link
stringlengths 41
231
| text
stringlengths 28
5k
|
---|---|
https://www.telugupost.com/crime/tadipatri-rural-ci-ananda-rao-demise-family-members-says-work-pressure-1483200 | అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఆనందరావు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పని ఒత్తిడే తన తండ్రి ప్రాణం బలిగొందని ఆయన కుమార్తె భవ్య కన్నీరు పెట్టుకున్నారు. ఆనందరావు గతంలో తిరుపతి, కడపలో పనిచేశారని, క్కడా ఒత్తిడికి గురికాలేదని చెప్పారు. తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, తన వల్ల కావడం లేదని చెప్పుకుని పలుమార్లు బాధపడ్డారని భవ్య తెలిపారు.తాడిపత్రి సీఐ ఆనందరావు మృతికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంతాపం తెలిపారు. సీఐ ఆనందరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనాస్థలిని అనంతపురం ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. సీఐ ఆనందరావు మృతికి కారణాలపై ఎస్పీ శ్రీనివాసరావు ఆరా తీశారు. సీఐ ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. ఆత్మహత్య ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. |
https://www.telugupost.com/movie-news/big-boss-season-4-remuneration-to-contestants-169011/ | బిగ్ బాస్ సీజన్ 4 లో హౌస్ లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఎవరూ పెద్దగా క్రేజ్ ఉన్నవాళ్లు లేరు. సీజన్ 4 కి అదే పెద్ద మైనస్. అయితే ఈ సీజన్లో లాస్య, నోయెల్, అమ్మ రాజశేఖర్ లాంటి వాళ్ళు తప్ప మిగతావారినెవరు పెద్దగా చూసింది లేదు.. అలాంటిది ఈ షో ఎలా 100 రోజులు గడుస్తుందో అందులోని.. సోమవారం ఎలిమినేషన్స్ విషయంలో ఇంటి సభ్యులంతా బుర్ర లేకుండా ఎవరికీ వారు త్యాగం చేసుకుని ఎలిమినేషన్స్ కి వెళ్లారు. ఎవరిని ఎలిమినేటి చేసిన హార్ట్ అవుతారంటూ బిగ్ బాస్ గేమ్ ని సేఫ్ గా ఆడేస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ పారితోషకాల మీద బయట పెద్ద చర్చే నడుస్తుంది. కొద్దిగా ఫేమ్ ఉన్న యాంకర్ లాస్య, అమ్మ రాజశేఖర్ లకి రోజుకి లక్ష చొప్పున ఫిక్స్ చేసిందట బిగ్ బాస్ యాజమాన్యం. ఇక నోయెల్ కి హీరోయిన్ మోనాల్ కి రోజుకి 50 వేల ఫిక్స్ చెయ్యగా గంగవ్వ, టివి 9 యాంకర్ దేవికి, కరాటే కళ్యాణి, హీరోయిన్ దివికి, హీరో అభిజిత్ కి రోజుకి 25 వేల చొప్పున, మిగతా కంటెస్టెంట్స్ కి రోజుకి 10 వేల చొప్పున ఫిక్స్ చేశారట. మరి యాంకర్ లాస్య, అమ్మ రాజశేఖర్ షో లో 100 రోజులుంటే 1 కోటి పట్టుకెలెత్తారు. అలాగే బిగ్ బాస్ విన్ అయితే అదనంగా మరో 50 లక్షలన్నమాట. మరి లాస్య, అమ్మ రాజశేఖర్ లు 100 రోజులుంటారా? లేదా అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఇక నోయెల్, దివి, దేవి లాంటి వాళ్ళు ఎన్ని రోజులు షో లో ఉంటేపెద్ద మొత్తం అందుకుంటాని అంటున్నారు. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ కి క్వారంటైన్ లోను స్టార్ మా పారితోషకాలు చెల్లించింది అనే టాక్ ఉంది |
https://www.telugupost.com/movie-news/nagarjuna-ram-gopal-varma-officer-movie-68368/ | ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏం బాగోలేదు. అసలు ఇకనుండి వర్మకి డైరెక్షన్ అవకాశాలు ఏ హీరోలైనా ఇస్తారంటే అనుమానమే. అంతలా వర్మ తన ఇమేజ్ ని శ్రీ రెడ్డి వ్యవహారంలో తల దూర్చి డ్యామేజ్ చేసుకున్నాడు. శ్రీ రెడ్డి తో పవన్ కళ్యాణ్ ని తిట్టించి పవన్ ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలు, మెగా హీరోల ఆగ్రహానికి గురయ్యాడు. గత కొంతకాలం నుండి రామ్ గోపాల్ వర్మ తిన్నగా ఒక్క పని చేసింది లేదు. అసలు ఫామ్ లో లేని వర్మకి నాగార్జున ఆఫీసర్ చిత్ర అవకాశం ఇవ్వడమే ఎక్కువ. నాగార్జున ఎక్కువగా వివాదాలకు దూరంగా ఉండడానికే ఇష్టపడతాడు. అయినా వర్మ నాగార్జున సినిమాని తెరకెక్కిస్తూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలోనూ, జీఎస్టీ విషయంలోనూ నానా హడావిడి చేసాడు. అయినా నాగ్ మౌనంగానే ఉన్నాడు.అయితే నాగార్జున - వర్మల సినిమా షూటింగ్ కంప్లీట్ కావడము సినిమా మే 25 న విడుదల తేదీ ప్రకటించడం జరిగిపోయాయి. కాకపోతే వర్మ ఎఫెక్ట్ తో ఆఫీసర్ సినిమాకి బిజినెస్ జరగలేదనే టాక్ ఉంది. ఇక ఇప్పుడు పవన్ విషయంతో సినిమా మీద ప్రేక్షకులకు పూర్తిగా ఆసక్తి పోయింది అంటున్నారు.అయితే ఇవన్నీ లెక్కచెయ్యని వర్మ, నాగార్జున ఆఫీసర్ సినిమా కి రీ షూటింగ్ నిర్వహిస్తున్నాడనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. అందుకే నాగార్జున ముంబై లోని ఆఫీసర్స్ సెట్స్ కి మళ్ళీ వెళ్లినట్టుగా చెబుతున్నారు. షూట్ జరిగిన స్టూడియోకి మళ్ళీ నాగార్జున వెళ్లడంతో.. ఆఫీసర్ లో కొన్ని సీన్స్ నాగ్ కి నచ్చక వర్మతో రీ షూట్ చేపిస్తున్నాడంటున్నారుమరి నాగార్జున ఆఫీసర్ సినిమాలో పోలీస్ అధికారిగా కనబడుతున్నాడు.అయితే ఈ సినిమా ఇంటర్వెల్ కూడా లేకుండా కేవలం గంటా 45 నిమిషాలు మాత్రమే ఉంటుందట. అలాగే ఈ సినిమా మొత్తం ఇద్దరు కూతుళ్లని ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేయడం... వాళ్లని సీఐఏ అధికారి విడిపించడమే అసలు స్టోరీ అంటున్నారు |
https://www.telugupost.com/movie-news/shruthi-haasan-not-attending-to-waltair-veerayya-pre-release-event-1456453 | మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రూపొందిన సినిమా వాల్తేరు వీరయ్య. జనవరి 13న విడుదలకు రెడీ అవుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా.. నేడు విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం.. రవితేజ, చిరంజీవి, బాబీ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత ప్రైవేట్ జెట్ లో విశాఖకు చేరుకున్నారు. కాగా.. వాల్తేరు వీరయ్యలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోతున్నట్లు చెప్పి.. అభిమానులకు షాకిచ్చింది.ఆరోగ్యం బాలేకపోవడంతో.. ఈ ఈవెంట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని శృతి హాసన్ తెలిపింది. ఈవెంట్ ను చాలా మిస్ అవుతున్నానని విచారం వ్యక్తం చేసింది. శృతి హాసన్ అటు బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలోనూ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఒంగోలులో జరగ్గా, ఈ కార్యక్రమానికి శృతి హాజరైంది. కాగా.. వాల్తేరు వీరయ్య ఈవెంట్ కోసం ఏయూ గ్రౌండ్స్ కి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. |
https://www.telugupost.com/top-stories/former-dharmavaram-mla-varadapuram-suri-is-currently-at-the-cross-roads-politically-he-does-not-know-what-to-do-1471886 | గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి రాజకీయాల్లో తనకు తానే ఫుల్్ స్టాప్ పెట్టుకున్నారనే అనిపిస్తుంది. టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయి తాత్కాలిక ప్రయోజనం కోసం బీజేపీలో చేరిన సూరికి రాజకీయ భవిష్యత్ కనుచూపు మేరలో కన్పించడం లేదు. ఆయన పార్టీ మారినా ఐదేళ్లు కమలం మాటున తలదాచుకునేందుకు ఉపయోగ పడి ఉండవచ్చేమో కాని, శాశ్వతంగా ధర్మవరానికి దూరమవుతారా? అన్న చర్చ మొదలయింది. పాపం.. సూరన్న అనే వాళ్లు కొందరైతే... పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వారికి అలాగేశాస్తి జరగాలి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో వరదాపురం సూరి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.తాత్కాలిక ఉపశమనం కోసం...2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి ధర్మవరం ఎమ్మెల్యేగా నెగ్గారు. అప్పడు కూడా ప్రత్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అధికార వైసీపీ నుంచి వేధింపులు, కేసుల నుంచి కాపాడుకోవడానికి ఆయన బీజేపీ పంచన చేరారు. ఎందుకు చేరారో ఆయనతో పాటు ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గంలో పెద్దగా బలం లేని పార్టీలో చేరడం ఆయన కేవలం తనను రక్షించుకోవడం కోసమే. అదే ఆయనను రాజకీయంగా బలి తీసుకున్నట్లయింది. ఆయనకు గత అనుభవాలు కూడా ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తున్నాయి. 2009 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కేతిరెడ్డి చేతిలోనే ఓటమి పాలయ్యారు.టీడీపీలోకి వద్దామనుకున్నా...ఎన్నికలకు ముందు టీడీపీలోకి వద్దామనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ఎందుకంటే అక్కడ పరిటాల శ్రీరామ్ పాతుకుపోయారు. ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నాళ్లు వెయిట్ చేస్తారు. రెండేళ్లు ముందుగానే పరిటాల శ్రీరామ్ కు ధర్మవరం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. అక్కడ శ్రీరామ్ తిరుగుతూ కేతిరెడ్డిపై పోరాటం చేస్తూ క్యాడర్ వెంట నిలబడి ఉన్నారు. వరదాపురం సూరి అభ్యర్థిత్వాన్ని పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కష్ట సమయంలో పార్టీని వదిలేసి వెళ్లిపోయిన వారిని తిరిగి ఎలా చేర్చుకుంటారన్న ప్రశ్న ధర్మవరం టీడీపీ క్యాడర్ నుంచి వినిపిస్తుంది. పరిటాల శ్రీరామ్ కూడా వరదాపురం సూరి టీడీపీలో చేరిపై ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇద్దరి మధ్య వార్ ఎప్పటినుంచో జరుగుతుంది. తిరిగి వరదాపురం సూరిని పార్టీలోకి చేర్చుకుని ధర్మవరం టిక్కెట్ ఇచ్చినా పరిటాల వర్గం సహకరించనంతగా.పోటీ చేస్తే మాత్రం..తాజాగా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ధర్మవరం టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ అని ప్రకటించారు. లోకేష్ సాధారణ నేత కాదు. ఆయన చెబితే అది అధికారిక ప్రకటనగానే చూడాలి. ఆషామాషీగానో.. సరదాగానో.. తమాషాగానో చేసి ఉంటారని అనుకోవడానికి వీలులేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు పాదయాత్రలో ఆయన అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ముఖ్యమైన నేతల విషయంలోనే లోకేష్ ప్రకటస్తున్నారు తప్పించి అన్ని చోట్లా ఇష్టమొచ్చినట్లు ప్రకటించరు. లోకేష్ నోటి నుంచి వచ్చింది అంటే అది సెలక్షనే.. ఎలక్షన్ లో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో వరదాపురం సూరి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తారా? లేదా బీజేపీ నుంచి బరిలో ఉంటారా? అన్నది చర్చనీయాంశమైంది. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా అది వైసీపీకే అనుకూలిస్తుంది. అందుకే టీడీపీ ఆయనకు ఏ రకమైన రాజకీయ ఏర్పాట్లు చేస్తుందన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. |
https://www.telugupost.com/movie-news/sandeep-kishan-film-with-new-concept-106151/ | తెలుగులో మంచి సినీ అండ ఉన్న యంగ్ హీరోగా సందీప్ కిషన్‌ని చెప్పాలి. ‘ప్రస్థానం’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో కెరీర్‌లో వచ్చిన ఒకే ఒక్క హిట్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’. హిందీలో నటించినా కూడా ఈయన ఈ మద్య ఎక్కువగా తమిళ, తెలుగు ద్విభాషా చిత్రాలపై మోజు పెంచుకున్నాడు. కానీ అవి కూడా ఆయనకు వర్కౌట్ కావడం లేదు. కృష్ణ వంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో ఆయనకు సపోర్ట్ గా సాయి ధరమ్ తేజ్ వంటి వారు ఉన్నా అది డిజాస్టర్‌గా నిలిచింది. మహేష్ బాబు సోదరి మంజుల దర్శకత్వంలో ‘మనసుకు నచ్చింది’ చిత్రం చేసినా ప్రేక్షకులకు మాత్రం అది నచ్చలేదు. ప్రస్తుతం ఆయన ‘నిన్ను వీడని నీడను నేను’ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ హీరోకి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఇటీవలే సుమంత్ హీరోగా ఈషా రెబ్బా జంటగా ‘సుబ్రహ్మణ్యపురం’ వంటి వెరైటీ చిత్రం తీసిన సంతోష్ జాగర్లమూడి ఆయనకు ఓ క్రీడా నేపథ్యం ఉన్న ఇంట్రస్టింగ్ స్టోరీని వినిపించడం, వెంటనే సందీప్ కిషన్ దానికి ఓకే చేయడం కూడా జరిగిపోయాయి. ఏకలవ్యుడి కథతో… మహాభారతంలోని ఏకలవ్యుడు కాన్సెప్ట్ ని డెవెలప్ ఈ కథను తయారు చేశారు. ఏకలవ్యుడు విల్లు విద్యలో అర్జునుడిని మించిన వాడు. ఆయన ద్రోణాచార్యుడి విగ్రహాన్నే గురువుగా భావించి విల్లు విద్యలో అర్జునుడిని మించిన ప్రతిభ సాధించాడు. కానీ ద్రోణాచార్యుడు మాత్రం ఏకలవ్యుడిని గురు దక్షిణగా అత్యంత ముఖ్యమైన బొటన వేలిని గురు దక్షిణగా అడిగాడు. ఇదే ఏకలవ్యుడు జీవితంపై గతంలో కృష్ణ హీరోగా మల్లెమాల ఓ చిత్రం నిర్మించి ఉన్నాడు. ఆధునిక కాలంలో ఓ గురువు తన ఏకలవ్య శిష్యుడిని ఎలాంటి గురు దక్షిణ అడిగాడు? అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ‘కార్తికేయ’ చిత్రాన్ని నిర్మించిన వెంకట శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండటం విశేషం. క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాల తాకిడి టాలీవుడ్‌లో బాగా పెరిగిన నేపధ్యంలో ఈ కొత్త కాన్సెప్ట్ చిత్రమైనా సందీప్ కిషన్‌కి హిట్ ఇస్తుందేమో చూడాలి…! |
https://www.telugupost.com/movie-news/movie-artist-association-has-extended-election-polling-time-by-another-hour-203915/ | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించారు. ఓటర్లు ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో మరో గంట పాటు పొడిగించాలని నిర్ణయించారు. వాస్తవానికి పోలింగ్ మధ్యాహ్నం రెండుగంటలకు ముగియాల్సి ఉన్నా మూడు గంటల వరకూ పొడిగించారు. ఇప్పటి వరకూ దాదాపు 540 మంది తమ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. |
https://www.telugupost.com/top-stories/telangana-elections-are-approaching-campaign-that-there-is-going-to-be-inclusion-in-bjp-will-go-on-vigorously-1472487 | తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీలో చేరికలు ఉండబోతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నెల 23వ తేదీన అమిత్ షా సభలో సీనియర్ నేతల చేరికలు ఉంటాయని చెబుతున్నారు. బీజేపీలో చేరేదెవరన్న దానిపై జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అధికార బీఆర్ఎస్ నుంచి నేతలు వస్తారా? లేదా కాంగ్రెస్ నేతలను ఆకట్టుకుని వేదికపైకి తెస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా సభలో చేరికలు మాత్రం ఉంటాయని మాత్రం బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. ఇందుకోసం చేరిక కమిటీ కూడా కసరత్తు చేస్తుందని చెబుతున్నారు.చేరికల కమిటీ...అందుతున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు బీజేపీలోకి వెళతారన్న సమాచారం అయితే బయటకు వచ్చింది. అందులో ఎంత నిజం ఉన్నదీ తెలియనప్పటికీ చేవెళ్ల సభలో ఆ ఎమ్మెల్సీ బీజేపీలో చేరతారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి మధ్య పొసగకపోవడం, బీఆర్ఎస్ నాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యేకే మద్దతుగా ఉండటంతో ఆయన పార్టీని వీడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో కూడా చేరికల కమిటీ సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానిక నాయకులైన డీకే అరుణ లాంటి నేతలు కూడా వారిని సంప్రదిస్తూ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి నిర్ణయం ఇంకా వెలువడలేదు.కాంగ్రెస్ ముఖ్యనేతలు...ఇక కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ముగ్గురు ముఖ్యనేతలు కూడా బీజేపీలో చేరే అవకాశముందంటున్నారు. వారంతా కాంగ్రెస్ లో నాయకత్వం పట్ల గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నవారు. నియోజకవర్గంలో సొంత బలం కొద్దో గొప్పో ఉన్నవారు కావడంతో వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దొరకడమూ కష్టమని భావించి బీజేపీలో అయితే టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకుని మరీ చేరవచ్చన్న అభిప్రాయంతో చేరికల కమిటీ వారిని కూడా సంప్రదిస్తున్నట్లు తెలిసింది. టిక్కెట్లు రావని డౌట్ ఉన్న వాళ్లు, నిధుల సమస్య ఉన్న నేతతు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు.టిక్కెట్ దక్కదని భావించి...దీంతో పాటు బీఆర్ఎస్ లో గత ఐదేళ్లలో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారిలో అక్కడ పోటీ చేసిన అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు అని ప్రకటించడంతో కొందరు తమ రాజకీయ భవిష్యత్ కోసం కమలం దారి పడుతున్నారని సమాచారం. వారిలో కొందరు రెడ్డి సామాజికవర్గం నేతలు కూడా ఉన్నారని చెబుతున్నారు. బీజేపీలో చేరితే భవిష్యత్ ఉంటుందని గ్యారంటీ టిక్కెట్ అని హామీలు దక్కడంతోనే కొందరు బీజేపీ వైపు వెళుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి వేదికపైకి చివరకు ఎవరు వస్తారన్నది చూడాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/there-is-a-suspense-as-to-who-will-be-the-first-to-be-eliminated-in-bigg-boss-season-5-202082/ | బిగ్ బాస్ సీజన్ 5 లో మొదట ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న ఉత్కంఠ నెలకొంది. ఈ వీకెండ్ లో ఇద్దరు కంటెస్టెంట్లు సేఫ్ అయ్యారు. సరయు, రవి, హమీదా, కాజల్, జెస్సీ, మానస్ లు నామినేషన్లలో ఉన్నారు. వీరిలో యాంకర్ రవి, హమీదా సేఫ్ అయ్యారు. మరో నలుగురు కంటెస్టెంట్లలో ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళతారన్న దానిపై చర్చ జరుగుతోంది. మానస్, జెస్సీ, కాజల్, సరయుల్లో సరయు హౌస్ ను వీడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. |
https://www.telugupost.com/movie-news/జతగా-చిత్రానికి-సెన్స-5204/ | రింగులజుత్తు సోయగం నిత్యామీనన్ - దుల్కార్ సల్మాన్ కాంబినేషన్ అంటేనే యువతరంలో విపరీతమైన క్రేజు. మలయాళంలో వరుస బ్లాక్‌బస్టర్ల తర్వాత ఈ జంట నటించిన 'ఓకే బంగారం' తెలుగులో మరో బ్లాక్‌బస్టర్ హిట్. దుల్కార్-నిత్యా జంటగా నటించిన తాజా చిత్రం 'జతగా'. మలయాళంలో జాతీయ అవార్డులు సంపాదించిన 'ఉస్తాద్ హోటల్'ని 'జతగా' పేరుతో అందిస్తున్నారు. అన్వర్ రషీద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా వంటి విజయవంతమైన చిత్రాల్ని అందించిన నిర్మాత సురేష్ కొండేటి ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. 'జతగా' మూవీ సెన్సార్ కార్యక్రమాలు మంగళవారం(4అక్టోబర్) హైదరాబాద్‌లో పూర్తయ్యాయి. సెన్సార్ యుఎ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ఈ గురువారం (06-10-16) 'సంతోషం' ఎడిటర్ అండ్ పబ్లిషర్, ఎస్.కె.పిక్చర్స్ అధినేత, నిర్మాత సురేష్ కొండేటి బర్త్‌డే, తాజా చిత్రం 'జతగా' సెన్సార్ పూర్తయిన సందర్భంగా..నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ -''చక్కని సందేశాత్మక కథాంశంతో రూపొందిన అందమైన ప్రేమకథా చిత్రమిది. పేద, ధనిక వర్గాల మధ్య ఉండే అంతరాలను స్పృశిస్తూ సున్నితమైన భావోద్వేగాలతో దర్శకుడు జనరంజకంగా తీర్చిదిద్దారు. దుల్కార్ సల్మాన్, నిత్యామీనన్ జంట మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్. గోపీసుందర్ బాణీలు సినిమాకి పెద్ద ప్లస్. యూత్, ఫ్యామిలీ ఆడియెన్‌కి నచ్చే పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలున్నాయి. మలయాళంలో జాతీయ అవార్డులు అందుకున్న 'ఉస్తాద్ హోటల్' చిత్రాన్ని 'జతగా' పేరుతో తెలుగులో అందిస్తున్నాం. మంగళవారం హైదరాబాద్‌లో సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బృందం యుఎ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ప్రేమిస్తే, జర్నీ తరహాలో అసాధారణ విజయం సాధించే చిత్రమిదని, చక్కని ప్రేమకథా చిత్రమని సెన్సార్ బృందం అభినందించడం ఆనందాన్నిచ్చింది'' అన్నారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, తిలకన్, సిద్ధిఖి, అసీమ్ జమాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: ఎస్. లోకనాథన్, రచన: అంజలి మీనన్, పాటలు: శ్రీమణి, పులగం చిన్నారాయణ, శ్రీవల్లి, మాటలు: సాహితి.ఎస్.కె.పిక్చర్స్ నుంచి స్ట్రెయిట్ చిత్రాలు:సినీవారపత్రికా లోకంలో సురేష్ కొండేటి 'సంతోషం' ప్రస్థానం 15 ఏళ్లు. కేవలం స్వయంకృషితో సాగించిన ఈ ప్రస్థానం ఆషామాషీ కాదు. ఎన్నో ఒడిదుడుకులు.. ఎగుడు దిగుడుల పయనం.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అలుపెరగని విజయవంతమైన ప్రస్థానం ఆయనది. కసిని పెట్టుబడిగా పెట్టి లక్ష్య సాధనలో తేజోవంతంగా ముందుకెళ్లి అనుకున్నది సాధించుకున్నారు. సంతోషం ఎడిటర్‌గానే కాదు... అవార్డుల కర్తగానే కాదు.... ఉత్తమ చిత్రాల పంపిణీదారుడిగా, 12 ఉత్తమ చిత్రాల నిర్మాతగానూ తనని తాను ఆవిష్కరించుకున్నారు. అందుకే సన్నిహితులు, తన గురించి తెలిసిన వారు 'సక్సెస్‌ల సురేష్' అంటారు. నిప్పుల గుండం లాంటి రంగంలో ఆయనను దగ్గరగా చూసేవాళ్లు మెప్పుకోలుగా చూస్తారు. ఎవరికీ అర్థం కాడు. కత్తిమీద సాము లాంటి విన్యాసాలెన్నో చేస్తారు. చివరికి పట్టు వదలని విక్రమార్కుడిలా తన పని తాను పూర్తి చేసుకుని వెళతాడు. అదీ ఆ వ్యక్తిత్వం. ఒక వ్యక్తిగా ఇన్ని విజయాలు అంత సులువేం కాదని విశ్లేషకులు చెబుతారు. పరిమిత సిబ్బంది అండతో.. ఇంకా చెప్పాలంటే ఒంటి చేత్తో వీటన్నిటినీ సాధించుకున్ననిరంతర శ్రామికుడిగా సహచరులు చెబుతుంటారు.15 సంవత్సరాలుగా 'సంతోషం' సినీవారపత్రిక ఎడిటర్, పబ్లిషర్‌గా సినిమా లోకంలో పేరు తెచ్చుకుని, 'సౌత్ ఇండియన్ సంతోషం ఫిలిం అవార్డ్స్'ను ఘనంగా నిర్వహిస్తున్న వ్యక్తిగా సురేష్ కొండేటి పయనం అసాధారణం. ''15 ఏళ్ల పాటు సినీవారపత్రికను నడిపిస్తూ.. ఇలా అవార్డులు నిర్వహించడం అంటే ఓ వ్యక్తికి అసాధ్యం. కార్పొరెట్ కంపెనీలకే సాధ్యం కాని పని ఇది. అయితే ఓ వ్యక్తి 14 సంవత్సరాల పాటు అవార్డుల కార్యక్రమం, 15 సంత్సరాలుగా సినీ పత్రికను విజయవంతంగా నడిపించడం గ్రేట్'' అంటూ 'సంతోషం 14వ అవార్డు వేడుకల వేళ దర్శకరత్న దాసరి అంతటి వారే ప్రశంసించారు. నేను ఉన్నంతవరకూ ఈ అవార్డుల కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. తుది శ్వాస వరకూ నడిపిస్తూనే ఉంటానని 'సంతోషం 14వ వార్షికోత్సవం' కర్టెన్‌రైజర్ వేడుకలో పత్రికాధినేత, నిర్మాత సురేష్ కొండేటి ప్రకటించడం చూస్తే సినిమాపై అతడికి ఉన్న ప్యాషన్ అర్థమవుతుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని నిర్మిస్తూ, మరెన్నో అభిరుచి ఉన్న సినిమాల్ని అందించాలన్న సంకల్పంతో అటు అనువాద చిత్రాల్ని తెలుగులో అందిస్తూనే, స్ట్రెయిట్ చిత్రాల్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం 'జతగా' రిలీజ్‌కి రెడీ అవుతోంది. అలాగే ఓ స్ట్రెయిట్ చిత్రాన్ని నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/complaint-filed-on-allu-arjun-for-visiting-kuntala-water-falls-169114/ | అల్లు అర్జున్ లాక్ డౌన్ లో ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకుంటూ పుష్ప సినిమా షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. కేరళ అడవుల్లో కానీ, నల్లమల అడవుల్లో కానీ ఈ సినిమా షూటింగ్ చెయ్యాల్సి ఉంటుంది. కథ ప్రకారం ఈ సినిమా మొత్తం అడవుల చుట్టూనే తిరుగుతుంది. అయితే కరోనా కారణంగా దర్శకుడు సుకుమార్ – అల్లు అర్జున్ ప్లాన్స్ అన్ని బెడిసికొట్టాయి. ఇక కరోనా లాక్ డౌన్ లోను పుష్ప లుక్ నే మెయింటింగ్ చేస్తూ అందరిలా కాకుండా ఉదయం లేచి కేబీఆర్ పార్కు.. లేదంటే సిటీ ఔట్స్ కట్స్ కో వెళ్లి జాగింగ్ చేస్తున్న అల్లు అర్జున్ తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధి కుంటాల జలపాతాన్ని సందర్శించాడు. కరోనా కారణంగా పర్యకటక ప్రాంతాలన్నీ మూసివేయ్యగా అల్లు అర్జున్ ఫ్యామిలీ అండ్ టీం తో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించడం చర్చనీయాంశమైంది. పుష్ప లొకేషన్స్ సెర్చింగ్ లో భాగంగానే అల్లు అర్జున్ కుంటల జలపాతాన్ని అలాగే మహారాష్ట్రలోనూ తిప్పేశ్వర్ ని సందర్శించడంతో.. అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి.. ఇలా కుంటాల జలపాతంతో పాటుగా తిప్పేశ్వర్ ని సందర్శించి షూట్ చేసారంటూ.. సమాచార హక్కుల సాధన స్రవంతి ప్రతినిధులు అల్లు అర్జున్ పై పుష్ప టీం పై ఆదిలాబాద్ జిల్లా నేరెడికొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కోవిడ్ కారణంగా కుంటాల జలపాత సందర్శాన్ని నిలిపివేసిన అల్లు అర్జున్ తన టీం తో దానిని సందర్శించి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లా డీఎఫ్ఓ అందుబాటులో లేకపోవడంతో.. అక్కడి పోలీస్ స్టేషన్ లో సిబ్బందికి తమ ఫిర్యాదు పత్రాన్ని అందించి వెళ్లినట్టుగా తెలుస్తుంది. |
