link
stringlengths
41
231
text
stringlengths
28
5k
https://www.telugupost.com/movie-news/అంధుడిగా-అదరగొట్టేస్తు-40690/
రవితేజ. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న 'రాజా ది గ్రేట్' టీజర్ ని 71 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకంక్షలతో విడుదల చేశారు. మాస్ మహారాజ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రవితేజ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. 25 ఏళ్లుగా అంధుడిగానే కనబడనున్న ఈ చిత్రంలో రవితేజ డైలాగ్ డెలివరీ, ఎనర్జీ లెవల్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు అని ఒక వాయిస్ ఓవర్ వినపడగానే వెంటనే రవితేజ నోర్ముయ్ ఆ నయనాలు లేకుండా పాతికేళ్ళు నుండి కుమ్మేత్నానిక్కడ.... సర్వేంద్రియానం సర్వం ప్రధానం ఇక్కడ అంటూ రవితేక మార్క్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా... సినిమాపై అంచనాలు పెంచేలా వుంది.ఇక కళ్ళు లేకపోయినా తెలివితేటలతో ఈ ప్రపంచంలో జీవించడం చాలా తేలిక అని చెప్పే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు.... కానీ నా కొడుకేంటో ఈ ప్రపంచం చూడాలంటూ రవితేజ తల్లి పాత్రలో కనబడనున్న రాధికా చెప్పే తీరు.... ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రో కబడ్డీ మ్యానియాతో పడి కొట్టుకుపోతున్న నేపథ్యంలో డైరెక్టర్ ఈ సినిమాలో రవితేజని కబడ్డీ ప్లేయర్ గా చూపించడం వంటి కొత్త అంశాలతో 'రాజా ద గ్రేట్' టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ టీజర్ లో ప్రకాష్ రాజ్ ని సంపత్ ని పోలీస్ లుగా చూపించి.... హీరోయిన్ మెహరీన్ ని మాత్రం ఆవేశంగా ట్రైన్ పక్కనే పరిగెడుతున్న స్టయిల్లో పరిచయం చేసాడు. 'ఐ యామ్‌ బ్లైండ్‌.. బట్‌ ఐ యామ్‌ ట్రైన్డ్‌' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ చూస్తుంటే రవితేజతో ఎనర్జీ లెవల్స్ ఏ మాత్రం తగ్గలేదనిపిస్తుంది.రవితేజ మోహంలో కాస్త గ్లో తగ్గినా కూడా అతని ఎనర్జీతో దాన్ని కప్పెట్టేసాడు. మరి ఈ టీజర్ చూస్తుంటే మాత్రం రవితేజ ఎక్కువ గ్యాప్ తీసుకుని అంధుడిగా కొత్తగా ఒక ప్రయోగం చేసినప్పటికీ మంచి కథతో ఆకట్టుకుని హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు.
https://www.telugupost.com/movie-news/అస్సలు-ఆగడం-లేదుగా-30792/
అల్లు అర్జున్ రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు. గత ఏడాది సరైనోడుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అర్జున్ ఈ ఏడాది హరీష్ శంకర్ డైరెక్షన్ లో డీజే దువ్వాడ జగన్నాథంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం విడుదల చేసిన ఫస్ట్ లుక్ నుండి ఆ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రం కంప్లీట్ కాగానే బన్నీ రైటర్ వక్కంతమ్ వంశి డైరెక్షన్ లో నా పేరు సూర్య... లో నటిస్తాడు. ఇక సినిమాల్లోనే స్పీడు చూపిస్తున్న బన్నీ మరోపక్క యాడ్స్ రంగంలో కూడా దూసుకుపోతున్నాడు.బన్నీసినిమాలకున్న క్రేజ్ ని బట్టి అతని బ్రాండ్ ఇమేజ్ కూడా బాగా పెరిగింది. ఇప్పటికే పలు కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న బన్నీకి కొత్త కంపెనీలు కూడా బన్నీనే తమ బ్రాండ్ అంబాసిడర్ కావాలనుకుంటున్నాయి. నేషనల్ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వున్న బన్నీ ఇప్పుడు మరో నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ఇండియా మొత్తం మీద రెడ్ బస్ సంస్థ అల్లు అర్జున్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. దీనికి సంబందించిన యాడ్ షూట్ కూడా జరిగిందని చెబుతున్నారు. అయితే ఈ యాడ్ లో అల్లు అర్జున్ స్టయిల్ లుక్ తో బాగా ఆకట్టుకున్నాడని అంటున్నారు. సూపర్ ఎనెర్జీతో కనబడుతున్నది అంటున్నారు. ఇక్కడ తెలుగులో అయితే ఆ యాడ్ ఇంకా విడుదల కాలేదుగాని హిందీలో ఈ యాడ్ విడుదలై అన్ని ఛానెల్స్ లో ప్రచారం అవుతుందని చెబుతున్నారు. ఇక ఇప్పటికే అభి బస్సు కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుండగా... ఇప్పుడు రెడ్ బస్ సంస్థ కి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికై సెన్సేషన్ క్రియేట్ చేశారు.
https://www.telugupost.com/movie-news/karan-johars-koffee-with-karan-accused-of-plagiarism-writer-says-show-used-her-work-without-giving-credit-1379548
కాఫీ విత్ కరణ్.. ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.. అంతే మంది విమర్శకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా షో హోస్ట్ కరణ్ జోహార్ తనకు ఇష్టమైన వారిని మాత్రమే ఆహ్వానిస్తాడని..! ఎవరికైతే తాను గాడ్ ఫాదర్ లాగా ఉంటాడో వాళ్లను ఎంకరేజ్ చేయడానికే ఈ షో ను నిర్వహిస్తూ ఉంటాడనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ షో సీజన్ 7 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతూ ఉంది.ఈ షో పై ఇప్పుడు కాపీ ఆరోపణలు వస్తున్నాయి. అసలు రచయితకు తగిన క్రెడిట్ ఇవ్వకుండా కంటెంట్‌ను దొంగిలిస్తూ ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌లతో నిర్వహించిన ఇటీవలి ఎపిసోడ్‌లో సదరు వ్యక్తికి ఎటువంటి క్రెడిట్ ఇవ్వకుండా తన ఆలోచనలను ఉపయోగించారని రచయిత-జర్నలిస్ట్ సోషల్ మీడియాలో చెప్పారు. జాన్వీ- సారా సినిమాలను గెస్ చేయమని అడిగారు. ఆ సమయంలో ప్రశ్నలు ఓ జర్నలిస్ట్ రూపొందించినవని చెబుతున్నారు. సదరు వ్యక్తికి కనీసం క్రెడిట్ ఇవ్వకుండా ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. ఈ షోలో ఒక రౌండ్ లో సినిమా కథను.. కథలాగా చెప్పకుండా వేరే విధంగా అడుగుతారు. అయితే ఇది గతంలో రచయిత-జర్నలిస్ట్ మాన్య లోహిత్ అహూజా కు చెందిన ప్రశ్న..! మాన్య లోహిత్ అహూజా ఎపిసోడ్ నుండి క్లిప్‌ను పోస్ట్ చేశారు, అలాగే 2020లో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ కోసం ఆమె రాసిన కథనంలో అదే ప్రశ్న ఉంది. తన ప్రశ్నను కాపీ చేశారని.. కనీసం తనకు క్రెడిట్ ఇవ్వలేదని ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు.ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో "నేను దీన్ని విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. నా పనికి నాకు క్రెడిట్ కావాలి- ఇది ప్రపంచాన్ని మార్చే పని కాకపోవచ్చు, అయితే ఇది నాది." ఆమె పోస్ట్‌లో కరణ్ జోహార్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, క్రియేటివ్ రైటర్ శ్రీమీ వర్మలను ట్యాగ్ చేసింది.https://twitter.com/mushroomgalouti/status/1547911379419426816
https://www.telugupost.com/crime/minor-girl-raped-killed-in-madhya-pradesh-body-found-on-roof-of-her-house-1345921
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికను అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహగ్‌పూర్ ప్రాంతంలో ఇంటి పైకప్పుపై గుడ్డలో చుట్టి ఉన్న బాలిక మృతదేహం శనివారం కనిపించిందని సోహగ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విక్రమ్ రజక్ తెలిపారు. ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రాథమిక శవపరీక్ష నివేదికలో ఆమెపై అత్యాచారం చేసి, ఆపై గొంతుకోసి చంపినట్లు తేలిందని ఆయన తెలిపారు.ఇంటి పై కప్పు పై మృతదేహంబాధితురాలి కుటుంబ పరిసరాల్లో నివసిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని అధికారి తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు వెతికినా తమ గ్రామంలో కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు వారి ఇంటి పైకప్పును పరిశీలించగా మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారి తెలిపారు.
