారంటారు. +అభిప్రాయ భేదాలు జుట్టు జుట్టు పట్టుకొని తన్నుకొనేదాక రావటం +ఏ పనీ చేయకుండా వూరక వూరి మీద పడి తింటూ తిరిగే వాడు.గ్రామదేవతకు సమర్పించేందుకు నిర్దేశించిన గొర్రెపోతును వూరివారంతా తెగ మేపుతుంటారు. +చాల చిన్న విషయం అని అర్థం: వివరణ: గతంలో ఓడ రేవులలో సరుకులతో ఒక ఓడ రేవుకు వచ్చిందంటే దాని రాకను తెలియ జేస్తూ శంఖారావం లాంటి శబ్దం చేసే వారు. దాంతో ప్రజలు, వ్వాపారస్తులు పొలోమని ఓడ వద్దకు వెళ్లి తమకు కావలసిన వస్తువులను తెచ్చుకునె వారు. ఓడ రాకను తెలియచేసేదే సింగి నాదం ఒక ఓడ రేవులో అన్నీ సార్లు జీలకర్రే వచ్చేది. సింగి నాధం వినపడినా ప్రజలు ఓడ వద్దకు వెళ్లే వారు కాదు. ఆ ఏ ముంది జీల కర్రే గదా అని అనుకుని మిన్నకుండి పోయే వారు. ఆ విధంగా పుట్టినదే ఈ మాట సింగినాధం జీలకర్ర. +ప్రతిభను గుర్తించి సన్మానించటం.రెండువైపులా సింహపు తలల్లా బొమ్మలు ఉండే బోలు కడియాన్ని తొడిగి సత్కరిస్తారు. +గొప్ప భలవంతుడు అని అర్థం ఇది జాతీయం కాదేమో?) +ఒక విషయానికి సంబంధించిన పూర్వాపరాలన్నింటినీ జాగ్రత్తగా ఆలోచించడం +పెద్ద భాగమని అర్థం: ఉదా: ఈ వేటలో వానిదే సింహ భాగం. +సిరి సంపదలను కోల్పోయినా జీవనశైలి మారకపోవటం.పదవులను కోల్పోయినా, అధికారాలు అంతరించినా డాబు, దర్పం ప్రదర్శించటం. +తిరుగు లేనిది అనే అర్థంలో వాడుతారు. +నిలిపివేయడం చెయ్యాల్సిన పనులన్నిటినీ ఒక వరుసక్రమంలో రాసుకుని ఏది ముందు, ఏది వెనుక చేయాలి, దేన్ని చెయ్యకుండా వదిలేయాలి అని ఆలోచించేటప్పుడు చెయ్యకుండా వదిలేయాల్సిన పని దగ్గర సున్నా చుట్టడం ఓ అలవాటు +ఆశ్రిత పక్షపాత ధోరణి.తన వారికే అన్నీ సమకూర్చుకుంటూ ఇతరులను ఇబ్బందులపాలు చేయటం +ఆకస్మిక పర్యటన ఎక్కడా ఎక్కువసేపు నిలవకుండా పర్యటన +అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతుంటే వాడి ఇలా అంటారు. ఉదా: నీసుత్తి కొట్టుడు భరించలేను ఇక ఆపెయి. +తిరుగులేనిది వాడి మాటంటే సుదర్శనం చక్రమే. +నీతులు చెప్పడం: తాను చేసేది మంచి పనులు కాకున్నా ఇతరులకు నీతులు చెప్పే వారిని గురించి ఇలా అంటారు. ఉదా: వాడు పెద్ద సుద్దులు చెప్పొచ్చాడు. వాడి బాగోతం ఎవరికి తెలియదు. +నీతులు బోధించటం వాడు సుమతి శతకం చెపుతున్నాడు. +ఎత్తి పొడుపు మాటలు అంటున్నారని అర్థం: ఉదా: వాని సూటి పోటి మాటలు విన్నావా? +సురసురలాడుతూ త్వరగా మండే లక్షణాలున్నవాడు ఉదా: వాడు సురె కారం లాంటి వాడు.ఉట్టిగనె కోపం వస్తుంది. +ప్రధాన కారకుడు, ప్రధాన వ్యక్తి నాటక ప్రదర్శనలో నాయికా నాయకులు, ప్రతినాయకుడు, విదూషకుడు ఎంత మంది ఉన్నా వారందరినీ ఎవరు ఎప్పుడు ఏం చెయ్యాలో నిర్దేశించి చెప్పేవాడు సూత్రధారుడు. +అత్యంత అల్పం. కౌరవ సభలో ధుర్యోధనుడు పాండవులకు సూది మొన మోపినంత స్థలం కూడ ఇవ్వనన్నాడు. +ప్రత్యేక గుర్తింపు లేని వాడు. ఉదా: ఎవడో సూరమ్మ మొగుడు వచ్చాడు ఎవరికేంతెలుసు. +చెత్త ప్రశ్నలు వేస్తున్నారు ఉదా: పిల్లలూ సొప్ప దంటు ప్రశ్నలు వేయకండి రా? +నష్టం కలగడం, పెట్టుబడిసొమ్మంతా నష్టమై మానసికంగా వ్యధ మిగలటం. +తన గురించి గొప్పలు చెప్పుకోవడము కోతలు కోయడం. ఉదా: వాడు సొరకాయలు బాగా కోస్తాడు. వాని మాటలు నమ్మకండి. +చాల ఆశగా చూస్తున్నాడని అర్థం: ఉదా: చూడు వాడు ఆ అమ్మాయిలను చూసి ఎలా సొంగ కారుస్తున్నాడో. +తమ ఇంటికి వచ్చారని అర్థం: ఉదా: తుపానుకు చెల్లాచెదురైన ప్రజలు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. +తన గురించి తానె గొప్పలు చెప్పుకోవడం: ఉదా: వానికి అసలు లేదు గాని సొంత డబ్బా బాగా కొట్టుకుంటాడు. +అనవసరపు విషయాలను చెప్పుతున్నాడు: ఉదా: వాడు ఒట్టి సోది చెప్పుతున్నాడు. +ఆనవాలు ఏమాత్రం లేకపోవటం .సోదిలోకి మరణించినవారు, దేవతలు వస్తూ ఉంటారు.సోదిలో పోయిన వస్తువుల గురించి తెలుసుకుంటారు.అలాంటి సోదిలోకి కూడా రాకుండా పోవటమంటే సంపూర్ణంగా ఏమాత్రం ఆనవాళ్ళు లేకుండా నశించటం +మస్కా కొడుతున్నాడు, ములగ చెట్టెక్కిస్తున్నాడు, చార్మీనార్ ఎక్కిస్తున్నాడు, పైకి లేపుతున్నాడు ఇవన్ని ఒకే అర్థాన్ని ఇస్తాయి. వీటన్నింటికి అర్థం ఎదుటి వాడి మెప్పు పొందడానికి అతన్ని పొగడడము. + + +హ అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. +ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. +"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. +[[ఆంగ్ల భాష]]లో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +హద్దుల్లో వుంటేనే ఆడది హద్దు దాటితే గాడిద +హనుమంతుడు లంకలో వున్నప్పుడు రారణాసురుని ఎదుట కూర్చోవడానికి రారణుని సింహాసనానికి కన్నా ఎత్తైన వేదికను తన తోకను పెంచి దానితో చేసిన వేధికపై కూర్చున్నాడని పురాణ కథనం. అనగా అతి పొడవైనదని అర్థం. అతి పొడవైనదని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఇలాంటిదే మరొక జాతీయం కూడా ఉంది కొండవీడు చాంతాంత అని. +ప్రత్యేక గుర్తింపు, ప్రతిభ లేని వాడు.అనామకుడు. భార్యచాటు మొగుడు, నారాయణమ్మ మొగుడు అనికూడా అంటారు. స్వంత గుర్తింపు లేని వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడుతారు. +ఉదా: హమ్మయ్య వెతుకుతున్నది దొరికింది.ఏదైనా సాధించా విడిచే నిట్టూర్పు +సులభంగా ఖర్చైపోవడం, తొందరగా అయిపోవడం అనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కర్పూరాన్ని హారతి కోసం వెలిగించినప్పుడు కలిగే స్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.హారతి కర్పూరము అతి తొందరగా హరించుక పోతుంది. ధనం, ఆస్తి తొందరగా ఖర్చైన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు ఆస్తంతా హారతి కర్పూరమైంది' అనేలాంటి ప్రయోగాలు ఉన్నాయి. +హరిశ్చంద్రుని నోట అబద్ధం రాదు నా నోట నిజం రాదు +హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన +హస్తకు ఆదిపంట చిత్తకు చివరి పంట +హస్త, చిత్తలు వరుపయితే అందరి సేద్యం ఒక్కటే +హస్తలో అడ్డెడు చల్లేకంటే చిత్తలో చిటికెడు చల్లటం మేలు +హస్తలో ఆకులాడితే చిత్తలో చినుకు పడదు +తిరిగి గెలిచాడు అని అర్థం. మూదవ సారి గెలవడాన్ని హ్యాట్రిక్ సాధిచాడు అని అంటారు +హీనకాంతి దీపం యింటికి చేటు మొగమాటపు పెళ్ళాం మొగుడికి చేటు +హేమా హేమీలు ఏట్లో కొట్టుకుపోతుంటే, నక్క పాటిరేవడిగిందట +హేమాహేములు అనే రూపంగా కూడా కనిపించే ఈ జాతీయం అన్నింటా గొప్పవారు, సమర్థులు అనే అర్థంలో వ్యవహారంలో ఉంది. కొన్నిచోట్ల మోసగాళ్లనే అర్థంలో కూడా వాడడం జరుగుతోంది. ఇవి ఎవరైనా ఇద్దరికి సంబంధించిన పేర్లా? అసలీ హేమా హేముడు అనేవారు ఉన్నారా? వారివల్లనే ఈ జాతీయం వచ్చిందా? అనేవాటిని గురించి ఇంకా పండితలోకంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా కడు సమర్థులు, అందరికంటే గొప్పవారు అనే అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది వారికేమండీ హేమాహేమీలు, ఎలాంటి పనినైనా సాధించగలరు' అనేలాంటి ప్రయోగాలు గమనార్హం. +కఠినాత్ముడని అర్థం: ఉదా: వాడు హృదయం లేని వాడు: దయా గుణం అసలు లేదు. కఠినాత్ముడు. వారిని గురించి ఈ జాతీయాన్ని వాడుతారు. +దీనంగా దేవుడిని ప్రార్థించడము: ఉదా: హే భగవంతుడా ఎన్ని కష్టాలొచ్చాయిరా +ప్రాణం పోయిందని అర్థం, లేదా జీవుడు ఎగిరి పోయాడని అర్థం హంస అనగా శరీరంలోని జీవుడు అని అర్థము) +హంస నడకలు రాకపోయే ఉన్న నడకలు మరిచిపోయే + + +"జాతీయములు" లేదా జాతీయాలు ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి వేటూరి ప్రభాకర శాస్త్రి నేదునూరి గంగాధరం బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు. +[[ఆంగ్ల భాష]]లో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. +సామాన్యంగా జాతీయాలను పని గట్టుకొని ఎవరు పుట్టించరు. అలా పుట్టించినా అవి కలకాలం ప్రజల నోళ్ళలో వుండవు. జాతీయములు ఒక భాషలో సహజంగా పుట్టి ప్రజల నోళ్ళలో నానుతుంటాయి. తరతరాలుగా అలా వాడుకలో వుంటూనే వుంటాయి. +కొన్ని జాతీయాలను సామెతగాను, సామెతలను జాతీయాగాను పొరబడు సందర్భాలున్నాయి. నిజానికి ఈ రెండు వేరు వేరు. సామెతలోని అర్థం సంపూర్ణము. ఉదాహరణ: సామెత గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట కాకిపిల్ల కాకికి ముద్దు తిన్నింటి వాసాలు లెక్కపెట్టడము ఇలా ఇందులో అర్థ సంపూర్ణము. దాన్ని అన్వయించడములో కొంత తేడా కనబడుతుంది. జాతీయములో అర్థం అసంపూర్ణం. సగం వాఖ్యమే వుంటుంది. జాతీయము: ఉదాహరణ కడతేర్చాడు కడుపు మంట కన్నాకు అగ్గినిప్పు పంటపండింది పంటికిందరాయి పక్కలోబల్లెం ఇలా వుంటాయి. పైగా వాటి నిజార్థాలు వేరుగా వుంటాయి. మరొక అర్థంలో వాటిని వాడతారు. ఉదాహరణకు పంట పండింది. అనగా అతని వరిపంట పండిందని అర్థం కాదు. అతనొక గొప్ప విజయము సాదించాడని అర్థము పప్పులో కాలేశాడు అనగా పప్పులో నిజంగా కాలేశాడని కాదు గదా. అనగా పొరబడ్డాడు అని అర్థము. ఇంతటి గూడార్థమున్నా జాతీయాలు సామాన్య మానవులు చదువులేని వారికి సైతం అర్థం అయి వారే ఎక్కువగా వాడు తుంటారు అందుచేత జాతీయాలు ఆ భాషకు ఆభరణాలు అని చెప్పవచ్చు. +(అకారాది క్రమంలో వివిధ జాతీయాలు ఇవ్వబడ్డాయి. ప్రక్కనున్న లింకుల ద్వారా ఆయా వ్యాసాలకు వెళ్ళవచ్చును) +తెలుగు జాతీయాలు బూదరాజు రాధాకృష్ణ, ప్రగతి పబ్లిషర్స్, 1999. +* జాతీయ సంపద తెలుగు నేర్చుకునేవారికి సామెతలు, జాతీయాలు, భవిష్యనిధి వివరణలతో, ఆరి శివరామకృష్ణయ్య, 2008. + + +ఆలూ పన్నీర్ చాట్ తయారు చేయు విధానము +బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము వేసి ఓ నిమిషం వేయించాలి. తరువాత పన్నీర్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, బటానీలు వేసి మరో నిమిషం వేయించాలి. ఇప్పుడు ఆమ్ చూర్, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర, కాస్త కారప్పూస చల్లి వడ్డించ వచ్చు. + + +| all అన్ని అనాథ పేజీలు + + + + + +ఉసిరి సాంబార్ ఒక శాకాహార వంటకము ఉసిరి కాయ]]లు ఎక్కువగా దొరికే సీజన్ లో దీనిని తయారుచేస్తుంటారు. + + +ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కాకరకాయ పులుసు. అది తయారుచేయు విధానం తెలుసుకుందాం. వీటిలో రకరకాల పులుసులను చేస్తారు. ఉదాహరణకు "కాకరకాయ పులుసు కాకరకాయ నువ్వుల పులుసు" +* శనగ పప్పు 3 స్పూన్స్ +చింతపండు 20 నిముషాలు నానపెట్టి, జారుగా చింతపండు గుజ్జు పులుసు తీసి పెట్టుకోవాలి. +* ఉద్దిపప్పు,శెనగపప్పు,వేరుశనగ విత్తనాలు, నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. +* కాకరయాలు పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి. +* పచ్చి మిరపకాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. +* బానలి పెట్టి3 స్పూన్స్ నూనె వేసి, వేడి అయ్యాక,1/4 స్పూన్ ఆవాలు వేసి చిట చిట అన్నాకా, ఇంగువ పసుపు వేయాలి. +* తరువాత పొడవుగా కట్ చేసిన కాకరకాయలు, పచ్చి మిర్చి వేసి బాగా కలిపి మూత పె��్టాలి. +* తరువాత మూత తీసి, ముక్కలు బాగా వేగినాక, చింతపండు పులుసు వేయాలి. +* తరువాత చింతపండు పులుసులో ముక్కలు బాగా ఉడికినాక, గ్రైండ్ చేసిన పొడి, కారం వేయాలి. +* తరువాత గుజ్జు గట్టి పడుతుంది.(చాల గట్టిగా ఉంటే కొద్దిగా నీరు వేసుకోవచ్చు) +* తరువాత తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. +* చివరి లో కరివేపాకు వేసుకోవాలి. +* ఎంతో రుచిగా ఉండే కాకరకాయ గుజ్జు/కాకరకాయ పులుసు రెడి. ఇది అన్నంలో కి బాగుంటుంది. +* నువ్వుల పొడి 4 స్పూన్స్ +* ధనియాల పొడి 1 స్పూన్ +* పోపు గింజలు 1 స్పూన్ +* ముందుగా కాకరకాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. +* చింతపండు నానపెట్టి బాగా గుజ్జు తయారు చేసుకోవాలి. +* అర కప్పు నీళ్ళలో వేసి నానబెట్టాలి. తరువాత నువ్వులను వేయించి పొడి చేసుకోవాలి. +* తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత కాకరకాయ ముక్కలు వేసి 10 నిముషాలు వేయించిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. +* ఇప్పుడు బాణలిలో పోపు పెట్టి, వేగాక చింతపండు గుజ్జు, అరకప్పు నీళ్ళు పోసి బాగా కలపాలి. తరువాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి. +* ఇప్పుడు అందులో బెల్లం కలిపిన నీళ్ళు, నువ్వుల పొడి వేసి మూత పెట్టి ముక్కలు బాగా మెత్తగా అయ్యేవరకు ఉంచి దించెయ్యాలి. +* అంతే రుచికరమైన కాకరకాయ నువ్వుల పులుసు తయార్. + + +* గోదుమ పిండి నాలుగు కప్పులు. +* కాలిప్లవర్ తురుము 2 కప్పులు, +* ముందుగా గోదుమపిండిని చపాతి పిండిలా ముద్దగా కలపి పక్కన పెట్టుకోవాలి. +* తర్వాత మిర్చి, కొత్తమీర అల్లం ఒక వుల్లిపాయ లను సన్నగా తరిగి, దీనిని, తగినంత కారం, ఉప్పు, గరంమసాల లను సిద్ధం చేసుకున్న కాలిప్లవర్ తురుముతో కలపాలి. +* ఒక చపాతి పైన కాలిప్లవర్ మిశ్రమాన్ని కొంత పలచగా చపాతి మధ్యలో పరిచి దానిపై రెండో చపాతిని పెట్టి చపాతి కర్రతో సున్నితంగా ఒత్తి ఒక గుండ్రని మూతి గల గిన్నెను (చపాతి సైజు) దానిపై బోర్లించి గట్టిగా అదిమితే రెండు చపాతిలు అంచుల వద్ద అతుక్కొని ఒక పరాటలాగ వుంటుంది. +* దానిని చపాతి కాల్చే పెనంపై కొంత నూనె రాసి చపాతిలాగ సన్నని సెగపై కాల్చుకోవాలి. +* తయారైన కాలిప్లవర్ పరోటాలు వేడివేడిగా తినడానికి ఇవి చాల రుచి]]గా వుంటాయి. వీటికి వేరే కూర అవసరం లేదు. + + +బియ్యం 2 కప్పులు (శుభ్రంగా కడిగి, పది నిముషాలు నానబెట్టుకోవాలి) +*ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలు చేసుకోవాలి) +*టమోటా: 1 (చిన్న ముక్కలు చేసుకోవాలి) +*పచ్చి మిర్చి: 2 (చిన్న ముక్కలు చేసుకోవాలి) + + +పాలకూర పకోడీ ఒక రకమైన పకోడీ +పాలకూర తరిగినది మూడు కప్పులు (సన్నగా కట్ చేసుకోవాలి) +పుదీనా రెండు టేబుల్ స్పూన్లు (సన్నగా కట్ చేసుకోవాలి) +* వేడి చేసిన నూనె 2 టేబుల్ స్పూన్లు +* ఒక గిన్నెలో శెనగ పిండి, బియ్యప్పిండి, కారం, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి వేడి చేసిన నూనె, కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. +* తరువాత అందులో తరిగిన పాల కూర ముక్కలు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టు కోవాలి. +* ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి కాగిన తర్వాత పకోడీకి తయారుచేసుకున్న పిండిని కొద్దికొద్దిగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే పాలకూర పకోడీ తయారైనట్టే. +* దీనిని వేడి వేడిగా తింటే చాల రుచిగా వుంటుండి +* నిలువ వుంచు కోవడానికి, గాలి పోకుండా డబ్బాలో దాచి ఉంచుకుంటే వారం రోజులు పాడవకుండా ఉంటాయి + + +పూర్ణం బూరెలు లేదా కుడుం బూరెలు ఒక ప్రత్యేకమైన బూరెలు +* బూరెలు వండడనికి మూడు గంటలు ముందుగా చోవి (బూరె పైన తొక్క కోసం) తయారుచేసుకోవాలి. దీనికోసం మినప పప్పు నానబెట్టి; గంటతర్వాత మెత్తని కాటుకలా రుబ్బి, ఆ రుబ్బినపిండిలో బియ్యపు పిండి పోసి కలిపి, చిటికెడు ఉప్పు వేసి గిన్నె మీద మూతపెట్టి ఉండనివ్వాలి. ఈ పిండిని కనీసం మూడు గంటలన్నా నానబెట్టాలి. +* శనగ పప్పు తక్కువ నీరుపోసి బాగా ఉడకనివ్వాలి. పప్పు చేతితో పట్టుకొని నొక్కి సూస్తే చితికిపోవాలి. తర్వాత పప్పులో నీరుగనక ఉంటే వంచేసి తరిగిన బెల్లం లేక చక్కెర పోసి ఉడకనివ్వాలి. ఈ మాదిరిగా పాకం పెట్టడం వల్ల బూరెలు రెండురోజులున్నా చెడిపోవు. +* ఏలకులు వొలిచి గింజలు పొడుంలాగా దంచుకోవాలి. కొబ్బరి సన్నంగా ముక్కలు తరిగి నేతిలో చేయించుకోవాలి. +* పాకం గిన్నెలోని పప్పుని గరిటెతో బాగా కుమ్మి, అందులో ఏలకులపొడి, కొబ్బరిముక్కలు వేసి, నేతితో బాగా కలిసేటట్లు పిసికి, తరువాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. +* పొయ్యిమీద బూరెల మూకుడు పెట్టి, నూనె మరిగాక, ఒక్కొక్క పూర్ణపు ఉండ సిద్ధంగా ఉంచుకున్న చోవిలో ముంచి, నూనెలోవేసి, ఎర్రగా వేగాక తీసి విడిగా పెట్టుకోవాలి. బూరెచోవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. +*బూరె చోవిలో బియ్యం పిండి ఎక్కువ కలిపితే, వేగా��� బూరెలు పైన కరకరలాడుతూ ఉంటాయి. మినప పిండి ఎక్కువ కలిపితే చల్లారిన తర్వాత మెత్తబడి సాగుతాయి. + + +మనం ఎక్కువగా వాడని ఆకుకూరల్లో ఒకటి బచ్చలి కూర కానీ ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో జరిపిన ఒక పరిశోధనలో మెగ్నీషియం మనలో చురుకుదనాన్ని పెంచే పోషకాలలో ఒకటి. కాబట్టి సాధ్యమైనంత తరచుగా బచ్చలిని తీసుకోవడం మంచి అలవాటు. +* బచ్చలి కూర 1 కట్ట +* బియ్యపు పిండి 2 చెంచాలు +* బచ్చలి కూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా ఉదికించుకోవాలి. +* పెరుగు చిలికి మజ్జిగ చేసుకోవాలి.తరువాత మజ్జిగలో బియ్యపు పిండి కలిపి ఉడుకుతున్న కూరలో కలపాలి. +* తరువాత సొంటి పొడి వేసి అడుగు అంటకుండ కలుపుతు ఉడకనివ్వాలి . +* ఉడుకుతుండగా ఈ మిస్శ్రమం చిక్కగా తయారవుతుంది +* తరువాత గిన్నె దించి నెయ్యితో పోపు వేసుకుంటే బచ్చలి కూర పెరుగు సిద్ధం + + +['long'] జనవరి 1 ఫిబ్రవరి 2 మార్చి 3 ఏప్రిల్ 4 మే 5 జూన్ 6 జూలై 7 ఆగస్టు 8 సెప్టెంబరు 9 అక్టోబరు 10 నవంబరు 11 డిసెంబరు 12}, + + +# నువ్వు పప్పు 100 గ్రా, +# బియ్యం కడిగి ఆరనిచ్చి పిండి పట్టించాలి. 1 కి 5 చొప్పున కొలతలో నీరు తీసుకోవాలి. 1 కొలతలో పిండిని జారుగా కలుపుకొని, మిగతా కొలతను ఎసరు పెట్టుకోవాలి. +# మరిగిన ఎసరులో ఈ పిండిని కొంచెం కొంచెంగా పోస్తూ తలపెట్టి నూరిన పచ్చిమిర్చి, జీర, నువ్వుపప్పు ముద్దను మరిగే పిండిలో వేసి బాగా కలిపి ప్లాస్టిక్ పేపర్ మీద వడియలుగా పెట్టుకుని +# రెండు రోజులు బాగా ఎండబెట్టి తీసి నిల్వ పెట్టుకోవాలి. +==బియ్యం పిండి జంతికల వడియాలు 2 +# జీలకర్ర, పచ్చి మిర్చి మెత్తగా పేస్టు చేసుకుని ఓ ప్రక్కన పెట్టుకోవాలి. +# బియ్యం పిండిని నీళ్ళలో కలుపుకుని పెట్టుకోవాలి. +# వేరొక గిన్నెలో నీళ్ళలో ఉప్పు, జీలకర్ర మెత్తగా నూరిన పేస్టు, కలిపిన బియ్యం పిండి వేసి బాగా ఉం డలు కట్టకుండా పిండిని కలుపుతూ ఉండాలి. +# అది దగ్గరగా ఉడికిన తర్వాత (చూడ్డానికి మనకు ఉప్మాలా కని పించాలి +# జంతికల దాంట్లో పిండి పెట్టి మనకు కావ లసిన ఆకారంలో వేసు కోవచ్చు. +# రెండు రోజులు బాగా ఎండబెట్టి తీసి నిల్వ పెట్టుకోవాలి. +# ముందుగా పచ్చిమిర్చి, అల్లాన్ని ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి. +# పాత్రలో నాలుగుగ్లాసుల నీటిని పోసి బాగా మరగనివ్వాలి. +# నీళ్లు కెర్లుతుండగా అందులో పచ్చిమిర్చి, అల్లం పేస్ట్‌, ఉప్పు, జీలకర్రను వే���ి కలపాలి. 5నిమిషాల తర్వాత పిండిని అందులో పోస్తూ పెద్ద గరిటెతో పిండి ఉండలు కట్టకుండా బాగా కలియతిప్పాలి. +# 10నిమిషాలు ఉడికించాక దించుకుని వేడిగా ఉన్నప్పుడే త్వరత్వరగా మీకు నచ్చిన సైజులో పెట్టుకోవాలి. పిండి కాస్త పలచగా ఉన్నప్పుడే పెడితే త్వరగా ఆరిపోతాయి. +# పిండి చల్లబడే కొద్దీ చిక్కబడిపోతుంది. అపుడు ఆరడం లేటవుతుంది. పప్పులోకి, సాంబారులోకి ఇవి చాలా బాగుంటాయి + + +[[భౌతిక శాస్త్రము అభ్యసించు విద్యార్థుల కోసం ఆంగ్లంలో గల కొన్ని భౌతిక శాస్త్ర పదాల అర్థాలను సంగ్రహంగా తెలియజేయటం జరిగింది. వాటిలో కొన్ని పదముల నిర్వచనాలను తెలుసు కొనుటకు భౌతిక శాస్త్ర నిఘంటువు ఉపయోగపడుతుంది. +Ammeter అమ్మీటరు(విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం) +Amplification తరంగ కంపన పరిమితి లోని ఆవర్థనం +Butterfly net సీతాకోకచిలుక వల విద్యుత్ పూరణాలు ఉపరితలం పైనే ఉంటాయని తెలియజేసే ఫారడే వల) +Cathode ray tube కేథోడ్ కిరణ ట్యూబ్ ఋణధ్రువ కిరణాల గొట్టము +Dioptre డయాప్టర్ కటకం లేదా గోళాకార దర్పణ సామర్థ్యానికి ప్రమాణం) +Electric pulses విద్యుత్ ప్రవాహ స్పందనలు +Gamma rays గామా కిరణాలు రేడియో ధార్మిక పదార్థం నుండి వెలువడే ఆవేశం లేని కిరణాలు) +Gear పళ్ళ చక్రము లేదా గేరు]] +Geo centric theory భూకేంద్రక వాదము (టోలమిక్ సిద్ధాంతం) +Gravitometer గురుత్వ మాపకం (ఒక ప్రాంతంలో గురుత్వ త్వరణాన్ని కొలిచే పరికరం) +Heleocentric theory సూర్యకేంద్రక వాదము కోపర్నికస్ వాదము) +Hole హోల్ లేదా రంధ్రము (సంయోజక పట్టీలో ఎలక్ట్రాన్ లేమిని హోల్ అంటారు) +Hook's law హుక్ నియమం.(స్థితిస్థాపక హద్దులో ఉన్నంతవరకు స్ప్రింగ్ లో సాగుదల ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.) +Hydro electric station హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషను జల విద్యుత్ కేంద్రం +Inertial frame of reference జడత్వ నిర్దేశ చట్రము (న్యూటన్ గమన నియమాలు పాటించే వ్యవస్థ) +Linear conductors దైర్ఘ్య వాహకాలు, రేఖీయ వాహకాలు, ఓమీయ వాహకాలు +Linear expansion దైర్ఘ్య వ్యాకోచం, రేఖీయ వ్యాకోచం +Lumen ల్యూమెన్ (కాంతి తీవ్రతకు ప్రమాణం) +Magnetic compass అయస్కాంత దిగ్దర్శిని (అయస్కాంత దిక్చూచి) +Newton న్యూటన్(బలమునకు ఎస్.ఐ. ప్రమాణం) ఒక న్యూటన్ అనగా 100000 డైన్లు) +Non inertial frame of reference అజడత్వ నిర్దేశ చట్రం(న్యూటన్ గమన నియమాలు పాటించని చట్రం) +Non luminous అస్వయంప్రకాశకాలు (లేదా) గౌణ ప్రకాశకాలు +Nuclear chain reaction కేంద్రక మాలికా చర్య, కేంద్రక శృంఖల చర్య +Nuclear fusion కేంద్రక మేళనం, కేంద్రక సంలీనం +Random motion క్రమరహిత చలనం, యాదృచ్ఛిక చలనం +Ripples ఏక కేంద్ర వలయాలు లేదా ఏక కేంద్ర తరంగాలు +Rotational motion భ్రమణచలన స్థితి, భ్రమణీయ చలనం +Solar system సూర్య కుటుంబం, సౌర వ్యవస్థ +Specific gravity సాపేక్ష సాంద్రత లేదా తారతమ్య సాంద్రత +Sun dial సౌర గడియారం,నీడ గడియారం పలభా యంత్రము]] +Ultrasonics అతిధ్వనులు,అతి శ్రుతి ధ్వని శాస్త్రము +Wave acoustics తరంగ (ధ్వని) శ్రవణ శాస్త్రము +Wave mechanics తరంగ యాంత్రిక శాస్త్రము + + +# ముందురోజు రాత్రి మినపగుళ్ళను నీళ్ళలో నానపెట్టుకోవాలి. +# మరునాడు ఉదయం మినపపప్పును కడిగి, మెత్తగా గారె పప్పులా రుబ్బుకోవాలి. +# మరునాడు ఉదయం మినపపప్పును కడిగి, మెత్తగా గారె పప్పులా రుబ్బుకోవాలి. +# మిరపకాయల పేస్టుని, ఇంగువను మినపపిండిలో వేసి బాగా కలుపుకొవాలి. +# ఒక తడిపిన పాత చీర మీద కానీ, ప్లాస్టిక్ పేపరు మీద కాని చిన్న చిన్నవి గా ఒడియాలు పెట్టుకొని 2 రోజులు ఎండలో ఉంచితే మినప ఒడియాలు తయారవుతాయి.. +# ప్లాస్టిక్‌ పేపర్‌ మీద కాని, పల్చటి తడి వస్త్రం మీద కానీ ఈ పిండిని చిన్నచిన్న వడియాలుగా పెట్టాలి. + + +మీల్ మేకర్ మంచూరియా తయారు చేయు విధానము +ముందుగా మీల్‌మేకర్‌ను నీళ్లలో నానబెట్టుకుని పదినిమిషాలపాటు ఉడికించుకోవాలి. +అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, బఠానీలను వేసి కొద్దిగా ఉడికించుకోవాలి. +అందులో మైదా, కార్న్‌ఫ్లోర్ పౌడర్, సోయాసాస్, అజినోమోటో, ఉప్పు, కలర్ వేసుకోవాలి. వెనిగర్‌ను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. +ఇప్పుడు ఒక పాత్రలో నూనె పోసి కాస్త వేడి అయ్యాక ఈ ఉండలను వేసి వేసి వేయించుకోవాలి. +మరొక పాన్‌లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేగిన తరువాత వేయించుకున్న మంచూరియాను కలపాలి. కాసేపు ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసి దింపుకోవా లి. మీల్ మేకర్ మంచూరియా తయారు. + + +# ముందురోజు రాత్రి సగ్గుబియ్యాన్ని నీళ్ళలో నానపెట్టుకోవాలి. +# 1 డబ్బా సగ్గుబియ్యానికి 14 గ్లాసులనీళ్ళు పోసి(అంత పలుచగా వద్దనుకుంటే 8 గ్లాసులు సరిపోతాయి) బాగా మరిగించాలి. +# సగ్గుబియ్యం ఉడికి, చిక్కబడే వరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. +# దానిలో మిరపకాయల పేస్టుని కలుపుకొని, బాగా కలియ తిప్పి స్టొవ్ ఆపాలి. +# ఆ మిశ్రమంలో నిమ్మరసం వేసి బాగా కలిపి, చిన్న వడియాలలా గరిటతో పలుచటి ప్లాస్టిక్ పేపరు మీద పెట్టి ఎండలో ఉంచాలి. +# ఈ వడియాలను విడిగానూ అన్నము]]లో నంచుకునీ తినవచ్చు. +# మందపాటి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్‌ మీద ఉంచి, బాగా మరిగించాలి. +# సగ్గుబియ్యం పోసి స్టౌ మంట తగ్గించాలి. +# మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ సుమారు గంటసేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. +# సగ్గుబియ్యం పూర్తిగా కరిగిపోయి, రంగు లేకుండా అయితే అప్పుడు పూర్తిగా ఉడికినట్టి పాత్రను కిందికి దించి, పచ్చి మిర్చిపేస్ట్‌, ఉప్పు, జీల కర్ర, నువ్వులు వేసి కలపాలి. +చల్లారాక ఎండలో గ్లాస్కో పంచె మీద కావలసిన సైజులో వడి యాలు పెట్టాలి. +# బాగా ఎండిన తరువాత వీటిని వేయించుకుని స్నాక్స్‌లా కాని, సాంబారు అన్న ంలో కాని నంచుకుని తింటే బాగుంటాయి. + + +;సేమియా పకోడి తయారు చేయు విధానము +* ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, +* అల్లం పేస్ట్ అర స్పూన్, +* కొత్తిమీర తరుగు రెండు స్పూన్లు, +* స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కాక ఒక కప్పు సేమియా వేసి దోరగా వేయించు కోవాలి. +* ఇంకో గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు నీళ్లు పోసి వేడిచేసి అందులో వేగించిన సేమియా వేసి మెత్తగా అయ్యే వరకు మూతపెట్టి ఉడికించాలి. +* ఉడికించిన సేమియా, శెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర తురుము, బేకింగ్ పౌడర్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడి పిండిలా గట్టిగా కలుపుకోవాలి +* ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసిస్టవ్ మీద పెట్టి వేడిచేసుకోవాలి. +* కలిపి పెట్టుకున్న పిండిని పకోడీల్లా కొద్దికొద్దిగా కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి చిల్లుల గరిటెతో తీయాలి. +* వేడి వేడిగా తింటుంటే బలే రుచిగా వుంటాయి. + + +[[సొరకాయ పకోడి తయారు చేయు విధానము. +సొరకాయ పొట్టుతీసి, తురిమి ఒకటి (మీడియం సైజ్) +ఉల్లిపాయ సన్నగా తరిగి ఒకటి (మీడియం సైజ్) +వెల్లుల్లి రెబ్బలు (సన్నటి ముక్కలు నాలుగు +* చాట్ మసాలా, కారం ఒక్కో టీస్పూన్ చొప్పున +* బ్లాక్ సాల్ట్ అర టీస్పూన్, +కొత్తిమీర తురుము ఒక టేబుల్ స్పూన్, +* శెనగపిండి, బియ్యప్పిండి, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చాట్‌మసాల, కారం, పసుపు, బ్లాక్‌సాల్ట్, కొత్తిమీర తరుగు వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. మిశ్రమం కొంత గట్టిగా వుండాలి. దీనిని ప్రక్కన పెట్టుకొని +* ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు చేసి కాగిన నూనెల��� జార విడవాలి. ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు కాలనిచ్చి చిల్లుల గరిటెతో వాటిని తీసి బ్లాటింగ్ పేపర్ మీద వేస్తే నూనెని పీల్చుకుంటుంది. +* వేడివేడిగా టొమాటో సాస్ తో తింటే చాల రుచిగా వుంటుంది. నాలుగు రోజుల వరకు నిలువ వుంటాయి.. + + +[[హర భర కబాబ్ తయారు చేయు విధానము + + +భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మిక్కిలి పురాతనమైనవి. చాలా లోతైన మూలాలు కలిగి ఉన్నవి. ఇక్కడి హిందూ మతము లేదా సంస్కృతిలో ఋషులు, మునులు ప్రాతఃస్మరణీయులు, పూజనీయులు. ఎంతో ప్రాముఖ్యత కలవారు. వేదాది సకల సాహిత్య, ఆధ్యాత్మిక విజ్ఞానమునకు కర్తలు, విధానకర్తలు, ధరించువారు వీరే. అలాగే, గౌరవము పూజనలు అందుకునే వారు ఆనాటి రాజశేఖరులు. వారి పరిపాలనా దక్షత, పరాక్రమము, ధర్మ నిబద్ధతల వలననే, వారి యెడల ఇంతటి గౌరవము. ఇన్ని శతాబ్దములు దాటినా నిలబడుతోంది. వీరి గురించి ఇతిహాస పురాణముల ద్వారా ఈనాటికీ వినబడుతోంది. వారు స్థాపించిన జీవన విలువలే నేటికి మన దేశమునకు ఆదర్శప్రాయమైనవి. కనుక, వారిని నిత్యమూ స్మరిస్తూ పూజిస్తూ ఉండాలి. వారి మార్గములో నడవాలి. +అట్టి భారతీయ పురాతన రాజవంశములలో సూర్యవంశము చంద్రవంశము చెప్పుకోదగ్గవి. సూర్యవంశము త్రేతాయుగములో బాగా వికసించినది. ఇందులో భాగీరథుల వారు, శ్రీరామచంద్రుల వారు మున్నగు మహా మహిమాన్వతులు జనించారు. వారిని వారి ఆదర్శ జీవనమును నేటికి పూజిస్తున్నాము. అలాగే ద్వాపరయుగములో ప్రధానముగా తెలియబడునది చంద్రవంశము. ఆ వంశములోనే శ్రీకృష్ణ పరమాత్మ, పాండవులు మున్నగు వారు ఎందరో పుట్టారు. వీరందరిలోనూ శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు యొక్క సంపూర్ణ అవతారము. వీరు ఈ చంద్రవంశములో యదువంశములో వసుదేవునికి కొడుకుగా జన్మించి వాసుదేవుడు అయ్యాడు. భూభారనివారణము కోసం అవతరించిన శ్రీకృష్ణునికి సేవచేయడానికి ఆదిశేషువే కాదు దేవతలు యదువంశము దాని పరివారములలో పుట్టి ధన్యులు అయ్యారు. అంతటి యదువంశం పరమ పవిత్రమైనది, బహుధా పూజనీయమైనది. + + +పూర్వము నహుషుండను మహీకాంతుడు నూరు యజ్ఞముల నొనర్చి సురలోకాధిపత్యమును బొందెను. కాని కొండక కారణంబున నగస్త్యమహాముని శాపోపహతుండై యాతండు మానుషరూపంబును గోలుపోయెను. నహుషునకు యతియు, యయాతియు, సంయాతియు, నాయాతియు, వియతియుఁ, గృతియు, నను నార్వురు కొడుకులుండిరి. తండ్రి యనంతరము పెద్దకుమారుండగు యతి రాజ్��మునకు వచ్చెను. కాని యాతఁడు రాజ్యంబు సకలపాపంబులకు మూలంబనియు, దానివలన దేహికిఁ బునర్జన్మంబు సిద్ధంబనియుఁ దలంచి రాజ్యంబును విడనాడి యోగివృత్తి నవలంబించెను. అన్నయుఁ దండ్రియు నీ విధముగా నగుటవలన యయాతి రాజ్యభారమును వహించెను. ఈతఁడు మొదటినుండియు సత్ప్రవర్తనము గలవాఁడు. రాజధర్మమును జక్కగాఁ నెఱింగినవాఁడు. ఎల్లప్పుడు వినయవిధేయతలతోఁ పెద్దలయందు వర్తించుచుండెడివాఁడు. ఇట్టి శుభగుణసంపత్సమేతుఁ డగు యయాతి రాజ్యమునకు వచ్చినప్పటినుండియు రాష్ట్రమునఁగల ప్రజలందఱును సర్వశుభములతో విరాజిల్లుచుండిరి. +టీక కొండొక ఒకానొక; మహీకాంతుడు రాజు; శాపోపహతుండు శాపముచేత దెబ్బతిన్నవాడు +యయాతి సుక్షత్రియ సంజాతుఁ డైయున్నను గర్మ వశమున బ్రహ్మవంశసంజనితయగు దేవయానిఁ బరిణయమయ్యెను. దేవయాని, దైత్యగురుండును, క్షత్రియ ధర్మవిజ్ఞాన పరిపూర్ణుండును, శాపానుగ్రహసమర్థుండును నగు శుక్రాచార్యునకు ముద్దుపట్టియై యుండెను. తేజోనిధియగు భార్గవుని పుత్రికయైన దేవయాని, దేవగురుండగు బృహస్పతి కుమారుఁడైన కచుని శాపంబునఁజేసి యయాతిని బెండ్లియాడవలసిన దయ్యెను. శుక్రుండును బుత్రికాభిప్రాయానుసారము యయాతికి నామెనిచ్చి వివాహమొనర్చెను. కాని వివాహసమయమున నగ్నిసాక్షిగాఁ గైకొన్న పత్నితోఁ గాక, పరకాంతలతో సంభోగింపకుండునట్లుగను, దేవయానియందే సర్వవిధకామోపభోగంబు లనుభవించునట్లుగను శుక్రుండు యయాతివలన ప్రతిజ్ఞ సేయించెను. నాటినుండియు, యయాతి ప్రతిజ్ఞాభంగము వాటిల్లకుండ నేకపత్నీవ్రతమును సలుపుచు, దేవయానివలన యదువు, తుర్వసుఁడు నను నిరువురు కుమారులఁ బడసి ప్రజారంజకముగా పరిపాలన మొనర్చుచుండెను. +దేవయానికి శర్మిష్ఠయను నొక చెలికత్తెయుండెను. ఈమె వృషపర్వుండను దానవేంద్రుని పుత్రిక. కాని తమ గురుపుత్రికయైన దేవయాని నామె యవమానించియుండుట వలన శుక్రుండు వృషపర్వునిపైఁ గోపించి, నిజకుమారికా పరాభవప్రతీకారమునకై యాతని పుత్రికను దేవయానికిఁ బరిచారికగా నొసంగవలయుననియు, లేకున్న శాపబలంబునఁ దానతని వంశచ్ఛేద మొనర్చువాఁడ ననియుఁ దెలియఁజేయ వృషపర్వుండు భయపడి, తనపుత్రికను బరిచారికా సహితంబుగా దేవయానికిఁ బరిచారికగా నొసెంగెను. దేవయాని యయాతినిఁ బెండ్లియాడినప్పటినుండియు శర్మిష్ఠ యామెను గొల్చుచు యయాతియందు బద్ధానురాగముగలదై యుండెను. సహజముగా రాజకుమారికయగుటవలన శర్మిష్�� దేవయానికంటెను జక్కనిదై యుండెను. చక్కదనమునకుఁ బరిపూర్ణమైన యౌవనముతోడై యుండెను. ఇట్లుండగా నొకనాఁడు దేవయాని లేని సమయముఁ గనిపెట్టి శర్మిష్ఠ యయాతికిఁ దన చిత్తము నెఱింగించెను. అతఁడును నామె మనోహరరూప లావణ్యాతిశయంబులకు లోఁబడి తాను గైకొన్న ప్రతిజ్ఞను మఱచి నాటనుండి యామెతో రహస్య సంభోగమున మెలంగఁ జొచ్చెను. కాలవశంబునఁ గ్రమముగా శర్మిష్ఠ గర్భంబును ధరించి ద్రుహ్యుండు, ననువుఁ బూరువు నను మువ్వురు తనయులఁ గాంచెను. అప్పుడు దేవయానికిఁ గల రూపు సర్వముఁ దెలిసిపోయెను. +యయాతి సమయభంగ మొనర్చినందుకై దేవయాని మిక్కిలికోపించి నాథుండు తన్నెంత బ్రతిమాలినను వినక తండ్రియైన శుక్రాచార్యునకు సర్వమును దెలియఁజేసెను. శుక్రుండు నాతని ప్రతిజ్ఞాభంగమునకు సహింపజాలక “నేటినుండి ముదిమి నిన్నలుముకొనుగాక” యని యయాతిని శపించెను. భార్గవశాపోహతుండైన యయాతి కరుణింపవేయని శుక్రుని పాదంబులపైఁబడ నాతఁడు గొంత దయగలవాఁడై యతనికుమారులలో నెవ్వరికైనను దన ముదిమినొసంగి, అట్టివాని యౌవనమును నతండు గైకొని సుఖింపవచ్చుననియు విషయేచ్చాసక్తినశించిన యనంతరము తిరిగి యతనిముదిమిని నాతఁడు గైకొని, కుమారుని యౌవనమును గుమారున కొసంగవచ్చు ననియుఁ దెలియఁ జెప్పెను. +శుక్రుని వాక్యానుసారము యయాతి కుమారుల నందఱిని రావించి నిజ జరాభారమును వహింపుఁడని కోరఁగా యదువు మొదలగు వారెవ్వరును నంగీకరింపకుండిరి. కాని శర్మిష్ఠ కనిష్ఠకుమారుడైన పూరువు మాత్రము తండ్రికోరినప్రకారమాతని ముదిమిని దానుగైకొని, తనయౌవనమును నాతని కొసంగెను. అప్పుడు చిన్నకుమారుని పితృభక్తికి యయాతి సంతసపడి, యదువు మొదలగు తక్కిన కుమారులు రాజ్యభ్రష్టులగుదురనియు; వారియందు సుక్షత్రియత్వము నశించుననియు; యదుసంతతివారందఱును క్షత్రియులుగాఁ బరిగణింపఁ బడరనియుఁ; దుర్వసు వంశంబువారు ధర్మాధర్మ వివేకశూన్యులగు కిరాతులకు రాజు లగుదురనియు; ద్రుహ్య వంశంబువారు ఉపప్లవసంతార్యంబైన దేశంబులకుఁ బాలకు లగుదురనియు; ననువు వంశంబువారు ముదిమి దొఱకొను నంతవఱకు జీవింపక యౌవనంబుననే యకాలమరణంబునకు లోనగుదురనియు; నీవిధముగా శపించి యంతంబునఁ బూరువునకు రాజ్యంబొసంగి, తన ముదిమిఁ దాను గైకొని తపోవృత్తి నవలంబించెను. +యయాతి పెద్దకుమారుండగు యదువు వంశంబు వారందఱును, శాపగ్రస్తులగుటవలనఁ దమ క్షత్రియత్వంబును గోలుపోయి నాటనుండి యాదవు ల���ఁబరగుచు గోరక్షణతత్పరులై మెలఁగఁ జొచ్చిరి. కాని వీరియందును శూరులైన వారు రాజ్యములను స్థాపించి ప్రజాపాలన మొనర్చియుండిరి. కాని సుక్షత్రియత్వమును గోలుపోయిన వారగుటవలన క్షత్రియులెవ్వరును దమతో సమానులుగా యాదవులను గైకొనకుండిరి. ఇట్టి యదువంశమునకే భగవంతుడైన శ్రీకృష్ణుడు సంబంధించి యుండెను. + + +యదువంశోద్భవుఁ డగు శూరుఁడను ధారుణీనాథునకు మారీష యను కాంతారత్నమునందు వసుదేవుం డుదయించెను. వసుదేవుండు పుట్టిన వెంటనే యనిమిత్తముగ నెల్లడల శుభసూచకంబులు పెక్కు గానంబడెను. ఇతఁడు సామాన్యమైన మానవజన్మమును ధరించినవాఁ డు గాఁడు. తొలుఁదొల్త నీతండు సుతపుఁడను ప్రజాపతియై యుండెను. అట్టియెడ ననపత్యతవలన శ్రీహరిఁ గూర్చి యితఁడు పెక్కుసంవత్సరములు తపంబొనర్ప హరియుఁ గరుణించి ప్రత్యక్షమై యేమికావలయునో కోరుకొమ్మని బలుకఁ బుత్రానురాగంబుఁ బెంపున నక్షరంబగు మోక్షంబు నాకాంక్షింపక సుతభిక్షకై యామహామహునిఁ బ్రార్థించెను. శ్రీహరియు నాతని గుణశీలాదులకు మెచ్చినవాడై తానే యాతనికి మూడు జన్మంబుల యందుఁ బుత్రుండై పుట్టుందని తెలియచెప్పి యదృశ్యుండయ్యెను. అదేప్రకారము మొదటిజన్మంబునఁ బృశ్నిగర్భుండను నర్భకుండుగను, రెండవజన్మంబున నాతండు కశ్యపప్రజాపతియైయుండఁ దాను వామనుండుగను శ్రీహరి పుత్రుడై యాతనికి జన్మించియుండెను. మూడవజన్మంబున నీతడు వసుదేవుండను పేరునఁ బుట్టియుం శ్రీహరియు నాతనికిఁ గృష్ణుండనుపేరున నుద్భవించి యిలాభారంబు వాపనుండెను. భగవంతుఁ డీతనికిఁ బుత్రుఁడై జన్మింపనుండెననియే వసుదేవుఁడు పుట్టినప్పు డనిమిత్తముగఁ బెక్కు శుభసూచకములు గానవచ్చెను. +టీక అనపత్యత పుత్రసంతానము లేకపోవుట అర్భకుడు బాలుడు +వసుదేవుఁడు యుక్తవయస్సునందే రాజ్యభారంబును వహించి పెండ్లియీడున దేవకీదేవి యనుకన్యని భార్యఁగాఁ గైకొనెను. దేవకీదేవి దేవకుండను వాని పుత్రిక. దేవకుఁడు దానవనాథుఁడైన యుగ్రసేనునకు సహోదరుడు ఉగ్రసేనునకుఁ గంసుఁడను కుమారుఁ డొకండు గలడు. కంసుఁడు దేవకినిఁ దోఁబుట్టిన దానిగాఁ బ్రేమించుచుండెడివాడు. వసుదేవునకీమె మొదటిజన్మంబున బృశ్నియను పేరునను, రెండవజన్మంబున నదితియనుపేరునను, నిప్పుడు దేవకీదేవియని పేరునను బత్నియయ్యెను. గతజన్మ ద్వయంబునందీమె శ్రీహరినిఁ బుత్రునిఁగాఁ బడసియుండెను. వసుదేవుండును బూర్వజన్మంబుల నీమెతనయెడలఁ చూపి�� పతిభక్తి విశేషంబులకు నలరి, మూడవ జన్మంబునను, నీమెయే తనకు సతికావలెనని నోచినవాఁ డగుటవలన నా ప్రకారమే దేవకీదేవి యాతనికిఁ బత్నియయ్యెను. ఈ దేవకీ వసుదేవులే యదువంశమునకు ముఖ్యులై యుండిరి. అశరీరవాణి పలుకుట +దేవకీ దేవియందు మిక్కిలి మక్కువఁ గల వాఁడగుటవలన ఆమె వివాహానంతరమునఁ జెల్లెలిని మఱిదిని, దగిన విధంబున నరదంబున నిడుకొని కంసుఁడు కొనిపోవుచుండెను. కంసునియందాక్షణమువఱకు దుష్టబుద్ధి యనునది యెంత మాత్రమును లేదు. అతఁడు పుట్టుకవలన రక్కసుండే గాని వర్తనంబువలన రక్కసుఁడు గాఁడు. అట్టి సాధుస్వభావము గలవాఁడగుటవలననే యెంతమాత్రము ను గుటిలస్వాంతుఁ డు గాక, తన చెలియలని, బావను, సురక్షితముగాఁ గొనిపోవుచుండెను. కాని విధిమాత్రము కంసునకు బ్రతికూలముగా నుండెను. అతఁడిట్లు సంతోషపారవశ్యంబున నొడలెఱుంగక యరదంబును నడుపుచుండ నశరీరవాణి యాతనిని సంబోధించి — “కంసా +నిష్టుఁ డవై రథముగడపె । దెఱుఁ గవు మీఁ దన్ +యష్టమగర్భంబు నిన్ను । హరియించుఁ జుమీ।” +అట్ల శరీరవాణి పలికినపలుకులు సెవులకు ములుకులై సోకఁ దోకఁద్రొక్కిన త్రాచువలె బుసఁగొట్టుచు దిగ్గున నరదంబు డిగ్గనుఱికి, నిజప్రాణరక్షణ పరాయణుండై, చెల్లెలినిఁ గొప్పువట్టి పుడమికీడ్చి, యామె ప్రాణంబులను గొనుటకై తన నిశితకరవాలమును బైకెత్తెను. ఆహా। స్వార్థపరాయణత్వమెంత నీచమైనది? ఏకగర్భసంజనితులకుఁ గూడ నొకానొకప్పుడు విరోధంబును బెంపొందించునుగదా? నిజప్రాణరక్షణోద్యోగాసక్తసహోదరీ ప్రాణాపహరణ ప్రయత్నంబున నున్న కంసునిఁ గాంచి వసుదేవుఁడు భయపడినవాఁడై తేరు డిగ్గి యాతనిని సమీపించి “బావా! ఇదేమి యాగడము? ఎన్నఁడో యాపద వచ్చునని యశరీరవాణి వ్రాక్కుచ్చినంతమాత్రమున నీ యట్టి శూరుఁడు భయపడుటయేగాక మీదుమిక్కిలి ప్రేమాస్పదురాలగు చెలియలిని నూతన పాణిగ్రహణోత్సవానందతత్పరయగు చెలియలిని— ఈ విధముగా— ఇంత దయాశూన్యముగా వధింపఁ దలంచుటయా? కంసా। సహోదరియందు నీకుఁ గల ప్రేమయంతయు నశించినదా? నీ చెలియలి ప్రాణము మాత్రము నీ ప్రాణము వంటిదికాదా? పురుషుఁడవైన నీవే ప్రాణరక్షణోపాయము నెఱుంగజాలక సోదరిని జంపనుండ నాడుదియగు నీ తోఁబుట్టువు ఏమి చేయగలదు? ఇదియేనా పౌరుషధర్మము? అదిగాక— +అన్నవు నీవు చెల్లెలికి నక్కట? మాడలు సీర లిచ్చుటో +మన్నన సేయుటో మధుర మంజులభాషల నాదరించుటో +మిన్నుల మ్రోఁతలే నిజము. మేలని చంపకుమన్న మాని రా +వన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేఁడెదన్.” +అని వసుదేవుఁడు దేవకీదేవి ప్రాణములను రక్షించుటకై కంసుని ననేక విధముల బ్రార్ధించెను. కాని యా పాపుని మనస్సు కరుగలేదు. అతని నిశ్చయము మారలేదు. +వసుదేవుఁడు. తన ప్రార్ధనము కంసునియెడ నిష్ఫలమైపోవుటఁ గాంచి నిజసతీమణికి ముప్పు తప్పదని తలంచియుఁ గొంత ధైర్యమవలంబించి ‘కానిమ్ము. ఈ తలోదరి యష్టమగర్భంబుగదా కంసునిప్రాణములు హరించునదియని ఆకాశవాణి తెల్పినది. అట్టియెడ నిప్పుడు నిష్కారణముగాఁ గాంతను గోలుపోవుటేల? ఈమెకుఁ గలుగు శిశువులనందఱిని నీతనికే యర్పించెదను. మీద దేవుఁడేగలడు. ఈఁతడెంత యత్నించినను దైవవిధితప్పదుగదా? కానిమ్ము, చూతము’. అని తనలోఁదాను సమాధానమును బొందినవాఁడై కంసునిఁ గాంచి “కంసా! నీ సోదరిని నిష్కారణముగా నేలచంపెదవు? ఈమెకుఁ బుట్టువారలుఁ గదా నిన్ను సంహరించునది? దానికై నీ వెంత మాత్రమును భయపడనక్కఱలేదు. ఈమెకుఁ గలుగు శిశువులనందఱినిఁ బుట్టినతోడనే నీకప్పగించెదను. ఆ శిశువులను సమయించి నీప్రాణములను కాపాడుకొనుము.” అని తెలియజెప్పెను. +వసుదేవుఁ డట్లు తనకుఁ దెలియఁ జెప్పగానే కంసుఁడును కొంతవఱ కాలోచించి యదియే సమ్మతమని తలంచినవాఁడై “బావా! నీ పల్కులను శిరసావహించెదను. ఆడినమాటను దప్పక యీమెకుఁ గలుగు శిశువులను నాకప్పగింపవలయును సుమా! మాటఁ దప్పినయెడల మీయిర్వురుప్రాణంబులును దప్పిపోవును. ఈ కంసుఁ డెంతమాత్రమను దయఁజూపువాఁడుగాఁడు అని తనమనోనిశ్చయమును వసుదేవునకుఁ దెలియపఱచి యా క్షణముననే వారలనిద్దఱినిఁ గొని తనపురంబునకరిగెను. పురమును బ్రవేశించినవెంటనే కంసుడు వసుదేవుని మాటయందు నమ్మకములేనివాఁడై చెలియలిని, మఱఁదిని, శృంఖలాబద్దులుగ నొనర్చి కారాగృహమందుంచెను. అప్పటికిని నిండార నమ్మకములేనివాఁడై శిశువు పుట్టినతోడనే తనకుఁ దెలియజేయవలసినదని కాప్తులైనవారినిఁ గొందఱిని కాపు పెట్టెను. +దేవకీ వసుదేవులట్లు కంసునివలనఁ గారాగృహవాసమొనర్చుచు సంతతము భగవచ్ఛింతన సేయుఁచు గాలమును గడుపుచుండిరి. ఇట్లు దినములు గతించినకొలఁది, దేవకీదేవి క్రమక్రమముగా గర్భమును ధరింపసాగెను. వసుదేవుఁడును సత్యవ్రతాచరణ తత్పురుషుండగుటవలన గర్భోత్పత్తి యైనవెంటనే పుత్రానురాగమును గూడ లెక్కింపక యాపొత్తుల కందువులను గంసున కర్పించుచుండెను. అతఁడును దయాశూన్యుఁడై యా పసిపాపలను దన నిశితకరవాలమున కెరఁజేయుచు నశరీరవాణి పల్కులు దనయెడల నెట్లు సార్థకంబులగుననియు, దైవవిధి తనకెట్లు ప్రతికూలము కాఁగలదనియుఁ దనకుఁదాను సమాధానము సెప్పికొనుచు నిజసహోదరి యష్టమగర్భంబువలనఁ దనకెంతమాత్రమను బ్రాణహాని సంభవింపనేరదను నమ్మకముతో నుండెను. వసుదేవుఁడును బుట్టినవారు పుట్టినట్లే గిట్టుచుండినను, దుఃఖముల పాలుఁగాక, సంతతము శ్రీ హరి చింతనంబునునఁ దవిలియుండెను. దేవకీదేవియుఁ బురాకృతకర్మఫలంబు ననుభవింపక తీరదను నిశ్చయంబునఁ బుత్రశోకమును దిగమ్రింగుచు దైవమునే నమ్మియుండెను. ఆపదలు ముమ్మరంబుగఁ జుట్టుముట్టిన ముట్టుఁగాక; ధీరస్వభావమెంతమాత్రము జలింపనేరదు. పౌరుషంబు దైవంబును దప్పింపఁజాలదు. + + +దేవకీదేవి యేఁడవ గర్భంబును దాల్చిన వెంటనే విశ్వరూపుండైన హరి గర్భస్థఁడగు జీవునకుఁ గంసునివలన హానిసంభవించునని యెఱింగి, తన్ను నమ్మియున్న యాదవులకు మేలొనర్పఁదలంచినవాఁడై యోగమాయాదేవినిఁ జేరఁబిలిచి “దేవీ! వసుదేవుని భార్యలలో నొకతెయైన రోహిణియను కాంత కంసునివలన నెట్టియాపదను బొందక నందగోకులమున సురక్షితముగా నున్నయది. ప్రస్తుతము దేవకీదేవిగర్భస్థమై యున్నపిండ మాదిశేషునియంశమున వృద్ధింబొందుచున్నయది. కావున నీ నేర్పుకొలంది ప్రయత్నించి యా పిండమునుగొని రోహిణీదేవి గర్భమునఁ జొనిపిరమ్ము. అష్టమగర్భంబున నేనామెకుఁ బుత్రుఁడనై పుట్టెదను. నీవును యశోదయను పొలతికిఁ బుత్రికవై పుట్టుము. జనులందఱును నిన్ననేక విధంబుల ననేక నామంబులలోఁ బూజింపఁగలరు” అని చెప్పి పనిచిన వెంటనే మాయాదేవియుఁ దన యోగమాయ వలన నెవ్వరికిఁ దెలియనిచందమున దేవకీదేవి గర్భమునుకొనివ రోహిణీదేవి గర్భమున నుంచెను. అంత రోహిణియు గర్భంబును దాల్చినదై యొక్క కుమారునిఁ గనెను. ఆపసిపాపఁడు బలముఁ గలవాడగుటవలన, బలభద్రుఁడనియు,లోకరమణుఁడగుటవలన, రాముడనియు, గర్భ సంకర్షణమున సంకర్షణుఁడనియు మున్నగునామములతోఁ దేజరిల్లఁజొచ్చెను.ఈ విధముగాఁ గృష్ణావతారమునకు ముందే నంద గోకులమున బలరామోత్పత్తి యయ్యెను. మాయాదేవియు శ్రీహరి వాక్యానుసారము యశోదగర్భమును జొచ్చెను. +దేవకీదేవి యేడవగర్భమేమైనది ఎవ్వరికిఁ దెలుయకున్నందువలనఁ బౌరులందఱును గడుపు దిగెనని యనుకొనసాగిరి. ఇట్లు కొన్నిదినములు గడుచునప్పటికి, దేవకీదేవి అష్టమగర్భంబును ధరించెను. ఈ యష్టమ గర్భమేగదా తన్ను సంహరించునదియని కంసుఁడు గడు జాగరూకతతోఁ దనవారినిఁ గాపు��చెను. పాపము! వసుదేవునకుఁ బుత్రునెట్లు గాపాడవలయునో తెలియకుండెను. భారమంతయును భగవంతునియందే నిలిపి యాతని చరణసరసీజములే తమకు దిక్కని నమ్మి యారాధించుచు నా దంపతులు దినములు గడుపుచుండ నొకనాటిరాత్రి శ్రీహరి వసుదేవునకుఁ బ్రత్యక్షమై తన్నేమార్గమునఁ గాపాడవలసినదియుఁ దెలియఁజేసి యదృశ్యుండయ్యెను. అప్పటికే దేవకీదేవికి నీళ్ళాడు ప్రొద్దులగుటవలన నొకనాఁటినడురేయినిఁ దారలు, గ్రహంబులు మొదలగునవి యన్నియును శుభగతిని నుండ నామె యొక్క శిశువును గనెను. పిండోద్భవమైన వెంటనే యొరులకుఁ దెలియకుండఁ బూలవానలు గురిసెను. దేవదుందుభులు మ్రోగెను. సురకాంతల నృత్యగీతములు విజృంభించెను. మఱియొకదెస, బ్రహ్మాదిసకల దేవతలును నారదాది సర్వమునీంద్రులును, గైలాసాది సకలభువనంబులును, నాతనిఁగీర్తింపఁదొడంగిరి. ఆహ! ఏమి యా పాపని సౌందర్యము! దేహము నీలవర్ణము. కన్నులు పద్మములు. కంఠహారము కౌస్తుభము. మోము పూర్ణేందుబింబము. అవిఇవి యననేల? సర్వవిధముల శ్రీహరినిఁ బోలియుండెను. ఆపాపని సహజతేజఃపుంజమువలన నా పురిటిఇల్లు చక్కగాఁ బ్రకాశింపఁజొచ్చెను. అట్టి శిశువును వసుదేవుఁడు గాంచి శ్రీహరియే తనకుఁ బుత్రుండయ్యెనని తలంచి, పుత్రానురాగమును బొందక, కేవలము భక్తి పరవశుఁడై యాపాపనికి బ్రదక్షిణపూర్వకనమస్కారం బొనర్చి, ముకుళిత కరకమలుండై “దేవా! సర్వమును నీ యందిమిడియున్నది. నిజముగ నీవు సర్వాత్ముఁడవు. సర్వమయుఁడవు. సర్వేశ్వరుఁడవు. గుణవికారరూపరహితుడవు. జననమరణాదులు నీకుఁ గలుగనేరవు. నీవే పరబ్రహ్మవు. నీ యాజ్ఞలేనిదే తృణమైనను గదలఁజాలదు. భూభారమును తొలగించుటకై నీవిట్లు రూపంబునుగొని యుద్భవించితివేగాని, నీకు రూపోత్పత్తులుగలవా?” యని యిట్లనేకవిధంబులఁ బ్రార్థింపఁదొడంగెను. దేవకీదేవియుఁ బుత్రవ్యామోహంబును బొందక, పరబ్రహ్మస్వరూపంబైన యాశిశువును బలువిధంబుల నుతిసేయసాగెను. ఈ విధముగా సకలమునకు శ్రీహరిజన్మక్రమము తెలిసియుండ మాయాదేవి యోగనిద్రవలన రక్కసకులంబున కెంతమాత్రమును దెలియకుండెను. ఆహా! పరాత్పరుని తత్త్వంబు నెవ్వరు గుర్తింపగలరు? +వసుదేవుఁడు పుత్రరక్షణము తనకుఁ గర్తవ్యమై యుండుటవలన భక్త్యావేశము నణంచుకొని, రక్షణోపాయమును, హరివలన నింతకుమున్నే యెఱింగి యున్నవాఁడగుటవలన, నా పసిబిడ్డను జంకనిడుకొని గోకులమునకు బయలుదేఱెను. యోగనిద్రవలనఁ గావలివారలా సమయంబున శరీరంబులు మైమ���చియుండిరి. వసుదేవున కప్రయత్నముగ నినుపసంకెల లూడిపోయెను. అప్పుడాతండు సప్పుడుగాకుండ మెల్లన నడుగులిడుచు మొగసాలలం గడచి యచిరకాలంబుననే పురంబును నిర్గమించి యమునానదీ సికతాతలంబును సమీపించెను. అచ్చోట యమునయు మురళీగానముచేత ముందు తన్నాబిడ్డ మోహింపఁజేయనుండెనని మేలుదలంచెనో యనునట్లు వసుదేవునకు మార్గమునొసంగెను. అతండును, ననాయాసముగా నదినిదాటి వ్రేపల్లెకుంజని యందు నందునిమందిరంబును ముందుగఁజొచ్చి యందమందనిద్రం బొందియున్న యశోదను డాయంజని, యామెకుఁ దెలియకుండ నప్పుడే పుత్రికారూపంబునఁ బుట్టియున్న మాయాదేవినిఁ దానుగైకొని యాయవ్వశయ్యపైఁ దన పసిగందును బరుండఁబెట్టి మరల నింటికి బయలుదేరెను. ఈ వృత్తాంతమంతయు నొరుల కెంతమాత్రమును దెలియకుండెను. వసుదేవుండట్లు బయలుదేఱి యధాప్రకారముగా నదినిదాటి కారాగృహంబునుజొచ్చి యాయాడు శిశువును దన కాంతకొసంగెను. +పసిపాపయైన మాయాదేవిని, నత్తెఱంగునఁ గొనివచ్చి, వసుదేవుఁడు నిజసతీమణి పురిటి మంచముపై నుంచినంతనే యాబాలిక, రక్కసకులమును మేల్కొలుపుటకో యనునట్లు యేడువఁ దొడంగెను. ఆరోదనధ్వనుల నాలకించి కావలివారలు మేల్కాంచి సర్వము నెప్పటివిధమున నుండుటఁ గని హానియేమియుఁ గలుగలేదను నమ్మకముఁ గలవారై, శిశువు కలిగిన సమాచారము నప్పుడే కంసునకుఁ దెలియఁజేసిరి. అతఁడు నీయష్టమగర్భంబేగదా తన్ను సమయించునది యని రోషకషాయితనేత్రుండై దిగ్గన శయ్యనుండి డిగ్గి, వెండ్రుకలు ముడివీడఁ దాల్మి నశింపఁ బైచీర తొలఁగిపోవఁ దత్తరంబునఁ బురిటి గృహంబును జొచ్చి, యేడ్చుచున్న యాపసిగందును దన నిశితకర వాలంబున కెరఁజేయుటకై, చేపట్టి భయంకరమైన యావాడివాలును పైకెత్తెను. అట్టియెడ దేవకీదేవి పెద్దపెట్టున యేడ్చుచు నాతనికడ్డంబు వచ్చి “అన్నా! అష్టమ గర్భంబునఁగలుగు పుత్రుఁడుగదా నీప్రాణంబులఁ గొనునని యాకాశవాణి పలికినది? నాయష్టమగర్భంబు బాలిక గాని బాలుండుగాడు. ఈ యాడుబిడ్డవలన నీకేమిభయము? దీనిని విడిచిపెట్టుము. అయ్యో! ఇదివఱకే నాకుఁగలిగిన యార్గురుకొడుకులను బట్టి దయాశూన్యుండై వధించితివి. ఇప్పుడీ యాడుబిడ్డనుగూడ నిష్కారణముగా వధింపనుంటివి. నాకుఁ బుత్రలాభము లేకపోయినను, బుత్రీలాభమునైనఁ బొందనిమ్ము. అన్న! ఈ యాడుబిడ్డ నిన్నేమిచేయఁగలదని భయపడెదవు? ఇదియేనా నీకుఁగలపౌరుషము? +అన్న! శమింపుమన్న! తగ దల్లుఁడు గాఁ డిది మేనగోడ లౌ +మన్నన జేయు మన���న! విను మానినిఁ జంపుట రాచపాడి గా +దన్న! సుకీర్తివై మనఁగ దన్న! మహాత్ములు పోవు త్రోవఁ బో +వన్న! భవత్సహోదరిఁ గదన్న! నినున్ శరణంబు వేడెదన్.” +అని యీ విధముగా ననేకవిధంబుల నాతనిఁ బ్రార్థింపఁజొచ్చెను. కాని యామె ప్రార్థనంబుల నాతని కఠిన హృదయ మెంతమాత్రమునుఁ గరుగలేదు. అతని నిశ్చితాభిప్రాయ మణుమాత్రమైనను మారలేదు. బలవంతముగా నా శిశుహంతకుడు ఆదుర్మార్గుడు ఆ కఠినహృదయుఁడు ఆపసిపాపను దల్లిఱొమ్మునుండి గైకొని వెక్కివెక్కి యేడ్చుచున్నను దయలేనివాఁడై పుడమిపయిం బడవైచెను. కాని యాపసిపాప పుడమిపయిం బడక, విచిత్రగతి గగనంబున కెగసి విశ్వరూపంబును దాల్చినదై,లచూచువారలాశ్చర్యపడ నందఱును వినునట్లు “కంసా! నీవెంత యత్నించినను దైవవిధిని దప్పించుకొనజాలవు. నిన్ను సమయించువాఁడిదివఱకే పుట్టిపెరుగుచున్నవాఁడు. క్రూరకర్మమని యెంచక సోదరిబిడ్డల నార్గురినిఁ జంపిన పాపము నిన్నుఁ గుట్టికుడుపక మానునే?” యని పలుకుచు నంతరిక్షంబున నదృశ్యమై పోయెను.కంసుఁడు హతాశుఁడైపోయెను. అచ్చటనున్నవారందఱును విభ్రమచేతస్కులై యుండిరి. +మాయాదేవి పలికినపలుకులు సెవులకు ములుకులై సోకఁ గంసుఁడు కొంతవడికిఁ దెప్పరిల్లి తానొనర్చిన దంతయు నిష్ఫలమైపోయెంగదా యని విరక్తిభావముఁగలవాఁడై మఱందియైన వసుదేవునిఁగాంచి “మహాత్మా! నేను నీయెడ మహాపరాధమును గావించితిని. నేను గేవలము పాపుఁడను; బాలఘాతకుఁడను; క్రూరుండను; దుష్టచిత్తుండను; దయాశూన్యుఁడను; బ్రాహ్మణ హింసాపరాయణుండను. పాపమనక యశాశ్వతంబగు నీ శరీర రక్షణార్ధమై నీ యార్గురు కొమరులను బట్టివధించితిని. అయినను దైవవిధిని, దప్పించు కొనఁజాలనైతిని. ప్రాణులందఱును దమ పూర్వజన్మకర్మానుసారము వృద్ధిక్షయములకును, జననమరణంబులకును లోనంగుచుందురు. దేహధారులెందును స్వతంత్రులుగారు. రక్షించుటకును శిక్షించుటకును గర్మప్రధానమగుచున్నది. కాని వ్యక్తిప్రధానమగుటలేదు. యా శిశుసంహారమునకు వారివారికర్మయే ప్రధానంబు గాని నేనెంతమాత్రమును గర్తనుగాఁజాలను. ఆత్మకెన్నండును బగసెలుములులేవు. అవి కర్మవలననే కలుగుచున్నవి. ఈ తాత్పర్యంబును గుర్తెఱింగి నన్ను క్షమింపవలసినది” యని యాతనిపాదములపై వ్రాల వసుదేవుఁడును గంసుని మనఃపూర్వకముగా క్షమించెను. కంసుండును దేవకీవసుదేవులను జెఱనుండివిముక్తులజేసి తాను నిజమందిరంబున కరిగెను. దేవకీవసుదేవులును శాంతచిత్తులై యుండిరి. + + +శ్రీకృష్ణుండట్లు కారాగృహంబున జన్మంబు నొంది, తండ్రియగు వసుదేవునివలన నందగోకులమునకుఁ జేర్పఁబడి యశోదకుఁ జంటిబిడ్డఁడై దినదినాభివృద్ధిఁ గాంచుచుండెను. నందయశోదలకుఁ పెంపుడుబిడ్డ డగుటకుఁ గారణము లేకపోలేదు. నందుఁడు పూర్వజన్మంబున ద్రోణుఁడను వసువైయుండెను. అతని భార్యపేరు ధర. కొండొక కారణంబున బ్రహ్మదేవుఁడు వారలపైగినిసి మర్త్యయోనిఁబుట్టుండని శపించెను. అప్పుడు ద్రోణుండును, నాతనిభార్యయగు ధరయుఁ దమకు విష్ణుసేవారతిఁ జేకూర్పవే యని యావేల్పు పెద్దను బ్రార్ధింపగా నాతండును నట్లకాక యని వారలకు వరంబొసెంగెను. శాపోహతులైన యాదంపతులు మానవజన్మంబున నందయశోదలనఁ బుట్టియుండిరి. విష్ణుండును గమలాసనుని వరంబును సార్ధకముగా నొనర్ప నందయశోదలకు ముద్దుబిడ్డఁడై తన్ను సేవించు భాగ్యమును వారలకుసమకూర్చెను. +కృష్ణుం డీవిధమున గోకులమున యశోద ఱొమ్మునఁ బెంపొందుచుండ నచ్చోట మధురాపురంబునఁ గంసునకు నాడునాఁటికి గృష్ణునిపైఁ గల శత్రుత్వము పెంపొందుచుండెను. తొలుదొల్త నశరీరవాణి వాక్యము లాతని కర్ణరంధ్రంబులఁజొచ్చినప్పుడే కంసునిహృదయమున దుష్టస్వభావము తాండవింపఁజొచ్చెను. అదియట్లుండ మాయాదేవి వాక్యంబులను వినినప్పటినుండియు నాతనియెడఁ దాండవించు చున్న వైరభావము గజ్జెకట్టి నృత్యముసేయనారంభించెను. ఇట్లు కృష్ణునియందుఁ బ్రబల శత్రుత్వమును వహించి యాతనిని రూపుమాపుటెట్లాయని పలుతెఱుఁగుల నాలోచించుచుఁ గంసుఁ డొకనాఁడు తనమంత్రుల రావించి కృష్ణునిఁగూర్చి తనకుఁగల మనస్తాపంబునంతయు వారలకుఁ దెలియజేసెను. వారును గొంతవడి దీర్ఘాలోచనమొనర్చి, “దానవనాథా! శ్రీకృష్ణునకు గోబ్రాహ్మణ సాధుజన సంఘంబులును, నధ్వరమంటప తపోవన శ్రద్దశాలలును మొదలుగాఁగలవన్నియుఁ బ్రియంబులై యుండును. కావుననట్టివాని నన్నింటినిం జెరుప నిప్పుడే యనుజ్ఞ నొసంగుడు. దానివలనఁ గృష్నునిపై దమకుఁగల విరోధానలంబు కొంతవఱకుఁ జల్లారఁగల” దని వాక్రువ్వ న్గంసుండును వల్లెయని సాధుల బాధించుటకప్పుడే దైత్య వీరుల కాజ్ఞనొసంగెను. నాటఁగోలెఁ గంసుని దుష్కృత్యములు భూనభోంతరాళంబులందు నిండి ప్రతిబింబింపసాగెను. +ఇట్లు కంసుఁడు నిజభటులను దుష్కృత్యంబు లొనర్ప బ్రేపించుటయేగాక, తనకుఁదానయే శ్రీకృష్ణ వధోపాయమును గూర్చి రేయింబవలు విచారింపఁదొడంగెను. శ్రీ కృష్ణుండు శిశువై యుండుటవలన ��ోకంబునఁగల శిశువులనందఱిని సంహరించినచోఁ గృష్ణుండును సంహరింపఁబడునుగదా యని తలంచి తత్కార్య నిర్వహణమునకై యారక్కసఱేఁడు పూతనయను నొక్క రాక్షసాంగనను నియోగించెను. ఆరక్కసియుఁ గంసుని పంపునఁ గామరూపంబుతో నెల్లెడల సంచరించుచుఁ జనుమొనల విషంబు నిడుకొని కనఁబడిన చిన్నిపాపల కందఱికిఁ బాలిచ్చు దానివలెఁ జన్నుగుడుపుచు శిశుసంహార మొనర్పసాగెను. ఇట్లా పూతన వాడవాడలఁ దిరుగుచుఁ దుదకు గోకులమునకు వచ్చిచేరెను. గోకులమును బ్రవేశించినది మొదలారక్కసి ప్రతి గృహముంబును బ్రవేశించి తానువచ్చిన కార్యమును ముగించుకొనుచుండెను. తుదకుఁ గర్మపరిపాకమగుటవలన దానవమృత్యుదేవతా గృహమనఁదగు యశోదాదేవిమందిరమును జొచ్చి, పూతన పాన్పుపైఁ బవళించియున్న బాలకృష్ణునిం గాంచి చన్నిచ్చుదానివలె నాతనిఁ గైకొనెను. గోపికలందఱును, గామరూపిణియగు పూతన సౌందర్యాతిశయంబున కచ్చెరువొందుచుఁ గలరూపెఱుంగఁజాలక మిన్నకుండిరి. పూతన, తనకుఁ జన్నిచ్చుటకుఁ బ్రారంభించినంతనే సర్వవిదుండైన శ్రీ కృష్ణపరమాత్మ యాదానవాంగన దుష్కార్యాచరణమును గుర్తెఱింగి, పాలు ద్రావుచున్నట్లు నటించుచు, గ్రుక్కగ్రుక్కకు నారక్కసిమేనిలోని సత్వమెల్లను ద్రావఁజొచ్చెను. ఆబాలుని యమానుషచర్య కాశ్చర్యపడి, క్షణక్షణమునకుఁ బ్రాణంబులు సన్నగిల్లుచుండ నిలువఁజాలక “కృష్ణా! ఇంకఁజాలును. చన్ను విడువుము. విడువుము” అని యాతనిని మరలింపఁజొచ్చెను. కాని చనుఁబాలు చవిఁగొన్నవానివలెఁ గృష్ణుండు చన్నువిడువక పైకొని పాలుద్రావనారంభించెను. కనుమూసి కనుదెఱుచునంతలోఁ కృష్ణుం డారక్కసకాంత సర్వప్రాణములను హరించెను. అప్పుడు కామరూపంబును దొఱంగినదియై, జీవంబులనెడఁబాసి పెనుగొండ వలె సహజస్వరూపంబున లోకభయంకరంబుగఁ పూతన భూమిపై వ్రాలెను. ఆ భయంకరాకారమును గాంచి గోప గోపికాజనంబు లందఱును మిక్కిలి భయపడిరి. కాని కృష్ణుండు మాత్రమారక్కసితో ఆడుకొనజొచ్చెను. అచ్చోట నున్నవారందఱును గృష్ణుని యామానుషచర్య కాశ్చర్యపడుచు నాతండు నిక్కముగా శ్రీహరియే యని తలంచిరి. యశోదయుఁ జంటిబిడ్డయైన కృష్ణుండు భయపడెనేమో యని విభూతి మొదలగు రక్షాకరణంబు లొనర్పసాగెను. నందుఁడు మొదలగు యాదవ ప్రముఖు లందఱును గోకులమున నుత్పాతములు పుట్టుచున్నవని భయపడఁ జొచ్చిరి. ఈ విధముగాఁ పూతనప్రాణంబుల హరించి కృష్ణుండు కంసుని ప్రయత్నము నిష్ఫలముగఁజేసెను. +లీలామానుష విగ్రహుండైన కృష్ణుండిట్లు నిజమాయాబలంబువలనఁ గంసుని ప్రయత్నంబులను గొనసాగనీయక నిష్ఫల మొనర్చుచు గోపికలతోడను గోపబాలకుల తోడను గ్రీడింపఁజొచ్చెను. ఒకనాఁడు యశోదాదేవి బాలకృష్ణునకు సిగముడిచి గృహాంగణంబున నాడుకొనుటకు వదలిపెట్టియుండఁగా దృణావర్తుఁడను రాక్షసుఁడు కంసుని పంపున సుడిగాలిరూపమునుదాల్చి యాడుకొనుచున్న కృష్ణునెత్తుకొనిపోయెను. అచ్చోటనున్న గోపబాలకులందఱును ‘కృష్ణుండు పోయెపోయె’ నని హాహాకారంబు లొనర్పసాగిరి. ఆ బాలకుల రోదనధ్వనుల నాలకించి యశోదాదేవి మొదలుగాఁగల వారందఱును బరుగెత్తుకొని వచ్చి, కృష్ణునకుఁ గలిగిన యాపదను దెలిసికొని పెద్దపెట్టున వాపోవందొడంగిరి. ఇవ్విధంబున గోకులంబంతయు బాలకృష్ణునిఁగూర్చి మిక్కిలిగ దుఃఖింపసాగెను. ఇట్లు తన్నుగూర్చి యందఱును విచారించుచుండఁగృష్ణుండు దానవునిచే నెత్తుకొనిపోఁబడిన వానివలె నభోభాగంబునకు వానితోఁగూడనరిగి యచ్చోట నాతనికంఠమును బిగియఁబట్టుకొని క్రిందికి వ్రేలాడఁజొచ్చెను. ఆ దానవుండా బాలకృష్ణుని బరువును భరింపఁజాలక, క్షణక్షణమునకుఁ గ్రిందికి దిగనారంభించెను. కాని కుత్తుకబాధ మిక్కుటముగానుండుటవలన మధ్యేభాగంబుననే యా దైత్యుఁడు ప్రాణంబులఁగోల్పోయి యొకపర్వతంబు వడువునఁ బుడమిపయిఁబడెను. అతనితోఁ గృష్ణుండును పుడమికి డిగ్గి తోడిబాలకులఁ గలసికొనెను. గృష్ణుఁడు తిరిగి కానుపించినంతనే యాగోపబాలకులంద ఱానందముతోఁ జిందులుద్రొక్కుచు బాలకృష్ణునెత్తుకొని యశోదాదేవి కడకరిగిరి. పుత్రునికై మిక్కిలిగ వాపోవుచున్న యశోద తన పాపనిఁగాంచి యపరిమితానందమును బొందెను. గోపికలందఱును గృష్ణుని దిరిగి చూడగలిగినందులకుఁ దమజన్మంబులు సార్థకంబులయ్యెనని తలంచిరి. ఎల్లరును జిన్నికృష్ణుఁ బరమాత్మగా భావింపఁదొడంగిరి. +గోకులంబున గృష్ణుండిట్లు క్రమక్రమాభి వృద్ధినందుచుండ, నందుఁడు రోహిణీదేవి కుమారుఁడైన బలరామునిఁ గైకొనివచ్చి కృష్ణునితో నుంచెను. నాటఁగోలె బలరామకృష్ణులిద్దఱును గోకులంబున మెలంగఁజొచ్చిరి. దినంబు లివ్విధంబునఁ గడిచిపోవుచుండ నొకనాఁడు యాదవపురోహితుండైన గర్గమహాముని నందుని మందకుఁ జనుదెంచెను. ఆ మహాత్ముని గాంచి నందుఁ డాతని నర్ఘ్యపాద్యాది విధుల బూజించి కుమారులైన శ్రీకృష్ణ బలరాములనుఁ జూపి వారలకు నామకరణంబు లొనర్పుఁడని యాతనితోఁ బల్కెను. గర్గుడును బలరామునిఁగాంచి, యా���ండు జనులను రమింపఁజేయువాఁడుగావున రాముఁడనియు, యదుసంకర్షణంబున సంకర్షణుండనియు, ఘనబలమున బలుఁడనియు, హలమునే యాయుధముగాఁ గలవాఁడు గావున, హాలాయుధుండనియు, నాతనికి నామకరణమొనర్చెను. అనంతరము శ్రీకృష్ణు నుద్దేశించి, నల్లని శరీరముఁగలవాడు గావున గృష్ణుండనియు, వసుదేవునకు జన్మించినవాఁడగుటవలన వాసుదేవుఁడనియు, గుణరూప కర్మంబులనేకంబులుఁ గలిగియున్నవాఁడగుటవలనఁ బెక్కునామంబులు గలవాఁడనియు నాతనికి నామకరణంబొనర్చి, యాశిశువువలన నందగోకుల ముద్ధరింపబడుననియు, దుఃఖంబులు దొలంగి సుఖంబులు సేకూరుననియు, మఱియు వారివలన దుర్జనశిక్షణంబును, సజ్జనరక్షణంబును జరుగుననియుఁ దెలియఁజెప్పి బాలకృష్ణుని విశ్వమయునిఁగాఁ దలంచుచు నాతండు తన యాశ్రమంబున కరిగెను. +బలరామకృష్ణు లిద్దఱును శరీరంబులు రెండుగను, మనంబు లొక్కటిగను మెలంగుచు గోపకులతో శైశవ క్రీడలు నెఱుపుచుండిరి. ఒకనాఁడు గోపకులును, బలరాముడును గలసి, శ్రీకృష్ణుండు మన్నుఁదినెనని యశోదాదేవితోఁ జెప్పిరి. ఆమెయు వారిమాటలను నమ్మి వెన్నుండు మన్నుఁదినెననియే భావించి యాతనిఁ బట్టుకొని “అన్నా! ఇదినీకుఁదగునా! ఇంటియందు నీ కెన్నియో రుచ్యములైన పదార్ధములుండ మన్నెందుకుఁ దింటివి? నానియమములను నీవేలమన్నింపవు? చూడుము. నీ యన్నయు నీ సఖులును నీ మీదఁ కొండెములు సెప్పుచుండిరికదా?” అని మందలించెను. భయరహితుఁడగు శ్రీకృష్ణపరమాత్ముఁడు తల్లి మందలింపునకు భయపడినవానివలెఁ గంటఁదడివెట్టి వెక్కివెక్కి యేడ్చుచుఁ దల్లియైన యశోదతో— +"అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో? +నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ +రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం +ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన దండింపవే." +అని జాలిఁగొలుపునట్లు పలికి తననోరును దెఱచి ‘చూడు’ మని తల్లిని సంబోధించెను. ఆమెయుఁ దన ముద్దుపట్టి ముద్దుపల్కులకు మహానందమును బొంది కుమారుని సత్యప్రవర్తన మెంతవఱకుఁ గలదో చూతమని యాతని నోరును దిలకించెను. చూచుటయేఁ దడవుగ యశోద విభ్రమాశ్చర్య చకితయై పోయెను. ఆ చిన్ని కృష్ణుని నోర నామెకు జలధిపర్వతవన భూగోళశిఖతరణిశశిదిక్పాలకాది కరండమైన బ్రహ్మాండంబంతయుఁ గానుపించెను. అట్టి బ్రహ్మాండమును బసిపాపని నోరఁగనుగొని యశోద— +కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో! +తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర +స్థలమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర +జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్ +అని తనలోఁదాను వితర్కించు కొనసాగినంతనే యామెకుఁ గృష్ణునియెడఁగల పుత్రానురాగంబుఁదొలంగి భక్త్యావేశ మినుమడించెను. అట్లు భక్తిపరవశయై బాలకృష్ణునిఁ బెక్కువిధములఁ బ్రార్థింపఁదొడంగెను. కాని కృష్ణుండది యెంతమాత్రమును దగదని యామెను వైష్ణవమాయయందుఁ దగుల్కొనఁజేసెను. తోడనే యశోదకు భక్త్యావేశము నశించి పుత్రప్రేమ మినుమడించుచు నామె కృష్ణునిఁ జేరదీసి నిజాంకతలంబున నిడుకొని “నాతండ్రీ! నిన్నెప్పుడు మందలింపను లెమ్ము”. అని యోదార్పసాగెను. కృష్ణుండును, నేడుపుమాని, తల్లికుచవేదికయందు నౌదలమోపి కూరుకుసెందెను. +కృష్ణుఁడిత్తెఱంగున, నప్పుడు గోపగోపికా జనంబులకుఁ దన సహజ తత్వంబును దెలియఁబఱచుచు నొకప్పుడు భక్తిపరవశులుగను, మఱొక్కప్పుడు తనయం దనురాగముగలవారిగను వారినందఱ నొనర్చుచుండెను. ఆతండును గోపబాలకులతో నాడుకొనుచు, నప్పుడప్పుడు చోరునివలె నితరగృహంబులందుఁ బ్రవేశించి యందున్న గొల్లపడుచులను, గనుసైగలు సేయుచును, వెనుకప్రక్కగాఁ జేరంజని చెక్కిళ్ళు నొక్కుచును, వచ్చెదవాయని రహస్యముగా భాషించుచును, నొంటరిగనున్నఁ బైఁబడి యధర చుంబనాదుల నొనర్చుచు నిట్లనేకవిధంబుల మగపోడుములు సేయుచుండుటయేగాక, వీలగునప్పుడు పాలుపెరుగులఁ గ్రోలుచు, వెన్న నారగించుచుఁ బట్టుకొనవచ్చిన గోపికలను వెఱపించి పాఱిపోవుచు నొక్కొక్కతఱి వారిలోవారికిఁ గలహంబులుపెట్టుచు, నిరంకుశాధికారంబున దుండగంబులు సేయంజొచ్చెను. గోపికలందఱును బాలకృష్ణుని దుండగంబులు నానాటికభివృద్ధి నందుచుండఁ జూచి సహింపఁజాలక యొకనాఁడు యశోదాదేవి కడకరిగి, యామెముద్దుపట్టి తమయిండ్లయందొనర్చిన దుండగంబుల నన్నింటిఁగూర్చి సవిస్తరంగాఁ జెప్పిరి. చన్నుగుడుచుచున్న కృష్ణుఁడు తల్లి తన్నెక్కడ మందలించునోయని భయపడినవానివలె యశోదయొడియందు ముసుగు పడియుండెను. యశోదయు గోపికలు సెప్పిన వృత్తాంతంబునంతయును విని, వారలగాంచి “అమ్మలారా! మాచిన్నికృష్ణు నెందుకట్లు దూఱెదరు? ఎన్నండును బొరుగిండ్లను ద్రొక్క యెఱుఁగఁడే? చక్కగాఁ గన్నులుగూడఁ దెరువని నాయీ చిన్నికుమారుని ఱవ్వసేయుట మీకుఁదగునా? +అన్య మెఱుఁగఁడు; తన యంత నాడుచుండు; +అని యనేక విధంబుల వారల నొడఁబఱచి గృహంబుల కనిపి కుమారుని మందలింప జాలకపోయెను. కృష్ణుండును, దన కేమియుఁదెలియనివానివలె నటింపసాగెను. +గోపికలు శ్రీ కృష్ణుని దుండగంబులఁ గూర్చి పలుమారు వచించుచున్నను యశోద కొడుకు నెంతమాత్రమును మందలింపకుండెను. ఇట్లు దినంబులు సనుచుండ నొకనాఁడు యశోద నిజమందిరంబున దధిమధనంబున మెలంగుచుండెను. అట్టియెడఁ గృష్ణుండు తల్లిఁజేరంజని పాలీయమని పోరుపెట్టదొడంగెను. ఆమెయుఁ గుమారునకుఁ జన్నిచ్చుచు నంతలోఁ బొయ్యిమీదనున్నపాలుఁ బొంగిపోవుచుండఁ గుండను దింపుటకై కుమారుని వదలిపెట్టిపోయెను. కృష్ణుండును గడుపునిండఁబాలీయలేదని కోపించి, యెదుటనున్న పెరుగుకుండను బాదములతోఁ దన్ని పగులఁగొట్టెను. పెరుగంతయు నేలపాలయ్యెను. అంతలో యశోద తిరిగివచ్చి కృష్ణుండొనర్చిన పనికి మివులఁ గోపించి “దుందుడుకా! నీ యాగడ మింకసాగదులే’ యని తనకు భయపడి పరిగెత్తిపోవుచున్న కుమారుని మందలించుటకై వెన్నంటెను. కృష్ణుండును దన లీలా వినోదంబుల వలనఁ దల్లిని విభ్రాంతాత్మురాలినిఁగా జేయుటకో యన నామెకుఁ జేతిదూరముననే యున్నట్లుండి పట్టుకొన వచ్చునంతలో మాయమగుచు, నెందుజూచినఁ గాన్పించుచు, నందందు ముసుఁగువడుచు నిట్లనేకవిధములఁ దల్లిని బాధింపఁజొచ్చెను. యశోదయుఁ గుమారుని యద్భుతచర్యలకు విస్మయంబునొందుచుఁ బట్టినపట్టును మాత్రము విడువక యాతని వెంబడించుచునే యుండెను. కృష్ణుండును దల్లిని శ్రమపెట్టుట భావ్యముగాదని తలఁచినవానివలె ననాయాసముగా యశోదకుఁ జిక్కిపోయెను. ఆమెయుఁ గుమారునిఁ బట్టుకొని “ఓహో! వీరు శ్రీ కృష్ణులేనా?” యని యెత్తిపొడుచుచు నాతనిని ఱోలఁగట్ట యత్నించెను. కాని యామెతీసుకొనివచ్చిన త్రాడుఁ ఱోటికిని, గృష్ణుని బొజ్జకును గొంచెము తక్కువగా నుండెను. యశోద యింకొక త్రాటిని దానికంటఁ గట్టి కట్టుటకు యత్నింపగాఁ దిరిగి పూర్వమెంత తక్కువగా నుండెనో యంతే తక్కువగానుండెను. ఈవిధముగా గృహములోనున్న రజ్జు పరంపరలఁ గొనివచ్చి కట్టుటకు యత్నించినను దిరిగి పూర్వపు స్థితియే సంభవించుచుండెను. కృష్ణుఁడేమియు నెఱుంగని వానివలెఁ దల్లినిఁజూసి నవ్వసాగెను. అట్టియెడ యశోద మిక్కిలి శ్రమ నొందినదై, కుమారునిఁగాంచి “కృష్ణా! ఏమి నాచేత బంధింపబడవా?” యని విచారసూచకముగను భక్తిపరవశత్వమును బొందినదానివలెను బలుక, భక్తపరతంత్రుడగు శ్రీకృష్ణపరమాత్మ— సిరిఁకౌగిఁట బంధింపఁబడని శ్రీకృష్ణపరమాత్మ సనకాది యోగిచిత్తాబ్జము ���ందుఁ బట్టువడని శ్రీకృష్ణపరమాత్మ తల్లివాక్యమును వినినంతనే, లోఁబడి యామెవలన ఱోలఁగట్టఁబడియెను. కుమారునట్లంటఁగట్టి యాయవ్వ యింటిలోని కరిగెను. ఆమె తన్ను బాసి చనిన వెంటనే, నారదశాపంబున యమళార్జునంబు లను సాలవృక్షంబుల రూపముననున్న నలకూబర మణిగ్రీవులను నిర్వురు గుహ్యకులకు శాపవిమోచనం బొనర్పదలంచి, ఱోలడ్డమగునట్లా సాలవృక్షంబుల మధ్యభాగమున కరిగెను. అవియు ఱోటి తాకుడునకు నిర్మూలంబులై పుడమిపయింబడ నందుండి యా గుహ్యకులిద్దఱును, శాపవిముక్తివలన బయలువెడలి యనేకవిధంబులఁ గృష్ణపరమాత్మను బ్రార్థించుచుఁ దమనివాసములకుఁ జనిరి. +ఇట్లు కృష్ణుండును సాలవృక్షంబులఁగూల్ప దన్నిర్మూలనధ్వనులకు గోపగోపికాజనంబులందఱును వెఱంగంది పిడుగులు పడెనని తలంచుచు వచ్చిచూడఁ గృష్ణుఁడా వృక్షంబులమధ్యభాగంబునఁ గపట బాల లీలల వినోదించుచుండెను. అప్పుడందఱును, “ఏమిది? పెద్దగాలి వచ్చినదనుకొందమా యది యెంతమాత్రమును సరిగాదు. పిడుగుపడిన దనుకొందమా తగినసూచకము లెవ్వియును గాన్పింపవు. అకారణంబుగ నీవృక్షంబు లెట్లుగూలినవి? ఈతఁడు పడఁద్రోసినాఁ డనుకొందమా కేవలము పసిబాలుఁడు. ఏమీవింత యని తమలోఁదాము తర్కించుకొనుచుండ నంతకుమున్నచ్చటనున్నవారు కృష్ణుని వలననే యాపని జరిగెనని తెలియఁజేసిరి. అప్పుడు నందాదులైన గోపకులును, యశోద మొదలైనగోపికలును గృష్ణుని లీలామానుషవిగ్రహుండైన పరమాత్మునిఁగాదలంచి, రెట్టించిన భక్తి తాత్పర్యంబుతో నాతనిఁ బూజింపఁదొడంగిరి. + + +బృహద్వనంబున నుత్పాతంబులు పెక్కులుప్పతిల్లుచుండుట వలన నందుఁడు సునందుఁడు మొదలగు యాదవ ప్రముఖు లందఱును దద్వనంబును విడనాడి బృందావనంబునకు గోగణంబులతో నరుగుటకు నిశ్చయించుకొని యప్పటికప్పుడే బృందావనంబున కరిగిరి. అచ్చోట బలరామకృష్ణులిద్దఱును దోడి గోపకులతోఁ గలసి యాడుకొనుచుఁ బసులవెంట నరిగి బంతిచల్దులారగించుచు, నొకరితోనొకరు బందెములువెట్టి పరుగెత్తుచు నిట్లనేకవిధముల శైశవ క్రీడలందుఁ గాలమును గడుపసాగిరి. కృష్ణుం డప్పుడప్పుడు గోగోపికా సంఘంబులు శరీరంబులు మఱచి యుండునట్లు యమునానదీ పులిన స్థలంబుల మురళీగాన మొనర్పసాగెను. యశోదాకుమారుని మృదుల మధుర మురళీ నిస్వనంబులకు గోపికలందఱును ముగ్ధలగుచు నింటిపనులఁగూడ మాని తదారవంబు శ్రవణపుటంబుల దూఱినంతనే కోకలు జారుచున్నను, వేణీబంధంబులు విడివడుచున్నను, స్తన���ారంబున లేనడుము లల్లలనాడ నాయాస మినుమడించుచున్నను లెక్కసేయక మురళీమోహనకృష్ణునిఁ జేరంజనుచుండిరి. తదారవంబును వినినంతనే గోగణంబులును మేతలమాని యఱ్ఱులెత్తి చెవులు నిక్కించుకొని తన్మధుర నిస్వనరసనిర్ఝర ప్రబలవేణికలందుఁ గ్రుంకులిడఁ జొచ్చెను. బాలకృష్ణుం డీవిధంబున నిజ మురళీగానంబున విశ్వంబును మోహింపఁజేయుచు బృందావన విహారంబు నొనర్పసాగెను. +కృష్ణుండీవిధంబున విశ్వమోహన మూర్తియై బృందావనంబున వెలుగుచుండ నచ్చోట మధురాపురంబునఁ గృష్ణుని వృత్తాంతంబు వినవచ్చినకొలంది కంసునకు మనస్తాపం బినుమడింపసాగెను. ఇంతవఱ కాతఁ డొనర్చిన కృష్ణవధోద్యోగ ప్రయత్నంబు లన్నియు నిష్ఫలంబు లగుటవలన నాతనికిఁ బట్టుదల మఱింత హెచ్చిపోయెను. అందువలన నాతని క్రూరచర్యలు తొల్లింటికన్న మిక్కుటములయ్యెను. ఎచ్చోటఁ జూచినను దైత్యభటుల యార్భాటములును, సాధుజనహింసాపరాయణత్వంబును, క్షణక్షణమునకు మించుచుండెను. పశుహింసయుఁ, దపోవననిర్మూలనంబును, యాగవిధ్వంసంబును, మునిజన నిష్ఠాపహారణంబును, శిశుమారణంబును, మొదలగు ఘోరకృత్యములు బ్రబలములయ్యెను. జగదపకారంబునకుఁ గంసుఁడు ముందంగ వైచుచుండెను. ఎల్లెడల దానవాపచార సంజనిత సాధుజన దీనారవంబులు మిక్కుటముగ వినవచ్చు చుండెను. ఆహా! సర్వజ్ఞుడైఁడైన శ్రీకృష్ణపరమాత్మ తనమీది వైరంబునఁజేసి సాధుజనంబులిట్లు కంసునివలనఁ బెక్కుబాధలకు లోనగుచుండఁ దద్వృత్తాంతంబంతయు నెఱింగియు సహించియుండుటేలకో గదా? +బృందావన ప్రాంతారణ్య భూములంగల పచ్చికబయళ్ళయందు శ్రీకృష్ణుండు గోపబాలక బలరామ సహితుండై గోవులను గాయుచుండ నొకనాఁడు కంసప్రేరితుండై వత్సాసరుండను దైత్యభటుఁడొక్కండు కామరూపంబున మందలోఁ బ్రవేశించి గోపకులను గోవులను బాధింపదొడంగెను. ఆవృత్తాంతంబును గృష్ణుఁ డెఱింగి యన్నయగు బలభద్రున కా సమాచారంబంతయుఁ దెలుయఁజెప్పి, వత్సంబు పగిది మందయందు సంచరించుచున్న యా దైత్యభటుని సమీపించి “ఆహా! ఈలేగ యెంత యందముగా నున్నది? ఈదూడను మీకుఁ గాకుండ నేనుహరించెద” నని గోపబాలకులతో నర్మగర్భంబుగాఁ బలుకుచు వత్సాసురునిఁ దోకమొదలు కంఠమువఱకుఁ దన యాజానుబాహు బంధంబున నిరికించుకొని యూపిరి యాడకుండునట్లు నొక్కుచుఁ దృటికాలములో విగతజీవునిఁగా నొనర్చి బంతిచందమున నవలీల గగనమార్గంబున కెగురవైచెను. ఆదైత్యుండును మొదలునరికిన తరువువలె ధరణిపై నొదిగి యసువలఁబాసెను. +అతఁ��ట్లు మడిసినతోడనే యతని యనుజుండగు బకాసురుండను వాఁడు భయంకరాకారంబుతో గోగోపసంఘంబుపైఁ గవిసి మహాట్టహాస మొనర్పసాగెను. ఆ దైత్యుని ఘోరాకారమునకు భయంపడి, గోవులును, గోపకులును బరుగెత్తసాగిరి. అట్లు తన్ను గాంచి భయభ్రాంతులై పాఱిపోవుచున్న గోగోపబృందంబుల వదలి యాదైత్యుండు కృష్ణునిపై విజృంభించెను. అట్టియెడ జితవైరియగు నందనందనుఁడు వెఱంగందినవాని చందంబున నందందుఁ జిందులుద్రొక్క నారంభించెను. బకాసురుండును గృష్ణునిఁ దనకుఁ లోబడినవానిఁగాఁ దలంచి యొక్కపెట్టున నాతనిపైఁబడి గుటుక్కున మ్రింగివైచెను. కృష్ణుండు దైత్యునివలన మ్రింగుడుపపడుటఁ గాంచి గోపకులు “హా కృష్ణా! హా కృష్ణా!” యని హాహాకారంబులు సేయందొడంగిరి. గోవులు కనులవెంట నశ్రుధారల గురియింపఁజొచ్చెను. వికసిత కుసుమపరిశోభితములైన లతానివసహంబులు గళావిహీనములై కాన్పింపదొడంగెను. ఇట్లు విశ్వంబంతయుఁ దనకై విచారించుచుండఁ గృష్ణుండును బకునివలన మ్రింగుడుపడి కంఠభాగంబునందే నిలిచి తనయందు లీనమైయున్న ప్రళయకాలానలంబును రగుల్కొల్పి తన్మూలమునను దాను కుత్తుక నొక్కుచును గనుఱెప్పపాటుకాలముననే యాదైత్యుని సర్వప్రాణంబులు హరించి మడియింపజేసెను. ఆతండు మరణించిన వెంటనే తద్గర్భంబునుండి వెలికివచ్చి గోగోపసంఘంబులకు దర్శనమిచ్చెను. తిరిగి కృష్ణునిఁ గాంచినంతనే గోపకులందఱు నానందపారవశ్యమునఁ జిందులుద్రొక్కుచు గొంగడుల నెగురవైవసాగిరి. గోగణంబులును ‘అంబా’ యని యఱచుచుఁ దోకలెత్తి పరుగిడసాగెను. ఇవ్విధంబున దైత్యవధంబు నొనర్చి శ్రీకృష్ణుఁడందఱికిని సంతోషముఁగూర్చెను. +శ్రీకృష్ణ పరమాత్ముని లీలామానుషచర్యలు సకలభువనంబుల యందును బ్రతిధ్వనులీనుచుండ సత్యలోకనివాసియైన బ్రహ్మదేవుఁ డతని నొకయలంతి మానవునిఁ గాఁదలంచి యాతని సామర్ధ్యమెట్టిదో పరీక్షింపఁదలంచినవాఁడై యొకనాఁడు కృష్ణుఁడు గోపబాలకులతోఁ బసులఁగాయుచుండ గోవులను గోపబాలకులను హఠాత్తుగా మాయమొనర్చెను. కృష్ణుఁడొక్కరుండే వనమధ్యంబున నిలచియుండెను. బ్రహ్మయొనర్చిన పని కాతఁడెంతమాత్రమును విస్మయంబునొందక సర్వజ్ఞుడగుటవలనఁ గలరూపెఱింగినవాఁడై పరమేష్ఠి నవమానింపదలంచి గోవులును, గోపకులును దానయై యథాప్రకారము వర్తింపఁదొడంగెను. గోగోపకులు శ్రీకృష్ణస్వరూపులుగానఁ జూచువారలకొక విధమగు దన్మయత్వము గలుగనారంభించెను. తమపుత్రులు కృష్ణాంశసంభవులుగా��� గోపికలకుఁ దొల్లింటికన్న సుతప్రేమ యెక్కువయ్యెను. బలభద్రుండును నీ యద్భుత సంఘటనంబున కచ్చెరువొందుచుఁ గలరూపు నెఱుంగఁజాలక ‘ఇదియేమి’ యని తమ్ముని నడిగెను. కృష్ణుండును బలభద్రునకు సర్వమును దెలియపఱచెను. అత్తెఱంగున నొక వత్సరంబు ముగిసినవెంటనే బ్రహ్మ కృష్ణుని పరిస్థితి యెట్లున్నదో యని వచ్చి చూచునప్పటికి గో గోపకులతో యశోదానందనుఁ డెప్పటియెట్ల విహరించుచుండెను. ఆ దృశ్యమును గాంచినంతనే బ్రహ్మయు‘సృష్టికర్తను నేనైయుండ నీ గో గోపకులను సృష్టించినవారెవరా?’ యని పెద్దయుఁబ్రొద్దు దనలోఁదాను వితర్కించుకొనుచుఁ గొంతవడికి శ్రీ కృష్ణ మహిమంబువలన వైష్ణవమాయనుండి విడివడినవాఁడై సర్వమును దెలిసికొనెను. అప్పుడు కమలాసనుండు దానొనర్చిన పనికి లజ్జించుచుఁ బ్రత్యక్షస్వరూపంబునఁ గృష్ణపరమాత్మను జేరంజని ముకుళిత కరకమలుండై “దేవా! నీమాయయందుఁ దగుల్కొని యజ్ఞానుండనై, నీ కపచారమును గావించితిని. మహాత్మా! నన్ను క్షమింపుము. నీవాదినారాయణుండవు. నీ తత్వంబు నెవ్వరును గ్రహింపఁ జాలరు. నీవలనే సృష్టిస్థితి లయములు జరుగుచున్నవి. నీ యందే సకలచరాచరాత్మకమైన యీవిశ్వంబంతయు లీనమైయున్నది. గుణకర్మంబు లనేకంబులు గలిగియున్నవాఁడగుటవలనఁ బెక్కు నామంబులతోడను, బెక్కు రూపంబులతోడను వర్తించుచుందువు. పరాత్పరా! నన్ను క్షమింపుము” అని యాతనిఁ బ్రార్థింప వసుదేవనందనుఁడు గరుణామయుండు గావున వేల్పుపెద్దను క్షమించెను. విరించియుఁ దిరిగి గోగోపకులను గృష్ణున కర్పించి నిజనివాసంబున కరిగెను. బ్రహ్మ గోగోపకుల నర్పించినంతనే శ్రీకృష్ణపరమాత్మ తన విశ్వరూపంబు నుపహరించి యొకవత్సరము తన్నెడఁబాసియున్న గోపకులందఱిని వేర్వేఱనాదరించి యాదవవంశభూషణుం డగుచుఁ బ్రకాశింపఁజొచ్చెను. +బలరాముఁ డెల్లప్పుడు దమ్ముఁడైన శ్రీకృష్ణు నెడఁబాయక మంద యందు సంచరించుచు గోపబాలురతోఁగూడి యాడుచుండెడివాడు. ఒకనాఁడేమి కతంబుననో శ్రీకృష్ణుండు గోవులవెంట రాక యింటనే నిలిచియుండెను. బలభద్రుండు మాత్రము గోపబాలురతోఁ గలసి పసులవెంట నరిగెను. అచ్చోట గోపకులందఱును బలరామ సహితులై బంతిచల్లుల నారగించి తలకొకదిక్కున మెలంగుచు నప్పుడప్పుడు గుంపుగట్టి యాడుకొనుచుఁ బ్రొద్దుపుచ్చుచుండఁ గంసునిపంపున నొకదైత్య భటుండు ఖరాకారంబున జనుదెంచి మందయందు శ్రీకృష్ణుండు లేడుగదాయని ధైర్యంబు నవలంబించి గోవులను గోపక���లను హింసింపసాగెను. అట్టియెడ గోపకులు భయంపడి “ఓకృష్ణా! ఓరామా! రక్షింపుడు. రక్షింపుడు.” అని పెద్దపెట్టున గోలలెత్తుచు బలభద్రుండున్న తావునకు వచ్చిచేరిరి. ఖరాసురుండు వారిని వెన్నంటి వచ్చి గోపబాలక రక్షణార్థమై తన్ను మార్కొననిలచియున్న బలరాముని నొక్కపెట్టున ఱొమ్మునఁ దన్నియార్చుచు విజృంభించెను. కృష్ణాగ్రజుండును వ్రేటువడినవెంటనే రౌద్రాకారంబున విజృంభించి గార్దభాసురు పదంబులు నాలుగు నొక్కకేల నంటంబట్టి బెట్టుదట్టించి యట్టిట్టు గదల్చుచు నొక్క పెట్టునఁ గందుకంబు చందంబున నభోభాగంబున కెగురవైచి యాదైత్యుని విగతజీవునిఁగా నొనర్చెను. +అట్లు ఖరాసురుని నవలీలగా మడియించి బలరాముఁడు తిరిగి యథాప్రకారము గోపబాలకులతో నాడుకొనఁజొచ్చెను. అట్టి సమయంబున ఖరాసురుని యనుచరుండైన ప్రలంబుడను రక్కసుండు పగసాధింపఁదలంచి గోపబాలక వేషముతోఁ జనుదెంచి యచ్చోట నాడుకొనుచున్న బలరామాదులతోఁగలసి తానుగూడ నాటలాడఁజొచ్చెను. గోపకులందఱును రెండుగములవారై, యోడిపోయినవారు, గెలిచినవారిని మోయునట్లు బందెమువెట్టికొని యాడుకొనుచుండిరి. ప్రలంబుఁడు పగసాధింపఁ దలచియున్నవాఁడుగావున బలరామున కెదురగువారివైపునఁ జేరెను. కర్మవశంబున బలరాముని వైపువారే యాటయందు గెలిచిరి. అప్పుడనుకొనిన ప్రకార మోడిపోయినవారు గెలిచినవారిని నొక్కొక్కరిని తమమూపులపై నెక్కించుకొని మోయఁజొచ్చిరి. అట్టియెడ నదియే సమయమని ప్రలంబుఁ డోడిపోయినవారి యందున్నవాఁ డగుటవలన బలరామునిఁ దన మూపున నెక్కించుకొని యున్నటులుండి గగనమార్గంబునకెగసెను. అదిగని గోపకులందఱును రామునికై దుఃఖింపఁ దొడంగిరి.మోసంబునఁ దన్నట్లు మోసికొని గగనమార్గంబున నరుగుచున్న ప్రలంబుని కపటంబు నెఱింగి, బలబద్రుం డుక్కుమిగిలి తనముష్టిహతిని దైత్యునిశిరంబు పగులఁజేసి విగతజీవునిఁగా నొనర్చి యచిరకాలముననే గోపకులఁజేరి వారికి సంతోషమును గూర్చెను. గోపకులును బలరాముని గొప్పవానిఁగాఁదలంచిరి. + + +శ్రీకృష్ణ బలరాము లిత్తెఱంగునఁ జేచిక్కిన దైత్యుల, బట్టి చక్కాడుచు గోగోప గోపికాసంఘంబుల రక్షించుచు బృందావనంబున విహరింపఁదొడంగిరి. గోపికలందఱును శ్రీకృష్ణునియం దెక్కువ మక్కువఁగలిగి యెల్లప్పు డాతని దివ్యసందర్శనంబునే యాకాంక్షించుచు ననవరత మాతని మురళీ మధుర నిశ్వనంబునే కోరుచుఁ బొద్దులు పుచ్చుచుండిరి. కృష్ణుఁడును బె���్కు తెఱంగులఁ బల్లవకోమలసదృశాకారిణులగు వల్లవీజనంబుల యుల్లంబు లుల్లాసంబున రంజిల్లునట్లు వర్తింపఁదొడంగెను. ఒకనాఁడు గోపికలందఱును యమునాస్నానంబున కరిగి యొడ్డున వస్త్రంబులను హారాది పరిష్కారంబులను బదిలంబుగా నొనర్చి, కంఠదఘ్నంబులగు సలిలంబుల జలకంబులాడఁ దొడంగిరి. అట్టియెడఁ దుంటరియగు బాలకృష్ణుండు యమునానదిఁ జేరంజని గట్టున నున్న గోపికల వస్త్రంబులను మెల్లన దొంగిలించి తత్తటినీతట నికటంబున నున్న వృక్షంబు నధిరోహించి లీలామాత్రుండై వినోదింపసాగెను. గోపికలును గొంతవడికిఁ గృష్ణునిరాకను గుర్తించి తుంటరి వాఁడగుటవలన ననుమానపడి గట్టునకుఁ జూడ వస్త్రంబులు లేకుండెను. ఏమాయని కృష్ణునిదెసఁ బరికింప నాతం డధిరోహించియున్న తరుశాఖలయందుఁ దమవస్త్రంబు లుంట గాంచి, మోసమయ్యెనని తలంచుచు మానభంగంబునకు వెఱచినవారలై, నదీగర్భంబునందే నిలచి లీలా వినోదియైన శ్రీకృష్ణ పరమాత్మను గూర్చి “కృష్ణా! ఇదియేమిన్యాయము? కేవలము పరమాత్మస్వరూపుండవును, సర్వజ్ఞుండవునగు, నీవే స్త్రీజన మానభంగమున బ్రయత్నింప నన్యులఁగూర్చి వేఱ చెప్పవలయునా? మావలువల మాకొసంగుము. మామగవారు జూచిన నిన్ను మందలింతురు. మా చీరెలఁ గొనితెచ్చియిచ్చి పొమ్ము. ఇదియేనా నీ యట్టివాఁడొనర్చవలసిన ఘనకార్యము? కృష్ణా! +బుధులు మెచ్చ భువిఁబ్ర బుద్ధత మెఱయుటో +అని మందలించినట్లుగను, ధర్మోపదేశం బొనరించినట్లుగను, బ్రతిమాలుకొనినట్లుగను, మొరపెట్టుకొన నాతండును వృక్షంబునందే నిలచి నగుచు ‘“గోపికలారా! మీరందఱిచ్చోటి కరుగుదెంచి మీమీవలువలఁ గొనిపొండు. నేను మాత్రము తీసికొనివచ్చి మీకొసంగ” నని ఖండితముగాఁ దెలియఁజెప్ప గోపికలును దమకు మానభంగంబెట్లును దప్పదని నిశ్చయించుకొని, పోవుదమని కొందఱును, వలదని కొందఱును, ముందువెనుకలాడుచుఁ దుదకందఱును నిజకరసంఛాదిత పంచాయుధగేహలగుచుఁ గృష్ణునిఁ జేరంజని వలువలిమ్మనికోర నాతండును “సుందరాంగులారా! ఒక్కమాఱు చేతులెత్తి మీరందఱు నన్నుఁ బ్రార్థింపుఁడు. వలువ లొసంగెద” నని పలుక గోపికలు “ఏమి? ఈ బాలుని తుంటరితనము? అంతకంతకు మితిమీరిపోవుచున్నదే?” యని లోనఁ గినుక వహించినవారలయ్యుఁ దప్పనిదియగుటవలన మానభంగమునకుఁ గూడ శంకింపక చేతులెత్తి వలువలిమ్మని యాతని బ్రార్థించిరి. కృష్ణుఁ డప్పుడు వృక్షంబునుండి డిగ్గి వలువలను వారికొసంగి, “గోపికలారా! మీకు మానభంగమయ్యెనని యెం���మాత్రమును జింతింపవలదు. నన్నుఁ గొల్చువారలకు సర్వంబును నా స్వరూపమై కానుపించును. అట్టియెడ వీరు పురుషులు, వీరు స్త్రీలు అను విచక్షణ యెంతమాత్రమును వారియందుండదు. అట్టి భేదభావము లేనివారలే నాకు నిజమైన భక్తులగుచున్నారు. మీ స్వభావంబును గుర్తెఱుంగుటకై మిమ్మిత్తెఱంగునఁ బరీక్షించితిని. నా వచన ప్రకారము వర్తించి మీరు నాకు నచ్చినవారలైతిరి. ఇదియే నా తత్త్వము” అని తెలియఁజెప్పి గోపికల మనస్తాపంబును మాన్పెను. వారును ధన్యులమైతిమని కృష్ణునితోఁ గలసి గోకులంబున కరిగిరి. +టీక కంఠదఘ్నంబులగు కంఠం లోతు కలిగిన; తటని నది; తటము ఒడ్డు; నికటము సమీపము. +వస్త్రాపహరణం బొనర్చివల్లవీ జనంబుల శ్రీ కృష్ణుండు పరిభవించెనను వార్త యెవ్విధంబుననో నందయశోదలకుఁ దెలియవచ్చెను. చూచుచుండఁగనే యావార్త గోపకులంబు నంతటను వ్యాపించెను. ఎల్లరును గృష్ణుని దుండగంబును గూర్చి పలుభంగుల ముచ్చటింపసాగిరి. తమకుమారుఁడొనర్చిన పనికి నందయశోదలు గినుకవహించినవారలై కృష్ణునిఁ జేరం బిలిచి “కుమారా! రోజురోజుకు నీ యాగడంబులు మితిమీరుచున్నవి. చూచి యుపేక్షాభావమును వహించుచుంటిమని తలంచుచుంటివా యేమి? కృష్ణా! గోపికా వస్త్రాపహరణం బొనర్చి మానభంగమును గావించుట నీ యట్టివానికిఁ దగునా? ఇంతటినుండి నీవిట్టి దుండగముల నెన్నండును జేయకుసుమా” యని యనేకవిధంబుల మందలించిరి. అప్పుడు కృష్ణుండు, కనులవెంట నీరునింపుచు “జననీజనకులారా! మీతోడను, మీ గోపగోపికా జనంబులతోడను నా కెంతమాత్రమును బనిలేదు. ఇందఱివలన మాటఁబడిన యీ బ్రతుకుఁగూడ నా కవసరములేదు. నే నిప్పుడోపోయి విషజలపూరితంబగు గాళిందీనదిలో దుమికెదను. ఇంతటినుండి మీరును, మీ కులమువారును, నావలన నెట్టిబాధలను బొందకుండ సుఖంబుండుఁడు” డని పల్కినవాఁడై యప్పుడే కాళిందీనదికిఁ బరుగులిడసాగెను. యశోదానందులును, “కృష్ణా! పోకుము. కాళిందీనదిలో దుముకవలదు. నీయిష్టమువచ్చినట్లు మమ్మందఱను బాధింపుము. నిన్నుఁబాసి యొక్క క్షణమైనను మేము నిలువఁజాలము.“ యని దుఃఖించుచు లీలావినోదియైన బాలకృష్ణుని వెంబడించిరి. బలభద్రుండు తమ్ముని తత్వంబు నెఱింగినవాడయ్యు, నేమియు యెఱుంగనివానివలెఁ దానును బంధుజనంబుల వెంబడించెను. ఇట్లు యాదవకులంబంతయుఁ దన్ను వెంబడించుచున్నను, నొక్కరికేనియుఁ జిక్కక, కాళిందిని సమీపించి, నిజచరణకమలయుగళసంస్పర్శంబున కెన్నినాళ్ళనుండియో ���ెదురుసూచుచుఁ దత్సమీపంబున విశాల విటపశాఖాసముదాయంబుతోనున్న కదంబ భూజంబు నధరోహించి తదగ్రంబున కెగఁబ్రాకి దూరంబుననుండి బంధుజనులు దన్నుఁగూర్చి యాక్రోశించుచుండ, నెల్లరకుఁ దెలియవచ్చునట్లు కుప్పించి యచ్చోటనుండి కాళిందిలో దుమికెను. వెంటనే యాహ్రదంబంతయు గుభగుభ ధ్వానంబులతో నల్లకల్లోలంబు గాఁజొచ్చెను. ఇచ్చోట యశోదానందులు మొదలగు వారందఱును గృష్ణుండు నదిలో దుముకుట కనులారగాంచి “హ కృష్ణా! హ కృష్ణా!” యని పెద్దపెట్టున నేడ్చుచుఁ గాళిందిని సమీపించి బాలకృష్ణునిఁ గానక ఘోరవిషానల దారుణాకారుఁడగు కాళీయునిచేత భక్షింపబడెనని తలపోసి తద్వియోగ సంజనిత సంతతానంతదుఃఖాతిరేకంబున స్మృతులుదప్పి పుడమిపై మూర్ఛిల్లిరి. బలరాముఁడుమాత్రము సర్వము నెఱింగినవాఁడు గావునఁ జూచి యూరకుండెను. +టీక విటపము చిగురు; శాఖ కొమ్మ; హ్రదము మడుగు; ధ్వానము ధ్వని. +కాళిందీనదియందుఁ గాళీయుఁడను సర్పరాజొకండు గలఁడు. పూర్వమొకప్పుడు సర్పములన్నియు వినతాసుతునకు భయంపడి, తాముసంపాదించుకొనిన యాహారంబునందు సగపాలతని కిచ్చునట్లును, నాతండు తమ్ముఁ జంపకుండునట్లును, నొడంబడికఁ జేసుకొని, యప్పటినుండి యనుకొనినప్రకారము వర్తింపఁ జొచ్చిరి. కాని కాళీయుఁడు మాత్రము తానుసంపాదించిన యాహారంబులోని సగపాలును విహంగవల్లభువ కర్పింపక తానే యుప్యాయనంబుగఁ గుడువఁదొడంగెను. అందువలన వైనతేయుఁడు కినుక వహించి కాళీయునిఁబట్టి శిక్షించుటకు దండెత్తిరాఁగా నతండు పన్నగాంతకునకు భయంపడి యాతనినెదుర్కొనఁజాలక కాళిందీనది యందుఁజొచ్చి ప్రాణరక్షణమొనర్చుకొనెను. సుపర్ణుఁడు కాళిందీనదిఁ జొచ్చుటకు భయఁపడెను. కారణమేమన నాతఁడొకనాఁడు క్షుద్భాధ నపనయించుకొను నిమిత్తమై కాళిందీమడుగులోని చేపలనుబట్టి భక్షించుచుండఁగా మత్స్యంబులన్నియుఁ బ్రాణరక్షణంబునకై తత్సమీపారణ్యంబునఁ దపంబుసేసికొనుచున్న సౌభరియను మునిపుంగవుని శరణుజొచ్చెను. అతఁడును వానిపైఁ గరుణవహించి “నాఁడు మొదలు వైనతేయుఁడు నదియందుఁ బ్రవేశించినచో శిరంబు పగిలి మడియుఁగాత” యని యుగ్రశాప మిచ్చెను. ఈ వృత్తాంతమునుస గాళీయుఁ డెఱింగియున్నవాడగుటవలన నామడుగునందుదూఱి ప్రాణరక్షణ మొనర్చుకొనెను. అతం డామడుగున నివసింపఁ దొడంగె. నప్పటినుండియుఁ దనవిషంబువలన, జలంబును విషపూరితంబుగా నొనర్చి, యానీరును గ్రోలినవారలనేగాక తుదకానీటికి సూటిగ నభోభాగ���బునఁ జరించు ద్విజసంతతులను గూడ మడియఁజేయుచు లోకభయంకరుండై మించి యుండెను. అందువలనఁ బ్రతివారును గాళిందిలోఁ బ్రవేశించుటకేగాక తుదకు సమీపించుటకుఁగూడ భయపడుచుండిరి. ప్రాణోపద్రవకరమగునట్టి యా మడుగునందే కృష్ణుఁడు దుమికెను. అందువలననే గోపకులంబంతయు నాతనిఁగూర్చి దుఃఖింపసాగెను. కృష్ణుఁ డట్లు తన నివాసంబగు కాళిందియందు దుమికినంతనే, కాళీయుఁడు రౌద్రాకారంబున విజృంభించి “ఏమిది? పరప్ర్రాణాపహరణ ప్రయుక్త విషానలజ్వాలా సమేతుండనగు నన్నుమఱచి యీబుడుతఁ డిందు దుముకుటకు సాహసించెఁగా? ఔరా! ఈ కాళీయుని ప్రభావమాతనికిఁ దెలియదు కాబోలు! ఒక్కమాఱు నా శక్తిని జూపెదఁగాక” యని పడగలను జక్కగా విప్పి ముఖంబులనుండి విషానల విస్ఫులింగంబులు ప్రజ్వరిల్లుచుండ శరీరంబునుబెంచి బాలకృష్ణుని నాపాదమస్తకంబుగాఁ జుట్టి యాతని గాత్రంబునందంతటను గంటులుపడునట్లు కఱవసాగెను. కృష్ణుండును లీలావినోదియై చేష్టలులేనివాని తెఱంగున భోగిభోగ పరివేష్టితుండై నదీతోయంబుల నుయ్యలలూగనారంభించెను. అట్టియెడ యశోదానందులు మొదలగు యాదవులందఱును మూర్ఛనుండి తేఱి కనులవిచ్చి నదివంక దిలకించునప్పటికిఁ గృష్ణుండు కాళీయునిచేతఁ జుట్టఁబడి చేష్టలు దక్కియుండెను. అట్టి యపాయస్థితియందున్న బాలకృష్ణునిఁగాంచి స్త్రీపురుష బాలవృద్ధ సమేతంబుగ యాదవులందఱును బెద్దపెట్టున విలపించుచు “హ కృష్ణా! కృష్ణా! ఇంక మాకు దిక్కెవ్వరు? మేమిందర ముండియు నిన్ను రక్షింపఁజాలమైతిమే? అయ్యో! కుమారా! నిన్నీయాపదనుండి కాపాడువారెవ్వరు? విషకుచదుగ్ధంబులఁ ద్రావియు నేహానియులేక బ్రతికియున్న నీకు నేఁడీ కాళీయుని విష మపాయంబును గూర్చుచుండెఁ గదా? కృష్ణా! నేటినుండి మాకు ముద్దుముచ్చటలు సెప్పువారెవ్వరు? కుమారా! అయ్యో! తండ్రీ! +నవ్వులు సూవు వా రెవ్వ రింక +మరిగి పాయలేము మాకు నీ తోడిద +అని యందఱును గుంపుగట్టి నదియందుఁ జొచ్చుటకుఁ గడంగిరి. అట్టియెడ బలభద్రుం డడ్డంబువచ్చి కృష్ణున కెంతమాత్రం బపాయంబు సంభవింపనేరదని వారికి నచ్చజెఁప్పి వారి యుద్యమంబును మాన్పెను. +టీక వైనతేయుడు గరుత్మంతుడు; మించి అతిశయించి; ద్విజ పక్షులు; తతులు సమూహములు; గాత్రము శరీరము; దుగ్దములు పాలు; ఉద్యమము ప్రయత్నము. +కృష్ణుఁడును బంధుజనుల దుఃఖావస్థను గాంచి యుపేక్షించుట మంచిదికాదని యెంచి యుచితంబుగ మేనువెంచిమించి కాళీయుని పంచప్రాణంబుల వ��చింప నుంకించి రెట్టించిన యట్టహాసంబున విజృంభించి, వడిగలిగిన పడగల మీద నడిదంబు వడువున నాభీలంబగు నిజకరంబు నెత్తి ప్రచండ ధ్వానంబనూనంబగునట్లు సఱచెను. ఆ వ్రేటునకు శిరంబులు పగిలి నెత్తురులు గ్రక్కుచు గాళీయుఁడు చేష్టలు దక్కిన వాఁడయ్యెను. అట్టియెడఁ గృష్ణుఁడాతని ఫణంబులపై కెక్కి కన్నులు వెఱికి, దౌడలువట్టి నాలుకల నూడఁదీసి, యుప్పొంగుచు గజ్జెలందియలు ఘల్లుఘల్లుమని మ్రోయ నహిమౌళియందు నృత్యంబు సేయఁజొచ్చెను. కాళీయుండును గృష్ణుని దుష్టజనదండ ధరావతారుండైన శ్రీహరిఁగాదలపోసి కంఠగత ప్రాణుఁడై శ్రీకృష్ణపరమాత్మను రక్షింపుమని ప్రార్థింపఁదొడంగెను. +టీక వడి బిగువు, శౌర్యము; అడిదము కత్తి; వడువున వలె; ఆభీలము భీకరము; ధ్వానము ద్వని: ఉంకించు పూను, సిద్దమగు; అహి పాము +ఆ సమయంబునఁ కాళీయుని భార్యలైన నాగాంగనలు తమ ప్రాణనాథునకుఁగలిగిన ప్రాణోపద్రవమునకు మిక్కిలిగఁ బరితపించుచుఁ శ్రీ హరిఁజేరంజని కరంబులు మోడ్చి “ కృష్ణా! మాకుఁ బతిభిక్షఁ బెట్టుము. మానాథుఁడు సర్వచరాచరభూతేశుండవైన నీతత్వంబు నెఱుంగఁజాలక యజ్ఞానంబున నీకపచారంబుఁగావించె, దేవా! నిన్ను జయించువారెవ్వరుగలరు? అగోచరుండవయ్యును గోచరుండగుచుంటివి; నిరాకారుఁడవయ్యు ననంతాకారుండ వగుచుంటివి; నిర్విశిష్టుండవయ్యును విశిష్టుండవగుచుంటివి; నిర్విశేషుండవయ్యును విశేషుండవగుచుంటివి; రూపరహితుండవయ్యును నానారూపసమన్వితుఁడ వగుచుంటివి; అనామకుఁడ వయ్యును బెక్కునామంబులు గలవాఁడ వగుచుంటివి; ఒక్కండవయ్యును సర్వంబునీవయగుచుంటివి; విశ్వంబునీవయయ్యును, నీవు విశ్వంబుగాకుంటివి; నిర్గుణుండవయ్యును గుణాచ్ఛాదకుండ వగుచుంటివి; ఆత్మారామత్వంబువలన మునివయ్యును హ్రస్వదీర్ఘస్థూల సూక్ష్మములకుఁగారణ భూతుడవగుచుంటివి. మహాత్మా! విశ్వభావాభావసందర్శనంబుసేయుచు విద్యావిద్యలకు గారణుఁడవైన నిన్నెవఱెఱుంగఁగలరు? సృష్టి స్థితిలయములకు నీమూర్తియే మూలకారణము. నీమహత్వమక్షోభ్యము బ్రహ్మాది దేవతలకే నీ తత్వంబనిర్వాచ్యంబు. శ్రీకృష్ణా! మాకాంతుని రక్షించి మాకు బతిభిక్షఁబెట్టు’ మని యనేకవిధంబులఁ బ్రార్థింపఁ గృష్ణుండును భక్తపాలకుండుగావున ఆ గాళీయుని ప్రాణంబులఁగాపాడి, తన్నుఁబ్రార్థించుచున్న సర్పరాజునుగాంచి “ఓయీ!