link
stringlengths
41
231
text
stringlengths
28
5k
https://www.telugupost.com/andhra-pradesh/vinod-jain-has-pleaded-guilty-molestation-in-minor-girl-suicide-case-in-vijayawada-1352129
లైంగిక వేధింపులు భరించలేక.. విజయవాడలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక ఆత్మహత్య కేసులో.. భవానీపురం పోలీసులు.. టీడీపీ నేత వినోద్ జైన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. పోలీసుల విచారణలో వినోద్ జైన్ తన తప్పును ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.Also Read : ఆమె కూడా మనతో ఉంటుంది.. భార్యకు ప్రపోజల్ పెట్టిన భర్త.. ఆ తర్వాత ?బాలిక ఆత్మహత్యకు పాల్పడిన అపార్ట్ మెంట్ వద్ద లభించిన సీసీ టీవీ ఫుటేజీలో నిందితుడి వికృతచేష్టలు, బాలిక ఆత్మహత్య దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఫుటేజీలను చూపించి.. వినోద్ జైన్ ను ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్‌లోని లోటస్‌ లెజెండ్‌ అపార్ట్‌మెంట్‌లో ఉండే వినోద్ జైన్.. అదే అపార్ట్ మెంట్ కు చెందిన బాలిక మెట్లు ఎక్కేటపుడు, దిగేటపుడు, లిఫ్ట్ వద్ద వేధించినట్లు అంగీకరించినట్లుగా సమాచారం. స్కూల్ కు వెళ్లేటపుడు, వచ్చేటపుడు ఆ బాలిక కోసం ఎదురుచూసి మరీ.. ఆమెను ఇబ్బందులకు గురిచేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఆ పాపను తాకుతూ.. ఆనందం పొందేవాడినని వినోద్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ బాలికతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు. Also Read : నిర్మలమ్మ బడ్జెట్ నిండా ముంచిందే? తాను చేసింది తప్పేనని అంగీకరించిన వినోద్ జైన్.. తాను చేసిన తప్పుకు బాలిక ఆత్మహత్య చేసుకునేంత వరకూ వస్తుందని ఊహించలేదన్నాడు. బాలిక ఆత్మహత్య చేసుకునే ముందర డాబాపైన పిట్టగోడ వద్దకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కిందపడతావు.. జాగ్రత్త అని హెచ్చరించినట్లు సమాచారం. అయినా బాలిక వినకుండా ఆత్మహత్య చేసుకుందని వారు చెప్తున్నారు.
https://www.telugupost.com/movie-news/sarwanand-negative-comments-on-rangasthalam-movie-124493/
రెండు రోజులు కిందట టాలీవుడ్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేసింది. శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘రణరంగం’ విషయం శర్వా తన ఫ్రెండ్స్ తో సినిమా ఆడితే ఆడుతుంది లేకపోతే లేదు అని నెగటివ్ ప్రచారం చేసాడని..దాంతో డైరెక్టర్ తో పాటు ప్రొడ్యూసర్స్ కూడా శర్వా పై కోపంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందొ మాత్రం క్లారిటీ లేదు. ఎందుకుంట రీసెంట్ గా శర్వా ‘రణరంగం’ ఫైనల్ ఎడిట్ అయిన కాపీ చూసుకున్నాడు. చూసిన తరువాత తన టీమ్ తో ముచ్చటిస్తూ, సినిమా బాగా వచ్చిందని అన్నట్లు బోగట్టా. మొదటి నుండే శర్వా ఈమూవీ పై కొంచం కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే ఫైనల్ కాపీ అవ్వకుండానే ఎడిటెడ్ కాపీ చూసాడు. అలానే సితారకు బ్యాక్ బోన్ అయిన హారిక హాసిని చినబాబు కూడా ఎడిట్ కాపీ చూసి… రెండు మూడు చిన్న మార్పులు చెప్పి చేంజ్ చేయమని చెప్పి హీరో శర్వా కు కంగ్రాట్స్ చెప్పారని తెలుస్తుంది. ఈమూవీ అన్ని కుదిరితే ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో శర్వా మాఫియా లీడర్ గా కనిపించనున్నాడు
https://www.telugupost.com/movie-news/majili-collections-116959/
నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ సినిమా ప్రేక్షకులు బాగా మెప్పించింది. క్రిటిక్స్ మజిలీకి యావరేజ్ మార్కులేసినా ప్రేక్షకులు మాత్రం హిట్ మార్కులేశారు. నాగ చైతన్య – సమంత – దివ్యంశ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్ నిర్మాణంలో తెరకెక్కిన మజిలీ సినిమా కి ప్రేక్షకాదరణ సూపర్బ్ గా వుంది. చాలారోజుల తర్వాత మజిలీ సినిమా తో బాక్సాఫీసు కళకళలాడడమే కాదు… థియేటర్స్ లో ప్రేక్షకుల హడావిడి మాములుగా లేదు. మరి చైతు, సామ్ లు ఈ ఉగాది కి ఎప్పటికి మరిచిపోలేని హిట్ అందుకున్నారు. మజిలీ హిట్ టాక్ తో తొలిరోజు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ మీ కోసం… ఏరియా: షేర్ (కోట్లలో) నైజాం 1.95 సీడెడ్ 0.70 నెల్లూరు 0.17 కృష్ణ 0.37 గుంటూరు 0.68 వైజాగ్ 0.76 ఈస్ట్ గోదావరి 0.28 వెస్ట్ గోదావరి 0.27 టోటల్ ఏపీ & టీఎస్ షేర్ 5.18 కర్ణాటక 0.80 యుఎస్ఏ 0.95 ఇతర ప్రాంతాలు 0.30 టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 7.23
https://www.telugupost.com/movie-news/2-0-సినిమాపై-షాకింగ్-న్యూస్-47624/
రజినీకాంత్ - శంకర్ కలయికలో '2 .0 ' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం '2 .0 ' సినిమా ఆడియో వేడుకని దుబాయ్ వంటి మహానగరం లో నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుక అందరి మతులని పోగొట్టింది. ఆ రేంజ్ లో ఈ వేడుకని దుబాయ్ లో నిర్వహించారు నిర్మాతలు. అయితే ఇప్పుడు తాజాగా '2 .0 ' సినిమాపై ఒక న్యూస్ వెలుగులోకొచ్చింది. అదేమిటంటే రజినీకాంత్ హీరోగా.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా తెరకెక్కిన ఈ సినిమా రన్ టైం కేవలం 140 నిమిషాలేనట.మరి శంకర్ తెరకెక్కించిన సినిమాలన్నీ దాదాపు 170 నిమిషాల రన్ టైం కలిగిఉంటాయి. అంత సేపు రన్ టైం ఉన్నప్పటికీ శంకర్ తన మ్యాజిక్ తో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా కుర్చీలలో అతుక్కుపోయేటట్లు చెయ్యగల టాలెంటెడ్ పర్సన్. మరి అలాంటి శంకర్ ఇలా '2 .0 ' కి ఇంత తక్కువ రన్ టైం ఫిక్స్ చెయ్యడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ ని బేస్ చేసుకుని శంకర్ ఇలా ప్లాన్ చేశాడని అంటున్నారు. అంతేకాకూండా '2 .0 ' బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో.. ఈ రన్ టైం విషయంలో కాంప్రమైజ్ కావాల్సివచ్చింది అంటున్నారు.ఒకవేళ నిడివి ఎక్కువ ఉంటే ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద పడుతుంది కాబట్టే ఇలా నిడివిని దర్శకుడు శంకర్ తగ్గించేశారంటున్నారు. మరోపక్క ఈ సినిమాకి సంబందించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి స్థాయిలో ఫినిష్ కాలేదని.. అందువలన కూడా డ్యురేషన్ తగ్గిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఏది కరెక్ట్ అనేది దర్శకుడు శంకర్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.
https://www.telugupost.com/movie-news/ravanasura-first-day-collections-1470950
మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర ఏప్రిల్ 7 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో.. కలెక్షన్స్ పై దాని ఎఫెక్ట్ పడింది. హీరోగా రవితేజ కెరియర్ లోనే సరికొత్త క్యారెక్టర్ లో కనిపించడంతో.. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ.. ఊహించిన మేర భారీ ఓపెనింగ్స్ అయితే జరగలేదు. దసరా మినహా మరే ఇతర చిత్రంతోనూ పోటీ పడలేకపోయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. నాని హీరోగా నటించిన దసరా సినిమా 9వ రోజు కలెక్షన్లను కూడా రావణాసుర ఫస్ట్ డే కలెక్షన్లు అధిగమించలేకపోయింది.గతేడాది రవితేజ హీరోగా వచ్చిన కిలాడీ రూ.6.8 కోట్లు, రామారావు ఆన్ డ్యూటీ రూ. 6.3 కోట్లు, ధమాకా రూ.9.48 కోట్లు ఫస్ట్ డే వసూళ్లు రాగా.. రావణాసురకు కేవలం ఐదున్నర కోట్ల వసూళ్లే రావడం గమనార్హం. వాటితో పోలిస్తే.. రావణాసురకు మంచి ఆరంభం రాలేదనేది వాస్తవం. ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది కోట్ల వసూళ్లు రాబట్టింది. మిశ్రమ స్పందనతో ఉన్న ఈ సినిమా లాభాల బాట పట్టాలంటే రూ.25 కోట్లు వసూళ్లు రావాల్సి ఉంది. వీకెండ్ లో అంటే శని, ఆదివారాల్లో ఏమన్నా సినిమాకు మంచి వసూళ్లు వస్తాయోమోనని చిత్రబృందం ఎదురుచూస్తోంది. అభిషేక్ నామా, రవితేజ కలిసి నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా.. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా, రావు రమేష్, జయరామ్, సంపత్ రాజ్, మురళీశర్మ కీలక పాత్రల్లో కనిపించారు.
https://www.telugupost.com/movie-news/ప్రిన్స్-మహేష్-బాబుకు-కో-22020/
హీరో మహేష్ బాబుకు నాంపల్లి కోర్టు సమన్లు కొద్ది సేపటి క్రితం జారీ చేసింది. మార్చి 3వ తేదీన నాంపల్లి న్యాయస్థానానికి హాజరు కావాలని కోరింది. మహేష్ బాబుతో పాటు శ్రీమంతుడు సినిమా దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ లకు కూడా సమన్లు జారీ చేసింది. తన ‘చచ్చేంత ప్రేమ’ నవలను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశారని కవి, రచయిత శరత్ చంద్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.శ్రీమంతుడు కాపీనా..?2012లో స్వాతి మాసపత్రికలో వచ్చిన చచ్చేంత ప్రేమ కథను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమాగా మలిచారన్నది శరత్ చంద్ర ఆరోపణ. ఈయన కొద్ది రోజుల క్రితం నాంపల్లి కోర్టులో దీనిపై పిటిషన్ దాఖలు చేశారు. అప్పడు చిత్ర యూనిట్ కు నాంపల్లి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈరోజు దీనిపై మళ్లీ విచారించిన నాంపల్లి కోర్టు కాపీ రైట్స్ యాక్ట్ 63, కుట్ర పూరిత నేరం భారతీయ శిక్ష్మాస్మృతి120 బి కింద కేసు నమోదు చేయాలని పిటిషనర్ తరుపున న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు హీరో మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ లను మార్చి 3వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
https://www.telugupost.com/movie-news/భరత్-అనే-నేను-గురించి-కైర-64752/
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే చాలానే కష్టపడాలి కానీ బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ మాత్రం చాలా అవలీలగా తెలుగులోకి ఎంటర్ అయ్యి ఏకంగా మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. మొదట 'భరత్ అనే నేను' సినిమాలో హీరోయిన్ కోసం కొరటాల - మహేష్ చాలా మంది హీరోయిన్ ల పేర్లు అనుకున్నారు. కానీ చివరికి ఆ అదృష్టం కైరాకే దక్కింది.అయితే లేటెస్ట్ గా ఆమె తన మనసులో మాటలు ప్రేక్షకులతో పంచుకుంది. 'ఇలాంటి టీంతో పని చేసే అదృష్టం రావడం నా అదృష్టం. వారంతా నాపై ఎంతో నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకునేందుకు అన్నివిధాలుగా ప్రయత్నించాను' అని చెప్పింది కైరా. నా డిగ్రీ ఫినిష్ అవ్వగానే నేను ఇండస్ట్రీలోకి రావాలని భావించాను కానీ ఇక్కడ ఒక్క గ్లామర్ ఉంటే సరిపోదు బోలెడంత హార్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పింది.ఈ సినిమా షూటింగ్ సమయంలో నేను చాలా ఎంజాయ్ చేశాను. అలానే పక్కా హైద్రాబాదీ అమ్మాయి పాత్రను పోషిస్తున్నానని.. ముందే డైలాగ్ వెర్షన్ ను దర్శకుడు ఇవ్వడంతో.. బాగా ప్రాక్టీస్ చేశానని..ఈ క్యారెక్టర్ ప్రతీ మహిళకు కనెక్ట్ అవుతుందని చెప్పింది. అంతేకాదు మహేష్ అసలు స్టార్ హోదా ఫీల్ కాడని.. తనకు డైలాగ్స్ విషయంలో చాలా సార్లు హెల్ప్ చేశాడంటోంది కైరా.
https://www.telugupost.com/movie-news/accident-in-kamal-hasan-indian-2-sets-148555/
భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా శంకర్.. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో భారీ హంగులతో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారతీయుడు గెటప్ లో కమల్ హాసన్ అద్భుతంగా కనిపిస్తుండగా… కాజల్, రకుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇండియన్ 2 సెట్స్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, దర్శకుడు శంకర్ గాయపడడంతో పాటుగా మరో పదిమంది కి తీవ్రగాయాలైనట్టుగా తెలుస్తుంది. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ లో సినిమా షూటింగ్ చిత్రీకరణజరుగుతుంది. అయితే ఆ ప్రదేశంలో ఒక పెద్ద క్రేన్ ఒక్కసారిగా కిందపడటంతో ముగ్గురు వ్యక్తుల అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ మధు, చంద్రన్ మరో టెక్నిక‌ల్ అసిస్టెంట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దర్శకుడు శంకర్ కి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మృతదేహాలను చెన్నై లోని రాజీవ్ గాంధి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో హీరో కమల్ హాసన్ కి గాయాలు అవలేదని, దర్శకుడు శంకర్ కి కూడా చిన్న చిన్న దెబ్బలే తగిలాయని చెబుతున్నారు.. ఈప్రమాదంతో అక్కడున్న వారంతా షాక్ కి గురైనట్లుగా ప్రత్యక్ష సాక్షుల కథనం.
https://www.telugupost.com/movie-news/rrr-trial-shoot-160452/
ఇప్పుడు సినిమా చిత్రీకరణలకు ప్రభుత్వ అనుమతులు వచ్చేసాయి. అందరూ షూటింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ముందు రాజమౌళి పని మొదలెడితే.. మిగతా వాళ్ళు రంగంలోకి దిగడానికి ఎదురు చూసున్నారు. అయితే రాజమౌళి RRR కోసం ట్రయిల్ షూట్ మొదలెట్టబోతున్నాడు. అంతకన్నా ముందే RRR టీం తో ఆన్ లైన్ లో మీటింగ్ పెట్టాడట. రాజమౌళి ఈ మీటింగ్ లో సినిమా బడ్జెట్, రెమ్యూనరేషన్స్ వంటి విషయాలతో పాటు.. కరోనా వైరస్ నుండి తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి అనేక విషయాలు తన RRR టీం తో చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ట్రయిల్ షూట్ లో ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం 50 మంది టీం తోనే షూటింగ్ చేయబోతున్నాడట రాజమౌళి. అంత తక్కువమందితో సినిమా షూటింగ్ సాధ్యమేనా అనేది రాజమౌళి ట్రయిల్ షూట్ తో తేలిపోతుంది. ఈ ట్రయిల్ షూట్ ని గండిపేటలో అల్యూమినియం ఫ్యాక్టరీలో సాబు సిరిల్ నేతృత్వంలో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ షూట్ జరుగుతుంది అని చెబుతున్నారు. ఇంతకుముందు రాజమౌళి RRR కోసం అద్భుతమైన లొకేషన్స్ నార్త్ ఇండియాలో ఎంపిక చేసి ఉంచారు. ఈ వైరస్ రీత్యా అక్కడికి వెళ్లి షూటింగ్ జరపలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇక్కడ హైదరాబాద్ లోనే ప్రత్యేకమైన సెట్స్ లో పనికానిచ్చేస్తున్నారట.
https://www.telugupost.com/movie-news/vijay-sarkar-movie-collections-96391/
దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సర్కార్' చిత్రం తమిళం తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది. నవంబర్ 6న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మురగదాస్ - విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తుంది. తెలుగులో డివైడ్ టాక్ తో నడుస్తున్న ఈసినిమా తమిళనాట మాత్రం బాక్సాఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో భారీ గా రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. కేవలం రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసి రికార్డు సృటించిందని టాక్. పైగా నిన్న సెలవు కావడంతో ఈసినిమాకు కలిసొచ్చింది.తెలుగులో డివైడ్ టాక్ వచ్చినప్పటికి ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. సుమారు గా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో ఆ మొత్తాన్ని రాబట్టడం ఖాయం గా కనిపిస్తుంది. రీసెంట్ గా ఈసినిమాను మహేష్ బాబు చూసి టీంకు కంగ్రాట్స్ చెప్పారు
https://www.telugupost.com/crime/tragedy-happened-in-the-cockfight-young-man-died-after-being-stabbed-by-a-knife-during-a-cockfight-1457636
కోడిపందేల్లో విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న కోడిపందేల్లో కత్తి గుచ్చుకుని ఒక యువకుడు మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లాా నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఈ ఘటన జరగింది. పందెం కోడి కత్తి గుచ్చుకుని పద్మారావు అనే యువకుడు మరణించాడు.తోపులాట జరిగి...కోడిపందేల సందర్భంగా తోపులాట జరగడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు బరులు వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. పద్మారావు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కోడిపందేల నిర్వహణ చట్ట విరుద్ధమని తెలిసినా ఎందుకు నిర్వహించారని నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
https://www.telugupost.com/movie-news/atagallu-release-date-82710/
నారా రోహిత్, జ‌గ‌ప‌తి బాబు హీరోలుగా తెర‌కెక్కుతోన్న సినిమా ఆట‌గాళ్లు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 24న విడుద‌ల కానుంది. ప‌రుచూరి ముర‌ళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్ష‌న బానిక్ ఈ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది చిత్ర‌ యూనిట్. ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ప‌రుచూరి ముర‌ళి. అందుకే ట్యాగ్ లైన్ కూడా గేమ్ ఆఫ్ లైఫ్ అని పెట్టారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్, ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పందన వ‌చ్చింది. నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబుపై వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిల‌వ‌నున్నట్లు చెబుతున్నారు. సాయికార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విజ‌య్ సి కుమార్ సినిమాటోగ్ర‌ఫీ ఆట‌గాళ్లు చిత్రానికి మ‌రో మేజ‌ర్ హైలైట్.
https://www.telugupost.com/movie-news/do-you-like-vijay-or-nitin-155700/
విజయ్ దేవరకొండ తో రెండు సినిమాలు, నితిన్ తో ఒక్క సినిమా చేసిన రష్మిక మందన్న కి మీకు విజయ్ అంటే ఇష్టమా? నితిన్ అంటే ఇష్టమా? అని అడిగితె.. మీకు ఎవరంటే ఇష్టం అంటూ తెలివైన సంధానం చెప్పింది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ క్వారంటైన్ గడుపుతున్న రష్మిక సరదాగా… సోషల్ మీడియా లైవ్ చాట్ లో అభిమానులతో ముచ్చటించింది. లాక్ డౌన్ ముగియగానే తాను చేసే మొదటి పని.. వెంటనే వెళ్లి ఫ్రెండ్స్ ని కలవడం అని..ఖాళీ సమయంలో కేకులు, వంటలు తయారు చేస్తుంటా అని చెబుతుంది. ఇక మీకు హిందీ మాట్లాడడం వచ్చా.. అని అడిగితే.. వారికీ హిందీలో సమాధానం చెప్పి సర్ప్రైజ్ చేసింది. ఇక రష్మిక పుష్ప కోసం పాన్ ఇండియా హీరోయిన్ గా మారడంతో ఆమెపై మరింత క్రేజ్ పెరిగింది. అయితే పుష్ప కోసం మీరు విభిన్న యాస నేర్చుకుంటున్నారా అని అడిగితె….అది మీకెలా తెలుసు అంటూ నవ్వేసింది. ఇక హిందీలో నటిస్తారా అనగా… ఆలోచిస్తా అని… తమిళ సినిమా ఎమన్నా చేసారా.. అని అడిగితె.. నటించాను.. కానీ లాక్ డౌన్ ముగిసాక ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చని చెప్పడమే కాదు… నటి కాకపోయి ఉంటే… అనగా జీవితాంతం క్వారంటైన్ లో ఉండేదాన్ని అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది.
https://www.telugupost.com/movie-news/balakrishna-ntr-biopic-2-77927/
మహానటి సినిమా వచ్చాక ఎన్టీఆర్ బయోపిక్ లో కొన్ని మార్పులు జరగనున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలయ్యకు కొన్ని ఐడియాలు ఉండగా అవి ఇప్పుడు మార్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ బయోపిక్ లో బాలయ్య ఒక్కడి గురించే కాకుండా ఇతర నటీనటులు గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మహానటి సినిమాలోని కొంత మంది నటీనటులను ఎన్టీఆర్ బయోపిక్ లో తీసుకోవాలని బాలయ్య.. నిర్మాతలు డిసైడ్ అయ్యినట్టు టాక్.వారి పక్కన బాలయ్య నటిస్తే..?ప్రస్తుతం ఈ బయోపిక్ లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య.. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్టు భావిస్తున్నారు అంతా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎన్టీఆర్ పాత్ర బాలయ్య చేస్తున్నాడు. అంటే కీర్తి సురేష్ కానీ, చైతూ కానీ బాలయ్య పక్కన నటిస్తే అంతగా బాగోదు. ఎందుకంటే బాలయ్యకు ఏజ్, వెయిట్ ఎక్కువ కాబట్టి. మరి యంగ్ ఏజ్ లో ఎన్టీఆర్ పాత్ర ఎవరు పోషిస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బాలయ్య కాకుండా ఇంకెవరైనా చేస్తే దానికి బాలకృష్ణ అంగీకరిస్తాడా? ఒకవేళ అంగీకరించినా ఎంత భాగం మరో నటుడికి అవకాశమిస్తారు? ఇలా ప్రస్తుతం మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.
https://www.telugupost.com/movie-news/rgv-tweets-about-his-mother-netizens-in-shock-1368665
హైదరాబాద్ : నేడు మదర్స్ డే (మాతృ దినోత్సవం). ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేస్తూ.. తన మనసులో ఉన్న విషయాన్ని సూటిగా చెప్తూ.. విమర్శలకు గురయ్యే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మదర్స్ డే రోజు కూడా.. ఆయన ఓ ట్వీట్ చేశారు. తనదైన శైలిలో తన మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ.. తాను మంచి కొడుకును కాదంటూ పోస్ట్ పెట్టారు.''హ్యాపీ మదర్స్ డే మామ్. నేను ఓ మంచి కొడుకును కాదు. కానీ, ఓ తల్లిగా నువ్వు మంచితనం కన్నా ఎక్కువ అమ్మ'' అంటూ చేతిలో గ్లాస్ పట్టుకుని తన తల్లితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. వివాదాస్పద ట్వీట్లు చేసే ఆర్జీవీ.. బంధాలకు విలువివ్వనని చెప్పే ఆర్జీవీ.. ఒక్కసారిగా తన తల్లి ఫొటోను షేర్ చేస్తూ విషెస్ చెప్పడంతో నెటిజన్లు షాకయ్యారు. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా సార్, మీరు మారిపోయారు సర్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. "అసలు ఈ పోస్ట్ పెట్టింది నువ్వేనా" అని ఒక నెటిజన్ అడిగితే.. మరో నెటిజన్ "ఎంత పెద్ద ఎదవైనా అమ్మ ముందు పసివాడే"నని కామెంట్ పెట్టాడు.Happy Mother's Day Mom, I am not as good as a son but u are more than good as a mother 💐💐🙏 pic.twitter.com/uZ7E9ngeMy— Ram Gopal Varma (@RGVzoomin) May 8, 2022
https://www.telugupost.com/movie-news/భారీ-ప్రాజెక్ట్-కోసం-బాగ-30216/
ఈ మధ్యన మీడియాలో, ఇండియాలోని ఆల్ ఫిలిం ఇండస్ట్రీస్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మహాభారత గురించే చర్చించుకుంటున్నారు. సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మహా భారత మూవీలో పలువురు సూపర్ స్టార్స్ నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. వాసుదేవన్ నాయర్ రచించిన ‘రాందామూజం’ నవల ఆధారంగా శ్రీ కుమార్ మీనన్ ఈ మహాభారత ని తెరకెక్కిస్తున్నాడు. అయితే తెలుగు, తమిళం, కన్నడ, ఆగ్లం, హిందీ, మలయాళం భాషలలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆయా భాషల సూపర్ స్టార్స్ చాలామంది ఈ చిత్రంలో నటిస్తారని.... ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మహాభారత లో భీముని పాత్రకి ఎంపికయ్యాడని అంటున్నారు.అయితే ఈ భీముని పాత్ర కోసం మోహన్ లాల్ కొంతమంది గురువుల వద్ద తాను సుమారు రెండేళ్ళు శిక్షణ పొందుతానని చెబుతున్నాడు. అసలు ఇప్పటివరకు మహాభారత లోని భీముడు బాగా కండలు పెంచి బొద్దుగా కనబడతాడు. అందుకే భీముని పాత్రకు మోహన్ లాల్ ని ఎంపిక చేశారా? అనే డౌట్ వచ్చేసింది జనాలకు. కానీ ఈ నవల కథనం ప్రకారం భీముడు భావోద్వేగాలున్న వ్యక్తి అని అందరూ గుర్తిస్తారని చెబుతున్నారు. వాసుదేవన్ ఈ చిత్రానికి స్వయంగా స్క్రీన్ ప్లే రాశారని అంటున్నారు. ఇక వచ్చే ఏడాది సెట్స్ మీదకెళ్లనున్న మహాభారత చిత్రాన్ని 2020 లో విడుదల డేట్ ప్రకటించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
https://www.telugupost.com/movie-news/మళ్లీ-బంపర్-ఆఫర్-ఇస్తున్-42685/
ఎన్టీఆర్ హోస్టింగ్ లో వస్తున్న బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్స్ అందరిలో హరి తేజ బలమైన కంటెస్టెంట్ లా కనిపిస్తుందని అంటున్నారు. షోలో అల్లరి చేస్తూ అందరిని ఆటపట్టిస్తూ దూసుకుపోతున్న హరితేజ అందరికి టీవీ సీరియల్స్ లో పరిచయమే.... కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ... ఆ' సినిమాలో మాత్రం సూర్య కాంతంలా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో త్రివిక్రమ్ ఇచ్చిన అవకాశాన్ని హరితేజ సద్వినియోగం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ షోతో హరితేజకు మరిన్ని సినిమా అవకాశాలు రావొచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. హరితేజ ఎనర్జీకి బిగ్ బాస్ హోస్ట్ ఎన్టీఆర్ కూడా బాగానే ముచ్చట పడుతున్నాడు.అయితే హరితేజకు ఇప్పుడొక అదిరిపోయే అవకాశం తగిలింది అంటున్నారు. అదేమిటంటే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమాలో హరితేజని ఒక కీలక పాత్రకి దర్శకుడు త్రివిక్రమ్ ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి 'అ.. ఆ' సినిమాలో హరితేజ నటనకు, బిగ్ బాస్ షోలో హరితేజ రియాలిటీకి ముగ్దుడైన త్రివిక్రమ్ ఆమెను దృష్టిలో ఉంచుకునే ఒక బలమైన పాత్ర రాసుకున్నట్టుగా చెబుతున్నారు. నిజంగా హరితేజకి త్రివిక్రమ్ -ఎన్టీఆర్ కలయికలో వస్తున్న సినిమాలో బెర్త్ గనక కన్ఫర్మ్ అయితే హరితేజ జాక్ పాట్ కొట్టినట్టే అంటున్నారు.మరి 'అ... ఆ' సినిమాతో త్రివిక్రమ్ ని ఇంప్రెస్స్ చేసిన హరి ఇప్పుడు బిగ్ బాస్ షో తో ఇంప్రెస్స్ చేసి..... మరి వారి కలయికలో రాబోతున్న సినిమాలో నటించి ఇద్దరినీ ఒకేసారి ఇంప్రెస్స్ చెయ్యడానికి రెడీ అవుతుందన్నమాట. ఇక బిగ్ బాస్ షో లో ఆమె చెప్పిన హరికథ స్టయిల్ కి ఫిదా అయిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆమె ఆ షో విన్ అవ్వాలని కోరుకుంటున్నారు.