https://www.telugupost.com/movie-news/allu-sirish-abcd-movie-116185/
మెగా హీరోలు ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా.. ఏదో ఒక సినిమా హిట్ అవకపోతుందా అని సినిమాలు చేస్తూనే ఉంటారు. ఇక అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కాస్త పేరున్న సినిమాల్లో నటించైనా .. ఇంకా స్టార్ రేంజ్ అందుకోలేకపోయాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్ తర్వత ప్లేస్ కోసం సాయి ధరమ్, తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ లాంటి హీరోలు పోటీపడుతూనే ఉన్నారు. తాజాగా అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ మూవీ విడుదల విషయంలో వాయిదాలమీద వాయిదాలు తీసుకుంటుంది. కారణం అల్లు శిరీష్ ఆ సినిమా అన్ని విషయాల్లో వేలుపెడుతున్నాడని.. అందుకే ఆ సినిమా ఇంకా విడుదలకాలేదని… సినిమాల్లో ఓ అన్నంత అనుభవం లేని శిరీష్ టాప్ హీరో లెవల్లో చాలా విషయాల్లో మార్పులు చేర్పులు చేసాడనే టాక్ నడిచింది. అయితే ఏబీసీడీ సినిమా షూటింగ్ ని ఎప్పుడో పూర్తి చేసుకుంది. కానీ విడుదల విషయంలోనే డేట్స్ మీద డేట్స్ మార్చుకుంటూ పోతుంది. తాజాగా ఏబీసీడీ సినిమాని అల్లు అరవింద్ వీక్షించాడని.. అందులో ఏయే సీన్స్ రిపేర్లు చేయించాలనే చర్చల్లో అరవింద్ తో పాటుగా ఏబీసీడీ టీం ఉందని చెబుతున్నారు. మరోపక్క ఎడిటింగ్ విషయంలో అల్లు శిరీష్ కి నిర్మాతకి బేధాభిప్రాయాలొచ్చాయనే టాక్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఎడిటింగ్ విషయంలో శిరీష్, నిర్మాత ఉప్పు, నిప్పులా వున్నారని ఫిలింనగర్ టాక్. అయితే ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్ కొడుకు శిరీష్ ను సపొర్ట్ చేయడం లేదని తెలుస్తోంది. అందుకే సినిమాని విడుదల చేసే విషయమై ఇంత స్తబ్దత నెలకొందంటున్నారు. మరి అరవింద్ చొరవ తీసుకుంటేనే సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. చూద్దాం ఏబీసీడీ పరిస్థితి ఏమిటి అనేది.
https://www.telugupost.com/crime/terrible-road-accident-happened-in-america-five-people-from-andhra-pradesh-died-in-this-accident-1511853
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులంతా వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యులేనని తెలిసింది. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబీకులు ఈ ప్రమాదంలో మరణించారని చెబుతున్నారు. అమెరికా జాన్సన్ కౌంటీలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులంతా అమలాపురానికి చెందిన వారిగా గుర్తించారు.ఒకే కుటుంబానికి చెందిన...రెండు కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో మరణించినట్లు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంతో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వెళ్లి ఈ ప్రమాదానికి గురయినట్లు తెలిసింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఎంబసీ అధికారులతో సంప్రదిస్తున్నారు. మృతదేహాలను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/film-actress-hema-has-lodged-a-complaint-with-the-cyber-crime-police-on-her-youtube-channels-1468206
సినీనటి హేమ యూట్యూబ్ ఛానల్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదు చేశారు. సెలబ్రెటీలే లక్ష్యంగా చేసుకుని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసత్య ప్రచారాన్ని చేస్తున్నాయని, ఇది సినిమా ఇండ్రస్ట్రీని తరచూ ఇబ్బంది పెడుతుందన్నారు.సెలబ్రటీలపై...తాజాగా సినీనటుడు కోట శ్రీనివాసరావు పై కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారా చేశాయి. ఆయన నేరుగా తాను క్షేమంగా ఉన్నట్లు వీడియోను విడుదల చేసుకోవాల్సి వచ్చింది. సెలబ్రటీలకు చికాకు కలిగిస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని హేమ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
https://www.telugupost.com/movie-news/ఆ-రోజు-ఫాన్స్-కి-పండగే-40716/
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ కి సంబందించిన అప్ డేట్ లేక పవన్ ఫాన్స్ జుట్టు పీకేసుకుంటున్నారు. సినిమా మొదలయ్యి చాలా కాలమైనా కూడా ఇప్పటివరకు ఆ సినిమాపై ఎటువంటి న్యూస్ మీడియాకి అందడంలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి పవన్, త్రివిక్రమ్ చిత్రం గురించిన అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సినిమామొదలై ఆరునెలలు గడుస్తున్నా ఇప్పటివరకు టైటిల్ కూడా ప్రకటించకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తున్న త్రివిక్రమ్ ఈ ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా పవన్ ఫస్ట్ లుక్ వదులుతారనే ప్రచారం జరిగింది.ఇక స్వాతంత్ర్య దినోత్సవం రోజు కంటే కూడా పవన్ పుట్టిన రోజుకు ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తే బాగుంటుందని యూనిట్ సభ్యులందరూ తమ అభిప్రాయం వ్యక్తం చేయడంతో త్రివిక్రమ్ కి కూడా వారి ఆలోచనే నచ్చి అలా ప్రొసీడ్ అవడానికి మొగ్గు చూపడంతో ప్రస్తుతానికి పవన్ ఫస్ట్ లుక్ ఆగింది. కానీ ఆగష్టు 15 న పవన్ సినిమా గురించి ఎటువంటి న్యూస్ బయటికి రాకపోయేసరికి పవన్ ఫాన్స్ బాగా హార్ట్ అయ్యారు. అయితే పవన్ ఫాన్స్ నిరాశ పడడం చూసిన పవన్ కళ్యాణ్ తన సినిమాకి సంబందించిన టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఫాన్స్ కి భరోసా ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు త్రివిక్రమ్, చిత్ర యూనిట్ ఆలోచన ప్రకారం సెప్టెంబరు 2న పవన్ పుట్టిన కానుకగా సినిమా టైటిల్ అనౌన్స్ చేసి.. ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేస్తారని సమాచారం బయటికి వచ్చింది. మరి పవన్ - త్రివిక్రమ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇక టైటిల్, ఫస్ట్ లుక్ బయటికొస్తే ఆ అంచనాలు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదని పవన్ ఫాన్స్ చంకలు గుద్దేసుకుంటున్నారు. ఇప్పటికే శాటిలైట్ రైట్స్, ప్రీ రిలీజ్ బిజినెస్ తో అదిరిపోయే లెవల్లో రికార్డు సృష్టిస్తున్న పవన్, త్రివిక్రమ్ లు ఈ టైటిల్, ఫస్ట్ లుక్ లతో ఇంకెంత రచ్చ చేస్తారో చూద్దాం.