నిన్ను రక్షించితిని. నీవిప్పుడే నీ దారాపుత్రులతో బయలుదేరి సముద్రమునకుఁబోయి యచ్చోట వసింపుము. నీశిరంబున మదీయ పాదచిహ్నంబులుండుటవలనఁ బక్షివల్లభుఁ డెంతమాత్రమును నిన్ను బాధింపఁడు. ఇప్పుడే పొ”మ్మని యానతిచ్చె. కాళిందీనదీతోయంబు లప్పటినుండి జనోపయోగ్యంబులగునట్లు వరంబొసంగి, యొడ్డునఁదనకై వేచియున్న జననీజనకులను బంధజనులను జేరంజనెను. కృష్ణుండట్లు సురక్షితంబుఁగా దమ్ముఁ జేరి నంతనే యాదవులందరును మహానందముతో మాటిమాటికిఁ గృష్ణునిఁ గౌగలించుకొనుచు నాతని యమానుషచర్యలను బొగడుచు నిజనివాసంబులకరిగిరి. +టీక అక్షోభ్యము క్షోభ (కలత) చెందుట లేనిది; దారాపుత్రులు భార్యాబిడ్డలు; పక్షివల్లభుడు గరుత్మంతుడు. +కృష్ణుఁడట్లు కాళీయుని శిక్షించి సురక్షితముగా నందగోకులమును బ్రవేశించిన కొన్నినాళ్ళకు నందాదు లింద్రయాగంబును సేయఁదలంచి తద్వృత్తాంతంబు నంతయుఁ గృష్ణునకుఁ దెలియఁ జేసి ‘నీ యభిప్రాయమేమి’ యని యాతని నడిగిరి. అప్పుడాతఁడు వారిఁగూర్చి ‘ఇంద్ర యాగంబునన మీరేల సేయవలయు?’ నని ప్రశ్నించెను. అందుకు నందాదులు బురుహూతునకుఁ బ్రియంబుగా యాగంబు నొనర్చిన నాతండు సంతోషించి వానలు గురియించు ననియు, వానలవలన వసుమతి యందుఁ గసవు పెరుగు ననియుఁ గసవు వలన గోగణంబులు వృద్ధిసెందుననియు, వానివలన వలసినంతపాడి తమకు లభించుననియు, నందువలనఁ దమ కులం బంతయు సకలసంపదలతో విరాజిల్లు ననియుఁ గావున, నింద్రయాగంబు సేయ సమకట్టితి మనియుఁ దెలియజేసిరి. అప్పుడు కృష్ణుఁడు వారినిఁ గాంచి “బంధువులారా! ఇంద్రునివలన మనము పెంపువహింపనేల? అతండు మనకెంతమాత్రమును గర్తకానేరఁడు. కర్మయే యన్నింటికిఁ బ్రధానమగుచున్నది. కర్మవలననే జననమరణంబులును, వృద్ధిక్షయంబులును శరీరధారులకుఁ గలుగుచున్నవి. అట్టియెడ నింద్రుని మనమెందుకుఁ బూజింపవలయును? ఇంద్రుఁడైనను గర్మకు లోఁబడినవాఁడే. అతఁడు కర్మఫలమును పోగొట్టఁజాలఁడు. ఉత్పత్తిస్థితి లయంబులకు సత్వరజస్తమోగుణంబులు ప్రధానములగుచున్నవి. రజంబున జగంబు జన్మించును, రజోగుణ ప్రేరితంబులై మేఘంబులు వర్షించు. అట్టి వర్షంబువలన మీరు వ్రాక్కుచ్చినదంతయు సమకూరును. అప్పుడు ప్రజాభివృద్ధి యగును. కావున నింద్రయాగముతో నిమిత్తంబులేదు. కర్మంబుననుసరించి ప్రజావృద్ధికిఁ బసులకుఁ, గొండకు, బ్రాహ్మణోత్తములకుఁ బూజలు గావించుట సమంజసము. కావున మీరందఱును గోవర్థన పర్వతంబును బూజింపుఁడు. దానివలననే మనకన్నియును సమకూరగల” వని పల్కెను. యాదవులును గృష్ణుని హితంబు ననుసరించి హరిసమేతులై గోవర్థనగిరికిఁ బూజలుసేసి భూసురాశీర్వాదములతోఁ బర్వతంబునకుఁ బ్రదక్షిణపూర్వక నమస్కారంబు లొనర్చి గోవులను బురస్కరించుకొని గృహంబుల కరిగిరి. +టీక వసుమతి నేల; కసవు గడ్డి; పెంపువహించు గౌరవించు; పురస్కరించుకొని ముందు ఉంచుకొని. +కృష్ణుని హితంబును బాటించి గోపకులు తన్ను మఱచినారని యింద్రుఁడు కోపించినవాఁడై వారికి బుద్ధి సెప్పఁదలంచి మేఘంబులఁ బురస్కరించుకొని సకలభువనంబులు కంపించునట్లు, పిడుగులతోఁ గూడిన శిలావర్షంబును నందగోకులంబుపైఁ కురియింపసాగెను. ఆ ప్రచండ శిలావర్ష విజృంభణంబునకు గోపకులు వెఱచి హాహాకారంబులు సేయుచు “కృష్ణా!రక్షింపుము. రక్షింపుము.” అని మొరలిడసాగిరి. కృష్ణుండును వాసవుని యఖండగర్వంబును బోఁగొట్టదలంచి, యపాయంబులేదని బంధుజనుల హెచ్చరించుచు, సకలలోకంబులు తన్నుగీర్తించునట్లు, గోవర్థనంబు నవలీలఁగానెత్తి ఛత్రంబు పగిదిఁ గొనవ్రేలియందు నిలిపినవాఁడై రక్షణోపాయంబుఁ గానక విలపించుచున్న నందగోకులంబును గాంచి “బంధువులారా! ఎంతమాత్రమును భయపడవలదు. ఇదిగో ఈ కొండ క్రిందికిరండు, ఇదియే మిమ్మును, మీదారాపుత్రాదులను, మీగోగణంబులను, గొడుగువలె నెగడి శిలావర్షంబునుండి రక్షింపఁగలదు. మఱియు నో బంధువులారా! +బాలుండీతఁడు కొండ దొడ్డది మహా భారంబు సైరింపఁగాఁ +జాలండో యని దీని క్రిందనిలువన్ శంకింపఁగాఁ బోలదీ +శైలాంభోనిధిజంతు సంయుత ధరా చక్రంబు పైఁబడ్డ నా +కేలల్లాడదు బంధులార నిలుఁడీ క్రిందం బ్రమోదంబునన్. +అని హెచ్చరించి ధైర్యంబు సెప్ప, హరివచనంబులు నమ్మి తమతమ గోధన పుత్రమిత్రకళత్రాది సమేతులై యాదవులాకొండ గొడుగు చాటున నిలచిరి. ఇంద్రుండు నేడహోరాత్రంబులు శిలావర్షమును గురియించియు గోపకులను శిక్షింపఁజాలక మేఘంబుల మరలించుకొనిపోయెను. వర్షమాగినతోడనే కృష్ణుండును బంధువుల వెలుపలి కంపి పర్వతంబు నెప్పటియట్లుంచి గోపకులను కలుసుకొనెను. తమ ప్రాణరక్షణం బొనర్చిన బాలకృష్ణుని వల్లవులెల్లఁ గౌఁగలించుకొని సముచిత ప్రకారంబుల సంభావించి దీవెనలొసంగిరి. అచ్చోట వాసవుండు కృష్ణుని సామాన్యునిఁగా దలంచి తానొనర్చిన పనికి లజ్జించుచు శ్రీహరిఁ జేరంజని తన తప్పును క్షమింపుమని యనేక విధంబులఁ బ్రార్థించెను. కృష్ణుండును దగిన విధంబున నింద్రునకు బుద్దిసెప్పి యెదిరిబలంబు నెఱుంగక యెన్నండును గయ్యంబునకుఁ గా���ు దువ్వకుమా యని హెచ్చరించి యాతనిని వీడ్కొలిపెను. యాదవప్రముఖ లందఱును గృష్ణుని లీలామానుషచర్యలను బదింబదిగఁ దలంచుచు నాతని యందు మివుల భక్తిగలిగి యుండిరి. +టీక నెగడు అతిశయించు; లీలామానుషచర్యలు లీలల వంటి మానవాతీతమైన పనులు; పదింపదిగా అనేక రకములుగా. + + +బలరామ కృష్ణుల యసమాన శౌర్య పరాక్రమ విశేషంబులు భూనభోంతరాళంబులఁ బ్రతిధ్వనులీనుచుండ మధురాపురంబునఁ గంసుండు రేయింబవలు నిద్రాహారంబుల మాని బలరామకృష్ణుల వధోద్యోగంబును గూర్చియే పెక్కుభంగులఁ జింతింపఁ దొడంగెను. తానొనర్చిన ప్రయత్నంబులన్నియు నిష్ఫలంబులగుటవలనఁ గపటోపాయంబునఁ వారల నెవ్విధినైన నిజపురంబునకు వచ్చునట్లొనర్చి మట్టుపెట్టవలయునని తుదకు నిశ్చయించుకొని వారలను మధురాపురంబునకుఁ గొనివచ్చుటకై యక్రూరుండను వానిని బృందావనంబునకుఁ బంపెను. అక్రూరుండును శ్రీహరినిఁ గన్నులారఁ జూచుభాగ్యంబు తనకు లభించినందుకు జన్మంబు సార్థకంబయ్యెనని తలపోయుచుఁ; గృష్ణుని లీలలఁగూర్చి యనేక విధంబులఁ దనలోఁదాను భాషించుకొనుచుఁ; గ్రూరుండగు కంసుని పంపునఁ దానరుగుచున్న వాఁడగుట వలనఁ దన్నాతఁడు వేఱుగాభావించి కరుణింపఁడేమో యని శంకించుచు; భక్తపాలకుండగు హరి, యతని కమలయుగళసేవాపరాయణుండగు తన్నేల కనికరింపకుండునని తనకుఁదానే ధైర్యంబు సెప్పికొనుచు; సకలభూతాంతర్భహిర్మధ్య సంగతుండగు కృష్ణుండు తన నిజస్వభావమును గుర్తింపనేరఁడా యని తర్కించుకొనుచు; నివ్విధంబున గతిపయ దివసంబులు ప్రయాణంబు నొనర్చి, యచిరకాలంబుననే చందనకుందకుటజ తాలసాలకురువక వటమాకందతరు పరిశోభితంబగు బృందావనంబును జేరి, యందుఁ బ్రవేశించి, శ్రీకృష్ణ బలరామ బాహుదండ ప్రాకార రక్షావిశేషభూషంబైన ఘోషంబున నొక్కదెసఁగల నందుని మందిరంబును జొచ్చి, యందు మందహాస రుచిరోదంచిత వదనారవిందుఁడగు నరవిందదళాక్షుని సందర్శించెను. +టీక ఘోషము గొల్ల మంద; రుచిరము అందమైనది; ఉదంచితము పైకి వచ్చినది. +అక్రూరుడు తాను వచ్చినకార్యమునుగూర్చి కృష్ణునకుఁ దెలుపుట +అక్రూరుండట్లు తన్ను సందర్సించినంతనే కృష్ణుండాతని కెదురేగి తోడ్కొనివచ్చి సముచిత ప్రకారంబుల నర్ఘ్యపాద్యాదివిధులఁ బూజించి సుఖాసీనుఁగా నొనర్చి కుశల ప్రశ్నమడిగెను. అక్రూరుండును దనువునఁ బులకాంకురంబులు ముమ్మరంబుగ మల్లడిఁగొన నానందబాష్ప పూరిత నేత్రుడగుచుఁ గృష్ణునిఁ బెక్కు తెఱంగులఁ గొనియాడి యచ్చోటనున్న నందాది ప్రముఖులైన యాదవులందఱును వినునట్లు దాను వచ్చిన కార్యముఁగూర్చి కృష్ణబలరాములతో “మహాత్ములారా! క్రూరాత్ముండును, మీకు మామయునగు కంసుడిప్పుడు ధనుర్యాగంబు సేయనున్నవాఁడు. అట్టి శుభకార్యమునకు మిమ్ముఁ దోడ్కొనిరమ్మని నన్ననుప మిమ్ముఁ గొనిపోవుటకై నేనిచ్చోటి కరుదెంచితిని. కాని యిందేమో మోసంబుగలదని నాకుఁ దోచుచున్నది. ఐనను సర్వజ్ఞులరగు మీకుఁ దెలియనిదేమియునులేదు. మీయిష్టానుసారము వర్తించెద” నని తెలియఁజెప్పఁ గృష్ణుండును నగుచు స్వజనంబులఁ గాంచి ‘బంధువులారా! నేఁడే మీరందఱును దగిన కానుకలఁగొని మధురాపురంబున కరుఁగుడు. మే మక్రూరునితో రేపు బయలుదేఱి మిమ్మందఱ నచ్చోటఁ గలిసికొనెదము. యాగమునకుఁ బిలువఁబడకయే యరుగుట శాస్త్రసమ్మతము. అట్టియెడఁ బిలువఁబడియుఁ బోకుండుట మంచిది కాదు. కావున మీరిప్పుఁడే బయలుదేరి పొం” డని పలుక వారును వల్లెయని తమశక్తికిఁ దగినట్లు కానుకలఁగొని శకటారోహణం బొనర్చి యప్పుడే మధురాపురంబున కరిగిరి. +మఱునాటి యుదయమునఁ దనవియోగఁబునకు సహింపఁజాలక మధురానగరంబున కరుగవలదని తన్ను నిరోధించు వల్లవీజనంబులఁ దాను దిరిగివచ్చెదనని యనేకవిధంబుల నూరడించి; బలభద్రసమేతుండై యక్రూర చోదితంబైన మణిస్యందనంబునెక్కి శ్రీకృష్ణుండు మధురాభిముఖుండై యరిగెను. అట్లు చనుసమయంబున మధ్యేమార్గంబునఁ గాళిందీ నదియొద్ద స్యందనంబు నిలిపి యన్నతోఁ గృష్ణుండు తన్మధుర సలిలపానం బొనర్చి కొంతతడవు తత్సమీప తరుచ్ఛాయా శీతల సికతాతలంబున విశ్రమించి తిరిగి రథంబును బ్రవేశించెను. అట్టియెడ నక్రూరుండు స్నానంబు సేయ నిచ్చగించి రథంబునఁ గృష్ణ బలభద్రుల భద్రంబుగా నుండజేసి నదిఁజొచ్చెను. అందాతఁడు జలంబులమునిఁగి స్నానంబుసేయచుండఁ దన్నదీతోయగర్భంబున బలభద్ర ద్వితీయుండైన శ్రీకృష్ణపరమాత్మ యాతనికిఁ బ్రత్యక్షమయ్యెను. ఇదియేమా యని విస్మయంబునొంది యాతండు లేచి రథంబువంకఁ దిలకింప శ్రీకృష్ణబలభద్రులు రథంబునందే యుండిరి. తిరిగి యాతండు జలంబుల మునిగినంతనే క్షీరసాగర శయనుండైన శ్రీమహావిష్ణుమూర్తి యాతనికిఁ గానఁబడియెను. అప్పు డక్రూరుండు, కృష్ణుండు కేవలము పరమాత్మ స్వరూపుండనియు; బలభద్రుం డాదిశేషుండనియు నెఱింగి భక్తిపారవశ్యంబున నామహాత్ములఁ బ్రస్తుతించుచు మేను మఱచియుండఁ, గృష్ణుండాతనిఁ బ్రొద్దాయెనని హెచ్చరించెను. అక్రూరుం డ��్పటికి తెలివినొంది జలంబులనుండి వెలువడి, రథంబు నధిరోహించి, బలరామకృష్ణుల ననేకవిధంబుల గీర్తించుచుఁ; బ్రొద్దుగ్రుంకువఱకు మధురానగరంబును సమీపించునట్లు రథంబును నడిపెను. కృష్ణుండు బలరామునితో బురంబు వెలుపలనే యరదంబునుండి డిగ్గి యక్రూరుని వీడ్కొలిపి, పురోపవనంబునఁ దన రాకకై యెదురు సూచుచున్న బంధువులఁ జేరఁజనియెను. +టీక స్యందనము రథము; సికతము ఇసుక; తలము చదునైన ప్రదేశము; అరదము రథము; ద్వితీయుండు జత యయి యున్నవాడు; పురోపవనము ఊరి ముందరి ఉద్యానవనము. +తెల్లవాఱినదేతడవుగా శ్రీకృష్ణబలభద్రులు కాలకృత్యంబుల నిర్వర్తించుకొని మధురానగరప్రవేశ మొనర్చిరి. అట్టియెడ రజకుండొక్కరుండు భూపరిపాలకోచితంబులగు దుకూలంబులఁ గొని యెదురు సనుదెంచుచుండఁ గృష్ణుండు వానిఁగని యా వస్త్రంబులఁ దనకిమ్మని యడిగెను. అతండును దుర్మదావివేకంబున నగుచు “ఏమీ వెఱ్ఱిగొల్లలకుఁగూడ దుకూలంబులు గావలయునా? యని పరిహాసంబొనర్చెను. అంత కృష్ణుం డాతనిపైఁ గినుకవహించి పిడికిట నాతని శిరంబు వగులఁజేసి యాతనివద్దనున్న పట్టువస్త్రంబులఁ గొని తానును బలభద్రుండును ధరించుకొనిరి. +టీక భూపరిపాలకులు దేశాన్నేలే రాజులు; ఉచితంబులు తగినవి; రజకుడు బట్టలు ఉతుకువాడు; దుర్మద చెడ్డ గర్వము; అవివేకము తెలివితక్కువతనము. +నూతనవస్త్రాధారణంబున నినుమడించిన మోహనాకారముంబుతో నరుగుచున్న కృష్ణునిఁగాంచి పౌరకాంతలు “ఆహా! ఈసుందరాకారునితోఁ గలసిక్రీడించుటకు గోపికలెట్టినోములు నోచికొనిరో కదా?” యని తమ్ముగూర్చి నిందించుకొనఁజొచ్చిరి. పురుషులగువారును, నాతని మోహనాకారంబునకుఁ దన్మయులగుచు నాతని యమానుషతేజోవిశేషంబుఁ గూర్చియుఁ బనులఁ గూర్చియుఁ బలువిధంబులఁలృదలంపసాగిరి. +బలరామకృష్ణులట్లు గొంతదవ్వరుగునప్పటికి వాయకుండొక్కండు వారల కెదురొచ్చి, భక్తిపూర్వకంబుగా నమస్కరించి, మిక్కిలి మనోహరంబులగు వస్త్రంబులను, విలువఁగల భూషణములను సమర్పించెను. కృష్ణుండును వానిఁగైకొని యాతనియెడఁ గరుణవహించినవాఁడై యాతఁ డొనర్చిన యంతమాత్రపుబనికే యాతని కష్టైశ్వర్యములు గలుగునట్లు వరంబొసంగెను. +టీక దవ్వు దూరము; వాయకుడు బట్టలు నేయువాడు. +అచ్చోటునువాసి మఱికొంత దవ్వరగునప్పటికి సుదాముండను మాలాకారుం డెదురు సనుదెంచి వినయపూర్వకంబుగా రామకృష్ణులకు దివ్యములైన సురభి కుసుమదామములను సమర్పించెను. ఆ పనికిఁ గృష్ణు��డు సంతసించి “ఏమివలయునో కోరుకొనుము. ఇచ్చెద” నని యాతనితోఁ బలుక నమ్మాలికుఁడును గరంబులుమోడ్చి “మహాత్మా! నాకితరంబులేవియును వలదు. నాకు వలయున దేమనగా. +అని వేడికొనఁ గృష్ణుం డట్లకాకయని వెండియు నాతనికి బలాయుః కాంతికీర్తి సంపదల నొసంగి, యగ్రజునితో ముందునకరిగెను. +అట్టియెడఁ గుబ్జయను కంసుని దాసియొక్కర్తుక విలేపనంబులఁ గొని రాజభవనంబున కరుగుచుండఁ గృష్ణుఁ డాదాసిని సమీపించి “ఓ సుందరాంగీ! మాకుఁగూడ విలేపనంబుల నొసంగెదవా?” యనియడుగఁ గుబ్జయు “ఓసుందరాకారా! కుబ్జనగు నన్ను సుందరాంగీయని యెందుకుఁ బరిహాసించెదవు? ఇవిగో విలేపనంబులఁ గొను” మని ప్రేమపూర్వకంబుగా నొసంగెను. కృష్ణుండును వానినందుకొని తాను నుడివిన వాక్యము వృథాకాగూడదని, యామెను సుందరాంగిగాఁ జేయఁదలంచి; దాని పాదంబులను దనచరణంబులతోఁ ద్రొక్కిపట్టి, హస్తాంగుళద్వయము నబల గవుదక్రింద నునిచి మీదికినొత్తి వక్రస్వరూపంబును జక్కఁజేసి యాకాంతను గేవలము మోహినీదేవతగా నొనర్చెను. కుబ్జయుఁ దనసౌందర్యంబునకుఁ దానే యాశ్చర్యపడినదై, మోహనాకారుఁడగు కృష్ణునిపై మోహంబునుగొని కామభిక్షపెట్టుమని యాతనిఁ బ్రార్థించెను. కృష్ణుండును, నాకామిని కోర్కె తరువాత సఫలతఁబొందునని వరంబొసంగె. యవ్విధంబున దన్ను నమ్మినవారినిఁ గరుణించుచుఁ గొంతవఱకుఁ బురంబున గలయందిరిగి నాటికిఁ బురవిహరంబు సాలించి యన్నతో వెడలి విడిదులకుఁజని తనవారలఁ గలసికొనెను. +టీక కుబ్జ మఱుగుజ్జు; విలేపనములు చందనాది మైపూతలు; గవుద చుబుకము, గడ్డము. +తనపురంబునందే కృష్ణుండొనర్చిన యద్భుతకార్యంబులకుఁ గంసుఁడు వెఱుఁగంది యాలసించుట యెంతమాత్రమును తగదని మఱుచటి యుదయముననే నందాదులను గృష్ణ బలరాములను సభాభవనంబున కాహ్వానించెను. నందాదులు ముందరగ బలభద్రకృష్ణులు వెనుకగ నరిగిరి. కృష్ణబలరాములు సభామంటప ప్రవేశద్వారప్రవేశంబొనర్చునెడ నాకస్మికంబుగాఁ గువలయాపీడమను మదగజంబొండు నిజపరిపాలక ప్రేరితంబై కృష్ణునిపై గవిసెను. కృష్ణుండు నీషన్మాత్రంబేనియుఁ జలింపక తనపైకిఁ బరతెంచుచున్న యాగంధనాగంబున కెదురు నడచి హర్యక్షంబు వడువున నవలీల దానిపైకి లంఘించి దనుజ మస్తకవిదారితంబగు హస్తంబునఁ దదీయ గుంభస్థలంబు వగులునట్లు చఱచెను. ఆ ముష్టిఘాతంబునకది తెలివిఁదప్పి ధరణిపై నొరగి నెత్తురులు గ్రక్కుచుఁ గొంతతడవునకుఁ బ్రాణంబులఁబాసెను. అట్లా మదగజంబును గను���ెప్పపాటు కాలంబుననే హతంబొనర్చి దానిదంతంబుల నూఁడబెరికి యున్నయుఁ దానును వానినే యాయుధంబులుగాఁ గైకొని భీకరాకారముతో బలభద్ర ద్వితీయుండై సభాభవనంబును ప్రవేశించెను. +టీక కవియు కలియబడు; గంధనాగము ఏనుగు; హర్యక్షము సింహము; వడువున వలె, పోలె. +అప్పటి శ్రీకృష్ణబలరాముల రౌద్రాకారములఁ గాంచి కంసుఁడు గడగడ వడకసాగెను. అట్టియెడఁ జాణూరముష్టికులను మల్లులిద్దరు దమనాధునకుఁ బ్రియంబు సేయఁదలంచి, శ్రీకృష్ణ బలరాములను గొంత తడవు తమతో మల్లయుద్ధమును సల్పుట కాహ్వానించిరి. పిలువఁబడి నప్పుడు వెనుదీయుట వీర లక్షణంబుగాదని కృష్ణుండు చాణూరుని, బలుండు ముష్టికుని మార్కొని మల్లయుద్ధ మొనర్పసాగిరి. నందాదులు తమపుత్రుల కేమిహాని గలుగునోయని దిగుల్పడసాగిరి. ప్రేక్షకులందఱును బెక్కుమల్లయుద్ధంబులం దారితేరిన చాణూర ముష్టికులను గేవలము పసివారకు యాదవ కుమారులపైఁ బురికొల్పుట చాలా యన్యాయమని కంసుని దూషింపసాగిరి. కంసుఁడు దనమల్లసింహంబుల వలన గోపాలకుంజరంబులు మడియుట నిక్కమని తలంపసాగెను. అట్టియెడఁ గృష్ణబలభద్రులు తమ్ము మార్కొనిన యామల్లులను విచిత్ర గతులనొప్పించి చూచువారాశ్చర్య పడునట్లును, గంసుండు హతాశుండగునట్లును, వారినిఁ బంచత్వంబు నొందించి భీషణంబుగ సింహనాదంబులుసేసిరి. +టీక గడగడ వడవడ, వణుకుట యందు ధ్వన్యనుకరణ; వడుకట వణకుట; మార్కొను ఎదిరించు, ఎదుర్కొను. +పేరువడిన చాణూరముష్టికులు మడసినంతనే కంసుఁడు తత్తరంబున నిజభటులంజూచి “భటులారా! చూచెదరేల? యాదవుల నందరిని బట్టినుగ్గాడుఁడు. దేవకీవసుదేవుల ప్రాణంబుల హరింపుడు. నాకుఁ దండ్రియయ్యు నాపై శత్రుత్వమువహించియున్న యుగ్రసేనుఁబట్టి ముక్కలుముక్కలుగాఁ గోయుఁడు. లెండు. మార్కొను” డని హెచ్చరించినంతనే రక్కసభటులుక్కుమిగిలి యాదవులపై విజృంభించిరి. అట్టియెడ బలుడొక్కరుండే యా దానవభట సంఘంబుల నెదుర్కొని గుట్టలు గుట్టలుగాఁ గూల్పసాగెను. అంతఁ గృష్ణుండు రణోల్లాసంబున మల్లడిఁగొన; నెల్లరుఁ దెల్లబోవ, సింహంబు పిల్లవలెఁ గంస భూవల్లభునిపైకి లంఘించి; కేశబంధంబువట్టి యవలీలఁగ గ్రిందఁబడవైచి; యాతని యురంబునఁ దిరంబుగ నాసీనుండై; దైత్యభట సంఘాతంబులు తల్లడిల్లునట్లు సకలలోకంబులు సంతసించునట్లు “ఓరీ శిశుహంతకా! నీ పాపఫలమిప్పుడే యనుభవింపగల” వని కంసునిఁగూర్చి పలుకుచు వజ్రసన్నిభంబగు తనపిడికిట నాతనిఱొమ్ము వగులునట్లు వొడచి విగతజీవునిగా నొనర్చెను. అట్టియెడ దేవతలందరును గృష్ణునిపైఁ బువ్వులవానఁ గురియించిరి; అప్సరసలు నాట్యమాడిరి; దేవదుందుభులు మ్రోగెను; మరియు నయ్యవసరంబున — +గీతము నారదుఁడు వాడెఁ గృష్ణా యనుచున్. +కృష్ణుండు కంసవధంబు నొనర్చుసరికి బలభద్రుండును దన్నెదుర్కొనిన దైత్యులనందరిని రూపుమాపెను. ఆగోపబాలకుల యసమాన శౌర్యధైర్య పరాక్రమ తేజోవిశేషంబులకు రక్కసులు భయపడి తలకొక్కదిక్కువంతునఁ బారిపోయిరి. శత్రుసంహారము సంపూర్తి నొందుటవలన బలభద్రకృష్ణులు కారాగారంబుననున్న తమ తల్లిదండ్రుల — దేవకీ వసుదేవుల — సందర్శించుట కరిగిరి. దేవకీవసుదేవులును దమపుత్రుల గాంచినంతనే శరీరంబులుప్పొంగఁ గౌగిటఁజేర్చి ముద్దాడదొడంగిరి. కృష్ణుండును దల్లిదండ్రుల బంధవిముక్తులుగా నొనర్చి, తమవలన వారికి గలిగిన కష్టంబులకుఁ దమ్ము క్షమింపవలసినదని బ్రార్థించెను. లీలామానుషవిగ్రహుండైన శ్రీహరి తమ్ము క్షమాపణంబును వేడినంతనే దేవకీవసుదేవులు మోహితులై కుమారుల నిజాంక పీఠంబులనిడుకొని వారివదనంబులఁ దమవేడికన్నీటితో దడుపసాగిరి. అట్టియెడఁ గృష్ణుండు మాతామహుండైన యుగ్రసేనుని రావించి, వినయపూర్వక నమస్కారంబులొనర్చి, “తాతా! పుణ్యపురుషుడవైన నీ విప్పుడే సింహాసనంబునధిష్ఠించి రాజ్యపరిపాలన మొనర్పు” మని పల్కుచు, నప్పుడే యాతనిని రాజుగా నొనర్చెను. అనంతరము మున్ను కంసునకు భయపడి పరదేశంబుల కరిగియున్న యదువృష్టి భోజమరుదశార కుకురాంధక ప్రముఖులగు సకల జ్ఞాతి సంబంధులను రావించి వారి వారి నివాసంబుల నునిచి యివ్విధంబున సర్వంబును గాపాడెను. + + +కంస వధానంతరము బలరామకృష్ణులు, బృందావనంబున కరుగక, తల్లిదండ్రులను మాతామహుని సేవించుచు మధురాపురమునందే నిలచియుండిరి. వసుదేవుండును గుమారులకుఁ దగినవయస్సు వచ్చియున్నందువలన శాస్త్రసమ్మతంబగు నొక ముహుర్తంబు నేర్పరచి, యుపనయనసంస్కారంబును నిర్వర్తించెను. బ్రాహ్మణులకు సదక్షిణంబులుగా ననేక గో భూ హిరణ్యదానంబులను, కుమారుల జన్మసమయంబున మనోదత్తలైన గోవులను, మిక్కిలి విలువఁగల మణిమయ దుకూలంబులను మున్నగు వాని నొసంగి సకలభూతంబులను సంతసింపఁ జేసెను. కృష్ణుండు దన కుపనయనాది సంస్కారంబులు సలుపఁబడినంతనే, తాను సర్వవిదుండయ్యు నెంతవారికేని గురు శుశ్రూష యనునది యుండితీరవలయు ననుదాని నిరూపింపఁ దలచి సాందీప మహామునియొద్ద గురుశ���శ్రూషసేయుచు విద్యాభ్యాసమునకుఁ గడఁగెను. అచిరకాలముననే సర్వశాస్త్రేతిహాస చతుర్వేదవిజ్ఞాన పరిపూర్ణుండై గురువనుమతిని గృహస్థాశ్రమంబును స్వీకరింపఁ దలంచి స్వగృహంబునకరిగెను. బలభద్రుండును వేఱొక గురూత్తమునికడ విద్యాభ్యాసంబును ముగించుకొని మథురానగరంబునకుఁ దిరిగి వచ్చెను. ఇవ్విధంబున రామకృష్ణులు సకలవిద్యాపరిపూర్ణులై గృహస్థాశ్రమ స్వీకారంబునకుఁ దగిన ఈడును గలిగినవారై యుండిరి. +కంసుఁడు కృష్ణునివలన మడసినాఁడనిన వార్త యెల్లెడలఁ దెలియవచ్చినంతనే యాతని బంధుజనులందఱును గృష్ణునిపైఁ బ్రబలసశత్రుత్వమును వహించియుండిరి. అట్టివారియందు మగధ దేశాధీశుండగు జరాసంధుఁడనువాడు ముఖ్యుండై యుండెను. జరాసంధుఁడును మిక్కిలి బలపరాక్రమములు గలవాఁడగుట వలనను, దనకుఁ గృష్ణునివలనఁ జావులేనివాఁడగుట వలనను, గంసుని మరణంబును గూర్చి కృష్ణునిపైఁ గత్తికట్టియున్నవారి కందఱికిని దాను నాయకుండై రామకృష్ణులు గురుకులవాసం బొనర్చుచున్న సమయంబున మధురాపురంబుపై దాడివెడలి, కృష్ణుని స్వజనంబులను బెక్కువిధంబుల బాధించెను. రామకృష్ణులు తిరిగి మధురానగరంబునకు వచ్చియున్నప్పుడు గూడ, జరాసంధుఁడు పెక్కుమారులు దండెత్తివచ్చెను. రామకృష్ణులు, తమవలన నాతనికి మృత్యువు లేకున్నందువలన నాతనివలన నెట్టిబాధలను గలుగకుండ బంధుజనులను కాపాడుచుండిరి. కాని జరాసంధుఁడు మాటిమాటికి దండెత్తివచ్చుచుఁ బురజనుల కశాంతిని జేకూర్చుచుండెను. అందువలనఁ గృష్ణుండు జరాసంధుని బారినుండి స్వజనుల రక్షింప దలంచి, దుర్జనులకు దుర్గమంబును, సుజనులకు సుగమంబునునై యుండునట్లు సముద్రంబు మధ్య ద్వారకయను నొకపురంబును నిర్మింపఁజేసి తనబంధుజనుల నందఱ నందు జేర్చి జరాసంధునివలన శాంతి భంగమొందకుండునట్లొనర్చెను. నలుపక్కల జలరాశియే యగడ్తగాఁగల ద్వారకానగరంబును సమీపించుట కేమియుఁ జాలనివాఁడై జరాసంధుఁ డంతటితో దన దండయాత్రలను ముగించెను కృష్ణుండును ద్వారకానగరంబు నందుండి సురక్షితులైయుండునట్లు బంధుజనులఁ బరిపాలింపఁ దొడంగెను. జరాసంధులకప్పటికి శ్రీకృష్ణుండు కేవలము మనుష్యమాత్రుండు గాడను సర్వంబును జక్కగా బోధపడెను. కాని శత్రుత్వమెంతమాత్రమును నశింప లేదు. +సముద్రమే పరిఖగాఁగల ద్వారకానగరంబున యాదవులందఱును సురక్షితులై యుండిరి. వసుదేవుఁడు తన పెద్దకొడుకైన రామునకు వివాహంబు సేయఁదలంచి కన్యాన్వేషణంబునకు భూసురుల నియోగించెను. వారును సకలదేశంబులు గలయఁదిరిగి తుదకు రైవతుఁడను నొక మండలేశ్వరుని పుత్రికయైన రేవతియను కన్యను రామునకుఁ దగినదని నిశ్చయించుకొని వచ్చిరి. రైవతుండును దనపుత్రికను రామునకిచ్చునట్లు బ్రహ్మదేవునచేఁ దెలుపఁబడినవాఁడై వసుదేవునకు శుభలేఖనంపెను. వసుదేవుండును నాప్తబంధు పుత్రమిత్రపురోహితకళత్రాది వర్గంబులతోఁ దరలివెళ్ళి యొక్క శుభముహుర్తంబున రామునకు వివాహ సంస్కారంబును ముగించెను. రాముండును రేవతితోడ ననుకూల దాంపత్యమును నెఱపుచు నామెయందు శశిరేఖయను పుత్రికారత్నమును బడసెను. ఆ బాలామణియు దినదినాభివృద్ధినొందుచు సకలసద్గుణంబుల కాలవాలంబగుచు జననీజనకులకులకేగాక సమస్తజనులకును ముదమును గూర్చుచుండెను. అట్టి పుత్రికారత్నమను బలరాముఁడు తనకు మేనల్లుఁడును, సుభద్రార్జునులకు ముద్దులపట్టియునగు నభిమన్యునకిచ్చి వివాహంబు గావించెను. +బలరాముఁడట్లు రేవతీ సహితుండై కాపురంబుసేయుచుండఁ గృష్ణుంకుఁ గూడ వివాహంబు సేయవలయునని వసుదేవుఁడు చింతింపసాగెను. కాని శ్రీహరి స్వరూపుఁడైన తనకుమారునకు లక్ష్మీస్వరూపురాలైన కన్యకామణి యెచ్చోట లభించునాయని వసుదేవుఁడు మిక్కిలిగ విచారింపఁదొడఁగె. ద్వారకానగర వృత్తాంతం బిట్లుండ నచ్చోట విదర్భదేశంబునకు రాజధానియైన కుండినగరంబున భీష్మకుండను నొక దొడ్డరాజునకు లక్ష్మీదేవి యంశంబున జనించిన రుక్మిణియను బాలామణి శ్రీహరిని భర్తగఁ బడయవలయునని యాలోచింపసాగెను. భీష్మకుండును నారదాది మహామునీంద్రులవలన శ్రీకృష్ణుని యొక్కయుఁ దనపుత్రికయొక్కయు నిజచరిత్రంబుల నెఱింగినవాఁడై తనబిడ్డను వసుదేవనందనున కొసంగవలయునని నిశ్చయించుకొనెను. కాని యాతని పెద్దకొడుకగు రుక్మియనువాఁడు కృష్ణునియెడ నకారణ విరోధంబును వహించి తనచెల్లెలినిఁ జేది దేశాధీశుండును, కృగృష్ణునకాగర్బశత్రువునగు శిశుపాలున కీయదలఁచి బంధువులను దుదకుఁ తల్లిదండ్రులను నడ్డుపెట్టి వివాహప్రయత్నములఁ గావింపఁదొడంగెను. భీష్మకుండును గుమారున కెదురు పలుకఁజాలక దైవవిధి యెట్లున్నదో యట్లే జరుగఁగలదని మిన్నకుండెను. శేముషీ సింధువులగు బంధువు లందఱును దుస్సంధుఁడగు రుక్మిని ‘నీకిది తగదు’ అని యెన్నియో మారులు బుద్ధిసెప్పిరి. తుదకు నారదుఁడును, “ఈకార్యమునందు నీవు పాల్గొనినచో నిక్కముగాఁ గృష్ణుని వలనఁ బరాభవింపఁ బడెద” వని యాతనికిఁ దెల్పియుండెను. కాని రుక్మి యెవ్వరిని లక్ష్యపెట్టలేదు. +రుక్మిణికి మొదటినుండియు శ్రీకృష్ణునియందే బద్ధానురాగ ముండెను. అట్టియెడ నామె రెండవవానిఁ జేపట్టనేర్చునా? తన వివాహమునకుఁ దనయన్న యడ్డునిల్చి యున్నవాఁడనుమాట నెఱింగినవెంటనే రుక్మిణి మిక్కిలి విచారమును బొంది కృష్ణుని బొందుటెట్లాయని యాలోచింపసాగెను. తుదకు ధైర్యము వహించి తనకాప్తుడగు నగ్నిజ్యోతనుఁడను భూసురశ్రేష్ఠునిఁ దనకడకు రప్పించుకొని యాతనికి సర్వమును దెలియఁజేసి, ద్వారకానగరమున కరిగి శ్రీకృష్ణునిఁ దోడ్కొని రావలసినదని ప్రార్థించెను. ఆతండును వల్లెయని యా నాఁడే ద్వారకకుఁ బయనమయ్యెను. కొన్నిదినములు ప్రయాణంబు లొనర్చి యగ్నిద్యోతనుండు శ్రీకృష్ణుని సందర్శించెను. శ్రీకృష్నుండును దన్నుఁగూర్చి వచ్చిన యా విప్రపుంగవుని నర్ఘ్యపాద్యాది విధుల సత్కరించి కుశల ప్రశ్నాంతర మేమియు నెఱుంగనివానివలె వచ్చినపని యేమని ప్రశ్నించెను. అగ్నిద్యోతనుండును దాను వచ్చినకార్యమును దెలుపఁదలంచి “కృష్ణా! నీ వెఱుంగని వృత్తాంతం బేమికలదు? అయినను మాయామానుష, విగ్రహుడ వగుటవలన నెఱుంగనట్లు నటించుచుంటివి. నావచ్చినకార్యముదెల్పెద వినుము. విదర్భ దేశాధీశుండైన భీష్మకుని పుత్రిక రుక్మిణి యను కన్యకామణి నిన్ను వరింపఁగోరియున్నది. తల్లిదండ్రు లందులకు సమ్మతించిరి, కాని యామె యన్నయగు రుక్మియనువాఁడు సర్వప్రాణ రంజకుండవగు నీయందేలకో శత్రుత్వమును వహించి తనచెల్లెలిని శిశుపాలున కీయఁదలంచి యుండెను. కుమారున కెదురాడఁజాలక భీష్మకుఁడు మౌనము వహించెను. తనయన్నయొక్క దురాలోచనమును దెలిసికొని రుక్మిణి యనాథ రక్షకుండవగు నీకడకు నన్నంపినది. ఇదిగో! ఆమె నీకుఁగా నావలనఁజెప్పి పుత్తెంచిన సందేశంబును దెల్పెద వినుము “ కృష్ణా! +ేఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక +అంకిలి సెప్పలేదు చతురంగబలంబుల తోడనెల్లి యో +పంకజనాభ! నీవు శిశు పాలజరాసుతులన్ జయించి నా +వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే +యుంకువసేసి కృష్ణ! పురు షోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్.” +కావునఁ గృష్ణా! అనాథయగు నా కన్యకామణిని రక్షింపుము. బయలుదేరుము. లెమ్ము అని విన్నవింపఁ గృష్ణుండును రుక్మిణియం దిదివఱకే బద్ధానురాగంబుఁ గలిగి యున్నవాఁ డగుటవలనఁ దోడనే దారుకచోదితంబైన రథంబునెక్కి, యగ్నిద్యోతనునితోఁ గలసి విదర్భకుఁ జనెను. రుక్మిణిఁ దెచ్చునప్పుడు యుద్ధంబు సిద్ధంబని తలపోసి, శ్రీకృష్ణునకుఁ దోడుగావలయునని యాతఁడరిగిన యనంతరము బలరాముఁడు యాదవసేనా సమేతుండై తానుగూడ విదర్భ కరిగెను. +కృష్ణుండు కుండిన నగరంబును జేరునప్పటికే, పెండ్లికొడుకగు శిశుపాలుఁడు జరాసంధాది మిత్రులతో వచ్చియుండెను. ఆతఁడు పురప్రవేశంబొనర్పక యగ్నిద్యోతనుని వలనఁ దన రాకను రుక్మిణికిఁ దెలియఁ జేసెను. వివాహ కాలంబు సన్నగిల్లుడుఁ గులాచార ప్రకారంబు గౌరీపూజార్థమై,రుక్మిణి పురంబు వెలుపల నున్న గౌరీదేవాలయంబునకు సకల బంధుసమేతయై వచ్చియుండెను. అట్టియెడఁ గృష్నుండొరులకుఁ గానంబడక యదృశ్యరూపుండై యాలయసమీపంబున నిలచియుండెను. రుక్మిణియుఁ దనకుఁ గృష్నునేపతిఁగా గూర్పుమని నగజాతకుఁ బూజలఁ గావించి యాలయంబునుండి వెలుపలికి వచ్చెను. ఆ సమయంబున లేళ్ళగుంపునందు సింహంబు దుమికిన చాడ్పున విరోధివర్గంబు నడుమ గృష్నుండు దుమికి యవలీలఁగా రుక్మిణిఁగైకొని నిజరథంబునందు నిల్పి ద్వారకా నగరాభిముఖుండై పోవఁదొడంగెను. ఆ యద్భుత సంఘట్టనంబునకు శిశుపాల రుక్మి జరాసంధాదులు నివ్వెఱపడి కొంతవడికిఁ దెలివిఁతెచ్చుకొని యాయుధహస్తులై తమతమ పరివారములతోఁ గృష్ణుని వెంబడించిరి. అట్టియెడ బలభద్రుండు నిజసైన్యంబులతో శత్రువుల కడ్డంబువచ్చి ఘోరాహవంబుసేయఁజొచ్చెను. ఇంతలోఁ గృష్ణుండు కుండినగరంబు నతిక్రమించెను. కాని రుక్మి మాత్రము బలరాముని బారినుండి తప్పించుకొని, నిజసైన్యంబుతో నతిరయంబునఁ జనుదెంచి శ్రీ కృష్ణుని మార్కొనెను. శ్రీ కృష్ణుండును దృటికాలంబుననే యాతని సైన్యంబుల రూపుమాపి, యాతనిని విరథునిఁగను హతాయుధునిఁగను నొనర్చి కృపాణహస్తుండై యాతనిఁ దెగవ్రేయుటకు రథంబునుండి క్రిందకి దుమికెను. కాని రుక్మిణీదేవి తన యన్నప్రాణంబులఁ గాపాడవలసినదని ప్రార్థించెను. కృష్ణుండును గరుణామయుండుగావున నాతనిఁ జంపక. ‘బావా! రమ్మని‘ పిలచుచు రుక్మిం జేరంజని పదునుగల కత్తితో గడ్డంబును, మీసంబును, దలయును రేవులు వాఱగొరిగి యాతనిని వికృతరూపునిఁగా జేసి విడిచిపెట్టెను. అట్టియెడ బలభద్రుండును శిశుపాల జరాసంధాదులఁ బారఁద్రోలి తనతమ్మునిఁ గలసికొనెను. +అవ్విధంబునఁ గృష్ణుండు రుక్మిణిం గైకొనివచ్చి ద్వారకానగరంబున నతివైభవంబుతో నొక్క శుభముహూర్తంబున నామెను బెండ్లియాడెను. కృష్ణుండు రుక్మిణినొక్కదానినే గాక సత్రాజిత్తుని పుత���రికయగు సత్యభామను, జాంబవంతుని పుత్రికయగు జాంబవతిని, నాగ్నజిత్తి, మిత్రవింద, మొదలగు వారల నేడ్గురిని, మఱియు నరకాసురుని వధానంతర మాతండు చెఱపట్టిన పదాఱువేల కన్నియలను బరిణయంబాడెను. రుక్మిణియందు శ్రీకృష్ణుండు ప్రద్యుమ్నుండను కుమారునిఁ గాంచెను. ప్రద్యుమ్నుండును గాలక్రమంబున బెరిగి పెద్దవాడైయుండు నెడఁ గృష్ణుడాతనికిఁ బ్రభావతియను కన్యను దెచ్చి పెండ్లియొనర్చెను. ప్రద్యుమ్నుండును బ్రభావతితోఁ గాపురంబును సేయుచు నామెవలన ననిరుద్ధుండను కుమారు నొక్కనిఁ గాంచెను. అనిరుద్ధుండును బాల్యయౌవనంబులఁ గడచి కౌమార ప్రారంభమున బాణాసురుని పుత్రికయైన ఉషాకన్యను వరించెను. కాని బాణాసురుఁడు విష్ణుద్వేషియగుటవలస ననిరుద్ధునిఁ బట్టి కారాగృహంబునందుంచెను. కృష్ణుండును మనుమని విడిపించు నిమిత్తమై బాణునిపై దాడివెడలి ఘోరాజియందతని సహస్రబాహుల ఖండించి శంకరుఁడు ప్రార్థింప నాతనిఁ జంపక ఉషాకన్యానిరుద్ధులతో నిజపురంబునకు మగిడివచ్చి తనయవతారంబునం దొనర్పవలసిన కుంతీసుత పరిపాలనముఁ గూర్చియుఁ గౌరవ వినాశంబుఁ గూర్చియు విచారించుచుండెను. + + +పాండురాజతనూభవులైన యుధిష్ఠర భీమార్జున నకుల సహదేవు లను వారు తమపెద్దతండ్రియైన దృతరాష్ట్రుని యాజ్ఞానుసార మింద్రప్రస్తపురంబు రాజధానిగా ధరణీపాలన మొనర్చుచుండిరి. కృష్ణునకుఁ బాండవులు మేనత్తకుమారులును, నిజచరణసరసీరుహ యుగళస్మరణ సుధారసాస్వాద సంజనిత సంతత సంతోష సంపత్పరిపూర్ణులును. నందుఁ బాండవమధ్యముఁడగు నర్జునుఁడు, నిజసోదరీ ప్రాణనాథుం డగుటవలనను, దుర్యోధన ప్రముఖులగు కౌరవుల మూలఁబునఁ గష్టంబులు పెక్కులు వారికిఁ గలుగుచున్నను, నెల్లప్పుడు వారి యోగక్షేమములు విచారించుచు, నన్నింటను జేఁదోడుగా నిలచి వారినిఁ గాపాడుచుండెను. ధర్మజుండు కేవలము ధర్మస్వరూపుఁడా యేమి యనునట్లు నయగుణ వర్తనంబున నిలచి యుండుటవలనను, నాతని యనుజన్ములతని యాదేశంబు ననుసరించి వర్తించుట వలనను, రాజలోకంబంతయుఁ బాండవుల ననేకవిధంబుల గొప్పగాఁ జూచుచుండెను. కాని, దాయాదులును, దృతరాష్ట్రనందనులును నగు సుయోధనాది కౌరవులు మాత్రము వారిని నసూయతోఁ జూచుచుండిరి. +ఇట్లుండ నారదప్రేరితులగు పాండవులు తమ చిన్న తనంబునందే మృతినొందిన తమ జనకుని యాత్మశాంతికై రాజసూయం బను మహాధ్వరంబు నొకదానిని జేయ సమకట్టిరి. అందుకు శ్రీ కృష్ణుండును వారల ప్��ోత్సహించెను. అన్నింటికిని మూలకారణుం డగు శ్రీహరి తమవాఁడగుటవలనఁ బాండవులును ధైర్యము వహించి యా మహాధ్వరంబును సలుపుటకుఁ గడఁగిరి. ధర్మజుని నల్వురు తమ్ములగు భీమార్జున నకుల సహదేవులు నాల్గుదిక్కులకరిగి, యందున్న రాజచక్రంబును నవక్రవిక్రమ పరాక్రమక్రమ విశేషంబున నవలీల జయించి తమ యగ్రజునిపేరఁ గానుకలను గొనితెచ్చిరి. కాని జరాసంధుఁడుమాత్రము జయింపఁబడక మిగిలియుండెను. +జరాసంధుఁడు తనకాగర్బశత్రుండగుటవలనను, నాతనివలన సాధుహింసయు స్వబంధు హింసయు జరుగుచున్నందువలనను, నాతండు జయింపబడనిచోఁ దనభక్తులైన పాండవుల యధ్వరోద్యమమునకు విఘ్నంబు గలుగనున్నందువలనను, శ్రీకృష్ణుండు, జరాసంధవధోద్యోగ సమాచరణంబునకు, భీమార్జున సహితంబుగా బ్రాహ్మణవేషమునుదాల్చి, భూసురాభీష్ట ఫలప్రదాత యగు మాగధునికడ కేగెను. ఆతండును బ్రాహ్మణవేషంబులతో నున్న శ్రీకృష్ణ భీమార్జునులఁగాంచి, యేమి కావలయునో తెల్పుఁ డొసంగెద నని పలికెను. అంతఁ గృష్ణుండును, దమ కాజిభిక్ష దక్క యన్యంబువలదని నుడువుచు, వారును దానును స్వస్వరూపంబులఁ దాల్చి తామెవ్వరైనదియు నాతని కెఱుగఁ బల్కెను. జరాసంధుఁడును, దన్నెదుర్కొనఁజాలక పెక్కు మారులు పారిపోయిన కృష్ణునిఁ గాంచి నగుచు, “కృష్ణా? మదీయబలపరాక్రమంబు లింతలోనే మఱపునకు వచ్చెనా? నన్నెదుర్కొనఁజాలక నట్టనడిసముద్రంబున నగరు గట్టుకొన్న జగదేకజెట్టివి నీవేగదా? అయినఁ గానిమ్ము. నీవు నన్నుఁ గెలువఁజాలవు గనుక నిన్ను నేను మార్కొనను. అర్జునుండు నాకన్నఁ బిన్నవాఁ డగుటవలన నాతనితోఁ బోరుట నాయట్టి యుత్తమవీరునకు ధర్మంబుగాదు. అన్నివిధంబుల భీముండు నాకుఁ దగియున్న వాఁడుగావున నాతనితో బోరెద” నని పల్కుచు ద్వంద్వయుద్ధమునకు వాయుపుత్రుని నాహ్వానించెను. భీముండును, గృష్ణానుమతంబున నుద్దండ గదాదండంబును గొని తొలుఁదొల్త నాతనితో గదాయుద్ధంబునకుఁ దలపడెను. జరాసంధుఁడును బాహుబల పరాక్రమము సమానమగుచుండెను. గదాయుద్ధంబు ఘోరంబుగా జరుగుచున్న సమయంబున నన్యోన్యసంఘర్షణంబున నిరువురి గదలు ముక్కలగుడునంత నొకరితోనొకరు ముష్టాముష్టి, బాహాబాహి, కచాకచి, పోరాడఁదొడంగిరి. అట్టియెడ భీముండలసటనొంది, యరినిరసనోపాయంబు గానక చింతించుచుండఁ గృష్ణుండది తెలిసికొని, భీముండు తనదిక్కు సూచుచుండ నొక్క శాఖాగ్రంబును రెండుగాఁజీల్చివైచి, జరాసంధు నట్ల హతమొనర్చవలసినదని సంజ్ఞగాఁజూపెను. గాడ్పుపట్టి యాకీలు దెలిసికొని, యినుమడించిన సమరోత్సాహంబున, సమధిక బాహుబలాతిశయుండగుచు, జరాసుతుని నవలీలఁ బుడమికిఁబడఁద్రోసి, నిజచరణంబును నాతని చరణంబొండు ద్రొక్కిపట్టి బాహుయుగళంబున రెండవచరణంబును గదలకుండఁ బట్టి, హరికృపాలబ్ధబలోన్మత్తాతిరేకంబున లేఁగొమ్మను జీఱునట్లు పాదజానుజంఘోరుకటిమధ్యోదరాంస కర్ణవయనంబులు సమానంబులుగ వేఱుభాగంబులగు చాడ్పున వ్రయ్యలువాపి విష్ణుద్రోహియు, లోకద్రోహియు నగు జరాసంధుని హతమొనర్చి సింహనాదం బొనర్చెను. +అవ్విధంబున మాగదుని సంహరించి కృష్ణభీమపార్థులు ధర్మజుని జేరంజనినంతనే యాతండును, దిగ్విజయంబు సంపూర్తి నొందినదగుటవలన, విధ్యుక్త ప్రకారంబుగా నధ్వరదీక్షను గైకొనెను. ఆయధ్వర మహోత్సవంబునకు, నారద సాత్యవతేయ కశ్యప భరద్వాజ విశ్వామిత్ర వీతిహోత్ర మైత్రేయ మధుచ్ఛంద గౌతమ భార్గవ వసిష్ఠ వామదేవ ధౌమ్య పరాశర కణ్వ వైశంపాయన ప్రముఖులగు సకల మునీంద్రులును, వివిధ దేశాధీశులగు భూపాలురును, యాదవ దృపద కౌరవ ప్రముఖులగు బాంధవులును భీష్మ ద్రోణ కృపాశ్వత్థామ విదురాది యాత్మీయులును మొదలగు వారందఱును వచ్చియుండిరి. శ్రీకృష్ణుఁడన్నివిధంబుల ధర్మజునకుఁ దోడుగా నుండెను. అధ్వర మంటపంబుననున్న సకలజనులు వినునట్లు, నారదుండు ధర్మజుని ధర్మప్రవర్తనముఁ గూర్చియుఁ బలుదెఱఁగులఁ గొనియాడెను. అట్టియెడ భీష్ముండు తత్క్రతు వైభవంబున కెంతయు సంతోషించి ధర్మజుఁజూచి, “ధర్మజా! స్నాతకుండును, ఋత్విజుఁడును, సద్గురుఁడును, భూతలేశుడును, సంయుజుఁడును ననువారలు పూజనీయులగుచున్నారు. అట్టివారి యందు సద్గుణ శ్రేష్ణుండగు వాఁడుత్తముఁ డగుచున్నాఁడు. కావున నిచ్చోటనున్నవారిలో నట్టివాని నొక్కని గుర్తించి, యాతని కగ్రతాంబూలంబు నిడి, యధ్వరం బొనర్పఁ గడంగుము. ఇది ధర్మపద్ధతి” యని వచింప, ధర్మజుఁ డట్టివానిని గురుతింపనేరక “తాతా! అట్టిపుణ్యపురుషునిఁగూడ నీవేనిర్ణయింపు” మని భీష్మునితోఁ బలికెను. అంత బ్రహ్మజ్ఞాన పరిపూర్ణుండగు మందాకినీనందనుండు “ధర్మజా! క్రతుహర్తయు, క్రతుభోక్తయు, శత్రుమూర్తియు, క్రతుకర్తయు నగు శ్రీహరి యిందు వెలుంగుచుండ నట్టి పుణ్యపురుషునికొఱకు వెదుకుట యేల? చింతించుట యేల? నిర్ణయించుట యేల! అన్నింటికిని శ్రీకృష్ణపరమాత్మయే యాధారభుతము. కావున నా మహాత్మున కగ్రతాంబూలంబుని” మ్మని పలుక, ధర్మజుండును, కేవలము యజ్ఞస్వరూప���ఁడైన కృష్ణునిఁ బూజించి యగ్రతాంబూలంబు నొసంగెను. అచ్చటనున్న వారందఱును గరతాళంబులొనర్చి తమ యంగీకారమును సూచించిరి. శ్రీకృష్ణుండు సంతసించుటవలన సకలభూతములు సంతసించెను. నభోకాంతామణి కనుఁగొనలనుండి యానందబాష్పములు రాలుచున్నవాయేమి యనునట్లు పువ్వులతోఁ గూడిన యాకాశగంగోర్మిశీకరంబులు రాలఁజొచ్చెను. విశ్వమంతయు, విశ్వమయునిఁగూర్చి యానందలహరియందు మునుంగఁజొచ్చెను. +ఆనందరస సాగర సముత్తుఁగ తరంగ డోలికా నివహంబుల నుయ్యెలలూగుచున్న నా సభికుల యందొక్కరుమాత్రము కృష్ణుని యందసూయాపరులై చింతాసాగరంబున మునింగియుండిరి. అట్టివారెవ్వరోగాదు. కృష్ణున కాజన్మవైరి యగు శిశుపాలుఁడే? ధర్మరాజునకు భీష్ముండుపదేశించుటయు నాతని యుపదేశప్రకారము ధర్మనందనుఁడు కృష్ణున కగ్రతాంబూలంబు నొసంగుటయు దానికి సభికులెల్లరుఁ గరతాళంబులమూలంబునఁ దమయంగీకారంబును సూచించుటయు మొదలుగాఁగలవన్నియు శిశుపాలునకు హృదయవిదారకములుగ నుండెను. +అతడెంతమాత్రమును సహింపఁజాలక కృద్ధుఁడై లేచినిలువఁబడి ధర్మజునిఁగాంచి “ధర్మనందనా! ఇన్నినాళ్ళనుండియు సకలధర్మాధర్మ విచక్షణుఁడవని నిన్నుఁ దలఁచియుంటిని. నీ ధర్మబుద్ధియంతయు నేఁడు దెలియవచ్చినది. వృద్ధాప్యమువలన యుక్తాయుక్తజ్ఞానంబుఁ గోల్పోయిన భీష్ముండు సెప్పినంతనే, దానియందుండు నిజానిజంబుల నరయక విశిష్టారాధ్యులగు వారెందఱో యిచ్చోటనుండ, వారలఁగాదని కృష్ణున కగ్రతాంబూలంబు నొసంగుట నీకుధర్మమేనా? కృష్ణునియందేమి గుణంబులున్నవని యాతనిని సభాపతిగా నొనర్చితివి? వృద్ధుని పూజించితినంటివా యందఱికన్నా వృద్ధుండగు వసుదేవుఁడు లేడా? ఆచార్యుఁడని పూజించితినంటివా యాతనికంటె గొప్పవారగు కృపద్రోణులు లేరా? ఋత్విజుఁడని పూజించినంటివా, ద్వైపాయనుండులేడా? భూనాధుండని పూజించితినంటివా, యయాతి శాపంబువలన యదువంశమున కాగౌరవములేదని యెఱుంగవా? ధర్మనందనా!”కృష్ణునేమని పూజించితివి? ముదుసలియగు భీష్ముఁడా నీకు ధర్మము నుపదేశించువాఁడు? అనపత్య దోషుండును, రాజకన్యాపహరణుండును నగు గాంగేయఁడు ధర్మమును దెలుపునంతటివాఁడా? ‘ఆహ! ఏమి కాలవైపరీత్యము! రాజకులంబున కంతకు నేడు నీమూలంబునఁ దలవంపు సంఘటిల్లెఁ గదా? ఒకవేళ నీవును భీష్ముండును మూఢాభిప్రాయములై యున్నచోఁ కృష్ణుండేనియు సభాపతిత్వము తనకుఁదగదని చెప్పవలదా? తానేమీ గుణములు గలవాఁడని యగ్రతాంబూలంబును గైక��నవలయును? ధర్మము ననుసరించినచో, స్త్రీగోబ్రాహ్మణ హింసాపరులగువారు పూజార్హులు గాకపోవుటయేగాక మీదుమిక్కిలి యట్టివారు దండనార్హు లగుచున్నారు. ఈకృష్ణుండు, స్త్రీవధయును, గోవధయును, నమ్మినవారిని జెఱుచుటయును మొదలగు దుష్కార్యముల నెన్నింటినో యొనర్చియుండ నట్టివానిని పూజార్హుండని నీ వెట్లు భావించితివి? యేదియోనొకకార్యము సలుపనున్నప్పుడు యుక్తాయుక్తంబుల నెఱుంగవలదా? ఇదియేనా నీ ధర్మప్రవర్తనము? ఇదియేనా భీష్ముని ధర్మోపదేశము? ఇదియేనా కృష్ణునిగొప్పతన” మని యనేకవిధంబుల ధర్మజ నదీసుత కృష్ణులను దూలనాడఁదొడంగెను. +శిశుపాలుని దూషణ వాక్యములకు సభికులెల్లరును జెవులుమూసికొని, “హరిహరీ” యని చింతించుచుండ, నట్టియెడ సహదేవుండు రోషకషాయిత నేత్రుండై లేచి యందఱిఁ గలయఁజూచి “ఓ సభికులారా! ఇంక ముందెవ్వఁడేనియు శ్రీకృష్ణదూషణం బొనర్చినచో నట్టివాని శిరంబున నిదిగో మదీయ వామపాదంబు నుంచెద’ నని పలుకుచు విజృంభించెను. సహదేవునకుఁ దోడుగా నాతనియన్న యగు భీముండు, ప్రళయకాల పర్జన్య గర్జనంబును నిర్జించు భీషణ గర్జనంబొనర్చుచు నుద్దండ గదాదండమండితుండై యాటోపించి “నేటితో శిశుపాలున కాయువు నిండె” నని విజృంభించెను. అదిగని, శిశుపాలుఁడు నిజసైనికులఁ బురికొల్పసాగెను. అట్టియెడఁ దనకుంచెయుఁ గృష్ణమృగాజినంబును బలుమఱు వీచుచుఁ గలహబంధువగు నారదుఁడు నృత్యము సేయసాగెను. అట్టి కలకలంబునుగాంచి ధర్మజుండు యాగభంగమగునేమో యని దిగులొందుచుండ భీష్ముండాతనికి ధైర్యముసెప్పి భీమసహదేవులఁ గాంచి “కుమారులారా! మీరొనర్పఁదలఁచియున్న పనిని కృష్ణుండే యొనర్చుచును. శిశుపాలుండు దమఘోషుండనువానికి సాత్వతి యందు జనించినప్పుడు నాల్గుభుజంబుల తోడను, లలాటంబునఁ గన్నుతోడను బుట్టెను. తల్లిదండ్రులా వికృతాకారంబునకు భయఁపడి చింతించుచుండ నశరీరవాణి “ఓ దంపతులారా! మీరేల చింతించెదరు? ఎవ్వరేని వీని నెత్తుకొనినప్పుడు మిక్కిలి చేతులును, మిక్కిలి కన్నును దొలఁగిపోయినయెడల నట్టివాని వలననే యీతండు సచ్చునుగాని యన్యులవలనఁ జావనేరఁ” డని తెలియఁజెప్పెను. ఇట్లుండ బలరామసహితుండై కృష్ణుం డొకనాఁడు వారింటికరుగ మేనత్తయగు సాత్వతి కృష్ణునకుఁ దన కుమారు నందిచ్చెను. కృష్ణుం డాతని నెత్తికొనినంతనే మిక్కిలి చేతులును, మిక్కిలి కన్నును దొలఁగిపోయెను. అప్పుడు తనకుమారుఁడు కృష్ణునిచేత మడియునని యెఱింగి, నూరుతప్పులవరకుఁ దన పుత్రుని క్షమింప వలసినదని కృష్ణునిఁ బ్రార్థింప నాతండు వల్లెయని నిజపురంబున కరిగెను. ఆ వరంబువలనఁ గృష్ణుం డుపేక్ష సేయుచుండెకాని లేకున్న వీనిప్రాణము లెప్పుడో యెగిరిపోయియే యుండు” నని వారల శాంతపఱచెను. +అట్టియెడఁ గృష్ణుండగ్రపీఠంబునుండి డిగ్గి సభికులఁజూచి, “మహాత్ములారా! నేను శిశుపాలుని తల్లికొసంగిన వరప్రకార మీతని శతాపరాధంబుల క్షమించితిని. ఇంకమీద నీతని క్షమింపజాలను. నేటితో నీదుష్టుం డంతమొందగల” డని చిత్తంబున సుదర్సనంబును దలంచెను. ఆ క్షణంబుననే సకలదైత్య దానవ దుష్టజనారణ్య వీతిహోత్రంబగు సుదర్సనంబు విస్ఫులింగంబులెగయఁ బరతెంచి శ్రీకృష్ణుని పాణితలంబు నలంకరింప, నాతండును గెంగేల నద్దానిని గిరగిరంద్రిప్పి శిశుపాలునిపైఁ బ్రయోగించెను. ప్రయోగించుటయే తడవుగాఁ గృష్ణద్వేషియగు శిశుపాలుని మస్తకము రుధిరపూరితంబై ధరణిపైఁ బడెను. దుష్టసంహారంబగుటవలన దేవతలు శ్రీకృష్ణునిపైఁ గుసుమవృష్టిని గురిపించిరి. ధర్మజ రాజసూయమహాధ్వరంబును నిర్విఘ్నముగా ముగింపఁబడెను. సర్వవ్యాపియు, సర్వకారణుండును సర్వాధారుండును, సర్వజ్ఞుండును సర్వవస్తుభూతాత్మకుండును, నగు శ్రీకృష్ణపరమాత్మున కెగ్గాచరించి ప్రాణములతో మనఁ గలవారెవ్వరుగలరు? ఆమహాత్మునకే గాక, యాతనిపాదసేవకుల కేనియు, సేవకులకేగాక, సేవకజనసేవకుల కేనియు, నెగ్గాచరించి ప్రాణములతో నుండనోపువారెవ్వరుగలరు? +శిశుపాలుని వధానంతర మాతని యనుచరులగు, సాల్వ పౌండ్రక దంతవక్త్రులనువారు మువ్వురు సకల సైన్యంబుల సమకూర్చుకొని కృష్ణునిపై దాడివెడలిరి. అందు సాల్వుండు శివునివలనఁ బెక్కువరంబుల నందినవాఁడగుటవలన “ధరణిపై యాదవులనుపేరు లేకుండ నొనర్తు” నని ప్రతిజ్ఞఁ గైకొని యుండెను. అట్లు వారు మువ్వురును దన్నెదుర్కొన హరియును వారల నెదుర్కొని మహాహవ మొనర్పసాగెను. బలరాముం డట్టియెడ యాదవసైన్యంబులఁ గూర్చుకొని విరోధిసైనికులఁ బరిమార్పఁ దొడంగెను. దోమలు పదివేలు చేరియైనను సామజమును మరలింపఁగలవా? శ్రీకృష్ణుండు కొంతవరకు వినోదార్థంబు సంగరంబొనర్చి, పరప్రాణాపహరణోద్యోగాచరణంబున నమోఘంబగు తనసుదర్సనంబును బ్రయోగించి వారల హతమొనర్చెను. వారి చావును గాంచి విరోధిసైన్యంబులన్నియుఁ బలాయనములయ్యెను. ఇవ్విధంబునఁ గృష్ణుండు భూభారంబు దగ్గించుచుండెను. + + +పాండవులు ధర్మపరులయ���యును మాయాజూదంబున దుర్యోధనునివలన సకలసంపదలును కోల్పోయి, యనుకొనిన ప్రకారము పన్నెండు సంవత్సరము లరణ్యవాసమును, నొక్కయే డజ్ఞాతవాసమును జరిపి, యుపప్లావ్యంబునకు వచ్చియుండిరి. అట్టియెడ ధర్మజుండు తమ్ముల యాలోచనంబు ననుసరించి, తమ కర్ధరాజ్యంబు నిచ్చుటయో, లేక యుద్దమునకు సిద్ధపడుటయో, యేదియైనదియుఁ దెలిసికొను నిమిత్తమై కౌరవుల కడకుఁ దమకు నచ్చినవానినిఁ గార్యాకార్యవిచక్షణ దక్షుని నొకని రాయబారిగాఁ బంపఁదలంచెను. అట్టివాఁడు శ్రీ కృష్ణుఁ డొక్కఁడే యని యెఱింగి యా మహాత్మునకు ధర్మరాజు తమ యభిప్రాయమును దెలియఁజేసెను. కృష్ణుండును, దుష్టరక్షణమున భూభారంబు తగ్గింప నవతరించి యున్నవాఁడగుటవలనను, దనకు భక్తురాలును కేవల మయోనిజ సంభవురాలును నగు ద్రౌపదీదేవికిఁ గౌరవులు మానభంగ మొనర్చి యున్నందువలనను, దాను ధర్మము నంటియుండు వాఁడు గావున “ధర్మోజయతి” యనువాక్యమును సార్థకంబు సేయవలసిన వాఁడగుటవలనను, నన్నింటికంటెను గౌరవ వంశ నిర్మూలనమునకే తాను యవతారమెత్తి యున్నవాఁడగుటవలనను, నిన్ని కారణములుండుటఁజేసి, తాను గౌరవులకడకుఁ బాండవుల పక్షమున రాయబారిగా నరుగుటకు సమ్మతించెను. ధర్మజుండును గృష్ణునకుఁ జెప్పవలసిన విషయముల నన్నింటినిఁ జెప్పి హస్తినాపురంబున కంపెను. +కృష్ణుండును హస్తినాపురంబును బ్రవేశించి తన భక్తుండైన విదురునియింట బసచేసి, యొకనాఁడు దృతరాష్ట్రుం డాప్తబంధు పుత్రమిత్రాదులతో నిండుపేరోలగంబుండిన సమయమున రాజానుమతిని గౌరవ సభామందిరంబును బ్రవేశించెను. కృష్ణావతార తత్త్వంబును సంపూర్తిగా నెఱింగినట్టి భీష్మద్రోణాదులాతనికి నమస్కారంబు లొనర్చి పరమాత్మఁగా దలంచుచుండ మూఢులగు దుర్యోధనాదులా మహానీయు నొక యలఁతి మానవునిఁగా దలంపసాగిరి. కృష్ణుండును సభా భవనంబును బ్రవేశించిన కొంతవడికి, నిజాసనంబునుండి లేచి ధృతరాష్ట్రుని గనుగొని యెల్లరును వినునట్లు “మామా! ధర్మమూర్తియగు ధర్మజుని పంపున నేను మీకడకు రాయబారినై వచ్చియుంటిని. పాండవులు సమయభంగ మొనర్పక యనుకొనిన ప్రకార మరణ్యాజ్ఞాత వాసంబుల జరిపివచ్చి ప్రస్తుత ముపప్లావ్యంబున నున్నసంగతి యెల్లరకును తెలిసేయున్నది. ఇదివరకుఁ దెలిసియో తెలియకనో యొనర్చినట్టి తప్పులన్నింటినిఁ బ్రస్తుతము మీరైనను వారైనను బరిగణింపవలదు? ఉభయ వంశములును సర్వశ్రేయంబులఁ బొందియుండు తెఱంగున విచారించి నీ తమ్ముని ���ొడుకులైన పాండవులకు న్యాయప్రకారముగా రావలసిన యర్దరాజ్యంబు నొసంగుము. ఇందువలన నుభయులకు మేలుఁగలుగును. ఒకవేళ వారికి యర్థరాజ్యంబొసంగక యుద్ధమునకే సంసిద్ధపడెదవేని “ధర్మోజయతి” యను సూత్రమును మాత్రము మఱవకుము. ఎచ్చట ధర్మముండునో యచ్చట భగవంతుఁ డుండును. ఎచ్చట భగవంతుఁడుండునో యచ్చట సర్వశుభములుండును. నీ కుమారు లధర్మపరులగుటవలన నీ సూత్రము వారియందు సమన్వయింపనేరదు. యుద్ధమే సిద్ధమగునేని నీ వంశనిర్మూలనము సిద్ధమని యెఱుంగుము. పాండవులు సామాన్యులుగారు. వారు కేవలము దేవతాంశ సంభూతులు. శాంతమూర్తియగు ధర్మరాజుండొక్క డలిగెనేని సకలభువనంబులును భస్మీభూతంబులుగాఁగలవు. పతివ్రతాశిరోమణియగు ద్రౌపదీదేవి నోటినుండి పరుషవాక్యములు వెలువడినచో, నీ నూర్గురు కుమారులు లొక్కబరి మృతినొందఁగలరు. ఇదియంతయును దధ్యము. నా హితంబును గైకొనక సంధికొడంబడనిచో నేఁ జెప్పిన దంతయు జరిగితీరును. ఓ మూఢదుర్యోదనా? సావధానుండవై వినుము. నీ మూలమున నీ వంశ క్షయమగు కాలము దాపరించుచున్నది. ఇప్పటికిని మించిపోలేదు. మదీయ హితవాక్యానుసారము పాండవుల కర్థరాజ్యంబు నొసంగి వారితో స్నేహభావమున మెలంగుము. భీష్మద్రోణకర్ణాశ్వత్థాములుండిరిగదా యని యుద్ధమునకు సిద్ధుడవగుచుంటివేమో యది యెంతమాత్రమును దగదు. వేయిమంది కర్ణులున్నను ఒక్కపార్థునితో సమానులుగాఁజాలరు. “ధర్మోజయతి” యను సూత్రమెంతమాత్రమును నిరర్థకంబుఁగానేరదు. చక్కగా విచారించుకొను” మని తెలియఁబలికి తన యాససంబంధిష్టించెను. కృష్ణుని హిత ప్రబోధనమునకు భీష్మ ద్రోణ కృపాశ్వత్థామ విదురాదులెంతయును సంతసించిరి. కాని దుర్యోధనున కది వినుటకుఁ గూడ హేయముగాఁ దోచెను. అందువలన, నచ్చోట నుండజాలక శకుని కర్ణ దుశ్శాసనాదులతోఁ గలసి సభనుండి లేచిపోయెను. +కృష్ణుని హితప్రబోధమునకు ధృతరాష్ట్రుఁడేమి చెప్పునో విందామని సభికులెల్లరును నిశ్శబ్దముగా నుండిరి. కాని దృతరాష్ట్రుఁ డేమియు బదులుసెప్పక మౌనము వహించి యుండెను. అట్టియెడ సభనుండి లేచి పోయిన దుర్యోధనాదులు శ్రీకృష్ణపరమాత్మను బంధింపవలయు నని ప్రయత్నించుచుండిరి. ఆ సమయమునఁ గృష్ణుని కనిష్ఠ సోదరుండగు సాత్యకి కౌరవుల దురభిప్రాయమును గుర్తించి సభికులెల్లరు వినునట్లు కృష్ణునితో “అగ్రజా! నిన్ను బంధించుటకు దుర్యోధనాదులు ప్రయత్నించుచున్నారు. ఆజ్ఞయయ్యెనేని వారల నిప్పుడే మదీయ నిశితకరవాలంబున కెరజేసెద” నని పలికెను. ఆ మాటలకు భీష్మద్రోణాదులు నివ్వెరపడిరి. “కౌరవవంశ క్షయకాలము సమీపించుచున్నదని సభికులందరును దలంపసాగిరి. అట్టియెడ శ్రీకృష్ణుం డాసనంబుననుండి లేచి “సభికులారా! వింటిరిగద? దుర్మార్గప్రవర్తనుడగు సుయోధనుడు నన్ను బంధింపఁదలచి యత్నించుచుండెనట. కానిండు, ఓ మూఢదుర్యోధనా? సకలమానవబంధవిముక్తండనగు నన్నే బంధింపఁదలచితివా? కౌరవవినాశకాల మిప్పుడే దగ్గఱించుచున్నది. రమ్ము. ఇదో చేతనగునేని నన్ను బంధింపు” మని విశ్వరూపంబును దాల్చెను. ఆ విశ్వరూపంబున అష్టదిక్పాలకులును, బ్రహ్మ రుద్రేంద్రాదులును, సకల ఋషీశ్వరులును, భీష్మద్రోణాదులును, కౌరవులును, బంచపాండవులును, వేయేల; పంచభూతాత్మకంబైన విశ్వంబంతయుఁ గానుపించుచుండెను. అట్టి విశ్వరూపంబును గాంచి భీష్మద్రోణాదులు పులకాంకిత గాత్రులై శ్రీకృష్ణభగవానునిఁ గీర్తింపదొడంగిరి. సభయంతయు జయధ్వానములతో నిండిపోయెను. ప్రకృతియంతయు నానందరస కల్లోల సముద్రంబున మునింగి యుండెను. ఎచ్చోట నాలకించినను “ఓం, ఓం, ఓం, ఓం” అను ప్రణవ మంత్రధ్వనులు వినవచ్చుచుండెను. అట్టియెడ ధృతరాష్ట్రుండును హరికృపాలబ్ధదృష్టివలన నామహాత్ముని విశ్వాకారమునుగాంచి, తిరిగి యంధత్వము నొందిన వాఁడై యా యనంతాకారునితో “మహాత్మా! విశ్వరూపంబు నుపసంహరింపుము. వినాశకాలము దాపరించుచున్నప్పుడు నీవుమాత్రమేమిచేయఁగలవు? నా వంశక్షయమగు నని నాకుఁ జక్కగాఁ దెలియును. ఇంక నీ వరిగి యుద్ధప్రయత్నమున నుండు” మని చెప్పెను. కృష్ణుండును ధృతరాష్ట్రుని వాక్యానుసారము తనవిశ్వరూపంబు నుపసంహరించి, దుర్యోధనాదు లవనతవదనులై తన్నుఁ జూచుచుండ, భీష్మద్రోణ విదురాదులు తనవెంటనడువ, సభాభవనమును వీడి యందఱి వలన వీడుకోలువడసి పాండవులవద్ద కరిగెను. నాటనుండి యుభయ పక్షములవారును యుద్ధప్రయత్నముల సేయందొడంగిరి. +‘కౌరవులును బాండవులును రాబోవు మహాయుద్దంబునకు సన్నద్ధులగుచుండఁ గృష్ణుండెట్లు బాండవులపక్ష మవలాభించు ననియుఁ దాను ద్వారకయందే నిలచియున్న నిజశిష్యుండగు దుర్యోధనునకుఁ దోడుగా నరుగవలసివచ్చునేమో యనియు, నుభయులు దనకుఁ గావలసిన వారగుటవలన నెవ్వరిపక్షము నవలింబింపఁ గూడదనియుఁ’ దలంచి బలరాముండు తీర్థయాత్రా నెపంబున ద్వారకానగరంబును విడిచి పుణ్యతీర్థంబుల సేవింప నరిగెను. అట్లరుగుచు నెడనెడ ననేక పుణ్యతీర్థంబుల యందవగాహన మొనర్చుచు దేవర్షి పితృతర్పణ బ్రాహ్మణ సంతర్పణంబుల నాచరించుచుఁ దుదకు నైమిశారణ్యంబునుఁ జొచ్చెను. అప్పుడచటనున్న మునులందఱును దమతమ యాసంబులనుండి డిగ్గి పూజించియుండ,సూతుండు మాత్రము నిజాయసనంబునుండి లేవక, ప్రత్యుత్థాన నమస్కారవిధుల నడపక యుండుటవలన బలభద్రుం డతని యెడఁ గినుకవహించి, ‘సూతుని దురభిమానియు, విద్యాగర్వంబున నొడలెఱుంగక యున్నవాఁడనియు’ నెద భావించి, దుష్టజన శిక్షణార్థం బవతరించిన తన యట్టివాని కాతని యెడ నుపేక్షసేయుట పాడిగాదని హస్తంబుననున్న కుశాగ్రంబునే యాయుధంబుగాఁగొని యాతని వధించెను. అప్పుడచ్చట నున్న మును లందఱును హహారవంబులతోడ నాతనిఁజూచి “మహాత్మా’ మేమీతనికి బ్రహ్మాసన మిచ్చియుండుటవలన నీ రాక నెఱింగియు నాసనంబునుండి దిగుట యధర్మంబు గావున నటుసేయకుండె. సర్వజ్ఞండవగు నీవును యుక్తాయుక్తంబుల విచారింపక యీతనిని వధించి బ్రహ్మహత్యాదురితంబు నందితివి. కావునఁ బ్రాయశ్చిత్తంబుఁ గైకొనుము. నీవే ధర్మంబు దప్పిన నింక భూమిపై ధర్మమునకుఁ దావుండునా? యని యనేకవిధములఁ బలుక బలరాముండును దామసంబునఁ దానొనర్చినపనికిఁ జింతించి, “యైననేమాయె” నని తన యోగమాయా ప్రభావంబువలనఁ దిరిగి సూతునిఁ బునర్జీవితునిఁగా నొనర్చెను. +మునులందఱు నాతండొనర్చిన పనికి సంతోషించి యతని పాపంబు దొలంగెనని వచించిరి. అట్టిమేలు దనకుఁ గూర్చినందులకు మునుల యెడ నాతండు గరుణవహించి “మునులారా! నన్ను బ్రహ్మహత్యా దోషంబునుండి విముక్తినిఁగాఁజేసి కాపాడితిరి. ఇట్టిమేలుఁ గూర్చిన మీకు నేనును మేలుసేయనున్నాఁడ. ఏమివలయునో తెల్పుఁ” డని పలుక వాఱంద ఱేకగ్రీవముగా “మహాత్మా! ఇల్వలుని పుత్రుం డగు పల్వలుండను రక్కసిఱేఁడు మా సవనవాటికలను బాడుసేయుచు మమ్మనేకవిధముల బాధించుచున్నవాడు. వానినింబట్టి వధించి మారు మేలొనఁగూర్పు” మని యాతనితో విన్నవించిరి. బలదేవుండును దనకు దుష్టశిక్షణం బవశ్యక కర్తవ్యంబు గావున, స్మృతిమాత్రంబున నిజాయుధంబులఁ బడసినవాఁడై తత్ప్రాంతారణ్యంబున నున్న పల్వలుని గుహ కరిగి వాని నెదిర్చి వినోదార్థంబుగాఁ గొంతకాలము రణమొనర్చి, తుదకుఁ దన హలాయుధంబున నాతనిని రెండుగాఁ జీల్చివైచి మునిగణంబుల సంతోషపెట్టినవాఁడై తాను యథేచ్ఛం జనియెను. +కురుక్షేత్రమునఁ గురుపాండవబలంబులు యుద్ధంబునకు సన్నద్ధంబులై యుండెను. కృష్ణుండు యుద్ధంబున జోక్యంబు గలిగించుకొనక పార్థు���కు సారథ్యంబుమాత్రంబు నెరుపుట కంగీకరించి పాండవపక్షము నవలింబించెను. యుద్ధము ప్రారంభమయ్యెను. కురుబలంబులకు భీష్ముండు నాయకత్వము వహించెను. పాండవ బలంబులకు దృష్టద్యమ్నుం డాధిపత్యమును గైకొనెను. అట్టియెడ యుద్ధము ప్రారంభమైనదని యనుటయేగాని యర్జునుండు మాత్రము, “తాను రాజ్యభోగానుభవంబునకై, పిన్ననాటినుండి తన్నుఁ బెంచి పెద్దవానిఁగాఁజేసిన భీష్ముని, విద్యాబుద్ధులఁ గఱపి తన్నంతవానిగా నొనర్చిన ద్రోణుని, మరియుఁ దనకుఁ గావలసిన స్వబంధులను, గరుణావిహీనుఁడై, జంపఁజాల” నని కృష్ణునకుఁ దెలియఁ జేయుచు, విరక్తిభావమును వహించి విల్లునమ్ములను విడచి చింతానిమగ్నుఁడయ్యెను. అప్పుడు సకలవిషయరహస్యవేత్త యగు శ్రీకృష్ణుం డాతనిఁజూచి “పార్థా! శోకమోహముల కిది యదనుగాదు. నీవు క్షత్రియుండవు. క్షత్రియులకు ధర్మశాస్త్రోక్తమైన యుద్ధంబుకన్న నితరమగు ధర్మ మేదియునులేదు. అట్టియెడ, నీవు కులధర్మము నెంతమాత్రము నతిక్రమింపఁగూడదు. కావున నీకన్నివిధముల యుద్ధమొనర్చుటయే ధర్మమగుచున్నది. వెండియు రాజులకు యుద్ధమే స్వర్గసమానము. అట్టియుద్ధమును నే రాజులు పొందుచున్నారో యట్టివారు స్వర్గసుఖ భోగానుభవు లగుచున్నారు. అర్జునా! ధర్మతత్వంబును దెలిపెద వినుము. ఎప్పటికైనను దేహములు నశించును గాని వానియందుండునట్టి యాత్మ నశింపనేరదు. ఈ యాత్మను ‘నేను జంపుచున్నా’ నని తలంచువాఁడును, ‘నావలనఁ జంపఁబడు‘ నని భావించువాఁడును, కేవల మజ్ఞానుండగుచున్నాడు. అన్నింటియందును సద్రూపముగా నుండునట్టి యీ యాత్మకు, నాశమునొందుట, మాఱురూపమును బొందుట, పుట్టుట, పెరుగుట, క్షీణించుట యనునవి యెంతమాత్రమును లేవు. ఎల్లప్పుడీ యాత్మ యొకే స్వరూపమున నిలచి యుండును. పంచభూతంబు లీయాత్మను బాధింపఁజాలవు. ఆత్మ నిత్యుండు అవ్యయుండు వికారరహితుండు శుద్ధుండు ఒక్కండు వాగగోచరుండు అచ్యుతుండు. కావుననే పాంచభౌతికంబు లగు దేహంబులు నశించుచున్నను, నీ యాత్మ నశించుటలేదు. సుస్థిరుం డగుటవలననే, యొక దేహమును విడిచి మఱియొక దేహమును ప్రవేశింపఁగలుగుచున్నాఁడు. పార్థా! ఒకఁడొకనిచిచేత నింకొకనిఁ జంపించుచున్నాఁ డనియు, నొకఁడు మఱియొక దేహమును బ్రవేశింపఁ గలుగుచున్నాఁడనియు, నొకఁడు మఱియొకనిఁ జంపుచున్నాఁడనియు జెప్పుట కెంతమాత్రమును వీలులేదు. చంపుటకును జంపించువాఁడవును నీవు గానేరవు. నీవు కేవలము నిమిత్తమాత్రుఁడవు. కావ���న యుద్ధమునకుఁ గడంగుము. ఇదిగో! సర్వమును దిలకింపు” మని తత్త్వోపదేశానంతరము దివ్యదృష్టి నొసంగెను. అర్జునుఁడు దివ్యదృష్టితోఁ దిలకించి నంతనే, కురుబలంబంతయు యమభటుల మూలఁబునఁ బ్రాణంబులఁ గోలుపోవుచుండెను. అంతఁ బార్థుండు సర్వమును గ్రహించినవాఁ డై యుద్దమునకుఁ గడంగెను. +కురుక్షేత్ర సంగ్రామంబు సుమారు పదునెనిమిది దినముల వఱకు జరిగెను. యుద్ధము సమాప్తి నొందునప్పటికిఁ గురువంశం బంతయును, బాండవుల బలంబు లన్నియును నశించెను. తుదకు బాండవులు మాత్రము మిగిలిరి. అట్టియెడ, ద్రోణుని పుత్రుఁడగు నశ్వత్థామ కౌరవబలంబులోని వాఁడగుటవలనఁ దన తండ్రి చావునకును, దుర్యోధనాది కౌరవ వినాశంబు కొఱకును మిగుల దుఃఖించి పాండవుల యెడఁ గినుక వహించినవాఁడై “అపాండవమగుఁగాక” యని నారాయణాస్త్రమును బ్రయోగించెను. +శ్రీకృష్ణుండు త్తర గర్భంబునకుఁ బ్రాణదాన మొసంగుట +ఆయస్త్రజ్వాలలవలన నుత్తర గర్భంబులోని పిండము గూడ మృతి నొందనుండెను. అప్పుడు కృష్ణుం డా యస్త్రంబు బారినుండి పాండవుల రక్షించి యుత్తర గర్భస్థమగు పిండమునకుఁ బ్రాణదానం బొసంగెను. ఇట్లు పాండవుల రక్షించి యుద్ధానంతరము ధర్మరాజునకుఁ బట్టాభిషేక మొనర్చెను. ధర్మజుండును ధర్మంబు దప్పక రాజ్యపరిపాలనంబు సేయఁదొడంగెను. కృష్ణుండు వారికిఁ దోడుగా నుండెను. + + +అర్జునుడు విప్రకుమారులఁ దెత్తునని ప్రతిజ్ఞ బట్టుట +ధర్మరాజు ధర్మంబును దప్పక రాజ్యపరిపాలనం బొనర్చుచుండ హస్తినాపురంబునఁగల యొక బ్రాహ్మణునకుఁ బుట్టినవారు పుట్టినట్లే కుమారులందఱును గతించుచుండిరి. ఆ బ్రాహ్మణుండును బుత్రశోకంబును భరింపఁజాలక రాజమందిరంబును దరియంజని “ఓ ధర్మరాజా! నీ పరిపాలనంబున నధర్మంబు నిలిచియుండుటఁజేసి నా పుత్రులందఱును మరణించుచున్నారు. ఇట్టి యధర్మయుక్తంబైన నీ పరిపాలనం బేల కాల్పనా?” యని యనేకవిధంబుల వాపోవఁ దొడంగెను. అట్టియెడ నర్జునుం డాతనికడ కరిగి వృత్తాంతంబంతయు నాతనివలన నెఱింగి యా విప్రకుమారుల దాఁ దెత్తుననియు నింక ముందు గలుగు పాపలను మృత్యువాత బడకుండ రక్షింతుననియు, నట్లొనర్పకున్న ననలంబునఁబడి కాయంబు దొఱఁగువాఁడననియుఁ బ్రతిజ్ఞపట్టి యాతనికి దుఃఖోపశమనంబు గావించెను. ఇట్లుండఁ గొన్నినాళ్ళ కా విప్రుని భార్యకు నీళ్ళాడు ప్రొద్దులు రాఁగా, నర్జునుం డెఱింగి, సూతికామందిరంబు చుట్టును బాణంబులఁ బ్రయోగించి తుదకుఁ జ���మగూడఁ బ్రవేశింపఁజాలనట్లొనర్చి తానప్రమత్తుఁడై యుండెను. కాని పుట్టిన శిశువు పుట్టినట్లే చనిపోవ విప్రుండర్జునుని నిరర్థకబ్రతిజ్ఞను గలవానిఁగా దలపోసి మురహరునికడ కరిగి పుత్రరత్న మొనర్పవలసినదని యా మహానీయుని అనేకవిధముల బ్రార్థించెను. ఇచ్చోట నర్జునుండును బ్రతిజ్ఞాభంగమునకు విచారించుచు నస్త్రబలంబువలన యమసదనంబున కరిగి యచ్చోట విప్రకుమారులఁగానక యెల్లచోట్లను వెదకినవాఁడై తుదకుఁ దానాడినమాటను నిలుపుకొనఁజాలక, అగ్నిఁ బ్రవేశింపనుండెను. అట్టియెడఁ గృష్ణుండు విప్రునితోఁ గలసి యర్జునుని చెంత కరుగుదెంచి. యతనికిఁ దాను విప్రకుమారులను జూపెదననియు నగ్నియందుఁ బడవలదనియుఁ దెలియఁబలికి విప్రునకు ధైర్యంబు సెప్పి యప్పుడే యర్జునునితో శ్రీకృష్ణుండు విప్రకుమారాన్వేషణార్థమై యరిగెను +శ్రీ కృష్ణుండు విప్రకుమారులదెచ్చి యర్జునుని ప్రతిజ్ఞను నిలుపుట +కృష్ణుడుసర్వజ్ఞుండు గావున దుర్గవన జానపదాచల పక్కణ ప్రభూత నదనదీ సరోవరయుత క్షితి నంతయుదాటి, సప్తసముద్రంబులను, గులగిరిప్రకరంబును నుత్తరించి, మేరునగంబు నతిక్రమించి, యమలోకంబును, భూరినీరంధ్ర నిబిడాంధకార ప్రయుక్తంబునునగు ప్రదేశంబును జొచ్చి, నిజచక్రాయుధ ప్రకాశంబువలన మార్గంబును గాంచుచుఁ జనిచని పెంజీకటికవ్వల సకలమునిగణసమేతుండై భోగీంద్రభోగతల్పంబున శయనించి యున్న యాదివిష్ణుమూర్తిని సందర్సించి, యనేకవిధంబులఁ బ్రార్థించెను. అంత, నయ్యాదిదేవుండును గృష్ణార్జునులంగని, “మహాత్ములారా! మీరు నా యంశమున ధర్మ సంస్థాపనార్థమై నరనారాయణులన జనించియున్నవారగుటవలన, నట్టి మిమ్మును జూడవలయునని యీ మునీంద్రులు నన్నర్థింప విప్రకుమార నెపంబున మిమ్మిచ్చటికి రప్పించితిని. నీ చెలికాఁడగు నరుని ప్రతిజ్ఞవృథ కాఁగూడదు. కావున నీ విప్రకుమారులఁ దోడ్కోని పొమ్ము. శుభంబయ్యెడు.” నని పలికి, విప్రకుమారుల నొసంగ, గృష్ణార్జునులు సముదితస్వాంతులై, యయ్యాదిదేవుని కృపావిశేషంబునకు మెచ్చుకొనుచు, నటనుండి బయలుదేరి దీర్ఘప్రయాణంబు లొనర్చి, హస్తినాపురంబు బ్రవేశించి యా విప్రునకు మృతులైన యాతని కుమారులనందఱ నొసంగిరి. కృష్ణుండును దన మిత్రునకుఁ బ్రతిజ్ఞాభంగంబు గాకుండ నవ్విధంబునఁ గాపాడినవాఁడై పాండవుల వీడుకోలును వడసి ద్వారకానగరంబున కరిగెను. +శ్రీకృష్ణుండు ద్వారకానగరంబును బ్రవేశించిన కొన్నినాళ్��కు యదువంశక్షయంబునకుఁ దుర్నిమిత్తంబులు గోచరంబులుగాఁజొచ్చెను. నారదాది మహామునీంద్రు లందఱును శ్రీ కృష్ణుని నవతారంబు సాలించి వైకుంఠమునకు రమ్మని ప్రార్థింపఁదొడంగిరి. అట్టియెడ, నొకనాఁడు కొందఱు మునీంద్రులు శ్రీకృష్ణసందర్సనంబొనర్చి ద్వారకానగర రాజమార్గంబున నరుగుచుండ యాదవులు గొందఱొక్కచో గుంపుగట్టి, తమలో నొక్కనికి స్త్రీవేషంబునమర్చి, యరుగుచున్న మునులఁ గాంచి “మహాత్ములారా” ఈ కాంత కేమి కలుగునో వచింపుఁ” డని యపహాస్యంబుగాఁ బలుక వారును దివ్యదృష్టివలన సర్వంబు నెఱింగి వారియెడఁ గినుకవహించి, యాకాంతకొక ముసలంబుపుట్టుననియు, దానివలన యదువంశ క్షయమగుననియు వచించి వెడలిపోయిరి. మునుల వచన ప్రకారము గొన్నినాళ్ళకు స్త్రీ వేషధారియగు నా పురుషునకు ముసలంబు పుట్ట, యాదవులు భయమంది యా ముసలంబు నంతయు నఱగఁదీసి సముద్రంబునఁ గలిపిరి. కాని తద్గంధలిప్తంబులగు తరంగంబులు పుడమిఁదాకుటవలన సముద్రతీరంబున నదియంతయుఁ దుంగగా నంకురించి నానాటి కభివృద్ధి నొందెను. ఇట్లుండ యాదవులంద ఱొకనాఁడు మదిరాపాన మత్తులై సముద్రతీరంబును జేరి, యకారణంబుగా నంతః కలహంబును బెంచికొని, యచ్చట దట్టముగాఁ బెరిగియున్న తుంగ బొటికలతో నొకరినొకరు మోదుకొనుచు, ఘోరంబుగఁ బోరుసల్పి, తుదకందఱును బ్రాణంబులు వాసిరి. మునుల వచనంబు లివ్విధంబున సార్థకంబులయ్యెను. +ఇట్లు యాదవులందఱును మడిసిన యనంతరము బలరాముండు తన యవతారంబు సమాప్తినొందెనని యెఱింగి శ్రీకృష్ణుని యనుమతిని ద్వారకాపురంబును నిర్గమించి చని చని యోగమార్గంబున దేహంబును జాలించి యనంతునిఁ గలసెను. అప్పుడు వైకుంఠంబునఁ గలవారందఱును మిగుల సంతోషంబు నంది శ్రీకృష్ణుని రాకకై ప్రార్థింపఁదొడంగిరి. జగదభిరాముండగు రాముండివ్విధమునఁ దనయవతారంబును జాలించి, యదువంశ చారిత్రపత్రంబులనుండి విడివడిపోయెను. +యాదవులు నశించుటయు, బలరాముఁడవతారమును జాలించుటయు, నారదాదిమునీంద్రులు వైకుంఠంబునఁ దనకై వేచియుండటయు, దనయవతారంబు సమాప్తియగు కాలంబు సమీపించియుండుటయుఁ దెలిసికొని శ్రీ కృష్ణుండుద్ధవునిఁ జేర బిలిచి “ఉద్ధవా! బ్రహ్మాదిదేవతా ప్రార్థనంబునఁజేసి యిట్టవతారంబునుదాల్చి ధాత్రీభారంబును దొలంగించితిని. నేటితో నాయవతారంబు సమాప్తినొందఁగలదు. నేటికి సప్తమ దినంబున సముద్రుండు ద్వారకాపురంబును ముంపఁగలఁడు. కావున నీ లోపలనే యందున్న స్త్రీవృద్ధ బాలాదుల నహస్తిపురికిఁ జేర్పవలసినదని నా యాజ్ఞఁగాఁ బార్థునకుఁ దెల్పుము. ఇంతటినుండి, కలియుగంబు సంప్రాప్తంబుఁగాగలదు. అట్టి కలియుగంబున మానవులందఱును దుష్టప్రవర్తనములఁ దగిలి, యధర్మపరులై యకాల మరణంబులకు లోనగుచుందురు. అధర్మంబు మూడుపాళ్ళు నడుచుచుండును. మఱియు మానవులందఱును ధర్మవిరహితులు, నాచారవిహీనులు, నన్యాయపరులు, నతిరోషులు, మందమతులు, నల్పతరాయువులు, బహురోగపీడితులు, నిష్ఫలారంభులు, నాస్తికులునై యొండురుల మెచ్చక యుందురు. కావున నీవు సుహృద్బాంధవ స్నేహంబు వర్జించి యింద్రియ వికారంబులకు లోనుగాక యెల్లప్పుడు హరినామ స్మరణం బొనర్చుచుచు జన్మరాహిత్యంబు నొందుము. ఇంకను వినుము. మానవులు గృహస్థులై యున్నను, రాగాది విషయంబులందుఁ దమ చిత్తంబులఁ జొప్పింపక, సంసారంబుననుండియు, సంసారబంధంబులకు దూరస్తులగుచు నిరంతర ధ్యానగరిష్ఠులై యగ్రాహ్యుండనగు నన్ను సత్వగుణ గ్రాహ్యునిఁగా నెఱింగి హృత్పద్మంబుల జీవాత్మ పరమాత్మల భిన్నంబుగాఁ దలంపక, యేకంబుగాఁ బరిగణించి, శంఖచక్ర గదాఖడ్గ శార్ఞ్గకౌమోదకీ కౌస్తుభాభరణ యుక్తుండనగు నన్నే సర్వంబునకు మూలంబని భజించిరేని జన్మరాహిత్యంబు నొందఁగలరు. నీవింక నేగుము. నేటితో నేనీయవతారంబును జాలించి వైకుంఠంబున కరిగెద” నని తెలియఁబలికి పరమార్థజ్ఞానోపదేశంబు నొనర్చిన, నుద్ధవుండును సంతోష దుఃఖంబులు హృదయంబున మల్లడింగొన మాఱుమాట పలుకనేరక శ్రీకృష్ణుని యాజ్ఞను శిరసావహించి వెడలిపోయెను. +ఉద్ధవుండరిగిన యనంతరము శ్రీ కృష్ణుండును, నిజపురంబును విడనాడి యెందేనిఁజని యొక్క నికుంజపుంజంబు చాటున విశ్రమించి చరణంబు వేఱొక చరణంబుమీద నిలిపి వినోదంబు సలుపుచుండెను. అట్టియెడ మృగయుఁ డొక్కరుండా ప్రదేశంబునకుఁ జనుదెంచి, వినోదంబుగా నటునిటుఁ గదలి యాడుచున్న శ్రీహరి చరణంబును హరిణకర్ణంబుగాఁ హృదయంబున భావించి బాణప్రయోగ మొనర్చెను. ఆ వ్రేటునకుఁ గృష్ణుండు హాహారవంబొనర్ప మృగయుండును దదారవంబు నాలించి మానవునిఁగాఁ దలపోసి, యప్పరమేశ్వరుని డాయంజని తానొనర్చిన యపరాధంబునకుఁ జింతించుచు నామహాత్ము ననేకవిధంబుల క్షమాపణంబును వేడి, యా మహానీయుఁడు దన్ను క్షమించినను దృప్తినొందక వైష్ణవాపరాధంబునకు క్షమాపణంబు లేదను భావంబున శ్రీహరిం దలంచుచుఁ బ్రాణంబులఁ బాసి యపవర్గ ప్రాప్తినొందెను. అంతఁ గృష్ణుండును దనకై విలపించుచున్న దారుకుని గనుంగొని, తాను దేహంబు సాలించిన వృత్తాంతమును బాండవాక్రూర సాత్యకి ప్రముఖులందఱికిఁ దెలియఁ జేయమని పలికినవాఁడై యోగమార్గంబున దేహంబును జాలించెను. అట్టియెడ నభోభాగంబున జయశబ్దంబు లొక్కపెట్టునఁ జెలరేగెను. శతకోటి సూర్యదివ్యతేజోవిభాసితంబగు విమానంబొండు సన నాదేరఁ గృష్ణుండును, బ్రహ్మరుద్రేంద్రాది దేవతలందఱును దన్నుఁ గీర్తించుచుండఁ గదలి వైకుంఠంబున కరిగెను. పుడమియంతయుఁ బూలవానలతో నిండిపోయెను. చల్లని మలయపవనంబులతోఁ బ్రకృతి యంతయు హృదయానందకరంబుగ నుండెను. విశ్వము విశ్వరూపునిలో లీనమయ్యెను. + + +ఇట్లు వ్రాయుటచేత నీతఁడు స్వయంకృషి చేతనే విద్యాధనమును సంపాదించియున్నాఁడని మనము తలంపవలసివచ్చుచున్నది. మఱియు పరమేశ్వరకరుణాకలితుండనికూడ చెప్పుకొనియున్నాఁడు. కాని వీరభద్ర విజయములోని గద్యయు భాగవతగద్యవలెనుండక వేరువిధముగా నుండుట గమనించవలసియున్నది. +ఇది శ్రీమన్మహామహేశ్వర యివటూరి సోమనారాధ్యదివ్యప్రసాద పాదపద్మారాధక కేసనామాత్యపుత్ర పోతయనామధేయప్రణీతంబయిన వీరభద్రవిజయంబు. +ఇట్లు భిన్నముగా ఆశ్వాసాంతగద్యముండుటకు కారణమగపడదు. తొల్లిటిపుస్తకమునకు భాగవతమును రచించునెడల గల సహజ పాండిత్యబిరుదము వీరభద్రవిజయములోని గద్యంలో లేకుండుట ఆలోచన కవకాశ మిచ్చుచున్నది. మఱియు వీరభద్రవిజయములో గల యివటూరి సోమనారాధ్య ప్రశంస భాగవతమునందెచ్చటను గానరాదు. ఈ కారణములవలన వీరభద్రవిజయమితని కృతియగునా కాదా యని సందేహింపవలసి వచ్చుచున్నది. +వీరభద్రవిజయములో భాగవతమునందలి శయ్యాసౌభాగ్యములంతగా కానరావు. పోతనభాగవతమునం దెచ్చటజూచినను విచ్చలవిడిగా ప్రయోగించిన అంత్యప్రాసముగల యలంకారము గానరాదు. మఱియు భాగవతమునందు లేనట్టి దోషములు పెక్కులుగా వీరభద్రవిజయమునంగలవు. ఇందువలన నీతఁడు వీరభద్రవిజయమును భాగవతమునకంటె ముందుగా రచించియుండునని యనుకొనవలసి యున్నది. కాని భాగవతమును రచించుటలో శివదూషణచేయుటచే నతనికి నేత్రావరోధము కలిగినట్టును అందులకై యాతఁడు బంధుజన ప్రేరితుడై వీరభద్రవిజయము రచింపసమకట్టెనని అనుశృతముగా వచ్చుకథలవలన తెలియవచ్చుచున్నది. ఇందుకనుగుణ్యముగా వీరభద్రవిజయములో, +స్తాగమ వీరభద్రవిజ. । యంబు రచించెద వేడ్కనామదిన్. +భాగవతమునందు పోతన గావించిన శివదూషణ, శివభక్తాగ్రేసర దూషణ మొదలైనవి. +యెఱిగి వేదంబు శూద్రున । కిచ్చినటుల. +ఇద�� యిట్లుండగా భోగినీదండకము యొక్క అంత్యమునందీ క్రింది పద్యము కానవచ్చుచున్నది. +ఈతఁడు భాగవతమును రచించినపిమ్మట రచించిన భోగినీదండకమును సర్వజ్ఞసింగమనాయున కంకితము గావించియుండెను. సర్వజ్ఞ సింగమనాయుఁడు 15 వ శతాబ్దముయొక్క మొదటనుండినవాడగుటచే నీతడును ఆ కాలముననే యుండెనని తలంపవలసి వచ్చుచున్నది. మఱియు వీరభద్రవిజయమున బేర్కొన్న యివటూరి సోమనారాధ్యులవారుగూడ ప్రౌఢరాయులకాలములో నుండియుండుటచే నీతఁడు +గూడ ప్రౌఢదేవరాయుల కాలములోనివాడని తలంపవలసివచ్చుచున్నది. శ్రీనాథునకును యీతనికి బాంధవ్యమున్నటులను శ్రుతముగావచ్చు కథలవలన తెలియుచున్నది. కావున శ్రీనాధునకీతఁడు సమకాలీనుఁడని చెప్పవలయును. పదునాల్గవ శతాబ్దముయొక్క అంత్యమున నీతడు జనించి యించమించుగా పదునేనవ శతాబ్దముయొక్క మధ్యవరకును జీవించియుండెననుట సత్యమునకు సమీపముగా వచ్చును. +ఈతఁడు తననివాస మేకశిలానగరమని భాగవతమున నిట్లు జెప్పి యున్నాడు. +ఇట్లు భాసిల్లెడు శ్రీ మహాభాగవతపురాణ పారిజాతపాదపసమాశ్రయంబునను హరి కరుణావిశేషంబునను గృతార్థంబు సిద్ధించెనని బుద్ధినెఱింగి లేచి మరలికొన్నిదినంబులకు నేకశిలానగరంబునకు జనుదెంచి యందు కురువృద్ధబంధుజనానుజ్ఞాతుండనై, +ఏకశిలానగర మిప్పుడెక్కడను గానరాదు. ఏకశిలయన నొంటిమిట్టుమని కొందరును, ఓరుగల్లు అని కొందరును యర్ధములను దీసి తమతమవాదములను స్థిరపరచుకొన దీర్ఘములగు నుపన్యాసములనిచ్చి యున్నారు. ఆవిషయములను గూర్చి చర్చించుటకిందు తావు చాలమిని విడువవలసి వచ్చినది. +పోతనామాత్యుడు పల్కినయెల్ల నిక్కమగుచుండుననుట జనశ్రుతముగానున్నది. అందులకీ క్రిందికధ యుదాహరణములని వచింతురు. +శ్రీకృష్ణుండు మహానుభావుండు గావున బ్రాహ్మణకుమారుండు మృతిజెంది దుఃఖించుచుండగా నక్కుమారుని సజీవితుం జేసెనని వ్రాయుచుండగా పోతన కుమారులలో నొక్కడు మరణించుటయు మరల జీవించుటయు గల్గెను. +రుక్మిణీకల్యాణమున రుక్మిణీదేవిని వర్ణించుచు నీ క్రిందిపద్యమును రచించునెడ. +యని వ్రాయునంత కుయ్యలతొట్టిం బరుండి నిద్రించుచున్న యాతని బాలిక దొర్లి క్రిందనున్న కుంపటిలోబడి కమరివాసన వేయనారంభించెను. అంతట పోతన్న +యని పద్యమును పూర్తిగావించునప్పటికి యా బాలిక కుంపటినుండి లేచి సుఖముగా నుండెను. +ఇట్టి విషయములనేకముల నుదహరింపవచ్చును గాని యివి సత్యమునకు దూరమైయుండునని యీ కాలముననతలంపకపోరు. ఇవి యాతనియందుగల గౌరవము చేతను, యాతనికూలంకష ప్రజ్ఞ చాటుటకును కల్పితములై యుండును. +పోతన భాగవతమును రచించుచుండగా నొక్కనాడు శ్రీ నాధుడరుదెంచి హాలికులకు గుశలమాయని పరియాచకమునకై పల్కెను. అంత పోతరాజు. +అని యుత్తరు వొసంగెను. శ్రీనాథుఁ డంతసిగ్గుపడి “బావా పరిహాసమున కట్లంటిని. ఇంతలోననే కోపింపవలయునా!” అని కొంతతడ విష్టాగోష్ఠియందు గడపెను. +నాటినుండి నాలుగైదు దినంబులు శ్రీనాథుండు పోతనతో “బావా! పాపమో పుణ్యమో! యెవ్వరుచూచినారు. ఈకుటుంబమును పోషించుకొనిన పిమ్మటగదా పరము సంగతి యాలోచించుకొనవలయును. దారిద్ర్యముకంటె నీచమేమియును లేదుగదాయని బలుకుచు నాతని మది ద్రిప్పబోయెను. +శ్రీనాథుఁడు వెడలిపోయినపిమ్మట పోతన యొక్కనాడింటియందు బియ్యము మున్నగునవేమియు లేకుండుటచే మిగుల వ్యసనపడి కట్టా! ఎన్నిదినములు నేనుపవసింతును. నేనెట్లో యేజలాహారముతోడనో నిలువగలను గాని యాలుబిడ్డలమాట యేమి, ఏమైననుసరే గ్రంథము నెవ్వరికైన నంకితమిచ్చి ధనంబును గొనియెదనుగాకయని నిశ్చయించుకొని భాగవతమును చంకబెట్టి యుత్తరీయమును కప్పికొని వీధిలోని కరుదెంచెను. తోడనే యాతని కట్టెదుట వలవల కన్నీరు గార్చుచు +విలపించు సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యెను. ఆమెనుగాంచి పోతనమది కరిగిపోయెను. అంతనాతఁడు సరస్వతి నద్దేశించి యిట్లనియెను. +ర్ణాటకిరాటకీచకుల । కమ్మ ద్రిశుద్ధిగనమ్ము భారతీ! +పోతనామాత్యుడొకయుద్గ్రంధమును రచింపకోరి యొక్కరాకానిశాకాలంబున సోమోపరాగంబు రాకంగని సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్రసముత్తుంగభంగ యగు గంగకుంజని క్రుంకులిడి వెడలి మహానియమంబయిన పులినతలమంటపమధ్యంబున మహేశ్వరధ్యానంబుసేసి కించిదున్మీలితనేత్రుండనై యున్నయెడ, +ఏను నారాజ శేఖరుం దేఱిచూచి భాషింప యత్నంబుసేయు నెడ నతండు దాన రామభద్రుండ, మన్నామాంకితముగా శ్రీ మహాభాగవతంబు దెనుంగుసేయుము, నీకు భవబంధములు దెగునని యానతిచ్చి తిరోహితుండనై సమున్మీలితనయనుండనై వెఱగుపడి చిత్తంబున, +పలికెద వేరొండుగాధ । పలుకగనేలా . +బమ్మెర పోతరాజొకడు. । భాగవతంబు జగద్ధితంబుగన్. +నా కంజాత భవాండకుంభకు మహీ । నందాంగనాడింభకున్. +అని శ్రీ కృష్ణభగవానుని సంస్తుతించియున్నాడు. కాని స్కంధాంత పద్యంబులందునను, తక్కిన స్కంధాదులయందును శ్రీరాముని సంబోధించియున్నాడు. +మంతకు నిర్జితేంద్రియ స । మంచితనభక్త జనాననగం��కున్. +ర్మాయికి గోపికానివహ । మందిరయాయికి శేషశాయికిన్. +పైపద్యములను బట్టియు, స్కంధాదిపద్యములను బట్టియు నీతడు రామకృష్ణుల యవతారములయెడ నభేదబుద్ధిగల్గి యిరువురును యొక్కరేయని దలంచువాడనుట తెల్లమగుచున్నది. అయినను ఈతఁ డద్వైతియగుటచే భాగవతమును అద్వైతపరముగనే రచించియున్నాఁడు గాని విశిష్టాద్వైతపరముగ నాంధ్రీకరించి యుండలేదు. +పోతన మహాభాగవతమున నష్టమస్కంధమును ఆంధ్రీకరించుచు గజేంద్రమోక్షకథా సందర్భమున, +అనునంతవరకును పద్యమునువ్రాసి యాపైనేమివ్రాయుటకును దోపక బెద్దయుంబ్రొద్దు చిందించి యానాటికింక గ్రంధరచన పొసగదని కట్టిపెట్టి కుమార్తెను బిలిచి అమ్మా! పుస్తకమును గొనిపోయి జాగ్రత్తపరుపుము అని చెప్పి యటనుండి లేచి యాహ్నికముల దీర్చికొనుటకు నదికరిగెను. +భక్తవత్సలుడును కరుణాంతరంగుడును అగు శ్రీ మహావిష్ణువు తన భక్తుడగుపోతన తనయానతిచే భాగవతమును దెనిగించుచు నాలోచన కుదరక గ్రంథరచనముగించి స్నానార్థమరిగినతోడనే యాతనికి దోడ్పడనెంచెను. తోడనే యాతఁడు పోతనరూపమును ధరించి యింటిలోని కరుదెంచి కుమార్తెను బిలిచి అమ్మా! ఇందాకటి పుస్తకమను గంటమును గొనితెమ్మ, పద్యమును సంపూర్తిగావించెదను. అని వచించెను. పోతనకుమార్తె నిక్కమునకు తనతండ్రియే మరలివచ్చి యిట్లడుగుచున్నాడని తలంచి యాపుస్తకమును గొనివచ్చి యిచ్చెను. మహావిష్ణువా గ్రంథమున పోతనవిడచిన పాదమును యిట్లు పూరించెను. +అని మాత్రము వ్రాసి యటుపిమ్మట పోతన సులభముగా నా పద్యమును పూరించగలడని యెంచి పుస్తకమును యెప్పటియట్లు కట్టి పోతనకుమార్తెకిచ్చి వెలికేగెను. ఆబాలికయు గ్రంథమునుగొని జాగ్రత్తపరచెను. పోతన యా దినమంతయును నాపద్యమునుగూర్చియే యాలోచించుచు గడిపివైచి మరునాఁడు ప్రాతః కాలమున కుమార్తె “నంపించి కుమారీ పుస్తకమునుగొనితెమ్ము. ఎట్లో యద్దానిని పూర్తి చేసెదను” యని పల్కెను. కుమార్తె పుస్తకమును గొనివచ్చి యందించెను. పోతన గ్రంథమును విప్పిచూడగా నందు దన వ్రాతగాక ముత్యములకోవవలె వ్రాయబడియున్న వ్రాతను దిలకించి, యాపద్యము తానువ్రాసిన దానికంటె నెక్కుడుగా నుండుటయుగాంచి కుమార్తెను పిలిచి “అమ్మా! ఇది వ్రాసినవారెవ్వరు చెప్పు”మని ప్రశ్నించెను. అంత నామె “జనకా! నిన్నమీరు స్నానమునకేగిన కొన్ని నిముషములకు దిరిగివచ్చి నా చే పుస్తకమును దెప్పించి వ్రాసియుండిరికాదా. ఇప్ప��డిది యెవ్వరు వ్రాసిరని యడిగెదరేల” యని ప్రశ్నించెను. అంత పోతన, “నిన్న నేను పుస్తకము మరల ముట్టుకొనలేదు ఆ మహావిష్ణువేవచ్చి యియ్యదివ్రాసియుండును. కుమారీ! నీవు చాల యదృష్టవంతురాలవు. వెన్నుని జూడగల్గితివని నుడివి యా పద్యమును యొకనిముషములో నిట్లుపూరించెను. +ఇయ్యది యనుశ్రుతముగా వినవచ్చుకధల నాధారముగా గొని వ్రాయబడియున్నది. +పోతనరచించు భాగవతమును దానెట్లైనను కృతిగొనవలయునని సంకల్పించుకొని సర్వజ్ఞసింగమనీడు తనసేనానాయకునకు గొంతబలమునొసంగి నీవేగి బమ్మెరపోతనామాత్యుని దండించియైన బట్టుకొని మహాభాగవతముతోగూడ నాతని నిచ్చటకు గొనిరావలసినదని నియమించెను. ఆసేనానాయకుఁడును తృటిలో నాకార్యమును సాధించుకొనివత్తు నని బీరములు పలికి వెడలిపోయెను. భక్తపరాధీనుడగు వెన్నుడు తనభక్తున కపకారముసేయబోవుచున్న నాతని యభిప్రాయమును గ్రహించి యాతని మందలించి వెనుకకు పంపనెంచెను. కాని యంతలోనిట్లు వితర్కించెను. ఈతనిని వెనుకకిపుడే పంపినచో రేపో లేక మరియొకనాడో చనుదెంచి యీతఁడు పోతనను బాధింపకమానడు. సర్వజ్ఞసింగమనీఁడు ముష్కరుఁడు. అతనికి తగినశిక్ష విధించినగాని సరియైన మార్గమునకురాఁడు.అని వితర్కించుకొని +తనతొలుతటి యభిప్రాయముపహరించుకొనియెను. ఈసేనానాయకుఁడు పోతనయింటిని ముట్టడించెను. ఆసమయమున పోతన నిర్భీతితోనుండెను. అపుడు పోతన భాగవతమున యజ్ఞవరాహవతార ఘట్టమును వ్రాయుచుండెను. అందీ క్రింది పద్యమును రచించెను. +నడరు సంరక్షితక్షోణి । యజ్ఞ ఘోణి. +అనుపద్యమును రచించునప్పటి కేవిధానపోతనను రక్షింతునాయని యాలోచించుచున్న శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహరూపముదాల్చి యా సేనానాయకుని సైన్యమును ప్రతిఘటించుచుండె. +అని రచించునప్పటికి యజ్ఞవరాహరూపముననున్న హరివిక్రమించి నిర్వక్రపరాక్రమంబున దన్ను ప్రతిఘటించిన ప్రతివీరులనెల్ల నొక్కుమ్మడిగూల్చుచుచు సేనానాయకునిబట్టి తొల్లి యజ్ఞవరాహము హిరణ్యాక్షునిఛేదించివధించిన తెరంగున మట్టు +బెట్టెను.ఇట్లు సర్వజ్ఞసింగమనాయని సైన్యమును ధ్వంసముసేసి దీనితో యా నృపాలునకు బుద్ధివచ్చును. ఇక నెన్నడును పోతనను బాధింప బలమును పంపకుండును. అని వితర్కించుచు నంతర్హితుండయ్యెను. సింగమనాయుడు తనకనేక యుద్ధములలో దోడ్పడినట్టియు, విశ్వాసపాత్రుఁడైనట్టియు సేనానాయకుడు మరణించినందుల కెంతయో విలపించెను. పోతనకు యీ సంగతియంతయు దరువాత తెలియవచ్చెను. పరమేశ్వరునకు దనయందుగల వాత్సల్యమునకెంతయు సంతసించినవాఁడై తా నాసమయమున రచించుచున్న ఘట్టమగు బ్రహ్మాదులు యజ్ఞవరాహమూర్తిని సంస్తుతించుటయందు భక్తి భావమును యిట్లువెల్లివిరియునట్లు వర్ణించియున్నాఁడు. +పలరిన కార్యముల్ నడప నన్యులకుం దరమే? రమేశ్వరా! +టకుఁ దలపోసి యా క్షితిఁ దృఢంబుగ నిల్పితి వయ్య; యీశ్వరా +శాశ్వతలీల లిట్టి వని సన్నుతిసేయఁగ మాకు శక్యమే? +ఇపుడు ముద్రితమై మనకు లభించుచున్న భాగవతము సంపూర్ణముగా పోతనామాత్య ప్రణీతముగాదు. పోతనామాత్యుఁ డు రచించిన భాగవతములో కొన్ని భాగములు శిధిలములు కాగా నట్టిభాగములను యితరులు పూరించిరి. పోతనామాత్యకృతమగు నా భాగములేల నశించినవి యను ప్రశ్నకు జనశ్రుతముగా నొండు రెండుకథలు వినవచ్చుచున్నవి. వానిని క్రింద బొందుపరచుచున్నాడను. +పోతనామాత్యుఁడు మహాభాగవతము నాంధ్రీకరించుచున్నట్లును, అతని కవిత్వమత్యంత మనోహరమైనదై సుధామయోక్తులతో నిండి యున్నదనియు వేంకటగిరి సంస్థానమున కధిపతియైన రావు సర్వజ్ఞ సింగమనాయునకు దెలియవచ్చెను. అతఁడు పోతనను ప్రార్థించి యా గ్రంథమును దానంకితమును పొందనభిలషించెను. పోతనామాత్యుఁడు తన భాగవతమును తనయిష్టదైవమగు శ్రీరాములకే యంకితమొసంగుటకు కృతనిశ్చయుఁడై యుండెను.అందువలన సింగమనాయుని యభిమత మీడేరదయ్యెను. +పోతనకు మఱదియగు శ్రీనాధుఁడు పోతనచెంతకరుదెంచి యాతఁడు మిగులదరిద్రుడై తినతిండియైనలేక యవస్థపడుచుండుట దిలకించి యాతనితో “బావా! యేల ఈవిధముగా కష్టము లనుభవించెదవు. నీవు రచించుచున్న యీ భాగవతము నెవ్వరికైన నంకిత మొసంగరాదా? నీ యట్టివాడంకిత మొసంగిన నెంతేని ధనంబు నొసంగుట కెందఱెందఱో సిద్ధముగానున్నా”రని పల్కెను, కాని పోతన యంగీకరింపడయ్యెను. +సింగమనాయుఁడు తనకోర్కెనెఱవేఱమికి గివిసిపోతనచెంతనున్న భాగవతమున దెప్పించి యద్దానిని నశింపుజేయవలయునను తలంపున దనయంతఃపురమున నొక్కచో పాతిపెట్టించెను. పోతనయు రామచంద్రున కంకితముగా నేను గ్రంథమురచించితిని. అయ్యది లోకమునవెలసి కలకాలముండుట యా రామచంద్రునకు సమ్మతమయ్యెనేని యాతఁడే యా గ్రంథమును వెలిగొనివచ్చును,అని తలంచి మిన్నకుండెను. కొన్నిదినములుగడచెను. +ఒక్కనాడు సింగమనాయుని స్వప్నమున శ్రీ రామచంద్రుఁడు సాక్షాత్కరించి యాతనికిట్లనియెను. “ఓయీ! లోకములోనున్నస్వార్థపరులలో నగ్రగణ్యుండవై యేల భగవదపచారము గావించెదవు. మహాత్ములగు కవి సౌర్యభౌములు తుచ్ఛములగు నీయీ ధనంబుల కాసజెంది నిన్ను సేవింతురనియే తలంచితివా? పోతన్నవంటి భక్తశిఖామణి, కవిపుంగవుఁ డు నిన్నాశ్రయించునా! అతఁడు తన భక్తిప్రభావమున నన్నే తన హృదయపంజరమున బంధించి యున్నాఁడు. అట్టివానియెడ నీవు మహాపచార మాచరించి యుంటివి. అజ్ఞానవశంబునగాని జ్ఞానవశంబునగాని నాకపచార మాచరించినవారిని మన్నింతునుగాని నా భక్తునకు గీడొనరించిన వాని నెన్నటికిని క్షమింపను. కావున నీవు పాతిపెట్టించిన గ్రంథమును వెలికిదీసి యద్దానిని సభక్తిపూర్వకముగా పోతనామాత్యునకర్పించి క్షమాభిక్షకోరుకొనుము. అట్లుగాదేని నీవు నా కోపానలంబున బగ్గునమాడిభస్మావశేషుఁ డయ్యెదవు.” ఇట్లు పలికి రామచంద్రుఁ డంతర్హితుడయ్యెను.సింగమనాయఁ డుదయమున మేల్కాంచి కాలోచితముల దీర్చుకొని సుస్నాతుఁడై శ్రీరామచంద్రుని భక్తితాత్పర్యములు ముప్పిరిగొన పూజించి స్వయముగా నా గ్రంథమును ద్రవ్వి యద్దానిని శిరముపైనిడుకొని పోతనామాత్యుని గృహమునకు గొనిపోయి యర్పించి పోతనపాదములపైవ్రాలి “మహానుభావా! తమయెడ మహాపరాధము గావించియుంటిని. రక్షించవలయును.” అని పెక్కువిధముల ప్రార్థించెను. పోతనామాత్యు డాతనిని మన్నించి పంపివైచెను. +పోతన గ్రంథమును విప్పిచూడగా నందు గ్రంధపాతములు బొడకట్టెను. పోతన తిరుగవానిని రచింపక యేలనో విడచెను. తరువాత వెలిగందల నారయారు లద్దానిని పూరించియుండిరి. +పోతనామాత్యుఁడు స్వవిరచితమగు భాగవతమును తన దేవతార్చన పెట్టెయందుంచి నిత్యపూజలు సలుపుచు గౌరవించుచుండెడివాఁడు. అటుపిమ్మట దన యవసానకాలమున కుమారుఁడగు మల్లనను బిలచి “నాయనా! ఎట్లో కష్టపడి గ్రంథమును సమగ్రముగా రచించితిని. పొట్టకూటికై యద్దాని నొరులకు విక్రయింపక యిన్నిదినములవరకు దాచియుంచితిని. నాకవసానము సమీపించినది. నేనీగ్రంథమును నీ హస్తమునందిడి పోవుచున్నాను. నీవు నా యందెట్టి భక్తివిశ్వాముల జూపియుంటివో యట్లే యీగ్రంథమునెడగూడ భక్తివిశ్వాసములు గల్గి లోకమున వెలయింపుము.” అని జెప్పి మరణించెను. తదనంతరము మల్లనాదులు గ్రంథమును పరిశోధింపగా నందు కొన్నిభాగములు క్రిములచే నాశనముగావింపబడినవి. పోతనామాత్యుని శిష్యులుమల్లన మున్నగువారాలోపములను పూరించియుండిరి. +“బావా! ఇదేమి దుక్కిటెడ్లనుగొని పొలముదున్నుచు నెంతకాలము గడిపెదవు. +అని వచించుచుండువాఁడు. పోతనయు యెప్పటికప్పుడు యేదో విధముగా తగినసమాధాన మొసంగుచుండువాఁడు. ఒకనాఁడు శ్రీనాధుఁడు పల్లకియందెక్కి పోతనామాత్యుని జూడ నరుదెంచుచుండెను. ఆ సమయమున పోతన తన చేనుగట్టున గూర్చిండి యేదోవిషయమును గూర్చి యాలోచనలు సలుపుచుండెను. పోతన +కుమారుఁడగు మల్లన యరకకట్టి పొలము దున్నుచుండెను. శ్రీనాధుఁడు పోతనకు తన శక్తి సామర్థ్యములు జూపవలయునని పల్లకి మోయువారలను బిలచి “ఓరీ వెనుకప్రక్కనున్నవారు. పల్లకిదండిని వదలిపెట్టుఁడు పల్లకి యెప్పటియట్లు నడువగలద”నియెను. బోయీలు పల్లకిదండిని వదలివైచిరి. పల్లకి మామోలుగా నేగుచుండెను. పొలమును దున్నుచున్న మల్లన యదిగాంచెను. తోడనే యాతఁడాశ్చర్య మగ్నుండై “నాయనా మామ శ్రీనాధుఁ డరుదెంచుచున్నాఁ డు. పల్లకి వెనుకబోయీలు లేకుండగనే నడచుచున్నది. చాల విచిత్రముగా నున్నదని పల్కెను. పోతన తన యాలోచనమును చాలింపక “కుమారా! వింతయేమున్నది. దాపలియెద్దును విప్పివేయుము.నీ నాగలికూడ యట్లే నడువఁ గల”దనియెను. మల్లన యావినోదమును జూడవలయునని దాపలకట్టిన యెద్దును విప్పివైచెను. నాగలి యెప్పటియట్లు నడుచుచుండెను. మల్లన యెంతయు వింతనొంది తిలకించుచుండెను. శ్రీనాధుఁడు బోయీలవలన నాగలి దాపలియెద్దు లేకుండగనే నడచుచుండుట విని యెంతయు సంతసించి మరల బోయీలనుపిలచి, “ఓరీ! ముందుభాగమునుగూడ వదలిపెట్టు”డని యాజ్ఞాపించెను. బోయీలు పల్లకిదండిని వదలివైచిరి. పల్లకి యెప్పటియట్లు నడచిపోవుచుండెను. మల్లన యదిగాంచి తండ్రి కెఱింగించెను. పోతనయు “గుమారా! ఆశ్చర్యము జెందకుము. వలపలియెద్దునుగూడ విప్పివేయుము. నాగలి యెప్పటికంటె సులభముగా నడువగల”దని పల్కెను. మల్లనయు నట్లే గావించెను. నాగలి యధాప్రకారముగా సాగిపోవుచుండెను. బోయీలు రెండువైపులను యెద్దులు లేకుండ బోవుచున్న విషయమును శ్రీనాథునకు తెలియజేసిరి. శ్రీనాథుఁడు తన యపరాధమును +గుర్తించి దిగ్గున పల్లకినుండి దిగి పోతనామాత్యుని సమీపించి, “బావా! క్షేమమా! తమ దర్శనార్ధ మగుదెంచుచుంటి”నని వచించెను. పోతనయు నాతని సముచితగౌరవమున నాదరించి తనగృహమునకు గొనిపోయెను. +పోతనామాత్యుఁడు స్నానసంధ్యాదికములు గావించుకొని దేవతార్చన గావించుచుండెను. శ్రీనాథుఁడు వీధియరుగుపై గూర్చుండి మల్లన మున్నగువారితో నేదో విషయములను గూర్చి ముచ్చటించుచుండెను. శ్రీ నాథుఁ డాగర్భశ్రీమంతుఁడు. బుద��ధివచ్చినదాది గ్రంథముల రచించి యే భూపాలునకో యంకితమొసంగి వారిచే మన్నన లందుచుండువాఁడు. కావున భోగలాలసుఁడై యుండెడువాఁడు. గడియ భోజనమున కాలస్యమైన యుగముగా దలంచి తల్లడిల్లువాఁడు. అట్టివాఁడు పోతనయింటి కతిథిగా వచ్చెను. దేవతార్చన యగుచున్నది. అంత నింతట నది తెమలునట్లు గాన్పడదు. అతని ఆకలి ఆకసమంటుచున్నది. అట్టిస్థితిలో నాతఁ డెట్లుండునో పాఠకమహాశయులే +యూహింతురుగాక. మరియు శ్రీనాథుండొక్కడు మాత్రమేగాక యాతనితో నరుదెంచిన వారును, శిష్యులును, మరికొందరు పండితులును గూడ నుండిరి. వీరందరికిని పోతన యానాడు విందుచేయుట కుద్దేశించెను. పోతన యెంతటిభాగ్యవంతుడో శ్రీనాథుండు చక్కగా నెఱుంగును. రెండుజాములు కావచ్చినది. ఇంట వంట జరుగుచున్నసవ్వడి యేమాత్రమును వినబడుటలేదు. ఇదంతయును గమనించి శ్రీనాథుఁడు ‘కట్టా’ ఈతని సం +సారము లేమిడిగల్గినది. నేనొక్కడనేగాక పలువురు నాతో వచ్చినవారు గలరు. వీరికందరికిని దగు పదార్థముల నీతఁ డెక్కడనుండి తేనోపును’ అని విచారించుచుండగా పోతన దేవతార్చనము పూర్తిగావించుకొని వెలికరుదెంచి “బావా! ప్రొద్దుపోయినది లెమ్ము మడికట్టుకొనుము. వడ్డన యగుచున్న”దనియెను. శ్రీనాథుండు ఆకలితో నున్నవాడుగావున బ్రతుకుజీవుఁడా యని లేచి మడి గట్టుకొనియెను. అతనితోబాటుగ పండితులెల్లరును మడిగట్టుకొనుటకై లేచిరి. భోజనమునకు శ్రీ నాధుడు మున్నగు వారెల్లరును పీటలపై కూర్చునుండిరి. అంత పోతన “అక్కా! తడవేల వడ్డన గావింపు” మని కేకవైచెను. తోడనే భారతీదేవి చక్కని స్త్రీ రూపము ధరించి ప్రత్యక్షమై వివిధ భోజ్యములను వారి కెల్లరకును వడ్డించెను. శ్రీనాదుఁడు తానీవరకెన్నడును రుచిచూడని భోజ్యము లభించుటచే నెంతయు సంతసించి తృప్తితీర భుజించెను. శ్రీ నాధుఁడు పోతన మాహత్యమున కెంతయు సంతసించి యాతని నెన్నియోవిధముల నుతించెను. +పోతన భాగవతము వ్రాయుచు నొక్కనాడు దన్నుజూచుట కరుదెంచిన శ్రీనాథున కద్దానినిచూపెను.