https://www.telugupost.com/movie-news/డబ్బు-ఖర్చు-లేని-పెళ్లి-68092/ | బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ బిజినెస్ మ్యాన్ ఆనంద్ ఆహూజాలు చాలా కాలంగా ప్రేమలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు పెద్దలని ఒప్పించి త్వరలోనే అంటే వచ్చే నెల మొదటివారంలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇప్పటికే పెళ్లి షాపింగ్ లో బాగా బిజీగా వున్న సోనమ్ కపూర్ ట్రెడిషనల్ అండ్ గ్లామర్ డ్రెస్సులతో బాగా ఎట్రాక్టివ్ గా సోషల్ మీడియాలో ఫొటోస్ పెడుతూ అందరిని కనువిందు చేస్తుంది. ఫ్యాషన్ ఐకాన్ అయిన సోనమ్ కపూర్ ఎంత రిచ్ గా... ఎక్కడ ( స్విట్జర్లాండ్ లేదా ముంబైలో) పెళ్లి చేసుకుంటుందో అని అందరూ ఎదురు చూడడమే కాదు... సోనమ్ ఎక్కడ కనబడితే అక్కడ ఇదే ప్రశ్నలతో ఆమెను వేదిస్తున్నారట.అయితే ఎట్టకేలకు ఈ హీరోయిన్ తన పెళ్లి విషయమై స్పందించింది. పెళ్లి చేసుకుంటే ఇంట్లోనే పెళ్లి చేసుకుంటానని.. పెళ్లి వేడుక కోసం కోట్లు ఖర్చు పెట్టాలేనని... అందుకే పెళ్లి ని చాలా సింపుల్ గా అతిధుల మధ్యలోనే చేసుకుంటానని క్లారిటీ ఇచ్చేస్తుంది ఈ హాట్ ఫ్యాషన్ ఐకాన్. ఇక గ్రాండ్ గా పెళ్లికి అయ్యే డబ్బుని కావాలంటే విరాళంగా ఇస్తానని చెప్పిన సోనమ్ కపూర్.... తక్కువ ఖర్చుతో పెళ్లికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పద్ధతిగా జరగాలని.... అందుకే ఇంట్లోనే పెళ్లి చేసుకోని, పద్ధతులు పాటించాలని డిసైడ్ అయినట్టు తెలిపింది. మరి వచ్చే నెల మొదటి వారంలో జరగబోయే పెళ్లి వేడుకలకు అనిల్ కపూర్ ఇంట అపుడే పెళ్లి పనులు మొదలైపోయాయి.ఇప్పటికే సంగీత్ కి సంబందించిన డాన్స్ ని ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫేర్ కమ్ డైరెక్టర్ ఫరాఖాన్ ఆధ్వర్యంలో మొదలైపోయాయి కూడా. ఇప్పటికే డాన్స్ రిహార్సల్స్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది. మరో పది రోజుల్లోనే సోనమ్ కపూర్ పెళ్లి కూతురైపోతుంది. మరి బాలీవుడ్ దిగ్గజాల ఇంట పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుగుతాయో.. వాటికీ భిన్నంగా సోనమ్ కపూర్ తన పెళ్లిని చాలా సింపుల్ గా చేసుకోబోతుంది. |
https://www.telugupost.com/movie-news/harish-shankar-varun-tej-valmiki-movie-131419/ | సెప్టెంబర్ 13 విడుదల కాబోతున్న రెండు మీడియం బడ్జెట్ చిత్రాలైన గ్యాంగ్ లీడర్, వాల్మీకి సినిమాల టైటిల్స్ వివాదం లో గ్యాంగ్ లీడర్ టైటిల్ విషయం కాస్త సద్దుమణిగినా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్మీకి టైటిల్ విషయం మాత్రం సద్దుమణిగేలా కనబడ్డం లేదు. వాల్మీకి టైటిల్ విషయంలో మొదటినుండి రగడ జరుగుతూనే ఉంది. బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వాల్మీకి సినిమా టైటిల్ ఉందని.. వాల్మీకి బోయలు గొడవ చేస్తున్నారు. మరో రెండు వారాల్లో విడుదలకాబోతున్న వాల్మీకి సినిమా టైటిల్ ఎట్టి పరిస్తితుల్లో మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చెయ్యడమే కాదు.. బోయ వాల్మీకిలు ఇప్పుడు హై కోర్టు మెట్లు కూడా ఎక్కారు. వాల్మీకి టైటిల్ మార్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని బోయ హక్కుల సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టైటిల్ మార్చాలని, అలాగే తమ కులం వారి హక్కులకు భంగం కలిగిస్తున్న చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టుని కోరారు. మరి హరీష్ శంకర్ మాత్రం వాల్మీకి టైటిల్ కి వారి కులస్తుల హక్కుల భంగానికి సమబంధం లేదని మొదటి నుండి వాదిస్తున్నాడు. ఈ టైటిల్ విషయంలో జరుగుతున్న గొడవ వాల్మీకి చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ అయితే వస్తుంది. మరి డిఫ్రెంట్ క్యారెక్టర్ లో కొత్త మేకోవర్ లో కనబడుతున్న వరుణ్ తేజ్.. ఈ సినిమాతో హిట్ కొట్టాలను చూస్తున్నాడు. అలాగే సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయని… అవే సినిమాకి హైలెట్ అంటూ ప్రచారం జరుగుతుంది. |
https://www.telugupost.com/telangana/a-young-man-molested-a-woman-in-the-name-of-a-lift-in-tarnaka-1483311 | హైదరాబాద్ లోని తార్నాకలో ఓ మహిళపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత సోమవారం అనగా జూన్ 26వ తేదీన జరిగిన ఈ ఘటన 8 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు తార్నాకలో శ్రీధర్ అనే యువకుడు రాత్రి 11.30 గంటల సమయంలో లిఫ్ట్ ఇస్తానంటూ తన బైక్ పై ఎక్కించుకున్నాడు. కొంతదూరం వచ్చాక బైక్ ను సల్మాన్ హోటల్ సమీపంలో రోడ్డు పక్కకు ఆపి.. తనపై బలాత్కారం చేయబోయాడంటూ సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని నుండి తప్పించుకునే క్రమంలో బైక్ పై నుంచి దూకడంతో.. వెనుక నుంచి వచ్చిన లారీ కింద పడ్డానని తెలిపింది.తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైన మహిళ.. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న శ్రీధర్ కోసం గాలిస్తుండగా.. జులై 3న తన లాయర్ తో కలిసి ఓయూ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తన కూతురిని జాగ్రత్తగా చూసుకోవాలని, తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ రోధిస్తోంది. తన బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. అసలు జూన్ 26వ తేదీన ఏం జరిగిందన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. |
https://www.telugupost.com/crime/180-grams-cocaine-seized-in-hayath-nagar-1456326 | హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే భారీగా కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా.. హయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు నిందితుల్ని పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న నైజీరియన్ ను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.భాగ్యనగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్ అధికారులు ఎంత ప్రయత్నించినా.. స్మగ్లర్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా దందా సాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక నైజీరియన్ బెంగళూరు నుండి నగరానికి వచ్చి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందింది. అప్రమత్తమైన హయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని.. 180 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ నగరంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో.. ఇదే అధికమొత్తంలో పట్టుబడిన కేసు కావడం గమనార్హం. నైజీరియన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/ఆకాశ-వీధిలో-అందాల-జాబిలి-46432/ | అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్రను అశ్విని దత్ అల్లుడు, 'ఎవడే సుబ్రహ్మణ్యం' దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో మహానటిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. సమంత, షాలిని పాండే లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే మహానటి షూటింగ్ మొదలుపెట్టి మూడు నెలలవుతుంది. ఈ లోపు కీర్తి సురేష్, సమంత ల లుక్స్ కొన్ని లీక్ అయ్యాయి. ఆ ఫొటోస్ లో కీర్తి సురేష్, సమంతలు అచ్చం అలనాటి నటీమణులల్లే ఉన్నారు. ఇకపోతే కీర్తి సురేష్ సరసన జెమినీ గణేశన్ పాత్ర చేస్తున్న దుల్కర్ సల్మన్ లుక్ దుల్కర్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసింది చిత్ర బృందం.ఇక ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ పుట్టినరోజు కానుకగా మహానటి చిత్ర బృందం కీర్తి సురేష్ 'మహానటి' లుక్ ని విడుదల చేసింది. ఇక ఆ లుక్ లో కీర్తి సురేష్ ని 'మహానటి' గా పూర్తిగా రివీల్ చేయకుండా కేవలం కళ్ళు మాత్రమే కనబడేలా ఆ లుక్ ని డిజైన్ చేశారు. ఇక ఆ కళ్ళు మాత్రం అచ్చం సావిత్రి కళ్ళు లాగే కనబడుతున్నాయి. అయితే ఆ లుక్ తో పాటు 'ఆకాశ వీధిలో అందాల జాబిలి' అనే క్యాప్షన్ కూడా పెట్టి హ్యాపీ బర్త్ డే 'మహానటి' అంటూ వెరైటీగా 'మహానటి' లుక్ వదిలారు.అశ్విని దత్ కూతురు ప్రియాంకాదత్ వైజయంతి మూవీస్ పతాకంపై ఈ 'మహానటి' సినిమాని నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత, దుల్కర్ సల్మాన్, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/విశ్వనాథ్‌కు-ఫాల్కే-అవార-30337/ | ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు 2016 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రకటించింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయాన్ి ప్రకటించారు. మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేస్తారు. సీతామాలక్ష్మీ., సప్తపది., సిరిసిమువ్వ., సాగరసంగమం., స్వాతి ముత్యం, సిరివెన్నెల, సూత్రధారులు., శంకరాభరణం, స్వర్ణ కమలం, శృతిలయలు, శుభసంకల్పం, స్వయం కృషి, స్వాతి ముత్యం వంటి సంగీత, నాట్య ప్రధానమైన చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.ఎన్నో అవార్డులు....భారత ప్రభుత్వం ఇప్పటికే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. విశ్వనాథ్‌కు ఫాల్కే అవార్డును ప్రకటించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడిగా., నటుడిగా పలు చిత్రాల్లో నటించిన విశ్వనాథ్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరు జిల్లా పెదపులివర్రు ఆయన స్వస్థలం.... 1957లో తోడికోడలు చిత్రంలో సౌండ్ రికార్డింగ్ విభాగంలో చిత్ర రంగంలో ప్రవేశించారు. ఆత్మగౌరవం ఆయన దర్శకత్వం వహించిన తొలిచిత్రం. |
https://www.telugupost.com/national/delhi-chief-minister-arvind-kejriwal-challenged-the-ruling-bjp-at-the-centre-he-prepared-to-resign-saying-that-he-is-ready-for-elections-1551552 | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ .జనతా పార్టీకి సవాల్ విసిరారు. తాను ఎన్నికలకు సిద్ధమంటూ ఆయన విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే తన నిజాయితీని నిరూపించుకోవాలంటే మరోసారి ప్రజల వద్దకు వెళ్లడమే మార్గమని ఆయన నమ్మడం నిజంగా రాజకీయ నేతలకు నిండుదనం ఇచ్చే అంశంగానే చూడాలి. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయనకు పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే ఎన్నికలకు వెళతానని చెప్పడం, ఎన్నికలు జరిగేంత వరకూ తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండనని చెప్పడం, తన స్థానంలో ఎన్నికల వరకూ వేరే ముఖ్యమంత్రి ఉంటారని ఆయన ప్రకటించడం నిజంగా భారతీయ ప్రజాస్వామ్యానికి ఒక దారి చూపినట్లే అవుతుంది.నేటి తరం రాజకీయ నేతలకు...నిర్దోషిగా తాను నిరూపించుకునేంత వరకూ పదవిలో కొనసాగనని ఆయన చెప్పి నేటితరం రాజకీయ నేతలకు ఒక సవాల్ విసిరారు. ఈరోజుల్లో మరికొంత కాలమయినా తాను ముఖ్యమంత్రి పదవిగా ఉండాలని కోరుకుంటారు. అసలు అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ అరంగేట్రమే ఆశ్చర్యకరమైన రీతిలో జరిగింది. అవినితీకి వ్యతిరేకంగా నాడు అన్నా హజారేతో కలసి ఉద్యమం చేసి చివరకు రాజకీయ పార్టీతోనే మార్పు సాధ్యమని నమ్మిన కేజ్రీవాల్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. అప్పటి వరకూ ఢిల్లీ పీఠాన్ని తన సొంతం చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ ను మట్టి కరిపించి 2013లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అయితే అప్పుడు బీజేపీ సహకారం తీసుకోవాల్సి రావడం, ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఆయన అధికారంలోకి వచ్చిన 49 రోజులకే ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి ప్రజల వద్దకు వెళ్లారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా...2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీని ఒంటరిగా అధికారంలోకి తేగలిగారు. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో ఉన్న 70 స్థానాల్లో ఆమ్ ఆద్మీపార్టీ 67 స్థానాల్లో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించారు. తిరిగి 2020 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 62 స్థానాల్లో నెగ్గి మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించిన అరవింద్ కేజ్రీవాల్ పాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఆ సంస్కరణలే పొరుగున ఉన్న పంజాబ్ లో ఆమ్ ఆద్మీపార్టీని అధికారంలోకి తెచ్చిందంటారు. అలాంటి కేజ్రీవాల్ పై ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో మద్యం పాలసీలో ఆయన పార్టీ ముడుపులు స్వీకరించిందన్న ఆరోపణలతో తీహార్ జైలుకు వెళ్లారు. తనను అన్యాయంగా ఇరికించారంటూ ఆయన చేసిన వాదనలు న్యాయస్థానం నాలుగు గోడల మధ్యనే నిలిచిపోయాయి. అయితే ఆయన తప్పు చేశారా? లేదా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఆయన ప్రజల ముందుకు వెళ్లి తీర్పును కోరడం అభినందనీయమే.మరో ఏడాది ....అందుకే అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇంకా నెలల సమయం ఉండగానే పదవి నుంచి తనకు తానే దిగిపోతానని ప్రకటించడం మాత్రం ప్రత్యర్థి పార్టీలకు కూడా మింగుడుపడకుండా ఉంది. బెయిల్ నుంచి విడుదలయిన తర్వాత తిరిగి ఎన్నికలకు వెళతానని ఆయన సవాల్ విసరడం మాత్రం నిజంగా రాజకీయాల్లో అందరికీ ఆదర్శమేనని చెప్పాలి. తాను ప్రజల నుంచే మళ్లీ తిరిగి ఎన్నికై తన పదవిని పొందుతానన్న ఆయన విశ్వాసం ఉంది చూడండి.. అది దమ్మున్నోడు చేసే పని. ప్రజా తీర్పును గౌరవించడం అంటే ఇదేనన్నది ప్రతి రాజకీయ నేత నేర్చుకోవాల్సిందే. అందుకు కేజ్రీవాల్ ఒక మార్గం చూపినట్లయింది. ఈరోజుల్లో ఇలాంటివి సాధ్యమేనా? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు కేజ్రజీవాల్. మరి ప్రజాతీర్పు ఎలా ఉన్నా ఆయన చూపిన సాహనం.. తీసుకున్న నిర్ణయం, తెగువకు మాత్రం అభినందించి తీరాల్సిందే. |
https://www.telugupost.com/crime/hanumakonda-district-road-accident-belongs-to-same-family-1510897 | హన్మకొండ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎల్కతుర్తి మండలం పెంచికలపేట సమీపంలోని శాంతినగర్ వద్ద ఎదురుగా వస్తున్న కారును ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన మంతెన కాంతయ్య, శంకర్, భారత్, చందనగా గుర్తించారు. బాధిత కుటుంబం వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయ్యింది. లోపలి చిక్కుకున్నవారిని అతికష్టంతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడి లోపలి ఇరుక్కుపోయిన వారిని తీయడానికి కట్టర్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు తెలిపారు. |
https://www.telugupost.com/movie-news/మాస్-ఇమేజ్-కి-దూరంగా-ఉండమ-29147/ | మెగా బ్రదర్ కొణిదల నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మెగా అభిమానులకి మెగా ప్రిన్స్ గా పరిచయమై తొలి చిత్రం నుంచే వినూత్న శైలిలో సాగే చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్ సాగిస్తున్నాడు. అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో తన పరిచయ చిత్రం ముకుంద కోసం ఎమోషనల్ డ్రామా సబ్జెక్టు ఎంచుకున్న వరుణ్ తేజ్ తన రెండవ చిత్రానికే సృజనాత్మక దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఒక గ్రామంలో కుల వివక్ష కారణంగా బలైన ఓ ప్రేమ కథ లో కథానాయకుడిగా గౌరవప్రదమైన విజయాన్ని, గుర్తింపుని అందుకున్నాడు వరుణ్. తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కమర్షియల్ మీటర్ లో సాగే లోఫర్ చిత్రం చేసాడు వరుణ్. లోఫర్ విడుదలై ఏడాదిన్నర్ర గడిచిపోతున్నప్పటికీ వరుణ్ నాలుగవ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. గత ఏడాది రెండు విడుదలలతో ప్రేక్షకులని అలరించటానికి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా, శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమాలు ప్రారంభించిన వరుణ్ తేజ్ కి ప్రమాదవ శాత్తు చిత్రీకరణలో కాలికి తగిలిన గాయం కారణంగా మిస్టర్ చిత్రం ఆలస్యమై ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.వరుణ్ తేజ్ దాదాపు మూడు నెలల పాటు షూటింగ్స్ కి దూరం ఐన సమయంలో తన అన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తనకి అమూల్యమైన సలహాలు ఇచ్చాడట. మగధీర వంటి క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం ఐన నాటి నుంచి తనపై అభిమానుల అంచనాలు అధికం అయిపోయి వాటిని సమన్వయ పరచుకుంటూ ఒకే స్టార్ స్టేటస్ చట్రంలో వరుసగా కొన్ని సినిమాలు చెయ్యవలసి వచ్చిందని, తనని ఆ చట్రంలో పడకుండా తొలి మూడు చిత్రాలతో విభిన్నమైన జోనర్స్ ఎంచుకున్నట్టుగానే కెరీర్ కొనసాగించమని వరుణ్ కి సూచించాడట రామ్ చరణ్ తేజ్. కాగా ప్రస్తుతం శ్రీను వైట్ల తెరకెక్కించిన మిస్టర్ కి శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఫిదా చిత్రాల మధ్య జోనర్ వ్యత్యాసం ఉండేలా జాగ్రత్త వహించిన వరుణ్ ముందు ముందు అభిమానుల అంచనాలను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/rana-daggubati-younger-brother-abhiram-destination-wedding-heres-everything-you-need-to-know-1508096 | ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు తనయుడు అభిరామ్ పెళ్లి చేసుకున్నాడు. ప్రత్యూష చాపరాలను అభిరామ్ పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఈ వేడుకకు శ్రీలంకలోని ఓ రిసార్ట్ వేదికైంది. శ్రీలంక నుంచి తిరిగి వచ్చాక దగ్గుబాటి ఫ్యామిలీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది. తన దగ్గరి బంధువైన ప్రత్యూషను దగ్గుబాటి అభిరామ్ బుధవారం పెళ్లిచేసుకున్నాడు. ఇటీవలే ప్రత్యూషతో అభిరామ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహ వేడుక కోసం దగ్గుబాటి కుటుంబమంతా శ్రీలంక వెళ్లగా 200 మంది అతిథులు పెళ్లికి హాజరయ్యారని సమాచారం. |
https://www.telugupost.com/movie-news/అఖిల్-పై-కంప్లెయింట్-ఇచ్-48286/ | నాగార్జున రెండో కొడుకు అఖిల్ 'అఖిల్' అనే సినిమాతో సినిమా పరిశ్రమలోకి అరంగేట్రం చేసాడు. వి.వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అఖిల్ తన పెర్ఫార్మన్స్ పరంగా కూడా జనాలని ఆకట్టుకోలేకపోయాడు. అయితే 'అఖిల్' సినిమాలో అఖిల్ ప్రతి దాంట్లో వేలు పెట్టాడని అందుకే సినిమా డిసాస్టర్ అయ్యిందనే టాక్ ఉంది.అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని 'మనం' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో 'హలో' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా అఖిల్ అన్నింట్లో వేలు పెడుతున్నాడని..అఖిల్ జోక్యం ఎక్కువ అవుతున్నందుకు దర్శకుడు విక్రమ్ కె కుమార్ చిరాకు పడుతున్నాడట. అఖిల్ గురించి నాగార్జునకి కూడా కంప్లెయింట్ కూడా చేసాడంట విక్రమ్. అయితే నాగార్జున కూడా అఖిల్ పై సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. అన్ని విషయాల్లో వేలు పెడితే ఈ సారి కూడా సినిమా ఫ్లాప్ అవుతుందని అఖిల్ కి వార్నింగ్ ఇచ్చాడట నాగార్జున.రెండో సినిమాకే అఖిల్ ఇలా అన్నింటిలో వేలుపెడితే ముందు ముందు కష్టమేమో అని అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. అఖిల్ జర చూసుకో బాబు. |
https://www.telugupost.com/movie-news/fight-between-manchu-manoj-and-manchu-vishnu-video-goes-viral-in-social-media-1468613 | మంచు మోహన్ బాబు కుమారులైన మంచు విష్ణు, మంచు మనోజ్ ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మనోజ్ పెళ్లి సమయంలోనే విష్ణు దంపతులు సరిగ్గా కనిపించపోవడంతో.. ఇద్దరి మధ్య విభేదాలున్నాయంటూ వార్తలొచ్చాయి. తాజాగా బయటికొచ్చిన ఓ వీడియో ఆ వార్తలకు బలం చేకూర్చినట్టయింది. మనోజ్ ఇంటిపైకి మంచు విష్ణు వెళ్లి దాడిచేసినట్లు సమాచారం. ఈ మేరకు మంచు మనోజ్, విష్ణు లకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఆ వీడియోలో మంచు విష్ణు కనిపించాడు. వాడేదో అన్నాడు కదా ఒరేయ్ అరేయ్ అని ఏదో అంటున్నాడు కదా ? అని విష్ణు అంటుంటే..అతడిని ఆపేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు. ఇదిగో ఇలా ఇంటి మీదకు వచ్చి అందరినీ కొడుతూ ఉంటాడండి. ఇదీ పరిస్థితి అంటూ వీడియోలో మనోజ్ వాయిస్ వినిపిస్తుంది. అయితే.. ఇది ఎప్పుడు జరిగింది ? సరదాకి ఈ వీడియోను పోస్ట్ చేశారా ? లేక నిజంగానే ఇద్దరూ గొడవ పడుతున్నారా ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.Manchu Vishnu 😌#manchuvishnu #vishnumanchu #maapresident pic.twitter.com/uKRTSDXc2A— hooligan (@hooligan669) March 24, 2023 |
https://www.telugupost.com/movie-news/వామ్మో-ఇదెలా-సెట్-అవుతుం-20292/ | టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న రాజమౌళి ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యింది అంటే అది తనకు నచ్చితే మటుకు ఆ సినిమా తీసిన డైరెక్టర్ ని పొగడ్తలతో ముంచేత్తుతుంటాడు . తానొగొప్ప డైరెక్టర్ అయినప్పటికీ ఏ మాత్రం గర్వం లేకుండా తన తోటి డైరెక్టర్స్ ని మెచ్చుకుంటాడు. ఇక ఇప్పుడు రాజమౌళి 'గౌతమీపుత్ర శాతకర్ణి' ని తీసిన డైరెక్టర్ క్రిష్ ని సినిమా విడుదల రోజే చూసి మెచ్చుకోవడమే కాక ఆయనతో ఒక ఇంటర్వ్యూ కూడా చేసాడు. ఆ ఇంటర్వ్యూ ని చాల ఫన్నీ గా అంటే సరదగా చేసి క్రిష్ ని గొప్ప డైరెక్టర్ అని కొనియాడాడు.అసలు రాజమౌళికి క్రిష్ - బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అంటే అస్సలు నమ్మాలనిపించలేదట. ఎందుకంటే బాలకృష్ణేమో మాస్ అంటూ తొడలు చరుస్తాడు. ఇక క్రిష్ ఏమో మంచి సందేశాత్మక చిత్రాలు చేస్తూ క్లాస్ ఆడియన్స్ కి నచ్చే విధం గా సినిమాలు తెరకెక్కిస్తుంటాడు. అందుకే రాజమౌళికి వీరిద్దరికి మధ్య ఎలా డీల్ కుదిరిందో అని అనుకున్నాడట. అసలు ఒక్క రాజమౌళికే కాదు చాలామందికి ఈ డౌట్ వచ్చింది. ఇక బాలకృష్ణ 'గౌతమిపుత్ర...'ని క్రిష్ డైరెక్టన్ లో చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సినిమా చూసిన తర్వాత రాజమౌళి ఈ సినిమా చాలాబాగా తీసారని బాలకృష్ణ కూడా బాగా నటించారని ట్వీట్ చేసాడు.ఇక తాజాగా రాజమౌళి, క్రిష్ ని ఇంటర్వ్యూ కూడా చేసాడు. అందులోని కొన్ని మాటలు మచ్చుకి.....అసలు మీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే నేను నమ్మలేదు. ఇద్దరికీ వర్క్అవుట్ అయ్యింది అన్నా నమ్మాలనిపించలేదు....అసలు వీళ్ళిద్దరిది చాలా బ్యాడ్ కాంబినేషన్ అని నేను ఫీలయ్యాను అంటూ మొదలు పెట్టిన రాజమౌళి.... మీకసలు ఈ సినిమా తియ్యాలని ఎందుకనిపించింది అని క్రిష్ ని అడగగా క్రిష్ అది నాకొక ఫ్యాషన్ ఎందుకో తియ్యాలని డిసైడ్ అయ్యా తీసేసా.. అని చెప్పాడు.అసలు 79 రోజుల్లో 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఎలా తెరకెక్కించారని రాజమౌళి అడగా... క్రిష్ రోజుకి 14 గంటలు వ్యయ ప్రయాసలు పడి ఈ సినిమా పూర్తి చేశామని చెప్పారు. ఈ క్రెడిట్ అంతా బాలకృష్ణ గారిదే అని క్రిష్ చెప్పారు. కేవలం సంక్రాంతి కే విడుదల చెయ్యాలని టైమ్ సెట్ చెయ్యడం వల్ల ఈ సినిమాని త్వరగా చేసెయ్యగలిగామని చెప్పారు. ఇక నీకు మాస్ రాదు మాస్ రాదు అన్న మాటలకూ నేను చాలా చిరాకు పడే వాడిని. అలాంటిది ఈ 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో బాలకృష్ణ గారితో ఇంటెర్వెర్ ముందు తొడలుకొట్టించి నాకు కూడా మాస్ టచ్ తెలుసు అని తెలిసేలా చేశానని చెప్పాడు క్రిష్. ఇక దీనికి బాలకృష్ణ గారు పూర్తి సహకారం అందించారని తెలిపాడు. అయితే ఈ సీన్ చెయ్యాలంటే చాల దరిద్రం గా అనిపించిందని కానీ చెప్పెట్టప్పుడు చాలా బాగుంటుందని అని నవ్వుతూ చెప్పాడు క్రిష్. ఇక ఆ తొడలు కొట్టే సీన్ థియేటర్లు లో పేలిపోయాయని రాజమౌళి కితాబునిచ్చాడు.ఇక చివరిగా మళ్ళీ ఇలాంటి చారిత్రక నేపథ్యం వున్న చిత్రాలను తెరకెక్కిస్తారా అని రాజమౌళి, క్రిష్ ని అడుగా ప్రస్తుతానికి నాకు అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాజెక్ట్ తియ్యాలనే కోరిక తీరిందని... మళ్ళీ అలంటి ప్రాజెక్ట్ ని 70 రోజుల్లో తియ్యాలంటే సాధ్యం కాదని.... ప్రస్తుతానికి మళ్ళీ అలాంటి సాహసం చెయ్యనని నోరుమూసుకుని వేరే కథతో సినిమా చేస్తానని ఫన్నీ సమాధానాలతో ఇంటర్వ్యూ ముగించారు. ఇక రాజమౌళి గారు తనని ఇంటర్వ్యూ చెయ్యడం తన అదృష్టమని చెప్పాడు క్రిష్. |