https://www.telugupost.com/movie-news/suneel-scenes-in-thank-you-movie-1380631
అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన చిత్రం థ్యాంక్యూ. విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో రాశీఖన్నా, మాళ‌వికా నాయ‌క్‌, అవికాగోర్‌, హీరోయిన్లుగా న‌టించారు. జులై 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆస‌క్తికర విష‌యం వైరల్ అవుతోంది. ఈ సినిమా ర‌న్‌టైం 129 నిమిషాలు. ఒరిజిన‌ల్ ర‌న్ టైం మాత్రం 2 గంట‌ల 45 నిమిషాలు ఉంద‌ట‌. సినిమా బోర్ కొట్టకుండా.. మిగిలిన పార్టును తొలగించార‌ని అంటున్నారు. సినిమా పోస్ట‌ర్‌లో క‌నిపించిన సునీల్.. సినిమాలో క‌నిపించ‌లేదు. డిలీటెడ్ వెర్ష‌న్‌లోనే సునీల్‌కు సంబంధించిన స‌న్నివేశాలు ఎగిరిపోయార‌ని అంటున్నారు.'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' చిత్రాలతో మంచి సక్సెస్ ను అందుకున్న నాగచైతన్య.. థ్యాంక్యూ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్స్ తొలిరోజు మరీ దారుణంగా ఉన్నాయి. నాగచైతన్య కేరీర్ లోనే 'థ్యాంక్ యూ' మూవీ కలెక్షన్స్ పరిస్థితి ఘోరంగా ఉంది. గత చిత్రాలతో పోల్చితే భారీ విఫలమని తెల్చుతోంది. ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలంగాణ, ఏపీలో కేవలం రూ.1.65 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.20 కోట్లకు పైగా అయినట్టు తెలుస్తోంది. థ్యాంక్యూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.16 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. చైతూ కెరీర్ లో ఇటీవల ఇంత తక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'థ్యాంక్యూ' నిలిచింది.నాగచైతన్య గత ఆరు చిత్రాల తొలిరోజు కలెక్షన్స్ ను చూస్తే.. శైలజారెడ్డి అల్లుడు - రూ.6.93 కోట్లు, సవ్యసాచీ - రూ.3.29 కోట్లు, మజిలి - రూ.5.6 కోట్లు, రూ.వెంకీ మామా - రూ.7.05, లవ్ స్టోరీ - రూ.7.13 కోట్లు సాధించగా.. చివరిగా వచ్చిన బంగార్రాజు చిత్రం కూడా రూ.9.06 కోట్లు సాధించింది.ఈ సినిమా తొలిరోజు వసూలు చేసిన కలెక్షన్స్ ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.నైజాం – 0.72 కోట్లుసీడెడ్ – 0.20 కోట్లుఈస్ట్ – 0.14 కోట్లువెస్ట్ – 0.08 కోట్లుఉత్తరాంధ్ర – 0.22 కోట్లుగుంటూరు – 0.10 కోట్లుకృష్ణా – 0.12 కోట్లునెల్లూరు – 0.07 కోట్లుకర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.06 కోట్లుఓవర్సీస్ – 0.45 కోట్లుటోటల్ వరల్డ్ వైడ్ – రూ.2.16 కోట్లు (రూ.3.70 కోట్లు గ్రాస్)
https://www.telugupost.com/movie-news/ఈసారి-కామెడీతో-హిట్-కొడత-30655/
గత ఏడాది 'పెళ్లి చూపులు' చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా విడుదలై భారీ విజయాన్ని మూటగట్టుకుని విజయకేతనం ఎగురవేసింది. మొదటిసారి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ని సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రశంసల జల్లు కురిపించింది. చిన్న చిత్రంగా విడుదలై భారీ హిట్ ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ చిత్రం జాతీయ పురస్కారాన్ని అందుకోవడం కూడా సంచలనమే అయ్యింది. 'పెళ్లి చూపులు' విడుదలై చాలా నెలలు గడుస్తున్నా ఆ దర్శకుడు మరో సినిమా చెయ్యలేదు. ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ తన రెండో సినిమాని పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడట. ఆ చిత్రం బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన 'దిల్ చాహత హై' తరహాలో ఉండబోతుందని అంటున్నారు. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా వున్న తరుణ్ సినిమా గురించి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి వుంది. మరో పక్క నటీనటుల ఎంపిక జరగలేదట. అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడు మొదలవ్వబోతుందో కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. కానీ తరుణ్ ఈసారి ఒక స్టార్ హీరోతోనే సినిమాకి సిద్ధమవుతున్నాడని అందుకే రెండో సినిమాని మొదలు పెట్టడానికి ఇంత సమయం తీసుకున్నాడని అంటున్నారు.
https://www.telugupost.com/movie-news/actress-lakshmika-sajeevan-dies-in-sharjah-due-to-heart-attack-1508341
సినిమా, టెలివిజన్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన మలయాళ నటి లక్ష్మీకా సజీవన్ కన్నుమూశారు. శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో కన్నుమూశారు. ఆమె వయస్సు 24. ఆమె గుండెపోటు కారణంగా మరణించింది. ఆమె మరణ వార్త మళయాళ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. ఆమె చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నవంబర్ 2 న పెట్టింది. అందులో ఆమె సూర్యాస్తమయానికి సంబందించిన అందమైన చిత్రాన్ని పంచుకుంది.ఆమె అకాల మరణ వార్త గురించి తెలుసుకున్న వెంటనే.. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో నివాళులు అర్పించడం మొదలుపెట్టారు. పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్కర్ సల్మాన్ నటించిన ఒరు యమందన్ ప్రేమకథా చిత్రాలలో ఆమె నటించి మంచి పేరు సంపాదించుకుంది. అజు అజీష్ దర్శకత్వం వహించిన 'కాక్క' షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష‍్మి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
https://www.telugupost.com/movie-news/lakshmis-ntr-ramgopal-varma-angle-116051/
నేను చూపినవన్ని నిజాలే. వారి గురించి ప్రజలకి తెలియజేస్తాను అంటూ బయలుదేరిన రామ్ గోపాల్ వర్మకి ఏపీ హై కోర్టు ఝలక్ ఇస్తే.. క్రిటిక్స్ ఇంకాస్త మొట్టికాయలు వేశారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు షాకిచ్చారు. నిన్న వరల్డ్ వైడ్(ఏపీ మినహా)గా విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ఫ్లాప్ రివ్యూస్ ఇచ్చారు రివ్యూ రైటర్స్. అంతేకాకుండా ప్రేక్షకులు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసి పెదవి విరిచారు. ఎందుకంటే అన్ని బయోపిక్స్ లాగే వర్మ కూడా తనకి తెలిసినదాని కన్నా భజనకే ప్రాధాన్యత ఇచ్చాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మీపార్వతిని హైలెట్ చేయడంతో పాటు గొప్ప వ్యక్తిగా చూపించడం, ఎన్టీఆర్ ఆ వయసులోనూ లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ రొమాన్స్ చేయడం వంటివి ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అలాగే అప్పట్లో పార్టీలో లక్ష్మీపార్వతి కారణంగా అసమ్మతి రాజుకుంది అన్నది జగమెరిగిన సత్యం. లక్ష్మీపార్వతి దూరమై, ఆమె భర్త వీరగంధ్రం సుబ్బారావు మీడియాకు ఎక్కి, ఆమెపై, ఎన్టీఆర్ పై విమర్శలు కురిపించారన్నది జరిగిన సంగతి. పార్టీ చీలిన తరువాత, అధికారం పోయిన వెంటనే లక్ష్మీపార్వతి రాజకీయంగా బహిరంగంగానే వ్యవహరించిన సంగతి అంతకన్నా వాస్తవం. నిర్మాణ విలువలు అంతంతే.. లక్ష్మీపార్వతి అమాయకురాలు. ఎన్టీఆర్ అంటే ఆమెకు దైవంతో సమానం. కేవలం ఎన్టీఆర్ చరిత్ర రాయడానికి ఆమె ఆయన దగ్గరకు వచ్చింది. ఎన్టీఆర్ ఆమె పట్ల ఆకర్షితుడై పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఏనాడూ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. అన్నట్టుగా చూపిస్తే ప్రేక్షకుడు ఒప్పుకోవవడం కష్టమే అంటున్నారు. ఇక చంద్రబాబు పాత్రని ఎంత విలన్ గా చూపించాలో అంతగా చూపించే ప్రయత్నంలో.. ప్రతి ఫ్రేమ్‌లోనూ కెమెరా అతనిపైనే ఫోకస్‌ పెట్టి, ఎప్పుడూ మైండ్‌లో ఏదో ప్లాన్‌ రన్‌ చేస్తున్నవాడిగా చూపించడం కూడా ప్రేక్షకులకు నచ్చేలా లేదు. సినిమాలో అసలెందుకు అన్ని పాటలు పెట్టారో ఎవ్వరికీ అర్ధం కాదు. క్వాలిటీ లేని నిర్మాణ విలువలు, ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతిల ప్రేమ ఇవన్నీ బాగా చూపించలేదంటున్నారు.