ఆ శ్రీనాథుడు గ్రంథమక్కడక్కడ దిలకించి అందు అష్టమస్కంధములోని గజేంద్రమోక్షసందర్భమున జెప్పిన యీ క్రిందిపద్యమును ముమ్మారు చదివెను. +అట్లు చదివి చెంతనేయున్న పోతన్నను గనుంగొని “బావా! యిదే మిట్లు వ్రాసితివి. ఆయుధములు లేకుండ గజరాజును విడిపింపనేగుటలో నాతని యభిప్రాయమేమి మకరమును చేతులతో గ్రుద్ది జంపదలచెనా? లేక మరేమి చేయదలంచెను?” పోతన యప్పట��కేమియు సమాధానమొసంగక నవ్వుచు యూరకుండెను. తదనంతరము శ్రీనాధుడు తనపంక్తిని గూర్చుండి భోజనము చేయుచుండగా తనకేదియో పనియున్న దని చెప్పి వడివడిగా భోజనమంతరించి లేచిపోయెను. వీధిలో నాడుకొనుచున్న శ్రీనాథుని కుమారుని లాలించుచు నెత్తుకొని దీసుకొనిపోయి సమీపమున నున్న మరియొకరి ఇంటిలో నాబాలుని దాచి నూతిపెరటిలోని కరుదెంచి, యొక పెనురాతిని గభాలున నూతిలో నెత్తివైచెను. అంతట పోతన యెలుగెత్తి “బావా! శ్రీనాధా రమ్ము రమ్ము” నీ కొమరుఁడు నూతపడినాడు”. అని యఱచెను. శ్రీనాధుడింకను భోజనము జేయుచుండెను. ఆమాట వినబడినంతనే విస్తరినుండి గభాలున లేచి చేయి కడుగుకొనకుండా నతివేగమున నూతిపెరటిలోని కరుదెంచి “అయ్యో!” యని రోదనము చేయుచు, “హా! కుమారా!” యని నూతిచుట్టూ ప్రదక్షిణము చేయుచు, గుండెలు బాదుకొనుచు బేలవలె వాపోవదొడగె. లేకలేక చిరకాలమునకు గలిగిన కుమారుడగుటచే యెవరి కట్టి బాధయుండదు? “అకటా! నా నోములపంట నీవేమో వంశోద్ధారకుడ వనియు, చిరాయుష్మంతుండవనియు, సుగుణఖనివనియు, దైవజ్ఞులెందరో పేర్కొని +యుండిరే. అన్నా యెంతకష్ట మెంతకష్టము. ఇక నా కీజన్మమేల? నేను +కూడ నీ బావి జొచ్చెద”నని, నూతిలోపడుటకు యత్నించుచుండ నంత పోతన “ఏదీ, బావా ఆపదలందు ధైర్యమువహింపవలయును గాదా! ఇది యేనా నీ ధైర్యము.’ అని యాక్షేపించుచు శ్రీ నాధునిగాంచి నవ్వుచు వెండియు నిట్లనెను. “నా వెన్నియో యిట్టి యిక్కట్టులపట్ల ధైర్యము వహింపవలెనని చెప్పిన యుపన్యాసము లన్నియు నేమైపోయినవి? ఇంతియేనా నీ ధైర్యసాహసములు. ఆడుదానివలె వాపోవుచు నూతిలో నురకజొచ్చెదవా? చాలులెమ్ము, నూతిలోబడ్డబిడ్డను దీయుటకై యత్నపడుము. అవును. నిచ్చెనయేది? త్రాళ్ళేవి? తట్టలేవి? తగిన యుపకరణముల సంపాదించి బిడ్డను పైకి దీయునుపాయ మాలోచింపవలెనుగాని. యూరకవాపోవుట పురుషలక్షణమా” అని యనుచుండ పోతన మాటలయొక్క భావమును కనిపెట్టి నాబిడ్డ కేవిధమయిన తొందరయు గలుగలేదు. ఇదంతయు పోతన గావించిన కపటనాటక విశేషమే. నాడు భాగవతములో “ సిరికింజెప్పడు” అను పద్యమును తాను చదివినప్పుడు నే నేదియో యాక్షేపణలొనరించితిని. ఇప్పుడీ పన్నాగమంతయు పన్ని యుండెనని తెలిసికొనియెను. అప్పుడు శ్రీ నాధుఁడు పోతనను కుమారుని జూపవలసినదని ప్రార్థించెను. పోతన యిట్లనియెను. “బావా! నీ కుమారునిపై నీ కెంతటి వాత్సల్యమో భక్తునియెడల పరాత్పరునకు కూడా నంతటి వాత్సల్యమ��� గలదు. ఆ వాత్సల్యము చేతనే గజేంద్రుని యాలాపము వినవచ్చినంతనే యున్నపాటునేలేచి భగవంతుడు పరువిడి వచ్చుచుండెను. ఆతఁ డాయుధము లేకున్న మాత్రమున మకరిని ద్రుంప లేడా! మనము నూతులలోబడిన వానిని పైకి సాధనములుపయోగింప వలయునేగాని యా మహానుభావునకు ఆయుధములతో పనియేమి? నాడు శిశుపాలుని వధించునాడు ధర్మరాజు పూజాద్రవ్యములతో నొసంగిన పళ్ళెరమేగదా చక్రమయ్యెను. అని వివరించి యాతని యాక్షేపణకు సోదాహరణంగా ప్రత్యుత్తర మొసంగెను. +భాగవతమున గొన్ని చోట్ల రేఫఱకారమనలకు ప్రాస స్థానములందును విశ్రమ స్థానములందును మైత్రియుండుట గాన్పించుటచేత అప్పకవి తన యప్పకవీయములో నిట్లు వ్రాసియున్నాడు. +కాని పరికింపగా నీరేఫఱకారసాంకర్యము పోతనకృతములగు భాగము లందంతగా గనబడదు. నారయ, సింగన, గంగన మున్నగువారు రచించిన భాగములలో మాత్రమే గనబడుచున్నది. ఈవిషయమును చర్చించి కూచిమంచి తిమ్మకవి తన “సర్వలక్షణసార సంగ్రహమున” నిట్లు వ్రాసినాడు. +కూచిమంచి తిమ్మకవి రేఫఱకారసాంకర్యములేని పద్యములను గొన్నిటిని నిరూపించి యున్నాడు. ఆ పద్యములను మరికొన్నింటినిగూడ నిందుదాహరించుచున్నాడను. +బాఱెడివీనిఁ గావుముకృ । పా మతి నర్జున సాపవర్జనా. +నాలి మఱచె నిజగ । ణాళిమఱచె. +విఱుఁగన్ వ్రేయుచుఁ బొంచిపొంచి కదియున్ వేదండ యూధోత్తమున్ +క్కఱటిం దాఁకి వధించె ముష్టిదళితగ్రావున్ హయగ్రీవునిన్. +పఱిబోవఁగ నింత నంతఁ బదమలఁ దన్నెన్ +నెఱి హరిఁ బెనగొనియె భుజగనివహపతి వడిన్. +నెఱి నొక్కొక నాటి వినికి నేర్చి రిలేశా! +ఇట్టివి పోతనకవిత్వమున గనబడుటజేసి యాతఁడు రేఫఱకారముల భేదము గుర్తించినవాడనియును, రేఫఱకారములసాంకర్యమును అంగీకరింపని వాడనియును స్పష్టమగుచున్నది. పోతన రచించిన భాగవతములో నొకటి రెండు స్థలములయందు మాత్రమే యీ దోషము గానబడుచున్నది. దానినీ క్రింద యుదాహరించుచున్నాను. +జిఱజిఱఁ ద్రిప్పి వైచెఁ బరిశేషిత దర్పముఁ గ్రూరసర్పమున్. +తరమున వెన్నెలన్ వ్రజనితంబిను లుండగఁ బాడి రింపుగన్. +ఈ ప్రయోగములు ప్రమాదజనితములుగా గాని మతబేధమునగాని లేక యితర కారణమునగాని ప్రయోగింపబడినవేగాని పోతన యుభయమైత్రి పాటించినాఁడుకాడనుట తగదు. వెలిగందల నారపరాజు మున్నగువారు రచించిన భాగములందు రేఫఱకార సాంకర్యము గనబడుచున్నది. వాని నీక్రింద నొసంగుచున్నాడను. +బరువడి నుయ్యి; ద్రవ్వునె పిపాసితుఁడై సలిలాభిలాషితన్? +ద్��రణీరాజ్యముఁ గొన్న మాద్రికొడుకుల్ ధన్యాత్ములే? యుద్ధవా! +పరులై వర్తింతు రాత్మ । బలగర్వమునన్. +వెనయ వివాహేచ్ఛ దగు । లుటెఱిగెనిటకున్. +నిరతము గృహకర్మమట్లు । నెఱపుచు నుండెన్. +ట్లరుదుగ రత్నకందుక వి । హారముసల్పెడు సంభ్రమునన్. +సురమతి బోధించిరపుడు । సుమతిం బ్రీతిన్ +సరసభవత్కధామృత ర. । మా హృదయేశ । మకుంద! మాధవా. +వేదవ్యాసవిరచితమగు భాగవతమననుసరించి పోతనామాత్యుడొక స్థలమున కొంతవరకు కల్పితమనలను జేర్చుచు, వేరొకయెడకొలదిగా సంకుచితము గావించుచు గ్రంథమును చక్కగాపోషించియాంధ్రీకరించినాఁ డు ఈతఁడు భాగవతమంతయు నద్వైతపరముగానే రచించి యుండెనని విస్పష్టమగుచున్నది. ఈతఁడు తనయాంధ్రీకరణమునకు శ్రీధరుల వ్యాఖ్యానము నూతగా గొనియున్నాఁడు. ఈ విషయమును ఈ క్రింది నొసంగబడిన వ్యాఖ్యానము రూఢిసేయగలదు. +ఈ శ్లోకమునకు శ్రీధరులవా రిట్లువ్యాఖ్యానము గావించియున్నారు. +నీకు మ్రొక్కెద మాలింపు । నిర్మలాత్మ. +మిచ్చిననైనఁ గానలకు । నేగిననైన హరిప్రబోధముల్. +మరియు పోతనరసోద్దీపకములు కానిపట్లను గూడ దనరచనా చమత్కృుతిచే నత్యంతమనోహరములై యుండునట్లుగా వర్ణించి యుండెను. ఈక్రిందిశ్లోకమును దానికి తెనుగుసేతయు గమనించిన నీ విషయము తెల్లమగును. +ప ప్రచ్ఛకథ్యతాం వత్స । మన్యతే సాధుయద్భవాన్. +శ్రాంతిం జూచెదఁ గాక నేఁ" డని మహాసౌధాంతరాసీనుఁడై. +ఇట్లు చారులచేత నాహుూయమానుండై ప్రహ్లాదుండు నరుదెంచిన, +యుత్సంగాగ్రముఁ జేర్చి దానవవిభుం డుత్కంఠ దీపింపగన్. +అని మరియుఁ బుత్రా! నీకెయ్యది భద్రంబైయున్నది చెప్పుమనిన గన్నతండ్రికిఁ బ్రియనందనుం డిట్లనియె. +హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై. +అను పద్యమువఱకును గల ఇరువదిపద్య గద్యములును రచించి యున్నాడు. +అంత నాబ్రాహ్మణునిభార్యపతికి నడ్డంబు వచ్చి యేడ్చుచు నా రాచరక్కసున కిట్లనియె. +త్ప్రవరున్ బ్రహ్మవిదున్ జగన్నుతగుణున్ భక్షింపఁగాఁ బాడియే?. +తండ్రిం దాతలఁ బూర్వులం దలఁపవే ధర్మంబునుం బోఁగదే. +పన్నన్ నన్ను శిరంబు ద్రుంచి మఱి మత్ప్రాణేశు భక్షింపవే. +దిను క్రియ శాపంబు కతన ధీరహితుండై. +పోతనామాత్యుఁడు నాచనసోముని హరివంశమును దిలకించి యందు గల పోకడల గొన్నింటిని దనభాగవతమన పొందుపరచియున్నాడనుట క్రిందిపద్యములు నిదర్శనములై యున్నవి. +సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్. +నన్నయ తిక్కనాదుల శైలికిని పోతనశైలికిని భేదములు గాన వచ్చుచున్నది. నన్నయాదుల కవిత్వము వ్యాకరణప్రయోగ ఫ్రౌఢిమగల్గి యన్వయకాఠిన్యము గల్గియుండును. పోతనశైలియందు సులభమగు నన్వయమును, బదలాలిత్యమును, శబ్దాలంకారచిత్రములును గలిగి యుండును. మరియు పోతన రచించిన పద్యములలో పాదాంతమునకును, విశ్రమస్థానమునకు పదములు సంపూర్తి జెందుచుండుటచే చదువుట కెంతయు ననుకూలముగానుండును. ఈవిషయనిరూపణమునకై భారత భాగవతములనుండి యుదాహరణము లొసంగుచున్నాడను. +జూచుచు వీనులకింపెసగన్ వినుచున్ । శుకకోకిలసుస్వరముల్. +కుంద మధూక మంజులనికుంజములం దనరారి వెండియున్”. +మరియు నీతఁడు భాగవతమును ఆంధ్రీకరించుచు నిట్లు నుడివి యున్నాఁడు. +నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్. +అని వచించినయట్లు భాగవతమును రచించియుండెను. దశమస్కంధమున శ్రీ కృష్ణావతారఘట్టమును చదువున్నప్పుడు సాధారణముగా సుబోధకముగాను. దానికి వేరుగా నర్ధమును వివరింపవలసిన పని యుండదు. +భాగవతములోని యితరభాగముల పూరించినవారెవ్వరును అవలింబింపని పద్ధతులను సింగన యవలంబించియున్నాఁడు.ఈతఁడు తాను భాగవత షష్టస్కంథమును పూర్ణముగా దెనిగించుచుంటి నని వక్కాణించి యున్నాఁడు. ఏకాదశస్కంధములను పూరించినవెలిగందల నారాయణ మున్నగువారు తాము సంపూర్ణముగా స్కంథమును రచించునప్పుడైనను, యిట్లు వక్కాణించియుండలేదు. +ఈపద్యమున నాతఁడు నారాయణుని యభినందించియున్నాఁడు. ఇంతియెగాక నీతఁడు హయగ్రీవస్తుతియును, గణపతిప్రార్థనము మున్నగువానిని గావించియున్నాఁడు. మరియు నితడు బమ్మెర పోతరాజు నిట్లభివర్ణించియున్నాఁడు +బమ్మెఱ పోతరాజుఁ గవిపట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్. +ఈతఁడు తనకు దివ్యవాణి సాక్షాత్కరించినట్లుగా యీ విధంబున వక్కాణించి యున్నాఁడు. +ఈతఁడు యితరులవలెగాక దన వంశానుక్రమణికనుగూడ యిట్లు వక్కాణించి యున్నాఁడు. +చేడియ లేదు చూరికుల శేఖరు కస్వయ ముమ్మడమ్మకున్. +భాగవతము నశించినభాగమును పూరించినవారు భాగవతములోని యుత్సన్న భాగముల పూరించినవారిలో సింగన పోతనకవిత్వగమనికలను గమనించియే రచించియున్నాడని దోచుచున్నది. ఈ క్రిందిపద్యములీ విషయమును రూఢిసేయునవిగా నున్నవి. +గడచితి నా జన్మ దుఃఖ కర్మార్ణవమున్. +ఇతడును పోతనవలె షష్ఠస్కంథమును అద్వైతపరముగనే తెనిగించెను.ఇందులకు ఉదాహరణములు. +దేవా। రజ్జవునందు సర్పభ్రాంతి గలుగునట్లు ద్రవ్యాంతరంబు చేత బ్రహ��మంబైన నీ యందు బ్రబంచభ్రాంతి గలిగెడిని. +కావున గుణంబులును, గుణియును, భోక్తయును, భోగ్యంబును …. హర్తయు హాస్యంబును నుత్పత్తిస్థితిలయైక కర్తయై సర్వాత్కృష్ణుండైన యప్పరమేశ్వరుండె కాని యన్యంబులేదు. +ఈతఁడును దనకు సహాయముగా శ్రీధరుల వ్యాఖ్యానమునేయూతగొని యున్నాఁ డు. ఇతఁడు భాగవతములోని యితర భాగముల దెనిగించినవారికంటె నెక్కువవాడని బేర్కొనవచ్చును. +ఈతఁడు పంచమస్కంధమును దెనిగించెను. ఈతనికవిత్వము సింగన కవిత్వముకంటె దక్కువయని చెప్పవచ్చును అయినను యితని కవిత్వము లలితముగను సుకుమారముగను నుండును. ఇతఁడు మూలమును సరిగాననుసరింపలేదు. మూలమున నున్నదానిని చాలవరకు తగ్గించినట్లు గనపడుచున్నది. ఈతని ఆంధ్రీకరణమున కుదాహరణములు. +ఈపద్యమున మూలమునందలి విశేషణములు పెక్కులు కానరావు. +బదపడి మీదరాలు గచ । భారమునందుల జారుక్రొవ్విరుల్. +రెండవదానియందు మూలార్థరీతి గానుపించదు. పోతనాదుల కవిత్వమునందుగల స్వకపోలకల్పితములగు వర్ణనలు యీతని కవిత్వమున నెందును గానరావు. ఈతడును శ్రీధరులవారి వ్యాఖ్యానమునే సహాయముగా గొనియుండెను. మరియు నీతఁడీ స్కంథమును నద్వైతపరముగనే తెనిగించెను. +ఈతడు ఏకాదశద్వాదశస్కందములను రచించెను. ఈ రెండు స్కందము +లును మూలమునకు సరిగానుండక మిగుల క్లుప్తీకరింపబడినవి. కొన్నియెడల మూలమునందలి యభిప్రాయములకు విరుద్ధముగా గూడ నుండును. +ఏకాదశస్కందమున త్రయోదశాధ్యాయమున శ్రీ విష్ణుండు హంస +రూపియైచేసిన తత్త్వోపదేశము. “వస్తునోయదా నానాత్వమాత్మనః ప్రశ్న ఈశ్వరః” అను శ్లోకములు గలవు. వానిని ఆంధ్రీకరించునెడల నైదారుపంక్తుల వచనముతో వదలివైచెను. ఈస్కందమున సంస్కృుతంబునగల భిక్షుతాదులు ఆంధ్రమున లేవు. మొత్తముమీద నీ స్కందమున నాల్గవపాలుమాత్రమే తెనిగింపబడినదని చెప్పవచ్చును. మరియు నీ రెండు స్కందములును వ్రాతప్రతులు పరిశీలించిన నెందును అద్వైతపరముగా నాంధ్రీకరింపబడినట్లు దోపదు కాని యచ్చుప్రతులందు స్పష్టముగా నద్వైతపరముగా దెనిగింపబడినట్లు గాన్పించుచున్నది. వ్రాతపతుల పాఠములను గమనించితిమేని యవి రెండును విశిష్టాద్వైతపరముగా దెనిగింపబడినవనుట తెల్లముగాగలదు. +పోతన భాషాంతరీకరణము యెంతవఱకుమూలము ననుసరించి యున్నదో తెలుపుటకు మరికొన్ని యుదాహరణము లిచ్చుచున్నాడను. +స్తర మార్గంబునఁ దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్. +నా విభు నాశ్రయించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్. +నీ వా రరసెదరు చూపు నీ రూపంబున్. +ధీరత నొప్పించు టిది వధించుట గాదే?. +ద్భావజ పుష్పభల్ల భవబాధ హరింపు వరింపు మాధవా!. +ఒకచో వర్ణించినవిషయమునే వర్ణించునెడల పోతనయుత్తరోత్తర మెక్కుడు రసవంతముగా నుండునట్లు వర్ణించును. +కుంద మధూక మంజులనికుంజములం దనరారి వెండియున్. +తృతీయస్కందమున జెప్పబడిన యీవర్ణనమును మార్చి పెంచి అష్టమస్కందమున గజేంద్రమోక్షమున త్రికూటమునందలి మహారణ్యము వర్ణించు వచనమున పెంపొందించియున్నాఁడు. ఆ వచనమంతయు నిచ్చట నొసంగిన గ్రంథ విస్తరమగునను తలంపున విరమింపబడియెను. +పోతన అంత్యానుప్రాసమును యెక్కువగా వాడియున్నాఁడు. క్రియతోనే పద్యము ప్రారంభమైనను యది చక్కని యంత్యప్రాసతో నలరారుచు చదువుటకు ముద్దులు మూటగట్టుచుండును. +జటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గాసారమున్. +వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాతకున్. +ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్. +ఉత్తరహరివంశమున ఎఱ్ఱాప్రగడ ఈ అలంకారమును వాడి యున్నాడు. +శారదనీరదుడు ధీవి । శారదుడు భవో +నారదుడు తదీయగృహము । కు నేతెంచెన్. +ఈ అలంకారమునే అనేకవిధములుగామార్చి పోతన వాడియున్నాడు. +దత హరిరవ భరిత శిఖరిదరికిన్ హరికిన్. +నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్. +సింగన కూడ నీ యలంకారమును అనుసరించియున్నాడు. +హననవ్యాప్తి విభీతులన్ మువుర నాత్మానేతలన్ దూతలన్. +గేళిం దేలుచునున్నవానిఁ గనెఁ బుంఖీభూత రోమాంచుఁడై. +విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్. +చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్. +దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. +జనులన్మోహము నొందఁ జేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్. +కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్. +పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై. +వేడ్క లిగురొత్త మెల్లన వీవఁ దొడఁగె. +బలవద్భీరుల వార్ధిలీనుల మముం బాటింప నీ కేటికిన్?. +వలనఱి వ్రాలెఁ గీ లెడలి వ్రాలిన పుత్తడిబొమ్మ కైవడిన్. +రిణి విశ్లేషిణి వీతతోషిణిఁ బురంధ్రీగ్రామణిన్ రుక్మిణిన్. +బిగియఁ గౌఁగిటఁ జేర్చి నె మ్మొగము నిమిరి. +బుల నిరోధము దన్ను సోఁకినఁ బొందుచుండు విపద్దశన్. +దేరు బన్ని సురభి తెచ్చె నపుడు. +కలకంఠీరవ! కంబుకంఠి! శివు వక్కాణింప నిం కేటికిన్. +త్కారాతుం డగు నీలకంఠుఁ దెగడంగా రాదురా; దుర్మతీ! +దాన కాన నింద దగదు సేయ. +కొండలరాజుకూఁతునకుఁ గూరిమి నిట్లనియెన్ బ్రసన్నుఁ డై. +రావే పోదము వెండికొండకు మనోరాగంబుతోఁ గన్యకా! +నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. +ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్. +ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్. +తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి. +గైకో నర్హము లండ్రు కాముకులు సంకల్పప్రభావంబులన్. +నే కాంతుండుఁ గలండొ? క్రీడలకు నాకీ యింతి సిద్ధించునే?. +జ్జ చలింపం దనకాంత చూడఁ గదిసెం జంద్రాస్య కేల్దమ్మికిన్.. +త బహిః ప్రక్రియ నెట్టకేనిఁ గదియం దద్బాహునిర్ముక్త యై. +దేవ మాయా జడత్వంబు దెలిసె హరుఁడు. +మగువతనం బుడిగి హరియు మగవాఁ డయ్యెన్. +మరగినతేఁటు లన్య కుసుమంబుల చెంతనుఁ జేరనేర్చునే? +పొత్తుల నొల్లమో పురుషభూషణ! దాస్యము లిచ్చి కావవే. +బొగులం జాలము; కౌఁగలింపుము మముం బుణ్యంబు పుణ్యాత్మకా +దండ విముక్త బాణముల దాసుల మయ్యెద; మాదరింపవే. +భవదంఘ్రిద్వయవీధిఁ బొందెదము నీ పాదంబులాన ప్రియా!. +గరఁగరె నినుఁ గన్న నీదు గానము విన్నన్?. +దా కుమార! యువతి ధైర్య చోర!. +పురముఁ గనియె భోగవతినిఁ బోలు దాని.. +పట్టె నరసింహుఁ డా దితిపట్టి నధిప! +ద్ర హుతాశాంతకభీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్. +వత్తు వేగమ; నిలువుము; వలదు వలదు +అనిన బ్రియమునకుఁ బ్రియంబు జనియింప డగ్గఱి. +మ్మానిని దన్ను భర్త బహుమాన పురస్సరదృష్టిఁ జూడఁగన్. +ఇట్లు తనకు మ్రొక్కిన సత్యభామను గరకమలంబుల గ్రుచ్చి మురాసుర పాశపరివృతంబైన ప్రాగ్జోతిషంబు డగ్గరి. +ప్రదుఁడై వాలునఁ ద్రుంచెఁ గృష్ణుఁడు మురప్రచ్ఛన్నపాశంబులన్. +కవి కలహంబునకు నరకాసురుండుగమకింపం దమకింపగ విలోకించి సంభ్రమంబున. +యేణీలోచన లేచి నిల్చెఁ దన ప్రాణేశాగ్ర భాగంబునన్. +లే మా విల్లందికొనుము లీలం గేలన్ +నెఱుఁగరా కుండ నని సేసె నిందువదన. +సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్. +సొంపఱి భూసుతుని వెనుకఁ జొచ్చెన్ విచ్చెన్. +అయ్యవసరంబున గంససంహారి మనోహారిణింజూచి సంతోషకారియుం గరుణరసావలోకనప్రసాదియు మధురవచనసుధారస విసారియుం దదీయసమర సన్నాహనివారియు నై యిట్లనియె. +మగువల దెసఁ జనరు మగలమగ లగుట హరీ +న్నరకాంతలు సూచి నేఁడు నందం బొందన్. +అని పలికి హరి నరకాసుర యోధులమీద శతఘ్నియను దివ్యాస్త్రము బ్రయోగించిన నొక్కవరుసను వారందఱు మహ���వ్యధజెందిరి మరియును. +హరి మ్రోలన్ నిలువంగ లేక పఱచెన్ హాహానినాదంబులన్. +మరియు విహగరాజపక్షవిక్షేపణసంజాతవాతంబు సైరింపఁజాలక హత శేషంబయిన సైన్యంబు పురంబుసొచ్చుటం జూచి నరకాసురుండు మున్ను వజ్రాయుధంబుం దిరస్కరించిన తనచేతశక్తింగొని గరుడుని వైచె నతండునన విరులదండవ్రేటున జలింపని మద్దోండవేదండంబునుంబోలె విలసిల్లె నయ్యవసరంబున గజారూఢుండయి కలహరంగంబున. +ద్రెళ్లెం జప్పుడు గాఁగ భూమిసుతుఁ డుద్దీప్తాహవక్షోణిపై. +నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. +ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్. + + +» తెలుగునాట ప్రముఖపాత్రికేయులు, హేతువాది, రచయిత. వీ.ఆర్.నార్లగా కూడా వీరు ప్రసిద్ధులు. +» ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. +» పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు, కొన్ని కథలు రాసారు. +» రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. +ఈ- రూపంలో వెలువడుతున్న నార్లవారి రచనలకు ముందుమాట: +బహుముఖ ప్రజ్ఞాశాలి నార్ల వెంకటేశ్వరరావు గారి సమగ్రరచనలను నార్లవారి కుటుంబం వారు 2004 ప్రచురించారు. ప్రస్తుతం వారి రచనలు అందుబాటులో లేవు. మారుతున్న సాంకేతిక సౌకర్యాలవల్ల నార్లవారి రచనలు అన్నిటినీ తెలుగు వారందరికీ అందించే సంకల్పంతో నార్ల కుటుంబీకులు ముందుకు వచ్చారు. +నేను ఈ బాధ్యతలను స్వీకరించాను. నార్లవారి కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం, వారిని గురించి ఎందరో మహానుభావులు కురిపించిన చిరుజల్లులు, గాలి తుఫానులను అందించే ప్రయత్నం చేశాను. +కంప్యూటరులో MS 365 ఆఫీసు అందుబాటులో గల వారు ఈ పుస్తకంలోని ఏ భాగాన్నయినా కంప్యూటరు సహాయంతో చదువుకోవచ్చు. ప్రచురణ ప్రణాళికను ఈ పుస్తకం చివరలో అందించాను. +నార్ల వెంకటేశ్వరరావు మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో డిసెంబర్ 1, 1908 న మహాలక్ష్మమ్మ, లక్ష్మణరావు +దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులు కృష్ణా జిల్లా కౌతవరం నుండి అక్కడికి వ్యాపార రీత్యా వెళ్ళారు. కాని నార్ల విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగింది. +వి.ఆర్. నార్లగా ఆంధ్రదేశానికే కాదు యావద్భారత దేశానికి ఉత్తమ సంపాదకులుగా సుపరిచితులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు. ఆంధ్రదేశంలో ఉన్న కొద్దిమంది ఉత్తమ సంపాదకులలో అగ్రేసరులుగా, తెలుగుజాతి మేధావి వర్గంలో అనుపమ వ్యక్తిత్వం గలవారు. రచయి��గా నార్లవారు విలక్షణమైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. వారు ఉత్తమ సంపాదకులేకాదు విమర్శకులు, వ్యాసరచయిత. ఉత్తమ కవులేగాదు తాత్త్వికులు, ప్రజాస్వామ్య ప్రియులు, హేతువాదులు వీటిని మించి మానవతావాదులు. +కృష్ణాజిల్లా కాటూరు నార్లవారి పూర్వీకుల గ్రామం. 18, 19 శతాబ్దాలలో ఈండియా కంపెనీ వారికి యుద్ధసామగ్రిని చేరవేసే కాంట్రాక్టర్లుగా నార్ల రామయ్య, రమణయ్య, తాతయ్య నియుక్తులై సాగరు ప్రాంతానికి వలస వెళ్ళారు. నార్ల తాతయ్య కుమారుడు మాధవరావు సిపాయి పితూరీలో కంపెనీ మెప్పుపొంది సాగర్ లో స్థిరపడ్డారు. శ్రీ వెంకటేశ్వరరావు తాతలైన హనుమయ్య వెంకయ్యగారలు అతి సాహసవంతులు. వెంకయ్యగారి సంతానంలో గోవిందరావు +లక్ష్మణరావు ఒక ఆడబిద్ద మాత్రమే బ్రతికారు. అధిక వ్యయానికి అలవాటు పడ్డ గోవిందరావు మూలంగా కుటుంబౌన్నత్యం క్షీణింప సాగింది. +లక్ష్మణరావు, మహాలక్ష్మమ్మ అనే పుణ్యదంపతులకు 1908 డిసెంబర్ 1వ తేదీన వెంకటేశ్వరరావు జన్మించారు. పుట్టింది జబల్ పూర్లో. పెరిగింది. సాగర్, లక్ష్మణరావు పోయిన ఆస్తిపోగా 1914-15 ప్రాంతంలో లక్ష్మణరావు భార్య స్వగ్రామమైన కృష్ణాజిల్లా కౌతరంలో స్థిరపడ్డారు. జన్మించింది సాగర్, కాబట్టి నార్ల వారికి మొదట హిందీయే అలవడింది. తల్లిదండ్రులు ఆంధ్రదేశంలో స్థిరపడ్డాక ఏడవ సంవత్సరంలో తెలుగు నేర్వను ఆరంభించారు. +నార్లవారి విద్యా జీవితం కౌతరం బోర్డు ఎలమెంటరీ పాఠశాలలో ప్రారంభమైంది చిన్ననాటనే బాలభటోద్యమం లో చేరారు. +కౌతరంలోని ఆంధ్ర లక్ష్మీ ఎడ్వర్డు మెమోరియల్ స్కూల్ లో ప్రవేశించి సెకండుఫారంలో కృతార్ధులయ్యారు. గుడివాడ హైస్కూల్ లో ఎస్.ఎస్.ఎల్.సి. 1920 వరకు చదివారు. అప్పుడు +‘సోదర సమితి’ స్థాపించారు. ఆదర్శవంతులైన నార్ల పెత్తండ్రి నార్ల వెంకటరామన్నగారు వీరి చదువుకు ఆర్థిక సాహయ్యం చేశారు. 1927లో గుంటూరు హిందూ కాలేజి హైస్కూలులో యస్. యస్.ఎల్.సి. పరీక్షకు వెళ్ళి ఇంగ్లీషులో ఒక్క మార్కు తక్కువ రావటంతో తప్పారు. 1927 డిసెంబర్ లో జరిగిన మద్రాసు కాంగ్రెసు సమావేశానికి నార్ల ప్రేక్షకునిగా హాజరయ్యారు. 1928లో అందులో ఉత్తీర్ణులయ్యారు. +నార్ల వారి పై అప్పటికే బ్రహ్మసమాజ ప్రభావం పడింది. కాకినాడ పిఠాపురం రాజావారి కాలేజిలో ఇంటర్మీడియట్ చేరినపుడు ఆ భావాలు బాగా బలపడ్డాయి. విగ్రహారాధనను మాని మానవతావాదిగా మారారు. సామాన్య మానవుల స్థితిగతులను మెరుగు పరచడానికి 'సోదర సమితి' అనే సమాఖ్యను ఏర్పాటు చేశారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో తుఫాన్ కు గురియైన ప్రజలకు ధన, వస్త్రాలను వసూలు చేయడంలో సహాయపడ్డారు. సాంఘిక, రాజకీయ కారణాలవల్ల వారి చదువు సరిగా సాగలేదు. +1928లో పూర్వం మద్రాసు సమావేశ పునః పరిశీలన కలకత్తాలో కాంగ్రెస్ పార్టీ చేయగా దానిపై ఆగ్రహంతో శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్యగారికి రాసిన వ్యక్తిగత లేఖను, వారు 'కాంగ్రెసు' పత్రికలో వ్యాసరూపంలో ప్రచురించారు. +ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనడానికి చిన్న ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలురయ్యారు. మహోద్రేకంతో సాగుతున్న ఉప్పు సత్యాగ్రహంలో చేరిపోయారు. ప్రతి ఆదివారం డా॥ పట్టాభిగారి'జన్మభూమి' పత్రికకు వ్యాసాలు రాసేవారు. ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం వీరిపై తప్పుడు కేసు బనాయించి 7 మాసాలు కఠిన కారాగార శిక్ష విధించింది. 1930-32 ప్రాంతాల్లో పోలీసుల చర్యల మూలంగా తీవ్రవాదుల్లో చేరిపోయారు. 1932లో బందరు నోబుల్ కళాశాలలో బి.ఏ.లో చేరారు. వేసవి సెలవులలో “కృష్ణా పత్రిక” కు ఉపసంపాదకులుగా పనిచేశారు. అప్పుడప్పుడు “భారతి”కి వ్యాసాలు రాసి కొంత డబ్బు సంపాదించేవారు. 1933లో బి.ఏ. చదివే రోజుల్లో మొదటి గ్రంథం "స్వదేశీ సంస్థానాలు” ప్రకటించారు. స్వదేశీ సంస్థానాలలో ప్రజల కష్టసుఖాలు ఇందులో వివరించగా శ్రీ ముట్నూరి కృష్ణారావుగారు “కృష్ణా పత్రిక”లో మెచ్చుకుంటూ సమీక్షిస్తూ సంపాదకీయం రాయటంతో ఈ గ్రంథానికి అనన్య ప్రచారమొచ్చింది. తమిళంలోకి అనువదించబడింది. అయితే నిజాం, మైసూరు, తిరువాన్కూరు ప్రభుత్వాలు బహిష్కరించాయి. +1934లో బి.ఏ. మొదటిసారి ఉత్తీర్ణులయ్యారు. బెనారస్ హిందూ యూనివర్శిటీలో ఎం.ఏ. చెయ్యాలన్న బలమైన కోరికను సుకరం చేసుకోడానికి తన చెల్లెల బంగారు గాజులమ్మి “నేటి రష్యా" అనే గ్రంథాన్ని ప్రకటించారు. రష్యాను గురించి తెలుగులో వచ్చిన మొట్టమొదటి గ్రంథం. కాని ప్రకటించిన నెలలో ప్రభుత్వం దీనిని నిషేధించింది. 1935లో ఇంగ్లీషు జర్నలిజంలో చేరాలన్న కోరికతో మద్రాసు చేరారు. శ్రీరామకృష్ణ మొదిలియార్ సంపాదకత్వంలో గల “జెక్టస్” పత్రికలో చేరారు. పూర్వ రాజకీయ చరిత్ర వలన, విప్లవ వాదులలో గల సంబంధాలవల్ల నెలకే ఉద్యోగం పోయింది. సమదర్శిని, భారతి, ప్రజామిత్ర వంటి పత్రికల్లో ప్రకటించిన వ్యాసాల ద్వారా తామొక పత్రికా రచయితగా నిరూపించుకున్నారు. తర్వాత “స్���రాజ్య" అన్న ఇంగ్లీషు పత్రికలో చేరి విలేకరిగా, ప్రూఫు రీడర్‌గా, ఉపసంపాదకునిగా, రాత్రిపూట సంపాదకునిగా పనిచేసేవారు. చేరిన తొమ్మిది నెలల లోపల స్వరాజ్య మూత బడింది. 1936 సం॥ పిఠాపురం మహారాజా వారు ప్రజా పార్టీ ఆధ్వర్యంలో నడపబడే “జనవాణి” పత్రికలో నార్లవారు న్యూస్ ఎడిటర్, శ్రీ తాపీ ధర్మారావు సంపాదకులు. అభిప్రాయ భేదాల కారణంగా రాజీనామాచేసి 'ప్రజామిత్ర' తెలుగువార పత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరారు. 1938 ఏప్రిల్ 24వ తేది సులోచనాదేవితో మద్రాస్ లో రిజిష్టర్ మ్యారేజి జరిగింది. అక్టోబర్ నెలలో హిట్లర్ చేసిన ఆస్ట్రియా దురాక్రమణను, అంతర్జాతీయ రాజకీయాలను తెలియజేస్తూ 'ఆస్ట్రియా ఆక్రమణ' పేరుతో రసవత్తర గ్రంథం వెలువరించారు. ఆగష్టు 1వ తేదీన ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్ గా ప్రవేశించి 1942 మధ్యలో ప్రధాన సంపాదకులై 1959 వరకు ఆ పని నిర్వహించారు. 1939 జనవరిలో హిట్లర్ జెక్ దేశాన్ని రాజకీయ తంత్రాలతో ఎలా కూలదోసింది తెలుపుతూ 'జెక్ రాజ్య విచ్ఛేదం' అన్న పేరుతో ప్రకటించారు. ఫిబ్రవరి నెలలో పాలస్తీనా ఆరబ్బులు, బ్రిటీషు ఇంపీరియలిజంతో సంఘర్షించిన విషయాలను 'పాలస్తీనా' గ్రంథంలో వివరించారు, 1943లో 'రష్యన్ కథలు' అన్న పేరుతో కథల అనువాదాన్ని చేశారు. 1944 అక్టోబర్ 19వ తేదీ ఆంధ్రుల శిల్ప సంపదపై ఆంధ్రప్రభలో రాసిన సంపాదకీయంవల్ల ప్రముఖుల్లో నాగార్జునకొండ, జగ్గయ్యపేట, ఘంటసాల మొదలగు ప్రాంతాల్లోని శిల్పాలను ఇతర ప్రాంతాలకు తరలించకూడదన్న ఆశయం ప్రబలింది. +1945లో కథలు, వ్యాసాలు, నిర్వచనాలు సంపాదకీయాలతో కూడుకున్న వివిధ విషయాలను సంకలనం చేసి 'కదంబం'గా రూపొందించారు. 1945 డిసెంబరు 30న మద్రాసు మహాజన సభహాలులో ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల సంఘం 5వ వార్షికోత్సవ సభాధ్యక్షులుగా నార్లవారు పత్రికారచయితల బాధ్యతలను గురించి ఉపన్యాసం చేశారు. 1946 ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని కాదని గాంధీజీ శ్రీరాజగోపాలాచారిని ముఖ్యమంత్రి చెయ్యాలని సంకల్పిస్తే, నార్లవారు దానిని వ్యతిరేకించి ప్రకాశం పంతులుగారు ముఖ్యమంత్రి కావడానికి దోహదం చేశారు. ప్రకాశంగారి ప్రభుత్వం పనితీరు పట్ల అసంతృప్తి చెందిన నార్ల వారు 'ప్రజా ప్రభుత్వం' అన్న శీర్షికతో రాసిన 5 సంపాదకీయాలతో ప్రభుత్వం పడిపోయింది. 1945లో తూర్పు కోస్తానిధికి, 1952లో రాయలసీమ క్షామనిధికి, 1953లో గోదావరి వరదబాధితులకు నిధులను వసూలు చేసి రామకృష్ణ మిషన్ ద్వారా పంపిణీ చేయించుటలో నార్లవారు ప్రధాన పాత్రను వహించారు. 1947లో రైతు జీవితాన్ని ఇతివృత్తంగా స్వీకరించి 'కొత్తగడ్డ' అనే పదహారు నాటికల సంపుటి ప్రకటించారు. 1949 సెప్టెంబర్ 6వ తేదీ బెజవాడలో అప్పటి ఆస్థానకవి శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి సన్మానం సందర్భంగా యేర్పాటైన పత్రికా ప్రదర్శనకు నార్లవారు ప్రారంభోత్సవం చేశారు. 1950 ఫిబ్రవరిలో మంచిర్యాలలో నిజాం ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆరో వార్షిక సభకు ప్రారంభోత్సవం చేశారు. 1951 సెప్టెంబర్ లో 'కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు'కు అభ్యంతరం తెలుపుతూ 'నాగార్జున సాగర్' ప్రాజెక్టు ఆవశ్యకాన్ని వెల్లడించగా నందికొండ ప్రాజెక్టును 'నాగార్జున సాగర్'గా పేరు మార్చారు. 1953లో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి, కమ్యూనిస్టుల ఘోరపరాజయానికి ఆంధ్రప్రభ ద్వారా నార్లవారు ఎంతో కృషి చేశారు. 1954లో ఒకసారి నార్లవారు యూరప్ యాత్ర చేశారు. మనదేశానికి కమ్యూనిస్టు వ్యవస్థ తగునా? తగదా? అన్న విషయంపై “ప్రగతి” అనే పుస్తకం రాశారు. 1956 డిసెంబర్ లో “వాస్తవమ్ము నార్ల వారిమాట” అన్న మకుటంతో గురజాడ వారిని అనుకరిస్తూ “నార్ల వారిమాట” అన్న పద్యాల సంపుటి వెలుగులోకి తెచ్చారు. 1957లో అప్పుడప్పుడు రాసిన యాభై అయిదు గేయాలను సంకలనం చేసి “జగన్నాటకం” అన్న కవితా సంపుటి ప్రకటించారు. +కొన్ని గేయాలు హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదాలయ్యాయి. వీరి 'కొత్తగడ్డ' నాటికల సంపుటిని శ్రీ బాలశౌరిరెడ్డిగారు “నయా ధర్తీ” పేరుతో హిందీలోకి అనువదించారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు పాఠ్యాంశాలుగా నిర్ణయింపబడ్డాయి. ఈ నాటికలు 1958లో ఒక పర్యాయం, 1964లో రెండో పర్యాయం రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. 1958లో పారిస్ లో జరిగిన పదో యునెస్కో మహాసభలకు మనదేశం పక్షాన డా॥ సర్వేపల్లివారి నాయకత్వంలో వెళ్ళిన ప్రతినిధి బృందంలో నార్లవారు సభ్యులు. 1959లో విజయవాడ దుర్గాకళామందిరంలో వీరి స్వర్ణోత్సవం జరిపారు. రాజమన్నార్ గారు “హాఫ్ వే' సన్మాన సంచికను బహుకరించారు. సమ్మెచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమంజస మైన కోర్కెలకు సానుభూతిగా 1959 మే 12వ తేదీన ఆంధ్రప్రభ నుంచి ఉద్యోగవిరమణ చేశారు. +1960లో నార్ల వారిని అభిమానిస్తున్న స్నేహితులు కలసి 'ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్సు'ను స్థాపించి జులై 1వ తేదీ 'ఆంధ్ర��్యోతి' దినపత్రికను విజయవాడలో నార్లవారి సంపాదకత్వాన వెలువరించారు. ఎన్నో కొత్త విషయాలను పత్రికాముఖంగా ప్రకటించి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో నార్లవారి పాత్ర ప్రశంసనీయం. 1957 నుంచి చాలాకాలం కేంద్రసాహిత్య అకాడమీ సభ్యులుగా ఉన్నారు. ఒక్క ఆస్ట్రేలియా తప్ప మిగిలిన ఆధునిక నాగరికత విస్తరించిన దేశాలన్నీ పర్యటించారు. ఈ పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాతి వహించిన పత్రికా యజమానులను, సంపాదకులను, వారి సిబ్బందిని కలుసుకొని వారితో చర్చలు సాగించారు. డాక్టర్ రాధాకృష్ణన్ 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయన భారత రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రజ్యోతిలో రాయించిన 5 వ్యాసాలను గ్రంథంగా ప్రచురించారు. దీన్ని ఒరియా భాషలోకి అనువదించారు. +భారతీయ సాహిత్య నిర్మాతలు (Makers of Indian Literature) అన్న శీర్షిక క్రింద ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడెమివారి ఆధ్వర్యంతో అంతర్జాతీయ భాషయైన ఆంగ్లంలో వీరేశలింగం, వేమన, గురజాడలపై నార్లవారిచే గ్రంథాలు ప్రచురించారు. ఇవి భారతీయ భాషలన్నిటిలోకి అనువదించబడ్డాయి. 1968 డిసెంబర్ లో ఆంధ్ర పార్లమెంటు సభ్యులు, అధికార, అనధికార ప్రముఖులు నార్లవారికి ఢిల్లీలోను, 1969 జనవరి 26వ తేదీ గుడివాడలోను షష్ట్యబ్ది పూర్తి సన్మానం చేశారు. అదేకాలంలో వేమనను గూర్చిన పాశ్చాత్యుల అభిప్రాయాలను (Vemana through Western eyes) అధిక వ్యయప్రయాసల కోర్చి పరిచయం చేయగా శ్రీ మరుపూరు కోదండరామిరెడ్డిగారు 'వేమన-పాశ్చాత్యులు' అను పేరుతో తెలుగులోకి అనువదించారు. వ్యాసాలు, చర్చా ప్రసంగాలు, రేడియో ప్రసంగాలతో కూడిన 'Traditional Indian culture and other essays' ముద్రించారు. 1971లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ కన్నడ స్టడీస్, మైసూరా వారి గోష్టిలో Gandhiji in Indian Literature అన్న అంశంపై చేసిన ఉపన్యాసం ముద్రించి కన్నడంలోకి అనువదించారు. 1969 తెలంగాణా ఉద్యమంలో, 1972లో జై ఆంధ్ర ఉద్యమంలో రాష్ట్ర సమైక్యతకు పాటుపడ్డారు. +1973 సెప్టెంబర్ 29వ తేదీన గవర్నర్ ఖండుభాయిదేశాయి గారి నుంచి ఆంధ్రవిశ్వ విద్యాలయం ద్వారా “డాక్టర్ ఆఫ్ లెటర్సు" గౌరవబిరుదాన్ని స్వీకరించారు, 1975 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పట్టంపొందారు. +Centenary Tribute' అనే పరిశోధనా గ్రంథం, 1974 సం॥లోనే సాంప్రదాయ వ్యతిరేకమైన సనాతన వ్యాఖ్యతో, విపుల పీఠికతో “జాబాలి” అనే నాటికను ప్రచురించగా తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. మాటా మంతీ, పిచ్చా పాటీలను కలిపి “కొత��త పాత” పేరుతో కొన్ని వ్యాసాలు జోడించి, “కదంబం”ను పునర్ముద్రించారు. సాహిత్య అకాడమీ పక్షాన గురజాడవారి “కన్యాశుల్కము"ను 1975లో కుదింపు కూర్పును చేశారు. +1975 జులై 25న దేశంలో అత్యయిక పరిస్థితి ప్రకటించబడింది. 1976 మార్చిలో సంజయ్ గాంధి గుంటూరు రాకసందర్భంగా నార్లవారికి చెప్పకుండా ఆంధ్రజ్యోతి ప్రత్యేక సంచిక ప్రచురించారు. దీనికి నిరసనగా నార్ల రాజీనామా ఇచ్చారు. పత్రికాధిపతియైన శ్రీ కె.ఎల్.ఎన్. ప్రసాద్ గారి కోరిక పై ఉపసంహరించుకొన్నారు. తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ పత్రికలో రాయమని అధిపతులు కోరగా అందుకు సమ్మతించని నార్లవారు 1977 జనవరిలో రాజీనామా చేశారు. +1976 ఆగష్టులో 1944-77 మధ్యకాలంలో ఎన్నికచేసిన సంపాదకీయాలను “మూడు దశాబ్దాలు” పేరుతో ప్రకటించారు. 1978లో మైసూరు విశ్వవిద్యాలయంలో ఇచ్చిన ఉపన్యాసాన్ని వారే "Poverty of Intellectualism in India" ప్రచురించారు. 1979లో విస్తృతపీఠికతో “సీతజోస్యం” ప్రకటించగా 1981లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందినది. మానవతావాదానికి పట్టంకట్టే "Gods, Goblins and Men" ఉస్మానియా విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవం సందర్భంగా సోషియాలజీ విభాగం వారి ఆధ్వర్యంలో ఇచ్చిన ఉపన్యాసము "Indian Culture and its Caste Complex" నాగార్జున విశ్వవిద్యాలయం ప్రథమోపాధ్యక్షులు ప్రొ॥ వి. బాలయ్య ధర్మోపన్యాసాల సందర్భంగా 1980లో డిసెంబర్ 4, 5 తేదీల్లో చేసిన ఉపన్యాసం "East and West Myth of Dichotomy" నూతన వ్యాఖ్యానంతో కూడుకున్న వీరి “నరకంలో హరిశ్చంద్రుడు” వీరి ప్రముఖ గ్రంథాలు. +హిరణ్యకశ్యపుని హత్య, పంచరాత్రం అనే నాటకాలు పీఠికలు రాయక ముద్రించలేదు. మా ఊరు, ఆషామాషి, సంస్కృతం సంస్కృతి, స్కాండినేవియన్ కథలు వెలుగుచూడవలసిన గ్రంథాలు. +వీరి భార్య శ్రీమతి సులోచనాదేవి వీరి వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడే నార్లవారిని వెన్నంటి ఉండి కంటికి రెప్పలా కాపాడిన ఆదర్శజీవి. ఈ దంపతులకు ముగ్గురు కుమాళ్ళు, ఐదుగురు కుమార్తెలు. ఇంట్లో పుట్టినవారు, ఇంటికి వచ్చినవారు (అంటే అల్లుళ్ళు కోడళ్ళు) అంతా డాక్టర్లు కావడం ప్రత్యేకం. పెద్దకూతురు డాక్టర్ కొల్లి శారద, అల్లుడు డాక్టర్ కొల్లి గంగాధరరావు తప్ప మిగతా అందరూ అమెరికాలో ఉండటం విశేషం. +బుద్ధుడన్నా, బౌద్ధమన్నా నార్లవారికి ఆదరాభిమానా లెక్కువ కాబట్టి వారి ఇంటికి 'లుంబిని' అని పేరు పెట్టారు. వీరికి పుస్తకాలు సేకరించడం ఒక హాబి. విదేశీ పర్యటనలో విలాసవస్తువులు కాక, ��ంచిగ్రంథాలు కొనేవారు. కొనడమే కాదు వాటిని అందంగా బైండింగ్ చేయించి +అమర్చిన తీరు వారి జ్ఞానతృష్ణకు నిదర్శనం. దాదాపు 20 వేల గ్రంథాలున్నాయి. +ఇంతటి ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించి జాతికి సేవచేసి, నవమేధావి అనిపించుకున్న నార్ల 1985 ఫిబ్రవరి నెలలో మరణించారు. +“చదువు సంధ్యలేల సంస్కృతి లేకున్న వ్రాత కోతలేల నీతిలేక తెలివి తేటలేల విలువలు లేనిచో నవయుగాల బాట నార్ల మాట.” పి. కృష్ణమూర్తి, నార్ల సంస్మృతి నుండి +ఒక అడవిలో రెండు దారులు చీలిపోయాయి. +చాలా తక్కువ మంది నడచిన బాటను ఎంచుకున్నాను. +అదే తేడా అంతటికీ కారణం అయింది. రాబర్ట్ ఫ్రాస్ట్ +1928 కాకినాడ, పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంటరు విద్యాభ్యాసం. కాకినాడలో యువజన పత్రిక లిఖిత పత్రికగా నిర్వహణ. +1929 మద్దూరి అన్నపూర్ణయ్యగారు నిర్వహించిన కాంగ్రెస్ పత్రికకు తొలి రచనలు. టెర్రరిస్టు కార్యకలాపాలలో పాల్గొనడం, జైలు జీవితం. +1931 భారతి, కృష్ణా పత్రికలో రచనలు. +1932 మచిలీపట్నం, నోబుల్ కళాశాలలో డిగ్రీ విద్యాభ్యాసం. +1933 స్వదేశ సంస్థానాలు గ్రంథ రచన. +• కృష్ణా పత్రికలో కొంత కాలం రచనలు చేశారు. +• మేడే రోజున మచిలీపట్నం నుంచి గద్దె లింగయ్యగారు ప్రారంభించిన ‘ ప్రభ’ పత్రిక నిర్వహణ బాధ్యతలు. +1934 నేటి రష్యా గ్రంథ ప్రచురణ. ఈ గ్రంథాన్ని వెంటనే బ్యాన్ చేశారు. +1935 జూలై ఇంగ్లీషు జర్నలిజంలో చేరేందుకు చెన్నై పయనం. +• ప్రజాబంధు ఎడిటరు ఎస్.జి. ఆచార్యతో పరిచయం. స్వరాజ్య పత్రికలో రిపోర్టరుగా చేరిక. +• శ్రీ రామకృష్ణ ముదలియార్ నిర్వహించే జస్టిస్ పత్రికలో చేరిక. +• జ్యోతి పత్రిక సంపాదకత్వ బాధ్యతలు. +1935-38 ప్రజాబంధు, వినోదిని, జనవాణి, సమదర్శినిలో రచనలు +1935-39 తాపీ ధర్మారావుగారు నిర్వహించిన జనవాణిలో అసిస్టెంటు ఎడిటరుగా కొంతకాలం పనిచేశారు. +1937 ప్రజామిత్ర పత్రికలో కొంతకాలం పని. +1938 ఆగష్టు 1 ఆంధ్రప్రభ దిన పత్రికలో న్యూస్ ఎడిటర్‌గా చేరిక. +1938 ఏప్రిల్ 2 చి.సౌ. సులోచనాదేవిగారితో మద్రాసులో రిజిష్టర్ వివాహం. +1939 జెక్ రాజ్య విచ్చేదం, పాలస్తీనా గ్రంథాల ప్రచురణ, ఆస్ట్రియా ఆక్రమణ ప్రచురణ +1942 ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్ బాధ్యతలు. +1943 రష్యన్ కథలు (అనువాదం) ప్రచురణ +1944 అక్టోబర్ 19 ఆంధ్ర శిల్పసంపద పై రాసిన సంపాదకీయాల వల్ల నాగార్జున కొండ, జగయ్య పేటలో గల శిల్ప ప్రాధాన్యం అందరికీ తెలిసింది. +1945 కదంబం-కథలు, కొన్ని సంపాదకీయాల ప్రచురణ కోస్తా తుపాను నిధ��� సేకరణ. +1945 డిశంబర్ 30, ఆంధ్రరాష్ట్ర పత్రికా రచయితల సంఘ నవ వార్షికోత్సవానికి అధ్యక్షత వహించారు. +• రాయలసీమ క్షామనిధి సేకరణ, ఆంధ్రప్రభ ద్వారా +1946 ఆంధ్రరాష్ట్ర పత్రికా రచయితల సంఘ అధ్యక్షులు +1947 కొత్తగడ్డ నాటికల సంపుటి ప్రచురణ +1947 ఫిబ్రవరి 12 ప్రకాశం ప్రభుత్వం పడిపోయే సమయంలో ప్రజాస్వామ్య విలువలు వివరిస్తూ ప్రజా ప్రభుత్వం పేరిట ఐదు సంపాదకీయాల రచన. +1949 సెప్టెంబరు 6 ఆస్థాన కవి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి సన్మాన సందర్భంగా ఏర్పాటైన పత్రికా ప్రదర్శనకు నార్ల ప్రారంభోత్సవం. +1950 మద్రాసు ప్రభుత్వము ఏర్పరచిన డ్రామా రివైవల్ కమిటీ సభ్యులు. +• నల్గొండ జిల్లా మంచిర్యాలలో ఏర్పాటైన నిజాం ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆరవ వార్షిక సంఘ ప్రారంభోత్సవం. +1951 సెప్టెంబరు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు అభ్యంతరం తెలుపుతూ నాగార్జున ప్రాజెక్టు అవసర వివరణ. +• మాటమంతీ, పిచ్చాపాటీ వ్యాస సంపుటాల ప్రచురణ +1952 ఆంధ్రప్రభ ద్వారా రాయలసీమ క్షామ నిధి వసూలు. +• ఆగష్టు 15 ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదక బాధ్యత. +1953 ఆంధ్రప్రభ ద్వారా గోదావరి వరదబాధితుల నిధి వసూలు. +1955 కమ్యూనిస్టు వ్యవస్థ తగదని ప్రగతి పేరుతో 9 సంపాదకీయాల ప్రచురణ. +• సంస్కృతం సంస్కృతి 15 సంపాదకీయాల పరంపర ప్రచురణ. +• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య గ్రంథాల విధాయక కమిటీ సభ్యులు. +1956 నార్లవారి మాట పద్య సంపుటి ప్రచురణ. +1957 జగన్నాటకం గేయాల, గీతాల ప్రచురణ. +• సాహిత్య అకాడెమి, ఢిల్లీ సలహా కమిటీ సభ్యులు. +• ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి సభ్యులు. +1958 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి రాజ్యసభకు సభ్యునిగా ఎన్నిక. +• యునెస్కో ప్రతినిధి వర్గంలో డాక్టర్ రాధాకృష్ణన్ నాయకత్వంలో పారిస్, యూరపు దేశాల పర్యటన. +• డిశంబరు 1 విజయవాడలో 51వ జన్మదినోత్సవ నిర్వహణ, Halfway అభినందన గ్రంథ ప్రచురణ. +• కేంద్ర పురావస్తు బోర్డు సభ్యులు +• ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ పునర్వవస్థీకరణ సంఘ అధ్యక్షుడు. +1959 మే 12 ఆంధ్రప్రభ దిన పత్రిక నుంచి రాజీనామా. +1960 ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ స్థాపన. +• జూలై 2 ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటరు బాధ్యతలు. +• ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక కళా అకాడమీ సభ్యులు. +1963 రాష్ట్రపతి రాధాకృష్ణన్ అభినందన గ్రంథ సంపాదకత్వం. +1964 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి రెండవసారి రాజ్య సభకు ఎన్నిక. +• ఢిల్లీలో జరిగిన షేక్ స్పియర్ సెమినార్ లో పాల్గొనడం +1967 ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్ బాధ్యత. +1968 హైదరాబాదులో 'లుంబిని' పేరుతో బంజారా హిల్స్ లో భవన నిర్మాణం. +1968 న్యూఢిల్లీ సాహిత్య అకాదెమీ చే (వీరేశలింగం) Veeresalingam మోనగ్రాఫ్ ప్రచురణ. +• డిశంబర్ 1 ఢిల్లీలో నార్ల షష్ట్యబ్ది పూర్తి ఉత్సవాల నిర్వహణ. ప్రత్యేక సంచిక ప్రచురణ +• నార్లకు షష్టిపూర్తి సందర్భంలో ప్రదానం చేసిన గ్రంథం (1968 న్యూఢిల్లీ సాహిత్య అకాడెమీచే +• Vemana మోనగ్రాఫ్ ప్రచురణ గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం నాటకం (కుదింపు) ప్రచురణ. +• జనవరి 20 కృష్ణా జిల్లా గుడివాడలో నార్ల షష్టిపూర్తి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ, Vemana +• Through Western Eyes పాశ్ఛాత్యుల దృష్టిలో వేమన) ప్రచురణ. +1970 బెంగళూర్ లో జరిగిన లెనిన్ శతజయంతి ఉత్సవాలలో పాల్గొనడం. +1972 అఖిల భారత రాడికల్ హ్యూమనిస్టు సమావేశంలో ప్రారంభోపన్యాసం. +1973 డిశంబరు 29, ఆంధ్ర యూనివర్శిటీ నుంచి డి.లిట్ గౌరవ స్వీకారం. +1974 జాబాలి ఏకాంకిక రూపకం, నవయుగాలబాట ప్రచురణ. +1975 అమెరికా, పశ్చిమ, తూర్పు యూరపు దేశాలు, దూర ప్రాచ్యదేశాలైన జపాన్, హాంగ్ కాంగ్, కంబోడియా +• వియత్నం, ధాయ్ లాండ్, ఇండోనేషియా పర్యటన. +• శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి డి.లిట్ గౌరవ స్వీకారం. +1976 మూడు దశాబ్దాలు పేరుతో 1944-1974 మధ్య ఎంపిక చేసిన సంపాదకీయాల ప్రచురణ +1977 ఆంధ్రజ్యోతి దిన పత్రిక సంపాదకత్వం నుంచి రాజీనామా +1978 నార్ల 71వ జన్మదినోత్సవం హైదరాబాద్ లో నిర్వహణ. ప్రత్యేక సంచిక ప్రచురణ. +• న్యూఢిల్లీ సాహిత్య అకాదెమిచే Gurazada మానగ్రాఫ్ ప్రచురణ. +1981 సీత జోస్యం గ్రంథానికి న్యూఢిల్లీ సాహిత్య అకాడెమీ అవార్డు ప్రకటన. నార్ల తిరస్కృతి +1982 నరకంలో హరిశ్చంద్రుడు నాటక ప్రచురణ. +* East and West Myth of Dichotomy నాగార్జున యూనివర్సిటీ ఉపన్యాసాలు గ్రంథ ప్రచురణ. +1983 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్కృతిక సలహాదారుగా నియామకం. +1986 హరిహరప్రియకు నార్ల రాసిన ఆంగ్ల లేఖల ప్రచురణ. +1988 కొల్లా శ్రీకృష్ణరావు సంపాదకత్వంలో నార్ల సంస్కృతి సంస్మరణ సంచిక ప్రచురణ. +పురాణ వైరాగ్యం అసంపూర్తి నవల న్యూ హ్యూమనిస్టు పత్రికలో ప్రచురణ. పూరణ పైడి చంద్రలత. +1990 హిరణ్యకశిపుని హత్య, పంచరాత్రం (ద్రౌపది) నాటికల ప్రచురణ. +1996 నార్ల గ్రంథాలయాన్ని హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అప్పగింత. నార్ల ధర్మనిధి ఉపన్యాసాల ప్రారంభం. +1999 4. తెలుగు పత్రికలలో భాషా ప్రమాణాలు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు. +2001 6. తెలుగు జర్నలిజం పథ నిర్దేశకుడు నార్ల సి. రాఘవాచారి. +2003 8. తెలుగు పత్రికల ప్రభావం ప్రాధాన్యతలు ఐ వెంకటరావు +2004 నార్ల రచనలు. తెలుగులో 7 సంపుటాలు, ఇంగ్లీషులో 5 సంపుటాలు ప్రచురణ. +తెలుగు మాగాణంలో నార్లవారి మాటకు ఎంతో పలుకుబడి ఉంది. నార్లవారు బహుముఖ ప్రజ్ఞాశాలులు కావడం చేత, వారి పలుకుబడి కూడా అనేక రంగాలలోనే అనేక వీథులలో విహరించిన వాడాయన. ఆయన లేఖిని, అనేక శక్తులను రంగరించుకుని, ఆస్వాదించి జీర్ణించుకొని, మునుపదును పొందింది. ఆయన ప్రగతిశీలి, చారిత్రక దృష్టి అలవరచుకున్న వాడు. భావుకుడు, రసోద్వేగి. అన్యాయాన్ని సుతరామూ సహించలేని సాహసుడు. అన్నిటికీతోడు నార్లవారి ప్రతి అణువులోను రైతుతనం స్పందిస్తుంది, ప్రతిబింబిస్తుంది. ఈ లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఆయనలేఖిని తెలుగు సాహిత్యానికి ఎన్ని అలంకారాలనో సంతరించి పెట్టింది. క్రొత్త మార్గాలను ఆవిష్కరించింది. పాతపుంతలను నవీనంచేసింది. అన్నిటినీ మించి నార్లవారి మాటకు తెలుగు వచన రచన పై గల ప్రభావం చెప్పుకోదగ్గది; శాశ్వతమైనది. +నార్లవారు గేయాలు వ్రాశారు; పద్యాలూ వ్రాశారు. ఆ వ్రాయడం 'నార్లవారి మాట'గానే వ్రాశారు. వేమన్నను గుర్తుకు తెచ్చారు. రసాత్మకాలైన నాటికలుకూడా వ్రాశారు కొత్తగడ్డ'ను ఏ సాహితీపరుడు మరువగలడు! అయితే ఆయన ప్రధానంగా వచన రచయిత. “నేటి రష్యా స్వదేశ సంస్థానాల"తో ప్రారంభమైన నార్లవారి వచన రచన, పత్రికాభిముఖంగా నూతన స్థాయిని సంతరించుకున్నది. అంతే కాదు. తెలుగు వచన రచనకే ఒక క్రొత్త తేజస్సును సంతరించి పెట్టింది +పటుత్వంతో, పటిమతో వచన రచన చేసిన తెలుగు రచయితలు మహాశిల్పులు చాలామంది వున్నారు. పానుగంటి, చిలకమర్తి, ఉన్నవ, చలం, గోపిచంద్ మొదలైన మహారచయితలు వచన రచనా శిల్పానికి క్రొత్త శోభలను కల్పించారు. అయితే నార్లవారు చిన్నయసూరి, వీరేశలింగం కోవకు చెందినవారు. +నవవాక్య నిర్మాణంలో ఈనాటి తెలుగు వచన రచనకు నాందీ ప్రస్తావన చేసినవాడు చిన్నయసూరి. నవ్య వచన రచనా రీతికి సృష్టికర్త చిన్నయసూరి. +చిన్నయసూరి గ్రాంథిక శైలిలో వచనం వ్రాశాడు. “మిత్రలాభము”, “మిత్రభేదము" వరకే ఆయన వచన రచన పరిమితమైంది. ఈ వచన రచనను బహుళ ప్రచారానికి తెచ్చినవాడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆదిలో తానుకూడా గ్రాంథిక శైలితోనే వచన రచన చేసినవాడు వీరేశలింగం. అయితే తాను సంస్కారోద్యమకర్త కావడంచేత, తన సందేశాన్ని ప్రజాసామాన్యానికి అందజేసి ఉద్యమ ప్రచారం చెయ్యవలసిన అవుసరం కలగడం చేత వీరేశలింగం ప్రధానంగా వచన రచన వ్యావహారిక భాషలోనే నడిపాడు. వ్యావహారిక భాషతో వచన రచన చెయ్యడాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చినవాడు వీరేశలింగం; వ్యావహారిక భాషావాదానికి మూలవిరాట్టు గిడుగు రామమూర్తి పంతులు. +అయితే ప్రజాయుగం ప్రారంభమైన నాటినుండి పత్రికల అవుసరం, ప్రభావాన్ని వీరేశలింగం గుర్తించాడు. అందువల్లనే తన ఉద్యమ ప్రచారానికి వీరేశలింగం కొన్ని పత్రికలు నడిపాడు. కాని, పత్రికలు ప్రభావం స్వాతంత్రోద్యమంతోగాని పరాకాష్ఠను అందుకోలేదు. అందునా తెలుగునాట, తెలుగు పత్రికల పలుకుబడి, నార్లవారు పత్రికా రంగంలో ప్రవేశించిన పిమ్మటనే పెరిగింది. +తెలుగు పత్రికా చరిత్రలో ఈ కాలాన్ని స్థూలంగా 'నార్లవారి శకం' అన్నా అతిశయోక్తి కాదు. ఈనాటి పత్రికా భాషను 'నార్లవారి మాట నార్లవారి భాష' అన్నా అతిశయోక్తి కాదు. వార్తలను పాఠకుని బుద్ధికి సూటిగా అందించడానికి, నవభావాలను పాఠకుని హృదయానికి హత్తడానికి, నార్ల వారి భాష చక్కగా అందుకే అది పుట్టుకువచ్చినట్టుగా సరిపోతుంది. ఆ భాషలో, నార్లవారి ఆ శైలిలో, సంతోషం, కోపం, విమర్శ, మెప్పు, హేతువాదం, అనుశాసనం తరంగ విన్యాసంతో తేలియాడుతూ పాఠకుని అందుకుంటయ్. అతన్ని అలరిస్తయ్. అలజడి కలిగిస్తయ్. ఆలోచనా నిమగ్నుణ్ణి చేస్తయ్. నార్లవారి పత్రికాభాష విశిష్టమయింది. వినూత్న మయింది. అది తెలుగు వచన రచనా రీతులమీద ఒక క్రొత్తపంథాను సృష్టించింది. చెరగని శాశ్వత ముద్రను వేసి తెలుగు వచన రచనకు ఒక శకారంభకులైనారు. తద్వారా నార్లవారి మాట అమోఘమైంది. +- ఆవుల సాంబశివరావు, హంస మాస పత్రిక నుండి +జర్నలిజం వృత్తిగా చేపట్టిన వాళ్ళకు ఆర్జవ అస్తవ్యస్తంగానే ఉంటుంది. కాని కష్టాలకు కొదువ ఉండదు. శరీరం డస్పిపోయింది. అంతులేని మానసిక సంఘర్షణలను ఎదుర్కోవాల్సొస్తుంది. జీవితం సందిగ్ధంగా గడుస్తుంది. సంశయాలు కోకొల్లలు. అంతా అనిశ్చితమే. ఇది ఖాయం, అని చెప్పుకోడానికికేమీ కనపడదు. జర్నలిస్టు వ్యాసంగం చేపట్టిన తొలిదశలో నార్ల కూడా తనవంతు కష్టాలు, బాధలు, వ్యధలు అనుభవించక తప్పలేదు. సిఫార్సులు, అండగా నిలబడే వ్యక్తులు లేకుండానే ఆయన జర్నలిస్టయ్యారు. కేవలం తన కృషి, ప్రవర్తన నిజాయితీ, ఉదాత్తతలను ఆలంబనగా చేసుకుని జర్నలిజంలో మహోన్నత స్థానం అధిష్టించి, తెలులు భాషా ప్రపంచంలో అజరామరమైన కీర్తి నార్జిం���ారు. +శ్రీ ప్రకాశంగారి ఆంగ్ల దినపత్రిక 'స్వరాజ్య' విలేకరిగా చేరినప్పుడు, శ్రీ నార్లతో నాకు పరిచయమైంది. ఆ రోజుల్లోనే తన విధి నిర్వహణలో ఆయన ప్రదర్శించిన సౌలభ్య వైఖరి ఒక విశిష్ట చిహ్నంగా నాకు గోచరించింది. ఎంత కష్టమైన పనినైనా, అతి తేలికగా చేయగల నేర్పు శ్రీ నార్లకుంది. ఆ పిమ్మట శ్రీ రామ్ నాధ్ గోయెంకా ఆంధ్రప్రభను స్థాపించినప్పుడు, పత్రికకు సంపాదక వర్గ సిబ్బందిని మొదటగా ఎంపికచేసే బాధ్యత నామీద పడింది. త్వరలోనే త సహోద్యోగులందరికంటే తానేమిన్న అని రుజువుచేసి, వారందరికీ నార్ల నాయకుడయ్యారు. విలేకరిగా ఆయన గడించిన అనుభవం ఆ కాలంలో ఎన్నో విధాల తోడ్పడింది. వార్తా ప్రచురణలో సామాన్యంగా ఉండే ఆంక్షలు, నిబంధనలు కొంత అసహజత్వాన్ని కృత్రిమ ధోరణులను సృష్టిస్తాయి. వాటికి దూరంగా ఉండి ప్రజల దైనందిన జీవితాన్ని ప్రవీలిస్తూ, వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ తన సంపాదకీయాల ద్వారాను, సిసలైన వార్తల ప్రచురణలోను ప్రజా సమస్యలకు దర్పణంగా నిలిచారు. నార్లలో ఉన్న రెండు విశిష్ఠ లక్షణాలు ఆయన ఔన్నత్యాన్ని అనుమడించాయని చెప్పాలి. ఒకటి ఆయన మేధాశక్తి, రుజువర్తన. రెండు శ్రామికుడుగా అన్ని విషయాలలో ఆయన చూపిన కార్యదీక్ష, బాధ్యతల నిర్వహణ. పని విషయంలో నార్ల విరామ మెరుగని రాక్షసుడు అలా ఎందుకనాల్సొస్తున్నదంటే, శ్రమలో ఉన్న ఆనందం, సంతృప్తిలను క్షుణ్నంగా తెలుసుకున్న వ్యక్తి నార్ల. జీవితంలోని గొప్ప రహస్యమదేనని ఆయన గ్రహించారు. కష్టించి పనిచేసి తన వృత్తి మీద గౌరవం, గర్వం పెంచుకోగలిగారు. +తన విద్యుక్తధర్మ నిర్వహణ నుంచి దృష్టిని మళ్ళించే ఒత్తిడులను, ఆకర్షణలను ఆయన తన దరికి రానీయలేదు. తన వృత్తి ధర్మాన్ని మరువకుండా, నిర్విరామకృషితో ఆంధ్రప్రదేశ్ లో వాడవాడలా అన్ని వర్గాల ప్రజల ఆదరణను, అనురాగాన్ని ఆయన చూరగొన్నారు. విజయవాడలో నార్లకు జ రిగిన సన్మానం ప్రజలకు ఆయన మీదున్న అభిమానానికి ప్రజల నిదర్శనం. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పరిమితమైన జర్నలిజం వృత్తిలో, లక్ష్యాన్ని విస్మరించని సాధకుడు ఎంతటి ఉన్నత కీర్తి శిఖరాలనధిరోహించగలడో రుజువు చేసిన నార్లకు, విజయవాడ సన్మానం ప్రజలు వ్యక్తం చేసిన అపూర్వ ప్రశంస ఖాసా సుబ్బారావు, ఈనాడు 1986 +నార్లవారి సులోచన అంటే ఆయన రాసిన నవలకాదు, నాటకంకాదు, కథకాదు. కావ్యం కాదు. మరి ఈ సులోచన ఎవరు? “బిహైండ్ ఎవ్వెరి గ్రేట్ మా���్ దేరీజ్ ఎ వుమన్” అన్న +ఆంగ్లసూక్తికి ఈమె ఒక ఉదాహరణ. ప్రఖ్యాత తత్వవేత్త మార్క్స్ కు వారి సతీమణి జెన్నీలాగే నార్లకు వారి సతీమణి సులోచన జీవితంలో కష్టసుఖాలు పంచుతున్న సహచరి. నార్లవారి వివాహం 1938లో జరిగింది. ఆయనకు తోడు నీడగా వచ్చారు సులోచనగారు. ఆమె అంతగా పెద్ద చదువులకు నోచుకోని మధ్యతరగతి రైతు కుంటుంబంలో పుట్టిన మహిళ. వివాహం అయిన కొద్ది రోజులకే ఆమె భర్తతో కాపురానికి చెన్నై చేరుకుంది. ఆ రోజుల్లో ఆయన ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్ గా ఉండేవారు. జీతం సుమారు 25 రూపాయలు. ఈనాటి విలువతో పోలిస్తే అది సరైన జీతమే కాదు. ఆనాటి విలువతో పోల్చుకున్న అది గొప్ప రాబడి కిందకు రాదు. ఆ రోజుల్లో దేశం పరాయిపాలన కింద ఉంది. కరువు కాటకాల వల్ల ఏర్పడిన ఒడిదుడుకులతోపాటు స్వాతంత్ర్య పోరాటం వల్ల ఎదురైన ఇబ్బందులు కూడా సామాన్య కుటుంబాలకు ఆర్థికంగా సమస్యలు సృష్టిస్తూ వుండేవి. అయినా గృహ నిర్వహణలో చాకచక్యంతో వ్యవహరించి కుటుంబ సమస్యల మూలంగా నార్లవారి రచన సర్వం కుంటుపడకుండా చూసేవారు సులోచన. +పాత్రికేయులుగా, సుప్రసిద్ధ సంపాదకులుగా మాత్రమే చాలామందికి నార్ల తెలుసు. కానీ, వారితో వున్న సాన్నిహిత్యాన్ని బట్టి వారి ఇంటి కెదురుగానే మేము చాలా రోజులుగా ఉంటూ ఉండడం వల్ల ఏర్పడిన సాహచర్యాన్నిబట్టి గృహస్తుగా, ఇంటి పెద్దగా నార్ల గురించి నాకు తెలుసు. నార్ల వెనుక వున్న ధార్మిక శక్తిగా ఆయన సహధర్మచారిణిగా సులోచనగారి గురించి నాకు తెలుసు. +మొదటిసారి నార్లను నా విద్యార్థి దశలో చూశాను. అప్పుడు ఆయన ఒంగోలులో జరిగే పశువుల సంత చూడడానికి వచ్చారు. అప్పటికే పత్రికారంగంలో వారు లబ్ధ ప్రతిష్ఠులు. కండువాను వల్లెవాటుగా వేసుకుని, చేతిలో సిగరెట్ డబ్బాతో ముఖ్య అతిథుల మధ్య ఠీవిగా, నిటారుగా నడిచిపోతున్నవారి మూర్తి నేటికీ నా మనఃఫలకం మీద నిలిచివుంది. అలాగే పత్రికా రచయితగా వారి ప్రభావం కూడా నా మీద చాలా వుంది. అప్పటివారి సంపాదకీయాలు, వ్యాసాలు, ఇతర రచనలు, అందులోని వారి శైలి, భాష, సరికొత్త పదాల సృష్టి, రాజకీయ చమత్కారాలు వీటన్నిటికి ఎందరో నాటి తెలుగు యువకులలో నేనూ ప్రభావితుడ్నయ్యాను. ఇంటర్ చదివేటప్పుడు 1944-46లో తెలుగు వ్యాసరచన పోటీలలో నార్ల వారి శైలిలో వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని. మా తెలుగు లెక్చరర్ ధరణికోట వెంకటసుబ్బయ్య నా వ్యాసానికి పదికి ఆరు మార్కులు ఇచ్చి “ఎవాయి��్ న్యూస్ పేపర్ స్టయిల్” అని మార్జిన్లో రిమార్క్ రాశారు. నార్లవారి భాషా ప్రభావం నామీద అంతగా ఉండేది. +కొన్నాళ్ళకు నేను ఒంగోలు జిల్లా కలెక్టరుగా ఉంటున్నప్పుడు ప్రకాశం దినోత్సవాలకు ఒంగోలు జిల్లా ప్రముఖులు నీలంరాజు వెంకట శేషయ్య, రాయప్రోలు సుబ్బారావు, నటీమణి భానుమతి, శాస్త్రవేత్త గంగాప్రసాద్ ను పిలుస్తూ నార్లవారిని కూడా ఆహ్వానించాను. అనారోగ్య కారణాల వల్ల ఆయన సభకు రాలేదు. తరువాత ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్ వచ్చాను. బంజారా హిల్స్ లో వారి 'లుంబిని'కి ఎదురుగా నివాసం ఉండంచేత 1973 నుంచి మా పరిచయం బాగా అభివృద్ధి చెందింది. వారిని పలకరించడానికి, పుస్తకాలు తీసుకోవడానికి తరచుగా వారింటికి వెళుతూ ఉండడంవల్ల వారికోసం వచ్చే ప్రముఖ పాత్రికేయులు, రాజకీయ నాయకులు, సారస్వత ప్రియులు మొదలైనవారితో వారు జరిపే చర్చలు నేనూ వింటుండే అవకాశం కలిగింది. ఆయా సందర్భాలలో నార్లవారి సంభాషణ, వ్యాఖ్యలు, ఛలోక్తులు, గతకాలపు విశేషాలు వినే వీలు కలిగింది. వారి సీతజోస్యం' రచనకు అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా మా ఇంట్లో ఉడతాభక్తిగా వారికి సన్మానం చేశాం. సన్మానాలంటే ఇష్టం లేకపోయినా నా మీద ఉండే వాత్సల్యం కొద్దీ అంగీకరించారు. ఆ సభకు జస్టిస్ గంగాధరరావు, మాధవరెడ్డి, పున్నయ్య, బోయి భీమన్న, గజ్జల మల్లారెడ్డి సి.నరసింహం మొదలైనవారు వచ్చారు. నార్లవారి సతీమణిని కూడా భర్త పక్కనే కూర్చోబెట్టి సన్మానించాము. +ఉద్యోగపు తొలి దినాల్లో నార్లవారి ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉండేది. ప్రకాశం పంతులుగారి పత్రికలో పనిచేసిన రోజులలో ఒకసారి జీతం బకాయి వసూలుకు పంతులుగారి ఇంటికి వెళ్ళారట. పంతులుగారుకూడా ఆ రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నారు. ఏమైనాసరే కాస్తో, కూస్తో ఇవ్వందే పోలేనని పట్టుబట్టారు. నార్లగారి వాలకం చూసి పంతులుగారు ‘కొడావట్రా' అంటూ 'పది రూపాయలు' విసిరారు. తనకు కావలసింది ఆ పదే. అది తీసుకుని చక్కా వచ్చేశారట. ఆ రోజుల్లో పది రూపాయలు ఉంటే నెల గడిచేది. +నాటి గడ్డు రోజులు గతించాయి. క్రమక్రమంగా నార్లవారి పేరుతో పాటు, జీతం ఆస్తిపాస్తులు కూడా సంతృప్తికరంగా అభివృద్ధి చెందాయి. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలతో కుటుంబం పెద్దదయింది. కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు వారి చదువులు నొప్పుళ్ళూ, పురుళ్ళు, పుణ్యాలు కుటుంబంలో బాదరబందీ కూడా పెరిగింది. ఈ గృహకార్యాలలో నార్లవారి తల నలిగిపోకుండా పాత్రికేయ వృత్తికి భంగం కలుగకుండా సజావుగా సాగిందంటే సులోచనగారు నార్లగారికిచ్చిన అమోఘమైన సహకారం ఫలితమేనని ఆనాటి ఇల్లాలు కూరలు తెమ్మని తరుముతుంటే కూతురుకు కట్నాలు తెమ్మని సణుగుతుంటే ఏ మగాడైనా మరేమి ఆలోచించగలడు? సులోచనగారు ఆయనకు ఇబ్బంది కలిగించకుండా సంసార భారమంతా ఎక్కువగా తామే మోస్తారు. ఇటీవలి కాలంలోనే ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు కుమార్తెలు పెళ్ళిళ్ళు జరిపించారు. ఆ తల్లి కృషి వలనే పిల్లలందరు ఉన్నత విద్యలు అభ్యసించి ఎంతో వృద్ధిలోకి వచ్చారు. +గృహకార్యాలు నిర్వర్తించడమే కాక సులోచనగారు మరో ముఖ్యమైన నిర్వహించేవారు. నార్ల బహుముఖ ప్రజ్ఞ వున్న మనిషి. ఆయన కోసం పండితులు, కవులు, మర్శకులు, రచయితలు, శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు ఇలా (కొన్ని పంక్తులు అదృశ్యం +సంస్కారం, పాండిత్యం వున్న మహామహులు ఇంటికివస్తే వాళ్ళతో సభ్యతగా మాట్లాడి తగు రీతిలో మర్యాదుచేసే నైపుణ్యం సులోచనగారికి స్వతహాగా ఉంది. ఒకోసారి విదేశీయులు కూడా వారింటికి వచ్చేవారు. సులోచనగారు వారిని కూడా సొంత కుటుంబ సభ్యులవలె ఆదరించేవారు. ఇంటి బాధ్యతలేకాక, భర్త సాంఘిక జీవితంలో కూడా ఎంతో విలువైన పాత్ర నిర్వహించిన సులోచనగారికి 1961 నుంచి మరో కొత్త బాధ్యత మీదపడింది. అప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చింది. దానికితోడు కంటి చూపు తగ్గడం, కొంచెం చెవుడు వంటి రుగ్మతలు ప్రవేశించాయి. లోకాన్ని రోజూ చదివి, విని జీర్ణం చేసుకునే సంపాదక లక్షణం ఉన్న నార్లవారికి ఇది అశనిపాతం. +అప్పుడు వారి ధర్మపత్ని సులోచనగారు నార్లగారికి కళ్ళూ, చెవులు తానే అయి కొత్త శక్తినిచ్చారు. కన్ను, కాలు స్వాధీనంలో లేని చరమదశలో వారు భగవద్గీత మీద పరిశోధనాపత్రం రాయబూనుకున్నారంటే అది ఎవరి అండ చూసుకుని? ఆయనకు ఘోస్ట్ రైటర్ లేడే? కనీసం లిటరరీ సెక్రటరీ కూడా లేడే? అలాంటిది ఈ వయస్సులో దాదాపు వందదాకా ఉన్న వివిధ భగవద్గీత వ్యాఖ్యాన గ్రంథాలను పరిశీలించి శోధించే ధైర్యం వారికి సులోచనగారి వల్లే కలిగిందని నిర్ద్వంద్వంగా చెప్పవలసి వుంది. +ముదిమి మీదపడి గొంతులోంచి మాట కూడా పైకిరాని దశలో సైతం వారికున్న జ్ఞాపక శక్తి అపారం. సులోచనా, ఫలానా పుస్తకం ఫలానా అలమారాలో ఫలానా చోట ఉంటుంది పట్టుకురా అనగానే ఆ ఇల్లాలు స్వయంగా తెచ్చి క్షణాల్లో అందించేది. పుస్తకాన్ని తెచ్చివ్వడం ఒక ఎత్తయితే, మళ్ళీ యధాస్థానంలో ఉంచడం మరో ఎత్తు. నార్లవారి గ్రంథాలయం పుస్తకాల సంఖ్య తెలిసిన వారికి ఈ విషయం అర్థమౌతుంది. రేడియోలో వార్తలు విని ఆయన చెవిలో “ఇందిరా గాంధీని చంపేశారట, రామ్ లాల్ రాజీనామా చేశాడట”, అంటూ వినిపించేది. కొన్ని కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు, సిద్ధాంతాలువున్న నార్లవారు రాజకీయ నాయకులమీద, ప్రముఖుల మీద కత్తులూ, కలాలు నూరు తుంటే “ఇప్పుడెందుకు లెండి, ఆరోగ్యం చూసుకోండి” అని సుతారంగా ఆయన్ని అనవసర వివాదాల నుంచి మళ్ళించేది. నార్ల వారికి పురావస్తు సంపద అన్నా, ఆంధ్రుల శిల్పాలు అన్నా గౌరవం ఎక్కువ. ఇంట్లో పుస్తకాలకెంత ప్రాధాన్యం ఇచ్చారో, కళాఖండాలకూ అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇంట్లోని ఈ కళాఖండాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ కనుపాపల్లా చూసుకొనే బాధ్యత కూడా నార్లవారి సులోచనదే. +ఈ పనులన్నీ ఒక ఎత్తయితే, వృద్ధాప్యంలో వేళకు అన్నపానాలు, మందులు మాకులూ సక్రమంగా అందిస్తూ భర్తను పసిపాపగా సాకే ఆమె గొప్పతనం ఒక ఎత్తు, చివరి క్షణం వరకు భర్తకు తోడునీడగా ఉండి, కార్యేషు దాసి, కరణేషు మంత్రి అన్నట్టు వ్యవహరించిన ఆ ఇల్లాల్ని ఆధునిక గృహిణులకు ఆదర్శమూర్తిగా భావించవచ్చు కె. చంద్రయ్య, ఉదయం దిన పత్రిక, 17-2-1986 + + +పాత్రలు రైతు పల్లెటూరి ఆసామి, అతని భార్య, అతని కొడుకు,అతని కూతురు, సెట్టి, షాహుకారు. +ఎదురుగా పడమటింటి ద్వారం పక్కగా కూర్చున్న రైతు భార్య (వయస్సు 35 ప్రాంతం) బియ్యపుచేట ముందు పెట్టుకుని, బెడ్డ లేరివేస్తూ వుంటుంది. ఆమె పాత చీర కట్టుకున్నది. నీరు దిగిన ముక్కు పుడకలు, వెల వెల బోతున్న ఏడురాళ్ళ పోగులు, ముఖాన రూపాయంత కుంకుమబొట్టు, చేతులకు నాలుగైదు జతల మామూలు గాజులు, మెడలో నల్లపూసలు, పెద్ద మంగళ సూత్రం ఇవే ఆమె ఆభరణాలు +కుడివైపునున్న సింహద్వారం దాపున కూర్చుని రైతు కొడుకు (ఈడు పద్దెనిమిదో, పంథొమ్మిదో) గోగునారతో ఎడ్ల తలతాడు పేనుతూ వుంటాడు. చెంగు యెగలాగి దోపుకున్న పంచె కట్టు; భుజంపై కొద్దిగా చిరిగిన బనియను. +గుడ్డల దండెంతో, మంచాలతో, గడమంచితో, బుట్టలు, తట్టలు, నార, తాళ్లు మొదలైన వాటితో చావడి చిక్కు రొక్కరుగా ఉఁటుంది. రైతు (ఇంచుమించు నలభై సంవత్సరాల వయస్సు) చుట్ట కాల్చు కుంటూ, తల వాకిలిగుండా వస్తాడు. మోకాళ్లు దిగిదిగని నీర్కావి ధోవతి; కుడిభుజాన్ని కప్పి కప్పని సర్కావి ఉత్తరీయం. చొక్కాగాని, బనియనుగాని లే��ు. చంకలో కోలుపు కర్ర; కాళ్ళకు కిర్రు చెప్పులు. +కొడుకు (తండ్రి ప్రవేశించినంతనే వడ్లు బేర మిచ్చేశావటేఁ? +రైతు ఆ ఒక మంచం వాల్చుకు కూర్చుంటాడు. +కొడుకు మరీ అంత తక్కువ కెందు కొదిలేశావేఁ అయ్యా? పేటలో పధ్నాలుగణాల పై చిలుకు పడుతున్నదట. +భార్య మనకి మంచీ సెబ్బరా లేదుగా! ఆళ్లు ఏకాడికి అడిగితే ఆకాడికి పారబోసి రావడమే! ఇంట్లో గింజవుంటే మనకి నిద్ర పడుతుంది? +రైతు చాల్లే, అఘోరించావ్! ఎక్కడా అప్పైనా పుట్టకపోతే, నన్నేం చెయ్యమంటావ్? +భార్య పేటకు తోలుకుపోయి అమ్ముకురాక పోయావూ? +రైతు అమ్ముకొచ్చేదాకా మునసబు, కరణాలు ఆగొద్దూ? ఈ పూట కిస్తీ కట్టకపోతే, చెంబూ తప్పేలా బయట వేస్తారట! గొడ్డూ గోదా జప్తు చేస్తారట ఆగితే ధరొస్తుందని నలుగురిలో నన్ను నవ్విం +కొడుకు రెండు కిస్తీలు కట్టనే కట్టాంగా, అయ్యా! మరొకటేగా బకాయి? +రైతు ఏమైనా మరి ఆగరటరా! తెస్తావా, ఛస్తావా అని ఎట్టాళ్ళ నురికిస్తున్నారు. సందేళకి జమాబందీ పూర్తికావాలంట. +భార్య అయితే, శిస్తుకు సరిపడ రెండు, మూడు బస్తాలమ్మి, మిగతావి అట్టే పెట్టక పోయావూ? +రైతు రెండు, మూడు బస్తాలకోసం నీ యింటి కెవ డొచ్చి కాటా కడతాడు? పైగా, మన మమ్మే పుట్ల కిన్ని మాట్లు బేరాలు కూడానా? +భార్య సరే, నీ యిష్ట మొచ్చినట్టు చేసుకో నాకు దేనికి? నేను ఆర్చేదాన్నా, తీర్చే దాన్నా? +వెట్టివాడు (బయటినుంచి హిరోయ్, మున్సబుగారు కూకేసుకు రమ్మన్నాడు. +రైతు అమ్మా, కొడుకూ చేరి, ఆగమన్నారుగా! ఆగితే, ఇదే మర్యాద వెట్టివాడితో) ఊఁ. వొస్తున్నా, నువ్వు పోరా! +వెట్టివాడు నిలుచున్న పాళాన రమ్మన్నాడు. మరి ఊరుకోడానికి ఈల్లే దన్నాడు. +కొడుకు ఊరుకోక పోతే, ఉ రెట్టుకోమను. +భార్య ఆరి ఈడి జిమ్మడ, కొంపమీదికి యములాళ్ళని పంపకం చేస్తున్నాడు. +వెట్టివాడు దొరోయ్ బేగి రా, దొరోయ్! +రైతు పదరా, పద! నీ యెనకాలే వొస్తున్నానని చెప్పు. +వెట్టివాడు (వెళ్ళిపోతూ ఆ అయ్య నన్ను కొంపడతాడు +కొడుకు ఈ మునసబు కరణాలు ఏం సవారి చేసినా, మనంటి పేదా బిక్కీ మీదే. అదే మోతుబరు ఆసాములనైతే, ఇట్టా దూకుడు చేస్తాడూ? +భార్య ఆళ్ళ దగ్గర ఈళ్ళ అంకిలి నొక్కుకు పోతుంది. నిరుడు మానానికి నిరుడు కూడా ఈళ్లు పీకమీద కూర్చుండబట్టేగా అయినకాడికి తెగనమ్ముకున్నాం. తీరా మనం అమ్ముకున్నాక వారానికే బస్తాకి రూపాయి పావలా పెరిగింది. +కొడుకు ఒక్క రూపాయి పావలా ఖర్మ మేమిటి? కార్తీకమాస మొచ్చేసరికి రెట్టికి రెట్టి ధర పలికింది. +రైతు నిజమేరా! కాని, కార్తీకమాసందాకా కిస్తీ ఆపగలమా? అప్పులవాళ్లని ఆపగలమా? గింజలు మన చేతికొచ్చేసరికి ఎవరికి రావలసింది వాళ్ళు గుంజుకోడానికే చూస్తారు. కాదు గూడదంటే పరువు పోతుంది; పరపతీ పోతుంది. +కొడుకు ఇంతకీ మన కమిషనన్ దారు బాగుపడే గీత వుంది. నిరుడు నిల్వబోసిన మూడువేల బస్తామీద పది, పదకొండు వేలు కళ్ళ జూశాడు. అందుకని ఈ యేడు మరీ తెగబడి కొంటున్నాడు. +భార్య ఎన్నేలు పోసుకోందే ఆడి పెళ్లాం మెడ తిరగకుండా అన్ని నగలు చేయించి పెట్టుకుందీ? అద్దం తరపు సిరొచ్చిందని అది నేలమీదే నడవడం లేదు. ఆడైతే సరేసరి. చుక్కల్లోకి చూస్తున్నాడు. +కొడుకు వాణ్ణి చూసి, మన షాహుకారు కూడా వడ్లబేరం ప్రారంభించాడే, అయ్యా! +రైతు ఔ నౌనురా! నిన్న మనకు కబురు చేశాడు. వాడి ఆశకైతే అసలే అంతూ పొంతూ లేదు. అయిదణాల కాడికి తనకి కొలవాలట. +కొడుకు వాడి పుణ్యమాయిరి! పావలాకాడికే అడిగాడు కాదు. +భార్య ఆరి ఆడి శిరుసు పగల! పోసుకుంటున్న వడ్డీలు చాలవు కాబోలు! ఒక మేడకు మరొక మేడ కట్టాలని చూస్తున్నాడు. +రైతు సర్లేరా, అబ్బాయ్! నాకు బద్ధకంగా వుందికాని, నువ్వెళి కిస్తీ కట్టిరా బొడ్డు నుంచి డబ్బు తీస్తూ) “ఒక యాభై సర్దరా” అని కమిషన్ దారు నడిగితే, “లేవే” అని, ఒక యిరవై మాత్రం బయానాగా యిచ్చాడు. ఇది బొటా బొటిగా కిసీకే సరిపోతుంది. +కొడుకు (పేనుతున్న తాడూ, నారా గడమంచంపై పెట్టి, తండ్రి చేతినుంచి పైకం అందుకుంటూ ఇంకా ఎంత కట్టాలేమేఁ అయ్యా? +తండ్రి ఏవో సెస్సులట; జమాబందీ మామూళ్ళట. +భార్య ఆళ్ళ పాడె, ఆళ్ళ పిండాకూడు! +కొడుకు మనకేం సాయం చేస్తున్నా రేమిటి? మనం మామూళ్ళివ్వడానికి. +రైతు సర్కారు ముడుపైనా తప్పుతుందేమో కాని, మామూళ్ళ ముడుపు తప్పుతుందట్రా? నిరుడు పల్లవీధివాళ్ళు మామూళ్ళివ్వలేదనేగా మునసబు కరణా లేకమై చురక తగిలించారు?వాళ్ళ చేతి కడ్డేమిటి? వాళ్ళది ముడుపులా వాళ్ళకి ముట్టజెప్పక పోతే, గండిలోగో, గిండిలాగో అని పరపర రాసేస్తారు. +భార్య ఆ మునసబు కేమి పోయే కాలమో కాని, మొన్న వుత్తి పుణ్యానికి సుబ్బమ్మత్త గేదల్ని బందెలదొడ్డికి తోలించాడు. లబో దిబో మంటూ అదొక్కటే గోల! +కొడుకు ఎవరైనా మనం వొంగిన కొద్దీ, మరింత వొంగ దీస్తారు. మామూళ్ళూ గీమూళ్ళూ మన మివ్వొద్దే, అయ్యా! +రైతు వాళ్లతో మన మెక్కడ గెలవగలంరా? మన కెందు కొచ్చిన పేచీలు గాని, ఆ మామూ లేదో తగలేశేరా! వాళ్లతో పేచీకి దిగితే పీకమీదికి తెస్తారు. +భార్య ��ేశేరా ఆళ్ల దెవస మేమో చేశేరా! +రైతు దండెం పైనుంచి పై పంచె తీసుకుని, మునసబు కచ్చేరీకి బయల్దేరిన కొడుకుతో) వొస్తూ, వొస్తూ కోమటింటి కెళ్లి, ఒక కాడ పుగాకు తేరా, అబ్బాయ్! కాస్త చూసి తే, బొత్తిగా నాసి రకమిస్తున్నాడు. నిలిచి కాలడమే లేదు. +కొదుకు సరే నయ్యా వెళ్లి పోతాడు.) +భార్య పొద్దున్నేగా ఒక అర్ధణాకి తెచ్చావ్! మళ్లీ అప్పుడే కావాలీ? మన పుగాక్కి చాలడం లేదు ఏంత డబ్బైనా? +రైతు నువ్వెప్పుడూ నా పుగాక్కి పడి యేడుస్తూనే వుంటావ్. ఇవాళ్ళ కొత్తే ముందిలే? +భార్య సర్లే. ఏది ఎలా తగలబడితే నాకు దేనికి కాని, నా కట్టు కోకలు చిరిగిపోయాయి. ఒక జత కొనకపోతే, ఇఖ జరగదు. +కూతురు పడమటింటిలోంచి వస్తూ బియ్య మేరడం కానే లేదటేఁ అమ్మా? +కూతురు చావడిలోకి వచ్చి ఎసరు సలసల కాగిపోతోం దేఁ అమ్మా!(పదిహేడేళ్ళ పడుచు, మూడేళ్ళనాడు పెళ్ళి అయింది.తండ్రివద్ద గారాం హెచ్చు.కల్లా కపటం యెరగదు.) +భార్య నా మాట చెవి నట్టించుకున్నావా? ఎంత అతుకు లెట్టు కుందామన్నా మరి ఆగేలా లేవు. ఒక జత కట్టుకోకలు +భార్య సరే, తేబోకు, మసిపూసుకు తిరుగుతాలే.(బియ్యపు చేట చేత బుచ్చుకుని విసురుగా లేచి వెళ్ళిపోతుంది. +కూతురు వాళ్లు తొందర చేస్తున్నారన్న మాట. +రైతు మనం ఆగుదా మన్నా, మనకు అప్పూ సప్పు పెట్టిన వాళ్లు ఆగనిస్తారా? +కూతురు ఆఁ! ఏమీ లేదు. రైతు (ఆప్యాయంగా) నా దగ్గరనా నీ దాపరికాలు? మనసులో మాటేమిటో చెప్పు! +కూతురు పై పంటనాటికి నల్ల పూసల గొలుసు చేయించి పెడతాననలేదూ? +రైతు అయితే, ఇప్పుడు చేయించమంటా వన్నమాట. +కూతురు నువ్వే అన్నావుగా, అయ్యా పంటనాటికి చేయించి పెడతానని. +రైతు (నవ్వుతూ మరి అన్నాక తప్పుతుందీ? అలాగే చేయిస్తాలే. +కూతురు వెంకట్రావమ్మ పిన్నిగారి రెండో కోడలు మొన్నే చేయించుకుంది. ఎంతో కాలేదు మజూరి కలుపుకుని నూరు రూపాయల లోపే. అయినా, కొట్టొచ్చినట్టు నదరుగా కనబడుతున్నది. ఈ పక్క పక్కవాళ్లంతా దాన్ని +కూతురు అంతా, యింతానా? చాలా బాగుంది. ఒకసారి తెచ్చి చూపించినా? నీకే తెలుస్తుంది. +రైతు తెద్దువుగాని లేఁ. ఇప్పు డంత తొంద రేమిటి? +కూతురు అస లొకసారి నీ కళ్ళతో చూడవే లా వుందో? నవర్సు మీద అయిదు చిన్నాలు పడిందట. కొత్త పేట కమలాచారి చేశాడు. మనంకూడా ఆ కంసాలిబత్తుడికే యిద్దామే, అయ్యా! పిన్నిగారింటి కెళ్లి, మా అయ్యకొక్కసారి చూపించి తెస్తానంటూ దాన్ని పట్టుకు రానా? +రైతు మంచిదమ్మా!(కూతురు వెళ్ళబోతూ వుంటే, భార్య వంటింటిలో నుంచి తిరిగి వస్తుంది. +భార్య ఇప్పుడు ఆళ్లింటికి దేనికి? అక్కడేం పాచిపోతున్నది? +కూతురు అయ్యకు చూపించడానికి వాళ్ల నల్లపూసల గొలుసు తెస్తానే. కొత్త పంట డబ్బు పెట్టి మా అయ్య నాకు అలాంటి దాన్నే చేయించి పెడతా నంటున్నాడు.(వెడుతుంది. +భార్య ఆ చేయించుకునేది నిరుడు చేయించుకున్నా బాగుండేది. నిరుడు బంగారం ఇంత మండిపోవడం లేదు. పెళ్లినాడు చేయించిన ఆ ఒక్క జత గాజులు తప్పితే, మళ్లీ దానికొక వస్తు వేదీ యేర్పడనే లేదు. మెడ బోసిగా వుంది. పైపంటనాటికి, పై పంటనాటికి అంటూ అప్పుడే మూడేళ్లు వెళ్లిపోయాయి. మన యిబ్బందులూ, సబ్బందులూ వాళ్ళకేం తెలుస్తాయ్? రేపు దాన్ని కాపరానికి పంపితే, దిసిబొమ్మలా వొచ్చిందని అత్తా, ఆడబిడ్డలూ ఆరడి +పెట్టరూ? కావాలంటే ఒక అప్పైనా దిగివిడిచి దాని మెడ కాస్త పచ్చబడేటట్టు చూడు. అలాగే నా కొక జత కోకలు కూడా +రైతు చెప్పినమాటే ఎన్నిసార్లు చెప్తావ్? తెస్తాలే, తెస్తా. +భార్య ఆ నాయుడమ్మ కోట్లోవి నా కొద్దు. అవి మూడు రోజులైనా నిలవడం లేదు. పోసుకునే డబ్బూ పోసుకుని, వొళి వలలాంటి గుడ్డల్ని అంటగడుతున్నాడు. వేరే ఎక్కడైనా కొనుక్కురా. +భార్య అంతేలే! నాకాడి కొచ్చేసరికి నీకు డబ్బే వుండదు. పాడి చేసీ, పిడక లమ్ముకునీ, దమ్మిడీ దమ్మిడీ చొప్పున పోగుజేసి, గుడ్డా గుడుసూ కొనుక్కుందామని పాతిక రూపాయలు కూడబెట్టుకుంటే, మాసూలు ఖర్చులకని +రైతు అది కాదే! సర్దవలసిన బాకీ లన్నీ సర్దాక, మరేం మిగుల్తుంది? ఆ నాయుడమ్మ కిప్పుడు ఏ ముఫ్ఫైయ్యో, నలభయ్యో యివ్వదేలాం. ఆ బాకీ తీర్చి మళ్ళీ వాడి దగ్గరే తెచ్చుకుంటే పై పంటదాకా ఆగుతాడు. +భార్య దొరికాడులేఁ, మన కొక నాయుడమ్మ, ఎక్కడలేని ధర లేసుకుని కొట్టుచీకుడు గుడ్డ లంటగట్టడానికి. ఆడి జిమ్మడ! మరి, ఆడి కెలా దక్కుతుందో, ఏమో? +సెట్టి (ప్రవేశిస్తూ ఎవర్ని పిన్నీ, శాపనాకారాలు పెడుతున్నావ్? +(సెట్టి వయస్సు ఇంచు మించు నలభై సంవత్సరాలు. ముందు క్రాపు, వెనక పిలక. బొత్తాలులేని చొక్కా జీరాడుతున్న పంచెకట్టు, సగం చెరిగిన పంగనామాలు. చేతిలో ఖాతా పుస్తకం +భార్య ఆ, ఎవర్నీ లేదు. ఎవర్ని అంటే ఎవ రూరుకుంటారు? +సెట్టి (రైతుతో ఎక్కడి బాకీ లక్కడ నిలిచిపోయాయే, బాబాయ్! మూడు రోజుల్నుంచీ ఎక్కే గడప, దిగే గడపే కాని రామరామ ఎర్రటి ఏగాడైనా వసూలైతే వొట్టు. ఊరుమీద అమాంబాపతు రెండు వేలెట్టి నా మొఖం నే +రైతు ఆఁ, రెండు మూడు వేలు నీ కొక లెఖా? పత్రమా? +సెట్టి నా ఇంట్లో సొమ్మంటే బాబాయ్! ఎప్పటి కప్పుడు ఫిరాయింపు సెయ్యందే అక్కడ నా మొగు డూరుకుంటాడంటే? మొన్న సరు కేసుకొద్దా మనెళ్ళితే, నానా మాటలన్నాడు. నువ్విప్పుడిస్తే, ఊరికే యిచ్చినట్టు! లెక్కేమైనా యిస్తావటే. బాబాయ్? +రైతు పెద్ద పెద్ద పద్దులు వసూ ల్చేసినా, చేసి నందం. ముందు వాటిని +సెట్టి బాబ్బాబు, నువ్వలా అంటే కాదు. చిల్లర శివాలచ్చి మన్నారు. కొంత కాకపోతే, కొంతైనా వసూల్టేసి సరు కేసుకు రాకపోతే, యాపారం బొబ్బుంటుంది. కొట్లో రామ రామ ఉప్పుంటే చింతపండు లేదు; చింత పండుంటే ఉప్పు లేదు. ఏ వొట్టు పెడితే ఆ వొట్టు. చెయ్యిరగ గొట్టుకున్నట్టుగా వుందంటే నమ్ము. +సెట్టి (పద్దుపుస్తకం చూస్తూ ఆఁ! వెరసి ఇరవైమూడు రూపాయల పన్నెండణాల కానీ అయిందే, పిన్నీ. +భార్య అంత యెచ్చ మేమి మండబెట్టుకున్నాం. +రైతు నెల రోజులనా డొకసారి లెఖ జూస్తే, పదిహేనేగా యివ్వదేలాం? +సెట్టి నే నగావ్ వేస్తున్నానటే, బాబాయ్? పద్దు పుస్తకం తేనే తెచ్చాగా. కావాలంటే, నువ్వే బేరీ చేసి చూసుకో. +రైతు నాకు చదునొస్తే, కానీకి మరొక కానీ నువ్వెలా రాసుకుంటావులే! +సెట్టి అరి నీ యిల్లు బంగారం గాను! ఎంత మాటన్నావేఁ బాబాయ్ పద్దు పుస్తకం పేజీలు తిరగవేస్తూ) ఆవకాయ పట్టుకోడానికని మొన్నేకాదటే, మా పిన్ని రెండు వీసెల మంచినూనె, వీసెడు మిర్చి, అరవీసెడు ఆవాలు, +అర్ధ సేరు నవటాకు మెంతులు, సవాసేరు వెల్లుల్లి వగైరా వగైరా తెప్పించుకుంది? వీసె రెండుంబావలా చొప్పున రెండు వీసెల మంచినూనె +రైతు రెండుం బావలా వేసుకున్నావ్? పేటలో రెండు రూపాయలకాడి కిస్తుంటే! +సెట్టి ఆ అక్కడైనా, రెండుం బేడా అమ్ముతున్నారే, బాబాయ్. +భార్య మరి ఆకాడికే మా కెందు కివ్వలా? +సెట్టి ఆకాడి కిస్తే నాకెలా గిడుతుందేఁ, పిన్నీ? కిరాయిలు పెట్టాలయ్యె; వడ్డీలు కట్టాలయ్యె; పారూ గీరూ పోతుందయ్యె. నాకు వీసె కొక కానీ, అర్ధణా మిగితే, అక్కడి కవి పెద్ద లాభాలే! +సెట్టి ఆఁ, ఆ మాదేమున్నదేఁ పిన్నీ! ఏడాదయ్యాక జమా ఖర్చు లెత్తితే శెట్టి మిగుల్తాడు. ఏమైనా రైతు రైతే. మంట్లో మానెడు, ఇంట్లో పుట్టెడు. +సెట్టి (రైతుతో ఏం, బాబాయ్, మరి నన్ను పంపించవటే? +రైతు ఇంతకు ముందే ఆ గింజ లేవో బేర మిచ్చాచ్చా! రేపో, మాపోకాని పైకం చేతి కందదు. అందగానే, పదో, పరకో జమ కడతాలే. +సెట్టి బాబ్బాబు! దీన్లో మళ్ళీ కాస్త బకాయి పెట్టొద్దు. బాకీ చుప్తా చేసెయ్. కావాలంటే మళ్ళీ వాడుకోవచ్చు. నీకు ఎప్పుడ��నా నేను అడ్డుచెప్పానటే, బాబాయ్? +రైతు మంచో, చెడో, ఆ యిరవై మూడు రూపాయలిస్తాగాని, బాకీకి శ్రీరామ చుట్టు. +సెట్టి నాకైనా కాస్త గుటక దిగొద్దటే, బాబాయ్? ఆ పై చిల్లర డబ్బులే నాకు మిగిలేది. +రైతు అయితే, దమ్మిడీలతోసహా గోళ్ళూడగొట్టి పుచ్చుకుంటానంటావ్! +సెట్టి నీ మా టెందుకు కాదనాలి? ఆపై కానీ తో సెయ్యవే, బాబాయ్. +భార్య (సెట్టితో ఊఁ! మహలావ్ చేశావులే ఎలాగైతేనేం మాకొక ముష్టికానీ రాయితీ రైతుతో) లెక్కా డొక్కా తిన్నగా చూపించి మరీయివ్వు! ఎంతంటే అంతా యిస్తాననక! మనం కళ్లు మూసుకుంటే చేతి కెంతొస్తే, అంతా పరపర రాసేసుకుంటారు. +సెట్టి కావాలంటే, నీ యిష్ట మొచ్చినవాళ్ళచేత పద్దు చూపించుకునే యివ్వవే, బాబాయ్! ఇందులో తటా బేమున్నది? మరి నన్ను వెళ్ళి రమ్మంటా +సెట్టి (వెళ్ళిపోబోతూ నామాట దక్కించాలి, బాబాయ్! పోనీ, నన్నే రమ్మంటే, మళ్ళీ రేపు +రైతు మళ్ళీ నువ్వు దేనికిలే? నేనే వొస్తా. +సెట్టి (ఆగి కందులూ, పెసలూ కొత్త వొచ్చాయ్, పిన్నీ! మొదటి రకం సరుకు. అన్నప్పుడల్లా దొరకవ్. అవొక యిరస, ఇవొక యిరస పంపనా? +భార్య (మూతీ ముక్కూ విరుస్తూ మా కేమీ వొద్దులే. +సెట్టి పోనీ, బెల్లం కావాలా? పాలకొల్లు నుంచి నిన్నే ఒక బుంగ వచ్చింది. తెల్ల బెల్లం; గెడ్డంటి బెల్లం. అయిపోతే,ఇంతలో మళ్ళీ అంత మంచిసరుకు రాదు. ఒక యెత్తెడు తూయించుకోండి.రాయితీ ధర కిస్తా. +భార్య ఎత్తెడూ వద్దు; ఎత్తుబారమూ వద్దు. మరి నే నెళ్లాలి. వణ్ణ మేమైపోయిందో!(వెడుతుంది.) +సెట్టి సర్లేవేఁ బాబాయ్! నే నొస్తా. నా బాకీ నిలపబోకు సుమీ తలవాకిలి దాపుకు చేరేసరికి ఎదురుపడిన షాహుకారును చూచి) కోమటి నెదురొచ్చా నయ్యా, నీకు కోటి లాభాలు. +షాహుకారు ఆఁ! అన్నీ లాభాలుగానే వున్నాయ్! +(షాహుకారు ఒక్కి మనిషి. గట్టిగా గాలి వేస్తే యెగిరిపోయేలా వుంటాడు.కాని, మాట కరకు; చూపు చురుకు, వయస్సు నలభైలోపు; యాభై అన్నట్టు కనబడతాడు. +సెట్టి నీకేం తక్కువయ్యా? ఊరు మొత్తం మీద పెద్ద షాహుకారువు. ఇంట్లో లచ్మి మూల్గుతున్నది రైతుతో) నేను బక్కవాణ్ణి. మర్చిపోబాకు-బాబాయ్-నా మాట వెళ్ళిపోతాడు.) +రైతు (మంచంపై నుంచి లేస్తూ రావయ్యా, రా! కూర్చో. +రైతు (మంచం చూపుతూ రాక రాక, దారి తప్పి మా యింటి కొచ్చావ్. కూర్చో. షాహుకారు (నిలుచుండే రాక తప్పుతుందీ? కాలం మారి పోయింది. కూర్చుంటే లేవలేని వాడికైనా కాళ్లొచ్చాయి. +రైతు ఎందుకయ్యా అంత కాక పడుతున్నావ్? +షాహుకారు ఒకసారి వచ్చి కనబడి పొమ్���ని కబురు చేస్తే నిన్నొచ్చావ్ +రైతు వచ్చేవాళ్లే. కాని, మునసబు తొంద రొక టొచ్చిపడింది. కిస్తీ కట్టలేదని థోమ్ ధూమ్ చేస్తున్నాడు. అదేదో సర్దుబాటు చేసుకుని ఇవ్వా లొద్దా మనుకున్నా. +షాహుకారు నీకు మంచి వచ్చినా, చెడ్డ వచ్చినా సర్దుబాటు కోసం నా వద్దకే వచ్చేవాడివిగా! ఈసా రెందుకు రాలేదు? మూడేళ్లనాడు నీ కూతురు పెళ్లికి అయిదువందలు కావాలంటే నే నడ్డం వెయ్యాలా? బండి మూల పడిందనీ, మరమ్మతులు చేయించుకోవాలనీ అఘోరిస్తే యాభయ్యో, అరవయ్యో తిరిగి నిరుడు భరోసాగా నే నివ్వలా? వందలకు వందలే సర్దినవాణ్ణి నువ్వు కిస్తీ కట్టుకోడానికి పాతికో పరకో సర్దలేక పోయానూ? +రైతు అమాసనాడు అట్టు పెట్టానని, పౌర్ణానికి బూరి పెట్టానని ఎందుకయ్యా ఇప్పు డీ దెప్పుళ్ళన్నీ? అప్పు సప్పూ కావాలంటే నువ్వు ఆదుకున్న మాట నేను కాదన్నానా? +షాహుకారు కాదనాలన్నా నోటూ పత్రాలూ వున్నాయిగా! ఎలా కాదంటావులే! కాని, నీకు అప్పూ సప్పు అవసరమైతే నేను కావాలి; గింజా గిట్రా అమ్ముకోవాలంటే కమిషన్ దారు కావాలి. నిన్న వాడికి బేర మిచ్చేశావటగా! +రైతు ఇంతకు ముందే మాటిచ్చాను. నాలు గైదేళ్లుగా వాడే కొంటున్నాడు. ఆనువాయితీ ఎందుకు తప్పించాలని మళ్లీ వాడికే బేర మిచ్చా. +షాహుకారు నేను కబురంపితే, నన్ను కాదని వాడికే బేరమివ్వడానికి నీకు ఆనువాయితీ అడ్డం వొచ్చిందన్న మాట! +రైతు నన్నేమి చావమంటా వయ్యా? నువ్వు అయిదణాలకే అడిగా వయ్యె! చూస్తూ, చూస్తూ అంత తక్కువకు ఎలా వొదిలిపెట్ట మంటావ్? నువ్వే చెప్పు! +రైతు నిన్నైనా కమిషనుదారు అర్ధణా తక్కువ ఏడణాలదాకా తూగాడు. +షాహుకారు తూగుతాడు; తూగుతాడు. తూలి పడేదాకా తూగుతూనే వుంటాడు. మిడిసిపడ్డవాళ్లని చాలామందిని చూశాలే. నాపై పోటీ కొచ్చి నాకు రావలసిన బేరం వీడు పడగొడతాడూ? +రైతు ఆఁ! నే నిచ్చిందీ ఒక బేరమేనా? పెద్ద బేరమైతే పుచ్చుకున్నా పుచ్చుకున్న అందం. +షాహుకారు పెద్దదో, చిన్నదో బేర మన్నాక బేరమే. ఇవ్వాళేంతదాకా ధర పెట్టా డేమిటి? +షాహుకారు అలాగేఁ! అయితే, వాడు బస్తాకి 170 పౌనులు ఖచ్చితంగా తూసుకుంటాడు. ముక్కానీ, అణా పెచ్చిస్తున్నాడని నువ్వు ఎగిరి గంతేశావే కాని, నాలుగు పౌనులు ఎక్కువ తూసుకుంటాడని పారజూసుకున్నావ్? +రైతు ఏమో, ఆ మాయ మర్మాలన్నీ నా కేం తెలుసు? +షాహుకారు అయితే, నే నిప్పుడు తెలియ జెబుతున్నాగా. బేరం వదులుకున్నా నని వాడికి చెప్పెయ్. +రైతు ఉహుఁ! వీల్లేదులే. చెయ్యి దా���ి పోయింది. ఇంతకు ముందే వాడి దగ్గిర యిరవై రూపాయలు బయానా కూడా పుచ్చుకున్నా. +షాహుకారు (జేబులోకి చెయ్యి పోనిచ్చి డబ్బు తీస్తూ ఇదుగో! ఇరవై కాదు; నూట యిరవై బయానాగా నే నిస్తున్నా. వాడిచ్చింది వాడికి వాపసు చేశెయ్! +రైతు మాటిచ్చాక, అంత తఫావత్తా? ఊళ్లో వాళ్లందరూ ముఖాన ఉమ్మెయ్యరూ? +షాహుకారు అయితే, వాడి కిచ్చిన బేరం వదులుకోవన్న మాట? +షాహుకారు నీకే యింత పట్టుదల వుంటే నాకేనా లేంది? నువ్వూ, వాడూ కట్ట గట్టుకుని ఏ గంగలో కలిస్తే నాకు దేనికి కాని, నా నోటు బాకీ నాకు పూర్తిగా తీర్మానం చేసెయ్. +భార్య (పడమటింటిలో నుంచి వస్తూ షాహుకారుతో ఏ మన్నయ్యా! అంత కోపం చేసుకుంటున్నావ్? +షాహుకారు కోపం లేదు; తాపం లేదు! నా కిప్పుడు పైకం అవసరంగా కావాలి. +రైతు అంతా ఒబ్బు దఫాగా తెమ్మంటే, నే నెక్కడ తెస్తానయ్యా? +షాహుకారు ఏఁ? మీ కమీష రున్నాడుగా? +భార్య ఈ తడవకి అయిందేదో అయిపోయిందిలే. అన్నయ్యా! పైపంట నీకే తోల్తాంలే. +షాహుకారు నా కేమీ తోలొద్దులే. నా బాకీ అసలు ఫాయిదాలు నాకు పారెయ్యండి +భార్య మరీ అంత నిక్కచ్చి చేస్తావేమిటేఁ, అన్నయ్యా +షాహుకారు మీరు చెయ్యలా నిక్కచ్చి బేరం +రైతు అయితే, నువ్వు ముందే అచ్చుకో లేదటయ్యా అప్పు వాయిదాల మీద తీర్చుకోవచ్చని +భార్య నిరుడు, ముందటేడు గింజలమ్ముకోగానే, అత్తార బత్తంగా నీకు డబ్బు తెచ్చివ్వలేదటేఁ అన్నయ్యా? మిగతాది కూడా నింపాదిగా తీర్చుకుంటాం! ఈ భాగ్యానికి మేము ఊరొదిలి పెట్టి పారిపోతామటే? +షాహుకారు(కాకగా ఈ వాయిదాలు, గీయిదాలు నా కిఖ పనికిరావ్. నన్ను మీరు ఖాతరు చెయ్యనప్పుడు, నాకు మీ లావేమిటి? +రైతు ఏఁ? ఏ యేటి వడ్డీ యేడే కచ్చితంగా పుచ్చుకుంటున్నా నొప్పేనా? +షాహుకారు నీ వడ్డీ డబ్బుల కెవ్వడూ వాసిలేడు. రే పీపాటికి దస్తు తెస్తేనే తెచ్చావ్. లేకపోతే దావా పడేస్తా. తర్వాత నీ యిష్టం. +రైతు కోర్టు కెక్కించాలని అంత ముచ్చటగా వుంటే యెక్కించవయ్యా! +షాహుకారు ఒక్క కోర్టుకాదు; ఏటి కేడు పధ్నాలుగు కోర్టులూ తిప్పి, నీ అంతు కనుక్కోక పోతానూ? నీకు ఏ కమిషన్ దారు అడ్డుపడతాడో అదీ చూస్తాగా! +(విసురుగా వెళ్ళిపోతాడు. ఒక క్షణంపాటు రైతు, భార్య నిశ్చేష్టులై వుంటారు.) +భార్య ఆరి ఈడి సిరి మండ! ఎట్టాగైతేనేం పెట్టా డప్పు! +రైతు త నడిగినకాడికి గింజలు పారబొయ్యలేదని వీడి కెంత గుర్తొచ్చింది. ఈ రెండు మూడేళ్ళనుంచీ, వీడి కేం పనొచ్చినా మనం హాజరుగా నిలబడ్డామనే యిశ్శో���మైనా వుందేమో చూడు? +భార్య ఆడి దెవసం చేశారులే! మొన్న మాసూలులో పాడి గొడ్డుశుద్దా తోలుకు వెళ్ళి కుప్పలు తొక్కించుకో లేదూ? మాయదారికుమ్ము యిరగడై పోతుంది కాని, ఆడి డబ్బు ఆడి మొఖాన గిరగిర తిప్పికొట్టు. ఇం కెం తివ్వాలి? మా అయితే నూట యాభయ్యేగా +రైతు కాదే! వాడి మడతవడ్డీలతో చేరి, రెండువందలదాకా దేకుతుంది. పంటమ్మిన దంతా వాడి యెదాన పెడితే, మిగతా చిల్లర మల్లర బాకీల మాటేమిటి? +భార్య ఊఁ! అంతగా అయితే, పిల్లదాని చేతిగాజులు కుదవ బెట్టుకుందాంలే. +రైతు దాని కింకొక వస్తువేదైనా యేర్పరచడం లేకపోగా, అవి కూడా కుదవబెట్టుకుని మొండిచేతుల్తో ఎలా నిలుపుతామే? +భార్య:ఆఁ, ఇబ్బం దొచ్చినప్పుడు మరేం చేస్తా వేమిటి? ఇప్పుడు అడ్డం వేసుకుని, అది అత్తారింటి కెళ్ళే నాటికి వొదిలించిద్దాం. +రైతు సరే. ఏదో ఒకదారి చూద్దాంలే. వాడిది తాసుపాము పగ. మొత్తంబాకీ చెల్లుబెట్టకపోతే, వాడు కోర్టు కీడ్వక మానడు. +భార్య అడి యెలుగు మండ! వా డడిగిన కాడికి గింజ లివ్వలేదని షాహుకారుకు పుస్సొచ్చింది. మొత్తం బాకీ యిప్పుడే కక్కమంటున్నాడు. +రైతు రేపీపాటి కివ్వకపోతే దావా పడేస్తాట్ట. +భార్య ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాట్ట! కొడుకు. ఎంత హజం! +భార్య నడమంత్రంగా ఈనా డొచ్చాయిలే వీడికి నాలుగు డబ్బులు. చెడి బతకబట్టే కిందూమీదూ కానడం లేదు. +కొడుకు మరి ఇప్పుడేం చేస్తావే. అయ్యా? +రైతు తల తాకట్టు పెట్టయినా వాడి బాకీ తీర్మానం చెయ్యాల్సిందేరా. కసి పట్టాడు. వాడిఖ నిలవడు. +కొడుకు పీడ వొదుల్తుంది. వాడిది వాడికి పారెయ్యవే. మనకి ఎలాగైతే తనే అప్పెట్టాను గదా అని పెద్ద పాలేరులా నన్ను పనిలో నిలబెట్టుకుంటున్నాడు. తనింటి చాయల్లో కనబడితే చాలు బులావ్ అని, ఆ పనీ, ఈ పనీ +పురమాయిస్తున్నాడు. ఊడిగం చెయ్యడానికి వీడు మనకి ఉచ్చితార్ధంగా యిచ్చాడేమిటి? అంతకంత పుచ్చుకోడూ?(ఆవేశంతో మాట్లాడుతుండగా పై పంచె చెంగున కట్టి వున్న మూట జారిపడుతుంది. దానిలోని +కొడుకు కంచర లింగయ్య పొద్దు నొచ్చి, నడివీధిలో డేరావేశాడే, అమ్మా! సీతన్న కొనుక్కుంటూ వుంటే నేనూ మన యెడ్లకని సరదాపడి తెచ్చుకున్నా. సరే ఇప్పు డేం చేస్తాం? వాప సిచ్చేస్తా. +రైతు ఉఁచుకోరా, అబ్బాయ్! ఉఁచుకో! పద్దు రాసుకోమను. పైపంటనాటికి చెల్లిద్దాం. +కొడుకు ఆఁ! వాడికి రొబ్ధం కావాలంటే, అరువిస్తే రెట్టికి రెట్టి కక్కాలట. పైపంటనాటికే కొనుక్కుంటాలే. ���ప్పుడొచ్చిన తొందరేమిటి +కొడుకు ఆఁ! మర్చేపోయా? ఇదిగో రసీదు. +కొడుకు ఆహాఁ! పట్టాకి రూపాయికాడికి ఈ యేడు జమా బందీ మామూలు వసూలు చేస్తున్నారట! తిన్నకొద్దీ వాళ్ళకు ఆక లెక్కువౌతున్నది! +భార్య తిననీ! ఇంకా తిననీ! ఇలా పీక్కు తిన్నాళ్ళు ముందుకు రారులే! +రైతు (కదలి వెడుతున్న కొడుకుతో ఆ కంచర లింగయ్యకి పైపంటనాటికే యివ్వొచ్చులే. అప్పటికి వా డడిగిందే పారేద్దాం. ఈ భాగ్యానికి మళ్ళీ వాపసు దేనికి? ఎవడు తినవలసింది వాడు తింటాడు. ఇంతతో వాడు బాగుపడతాడా? ఇంత కంటె మనం చెడిపోతామా? +కొడుకు మువ్వలు లేకపోతే, ఇప్పుడు మన కొచ్చిన ముప్పేమిటి? తర్వాతే కొనుక్కుంటా. అప్పుచేసి పప్పుకూడు దేనికి? అప్పు పెట్టిన కాడినుంచీ అడ్డమైన వాడూ అములు చేస్తాడు.(వెళ్ళిపోతాడు.) +భార్య పిచ్చి తండ్రి! మూడేళ్ళ నుంచి మువ్వలు మువ్వలని ముచ్చట పడుతుంటే, ఈనాటికైనా ఒకదారి లేకపాయె! తవ్వుకోవడం, పూడ్చుకోవడం ఇదే సరిపోతున్నది. +రైతు ఆ దేవుడు చల్లగా చూస్తే పై పంటతో మన చిక్కులన్నీ తీరిపోతాయి లేవే! +భార్య దేవుడికేఁ! వాడు చల్లగానే చూస్తున్నాడు. మనుషులే పీక్కు తింటున్నారు! +రైతు ఆఁ! మంచిరోజు ఎప్పటికైనా కనబడక పోతుందటే! అన్నట్టు, అబ్బాయి పుగాకు తేనే లేదు, మర్చిపోయాడుకాబోలు. +భార్య తేకపోతే ఇప్పు డేమీ ముంచుకు పోలేదులే! +రైతు నీదంతా మర్రతనం కాని, నే నడిగేది రోజుకు కానీ, అర్ధణా పుగాకే కాదటే? +భార్య ఆ కానీ, అర్ధణా లేకేగా ఈ తిప్పలన్నీ! ఆ డబ్బులు పెడితే ఇంత కూరో నారో రాదూ? పూట పూటా పచ్చడి మెతుకులు దేనికి? +రైతు సర్లే! చుట్ట కాల్చడం మానేస్తాను. +భార్య మానాలని నీకు లేనప్పుడు నాకోసం మానెయ్యడ మెందుకు? +రైతు అదేమైనాగాని, ఇఖ చుట్ట ముట్టను! +భార్య (చిరునవ్వుతో ఆఁ! ఈ మురిపె మెన్ని రోజులులే! కూడైనా లేకపోతే నువ్వుంటావు గాని, చుట్టముక్క లేకపోతే బతగ్గలవూ? కాల్చులే కాల్చు; కాని, కాస్త తగ్గించి కాల్చు. ఇంటికీ, వొంటికీ మంచిది. +కూతురు(నల్లపూసల గొలుసుతో హుటాహుటిగా ప్రవేశిస్తూ చూడవేఁ! అయ్యా! ఎంత నదరుగా వుందో! +రైతు (నీరసంగా ఔ నమ్మా! బాగానే వుంది. +కూతురు ఈ బిళ్ళ చూడవే! కొట్టిస్తున్నట్టుగా లేదూ? +కూతురు (గొలుసు మెడలో పెట్టుకుంటూ అయ్యా! నా కిది బాగుందా? +కూతురు బాగుండ లేదా యేమిటి గట్టిగా చెప్పడం లేదు +రైతు బాగుండ కే మమ్మా? బాగానే వుంది. +కూతురు (అద్దం తెచ్చుకుని చూచుకుంటూ మరి కాస్త బారుండొద్దూ? లేకపోతే బిగు త���ిపిస్తుందేమో? +భార్య బిగుతూ, వొదులూ ఆ తర్వాత చూచుకోవచ్చులేవే. +కూతురు (తల్లి మాట వినిపించుకోకుండా ఇంకొక అంగుళమైనా వుండాలి. అయితే, అప్పుడు తీగ మరీ పల్చనై పోదూ? మరి పది చిన్నాలైనా పెట్టందే ఈ పాటి మందం రాదు. +భార్య ఓపికుంటే ఎన్ని చిన్నాలైనా పెట్టుకోవచ్చు. +కూతురు అయితే, నాకు తెల్లరాళ్ళొద్దు; ఎర్ర రాళ్ళు కావాలి. +భార్య ఏ రాళ్లకైనా, ఇప్పుడు డబ్బేదమ్మా? +కూతురు ఊఁ! నువ్వు చెప్పొచ్చావ్ లే మాలావ్. నాకు గొలు సొద్దుగాని, నీకు కొత్త కోకలు కావాలేఁ? +భార్య ఈ యేటికి నా కిఖ కొత్త కోకలు కూడానా? జీరలో, బారలో ఆ పాతగుడ్డలే గతి. +రైతు (కూతురుతో ఇంత వెర్రిబాగులదాని వేమమ్మా? నీకు లేకుండా మీ అమ్మ తనకి కావాలంటుందా? నామాట విను. పై పంటనాటికి +కూతురు అయితే, ఇందాక నే నడిగితే +రైతు ఔను! ఈ పంటలోనే చేయిస్తా నన్నాగాని, షాహుకారు తొందరచేస్తున్నాడు వాడి బాకీ నిలపడానికి వీల్లేదు. +భార్య అది తీర్చినా ఇంకా లేవూ తలమోపి డప్పులు? +కూతురు (తండ్రితో అయితే, నాకు ఆశాశ ఎందుకు పెట్టావేమిటి? +రైతు నాకుమాత్ర మేం తెలుసునమ్మా, వాడిప్పుడు గొంతుమీద కూర్చుంటాడని మా తల్లివి కాదూ? నామాట విను! తప్పకుండా పైపంటలో నీకు +భార్య దారి లేనప్పుడు మరి ఆయన మాత్రం ఏం చేస్తాడేఁ? +కూతురు వాళ్ళంద రిప్పుడు నన్ను చూచి నవ్వుతారు. గొలుసు చేయించుకుంటున్నానని సిగ్గుచేటు అందరికీ చెప్పొచ్చా. +రైతు లేదమ్మా! సత్తే ప్రమాణంగా నీకు పైపంటలో +కూతురు అన్నీ చేయిస్తావులే. నిరుడు మానానికి నిరుడిలాగే అనలా?