https://www.telugupost.com/movie-news/malaika-aurora-arjun-kapoor-115843/ | బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అదే తల్లయిన మలైకా అరోరా యువ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉన్నారనేది. మలైకా అరోరా భర్త అర్బాజ్‌తో విడాకులు తీసుకున్న నాటి నుంచి అర్జున్‌తో ఆమె సహ జీవనం చేస్తుంది. అయితే అర్జున్ ఇంట్లో ఏవో ఇబ్బందులు ఉండటంతో ఇప్పుటివరకు ఎక్కడ ఈ న్యూస్ బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇక ఒకడిని విడిచి మరొకరు ఉండలేక పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయి బయట ఇద్దరూ కలిసే తిరిగేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంట్లో వారు ఒప్పుకుంటారా..? అర్జున్ కంటే మలైకా ఏకంగా పదిహేనేళ్లు పెద్దది. ఏప్రిల్ 19న వీరి పెళ్లి జరగబోతుందని… అది కూడా కొద్దిమంది స్నేహితులు, బాగా క్లోజ్ అయిన సినిమా వాళ్ల మధ్యన చాలా సింపిల్ గా జరగనుంది. మరి వీరి పెళ్లికి అర్జున్ కపూర్ వాళ్ల ఇంట్లో ఒప్పుకున్నారో లేదో తెలియాలి. త్వరలోనే బాలీవుడ్ లో పెళ్లి బాజా మోగబోతుంది. |
https://www.telugupost.com/crime/massive-fire-accident-at-west-bengal-indian-oil-company-1344926 | పశ్చిమ బెంగాల్ లోని హల్దియాలో ఉన్న ఓ ఇండియన్ ఆయిల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపోట్ లోపల జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 40 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఫైరింజన్లు ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. కాగా.. ఈ భారీ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. |
https://www.telugupost.com/movie-news/adhi-sai-kumar-career-after-burrakatha-movie-126513/ | కుర్ర హీరోలకు రెండు మూడు హిట్స్ తగిల్తే అలానే ఇండస్ట్రీ లో ఉండిపోతారు. తరువాత ఎన్ని ప్లాప్ లొచ్చినా ఇండస్ట్రీ అయితే వదలరు. అందులోను ఫిల్మీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన హీరోలైతే మరీను. ప్రస్తుతం సాయికుమార్ నట వారసత్వంతో సినిమాల్లో హీరోగా వచ్చిన ఆది సాయికుమార్ హీరోగా నిలబడేందుకు నానా తంటాలు పడుతున్నాడు. లవ్లీ, శమంతకమణి, సుకుమారుడు, నెక్స్ట్ నువ్వే లాంటి సినిమాల్తో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. శమంతకమణి ఓ మాదిరిగా ఆడినా.. ఆ సినిమాలో సందీప్ కిషన్, సుధీర్ బాబు లాంటి హీరోలుండడంతో ఆ పేరు తలా కాస్త వచ్చింది కానీ.. ఆది కి ఒక్కడికే ఏం ఒరగలేదు. నెక్స్ట్ నువ్వే లాంటి భారీ డిజాస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని రైటర్ గా పనిచేస్తున్న డైమండ్ రత్న బాబు ని దర్శకుడిగా పరిచయం చేస్తూ బుర్రకథ అనే సినిమా చేసాడు ఆది. నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ బుర్రకథ సినిమా మీద విడుదలకు ముందు మంచి అంచనాలే ఉన్నాయి. కానీ విడుదలయ్యాక మొదటి షోకే సినిమాకి ప్లాప్ టాక్ పడింది. ఇక రివ్యూ రైటర్స్ కూడా బుర్రకథ కు ప్లాప్ రేటింగ్స్ ఇవ్వడంతో ఆ సినిమా ప్లాప్ అని తేలిపోయింది. అసలు సినిమాలో ఇంట్రెస్ట్ కలిగించే అంశాలు తక్కువ, బోర్ కొట్టించే అంశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు ప్రేక్షకులు. మనిషికి ఒక మెదడు మాత్రమే ఉంటుంది. అలాంటిది రెండు మెదళ్లతో ఓ మనిషి పుడితే ఎలా ఉంటుంది.. అతడు పెరిగి పెద్దయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు.. అనేది స్టోరీ లైన్. మరి ఈ సినిమాలో ఆది సాయి కూంర్ నటన పరంగా బాగ్ వీక్ గా కనిపించాడు. అసలు ఒకే సినిమాలో ఇటు క్లాస్, అటు మాస్ గా కనిపించే రెండు క్యారెక్టర్లు దొరకడం నిజంగా అదృష్టం. అలాంటి అద్భుతమైన క్యారెక్టర్ దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు ఆది. ఇక నటన సరే సరి.. కనీసం మేకోవర్ లో కూడా మాస్ – క్లాస్ పాత్రల మధ్య తేడా చూపించలేకపోయాడు. నటనలో డైలాగ్ డెలివరీ లో నెంబర్ వన్ అయిన సాయి కుమార్ తనయుడు ఆది నేనా ఇలాంటి నటన అన్నట్టుగా ఉంది బుర్రకథలో ఆది నటన. అసలు డైరెక్షన్ స్కిల్స్ కానీ, కథ కానీ, హీరోయిన్స్ కానీ, మ్యూజిక్ కానీ ఏమి బుర్రకథ సినిమాని కాపాడలేకపోయాయి. మరి ఇలాంటి ఘోరమైన సినిమాలు చేస్తే ఆది కెరీర్ కి ప్రమాదం పొంచి ఉన్నట్లే |
https://www.telugupost.com/movie-news/ఫైనల్-విన్నరెవరో-అనేది-త-40473/ | వరుస సెలవును క్యాష్ చేసుకోవడానికి మూడు భారీ సినిమాలు థియేటర్స్ లోకి దిగిపోయాయి. మూడు సినిమాలు నువ్వానేనా అన్నట్టు పోటీ పడ్డాయి. విడుదల విషయంలో మూడు సినిమాల నిర్మాతలు ఎక్కడా రాజి పడలేదు. ఇక మూడు సినిమాల్లో నటించిన హీరోల తండ్రులు కూడా నిర్మాతలే కావడం గమనార్హం. డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత అయిన సుధాకర్ రెడ్డి కుమారుడు నితిన్, హను రాఘవపూడి డైరెక్షన్ లో 'లై' సినిమాతో సందడి చెయ్యగా, నిర్మాత సురేష్ బాబు కొడుకు రానా సోలో హీరోగా తేజ డైరెక్షన్ లో 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ వచ్చేసాడు. ఇక మరో నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బోయపాటి డైరెక్షన్ లో 'జయ జానకి నాయక' అంటూ కుమ్మడానికి వచ్చేసాడు.మరి ఈ మూడు సినిమాలు మొదటిరోజున దాదాపుగా అన్నీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నాయి. మూడు చిత్రాలు కూడా విడుదలకు పోటీపడ్డట్లే కలెక్షన్ల విషయంలో నువ్వానేనా అన్న రేంజ్‌లో పోటీపడ్డాయి. ఇంతకీ ఫస్ట్ డే వసూళ్లలో ఫస్ట్ ప్లేస్ ఎవరిది? అనే ప్రశ్న ఇపుడు అందరిలో తలెత్తింది.రానా - కాజాల అగర్వాల్ - కేథరిన్ లు నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మొదటిరోజు 3 కోట్ల 72 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. ఏరియాల వారీ వసూళ్లు నైజాం-1. 22 కోట్లు, ఉత్తరాంధ్ర- 68 లక్షలు, సీడెడ్- 65, ఈస్ట్ గోదావరి-35, కృష్ణ- 28, గుంటూరు-24, వెస్ట్- 20, నెల్లూరు- 10 లక్షలు రాబట్టినట్టు సమాచారం అందుతుంది.బోయపాటి డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్, కేథరిన్ మరియు భారీ తారాగణం నటించిన 'జయ జానకి నాయక' చిత్రం అయితే 3 కోట్ల 27 లక్షలు రాబట్టింది. నైజాం-90 లక్షలు, సీడెడ్- 55, గుంటూరు- 49, ఉత్తరాంధ్ర- 45, వెస్ట్- 28, ఈస్ట్- 24, నెల్లూరు- 20, కృష్ణ- 16 లక్షలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.హను రాఘవపూడి డైరెక్షన్ లో నితిన్ - మేఘ ఆకాష్ జంటగా అర్జున్ విలన్ గా తెరకెక్కిన 'లై' చిత్రం మూవీ థర్డ్ ప్లేస్‌కి వెళ్లినట్టు చెబుతున్నారు. కేవలం 2 కోట్ల 27 లక్షల మాత్రమే లై మొదటి రోజు కలెక్షన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. నైజాం-81 లక్షలు, సీడెడ్- 42, ఉత్తరాంధ్ర- 32, ఈస్ట్- 21, గుంటూరు-17, కృష్ణ- 17, వెస్ట్- 11, నెల్లూరు- 6 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక ఫస్ట్ డే టాక్ పరంగా ‘నేనే రాజు న్నే మంత్రి’ టాప్ పొజిషన్‌లో ఉంటే...... 'జయ జానకి నాయక' చిత్రం బీ,సీ సెంటర్లలో, 'లై'.. ఏ సెంటర్లను ఆకట్టుకున్నాయి. అయితే ఈ కలెక్షన్స్ నిర్మాతలకు లాభమా? నష్టమా? అనేది తేల్చాల్సింది మిలిగిన నాలుగు రోజులే అంటున్నారు. చూద్దాం ఫైనల్ విన్నరేవరవుతారో అనేది కొద్దీ రోజుల్లో తేలిపోనుంది. |
https://www.telugupost.com/movie-news/raviteja-remuneration-179995/ | రవితేజ తాజా బ్లాక్ బస్టర్ క్రాక్ ఇంకా కలెక్షన్స్ వేటలోనే ఉంది. రెండు వారాలుగా మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ అదిరిపోయే కలెక్షన్స్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. క్రాక్ సినిమాకన్నా ముందు డిజాస్టర్ ఉన్న రవితేజకి ఈ హిట్ గట్టి ఊపుని, నమ్మకాన్ని ఇచ్చింది. రెండు వారాల్లోనే లాభాల బాట పట్టించిన క్రాక్ సినిమాకి రవితేజకి 12 కోట్ల వరకు పారితోషకం వరకు ముట్టింది. ఇక క్రాక్ తర్వాత రమేష్ వర్మ తో రవితేజ చేస్తున్న ఖిలాడీ సినిమాకి ఏకంగా 13 కోట్ల పారితోషకం అది సింగల్ పేమెంట్ లో నిర్మాతలు సెటిల్ చేశారు. మరి క్రాక్ హిట్ తో రవితేజ రెమ్యునరేషన్ భారీగా పెరిగిపోయింది. డిజాస్టర్స్ ఉన్నప్పుడే రవితేజ పారితోషకం విషయంలో పేచీలు పడేవాడు. ఇప్పుడు మంచి హిట్ పడ్డాక ఊరుకుంటాడా.. ఇక త్రినాధరావు నక్కిన తో రవితేజ ఖిలాడీ తర్వాత చెయ్యబోయే సినిమాకి ఏకంగా 15 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇడియట్ లో రవితేజ వాడిన నేను లోకల్ అనే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. దానినే టైటిల్ గా పెట్టి నాని హీరోగా నేను లోకల్ అంటూ సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టిన త్రినాధ్ రావు నక్కిన ఇప్పుడు డైరెక్ట్ గా రవితేజ తోనే సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా రవితేజ ఎనర్జీకి తగిన సినిమా అని, పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా త్రినాధ్ రావు – రవితేజ కాంబో సినిమా ఉండబోతుందట. మరి ఈ సినిమాకే రవితేజ 15 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడు అంటే.. క్రాక్ హిట్ రవితేజకి ఎంతగా కలిసొచ్చిందో చూసారా.. |
https://www.telugupost.com/movie-news/samantha-decission-78604/ | చైతు 'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సమంత.. ఆ తర్వాత వరసబెట్టి సినిమాలు మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. టాలీవుడ్ లో గత కొనేళ్ల నుండి టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సామ్.. చైతుని లవ్ చేసి పెళ్లి చేసుకుని సక్సెస్ అయింది. అక్కినేని కోడలుగా పిలుచుకునే సామ్.. మ్యారేజ్ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. తర్వాత ఆమె అలాంటిది ఏమి లేదని క్లారిటీ ఇచ్చి సినిమాలు స్టార్ట్ చేసింది. మళ్లీ ఇప్పుడు సామ్ సినిమాలకు గుడ్ బై చెపుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు కమిటైన సినిమాలను ఫినిష్ చేసి ఆ తర్వాత గ్లామర్ ఇండస్ర్టీకి దూరంగా వుండాలన్నది ఆమె ప్లాన్‌గా చెబుతున్నారు.ఇక సినిమాలకు గుడ్ బై...పెళ్ళికి ముందుకన్నా పెళ్లి తర్వాత చేసిన 'రంగస్థలం', 'మహానటి', 'ఇరుంబుథరై' వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాంతో సమంత ఇంకా కంటిన్యూ అవుతుందని ఆమె అభిమానులు భావించారు. కానీ సడెన్ గా ఇటువంటి డెసిషన్ ఎందుకు తీసుకుందో తెలియలేదు. ప్రస్తుతం సామ్...తెలుగు, తమిళం ఒక్కో ప్రాజెక్ట్ చేస్తోంది. ఈ రెండూ మార్చి నాటికి పూర్తికానున్నాయి. సమంత గ్లామర్ ఇండస్ర్టీ నుంచి తప్పుకుంటోందని వార్తల నేపథ్యంలో అక్కినేని అభిమానులు లైన్‌లోకి వచ్చేశారు. దాంతో మీడియాలో రకరకాలు కామెంట్స్ వస్తున్నాయి. అక్కినేని ఇంటికి వారసుడు రాబోతున్నాడని.. అక్కినేని ఫామిలీ సామ్ ను సినిమాలు ఆపేయాలని...ఇలా చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సామ్ నోరు విప్పాల్సిందే. |
https://www.telugupost.com/movie-news/weeked-gang-leader-in-week-days-134081/ | గ్యాంగ్ లీడర్ ఈ వారంలో కొంత వీకైంది. ఈ వారంలో వచ్చిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఏరియా షేర్ (కోట్లలో) నైజాం 5.72 సీడెడ్ 1.75 నెల్లూరు 0.44 కృష్ణ 1.06 గుంటూరు 1.12 వైజాగ్ 1.89 ఈస్ట్ గోదావరి 1.21 వెస్ట్ గోదావరి 0.78 టోటల్ ఏపీ & టీస్ షేర్ 13.97 |
https://www.telugupost.com/crime/three-persons-spot-dead-in-train-accident-at-atmakuru-railway-bridge-1458694 | శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో గత అర్థరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గూడూరు నుండి విజయవాడ వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొని ఓ మహిళ, ఇద్దరు పురుషులు దుర్మరణం చెందారు. ఆత్మకూరు బస్టాండ్ వద్దనున్న రైల్వే బ్రిడ్జిపై ఈ ఘటన జరిగినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుల వయసు 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు పట్టాలపైనే చనిపోగా.. మహిళ బ్రిడ్జిపై నుండి కిందపడి మృతి చెందింది. పట్టాలపై ఉన్న సదరు మహిళను రక్షించే క్రమంలో.. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.కాగా.. ప్రమాద సమయంలో వారిచేతుల్లో ఉన్న సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం లాకర్ అలాట్ మెంట్ టికెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటితో పాటు లభించిన ఫోన్ నంబర్ కు పోలీసులు ఫోన్ చేయగా.. ఎలాంటి స్పందన లేదని పోలీసులు తెలిపారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారా? లేక వేర్వేరు కుటుంబాలకు చెందినవారా? అన్న విషయం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్న సంచులలో విజయవాడ కార్పొరేషన్‌కు చెందిన వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ తెన్నేటి సరస్వతీరావు పేరుతో ఉన్న గుర్తింపు కార్డు కూడా లభించింది. అందులోని ఫొటో ఆధారంగా మృతుల్లో ఆయన కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/rajamouli-special-arrangements-rrr-sets-97539/ | దర్శకధీరుడు రాజమౌళి తన #RRR సినిమాను మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయనున్నారు. ఈ నెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్క క్లూ కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు జక్కన్న. ఇంతవరకు ఈ సినిమా స్టోరీ ఏంటి.. అసలు ఎటువంటి జోనర్.. ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు అన్న విషయాలు కూడా అక్కడ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.సెక్యూరిటీ నడుమ షూటింగ్ఈ నేపధ్యంలో #RRR షూటింగ్ సెట్స్ లో ఎవరూ సెల్ ఫోన్స్ ఉపయోగించకూడదు అని నిషేధం పెట్టాడట జక్కన్న. ఫొటోస్ ఎక్కడ లీక్ అవుతున్నాయో అని ముందు జాగ్రత్తగా ఇలా చేస్తున్నాడట. 'బాహుబలి' టైంలో ఇదే చేశాడు కానీ సినిమాలో హైలైట్ సీన్ బయటికి వచ్చేసింది. అయితే ఈసారి అటువంటి తప్పులు జరగకుండా చేసుకుంటున్నాడట. హైదరాబాద్ శివారున కోకాపేటలో ఓ సెట్ వేసి అక్కడ షూట్ చేయనున్నాడు. భారీ సెక్యూరిటీ మధ్యన ఈ సినిమా షూటింగ్ జరగనుంది.చైనా నుంచి జామర్స్...అయినా ఎందుకైనా మంచిది అని జామర్స్ వాడుతున్నాడట. ఎవరైనా సీక్రెట్ కెమెరాలు పెట్టుకొచ్చి ఏదన్నా వీడియో తీస్తారేమోనని.. చైనా నుండి తెప్పించిన జామర్స్ ను సెట్లో అమర్చనున్నారట. దానివల్ల ఎవరైనా సీక్రెట్ కెమెరాలు తీసుకొచ్చి షూట్ చేద్దాం అనుకున్నా అవి పని చేయకుండా జామర్స్ చూసుకుంటాయి అంట. కాబట్టి ఈ సారి జక్కన్న బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అర్ధం అవుతుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/are-they-doubting-rajamouli-162618/ | రాజమౌళి తో సినిమా అనగానే హీరో హీరోయిన్స్ కథ ఏమిటి అని అడక్కుండానే ఎగిరి గంతేస్తారు. అది రాజమౌళి రేంజ్. ఆయన మీద నమ్మకం ఉండబట్టే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు RRR కథ వినకుండానే రౌద్రం -రణం – రుధిరం సినిమా ఒప్పేసుకుని సెట్స్ మీదకెళ్లారు. రాజమౌళిని నమ్ముకుంటే క్రేజకి క్రేజు, ఫెముకి ఫెము, డబ్బుకి డబ్బు. అందుకే ఆయనతో సినిమా కోసం అందరూ ఎదురు చూస్తారు అవకాశం రాగానే అయన సినిమా సెట్స్ లో వాలిపోతారు. అయితే తాజాగా రాజమౌళి పనితనం మీద అనుమనమో.. కరోనా భయమో తెలియదు కానీ.. RRR సినిమా బయ్యర్లకి కంగారు పుడుతుంది. RRR సినిమాని కరోనా కన్నా ముందే కొన్ని ఏరియా లను అమ్మినట్టుగా, కొన్నిఆ ఏరియాల నుండి భారీ ఆఫర్స్ వచ్చినట్టుగా వార్తలొచ్చాయి.బాహుబలి తర్వాత బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి సినిమా RRR కి భారీ క్రేజ్ ఉంది. అందుకే RRR కి ఫ్యాన్సీ రేట్లకి అగ్రిమెంట్స్ చేసుకున్నారు కొంతమంది ఏరియా బయ్యర్లు. రాజమౌళి సినిమా కాబట్టి ఆ సినిమా ఎన్ని వాయిదాలు వేసుకున్న మా డబ్బు మాకు రావడం పక్కా అనుకున్నారు. అందుకే నిర్మాత దానయ్య ఎంత అంటే అంతకి ఒప్పేసుకుని అడ్వాన్స్ ఇచ్చేసారు బయ్యర్లు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా అంతా తారుమారయ్యింది. రాజమౌళి అయినా, ఎన్టీఆర్ అయినా, రామ్ చరణ్ అయినా ఎంత క్రేజ్ ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్స్ లోకి వస్తారంటే నమ్మకం తక్కువే. అందుకే RRR కి అడ్వాన్స్ ఇచ్చిన బయ్యర్లు ఆలోచనలో ఉన్నారట. అందుకే మేము పెట్టిన డబ్బు మళ్ళీ వెనక్కి వస్తుందో రాదో అనే కంగారులో RRR నిర్మాతకు ఫోన్ చేసి అడ్వాన్స్ లు వెనక్కి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారట. మరి రాజమౌళి సినిమా అయినా బయ్యర్లు ఆలోచించించడం లేదు. అంతటికి కారణం కరోననే. రాజమౌళి మీద నమ్మకం కూడా కరోనా కారణంగా సడలుతుంది. |
https://www.telugupost.com/crime/man-ends-his-life-at-durgam-cheruvu-cable-bridge-1475194 | హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నేడు ( మే 6) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వ్యక్తి బ్రిడ్జి పై నుండి దూకుతుండటాన్ని గమనించిన కొందరు వాహనదారులు అతడిని ఆపేందుకు ప్రయత్నించారు కానీ అప్పటికే అతను చెరువులోకి దూకేశాడు.వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని చెరువులో నుండి వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఆ వ్యక్తి ఎవరు ? ఎక్కడి నుండి వచ్చాడు ? ఆత్మహత్యకు గల కారణాలేంటి ? అతని మానసిక పరిస్థితి సరిగానే ఉందా ? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. |
https://www.telugupost.com/top-stories/prashant-kishor-meets-sonia-gandhi-second-time-in-three-days-1365632 | ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్న తరుణంలో మూడు రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని రెండు సార్లు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది జరగనున్న తదుపరి రౌండ్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రణాళిక సెషన్ కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. 2024కి ముందు పార్టీ పునరుద్ధరణ కోసం ప్రశాంత్ కిషోర్ నుండి ఒక ప్రతిపాదనను, ఆ సంవత్సరం జరగనున్న సాధారణ ఎన్నికల కోసం గేమ్ ప్లాన్‌ను కాంగ్రెస్ పరిశీలిస్తోంది. మూడు రోజుల్లో వారికిది రెండవ సమావేశం. కిషోర్ మిషన్ 2024పై శనివారం ఎంపిక చేసిన కాంగ్రెస్ నేతల బృందం ముందు వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు.సోనియా గాంధీతో సోమవారం జరిగిన సమావేశంలో ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలలో ఎన్నికలపై చర్చించారని వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నివేదించింది. మిషన్ 2024 ప్రణాళికను మూల్యాంకనం చేసే పనిలో ఉన్న పార్టీ బృందంతో శ్రీమతి గాంధీ తన ఇంటిలో సమావేశమయ్యారు.ఈ సమావేశానికి సోనియా గాంధీ కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కెసి వేణుగోపాల్, అంబికా సోని హాజరయ్యారు. ఈ బృందం వారం రోజుల్లోగా నివేదిక అందజేయనుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ 370 స్థానాల్లో పోటీ చేయాలనే ప్రణాళికతో పాటు కొన్ని రాష్ట్రాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ప్రణాళికతో కూడిన కిషోర్ ప్రతిపాదనకు ప్రతిస్పందించడానికి కాంగ్రెస్‌కు కొంచెం సమయం ఇవ్వబడింది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలో కాంగ్రెస్ ఒంటరిగా పోరాడాలని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో పొత్తులు పెట్టుకోవాలని శ్రీ కిషోర్ సూచించారని, దీనికి రాహుల్ గాంధీ అంగీకరించారని మూలాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI గతంలో నివేదించింది. |
https://www.telugupost.com/movie-news/రకుల్-మాస్టర్-ప్లాన్-61189/ | ఇండస్ట్రీ లో గ్లామర్ ఫీల్డ్ లో కొనసాగాలంటే ఎక్కువ కాలం ఫిట్నెస్ చాలా అవసరం. ముఖ్యంగా హీరోయిన్స్ చాలా అవసరం. ఏమాత్రం గ్యాప్ దొరికిన జిమ్స్ కి వెళ్లి వర్క్ అవుట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ మాత్రం ఫిట్నెస్ లేకపోతే సినిమాల ఆఫర్స్ రావు కాబట్టి.జిమ్ కి వెళ్లే హీరోయిన్స్ సాధారణంగా తమ పార్ట్నర్స్ గా లవర్స్ ని లేదా బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్తుంటారు. ప్రేమికులుగా ప్రచారం పొందుతున్నవారితోనే కలిసి జిమ్ లో గంటలకొద్దీ సమయం గడుపుతూ ఉంటారు. కానీ రకుల్ మాత్రం ఇందుకు వ్యతిరేఖం. తమ్ముడు అమన్ తో కలిసి వర్కవుట్స్ చేస్తోంది రకుల్ ప్రీత్.లేటెస్ట్ గా వీరిద్దరూ కలిసి జిమ్ చేస్తున్న వీడియోను రకుల్ తన అకౌంట్ లో పోస్ట్ చేసింది. తమ్ముడి ట్రైనింగ్ లోనే తన ఫిట్నెస్ ను మెయింటెయిన్ చేస్తోంది ఈ భామ. అయితే ఇక్కడ పైకి కనపడని ఓ సీక్రెట్ ఉంది లెండి. రకుల్ కు హైదరాబాద్ లో ఫిట్నెస్ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన ఫ్రాంచైజీలున్నాయి. వీటిని చూసుకునేది ఆమె తమ్ముడే. మరోవైపు ఆమె తమ్ముడిని సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తోంది రకుల్. అటు తన తమ్ముడికి...ఇటు వ్యాపారానికి రెండిటి ప్రచారం లభించేలా ఇలాంటి పోస్టులు పెడుతోందట రకుల్ ప్రీత్ సింగ్. |
https://www.telugupost.com/movie-news/vinaya-vidheya-rama-98624/ | మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'వినయ విధేయ రామ'. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2019 సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. డిసెంబర్ 10 నుండి హైదరాబాద్‌లో భారీ సెట్‌లో ఓ పాటను చిత్రీకరించబోతున్నారు. |
https://www.telugupost.com/movie-news/devadas-story-line-90009/ | ఈ నెల 27న నాగార్జున - నానిలు మన ముందుకు 'దేవదాస్' అనే సినిమాతో వస్తున్నారు. ట్రైలర్ బట్టి చూస్తుంటే ఇందులో నాగ్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడని అర్థం అవుతుంది. ట్రైలర్ లో నాగ్ గన్స్ తో ఉండటం.. ఫైట్స్ చేయడం చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అయితే నాగ్ ఇందులో మాఫియా డాన్ గా చాలా తక్కువ సేపే కనిపిస్తాడట. సినిమా మొత్తం హిల్లేరియస్ ట్రాక్ మీద నడుస్తుందని తెలుస్తుంది. రీసెంట్ గా 'దేవదాస్' సినిమాను కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించారట. వారు చెబుతున్న ప్రకారం నాగ్ మాఫియా బ్లాక్ అన్నది చాలా చిన్నది అని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ ఎంతో సేపు ఉండదని చెబుతున్నారు. సినిమా మొత్తం నవ్వుల పడవ మీద సాగుతుందని చెబుతున్నారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంతే నవ్వులే అంట. స్క్రిప్ట్ కూడా అదేవిధంగా రాసుకున్నాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య.కీలక పాత్రలో శరత్ కుమార్...సినిమా మొత్తంలో ప్రేక్షకులకి ఎక్కడ బోర్ కొట్టదని చివరి వరకు నవ్వుకుంటూనే ఉంటారని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో నాని ఫుల్ గా నవ్వులు పూయించేసాడని టాక్. అలాగే తమిళ్ నటుడు శరత్ కుమార్ పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని వినికిడి. నాని - నాగ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు దానికి ఈ పాజిటివ్ తోడైతే సినిమా హిట్టే. చూద్దాం ఏం జరుగుతుందో. |
