inputs
stringlengths
36
187
targets
stringlengths
36
109
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు చారెడు నీళ్ళల్లో చామంతి బిళ్ళ?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "నూనె, నూనె లో వడ"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నాకు కన్నులంటే చాలా ఉన్నాయి. నేను చేసేది మాత్రం రెండితోనే.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "నెమలి"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు పాముని చంపుతాను కానీ, గ్రద్దను కాను, ఒళ్లంతా కళ్లు ఉంటాయి, కాని ఇంద్రుడుని కాను, నాట్యం చేస్తాను కానీ శివుడిని కాను, నేనెవర్ని?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "నెమలి"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు చిన్న ఇంటి నిండా తెల్లటి పండ్లు!
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "నోటిలోని దంతములు"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఒక సభ ఆ సభలో 32 మంది సభ్యులు అందులో ఒక నాట్యగత్తె నాట్యం వేస్తూ కనిపిస్తుంది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "నోరు, నోటిలో 32 పళ్ళు, నాలుక."
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు తవ్వని కుంట కురవని నీరు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "నోరు, లాలాజలం"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "న్యూస్ పేపర్."
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఐదు తంత్రాలు గలది.పిల్లలకు మహాఇష్టమైనది
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పంచతంత్రం"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు జాబు గాని జాబు ఏమి జాబు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పంజాబు"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు నడవలేని కాలు ఏమిటి?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పంపకాలు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పకోడి"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు కోడిగాని కోడి! ఏమి కోడి?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పకోడి, చెగోడి"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు దీనిని పైకి తీయడం చాలా సులభం కానీ దూరంగా విసిరి వేయడం చాలా కష్టం?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పక్షి ఈక"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు పిఠాపురం చిన్నవాడా, పిట్టలకు వేటగాడా,బతికిన పిట్టను కొట్టా వద్దు, చచ్చిన పిట్టను తేనూ వద్దు, కూరకు లేకుండా రానూ వద్దు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పక్షి గుడ్డు"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అమారా దేశం నుంచి తుమారా పండ్లు తెస్తే కొనే వారే గాని తినేవారు లేరు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పగడం"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఆకాశం పచ్చన నక్షత్రాలు తెల్లన
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పచ్చిమిరపకాయలు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు జీవంలేని గుర్రాన్నెక్కి జిగటాకోల చేతబట్టి ఆకుల్లేని అడవిలోకి వేటాడబోయింది టక్కులాడి.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పడవ"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు భూమి చూసి నిలుచును?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పడవ"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పత్తి కాయ."
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు బంగారు చెంబులో, వెండి గచ్చకాయ?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పనస తొన"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఒళ్లంతా ముళ్ల్లే కానీ రత్నలాంటి బిడ్డలు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పనస పండు"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు తండ్రి గరగర! తల్లి పీచు పీచు! బిడ్డలు రత్నమాణిక్యములు!
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పనస పండు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఓహోహో హాలయ్య - వల్లంతా గరుకయ్యా - కరకర కోస్తె కడుపంతా తీపయ్యా!
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పనస పండు."
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఒహొహొ బాలయ్యా ఒళ్ళంతా ముళ్ళయ్య పరపరకోసేస్తే కడుపంతా తీపయ్య.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పనసకాయ"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తండ్రి గరగర, తల్లి పీచుపీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనుమలు బొమ్మరాళ్ళు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పనసకాయ"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు బంగారు చెంబులో వెండి గచ్చకాయ
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పనసతొన."
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు పచ్చ పచ్చని తల్లి: పసిడి పిల్లల తల్లి: తల్లిని చీలిస్తే తియ్యని పిల్లలు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పనసపండు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు బంగారు చెంబులో వెండి గచ్చకాయ
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పనసపండు గింజ"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అందంకాని అందం
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పరమానందం, బ్రహ్మానందం"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అందం కాని అందం?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పరమానందం, బ్రహ్మానందం."