https://www.telugupost.com/andhra-pradesh/andhra-pradesh-bjp-leader-somu-veerraju-arrest-1350910
కృష్ణాజిల్లా గుడివాడలో క్యాసినో వ్యవహారంపై రాజకీయ వేడి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయంపై ఏపీలో రగడ జరుగుతూనే ఉంది. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ సీనియర్ నేతలు గుడివాడ వెళ్తుండగా.. నందమూర వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గుడివాడ వెళ్లడానికి వీల్లేదని నిలువరించారు. ఈ క్రమంలో.. తాము సంక్రాంతి సంబరాలు ప్రజలకు తెలియజేసేందుకే గుడివాడ వెళ్తున్నామని.. మరో కారణం లేదని సోము వీర్రాజుతో పాటు బీజేపీ నేతలు పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశారు.Also Read : వివాదంలో సింగర్ సునీత భర్త.. ఏం జరిగింది ?గుడివాడలో 144 సెక్షన్ అమల్లో ఉన్నకారణంగా అనుమతి లేదని తేల్చి చెప్పారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో.. కలువపాముల ప్రాంతంలో సోము వీర్రాజుతో పాటు ఇతర బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. వేడుకలు చేయడానికి వెళ్తుంటే.. అరెస్ట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రవర్తనపై బీజేపీ కార్యకర్తలు నిరసన చేయడంతో.. గుడివాడ పరిసరాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
https://www.telugupost.com/movie-news/mahesh-babu-trivikram-allu-arjun-116549/
అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ అధికారిక ప్రకటన వచ్చి ఆరు నెలలైనా ఆ కాంబో ఇంకా పట్టాలెక్కలేదు. బన్నీ – త్రివిక్రమ్ సినిమా మీద రకరకాల వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ మీద నమ్మకం లేక సుకుమార్ వైపు చూస్తున్నాడని.. సుకుమార్ తో ఎప్పుడెప్పుడు సినిమా మొదలెడదామా అన్నట్లుగా బన్నీ చూస్తున్నాడనని అంటున్నారు. ఈలోపు త్రివిక్రమ్.. మహేష్ తో పని చేయబోతున్నాడనే న్యూస్ హైలెట్ అయ్యింది. మహేష్ తో త్రివిక్రమ్ గతంలో అతడు, ఖలేజా సినిమాలు చేసాడు. మహేష్ తో యాడ్ షూట్ అయితే మహేష్ తో గత కొంతకాలంగా సినిమాలు చెయ్యకపోయినా చాలా యాడ్ షూట్స్ చేస్తున్నాడు. ఆ రకంగా త్రివిక్రమ్ – మహేష్ కలిసే పనిచేస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్, మహేష్ తో సినిమా చెయ్యడం లేదు కానీ ఒక యాడ్ ఫిలింని ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ స్టార్స్ తో కొన్ని క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ డైరెక్ట్ చేశాడు. అయితే ప్రస్తుతం మహేష్ తో త్రివిక్రమ్ చేస్తున్న ఆ యాడ్ ఒక యాప్‌కి సంబంధించినదని, ఈనెల 10 నుండి ఆ యాడ్ షూటింగ్ జ‌ర‌గ‌బోతోందట. ప్రస్తుతం మహేష్ మ‌హ‌ర్షి షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి ఈ యాడ్ షూట్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.
https://www.telugupost.com/movie-news/ram-charan-chiranjeevi-dance-for-shah-rukh-khan-jawan-song-1504509
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో చాలా సందడిగా ఉంటూ కనిపిస్తుంటారు. పండుగల సమయంలో కుటుంబసభ్యులు అందరి మధ్య ఒక చిన్న పిల్లాడిలా మారిపోయి సందడి చేస్తుంటారు. తాజాగా చిరు ఇంట దివాళీ బ్యాష్ జరిగిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన హోస్ట్ చేసిన ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ లోని స్టార్స్ నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా అందరూ కదిలి వచ్చారు.ఆ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కోటిగా బయటకి వస్తూ ఉన్నాయి. తాజాగా ఆ దివాళీ బ్యాష్ నుంచి ఒక వీడియో బయటకి వచ్చింది. ఆ వీడియోలో చిరంజీవి షారుఖ్ ఖాన్ 'జవాన్' మూవీ టైటిల్ సాంగ్ కి డాన్స్ వేస్తూ కనిపించారు. షారుఖ్ పాటకి చిరంజీవి స్టెప్పులు వేస్తుంటే రామ్ చరణ్ చప్పట్లు కొడుతూ సందడి చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వీడియోని మీరుకూడా చూసేయండి.MEGASTAR ✨ @KChiruTweets garu grooves to KING KHAN 👑 @iamsrk 's Jawan title track in Diwali Party at his Home. #SRKAlso Seen Man Of Masses @AlwaysRamCharan ❤️‍🔥 pic.twitter.com/g6qF36mDMQ— Ujjwal Reddy (@MEHumanTsunaME) November 14, 2023 ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. త్వరలో Mega156 ని పట్టాలు ఎక్కించబోతున్నారు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన ఈ సినిమా ఈ నెలాఖరులో షూటింగ్ మొదలు పెట్టుకోనుందని సమాచారం. బింబిసారా ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు. సోషియో ఫాంటసీ కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో చిరంజీవి తన ఏజ్ కి తగ్గ పాత్రని పోషించబోతున్నారట.మూవీలో హీరోయిన్ తో రొమాన్స్ వంటి సీన్స్ ఉండవని వశిష్ఠ తేల్చి చెప్పేశారు. చిరు రోల్ చాలా పవర్‌ఫుల్ గా ఉంటుందంటూ దర్శకుడు చెప్పుకొస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం చంద్రబోస్ తో కలిసి కీరవాణి సాంగ్స్ ని సిద్ధం చేస్తున్నారు. చోట కె నాయడు ఈ సినిమాకి డిఒపిగా పనిచేస్తున్నారు. అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సినిమాల తరువాత చాలా గ్యాప్ తో చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ సబ్జెట్ కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి.
https://www.telugupost.com/top-stories/comedian-and-director-manobala-passed-away-he-has-been-suffering-from-illness-for-some-time-1474666
ప్రముఖ హాస్యనటుడు, డైరెక్టర్ మనోబాల మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కమెడియన్ గా మనోబాల గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఈ ఏడాది జనవరి నెలలో గుండెకు సంబంధించిన చికిత్స చేయించుకున్నారు. యాంజియో చేయించుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.తమిళ పరిశ్రమలో...అయితే ఆయన ఈరోజు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో తమిళ పరిశ్రమ ఒక గొప్ప హాస్యనటుడిని కోల్పోయిందని చిత్ర ప్రముఖులు అనేక మంది పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిది అని కూడా పలువురు వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు.
https://www.telugupost.com/movie-news/మహేష్-అభిమానుల-ని-థ్రిల్-53650/
తన అభిమానుల కు తన సినిమా ద్వారా ఏదొక ట్రీట్ ఇవ్వాలని చూస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమాతో అతడి కెరీర్ లో ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు మహేష్. ప్రస్తుతం వరస పరాజయాలతో ఉన్న మహేష్ తన అభిమానుల్లో జోష్ నింపేలా ప్రస్తుతం తీస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూస్తున్నాడు.శ్రీమంతుడు సినిమాలో ఓ పాటలో మహేష్ లుంగీలో కనిపించాడు. ఆ లుక్ అభిమానులకు తెగ నచ్చడంతో...అదే తరహాలో ఇప్పుడు తీస్తున్న భరత్ అనే నేనులో ఫ్యాన్స్ కోసం అచ్చ తెలుగు పంచెకట్టుతో ఓ పాట తీయాలని డైరెక్టర్ కొరటాల శివ ఆలోచన చేస్తున్నాడట. అంతకు ముందు పోకిరి, శ్రీమంతుడు సినిమాల్లో లుంగీలో కనపడ్డాడు మహేష్. తొలి సారిగా పంచెకట్టుతో కనపడనున్నాడు ‘భరత్ అనే నేను’ సినిమాలో.అయితే ఈ ప్రపోజల్ గూర్చి కొరటాల శివకు ఫిలిం మేకర్లకు తప్ప ఎవరికి తెలీదని సినిమా యూనిట్ సభ్యుడొకరు తెలిపారు. ఇక భరత్ అనే నేను సినిమాలో మహేష్ కెరీర్ లో మొదటి సారి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలిసిన విషయమే. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం అవుతుంది.
https://www.telugupost.com/movie-news/ysr-biopic-yatra-movie-108616/
సినిమా పై అంచనాలు ఉంటె మంచిదే. కానీ అది కొన్నికొన్ని సార్లే. సినిమాపై మరీ అంచనాలు ఎక్కువ అయిపోతే సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశముంది. సినిమాలో ఎక్కడో కొంచం తేడా కొట్టిన ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుంది. కొన్నిసార్లు ఎక్సపెక్టషన్స్ లేకుండా వచ్చిన సినిమాలు సక్సెస్ అయినా దాఖలు కూడా ఉన్నాయి. మహానటి అదే కోవకి చెందింది. ఈసినిమా వచ్చేవరకు పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కానీ సినిమా వచ్చాక సినిమా చూసి ఔరా అనుకున్నారు. ఇక సంక్రాంతికి రిలీజ్ అయినా ఎన్టీఆర్ కథానాయకుడు పై ముందు నుండే బారి అంచనాలు ఉన్నాయి. సినిమాలో విషయం లేకపోవడంతో ఎమోష‌న్లు వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం చేటు చేసింది. మరి మహానాయకుడు పరిస్థితి ఏంటో చూడాలి. ఈసినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు అయితే లేవు. ఇక టాలీవుడ్ లో మరో బయోపిక్ రానుంది. అదే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద తీసిన “యాత్ర‌”. ఈసినిమా పై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే వైఎస్ ఏమీ సినిమా వాడు కాదు కాబ‌ట్టి.. గ్లామ‌ర్ ట‌చ్ మిస్స‌యింది.అందులోనూ ఇది ప్ర‌ధానంగా వైఎస్ పాద‌యాత్ర నేప‌థ్యంలో సాగే చిత్రం. దాంతో ఈసినిమాపై అంతగా బజ్ లేదు. అయితే డైరెక్టర్ మ‌హి.వి.రాఘ‌వ్ ఒక క‌న్విక్షన్‌తో ఈ సినిమా తీశాడు. ఇది వైఎస్ సినిమాగా కాకుండా మామూలుగా చూసినా ఇది న‌చ్చే సినిమా అంటున్నాడు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మ‌మ్ముట్టి నటించారు.
https://www.telugupost.com/AndhraPradesh-Assembly-Elections/tdp-has-created-history-in-this-election-this-time-it-has-seen-victories-that-were-not-achieved-in-united-andhra-1538735
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో హిస్టరీని క్రియేట్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ సాధించని విజయాలను ఈసారి చవి చూసింది. జనం ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా ఒక్కటై సైకిల్ కు జై కొట్టారు. ఎస్సీ నియోజకవర్గాల్లో సహజంగా తొలి నుంచి కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి పట్టు ఉంది. అయితే ఇప్పుడు ఆ చరిత్రను టీడీపీ తిరగరాశారు. ఒకటంటూ ఏమీ లేదు. అసలు అభ్యర్థులను చూడలేదు. ఒకే ఒక లక్ష్యం. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా జనం బటన్ నొక్కారని రిజల్ట్ ను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతటి ఘన విజయాన్ని చంద్రబాబు పార్టీ పగ్గాలుచేపట్టిన తర్వాత ఎప్పుడూ సాధించలేదు.గతంలో ఏనాడూ...చంద్రబాబు అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నారు కూటములను ఏర్పాటుచేశారు. అయితే అప్పుడు కూడా ఈ స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అంతటి విజయం వస్తుందని బహుశ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరు. ప్రభుత్వంపై చాపకిందనీరులా ఇంతటి వ్యతిరేకత ఉందని ఫలితాల తర్వాతనే అర్థమయిందని చెప్పాలి. విశ్లేషకులకు సయితం అర్థం కాకుండా జనం నాడి ఉందని ఈ రిజల్ట్ తేల్చి చెప్పాయి. ఇది పాలకులకు ఒక గుణపాఠం అని చెప్పాలి. ఎందుకంటే సహజంగా ఓటమి పాలయితే తక్కువ మెజారిటీతో ఓటమి పాలు కావడం, తక్కువ ఓట్లతోతృటిలో అధికారాన్నికోల్పోవడాన్ని చూశాం. కానీ ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులందరికీ దాదాపు వేల మెజారిటీలు. గతంలో ఎన్నడూ రానంత మెజారిటీలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ...వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి పట్టు ఉందని భావించారు. అర్బన్ ప్రాంతాల్లో తొలి నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించినా రూరల్ ఏరియాలో అస్సలు కనిపించలేదు. దీంతో రూరల్ లో పట్టు తమకే ఉందన్న అభిప్రాయం దాదాపు అందరిలోనూ ఉంది. అయితే ఈ ఫలితాలతో పటాపంచలయింది. రూరల్ లేదు.. పట్టణం లేదు... అంతా ఏకమైంది... ఒకే మాట.. అందరూ కలసి మాట్లాడుకున్నట్లు ఓటేసినట్లే అనిపిస్తుంది. ఇంత భారీ స్థాయిలో ఓటమిని జగన్ కూడా ఊహించి ఉండడు. చంద్రబాబు మీద నమ్మకం అయి ఉండవచ్చు. లేకుంటే జగన్ పాలన పై విసుగు పుట్టి ఉండవచ్చు. అందరూ కూడబలుక్కుని బటన్ నొక్కినట్లే ఓటింగ్ జరిగిందని ఈ రిజల్ట్ స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.
https://www.telugupost.com/movie-news/telugu-movie-collections-in-may-june-124242/
మే నెలలో ఒకే ఒక్క పెద్ద సినిమా బాక్సాఫీసు వద్దకు వచ్చింది. మే 9 న మహేష్ బాబు మహర్షి సినిమా విడుదలైంది. కానీ ఆ సినిమాకి యావరేజ్ టాకొచ్చినా.. చిత్ర బృందం మాత్రం సూపర్ హిట్ అంటూ వాయించేశారు. ఇక తర్వాతి వారంలో వచ్చిన అల్లు శిరీష్ ఏబీసీడీ, ఆ తర్వాత వచ్చిన సీత లాంటి సినిమాలతో ప్రేక్షకులకు పిచ్చెక్కింది. వేసవి సెలవలన్నీ చాలా చప్పగా చాల డ్రై గా ముగిసిపోయాయి. మరో వారంలో స్కూల్స్ రీ ఓపెన్ కూడా అవుతున్నాయి ఇక ఈవారం విడుదలైన 7, హిప్పీ సినిమాలు అయితే ప్రేక్షకుల తలకు బొప్పి కట్టించాయి. అసలు వేసవి సెలవలు అంటే గనక భారీ బడ్జెట్ సినిమాల హంగామా మమూలుగా ఉండదు. కానీ ఈవేసవి లో మహర్షి తప్ప భారీ బడ్జెట్ మూవీ ఒక్కటి లేదు. ఏదో తమిళం నుండి సూర్య ఎన్జీకే మంచి అంచనాలతో విడుదలయింది. అది కూడా ప్లాప్ అయ్యింది. ఇక ఈ నెల లో కూడా పెద్ద సినిమాలేమి కనిపించడం లేదు. జూన్ మొదటి వారంలో హిప్పీ, 7 విడుదలైతే.. తర్వాత కూడా చిన్న సినిమాల హడావిడే ఉంది. అందులో మల్లేశం, గేమ్ ఓవర్, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ, విశ్వామిత్ర, కిల్లర్, వజ్రకవచదర గోవింద లాంటి ఓ ఏడెనిమిది సినిమాలు ఈ జూన్ లోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ ఏడాది భారీ బడ్జెట్ సినిమాలంటే కేవలం సాహో, సై ర సినిమాలే కనబడుతున్నాయి. ఆ సినిమాల విడుదలకు ఇంకా రెండు నెలల టైం ఉంది. ఈలోపు చిన్న సినిమాల హడావిడే బాక్సాఫీసు వద్ద కనబడుతుంది. ఏది ఏమైనా మే తో పాటుగా జూన్ కూడా ప్రేక్షకులకు పెద్దగా ఆశాజనకంగా కనిపించడం లేదు.
https://www.telugupost.com/movie-news/rrr-forth-song-coming-out-from-december-4th-1345138
భారీ అంచనాల జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు టీజర్లు రాగా.. మూడు పాటలను విడుదల చేశారు మేకర్స్. దోస్తీ, నాటు నాటు పాటలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ లు ట్విట్టర్ వేదికగా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. కొమురం భీముడో.. కొమురం భీముడో అంటూ సాగే ఈ పాటను సింగర్ కాలభైరవ ఆలపించగా.. ఇదొక ఎమోషనల్ సాంగ్ అని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎమోషనల్ ట్రాక్ మీద వచ్చే పాట ఇదేనని, ఈ పాట మీ అందరికీ చాలా కాలం గుర్తుండిపోతుందని తారక్, చరణ్ లు తెలిపారు. డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నారు మేకర్స్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ తో తెరకెక్కుతోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం దర్శకుడితో పాటు కథానాయకులిద్దరూ ఎంత కష్టపడ్డారో టీజర్లలోనే చూపించారు రాజమౌళి.
https://www.telugupost.com/movie-news/ఈ-టూర్-వెనుక-అసలు-కారణమేమ-36194/
మెగాస్టార్ చిరంజీవి తన 151 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా మొదలు కావడానికి కాస్త టైం పట్టేలా వుంది. అందుకే మెగాస్టార్ ఇపుడు ఒక ప్లాన్ చేస్తున్నాడట . ఇటీవలే మెగాస్టార్‌ చైనా వెళ్లి వచ్చాడు. నాటి 1980నాటి సౌతిండియన్‌ సినీనటుల కలయిక సెలబ్రేషన్స్‌ కోసమే ఆయన తన సతీమణి సురేఖతో ఆ వేడుకకు హాజరయ్యారు. దాంతోనే ఆయన దాసరి మరణవార్తను విన్నప్పటికీ కడచూపు చూసేందుకు రాలేదు. మళ్ళీ ఇపుడు ఆయన హఠాత్తుగా ఫ్యామిలీ టూర్‌ వేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ అమెరికా టూర్‌ ఎందు కోసమో ఏమో తెలియదు కానీ ఆయన వెంట భార్య సురేఖతో పాటు అల్లుఅరవింద్‌ ఫ్యామిలీ కూడా కలిసి వెళ్తోంది. ఈ ట్రిప్‌లోప్రత్యేకతఏమీ లేదని, సాధారణంగా జరిగే ట్రిప్పేనంటున్నారు. అదే సమయంలో ఉయ్యాలవాడలో తన మేకోవర్‌ విషయంలో పలువురు హాలీవుడ్‌ సాంకేతికనిపుణుల నుంచి సలహ తీసుకుంటారని అంటున్నప్పటికీ ఇది కేవలం జాలీ ట్రిప్పే అని తెలుస్తోంది.
https://www.telugupost.com/movie-news/మళ్ళీ-వీరో-కాంబోలో-మూవీన-41741/
బాలకృష్ణ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ సెట్స్ మీదకెళ్లే వరకు వారి కాంబోలో సినిమా వస్తుంది అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కానీ వారి కాంబోలో సినిమా సెట్స్ మీదకెళ్ళడం... ఆ సినిమా రికార్డు స్థాయిలో పూర్తి కావడం.... విడుదలకు సిద్దమవడం జరిగిపోయాయి. ఇక వీరి కాంబోలో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం వచ్చే శుక్రవారమే విడుదలకానుంది. వీరి కాంబినేషన్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. స్టంపర్, ట్రైలర్ తోనే బాలయ్య ఎనర్జీ పీక్స్ లో చూపించిన పూరి ప్రోమో సాంగ్స్ లో కూడా బాలయ్య డాన్స్ స్టెప్స్ ని చూపించేసాడు.ఇక వీరి కాంబోలో సినిమా సెట్స్ మీదున్నప్పుడే బాలయ్య అంటే అభిమానమని ఆయనతో సినిమా చెయ్యడం అదృష్టమని పూరి చెప్పేవాడు. ఇక పూరి మార్క్ డైలాగ్స్ ఎలా ఉంటాయో 'పైసా వసూల్' లో చూడమని బాలయ్య కూడా చెబుతున్నాడు. ఇంకా ఈ సినిమా విడుదల కాకముందే వీరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. 'పైసా వసూల్' షూటింగ్ లోనే పూరి... బాలయ్యకి ఒక కథ వినిపించాడని... కథ విన్న బాలయ్య కూడా ఆ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడనే టాక్ నడుస్తుంది.ఇక ఇప్పుడు పూరి, బాలయ్యని 'పైసా వసూల్' లో గ్యాంగ్ స్టర్ గా చూపెడుతుండగా... మళ్ళీ వీరి కాంబో లో రిపీట్ అయ్యే మూవీని మాత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తాడని అంటున్నారు. మరి మళ్ళీ వీరి కాంబో రిపీట్ అవ్వాలంటే ముందు 'పైసా వసూల్' విడుదలయ్యి ఆ సినిమా హిట్టవ్వాలిగా అంటున్నారు. నిజంగానే 'పైసా వసూల్' ఫలితం మీదే పూరి - బాలయ్య ల మరో సినిమా ఆధారపడివుంది. ఇక బాలయ్య తాజాగా కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో 102 వ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేసి సెట్స్ మీదకెళ్ళిపోయాడు.
https://www.telugupost.com/movie-news/no-more-item-songs-183359/
హాట్ యాంకర్ అనసూయ అందాలు కేవలం జబర్దస్త్ లోనే కాదు వెండితెర మీద వెలిగిపోతున్నాయి. అటు ఐటెం సాంగ్స్, ఇటు కీ రోల్స్ అబ్బో అనసూయ వెండితెర వెలుగులు మాములుగా లేవు. రవితేజ ఖిలాడీ సినిమాలో కీలక పాత్ర అంటే రవితేజతో ఢీ కొట్టే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న అనసూయ రీసెంట్ మూవీ థాంక్యూ బ్రదర్ విడుదలకు సిద్దమవుతుంది. ఇక అనసూయ గతంలో సాయి ధరమ్ తేజ్ విన్నర్ మూవీలో సూయా సూయ అనసూయ అనే సాంగ్ లో క్లాసీ స్టెప్స్ వేస్తే.. ఇప్పుడు కార్తికేయ చావు కబురు చల్లగా సినిమాలో మాస్ ఐటెం స్టెప్స్ తో అవసరమని వేడుకుంటారు. అవసరానికి వాడుకుంటారు అంటూ అదరగొట్టబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ఐటెం సాంగ్ స్టిల్స్ లో అనసూయ లుక్ మాస్ కాదు ఊర మాస్ లా కనిపిస్తుంది. అయితే అనసూయ ఇలా ఐటెం సాంగ్స్ చేస్తుంది కదా అని మరికొంతమంది ఈ హాట్ యాంకర్ అనసూయని సంప్రదించగా.. నేను ఇకపై ఐటెం సాంగ్స్ చెయ్యను. చావు కబురు చల్లగా సినిమానే లాస్ట్ ఐటెం సాంగ్. అది కూడా నా ఫ్రెండ్ జానీ మాస్టర్ అడిగాడని చేస్తున్నా.. అంటూ చావుకబురుని చల్లగా చెప్పేసరికి అనసూయ అభిమానులు హార్ట్ అవుతున్నారు. అనసూయ గ్లామరస్ గా ఊర మాస్ స్టెప్స్ తో స్క్రీన్ మీద కనిపిస్తుంటే చూడాలనుకుంటున్న యూత్ కి అనసూయ సమాధానం షాకిచ్చింది. మరి జానీ మాస్టర్ తో గతంలోనూ అనసూయ స్పెషల్ షోస్ లో స్టేజ్ మీద ఆదిరిపోయే స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి జానీ మాస్టర్ ఆధ్వర్యంలో చావుకబురు చల్లగా లో మాస్ స్టెప్స్ తో ఇరగదియ్యబోతుంది కానీ.. ఇకపై ఐటెం సాంగ్స్ చెయ్యను అనడమే ఫాన్స్ ని కలవరపెడుతుంది.