https://www.telugupost.com/movie-news/varalakshmi-naandi-184384/ | వరలక్ష్మి శరత్ కుమార్ గతంలో తమిళంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా.. ప్రస్తుతం ఆమె నెగటివ్ కేరెక్టర్స్ కి, ఇంకా కీలక పాత్రలకి టర్న్ అయ్యింది. స్టార్ హీరోస్ మూవీస్ లో లేడి విలన్ గాను వరలక్ష్మి అదరగొట్టేస్తుంది. అయితే వరలక్ష్మి ఆహార్యానికి, ఆమె పవర్ ఫుల్ లుక్స్ కి ఆమెకి గనక మంచి పాత్ర తగిలితే ఎంతలా పెరఫార్మెన్సు చూపిస్తుందో అనేది రీసెంట్ గా రిలీజ్ అయిన నాంది సినిమానే ఉదాహరణ. ఇదివరకు వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్స్ విజయ్ సర్కార్ లోను, విశాల్ పందెం కోడి సినిమాల్లో నటించింది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ కేరెక్టర్ ని పవర్ ఫుల్ గా చూపించినా.. ఆ సినిమాల టాక్ వలన ఆమె పెరఫార్మెన్స్ మరుగున పడిపోయింది. టాలీవుడ్ లోకి సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బిలో నటించింది. రీసెంట్ గా రవితేజ క్రాక్ సినిమాలోనూ జయమ్మగా వరలక్ష్మి నటించింది. అయితే ఆ సినిమాల్లో వరలక్ష్మి పాత్రకి గాని ఆమె లుక్స్ కి కానీ మంచి మార్కులు పడలేదు. కానీ అల్లరి నరేష్ నాంది సినిమాలో జూనియర్ లాయర్ ఆద్యగా వరలక్ష్మి నట విశ్వరూపాన్ని ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. అల్లరి నరేష్ పాత్ర కన్నా వరలక్ష్మి ఆద్య పాత్రకే ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారు. నాంది సినిమాలో ఆద్య గా కోర్టులో వరలక్ష్మి పెరఫార్మెన్స్ నిజంగా అద్భుతం. సినిమాకే సూపర్ హైలెట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరి మంచి నెగెటివ్, పవర్ ఫుల్ లుక్స్ ఉన్న వరలక్ష్మిని కరెక్ట్ గా వాడితే.. ఇలా నాంది లాంటి రిజెల్ట్స్ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.రీసెంట్ గా అల్లు అర్జున్ – కొరటాల మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ వన్ అఫ్ ద విలన్ గా కనిపించబోతుంది అనే టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. |
https://www.telugupost.com/movie-news/ram-charan-ntr-rajamouli-movie-story-69731/ | బాహుబలి తర్వాత రాజమౌళి దాదాపుగా ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని మళ్ళీ పిచ్చఇంట్రెస్టింగ్ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టాడు.రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఒక అద్భుతమైన మల్టీస్టారర్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టేసాడు రాజమౌళి. ఇక ప్రస్తుతం రంగస్థలం సినిమా తో హిట్ కొట్టిన రామ్ చరణ్, బోయపాటి సినిమాతో సెట్స్ మీదున్నాడు. అలాగే ఎన్టీఆర్ కూడా లాంగ్ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ సినిమాతో సెట్స్ మీదున్నాడు. వీరిద్దరి ప్రస్తుత సినిమా లు పూర్తి కాగానే రాజమౌళి తన మంది మార్బలంతో #RRR ని పట్టాలెక్కిస్తాడు.అయితే రాజమౌళి సినిమా ఎలాంటి కథతో ఉండబోతుందో అనే దాని మీద అనేక రకాలు కథనాలు, కథలు ప్రచారంలోకి వచ్చాయి. రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ లను అన్నదమ్ములుగా చూపించబోతున్నాడని.. అలాగే ఈ సినిమా కథ మొత్తం క్రీడా నేపథ్యంలో ఉండబోతుందని... అందులోను బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందనే టాక్ మొదటి నుంచి బాగా ప్రచారంలో ఉంది. అయితే రంగస్థలం ఇంటర్వ్యూ అప్పుడు రాజమౌళి సినిమా గురించిన విషయాలేమి బయటపెట్టని రామ్ చరణ్ ఇప్పుడు తమ మల్టీస్టారర్ సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు.చరణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రాజమౌళి తో ఎన్టీఆర్, తాను చెయ్యబోపై సినిమా గురించిన విషయాలు ప్రస్తావించాడు. తమ సినిమా కథ మీద వస్తున్న వార్తలన్ని కేవలం పుకార్లే అని.. అసలు తాను ఎన్టీఆర్ అన్నదమ్ములుగా కనిపించడం దగ్గరనుండి... ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యం కొనసాగుతుందని... వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టి పడెయ్యడంమే కాదు... #RRR అసలు కథ వేరే ఉందనీ .. ఆ కథ కూడా అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. |
https://www.telugupost.com/movie-news/senior-actress-raashi-comments-on-director-teja-139994/ | శుభాకాంక్షలు, గోకులంలో సీత, మా ఆవిడా మీదొట్టు మీ ఆవిడ చాలామంచిది లాంటి హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాశి.. చాలా త్వరగా ఫెడవుట్ లిస్ట్ లోకి చేరిపోయిన హీరోయిన్. అయితే తర్వాత ఐటెం సాంగ్స్ తోనూ, నెగెటివ్ కేరెక్టర్స్ తోనూ ఆకట్టుకున్నప్పటికీ..ఆమె సినిమా కెరీర్ మాత్రం నిలకడగా సాగలేదు. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన రాశి కి అలీ అలీతో జాలిగా ప్రోగ్రాం ద్వారా అనేక ప్రశ్నలు వెయ్యగా వాటికి రాశి ఆసక్తికర సమాధానాలు చెప్పింది. అలీ మీకు నచ్చని దర్శకుడు ఎవరు అనగానే దానికి రాశి వెంటనే తడుముకోకుండా దర్శకుడు తేజ అని చెప్పింది. మీకు సినిమా లో మంచి పాత్ర అని చెప్పి.. ఎవరైనా ఫ్రాడ్ చేసారా అని అడగగా… దానికి రాశి ఇంకెవరు తేజనే అని చెప్పింది. నిజం సినిమాలో మహేష్ బాబు హీరో అని.. గోపీచంద్ మీది లవ్ ట్రాక్ అని మీ లవ్ ట్రాక్ లోకి విలన్ వస్తాడని చెప్పి.. తన కట్టు బొట్టు అన్ని మార్పించిన తేజ.. షూటింగ్ సమయంలో తన కేరెక్టర్ ని నెగెటివ్ చేసేశాడని, విలన్ గా తన కేరెక్టర్ కనిపించండం తో వెంటనే సెట్స్ నుండి వెళ్లిపోవాలనుకుంటే… రాశి అన్నయ్య మాత్రం హీరోయిన్స్ ఇలా చెయ్యకూడదని, ఇప్పటివరకు నీకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.. ఇప్పుడు ఇలా చెయ్యడం బాగోదని చెప్పడంతో ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసానని.. తేజ కథ ఒకలా చెప్పి సినిమా మరోలా తీసాడని తేజ మీద ఫైర్ అవుతుంది రాశి. |
https://www.telugupost.com/movie-news/సినిమాల-వైఫల్యాలు-నన్ను-5184/ | జాతీయ పురస్కార గ్రహీత ఐన నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన శైలి లో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ధోని, ఉలవచారు బిర్యానీ తర్వాత ఆయన నిర్మాణంలో ఆయనే దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం మన ఊరి రామాయణం. ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన గత రెండు చిత్రాలు ఆర్ధిక లాభాలు తీసుకురానప్పటికీ, తనదైన శైలిలో వైవిధ్య కథలను చెప్పే దర్శకుడిగా మాత్రం ప్రకాష్ రాజ్ కు అటు పరిశ్రమ వర్గాల్లోనూ, ఇటు సినీ విశ్లేషకులలోను గుర్తింపు తెచ్చిపెట్టాయి. మన ఊరి రామాయణం లో ఏ పాత్ర గొప్పతనం ఆ పాత్రదేనని ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్నే తెరపై చూసుకున్న అనుభూతి పొందుతారని నమ్మకంగా చెప్పారు ప్రకాష్ రాజ్.సినీ జీవితంలో ప్రస్తుత తన పరిస్థితిని వివరిస్తూ, సమర్ధిస్తూ "ఇప్పుడు నేను కేవలం నటనకు పరిమితమైన వ్యక్తిని కాదు. నిర్మాతగా మారి నా అభిరుచులకు తగ్గ చిత్రాలను నిర్మిస్తున్నాను. అలానే దర్శకుడిగా మారి నేను ఏ కోణంలో కథను అర్ధం చేసుకుంటానో అదే కోణంలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందు ఉంచుతున్నాను. అయితే ఈ ప్రయాణంలో నాలోని నిర్మాతకు నాలోని నటుడి మద్దతు ఉంటుంది. అలానే నాలోని దర్శకుడికి నాలోని నిర్మాత ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది. దర్శకుడిగా వైఫల్యాలు ఎదుర్కొన్నంత మాత్రాన దర్శకత్వం నుంచి వైదొలగను. మంచి కథలను నాదైన ప్రత్యేక శైలిలో తెరకెక్కిస్తూనే ఉంటాను." అని వివరించారు ప్రకాష్ రాజ్.మన ఊరి రామాయణం ఈ నెల 7 వ తారీకున విడుదల కానుంది. ప్రియమణి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ గత రెండు చిత్రాలతో పోలిస్తే మన ఊరి రామాయణం భారీ స్థాయిలో విడుదల అవుతుంది. |
https://www.telugupost.com/movie-news/bigg-boss-season-5-impresses-the-audience-204089/ | బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హౌస్ లో ప్రతి వారం నామినేషన్ సందర్భంగా గొడవలు అవుతూనే ఉన్నాయి. అయితే ఈవారం హౌస్ లో యాని మాస్టర్ కంటెంట్ కోసం పాకులాడుతున్నట్లు కన్పిస్తుంది. ప్రతి చిన్న విషయానికి కంటెస్టెంట్లతో యాని మాస్టర్ గొడవకు దిగుతున్నారు. సిరిని బిగ్ బాస్ సంచాలకులుగా నియమించారు. సిరిపై కూడా యాని మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. తాను అందరిలాంటి దానిని కాదని, కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. హౌస్ లో మరో నటరాజ్ మాస్టర్ తయారయ్యారని యానిని ఉద్దేశించి కామెంట్స్ వినపడుతున్నాయి. |
https://www.telugupost.com/movie-news/samantha-rejected-role-in-miss-granny-105494/ | పెళ్లికి ముందు ఏమో కానీ పెళ్లి తరువాత మాత్రం సమంతకి తెగ కలిసి వచ్చేస్తుంది. వరసగా సినిమాల మీద సినిమాలు చేసి సక్సెస్ అవుతుంది. అయితే ఏది పడితే అది ఒప్పుకోకుండా పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ నటిస్తుంది. నటనపరంగా తనకి మరింత పేరు తెచ్చిపెట్టే విభిన్నమైన పాత్రలను చేయడానికి ఉత్సాహాన్ని కనబరుస్తోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా డైరెక్టర్ నందిని రెడ్డి చెప్పిన కథకు ఓకే చెప్పింది. ఇది కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్. ఇందులో సమంత యువతిగానే కాకుండా 70 యేళ్ల బామ్మగానూ కనిపించనుంది. ఆల్రెడీ బామ్మ గెటప్ ఫోటోషూట్స్ కూడా అయిపోయిందని సమాచారం. అప్పుడే వృద్ధురాలిగా వద్దని 70 యేళ్ల బామ్మగా సామ్ అదిరిపోయిందని టాక్. దీనికి ‘ఓ బేబీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వృద్ధురాలి పాత్రకు సామ్ ‘నో’ చెప్పిందట. అప్పుడే వృద్ధురాలి పాత్రలో కనిపిస్తే ఆ ప్రభావం కెరియర్ పై పడుతుందని తన స్నేహితులు, సన్నిహితులు చెప్పడంతో ‘నో’ చెప్పేసిందట. దీంతో ఆ వృద్ధురాలి పాత్రకి సీనియర్ హీరోయిన్ లక్ష్మిని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. అంటే యువతిగా ఉన్నప్పుడు సామ్… 70 యేళ్ల బామ్మ గా లక్ష్మి నటించనున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలియనున్నాయి. |
https://www.telugupost.com/crime/jubilee-hills-rape-mlas-son-arrested-police-say-all-6-accused-held-1373126 | జూబ్లీహిల్స్‌లో బాలికపై అఘాయిత్యం కేసులో ఎమ్మెల్యే కొడుకును పోలీసులు అరెస్ట్‌చేశారు. అతడిని ఆరో నిందితుడిగా చేర్చి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సాదుద్దీన్ మాలిక్(18), మరో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో A1 నిందితుడైన సాదుద్దీన్ మాలిక్ మూడురోజుల కస్టడికి ఇచ్చింది కోర్టు. సాదుద్దీన్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. నేరం జరిగిన ప్రదేశంలో సీన్ రికన్‌స్ట్రక్న్ చేయాల్సి ఉందని.. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించాలని ప్రాసిక్యూషన్ తన వాదనలో పేర్కొంది. ఇందుకోసం నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని తెలిపింది. ఈ క్రమంలోనే రేపటి నుంచి మూడు రోజుల పాటు సాదుద్దీన్‌ను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో AIMIM (ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) ఎమ్మెల్యే కొడుకును నిందితుడిగా పేర్కొన్నారు. మొత్తం ఆరుగురు నిందితులు ఒకరు 18 సంవత్సరాల కంటే పైన ఉన్నవాళ్లు కాగా.. మిగిలిన వాళ్లు ఐదుగురు మైనర్లు ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. మొదటి ఐదుగురిపై సామూహిక అత్యాచారం, అపహరణ, స్వచ్ఛందంగా గాయపరచడం, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద నిందితులుగా పేర్కొన్నారు. వారికి మరణశిక్ష, 20 ఏళ్ల జైలు లేదా జీవితకాలం జైలు శిక్ష విధించవచ్చు.గత వారం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కారులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారని ఆరోపిస్తూ వీడియో క్లిప్, ఫోటోలను విడుదల చేశారు. పోలీసులు ఈ ఘటనను దాచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని ఆరోపించారు. మొదట్లో ఎంఐఎం నేత కొడుకు గ్యాంగ్‌రేప్‌లో పాల్గొనలేదని పోలీసులు సమర్థించారు. "అతను ఇన్నోవాలో కొద్ది దూరం ప్రయాణించి, ఫోన్ కాల్ రావడంతో తిరిగి వచ్చాడని అందుకే ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు" అని కమిషనర్ చెప్పారు. బీజేపీ నాయకుడు విడుదల చేసిన వీడియో, ఫోటోల తర్వాత మాత్రమే బాలికపై ప్రాథమిక లైంగిక వేధింపులో అతని ప్రమేయం తమకు తెలిసిందని అంగీకరించారు.గ్యాంగ్ రేప్ సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో నిందితులకు మూడు రకాల శిక్షలు పడే అవకాశముందని కమిషనర్ చెప్పారు. 20 ఏళ్ల జైలు శిక్ష, లేదంటే జీవించి ఉన్నంత కాలం పాటు జైలు శిక్ష, లేదంటే ఉరి శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. అత్యాచారానికి పాల్పడని నిందితుడికి కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మైనర్ బాలిక పబ్ కు వచ్చింది. దాదాపు 100 మంది విద్యార్థులు తలా ₹ 1,300 చెల్లించి పబ్‌ను బుక్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీద మైనర్‌లు ఒక్కొక్కరికి ₹ 900 వరకు పబ్‌ని బుక్ చేసుకున్నారు. "మధ్యాహ్నం 3 గంటల సమయంలో పబ్‌లోనే బాలికపై వేధింపులు మొదలయ్యాయి. ఆ తర్వాత సాయంత్రం 5:40 గంటలకు ఆమె స్నేహితుడు వెళ్లిన తర్వాత వారు ఆమెను పబ్ వెలుపల అడ్డుకున్నారు" అని హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీపీ ఆనంద్ చెప్పారు. బాలికతో తొలి ముద్దాయిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ మాట కలిపాడు. ఇతను ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు.. అంతకన్నా ముందు నిందితుడిగా ఉన్న మరో మైనర్ కూడా ఆమెతో మాట కలిపాడు. వారిద్దరూ బాధితురాలిని లైంగికంగా వేధించారు. తన స్నేహితురాలితో కలిసి బాధితురాలు బయటకు వెళ్లింది. పబ్‌లో సాదుద్దీన్‌తో కలిసి ఐదుగురు మైనర్లు ప్లాన్ వేసుకున్నారు. బయటకు వెళ్లిన బాధితురాలిని ఇద్దరు నిందితులు తమ బెంజ్ కారులో ఎక్కించుకుని బంజారా హిల్స్‌లోని ఓ బేకరీకి వెళ్లారు. వారిని అనుసరించి ఇన్నోవా కారులో మరో నలుగురు వెళ్లారు. బేకరీ నుంచి బయటకు వచ్చాక ఆరుగురు నిందితులు బాధితురాలిని ఇన్నోవాలో ఎక్కించుకుని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి వెనుక నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వెళ్లారు. కారులో వెళుతుండగానే ఆమెపై నిందితులు రేప్ చేశారట. అనుకున్న ప్రాంతానికి చేరుకున్నాక బాధితురాలిపై ఆరుగురు నిందితులు వరుసగా అత్యాచారం చేశారు. వీడియోలు తీసుకున్నారట. వీడియోలను ఒకరితో మరొకరు షేర్ చేసుకున్నారు. అత్యాచారం తర్వాత బాధితురాలిని ఆమ్నేషియా పబ్ వద్దే వదిలివెళ్లారు. ఆ తర్వాత బాధితురాలు తన తండ్రిని పిలిపించుకుని ఇంటికెళ్లిపోయింది. గ్యాంగ్ రేప్ సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో నిందితులకు మూడు రకాల శిక్షలు పడే అవకాశముందని కమిషనర్ చెప్పారు. 20 ఏళ్ల జైలు శిక్ష, లేదంటే జీవించి ఉన్నంత కాలం పాటు జైలు శిక్ష, లేదంటే ఉరి శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. అత్యాచారానికి పాల్పడని నిందితుడికి కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.నిందితులు 11 మరియు 12 తరగతుల విద్యార్థులు. రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందినవారు. పోలీసులకు పట్టుబడిన మైనర్లలో ఒకరు రాష్ట్ర అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన స్థానిక నాయకుడి కుమారుడు. మరో మైనర్ సంగారెడ్డికి చెందిన టీఆర్ఎస్ నేత కుమారుడు. |
https://www.telugupost.com/top-stories/recently-rajya-sabha-member-gvl-narasimha-rao-seems-to-have-shouldered-the-problems-of-kapu-community-1462329 | ఎన్నికలు దగ్గరపడే సమయంలో ఓటర్ల మీద రాజకీయ నాయకులకు వల్లమాలిన ప్రేమ వస్తుంది. ఎంతగా అంటే నాలుగేళ్లు కనపడని సమస్య ఎన్నికల ఏడాది మాత్రం బిగ్ ప్రాబ్లంగా చూస్తారు. దానిని పరిష్కరించడానికి తాము తప్ప ఎవరూ కృషి చేయలేదని నమ్మబలికే ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని మంచి చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే పార్టీలు చర్యలు ప్రారంభించాయి. కాపుల కోసం మేము.. మా వెంటే కాపులు అన్నట్లుగా కొన్ని పార్టీలు వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీ బీజేపీ కూడా కాపుల ఓట్ల కోసం పడే తంటాలు చూస్తుంటే ఔరా అని అనిపించక మానదు.పదే పదే కాపు సమస్యలను...ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కాపు సమస్యలను తన భుజానకెత్తుకున్నట్లే కనపడుతుంది. కాపులకు తామే న్యాయం చేయగలమన్న సంకేతాలను ఆ సామాజికవర్గంలోకి తీసుకెళ్లేందుకు జీవీఎల్ పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. మొన్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లలో కాపులకు రిజర్వేషన్లను కల్పించడంపై రాజ్యసభలో ప్రశ్నించిన జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి సానుకూలమైన సమాధానం రావడంతో అందులో తామే సక్సెస్ అయ్యామని చెప్పుకుంటున్నారు. కాపుల చేత జీవీఎల్ సన్మానాలు కూడా చేయించుకున్నారు.ీఈరోజు రంగాపై...ఇక తాజాగా ఈరోజు రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు వంగవీటి మోహనరంగా పేరును ప్రస్తావించారు. వంగవీటి రంగా పేరును కృష్ణా జిల్లా లేదా మచిలీపట్నం జిల్లాకు పెట్టాలని ఆయన కోరారు. విజయవాడ ఎయిర్‌పోర్టుకు రంగా పేరు పెట్టాలన్నారు. రాజ్యసభ జీరో అవర్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీకి కాపుల అంశం ఇప్పుడే బీజేపీకి ఎందుకు గుర్తుకొచ్చింది? ఏపీలో అధిక సంఖ్యలో ఉన్న ఆ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోగలిగితే అధికారానికి చేరువయ్యే అవకాశాలుంటాయని భావించి కమలనాధులు కాపు నామస్మరణం చేస్తున్నారు. జనసేన సేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎటూ ఆ సామాజికవర్గంలోని మెజారిటీ ప్రజల మద్దతు ఉంటుందంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నేతకే పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.అందరూ నిలబడతారా?గత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు.. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు కావచ్చు.. అదే సామాజికవర్గానికి చెందిన వారు. కానీ కాపులు బీజేపీ వైపు పెద్దగా చూడకపోవడంతోనే జీవీఎల్ నరసింహారావు వరసగా రాజ్యసభలో పదే పదే కాపుల అంశాలను ప్రస్తావిస్తున్నారన్న టాక్ వినపడుతుంది. అంతే కాకుండా కాపుల రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏడాది ముందు కాపుల కోసం కమలం పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో చెప్పలేం కాని.. బీజేపీ మాత్రం కాపులను వదలడం లేదు. చూడాలి.. పవన్ + బీజేపీ కాంబినేషన్ ఇలాగే ఉంటే కాపులందరూ ఏకమయి తమకు అండగా నిలబడతారన్నది ఎంత వరకూ అన్నది. |
https://www.telugupost.com/movie-news/rashmika-mandanna-luck-122697/ | అందం, ఆకర్షణ ఉన్నా నటనలో నైపుణ్యమున్నా.. హీరోయిన్స్ కు లక్ అనేది ఎంత అవసరమో చాలామంది హీరోయిన్స్ విషయంలో చూస్తూనే ఉన్నాం. అందం ఓ అన్నంత మాత్రమే ఉన్నా… లక్కు, ఆకర్షణ, నటనలో నైపుణ్యం టన్నుల లెక్కన ఉండడంతో కన్నడ భామ రష్మిక మందాన్నాకి అవకాశాల మీద అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇటు తెలుగు, అటు తమిళం, కన్నడలోనూ రష్మిక జోరు మాములుగా లేదు. తెలుగులో క్రేజీ హీరో విజయ్ తో నటిస్తున్న రష్మికకు… నితిన్ సరసన, అటు మహేష్ సినిమాలో ఆఫర్ వచ్చింది. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇక తమిళనాట కార్తీ సినిమాతో అడుగుపెట్టిన రష్మికకు మరో క్రేజీ ఆఫర్ వచ్చిందట. అది కూడా ఇళయ దళపతి విజయ్ 64లో విజయ్ సరసన అవకాశమొచ్చిందట. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రష్మికను మెయిన్ హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రస్తుతం ఆమెతో చర్చలు సాగుతున్నాయట. మరి కార్తీతో నటిస్తున్న తమిళ మూవీ ఇంకా విడుదల కాకుండానే రష్మికకు ఇలా స్టార్ హీరో విజయ్ సరసన ఆఫర్ రావడం మాత్రం రష్మిక లక్కుకు నిదర్శనం. తెలుగు, తమిళ, కన్నడ ఆఫర్స్ తో బాగా బిజీగా ఉన్న రష్మికను లక్కున్న హీరోయిన్ అనడంలో అతిశయోక్తి లేనేలేదు. |
https://www.telugupost.com/movie-news/telugu-biggboss-contestant-amardeep-comments-about-pallavi-prashanth-fans-attack-1510524 | Amardeep : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 కంప్లేటేట్ అయ్యిపోయింది. ఇక ఈ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిస్తే, అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. హౌస్ లో ఉన్నంత కాలం వీరిద్దరి మధ్య గట్టి ఫైటే జరిగింది. ఆ ఫైట్ బయటకి వచ్చాక కూడా కొనసాగుతుంది. చివరి ఎపిసోడ్ పూర్తి అయిన తరువాత బిగ్‌బాస్ హౌస్ నుంచి తన ఇంటికి బయలుదేరిన అమర్ దీప్‌పై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడి గురించి రియాక్ట్ అవుతూ అమర్ దీప్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.అమర్ దీప్ ఏమన్నాడంటే.."ఆ కారు దాడి గురించి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఆ విషయం గురించి నేను మాట్లాడాలి అనుకోవడం లేదు. ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టేశారు. అందుకు నేను చాలా బాధపడ్డా. నన్ను ఏమన్నా అనండి, నా పై చెత్త వీడియోలు చేయండి నేను బరిస్తాను. కానీ నా కుటుంబం ఏం చేసింది. మొన్న కారు అద్దాలు పగలు గొట్టారు. ఆ అద్దాలు ముక్కలు కారులో ఉన్న మా అమ్మ మీద పడ్డాయి. ఆమెకు ఏమి కాలేదు కాబట్టి ఓకే. కానీ ఒకవేళ ఏమైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి.అలాగే మా ఇంటిలో ఆడవాళ్ళ ముందే ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారు. మీ ఇంటిలో కూడా ఆడవాళ్లు ఉంటారు. వాళ్ళతో కూడా ఇలాగే ప్రవర్తిస్తారా. నేను ఒక్కడినే ఉన్నప్పుడు ఏమైనా చేయండి. నన్ను తిట్టండి, దాడి చేయండి. నేను భయపడను. కానీ కుటుంబం ఉన్నప్పుడు కొంచెం మంచి ప్రవర్తించండి. నాతోనే కాదు ఇలా ఎవరితో ఎప్పుడు చేయవద్దు. ఇంకోసారి ఇలా ప్రవర్తించకండి. లేదు మీకు ఇంకా నా పై కోపం తగ్గలేదు అంటారా. నన్ను ఎక్కడికి రమ్మంటారో చెప్పండి వస్తాను" అంటూ సవాల్ విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. |
https://www.telugupost.com/movie-news/నాకు-నిక్-నేమ్-అంటేనే-ఇష్-53047/ | ఇండస్ట్రీకి వచ్చినప్పటినుండి నిక్ నేమ్ తోనే చలామణి అవుతున్న హీరో నాని.. అసలు పేరేమిటో తెలుసా..? ఎప్పుడూ నాని నాని అంటూ అతని పేరు ఇండస్ట్రీలోనే కాదు అటు ఫ్యామిలిలో కూడా గట్టిగా పాతుకుపోయింది. అందుకే నాని తన అసలు పేరును పూర్తిగా మరిచిపోయాడు. అసలింతకీ నాని ఒరిజినల్ నేమ్ ఏమిటంటే... నవీన్ బాబు. అయితే నాని మాత్రం నా పేరు నాని..... నన్ను ఇలానే గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. తనను నానిగానే పిలవాలని అంటున్నాడు. నాని నటించిన తాజా చిత్రం ఎంసీఏ ప్రమోషన్స్ లో భాగంగా మీ అసలు పేరు బాగుంది కదా, మరి ముద్దుపేరును ఎందుకు స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నారంటూ ఓ యాంకర్ నానిని సూటిగా అడగగా.. మా అమ్మ, నాన్న, పెద్దమ్మ, అమ్మమ్మ, ఫ్రెండ్స్ ఇలా అంతా నన్ను నాని అనే పిలుస్తారు. అది నా ముద్దు పేరే. దానికి నేను ఒప్పుకుంటాను. కానీ అలా పిలిపించుకోవడమే నాకిష్టం. అందరూ నాని అని పిలుస్తుంటే నాకెంతో హ్యాపీ గా ఉంటుంది. అసలు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా నన్ను నేను నానిగానే పరిచయం చేసుకున్నానని. ఎక్కడా నా అసలు పేరు నవీన్ బాబు అని చెప్పలేదు.ఇక సినిమా పరిశ్రమలో కూడా నన్నంతా నాని అనే పిలుస్తారు. ఇప్పుడు హీరోని కదా అని అసలు పేరును పెట్టుకోలేదు. అసలు ఎప్పటికీ ఇలా నేను నానిగానే ఉండిపోతానని తన ఒరిజినల్ నేమ్ పై పూర్తిగా క్లారిటీ ఇచ్చేసాడు నాని. |