https://www.telugupost.com/crime/dsp-vasudevan-said-that-the-killing-of-amarnath-reddy-of-kutalapally-was-due-to-personal-reasons-1527427
వ్యక్తిగత కారణాలవల్లే కుటాలపల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిందని డీఎస్‌పీ వాసుదేవన్ తెలిపారు. నల్లమాడ మండలం కుటాలపల్లి లో ఆదివారం రాత్రి జరిగిన అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిందని, ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి , డీఎస్పీ వాసుదేవన్ పరిశీలించారు. ఈ హత్య కేసును వెంటనే ఛేదించాలని ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈనేపథ్యంలో హత్య ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను వెల్లడించారు.ప్రాధమిక దర్యాప్తులో...పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ విడుదల చేసిన ప్రకటన ప్రకరాం నల్లమాడ మండలం కుటాలపల్లి గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి వ్యక్తిగత కారణాలవల్లే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఈ హత్యకు ఎటువంటి రాజకీయ కోణం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని తెలుస్తోందని, ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని త్వరలోనే అమర్నాథ్ రెడ్డి హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
https://www.telugupost.com/movie-news/తమిళుల-సెంటిమెంట్-సమర్ధి-20172/
గత ఏడాది డిసెంబర్ నెలలో అమ్మ జయలలిత అకాల మరణం చెందటంతో తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితిని సమర్ధవంతంగా ఎదుర్కొని తమ ప్రభుత్వ పాలన ను కొనసాగిస్తున్నారు తమిళనాడు ముఖ్య మంత్రి పన్నీర్ సెల్వం, ఏ.ఐ.డి.ఎం.కే పార్టీ అధ్యక్షరాలు చిన్నమ్మ శశికళ. కానీ దక్షిణ భారత దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగైన సంక్రాంతి కి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సాంప్రదాయం వుంది. కాగా తమిళుల ఆచరణ ప్రకారం మూగ జీవులను శారీరక శ్రమ కి, హింస కి గురి చేసే జల్లికట్టు తర తరాలు గా జరుపుకోవటం ఆనవాయితీగా కొనసాగుతుంది. పెటా సంఘం వేసిన పిటిషన్ ని సమర్ధిస్తూ సుప్రీమ్ న్యాయస్థానం జల్లికట్టు నిర్వహించటం నేరం అంటూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పన్నీర్ సెల్వం పై అధిక భారం పడుతుంది. తమిళుల సెంటిమెంట్ ని అడ్డుకున్న న్యాయస్థానంపై రాజకీయపరమైన ఒత్తిడి పెంచైనా సరే జల్లికట్టు పై నిషేధాన్ని ఎత్తివేయించాలని పన్నీర్ సెల్వం పై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం ఈ వ్యవహారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు ఉంచారు. అమ్మ ఉండి ఉంటే తమిళుల సెంటిమెంట్ ని అడ్డుకునేందుకు సుప్రీమ్ న్యాయస్థానానికి ధైర్యం సరిపోయేది కాదనే అభిప్రాయలు కూడా వినపడుతున్నాయి.మరోవైపు తమిళుల ఆచారాన్ని కాపాడటానికి రాజకీయాలకు సంబంధం లేని సినిమా ప్రముఖులు నడుం బిగిస్తున్నారు. పెటా సంఘానికి మద్దతుగా నిలిచిన త్రిష తమిళుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి రాగా, తమిళ హీరో సూర్య తో పాటు పలువురు ప్రముఖులు జల్లికట్టు పై నిషేధాన్ని ఎత్తివేసి తమిళ ప్రజల మనోభావాలను కాపాడాలని నిరసనలు మొదలుపెట్టగా, ఇటువంటి వివాదాస్పద చర్యలకు ఎప్పుడూ దూరంగా వుండే ప్రముఖ సంగీత దర్శకులు ఏ.ఆర్.రెహమాన్ నేడు(20 జనవరి) న మద్రాస్ లో నిరాహార దీక్ష చేసి తమిళుల సెంటిమెంట్ కి మద్దతుగా సుప్రీమ్ కోర్ట్ తీర్పుపై నిరసన ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికి కూడా జల్లికట్టు పై నిషేధం ఎత్తివేయకుంటే ఇంకెందరు ప్రముఖులు న్యాయస్థానానికి ఎదురు వెళ్తారో ఊహకి అందని లెక్క గా మారుతుంది.
https://www.telugupost.com/movie-news/keerthi-in-sarkaru-vari-pata-162319/
మహేష్ బాబు – పరశురామ్ కాంబోలో తెరెకెక్కబోయే సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ఎంపికైంది. ఈ విషయం మూవీ యూనిట్ నుండి క్లారిటీ రాకపోయినా.. కీర్తి సురేష్ మాత్రం కన్ఫర్మ్ చేసింది. అయితే మహేష్ సరసన మొదటసారి నటించబోయే కీర్తి సురేష్ రోల్ పై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియా కథనం ప్రకారం ఈ సినిమా మొత్తం బ్యాంకింగ్ రంగంలో జరిగిన అతి పెద్ద స్కాం చుట్టూ తిరగబోతుంది అని… మహేష్ ఈ సినిమాలో బ్యాంకు మేనేజర్ కొడుకు పాత్రలో నటించబోతున్నాడని టాక్ ఉంది. బ్యాంక్ లో జరిగిన అతి పెద్ద స్కామ్ ని బయటపెట్టడం అనేది హీరోకి పెద్ద సవాల్ తో కూడుకున్న పని అని.. దానిని పరశురామ్ కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్ని కలిపి ఆ ఎపిసోడ్ ని హైలెట్ అయ్యేలా రాసుకు న్నాడనీ అంటున్నారు. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ రోల్ పై కూడా ఓ న్యూస్ ప్రచారంలోకొచ్చింది. అదేమిటంటే కీర్తి సురేష్ ఈ సినిమాలో బ్యాంక్ ఎంప్లొయ్ గా నటిస్తుంది అని.. మొదట్లో మహేష్ చేసే పనులు నచ్చకపోయినా.. ఒకొనొక క్షణంలో మహేష్ ని చూసి ఇంప్రెస్స్ అవడమే కాదు… మహేష్ కి బ్యాంక్ స్కామ్ ని సాల్వ్ చెయ్యడానికి హెల్ప్ కూడా చేస్తుందట. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. కీర్తి సురేష్ సర్కారు వారి పాటలో ఇలాంటి రోల్ లోనే నటించబోతుంది అంటూ సోషల్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్.