https://www.telugupost.com/crime/key-development-has-taken-place-in-the-delhi-liquor-scam-amit-arora-has-been-arrested-by-the-enforcement-directorate-1450491
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కాంలో మద్యం వ్యాపార వేత్త అమిత్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అమిత్ అరోరా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ముఖ్య అనుచరుడిగా గుర్తించారు. అర్ధరాత్రి అమిత్ అరోరాను ఈడీ అధికారులు పోలీసులు అరెస్ట్ చేశారు.మనీష్ సిసోడియాకు...ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పీడ్ పెంచింది. ఇప్పటికి ఈ స్కాంలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లయింది. ఈ కేసులో మరికొందరిని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఎవరిని అధికారులు ఈ స్కాంలో అరెస్ట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
https://www.telugupost.com/movie-news/ntr-attending-big-boss-finale-89495/
నిన్నమొన్నటివరకు బిగ్ బాస్ సీజన్ టు నాని హోస్టింగ్ పై, హౌస్ కంటెస్టెంట్స్ పై పెద్దగా జనాలలో ఆసక్తి లేకుండా పోయింది. బిగ్ బాస్ సీజన్ వన్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా హిట్ అయిన బిగ్ బాస్ షో.. నాని రాకతో కాస్త డల్ అయ్యింది. మొదటి సీజన్ ని సక్సెస్ ఫుల్ గా నడిపిన ఎన్టీఆర్ రెండో సీజన్ కి డేట్స్ సర్దుబాటు లేవంటూ బిగ్ బాస్ టీం కి హ్యాండిచ్చాడు. నిన్నమొన్నటివరకు బిగ్ బాస్ సీజన్ టు పై పెద్దగా ఆసక్తి లేదుకానీ.. ఇపుడు బయట కౌశల్ ఆర్మీ పేరిట జరుగుతున్నా 2 కే రన్ లు, ర్యాలీలు హంగామా సృష్టిస్తుంటే... లోపల అదేనండి బిగ్ బాస్ హౌస్ లో ధర్నా జరుగుతుంది. హౌస్ లోని సభ్యులంతా కౌశల్ ని టార్గెట్ చేసి ఆడుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ కూడా కౌశల్ ని బ్యాడ్ చేసే ప్రయత్నాలేవో మొదలెట్టినట్టుగా టాక్ ఉండనే ఉంది.ప్రస్తుతం 101 రోజులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ మరో పది రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరుపుకోనుంది. అయితే సీజన్ వన్ గ్రాండ్ ఫినాలే ని ఎన్టీఆర్ ఎంతో చక్కగా అందరూ ఆకట్టుకునేలా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈసారి నాని స్టామినా చాలదని స్టార్ మా యాజమాన్యం నాని కి తోడుగా బిగ్ బాస్ సీజన్ టు కి స్పెషల్ గెస్ట్ గా ఒకరిని తీసుకురాబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే మొదట్లో ఎన్టీఆర్ పేరు వినబడినప్పటికీ... ఎన్టీఆర్ అరవింద సమేత షూటింగ్, హరికృష్ణ మరణంతో కుంగిపోవడంతో.. బిగ్ బాస్ గ్రాండ్ ఫైనలేకి రాడని అన్నారు. ఈ లోపు నాగార్జున పేరు తెర మీదకి రావడం జరిగింది. నాని, నాగార్జున కలిసి దేవదాస్ ని ప్రమోట్ చేస్తూ గ్రాండ్ ఫినాలేని పూర్తి చేస్తారని, నాగార్జున కి స్టార్ మా కి ఉన్న అనుబంధంతో నాగ్ ఫైనల్ ఈవెంట్ కి వస్తున్నాడన్నారు.కానీ తాజాగా మళ్ళీ ఎన్టీఆర్ ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి హాజరవుతున్నాడని.. బిగ్ బాస్ స్టేజ్ మీద ప్రేక్షకులను, మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్ ని ఎంటర్టైన్ చేస్తూ.. ఫైనల్ విన్నర్ ని ఎన్టీఆర్ ప్రకటిస్తాడంటూ.. లేటెస్ట్ గా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినబడుతుంది. మరి ఎన్టీఆర్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి హాజరవుతాడని వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియదు గాని... నిన్నటినుండి సోషల్, వెబ్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ బిగ్ బాస్ కి వచ్చే విషయమై వచ్చిన వార్తలు నిజమే అని... అధికారిక ప్రకటన రావడమే తరువాయంటున్నారు కొంతమంది. ఏది ఏమైనా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి ఎన్టీఆర్ గనక హాజరయితే.. స్టార్ మా టీఆర్పీ రేటింగ్ ఒక రేంజ్ లో పెరగడం ఖాయం.
https://www.telugupost.com/movie-news/బాలయ్య-స్టామినాకు-తగ్గ-స-59647/
పోయిన ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల మధ్య ఎంత పోటీ ఉందొ.... అదేవిధంగా ఈ సంక్రాంతికి కూడా కచ్చితంగా పోటీ ఉంటుంది అనుకున్నారు అంత. కానీ అజ్ఞాతవాసి డిజాస్టర్ వల్ల ఈ పోటీ చప్పపడిపోయింది. విడుదల ఐన మూడు స్ట్రెయిట్ సినిమాలో బాలయ్య సినిమా జై సింహ పర్లేదు అనిపించుకుంది.ఈ జైసింహ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయిపోయింది. ఇప్పటి దాకా 35.86 కోట్ల షేర్ తో సేఫ్ అనిపించాడు బాలయ్య. ఈ సినిమా బిజినెస్ ప్రకారం సుమారు 28 కోట్లకు అమ్ముడైంది. 8 కోట్ల లాభంతో మరోసారి బాలయ్య సెంటిమెంట్ వర్క్ అవుట్ అయింది.కానీ ఇది బాలయ్య స్టామినాకి తగ్గ సినిమా కాదు. ఎందుకంటె గత ఏడాది గౌతమిపుత్ర శాతకర్ణి 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించి కొత్త రికార్డు సెట్ చేసింది. కానీ జై సింహ మాత్రం 36 కోట్ల మాత్రమే వసూల్ చేసింది. విన్నర్ అని చెప్పుకుంటున్న బాలయ్య స్టామినాకు తగ్గ సక్సెస్ మాత్రం జైసింహ ఇవ్వలేదు.
https://www.telugupost.com/movie-news/tamannah-bhatia-comments-on-lip-lock-scenes-150489/
హీరోయిన్స్ గా 15 ఏళ్ళు ఘంటాపధంగా ఛాన్స్ లు చేజిక్కించుకుంటూ.. ఇప్పటికి హీరోయిన్ గా బిజీగా వున్నా తమన్నా మీద ఈమధ్యన పెళ్లి రూమర్స్ చాలానే వచ్చాయి. తమన్నా కి ఆఫర్స్ తగ్గాయి, కెరీర్ లో చూడాల్సిన ఎత్తుపల్లాలు చూసేసింది.. ఇక త్వరలోనే తమన్నా పెళ్ళికి సిద్దమంటూ వార్తలొచ్చాయి. కానీ తమన్నా మాత్రం పెళ్లి విషయం ఎత్తగానే సిగ్గుపడకుండా.. తానిప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని చెప్పింది. ఇంకా సినిమాలు చెయ్యాలి అంటున్న తమన్నాని ఓ మీడియా ప్రతినిధి మీరు గనక పెళ్లి కోసం స్వయంవరంలో పాల్గొంటే ఆ స్వయం వారానికి ఏ హీరోలు రావాలనుకుంటారో అందులో ముగ్గురు పేర్లు చెప్పమనగానే తమన్నా టక్కున బాహుబలి ప్రభాస్, బాలీవుడ్ నటులు హ్రితిక్ రోషన్, విక్కీ కౌశల్ పేర్లు చెప్పేసింది. మరి బాహుబలి ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పకనే చెప్పిన తమన్నా తనకు ముద్దు సీన్ లో నటించాలంటే అది కేవలం ఒక్క హీరో సినిమాలోనే అది.. కూడా హ్రితిక్ రోషన్ సినిమాలో అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఒక్క ముద్దు సీన్ లో కూడా తమన్నా నటించలేదట. సినిమా కథ విన్నప్పుడే డైరెక్టర్ కి తమన్నా తన కండిషన్స్ వినిపిస్తుందట. హాట్ గా కనబడమంటే ఓకె కానీ.. ముద్దు సీన్స్ కి నై అంటుందట. ఇక కేవలం ఆ ముద్దు సీన్స్ ని హ్రితిక్ రోషన్ సినిమా కోసం తన నియమాన్ని ఉల్లంగిస్తా అని… హ్రితిక్ రోషన్ అనగానే ముద్దు సీన్స్ కి కూడా సై అంటా అంటుంది తమన్నా
https://www.telugupost.com/movie-news/koratala-naveen-polisetty-171527/
అదేమిటి చిరంజీవి ఆచార్య ని కొరటాల తేరకెక్కిస్తున్నాడు. తర్వాత అల్లు అర్జున్ మూవీకి కమిట్ అయ్యి ప్రకటన కూడా ఇచ్చేసాడు. మధ్యలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ హీరో నవీన్ పోలిశెట్టి కొరటాలతో సినిమా ఏమిటి అనే కన్ఫ్యూషన్ లో ప్రేక్షకులు ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ అటు నిర్మాతగానూ, ఇటు దర్శకుడిగానూ సినిమాలు చేస్తున్నాడు. చిరు తో ఆచార్య సినిమా తో పాటుగా కొత్త కథలను సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఆ కథలతో సినిమాలు చెయ్యడానికి కాదు.. ఓటిటి వాళ్ళకి కొరటాల వెబ్ సీరీస్ చెయ్యడానికి. అదిగో అందుకే శ్రీనివాస్ ఆత్రేయ అదేనండి నవీన్ పోలిశెట్టి తో కొరటాల వెబ్ సీరీస్ ప్లాన్ చేసాడు. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ తో డీల్ మాట్లాడిన కొరటాల శివ.. నవీన్ పోలిశెట్టితో వెబ్ సీరీస్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ వెబ్ సీరీస్ కి కొరటాల శివ శిష్యుడు దర్శకత్వం వహిస్తాడని.. కొరటాల కేవలం కథ, ఇటు నిర్మాతగానూ కొనసాగుతాడు.. అయితే వెబ్ సీరీస్ డైరెక్షన్ కూడా కొరటాల శివ కనుసన్నల్లోనే జరగబోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో అదరగొట్టిన నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమాని పూర్తి చేసాడు. ఇక కొరటాల నవీన్ అయితే తన వెబ్ సీరీస్ కి పర్ఫెక్ట్ అని నవీన్ పోలిశెట్టితో మాట్లాడి ఓకే చేసాడని అంటున్నారు. నవీన్ కూడా కొరటాల కథకి ఇంప్రెస్స్ అయ్యి ఈ వెబ్ సీరీస్ కి ఒప్పేసుకున్నాడనే టాక్ నడుస్తుంది.
https://www.telugupost.com/crime/fire-accident-in-hyderabads-gandhi-nagar-1450884
హైదరాబాద్ లోని గాంధీనగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జబ్బార్ కాంప్లెక్స్ పక్కనున్న అసెంబుల్ వాటర్ ఫిల్టర్ దుకాణంలో గత అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని.. రెండుగంటల పాటు శ్రమించిన మంటలను ఆర్పివేశారు. కాగా.. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/vikram-movies-89926/
తన కెరీర్ స్టార్టింగ్ లో తెలుగులో సక్సెస్ రాకపోవడంతో తమిళనాట వెళ్లి అక్కడ వైవిధ్యభరిత చిత్రాలు చేసి స్టార్‌ అయ్యాడు విక్రమ్. 'శివపుత్రుడు', 'అపరిచితుడు' వంటి చిత్రాలతో తన టాలెంట్ ని బయట పెట్టిన అది అతనికి ఏమి సక్సెస్ ఇవ్వలేకపోతుంది. ఏమైందో ఏమో 'అపరిచితుడు' తర్వాత ఇప్పటివరకు విక్రమ్ ఒక హిట్ సినిమా కూడా లేదు. 'అపరిచితుడు' వచ్చి పదమూడేళ్ళ అవుతున్న సరయిన హిట్‌ లేదు.శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఐ' కూడా విక్రమ్ కు సక్సెస్ ఇవ్వలేకపోయింది. మధ్యలో వచ్చిన 'నానా' తో పర్లేదు అనిపించుకున్నాడు తప్ప సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. రీసెంట్ గా వచ్చిన 'స్కెచ్‌' కూడా నిరాశకు గురిచేసింది. ఇక మొన్న శుక్రవారం రోజు విడుదలైన 'సామి స్క్వేర్‌' కూడా డిజాస్టర్ గా నిలవడంతో విక్రమ్ ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు. అంతేకాకుండా యాభై రెండేళ్ల వయసులో విక్రమ్‌ మునుపటి గ్లామర్‌ కూడా కోల్పోయాడు. ఈసినిమాలో కీర్తి సురేష్ పక్కన చాలా పెద్దవాడిలా అనిపించాడు. వయసు మళ్లిన వాడిలా కనిపించాడు. మరి ఎందుకని విక్రమ్ ఇన్ని ఏళ్ళు అవుతున్న సరైన సక్సెస్ ని అందుకోలేక పోతున్నాడో అర్ధం కావట్లేదు. మరోపక్క విక్రమ్ కొడుకు ధ్రువ సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. మరి గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో చేస్తోన్న 'ధృవ నచ్చిత్రమ్‌' చిత్రంతో ఐన విక్రమ్ కు హిట్ వస్తుందేమో చూడాలి
https://www.telugupost.com/movie-news/ravi-teja-cut-his-remuneration-after-failures-150969/
వరస ప్లాప్స్ పలకరిస్తున్నా.. పారితోషకం మాత్రం తగ్గనని భీష్మించుకుని కూర్చుని.. వరస అవకాశాలు కోల్పోతున్న రవితేజ ఎట్టకేలకు లైన్ లో కొచ్చినట్టే అనిపిస్తుంది. ఇంతకుముందు పైసా కూడా తగ్గనని నిర్మాతల కు మొహమాటం లేకుండా చెప్పే రవితేజ ఇప్పుడు నిర్మాతలు ఎలా చెబితే అలా అంటూ తల ఊపుతున్నాడట. ఎందుకంటే వరసగా నాలుగు డిజాస్టర్స్ పడే సరికి తలకెక్కిన దెయ్యం దిగింది ఈ హీరోగారికి. లేదంటే ఒక్క పైసా తక్కువైనా సినిమా చెయ్యనని చెప్పేవాడు. ఇప్పడు రవితేజ తో సినిమా అంటే దర్శకనిర్మాతలెవరు ఆసక్తి చూపడం లేదు. అందుకే రవితేజ తన పద్దతిని మార్చుకున్నాడు. భారీ పారితోషకం అంటే కెరీర్ ముగించేయ్యాలని భయపడిన రవితేజ ఇప్పుడొక నిర్ణయానికి వచ్చాడట. అది పారితోషకం లేకుండా లాభాల్లో వాటా తీసుకోవాలని రవితేజ నిర్ణయించుకోవడమే కాదు… ఇప్పటికే రవితేజ మేనేజర్ నిర్మాతలకు ఈ కబురు చేరవేస్తున్నాడట. దానితో దర్శకుల్తో పాటు వచ్చి నిర్మాతలు రవితేజ ని కలుస్తున్నారట. ఎలాగూ రవితేజ ఓ మెట్టు దిగి సినిమా లాభాల్లో వాటాకు సిద్దమయ్యాడు కాబట్టి.. సినిమా ఖర్చు విషయంలోనూ రవితేజ కాస్త జాగ్రత్తగా ఉంటాడు. అందుకే నిర్మాతలు కూడా ధైర్యంగా రవితేజ తో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పాపం నిర్మాతలు వెనక్కి తగ్గేసరికి దర్శకులు కూడా రవితేజతో సినిమా అంటే సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. లేదంటే ఈపాటికి రవితేజ రెండు మూడు లైన్ లోపెట్టేవాడు
https://www.telugupost.com/movie-news/ఇలా-అయితే-వేషాలు-వస్తాయా-59007/
నిన్న బుధవారం నుండి హీరోయిన్స్ చాలామంది హాట్ హాట్ షో చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. నిన్నటికి నిన్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కోసం అన్ని విప్పేసి బికినీ వంటి చిన్న బట్టలతో కవర్ పేజ్ మీద రచ్చ చేసిన విషయం మరువక ముందే ఇప్పుడు జూలీ 2 తో బాలీవుడ్ లో బోల్తాపడిన లక్ష్మి రాయ్ బీచ్ ఒడ్డున బికినీతో రచ్చ మొదలెట్టింది. ప్రస్తుతానికి కోలీవడ్, బాలీవుడ్ , టాలీవుడ్ లలో ఎటువంటి అవకాశాలు లేక ఖాళీగా ఉన్న లక్ష్మి రాయ్ ఇలా వెకేషన్స్ అంటూ బీచ్ లో నానా హడావిడి చేస్తుంది.బాలీవుడ్ లో తాజాగా విడుదలైన జూలీ 2 సినిమా ఘోరమైన ప్లాప్ తర్వాత కూడా లక్ష్మి రాయ్ అందాల ఆరబోతకు అడ్డుకట్టవెయ్యలేదు. ఎప్పటికప్పుడు అందమైన, గ్లామరస్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అవకాశాల కోసం కాచుకుని కూర్చుంది. ఇప్పుడు తాజాగా లక్ష్మి రాయ్ సెక్సీ లుక్ తో బీచ్ లో బికినీ వేసుకుని పడుకుని రెచ్చగొడుతూ మతులుపోగొడుతుంది. ఇలా బికినీ షో చేస్తేనే సినిమా అవకాశాలు వస్తాయని చాలామంది హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు. అందులోనూ బాలీవుడ్ లోకి అడుగెట్టగానే అంద చందాలను మరి అలా గాలికొదిలేస్తున్నారు.జూలీ 2 లో ఎంతో గ్లామర్ గా బికినీ షో చేసిన లక్ష్మి రాయ్ కి ఆ సినిమా హిట్ అయితే దున్నేసేదే. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో అమ్మడు మళ్ళీ ఇలా సోషల్ మీడియా ని తగులుకుంది. సోషల్ మీడియాలో రకరకాల బికినీ ఫొటోస్ తోపాటు... హాట్ అందాల ఫోటో షూట్స్ ని పోస్ట్ చేస్తూ బిజీగా ఉన్న పాపకి కాస్త ఎవరైనా పిలిచి అవకాశం ఇవ్వండయ్యా. లేదంటే అవకాశాల కోసం ఇంకేం చూపిస్తోందో అంటూ తెగ సెటైర్స్ వేస్తున్నారు నెటిజెన్లు.
https://www.telugupost.com/movie-news/ravi-teja-krack-restarted-171423/
‘క్రాక్’ చిత్రంలో “స్టేష‌న్‌లో ఉన్న‌ప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి దొబ్బిచ్చుకో” అంటున్న ర‌వితేజ‌ మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్‌’. ఇదివ‌ర‌కు ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ‘డాన్ శీను’, ‘బ‌లుపు’ సినిమాలు ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి హిట్ట‌య్యాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్‌పై క‌న్నేశారు. ‘క్రాక్’ షూటింగ్ గ‌త వారం రామోజీ ఫిల్మ్ సిటీలో పునఃప్రారంభ‌మైంది. ర‌వితేజ, ఇత‌ర న‌టీన‌టుల‌పై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్త‌వుతుంది. సోమ‌వారం ‘క్రాక్’ షూటింగ్‌కు సంబంధించిన ఒక వ‌ర్కింగ్ వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఇందులో షూటింగ్ సెట్ మొత్తాన్ని ప్రాప‌ర్‌గా శానిటైజ్ చేయ‌డం, ఎంట్ర‌న్స్‌లో డిజిన్‌ఫెక్టెంట్ ట‌న్నెల్‌ను ఏర్పాటు చేయ‌డం మ‌నం చూడొచ్చు. ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని స‌హా సెట్‌లో ఉన్న ప్ర‌తి యూనిట్ మెంబ‌ర్ మాస్క్ ధ‌రించి క‌నిపిస్తున్నారు. కెమెరా ముందుకు వ‌చ్చి న‌టిస్తున్న‌ప్పుడు మాత్ర‌మే యాక్ట‌ర్లు మాస్క్‌లు తీసేస్తున్నారు. “స్టేష‌న్‌లో ఉన్న‌ప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి దొబ్బిచ్చుకో” అని తోటి పోలీస్‌తో ర‌వితేజ గ‌ట్టిగా చెబుతున్న లేటెస్ట్ డైలాగ్ సీన్ ఒక‌దాన్ని ఈ వీడియోలో మ‌నం చూడొచ్చు. ఆ డైలాగ్‌తో ర‌వితేజ క్యారెక్ట‌రైజేష‌న్ ఏ రీతిలో ఉంటుందో చిత్ర బృందం మ‌న‌కు హింట్ ఇస్తోంది. అలాగే త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ క‌థ‌లోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసే రీతిలో ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు, మాస్ ఎలిమెంట్స్‌తో క‌నిపించిన టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ రావ‌డ‌మే కాకుండా, ర‌వితేజ ఫ్యాన్స్‌ను, ప్రేక్ష‌కుల‌ను అవి అమితంగా ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు వ‌ర్కింగ్‌ వీడియోతో ఈ చిత్రంపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి.
https://www.telugupost.com/movie-news/samantha-akkineni-hot-photos-108591/
అక్కినేని సమంత ఎక్కడా తగ్గడం లేదు. గ్లామర్ షో విషయంలో వెనకడుగు వెయ్యడం లేదు. ఎంత గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నా.. ఒ ఇంటి కోడలయ్యాక కాస్త తగ్గితే బెటర్ అన్న నెటిజెన్లకు తన అందాలతోనే జవాబు చెప్పేస్తుంది. పెళ్లయ్యాక కూడా ఇసుమంత మార్పు కూడా సమంత లో కనిపించడం లేదు. పెళ్ళికి ముందు హాట్ హాట్ గా ఎలా గ్లామర్ షో చేసిందో.. పెళ్లయ్యాక కూడా అలానే చేస్తుంది. యు టర్న్ లో అందాల ఆరబోతతో రెచ్చిపోయిన సమంత.. తర్వాత భర్త నాగ చైతన్య తో కలిసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూనే హాట్ హాట్ ఫొటోస్ తో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. రంగస్థలంలో రామలక్ష్మిలా… అభిమన్యుడిలా సైక్రటిస్ట్ గా, మహానటి లో మధురవాణిగా డి గ్లామర్ షోతో మెప్పించిన సమంత తాజాగా భర్త చైతు తో కలిసి మజిలీ సినిమా చేస్తుంది. అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో బేబీ సినిమాలో 60 ఏళ్ళ వృద్ధిరాలిగా, 20 ఏళ్ళ పడుచుపిల్లగా నటించబోతుంది. అంతేకాకుండా తమిళ క్లాసిక్ 96 ని దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్ తో కలిసి తెలుగు రీమేక్ లోను ఒక కూల్ కేరెక్టర్ చేయబోతుంది. మరి నటనకు ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ పోతున్న సమంత హాట్ షోకి మాత్రం తెర పడడం లేదు. నిన్నగాక మొన్న బ్లాక్ ఫ్రొక్ తో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపిన సమంత.. తాజాగా క్లివేజ్ షో తో రెచ్చగొడుతుంది. వయ్యారంగా పక్కకి చూస్తూ కూర్చున్న సమంత హాట్ అందాలు చూసిన వారికీ చూపు మరల్చుకోవడం కష్టమే సుమీ.. మరి అక్కినేని కోడలు ఘాటు అందాలు మీరు చూసెయ్యండి.
https://www.telugupost.com/movie-news/tollywood-actress-didi-no-1-host-rachana-banerjee-to-contest-in-lok-sabha-2024-election-1524840
యాక్ట్రెస్ రచనా.. తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కన్యాదానం, బావ గారూ బాగున్నారా!, మావిడాకులు, పిల్ల నచ్చింది లాంటి పలు తెలుగు సినిమాల్లో నటించి బాగా దగ్గరైంది. దిగ్గజ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ రచనను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు. ఇక ఒరియాలో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. బెంగాలీ టీవీ షోలలో కూడా నటించి బెంగాల్ ప్రజలకు కూడా బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు రచనా ఎంపీగా పోటీ చేయబోతున్నారు.నటి రచనా బెనర్జీ రాజకీయ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. రాబోయే లోక్‌సభ 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. నటి హుగ్లీ నుంచి పోటీ చేయనున్నారు. మార్చి 10న, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ బ్రిగేడ్ గ్రౌండ్ మార్చ్ నుండి లోక్‌సభ 2024 ఎన్నికల కోసం పూర్తి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. నటి రచనా బెనర్జీ హుగ్లీ నుంచి పోటీ చేయనున్నారని తెలిపారు. అక్కడ ఆమె బెంగాలీ పరిశ్రమకు చెందిన మరో నటిపై పోటీ చేయనున్నారు. లాకెట్ ఛటర్జీ ఇదే నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున పోటీ చేస్తున్నారు.ఒక వారం క్రితం, CM మమతా బెనర్జీ.. రచన ప్రముఖ రియాలిటీ షో దీదీ నంబర్ 1 లో కనిపించారు. ప్రత్యేక ఎపిసోడ్ మార్చి 3 న ప్రసారం చేశారు. ఆ ఎపిసోడ్‌లో మమత ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తన కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించేందుకు రచన స్వయంగా మమత వద్దకు వెళ్లారు. అప్పటి నుంచి రచన రాజకీయాల్లోకి వస్తున్నారనే వదంతులు వ్యాపించడం మొదలయ్యాయి. తన రాజకీయ రంగ ప్రవేశంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని స్వయంగా సీఎం ప్రకటిస్తారని ఆమె మీడియాకు తెలిపారు. నబన్నాలో దీదీని కలిసిన కొన్ని రోజుల తర్వాత, హౌరాలోని తిలజలా స్టేడియంలో సీఎంతో కలిసి దీదీ నంబర్ 1 స్పెషల్ ఎపిసోడ్‌ని చిత్రీకరించారు.