https://www.telugupost.com/movie-news/varun-tej-birth-day-special-varun-tej-12th-movie-first-look-and-title-announcement-1458284 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. గని సినిమా తర్వాత.. ఇంతవరకూ మరో సినిమా అప్డేట్ లేదు. తాజాగా వరుణ్ తేజ్ రెండు సినిమాల నుండి అప్డేట్స్ వచ్చాయి. నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా.. రెండు సినిమాల నుండి పోస్టర్లు వదిలారు మేకర్స్. వరుణ్ 12వ సినిమా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా నుండి వరుణ్ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని ప్రకటించారు మేకర్స్.మోషన్ పోస్టర్ విజువల్స్ చూస్తుంటే లండన్ బ్యాక్ గ్రౌండ్ లో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ చేతిలో గన్ పట్టుకొని అగ్రెసివ్ ఇంటెన్సిటీతో ఇంతకు ముందు చూడని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. టైటిల్ కూడా వైవిధ్యంగా ఉంది. ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్ తో అందరిలోనూ కొత్త ఆసక్తిని రేపారు.ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మోషన్ పోస్టర్ కి మిక్కీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. త్వరలోనే మిగతా నటీనటుల వివరాలను అధికారిగా ప్రకటించనున్నారు. కాగా.. వరుణ్ కెరీర్ లో వస్తున్న ఫస్ట్ కమర్షియల్ మూవీ ‘గాండీవధారి అర్జున’. ఘోస్ట్ లాంటి డిజాస్టర్ తర్వాత దర్శకుడు ప్రవీణ్ సత్తార్ చేస్తున్న ఈ మూవీతో వరుణ్ కి కమర్షియల్ హిట్టుని అందిస్తాడా అనేది చూడాలి.ఇక వరుణ్ 13వ సినిమా.. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వంలో రాబోతోంది. ఆ సినిమాలో వరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నాడు. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆ సినిమా గురించి టైటిల్ లేదా.. ఇతర వివరాలు ఇంకా వెల్లడించలేదు.#GandeevadhariArjuna pic.twitter.com/L2p4g5FttS— Varun Tej Konidela (@IAmVarunTej) January 19, 2023 |
https://www.telugupost.com/movie-news/మూడు-సంవత్సరాల-పాటు-బాయ్-24045/ | బాలీవుడ్ లో హౌస్ ఫుల్ చిత్రంతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని సల్మాన్ ఖాన్ సరసన కిక్ చిత్రంలో కథానాయికగా అవకాశం సంపాదించుకున్న శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండేజ్ ప్రతి సంవత్సరం కనీసం రెండు హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఏకార్డింగ్ టు మ్యాతీవ్ అనే ఆంగ్ల చిత్రంతో పాటు ఈ ఏడాది ఆగష్టు నెలలో విడుదల కానున్న రీ లోడెడ్ మరియు సెప్టెంబర్ నెలలో విడుదల కానున్న జుద్వా 2 చిత్రంలో నటిస్తుంది. జుద్వా 2 చిత్రంలో వరుణ్ ధావన్ సరసన ఇద్దరు కథానాయికలు నటిస్తుండగా వారిలో ఒకరు జాక్వెలైన్ ఫెర్నాండేజ్ కాగా, మరో కథానాయిక తాప్సి పన్ను. రీ లోడెడ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశకి చేరుకోవటంతో జాక్వెలైన్ ఇంటర్వ్యూ లు ఇవ్వటం మొదలు పెట్టేసింది.తాజాగా జాక్వెలైన్ ఫెర్నాండేజ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ముద్దు సన్నివేశాల గురించి ప్రస్తావన రాగా సినిమా లో వుండే సన్నివేశాలతో పాటు తన వ్యక్తిగత ముద్దు సన్నివేశం గురించి కూడా బైట పెట్టేసింది ఈ శ్రీలంక బ్యూటీ. "నా స్కూల్ డేస్ లోనే నా తొలి ముద్దు అనుభవం అయిపోయింది. నాకు స్కూల్ డేస్ లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. మూడు సంవత్సరాల పాటు అతనితో నా ప్రేమ కథ నడిచింది. అతనితో నా 14 వ సంవత్సరంలోనే నేను నా తొలి లిప్ లాక్ అనుభవం పొందాను. ఆ తరువాత నేను ప్రేమ కి, కుర్రాలకి దూరంగా ఉంటున్నాను." అంటూ ధైర్యంగా తన స్కూల్ డేస్ లిప్ లాక్ ఎపిసోడ్ గురించి మనసు విప్పింది జాక్వెలైన్ ఫెర్నాండేజ్. |
https://www.telugupost.com/movie-news/కృషితో-నాస్తి-దుర్భిక్షం-5550/ | నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'ఇజం'.ఈ సినిమా ఆడియో ని హైదరాబాద్‌లో బుధవారం రాత్రి విడుదల చేసారు. నందమూరి హరి కృష్ణ, నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్, దిల్ రాజు, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి అతిధులు గా విచ్చేసారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలైంది.ఈ కార్యక్రమం లో,ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ "అనూప్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. కల్యాణ్ రామ్ ని చూస్తుంటే అతనిలో ఉన్న ఆకలి తెలుస్తోంది. ఓక నటుడి కి ఆ ఆకలి అర్ధం అవుతుంది. పూరి విజన్ తెలుసు. మాస్‌కి క్లాస్ టచ్ ఇవ్వగల దర్శకుడు ఆయన. సినిమా సూపర్ హిట్ అవుతుంది. అంతా పాజిటివ్‌గా ఉంది" అని అన్నారు.బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ "విజువల్స్ మామూలుగా లేవు. చాలా పెద్ద సినిమా అవుతుంది అని చెప్పగలను" అని చెప్పారు.హేమంత్ మధుకర్ మాట్లాడుతూ "సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. టీజర్ , పాటలు బావున్నాయి" అని అన్నారు .భాస్కరభట్ల మాట్లాడుతూ "పూరి జగన్నాథ్ గారి తో పని చేస్తోన్న 24వ సినిమా ఇది. అయన ఇచ్చిన సపోర్ట్ కి ఎప్పటికి రుణ పది ఉంటాను. ఆయనకి రాయడంలో కంఫర్ట్ ఉంటుంది. . అనూప్‌తో పనిచేస్తున్న మూడో సినిమా ఇది. కల్యాణ్ రామ్ గారి కి తొలిసారి పాటలు రాయడం ఆనందంగా ఉంది" అని అన్నారు.దిల్ రాజు మాట్లాడుతూ "ఇజం" పాటలకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. మా సంస్థకు ఈ ఏడాది బావుంది. టీజర్ చూస్తే ఇడియట్ సినిమా గుర్తుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ ఒక గంటా రెండు నిమిషాలుంటే, సెకండ్ హాఫ్ గంటా ఐదు నిమిషాల నిడివి ఉంది. మంచి రేంజ్ ఉన్న సినిమా అవుతుంది " అని తెలిపారు.అలీ మాట్లాడుతూ "కల్యాణ్‌రామ్ మంచి మనసున్న హీరో. ఎక్కడా గర్వం అనేది ఉండదు. కళ్యాణ్ పూరీ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను " అని అన్నారు.తనికెళ్ల భరణి మాట్లాడుతూ "మా నర్సీపట్నం కుర్రోడు ఇవాళ ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు అంటే గర్వం గా ఉంది. ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం నుంచి నాకు పూరి జగన్నాథ్‌తో పరిచయం ఉంది. ఇజం చిత్రం క్లైమాక్స్ చూస్తే నాకు కన్నీళ్లొచ్చాయి. ఏడు నిమిషాల పాటు పెర్ఫార్మెన్స్ ను కల్యాణ్ రామ్ ఇరగదీశాడు." అని అన్నారు .అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ "కల్యాణ్‌రామ్‌గారితో నేను చేస్తున్న తొలి సినిమా ఇది. పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ అవకాశం ఇచ్చిన పూరి గారికి, కళ్యాణ్ గారికి థాంక్స్" అని అన్నారు.అదితి ఆర్య మాట్లాడుతూ "కల్యాణ్ రామ్ గారు పెద్ద కుటుంబం నుంచి వచ్చారు. పెద్ద హీరో. ఆయన చాలా ఆరోగెంట్‌గా ఉంటారేమో అని భయపడ్డా. కానీ ఆయన చాలా సాఫ్ట్ , డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు. ఈ చిత్రం లో అవకాశం ఇచ్చినందుకు ఆయనకి, పూరి గారి కి థాంక్స్ . ఈ చిత్రం లో నటించటం చాలా బాగుంది" అని తెలిపారు.పూరి జగన్నాథ్ మాట్లాడుతూ " ఎప్పటి నుండో కళ్యాణ్ రామ్ గారి తో సినిమా చేయాలి. కొంచెం లేట్ అయినా ఇన్నాళ్ళకి మంచి సినిమా చేసాం. ఇజం టీజర్ హరికృష్ణ గారికి నచ్చి, "ఏంటయ్యా నా కొడుకు ఇట్టా ఉన్నాడు" అని అన్నారు. ఎన్టీఆర్ అయితే కేక వేసాడు. ఈ సినిమా లో ఒక కోర్ట్ సీన్ లో కళ్యాణ్ రామ్ ఇరగదీసాడు. కోర్ట్ సీన్స్ అంటే నందమూరి వారికే చెందుతాయి. ఆయన యాక్టింగ్ చూసి చాలా గర్వంగా అనిపించింది. తప్పకుండా చూసిన వాళ్లందరూ కూడా అది ఫీలవుతారు.హరికృష్ణ గారు టీజర్ నచ్చి నాకు రెండు పావురాలను ఇచ్చారు.అనూప్ నాకు ఈ సినిమాలో ఓ పాటను రాసే , పాడే అవకాశాన్నిచ్చాడు. పాట రాయడం ఎంత కష్టమో అర్థమైంది. దానికి బదులు ఓ కథ రాసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మా సినిమా చాలా చాలా బాగా వచ్చింది", అని చెప్పారు.నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ ''ఇపుడు నా వయసు 60. ఈ జీవితంలో ఎవరూ పొందలేని, అనుభూతులను నేను పొందాను. మహానుభావుడు నందమూరి రామారావు గారి దగ్గర 30 ఏళ్లు పనిచేశా. ఆయనతో నాకున్న అనుభవాలు హిమాలయ శిఖరాలను మించాయి. సినిమా రంగంలో ఆయనతో ఎన్నో విజయాలు చూశాను. రాజకీయాల్లో పార్టీ పెట్టి పోరాటం చేసి 8 నెలల్లో గెలిచాం. వెలకట్టలేని వీరాభిమానులు ఇవాళ మా సొంతం. డబ్బు పోవచ్చు. కానీ ఎవరూ తస్కరించలేనిది అభిమానం.తెలుగు ప్రజలు నా బిడ్డలకు ఆ అభిమానాన్ని పంచుతున్నారు. నా 59వ ఏట జూనియర్ టెంపర్ హిట్ ఇచ్చాడు. కల్యాణ్‌రామ్ పటాస్ ఇచ్చాడు. నా 60వ ఏట జూనియర్ జనతాగ్యారేజ్ బ్లాక్బస్టర్ ఇచ్చాడు. కల్యాణ్ ఇప్పుడు ఇజంతో ముందుకు రాబోతున్నాడు. హిట్ కొడతాడనే నమ్మకం ఉంది.నేను ఎప్పుడూ ఎవరికీ తల వంచను. కష్టం అయినా నష్టం అయినా అంతే. మా నాన్న కడుపున పుట్టడమే నేను చేసుకున్న మహద్భాగ్యం. ఆయన ఆశీస్సులు పిల్లలకున్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటను నా ఇద్దరు పిల్లలూ గుర్తుంచుకున్నారు. నా పెద్ద కుమారుడు తన తమ్ముళ్లు తప్పకుండా హిట్లు తీస్తారని నాతో చెప్పేవాడు. అతను లేకపోయినా అతను నమ్మిన మాట ఉంది. ఆ మాట ప్రకారం పిల్లలిద్దరూ హిట్లు కొట్టారు. పై నుంచి మా నాన్న, నా పెద్ద కుమారుడు వీళ్లను ఆశీర్వదిస్తున్నారు " అని అన్నారు.కల్యాణ్ రామ్ మాట్లాడుతూ "ఇజం టీమ్ నా బెస్ట్ టీమ్. నేనింత వరకు పనిచేసిన వాళ్లలో ఈ యూనిట్ ద బెస్ట్. అనూప్ మంచి పాటలిచ్చారు. US నుండి ఫోన్ చేసి నా కెరీర్ బెస్ట్ సాంగ్స్ అని చెప్తున్నారు. పూరి జగన్నాథ్‌గారు చాలా ఉత్సాహాన్నిచ్చారు. నా కెరీర్‌లో బెస్ట్ డైరక్టర్ ఆయన. లవబుల్ పర్సన్. ప్రతి వ్యక్తిలోనూ ఉత్సాహాన్ని నింపి పని చేయించుకున్నారు. థాంక్స్ ఆ లాట్ పూరీ సర్", అని అన్నారు .ఎన్టీఆర్ మాట్లాడుతూ "అనూప్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఇప్పుడున్న వాళ్లలో మెలోడీ లను అత్యద్భుతంగా చేయగలిగింది అనూప్. జగన్ భయ్యా ఒక రోజు పిలిచి కల్యాణ్ రామ్ అన్నయ్యతో ఓ సినిమా చేయబోతున్నట్టు చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది . జగన్ గారితో అన్నయ్య ఓ సినిమా చేస్తే బావుంటుందని నాకు ఎప్పటి నుంచో అనిపించేది. ఎందుకంటే ... |
https://www.telugupost.com/movie-news/dil-raju-sankranthi-sentiment-105722/ | 2017 సంక్రాతిలో మెగాస్టార్ చిరు కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ – క్రిష్ ల గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. పెద్ద స్టార్స్, భారీ బడ్జెట్, భారీ అంచనాలతో ఉన్న సినిమాలు.. అయినప్పటికీ దిల్ రాజు కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిన శతమానం భవతిని సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. మరి చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో సూపర్ హిట్ కొత్తగా… బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి కూడా హిట్ అయ్యింది. అంత పెద్ద సినిమాల్లో చిన్న సినిమాగా విడుదలైన శతమానం భవతి సూపర్ హిట్ అవడమే కాదు.. మంచి కలెక్షన్స్ తీసుకొచ్చి దిల్ రాజుకి సెంటిమెంట్ ఇచ్చింది. మళ్లీ బాలయ్యతోనే పోటీ తాజాగా ఈ ఏడాది కూడా భారీ బడ్జెట్ చిత్రాల నడుమ తన చిత్రాన్ని విడుదల చెయ్యాలని దిల్ రాజు కంకణం కట్టుకుని కూర్చున్నాడు. గత ఏడాది డిసెంబర్ చివరి వరకు దిల్ రాజు సంక్రాతి పోటీకి భయపడి తన చిత్రం ఎఫ్ 2 వదలడేమోలే ఆనుకుంటే.. అనూహ్యంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అనుకున్న టైంకే తన ఎఫ్ 2 సినిమాని థియేటర్స్ లోకి తెచ్చేసాడు. మరి ఈ సంక్రాంతికి బాలకృష్ణ తో మళ్లీ పోటీ పడ్డాడు దిల్ రాజు. 2017లో తండ్రి చిరుతో పోటీపడిన దిల్ రాజు చిత్రం ఈ ఏడాది కొడుకు చరణ్ సినిమాతో పోటీ పడింది. ప్రమోషన్స్ లేకపోయినా… మరి ఈ ఏడాది కూడా దిల్ రాజు సంక్రాంతికి వచ్చి ఎప్పటిలాగే హిట్ కొట్టేసాడు. ఎఫ్ 2 ఈ శనివారమే సంక్రాతి కానుకగా చివరి చిత్రంగా విడుదలై, కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రావడం.. ప్రేక్షకులు మెచ్చడం జరిగింది. ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామలకు గట్టి పోటీ ఇచ్చింది ఎఫ్ 2 చిత్రం. మరి దిల్ రాజు పెద్ద సినిమాల హడావిడిలో తమ సినిమా ప్రమోషన్స్ ఎందుకు అనుకున్నాడో లేదా ఎలాగూ హిట్ అవుతుంది ప్రమోషన్స్ అవసరం లేదనుకున్నాడో.. ఎఫ్ 2 సినిమాకి చాలా తక్కువ ప్రమోషన్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రమోషన్స్ లేకపోయినా ఎఫ్ 2 మౌత్ టాక్ తో లేచేలా కనబడుతుంది. |
https://www.telugupost.com/movie-news/ఈసారి-పోటీ-ఉండదట-35443/ | కిందటి సంక్రాంతికి ఎవరు చెప్పినా వినకుండా జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకుప్రేమతో' చిత్రంతో వచ్చాడు. బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్' కూడా బరిలోకి దిగడంలో బాబాయ్‌ని మంచి చేసుకోవాల్సింది పోయి ఇలా పోటీ పడి సినిమా రిలీజ్ చేయడం ఏమిటి? సీనియర్ అయిన బాలకృష్ణకు ఎన్టీఆర్ గౌరవం ఇవ్వాలి కదా అనే విమర్శలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ నటించిన 'నాన్నకుప్రేమతో' చిత్రానికి చంద్రబాబుతో కలిసి బాలయ్య థియేటర్ల దొరకనివ్వలేదని, చాలా చెత్త థియేటర్లలో సర్దుకుపోవాల్సివచ్చిందని, దాంతోనే సూపర్‌హిట్ కావాల్సిన ఆ చిత్రం హిట్ వద్దనే నిలిచిందనే వార్తలు కూడా హల్‌చల్ చేశాయి. నందమూరి అభిమానులు కూడా ఆ పరిస్థితి వల్ల అయోమయంలో పడ్డారు. ఇక ఈ సారి దసరా కానుకగా బాలయ్య తాను పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పైసా వసూల్'కి సెప్టెంబర్ 29న విడుదల అని అనౌన్స్ చేశారు. మరోపక్క ఎన్టీఆర్ బాబి దర్శకత్వంలో అందునా కళ్యాణ్‌రామ్ నిర్మాతగా తెరకెక్కుతోన్న 'జై లవ కుశ' కూడా దసరాకే వస్తుందని అభిమానులు భయపడ్డారు. కానీ 'జై లవ కుశ' చిత్రాన్ని ఇంకా వేగంగా షూటింగ్ జరిపి సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో రిలీజ్ చేసి తన బాబాయ్ కంటే కనీసం 15 నుంచి 20రోజుల గ్యాప్ తీసుకోవాలనే నిర్ణయానికి ఎన్టీఆర్,కళ్యాణ్‌రామ్‌లు వస్తారని వార్తలు వస్తున్నాయి. సో.. ఈసారి నందమూరి అభిమానులకు మిగతా హీరోలను నుంచి తప్ప వారిలో వారికి పోటీ ఉండదనే చెప్పాలి...! |
https://www.telugupost.com/top-stories/ycp-mla-undavalli-sridevi-will-face-opposition-from-her-own-party-1455113 | వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తీవ్రమైన వ్యతిరేకత బయటపడుతుండటంతో ఎమ్మెల్యే గ్రామాల్లో కూడా పర్యటించలేకపోతున్నారు. తాడికొండ నియోజకవర్గం వైసీపీ హైకమాండ్ కు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. తమపైనే కేసులు పెట్టించారంటూ ఉండవల్లి శ్రీదేవిపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ పార్టీ అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించారు. అది కూడా అప్పట్లో రచ్చ అయింది. దీంతో డొక్కా మాణిక్యవరప్రసాద్ కొంత సైలెంట్ అయ్యారు.తొలి నుంచి వ్యతిరేకతే...నిజానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై తొలి నుంచి వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. ఆమె స్వతహాగా వైద్యురాలు. హైదరాబాద్ లో వైద్య వృత్తి చేసుకుంటున్న ఉండవల్లి శ్రీదేవిని తాడికొండ టిక్కెట్ ఇచ్చి జగన్ గెలిపించారు. కానీ ఆమె డాక్టర్ గా సక్సెస్ అయినా పొలిటిషియన్ గా మాత్రం ఫెయిల్ అయ్యారన్న విమర్శలున్నాయి. తొలినుంచి తాడికొండలో తన కంటూ ప్రత్యేకమైన గ్రూపును ఏర్పాటు చేసుకోవడంతో వైసీపీ సిసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. తాడికొండ పంచాయతీ అనేక సార్లు హైకమాండ్ దృష్టికి వెళ్లినా ఫలితం కన్పించలేదు. మూడు గ్రూపులు...ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కు పొసగదు. అలాగే పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ కు, ఉండవల్లి శ్రీదేవికి మధ్య విభేదాలున్నాయి. తాడికొండ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందులో డొక్కామాణిక్య వరప్రసాద్, నందిగం సురేష్ లు కూడా ఉన్నారు. వీరిద్దరి వర్గాలు కూడా తాడికొండలో ఉన్నాయి. నందిగం సురేష్ ది అదే ప్రాంతం కావడంతో తాను ఈసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి వైసీపీలో గ్రూపు విభేదాలు భగ్గుమంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ఉండవల్లి శ్రీదేవికి ఇస్తే తాము సహకరించబోనని వైసీపీ కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారు. మధ్యలో వెళ్లిపోయిన...తాజాగా తాడికొండ, తుళ్లూరు మండలాలకు చెందిన వైసీీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీదేవి మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. శ్రీదేవి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వచ్చిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్ లు సర్దిచెప్పినా కార్యకర్తలు వినిపించుకోలేదు. సభలో కుర్చీలు విసిరేయడంతో శ్రీదేవి ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. చివరకు పోలీసులు కలగచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మర్రి రాజశేఖర్ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చినా వారు శాంతించలేదు. శ్రీదేవి ఇక్కడ నుంచి వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. కార్యకర్తల సమస్యలను తెలుసుకునేందుకు పార్టీ హైకమాండ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఉండవల్లి శ్రీదేవికి సొంత పార్టీ నుంచి సెగ మామూలుగా తగలలేదు. |
https://www.telugupost.com/crime/youth-asked-to-send-nude-video-in-the-name-of-medical-checkup-1373919 | ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాకు చెందిన ఓ యువకుడు వాట్సాప్‌లో తన నగ్న వీడియోలతో గుర్తు తెలియని వ్యక్తి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించాడు. ఉద్యోగం కోసం మెడికల్ చెకప్ పరీక్ష చేయించుకుందామని నిందితులు తన న్యూడ్ వీడియోను అడిగారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. రూ.25 వేలు ఇవ్వాలని, లేకుంటే తన వీడియోను ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో అప్‌లోడ్ చేస్తానని అతడు బెదిరిస్తున్నాడని వాపోయాడు. ఈ సంఘటన రాంపూర్ ఖర్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. ఉద్యోగం కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నానని ఆ నిరుద్యోగ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో కూడా వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఇందుకు సంబంధించి పలు అవసరమైన పత్రాలను సమర్పించినట్లు తెలిపారు.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 9న తనకు కాల్ వచ్చిందని, విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మెడికల్ చెకప్ కోసం తన న్యూడ్ వీడియోను పంపాల్సిందిగా కాలర్ కోరాడని తెలిపాడు. తన మొబైల్ ఫోన్‌లో వీడియో పంపితే మెడికల్ చెకప్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని నిందితులు బాధితుడిని వాట్సాప్‌లో తన నగ్న వీడియోను పంపేలా ప్రలోభపెట్టారు. ఒక రోజు తర్వాత, బాధితుడికి మరో నంబర్ నుండి కాల్ వచ్చింది. అతను తన వీడియోలను వేర్వేరు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి రూ.25,000 చెల్లించాలని బ్లాక్ మెయిల్ చేశాడు. "వీడియోను తొలగించమని నేను చాలాసార్లు కాలర్‌ని అభ్యర్థించాను, కాని అతను నన్ను బెదిరిస్తూనే ఉన్నాడు. రూ. 25,000 చెల్లించమని అడిగాడు. కాల్‌ను డిస్‌కనెక్ట్ చేసాడు" అని బాధితుడు తన పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు తన స్నేహితులకు తన బాధను వివరించాడు. రాంపూర్ ఖార్ఖానా పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. |
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-movie-with-flop-director-122787/ | తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత నుండి స్క్రిప్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. యూత్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. వరుస కమిట్మెంట్స్ ఉన్న విజయ్ కి మరో డైరెక్టర్ లైన్ లో ఉన్నాడు. అతనే హను రాఘవపూడి. నానితో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, శర్వాతో 'పడి పడి లేచె మనసు'చేసి ఫ్లాప్‌తో ఢీలా పడ్డ హనుకి ఆ తరువాత అతనితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందు రాలేదు. లవ్ స్టోరీతో విజయ్ సినిమా వైజయంతీ అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్‌తో విజయ్ ఓ సినిమా చేయాలి. అయితే ఇప్పటివరకు విజయ్ స్వప్న సినిమాస్‌లో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి రెండు సినిమాలు చేసాడు. ఒప్పందం ప్రకారం మూడో సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమాను హనుతో చేయించాలని స్వప్న భావిస్తుంది. హను రీసెంట్ గా ఓ లవ్ స్టోరీ రాసుకున్నాడట. మిలటరీ నేపథ్యంలో సాగే ఈ లవ్ స్టోరీలో విజయ్ అయితే బాగుంటాడని హను కూడా భావిస్తున్నాడట. మరి ఈ సినిమాను ఓకే చేసాడో లేదో చూడాలి. |
https://www.telugupost.com/top-stories/whatever-step-telugu-desam-party-chief-chandrababu-takes-will-have-a-political-purpose-1468110 | తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి అడుగు వేసినా అందుకు ఒక రాజకీయ ప్రయోజనం ఉంటుంది. రాజకీయాలను వడపోసిన చంద్రబాబు ఏ నిర్ణయమూ అంత సులువుగా తీసుకోరు. అందుకే ఆయన నలభై ఏళ్ల నుంచి రాజకీయాలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఎక్కువ రోజులు పనిచేసిన ముఖ్యమంత్రిగా కూడా రికార్డుల కెక్కారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని చేతులోకి తీసుకున్నా దానిని మూడు దశాబ్దాల నుంచి విజయవంతంగా నడపటం ఆయనకే సాధ్యం. ఇది చంద్రబాబుపై పొగడ్తలు కావు. ఆయనకున్న రాజకీయ సమర్థత. పాలిటిక్స్ పై ఆయనకున్న గ్రిప్‌ను తెలియజేయడానికి మాత్రమే. అందుకే ప్రత్యర్థులు ఎవరూ చంద్రబాబును అంత ఆషామాషీగా తీసుకోవడానికి వీలులేదు. ప్రతి నిర్ణయం వెనక...చంద్రబాబు ప్రతి నిర్ణయం వెనక పార్టీ ప్రయోజనం దాగి ఉంటుంది. భవిష్యత్ లో ఉపయోగపడే నిర్ణయాలనే ఆయన తీసుకుంటారన్నది పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే ఆయన నేతృత్వంలో పార్టీ 2019 ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయినా కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీని వీడారు. ఆ ఒక్కటి చాలు ఆయనపై పార్టీ నమ్మకానికి ఉదాహరణ. ఇక తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థిని బరిలోకి దింపారు. ఎమ్మెల్యే కోటాలో ఆయనకున్న ఎమ్మెల్యేలు కేవలం 19 మంది మాత్రమే. అయినా రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే ఎన్నికలకు వెళుతున్నారు. మొత్తం ఏడు ఎమ్మెల్సీలకు గాను ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో...ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 23న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలవాలంటే 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. పార్టీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలు ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. అంటే 19 మంది టీడీపీ ఒరిజినల్ కౌంట్. ఇక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఓట్లు ఎటూ తమ అభ్యర్థికి వచ్చినా 21కే పరిమితం అవుతారు. కానీ మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే ఎన్నికల్లో ఏదైనా జరగొచ్చు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరయినా, హైకమాండ్‌పై అసంతృప్తితో తమకు ఓటు వేసినా టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశముంది. కానీ అది ఆశమాత్రమే. అదినెరవేరుతుందన్న గ్యారంటీ అయితే లేదు కాని, ఒక ప్రయత్నం మాత్రం చంద్రబాబు చేశారనే చెప్పాలి. పంచుమర్తి ఎంపిక...విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే ఈ ఎంపికలోనూ చంద్రబాబు దూరదృష్టి ఉంది. పంచుమర్తి అనూరాధ బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన వారు. ఇప్పటికే జగన్ ఆ సామాజికవర్గానికి ఎమ్మెల్సీ పదవితో పాటు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మంగళగిరిలో ఆ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. చంద్రబాబు తమ సామాజికవర్గానికి చెందిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అక్కడి ప్రజలు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు లోకేష్ కు అండగా నిలబడే అవకాశముంది. రాష్ట్రంలో బీసీలు కూడా కొంత సానుకూలంగా స్పందించే వీలుంటుంది. గెలిస్తే వెల్ అండ్ గుడ్. లేకుంటే చంద్రబాబు ఇచ్చినా తమ పార్టీ పట్ల సానుభూతి వచ్చే అవకాశముందన్నది చంద్రబాబు లెక్క. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏరి కోరి అనూరాధను ఎంపిక చేశారన్నది వాస్తవం. సరే ఓటమి చెందవచ్చు. విజయం సాధించవచ్చు. గెలిస్తే ఓకే. ఓడినా భవిష్యత్ లో లోకేష్ ఖాతాలో కొన్ని ఓట్లయినా పడటానికి ఈ ఎంపిక ఉపయోగపడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. |