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నల్లని పొలం లో తెల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పలక అందులోని అక్షరాలు"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు వంకర టింకర మాను.. కష్ట జీవుల గూడూ, ఈడూ జోడూ అవును
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పల్లకీ."
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు రసరసాలు తిన్న రాజు కడుపులో పేగుల్లేవు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పళ్ళెం"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు కనిపించని వనం ఏమిటి?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పవనం."
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఉదయం నాలుగు కాళ్లతో నడిచేది,మధ్యాన్నం రెండు కాళ్ల తో నడిచేది,సాయంత్రం మూడు కాళ్ళతో నడిచేది.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పసితనం లో నాలుగు కాళ్ళు, పెద్దయ్యాక రెండు కాళ్ళు, వృద్ధా ప్యం లో మూడు కాళ్ళు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తాగలేని రసం ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పాదరసం."
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు . భోజనంలో పనికి రాని రసం ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పాదరసం."
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు పాలు కాని పాలు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పాపాలు, పీపాలు, కోపాలు, తాపాలు, శాపాలు, మురిపాలు, లోపాలు, దీపాలు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తాగలేని పాలు ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పాపాలు."
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చిక్కటి కారడవిలో చక్కని దారి
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పాపిట"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు నల్లపడవలో తెల్లటిదారి?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పాపిడి"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు నల్లని చేనులో తెల్లని దారి ఏమిటది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పాపిడి."
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు డొంకలో మెలికల కఱ్ఱ?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పాము"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు శాస్ర్తం చెప్పన్నా.. నేల గీరన్నా..
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పార"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు శాస్త్రం చెన్నప్ప,నేల గీరప్ప, మూల నక్కప్ప
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పార"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు మారుతట్టు మల్లయ్య ముడ్డి దేకయ్య
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పార"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు తిత్తిలో నుండి తీయగలమేమో గాని, పొయ్యలెము
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పాలు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు జోడు గుఱ్ఱముల మీద ఒకడే రాజు!
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పావు కోళ్ళ"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు రాయి గాని రాయి! ఏమి రాయి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పావురాయి"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఎర్ర మేడలో పచ్చ దీపాలు, దీపాలు చూదామని మేడ తలుపు తీసిన కళ్ళ వెంబడి నీరుకారు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పిచ్చిమిరప"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అరచేతి కింద అరిసె
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పిడక"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అరుగు గోడకు అరచేయి
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పిడక"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అమ్మ కడుపున పుట్టాను. అంతా సుఖాన ఉన్నాను. నీచే దెబ్బలు తిన్నాను. నిలువున ఎండిపోయాను. నిప్పులు గుండు తొక్కాను. గుప్పెడ బూడిద అయినాను.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పిడక"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు నీచేతి దెబ్బలు తిన్నాను నిలువునా ఎండిపోయాను. నిప్పుల గుండమును తొక్కాను. గుప్పెడు బూడిదనయ్యాను.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పిడక"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అబ్బాయి గారి దొడ్లో పెద్ద బొప్పాయి పండు పడితే పరుగెత్త లేక పదిమంది చచ్చారు.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పిడుగు"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు నాలో చాలా కీస్ ఉంటాయి కానీ నేను ఒక తాళం కూడా తెరవలేను . ఎవరు నేను?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పియానో"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు తనువంతా రంధ్రాలు కానీ తీయగా పాడుతాను?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పిల్లనగ్రోవి"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు లక్కబుడ్డి నిండా, లక్ష వరహాలు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పుచ్చకాయ"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పుట్ట"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు జల్లు పడగానే, జండా లేస్తుంది.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పుట్ట గొడుగు"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు కాళ్ళ క్రింద కోడి కదలకుండా గ్రుడ్లు పెట్టు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పుట్టగొడుగు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు వేసుకోలేని గొడుగు ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పుట్టగొడుగు."