https://www.telugupost.com/crime/robbery-took-place-in-tirupati-guntur-train-thieves-robbed-while-the-passengers-were-sleeping-1477063
తిరుపతి - గుంటూరు రైలులో దోపిడీ జరిగింది. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రవేశించిన దొంగలు అయిన కాడికి దోచుకెళ్లారు. అర్ధరాత్రి ఇరుగుపాడు వద్ద ఈ దోపిడీ జరిగినట్లు ప్రయాణికులు వివరించారు. తిరుపతి నుంచి వస్తున్న రైలులోకి ఒక్కసారిగా ప్రవేశించిన దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు.బంగారు ఆభరణాలను...మహిళల మెడలో నుంచి బంగారాన్ని దొంగిలించుకుని వెళ్లారు. ఎంత బంగారం పోయిందన్న దానిపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎస్1 బోగీ నుంచి ఎస్ 6 బోగీ వరకూ దొంగలు తమ దోపిడీని యధేచ్ఛగా కొనసాగించారు. ఈ దోపిడీలో 20 నుంచి ఇరవై మంది దొంగలు పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/మహేష్-మారాడా-62083/
బ్రహ్మ్మోత్సవం సినిమా టైం లో మహేష్ బాబు సినిమాల కథలను మహేష్ భార్య నమ్రత కూడా వింటుందని... మహేష్ కి సంబందించిన సోషల్ మీడియా కానివ్వండి బిజినెస్ వ్యవహారాలు కానివ్వండి అన్ని ఆమె చక్కబెడుతుందనే వార్తలు ఫిల్మ్ నగర్ సాక్షిగా చక్కర్లు కొట్టాయి. అసలు మహేష్ ని ఏ డైరెక్టర్ నిర్మాత కలవాలన్నా ముందు నమ్రత ని కలిస్తేనే పనిజరుగుతుందనే న్యూస్ బాగా హైలెట్ అయ్యింది. అయితే ఈమధ్యకాలంలో మాత్రం మహేష్ భార్య నమ్రత న్యూస్ మాత్రం పెద్దగా బయటికి రావడం లేదు. అయితే మహేష్ ఆ వార్తలన్నిటికి చెక్ పెట్టేందుకే సినిమాలకి సహనిర్మాతగా వ్యవహరించే విషయాన్ని వదిలేసాడనే టాక్ మాత్రం వినబడుతుంది.గతంలో మహేష్ బాబు ఇకపై చేసే సినిమాలకు సహా నిర్మాతగా వ్యహరిస్తానని చెప్పడమేకాదు అందులో భాగంగా గత రెండు సినిమాల కి మహేష్ తన ప్రొడక్షన్ ని లింక్ చేసాడట. కానీ నమ్రత తన సినిమాలు ఎవరికీ అమ్మలో.. ఎవరికీ అమ్మకూడదు అనే విషయాలు చూసుకుంటుందని న్యూస్ బయటికి రావడంతో మహేష్ తన తాజా సినిమాల నిర్మాణ భాగస్వామ్యంపై దృష్టి సారించలేదట. అందులో భాగంగానే తన సినిమాలకి తనకి ఎంత పారితోషకం రావాలో అంత తీసుకుని నిర్మాణ పనుల విషయంలో వేలెట్టడం మానేసాడట. అసలు సినిమా బడ్జెట్‌ కంట్రోల్‌ నుంచి అమ్ముతున్న రేట్ల వరకు దేనిపై కూడా మహేష్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదట.అయితే సినిమా డిజాస్టర్స్ అయినప్పుడు బయ్యర్లు హీరోలని కార్నర్ చేసి మాట్లాడే విషయంలో మహేష్ మాత్రం దానికి వ్యతిరేఖంగా వున్నాడట. హిట్ అయినా ఫట్ అయినా హీరోలు చేసే సినిమాలకు ఒకటే కష్టపడాలి. అందుకే సినిమా ఫెయిల్యూర్ అయితే హీరో ని మధ్యలో లాగడం ఎందుకు... ఆ పంచాయితీలేవో నిర్మాతలే పెట్టుకోవాలని నిర్మతలతో ఖరాఖండిగా చెబుతున్నాడట మహేష్. అంటే మహేష్ ఈ నిర్ణయంతో గత సినిమాల డిజాస్టర్స్ తో ఇలా మారిపోయాడా అనే డౌట్ వస్తుంది అందరికి.
https://www.telugupost.com/movie-news/ram-charan-and-ntr-first-look-from-rrr-will-be-released-soon-148030/
రాజమౌళి చేతిలో రెండేళ్ళకి పైగా బాగా బుక్ అయిన తన అభిమాన హీరోల ఫస్ట్ లుక్స్ పై కూడా ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ ఆశలు వదిలేసుకున్నారు. అదే జులై 30 న సినిమా విడుదలైతే ఈపాటికి హీరో ల లుక్స్ తో ఓ రేంజ్ లో అభిమానులు పండగ చేసుకునేవారు. కానీ రాజమౌళి చెర్రీ – ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి హోల్సేల్ గా షాకిచ్చాడు. జనవరి 8 2021 సినిమా విడుదల అంటూ హీరోలిద్దరిని అడ్డంగా బుక్ చేసేసాడు. అయితే వచ్చే ఏడాది సినిమాకి ఇప్పుడు రాజమౌళి #RRR ఫస్ట్ లుక్స్ వదలడని.. ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎందుకంటే ఈ జనవరిలో #RRR లుక్స్ కోసం తెగ వెయిట్ చేసారు ఫ్యాన్స్. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి #RRR హీరోస్ ఫస్ట్ లుక్స్ విషయంలో పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27 రోజున అల్లూరి సీత రామరాజు పాత్రధారి చరణ్ లుక్ ని, మే 20 ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ కొమరం భీం లుక్ ని విడుదలకు ఏర్పాట్లు స్టార్ట్ చేసాడని.. ఓ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావడమే ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ ఇద్దరు కలిపి సంబరాలకు రెడీ అయ్యారు. పైన పేర్కొన్న రెండు తేదీలు వేగంగా రావడంతో. అభిమానులు ఆనందానికి అవధుల్లేవ్. మరి #RRR లుక్ కోసం ఫ్యాన్స్ అంతా రెడీ కండమ్మా అంటున్నారు
https://www.telugupost.com/movie-news/sakshyam-3-days-collections-82180/
బెల్లంకొండ శ్రీనివాస్ - పూజ హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాక్ష్యం సినిమా మూడు రోజుల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ షేర్స్ మీకోసం.ఏరియా షేర్స్ (కోట్లలో)నైజాం 1.75సీడెడ్ 1.00నెల్లూరు 0.24కృష్ణ 0.50గుంటూరు 0.81వైజాగ్ 1.00ఈస్ట్ గోదావరి 0.49వెస్ట్ గోదావరి 0.37మొత్తం ఏపీ, టీఎస్ మూడు రోజుల షేర్స్ 6.16 కోట్లు
https://www.telugupost.com/crime/some-people-fired-at-telugu-desam-party-mandal-president-benna-balakotireddy-in-palnadu-district-1460470
పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు కాల్పులు జరిపారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి వచ్చి మరీ కాల్పులు జరిపారు. తలుపులు కొట్టి పిలవగా బాలకోటిరెడ్డి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన బాలకోటిరెడ్డిపై వెంటనే కాల్పులు జరిపారు. రొంపిచర్ల మండలం అలవాలలో ఈ ఘటన జరిగింది.పరిస్థితి విషమం...బాలకోటిరెడ్డి పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. మరో బుల్లెట్ గురి తప్పింది. కాల్పులు జరిపిన దుండగులు వెంటనే పరారయ్యారు. గాయపడిన వెంకటకోటిరెడ్డిని వెంటనే నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
https://www.telugupost.com/movie-news/nayanthara-is-a-heroine-with-a-special-identity-for-herself-134144/
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అంటే వెంటనే మనం నయనతార పేరు చెప్పేస్తాం. ఎందుకంటే ఆమె అటువంటి సినిమాలు చేసి అంతటి యాక్టింగ్ చేసి అందరిని ఫిదా చేసింది కాబట్టి. కెరీర్ స్టార్టింగ్ లో మంచి మంచి సినిమాలు చేసిన నయన్ వెంటనే స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి వసూళ్లు రాబట్టింది. ఆమంటే అంతా క్రేజ్…. నయనతారతో సినిమా అంటే ప్రొడ్యూసర్స్ ఏమి ఆలోచించకుండా భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఆమె క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ప్రొడ్యూసర్స్. ప్రస్తుతం ఆమె సినిమాకి ఆరుకోట్ల రూపాయలు తీసుకుంటుంది. అయినా కానీ ప్రొడ్యూసర్స్ తగ్గడంలేదు. ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికైనా సై అంటున్నారు. కాకపోతే నయన్ ఈ భారీ రెమ్యూనరేషన్లను కేవలం బయటి భాషల సినిమాలకే తీసుకుంటోంది. ఆమె సొంత భాష అయినా మలయాళంలో ఇంత తీసుకోవడంలేదు. బయట భాషలతో పోల్చుకుంటే చాలా తక్కువ తీసుకుంటుందని టాక్. ఆ వయస్సులోనూ తగ్గని ఛాయ రీసెంట్ గా ఆమె చేస్తున్న సినిమాలు ‘సైరా నరసింహారెడ్డి’, రజనీకాంత్ ‘దర్బార్’ సినిమాలకు ఆమె 6 కోట్లు తీసుకుందని తెలుస్తుంది. హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాకా.. కొన్ని సినిమాలకు కోటిరూపాయల పారితోషకాన్ని తీస్తుంటే ఇప్పుడు రిటైర్ అయ్యే టైములో 6 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవడం విడ్డూరమే.