https://www.telugupost.com/movie-news/ఇంటరెస్టింగ్-రేట్-కు-హలో-52993/ | మొదటి సినిమా డిజాస్టర్ అవ్వడంతో రెండో సినిమాపై ఫుల్ డెడికేషన్ పెట్టి హలో సినిమాను రెడీ చేసాడు అఖిల్. ఈ సినిమా ఈ క్రిస్మస్ కు రిలీజ్ అవుతుంది. కానీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు సినిమా 5కోట్ల 90లక్షల రూపాయలకు దక్కించుకుంది.ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ ఇంత మొత్తంలో రావడం చెప్పుకోదగ్గ విషయమే. సినిమా రిలీజ్ అవ్వకుండానే జీ సినిమా డీల్ సెట్ చేసుకుంది. అఖిల్ మొదటి సినిమా కూడా జీ తెలుగు వాళ్లే కొన్నారు. అది డిజాస్టర్ అయినా మళ్ళీ వీళ్ళే కొనడానికి కారణం నాగార్జున అంట. అఖిల్ సినిమా ప్లాప్ అవ్వడంతో టీవీల్లో కూడా రేటింగ్ రాలేదు అందుకు నాగ్ హలో సినిమా కూడా ఆ ఛానల్ కు ఇచ్చాడట.ఇది ఇలా ఉండగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 29కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఖర్చులన్నీ కలుపుకొని కనీసం 33 కోట్ల రూపాయలు రావాలి. మరి అఖిల్ కు అంత మార్కెట్ కూడా లేదు. అందుకే నాగ్ ఈ సినిమా ప్రొమోషన్స్ యూఎస్ నుండి స్టార్ట్ చేసి అక్కడ వసూళ్ల కోసం ఓవర్సీస్ పై ఎక్కువ ద్రుష్టి పెట్టటానికి కారణం |
https://www.telugupost.com/movie-news/అసలు-కారణం-ఇదేనా-24091/ | గత రెండ్రోజులుగా మీడియాలో అఖిల్ పెళ్లి రద్దయిందనే వార్త సంచలనం రేపుతోంది. అఖిల్ - శ్రీయ భూపాల్ ఇద్దరు తమ పెళ్లిని రద్దు చేసుకున్నారనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేస్తుంది. అసలు రెండేళ్ల నుండి ప్రేమించుకుని డేటింగ్ చేస్తున్న ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని త్వరలోనే విదేశాల్లో పెళ్ళికి సిద్దయమైన వీరు ఇప్పుడు సడన్ గా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడమేమిటి అని అందరూ తెగ ఇదై పోతున్నారు. ఇక నాగార్జున ఫ్యామిలీ గాని, జివికె ఫ్యామిలీ గాని ఈ పెళ్లి రద్దయిన విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అసలేం జరిగింది ఈ పెళ్లి రద్దవ్వడానికి కారణాలేమిటి? అనే విషయాలను మీడియాకి ఎంతో కొంత తెలిస్తే తప్ప ఈ రూమర్స్ ఆగేలా లేవు. అసలు సోషల్ మీడియాలో అఖిల్ పెళ్లి రద్దు అనే మేటర్ ని ప్రముఖంగా రాసేస్తున్నారు చాలామంది. అసలింత జరుగుతున్నా నాగార్జున ఎందుకు మీడియాకి ముఖం చూపించలేక పోతున్నాడు. అంటే మీడియాలో జరిగే ప్రచారం నిజమేనా? అని అనిపించకమానదు.అసలు అఖిల్ కి శ్రీయ భూపాల్ కి ఆ మధ్యన సుబ్బరామిరెడ్డి మనవడు పింకీ రెడ్డి కుమారుడి పెళ్లిలోనే ఏదో గొడవైందని..... ఇక అప్పటినుండి వీరి మధ్యన విభేదాలు తలెత్తాయని... తాజాగా అఖిల్, శ్రీయ లు ఎయిర్ పోర్ట్ లో గొడవ పడ్డారనే అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియదు గాని... అఖిల్, శ్రీయ, శ్రీయ తల్లి ముగ్గురు పెళ్లి పనుల కోసం ఇటలీకి వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ కి చేరుకోగా... అక్కడ శ్రీయ భూపాల్ ని ఫొటోస్ కి ఫోజ్ ఇవ్వాల్సిందిగా అఖిల్ కోరగా శ్రీయ మాత్రం అఖిల్ మాట వినకుండా ముందుకు వెళ్లిపోవడంతో అఖిల్ అప్పుడే శ్రీయ తో గొడవ పడడంతో ఈ పెళ్లి రద్దయిందనే ఒక వార్త ఇప్పుడు మీడియాలో హైలెట్ అయ్యింది. ఇక అఖిల్ శ్రీయ గొడవని ఆపాలని శ్రీయ తల్లి ఏ మాత్రం ట్రై చెయ్యక పోవడంతో అఖిల్ పెళ్లిని రద్దు చేసుకున్నాడని అంటున్నారు.అఖిల్ ఇంటికి వచ్చి నాగార్జున కి జరిగింది చెప్పగా నాగ్, శ్రీయ - అఖిల్ కి సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేయగా వీరు పెళ్లిని ని బ్రేక్ చేసుకోవడానికే సుముఖత చూపడంతో ఈ పెళ్లిని తప్పనిసరి పరిస్థితుల్లో క్యాన్సిల్ చెయ్యాల్సి వచ్చిందని అంటున్నారు. ఇక ఇదంతా ఇలా జరుగుతుండగా మరోపక్క నాగ చైతన్య - సమంతలు త్వరగా పెళ్ళిచేసుకుని సెటిల్ అవ్వమని అక్కినేని ఫ్యామిలీ వారిపై వత్తిడి తెస్తున్నట్టు ప్రచారం మొదలైంది. ఇప్పటికే వీరు ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి కొద్దీ టైం కావాలని అడగడంతో నాగార్జున ఒప్పుకున్నాడట. కానీ ఇప్పుడు అఖిల్ - శ్రీయ భూపాల్ వ్యవహారంలో నలిగిపోతున్న నాగ్, నాగ చైతన్య విషయంలో కూడా ఇలాంటిది ఏదో ఒకటి జరిగే వరకు పెళ్లి వాయిదా వేయకూడదని అందుకే త్వరలోనే వీళ్ళపెళ్లి జరిపించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మరి ఎంకి పెళ్లి సుబ్బి చావుకి రావడం అంటే ఇదేనేమో. పాపం టాలీవుడ్ లో డీసెంట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న నాగ్ కొడుకుల వల్ల వీధికెక్కాల్సి వచ్చిందని అనుకుంటున్నారు అందరూ. |
https://www.telugupost.com/movie-news/vijay-varasudu-movie-3-days-collections-in-telugu-states-1457941 | విజయ్ హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'వరిసు'.. తెలుగులో 'వారసుడు' టైటిల్ తో ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. వారసుడు విడుదలయ్యాక తెలుగు రాష్ట్రాల్లో తొలి 3 రోజుల్లో.. రూ.8.9 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే 3.61 కోట్లను రాబట్టింది.తెలుగులో ఇద్దరు అగ్రహీరోల సినిమాలైన..'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' వంటి భారీ సినిమాలకు పోటీగా విడుదలైన వారసుడు మూడు రోజుల్లో.. రూ.8.9 కోట్ల షేర్ ను సాధించడం విశేషమనే చెప్పాలి. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టయినర్ నేపథ్యంలో రూపొందిప్పటికీ, యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కి కూడా ప్రాధాన్యత ఉంది. తమిళంలో రూపొంది.. తెలుగులోకి అనువదించినా.. తారాగణాన్ని చూస్తే.. పక్కా తెలుగు సినిమానే అనిపిస్తుంది. కథ, కథనాలు తెలుగువారికి రొటీన్ గానే అనిపించాయనడంలో సందేహం లేదు. తమన్ సంగీతం ఈ సినిమాను కొంతవరకూ ఆదుకుంది. |
https://www.telugupost.com/movie-news/trisha-continue-to-work-in-telugu-movies-152006/ | తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన త్రిష.. సీనియర్ అండ్ యంగ్ హీరోలందరిని చుట్టేసింది. అయితే తాజాగా చిరు సినిమా నుండి త్రిష తప్పుకోవడంతో… ఆమెపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. పాత్ర నచ్చలేదని అన్నయ్య సినిమా నుండే వాకౌట్ చేస్తావా అంటూ త్రిషపై నిప్పులు చెరుగుతున్నారు. అందుకే త్రిషపై మెగా ఫ్యాన్స్ లేనిపోనివి ప్రచారం చేస్తున్నారు,. అందులో భాగంగానే త్రిష ఇక తెలుగులో నటించదు అందుకే చిరు సినిమానుండి తప్పుకుంది అంటూ ఆమెపై ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారట. ఆ ప్రచారం విషయం తనదాకా రావడమతొ త్రిష వాళ్ళ మీద ఫైర్ అవుతుంది. దానితో త్రిష నేను హీరోయిన్ గా నిలదొక్కుకున్నదే తెలుగు సినిమాలతో. ఇక్కడ తెలుగు హీరోలందరితో సినిమాలు చేశాను అలాంటప్పుడు నేను తెలుగు సినిమాలు చేయనని ఎందుకు చెబుతాను. మొన్నామధ్యన టాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ వస్తే, డేట్స్ కుదరక చేయలేనని చెప్పాను. అంతేకాని.. తెలుగులో సినిమాలు చెయ్యనని చెప్పలేదు. అంతలోనే త్రిష తెలుగులోనే చేయదట అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా పుకారు మాత్రమేనని చెప్పడమే నా ఉద్దేశం. అంటూ ఫైర్ అవుతుంది త్రిష. |
https://www.telugupost.com/top-stories/andhra-pradesh-cabinet-expansion-is-set-to-take-place-there-is-a-possibility-of-cabinet-expansion-on-april-11th-1361741 | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖారారయింది. ఏప్రిల్ 11న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఆశావహులు సీనియర్ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల టీం కావడంతో జగన్ సామాజికవర్గాల సమీకరణాలు, ప్రభావితం చేయగల నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జగన్ ఇప్పటికే కేబినెట్ విస్తరణపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.అన్ని సమీకరణాలు...ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు కానుండటంతో ఆ లెక్కలను కూడా జగన్ పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కేబనెట్ విస్తరణ కావడంతో జగన్ ఆచితూచి సమీకరణ చేయాల్సి ఉంటుంది. సీనియర్ నేతలు వైసీపీలో అనేక మంది ఉన్నారు. వారిని సంతృప్తి పర్చడమే ఇప్పుడు జగన్ ముందున్న సవాల్. సీనియర్ నేతలు అసంతృప్తికి లోనయితే వచ్చే ఎన్నికల్లో పార్టీకే నష్టమని చెప్పకతప్పదు. సీనియర్ నేతలు.....ప్రతి జిల్లాలో సీనియర్ నేతలు మంత్రి పదవి కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి, ఆర్కే రోజా, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కోడుమూరు శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి వంటి నేతలు ఈసారి తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న ఆశతో ఉన్నారు.రెడ్డి సామాజికవర్గం.....ఈ లెక్కలను జగన్ ఎలా క్రోడీకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎక్కువ మంది రెడ్డి సామాజికవర్గం నేతలే మంత్రివర్గంలో చోటు దక్కడం కోసం పోటీ పడుతున్నారు. కూడికలు, తీసివేతలు జగన్ కు ఖచ్చితంగా తలనొప్పిగా మారనుంది. దీంతో పాటు ఎన్నికల్లో జిల్లాల్లో ప్రభావితం చేయగల నేతలు కూడా జగన్ కు కావాల్సి ఉంటుంది. ఈ రెండేళ్లు విపక్షాలు గట్టిగా పోరాడతాయి. విమర్శలు చేస్తాయి. వాటికి సమర్థవంతంగా సమాధానం చెప్పగలిగిన వారు కావాల్సి ఉంటుంది. మొత్తం మీద జగన్ కు ఈసారి మంత్రివర్గ విస్తరణ అంత సులువు కాదన్నది పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. |
https://www.telugupost.com/movie-news/karan-johar-trying-to-buy-rrr-bollywood-rights-98503/ | #RRR సినిమా షూటింగ్ కొన్ని రోజుల కిందటే స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈసినిమా షూటింగ్ చివరకు స్టార్ట్ అవ్వడంతో ఈసినిమా యొక్క బిజినెస్ కోసం రైట్స్ కోసం ఇప్పటి నుండే ఎగబడుతున్నారట. శాటిలైట్ రైట్స్...డబ్బింగ్ రైట్స్..ఆడియో రైట్స్...డిజిటల్ రైట్స్ ఇలా అన్ని రైట్స్ కోసం పలు సంస్థలు..పలు వ్యక్తులు రంగంలోకి దిగిపోయారు. అందులో ఒక్కరు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్.'బాహుబలి' సినిమాతో రాజమౌళి రేంజ్ ఏంటో తెలుసుకున్న కరణ్ 'బాహుబలి' కి లాభాలు రావడంతో మరోసారి రాజమౌళి సినిమాను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని అనుకుంటున్నాడు. అందుకు ఎంతైనా ఇవ్వడానికి రెడీ గా ఉన్నాడు. రాజమౌళి పరిచయంతో..ప్రభాస్ - రానాలను యూజ్ చేసుకుని తారక్ - చరణ్ లకు ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చి ఈసినిమా యొక్క హిందీ రైట్స్ ఎలాగైనా దక్కించుకుంద్దాం అని చూస్తున్నాడు.కరణ్ ఆల్రెడీ ఈసినిమా దర్సకనిర్మతల తో మాట్లాడి నట్లు తెలుస్తుంది. అయితే యూనిట్ మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఎలాంటి చర్చలు పెట్టుకోవద్దని నిర్ణయించుకుంది. ఆ తరువాత ఓ మంచి రోజు బిజినెస్ గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నారట. తారక్ - చరణ్ నటిస్తున్న ఈసినిమాలో ఇతర నటీనటులు పేర్లు ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే ఆ పేర్లు అధికారంగా ప్రకటించనున్నారు మేకర్స్. |
https://www.telugupost.com/movie-news/pushpa-rocket-speed-184407/ | తొమ్మిది నెలలు ఫ్రీగా ఉన్న బన్నీ సుకుమార్ తో కలిసి పుష్ప పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టాడు. గత నవంబర్ నుండి పుష్ప ని పట్టాలెక్కించిన బన్నీ.. సుకుమార్ తో కలిసి రాత్రీపగలూ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. విరామం అన్నదే లేకుండా పుష్ప షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బన్నీ ఉన్నాడు. ఎందుకంటే ఆగష్టు 13 న పుష్ప వరల్డ్ వైడ్ రిలీజ్ అంటూ డేట్ ప్రకటించడంతో సుకుమార్ కూడా బన్నీని ఫాలో అవ్వక తప్పడం లేదు. ఈమధ్యన సుకుమార్ తన కూతురు హాఫ్ సారీ ఫంక్షన్ కి కూడా ఒక రోజు వచ్చి మళ్ళీ వెంటనే తిరిగి వెళ్లిపోయాడంటే ఏ రేంజ్ స్పీడులో పుష్ప షూటింగ్ చిత్రీకరణ ఉందో అర్ధం చేసుకోవచ్చు. లేదంటే సుకుమార్ చెక్కుడు తెలియంది కాదు.. పుష్ప సినిమా ఏడాదికి కానీ పూర్తి అయ్యేది కాదు. కానీ బన్నీ మాత్రం సుకుమార్ ని నిలువనియ్యడం లేదు. హైదెరాబాదులో చిన్నపాటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న పుష్ప టీం మారేడుమిల్లి, రంపచోడవరం ఫారెస్ట్ లో భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న పుష్ప టీం వెంటనే తమిళనాడులోని టెన్ కాశీ పరిసర ప్రాంతాల్లో మరో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అక్కడ షెడ్యూల్ పూర్తి కాగానే పుష్ప టీం హైదరాబాద్ కి పయనమైంది. టెన్ కాశీలో అల్లు అర్జున్, రష్మిక, ఇంకొంతమంది నటీనటులపై కుటుంబ నేపథ్యం ఉన్న కీలక సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది. అదే లొకేషన్స్ లో ఓ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తి చేసేసారు. ఇంతకుముందు ఆగష్టు 13 కి డేట్ ఇచ్చారు. అయితే పుష్ప అనుకున్న డేట్ కి రావడం అసాధ్యం అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ స్పీడు, జోరు చూస్తుంటే.. అనుకున్న టైం కి ఎలాంటి అనుమానాలు, ఆటంకాలు లేకుండా పుష్ప థియేటర్స్ కి దిగడం ఖాయం. |
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-interferers-in-directors-work-in-his-films-139723/ | విజయ్ దేవరకొండ ఇదివరకు అంటే అర్జున్ రెడ్డి, గీత గోవిందం హిట్స్ తో కాస్త యాటిట్యూడ్ చూపించేసాడు. ఆతర్వాత తనతో పనిచేసిన దర్శకులెవరికి విజయ్ దేవరకొండ స్వేచ్ఛనివ్వలేదనే టాక్ ఉంది. అందులో నోటా దర్శకుడు, తాజాగా డియర్ కామ్రేడ్ దర్శకుడితో పాటుగా టాక్సీవాలా దర్శకుడికి కూడా విజయ్ దేవరకొండ స్వేచ్ఛనివ్వలేదని ప్రచారం జరిగింది. సినిమాల మేకింగ్ విషయంలో విజయ్ దేవరకొండ వేళ్ళు పెడతాడని, చాలా మార్పులు చేర్పులు చేపిస్తాడనే ప్రచారం ఉంది. డియర్ కామ్రేడ్ సినిమా అప్పుడు అయితే ఈ ప్రచారం మాత్రం బాగా జరిగింది. తాజాగా పూరి జగన్నాధ్ తో ఫైటర్ సినిమా తో సెట్స్ మీదకెళ్ళబోతున్న విజయ్ దేవరకొండ ఆటలు సాగేలా లేవు అంటున్నారు. ఎందుకంటే పూరి జగన్నాధ్ కి తన కథలో కానీ, తన డైరెక్షన్ లో కానీ వేళ్ళు పెట్టే హీరోలంటే నచ్చరు. అందుకే పవన్ తో గంగతో రాంబాబు సినిమా తీసాక.. పవన్ కళ్యాణ్ తన డైరేక్షన్ లో చేతులు పెట్టాడని. ఇక పవన్ తో సినిమా చెయ్యనని చెప్పాడు. మరి ఫైటర్ విషయంలో విజయ్ దేవరకొండ గనక పూరి జగన్నాధ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేతులు పెడితే పూరి ఊరుకునే రకం కాదు. మరి పూరి దగ్గర విజయ్ దేవరకొండ ఆటలు సాగేలా లేవు అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/nadamuri-balakrishna-v-v-vinayak-70617/ | ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ విషయం ఏమోగాని బాలకృష్ణ మాత్రం వి. వి. వినాయక్ తో ఒక కొత్త సినిమాతో సెట్స్ మీదకెళ్ళబోతున్నాడు. అది కూడా ఒక రీమేక్ కథతో. కన్నడ సూపర్ హిట్ మూవీ మఫ్తీకి రీమేక్ కథతో బాలకృష్ణ, వినాయక్ కాంబోలో మూవీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దర్శకుడు వినాయక్ కూడా రిస్క్ లేకుండా మాస్ ని మెప్పించే ఈ రీమేక్ కథ వైపు మొగ్గు చూపారంట. మరి బాలకృష్ణ చాలాకాలం నుంచి రీమేక్ సినిమాలు చేయడం లేదు. గతంలో సామీ సినిమా రీమేక్ లక్ష్మి నరసింహాలో నటించినప్పటి నుంచి నేటి వరకు మళ్లీ రీమేక్ ల జోలికి వెళ్ళలేదు.బాలయ్య ఫ్యాన్స ఊరుకుంటారా..?ఇక కన్నడ మఫ్తీ సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఆ సినిమాపై కన్నేశాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. కన్నడలో సీనియర్ హీరో శివరాజ్ కుమార్ ఒక పాత్ర వేయగా మరో పాత్రలో యూత్ హీరో మురళి కనిపిస్తాడు. ఇక తెలుగులో బాలయ్య చేసేది శివరాజ్ కుమార్ పాత్ర. మరి మురళి పాత్రలో కనిపించే సెకండ్ హీరో ఎవరనే క్యూరియాసిటీతో ఉన్నారు నందమూరి ఫాన్స్. ఇక కన్నడ మఫ్తీలో హీరో మురళి పాత్రే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సేపు కనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు మాత్రమే శివరాజ్ కుమార్ పాత్ర ఎంట్రీ వస్తుంది. మరి బాలకృష్ణ సినిమాలో బాలయ్య లేట్ గా ఎంట్రీ ఇస్తే బాలయ్య ఫాన్స్ అస్సలూరుకోరు.మాఫియా బ్యాక్ డ్రాస్ లో...అందుకు తగ్గట్టుగానే బాలయ్య పాత్రను సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా కనబడే విధంగా వినాయక్ డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా రఫ్ గా, మాస్ గా ఉంటుంది. మరి బాలయ్యతో సై అంటే సై అంటూ ఛాలెంజ్ చేసే పాత్రలో ఏ హీరోను తీసుకుంటారు అనే ఆసక్తి ప్రస్తుతం అందరిలో నెలకొంది. చూద్దాం బాలయ్యకి ఏ హీరో తగులుతాడో అనేది. |
https://www.telugupost.com/movie-news/rahul-ashu-reddy-180326/ | బిగ్ బాస్ సీజన్ 3 తో క్రేజీ గా లైమ్ టైం లోకి వచ్చిన న్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నటి పునర్నవితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాడు. దానితో పునర్నవి – రాహుల్ పెళ్లి చేసేసుకుంటారేమో అనుకున్నారు. బయటికి వచ్చాక కూడా పునర్నవితో రాహుల్ కొన్నాళ్ళు జతగానే తిరిగాడు. కానీ తర్వాత అషు రెడ్డి తో రాహుల్ హైలెట్ అవుతున్నాడు. సీజన్ 3 లో అషు రెడ్డి కూడా ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో అషు రెడ్డి తో రాహుల్ పెద్దగా కలవకపోయినా.. బయట మాత్రం రాహుల్ అషులు బాగా క్లోజ్ గా మూవీ అవుతున్నారు. ఈమధ్యన పబ్లిక్ గానే తిరుగుతున్నారు. హాగ్ లు ఇచ్చుకోవడం, అషు ని రాహుల్ ఎత్తుకోవడం అబ్బో వీళ్ళ యవ్వారం మాములుగా లేదు. దానితో రాహుల్ – అషు రెడ్డిల మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ రూమర్స్ మొదలయ్యాయి. కానీ అవి రూమర్స్ కాదు నిజాలే అన్నట్టుగా ఉంది ఇప్పుడు వాళ్ళ బిహేవియర్. ఈమధ్యన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ – అషు రెడ్డిలు ఒకరి కోసం ఒకరు పాట పాడుకున్నారు. అంతేకాదు.. మేమిద్దరం కెమిస్ట్రీ చదువుకుంటున్నాం.. ఫిజిక్స్ అనుకుంటున్నాం, హిస్టరీలు రిపీట్ చేసుకుంటున్నాము అంటూ ఏదేదో అర్ధం పర్ధం లేకుండా మాట్లాడడంతో రాహుల్ అషు రెడ్డితో బాగానే పులిహోర కలుపుతున్నాడని అర్ధమైపోతుంది. అంతే కాదు.. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోస్ చూపిస్తే ఇవెలా బయటికి వచ్చాయి.. అయినా ఈ ఫొటోస్ నథింగ్ ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయ్ అంటూ మాట్లాడడం చూస్తే వీరి మధ్యన సం థింగ్ కాదు కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తుంది వ్యవహారం. |
https://www.telugupost.com/movie-news/tension-in-the-saira-team-135406/ | సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సినిమా విడుదలకు దగ్గరయ్యాకే సైరా టీం సినిమా ప్రమోషన్స్ ని సుడిగాలి మాదిరిగా.. చెన్నై, బెంగుళూరు అంటూ చుట్టేస్తున్నారు. ఈ విషయంలో రామ్ చరణ్ కూల్ గా కనిపిస్తున్నప్పటికి… సినిమా విడుదలకు దగ్గరయ్యే కొద్దీ చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. చిరుకూడా ఈ వయసులో ఫ్లైట్ ఎక్కడం, ఫ్లైట్ దిగడం సమయంలో కాస్త డల్ అయినట్లుగా చెబుతున్నారు. మరో వైపు సైరా ప్రీమియర్స్ విషయంలోనూ సమస్యలున్నట్లుగా టాక్. బొమ్మ పడుతుందా…. లేదా….? యూఎస్ లో భారీ సినిమాల ప్రీమియర్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసు. అయితే సైరా సినిమా విషయంలో ఈ ప్రీమియర్స్ విషయంలో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. యుఎస్ కి క్యూబ్ లు చాలా చోట్లకు ఇప్పటికే చేరుకున్నా.. ఇంకా కొన్నిచోట్లకు వాటిని చేర్చాల్సి ఉంది. క్యూబ్ డిస్కులు అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా చేరకపోవడం వల్ల కొన్ని చోట్ల సైరా ప్రీమియర్లు క్యాన్సిల్ చేస్తున్నారని చెబుతున్నారు. మంగళవారం 2 గంటలకు పడాల్సిన సైరా ప్రీమియర్లు వేస్తారా.. లేదా… అన్నది ప్రస్తుతం ఉన్న డౌట్. ఈ విషయాల్తోనే సైరా బృందం తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్. |
https://www.telugupost.com/movie-news/rangasthalam-100-days-function-78718/ | నటనకు అవకాశం ఉండే పాత్ర కోసం చాలా రోజులు ఎదురు చూసిన రామ్ చరణ్.. మంచి కమెర్షియల్ సినిమా కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న డైరెక్టర్ సుకుమార్.. ఈ ఇద్దరికీ 'రంగస్థలం' రూపంలో వాళ్ల కోరిక తీరింది. చరణ్ సరసన సమంత నటించిన ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో విజయవిహారం చేసింది. చరణ్, సుకుమార్ కెరీర్స్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈరోజుల్లో వంద రోజులంటే మామూలా మరిప్రేక్షక ఆదరణే కాకుండా క్రిటిక్స్ సైతం మెచ్చిన ఈ చిత్రం తాజాగా 100 రోజులను పూర్తిచేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 15 సెంటర్లలో ఈ సినిమా 100 రోజుల మైలురాయిని దాటేసింది. దానికి సంబంధించి పోస్టర్స్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ లో 100 రోజుల వేడుకను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ కారిక్రమానికి చీఫ్ గెస్ట్ గా చిరంజీవిని ఆహ్వానించినట్టు సమాచారం. ఇప్పుడున్న రోజుల్లో సినిమా 100 రోజులు కంప్లీట్ చేసుకోవటం అంటే మాములు విషయం కాదు. |
https://www.telugupost.com/movie-news/kajal-agarwal-in-bellamkonda-srinivas-kavacham-movie-99710/ | బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించే హీరోయిన్స్ అంతా... టాప్ హీరోయిన్స్ అయ్యే ఉండాలి. ఒకే ఒక్క సినిమాలో కాస్త పేరు లేని హీరోయిన్ తో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ తన మిగతా సినిమాలన్నిటిలో పేరున్న హీరోయిన్స్ తోనే రొమాన్స్ చేసాడు.అయితే బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి చిన్న హీరోతో క్రేజున్న హీరోయిన్స్ నటించాలి అంటే.. కేవలం పారితోషకాన్ని డబుల్ ఇస్తేనే హీరోయిన్స్ అతనితో నటించడానికి ఒప్పుకుంటారనేది బహిరంగ సత్యం. మరి బెల్లంకొండ సురేష్ కొడుకుని హీరోగా నిలబెట్టడానికి సినిమాలకి భారీ బడ్జెట్స్ పెట్టడమే కాదు... టాప్ హీరోయిన్స్ ని కూడా తెచ్చి పెడుతున్నాడు. మరీ ఓ అన్నంత హిట్స్ కొట్టకపోయిన.. బెల్లంకొండ సినిమాలు యావరేజ్ హిట్స్ అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు సమంత, రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఒకేసారి రెండు సినిమాల్లో చందమామ కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేస్తున్నాడు. తేజ డైరెక్షన్ లోని సినిమాతో పాటుగా.. కొత్త డైరెక్టర్ తో కవచం సినిమాలోను బెల్లంకొండ కాజల్ తో జోడి కట్టాడు. తాజాగా కవచం సినిమా వచ్చే వారం విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఆ సినిమాలో కాజల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న రొమాన్స్ లో హాట్ నెస్ కనబడుతుంది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా హాట్ అండ్ సెక్సీ లుక్ లో చింపేస్తుంది. మరి గతంలోనూ సమంత అల్లుడు శీను సినిమాలో హాట్ హాట్ గా శ్రీనివాస్ సరసన నటించింది. అయితే పారితోషకం విషయంలో గట్టిగా ఇవ్వబట్టే హీరోయిన్స్ అంతా బెల్లంకొండ పక్కన గ్లామరస్ గా కనబడుతున్నారంటున్నారు సగటు ప్రేక్షకులు.పారితోషకం దండిగా ఇస్తే హీరోయిన్స్ చాలామంది గ్లామర్ పరంగా కూడా హద్దు లేకుండా ఆరబోస్తున్నారనే టాక్ వినబడుతుంది. మరి సమంత అయినా కాజల్ అయినా రకుల్ అయినా పూజ హెగ్డే అయినా శ్రీనివాస్ లాంటి హీరోలపక్కన డబ్బు కోసమే నటిస్తున్నారంటూ కామెంట్స్ అయితే వినబడుతుంది. మరి తాజాగా విడుదలైన కవచం పోస్టర్స్ లో కాజల్ ఎంతగా గ్లామర్ ఒలకబోసిందో.. బెల్లంకొండ తో ఆ ఘాటు రొమాన్స్ ఎలా ఉందొ మీరే చూడండి |