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఆరామడల నుండి అల్లుడొస్తే అత్తగారొడ్డించింది విత్తులేని కూర?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పుట్టగొడుగులు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తెల్లటి శనగలలో ఒకటే రాయి. చేతితో చల్లడం. నోటితో ఏరడం.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పుస్తకం"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు. చేతితో చల్లడం, నోటితో ఏరుకోవడం.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పుస్తకం"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నాలో చాలా మాటలు ఉంటాయి కానీ నేను మాట్లాడలేను,ఏమిటి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పుస్తకం"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు నేనెన్నో మంచి విషయములను నేర్పుతాను గానీ, నాకు మాటలు రావు. నేను మీకు ప్రపంచమును చూపగలను గానీ, నేను చూడలేను. మరి నేనెవరిని?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పుస్తకము"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అందరూ నమస్కరించే కాలు ఏమిటి?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పుస్తకాలు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు బంతి కాని బంతి
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పూబంతి"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు కట్టుకుని, పెట్టుకునేది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పూల దండ"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు వంకర టింకర మ్రాను! కష్ట జీవుల గూడే ఈడు, జోడు! విప్పితే, ఇంకో ఇల్లుంది. ఏమిటది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పెండ్లి పల్లకి"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పెదవులు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అమ్మంటే దగ్గరకు.. అయ్యంటే దూరంగా పోయేవి ఏమిటి?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పెదవులు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అమ్మంటే దగ్గరకు అయ్యంటే దూరంగా పోవును?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పెదవులు"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అమ్మ అంటే అందుతాయి నాన్న అంటే అందవు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పెదవులు"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అయ్యంటే దూరంగా వెళ్లి అమ్మంటే దగ్గరకు వచ్చేవి ఏమిటి?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పెదవులు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అన్నకందవు అమ్మ కందుతాయి.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పెదవులు"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పెదవులు"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పెదవులు"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అక్క ఇంటిలో చెల్లి ఇంటిలోనికి వెలుగు తెస్తుంది?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పెద్ద పొయ్యి"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు మొదటి ర్యాంకు రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పెన్నుతో"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది. దాని పీక మీదకు కత్తిని తెస్తేగానీ నడువదు. ఏమిటది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పెన్సిల్"
1
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు బుడబుక్కలోడొచ్చి భూమంతా చాటించె! మధ్యాహ్నామునకేమో మాయమాయే!
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పేడ నీరు"
1
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు చెట్టు కొడితే పిట్ట లేచి పోయె!
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పేడు"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు గరికపోచలపై గాడిదలు నాట్యమాడు?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పేను"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఐదుగురు, ఐదుగురు, దొంగలు రెండు జట్లు గా పోయి ఒక జీవాన్ని తెచ్చారు.వెంటనే చంపారు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పేను"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అంబులో పుట్టింది, జంబులో పెరిగింది అరచెయ్యికొచ్చింది, అంతరించిపోయింది
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పేను"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పొగ"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పొగ"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఏటి నీటిన వెంపలి చెట్టు ఎంత కోసినా గుప్పెడు కాదు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పొగ"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఇంటి వెనక ఇంగువ చెట్టు ఎంత కోసినా గుప్పెడు కాదు
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పొగ"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చారల పాము, చక్కటి పాము, నూతిలో పాము, నున్ననైనా పాము.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పొట్లకాయ"
1
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఆకాశంలో పాములు ?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పొట్లకాయ"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు చారల చారల పాము చక్క చక్కని పాము నూతిలోని పాము నున్ననైన పాము
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పొట్లకాయ"
2
['tel']
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పొయ్యి"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ముక్కులేని పిట్ట ముళ్ళన్నీ ఏరుకు తిన్నది.
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పొయ్యి"
2
['tel']
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అక్క ఇట్ల కూడాని చెల్లె ఇంట్లోకు పోతది?
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: "పొయ్యి మీద కుండ"
1
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు చక్కని రాజుకు ఒళ్లంతా బొచ్చు?
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పొలం గట్టు"
2
['tel']
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు వంరి వంకల రాజు, వళ్ళంతా బొచ్చు
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "పొలం గట్టు"
2
['tel']
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు తాపం గాని తాపం
మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం: "ప్రతాపం"
2
['tel']