https://www.telugupost.com/movie-news/rumours-on-mahesh-babu-maharshi-movie-90865/
మహేష్ బాబు - వంశి పైడిపల్లి కాంబోలో మహేష్ కెరీర్ లోనే మైలు రాయి అయిన మహేష్ 25 వ సినిమా 'మహర్షి' తెరకెక్కుతుంది. మహేష్ కెరీర్ లో ఈ 'మహర్షి' మూవీ బెస్ట్ మూవీ గా ఉండాలని వంశి పైడిపల్లి తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడట. ఇక నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ లు కూడా వంశి అడిగినదల్లా కాదనకుండా సమకూరుస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడానికి చాలా సమయం తీసుకుంది. కనకనే రెగ్యులర్ షూటింగ్ మొదలైనప్పటినుండి షూటింగ్ కి ఎటువంటి విరామం ఇవ్వడం లేదు చిత్ర బృందం. ఇక మహేష్ కూడా వంశి తో కలిసి కష్టపడుతున్నాడు. అమెరికా షెడ్యూల్ లెట్ అయినప్పటికీ... మధ్యలో హైదరాబాద్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసేసింది 'మహర్హి' చిత్ర బృందం. అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ 'మహర్షి' సినిమాపై ఒక రూమర్ సోషల్ మీడియాలోనూ, ఫిలింసర్కిల్స్ లోను స్ప్రెడ్ అయ్యింది. అదేమిటంటే.. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ అవుట్ ఫుట్ ని మహేష్ తో కలిసి దర్శకుడు వంశి, నిర్మాతలు చూశారట. కానీ మహేష్ కీలకమైన కొన్ని సన్నివేశాలు తాను ఆశించినట్టుగా రాలేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశాడట. అంతేకాకుండా ఆ సన్నివేశాలను రీ షూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. ఇక మహేష్ చెప్పిన విషయానికి దర్శకుడు వంశి, నిర్మాతలు దిల్ రాజుతోపాటుగా..పీవీపీ, అశ్వినీదత్ లు కూడా ఒప్పుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం మహేష్ మహర్షికి రి షూట్ అంటూ ప్రచారం మొదలైంది. ఇక పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరో అల్లరి నరేష్ కీలకమైన అంటే మహేష్ ఫ్రెండ్ రోల్ లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
https://www.telugupost.com/crime/indian-predator-chops-live-in-partner-into-pieces-scatters-body-parts-across-delhi-1448068
దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, 18 రోజుల పాటు మెహ్రౌలీ అటవీ ప్రాంతం సమీపంలో నగరం అంతటా పారవేస్తూ వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాగా గుర్తించారు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ప్రియురాలు శ్రద్ధను అతడు హత్య చేశాడు. నిందితుడు నేరం అంగీకరించడంతో పోలీసులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితురాలి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదు నెలల క్రితం మే నెలలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ హత్య జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు నవంబర్ 8న మెహ్రౌలీ పోలీసులకు తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ముంబైలో మలాడ్ ప్రాంతంలోని కాల్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఆ సమయంలో అక్కడ ఆమెకు ఆఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. ఈ జంట ఢిల్లీకి వెళ్లి సహజీవనం చేయడం ప్రారంభించారు. బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే తమ కుమార్తె లివ్-ఇన్ రిలేషన్‌షిప్ గురించి తెలుసుకుని వ్యతిరేకించారు. శ్రద్ధ మాత్రం అఫ్తాబ్ తనను వివాహం చేసుకుంటాడనే ఆలోచనలో ఉంది. పెళ్లి చేసుకుని కలిసి ఉందామని ఆఫ్తాబ్‌ను ఒత్తిడి చేస్తూ ఉండడంతో.. ఇద్దరి మధ్య తరచూ గొడవలకు దారితీసింది. గొడవ సమయంలో శ్రద్ధ బిగ్గరగా అరవడంతో.. ఆమెను నిశ్శబద్దంగా ఉంచడానికి గొంతును నొక్కాడు. దీంతో ఊపిరాడక శ్రద్ధ మృతి చెందింది.అఫ్తాబ్‌ తాను చేసిన నేరాన్ని దాచడానికి, ఒక రంపాన్ని ఉపయోగించి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, వాటిని 18 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పారవేసాడు. ఆమె శరీర భాగాలను 18 రోజుల పాటు దుర్వాసన రాకుండా భద్రపరిచేందుకు పెద్ద ఫ్రిజ్‌ను కూడా కొనుగోలు చేశాడు. అఫ్తాబ్ ప్రతిరోజూ రాత్రి 2 గంటలకు అటవీ ప్రాంతంలో శరీర భాగాలను పారవేసేందుకు మెహ్రౌలీకి వెళ్లేవాడు. కొన్ని రోజులుగా శ్రద్ధ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయకపోవడంతో ఆమె కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. ఆమె తండ్రి ఐదు నెలల క్రితం ఢిల్లీకి వెళ్లి తన లివ్ ఇన్ పార్ట్‌నర్‌తో కలిసి తన కూతురు ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. అయితే, అక్కడికి చేరుకోగానే, ఆ స్థలం తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన ఆమె తండ్రి మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి నిందితుడిని పట్టుకున్నారు.
https://www.telugupost.com/movie-news/rakul-before-ncb-169872/
బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు.. ఎక్కడినుండి ఎక్కడికి వెళ్లిందో అనేది మీడియాలో చూస్తూనే ఉన్నాం. చిన్న చేప ఎన్ సీబీ వలలో పడితే.. చివరికి పెద్ద చేపలు గాలానికి చిక్కేలా చేసింది ఆ చిన్న చేప. సుశాంత్ రాజ్ ఫుట్ ఆత్మహత్య కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారి బాలీవుడ్ టాప్ తారల మీదకి చుట్టుకుంది. తాజాగా రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ టాలెంట్ మేనేజర్ జయ సాహా, దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా చెప్పిన సాక్ష్యాలతో బాలీవుడ్ బడా హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్ద కపూర్, సారా అలీఖాన్ లకు అలాగే సౌత్ హీరోయిన్ రియా ఫ్రెండ్ రకుల్ ప్రీత్ కి ఈ డ్రగ్స్ కేసులో ఎన్ సీబీ సమన్లు జారీ చెయ్యడంతో ఈ కేసు రసవత్తరంగా మారింది. నిన్నమొన్నటివరకు ఊహాగానాలుగా మీడియా కెక్కిన పేర్లు ఈ రోజు ఎన్ సీబీ ముందు విచారణకు హరజరయ్యేలా ఉంది. రకుల్ నేడు ఎన్ సీబీ ముందుకు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవ్వాల్సి ఉండగా.. దీపికా రేపు ఎన్ సీబీ ఎదుటపడాలి. అయితే దీపికా పదుకొనె కేసు వాదించడానికి 12 మంది లాయర్ల బృందం రెడీగా ఉందనే విషయం మీడియాలో చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం గోవా లో సినిమా షూటింగ్ లో ఉన్న దీపికా లాయర్లతో చర్చలు జరుపుతున్నట్టుగా టాక్. ఇక శ్రద్ద కపూర్, సారా అలీఖాన్ లు కూడా ఈ విచారణలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు టాప్ తారల పేర్లు డ్రగ్స్ కేసులో బయటికి రావడంతో వారి కెరీర్ ఏమవుతుందో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. రకుల్ కెరీర్ ఇప్పటికే అంతంత మాత్రంగా ఉంటె.. దీపికా టాప్ గరే లో దూసుకుపోతుంది. అసలే ప్రభాస్ తో ఓ స్ట్రయిట్ తెలుగు మూవీ కూడా చేస్తుంది. ఇక సారా అలీ ఖాన్ ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్న తార, ఇక శ్రద్ద కపూర్ కి అంతంత మాత్రం అవకాశాలే. ఈ డ్రగ్స్ కేసుతో తారల కెరీర్ ఎలా ఉన్నా ప్రేక్షకులు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది.