https://www.telugupost.com/top-stories/tdp-is-very-short-of-parlament-members-criticisms-are-being-heard-that-chandrababu-is-not-focusing-in-that-direction-1466237
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు కీలకం. అసెంబ్లీ ఎన్నికలు ఎంత ముఖ్యమో అదే స్థాయిలో పార్లమెంటు ఎన్నికలు కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాలన్నా, తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలన్నా పార్లమెంటు సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాల్సి ఉంటుంది. లేకుంటే ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లెక్క చేయరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఏరకంగా చూసినా ఢిల్లీ మద్దతు అవసరం అన్నది అందరికీ తెలిసిందే. గతంలో బీజేపీని కాదనుకుని బయటకు వచ్చి తప్పు చేశామని ఇప్పటికే చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీకి ఆయన మద్దతిచ్చే విధంగా మాట్లాడటం కూడా ఇందులో భాగమే. నాలుగేళ్లుగా...అందుకే గతనాలుగేళ్లుగా బీజేపీని పన్నెత్తు మాట అనలేదు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికీ చంద్రబాబు పొత్తు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలో వస్తుందన్న లెక్కలు కూడా చంద్రబాబు వేసుకుని బీజేపీతో సయోధ్య కోసమే ఆయన గత నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కోరకుండానే బీజేపీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించుకోవాల్సిన దీన స్థితికి చేరుకోవాల్సి వచ్చింది. గతంలో ఢిల్లీకి వెళితే ఇతర పార్టీల నేతలు వచ్చి మరీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. కానీ ఇప్పుడా పరిస్థిితి లేదు. చంద్రబాబు ఎప్పుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న పరిస్థితి తెలియక విపక్ష నేతలు కూడా ఆయనకు దూరమయ్యారనే చెప్పాలి. ఢిల్లీలో చంద్రబాబు వైపు...బీజేపీ కాదు కదా.. పార్లమెంటు సభ్యులు లేకపోతే కాంగ్రెస్ వంటి విపక్షాలు కూడా చంద్రబాబును కేర్ చేయడం లేదు. అనేక ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. అయితే శాసనసభ స్థానాలపై పెట్టిన దృష్టి పార్లమెంటు స్థానాలపై చంద్రబాబు పెట్టడం లేదని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మూడు పార్లమెంటు స్థానాలు మాత్రమే దక్కాయి. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళంలో మాత్రమే టీడీపీ ఎంపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఢిల్లీ పర్యటనలు కూడా గత నాలుగేళ్ల నుంచి వేళ్ల మీద లెక్కపెట్టుకునే సంఖ్యలోనే చంద్రబాబు చేయాల్సి వచ్చింది. మరోసారి ఈ తప్పిదం జరగకూడదంటే పార్లమెంటు స్థానాల్లో గెలవడం కూడా ముఖ్యమే. కానీ టీడీపీకి పార్లమెంటు సభ్యుల కొరత బాగా ఉంది. అధికారంలో లేకపోవడంతో ఆర్థికంగా బలహీనపడిన నేతలు ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు. ఎవరు పోటీకి?కానీ ఆ దిశగా అధినేత చేసిన ప్రయత్నాలు కూడా శూన్యమనే చెప్పాల్సి ఉంటుంది. కోస్తా ప్రాంతంలోని రెండు మూడు నియోజకవర్గాల్లో తప్ప టీడీపీకి పార్లమెంటుకు పోటీ చేసే బలమైన అభ్యర్థులు లేరన్నది పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్న అంశం. ఇప్పటి వరకూ రాజంపేట ఎంపీ అభ్యర్థిగా గంటా నరహరిని మాత్రమే అధికారికంగా ప్రకటించారు. ఆయన పారిశ్రామికవేత్త కావడంతో వెంటనే నరహరిని అభ్యర్థిగా ప్రకటించేశారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వరకూ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన వారిలో అధికశాతం మంది నలుగురైదుగురు తప్ప ఎవరూ యాక్టివ్ గా కూడా లేరు. పొత్తులు కుదురుతాయని భావించ వచ్చు. అందుకే కొన్ని నియోజకవర్గాలకు మినహాయింపు ఇవ్వవచ్చు. గత ఎన్నికలలో ఎంపీలుగా పోటీ చేేసిన ఆదినారాయణరెడ్డి, బీద మస్తాన్ రావు, శిద్దారాఘవరావులు పార్టీలు వీడారు. మాగంటి రూప లాంటి వాళ్లు ఇన్ యాక్టివ్ అయ్యారు. మరి ఎన్నికల నాటికి టీడీపీకి అన్ని విధాలుగా బలమున్న నేతలు ఎవరైనా ముందుకు వస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతుంది.
https://www.telugupost.com/top-stories/థర్డీ-ఇయర్స్-ఇండస్ట్రీ-న-36144/
ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మికి భరణం కింద నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు తాజాగా ఆదేశించింది. పృధ్వీరాజ్ విజయవాడకు చెందిన శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు, కూతురు. అయితే సినిమాల్లో బిజీ అయిన పృధ్వీరాజ్ భార్యను బయటకు పంపించివేశారు. దీంతో పృధ్వీరాజ్ భార్య విజయవాడ కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు భరణం కింద నెలకు 8 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. సమన్లు పంపినా పృధ్వీరాజ్ కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ తీర్పు చెప్పింది. అయితే పృధ్వీరాజ్ ప్రస్తుతం సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నారు.ఎవరో నడిపిస్తున్నారు.....ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ తనయుడు సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, తన తల్లి, తండ్రి మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. కుటుంబ గొడవలు కోర్టు వరకు వెళ్తాయని అనుకోలేదని, తన తల్లి వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని సాయి శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. తనను, తన చెల్లెలని తన తండ్రి పృథ్వీరాజ్ బాగా చూసుకునేవారని చెప్పారు. కాగా, పృథ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మిని గత ఏడాది ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. రాజీకి యత్నించినా భర్త పట్టించుకోకపోవడంతో శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దీంతో,ఆమెకు ప్రతినెలా భరణం కింద రూ.8 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది...
https://www.telugupost.com/top-stories/telugu-bigg-boss-season-6-will-be-24-hours-live-on-ott-soon-says-nagarjuna-1345336
బిగ్ బాస్ సీజన్ -6. ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ కు దీనిపైనే ఆసక్తి ఎక్కువగా ఉంది. నెక్ట్స్ సీజన్ లో ఎవరెవరు కంటెస్టంట్లుగా వస్తున్నారు ? ఎలా ప్లాన్ చేస్తున్నారన్న విషయాలను తెలుసుకునేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే రోజున రెండు నెలల్లోనే సీజన్ 6 ను మొదలు పెట్టనున్నట్లు నిర్మాతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి ఎప్పుడు ఈ సీజన్ మొదలవుతుందా ? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 6 పై పలు కామెంట్స్ చేశారు.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో..ఆరుపదుల వయస్సులోనూ మన్మథుడిలా కనిపించే నాగార్జున.. ప్రెజర్ ఎంత ఎక్కువగా ఉంటే.. అంతబాగా పనిచేస్తానంటున్నారు. వరుస సినిమాలు, యాడ్స్, టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉంటున్నారు బంగార్రాజు. బిగ్ బాస్ సీజన్ 1 జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్ ను నాని హెస్ట్ చేశారు. ఇక మూడవ సీజన్ నుంచి వరుసగా నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాగ్ మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'బిగ్ బాస్' చెయ్యబోతున్నట్లు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.24 గంటలు బిగ్ బాస్ లైవ్..ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. బిగ్ బాస్ ను ఇంతలా ఆదరించిన లవర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. "తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్నీ చూశాను. చేతిలో రాసుకొని కంటెస్టంట్స్‌‌తో మాట్లాడేవాడిని. బిగ్ బాస్ షో తర్వాత చాలా మంది మెసేజెస్ పెట్టారు. 'బిగ్ బాస్' ఓటీటీలో చేద్దాం అన్నారు. ఇది చాలా డిఫరెంట్ ఫార్మేట్. ఇది నంబర్ వన్ షో.. అలాగే ఓటీటీలో 24 గంటల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా లైవ్‌లో ఈ షో చెయ్యబోతున్నాం" అని తెలిపారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 ఓటీటీలో 24 గంటలు లైవ్ లో చేస్తున్నట్లు నాగార్జున చెప్పేశారు. ఇక బంగార్రాజు సినిమా గురించి మాట్లాడుతూ.. బంగార్రాజు పండుగ లాంటి సినిమా అంటూనే.. సంక్రాంతి బరిలోకి సినిమా రానున్నట్లు హింట్ ఇచ్చేశారు.
https://www.telugupost.com/movie-news/పైసా-వసూల్-లో-ఛార్మి-సోయగ-42034/
బాలకృష్ణ - పూరి కాబోలో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం వచ్చే నెల 1 న విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా చిత్ర టీమ్ 'పైసా వసూల్' ఆడియో సక్సెస్ మీట్ ని భారీ లెవల్లో నిర్వహించింది. ఆడియో వేడుకని ఖమ్మంలో భారీగానే నిర్వహించారు. అలాగే 'పైసా వసూల్' పాటలు యూట్యూబ్ లో వీడియో ప్రోమోలతో సహా ఆకట్టుకున్నాయి. 'పైసా వసూల్' పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సందర్భాల్లో చిత్ర టీమ్ ఈ ఆడియో సక్సెస్ మీట్ ని గొప్పగా నిర్వహించింది. అయితే ఈ వేడుకలో బాలయ్య బాబు ఫుల్ జోష్ లో కనిపించాడు.సినిమాలో నటిస్తున్న శ్రియ, ముస్కాన్, కైరాలతోనే కాకూండా 'పైసా వసూల్' లైన్ ప్రొడ్యూసర్, పూరికి వ్యాపారవ్యవహారాలు చక్కబెడుతున్న ఛార్మి తో కూడా బాలకృష్ణ ఫుల్ జోష్ లో కబుర్లు చెబుతూ కనబడ్డాడు. వారితో సరదాగా అల్లరి చేస్తూ బాలయ్య ఎనర్జీతో రెచ్చిపోయాడు. కేవలం సినిమాలోనే కాక బయట ఈ ఈవెంట్ లో కూడా బాలయ్య జోష్ చూస్తుంటే సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోతూన్నాయి. అయితే ఈ ఈవెంట్ కి మోహన్ బాబు అతిధిగా పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఇకపోతే ఈ ఈవెంట్ కి హాజరైన అందరూ బాలయ్య, పూరీలా కాంబోని పొగుడుతూ ఆకాశానికెత్తేశారు.ఇక ఈ ఈవెంట్లో లో ఛార్మి హడావిడి అందరికన్నా ఎక్కువగానే కనబడింది..బాలకృష్ణ ని అందరు బాలయ్య బాబు అనో లేకుంటే బాలకృష్ణ అనో, బాలయ్య అనో, నందమూరి నటసింహం అనో పిలుస్తుంటారు. అయితే బాలకృష్ణకి బాలకృష్ణ గారు అనో బాలయ్య గారు అనో పిలిస్తే అస్సలు ఇష్టం ఉందట. అందరూ బాలా అనిపిలిస్తే ఆయనకి చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారట. అందుకే ఇక్కడ 'పైసా వసూల్' ఫంక్షన్ లో సదరు హీరోయిన్ ఛార్మి గారు బాలయ్య మనసెరిగి బాలా... బాలా అంటూ తెగ వయ్యారాలు పోతూ మాట్లాడేసింది. ఇక బాలకృష్ణ - శ్రియ శరణ్ లు కెమెరా ముందే గాక బయట కూడా నిజమైన భార్య భర్తల్లాగా కనబడ్డారని చెప్పుకొచ్చింది. అంత ముచ్చటగా వాళ్ళ పెయిర్ ఉందని... చెప్పుకొచ్చింది.అయితే ఛార్మి అలా బాలా అనిపిలుస్తుంటే అక్కడేఉన్న బాలకృష్ణ ఆనందం చూడాలి... పిచ్చ హ్యాపీగా కనబడ్డాడు. ఇక పక్కనే ఉన్న బాలయ్య అక్కడ వున్న ఛార్మిని దగ్గరకు తీసుకుని మరీ అభినందించడం అక్కడ ఆ వేదికపై హైలెట్ అయ్యింది. ఇక ఈ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
https://www.telugupost.com/movie-news/మరోసారి-వివాదం-అవుతున్న-29774/
బాలీవుడ్ సెక్సీ బ్యూటీ గా యావత్ దేశంలోని యువతకి చేరువ ఐన సన్నీ లియోన్ పై నిత్యం ఏవో ఒక ఆరోపణలు విలయతాండవం చేస్తూనే ఉంటాయి. కొన్ని ఆవిడ వ్యక్తిగత జీవితం పై ఆరోపణలు ఉంటుండగా మరి కొన్ని ఆవిడ వృత్తి పరమైన జీవితంపై చేసే ఆరోపణలు వుంటుంటాయి. ఇలాంటి వాటన్నిటికీ కెరీర్ తొలి నాళ్ళల్లో రెస్పాండ్ ఐన సన్నీ లియోన్ రాను రాను ఇదే అలవాటుగా మారిపోతుందని గ్రహించి అనుచిత వ్యాఖ్యలకి, ఆధారాలు లేని ఆరోపణలకు రియాక్ట్ కావటం మానేసింది. అయినా సన్నీ లియోన్ పై కానీ సన్నీ లియోన్ చేసే సినిమాలు, వాణిజ్య ప్రకటనలపై కానీ ప్రొటెస్ట్ చేసే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే వుంది.తాజాగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) మహిళా విభాగం వారు సన్నీ లియోన్ నటించిన ఒక కండోమ్ కంపెనీకి చెందిన వాణిజ్య ప్రకటనపై తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఆ వాణిజ్య ప్రకటన బుల్లి తెరపై ప్రసారం చేయటం మహిళలకి అవమానం కలిగించేలా ఉందని, కుటుంబ సమేతంగా టెలివిషన్ కార్యక్రామాలు వీక్షించే సమయంలో ఇలాంటి వాణిజ్య ప్రకటనలు ప్రాసరం అయితే పిల్లలకి ఎం సంకేతాలు వెళ్తాయో ఆలోచించమంటూ సదరు కంపెనీ కి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా విభాగం అధ్యక్షురాలు షీలా నోటీసు పంపారు. వారం రోజులలోపు సదరు కండోమ్ యాడ్ ప్రసారం నిలిపి వేయని పక్షంలో తమ ప్రొటెస్ట్ తీవ్ర రూపు దాలుస్తుందని హెచ్చరించారు. మరి నిర్ణీతగడువు లోపు కండోమ్ కంపెనీ వారు ఆ యాడ్ కి ప్రత్యామ్నాయం ఏమైనా చేసుకుంటారా లేక వారు కూడా చట్టపరంగానే సమాధానం ఇవ్వదలిచారో చూడాలి.
https://www.telugupost.com/movie-news/suma-kanakala-responds-on-their-divorce-rumors-1367644
హైదరాబాద్ : ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల చాలా సంవత్సరాల తర్వాత జయమ్మ పంచాయితీ అనే సినిమా తో వెండితెరపై కనిపించనుంది. మే 19న ఈ సినిమా విడుదల కానుండగా.. శనివారమే ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ తో విడాకులపై వస్తున్న రూమర్లపై స్పందించారు. పెళ్లై 23 ఏళ్లు అయిందని, ఈ 23 ఏళ్ల దాంపత్య జీవితంలో తాము చాలా సంతోషంగా ఉన్నామని సుమ కనకాల చెప్పింది.రూమర్లు వచ్చినప్పుడల్లా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేయడం ద్వారా ఆ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశానని సుమ పేర్కొంది. ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు సాధారణమేనని, ముఖ్యంగా ఫేమస్ అవుతూ.. స్టార్ డమ్ వస్తుందంటే ఇలాంటి గాసిప్ లు, పుకార్లు మరింత ఎక్కువవుతాయని సుమ చెప్పుకొచ్చింది. వీటి వల్ల మానసికంగా చాలా బాధ కలిగినా.. అందుకు అలవాటుపడి ఉన్నామని పేర్కొన్నారు.
https://www.telugupost.com/movie-news/ఆ-ముగ్గురు-ఓకే-మరి-నాలుగో-42699/
ఆగష్టు 11 యుద్ధం మరోసారి జరగబోతుంది. ఆగష్టు 11 న మూడు సినిమాలు లై, నేనేరాజు నేనే మంత్రి, జయ జానకి నాయక పోటీ పడ్డట్టే... ఇప్పుడు వచ్చే శుక్రవారం సెప్టెంబర్ 8 న కూడా మరో నాలుగు సినిమాలు యుద్దానికి సై అంటున్నాయి. నిన్నటిదాకా ఎవరుంటారో.. ఎవరు తప్పుకుంటారో అనుకున్నవారికి ముగ్గురు క్లారిటీ ఇచ్చినట్లేగాని... నాలుగోవాడే ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్సులోకి నెట్టేస్తున్నాడు. ఈ 8 న నాగ చైతన్య 'యుద్ధం శరణం'తో లావణ్య త్రిపాఠి తో కలిసి వస్తున్నాడు . ఆమేరకు 'యుద్ధం శరణం' పబ్లిసిటీని వేగవంతం చేసాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు గట్రా ఇస్తూ హడావిడి చేసేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హాట్ లుక్స్ తో కనబడనున్న ఈ మూవీలో శ్రీకాంత్ విలన్.ఇక రెండో వాడు అల్లరి నరేష్. నరేష్ కూడా 'మేడ మీద అబ్బాయి' అంటూ అల్లరితో కామెడీ చెయ్యడానికి సిద్దమైపోయాడు. అల్లరి నరేష్ కూడా తన సినిమా పబ్లిసిటీని షురూ చేసాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హడావిడి మొదలెట్టాడు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ తో జోడి కడుతున్న భామ నిఖిల విమల్. ఇకపోతే మూడోవాడు బాలీవుడ్ నటుడు సచిన్ జోషి కూడా 'వీడెవడు' తో తెలుగు హీరోల మీద యుద్దానికి సై అన్నాడు. నిన్నమొన్నటివరకు సైలెంట్ గా కూర్చుని ఉన్నట్టుండి 'బిగ్ బాస్' అనే తెలుగు రియాలిటీ షోలో తన సినిమా ప్రమోషన్ కి శ్రీకారం చుట్టేశాడు. ఈ ముగ్గురు పక్కాగా సెప్టెంబర్ 8 కే స్ట్రాంగ్ గా ఫిక్స్ అవడమూ... పబ్లిసిటీని పీక్ కి తీసుకెళ్ళడమూ బాగానే ఉన్నాయి.కానీ నాలుగోవాడు మంచు మనోజ్ మాత్రం తన 'ఒక్కడు మిగిలాడు' చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 8 నే విడుదల అన్నాడు. కానీ ఎటువంటి కన్ఫర్మెషన్ లేకుండా... ఇప్పటికి సినిమాకి సంబందించిన ప్రమోషన్ ని మొదలెట్టకుండా సైలెంట్ గా నే ఉంటున్నాడు. అసలు మనోజ్ రాక ఉన్నట్టా.. లేనట్లా అనేది క్లారిటీ రావడం లేదు. మరి మంచు మనోజ్ తప్పుకున్నాడో.. లేదో తెలియదు గాని ఈ ముగ్గురు హీరోలు నాగ చైతన్య, అల్ల్లరి నరేష్, సచిన్ జోషీలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా బలాబలాలు చూపించేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించేసారు
https://www.telugupost.com/movie-news/maharshi-release-late-because-mahesh-babu-116673/
ఏప్రిల్ 5న మహర్షి సినిమా విడుదల అంటూ గత ఏడాది మహర్షి సినిమా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ ఏడాది మొదట్లో మహర్షి సినిమా విడుదల ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 25కి వెళ్లిందని స్వయానా మహర్షి ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పాడు. కారణం మహర్షి సినిమా షూటింగ్ ని వంశీ నత్తనడక నడిపిస్తున్నాడని… అలాగే కొన్ని సీన్స్ ని రీషూట్స్ చేస్తున్నాడని.. అందుకే సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తుందని అన్నారు. ఇక మొన్నీమధ్యన మహర్షి సినిమాని మహానటి సెంటిమెంట్ తో మే 9న విడుదల చేస్తున్నట్టుగా దిల్ రాజు ప్రకటించాడు. యాడ్ ల కోసం షూటింగ్ కు బ్రేక్ కానీ ఇప్పటివరకు మహర్షి సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే షూటింగ్ వంశీ పైడిపల్లి వలన లేట్ కాలేదని.. మహెష్ వల్లనే లేట్ అయ్యిందని అంటున్నారు. ఎందుకంటే మహర్షి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మహేష్ కమర్షియల్ యాడ్ షూట్స్ కోసం వెలుతున్నాడని, అందుకే మహర్షి సినిమా షూటింగ్ ఇలా లేట్ అవుతూ రావడంతో విడుదల పోస్ట్ పోన్ అవడం జరిగిందని అంటున్నారు. మొన్నామధ్యన ఒక యాడ్ షూట్ కోసం సౌతాఫ్రికా వెళ్లిన మహేష్ తాజాగా మరో యాడ్ షూట్ కోసం మహర్షి షూటింగ్ కి బ్రేక్ ఇస్తున్నాడట.
https://www.telugupost.com/movie-news/mrunal-thakur-is-really-dating-with-bollywood-singer-badshah-1504328
Mrunal Thakur : బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ కూడా వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం నాని సరసన 'హాయ్ నాన్న', విజయ్ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్' సినిమాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, కొన్నిరోజులు నుంచి మృణాల్ పెళ్లి, ప్రేమ రూమర్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఒక అవార్డుల వేడుకల్లో అల్లు అరవింద్, మృణాల్‌తో తెలుగు కోడలిగా రమ్మని చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.మృణాల్ ఠాకూర్ నిజంగానే ఒక తెలుగు అబ్బాయిని పెళ్లాడబోతుంది అంటూ వార్తలు వైరల్ అవ్వడం, దాని గురించి మృణాల్ క్లారిటీ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మృణాల్ కి సంబంధించిన మరో రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రముఖ బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్‌షాతో మృణాల్ డేటింగ్ చేస్తుందా..? అని సందేహం వ్యక్తం చేస్తూ ఒక వీడియో వైరల్ చేస్తున్నారు.నవంబర్ 10న బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ఆమె ఇంట దివాళీ బ్యాష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ లోని పలువురు స్టార్స్ అటెండ్ అయ్యి సందడి చేశారు. ఈక్రమంలోనే మృణాల్ ఠాకూర్, బాద్‌షా కూడా హాజరయ్యారు. ఇక అక్కడ శిల్పా, బాద్‌షాతో కలిసి దిగిన ఒక ఫోటోని మృణాల్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. "ఇద్దరు ఫేవరెట్ వ్యక్తులు" అంటూ పేర్కొన్నారు. ఇక అదే పార్టీ నుంచి లీక్ అయిన ఒక వీడియోలో మృణాల్ అండ్ బాద్‌షా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కనిపించారు.ఇలా కనిపించడం పైనే అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మృణాల్, బాద్‌షాతో డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ సృష్టిస్తున్నారు. కాగా ఇవి కేవలం రూమర్సే అని అర్ధమవుతున్నాయి. ఎందుకంటే మృణాల్ గతంలో బాద్‌షాతో కలిసి ఒక ఆల్బమ్ సాంగ్ లో నటించారు. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇక ఆ వీడియోలో కూడా వారిద్దరూ ఏమీ కంప్లీట్ గా చేతులు పట్టుకొని నడవలేదు. మృణాల్ వెళ్లిపోయే సమయంలో గుడ్ బై చెప్పే క్రమంలో అలా చేతులు జోడించుకున్నారు. ఆ వీడియోని తీసుకోని నెట్టింట మృణాల్, బాద్‌షా డేటింగ్ అంటూ వార్తలు పుట్టించేస్తున్నారు నెటిజెన్స్.Mrunal Thakur and Badshah leaving after Diwali Bash💥🔥❤️ @mrunal0801 #MrunalThakur #Badshah #ScrollandPlay pic.twitter.com/94kWEF0OXv— Scroll & Play (@scrollandplay) November 12, 2023
https://www.telugupost.com/movie-news/అబ్బో-మెగా-ఫ్యాన్స్-కి-పి-21807/
ఎప్పుడెప్పుడు పవన్ 'కాటమరాయుడు' టీజర్ చూద్దామా.. అని ఎదురు చూస్తున్న మెగా ఫాన్స్ నిరీక్షణ ఫలించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' టీజర్ తో వచ్చేసాడు. 'కాటమరాయుడు' గురించి ఇప్పటిదాకా వినబడిన గాసిప్స్ అన్నిటికీ ఒకా టీజర్ తోనే చెక్ పెట్టేసాడు పవన్. ఉన్న అనుమానాలన్నీ ఒక్క టీజర్ తో ఎగిరిపోయాయి. ఇప్పటిదాకా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పుడు సైలెంట్ గా కుమ్మడానికి వచ్చేసాడు పవన్. డాలి డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న 'కాటమరాయుడు' లో అసలు పవన్ ఎలా ఉంటాడో అని అందరూ ఎదురు చూస్తున్న టైములో పంచె కట్టు తో ఫస్ట్ లుక్ వదిలి టీజర్ అతి త్వరలోనే అంటూ ఊరించిన చిత్ర యూనిట్ ఇప్పుడు పవన్ ని రాయుడు లుక్ లో ఫస్ట్ లుక్ టీజర్ లో చూపించి అరిపించేసారు.ఇక 'కాటమరాయుడు' టీజర్ 'రాయుడా... అంటూ సాంగ్ తో మొదలై పవన్ డాన్స్ తో పిచ్చేక్కిన్చేసి.... ఫైట్ సీన్ తో ఇరగదీసిన పవన్ ,ఎంతమందున్నరన్నది ముఖ్యం కాదు ఎవడున్నాడన్నదిముఖ్యం, అంటూ చెప్పే డైలాగ్ తో థియేటర్స్ బద్దలయిపోయేలా వుంది. అసలు పవన్ అలా పంచె కట్టుతో కూర్చునే సీన్ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగతా ప్రేక్షకుడు కూడా కుర్చీ లోనుండి లేచి ఈల వెయ్యడం గ్యారెంటీ అనిపించేలా ఉందా సీన్. ఇక పూర్తి యాక్షన్ తో నింపేశారు 'కాటమరాయుడు' టీజర్ మొత్తాన్ని. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అనూప్ రూబెన్స్ అరిపిన్చేసాడు. అదరహో అనిపించేలా మ్యూజిక్ అందించాడని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ టీజర్ లో హీరోయిన్ శృతి హాసన్ ని మాత్రం చూపించకుండా హైప్ క్రియేట్ చేశారు. ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం 'కాటమరాయుడు' టీజర్ తోనే పవన్ మాకు పండగ వాతావరణాన్ని తీసుకువచ్చాడని ఫీల్ అవుతున్నారు.