(చేతిలోని అద్దం అక్కడ పారవేసి కోపంగా చర చర పడమటింటిలోకి వెళ్ళిపోతుంది +రైతు పిచ్చిసన్నాసి! గంపెడాస పెట్టుకున్నదేమో చెడ కోపమొచ్చింది. ఏమైనా పై పంటనాటికైనా దానిముద్దు తీర్చాలి. +భార్య (నిట్టూరుస్తూ పైపంట పై పంట పై పంట ఎక్కడి పైపంట? కళ్ళన్నీ దానిమీద పెట్టుకోవడమే కాని, అది నోటిదాకా వొస్తేనా? కాకులు, గద్దలు తన్నుకు పోయినట్టు చేతిలో దాన్ని చేతిలోనుంచే తన్నుకుపోతారయ్యె! పండించేవరకే పంట మనది. +రైతు ఏమైనా, లేదనుకోగూడదే! రోగం రొష్ఠూ లేకుండా రెక్కాడుతూ వుంటే, బండిని ఎట్టాగో దొర్లించుకు పోలేకపోతామూ రైతు ఈ మాటలు అంటుండగా “ఎందుకైనా వుంచి నావూ బందిఖానాలో” అనిపాడుకుంటూ తలవాకిలిలోకి బిచ్చగాడు వస్తాడు +భార్య చెయ్యి ఊరికే లేదు. పో! పో! +రైతు దేహి అంటూ వాకిట్లోకి వచ్చినవాణ్ణి కసిరికొట్టగూడదే! ఏదీ! లే! బ���్ధకించబోకు. నాలుగు గింజ లేసిరా! +భార్య ఆడి కేం తీపరం? మొద్దులా వున్నాడు. కూలీ నాలీ చేసుకో లేడూ? అడుక్కోవడం దేనికి? +రైతు అది వాడి ఖర్మ! దానికి మన మేం చేస్తాం? పిడికెడు బియ్యం పెట్టి పంపించు. +భార్య డబ్బా సోలెడు బేడ కమ్ముతున్నారు. వచ్చినవాడికల్లా పిడికెడుకాడికి పెడితే, రోజుకు మానెడైనా చాలవ్. +రైతు నోటితో లేదనడం దేనికి చేత్తో లేదను. ఈ కాస్తకే మనకు దరిద్రం రాదులే! పొట్టకు తిన్నది మిగలదు; నలుగురికి పెట్టిందే మిగిలేది. నామాట విను, లే బిచ్చగానితో) ఆగవోయ్! ఆగు! వొస్తున్నారు. +(ఒక మూలుగు మూలిగి భార్య లేస్తుండగా తెర) +పాత్రలు: లక్ష్మయ్య పల్లెటూరి రైతు, మాణిక్యమ్మ: అతని భార్య,కృష్ణమూర్తి అతని కుమారుడు,కమల అతని కుమార్తె, డాక్టర్, బండివాడు. +లక్ష్మయ్య ఇంటి చావిడి. కుడివైపున సింహద్వారం; ఎడమవైపున పెరటి గుమ్మం. ఎదుటి గోడ నడుమ ఒక అలమర. దాని కుడిపక్క పడమటింటి గుమ్మం; ఎడమపక్క పడకగది గుమ్మం గోడలకు శ్రీరాముడు, గోపాలకృష్ణుడు, తిరుపతి వెంకటేశ్వర్లు, లంకాదహనం మొదలైన పటాలు. పటంపైన దాని మేకుకే తగిలించి ఒక విసనకర్ర వేలాడుతూ వుంటుంది. చావడిలో ఒక మూల గడమంచి; దానిమీద తవుడు, ఉలవల బస్తాలు. +తెర లేచేసరికి లక్ష్మయ్య చావడిమధ్య కూర్చుని వుంటాడు. అతని వయస్సు నలభై అయిదు పైన, యాభైలోపు. అయిదుంబావు అడుగుల మించని యెత్తు. స్థూలకాయుడు కాదుగాని, పొట్టినిబట్టి +గుమ్మటంలా కనబడతాడు. చిన్న బొర్ర. జులపాల జుట్టు, వెనుకముడి. క్షురకర్మకు శుభముహూర్తం ఒక పట్టాన కుదరదు గనుక, సామాన్యంగా మాసిన గడ్డంతోనే వుంటాడు. నీర్కావి ధోవతి కట్టి, భుజం పైన తడి అంగవస్త్రం వేసుకుని వుంటాడు. +తెర లేచేసరికి అతడు పంగనామాలు పెట్టుకోవడం పూర్తిచేస్తూ వుంటాడు. అతని ముందు బొట్టు పెట్టె; నీళ్ళచెంబు. బొట్టు పెట్టె చుట్టూ అద్దం, నాముకట్టి, తిరుచూర్ణం కాయ, బొట్టుకణిక వగైరా. +లక్ష్మయ్య (కళ్లుమూసుకుని, చేతులు జోడించి పరమాత్మా! పరమపావనా! పరమకల్యాణ గుణాభరణా! పాపహరణా! పుండరీకవరదా! భక్తవత్సలా! భవబంధవిమోచనా! పుండరీకనయనా! భుజగేంద్రశయనా! కరుణాకరా! కామితార్థప్రదా! నందకుమారా! నవనీతచోరా! ఇందిరారమణా! ఇభరాజగమనా! సుందరాకారా! మందరోద్గారా! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా! ఆదిమధ్యాంత రహితా! అప్రమేయా! ఆనందరూపా! అనాధరక్షకా! కవిలోకరంజనా! కాళింగగర్వభంజనా! సదానందా! సచ్చిదానందా! ముకుందా! గోవిందా! గజరాజవరదా! గరుడధ్వజా! దానవమర్ధనా! జనార్ధనా! ధర్మవర్ధనా! దీనజనశరణ్యా! +(మాణిక్యమ్మ గది గుమ్మంలోకి వస్తుంది.ఆమె వయస్సు నలభై ప్రాంతాల, అచ్చమైన, పల్లెటూరు ఇల్లాలు, కష్టమొచ్చినా, సుఖమొచ్చినా పట్టలేదు. +మాణిక్యమ్మ (గది గుమ్మంలో నుంచి ఇంకా మీ జపతపాలు కానే లేదండీ? +లక్ష్మయ్య (వినిపించుకోకుండా గోవర్ధనోద్ధరణా! గోపికా వస్త్రాపహరణా! మునిజనవందితా! +ముచికుందవందితా! ముక్తి ప్రదాయకా! మురళీగానవినోదా! కనకమయవసనా! కంసవిధ్వంసనా! రాధామనోహరా! రాకేందువదనా! నీలమేఘశ్యామా! నిర్మలనామా! +మాణిక్యమ్మ (గదిగుమ్మంలో నుంచే మీకు పున్నెం వుంటుంది! ఇవ్వాళైనా కాస్త తొరగా తెములుద్దురూ! +లక్ష్మయ్య (బిగ్గరగా సర్వేశ్వరా! సర్వతోముఖా! సర్వలోక పూజితా! సత్యసంకల్పా! సత్యపరాయణా! +సత్యజనకా! సత్యనిలయా! సత్యాశ్రయా! సత్యనేత్రా! సత్యసంధా! సుజనప్రియా! శాంతస్వభావా! +మాణిక్యమ్మ (గుమ్మం దాటివచ్చి ఏమండీ! మిమ్మల్నే! +లక్ష్మయ్య మరింత బిగ్గరగా) అర్జునసఖా! అభిమానరహితా! పాండవపక్షా! ద్రౌపదీ మానసంరక్షకా! దేవకీనందనా! యశోదానందవర్ధనా! అనంతా! అచ్యుతా! అవాజ్మానసగోచరా! అమోఘశాసనా! నరకాంతకా! +మాణిక్యమ్మ (రెండడుగులు ముందుకువచ్చి అబ్బబ్బ! ఇక్కడ దీని ప్రాణంమీది కొస్తున్నా. మీ గోడు మీదే గదా! +లక్ష్మయ్య (కోపం సూచిస్తూ పరమేశ్వరా! నిర్గుణా! నిష్కళంకా! నిరుపద్రవా! నిరంజనా! నిరింద్రియా! నిర్వికల్పా! నిరాకారా! నిర్వికారా! పరమపురుషా! +మాణిక్యమ్మ (మరింత దగ్గరికి వచ్చి మీకు చెముడేమైనా వొచ్చిందా? +లక్ష్మయ్య (పొలికేకలు వేస్తున్నట్టు పరంజ్యోతి స్వరూపా! పరంధామా! పురుషోత్తమా! పుణ్యస్వరూపా పుణ్యనిలయా! పుణ్యభావనా! దేవదేవోత్తమా! దేవతాసార్వభౌమా! +లక్ష్మయ్య స్వయంప్రకాశా! పరతత్వదీపా! పరిపూర్ణా! జ్ఞానప్రదా! యోగీశ్వరేశ్వరా! కుచేలవరదా! గుప్తవర్తనా! విశ్వనేత్రా! విమల చరిత్రా! హరేకృష్ణ! హరేకృష్ణ! పాహిమాం! పాహిమాం! పాహి ముమ్మారు నమస్కరించిన మీదట కళ్లు తెరచి) ఎందుకలా గొడ్డులా అరుస్తున్నావ్ +మాణిక్యమ్మ గొడ్డులా అరిస్తేనే? కాకిలా గోలపెడితేనే? మీ తంతు మీరు మానారు గనుకనా? ఇలా ఒకసారొచ్చి అమ్మాయిని చూడండి. మరీ హైరాన పడుతున్నది. +లక్ష్మయ్య ఇవ్వాళ అమావాస్యకదూ! మరెలా వుంటుంది? శేషాచార్యులుగారిచ్చిన మాత్రవెయ్యలా? +మాణిక్యమ్మ ఏం మాత్రో నా పిండాకూడు! అదేసిన కాడినుంచీ ఎగశాస ఎక్కువైంది. కా సెళ్ళి, డాక్టర్ గార్ని ���ిల్చుకొద్దురూ? +లక్ష్మయ్య నడమంత్రంగా వెలిశాడులే. మనకొక డాక్టరు! మామానాడు ఈ డాక్టర్లే వైద్యాలు చేశారేమిటి? +మాణిక్యమ్మ ఎడ్డెమంటే తెడ్డెం. మనకి మొదట్నుంచీ వున్నదేగా ఇవ్వాళ్ళ కొత్తేమిటి? +లక్ష్మయ్య చాల్లే! ఇఖ కట్టి పెట్టు. డాక్టరట డాక్టరు! ఆ బొడ్డూడని వాడికి తూర్పు పడమరలైనా తిన్నగా తెలుసా? సూటూ బూటూ వేసుకుని, మెడలో ఇంత బారు గొట్ట మొకటి తగిలించుకుని, బొట్లరు ముక్కలు నాలుగు మాట్లాడే సరికే పెద్ద వైద్యుడై పోతాడూ? దాని కెంత శాస్త్రం తెలియాలి! ఎంత అనుభవం వుండాలి! బుద్ధిలేని వాళ్ళందరు “డాక్టరు, డాక్ట”రంటూ వాడికోసం యెగబడు తున్నారని నే నెగబడతానా? +మాణిక్యమ్మ అంతే లెండి! ఎప్పుడు మీరు నామాట సాగనిచ్చారు కాబట్టి, ఇప్పుడు సాగనిస్తారు? అబ్బా యొస్తే నాడైనా +లక్ష్మయ్య అద్దాన్ని అంగవస్త్రంతో తుడిచి, బొట్టు పెట్టెలో పెడుతూ వాడొచ్చి రోగాన్ని గిల్లేస్తా డేమిటి? ఎవరొచ్చినా చేసే దేమీ లేదు. ఎవరి ప్రారబ్దాన్ని ఎవరు తప్పిస్తారు? +మాణిక్యమ్మ ఎప్పటి కప్పుడు ఈ మెట్ట యేదాంతమే నా కొంప తీస్తున్నది. ఈవిసురుగా గదిలోకి వెడుతుంది. +లక్ష్మయ్య (వెనకనుంచి చాల్లే నోరు ముయ్ బొట్టు పెట్టె సర్దడం పూర్తి చేసి) కమలం క్షణం ఆగి బిగ్గరగా) కమలం ఇంకొక క్షణం ఆగి, మరింత బిగ్గరగా) కమలం!! +మాణిక్యమ్మ (గది గుమ్మంలోకి వచ్చి దేని కండీ అలా కేకలు? అది పెరట్లోకి వెళ్ళింది కామాలు! ఏం కావాలి? +మాణిక్యమ్మ మీకు పున్నెం వుంటుంది! కేకలూ, బొబ్బలూ సాలించండి. ఇక్కడిది తుళ్ళి పడుతున్నది. +(మాణిక్యమ్మ గదిలోకి వెడుతుంది. లక్ష్మయ్య బొట్టు పెట్టె అలమరలో పెట్టి వెనక్కు తిరుగుతూవుండగా కృష్ణమూర్తి వస్తాడు. వయస్సు 25 సంవత్సరాలు. ఆకారంలో తండ్రిని, స్వభావంలో తల్లిని పోలినవాడు. బి.ఏ. ప్యాసై బస్తీలో వుద్యోగం చేస్తున్నాడు. సైను పంచె; కాలరు షర్టు, డబుల్ బ్రెస్ట్ కోటు. +కృష్ణమూర్తి నాన్నా! అమ్మాయి కెలా వుంది? +లక్ష్మయ్య అమావాస్య కదూ? కొంచెం బరువుగానే వుంది. +లక్ష్మయ్య చూస్తూ చూస్తూ అమావాస్యపూ టొచ్చా వేమిరా? రేపో, మాపో రాకపోయావా? +కృష్ణమూర్తి అమ్మాయి కెలా వుంది, నాన్నా? +మాణిక్యమ్మ (గదిలోనుంచి హుటా హుటిగా వచ్చి ఏం చెప్పను రా బాబూ! దాని మాట? మంటల జొరం, మూసిన కన్ను తెరవడం లేదు. ఏమి నొప్పో, ఎక్కడ నొప్పో?“ఆఁ! ఆ!” అన్న నోటికి యిసుగే లేదు. యమ తెర +కృష్ణమూర్తి (తన సూట్ కేస్, హోల్డాల్ లోపలికి ���ెచ్చి పెట్టిన బండివానికి బాడుగ యిచ్చి పంపివేస్తూ మరి డాక్టరుగా రేమన్నారు? +కృష్ణమూర్తి లక్షణంగానే వుంది. అయితే వైద్య మెవరు? +లక్ష్మయ్య శేషాచార్యులుగారు మందు వాడుతున్నారు. ఆయన హస్తవాసి మంచిది. +కృష్ణమూర్తి వాకిట్లో డాక్టరుంటే ఈ కూరగాయ వైద్యాలు దేనికి?(తల్లితో) జానకి ఎక్క డమ్మా? +మాణిక్యమ్మ ఇదిగో రా, బాబూ! ఈ గదిలో,(మాణిక్యమ్మ గదిలోకి దారి తీస్తుంది. కృష్ణమూర్తి అనుసరిస్తాడు. బొట్టు పెట్టుకోడానికి తానుప యోగించిన నీళ్ళ చెంబును లక్ష్మయ్య అందుకోబోతూ వుండగా కమల ప్రవేశిస్తుంది +ఆ పిల్ల చురుకైనది. ప్రతి విషయాన్నీ ఇట్టే ఆకళింపు చేసుకోగలదు. కాని, తేలికగా బయట పడదు. అన్న అంటేనూ, అక్క అంటేనూ చాలా ప్రేమ. బాల్యం పూర్తిగా వెళ్ళని, యవ్వనం పూర్తిగారాని వయస్సు. తనకంటే పెద్దవారితో ఎక్కువ చనువుగానూ వుండలేదు; పూర్తిగా వైదొలగీ వుండలేదు. +లక్ష్మయ్య మరేమీ లేదులే అన్నయ్య వొచ్చాడమ్మా! +లక్ష్మయ్య రానూపోనూ రైలు ఖర్చులు దండగ. మీ వదినకూడా ఎందు కిప్పుడు? +కమల:వదిన్ని చూచి చాలారోజులైంది.వెంటపెట్టుకొస్తాడేమో ననుకున్నా. పోనీ, బేబీనైనా తీసుకొచ్చాడా? +లక్ష్మయ్య ఆఁ! వాళ్ళమ్మని వొదలి పెట్టి అది వుంటుందా, పెడుతుందా? సరే గాని, కాస్త ఈ బొట్టునీళ్ళు తులిసికోటలో పోసిరా చెంబు అందిస్తాడు. దాన్ని అందుకొని కమల వెడుతుంది +కృష్ణమూర్తి (ముఖం చిట్లిస్తూ చావిడిలోకి వచ్చి అదేమిటమ్మా ఆ గది అంత చెడ్డకంపు కొడుతున్నది! +మాణిక్యమ్మ (వెనకనే వొస్తూ అక్కడికీ ముప్పొద్దులా సాంబ్రాడిపొ గేస్తూనే వున్నారా, బాబూ! +కృష్ణమూర్తి దాన్ని చీకటి కొట్టులా చెయ్యకపోతే. కాస్త గాలీ వెలుతురూ రానివ్వరాదటమ్మా? +మాణిక్యమ్మ మంటల జొరంతో వున్నదానికి చల్లటి గాలి తగిలే శీతలం కమ్ముకు రాదట్రా! +కృష్ణమూర్తి నీకు తెలియదులే అమ్మా! మంచి వాళ్ళకైనా ఆ గబ్బుకు తప్పకుండా జబ్బు చేస్తుంది. అమ్మాయి పడక పెట్టి ఎన్ని రోజులైంది? +(అన్నయ్యను చూచి పలకరించాలనే ఆపేక్షతో కమల వచ్చి పడమటింటి గుమ్మంలో నిలబడుతుంది. +మాణిక్యమ్మ రేపటికి సరిగా వారం, మూసిన కన్ను తెరవకుండా పడున్న నా తల్లిని నాల్గురోజులనాడు జల్లబండెక్కించి, మీ బావ తగిలేశాడురా, బాబూ! +లక్ష్మయ్య వాడినని లాభమేమిటిలే? అది మన ప్రారబ్ధం. +మాణిక్యమ్మ దిక్కూ మొక్కు లేకుండా ఎర్రటి ఎండని పడొచ్చిందేమో, రోగం నెత్తికెక్కి పోయిందిరా, బాబూ! ఇప్పుడు దానికి మన సోరకమే లేదు. మాతల్లి మాలోకంలో వుంది. +లక్ష్మయ్య ఇంతకూ పెద్దమ్మ వచ్చి నెత్తిని కూర్చుంది! +కృష్ణమూర్తి (తల్లితో జానకి పిచ్చిమాట లాడుతున్నది ఎప్పటినుంచి?(తనను అన్నయ్య గమనించకపోవడాన్ని చూచి, ముఖం కొంచెం చిన్నబుచ్చుకుని, కమల లోపలికి వెళ్ళిపోతుంది. +మాణిక్యమ్మ మొన్నటి నుంచీరా, బాబూ! అదేమిటోకాని “నేనీ నింద మొయ్యలే” నంటూ ఒక్కటే పాట. కొట్టుకుని కొట్టుకుని కాసేపు కన్నుమూసినా అదే కలవరింత! ఏమి గాలో దూలోనని అక్కడికీ దిగదుడుపులూ, అవీ తీయిస్తూనే వున్నా. ఏడుకొండల వాడికి ముడుపుకూడా కట్టా. “ఈ గండ మెలాగైనా గడిపి, నా తల్లిని వొడ్డుని పడేశా వంటే నీకొండ కొచ్చి, నిలువు దోపి డిప్పిస్తా వెంకటేశ్వర్లు తండ్రీ!” అని దణ్ణం పెట్టుకున్నా, మరి, ఆ సామి దయ ఎలా వుందో! +కృష్ణమూర్తి ఇంత ఉధృతంగా వుందని ఆ వుత్తరంలో రాస్తే నిన్నే ఆఫీసుకు సెలవు పెట్టి వచ్చేవాణ్ణిగా! +లక్ష్మయ్య నువ్వు ఆదుర్దాపడతావని రాయలేదులే. ఇంతకూ దాని రోజులు బాగా లేవు. ఎంత రాసిపెట్టి వుందో, అంతా అనుభవించి తీరాలి. +మాణిక్యమ్మ డాక్టరుగార్ని పిలుచుకురమ్మని నేను మొన్నటి నుంచీ మొత్తుకుంటూ ఉఁటే మీనాన్న ఈ మెట్టయేదాంతమే +లక్ష్మయ్య అడుగో! ఆ మాట అనొద్దనే నీనోట గడ్డి పెట్టేది. +మాణిక్యమ్మ (కొడుకుతో చూశావా! బాబూ! ఇదీ వరస! నేను అటు దాని బాధ చూడలేక, ఇటు ఈయన కూతలు పడలేక చస్తున్నా నంటే నమ్ము. +కృష్ణమూర్తి సర్లే! అమ్మా! నే వెళ్ళి డాక్టరుగార్ని పిలుచుకొస్తాగాని, నువ్వు ఆ గది కిటికీలు నే రెండూ తెరచి, సాంబ్రాణి పొగ వెయ్యి. +లక్ష్మయ్య శేషాచార్యులుగారు తక్కువవాడట్రా? ఆయన తండ్రి వైద్యుడు; తాత వైద్యుడు; ముత్తాత వైద్యుడు; వాళ్ళది వైద్యులవంశం. వాళ్ళ యింటవున్న లేహ్యాలు, గుళికలు, రసభస్మాదులు సామాన్యమైనవట్రా? ఈ మధ్య నాకు కాళ్ళతీపు పుడితే, ఆయనిచ్చిన కూష్మాండలేహ్యం వెంటనే జవాబిచ్చింది. +కృష్ణమూర్తి ఒకసారి డాక్టరుగార్ని పిలుచుకొచ్చి చూపించడం ఎందుకైనా మంచిది కాదూ, నాన్నా? +లక్షయ్య ఆఁ! మరేమీ లేదట్రా! అసలు దానొ నిక్కాక వొళ్ళు. దానిమీద పైత్యం ప్రకోపించిందట. నాడి నిదానంలో ఆయన చాలా గట్టివాడు. క్షణంలో ఏ జబ్బునైనా ఇట్టే కనిపెడుతాడు. మందు నడిపించడంలో ఆయన్ని మించిన వాడు లేడు. డాక్టరు వచ్చిన కాడినుంచీ సూదులనీ, సీసాలనీ ఎంత తతంగం చేస్తారు! ఎంతడబ్బు గుంజుతారు! పిలుచుకు రాగానే సరేనా? ��ంతకూ రోగమైనా, నొప్పైనా దాని రోజొచ్చినప్పుడు తిరుగుతుంది కాని +మాణిక్యమ్మ నానోట చెప్పించడం దేనికి? మీకు తెలవదూ? +లక్ష్మయ్య అదుగో! ఆ కూత కుయ్యవద్దనే నీకు బుద్ధి చెప్పేది. +మాణిక్యమ్మ చూశా వట్రా! ఇప్పుడు నే నేమన్నానని? సర్లే ఇది నాకు రోజూ వుండే బాగోతమేకాని, నువ్వెళ్ళి డాక్టరుగార్ని పిలుచుకురా! ఇక్కడున్నట్టుగా రావాలి, బాబూ! +లక్ష్మయ్య (గింజుకుంటూ మనం దొరలమా? దొరసానులమా? ఇంగ్లీషు వైద్యాలు మనకు దేనికి? అసలు ఆ పాడుమందులు మనకి పట్టివ్వవు క్షణం ఆగి) ఇంతకూ పిదప కాలం వచ్చి పడింది. మన మందులూ, మన వైద్యాలూ, మన ఆచారాలూ, మన కట్టుబాట్లూ ఏవీ పనికి రావడం లేదు గోడనున్న విసనకర్ర తీసి విసురుకుంటూ) పెద్ద లన్నారుగా “కొత్తొక వింత, పాతొక రోత” అని. మంచీ చెడ్డా లేదు. కొత్త కనబడితే చాలు వేలంవెర్రిగా యెగబడ్డమే! మన మతం, మన ఆచారాలు, మన సంప్రదాయాలు ఇప్పుడు పుట్టాయా భూమి పుట్టినప్పుడే పుట్టాయి కాని! +(లక్ష్మయ్య ఈ మాటలు అంటూవుండగా మాణిక్యమ్మ ముక్కూ మూతీ విరిచి గదిలోకి వెళ్ళి, కిటికీ తలుపులు తెరచి, మళ్ళీ చావడిలోకి వస్తుంది. +లక్ష్మయ్య (ఇంకా గుణుస్తూ అయినా, మనిషికి రాక మానుకొస్తుందా? రాత బాగుండక రోగం రొష్టూ వస్తే పూర్వం రెండు లంఖణాలు కట్టించేవారు. దాంతో ఎంత జబ్బయినా యెగిరిపోయేది. ఇప్పు డేముంది? ముక్కున పడిశం పట్టినా డాక్టర్లు గీక్టర్లు కట్టకట్టుకు రావాల్సిందే! అంత కంత గుంజడానికి వాళ్ళసలు రోగాన్ని యెక్కదోస్తారు. +మాణిక్యమ్మ (పడమటింటి గుమ్మం వద్దకు వెళ్ళి కమలం! కాస్త తేవే (“నీ మెట్టవేదాంతం మండిపోను” అన్నట్టుగా మాణిక్యమ్మ చాటుగా మెటికలు విరుస్తుంది +లక్ష్మయ్య ఆయువు గట్టిదైతే మునిగే తెప్పైనా తేలుంది. మాయలో పడి, మందులనీ, మాకులనీ మన దేవులాటేకాని, లలాట లిఖితం తప్పదు +(విసనకర్ర మళ్ళీ పటంమేకుకు తగిలించి, అలమరలో నుంచి నల్లమందు డబ్బీ తీసి, మాత్ర కట్టుకుంటూ వుంటాడు.) +కమల (గరిటెతో నిప్పు తెచ్చి ఇదుగోనమ్మా! నిప్పు! +మాణిక్యమ్మ ఇలా తే, తల్లీ నిప్పుగరిటె అందుకుని) ఇంకా నీవంట తెమల్లే దమ్మా? +కమల అన్నయ్య కోసమని ఇంకొక కూర చేస్తున్నానమ్మా! +మాణిక్యమ్మ బండెడు చాకిరి పైబడి, ఇప్పటికే హూనం హూనమౌతున్నావ్. నువ్వు చెయ్యలేదని మీ అన్నయ్య అనుకుంటాడా? దేని కమ్మా. ఇప్పుడు కూరలూ నారలూ? +కమల ఆఁ! మరేమీ లేదే! వంకాయవేపుడు వేస్తున్నా. చిటికలో అయిపోతుంది.(మాణిక్యమ��మ గదిలోకి వెడుతుంది +లక్ష్మయ్య(కమలతో):నాకు నల్లమందు వేళ మించిపోతున్నది. రెండు మెతుకులు వడ్డిస్తావమ్మా? +కమల అలాగే, నాన్నా! కాళ్ళు కడుక్కురా!(కమల పడమటింటిలోకి వెడుతుంది.) +లక్ష్మయ్య (నల్లమందు డబ్బీని అలమరలో పెట్టి, కట్టినమాత్ర వేసుకుని హరేకృష్ణ! హరేకృష్ణ! పాహిమాం పాహిమాం పాహి!(పడమటింటిలోకి వెళ్ళబోతాడు.) +మాణిక్యమ్మ గదిలో నుంచి వచ్చి) కాస్త ఆగుదురూ! భోజనానికి అంత తొందరేమిటి తలవాకిలివైపు చూచి) అదుగో! డాక్టరుగా రొస్తున్నారు. +లక్ష్మయ్య ఉహూఁ! తయారవుతున్నాడూ?(గదిలోకి వెడుతుంది. డాక్టరు, కృష్ణమూర్తి గదిలోకి వెడతారు.లక్ష్మయ్య ధుమధుమ లాడుతున్న ముఖంతో చావడిలో పచారు చేస్తుంటాడు.) +కృష్ణ మూర్తి (గదిలోనుంచి తిరిగి వచ్చి, పడమటింటి గుమ్మం వద్దకు వెళ్ళి కమలా! గ్లాసుతో కాసిని నీళ్ళు తీసుకురా క్షణం ఆగి) త్వరగా రా! +కమల (లోపలనుంచి వచ్చే! అన్నయ్యా! వచ్చే! +కృష్ణమూర్తి ఇంకొక క్షణం తర్వాత, కొంచెం విసుగ్గా) త్వరగా తెమ్మని నీక్కాదూ అతని మాట పూర్తికాక ముందే కమల నీళ్ళ గ్లాసుతో వస్తుంది. దాన్ని అందుకుని కృష్ణమూర్తి +గదిలోకి వెడతాడు. కమల గదిగుమ్మం వద్దకు వెళ్ళి, వోరగా నిలబడి లోపలికి చూస్తూ వుంటుంది. +కృష్ణమూర్తి (గదిగుమ్మంలోకి వచ్చి కమలతో డాక్టరుగారు చేతులు కడుక్కోడానికి పెరటిగుమ్మంలో చెంబుతో నీళ్ళూ, సబ్బూ పెట్టు; తువాలుకూడా తే! +(కృష్ణమూర్తి తిరిగి గదిలోకి వెడతాడు. కమల పెరటిగుమ్మంలో నీళ్లు పెట్టి, వెనక్కి వస్తూవుండగా, గదిలో నుంచి డాక్టరు బయటికి వస్తాడు. అతని చూడగానే ఆ పిల్ల చప్పున పడమటింటిలోకి తప్పుకుంటుంది. డాక్టరు వెంటరాగా కృష్ణమూర్తి పెరటిలోకి దారితీస్తాడు. +కమల (పడమటింటి గుమ్మంలోకి వచ్చి అన్నయ్యా! ఇదుగో తువాలు.(కృష్ణమూర్తి దాన్ని అందుకుని, చేతులు కడుక్కుని వస్తున్న డాక్టరుకు అందిస్తాడు.) +డాక్టరు (చేతులు తుడుచుకుని తువాలు తిరిగి యిచ్చివేస్తూ నా బ్యాగ్ గదివైపుకు ఒక అడుగు వేస్తాడు.) +(కృష్ణమూర్తి గదిలోనుంచి లక్ష్మయ్య (డాక్టరు గడప దాటినంతనే రావడమైంది; పోవడమైంది. కాసేపు కూర్చోడం, మంచి చెడ్డా మాట్లాడ్డం ఏమీ లేదు. పలుకే బంగారం! ఈ భాగ్యానికే డాక్టర్లూ గీక్టర్లూ అని పడి ఛస్తారు. +(మెడిసిన్ ఛెస్ట్ తెచ్చి, డాక్టరు ముందు నడవగా ఆయన వెంట వెడతాడు.) +కమల (పడమటింటి గుమ్మంలోనుంచి నాన్నా! మరి, అన్నాని కొస్తావా? +లక్ష్మయ్య వినిప���ంచుకోకుండా) శేషాచార్యులుగారు వస్తే, కష్టసుఖాలు మాట్లాడుతూ పక్కా గంట కూర్చుంటారు. ఆయన మాట, ఆయన మర్యాద, ఆయన మన్నన ఈ రాలుగాయలు వొంటి కాలిమీద తపస్సు చేస్తే మాత్రం +కమల నిన్నే నాన్నా! అన్నం వడ్డించమంటావా? +లక్ష్మయ్య:మించిన వేళ మించనే మించింది-అన్నయ్యని రానీ ఇన్నిసార్లు వడ్డన దేనికి?కలిసే భోంచేస్తాం. +మాణిక్యమ్మ గదిలోనుంచి వచ్చి) ఇంకా వాడి స్తానం పానం కాలేదు. వాడికోసం మీరు కనిపెట్టుకు కూచోడం దేనికి? మీకు పెట్టి, చిన్నమ్మాయి కూడా రెండు మెతుకులు తింటుంది.మిట్టమజ్ఞాన్నం దాకా అది మాడ్డం దేనికి? +కమల అc! నా కేం, తొందర? అన్నయ్యని రానివ్వవే! +మాణిక్యమ్మ మందు తేవాలి కదమ్మా! ఆలిసిమౌతుందేమో? +లక్ష్మయ్య రంగు నీళ్ళే కదూ సీసాలో పోసివ్వడానికి ఏమంత ఆలస్య మౌతుంది? +మాణిక్యమ్మ చాల్లెండి! ఎవరైనా వింటే నవ్విపోతారు. +లక్ష్మయ్య నే నీ యిల్లు కట్టి పాతికేళ్ళయింది. ఎన్నడైనా, ఏ డాక్టరైనా నా గడప తొక్కాడా? ఇవ్వాళ నువ్వూ, నీ కొడుకూ చేరి, వాణ్ణి రప్పించారు. డాక్టరు అడుగు పెట్టిన కొంప ఏది నీ ముందు కొచ్చింది? కదిలితే బిల్లు, మెదిలితే బిల్లు వాడు రేపటినుంచీ యిల్లు గుల్ల చెయ్యడూ? ఏ తృణమో, పణమో, మనకు తోచింది చేతిలో పెట్టినా, శేషాచార్యులుగారైతే కళ్ళ కద్దు కుంటారు. మొన్న నాకు మూడు నెలలు మందిస్తే, నేనే మిచ్చాను? పొలంలో పండిన మినుములు మూడు కుంచాలు కొలిస్తే ఆయన బ్రహ్మానంద పడ్డాడు. ఈ డాక్టరుగాళ్లు బిళ్ళ కుడుముల లాంటి రూపాయలు బల్ల మీద పెడితే తప్ప పలకరు, ఉలకరు. +లక్ష్మయ్య కా నివ్వండి, కా నివ్వండి! చిప్ప పుచ్చుకుని అడుక్కు తిందురు గాని లెండి! చూడగా మీ కది రాసి పెట్టినట్టే వుంది. ఎవరి గీత నెవరు తప్పిస్తారు. +కృష్ణమూర్తి (కోపంగా లక్ష్మయ్యతో ఆఁ! ఏ మంటారు అనునయిస్తూ మాణిక్యమ్మతో) సరిగాని, ఏమిటమ్మా నీ అవతారం! ముందు నువ్వు పడకపెట్టేలా వున్నావ్. వెళ్ళి స్నానమైనా చేసిరా. నే నమ్మాయిని చూస్తూ వుంటా. +మాణిక్యమ్మ ఆఁ! నా కేమి తీపరంలేరా? +కమల నిన్నటినుంచీ అమ్మ నోట్లో పచ్చి నీళ్ళయినా పోసుకోలే దన్నయ్యా! +కృష్ణమూర్తి ఏమిటమ్మా అది! నువ్వు మూలబడితే, ఇఖ జానకి ఆలనా పాలనా ఎవరు కనుక్కుంటారు? +మాణిక్యమ్మ ఏం చెప్పనురా, బాబూ! నా మతి మతిలో లేదు. సరే! ఆ మందిలా తే! తాగిస్తా. మంచి నీళ్ళైనా తిన్నగా గుటక పడ్డం లేదు. ఏం తాగుతుందో! +కృష్ణమూర్తి ఇదుగో నమ్మా! ఈ గీతవరకు గాజు గ్లాసులో పో సివ్వు. ఇవిగో! ఇవి ఆరు పొట్లాలు.అరు కిచ్చిన అర గంట కొక పొట్లం చొప్పున నీళ్ళతో వెయ్యాలి. +(కృష్ణమూర్తి చేతిలోనుంచి మందుసీసాను, పొట్లాలు తీసుకుని మాణిక్యమ్మ గదిలోకి వెడుతుంది. +లక్ష్మయ్య (రెండు మూడుసార్లు పొడిదగ్గు దగ్గి డాక్ట రేమి చెప్పా డేమిరా? +కృష్ణమూర్తి కాస్త నిదానించండి మనవి చేస్తాగా?(ఒక నిమిషం నిశ్శబ్దం.) +లక్ష్మయ్య పొద్దున్నే శేషాచార్యులు గా రొకసారి చెయ్యి చూచి వెళ్ళారు. నాడి కొంచెం దూకుడుగా వుంది కాని, భయ మేమీ లేదన్నారు. ఇవ్వాళ అమావాస్య. దాని విసురు ఇంతో, అంతో కనబడకుండా వుంటుందా?” +అన్నాడు. ఇవ్వాళొక్క రోజూ గడిస్తే రేపటికి జబ్బు తిరుగుముఖం పడుతుందన్నారు. దేనికైనా గ్రహబలం బాగుండాలి +మాణిక్యమ్మ (గదిలోనుంచి వస్తూ మందు తిన్నగా తాగలేదురా. బాబూ! సగానికి సగం కిందే పోయింది. +కృష్ణమూర్తి ఫరవా లేదులే. నువ్వు వెళ్ళమ్మా! వెళ్ళి, స్నానం చేసిరా. +మాణిక్యమ్మ దాన్ని ఒక కంట కనిపెట్టి చూస్తూవుండరా, బాబూ!(పడమటింటి గుమ్మంగుండా లోపలికి వెడుతుంది. +కృష్ణమూర్తి:(బెదరినలేడివలె చూస్తూ నిలుచున్న కమలతో):కమలా! అమ్మకు నీలూ పాలూ చూడరాదూ! +లక్ష్మయ్య ఏ మన్నా రేమిరా డాక్టరుగారు? +లక్ష్మయ్య ఆఁ! అది పైత్య ప్రకోప మటరా కమల వెళ్ళిపోతుంది. +కృష్ణమూర్తి ఏ మన్నారా? రోగం ముదిరి పోయిందన్నారు! మరి ఏ క్షణానికేమి జరుగుతుందో చెప్పలే మన్నారు! +లక్ష్మయ్య ఆఁ! డబ్బు గుంజడానికి వాళ్ళు అలాగే అంటారులే! +కృష్ణమూర్తి పాడు డబ్బు ముఖం చూచుకునే దాని ప్రాణం మీదికి తెచ్చావ్. +లక్ష్మయ్య డబ్బు డబ్బంటారు డబ్బు విరజిమ్మితే పోయే ప్రాణాలు నిలుస్తాయటరా? మొన్న మన చంద్రయ్య పెళ్ళాన్ని పట్నం దాకా తీసు కెళ్ళి అయిదారు వందలు వ్యయం చేశాడు. మరి అది బతకలేదే? కాలం,ఖర్మం కలిసొస్తే డాక్టర్లు ఆపగలరా? సర్లే ఇంతకూ జబ్బేమి టంటాడు? +కృష్ణమూర్తి (బరువుగా అది టైఫాయిడ్ జ్వరమట. డబుల్ నిమోనియాతో ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయట. ముందే ఆయన్ని పిలుచు కొస్తే, ఇంత ముంచు కొచ్చేది కాదు. నువ్వే చేతులారా దాని బ్రతుకు బుగ్గిచేశావ్! +లక్ష్మయ్య ఆఁ! ఒకరు చేసిందే ముంది? ఎవరి కెలా రాసి పెట్టివుంటే అలాగే జరుగుతుంది. +కృష్ణమూర్తి చాల్ చాలు! ఈ వెర్రి మొర్రి వేదాంతంతోనే జానకి గొంతుకోశావ్! దాని వొళ్ళంతా పుచ్చిపోయింది. ఎందుకో తెలుసా? +లక్ష్మయ్య అయితే, అది ఏమి టంటావ్? +లక్ష్మయ్య చిన్నతనంలో అల���లరి చిల్లరగా తిరిగిన వాళ్ళయినా, ఒక ఇంటివాళ్ళయినాక లక్షణంగా బ్రతకరట్రా? నారాయణ రావైనా అంతే ననుకున్నా. అయినా, మన చేతిలో ఏమున్నది? అదంతా పూర్వజన్మ కర్మానుభవం. +కృష్ణమూర్తి మన చేతులతో మనం గొంతు కొయ్యడం; అది వాళ్ళ పూర్వజన్మ కర్మానుభవ మనడం. ఎంత చక్కని సూత్రం కని పెట్టారు! వాడు చదువు సంధ్యలు లేనివాడని నీకు తెలుసు. గుణం లేనివాడని నీకు తెలుసు. అయినా, వాడి ఆస్తిని చూచి, వాడికి పిల్లనిచ్చి కడితే, ఆ తప్పు నీది కాదూ? +లక్ష్మయ్య ఆఁ! ఎవరి గీతలో ఎలా వుంటే అలా జరుగుతుంది. మనం కేవలం నిమిత్త మాత్రులం. +కృష్ణమూర్తి చేతులారా చేసిన పనికి చింతించేది పోయి, “దాని గీత”, “దాని ఖర్మ” అనడానికి నీకు నో రెలా వొస్తున్నది,నాన్నా? వివాహ మనుకున్న తర్వాత జానకి ముఖంలో ఎన్నడైనా కళా కాంతీ చూశావా? ఈ అయిదారేళ్ళ నుంచీ అది చేసింది సంసారమా? నరకంలో నివాసం కదూ? +లక్ష్మయ్య ఆఁ! కలిగినవాడి కిస్తే, సుఖ పడుతుం దనుకొన్నా గాని, ఇలా జరుగుతుందని నే నేమైనా కల గన్నానా? ఇంతకూ అది తిన బుట్ట లేదు. +కృష్ణమూర్తి సుఖ పెట్టగోరిన వాడివైతే దాన్ని వాడి కిచ్చి కట్టే వాడివా? పోనీ, కట్టింతర్వాత, వాడి కట్న మేదో వాడికి పారెయ్యక, లేనిపోని పేచీలకు దిగేవాడివా? వాడు మన జానకిని మరింత వేపుకు తినడానికి, “ఇంకొక పెళ్లి చేసుకుంటా!” నంటూ దాన్ని రాచి రంపాన పెట్టడానికి నువ్వే కారణం కాదూ? +లక్ష్మయ్య అంతా బ్రహ్మలిఖితం కాని, అదంటే నాకు పగటరా? +కృష్ణమూర్తి ఆఁ! నేను వాడి మాట మర్చేపోయా! మన పాపాలన్నీ అంటగట్టడానికి వాడొక డున్నాడు! మంచి జరిగితే అది మన ప్రజ్ఞ; చెడు జరిగితే అది బ్రహ్మరాత. +మాణిక్యమ్మ (జుట్టు వేలుముడి వేసుకుంటూ, చావడిలోకి తిరిగివచ్చి బాబూ! అమ్మాయి కెలా వుందిరా? +కృష్ణమూర్తి కొంచెం తగ్గే వున్నట్టున్న దమ్మా? +మాణిక్యమ్మ నువ్వెళ్ళి స్తానం చెయ్యి, బాబూ! నేను దాన్ని చూస్తూవుంటా! +కృష్ణమూర్తి చేస్తాలే, అమ్మా! అంత తొంద రేమిటి +మాణిక్యమ్మ పొద్దెక్కి పోలేదట్రా! నీ కోసం మీ నాన్నా, కమలమూ కనిపెట్టుకు కూర్చున్నారు. కృష్ణమూర్తి నా కోసం కనిపెట్టుకు కూర్చోవడం దేనికి? ముందు నీ భోజనం కానివ్వు, నాన్నా! నేను తర్వాత చేస్తాలే. +మాణిక్యమ్మ దూరాబారం పయానం! నిన్నెప్పుడు బోంచేశావో, ఏమో? స్తానం చేసి, కాస్తా ఎంగిలి పడరా, బాబూ! +మాణిక్యమ్మ ప్రాణం కడబడుతుందేమోరా, బాబూ!(ఈమాట అంటూ గదిలోకి వెడుతుంది. +లక్ష్మయ్య (���ర నిమిషం తర్వాత, ముందు పొడిదగ్గు దగ్గి ఏమోరా? డాక్టరు మా టంటే, నా కేమంత నమ్మకం +కృష్ణమూర్తి నీ కొక నమస్కారం. ఆ ప్రస్తావన తేవొద్దు. అమ్మ వింటే ఆవిడ గుండె బేజారౌతుంది. +లక్ష్మయ్య సర్లే! కానున్నది కాకమానదు కళ్ళు మూసుకుని) హరేకృష్ణ! హరేకృష్ణ!పాహిమాం! పాహిమాం! పాహి +కమల ఆలస్య మున్నదంటే, పోనీ వేన్నీళ్ళు పెడతా నన్నయ్యా! +కృష్ణమూర్తి ఎందుకమ్మా? ఈ యెండలో వేన్నీళ్ళు? +కమల వేన్నీళ్ళ స్నానం చేస్తే, ప్రయాణం బడలిక తీరుతుందన్నయ్యా! +కృష్ణమూర్తి అబ్బే వద్దు! చన్నీళ్ళే చాలు. +కమల (పడమటింటిలో నుంచి వచ్చి అన్నయ్యా! నీకు నీళ్ళు తోడనా? +కమల అన్నయ్యకు ఆలస్య మున్నదట, పోనీ, నువ్వైనా భోజనానికి రా, నాన్నా! +లక్ష్మయ్య వేళ మించిపోయి, ఆకలి చచ్చిపోయిందమ్మా! ఇఖ ఎప్పుడైతే నేమిటి? నేనూ తర్వాతే భోం చేస్తాలే!(నీరసంగా కమల పడమటింటిలోకి వెళ్ళిపోతుంది. +లక్ష్మయ్య (కృష్ణమూర్తితో ఏదీ ఇలా దగ్గరికి రా కృష్ణమూర్తి దగ్గరికి వస్తాడు ఈ డాక్టర్లని, దీక్టర్లని నమ్మిం దెవరు గాని, ఆ శేషాచార్యులుగార్ని మళ్ళీ ఒకసారి పిలుచుకొచ్చి +కృష్ణమూర్తి చాలు! ఆయ నింతవరకు చేసిన వైద్యం చాలే! +లక్ష్మయ్య అది కాదురా! ఆయన్ని మళ్ళీ సంప్రతిస్తే అయ్యొ! నా తల్లీ!” అని గదిలో మాణిక్యమ్మ రొమ్ము గుద్దుకుంటున్న చప్పుడు.ఏమిటే, అది? +మాణిక్యమ్మ (గదిలోనుంచి వస్తూ అయ్యె నా తల్లీ! అయ్యొ మా అమ్మా! +లక్ష్మయ్య కృష్ణమూర్తి ఒకేసారిగా ఏమే, ఏమిటి? ఏమమ్మా! ఏ మమ్మా!! +మాణిక్యమ్మ (ఈ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా, నెత్తి, నోరూ కొట్టుకుంటూ ఇఖ నే బతికి దేనికి? చచ్చి దేనికి? ఆ పాడుదేవుడు న న్నెత్తుకు పోరాదూ! +(మాణిక్యమ్మ ఇలా విలపిస్తూవుండగా లక్ష్మయ్య, కృష్ణమూర్తి గబగబ గదిలోకి వెడతారు. +మాణిక్యమ్మ అయ్యో! అయ్యొ! నే నేం పాపం చేశాను! నే నేం పాపం చేశాను అయ్యో నా తల్లీ! అయ్యొ మా అమ్మా! +లక్ష్మయ్య (గదిలోనుంచి కోపంగా వచ్చి నీ కేమైనా పోయే కాలం వచ్చిందా? దేనికే అలా యేడుస్తావ్? +మాణిక్యమ్మ మా తల్లి గొంతు నువ్వే కోశావ్. మా అమ్మని నువ్వే గంగలో దించావ్. నీ మెట్ట యేదాంతం మండిపోను! +లక్ష్మయ్య ఛీ! నోరుముయ్! ఎవరి కర్మ కెవరు కర్తలు! +కృష్ణమూర్తి (గదిలోనుంచి వచ్చి ఏమిటమ్మా నీ గోల? మరేమోనని నేను ఖంగారు పడ్డా. +మాణిక్యమ్మ ఏం చెప్పను రా, బాబూ! నా తల్లికి ఎంత కష్టమొచ్చింది! ఎంత కష్ట మొచ్చింది! అయ్యో! అయ్యో!! +మాణిక్యమ్మ ఈ నింద మొయ్యలేను! ఈ ��ింద మొయ్యలేను!!” అంటూ మా అమ్మ ఆవజాన పలవరిస్తూ వుంటే నే నేమిటో ననుకున్నా. ఆ మాట పడ్డాకే అది మంచ మెక్కింది కామోసు! +కృష్ణమూర్తి ఏమిటమ్మా, నీ గొడవ? మాటేమిటి? నిందేమిటి? +మాణిక్యమ్మ నా నోటితో నే నెలా చెప్పనురా, బాబూ? మీ బావ అయ్యో! అయ్యో! దాన్ని పట్టుకుని, నువ్వే అవ్వ! ఎక్కడ సంపాయించావో వాడి దగ్గరికే పో అన్నాట్ట! స్కౌండ్రల్! +కృష్ణమూర్తి, లక్ష్మయ్య ఒకేసారిగా ఆఁ! రాస్కెల్! ఆరి అప్రాచ్యుడా! +కృష్ణమూర్తి (పళ్ళు నూరుతూ ఆ వెధవని నిలువునా చీల్చాలి. +లక్ష్మయ్య (ముక్కుపై వేలు వేసుకుని ఔరా! ఎంత పాపాని కొడిగట్టాడు వెంటనే తిరిగి తన మెట్ట వేదాంతం ధోరణిలోకి మారిపోయి) సరే, వాడి పాపాన వాడే పోతాడులే! +కృష్ణమూర్తి (వెటకారంగా వాడి పాపాన వాడే పోతాడూ? +లక్ష్మయ్య అంతే మరి! పాపం చేసినవాడు ఈ జన్మలో కాకపోతే, మరో జన్మలోనైనా అంత కంత అనుభవిస్తాడు. +కృష్ణమూర్తి ఇంకో జన్మ! ఎవరు చూచొచ్చారు? +లక్ష్మయ్య ఇవి పెద్ద విషయాలు నీ కీ ధర్మసూక్ష్మాలు తెలియవు లేరా! కర్మనుబట్టే జన్మ వుంటుంది. పూర్వజన్మలో చేసిన కర్మను బట్టి ఈ జన్మ. ఈ జన్మలో +మాణిక్యమ్మ: నీ మెట్ట యేదాంతం మండిందిలే! అయ్యో! అయ్యో నా తల్లి నెంత మాటన్నాడు. +కృష్ణమూర్తి ఆ వెధవని కంటబడనీ పాతేస్తాను. +మాణిక్యమ్మ వాడొట్టి వెధవే! కాని, మన పిల్ల నిచ్చాక ఏమను కుంటే, ఏం లాభం? మన బిడ్డ ముఖం చూసైనా వాడి కడుపూ కాళ్ళు పట్టుకుని +మాణిక్యమ్మ కాదు, బాబూ! కాదు. నా మాటిను. మనం కోసి వేసుకుందా మనుకున్నా, తెగే సంబంధ మట్రా యిది? వాణ్ణి ఎలాగైనా బతిమలాడి +కృష్ణమూర్తి వాణ్ణా? బ్రతిమలాడ్డమా? ఆ పశువునే? చాల్లే అమ్మా! +మాణిక్యమ్మ వాణ్ణి చూడందే మనపిల్ల మనకి దక్కదురా! నా తల్లి గుండెల్లో పెద్దరాయి పడింది. వాడు రావాలట. దానికంట బడాలట. నీ తప్పేమీ లే దనాలట. నీకు పున్నెముంటుంది వాడి దగ్గరి కెళ్ళి +కృష్ణమూర్తి అదేమైనా సరే నే వెళ్ళను; వెళ్ళను; వెళ్ళను. +లక్ష్మయ్య మన అవసర మది! మనకు తప్పుతుందా? +లక్ష్మయ్య మనం పట్టుకోవడం ఒక లెఖ్కా? ఆనాడు సాక్షాత్తు శ్రీవసుదేవుడే పట్టుకున్నాడు. +కృష్ణమూర్తి అయితే, నే నంతటి మహానుభావుణ్ణి కాను. నాకు చీమూ, నెత్తురూ వుంది; మానాభిమానా లున్నాయి.అన్నయ్యా!”అంటూ పడమటింటినుంచి కమల వస్తుంది. వడిలోవున్న ముగ్గురి వాలకాన్ని చూచి (తెల్లబోయి, గుమ్మంలోనే ఆగిపోతుంది. +మాణిక్యమ్మ మంచో, చెడ్డ వాడి కిచ్చి కట్టింతర్వాత దానిక�� మరి వాడే దిక్కు ముఖమైనా చూసి యెళ్ళరా, బాబూ! +కృష్ణమూర్తి: నీదంతా వెర్రి కాని, ఇంతవరకు పడని సుఖం ఇఖ వాడితో మన జానకి ఏం పడుతుందమ్మా! బుద్ధిలేని ఆ వెధవను వృథాగా దేవిరించడం దేనికి? +లక్ష్మయ్య గుడ్డివాడైనా, కుంటివాడైనా, చివరికి కుష్టువాడైనా ఆడదానికి భర్తే దైవం. +మాణిక్యమ్మ నా మాటిను, బాబూ? లేకపోతే మన పిల్ల మనకి దక్కదు. +మాణిక్యమ్మ నువ్వు పసివాడివి. నీకు తెలవదురా, బాబూ! నా మాటిను. +కృష్ణమూర్తి అదేమైనా గాని, నేను వెళ్ళనమ్మా! +లక్ష్మయ్య అయితే! మరి నాకు తప్పుతుందా, నే వెడతాలే! +మాణిక్యమ్మ అదేమిటిరా, బాబూ! పోనీ ఆయన్నైనా యెళ్ళి రానియ్యి. +మాణిక్యమ్మ ఆఁ! వాడి మాటల కేం లెండి? మీరున్నవా రున్నట్టుగా బయల్దేరండి +లక్ష్మయ్య (కరకుగా ఇందాకటినుంచి తమాయించుకు చూస్తున్నా! గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు, ఏమిటిరా మాకు నీ అదుపాజ్ఞలు? సమయాన్ని బట్టి సర్దుకు పోవాలికాని, నీలిగితే పనులౌతాయా? +కృష్ణమూర్తి అయితే, వాణ్ణి పిలుచుకొచ్చి, నెత్తిని పెట్టుకు పూజించండి. నా దారిని నే పోతా! +మాణిక్యమ్మ నన్ను నట్టేట ముంచిపోతావా? వొద్దురా, బాబూ! ఎళ్ళెద్దు! +కృష్ణమూర్తి లేదమ్మా! నే నీ పాడుకొంపలో మరొక క్షణమైనా వుండలేను! +మాణిక్యమ్మ (దారికి అడ్డంగా వెళ్ళి నువ్వెళ్ళితే నన్ను చంపుకు తిన్నట్టేరా, బాబూ!(కళ్లు చెమ్మగిలగా కమల చీర చెంగుతో తుడుచుకుంటుంది +లక్ష్మయ్య: పోయేవాణి పోనివ్వ రాదటే! ఎవర్ని బెదిరిస్తాడు ఈ గుడ్డి బెదిరింపుల్తో.(ఈ మాటకు కృష్ణమూర్తికి మరింత కోపం రాగా, మాణిక్యమ్మను తప్పించుకుని వీధిగుమ్మం వైపు రెండడుగులు వేస్తాడు. +మాణిక్యమ్మ, కమల (ఒకేసారిగా) అయ్యో! అయ్యో! బాబూ! అన్నయ్యా! అన్నయ్యా కృష్ణమూర్తి ఆగిపోయి కమలవైపు చూస్తాడు. +కమల న న్నేంచేసి పోతా వన్నయ్యా! +కృష్ణమూర్తి నీమాట మర్చేపోయానమ్మా! ని న్నిక్కడ విడిచి వెళ్ళితే, అక్కయ్య గొంతుకోసినట్టు నీ గొంతు కోస్తారు. నా వెంట రా పోదాం! +(కమల కళ్ళను గిర్రున నీళ్లు తిరుగుతాయి. గుడ్లు అప్పగించి చూస్తూ జవాబు చెప్పదు. కృష్ణమూర్తి నీకు అభం శుభం తెలియదమ్మా! వీళ్లు కిరాతకులు. నీ అన్నను కాదూ? నామాట విను. రా! వెడదాం! +కమల (గాద్గదికంగా మనం వెళ్ళిపోతే, మరి అక్కయ్యో? +కృష్ణమూర్తి (మనిషి చప్పున తగ్గిపోయి ఔనమ్మా! పిచ్చి కోపంలో నేను దాని మాటే మర్చిపోయా నిట్టూరుస్తూ) ఔను! దాన్ని ఈ స్థితిలో విడిచి మన మెక్కడికి ���ోతాం? +మాణిక్యమ్మ పోనీ లేరా దాని మొగమైనా చూసి అగిపోయావ్. నా కదే పది వేలు. వొంటిగా రొమ్మున నే నీ కుంపటి మొయ్యగల నట్రా? +కృష్ణమూర్తి సర్లే, అమ్మా చేతిగడియారాన్ని చూచి) అరుకిచ్చి అరగంటైంది. మరి పొట్లం వెయ్యొద్దూ? +మాణిక్యమ్మ (పెద్దగా నిట్టూర్చి నాకు కాళ్ళూ, చేతులూ ఆడ్డంలేదు. నువ్వే కాస్తెయ్యరా, బాబూ!(కృష్ణమూర్తి గదిలోకి వెడతాడు. +మాణిక్యమ్మ (లక్ష్మయ్యతో ఇంకా మీరు చూస్తారు దేనికి? మీ రెళ్ళిరండి. +లక్ష్మయ్య రెండు ఝాము లైంది. వేళకాని వేళ. ఇప్పు డేమిటి? చల్లబడినాక వెడతాలే. +మాణిక్యమ్మ ఎంత దూరమండీ! రెండు కోసులైనా నిండాలేదు.నా మాటిని, నిలుచున్న పాళంగా యెళ్ళి రండి. +లక్ష్మయ్య సర్లేవే! రెండు మెతుకులైనా తిననీ! ఇంతలో ఏమీ ముంచుకు పోదు. కమలం! నా కొడ్డించ వమ్మా! +కమల (ఇంకా తడి ఆరని కన్నీళ్ళను తుడుచుకుంటూ రా, నాన్నా! +మాణిక్యమ్మ భోజనాని కేమొచ్చె. రోజూ చేసే భోజనమే! ముందెళ్ళి రద్దురూ! ఆలిసిమైతే ఎక్క డేమి కొంప మునుగుతుందోనని నా గుండెలు కొట్టుకుంటున్నాయ్. +లక్ష్మయ్య ఎందుకే? పాడు భయం! శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు. +లక్ష్మయ్య సరే తగలడు విసురుగా రెండడుగులు వేస్తాడు) +కృష్ణమూర్తి (పొంగి పొరలివస్తున్న దుఃఖాన్ని అతి కష్టం మీద ఆపుకుంటూ గదిలోనుంచి వచ్చి నాన్నా లక్ష్మయ్య వెనక్కి తిరిగి చూస్తాడు) నువ్విక వెళ్ళనఖ్ఖర లేదులే!(అర్థం తెలియక మాణిక్యమ్మ, కమల వెర్రివాళ్ళవలె చూస్తుంటారు. +లక్ష్మయ్య సరే ఏం చేస్తాం? ప్రారబ్ధం! +అనడానికి నోరురాని భయసంశయాలతో మాణిక్యమ్మ, కమల వెర్రివాళ్ళవలె కృష్ణమూర్తి తర్వాత లక్ష్మయ్యను, లక్ష్మయ్య తర్వాత కృష్ణమూర్తిని ప్రశ్నార్ధకంగా చూస్తూవుండగా తెర) +పాత్రలు: చదువుకున్న భర్త, చదువురాని భార్య +(గమనిక ఇతివృత్తం, పాత్రలు మొదలైనవాటిలో ఇది స్వతంత్ర రచన. టెక్నిక్ మాత్రం స్వీడిష్ +రచయిత ఆగస్ట్ ఫ్రెండ్ బర్గ్ కు అనుసరణ. ఒక పాత్రచేతనే మాట్లాడించి, రెండవదాన్ని మౌనంగా వుంచడం ఈ పద్ధతిని “ది స్ట్రాంగర్” అనే నాటికలో ఆయన వినియోగించాడు. ఈ పద్ధతి మాత్రమే “దాంపత్యం”లో అనుసరించబడింది.) +అది వారి యింటిముందు వసారా. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతం, పడక కుర్చీలో వాలి, భర్త పత్రిక చదువుకుంటూ వుంటాడు. వయస్సు ముప్ఫై ప్రాంతాల. గూడకట్టు కట్టుకున్నాడు; ఆఫారం వేసుకున్నాడు. తమలపాకుల పళ్ళెంతో భార్య ప్రవేశిస్తుంది +భార్య ఏమండీ! ఈ ��ూటైనా తిన్నగా భోజనం చెయ్యనే లేదు. విస్తరి ఇలా అలా కెలికి లేచొచ్చేశారు. చూడగా వండుకోవడం, వార్చుకోవడం నాకోసంలానే వుంది. అంతకంతకు చిక్కి సగమై పోతున్నారు. ఇలా చేస్తే, ఎలా చెప్పండి కుర్చీ దగ్గర కూర్చుని తమలపాకుల ఈనెల్ని తీస్తూ వుంటుంది. +భార్య పోనీ, మీకు హితవైన కూరలేవో మీరు తెచ్చుకుంటే వండి పెట్టనన్నానా? కాని, ససేమిరా మార్కెట్టుకు వెళ్ళనంటారు. పనిమనిషిని పంపిస్తే, అది సగం తిని, సగం తెస్తుంది. అబ్బబ్బ! అది వొద్ది దొంగ ముండ! ఇంటి వద్దకు మంచి కూర లేవీ రావడమే లేదు. ఎవడు తెచ్చినా వంకాయలూ, బెండకాయలూ తెస్తున్నాడు. అవైనా అన్నీ చచ్చులూ, పుచ్చులూ. వాటినీ మండబెడుతున్నారు. ఇఖ నేనేం చచ్చేది మీరే చెప్పండి? +భార్య అన్నం మానేసి పాడు కాఫీ హోటల్ లో, పాడు కాఫీ తాగుతూ వుంటారు. ఆ కాఫీ నీళ్ళతో ఏం కడుపు నిండుతుంది? ఏ పచ్చడి మెతుకులు తిన్నా అన్నం అన్నమే! మా తాత ముప్పొద్దులా తవ్వెడు బియ్యం అన్నం పెట్టించుకుని, చిక్కటి మజ్జిగ పోసుకుని, జుర్రున జూరతాడు. ఎనభై యేళ్ళోచ్చినా ఇంకా రాయిలా వున్నాడు. కంటి చూపైనా తగ్గలేదు. ఇప్పటికీ సూదిలో దారం అలాగ్గా గుచ్చుతాడు. +భార్య అబ్బ! చదవొచ్చు లెద్దురూ! పొద్దున్నే పోతారు; పోదోయి వస్తారు.“ఇదుగో వొస్తారు; అదుగో వొస్తారు” అంటూ ఎదురు చూసి చూసి, నా కళ్ళు కాయలు కాసిపోతున్నాయ్. ఆఫీసు పని అయిదు గంటలకే అయిపోయినా ఎనిమిది, తొమ్మిది గంటలదాకా ఏం చేస్తారో, ఏమో, మీకే తెలియాలి. అసలు గడప దాటగానే మీ రింటిమాటే మర్చిపోతారులెండి! ఇవ్వాళమట్టు కివ్వాళ “నా న్నొస్తాడు. మిఠాయి తెస్తా” డంటూ పెద్దపిల్ల దారి కాసి కాసి, మీ రొచ్చే ముందే చిటుక్కున నిద్దరోయింది. చంటిదికూడా “నాన! నాన!” అంటూ పాపం! కలవరించింది. దాని కీ పూట వొళ్లు కాస్త వెచ్చగా వుందండీ! నిద్రలో వెర్రితల్లి తుళ్ళి పడుతున్నది. దీపాలెట్టగానే గుప్పెడు మిరపకాయలు దిష్టి తీసి, పొయ్యిలో పోస్తే గొట్టే రాలేదు. బిడ్డమీద ఏ పీడాకారి ముండ కళ్ళు పడ్డాయో, ఏమో! +(భార్య అందించిన తమలపాకుల మడుపు అందుకుని, భర్త పత్రికలో మరింతగా దాక్కుంటాడు.) +భార్య ఎప్పుడూ పత్రిక చదువుతూ కూర్చుంటే, కళ్ళకు జబ్బు కూడా. పిండారబోసినట్టు వెన్నెల కాస్తున్నది. చల్లటి గాలి వేస్తున్నది పెందలాడే యింటి కొచ్చి, వాకిట్లో కుర్చీవేసుకు కూర్చుంటే హాయిగా వుండదండీ? ఇవ్వాళ వెన్నెల్ని చూసి పెద్దపిల్ల ఎంత సంబర పడిందనుకున్నారు! “చందమామ రావె!”అంటూ మీరు దాని కెప్పుడో పాట చెప్పారట. దాన్ని చెప్పమని నన్ను తెగ వేధించింది ఒక క్షణం పాటు ఆగి) పాలు చల్లారిపోతున్నాయి. తోడేసొస్తా లేచివెడుతూ) ఈ పూట మరీ పల్లెపు మెతుకులు తిన్నట్టు తిన్నారు. పాలయినా తాగరాదటండీ జవాబు కోసం అన్నట్టు ఒక్క క్షణం ఆగి) ఏఁ! తెమ్మంటారా? +భార్య పోనీ, కాసినన్నే తాగండి. ఒక అరకప్పు తెస్తా వద్దని భర్త మరింత గట్టిగా తల ఊపుతాడు. భార్య లోపలికి వెడుతుంది. ఆమె వెళ్ళగానే అతడు పత్రికను ఒక మూలకు గిరాటు కొట్టి, పడక కుర్చీలోనుంచి లేచి, పక్కనే టేబులు పై వున్న పుస్తకం తెచ్చుకుని, దాన్ని చదువుతూ మళ్ళీ కుర్చీలో జేరగిలబడతాడు. +భార్య (తిరిగి వచ్చి పత్రిక చదవడం అయిందనుకుంటే పుస్తకం మొదలెట్టారటండీ? అదేం పాపమో నాతో ఒబ్బుమాటైనా మాటాడరు. ఇంటికి వచ్చినప్పటినుంచీ చదువు, చదువు అంతూ పంతూ లేని చదువు. నే నేమైనా అంటే, “అదుగో! నా చదువు చెడగొడుతున్నా!” వంటారు. అదే స్నేహితులెవరైనా వొస్తే, చదువేమౌతుందో తెలవదు. ఊరు మాటుమణిగేదాకా వాళ్ళతో నవ్వుతూ కేరుతూ కూర్చుంటారు. నాతో మాట మాట్లాడ్డ మంటేనే మీకు భర్త చటుక్కున పుస్తకం మూసి “ఈ సోది వినక తప్పదు” అన్నట్టు ముఖం పెడతాడు. +భార్య (దైన్యంగా ఇప్పుడు నే నేమన్నానండీ మీరంత విసుక్కోడానికి! పిచ్చిదాన్ని కనక, ఎప్పుడు సాయంత్ర మౌతుందా, ఎప్పుడు మీ రొస్తారా అని గంటలు లెక్కె పెట్టుకుంటూ కూర్చుంటాను. కాళ్ళ అలికిడైతే చాలు, మీ రేమోనని ఆలకిస్తాను. గేటు తీసిన చప్పుడైతే చాలు, మీ రేమోనని ఎదురుచూస్తాను. దానికి చూడబోతే రెండున్నరేళ్లు నిండా వున్నాయో, లేవో, ఆ అల్లరికాన “అమ్మా! నాన్నొస్తున్నాడేఁ” అంటూ చీటికీ మాటికీ పరుగెత్తుకొస్తూ వుంటుంది. ఉత్తిదే అని తెలిసీ వుండబట్టలేక వాకిట్లోకి ఆదరాబాదరాగా లేచొస్తాను. లేచొచ్చి, “ఎక్కడే?” అంటే, పకపక నవ్వుతుంది భర్త పెదవులపై చిరునవ్వు కనబడుతుంది చంటిది కూడా “నాన్న ఎక్కడమ్మా?” అంటే, ముఖం ఇంత చేసుకుని, వేలేట్టి గేటువంక చూపిస్తుంది. నా తల్లికి సందేళ కాక తగిలింది. అజీర్తి చేసిందేమో అనుకోడానికి నిన్నే ఆముదం పెట్టానయ్యె! ఇవ్వాళ పొద్దునకూడా ఝాడించి విరోచనమైంది. వాసనన్నా లేదు.(భర్త ముఖం చిట్లించుకుని, చేతి గడియారం వంక చూస్తాడు. +భార్య ఇంటికి రావడానికి మీకొక టైము లేదుకాని, వచ్చాక టైము చూసుకోవడమే సరిపోతుంది. సంసారం మంచి చెడ్డ���ు చెప్పుకోడానికైనా మీకు తీరుబాటుండదు.పగలంతా మీ కోసం నేను యెదురు తెన్నులు కాస్తుంటాను. కాని, నాతో మాట్టాడితేనే మీ నోటి ముత్యాలన్నీ రాలిపోతా యనుకుంటారు! +(ఏదో జవాబు చెప్పబోయినట్టు భర్త పెదవి కదపబోతాడు. +నా భార్య మీరు ఏ మనబోతున్నారో నాకు తెలుసు లెండి.“నీతో ఏమి సంగతులు మాట్లాడమంటావ్? వండడం, వార్చడం తప్పితే నీ కేమొచ్చు? చీరలు, నగలు తప్పితే నీ కేం కావాలి?” అనేగా? మా అమ్మా, నాన్నా నాకు చదువు చెప్పించారు కాదు. ఖర్మది. ఏఁ! ఇప్పుడు మాత్రమే! నే చెబుతా చదువుకోరాదా?” అంటారు. “పోనీ, మీకంత ముచ్చటగా వుంటే చెప్పం” డని వచ్చి కూర్చుంటే, ఏ కాస్త తప్పొచ్చినా, చెడ్డ చికాకుపడతారు గదా! అబ్బబ్బ! ఎంత తల బద్దలు కొట్టుకున్నా, నీకేమీ అర్ధంకాదు. వొట్టి మట్టి బుర్ర” అంటూ చిందులు తొక్కుతారు! ఔను! నాది మట్టిబుర్రే! లేకపోతే, మీ కెందుకింత లోకువౌతాను? “భూమి గుండ్రంగా వుంటే, అడుగుపక్క నున్నవాళ్లు తలకిందులుగా నడుస్తారా?” అన్నానని ఆ పూటంతా ఒక్కటే నవ్వు!(భర్త ఆవలిస్తాడు. +భార్య “ఏమండీ! కామ్రేడ్ అంటూ చాలామంది పేరుముందు వుంటుంది గదా? కామ్రేడు ఇంటి పేరు వాళ్లు దేశంలో అంత తామరతంపరగా వున్నారటండీ?” అని ఒకనా డడిగినందుకు ఏమి హేళన చేశారు! ఏమి హేళన చేశారు భర్త వొళ్లు విరుచుకుంటాడు. +భార్య భర్త విసుగుదలను గమనించకుండానే మీలా అందరూ చదువుకున్నవాళ్ళే వుంటారా? నిజానికి నాబొంద! ఇంకా నా కేం చదువు? అప్పుడే ఒకరికిద్దరు బిడ్డలయ్యారు. ఇటు నేను ఇంటిపనే చేసుకోనా? అటు వాళ్ళనే సంబాళించుకోనా? పగటిపూట ఇలా కాస్త కన్ను మూసే ప్రాప్తి లేదు. బద్దకించి ఎప్పుడైనా కాసేపు నడుం వాలిస్తే, పిల్లలిద్దరూ పీకి పాకాన పెడతారు. మరీ నెల రోజుల్నుంచి చంటిపిల్ల రాత్రిపూటైనా కంటి మీద కునుకు పడనివ్వడంలేదు. పాలు చాలక "కుయ్యో, మొర్రో” అంటూ తెల్లవార్లూ ఒక్కటే గోల! వొట్టి రొమ్ము దాని నోట్లో పెట్టి పడుకుంటే, దవళ్ళు పీక్కు పోవడమేకాని కడుపు నిండుతుందా, పెడుతుందా? +(తలనొప్పి వచ్చినట్టు భర్త కణతలు నొక్కుకుంటాడు. +భార్య మండీ! తలనొప్పిగా వున్నదా మరి ఆ మాట చెప్పారు కారేఁ? తలనొప్పిగా వుంటే అన్నమెలా సయిస్తుంది? అందువల్లే ఈ పూట ఆ కాసిని మెతుకులైనా తిన్నారు కాదు. తలనొప్పి మందు రాయనా?(కణతలు నొక్కుకోవడాన్ని వెంటనే మానివేసి, మందూ గిందూ వద్దన్నట్టు భర్త సంజ్ఞ చేస్తాడు. +భార్య అయితే, నా మాటలే మీకు తల��ొప్పిగా వున్నాయంటారు. అంతే లెండి. నే నన్నా, నామాట లన్నా మీకు తలనొప్పి. మీకు పుస్తకాలు కావాలి; పత్రికలు కావాలి. దేశం సంగతులతో, ప్రపంచం సంగతులతో మీకు పొద్దుపోతుంది. నాకు నా యిల్లే దేశం; నా పిల్లలే ప్రపంచం పెళ్ళయినాక ఒక్క ఏడాదిపాటు నాతో ఏమి తిన్నగా వున్నారో! ఆ తర్వాత నేనేం పాపం చేసుకున్నానోకాని, నా పొడైనా మీకు గిట్టడం లేదు. పిచ్చిదాన్ని కనక, మీరెంత తోసేస్తున్నా, మిమ్మల్నే పూసుకు తిరుగుతాను. మీరు సంతోషంగా ఒక్కమాట మాటాడితే, అదే పండ గనుకుంటాను. కాని, నే నెదురుగా వస్తేనే మీకు చిరచిరలు, బురబురలు! +(పడక కుర్చీలో నుంచి చరాలున లేచి, భర్త పచారు చేయ నారంభిస్తాడు. +భార్య అయ్యో! కూర్చోండి పాపం కూర్చోండి. నామూలాన మీకు లేనిపోని కాళ్ళ తిప్పటకూడా దేనికి లెండి చదువురానిదాన్నని మీకు మొదటే తెలుసుగా! తెలిసికూడా నన్నెందుకు చేసుకున్నారు? ఆ కిరస్తానీదాన్నే కట్టుకోక పోయారూ కీసరబాసర ఆ మాట్లాడుతూ దాంతో హాయిగా పళ్ళు నూరుతూ, భర్త “హుఁ!” అంటూ హూంకరిస్తాడు. +(కోపం పట్టలేక భర్త నేలను తన్నుతాడు. +భార్య నేలని తన్నడం దేనికి! మీకు కాలు నొప్పి కూడా! నన్నే తన్నండి. తన్ని తగిలేస్తే, మీకు పీడ విరగడైపోతుంది ఈసడింపుగా) పాపం! ఆ పోలిది కష్టాలమారి బ్రతుకట. దానికి “నా” అన్న వాళ్ళెవ్వరూ లేరట. అమ్మా, నాన్నా చిన్నతనంలోనే పోయారట. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఎంత పెద్ద జీతం తెచ్చుకుంటున్నా దానికి సుఖమే లేదట. తన ఉద్యోగానికీ, సంపాదనకీ ఆశపడి వచ్చేవాళ్ళని చూస్తే దానికి కంపరమట. దాని ఫాయా వాళ్ళెవ్వరూ దాన్ని వలచి రారట. అదంటే ఎంత జాలి! పోనీ, మీరే ఆ సింగిని కట్టుకోరాదూ భర్త కొట్టడానికి చెయ్యెత్తబోయి, మళ్ళీ అంతలోనే దించి వేసుకుంటాడు. +భార్య (ఇంకా విరగబడి ఆగిపోయారేఁ! కొట్టండి. బిడ్డలతల్లికి ఆ ముచ్చటే తక్కువగా వుంది. ఇంతకాలం నుంచి దిగమింగి వూరుకున్నా! ఏమైనా సరే. ఇఖ వూరుకునేది లేదు. అది వుండడమో, నే నుండడమో ఇవ్వాళ తేలిపోవాలి. మీకు వొండి పెట్టడానికి నేను కావాలేఁ? మీకు పిల్లల్ని కనడానికి నేను కావాలేఁ? మీతో మాట మాట్లాడ్డానికి మాత్రం నేను పనికి రాను! ఎంత చదువురాని మొద్దునైతే మాత్రం మీకు వూడిగం చేస్తూ మూలపడి వుండాలని ఎక్కడున్న దేమిటి? పొట్టకూటికి నే నేమీ ముఖం వాచి లేను. కావాలంటే ఇంత ముద్ద పెట్టడానికి నాకు అమ్మా బాబూ వున్నారు.“ఆయన మనస్సు విరిగిపోయాక ఛీ ఇంకా నే న���క్కడ దేని?”కని ఆ పీడాకారి ముండ ఈ వూరొచ్చిన మూడు నెల్లనుంచీ నే ననుకోని రోజు లేదు. కాని, పిల్లలే తగలాటమైపోయారు. వాళ్ళ నొదిలి పెట్టి వెళ్ళలేక తువ్వాలు పైన వేసుకుని భర్త వీధిలోకి దారితీస్తాడు. +భార్య దాని దగ్గరికేనా, ప్రయాణం? వెళ్ళండి! వెళ్ళండి! నా కాపరం తియ్యడానికే అ దిక్కడికి తగలడింది.(వీధితలుపు గుభేలున వేసి భర్త వెళ్ళిపోతాడు. +భార్య అనాకారి ముండ! నా ప్రాణానికి అ దెక్కడినుంచి దాపరించిందో? దాని శిరుసు పగల! దా నింట్లో పీనుగెళ్ళ ఒక క్షణం ఆగి) దాని కొంపకే వెళ్లుండాలి. ఇంత రాత్రి వేళ ఇంకెక్కడికి వెడతారు? ఆఫీసు పనయ్యాక అక్కడే కూర్చొనొస్తూ వుండాలి. లేకపోతే, రోజూ ఎనిమిది, తొమ్మిది గంటలదాకా ఏమి పను లుంటాయ్! దిక్కుమాలిన ముండ! సిగ్గుమాలిన కుంక! దానికి బుద్ది లేకపోతే ఈయనకైనా ఇదుండొద్దూ? వీధితలుపు తీసి, వీధివంక తేరిపారజూచి వచ్చి) దాని కొంప పడమరవీధిలో వుంటే, ఇలా తూర్పుకు వెళ్ళారు దేనికో? ఆఁ! అదొక వేషం రెండు బజార్లు చుట్టి వెళ్ళి, దాని తలుపు కొడతారు. ఈసరికి అసలటు తిరిగే వుండాలి. మాయదారి ముండ! పండంటి నా కాపరానికి చిచ్చు పెట్టడానికే అదిప్పుడు చప్పున ఏదో జ్ఞాపకానికి వచ్చినట్టు) ఆఁ! అన్నట్టు, ఇస్కూళ్ల తణిఖీకి వారం రోజుల నాడే వెళ్లిందనీ, ఇప్పటిలో అది తిరిగి రాదనీ ఈ దారినిపోతూ నిన్న దాని బంట్రోతు చెప్పిపోయాడుగా పెద్ద తప్పు చేసినదానివలె నోరు నొక్కుకుంటూ) అయ్యొ! అయ్యొ ఎంత పాపిష్టి దాన్ని! ఉత్తపుణ్యానికి నోటి కొచ్చిన కారుకూత లన్నీ కూసి ఇంత రాత్రివేళ ఆయన్ని బయటికి తగిలేశాను. మబ్బు మూసుకొస్తున్నది. కొంపతీసి చినుకు పడుతుందేమో! తడిస్తే, ఆయన కిట్టే జలుబు చేస్తుంది! నే నిప్పుడేం చెయ్యను? అయ్యొ! నే నిప్పుడేం చెయ్యను? నిరుడొకసారి ఏదో మాటామాటా వచ్చి, ఇలాగే తెల్లవార్లూ వీధులెంట తిరిగి తిరిగి, తెల్లవారేసరికి పుట్టెడు జలుబుతో, జ్వరంతో యింటి కొచ్చారు! అప్పుడు వారం రోజులకుగాని ఆయన కోలుకోలేదు. పాపిష్టిదాన్ని! ఇప్పు డాయన కేమి తెచ్చి పెట్టడాని కింత రాద్దాంతం చేశానో గదా నెత్తీ నోరూ కొట్టుకుంటూ) నా బొంద పడ! నే నెంత పాపిష్టిదాన్ని! అయ్యో! అయ్యో తెర) +పాత్రలు: రామయ్య ఒక పల్లెటూరి గృహస్థు, మహలక్ష్మమ్మ అతని భార్య, వెంకటరావు అతని కుమారుడు, సీతాపతి అతని వేలువిడిచిన బావమరిది +పల్లెటూరి ఆసామి ఇంటిచావిడి. కుడివైపున సింహద్వారం; ఎడమవైపున ప���రటిలోకి ద్వారం. ఈ రెండు ద్వారాలకు ఒక్కొక్క పార్శ్వంలో ఒక్కొక్క కిటికీ. ఎదురుగా మరి రెండు ద్వారాలు; మొదటిది పడకగదిలోకి, రెండవది పడమటింటిలోకి. ఈ రెండు ద్వారాల మధ్య పసుపు కుంకుమలతో ఇనపపెట్టె. దాని పైన గోడ కాన్చి ధనలక్ష్మి పటం. దానికి ముద్దబంతి పూలదండ. వీధితల గోడమూలకూ, పడకగది ద్వారానికీ మధ్యగా ఒక పెద్ద బీరువా. చావడిమధ్య ఒక పడకకుర్చీ; దానిచెంత ఒక బెంచీ.రామయ్య పడకకుర్చీలో కూర్చుని, బెంచీ పై వున్న దస్త్రంలోనుంచి వరసగా దస్తావేజులు తీసి, వాటి పేజీలు తిరగ వేస్తూవుంటాడు. అతడు భయ్యోపడిలో పడినవాడు. కురచగా, బొద్దుగా, గుమ్మటాన్ని పోలినవాడు. గండుముఖం, గుండ్రని పెద్దకళ్లు. నుదురుకూడా పెద్దదే. అంట కత్తిరించిన క్రాపు. +మీసం గడ్డాలు లేవు. కొంచెం బొంగురు గొంతు. మాటతీరులో “వ్యవహర్తను సుమీ!” అనే భేషజం కనబడుతూ వుంటుంది. నీర్కావిధోవతి కట్టి, తెల్ల లాల్చీ వేసుకున్నాడు. +మహలక్ష్మమ్మ చావిడిలోనే ఒక పక్కగా కూర్చుని, కందిపప్పు చేట ముందు పెట్టుకుని, రాళ్లు యేరివేస్తూ వుంటుంది. వయస్సు నలభై ప్రాంతం. అభం శుభం యెరగని పల్లెటూరి యిల్లాలు. +ముక్కు పైకి జారిన కళ్లజోడును సరిగా తోసి, కొత్త దస్తావేజును అందుకోబోతూ, “కాసిని మంచినీళ్లు తేవే!” అని రామయ్య అంటాడు. పప్పుచేట చావిడిలోనే వదలి పెట్టి, మహలక్ష్మమ్మ పడమటింటి గుమ్మంగుండా లోపలికి వెడుతుంది. +ఇంతలో సీతాపతి వస్తాడు. వయస్సు నలభై లోపు. పొడుగ్గా, కాయలాంటి శరీరంతో, తనాబిలాంటివాడు. +సంస్కారంలేని వొత్తు కాపు; మాసిన గడ్డం; రొయ్యమీసం. పైకి వెర్రి బాగులవాడివలె కనబడినా, జిత్తులలో నక్కను మించినవాడు. నీర్కావి ధోవతి కట్టి, నీర్కావి బనియన్ వేసుకున్నాడు. భుజంపై తుండుగుడ్డ, చేతిలో +రామయ్య (అలికిడి కాకుండా వచ్చిన సీతాపతిని చూడగానే ఏం సీతాపతీ! ఇంత పొద్దుపోయాక ఇలా వొచ్చావ్? +సీతాపతి (తెచ్చి పెట్టుకొన్న నవ్వుతో పొద్దున్నే వచ్చిన వాన, పొదోయి వచ్చిన చుట్టం పోయేది లే”దని మా రామయ్య బావయ్యకు అప్పుడే దిగులు పుట్టిందేమిటి? +రామయ్య నీ సామెతల కేమిలే! అయినదానికీ, కానిదానికీ ఒక సామెత విసురుతూ వుంటావ్. ఇప్పు డెందు కిలా ఊడి పడ్డట్టు? +సీతాపతి ఆఁ! ఏమీ లేదు, వూరికేనే. +సీతాపతి నీ కొకరి అంటూ సొంటూ గిట్టదు. నన్ను ముట్టుకోకు నా మాలకాకి” అంటావ్. మరి అందరం అలా వుండ గలమా? +రామయ్య సర్లే! ఇంతకూ ను వ్వొచ్చిన పనేమిటో చెప్పరా��ూ? దాపరికం దేనికి? +సీతాపతి “చల్ల కొచ్చి ముంత దాస్తున్నా”ననే! నీ దంతా చోద్యం రామయ్య బావా! +రామయ్య నువ్వు వెయ్యి చెప్పు; లక్ష చెప్పు. వూరికేనే వచ్చా వంటే నేను నమ్మలేను. +సీతాపతి (నవ్వుతూనే బెంచీ పై కూర్చుంటూ “లాభంలేని పెట్టి వరదను పోడంటావ్” -అంతేనా? ఇఖ ఒక చుట్టం, పక్కం; రావడం, పోవడం; మంచి, చెడ్డా; ఏమీ లేదన్నమాటే! +రామయ్య మాటలు నేర్చావులే! ఇంతకూ ఏమిటి సంగతి? +సీతాపతి ఆఁ! మరేమీ లేదు. మా లక్షువమ్మకు సుస్తీ చేసినట్టు విని, వుండబట్టలేక చూచిపోదా మనొచ్చా! వలచి వస్తే మేనమామ కూతురు వరస కా”దనే రకం నీది. +నువ్వు నన్నెంత పరాయి వాణ్ణిగా చూసినా, అది నాకు వే లిడిచిన చెల్లెలు పడమటింటి గుమ్మం గుండా మంచినీళ్ళ గ్లాసుతో మహలక్ష్మమ్మ వస్తుంది నీ మాటే అంటున్నానమ్మా! నీకు నూరేళ్ళాయిస్సు. ఏ మమ్మా? కొంచె మేమో సుస్తీ చేసిందట. +మహలక్ష్మమ్మ ఔ నన్నయ్యా! అసలే కొన ఊపిరిదాన్ని. ఈ గాడ్పులకు ప్రాణం మరింత బేజారై పోతున్నది.(ఈ మాటల్ని అంటూ భర్తకు మంచినీళ్ళు అందించి, తను వెళ్లి పప్పు చేటముందు తిరిగి కూర్చుంటుంది. +సీతాపతి కాదూ, మరి?“రోహిణీ కార్తెలో రోళ్లు బద్ద లౌతా” యని ఊరికే అన్నారూ? ఈ యేడు మరీ నిప్పుల్ని చెరుగుతున్నది. ఈ పడమటి గాడ్పులికి మా పిల్లలు ఆవిటిల్లి పోతున్నారు. చల్లబొట్టు కూడా లేదేమో, యెండి వొరుగైపోతున్నారంటే నమ్ము వంగి కాసిని కందిపప్పు తీసి నోట్లో వేసుకుంటాడు. +మహలక్ష్మమ్మ: మీ కిప్పుడు పాడి లేదేమే, అన్నయ్యా? +సీతాపతి లేదమ్మా! నల్లపడ్డ యెండిపోయింది; పెద్ద గేదేమో యెత్తడి పోయింది; బోడావు పాలు దూడకే చాలడం లేదు.“పాడిలేని యిల్లు పాతాళలోకం”. బక్కనీళ్ళయినా లేక నానా శెరా పడుతున్నాం. +మహలక్ష్మమ్మ పోనీ, యెక్కడైనా అణా పెరుగు వాడిక పెట్టుకోకపోయారా, అన్నయ్యా? +సీతాపతి ఏమోనమ్మా! అమ్మబోతే అడివి; కొనబోతే కొరివి.”అణా పెరుగన్న పేరేకాని, యిల్లు గడుస్తుందా, పెడుతుందా? అక్కడికీ ఈ మధ్య మా చిన్నల్లుడు పండక్కి వచ్చాడని ఆ ముసిలిముండ లేదూ కాపు వీధి కామమ్మ దానిదగ్గిర వారం రోజులు పెరుగు పోయించుకుంటే, లొట లొట నీళ్ళు పోసింది. అయితే అమ్మాయ్! మన పాలెం పడ్డ ఈనిందటగా? +మహలక్ష్మమ్మ ఈనింది. కాని, ఏం లాభం? నిన్న దూడ నిడుస్తూ వుంటే, ఆ పాడుముండ – చెరువుగట్టు శేషమ్మ కన్నుపడింది. దాంతో ఇఖ ఒక్క జీరైనా రాలిస్తే వొట్టు +సీతాపతి ఆ మాయదారిముండ మన కెక్కడ దాపరించిందమ్మా!“నర��డికంట నల్లరాయి పగుల్తుంది.”పాటి మీది సాయబును పిలిపించి దిష్టితాడు వేయించక పోయావా? +సీతాపతి “తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు.” ఈ పిదప కాలంలో పాలేళ్ళు తిన్నగా మాట వింటారుగాఁ! వాళ్ళ కళ్ళు నెత్తికొచ్చాయ్ పత్తిగింజలు తింటావా బసవన్నా అంటే, ఆహా అన్నాడట; గంత కట్టనా బసవన్నా అంటే, ఊఁహు అన్నాడట”. అలా వుంది వాళ్ళ పనిప్పుడు. రేపు నే నెళ్ళి ఆ సాయబును పిలుచుకొస్తాలే! ఇబ్బందో, సబ్బందో నువ్వు రోజూ కాసిని మజ్జిగనీళ్ళు పంపించకపోతే మేం బతకడం కష్టం. +రామయ్య (అప్పటి వరకు పడకకుర్చీలో వాలి, దస్తావేజుల్ని చూచుకుంటున్నవాడు చప్పున నిటారుగా కూర్చుని అదీ వరస! నేను ముందే అన్నాగా? ఎదో పని పడకపోతే నువ్వు రాకే! +సీతాపతి వినవమ్మా, విను మాబావగారి మాటలు!“అయినవాళ్ళకు ఆకుల్లోను; కానివాళ్లకు కంచాల్లోను”. మొన్న రెవిన్యూ ఇన స్పెక్టరుగా రొస్తే, పెద్ద డబ్బా నెయ్యి సమర్పయామీ చేశాడు. కాని, కాసిని కుండ కడిగిన నీళ్ళు నే నడిగితే, ఎన్ని చదువుతున్నాడో! +రామయ్య నాకు తెలుసులే నీ సంగతి! కాలికి వేస్తే మెడకి, మెడకి వేస్తే కాలికి. ఇంతకీ మాటలు నేర్చావ్. మజ్జిగకోసం వచ్చినవాడివి ముందే ఆమాట చెప్పరాదూ? పరామర్శ, గిరామర్శ అంటూ ఈ నాటకమంతా దేనికి? +సీతాపతి వెనకటి కెవడో “కడుపులో లేంది కావిలించుకుంటే వొస్తుందా?” అన్నాట్ట. నీకు నావాళ్లన్న మాటే లేనప్పుడు నే నెందుకోస మొచ్చినా, ఏదో బాముకోడాని కొచ్చినట్టే వుంటుంది. అసలు నీ చెల్లెలుకూడా “మా వొదినకు సుస్తీగా వుందట, చూచొద్దా” మంటూ బయల్దేరింది. కాని, “పొద్దు పోయింది లేవే, ఇప్పు డేమొస్తావ్?” అని నే నొక్కణ్ణి చక్కా వొచ్చా. +మహలక్ష్మమ్మ ఔ నన్నయ్యా! పొద్దు పోయింది భర్తతో) ఏమండీ! అబ్బాయి ఇంకా భోజనానికి రాలేదు. పొద్దున్నెప్పుడో రెండు మెతుకులు తినెళ్లాడు. లైబ్రీలో వున్నాడేమో అటొక అడుగేసి రండి. +రామయ్య వాడేమి చిన్నవాడా? చితకవాడా? వాడికి ఆకలైతే వాడే వొస్తాడు. సంసారం సంగతి సుతరామూ పట్టించుకోకుండా వాడు ఊరుమీద బలాదూర్ తిరుగుతూవుంటే వాడి వెనక నేను పరుగులెత్తలేను. +సీతాపతి “సముద్రం ఈదవచ్చుగాని, సంసారం ఈదరాదు.” ఈ కాలపు నాగమ్మల కేం తెలుస్తాయ్, సంసారంలోని సాధక బాధకాలు? అన్నదమ్ముల్లో పంచుకున్నది నాలు గెకరాల కొండ, దాన్ని నీ ప్రయోజకత్వం వల్ల నలభై +రామయ్య (పొగడ్తకు లోలోపల సంతోషిస్తూ, పైకి మాత్రం ఆఁ! మన ప్రయోజకత్వమే మున్నదిల��! +సీతాపతి నీ ప్రయోజకత్వం కాకపోతే మరేమిటి, రామయ్య బావా? పట్టిందల్లా బంగారం చేస్తావ్. వ్యవహారాన్ని నడిపించడంలో కొమ్ములు తిరిగిన ప్లీడరైనా నీ తర్వాతే! నువ్వు నీ కాబట్టి అన్ని కోర్టులూ తిరిగి, ఆ వారసత్వం వ్యాజ్యంలో నెగ్గుకొచ్చావు గాని, మరొకడైతే పేడకడిలా చతికిలబడేవాడు కాదూ +రామయ్య నువ్వైనా సామాన్యుడివా? ఐదుగురు ఆడపిల్లల్ని విరగడచేశావ్; అప్పూ సప్పు లేకుండా గుట్టుగా సంసారం చేస్తున్నావ్. +సీతాపతి ఆఁ! చెప్పుకోక, చెప్పుకోక నా మాటే చెప్పుకోవాలీ!“వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం తూగితే; కరెడ్ల కామమ్మ వంకాయలభారం తూగిందట. నీకంటె నాలుగెకరా లెక్కువే పంచుకున్నా. కాని, “నానాటికి తీసికట్టు నాగంబొట్టు” అన్నట్టుగా వుంది నాపని. చివరికి పుగాకు పాయకైనా ఠికానా లేదు. వెనకటికి నాబోటి వా డెవడో “దశాదశా రమ్మంటే, దరిద్రాన్ని పిలవమన్న"దట. దశంటే నీదే దశ! ఏదీ, రామయ్య బావా! ఒక పుగాకుకా డిలా పారెయ్! +రామయ్య ఇస్తాలే కాస్త ఆగు (భార్యతో అయితే, ఏమే! పడమటిపొలం క్రయం దస్తావేజు కనబడదేం? +మహలక్ష్మమ్మ ఏమో, నాకేం తెలుసు నేను వాటి జోలికీ సొంటికీ పోతాను గనకనా!రామయ్య (చావడిలోని బీరువా వద్దకు లేచివెళ్ళి, దాని తలుపులు తెరచి, లోపలవున్న రికార్డులను ఒక నిమిషం ఇటూ అటూ తిప్పి ఈ బీరువాలోనే పెట్టిన జ్ఞాపకం మరొక క్షణం వెదకి ఊహుఁ! ఇక్కడ లేదు. గదిలో పెట్టలేదుగదా? +మహలక్ష్మమ్మ ఎక్కడ పెట్టుకున్నారో, ఏమో? మీకే తెలియాలి! మీ కాగితాల కిల్లంతా చాల్డం లేదు. +రామయ్య చాల్లే! ఇఖ కట్టి పెట్టు! ఆ కాగితాల విలవ నీ కేం తెలుసు. కొంపను నిలబెట్టినా, కూల్చినా వాటికే చెల్లు ఈ మాటలు అంటూనే పడకగదిలోకి వెడతాడు. +సీతాపతి మా బావయ్యకు కాగితాలుంటే చాలు కడుపు నిండుతుంది చారెడు పప్పు తీసుకుంటూ సరిగాని, అమ్మాయ్! కాస్త మాట దక్కిస్తావుగా? +మహలక్ష్మమ్మ మజ్జిగ మాటేనా? నువ్వింత యిదిగా అడుగుతూ వుంటే కాదనగలనా, అన్నయ్యా? +సీతాపతి కాదన్నమాట నీనోట రావడమే! కన్నుచూసి కాటిక; “పిర్రచూసి పీట” వ్యవహారం కాదు నీది. కలవారైనా, లేనివారైనా, చుట్టపక్కాలందర్నీ ఒబ్బు మాదిరిగా చూసుకుంటావ్. నువ్వు అడుగుపెట్టిన వేళావిశేషం వల్లనే ఈ యింటి కింత అయిశ్వర్య మబ్బింది. +మహలక్ష్మమ్మ ఆఁ! నాదే మున్నదిలే! అది మా అబ్బాయి అదృష్టం. వాడు కడుపున పడ్డాకే మాకు కలిసొచ్చింది. +సీతాపతి ఔనమ్మా! బిడ్డ పుట్టినవేళ, గొడ్డు వచ్చినవేళ” అన్నారు. వాడి దసలు సిరిగల ముఖం. వాడికంటె తెలివి గలవాడు ఈ వూళ్ళో వున్నాడా! వాణ్ణి మించి చదువుకున్నవా డున్నాడా? వాడి మాట, వాడి మంచి, వాడి మర్యాద వాడికి వాడే తగు! +మహలక్ష్మమ్మ ఔనన్నయ్యా! ఊళ్ళో వాళ్లందరు వాణ్ణి నెత్తినెట్టుకుంటారు. కాని, మీ బావయ్యకుమాత్రం వాడి పొడయినా గిట్టదు. అది మరి వాడి ఖర్మమో, నా ఖర్మమో! +సీతాపతి ఆఁ! మా బావయ్య మాటల కేమిలే? నా యింటికి నేనే పెద్దను, పిల్లికి పెట్టరా పంగనామాలు” అంటాడు. ఆయన మాటల్ని నువ్వు పట్టించుకో వద్దమ్మా! మన వెంకట్రావుకేఁ? నిక్షేపంలాంటివాడు. తల్లికి తగినబిడ్డ; ఇంటికి తగిన పందిరి” అన్నారు. వాడి వన్నీ అచ్చంగా నీ పోలికలే! కట్టుకున్న పెళ్ళాం మంచితనం మా బావయ్యకు తెలిసింది కనకనా. కన్నకొడుకు మంచితనం తెలియడానికి? పెద్ద లన్నారుగా “చూడగా, చూడగా గుర్రం గాడెదైం” దని. +మహలక్ష్మమ్మ నువ్వు నిజం పలుకుతా వన్నయ్యా! వాడికి వడసారం యిరవై యేళ్ళయినా లేవు. అభం శుభం యెరగని పిచ్చి సన్నాసి. ఇప్పణ్ణుంచీ వాణ్ణి సంసారం తీర్చి దిద్దమంటాడు మీ బావయ్య. +సీతాపతి (తిరిగి కందిపప్పు అందుకోబోగా, మహలక్ష్మమ్మ తానే చారెడు తీసి, అతని చేతిలో పోస్తుంది తనలా అందరూ నమలకుండా మింగాలంటాడు. ఇప్పుడేమంత పట్టించు కోకుండా తిరిగినా, నాలుగేళ్లు పైబడితే, అంతా వాడే దిద్దుకు పోడూ?“తుళ్ళే యెద్దే గోనె మోసేది.” +మహలక్ష్మమ్మ ఇప్పుడైనా ఏవో మీటింగులు. గీటింగులైతే వెళ్ళడం తప్ప, వాడైనా ఏమీ అల్లరి చిల్లరిగా తిరగడం లేదు. +మహలక్ష్మమ్మ ఔ నన్నయ్యా! అందరికీ చెడ్డ యిబ్బందిగానే వుంది. +సీతాపతి నిజమే నమ్మా! ఇంతో అంతో అందరికీ యిబ్బందిగానే వుంది. కాని, మాకు మరీనీ! ముతక సామెత చెబుతారు చూచావ్ “మొగుడు లేకపోతే అప్ప మొగుడు; కూర లేకపోతే పప్పుకూర” అలా +వుంది మా పని. సాంబారు కారం, మామిడికాయ పచ్చడి పూటపూట యెదానవేసి కొట్టుకుంటున్నాం. నోరు చవి చచ్చిపోయిందంటే నమ్ము. అయితే, అమ్మాయ్! మా బావ వామిదొడ్డిలో కందా పెండలం పండించాడటగా? నీకు పుణ్య ముంటుంది మాకు కాస్త పంపిద్దూ! +మహలక్ష్మమ్మ ఆఁ! దాని కేమి భాగ్యం! రేపో మాపో అలాగే పంపిస్తాలే, అన్నయ్యా! +సీతాపతి తోడబుట్టిందైనా అంత మాట మా మంగినోట వొచ్చింది కాదు. “మాటలు తేటలు మాయింటను; మాపటి భోజనం మీ యింటను” అంటుందది. సరిగాని అమ్మాయ్! నే నెళ్ళి మన వెంకట్రావును కూకేసి రానా? +రామయ్య (దస్తావేజుతో చావిడిలోకి తిరిగి వస్తూ):వొద్దులే! వాడికేం తీపరమా?వాడి కడుపు కాల్తే వాడే వస్తాడు. +మహలక్ష్మమ్మ మీదంతా అడివిగోల! కాస్త వెళ్ళి పిలుచుకు రానిద్దురూ! వాడికోసం నేను కనిపెట్టుకు కూర్చున్నా. +రామయ్య (తిరిగి పడకకుర్చీలో కూర్చుంటూ):వాడు పెత్తనాలు చేస్తుంటే, వాడికోసం నువ్విగరడం దేనికి? నువ్వెళ్ళి భోంచెయ్యి. +మహలక్ష్మమ్మ నా మాట కే మొచ్చె? భోంచేస్తా లెండి. +రామయ్య వాడికోసం కనిపెట్టుకు కూర్చుంటూ వేళకూ, పాళకూ తిండి తినకపోతేనే ఈకాడి కొచ్చావ్. నువ్వు మూలబడితే ఇంటి చాకిరి నీ సవితి ఎవతొచ్చి చేస్తుంది? +మహలక్ష్మమ్మ (కోపంగా, చేట పుచ్చుకు లేచి చాల్లెద్దురూ! ఎవరైనా వింటే నవ్విపోతారు. బాగూ, ఓగూ లేదు. నోటి కెంతొస్తే అంతా అనేస్తారు.(పడమటింటిలోకి చరచర వెళ్ళిపోతుంది. +సీతాపతి (ఒక క్షణం తర్వాత ఏదీ, రామయ్య బావా! పుగాకు తునక. +రామయ్య (జేబులో నుంచి పొగాకు లెదర్ కేస్ తీసి, ఒక తునక అందిస్తాడు. తనకోసం ఒక తునక తీసుకుని, కేసును మళ్ళీ జేబులో పెట్టుకుంటూ కుర్రవాడు పెరిగొచ్చాడు గదా, ఇఖ చిన్నపనికీ పెద్దపనికీ ఆదుకుంటా డనుకున్నా. నేనైనా ఇంకెంత కాలం మొయ్యగలను ఈ బరువంతా? +సీతాపతి (పొగాకు వాసన చూస్తూ ఆఁ! నీ బరువు నీకే కాని వాడికేం తెలుస్తుంది మోసేవాడికే తెలుసు కావిడి బరువు.” +రామయ్య నేనైనా ఒఖ్కసారిగా వాణ్ణి బరువంతా యెత్తుకో మన్నానా? ఇప్పటినుంచీ కాస్త కాడికింది కొస్తే మంచిదని మొత్తుకుంటున్నా. +సీతాపతి (పొగాకును పాయతీసి, ఉఁడచేసి, రొంపిని దోపుకుంటూ అదీ నిజమే!“మొక్కై వొంగనిదే మానై వొంగుతుందా?"పొలంపని చేతనైనా, కాకపోయినా, ఇప్పటి నుంచీ ఏదో కాస్త కలుగజేసుకుంటూ వుండాలి మరి +రామయ్య పొలంపని చేతకాకపోతే పాయె! కరణం లెఖ్కలూ, కోర్టు దస్తావేజులూ అయినా చూసుకోరాదూ? బియ్యే వరకు మిడికినవాడికి ఆమాత్రమైనా చేతకాదూ? +సీతాపతి “చదువుకున్న వాడికంటె చాకలివాడు మేలు.” ఏమిటో ఈ కాలం చదువులు! బియ్యె, గియ్యె సతికా మంటారుగాని, చివరికి చూడబోతే నోటుమీద వసూలెయ్యడమైనా చేతకాదు. +రామయ్య ఏం చదువులో చట్టుబండలు! మొన్న ప్లీడరుగారి దగ్గరి కెళ్ళి, దావా వాయిదా వేయించుకు రారా అంటే, తెడ్డేమిరా కదిలాడు కాదు. +సీతాపతి “మాటలు కోటలు దాటతాయి; కాలు గడప దాటదు.” +రామయ్య: అబ్బే! అదీ లేదు. ఇంటి పనికైతే మొండి కాని, ఊళ్ళో పనికైతే యెగిరి గంతేస్తాడు. అడ్డమైన పనికీ, అడ్డమైన వాడితో, అడ్డమైన చోటుకు తిరిగి, కొంపకేమి ���ేటు తెస్తాడోనని బెంగపడి ఛస్తున్నా. +సీతాపతి నిజమే రామయ్య బావా!“పోరాని చోట్లకు పోతే, రారాని మాటలు రాక మానవు”. తన కేమి తక్కువ? మహరాజులా అనుభవిస్తూ ఇంటి పట్టున కూర్చోక, లేని పోని గొడవలన్నీ మనవాడి కెందుకో? కాలిది తీసి, నెత్తికి రాసుకోవడ” మంటారు దీన్నే. +రామయ్య అబ్బబ్బబ్బే; ఇంటిపట్టున కూర్చుంటే యెలా? అయితే, మరి సభ లెవరు తీరుస్తారు? ఉపన్యాసా లెవరిస్తారు? +సీతాపతి పగటి మాటలు పనికి చేటు; రాత్రి మాటలు నిద్రచేటు.” ఎందుకొచ్చినట్టు ఈ సభలూ, గిభలూ రామయ్య తుమ్ముతాడు) చూచావ్, నామాట నిజం తుమ్ము తమ్ముడై చెబుతుంది”. సరిగాని, రామయ్య బావా! నా ఆకుమడి బొత్తిగా అంటనే లేదు. దరిద్రుడు తలగడగబోతే, వడగండ్లవాన వెంబడే వచ్చిం”దట. పదిపోగుల ఆకు తక్కువ పడితే, నువ్వు ఎలాగైనా కాస్త మాట దక్కించాలి. +రామయ్య తడు పందక మా ఆకుమడీ అంతంత మాత్రంగానే వుంది. మీ తమ్ముడు లక్ష్మయ్య నడగరాదూ? ఎకరం మడిపోశాడట. +సీతాపతి నంబీ! నంబీ! నా పెళ్ళి కేమి సాయం చేస్తావంటే, నే నెదురు రాకపోవడమే సాయమన్నా"డట. అబ్బే! వాడి నడిగితే మాట పోతుంది. కాస్త రాలిస్తే నువ్వే రాల్చాలి. +రామయ్య సరే! వీలును బట్టి చూస్తాలే ఏమైనా పొలంపనీ, ఇంటిపనీ, కోర్టుపనీ అన్నీ నేనే చూచుకోవాలి. వాడేమీ పట్టించుకోడుగదా? ఇటు వ్యవసాయానికీ, అటు ఉద్యోగానికీ కాకుండా చెడిపోయాడు. తాలూకా సభలనీ, జిల్లా సభలనీ చీటికీ మాటికీ బస్సెక్కి బస్తీలకు పరిగెత్తడం ప్రారంభించాడు కూడా. తన కోసం రామయ్య తీసి పెట్టుకున్న పొగాకు తునక కుర్చీపక్కకు జారి పడుతుంది. అతడు దాన్ని గమనించడు. +రామయ్య వాడా? వాడి పేరు గుర్నాధం కాదూ? +రామయ్య మన కొక అంటా, సొంటా? వాడితో వీడికి జత లేమిటో? +సీతాపతి అంటూ, సొంటూ కాకపోవడ మేమిటి?“వాడి తండ్రీ, వీడి తండ్రీ సయానా మగవాళ్లు” కారూ? +రామయ్య అప్పులపాలై వాడు కొంపా గోడూ తెగనమ్ముకున్నాడు. వాడితో +సీతాపతి కొంపా గోడూ లేకపోతే మాత్రమేఁ? పొద్దస్తమానం చేతిలో సంచొకటి వుంటుందిగా?ఇల్లు కాలింది జంగమయ్యా అంటే, నా జోలే, కప్పెరా నావద్దే వున్న"వన్నాట్ట. +రామయ్య ఆ గుర్నాధం తాడూ బొంగరం లేని సన్నాసి, సభలనీ, సంఘాలనీ రెండు, మూడు దఫాలు జెయిలుక్కూడా వెళ్ళాడు! వాడికేఁ! వా డెన్ని వేషాలైనా వేస్తాడు. +సీతాపతి ఔను! “కోటి విద్యలు కూటి కొరకే.” వాడికేఁ! వాడన్నింటికీ తెగించి కూర్చున్నాడు. ఆ గుర్నాధంగాడు “నాడువుంటే నవాబుసాయబు, అన్నంవుంటే అమీరుసాయబు, బీదపడితే పకీరుసాయబు; చస్తే పీరుసాయబు ఏం జరిగినా, వాడికి పోయే దేదీ లేదు. +రామయ్య (మనస్సు ఎక్కడో వున్నట్టు ఔనౌను. +రామయ్య (నిట్టూరుస్తూ ఊఁ! ఆ బికారితో సమానంగా తిరిగితే ఇఖ మావాడు ముందు కొచ్చినట్టే! చూడగా నా బ్రతుకంతా బుగ్గయిపోయేలా వుంది. వాడికోసం కాకపోతే, ఈ దేవులాటంతా నాకు దేనికి? +సీతాపతి ఎవరైనా రేపన్న రోజున్నదని కొనాలి.“రూకలేనివాడు పోక చెయ్యడు."పోనీ, మంచో చెడ్డా తనకోసం తను ఖర్చు పెట్టుకుంటున్నాడు సరే! కాని, వాడికోసం కూడా మనవాడు ఖర్చు పెట్టడం దేనికి? అంతో, ఇంతో ముట్టినంత వరకు వాడు బాగానే అంట కాగుతాడు. వెనకటికి “ఎక్కడికి పోతావు విధవమ్మా?” అంటే, “వెంటనే వస్తాను పదవమ్మా” అనిందట. వాడితో ఈతం చేస్తే మన వెంకట్రావు +(వెంకట్రావు ప్రవేశిస్తాడు.ఇరవై యేళ్ళవాడు. తల్లి పోలికల కంటె తండ్రి పోలికలే యెక్కువ. ఖద్దరు ధోవతి కట్టుకుని, రౌండ్ కాలర్ ఆఫారం వేసుకున్నాడు. +వెంకటరావు సీతాపతి మామయ్యా! నా ప్రశంస చేస్తున్నా వేమిటి? +వెంకటరావు ఏమీ లేకపోవడ మేమిటి? ఇప్పుడే ఏమిటో అంటున్నావుగా? +సీతాపతి ఆఁ! ఏం లేదురా, బాబూ! +వెంకటరావు: ఏమీ లేకపోవటమేమిటి? ఇప్పుడే అంటున్నావుగా? +సీతాపతి అబ్బే! మరేమీ లేదు. నువ్వింకా అన్నానికి రాలేదని మీ అమ్మంటే మాటెంట మాటొచ్చింది. +వెంకటరావు ఏమైనా నావూసు నీకు దేనికి? +సీతాపతి “దూడా, బర్రె వుండగా గుంజ అరిచిం” దన్నట్టు, నీవూసు నాకు దేనికిరా, బాబూ! ఇంత పొద్దుపోయింది, ఇంకా అన్నానికి రాలేదని మీ అమ్మంటే +మహలక్ష్మమ్మ (పడమటింటిలో నుంచి వచ్చి ఔనురా, నాయనా! ఇంత పొద్దయేదాకా వుండకపోతే, వేళ కొచ్చి రెండు మెతుకులు తిని వెళ్ళరాదూ? +వెంకటరావు ఏమంత పొద్దు పోయిందమ్మా? నీ దంతా చోద్యంకాని! ఇంకా తొమ్మిదైనా కొట్టలేదు. +రామయ్య ఉహుఁ! పొద్దు పోనేలేదు. మరి కాసేపు పెత్తనాలు మిడికిరా! +మహలక్ష్మమ్మ సర్లేమీ రూరుకుందురూ! వా డింటి కొచ్చేసరికి కసురుకుంటారు కొడుకుతో) రా, నాయనా! నువ్వు రా! కాళ్లు కడుక్కో! అన్న మొడ్డిస్తా.(మహలక్ష్మమ్మ పడమటింటిలోకి వెడుతుంది; వెంకటరావు +రామయ్య: చూశావా, వాడి వాలకం! నిజానికి దాని అలుసు చూసుకునే వా డింత నెత్తి కెక్కాడు. పనిపాటులు లేక పోయినా, వేళకు భోజనం చెయ్యడానికైనా తీరుబాటు కావడం లేదు. +సీతాపతి కుక్కకు పనీ లేదు! తీరుబాటూ లేదు” అని వెనుకటికి నీబోటి పెద్దవా డెవడో సామెత చెప్పలేదూ, రామయ్య బావా? +వెంకటరావు(ప���మటింటిలోనుంచి చరాలున తిరిగివచ్చి):ఏమిటది? పిచ్చిపిచ్చిగా వాగుతున్నావ్ +సీతాపతి మనుషు లుండరు గాని, మాట లుంటా” యని పెద్దలన్నారు. కాస్త పెద్దంతరం, చిన్నంతరం చూసి మాట్లాడు. +వెంకటరావు మంచి మనిషికొక మాట; మంచి గొడ్డుకొక దెబ్బ” అని కూడా పెద్ద లన్నారు, మా గడప తొక్కొద్దని నీ కెన్నిసార్లు చెప్పలేదు? మళ్ళీ ఎందు కొచ్చావ్? +సీతాపతి “మాటకు మాట తెగులు; నీటికి నాచు తెగులు.” నీతో నాకు మాట లెందుకులే? +వెంకటరావు నీ సామెతలు, గీమెతలు కట్టి పెట్టు, ఆ పప్పులు నా దగ్గి రుడకవ్. జాగ్రత్తగా మసులుకోకపోతే +రామయ్య సర్లే! ఇఖ ఆగు! సంతోషించాం!(సీతాపతి పైకి ఉరకబోతాడు.) +సీతాపతి కాగే కాగే పాలు, రామయ్య బావా! “పిల్లకాకి కేమి తెలుసు వుండేలు దెబ్బ.” +మహలక్ష్మమ్మ (కేక విని లోపలినుంచి అడుగులో వచ్చి నాకు వొక్కగాను వొక్క కొడుకు. వాడింటి కొచ్చేసరికి ఏదో ఒక రభస ప్రారంభం! +సీతాపతి “ఒక కన్ను కన్నూ కాదు; ఒక కొడుకు కొడుకూ కాదు.” +రామయ్య ఒకేసారిగా) ఛా ఛా! అశుభం మాట! +సీతాపతి “పడ్డవారు చెడ్డవారు కాదు.” సరే! అనండనండి!“వోరిస్తే వోరుగల్లే పట్న మౌతుంది.” +రామయ్య (తమాయించుకుని అంటే నీకు కోపం కాని నువ్వన్న మా టేమిటి, సీతాపతీ? +వెంకటరావు శుభం పలకరా మంకెన్నా అంటే, పెళ్ళికూతురు ముం డేదన్నాడట.” ఈ సామెత నీకు రాదేమిటి? సీతాపతి మామయ్యా! +సీతాపతి (దీన్ని వినిపించుకోకుండా ఏదో నోరు జారిందిలే, రామయ్య బావా! +వెంకటరావు (విడిచి పెట్టకుండా కాని, సీతాపతి మామయ్యా!“కాలు జారితే తీసుకోగలం కాని, నోరు జారితే తీసుకోగలమా?” +సీతాపతి (దీన్నికూడా విననట్టే రామయ్యబావా బ్రహ్మకైనా వుండు రిమ్మతెగు” లన్నారు. నే నన్నది పొరపాటే.నువ్వు దాన్ని మనసులో పెట్టుకోబోకు.మరి నే వెళ్ళొస్తాగాని, నారు మాట మర్చిపోబోకు సుమీ. +రామయ్య అబ్బే! వీల్లేదు సీతాపతీ! మాది మాకే చాలదు. +సీతాపతి “దంచి నమ్మకు బొక్కిందే కూలి.” సర్లే! ఇంకొక పుగాకు తునకైనా ఇలా పారెయ్. +రామయ్య ఇందాక చెయ్యి జారింది చాల్లే. +సీతాపతి నాకు తెలుసుగా నీ సంగతి. “ఎక్కడైనా బావగాని, వంగతోట దగ్గర మాత్రం బావ కాదు.” మరి నే నెల్లొస్తాగాని, లక్షువమ్మా! నీ వొళ్లు కాపాడుకో! అసలే బక్క ప్రాణం. రేప్పొద్దున్నుంచీ మజ్జిగనీళ్ళకు పిల్లవాణ్ణి +మహలక్ష్మమ్మ ఒక్క గేదె పాడి. అబ్బే! మాకే తిన్నగా యిల్లు గడవడం లేదు. +సీతాపతి పోనీ లేవమ్మా! వీలు లేనప్పుడు నువ్వేమి చేస్తావు గాన���, కాస్త కందా పెండలమైనా పంపిస్తావుగా? +మహలక్ష్మమ్మ ఊఁ! కందా పెండలం మే మిక్కడ ఆరబెట్టుకు కూర్చోలేదు వెంకటరావు పకపక నవ్వుతాడు. +సీతాపతి నవ్వకు, బాబూ! నవ్వకు నవ్వు నాలుగు విధాల చేటు.”(దారిని పడుతూ) ఇలా నవ్వినవాళ్ళను చాలామందిని చూశాం నడమంత్రపు సిరి నరాలమీది కురుపు.” +పాత్రలు: వెంకయ్య సన్నకారు రైతు, రత్తమ్మ-అతని భార్య, గోపాలరావు- అతని కొడుకు నరసమ్మ అతని తల్లి. +గమనిక ఈ నాటిక ఈ సంపుటిలోని తక్కిన అన్నింటివలె స్వతంత్ర రచన. ఇది దేనికీ అనువాదం కాదు; +అనుసరణైనా కాదు. కాని, దీనిలో హెరాల్డ్ ఛాపిన్ వ్రాసిన "ది డంబ్ అండ్ ది బ్లయిండ్” అనే ఏకాంక నాటిక “ఇన్ఫ్లుయెన్స్” కనబడుతుంది. దాన్ని చదివి వుండకపోతే, దీని రచన బహుశా జరిగివుండేది కాదు. +అది వెంకయ్యగారి యింటివసారా. రాత్రి ఏడుగంటల ప్రాంతం. వసారాలో కుడివైపున వాల్చి వున్న కుక్కి నులకమంచం; ఎడమ వైపున తవుడుమూట, ఉలవలబస్తా, వడ్లసంచులు వగైరా. వసారా మధ్యగా (ప్రేక్షకులకు ఎదురుగానున్న గోడ నడిమిని) లోపలి యింటి ద్వారం. ఈ ద్వారబంధానికి ఎడమ పక్కగా గోడకెత్తి పెట్టివున్న మరొక నులకమంచం. ఇంటిలోపలికి వెళ్ళే ద్వారానికి కాస్త కుడిపక్కగా పాతకాలపు దీప స్తంభంపై కిరసనాయిల్ దీపం బుడ్డి. +వాల్చివున్న నులకమంచం నడిమిని నరసమ్మ చిరుగుపట్టిన జంఖానా పక్కగా వేసుకొని కూర్చుని వుంటుంది. +వయస్సు డెబ్భై ప్రాంతాలగాని, అరవై మించినట్టు ఒప్పుకోదు. వయస్సు పూర్తిగా మళ్లినదైనా ఓపిక ఉడగ లేదు; చూపుకూడా ఏమంత తగ్గలేదు. +దీపపు బుడ్డి వద్ద పుస్తకాలు చుట్టూ పరుచుకుని, గోపాలరావు ఈ అబ్బాయి ముద్దు పేరు “గోపి” పాఠాలు చదువుతూ వుంటాడు. ఏ డెనిమిదేళ్ళవాడు. నాయనమ్మ శిక్షణ కారణంగా ముదిమాటలు మాట్లాడ్డం కద్దు. +రత్తమ్మ గయ్యాళివలె పైకి కనబడినా, మనస్సు మెత్తనిదే. సంస్కారం శూన్యం. దానికి లేమి తోడైంది. కోడికూతతో లేచినా రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటలవరకు తెమలని పని. అంతూ పంతూలేని పనివల్లనే చెడ్డ విసగటగా వుంటుంది. వయస్సు ముప్ఫై అయిదుకు మించదుగాని, నలభై నిండినట్టు కనబడుతుంది. లేక లేక ఒక పిల్ల, ఒక పిల్లవాడు కలిగారు. +వెంకయ్య నలభై ఏళ్ళవాడు. రెండు, మూడెకరాల ఆసామి. చిన్న పాలేరైనా లేకుండా సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్న వాడు. వ్యవసాయపు పనులు లేని రోజులలో కిరాయి ఆడతాడు. పొద్దస్తమానం నడుములు విరిగేలా పాటుపడేవాడు కాబట్టే, చిర్రు బుర��రు లాడుతూ వుంటాడు. +తెర లేస్తుందనగానే ఎక్కాలు చదువుతున్న గోపి పొలికేకలు, మంచం నడిమిని కూర్చుని గాలితోనైనా పోట్లాడగల నరసమ్మ సణుగుడు ప్రారంభమౌతుంది. +గోపి (తాపీగా ఒక ఏడు ఏడు; రెండేళ్ళు పధ్నాలుగు గబగబ) మూడేళ్ళు ఇరవై ఒకటి; నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది; అయిదేళ్ళు ముప్ఫైయేడు (తనకే సందేహం తోచగా, కళ్ళు తెరిచి, ఎక్కాల పుస్తకం చూచి, తప్పు దిద్దుకుంటూ) అయిదేళ్ళు ముప్పై అయిదు; ఆరేళ్ళు నలభై రెండు; ఏడేళ్ళు నలభై తొమ్మిది; ఏడేళ్ళు నలభై తొమ్మిది; ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్ళు ఆఁ ఎనిమిదేళ్ళు ఊఁ ఎనిమిదేళ్ళు (కళ్ళు మరింత గట్టిగా మూసుకుని) ఆఁ ఊఁ ఎనిమిదేళ్ళు (తుపాకి పేల్చినట్లు) యాభై ఆరు; తొమ్మిదేళ్ళు అరవైమూడు (గమ్యస్థానాన్ని చేరేటప్పుడు కలిగే సంతృప్తిని ధ్వనిస్తున్నట్టుగా) పదేళ్ళు డెబ్బై (దీపం బుడ్డి పైకి వంగి) పదకొండేళ్ళు +నరసమ్మ జుట్టు కాలేను. తిన్నగా కూర్చోరా, బాబూ! +గోపి (విసుగ్గా ఏమిటే నాయనమ్మా! చెవికింద నీ రొద. నేను చదువుకుంటావుంటే +నరసమ్మ సదువూ, సట్టుబండలూ! దీపంమీదికి వొంగబడతావు దేనికిరా? కాస్త అవతలికి జరుగు. నీకు పున్నె ముంటుంది. +గోపి అబ్బ! సరేలేవే మళ్ళీ తన ధోరణిలో పడి) పదేళ్ళు డెబ్బై; పదకొండేళ్ళు డెబ్బైయేడు (పట్టు విడుస్తున్నట్లు) పన్నెండేళ్ళు ఎనభైనాల్గు. +( గోపి వెనుకకు వెళ్ళి ఎక్కం వల్లిస్తుంటాడు. నరసమ్మ తనలో తనేమో గొణుక్కుంటూ వుంటుంది. ఇంతలో లోపలినుంచి చంటి పిల్ల ఏడ్పు ప్రారంభమౌతుంది. +గోపి (ఎక్కం వల్లించడం చాలించి అమ్మా! అన్నం పెట్టవే! +రత్తమ్మ (లోపలినుంచి ఆగరా! కాస్త ఆగు! చె య్యూరికే లేదు. పెడతాలే. +గోపి నా కాక లేస్తున్నదే, అమ్మా! +రత్తమ్మ (లోపలినుంచే ఆగమనేది నిన్ను కాదట్రా! +గోపి (మారాం చేస్తున్నవాడివలె ఉహుఁ! ఇప్పుడే పెట్టాలి! +నరసమ్మ ఆడి కడుపు సచ్చిపోతున్నది. ఆడికి రెండు మెతుకు లెట్టరాదటే, రత్తమ్మా! +రత్తమ్మ (చరచర వసారాలోకి వచ్చి నీకేం? మంచం నడిమిని కూర్చుని ఎన్నైనా చెబుతావ్!ఇక్కడ ఈ మాయదారి పిల్ల కుయ్యో, మొర్రో మని యేడుస్తుంటే, ఎట్టా పెట్టమంటావ్? +నరసమ్మ దాని కడుపుకి ఆమదం పెట్టకపోతే +నరసమ్మ దాని కింకా ఏడాదైనా వెళ్ళలేదు. వారాని కొకసారి ఆమదం పెట్టుకుంటా రటేఁ? మా కాలంలో +రత్తమ్మ (వెటకారంగా ఊఁ! మీ కాలంలో? +నరసమ్మ నాకు దేనికిలే తల్లీ? నే నేమన్నా నీకు కంపరంగానే వుంటుంది. +రత్తమ్మ ఏమంత పొద్దుపోయిందని? ఇప్పుడేగా దీపా లెట్���ింది! ఆ సతుకుడేమిటో మరి కాసేపు సతుకు. +రత్తమ్మ రెండు పొలికేక లెట్టేసరికి ఇవ్వాల్టికి చదువైపోయిం దన్నమాట. మొన్న పరిచ్చలో అన్నీ గుండు సున్నాలొచ్చాయి. సదువంటే నీకు గొంతు పట్టుకుంటుంది. తినమంటే తింటావ్ ఒక బొచ్చెడైతే. +రత్తమ్మ ఇఖ చదవ్వేం? ఏదీ పుస్తకం పట్టు! పడతావా, ఈ చెంపా, ఆ చెంపా వాయించమంటావా? +రత్తమ్మ (చెయ్యెత్తి పట్టు! పుస్తకం పట్టు! +గోపి (ఏడుపు ముఖం పెట్టి ఊఁ! ఊఁ! ఉఁ! +నరసమ్మ ఆడి పైన సేయి సేసుకుంటా వెందుకే? ఆడి కాకలై ఆడు కొట్టుకుంటూంటే +రత్తమ్మ పిల్లవాడి వైపునుంచి అత్తవైపు తిరిగి సర్లే! గారాం చేసి నువ్వే వాణ్ణి సగం చెడగొడుతున్నావ్! +నరసమ్మ మేమూ కన్నాం పెంచాం కాని, ఇంత యిడ్డూరం ఎక్కడా యెరగ మమ్మా! +రత్తమ్మ నేనూ చాలామంది అత్తముండల్ని యెరుగున్నాకాని +నరసమ్మ అయ్యొ! అయ్యొ! ఎంతమాట! పెద్దదాన్ని నన్ను పట్టుకుని ముం డంటావటేఁ? +నరసమ్మ అనలా? అని లేదంటావు దేనికి? +రత్తమ్మ ఒట్టు వేసుకుంటావ్ ఆమాట నే నన్నానని? +నరసమ్మ ఎదురు ఒట్టుకూడా దేనికిలేఁ! ఇంతకూ నాకు సావురావడం లేదు. ఆ మారాజుండగానే, నేను మట్టి కలిసిపోతే అందరిచేతా ఈ మాటలుపడే ఖర్మ నాకెందుకు పట్టేది? కాలూ, సెయ్యీ ఆడుతుండగానే తను దాటుకుని, నన్ను ఈ ముళ్ళ కంపలో పెట్టిపోయాడు. +(ఇలాగే నరసమ్మ ఏమేమో గొణుగుతూనే వుంటుంది. మధ్య మధ్య ముక్కు చీదివేస్తూ వుంటుంది. +రత్తమ్మ (తిరిగి చెయ్యెత్తి చదువుతావా? రెండొడ్డించ మంటావురా? +గోపి (వాచకం తీసి గొణుగుడుగా ఒక పట్టణమున ధనవంతుడగు వైశ్యు డొక డుండెను. అతని +రత్తమ్మ ఏం! అంకిళ్ళు నొక్కుకు పోయాయా? గొంతే లేవడం లేదు! +గోపి (బిగ్గరగా, కాని, గాద్గదికంగా బిడ్డ లొక్కచో జేరి యాడుకొనుచుండగా, నొక కాకిపిల్ల వారి సమీపమున బడెను. దానిని సంతోషమున +రత్తమ్మ అంతేలే! నీకు చదువు పేరు చెప్తేనే వలవల యేడు పొస్తుంది. +గోపి (ఏడుపు దిగమింగడానికి ప్రయత్నిస్తూ దానిని సంతోషమున దీసుకొని, యా బిడ్డలు దినదినము తమ యెంగిళ్ళు పెట్టి దానిం బెంచిరి. అదియు మిక్కిలి కొవ్వి, గర్వించి +రత్తమ్మ (లోపల పిల్ల ఏడ్పు ఎక్కువ కాగా ఆసి దీని పీకపిసక! ఏమి యేడుస్తున్నది! ఏమి యేడుస్తున్నది రత్తమ్మ లోపలికి వెళ్లిపోతుంది +గోపి (మధ్య ఒక క్షణంపాటు ఆపిన చదువును తిరిగి సాగిస్తూ అదియు మిక్కిలి కొవ్వి, గర్వించి, ప్రపంచమున దానిపాటి పచ్చులు లేవనియు, బ్రమ్మదేవుడు స్రుష్టించిన సమస్త పచ్చులకు దాను సార్���భౌముడనియు భావించి, యెవ్వరిని సరకు సేయకుండెను. అటులుండ నొకనాడు అంసలు కొన్ని సముద్రతీరమున వాలియుండ వైచ్యపుత్రులు కాకికి అంసల జూపి యిట్లనిరి “ఓ పచ్చిరాజా! పచ్చులకన్నింటికీ నీవు చక్రవర్తివి. నీవలె బాడగల పచ్చి లేదు. నీవంటి యందమైన పులుగు లేదు. నీలాగున నెగిరి పరుగెత్తగల వియంగములేదు. ఈ అంసల జూడుము ” +(లోపల పిల్ల ఏడుపుతోపాటు రత్తమ్మ విసుగుదల, రత్తమ్మ విసుగుదలతోపాటు పిల్ల యేడుపు ఎక్కువౌతూ వుంటాయి. బుజ్జగింపుల మధ్య “నీ తిల్లికార!”, “నీ కడుపుడక”, “నా ప్రాణానికి నువ్వెక్కడ దాపరించావే!” మొదలైన దీవనలు వినబడుతూ వుంటాయి. తల్లి వేరే ధ్యాసలో వున్నది కదా అని గోపాలరావు చదువు మానివేసి వాచకాన్ని విసిరి కొడతాడు. +నరసమ్మ(రహస్యం చెబుతున్నట్టు దెబ్బలెందుకు పడతావురా,బాబూ! సదువుకో! మరి కూసేపు సదువుకో! +నరసమ్మ (అంకిలి నొక్కుకుంటూ అదొచ్చిందంటే మళ్ళీ యిరుసుకు పడుతుందిరా! సదువుకో! నా మాటిని సదువుకో! +రత్తమ్మ (లోపలినుంచి వచ్చి వీపు దెబ్బల కేడుస్తున్న దేమిరా? మళ్ళీ మానేసి కూర్చున్నావ్? +గోపి (చేతికందిన పుస్తకం చప్పున తీసి, మధ్యలో విప్పి మొండె మందలి వెన్నెముక, వెన్నుపూస లనబడు ముప్పది మూడు చిన్న యెముకలచే కూర్పబడి యున్నది రత్తమ్మ లోపలికి వెళ్ళిపోతుంది.) +ఎడమబాగమందు ఏడు, రొమ్ముబాగమందు పండెండు, నడ్డి బాగమందు ఐదు, తుంటి బాగమందు అయిదు, తోక బాగమందు నాలుగు +నరసమ్మ తుంటేమిటి? తోకేమిటి? ఏమి సదువు యివి? మాకాలంలో మే మిలాంటి వెరగం. ఏదో బారతమనీ, బాగోతమనీ, రామాయనమనీ అంతేగాని మేమీ సోద్యా లెరగం. ముసిలిముండని, నేనుకూడా కాస్త యింటా. +గోపి ఊఁ! పోవే, నా కాకలై నే చస్తూవుంటే +నరసమ్మ నిజమేరా, బాబూ! సదువుకునే వాళ్ళ కసలు యేడి తల కెక్కుతుంది. ఏళకూ పాళకూ ఆళ్ళకు తిండీ తిప్పలూ లేకపోతే, మెదడు కరగిపోతుంది. మా కాలంలో సర్లే! ఎందుకొచ్చింది కాని మరి కూసేపు సదువుకో బాబూ! నా నాన్నవుగా! నేను యింటా! ఏదీ ఒక పద్దెం సదువు +ఎలుక తోలు తెచ్చి ఎందాక నుతికినా *నలుపు నలుపెగాని, తెలుపు కాదు;కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా *విశ్వదాభిరామ వినురవేమ. +నరసమ్మ తుంటీ తోకా ఐందీ ఎలికీ, పిల్లీ, కుక్కా నక్కా అని మొదలెట్టావ్! రామా, క్రిష్ణా అనే ముక్క చెవినేసుకుందామంటే, అది యినపడనే యినపడదుగదా! +గోపి విశ్వదాభిరామ వినురవేమ”లో “రామా” లేదటే? +నరసమ్మ రామాయనంలో ఎలికీ, పిల్లీ ఎందుకొస్తాయిరా? +గోపి ఊఁ! పోవే నీ మొగం! నీ కేం తెలుసునని!(సర్వం తనకే తెలుసునన్న దర్పంలో పద్యాన్ని వల్లె వేయడం ప్రారంభిస్తాడు. +నరసమ్మ (తనలో తను చిన్నాళ్ళ మొదలు, పెద్దాళ్ళ దాకా అందరూ నన్నిదిలించి పారేశేవాళ్లే! కాలం మారిపోయింది. మా కాలంలో ఆ రోజు లిప్పు డెందుకొస్తాయి? అప్పుడు పెద్దాళ్ళకు సచ్చినా ఎదురు సెప్పేవారా? సెబితే బతక నిచ్చేవారా? మా అత్తముండమానానికి మా అత్తముండ కూసుంటే ఒక మొట్టికాయ, నుల్చుంటే ఒక మొట్టికా యేసేది. ఇఖ మా మామగున్న వున్నాడంటే, “సొబ్బన్న” అని పేరు సెబితే సాలు, కాకులు నీళ్ళు తాగేవి కావు. ఆ రోజులూ పోయాయి, ఆ మడుసులూ పోయారు ఒకటి రెండు క్షణాలపాటు ఆగి) తెకతెక లాడిపోతోంది. వాన కురుస్తుందేమో! కురిసేది, బాగా కురిసినా బాగుండును; రెండు ఉబ్బ సినుకులు పడిపోతున్నది. పని సెరుపు తప్ప మ రేమీ లేదు. మా కాలంలో ఆసాడ మాస మొచ్చేసరికి కుండలతో దిమ్మరించేది. శావణ మొచ్చినా, ఇప్పుడు సరిగా వానే లేదు. కాలం మారినట్టే, అదీ మారింది (ఒక క్షణం ఆగి) పొన్నిగారిసత్తి కూతురిసేత శావణ సుక్రారం నోము నోయించింది కామాలు. అప్పయ్యగారి కోడలు పప్పు లుచ్చుకుని, ఊరెంట తైతక్కమంటున్నది. అమ్మో! అదెక్కడ! అది గజ్జెలగుర్రం! దాన్ని పట్ట పగ్గాలు లేకుండా వున్నాయి. ఏమేఁ కూతరా!”అని పలకరితే, యినిపించుకోకండా సక్కాపోయింది. ఏమి సూసుకునో అంత పొంగు ఇంకొక క్షణం ఆగి) అదుగో! సినుకు మొదలైంది. మా యెంకయ్య పొలంనుంచి రానే లేదు. ఖర్మం! వానలో తడుస్తాడో, ఏమో! నాల్గు రోజుల్నుంచి తీస్తున్నా కలుపు కాకండానే వొచ్చింది. రోజుకు బిళ్ళకుడుంలా రూపాయిస్తున్నా. యిప్పుడసలు కూలోడు పలుకుతున్నాడూ? మా కాలంలో అణా, బేడా యిస్తే చంటిది సందేళ నుంచి తెగేడుతా వుంది. పిచ్చిముండ! దడుసుకున్నదో, యేమో! దానికి వారాని కొకసారైనా దిష్టి తీస్తేగాఁ ఒక క్షణం మళ్ళీ ఆగి) జల్లు పెద్దదైంది. మా యెంకయ్య వెంకయ్య వస్తాడు ఏరా! అబ్బాయ్! ఇవ్వాళ మరీ ఇంత పొద్దయిందేఁ? వానకి తడవలేదుగందా వెంకయ్య జవాబు చెప్పడు. పై పంచెతో తల తుడుచుకుంటూ వుంటాడు) ఉహుఁ! నాతో ఎందుకు పలుకుతాడు! ఏదో ముసిలిముండ దాని వాగు డది వాగుతుందని +వెంకయ్య ఊ! నీ చాదస్తం కాస్త కట్టి పెట్టవే పైపంచె వడ్లబస్తాలమీద ఆరవేయడానికి వెడుతూ, రత్తమ్మ నుద్దేశించి) ఒసేయ్! పొంతని వేన్నీళ్ళు యేమైనా వున్నాయా? +రత్తమ్మ (వసారాలోకి వస్తూ ఆఁ! వున్నాయ్! +వెంకయ్య (కునికిపాట్లు పడుతున్��� గోపితో):భడవా! చదువు పేరు చెబితేనే నీకు కళ్ళు కూరుకొస్తాయ్! పోనీ నిద్దరోయే వాడివి తిన్నగా పోక, గంటంలా దీపం పెట్టి, దానిముందు కునికిపాట్లు పడ్డం దేనికి? +గోపి అమ్మ నా కింకా అన్నం పెట్టలేదు, నాన్నా! +రత్తమ్మ పిల్లది పోరు పెట్టి యేడుస్తుంటే, దాన్ని కాస్త దగ్గరికి తీసే దిక్కేనా వుంటేనా! ఎలా పెట్టను? +నరసమ్మ కూసుంటే లేవలేను; లేస్తే కూసోలేను. నా మొగం దాన్ని నే నెత్తుకోగలనా, పెట్టగలనా? కాలూ సెయ్యీ ఆడుతున్నంతవరకూ సెయ్యలేదూ? వొళ్ళు దాసుకున్నానా? నేను సతమతం కాందే, ఈ కొంప ఒక దిక్కు +వెంకయ్య (రత్తమ్మతో సర్లే! ఆ పొంతలో నీళ్ళిలా తగలెయ్యి! +రమ్మ దూడ నింకా యిడవలేదు. వెంకయ్య ఏఁ! నే నేయేళ కొచ్చినా, నాకోసం ఆ పని అట్టే పెట్టాలా? +రత్తమ్మ నాకైనా పదికాళ్ళూ, ఇరవైచేతులూ లేవు. అన్ని పన్లకీ నే నొక్కదాన్నే ఎక్కడ చచ్చేది! +వెంకయ్య చాల్లే! చెంబిలా తగలెయ్!,రత్తమ్మ విసురుగా చెంబు తెస్తుండగా ఠంగుమని గడప తగుల్తుంది). +వెంకయ్య ఏఁ! అంత దూకుడు! చెంబు పగిలే నీ అబ్బగాడెవడు తెస్తాడు రత్తమ్మ చేతిలోనుంచి చెంబు గుంజుకుని, గోపాలరావుతో) ఓరే! గోపీ! రారా! కాస్త దూడని పట్టుకుందువుగాని. +వెంకయ్య (గద్దిస్తూ మొక్క మొలిచిపోవులే! రా +గోపి ఉహుఁ. చీక టంటే నాకు బయం. +వెంకయ్య వస్తావా? రెం డుతకమంటావా?(గోపాలరావు యిష్టం లేకుండా కదులుతాడు. వెంకయ్య కూడా పశువుల చావడిలోకి వెడతాడు. +రత్తమ్మ (పిల్లదాని ఏడ్పు మరింత ఎక్కువ కాగా ఆసి దీని దుంప తెగ! దీని కడు పుడక! సుయ్యి మనిపించి నన్ను చుక్కల్లో పెడుతున్నది.(లోపలికి వెడుతుంది. +నరసమ్మ నిన్నటి ముండనా, మొన్నటి ముండనా! అప్పుడే అరవై యేళ్ళొచ్చినై. సూపైనా తిన్నగా ఆనడం లేదు. ఇంకా నేను సేసి పెట్టడం లేదని సాదింపులు. ఒకళ్ళ సేత సేయించుకోకుండా వుంటే, నేను సేసినంత +రత్తమ్మ (చప్పున బైటికి వస్తూ ఏరా! ఏమిటి? +గోపి ఎదురొమ్ముమీద తన్నిందే! ఎల్లికిలగా పడిపోయాడు!(రత్తమ్మ గొడ్లచావడిలోకి పరుగున వెడుతుంది.గోపాలరావు అనుసరించబోతాడు. ఎక్కడలేని ఓపికతో నరసమ్మ మంచం మీదనుంచి లేస్తుంది. +నరసమ్మ దీపం తేరా, బాబూ! దీపం తే! సీకటి మేళాంలో కన్నొడుసుకున్నా కనబడ్డం లేదు. పద పద గోపాలరావు దీపం పట్టుకుంటాడు.నరసమ్మ రెం డడుగులు వేసేసరికి, రత్తమ్మ భుజంపై చెయ్యి వేసుకొని వెంకయ్య లోపలికి వస్తాడు. +నరసమ్మ అడుగో! నా బాబే వొస్తున్నాడు! అయ్యె నా బిడ్డా! పొద్దున్నే ఎవడి మొగం ��ూశావురా! +వెంకయ్య ఆఁ! మీదంతా వొఠ్ఠి ఖంగారు, తాపు మోపుగా తగల్లేదు; దూసుకుపోయింది. రత్తమ్మ (దీపం పెట్టి చూస్తూ ఇంత కమిలిపోతే, దూసుకుపోవడ మేమిటి?