https://www.telugupost.com/crime/assam-police-si-junmoni-rabha-dies-in-road-accident-1476686 | అస్సాం పోలీసు విభాగంలో లేడీ సింగం, దబాంగ్ కాప్ గా పేరొందిన మహిళా ఎస్సై జున్మణి రాభా (30) మంగళవారం (మే16) తెల్లవారుజామున కారుప్రమాదంలో మృతి చెందారు. జున్మణి ప్రయాణిస్తోన్న ప్రైవేటు కారును నగావ్ జిల్లా పరిధి జఖలాబంధా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కంటైనర్ ట్రక్కు ఢీ కొట్టినట్లు అధికారులు తెలిపారు. నగావ్ ఎస్పీ లీనా డోలే ప్రమాద స్థలాన్ని గుర్తించారు.ఈ ప్రమాదం జరగడానికి కొన్నిగంటల ముందు జున్మణిపై దోపిడీ కేసు నమోదైంది. ఈ ప్రమాదంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రమాదానికి కారణమైన ట్రక్కును పోలీసులు సీజ్ చేయగా.. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రాత్రి వేళలో జున్మణి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, యూనిఫాం లేకుండా ప్రైవేటు కారులో ఒంటరిగా ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నారన్నది సస్పెన్స్ గా మారింది. పలు వర్గాల డిమాండ్ మేరకు.. ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు అస్సాం డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. |
https://www.telugupost.com/movie-news/బాలీవుడ్-లో-తాప్సీకి-క్ర-48230/ | టాలీవుడ్ పై నోరు పారేసుకుంటూ బాలీవుడ్ లో సెటిల్ అయింది తాప్సీ పన్ను. బాలీవుడ్ లో 'పింక్' మూవీతో తెగ గుర్తింపు తెచ్చేసుకుంది ఈ అమ్మడు. టాలీవుడ్ లో కూడా 'ఆనందో బ్రహ్మ' అంటూ మంచి హిట్ నే అందుకుంది. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది ఈ మిల్క్ బ్యూటీ.అయితే ఇప్పుడు తాప్సీ పై ఓ న్యూస్ మీడియా లో ప్రముఖంగా వినపడుతుంది. ఇప్పటికే జూడ్వా 2 తో అందాల ఆరబోతతో బికినీ షో చేసిన ఈ భామను అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందనున్న లేటెస్ట్ మూవీ కోసం సంప్రదించారట. ఇప్పటి వరకూ తను స్టార్ అనిపించుకోలేకపోయానంటూ ఈ మధ్యనే అసహనం వెళ్లగక్కిన ఈ భామకు ఇది మంచి అవకాశమే అని చెప్పవొచ్చు.నిజానికి ఈ పాత్రను మొదట దంగల్ భామ సాన్యా మల్హోత్రాకు ఆఫర్ చేశారు.. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ తాప్సీ పన్ను ముంగిట వాలిందని తెలుస్తోంది. అటు స్టోరీ పై.. డేట్స్ పై డిస్కషన్స్ కూడా జరిగిందని సమాచారం. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరి కొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్టులోకి తాప్సీ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/అల్లు-అర్జున్-షో-స్టీలర్-19372/ | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది ఇచ్చిన బ్లాక్ బస్టర్ సరైనోడు తో ఆయన క్రేజ్ ఎన్నో రేట్లు పెరిగిపోయింది. అల్లు అర్జున్ చేయబోయే తదుపరి చిత్రాల కోసం మెగా అభిమానులు చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అందులోనూ కమర్షియల్ సినిమాలలో ఎంటర్టైన్మెంట్ తో పాటు హీరో కారెక్టరైసెషన్ కి అధిక ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు హరీష్ శంకర్ తెరకేక్కిస్తున్న దువ్వాడ జగన్నాథం అయితే కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు మెగా అభిమానులు. గతంలో హరీష్ శంకర్ మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తో పాటు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయం ఇవ్వటంతో ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న దువ్వాడ జగన్నాథం లో అల్లు అర్జున్ ఎలా చూపిస్తాడో అని ఆతృతగా వున్నారు అభిమానులు.హరీష్ శంకర్ మాత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా పకడ్బందీగా చేసుకుని చిత్రాన్ని పట్టాలెక్కించినట్టున్నారు. చిత్రం మొదలై మూడు నెలలు కూడా పూర్తి కాకముందే మూడు రెగ్యులర్ షెడ్యూల్స్ పూర్తయ్యి నాలుగో షెడ్యూల్ మొదలైపోయింది. నాలుగో షెడ్యూల్ లో హైద్రాబాద్ పరిసర ప్రాంతాలలో చేయనున్న పోరాట సన్నివేశాలు మరియు కొన్ని కీలక సన్నివేశాలతో టాకీ పార్ట్ పూర్తవనుంది. అప్పటి వరకు ఆగకుండా హరీష్ శంకర్ జరిగిన మూడు షెడ్యూల్స్ తాలూకా ఫ్యూటేజి కి ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టించేశాడు. ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణ అనుభవంతో కచ్చితంగా అల్లు అర్జున్ షో స్టీలర్ గా నిలుస్తాడని చెప్పి ఎడిటింగ్ పనులకు నాంది పలుకుతూ తీసిన మోనిటర్స్ ఫోటో తో ట్విట్టర్ లో అభిమానులకు పంచుకున్నాడు ఈ దర్శకుడు.ఈ ఏడాది వేసవికి మెగా అభిమానులకు ఫీస్ట్ ఇవ్వటానికి సిద్దమవుతుంది దువ్వాడ జగన్నాథం. |
https://www.telugupost.com/movie-news/rrr-natu-natu-song-receives-oscar-award-in-95th-oscars-1466689 | తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి తెలుగు పాటగా నాటు నాటు రికార్డు క్రియేట్ చేసింది. భారతీయుల ఎదురు చూపులు ఫలించాయి. ఈ రోజు కోసం కోటి ఆశలతో ఎదురుచూసిన అందరికీ భావోద్వేగ క్షణం. భారత ప్రభుత్వం తరపున అధికారికంగా ఎంపిక కాకపోవడంతో.. సొంతంగా ఆస్కార్ నామినేషన్లకు వెళ్లిన RRR అనుకున్నది సాధించింది. తెలుగు సినీ ప్రేక్షకుల కలల్ని నిజం చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR నాటు నాటు పాట నామినేషన్ లో నిలబడింది. ఈ రోజు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న డాల్బీ థియేటర్లో జరుగుతున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో నాటు నాటు పాట.. ఆస్కార్ అవార్డును అందుకుంది. ఈ అవార్డులను సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ అందుకున్నారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. ముందుగా ఈ ఆస్కార్ అవార్డులను తయారు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాజమౌళి, ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం ఈ అవార్డు కోసం, ఈ క్షణం కోసం ఎంతగానో ఎదురుచూశామన్నారు. ఈ అవార్డుతో భారతీయులను గర్వించేలా చేశామన్నారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు పాటకు పట్టంకట్టిన ఆ సన్నివేశాన్ని చూసి భారత, తెలుగు సంగీత ప్రియులు సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న ఆర్ఆర్ఆర్.. విమర్శకుల ప్రశంసలను అందుకుంది.చంద్రబోస్ రచించిన నాటు నాటు పాటను.. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరచగా.. సింగర్లు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేయగా.. ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. ఉక్రెయిన్ లో చిత్రీకరించిన ఈ పాట కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంతో శ్రమించారు. ఇటీవల ఓ అమెరికన్ ప్రోగ్రాం లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. పాట డ్యాన్స్ ప్రాక్టీస్ కంటే.. చరణ్ , తాను కలసి సింక్ చేయడానికే ఎక్కువ సమయం పట్టేదన్నారు. రోజుకి మూడు గంటలు ప్రాక్టీస్, షూటింగ్ ముందు, తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేసేవాళ్లమని తెలిపారు. ఆ సమయంలో తన కాళ్లు కూడా సరిగ్గా పనిచేయలేదని ఎన్టీఆర్ పేర్కొన్నారు. THE OSCAR MOMENT ❤️🔥❤️🔥❤️🔥 #NaatuNaatu #Oscars95 #RRRMovie pic.twitter.com/0P0SLLfnOd— RRR Movie (@RRRMovie) March 13, 2023 |
https://www.telugupost.com/crime/shilpa-choudhary-who-is-a-remand-prisoner-in-chanchalguda-jail-was-released-after-she-was-granted-bail-1345267 | చంచల్ గూడ జైలులో ఉన్న శిల్పా చౌదరి విడుదలయ్యారు. రిమాండ్ ఖైదీగా ఉన్న శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు కావడంతో ఆమె విడుదలయ్యారు. శిల్పా చౌదరికి షరతులతో కూడిన బెయిల్ ను ఉప్పరపల్లి కోర్టు మంజూరు చేసింది. ప్రతి శనివారం ఖచ్చితంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.మోసం చేసిన కేసులో....ప్రముఖులను మోసంచేసిన కేసులో శిల్పా చౌదరి ఇరవై ఐదు రోజుల పాటు జైలులో ఉన్నారు. ఆమెను మూడుసార్లు పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు ప్రముఖుల నుంచి తీసుకుని ఎగ్గొట్టడంతో శిల్పా చౌదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. |
https://www.telugupost.com/movie-news/samantha-akkieneni-oh-baby-collections-126651/ | ప్రస్తుతం గత మూడు రోజులుగా టాలీవుడ్ ప్రముఖులే కాదు… సాధారణ ప్రేక్షకుడు కూడా సమంత హీరోయిన్ గా నటించిన ఓ బేబీ ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు. ఓ బేబీ లో సమంత నటనకు 100 కి 100 మార్కులు పడుతున్నాయి. అందుకే ఓ బేబీ కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఫ్యామిలీస్ మాత్రమే కాదు.. చిన్న పెద్ద అంతా ఓ బేబీ మ్యానియాలోనే ఉన్నారు. సమంత క్రేజ్ తో మంచి ఓపెనింగ్స్ సంపాదించిన ఓ బేబీ… ఫస్ట్ వీకెండ్ లోనే సినిమా కు వచ్చిన హిట్ టాక్ తో మంచి కాదు కాదు.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఓ బేబీ కి పెట్టింది కేవలం 13 కోట్ల బడ్జెట్ మాత్రమే. అయితే అందులో థియేటర్స్ రైట్స్ కే 10 కోట్లకు పైగానే వచ్చేసాయి. ఇంకా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కి అదనంగా వచ్చాయి. ఇక ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే… ఎప్పుడూ స్టార్స్ సినిమాలనే కాదు.. చిన్న సినిమాలను కూడా డిజిటల్ ప్రపంచంలో నెంబర్ వన్ గా ఎదిగిన అమెజాన్ ప్రైమ్ వారే ఎగరేసుకుపోతుంటే.. ఈసారి ఓ బేబీ ని మాత్రం అమెజాన్ కి పోటీగా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్కడ పోటీ వాతావర్ణంలోను ఓ బేబీ కి కలిసొచ్చింది. ఇక 13 కోట్ల పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు ఓ బేబీ ఫస్ట్ వీకెండ్ లోనే 17 కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందించింది. సమంత క్రేజ్.. సినిమా కొచ్చిన పాజిటివ్ టాక్, అలాగే క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ అన్ని ఓ బేబీ ని కేవలం మూడు రోజులకే 17 కోట్లను కొల్లగొట్టే దిశగా నడిపించాయి. వరల్డ్ వైడ్ గా ఈ రేంజ్ కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ కొల్లగొట్టడం సామాన్యమైన విషయం కాదు. మరి ఫస్ట్ వీకండ్ లో దడదడ లాడించిన ఓ బేబీ మొదటి వారం ముగిసేసరికి నిర్మాతలకు ఏ రేంజ్ లాభాలు తెస్తుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/bigg-boss-season-3-is-going-to-be-very-bland-134146/ | బిగ్ బాస్ సీజన్ 3 చాలా చప్పగా సాగుతుంది. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ అంతా చాలా జాగ్రత్తగా గేమ్ ఆడుతున్నారు. ఎక్కడ ఎటువంటి గొడవలకు తావివ్వకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని షో కి వచ్చినట్టుగా కనబడుతుంది. నాగార్జున చెప్పినట్టుగా ఎవరు ఇంతవరకు తమ ముసుగు తియ్యలేదు అనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు కూడా తమకు కావాల్సిన, క్రేజ్ ఉన్న కంటెస్టెంట్స్ ని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హౌస్ లో పునర్నవి, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికాలు కాస్త పేరున్న క్రేజున్న కంటెస్టెంట్స్. వారిని కాపాడడానికి బిగ్ బాస్ ఎత్తులు వేస్తుంది. మిగతా వాళ్ళని ఒక్కొక్కరిగా హౌస్ నుండి బయటికి పంపుతున్నారు. నటిస్తే చాలు….. ఇక వరుణ్ – వితిక భార్యాభర్తలు గనక వారిద్దరూ హౌస్ లో ఉంటే.. బిగ్ బాస్ కి క్రేజ్ వస్తుందని చెప్పి.. వారిని కాపాడుతున్నారు. వరుణ్ సందేశ్ మొదట్లో ఎలా ఉన్నా ప్రస్తుతం మిస్టర్ కూల్ టాగ్ వేసుకున్నాడు. ఇక వితిక అన్నింటికి అగ్రెస్సివ్ అవుతుండేది.. కానీ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతుంది. ఇక వీరి క్రేజ్ తో బిగ్ బాస్ నిర్వాహకులు వారికి ఈ సీజన్ మొత్తానికి కలిపి 30 లక్షల పారితోషకానికి తెచ్చారట. ఫైనల్స్ వరకు ఉన్నా ఇస్తారు, లేకున్నా అదే పేమెంట్ వారికి వస్తుంది. ఇక ఫైనల్ విన్నర్ అయితే మరో 50 లక్షలు ఈ జంటకి అదనం. అప్పటివరకు ఉంచేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తుందంటున్నారు. మరోపక్క శ్రీముఖి, పునర్నవికి కూడా గట్టిగానే ఇస్తున్నారట. మిగతా వాళ్ళకి వారానికి ఇంత అని మట్లాడారు కానీ.. పై నలుగురికి మాత్రం ఒకె ఎమౌంట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. |
https://www.telugupost.com/crime/man-refuses-to-show-wife-on-video-call-and-stabbed-by-colleague-in-banglore-1460491 | వీడియో కాల్ లో తన సహఉద్యోగి భార్యను చూపించలేదన్న కోపంతో.. అతడిపై మరో ఉద్యోగి కత్తెరతో దాడి చేసి గాయపరిచాడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. హెచ్ఎస్ఆర్ లే ఔట్ లో ఉన్న ఓ దుస్తుల షాపులో సురేష్(56), రాజేశ్ మిశ్రాలు(49) టైలర్ కమ్ సేల్స్ మెన్లుగా పనిచేస్తున్నారు. సురేశ్ హెచ్ఎస్ఆర్ లేఔట్ లో, రాజేశ్ కోరమంగళ దగ్గర వెంకటాపురలో నివాసముంటారు. డ్యూటీలో ఉండగా.. రాజేశ్ మిశ్రాకు అతని భార్య ఫోన్ కాల్ చేయగా.. అతను ఫోన్ లో మాట్లాడుతున్నాడు.ఇంతలో అక్కడికి వచ్చిన సురేశ్.. రాజేశ్ కి అడ్డు తగిలి నీ భార్యను వీడియో కాల్ చేసి చూపించమని అడిగాడు. అందుకు రాజేశ్ ఒప్పుకోలేదు. నా భార్యను నువ్వు చూడటం ఏమిటంటూ.. ససేమిరా కుదరదన్నాడు. ఈ విషయమై ఇద్దరిమధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సురేశ్ ఆవేశంతో చేతికి అందిన కత్తెరతో రాజేశ్ పై దాడిచేశాడు. అనంతరం అక్కడి నుండి పారిపోయాడు. ఈ దాడిలో గాయపడిన రాజేశ్ మిశ్రాను ఇతర సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తనపై జరిగిన దాడి గురించి రాజేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సురేశ్ పై ఐపీసీ సెక్షన్ 324, 504 కింద కేసులు నమోదు చేసి, సురేశ్ ను అరెస్ట్ చేశారు. |
https://www.telugupost.com/movie-news/lawrence-offer-to-sri-reddy-82172/ | క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటి శ్రీరెడ్డికి తమిళ డైరెక్టర్ రాఘవ లారెన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీరెడ్డి ఇటీవల పలువురు కోలీవుడ్ దర్శకులు, నటులపై కూడా లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్ పైన కూడా ఆమె ఆరోపణలు చేసింది. అయితే, ఈ ఆరోపణలపై స్పందించిన లారెన్స్... ఏడేళ్ల క్రితం రెబల్ సినిమా షూటింగ్ సమయంలో శ్రీరెడ్డి తనను కలిసిందని, ఒకవేళ తన తప్పు ఏమైనా ఉంటే ఇంతకాలం ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. తన హోటల్ రూంకి వచ్చినట్లు శ్రీరెడ్డి చెబుతుందని, రూంలో దేవుళ్ల పోటోలు రుద్రాక్ష మాల ఉన్నాయని చెబుతుందని, తాను హోటల్ రూంలో రుద్రాక్ష మాల పెట్టి, దేవుళ్లకు పూజలు చేసేంత ఫూల్ ని కాదన్నారు.టాలెంట్ ఉంటే మంచి పాత్ర ఇస్తా...తాను మహిళలకు అమితంగా గౌరవం ఇస్తానని, అందుకే తన తల్లికి గుడి కట్టించి మహిళలకు అంకితం చేశానని లారెన్స్ గుర్తుచేశారు. శ్రీరెడ్డికి తన చిత్రంలో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. ముందు ప్రెస్ మీట్ పెట్టి, అందరి ముందు ఒక సీన్, కొన్ని సులువైన డ్యాన్స్ స్టెప్స్, డైలాగ్స్ ఇస్తానని, ఒకవేళ ఆమెకు టాలెంట్ ఉంటే కచ్చితంగా తన తర్వాతి చిత్రంలో మంచి పాత్ర ఇచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తానన్నారు. తన సినిమాలో నటించడం ద్వారా మరిన్ని అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అందరి ముందు నటించడానికి ఇష్టపడకపోతే, ఒక లాయర్ ను, ఆమె శ్రేయోభిలాషులను తీసుకువచ్చైనా నటించి చూపిస్తే చాలని స్పష్టం చేశారు. అయితే, ఇది శ్రీరెడ్డికి భయపడి చెప్పడం లేదని, ఒక మహిళగా ఆమెను గౌరవిస్తూ చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. |
https://www.telugupost.com/crime/kerala-wife-swapping-case-murdered-complainants-husband-attempts-suicide-1477105 | కేరళలో భార్యల మార్పిడి కేసు ఎంత సంచలనం సృష్టించిందే అప్పుడే మరచిపోలేం. ఈ ఉదంతంపై ఫిర్యాదు చేసిన మహిళ తాజాగా హత్యకు గురైంది. 26 ఏళ్ల మహిళను ఆమె భర్తే హత్య చేసి.. ఆపై తాను విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడైన షినో మాథ్యూ కొట్టాయం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలో కపుల్ మీట్స్ కేరళ అనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా భార్యల మార్పిడి జరుగుతోంది. ఆ గ్రూపులో ఉన్న 9 మందికి పైగా సభ్యులు తమ భార్యలను మార్చుకున్నారు. ఈ క్రమంలో షినో మాథ్యూ కూడా తన భార్యను బలవంతంగా వారివద్దకు పంపగా.. వారంతా ఆమెపై బలాత్కారం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..9 మందిని పోలీసులు ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు.ఆ ముఠా వెనుక పెద్దహస్తాలు ఉండి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా ఈ కేసులో బాధితురాలైన షినో భార్య హత్యకు గురికావడం మరో సంచలనమైంది. తన ఇంటిముందు రక్తపు మడుగులో పడిఉన్న మహిళను చూసిన ఇరుగుపొరుగువారు వెంటనే మెడికల్ కాలేజీకి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. బాధితురాలి తండ్రి.. ఆమె భర్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ఆరోపించారు. |
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-world-famous-lover-collections-148121/ | విజయ్ దేవరకొండ హీరోగా నలుగురు హీరోయిన్స్ నటించిన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో సో టాక్ తెచ్చుకున్న వరల్డ్ ఫెమస్ లవర్ ఓపెనింగ్స్ కూడా భారీగా కనబడలేదు. మొదటినుండి ఈ సినిమాపై పెద్దగా క్రేజ్ కానీ, బజ్ కానీ లేదు. దానికి తగ్గట్టుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ ఫెమస్ లవర్ 4.34 కోట్లు కొల్లగొట్టింది. మరి విజయ్ క్రేజ్ కి ఈ ఓపెనింగ్స్ చూస్తుంటే చాలా డల్ అనే చెప్పాలి. ఏరియా: షేర్ (కోట్లలో) నైజాం 2.05 సీడెడ్ 0.37 నెల్లూరు 0.18 కృష్ణ 0.25 గుంటూరు 0.43 వైజాగ్ 0.51 ఈస్ట్ గోదావరి 0.31 వెస్ట్ గోదావరి 0.24 టోటల్ ఏపీ & టీస్ షేర్: 4.34 |
https://www.telugupost.com/movie-news/ఈ-హీరోయిన్-కి-జ్ఞానోదయం-అ-62085/ | చిన్నగా కెరీర్ మొదలు పెట్టి టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో జోడి కట్టి టాప్ రేంజ్ కి చేరుకున్నాక కూడా... చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ గత ఐదేళ్లుగా ఒక్క నిమిషం ఖాళీ లేకుండా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్తో బిజీగా ఉన్నప్పటికీ... టాలీవుడ్ లో మాత్రం పూర్తిగా ఖాళీ అయ్యింది. నిన్నమొన్నటివరకు టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న ఈ భామ ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ వలన గట్టి పోటీ ఎదుర్కుంటూ వెనుకబడిపోయింది. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా కొత్త హీరోయిన్స్ వైపు చూడడంతోనే రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ సినిమాలు తగ్గిపోయాయి.అయితే టాప్ రేంజ్ లో ఉన్న రకుల్ ప్రీత్ రెమ్యునరేషన్ కూడా అంతే టాప్ రేంజ్ లో ఉండడంతో... ఆమెని టాలీవుడ్ దర్శక నిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టేసారు. అయితే దర్శకనిర్మాతల బాధని రకుల్ పసిగట్టినట్టుగా కనబడుతుంది. తనకి అవకాశాలు తగ్గడానికి రెమ్యునరేషన్ కారణమని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కనబడుతుంది రకుల్ వ్యవహారం. రకుల్ ప్రీత్ ఇప్పుడు తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్టుగా తెలుస్తోంది. కథా కథనాలు తో పాటు ఆ సినిమాలో తన పాత్ర బాగుంటే చాలంటూ మాట మార్చేసిందని అంటున్నారు. మరి రకుల్ ప్రీత్ ఇలాంటి డెసిషన్ తీసుకోకపోతే మరో పదికాలాల పాటు టాలీవుడ్ లో మనగలగడం కష్టం. నిన్నమొన్నటివరకు తానే సినిమాలు ఒప్పుకోకుండా రెస్ట్ తీసుకుంటున్నాని బిల్డప్స్ ఇచ్చిన రకుల్ కి ఇప్పుడు బాగా జ్ఞానోదయం అయినట్టుగా ఉంది. అందుకే తన పారితోషకాన్ని తగ్గించేసింది అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/heroes-afraid-of-corona-162235/ | కరోనా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమైన స్టార్స్ అంత.. ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడమే కాదు.. కొత్త కథలను ఫోన్ లోనే వింటున్నారు. దర్శకులు నేరేట్ చేసే కథలను వింటున్న హీరోలంతా ఎప్పుడెప్పుడు షూటింగ్ స్పాట్ కి వెళ్దామా అని అస్సలు ఎదురు చూడడం లేదు. కారణం కరోనా భీబత్సం. కరోనా ఉదృతి కొనసాగుతున్న టైం లో షూటింగ్ కి ఆనుమతులొచ్చినా స్పాట్ కి వెళేళ్దుకు ఏ హీరో మొగ్గు చూపడం లేదు. ఆగష్టు నుండి హీరోలకంతా తమ తమ సినిమా సెట్స్ లోకి వెళతారని చెబుతున్నారు. కొంతమంది ఆగష్టు టార్గెట్ గా సిద్ధమవుతున్నారు కూడా. కానీ ఇప్పుడు వాళ్ళని సీరియల్స్ షూటింగ్స్ బాగా భయపెట్టేశాయి. టాలీవుడ్ లో షూటింగ్స్ కి ఆనుమతులు రావడం తరువాయి.. తెలుగు, హిందీ, తమిళ సీరియల్స్ షూటింగ్స్ పొలోమంటూ మొదలయ్యాయి. మూడు నెలల గ్యాప్ తర్వాత సెట్స్ మీదకెళ్ళిన ఆర్టిస్ట్ లు మొదటి రెండు రోజులు మంచి ఉత్సాహంగా కనిపింఛారు. కానీ తర్వాత నుండి ఒక్కో సీరియల్ షూటింగ్ లో ఒక్కో కరోనా పాజిటివ్ లు రావడంతో మొత్తం యూనిట్ తల పట్టుకుని టెస్ట్ లు చేయించుకుని మరీ హోమ్ క్వారంటైన్ కి వెళ్లారు. జీ తెలుగు మొదలు మా టివి సీరియల్స్ లో నటించే నటులకు కరోనా పాజిటివ్ రావడంతో.. ఆగష్టు నుండి సినిమా షూటింగ్స్ కి హాజరవుదామనుకున్న హీరోలంతా ఇప్పుడు మల్లి గప్ చుప్ అంటున్నారట. సీరియల్స్ కె అలా ఉంటె.. సినిమా షూటింగ్స్ లో వందలాదిమంది పని చెయ్యాలి. అలాంటప్పుడు కరోనా కట్టడి అసాధ్యం. అందుకె ఆగష్టు లో కూడా సినిమా షూటింగ్స్ మొదలయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/గౌతమీపుత్ర-శాతకర్ణి-ఫస్-3-20176/ | ప్రాంతం షేర్ (కోట్ల లో)నైజాం 7 .31సీడెడ్ 6 .47వైజాగ్ 4 .00ఈస్ట్ గోదావరి 3 .02వెస్ట్ గోదావరి 3 .06క్రిష్ణ 2 .57గుంటూరు 3 .66నెల్లూరు 1 .50కర్ణాటక 3 .50యూ.ఎస్.ఏ 5.10రెస్ట్ ఆఫ్ ఇండియా &రెస్ట్ ఆఫ్ వరల్డ్ 1 .50ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 41 .69 |
https://www.telugupost.com/crime/tragedy-struck-on-holi-in-ujjaini-fire-broke-out-in-the-temple-of-mahakaleshwar-1527363 | ఉజ్జయినిలో హోలీ రోజున విషాదం చోటు చేసుకుంది. మహాకాళేశ్వరుడి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం హోలీ సందర్భంగా పూజారులు భస్మ హారతి ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పూజారులతో సహా పదమూడు మంది భక్తులు గాయాలపాలయ్యారు. హోలీ కావడతో అధిక సంఖ్యలో భక్తులు ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు.పూజారులతో పాటు...ఉదయం భస్మ హారతి ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు పూజారులు గాయపడ్డారు. ఎనిమిది భక్తులకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో గాయపడిన వారందరూ కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. |