https://www.telugupost.com/crime/two-mothers-died-trying-to-save-their-children-who-fell-into-pit-in-nellore-1478751
గుంతలో పడిన ఇద్దరు పిల్లల్ని రక్షించబోయి వాళ్లిద్దరి తల్లులు మృతి చెందారు. ఈ విషాద ఘటన నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్నానది రివిట్ మెంట్ వాల్ నిర్మాణం కోసం ఇటీవల గుంతలు తవ్వాలు. బుధవారం సాయంత్రం ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ..ఆడుకుంటూ.. గుంతలు తవ్వినవైపుగా వెళ్లి.. ప్రమాద వశాత్తు వాటిలో పడిపోయారు. ఈ విషయం గమనించిన తల్లులు షాహీనా, షబీనా పిల్లల్ని కాపాడుకునేందుకు ఆ గుంతల్లో దూకారు. చిన్నారులను కాపాడిన అనంతరం ఇద్దరు తల్లులు పైకి రాలేక.. ఆ గుంతల్లోని బురదలో చిక్కుకుపోయి మరణించారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పైకి తీయించారు. వివరాలు నమోదు చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. కొంతకాలంగా రివిట్ మెంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే జేసీబీతో గుంతలు తవ్వి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ గుంతలు తవ్వి.. వాటి వద్ద ఎలాంటి హెచ్చరికలు, రక్షణ లేకపోవడం, నిర్మాణంలో జాప్యం కారణంగా ఇద్దరు తల్లులు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు వాపోయారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
https://www.telugupost.com/movie-news/mega-fans-still-waiting-for-ram-charan-first-look-in-rrr-148590/
రాజమౌళికి మెగా ఫ్యాన్స్ చుక్కలు చూపించడం ఏమిటి? చూపిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ కలిపి చూపించాలిగా అనుకుంటున్నారేమో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కూల్ గానే ఉన్నారు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి ని వదిలేలా కనిపించడం లేదు. కారణం సినిమా ఫస్ట్ లుక్ విషయం కాదు కానీ.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర తాలూకు లుక్ తో పాటు ఓ వీడియో కూడా లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఎన్టీఆర్ కొమరం భీం లుక్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ అంచనాకి వచ్చేసారు. కానీ అల్లూరి సీతారామరాజు చరణ్ లుక్ విషయం ఇంకా ఎటూ తెగలేదు. అందుకే రాజమౌళిని మెగా ఫ్యాన్స్ వేపుకు తింటున్నారట. రామ్ చరణ్ అల్లూరి లుక్ ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ కి ఉన్నట్టే చరణ్ కి కూడా హీరోయిజం సీన్స్ ఉంటాయా? అసలు బయట అల్లూరి మీసకట్టుతో తప్ప చరణ్ మామూలుగానే కనబడుతున్నాడు. సినిమా కోసం చరణ్ ఎలా మారుతున్నాడు? అందులోను చిరు కూడా ఈమధ్యనచరణ్ పాత్ర విషయంపై రాజమౌళి మీద అలిగాడనే న్యూస్ ఉంది. మరి ఇంత జరుగుతున్నా రాజమౌళి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ఉన్నాడు.. మాకు చరణ్ లుక్ కొద్దో గొప్పో లీక్ చేయొచ్చుగా అంటూ రాజమౌళి పై మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారట.
https://www.telugupost.com/movie-news/రెండోసారి-తాతయ్య-అయిన-బా-64297/
మొదటి కుమార్తె బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ పుట్టుకతో తాతయ్య హోదా సంపాదించుకొన్న నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు తన రెండవ కుమార్తె తేజస్వినికి కుమారుడు జన్మించడంతో మరోమారు తాతయ్య అయ్యారు. మార్చి 22వ తారీఖు తెల్లవారుఝామున తేజస్విని-శ్రీభరత్ లకు పండంటి మగ బిడ్డ పుట్టాడు. వారసుడి ఆగమనంతో నందమూరి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
https://www.telugupost.com/movie-news/trisha-social-media-160152/
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా నిమిషాల్లో అందరికి చేరిపోతుంది. మీడియాలో రాక ముందే సోషల్ మీడియాలో న్యూస్ లు కుప్పలు తెప్పలుగా ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. మంచి విషయాలు, చెడు విషయాలు ఏవైనా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అందులో వినకూడానవి కూడా ఉంటున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య అందరి మనసులను కలిచివేసింది. దేశ ప్రధాని మోడీ దగ్గరనుండి బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మల్లువుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అయన అభిమానులు అందరూ సుశాంత్ ఆత్మహత్యకు ఎమోషనల్ పోస్ట్ లు పెట్టారు. అయితే ఇలాంటి విషయాలను వినాల్సి వస్తుంది అని ఓ టాప్ హీరోయిన్ సోషల్ మీడియాకి కొన్నాళ్ళు దూరంగా ఉందామనుకుంటుందట. చిరు ఆచార్య నుండి అర్ధాంతరంగా తప్పుకుని న్యూస్ గా మారిన త్రిష ఇప్పుడు సోషల్ మీడియా నుండి తప్పుకుంటుందట. ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా నుండి తప్పుకోవడం చాలా అవసరమని చెబుతుంది. నేను చాలా హ్యాపీ గా ఉన్నాను అంటూనే.. ప్రస్తుతం నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది నాకు తెలియకపోవడమే మంచిది. అది అవరసరం కూడా. మైండ్ కి ఇది డిజిటల్ చికిత్స లాంటిది. కరోనా తో బయట తిరగకండి.. ఇంట్లోనే ఉండండి.. సేఫ్ గా ఉండండి లవ్ యు గైస్ అంటూ సోషల్ మీడియాకి దూరమవుతున్నట్టుగా త్రిష ట్వీట్ చేసింది. మరి త్రిష కి బయట జరుగుతున్న పరిణామాలు చూసి ఎంత వేదన పడితే కానీ ఇలా సోషల్ మీడియాకి దూరమైందో అంటూ ఆమె అభిమానులు ఫీలవుతున్నారు.
https://www.telugupost.com/crime/gang-assault-on-minor-in-gujarat-minor-died-accused-abscond-1458112
దేశమంతా సంక్రాంతి పండుగ సంబరాల్లో బిజీగా ఉన్న వేళ.. గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. 8 సంవత్సరాల బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి.. కామాంధులు తమ పైశాచికాన్ని ప్రదర్శించారు. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ రాష్ట్రంలోని బొటాడ్ లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం (జనవరి 15) సాయంత్రం 4.30 గంటల సమయంలో గాలిపటం తెచ్చుకునేందుకు బయటికెళ్లింది బాలిక. ఎంతసేపటికి కూతురు ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు కంగారుగా చుట్టుపక్కల వెతికారు.తెలిసిన వారిళ్లల్లో ఆరా తీశారు. ఎక్కడా ఎవరికీ కనిపించకపోవడంతో.. చివరికి స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. బాలిక ఆచూకీ కోసం విస్తృతంగా గాలించారు. ఒక నిర్మానుష్య ప్రదేశంలో అర్థనగ్నంగా ఉన్న బాలిక శవాన్ని గుర్తించారు. కామాంధులు బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి.. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల్ని తక్షణం అరెస్టు చేసి శిక్షించాలంటూ.. బాలిక కుటుంబ సభ్యులతో పాటు.. స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఒకచోట చేరి.. ఆందోళన చేశారు.
https://www.telugupost.com/movie-news/rakul-in-jayalalitha-role-82978/
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మెల్లిగా ఫామ్ లోకొస్తుంది. గత ఏడాది నుండి బాగా అవకాశాలు తగ్గిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు మెల్లిగా అవకాశాలు వస్తున్నాయి. స్పైడర్ సినిమా దెబ్బకి కోలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు రావేమో అనుకున్నారు. కానీ సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకే సినిమా రకుల్ కి సెకండ్ హీరోయిన్ పాత్ర దొరికింది. అయితే మొదటి హీరోయిన్ గా సాయి పల్లవి కి ఛాన్స్ రాగా పెద్దగా క్రేజ్ లేని రకుల్ ప్రీత్ కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఇకపోతే ఎన్జీకే లో సాయి పల్లవి సూర్య భార్య‌ పాత్రలో నటిస్తుంది.ఎంజీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా...ప్రస్తుతం బయోపిక్స్ సీజన్స్ నడుస్తున్న ఈ టైం లో టాలీవుడ్, కోలీవుడ్స్ లో బయోపిక్స్ పిచ్చి పీక్స్ కి చేరింది. మహానటి సినిమా హిట్ తో అది మరింత ముదిరింది. టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయో పిక్, వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమాలు పోటాపోటీగా తెరకెక్కుతుండగా.. తమిళనాట ఎంజీఆర్, జయలలిత బయోపిక్స్ కూడా అతి త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే సూర్య - సెల్వ రాఘవన్ కాంబోలో వస్తున్న ఎన్జీకే సినిమా నటుడు, పొలిటీషియన్ అయినా ఎంజీఆర్ జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నారనే టాక్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.ఎంత దాచిపెట్టాల‌ని చూసినా...అయితే ఈ సినిమాలో సూర్య భార్య రోల్ లో సాయి పల్లవి నటిస్తుండగా... మరో ముఖ్యమైన అంటే తమిళనాడులో ఎంజీఆర్ జీవితంలో ఎంతో కీలకమైన మాజీ సీఎం జయలలిత పాత్రని రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఇంతవరకు రకుల్ ప్రీత్ సింగ్ జయలలిత పాత్ర పోషిస్తున్నట్టుగా బయటికి పొక్కకుండా చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుందట. ఎందుకంటే జయలలిత పాత్ర ఒక సినిమాలో కనబడుతుంది అంటే.. ఎక్కడ లేని సమస్యలు వస్తాయని భావించి రకుల్ జయలలిత పాత్రని బయటకి రానివ్వకుండా జాగ్రత్త పడితే ఇప్పుడేమో అదే సెన్సేషన్ అయ్యి కూర్చుంది. అయితే రకుల్ నిజంగానే ఎన్జీకేలో జయలలితగా కనబడనుందా..? అంటే ఇంకా స్పష్టమైన సమాచారం అయితే లేదు.
https://www.telugupost.com/movie-news/only-rajamouli-rrr-can-beat-bahubhali-collections-131914/
బాహుబలి ని తలదన్నే సినిమాని కేవలం బాహుబలి దర్శకుడు రాజమౌళి వల్లే అవుతుందా?ఎందుకంటే బాహుబలి ని తన్నాలని కలలు కన్నా చాలామంది చివరికి సౌండ్ లేకుండా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి. బాహుబలి ని టార్గెట్ చేసిన రోబో 2.0 కి చుక్కలు కనబడ్డాయి. ఇక బాహుబలి ని కొట్టాలనే కసితో సల్మాన్ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద తుస్ మన్నాయి. మరి తాజాగా ప్రభాస్ సాహో కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నా… టాక్ పరంగా చాలా వీక్ గా వుంది. మరి బాహుబలి రేంజ్ మూవీ ని మళ్లీ మనం రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న #RRR తోనే చూడగలమా అనే అనుమానమైతే అందరిలో ఉంది. మరి అక్టోబర్ 2 న విడుదల కాబోతున్న సై రా నరసింహారెడ్డి మీద కూడా ఇప్పుడు సాహో చూసాక… నమ్మకం పోయినట్లే కనబడుతుంది. ఎందుకంటే సురేందర్ రెడ్డి ఇప్పటివరకు టాలీవుడ్ హీరోలతో చిన్న కథలతో మిడియం బడ్జెట్ సినిమాలు చేసిన దర్శకుడు. మరి ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా ఐదు భాషల్లో సినిమాని హ్యాండిల్ చెయ్యాలంటే కూసింత కష్టమే. అందుకే సై రా మీద హోప్స్ పెట్టుకున్నోళ్ళు.. సాహో చూసాక టెన్షన్ పడుతున్నారు. మరి బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ ని రాజమౌళి తన #RRR తోనే కొడతాడని ప్రచారం ఊపందుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఖచ్చితంగా రాజమౌళి బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు.. బాహుబలి రికార్డులని తన #RRR తో ఖచ్చితంగా బద్దలు కొడతాడని అంటున్నారు.
https://www.telugupost.com/crime/rachakonda-police-destroy-five-crore-worth-narcotics-1543265
గత ఏడాది కాలంలో 23 పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఐదు కోట్ల రూపాయలకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను రాచకొండ పోలీసులు ధ్వంసం చేశారు. నిషేధిత పదార్థాలను యాదాద్రి భోంగీర్‌ జిల్లా కేంద్రంలో ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. డ్రగ్స్‌లో గంజాయి, ఓపియం గసగసాల స్ట్రా, ఎక్స్‌టసీ మాత్రలు, హషీష్ ఆయిల్ ఉన్నాయి. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని సాధించేందుకు నిరంతర అప్రమత్తత, సంఘటిత ప్రయత్నాల ఆవశ్యకత ఉందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.ఐదు కోట్లకు పైగా విలువైన 3891 కిలోల 813 గ్రాముల మాదకద్రవ్యాలను రాచకొండ పోలీసులు ధ్వంసం చేశారు. రాచకొండ పరిధిలో 23 పోలీస్ స్టేషన్లలో 106 కేసులు నమోదయ్యాయి. రాచకొండ సిపి తరుణ్ జోషి ఆధ్వర్యంలో భువన గిరి జిల్లాలోనితుక్కా పూర్ గ్రామంలోని కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ వద్ద మొత్తం ధ్వంసం చేశారు. డ్రగ్స్ ,గంజాయి వంటి వాటికి బానిసలైన వారిపై కేసులు నమోదు చేస్తామని రాచకొండ పోలీసులు హెచ్చరించారు.
https://www.telugupost.com/movie-news/mahesh-new-look-4-80065/
'పోకిరి', 'అతిధి' సినిమాల్లో తప్ప తను నటించిన ఏ సినిమాలోనూ మహేష్ తన లుక్ ని మార్చలేదు. అయితే రీసెంట్ గా స్టార్ట్ అయిన వంశీ పైడిపల్లి సినిమాలో మహేష్ లుక్ మార్చాడు. తన కెరీర్లో తొలిసారిగా కొంచెం ఎక్కువ గడ్డం, జుట్టు పెంచి.. రఫ్ లుక్‌లోకి మారాడు. ఈ లుక్ తోనే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఆల్రెడీ ఆ లుక్ కు సంబంధించి పిక్స్ కూడా బయటకి వచ్చి వైరల్ అయ్యాయి.మళ్లీ పాత లుక్ లోకి...దాదాపు నెల పాటు ఉత్తరాఖండ్‌లో జరిగిన షెడ్యూల్ లో మహేష్ ఆ లుక్ లోనే యాక్ట్ చేశాడు. షూటింగ్ మధ్యలో ఓ ప్రకటనలో కూడా అదే లుక్ తో నటించాడు. అయితే ఆ షెడ్యూల్ పూర్తి అవ్వడంతో అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ లుక్ తోనే మహేష్ సినిమా మొత్తం ఉంటాడు అనుకుంటే అందరికీ షాక్ ఇచ్చాడు. సడన్ గా గడ్డంని బాగా ట్రిమ్ చేసి కనిపించాడు.ఒక షెడ్యూల్ వరకే ఆ లుక్ఆదివారం చెన్నై సిల్క్స్ వాళ్ల కొత్త షోరూం ఓపెనింగ్‌కి వచ్చిన మహేష్ ను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఎందుకు అలాగా గడ్డం ట్రిమ్ చేసి కనిపించాడో అన్నది అర్థం కాలేదు. బహుశా సినిమాలో ఒక ఎపిసోడ్ వరకు మహేష్ గడ్డంతో కనిపిస్తాడేమో అనుకుంటున్నారు అంతా. ఇక త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది.. ఇందులో ఎవరు పొల్గొంటారో ఇంకా తెలియాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/ntr-trivikram-aravinda-movie-78235/
ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘అరవింద సమేత’ చిత్రం. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ టైటిల్ వెనుక బోలెడంత క్యూరియాసిటీ నడుస్తుంది. ఈ సినిమా టైటిల్ ను బట్టి ఈ సినిమా స్టోరీ ఏంటో అని ఆ లాజిక్ ను ఛేదించే పనిలో పడ్డారు ఫ్యాన్స్.అరవింద అనేది సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే పాత్ర పేరని, వీర రాఘవ అనేది ఎన్టీఆర్ పాత్ర పేరని అన్నారు. మరి కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి అరవింద అనేది ఎన్టీఆర్ సాఫ్ట్ క్యారెక్టర్ పేరని.. వీరరాఘవ అనేది రాయలసీమ ఉండే ఎన్టీఆర్ యొక్క మాస్ షేడ్ అని విశ్లేషణ ఇచ్చారు. అయితే టైటిల్ రహస్యం అది కూడ కాదని చిత్రం యూనిట్ క్లారిటీ ఇచ్చారు.దాంతో ఫ్యాన్స్ మరోసారి స్టోరీ ఏంటోనని ఆ లాజిక్ ను ఛేదించే పని మొదలుపెట్టారు. అయితే ఆ లాజిక్ ఏంటో తెలియాలంటే త్రివిక్రమ్ ఐన.. ఎన్టీఆర్ ఐన నోరు విప్పాలి. అయితే వాళ్లు ఇప్పట్లో నోరు విప్పరు ఎందుకంటే ఆలా చేస్తే సినిమాను స్పోయిల్ చేసినట్టు అవుతుంది. సో సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయక తప్పదు
https://www.telugupost.com/movie-news/jabardast-changes-158940/
కరోనా లాక్ డౌన్ తో సినిమా పరిశ్రమ అంతా అతలాకుతలం అయ్యింది. సినిమానే కాదు.. బుల్లితెర పరిస్థితి అంతే ఉంది. ఈటివి లో క్రేజీ గా బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతున్న జబర్దస్త్ పరిస్థితి అంతే అగమ్య గోచరంగా మరింది, తాజాగా కమెడియన్స్ పారితోషికాలనుండి.. జడ్జి పారితోషికాలు, టెక్నీకల్ డిపార్ట్మెంట్ వరకు అందరి జీతాల్లో కోతలు తప్పవని ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు జబర్దస్త్ తో పాపులర్ అవడమే కాదు.. చేతినిండా సంపాదించిన వారు ఇప్పుడు అరకొర పారితోషికాలతో సరిపెట్టుకోవాల్సిందే. జడ్జి రోజా కి కూడా కోత తప్పదని ప్రచారం జరగడమే కాదు.. ఇప్పుడు జబర్దస్ కి ఇద్దరు జడ్జి లు ఉండరని అంటున్నారు. గతంలో రోజా, నాగబాబు జబర్దస్త్ ని జబర్దస్త్ గా లీడ్ చేసారు. కానీ ఏడేళ్లు గడిచాక నాగబాబు జబర్దస్త్ కి హ్యాండ్ ఇవ్వగా రోజాకి జతగా వారానికో సెలెబ్రెటీ జడ్జి గా రెండో స్థానంలో కూర్చుంటున్నారు. అయితే తాజాగా జబర్దస్ రెండో జడ్జి ఇక ఉండరని తెలుస్తుంది. కారణం ఆర్ధిక పరిస్థితులు అంటున్నారు. ఇప్పటికే జబర్దస్త్ లో ఖర్చులు తగ్గించుకునే పనులు మొదలయ్యాయయని..అందులో భాగంగానే యాంకర్స్ ని మార్చడం, జడ్జి లు కాకుండా రోజా ఒక్కదాన్నే కంటిన్యూ చెయ్యడం ఇలా చాలా విషయాల్లో జబర్దస్త్ కొత్త అవతారమెత్తబోతుందట.
https://www.telugupost.com/movie-news/కృష్ణవంశీతో-ఆయన-కాంబినేష-9845/
అంతఃపురం, సముద్రం, ఖడ్గం, చక్రం, గోవిందుడు అందరి వాడేలే ఈ చిత్రాల పేర్లు వినగానే గుర్తొచ్చే రెండు పేర్లు కృష్ణ వంశి, ప్రకాష్ రాజ్. ఒకరు ఏ నటుల నుంచి ఐన పూర్తి స్థాయి ప్రతిభను బైటకి తీసి ప్రదర్షింపచేసే దర్శకుడు కాగా, మరొకరు పాత్ర కు, దర్శకుడి అభిరుచి కి బానిసగా మారిపోయి పోషించిన పాత్రకు జీవం పొయ్యగల నటుడు. ఆలా ఈ ఇద్దరి కలయికలో మళ్లీ అంతటి ప్రభావం చూపగలిగే స్థాయి కనిపిస్తున్న చిత్రం నక్షత్రం. నక్షత్రం చిత్రంలోని ప్రకాష్ రాజ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.సందీప్ కిషన్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, కంచె ఫేమ్ ప్రగ్య జైస్వాల్ లు పోలీస్ ఆఫీసర్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా ఖాకీ దుస్తులలోనే కనిపిస్తున్నాడు ఫస్ట్ లుక్ లో. అందరూ తారలు కనిపించబోయే ఈ నక్షత్రం కోసం కృష్ణ వంశి తీవ్రంగానే శ్రమిస్తున్నాడు. ఇటీవలి కాలంలో తన ముద్ర చాటుకునే సినిమా ఆయన నుంచి ప్రేక్షకులకు అందకపోవటంతో, ఈ చిత్రం పై తన దృష్టిని, కష్టాన్ని కేంద్రీకరించాడు. ప్రకాష్ రాజ్ కూడా విజయ దశమి కి మన ఊరి రామాయణం అనే గొప్ప చిత్రం తో ప్రేక్షకులని పలకరించే ప్రయత్నం చేసినా మన వాళ్ళు పట్టించుకోలేదు. అందుకే ఆయనకు కూడా నక్షత్రం చిత్రం కీలకం కానుంది.నక్షత్రం చిత్రంలో అందరి పాత్రలు కీలకం కావటంతో పది ఫస్ట్ లుక్ లను ప్లాన్ చేసి ఒక్కొక నటులది ఒక్కో లుక్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.
https://www.telugupost.com/andhra-pradesh/ycp-rajya-sabha-member-vijayasai-reddy-is-trying-for-the-post-of-governorlobbying-is-being-done-in-delhi-1549297
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గవర్నర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో పెద్దయెత్తున లాబీయింగ్ చేస్తున్నారు. తనకున్న పరిచయాలతో ఢిల్లీ పెద్దలను కలసి తనను గవర్నర్ గా పంపించాలని కోరుతున్నారు. విజయసాయి రెడ్డి ఇటీవల ఒంటరిగా వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం వెనక ఇదే కారణమని అంటున్నారు. అమిత్ షాను మాత్రమే కాకుండా బీజేపీ పెద్దలను కూడా కలసి తన మనసులో మాటను చెబుతున్నట్లుగా పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. విజయసాయిరెడ్డికి ఇంకా రాజ్యసభ పదవీ కాలం ఉండగానే ఆయనకు ఎందుకు గవర్నర్ పదవి అంటూ వైసీపీ నేతల్లోనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అత్యంత సన్నిహితుడిగా...విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అందుకే ఆయనను రెండుసార్లు రాజ్యసభ పదవికి జగన్ ఎంపిక చేశారు. దీంతో పాటు మొన్నటి ఎన్నికల్లో జగన్ సాయిరెడ్డికి నెల్లూరు పార్లమెంటు టిక్కెట్ ను ఇచ్చారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడి వెళ్లడంతో మరో బలమైన నేత లేకపోవడంతో విజయసాయి రెడ్డికి ఇచ్చారని ఆయన ప్రత్యర్థులు అంటున్నప్పటికీ అందులో నిజం మాత్రం లేదన్నది తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వర్గాలు చెబుతున్న మాట. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచి విజయసాయి రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఒక దశలో పార్టీలో నెంబరు 2గా ఆయన పేరు వినిపించేది.బాధ్యతలను అప్పగించినా...వైఎస్ జగన్ తొలుత ఉత్తరాంధ్ర బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత సోషల్ మీడియా బాధ్యతలను కూడా విజయసాయిరెడ్డికి ఎన్నికలకు ముందు అప్పగించారు. ఇంత ప్రయారిటీ ఇచ్చిన విజయసాయిరెడ్డి ఎన్నికల తర్వాత జగన్ కు దూరం అయినట్లు తెలిసింది. విజయసాయిరెడ్డి జగన్ ను కూడా కలవడం లేదు. అసలు విజయవాడ వచ్చేందుకు కూడా ఆయన ఇష్టపడటంలేదు. ఢిల్లీ, హైదరాబాద్‌లలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ కు కూడా టచ్ లోకి వచ్చేందుకు ఇష్టపడటం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విజయసాయిరెడ్డి పార్టీ అధినేతకు దూరమవ్వడానికి కారణాలు మాత్రం తెలియరావడం లేదు.అదే కారణమా?వైఎస్ జగన్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ చూసుకునే సాయిరెడ్డిలో ఒక్కసారి ఈ మార్పేమిటి? అన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతుంది. అయితే తనకు ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా అధికారంలో ఉన్ననాళ్లు తనకు ప్రయారిటీ ఇవ్వకపోవడాన్ని కూడా ఆయన మనసులో పెట్టుకున్నారని అంటున్నారు. దీంతోపాటు తనపై ఒక విషయంలో ఒక వర్గం మీడియా ప్రచారం చేసినా దానిని వైసీపీ నేతలు ఎవరూ ఖండించకపోవడాన్ని కూడా ఆయన తప్పుపడుతున్నట్లు తెలిసింది. అందుకే ఆయన వైసీపీ అధినేతకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. దీంతో పాటు పార్టీ ఓటమి పాలు కావడంతో తాను రాజకీయాలను వదిలేసి గవర్నర్ పోస్టుకు వెళితే కొంత ఉపశమనంగా ఉంటుందని విజయసాయి రెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే సాయిరెడ్డి ప్రయత్నాలు సరిపోతాయా? బీజేపీ పెద్దలు అందుకు అంగీకరిస్తారా? అన్నది మాత్రం తేలాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/స్పైడర్-నిర్మాతకు-చరణ్-స-48080/
మహేష్ బాబు - మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన 'స్పైడర్' సినిమా దసరా సంధర్బంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇండియా లోనే అతి పెద్ద డిజాస్టర్ సినిమాగా 'స్పైడర్' రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాని ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ మాత్రం ఈ సినిమా వల్ల చాలా నష్టపోయాడట. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు కూడబెట్టుకున్నది మొత్తం ఒక్క సినిమాతో పోయింది అనే ప్రచారం మాత్రం స్టార్ట్ అయ్యింది. మరి కోలుకోలేకుండా నష్టపోయిన ఈ నిర్మాతని ఆదుకోడానికి ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకి వచ్చాడు అని చేనుతున్నారు.మెగా కుటుంబానికి ఎంతో దగ్గర అయిన ఎన్.వి.ప్రసాద్.... రామ్ చరణ్ తో ఇదివరకే 'రచ్చ, ధృవ' సినిమాలకు కో ప్రొడ్యూసర్ పని చేసాడు. మరి రామ్ చరణ్ కెరీర్ లో 'రచ్చ' యావరేజ్ అయినప్పటికీ... 'ధ్రువ' సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టే. ఆ సినిమాలు చేశారనే కృతజ్ఞతా భావంతో ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నఎన్.వి.ప్రసాద్ కి రామ్ చరణ్ డేట్లు ఇచ్చాడట. దాంతో అటు 'స్పైడర్' నష్టాలను పూడ్చమని గొడవ చేస్తున్న పంపిణీదారులకు ఇప్పుడు చరణ్ తో చేసే సినిమాను తక్కువ రేట్లకే ఇస్తానని ఎన్.వి. ప్రసాద్ చెప్పడంతో వారు కూడా కాస్త శాంతించినట్లుగా తెలుస్తోంది.మరి ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' సినిమాలో నటిస్తున్నాడు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక ఎన్.వి.ప్రసాద్ తో సినిమా చేస్తాడట చరణ్. మొత్తానికి మహేష్ బాబు వల్ల నష్టపోయిన వాళ్లకి రామ్ చరణ్ అండగా నిలిచాడు అని చెప్పొచ్చు.