(ఆగి అక్క డక్కడ బారుగా గీరుకుపోయింది ఇంకా పరీక్షచేస్తూ) రెండు చోట్ల నెత్తురు చిమిర్చింది వేలితో గుండ్రంగా గీసి చూపుతూ)ఇంత లెక్క నల్లగా కమిలిపోయింది. మోపుగా తగలకపోతే ఇంతెందుకు కమిలి పోతుందీ? +(దీపంబుడ్డి కింద పెట్టి, పైటచెంగుతో నెత్తురు చిమిర్చిన చోట అద్దుతుంది. +నరసమ్మ (గాద్గదికంగా అయ్యొ! నా బిడ్డా! నా బిడ్డా +వెంకయ్య ఆఁ! దాని మాటల కేమిలే? గట్టిగా తగల్లేదమ్మా! +రత్తమ్మ అత్తయ్యా! ఈయనగార్ని కాస్త రెక్కట్టుకో! నేను మంచం వాలుస్తా. +వెంకయ్య రెక్కట్టుకోడమా నీ మొఖమా! చాల్లే యిఖ! +నరసమ్మ:(దీన్ని వినిపించుకోకుండా,రెక్క పట్టుకుని ఇంకా నయం! లేసినేళ బాగుంది. బిడ్డవు దక్కావ్! +వెంకయ్య ఊఁ! కాస్తంత గంపెడంత చేస్తున్నారు! +రత్తమ్మ (గోపితో బాబూ! ఆ దీపం అక్కడెట్టి దిండు తే మంచం వాల్చిన తర్వాత, వెంకయ్య రెక్క ఊతంగా పట్టుకుని) రండి! పడుకోండి! కాస్త ఆమదంతో కాపైనా కాస్తా! +నరసమ్మ ఆమదం కాపుకంటె కోడిగుడ్డు పట్టు నయమేఁ-అదైతే తెల్లారేసరికి నెప్పిని లాగేస్తుంది. +వెంకయ్య (మంచంపై నడుం వాలుస్తూ ఆఁ! ఎందుకేఁ కాపులూ, పట్టులూ? అదే పోతుంది. +నరసమ్మ: సున్నం, బెల్లం, చింతపండూ నూరి పట్టేసుకున్నా,వాపు తొరగా తగ్గుతుందిరా, బాబూ! +వెంకయ్య: ఎందుకమ్మా! లేని పోని ఖంగారు? ఏమంత దెబ్బ తగిలిందని? +రత్తమ్మ పాడుదాన్ని! కాస్త నేనే ఉసులు చేసుకుని దూడ నిడుచుకుంటే, ఈ ఖర్మెందుకొచ్చేది? +నరసమ్మ నీ తప్పేముంది లేవే! ఒంటిదానివి. అన్నీ ఎక్కడ దిద్దుకుంటావ్! అది నా సేతిలో నీనిలవదుగాని, ఆ పిల్లదాన్ని నేను సమదాయిస్తే, నువ్వు దూడ నిడుసుకొనే దానివిగాఁ? +రత్తమ్మ ఆఁ! పెద్దతన మొచ్చింది. ఇంకా నువ్వేమి దేవుళ్లాడతావులే! నిన్ను కూర్చోబెట్టి నీకు చేసేదిపోయి, ఇంకా నీచేత చేయించుకోవడమా? +నరసమ్మ ఇంకా కాలూ సెయ్యీ ఆడుతున్నయిగాం! పెద్దపనులు కదలవనుకో! అయినా సిన్నపనికీ, సితకపనికీ నేను నిలబడితే, నీకు కూస్తి తెలిపిగా వుంటుంది. +రత్తమ్మ నువ్వుగనక ఇంకా నీ పనులన్నీ నువ్వే చేసుకుంటున్నావుగాని, నీ వయసొస్తే మేము నీ మంచాన పడతాం. +రత్తమ్మ పాపం! అదింకా గోలపెడుతూనే వుంది. దాన్ని కాస్త తీసుకో, అత్తయ్యా! +నరసమ్మ అట్టాగే నమ్మా వెడుతూ) నా బిడ్డకు లేచినేళ మంచిద��ంది. గండం తప్పింది వెడుతుంది. +గోపి (దిండుతో వచ్చి ఇదుగో నాన్నా! దిం డేసుకో! వెంకయ్య ఆఁ! దేనికిరా, బాబూ?(ఇలా అంటూనే తల యెత్తుతాడు. +రత్తమ్మ (దిండు అంచు పట్టుకుని ఏదీ! కాస్త తలెత్తండి! దిండు సరిగా లేదు. +రత్తమ్మ (దిండు సరిచేస్తూ ఏఁ! కదిలే నెప్పిగా వుందా? +వెంకయ్య: అబ్బే! లేదేం!(గోపాలరావు దిండును తలకిందికి తోస్తాడు. +రత్తమ్మ లేకపోవడ మేమిటి ఒక పక్కని మూలుగుతూ! ఎందుకైనా మంచిది నా మాటిని తవుడు కాపైనా కాయించు కోండి. పొయ్యిలో కాస్త నిప్పేసొస్తా! +వెంకయ్య ఆఁ! అంతగా అయితే తెల్లారి పొద్దున చూసుకో వచ్చులేవేఁ! +వెంకయ్య ఊఁ! నీ మొఖం కాదూ? అదే పోతుంది. +రత్తమ్మ సరే! ఇఖ మీ యిష్టం! +వెంకయ్య (దిండును మరింతగా తలకిందికి తోసుకుంటూ నాయనమ్మ వెళ్లి యెత్తుకునేసరికి చంటిది యేడుపు చాలించింది. +రత్తమ్మ అవును, వెర్రితల్లి! ఆలనా పాలనా ససిగా లేక, చిక్కిసగమైపోయింది. నా చెయ్యడ! దాన్ని యెడా పెడా బాదాను. ఏడ్చేడ్చి పిచ్చితల్లి చిటుక్కున నిద్దరోయింది. +గోపి (కౌగిలినుంచి తప్పించుకుంటూ ఆఁ! లేదు, నాన్నా! +వెంకయ్య (దగ్గరికి లాక్కుని, తన పంచె చెరగుతోనే తల తుడుస్తూ చూడవేఁ! పాపం! పొట్ట వెన్నుకు అతుక్కు పోయింది. +రత్తమ్మ పాపిష్టిదాన్ని! వాడి కింకా తిండీ తిప్పలైనా పెట్టాను కాను. +గోపి ఆనికి తింటా ఇప్పు డాకలి లేదమ్మా! +రత్తమ్మ (నవ్వుతూ ఇప్పుడేగా ఆక లాకలని మారాం చేశావ్? +వెంకయ్య (కొడుకును గుండెకు హత్తుకుంటూ పిచ్చి సన్నాసి! +రత్తమ్మ (కొడుకువీపు నిమురుతూ బంగారు తండ్రి!తెర) +పాత్రలు: పల్లెటూరి రైతు, అతని భార్య, అతని కొడుకు, అతని మనుమడు. +కాలం: వర్తమానం గంటల ప్రాంతాల రాత్రి ఎనిమిది +తెర లేచేసరికి అప్పుడే భోజనం చేసి వచ్చిన రైతు తన యింటి చావడిలో మంచంపై కూర్చుని చుట్ట +కాల్చుకుంటూ వుంటాడు. అతని వయస్సు యాభైకి పైగా, అరవైకి లోపు. బాగా పొడగరి; చేవ తేలిన వొళ్లు. పెద్ద నుదురుతో, పెద్ద కళ్ళతో, అక్కడక్కడ కొంచెం నెరసిన గుబురు మీసాలతో కళగల మొహం. నీర్కావి పంచె కట్టుకుని, నీర్కావి పై పంచె కప్పుకున్నాడు. +చావిడికి నాలుగు ద్వారాలు కనబడుతూ వుంటాయి. కుడివైపున సింహద్వారం; ఎడమవైపున పెరటి గుమ్మం, ఎదుటి రెండింటిలో ఒకటి పడకగది గుమ్మం, రెండవది పడమటింటి గుమ్మం. ఈ రెండింటి మధ్య పడకగదిలోకి కిటికీ. పడమటింటి గుమ్మందగ్గరగా చావిడిలో ఒక ముక్కాలు పీటపై హరికేన్ లాంతరు వెలుగుతూ వుంటుంది. రైతు కూర్���ున్న మంచం కాక, మరొకటి పెరటిగుమ్మం వైపు గోడకాన్చి నిలబెట్టి వుంటుంది. ఇతర సామాగ్రి యేమీలేకుండా చావిడి అద్దం వలె వుంటుంది. రైతు గొడ్ల చావిడి తలవాకిలివైపున, యింటికి యెడమ పక్కగా వుంటుంది. +తెర లేచిన కొన్ని క్షణాలకు, పడమటింటిలోనుంచి మనుమడు పరుగు పరుగున వచ్చి, తాత వొడిలో గారాబంగా వొరుగుతాడు. నాలుగేళ్ళవాడు, చాలా చురుకైనవాడు. +మనుమడు నాకేఁ--మరే కత సెప్పు, తాతా! +రైతు (మనుమని ముఖాన్ని రెండుచేతులలోకి తీసుకుని, నుదురును ముద్దు పెట్టుకుంటూ కథ లొద్దు; కాకరకాయ లొద్దు. పద్యం చెబుతా; నేర్చుకోరా బాబూ మనుమని యెత్తుకుని వొడిలో కూర్చోబెట్టుకుని) “శ్రీరాముని +రైతు “చీ” కాదురా, తండ్రీ! “శ్రీ” +రైతు: ఏదీ? మళ్ళీ అను శ్రీరాముని దయచేతను ” +రైతు అదుగో! మళ్ళీ తప్పే అంటున్నావ్! +మనుమడు నాకు లావడం లేదు, తాతా! +రైతు అదే వస్తుంది. ఏదీ అను! “శ్రీరాముని దయచేతను ” మనుమడు “చీలాముని దయ ” +రైతు (మరింత స్ఫుటంగా ఉచ్ఛరిస్తూ “శ్రీ”(మనుమడు సిగ్గుపడి, కళ్లు చేతితో కప్పుకుని ముసి ముసి నవ్వులు నవ్వుతాడు. +రైతు సరే, నాయనా!నీ కొచ్చినట్టే అనులే! “శ్రీరాముని దయచేతను ” మనుమడు “చీలాముని దయసేతను ” +రైతు సరే! “నారూఢిగ సకలజనులు నౌరా యనగా ” +రైతు (“ఢీ”ని నొక్కుతూ “నారూఢిగ ” +రైతు (మరి లాభం లేదనుకొని “సకల జనులు నౌరాయనగా ” +మనుమడు “చకల జనులు నౌలా యనగా ” +రైతు “నోరూరగ జవులుపుట్ట నుడివెద సుమతీ +రైతు (నవ్వుతూ చెవులు కాదురా! “జవులు +మనుమడు (తాత నవ్వు వల్ల మాట అసలే తెలియక “జలుబు” +రైతు (మరింత బిగ్గరగా నవ్వుతూ జలుబట జలుబు! జలుబెవరికిరా, బాబూ నవ్వు ఆపుకుంటూ) “జవులు” రా! “జవులు" +మనుమడు (మూతి బిగించుకుని నే ననను! +రైతు నవ్వనులే, బాబూ! ఇఖ నవ్వనుగాఁ! ఏదీ? అను! “జవులు” +రైతు పోనీ, వేరే పద్య మేదైనా చెబుతా లేరా, బాబూ! “అక్కరకు రాని చుట్టము ” +మనుమడు నాకు పద్దా లొద్దు. కాకి కత సెప్పు. +రైతు కథలంటే చెవి కోసుకొంటావ్. ఎందుకొచ్చిన కథలు! కూటికా? గుడ్డకా? చక్కటి పద్యాలు నేర్చుకోరా, నాయనా! +మనుమడు ఊఁ! నా కిదొద్దు తాతా! +మనుమడు ఉహుఁ! నాకు కతలే కావాలి. +రైతు సర్లే! నువ్వు పడుకో అట్టాగే చెబుతాలే (మనుమని యెత్తి, మంచంపై పడుకోబెడతాడు +రైతు కాస్త నిదానించరా, బాబూ! ఏదీ దుప్పటి కప్పుకో. +రైతు చలేస్తున్నది. నా బాబు కాదూ? కప్పుకో!(దుప్పటిని చక్కగా కప్పుతాడు. +రైతు: ఎంత ఆరాటంరా నీకు కథలంటే! సర్లే! ఏం కథ చెప్పను? +తాత రోజూ అదేనా? వినడానికి నీకు విసుగు లేకపోతే, చెప్పడానికి నాక కాదట్రా? +మనుమడు ఏం తాతా, కత సెప్పవే?(కప్పుతున్న దుప్పటిని తీసివేయబోతాడు. కొత్తది కోతికథ చెబుతాలే. అనగా అనగా ఒక కోతి +మనుమడు నాకు కోతి కతొద్దు! కాకి కతే కావాలి. +రైతు నీ పంతమే నెగ్గాలంటావ్. సరే! నీ యిష్టం వచ్చినట్టే కానివ్వు. అనగా అనగా ఒక కాకి +రైతు ఆ కాకికి ఒక మాంసంముక్క దొరికింది +మనుమడు నాకు గ్యాపకం లేదు. మళ్ళీ చెప్పు. +రైతు మేకల్ని, గొర్రెల్ని కోసి అమ్ముతాడేఁ! వాణ్ణి కటికవాడంటారు. +మనుమడు: అవి ఏడవ్వూ? తాతా, వాటిని కోస్తే? +మనుమడు ఉంటే మలేఁ-మానాన్న నన్ను కొట్టిస్తే నువ్వడ్డమొస్తావే! అట్టా మలి వాటి తాత అడ్డం లాడూ? +రైతు (మరింతగా నవ్వుకుంటూ, మనుమని చెక్కిలి ముద్దు పెట్టుకుని ఎక్కడినుంచి పుట్టుకొస్తాయిరా నీకీ మాటలు! సరే! కథ విను! మాంసం ముక్క తెచ్చుకుని +రైతు ఆ కాకి ఒక చెట్టుమీద కూర్చుంది +రైతు మన చెరువుగట్టున లేదూ? పెద్ద మర్రిచెట్టు. దాని మీద కూర్చుంది. కూర్చుంటే ఒక నక్కొచ్చింది. +మనుమడు అయితే, నక్క అక్కడి కెట్టా వొచ్చింది? +రైతు రాత్రిపూట ఎవ్వరూ లేనప్పుడు వచ్చిందిలే +మనుమడు చీకట్లో కాకులు తిలగవుగా, తాతా! +రైతు (నవ్వుతూ ఎంత గడ్డుగ్గాయివిరా నువ్వు! తాతను బోల్తా కొట్టించావు. ఔను, బాబూ! నక్కలు పగటిపూట ఊళ్ళోకి రావు; కాకులు రాత్రిపూట గూట్లోనుంచి కదలవు. ఈ కథ పట్టపగలే ఊరుబయట జరిగింది. కాకి మాంసం +రైతు ఊరుబయట ఒక చెట్టు మీద కూర్చుంటే +రైతు “నువ్వు ఎంత అందంగా వున్నావ్! నీ అందంకంటె కూడా నీ పాట మరీ బాగుంటుందట! ఏదీ! ఒక పాట పాడు! వింటా” ననిందట +రైతు అనే సరికి మనుమడు ఊఁ కొట్టడు. +రైతు అనేసరికి ఆ కాకి “కాఁ,కాఁ” అని కూసిందట మనుమడు నిద్రపోయిన సంగతి కానక) కూసేసరికి కాకి నోట్లో నుంచి మాంసంముక్క మనుమడు నిద్రపోయినట్టు తెలుసుకుని) ఏరా, బాబూ! నిద్దరోయావా? మనుమని వీపు నిమురుతూ) పసివాళ్ళు మాట్టాడుతూ, మాట్టాడుతూనే చిటుక్కున నిద్దరోతారు. వాళ్ళకు చీకా, చింతా? కల్లా కపటం యెరగని వాళ్ళ బ్రతుకే బ్రతుకు. వాళ్ళు సాక్షాత్తు ఆ పరబ్రహ్మస్వరూపులే! సంసార లంపటంలో పడిపోయినవాళ్ళకు ఇటు మసలి, అటు మసలి, చివరి కెప్పుడో పడక కుదిరితేనే తప్ప కంటిమీద రెప్పపడదు. ఈ సంసారం, ఈ మమకారం ఆ శ్రీ రఘురాముడి చిద్విలాసం (కళ్లు మూసుకుని నమస్కారం చేస్తూ) అంతా +ద్దాముడు, రాముడే పరమదైవము మాకని, మీయడుఁగు గెం +(ఆవలిస్తూ, చిట���కెలు వేస్తూ, రైతు రామసంకీర్తన చేస్తూ వుండగా భార్య ప్రవేశిస్తుంది. ఆమె వయస్సు దాదాపు యాభై సంవత్సరాలు. కాని, అరవై నిండిన దానివలె కనబడుతుంది. పొట్టిగా; బొద్దుగా వుంటుంది. గుండ్రని ముఖం. ముడతలు పడి కొంచెం దిగజారిన బుగ్గలు. ముప్పాతిక నెరసిన జుట్టు; మధ్య పాపట, కొప్పు ముడి. పెద్ద కుంకుమ బొట్టు. +భార్య దాని ముందేసిన మేత యేసినట్టుగా వుంది. అదేమో కాని మన పెద్దగేదె ఒక్క పరకైనా కొరకడం లేదు. +రైతు కొంపతీసి గాళ్లు తగల్లేదుగదా? ఊరంతా ఇప్పుడీ పాడు జబ్బే. కిష్టప్పగారి దొడ్డిని ఊడ్చేసిందని ఇందాక చెట్టుకాడ చెప్పుకుంటున్నారు. రేపు పొద్దున్నే కామయ్య నొకసారి పిలుచుకొచ్చి చూపిద్దాంలేఁ! ఎడ్లముందు మే +రైతు ఎగదోసి, మరొక జనప కట్టేసి రాకపోయావూ? +భార్య ఎలిసిమీ దుంది. నా కందుతుందా, పెడుతుందా? +రైతు అబ్బాయి అత్తారింటి కెళ్ళిన ఈ అయిదారు రోజుల్నుంచీ వాటికి తిన్నగా నీళ్ళూ మేతా లేవు. వాడుంటే అడుగడుక్కీ వాటి అజా పజా కనుక్కుంటూ వుంటాడు. +భార్య ఆ డెళ్ళి రేపటికి సరిగా వారం. ఈ వారం రోజుల్నుంచీ మనదొడ్డికి అదు పేదీ? ఊరు మందంతా వొచ్చిపడి, యేసిన నాలుగు పరకలు మేసిపోతున్నాయ్. ఆళ్ళ కేం పోగాలమో, మరీ ఆ రత్తయ్యగారి గుంపు పలుపు లిప్పి ఊరుమీది కెగదోలేస్తున్నారు. +రైతు ఊరు మాటుమణిగాక వాళ్ళ గొడ్డుగోదలు అస లెన్నడైనా కట్టుగొయ్యల నుంటేగాఁ! దొంగ రత్తయ్యగారి సంపదని వాళ్లకి మరి వూరికే పేరొచ్చింది? +భార్య ఆళ్ళ తాడు తెంచారుగాని, ఇదుగో వొస్తానని మన అబ్బాయి రానే లేదేమో? కోడలు తేలిగ్గానే పురుడు పోసు కుందాయె! దాని కెదురుగుండా ఈ డెందుకు కూకున్నాడు! +రైతు సంక్రాంతి రేపు సోమవారంనాడేగా? పండగముందు వాళ్ళు రానివ్వొద్దూ? +భార్య ఆఁ! పండగనీ, అల్లుడనీ, ఆళ్ళ కిదే పట్టింది! ఏడెనిమిదేళ్ళనాడు పెళ్ళి పీటలమీద కట్టబెట్టిన ఆ వొక్క పంచెలచాపు తర్వాత, ఆడు మళ్ళీ ఎప్పుడైనా ఒక గుడ్డపీలికైనా ఎరుగున్నాడూ? మన కివ్వాల్సిన కట్నం డబ్బు మనకు పారెయ్యడానికి చేతులు రాకేఁ. ఇదుగో, అదుగో” అంటూ ఆళ్లు రోజులు గడుపుతున్నారు. నే నొద్దన్న కొద్దీ ఈ పాడుచుట్టరికం నువ్వే తెస్తివిగా! +రైతు (బయట చప్పుడుకాగా ఆలకించి ఏమిటది? మనగొడ్ల చావిడిలో అలికి డౌతున్నది. +భార్య ఆ దొంగ రత్తయ్యగారి మాయదారిమంద మళ్లీ వొచ్చి పడిందేమో? +రైతు ఆరి వీటిని మాదిగాడికి తోల! ఇవి మన కెక్కడ పంపక మైనై ఈ మాట అంటూనే మంచంపై నుంచి ది���్గునలేచి, మూలనున్న కోలుపుకర్ర తీసుకుని వెలుపలికి వెడుతూ జిఝైఁ, జిఝైఁ! +భార్య నువ్వటరా! బాబూ!(వెలుపలినుంచి కొడుకుగొంతు: “నేను నాన్నా!” +కొడుకు ప్రవేశిస్తూ) ఇప్పుడే! వస్తూ వస్తూ, గొడ్లముందు మే తెగదోసొద్దామని చొప్పరంలో కెళ్ళాను.(వయస్సు 30 సంవత్సరాలు, ఈ ప్రాయంనాటి రైతును ఊహించుకుంటే కొడుకు రూపును వేరే +భార్య పొద్దోయి, పోరబోయి ఇప్పు డొచ్చా వేమిరా? +రైతు తిరిగి వచ్చి, కోలుపు కర్రను దాని తాపులో పెట్టివేస్తూ ఇంత చిమ్మచీకటిని పడి రాకపోతే, తెల్లారినా కొస్తే కాదట్రా? దస్తుకూడా వెంటున్న దేమో! +రైతు వెళ్ళి, మళ్ళీ తన మంచంపై కూర్చుంటూ) ఆఁ! పదిహేను రోజుల గుడ్డు. వాడు తిన్నగా చూశాడో లేదో! నువ్విన్ని వైనా లడిగితే వాడేం చెబుతాడు? +భార్య సర్లే! మగబిడ్డ ఎట్టావుంటే యేంగాని, సరిసి బాగుందట్రా? నన్ను తలుస్తున్నదా? +కొడుకు ఆఁ! నాయసమ్మ దగ్గరికి వచ్చేస్తానంటూ మారం చేసింది. కాళ్ళను చుట్టేసి కదలనివ్వలేదు. బతిమలాడి, బామ లాడి ఎలాగో సముదాయించొచ్చా +భార్య తీసుకురాక పోయావట్రా? నాతల్లి నాదగ్గి రుండేదేమో? దాన్ని చూసి ఏళ్ళూ పూళ్ళూ అయినట్టుగా వుంది. ఎందరున్నా అది లేకపోతే యింట్లో సందడే వుండదు. నా యావంతా దానిమీదే వుంది. +రైతు సర్లే! నీ సోది కేమి కాని, ముందు వాడికి అన్న మొడ్డించు. +భార్య పొద్దున్నెప్పుడు తిండి తిన్నావో! రారా! కాళ్లు కడుక్కురా +కొడుకు సందేళ భోంచేసే బయల్దేరా నమ్మా. +భార్య ఇందాకెప్పుడో రెండు మెతుకులు తింటే, అంతదూరం నుంచి, ఇంతదూరం నడిసొచ్చేసరికి అరిగిపోకుండా మీ అత్తారు అంత పెట్టు పెట్టారేమిటి? రారా! రా! వొడ్డిస్తా! +కొడుకు అబ్బే! ఎందుకు ఆకలి లేందేం!(ఈ మాట అంటూ షర్టు విప్పి, దాన్ని పడకగదిలో వుంచి, తిరిగి చావడిలోకి వస్తాడు. +రైతు నువ్వింకా రాలేదని వాడు ధూంధాములు చేస్తున్నాడురా! +భార్య అవునురా! ఉడుగుడు గొచ్చి పోతున్నాడు. సందేళకూడా ఆడొచ్చి నానా కూతలు కూస్తే “రేపో మాపో వొస్తాడులేవేఁ, బూసయ్య బావా! ఎళ్ళినాడు రాకండా అక్కడే కూకుంటాడేమిటి?” అని సర్దిసెప్పి పంపించా. +రైతు ఎల్లుండికి నోటు లిమిటేషను పట్టి పోతుందట్రా! చూడగా మీ అబ్బాయి కావాలనే ముఖం చాటేసినట్టున్నాడు. చాల్ చాల్ లేవయ్యా! ఇదేనా మీ మర్యాద! ప్లెయింటు పడేస్తా!” నంటూ వాడు వీధిని పడుతున్నాడు. +భార్య ఆడినోటికి శుద్దీ బద్దీ వుంటేగా? నోటి కెంత కూతొస్తే అంతా వూడేస్తాడు. +రైతు మరి మీ ��ా మేమన్నాడు? కట్నంబాపతు కొదవ పైకమిచ్చాడా? భూషయ్య బాకీ తీర్మానం చెయ్యకపోతే, పరువు దక్కేటట్టులేదు. +కొడుకు ఆ ఊళ్లో పొలా లిప్పుడు బాగా పండుతున్నాయి. నాన్నా! ఈ యేడు పుట్టీ ముప్పందుంకాడికి రాలింది. +రైతు ఆఁ! పండినేడు పండుతుంది; పోయినేడు పోతుంది. అది పాడు గరువునేల. అక్కడి పంటలమాట కేమిలే? ఇక్కడ భూషయ్య +కొడుకు లేదు, నాన్నా! ఇప్పుడు మురుగుకాల్వ పడింది కాదూ? ముల కెయ్యడం లేదు. బంగారం పండుతున్నది. +భార్య మా యియ్యిపురాలు వాకిట్లో పురులు కట్టేసిం దేమిటి? అయితే, ఆమెగారి ముందు నే నిఖ అసలే నిలవలేను. +కొడుకు రెండో పంటకింద జనుం వేశారు, నాన్నా! ఏమి యేపుగా పెరిగిందనుకున్నావ్! చేలో దిగితే మనిషి కనబడ్డంలేదు. అక్కడా భూముల ధరలు రోజు కొక రకంగా పెరిగిపోతున్నాయి. నిరుటికీ, ఈ యేటికే ఎకరానికి మూడొందలు పెరిగింది. అయిదా రేళ్ళనాడు వందకీ, వందంబాతిక్కీ మూజూడనిదాన్నే ఇప్పు డయిదారు వందలదాకా అడుగుతున్నారు. ముందు ముందు ధర లింకా +రైతు ఆ చవిటి పర్రలమాట నాకు చెప్పకురా! ఏమైనా నల్లగడ్డ నల్లగడ్డే! ఊఁ! సరే కాని, పైకం పట్టుకొచ్చావా? +భార్య ఇంకెన్నిసార్లు తిప్పించుకుంటారు? ఏడేళ్ల నుంచి దగ్గిరెట్టుకున్నారు చాలదూ?(భర్తతో) నేను ఆనాడే అనలా?“ఒక పొలి కే కేయిస్తే మనకి నిండిందా? ఇలాంటి సదివింపులు చాలా చూశాం! ఆ మూడు ముళ్ళు +పడకముందే రొబైం పోస్తేనే సరి” అని నే నంటే ను వ్విన్నావూ? +రైతు మరి, భూషయ్య ఆగుతాడట్రా? నోటు తిరగ రాసిస్తామన్నా రాయించుకునే ధోరణిలో లేడు. ఈ మాట మీ మామతో చెబితే పైక మిచ్చే వాడేమో? +భార్య ఆఁ! ఇచ్చే వాళ్ళయితే ఎప్పుడో యిచ్చేవాళ్లు. ముప్ఫైమూడు మాట్లు తిప్పించుకుని, మూడేళ్ళనాడిచ్చిన అయిదారొందలే మన కేం ముట్టినా! మిగతాది గుండాన పడిపోయినట్టే! +కొడుకు ఎందు కొచ్చిన మాటలమ్మా, యివి? కావాలంటే, వడ్డీతోసహా పట్టుకుపొమ్మని వాళ్ళన్నారు. తొందర లేదని నేనే చక్కా వచ్చా. +రైతు: సరే కానియ్యి! ఊళ్ళో టముకేయించి, కొంపా గోడూ అప్పులవాడు వేలం వేయించుకు పోతాడులే!! +భార్య ఆ బూసయ్య అంత పనీ సేయించడనా? ఆ డెంతకైనా తగు! +రైతు వేలం, జప్తులు నే నెన్న డెరగను. ఇంత బ్రతుకూ బ్రతికి, ఇంటి వెనకాల చచ్చినట్టు, ఇన్నే ట్ళొచ్చాక ఇప్పుడు కోర్టుకు లాగించుకుంటానా? నీ పెళ్లాం తెచ్చేమూట నువ్వు భద్రం చేసుకో! సెంటో కుంటో తెగనమ్మి వాడిబాకీ వాడికి రేపీపాటికి పారేస్తా! +కొడుకు ఆ డబ్బేనా నాది? ఈ క��ండ్ర నాది కాదూ? ఎప్పటి కప్పుడు ఇలా అప్పులై పోతూ వుంటే చివరి కేమి నిలుస్తుందనే నా యేడుపు! +రైతు నే నేమి జుర్రుకుంటున్నానా? సంసార మన్నాక అప్పూ, సప్పూ కాకుండా వుంటుందా? +భార్య నే నెవ్వరికీ ఏమీ దోసి పెట్టడం లేదు. ఇద్దరు ఆడపిల్ల లున్నారంటే వాళ్ళు పండక్కీ పబ్బానికీ ఆకులో ఇంత కుంకమైనా యెరగరు. పెద్దపిల్ల తొలుసూరిదానికి మొన్న పెళ్ళిసేసుకుంటే, “గాజులు తొడిగించుకోవే" అని పెళ్ళికూతురు సేతిలో పెట్టడానికి రూపాయి డబ్బులైనా నాకు గతిలేకపాయె! అమ్మమ్మకని అది దణ్ణం పెట్టొస్తే నలుగురిలో నా కెంత సిగ్గేసింది? +కొడుకు నాకుకాకుండా మీ రందరికీ దోచిపెడుతున్నారని నే నన్నాన టమ్మా? రెక్కలు విరుచుకోవడమే కనబడుతున్నదికాని, ఎవ్వరు బాముకుంటున్నదీ ఏమీ లేదు. మన రెండెకరాలమీద మనకొచ్చే అయివే జెంతో నాకు తెలవదూ? +రైతు మరి అన్నీ తెలిసినవాడివేనా, ఇంత లక్షణంగా వ్యవహారం చేసుకొచ్చావ్? +కొడుకు: నే నొకటి అడుగుతాను, నాన్నా! మనం రాత్రింబగళ్లు పాటుబడుతున్నామా? వొళ్ళు దాచుకుంటున్నామా? +రైతు (వెటకారంగా ఆఁ! నా దేమున్నదిలే! అంత పాటూ నీదే. +కొడుకు నే నొక్కడే పాటుపడుతున్నానని నేనన్నానా? అయినా, వయస్సులో వున్నవాణ్ణి; ఇప్పుడు కాకపోతే మరెప్పుడు పాటుపడతాను? కాని నలభై, యాభై యేళ్ళనుంచి రెక్కల కష్టం చేసినా ఈనాటికైనా నీడపట్టున కూర్చునే యోగ్యత నీకు లేదయ్యె! ఎండనక, వాననక, పొద్దస్తమానం దేవులాడినా మన కేం మిగులుతున్నది? మూడేళ్ళ కిందట పేరుకున్న అయిదారొందల అప్పు నెట్టాగో యెత్తి పారవేశామనుకుంటే, మళ్ళీ అప్పుడే నాలుగొందల అప్పు కనబడుతున్నది. ఇంతేనా? +భార్య కలిసిరావడం లేదు ఏం చేస్తాంరా? +కొడుకు కలిసిరావడం, గిలిసిరావడం కా దమ్మా! మన కిప్పుడు వస్తున్న ఆదాయంతో మన +భార్య కొద్ది సంసారంలో తవ్వుకోవడం, పూడ్చుకోవడం అందరికీ వుంటుంది. ఒఖ్ఖ మనకేనా? +కొడుకు ఊఁ! నీకు తెలియదులే. అమ్మా! మా ముత్తాత డెబ్బై ఎకరాల ఆసామట. మా తాతలు పదేసి +ఎకరాలవాళ్ళు. మా నాన్నల దగ్గరికి వచ్చేసరికి తలొక రెండెకరాలు అయింది. ఇఖ, నాకాడి కొచ్చేసరికి నేను రేపు కుంటా సెంటూ పంచిపెట్టాలి. అదైనా ఈకాస్తా ఈలోగా ఋణాలకింద హరించిపోకుండా మిగిలేనే. ఇప్పటి లెఱ్ఱని చూస్తే, అసలేమీ మిగలనే మిగలదు. +రైతు అయితే, అప్పుడు నీ పెళ్ళాం తేచ్చే ఆరొందలు నిన్ను +భార్య మ రేమిటిరా నీ గొడవ +కొడుకు మన కుటుంబం ఖర్చుకు సరిపడ రాబడి యేర్పరు���ుకోవా లంటున్నాను. +రైతు: లేని రాబడి రమ్మంటే, ఎలా వస్తుంది? నారుపోసినవాడు నీరు పొయ్యడూ? అన్నిటికీ ఆ +కొడుకు దేవుడిమీద భారంవేసి వూరుకుంటే సరిపోతుందా, నాన్నా? మన దేవులాటకూడా వుండాలి. +కొడుకు మన రెండెకరాలు బేరం పెడితే +కొడుకు ఎకరానికి మూడు వేలచొప్పున ఆరువే లొస్తాయి. చేలో చేను కలుస్తుందని ఆ ధర పెట్టడానికి +భూషయ్యే తయ్యారుగా వున్నాడు. మన యిల్ల, దొడ్డి కూడా అమ్ముకుంటే +భార్య (నోరు నొక్కుకుంటూ అవ్వ! పెద్దలు కట్టిన కొంపా తెగనమ్ముకుంటావట్రా? +కొడుకు పాటి మట్టి వున్నది కాబట్టి, కనీసం మరొక రెండున్నర వేలయినా అలాగ్గానే +రావచ్చు.ఇక్కడున్న ఋణం తీర్చుకుని, మిగతా డబ్బు పెట్టుకుంటే, ఆ వూళ్ళో +రైతు అలా చెప్పు! అత్తవారి పంచకు చేరా లనుకుంటున్నా వన్నమాట! +భార్య మాయదారిమూక! ఆళ్ళే నూరిపోసి పంపించారు. +కొడుకు ఈ మాట ఎక్క డొస్తుందోననే యిన్నాళ్ళూ తటపటాయించా. సరే! రావలసినమాట రానే +వచ్చింది కనక, మరి బరిలో పడతాను. ఏఁ! ఇక్కడి రెం డెకరా లమ్ముకుని అక్కడ ఇరవై ఎకరాలు కొనుక్కోడం లేదా? +కొడుకు ఏఁ! ఊరు బువ్వ పెడుతుందా? +భార్య అదీ ఒక ఊరేనా! ఈగలు, దోమలు మొగంనిండా ముసురుకుంటూ అడివూరు. +భార్య ఏం మడుసులురా ఆళ్ళు? వొ? అడివి మడుసులు! పని సుబ్రం తెలుసా? మాట సుబ్రం +తెలుసా? అసలు ఆ ఊరు మొత్తంమీద తీరైన కొంప ఒక్కటైనా మండిందీ? అన్నీ చుట్టు గుడిసెలే! +కొడుకు అయితే మనదేనా ఆరామడ పట్నం? +భార్య మంచీ చెడ్డా తెలిసినా డెవడైనా అలిగి అత్తారింటికి, చెడి చెల్లెలింటికి పోతాడట్రా! +కొడుకు ఇప్పుడు ఎవరిమీద ఎవరు అలుగుతున్నా రమ్మా +రైతు సర్లే! ఇల్లరికం వెళ్ళడం నీకు ముచ్చటగావుంటే, నువ్వు ఆ వూరు చేరు! +కొడుకు నన్నిల్లటం చేసుకోడానికి వాళ్ళ కేం ఖర్మ? వాళ్ళకే వున్నారు ఆరుగు రబ్బాయిలు. చిన్నవా +ళ్ళిద్దరు బస్తీ కెళ్ళి చదువుకొంటూ వుంటే, పెద్దవాళ్లు నలుగురూ దిట్టంగా యవసాయం చేస్తున్నారు. మనస్సు తెంపు చేసుకుని, ఇక్కడున్న కాస్తా అమ్ముకుని, అక్కడి కెళ్ళాకే వాళ్ళకు అయిదేళ్ళూ నోట్లో కెళ్ళుతున్నాయి. ఆయేటి కా యేడు వాళ్ళకు బాగా కలిసొస్తున్నది. మనమళ్ళు, మనమరాళ్ళు పుట్టుకొస్తున్నా, సంతుతోపాటు ఖర్చులు పెరిగిపోతున్నా, ఏడాదికి అయిదెకరాలకు తక్కువ కాకుండా వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఈ లెక్కని మరి నాలుగేళ్ళు గిర్రున తిరిగొచ్చేసరికి వాళ్ళు నూ రెకరాల ఆసాము లౌతారు. మూడు జతల యెడ్లు, ఎనిమిది ఆ��ులు, అయిదు కోడెదూడలు, పది, పన్నెండు పాడిగేదెలు వాళ్ళ దొడ్లో లక్ష్మి కళకళ లాడుతున్నది. దానిలో కెళ్ళితే, నాకు తిరిగి రా బుద్ధి కాలేదు. +రైతు అయితే, అక్కడే వుండక పోయావూ? +కొడుకు అక్కడుంటే అది నా దౌతుందా? నా మామ కుంటే నా మామే తింటాడు; నా కెందుకు +రైతు ఎందుకులే ఈ మాటలన్నీ? నీ చూపంతా మామగారి వూరుమీదే వుంది. అక్కడికే జెండా +కొడుకు ఆ ఊళ్లో కాకపోతే, ఆ చుట్టుపక్కల మరెక్కడైనా చేతినిండా కొండ్ర సంపాయించుకో +రైతు చేసుకునే సత్తా వుండాలేకాని, ఇక్కడ లేదా కట్టుబడి కెంత పొలమైనా? +కొడుకు వాడి పొలం, వీడి పొలం కట్టుబడిచేస్తే మనకు నిండుతుందా? మూడేళ్లు పడరాని పాట్లుపడి, +పాటి మట్టి తోలి, పెంట కట్టించి, దేవుడినాం బలం చేస్తే, అది తీరా మన కక్కర కొచ్చేసరికి, దాన్ని పాటకు పెట్టించి, ట్రస్టీ తన బావమరిది పేర కొట్టేయించుకోలా? పిచ్చిభూమో, యెచ్చిభూమో, అది మనదైతేనే మనం చెమటోడ్చినా, చెమటోడ్చిన ఫలం. అందుకనే ఎక్కడికైనా వెళ్ళి, మరొక చారెడు నేల సంపాయించుకుందామని నా ఆరాటం. ఇక్కడ ఈ పడే కష్టమే అక్కడ పడితే, అది గనిగడ్డ కాదూ? +రైతు మా కేమీ వద్దులే! అచ్చొచ్చిన భూమి అడిగిడే చాలు. +కొడుకు ఏమి అచ్చిరావడం? ఎంత రెక్కలు విరుచుకున్నా కడుపు నిండక పోవడమేనా? +రైతు ఏమైనా అత్తారిపంచని చేరతావట్రా? అది మగసిరి పనేనా? అంతకంటె అడుక్కుతినడం మేలు! +భార్య ఇంతకీ ఆళ్ళ మాయమాటల్లో పడిపోయాడు. +కొడుకు మాయమాట లేమీ కాదు; మంచిమాటలే! వాళ్ళు రమ్మన్నప్పుడే వెళ్ళితే, ఏ నూరెకరాలో +కట్టుకునే పని. అప్పు డక్కడ ఈ పాటిగా నైనా రైతు వొత్తిడి లేదు. +ముందుగానే జాగ్రత్త పడ్డవాళ్ళందరు ఇప్పుడెంతో బాగుపడ్డారు. అన్ని వనరు లేర్పడుతున్నాయి; అన్ని పంటలు పండుతున్నాయి; అందరూ పచ్చగా వున్నారు. +రైతు ఇప్పుడైనా మించుకుపోయింది లేదులే! కావాలంటే నీది నువ్వు పంచుకుపో! ఈ కళ్ళకు ఈ +రెప్పలు దూరం కాకపోతే, అక్కడ నీకు ఏం గతి పట్టేదీ చూడకపోతానూ? పో! నీ సగం నువ్వు పంచుకు పో మనుమడిని చూపిస్తూ) వాడే నాకు కొడుకూ, మనుమడూ అనుకుంటా! వాడైనా వుంటాడు నా గడ్డమీద. +కొడుకు ఆమాట కొస్తే వాడిని నే నిక్క డొదిలేసి పోతానా? +రైతు ఏఁ! నేను చచ్చింతర్వాత నా యింట్లో దీపం పెట్టేవా డుండగూడదనా? +కొడుకు సొంత ఊరునుంచి లేచిపోవడమంటే నీకేనా బాధ? నాకు లేదూ? ఇక్కడొక యెకర మమ్మి, +అక్కడ నాలుగెకరాలు కొనాలనే ఈ తాపత్రయం నాకు దేనికి? మన రెక్కల కష్టం (కుర్రవా���ిని వేలితో చూపిస్తూ) వాడికి దక్కాలని కాదూ? వాడి బాగెరిగిన వాడివైతే నువ్వు వూరు పట్టుకుని ఊగులాడతా నంటావా? ఏది మనకు కడుపునిండా కూడు పెడుతుందో అదే మన వూరు; అదే మన గడ్డ. ఉసులుబాటు లేకపోయినా, ఉక్కిరిబిక్కిరౌతున్నా ఊరు నంటి పెట్టుకోవడం దేనికి? కొత్తగడ్డకు పోతే, కొత్త రోజులు కనబడతాయేమో! +రైతు (పట్టరాని కోపంతో సర్లే! నువ్వే నాకు కానప్పుడు వాడు నా కౌతాడా? తీసుకు పో వాణ్ణి కూడా +వెంట తీసుకు పో! పోయి ఏట్లో కలువ్ +భార్య ఊఁ! చాల్లే! ఏమిటా కీడు మాటలు? ఎవరైనా యింటే నవ్విపోతారు. +రైతు నవ్వకేఁ? నవ్వుతారు! పైగా ఒక్కనోటితోనే నా నవ్వేది! కాలాన్నిబట్టి బళ్లు ఓడ లౌతాయి; ఓడలు +బళ్లు అవుతాయి. అలాగని జెండా పీక్కుని, ఊళ్ళవెంట అడుక్కు తినబోతారా? ఎకరాలేనా ముఖ్యం? మంచీ చెడ్డా లేదూ! మర్యాదా, మన్ననా లేవూ? మా తాత ముత్తాతలు ఈ ఊరు పెత్తందారులు. సత్రాలమీదా, చెరువులమీదా ఇప్పటికీ పెత్తనం మాదే. ఏ పంచాయితీ వచ్చినా, ఈనాటికీ మమ్మల్నే పిలుస్తారు. సీతారామ కల్యాణంలో పీటలమీద కూర్చునేది మేమే. అమ్మవారి సంబరం జరిగితే, తొలేట మాదే. ఎకరానికి నాలుగెకరా లొస్తాయని చూసుకుంటే సరేనా? వంశమర్యాద నిలబెట్టుకోవద్దూ? కూడులేక చచ్చిపోతా రేమిటి? చచ్చినా, ఎవడి పంచని వాడు చస్తే, అదొక తీరూ దారీ. లేకపోతే, కాలు పుచ్చుకుని కుక్కనీర్చినట్టు, అవతలి కీడుస్తారు. ఎక్కడైనా తాగిన రొమ్మునే గుద్దుతారా? కన్నతల్లివంటి ఊరును కాలదన్నిపోతారా? పోరా! పో కావాలంటే, నువ్వు పో +(రైతు కేకలకు మనుమడు తుళ్లిపడి లేచి, ఏడుపు ప్రారంభిస్తాడు +భార్య చాల్లే! ఏమిటా గొంతు చించుకోవడం! పిల్లోడు తుళ్ళిపడి లేచాడు దగ్గరికి వెళ్ళి, కుర్రవాడి +వీపు నిమురుతూ) మా బాబుగా ఊరుకో! ఊరుకో కుర్రవాడు ఏడుపు మానడు) బజ్జోరా, నాన్నా! బజ్జో! +మనుమడు (తాతవైపు చేతులుజాచి ఏడుస్తూ తాతా! ఉఁ! ఉఁ! +(తాత దగ్గరకి తీయడు. అతి కష్టం మీద ముఖం తిప్పేసుకుంటాడు +భార్య నాన్నవుగా! పడుకో! పడుకోరా బాబూ! +మనుమడు (ఇంకా యేడుస్తూనే తాతా! తాతా! ఊఁ! +భార్య దగ్గిరికి తియ్యవేఁ ఆడంత గోలెడుతూ వుంటే? +భార్య నే నున్నాగాదురా! బజ్జో, బాబూ! +మనుమడు ఊఁ! ఊ! నాకు తాతే కావాలి ఊఁ! తాతా ఊఁ! +భార్య ఇంతకీ నాకొచ్చిపడింది ఈ ఖర్మ! +మనుమడు (ఏడుపు పెద్దదిచేసి ఆఁ! ఆఁ! తాతా! ఉఁ! ఊఁ +భార్య అబ్బ! ఎత్తుకున్న దాన్ని నేను మడిసిని కాదట్రా? ఊరుకో! +కొడుకు వెధవని రెండు చరిస్తే సరి! గారాం మరీ ఎక్కువై పోయింది! +మనుమడు(భయదైన్యాలతో నిండినకళ్లతో రెండుచేతులు చాచి,తాత వైపు విరగబడుతూ):తాతా! +రైతు (గాద్గదికంగా నీ తాత లేడురా, బాబూ! నీ తాత చచ్చి పోయాడు +(రైతు మరి వుండబట్టలేక మనుమని యెత్తుకుంటాడు. కప్పవలె కరుచుకుని, భుజంపై తల పొదువుకుని, మనుమడు ఇట్టే తిరిగి నిద్రపోతాడు. +రైతు రెండు, మూడుసార్లు చావడిలో పచారుచేసి, కొడుకుతో నీపట్టు నీదేనట్రా? +కొడుకు నే నేమి ఏడ్పేడ్చినా నాకోసం కాదు. అదుగో! అక్కడ ఆ పుట్టినవాడికోసం. ఇదుగో! ఇక్కడ +ఈ పెరుగుతున్న వాడికోసం. వీళ్ళిద్దరుకాక విరగడ చెయ్యవలసింది మరొక ఆడపిల్లకూడా వుంది. ఈ ముగ్గురికి మరొక ముగ్గురైతే మన పని “అమ్మా బువ్వ అయ్యా బువ్వ” అవుతుంది +భార్య ఆఁ! చెట్టుకు కాయలు బరువటరా? +కొడుకు అసలు చెట్టొకటి మిగిలేనా? మనం ఆరోజుకారోజు చేవ దేల్తున్నామా? నీళ్ళు +కారుతున్నామా? మనకేఁ? కష్టమో, సుఖమో మన బ్రతుకులు ఎలాగో వెళ్ళమారిపోతాయి. రేపు వాళ్ళ మా టేమిటి? వాళ్లు పాలేరుతనానికి నిలబడవలసిందేనా +రైతు నువ్వేమన్నా ఆదికాలంనుంచీ ఇది మన ఊరురా! ఊరు మొత్తంమీద ఒకప్పుడు మనదే +పెద్దకుండ. కష్ట మొచ్చినా, సుఖ మొచ్చినా చల్లని తల్లి ఈవూరే మనల్ని కడుపులో పెట్టుకు కాపాడింది. దీన్ని విడిచి పెట్టక తప్పదట్రా?(కొడుకు మాటాడకపోగా, దీర్ఘంగా నిట్టూర్చి) ఈ గడ్డమీద పుట్టాను; ఇక్కడే పెరిగాను; ఇక్కడే మట్టి కూడా అయిపోదామనుకున్నా. కొత్తగడ్డమీద అడు గెట్టాల్సొస్తుందని కలలోనైనా అనుకోలేదు మరి రెండు, మూడుసార్లు పచారుచేసి) నాగలి పట్టిననాటి నుంచీ నేను దున్నుకుంటున్న చేలో మరొకడు పాదం డితే నాగుండె తరుక్కుపోదట్రా? కొడుకు మనస్సు మారుతుందేమోనని, ఒక్కక్షణం పాటు ఆగి, మరి లాభం లేదనుకుని) ఇంతవరకు నన్నెవ్వరు లొంగదీయలేదు. ఈనాడు (మనుమని వీపు చేతితో తడుతూ) ఈ పసికందు లొంగదీస్తున్నాడు ఒక త్రుటిపాటు ఆగి, ప్రారబ్దానికి తల వొగ్గుతున్నట్టుగా) సరే! రేపు భూషయ్యకు బేర మివ్వు! +(కొడుకు పెదవులపై విజయసూచకంగా చిరునవ్వు మొలక లెత్తుతుండగా +లా కాలేజీ విద్యార్థులు గిరి, మూర్తి, శాస్త్రి, రావ్, ప్రసాద్. +మద్రాస్ లింగిచెట్టివీధిలో ఒక గది. దానిలో మూర్తి, శాస్త్రి వుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక టేబుల్, ఒక చెయిర్, ఒక బుక్ షెల్ఫ్, ఒక క్యాంప్ కాట్. మూర్తిది ఒక లెదర్ సూట్ కేస్; శాస్త్రివి రెండు స్టీల్ ట్రంకులు. మూర్తి టేబుల్ మీద ఒక టెన్నిస్ రాకెట్, చిక్కురొక్కురుగా కొన్ని పుస్తకాలు, ఉపయోగించి అలక్ష్యంగా విడిచిపెట్టిన షేవింగ్ సెట్ వగైరా. శాస్త్రి టేబుల్ మీద ఒక పెద్ద అద్దం, ఒక అలారం టైమ్ పీస్, చక్కగా సర్ది పెట్టుకున్న పుస్తకాలు మొదలైనవి. +తెర లేచేసరికి శాస్త్రి డ్రెస్సింగ్ పూర్తిచేసుకుని, అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ వుంటాడు. ఒక నిమిషం తర్వాత ఎడమ వైపునున్న గది గుమ్మం గుండా మూర్తి చాలా అలసటగా వస్తాడు. అతని అడుగుల అలికిడికి శాస్త్రి వెనక్కి తిరిగి చూస్తాడు. +(మూర్తి కొరకొర చూపులకు బెదరిపోయి, మాట మధ్యలో శాస్త్రి ఆగిపోతాడు. మూర్తి తన క్యాంప్ కాట్ ను చేరి, దానిపై చతికిలబడి, ముందుకు వాలి, గుండె బరువుగా వున్న వాడివలె ముఖాన్ని అరచేతులతో కప్పుకుంటాడు. దీన్నిచూచి శాస్త్రి తెల్లబోతాడు. +శాస్త్రి (బెదురుగా చౌదరి కండిషన్ ఎలా వున్నదేమిరా? +మూర్తి (విదిలించి వేస్తున్నట్టుగా ఊఁ! ఎలా వుంటే నీకు దేనికిలే! +శాస్త్రి నాలుగైదు రోజుల్నుంచి చూస్తున్నా నేనంటే నీ వెందుకో చెడ్డ చికాకుగా వుంటున్నావు. నేనేం +చేశానని నీకింత కోపం? పోనీలే, ఎలా వున్నాడు చౌదరి? +మూర్తి ఎలా వున్నాడా? రాత్రినుంచి డెలిరియం ప్రారంభమైంది. +శాస్త్రి అయితే కొంచెం సీరియస్ గానే వుందన్నమాట. +శాస్త్రి ఏమిటిరా ఆ తిట్లు నే నిప్పుడేమన్నానని! +మూర్తి రాత్రి నుంచి డెలిరియంలో వున్నాడంటే, ఏ కొంచమో సీరియస్ గా వున్నదనేనా దాని +తాత్పర్యం? నిన్ను ఫూల్ కాదు; ఫూలున్నర అనాలి. +శాస్త్రి ఫూల్, గీలని ఇప్పుడంటే అన్నావుగాని, ఈసారి అంటే మాత్రం నే నూరుకోను. +మూర్తి పోనీలేరా! వేరే పేరు పిలుస్తాలే. నీకు అతికే పేర్లు చాలా వున్నాయ్. +మూర్తి ఆఁ! చాలా లేకేమిరా? డన్స్, యాస్, స్టుపిడ్, ఇడియెట్, డండర్ హెడ్, మీన్ మైజర్లీ రెచ్ +శాస్త్రి అన్నింటికీ తెగించి కూర్చున్నావ్! అంటావ్! నీ వనకేఁ? నీ మాటలకు వాల్యూ యేమిటి? నీ +నోటికి హద్దూ పద్దూ లేదని ఒకనాడు చౌదరి నాతో +గిరి (ప్రవేశిస్తూ ఏమిటిరా? అప్పుడే మీ కిద్దరికీ మళ్ళీ మొదలైందీ లడాయి? +మూర్తి లేకపోతే, ఈ సిల్లీ ఫూల్ చూడు! నర్సింగ్ హోంనుంచి నేను తిరిగి వచ్చానో, లేదో +శాస్త్రి అది కాదోయ్, గిరీ! చౌదరి రాత్రినుంచి డెలిరియంలో వున్నాడని మూర్తీ! నిజమే? +గిరి (డెలిరియం అనే ముక్క తర్వాత మాటను తెంచివేస్తూ ఏరా +మూర్తి (బరువుగా ఆఁ! జుట్టు పీక్కోవడం, వొళ్లు రక్కుకోవడం చాలా అవలక్షణాలు +ప్రారంభమైనాయ్. బెడ్ మీద నిలవ���ం లేదు. పట్టుకోలేకుండా వున్నాం. చేతులు మంచానికి కట్టేశారు. +గిరి (దైన్యంగా పూర్ ఫెలో! చూస్తూ చూస్తూ వుండగానే ఎంత ముంచుకొచ్చిందిరా +మూర్తి మొన్నే మనం అతన్ని వాళ్ల వూరు పంపించేస్తే బాగుండేదేమోరా? +గిరి ఆఁ! వాళ్ళది కుగ్రామమట. అక్కడ మెడికల్ ఎయిడ్ ఏముంటుంది? పైగా, ఈ స్థితిలో రైలు +ప్రయాణం డేంజరస్ అని డాక్టర్ అన్నాడు కూడాగా, +శాస్త్రి అయినా, మన బాధ్యత తప్పేది. +మూర్తి ఔను! ముఖ్యంగా నీ బాధ్యత తప్పేది! ఇప్పు డతని బరువంతా నువ్వే మోస్తున్నావ్. +శాస్త్రి ఏమోయ్ గిరీ! చూశావా నేనంటే వొంటి కాలిమీద ఎలా వస్తున్నాడో! +మూర్తి రెండు కాళ్ళ మీ దొచ్చినా మొండి శిఖండివీ, నీకేమి సిగ్గా, తెరమా? షేమ్ లెస్ మాన్? +గిరి (విసుగ్గా అబ్బబ్బ! సమయం లేదు; సందర్భం లేదు. క్యాట్స్ అండ్ డాగ్స్. మీ కిద్దరికీ ఎప్పుడూ +ఒక్కటే కాట్లాట! చెడ్డ న్యూసెన్స్ అయిపోతున్నారు. +మూర్తి లేకపోతే, ఏమిటి? ఈ డామ్ ఫూల్ మాటలు! చౌదరి ఫీవర్ తో మన లాడ్జిలో వుండగా, అది +తన కెక్కడ అంటుకుంటుందోనని తప్పుకు తప్పుకు తిరిగాడు. అతను నర్సింగ్ హోంలో అడ్మిట్ అయ్యాక ఒక్కసారైనా విజిట్ చేశాడు కాదు. ఇంకా ఏమిటో వీడి తలకాయ తన బాధ్యతట! బాధ్యత +గిరి సర్లేరా మూర్తీ! ఇప్పు డెందుకులే, ఈ లేనిపోని రగడ. అయితే, ఇప్పుడక్కడ ప్రసాదు +గిరి ఆయన్ని వెళ్ళమని చెప్పానే! రానే లేదా? +మూర్తి రాకేఁ? వచ్చాడు. కాని, గ్లూకోజ్ రాత్రే అయిపోయింది. అంచేత కొనుక్కురమ్మని +ఆయన్ని పంపించి, స్నానంచేసి పోదామని నే నిలా వచ్చా. +గిరి మరి, అక్క డెవ్వరూ అటెండ్ కావడం లేదన్నమాట! నేనైనా పోతా. +మూర్తి ప్రసాద్ తిరిగి వచ్చేదాకా సిస్టర్ నే జాగ్రత్తగా చూస్తూ వుండమన్నాలే. అయితే సెంట్రల్ కి +గిరి ఓ యస్! మన రావ్ వెళ్ళాడు. +మూర్తి ఆమె ఈ పూట మెయిల్ కే వస్తే బాగుండును. +గిరి (శాస్త్రితో మన చౌదరి తల్లి. వెంటనే బయల్దేరి రమ్మని ఆవిడకు నిన్న టెలిగ్రాం పంపించాం. +(మూర్తివైపు తిరిగి) మూర్తీ అది ఎక్స్ ప్రెస్ టెలిగ్రామ్ కాదూ? +(“ఔ”, నన్నట్టు మూర్తి తల పంకిస్తాడు) మెసెంజర్ కని మైలేజీ కూడా కట్టామయ్యె. బహుశా నిన్న మధ్యాహ్నానికే అందివుంటుంది. ఆమె ఈ పూట మెయిల్ లోనే రావచ్చు. +శాస్త్రి నైన్ థర్టీ అయింది. లేట్ కాకపోతే మెయిల్ ఈసరికి వచ్చేవుండాలి. +గిరి నీకు ఈ మూర్తి పోరైనా తప్పేది; రావుకు తోడుగా కాస్త రైలు స్టేషన్ కైనా వెళ్ళకపోయావా, +శాస్త్రి ఆఁ! ఈ భాగ్యానికి తోడుకూడా కావాలా? +మూర్తి తోడు వెళ్ళడంలో నీకు ఆల్ ఆఫ్ ఎ సడెన్ నమ్మకం పోయిందేమిరా? చౌదరి కాఫీ హోటల్ కి +వెళ్ళినా, సినిమాకు వెళ్ళినా, తప్పనిసరిగా తోడు వెళ్ళేవాడివిగాఁ! +గిరి అబ్బబ్బ! నువ్వూరుకోరా, మూర్తీ నీకు బొత్తిగా మతిపోతున్నది. +మూర్తి నీవేమైనా అనుగాని, వీణ్ణి చూస్తే నాకు అరికాలిమంట నెత్తి కెక్కుతున్నది. ఇదివరకైనా +వీడిసంగతి నేను కొంత కనిపెట్టక పోలేదుగాని, వీడు మరీ ఇంతటి మీన్, సెల్ఫిష్, స్టుపిడ్, +కవర్డ్ లీ, డర్టీ యాస్ అనుకోలేదు. +శాస్త్రి (మూర్తి వాక్యం పూర్తికాకముందే అందుకుని చూడవోయ్! ఎంత రెచ్చెడ్ గా తిడుతున్నాడో! +గిరి చాల్లేరా, మూర్తీ! నీకు సమయాసమయాలు బొత్తిగా తెలియవ్ శాస్త్రితో) శాస్త్రీ! నువ్విక +శాస్త్రి ఆఁ! టైం కావొస్తున్నది, పోవాలిక. +గిరి అన్నట్టు, శాస్త్రీ! మాకు అటెండెన్స్ కాస్త ప్రాక్సీ చెబుతావటోయ్. +శాస్త్రి నా కది అలవాటులేని పని, మన నాయుణ్ణి చెప్పమంటాలే. +మూర్తి ఉద్ధరిస్తావ్. వీడు మరీ ఇంత అంట్లవెధవని ఇంతకు ముందు నాకు తెలియదు సుమీ! +గిరి మంచిదోయ్, శాస్త్రీ! వీడిమాటల కేమిలే? నువ్వు వెళ్ళు. +మూర్తి ఇదివరకైతే వీడికి బ్రెయినే తక్కువనుకున్నాగాని, కారెక్టర్ కూడా లేదు. +గిరి మరీ నాలుగైదు రోజుల్నుంచి శాస్త్రి నీకు పెద్ద అబ్సెషన్ అయిపోయాడురా. అతని ప్రవర్తన +నాకైనా అసహ్యంగానే వుంది కాని, మనం నోరు పారవేసుకుంటే లాభ మేమిటి?“ఇట్ టేక్స్ ఆల్ సార్ట్స్ టు మేక్ ఎ వరల్డ్” అన్నారు. మనం ఎలాగో సర్దుకుపోవాలి. +గిరి ఆహా! అలాంటి వాళ్ళతోనే మరీ ముఖ్యంగా. +మూర్తి ఇలాంటి పశువులను కూడా కలుపుకు పోవాలంటే మనం కూడా నాలుగు కాళ్ళమీద +గిరి సర్లే! ఈ చర్చ మరొకసారి చేద్దాముగాని, చౌదరికి క్లోరోమైసిటిన్ ఇంజెక్ష నిస్తే మంచిదని నిన్న +సాయంత్రం డాక్టరన్నాడు. నీవద్ద పైక మేమైనా వున్నదట్రా? +మూర్తి మంతెండ్ కాదూ? అయిపోయింది! చిల్లర మల్లర మాత్రం మిగిలింది. కాని, ఏఁ? +గిరి ఉహుఁ! నర్సింగ్ హోమ్ లో అడ్మిషన్ కే అతనివద్ద ఏమీ లేకపోయింది. నేనే పే జేశా. +మూర్తి మంత్ బిగినింగ్ లో వచ్చిన నూటయాభై కాక, వారం రోజులనాడు అతనికి మరొక +గిరి ఆఁ! ఎంతవస్తేనేఁ? రెండోనాటికి కానీ మిగల్చడు. అతనెంత శ్రీమంతుడైనా మరీ ఇంత +మూర్తి అయితే, ఇప్పు డేమి చేస్తాం? +గిరి అదే తోచడం లేదురా. అప్పిచ్చేవాడైనా కనబడడు. అక్కడికీ మొన్న మన నాయుడువద్ద +పాతిక రూపాయలుంటే పుచ్చుకుని చౌదరికిందే ఖర్చ��� పెట్టేశాను. +మూర్తి ప్రసాద్ పర్సుకూడా ఖాళీయే. గ్లూకోజ్ టిన్నుకు తన వద్ద టూ రుపీస్ లేక, నన్నడిగి +పట్టుకు వెళ్ళాడు. మన రావ్ ని అడిగిచూశావా? +గిరి ఆఁ! రావ్ చాలా బీదవాడు. పాపం! అతని పని కటకటగా వుంటున్నది. చివరివరకు +చదువు సాగుతుందో, లేదో అని ఆఁదోళన పడుతున్నాడు. గుంభన గల మనిషి కాబట్టి, బయటపడడుగాని, కాలేజీ జీతానికైనా డబ్బుండడం లేదు. మందు కొనడానికి ఇప్పు డేమి చెయ్యాలో ఏమిటో నా కేమీ పాలుబోవడం లేదు. +మూర్తి అన్నట్టు, చౌదరి మదర్ కాసేపటిలో వస్తున్నదిగా! ఆమెకు డబ్బు కేం తక్కువ? ఆమె +గిరి కాని, ఆమె ముక్కూ ముఖమైనా మన మెరగం. రైలు దిగీ దిగడంతోటే పైక మడిగితే, ఆమె +మూర్తి ఔనురా! అదీ నిజమే. ఆఁ! అన్నట్టు శాస్త్రిగాడి దగ్గర డబ్బు పుష్కలంగా వుంది. ఫైవర్స్, +గిరి అయ్యో! చేబదులైనా చేయడానికి అతను కాలేజీకి వెళ్ళిపోయాడేం! +మూర్తి వెళ్ళితేనేం? ఫ్రెండ్స్ కోసం ఎక్కడ ఏ బిల్లు పే జెయ్యవల సొస్తుందో నని అణా, బేడా, +మనీ పర్సులో వేసుకుని వాడు బయటికి బయల్దేరతాడు. వాడి దాపరికం అదుగో ఆ +పెద్ద స్టీల్ ట్రంకులో, ఎలాగైనా దాని తాళం పగలగొడితే ఆశ్చర్యంగా) హెవెన్స్! ఏమిటీ చిత్రం! ఇవ్వాళ పెట్టెకు తాళం బిగించడం మర్చేపోయాడు! +(గబగబ మూర్తి ట్రంకుల వద్దకు వెడతాడు. +గిరి నోనో! దట్స్ బ్యాడ్! అతను లేనప్పుడు అతని పెట్టె తెరవడం తప్పు. +మూర్తి (పైనున్న చిన్న ట్రంకును దించి, అడుగునున్న పెద్దదాన్ని తెరుస్తూ నీకు తెలవదులేరా! +ముందు ఈ ప్రాణావసరం గడిస్తే, తప్పొప్పులమాట తర్వాత కన్సిడర్ చెయ్యొచ్చు బట్టల అడుగునుంచి నోట్లపొతిక తీసి, లెక్కపెడుతూ) చూడరా! వెధవదగ్గర ట్రంక్ వద్ద నుంచి, గిరి వైపుకు నడిచి వెడుతూ, ముందు కొంత సేపు నోట్లోనే లెక్కపెట్టి. తర్వాత పైకి అంటూ) టూ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ – సిక్స్ టీ- సిక్స్ టీ టూ – సిక్స్ టీ ఫోర్ సిక్స్ టీ ఫైవ్ సిక్స్ టీ సిక్స్ – సిక్స్ టీ సెవెన్ టూ సిక్స్ టీ సెవెన్ రూపీస్ వున్నాయ్! +గిరి మూర్తీ! నువ్వు ఏం చేసినా, చెడ్డ ఇంపల్సివ్ గా చేస్తావురా! ఇప్పుడు శాస్త్రి వచ్చాడంటే, +మూర్తి ఆఁ! వాడిమొఖం కాదూ? నోరు మెదిపాడంటేనా? నా సంగతి తెలియదూ? ఈ టెన్నిస్ +రాకెట్ వాడి వీపుమీద విరిగిందన్న మాటే! +గిరి అత నొకవేళ ఏదైనా మాట తూలినప్పటికీ నువ్వు తొందరపడబోకు! ఏవీ, ఒక యాభై +రూపాయలిలా తే వాటిని అందుకుని వీలుపడితే, అతని పైకం సాయంత్రం లోగానే రీప్లేస్ చ���ద్దాం. లేకపోతే, లైఫ్ అండ్ డెత్ కొశ్చన్ కనక, నేనే పెట్టె తెరిచి, ఒక యాభై మాత్రం పట్టుకెళ్ళానని చెప్పు. +మూర్తి ఏఁ! నేనే తీశానంటే తలకొట్టి మొలవేస్తాడా? +గిరి నాన్ సెన్స్! నీకు తెలియదురా నేను చెప్పమన్నట్టే చెప్పు. నువ్వు వాణ్ణి రెచ్చగొడితే, +ఎటుపోయి యెటువస్తుందో! ఇప్పుడు తప్పు మనమీద వున్నదయ్యె! అన్ని రోజులూ మనవి కావు. డోన్ట్ బి హేస్టీ. ఊఁ! నే వెళ్లోస్తాగాని, ఆ మిగతా డబ్బు మళ్ళీ భద్రంగా వాడి పెట్టెలో వుంచెయ్. +(మిగిలిన డబ్బును మూర్తి తిరిగి శాస్త్రి ట్రంకులో పెట్టి వేస్తాడు. క్రిందకు దించిన చిన్న పెట్టెను పెద్దదాని పైకి యెక్కిస్తాడు కూడా. గిరి తన చేతిలోని నోట్లను మనీపర్సులో పెట్టుకుంటూ, గుమ్మం వైపుకు రెండడుగులు వేస్తాడు. ఇంతలో పెద్దగా నిట్టూరుస్తూ రావ్ ప్రవేశిస్తాడు. +రావ్ (కుర్చీలో బరువుగా చతికిలబడి అబ్బ! +గిరి ఏఁ! ఆవిడ ఈ బండికి రానేలేదా? +రావ్ రాకేఁ? వచ్చింది. కాని, ఏం చెప్పను? +గిరి ఏమిటోయ్? అసలు విషయ మేమిటి? +మూర్తి ఏఁ! సింక్ అయిపోతున్నా డేమిటి? +రావ్ అబ్బే! లేదురా! ఉదయాన వున్నట్టే వున్నాడు. +రావ్ చౌదరి మహాభాగ్యవంతుడని కాదూ, మీ అభిప్రాయం +గిరి ఇప్పు డతని స్థితిగతుల మాట దేనికి? +రావ్ ఆఁ! ఏమీ లేదు. నేనూ మీలానే పొరబడ్డాను. +మూర్తి ఏమిటిరా? నువ్వు స్ట్రేంజిగా మాట్లాడుతున్నావ్! +రావ్ (కుర్చీపై నుంచి అశాంతిగా లేస్తూ పాపం! ఆ తల్లిని చూస్తే నువ్విలా అనేవాడివి +కాదురా? చింపిరితల, చీరికల గుడ్డలు, మ్స్ ఏం చెప్పను ఆమె అవతారం! వొఠ్ఠి ఎముకలగూడు! కళ్ళలో వున్నదేమో కాస్త కొనూపిరి. మహా యిల్లాలు! ఉన్నపూట తిని, లేనిపూట పస్తుండి కొడుక్కు చదువుకు డబ్బు పంపించేదట. +రావ్ ఈ సంగతి ఆమె నోటినుంచికాక, మరెవరి ద్వారానైనావిని వుంటే నేనూ మీలానే నమ్మలేక +రావ్ వాళ్ళకి ఆరెకరాల మాగాణి వుండేదట. అతను బి.ఏ. పూర్తిచేసేసరికి దానిలో సగం +అప్పులకింద పోయిందట. పోతే, ఇప్పుడు ఈ లా కాలేజీ చదువుకోసమని నిరుడు మిగతా మూడెకరాలు అమ్మేశారట. ఈ యేటికి లోగిలి తాకట్టు పెట్టి, దొడ్లో పాటి మట్టి అమ్మించి పాపం! ఆమె డబ్బు పంపిస్తున్నదట. +రావ్ డబ్బు చాలక పిల్లవాడు ఎక్కడేమి యిబ్బంది పడతాడోనని పాలూ, పెరుగూ అమ్మి, పట్నం +పంపించేదట. పిడకలు చేసేదట; ఏకులు వడికేదట; కూలికి దంపుడు కూడా దంచేదట +ఈమాట చెవిని పడితే కొడుకు మనస్సు చివుక్కుమంటుందేమోనని కడుపులో పెట్టుకునేదట. తాను కష్టప��్డా, కడుపు కట్టుకున్నా, ఇంకెంత కాలంలే అనుకొంటూ వుండగానే ఈ ఆపద వచ్చిపడిందని ఆవురుమంటున్నది. +మూర్తి (నమ్మలేక ఏమోయ్ రావ్! ఈ సంగతులన్నీ ఆమె ఇప్పుడు నీకెందుకు చెప్పింది? +రావ్ ఉహుఁ! నన్నూ, నిన్నూ వినమని ఆ మేమీ చెప్పలేదు. కొడుకుని చూచుకుని పాపం! ఆ +తల్లి గుండె పగిలేలా యేడుస్తున్నది. ఆ యేడుపుమధ్య ఇంకా చాలా విషయాలు బయట +రావ్ ఎన్నని చెప్పమంటావోయ్! శోకం పట్టలేక తన సోదంతా వెళ్ళబోసుకుంటున్నది. “మనకు ఒక్కగాను ఒక మగబిడ్డ. వాడు పెద్ద చదువు చదివి, పెద్ద ఉద్యోగం చేస్తే, మన వంశానికే గౌరవమే. ఆస్తి వుంటుందీ, పోతుందీ అని వెనకా ముందూ ఆడకుండా, ఎంత డబ్బైనా సరే, వాడికి చదువు చెప్పించవే” అని వాళ్ళ ఆయన చెప్పిపోయాడట. తనూ అంతే ననుకుని బిడ్డను దొరలా పెంచుకున్నదట. చదువు పూర్తిచేసి, కొడుకు ఏ జిల్లా జడ్జియో అయితే, చూచి ముచ్చటపడ్డానికి ఆయన లేడు గదా అని విచారించేదట. చదువుకున్న పిల్లని చేసుకుని, కొడుకూ, కోడలూ చిలకా, గోరంకల్లా కాపరం చేస్తూవుంటే, వాళ్ళచేతుల మీదగా తను దాటిపోదామనుకున్నదట. దుఃఖం పట్టలేక ఇలాగే ఏమేమో చాలా వెళ్ళబోసుకుంటున్నది. +గిరి చౌదరి సిన్సియర్ మ్యాన్ అనుకున్నా. నావద్ద అతడికి రహస్య మనేదే లేదనుకున్నా కాని, +ఎంత నటన చేశాడు? తన స్థితిగతుల సంగతి పొరపాటుగానైనా ఎన్నడూ నాతో అన్నాడు కాదు. +గిరి కాని, ఎంత స్టయిలిష్ గా వుండేవాడు! ఫక్తు ట్వీడ్ సూట్స్ వేసేవాడు. కాస్ట్ లీ స్నోస్, +సెంట్స్, పొమేడ్స్, హెయిర్ ఆయిల్స్ వాడేవాడు. ఆ మధ్య పి.ఆర్. అండ్ సన్స్ లో ఎనభై రూపాయలు పెట్టి సిల్వర్ హెయిర్ బ్రష్ కొన్నాడు. +మూర్తి నీకు అంతే తెలుసునన్నమాట! పోయిననెలలో రెండు వందల యాభై రూపాయలకు +స్పెన్సర్స్ లో బాండ్ స్ట్రీట్ రెయిన్ కోటు కొన్నాడు. +గిరి తనకోసం తనే తగలేసుకుంటే, అక్కడి కది కొంత నయమే! సినిమాకి వెళ్ళినా, కాఫీ +హోటల్ కి వెళ్ళినా, అందరి బిల్సు పట్టుపట్టి తనే చెల్లించేవాడుగాఁ! +రావ్ డబ్బు నీళ్ళలా వాడుతూ ఇంకా చాలా చాలా చేసేవాడు లెండి +మూర్తి అతని ఖర్చుచూచి, లక్షాధికారి అనుకున్నా, +మూర్తి తల్లి నిన్ని కష్టాలుపెట్టి, చౌదరి ఎందుకిలా ప్రవర్తించాడో? నా కేమీ అర్థం కావడం లేదు. +రావ్ నా కతని ప్రవర్తన కొంతవరకు అర్థమౌతుందనుకుంటాను. అతడిలా నేనూ పేదవాడినే; +నేనూ పల్లెటూరివాడినే. లా కాలేజీలో చేరడానికని ఈ మద్రాసుకు వచ్చిన కొత్తలో ఇక్కడి సిరీ, ఇక్కడి సంపత్తీ నన్��ూ, నా పేదరికాన్ని వెక్కిరిస్తున్నట్టే అనిపించింది. +కొంత సిగ్గు, కొండంత బిడియం, అర్థంలేని అసూయ, అకారణమైన ఆవేదన అప్పటి నా మనఃస్థితిని గురించి చెప్పడం కష్టమే. మొత్తంపై నే నంటే, నాబ్రతుకంటే నాకే అసహ్యం పుట్టింది. మా పల్లెటూరు, మా పూరి కొంప, మా ముతకగుడ్డలు, మా మోటు తిండి; అదొక నరకంలానే తోచింది. దానినుంచి ఎంత దూరంగా పారిపోతే, నాగరికతకు అంత దగ్గరగా వస్తాననుకున్నా, పస్తులుండి, పడరాని పాట్లుపడి, ఎప్పుడడిగితే అప్పుడు ఎంతడిగితే అంత పైకం పంపడానికి చౌదరిలా నాకూ ఎవరైనా వుంటే, నేనూ అతడిలానే తయారయ్యే వాడినేమో చీకటిలోనుంచి ఒక్కసారిగా వెలుగులోకి వస్తే కళ్లు చిరత లాడినట్టుగానే వుంటుంది జీవితమంతా ఏ కుగ్రామంలోనో, ఏ చిన్న బస్తీలోనో గడిపి, మొదటిసారిగా ఈ మద్రాసును పోలిన మహానగరానికి వస్తే. +గిరి ఏమైనా చౌదరి చేసినపని అతి ఘోరం! +మూర్తి నా ఒపీనియన్ నన్ను చెప్పమంటావా? దిస్ ఈజ్ సింప్లీ మాన్ స్ట్రస్. +రావ్ సరే! ఇప్పు డేమనుకుంటే ఏం లాభంలేరా? అతడిప్పు డెలాగైనా వొడ్డున పడితే అదే +పదివేలు. లేకపోతే, ఆ తల్లి చేసిన త్యాగమంతా బూడిదలో పోసిన పన్నీరౌతుంది. ఆవిడ కోసమైనా అతడు బ్రతకాలి. ఏమోయ్, గిరీ! డాక్టరు నీతో ఏదో మందు మాట చెప్పాడట. +గిరి (బరువుగా ఔనోయ్! “అప్పా అండ్ కో” లో కొనుక్కుపోవాలి. ఏఁ! నువ్వుకూడా +రావ్ నామనస్సు చెడ్డ కలతగా వుంది. నే నిప్పుడు రానులే. కాసేపైనాక సరాసరి తిరిగి నర్సింగ్ +గిరి మంచిది. ఇప్పటికే ఆలస్యమైందేమో. మరి, నే వెడతా! కన్నతల్లి నింతగా కష్టాల పాలుచేసి, +రావ్ ఆఁ! ఇది ఆలోచించి చేసిన పనే అంటావా? కాదు, కేవలం అనాలోచిత ప్రవర్తన, +గిరి (వెళ్ళిపోతూ ఏదో ఒక ప్రవర్తన! ఏదైతేనే? కన్నతల్లి కింత ఘోరాన్యాయం చేసింతర్వాత! +మూర్తి పూర్ మదర్! కొడుకుకోసం ఎంత శాక్రిఫైస్ చేసిందిరా! ఆవిడ మా అమ్మే అయితేనా? +మా అమ్మ నా చిన్నతనంలోనే పోయింది. మా కున్నది నన్నూ, నా యిద్దరు చెల్లెళ్ళనూ కాల్చుకుతినే సవతి తల్లే చౌదరి హార్ట్ లెస్ గా ప్రవర్తించాడు గాని, ఆవిడ మా అమ్మే అయితేనా, పువ్వుల్లో పెట్టి పూజించేవాణ్ణి. +రావ్ పాపం! కొడుకుమీద కొండంత ఆశ పెట్టుకున్నదిరా! మ్చ్! ఏమి కానున్నదో! తమకు +చదువు సంధ్యలు లేక పోయాయే అన్న విచారం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని బాధిస్తుంది కాబోలు. అందువల్లే కొందరు పల్లెటూరివాళ్లు తమ బిడ్డల చదువు కోసం ఎన్ని కష్టనష్టాలైనా సంతోషంగా పడ��ారు. బస్తీలకు పోయి, వేలకు వేలు గుమ్మరిస్తేనే తప్ప పూర్తి కాని ఈ చదువులకు వాళ్లు బలి అయిపోతూ వుంటారు. త్యాగమంటే నిజంగా వాళ్ళదే త్యాగం. +మూర్తి (అవహేళనగా నీదేరా? నీ ప్రశంసే మన రావుగారు చేస్తున్నారు. నువ్వు గొప్ప +త్యాగమూర్తి వట! సరిగాని, నువ్వు కాలేజీకి వెళ్ళలేదేమిరా? +శాస్త్రి వెళ్ళకేఁ! వెళ్లా. తీరా లెక్చెర్ రూమ్ లోకి వెళ్ళేసరికి ఏదో మాట జ్ఞాపకం రాగా వెనక్కి +శాస్త్రి. మరేమీ లేదురా ట్రంక్ లాక్ చేసుకోవడం మర్చిపోయా. +మూర్తి వెంటనే తిరిగి రాకపోతే, నీ పెట్టె నేను కొల్లగొట్టేస్తా ననుకున్నావా? +రావ్ మూర్తీ! నువ్వు మరీరా! శాస్త్రిగారి మీదికి కయ్యానికి కాలు దువ్వుతావ్. +మూర్తి లేకపోతే ఏమిటిది? ఈ రూంలో వుంటున్నది వీడూ, నేనూ. అయితే, ఇఖ వీడి +భయమేమిటి? పెట్టెకి తాళం లేకపోతే, వీడి ముల్లె నేను కాజేస్తాననేనా? +శాస్త్రి ఏమండీ రావుగారూ! ఆ మాట నే నన్నానా? +(శాస్త్రి మీదకు కొట్టబోయినట్టు మూర్తి వెడతాడు. అతడిని రావ్ వారిస్తాడు. ఇంతలో ప్రసాద్ వస్తాడు. +రావ్ లేడే! దేనికండీ, ప్రసాద్ గారూ? +మూర్తి ఇప్పుడే వెళ్ళాడురా మందుకోసమని. నీకు దారిలో యెదురుపడవలసిందేనే! +రావ్ ఏమిటండీ సంగతి? మరేమీ తొందరలేదుగదా? +ప్రసాద్ (బరువుగా చౌదరి కొలాప్స్ అవుతున్నాడు. +ప్రసాద్ (నిట్టూరుస్తూ ఈ సరికి అయిపోయిందేమో కూడా! +రావ్ ఆ తల్లి ఆశలన్నీ పాపం! మంటగలిసిపోయాయి. +ప్రసాద్ అసలు ఆవిడ దుఃఖాన్ని చూడలేకే సగం నేనిటు పరిగెత్తుకొచ్చా. +మూర్తి బ్రతికీ, చచ్చీకూడా ఆ తల్లికి ద్రోహం చేశాడన్నమాట! +ప్రసాద్ ఔ నంతే! మహాద్రోహం చేశాడు +రావ్ మరి దేనికి? పోదాం పదండి. మన మెవ్వరం కూడా లేకపోతే పాపం ఆవిడ గతి +(రావ్, ప్రసాలు కదులుతారు. శాస్త్రి ఏమి చేస్తాడో అన్నట్టుగా మూర్తి అతని వంక చూస్తూ వుంటాడు. శాస్త్రి వెళ్ళి, తన కుర్చీలో కూర్చోబోతాడు. +శాస్త్రి ఊహూఁ! నాకు కాళ్లాడ్డం లేదు. +మూర్తి చౌదరి డబ్బు విరజిమ్ముకు పోతూవుంటే, వాటిని యేరుకోడానికి బాగానే కాళ్లాడేవేం! +రావ్ వెడుతున్నవాడు వెనక్కు వచ్చి నువ్వు రారా! ఇదేనా తగవులకు సమయం +మూర్తి ఈ రాస్కెల్ ను నిలువునా చీల్చినా పాపం లేదు. అంత కన్నూ, మిన్నూ కానకుండా +చౌదరి ప్రవర్తించడానికి సగం వీడే కారణం. +(కొట్టడానికి శాస్త్రి పైకి దూకుతాడు. ఇంతలో రావ్, ప్రసాద్ అడ్డుపడతారు. +రావ్ (మూర్తిని అవతలకి తోసి నీకు పిచ్చెక్కుతున్నదేమిరా! చాల్లే కాస్త నిద���నించు. +(శాస్త్రితో) రావోయి, శాస్త్రీ నువ్వుకూడా రా! నువ్విప్పుడు ముఖం చాటువెయ్యడం బాగుండదు. సరే పదండి. పాపం దిక్కులేని ఆ తల్లి ఏమౌతున్నదో? +ప్రసాద్ ఆవిడవద్ద డబ్బేమీ లేనట్టున్నది. ఏ పెద్ద డాక్టరు కాళ్ళో పట్టుకుని బిడ్డను దక్కించు +కోడానికి డబ్బైనా తెచ్చుకున్నాను కాదని ఆవిడ గోల పెడుతున్నది. గిరే ఎక్కడైనా సాధించాలిప్పుడు. +(రావ్, ప్రసాద్, శాస్త్రి వెడతారు. మొదటి వారిద్దరు సాగిపోయినా, శాస్త్రి కావాలని వెనుక బడతాడు. మూర్తి దీన్ని గమనించకుండానే చటుక్కున శాస్త్రి ట్రంకుల వద్దకు వెళ్లి, పైదాన్ని ఒక పక్కకు విసిరి పారవేసి, అడుగు దానిలోనుంచి డబ్బుతీస్తాడు. శాస్త్రి “ఆఁ ఆఁ!” అంటూ నోరు తెరిచి, తెల్లమొహం వేసి నిలిచివుండగా – తెర) +పాత్రలు ఈశ్వరరావు,రామబ్రహ్మం, వెంకటాద్రి, సుబ్బన్న, ప్రసాదరావు, జానకిరామయ్య, బిల్లు కలెక్టరు. +ఈశ్వరరావు యింటి చావడి. కుడివైపున సింహద్వారం; ఎదురుగా రెండు గదులలోకి రెండు +ద్వారాలు; ఎడమవైపున పెరటిలోకి ద్వారం. చావడిలో గదులగోడ సరసను ఒక టేబుల్; నడిమిని ఒక పడకకుర్చీ, రెండు, మూడు మామూలు కుర్చీలు, ఒక బెంచీ, కొన్ని కాలెండర్లు, ఫొటోలు, వెండితో చేయబడిన లక్ష్మీ, సరస్వతి పటాలు. +తెర లేచేసరికి ఈశ్వరరావు పడకకుర్చీలో పడుకుని, ఒక ఇంగ్లీషు దినపత్రిక చదువుతూ +వుంటాడు. అతని వయస్సు ఇంచుమించు ముఫ్ఫై రెండు సంవత్సరాలు, పట్టణంలో ఉద్యోగం చేసుకుంటున్న వాడు గనక, వేషభాషలలో పట్టణ సంస్కారం కొంత కనబడుతూ వుంటుంది. +తెర లేచిన కొన్ని క్షణాలకు రామబ్రహ్మం, వెంకటాద్రి ప్రవేశిస్తారు. వారిద్దరు అచ్చమైన పల్లెటూరి వారు . +రామబ్రహ్మం, వెంకటాద్రి కాళ్ళ అలికిడి విన్న ఈశ్వరరావు పత్రిక పుటలలోనుంచి తలెత్తకముందే +వా రిద్దరు ఎడా పెడా కొట్టి తుపానువలె సంభాషణకు అందుకుంటారు. +రామబ్రహ్మం దొరికాడయ్యా, మిడతం భొట్లు! దొరికిపోయాడు! +వెంకటాద్రి కొట్టా డయ్యా! డింకీ కొట్టాడు!! +వెంకటాద్రి ఆహా! బో ర్డిఖ తిప్పాల్సిందే! +రామబ్రహ్మం ఇంకా ఎవరంటా వేమిటి? అయిపోయా డయ్యా, ఈ దెబ్బతో చిత్తయిపోయాడు. +వెంకటాద్రి ఇఖ పత్తా అయినా వుండదులే! +రామబ్రహ్మం ఊరంతా గుప్పుమంటే నువ్వింకా వినలాఁ? +వెంకటాద్రి గుంపు చింపులుపడి ఊరంతా చెప్పుకుంటున్నా నువ్వు వినకపోవడమేమిటి? +రామబ్రహ్మం చోద్యమే నువ్వు వినలేదంటే! – +ఈశ్వరరావు (విసుగ్గా చాల్లే! ఊరికే చంపక, ఎవరో, ఏమిటో సరిగా చెప్పరాదటయ్యా? +రామబ్రహ్మం మీవాడే నయ్యా! మీ జానకిరామయ్య! +వెంకటాద్రి మీ ప్రాణ స్నేహితు డయ్యా! +ఈశ్వరరావు (మరింత విసుగుదలతో ఆఁ! అయితే? +రామబ్రహ్మం గద్దెక్కి కూర్చున్న తర్వాత వాడికి ఈ రామబ్రహ్మం అసలొకడు కనబడితేనా? +వెంకటాద్రి పట్టం కట్టుకున్న తర్వాత ఈ వెంకటాద్రి వాడికంట దూరనే లేదు. +రామబ్రహ్మం (తగ్గి, వెంకటాద్రితో మన ఈశ్వరరావుకు కోప మొచ్చిందిరా +వెంకటాద్రి మన మే మన్నాం అంత కోపానికి? +ఈశ్వరరావు(మందహాసం చేస్తూ సరే! ఇప్పుడు మీ మధ్య లేనిపోని తగవులాట దేనికి కాని, ఏమి +రామబ్రహ్మం అబ్బో! చాలా కథ వుందిలే +ఈశ్వరరావు దానిలో మీ రిద్దరు వాలి, సుగ్రీవులుగాని, ఇంతకూ అసలు విషయం తేల్చారు కారు. +రామబ్రహ్మం సరే. వినవయ్యా! మొన్నపోయిన పున్నం రేపు కద్దనగా +ఈశ్వరరావు సరే! ఒకరోజు ఇటో, అటో దానికేమి లెండి. +రామబ్రహ్మం డి.పి. డబ్లీ వాళ్లు వేలం వెయ్యమంటే, పాట పెట్టకుండానే జాయి చూడా పేర +కొట్టేసినట్టు బినామీగా రాసిపారేసి, రివెన్యూ ఇనస్పెక్టరు కొకటి +వెంకటాద్రి ఏఁ! నే నెందుకు చెప్పగూడదు? +ఈశ్వరరావు ఎవరు చెబితే నేమిటిలేఁ! వెంకటాద్రీ! ఊరుకోవయ్యా నువ్వాక క్షణం +రామబ్రహ్మం పంచాయితీ బోర్డు వైసు ప్రెసిడెంటు కొకటి, గుమాస్తా కొకటి, బిల్లు కలెక్టరు +కొకటి వీళ్ళందరి నోళ్ళు కట్టెయ్యడానికి తలొకరికి తలొకటి పంచిపెట్టి, తనైతే ఒక నాలుగు పెద్ద చెట్లు +వెంకటాద్రి నాలుగు ఖర్మ మేమిటి? అయిదో, ఆరో +రామబ్రహ్మం ఆఁ! నీ మొఖంకాదూ? నాలుగే! +వెంకటాద్రి నా కళ్ళతో నేను చూస్తే! ఆరింటికి తక్కువ లేవు. అన్నీ పెద్ద పెద్ద మానులు! కొండలా +వాముల దొడ్డిలో పేర్చి పెట్టుకున్నాడు. ఒక లక్ష యిటికాము అలాగ్గా కాల్తుంది. +రామబ్రహ్మం సరిగాని, వేలాని కొచ్చినవి మొత్త మెన్ని చెట్లంటావ్ +వెంకటాద్రి ఏమో, ఆ తబ్సీలు నాకు తెలవదు. +రామబ్రహ్మం అయితే, మరి నోరుమూసు కూరుకో! +వెంకటాద్రి ఏం పందెం కడతావ్? జానకిరామయ్య తోలించుకున్నవి ఆరేడు చెట్లని నేను +రామబ్రహ్మం కాదు! కాదు! ముమ్మాటికీ, కాదు. +వెంకటాద్రి ఔను! ఔను! ముమ్మాటికీ, ఔను! +వెంకటాద్రి నువ్వు కాదన్నా, అవి ఆరు! +ఈశ్వరరావు ఎన్నో వొకన్ని పోనిద్దురూ! ఆఁ! అయితే ఏమి జరిగింది? +రామబ్రహ్మం ఏరోయ్! అంతా నువ్వే చేసినట్టుగా మాట్లాడుతున్నావ్! +వెంకటాద్రి నేనుగాక నువ్వా? అటునుంచి నరుక్కొచ్చిందెవరోయ్? పంచాయితీ ఆఫీసరు దగ్గిరికి +నిన్న పిటిషను పట్టుకెళ్ళి యిచ్చింది నేను కాదూ? +రామబ్రహ్మం పిటిష నివ్వడానికేఁ? పోస్టు బంట్రోతుకూడా యిస్తాడు. అది రాసిం దెవరోయ్? +వెంకటాద్రి మహలావ్! నువ్వే రాశావులే, సుబ్బన్న రాయింపిస్తే! +రామబ్రహ్మం కావాలంటే నేనే రాయలేనేమిటి? ఇలాంటివి లక్షా తొంభై రాశాను. +వెంకటాద్రి ఇంత పెద్ద రాతగాడివేనా మొన్న సుబ్బన్న వూళ్ళో లేకపోయేసరికి ఏకుసాలు +రామబ్రహ్మం నువ్వంటే నా కిందుకే వొళ్ళుమంట! నా రాతకోత లంటేనే కళ్ళల్లో కారం +వెంకటాద్రి రాతసంగతి నీ కేం తెలుసు లేరా? రాత బలిగోరుతుంది! +రామబ్రహ్మం పొట్ట పొడిచినా అక్షరం ముక్క లేనివాడివి, నువ్వు కూడా నన్ను +వెంకటాద్రి బయల్దేరా డయ్యా, ఈయనే కొమ్ములు తిరిగిన పండితుడు! +రామబ్రహ్మం వీడి మొఖం! వీ డేం పండితపుత్రుడు? ఆ పేరు నాకే తగు. మా నాన్న ఆఁజనేయ +ఈశ్వరరావు (మరింతగా నవ్వుతూ చెప్పావ్ కాదూ? ఆఁజనేయ వరప్రసాదంవల్ల జన్మించిన +సుపుత్రుడ వన్న మాట నవ్వు ఆపుకుని) సర్లే మీరు పిటిషన్ పెడితే ఏమైంది? +వెంకటాద్రి పంచాయితీ ఆఫీసరు తనిఖీకొస్తా నన్నాడు. +ఈశ్వరరావు సరే! వస్తాడయ్యా! వస్తే జానకిరామయ్య కొచ్చిన భయ మేమిటి? బోర్డులో +మెజారిటీ వాడిదే నయ్యె! ఊళ్లో ఉద్యోగస్థులందరు వాడి పక్షమే నయ్యె! +రామబ్రహ్మం నీకు తెలియదులే వయ్యా! దానిలో ఒక కిటుకుంది. +వెంకటాద్రి ఈ దెబ్బతో కుర్చీ దిగాలి. +ఈశ్వరరావు ఇంతకూ ఆ కిటు కేమిటి? +వెంకటాద్రి దానిలో చాలా తిరుగు డుందిలే +ఈశ్వరరావు ఏమి టది? కాస్త విడమర్చి చెప్పరాదూ? +వెంకటాద్రి చెట్లను పబ్లీకుగా పాట పెట్టందే పెట్టానని దొంగరాతలు రాశాడు గాదటయ్యా! +రామబ్రహ్మం నీ మొఖం! అది కాదు పాయింటు. చెట్లని సేలు చేశాక, దాన్ని అప్రూవు +చెయ్యడానికి బోర్డు మీటింగు పెట్టాలి. ఈలోగా సొత్తును దాని స్తానంనుంచి కదిలించగూడదు. కదిలిస్తే కే సౌతుంది. +ఈశ్వరరావు అయితే, ఇంకా మీటింగు జరగలే దేమిటి? +రామబ్రహ్మం ఉహుఁ! మీటింగు రేపటికి వేశాడు. +వెంకటాద్రి ఈలోగా పంచాయితీ ఆఫీసరు రానే వొస్తున్నాడు. +రామబ్రహ్మం ఇప్పు డాయ నొచ్చి సొత్తు చూపించమంటే నీళ్ళు నమలాలి! +రామబ్రహ్మం అసలు శాల్తీలైనా వుంటేగా? దుంగలకింద అప్పుడే కోయించేసుకున్నాడు. +వెంకటాద్రి ఎంత పొగరు లేకపోతే పెంటపోగు పిసరంత వీధిలో కొచ్చిందని నాపైన న్యూసెన్స్ +కేసు పెడతానంటాడు! సంసారి అన్నాక పెంటపోగు కాస్త ఇటూ అటూ రాకండానే వుంటుందా? +రామబ్రహ్మం నాకుమట్టుకు నోటీ సెట్ట���ేదూ? మురుగు మూడు రోజుల్లో తీసెయ్యకపోతే +ప్రాసిక్యూషను చేయిస్తా ఆసామి అన్నాక కాస్త వెనకా, ముందూ వుండదూ? ఆ రెండు మోపుల చెత్తకే చెరువునీళ్ళన్నీ చెడిపోతాయీ +కట్టుకుని ఎన్నాళ్ళు తిరిగినా ససేమిరా అన్నాడు, +రామబ్రహ్మం చెరువులపాటలో దండగ పడ్డానని ఎంత మొత్తుకున్నా, అయినవాళ్లండునని +ఈశ్వరరావు అయితే, ఊరుసొమ్ము తిననివ్వలేదనేనా, ప్రెసిడెంటుపైన మీ కింత కక్ష? +వెంకటాద్రి ఇంతకీ వాడికి కాళ్ళు తెచ్చింది మనమే! +రామబ్రహ్మం పోనీలే, అయినవాడని నేను మా కుదుటివాళ్ళ వోట్లన్నీ వేయించకపోతే, ఈ +వెంకటాద్రి ఊరు కాల్వగట్లని వాడి గొడ్లు ఊరికే మెయ్యడంలాఁ? +రామబ్రహ్మం తూర్పు వీధిలో సగాన్ని వాడు తన వియ్యంకుడికి కలపలాయా? +వెంకటాద్రి చాల్లే! ఇలాంటి మాటలు నాదగ్గిర చెప్పకు, చెయ్యి తడి అయిందేమో, వోట్లు +రామబ్రహ్మం చీ చీ! వాడి పాపిష్ఠిసొమ్ము తిన్నవా డెవడు? ఏమైనా కతికితే, నువ్వే కతికుండాలి. +ఈశ్వరరావు మిమ్మల్ని చూస్తే ఒకందుకు మాత్రం నాకు చాలా ముచ్చ చేస్తున్నది. మీకు ఒకరి +పొడ ఒకరి కెంతమాత్రం గిట్టకపోయినా, జానకిరామయ్యమీద కలిసే కత్తి కడుతున్నారు. +రామబ్రహ్మం పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ కొరికినట్టు, మరి వాడు చేసే పనులేమి టయ్యా? +వెంకటాద్రి ఇప్పుడే గనుక వాణ్ణి నొక్కకపోతే, మరి పట్ట పగ్గాలుంటాయా? +రామబ్రహ్మం వాడి అంతు ఇప్పుడే కనుక్కోవాలి. +రామబ్రహ్మం వాడి పెళ్ళి యిప్పుడే చెయ్యాలి. +వెంకటాద్రి వాడి భరత మిప్పుడే పట్టాలి. +ఈశ్వరరావు కోరితే లంకాదహనం చేయగల సమర్థులు. మీకు ఎదు రేమిటి కాని, సుబ్బన్న +వెంకటాద్రి లేకేం! వున్నా డయ్యా! వెంకటాద్రి నీ కబు రందింది +రామబ్రహ్మం నీకిదే తెగులు! పెద్దమనిషితో మాట్లాడుతూ వుంటే మాటమాటకూ అడ్డొస్తావ్! +వెంకటాద్రి అసలు నీ వెంట రావడం నాదే బుద్ధితక్కువ చెంపలు వేసుకుంటూ) ని న్ననే +రామబ్రహ్మం (తనుకూడా లెంపలు వేసుకుంటూ కాదు, కాదు! తప్పు నాదే! +వెంకటాద్రి మ్! నాదే! రామబ్రహ్మం ఉహుఁ! నాదే! +రామబ్రహ్మం చూశావా? ఆ పెద్దమనిషి నిన్ను చూసి ఎలా నవ్వుతున్నాడో! +వెంకటాద్రి నన్ను చూసి కాదు; నిన్ను చూసే! +వెంకటాద్రి నువ్వు నిజం చెప్పవయ్యా? ఎవర్ని చూసి? +రామబ్రహ్మం ఈ పెద్దమ్మను చూసి కాదూ? +వెంకటాద్రి ఈ దద్దమ్మను చూసి కాదూ? +(ఈశ్వరరావు కడుపు చెక్కలయ్యేటట్లు విరగబడుతుండగా సుబ్బన్న ప్రవేశిస్తాడు. అతడు ఈశ్వరరావుకంటె రెండు, మూడేళ్లు పెద్ద. ఊళ్లో ఒక పార్టీ నాయకుడు, ఆరితేరిన వ్యవహర్త. +ఈశ్వరరావు రారా! సుబ్బన్నా! రా! పరమానందయ్య శిష్యుల్ని చేర్చి వ్యవహారం చాలా +సుబ్బన్న మీ రిక్కడ పోగైనారూ? వార్డి సోదిరాముళ్ళు! మీతో పనులైనట్టే! రామబ్రహ్మం! +ప్రెసిడెంటు తన పార్టీ మెంబర్లందర్నీ యింటికి పిలిపించుకున్నాడు. ఏమి గూడుపుఠాణీ చేస్తున్నారో కాస్త ఆరా తీసి రా +రామబ్రహ్మం ఆఁ! చెయ్యడాని కేముంది? తలపట్లు పట్టుకుంటున్నారు! +సుబ్బన్న వెంకటాద్రీ! నువ్వెళ్ళి మన ప్రసాదరావుని ఒకసారి పిలుచుకురా! నే నిక్కడే వుంటా – +వెంకటాద్రి పొద్దు నొకసారి వెళ్ళితే, పొల మెళ్ళాడన్నారు. తిరి గొచ్చాడో, లేదో +సుబ్బన్న (వెంకటాద్రి అవతలికి వెళ్ళిన తర్వాత, ఈశ్వరరావుతో విన్నావా, ఊళ్ళో విశేషాలన్నీ? +ఈశ్వరరావు విన్నాలే! కాని, మీ పగలు మీరు సాధించుకుంటూ రాజీ చెయ్యడానికి నన్ను +సుబ్బన్న ఆఁ! నీకేం తెలుసు లేరా రాజీ మాట లొచ్చాక వాడెంతగా నోరు పారేసుకున్నాడో! +ఈశ్వరరావు వాడికి కొంచెం నోటి దురుసుతన మున్నమాట నిజమే. కాని, ఇప్పుడు మీరు వాణ్ణి +ప్రాసిక్యూషన్ చేయిస్తే కక్షలు మరింత పెరిగిపోయి, ఊరు ధ్వంసధూళి కాదూ? +సుబ్బన్న: చూస్తూవుంటే మేస్తూ పోయిందని, మేము ఊరుకున్న కొద్దీ వాడు మరీ తెగబడు +ఈశ్వరరావు జానకిరామయ్య నీ కిప్పుడు దుష్టుడయ్యాడు గాని, నిన్న మొన్నటివరకు మీరిద్దరు +ప్రాణ స్నేహితులేగా? వీరభద్రయ్యను కలిసే పడగొట్టారయ్యె! +సుబ్బన్న ఆఁ! జానకిరాము డిప్పుడు వెనకటి మనిషి కాడులేఁ? +ఈశ్వరరావు నిన్నుగురించీ వాడు బహుశా ఇదే మా టంటాడు. పదవుల కోసం పాకులాటే తప్ప +ఊరు కుపకారం లేదని ఒకప్పుడు మనం పెద్దవాళ్ళని విమర్శించేవాళ్ళం నీకు జ్ఞాపకం లేదట్రా? ఉద్యోగమై నేను పట్నవాసానికి వెళ్ళిపోడానికి ముందు గ్రామసేవా సంఘమంటూ మన మందరమూ చేరి స్థాపించాం కూడాగా? దానికి ప్రెసిడెంటువు నువ్వైతే, జానకిరామయ్య సెక్రటరీ. ముసలీ, ముతకా పెత్తందార్లు స్వలాభం కోసం స్పర్ధలు పెంచుతున్నారనీ, స్వప్రయోజనాలకు సమష్టి క్షేమాన్ని బలిపెడుతున్నారనీ ఆనాటి మన ఉపన్యాసాలు, మన తీర్మానాలు అన్నీ మరిచిపోయావా? +సుబ్బన్న ఆ రోజులలో ఏమేమో చాలా చాలా అనుకున్నాంలే! కాని, సాగొద్దూ? +ఈశ్వరరావు ఎందుకు సాగవు? ఈ కక్షల సాధింపు పట్టుదలలో పదోవంతైనా వుండాలే కాని! +ఇప్పటికి మీ పార్టీ కెంత ఖర్చైంది +సుబ్బన్న ఆఁ! తాడో పేడో తేలేసరికి రెండు, మూడు సంచులై���ా కావూ? +ఈశ్వరరావు మీకు రెండు, మూడు వేలైతే, జానకిరామయ్య పార్టీవాళ్ళకు కనీసం మరంతైనా +సుబ్బన్న ఆఁ! వాళ్ళు యింట్లో సొమ్ము తెచ్చిపెడుతున్నా రేమిటి? పవరు చేతిలో వుందిగా! +చెరువుల పాటల్లోను, కాలవగట్ల పాటల్లోను మిగిల్చి, పార్టీ ఫండు కూడబెడుతున్నారు. +ఈశ్వరరావు ఏమైనా ఊరు సొమ్ము దండగ కావడమే గదరా? ఈ మొత్తం ఆ జిల్లా బోర్డు +వాళ్లకిస్తే గరల్స్ స్కూలుకి ఒక బిల్డింగ్ పడేది కాదూ? స్థలం వుండనే వున్నదయ్యె, దాన్ని భరంతు కూడా చేశారయ్యె. జిల్లేళ్ళూ పల్లేళ్ళూ మొలిచి, అది పాడుపడి పోవలసిందేనా? +సుబ్బన్న నీ దంతా పిచ్చి కాని, స్కూలుకోసమంటే డబ్బిచ్చే వా డెవడురా? +ఈశ్వరరావు ఎందుకివ్వరు మనం అందరినీ సరిగా కూడగట్టుకు రావాలే గాని! పంచవర్ష +ప్రణాళికల కింద గ్రామాలకు ప్రభుత్వ మిప్పుడు విరివిగా సహాయం చేస్తున్నదిగాఁ! కలిసి పనిచేసుకుంటే ఒక గరల్స్ స్కూలే అన్న మాటేమిటి? ఆసుపత్రి తెచ్చుకోవచ్చు; ఎలక్ట్రిసిటీ తెచ్చుకోవచ్చు; ఏమైనా తెచ్చుకోవచ్చు. +సుబ్బన్న బస్తీలో కూర్చున్నావ్! పల్లెటూరు వ్యవహారాల సంగతి నీ కేం తెలుసులేరా? ఇక్కడుండి +అన్నీ పడుతుండే మాకే ఆకళింపుకావు, వాటి లోతుపాతులు! నువ్వు పుస్తకాల్లో చదువుకున్నట్టు జరగమంటే జరుగుతుందా? +ఈశ్వరరావు ఇంతకూ నా కేమీ తెలియదంటావ్? అయితే, నన్ను రాజీచెయ్యడానికి రమ్మనడం +సుబ్బన్న ఇం కేం రాజీరా? వ్యవహారం నా చెయ్యి కూడా దాటిపోయింది. నేను ఆపాలన్నా, ఇఖ +ప్రాసిక్యూషను ఆపలేను. వాడి కళ్ళు ఎంత కప్పుకు పోకపోతే +రామబ్రహ్మం (ఇంకా సాలిపడుతూనే పోయాడు! ఇంకేముంది? పోయాడు! +సుబ్బన్న ఎవడు పోయాడు? ఎక్కడికి పోయాడు? ఏమొచ్చి పోయాడు? +రామబ్రహ్మం (ఇంకా గుక్కతిప్పుకో లేక వాడే? +రామబ్రహ్మం (కాస్త తెప్పరిల్లి వాడే! జానకిరామయ్య! +రామబ్రహ్మం బోర్డు మీటింగు మొన్నే జరిగినట్టు రాసి పారేశాడు! +రామబ్రహ్మం మెంబర్ల సంతకాలు కూడా చేయించేసుకున్నాడు! +రామబ్రహ్మం తెచ్చి వాములదొడ్డిలో పెట్టుకున్న మానులన్నీ పాలేళ్ళతో పగలేయించి, బళ్ళమీద +వాళ్ళకీ, వీళ్ళకీ తోలించేశాడు. మరి కాసేపటికి అక్కడ చితుకు పుల్లయినా మిగలదు. +ఈశ్వరరావు మీటింగు అయిపోయిందా? ఇంకా జరుగుతున్నదా? +రామబ్రహ్మం ఇంకా జరగడమేమిటయ్యా? మొన్నే జరిగినట్టు రాయడమూ అయింది; ఎవడి +దారిని వాడు లేచి పోవడమూ అయింది. +ఈశ్వరరావు అయితే, దొడ్లో వేయించుకున్న మానులు కూడా అక్క డిప్పుడు ల��వన్న మాట. +రామబ్రహ్మం వాటినీ దాటేయించేశాడు. మొన్న మొన్నటిదాకా మొద్దు రాచ్చిప్పలా వుండేవాడు. +చూస్తూ చూస్తూ వుండగానే జానకిరాము డెంత తెలివి మీరాడు! ఎత్తు, పైయెత్తులకు మా సుబ్బన్నే అనుకుంటే, సుబ్బన్న తలదన్ను తున్నాడు. +ఈశ్వరరావు ఏరా! సుబ్బన్నా! మరిప్పుడేం చేస్తావ్? +సుబ్బన్న విజయసూచకమైన చిరునవ్వుతో తల పంకిస్తూ) నే నేమీ చేయనఖ్ఖరలేదు. తన చేత్తోనే +తన మెడకి ఉచ్చు మరింత బిగించుకున్నాడు! +సుబ్బన్న ఏమిటో చెబుతాలే రామబ్రహ్మంతో) ఆ వెంకటాద్రి అదే పోకడ పోయాడేమిటి? కాస్త +వెళ్ళి ప్రసాదరావుని ఇక్కడున్నట్టు పిలుచుకురా! మర్చిపోక, మీటింగు యెజెండా తెమ్మన్నానని ప్రసాదరావుతో చెప్పు! చూస్తావేఁ! త్వరగా ఈ పని చేసుకురా! +రామబ్రహ్మం ఇంకేం చెప్పడం? ఇంకేం చూడ్డం? పోయాడు; చిక్కినట్టే చిక్కి గుప్పిటిలోనుంచి +సుబ్బన్న ఆఁ! ఎక్కడికి పోతాడు? ఏట్లోకి! నీళ్లు నములుతూ నిలుచోకుండా నువ్వెళ్ళి చెప్పినపని +చేసుకురా! నేను నడిపిస్తాగా వ్యవహారం నీకెందుకు? +ఈశ్వరరావు సుబ్బన్నా! ఏమి కొత్త యెత్తు యెత్తుతున్నావురా? +సుబ్బన్న మీటింగు రేపని యెజండా పంపించలేదట్రా? దాన్నిబట్టే కాలవగట్టు చెట్లపాట బోర్డు +మీటింగులో ఇంకా అప్రూవు కాలేదని మాకు తెలిసింది. మాపార్టీ మెంబర్లు నలుగురిలో ముగ్గురు వూళ్ళో లేకపోయినా, ప్రసాదరావుకు యెజెండా అందింది. ఇప్పుడిక ఆ యెజెండాయే మన జానకిరాముణ్ణి జెయిలుకు పంపించడానికి! +సుబ్బన్న గట్టి చిక్కేనని నెమ్మదిగా అంటున్నా వేమిటి? ఇది కొరివి పెట్టి తల గోక్కోవడమే! +(రామబ్రహ్మం, వెంకటాద్రి, ప్రసాదరావు ప్రవేశిస్తారు. ప్రసాదరావు +దాదాపు నలభై యేళ్ళవాడు. చిరుబొజ్జతో నిండైన విగ్రహం. కాని, ఆలోచన తక్కువ. +రామబ్రహ్మం ఇరుగో! సుబ్బన్నా! నాకు వాకిట్లోనే ఎదురయ్యారు. +రామబ్రహ్మం ఏఁ సుబ్బన్నా! ఇప్పు డెలా చక్కదోస్తావ్? +వెంకటాద్రి ఏదో ఒక దారి నువ్వే చూడాలి, సుబ్బన్నా! +సుబ్బన్న (ప్రసాదరావుతో ఏదీ ఆ యెజెండా? +ప్రసాదరావు అబ్బే! కాగితం గిరాకీ అయ్యాక తలొక మీటింగు నోటీసు, యెజెండా పంపించడం +లేదుగా? అంతా ఒకే కాగితంమీద రాసి, దానిమీదే అందరు మెంబర్ల సంతకాలు పెట్టించుకు పోతున్నారు. +సుబ్బన్న (తెల్లబోయి ఈ సంగతి నేను కానలేదే! +ప్రసాదరావు పాత యెజెండా చించి పారేసి, కొత్తది సృష్టించాడంటావా? +సుబ్బన్న ఔను! కొత్తది సృష్టించి వుండాలి; దానిమీద పాత తారీ కేసి తన పార్టీ మెంబర్ల +ప్రసాదరావు మరి నా సంతకం వుండదుగా? +ఈశ్వరరావు సుబ్బన్నా! మరి నీ ఆట కట్టినట్టేనా? +(సుబ్బన్న జవాబు చెప్పడు. తిరిగి ఆలోచనలో పడ్డట్టు కనబడతాడు. +రామబ్రహ్మం వలలో పడ్డట్టే పడి, చేప జర్రున జారిపోయింది. +వెంకటాద్రి చేతిలో చిక్కినట్టే చిక్కి పిట్ట తుర్రున పారిపోయింది! +రామబ్రహ్మం ఇఖ చూడు వాడి ప్రతాపం! +వెంకటాద్రి మరి వాడు ఆడిందే ఆట. +వెంకటాద్రి రేపటి నుంచి మరీ మండిస్తాడు! +వెంకటాద్రి వాడు నక్కను చంపి పుట్టాడు. +వెంకటాద్రి ఏట్లో పారేసినా ఎదు రీదుకొస్తాడు. +వెంకటాద్రి వాడు అఖండుడని నేను ఆదికాలంనాడే చెప్పలా? +రామబ్రహ్మం వాడు మా కుదుటివాడు. వాడి జిత్తులు నాకంటె నీకే యెక్కువ తెలుసా? +వెంకటాద్రి కాడిగట్టు వాళ్ళం. వాడితో నే నెన్ని పేచీలు పడివున్నానో నీకేం తెలుసు! +రామబ్రహ్మం అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గిర +సుబ్బన్న అబ్బబ్బ! మీరు కాసేపు ఊరుకోండి! ఆఁ! ప్రసాదరావ్! ఈ పూట మీటింగు జరిగింది +సుబ్బన్న అయితే, మినిట్సుబుక్కు యింటికి పట్టించుకు వెళ్ళాడన్నమాట! దాన్ని ఆఫీసులోనుంచి +రామబ్రహ్మం అమ్మ! వాడి యెత్తులు మరెవరి కొస్తాయి! +సుబ్బన్న సరే! పంచాయితీ ఆఫీసరు వచ్చేలోపల దాన్ని మళ్ళీ ఆఫీసులోకి చేర్చనివ్వకుండా చేస్తే +సరి! అప్పుడు బయటపడుతుంది వాడి బడాయ్ +ప్రసాదరావు ఆ పని చేస్తేనా, పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టే. +సుబ్బన్న రామబ్రహ్మం! వెంకటాద్రీ! చూస్తారేఁ? మన వాళ్లందరినీ పోగుజేసుకు రండి! బోర్డు ఆఫీసు చాయలకైనా ఆ పార్టీ మనిషిని అడుగు పెట్టనివ్వరాదు అదేమైనా సరే! +వెంకటాద్రి బుర్ర రామకీర్తన పాడిందన్న మాటే! +రామబ్రహ్మం అటువైపుకు తొంగైనా చూస్తే, రక్తం కళ్ల జూడం! +వెంకటాద్రి అక్కడే పాతి పెట్టం! వెంకటాద్రి ఇంటిదగ్గిర చెప్పుకు రావాలి. +వెంకటాద్రి ఎవడికి కలేజా వుంది అటు రావడానికి! +రామబ్రహ్మం ఎన్ని గుండె లుండాలి అక్కడడుగెట్టాలంటే! +సుబ్బన్న మాటలు కాదు; చేతలు కావా లిప్పుడు, పదండి త్వరగా! ప్రసాదరావ్! నువ్వూ పద! – +సుబ్బన్న వాళ్ళు గడప దాటి వెళ్ళేవరకు ఆగి, ఈశ్వరరావుతో ఆట ఇంకా కట్టలేదు! +ఈశ్వరరావు ఎందుకు కడుతుంది? కొట్లాటకు దిగబోతున్నావుగా? ఎందుకైనా మంచిది. +లాఠీలు, బరిసెలు, గండ్రగొడ్డళ్ళు జాగ్రత్త పెట్టించు. +సుబ్బన్న వాడు చేస్తున్న పనులు నీకు బాగున్నాయేం? +ఈశ్వరరావు ఎవరు చేస్తున్న పనులూ బాగుండలేదు. ఈ కోపాలు, ఈ తాపాలు, ఈ కక్షలు, ఈ +బిల్లు కలెక్టరు (బయటనుంచే మీ రున్నారేమో మా ప్రెసిడెంటుగారు సూడమన్నారండీ! +బిల్లు కలెక్టరు (బయటినుంచే మీ దగ్గరికే వొస్తున్నారు. +ఈశ్వరరావు వాడొస్తే నువ్వు వెళ్ళాలా? మీ వుభయులకు నేను కావలసినవాడినేగాఁ? +సుబ్బన్న ఆఁ! నేనుంటే వాడు రాడులే! నువ్వు వొంటరిగా వున్నావేమో చూచి రమ్మనే బిల్లు +ఈశ్వరరావు మరి నే నేమి చెప్పీ లాభం లేదన్నమాట! +సుబ్బన్న నీకు తెలియవులేరా పల్లెటూరి వ్యవహారాలు! +(సుబ్బన్న నిష్క్రమిస్తాడు. ఈశ్వరరావు తిరిగి పత్రిక తీసి, దేనిపైనా దృష్టి లగ్నం కానందున పేజీలు ఊరికేనే తిరగవేస్తూ వుంటాడు. ఇంతలో జానకిరామయ్య ప్రవేశిస్తాడు. అతడు ఈశ్వరరావు ఈడువాడే. వేషంలో కొంత దర్పం కానవస్తుంది. ఆ దర్పం ప్రవృత్తిలోకూడా లేక పోలేదు. +జానకిరామయ్య చూశావుగా సుబ్బన్న నడిపిస్తున్న తతంగం? +ఈశ్వరరావు ఒక్క అదేనన్న మాటేమిటి? సర్వం చూస్తున్నా, +జానకిరామయ్య కట్టెపుల్లలకు కరువుగా వుందని ఊళ్ళో ఉద్యోగస్టులు మొహమోట పెడితే, +వాళ్ళకు సప్లయి చేసినందుకు నా పీకమీదికి తెచ్చాడు. +ఈశ్వరరావు ను వ్వేమీ తోలించుకో లేదా? +జానకిరామయ్య ఈ ముష్టి మూడుబళ్ళ పుల్లలులేకపోతే, నాకు గడవదట్రా? నేను ఊళ్లో +లేనప్పుడు పంచాయితీ బోర్డు గుమాస్తా చేయించాడు ఈ పాడు పని. +ఈశ్వరరావు నీకు తెలియకుండా జరిగితే వాటి నెందుకు అట్టే పెట్టుకున్నావ్? +జానకిరామయ్య అది తప్పే! ఆ మాట నాకు తోచలేదు. +ఈశ్వరరావు మరి ఇవ్వాళ ఈ మీటింగు మా టేమిటి? +జానకిరామయ్య నా ప్రాణం మీదికి తెస్తే, మరి నన్ను చావమంటావా? ఏదో ఒక విధంగా +ఈశ్వరరావు సరేగాని నువ్వు రాజీ ప్రయత్నం చెయ్యమంటేనేగా నే నివ్వాళ పనికట్టు +కొచ్చింది? నన్ను రమ్మని చెప్పినవాడివి ఊళ్లోకొచ్చి సుబ్బన్నను తిట్టడం తగునా? +జానకిరామయ్య ఆఁ! పుండాఖోర్! నేను తిట్టానని చెప్పాడూ? +ఈశ్వరరావు ఒక పక్కని పుండా బోర్ అంటూనే తిట్టలేదంటా వేమిరా? +ఈశ్వరరావు ఊరికే ఇప్పుడు నోరు పారేసుకోవడం దేనికి కాని, “రెండేళ్ల నుంచి ప్రెసిడెంటుగా +వున్నానుగదా! ఊరుకు ఏమి ఉపకారం చేశా నని ఎన్నడైనా ఆలోచించుకున్నావూ? +జానకిరామయ్య ఎవడైనా చేసే దేమున్నదిరా? పంచాయితీ బోర్డు ఆదాయం వడసారం ఆరు +వేలు! దానిలో సగమైనా జీతాలకు, ఎస్టాబ్లిష్ మెంటుకు పోతుంది. మిగతాదాంతో ఏం పను లౌతాయి? పోనీ, ఏమైనా చేయిద్దామంటే, ఖర్చు నూరురూపాయలు మించితే చాలు, దానికి సవాలక్ష ఎస్టిమేట్��ు, అప్రూవల్సు కావాలి. దీనిలో ఎక్కడ ఏ కాస్త పొరపాటు జరిగినా, సర్ ఛార్జీలు తప్పవు. ఇదే పంచాయతీబోర్డు ప్రెసిడెంటుగిరీ బండారం! +జానకిరామయ్య పెడితేనే బాగుండును. కాని, పరువుకోసం పట్టుకు పాకులాడుతున్నా. ఇది +కత్తిమీద సాములా వుంది. ఇవ్వాళ చూశావుగా ఎంత గట్టి దెబ్బ తట్టుకోవాల్సొచ్చిందో! +ఈశ్వరరావు చూడ కేమిరా? ఎత్తుకు పైయెత్తు ఇంద్రజాలపు యెత్తు లెత్తారు. సామ్రాజ్య చక్రాన్ని +తిప్పే తెలివితేట లున్నాయి. కాని, ఏమి లాభం? ఒకరిపై ఒకరు కక్షలు సాధించుకోడానికే తప్ప, ఊరి కుపయోగించడం లేదు. +జానకిరామయ్య ఒకడు పదవిలో వుంటే, వాణ్ణి ఎలా పడగొట్టాలని తప్పితే మనకు వేరే ఆలోచనే +వుండదయ్యె. ఇక, మన మేం ముందు కొస్తామురా +ఈశ్వరరావు ఆ మాట నిజమే! వీరభద్రయ్యను రిమూవ్ చేయించేగా నువ్వు మొదటిసారి +జానకిరామయ్య అప్పుడు ఈ సుబ్బన్నే నా మెడలు విరిచాడు. కావాలని నే నేడ్చానా? తనే +బలవంతాన నన్ను ఈ కుర్చీ యెక్కించాడు. ఎలాగైనా ఈ మహాపదవి నాకు +న న్నిప్పుడు దించి, తానే దానిలో కూర్చోవాలని చూస్తున్నాడు. వీరభద్రయ్యను పడగొట్టడానికి వీడికి నా వత్తాసు కావల్సి వచ్చింది. ఇప్పుడు నన్ను పడగొట్టడానికి ఆ వీరభద్రయ్యతో ఏకమయ్యాడు. నాకు తెలుసులే వీడి యెత్తులన్నీ. వీరభద్రయ్యకు పెద్ద ఖాతా నడుస్తున్నది; నా కేమో పెద్దలు సంపాయించి యిచ్చిపోయిన కొండ్ర వున్నది. కాస్త పచ్చగా వున్న మా యిద్దరి జుట్లూ ముడివేసి, మమ్ముల నిద్దరినీ గాడిదల్ని చేసి, తాను గద్దెక్కాలని చూస్తున్నాడు. వా డిప్పుడు పాత సుబ్బన్న కాడు. ఆస్తి పాస్తులు లేకపోయినా, ఊరూ నాడూ యేలా లంటున్నాడు. +ఈశ్వరరావు నామాట విని, ను వ్విప్పుడు కాస్త తగ్గరాదూ? ఉభయ పార్టీలకు +అనుకూలమైనవాణ్ణి ప్రెసిడెంటుగా చేద్దాం. లేకపోతే, ఇప్పుడు రైటింగ్ వరకు పోతుందేమో! నువ్వు మిన్సిబుక్ ఆఫీసుకు చేర్పించబోతే, అంత పనీ తప్పదు. సుబ్బన్న తన వాళ్ళందర్నీ పోగుజేసుకు వెళ్ళాడు. పంచాయితీ ఆఫీసరు వచ్చేలోగా బోర్డు ఆఫీసు చాయలకు ఎవడైనా వస్తే, నలిపివేస్తా మంటున్నారు. ఇప్పుడు దొమ్మీ జరగవలసిందేనా? +జానకిరామయ్య ఆఁ! ఏడ్చారులే! ముందే ఆలోచించి అందుకు తగిన కట్టుదిట్టం చేశా. పోలీసు +సబ్ యిన స్పెక్టర్ తను దగ్గరుండి దాన్ని లోపలికి చేర్పిస్తానన్నాడులే! ఆయన వద్ద వీళ్ళ పప్పు లుడకవ్. ఎవడైనా అడొస్తే బొక్కలో తోయిస్తాడు. +ఈశ్వరరావు కావచ్చులేరా! ఈనాడు నీదే పై చె��్యి కావచ్చు; ఈ వ్యవహారంలో నువ్వే +నెగ్గవచ్చు. కాని, ఇలా కక్షలు పెంచుకుంటే ఊరు ముందు కొస్తుందా? +జానకిరామయ్య ఆ! నీకు తెలియవులేరా, పల్లెటూరి వ్యవహారాలు! +ఈశ్వరరావు సుబ్బన్నకూడా సరిగా ఇదే మాట అనిపోయాడు సుమీ! మీ కిద్దరికీ అన్నీ +భేదాభిప్రాయాలే అయినప్పటికీ, ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వున్నట్టుంది. +ఈశ్వరరావు వొట్టి శుంఠకింద నన్ను లెఖ్క కట్టడంలో! +పాత్రలు: వెంకట్రామయ్య పల్లెటూరి రైతు, రాజేశ్వరి అతని కుమార్తె,సత్యనారాయణ అతని అల్లుడు, +నాగేశ్వరరావు అతని మేనల్లుడు, చింతాలు అతని పాలేరు, భీమన్న ఒంటెద్దుబండివాడు. +(వెంకట్రామయ్యగారి యింటి చావడి, ఎడమవైపున సింహద్వారం, కుడివైపున పెరటిలోకి ద్వారం. ఈ రెండు ద్వారాలకు ఒక్కొక్క పార్శ్వంలో ఒక్కొక్క కిటికీ. ఎదురుగా మరి రెండు ద్వారాలు; ఒకటి పడకగదిలోకి, రెండవది పడమటింటిలోకి, చావడిలో వీధిగోడ చెంతగా యెత్తిపెట్టివున్న రెండు నవారు మంచాలు. చావడి గోడలకు లక్ష్మి, సరస్వతీ, మోహిని, మేనక విశ్వామిత్రుడు, శ్రీరామ పట్టాభిషేకం, గోపికా వస్త్రాపహరణం మొదలైన పటాలు (సన్ లైట్, వినోలియా వైట్ రోజ్ సబ్బుల అడ్వర్టైజ్ మెంట్స్ తో సహా) +తెర లేచినప్పుడు చావడి ఖాళీగా వుంటుంది. వీధి తలుపును ఎవరో తట్టినచప్పుడు కాగా, “ఎవ రది +అంటూ పడమటింటిలో నుంచి రాజేశ్వరి చావడిలోకి వస్తుంది. ఆమె ముద్దు పేరు చిట్టెమ్మ. వయస్సు పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాలు. చామనచాయ. కళకళలాడుతున్న కోలముఖం. కాంతివంతమైన చేరెడేసి కళ్లు. తిరిగి తలుపు తట్టిన చప్పుడు కాగా “వచ్చే” అంటూ ఆమె త్వరగా అడుగు వేస్తుంది. +సత్యనారాయణ;(దర్పాన్ని నటిస్తూ, చావడిలోకి వచ్చి ఔను! మేమే! +రాజేశ్వరి (చిరునవ్వుతో మీ చిలిపి మాటలు పోనిచ్చారు కారు. పడమటింటిలోకి వెడుతూ అమ్మా! +(సత్యనారాయణ చావడి మధ్యకు వస్తాడు. అతడు పాతికేళ్ల వాడు. పొడుగ్గా, పలచగా, +నాజూకైనవాడు. బిళ్ళగోచి పంచెతో, వొదులు లాల్చీతో, వల్లెవాటు ఉత్తరీయంతో బెంగాలీ వేషం. ఉత్తరీయాన్ని తీసి, ఎక్కడ తగిలించాలా అన్నట్టు అతడు చావడిని కలయజూస్తూ వుండగా సామానుతో, థైర్మస్ ప్లాస్క్ తో బండి భీమన్న వస్తాడు. +బండి భీమన్న (సామాను చావడిలో పెడుతూ సామాను సరిగ్గా సూసుకోండి, బాబయ్యా! ఇదో! ఇది +పెట్టి; ఇది పరుపు సుట్ట; ఇది మరిగలే ఏంటో గొట్టం. ఇది పూలబుట్ట, మొత్తం నాల్గు సాల్తీలు. లెక్క సూసుకోండి బాబయ్యా! +సత్యనారా���ణ సరి లేవోయ్! బాడు గెంత? +బండి భీమన్న మీ సిత్తం బాబయ్యా! +సత్యనారాయణ (పర్సు తీసి, రూపాయి యిస్తూ మంచిది. పోవోయ్! +బండి భీమన్న (రూపాయి అందుకుని దణ్ణం పెడుతూ ఈనాం దయసేయించండి, బాబయ్యా! +సత్యనారాయణ (పర్సు జేబులో పెట్టివేసుకుంటూ ఈనాములు, అగ్రహారాలు యివ్వడానికి నే నేమీ +బండి భీమన్న పెబువులు మీకేం లోటు? మీరు సల్లగా సూడకపోతే పేదా బిక్కీ బతికే దెలా, బాబయ్యా? +రాజేశ్వరి (కాళ్లు కడుక్కోడానికి చెంబుతో నీళ్ళు తెచ్చి ఏం, భీమన్నా! ఏమిటది? +సత్యనారాయణ రూపాయిచ్చినా, ఇంకా ఈనాం తెమ్మంటున్నాడు! +రాజేశ్వరి రూపాయి పుచ్చుకున్నాడూ? స్టేషన్ నుంచి వూళ్లోకి అర్ధరూపాయే మామూలు, ఏం, +భీమన్నా? కొత్తవార్ని చేసి, ఇలా గుంజుతున్నావ్! వుండు. మా నాన్నతో చెబుతా! +బండి భీమన్న నీకు దణ్ణం పెడతా! వొద్దమ్మా, వొద్దు! +బండి భీమన్న ఎంకట్రామయ్య బాబయ్యతోటే! అబ్బో! ఆయన కరకట్టు మనిషి. మాట +సత్యనారాయణ ఆఁ! ఆయనంత కరకట్టుగా వుంటాడూ? +బండి భీమన్న ఆయన సంగతి మీకేం తెల్సు, బాబయ్యా? బలే నికార్సు మనిషి. అయితే, +సిట్టెమ్మొగోరూ! ఈ రూపాయి తీసుకుని, అర్థే యిప్పించండమ్మా! +సత్యనారాయణ సరి లేవోయ్! నువ్వు పో! +బండి భీమన్న సిత్తం! బాబయ్యా! సామాన్ల లెక్క సరిగ్గా సూసుకోండి. +రాజేశ్వరి (నీళ్ళచెంబు అందిస్తూ కాళ్ళు కడుక్కోండి. +సత్యనారాయణ నా కాళ్ళకేఁ? పరిశుభ్రంగానే వున్నాయ్! +రాజేశ్వరి (చిరునవ్వుతూ తమరు బస్తీవారు కాబోలు! మేము పల్లెటూరి వాళ్ళం, మోటువాళ్ళం, +మా మోటు ఆచారాలివి. మోటువాళ్ల మధ్య ఇష్టమైనా, కష్టమైనా వాళ్ల పాటు ఆచారాలు పాటించక తప్పదు. +సత్యనారాయణ (ఉత్తరీయాన్ని రాజేశ్వరి చేతి కిస్తూ):అబ్బే! మోటువాళ్లు కాదు, మాటశారు! +(కాళ్లు కడుక్కోడానికి సత్యనారాయణ పెరటి గుమ్మం గుండా వెడతాడు. రాజేశ్వరి ఉత్తరీయాన్ని ఒక పటం మేకుకు తగిలిస్తుంది. ఒక నవారు మంచాన్ని వాల్చి, దానిపై జంఖానా పరిచి, తలవైపున దిండు వేస్తుంది. ఈలోపల కాళ్ళు కడుక్కువస్తున్న సత్యనారాయణకు యెదురుగా వెళ్లి, తువాలిచ్చి, చెంబు తీసుకుని, పడమటింటిలోకి వెడుతుంది. సత్యనారాయణ మంచంపై కూర్చుంటాడు. +బండి భీమన్న (బయట నుంచి బాబయ్యా! +బండి భీమన్న (చావడిలోకి వస్తూ నేనే బాబయ్యా! +సత్యనారాయణ (బుర్ర గోక్కుంటూ, ఎదురుగా వచ్చి నిలిచిన భీమన్నతో దేనికోయ్? +బండి భీమన్న ఏం లేదు బాబయ్యా! మరిగళ్తే మీరు మల్లీ పట్నమెప్పు డెడతారు, బాబయ్యా? +సత్యనారాయణ (చ���కాకుగా నీ కెందుకోయ్ ఈ ఆరాలన్నీ? నే నెప్పుడు వెళ్ళితే నీకేఁ? +బండి భీమన్న ఏం లేదు. బాబయ్యా! మరిగళ్తే +సత్యనారాయణ ఏమిటోయ్ ఆ గల్లీలూ, కలీలూ +బండి భీమన్న అది కాదు. బాబయ్యా! మళ్ళీ బం డెప్పుడు తోలుకు రమ్మంటారు? +సత్యనారాయణ ఓహో! అదా సంగతి! ఎల్లుండి పొద్దున్నే మెయిల్ వేళకు తోలుకురా! +రాజేశ్వరి (పడమటింటిలోనుంచి వస్తూ మళ్ళీ ఎల్లుండే ప్రయాణమటండీ? ఏమంత తొందర? +బండి భీమన్న అయితే, మరెప్పుడు రమ్మంటారు, బాబయ్యా +సత్యనారాయణ ఎల్లుండి పొద్దునని నీకు చెప్పలా? +బండి భీమన్న ఎల్లుండి ఈల్లేదని మా సిట్టెమ్మగా రన్నారు గదండీ? +సత్యనారాయణ మీ సిట్టెమ్మగారు, పొట్టెమ్మగారు అలాగే అంటారులే! నువ్వు మాత్రం నే +చెప్పినట్టుగానే ఎల్లుండి పొద్దున్నే రా! సరేనా +బండి భీమన్న సిత్తం సిత్తం! దణ్ణం, బాబయ్యా! +రాజేశ్వరి ఇదుగో! భీమన్నా! రామాలయందగ్గిర మా నాన్న వుంటే, పట్నం అల్లుడు +బండి భీమన్న సిత్త మమ్మా! సిత్తం! +రాజేశ్వరి (చిన్న మొహం చేసుకుని అంత తొందరేమండీ? ఎల్లుండే తిరిగి వెళ్లాలా? వారం +రోజులపాటైనా మీకు సెలవు దొరక దేమండీ? +సత్యనారాయణ ఒక్క వారం రోజుల ఖర్మేమిటి? అసలే సెలవు దొరికింది! +సత్యనారాయణ (బండి భీమన్న గొంతుతో సిత్తం! సిత్తం! +రాజేశ్వరి ఆఁ! పోదురూ! మీరు వేళాకోళ మాడుతున్నారు. +సత్యనారాయణ నిజం చెప్పినా నువ్వు నమ్మకపోతే, మరి నేను చేసే దేమిటి? +రాజేశ్వరి అ దేమిటండీ? ఏడాదిపాటు ప్రయత్నం చేసి ఉద్యోగం సంపాయించడమూ, నెలైనా +సత్యనారాయణ (సిగరెట్టు తీసి ముట్టిస్తూ మన అదృష్టం అలా వుందన్న మాట. ఆ పత్రిక +రాజేశ్వరి మొన్నే కదండీ దాన్ని ప్రారంభించింది? +సత్యనారాయణ నిజమే! కాని, కనీసం లక్షలైనా పెట్టుబడి లేకుండా ప్రారంభిస్తే, దినపత్రిక +రాజేశ్వరి మరి మీ వుద్యోగం పోతే, ఎల్లుండే జరూరుగా తిరిగి వెళ్ళాలంటా రేమిటి? +సత్యనారాయణ మా క్లబ్బు నాటకంలో రాజు వేషం వొప్పుకున్నాలేఁ! +రాజేశ్వరి అలాగేఁ! అయితే రాణిగా రెవరో? +సత్యనారాయణ (రాజేశ్వరిని వేలితో చూవుతూ వీరే రాణిగారు! తమ నామధేయమే +రాజేశ్వరి నాపని నాటకంగానే వుంది. నే నొకటి అనుకుంటే, మరొకటి జరిగింది. +సత్యనారాయణ (సిగరెట్టు పొగ రాజేశ్వరి ముఖంలోకి “ఉఫ్" మని ఊది నీ వేమనుకున్నా +రాజేశ్వరి (పొగకు ఉక్కిరి బిక్కిరై దగ్గుతూ ఊఁ! పోదురూ! +రాజేశ్వరి (భర్త భుజాలమీద చేతులు వేసి నొక్కుతూ మహబాగుంది +సత్యనారాయణ (నిలబడే నీ వేమనుకుంటున్నావో చెబితే తప్ప కూర్చోను. +రాజేశ్వరి చెబుతా గదండీ! ముందు కూర్చోండి. +సత్యనారాయణ అన్నట్టు, కూర్చోకపోతే (రాజేశ్వరి గొంతు పెట్టి) “ఉండు, మా నాన్నతో చెబుతా!” +అస్త్ర మిప్పుడు నా పైనే సంధిస్తావు కాబోలు! +సత్యనారాయణ (కూర్చుంటూ సరే! అదేమిటో చెప్పు మరి? +రాజేశ్వరి మరే మరే నవ్వుతూ) ఎలా చెప్పనండీ? +సత్యనారాయణ అందమైన ఆ చిన్ని నోటితో; విందు కూర్చే ఆ తేనె కంఠంతో. +రాజేశ్వరి ఉహూఁ! నేర్చారు నాటకాల్లో మాటలు! +సత్యనారాయణ ఇంతకూ అదేమిటో చెప్పావ్ కాదు. +రాజేశ్వరి మరే మరే మీకు ఉద్యోగమైంది గనక, ఇక నన్ను పట్నం కాపరానికి +సత్యనారాయణ (నవ్వుతూ ఓహో! అదా సంగతి! +రాజేశ్వరి మీకేం! మీకు నవ్వులాటగానే వుంటుంది.వొదిలి నే నిక్కడిక మరి వుండేదే లేదు. +ఉద్యోగం నాకిక్క డేమీ తోచడం లేదు మిమ్మల్ని సద్యోగం మాట నాకు తెలవదు.మీరు పట్నం వెళ్ళితే, ఈసారి నేనూ మీ వెంట రావల్సిందే! +సత్యనారాయణ భేష్! ఉద్యోగం లేకుండా మద్రాసులో కాపరం పెట్టడ మెలా? +రాజేశ్వరి ఉద్యోగం లేకపోయినా, మీ రక్కడ వుంటం లేదా? +సత్యనారాయణ నా దారి వేరు. ఒంటరిగావుంటే నా తిప్ప లేవో నేను పడతా. +రాజేశ్వరి జంటగావుంటే ఆ తిప్ప లేవో మనం చెరిసగం పంచుకో వచ్చుగాం +సత్యనారాయణ ఆస్తిలో ఆడవాళ్లకు సగ భాగమంటూ ఈ మధ్య శాసనం వచ్చిందనుకో! +తిప్పలలో కూడా సగం పంచి పెట్టాలంటూ ఇంకా శాసనం రాలేదు. +రాజేశ్వరి (ముఖం చిన్నబుచ్చుకుని పోనీ లెండి. మీకు నే నంత భారమైతే. +సత్యనారాయణ రాజేశ్వరీ! ఏదీ, ఇలా నావంక చూడు చూడదు) ఇలా నావంక చూడమంటూ +వుంటే ఆమె ముఖం తనవైపుకు తిప్పుకుని) పిచ్చిదానా! నిన్ను విడిచి వుండడం నాకు మాత్రం కష్టంగా లేదనుకున్నావా? వెర్రిబాగుల దానివి కాబట్టి, నువ్వు తేలిగ్గా బయటపడ్డావు; నేను పడలేదు. అంతే భేదం. +రాజేశ్వరి (సత్యనారాయణ కళ్ళలోకి చూస్తూ పోనీ, మనం పట్నం కాపరం పెట్టడానికి మా +సత్యనారాయణ అడగడం తేలికే! కాని, ఆ కరకట్టు మనిషి యివ్వొద్దూ? +రాజేశ్వరి చిన్నదాన్ని మానాన్న నా కన్యాయం చేస్తాడేమిటి? కాపరానికి మా అక్కయ్యలు +ముగ్గురూ వెడుతూవుంటే, వాళ్ళకి అయిదేసి వేలివ్వలేదూ?. +సత్యనారాయణ ప్రయాణమై వెడుతూవుంటే వాళ్ళు అడక్కుండానే యిచ్చాడా? +రాజేశ్వరి పెద్దక్కాయి కాపరాని కెళ్ళడం నాకు బాగా గుర్తు లేదు గాని, రెండో అక్కాయికీ, +మూడో అక్కాయికీ వాళ్ళు ప్రయాణమైనాక పసుపూ కుంకంలో పెట్టి మా పెదనాన్నచేత యిప్పించాడండీ! +సత్యనారాయణ అయితే, నువ్వు ప్రయాణమైతే నీకూ +(బయటినుంచి “చిట్టెమ్మా!” అంటూ వెంకట్రామయ్య గొంతు. +సత్యనారాయణ భేష్! నువ్వు లోపలికి పో! +సత్యనారాయణ మన మిప్పుడు నడిపించవలసిన నాటక మున్నదిలే. తమరు అంతఃపురంలోకి +(ఆశ్చర్యంతో వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ, రాజేశ్వరి పడమటింటిలోకి వెడుతుంది. వెంకట్రామయ్య పుగాకు తునక పాయతీస్తూ లోపలికి వస్తాడు. ఆయన వయస్సు దాదాపు యాభై సంవత్సరాలు. ఆరడుగులకు పైగా పొడవు; పొడవుకు తగిన లావు. పెద్ద నుదురు, చేరెడేసి కళ్లు, గండుమాసం. చూచి చూడ్డంతోటే హుందా గల వాడిలా కనబడతాడు. +వెంకట్రామయ్య ఏం నాయనా! ఎప్పుడూ రావడం! +సత్యనారాయణ (కొత్త సిగరెట్టు తీసి ముట్టిస్తూ మీ అనుమతైతే రాజేశ్వరిని మద్రాసు +వెంకట్రామయ్య ఇందుకు నా అనుమతి దేనికి? +సత్యనారాయణ అదేమన్న మాటండీ? మీ సమ్మతి లేకుండా +వెంకట్రామయ్య మంచిది, నాయనా! ఎప్పుడూ ప్రయాణం? +వెంకట్రామయ్య సరి సరి! దాని కొక వారం, వర్జ్యం, మంచీ చెడ్డా లేదన్నమాట ఎప్పుడు +సత్యనారాయణ నేను మంచి రోజు విచారించే వచ్చానండీ! దక్షిణదిశ ప్రయాణానికి దివ్యమైన +వెంకట్రామయ్య కాని, మధ్యాహ్నం రావడమూ, రాత్రికే ప్రయాణమూనా! పిల్లని కొత్తగా +కాపరానికి పంపించడమంటే మాటలా? పోనీ, రెండు, మూడు రోజులతర్వాత వెళ్ళగూడదూ? +సత్యనారాయణ కొత్త ఆఫీసు గదండీ? సెలవు దొరకదు! +వెంకట్రామయ్య ఎంత కొత్త ఆఫీసైతే మాత్రం ఆపాటి సెలవు దొరకదూ +సత్యనారాయణ అసలు ఈ ఒక్క రోజు సెలవు దొరకడమే గగనమైంది. ఇద్దరు, ముగ్గురు వెంట +వెంటనే సెలవు పెట్టారు. రేపే మళ్ళీ డ్యూటీలో జాయిన్ కావాలని మా ఎడిటర్ గట్టిగా చెప్పాడు. +వెంకట్రామయ్య అయితే, ఫలానానాటికి అమ్మాయిని పట్నం తీసుకువెళ్ళడానికి వస్తున్నానంటూ +ముందే ఒక ఉత్తరం ముక్క రాయకపోయావూ ప్రయాణ సన్నాహాలన్నీ పూర్తి చేసుకునే వాళ్ళంగా! +సత్యనారాయణ పొరపాటు సుమండీ! ఆ మాట నాకు తోచనే లేదు. +వెంకట్రామయ్య ఎంత చదువుకుంటే మాత్రమేఁ? మీకు లోకానుభవం తక్కువ, నాయనా! అందువల్లే +వచ్చిన యెడం లేకుండా ప్రయాణం సాగించా లంటున్నావ్ రెండు, మూడు రోజుల తర్వాత చూద్దాంలే! +సత్యనారాయణ మళ్ళీ మొదటికి వస్తున్నారు మీరు. +వెంకట్రామయ్య పుగాకు తునక లాల్చీ జేబులో పెట్టి మంచంపై కూర్చుంటూ కన్నకడుపు – +చూడు పైగా, అది మా కడసారి బిడ్డ. ఎన్నడూ మమ్మల్ని విడిచివుం డెరగదు ఒకరి చేతిలో పెట్టింతర్వాత పంపించమన్నప్పుడు పంపించి తీరాలనుకో. అయితే, మన ఊరూ నాడూ కాని చెన్నపట్నంలో కాపరం. ఇక ఇరుగా, పొరుగా? నువ్వేమో పగలంతా ఆఫీసులో వుంటావ్. బిక్కుబిక్కుమంటూ ఒబ్బుతే అది యింట్లో వుండాలి. బెంగ పెట్టుకుంటుందేమోనని మా భయం, +సత్యనారాయణ లేనిపోని భయాలండీ మీవి. మా ఆఫీసుదగ్గర్నే యిల్లు మాట్లాడాను. ఇరుగుపొరుగున +నాలుగైదు తెలుగు కుటుంబా లున్నాయి కూడా. +వెంకట్రామయ్య ఇల్లు కూడా మాట్లాడావ్ నవ్వుతూ) మరి నా సమ్మతికోసం నువ్వు వేచివున్న దెక్కడ? +ఏమైనా బస్తీదారి వేరు. ఒకరి సంగతి మరొకరు పట్టించుకోరు. పైగా, తొలిగా కాపరానికి వెళ్ళడం ఏమి నిర్వాకం చేస్తుందో మా వెర్రిబాగుల్ది. +సత్యనారాయణ (లౌక్యంగా పోనీ, మీరూ, మా అత్తగారూ రెండు, మూడు నెల్లపాటు మాతో +వెంకట్రామయ్య మాసూలు యెద్దడిలో క్షణమైనా తీరడం లేదు. ఇప్పుడు వూరు కదిలితే పొలంలో +పంట పొలంలో మట్టి కావల్సిందే! లేకపోతే రావడానికేఁ? పోనీ, మరి రెండు, మూడు నెల్లపాటు అమ్మాయిని +సత్యనారాయణ ఏమో, అది ఇహ మీయిష్టం; మీ అమ్మాయి యిష్టం. +వెంకట్రామయ్య నా యిష్టాని కేమిలేఁ! నీ యిష్టం, దాని యిష్టం ముఖ్యం. +సత్యనారాయణ అదేమన్న మాట? మీరు గట్టిగా కాదంటే, మీ మాటకు మేము వ్యతిరేకంగా +వెంకట్రామయ్య నేను గట్టిగా కాదనడం తగునా, నాయనా? మరి, అమ్మాయి ఏమంటున్నది? +వెంకట్రామయ్య సరి సరి బిగ్గరగా) అమ్మా! చిట్టెమ్మా! +సత్యనారాయణ నే నడగలేదు; మీ రడిగి చూడండి. +(రాజేశ్వరి వచ్చి పడమటింటి గుమ్మంలో నిలబడుతుంది. చావడిలో జరుగుతున్న సంభాషణను చాటు నుంచి వింటున్నందువల్ల సిగ్గు బిడియాలతో తల కొద్దిగా వంచుకుంటుంది) +వెంకట్రామయ్య అమ్మా! ఇవ్వాళే ప్రయాణం చేయించ మంటున్నాడు, +సత్యనారాయణ, మరి, నీ యిష్ట మేమిటి? +రాజేశ్వరి (పైట అంచును రెండు చేతులతోనూ పట్టుకుని, దాన్ని వేళ్ళకు చుట్టుకుంటూ, వంచిన తల +యెత్తకుండానే ఏమో, మీ యిష్టం; వారి యిష్టం. +వెంకట్రామయ్య (చిరునవ్వుతూ మా యిష్టం మాట కేమిలే! నీ యిష్ట మేమిటో చెప్పుతల్లీ!