https://www.telugupost.com/movie-news/mega-daughter-niharika-career-116056/ | మెగా ఫ్యామిలీ నుండి ఏకైన హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెలకు లక్కు అస్సలు కలిసి రావడం లేదు. ఏదో వెబ్ సీరీస్ తో కాలం గడిపెయ్యకుండా హీరోయిన్ అంటూ సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ మెగా డాటర్. ఒక మనసు సినిమాలో నాగశౌర్యతో కలిసి నటించింది. ఆ సినిమా యావరేజే అయ్యింది. తర్వాత హ్యాపీ వెడింగ్ అంటూ సుమంత్ అశ్విన్ తో కలిసి హడావిడి చేసింది. కానీ ఆ సినిమా కూడా పోయింది. మెగా అభిమానులే నిహారిక సినిమాలను హిట్ చేయలేకపోతున్నారు. మరి ౩౦ ఏళ్లు వచ్చాయి అంటే పెళ్లి చేస్తామని ఇంట్లో వాళ్లు చెప్పారు. ఈలోపే సినిమాలు చేసుకోవాలని చెప్పిన నిహారిక.. ఎడాపెడా సినిమాలేవీ చెయ్యడం లేదు కానీ ఆమెతో సినిమాలు చేసే దర్శకులే సరిగ్గా నిహారికకు హిట్ ఇవ్వలేకపోతున్నారు. నిహారికతో సినిమా అంటేనే సినిమా కథ మొత్తం నిహారికనే హైలెట్ చేస్తూ.. ఆమె చుట్టూనే తిరిగేటట్టుగా రాసుకుంటున్నారు. అక్కడే వాళ్లకి దెబ్బసేది. సూర్యకాంతం కూడా అంతే… తాజాగా రాహుల్ విజయ్ హీరోగా నిహారిక ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రణీత్ సూర్యకాంతం అనే సినిమాని తెరకెక్కించాడు. మారి ఆ సినిమాలో సూర్యకాంతంగా నిహారిక క్యారెక్టర్ బాగుంది కానీ ఆమె నటనకు ప్రేక్షకులే కనెక్ట్ కాలేకపోతున్నారు. ఈ సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాలేదు. డిజాస్టర్ టాక్ వచ్చింది. రివ్యూ రైటర్స్ కూడా సూర్యకాంతంకి ఫెయిల్ మార్కులే వేశారు. నిన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పోటీగా దిగిన సూర్యకాంతం పూర్ టాక్ తో మొదలై సాయంత్రానికి థియేటర్స్ దగ్గర జనాలు లేక వెలవెలబోయాయి అంటే మెగా ప్రిన్స్ పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది. మరి మార్చి పొతే సెప్టెంబర్, సెప్టెంబర్ పొతే మార్చి అన్నట్టుగా నిహారిక పరీక్షలు రాస్తూనే ఉంది. ఫెయిల్ అవుతూనే ఉంది. నిన్న విడుదలైన సూర్యకాంతం నిహారికకు ఎలాంటి ప్లస్ కాదు కదా ఆ సినిమా చూసిన వారంతా మెగా డాటర్ కి సినిమాలెందుకు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి నిహారిక ఇక సినిమాలు ఆపేస్తుందో.. లేదంటే మరో ట్రయిల్ వేసుకుంటుందో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/animal-made-my-daughter-cry-congress-mp-ranjeet-ranjan-in-rajya-sabha-1508337 | బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మొదటిరోజు నుంచే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. మొదటిరోజు ఈ సినిమా రూ.116 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.356 కోట్లు వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం రూ.563 కోట్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా గురించి పార్లమెంట్ దాకా వెళ్ళింది.యానిమల్ మూవీపై ఛత్తీస్‌గఢ్ ఎంపీ రంజీత్ రంజన్ మాట్లాడుతూ.. సినిమాను చూడడానికి వెళ్లిన తన కూతురు ఏడుస్తూ బయటకు వచ్చిందని అన్నారు. నా కూతురు తన ఫ్రెండ్స్ కలిసి యానిమల్ సినిమాకు వెళ్లింది. సినిమా మధ్యలోనే ఆమె ఏడుస్తూ బయటికి వచ్చేసింది. సినిమాలో హింస, మహిళలపై వేధింపులు సన్నివేశాలు చాలా ఉన్నాయని అన్నారు. అలాంటివి చూపించడం నాకు నచ్చదు. కబీర్ సింగ్ సినిమాలో హీరో తన భార్య, సమాజాన్ని, తోటి మనుషులతో చాలా అగ్రెసీవ్ బిహేవ్ చేస్తాడు. పైగా అలాంటి పాత్రలే కరెక్ట్ అన్నట్లుగా చూపిస్తున్నారు. ఇది కచ్చితంగా ఆలోచనను రేకెత్తించే అంశమే అవుతుంది. ఇలాంటి సినిమాలు ఇంటర్ చదివే పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. అలాంటి వారిని రోల్ మోడల్ గా భావిస్తున్నారు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రంజీత్ రంజన్. సినిమా అనేది సమాజానికి అద్దం లాంటిది. మనం సినిమాలు చూస్తూ పెరిగాం.. అది యువతను ప్రభావితం చేయగలదన్నారు. మొదట కబీర్ సింగ్, పుష్ప లాంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు యానిమల్ వచ్చింది. నా కూతురు తన కాలేజీ స్నేహితులతో కలిసి సినిమా చూడటానికి వెళ్లి, ఏడుపు ఆపుకోలేక మధ్యలోనే బయటకు వెళ్లిపోయిందన్నారు. |
https://www.telugupost.com/movie-news/బాహుబలిని-కట్టప్ప-ఎందుక-30661/ | అందరినీ రెండేళ్లుగా ఊరిస్తున్న బాహుబలి 2 సినిమా అదరహో అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా సీనీ అభిమానులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు బాహుబలి దర్శకుడు రాజమౌళి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. బాహుబలి 2లో యుద్ధసన్నివేశాలు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఐదేళ్ల రాజమౌళి కృషి ఫలించిందనే చెప్పొచ్చు.బాహుబలి అదుర్స్....అమరేంద్ర బాహుబలిని రాజమాత శివగామి రాజ్యానికి రాజుగా ప్రకటిస్తుంది.పట్టాభిషేకానికి ఇంకా సమయం ఉండటంతో రాజ్యంలో పర్యటనకు బయలుదేరుతాడు బాహుబలి. ఆ పర్యటనలోనే కుంతల దేశపు యువరాణి దేవసేన ప్రేమలో పడతాడు. దేవసేన ఫొటోను చూసి భళ్లాలదేవుడు కూడా ప్రేమలో పడతాడు. భళ్లాల దేవుడిని మహేంద్ర బాహుబలి ఎలా చంపుతాడు? కట్టప్ప అమరేంద్ర బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న ప్రశంసలు అందుతున్నాయి. ఫస్ట్ హాఫ్ ను సెంటిమెంట్ కు కామెడీ జోడించడంతో అదిరింది. విజువల్స్ ఎఫెక్ట్ అదిరిపోయాయి. రాజమౌళి ఎంత శ్రద్ధ పెట్టాడనేది ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. మొత్తం మీద బాహుబలి 2 ది కన్ క్లూజన్ అంచనాలకు మించి హిట్ అయింది. బాహుబలి 2 హాలివుడ్ సినిమాల సరన నిలుస్తందని యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు తెలిపారు. హాలివుడ్ లో మరిచిపోలేని చిత్రాలైన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, హ్యారీపోర్టర్ సరసన బాహుబలి చేరనుందని ఆయన తెలపడం విశేషం. చిత్రంలోని ప్రతి ఫ్రేమూ ఆకట్టుకునే విధంగా ఉందని ఆయన కొనియాడారు. సో బాహుబలి సూపర్ సక్సెస్. |
https://www.telugupost.com/movie-news/venkateshwara-creations-press-release-about-ram-charan-shankar-movie-1380700 | రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ సినిమాని దిల్ రాజు నిర్మిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ సినిమాలో రామ్ చరణ్ పలు గెటప్ లలో సందడి చేయబోతున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం నటీనటుల్ని తీసుకుంటున్నారని, టైటిల్ ఇదే అని వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చింది. రామ్ చరణ్, శంకర్ సినిమా గురించి వస్తున్న వార్తలు అవాస్తవం అని, మా ప్రాజెక్ట్‌లో ఏదైనా పాత్ర కోసం వ్యక్తులను నటించడానికి ఎవర్ని తీసుకోవట్లేదని, మా పేరు చెప్పి అలా చేయడానికి ఏ వ్యక్తికి లేదా ఏజెన్సీకి అధికారం లేదని తెలుపుతూ ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలని, జాగ్రత్తగా ఉండాలని మేము స్పందిస్తున్నాము అని ఓ లేఖని విడుదల చేసింది. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తి అవాస్థవమని.. తమ ప్రాజెక్ట్‌లో ఎవరినైనా నటీనటులుగా ఎంపిక చేసే బాధ్యత, అధికారం ఏ వ్యక్తికి, సంస్థకు లేదని ఆ రూమర్లను ఖండించింది.ఈ సినిమా కూడా లీకుల బెడదను ఎదుర్కొంటూ ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అవుతున్నాయి. రామ్ చరణ్ లుక్ మాత్రం రివీల్ అవుతూ వస్తోంది. రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్, లుక్స్ మీద అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి.https://twitter.com/SVC_official/status/1551074057906401280 |
https://www.telugupost.com/movie-news/హమ్మా-ఇప్పటికి-ఫిక్స్-అయ-40710/ | బాహుబలి తర్వాత ప్రభాస్ నటించే సినిమాపై బాహుబలి రిలీజ్ కి ముందే క్లారిటీ వచ్చింది. సుజిత్ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్ నిర్మాణంలో ప్రభాస్ సాహో చిత్రాన్ని బాహుబలి విడుదలకు ముందే ఎనౌన్స్ చేసాడు. సాహో సినిమా ని ఎనౌన్స్ చెయ్యడమే కాదు ఆ సినిమా టీజర్ తో కూడా వచ్చేసి అభిమానులకు షో టైం అంటూ షాకిచ్చేసాడు.అదిగొ... అప్పటినుండి ప్రభాస్ పక్కన చెయ్యబోయే హీరోయిన్ విషయంలో వచ్చిన వార్తలు మరే సినిమా హీరో కి వచ్చి ఉండవు . ప్రభాస్ పక్కన సాహోలో ఈ హీరోయిన్ ఫైనల్ అంటే ఆ హీరోయిన్ ఫైనల్ అంటూ వచ్చిన గాసిప్స్ కి లెక్కే లేదు.ముందుగా బాలీవడ్ భామ అన్నారు. కాదు కాదు బాహుబలి భామ అనుష్కనే సాహోలో ప్రభాస్ పక్కన అన్నారు. కాదు అంటూ మళ్ళీ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ అన్నారు. లాస్ట్ కి ఫైనల్ గా శ్రద్ద కపూర్ సాహో చిత్రంలో ప్రభాస్ పక్కన ఫైనల్ అయ్యింది. ఈ విషయాన్నీ యూవీ క్రియేషన్స్ వారు అధికారికంగా ప్రకటించారు. సాహో ఫ్యామిలీ బ్యూటిఫుల్ శ్రద్దా కపూర్ కు స్వాగతం పలుకుతున్నాం అంటూ ట్వీట్ చేసింది. ముందు అనుకున్నట్టుగానే సాహో కోసం బాలీవుడ్ భామనే దింపారు. ఇక సాహో చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు . మరీమూడు భాషల్లో సినిమా అంటే హీరోయిన్ కి కూడా గట్టిగానే సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మూడు భాషల్లో ప్రమోషన్ కార్యక్రమం గట్రా ఉంటుంది కాబట్టి శ్రద్ధకి కూడా సాహో చిత్ర యూనిట్ భారీగానే సమర్పించారని టాక్ ఉంది. శ్రద్ద కపూర్ సాహో లో నటిస్తున్నందుకు గాను ఆమెకి ఏకంగా 8 కోట్లు పారితోషకం ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. |
https://www.telugupost.com/movie-news/చాలా-స్లిమ్-అయ్యాడే-35345/ | ఎప్పుడూ ఫిట్నెస్ మెయింటైన్ చేసే పవన్ కళ్యాణ్ ఈ మధ్యన రాజీకీయాల్లో పడి కాస్త వళ్ళు చేసాడు. సినిమాల్లో రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ విషయంలో అశ్రద్ధ చేసాడనే చెప్పొచ్చు. అందుకే 'కాటమరాయుడు' సాంగ్స్ లో పవన్ లావుగా ఉన్నాడనే కామెంట్స్ కూడా పడ్డాయి. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా కోసం పవన్ లావు తగ్గే ప్రయత్నాలు మొదలు పెట్టాడనే ప్రచారం వుంది. ఫిట్ గా, అందంగా కనబడాలంటే చాలా కష్టపడి వర్కౌట్స్ చెయ్యాలని ఎవరూ పవన్ కి సూచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాలకంటే ముందే పవన్ మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం సంపాదించి ఫిట్ గా వున్నాడు.ఇక ఇప్పుడు పెరిగిన బరువును పవన్ కళ్యాణ్ బెంగుళూరు వెళ్లి కరిగించుకుంటున్నాడట. మొన్నామధ్యన దాసరి మరణం తో మీడియా ముందుకు వచ్చిన పవన్ ఆతర్వాత మళ్ళీ మీడియాకి చిక్కలేదు. అయితే ఈ గ్యాప్ లో పవన్ బెంగుళూరు వెళ్లి బరువు తగ్గించుకున్నాడట. ఆ విషయం ఇప్పుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలోని ఆన్ లొకేషన్ లోని పిక్ ద్వారా అర్ధమవుతుంది. షూటింగ్ లొకేషన్ లో లీకైన పిక్ ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ చాలా స్లిమ్మయ్యాడనిపిస్తుంది. మరి ఎంత కమిట్మెంట్ లేకపోతె పవన్ ఇంత తక్కువ సమయంలో అలా సన్నగా తయారయ్యాడో అని ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబై పోతున్నారు.అంటే మనం త్రివిక్రమ్ సినిమాలో అందంగా స్లిమ్ గా వుండే పవన్ ని చూడబోతున్నామన్నమాట. ప్రస్తుతానికి ఈ లీకైన పవన్ పిక్ ని చూసి మీరు ఎంజాయ్ చెయ్యండి. |
https://www.telugupost.com/movie-news/actor-prakash-raj-is-once-again-incensed-at-prime-minister-narendra-modi-1340211 | ప్రధాని నరంద్రమెదీపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి మండిపడ్డారు. రైతులకు క్షమాపణలు చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. రైతులకు క్షమాపణ చెబితే సరిపోదని, జరిగిన నష్టానికి బాధ్యత వహిస్తారా? అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. రైతులు ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన చేస్తున్న నేపథ్యంలో మోదీ చట్టాలను వెనక్కు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.జరిగిన నష్టానికి....అయితే దీనిపై ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఏడాదిన్నరగా రైతులు చలిలో, వర్షంలో తడుస్తూ ఉద్యమం చేశారని, ఎందరో ప్రాణాలు కోల్పోయారని, జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. |
https://www.telugupost.com/movie-news/అన్నీ-చేతులెత్తేశాయి-43876/ | ఆగష్టు 25 న విడుదలైన అర్జున్ రెడ్డి అనూహ్య విజయం తర్వాత మళ్ళీ ఇప్పటివరకు అంటే గత నాలుగు వారాలుగా బాక్సాఫీసును షేక్ చేసే సినిమా ఒక్కటి రాలేదు. సెప్టెంబర్ 1 న పైసా వసూల్ పైసల్ వసూలు చెయ్యలేక చేతులెత్తేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 8 న యుద్ధం శరణం, మేడ మీద బ్బాయి చిత్రాలు రెండూ బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. ఇక ఆ తర్వాతి వరం అంటే ఈ శుక్రవారం సెప్టెంబర్ 15 న ఏకంగా 5 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సినిమాలైతే వరుసగా క్యూ కట్టాయి కానీ..... ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనేది పచ్చి నిజం. నారా రోహిత్ కథలో రాజకుమారి అంటూ సైలెంట్ గా బాక్సాఫీసు వద్ద యుద్దానికి దిగిపోయాడు. ఇక సినిమా టైటిల్ తో బాగానే ఎట్రాక్ట్ చేసింది కథలో రాజకుమారి. అలాగే ఈ సినిమాలో నాగ సౌర్య వంటి హీరో క్యామియోరోల్ చేసిన ఫలితం మాత్రం ప్లాప్. అలాగే సునీల్ నటించిన ఉంగరాల రాంబాబు సినిమా మొదటి రోజు మొదటి ఆటకే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సోమవారం నుంచి ఈ సినిమా ఆడేది డౌటే అంటున్నారు. ఇక బాహుబలి రైటర్ దర్శకత్వంలో వచ్చిన శ్రీవల్లీ మూవీ కూడా డిజాస్టర్ అయింది. అసలు ఈ సినిమా ఏ యాంగిల్ లో ఆకట్టుకోలేదు. ఇక శ్రీ వల్లికి కి పెద్ద పెద్ద స్టార్స్ అంతా ఫుల్ గా సపోర్ట్ కూడా చేశారు.రామ్ చరణ్, రాజమౌళి, వెంకటేశ్, ప్రభాస్ లాంటి బడా స్టార్స్ ప్రమోట్ చేసినప్పటికీ.. శ్రీవల్లి సినిమాలో విషయం లేకపోవడంతో అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక సచిన్ జోషి హీరోగా తెరకెక్కిన వీడెవడు కూడా దాదాపు ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక తమిళ్ నుండి డబ్బింగ్ అయిన సరసుడు కూడా సోది లోకి లేకుండా పోయింది. శింబు-నయనతార కాంబోలో వచ్చిన సరసుడు సినిమాను భరించడం ప్రేక్షకుల వల్ల కాలేదు. అలా ఈ శుక్రవారం విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోగా... ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే చివరికి ఈవారం కూడా అర్జున్ రెడ్డి కి కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటున్నారు. |
https://www.telugupost.com/top-stories/telugu-desam-party-chief-chandrababu-seems-to-be-mentally-prepared-1448517 | తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మానసికంగా సిద్ధమయినట్లే కనిపిస్తుంది. తనతో జనసేన, బీజేపీ కలసి రాకపోయినా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందుకే తనకు చివరి ఎన్నికలు అని ఆయన ప్రస్తావించారు. జనసేన తనతో కలిసినా, రాకున్నా వచ్చే నష్టమేదీ లేదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లుంది. ఆయనకు అంతా మంచే జరుగుతుందా? జనసేన తనతో కలసి రాకపోయినా చంద్రబాబుకు రాజకీయంగా వచ్చే ఇబ్బంది ఏమీ లేదా? అంటే ప్రస్తుతానికి మాత్రం అవుననే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు పై మధ్యతరగతి, ఉన్నతవర్గాల ప్రజలలో మాత్రం ఒక ప్రత్యేక అభిమానం ఉంది. విజన్ ఉన్న నేతగా ఆయనను అనుకుంటారు. చంద్రబాబు వల్ల రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని నమ్ముతారు. అదే సమయంలో అట్టడుగు వర్గాల్లోనూ ఎన్టీఆర్ వేసిన బీజం కొంత మేర అలాగే ఉంది. ఆ అభిమానం చెక్కు చెదరలేదనడానికి ఉదాహరణ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతమేనని చెప్పాలి.అడ్వాంటేజీ కంటే...ఇప్పుడు పవన్ కల్యాణ్ తన వెంట వస్తే కొంత అడ్వాంటేజీ ఉండి ఉండవచ్చు. కాపు సామాజికవర్గంలోనూ, యువతలోనూ కొంత అదనపు బలం చేకూరవచ్చు. కానీ గంపగుత్తగా కాపులు మొత్తం తమ వెంట నడుస్తారన్న నమ్మకం లేదు. పవన్ వస్తే తమ పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చిన బీసీలందరూ వ్యతిరేకమవుతారు. అది కూడా చంద్రబాబుకు పవన్ తో కలసి నడిస్తే నష్టమేనన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. తనపై ఒక ముద్ర తొలగించుకోవడానికి కూడా చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు ఉపయోగపడతాయి. ఒంటరిగా పోటీ చేస్తే చంద్రబాబు గెలవలేరన్న అపప్రథ నుంచి తాను బయటపడేందుకు వీలుంటుంది. ఆ రోజులు మారాయి...ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అధికార పార్టీకి అడ్వాంటేజీ అన్నది ఒకప్పుడు మాట. కానీ రోజులు మారాయి. ప్రజల్లో మార్పు వచ్చింది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజల్లో చైతన్యం వచ్చింది. అందుకే ప్రజలు కూడా తాము ఏ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారో ఆ పార్టీకి ఓటు వేస్తారు తప్ప. కులాలు చూడరు. అభిమానం చూపరు. అందరూ కోరుకుంటే వన్ సైడ్ విజయం దక్కుతుంది. దానిని ఆపే శక్తి ఎవరికీ ఉండదు. పొత్తులతో తాము ముందుకు వెళితే జరిగే నష్టాల కంటే లేకుంటే వచ్చే ప్రయోజనాలే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు.లాస్ట్ ఛాన్స్ అంటే...చంద్రబాబుకు ఏపీ రాజకీయాల్లో ఒక అడ్వాంటేజీ వచ్చే ఎన్నికలలో ఉందని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. వయసు రీత్యా ఆయనకు కొంత సానుభూతి లభిస్తుంది. పవన్ కల్యాణ్ ఒక్క ఛాన్స్ అన్నా వినరేమో కాని, చంద్రబాబు తనకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వమంటే ప్రజలు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. పైగా టీడీపీని అంత తీసేసే పార్టీ కాదు. ప్రతి గ్రామంలో జెండా ఉన్న పార్టీ అది. ప్రతి బూత్ లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీ అది. అందుకే పవన్ తన దరి చేరకుండా వెళ్లినా చంద్రబాబుకు ప్రత్యేకంగా వచ్చే నష్టమేమీ లేదు. పైగా అందరూ కలసి పెద్దాయనను ఇబ్బంది పెడుతున్నారన్న సానుభూతి దొరుకుతుంది. అందుకే పవన్ తమను కాదనుకుని వెళ్లినా చంద్రబాబుకు ఎలాంటి నష్టం లేదు. అంతే కాదు 175 నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతలు, క్యాడర్ మరింత జోరుగా పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. చూడాలి మరి.. పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో జరిగే ప్రత్యేకంగా జరిగే నష్టం లేదు. అలాగని వచ్చే ప్రయోజనం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/victory-venkatesh-saindhav-movie-completed-censor-formalities-details-here-1512605 | విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. విక్టరీ వెంకటేష్- శైలేష్ కొలను కాంబినేషన్ లో వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్ దక్కింది. ఈ చిత్రం జనవరి 13న విడుదలకు సిద్ధంగా ఉంది. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 75 వ చిత్రంగా సైంధవ్ రావోతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ అధికారులు U/A సర్టిఫికేట్ అందించారు. 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా వస్తోంది.సైంధవ్ సినిమా ఒక యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ అని చిత్ర బృందం చెబుతోంది. పాటలలో చూపినట్లుగా తండ్రి - కుమార్తె బంధం సినిమాలో ప్రధాన అంశం. వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా వంటి అనేక మంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో భాగమై ఉన్నారు. ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను తీసుకున్నారు. సైంధవ్ సినిమా 2024 సంక్రాంతికి జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.#saindhav Censored U/A #venkatesh pic.twitter.com/do4qNExfLp— MOVIE_FLICKS (@movieflicks123) December 30, 2023 |
https://www.telugupost.com/movie-news/vaibhav-reddy-will-play-ram-charan-brother-role-in-rangasthalam-movie-1509996 | Rangasthalam : సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ 'రంగస్థలం'. ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రామ్ చరణ్ కెరీర్ కి అయితే.. ఇదొక మైల్ స్టోన్ అయ్యింది. బ్రదర్ సెంటిమెంట్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీలో రామ్ చరణ్ కి అన్నయ్య ఆది పినిశెట్టి నటించారు. అయితే ఆ పాత్ర కోసం ఆది కంటే ముందు సుకుమార్ మరో హీరోని ఎంపిక చేశారట. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆయన ఎందుకు నటించలేదు..?చిరంజీవితో ఖైదీ, అభిలాష, ఛాలెంజ్ వంటి సూపర్ హిట్స్ తెరకెక్కించిన దర్శకుడు కోదండరామిరెడ్డి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో 'వైభవ్ రెడ్డి'. తెలుగు సినిమా 'గొడవ'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైభవ్.. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ హీరోనే రంగస్థలంలో రామ్ చరణ్ కి అన్నయ్యగా నటించాల్సిందట. వైభవ్, రామ్ చరణ్ కూడా కొంచెం చూడడానికి ఒకేలా ఉంటారు. సుకుమార్ కథ వినిపించగా వైభవ్ కూడా ఓకే చేశారట.ఆ ఛాన్స్ తనకి వచ్చినందుకు ఎంతో ఆనందపడ్డారట. కానీ ఆ తరువాత కొన్ని రోజులకు ఆది పినిశెట్టిని ఎంపిక చేసుకున్నట్లు తెలియజేశారట. వైభవ్ చూడడానికి రామ్ చరణ్ లా ఉండొచ్చు. కానీ ఆయన చరణ్ కి తమ్ముడిగా కనిపిస్తారు. కానీ సినిమాలో అన్నయ్య పాత్ర చేయాల్సి ఉంది. ఈ కారణంతోనే వైభవ్ ని తప్పించినట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని వైభవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ఇక రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో పూర్తి అవ్వనుందని చెబుతున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అవ్వాల్సిన 'జరగండి' సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ న్యూ ఇయర్ కి అయినా ఆ సాంగ్ ని రిలీజ్ చేస్తారేమో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/nidhi-agarwal-to-dance-for-a-item-song-in-bellamkonda-srinivas-movie-151797/ | ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ తో హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభ నటాషాలకు భారీ క్రేజ్ వచ్చి భారీ అవకాశాలొస్తున్నాయ్ అనుకున్నారు. అంతేకాదు.. ఈ భామలిద్దరు గ్లామర్ షో కోసం తదుపరి సినిమాల్లో భారీగా గా డిమాండ్ చేస్తున్నారనే న్యూస్ నడిచింది. ఇక ప్రస్తుతం నభ నటాషా మాత్రం స్పీడు గేర్ లోనే సినిమాలు చేస్తుంది. కానీ నిధి అగర్వాల్ కే ఇంతవరకు సినిమా దొరకలేదు. నభ నటాషా సాయి ధరమ్ తేజ్ తోనూ, బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సినిమాలు చేస్తుంది. ఇక నిధి మాత్రం హీరోయిన్ అయినా పర్లేదు.. ఐటెం అయినా పర్లేదు అంటూ ఆఫర్స్ కోసం ఎదురు చోస్తుంది. అయితే ఈ హాట్ గర్ల్ నిధి కి బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం అవకాశం వచ్చింది అట. అయితే నిధి అగర్వాల్ మాత్రం ఐటెం చెయ్యడానికి ఆసక్తి చూపడంతో పాటుగా ఐటెం సాంగ్ కోసం భారీ పారితోషకం డిమాండ్ చేస్తుందట. అందాలు ఆరబోస్తూ అదిరిపోయే స్టెప్స్ వెయ్యడానికి నిధి భారీ మొత్తాన్ని డిమాండ్ చెయ్యడంతో నిర్మాతలు అవాక్కయ్యారట. అయితే నిధి అందాల కోసం నిర్మాతలు ఎంతైనా వెనుకాడలేదని.. అల్లుడు అదుర్స్ ఐటెం కోసం నిధి అక్షరాలా 80 లక్షలు పారితోషకం పట్టుకుపోయింది అనే టాక్ నడుస్తుంది. మరి ఒక్క ఐటెం కె నిధికి 80 లక్షలంటే.. హీరోయిన్ గా ఏ రెండు కొట్లో అడుగుతుందేమో. |
https://www.telugupost.com/movie-news/ఈ-స్టార్-హీరోలు-ఈ-విషయంలో-61732/ | గత కొంత కాలంగా స్టార్ డైరెక్టర్స్ - స్టార్ హీరోల సినిమాలకు మొదట ఎంపిక చేసిన సినిమాటోగ్రాఫర్స్ ని కాకుండా తర్వాత కారణాలు బయటికి రానివ్వకుండా ఉన్నట్టుండి మార్చేస్తున్నారు. అసలు ఒక్కోసారి కొంత షూటింగ్ పూర్తయ్యాక సడన్ గా సినిమాటోగ్రాఫర్స్ తప్పుకోవడం లాంటివి కూడా జరుగుతుంది. అసలు సినిమాకి మంచి సినిమాటోగ్రాఫర్స్ ఉండడం ఎంతో కీలకం కూడా. అసలు సినిమాలు ని ఎంతో కొత్తగా... రిచ్ గా చూపెట్టడంలో సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చాలా కీలకం. అందుకే స్టార్ హీరోస్ తమ సినిమాలకు టాప్ సినిమాటోగ్రాఫర్స్ ని ఎంచుకుంటూ ఉంటారు.అయితే ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు తమ కొత్త చిత్రాల కోసం టాప్ రేంజ్ సినిమాటోగ్రాఫర్స్ ని ఎంచుకుని ఎనౌన్స్ కూడా చేశారు. కానీ వారిప్పుడు ముందు అనుకున్న వారిని కాకుండా కొత్తవారిని తీసుకున్నారు. ఆ స్టార్ హీరోలెవరో కాదు ఒకరు మహేష్ బాబు, మరొకరు ఎన్టీఆర్. మహేష్ - వంశి పైడిపల్లి చిత్రానికి గాను ముందుగా సినిమాటోగ్రాఫర్ గా ‘మనం, ఊపిరి, ధృవ, విక్రమ్ వేద’ లాంటి సినిమాలకు పని చేసిన పి.ఎస్.వినోద్ ను అనుకున్నారట. అలాగే ఎన్టీఆర్ - త్రివిక్రం సినిమాకి బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అయిన మోహనన్ ని తీసుకున్నారట.కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి అనుకున్న మోహనన్ మహేష్ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తుండాగా... మహేష్ బాబు కి అనుకున్న పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రాఫర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడట. మరి ఈ స్టార్ హీరోల సినిమాలకు ముందు అనుకున్న సినిమాటోగ్రాఫర్స్ వేరు ఇప్పుడు పనిచేస్తున్నవారు వేరు. మరి ఎన్టీఆర్ కి చెయ్యాల్సిన వాడు మహేష్ కి, మహేష్ కి చెయ్యాల్సిన వాడు ఎన్టీఆర్ కి అలా రివర్స్ అయ్యారన్నమాట. |
Subsets and Splits