https://www.telugupost.com/movie-news/ఖైదీ-నెం-150-వేడుకలకి-చెర్రీ-28771/
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధ్రువ సక్సెస్ అనంతరం నాలుగు నెలల విరామం తీసుకుని తాజాగా తూర్పు గోదావరి జిల్లా లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ లో పాల్గొంటూ బిజీ అయిపోయాడు. ఇంత కాలం రామ్ చరణ్ తేజ్ తదుపరి చిత్రం ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చుసిన మెగా అభిమానులకి ఇంతకాలానికి సమాధానం అయితే దొరికింది కానీ ఇప్పుడు అభిమానుల తరపు నుంచి చరణ్ కి కొత్త ఒత్తిడి ఎదురవుతోంది. అది కూడా తాను నిర్మించిన తొలి చిత్రం, మెగా స్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక 150 వ చిత్రం ఖైదీ నెం.150 విజయోత్సవ వేడుకల విషయమై మెగా అభిమానులు చరణ్ ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.ఖైదీ నెం.150 సంక్రాంతి పండుగకి విడుదలై నాలుగు వారాలు దిగ్విజయంగా ప్రదర్షింపబడిన అనంతరం విజయోత్సవ సభ భారీగా చెయ్యాలని అనుకుంటుండగా, మెగా స్టార్ చిరంజీవి సినిమా పరిశ్రమ పెద్ద దర్శక రత్న దాసరి నారాయణ రావు ని ఆసుపత్రిలో పరామర్శించి మీడియా తో మాట్లాడుతూ, దాసరి ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చి ఆశీర్వదించారని గుర్తు చేసి, ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి విజయోత్సవ సభ కూడా దాసరి ముఖ్య అతిధిగానే జరుపుతాం అని చెప్పారు. ఇప్పుడు దాసరి ఆరోగ్యం స్థిమితంగా ఉండటం, పైగా ఖైదీ నెం.150 ఇరు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 30 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంటుండటంతో ఖైదీ నెం.150 చిత్రానికి 100 రోజుల వేడుక ఘనంగా నిర్వహించాలంటూ నిర్మాత రామ్ చరణ్ తేజ్ ని మెగా అభిమానులు కోరుతున్నారు.
https://www.telugupost.com/movie-news/huge-deal-for-pushpa-194110/
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ పై అన్ని భాషల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, కన్నడ, మలయాళంలో సూపర్ ఫామ్ ఉన్న అల్లు అర్జున్.. మొదటిసారి హిందీలోకి అడుగుపెడుతున్న అల్లు అర్జున్ పుష్పకి అక్కడ కూడా క్రేజ్ ఉంది. సుకుమార్ రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అవడం, అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీసుని ఈ హీరో – దర్శకుడు దున్నేయడానికి సిద్దమైపోతున్నారు. ఇ-ప్పటికే అన్ని భషాల్లో మంచి అంచనాలున్న పుష్ప కి ఇప్పుడు ఓవర్సీస్ నుండి భారీ డీల్ కుదిరినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ఇంతకుముందు సినిమాలు ఒక ఎత్తు.. ఇప్పడు ఈ పుష్ప ఒక ఎత్తు అన్న రేంజ్ లో ఓవర్సీస్ డీల్ ఫినిష్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ డీల్ ఎంతకి తెగింది.. అనేది ఇంకా లెక్కలు బయటికి రాకపోయినా అల్లు అర్జున్ పుష్ప కి భారీ రేటు వచ్చింది అనేది మాత్రం తెలుస్తుంది. మరి రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ గా నిలవబోతుంది అని అంటుంటే.. ఈసినిమాలో ఐటెం సాంగ్ వేరే లెవల్లో ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.
https://www.telugupost.com/movie-news/తెలుగు-ప్రేక్షకులకు-చేరు-5906/
నటన లో ప్రతిభ ఏ మాత్రం కనబరచగలదో దక్షిణ భారత సినిమా ప్రేక్షకులకు అవగాహన లేకపోయినా, అంధ చందాల విషయంలో మాత్రం పరిచయం అవసరం లేని పేరు సన్నీ లియోన్. అనేక హిందీ చిత్రాలలో నటిస్తూ ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడుపుతుంది సన్నీ. మన నిర్మాతలు సన్నీ ని తెలుగు చిత్రాలలో నటింపచేసే ప్రయత్నాలు చెయ్యక మానలేదు. కానీ పాత్ర కుదిరినప్పుడు పారితోషికం నచ్చక, అధిక పారితోషికాలు అందే దగ్గర పాత్ర నచ్చక, రెండు కుదిరితే కాల్ షీట్స్ సర్దుబాటు కాక ఇలా అనేక కారణాల వల్ల ఎంతో క్రేజ్ ఉన్న సన్నీ ఇప్పటి వరకు తెలుగులో కేవలం కరెంటు తీగ చిత్రంలో చాలా తక్కువ నిడివి ఉన్న ఒక అతిధి పాత్రలో స్కూల్ టీచర్ గా కనిపించి అలరించింది.ఇప్పుడు రాగిణి ఎం.ఎం.ఎస్, జిస్మ్ లాంటి చిత్రాలతో సన్నీ లియోన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరి అందాల తార పారితోషికం పెంచకుండా ఉంటుందా?? అవీ పెరిగాయ్. ఇక ఇప్పుడు సన్నీ ని మన చిన్న నిర్మాతలు కదపలేని పరిస్థితి ఏర్పడింది. కానీ గుంటూరు టాకీస్ చిత్ర నిర్మాత ఆ చిత్రానికి కొనసాగింపుగా గుంటూరు టాకీస్ 2 చిత్రం ప్రారంభించబోతున్నారు. సన్నీ లియోన్ అయితే చిత్ర మార్కెట్ విస్తృతంగా ఉండొచ్చు అనే అంచనాతో ధైర్యం చేసి సన్నీ లియోన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో అనువాద చిత్ర రూపాన సన్నీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. రాగిణి ఎం.ఎం.ఎస్ చిత్రాన్ని తెలుగు భాషలో రాత్రి పేరుతో అనువదించి విడుదల చెయ్యటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.అడల్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన గుంటూరు టాకీస్ చిత్రం లో రష్మీ గౌతమ్ నటించిన విషయం విదితమే. కథ కథనాల్లో నాణ్యత లేకపోయినా ప్రచార చిత్రాల్లో రష్మీ గౌతమ్ అందాల ఆరబోత ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించగలిగింది. మరి ఇప్పుడు రష్మీ గౌతమ్ బదులు సన్నీ లియోన్ అయితే మరి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కచ్చితంగా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
https://www.telugupost.com/movie-news/ranveer-singh-comments-on-kareena-kapoor-and-anushka-sharma-105946/
ఎంతైనా మన దేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మనం నడుచుకోవాలి. స్వామి వివేకానందుడు అమెరికా వెళ్లినప్పుడు కూడా తన ప్రసంగంలో ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మేన్‌’ అని అనకుండా ‘మై డియర్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌’ అని సంబోధించాడు. ఓ అందమైన డబ్బున్న, ఓ అమ్మాయి మీలాంటి అబ్బాయి నాకు కావాలి… అని స్వామి వివేకానందుడిని అడిగితే.. నాలాంటి అబ్బాయి ఎందుకు.. నన్నే నీ అబ్బాయిగా (కొడుకుగా) భావించు… అని సమాధానం చెప్పి అబ్బురపడిచాడు. కానీ నేడు మాత్రం మన దేశంలో పాశ్చాత్య ధోరణి బాగా పెరిగిపోతోంది. తల్లిగా, చెల్లిగా, అక్కగా, దేవతగా పూజించాల్సిన మహిళలను మనం ఏదేదో అనేస్తున్నాం. ఇలాంటి వాటికి దేశవ్యాప్తంగా పేరు గాంచిన కరణ్‌జోహార్‌ నిర్వహించే ‘కాఫీ విత్‌ కరణ్‌’ వేదికగా మారుతోంది. ఈ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రికెటర్లు హార్ధిక్‌పాండ్యా, లోకేష్‌ రాహుల్‌ల కెరీరే ప్రమాదంలో పడింది. ఇదే సమయంలో పాత ‘కాఫీ విత్‌ కరణ్‌’షోలో పలువురు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను మన నెటిజన్లు వెతికి మరీ బయటకు తెస్తున్నారు. ఎప్పుడో ఆరేడేళ్ల కిందట బాలీవుడ్‌ యంగ్‌స్టార్‌ రణవీర్‌సింగ్‌ ఈ షోలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నాడు సోషల్‌మీడియా అంత విస్తారంగా లేని కారణంగా అవి జనాలకు చేరలేకపోయాయి. కానీ అవే ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. రణవీర్‌సింగ్‌ ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ, కరీనాకపూర్‌, అనుష్కశర్మల గురించి నీచమైన కామెంట్స్‌ చేశాడు. కరీనాకపూర్‌ని బికినీలో చూసిన చిన్న వయసులోనే నాకు మూడ్‌ వచ్చేది.ఇక అనుష్కకి గిల్లించుకోవాలని ఉంటే గిల్లడానికి నాకే అభ్యంతరం లేదని ఆయన వివాదాస్పద కామెంట్స్‌ చేశాడు. అవే ఇప్పుడు ఆయన కొంపముంచుతున్నాయి. ఇటీవలే ఆయన దీపికాపడుకొనేని వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్న సమయంలో ఇవి ఆయనకు తలనొప్పిగా మారాయి. ఈ వ్యాఖ్యలు చేసిన వారినే కాదు.. అలా మాట్లాడేలా చేసిన కరణ్‌జోహార్‌ కూడా ఇందుకు బాధ్యుడేనని చెప్పాలి. అసలు ‘కాఫీ విత్‌ కరణ్‌’ వంటి షోలను ఆపకుండా అందులో పాల్గొని వ్యాఖ్యలు చేసిన వారిని పూర్తిగా దీనికి బాధ్యులను చేయడం కూడా సరికాదనే చెప్పాలి.
https://www.telugupost.com/top-stories/etala-rajender-is-the-chairman-of-the-joinings-committee-of-bjp-that-is-why-leaders-are-being-joinings-in-trs-1444663
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రేమ వచ్చినా అంతే. కసి ఉన్నా అంతే. అదే స్థాయిలో కనపరుస్తారు. ప్రేమ ఉంటే పదవులతో ముంచెత్తుతారు. తాను నమ్మితే ఇక అంతే ఆ నేతకు తిరుగులేదు. ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తారు. ఆ నేతను వెనకేసుకు వస్తారు. ఇక కసి ఉన్నా అంతే. దగ్గరకు కూడా రానివ్వరు. సమయం వచ్చినప్పుడు ఆ నేతను రాజకీయంగా మరింత దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. కేసీఆర్ ను దగ్గరి నుంచి చూసిన వారెవరికైనా ఈ విషయం తెలుసు. అందుకే గులాబీ బాస్ తో అంతగా అంగకాగరు. అలాగని దూరం కారు. బ్యాలన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ అనేక మంది నేతలు అలా బతికిపోతున్నారు.ఎదిరించిన ఈటలను...ఇక ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈటల రాజేందర్ తనను ఎదిరించాడు. అది కేసీఆర్ సహించలేకపోయారు. మంత్రి వర్గం నుంచి బర్త్‌రఫ్ చేసేశారు. అయినా ఈటల తగ్గలేదు. వెంటనే బీజేపీ కండువా కప్పుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై కాలుదువ్వాడు. దీంతో హుజూరాబాద్ లోనే ఈటలను ఓడించాలనుకున్న కేసీఆర్ కు ఆ కోరిక నెరవేరలేదు. ఎందరికో ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. ఇతర పార్టీ నేతలను తీసుకొచ్చి మరీ అందలం ఎక్కించారు. అయినా ఫలితం దక్కలేదు. చివరకు హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ దే పైచేయిగా మారింది.సన్నిహిత సంబంధాలు...పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఈటల రాజేందర్ కు ఇప్పటికీ కొందరు టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేయడంతో బీసీ నేతలతో ఈటలకు టీఆర్ఎస్ లోని నేతలతో వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు వారికి ఏదో రకంగా పనిచేసిపెట్టడం, వారు నిర్వహించిన కార్యక్రమాలకు హాజరు కావడం వంటివి చేసి ఈటల వారికి చేరువయ్యారు. ఈ సంబంధంతోనే ఇటీవల మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిపోయారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బూర పార్టీని వీడటం ఇబ్బంది పెట్టింది. బీసీలు పార్టీకి వ్యతిరేకమవుతున్నారన్న ప్రచారం బూర పార్టీని వీడటంతో మరింత ఎక్కువయింది. దీని వెనక ఈటల రాజేందర్ ఉన్నారని కేసీఆర్ అనుమానిస్తున్నారు.మెట్టుదిగి మరీ...ఈటల రాజేందర్ బీజేపీలో చేరికల కమిటీ ఛైర్మన్ గా కూడా ఉన్నారు. అందుకే ఈటలను దెబ్బతీయడానికి వరసగా నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఒక మెట్టు కిందకు దిగైనా సరే.. తానే ఫోన్ చేసి వారిని స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఒకర్ని చేర్చుకుంటే ముగ్గురిని లాగేస్తాం అని వార్నింగ్ పంపుతున్నారు. బీజేపీలో ఉన్న బీసీ నేతలనే కేసీఆర్ టార్గెట్ చేశారు. అందుకే తనను వీడి వెళ్లిపోయిన స్వామి గౌడ్ కు ఫోన్ చేసి వెనక్కు రప్పించారు. మరికొందరు నేతలు కూడా లైన్ లో ఉన్నారని చెబుతున్నారు. ఈటల నాయకత్వంపై బీజేపీ హైకమాండ్ కు అనుమానం కలిగేలా ఆయన చేరికలను ప్రోత్సహిస్తున్నారు. అవసరమైతే వచ్చే వారికి పదవులు ఇచ్చేందుకు కూడా వెనకాడరు. ఇటు మునుగోడు ఉప ఎన్నికతో పాటు అటు ఈటలను దెబ్బకొట్టినట్లు అవుతుందన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. మరి ఈరోజు, రేపు ఎవరు కేసీఆర్ లిస్ట్ లో ఉన్నారో అన్నది రాజకీయ పార్టీలతో పాటు ఈటలకు కూడా టెన్షన్ పట్టుకుంది.
https://www.telugupost.com/movie-news/tollywood-to-bollywood-celebrities-at-ayodhya-ram-mandir-opening-ceremony-1516400
Ayodhya Ram Mandir : నేడు జనవరి 22న ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లమంది హిందువుల కల నెరవేరుతున్న రోజు. 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈరోజు జరుగుతుంది. ఇక ఈ మహత్తర వేడుకకు హాజరుకావాలంటూ రాజకీయ రంగంతో పాటు సినీ, క్రీడా రంగంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానం వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఆహ్వానం అందుకున్న అందరూ అయోధ్యలో రామ విగ్రహ ప్రాణప్రతిష్టని చూసేందుకు తరలి వెళ్లారు. టాలీవుడ్ నుంచి మెగా కుటుంబసభ్యులు చిరంజీవి దంపతులు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, కోలీవుడ్ నుంచి రజినీకాంత్, ఇక బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, జాకీ ష్రాఫ్, రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, కంగనా, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, మధుర్ బండార్కర్, వివేక్ ఒబెరాయ్, అనుపమ్ ఖేర్, సచిన్ టెండూల్కర్, చంద్రబాబు నాయుడు.. తదితరులు అయోధ్యకు చేరుకున్నారు. దీంతో అయోధ్య ఎయిర్ పోర్టులో సుమారు 100 ప్రైవేట్ విమానాలు చేరుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అయోధ్యకు చేరుకున్న సెలబ్రిటీస్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటి పై ఓ లుక్ వేసేయండి.#WATCH | Uttar Pradesh: Telugu superstars Chiranjeevi and Ram Charan arrived at Ayodhya airport.(Earlier visuals) pic.twitter.com/zXAm5ayV1m— ANI (@ANI) January 22, 2024 #WATCH | Uttar Pradesh: Jana Sena chief Pawan Kalyan arrives in Lucknow, ahead of the Ayodhya Ram Temple Pranpratishtha ceremony that will be held tomorrow. He says, "This has been a long-cherished dream of the people and after 500 years, it is finally coming into reality, we… pic.twitter.com/JEY4QnO6qn— ANI (@ANI) January 21, 2024 #WATCH | Actor Chiranjeevi arrives at Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Pran Pratishtha ceremony“This is a God-given opportunity, we are really happy to be here…” he says pic.twitter.com/HFtKP00zVJ— ANI (@ANI) January 22, 2024 #WATCH | Telugu superstars Chiranjeevi and Ram Charan at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony #RamMandirPranPrathistha pic.twitter.com/k4T95PvXkY— ANI (@ANI) January 22, 2024 #WATCH | Superstar Rajinikanth arrives at Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Pran Pratishtha ceremony pic.twitter.com/1ii6iCsdQ1— ANI (@ANI) January 22, 2024 #WATCH | Uttar Pradesh: Actors Amitabh Bachchan and Abhishek Bachchan at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony pic.twitter.com/wJFUsLPjXJ— ANI (@ANI) January 22, 2024 #WATCH | Actors Madhuri Dixit Nene, Vicky Kaushal, Katrina Kaif, Ayushmann Khurrana, Ranbir Kapoor, Alia Bhatt and filmmaker Rohit Shetty arrive at Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Pran Pratishtha ceremony pic.twitter.com/UNLxN1ULLg— ANI (@ANI) January 22, 2024 #WATCH | Ayodhya, Uttar Pradesh | Actor Anupam Kher says, "Historic! Wonderful! I had never seen such an atmosphere for Hindu religion ever before. This is bigger than Diwali. This is the real Diwali...Maryada Purushottam Ram symbolised goodness and a sense of sacrifice. Today,… pic.twitter.com/zYORDFWvqs— ANI (@ANI) January 22, 2024 Filmmaker Madhur Bhandarkar and actress Kangana Ranaut at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony.#RamMandirPranPrathistha pic.twitter.com/JTIiuWLxie— ANI (@ANI) January 22, 2024 #WATCH | Actor Vivek Oberoi and singer Sonu Nigam arrive at Shri Ram Janmaboomi Temple in Ayodhya to attend the Pranpratishtha ceremony.Vivek Oberoi says, "It's magical, spectacular. I have seen so many images of it. But when you see it before your eyes, it seems that you are… pic.twitter.com/U7YAFATnct— ANI (@ANI) January 22, 2024 #WATCH | Uttar Pradesh: Former Andhra Pradesh CM and TDP chief N Chandrababu Naidu arrives at Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony #RamMandirPranPrathistha pic.twitter.com/cIUK3sp7WP— ANI (@ANI) January 22, 2024 #WATCH | Ayodhya, Uttar Pradesh | Actor Jackie Shroff says, "Received a lot of love...How does it feel when you come to Lord's temple? He called us here, it is big for us..." pic.twitter.com/aaDfklqsG7— ANI (@ANI) January 22, 2024 #WATCH | Actors Madhuri Dixit Nene, Vicky Kaushal, Katrina Kaif, Ayushmann Khurrana, Ranbir Kapoor, Alia Bhatt and filmmakers Rajkumar Hirani, Rohit Shetty arrive at Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Pran Pratishtha ceremony pic.twitter.com/0KCYCaQz9R— ANI (@ANI) January 22, 2024 "Amazing, unforgettable, supernatural moment": Yogi Adityanath greets people on reaching Shri Ram Janambhoomi MandirRead @ANI Story | https://t.co/2a0S6kTz2f#Ayodhya #RamTemple #LordRam #RamLalla #RamMandirPranPrathistha #PranPratishta #ShriRamJanambhoomiMandir pic.twitter.com/0DWtjTnyW2— ANI Digital (@ani_digital) January 22, 2024 #WATCH | Cricket legend Sachin Tendulkar arrives at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony#RamMandirPranPrathistha pic.twitter.com/72BLcxUnmp— ANI (@ANI) January 22, 2024
https://www.telugupost.com/movie-news/mahesh-babu-nephew-ashok-galla-to-enter-into-tollywood-139572/
ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా నవంబ‌ర్ 10న పలువురు సినీ ప్ర‌ముఖు ల స‌మ‌క్షంలో గ్రాండ్ లాంచ్‌కానుంది. రీసెంట్‌గా 'ఇస్మార్ట్ శంక‌ర్‌' వంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన నిధి అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
https://www.telugupost.com/top-stories/somu-veerrajus-tenure-as-bjp-state-president-will-be-completed-soon-1362278
ఎవరు అవునన్నా.... కాదన్నా.. ఏపీ బీజేపీలో రెండు గ్రూపులున్నాయి. ఒకటి జగన్ అనుకూల వర్గం కాగా, రెండోది చంద్రబాబుకు సపోర్ట్ చేసే వర్గం. ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న పెద్దాయన వర్గమంతా సోము వ్యతిరేక వర్గంగానే నేటికి కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి సోము వీర్రాజు ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్నది ఈ వర్గం లక్ష్యంగా కన్పిస్తుంది. సోము అధ్యక్ష పదవిలో ఉంటే పొత్తులు కుదరనీయరని, టీడీపీని దగ్గరకు రానివ్వరన్నది ఆ వర్గం విశ్వసిస్తుంది.త్వరలో పదవీ కాలం....నిజానికి సోము వీర్రాజు పదవీ కాలం త్వరలో పూర్తి కావస్తుంది. ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారా? లేదా సోమును కంటిన్యూ చేస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఆయనకు రెండోసారి రెన్యువల్ దొరకలేదు. ఇప్పుడు సోము పరిస్థితి కూడా అంతేనన్నది ఆయన వ్యతిరేక వర్గం భావన. సోము పార్టీ అధ్యక్షుడిగా ఉంటే బీజేపీ, జనసేన, టీడీపీ లు కలిసి పోటీ చేసే అవకాశాలు తక్కువన్నది వారి అభిప్రాయం.పక్కా ఆర్ఎస్ఎస్....నిజానికి మిగిలిన ఈ సోకాల్డ్ నేతల్లాగా పార్టీ మారి సోము వీర్రాజు బీజేపీలో చేరలేదు. బీజేపీకి ఏమీ లేనప్పుడే ఆయన పార్టీలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేత కావడం, పార్టీని తన సొంత తల్లిలా ప్రేమించడం సోముకు అలవాటు. చంద్రబాబు అనేకమార్లు బీజేపీని మోసం చేసిన విషయాన్ని ఆయన పదే పదే గుర్తు చేస్తుంటారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందున నాలుగు సీట్లు అయితే రావచ్చేమో కాని, పార్టీ పూర్తిగా బలహీనపడిందన్నది సోము భావన. ఇదే విషయాన్ని పార్టీ అధినాయకత్వానికి కూడా ఆయన నివేదించారు.బాబు అనుకూల వర్గం....ఇక సోము వ్యతిరేక గ్రూపులో ఉన్న వారంతా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించేవారే. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు నేతలు ఏకమై సోము స్థానంలో మరొకరిని ఎంపిక చేయాలని హైకమాండ్ ను కోరుతున్నారు. వీరికి బీజేపీపై కన్నా చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలన్న కసి ఎక్కువగా ఉంది. సోము వీర్రాజు పట్ల పార్టీ హైకమాండ్ సానుకూలతతో ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల వరకూ ఆయనను కొనసాగించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సోమును పదవి నుంచి తప్పిస్తే తమ పని సులువవుతుందన్నది బీజేపీలోని ఒక వర్గం ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.