రాజేశ్వరి జవాబు చెప్పదు సత్యనారాయణ వంక భావపూర్వకంగా చూచి, చిరునవ్వు నవ్వుతూ లోపలికి +వెంకట్రామయ్య సరే, నాయనా! మీ వుభయుల యిష్టమూ అయిన తర్వాత మరి మధ్య నా అభ్యంతరం +దేనికి? కాని, నీ ఉద్యోగం ఖాయమేనా? +వెంకట్రామయ్య ఏమి జీత మేర్పాటు చేశారు? +సత్యనారాయణ అలవెన్సులతో చేరి నెలకు నూటముప్పై రూపాయలు +వెంకట్రామయ్య సరి సరి! బి.ఏ. చదివినా ఇంతేనా జీతం? +వెంకట్రామయ్య ఏం గొడవో! వేలకువేలు చదువుకు పోస్���ే చివరికి వడ్డీ డబ్బులైనా గిట్టవ్. సరేగాని, +ఈ కరువు కాలంలో ఈ నూటముప్పై రూపాయలతో మీ సంసార మెలా గడుస్తుంది? +సత్యనారాయణ వ్యాసాలు వ్రాసి, పైన ఏమైనా సంపాయిస్తాలెండి. +వెంకట్రామయ్య వ్యాసాని కేమాత్ర మిస్తా రేమిటి? +వెంకట్రామయ్య సరి సరి! అదీ అంతంతమాత్రమే నన్న మాట! నెల కెన్ని వ్యాసాలు రాయొచ్చు? +వెంకట్రామయ్య మూడనుకో! అంటే, మూడు పదిహేన్లు, నలభై అయిదు. అదొక నూటముప్పై, ఇదొక +నలభై అయిదు, మొత్తం నూటడెబ్బై అయిదు. బస్తీ సంసారానికి ఇదైనా ఏం సరిపోతుంది? +వెంకట్రామయ్య మ రేమైనా అంటే, ఏ విధంగా? +సత్యనారాయణ (కొంచెం చికాకుగా ముందుగానే ఎలాగండీ చెప్పడం? వీలునుబట్టి ఏదో +వెంకట్రామయ్య మీకు లోకానుభవం తక్కువ. నాయనా! మంచి చెడ్డల్ని ముందుగానే +విచారించుకోకపోతే, చివరికి చిక్కు పడతారు. నూటడెబ్బై అయిదు రూపాయల సంపాదనతో ఈ గడ్డు రోజులలో చెన్నపట్నం సంసార మెలా గడుస్తుంది? ఏదీ లెఖేసి చెప్పు! ఇంటి బాడుగెంత? +వెంకట్రామయ్య యాభై రూపాయలే! పాతిక తక్కువ రెండు వందల రూపాయల సంపాదనలో యాభై +ఇంటద్దె కిందే పోతే, ఇంకేం తింటారు? +(సత్యనారాయణ చికాకు పడి, ఇంకొక సిగరెట్టు తీసి ముట్టిస్తాడు. +వెంకట్రామయ్య ఇప్పుడేగాఁ, నాయనా! ఒక సిగరెట్టు కాల్చావ్, అప్పుడే ఇది రెండోది! ఈ లెఖ్ఖని రోజు +సత్యనారాయణ (మరింత చికాకుగా ఇక్కడ మీవూళ్ళో ఉబుసుపోక ఇన్ని కాలుస్తున్నా గాని, రోజూ +వెంకట్రామయ్య పోనీ మీ చెన్నపట్నంలో అయితే, ఎన్ని కాలుస్తా వేమిటి? +సత్యనారాయణ (ఎన్ని చెబుదామా అని కొంచెం సంకోచించి, లెక్క బాగా తగ్గించి రోజు కొక ప్యాకెట్ +వెంకట్రామయ్య (ముక్కుపై వేలువేసుకుని పదణాలే! అయితే, నెలకి ఇరవై రూపాయలు సిగరెట్లకే +చెల్లి పోతుంది. నెలకి యాభై రూపాయలు యింటి బాడుగ, ఇరవై రూపాయల సిగరెట్లు, ఇక నూరురాళ్ళతో ఇద్దరెలా బ్రతకడం +సత్యనారాయణ (కోపంగా మంచంపై నుంచి చరాలున లేచి మీకంత యిష్టం లేకపోతే, మీ +అమ్మాయిని పంపించడం మానెయ్యండి! ఈ ప్రశ్నలన్నీ దేనికి? +(అప్పుడే ముట్టించిన సిగరెట్టును గోడమూలకు విసిరి పారేస్తాడు. +వెంకట్రామయ్య (ధోరణి మార్చి అదికాదు, నాయనా! పెద్దవాణ్ణి, కావలసినవాణ్ణి. నేను గాకపోతే మీ +యోగక్షేమాలు మరెవరు విచారిస్తారు? నీకింత కోపం వస్తున్నప్పుడు నేనిఖ +సత్యనారాయణ (తెప్పరిల్లి, తనుకూడా ధోరణి మార్చి అబ్బే! నాకు కోపమేమిటండీ? +ఆ వెంకట్రామయ్య సర్లే, నాయనా! ఇంతకూ మీరిద్దరూ సుఖంగా వు���డడమే నాకు కావల్సింది. +పెద్దపిల్లలు ముగ్గురూ కాపరానికి వెళ్ళేటప్పుడు అయిదేసి వేల రూపాయ లిచ్చి పంపించాం. కట్నాలనుకున్నా, కానుక లనుకున్నా, ఇంతే మే మిప్పు డివ్వగలిగింది, మాకున్నదేమో నలభై అయిదెకరాల కొండ. దానిలో పదెకరాలు హైకోర్టు వ్యాజ్యంలో వుంది. వ్యాజ్యం మన పక్షమైతే, మా తదనంతరం నలుగురు కూతుళ్ళకు తలొక +వెంకట్రామయ్య ఈ కాలపు వాళ్ళతో కాపరంలోని కష్ట సుఖాల్ని చెప్పుకోవడం కూడా తప్పే! మే మేమి +తిప్పలు పడ్డా, అది మీకోసం సత్యనారాయణ ఇంకొక సిగరెట్టును తియ్య బోవడాన్ని చూచి) మళ్ళీ అప్పుడే ఇంకొక సిగరెట్టా? +సత్యనారాయణ (తప్పుచేస్తూ పట్టుపడినవానివలె ప్యాకెట్ జేబులో పెట్టివేసుకుంటూ ఆఁ! లేదులెండి. +వెంకట్రామయ్య మానడం దేనికి? కాల్చు, నాయనా! కాల్చు. ఆరోగ్యం చెడిపోతుందేమోననే నా భయం. అన్నట్టు, మీ అత్తకు ప్రయాణం మాట తెలుసో, లేదో చెప్పొస్తా! +(వెంకట్రామయ్య పడమటింటిలోకి వెడతాడు. సత్యనారాయణ విజయగర్వంతో సిగరెట్టు ముట్టించి, గట్టిగా దమ్ములాగుతూ వుండగా, చిట్టిగారెలు, పంచదార, నేతిగిన్నె పుచ్చుకుని రాజేశ్వరి వస్తుంది. +రాజేశ్వరి ఫలహారం తెస్తుంటే ఇంతలోనే మళ్ళీ సిగరెట్టు ముట్టించా రేమండీ? +సత్యనారాయణ చూశావ్! నాటక మెంత రక్తిగా నడిపించానో! +రాజేశ్వరి ఏమైం దప్పుడే? ఇంకా మొదటి అంకంలోనే వున్నారుగా! +సత్యనారాయణ భరతవాక్యంవరకు ఇంత రక్తిగానూ మనం నడిపించగలంలే! +రాజేశ్వరి (నవ్వుతూ ఫలహారాన్ని మంచంపై పెట్టి నవ్వులాటలకేమిగాని, నా కెందుకో భయంగా +రాజేశ్వరి (భర్త సరసను కూర్చుంటూ మీ కుద్యోగం పోయిన సంగతి మా నాన్నకు తెలిస్తేనో? +సత్యనారాయణ అందుకనేగా ఇవ్వాళ రాత్రికే ప్రయాణమని పథకం వేసింది. చీకటి పడకముందే +ఉడాయిస్తాం; తెల్లవారేసరికి మూడువందల మైళ్ళ దూరాన వుంటాం. +సత్యనారాయణ (కాస్త చికాకుగా ఏమిటి అర్థంలేని భయం! +రాజేశ్వరి తర్వాతనైనా మా నాన్నకి మీకుద్యోగం పోయినమాట తెలిస్తే, ఏమంత బాగుంటుంది? మీరే +చెప్పండి! ఆయన కానివాడు గనకనా? దాపరికం లేకుండా వున్నమాట చెప్పి +సత్యనారాయణ మహ మంచిమాట చెప్పావులే! నా కుద్యోగం పోయినమాట తెలిస్తే మీ నాన్న నిన్ను +రాజేశ్వరి పంపకేం చేస్తాడేమిటి? ఎల్లకాలం యింట్లో పెట్టుకు కూచుంటాడా? +సత్యనారాయణ అయితే, నువ్వనే దేమిటి? “నా కుద్యోగం లేదు, సద్యోగం లేదు. నా పెళ్ళాన్ని పెట్టుకుని +మద్రాసులో వూరేగాలనుకొంటున్నా, తే తేవయ్��ా! డబ్బు తే!” అని అడగమనేనా? +రాజేశ్వరి చాల్లెదురూ! ఒక్క మనకే యిస్తున్నా డేమిటి? తక్కిన తన ముగ్గురు కూతుళ్ళ కిచ్చుకోలా? +సత్యనారాయణ నువ్వు వెయ్యిచెప్పు; లక్షచెప్పు, డబ్బివ్వమంటూ ఆయన్ని నా నోటితో నే నడగను. +ఆయనకు లోకువ కావడం నాకిష్టం లేదు. +సత్యనారాయణ కాక? కాలు చచ్చి వున్నా మనుకున్నావా? +రాజేశ్వరి ఇస్తే పుచ్చుకుంటారటగాని, యివ్వమనడం లోకువట! ఏం చోద్య మండీ? పోనీ, మీ +సత్యనారాయణ చాల్లే! నా పరువు తియ్యకు! “ఉద్యోగం ఖాయమేనా? జీత మెంత? అదేం +సరిపోతుంది? ఎన్ని సిగరెట్లు కాలుస్తావ్? ఎంత కాఫీ తాగుతావ్? ఎన్ని సినిమాలు చూస్తావ్ ఈ లాయర్ ప్రశ్నలన్నీ అయ్యాక, ఉద్యోగం పోయిందని ఈ చెబుతావుగా! ఇహ నే నేమైనా తలెత్తుకు తిరగాలా! +(వెంకట్రామయ్య పడమటింటిలోనుంచి వస్తూ తన రాకను సూచించడానికి పొడిదగ్గు దగ్గుతాడు. మాట సగంలో మింగివేసి, మంచంపై నుంచి రాజేశ్వరి దిగ్గున లేస్తుంది +వెంకట్రామయ్య (చావడిలోకి వచ్చి చిట్టెమ్మా! చింతా లెక్కడమ్మా? +వెంకట్రామయ్య వెళ్ళి, కాస్త పిలు వమ్మా! +(రాజేశ్వరి పెరటి గుమ్మం గుండా వెంకట్రామయ్య (సిగరెట్టు కాల్చుతున్న సత్యనారాయణను చూచి, తల పంకిస్తూ ముందు ఫలహారం పుచ్చుకో, నాయనా! +(కాల్చుతున్న సిగరెట్టును చప్పున నోట్లో నుంచి తీసి, దాన్ని కాస్త వెనగ్గా పెట్టి, సత్యనారాయణ ఫలహారం చెయ్యడం ప్రారంభిస్తాడు. +వెంకట్రామయ్య (రెండవ నవారు మంచాన్ని వాల్చుకుని దానిపై కూర్చుంటూ ఇంత తొందర +ప్రయాణ మేమిటని మీ అత్త చాలా నొచ్చుకుంటున్నది. కడసారి కూతురు దానికైనా అచ్చట్లూ, ముచ్చట్లూ తీరొద్దూ? కాని, “వాళ్ళుభయులూ ప్రయాణానికి ఉబలాట పడుతూ వుంటే, మనకు దేనికే?” అని సర్ది చెప్పాం! మేము పాతకాలపువాళ్ళం, మాకు +చింతాలు (పెరటి గుమ్మంగుండా వచ్చి ఏమయ్యగోరూ! +వెంకట్రామయ్య చూడు, చింతాలూ! మన చిట్టెమ్మ కాపరానికి వెడుతున్నది. మరి నువ్వు +చింతాలు అదేమి టయ్యగోరూ! అంత యవదానం లేకుండానే! +వెంకట్రామయ్య ఔనురా! ఈ కాలపువాళ్ళు మన మాటల్ని వింటారా, పెడతారా? సరిగాని +(ఇంతలో చావడిలోకి వచ్చిన రాజేశ్వరిని చూచి వెంకట్రామయ్య మాటకు చింతాలు అడ్డువస్తాడు. +చింతాలు సిట్టెమ్మగోరూ! మీ రెల్లిపోతే, మే మేం గావాలమ్మా? +రాజేశ్వరి (చిరునవ్వుతూ అదేమిటి, చింతాలూ! మిమ్ముల నందర్నీ నేనే పోషిస్తున్నా నేమిటి? +చింతాలు అది కా దమ్మగోరూ! మీ రెల్లిపోతే, యిల్లు సిన్నబోదూ? మీరు కంటి కాపడకపోతే, మన +రాజేశ్వరి ఔను, నాన్నా! మన చిన్నావు +చింతాలు సిట్టెమ్మగోరు కంటి కాపడకపోతే, సిన్నావు నీలూ మేతా ముట్టుకుంటుందనే? దాని +సత్యనారాయణ అయితే, నువ్వు ఆ ఆవును మావెంట పట్నం తోలుకు రావోయ్. +చింతాలు సత్తెం, బాబూ! తోలుకు రానా? +వెంకట్రామయ్య పిచ్చి వెధవ్వి! ఆయన నవ్వులాట కంటున్నాడు. +చింతాలు అదేటో అయ్యగోరూ! నా కేమీ తోసడం లేదు. సిట్టెమ్మగోరు లచ్చిలా తిరుగుతూ వుంటే +యిల్లూ వాకిలీ కళకళలాడుతూ వుంటుంది. ఆమెగోరు ఎల్లిపోతే అంతా బావురుమందండీ? +వెంకట్రామయ్య నిజమేరా! కాని, తప్పుతుందా? సరిగాని, తొందర ప్రయాణం. లక్ష పనులున్నాయ్. +నువ్వెళ్ళి, మీ అమ్మగారు చెప్పినట్టు, బియ్యం, పప్పులూ సంచుల కెత్తి, మూతులు కుట్టు; కారం, పసుపు వగైరాలన్నీ గుడ్డ మూటలు కట్టు. అటకమీది నుంచి అమ్మాయి పెళ్ళినాడు చదివించిన సామానంతా కిందికి దించు. కుర్చీపీటలు, భోజనం పీటలు వగైరా కొయ్యసామాన్లు ఆ మూల గదిలో వున్నాయ్. వాటిని బయట పెట్టించి, దుమ్మూ, దుట్రా దులిపి +సత్యనారాయణ ఇప్పుడెందుకండీ మా కీ సామానులన్నీ? +వెంకట్రామయ్య ఏఁ! మీ బస్తీ కాపరానికి మా పల్లెటూరి సామాను లేవీ పనికి రావేమిటి? +సత్యనారాయణ: అద్దెకు పుచ్చుకున్నది చాలా చిన్న యిల్లు. దానిలో ఈ సరంజామంతా +( మాట పూర్తి కాకుండానే ఆపివేస్తాడు +చింతాలు లంకంత యిల్లు ఇదే మా సిట్టెమ్మగారికి సాలడం లేదు. ఆ కూపీ యింటికి మా బుల్లి +దొరసా న్నెట్టా తీసి కెడతావ్, బాబయ్యా! +వెంకట్రామయ్య కాస్త యిల్లో, కూస్త యిల్లో! అద్దె కొంపైనా అది వాళ్ళది; ఇది కాదు! రాజేశ్వరి ఊఁ! +వెంకట్రామయ్య సర్లేరా! చింతాలూ! మన బసివిగాణ్ణి పంపి, బండి భీమన్నని పెందరాళే పిలిపించు. +స్టేషన్ దాకా సామాన్లు తీసుకు వెళ్లడానికి మన బండీ కావాలి. జల్ల వేసి, మన వెంకాయిని ఒక బండి సిద్ధంగా వుంచమను. పనులన్నీ త్వరగా తెమలాలి సుమీ! +వెంకట్రామయ్య ఆఁ! అన్నట్టు, మొన్న వాళ్ళపిల్ల అన్నప్రాశనానికి సుబ్బక్కగా రబ్బాయి నాగేశ్వర +రావ్ మన వెండి సామాను పట్టుకుపోయాడు గాని, దాన్ని తిరిగి పంపించమన్నానని చెప్పిరా! నువ్వు చమురు వాడి వని నాకు తెలుసుగాని, తేమాణం చెయ్యకు +చింతాలు ఏమో, అయ్యగోరూ! నాకు కాళ్ళూ సేతులూ ఆడ్డంలేదు. +వెంకట్రామయ్య నిజమే! ఇక, యిల్లంతా బావురు మంటుంది సత్యనారాయణకు వెక్కిళ్ళు వస్తాయి. +అంతట వెంకట్రామయ్య కుమార్తె నుద్దేశించి) మంచినీళ్ళు పెట్టలేదేమి, తల్లీ? +రాజేశ్వరి ��ర్చిపోయా, నాన్నా! ఇదుగో, చిటికలో తెస్తా! +వెంకట్రామయ్య వెర్రిబాగులి! ప్రయాణం సంతోషంలో దానికి పనే తోచడంలేదు. కంటాం; +పెంచుతాం; ప్రాణాలన్నీ వాళ్ళ మీదే పెట్టుకుంటాం. అయినా, వయస్సొచ్చేసరికి రెక్కలు కట్టుకు యెగిరిపోతారు. మాకు మిగిలేది దొర్లిగూడు. ఆడపిల్లల్ని కన్నవారి బ్రతు కింతే. +(రాజేశ్వరి మంచినీళ్ళతో, కాఫీతో తిరిగి వస్తుంది. +వెంకట్రామయ్య (కొత్తగా ఏదో జ్ఞాపకానికి వచ్చినట్టు చింతాలూ! +చింతాలు (లోపలినుంచే వొచ్చే, అయ్యగోరూ! వొచ్చే! +వెంకట్రామయ్య (రాజేశ్వరితో వెళ్ళమ్మా, వెళ్ళు! నువ్వుకూడా కాస్త పలహారం చేసిరా. +వెంకట్రామయ్య నే నొస్తాలే నువ్వు వెళ్ళు తల్లీ! ఇక మా బ్రతుకు దేనికి? తిండికేగా?? +రాజేశ్వరి ఏం మాటలవి, నాన్నా! ఒకేసారిగా +వెంకట్రామయ్య పసివాళ్ళు మా కడుపు తీపి మీకేం తెలుస్తుంది? సర్లే, తల్లీ! నువ్వు వెళ్లు +చింతాలు (పడమటింటి గుమ్మంగుండా వచ్చి ఏమయ్యగోరూ? +వెంకట్రామయ్య అరే! చూడు! అటొక అడుగేసి, కొట్టప్పయ్యను ధోవతులు, ఉత్తరీయాలు, చీరలు +మొదటి రకం సరుకు చూచి మనింటికి పది, పదిహేను జతలు పంపించమను కావల్సినవాటి నుంచుకుని, మిగతావి వాపసుచేస్తామని చెప్పేఁ! వెళ్ళు ముందు ఈ పని చూడు! +వెంకట్రామయ్య కాస్త ఉత్తరం ముక్కైనా రాశావు కాదు; అన్ని యేర్పాట్లు ముందుగా చేసుకునే వాళ్ళం. +(సత్యనారాయణ జవాబు చెప్పడు) ఏమో, నాయనా! అంతా హడావుడి ప్రయాణమై పోతున్నది. +రాజేశ్వరి (పడమటింటిలో నుంచి వచ్చి నాన్నా! నిన్నొకసారి అమ్మ రమ్మంటున్నది. +రాజేశ్వరి పచ్చళ్ళు పెట్టడానికి జాడీలు చాలలేదట. పెదనాన్నగారింటినుంచి రెండింటిని తెప్పిం +సత్యనారాయణ ఇంత దూరాభారం ఎందుకండీ ఇప్పుడు పచ్చళ్ళు, గిచ్చళ్ళు? +రాజేశ్వరి నేనూ ఆమాటే అంటూ వుంటే వినడం లేదండీ! +వెంకట్రామయ్య వెర్రిబాగులవాళ్ళు! మీ రిద్దరు ఏమి నిర్వాకం చేస్తారో గదా! +రాజేశ్వరి ఒకేసారిగా చాల్లే, నాన్నా మీదంతా వింత +వెంకట్రామయ్య (దైన్యంగా చిరునవ్వు నవ్వుతూ నలుగురు బిడ్డల్ని యెత్తితే మీకూ తెలిసొస్తుంది +లెండి మరి, నే వెళ్ళి, పెద్దవాడు మా అన్నగారితో ప్రయాణంమాట చెప్పి, ఆయన్ని తోడుకొస్తా. అలాగే జాడీలుకూడా పట్టించుకొస్తాలేఁ తల్లీ నువ్వు జాగు చెయ్యక మరి చప్పున ప్రయాణం కా. +రాజేశ్వరి ఏమోనండి నా కెంతో భయంగా వుంది. +సత్యనారాయణ మీ నాన్న కట్టి పంపుతున్న ఈ సామానంతా ఎక్కడ పెట్టుకోగలమనేనా? +రాజేశ్వరి ఆ! అ��తా మీకు హాస్యమే! +సత్యనారాయణ వెంకట్రామయ్య గొంతుతో) సరి సరి తన మామూలు గొంతుతో) నే నింత +నాటకం నడిపించిన తర్వాత వెనక్కితీసి భంగపాటు చెయ్యవుగదా? +సత్యనారాయణ కానీ, అర్ధణా ఏమి టది? +రాజేశ్వరి మా అమ్మ, మా నాన్న +సత్యనారాయణ మంచిది! వాళ్ళనే అంటి పెట్టుకుండు. నాదారిని నే పోతా +రాజేశ్వరి చాల్లెద్దురూ! నేను రానూ లేను; వుండనూ లేను. మీకేం తెలుస్తుంది నా బాధ? +(“చిట్టెమ్మా” అని పిలుస్తూ, సింహద్వారం గుండా వెంకట్రామయ్య తిరిగి ప్రవేశిస్తాడు) +వెంకట్రామయ్య లేదమ్మా! అడుగు పడనేలేదు. మన వాకిట్లోనే సుబ్బక్కగారి చిన్నాడు, వా డెదురు +ఫలహార పాత్రల్ని తీసుకుని రాజేశ్వరి లోపలికి వెళ్ళిపోతుంది. +నాగేశ్వరరావు (చావడిలోకి వస్తూ ఏం, సత్యనారాయణా! ఎప్పుడు రావడం? +నాగేశ్వరరావు (సత్యనారాయణ కూర్చునివున్న మంచం పైనే కూర్చుంటూ ఏమిటీ చెన్నపట్నం +నాగేశ్వరరావు ఏమిటీ అవ్యవధి ప్రయాణం? చిట్టెమ్మను తీసుకుని ఇవ్వాళ రాత్రికే తిరిగి +వెంకట్రామయ్య నేనూ ఆ మాటే ఎంతో దూరం చెప్పి చూశారా. కాని, వెళ్ళితీరా లంటున్నాడు! +సత్యనారాయణ వెళ్ళాలి, మరి కొత్త ఆఫీసుగదూ? సెలవు దొరకదు. +నాగేశ్వరరావు సెలవు దొరక్కపోవడ మేమిటి? అప్పుడే మీ పత్రికను +సత్యనారాయణ (మాటకు చటుక్కున అడ్డంవచ్చి మీ తమ్ముడు ఇప్పుడు బి.ఏ. జూనియరా? +నాగేశ్వరరావు అబ్బే! వాడింకా ఇంటరైనా ప్యాసు కాలేదు. +సత్యనారాయణ అన్నట్టు, ఇంకొక పార్టు మిగిలిపోయింది కాబోలు! +నాగేశ్వరరావు పార్టూ లేదు; గీర్దూ లేదు. చదువూ, సంధ్యా లేకుండా అడ్డగాడిదలా ఊరుపట్టుకు +తిరిగాడేమో సెలెక్షన్ లోనే డిటెయిన్ చేశారు, వాడి మాట కేమి కాని +నాగేశ్వరరావు వ్యవసాయ మెత్తివేసి, పొలమంతా మూడేళ్ళనాడే కట్టుబడి కిచ్చేశాగాం! +సత్యనారాయణ కట్టుబడి కివ్వడం దేనికి? సొంత వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదా? +నాగేశ్వరరావు (ఈ ప్రశ్నను వినిపించుకోకుండానే చూడు! నీకు సెలవు +సత్యనారాయణ అయితే, ఈ మధ్య మీ అమ్మాయికి అన్నప్రాశన చేశావటగాఁ నన్ను పిలవలేదేం? +నాగేశ్వరరావు పిలవలేదన్న నెపమేగాని, పిలిస్తే నువ్వు వచ్చేవాడివి గనకనా? ఇంతకూ మీ +సత్యనారాయణ ఊళ్ళోకి వచ్చికూడా మాయింటివైపు తొంగైనా చూశాడు కాదని మీ అమ్మ నెపం +వేస్తుందేమో! మీ యింటికి వెళ్ళాద్దాం పద! +నాగేశ్వరరావు మా అమ్మ ఊళ్ళో లేదు. +సత్యనారాయణ పోనీ, మీ పిల్లల్ని చూద్దాం. +నాగేశ్వరరావు వాళ్ళూ నాయనమ్మ వెంట వూ రెళ్��ారు. +సత్యనారాయణ అయితే, మీ ఆవిడను పలకరించి వస్తారా! +నాగేశ్వరరావు కొత్త చుట్టరికమని ఆవిడ నీకు చాటు వెడుతుందిగా పోదాం. +సత్యనారాయణ ఇంతకీ మీ యింటికి రావద్దంటావ్! మంచి మర్యాదస్థుడివే! సర్లే రా చెయ్యి +పట్టుకుని నాగేశ్వరరావును లేవదీస్తాడు. అతడు తిరిగి మాట్లాడరాదనే ఆతురతకొద్దీ) ఆఁ! అన్నట్టు, నువ్వు మద్రాస్ చూడ్డానికి వస్తానని వచ్చావ్ కాదేఁ? చాలాకాలంగా ఇదుగో, అదుగో అనడమే తప్ప +వెంకట్రామయ్య (ఈసరికి సింహద్వారాన్ని చేరిన సత్యనారాయణవంక ఆశ్చర్యంగా చూస్తూ పైపంచె +సత్యనారాయణ (వీపుపై కంచీదెబ్బ పడ్డట్టు వెనక్కి తిరిగి దేనికి లెండి ఈ అడుగు దూరంకోసం! +వెంకట్రామయ్య అడుగైనా, ఆమడైనా పై పంచె లేకుండా వీధిలోకి వెళ్ళడం మంచిది కాదు +సత్యనారాయణ సరిలెండి చక చక ఉత్తరీయాన్ని తీసి, పైన వేసుకుని, రెండడుగులలో +నాగేశ్వరరావును కలుసుకుని) ఆఁ! ఇప్పుడు పడ్ల ధర ఎలా వుంది? బస్తాకు పదహారు, పదిహేడు రూపాయలైనా పలుకుతున్నదా? అంతమాత్రమైనా లేకపోతే +(గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూనే నాగేశ్వరరావును వీధిలోకి ఈడ్చుకుపోతాడు. సత్యనారాయణ వైఖరి కొంత అనుమానాన్ని కలిగించగా, లాల్చీ జేబులోంచి పుగాకు తీసి, చుట్ట చుట్టుకుంటూ వెంకట్రామయ్య ఒక మంచం పై కూర్చుంటాడు. +బండి భీమన్న (చావడిలోకి వస్తూ నేనే బాబయ్యా! బండి భీమన్నని. +బండి భీమన్న ఏం లేదు, బాబయ్యా! మరిగలే, బండి బేగి తోలుకు రమ్మని బసివిగా డొచ్చాడు. మరి +నే నేమో ట్నం బాబయ్యగార్ని మద్దాన్న మడిగితే ఎల్లుండి పొద్దున్నే మెయిల్ బండికి రమ్మన్నారండీ. +వెంకట్రామయ్య (అప్పటివరకు రెండు మోకాళ్ళ పై రెండు మోచేతుల్ని ఆన్చి ముందుకు వంగి, తల వంచుకుని, చుట్ట చుట్టుకుంటూ వున్నవాడు చప్పున నిటారుగా కూర్చుని, సగం చుట్టిన చుట్టను లాల్చీజేబులో కుక్కి బండి భీమన్నను గుచ్చి చూస్తూ వెధవ! నువ్వు తిన్నగా వినలేదు కాబోలు! +బండి భీమన్న అయ్యొ బాబయ్యా! తిన్నగా యినకేఁ! సిట్టెమ్మగోరు ఎల్లుండి ఈల్లేదంటే, ఆ అయ్యగోరు +ఎల్లి తీరాలని తెగేసి సెప్పారు బాబయ్యా! +బండి భీమన్న ఏ బొట్టు పెడితే ఆ వొట్టు, బాబయ్యా! +వెంకట్రామయ్య (తల పంకిస్తూ సరి సరి! +బండి భీమన్న మరి బండెప్పుడు కావాలి, బాబయ్యా! +వెంకట్రామయ్య (ఇంకా తల పంకిస్తూ సరి సరి! +రాజేశ్వరి (పడమటింటిలోనుంచి వచ్చి ఏం, భీమన్నా! బండి తోలుకొచ్చావా? +బండి భీమన్న ఇప్పుడే కావాలా అమ్మా +రాజేశ్వరి మరి కాసేపటికే మా ప్రయాణం. +బండి భీమన్న అయితే, సిటికలో తోలుకొస్తా. +బండి భీమన్న సిత్తం, బాబయ్యా! సిత్తం! +వెంకట్రామయ్య మన నాగేశ్వరరావుగా రింటికి వెళ్ళాడమ్మా! ఇప్పుడే తిరిగొస్తా నన్నాడు గాని, సత్య +నారాయణ తన ఉద్యోగం సంగతులు నీకేమైనా చెప్పాడా? +రాజేశ్వరి (తెల్లబోయి, దాన్ని కప్పిపుచ్చుకోడానికి ప్రయత్న పూర్వకంగా లేదు, నాన్నా! ఏమీ అనలేదే! +రాజేశ్వరి (ఒకవేళ రహస్యం తెలుసుకున్నాడేమో కనిపెట్టాలని నువ్వు ఉత్తినే అడగవు, నాన్నా! ఏమిటీ +వెంకట్రామయ్య అబ్బే! ఏం లేదు, తల్లీ ఇంతలో సత్యనారాయణ తిరిగి వస్తాడు) ఏం, నాయనా! +వెంకట్రామయ్య ఆ మాట నిజమే! మరి నే వెళ్ళి, పైకాని కేర్పాటు చేసొస్తా. +సత్యనారాయణ (అలక్ష్యాన్ని నటిస్తూ ఏమో, మీ యిష్ట మది. +సత్యనారాయణ(మంచంపై చతికిలబడుతూ):అమ్మయ్యవాణ్ణి వొదిలించుకునేసరికి తాతలు దిగొచ్చారు. +సత్యనారాయణ వాడే, ఆ పీనుగ, మీ నాగేశ్వరరావు, +సత్యనారాయణ మా పత్రిక కట్టివేసినమాట వా డెక్కడో ఇవ్వాళే చూచాయగా విన్నాడు. ఆ మాటని +సత్యనారాయణ లేదులే! కాని, అనకుండా వాణ్ణి పట్టుకునేసరికి బ్రహ్మప్రళయమైంది. తనదంతా +మునిగి పోతున్నట్టు దేభ్యంలా సరిగా ఇప్పుడే వా డిక్కడికి తయారయ్యాడు! +రాజేశ్వరి అత నెప్పుడూ అంతేనండీ! ఒకరి పచ్చనచూచి వోర్వలేడు. కాని, మా నాన్నకు కొంచెం +రాజేశ్వరి మీ ఉద్యోగం సంగతులు మీరు నాకేమైనా చెప్పారా అని అడిగాడు. +రాజేశ్వరి “నా కేమీ చెప్పలేదు నాన్నా!” అని చూస్తూ చూస్తూ పచ్చి అబద్ధమాడాను. +సత్యనారాయణ అయ్యో పాపం! నీ కెంత ముప్పు వచ్చింది! +రాజేశ్వరి మీకేఁ? మీ కలాగే వుంటుంది. నానోట అబద్ధం రాదని అందరితో చెప్పుకుని మా నాన్న +ఎంత మురుస్తాడో మీ కేం తెలుసు? +సత్యనారాయణ ఓహోహో! సత్య హరిశ్చంద్రుడటు; తమ రిటు. +రాజేశ్వరి సంతోషించాం చాల్లెద్దురూ! ఏమిటి సంగతి నాన్నా?” +సత్యనారాయణ అయితే, మీనాన్న మరేమైనా అడిగాడా? +రాజేశ్వరి ఉహుఁ! ఆయన మళ్ళీ మాట్లాడే లేదు. నేనే “గుచ్చిగుచ్చి అడిగినా, “అబ్బే! ఏం లేదమ్మా! +సత్యనారాయణ అయితే, ఏమీ ఫరవా లేదులే! పైగా, పైకం కోసం వెళ్ళాడుకూడాగా! +రాజేశ్వరి అయినా, ఏమోనండీ! నాకు బెదురుగా వుంది. మన ప్రయాణానికి మేమీ కలగదుగదా? +సత్యనారాయణ కలిగితే మంచిదే! రావాలని నీకు ఎలాగూ లేదయ్యె! +సత్యనారాయణ ఏం మాటో ను వ్వన్నదేగా +రాజేశ్వరి చాల్లెద్దురూ! నే ననకేం! ఇంతకూ మా నాన్నకి నిజం తెలిసిందంటారా? +సత్యనారాయణ అబ్బే! ల��దు. నేను ఆ నాగేశ్వరరావు నోరు కట్టేశా! మా పత్రిక ఆగిపోలేదని +వాడికి నచ్చ జెప్పా! నాటకం నడిపించడంలో ఎవరైనా మన తర్వాతే! +రాజేశ్వరి మా నాన్న సంగతి మీకు తెలియదండీ! ఆయన అసాధ్యుడు. ఆవలిస్తే పేగులు లెక్టెడతాడు. +సత్యనారాయణ మీనాన్నకంటె నేను రెండాకు లెక్కువే చదివానంటావా? +రాజేశ్వరి మీరు ఎంత బి.ఎ. చదివినా, తెలివికి మా నాన్న తర్వాతే! +సత్యనారాయణ (వెంకట్రామయ్య గొంతు పెట్టి సరి సరి! +రాజేశ్వరి వెక్కిరింతకూడా దేనికి లెండి? ఇప్పుడు కాకపోతే, మరొక్కప్పుడైనా మీకే తెలిసి +రాజేశ్వరి సర్లెండి! మరి నే వెళ్ళి పెట్టి బేడా సర్దుకోనా? +రాజేశ్వరి అడ్డం రాకుండా వుంటే సాయం వచ్చినంత ఫలం! +సత్యనారాయణ (తిరిగి వెంకట్రామయ్య గొంతుతో సరి సరి! +రాజేశ్వరి నాటకాల్లో వేషాలకు బాగానే పనికొస్తారు. +(నవ్వు ముఖంతో రాజేశ్వరి పడక గదిలోకి వెడుతుంది. ఇంతలో “ఆరి వాడి తస్సా చెక్కా!” అంటూ వెంకట్రామయ్య వీధి గుమ్మంగుండా చావడిలోకి వస్తాడు ఆశ్చర్యంగా సత్యనారాయణ అతని వంక చూస్తాడు +రాజేశ్వరి (పడకగదిలో నుంచి తిరిగి వచ్చి ఏమిటి, నాన్నా? +వెంకట్రామయ్య ఆ షాహుకారు రత్తయ్య చూడమ్మా! ఇప్పుడు తనదగ్గిర చిల్లి గవ్వయినా +లేదంటున్నా డు. డు ఎప్పుడడిగితే అప్ప డిస్త అని పాత పంటమ్మిన దస్తంతా వాడి దగ్గిర పెడితే అయ్యయ్యయ్యయ్యో ఎంత పని చేశాడు? +రాజేశ్వరి (తెలివితక్కువగా అయితే, మా ప్రయాణం? +వెంకట్రామయ్య దానికేమమ్మా? మీరు వెళ్ళండి. వెనకా ముందుగా నే పంపిస్తాం! +రాజేశ్వరి అది కాదు, నాన్నా! మరి +(సత్యనారాయణ చూపులతో వారిస్తాడు. రాజేశ్వరి మాటమధ్యలో ఆగిపోతుంది. +(జవాబు చెప్పకుండానే నీళ్ళు కారుతూ రాజేశ్వరి పడక గదిలోకి వెళ్ళిపోతుంది. +సత్యనారాయణ దాని కేం లెండి. మీ కెప్పుడు వీలైతే అప్పుడే పంపించొచ్చు, కాని కాని +సత్యనారాయణ “ఇంత అవ్యవధిగా ఈ ప్రయాణం చేయించడం తగునా?” అని మళ్ళీ నాకే సందేహం +వెంకట్రామయ్య దాని కేమిలే, నాయనా! పిలుచుకెళ్లాలని నువ్వు, వెంటరావాలని మా అమ్మాయి +సత్యనారాయణ అయినా, చూడండి! అచ్చట్లు ముచ్చట్లు తీరలేదని మా అత్తగారు అనుకుంటారయ్యే. +ఆమె మనస్సునైనా నొప్పించడం భావ్యమా అని +వెంకట్రామయ్య కూతుళ్ళను కన్నతల్లికి ఆ విషయంలో సంతృప్తి ఎక్కడికిలే! +సత్యనారాయణ ఇంత హఠాత్తుగా మిమ్మల్ని విడిచిపెట్టడమంటే రాజేశ్వరికీ కష్టంగానే వుంది. పోనీ +వెంకట్రామయ్య ఏమైనా, అయినప్రయాణాన్ని ఆప���ం మంచిది కాదు, నాయనా! +సత్యనారాయణ (ఉడుకుబోతుతనంతో బయల్దేరాలని అనుకున్నామే తప్ప, ఇంకా బయల్దేరలేదు +వెంకట్రామయ్య మంచిది, నాయనా! మాదే మున్నది? నీ యిష్టం;దాని యిష్టం. +(ముఖాన్ని తిప్పుకుని, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పడమటింటిలోకి వెడతాడు. రాజేశ్వరి గదిలో నుంచి తిరిగి వస్తుంది. ప్రయాణం ఆగిపోయినందుకు విచారం ఒక వైపున, తండ్రి లౌక్యానికి గర్వం మరొక వైపున పై చెయ్యి కావాలని ఆమెలో పెనగులాడుతూ వుంటాయి. +రాజేశ్వరి: ఏమండీ! ఇక, నాటకమెలా నడిపిస్తారు? +సత్యనారాయణ ఇంకేమి నాటకం? నాటకం వికటించింది. +రాజేశ్వరి (తండ్రి లౌక్యాన్ని చూడగా కలిగిన గర్వానిదే పై చెయ్యి కాగా అయితే, ఎవరు రెండాకు +రాజేశ్వరి ఆవలిస్తే ఆయన పేగులు లెక్కెడతాడని నేను ముందే చెప్పలేదండీ? +సత్యనారాయణ (ఉడుకుబోతు తనంతో ఔను! ఆ తానులోదేగా ఈ ముక్క +రాజేశ్వరి చాల్లెద్దురూ! మా నాన్నతో వ్యవహారమంటే నాటకాల్లో వేషాలనుకున్నారా? +(రాజేశ్వరి గదిలోకి వెళ్ళిపోతుంది. సత్యనారాయణ సిగరెట్టును ఆశ్రయిస్తాడు. +బండి భీమన్న చావడిలోకి వచ్చి బండి తోలుకొచ్చా, బాబయ్యా! +సత్యనారాయణ ఎల్లుండి పొద్దున రమ్మంటే ఇప్పు డెందుకొచ్చావ్! వెధవా! పో పో! బండి భీమన్న +(కోపంగా ఒక అడుగు ముందుకు వేస్తాడు. +బండి భీమన్న (బుర్ర గోక్కుంటూ వెనకడుగు వేస్తూ సిత్తం! సిత్తం! కోపం సెయ్యకండి, బాబయ్యా! +సత్యనారాయణ (ముందు కురికి, భీమన్న మెడపై చెయ్యివేసి డాం పూల్! పోతావా, లేదా? +బండి భీమన్న పోతున్నా, బాబయ్యా! పోతున్నా! +(చకచక సింహద్వారం వైపుకు నడుస్తాడు. దాటుతూ ఇదేదో సాలాసిత్రంగానే వుందే! +రాజేశ్వరి (పడకగది గుమ్మంలోకి వచ్చి ఏమిటండీ, అది? పాపం! మధ్య వాడేం చేశాడు? +సత్యనారాయణ చాల్లే! నువ్వు కట్టి పెట్టు! +బండి భీమన్న (సింహద్వారాన్ని (వీధిలోనుంచి "సత్యనారాయణా!” అంటూ నాగేశ్వరరావు కేక. సత్యనారాయణ మళ్ళీ ఎందుకో తయారౌతున్నాడు, ఈ శనిగాడు! +(పడమటింటి గుమ్మంలో నిలబడివున్న రాజేశ్వరి చాటుకు వెడుతుంది. +నాగేశ్వరరావు (చావడిలోకి వచ్చి ఇప్పుడేనా ప్రయాణం? +నాగేశ్వరరావు అయితే, మీ పత్రిక తెప్పించాలనుకుంటున్నా. నెల చందా యెంత? రెండుంబావలా +నాగేశ్వరరావు ముందు ఒక నెలపాటు తెప్పించి చూస్తాలే జేబులోనుంచి డబ్బు తీస్తూ) కాస్త దీన్ని +సత్యనారాయణ నా చేతికి దేనికి? మనియార్డర్ ద్వారా పంపించు. +నాగేశ్వరరావు ఆఁ! రెండుంబావలా చందాకి రెండణాల మనియార్���ర్ కమీషన్ దండగ దేనికి? మీ +పత్రికే, మీ ఆఫీసే కదూ? ఏమంత శ్రమ? కాస్త కడుదూ! +సత్యనారాయణ ఉహుఁ! నువ్వే పంపించు. కావాలంటే, ఆ గెండణాలు నే నిస్తా! +నాగేశ్వరరావు (నవ్వుతూ ఏదో పనిలో పని చేస్తావనుకున్నా గాని +వెంకట్రామయ్య (పడమటింటిలోనుంచి వస్తూ ఏమిటిరా అబ్బాయ్? +నాగేశ్వరరావు ఎలాగూ తమ ఆఫీసుకు వెడుతున్నాడు గదా అని, వాళ్ళ పత్రిక్కి ఒకనెల చందా +వెంకట్రామయ్య లేదురా! హడావుడి ప్రయాణమౌతున్నదని కూకలేసి ప్రస్తుతానికి నేనే ఆపుచేయించా. +నాగేశ్వరరావు మరి ఆమాట చెప్పడేం! అందువల్లే కాబోలు చెడ్డ చికాగ్గా వున్నాడు. +(సత్యనారాయణతో) సరే, ఇంకా రెండు, మూడు రోజులపాటు వుంటావుగా! రేపొచ్చి కనబడతాలే. కరణంగారింటికి తొందర పనిమీద పోతున్నా. +(నాగేశ్వరరావు వెళ్ళిపోతాడు. ఇక అక్కడ వుండడానికి ముఖంచెల్లక, గట్టిగా సిగరెట్టుదమ్ము పీకుతూ సత్యనారాయణ పడక గదిలోకి చక్కాపోతాడు. దీన్ని చూచి, తల పంకిస్తూ వెంకట్రామయ్య చిరునవ్వు నవ్వుతాడు). +వెంకట్రామయ్య (మంచంపై కూర్చుని, సగంచుట్టి జేబులో పడవేసిన చుట్ట పైకితీసి, దాన్ని చుట్టడాన్ని పూర్తిచేస్తూ చిట్టెమ్మా! +వెంకట్రామయ్య నువ్వు నాకొక ముచ్చట తీర్చాలమ్మా! పెద్దపిల్ల కడుపు పండనేలేదు, రెండోదానికీ, +మూడో దానికీ అంతా ఆడపిల్లలే. మరి, నీ కడుపు నైనా ఒక మగపిల్లవాడు పడితే +వెంకట్రామయ్య అంత సిగ్గు దేనికమ్మా! ఇలా చూడు! తాతకు దగ్గులు నేర్పడానికి ఒక మనమడు +(రాజేశ్వరి ముసిముసి నవ్వులతో నిష్క్రమిస్తుంది. వెంకట్రామయ్య తృప్తితో చుట్ట ముట్టించి, గుప్పుగుప్పున పొగ వదలుతూ వుండగా - +పాత్రలు: శివరావు బ్యాంకి గుమాస్తా, కృష్ణవేణి శివరావు భార్య,వెంకాయమ్మ అతని తల్లి, +శ్రీరాములు – ప్లీడర్ గుమాస్తా,సత్తిగాడు, క్లబ్ ప్యూన్. పచారు కొట్టు గుమాస్తా +స్థలం శివరావు అద్దెకున్న భాగంలో ఒక గది +అది శివరావు అద్దెకున్న భాగంలో పెద్ద గది. కుడిచేతివైపుది వీధితల వసారా, ఎడమచేతివైపుది వెనక వక్క వసారా. వంటిల్లు వెనకపక్క వసారాలో సగం భాగమే. ఉన్నది ఒక్క గదే కనక, అది పెద్దదైనా, ఒక మంచంతో, ఒక వెదురు పుల్లల టేబుల్ తో, ఒక ఈడిచెయితో, ఒక కుర్చీపీటతో, రెండు కుర్చీలతో, నాలుగైదు పెట్టెలతో ఇరకాటంగా వుంటుంది. +తెర లేచిన క్షణానికి సినిమా పాట పాడుకుంటూ, శివరావు ప్రవేశిస్తాడు. అతడు యించుమించు పాతికేళ్లవాడు. +సన్నగా, పొడుగ్గా, నాజుకైనవాడు, నీటుగోటులు హెచ్చు. లోతులేనివాడు కాబట్టి, ఇట్టే ఉబ్బిపోగలడు; ఇట్టే కుంగిపోగలడు. సూట్ వేసుకున్నాడు. మిఠాయి పొట్లాలతో నింపిన గుడ్డ సంచి వెంట తెచ్చాడు) +శివరావు (చేతిలోని గుడ్డసంచి టేబుల్ మీద పెడుతూ కృష్ణా! కృష్ణా హాట్ తీసి, చెలాకీగా చిలక కొయ్యపైకి విసిరివేసి) అమ్మా! అమ్మా! క్షణం ఆగి) ఎవ్వరూ పలకరు. ఎక్కడి కెళ్లారో ఈలవేస్తూ, టై కొంచెం వదులు చేసుకుని, మరింత బిగ్గరగా) కృష్ణా +(వెనక వాకిలిగుండా కృష్ణవేడి వస్తుంది. ఆమె పద్దెనిమిదేళ్ల పల్లెపడుచు. కాని, వేష భాషలలో బస్తీ కాపురం తళుకు బెళుకులు కొంతవరకు కనబడుతూ వుంటాయి. +శివరావు తమ రేం చేస్తున్నారేమిటి? బదులే లేదు! +కృష్ణవేణి చెయ్యడానికి నాకు మ రేముంది? వంట చేస్తున్నా, +శివరావు నీ కొక శుభవార్త తెచ్చా! ఏమిటో చెప్పుకో? +కృష్ణవేణి ఏమి టది? మీరే చెప్పండి. +శివరావు ఉహుఁ! నువ్వు చెప్పుకోవాలి. కృష్ణవేణి బాగుంది. నామొహం నా కేం తెలుసు? +శివరావు ఉహుఁ! చెప్పుకోవాలి. కావాలంటే మూడు ఛాన్సు లిస్తా. +శివరావు అహం! చెప్పుకోవాలి. ఏదీ వన్! +కృష్ణవేణి చెబితే చెప్పరాదా? లేకపోతే, మానరాదా? ఏమిటీ నన్ను ఆడించడం? +కృష్ణవేణి పిచ్చిదాన్ని చేసి ఆడించండి! ఆడించండి!! +శివరావు ఛా! ఏమిటది? సర్లే! నువ్వు చెప్పుకోలేవన్న మాట! మరి, నే చెప్పనా? +కృష్ణవేణి కొందరి కళ్ళకు కోతికంటె కూడా కనాకష్టమైనదాన్ని గానే కనబడుతున్నా లెండి! +శివరావు వద్దన్న వాళ్ళకి చెప్పడం దేనికి? తిరిగి వంటింటిలోకి నడవండి! +కృష్ణవేణి రమ్మన్నా, పొమ్మన్నా మీకే చెల్లు! +(వెనక వసారావైపు ఒక అడుగు వేస్తుంది. +శివరావు (రెక్కపట్టి చెంతకు లాక్కుంటూ దేవిగారికి +కృష్ణవేణి దేవీ లేదు! గీవీ లేదు. ఈ దెయ్యపు గుడ్లదానికి అంత పెద్ద పేరు దేనికిలెండి! +శివరావు ఏం కృష్ణా! కోప మొచ్చినట్టుందేం? +శివరావు చీర తేలేదనే ఇంత ఆగ్రహం? +కృష్ణవేణి చీరా గీరా నే తెమ్మన్నానటండీ? +శివరావు నేనే తెస్తానన్నాననుకో. కాని, శుభవార్త వెంటనే చెప్పాలని ఆఫీసునుంచి ఇవ్వాళ సరాసరి +ఇంటి కొచ్చా. రేపు తప్పకుండా నీ కొక ఉప్పాడ జరీచీర కొనుక్కొస్తాగా +శివరావు (కృష్ణవేణి గుండెదగ్గిరిగా చెవి పెట్టి, ఏదో వింటున్నట్టు నటించి నోరు వద్దంటున్నా గుండె +మాత్రం “తే! తే!” అంటూ కొట్టుకుంటున్నదే! +కృష్ణవేణి (ఒక అడుగు వెనక్కు జరిగి కట్టండి; ఇంకా తాటాకులు కట్టండి. ఎవరికైనా నేనేగాకువ? +శివరావు ఈ పూట విసుగ్గా వున్నావేఁ? సర్లే! శుభవర్తమాన ���ేమిటో చెప్పనా? +కృష్ణవేణి చెత్తే చెప్పండి; మాస్తే మానండి. నన్నడిగి చెబుతారేమిటి? +కృష్ణవేణి నాదగ్గ రేముంది మీ కివ్వడానికి? +శివరావు(భుజంపై చెయ్యివేసి ఆపి):ఎక్కడికలా పరిగెత్తుతానంటావ్? కాస్త ఆగు! చెబుతాగాం! +శివరావు నీకు తెలవకపోవడ మేమిటి? ఎక్కడికి వెళ్లింది? +కృష్ణవేణి ఎక్కడికీ లేదు. అదుగో! ఆ వెనక వసారాలో వున్నట్టుంది +శివరావు అమ్మా! నిన్నే! ఒకసా రిలా రా! +వెంకాయమ్మ (లోపలినుంచే ఇప్పుడు నాతో పను లేమొచ్చాయ్ ? +వెంకాయమ్మ (వస్తూ పానకంలో పుడకలా మీ ముచ్చట్ల మధ్య నేను దేనికి? +శివరావు (వసారా వైపుగా రెండడుగులు వేసి అమ్మా! +శివరావు: అమ్మా! నిన్నే! ఒక్కసారిలా రా! +వెంకాయమ్మ లోపలి నుంచే) ఇప్పుడు నాతో పనులేమొచ్చాయ్? +వెంకాయమ్మ వస్తూ) పానకంలో పుడకలా మీ ముచ్చట్ల మధ్య నేను దేనికి? +(తర్వాత ఒక అరనిమిషానికి చిరిగిన చొక్కా కుడుతూ వెంకాయమ్మ వస్తుంది. ఆమె పల్లెటూరి యిల్లాలు. జీవితం అంతా కూడా గీసిగీసి సంసారం చేయడం వల్ల శుష్కించి అచ్చమైన +పోయినట్టు కనబడుతూవుంటుంది. ఏదో చింతకూడా ఆమె ముఖాన్ని ఆవరించి వుంటుంది. వితంతువైనందున తెల్ల చీర, తెల్ల రవికె. వేలుముడి జుట్టు, సగం నెరసిన తల +శివరావు (తల్లి ప్రవేశించగానే నీ కొక శుభవర్తమానం తెచ్చానమ్మా! +శివరావు నా కివ్వాళ ఆఫీసులో యింక్రిమెం టిచ్చారమ్మా! +శివరావు పదిహేను రూపాయలు హెచ్చించారమ్మా! ఇక నెలకి నూటతొంభై యిస్తారు. +వెంకాయమ్మ పదిహేనేనా! హెచ్చింపంటే ఏ పాతికో, ముప్పయ్యో అనుకున్నా. +శివరావు (నవ్వుతూ మెట్టూ, గట్టూ కాదమ్మా! ఈ నెలనుంచి నాకు జీతం హెచ్చించారు. +శివరావు ఆఫీసులో నాకు తప్ప మరెవ్వరికీ యివ్వనే లేదమ్మా! నన్నూ, నా పనినీ మెచ్చుకుని నా +వెంకాయమ్మ (మాట తెంచివేస్తున్నట్టు మంచిదిరా, అబ్బాయ్! ఇదంతా నీ పెళ్ళాం అదృష్టం. +శివరావు రేపు నీ కోడలి కొక ఉప్పాడ జరీ చీర, నీ కొక సైను చీర +వెంకాయమ్మ నాకు సైను చీరలూ వొద్దు; రవికెలూ వొద్దు. మీ ఆవిడకే తెచ్చుకో మరొక జరీ చీర. +కృష్ణవేణి నా కేమీ తే నఖర్లేదు. +శివరావు ఇదుగో! కృష్ణా! బ్రహ్మానందాన్ని, మాధవరావుగార్ని, శ్రీనివాసరావుగార్ని కాఫీకి పిలిచా. +వాళ్ళిప్పు డొస్తారు. బజారు నుంచి స్వీట్స్ కొనితెచ్చా గాని, కాసేదైనా సేవరీ చేసి, కాఫీ పెట్టు. +కృష్ణవేణి ఏమి చెయ్యమంటారు? ఇంట్లో యేమీ లేదు. +శివరావు మొన్నొక రోజున వాళ్లెవరో వచ్చినప్పుడు తెప్పించిన ఉప్మారవ్వ లేదూ? +కృష్ణవేణి కాస్త మిగిలింది. అదేం సరిపోతుంది? +శివరావు వస్తున్నది ముగ్గురేగాఁ? దాన్నే ఎలాగో సరిపెడుదూ. +శివరావు (కోటు, టై తీసి చిలకకొయ్యకు తగిలిస్తూ ఈ గది ఒకసారి ఊడుస్తావమ్మా +వెంకాయమ్మ ఇంతకు ముందేరా పనిమనిషి ఊడ్చి వెళ్ళింది. +శివరావు ఎక్కడి దుమ్ము అక్కడే ఉంది. దాని మొహం! ఇదేనా ఊడ్చడ మంటే? +వెంకాయమ్మ అది అణిగి మణిగి పనిచేస్తేగాఁ? ఇక్కడొక చీపురూ, అక్కడొక చీపురూ చేసి +చక్కాపోతుంది. చూస్తూ ఊరుకోలేక అ దేమిటని నే నడిగితే మూతీ, ముక్కూ విరిచి, ఏ డెక్కిరింపు లెక్కిరిస్తుంది. నేను పెట్టి పోషించడం లేదుగా? అది నా మాటినడానికి! +శివరావు అంత వొళ్ళు పొగ రెక్కివుంటే, దాన్ని పని మాన్పించవమ్మా! +వెంకాయమ్మ నాకు దేనికిరా, అబ్బాయ్! నే నిక్క డుండొచ్చానా, పెట్టొచ్చానా? దాన్ని అదుపు +శివరావు అదేమిటమ్మా! అలా అంటావ్ వెదురు పుల్లల టేబుల్ గదిమధ్యకు లాగుతూ) అమ్మా! +వెంకాయమ్మ ఏమోరా, నా కేం తెలుసు? ఇది నా కొంపా, గోదా? +శివరావు (పడకకుర్చీని టేబుల్ దగ్గరికి తెచ్చివేసి కృష్ణా! +కృష్ణవేణి (తిరిగివస్తూ దేనికిప్పుడు? ఉప్మా చెయ్యమన్నారుగా! చేస్తున్నా. +శివరావు ఆఁ! ఏం లేదు. టేబుల్ తేదీ? కృష్ణవేణి మురికై పోయిందని మొన్న చాకలికి వేశా! +కృష్ణవేణి అ దెన్నడో చిరిగి పోయింది. +శివరావు మరి, ఇప్పు డేమిటీ చెయ్యడం? పోనీ, ఒక ఉత్తరీయమైనా కప్పుదాం. ఏదీ, ఒక టేదైనా తే! +ఏమీ కప్పకపోతే, ఇది చెడ్డ అసహ్యంగా వుంటుంది. +(పై రెండు ట్రంకుల్ని కిందికి దించి, అడుగుదాన్ని ఉత్తరీయం కోసం కృష్ణవేడి గాలిస్తూ వుంటుంది. శివరావు కుర్చీపీటను ఈడ్చుకొచ్చి, కుర్చీలను వాటిని టేబుల్ దగ్గర చక్కగా అమర్చడానికి ప్రయత్నిస్తూ వుంటాడు. +కృష్ణవేణి డబ్బుకు పాలవాడు తొందర చేస్తున్నాడండీ! +శివరావు ఇవ్వాళేగా ఒకటో తారీఖు. ఆ వెధవకి అప్పుడే ఏం తొందర? +కృష్ణవేణి పోయిననెల వాడికి సగమేగదండీ యిచ్చాం. వాడూ సతాయిస్తున్నాడు. నేతివాడికి కూడా +కృష్ణవేణి కూరగాయలదైతే బతక నివ్వడమే లేదు. దానికి పాత బాకీతో చేరి నాలుగు +రూపాయలదాకా అయింది. తెల్లవారేసరికి రాక్షసిలా వచ్చి అది వాకిట్లో కూర్చుంటుంది. +శివరావు రానీ, వెధవముండని! దానిడబ్బు దానిముఖాన గిరగిర తిప్పి కొట్టి, ఇక మా గడప +కృష్ణవేణి పచారీ కొట్టు గుమాస్తా ఇవ్వాళప్పుడే నాలుగు దఫాలొచ్చి వెళ్ళాడు. వాళ్ళిఖ ఆగరట. +శివరావు మొన్నేగా ఒక యిరవై వాడికి జమ కట్టింది? +కృష్ణవేణి ఏమో? ఇంకా పాతికదాకా యివ్వాలట! +శివరావు దొంగ లెక్కలు రాస్తున్నాడు కాబోలు! స్కౌండ్రల్! రేపు వెళ్ళి, వాళ్ళ అంతు కనుక్కుంటా! +కృష్ణవేణి ఏ నెల కా నెల ఎవళ్ళ డబ్బు వాళ్ళకి పారేస్తే, మనకు ఏ చికాకూ వుండదుగదండీ? +శివరావు ఆ జీతమేమో తెచ్చి నీ చేతికే యిస్తున్నాగా! ఆరిందావి! అంతా చక్కగా దిద్దుకురారాదూ? +కృష్ణవేణి అంతే లెండి! నేను మంచిదాన్నయితే మీ కిన్ని చిక్కు లెందుకొస్తాయ్? పాపం! నావల్ల +(కళ్ళను గిర్రున నీళ్ళు తిరగ్గా, మాటమధ్యలో ఆగిపోతుంది. +శివరావు కృష్ణా దగ్గరకు లాక్కుని) నువ్వు వొట్టి వెర్రిదానివి సుమీ! +కృష్ణవేణి (పట్టు విడిపించుకుని, దూరంగా జరిగి, కోపంగా చాల్లెద్దురూ! ముందు జీతం +తెచ్చిస్తున్నారేమో! తర్వాత సిగరెట్లకనీ, సినిమాలకనీ గుంజు కొడుతున్నారేమో! అదేదో మీ దగ్గరే పెట్టుకోండి; మీరే వాడుకోండి. మీరు సంపాయించి తెస్తుంటే కిందూ మీదూ కానకుండా నేను ఖర్చు చేస్తున్నానని నన్నందరు ఆడిపోసుకోవడం దేనికి? +శివరావు (అనునయిస్తూ నేను తలకుమించిన ఖర్చుల్ని చేస్తూవుంటే పాపం! నువ్వేం చేస్తావులే. +కృష్ణవేణి అబ్బే! మీ తప్పేముంది లెండి? ఇంతకూ నేను దరిద్రపుగొట్టుదాన్ని. +కృష్ణవేణి (ట్రంకును వెదకడం తిరిగి ప్రారంభించి, దాని అడుగునుంచి ఉత్తరీయాన్ని తీసి +శివరావు (దాన్ని అందుకొని, మడత విప్పిచూచి అబ్బే, ఇదీ చిరిగిందేనేఁ! వేరే లేదూ? +కృష్ణవేణి (ట్రంక్ మూతవేస్తూ మ రెక్కడిదండీ? మీకున్నదే అదొక్కటైతే +(కృష్ణవేణి ట్రంకుల్ని తిరిగి దొంతరగా పెడుతూ వుంటుంది. చిరుగులు కనబడకుండా, ఉత్తరీయాన్ని మడత పెట్టి, టేబుల్ పై పరచడానికి శివరావు ప్రయత్నిస్తూ వుంటాడు. +కృష్ణవేణి మొదలెట్టిన యెడ మెక్కడండీ? ఇంతలోనే మీరు పిలిస్తిరయ్యే! +శివరావు మంచిది త్వరగా సిద్ధం చెయ్యి! అల్లం సన్నగా తరిగి, జోరుగా వెయ్యి. డాక్టరు +శ్రీనివాసరావుగారికి అల్లమంటే చాలా యిష్టం. జీడిపప్పుకూడా బాగా వెయ్యాలి. +కృష్ణవేణి ఇంట్లో బద్దయినా లేదు, బాగా నే నేం వేస్తాను? +శివరావు గట్టి చిక్కేనేఁ! జీడిపప్పు లేందే ఉప్మాకు రుచీ పచీ వుండదు. ఆ బ్రహ్మానందం అసలే ఉలిపి +కృష్ణవేణి అయితే, త్వరగా వెళ్ళి, రెండు తులాలు కొనుక్కురండి. +శివరావు ఇప్పుడు టైం లేదులే. ఎలాగో పూర్తిచేశెయ్! +శివరావు ఛా! ఎలా మడత పెడదామన్నా ఈ పాడు చిరుగు తప్పడమే లేదు! +వెంకాయమ్మ (చీపురుకట్టతో తిరిగివచ్చి దుమ్ము పైకొస్తుంద���మో. కాస్త తప్పుకోరా, అబ్బాయ్! +శివరావు రాదులే, అమ్మా! ఆ మూలనుంచి ఊడ్చుకురా! +(వెంకాయమ్మ ఒక మూలనుంచి గది జిమ్మడాన్ని ప్రారంభిస్తుంది. +శివరావు (ఉత్తరీయాన్ని నాలుగ్గా మడత పెడుతూ ఇవ్వాళ మనింటికి పెద్ద పెద్దవాళ్ళొస్తున్నారమ్మా! +శివరావు (చిన్నదిగా మడత పెట్టడం వల్ల చాలీ చాలకుండాపోయిన ఉత్తరీయాన్ని టేబుల్ మీద వేసి, +దాని అంచును ఒకవైపున కిందికి లాగబోతే, రెండోవైపున అది పైకి పోతూవుండగా బ్రహ్మానందాన్ని పిలిచానమ్మా! మే మిద్దరం ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాము. వాడిప్పుడు మునిసిపల్ కమీషనర్. నెలకు నాల్గు వందల జీతం తెచ్చుకుంటున్నాడమ్మా! +శివరావు మాధవరావుగారూ వస్తున్నా రమ్మా! ఆయన త్వరలో డిప్టీ కలెక్టర్ కాబోతున్నాడు. నన్ను +మించి చదువుకున్నవాడేమీ కాదు. అయినా, అప్పుడే పెద్ద పదవిలోకి పోబోతున్నాడు. ఆయనింకా పైకి పోతాడు +వెంకాయమ్మ ఊఁ! చదువులు సమానమైతే సరేనా? నసీబు సమానం కావొద్దూ? +శివరావు శ్రీనివాసరావుగార్ని కూడా రమ్మన్నా. ఆయన పెద్ద డాక్టరు. నెలకి వెయ్యిదాకా కళ్ళ +వెంకాయమ్మ సర్లే! ఊళ్ళోవాళ్ళ సంపాదన చూసి మురిస్తే, మన కేం వొరుగుతుంది లేరా, అబ్బాయ్! +శివరావు అది కాదమ్మా! పెద్దవాళ్ళ స్నేహముంటే, ఎందుకైనా మంచిది కాదూ? వాళ్ళ శిఫార్సు +దొరికితే ఉద్యోగంలో ఎంత పైకైనా పాకి పోవచ్చు. +వెంకాయమ్మ ఏమోరా, అబ్బాయ్? ఆ గొడవలేమిటో నా కేం తెలుస్తాయ్? +శివరావు పెద్ద పెద్ద వాళ్ళందరికీ మా బ్యాంకిలో ఖాతా లున్నా యమ్మా! అందువల్లనే పెద్దవా +(బయటి నుంచి “శివరావుగారూ” అని కేక. +శివరావు మాధవరావుగా రనుకుంటా. అన్న వేళకంటే ముందే వచ్చారు. ఇం కేం వూడుస్తాలే, +(వెంకాయమ్మ చీపురుకట్ట అక్కడే పారవేసి వెళ్ళబోతుంది. +శివరావు అమ్మా! అదేమిటి? ఆ చీపురుకట్ట తీసుకుపో. +(వెనక్కువచ్చి వెంకాయమ్మ చీపురుకట్ట తీసుకు వెడుతుంది. “శివరావు గారూ!” అని తిరిగి బయటి నుంచి కేక. +శివరావు మాధవరావుగారా? రండి, రండి. మా గృహం పావనమైంది +పచారీ కొట్టు గుమాస్తా (లోపలికి వస్తూ నేనండీ పచారీకొట్టు పరంధామయ్య గుమాస్తాని. +శివరావు (ముందు తెల్లబోయి, అంతలోనే కోపం తెచ్చుకుని ఏమి టయ్యా! వేళా పాళా లేకుండా +మళ్లీ తయారయ్యావ్! దేనికీ ఇన్నిసార్లు ఇంటి చుట్టూ తిరగడం? +పచారీకొట్టు గుమాస్తా ఎందుకండీ మధ్య నా మీద కోపం? షాహుకారు వెళ్లిరమ్మంటే నే నొస్తానా? +శివరావు మొన్నేగా ఒక యిరవై జమ కట్టింది. ఇంతలోనే ఏమి తొంద రొచ్చింది? +పచారీకొట్టు గుమాస్తా ఇంకా ఇరవై అయిదు రూపాయల తొమ్మిదణాల ఏడు పైసల బాకీ వుంది. సంవత్సరాది వస్తున్నది. కొత్త ఖాతా పుస్తకాలు పెట్టుకోవాలి. పాత బాకీలన్నీ అణా పైసలతో సహా చుప్తాగా వసూలుచేసుకు రమ్మని మా షాహుకారు దండిస్తున్నాడు. +శివరావు మా దేమీ పాతబాకీ కాదేఁ? +పచారీ కొట్టు గుమాస్తా పాతదో కొత్తదో, మా షాహుకారు మరి ఆగడండీ! +శివరావు సర్లే! ఆ లెక్కా డొక్కా యేమిటో చూచి, రేపే బాకీ ఫైసల్ చేస్తానని చెప్పు. +పచారీ కొట్టు గుమాస్తా చిట్టా, ఆవర్జాలు చూసి మేము సరిగానే లెఖ్క వేశామండీ. మా లెఖ్ఖలో తేడా +శివరావు పోనీ, ఇప్పుడు నే నంటున్నాగా! సరే, ఇఖ వెళ్ళు. ఏమో ననుకున్నా! మంచి మర్యాదస్తులే. +పచారీకొట్టు గుమాస్తా ఇది లోకంలో రివాజే లెండి. బాకీ అడక్కపోతే మర్యాదస్తులు. అడిగితే +పచారీ కొట్టు గుమాస్తా అడిగితే మీకు కోపం, అడక్కపోతే ఆయనికి కోపం.ఈ బాకీ వసూళ్ళంతటి +శివరావు (తెప్పిరిల్లడానికా అన్నట్టు ఒక క్షణం ఆగి అమ్మా అమ్మా! +శివరావు గది సగమే ఊడ్చి వెళ్ళావ్. మళ్ళీ ఒకసారి ఆ చీపురు పట్టుకురా! +వెంకాయమ్మ ఎవ రేమిటిరా, ఇప్పుడొచ్చి వెళ్ళింది? +శివరావు ఆఁ! ఎవరూ లేదమ్మా! పచారీకొట్టు గుమాస్తాగాడు. పుట్టి మునిగినట్టు ఇంటి చుట్టూ తెగ +వెంకాయమ్మ వాళ్ళకి బాకీవుంటే వాళ్ళు తిరగరట్రా? కాస్త వెనకా ముందూ చూసి కాపరం +చేసుకోవాలి. “ఆడపెత్తనం తంబల దొరతనం” అన్నారు. +శివరావు (చిలక కొయ్యనున్న కోటుజేబులోనుంచి చిన్న దువ్వెన తీసుకుని, తల దువ్వు కుంటూ +(కృష్ణవేణి పలకదు. చీపురుతో వెంకాయమ్మ మాత్రం వచ్చి, గది జిమ్మడాన్ని పూర్తిచేస్తూ వుంటుంది. +శివరావు ఏఁ! పలకవ్. ఏం చేస్తున్నావ్? +శివరావు అయితే, మనకి మూడే కుర్చీలున్నాయ్. మరొకటి కావాలి. పక్కింటి వాళ్ళ నడిగి ఒక కుర్చీ +కృష్ణవేణి ఏమో! వాళ్ళని నమ్మడానికి వీల్లేదండీ! మంచి గుణాన వుంటే యిస్తారు; పోతే +శివరావు అమ్మా! పింగాణీ ప్లేట్లు ఎక్కడున్నవో చూసి, కడిగి పట్టుకురా! +వెంకాయమ్మ మీ ప్లేట్లు, గీట్లు ఎక్కడున్నవో, ఏమిటో నాకు తెలవదురా, అబ్బాయ్! +వెంకాయమ్మ వోటి చేతులదాన్ని. చెయ్యిజారి పగిలే మీచేత మాటలు పడాలి, మీ ఆవిణ్ణి రానివ్వరా! +(గది జిమ్మడాన్ని పూర్తిచేసి వెళ్ళిపోతుంది. వెనక వాకిలిగుండా చీపురుతో ఆమె వెళ్ళిపోవడమేమో, తల వాకిలిగుండా కృష్ణవేణి కుర్చీతో రావడమేమో. +శివరావు మా అమ్మ చికాగ్గా వుంది. టీ పార్టీకి డబ్బ��� తగలేస్తున్నాననే కాబోలు! కాని, పెద్దవాళ్ళు +మనింటి కెందు కొస్తారు? ఇవ్వాళ ఏదో సాకు దొరికింది కనక, వాళ్ళని మనం పిలవడం పడింది. పిలిచినా వాళ్ళు అంద రిళ్ళకు వెళ్ళరు. పిలిచింది మనం కాబట్టే “ఎందుకోయ్! నీకు లేనిపోని ఖర్చు!” అన్నారు. వాళ్లు అనవలసిన మాటే అది! మా ఆఫీసు బడుద్ధాయిల మాదిరిగా యింక్రిమెంట్ వచ్చిన మాట వినగానే “మా కెప్పుడు టీపార్టీ చేస్తావ్? మా కెప్పుడు డిన్న రిస్తావ్?” అంటూ ఈగల్లా ముసురుకోడానికి వాళ్ల కేం తక్కువ కృష్ణవేణి ఔననిగాని, కాదనిగాని అనకపోవడాన్ని గమనించి) ఏం, కృష్ణా! పలకవ్, ఉలకవ్! ఇది వొట్టి దుబారేనని అత్తాకోడళ్ళిద్దరు కలిసే తీర్మానించుకున్నారేమిటి! +కృష్ణవేణి అడక్క అడక్క మా అత్తాకోడళ్ళమాటే అడగాలి! +శివరావు సర్లే! ఏవీ పింగాణీ ప్లేట్లు పట్టుకురా! స్వీట్స్ వాటిలో పెట్టి సిద్ధంగా వుంచుదాం. +(కృష్ణవేణి వెడుతుంది. శివరావు తన వెంట తెచ్చిన గుడ్డసంచి అందుకుని, దానిలోనుంచి ఒక పొట్లాన్ని పైకి తీసి, దాన్ని విప్పుతూ వుంటాడు. చిన్నవి, పెద్దవి ఎనిమిది ప్లేట్లతో కృష్ణవేణి తిరిగి ప్రవేశిస్తుంది. +శివరావు (ప్లేట్లు నింపి ఉప్మా అయిందా? +శివరావు ఈ ప్లేట్లు అన్నీ అన్ని సైజులుగా వున్నాయేఁ! +కృష్ణవేణి ఏం సైజులో, మన కున్న వవీ. +శివరావు (ఒక దాన్ని యెత్తి దీని అంచు నొక మొర్రి వున్నది (మరొకదాన్ని పరీక్ష చేస్తూ) ఇది +బీటిచ్చింది వేరొకదాన్ని తీసి) ఇదేమో వంకర తిరిగింది ఇంకొక దాన్ని వేలితో చూపుతూ) దానికి రంగు పోయింది. వీటిని చూశాక ఆ బ్రహ్మానందం అందరివద్ద మనల్ని రేపటినుంచీ వెక్కిరిస్తాడు! +కృష్ణవేణి ఈ కాస్తకే వెక్కిరించాలీ! మరి అలాంటి వాణ్ణి మనకు లేని పోని కుమ్ము మీరు +శివరావు పిలవకుండా వదిలి పెడితే వాడు మరింత అల్లరి చేస్తాడు. మా కాలేజీ హాస్టల్ లో వాడి +కృష్ణవేణి మంచి స్నేహితుడే సంపాయించారు! శివరావు నీకు తెలవదు. వాడు భలేవాడు. +(ఇద్దరూ చేరి ప్లేట్లలో స్వీట్సు పెడుతూ వుంటారు. +శివరావు డికాక్షన్ చిక్కగా పెట్టు. ఫిల్టర్ చేస్తే తప్ప, మాధవరావుగారికి కాఫీ నచ్చదు. ఫిల్టర్ +కృష్ణవేణి వాళ్ళివ్వరండీ? కుర్చీ అడిగినందుకే ఆవిడ ముఖం ధుమధుమ లాడింది. ఉప్మాకూడా +శివరావు అందర్నీ రానీ! ఇప్పటినుంచీ వడ్డించి వుంచితే చల్లారి పోతుంది. +శివరావు మనం పిలవడమూ, రాకపోవడమూనా? మన కెంత పలుకుబడి లేకపోతే, చిన్నపనికీ, +పెద్దపనికీ మా ఏజంట్ నన్ను ప్రతి ఆఫీసర్ దగ్గిరికీ తరుముతాడు! ఎంత పెద్ద ఆఫీసరైనా మనం వెళ్ళామంటే, ముందు మన పనిచేసి పంపిస్తాడు. మన సూటూ, మన బూటూ, మన హ్యాటూ చూసేసరికి ఎంతటివాడైనా సీటిస్తాడు. నువ్వేమైనా అనుగాని, వేషంలో కొంత డాబూ దర్పం కావాలి. లేకపోతే, మన ముఖం చూసేవాడెవడు +కృష్ణవేణి ఏం డాబూ, దర్పాలో! ఊరినిండా బోలెడన్ని అప్పులూ, మనమున్నూ! +శివరావు ఇలాంటి యింక్రిమెంట్లు త్వరత్వరగా మరి రెండొస్తే ఈ అప్పు లేం చేస్తాయ్! వెధవప్పులు! +కృష్ణవేణి ఆఁ! రెండేళ్ళకు ఇప్పుడేగా కాస్త జీతం హెచ్చించారు. +శివరావు మన సత్తా వాళ్ళకి ఇప్పుడిప్పుడేగా తెలిసొచ్చింది! ఇఖ, చూడు! చకచకా, చకచకా పైకి +ఎలా వెళ్ళిపోతామో! నాలుగేళ్ళు పోయేసరికి ఏజెంట్ పని! అప్పుడొక కారు, బంగళా, టెలిఫోన్, నౌకర్లు, చాకర్లు +కృష్ణవేణి ఎవరైనా వింటే గప్పాలనుకుంటారు. అయినప్పు డనుకోవచ్చు, ఇప్పుడెందుకులెండి ఈ +శివరావు ఆగు! నువ్వే చూద్దువుగానిగా! ఈ యేడు నాకు యింక్రిమెంట్ వచ్చి తీరుతుందని నేనంటే, +శివరావు బ్రహ్మానందం వచ్చినట్టున్నాడు. సరే నువ్వు లోపలికిపో. కాఫీ కూడా రెడీ చెయ్యి! +(కృష్ణవేణి వెడుతుంది) రావోయ్! బ్రహ్మానందం! రా! పిలవగా, పిలవగా నీ పుణ్యమాయిరి మా యింటి కిప్పటికైనా వచ్చావ్! +శ్రీరాములు (మందుసీసాతో లోపలికివస్తూ నేనురా, శ్రీరాముల్ని. ఏఁ! అంత కొత్త వాణ్ణి +అయిపోయానూ నా గొంతు ఆనవాలు పట్టలేకపోడానికి! +శివరావు ఓరి పీనుగ! నువ్వట్రా! ఎక్కడినుంచి ఊడిపడ్డావిప్పుడు? ఆ మందెవరికి? +శ్రీరాములు మా ఆడవాళ్ళకు మొన్నటినుంచి జ్వరం తగులుతున్నదిరా! మందు తెద్దామంటే +ఉదయం తీరనే లేదు. అందుకని కోర్టు పని కాగానే ఎకాయెకి డాక్టర్ గారింటి కెళ్లా. ఏమిటిరా, నువ్వేమిటో టీపార్టీ చేస్తున్నావట? +శివరావు నీ కెవరు చెప్పారు? డాక్టర్ చెప్పాడా? +శ్రీరాములు నువ్వు చెప్పకపోతే మాత్రం దాగుతుందట్రా! ఇంతకూ విశేష మేమిటి? +శివరావు ఆఁ! మరేమీ లేదురా! ఇవ్వాళ మనకు స్పెషల్ ఇంక్రిమెంట్ వచ్చింది. అందుకని +శ్రీరాములు అదృష్టవంతుడివిరా! అయితే, టీపార్టీకి నన్ను పిలవనే లేదేం! +శ్రీరాములు అంతేలే! నీకు నే నిప్పుడు కనబడను. ఇప్పుడు నీ స్నేహాలన్నీ పెద్ద పెద్ద వాళ్ళతోనే. ప్లీడర్ +గుమాస్తాగాణి నాబోటి బక్కవా ళ్ళిప్పుడు నీ కంటికి ఆనరులే. +శివరావు అఘోరించావ్! ఇప్పుడు మాత్రం మించిపోయిన దేముంది? వుండు నువ్వుకూడా +శ్రీరాములు నే నొచ్చి అడిగితే నన్ను ���ిలుస్తావన్నమాట! ఏం మర్యాదస్తుడివిరా! +శివరావు ఏడ్చావులేరా! బొట్టూ, కాటుకా పెట్టి పేరంటానికి పిలిచినట్టు నిన్ను పిలవాలా? అయితే, +శ్రీరాములు ఊహుఁ! లేదు. ఏదో అర్జెంటుకేసు వచ్చిందట. “నీ కది దారేగదా! రా లేనని ఆ +శివరావుతో చెప్పిపో!” అని ఆయనంటే, ఇంటికైనా పోకుండా నే నిలా వచ్చా. +శివరావు అయ్యొ! ఆయన తప్పకుండా వస్తాడనుకున్నారా! ఏమిటో అంత అర్జెంటు కేసు? +శ్రీరాములు ఏమో! నాకేం తెలుసు? ఆయన చెప్పమన్న మాట చెప్పాను. +శివరావు ఏదో పెద్ద ఆటంకం కలిగివుండకపోతే, ఆయన ఆగిపోయేవాడు కాదు. మనమంటే +ఆయన చాలా ఫ్రెండ్లీగా వుంటాడు. వాళ్ళ యింట్లో ఏ పార్టీ జరిగినా, ఏర్పాట్లన్నీ మనకే అప్పజెబుతాడు. +శ్రీరాములు లేదురా! వెళ్ళాలి! అదెలా వుందో, ఏమో గొడవ! పొద్దుటికే జ్వరం మంటలు +శివరావు మాధవరావుగారు, బ్రహ్మానందంగారు మన పార్టీకి వస్తున్నారు. అలాంటి పెద్ద వాళ్లతో +పరిచయం కలగడానికి ఇంత మంచి ఛాన్సు నీకు మరెలా వస్తుంది? పోనీ, కావాలంటే ఒక పావుగంట తర్వాత వెళ్ళిపోవచ్చులే! +శ్రీరాములు ఆగడానికి వీల్లేదులేరా! ఇంట్లో మందు అప్పగించి, వీలుపడితే, ఏదో ఒకవేళకు +కృష్ణవేణి (తిరిగి వచ్చి ఎవరండీ అది? +శివరావు వాడి వూరూ, మా వూరూ పక్కపక్కనే వున్నాయిలే! మా కేదో బీరకాయపీచు చుట్టాన్నని +చెబుతాడు. రెండు, మూడు నెలలైంది ప్లీడరుగుమాస్తాగా వా డిక్కడి కొచ్చి +రెండో గుమాస్తాగా ఒక యాభై రాళ్ళు తెచ్చుకుంటున్నాడు. చచ్చుపీనుగ! నన్ను పూసుకు పూసుకు తిరగాలంటాడు. నే నెంత పెద్దవాళ్ళమధ్య వున్నా “ఏరా” అంటూ తయారౌతాడు. ఎప్పుడో బుద్ధి చెప్పాలి. ఇలాంటి వాళ్ళని దగ్గరికి చేరనిస్తే మన పరువు తీసేస్తారు. చేసినా స్నేహాలు పెద్దవాళ్ళతో చెయ్యాలి. ఇలాంటి ప్లీడరు గుమాస్తాగాళ్ళతోనా! +శివరావు డాక్టర్ శ్రీనివాసరావుగారికి అర్జెంటు కేసొచ్చిందట. అందువల్ల మన టీపార్టీకి రాలేమని +ఆ శ్రీరాములుగాడి ద్వారా కబురు చేశారు. +కృష్ణవేణి అయిందీ? అప్పుడే ఒకరు జారుకున్నారన్నమాట. తక్కిన యిద్దరేరీ? +శివరావు ఆఫీసర్లు కాదూ? వాళ్లకి ఊపిరిసలపని పను లుంటాయ్. వస్తారు కాస్త వెనకా ముందుగా. +తీరుతుందో, లేదో అని నేను పిలిచినప్పుడే అన్నారు. “ఎలాగైనా సరే తీరుబాటు చేసుకొనక తప్ప”దని నేను గట్టిగా చెప్పేసరికి “ఇంత బలవంతం చెయ్యాలటోయ్ అన్నారు. అన్న మాట తప్పే రకం కాదు; తప్పకుండా వస్తారు. +శివరావు ఆరి వెధవ! వీడికి వేరే వేళ కుదరలేదు కాబోలు! వీడిప్పుడు తయారయ్యాడు! +శివరావు (బిగ్గరగా బయటనుంచి అరుస్తావ్ దేనికి? లోపలికిరా కంఠస్వరం తగ్గించి) నీ కాళ్లు +క్లబ్ ప్యూన్ (దణ్ణం పెడుతూ లోపలికి వచ్చి నేనయ్యా! సత్తిగాః! మరిగలే మాధవరావుగార్ని, +బమ్మానందంగార్ని తమరు టీపార్టీకి దయసెయ్య మన్నారంట బుర్ర గోక్కుంటూ) కాని, ఆరి కేదో తొందరపని తగిలిందంట. ఆ మాట మీతో సెప్పిరమ్మన్నా రయ్యా! +శివరావు (మనిషి చచ్చిపోయి ఏడ్చినట్టే వుంది! ఎక్కడున్నా రేమిరా వాళ్ళిద్దరూ? +శివరావు ఏమో యేమిటి? నీ తలకాయ్! వాళ్లేం చేస్తున్నారు? +క్లబ్ ప్యూన్ సెబ్రే, నన్ను తెగ్గిస్తారేమో నయ్యా! +క్లబ్ ప్యూన్ నే సెప్పానని తమరు +శివరావు చెప్పనులేరా! నీ కేమీ భయమొద్దు. +క్లబ్ ప్యూన్ పేదోణ్ణయ్యా! తమరు నిగ్గదీస్తే సెప్తాగాని +శివరావు మ్! నీ కేమీ ఫరవా లేదు! నీకు మాట రానివ్వను. సరే నువ్వు పో! +క్లబ్ ప్యూన్ వెళ్ళేస్తా నయ్యా! దయుంచండి. +క్లబ్ ప్యూన్ ఆ రిద్దరూ పేకాటలో కూకున్నారయ్యా! +కృష్ణవేణి వీళ్ళూ ఎగవేశా రన్నమాట. నే చెట్లే వింటారటండి? ఉత్తిపుణ్యానికి డబ్బుకు డబ్బూ +ఖర్చుపోతారు; మనస్సుకి మనస్సూ హైరాన పెట్టుకుంటారు. మన యెత్తువాళ్ళతో మనం వుండాలిగాని, పై కెగరబోతే +శివరావు ఊఁ! చాల్లే సంతోషించాం! పోపో!! +కృష్ణవేణి అంతే లెండి! అమ్మకీ నేనే లోకువ! కొడుక్కీ నేనే లోకువ. +(కృష్ణవేణి వెడుతుంది. శివరావు “ఉస్!” అంటూ పడక కుర్చీలో జేరగిలబడతాడు. +శివరావు పడకకుర్చీలో జేరగిలబడినవాడు, హఠాత్తుగా నిటారుగా కూర్చుని) అమ్మా అమ్మా! +శివరావు ఆఁ! ఏం తగలడ్డారో! వీటిని పట్టుకుపో! +వెంకాయమ్మ పట్టుకొచ్చింది పట్టుకుపోలేదూ మీ ఆవిడొచ్చి పట్టుకుపోతుందిలే ఒకక్షణం +ఆగి) ఎల్లుండి మంచిరోజటరా, అబ్బాయ్! నేను మన వూరు వెడతా. +శివరావు ఎందుకమ్మా, యిప్పుడక్కడికి? అక్కడేం ముంచుకు పోతున్నది +వెంకాయమ్మ లేదురా, అబ్బాయ్ నే నెళ్ళాలి. +శివరావు రాకరాక మొన్నే గదమ్మా, నువ్వొచ్చావ్! అప్పుడే వెళ్లాలా? మరొక నెలరోజులైనా +శివరావు ఇక్కడ నీకు బాగా లేదే మమ్మా! +వెంకాయమ్మ బాగేమిటి. వోగేమిటి? ఎక్కడైనా నేను పొట్టకూటి దాన్నేగా! ఇంత పని +శివరావు నిన్ను పనెవ్వరు చెయ్యమన్నారమ్మా? మహరాజులా కాలిమీద కాలువేసుకు కూర్చోక. +వెంకాయమ్మ ఆఁ! కాలిమీద కాలువేసుకు కూర్చుంటే నెత్తిని బండపెడతారు. +శివరావు ఏమి టమ్మా? ఈ పూట నువ్వు చాలా చిత్రంగా మాట్లాడుతున్నావ్! +వెంకాయమ్మ చిత్రం���ా మాట్లాడ్డానికి నే నేమీ చిత్రాంగిని కాదు. +శివరావు మా అమ్మ ఊరు వెళ్ళిపోతానంటున్న దేమిటి? +కృష్ణవేణి లేదండీ! ఆమే ఉత్తిపుణ్యానికి న న్నన్నీ దులపరించింది. +శివరావు అకారణంగా ఆమె నీతో తన వెందుకు పెట్టుకుంటుంది? +శివరావు అసలు తగవెలా ప్రారంభమైం దేమిటి? +కృష్ణవేణి ఆమెగారితో తగవెవరు పెట్టుకున్నారండీ? కృష్ణా, రామా అంటూ మీకు ఒక్కటే +శివరావు ఊరికే ఆమె ని న్నెందుకు సాధిస్తుంది +నేను అదు. ఆమె అదృష్టం వల్లనే మీకు పెద్ద చదువొచ్చిందట; నా ముంపలు మీకు పిచ్చ ఉద్యోగ మేదీ రాకుండా పోయిందిట. పెచ్చబ్బాయికి అన్యాయం చ కాన్ని ఆులు పాల్గొని, మిమ్మల్ని చదిమించిన వెలుగేమీ కనబట్టంలేదట ఏ చినీ కలలు ఎనైనా FENUగా అనుకుంటే, ఈ గుమాస్తాగిరి దొరికిందట. పెద్ద MANA AAVుకు పెద్ద కొలువులో చేరి, అన్నయ్యను అనుకుంటా రనుకుంటే, మీ సంపాదన మీకు exy Akుగా వుందట సరే నింగారం లేకపోయినా, అప్పుల Nomu కనబడుతున్నదట పెట్టి సోనించకపోయినా, ఏదో వొస్తూ పోతూ వుందామంటే, పరాయి కొంపకంటె కనాకష్టమై పోయిందట. +శివరావు ఆమెను నువ్వేమి నొప్పించానో, లేకపోతే ఆమె ఇంత నిష్టూరంగా మాట్లాడేది +కృష్ణవేణి ఏ బొట్టు పెడితే ఆ సొట్టు! నే నేమీ అనలేదండీ! +శివరావు చాల్లే! నువ్వేమీ అనకపోతే ఆమె మనస్సు కింత కష్టమెందుకు కలుగుతుంది? వొంటిమీద +వెండి బంగారాలు తెగనమ్మికూడా నాకు చదువు చెప్పించింది. ఆమెను పువ్వుల్లో పెట్టి పూజించేది పోయి, మనం కాపరం పెట్టిన ఇన్నాళ్ళకొకసారొస్తే మంచి మర్యాదే చేశావ్.. +కృష్ణవేణి నాతోడు! నే నొక్కమాటైనా అనలేదండీ! +శివరావు ఉహు! నువ్వేమీ అనలేదు; మా అమ్మే గయ్యాళి గంప, మా అమ్మే నీతో పోట్లాటకు +(కక్ష వెంట నీళ్లు కాల్వ కాగా, మారు మాట్లాడకుండా కృష్ణవేణి వెడుతుంది +శివరావు ఇంకా నా దగ్గిర దాపరికం దేనికమ్మా? ఎందుకొచ్చింది పోట్లాట ? +వెంకాయమ్మ మీ యింటి కొచ్చి, ఎదురు మీతో పోట్లాట కూడానా? +శివరావు (అశాంతిగా నాలుగైదుసార్లు పచారుచేసి అమ్మా ! +శివరావు అత్తాకోడళ్లకు జగడ మెందుకు వచ్చిందమ్మా! +శివరావు అదేమిటమ్మా? ఇది నీ యిల్లు కాదూ? +వెంకాయమ్మ ఆఁ! నాయిల్లు కాకేఁ! మీ ఆవిడ మా యిల్లు, మా వాకిలి, మా కంచాలు, మా +మంచాలని నేనొచ్చిన కాడినుంచీ అంటున్నది నువ్విన లేదూ? ఇక్కడ నా దేముంది +వెంకాయమ్మ ఇది చాలదూ? ఇంకే మనాలి? రోస మున్న దేవతైనా పిసుక్కు చావడాని కిది చాలు! +శివరావు ఈ మాట తప్పుకాదని నే ననడం లేదమ్మా! ఇది ��ప్పే. కాని, ఇంతే అనిందా? ఇంకేమైనా +వెంకాయమ్మ నోరు మెదపకుండానే చుర్రున వాత లంటించ గలిగినప్పుడు నో రెందుకు +శివరావు అయితే, నువ్వు దాన్ని మన్నించవచ్చు. కావాలని అది నీ మనస్సు నొప్పించలేదు; తెలియక +వెంకాయమ్మ చెప్పొచ్చావులే మా లావు తీర్పు! పెళ్లాం బెల్లం, తల్లి విషం లోకంలో వున్న +శివరావు అది కాదమ్మా? ఇక్కడ మన చుట్టాలా, పక్కాలా? మేము కాపరం పెట్టి రెండేళ్ళు +కావొస్తున్నా. ఇప్పటికిగాని నువ్వు వచ్చావ్ కాదయ్యె. ఈలోపున ఇరుగు పొరుగువాళ్ళతో మా యిల్లనడం దానికి అలవాటై పోయింది. మరొక విధంగా వాళ్ళతో అది మాట్లాడానికి వాళ్లు మన చుట్టాలా? పక్కాలా? అదే అలవాటు చొప్పున నీతో కూడా +శివరావు అమ్మా కాస్త ఆగి) అమ్మా ఎంతకూ బదులు లేకపోగా) పొరపాటుగా అన్న మాట +కింతకోప మెందుకమ్మా క్షణం ఆగి) కృష్ణా నాలుక కరుచుకుంటూ) కృష్ణవేణీ! +కృష్ణవేణి (కళ్ళు తుడుచుకుంటూ వచ్చి దేనికండీ? +శివరావు మా అమ్మ మనస్సుకు ఎందుకు కష్టం కలిగిందో తెలుసా? +శివరావు:ఆవిడతో మాట్లాడుతూకూడా మాయిల్లు, మా వాకిలి, మా మంచాలు, మా కంచాలు +శివరావు అలవాటుచొప్పున అన్నావేమోలే! కాని, పొరపాటుగానైనా పరాయిదాన్నిగా చూస్తే ఆమె +కృష్ణవేణి నాకామె కాదు; ఆమెకు నేనే పరాయిదాన్ని. చిన్నదైనా తమ్ముడి కూతుర్ని చేసుకుంటే, +మాలో అతుక్కు పోయేదని ఆమె సూటీ పోటీగా అనని రోజు లేదు +శివరావు చాల్లే! ఇఖ కయ్యానికి కాలుదువ్వకు! +కృష్ణవేణి అంతే లెండి! మీరూ మీరూ ఒక్కటే. నేనేగా పరాయిదాన్ని! +(గిర్రున నీళ్ళు తిరిగిన కళ్ళతో ఒక్కసారి తలెత్తి చూచి, కృష్ణవేణి వెళ్ళిపోతుంది, “అబ్బబ్బ” అంటూ శివరావు తిరిగి పడక కుర్చీలో జేరగిలబడతాడు. +శ్రీరాములు (చడీ చప్పుడు కాకుండా వచ్చి ఏరా, అప్పుడే అంతా వచ్చి వెళ్లి రేమిటి? +శ్రీరాములు వేళకు అందుకో లేనేమోనని అక్కడికీ ఆదరాబాదరా పడొచ్చారా? అసలు రాకే పోదును. +కాని, నువ్వు ఏమనుకుని పోతావోనని తెరిపి చేసుకొచ్చా. అడుగూ బొదుగూ కాస్త నా కేమైనా మిగిలిందా? +శివరావు కాస్త ఖర్మ మేమిటి? అంతా నీకే మిగిలింది! +శ్రీరాములు (కంఠం వరకూ మెక్కడానికి అన్నట్టుగా తాపీగా ఒక కుర్చీలో కూర్చుంటూ నిన్ను +చూస్తే నా కెంతో ముచ్చటరా! శ్రమలేని ఉద్యోగం, ఒకటో తేదీకి ఠంచనగా జీతం, అప్పుడప్పుడూ స్పెషల్ యింక్రిమెంట్లు, త్వర త్వరగా ప్రమోషన్లు, పెద్ద పెద్దవాళ్ళతో స్నేహాలు, రవ్వారట్టూ +పాత్రలు: తెరపైకి వచ్చేవారు మోహనర���వు, అనసూయ, +నేపథ్యంలో నిలిచేవారు బిచ్చగాళ్ళు, సీతారామయ్య, తులశమ్మ +స్థలం మోహన్ రావ్ యింటిలో ముందు గది +మోహన్ రావు యింటిలో ముందరి గది. కుడిచేతివైపు ద్వారం వీధితల వరండాలోకి; ఎదురుగానున్న ద్వారం పడకగదిలోకి; ఎడమ చేతివైపు ద్వారం భోజనాలగది, వంటిల్లు మొదలైన వాటిలోకి వీధి తల వరండాలో నుంచి ముందరి గదిలోకి ఒక ద్వారం వుంటే, పడక గది లోపలికి మరొక ద్వారం వున్నదన్నమాట ఎదురుగుండా వున్న ద్వారానికి రెండుపక్కలా రెండు కిటికీలు. +గదిలో ఒక పక్కగా రోజ్ వుడ్ టేబుల్, దాని వెనక కుర్చీ. గది మధ్యగా రెండు, మూడు పాత పేము కుర్చీలు. గోడలకు చౌకబారు క్యాలెండర్లు. తుక్కు పుస్తకాలతో అద్దం తలుపుల బీరువా. +తెర లేచేసరికి మోహన్ రావు టేబుల్ వద్ద కూర్చుని ఏదో వ్రాయడానికి ప్రయత్నం చేస్తూవుంటాడు. కుడిచేతిలో కలం; ఎడమ చేతిలో సిగరెట్టు. వ్రాత సాగడం కష్టమైపోయిన కొద్దీ సిగరెట్టు దమ్మును లాగుతూవుంటాడు మరింత గట్టిగా. +అతని వయస్సు ముప్ఫయి అయిదు ప్రాంతాల. కాశ్మీర్ శాలువ వల్లె వాటుతో సహా పక్కా బెంగాలీ బాబు వేషం. +అనసూయ వయస్సు పాతిక సంవత్సరాలు. అందకత్తె. లేనిపోని ఆడంబరాలకు పోక, సంసార పక్షంగా వుంటుంది. మాటకారి కాని, మెత్తని మనస్సు, +మోహనరావు (వ్రాసే ప్రయత్నం విరమించి అనూ! అనూ! +అనసూయ (ప్రవేశిస్తూ అనసూయ" అంటూ నాకు శుభ్రమైన పేరుండగా, ఏమిటండీ, ఈ అనూ, +అనసూయ మీ కవిత్వమేనా? “నా సఖీ! ఓ సఖీ! ఓహో సఖీ!” ఎన్నిసార్లు విననండీ? చెంతనున్న ఈ +సఖిని కన్నెత్తి చూడ్డానికి ఫురసత్ లేకపోయినా, ఏ సఖినిగురించో అదే పనిగా కలవరిస్తూ వుంటారు. +మోహనరావు నేను బాధపడతానని తెలిసికూడా నా సఖిని అవహేళన +అనసూయ అబ్బే! నే నేమీ హేళన చెయ్యడం లేదు. అయినా చేస్తే మాత్రం తప్పేమున్నది నా +కామె సవితై నప్పుడు? ఎప్పటి కప్పుడు ఆమె సంగతి సందర్భాలు విచారిద్దా మనుకుంటూనే వివరంగా అడగలేదు. ఆ సఖిగా రెవరండీ? +మోహనరావు ఆమె నా కవితాసఖి; గగన సీమంతిని. +అనసూయ రెండు పేర్లు చెబుతున్నారు. ఇంతకీ, ఒక్కరా? ఇద్దరా +మోహనరావు ఒక్కతే! కాని, ఆమెకు సహస్రనామాలున్నాయి? +అనసూయ అందుకనేనా మీ రామెకు సహస్రనామ పూజ చేస్తూ వుంటారు. మీ పూజ +అనసూయ నాకు తెలిసినంత వరకు అది నలుసంత పీట. దాని మీద కూర్చోడానికి ఆమె నలుసంత +మోహనరావు ఆమె సూక్ష్మాతి సూక్ష్మ; విశ్వవిశాల +అనసూయ విన్నకొద్దీ ఆవిడ సంగతి మహ చిత్రంగా వుంది. అంత చిన్నదీ, అంత పెద్దదీ కూడా +కావడానికి ఆమె హనుమానులవారికి తోబుట్టువు కాదుగదా? +అనసూయ ఆమె రూపురేఖలు తెలుసుకోవాలని అడుగుతున్నానండీ! ఈ మాత్రానికే తప్పు పట్టాలా? +ఆమె చూడచక్కనిదేనా? ముక్కూ ముఖమూ అందంగా వుంటాయా? +మోహనరావు ఆమె అశరీరవ్యక్తి; ఆద్యంతరహిత శక్తి. +అనసూయ అంటే మీరనే దేమిటి? ఆమెకు రూపమే లేదూ? +మోహనరావు కాని, కోటి రూపాలతో కోటానుకోట్ల ప్రియులకు ఆమె సాక్షాత్కరిస్తూ వుంటుంది. +అనసూయ మీ రొక్కరే అనుకున్నా! ఆమెగారికి నా తలలో వెంట్రుక లంతమంది మొగుళ్ళున్నా +మోహనరావు నన్ను నొప్పించడానికే నీవీ మాటలంటున్నా, ఆమె నా భావనావీధిలోని ప్రియాంగన +కాని, నీవు చిత్రించ గోరుతున్నట్టు, బజారులోని పణ్యాంగన కాదు. +అనసూయ నాకు తెలియ కడుగుతాగాని, వీధి అంటే బజారు కాదండీ? ఏమైనా తుకిడీలు, +తుకిడీలుగా ఇంతమందిని ఆమె తనకు గులాముల్ని చేసుకోవడం గొప్ప సంగతే! ఆమె వయస్సెంత? పడుచుదేనా? లేక, ఆమె విషయంలో అన్నీ విడ్డూరాలైనట్టు, ముసిలిదా? +మోహనరావు ఆమెకు జరలేదు; మృతిలేదు, ఆమె నిత్యయౌవని; నిత్యనూత్న; నిత్యప్రణయిని; +నిత్యవిరహిణి, ఏజాతికీ ఆమె చెందదు! ఏ నీతీ ఆమెను బంధించదు. +అనసూయ అలా చెప్పండి. ఆమెకు నీతీ లేదు; జాతీ లేదు. అటు తిరిగి, ఇటు తిరిగి, చివరికి మీరూ +మోహనరావు మానవమాత్రకాని ఆ తేజోమూర్తిని సామాన్య మానదండాలతో కొలవడానికి +అనసూయ దండాలు పెట్టి, ప్రాణాచారాలు పడి, మీరు దాన్ని కొలుస్తున్నారు చాలదూ? నేను కూడా +కొలవడం దేనికి లెండి. నాకు వేరే కొలువున్నది; వంటింటి కొలువు. నే పోతున్నా, +అనసూయ లేకపోతే విస్తరిలోకి మెతుకులెలా వస్తాయండీ! +మోహనరావు: తిండి! తిండి! పాడు తిండి! పొట్ట నింపుకోవడమే ప్రధానమా? అయితే మనకూ, +శుపక్ష్యాదులకూ భేదమేమిటి? జీవితం విలువలు తెలిసినవారికి అన్నవస్త్రాదులు ముఖ్యం కావు; ఉషఃకాలం, సూర్యోదయం +అనసూయ పొద్దు బారె డెక్కేదాకా మీరు నిద్ర లేవరయ్యె! లేచిన తర్వాత గంటకైనా మంచంపై +నుంచి కాలు కింద పెట్టరయ్యె! సూర్యోదయాలతో మీకేం పని? +మోహనరావు నీ భౌతిక ప్రపంచంలో ఒక్క సూర్యుడే కాని, నా మానసిక జగత్తులో శత సహస్ర +సూర్యు లుదయిస్తూ వుంటారు. నా సూర్యుల కాంతి తీక్షమైంది కాదు; కవోష్ఠమైంది, అది తృష్ణ కలిగించదు; తృప్తి నిస్తుంది. +అనసూయ నేను మామూలు మనిషిని. నాతో మామూలుగా మాట్లాడరాదటండీ? మీ కవితాసఖితో +మీరు కాలక్షేపం చెయ్యండి; నేను చక్కా పోతున్నా. +మోహనరావు (ధోరణి మార్చి ఆఁ! ఆఁ! లేదులే. ���ాస్త నిదానించు. కొత్తగా నే నొక నాటకం +అనసూయ మన బ్రతుకే ఒక నాటకంగా, ఒక బూటకంగా వున్నదయ్యె! ఇప్పుడు మీరు కొత్తగా +మోహనరావు చాల్లే! నువ్వు ప్రతిదానికీ విపరీతార్థాలు తీస్తావ్! +అనసూయ మీ కింత విసుగు దేనికి లెండి! నన్ను పోనీయండి! +మోహనరావు లేదులే, ఆగు! ఇదివర కెన్నడూ నేను నాటకం రాయలేదు. ఇవ్వాళే కొత్తగా ఒకదాన్ని +అనసూయ ఏఁ! మీ కవితాకన్యకు విడాకు లిచ్చారేమిటి? +మోహనరావు నేనా? కవితాకన్యకు విడాకు లివ్వడమా? అదెన్నటికీ జరగదు. +అనసూయ ఔనులెండి! మీ రొకవేళ విడిచిపెట్టాలన్నా, అది మిమ్మల్ని విడిచి పెట్టదు. పుట్టుమచ్చలు +పోతాయి కనకనా, పుట్టుకతో వచ్చిన కవిత్వం పోవడానికి! +మోహనరావు నిజం, అనూ! నిజం! నీ వన్నది నిజం! నేను పుట్టుకతోనే కవిని. జన్మ +జన్మాంతరాలనుంచీ కవిత నంటి నేను వస్తున్నాను; న న్నంటి కవిత వస్తున్నది. కవితే నాకు ప్రాణం; కవితే నాకు ప్రపంచం; కవితే నాకు సర్వస్వం. కవిత కానిది కల్ల. +అనసూయ ఔనండీ! ఔను! ఈ సంగతి నాకు బాగా తెలుసు. ఇల్లూ, వాకిలీ మీకు కల్ల! ఇల్లాలూ +కల్ల! ఇంతకీ మన కవితా కన్యకు చెల్లుచీటీల ప్రమాదమేమీ లేదంటారు! +మోహనరావు నా కవితారాధనలో ఒక భాగమే ఈ నాటక రచనా ప్రయత్నం. “కావ్యేషు నాటకమ్ +రమ్యమ్”. కాళిదాస మహాకవికూడా మేఘసందేశాది మహాకావ్యాల తర్వాత అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం మొదలైన నాటకాలు రాశాడు +అనసూయ అయితే మీరూ రాసుకోండి! మీ దేవకన్యల్ని గురించి వినడానికి నా కిప్పుడు తీరుబాటు +మోహనరావు ఉహుఁ! నా నాటకం దేవకన్యల్ని గురించి కాదు. +అనసూయ మీ రాజపుత్రికల గొడవైనా నాకు పట్టదండీ! +మోహనరావు అబ్బే! కాదు. ఇది పూర్తిగా కొత్త నాటకం. కథావస్తువులో, కథా సంవిధానంలో, +పాత్రకల్పనలో, పాత్రపోషణలో, సంభాషణల గతిలో, సన్నివేశాల రతిలో అంతా కొత్త, క్రొత్త నడలతో, క్రొంగొత్త నుడులతో, రసస్ఫోరకంగా, రసోజ్వలంగా, రసైక్యంగా నడుస్తుందిలే! +అనసూయ నడవనివ్వండి. మీ మాటలే నాకు కొరుకుడు పడనప్పుడు మీ నాటకం నడకలు నాకేం +తెలుస్తాయ్! నే వెళ్లి నా వంటపని చేసుకుంటా; మీరు రాసుకోండి. +మోహనరావు రాయడానికే ప్రయత్నం. కాని, కృత్యాద్యవస్థలో పడ్డాను. +అనసూయ అంటే? అనసూయ (నవ్వుతూ) అయితే, అట్లకాడ తేనా, అడ్డు కుళ్ళగించడానికి? +మోహనరావు పరిహాసంలో గట్టిదానివేలే! కాని, నా కిప్పుడు పట్టిన ప్రశ్న పరిహాసం కాదు; +అనసూయ అంత ప్రళయ మేమి వచ్చిపడిందండీ? +మోహనరావు అదుగో! తిరిగి పరిహాసమా? ఇహ ��ాలించి, రాసినంతవరకు నా నాటకాన్ని +సావధానంగా విని, ఒక సలహా చెప్పు. +అనసూయ అయ్యొ రామ! నేను మీకు సలహాలు చెప్పేపాటి దాన్నా? అయినా చదవండి. +మోహనరావు ఈ నాటకంలోని రసస్ఫూర్తి నీ వనుభవించాలంటే, ముందు కొంత ఉపోద్ఘాతం +(ఉపోద్ఘాతం ప్రారంభించడానికి గభీర ముద్ర ధరించి, అర్ధనిమీలిత నేత్రు డౌతాడు. +అనసూయ ఏమండోయ్! నా కవతల చేతినిండా పనుంది. మీరిప్పుడు మబ్బుల్లోకి పరుగులెత్తి, +మోహనరావు (విసుగ్గా అబ్బ! రసభంగం చేస్తావ్! +అనసూయ (నాలిక కరుచుకుంటూ అయ్యొ రామ! తప్పే! +మోహనరావు సరే! ఇకనైనా ఉపోద్ఘాతం చెప్పనిస్తావా? +మోహనరావు (ఈసారి పోజ్ పెట్టకుండానే అతడు కురూపి. కాని కవి, రసజ్ఞుడు, వ్యుత్పన్నుడు. +కళాసంపత్తి ఎక్కువ. కవిత్వం కోసం బ్రతుకుతాడు. రుచిగలవాడు. +అనసూయ రుచిగలవా డేమిటండోయ్! మీరు కొరుక్కు తిని చూశారేమిటి? +మోహనరావు (“కాస్త ఆగు!” అన్నట్టు సంజ్ఞచేసి అతడు స్నిగ్ధ హృదయుడు, సౌందర్యోపాసి. అనసూయ ఒక్కరూపులో తప్ప, అచ్చంగా మీ లాంటివాడే అందురూ! +మోహనరావు (అంతవరకు కాల్చుతున్న సిగరెట్టును నేలపై పారవేస్తూ కొంతవరకు అంతే +అనసూయ ఎక్కడబడితే అక్కడ మీలా యిలాగే సిగరెట్టు పీకలు పారవేసేవాడా? మోహనరావు +సౌందర్యోపాసనకు, సిగరెట్టు పీకలు పారవేయడానికి సంబంధ మేమిటి? +అనసూయ ఆఁ! నిజమే! వాటికి సంబంధ మేమీ లేదు. కాని, అద్దంలా పూడ్చి పెట్టుకున్న నేలమీద +సిగరెట్టు పీకల్ని చూస్తే నా కెందుకో వొళ్ళు గరపొడుస్తుంది. ఇంతకూ, మీ నాటకంలోని ఈ అత డెవడండీ? +అనసూయ అతనికి ఊరూ, పేరూ లేదేమిటి? +మోహనరావు అతడు కవి, రసజగత్తును సృష్టించే కవికి రసధుని వంటి పేరు పెట్టడమే రసౌచిత్యం. +అనసూయ సర్లే! ఆ చంద్రప్పగారి మాటేమిటి? +మోహనరావు అబ్బబ్బ! నేను ఎంతో ఆలోచించి పెట్టిన పేరు సొగసు ఇట్టే చెడగొట్టేశావ్! +అనసూయ ఆ సొగసు లేవో నా కేం తెలుస్తాయి లెండి. సరే కానివ్వండి! +మోహనరావు చెప్పాను కదూ అతడు కురూపి +మోహనరావు అబ్బ! ఇంత కటువుగా మాట్లాడతావేఁ? +అనసూయ మీరే అంటిరిగా అతడు కురూపివాడని. +మోహనరావు సర్లే! విను! బాహ్యసౌందర్యం లేకపోయినా, అంటే, పైపై అందం లేకపోయినా +అనసూయ పై పై అందమొకటి, లోపల అందమొకటి ఇన్ని వుంటాయటండీ? +మోహనరావు ఔనౌను! ముక్కు, ముఖాల అంద మొక అందమా? +అనసూయ ఓహో! అలాగేఁ! అందువల్లనే కాబోలు +మోహనరావు ఏ మాటకూ లేని సంకోచం దీని కెందుకు? +అనసూయ ఆఁ! మరేమీ లేదు. ముక్కు ముఖాల అంద మొక అందం కాకపోబట్టే కాబోలు +నేనున్నదీ, లేనిదీ కాననట్టుగా మీరు సంచరిస్తూ వుంటారు. +మోహనరావు కానక పోవడమేమిటి? కళ్ళెదట తిరుగుతూ వుంటే! +అనసూయ కళ్ళెదట ఎంత తిరిగితే మాత్రమే? మీ లోకమేమిటో! మీరేమిటో! రాత్రి నే నేమి పువ్వులు +మోహనరావు నువ్వు జడలో పెట్టుకున్న పువ్వుల పేర్లు జ్ఞాపకం వుంచుకోవడం తప్ప నాకు పని +అనసూయ కవిత్వం రాసేవారికి పెళ్ళాం పెట్టుకున్న పువ్వుల పైకి కన్నే పోదన్నమాట. అయితే, మరి +పువ్వుల పైన పాటలూ, పద్యాలూ అల్లడం దేనికో! +మోహనరావు ఇవి పెద్ద సంగతులులే! ఇవి నీకు అర్థం కావడం కష్టం. రసజ్ఞ హృదయంవల్ల, +రసోపాసక జీవితంవల్ల, రసపారవశ్యంవల్ల సిద్ధించే ఆత్మసౌందర్యమే వాస్తవికమైన సౌందర్యం. అదే అనుపమ సౌందర్యం; అదే అలౌకిక సౌందర్యం. రసోపాసకు లందరు ఆశాజీవులు. ఊహాతీతమైన దేనికో వారు అర్రులు జాస్తారు. దూర దూరాలకు, రహస్తీరాలకు వారు పరుగు పెడతారు. వారినే కవిత్వం వరిస్తుంది. వారు బాధలో హృదయం చీల్చుతారు; బ్రతుకులో కవిత్వం ఏరుకుంటారు. ప్రతి పదం జీవించే పలుకుతారు. +అనసూయ తక్కినవాళ్లు చచ్చికూడా పలుకుతా రేమిటి? ఏమీ అర్థంకాని మొద్దుని. ఆ చెప్పే దేదో +మోహనరావు రసోద్వేగంలో పడిపోయాలే! సరే, విను! చంద్ర పైకి అందగాడు కాకపోయినా, +అనసూయ మంచిది; అచ్చుకున్నానండీ! అతడు బాలచంద్రుడే! +మోహనరావు ఒక యువతిని అతడు ప్రేమిస్తున్నాడు. ఆమె దివ్యసుందరమూర్తిని తన +హృదయపీఠంపై ప్రతిష్టాపించుకుని, ప్రేమసుమాలతో, రక్తోదకాలతో అహర్నిశలు అర్చిస్తున్నాడు. +అనసూయ రికామీగా కూర్చోడానికి మీవలె జరుగుబా టున్నవా +డేమిటి? మోహనరావు (ముఖం చిట్లిస్తూ నీకు తోచే వన్నీ యిలాంటి అవకతవక ప్రశ్నలే! +అనసూయ నాకు తెలియకడుగుతా గాని, తిని కూర్చోడానికి తగు స్థితి లేనివాడైతే, రాత్రింబగళ్లు +ఏదో ఒక అమ్మాయిని గురించి జపం చేస్తూ కూర్చోగలడటండీ! +మోహనరావు చాల్ చాల్లే! ఈ విషయాలు నీకు తెలియవ్. +అనసూయ అయితే, మరి నాకు చెప్పడం దేనికి? +మోహనరావు ఆ మాట నిజమే! నా మూడ్ చెడగొట్టేశావ్. +అనసూయ అయ్యొ రామ! మళ్ళీ మాడుపోటు వచ్చిందేమిటి? +మోహనరావు ఊఁ! మాడుపోటూ లేదు; గీడుపోటూ లేదు. +(మోహన్ రావు సిగరెట్టు ముట్టిస్తాడు. అనసూయ “ఏఁ! కోపమొచ్చిందా?” అని అడుగుతుంది. అతడు జవాబు చెప్పడు. ఇంతలో ఈ కింది పాట పాడుకుంటూ తలవాకిలిలోకి ఇద్దరు ముగ్గురు బిచ్చానికి వస్తారు. +ఆమె (బిచ్చగాళ్ళ పాటమధ్య “నిజంగా ఇదంతా కోపమే?” అని అనసూయ అడుగుతుంది. మాట విననట్టు మోహనరావు నటిస్తాడు. ఒక క్షణం తర్వాత “చాల్లే! పొండోయ్” అని బిచ్చగాళ్ళను కసురుకుంటాడు. అయినా వాళ్లు పాటసాగిస్తూ పోతూవుండగా, “మీక్కాదూ చెప్పేది! చచ్చు పీనుగుల్లారా! పో పొండి!” అని గద్దిస్తాడు. +అప్పటికీ బిచ్చగాళ్ళు పాట మానరు. అంతట “వస్తున్నానర్రా! ఆగండి!” అని అనసూయ కదులుతుంది. పాట ఆపి, “అమ్మా! మా అమ్మా కాశీ అన్నపూర్ణమ్మా! గుప్పెడు గింజలు” అని బిచ్చగాళ్లు అర్థిస్తారు. సిగరెట్టు కాల్చుతూ మోహనరావు గదిలో పచారుచేస్తూ వుంటాడు. బిచ్చగాళ్లకు ముష్టి పెట్టి పంపించిన అనసూయ తిరిగి వస్తుంది. +అనసూయ పాపం! వాళ్ళ దేశంలో కరువు వచ్చిందటండీ! మూడేళ్ల నుంచి వరసగా వానలు లేవట. +వాగులు, వంకలు, చెరువులు, దొరువులు దేనిలోనూ చుక్క నీళ్ళైనా లేవట. వానదేవుడు దయచూడక పోతాడా అని ఈ మూడేళ్ల నుంచీ ఏటేటా పైర్లు పెట్టుకుంటే, ఏటేటా పెట్టిన పైర్లు పెట్టినట్టే మలమల మాడిపోయినవట. అమ్ముకు తినగలదల్లా అమ్ముకు తిన్నారట. మరేమీ దారి కనబడక, ఊరూ, నాడూ విడిచి పెట్టి, కొంపా గోడూ పాడు పెట్టి, “అమ్మా అయ్యా!” అంటూ పట్టెడు మెతుకులకోసం గడప గడపకు తిరుగుతున్నారు. కళ్లు లోతుకు దించుకు పోయి, ముఖాలు చప్పగా డోక్కుపోయి, పొట్టలు వెన్నుకు అతుక్కుపోయి, పక్కటెముకలు బయటికి పొడుచుకొచ్చి, వీనుగులంటే పీనుగులుగా +మోహనరావు (చెవులు మూసుకుంటూ ఈ పాడు మాటలు నాకు చెప్పకు! +అనసూయ పాడు మాట లేమిటండీ! పాపం! తినడానికి పట్టెడు మెతుకులు లేక, తాగడానికి చిట్టెడు +గంజైనా లేక, చెట్టుకొక పక్షిచొప్పున అయిపోయి, “అమ్మా! తల్లీ!” అంటూ వాళ్లు అఘోరిస్తుంటే! వాళ్ళ వొంటిని ఎక్కడైనా ఇంత కండన్నమాట వుంటే బొట్టు. వొళి ఎముకలగూళ్ళు. ఎండి వొరుగై, కాసేపో, కూసేపో అన్నట్టుగా వున్నారు. వాళ్ళని చూస్తే నాగుండె చెరువై పోయింది. +మోహనరావు (కోపంతో సిగరెట్టు విసిరికొట్టి చాల్ చాలు! ఇఖ కట్టి పెట్టు! కూడులేక ఎన్ని +కుక్కలు చావడం లేదు! వాటి సంగతి నేను పట్టించుకో బోతున్నానా? +అనసూయ అయ్యొ రామ! మనుష్యులు, కుక్కలు ఒఖ్ఖటే నటండీ! +మోహనరావు ఆఁ! అంతే! సంస్కారం లేకపోతే, రసజ్ఞత లేకపోతే! నేను కవిని. కమనీయ +వాతావరణం నాకు కావాలి. అందాన్ని నేను ఆరాధిస్తాను; ఆనందాన్ని నేను అన్వేషిస్తాను. వాటిని నా రచనల ద్వారా లోకానికి పంచి పెడతాను. నా దృష్టి మేఘాల పైకేగాని, మురికి గుంటలపైకి పోరాదు. నేను వినవలసినవి కోకిల పాటలు గాని, కూటికై అరు��ులు కావు. ఈ వికృత ప్రపంచంతో, దీని వికార జీవితంతో సంబంధం లేకుండా, అనంతాకాశాల లోకి కరగని ఒక ఆవేదనతో, దొరకని ఒక తేజస్సుకై నేను నేను +అనసూయ (తెల్లపోయి ఎందుకండీ అంత కోపం లెంపలు వాయించుకుంటూ) బుద్ధి +(అనసూయ వెళ్ళిపోతుంది. మోహన్ రావు కుర్చీలో కూర్చుని కొత్త సిగరెట్టు ముట్టిస్తాడు. టేబుల్ వద్ద కూర్చుని వ్రాయడానికి ప్రయత్నించగా ఒక్క అక్షరమైనా రాలదు. అంతట కుర్చీలోనుంచి లేచి, గదిలో నాలుగైదుసార్లు పచారు చేస్తాడు. పిమ్మట “అనూ" అని వరసగా రెండు, మూడుసార్లు పిలుస్తాడు. +అనసూయ కోపమైనా, తాపమైనా మీకే చెల్లు! నా దేముంది? మొద్దురాచ్చిప్పను! +మోహనరావు నాది సున్నితమైన మనస్సని నీకు తెలుసుగదా? తెలిసీ, కరువు, కాటకాల మాటలు +అనసూయ తప్పేనని చెంపలు వాయించుకున్నా గదండీ! +మోహనరావు సరే! ఇలాంటి పాడుమాటలు చెప్పి, నా మనసు మరి నొప్పించకు. ఆఁ! అన్నట్టు నా +నాటకం కథ ఎంత వరకు చెప్పాను? ఆఁ! ఆమె +అనసూయ ఆమె యెవతండీ అంతలో నాలిక కరచుకుని) ఆఁ! ఎవతైతే నాకు దేనికిలెండి! +ఊరుకోలేక నవ్వులాటకు నేనేమైనా అంటే, ఇట్టే మీకు తట్టెడు కోప మొస్తుంది +మోహనరావు అబ్బే! సందేహం వస్తే అడగనూ వచ్చు; తీర్చుకోనూ వచ్చు. నా మనోవీధిలో ఈ +పాత్రలు స్పష్టంగా, సజీవంగా మూర్తిమంతమై వున్నందున నీకూ సుపరిచిత వ్యక్తులే అన్నట్టు పొరపడుతున్నాను. ఆమె ఎవరో నీకు చెప్పనే లేదు. ఆమె సరళ. చంద్ర ప్రేమిస్తున్న దివ్యసుందర యువతి. +మోహనరావు పేరు చక్కగా కుదిరింది కాదూ! ఆమెది సరళాతి సరళ హృదయం. అందువల్ల +మోహనరావు ఆమె ఎంత రూపవతో అంత గుణవతి; ఎంత గుణవతో, అంత విద్యావతి. ఇక, ఆమె +అనసూయ పాడుదేవుడు! అన్నీ ఒక్కరికే అమిర్చి పెడతాడు! +మోహనరావు ఆమె మహదైశ్వర్యానికి ప్రలోభపడి ఒక జిత్తులమారి అతడి పేరు శాస్త్రి జంబుక +శాస్త్రి అని ధ్వనించాలే! ధ్వని ప్రధానమైనదే ఉత్తమకావ్య మౌతుంది చంద్ర, సరళ, శాస్త్రి అని పేర్లు పెట్టడంలోనే నేను గొప్పగా ధ్వనించాను కాదూ ఆమె సంపత్తికి ప్రలోభపడి ఆమెను వశీకృతను చేసుకోవాలని శాస్త్రి సకల మాయోపాయాల ద్వారా ప్రయత్నిస్తున్నాడు; సమస్త సమ్మోహనాస్త్రాలను పుంఖానుపుంఖాలుగా ఆమెపై సంధిస్తున్నాడు. సరళ హృదయ గనక, అతడి కపటాన్ని ఆమె కానలేక పోతున్నది. అతడి పైపై మెరుగులకు బ్రమసి, అతడి మాయ మాటలకు మురిసి, అతడే తనకు వరుడని ఆమె భావిస్తున్నది. హృదయం లేని ఒక మహానీచుడు, సంస్కారంలేని ఒక పరమతుచ్చుడు సరళ మధుర జీవితాన్ని బలిగొన బోతున్నాడే అని చంద్ర ఆఁదోళన పడుతున్నాడు; ఆవేదన చెందుతున్నాడు; ఆక్రోశిస్తున్నాడు. ఈ ఘట్టంలో నేను నా నాటకాన్ని యెత్తుకుంటు న్నాను. ఏఁ! ఈ యెత్తుగడ రసవత్తరంగా వుంటుంది కదూ? +అనసూయ మీ మాటలు నాకు రావు గాని, బలే పసందుగా వుంటుంది. +అనసూయ అయ్యొ రామ! ఇ దెక్కడి పాపమండీ! నే నే మాటన్నా పరాచక మంటారు! +మోహనరావు సరే! నా నా మొదటి రంగం సరళ దివ్యసౌధాన్ని పరివేష్టించివున్న +పుష్పోద్యానవనం. దానిలో ఒక సుందర లతానికుంజం. ఆ నికుంజంలో ఒక చంద్రశిలావేదిక. ఆ వేదికపై దేవకన్యవలె విశ్రమించివున్న సరళ. ఆమె సహజ సౌందర్యానికి శీతల సుధాచంద్రికలు ఒక నూత్న శోభను తెస్తున్నాయి. ఆమె పాదపద్మ యుగ్మం వద్ద శాస్త్రి కూర్చుని వున్నాడు. అతడు ఒక ప్రేమగీతాన్ని ఆలపిస్తూ వున్నాడు. +మోహనరావు ఔను. నేను రాసిందే. “సఖీ! సఖీ! నీ సఖుడనే” అంటూ రాశానే ఆ ప్రేమ గీతం. ఆ +గీతంలోని అవ్యక్త మాధుర్యానికి మందానిలంతో మావిచిగురువలె ఆమె చలించి పోతున్నది. చంద్రశిలా వేదికపై నుంచి అశాంతిగా లేచి, ఆమె లతానికుంజం వెలుపలికి వస్తుంది. మరింత తేనె లూరేటట్టు ప్రేమగీతాన్ని ఆలపిస్తూ శాస్త్రి ఆమెను అనుసరిస్తాడు అప్పుడు +అనసూయ ఆ అమ్మాయికి అమ్మా, బాబూ లేరేమిటి? +అనసూయ అమ్మా బాబూ వుంటే అదుపాజ్ఞలలో పెట్టుకోరటండీ? పెళ్ళికాని పిల్లను తోటలెంట +మోహనరావు అబ్బబ్బ! నీ సామాన్యపు కొలత బద్దలతో నేను సృష్టిస్తున్న ఆదర్శజీవులను +అనసూయ మీ కొలతబద్దలకైతే గజానికి ఆరడుగు లుంటాయి కాబోలు! +మోహనరావు నీ పరిహాసాలకేమి గాని, నేను చెప్పబోతున్న దాన్ని కాస్త చెప్పనీ! “శాస్త్రి కపటి, +అతడు ప్రేమిస్తున్నది నిన్ను కాదు; నీ సంపత్తిని” అని సరళను హెచ్చరించడం తన విధ్యుక్త ధర్మమని ఒక నిశ్చయానికి వచ్చి, సరిగా అదే వేళకు చంద్ర వస్తాడు. రసకందాయపు పట్టులో చంద్ర వచ్చాడని శాస్త్రి ఆగ్రహపరవశు డౌతాడు. అన్యాపదేశంగా చంద్రను నిందించాలని సరే, ఇక నేను రాసింది చదువుతా విను. +(తను వ్రాసిన కాగితాలు తీసుకుని, నాటకంలో వేషధారి వలె ఫోజ్ పెట్టబోయి, అంతలోనే ఆగుతాడు. +మోహనరావు ఆఁ! అన్నట్టు నీ కిక్కడ ఒకమాట చెప్పాలి. లేకపోతే, నా ఉపక్రమణికలోని +రసవద్విశేషం నీకు బోధపడదు. చంద్ర నల్లటి వాడు. నల్లటి వాడని శాస్త్రి అతణ్ణి వెక్కిరిస్తున్నాడన్నమాట. +మోహనరావు ఇక చదవనా అనసూయ “సరే” అన్నట్టు తల ఊపగా, నాటక వేషదారి పోజ్ +శాస్త్రి ���రళా! ఆ నీల మేఘశకలాన్ని చూడండి. క్రూరవన్యమృగం వలె అది పైకి దూకుతుంటే, +భీతహరిణాలవలె ఆ చుక్క కన్నెలు ఎలా చలించిపోతున్నవో! +అనసూయ అతని మాటలు మన మాటలుగా లేవేఁ? +మోహనరావు చంపేశావ్! ఎత్తుగడలోనే నేను కాళిదాసు పోకడ పోయాననుకుంటే, నువ్వు చేసే +అనసూయ ఆఁ! నా మొఖం, నా కేం తెలుసులెండి! చదవండి. +మోహనరావు మధ్య మధ్య నువ్వు వ్యాఖ్యానాలు చెయ్యనంటే గాని చదవను అలాగే నన్నట్టు +అనసూయ తల వూపుతుంది)ఈ మాటమీదే నిలబడాలి సుమా సరే నన్నట్టు అనసూయ తిరిగి మౌనంగానే సూచిస్తుంది అయితే విను! +సరళ (నవ్వుతూ చంద్రగారిని మించిన కవిచంద్రు లౌతున్నారే మీరు! +(ఇంతలో ఎవరో ఉక్కిరిబిక్కిరై దగ్గుతున్నట్టు వినబడుతుంది +మోహనరావు (చప్పున రెండుచేతులతో రెండు కళ్లు మూసివేసుకుంటూ ఖర్మం! సరాసరి ఇక్కడికే +రాడుగదా! వెళ్ళి ఆయన్ని పంపించిరా! ముందు వెళ్లు! +అనసూయ అంత భయం దేనికండీ! ఆయ నేం దెయ్యమా? భూతమా? +మోహనరావు ఆ శవాకారాన్ని నేను చూడలేను. నా కళ్ళ బడకుండా తక్షణం పంపించి రా! +(అనసూయ వెడుతుంది. ఆమె వెళ్ళిన క్షణానికి మోహనరావు ముందు వేళ్ళసందుగుండా గుమ్మంవంక చూచి, భయంలేదని గుండె దిటవు చేసుకుని, తర్వాత కళ్ళకు కప్పుకొన్న చేతుల్ని తీసివేసుకుంటాడు. సిగరెట్టు కేసు, అగ్గి పెట్టి అందుకోబోయేసరికి అనసూయ తిరిగి వస్తుంది. +అనసూయ సీతారామయ్యగారే నండీ! ఈ ఉత్తరమట కాస్త చదివి పెట్టండి. +మోహనరావు (ఉత్తరాన్ని అందుకుంటూ తెలుగు ఉత్తరమేగాఁ? నువ్వే చదివి చెప్పకపోయావూ? +అనసూయ ఆ గొలుసుకట్టు రాత నాకు తెలిస్తేనా? +మోహనరావు (ఉత్తరాన్ని చకచక లోపల చదువుకుని ఆఁ! ఏంలేదు. ఆడబిడ్డ లాంఛనాలకింద +నూటపదహా ర్లివ్వకపోతే వాళ్ళు పెళ్ళిసంబంధం వదులుకుంటారట. +(సీతారామయ్య తిరిగి ఉక్కిరి బిక్కిరిగా దగ్గుతాడు. +మోహనరావు సరే! నువ్వెళ్ళి తక్షణం ఆయన్ని సాగనంపిరా! +అనసూయ ఇలాంటి కష్టాలు మరి నాలుగు చుట్టుకుంటే ఆ పిచ్చి మారాజు తనే వెళ్ళిపోతాడు. +(అనసూయ వెడుతుంది. సీతారామయ్యగారికి తిరిగి దగ్గు తెర వస్తుంది. +(విసుగుదలతో గదిలో పచారు చేస్తుంటాడు. దగ్గుకుంటూ సీతారామయ్య వెళ్ళిపోతాడు. +అనసూయ (తిరిగి వచ్చి పాపం! మాటవినగానే ఆయన నిలువునా నీరైపోయాడండి. చేతి +కక్కరకొచ్చిన చెట్టంత కొడుకు నిరుడు పోయినప్పటి నుంచీ ఆయన పడుతున్న కష్టాలు ఆ పగవాడికైనా వద్దు. “కట్నం వెయ్యిన్నూట పదహార్లకే గిజ గిజలాడుతుంటే, మరొక నూటపదహార్లు న��� నెక్కడ తెస్తానమ్మా?” అని పాపం ఆయన కంట తడి పెట్టుకున్నాడు. కాని, ఏం చేస్తాడు? రక్తం పిండుకునైనా ఆ నూటపదహార్ల ముడుపుకూడా చెల్లించుకోవాలి. ఈడు ముదిరి పోతున్న పిల్ల మరెంతకాలం పెళ్ళీ పేరంటం లేకుండా యింట్లో పెట్టుకుంటాడు. తల్లి చాటున బ్రతకడానికి తల్లీ లేదయ్యె! ఆ కోడలున్నదంటే, అదొక రాక్షసి, ఆడబిడ్డను అష్టకష్టాలు పెడుతున్నది. కడుపునిండా కూడైనా పెట్టకుండా మల మల మాడ్చి వేస్తున్నది, “నా ఆయుస్సు కూడా పోసుకుని మా అన్నయ్య చల్లగా వుండి, నేనైనా పోకపోయాను. మా నాన్నకు ఈ ముసలితనంలో ఈ కష్టాలైనా తప్పే” వని మొన్న ఆ పిల్ల నా దగ్గిర ఆవురుమన్నది. అందరి కాళ్ళూ, కడుపూ పట్టుకుని, అవస్థ లెన్నో పడితేగాని, ఈ సంబంధం కుదిరింది కాదు. ఇప్పుడిది తప్పిపోతే, ఆ పిల్ల ఏంకాను? ఆ తండ్రి ఏంకాను? అయ్యొ రామ! ఆడపిల్లల్ని కనడమే మహాపాతకమైపోతే! చేతనైతే లోకానికి సిగొచ్చేలా దీన్ని గురించి ఒక నాటకం రాయరా దటండీ? +మోహనరావు వెర్రిదానా! ఇలాంటి సామాన్య విషయాలు కావ్య వస్తువు లౌతాయా? +అనసూయ అయితే, లోకంలో లేని విషయాల్ని గురించి రాయడం ఎవర్ని ఉద్ధరించడానికండీ? +మోహనరావు ఉద్ధరిం పేమిటి? ఆ ప్రశ్న లేనే లేదు. కళ కళ కోసమే. పువ్వు ఎందుకు విచ్చుతుంది? +కోకిల ఎందుకు పాడుతుంది? సెలయేరు ఎందుకు ప్రవహిస్తుంది? +అనసూయ ఇంకా నయం! “నువ్వెందుకు అన్నం తింటున్నావ్? ఎందుకు గుడ్డ కడుతున్నావ్?” +మోహనరావు ఎంత గొప్ప సంగతినైనా ఇట్టే కూడుగడ్డల లెవెల్ కు దించేస్తావ్! ఇందుకు పూర్తిగా +భిన్నమైనదే సాహిత్యం. జీవితాన్ని కవి యథామాతృకంగా చిత్రించరాదు. లోకానికి అతీతుడై, అతిలోకాన్ని సృష్టించాలి. +అనసూయ ఆఁ! ముందు ఈ లోకంలో కడతేరితే గదా, తర్వాత ఏ లోకమైనా. +మోహనరావు దుఃఖం, దైన్యం, దారిద్ర్యం, కల్ల, కపటం, కాఠిన్యం ఇదేగా లోకమంటే? ఈ పాడు +లోకంనుంచి ఎంత దూరానికి పారిపోగలిగితే, అంత గొప్ప కవి కావచ్చు. అప్పుడే కవి రసాధిదేవతను ప్రసన్నం చేసుకోగలుగుతాడు! రసం లేనిదే +మోహనరావు మ్! నిన్ననే పనిలేదులే. ఇంతకూ తప్పు నాది! నేను నీతోనా సాహిత్యమీమాంస +అనసూయ పోనీ. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారు. నేను పోతున్నాలెండి. వంటకు వేళ +మోహనరావు అనూ! అనూ! ఆగు నీ వంట కేమిలే! +అనసూయ మీ వంటేనా ముఖ్యం. మీరు తొమ్మిది రసాలే పెట్టగలరేమో కాని, నేను తొంభై రకాలు +పెట్టగలను. నేను ఏ రసం పెట్టినా నోటికి కమ్మగా వుంటుంది. +మోహనరావు సరే! ఒక్కమాట విని వెళ్లు. నా నాటకంలోని ఒక ఘట్టంలో తాను వ్రాసిన +కాగితాలు తిప్పివేస్తూ) ఈ మధ్య భాగాలు వదిలేస్తున్నాలే! శ్రద్ధగా నీవు విననప్పుడు చదివి మాత్రం ప్రయోజన మేమిటి? చివరి భాగం మాత్రం చదువుతా. చంద్ర సరళతో ఈ ఏం! చదవ మంటావా +(నాటకంలోని వేషధారివలె పోజ్ పెట్టి గడగడ చదువుతాడు. +చంద్ర: “సరళా! నేను మిమ్ము మనసారా ప్రేమిస్తున్నాను; పూజిస్తున్నాను. నాది కాముకుని తుచ్ఛ +మోహనరావు (ఆశ్చర్యంగా అదేమిటి? ఆ పిచ్చిమాట ఎందుకంటుంది? +అనసూయ జడివాన కురిసి కురిసి వెలిసిందిగదా అని? +మోహనరావు హాస్యానికి నీకు సమయాసమయాలు లేవు గాని, చంద్ర తనను ప్రేమిస్తున్నట్టు సరళ +ఎన్నడూ శంకించనైనా లేదు. అట్టిది మహాగ్నిపర్వతమే బ్రద్దలైనట్టుగా అతడు తన ప్రేమను ప్రకటించాడు. కవి కుమారుడని, రసజ్ఞహృదయుడని అతడంటే ఆమెకు గౌరవాదరాలు లేకపోలేదు గాని, అతని సౌందర్యవిహీనత కారణంగా, ప్రియునిగా ఆమె ఎన్నడూ అతనిని భావించలేదు. ఈ పరిస్థితిలో ఆమె మనోగతభావాలు ఏవిధంగా వుంటాయి? +అనసూయ ఏమో నాకేం తెలుసు? ఆ వైనం ఆ సరళమ్మగారినే అడిగి చూడండి +మోహనరావు ఆ పరిస్థితిలో నీవే కాసేపు వున్నావనుకో. +అనసూయ అంత దౌర్భాగ్యం నాకెందుకు పడుతుందండీ? +మోహనరావు నువ్వు చెప్పకపోతే పోయావుగాని, నే నేమని ఊహిస్తున్నానంటే +అనసూయ మీకు తెలియని సంగతులు, మీకు అనుభవంలో లేని విషయాలు మీ రెందుకు +మోహనరావు అదే కవి ప్రత్యేకత! సమస్త విషయాలను అతడు ఊహిస్తాడు. అతడి ఊహకు +అందనిది ముల్లోకాలలో లేదు. అతడి మనోనేత్రం మహాశక్తిమంతమైంది; అతడి అంతశ్చక్షువు మహామహితాత్మమైనది! +అనసూయ అందువల్లే కాబోలు మామూలు కళ్ళతో చూడరు! మామూలు చెవులతో వినరు!! +మోహనరావు ఇలాంటి మాటలంటేనే నాకు కోప మొస్తుంది! +అనసూయ (భయం నటించి, లెంపలు వాయించుకుంటూ అపరాధం! మహాపరాధం!! +మోహనరావు శాస్త్రిపట్ల అసూయతోనే అతడి నింత నికృష్టమైనవాణ్ణిగా చంద్ర చిత్రించినట్టు సరళ +శంకిస్తుందని నేను ఊహిస్తున్నాను. నా ఊహ సరైనదే అంటావా? +అనసూయ మీరు ఏమైనా అనుకోవాలేగాని, మరి దానికి తిరుగేమిటండీ? +మోహనరావు అనుకోవటాలు, గినుకోవటాలు కాదు. ఇక్కడే నన్ను కొంత సంశయం పీడిస్తున్నది. +అందువల్లే నా నాటకం నడవడంలేదు. నువ్వే సరళ స్థితిలో +అనసూయ అయ్యొ రామ! వద్దన్న కొద్దీ దానికీ, నాకూ సాపత్యం పెడతా రెందుకండీ? +మోహనరావు నాకోసమని మాట వరసకు నువ్వే బయట నుంచి ఎవరో “అనసూయమ్మా!” అని +పిలవగా) వీ రెవరు? అబ్బబ్బ! అంతా రసాభాస! +(అనసూయ వెడుతుంది. ముఖంలో విసుగుదల కనబడుతూ మోహనరావు తను వ్రాసిన కాగితాలు తిరగవేస్తూ వుంటాడు. కొన్ని క్షణాల తర్వాత సిగరెట్టు ముట్టిస్తాడుకూడా. +అనసూయ (తిరిగివస్తూ పాపం! ఆ తులశమ్మ వలవల యేడుస్తున్నదండీ! “మాది అవిభక్త +కుటుంబం. ఇక్కడ నీ దేముంది?” అని ఆవిడను వాడులేడూ ఆవిడ మరిది వా డొర్ధి కర్కోటకుడు ఈపూట ఇంట్లో నుంచి గెంటి వేశాడట. భర్తపోయిన ఈ ఆరేడు నెలల నుంచీ ఆ మరిది వాడి దెంత కటికిగుండో కాని నానా హింసలు పెడుతున్నాడు. మీ నాన్న గారేనట, వాళ్ళకి నాలుగైదేళ్ళనాడు అన్నాదమ్ముల భాగాలు పంచిపెట్టి, పారీకత్తులు రాసిచ్చింది. ఆ కాస్త కొంపకూడా కలుపుకుపోతే, ఆమె తను వెలా గడుస్తుంది? అడిగేవారు లేకపోబట్టే గదా, వాడు ఆమె నింతగా కాల్చుకు తినడం! మీరు కాస్త జోక్యం కలిగించుకుని, ఆమెకు కోర్టు వ్యవహారం +మోహనరావు (ముక్కుపై వేలు వేసుకుంటూ ఔరా! కవిత్వం పలికే నోటితో కూటసాక్ష్యాలు +అనసూయ ఇందులో అబద్ధ మేమున్నదండీ? వాళ్ళు ఏనాడో వేరుపడ్డ సంగతి +మోహనరావు (చేతిలోని కాగితాలను నేలకు విసిరికొడుతూ చాల్ చాల్లే! పాపం వాళ్లు, పాపం +వీళ్లు అంటూ అందర్నీ తెచ్చి నా నెత్తి నెక్కించు. ఈ వాతావరణంలో కళాసృష్టి ఏం జరుగుతుంది? రసాధిదేవతను ఏమి ప్రసన్నం చేసుకోగలం? రసవాహినులను ఎలా ప్రవహింప జేస్తాం? అందుకే కవి నిర్జనప్రదేశానికి పోవాలి; ఏకాంతవాసం చెయ్యాలి. నేనూ పోతాలే ఏ నదీతీరానికో, ఏ పర్వత ప్రాంతానికో, ఏ అరణ్యగర్భానికో! +పాత్రలు: సుబ్బయ్య (రంగస్థలం పై గుమాస్తా (నేపథ్యంలో) +గమనిక ఒక పాత్రను రంగస్థలంపై నిలిపి, రెండవ పాత్రను నేపథ్యంలో వుంచి, అమెరికన్ నాటక కర్త యూజీన్ ఓనీల్ “బిఫోర్ బ్రేక్ ఫాస్ట్” అనే ఏకాంక నాటికను రచించాడు. కేవలం ఆ టెక్నిక్ మాత్రం ఈ నాటికలో అనుసరించబడింది. టెక్నిక్ లో తప్ప, తక్కిన అన్ని విషయాలలో ఇది స్వతంత్ర రచన. +శ్రీరామరాజ్యం రైసుమిల్లు ఆఫీసు రూమ్. కుడివైపున వీధితల ద్వారం, ఎదురుగా రెండు పెద్ద కిటికీలు. ఆ కిటికీలగుండా దూరాన చెట్లూ, ఆకాశమూ కనబడుతూ వుంటాయి. ఆఫీసు రూమ్ ఎడమపక్క గుమాస్తాల గది. పైభాగంలో రంగు అద్దాలు అమర్చబడిన బల్లకూర్పుతో (గ్లాస్ పేస్ట్ వుడెన్ పార్టిషన్ తో) ఆఫీసు రూమ్ లోని ఎడమభాగమే గుమాస్తాల గదిగా ఏర్పాటు అయివుంటుంది. బల్లకూర్పు మధ్య ఒక ద్వారం. రానికి “స్వింగ్ డోర్స్” (స్ప్రింగ్ తలుపులు ఈ తలుపులకు రెండు వైపుల కోట్లు తగిలించుకోడానికి రెండు చిలకకొయ్యలు. +గది మధ్యగా ఒక పెద్ద టేబుల్. దానిమీద టెలిఫోన్, లెటర్ బాక్స్, వ్రాతపరికరాలు, రబ్బర్ స్టాంపులు వగైరా. టేబుల్ కు ఒకవైపున (ప్రేక్షకులకు సమ్ముఖంగా) ఒక చేతులున్న కుర్చీ; తక్కిన వైపుల మరి అయిదారు చేతులులేని కుర్చీలు. +తెర లేచిన ఒక క్షణానికి శ్రీరామరాజ్యం రైసుమిల్లు యజమాని సుబ్బయ్య ప్రవేశిస్తాడు. అతని వయస్సు నలభై పైన, నలభై అయిదు లోపు. పొట్టిగా, పలచగా వుంటాడు కోలముఖం, చిన్న నుదురు, చింకి కళ్లు, పీచు మీసం +పంచె కట్టి, కోటు తొడిగి, మెడచుట్టు నాలుగైదు మెలికలు చుట్టి ఉత్తరీయాన్ని వేసుకున్న సుబ్బయ్య ఆఫీసు రూమ్ లో ప్రవేశిస్తూనే ఒక చిలక కొయ్యవద్దకు వెళ్లి, ఉత్తరీయాన్ని తీసి దానికి తగిలిస్తాడు. +సుబ్బయ్య (స్వింగ్ డోర్సులో ఒకదాన్ని బయటికి లాగి, లోపలికి తొంగిచూస్తూ, లోపలున్న +గుమాస్తాతో ఏఁ! ఇంకా పెన్సిళ్లు చెక్కడం కాడే వున్నావ్? ఒక బద్దీకత్తి పుచ్చుకుని పొద్దస్తమానం పెన్సిళ్ళు చెక్కిపారెయ్యడ మొక్కటే కనబడుతుంది. పనీ పంగూ లేదు స్వింగ్ డోర్ ను అతడు విడిచి పెట్టగా అది రఫీమని మూసుకు పోతుంది. కోటు విప్పి, దాని జేబులో నుంచి కళ్లజోడు తీసుకుంటాడు. ఉత్తరీయాన్ని తగిలించిన చిలకకొయ్యకే కోటు కూడా తగిలించి, అతడు టేబుల్ వద్దకు వెడతాడు. +సుబ్బయ్య (టేబుల్ పై పెట్టివున్న టపాను అందుకుంటూ, గదిలోని గుమాస్తాను ఉద్దేశించి రెండో +గుమాస్తా యివ్వాళ కూడా రానట్టేనా? ఇంకెన్ని రోజు లింట్లో పడుకుంటాడు! +(లోపలనుంచి ఏదో జవాబు వస్తుంది. అది మనకు వినబడదు; ఇంతలో ఒక ఉత్తరాన్ని విప్పి దాన్ని చదువుకోసాగిన సుబ్బయ్య ఆ జవాబు వినిపించుకోడు. +సుబ్బయ్య (ఆ ఉత్తరాన్ని పూర్తిచేసి, మరొకదాన్ని విప్పుతూ ఆఁ! ఏమన్నావ్? +( జవాబుకోసం నిరీక్షించకుండానే మూడవ ఉత్తరాన్ని చదవ నారంభిస్తాడు. +సుబ్బయ్య చందాలట! చందాలు ఇక్కడ పోగేసుకు కూర్చున్నాం అందరికీ పందేరం పెట్టడానికి! +(ఆ ఉత్తరాన్ని ముక్క ముక్కలుగా చించి, బుట్టదాఖలు చేస్తూ) వెధవలు! తెంపి వెధవలు నిమ్నజాతి సంఘమట. హాస్టలు పెడతారట. అడ్డమైనవాడికీ ఇప్పుడు చదువులు కావాల్సొచ్చాయ్! ఈ పాడు చదువులొచ్చాకే అలగాజనానికి కాల్గొచ్చాయ్. ధర్మఫండు ఇలాంటివాళ్లకి దొబ్బబెట్టడానికేనా! ఏ రామభజన కూటానికో, ఏ సాయిబాబా భక్తసంఘానికో ముట్టజెబితే పుణ్యం, పురుషార్థం. అంతే కాని తర్వాత ఒక కార్డు అందుకుని, దాన్ని చదువుకుని, కలర్ పెన్సిల్ తో దానిమీద ఏదో రిమార్కు వ్రాసుకుంటూ గుమాస్తాతో) ఆఁ! అయితే? +(సందర్భంలేని ఈ మాటతర్వాత మరొక కవరు చించి, కవరులోనుంచి ఉత్తరం త్వరగా బయటికి రాకపోగా విసుక్కుంటాడు. +సుబ్బయ్య (ఉత్తరాన్ని ఎలాగో బయటికి లాగి దాన్ని చదువుకుంటూ గుమాస్తాతో మొన్నరాత్రి +హోటల్ వాడి లారీరాలా ఆఁ అంకిలి నొక్కుకుపోయిం దేమిటి? నోటమాటే పెగలడంలేదు ఈమాటలు అంటూనే ఉత్తరాన్ని కంటితో చదువుతూ) వచ్చి, వెళ్లిందటగా! ఆమాట వీడే రాస్తున్నాడు. “మొన్నరాత్రి పెద్దయ్య ఇక్కడికి సుఖంగా చేరాడు.” పెద్ద లారీనే పంపించాడూ గుమాస్తాతో) అయితే ఓ దేభ్యం! పనిలో పని, ఆ రేషన్ కొట్టువాడికి కూడా ఒక పదిమూట లెత్తించకపోయావూ ఉత్తరం మొదటి పేజీ పూర్తి చేసి, రెండవదాన్ని లోలోపల చదువుకుంటూ) మళ్ళీ అప్పుడే సరుకు కావాలంటాడేమిటి? వెధవ! దొంగ వెధవ! తన హోటల్ కని ఖరీదుచేసి, అక్కడ మారుబేరం సాగిస్తున్నట్టున్నాడు. వీడి హోటలే ఒక నల్ల బజారు. నల్ల బజారే అన్నమా టేమిటి? పిల్ల బజారు కూడా. వాటికి తోడు బియ్యం బజారుకూడా పెట్టాడు కాబోలు! దొంగ లాభాలు పోసుకోడానికి కాకపోతే, అప్పుడే మళ్లీ వీడికి సరుకెందుకు? టౌన్ స్టేషన్' సబిన స్పెక్టరు నిన్నే బదిలీ అయ్యాడని ఎవరో అన్నారు. కొంచెం నోటి దురుసుతన మున్నా, బోళా మనిషి. తన మామూలు తనకు ముట్టజెపితే, మళ్ళీ మన జోలి కొచ్చేవాడు కాదు. కొత్తవాడు ఏ బాపతో మన కింకా తెలవదు. వాణ్ణి ఆకట్టుకోందే సరు కెలా పంపిస్తాం ఆ ఉత్తరాన్ని ఒక పక్కగా పెట్టి, ఆనాటి టపాలో మిగిలి వున్న కార్డును చదువుకుంటూ) ఆరి వీడి తస్స దియ్య! ఈ పెద్ద గుమాస్తా మరి వారం, పదిరోజుల దాకా రాలేడటేఁ! ఒక దారీ తెన్నూ లేకుండా లెక్కలన్నీ తీన్ రాగా వున్నాయి. ఇన్కమ్ టాక్సు వాళ్లు లగాలగీ అంటున్నారు ఆనాటి ఉత్తరాలను డ్రాయర్ లో ఒకమూల భద్రంచేస్తూ) అబ్బబ్బ! ఈ గుమాస్తాగాళ్ళతో చెడ్డ బెడదైపోతే! పెద్ద గుమాస్తాకి కూతురు పెళ్ళిస్తే, రెండోవాడికి రోగ మొచ్చిందట! ఏం రోగమో, మాయరోగం! పని తొందరు న్నప్పుడే వీళ్ళకి రోగాలూ, నెప్పులు వస్తాయ్. వొళ్లు బలిస్తే సరి, రోగాలొస్తాయ్! రావూ? మందు తింటానంటే వాడి కొక నెలజీతం ముందే పారెయ్యడం పొరపాటై పోయింది. అది చేతిలో పడ్డాక రెండు, మూడు రోజులైనా వాడు తిన్నగా ఆఫీసు కొచ్చాడో, లేదో! ఆ రెండు, మూడు రోజులైనా వాడు మిడికిన పనేముంది? ఖంగ్ ఖంగ్ మంటూ ��ెవికింద దగ్గుతూ కూర్చోడం తప్ప. ఆకలి చచ్చిపోయిందట! ఆకలి ఎక్కడ చచ్చిందీ ఆకలి! మొన్నేగా ఈ మూడో గుమాస్తా బడుద్ధాయ్ గాణ్ణి కూడగట్టుకుని తమకు జీతం చాలడం లేదంటూ తెగబారెడు పిటిషన్ పెట్టాడు. ఈ యుద్ధం రోజుల్లో కాగితాలకు అసలే కరువుగా వుంటే, రెండు రావులు ఖరాబు చేశాడు. తమ అబ్బగాడి సొమ్మేమీ పోలేదుగా! ఎన్ని పిటిషనులైనా పెడతారు. ఆ కాగితాలు నావి, ఆ కలాలు నావి, ఆ పాళీలు నావి, ఆ సిరాబుడ్లు నావి. నా ఖర్చుతో నాకే అర్జీలు! సాయంత్ర మయ్యేసరికి ఆ ముచ్చుముఖం వాడికి కాక తగిలినట్టుగా వుంటుందట! ఇద్దరికి ముగ్గురై పని తగ్గేసరికి ఎన్ని రోగాలైనా పుట్టుకొస్తాయ్! వెధవలు! అంట్ల వెధవలు గుమస్తాతో) సర్లే! ఆ చిట్టా, ఆవర్జా లిలా తగలెయ్! ఈ రెండు రోజుల నుంచీ లెక్కలేమైనా సరిచూశావా? గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నావా? బద్దీ కత్తితో పెన్సిళ్ళు చెక్కి పారెయ్యడం తప్ప, నీకు పనెక్కడ కదులుతుందిలే! నిన్ను నమ్ముకుంటే ఇన్ కమ్ టాక్సు వ్యవహారం నిర్వాకమైనట్టే! +(గుమాస్తా గదిలోపలవుండే చిట్టా, ఆవర్జాలను అందిస్తాడు. అతని చెయ్యిమాత్రం మనకు కనబడుతుంది. అది పుల్లలాంటి చెయ్యి. సగంవరకు దాన్ని కప్పివున్న చొక్కొ చిరిగిపోయి వేలాడుతూ వుంటుంది. చిట్టా, ఆవర్జాలను అందిస్తుండగా ఆ చెయ్యి కొంచెం వణుకుతున్నట్టు మనం గమనిస్తాముగాని, సుబ్బయ్య దాన్ని కానడు. +సుబ్బయ్య (చిట్టా, ఆవర్జాలను అందుకుంటూ ఏఁ? లోపల నక్కుతున్నావే దొరికిందిగదా అని +చెప్పినపని సున్నా చుట్టి, ఊరట్టుకు అడుక్కుతిన్నా వేమిటి? +(చిట్టా విప్పి కొన్ని పేజీలు చకచక తిప్పివేస్తాడు. ఎక్కువ పేజీలు తిప్పివేసి నందువల్ల +వెనక్కి వచ్చి, ఒక పేజీ వద్ద ఆగుతాడు. +సుబ్బయ్య (గుమాస్తాతో ఏం రాతిది? బ్రహ్మరాత! తెలిసేటట్టు అక్షరాలు విడివిడిగా +రాయమంటే, గొలుసుకట్టు అఘోరిస్తావ్ దేనికి నొసలు ముడివేసి) ఏమి టిది? బొబ్బా ఉహుఁ బొప్పన ఆఁ! బొప్పనే లింగన్నగారికి వంకసన్నాలు నలభై రెండు బస్తాలకి బస్తా ఒకటింటికి పన్నెండు రూపాయల రెండణాల ఆరు పైసల చొప్పున అయిదు వందల పది రూపాయల +సుబ్బయ్య (రిసీవర్ అందుకుని హలో! ఆఁ! శ్రీరామరాజ్యం రైసుమిల్లే ఊఁ! ఊఁ! +సుబ్బయ్యనే ఏమిటది సర్కిల్ గారు మాట్లాడతారా? అయ్యొ! అంతకంటేనా! మాట్లాడమనండి నమస్కారమండీ! నమస్కారం! అమ్మగారు కన్నారింటినుంచి తిరిగొచ్చారా మొన్న హెడ్డు చెప్పాడు లెండి, రేపో మాపో వొస్తున్నారని ఆఁ! చిత్తం! చిత్తం! అలాగే లెండీ, అదెంత భాగ్యం ఆఁ! ఆఁ! అరమూట చాలంటారా? పనిలోపని ఒక మూట సరే, అలాగే ఢిల్లీ భోగాలే. వంక పెట్టడానికి వీల్లేదు. నాణ్యమైన సరుకు అబ్బే! అవల్ రకమండీ! ఎంతమాట! తమకి కొత్తవి పంపిస్తామా? పాతవే. పాతరేసినొడ్లు. మనింట్లోకని స్పెషల్ గా రెండు పుట్లు కొన్నాం లెండి. మొన్నే నాలుగుబస్తా లాడించాను. వాటిలో నుంచే ఆఁ? కిందటిసారి కొత్త బియ్యం ఆఁ! ఔనౌను! హెడ్డు ఆ మాట చెబితే నే నెంత నొచ్చుకున్నానని! నే నూళ్ళో వుంటే అలాంటి పని జరిగేదా? మా రెండో గుమాస్తాగాడికి చెప్పి, ఇన్కమ్ టాక్స్ వాయిదాకని నేను వా డొర్రి వెధవలెండి! చచ్చు వెధవ! అయ్య అయ్య ఆఁ! ఆఁ! వాడే మింగ మెతుకులేదుగాని మీటింగు లెడతాడు ఆఁ! తీసి పారేద్దునుగాని, మనిషిపోతే మనిషి దొరకడం లేదండీ! ఈ యుద్ధ మొక టొచ్చాక గుమాస్తాగాళ్ళకీ గిరాకీ వచ్చిందయ్యె ఆఁ! ఆఁ చిత్తం! చిత్తం! మరొక గంటకి మూట మీ యింటి దగ్గరుండకపోతే న న్నడగండి! మా లారీ రాగానే మంచిదండీ, అయ్యా! సెలవ్!! +సుబ్బయ్య (చిట్టా తిరిగి అందుకుంటూ తేర సొమ్ము తెగతిని బలిసి కొట్టుకుంటున్నాడు. వీడి +కథ, వీడి కమామిషు ఎవడికి తెలవదు! నిన్న మొన్నటిదాకా వీడు కనిస్టేబులేగా? కాంగ్రెసు వాళ్ళకి మతులు పోబట్టే వీడి గీత బయటపడింది. ఉన్నచోటుండక ఆగస్టు ఉద్యమం, వాళ్ళ తలకాయ అంటూ బుడ్డగంతులేస్తే, వాళ్ళ మక్కి లిరగొట్టి వీడు సర్కిలయ్యాడు. లేకపోతే, ఎక్కడుండేవాడో! కొత్త బియ్యం తినలేడట! అన్నం కాస్త చిమిడితే వీడి గొంతు పట్టు కుంటుంది కాబోలు! మహమహవాళ్ళే ఇప్పుడు కొత్తపాతా చూడ్డంలేదు. దుమ్మూ, దుట్రా కలిసినా గింజొకటి దొరికితే చాలని కళ్ళ కద్దుకుంటున్నారు. తెల్లారి లేస్తే ఏదో ఒక పని పడుతుంది గదా అని, అడగ్గానే నంబర్లు పంపిస్తే, కొత్త బియ్యమట! కొత్త బియ్యం వీ డబ్బుగాడి సొమ్ము ఇక్క డేదో దాచిపెట్టినట్టు! తేరగా తెమ్మనేది కాకుండా తప్పు పడుతు న్నాడయ్యా, తప్పు!! +(చిట్టా ఒక పక్కని పెట్టి, ఆవర్జా తెరుస్తాడు. చిట్టా చూస్తూ, ఆవర్జా పేజీలు తిప్పుతూ, కలర్ పెన్సిల్ తో టిక్కులు పెడుతూ పోతాడు. +సుబ్బయ్య కళ్ళు పోతున్నాయ్ ఈ రాత తెలవక. ఏం రాత? పాడురాత గుమాస్తాల గదివైపుకు +తిరిగి) ఇదుగో నబ్బాయ్! ఇఖ నువ్విలా రాశావంటేనా; యింటికి నడవొచ్చు మళ్లీ చిట్టావైపుకు తిరిగి) “ఈడ్పుగంటి రాఘవయ్యగారి ఖాతాకు ధనిగుజారున చెల్లించిన రొక్కం ఏడువందల యాభై రూపాయలు మళ్ళీ వీడు ఏడున���నరవందలు పట్టుకుపోయాడూ? మరీ లెక్కాపత్రం లేకుండా వాడుకుంటున్నాడేఁ! వీడు తోలింది ముప్పై పుట్టేగా? ఖాతా వాడుకోవడంలో ఈ ధరాటా యేమిటో వీణ్ణి కాస్త కనుక్కోవాలి. +సుబ్బాయ్య (రిసీవర్ అందుకుని హలో! హలో ఆఁ అబ్బే! మర్చిపోలేదు. తెప్పించి +పంపిస్తా ఎప్పుడోనా? అబ్బే! ఇదుగో! ఇప్పుడంటే యిప్పుడే +(ఆ నంబర్ డిస్కనెక్ట్ చేసి, కొత్త నంబర్ డయిల్ అడుగుతాడు. +సుబ్బయ్య హలో! రావుగారేనా ఆఁ! నేనండీ! శ్రీరామరాజ్యం రైసుమిల్లు సుబ్బయ్యగారిని. మా +చిన్న పిల్లవాడు కొన్ని రోజులుగా నలతగా వుంటున్నాడు. డాక్టరుగారికి చూపిస్తే, పాలలో పంచదార మానేసి, గ్లూకోజ్ వాడమన్నారు. ఒక పౌను డబ్బా మీరే ఇలాగంటే ఎలాగండి? ఈ సాయం మీరు చెయ్యాలి. మాట తీసెయ్యొద్దు పోనీ, ఒక అరపౌను డబ్బా కనీసం పాతిక పౌను అయ్యయ్యొ! మీవల్ల కాకపోతే, మరెవరివల్ల ఏ ధరకైనా సరే అబ్బెబ్బే! మీ షాపులో వుందని కాదు. మీపరంగా మరెక్కడైనా తెప్పించి కాస్త వాకబు చేసి చూడండి, మీకు దొరక్కపోతుందీ ఎంతైతే తప్పుతుంది మన కవసర మొచ్చినప్పుడు! మీ రెలాగైనా మాట దక్కించాలి వుంటానండీ, వుంటాను! +సుబ్బయ్య వెధవ! ఆశపాత్రపు వెధవ! దొంగలాభాలు దొబ్బమరిగి, వుంచుకునే లేదంటున్నాడు! +మరెక్కడో తెప్పించానంటే, అక్కడికి పెద్ద మెహర్బానీ చేసినవాడూ అవుతాడు; నల్లబజారు ధర పుచ్చుకున్నవాడూ అవుతాడు! పిల్లవాడికి కావాలని చెప్పినా, వాడి లేకి బుద్ధి వా డెందుకు పోనిస్తాడు. వెధవ! బందిపోటు వెధవ!! +(చూపు మళ్ళీ చిట్టా, ఆవర్జాలమీదికి పోతుంది. మౌనంగా కాసేపు పద్దుల్ని సరిచూచుకుంటాడు. +సుబ్బయ్య (గుమాస్తాను ఉద్దేశించి ఏం పనిది? తిరపతి మంగలి పని! చిట్టాలో పద్దులు ఆవర్ణాలోకి +ఒక టెక్కితే ఒక టెక్కలేదు. నువ్వు వొళ్ళాంగి పనిచేస్తేనా? చుంచు ముఖమూ, నువ్వూను! కూటికైన గతి లేదంటూ కాళ్ళా, వేళ్ళా పడ్డావని దగ్గరికి తియ్యడంగాని, నిన్ను పనిలో పెట్టుకోమనున్నదీ? ఎప్పుడు చూసినా, ఈదురోమంటూ వుంటావ్. ఏల్నాటి శని నీ ముఖానే వుంటుంది. ఒక్కరోజు ఆ పెద్దగుమాస్తా రాకపోతే అంతా ఖంగాళీయే! ఈ ముష్టిపనికే వీళ్ళకి జీతాలు చాలవట. నెలకి పాతిక, ముప్ఫై చొప్పున పోసుకుంటున్నా నెప్పే! వీళ్లు ప్యాసయిన బి.ఏ.లు, యం.ఏ.లు హితాయి పోతున్నాయా? వెధవలు! పింజారీ వెధవలు వీళ్ల నసలు రామరామ అనగూడదు. ఎందు కీ ఆవర్జా? అంతా తిన్నగా మండబెట్టినట్టు చేతికిచ్చావ్! +(ఆవర్జాను ఫెడేలున మూసి ఒక పక్కకు తోసివే��్తాడు. +సుబ్బయ్య (చిట్టా మాత్రమే చూస్తూ “తవుడు ఖాతాకు జమ వెరసి అమ్మకం పదకొండు +సుబ్బయ్య (రిసీవర్ అందుకుని హలో ఎఫ్.ఐ. గారా? అయ్యా! నమస్కారమండీ! నమస్కారం! +అబ్బే లేదండీ! మూడురోజులనుంచీ ఫ్యాక్టరీ ఆడ్డంలేదు. ఇంజను పిస్టను దెబ్బ తినింది.రిపేరుకు పంపించాం ఆఁ ఆఁ రేపో, మాపో తిరిగి ఆడతాం లేదండీ! రెండు రోజుల నుంచీ ఊళ్లో లేను. ఇవ్వాళ పొద్దున్నే తిరిగొచ్చాను అబ్బే! పద్దు పుస్తకాలు చూచు కుందామని ఇన్ కమ్ టాక్సు లెక్కలొచ్చి నెత్తిని కూర్చున్నాయ్ ఆఁ! అన్నింటికీ నేనే నుంచోవాలి. పెద్ద గుమాస్తా లిద్దరు సెలవుమీ దున్నారు. చిన్నవాణ్ణి పెట్టుకుని నేనే దేవులాడు తున్నా నవ్వుతూ) అయ్య! తమకేమండీ? తమరు మహరాజులు అయ్య అయ్య చిత్తం అబ్బబ్బే! తమకు మాట రానిస్తామా మొన్న బళ్లారికి బట్వాడా చేసిన వెయ్యిబస్తాల మాటేనా ఆ బియ్యంలో సగానికి సగం మట్టేనన్నారూ? రామరామ! అం తెక్కడిదండీ? వుంటే, గింటే ఏ కొంచెమో వున్నదేమో! నిజంమాటకి అస లిప్పుడు రైతు సజావుగా గింజ అమ్ముతున్నా డండీ! తప్పా, తాలూ, దుమ్మూ, దూగరా, మానుకాయా, మసిని కాయా అన్నీ కలిపి అబ్బే! మనం ఎగుమతి చేసినప్పుడు పురుగులేదు. గాలిపాటుకు తర్వాత ఏమైనా పుట్టిందేమో అబ్బే! మేకు లెక్కడివండీ? ఇను మిప్పుడు అసలే కరువుగా వుంటే చిత్తం అయ్య చిత్తం అయ్య వారంనాటికే మూడువేల బస్తా పచ్చిబియ్యమా అంత ఆర్డరుకు మన దగ్గర ధాన్యం స్టాకులేదేఁ మొత్తం స్టాకు ఎంతంటారా హోల్‌ మొత్తం అయిదువేల రెండువందల బస్తాలండీ చిత్తం, అంతేలెండి! అయిదువేల రెండువందల బస్తా ధాన్య మాడితే, కటాకటిగా రెండు వేల అయిదువందల బస్తా బియ్యమే దిగుబడి ఆఁ! అయితే, తమ దయ వుండాలేకాని, ఆ సరుకునే మరొక వంద బస్తా దేకించి, రెండువేల ఆరువందలు చెయ్యకపోతామూ ముతకలే అనుకోండి. కాని, మీరు సర్టిఫై చేస్తే ముతకలు సన్నాలై పోవటండీ ఆఁ! మద్రాసుకైతే మరీ మంచిది! అక్కడ సన్నాలేవో, ముతకలేవో ఏ విధ తెలుసండీ అయ్య! మరొక ఆర్డరుకూడా వుందా ఆఁ? ఉప్పుడు బియ్యానికా కాని, రైతు ధాన్యమమ్మితేనా? వాళ్ళ ఆశకి అంతులేదు. పోసుకున్న కొద్దీ ఇంకా పోసుకోవా లంటున్నారు. కార్తీక మాసం నాటికి మరింత గిరాకీ వస్తుందేమోనని నిల్వపోసుకు కూర్చున్నారు బ్లాకు చెయ్యడంలో వాళ్ళ తర్వాతే. తమ రిప్పిస్తానంటే, సరుకు చూపించడ మెంత పనండీ ఓఁ! చాలా వుంది రామ్మూర్తిలేడూ? అతనిదగ్గిర ఆఁ! ఆఁ! ఆ ఊరువాడే! ఆ ఊరు మొత్తంమీద అతనే మోతుబరి ఆసామి. బాగా మదాయించి వున్నాడు ఆఁ! అతనే! అత నొక్కడిదగ్గిరే వెయ్యిబస్తాదాకా ధాన్యం వుంది. తలవాకిట్లో వామిలాంటి పురికట్టుకు కూర్చున్నాడు. తమరు దాన్ని రిక్విజిషన్ చేసి మన కప్పిస్తే అయ్య! చిత్తం! చిత్తం దయమట్టుకు వుంచండి. తమరొక కంటితో కనిపెట్టకపోతే నమస్కారమండీ! నమస్కారం! +సుబ్బయ్య వీడికి బుద్ధి లేదు. ఇలాంటి సంగతులు టెలిఫోన్లో మాట్లాడొద్దురా అని ఎన్నిసార్లు +మొత్తుకున్నా వినడు. అన్నీ మనరోజులే వుంటాయా? వెధవ! బుర్రలేని వెధవ. తెలివి తేటలకు ఆ జి.పి.ఓ.నే చెప్పుకోవాలి. పురుగునైనా దరిదాపులకు చేరనివ్వనట్టే వుంటాడు; అయినా, లక్షలకు లక్షలే దండుకుంటున్నాడు. ఆ జి.యం.ఒ. కూడా గడుసువాడే! మడి కట్టుకున్న వాడిలా బలే నాటకమాడతాడు. లొడలొడ వాగుడుగాళ్లు ఫుడ్ ఇన్ స్పెక్టరూ, ఆ లోడింగ్ క్లర్కుగాడూ వున్నారుగాఁ! వసూళ్లు చెయ్యడం వీళ్ళ పని; వాటాలు పంచుకోవడం వాళ్ళ పని. ఎగుడు దిగుడేమైనా వస్తే బొక్కలో వీళ్ళే కూర్చుంటారు, పైవాళ్ళిద్దరికేఁ? వాళ్ళకొచ్చే ప్రమాద మేమీ లేదు చిట్టా అందుకుని. కళ్ళజోడు సరిచేసుకుంటూ) ఎంత పోసుకున్నా వీళ్ళ దాహం తీరదు. ఎదురింకా మట్టీ గిట్టీ అంటాడు. ఏదో ఒక కొత్తడం చెయ్యందే వీళ్ళకు గుమ్మరించే సంచులన్నీ ఎక్కడి నుంచొస్తాయ్! ఈ యఫ్.ఐ. గాడు మరీని! నిన్నకాక మొన్నొచ్చాడు. అప్పుడే ఒక లకారం చేతబట్టాడు. దాని పుణ్యమా అని యుద్ధ మొక టొచ్చి బాగుపడ్డాడు గాని, వీడి నెత్తిని కానీ పెట్టి వేలంవేస్తే యేగాణీకి కొనేవాడుండేవాడా? వెధవ! లంచగొండి వెధవ!! +సుబ్బయ్య (విసుగెత్తి పోయినట్టు చిట్టాను కూడా రపీమని మూసి, దాన్ని ఒకపక్కకు నెట్టి వేస్తూ +అబ్బబ్బ! కళ్ళు పోతున్నాయ్, ఈ పాడురాత తెలవక! కోడి కెలికిన పేడలానే వుంది. నీ దెవసం రాత! అసలు నీ వల్ల ఏం పని కదులుతుందిలే! రేపు ఆ పెద్ద గుమాస్తా దగ్గిరికి మనిషి నురికించాలి, చప్పున తెముల్చుకు రమ్మని. ఆ పెళ్ళీ పెటాకులూ ఎప్పుడో అయిపోయాయిగా! వీ డింకా అక్క డేమి అఘోరిస్తున్నాడు? పోనీలే, కూతురు పెళ్ళంటున్నాడని ధర్మపండు ఖాతాలో ఖర్చురాసి, నాలుగు బస్తాల బియ్యం కొలిపించా. అవి తినేశేదాకా కదలడు కాబోలు! వెంటనే బయల్దేరి రాకపోతే నాగాలు కట్టి, జీతం తెగీస్తే సరి! అప్పుడుగాని బుద్ధిరాదు. సర్లే! ఆ అనామతుఖాతా పుస్తక మిలా తగలెయ్ ఒక క్షణం ఆగి) లోపల ఏం మిడుకుతున్నావ్? వెధవ! చచ్చు వెధవ తే! త్వరగా తే!! +(లోపలవుండే గుమాస్తా అనామతుఖాతా పుస్తకం అందిస్తాడు. ఈసారి అతని చెయ్యి గజగజ వణికి పోతూ వుంటుంది. +సుబ్బయ్య ఏఁ? చెయ్యికి వొణుకు పుట్టింది? నీక్కూడా మాయరోగ మేదైనా వచ్చిం దేమిటి పని +(అనామతుఖాతా పుస్తకం తెరిచి, దాన్ని మౌనంగా ఒకటి, రెండు నిమిషాలు తిరగవేస్తాడు. +సుబ్బయ్య మళ్లీ ఈ ప్లీడరు అరమూట బియ్యం వేయించుకు పోయాడూ? ఏమిటి మనకి ఈ +మెహర్బానీ! ఏదో శుభకార్యం వచ్చిందని మొహమోట పెడితే, నాలుగు బస్తాలు రాయితీగా యిచ్చామని వరస సాగుతున్నాడేం! తన ఫీజు తను తగ్గుతున్నాడా? ఈసారొస్తే నాకు తెలవదు, మా ఖామందు నడగమను! తన ప్రాక్టీ సేమో తను చూసుకోకుండా, ఈ ముండమోపి కాంగ్రెసు ప్రచార మంటాడు! ఈ కాంగ్రెసు వాళ్ళు కాదూ దేశాని కిన్ని తిప్పలు తెచ్చింది. స్వరాజ్యం కావాలట; యుద్ధం వొద్దట! స్వరాజ్య మొచ్చి బువ్వ పెడుతుందా? దాని పుణ్యమా అని ఈ యుద్ధ మొచ్చాకే ఎవడికైనా నాలుగు డబ్బులు కళ్ళబడుతున్నాయి. ఆగకుండా మరి నాలుగేళ్ళు ఇలాగే యుద్ధం సాగాలని మొక్కుకునేది పోయి +(మాట పూర్తిచేయకుండానే, కలర్ పెన్సిల్ పుచ్చుకుని, మొదటి పేజీలోని పద్దుల్ని కూడ నారంభిస్తాడు. +సుబ్బయ్య (కూడిక సరిగా వున్నందున ఆ పేజీ తిప్పివేస్తూ ఊఁ! సరే రెండో పేజీ తిప్పి, +దానిలోని పద్దుల్ని పైనుంచి కిందికి ఒకసారి చూస్తూ మొన్నరాత్రి హోటల్ వాడికి తోలిన సరుకు పద్దు ఎక్కడా కనబడదేం మళ్ళీ ఒకసారి పైనుంచి కిందికి పద్దులన్నీ చూచి, వెనక పేజీలోకి వెళ్లి, దాన్ని కూడా తనిఖీ చేసి కుర్చీలోనుంచి చరాలున లేస్తూ) ఆరి వెధవ! దొంగ వెధవ! ఇదేమిటి? ఇలారా! ఎదటికి రా! ఇందుకేనా పొద్దుటి నుంచీ గదిలో నక్కి నక్కి కూర్చున్నావ్! ఇందుకేనా అనామతు ఖాతా తెమ్మంటే చేతులు గజగజలాడిపోయాయ్! నేను మరేమిటో అనుకున్నా! వెధవ! దగాకోర్ వెధవ! రావేరా? రా! బయటికి రా ఎంతకూ గుమాస్తా బయటికి రాకపోగా స్వింగ్ డోర్సు వద్దకు వెళ్ళి, ఒక తలుపును లోపలికి తోసి పట్టుకుని) దొరగారూ! అయితే, మొన్నరాత్రి హోటల్ వాడికి వేసిన సరుకు పద్దు అనామతు ఖాతాలో కనబడదేఁ? మాటాపలుకూ లేకుండా అలా గుడ్లు అప్పగించి చూస్తారేమండీ ఆఁ ఎక్కించడం మర్చిపోయావూ? ముండమోపి అయితే, క్యాషుందా? ఏదీ, క్యాషుబాక్సు బీగ మేదీ? క్యాషు తిన్నగా లేకపోతే, చూసుకో నీపని? ఈ పూట నీ పెళ్ళి చేశానన్న మాటే! +(గుమాస్తా యివ్వగా క్యాష్ బాక్స్ బీగం అందుకుని, స్వింగ్ డోర్‌ను చరాలున వదిలివేస్తాడు. అది ఠపీమని మూసుకుపోతుంది. తన టేబుల్ పైనే వున్న క్యాష్ బాక్స్ తెరిచి, దానిలోని పైకాన్ని సుబ్బయ్య లెఖ్ఖ పెడతాడు. తర్వాత ఆ మొత్తాన్ని అనామతు ఖాతాలోని మొత్తంతో సరిచూస్తాడు. +సుబ్బయ్య వెధవ! దగుల్బాజీ వెధవ నువ్వు పద్దురాయడం మర్చిపోతే, క్యాషులో పెచ్చు +కనబడదే ఒక్క గంతులో వెళ్ళి, స్వింగ్ డోర్ బయటికి లాగిపట్టుకుని, పట్టరాని కోపంతో మండిపడుతూ) వెధవ! బటాచోర్ వెధవ పన్నెండొందలు దొబ్బేశావ్! రా, బయటికిరా! నే నేం గుడ్డివాడి ననుకున్నావా? పన్నెండొందలు జేబులో వేసుకొని, క్యాషు బ్యాలెన్సుకూ, అనామతు ఖాతాకూ సరిపెడితే, ఆపాటి నేను కనిపెట్టలేననుకున్నావ్! ఇంతకీ తప్పు నాదేలే! బికారి వెధవ్వి నీకు తాళాలప్పగించి వెళ్ళడం తప్పుకాదూ? ఏమిటి ఆ దెయ్యపు గుడ్లూ, నువ్వూనూ! గుడ్లు పెద్దవి చేస్తే, నేనేం భయపడతాననుకున్నావా? పళ్లు కూడా బిగిస్తున్నావ్! ఏఁ! వొంటిరిగా వున్నానని పైబడి కొడదా మనుకుంటున్నావా? వెధవ! చచ్చువెధవ! నీలాంటి వాళ్లని చాలామందిని చూశాలే! ఈ పప్పులు మనదగ్గి రుడకవ్. మర్యాదగా ఆ పైకం అప్పగించు. రద్ది మాస్తుంది. లేకపోతే, పాత చెప్పు పుచ్చుకుని ఈ దవడ, ఆ దవడ ఆరి వెధవ! రౌడీ వెధవ! పైపై కొస్తావటరా? +(స్వింగ్ డోర్‌ను వదిలిపెట్టి, చల్లగా యివతలికి వస్తాడు. +సుబ్బయ్య (టేబుల్ వద్దకు చేరి, ముఖాన్ని పట్టిన చెమటను చొక్కాకే తుడుచుకున్న తర్వాత +ఎందు కబ్బాయ్ చెడిపోతావ్! ఒక్కసారి చాలా డబ్బు కంటబడేసరికి ఎంత లావాడికైనా మనస్సు రెవరెవ లాడుతుందిలే! ఇలాంటి బుద్ధిపొరపాట్లు ఎవరికైనా వస్తాయ్! పెద్దవాళ్లు చెప్పినప్పుడు సర్దుబాటు చేసుకోవాలి! కాస్తా, కూస్తా పన్నెండొందలు స్వింగ్ డోర్ వద్దకు వెళ్ళి దాన్ని తెరుస్తూ) కాజేసిన పైకం బుద్ధిమంతుడిలా వాపసు చేశావంటే చేతిలో ఆ బద్దీకత్తేమిటి ఒక అడుగు వెనక్కి వేస్తూ) ఆరి వెధవ! రాక్షసి వెధవ అది పెట్టి నన్ను పొడుస్తావా యేమిటి? +( భయంతో చేతిలోని స్వింగ్ డోర్‌ను చప్పున వదిలి వేస్తాడు. ఠపీమని అది మూసుకు పోతుంది +సుబ్బయ్య (వీలైనంత దూరానికి జరిగి ఉండు, వెధవ! పొగరుబోతు వెధవ! పోలీసులకు +రిపోర్టిచ్చి నిన్ను బొక్కలో తోయిస్తా! పిల్లా జిల్లాతో కూటి కిలేక మలమల మాడి చస్తున్నావని నీ కొక దిక్కు చూపించినందుకు ఇదట్రా నువ్వుచేసే పని? నేను దగ్గరికి తియ్యకపోతే, నీకు పొయ్యిమీద కుండైనా యెక్కేద ట్రా? అన్నం పెట్టే చేతినే కరుస్తావూ? పన్నెండొందలు దొబ్బింది కాక��ండా కత్తి చూపిస్తావూ! కాటా వాళ్ళుంటే, నిన్నిప్పు డిక్కడ పాతేయించేవాణ్ణి కాదూ? ఏమైనా ఈపూట నీ అంతు కనుక్కోకపోతే నన్ను సుబ్బయ్యని పిలవొద్దు. +సుబ్బయ్య హలో! హలో! పోలీసు స్టేషన్ ఔను! టౌన్ పోలీసు స్టేషన్ (కనెక్షన్ రాగానే) హలో +(గదిలోనుంచి ఏదో విరుచుకుపడ్డ చప్పుడు వస్తుంది. +సుబ్బయ్య (గదివంక ప్రశ్నార్ధకంగా చూస్తూ సర్కిల్ గారు బియ్యం పంపించమన్నారు. ఈ +గుమాస్తాగాళ్ళని నమ్మడానికి వీల్లేదు. మంచి పాతబియ్యం దగ్గరుండి పంపిద్దా మను కుంటున్నా. ఇంకా మా మిల్లు లారీ రాలేదు అయ్య! చిత్తం! చిత్తం ఒక కంటితో గుమస్తాల గదివైపు చూస్తూ టెలిఫోన్ డిస్ కనెక్ట్ చేసి, సబ్ ఇన్ స్పెక్టరుతో ఇంకా మాట్లాడు తూనే వున్నట్టు నటనచేస్తూ) నేను ఊళ్ళోలేని సందుచూసి, మా మూడో గుమస్తా గాడు పన్నెండొందల రూపాయలు రొక్కం కొట్టేశాడండీ ఆఁ! ఆఁ! అవునండీ! పన్నెండొందలు. ఎదురు, పొడిచేస్తానంటూ బద్దీ కత్తి పుచ్చుకుని పై పైకొచ్చాడు ఆఁ! ఇక్కడున్నట్టు పంపించండి నలుగురు జవానుల్ని మీరే వస్తానంటరా? చిత్తం! అంతకంటేనా? సెలవ్! నమస్కారమండీ! నమస్కారం! +(అంతటితో టెలిఫోన్ లో మాట్లాడుతున్న నటన చాలించి రిసీవర్ పెట్టివేస్తాడు. +సుబ్బయ్య (ఒక క్షణం ఆగి, గుమాస్తాల గదివైపుకు బెదురు బెదురుగా రెండడుగులువేసి +వస్తున్నారులే నీ మొగుళ్ళు, చేతులకు బేడీలు తొడిగి, బొక్కలో తోస్తారు! ఒంటిరిగా చూసి నన్ననుకున్నావా బద్దీకత్తితో బెదిరించడానికి! వెధవ! పోకిరీ వెధవ పిల్లలుగల వాడివి, ఎందుకు చెడిపోతావుగాని, ఇప్పటికైనా బుద్ధికలిగి ఆ డబ్బు వాపసు చెయ్యి. ఇప్పుడైనా మించుకు పోలేదు. నా పైకం నాకిచ్చి, నా కాళ్ల మీద పడ్డావంటే, వాళ్ళకేదో సర్దిచెప్పి పంపిస్తా! తీరా వాల్గొచ్చి పట్టుకుపోయారంటే, మరి నీగతి కుక్కలొల్లవ్! పిల్లా పీచుతో గంపెడు సంసారమూ, నువ్వూనూ! తింటున్న కూటిలో మట్టి పోసుకోబోకు. నీ మంచికే చెబుతున్నా. పీకమీదికి తెచ్చుకున్నాక పస్తాయించి లాభం లేదు నెమ్మదిగా స్వింగ్డోర్స్ వద్దకు వెళ్లి, వాటిలో ఒకదాన్ని కొద్దిగా తెరిచి) నామాట విన్నావంటే జెయిల్ తప్పిస్తా! సర్కిలు మనచేతిలో వాడే నయ్యె! మన మాట దాటిపోడు. ఏఁ మాట్లాడవే బెదురు బెదురుగా లోపలికి తొంగి చూచి) ఆఁ! ఆఁ! కత్తితో మెడకోసుకు వచ్చాడు! చచ్చాడి! చచ్చాడు ఆరి వెధవ! పింజారీ వెధవ! నన్ను పీక్కుతినమని నా కొంపమీదికి పోలీసోళ్ళను తోలడానికట్రా! ఓరి వెధ��! దొంగ వెధవ +(వెర్రిగంగిర్లు యెత్తినవాడివలె ఆఫీసురూమ్ లో గంతులు వేస్తుండగా +పాత్రలు సుందరి పెళ్ళి ఈడు పిల్ల, సీతమ్మ సుందరి తల్లి, రాజమ్మ సుందరి మేనత్త, +తమ “సుమంగళి స్వర్గసీమ” ఫిల్ములలోని మూడు పాటలను ఈ నాటికలో నేను +ఉపయోగించుకొనడానికి అనుమతించిన వాహినీ పిక్చర్స్ లిమిటెడ్ వారికి కృతజ్ఞుడను. +అది సుందరిగారి యింటిలో ముందుగది. ఎదురుగా వున్నది సింహద్వారం. దానికి రెండు వైపుల +రెండు కిటికీలు. కుడి చేతివైపు ద్వారం పడకగదిలోకి; ఎడమ చేతివైపుది భోజనాల గది, వంటిల్లు మొదలైన వాటిలోకి. +గోడలకు కొన్ని రవివర్మ పటాలు. పడకగది గోడసరసను ఒక స్టూల్. దానిమీద ఒక గ్రామఫోన్. +భోజనాల గది గోడకు ఆన్చి ఒక టేబుల్. దానిమీద ఏవో కొన్ని ఆఫీసు రికార్డులు. +తెర లేచినంతనే మనకు కానవచ్చే సుందరి పెళ్ళి ఈడు వచ్చిన పిల్ల. పేరుకు తగినట్టు అందకత్తె. కల్లా, కపటం యెరగదు. పగటి కలలు కనడంలో దిట్ట. చౌకపారు నేతచీర కట్టుకున్నది చేతికి ఒక జత బంగారం గాజులు, చెవులకు లోలకులు, మెడలో ఒంటిపేట గొలుసు. +తెర లేవబోతుందనగా ఈ కింది గ్రామఫోన్ రికార్డు “లో వాల్యూమ్"లో ప్రారంభమై, క్రమంగా “హై పిచ్" లోకి వస్తుంది. +“వస్తాడే మాబావ వస్తాడే రేపో మాపో – వస్తాడే +ఢిల్లీ నుంచి వస్తాడే పరీక్షపాసై వస్తాడే।। +తీయతీయనీ పండ్లానొసగీ, చందమామలా అందము చిలికే +బావకు స్వాగతమిస్తానూ ఇస్తానూ బావకు స్వాగతమిస్తానూ।। +పూలతోటలో కోయిల పలుకూ క్రొత్తపాటతో మేళవించీ +పాడి ఆడుకొనగా, చిలుకలు కిలకిల నవ్వేనూ।। +బస్తీనుంచీ వస్తావె, చీరెలు నగలూ తెస్తావా? +కోరినవన్నీ తెస్తావా? తెస్తాడూ, అడిగినవన్నీ తెస్తాడూ +నీ మువ్వల మ్రోతలు వింటాడూ, నీ మువ్వల మ్రోతలు వింటాడు నీ +వెన్నా మీగడ లిస్తాడు, వెన్నా మీగడ లిస్తాడు +వస్తాడే మా బావ, వస్తాడే మాబావా +హాహాహాహా హహహాహా నన్ను పెళ్ళి చేసుకుంటాడే +గ్రామఫోన్ రికార్డుల్తో గొంతుకలిపి పాటపాడుతూ సుందరి గిరగిర తిరుగుతుంది. ఇలా తిరగడంవల్ల కళ్లు బయిర్లు కమ్మగా తూలిపడిపోబోతుంది. కాని, నిలదొక్కుకుని ఒక క్షణంపాటు కళ్లు మూసుకుంటుంది. ఆ తర్వాత శూన్యాన్ని చూస్తూ “రా అత్తయ్యా! రా! ఇదేనా రావడం? అంతా బాగున్నారా? మా మామయ్య, మా బావ “బావ” అనే సరికి సిగ్గుపడి, మాట మధ్యలో ఆగిపోయి) “అమ్మా! అత్తయ్యొచ్చిందే!” అని కేకవేస్తుంది. ఈ ఘట్టంలో చప్పున అన్ని లైట్స్ ఫేడ్ ఔట్ అయిపోతాయి. +తిరిగి లైట్స్ ఆన్ అయ్యేసరికి సీతమ్మ, రాజమ్మ చిరిచాపపై కూర్చుని మాట్లాడుకుంటూ వుంటారు. సీతమ్మ వయస్సు ఇంచుమించు ముప్పై; రాజమ్మ వయస్సు దాదాపు నలభై. సీతమ్మ మాసిన చీరతో, చెరగిన జుట్టుతో వుంటుంది. బోసిమెడ. చేతికి ఒక జత బంగారం గాజులైనా లేవు. రాజమ్మ చక్కగా ముస్తాబై వుంటుంది. మెడ తిరగనన్ని నగలు. +సీతమ్మ మీ అన్నయ్య చూపంతా నీమీదే పెట్టుకున్నారు. మరి నువ్వేమి చేస్తావో రాజమ్మొదినా! +రాజమ్మ ఆఁ! నా దేమున్నదే, సీతమ్మా! +సీతమ్మ అదేం మా టొదినా! నువ్వు కావాలంటే +రాజమ్మ నేను కావాలన్నవన్నీ అవుతున్నాయటే ఇది కావడానికి! +సీతమ్మ అయినదానివి నువ్వే ఇలా మాట్లాడితే, ఇఖ ఏం సానుకూల మౌతుంది? సుందరి +భూంమీద పడ్డప్పటినుంచీ దాన్ని మేనల్లుడి కిచ్చి చెయ్యాలని మీ అన్నయ్య ముచ్చట పడుతున్నారు. మేనల్లుడంటే ఆయన కెంత అపేక్షో నీకు తెలియం దేమున్నది? +రాజమ్మ అయితే, ఇప్పుడు నే నే ఈ సంబంధం వొద్దంటున్నానటీ! కన్నారితో వియ్యమంది వస్తూ +సీతమ్మ నువ్వు వద్దనడం లేదనుకో. కాని, అదే సరిపోతుందా? కావాలని పట్టు పట్టాలి. నువ్వు +పట్టుపడితే మా అన్నయ్య నీమాట తోసేస్తాడా? +రాజమ్మ మావారి సంగతి నీకేం తెలుసు! తన కెంత తోస్తే అంతే! ఎవరేం చెప్పినా వినిపించు +కోరు. నాలుగేళ్ళనాడు భూమీపుట్రా అమ్మొద్దని చెవి నిల్లుకట్టుకు పోరినా విన్నారూ? +సీతమ్మ అప్పు డమ్ముకోవడం మంచిపనే అయిందిగా! ఆనాడు ఆ రెండెకరాలమ్ముకుని వ్యాపారం +రాజమ్మ ఆఁ! అప్పుడు మూడువేలకు తెగనమ్ముకున్న ఆ చేనే యిప్పుడు అయిదువేలు చేస్తున్నది! +ఆయన చేసే బేరాలన్నీ యింతే! ఏం బేరాలో బెండిత్తులు! +సీతమ్మ మా అన్నయ్య బేరాలకే నువ్వు వంక పెడుతున్నావుగా! ఆ నాలుగెకరాలు పోతేనేం? +ఇప్పుడు కావాలనుకోవాలేగాని, పాతి కెకరాలు కొని వెయ్యగలడు! +రాజమ్మ ఏమైనా తాతలనాటి గడ్డ పోయిందిగా! దాన్ని తొందరపడి అమ్మివేసుకోకుండా, తనఖా +పెట్టుకుంటే పనికి పనీ జరిగేది; పొలానికి పొలమూ మిగిలేది. +సీతమ్మ నీ మాటల కేమిలే, వొదినా! తెగింపు చెయ్యబట్టే మా అన్నయ్యకు బాగా కలిసొచ్చింది. +మా పని చూడరాదూ? ఎప్పుడొచ్చినా ఆ జీతపురాళ్లేగా? యుద్ధానికి ముందు ఏదో కాస్త పచ్చపచ్చగా కనబడ్డా, ఇప్పుడు నీళ్ళు కారిపోతున్నాం. ఏం కొనబోయినా ధరలన్నీ మండిపోతున్నాయయ్యె! రూపాయి మార్చడమే కనపడుతున్నది కాని, ఇంటి కొచ్చేది ఏమీ మిగలకపోతే పాయె! ఎప్పుడు మిగిలింది కాబట్టి ఇప్పుడు మిగలడానికి! కాని, ��దివరలో జరిగినట్టు జరగడమైనా కష్టమై పోతున్నది. మాపని దిగదియ్యబట్టేగా మేం మీకు దూరమై పోతున్నాం! మే మిప్పుడు మీ కంటిలో దూరంలే! కనబడ్డం లేదు. +రాజమ్మ అదేమిటే! మాకు కొత్త భాగ్య మొచ్చిందని మాకళ్లు పైకి పోయాయా? +సీతమ్మ అబ్బే! ఎంతమాట! కాని, మాతో సంబంధం చెయ్యడమంటే, ముందు నీకే యేమంత యిష్టం +రాజమ్మ నే నిష్టపడితే సరేనా? ఆయ నిష్ట పడొద్దూ? +సీతమ్మ మా అన్నయ్య కేమీ అభ్యంతరం లేదట. ఈ మధ్య మావారు కదిలిస్తే “ఆఁ! నాడే మున్నది? +నీ యిష్టం, నీ చెల్లె లిష్ట" మన్నాడట. +సీతమ్మ అయితే, మా అన్నయ్యకే మాతో సంబంధం చెయ్యాలని కడుపులో లేదన్నమాట! +రాజమ్మ ఆఁ! మా మాటకేమిలే? అసలు పిల్లవా డిష్ట పడొద్దూ?ఈ కాలపువాళ్లు అమ్మా బాబూ +కుదిర్చిన పిల్లల్ని చేసుకుంటున్నారూ? తమకు నచ్చినదాన్ని తామే ఏరి, కోరి కట్టుకుంటున్నారు గాని! +సీతమ్మ అబ్బాయిని కూడా మావారు కదిలించి చూస్తే, తన కిష్టమే నన్నాడట. నిన్ను, మా +రాజమ్మ ఆఁ! పసివాడు! తెలి సొక మాట, తెలియ కొకమాట, అయినా, ఇప్పుడేం తొందర? వాడి +చదువైనా పూర్తికాలేదింకా. మరి రెండు మూడేళ్ళదాకా వాడి పెళ్ళిమాట మేముతల పెట్ట బోవడం లేదు. +సీతమ్మ అదేమిటి రాజమ్మొదినా? గుడివాడవా రెవరితోనో సంబంధం మాటలు నలుగు తున్నా +సీతమ్మ ఆఁ! ఎవరంటే నేమిలే! మీరు ఎంత కమ్మిపెట్టాలన్నా ఆ నోటా, ఆ నోటా తెలియక +రాజమ్మ మరి అన్నీ తెలిసినదానివి న న్నడగడం దేనికి? +సీతమ్మ ఊరుకుంటుందీ పాడు మనస్సు, ఆశ పీడిస్తుందిగా? “ఇంకొకసారి అడిగి చూడండి. +వాళ్ళమాట వాళ్ళకే వుంటుం” దని నలుగు రనబట్టే, ఇంకా మీవెంట బడుతున్నాం. +రాజమ్మ వాళ్ళెవరో మొ న్నొచ్చారులే పదెకరాల మాగాణి, పాతికవేల రొక్కం యిస్తామంటూ. +పిల్ల వొంటిని నూట యాభై నవర్సుల బంగారంకూడా వుందట. +సీతమ్మ మీ చూపు కట్నాలమీదికి పోతే, మే మెక్కడ తూగగల మొదినా? మా అన్నయ్య చుట్టరికం +చూసుకుంటాడు గాని, డబ్బు కాశపడతా డనుకోలేదు. +రాజమ్మ ఏఁ! డబ్బంటే ఎవరికైనా చేదా? +సీతమ్మ అయితే మీకూ, మాకూ ఇంతటితో తీరిపోవలసిందేనా, వొదినా? ఇక మమ్మల్ని మీ గడప +రాజమ్మ నీదంతా చోద్యమే, సీతమ్మా! ఇంతమాత్రానికే మా అన్నయ్య నాకు అన్నయ్య కాకపోతాడా? +సీతమ్మ సుందరిని నీ చేతిలో పెడితే, అది సుఖపడుతుందని మీ అన్నయ్య +రాజమ్మ ఎవరి కెక్కడ రాసి పెట్టివుంటే అక్క డౌతుంది. మన మనుకున్న వన్నీ అవుతాయటే! సీతమ్మ +: అది వొ? మెతకపిల్ల. నోట నాలిక లేదు. అయినవాళ్ళ యింట్లో పడితే కడుపులో పెట్ట���కు కాపాడతా రనుకున్నాం. కానీలే దాని గీత ఎలావుంటే అలాగే జరుగుతుంది. +రాజమ్మ దానికేమేఁ? పుత్తడిబొమ్మ! దాన్ని ఎవరైనా కళ్ళకద్దుకు చేసుకుంటారు. +సీతమ్మ (నిట్టూరుస్తూ ఇప్పు డంద మెవరికి కావాలి? చదువు లెవరికి కావాలి? బుద్ధు లెవరికి +కావాలి? కట్నాలు కావాలి; కాన్కలు కావాలి. మాకు లేవుగా సంచులు? గుమ్మరించడానికి! +రాజమ్మ ఆఁ! దానికి తగినవా డెవడో దాని కొస్తాడు. పేదపిల్ల లందరు పెళ్ళిళ్లుకాకుండా అట్టే +వుంటున్నారటే! దాని కెవడో, ఎక్కడో పుట్టేవున్నాడుగాని, పుట్టబోడుగా? +సీతమ్మ ఇంకా మీ అన్నయ్య గంపెడాశతోనే వున్నారు. “మమ్మల్ని విడిచిపెట్టి వాళ్ళెక్కడికి పోతారే?” +అని మొన్న కూడా నాతో అన్నారు. ఈ మాట వింటే ఆయనకు నడుం విరిగినంత పని అవుతుంది. +రాజమ్మ ఆఁ! మా అన్నయ్యకు అల్లుడే కరువౌతాడా! +సీతమ్మ అల్లుడు దొరక్క అట్టే వుండడులే! కాని, బుద్ధిమంతుడని మేనల్లుడంటే, ఆయన కెంతో యిది! +ఇంట్లో పెట్టుకుని నాలుగేళ్లు చదువు చెప్పించుకున్నారు కూడా. +రాజమ్మ ఎవరి మేనల్లుడిమీద ఎవరికి బ్రమత లుండవు లేవే! నాలుగేళ్లు చదువు చెప్పించినందుకు +అయిదారొందలు అయ్యాయేమో! సుందరి పెళ్ళికి అంతకంత మే మేదో ఒక రూపంలో +ముట్టజెప్పక పోములే! నేను ఆయనకు చెప్పేవుంచా సుందరికి పెళ్ళినాడు వెయ్యిన్నూట పదహార్లు చదివించాలని +సీతమ్మ మీరు ముందెప్పుడో అంతకంత మాకు ముట్టజెబుతారని మేము మేనల్లుడికి చదువు +చెప్పించుకోలేదు. మీ కట్నాలు, కాన్కలు మా కొద్దులే, తల్లీ! ఏదో ఒక విధంగా దాన్ని విరగడ చేసుకోలేక పోతామా? +రాజమ్మ సరే! మీరు మమ్మల్ని తోసెయ్యదల్చుకుంటే +సీతమ్మ ఎదురు ఈమాట కూడానా? ఎవరు ఎవర్ని తోసేస్తున్నారో లోకానికి తెలవదూ? మీ అన్నయ్య +వన్నీ పిచ్చి బ్రమలుగాని, ఇప్పుడు మీ చూపుకు మే మెక్కడ ఆనతాం! మీ రిప్పుడు కోటీమీద కూర్చున్నారయ్యె! మిమ్ము అందుకోవాలన్నా మేము +(మొదటి దృశ్యంలో ఎక్కడ, ఏ భంగిమలో నిలబడిందో అక్కడే, ఆ భంగిమలోనే నిలబడి సుందరి “అమ్మా! అత్తయ్యొచ్చిందే!” అని కేక వేస్తుంది. ఈ కేక విని సీతమ్మ ప్రవేశిస్తుంది. +సీతమ్మ ఏమిటే నీ కేకలు సుందరీ? +సుందరి (శూన్యాన్ని చూపిస్తూ అదే! ఎదురుగుండా! +సీతమ్మ నీకు పిచ్చేమైనా పట్టిందేమేఁ! ఎవరున్నా రక్కడ? +సుందరి (నిద్రలోనుంచి మేల్కొంటున్నట్లు కళ్లు నులుముకుంటూ ఔనమ్మా! ఎవ్వరూ లేరు. +కాని,ఇంతకుముందు ఒక్క క్షణానికి ముందు అత్త య్యొచ్చినట్టు +సీతమ్��� ఆవిడ మనింటి కెందుకొస్తుందే! వాళ్ళ చూపుకు మన మిప్పుడు ఆనం! వాళ్ళిప్పుడు కోటీమీద +సుందరి అత్తయ్య రాలేదుగాని, సినిమా తెరమీద బొమ్మ కనబడ్డట్టు +సీతమ్మ నీకు మతి పోతున్నదేమే? వాళ్ళు అస లిప్పుడు కింద నడుస్తున్నారూ? దొంగవ్యాపారం +చేస్తేనేఁ? లోకుల కొంపలు కూల్చితేనేఁ? తమ కింత పోగు పడింది. ఇప్పుడు మన మంటే వాళ్ళ కెంత చులకన! ఈ పాడు సినిమాలతో నీ మతి సగం చెడుతున్నది. కాసేపు మురిపించి డబ్బు పోసుకోడానికి వాళ్ళకేఁ? తెరమీద బొమ్మల్ని తైతక్క లాడిస్తారు! +సుందరి అయితే, సినిమాలలో మనం చూసినట్టు జరగనే జరగదంటావా, అమ్మా? +సీతమ్మ అది పచ్చి బూటకం! బ్రతుకు దొకదారైతే, సినిమా దొకదారి. దానికీ, దీనికీ సాపత్యమెక్కడ? +ప్రేమలనీ, పెళ్ళిళ్ళనీ వాళ్ళు ఏమేమో అంటారు. ప్రపంచంలో ప్రేమ లెక్కడివి, తల్లీ? డబ్బే ప్రధానం, డబ్బులేనివాడు డుబ్బుకు కొరగాడు. +సీతమ్మ ఔను తల్లీ! మీ మామయ్యకు, అత్తయ్యకు మన మెందుకు దూరమైపోయాం? మనకి డబ్బు +లేకపోబట్టేగా? డబ్బుంటేనే ప్రేమలైనా, బంధుత్వాలైనా. సుందరి ఆఁ! నీమాట నేను నమ్మలే నమ్మా! +సీతమ్మ (సుందరిని దగ్గరికి తీసుకుని తల నిమురుతూ ఇంత పిచ్చితల్లివి! నువ్వేం కడతేరతావో! సుందరి పోనీ, అత్తయ్యా, మామయ్యా చెడ్డవాళ్ళనుకో! వాళ్ళకి డబ్బే ప్రధాన మనుకో! కాని, బావయ్య +సీతమ్మ అతడు మంచివాడైతే కావచ్చు. కాని, అతని మాటేమి సాగుతుంది? తల్లీ, తండ్రీ చాటుబిడ్డ. +వాళ్లు రావడం తగ్గించుకోగానే తనూ తగ్గించుకున్నాడుగా మనింటికి రావడం! మొన్న మీ నాన్న వీధిలో యెదురుపడితే, చూసీ చూడనట్టు వెళ్ళిపోయాడట. మీ +సుందరి తల్లి మాటలు అంతగా రుచించక, సంభాషణ వేరొక ధోరణికి మార్చాలని):అయితే, +సుందరి నే నొక కొత్త సినిమా పాట నేర్చుకున్నా నమ్మా. +సీతమ్మ అలాగేఁ? సీతమ్మ అంత చక్కనిదా? +సుందరి అది చాలా చక్కని పా టమ్మా! +సుందరి ఔనమ్మా! దాని బాణీ నేనింకా బాగా పట్టుకోలేదు గాని, పాడి వినిపించనా! +(సుందరి ఈ కింది పాట పాడుతుంది; +ఈ గృహమే కదా, మన గృహమే కదా స్వర్గసీమ! +జగతిని యశ మంది, సంపద లంది, +తిరిగి లైట్స్ ఆన్ అయ్యేసరికి రంగమ్మ నీళ్ల బిందెతో ప్రవేశిస్తుంది. ఆమె వితంతువు. వయస్సు యాభై అయిదు. కాని, సందర్భానుసారంగా ఆమె దాన్ని యాభయ్యో, అరవయ్యో చేస్తూ వుంటుంది. +రంగమ్మ గంపెడు చీకటి నెత్తినేసు కెళ్లినా, పాడుమూక అప్పుడే పంపుచుట్టూ చేరింది. బిందెడు +నీళ్లు పట్టుకొచ్చే సరికి తలప్రాణం తోక కొచ్చింది. మాయదారి గుంపు! ముదనష్టపు గుంపు కాస్త సందిస్తేనా? పై పైకి తోసుకు రావడమే! అ దున్నది ఆ పుట్టుకుంక దాని ముఖం మండ! అది మరీనీ! పంపుకింద బిందెట్టుకుంటే లాగి పారేస్తుంది. +(సీతమ్మ వస్తుంది. కిందటి రంగంలో మనం చూచినప్పటి కంటె ఆమె దాదాపు పదిహేడేళ్లు చిన్నది. +రంగమ్మ ఎంత అరచినా పలకవే? అంకిలి నొక్కుకు పోయిందా? +సీతమ్మ కళ్లాపి జల్లుతున్నా నత్తయ్యా! నీ కేక వినబడలేదు. +రంగమ్మ తెచ్చిన నీళ్ళన్నీ అప్పుడే దిమ్మరించేశావ్! ఆ పాడు పంపుదగ్గిరి కెళ్లి, ఆ పాడు ఆ +ముండలందరితో చెలిగి, తెచ్చే దున్నదిగా! దిమ్మరించడానికి నీకేం నెప్పి! +సీతమ్మ లేదత్తయ్యా! నాలుగంటే నాలుగు చెంబుల నీళ్లు +రంగమ్మ నీకు నాలుగు చెంబులుగానే కనబడతాయ్! ఒక్కొక్క బిందెడు నీళ్లెత్తు కొచ్చేసరికి నా +నడుము లిరుగుతున్నాయ్! ఇంకా ఎంతకాలం చేస్తాను నేనీ గాడిది చాకిరి? పాచినీళ్లట! పాచినీళ్లు జీతం బత్తెం లేకుండా తెచ్చి పొయ్యడానికి నౌకరుదాన్ని నే నున్నానుగా! ఇంట్లో కూర్చుని బుడబుడ ఎన్ని నీళ్లినా పారబోస్తావు! ఒక్క చెంబుడునీళ్ళు పట్టుకురా, నీకే తెలుస్తుంది ఆ కష్టమేమిటో, సుఖమేమిటో! +సీతమ్మ అంత కోపం దేని కత్తయ్యా! పోనీ, నేనే నీళ్ళు తెచ్చుకుంటాను. +రంగమ్మ నీకు ముచ్చటగా వుందటే? నన్ను నలుగురి నోళ్ళలో పడెయ్యాలని! రంగమ్మ కొత్తగా +కాపరానికొచ్చిన కోడల్ని బజార్లెంట తిప్పుతున్న"దని అమ్మలక్క లందరు మూతీ ముక్కూ విరుస్తుంటే చూడాలని ముచ్చటగా వుందా? +సీతమ్మ తప్పు మాటంటే, మన్నిం చత్తయ్యా! +రంగమ్మ ఎంత వగలాడివే! అన్నిటికీ ఇదొకటి నేర్చుకున్నావ్! ఉలిపి, చిలిపిమాట లనడం! +“మన్నించత్తయ్యా!” అని చిలక పలుకు పలకడం! +రంగమ్మ ఏం నంగనాచివే! కల్లిబొల్లి యేడ్పులుకూడా మొదలెట్టావ్ రంగమ్మ కోడల్ని కాల్చుకు +తింటున్న”దని నలుగురిచేత నన్ను ఆడిపోయించమ్మా! ఆడిపోయించు రద్దీ రవ్వా లేకుండా బతికిన ముండని, నన్ను అల్లరి పెట్టందే నీకళ్ళు చల్లబడవులే! +(సీతమ్మ కళ్ళవెంట గిర్రున నీళ్లు తిరుగుతాయి. +సీతమ్మ వాకిట్లో ఒక ముగ్గుకళ్ సొస్తా. +రంగమ్మ మాట్టాడేదాన్ని నేను మనిషినేనా? ఒక పక్కని మాట్లాడుతూవుంటే దులపరించుకు +రంగమ్మ సర్లే! నీకు నీ అమ్మా, బాబూ నేర్పిపంపిన చిలకపలుకులు ఇవ్వాళ పొమ్మంటే ఎక్కడికి +రంగమ్మ బారెడు పొద్దెక్కినా నీకు కాఫీ పెట్టడానికే తీరలా! +సీతమ్మ చేతిలో పని కాగానే పెడతా నత్తయ్యా! +రంగమ్మ అబ్��ే! ఎందుకులే! పెట్టొద్దు! నా కూతురు పల్లెటూరిదయ్యె! మన్ను పిసుక్కు నేదయ్యె! అది +నీలో ఉద్యోగస్థుడి పెళ్ళామా? బస్తీ కాపరం చేస్తున్నదా? అది కాఫీ ముఖమేమెరుగున్నది? +సీతమ్మ రాజమ్మొదిన ఇంకా నిద్ర లేవలే దయ్యా! ముందే పెడితే చల్లారిపోతాయని పెట్టలేదు. +రంగమ్మ (వెనకనుంచి దానికి కాసిని కాఫీనీళ్ళివ్వడానికి చేతులు రాక ఎన్ని వేషాలు వేస్తున్నావే! +ఇంతకూ నిన్ననే పనేమిటి? నా కొడుకు మంచివాడైతే నువ్వు ఆడిందే ఆటగా సాగుతుందా? వాడొఠ్ఠి దద్దమ్మ! పెళ్ళానికి చాల్లేడు. మొన్న మట్టుకు మొన్న నేను వద్దంటున్నా, ఇరుగు పొరుగు అమ్మలక్కలతో చేరి అది నాటకానికి వెళ్లిస్తే కుక్కిన పేనులా వూరుకున్నాడు గాని, పల్లెత్తుమా టన్నాడూ? మనం సంసారులం; నాటకాలు, గీటకాలు మన కెందుకు? ఇది డబ్బు దండగచేటేనా? మ రేమైనానా? అది ఎన్ని దండగలు పెట్టినా వాడి కిష్టమే. కచ్చేరీకి వెళ్ళిన ఆ కాసేపు తప్పితే, దాని కొంగుచ్చుకు తిరగాల్సిందే! పట్టపగలే దాంతో పకపకలు, వికవికలై పోతే! ఇంతకూ నాకు చావు రావడంలేదు. కూతురు రాకరాక చుట్టపుచూపుగా ఒకసారొస్తే దాని కిన్ని కాఫీనీళ్ళకు గతిలేకపోయె! ఇంకా నా బతు కెందుకు? పాడు బతుకు! ఏ నుయ్యో, గొయ్యో చూసుకుంటే అందరికీ పీడ విరగడై పోతుంది. నలుగురిచేత ఔననిపించుకున్న ముండని. నా కెన్ని తిప్పలొచ్చాయ్! నా కెన్ని తిప్పలొచ్చాయ్!! +(రాని కన్నీళ్లను తుడుచుకుని, వేలు విదిలిస్తుంది. +రంగమ్మ (మూలనున్న చీపురు తీసుకుని, గది కొంత జిమ్మి ఒసేయ్! నిన్నే ఏమేయ్! +సీతమ్మా! ఊహుఁ! అదెందుకు పలుకుతుంది? నా పిలుపంటేనే దాని చెవుల్లో చెట్లు మొలుస్తాయ్! అమ్మ! ఎంత కానరాని దది! ఏమేయ్! నిన్నేనే!! +గృహమే స్వర్గసీమ” అంటూ నేపథ్యంలో నుంచి పాట ప్రారంభమౌతుంది. +లైట్స్ ఆన్ అయ్యేసరికి సుందరి, సీతమ్మ నాల్గవ రంగంలో కూర్చున్నట్టుగానే కూర్చునివుంటారు. సుందరి గృహమే స్వర్గసీమ” పాట చివరి చరణాలలో వుంటుంది. సీతమ్మ చెమ్మగిలిన కళ్ళను పైటచెంగుతో ఒత్తుకుంటూ వుంటుంది. +సుందరి అదే మమ్మా, కంట తడిపెడుతున్నావ్? +సీతమ్మ ఆఁ! ఏం లేదు, తల్లీ! +సుందరి ఎందు కమ్మా? నాకు చెప్పవ్? +సుందరి మరి సినిమా పాటలన్నీ పిచ్చిపాట లంటావ్? ఒక్కొక్క పాట వింటుంటే, నాకూ కళ్ళు +సీతమ్మ సంసారమంటే మాటలు కాదు, తల్లీ! మంచి చెడ్డలు ఎన్నెన్నో వుంటాయ్. పడివున్న +వాళ్ళకేగాని అవి తెలియవ్ పదహారు, పదిహేడేళ్ళనాడు నాది నీ ఈడే. అప్పుడు అచ్���ంగా నీ మాదిరిగానే వుండేదాన్ని. ఇప్పుడు నిన్ను చూస్తే అప్పుడు నన్ను చూడ నఖఖరలేదు. ఈ సినిమాలు మేమప్పు డెరగంగాని, నీకు మల్లేనే నాకూ కష్టం, సుఖం తెలిసేది కాదు. తల్లీ తండ్రి ఆదరించినట్టే లోక మెల్లా ఆదరిస్తుందనుకున్నా, కాపరాని కొచ్చి, సంసార మీదడం ప్రారంభించిన తర్వాతగాని తెలిసి రాలేదు. బ్రతుకులు వెళ్ళమారడ మెంత కష్టమో! నేను పడ్డ పాట్లు నిన్ను చుట్టుకోరాదని నే నెందరి దేవుళ్ళకు మొక్కుకుంటున్నానో నీకేం తెలుసు? ఒక ఆటగానో, పాటగానో తనువు గడుస్తుందని లేనిపోని బ్రమతలకు పోవద్దు, తల్లీ! +సుందరి అమ్మా, ఈపూట నువ్వింత యిదిగా మాట్లాడుతున్నావే? మనస్సు బాగుండలేదా? +సుందరి అదేమో నమ్మా! ఒక్కొక్కసారి పాటేదైనా వింటుంటే కడుపులో చెయ్యి పెట్టి +దేవుతున్నట్టుగా వుంటుంది. అదే మరొక్కొక్కసారి పాట వినగానే ఎంత కలతగా వున్నా మనస్సు ఇట్టే తేటపడుతుంది. అది మరి పాటలో వుంటుందో, మనం వినే వేళా విశేషంలో వుంటుందో! +సీతమ్మ ఏమో నమ్మా! నే నేం చెప్పగలను? +సుందరి ఒక కమ్మనిపాట వున్నదమ్మా? దాన్ని వింటే చాలు, గాలిలో తేలిపోతున్నట్టుగానే +సీతమ్మ (మందహాసం చేస్తూ అబ్బో! అంత గొప్ప పాటా! +సుందరి ఔనమ్మా! నాన్న నాకు దాని రికార్డ్ తెచ్చి పెట్టాడు. +సుందరి బాబూ, కూతురూ చేరి, నా కీ మాట తెలియకుండా ఇప్పటిదాకా దాచిపెట్టారన్నమాట! +మనం కలవాళ్ళమా? ఎందుకమ్మా మీ నాన్నచేత నువ్విలా డబ్బు తగలేయించడం? ఈ రికార్డులకని నెలనెలకి దండగ పెట్టే డబ్బు కూడబెట్టుకుంటే, మెడరోత తీరడానికి ఏదో ఒక చిన్న నగ యేర్పడదూ? +సుందరి తెచ్చి పెట్టమని నే నడగలేదమ్మా! అది మంచి రికార్డని నే నంటే +సీతమ్మ ఆయన కొనుక్కొచ్చారు. అంతేనా? నీకు ఏ లోపం చెయ్యరాదని ఆయన ఎన్ని చిక్కులైనా +సుందరి ఇంకెప్పుడు నాన్న దగ్గిర రికార్డుల మాట యెత్తనులే, అమ్మా! +సీతమ్మ (నవ్వుతూ చూస్తానుగా ఎన్ని రోజులు నిలుస్తావో ఈ మాటమీదే! నిన్ననగా మీ నాన్న +రికార్డు తెస్తే దాన్ని యింతవరకు పెట్టనే లేదని నువ్వెంత ఆరాటపడుతున్నావో! ఏదీ, ఆ రికార్డు వినిపించు! +(సుందరి ఈ కింది గ్రామఫోన్ రికార్డ్ పెడుతుంది: +ఆదిలో పాట “లో వాల్యూమ్”లో వస్తుంది. +సుందరి అమ్మా! ఇది చాలా మంచిపాట కాదూ? +సీతమ్మ పాటకే? మంచిపాటే! కాని, బ్రతు కొక పాటా, ఆటా కాదు, తల్లీ! పైకి సాఫీగానే +నడుస్తున్నట్టు కనబడ్డా, అడుగడుక్కీ చిన్నచిన్న చిక్కులూ, చిల్లర యిబ్బందులూ ఒక లక్ష వస్తుంట���య్. వడ్డించిన విస్తరిలా బ్రతుకు లున్న వాళ్లకే ఏవో కొన్ని వొడుదుడుకులు తప్పవంటే, ఆస్తిపాస్తులు లేనివాళ్లమాట వేరే చెప్పాలీ? కొద్దికొద్ది సంసారాలనే సరికి అన్నీ కొరతలే! అయినా, పరువుకోసమని ఏ లోపం లేనట్టు దేవులాడాలి. ఇక, అత్తపోరూ, ఆడబిడ్డపోరూ వుంటే సరేసరి! ఒక యింటి దానివై నీ సంసారం నువ్వు దిద్దుకుంటున్నప్పుడు మంచిచెడ్డలన్నీ నీకే తెలుస్తాయిలే +(లైట్స్ ఫేడ్ ఔట్ అయిపోతాయి. ఆ వెంటనే పాటకూడా నిలిచిపోతుంది. పిమ్మట ఒక క్షణానికి ఒక్క సుందరిమాత్రం స్పాట్ లైట్ లో నిలబడి వుంటుంది. ఆమె చుట్టుపక్కల కటిక చీకటి. ఆ చీకటిలో నుంచి వేర్వేరు గొంతులు ఒకదాని తర్వాత మరొకటి, ఒకదాన్ని మరొకటి తరుముతున్నట్టు వినబడతాయి. +మొదటి గొంతు (సుందరికి కాగల భర్తది ఇంకా నీ వంట తెమల్లేదటే? +సుందరి (గొంతు వినవచ్చినవైపుకు తిరిగి అయిపోతుంది ఒక చిటికలో! +మొదటి గొంతు చాల్ చాలు! ఆఫీసుకు వేళ మించిపోతున్నది. రోజూ ఇదే యేడుపు! +మొదటి గొంతు ఏమైపోయింది? నీ మొఖం! ఆఫీసులో నాకు మాటొస్తున్నది +మొదటి గొంతు చాల్లే! నే పోతున్నా! +రెండవ గొంతు (పాలమ్మిది ఏమిటమ్మా ఈ తిప్పించుకోడం?? +రెండవ గొంతు ఏఁ! నేను మీకు అచ్చివున్నా నేమిటి మీ కొంప చుట్టూ తిరగడానికి! +సుందరి (అటు తిరిగి రేపిస్తాంగా తప్పకుండా! +రెండవ గొంతు రోజూ రేపురేపేనా? అంత గతిలేనివాళ్ళు పాలెందుకు పోయించుకోవాలి +సుందరి ఏమిటమ్మీ! మాటలు మహ రానిస్తున్నావ్! +మూడవ గొంతు (సుందరికి కాగల అత్తగారిది కాస్త నేలమీద ఆని నడువమ్మా! నడువు +మిడిసిపాటు తగదు. ఏం కట్టుకొచ్చావని అంత పొంగు! +(సుందరి అటు తిరిగి గుడ్లు అప్పగించి చూస్తుంది. +నాల్గవ గొంతు (పిల్లవాడిది అమ్మా! అమ్మా! పండక్కి నాకు కొత్త చొక్కాయేఁ! +సుందరి (అటు తిరిగి నాన్న రేపు తెస్తాడులే, బాబూ! +నాల్గవ గొంతు అహం! నా కిప్పుడే కావాలి. పండ గివ్వాళే! వాళ్ళ కిష్టిగాడు కొత్త దేసుకున్నాడు +సుందరి మా నాన్నవుగా! రేపు నీకు +నాల్గవ గొంతు ఉహుఁ! పిల్ల లందరు కొత్త చొక్కా లేసుకున్నారు. నా కిప్పుడే కావాలి! +తిరిగి మొదటి గొంతు మొన్నేగా వీసెడు నెయ్యి మండబెట్టింది! +సుందరి (అటు తిరిగి అయ్యొ! అయిపోయిందండీ! +మొదటి గొంతు వెనకా ముందూ చూసుకోవద్దూ? ఇలాగైతే నే నెక్కడ ఛస్తాను. +తిరిగి మూడవ గొంతు చంకల్లోకి ఆ రవికేమిటి? ఆ బెత్తెడు పమిటేమిటి? చెవుల పైకి జారుతూ +ఆ జుట్టు ముడేమిటి? ఏం వేషా లివి? దొమ్మరి వేషాలు! ఎక్కడైనా సంసారుల కివి తగునా? దానికి బుద్ధిలేకపోతే, ఆ అత్తకు బుద్ధిలేదా అని నలుగురూ నన్ను దెప్పడానికా? +(సుందరి అటు తిరిగి దిగాలుపడి చూస్తుంది. +అయిదవ గొంతు (పిల్లవానిది బడిలో జీతం తెమ్మన్నా రమ్మా! +సుందరి (అటు తిరిగి రేపిస్తాం లే, బాబూ! +అయిదవ గొంతు ఊఁ! ఊఁ! ఇవ్వాళ కట్టకపోతే, పేరు కొట్టేస్తామన్నారే, అమ్మా! +మరొకసారి మొదటి గొంతు మళ్ళీ డాక్టరా? +సుందరి (అటు తిరిగి అయ్యొ! నా తండ్రి కెక్కువగా వున్నదండీ! +మొదటి గొంతు తడవకి మూడేసి రూపాయలు పొయ్యాలి. +సుందరి అయ్యో! అయ్యో! నా బాబేం కాను +మొదటి గొంతు చాల్లే! నీ ఖంగారు! +(“ఆడబ్రదుకే మధురం” అని రికార్డ్ ఫుల్ బ్లాస్ట్ తో ప్రారంభం కాగా +పాత్రలు: అప్పయ్య పల్లెటూరి రైతు, కోటమ్మ అతని భార్య, చలపతి అతని కొడుకు, +పొన్నమ్మ ఇరుగు పొరుగు యిల్లాలు, భూషయ్య ఊరు పెత్తందారు. +అది అప్పయ్యగారి మండువా చావడి. మండువా నాలుగు వైపులా నాలుగు స్తంభాలు. ఆ స్తంభాలను కలుపుతూ పిట్టగోడ. మండువా మధ్య తులసికోట. ప్రేక్షకులకు సమ్ముఖంలో మండువాకు అవతలగా కానవచ్చేది సింహద్వారం. ఎడమ చేతివైపునున్న రెండు ద్వారాలు గదులలోకి, కుడిచేతివైపునున్న మరి రెండు ద్వారాలలో ఒకటి వంటింటిలోకి, రెండవది పెరటిలోకి. చావడిలో రెండు నవారు మంచాలు మాత్రం వున్నాయి. +తెర లేచిన క్షణానికి పొన్నమ్మ ప్రవేశిస్తుంది. ఆమె వయస్సు నలభై అయిదు ప్రాంతాల. పూర్వకాలపు ముత్తయిదువ ముస్తాబు. +కోటమ్మ (లోపలినుంచే నువ్వటే పొన్నీ! చేతిలో కాస్త పనుంది. చేసుకొస్తాగాని, కూకోవే, కల్లాలా! +పొన్నమ్మ ఇంత పొద్దుగూకేళ అంత వంటేమి చేస్తున్నావ్, తల్లీ! చుట్టపా డెవడైనా వొచ్చా డేమిటి? +(పొన్నమ్మ ఈ ప్రశ్న వేసిన తర్వాత ఒక క్షణానికి కోటమ్మ ప్రవేశిస్తుంది. ఆమె వయస్సు ఇంచు మించు యాభై అయిదు సంవత్సరాలు. అభం శుభం తెలియని పల్లెటూరి యిల్లాలు, +కోటమ్మ (ప్రవేశిస్తూ సుట్టాలూ లేరు; పక్కాలూ లేరు. ఉలవల్లో తవుడు కలుపుతున్నా, +పొన్నమ్మ ఏఁ? మా బాబాయి లేడూ? +కోటమ్మ ఆడు మంచాడైతే మా కిన్ని తిప్ప లెందుకొస్తాయ్! ఆయనగార్కి బద్ధకంగా వుండి +“అబ్బాయ్! పేట కెళ్ళి వొడ్లమ్ముకు రారా +అని మొన్ననగా పంపిస్తే అజా పజా లేడు. తెల్లారగట్టే ఆ గింజల్ని తోలుకెళ్ళిన బళ్ళు ఆవాళ రేత్రికే తిరిగొచ్చేశాయి. ఎళ్ళీ ఎళ్ళగానే ఆ గింజలేవో బేరమిచ్చేశాడని బళ్ళాళ్ళు చెప్పారు. మరి ఆడేమయ్యాడో ఆ డబ్బేమైందో! ఇదుగో వొస్తాడు, అదుగో వొస్తాడని చూసి చూసి మా కళ్ళు కాయలు కాసినా ఆడి పత్తా లేదు. ఆడి సంగతి తెలిసుండీ ఆడి నెందుకు పంపించానని తన్ను తాను ఒక పది తిట్టుకుని మీ బాబాయి సీకటితో లేచి పేటకి లగెత్తాడు. సందేళకి తిరిగొస్తా నన్నాడు. ఇంకా రానే లేదు. గొడ్లు యిళ్ళకొచ్చేయాళకు ఒక బస్సొస్తుందటగా! అది రానేలా? +పొన్నమ్మ ఆఁ! అదింకా మండిందో, లేదో! ఏం బస్సులో పాడు బస్సులు! ఇవేమంటూ +వొచ్చాయోగాని, మన ఊరికే శని పట్టుకుంది. పనీ పోయింది; పాటూ పోయింది. బస్సెక్కి బుడిగీ బుడిగీ బస్తీకి దౌడుతీస్తున్నారు. నడవాలా? పెట్టాలా? ఇక్కడ గడపలో యెక్కడం, అక్కడ బజార్లో దిగడం. ఒక అర్థరూపాయి మన్ది కాదునుకుంటే బుర్రున పోయి, బర్రున రావొచ్చయ్యె! +కోటమ్మ ఔనే, కల్లాలా! ఈ మాయదారి బస్సులు మన కెక్కడ దాపరించాయోగాని, ఊరొక అందాన +పొన్నమ్మ కాదటే, పిన్నామా? మొన్నొకనాడు ఏం జరిగిందనుకున్నావ్! మా రెండో పిల్లదానికి +పురుడొయ్యడానికని ఏటవతలి కెడుతుంటే, ఆ మీసాల యెంకడు పెదమాలపల్లి యెంకడు- ఆడి పెళ్ళామొచ్చి, రింగు రంగా అంటూ పక్కని కూర్చుంది. ఏం సెయ్యను? మాట్టడానికి మనవల్లా? ఇంకా దాని పుణ్యమాయిరి! పక్కనే కూకుందిగాని, వొళ్ళో కూకుంటే మాత్రం దాన్ని అడిగేవాళ్ళెవరు? పిసుక్కు చచ్చి, నేనే కాస్త ఒక పక్కకి వొత్తిగిలా! అదే మన మెక్కిన బల్లకట్టుమీ దెక్కితే, దాన్ని కాళ్ళిరగగొట్టేవాళ్లు కాదూ? +కోటమ్మ ఇది మాయ కలికాలం కాదటే, కల్లారా! ఒక కట్ట డెక్క డేడ్చింది? కుడీ, యెడ మెక్క +డేడ్చింది? ఆ మాటకొస్తే, సిన్నా పెద్దా అయినా చూస్తున్నారటే! మా అబ్బాయి మానానికి మా అబ్బాయి బాబు మాట యింటున్నాడూ? ఈయేడు ఆ డసలు మాసూల్లోకి యెళ్ళితేనా కళ్ళాం తొక్కించరా!” అంటే చెవి నట్టించుకోలేదు కుప్ప దింపించరా!” అంటే గోడకి చెప్పినట్టే! ఏమిటో సినిమాలట! మాయదారి సినిమాలు ఈటిని మరిగాక ఆడింటిపట్టు నుంటేనా! +పొన్నమ్మ ఆడికేమే పిన్నామా! ఎంత చెడ్డా మగబిడ్డ. కాని, ఈ ఆడముండల కేం తిప్ప లొచ్చాయ్! +కొత్త సినిమా ఆడుతున్నదని టము కొస్తే చాలు, తంబలకి తంబ లిరగ బడుతున్నారు. వాటిని చూసొచ్చిన కాడినుంచీ ఆ పాపట్లు పాపట్లు కావు; ఆ పమిటలు పమిటలు కావు. రోజు కొక రకం. నిన్న చూద్దునుగదా ఆ ఎత్తుపళ్ల సుబ్బి కోడలిచేతిని కిందినుంచి పైదాకా అన్నీ గాజులే. లంబాడీముండా. లంబాడీ యాసమున్నూ! +కోటమ్మ ఇంకా అది నయం కాదటే, కల్లాలా? ఆ మెరకీది నరిసి కూతురు +పొన్నమ్మ చల్లనేళ ఆ పుట్టుకుంక పేరెందు కెత్తావే, పిన్నామా! పాపం చుట్టుకోడానికా! అది ఆ బస్సు +కండక్టర్ని దుబ్బు జట్టుతో గణాసారిలా వుంటాడే ఆణ్ణి +పొన్నమ్మ ఉన్నాడులే వొకడు చీంబోతులా ఆడి జిమ్మడ! ఆణ్ణి పగలు చూస్తే, రాత్రి కలలో కొస్తాడు +– ఆణ్ణి అది పెట్టుకుంది. మల్లెపువ్వు లేమిటి? మిఠాయిపొట్టా లేమిటి ఆడు నడిపే బుట్టలు బుట్టలు కావు. అన్నీ తెచ్చి యింటి నిండా పడేస్తున్నాడని ఆణ్ణి ఇంటి అల్లుణ్ణి చేసుకున్నారు. +కోటమ్మ చీ! మద్దెపు ముండలు. మరి దాని మొగుడెలా వూరుకుంటున్నాడే? +పొన్నమ్మ ఆడు గాజులు తొడిగించుకొన్న యదవ కాదంటే, పిన్నామా! పెళ్ళాం ఏంకూళ్ళు కుడిస్తే +ఆడికేఁ? దమ్మిడీ ఖర్చులేకుండా బస్సులెక్కి గడేకారిలా తిరుగుతున్నానని ఆడి కులుకాడిది. +పొన్నమ్మ సన్నాసా! సన్నాసిన్నరా నెరీదిగా ఇలాంటి తప్పుడు పనులు సాగుతుంటే, ఇదివరకైతే +ఊరుకునే వాళ్ళటే, పిన్నామా! నిలువునా తెగ్గేసి, ఉప్పుపాతర్లో ఊరేసేవాళ్ళు కదూ? +కోటమ్మ ఇంతకీ ఈ తిప్పలన్నీ పెదనాగన్నగారి బూసయ్య తెచ్చి పెట్టాడు. ఏటిమీద వొంతిన కట్టి, +రోడ్డొస్తే, ఊరుకేదో వొరుగుతుందని గడప గడపకి తిరిగి చందా లోగుజేసి చట్టు బండలయ్యాడు. అంతకు ముందు ఆ పేట ఎక్కడ మండిందో ఎవళ్ళకి తెలుసు? నామట్టుకు నేను ఇన్నేళ్ళోచ్చినా దాని ముక్కూ ముఖ మెలా వుంటుందో యెరగను. +పొన్నమ్మ అంతేనే, పిన్నామా! మనకి బస్తీలతో పనేమిటి? ఏటి కొకసా రెళ్ళితే గింజా గిట్రా +అమ్ముకోటాని కెళ్ళాలి. పెళ్ళికీ, పబ్బానికీ గుడ్డా గుడుసూ తెచ్చుకోడాని కెళ్ళాలి. అప్పుడైనా ఎవళ్లు బడితే ఆళ్ళే యెళ్ళేవా? పెద్ద తలకాయలు ఒకరో, యిద్దరో పొద్దున్నే చద్దన్నం తినెళ్ళితే, సందేళకి ఆ పనేమిటో చూసుకుని చక్కా వొచ్చేవాళ్ళు. ఇప్పుడేముంది? అడ్డమైనాళ్లూ ఆసులో గొట్టం తిరిగినట్టు ఈ సందుకీ, ఆ సందుకీ తిరుగుతున్నారు. ఎన్ని బస్సులు నడిచినా, నిలుచోటానికైనా సందుంటేనా! +కోటమ్మ ఇంతకీ మా కొంపకి తిప్పలు తేవటానికే వొచ్చిపడ్డాయి ఈ పాడు బస్సులు! తన పనేమో, +తనేమో ఒకరి జోలీ సొంటీ లేకుండా దొరలా వుండే నా బిడ్డ ఇవొచ్చాక చప్పగా చెడిపోయాడు. వారానికి రెండు, మూడు సార్లయినా బస్తీ కెళ్ళి రాకపోతే ఆడికి నిద్ద రట్టడం లేదు. +పొన్నమ్మ మన పెత్తందారు బూసయ్య దొంతి నేయించాక, మనాళ్ళందరు నీళ్ళకు చేప +లెదురెక్కినట్టు బస్తీ కెళ్ళడమేనా, మన కొచ్చిపడ్డ తిప్పలు? ఆ బస్తీయే వొంతినమీదగా వొచ్చి, మన గొంతుమీద కూకోడం లేదటే, పిన్నామా? అంతకుముందు బీడీలు, సిగరెట్లు, సోడాలు, కిళ్ళీలు మన వూళ్లో అమ్మేవారూ? ఇప్పుడు ఆ మండి నొంతినదగ్గిర అన్నీ ఈ కొట్లే. రెండో, మూడో బట్టల కొట్లు కూడా కొత్తగా యెలిశాయిగాఁ! ఇఖ కాపీ వోటళ్లు సరేసరి. రోజు కొకటి కాడి కొస్తున్నది. వోటల్, వోటల్లోను పొనిగ్రాపులంట పొట్టోయేదాకా ఒక్కటే రొద. ఈ లెక్కని మరి నాల్గు రోజులు పోతే, ఇదే పెద్ద బస్తీ కాకపోతే న న్నడుగు. +కోటమ్మ అవునే, కల్లాలా! ఈ మాయదారి వొంతె నొచ్చాక ఊరే తలకిందులై పోతున్నది. మా +అబ్బాయి మానానికి మా అబ్బాయి వుంటే ఆ బస్తీలో వుంటాడు; లేకపోతే ఆ వొంతెనదగ్గ రుంటాడు. ఇల్లంటేనే ఆడికి కంపరంగా అడుగో! ఆ డొచ్చాడు. ఏరా, అబ్బాయ్! ఎన్ని రోజులైంది నువ్వెళ్ళి! రేపటికి నాలుగు! ఇదుగో తిరిగొస్తానన్న బిడ్డ రానే లేదని మా మనసెంత పీకిందో నీకేం తెలుస్తుంది! ఇట్టాగైతే ఎట్టారా, బాబూ! ఏడీ, మీ బా బేడీ? +(ఈ ఘట్టంలో ప్రవేశించిన చలపతి ఇరవై రెండు, ఇరవై మూడు యేళ్ళవాడు. మనిషిలో +నాజూకుతనం లేకపోయినా, వేషంలో నాజూకుతనం కోసం చాలా ప్రయత్నం కనబడుతుంది. కుబుసంలాంటి ధోవతి; ఆ ధోవతికంటె కూడా సన్నని లాల్చీ; ఆ లాల్చీలో నుంచి తొంగిచూస్తూ చేతులులేని అల్లిక బనియన్; వల్లెవాటుగా సన్నని జరీ ఉత్తరీయం, కాళ్ళకు ఆకు చెప్పులు; చేతికి గడియారం; కళ్లకు గాగుల్స్. +కోటమ్మ ని న్నెతుక్కుంటూ, పొద్దున్నే పేటకి రాలేదట్రా మీ బాబు? +చలపతి నన్ను వెతుక్కుంటూ తను రావడం దేనికి? నేనేం పాపాయినా దారితప్పి పోవడానికి? +కోటమ్మ అది కాదురా, బాబూ! పంటమ్మి డబ్బు తెమ్మని పంపిస్తే +చలపతి పంపిస్తే, ఆ డబ్బు పుచ్చుకుని, దేశం తెగించి పారిపోయాననుకున్నాడా? +కోటమ్మ చూడవే, పొన్నీ! ఆడిమాటలు! మొన్న పొద్దున్ననగా వొడ్లు తోలించుకెళ్ళి తను బస్తీలో +చలపతి అక్కడ ఆ రైసుమిల్లు వాళ్లు డబ్బివ్వకపోతే నన్నేం చెయ్యమంటా రేమిటి? +పొన్నమ్మ అంత కోపం దేనికిరా తమ్ముడూ? ఇప్పుడు పిన్నా మేమనిందని +కోటమ్మ అక్కడ పైక మందకపోతే, అందలేదని తెల్లారి లేస్తే లచ్చా తొంబైమంది వొస్తూ పోతూ +వుంటారుగదా ఎవళ్ళ చేతనైనా కాస్త కబు రంపితే మే మెందుకు గుంజాటన పడతాం! +పొన్నమ్మ నిజమే తమ్ముడూ! కాకితోనైనా కాస్త కబురు చేస్తే కాదూ? +చలపతి కబురెలా చెయ్యడం? ఏపూట కాపూట మీపని చేసి పంపిస్తామని వాళ్ళంటూవుంటే! +కోటమ్మ సర్లే, బాబూ! నువ్వు సుకంగా తిరిగొచ్చావ్! అదే పదేలు గాని, నిన్నెతుక్కుంట�� యెళ్ళిన +బాబు నువ్వు తగల్లేడని యెంత గాబరా పడుతున్నాడో, ఏమో, ఖర్మం! పైకెంత బోకరించినా, వొట్టి బయస్తుడు. కాస్తికీ కూస్తికీ గుండె బేజారౌతాడు. సందేళకి తప్పకుండా తిరిగొస్తానని చెప్పెళ్లాడు గాని, నువ్వు కనిపించలేదని ఇవాల్టి కిఖ రాడేమో. చివరి బస్సొచ్చేసిందా? +పొన్నమ్మ వచ్చే వుండాలి. నువ్వొచ్చింది చిట్టచివరి బస్సేగా, అబ్బాయ్ ? +చలపతి ఉఁహుఁ. అది మరి కాసేపటికిగాని రాదు. నే నొచ్చింది. దారిలో చెడిపోయి,గంటన్నర +పొన్నమ్మ అంతే మరి! ఏదైనా సాగితే బండి, సాగకపోతే మొండి. +కోటమ్మ సర్లేరా, బాబూ! రా! కాళ్లు కడుక్కురా బువ్వ పెడతా! +చలపతి ఉఁహుఁ! ఆక లెయ్యడం లేదు. +కోటమ్మ అయ్యొ, ఖర్మ! ఆక లెయ్యకపోవట మేమిట్రా? పెరుగోసుకైనా రెండు ముద్దలు +కోటమ్మ మా నాన్నవుగా రెండంటే రెండే ముద్దలు. +చలపతి (చిరాకుగా నా కాకలి లేదంటూంటే! +కోటమ్మ మళ్ళీ యిప్పుడు బయటి కెక్కడికిరా? కాసేపటికో, కూసేపటికో మీ బాబొస్తాడేమో! ఆయి +పొన్నమ్మ ఔను, తమ్ముడూ! బాబాయి యిప్పు డొస్తాడేమోగా! నువ్విప్పు డెక్కడికి? +చలపతి ఎక్కడికీ లేదు ఇక్కడికే! ఇప్పుడే తిరిగొస్తా. +కోటమ్మ సరేగాని, ఆ దస్తు యెంట దేనికిరా, బాబూ! ఇంట్లో బద్రంచేసి పో +కోటమ్మ ఆళ్ళ జిమ్మడ! ఇన్ని రోజు లట్టి పెట్టుకుని ఆళ్లు డబ్బివ్వనేలా? +కోటమ్మ చూశావటే, పొన్నీ! ఆడొచ్చిన యెడ మెక్కడ? ఎళ్ళిన యెడ మెక్కడ? కూసేపైనా కొంపలో +ఆడికి కాలు నిలిస్తేనా? ఈ మండిన వొంతిన పడి, ఈ మాయదారి బస్సు లేమంటూ వొచ్చాయో గాని, నాబిడ్డ చప్పగా చెడిపోయాడు. ఏ మేసి పెట్టినా సుబ్బరంగా పళ్లెం తుడుసుకు తినేవాడు. ఇప్పు డెంత కమ్మగా కూరొండినా, ఆడికి రెండు ముద్దలైనా దిగందేఁ! కూకున్నాడు కూకున్నట్టే లేసి చక్కాపోతున్నాడు. ఈపూట గత్తే అసలన్నమే వొద్దన్నాడు! +పొన్నమ్మ ఆఁ! కాపీవోటళ్ళకి మరిగినాళ్ళకి మన కూరా నారా నచ్చుతాయటే, పిన్నామా! ఇడ్డెన్లని, +దోసెలని ఆటి పేర్లయినా మండిన పేర్లు మనకి తెలవ్వు అక్కడేమిటో వర్రగా పెడతారట! +కోటమ్మ ఏం తిళ్ళో పాడు తిళ్లు! ఇల్లాంటి తిళ్లు ఎన్ని తిన్నా అన్నమౌతుందటే, కల్లాలా! +పొన్నమ్మ కాదనుకో! కాని అడ్డమైనాళ్ళకి ఇప్పుడు కాపీ వోటలు ఒక పెద్ద రందై పోయిందిగా! బస్తీకి +తిరిగేవాళ్ళు సగం సినిమాలకైతే, సగం కాపీవోటళ్ళకి. ఈ పాడు వోటళ్ళ మూలంగానేగా, ఊళ్లో పాలూ, పెరుగూ, మజ్జిగా కరువైపోయాయ్! నెయ్యిమాత్రం కావాలంటే దొరుకుతున్నదా? ఇప్పుడు పాడిచేసుకోవడం తాగడానికటే, పిన్నామా? అమ్ముకు మూటలు కట్టుకోడానికిగాని! తెల్లారకముందే వాడిక వాళ్ళోచ్చి పాలు, పెరుగూ, యెన్నా, అన్నీ బస్సులమీద యెక్కించుకు పోతున్నారు. +కోటమ్మ నిజమేనే, పొన్నీ! మొన్నొకనాడు సుట్టపాడొస్తే పావు సేరు నెయ్యికోసమని పిడతెట్టి ఊరంతా +తిప్పించినా దొరికితేనాం! మీ రమ్మేదానికి కానీ, అర్ధణా యెక్కు వేసుకు పొయ్యమన్నా, ఎవ్వతీ పొయ్యలేదు. +పొన్నమ్మ నీదంతా పిచ్చిగాని, ఇప్పు డసలు అర్ధ శేరు పాలు పొయ్యమన్నా పోస్తున్నారటే, పిన్నామా? +ఒకపూట వాడిక తప్పిస్తే, వాడిగ్గా వొచ్చేవాళ్లు అలిగి బిగదీసుకు పోతారట! అడిగితే మాట వోటుపోవడమే తప్ప, ఒక్క బొట్టయినా రాల్చరు. +కోటమ్మ అయ్యొ! కాలాని కెన్ని కడగళ్లొచ్చాయే. కల్లాలా!! +పొన్నమ్మ పిల్లా జిల్లా నోట గడ్డ కట్టి, ఆ అమ్ముకునే పాడైనా ఒక తీరూ దారీగా అమ్ముతున్నారా? +కోటమ్మ ఔనే, పొన్నీ! మొన్న యెవతో చెప్పింది. యెన్న తీశాక, దాన్లో యింత మజ్జి గోసి, కవ్వంతో +గిలకొడితే, ఆ మజ్జిగంతా యెన్నలో కెక్కి ఆటొస్తుందటగా! +పొన్నమ్మ అదొక్కటేనా? మైదాపిండి మెత్తగా ఉడకబెట్టి యెన్నలో కలిపేస్తున్నారు! +కోటమ్మ ఇంత పాపం మూట కట్టుకుంటే ఏం ముందు కొస్తారులే! ఈ మండి నొంతెన పడి, ఈ +మాయదారి బస్సు లొచ్చి, ఈ ముదనష్టపు బస్తీల కెక్కడం ఎక్కువైనాకేగాని, అంతకుముందు ఈ పాపా లెరగమే, పొన్నీ! ఎటొచ్చీ ఈ ఏణ్ణర్ధం, రెండేళ్ళ నుంచేగా ఈ యిడ్డూరాలన్నీ! +పొన్నమ్మ నిజమేనే పిన్నామా! నాలుగేళ్ళనాడు మా రెండో పిల్ల పెళ్ళికి కానీ పెట్టి కూర +కొన్నామూ? ఇరుగు పొరుగాళ్ళే గుమ్మడికాయలు, సొరకాయలు, దోసకాయలు, వంకాయలు, బెండకాయలు, దొడ్లలో కాసినాటిని, అడక్కుండానే పట్టుకొచ్చి యిల్లు నింపారు. అదే పోయినేడు మా మూడోపిల్ల పెళ్ళికి తోటకూర కాడ సుద్దా అన్నీ బస్తీ కెళ్ళి కొనుక్కోవా ల్సొచ్చింది! +కోటమ్మ అంతేనే, కల్లాలా! ఇదివరకంటే మంచొచ్చినా, చెడొచ్చినా ఒకళ్ళ కొకళ్లు ఆదుకునే +వాళ్లు. ఇప్పుడేముందీ? డబ్బుకు మరో డబ్బు ముడేసి +పొన్నమ్మ (కాళ్ళ అలికిడి విని, వీధిగుమ్మంవైపు ముఖంతిప్పి అడుగోనే, పిన్నామా, మా +(అప్పయ్య ప్రవేశిస్తాడు. వయస్సు దాదాపు అరవై సంవత్సరాలు. అయినా, శరీరపటుత్వం కొంచెమైనా సడలనివాడు. పొలంలో వంగితే, పడుచువాళ్లను మించి పాటుపడగలవాడు. +అప్పయ్య (లోపలికి అడుగు పెడుతూనే కోటమ్మతో ఏమేఁ! వాడు పేటలో లేడు! +అప్పయ్య దొర దిగాడన్నమాట! ఏడీ, మరి? +కోటమ్మ వాకిట్��ో వాడు వాకిట్లోనే ఊరిమీదికి పోయాడు. ఎంత బతిమిలాడినా తిండైనా తిర్లేదు! +అప్పయ్య అప్పుడే ఇంటికి రావడమూ, ఊరిమీదికి పోవడమూ జరిగిందన్నమాట! ఆ దస్తు +అప్పయ్య డబ్బివ్వకపోవడ మేమిటి? సొమ్ము సంచులమీద పెట్టామని వాళ్ళు చెబితే! +పొన్నమ్మ అబ్బే! లేదటే బాబాయ్! ఆళ్ళు తెగ తిప్పి, ఉత్తచేతుల్తో పంపించారని అబ్బాయి అంటేనే! +అప్పయ్య వీడింత దొంగ వెధ వయ్యాడే! ఒక్కమాటైనా నిజం లేదుగదా? బేరం పుచ్చుకోగానే, +డబ్బిచ్చేశామని వాళ్ళు నాతో సొష్ఠంగా చెప్పారు! +కోటమ్మ అయ్యొ ఖర్మ! అయితే ఆడు డబ్బేం చేసినట్టు! కాస్తా, కూస్తా! మూడేల సిల్లర! +అప్పయ్య వా డొంటికి బాగా నీరుపట్టింది. కళ్లు పసరెక్కి కొట్టుకుంటున్నాడు. నేను కాస్త బద్ధకించి, +వొడ్లు అమ్ముకు రారా అని పంపిస్తే, నన్నింత రొష్టు పెడతాడూ? ఎక్కడున్నాడో చూసి, సిగ పాయతీసి, వాణ్ణి ఈ పూట సున్నంలోకి ఎముకలేకుండా నలగ బొడవకపోతే నా పేరు అప్పయ్య కాదు. +(మండువా చూరులోనుంచి కోలుపుకర్ర తీసుకుని, వీధిలోకి బయల్దేరబోతాడు. +కోటమ్మ (అడ్డు వచ్చి సర్లే! నువ్వూరుకో! కన్నూ మన్డే; యేలూ మన్డే. ఆడ్డి పట్టుకు కొడితే పోయిన +అప్పయ్య (కోటమ్మను తోసివేసి వెళ్ళిపోతూ ఎప్పటికప్పుడు నువ్వే వాణ్ణి చెడగొట్టింది. నువ్విచ్చిన +అలుసు చూసుకునేగా వాడు మేకై కూర్చున్నాడు. +కోటమ్మ (నెత్తి కొట్టుకుంటూ ఇది నా ఖర్మ. +పొన్నమ్మ ఆఁ! నీకు తెలవదులేవే, పిన్నామా! ఆపాటి భయం లేకపోతే మాటింటారటే! +కోటమ్మ చాల్లే! చెప్పొచ్చావ్! కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని. ఆడి కాలో,సెయ్యో +పొన్నమ్మ ఆఁ! బాబాయిది బుసబుస పొంగు? ఎదో తామస మొచ్చి కేకలేస్తూ పోయాడు గాని, +పెరిగొచ్చిన కొడుకు పై చెయ్యి చేసుకుంటాడటే, పిన్నామా! +కోటమ్మ ఏమో కర్మ! మండిపడుతూ యెళ్ళాడు. పిచ్చి కోపంలో నా కొంప కేమి తిప్పలు తెస్తాడో! +ఇంతకీ ఈ పీడంతా ఆ పెదనాగన్నగారి బూసయ్య +భూషయ్య (ప్రవేశిస్తూ ఏమిటీ, కోటమ్మక్కా నా పేరెత్తు తున్నావ్! +(భూషయ్య వయస్సు నలభై అయిదు ప్రాంతాల. మనిషిలో ఎంతో హుందాతనం కనబడుతూ +వుంటుంది. తాతవలె, తండ్రివలె తానుకూడా తన హుందాతనంవల్లనే పోరుకు పెత్తందారై, వయస్సులో తనకంటె పెద్దవారినుంచి కూడా మన్నన లందుకొంటున్న వాడు. +కోటమ్మ వొచ్చావ్, బాబూ, నువ్వు! మాటలో మూటేసుకుని! నువ్వే మా కిన్ని కడగళ్లు తెచ్చావ్! +భూషయ్య (నవ్వుతూ అంత పాపం చేశానూ? +కోటమ్మ నీకిది నవ్వులాటగా వుందటరా, బూసయ్యా? +క��టమ్మ ఏమిటి? గింజలమ్ముకురారా అని పిల్లాడిని పేటకి పంపిస్తే, ఆటినమ్మి ఆ డబ్బంతా +మంగళం చేసుకొచ్చాడు. ఈ మాటినేసరికి మీ బావయ్యకి వాళ్లు మండుకొచ్చి కడుచ్చుకు కొడుకు మీది కెళ్లాడు. +భూషయ్య ఆ మా బావయ్యకి అంత వొళ్లు తెలియని కోప మొచ్చింది? +పొన్నమ్మ: వళ్ళు నా పుట్టుకొస్తుంది రేచిక్క ఇట్టాంటి పన్లు చూస్తే, +కోటమ్మ అబ్బాయ్. నువ్వు కాస్తెల్లి మీ బావయ్యకి సర్దిచెప్పి తీసుకురారా. మంగళమైన సొమ్మేమో +మంగళమైంది. ఆణ్ణి బాదితే పోయిన డబ్బీస్తుంది? +భూషయ్య ఇప్పుడు నీ కొడుక్కొచ్చిన భయమేమి లేదు, కోటమ్మక్కా వాడు మాయింట్లో భద్రంగా +కోటమ్మ: ఆడ మీఇంటి కాడున్నాడు. అయితే, పరవాలేదులే. +భూషయ్య పరదా లేదూ? ఇంతకు ముందేగా నేమ మీకు కడగళ్లు తెచ్చా నన్నావ్! +కోటమ్మ ఆ మాట ఇప్పుడననూ? నువ్వు ఈ మండిన రోడ్డు పోయించి, ఈ మాయదారి వొంతె +నేయించి, ఈ ముదనష్టపు బస్సులు తెప్పించాకే కాదట్రా, ఊళ్ళో కొంపకొంపకీ ఇన్ని కడగళ్ళొచ్చాయ్. అంతకుముందు ఈ యిడ్డూరా లెరిగున్నామూ? +పొన్నమ్మ అట్టా అడుగు, పిన్నామ. బాగా ఆడుగు! +భూషయ్య అయితే, పొన్నమ్మా నువ్వు పాడిమీద ఎంత సంపాయిస్తున్నావ్ +పొన్నమ్మ ఆయా ఈ యేడు మాకు పా డెక్కడిది? +భూషయ్య పోనీ, ఈ యేడు కాకపోతే నిరుడెంత మూటగట్టావ్? +పొన్నమ్మ ఆఁ. చాలా మూట గట్టాం! వాటికి పోసిన తవుడుకే చాల్లేదు +కోటమ్మ అదేంటే, పోన్నీ! పాడికుండమీద నాలుగు డబ్బులు కళ్ళబడితేనేగాఁ ఆ నానుపేట +భూషయ్య (నవ్వుతూ అలా అడుగు, కోటమ్మక్కా బాగా అడుగు! +పొన్నమ్మ అడగడానికీ, కడగడానికి నే నెవరి యింట్లోనైనా కన్నామేశానా! +భూషయ్య ఎవరింట్లో కన్నంచేస్తే ఎవ రూరుకుంటారమ్మా? పాడి అమ్ముకోబట్టి +పొన్నమ్మ అమ్ముకోక పందేరం పెడతా రేమిటి? ఊరికే మా కెవ్వరేమీ పంచిపెట్టడం లేదే? +భూషయ్య ఊరికే పంచి పెట్టమని నేనంటానా? రోడ్డు పొయ్యబట్టే, వంతెన పడబట్టే నాలుగుడబ్బులు +అందరికళ్లా పడుతున్నా యంటున్నాను, అందరూ కాస్త పచ్చపచ్చగా వున్నారంటున్నాను కొత్తగా చేతిలో నాలుగు డబ్బులు గురగుర లాడుతుంటే, ఎంతటివాళ్లకైనా మతులు పోతాయ్! అంతమాత్రానికి చేతిలోకి నాలుగు డబ్బు లొచ్చేదారి చూపించడమే తప్పా? +కోటమ్మ మా లావు చూపించావులే దారి! ఆ మండిన బస్తీ నుంచి ఒక కానీ ఇక్కడికొస్తే, ఇక్కడి +నుంచి రూపాయి అక్కడికి పోతున్నది. ఇంతేనా సంబరం! వాళ చూశావుగా! కాస్తా, కూస్తా! మూడేల చిల్లర. చల్లా పెరుగూ అమ్ముకుని కానీ కానీకాడికి ముడేస్తే, ఎప్పటికి కాను మూడేలు! ఈ మాయదారి బస్సులు తగలడకముందు మా అబ్బాయి బస్తీ ముఖ మెరుగున్నాడూ? +పొన్నమ్మ అట్టా అడుగు, పిన్నామా! బాగా అడుగు! +భూషయ్య నేను తిరగమన్నానటే, కోటమ్మక్కా మీ అబ్బాయిని బస్తీ చుట్టూ! నామాట విని, ఎక్కడైనా +మంచి పిల్లను చూచి వాడికి తొందరగా ముడిపెట్టండి. గుదిబండ మెడని పడితే, ఇంటి నతికి వుంటాడు. +కోటమ్మ ఆడింత గాలిగా తిరుగుతుంటే ఆడికి పిల్ల నెవరిస్తారు? +పొన్నమ్మ ఆడికి పిల్లనిచ్చేవాళ్లే కరువటే, పిన్నామా? మా పెద్దమ్మాయి దగ్గర వుందిగా ఎదిగిన పిల్ల. +నువ్వు “ఊఁ" అనాలేగాని, పదేనేలు కట్నంపోసి +కోటమ్మ కట్నాల కేమొచ్చెలే! అంత దూరం సమ్మందం +పొన్నమ్మ ఎంతదూరమే, పిన్నామా! పది ఆమడలైనా లేదు. ఈ ఊరునుంచి ఆ ఊరుదాకా బస్సులు +నడుస్తూనే వున్నాయిగాఁ! పొద్దు నిక్కడ బయల్దేరితే, పొద్దుగూకేళకుముందే అక్కడ దిగొచ్చు. +కోటమ్మ ఎందుకురా బూసయ్యా! నీకంత నవ్వుగా వుంది? +భూషయ్య ఏం లేదు, కోటమ్మక్కా ఈ ముదనష్టపు బస్సులు రాబట్టే గదా, పొన్నమ్మ పెద్దమ్మాయిగారి +పొన్నమ్మ మన పెత్తందారుగారి ఎకసక్కాలకేం గాని, అయిన సమ్మందం! పిల్ల వొంటిని డెబ్బై +నవర్సుల బంగారం వుంది. ఏమంటావే, పిన్నామా? +కోటమ్మ ఆఁ! ఇప్పు డేం తొందర లేవే +పొన్నమ్మ వచ్చేనెల్లో రెండే లగ్గా లున్నాయి. ఆ రెండూ తప్పనిడిసి, మరి ఈ యేటికి లగ్గమే +లేదంటున్నారు. ఈపూట నే నసలు ఈ మాట కదలేసిపోదామనే సగ మొచ్చానే, పిన్నామా! +కోటమ్మ: సరే సూద్దాం లేవే, పొన్నీ! +పొన్నమ్మ సూద్దామంటే కాదు; తొరగా ఏదో ఒకమాట తేల్చాలి నువ్వూ, మా బాబాయీ కూడా +బలుక్కుని. నోరు తెరిచి అడిగినందుకు, నామాట దక్కించాలి. పొట్టోయింది. మరి నే నెళ్లొస్తా. +భూషయ్య అంత కట్నం పోస్తామంటే, ఆ సంబంధం వొద్దంటా వేమే, కోటమ్మక్కా +కోటమ్మ కట్న మొస్తే సాలట్రా? మంచీ సెబ్బరా లేదూ +భూషయ్య వాళ్ళకేఁ? పొన్నమ్మ పెద్దల్లుడికి ఈ మధ్య బాగా కలిసొచ్చిందటగా! +కోటమ్మ ఆఁ! ఎంత కొత్త భాగ్య మొస్తేనేరా, అబ్బాయ్! ఆడిగుణం మంచిది కాదు. ఆడు బోగం +కొంపలకి తిరుగుతూ, పెళ్ళాన్ని కాపరానికి తీసికెళ్లకుండా, మొదట్లో రెండు మూడేళ్లు ఈ పొన్నిని నానాగడ్డి తినిపించలేదట్రా? ఈ మాయదారి సమ్మందం మా కెక్కడ దాపరించిందని కనబడ్డాళ్లందరికీ చెప్పుకుని ఆవురావురని ఇది అప్పు డేడ్చేదికాదూ? ఇవ్వాళ గతే, నా అల్లుడు పదేనేలు కట్నమిస్తాడంటూ చెప్పొచ్చింది! +భూషయ్య: కట్నం అక్కర లేదనుకుంటే, మా పిల్లని చేసుకో! +కోటమ్మ నీకేం తక్కువరా కట్న మివ్వక పోవటానికి! +కోటమ్మ నీ కూతురికి నువ్వేమీ పెట్టుకోవట్రా? అయితే, అది ఉసూరుమన్దూ? +భూషయ్య నా కూతురికి నే నేమైనా పెట్టుకుంటానో, లేదో అది నా యిష్టం. ఇంత కట్నం, అంత కట్న +మని ముందుగానే బేరాలు మాత్రం నాకు గిట్టవ్. బేరాలకు ఇదేం బర్రెగొడ్డా! కట్నం పేరు పెట్టి నే నొక చిల్లిగవ్వైనా యివ్వను! +కోటమ్మ కట్నం లేందే నీపిల్ల మాకు దేనికి? ఆడికి పాతికేలు పోస్తామంటూ ఎన్నో సమ్మందా +లొస్తున్నాయి. నిచ్చేపంలాంటి బిడ్డ! నిలువెత్తు డబ్బోసినా, నా బిడ్డంటి అల్లుడు నీకు దొరకుతాడూ? +భూషయ్య (ఈ ఘట్టంలో ధుమధుమలాడుతూ లోపలికి వచ్చిన అప్పయ్యతో అప్పయ్యబావా! +నిలువెత్తు డబ్బు పోసినా దొరకని కొడుకుతో లేనిపోని పేచీ లెందుకు +అప్పయ్య వాడా నా కొడుకు! ఇఖ, వాణ్ణి నా గడప తొక్కనిస్తానూ? +కోటమ్మ చాల్లే! ఏం మాటలు! ఎవరైనా యింటే నవ్విపోతారు! +భూషయ్య ఎందుకే. అప్పయ్యబావా, అంత టెంపరు! +అప్పయ్య ఈపూట వాడి గీత బాగుంది! లేకపోతే, రక్తం కళ్ల జూచేవాణ్ణి కాదూ? కలెత్తేసరికి +భూషయ్య (నవ్వుతూ నలుగురూ పోగయ్యేవరకు ఆగినాడివి నువ్వేం రక్తం కళ్ల జూస్తావ్, +కోటమ్మ నీ యెకసక్కాలకు యేళా పాళా లేదట్రా, బూసయ్యా! +అప్పయ్య ఆ వెధవని ఈపూట పాతేసేవాణ్ణి కాదూ! ఆ వంతెనకాడ పదిమంది వుండబట్టిగాని భూషయ్య చలపతి వంతెనవద్ద వున్నాడటే, అప్పయ్యబావా? నేను తిరిగొచ్చేదాకా మాయింట్లో నుంచి +కదలొద్దని చెప్పొస్తే వాడికి కాలు నిలవలే దన్నమాట! +కోటమ్మ ఆ డొకచోట కాలు నిలిచే గున్నైతే మా కిన్ని తిప్పలెందు కొస్తాయిలే! +భూషయ్య మాట్లాడితే తిప్పలు తిప్పలంటావ్. ఇప్పుడు నీకొచ్చిన ప్రమాద మేమిటి, కోటమ్మక్కా? +కోటమ్మ చూస్తూనే వున్నావుగా! ఇ దేమిట్రా? కొంపకి తిప్పలు కావూ? +అప్పయ్య శిస్తుకైనా రికానా లేకపోబట్టేగా ఈ తక్కువ ధరల్లో సగం పంట అమ్ముకుంది! “ జాగ్రత్తగా, +అబ్బాయ్!” అని మరీమరీ చెప్పి పంపిస్తే, అంతా జలగడుక్కొస్తాడూ? పైగా, వాళ్లు డబ్బివ్వలేదని +భూషయ్య అబ్బే! లేదే, అప్పయ్యబావా! వాడు మొత్తమంతా ఖర్చు పెట్టలేదు. ఏదో కొంచెం బొర్రి +పడింది. చేబదులుచేసి దాన్ని పూడుద్దామనే ఈపూట నాదగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. బుద్ధిమంతుడిలా నాదగ్గరికి రాబట్టి సరిపోయిందిగాని, అదే ఏ షాహుకారు సుబ్బయ్యలాంటి వాడిదగ్గిరికో వెళ్లితే రూపాయి చేతిలో పెట్టి, రెండు రూపాయలకు ప్రోనోటు ర��యించుకునే వాడు కాదూ? +పెట్టుకుంటాడేమో గాని, ఆడు మూడే లేం చేస్తాడు! ఆడేం తాగుతాడా? తలకు బోసు కుంటాడా? +అప్పయ్య (మొత్తం సొమ్ము గల్లంతు కాలేదని విన్నంతనే కోపం కొంత చల్లారిపోగా బొర్రి +భూషయ్య ఆఁ! ఎంతోనా, అప్పయ్య బావా! సాదరుకింద తను వాడుకున్న బాపతు ఏవో చిల్లరమల్లర +అప్పులుంటే, వాటిని ఆపడానికి వీల్లేక, ఒక నాలుగు వందలు వాటికింద జమకట్టాడట. ఈ మాట తెలిస్తే నువ్వెక్కడ కోప్పడతావో అని నీ యెదటపడ్డానికి వాడు నీ జంకుతున్నాడు. +కోటమ్మ ఏదో చిన్న సన్నాసి! ఆపాటి వాడు వాడుకున్నాడేమోలే! +అప్పయ్య వాడా చిన్న సన్నాసి! ఈ మధ్య నీటుగోటులు తెగబలిసిపోతే! ఇస్త్రీ మడతలు తప్ప పనికి +రావడం లేదు. తలకి వాసన నూనెలు కావాల్సొచ్చాయి. వీడు ఉద్యోగాలు చేస్తున్నాడా? ఊళ్ళేలుతున్నాడా? వీడికి చేతికొక గడియారం దేనికి? నాకు అరవై యేల్గిస్తున్నాయ్! ఇంకా కళ్లజోడుతో పనిపడలేదు. నాకురాని చత్వారం వీడి కొచ్చిందా? వీడికి కళ్లజోడు దేనికి? షోకు బలిసి, ఎంత నాజూకు తేలాడని! ఎండ తగిలే వొళ్ళు కందిపోతుంది కాబోలు పొలంవైపు తొంగైనా చూడ్డంలేదు. +భూషయ్య అదీ ఒక చిన్నతనమే! ఏమైనా నువ్వంటే వాడికి భయభక్తులేనే, అప్పయ్య బావా! లేకపోతే, +అప్పయ్య వాడి భయకు లేవో కనబడుతూనే వున్నాయ్! నమ్మి గింజలు తోలించి పంపిస్తే +భూషయ్య వాడు చేసింది తప్పేననుకో. కాని, నువ్వు కానకుండా ఏ రాత్రివేళో కళ్లాంలోనుంచి ఒక +పదిబస్తా లెత్తించివేస్తే ను వ్వేం చేసేవాడివి? అలాంటి పాడు పని చెయ్యనందుకు సంతోషించక +కోటమ్మ బొర్ర సుబ్బయ్యగారి రెండోవాడు మొన్న మాసూలులో అంత పనీ చేశాడు. పాలేరుని +కట్టుకుని, బాబుకి తెలియకుండా పందుమొడ్లు కోమటి మల్లయ్యకి పోశాట్ట! +భూషయ్య ఆఁ! నేను చెప్పవచ్చిందీ అదే, బావా! ఊళ్లో సన్నాసుల కంటె మన చలపతి చాలా +మెరుగ్గాదూ? అలాంటి తప్పుడు పను లేమీ చెయ్యకుండా తనింత వాడుకున్నానని పబ్లికుగా చెబుతున్నాడు. వాడి ఖర్చులేవో అయిటంవారీగా నాకు చెప్పాడు. కాస్త దుబారా అయినా, అంత చెడ్డ ఖర్చు లేమీ కావు. సినిమాలు, కాఫీ హోటళ్లు, సోడాలు, సిగరెట్లు, కిళ్లీలు ఇలాంటివే! +అప్పయ్య సర్లే! ఏం తగలడ్డాడోగాని, ఆ మిగతా సొమ్మైనా భద్రంగా వుందా? +భూషయ్య ఏదో బస్తీ అనగానే తలలు మార్చేవాళ్లు వుంటారుగా! పేటలో ఆ పార్కుపక్కని నీకు +తెలుసుగా, పెద్ద బజారులోని శివాలయం దానియెదట ఎవళ్ళో వచ్చి ఫెయిరీలాండ్స్ అనో, వాళ్ళ తలకాయ లాండ్స్ అన��� పెట్టారు. అందరూ విరగబడుతుంటే, ఏమిటోనని మన చలపతికూడా ఒకపూట లోపలికి వెళ్లాడట. కళ్లు జిగేల్ మంటూ ఎలక్ట్రిక్ దీపాలు పెట్టి పాటలని, డ్యాన్సులని, ముందు నలుగుర్నీ లోపలికి రాబడతారు. ఆ తర్వాత బంతులూ, బాణాలు విసరడమని ఏవేవో ఆటల్లోకి దించి, డబ్బు గుంజుతారు. మనవాడు వాళ్ళ మాయలో పడి +భూషయ్య వరసగా నాలుగుసార్లు పందెం పోయేసరికి మరొకడైతే వేడెక్కి మొత్తానికి మొత్తాన్నే +పోగొట్టు కొచ్చేవాడే! మనవాడు బుద్ధిమంతుడు గనక, చప్పున గుక్కతిప్పుకున్నాడు. వా డోడింది అబ్బే! ఎంతోనా ఒక్క ఆ రొందలు! +అప్పయ్య వొళ్లు తెగబలిసి జూదంకూడా మొదలెట్టాడన్నమాట! ఇక తాగుడొక్కటే తక్కువ! వీడు +నాకడుపున చెడబుట్టాడు! ఈ నీతిమాలినవాణ్ణి ఇక నా గడప తొక్కనివ్వను, అదేమైనా గాని! +భూషయ్య ఎందుకే, అప్పయ్య బావా, అంత టెంపరు! తెలిసో తెలియకో వాడు కాస్త దారితప్పాడే +అనుకో! పెద్దవాళ్ళం మనం వాణ్ణి నయానా, భయనా మళ్ళీ సరైన దారికి తెచ్చుకోవాలేగాని, శరిస్తే చప్పగా చెడిపోడూ? +అప్పయ్య వాడిఖ ఎలా తగలబడితే నాకేం! జూదాలుకూడా మొదలెట్టిం తర్వాత! +భూషయ్య అదుగో! అక్కడే నువ్వు పప్పులో కాలేస్తున్నావ్. అప్పయ్య బావా! తనుచేసింది తప్పేనని +వాడు నొచ్చుకుంటున్నాడు. వాడొచ్చి కన్నీళ్ళ పర్యంతమైతేనే నేను పనికట్టుకొచ్చాగాని, లేకపోతే జమీందారొచ్చినా ఈ వేళప్పుడు యింట్లో నుంచి కదిలేవాణా నువ్విప్పుడు తొందర పడొద్దు. +అప్పయ్య తొందరలేదు; గిందరలేదు. ఈ పూటతో వాడికీ, నాకూ సరి! +కోటమ్మ ఆఁ! ఏం మాట లవి? ఆడింకా చిన్న సన్నాసి! ఈ మండిన రోడ్డు పడి, ఈ మాయదారి +వొంతె నేర్పడి, ఈ ముదనష్టపు బస్సు లొచ్చాక ఆడు కాస్త గాలిగా తిరుగుతున్నాడు గాని, అంతకముందు ఆడు ఏ పక్కిని పడుండేవాడో అసలు అజుండేదీ? +అప్పయ్య ఈ మాటలు నాదగ్గిరిక చెప్పకండి. ఆరు నూరైనా, నూరు ఆరైనా ఇక వాడిదారి వాడు +కోటమ్మ (నెత్తి కొట్టుకుంటూ ఇంతకీ నాకొచ్చి పడ్డాయి ఈ తిప్పలు! +భూషయ్య నువ్వూరుకో వమ్మా! బావ టెంపరులో వుండి అలా అంటున్నాడుగాని, కొడుకు నింట్లో +నుంచి వెళ్లగొట్టేస్తాడనే! మొదటి సంబంధం కొడుకు లిద్దరితో పంచుకున్న పదెకరాల్ని రాత్రింబగళ్ళూ దేవులాడి పాతికెకరాలు చేసింది ఈ కొడుకు మీద మమకారంతో కాదూ +కోటమ్మ నువ్వేమైనా అనుకోగాని, బూసయ్యా! నువ్వేరా నిచ్చేపం లాంటి నాబిడ్డ కీ తిప్పలు తెచ్చి +భూషయ్య (నవ్వుతూ ఔను, కోటమ్మక్కా! ఈ మండిన రోడ్డు పోయించి, ఈ మాయదారి వంతెన +వేయించి, ఈ ముదనష్టపు బస్సులు తెప్పించి +అప్పయ్య నవ్వులాట కాదురా, అబ్బాయ్! ఊరు నుద్ధరిస్తానని బయల్దేరి, నువ్వే ఈ పీడలన్నీ తెచ్చి +మా తలకు చుట్టావ్! ఈ పాడు బస్సు లొచ్చాక ఏ తండ్రి మాటా ఏ కొడుకూ వినడం లేదు. ఊరే నాశనమైపోతున్నది. +భూషయ్య అయితే, అప్పయ్యబావా! నిన్న పొద్దున నువ్వు తూర్పు చెరువుగట్టున ఏమిటీ +అప్పయ్య ఆఁ! ఏం లేదు. చెరువు నీళ్లన్నీ పసరెక్కి పోయాయని, తూము తెరిపించి, కాల్వలోనుంచి +భూషయ్య ఆఁ! నేను చేయించిందీ అంతే! పాత పసరనీళ్ళని కొట్టేసినా, కొత్త నీళ్ళెంట వొండు +రాదూ? చెత్తా చెదారం కొట్టుకురాదూ? అలాగని పసరునీళ్ళే తాగుతామా? కొత్త నీళ్ళెంట వచ్చే వొండు విరిగి, చెత్తా, చెదారం పోయి, మంచి నీళ్ళు తేరుకోడానికి కొంత కాలం పట్టదూ? +కోటమ్మ పసరు నీళ్ళేమిటి? వొండు నీళ్ళేమిటి? ఏమిట్రా నీమాటలు, బూసయ్యా! +భూషయ్య నీ కెలాగే విడమర్చి చెప్పడం, కోటమ్మక్కా? సర్లే, నువ్వే చెప్పు లోకం ఆరోజు కారోజు +కోటమ్మ ఆఁ! తెలివి మీరిపోకేఁ? ఈ బస్సులు, ఈ సినిమాలు, ఈ కాపీవోటళ్ళు +భూషయ్య అబ్బే! ఇంతే కాదు. ఇతర విధాలకూడా ప్రపంచం చకచకా ముందుకు సాగిపోతూ వుంది. +మనం కూడా దానితో పాటు నడవాలి. లేకపోతే, అది మనపైగా నడిచిపోతుంది. అందుకని బస్తీలతో మనకి సంబంధం తప్పదు. +కోటమ్మ ఇదివర కల్లా గడవలేదేమిటి బస్తీలకి పోకపోతే! +భూషయ్య ఇదివరకటి దారి వేరు; ఇప్పటి దారివేరు. కాలానితో పాటు మనమూ పోవాలి; దానికి +ఎదురీదలేము. సరే, అప్పయ్య బావా! నేను వెళ్ళిస్తాగాని, నువ్వు కాస్త తమాయించుకో! లేకపోతే, వాడు మరీ తెగబడి చప్పగా చెడిపోతాడు. +అప్పయ్య పోనీ, ఇక వాడు ఏ యేట్లో కలిస్తే నాకేం! +కోటమ్మ చూశావట్రా, బూసయ్యా, ఆ మాటలు +భూషయ్య అదుగో! ఆ టెంపరే వద్దంటున్నాను. తెగేవరకు లాగడం మంచిది కాదు. బ్రహ్మయ్య, +బ్రహ్మయ్య కొడుకు వీధికెక్కడం చూస్తూనే వున్నాంగా! తలలు బద్దలు కొట్టుకుని ఛార్జీలదాకా వెళ్లారు. తండ్రీ కొడుకులకైనాసరే తగవులు పెంచి, కొంపలు తియ్యడానికి ఎంతమంది టౌట్లు మన ఊళ్లో తయారయ్యారో నీకు నేను చెప్పాలటే? +అప్పయ్య సర్లే! ఆకాడికొస్తే ఎవరి పసెంత వుందో తెలుస్తుంది! +కోటమ్మ అయ్యొ ఖర్మ! ఆ డెవడని ఆడిమీద నువ్వు పగపట్టడానికి! పెద్దాళ్ళకి మనకే యింత +పొన్నమ్మ (హుటాహుటిగా ప్రవేశిస్తూ పిన్నామా! కోటమ్మ పిన్నామా! +పొన్నమ్మ ఆడు లేడంటే, పిన్నామా! ఆ సీపురుకళ్ళ శేషయ్య, ఆడు అప్పయ్యను ఆ చూచి) +మా బాబాయి ఇక్���డే వున్నాడూ! బాబాయ్! నువ్వు అబ్బాయిని పట్టుకు కొట్టావని చెప్పి, నీమీద ఆ సీపురుకళ్ళ శేషయ్య కేసు పెట్టించబోతున్నాడటే! +కోటమ్మ ఆరి! ఈడి జిమ్మడ! ఈడి కేం పోయేకాలం? +పొన్నమ్మ దెబ్బలు తగిలినట్టు దొంగ సర్టిఫికెట్టు పుట్టిస్తానని రెండొందలో, మూడొందలో అబ్బాయి +దగ్గిరి నుంచి అప్పుడే ఆ డొడుక్కున్నాడట. +కోటమ్మ ఆరి! ఈడి పెళ్లాంతాడు పుటుక్కున తెగ! ఈడు మా కెక్కడ పోగయ్యాడేం! +భూషయ్య నా నోట్లోమాట నోట్లో వుండగానే నే నన్నంత పనీ జరిగింది, చూశావా, అప్పయ్య బావా! +అప్పయ్య అబ్బే! ఆణ్ణి నేను కొట్టిం దెక్కడ? +భూషయ్య కొట్టాలటే కేసు బనాయింపుకు! దీన్తో సరేనా! చీపురుకళ్ళ శేషయ్య అంటే సామాన్యుడా! +అప్పయ్య అరవై ఏళ్ళోచ్చినై. నే నెన్నడూ సాక్ష్యానికైనా బో నెక్కలేదు. ఇవ్వాళ వీడు నన్ను కోర్టు +కోటమ్మ ఆడి తలకాడ దీపమెట్ట! ఆ చీపిరి కళ్లయెదవెంత చేయిస్తున్నాడు! +భూషయ్య ఔను! వా డెంతైనా చేయిస్తాడు! తంపులు పెట్టందే, తగవులు పెంచందే వాడి పొయ్యిలో +పిల్లి ఎలా లేస్తుంది? వాడి కదే బ్రతుకయ్యె! ఇంతకీ, అప్పయ్య బావా, మొదటే నువ్వు నా మాట వింటే, పంట అమ్ముకున్న మూడువేల చిల్లరలో పోయిన వెయ్యి పోగా, మిగిలిందైనా దక్కేదా? ఇప్పుడు మరొక రెండొందలో, మూడొందలో బొక్క! ఇంకా మన మాలస్యం చేస్తే +పొన్నమ్మ మన పక్కూరు డాక్టరుగారి దగ్గిరికి అబ్బాయిని తీసికెళ్లటానికని ఆ శేశిగాడు ఒంటెద్దుబండి +కోటమ్మ ఆడికి బిడ్డలు లేరూ! ఆడింట్లో పీని గెళ్ళ +అప్పయ్య ఇందాక కుర్రవాడు మీ యింటి కొచ్చినప్పుడు వాడి దగ్గరి డబ్బు తీసుకుని నువ్వెందుకు +భూషయ్య నిజమేనే, అప్పయ్య బావా! ఆ పని చేస్తే బాగానే వుండేది. కాని, నాకు తోచి చావలేదు. +కోటమ్మ అయిందేదో అయింది; ఆడ్డి ఎట్టాగైనా కొంపకి చేర్చరా, బూసయ్యా! నీకు పున్నెం +భూషయ్య మరి, మా అప్పయ్య బావ కాస్త తగ్గుతాడా, లేదా? లేకపోతే, మధ్య నా మాట పోతుంది. +కోటమ్మ ఆఁ! తగ్గ కేం చేస్తా డేమిటి? +పొన్నమ్మ ఎవరో ఒకరు తగ్గా లిప్పుడు. లేకపోతే, కొంప గుణ్డాన పడిపోదూ? +భూషయ్య కాని, మా అప్పయ్య బావ “ఊఁ!” అనందేనా? పట్నాలని చూచి బాగుపడేదిపోయి, మన +కుర్రకారు చెడిపోతున్నారనే ఒక హిందీ స్కూలైనా పెట్టించి, కొంత ప్రపంచ జ్ఞానం కలిగించాలని నే ననుకుంటే, ఊళ్ళో పెద్ద తలకాయలు నలుగురు కలిసొస్తేనా! “తుద కబ్బెరా తురక బాస” అన్నట్టు ఇప్పుడు హిందీ స్కూలొక్కటే తక్కువై పోయిందని నవ్వి, నామాట సాగనిచ్చారు కా��ు. సర్లే! అప్పయ్య బావా! ఏమంటావే? ఏవో రెండు మంచి మాటలు చెప్పి, మన చలపతి మనస్సు తిప్పి, ఇంటికి రమ్మన్నా! +భూషయ్య మరి నే వెళ్లోస్తానే. కోటమ్మక్కా ఏమైనా, కొడుకును అదుపులో పెట్టుకోవడం నే మా +బావయ్యకి చేతకాదనుకుంటా. ఆయన పాతకాలపు మనిషి. ఊరకేనే కస్సు బుస్సు మంటే, ఈ కాలపాళ్లు అంకికొస్తారా! వాణ్ణి నే నొక దారికి తెచ్చుకుంటా, నాతో సంబంధం చేస్తే. భార్యా భర్తలు మాలోచించుకుని రేపు నాకు కబురు చెయ్యండి. +కోటమ్మ సర్లే! నువ్వేగా ఈ తిప్పలన్నీ తెచ్చింది. ఎలాగో నువ్వే మళ్లీ కాస్త చక్కదొయ్యి! ఊరెంట +తిరిగి, చందాలోగుచేసి చట్టుబండలై, ఈ మండిన రోడ్డు పోయించి, ఈ మాయదారి వొంతి నేయించి, ఈ ముదనష్టపు బస్సులు తెప్పించి తెర +పాత్రలు ప్రొఫెసర్ రాధాకృష్ణ, మిసెస్ శ్యామలా రాధాకృష్ణ +స్థలం మద్రాసులో ప్రొఫెసర్ రాధాకృష్ణ డ్రాయింగ్ రూం +అది ప్రొఫెసర్ రాధాకృష్ణ డ్రాయింగ్ రూమ్, కుడివైపున బయట వరండాలో నుంచి ద్వారం; ఎడమవైపున డైనింగ్ రూమ్, కిచెన్ మొదలైన వాటిలోకి ద్వారం. ఎడమవైపునే ఒక మూలగా మేడపైకి మెట్లు. ఒక సెటీ, రెండు చెయిర్స్, ఒక సెంట్రల్ టేబుల్, రెండు పెగ్ టేబుల్స్, ఒక స్టాండర్డ్ ల్యాంప్, ఒక బుక్ షెల్ఫ్, రెండు పామ్ స్టాండ్స్, ఒక పెద్ద తివాచీ, ఒక సైడ్ టేబుల్ మొదలైన ఫర్నిచర్ తో, యాటీ తో, ఒరిజనల్ పెయింటింగ్స్ ” అది అధునాతన సంస్కృతి తొలుకాడుతున్న డ్రాయింగ్ రూమ్. +తెరలేచిన ఒక క్షణానికి మోటారు కారు వచ్చి వాకిట్లో ఆగిన శబ్దమౌతుంది. ఆ వెంటనే బయటి వరండాలో నుంచి ఈ కింది మాటలు వినబడతాయి. +మగగొంతు ఓ, ఇట్స్ ఎ ప్లెజర్. +(ఆ పిమ్మట మోటారుకారు బయల్దేరి వెళ్ళిన శబ్దం. ఈ శబ్దం అణిగిపోకముందే శ్యామల ప్రవేశిస్తుంది. ఆమెదే వరండాలో నుంచి వినవచ్చిన ఆడగొంతు. +శ్యామలకు ఇరవైమూడవ సంవత్సరం నడుస్తున్నా, ఇరవై దాటనట్టు కనబడుతుంది. ఆమెలోని ఆకర్షణకు ఆమె సౌందర్యం కంటె, ఆమె సంస్కృతి అధిక కారణం. +హాండ్ బ్యాగ్ తోనూ, ఏదో ఒక పార్సెల్ తోనూ ప్రవేశించిన శ్యామల వాటిని సెంట్రల్ టేబుల్ పైపెట్టి, సోఫాలో కూర్చుంటుంది. +బోయ్ (లోపలినుంచి ఆఁ! ఇదుగో వచ్చే, అమ్మా! వచ్చే!! +బోయ్ (ప్రవేశించబోతూ వస్తున్నా నమ్మా! వస్తున్నా! +శ్యామల బోయ్ రాగానే) వీధితలుపులు వేసుకోమంటే, తెరిచి వుంచావే? దొంగలెవరైనా దూరితేనో! +శ్యామల (ఆశ్చర్యంగా ఆఁ! ఎంత సేపైంది? +(ఇంతలో రాధాకృష్ణ ప్రవేశిస్తాడు. వయస్సు ముప్పై ప్రాంతాల అందగా డనల���ముగాని, చాలా +నాజూకైనవాడు. మనస్సులో రేగుతున్న తుపాను దాచిపెట్టుకోడానికి ప్రయత్నిస్తున్నవాని ముఖ కవళికలతో ప్రవేశిస్తాడు. కాలేజీకి వెడుతూ వేసుకున్న సూట్ లో సగం విప్పిన కోటు గుండీలతో, అతడు బరువుగా అడుగులు పెట్టుకుంటూ వస్తాడు. +శ్యామల ఏమండీ! మీటింగ్ అప్పుడే అయిపోయిందా? +రాధాకృష్ణ ఏఁ! అన్ ఎక్స్ పెక్టెడ్ గా వచ్చా నేమిటి? +శ్యామల ఇవ్వాళ సాయంత్రం మీ కాలేజీ ఎకనామిక్స్ అసోసియేషన్ మీటింగు వుందన్నారుగా! +రాధాకృష్ణ ఆఁ! అది కాన్సెల్ అయిపోయింది. +శ్యామల అయ్యొ! రామారావుగారు వాకిట్లోనుంచే వెళ్ళిపోయారే! మీ రింట్లోనే వున్నట్టు తెలిస్తే, +రాధాకృష్ణ అతనికి నాతో ఏం మాట లున్నాయ్? +శ్యామల ఏమో, నాకేం తెలుసు? మీరు సాయంత్రం అయిదు గంటలకు ఆయనతో ఎంగేజ్ +రాధాకృష్ణ ఆఁ! ఔను. కాలేజిలో మీటింగ్ మాట గుర్తులేక +శ్యామల (చిరునవ్వుతూ మీ ప్రొఫెసర్ల జాతికి మతిమరుపు మామూలే లెండి +రాధాకృష్ణ ఎంత మతిమరుపైనా బుద్ధిమాంద్య మింకా రాలేదు. +శ్యామల యం.ఎ.