https://www.telugupost.com/movie-news/చరణ్-ఇంకా-చిరుని-అడిగే-సి-61705/
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ చిరంజీవి కొడుకుగా స్టార్ట్ అయింది. కానీ కొన్నాళ్ల తర్వాత ఆ మార్క్ పోయింది. చరణ్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ వున్నాయి అలానే డిజాస్టర్స్ కూడా వున్నాయి. ఒకవైపు నటుడిగా మెప్పిస్తూ..నటనకు ఇంపార్టెన్స్ వున్న పాత్రలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకెళుతున్నాడు. కానీ ఇప్పటి కి రామ్ చరణ్ కొన్ని విషయాలలో సొంత నిర్ణయాలు తీసులేకపోతున్నాడట.స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ఓ మల్టీ స్టార్రర్ లో చరణ్ - ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి చరణ్ కు కథ చెప్పిన వెంటనే ఒకే చేయలేదంట. చేద్దామా.. వద్దా అనే డౌట్ తో తండ్రి చిరంజీవి సలహా కోసం వెళ్లాడు. రాజమౌళి తీసే సినిమా కెరీర్ లో మైలురాయిగా మిగిలిపోవడమే కాదు... ఓ ట్రెండ్ సెట్టర్ సినిమా కూడా అయ్యే అవకాశం ఉందని చరణ్ చెప్పారంట.సో వెంటనే వెళ్లి రాజమౌళితో సినిమా చేస్తా అని చెప్పాడన్నది అతడి సన్నిహితుల నుంచి వినిపిస్తున్న టాక్. ఇన్ని సినిమాలు చేసిన అనుభవం వున్న చరణ్ కు ఇంకా ఏ సినిమా చేయాలో వద్ధో సొంతంగా ఠక్కున నిర్ణయం తీసుకోడం లేదు. ఇంట్లో నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే సినిమాను ఒకే చేస్తున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకోకపోతే కష్టం అంటున్నారు సినీ పండితులు.
https://www.telugupost.com/movie-news/tollywood-heros-listening-the-stories-during-corona-break-151794/
కరోనా వైరస్ తో ప్రజలు బయటికి రాకుండా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ప్రజలే కాదు.. సెలబ్రిటీస్ కూడా ఈ కరోనా కాలాన్ని ఏ వర్కౌట్స్ తోనో, లేదంటే ఫ్యామిలీతోనో టైం స్పెండ్ చేస్తున్నారు. కొంతమంది హీరోలు పిల్లలతో ఆడుకుంటుంటే.. కొంతమంది అయితే సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై ప్రచారం చేస్తున్నారు. ఇక కొంతమంది హీరోలు మాత్రం ఈ సమయంలో తమకి కథలు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న దర్శకులకు కబురు పెడుతున్నారట. చాలామంది యంగ్ హీరోలు కొత్త ప్రాజెక్టుల షూటింగ్స్ తో చాలా కథలను హోల్డ్ లో పెట్టడం దర్శకులను హోల్డ్ లో పెట్టడం జరిగింది. అయితే తాజాగా కరోనా తో ఇళ్లకే పరిమితమైన ఈ యంగ్ హీరోలు తమకి కథలు చెప్పడానికి రెడీ అయిన దర్శకులను ఒక్కొక్కరిగా ఇంటికి పిలిపించుకుని.. కూల్ మైండ్ తో కథలను వింటున్నారట. నచ్చితే స్క్రిప్ట్ సిద్ధం చెయ్యమని దర్శకులకు చెబుతున్నారట. ఇక కొంతమంది యంగ్ హీరోలైతే దర్శకులకు ఫోన్స్ చేసి మరీ తమకి ఎలాంటి కథలు కావాలో అలాంటి కథలను సిద్ధం చెయ్యమని ఆడుగుతున్నారట. ఒకవేళ రావడానికి కుదరకపోయినా.. ఫోన్ లోనే కథను నేరేట్ చెయ్యమని మరీ అడుగుతున్నారట. మరోపక్క యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇలాంటి సమయం కోసమే కాచుకుని కూర్చోవడంతో యంగ్ హీరోలు పిలవడమే పాపం.. లగెత్తుకుని కథలు చెప్పడానికి వెళ్తున్నారట
https://www.telugupost.com/movie-news/yatra-2-jivaa-first-look-released-on-occasion-of-ys-jagan-mohan-reddy-birthday-1510758
Yatra 2 : నేడు డిసెంబర్‌ 21న ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ కి విషెస్ తెలియజేశారు. ఇక జగన్ లైఫ్ స్టోరీ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాల నుంచి బర్త్ డే కానుకలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఈక్రమంలోనే యాత్ర 2 నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.గత ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రని కథాంశంగా తీసుకోని దర్శకుడు మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన 'యాత్ర' సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో దానికి సీక్వెల్ గా జగన్ మోహన్ రెడ్డి చేసిన పాద యాత్రని తీసుకు వస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించగా, ఇప్పుడు జగన్ పాత్రలో తమిళ హీరో జీవ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. View this post on Instagram A post shared by Jiiva (@actorjiiva) ఇక నేడు జగన్ పుట్టినరోజు కావడంతో మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ పాత్రలను పోషిస్తున్న మమ్ముట్టి, జీవ.. కుర్చీల్లో కూర్చొని ఆ పోస్టర్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ అయితే ఆకట్టుకునేలా ఉంది. జగన్ గా జీవ బాగా సెట్ అయ్యారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 2024 ఫిబ్రవరి 8న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.They thought it was his end, and he knew it was just the beginning!Wishing @ysjagan garu a very Happy birthday.Cant wait to tell your story to the world through our lens.#Yatra2 in cinemas from Feb 8, 2024.#HBDYSJagan #LegacyLivesOn #Yatra2OnFeb8th pic.twitter.com/oo51ZKUEVR— Mahi Vraghav (@MahiVraghav) December 21, 2023
https://www.telugupost.com/movie-news/know-about-guntur-karam-kurchi-madathapetti-song-details-1512600
గుంటూరు కారం సినిమా నుండి కుర్చీ మడతపెట్టి అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. శ్రీలీలతో కలిసి మహేశ్ బాబు సూపర్ స్టెప్స్ వేసారు. తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. "రాజమండ్రి రాగమంజరి... మా అమ్మ పేరు తెలవనోళ్లు లేరు మేస్తిరీ... సోకులాడి స్వప్న సుందరీ... నీ మడతచూపు మాపటేల మల్లెపందిరీ" అంటూ రామజోగయ్య లిరిక్స్ రాశారు. ఆ లిరిక్స్ శ్రీలీల గురించి అని అనుకున్నా/.(Kurchi madthapetti)ఈ సాంగ్ లో నటి పూర్ణ కనిపించింది. లిరికల్ వీడియోలో ఆమెను రివీల్ చేయలేదు. మొత్తం శ్రీలీలనే చూపించడంతో ఆ లిరిక్స్ ఆమె మీదనే అని అనుకుంటున్నారు. అయితే చివర్లో పూర్ణ కనిపించిందని అభిమానులు పోస్టులు పెట్టారు. దీంతో పూర్ణతో కలిసి మహేష్ బాబు సూపర్ స్టెప్స్ వేసే ఉంటాడని.. ఆ స్టెప్స్ వెండితెర మీద అదిరిపోతాయని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం చిత్రం 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
https://www.telugupost.com/top-stories/chandrababu-has-changed-the-angle-in-his-campaign-it-is-to-gain-sympathy-from-the-people-1448582