https://www.telugupost.com/movie-news/varun-tej-to-play-vilan-role-in-a-tamil-remake-cinema-98057/
ఫిదా చిత్రం దగ్గరనుండి స్పీడు పెంచిన వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఎడా పెడా సినిమాలు చేసుకుపోతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం అంతరిక్షం సినిమాతో ఈ డిసెంబర్ లోను, ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో జనవరిలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇప్పటికే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన వరుణ్ తేజ్ జోరు మాములుగా లేదు. అయితే మీడియం హీరోగా దూసుకుపోతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రతినాయకుడు పాత్ర మీద మోజు పడుతున్నాడనే ప్రచారం ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. ఈమధ్యన టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోను చాలామంది హీరోలు తమకొచ్చిన నెగెటివ్ కేరెక్టర్స్ ని ఉతికి ఆరేస్తున్నారు. స్టార్ హీరోలైనా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చెయ్యడానికి వెనుకాడడం లేదు. జై లవ కుశ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలా మెప్పించాడో తెలిసిందే. ఇంకా ఈ మధ్యన మాధవన్, ఆది పినిశెట్టి, రానా వంటివారు విలన్ కేరెక్టర్ స్లో ఇరగదీస్తున్నారు. మరి వరుణ్ కూడా అలా ప్రతినాయకుడి పాత్రలో కనిపించడానికి మోజు పడుతున్నాడంటే... అందులో ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి. మరి అలాంటి పాత్రే వరుణ్ కి తగలడంతో... వరుణ్ ఇప్పుడు విలన్ పాత్రకి సై అంటున్నాడట. త‌మిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న జిగ‌డ్తాండ‌ లో సిద్దార్థ్ హీరోగా నటిస్తే... బాబీ సింహా విలన్ గా నటించాడు. అయితే హీరో సిద్దార్ధ్ కన్నా ఎక్కువగా ఆ సినిమాలో విలన్ పాత్ర చేసిన బాబీ సింహా కు మంచి పేరు వచ్చింది.మరి అదే జిగ‌డ్తాండ‌ ని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాట. తెలుగు రీమేక్ లో హీరో పాత్రని మరింత తగ్గించి విలన్ పాత్రకి మరింత హైప్ ఇవ్వాల‌ని చూడడం.. హీరొకింద ఎవరినైనా సెలెక్ట్ చేసి నెగెటివ్ పాత్రలో మాత్రం వరుణ్ తేజ్ ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. జిగ‌డ్తాండ‌ రైట్స్ దగ్గరపెట్టుకున్న దిల్ రాజు, హీరోగా, దర్శకుడిగా ఎవరికీ అవకాశం ఇస్తాడో కానీ.. విలన్ గా మాత్రం వరుణ్ చేస్తాడంటున్నారు. మరి ఈ సినిమాలో విలన్ రోల్ కున్న ఇంపోర్టన్స్ తోనే వరుణ్ ఈ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకి ఓకె చెప్పాడంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/who-is-big-boss-telugu-season-3-final-winner-139230/
బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ ఎప్పటిలాగే సోషల్ మీడియాలో లీకైపోయింది. బిగ్ బాస్ లీకులు ఫైనల్ ఎపిసోడ్ ని కూడా కబళించడంతో… బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో ఇప్పటికే సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. టాప్ 5 లో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రేజాలు ఉండగా.. ఈ ఫైనల్ విన్నర్ గా శ్రీముఖి నే అంటు సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా బోలెడన్ని న్యూస్ లు ప్రచారం లోకొచ్చాయి. అయితే శ్రీముఖి తరుపున చాలామంది ప్రచారం చేసారు. ఇక మొదటినుండి శ్రీముఖిని విన్నరే అని బిగ్ బాస్ శ్రీముఖి తో డీల్ సెట్ చేసిందేనని ఇలా చాలా వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలన్నిటి బ్రేక్ చేస్తూ.. అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ లో పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా నిలిచాడు. మొదట్లో కాస్త డల్ గా ఆడిన రాహుల్, శ్రీముఖి గేమ్ స్ట్రాటజీతో బాగా హైలెట్ అవడం.. చివరిలో అనూహ్యంగా రాహుల్ మీద సింపతీ రావడంతో.. ఫైనల్ గా టాప్ 2 లోశ్రీముఖి, రాహుల్ ఉండగా… ఫైనల్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. టాప్ 5 లో అలీ రెజా కి తక్కువ ఓట్స్ వచ్చి ఫస్ట్ ఎలిమినేట్ అవగా.. తర్వాతి వరుణ్ సందేశ్, తర్వాత బాబా భాస్కర్ లు ఒక్కొకరుగా ఎలిమినేట్ అయ్యారు. చివరికి రాహుల్ ఫైనల్ విన్నర్ అయ్యాడు.
https://www.telugupost.com/telangana/jaggareddy-demands-to-remove-puvvada-as-minister-from-ts-cabinet-1365396
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అజయ్ కుమార్ పెద్ద సైకో అని.. అతడిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా ఖమ్మంలో పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, పువ్వాడకు కొందరు పోలీసులు గులాంగిరీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను ఆకట్టుకునేందుకు పువ్వాడ అతిగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు.కాగా.. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్యకు కారకుడు కూడా పువ్వాడేనంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. సాయిగణేశ్ నుంచి పోలీసులు వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కావాలనే పోలీసులు వాంగ్మూలం తీసుకోలేదని క్లియర్ కట్ గా తెలుస్తోందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైనా మంత్రి పువ్వాడ ఇదే తరహాలో వేధింపులకు పాల్పడ్డారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
https://www.telugupost.com/movie-news/taxiwala-collections-better-than-amar-akbar-antony-97851/
ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా -నేనా అన్నటుగా రవి - విజయ్ లు తమ సినిమాలతో పోటీకి దిగారు. ముందుగా రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ శుక్రవారం రోజు రిలీజ్ అయింది. తరువాత రోజు అంటే నిన్న విజయ్ ‘ట్యాక్సీవాలా’ రిలీజ్ అయింది. రెండు సినిమాల మీద పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఎవరిని ఎవరు దెబ్బ తీస్తారనే చర్చే లేకపోయింది. ‘అమర్ అక్బర్ ఆంటోని’ మొదటి ఆటతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈచిత్రం తొలి రోజే ఓపెనింగ్స్ పడిపోయాయి. మొదటి రోజే సినిమా పరిస్థితి ఏంటో తేలిపోగా అందరి ఫోకస్ ‘ట్యాక్సీవాలా’ మీదికి షిఫ్టయింది. చాలా ఇబ్బందులు మధ్య రిలీజ్ అయిన ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నిజానికి ‘అమర్ అక్బర్ ఆంటోని’ అక్టోబర్ 5న రిలీజ్ కావాల్సివుంది. కానీ అదే రోజు విజయ్ 'నోటా' సినిమా ఉండటంతో ఎందుకులే పోటీ అని డేట్ మార్చుకున్నారు మేకర్స్. ఐన కానీ వీరిద్దరి మధ్య పోటీ తప్పలేదు.గంటల గ్యాప్ తో విజయ్ తన ‘ట్యాక్సీవాలా’ ను రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. అయితే ఈ సినిమా మరీ అంత గొప్పగా ఏమి లేదు. ఒకసారి చూడవచ్చు. విజయ్ క్రేజ్ వల్ల దీనికి బుకింగ్స్ బాగానే జరిగాయి. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. వసూల్ కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం రవి అక్టోబర్ 5 న మిస్ అయినా ఇక్కడ దొరికేసాడు
https://www.telugupost.com/movie-news/yaatra-ys-rajashekhar-reddy-movie-67667/
టాలీవుడ్ లో ప్రస్తుతం బియోపిక్స్ హావ నడుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ను తన కొడుకు బాలకృష్ణ నిర్మిస్తుండగా.. పొలిటికల్ లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాలతో రాబోతున్న ‘యాత్ర’. ఈ సినిమా ఆనందోబ్రహ్మ సినిమా ను తీసిన మహి వీ రాఘవన్ ఈ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై బజ్ క్రియేట్ అయ్యింది. అయితే రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ పాత్ర చేసేదెవరన్నదానిపై కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ముందు నయనతార పేరు వచ్చింది ఆ తర్వాత మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. లేటెస్ట్ గా మరో ఆసక్తికరమైన పేరు తెరపైకి వచ్చింది. బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో దేశమంతా పాపులారిటీ సంపాదించుకున్న రమ్యకృష్ణతో విజయమ్మ పాత్ర చేయించాలని దర్శకుడు మహి.వి.రాఘవ్ ప్రయత్నిస్తున్నాడట. ఆమె నటిస్తే ఈ పాత్రకు సరైన న్యాయం జరుగుతుందని నిర్మాతలు అండ్ డైరెక్టర్ భావిస్తున్నారు.అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/date-with-prabhas-193989/
కన్నడ నుండి టాలీవుడ్ కి దూసుకొచ్చిన గ్లామర్ డాల్ రష్మిక మందన్న రేంజ్ ఇప్పడు పాన్ ఇండియా లెవల్లో ఉంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు రష్మిక మందన్న ఫుల్ బిజీ. సినిమాలతో క్షణం తీరిక లేకుండా స్టార్ హీరోస్ ని చుట్టేస్తున్న రష్మిక గ్లామర్ కి, పెరఫార్మెన్స్ కి బాలీవుడ్ కూడా ఫిదా అయ్యిపోయింది. కాబట్టే అక్కడ అమ్మడుకి వరస అవకాశాలు. తెలుగులో మహేష్ బాబుతో నటించిన రష్మిక తర్వాత అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ పుష్ప లో నటిస్తుంది. బాలీవుడ్ లో మూడు క్రేజీ ఆఫర్స్ తో బిజీగా ఉన్న పాప విజయ్ దేవరకొండ తో డీప్ ఫ్రెండ్ షిప్ లో ఉంది.అయితే తాజాగా రష్మిక ని మీరు డేటింగ్ కి వెళ్ళాలి అనుకుంటే ఏ హీరో తో వెళతారు అనగానే.. తెలుగు స్టార్ హీరోతో తాను డేట్ కు వెళ్లాలనుకుంటున్నానని చెప్పి షాకిచ్చింది. అందరూ అది విజయ్ దేవరకొండ అయ్యుంటాడని అనుకునేలోపే.. ఆ స్టార్ ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అంటూ చెప్పి మరింత షాకిచ్చింది. తనకు గనక అవకాశం వస్తే.. ఏదో ఒకరోజు ప్రభాస్ తో డేట్ కు వెళ్తానని రష్మిక తెలిపింది. ఎందుకంటే తాను ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్ ని అని అందుకే ప్రభాస్ తో అవకాశం వస్తే ఖచ్చితంగా డేట్ కి వెళతాను అంటుంది కన్నడ బ్యూటీ రష్మిక. మరి రశ్మికది కూడా పాన్ ఇండియా లెవల్.. ప్రభాస్ ఏమైనా రష్మిక కి తన పాన్ ఇండియా మూవీస్ లో ఛాన్స్ ఇస్తాడేమో చూద్దాం.
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-in-new-role-108067/
ప్రస్తుతం యంగ్ హీరోస్ కి, స్టార్ హీరోస్ కి గట్టి పోటీ ఇస్తున్న విజయ్ దేవరకొండ నుండి సినిమా అప్ డేట్ వస్తుంది అంటే.. ఆయన అభిమానులకే కాదు మిగతా ప్రేక్షకులకి ఎంతో ఆసక్తి కలుగుతుంది. ఇప్పటి వరకు, బేవార్స్ కుర్రోడిగా, స్టూడెంట్ అండ్ డాక్టర్ గా, కాలేజ్ లెక్చరర్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యే పాత్రల్నే చేస్తున్న విజయ్ దేవరకొండ.. మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంలో స్టూడెంట్ గా అదరగొట్టేయ్యబోతున్నాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో తనకు అచ్చొచ్చిన హీరోయిన్ రష్మిక మందన్నతో కలిసి నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. సింగరేణి కార్మికుడిగా… ఇక భరత్ కమ్మ సినిమాతో పాటుగా విజయ్ దేవరకొండ… క్రాంతి మాధవ్ డైరెక్షన్ లోనూ మరో మూవీకి కమిట్ అయ్యాడు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టేసుకుంది. క్రాంతి మాధవ్ – విజయ్ దేవరకొండ కాంబోకి ఇంకా టైటిల్ అయితే పెట్టలేదు కానీ.. షూటింగ్ మాత్రం కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లోని బొగ్గు గనుల్లో శరవేగంగా జరుపుకుంటుంది. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగరేణి అంటే బొగ్గు గనుల కార్మికుడిగా కనిపించబోతున్నాడట. ఇద్దరు హీరోయిన్లతో… ఇప్పుడు ఆ సింగరేణి కి సంబందించిన సన్నివేశాలని కొత్తగూడెం బొగ్గు గనుల్లోనే చిత్రీకరిస్తున్నారట. కాకపోతే సింగరేణి కార్మికుడిగా విజయ్ దేవరకొండ సినిమాలో కొంతమేర మాత్రమే కనిపిస్తాడట. మిగిలినదంతా క్లాస్ లుక్ లోనే కనిపిస్తాడని చెబుతున్నారు. మరి ఈ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నాతో పాటుగా మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా ఎంపికయ్యిందని సమాచారం.
https://www.telugupost.com/movie-news/పవన్-కళ్యాణ్-తరహాలో-ప్రశ-7223/
హీరోల నట జీవితం లా ఏ బ్రేకులు పడకుండా హీరోయిన్ల నట జీవితాలు సాగవు. అటువంటి వారిలో జ్యోతిక ఒకరు. తెలుగు తమిళ భాషల్లో అగ్ర కథానాయకులు వంటి కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున లతో నటించిన జ్యోతిక, తమిళ నటుడు సూర్యని వివాహం చేసుకుని సుదీర్ఘ కాలం రంగుల ప్రపంచానికి దూరంగా ఉన్నారు. జ్యోతిక ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కొంత కాలం ఏ సినిమా కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు. గత సంవత్సరమే పాత్ర బలం ఉన్న మలయాళ చిత్ర కథను ఎంచుకుని తమిళంలో 36 వయధినిలే లో కనిపించి ఆవిడ నట జీవితాన్ని పునః ప్రారంభించారు.తాజాగా జ్యోతిక మరో చిత్రంలో నటిస్తూ ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ చిత్రానికి మగలీర్ మట్టుమ్ అనే పేరు ఖరారు చేసి ఫస్ట్ లుక్ ట్విట్టర్లో పంచుకున్నారు ఈ చిత్ర నిర్మాత ఐన జ్యోతిక భర్త సూర్య. ఈ చిత్రంలో జ్యోతిక పాత్రికేయురాలి పాత్ర పోషిస్తున్నారు. కథ మొత్తం ఆవిడ పాత్ర చుట్టూ, ఆవిడ జరిపే కేసు విచారణ చుట్టూ తిరుగుతుంది అని సమాచారం. కెమెరా మాన్ గంగతో రాంబాబు లో మైక్ పట్టుకుని పవన్ కళ్యాణ్ సామాజిక అంశాలపై ప్రశ్నించిన రీతిలో ఉంటుందో, లేక సెట్టిల్డ్ పెర్ఫార్మన్స్ తో కనిపించే పాత్రికేయురాలిగా ఉంటుందో చూడాలి.నటుడిగా సూర్య తమిళ తెలుగు భాషల్లో అనేక ఎదురు దెబ్బలు తింటూన్న, కొత్త దర్శకుడు బ్రహ్మ ని నమ్మి జ్యోతిక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలో సూర్యకి బాగా కలిసివచ్చిన సింగం సిరీస్ లో మూడవ భాగం సింగం3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఆ చిత్రంతో ఐనా సూర్య కు తన పాత మార్కెట్ తిరిగి వస్తుందో లేదో చూడాలి.
https://www.telugupost.com/movie-news/koratala-shiva-condition-to-anushka-106576/
ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆగష్టులో రిలీజ్ అవుతున్న ఈ సినిమా చకచకా షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ కాగానే చిరు కొరటాల డైరెక్షన్ లో తీయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఫాల్గొననున్నాడు. ఈలోపు కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. అందుకుగానూ హీరోయిన్ ని సెట్ చేసే పనిలో ఉన్నాడు. చిరు పక్క సరిపోయే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే మనకు ముందు గుర్తొచ్చే పేర్లు కాజల్, నయనతార. చిరు వీరితో ఆల్రెడీ నటించారు కాబట్టి వీరిని కాకుండా మరో హీరోయిన్ ని చూడాలని నిర్ణయించుకున్నాడు. బరువు తగ్గేందుకు డెడ్ లైన్ అనుకుందే తడవుగా అనుష్క పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే కొరటాల ఆమెను సంప్రదించినట్టు టాక్. కాకపోతే అనుష్కను చూసిన వారెవరూ ఆమెను హీరోయిన్ అని అనుకోవడం కష్టం. ఎందుకంటే ఈమధ్య అనుష్క బాగా లావయ్యింది. అయితే కొరటాల ఆమెకు ఓ కండిషన్ పెట్టాడట. మార్చి తరువాత షూట్ స్టార్ట్ అయ్యేలోగా వీలయినంత బరువు తగ్గి, కాస్త నాజూగ్గా తయారు కావాలన్నది ఆ కండిషన్. ప్రస్తుతం అనుష్క విదేశాలకు వెళ్లి బరువు తగ్గే ప్రయత్నంలో ఉందని సమాచారం. ప్రస్తుతం అనుష్క చేతిలో మాధవన్ హీరోగా కొన వెంకట్, పీపుల్స్ మీడియా నిర్మించే సినిమా మాత్రమే ఉంది.
https://www.telugupost.com/top-stories/alla-nani-won-three-times-as-mla-from-eluru-constituency-he-won-fromcongress-in-2004-and-2009-elections-1446549
జగన్ కు అత్యంత ఇష్టుడైన వ్యక్తి. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోయినా పదవి ఇచ్చి అతనికి వెన్ను దన్నుగా నిలిచారు. అయినా మంత్రి పదవి నుంచి తొలగించిన వెంటనే మాత్రం తనకేదో అన్యాయం జరిగినట్లు ఫీలవుతున్నారు. ఆ నేతే ఆళ్ల నాని. మంత్రి పదవి పోయిన నాటి నుంచి పత్తా లేరు. అసలు పార్టీలో ఉన్నారా? అన్నది కూడా పట్టించుకోవడం లేదు. ఏమాత్రం సీరియస్ నెస్ లేని నేతగా వైసీపీ అధినాయకత్వం కూడా అభిప్రాయపడుతుంది. మంత్రి పదవి ఐదేళ్లు పాటు ఉండాలనుకుని తనను తొలగించిన వెంటనే బాగా నిరాశకు లోనయినట్లుంది.మూడు సార్లు...ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో ఆళ్ల నాని కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆళ్ల నాని ఓటమి పాలయ్యారు. దీంతో జగన్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆళ్ల నానికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు పార్టీ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించి అప్పటి మున్సిపల్ ఛైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరామ్ కు ఇచ్చినా ఆ ఎన్నికలలో టిక్కెట్ మాత్రం ఆళ్ల నానికే ఇచ్చారు. అంతగా నానికి జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. మూడేళ్లు మంత్రిగా...ఇక 2019 ఎన్నికల్లో అంతటి జగన్ ప్రభంజనంలోనూ ఆళ్ల నాని కేవలం మూడు వేల మెజారిటీతోనే విజయం సాధించారు. తొలి మంత్రివర్గంలోనే చోటు కల్పించారు. కీలకమైన వైద్య ఆరోగ్యశాఖను కేటాయించారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేశారు. మూడేళ్ల పాటు పదవిలో ఆళ్ల నాని కొనసాగారు. కరోనా సమయంలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా జగన్ పట్టించుకోలేదు. అప్పటి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ముందు ఆళ్ల నాని తేలిపోయాడని భావించినా జగన్ మాత్రం నానిని వెనకేసుకొచ్చారు. బాగా పనిచేశావంటూ అనేక సార్లు కితాబిచ్చారు. అయితే అందరితో పాటు ఆళ్లనానిని కూడా మంత్రి పదవి నుంచి తొలగించారు. తొలగించారని...మంత్రి వర్గ విస్తరణలో జగన్ ఎవరినీ స్పేర్ చేయలేదు. కొడాలి నాని ఒకే ఒక కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యే అయినా ఆయనను కూడా తొలగించారు. కాని మంత్రి పదవి పోయిన నాటి నుంచి పత్తా లేకుండా పోయారు. గడప గడపకు ప్రభుత్వం కార్కక్రమంలో కూడా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏదో పాల్గొని మమ అనిపిస్తున్నారు. ఇటీవల కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలందరూ రాజమండ్రిలో సమావేశమయినా ఆళ్ల నాని మాత్రం దూరంగానే ఉన్నారు. మంత్రి పదవి ఎవరికి శాశ్వతం కాదు. జగన్ ముందు చెప్పినట్లే 90 శాతం తొలగించి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పిన విషయాన్ని కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలవాలంటే యాక్టివ్ అవ్వాలి. క్యాడర్ కు అందుబాటులో ఉండాలి. అప్పుడే మళ్లీ గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి కాగలుగుతారు. ఇలా అలిగి ఇటు పార్టీకి, అటు క్యాడర్ కు దూరమయితే అసలుకే మోసం రాక తప్పదు.
https://www.telugupost.com/movie-news/adavi-shesh-new-movie-shooting-122489/
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు ప్రమోషన్స్ ఎంత కీలకమో మన అందరికీ తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ ఎంత బాగా చేస్తే ఆ స్థాయిలో సినిమా ఆడుతుంది. సినిమా ఓపెనింగ్ దగ్గర నుండి రిలీజ్ మూడు వారాలు ఆడేవరకు ఏదో ఒకరకంగా మీడియాలో నానితే తప్ప జనం గుర్తుపెట్టుకోలేని పరిస్థితి ఉంది. అందుకే సినిమాలకు ప్రమోషన్స్ చాలా కీలకంగా మారాయి. కానీ ఎటువంటి హడావిడి లేకుండా ఏ అప్ డేట్ ఇవ్వకుండా అడవి శేష్ ఓ మూవీ పూర్తి చేశాడు. పీవీపీ నిర్మిస్తున్న ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఒక థ్రిల్లర్ అని చెబుతున్నారు. క్యాస్టింగ్ తక్కువగా ఉండడం, పైగా థ్రిల్లర్ కావడంతో చకచకా తీసేసారు. షూటింగ్ కూడా అయిపోయిందా..? అయితే ఇలా ఎటువంటి చప్పుడు లేకుండా సినిమాను కంప్లీట్ చేయాలని ముందే అనుకున్నారట. ఫస్ట్ లుక్ తో పాటు మిగిలిన వివరాలు ప్రకటించే విధంగా ముందే ప్లాన్ చేసుకున్నారట. మరో రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ చేస్తారట. ఈ సినిమా కన్నా ముందే అడివి శేష్ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాడు. గత ఏడాది తనకు మంచి సక్సెస్ ఇచ్చిన గూడచారి సీక్వెల్ తో పాటు మహేష్ బాబు, సోనీ సంస్థల సంయుక్త నిర్మాణంలో మేజర్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి. అది మ్యాటర్.
https://www.telugupost.com/movie-news/అల్లు-అర్జున్-మరో-బిజినె-46329/
ఇప్పుడు స్టార్స్ అంతా ఒక్క సినిమాల మీదే కాన్సంట్రేట్ చేయడంలేదు... సినిమాలతోపాటు ఇతర బిజినెస్ ల మీద కూడా కన్నేస్తున్నారు. హీరో హీరోయిన్స్ సినిమాలతో పాటే వ్యాపారాలను చక్కబెట్టేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ రాజకీయాలతోపాటే సినిమాలు చేస్తుంటే, నాగార్జున వంటివారు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ కూడా ప్రొడక్షన్ తోపాటు జిమ్, హోటల్ వ్యాపారంలో దూసుకుపోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు యంగ్ హీరోస్ రామ్ చరణ్, శర్వానంద్, రానా వంటివాళ్ళు సినిమాలతోపాటే ఇతర బిజినెస్ లలో దూసుకుపోతున్నారు. అయితే స్టార్స్ అంతా ప‌బ్బులు, క్ల‌బ్బులు, హోట‌ల్‌, బార్, జిమ్.. వంటి వ్యాపారాలతో దూసుకుపోతున్నారు. రామ్ చరణ్ తన తండ్రి సినిమాలతో నిర్మాతగా మారడమే కాదు.. ట్రూజెట్ తో విమానయాన రంగంలోనూ దూసుకుపోతున్నాడు. అలాగే బాహుబలితో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాయించిన ప్రభాస్ కూడా నెల్లూరు హైవే మీద మల్టిప్లెక్స్ థియేటర్స్ తోపాటు షాపింగ్ మాల్ బిజినెస్ లోకి దూకేసాడు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఈ మధ్యనే తన భార్యతోకలిసి హోటల్ రంగంలోకి దూకాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడట. ఇప్పటికే బన్నీ జూబ్లీహిల్స్ వంటి కాస్ట్లీప్రాంతంలో ఒక పబ్ ని నిర్వహిస్తున్నాడనే ప్రచారం ఉండనే ఉంది. అంతేకాకుండా ప్రో కబడ్డీ లీగ్స్ లో చెన్నై తలైవాస్.... కేరళ ఫుట్ బాల్ క్లబ్స్ వంటి వాటిలో కూడా బన్నీ భాగస్వామిగా వున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా బన్నీ ఒక కొత్త బిజినెస్సులోకి దిగుతున్నాడట. ఇప్పటి వరకు స్టార్స్ ఎవరు టచ్ చెయ్యని వ్యాపారంలోకి అల్లు అర్జున్ వెళుతున్నాడట. అల్లు అర్జున్ బేక‌రీ వ్యాపారం చేసేందుకు రెడీ అయ్యాడ‌ని తెలుస్తోంది. ఆ బేకరీలో కాస్ట్లీ స్వీట్స్ ఉంటాయంటున్నారు. ఇక ఆ స్వీట్స్ అల్లాట‌ప్పా స్వీట్స్ కాదని.... ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్ స్వీట్స్‌ అని చెబుతున్నారు. ఇక ఆ బేకరీ పేరు కూడా కెనోలి కేఫ్ అని... ఇది కూడా అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో ప్రారంభించ‌నున్నాడట. మరి సినిమా సెలెబ్రిటీస్ అంతా అక్కడ హాయిగా కూర్చుని కొత్త కొత్త స్వీట్స్ టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తారన్నమాట.
https://www.telugupost.com/movie-news/బాలయ్య-బిగ్-బీ-ని-ఎందుకు-క-9080/
అవునండి బాలకృష్ణ ముంబై వెళ్లి మరీ బిగ్ బి అమితాబచ్చన్ ని కలిసి వచ్చాడు. ఎందుకో ఏమో తెలియదు గాని నిన్న ముంబైలోని సర్దార్ 3 సినిమా షూటింగ్ స్పాట్ లో బాలకృష్ణ అమితాబ్ ని కలిసినట్లు ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ కలిసి ఏవో ముచ్చటించుకున్నట్లు ఉందా ఫోటో. బాలకృష్ణ కి అమితాబ్ ఎప్పటినుండో తెలుసు కానీ.... వారు ఈ మధ్యన ఎక్కడ మీట్ అవ్వడం గాని మాట్లాడుకోవడం గాని జరగలేదు. మరి ఉన్నట్టుండి బాలయ్యకి అమితాబ్ తో ఏం అవసరమొచ్చిందో గాని ఇప్పుడు ఈ కలయిక మీడియాలో ప్రాధాన్యత సంతరించుకుంది.బాలకృష్ణ తన 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. అక్కడ అమితాబచ్చన్ కూడా తన సర్దార్ 3 సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. మరి ఇంత బిజీ గా వున్న ఈ స్టార్స్ ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారో అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకిత్తిస్తోందో. వారిద్దరూ కలిసి వున్న ఈ ఫోటో మీ కోసం.