లో ఫస్ట్ క్లాస్, ప్రెసిడెన్సీ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్! మీకా బుద్ధిమాంద్యం! +(ఏదో బాధ పీడిస్తున్నట్టు రాధాకృష్ణ ఒక కుర్చీలో చతికిలబడి, దాని చేతిపై మోచేతిని అరచేతిలో తల వాల్చుకుంటాడు. +రాధాకృష్ణ ఎలా వున్నాను? బాగానే వున్నానే! +శ్యామల మరి, అలా వున్నారేమండీ? ఇందా కెప్పుడో కాలేజీ నుంచి వచ్చినవారు ఇంకా సూటైనా +శ్యామల మళ్ళీ బయటికి వెళ్ళవలసిన పని వున్నదా? +శ్యామల (చిరునవ్వుతో):అన్నింటికీ ఒక్కటే ముక్తసరి జవాబుగా “లే"దనే ముక్క కొత్తగా +శ్యామల అదుగో! మళ్ళీ అదే జవాబా? +రాధాకృష్ణ సర్లే! నాకు అలసటగా వుంది. +శ్యామల ఆమాట మీరు చెప్పడం దేనికి? కనబడుతూనే వుంది. ఒక కప్పు కాఫీ పెట్టుకురానా? +శ్యామల నాలుగు బిస్కట్లు తీసుకురానా అక్కర లేదన్నట్టు ప్రొఫెసర్ మౌనంగా సూచిస్తాడు) +గ్లూకోజ్ బిస్కట్లు మంచి వున్నాయండీ! మీ కవి యిష్టంగా ఇవ్వాళ పొద్దున తెప్పించా వద్దని మౌనముద్ర వీడకుండానే తిరిగి రాధాకృష్ణ తెలియజేస్తాడు) సరే! అయితే వేడి వేడిగా కాఫీ అయినా పుచ్చుకోండి. బోయ్! క్షణం ఆగి, మరి కొంచెం బిగ్గరగా) బోయ్ +శ్యామల (సెంట్రల్ టేబుల్ పై తానుంచిన పార్సెల్ అందుకుని, దాన్ని విప్పుతూ ఈ సిల్క్ చీర +చెల్లారామ్స్ లో కొన్నా. లేటెస్ట్ డిజైన్. ఈ అంచులు చూశారా? అజంతా ఫ్రెస్కోప్ నుంచి యెడాప్ట్ చేశారట. కలర్ పేటరన్ కూడా నాకు నచ్చింది. మీకు లౌడ్ క���ర్సు గిట్టవ్. దీని రంగులు సాఫ్ట్ గా, ప్లీజింగ్ గా లేవూ? అయితే, ఎంత బిల్లు చేశారో తెలుసా? రెండువందల నలభై రూపాయల చిల్లర. ఖరీదుకు తగినట్టు బాగుందంటారా? లేక, దండగ బేరమా? +రాధాకృష్ణ (చీరవంక చూడక, శ్యామలను చూస్తూ నాలుగైదు రోజులనాడు కూడా ఒక చీర +శ్యామల అది ఈ కట్టుకున్నదే నండీ! మిసెస్ రాజారాం ఇది ఎంతో మంచి సెలెక్షన్ అని +రాధాకృష్ణ (వ్యంగ్యంగా ఒక్క నా విషయంలో తప్ప నీవన్నీ మంచి సెలెక్షన్లే! +శ్యామల (నవ్వుతూ ఏఁ! మీమీద మీకే నమ్మకం తగ్గిపోతున్న దేమిటి? +రాధాకృష్ణ అబ్బే! లేదు. కాని, నీకు మాత్రం +(బోయ్ కాఫీ ట్రేతో వచ్చి, దాన్ని ఒక పెగ్ టేబుల్ పై పెట్టి వెళ్ళిపోతాడు. +శ్యామల (కెటెల్ లో నుంచి, ఒక కప్పులోకి కాఫీ పోస్తూ ఆఁ! ఏమి టది? నాకుమాత్రం? +శ్యామల కాఫీకప్పు అందిస్తూ ఈ పూట మరీ యింత నీరసంగా వున్నారేఁ? బస్సు దొరకలేదని +ఎదురెండలో నడిచి రాలేదుగదా? ట్యాక్సీ అయినా చేయించుకొనక పోయారూ? సరే! వేడి వేడిగా కాస్త కాఫీ పుచ్చుకోండి. +రాధాకృష్ణ (కప్పు అందుకుంటూ నీ కొద్దూ? +శ్యామల నే నింతకుముందే పుచ్చుకున్నా. వద్దన్న కొద్దీ రామారావుగారు కన్నిమరాకు కారు +పట్టించారు. తాగింది రెండు కప్పుల కాఫీయే అయినా, అయిదు రూపాయలు బిల్లు చేశారు! +రాధాకృష్ణ లేడీ ఫ్రెండ్స్ విషయంలో అతడు ఖర్చుకు వెనకా ముందు ఆడడులేఁ! +(ఈమాట అంటూనే సగం మాత్రమే తాగిన కాఫీకప్పు ట్రేలో పెట్టివేస్తాడు. +శ్యామల ఏఁ, మళ్ళీ షుగర్ ఎక్కువ వేశాడా? ఎన్నిసార్లు చెప్పినా ఈ ఫూల్ కాఫీని +రాధాకృష్ణ ఆఁ! షుగర్ సరిపడే వేశాడు. +శ్యామల అయితే, సగానికి పైగా వదిలి పెట్టేశారేఁ! +శ్యామల (బోయ్ ట్రీ అందుకోబోతూ వుండగా బాగానే వుంది. మీరు కాఫీ తాగడం. మరి కాస్త +రాధాకృష్ణ అహఁ! మరొద్దు బోయ్ తో చికాకుగా) పోరా! పట్టుకుపో! +శ్యామల శ్రమేమిటండీ? చిత్రంగా మాట్లాడుతున్నారు! మీతో చెప్పకుండా షాపింగ్ కు వెళ్ళానని +రాధాకృష్ణ కోపానికైనా, తాపానికైనా నాకు హక్కేముంది? నువ్వు స్వతంత్రురాలివి. +శ్యామల (నవ్వుతో ఏఁ! స్త్రీ స్వాతంత్ర్యానికి హఠాత్తుగా మీరు విరోధులై పోయారేమిటి? +రాధాకృష్ణ ఔను! ఈమధ్య అతనికి నాతో తరుచు పనిపడుతున్నది. +శ్యామల మరి, ఆయన పెడుతున్న కొత్త లిమిటెడ్ కంపెనీ ప్రాస్పెక్టస్ మీ రింకా పూర్తిచేసి +రాధాకృష్ణ వాడి ఆడిటర్సు ఫరమ్ లేదూ? వాడికి కావలసింది ప్రాస్పెక్టస్సే అయితే +శ్యామల ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ లో మీకు చాలి��వారు లేరని ఆయన నమ్మకం. మొన్న మొన్న +మీరు డిఫిసిట్ ఫైనాన్ సింగ్ మీద వ్రాసిన వ్యాసాన్ని కాస్మాపాలిటన్ క్లబ్ లో పెద్ద పెద్ద వాళ్ళందరు మెచ్చుకున్నారట. కంపెనీ లాలో కూడా మీ తర్వాతే మరెవరినైనా చెప్పాలని ఆయ నన్నారు +రాధాకృష్ణ ఏమైనా, నేను బడిపంతుల్నేగా! కాస్మాపాలిటన్ క్లబ్ మెంబర్నా? కన్నిమరాలో కాఫీలు +శ్యామల ఏఁ! ఈ పూట చాలా చిత్రమైన మూడ్లో పడ్డారు! మీ రింటికొచ్చేసరికి నేను లేనందుకే +ఇంత కోపం రావాలా? మీ మీటింగ్ కాన్సెల్ అవుతుందని నా కేం తెలుసు? మీరు ఎంగేజ్ మెంట్ కీప్ చెయ్యలేదు గనక, క్లబ్బుకైనా పోతానని రామారావుగారంటే, నన్ను చెల్లా రామ్స్ వద్ద డ్రాప్ చెయ్యమన్నాను. తిరిగి రావడానికి ట్యాక్సీ చేయించుకుంటానంటే వినక, మళ్లీ ఆయనే యింటి దగ్గర డ్రాప్ చేశాడు. వద్దన్న కొద్దీ దారిలో ఆయన కన్నిమరాకు కాఫీకి తీసుకు వెడితే కాస్త ఆలస్యమైంది. +రాధాకృష్ణ ఔను. అతను చాలా సరసుడు! నిన్ను వెంటబెట్టుకుని కన్నిమరాలో ప్రవేశించడం +కాలేజీ నుంచి వస్తూ నేను చూశాను సెంట్రల్ టేబుల్ పై పెట్టివున్న సిల్క్ చీర పైకి కన్ను పోనిస్తూ) అతడు తన లేడీ ఫ్రెండ్ కు కాస్ట్ లీ ప్రెజంట్సు కూడా యిస్తాడు! +శ్యామల (చురుకుగా అయితే, మీరు ఏం సజెస్ట్ చేస్తున్నారు +శ్యామల అయితే, మీ మాటల కర్థం? +రాధాకృష్ణ అతని స్వభావాన్ని గురించే నేను ప్రస్తావిస్తున్నాను +శ్యామల (కరుకుగా ఆయన స్వభావమేమిటో మీకే తెలవాలి. చిరకాలంగా అతను మీ +స్నేహితుడు. మీరు ఇంటర్ డ్యూస్ చేసే వరకూ అతని మూక్కూ మొఖమైనా నే నెరగను. +రాధాకృష్ణ స్నేహితుడు గనకనే చెబుతున్నాను. ఎంతటి సరసుడు కాకపోతే, ఒక్కవారంలో శ్రమ +అనుకోకుండా రెండుమార్లు నిన్ను షాపింగ్ కు తీసుకు +శ్యామల (“షాపింగ్” వద్ద మాటను తెంచివేస్తూ మీరు సూచిస్తున్న దేమిటి? +(ఈమాట అంటూనే సెంట్రల్ టేబుల్ పైనుంచి సిల్క్ చీర తీసుకుని శ్యామల వెళ్లిపోతుంది. ఆమె +తన హాండ్ బ్యాగ్ అక్కడే విడిచి పెట్టి వెడుతుంది. ఆమె వెళ్ళిన తర్వాత మానసిక వేదనతో సోఫాలో జేరగిలబడి, రాధాకృష్ణ కళ్లు మూసుకుంటాడు. కొన్ని క్షణాల తర్వాత గట్టిగా నిట్టూర్చి, కళ్ళు తెరిచే సరికి శ్యామల హాండ్ బ్యాగ్ పై అతని కన్ను పడుతుంది. దాన్ని తెరిచి చూడాలనే దుర్భుద్ధి అతనికి వెంటనే పుడుతుంది. చరాలున ముందుకు వంగి, దాన్ని అందుకోబోయి, తన సంస్కారం అడ్డురాగా అంతలోనే ఆగిపోతాడు. కాని, అనుమాన పిశాచం సంస్���ారం కుత్తుకను నులిమివేయగా, హాండ్ బ్యాగ్ అందుకుని, తప్పు చేస్తున్న వాడివలె మేడ మెట్ల పైకి ఒకసారి చూస్తాడు. పిమ్మట హ్యాండ్ బ్యాగ్ తెరిచి దాన్ని గాలిస్తాడు. ఏవో రెండు, మూడు ఉత్తరాలు అతనికి కనబడతాయి. వాటిని చదివి మళ్ళీ లోపల పెట్టివేస్తాడు. ఇంకా గాలించి, ఒక మని యార్డర్ కూపన్ పైకి తీస్తాడు. దాన్ని చదువుకునేసరికి అతని ముఖం విప్పారుతుంది. ఇంతలో మేడమెట్లపై కాలి అలికి డౌతుంది. చప్పున మని యార్డర్ కూపన్ అతడు తన కోటు జేబులో పెట్టివేసు కుంటాడు. జేబులోని చెయ్యి పైకి తీయకముందే శ్యామల ప్రవేశిస్తుంది. భర్త చేసిన పనిని చూచినందున ఆమె ముఖంలో ఆశ్చర్యం, ఆగ్రహం, ఆవేదన ఒకదానితో ఒకటి పెనవేసుకుంటూ, ఒక్కసారిగా కనపడతాయి. +పెట్టిన కాఫీ నిజంగానే బాగా లేదు. మరికొంచెం కాఫీ పెడతావా, శ్యామలా? +రాధాకృష్ణ (ఏదో ఒకటి మాట్లాడాలనే ఆతురతకొద్దీ ఇంకా వస్తాడేమో, ఇంకా వస్తాడేమో నంటూ +అరగంటసేపు వెయిట్ చేసినా, ఆ స్పీకర్ డామ్ స్కౌంట్రోల్ రానేలేదు. మీటింగ్ కాన్సెల్ చేశాక, కారు బ్రేక్ డౌన్ వల్ల రాలేక పోతున్నానని టెలిఫోన్ చేశాడు. తన కారు లేకపోతే, ఏ టాక్సీలోనో రాగూడదూ? మన ఇండియన్సుతో యిదే చెడ్డ చికాకు. ఎంగేజ్ మెంట్స్ కీప్ చెయ్యరు, ఆ రాస్కెల్ కోసం ఎదరుచూస్తూ కూర్చోబట్టే చెడ్డ తలనొప్పి వచ్చింది. నిన్ను వెంటబెట్టుకుని కాసేపు అలా బీచ్ వైపుకైనా పోదామని యింటికొస్తే ఇక్కడా డిసప్పాయింట్ మెంట్ అయింది కణతలు నొక్కుకుంటూ) అబ్బ ఇంకా తలనొప్పి తగ్గనే లేదు మెడపై చెయ్యి వేసుకుని) మెడలు కూడా పీక్కుపోతున్నాయి సానుభూతి కోసం ఒక క్షణం ఎదురు చూచి, నిరాశ చెంది) నేను పోయి బట్టలు మార్చుకొస్తానుగాని, కాస్త కాఫీ పెట్టు. డబుల్ డోస్ కావాలి. +(కోటు విప్పి భుజం పైన వేసుకుంటూ రాధాకృష్ణ మేడ పైకి పోతాడు. అతను వెళ్లిపోయిన తర్వాత +పెదవి కొరుక్కుంటూ, తల పంకిస్తూ కొన్ని క్షణాలపాటు నిలబడి, తుదకు ఒక నిర్ణయానికి వచ్చినట్టు శ్యామల కనబడుతుంది. +శ్యామల పొద్దుటి “ఎక్స్ ప్రెస్” యేదిరా? +బోయ్ అదుగోనమ్మా! ఆ పుస్తకాల బీరువామీద. +(పత్రిక చేతికిచ్చి బోయ్ వెళ్ళిపోతాడు. శ్యామల నిలబడివుండే పత్రిక మొదటి పేజీ తిప్పి, రెండవ పేజీ వెదకి, దానిలో తనకు కావలసింది కనబడిన వెంటనే సైడ్ టేబుల్ వద్దకు వెడుతుంది. ఆ టేబుల్ డ్రాయర్ లో నుంచి లెటర్ హెడ్స్ ప్యాడ్ తీసి, ప్రొఫెసర్ రాధాకృష్ణ పేరు అచ్చొత్తివున్న పైభాగాన్ని చించి వేస్తుంది. తర్వాత ఆ డ్రాయర్ లో నుంచి ఒక కవరు కూడా తీసుకుని సోఫాలో కూర్చుంటుంది. తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఫౌంటెన్ పెన్ తీసుకుని, ఏదో వ్రాస్తూ వుంటుంది. ఇంతలో రాధాకృష్ణ పైజమాతో,లాల్చీతో మేడమెట్లు దిగివస్తాడు.బట్టలు మార్చుకున్న తర్వాత చక్కగా టాయెలెట్ చేసుకుని మరీ అతడు ప్రవేశిస్తాడు. +రాధాకృష్ణ (శ్యామల ముఖాన్ని చూడ్డానికి ఇంకా సిగ్గుపడుతూ, వీధిలోకి చూస్తున్నట్టు గుమ్మంవైపుకు +రాధాకృష్ణ ఆఁ! అన్నట్టు, నీతో చెప్పానా? ఇవ్వాళ ఉదయం మిస్టర్ చెట్టియార్ వీలుపడితే రే +పొకసారి తమ ఆఫీసులో తప్పకుండా కలుసుకోమని ఫోన్ చేశాడు. వాళ్ళ జనరల్ ఇన్యూరెన్స్ కంపెనీ సెక్రటరీ రిటైర్ అవుతున్నాడట. ఆ పోస్ట్ నాకు ఆఫర్ చెయ్యడానికే కాబోలు! అది సౌండ్ కంపెనీయే. ఆ పదవి పుచ్చుకోమంటావా? కమిటీ కాలేజీలలో ఉద్యోగాలకంటె, నిజానికి ఏ పనైనా మెరుగే! ఇచ్చే ఆ కొద్ది జీతాలైనా నెలనెలకు సరిగా ముట్టజెప్పకపోయినా, ప్రతి కమిటీ మెంబరూ మాపై పెత్తనం చలాయించేవాడే! “వీడు నా తమ్ముడి బావమరిది తోడల్లుడు కొడుకు, వీడికి సీటివ్వాలి; వాడు నా అన్నయ్య పినమామ మరద లల్లుడు, వాడిని ప్రమోట్ చెయ్యాలి.” అంటూ సిఫార్సులు చేసి ప్రాణాలు తోడేస్తారు. ఏఁ! శ్యామలా! మిస్టర్ చెట్టియార్ రేపు సెక్రటరీ పోస్ట్ ఆఫర్ చేస్తే పుచ్చుకోమంటావా? +రాధాకృష్ణ (శ్యామలవైపుకు నాలు గడుగులు వేసి ఏమిటది, శ్యామలా? అంత దీక్షగా వ్రాస్తున్నావ్! +శ్యామల (తాను వ్రాస్తున్నది కనబడకుండా కాగితం పై అంచును మడిచిపట్టుకుంటూ ఆఁ! ఏమీ +లేదు. ప్రజెంట్స్ యివ్వగల ఫ్రెండ్స్ కు లెటర్స్ రాస్తున్నా. +రాధాకృష్ణ (లేని నవ్వు తెచ్చి పెట్టుకుంటూ వాట్ నాన్ సెన్స్! +శ్యామల ఇంతకు ముందు మీరే అన్నారుగా, వారం రోజుల లోపల రామారావుగారి నుంచి +రాధాకృష్ణ అబ్బే! ఆ మాట నే నన్నానా +శ్యామల సరిగా అదేమాట అనకపోతేనేం? ఆ అర్థం వచ్చే మాట మరొకటి! +రాధాకృష్ణ ఆఁ! చెడ్డ తలనొప్పి కొద్దీ నే నేదో అంటే, నువ్వేవో లేనిపోని అర్థాలు తీస్తున్నావ్. నాకు +తెలియదూ? మీనాన్న పంపించిన డబ్బుతో నువ్వు షాపింగ్ చేశావని. +శ్యామల (సోఫాలోనుంచి చరాలున లేచి, ముఖాముఖిగా నిలబడి అయితే, మా నాన్న నాకు డబ్బు +పంపించిన సంగతి మీ కెలా తెలిసింది? +శ్యామల (తీవ్రంగా నన్ను శంకించి, చాటుమాటుగా నా హ్యాండ్ బ్యాగ్ విప్పిచూస్తే తెలిసింది. +శ్యామల అయ్యొ! అబద్దం కూడానా సెం���్రల్ టేబుల్ ను వేలితో చూపిస్తూ) అదుగో! నా హ్యాండ్ +బ్యాగ్ విప్పిలేదూ? దానిలోని నా మనియార్డర్ కూపన్ (కప్పువైపు వేలితో చూపిస్తూ) మేడమీది మీ కోటుజేబులోకి ఎలా నడిచివెళ్ళింది? +రాధాకృష్ణ (చిన్న ముఖం చేసుకుని, శ్యామల చేతుల్ని పట్టుకుని తప్పే! క్షమించు. +శ్యామల (చేతుల్ని విడిపించుకుంటూ తప్పు మీది కాదు; నాదే! చేసుకుంటున్న ఉద్యోగం చేతులారా +విడిచిపెట్టుకున్న తప్పు నాదే కాదూ? నాకే సంపాదనుంటే మీ రివ్వాళ నన్నెందుకు శంకించేవారు? +రాధాకృష్ణ (దీనంగా శ్యామలా! నన్ను మన్నించవ్ +శ్యామల ఇక నన్ను నేనే మన్నించుకో లేను మిమ్ములను నే నేం మన్నిస్తాను! భర్త యివ్వందే +భార్యవద్ద డబ్బుంటే, దొంగతనమో, రంకుతనమో చేసిందని తీర్మానించుకుంటారు. చదువుకున్నదాన్నని, తెలిసినదాన్నని అనుకున్నాగాని, ఈ పాటి గుర్తించగల జ్ఞానం నాకు లేకపోయింది. +రాధాకృష్ణ శ్యామలా! ఇటు చూడు ఆమె తిరిగి చూడకపోగా బలవంతాన ఆమె ముఖం తనవైపుకు +తిప్పుకుంటూ) “బిలీవ్ మి, మై డియర్. ఐ యామ్ ఫీలింగ్ అట్టర్లీ ఎషేమ్ ఆఫ్ మైసెల్ఫ్”. +శ్యామల నన్ను చూచుకుంటే నాకు మాత్రం సిగ్గువెయ్యడం లేదండీ? మన మిద్దరం విద్యావంతులమే; +ఇద్దరం సంస్కృతిపరులమే. ఒకరి నొకరు ప్రేమించుకున్నాం; ఒకరి నొకరు పూర్తిగా అర్థం చేసుకున్నా మనుకున్నాం. కాని, మన విద్య, మన సంస్కృతి, చివరికి మన ప్రేమైనా, మీరు నన్ను శంకించడానికి అడ్డుకాలేక పోయింది. అయినా, తప్పు మీది కాదు. నా ఆర్థిక బానిసత్వమే మన మధ్య విషం చిలికింది. దాన్ని తొలగించుకో గలిగితేనే నేను తిరిగి మీ ముఖం చూడగలిగినా, మీరు నా ముఖం చూడగలిగినా! ఒకరు భరించేవారై, మరొకరు భరించబడే వారైనంత వరకు హృదయాలు నిజంగా కలవవ్. +శ్యామల ఔను! తిరిగి ఏదైనా ఉద్యోగంలో ప్రవేశిస్తాను. +(సగం వ్రాసిన ఉత్తరం వద్ద తిరిగి కూర్చుంటూ) +గుంటూరు విమెన్స్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ ఖాళీగా వుందట. దానికి అప్లయి చేస్తున్నా. +రాధాకృష్ణ ఉద్యోగం తిరిగి చేసి తీరాలంటే ఇక్కడే ఏదైనా దొరికేవరకూ పోనీ ఆగవచ్చుగాఁ? +శ్యామల ఎక్కడైతేనేమి లెండి! ఉన్న వూళ్ళోనే అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయా? +రాధాకృష్ణ ఎక్కడైనా ఒక్కటేనా? మనం కలసి వుండడం, దూరమైపోవడం ఒక్కటేనా? +శ్యామల మైళ్లనుబట్టి ఇద్దరి మధ్య దూరాలను, దాపులను కొలవగలమా? మనస్సులు కలిసిపోతే +ఎంత దూరాన వున్నా, కలిసి వున్నట్టే, లేకపోతే, ఒకచోటనే వున్నా, వేర్వేరు ప్రపంచాలలో వున్నట్టే. +రాధాకృష్ణ ఇంతగా నీ మనస్సు విరిగిపోయిందా, శ్యామలా? ఇంతగా నేను నీకు దూరమై +శ్యామల మీరు నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఇవ్వాళే నేను కన్ను తెరిచా; నాది కల్లబ్రతుకని +తెలుసుకున్నా. నాకు అర్థం లేనంతవరకు నేను మీకు అర్ధాంగిని కాలేను. ఆ అర్హతను సంపాదించుకోవడంలో నేను ఆలస్యమెందుకు చెయ్యాలి? +రాధాకృష్ణ శ్యామలా! ఇవ్వాళ నీపట్ల మహాపచారమే చేశానని ఒప్పుకుంటున్నాగా! +శ్యామల మీపట్ల నేను చేసింది కూడా మహాపచారమే. నన్ను నేను ఆర్థిక దాస్యంలో పెట్టుకోబట్టేగదా, +మీనోట ఇవ్వాళ అబద్ధం పలికించడం జరిగింది. ఇది మీకూ, నాకూ కూడా ఫాల్స్ పొజిషన్. ఇది మన యిద్దరి నైతిక పతనానికి సమానంగా కారణమౌతున్నది. రాధాకృష్ణ మన్నించవలసిందిగా బ్రతిమాలాడుకుంటున్నా, నన్ను మన్నించలేవా, మైడియర్? +శ్యామల ఇది కేవలం మీ, నా ప్రశ్న మాత్రమే కాదండీ. చదువుకునే భాగ్యం -ముఖ్యంగా పెద్ద +చదువులు చదువుకునే భాగ్యం మా స్త్రీ జాతిలో ఎంతమంది కబ్బుతుంది? నేను చదువుకున్న చదువుకు సార్ధక్యం పదిమంది స్త్రీలకు దాన్ని చెప్పినప్పుడే అనుకున్నా. ఆ ఉద్దేశంతోనే టీచర్ గా ప్రవేశించాను. కాని, మన వివాహం స్థిరపడగానే “నా సంపాదన చాలదా? నువ్వు శ్రమపడ్డం దేనికి?” అని మీరంటే నా సుఖాన్నే, నా స్వార్థాన్నే చూచుకుని, నా లక్ష్యాన్నే మరిచిపోయాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూచుకుంటే ఒకనాటి ఆశయాలన్నింటికీ ఎంత దూరమైపోయానో తెలిసొస్తున్నది. ఆ పాపాని కిప్పుడు పరిహారం చేసుకోబోతున్నాను. +(అప్లికేషన్ పై సంతకం పెట్టి, దాన్ని మడిచి కవరులో పెడుతూ వుంటుంది +రాధాకృష్ణ మన కొక బిడ్డేవుంటే నువ్వింత తొందరపడేదానివా? +శ్యామల కాదటండీ! మీరే ఇప్పు డన్నట్టు, మనకు ఒక బిడ్డేవుంటే ఈ పాటి తెగింపైనా నేను +రాధాకృష్ణ (వాదంలోకి దించితే, మనస్సు మార్చవచ్చుననే ఆశతో ఆత్మగౌరవాల కేమిగాని, +మాతృత్వమే స్త్రీ జీవితానికి శోభైనా, సాఫల్యమైనా, అసలు స్త్రీ పురుష ప్రేమకు వైశిష్ట్యాన్ని కూర్చేదే సంతానాపేక్షే, ఆ అపేక్షే లేకపోతే +శ్యామల (పట్టరాని కోపాన్ని అణచివేసుకోడానికి ప్రయత్నిస్తూ “ఆత్మ గౌరవాల కేమిగాని ఔను! +మీ దృష్టిలో స్త్రీకి ఆత్మే వుండదు. ఇక, ఆత్మగౌరవం ఎక్కడినుంచి వస్తుంది లెండి! +రాధాకృష్ణ ఇది న్యాయమేనా, శ్యామలా? నే నేమన్నా దానికి పెడర్థాలు తీస్తున్నావ్! +శ్యామల ఇందులో పెడర్డా లేమున్నై! నేనే తల్లినైవుంటే, బిడ్డలపై మమకారం కొద్దీ మీ రేం +చేసినా పడివుండేదాన్నని మీ రంటున్నారు అంతేగా! +రాధాకృష్ణ నీతో వాదానికి నే నెక్కడ నిలవగలను గాని, నీ నిర్ణయం మారదా, శ్యామలా? +(ఈ ప్రశ్నకు జవాబు అన్నట్టుగా శ్యామల కవరుపై అడ్రసు వ్రాస్తుంది. +రాధాకృష్ణ “లుక్ హియర్, మై డియర్!” +రాధాకృష్ణ పోనీ, రేపటివరకైనా ఆగరాదా? ఈలోగా ఆ ఉద్యోగ మెక్కడికీ పోదు. +శ్యామల పోకపోవచ్చు. కాని, వెంటనే అప్లికేషన్ పంపకుండా ఆగవలసిన అగత్యం నాకేమీ కనబడ్డం +రాధాకృష్ణ నా తప్పు అంగీకరించిన తర్వాత కూడా ఇంత క్రూరమైన శిక్ష విధించాలా? +శ్యామల ఇది శిక్షే అయితే, మీకు కాదు; నాకు. నా ఆర్థిక దాస్యాని కిది శిక్ష: నా అబద్ధపు బ్రతుకు కిది +రాధాకృష్ణ మరొకసారి అడుగుతున్నా నన్ను మన్నించు, శ్యామలా! నాకు దూరం కావద్దు. +శ్యామల నన్ను మీరు అర్థం చేసుకోవడం లేదు. నా ప్రయత్నమంతా మీరు మరింత దగ్గరగా – +రాధాకృష్ణ (శ్యామల రెండు చేతుల్ని పట్టుకుని డోన్ట్ టార్చర్ మి, మై డియర్. +(శ్యామల చేతుల్ని విడిపించుకుని, అవతలికి జరుగుతుంది. +శ్యామల (కవర్ అందుకుని, దాన్ని బోయ్ చేతి కిస్తూ ఈ ఉత్తరం పోస్ట్ చేసిరా! బోయ్ (ఉత్తరాన్ని +రాధాకృష్ణ తొందర లేదు లేరా! ఆగు! +రాధాకృష్ణ నీక్కాదురా చెప్పేది? రేపు వెయ్యొచ్చులే! +శ్యామల ఔను! వాడికి జీతభత్యా లిస్తున్నది మీరేగా? వాడికి పనిచెప్పడానికి నాకు హ కేముంది? +తేరా! తే! ఆ ఉత్తరమిలా తే! నేనే పోస్ట్ చేసుకుంటాలే! +పాత్రలు: భూషయ్య మోతుబరి రైతు, మాధవరావు భూషయ్య కుమారుడు, +భూషయ్య మండువా చావడిలో పడక కుర్చీపై కూర్చుని వుంటాడు. ఆయనకు దగ్గరగా మామూలు కుర్చీలో కూర్చుని కృష్ణమాచార్యులు బమ్మెర పోతన భాగవతం నుంచి వామనావతార ఘట్టాన్ని వినిపిస్తుంటాడు. +చావడిలో మరి రెండు కుర్చీలు, ఒక బెంచీ వుంటాయి. +కృష్ణమాచార్యులు “అని మరియు నిట్లనియె.” బలి చక్రవర్తి ఇంకా ఏ ప్రకారంబుగా +“వసుధాఖండము వేడితో, జగములన్ వాంఛించితో, వాజులన్ +నెస నూహించితో, కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో +పసిబాలుండవు నేర వీ వడుగ నీ భాగ్యంబు లీసాటి గా +కసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే!” +అయ్యయ్యో! వెర్రి బ్రాహ్మడా! ఏమిటయ్యా యిది నీకు మడులు కావాలా? మాన్యాలు కావాలా? +అగ్రహారాలు కావాలా? అర్ధభాగమే కావాలా? ముల్లోకాలు జయించినవాణ్ణి. కనీస మొక లోకాన్ని అడిగి పుచ్చుకోరాదటయ్యా? పోనీ దొడ్లమీదా, దోవలమీదా నీక��� మమత లేదే అనుకో! ఊళ్ళమీద, నాళ్ళ మీద బ్రమత లేదే అనుకో! అయితే, “వాజులన్”, గుర్రాలను అడగరాదటయ్యా? వాయువేగ మనోవేగాలతో ప్రయాణించే ఉత్తమాశ్వాలు ఒక వంద ఒక వెయ్యి ఒక లక్ష ఎన్ని కావాలి? చెప్పవయ్యా! సంకోచం దేనికి? గుర్రాలూ, ఏనుగులూ నే నేమి చేసుకొంటాను. నాకు దేనికంటావా? అయితే, పడుచుపిల్ల లెవ్వరూ నీకంట దూరనే లేదటయ్యా? ఎవ్వరి పైకీ నీ మనస్సు పోనేలేదటయ్యా? పద్మిని. నీ చిత్రిణి, శంఖిని, హస్తిని ఏ జాతి స్త్రీలు నీకు కావాలి? ఎంత మంది కావాలి? ఇంతకూ నువ్వు ముక్కు పచ్చలారని పసివాడివి. ఒక చెంప పాలు, మరొక చెంప నీళ్ళు. అభం శుభం యెరగవు. “నేర వీ వడుగ!”. అడగడమైనా సరిగా చేత కాదయ్యె. ఇచ్చేవారున్నా పుచ్చుకొనడానికీ, అనుభవించడానికి నీకు ప్రాప్తం లేదు కాబోలు. “బుద్ధిః కర్మానుసారిణీ”. కర్మనుబట్టే బుద్ధి. కాకపోతే దానచక్రవర్తిని; ముల్లోకాధిపతిని. నన్నేమిటి? ముష్టి మూడడుగుల నేల అడగడ మేమిటి? ఇంత స్వల్పాన్ని నువ్వు అడిగితే మాత్రం నే నెలా యివ్వగలనయ్యా! నాది భారీ చెయ్యి. నన్ను భారీగా అడుగు. భారీగా పుచ్చుకో, “అనిన మొగంబునం జిరునగవు మొలకలెత్త గృహమేధికి మేధావి యిట్లనియె” బలి చక్రవర్తి ఈ ప్రకారంబున పలుకగా ఆయనతో ఆ వామనమూర్తి ఆ లీలామానుష విగ్రహుడు ఆ జగన్నాటక సూత్రధారి ముఖం పై చిరునవ్వులు మొలకలెత్తుతుండగా ఏ విధంబుగా అంటున్నాడంటే +“గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో +వడు గే నెక్కడ? భూము లెక్కడ? కరుల్ వామాక్షు లశ్వంబు లె +క్కడ? నిత్యోచితకర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూ +డడుగుల్ మేరయ త్రోవ కిచ్చు టది బ్రహ్మాండంబు నాపాలికిన్” +చేత పట్టుకోడానికి ఒక గొడుగో, మెడలో వేసుకోడానికి ఒక జంధ్యమో, మంచి పుచ్చుకోడానికి ఒక కమండలమో, మొలకు కట్టుకోడానికి ఒక ముంజియో అంటే మరేమీ లేదు, భూషయ్య బాబూ దర్భలతో పేనిన మొలత్రాడు “గొడుగో, బన్నిడమో, కమండలువొ, నాకు ముంజియో, దండమో.” లేదా జపతపాలకు అక్కరకు రావడానికి ఒక దండమో ఇలాంటి దేదైనా నే నడిగినా, తమరిచ్చినా అదొక అందం, చందంగాని, బ్రహ్మచారిని, నాకు మడులు దేనికి? మాన్యాలు దేనికి? అగ్రహారాలు దేనికి? అర్ధాసనాలు దేనికి? గుర్రాలూ, ఏనుగులూ నే నేమి చేసుకొంటాను. స్వామీ? అందకత్తెలు నాకు దేనికి? నెత్తిని పెట్టుకొని ఊరేగడానికా? “కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపం? అన్నట్టు, ఈ బాదరబందీ యావత్తూ నాకు దేనికి, ప్రభూ? నామొర విని నా విన్నపాన్ని నేను కోరిన మూడడుగుల నేలను దేవరవారు నా కనుగ్రహిస్తే, అదే నాకు బ్రహ్మాండాన్ని కట్టబెట్టినట్టు ఆయన ఆ వామనమూర్తి ఆ మాయామానుష విగ్రహుడు సాక్షాత్తు జగదీశ్వరుడు. “జగత్సర్వం మయాసృష్టం సమస్త జగాలూ ఆయన సృష్టించినవే. మాయలోపడి “ఇది నాది అది నాది” అని అనుకోడమే గాని, సర్వం ఆ జగన్నాథునిదే. సకల చరాచర జీవకోటికీ ఆయన పెట్టిందే భిక్ష. అయినప్పుడు ఆయన్ని ఏం కావాలో కోరుకో మనడ మేమిటి? ఆయన కోరుకున్నది స్వల్ప మనడ మేమిటి? “ఓయి! వెర్రివాడా! నీవు మాయామోహపాశాలలో చిక్కుకున్నావు. నేను సర్వేశ్వరుడ నని గుర్తెరగలేక పోతున్నావు. నీ ముల్లోకాలూ నాకు మూడడుగులే సుమీ!” అని ఆయన ఆ వామనమూర్తి “మదాకాంక్షామితంబైన మూడడుగుల్ మేరయ త్రోవ కిచ్చు టది బ్రహ్మాండంబు నా పాలికి ” అని సూచిస్తున్నాడు “అదియునుంగాక ” +ఇంకా, ఇంకా పోగుజేసుకోవాలి. ఇంకా ఇంకా మీట వేసి పోవాలి, ఇంటిమీద ఇల్లు వచ్చిపడాలని +తాపత్రయ పడకుండా తనకు ప్రాప్తంబయ్యేది అది తృణమైనా, పణమైనా అదే పదివేలని సంతుష్టి పడనివారు “సప్త ద్వీపములనయిన జక్కంబడునే” ఏడు ద్వీపాలలోనైనా ముందుకు రాగలరా? “దురాశ దుఃఖం చేటు”. వెనకటి కెవడికో తనకులేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట; ఎదటివాడి కున్నదని ఏడిస్తే రెండో కన్ను పోయిందట. సంతోషం సగం బలమని పెద్దలన్నారుగాని, సంతుష్టి పూర్తిబలం. +“ఆశాపాశము దా గడున్ నిడుపు, లేదంతంబు, రాజేంద్ర! వా +గాసిం బొందిరిగాక వైన్యగయభూ కాంతాదులు న్నర్థకా +మాశం బాయగ నేర్చిరే మును, నిజాశాంతంబులం జూచిరే?” +ఆశ అనే పాశం బహు పొడవైనది. పల్నాటి చేంతాడుకైనా అంతు వుంటుందేమోగాని, ఆశకు మాత్రం అంతే లేదు. +(“ఆశాపాశము దా గడున్ నిడుపు” అనే పద్యాన్ని కృష్ణమాచార్యులు ప్రారంభించబోయే సమయానికి వీధిలో కారు హారన్ మోత వినపడుతుంది. తర్వాత కొన్ని క్షణాలకు వీథిగుమ్మంలో మోటారు కారు ఆగుతుంది. ఆ వెనువెంటనే మాధవరావు, వీరభద్రయ్య, వెంకటశాస్త్రి చావడిలోకి వచ్చి, ఒక పక్కగా ఒదిగి కూర్చుంటారు. వారి రాకను చూచి, కృష్ణమాచార్యులు తన వ్యాఖ్యానం మధ్యలో ఆగిపోతాడు. +వీరభద్రయ్య ఆపివేశా రేమండీ, ఆచార్యులుగారూ! కానివ్వండి. +భూషయ్య (వీరభద్రయ్యతో కానిస్తారులే! ఏం? ఇలా వేంచేశారు? +వీరభద్రయ్య అబ్బే! ఊరికేనే, బాబాయ్! భూషయ్య “ఊరకరారు మహాత్ము” లన్నారు. ఊరికే +భూషయ్య అయ్యో! మీకు తెలియదటండీ? ఈయన పెద్ద నాయకుడు. దేశాన్ని ఉద్��రిస్తున్నాడు. మన +తిరపతయ్యకు మన చినతిరపతయ్యకు సయానా మేనత్త కొడుకు. +కృష్ణమాచార్యులు: ఓహో! వీరభద్రయ్యగారా? పేరు ప్రఖ్యాతులు వింటమే తప్ప ఎన్నడూ దర్శనం +భూషయ్య ఈయన దర్శనం మనబోటి సామాన్యులకు దొరుకుతుందటండీ! కలెక్టర్లు, గవర్నర్లు, +మినిస్టర్లు -ఎంతెంత పెద్దఫాయావారితో ఈయనిప్పుడు భుజాలు రాసుకుంటూ తిరుగుతున్నాడని! పేరు ఇతరులదైనా, ప్రభుత్వ చక్రం ఇప్పు డీయన చేతిలోనే వుంది. +వెంకటశాస్త్రి మనవాడి కిప్పుడు బృహస్పతి రాజ్యంలో వున్నాడు. భూషయ్యబాబూ! రాజయోగం +పట్టింది. మహర్దశ అందుకుంది. పదహారేళ్లు దేదీప్యమానంగా వెలుగుతాడు! +భూషయ్య ఇంకేం? ఈ సారి ముఖ్యమంత్రి ఛాన్సు మనవాడిదే. +భూషయ్య అబ్బే! యద్దేవ కాదురా! నిజం మాటే. నేను +వీరభద్రయ్య ఇప్పుడు మినిస్టర్లుగా వున్న వాళ్ళందరూ మన కంటె పొడిచేశా రేమిటి? +వెంకటశాస్త్రి ఇంతకీ ఎవరి ప్రయోజకత్వ మేమున్నది? దేనికైనా రాజయోగం కలిసిరావాలి. +భూషయ్య సరేనయ్యా! ఇప్పు డిక్కడ ఈ గ్రహ సంయోగానికి కారణ మేమిటి +మాధవరావు మరేమీ లేదు, నాన్నా! కొత్త బస్సు రూటుకు +భూషయ్య పాతది నిర్వాకం చేస్తున్నావ్. ఇఖ, కొత్తది +వీరభద్రయ్య (తెచ్చి పెట్టుకొన్న నవ్వుతో నోట్లో మాట నోట్లో వుండగానే నువ్వు వాణి +కసురుకొంటావేమే, బాబాయ్! నువ్వెక్కడ కూకలేస్తావోనని ఈ పూట వా డసలు నీ దగ్గరికి పెద్దపులిదగ్గిరి కొచ్చినట్టొచ్చాడు. +భూషయ్య తోడేళ్ల సావాసం చేస్తున్నవాడికి పెద్దపులంటే అంత భయమట్రా? +కృష్ణమాచార్యులు భూషయ్యబాబూ! ఇవ్వాళికి పురాణ కాలక్షేపం చాలిద్దామా? +భూషయ్య ఆఁ! ఈ పురాణంలో పడినాక మరి అదేమి సాగుతుంది లెండి. +కృష్ణమాచార్యులు అది పొద్దున వాకిట చేరింది. పిల్లలే చెయ్యి కాల్చుకుంటున్నారు. ఏమి తీన్ తేరా +చేస్తున్నారో! నేను వెళ్ళొస్తాగాని, వంట చిచ్చుమాట మర్చిపోబోకు సుమీ! ఒక వంద పిడక, ఒక మోపుడు పుల్లలు దుంగలైతే వాటిని మళ్ళీ పగలేయించడానికి నా కెవ్వరూ పలకరు సన్నటి పుల్లలు చూచి +భూషయ్య మెరకపొలాన తుమ్మ చస్తే, మొన్నే దాన్ని కొట్టుకొచ్చి దొడ్లో పడేశారు. అన్నీ దుంగలే. +పాలేళ్ళు పొలం నుంచి వచ్చే వేళైంది. మళ్ళీ మీ రొకసా రొచ్చి, దగ్గరుండి వాళ్ళచేత పగలేయించుకొని, మీకు కావల్సినన్ని పట్టించుకు వెళ్ళండి. +వెంకటశాస్త్రి భూషయ్యబాబుది ఎముకలేని చెయ్యి. “లేదు” అనేమాట ఆయన ఇంటా, వంటా లేదు. +అడగనివానిదే పాపం; యథోచితంగా అందరినీ సత్కరిస్���ారు. +వీరభద్రయ్య ను వ్వూరుకోవయ్యా, శాస్త్రులూ, కాసేపు. వ్యవహారం మాట్లాడుతుంటే, మధ్య ను +వ్వేమిటి పానకంలో పుడకలా! రా! మాధవరావ్! ఊరికే నీళ్ళు నములుతావు దేనికి? చెప్పరాదట్రా ఇది ఫస్టుక్లాసు రూటనీ, డెయిలీ కలెక్షన్ రెండు మూడొందల పైమాటనీ, ఈ ఛాన్సు పోగొట్టుకుంటే మళ్ళీ రాదనీ, నోట్లో నాలిక లేదట్రా మాటే పెగలదు. +మాధవరావు ఔను, నాన్నా! ఇది లాంగు రూటు. ఇది మనకొస్తే +భూషయ్య అయితే, పుచ్చుకో! పాతది నన్నడిగి పుచ్చుకున్నావా కొత్తదానిమాట నన్నడగడానికి! +ఇందులో నా పెత్తన మే మున్నది? +వీరభద్రయ్య అబ్బే అదేంమాటే, బాబాయ్! నీవంటే వాడికెంత భయభక్తులని!! +భూషయ్య భయభక్తులున్నవాడైతే నేను నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నా నామాట ఖాతర్ +చెయ్యకుండా, ఈ వ్యాపారంలో వేలు పెట్టేవాడా? ఇది మనకు లాయకేనా? మన తాత ముత్తాతలు వ్యాపారాలే చేశారా? ఆ దేవు డిచ్చింది మన కేదో ఇంత వున్నదిగా! మనం తిననూ వచ్చు; నలుగురికి పెట్టనూ వచ్చు. నోటి దగ్గిరి కూడు బోర్ల దోసుకోవడం కాకపోతే, వీడికీ వంకర బుద్దు లేమిటి? +వీరభద్రయ్య అదేం మాటే, బాబాయ్! డబ్బుకు నాలుగు డబ్బులు చేర్చి వాడు ప్రయోజకుడు +భూషయ్య ఆఁ! ప్రయోజకుడో, అప్రయోజకుడో కనబడుతూనేవుంది. చదువుకని పెడితే, మిటికేషన్లో +మూడు పిల్లి మంతరాలు కొట్టి, నెత్తిని గుడ్డేసుకుని కొంపకి చేరాడు. అయిదారువేలు ఖర్చు పోతే అబ్బిం దేమిటి? సిగరెట్లు, సినిమాలు, షోకులు ఇవేగా? వ్యాపారం వంక పెట్టుకొని మళ్ళీ బస్తీ కెక్కితే, ఏం కనబడుతున్నది? కట్నంగా వచ్చిన యాభైవేలు గంగలో కలిసిపోవడమేనా? మేదకురాలని పెళ్ళాన్ని బెదిరించి, సదిరించి, దాని నగా, నాణెం పట్టుకుపోయి తెగనమ్ముకోడమేనా? సిగ్గూ, యెగ్గూ లేకపోతే సరి! +వీరభద్రయ్య నీకు మేము చెప్పేపాటి వాళ్ళమటగాని, వ్యాపార మన్నాక, లాభనష్టాలు తప్పుతాయటే, +బాబాయ్? వాడు కుర్రసన్నాసి. అనుభవంలేక ముందు కొంత దెబ్బతిన్నాడే అనుకో, కాని, ఎల్లకాలం నష్టమే వస్తుందా? +వెంకటశాస్త్రి పోయిన రెండేళ్ళు వ్యయాధిపతి భుక్తి, నష్టం రాకేమి చేస్తుంది? +భూషయ్య ఇంత తెలిసినవాడివి, “ఇప్పు డిది తగ"దని నువ్వు ముందే ఎందుకు చెప్పలేదయ్యా? +వెంకటశాస్త్రి ఒకవేళ నేను చెప్పానే అనుకోండి! అయినా దుష్టగ్రహ వీక్షణం తీక్షంగా వుండగా +భూషయ్య ఔను. మావాణ్ణి చాలా దుష్టగ్రహాలు చుట్టుకొన్నాయి. అందుకనే ఇంత భ్రష్టుడయ్యాడు! +వీరభద్రరావు ఇదుగో! వెంక��శాస్త్రీ! మధ్య ను వ్వేమిటయ్యా? వసపోసిన పిట్టలా వాగొద్దని నీక్కాదూ +వెంకటశాస్త్రి ఇంతకీ మన కివ్వాళ శకునం బాగుండ లేదులెండి. భుజాన పంచె వేసుకొని, చెప్పులో +వీరభద్రయ్య చాల్లేవయ్యా! పెద్దమనిషి! కట్టి పెట్టమంటుంటే!! +వీరభద్రయ్య భూషయ్య బాబాయ్! నే నొక్కమాట చెబుతా, విను! తప్పో, ఒప్పో! మనవాడు +వ్యాపారంలో వేలు పెట్టాడు. కొంత నష్టం వచ్చింది. ఇప్పుడు ఊరికే రొష్టుపడితే, వచ్చిన నష్టం పూడుతుందా? మళ్ళీ కాస్త పెట్టుబడి పెట్టి ఈసారి పకడ్బందీగా వ్యవహారం నడిపిస్తే +భూషయ్య దాని కేమిరా! పోయినదానితో జతకావడానికి ఎవడి కొంపైనా తీసి మళ్ళీ పెట్టుబడి +వీరభద్రయ్య అదేం మాటే, బాబాయ్! లేకపోతే, అసలుకే మోసం రాదటే? +భూషయ్య అసలు లేదు; సిసలు లేదు. తను అల్లరిపడి, న న్నెందుకు అల్లరి పెడతాడుగాని, తట్ట +వీరభద్రయ్య అదిమాత్రం మాటలటే, బాబాయ్ రావలసిన బాకీలు, యివ్వదేలిన బాకీలు, ఎన్ని +లావాదేవీలు లేవు? వ్యాపారం కట్టి వేయడమంటే ఎంత పీకులాటపని చిన్నవాళ్లం, ఈ విషయాలు మేము నీకు చెప్పాలటే? మనవా డొచ్చి నోరు తెరిచి అడిగాడనిగాని, ఇదే మరొకడో, మరొకడో అయితే, వా డెంత కొమ్ములు తిరిగిన వాడైతే మాత్రం నేను కల్పించుకొనేవాడినటే, బాబాయ్? ఫలానా కొత్త బస్సురూటు యిప్పిస్తే, కాస్త కాలూ, చెయ్యీ కూడ దీసుకుంటానని మనవాడు రాబట్టి, మినిస్టరు చెవిని ఒకమాట వేశాను. +భూషయ్య ఇకనేఁ! పని అయిపోయినట్టే! మీ స్నేహితుడి రొట్టె నేతిలో విరిగిపడ్డట్టే +వీరభద్రయ్య మినిస్టరు మనం ఎంత చెబితే అంతే ననుకో. ఆ మాటకొస్తే, చీఫ్ మినిస్టరైనా మనం +ఎక్కడ బరి గీసి నిలబడమంటే, అక్కడ నిలబడాల్సిన వాడే. కాని, ఆ సెక్రటరీ గా డొకడున్నాడు. వా దొ? తెంపి వా డేవో అడ్డుపుల్లలు వేస్తున్నాడు. వాణ్ణి కట్టుకోవాలి. మేత పడందే వాడు మెత్తపడేటట్టు లేడు. ఒక్క పదివేల రూపాయీలు మనవి కావనుకొని గిరగిర తిప్పి, వాడిమొఖాన కొడితే +భూషయ్య కాంగ్రెసువాది నంటావ్; దేశభక్తుడి నంటావ్; ప్రజాసేవకుడి నంటావ్. ఈ పాడు పని +నీకు తగునట్రా? ఎవరైనా వింటే, కాండ్రించి ముఖాన ఉయ్యరట్రా? +వీరభద్రయ్య ఆఁ! ఎవడు మడికట్టుకు కూర్చున్నాడు? ఎవడిని చూడబోయినా లంచమో, పంచమో +పెట్టి, అక్కర గడుపుకొనేవాడే! ఇది పోలిటిక్స్ బాబాయ్, పోలిటిక్స్. ఇప్పుడు ప్రపంచమే ఇలా నడుస్తున్నది. +భూషయ్య ఔనౌను. దిక్కుమాలిన ప్రపంచం. కుడీ యెడమూ; మంచీ చెడ్డా; పాపం పుణ్యం ఏమీ +వీరభద్రయ్య సత్యకాలపువాడివి నీ కన్నీ పట్టింపులు గాని, పని కావడమే ప్రధానం, బాబాయ్! ఈ రూ +టొచ్చిందంటే మన వాడి పంట పండిందన్న మాటే! +వెంకటశాస్త్రి మన మాధవరావుగారికి ప్రస్తుతం భాగ్యాధిపతిభుక్తి. వాడు రాజ్యంలోనే వున్నాడు. +వాడిని ధనాధిపతి చూస్తున్నాడు. వాహన, భాగ్యాధిపతులు కలిసేవున్నారు. అసలు జాతకానికే పంచానన యోగం పట్టింది. బ్రహ్మాండమైన యోగకాలం. ఇక పట్టిందల్లా బంగారమే. +భూషయ్య సరే! సంతోషం! ఆ బంగారంలో నువ్వొక పది తులాలు అడిగి పుచ్చుకో! ఆ పెళ్ళాం +వీరభద్రయ్య నీ ఎకసక్కాల కేమిగాని, బాబాయ్! చిన్నవాడినో, పెద్దవాడినో నేను చెబుతున్నాను. +కాదు, కూడ దనకు. ఆ పదివేలకూ నువ్వు మాట దక్కించుకో. +భూషయ్య ఈ మాట ఎప్పుడు ఎప్పుడు బయటి కొస్తుందా అని ఇందాకటినుంచి ఎదురుచూస్తున్నాను. +భూషయ్య నీ ఖర్మ! నే నేం చేస్తాను? +భూషయ్య అంత కాకపోతే, మరెంతరా? నా కడుపున పుట్టింది నువ్వొక్కడివే కాదు. నువ్వు ఒక్క +వెలుగు వెలుగుతావని నీకోసం చిన్నవాళ్లు వాళ్ళకు అన్యాయం చేస్తానా? +భూషయ్య సరే! ఒకడు తక్కువ పుట్టాడనుకొంటాను. +వీరభద్రయ్య చిన్న సన్నాసి. తెలిసీ తెలియని మేళం. పెద్దవాడివి నువ్వెందుకే కాకపడతావు. +బాబాయ్? నలభై యాభై వేలు వ్యాపారం మీద పెట్టనే పెట్టాడా? అది సున్నా చుడుతుంటే ఎవరైనా చూస్తూ చూస్తూ ఎలా వూరుకోగలరే. బాబాయ్? పెట్టిన మొత్తమైనా రాబట్టుకోగలిగితే, చల్లగా తప్పుకొందామనే వాడూ చూస్తున్నాడు. పైకం అర్జంటుగా కావాల్సొచ్చిగాని, నాలుగైదు రోజుల యెడ ముంటే వాడే రకం ఫిరాయింపు చేసుకొనేవాడు కాదూ? అవతల మరొకళ్ళు ఆ సెక్రటరీగాడికి రెట్టింపు మొత్తం ఆశ చూపుతున్నారు. “ఖబడ్డార్” అని చెప్పి, ఆర్డర్ వాళ్ళకు పడకుండా ఇప్పటిదాకా పట్టుకొస్తున్నాను. నువ్వు "ఊ" అను! టెలిఫోన్ లో ఒక్కమాట చెప్పి, ఆర్డర్ని తెల్లవారేసరికి మన వాడి కాళ్ళ దగ్గిరికి తెప్పిస్తానో, లేదో! +వెంకటశాస్త్రి సిరి వస్తుంటే మోకా లడ్డకూడదు, భూషయ్య బాబూ. +భూషయ్య మీరు వెయ్యి చెప్పండి, లక్ష చెప్పించండి. నేను చిల్లిగవ్వైనా చెయ్యిజారను. +వీరభద్రయ్య నీమాట నీదేనట, బాబాయ్? నే నొక్కమాట +భూషయ్య ఈ సంగతి మరి నా దగ్గిర మాట్లాడ వద్దురా, అబ్బాయ్! ఏదో నీతిగా, నిజాయతీగా +కాలక్షేపం చేస్తున్నా. ఈ ఘటం ఇలాగే వెళ్ళమారిపోనీ! లంచాలు, పంచాలు, ఆ పాపానికి ప్రాణం మీది కొచ్చినా నే నొడికట్టను. ఏ జన్మాన ఏం పాపం చేస్తే (మాధవరావును చూపిస్తూ) వీడు నా కడుపున చెడబుట్టాడో! అందుకు జత ఇంకో పాపం దేనికి? పుట్టుగతులు లేకుండా పోవడానికా? +మాధవరావు (దిగ్గున లేచి సరే! నే నేమైపోతేనేఁ! నువ్వు పుణ్యం మూటకట్టుకుని స్వర్గానికి వెళ్లు! +రావయ్యా, శాస్తుర్లూ రా! రండి, వీరభద్రయ్యగారూ! రండి! ఇక్కడ మరొక క్షణమైనా ఆగడానికి వీల్లేదు. +వెంకటశాస్త్రి బయలుదేరిన వేళా విశేషం! నాకు ముందే దుశ్శకునమయింది. +వీరభద్రయ్య నల్లపిల్లివి నిన్ను వెంటపెట్టుకు రావడమే దుశ్శకునం! సరిగాని, మాధవరావ్! నీ +వాలకం నా కేమీ బాగాలేదు. పెద్దవాడు ఆయన నిన్ను పది అననూ వచ్చు; నువ్వు పడనూ వచ్చు. పెద్దవాళ్లు తిట్టినా, అవి దీవనలే. అబ్బే! నువ్వు తొందర పడకూడదు. కాస్త నిదానించు! +మాధవరావు అదంతా నాకు తెలవదు. మీరు వెంటనే కదులుతారా, లేదా? +వీరభద్రయ్య పోనీ, ఈ రాత్రి ఆలోచించి, రేపటికి చెబుతావటే, బాబాయ్! నన్ను మళ్ళీ రమ్మంటే రేపు +పొద్దున్నే వస్తాను. రమ్మంటావా? భూషయ్య ఊహుఁ +వీరభద్రయ్య అంత తేలిగ్గా తోసెయ్యబోకవే, బాబాయ్, నా మాట! వ్యాపారరీత్యానే కాక, మరొక +విధంగా కూడా మనవాడు చిక్కున పడ్డాడు +భూషయ్య మరొక చిక్కు కూడానా? ఏమిటది +వీరభద్రయ్య ఏదో వున్నదిలే! తెలిసీ తెలియనితనంవల్ల పెద్ద ఊబిలో దిగబడ్డాడు. +వెంకటశాస్త్రి దశబాగున్నా, గోచారంలో అష్టమ గురుడు. వాడు ఊబిలోకి దించడ మొక లెక్కా? +భూషయ్య మన బుద్ధుల్నిబట్టే మన జాతకా లుంటాయి. చేతులారా చేటు తెచ్చుకుంటూ నెపం +వీరభద్రయ్య నువ్వలా అంటే కాదే, బాబాయ్! మాధవరావు మెడ నిజంగా ఉచ్చులో చిక్కుకున్నదంటే +భూషయ్య మంచిది. నువ్వెన్ని చెప్పినా, దాన్ని తీసి నేను నా మెడకు తగిలించుకో బోవడం లేదు. +మాధవరావు (దిగ్గున లేచి నే పోతున్నా. +వీరభద్రయ్య దూకుడుకుగా పోతున్నాడు. ఏమి తిప్పలు తెచ్చుకొంటాడో? నేనూ పోతానుగాని, +ఎందుకైనా మంచిది. కాస్త వెనకా ముందు పరకాయించవే, బాబాయ్! లేకపోతే పస్తాయిస్తావ్. వెళ్ళొస్తా మరి. +వెంకటశాస్త్రి (తనొక అడుగు వెనక్కి తగ్గి భూషయ్యబాబూ! పేద బ్రాహ్మణీ! పిల్లా జిల్లాతో గంపెడు +సంసారం. తాము దయ వుంచాలి. తమ జాతకం ఒకసారి దయచేయిస్తే - +(బయటినుంచి మాధవరావు “ఏమయ్యా! శాస్తుర్లూ తగలబడవే” అని అరుస్తాడు. +వెంకటశాస్త్రి (బయటి మాధవరావుతో వస్తున్నా, బాబూ వస్తున్నా ఎదటి +భూషయ్యతో)సూరేకారం పాలు, భూషయ్యబాబూ! తొందరపాటు తగదని అబ్బాయిగారికి చెవినిల్లు కట్టుకుని నేను చెబుతానే వున్నా. దశానాధుణ్ణి అష్టమాధిపతి చ���స్తున్నాడు. అంచేత అదృష్టమేమో పడుతుంది కాని, అష్టకష్టాలలో పడక తప్పదన్నట్టు కనిపిస్తూ వుంటుంది. నే నొస్తా, భూషయ్య బాబూ! సెల విప్పించండి. +(నమస్కరించి వెంకటశాస్త్రి వెళ్ళిపోతాడు. వెంటనే మోటారుకారు బయలుదేరి వెడుతున్న చప్పుడు వినబడుతుంది. +భూషయ్య ముఖంలో కలత కనబడుతుంది. కొన్ని క్షణాల తర్వాత, అప్రయత్నంగా శ్రీమదాంధ్ర +భాగవతం అందుకొని, కృష్ణమాచారి గుర్తు పెట్టి వెళ్ళిన పేజీ వద్ద దానిని విప్పుతాడు, మనస్సు కలత తీరడానికన్నట్టు, “ఆశాపాశము దాగడున్ నిడుపు అనే పద్యం చదువుతాడు. ఆ పిమ్మట సీసపద్యాన్ని అందుకొని “సంతుష్టు డీ మూడు జగముల బూజ్యుండు, సంతోషి కెప్పుడు జరుగు సుఖము, సంతోషి గాకుంట సంసార హేతువు, సంతసంబున ముక్తసతియు దొరకు” అనే మొదటి రెండు చరణాలూ పూర్తి చేస్తుండగా కృష్ణమాచార్యులు తిరిగి ప్రవేశిస్తాడు +కృష్ణమాచార్యులు భగవత్కథా కాలక్షేపానికి విఘ్నం దేనికని వామనావతార ఘట్టాన్ని పూర్తి +భూషయ్య అబ్బే, లేదండీ! మనస్సు చికాగ్గావుంటే, యదాలాపంగా +కృష్ణమాచార్యులు చికాకే మరి! ఇదెంత అప్రతిష్ఠ! ఇదెంత అప్రతిష్ఠ! మీ కుటుంబ గౌరవానికి, మీ +వంశమర్యాదకూ అయ్యయ్యో ఎంత మచ్చ! ఇంతకీ ఇది విధి వైపరీత్యం. భూషయ్య బాబంటే సాక్షాత్తు ఆ ధర్మరాజని లోకమంతా మ్రోగిపోవడ మేమిటి, అట్టి ధర్మప్రభువు కడుపున ఫోర్జరీకి పాల్పడే కొడుకు పుట్టడ మేమిటి? +భూషయ్య (మిన్ను విరిగి మీద పడ్డట్టు ఆఁ! ఫోర్జరీ యేమిటి? +కృష్ణమాచార్యులు (తెల్లబోతూ ఏఁ? భూషయ్య బాబూ! ను వ్వింకా విననే లేదా? +భూషయ్య అయ్యో ఖర్మ! ఫోర్జరీ యేమిటండీ? +కృష్ణమాచార్యులు నాలుగైదు రోజుల క్రితమే నేను కర్ణాకర్ణికగా విన్నాను. పాపం, పుణ్యం ఆ +భగవంతుడి కెరుకని నీ చెవిని వెయ్యలేదు. కాని, ఈపూట ఊరంతా గుప్ మంది. ఎక్కడ వినబోయినా ఈమాటే మహా విడ్డూరంగా +కృష్ణమాచార్యులు వస్తున్నా, భూషయ్యబాబూ! దానికే వస్తున్నా. నీ సంతకాన్ని అబ్బాయి ఫోర్జరీ +భూషయ్య నా సంతకాన్నా? ఎప్పుడు? ఎందుకు? +కృష్ణమాచార్యులు ఆ దుష్టుడు లేడూ వీరభద్రయ్య అతగాడు ఏదో బస్సురూటట పర్మిటట +వాడి శ్రాద్ధమట ఆ గొడవలు నాకు తెలియవ్ మనచేతిలో పని చిటికలో అయిపోతుంది నాదీ పూచీ ఒక్క పదివేలు పట్టుకురావోయ్” అన్నాడట. “అదెంత భాగ్యం? +భూషయ్య ఔను, ఇప్పుడేగా మీ రిక్కడుండగానే ఆ పదివే లిమ్మని నా దగ్గరి కొచ్చి వెళ్లారు. +కృష్ణమాచార్యులు అబ్బాయి నెలనాడే పదివేలు అప్పుచేసి యివ్వడం, దాన్ని ఈ ఖర్చులని, ఆ +ఖర్చులని వీరభద్రయ్య గుటకాయస్వాహా చేసివెయ్యడం జరిగిపోయిందట, భూషయ్యబాబూ! +భూషయ్య సరే, ఏం తగలబడ్డాడో గాని, ఫోర్జరీ యేమిటండీ? +కృష్ణమాచార్యులు ఆ అప్పు పెట్టినవాళ్ళు “మీది అవిభక్త కుటుంబం నోటుమీద మీ నాన్న సంతకం +కూడా కావా” లన్నారట. సూర్యుడు ఇటు అటు పొడిచినా నువ్వు సంతకం పెట్టేది లేదని తెలుసుగనక "ఆఁ! ఎవరు చూడొచ్చారులే అని నీ బదులు కూడా అబ్బాయే సంతకం చేశాడట. +భూషయ్య ఆరి భడవ! ఎంత పని చేశాడు! +కృష్ణమాచార్యులు వస్తుతః అబ్బాయి మంచివాడే. కాని, ఆ భ్రష్టాకారి ముండావాడు వీరభద్రయ్య +స్నేహం చేసి చెడిపోతున్నాడు. ఈ చిక్కు అతగాడు తలకు చుట్టిందే. +భూషయ్య అయితే, నీ డింకా వాడి చంకే నాకుతున్నాడేం? +భూషయ్య ఇంకేం పసితనం? పాతకేళ్ళిస్తే ముక్కున వేలు వేసుకొని) అన్ని విధాలా నన్నెంత +కృష్ణమాచార్యులు లోకానుభవం తక్కువ, భూషయ్య బాబూ. లోకానుభవం తక్కువ! ఆ వీరభద్రయ్య +మైరాముణ్ణి చంపి పుట్టాడు. అతగాడు బట్టలో పేలాలు వేయిస్తాడు; అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు. తిమ్మిని బ్రహ్మి చేయగల సమర్ధుడు. మహామహా కొమ్ములు తిరిగినవాళ్ళే అతగాడి మాయలో పడిపోతారు. ఇహ, మన మాధవరావుమాట చెప్పాలీ? జరిగిందేదో జరిగింది. పస్తాయించి లాభం లేదు. రెండోకంటి వాడికి తెలియకుండా ఆ పదివేలూ పంపించి, తెల్లవారక ముందే ఆ నోటు మన చేతి కొచ్చేటట్టు +భూషయ్య (ఆందోళనాపూర్వకంగా అది పరాయివాళ్ళ చేతిలో వుండడం ప్రమాదమే! +కృష్ణమాచార్యులు ప్రమాద మని నెమ్మదిగా అంటావేమి, భూషయ్యబాబూ! దాన్ని మన చేతికి +రాబట్టుకోకపోతే కుత్తుక పట్టుకుంటుంది. వాళ్ళు "మా పదివేలు మాకు తెస్తావా? సివిల్, క్రిమినల్ చర్యల్ని జరపమంటావా?” అని దూకుడు చేస్తున్నారట. మీ రిహ తాత్సారం చేస్తే కాదు. తలలో నాలికవంటి మనిషి నెవరినైనా చూచి, అతగాడి చేతికి పైక మిచ్చి, తెల్లవారేసరికి ఎలాగైనా సరే +భూషయ్య (బాధతో బరువుగా కొడుకు రాసిన దొంగనోటు తెప్పించ మంటారు! +కృష్ణమాచార్యులు లేకపోతే, కొంప లంటుకోవూ, భూషయ్య బాబూ? దుష్టసహవాసం చేసి, +చెయ్యరాని పని చేశాడనుకో! అయినా జ్యేష్ఠుడు, జెయిల్లో పడ్డాడంటే, వంశానికే తరతరాలకూ తలవంపులు కావూ? +భూషయ్య ఇప్పుడు అంతపనీ జరగలేదటండీ? ఫలానా వారబ్బాయి ఫోర్జరీ చేశాడంటూ లోకం కోడై +కూస్తున్నదని మీరేగా ఇంతకుముందు చెప్పారు జెయిలుకు వెళ్ళడం ఇంతకంటె అప్రతిష్ఠ కాదుగా? ఇంత బ్ర���ుకూ బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు, నా కొడుకు రాసిన దొంగనోటు నా కివ్వమని నేను అడ్డమైనవాడి కాళ్లా వేళ్లా ఎక్కడ పడతానులెండి? వీడు రాసిన దొంగనోటు ఇదొక్కటే నన్నమాటేమిటి? ఎన్నున్నవో! +కృష్ణమాచార్యులు అబ్బే! వోడు వోడంటే కంచమంతా వోడేనా, భూషయ్యబాబూ? ఇందాక నీదగ్గరి +కొచ్చినప్పుడు అబ్బాయి ముఖాన కత్తివేటు వేసినా నెత్తురు చుక్క వున్నదా? పాపం! చాలా సిగ్గుపడిపోతున్నాడు! +భూషయ్య వాడు సిగ్గు బిడియాలున్నవాడైతే, అన్ని అబద్ధాలాడతాడా? “ఏదో బుద్ధి తక్కువైంది. గడ్డి +కరిచాను. నన్ను ఒడ్డుకు చేర్చ” మంటే, అదొక దారి. ఆ మాట వాడి నోటివెంట వచ్చిందా? +(లోపలినుంచి పదిహేను, పదహారేళ్ల కుర్రవాడి గొంతు “నాన్నా! చెల్లాయి మందుపొట్లం వేసుకోనంటున్నది”. +భూషయ్య అది చేదు పుట్ట. కాస్త తేనెలో కలిపి వెయ్యండిరా! +కృష్ణమాచార్యులు అమ్మాయికి నెమ్మళ్లించ లేదా భూషయ్య బాబూ? +భూషయ్య ఆఁ! కొంత నెమ్మళించింది. నిన్న సాయంత్రం నుంచి జ్వరం తిరుగుముఖం పట్టింది. +కృష్ణమాచార్యులు మొత్తంమీద చాలా పెద్ద ఖాయలా తీసింది. రత్నంవంటి పిల్ల. ఎక్కడ +దాపురించిందో ఈ విషజ్వరం. పైకి అనలేదుగాని, పోయిన వారం నాకు మనస్సులో కొంత డొక్కు పడింది. +భూషయ్య ఎవరెంత ఖంగారు పడితే నేమండీ! వాడు వాకిట్లో వాడు వాకిట్లోనుంచే వెళ్ళిపోయాడు +గాని, లోపలికి తొంగైనా చూశాడా? అన్నయ్యను చూడాలని అది కలవరిస్తే, అక్కడికీ మొన్న కబురుకూడా చేశాను. తన షోకు, తన దర్జా, తన సుఖం, తన గొడవేతప్ప మరొకరి ఊసే వాడికి పట్టదు. ఏమిటో ఈ విపరీతపు బుద్ధులు. కాలమహిమ కాబోలు! +కృష్ణమాచార్యులు ఇంకా పసివాడు, భూషయ్యబాబూ! పసివాడు. ఎలాగైనా, ఈ ఉచ్చు మీరు +భూషయ్య అయితే, వీడికంటే పసివాళ్ళు లేరూ? వాళ్ళ మాటేమిటి? వీడికోసం వాళ్ళకు చిప్ప చేతి +కృష్ణమాచార్యులు ఆమాట నిజమే ననుకో, భూషయ్యబాబూ! కాని మాధవరావు +భూషయ్య వాడు నా పెద్దబిడ్డ; వాడిమాట మీరు నాకు చెప్పాలటండీ? పైపై గాంభీర్యమేగాని, వాడి +విషయమై నేనెంత కుమిలిపోతున్నానో మీకేం తెలుసు? ఇప్పుడు మీరు చెప్పిన మాట వినేసరికి నవనాడులూ క్రుంగి నేను సగం చచ్చానంటే నమ్మండి. కాని, నీతీ నిజాయితీ లేనివాడిని కొడుకైతే మాత్రం కాపాడాలన్న తాపత్రయం మనకు తగునా? అట్టివాడు ఏ గంగ కలిసినా ఒక్కటే. “మన కున్నది మనకు చాలదట్రా అని ఎంత మొత్తుకున్నా గోడకు చెప్పినట్టే అయింది. వాణ్ణి దురాశ పీడిస్తున్నది; దుర్మార్గు���ౌతున్నాడు. సరే, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. ఎవరి కర్మ కెవరు కర్తలు? సర్లెండి ఆ పద్యం దాన్ని మళ్లీ వినిపించండి “ఆశాపాశము దా గడుకొనిడుపు ” +కృష్ణమాచార్యులు ధర్మరాజువని నీకు ఊరికే పేరొచ్చిందీ భూషయ్యబాబూ! నీబోటి వాళ్ళింకా +భూషయ్య మీ మాటలకేమిలెండి. ఆ పద్యం వినిపించండి. +(కృష్ణమాచార్యులు “ఆశాపాశము దా గడున్ నిడుపు” అని ఉచ్సైస్స్వరంలో యెత్తుకొన్నంతనే – +గమనిక ఈ నాటికను రెండవ ముద్రణలో చేర్చారు తెర) +పాత్రలు: మనుమడు, అతని తల్లి, అతని తాత. +స్థలం వార్సా సమయం: 1939 సెప్టెంబరు 10వ తేది ఉదయం +ఈ నాటికలోని పాత్రలు మార్షల్ పిల్సుడ్ స్కీ పట్ల చాలా భక్తిభావాన్ని ప్రదర్శిస్తారు. ఇది సహజం. రష్యాపై దండెత్తడానికి 1914లో పిల్సుడ్ స్కీ +కూడదీసిన మొదటి లీజియన్ కు చెందిన ఒక సైనికుడు మార్షల్ జీవితాంతం వరకు ఆయన వాలెట్ గా పనిచేశాడని "న్యూ స్టేట్స్ మన్ అండ్ నేషన్”లోని ఒక వ్యాసంలో ఆ ఒక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ నాటికలోని తాతను సృష్టించాను. మార్షల్ కు అంత, విశ్వాసపాత్రంగా సేవచేసిన వ్యక్తి అతనిపట్ల విపరీతమైన భక్తిని ప్రదర్శించడం సహజం. తాతనుబట్టి తాత కుటుంబంలోని ఇతరుల వైఖరి కూడా వుంటుందనడంలో దోషంలేదు. చదివాను. +అయితే, ఈ పాత్రలతోపాటు మనం మార్షల్ ను స్తోత్రం చెయ్యలేము. మాతృదేశ స్వాతంత్ర్యసిద్ధికి పిల్సుడ్ స్కీ కఠోర తపస్సు చేశాడనడం నిజం. +కాని, జాతీయాభిమానమే అతనిలో ఒక పెద్ద లోపమైంది. సోషలిస్టుగా అతడు జీవితాన్ని ప్రారంభించాడు. ఎంతవరకు సోషలిస్టుల సాహచర్యం తన జాతీయోద్యమానికి వినియోగించిందో, అంతవరకు దాన్ని వినియోగించుకున్నాడు. ఆ తర్వాత అసలు సోషలిస్టు సిద్ధాంతాలకే విరోధి అయ్యాడు. ఇది ద్రోహమని ఒక సోషలిస్టు మిత్రుడు నిందిస్తే, “నీవూ నేనూ సోషలిజం అనే రైలును అందుకున్నాం. నేను పోలిష్ స్వాతంత్ర్యం అనే స్టేషన్ దగ్గర దిగిపోయాను; నువ్వు యూటోపియాకు (ఆదర్శ రాజ్యానికి) నీ ప్రయాణాన్ని సాగించు” అని అవహేళన చేశాడు. +1772లో రష్యా, జర్మనీలు మొట్టమొదటిసారిగా పోలెండ్ ను పంచుకున్నాయి. అప్పటి నుంచి 1815 వరకు మరి మూడుసార్లు పోలెండ్ +పంపకం జరిగింది. నాల్గవ పంపకంలో రష్యా, జర్మనీ, ఆస్ట్రియాలు భాగస్థులు, 1918 వరకు ఈ నాల్గవ పంపకం అమలులోనే వుంది. ఏదో ఒక విదేశ రాజ్య దాస్యానికి లోబడి ఉండటమే దుర్భరం. ఇక, మూడు విదేశ రాజ్యాలకు గులాం కావడం సంగతి చెప్పనక్కర్నేలేద���. అంచేతనే పోలిష్ వారిలో జాతీయత మూర్తీభవించి, చివరికి అది ఒక జాడ్యంగా పరిణమించింది. పిల్సుడ్ స్కీ ఈ జాడ్యానికి అందరికంటే ఎక్కువగా గురి అయ్యాడు. +జాతీయాభిమాన జాడ్యం ముదిరినప్పుడు అది జాతీయదురహంకార మౌతుంది. పిల్సుడ్ స్కీ విషయంలో ఇదే జరిగింది. పోలిష్ జాతికి చెందిన +వారినందర్నీ, పోలిష్ భాషను మాటాడే వారినందరినీ ఒక రాజ్యం కిందికి తేవడంలో సంతృప్తిపడక, అతడు పోలెండ్ ను యూరప్ లో ఒక మహారాజ్యంగా చెయ్యాలనుకున్నాడు. ఇందుకోసం జర్మన్ జాతివారు నివసిస్తున్న కొన్ని ప్రాంతాల్ని ముందుగానే పోలెండ్ లో కలుపుకున్నాడు. ఆ తర్వాత రష్యాలోని అంతర్యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని, దానిపై దండెత్తి వెళ్ళి, 1920లో దానిదగ్గరి నుంచి వెస్టన్ యూక్రెయిన్ రాష్ట్రాన్ని అపహరించాడు. ఆతర్వాత లిథువేనియాపై కత్తికట్టి, 1927లో దానిదగ్గరి నుంచి విల్నా జిల్లాను వశపరుచుకున్నాడు. ఈ దురాక్రమణలతో పోలెండ్ కు అతడు ఎన్నో కొత్త సమస్యల్ని కల్పించాడు. +ఇంతేకాదు. విదేశ ప్రభుత్వాలతో సంఘర్షణల్ని సాగించడంలోనే జీవితాన్ని వెళ్ళబుచ్చినవాడు కావడం వల్ల పిల్సుడ్ స్కీలో సైనిక ప్రవృత్తి ప్రబలింది. +నిజానికి ఇది పిల్సుడ్ స్కీ నాటికకాదు; పోలెండ్ నాటిక. పోలెండ్ నాటిక కూడా కాదు; స్వాతంత్ర్య సంపాదన కోసం, సంరక్షణ కోసం పోరాడే +సీన్ వార్సాలో ఒక డ్రాయింగ్ రూం. కుడివైపుది సింహద్వారం. దాని రెండుపక్కల వీధిలోకి రెండు కిటికీలు. ఎడమవైపున మరి రెండు కిటికీలు. +వాటిమధ్య ఫైర్ ప్లేస్. వెనక భాగాన మేడమెట్లు, గదిమధ్య నుంచి కొంత ఎత్తు లేచిన తర్వాత రెండు వరసలుగా చీలి, ఒక వరస కుడివైపుకూ, మరొక వరస ఎడమవైపుకూ పైకి వెడుతున్నాయి. మెట్ల వరసలలో ఎడమ దానికింద బీరువా, కుడిదానికింద సైడ్ టేబుల్, ఆ టేబుల్ పైన రేడియో, దాని ఎదట ఒక కుర్చీ. సైడ్ టేబుల్ వున్న గదిమూల ఒక కబర్డ్. గది మధ్యలో ఒక సెటీ, నాలుగు కుర్చీలు, వాటి మధ్య గ్లాస్ టాప్లు సెంట్రల్ టేబుల్. దానిమీద చప్పగా వాడిపోయిన పువ్వులతో ఫ్లవర్ వాస్. గదిలో ఒకపక్కగా పామ్ స్టాండ్. దానిమీద మార్షల్ పిల్సుడ్ స్కీ బస్ట్. గది మధ్య చక్కని తివాచీ. +సెటీలో ఒక మూలకు వొది? కాత కూర్చుని వుంటాడు. వయస్సు డెబ్బై ప్రాంతాల, తాత ముఖం చింతాక్రాంతంగా వుంటుంది. టీ ట్రీ పుచ్చుకుని +మనుమడు తాతా! తాతా! తాత (ఆలోచనలు అన్నీ ఎక్కడో వున్నట్టు ఆఁ! +మనుమడు అమ్మ పనితొందరలో వుంది. టీ కోసం కిందికి రాలే నంది. తాత ఊఁ! +మనుమడు బ్రెడ్ లేదు. కబలో బిస్కట్లు వున్నవేమో చూడమన్నది, తాతయ్యా! +మనుమడు బిస్కట్లు అయినా లేవు, తాతయ్యా! తాత సర్లే, బాబూ! మనుమడు మరి, నేను పోనా? +(మనుమడు మేడమీదికి వెళ్ళడానికి నాలుగు మెట్లు యెక్కుతాడు. +మనుమడు (మెట్లు దిగుతూ దేనికి? తాత మన గరాజ్ లోకి వెళ్ళి, ఆయిల్ కాన్ పట్టుకురా! +మనుమడు ఆయిల్ కాన్ దేని కిప్పుడు? +తాత (మెట్ల దగ్గరికి వెళ్ళి కుమార్తె నుద్దేశించి అమ్మా! +అమ్మ (మేడపై నుంచి దేనికి నాన్నా? +తాత బీరువా తాళంచెవి ఎక్కడున్న దమ్మా? +అమ్మ సైడ్ టేబుల్ డ్రాయర్ లో వుంది. +(తాత తాళం చెవి తీసుకుని బీరువా తెరుస్తూ వుండగా మనుమడు తిరిగి వస్తాడు. +మనుమడు ఇదుగో, తాతయ్యా! ఆయిల్ కాన్ ముట్టకుండా వున్న టీ వంక చూచి) టీ తాగనే లేదేమి, తాతయ్యా! చల్లారిపోతున్నది, +తాత తాగుతా, బాబూ! మీ అమ్మ నడిగి డస్టరుంటే పట్టుకురా! +మనుమడు ఊహుం! ముందు చెబితేనేగాని తేను. +తాత (బీరువాలోనుంచి ఆర్మీరైఫుల్ బయటికి తీస్తూ ఈ రైఫుల్ వాడుకలేక తుప్పు పట్టిపోయింది; తుడవాలి. +(మేడమీదికి వెడతాడు. తాత రైఫుల్ పుచ్చుకువచ్చి, సెటీలో చతికిలబడి, రైఫుల్ బారెల్ పరిశీలిస్తాడు. తర్వాత ట్రిగ్గర్ +ముమ్మారు పైకిలాగి నొక్కుతాడు. ఇంతలో మనుమడు తిరిగి వస్తాడు. +మనుమడు నిన్ను అమ్మ చప్పున ప్రయాణం కమ్మంటున్నది, తాతయ్యా! +మనుమడు ఎక్కడి కేమిటి? మన వార్సాను ముట్టడించబోతున్నారనీ, సైనికులు కానివాళ్ళందరు వెళ్ళిపోవాలనీ రేడియోలో చెప్పలేదూ? +తాత ఆఁ! ఔనౌను! నే నామాటే మర్చిపోయాను. మరి, చప్పున ప్రయాణమై వెళ్ళండి. +తాత రేడియోలో చెప్పిందేమిటి? సైనికులు కానివాళ్ళు వెళ్ళిపోవాలని అంతేగా? మనుమడు ఔను. +తాత మరి నేను సైనికుణ్ణి. ఎలా వస్తాను నువ్వే చెప్పు? +మనుమడు ముసిలివాడివి నువ్వేమి సైనికుడివి, తాతయ్యా? +తాత సైనికుడు కావడానికి ముసిలివాడేమిటి? పడుచువాడేమిటి? ఒకసారి సైనికుడైనవాడు బ్రతికినంతకాలమూ సైనికుడే? +మనుమడు నువ్వేమి సైనికుడివి తాతయ్యా! నీ చేతులు +తాత ఔను. నా చేతులకు వణుకు పుట్టింది. అయితే నేం? గుండెమాత్రం గట్టిగానే వుంది. +తాత నిజమే. నాకు చూపైనా తిన్నగా ఆనడం లేదు. కాని, నా దారిమాత్రం సూటిగా కనబడుతున్నది. +(ఈ మాటల్ని అంటూ రైఫుల్ కు ఆయిల్ రాస్తూ ఉంటాడు +మనుమడు నీకేమైనా పిచ్చిపట్టిందా, తాతయ్యా? ఇంత ముసిలివాడివి నువ్వేం యుద్ధం చేస్తావు. +తాత ఏమంత వయస్సు? ఇంకా డెబ్బై నిండలేదు. +మనుమడు (నవ్వుతూ అదేమిటి, తాతయ్యా! నువ్వింకా చిన్నవాడివనే +! మనుమడు ఏమో! అంత వయస్సులో ఆయనైనా ఇంత సాహసాన్ని చేసేవాడు కాదు. +తాత కాదనుకో! కాని, ఆ మహామహుడు జీవించివుంటే +మనుమడు ఆయన జీవించేవుంటే తుపాకి పట్టేవాడంటావా? +మనుమడు నీకంటె ఆయన మూడు సంవత్సరాలు పెద్దవాడని చెప్పావ్ కాదూ, తాతయ్యా? +తాత ఔను. ఇప్పటికి డెబ్బై రెండు నిండేవి. +తాత ఆయనకు ఇదొక సాహసమా? కేవలం మూడువందల మందితో జార్ సామ్రాజ్యంపై దండెత్తాడు! ఆ మూడు వందల మందిలో నుంచే మూడు లక్షలమంది వీరు లుద్భవించారు; శతాబ్దం పై నుంచీ దాస్య బాధతో క్రుంగిపోతున్న మన దేశం స్వతంత్ర రాజ్య మైంది. +తాత అప్పుడా ఆలోచిస్తున్నట్టు క్షణం ఆగి) ఆయన జన్మించింది 1867లో. ఇక, రష్యాపై దండెత్తింది 1914లో. అంటే +మనుమడు 1914లో 1867 పోతే ఆఁ ఉండు తాతయ్యా చెబుతాను అదొక 33 ఇదొక 14 మొత్తం 47 అంటే, అప్పటికి నడి వయస్సన్నమాట! +తాత తర్వాతనైనా ఆయన పౌరుషం చచ్చిందా! పిల్సుడ్ స్కీ సంగతి నీకు తెలియదు, బాబూ? పోలెండే ఆయన; ఆయనే పోలెండ్. దాస్య బాధ నుంచి ఆయన విముక్తి చేసిన పోలెండ్ పై ఈనాడు నాజీమూకలు +("పేపర్" అంటూ న్యూస్ బాయ్ పత్రిక పడవేసి వెడతాడు. అది పడిన చప్పుడుకు ఇద్దరూ అటు చూస్తారు. +మనుమడు పత్రిక వచ్చింది, తాతయ్యా! స్పెషల్ ఎడిషన్ కాబోలు వెళ్ళి దాన్ని తెచ్చి. హెడ్డింగుల్ని దువుతాడు “వార్సా సరిహద్దులలో జర్మన్ సైన్యాల ప్రవేశం “పలాయనమౌతున్న ప్రజలపై ఫిరంగులు “మన సైన్యాల వీరోచిత ప్రతిఘటన” +తాత (ఉద్రేకంతో కూడిన ఉచ్చైస్వరంతో పారిపోతున్న ప్రజలపై ఫిరంగులు! ఇది యుద్ధం కాదు, హత్యా కాండ! హంతకులు! రాక్షసులు!! +(ఉద్రేకం మరీ హెచ్చి, ఉక్కిరి బిక్కిరై పోతాడు. చెడ్డ దగ్గు వస్తుంది. +మనుమడు అయ్యొ తాతయ్యా చప్పున టీకప్పు దగ్గరికి తీసుకువెళ్ళి) కాస్త టీ పుచ్చుకో! టీ దగ్గు తగ్గుతుంది! +తాత (గుక్క తిప్పుకుంటూ వద్దు, బాబూ! వద్దు. +మనుమడు వద్దక పోవడమేమిటి, తాతయ్యా! కొంచెం తాగు మంచిది. +తాత (కప్పు అందుకుని, రెండు గుక్కలు తాగి మరి చాలు బాబూ కప్పు టేబుల్ పై పెడుతూ) ఇప్పు డాయనే జీవించివుంటే +మనుమడు వుంటే, ఆయనైనా మాత్రం ఏం చేశేవాడు? +తాత ఏం చేశేవాడా? 1920లో ఏం చేశాడో. ఇప్పుడూ అదే చేశేవాడు. అప్పుడు వార్సాకు ఆరుమైళ్ళ దూరంలోకి వచ్చిన బోల్షివిక్ సైన్యాల్ని ఆయన తరిమికొట్టలేదా? +మనుమడు ఆయన శక్తి అంటే నీ కెంత విశ్వాసం తాతయ్యా! +తాత ఆయన సంగతి తెలిస్తే నీక�� +మనుమడు అంతా తెలుసు. ఆయన విల్నాలో పుట్టాడు. ఆయన తండ్రి ఆస్తిని జార్ ప్రభుత్వం జప్తు చేసింది; ఆయన అన్నకు ఉరిశిక్ష వేసింది; ఆయన్ని రెండు సార్లు జైలులో పెట్టింది. మొదటిసారి సైబీరియాలో ఐదేళ్ళపాటు సీసం గనిలో కూలీగా పనిచేయించింది. రెండోసారి వార్సాలోనే చీకటి కొట్టులో పడవేసి అష్టకష్టాలు పెట్టింది. అప్పుడాయన పిచ్చెత్తి పోయినట్టు నటన చేసి, ఒక డాక్టర్ సహాయంతో జైల్ నుంచి తప్పించుకున్నారు. ఇంకా చెప్పనా? +తాత (మనుమడి ధోరణికి చిరునవ్వుతూ ఊఁ! చెప్పు! +మనుమడు 1914లో యుద్ధం ప్రారంభం కాగానే “మీరు మా పక్షాన చేరి రష్యా పై యుద్ధం చేస్తే, మీ దేశాన్ని స్వతంత్ర రాజ్యం చేస్తా” మని జర్మనీ, ఆస్ట్రియాలవారు వాగ్దానం చేశారు. దీన్ని నమ్మి ఆయన ష్యాపై దండయాత్ర సాగించాడు. 1917లో రష్యా వోడిపోగానే, ఇక పోలెండ్ ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించమని ఆయన కోరాడు. ఇందుకు జర్మనీవా రిచ్చిన జవాబు ఆయన్ని ఖైదులో పెట్టడం. +తాత (నవ్వుతూ ఇంకా తేదీలు జ్ఞాపకం లేవూ? +మనుమడు (గారాబంగా కాదు, తాతయ్యా! ఇంకా చెబుతా, విను! ఆయన జైలుకు వెడుతూవుంటే, కష్టకాలంలో ఆయన సరసను నిలవాలని నువ్వు వెంట బయల్దేరావు. నువ్వు వెంట రావడానికి వీల్లేదని అడ్డుచెప్పగా “నేను పిల్సుడ్ స్కీ వాలెట్ ను; ఆయన వెంట ఉండితీరా” లన్నావు. 1918లో జర్మనీ వోడిపోయింది. వెంటనే పిల్సుడ్ స్కీ విడుదలయ్యాడు. పోలెండ్ స్వతంత్ర రాజ్యమైంది. తర్వాత నీకు పెద్ద హోదా నిస్తానంటే “వద్దు! నేను వాలెట్ గానే వుంటా” నన్నావు. పిల్సుడ్ స్కీ మొదటి లీజియలోని మూడు వందల మందికీ ఇంత తక్కువ హోదాతో సంతృప్తి పడింది నువ్వొక్కడివే. నువ్వు +తాత (నవ్వుతూ నువ్వు చెబుతున్నది పిల్సుడ్ స్కీ చరిత్ర కాదు; మీ తాత చరిత్ర. +మనుమడు కాదు; తాతయ్యా! పిల్సుడ్ స్కీ జీవితచరిత్ర అంతా నాకు తెలుసు. +తాత నీకు తెలిసిన విషయాలు ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య స్థూలఘట్టాలు మాత్రమే, బాబూ? ఆయన అంతర్జీవితం నీకు తెలియదు. ఆయన జీవితం మీద, ఆయన జీవిత లక్ష్యాల మీద వెలుగు ప్రసారించగల చిన్ని చిన్ని సంఘటనలు ఎన్నో నా కళ్లెదట జరిగాయి. వీటి సంగతి లోకానికి తెలియనే తెలియదు. +మనుమడు ఏం సంఘటన లవి, తాతయ్యా? ఏదీ ఒకటి చెప్పు! +తాత సరే! చెబుతా విను. ఒకనాడు వీధిలో నవ్వుతూ కేరుతూ ఆడుకుంటున్న పిల్లల్ని చూచి ఆయన నిట్టూర్చాడు. +మనుమడు ఆడుకుంటున్న పిల్లల్ని చూచి నిట్టూర్చడం దేనికి? +తాత నేనూ అదే ఆశ్చర్యపోయాను. అయితే అప్పటికి మాట్లాడకుండా వూరుకుని, ఆ రాత్రికి “ఉదయం నిట్టూర్చారు దేనికి?” అని అడిగాను. +అమ్మ ఈ ట్రంక్ కిందికి దించాలి. +తాత వెళ్ళు, బాబూ! సాయం పట్టు. +తాత వెళ్ళిరారా, బాబూ? మనుమడు సరే! వెడుతున్నా! +మనుమడు (తిరిగివచ్చి నీ ప్రశ్నకు మార్షల్ ఏం జవాబిచ్చాడు. తాతయ్యా? +తాత చాలా గొప్ప జవాబిచ్చాడు. “మనం దాస్యబాధ అనుభవించాం. అంచేత స్వాతంత్ర్యం కోసం పరితపించాం. ఎలాగో దాన్ని సాధించాం. నవ్వుతూ, కేరుతూ ఆడుకుంటున్న ఆ పిల్లలకు దాస్య బాధ తెలియదు. అంచేత వాళ్ళు స్వాతంత్ర్యం విలువ గ్రహించగలరా అని సందేహం తోచింది” అన్నాడు. “ఈ సందేహం ఇంకా మిమ్మల్ని బాధిస్తున్నదా?” అని నే నడిగాను. “లేదు; అప్పుడే పోయింది” అంటూ ఆయన మందహాసం చేశాడు. తర్వాత చప్పున కుర్చీలోనుంచి లేచి, గదిలో పచారుచేస్తూ “మూడుసార్లు పంపకం జరిగినా పోలెండ్ నశించలేదు. మరి ముప్ఫయిసార్లు పంపకం జరిగినా అది నశించలేదు. అజేయమైంది నా పోలెండ్! అమరమైంది నా పోలెండ్!!” అని గంభీరంగా అన్నాడు. ఆ మాటలు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. +మనుమడు అయితే, తాతయ్యా! మా బడిలో +మనుమడు అదికాదు, తాతయ్యా! మార్షల్ చాలా గొప్పవాడే. దేశం కోసం చాలా త్యాగాలు +చేశాడు. కాని, చండశాసనుడుగా పరిపాలించాడటగా? ప్రజాస్వామ్యాన్ని పీడించాడటగా! తాత ఆఁ! తెలిసీ తెలియక ఏవో పేలుతూ వుంటారు? నెత్తిని ఆమాత్రం మొట్టకపోతే, అలకాజనం మాట వింటారూ? దెబ్బకే దెయ్యం జడిసేది. +మనుమడు అలకాజన మేమిటి, తాతయ్యా! నువ్వు, మా నాన్నా పోరాడింది ప్రజలకోసం కాదూ? మార్షల్ కోసమేనా? ఆయన జనరల్స్ కోసమేనా? +తాత నువ్వు పసివాడివిరా, బాబూ! ఈ పెద్ద విషయాలు నీకు తెలియవ్, పోలెండు సైనికశక్తిని కూర్చి, తూర్పు యూరప్ లో దాన్ని మహారాజ్యం చెయ్యాలని +విమానాల రొద. మనుమడు అవిగో, తాతయ్యా! విమానాలు కిటికీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి) ఒకటి రెండు మూడు నాలుగు అయిదు ఆరు ఆరు విమానాలు, తాతయ్యా! +(విమానాలు దాటి వెళ్ళిపోతున్నట్టు క్రమంగా రొద తగ్గుతుంది. +తాత తప్పు, బాబూ! తప్పు విమానాలు దాడిచేస్తూండంగా కిటికీ వద్ద నిలబడరాదు. ఇలారా! ఆ కిటికీ మూసెయ్యి! +మనుమడు (కిటికీ వద్దనే నిలబడి ఊరు మధ్యకు వెడుతున్నట్టున్నాయి, తాతయ్యా! ఉదయం గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద చాలా బాంబుల్ని వేశాయట. ప్రాగా ఆసుపత్రి కూలిపోయిందట. మార్షల్ పాలెస్ బూడిదై పోయిందట. +తాత మార్ష��్ పాలెస్ బూడిదైపోతే పోవచ్చు గాని, మార్షల్ సృష్టించిన పోలెండ్ బూడిద కాదు. బాబూ, బూడిద కాదు దగ్గుతూ) బూడిద కాదు, ముమ్మాటికీ! +మనుమడు అవిగో, తాతయ్యా! మళ్ళీ వస్తున్నాయి కిటికీ దగ్గరికి జరిగి) ఈసారి మూడు కొంచెం ఆగి) కాదు, తాతయ్యా! ఈసారికూడా మళ్ళీ ఆరు! +(దూరానికి వెళ్ళిపోతున్నట్టు విమానాల రొద క్రమంగా తగ్గుతుంది. +మనుమడు తాతయ్యా దగ్గరికి వచ్చి) మరి, మానాన్న విమానం ఎక్కడున్నదో? +తాత (విచారం ధ్వనిస్తున్న కంఠంతో ఏమో, తెలియదు, బాబూ! మనుమడు తరచు వుత్తరాలు వ్రాస్తూ వుంటానని చెప్పాడు. ఒక్క వుత్తరమైనా వ్రాశాడు కాదు. +మనుమడు ఒక్క వుత్తరమైనా రాలేదని కాబోలు అమ్మ చాలా బెంగగా వుంటున్నది, తాతయ్యా! నువ్వు ధైర్యం చెప్పకపోయావూ? +( తాత జవాబు చెప్పడు. తాత ఏం లేదురా, బాబూ! ఏం లేదు (కొంచెం ఆగి) ఏమి టది వీధిలో గలభా? +మనుమడు ఏం, తాతయ్యా! జవాబు చెప్పవు? +మనుమడు (కిటికీ దగ్గరికి చెక చెక వెళ్ళి జనం గుంపులు గుంపులుగా పరిగెత్తుతున్నారు తాతయ్యా! కొందరికి చేతులలో పెట్టెలున్నాయి. కొందరు ఉత్తి చేతులతోనే వెడుతున్నారు. కోటైనా లేదు కొందరికి కొంచెం ఆగి) అదేమిటి హెచ్చర్! గాయపడ్డ ముసిలివాణ్ణి స్ట్రెచర్ మీద ఎత్తుకు వెడుతున్నారు మరికొంచెం ఆగి) అబ్బబ్బ! ఘోరం! చేతికి దెబ్బతగిలింది. రక్తం కాల్వలు కడుతున్నది! అయినా, రెండో చేతితో అయిదేళ్ళ పిల్లను నడిపించుకు వెడుతున్నాడు. చెల్లాయి. కాబోలు! నా ఈడే వున్నట్టున్నది, తాతయ్యా! ఆ అబ్బాయికి పాపం! చెయ్యి పోయిందేమో ఉద్వేగంతో చలిస్తూ) అదిగో! ఇంకొక స్ట్రెచర్, దానివెనక ఇంకొకటి హారన్ల మోత) యాంబ్యులెన్సు కార్లు ఒకటి రెండు మూడు వాటినిండా గాయపడ్డవారే కాబోలు మరింత గొంతెత్తి) అబ్బబ్బ! దారుణం! అతి దారుణం, తాతయ్యా! దవడకు దవడ ఎగిరిపోయింది, ఆ అమ్మాయికి! పాపం! ఏడుస్తూ తాత రారా బాబూ! నీ విలా రా! కిటికీ దగ్గరి నుంచి కదిలి రా! +మనుమడు (వినిపించుకోకుండా ఇంకా వస్తున్నారు, తాతయ్యా! ఇంకా వస్తున్నారు జనం! అదిగో! ముసిలిది! నడుంకూడా వంగిపోయింది. కాలికి నెత్తురుతో తడిసికట్టు! పాపం! అలాగే కుంటుకుంటూ, కుంటుకుంటూ +తాత (విసుగు, ఆందోళన మిళితమైన కంఠంతో ఇలారా బాబూ! కిటికీ మూసెయ్యి! +మనుమడు వస్తా, తాతయ్యా! వస్తా అబ్బబ్బ! ఇది మరీ ఘోరం మూడేళ్ళ పిల్లవాడు వొంటినిండా నెత్తురే! చచ్చిపోయాడు కాబోలు! మెడ వేలాడుతూ ఉంది. తల్లి బిడ్డను గుండెకు హత్తుకుని +తాత ఇవతల���కి రమ్మనేది నిన్ను కాదటరా! +(రెక్కపట్టుకు ఇవతలికి లాగి, కిటికీ మూసివేస్తాడు. +మనుమడు కిటికీని మూశావేగాని, నా కళ్ళనూ, చెవుల్నీ మూశావా తాతయ్యా! ఆ దారుణ దృశ్యాలు నా కళ్ళకు కట్టినట్టే వున్నాయి! ఆ దీనాలాపాలు నా చెవులలో మారుమోగుతూనే వున్నాయి. అదిగో! అది తెగిపోయిన చెయ్యి! అది మెడ వేలాడవేసిన బిడ్డ. అదిగో! అది ముసిలిదాని మూలుగు! అది పసిపిల్ల తల్లి ఏడుపు! +తల్లి (గబగబ మేడమెట్లు దిగివచ్చి ఏమిటది, బాబూ! కేకలు వేస్తున్నా వేమిటి! +తాత ఏం లేదమ్మా! గాయపడి వెళ్ళుతున్నవారిని చూచి ఉద్రేకపడుతున్నాడు. +తల్లి ఔను! నాన్నా! అప్పుడే ముట్టడి ప్రారంభమైనట్టుంది. మనం చప్పున బయల్దేరి వెళ్ళాలి. నేను పెట్టి బేడా సర్దేశాను తండ్రివంక పరీక్షగా చూచి) మీ రింకా ప్రయాణం కాలేదేం నాన్నా కొడుకువంక తిరిగి) ప్రయాణంకమ్మని తాతతో చెప్పనే లేదా? +తాత ఔనమ్మా! చెప్పాడు. కాని, నేను రాను. మీరు బయల్దేరి వెళ్ళండి. తల్లి అదేమి మాట నాన్నా! మీరు రాకపోవడ మేమిటి? +తాత ముసిలివాణ్ణి. ఇవ్వాళ కాకపోతే రేపు నా ప్రాణం పోతుంది. ఎక్కడైతే నేమిటి చచ్చిపోవటానికి! నే నిక్కడే యిల్లు కనిపెట్టుకుంటాను. ఒంటరిదానివి పిల్లవాణ్ణి ఎలా కాపాడతావో! వాణ్ణి వెయ్యికళ్ళతో సంరక్షించు. వెళ్ళమ్మా! వాణ్ణి వెంటబెట్టుకు త్వరగా వెళ్లు! +మనుమడు లేదు, తాతయ్యా! నేనూ వెళ్ళడం లేదు +మనుమడు ఔను. నేనూ వెళ్ళడం లేదు. +తాత తప్పు, బాబూ! అలా అనబోకు, కాటికి కాళ్ళు జాచినవాణ్ణి; నీకు నాతో వంతా? +మనుమడు అదేమిటా? మార్షల్ ఎందుకు నిట్టూర్చాడు? కొత్త తరంవారు స్వాతంత్ర్యం విలువ గ్రహిస్తారో, లేదో అనేగా! అలాంటప్పుడు నేను పారిపోవడం తగునా? నువ్వే చెప్పు, తాతయ్యా? +తాత అదికాదు, బాబూ! నువ్వింకా చాలా చిన్నవాడివి. +మనుమడు నేను చాలా చిన్నవాడినైతే, నువ్వు చాలా పెద్దవాడివి. సైనికుడు కావడానికి ముసిలివాడేమిటి, పడుచువాడేమిటి అని ఇప్పుడేగా నువ్వన్నది. తల్లి +తల్లి నా కిదంతా అయోమయంగా వుంది. పిల్లవాడికి మీరేం నూరిపోశారు? +మనుమడు ఏం లేదమ్మా! తాత నా కన్ను విప్పాడు. +ఏమిటది, నాన్నా! వీడింత వింతగా మాట్టాడుతున్నాడు. వీడికి ఏం బోధచేశారు కన్నీరు పెడుతూ) నా ఒక్క కొడుకూ నా క్కాకుండా చేస్తారా? వీడినైనా చూచుకు నేను బ్రతుకుదా మనుకున్నాను. +తాత (మనమడి దగ్గరికి వెళ్ళి భుజం నిమురుతూ బాబూ! నువ్వు మంకుపట్టు పట్టవద్దు. పెద్దవాణ్ణి, నా మాట +మనుమడు తాత��్యా! మార్షల్ బ్రతికున్నంతకాలం ఆయన సేవ చేశానన్నావు. ఆయన చచ్చిపోయాడుగదా అని ఇప్పుడు ఆయనకు ద్రోహం చేస్తావా? నీమాటల్ని వింటే, ఆయన ఆత్మ విలపించదూ? +తాత (కన్నీరు కురుస్తున్న గొంతుతో లేదు, బాబూ! లేదు. ఆయనకు నేను ద్రోహం చెయ్యలేను. +మనుమడు అయితే నేను నీతోపాటే ఉండిపోతాను. +తాత (విషాద గంభీర కంఠంతో సరే, బాబూ! వుండు. +తల్లి అదేం మాట, నాన్నా! నీకు మతిపోయిందా? నన్ను దిక్కులేని పక్షిని చేస్తావా? ఈ పాడు యుద్ధంలో భర్తపోనే పోయాడు. ఇక +మనుమడు ఆఁ! ఆఁ! మానాన్న చచ్చిపోయాడా? +మనుమడు (శోకోద్వేగంతో జవాబు చెప్పరేమి ఏమమ్మా! ఈ మాట నిజమా తాతయ్యా! నువ్వైనా చెప్పవూ? ఎందుకు నా దగ్గిర దాపరికం? చెప్పండి! చెప్పండి తాత నిజమే, బాబూ! +తల్లి అది అన్యాయం! ఘోరాన్యాయం భర్త పోనే పోయాడు. కొడుకునైనా నా క్కాకుండా చెయ్యవద్దు. వెళ్ళమని వాడితో చెప్పు. నాన్నా దగ్గరికి వెళ్ళి చేతుల్ని పట్టుకుని) నన్ను కనికరించు. +మనుమడు లేదమ్మా! తాతయ్య నోటివెంట ఆమాట రాదు. +అమ్మ నాన్నా! నీకు దణ్ణం పెడతాను. +తాత (దుఃఖవివశుడౌతూ క్షమించు, తల్లీ! నన్ను క్షమించు దుఃఖంతో నాగుండె పగిలిపోతున్నది. కాని, ఆ మాటమాత్రం అనలేను. +తల్లి (తండ్రి యెదట మోకరిల్లి నాకోసం అను, నాన్నా! నాకు పుత్రభిక్ష పెట్టు. +తల్లి (చప్పున లేచి కోపావేశంతో అనలేవా? అనలేవా? కూతురునైన నాపై దయలేకపోతే పోయె చచ్చి స్వర్గాన వున్న అల్లుడి పైనైనా నీకు దయలేదా, నాన్నా? ఆయనే ఇప్పుడుంటే, నిన్ను ఎంతగా అసహ్యించుకునేవాడో +తాత నన్ను అంటే అనుగాని, అతన్ని అలా అవమానించకు తల్లీ! అతడి హృదయం నాకు తెలుసు. నేనూ, అతడూ అనేక యుద్ధాలలో కలిసి పోరాడాము. అప్పటి కతడు ఇరవై ఏళ్ళవాడు. ఒకనాడు తీవ్రంగా గాయపడి, మరి ఆశ లేదన్న స్థితిలో ఆసుపత్రిలో వుండగా నేను వెళ్ళి “ఇంత చిన్నతనంలోనే నీకెంత అన్యాయం జరిగింది?” అన్నాను. అతడు “విచారించకండి. నా కేమీ చింతలేదు. నా పోలెండ్ కోసం నేను మరణిస్తున్నాను. నేను పోతే మాత్రమేమి? నా పోలెండ్ చిరస్థాయిగా ఉంటుంది” అన్నాడు. లేదు, తల్లీ! అతడు నన్ను అసహ్యించుకోడు. పైపెచ్చు మెచ్చుకుంటాడు, +మనుమడు తాతయ్యా! ఒకమాట చెబుతాను నువ్వు కోప్పడనంటే. +మనుమడు నిన్ను చూచి నేను గర్వపడుతున్నా! +తల్లి అయ్యయ్యో! ఇది ఘోరం! ఘోరాతి ఘోరం! నన్ను అనాధను చేస్తారా? +మనుమడు అమ్మా! నీతోనూ ఒకమాట చెప్పాలి నువ్వు మన్నిస్తే! +తల్లి ,తాత.(ఒకేసారిగా ఆఁ! తప్పు, నాయనా! అలా అన��ోకు. +మనుమడు ఇలా అన్నందుకు క్షమించు, అమ్మా! కాని +తల్లి నీవు పసివాడవు, బాబూ! నీకు స్త్రీ హృదయం లోతులు తెలియవ్. ఈ యుద్ధం ప్రారంభమైన నాటినుంచీ, నే నెంత బాధపడు తున్నానో నీ కెలా తెలియజెప్పడం! వారం రోజుల నాడు మన వార్సామీద విమానాలు బాంబులు వేస్తూవుంటే, నీవేమన్నావో జ్ఞాపకం తెచ్చుకో! “నాజీలు మన వార్సాను ధ్వంసం చేస్తున్నారు. మనం వాళ్ళ బర్లిన్ ధ్వంసం చెయ్యాలి. దానికి అదే ప్రతీకారం. అంతేకా దమ్మా!” అన్నావు. +మనుమడు ఔను. నేనలా అంటే, “నిజమే బాబూ?” అన్నావ్ నువ్వు. +తల్లి పైకి అలా అన్నప్పటికీ, లోపల నాకు ఎన్నో ఆలోచనలు పోయాయి. “నాజీ వైమానికుల దురాగతాల వల్ల ఇక్కడ ఎందరో తమ బిడ్డల్నీ, భర్తల్నీ, ఆప్తుల్నీ పోగొట్టుకుని విలపిస్తున్నారు. బర్లిన్ పై మనం బాంబుల్ని వేసివచ్చినా ఇంతేగా జరిగేది? పోలిష్ స్త్రీల దుఃఖమెంతో, జర్మన్ స్త్రీల దుఃఖమూ అంతేగా? యుద్ధం ఎంత ఘోర వ్యాపారం!” అని నేను అనుకుంటూ ఉండగానే ఉత్తరం వచ్చింది. దాన్ని చూడగానే ఎంచేతనో నా గుండెలో రాయి పడింది. “నాన్న దగ్గరినుంచేనా?” అని నువ్వన్నావు. +మనుమడు కాదని నువ్వు చెప్పావు. కాని, అది నాన్నదగ్గరి నుంచే వచ్చిందన్నమాట! +తల్లి కాదు, బాబూ! ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి. పైకి పట్టుకు వెళ్ళి, ఉత్తరాన్ని విప్పి చదువుకుందునుగదా ఆ క్షణం నుంచీ నాకు జీవితంపై అసహ్యం పుట్టింది. అయితే, నిన్ను చూచుకుని నీకోసం నీలో జీవించాలనుకున్నాను. ఒక్కసారి గట్టిగా విలపిస్తే హృదయభారం కొంత తగ్గేదేమో! కాని, నువ్వు ఈ దుర్వార్త ఎక్కడ తెలుసుకుంటావో నని నా దుఃఖాన్ని దిగమింగాను. ఈ వారం రోజుల నుంచీ లాభం లేదు, బాబూ! చెప్పినా నీకిది అర్థం కాదు. +మనుమడు అర్థం కాకేం! అర్థమౌతూనే వున్నదమ్మా! కాని, నాన్న ఏ ఆదర్శం కోసం జీవించాడో, దేనికోసం మరణించాడో, దాన్ని మనం మర్చిపోవచ్చా? నాన్న బయల్దేరి వెడుతుంటే, నువ్వు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నావు. అప్పుడు నాన్న కన్ను కూడా చెమ్మగిలింది గాని, దానిలో గొప్ప వెలుగు కనబడింది. అప్పుడు దాన్ని నేను అర్ధం చేసుకోలేక పోయాను. కాని, తాత మాటల్ని విన్నమీదట “నేనుపోతే మాత్రమే? నా పోలెండ్ చిరస్థాయిగా వుంటుంది” అని నాన్న ఆ క్షణంలో అనుకుంటూ వున్నాడని తెలిసింది. నాన్న ధైర్యాన్ని, త్యాగాన్ని మార్షల్ పిల్సుడ్ స్కీ జీవించివుంటే ఎంతగా +అమ్మ పిల్సుడ్ స్కీ పిల్సుడ్ స్కీ రాత్రింబవళ్ళు పిల్సుడ్ స్కీ సంస్మరణే! దీనితోనే నా బ్రతుకంతా వెళ్ళమారిపోతున్నది. కూతురుగా నేను తండ్రి ప్రేమకు నోచుకోలేదు; భార్యగా భర్త ప్రేమకు నోచుకోలేదు. వారి హృదయాలలో పిల్సుడ్ స్కీకే గాని, నాకు స్థానం లేకపోయింది. చివరికి కొడుకు ప్రేమనైనా పొందలేక పోతానా అనుకుంటే, వాడి మతినికూడా విరిచేశారు (తండ్రివైపు తిరిగి) నాకెంత అన్యాయం చేశావ్, నాన్నా! +తాత పిల్సుడ్ స్కీని ఒక వ్యక్తి అనుకుని నువ్వు పొరపడుతున్నావమ్మా! ఆయన ఒక భావం; ఒక లక్ష్యం; ఒక ఉద్యమం. ఆయన ఒక విప్లవం; ఒక వెల్లువ. పోలెండ్ ఆయనలో మూర్తీభవించింది. మేము ఆయన్ని ప్రేమించామంటే పోలెండ్ ను ప్రేమించామన్న మాట. ఆయనను స్తుతించామంటే పోలెండ్ ను స్తుతించా మన్నమాట. ఇది నీకు అర్థం కాదేమోగాని, పురుషులమైన మేము దేశదాస్యాన్ని సహించలేమమ్మా! అది మా వ్యక్తిత్వానికే అవమానం; మా జీవితానికే అపవాదు. దాస్య జీవనం కంటె మరణమే మాకు మేలుగా కనిపిస్తుంది. +తల్లి కాని, నామాటేమిటి నాన్నా జవాబు చెప్పక పోవడాన్ని చూచి) ఏమి, నాన్నా జవాబుచెప్పవు? +తాత నే నేమి జవాబు చెప్పగలనమ్మా? +(తర్వాత ఒక క్షణం అంతా ప్రశాంతం. అంతలో ఆ గంభీర ప్రశాంతిని చీల్చుకుని 'స్విష్ స్విష్' అంటూ వరసతప్పని వికృతధ్వని. +(“స్విష్”, “స్విష్” ధ్వని మరీ దగ్గరగా వస్తుంది; మరీ భయంకర మౌతుంది. ఆ ధ్వనిని మించి కూడా హాండ్ గ్రెనేడ్స్ ప్రేలుడు, +భయారుల ఆక్రందనాలు వినబడతాయి. తల్లి చప్పున కొడుకు దగ్గరికి జరిగి, అతణ్ణి కౌగిలించుకుంటుంది. +తాత ఔనమ్మా! ఘోరమే! అయితే, ఇది మన పోలెండ్ కు కొత్త కాదు. ఈ నాజీల తలదన్నినవారు మన దేశాన్ని దాస్యబద్ధం చెయ్యాలనుకున్నారు; దాని ఆత్మను నశింపజెయ్యాలనుకున్నారు. కాని, నీ భర్త, నీ కుమారుడు లాంటి వారిని కన్నదేశం చచ్చిపోతుందా? పోదు! ఈ ప్రళయం తర్వాత పోలెండ్ పునర్జన్మ నెత్తుతుంది స్విష్ స్విష్" ధ్వని అంతకంతకూ +దూరమై, అసలే వినబడకుండా పోతుంది) కాని, నా స్థితిని చూచుకుంటే నాకే సిగ్గూ, నా విచారమూ కలుగుతున్నది. నా దేశానికి ఘోర సంకటం తటస్థించిన ఈ సందర్భంలో దాని రక్షణకు నిలబడ్డానికి నాకు యవ్వనం లేకపోయింది. నే నెంత దౌర్భాగ్యుణ్ణి! +(తాత కళ్లనుంచి కన్నీరు కాల్వలు కడుతుంది. +తల్లి అదేమి, నాన్నా! కంట తడి పెడుతున్నారు. నాకుమాత్రం మన దేశంపైన అభిమానం లేదూ? కన్నకడుపు కాబట్టి, ఈ పసివాడి విషయమై దిగులుపడుతున్నా గాని +మనుమడు నా విషయమై మాత్రం నీకు దిగులు దేనికమ్మా? నేనూ, నావంటివారూ సుఖంగా, గౌరవంగా, జీవించడానికి తగిన స్వతంత్ర పోలెండ్ రాజ్యాన్ని కాపాడ్డానికే గదా నాన్న ఆత్మార్పణ చేసింది. దీనికోసమే గదా తాత ఇంత పెద్దతనంలో కూడా తుపాకి పట్టబోతున్నది మాకోసమై జరుగుతున్న ఈ ప్రయత్నంలో నేను పాల్గొనవద్దా? +మనుమడు కాని, గీని అని ఇంకా సంకోచం దేనికమ్మా ఇంతలో తిరిగి విమానాల రొద, ఆ రొదను మించేలా అతడు గొంతెత్తుతాడు) తాత ద్వారా నువ్వు వీరపుత్రికవైనావు. నాన్నద్వారా వీరపత్నివైనావు. ఇక, నా ద్వారా వీరమాతవుకా గోరతావా, లేదా? తల్లి తప్పక కోరతాను, బాబూ? +మనుమడు అయితే, అమ్మా! మాతో చేరి విజయధ్వానం చెయ్యి. +తాత:తల్లి మనుమడు: ఒకేసారిగా పోలెండు జై పోలెండ్ కు జై”. +గమనిక ఈ నాటికను రెండవ ముద్రణలో తొలగించారు. + + +నిఘంటువు తెలుగులో సాంకేతిక పదాలు కోసం చాలా ఉపయోగకరంగా ఉంది. పుటల మధ్య మారడానికి వీలుగా ప్రతి పుట లోను పైన ఈ విధంగా అక్షరక్రమం వ్రాస్తే చాలా సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నాను. లేదా +ఎడమ పక్కన చేర్చినా 'అక్షరక్రమం' చేర్చినా ఇంకా బావుంటుంది. దీనికోసం పుట పైకి వెళ్ళక్కరలేదు. వీలయితే ఈ సౌకర్యం కల్పించండి. ధన్యవాదాలు + + +నేటి డిజిటల్ యుగంలో, ఒక బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయగలరు, విద్యార్థులు తరచుగా ఆన్‌లైన్‌లో లభించే విస్తారమైన విజ్ఞాన సముద్రంతో మునిగిపోతారు. ఈ డిజిటల్ మహాసముద్రం మధ్య, వికీపీడియా ఒక ప్రముఖ దీపస్తంభంగా నిలుస్తుంది, సమాచార భాగస్వామ్యం కోసం సమగ్రమైన మరియు సహకార వేదికను అందిస్తుంది. వికీపీడియా సోదర ప్రాజెక్టులు అనేవి ఉచిత జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలన్న వికీమీడియా ఫౌండేషన్ దృష్టిని పంచుకునే సహకార వెబ్ ఆధారిత కార్యక్రమాల సమాహారం .వికీపీడియా అనేది ఎవరైనా సవరించగలిగే ప్రసిద్ధ మరియు ప్రసిద్ధ ఆన్‌లైన్ ఎన్సైక్లోపీడియా. ఇది అన్ని వయసుల విద్యార్థులకు గొప్ప వనరు, ఒక బటన్ నొక్కితే సమాచారం సులభంగా లభ్యమయ్యే డిజిటల్ యుగంలో, వికీపీడియా అనేక అంశాలపై జ్ఞానాన్ని సంపాదించడానికి ఒక ప్రధాన వేదికగా అవతరించింది. వికీపీడియా ఆన్‌లైన్ సమాచారం యొక్క విస్తారమైన రంగంలో సహకార విజ్ఞాన సృష్టికి అత్యున్నతంగా నిలుస్తుంది. ఏదేమైనా, వికీమీడియా గొడుగు కింద వివిధ సోదర ప్రాజెక్టుల గురించి చాలా మంది విద్యార్థులకు తెలియదు, త్యున్నత ��్మారక చిహ్నంగా నిలుస్తుంది. అయితే వికీపీడియా అనేది ప్రాజెక్టుల పెద్ద సమూహంలో ఒక అంశం మాత్రమే అని చాలా కొద్దిమందికి తెలుసు సమిష్టిగా సోదరి ప్రాజెక్టులు అని పిలుస్తారు. ఈ సోదరి ప్రాజెక్టులు ఒక్కొక్కటి ప్రత్యేకమైన దృష్టి మరియు ఉద్దేశ్యంతో సమిష్టిగా విద్యార్థుల అభ్యాస అనుభవాలను సుసంపన్నం చేయడానికి మరియు విభిన్న విషయాలపై అవగాహనకు దోహదం చేస్తాయి ఇవి ప్రధాన వికీపీడియా వేదిక అందించే వాటికి మించి ప్రత్యేకమైన మరియు లోతైన సమాచారాన్ని అందిస్తాయి. వికీబుక్స్ మరియు వికీవర్సిటీ నుండి వికీమీడియా కామన్స్ మరియు వికీన్యూస్ వరకు ఈ సోదర ప్రాజెక్టులు వివిధ అంశాలపై విద్యార్థుల అవగాహన మరియు అవగాహనను గణనీయంగా పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.వారి అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి విస్తృత అవగాహనను పెంపొందించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తాయి. +ఈ సోదర ప్రాజెక్టులు అన్నింటికీ ఉచితంగా ఉపయోగించబడతాయి మరియు ఎవరి నుండి అయినా సహకారాన్ని పొందేందుకు తెరవబడతాయి. విద్యార్థులు వారి పరిశోధన, అభ్యాసం మరియు సృజనాత్మకతతో సహాయం చేయడానికి వారు వివిధ వనరులను అందిస్తారు. +ఈ వ్యాసం విద్యార్థుల అవగాహనను పెంపొందించడంలో మరియు వారి విద్యా ప్రయాణాలను మెరుగుపరచడంలో వికీపీడియా యొక్క సోదరి ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తుంది. +వికీమీడియా కామన్స్ ఇది 60 మిలియన్లకు పైగా చిత్రాలు, వీడియోలు మరియు ఇతర ఫైళ్లను కలిగి ఉన్న ఉచిత మీడియా రిపోజిటరీ. విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలు, ప్రెజెంటేషన్‌లు మరియు ఇతర ప్రాజెక్ట్‌లను ఉల్లేఖించడానికి ఈ ఫైల్‌లను ఉపయోగించవచ్చు.సమాచారాన్ని అర్థం చేసుకోవడం మరియు నిలుపుకోవడంలో విజువల్ కంటెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. వికీమీడియా కామన్స్ అనేది చిత్రాలు, వీడియోలు మరియు ఆడియో క్లిప్ లతో సహా స్వేచ్ఛగా ఉపయోగించదగిన మీడియా ఫైళ్ల భాండాగారం. విద్యార్థులు ఈ వనరులను వారి ప్రజంటేషన్లు, ప్రాజెక్టులు మరియు అసైన్మెంట్లలో అన్వేషించవచ్చు మరియు చేర్చవచ్చు, ఇది వారి పనిని మరింత ఆకర్షణీయంగా మరియు ప్రభావవంతంగా చేస్తుంది. విభిన్న శ్రేణి విజువల్స్ ను ఉపయోగించడం ద్వారా, విద్యార్థులు తాము చదివే సబ్జెక్టుల పట్ల లోతైన అవగాహనను పెంపొందించుకోవచ్చు మరి���ు వారి ఆలోచనలను మరింత సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయవచ్చు. వికీమీడియా కామన్స్ విజువల్ కమ్యూనికేషన్ గురించి విద్యార్థుల అవగాహనను విస్తృతం చేయడమే కాకుండా, జ్ఞాన వ్యాప్తిలో మల్టీమీడియా యొక్క ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకోవడానికి వారిని ప్రోత్సహిస్తుంది.వివిధ సబ్జెక్టులను చదివే విద్యార్థులు ఈ వనరు నుండి గొప్పగా ప్రయోజనం పొందవచ్చు. ఉదాహరణకు, చరిత్ర విద్యార్థులు చారిత్రక సంఘటనలకు జీవం పోసే ప్రాథమిక మూల చిత్రాల నిధిని కనుగొనవచ్చు. సైన్స్ ఔత్సాహికులు సంక్లిష్ట భావనలను వివరించే వివరణాత్మక రేఖాచిత్రాలు మరియు దృష్టాంతాలను అన్వేషించవచ్చు. భాషా అభ్యాసకులు వారి ఉచ్చారణ మరియు గ్రహణశక్తిని మెరుగుపరచడానికి ఆడియో క్లిప్‌లను యాక్సెస్ చేయవచ్చు. వికీమీడియా కామన్స్‌ను వారి అధ్యయనాలలో ఏకీకృతం చేయడం ద్వారా, విద్యార్థులు తమ అభ్యాసాన్ని మెరుగుపరచుకోవడమే కాకుండా వారు అన్వేషించే విషయాల యొక్క దృశ్య మరియు శ్రవణ అంశాలను కూడా అర్థం చేసుకుంటారు. +వికీబుక్స్ వికీపీడియా సోదర ప్రాజెక్టులలో ఒకటైన వికీబుక్స్ వివిధ విషయాలపై ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు మాన్యువల్‌ల సమాహారం. విద్యార్థులు తమ తరగతి గది పాఠ్యపుస్తకాలకు అనుబంధంగా లేదా సొంతంగా కొత్త విషయాలను నేర్చుకోవడానికి వికీబుక్‌లను ఉపయోగించవచ్చు. ఉచిత విద్యా పాఠ్యపుస్తకాలు మరియు అభ్యాస సామగ్రిని సృష్టించడానికి మరియు నిర్వహించడానికి అంకితమైన వేదిక. ఈ వనరులు వివిధ విద్యా స్థాయిలు మరియు అభ్యాస శైలులను తీర్చే అనేక విషయాలను కవర్ చేస్తాయి. విద్యార్థులకు, వికీబుక్స్ సాంప్రదాయ పాఠ్యపుస్తకాలకు మించి ప్రత్యామ్నాయ దృక్పథాలు మరియు వివరణలను అన్వేషించడానికి అమూల్యమైన అవకాశాన్ని అందిస్తుంది. గణితం, సాహిత్యం, సైన్స్ లేదా భాషలను అధ్యయనం చేసినా, విద్యార్థులు నిపుణులు మరియు ఔత్సాహికులచే సమిష్టిగా సృష్టించబడిన మరియు నిరంతరం నవీకరించబడే కంటెంట్ యొక్క సంపదను యాక్సెస్ చేయవచ్చు. ఇది వివిధ అంశాలపై వారి అవగాహనను విస్తరించడమే కాకుండా జ్ఞాన సృష్టిలో చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.పాఠ్యపుస్తకాల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, వికీబుక్స్ విద్యార్థులకు ఆర్థిక ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఈ సహకార పాఠ్యపుస్తకాలు విస్తృత శ్రేణి అంశాలను కవర్ చేస్తాయి మరియు జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం పట్ల మక్కువ ఉన్న వాలంటీర్లచే వ్రాయబడ్డాయి. వికీబుక్స్‌కు సహకరించడం లేదా ఉపయోగించడం ద్వారా, విద్యార్ధులు విద్యా విషయాల సృష్టి మరియు భాగస్వామ్యంలో చురుకుగా పాల్గొంటారు. ఇది వారి అభ్యాసంపై యాజమాన్య భావాన్ని పెంపొందించడమే కాకుండా పరిశోధన, విమర్శనాత్మక ఆలోచన మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్‌లో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. +వికీవర్సిటీ ఇది వివిధ కోర్సులు, ట్యుటోరియల్‌లు మరియు వ్యాయామాలను అందించే ఉచిత అభ్యాస వనరు. విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకోవడానికి, పరీక్షలకు సిద్ధం కావడానికి లేదా వారి హోంవర్క్‌లో సహాయం పొందడానికి వికీయూనివర్సిటీని ఉపయోగించవచ్చు. +ికీవర్సిటీ విద్యార్థులకు ప్రత్యేకమైన అభ్యసన అనుభవాన్ని అందించే మరొక సోదర ప్రాజెక్టు. సహకార అభ్యాస కార్యకలాపాలు, ప్రాజెక్టులు మరియు కోర్సులను సృష్టించడానికి మరియు పాల్గొనడానికి ఇది ఒక ఆన్లైన్ వేదికగా పనిచేస్తుంది. విద్యార్థులు చర్చల్లో పాల్గొనవచ్చు, వనరులను పంచుకోవచ్చు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటివారు మరియు విద్యావేత్తలతో సహకరించవచ్చు. వికీవర్సిటీ అభ్యాసక-కేంద్రీకృత విధానాన్ని ప్రోత్సహిస్తుంది, విద్యార్థులు వారి విద్యపై యాజమాన్యాన్ని తీసుకోవడానికి మరియు విషయాలను లోతుగా అన్వేషించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ ప్రత్యక్ష మరియు ఇంటరాక్టివ్ వాతావరణం భావనలపై లోతైన అవగాహన, విమర్శనాత్మక ఆలోచన మరియు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధిని పెంపొందిస్తుంది, తద్వారా విద్యార్థుల అవగాహనను కేవలం పాఠ్యపుస్తక అభ్యాసానికి మించి పెంచుతుంది. +విక్షనరీ: ఇది 5 మిలియన్లకు పైగా పదాలు మరియు పదబంధాలను కలిగి ఉన్న ఉచిత నిఘంటువు మరియు థెసారస్. విద్యార్థులు పదాల అర్థాన్ని వెతకడానికి, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలను కనుగొనడానికి లేదా పదాల శబ్దవ్యుత్పత్తి గురించి తెలుసుకోవడానికి విక్షనరీని ఉపయోగించవచ్చు. +విక్షనరీ లోగో కొత్త విండోలో తెరుచుకుంటుంది,ఈ బహుభాషా నిఘంటువు నిర్వచనాలను మాత్రమే కాకుండా భాషలలో పద వ్యుత్పత్తి, అనువాదాలు మరియు ఉదాహరణలను కూడా అందిస్తుంది. భాషా విద్యార్థులు వారి ఎంచుకున్న భాష యొక్క సంక్లిష్టతలు, సూక్ష్మ నైపుణ్యాలు మరియు సాంస్కృతిక అర్థాలను అన్వేషించవచ్చు. అంతేకాకుండా, విక్షనరీ యొక్క సహకార స్వభావం భాషలను సజీవంగా, అభివృద్ధి చెందుతున్న అస్థిత్వాలుగా లోతైన అవగాహనను ప్రోత్సహిస్తుంది. ఈ సోదరి ప్రాజెక్ట్‌ను చేపట్టడం ద్వారా, విద్యార్థులు తమ పదజాలాన్ని మెరుగుపరచుకోవచ్చు, వారి భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు మరియు క్రాస్-కల్చరల్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. +వికీడేటా: ఇది వివిధ అంశాలపై నిర్మాణాత్మక డేటాను కలిగి ఉన్న ఉచిత నాలెడ్జ్ బేస్. విద్యార్థులు వికీపీడియాలో అందుబాటులో లేని దేశ జనాభా లేదా పదార్ధం యొక్క రసాయన కూర్పు వంటి సమాచారాన్ని కనుగొనడానికి వికీడేటాను ఉపయోగించవచ్చు. +వికీన్యూస్: ఇది స్వచ్ఛంద సేవకులచే వ్రాయబడిన మరియు సవరించబడిన ఉచిత వార్తా మూలం. విద్యార్థులు ప్రస్తుత ఈవెంట్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి లేదా ప్రధాన స్రవంతి మీడియాలో కవర్ చేయని వార్తల అంశాల గురించి తెలుసుకోవడానికి వికీన్యూస్‌ని ఉపయోగించవచ్చు.వేగవంతమైన సమాచార వ్యాప్తి ఉన్న యుగంలో, మీడియా అక్షరాస్యత చాలా ముఖ్యమైనది. సిటిజన్ జర్నలిజంపై దృష్టి సారించిన సోదర ప్రాజెక్టు వికీన్యూస్, వార్తా కంటెంట్ను విమర్శనాత్మకంగా అంచనా వేయడానికి మరియు వర్తమాన సంఘటనలతో బాధ్యతాయుతంగా నిమగ్నం కావడానికి విద్యార్థులకు అధికారం ఇస్తుంది. వికీన్యూస్ లో వార్తా కథనాలకు దోహదపడటం లేదా వినియోగించడం ద్వారా, విద్యార్థులు మీడియా పక్షపాతం, మూల మూల్యాంకనం మరియు వార్తా నివేదన యొక్క సంక్లిష్టతలపై లోతైన అవగాహనను పెంపొందించుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో మీడియా పాత్ర గురించి అవగాహనను పెంపొందిస్తుంది మరియు వార్తల యొక్క సమాచారం మరియు వివేకవంతమైన వినియోగదారులుగా మారడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. +వికీకోట్: ఇది వివిధ మూలాల నుండి వచ్చిన కొటేషన్ల సమాహారం. విద్యార్థులు పరిశోధనా పత్రాలు లేదా ప్రెజెంటేషన్‌లలో తమ వాదనలకు మద్దతు ఇవ్వడానికి కోట్‌లను కనుగొనడానికి వికీకోట్‌ని ఉపయోగించవచ్చు.సైన్స్ మరియు ఇన్నోవేషన్ రంగం వికీకోట్‌లో దాని స్వర్గధామాన్ని కనుగొంది, ఇది వివిధ వ్యక్తుల నుండి గుర్తించదగిన కొటేషన్‌లను సంకలనం చేయడానికి మరియు సోర్సింగ్ చేయడానికి అంకితం చేయబడింది. సాహిత్యాభిమానులకు వేదికగా ఉండటమే కాకుండా, వికీకోట్ అన్ని విభా��ాల విద్యార్థులకు విలువైన సాధనంగా ఉపయోగపడుతుంది. ఉల్లేఖనాలు లోతైన ఆలోచనలు, చారిత్రక సందర్భాలు, సాంస్కృతిక దృక్కోణాలను క్లుప్తంగా సంగ్రహించగలవు. విద్యార్థులు తమ ప్రెజెంటేషన్‌లు, వ్యాసాలు లేదా పరిశోధనా పత్రాలలో కీలకమైన అంశాలను నొక్కి చెప్పడానికి ఈ కోట్‌లను ఉపయోగించవచ్చు. విభిన్న స్వరాల నుండి ఉల్లేఖనాలను ఉపయోగించడం ద్వారా, విద్యార్థులు తమ విషయంపై సమగ్ర అవగాహనను ప్రదర్శిస్తారు జ్ఞానంతో వారి వాదనలను బలపరుస్తారు. +వికీసోర్స్: ఇది పుస్తకాలు, కవితలు మరియు వ్యాసాలు వంటి మూల గ్రంథాల ఉచిత లైబ్రరీ. విద్యార్థులు తమ పరిశోధన కోసం ప్రాథమిక మూలాలను కనుగొనడానికి లేదా సాహిత్యం యొక్క క్లాసిక్ రచనలను చదవడానికి వికీసోర్స్‌ని ఉపయోగించవచ్చు..సాహిత్యం, చరిత్ర మరియు సంస్కృతి పట్ల అభిరుచి ఉన్న విద్యార్థులకు, వికీసోర్స్ చారిత్రక పత్రాలు, సాహిత్య క్లాసిక్స్ మరియు న్యాయ గ్రంథాలు వంటి మూల మూల గ్రంథాలను అన్వేషించే అవకాశాన్ని అందిస్తుంది. ప్రాధమిక వనరులతో నిమగ్నం కావడం ద్వారా, విద్యార్థులు వివిధ కాలాలు, సంస్కృతులు మరియు సిద్ధాంతాలపై అంతర్దృష్టులను పొందవచ్చు. ఈ బహిర్గతం చారిత్రక సందర్భాలపై వారి అవగాహనను పెంచడమే కాకుండా కాలక్రమేణా భాష మరియు ఆలోచనల పరిణామంపై లోతైన అవగాహనను పెంపొందిస్తుంది. వికీసోర్స్ విజ్ఞానం యొక్క మూలాలను అన్వేషించడానికి మరియు మానవాళి యొక్క మేధో వారసత్వంతో అనుసంధానించడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తుంది.ఉదాహరణకు, సాహిత్య విద్యార్థులు, రచయిత యొక్క రచనా ప్రక్రియను విశ్లేషించడానికి మూల వ్రాతప్రతులను అన్వేషించవచ్చు. చరిత్ర విద్యార్థులు గత సంఘటనలపై లోతైన అవగాహనను పెంపొందించుకోవడానికి ప్రాధమిక వనరులతో నిమగ్నం కావచ్చు. వికీసోర్సును వారి విద్యా ప్రయత్నాలలో ఏకీకృతం చేయడం ద్వారా, విద్యార్థులు తమ విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకుంటారు మరియు సంక్లిష్టమైన గ్రంథాలను అర్థం చేసుకోవడానికి సునిశిత దృష్టిని అభివృద్ధి చేస్తారు. +వికీస్పీసీస్: ఇది మొక్కలు, జంతువులు మరియు ఇతర జీవుల జాతుల డైరెక్టరీ. విద్యార్థులు భూమిపై వివిధ జాతుల గురించి తెలుసుకోవడానికి లేదా నిర్దిష్ట జాతుల గురించి సమాచారాన్ని కనుగొనడానికి వికీస్పీసీలను ఉపయోగించవచ్చు +వికీవాయేజ్: ఇది ప్రపంచవ్యాప్తం��ా 200,000 కంటే ఎక్కువ గమ్యస్థానాలను కవర్ చేసే ఉచిత ట్రావెల్ గైడ్. విద్యార్థులు తమ సెలవులను ప్లాన్ చేసుకోవడానికి, విభిన్న సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి లేదా నిర్దిష్ట ప్రదేశాల గురించి సమాచారాన్ని కనుగొనడానికి వికీవాయేజ్‌ని ఉపయోగించవచ్చు. +వికీవాయేజ్ లోగో కొత్త విండోలో తెరుచుకుంటుంది +విద్యార్థులకు అందుబాటులో ఉన్న అనేక వికీపీడియా సోదర ప్రాజెక్టులలో ఇవి కొన్ని మాత్రమే. ఈ ప్రాజెక్ట్‌లను అన్వేషించమని మరియు మీ అధ్యయనాలకు అత్యంత ఉపయోగకరమైన వాటిని కనుగొనమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. +వికీమీడియా సహోదరి ప్రాజెక్ట్‌లు అనేక రకాల వనరులను అందించడంతో పాటు విద్యార్థులు పాల్గొనడానికి అనేక అవకాశాలను కూడా అందిస్తాయి. విద్యార్థులు వ్యాసాలు రాయడం, ఇప్పటికే ఉన్న కంటెంట్‌ని సవరించడం లేదా ఇతర భాషల్లోకి వచనాన్ని అనువదించడం ద్వారా ప్రాజెక్ట్‌లకు సహకరించవచ్చు. వారు ప్రాజెక్ట్‌ల ఫోరమ్‌లపై చర్చలలో కూడా పాల్గొనవచ్చు లేదా ఈవెంట్‌లను నిర్వహించడంలో సహాయపడవచ్చు. +వికీమీడియా సోదర ప్రాజెక్ట్‌లలో పాలుపంచుకోవడం విద్యార్థులకు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర విద్యార్థులతో కనెక్ట్ కావడానికి గొప్ప మార్గం. +మీరు విద్యార్థి అయితే, వికీమీడియా సోదర ప్రాజెక్టుల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వాటితో పాలుపంచుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌లు మీ అధ్యయనాలు, మీ అభ్యాసం మరియు మీ సృజనాత్మకతతో మీకు సహాయం చేయడానికి వనరులు మరియు అవకాశాల సంపదను అందిస్తాయి. +వికీమీడియా సోదర ప్రాజెక్టులను ఉపయోగించడానికి ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఇక్కడ కొన్ని అదనపు చిట్కాలు ఉన్నాయి: +మీకు ఆసక్తి ఉన్న ప్రాజెక్ట్‌తో ప్రారంభించండి. అనేక విభిన్న వికీమీడియా సోదర ప్రాజెక్టులు ఉన్నాయి, కాబట్టి మీ ఆసక్తులకు సరిపోయేదాన్ని కనుగొనడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని ఉత్సాహంగా మరియు నిశ్చితార్థంగా ఉంచుతుంది. +మీ తరగతి గది అధ్యయనాలకు అనుబంధంగా ప్రాజెక్ట్‌లను ఉపయోగించండి. వికీమీడియా సోదర ప్రాజెక్టులు మీ తరగతి గది అధ్యయనాలకు అనుబంధంగా ఒక గొప్ప మార్గం. మీరు పాఠశాలలో నేర్చుకుంటున్న అంశాలపై అదనపు సమాచారం వీటి ద్వారా పొందవచ్చు. వికీపీడియా సోదర ప్రాజెక్టులు విద్యార్థులకు వారి అవగాహనను పెంచుకోవడానికి, వారి అవగాహనను మరింతగా పెంచుకోవడానికి మరియు వారి అభ్యాస అనుభవాలను మెరుగుపరచుకోవడానికి అనేక అవకాశాలను అందిస్తాయి. +