https://www.telugupost.com/movie-news/పవన్-తో-పనిచెయ్యడం-కలగా-ఉ-47928/
ఈ మధ్యన తెలుగులో ఆది పినిశెట్టి విలన్ గా, సపోర్టింగ్ కేరెక్టర్స్ లో అదరగొడుతున్నాడు. అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో విలన్ కేరెక్టర్ లో ఇరగదీసిన ఆదిపినిశెట్టి... నిన్నుకోరి సినిమాలో నివేద థామస్ భర్తగా ఇంకాస్త ఇరగదీసాడు. ఈ రెండు సినిమాల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆది పినిశెట్టి ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలోనూ, మరో మెగా హీరో రామ్ చరణ్ రంగస్థలం చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాల రెండింటిలోనూ ఆది రోల్ చాలా ముఖ్యమైనది కాబట్టే ఈసినిమాలకు సైన్ చేసానని చెబుతున్నాడు ఆది.ఇకపోతే త్రివిక్రమ్ - పవన్ కలయికలో వస్తున్నా సినిమాలో ఆది పాత్ర చాల ప్రత్యేకంగా ఉండబోతుందంటున్నాడు. ఒక ఐడియాలజీ ఉండే ఇంటెన్స్ పాత్ర నాది అని..... ఇది పూర్తిగా నెగెటివ్ రోల్ కాదు.. అలాగని పాజిటివ్ రోల్ కాదు. అయితే ఆ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయి అని చెబుతున్నాడు. ఈ పాత్రను త్రివిక్రమ్ గారు రాసిన తీరే చాలా గొప్పగా ఉంటుందని..... నా కెరీర్లో ఇది మరో ప్రత్యేకమైన పాత్ర అవుతుంది అని చెప్పడమే కాదు.... పవన్ సార్‌తో చేసిన సన్నివేశాల్ని ఎప్పటికీ మరిచిపోలేను. సినిమా విడుదల తర్వాత అందరూ ఆ సన్నివేశాల గురించి గొప్పగా మాట్లాడుకుంటారని చెబుతున్నాడు.ఇక పవన్ పేరు అంటేనే.... అందరికి ఎంతో పిచ్చి... అలాగే ఎంతో హైప్ ఉంటుంది కానీ.. పవన్ సర్ మాత్రం చాలా సింపుల్ అంటూ మోసేస్తున్నాడు. పవన్ సర్ తోకలిసి పనిచెయ్యడం ఇంకా కలగానే ఉందని చెబుతున్నాడు ఆది పినిశెట్టి. ఇకపోతే పవన్ అజ్ఞాతవాసి జనవరి 10 న విడుదల కాబోతుంది.
https://www.telugupost.com/movie-news/యాక్షన్-సీక్వెన్సెస్-డూప-29101/
ఈ ఏడాది సోషల్ మీడియా లో మద్రాస్ బ్యూటీ త్రిష కి వరుసగా ఎదురు దెబ్బలే తగిలాయి. ఏడాది ఆరంభంలో సుప్రీమ్ న్యాయస్థానం తొలుత తమిళనాడు లో సాంప్రదాయ క్రీడగా ప్రసిద్ధి చెందిన జల్లికట్టు పై నిషేధం విధిస్తు తీర్పు ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో తలెత్తిన అల్లర్లు, నిరసనలకు వ్యతిరేకంగా పెటా సంఘానికి మద్దతు పలుకుతూ ట్వీట్ చేసి త్రిష తమిళ తంబీల ఆగ్రహావేశాలకు బలైయ్యింది. అప్పటికి సెట్స్ పై వున్న త్రిష చిత్రాల షూటింగ్స్ కి కూడా ఈ వేడి తాకి ఆ చిత్రీకరణలకి అంతరాయం ఏర్పడింది. ఈ వివాదం చల్లారుతున్న సమయానికి సూచి లీక్స్ అంటూ సంచలనం సృష్టించిన కొన్ని ప్రైవేట్ ఫొటోస్ లో త్రిష, రానా దగ్గుబాటిలకి సంబంధించిన ఫొటోస్ ట్విట్టర్ లో హల్చల్ చేసి త్రిష ప్రతిష్టకి భంగం కలిగించాయి. ఇప్పుడిప్పుడే జనం ఈ అలజడి మొత్తాన్ని మర్చిపోతుండటంతో త్రిష తాను నటిస్తున్న చిత్రాల షూటింగ్స్ జోరు పెంచుతూ శరవేగంగా సెట్స్ పై వున్న సినిమాలు పూర్తి చెయ్యటానికి నిర్మాతలకి సహకరిస్తుంది. స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో తెరకెక్కుతున్న గర్జనై అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న త్రిష ఈ చిత్రంలో తన గ్లామర్ ఇమేజ్ కి విరుద్ధంగా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ని కూడా చేస్తుందట. యువతులని వలలో వేసుకుని వశపరచుకుని వారి నగ్న దృశ్యాలని సోషల్ మీడియాలో బహిర్గత పరిచి వారి జీవితాలను చెల్లాచెదురు చేసే ఐదుగురు యువకుల గ్యాంగ్ ని ఎదిరించి యువతులని వారి బారిన పడకుండా కాపాడే హీరోయిక్ పాత్ర చేస్తుంది త్రిష. ఈ పాత్ర కోసం డూప్ లేకుండా సహజ సిద్ధంగా కొన్ని ప్రమాదకర యాక్షన్ సీక్వెన్సెస్ లో పాల్గొంది త్రిష. ఇంత కాలం గ్లామర్ రోల్స్ లో అలరించిన త్రిష లోని ఈ కొత్త కోణం ఎలా ఉంటుందో చూద్దాం.
https://www.telugupost.com/movie-news/rx-100-heroine-remuneration-79916/
కేవలం ట్రైలర్ తో ఓ సినిమాను ప్రమోట్ చేయొచ్చు అంటే చేయొచ్చు అనే చెప్పుతున్నారు 'ఆర్ ఎక్స్ 100' టీం. కేవలం ఒక ట్రైలర్ తోనే థియేటర్స్ కు జనాలను రప్పించేలా చేసారు మేకర్స్. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ .. పాయల్ రాజ్ పూట్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల అయిన ప్రతి చోట విజయవిహారం చేస్తోంది.ప్రస్తుతం అంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పూట్ తీసుకున్న పారితోషికం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇందులో రొమాన్స్ బాగా ఎక్కువ అని చూసిన వాళ్లకి అర్ధం అవుతుంది. ఈ సినిమాలో లిప్ లాక్ లు చాలానే ఉంటాయి డైరెక్టర్ అజయ్ భూపతి ముందుగానే చెప్పడం వలన.. చాలామంది హీరోయిన్స్ రిజెక్ట్ చేసారంట.ఒకానొక టైములో ఈ సినిమాకు హీరోయిన్ దొరకటం కష్టం అయిపోయిందంట. ఆలా చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత పాయల్ రాజ్ పూట్ ఈ సినిమాలో సెలెక్ట్ అయిందంట. మరీ ఈ సినిమాలో రొమాన్స్ ఎక్కువే కాబట్టి పారితోషికం కూడా బాగానే తీసుకుని ఉంటదని అంత అనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమా కోసం కేవలం 6 లక్షలే తీసుకుందట. ఈ విషయం తెలిసిన వారంత ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం గురించే అంత మాట్లాడుకుంటున్నారు.
https://www.telugupost.com/movie-news/సైరాకు-షాకింగ్-డిజిటల్-ర-61741/
మెగా స్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి రెండో షెడ్యూల్ ఫిబ్రవరి నుంచి మార్చ్ కి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. హీరోయిన్ నయనతార ఈ షెడ్యూల్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాపై వచ్చిన ఒక న్యూస్ తో చిరంజీవి ఫ్యాన్స్ ఆనందం పట్టలేకపోతున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కనివిని ఎరుగని స్థాయిలో అమెజాన్ ప్రైమ్ 30 కోట్లకు కొనుగోలు చేసిందనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.ఈ వార్త గతంలోనే వచ్చిన ఇప్పుడు అగ్రిమెంట్ జరిగినట్టు టాక్. మెగా స్టార్ సినిమాకు ఇంత రేట్ రావడం మాములు విషయం కాదు. ప్రస్తుతం డిజిటల్ మీడియాలో అమెజాన్ ప్రైమ్ హావ నడుస్తుంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. తమిళ - కన్నడ - హింది సినిమాలని కూడా అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కులని సొంతం చేసుకుంటుంది. విడుదలైన 28 రోజులకే తమ యాప్ లో స్ట్రీమింగ్ పెట్టేలా ఒప్పందం చేసుకుంటున్న ఈ సంస్థ. విన్నర్ నుంచి లేటెస్ట్ హిట్ భాగమతి దాకా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది.త్వరలో విడుదల కాకున్నా రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు అమెజాన్ ప్రైమ్ ఖాతాలో ఉన్నాయి. ఇవి కూడా 28 రోజులకే చేసేలా ఒప్పందం జరిగిందా లేక గడువు పోడిగించారా అనేది తెలియాల్సి ఉంది. ఇక సైరా సినిమా శాటిలైట్ రైట్స్ 30 కోట్లు వచ్చే అవకాశముందని అంచనా కూడా ఉంది. ఇంకా సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోకుండా సగానికి పైగా బడ్జెట్ ఇలా హక్కుల రూపంలోనే రాబడుతున్న సైరా, ముందు ముందు ఇంకెన్ని సంచలనాలకు వేదికగా మారనుందో చూడాలి.
https://www.telugupost.com/movie-news/sai-pallavi-foot-ball-78262/
సినిమా, క్రికెట్ రెండూ కలిపితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని తెలిసిన విషయమే. సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ పేరట మన టాలీవుడ్ హీరోలు ప్రతి ఏడాది క్రికెట్ ఆడుతుంటారు. అయితే హీరోయిన్స్ మాత్రం అటువంటి గేమ్స్ ఆడారు. హీరోలు అయితే సినిమాల్లో కూడా క్రికెట్ ఆడిన సందర్భాలూ ఉన్నాయి. కానీ హీరోయిన్స్ ఆలా ఎప్పుడు ఆడిన సందర్భాలు లేవు. అయితే లేటెస్ట్ గా మన హీరోయిన్స్ సినిమాల్లో స్పోర్ట్స్ ఆడే పాత్రలు చేస్తున్నారు. ముందుగా హీరోయిన్ రష్మిక మందన్నా 'డియర్ కామ్రేడ్' సినిమాలో క్రికెటర్ గా కనిపించబోతోంది. అలానే 'సూర్మ' అనే బాలీవుడ్ సినిమాలో తాప్సీ హాకీ ప్లేయర్ గా కనిపించబోతుంది. ఇప్పుడు నేనేం తక్కువ అన్నట్లు సాయిపల్లవి కూడా ఫుట్ బాల్ ఆడుతోంది అంటున్నారు ఫిలిం నగర్ జనాలు.ఫుట్ బాల్ నేపథ్యంలో....హను రాఘవపూడి డైరక్షన్ లో శర్వానంద్ హీరోగా వస్తున్న 'పడి పడి లేచె మనస్సు' సినిమాలో సాయి పల్లవి ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనుందట. మొదటి నుండి ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ అని తెలిసిందే. కానీ ఇలా ఫుట్ బాల్ నేపథ్యంలో సాగుతోంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియని అంశం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
https://www.telugupost.com/movie-news/puri-mahesh-next-movie-159015/
మహేష్ బాబుతో పోకిరి – బిజినెస్ మ్యాన్ లంటూ బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు పూరి జగన్నాధ్ మహేష్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు జనగణమన సినిమా కథతో మహేష్ ని కలవడం మహేష్ చేద్దాం చూద్దాం అంటూ పూరి ని తిప్పుకుని.. చివరికి రిజెక్ట్ చెయ్యడం.. తర్వాత పూరి జగన్నాధ్ మహేష్ ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చెయ్యడం.. మహేష్ కి పూరికి మధ్యన ఏం జరిగిందో అనేది అధికారికంగా తెలియకపోయినా.. ఆ విషయంపై అందరిలో ఓ క్లారిటీ ఉంది. ఇక పూరి కి మహేష్ ఓకె చెప్పలేదనే కసి పూరిలో ఉండనే ఉంది. అవకాశం వచ్చినప్పుడు పూరి ఇండైరెక్ట్ గ మహేష్ ని పంచ్ లతో ఆడుకుంటున్నాడు. పూరి మాత్రం మహేష్ తోనే జనగణమన అంటూ కూర్చున్నాడనే టాక్ ఉంది.అయితే తాజాగా మహేష్ ని ఓ అభిమాని ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టి విజయ్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న పూరి జగన్నాధ్ తో భవిష్యత్తులో మూవీ ఎప్పుడూ ఉంటుంది. మూవీ ఉంటుందా? అని అడగగా.. మహేష్ మాత్రం నవ్వుతూ ఖచ్చితంగా పూరి దర్శకత్వంలో ఫ్యూచర్ లో నా మూవీ ఉంటుంది. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరి కూడా ఒకరు,. ఆయన ఎప్పుడు కథ నేరేట్ చేస్తారో అని నేను కూడా వెయిటింగ్ అంటూ మహేష్ పూరికి డైరెక్ట్ గానే షాకిచ్చాడు. మరి మహేష్ చేసిన పనికి పూరి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
https://www.telugupost.com/movie-news/లవ్-ఆఫ్-మై-లైఫ్-46256/
రామ్ చరణ్ కి పెంపుడు జంతువులు అంటే ఎంతిష్టమో తరచూ చూస్తూనే ఉంటాం.... అలాగే వింటూనే ఉంటాం. తన ఫామ్ హౌస్ దగ్గర రామ్ చరణ్ అనేక రకాల పెంపుడు జంతువులను పెంచుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. గుర్రాల దగ్గరనుండి, నెమళ్ళు, కుక్కపిల్లలు ఇలా చరణ్ పెంపుడు జంతువుల లిస్ట్ చాలానే ఉంది. ఇక సినిమా షూటింగ్స్ తోను, ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉన్నప్పుడు వాటి సంరక్షణ చరణ్ వైఫ్ ఉపాసన తీసుకుంటుంది. ఇక ఉపాసన కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ తన మిస్టర్ సి చేసే పనులను ఎప్పటికప్పుడు మెగా అభిమానులకు అందిస్తుంటుంది.రామ్ చరణ్ భార్య ఉపాసన భర్త చేసే పనులని... అలాగే అతనికి సంబందించిన విశేషాలను ఆమె ట్విట్టర్ వేదికగా పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. మొన్నామధ్యన పెంపుడు కోడి పుంజుతో చరణ్ అంటూ ఒక పిక్ ని పోస్ట్ చేసిన ఉపాసన ఇప్పుడు తాజగా మరో అందమైన ఫోటోని పోస్ట్ చేసింది. రామ్ చరణ్ సోఫాలో కూర్చుని ఉండగా అతడి ఒడిలో ప్రేమగా పెంచుకునే కుక్కపిల్ల (బ్రాట్) ఒకటి ఠీవీగా కూర్చుని ఉంది. లవ్ ఆఫ్ మై లైఫ్ అనే హ్యాష్ టాగ్ తో ఉపాసన ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఆ పిక్ లో రామ్ చరణ్ గుబురు గెడ్డంతో ఒడిలో పెంపుడు కుక్క బ్రాట్ తో అందమైన ఫోటోకి ఫోజులిచ్చాడు.ఇక చరణ్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకూండా తన తండ్రి సై ర నరసింహారెడ్డి సినిమా నిర్మాణ బాధ్యతల్లో కూడా తలమునకలై ఉన్నాడు.
https://www.telugupost.com/movie-news/భారం-తేజు-పై-వేస్తే-ఇప్పు-30414/
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి తన సినెమాలన్నిటిలోకి చాలా తక్కువ వర్కింగ్ షెడ్యూల్ తో అతి వేగంగా పూర్తయ్యే చిత్రమని చెప్పి మొదలు పెట్టిన నక్షత్రం ఇప్పటికి సెట్స్పై దాదాపు ఏడాదిన్నర్ర పూర్తి చేసుకోబోతున్నా ఇంకా ఫస్ట్ కాపీ సిద్ధమయ్యే డేట్ ఖరారు కావటం లేదు. దానితో నిర్ణీత వ్యయాన్ని దాటుకుని నక్షత్రం బడ్జెట్ నక్షత్రాలని తాకుతుంది. కృష్ణ వంశి తన సక్సెస్ ట్రాక్ నుంచి బైటకి వచ్చి చాలా కాలం గడిచిపోవటంతో క్రియేటివ్ డైరెక్టర్ బ్రాండ్ ఇమేజ్ తో సినిమాకి భారీ బిజినెస్ కలిపించే పరిస్థితి కూడా లేదు. దానితో భారమైన బడ్జెట్ నుంచి నిర్మాతని సేఫ్ జోన్ లోకి తీసుకువెళ్ళటానికి సినిమాని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఫేమ్ తో ప్రచారం చేసి సేఫ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరపాలని అనుకున్నారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తిక్క, విన్నర్ వంటి ఘోర పరాజయాలతో తన మార్కెట్ ని క్లిష్ట పరిస్థితులలోకి నెట్టుకున్నాడు. దానితో తేజు ఫేమ్ ని నమ్మి అత్యధిక రేట్లకి సినిమాని కొనటానికి పంపిణీదారులు ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సాయి ధరమ్ తేజ్ మార్కెట్ మీద నమ్మకంతోనే ముందుగా 20 నిమిషాల నిడివికి పరిమితమైన అతని పాత్రని 40 నిమిషాల నిడివికి పెంచటమే కాకుండా తేజు పై ఒక పాటని కూడా చిత్రీకరించారు కృష్ణ వంశి. సందీప్ కిషన్ టాలెంటెడ్ యాక్టర్ అయినప్పటికీ పెరిగిన నక్షత్రం సినిమా బడ్జెట్ స్థాయికి ప్రీ రిలీజ్ బిజినెస్ చేపించగలిగిన స్టార్ స్టేటస్ లేని హీరో. అందుకే నక్షత్రం పూర్తి భారం తేజు పైనే వుంది. కృష్ణ వంశి కూడా నిడివికి సంబంధం లేకుండా అంతఃపురం చిత్రంలో జగపతి బాబు పోషించిన పాత్ర తరహాలో బలమైన పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపిస్తాడని ప్రమోట్ చేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు సహకరిస్తుందో చూద్దాం.
https://www.telugupost.com/crime/two-students-from-telangana-were-killed-in-a-road-accident-in-america-1531701
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణకు చెందిన విద్యార్థులు మరణించారు. భారత కాలమాన ప్రకారం నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేేసుకుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ కు చెందిన గౌతమ్ కుమార్, కరీంనగర్ జిల్లా హుజూర్ నగర్ కు చెందిన ముక్క నివేశ్ అమెరికాలోని అరిజోనా స్టేట్ వర్సిటీలో చదువుతున్నారు.వాటర్ ఫాల్స్ కు వెళుతుండగా...వీకెండ్ లో వీరిద్దరూ స్నేహితులతో కలసి కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగంది. వీరు ప్రయాణించే కారును మరో ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందిని తెలిపారు. గౌతమ్, నివేశ్ అక్కడికక్కడే మరణించగా మరికొందరికి గాయాలయ్యాయి. వీరంతా వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళుతున్నారని తెలిసింది. దీనిపై అరిజోనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల మరణంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.
https://www.telugupost.com/andhra-pradesh/andhra-pradesh-government-has-taken-a-crucial-decision-government-has-given-permission-for-cbi-investigation-directly-in-anahra-pradesh-1548607
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు నేరుగా ఏపీలో అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు, ప్రయివేటు సంస్థలు వంటి వాటిపై ఏదైనా ఫిర్యాదు వస్తే సీబీఐ నేరుగా విచారణ చేపట్టేందుకు అవకాశమిచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీబీఐ విచారణ చేపట్టాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అంటూ షరతు మాత్రం విధించింది. 2014 - 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణకు నిరాకరిస్తూ నాటి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కొన్ని కీలక కేసులను అయితే తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐ విచారణకు అనుమతించినప్పటికీ తాజాగా మరోసారి గెజిట్ విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జగన్ తో పాటు వైసీపీ నేతల కోసమే ఈ గెజిట్ ను విడుదల చేసినట్లు గుసగుసలు వినిపస్తున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొన్ని కీలక కేసులను సీఐడీకి అప్పగించింది. మద్యం కేసుతో పాటు ఇసుక దోపిడీ, ఆడుదాం ఆంధ్ర, ఫైబర్ నెట్ కేసులను ఏపీ సీఐడీ విచారిస్తుంది. అయితే సీఐడీ విచారణ చేపట్టే ఈ కేసుల కన్నా ముఖ్యమైన కేసులను సీబీఐకి అప్పగించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు.రాజకీయంగా ఇబ్బందులను...సీబీఐ విచారణతో జగన్ రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొనడమే కాకుండా న్యాయస్థానాలకు హాజరయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పుులను లెక్క గడుతున్న కూటమి ప్రభుత్వం సీబీఐ అయితే జగన్ కు కరెక్ట్ అని భావించి తిరిగి సీబీఐ ఏపీలో విచారణకు అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్రమ బియ్యం సరఫరాపై ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు వివిధ కేసుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరికొందరు సీనియర్ నేతలను కూడా ఇరికించే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు స్కెచ్ జగన్ పార్టీపై అదిరిపోయిందిగా?
https://www.telugupost.com/movie-news/tollywood-star-hero-daughter-is-to-be-the-heroine-in-uppena-movie-1506361
Uppena : మెగా వారసుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమా 'ఉప్పెన'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా డెబ్యూట్ ఇస్తూ చేసిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డెబ్యూట్ మూవీతోనే 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారసుల్లో వైష్ణవ తేజ్ రికార్డు సృష్టించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ కృతిశెట్టి ఆడియన్స్ కి పరిచయమైన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో కృతి టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్‌డమ్ ని సంపాదించుకున్నారు. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ హీరోయిన్ గా బిజీ అయ్యారు. అయితే ఉప్పెన సినిమాలో కృతిశెట్టికి బదులు మరో భామ నటించాల్సిందట. ఒక స్టార్ హీరో కుమార్తె హీరోయిన్ గా డెబ్యూట్ ఇవ్వాల్సిందట. దర్శకుడు బుచ్చిబాబు ఆమెకు ఈ సినిమా కథని వినిపిస్తే.. ఆమె రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు..? ఆ వారసురాలు ఎవరు..?టాలీవుడ్ యాంగ్రీ మెన్ రాజశేఖర్ కుమార్తె 'శివానీ' ఉప్పెన సినిమాలో నటించాల్సి ఉందట. కానీ శివానీ నో చెప్పడంతో ఆ ఛాన్స్ కృతికి వెళ్ళింది. ఇంతకీ శివానీ ఉప్పెన చిత్రానికి ఎందుకు నో చెప్పింది..? బుచ్చిబాబు తనకి కథ చెప్పినప్పుడు సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయట. అందుకనే ఆమె నో చెప్పిందట. కానీ సినిమా రిలీజ్ అయ్యిన తరువాత చూస్తే.. అలాంటి సన్నివేశాలు అసలు కనిపించలేదని, కథలో చాలా మార్పులు కనిపించాయని శివానీ చెప్పుకొచ్చారు.అలా బోల్డ్ సీన్స్ కారణంతో శివానీ ఆ సూపర్ హిట్ మూవీ ఛాన్స్ ని మిస్ అయ్యింది. ఆ తరువాత యువహీరో తేజ సజ్జా సరసన 'అద్భుతం' సినిమాలో నటించి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. గత ఏడాది తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు చేశారు. రీసెంట్ గా 'కోటబొమ్మాళి పీఎస్‌' సినిమాలో నటించిన ఆడియన్స్ ముందుకు వచ్చారు. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా పొలిటికల్ డ్రామాతో అందర్నీ ఆకట్టుకుంటుంది.
https://www.telugupost.com/movie-news/puri-jagannath-vijay-devarakonda-movie-131295/
క్రేజీ కాంబినేషన్ అయినా విజయ్ దేవరకొండ – పూరి ల సినిమా నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈమూవీ అయినా వెంటనే పూరి తో సినిమా స్టార్ట్ చేస్తాడు. దీనికి ఆల్రెడీ ఫైటర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. టైటిల్ తగ్గట్టుగానే ఇందులో విజయ్ టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈమూవీలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా కనిపించనున్నాడు విజయ్ దేవరకొండ . దాంతో ఇప్పటినుండే ఈసినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. పైగా పూరి సినిమాల్లో హీరోల లుక్ నుండి ఆటిట్యూడ్ వరకు సరికొత్తగా చూపించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇందులో విజయ్ ను ఎలా చూపించబోతున్నాడో అని ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారు దేవరకొండ ఫ్యాన్స్. ఇక ఈమూవీ పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మించనున్నారని తెలుస్తుంది. హీరోయిన్, ఇతర నటీనటులు,మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సిఉంది.
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-film-fare-80113/
అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ తన సేవాభావాన్ని అప్పుడప్పుడూ చూపిస్తుంటాడు. తాజాగా ఆయనకు దక్కిన ఫిలిం ఫేర్ అవార్డును వేలం వేసి ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అన్నమాట ప్రకారం ఆదివారం సాయంత్రం ఆయన తన అవార్డును వేలం వేశారు. దివి ల్యాబ్స్ నిర్వాహకులు శకుంతల దివి, కిరణ్ దివవి ఈ అవార్డును రూ.25 లక్షలకు కొనుగోలు చేశారు.రూ.5 లక్షలు అడిగితే...అయితే, ఈ అవార్డు కోసం విజయ్ దేవరకొండ రూ.5 లక్షలకు కొనుగోలు చేయాలని విజయ్ దివి ల్యాబ్స్ వారిని కోరారంట. అది అర్జున్ రెడ్డి సినిమాకు విజయ్ అందుకున్న రెమ్యునరేషన్ తో సమానం. అయితే, ఈ సేవవాభావంతో విజయ్ ఈ కార్యక్రమం చేస్తున్నందున దివి ల్యాబ్ వారు రూ.25 లక్షలు ఇస్తామని, అవార్డు కూడా విజయ్ వద్దే ఉంచుకోవాలని కోరారు. కానీ, దివి ల్యాబ్ వారు చేసిన ఈ సహాయం సంస్థ ఉద్యోగులకు తెలియాలనే ఉద్దేశ్యంతో అవార్డును సంస్థ వద్దే పెట్టుకోవాలని విజయ్ కోరారు. దీంతో రూ.25 లక్షలను విజయ్ దేవరకొండ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశారు.
https://www.telugupost.com/crime/a-terrible-road-accident-happened-in-the-west-african-country-of-senegal-forty-people-died-in-this-accident-1456493
పశ్చిమాఫ్రికా దేశమైన సెనగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలభై మంది మరణించారు. 78 మంది వరకూ తీవ్ర గాయాలపాలయ్యారు. రెండు బస్సులు ఢీకొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సెనగల్ లో క‌ఫ్రీన్ ప్రాంతంలోని నివీ గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రెండు బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి పోయి ఉండటంతో మృతులు, గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.టైరు పంక్చర్ కావడంతోనే...సెనగల్ లోని ఒకటో నెంబరు జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్నాయి. బస్సు టైర్ పంక్చర్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. గాయపడిన 78 మందిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం వైద్యాధికారులను ఆదేశించింది.