అనుకున్నట్లే జరుగుతుంది. చంద్రబాబు తన ప్రచారంలో కోణాన్ని మార్చారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పడం వెనక ప్రజల నుంచి సానుభూతి పొందడానికే. చంద్రబాబుకే కాదు కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరికైనా ఆ విషయం అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో టీడీపీకి గెలుపు దక్కకపోతే ఆ పార్టీ పరిస్థితి అద్వాన్నంగా మారుతుంది. చంద్రబాబు నాయకత్వాన్ని చూసి ఇప్పటికీ పార్టీలో నేతలు కాని, కార్యకర్తలు కాని ధైర్యంతో ఉన్నారు. ఆయన రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటే తమ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు సైకిల్ పార్టీకి చెందిన ఏ తమ్ముడికీ సమాధానం దొరకదు. నేతల్లో నమ్మకం...చంద్రబాబుకు ఇప్పటికే ఏడు పదుల వయసు దాటింది. అయినా ఆయన ఆరోగ్యవంతంగానే ఉన్నారు. పార్టీని మరికొంత కాలం నడుపుతారన్న నమ్మకం నేతల్లో ఉంది. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఆయన మారగలరు. తన వ్యూహాలను కూడా మార్చుకోగలరు. చంద్రబాబు ఎలాగైనా ఈసారి పార్టీని అధికారంలోకి తెస్తారన్న నమ్మకం టీడీపీలోని ప్రతి ఒక్క కార్యకర్తకూ ఉంది. అది చంద్రబాబు సామర్థ్యం పై ఉన్న విశ్వాసం. ఆయన ఎత్తుగడల పట్ల ఉన్న అపారమైన నమ్మకం. అందుకే ఇప్పటికీ రాష్ట్రమంతటా టీడీపీ కోసం కష్టించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.పార్టీలో కలకలం...అలాంటి చంద్రబాబు కర్నూలు సభలో చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ కలకలం రేపాయని చెప్పవచ్చు. ఇదే తనకు లాస్ట్ ఛాన్స్ అని అనవచ్చు. కానీ తనను ఈసారి అసెంబ్లీకి పంపకుంటే (టీడీపీ అధికారంలోకి వచ్చి సీఎం అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతారని శపథం చేశారు) తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించడం మాత్రం క్యాడర్ లో అలజడి రేగింది. తన భార్యను తిట్టారంటూ సానుభూతి కోసం మరోసారి ప్రయత్నించారు. చంద్రబాబు ఎప్పుడూ రాజకీయాల్లో భయపడరు. అలాగని ఆయన సాహసోపేత నిర్ణయాలనూ తీసుకోలేరు. చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఎప్పుడూ ఇలా అధైర్యపడలేదు. ఆయన నోటి నుంచి తనకు ఇవే చివరి ఎన్నికలు అని రావడంపై పార్టీలోనే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. చంద్రబాబు తన బలహీనతను బయటపెట్టుకున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంత ఎమోషనల్ గా....రాజకీయాలకు వయసు అడ్డు కాదు. నవీన్ పట్నాయక్ వంటి వారు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఎ యడ్యూరప్ప కూడా ఏడు పదుల వయసులో హుషారుగానే ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఈ సమయంలో అలా కామెంట్ చేసి ఉండాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒక్క ఎన్నికలో ఓడిపోతే ఇక రాజకీయ సన్యాసం ఎందుకు? ప్రజల నుంచి సానుభూతి ఆశిస్తే అది ఎంత వరకూ పనిచేస్తుంది? చంద్రబాబు అంత ఎమోషనల్ గా ఎందుకు మాట్లాడారు?తనను గెలిపించకపోతే ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పడం బ్లాక్ మెయిలింగ్ అని కూడా ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎలాంటి చంద్రబాబు ఎలా అయిపోయారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.
https://www.telugupost.com/movie-news/అమ్మడు-ఫెట్-భలే-మారిందిల-43878/
ఎప్పుడో బాలీవుడ్ లో ఫెమస్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు కొత్తగా తెలుగు, తమిళ భాషల్లో కూడా మొదలైంది. ఇక ఈ షోలో కొంత ఫెమ్ వున్నవాళ్లు, మామూలు వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ గా దిగారు. ఇక ఈ షో బిగ్ బాస్ షోతో హౌస్ లో పార్టిసిపేట్స్ అంతా అక్కడ ఎన్ని రోజులున్నప్పటికీ బయటికి వచ్చాక మాత్రం బిగ్ సీలెబ్రిటీస్ గా మారిపోతున్నారు. బిగ్ బాస్ హౌస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతున్న కంటెస్టెంట్స్ వారు షోలో అడుగుపెట్టిన్నప్పుడు సాధారణంగా ఉన్నప్పటికీ షో నుండి ఎలిమినేట్ అయిన వెంటనే వారు బయటికి వచ్చి ఫుల్ ఫెమస్ అవుతున్నారు.అయితే ఇప్పుడు తెలుగులో ఎలాగున్నా తమిళంలో కమల్ హోస్ట్ గా వస్తున్న తమిళ బిగ్ బాస్ లో ఒక చిన్న హీరోయిన్‌కు మాత్రం లక్, పిచ్చ పాపులారిటీ తెచ్చేసింది. అసలు హీరోయిన్ గా అంతగా ఏ మాత్రం పాపులర్ కాని ఒవియా తమిళ బిగ్ బాషౌస్ లోకి ఎంటర్ అయినప్పటినుండి సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది. తమిళ బిగ్‌బాస్ షో‌తో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేసింది. ఆమె హౌస్ లో ప్రేమ పెళ్లి వ్యవహారాలతో పాటు... ఆత్మహత్య కు కూడా పాల్పడడం వంటి అంశాలతో ఒవియా ఒక్కసారిగా ఫెమస్ అవడమే కాదు బిగ్ సెలెబ్రెటీగా తమిళ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చింది.ఇక బయటికి వచ్చాక ఒవియా ఇప్పుడు తమిళంలో చక్రం తిప్పుతున్న కొంతమంది హీరోయిన్స్ కి ఝలక్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్స్‌కు చెక్ చెప్పి.... కొన్ని కమర్షియల్ యాడ్స్ కి బ్రాండ్ అంబాసడర్‌గా అవతారమెత్తింది ఈ అమ్మడు. ఇప్పటివరకు తమిళనాడు చెన్నై లో ఫేమస్ అయిన శరవణ స్టోర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న హీరోయిన్స్ ప్లేస్‌లో ఒవియా‌కు ఛాన్స్ దక్కించుకున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తుంది. అంతేకాకుండా మరికొన్ని కంపెనీల బ్రాండ్స్‌కు సైన్ చేస్తోందని చెన్నై నుండి సమాచారం అందుతుంది. ఇక ఇలా ఒకపక్క బ్రాండ్స్ కి అంబాసిడర్స్ గా చెయ్యడమే కాదు కోలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో వరుస అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా టాక్.
https://www.telugupost.com/movie-news/megastar-chiranjeevi-phoned-senior-actor-kaikala-satyanarayana-he-inquired-about-his-health-condition-1340209
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. కైకాల త్వరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. కైకాల సత్యనారాయణ పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడుతూ అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని నిన్న అపోలో వైద్యులు చెప్పారు.వైద్యులతో...దీంతో కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి వైద్యుల సాయంతో కైకాల సత్యనారాయణతో మాట్లాడారు. త్వరగా కోలుకుని ఇంటికి వస్తారని చిరంజీవి ఆయనతో చెప్పారు. అపోలో వైద్యులను అడిగి కైకాల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కైకాల త్వరగా ఇంటికి వస్తారని చిరంజీవి ఆకాంక్షించారు.
https://www.telugupost.com/movie-news/డాన్సుల్లో-అదరగొట్టేసిం-35343/
టాలీవుడ్ లో అల్లు అర్జున్ డాన్సింగ్ స్టయిలే వేరు. ఒక పక్క ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్స్ లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే అల్లు అర్జున్ కూడా వారికి ఏమాత్రం తీసిపోకుండా తన డాన్సింగ్ స్టయిల్ తో ప్రతి సినిమాలో ఇరగదీసేస్తున్నాడు. ఇక ఇపుడు తాజాగా 'డీజే' చిత్రంలో అల్లు అర్జున్ డాన్స్ అదిరిపోతుందని పాటల ప్రోమోస్ చూస్తే అర్ధమవుతుంది. అలాగే అల్లు అర్జున్ కో స్టార్ పూజ హెగ్డే కూడా అదే చెబుతుంది. అల్లు అర్జున్ తో డాన్స్ చేయటం అంటే చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పింది. 'దువ్వాడ జగన్నాథం' చిత్రంలో పూజ హెగ్డే గ్లామర్ షో తో రెచ్చిపోతుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పోటీ పడి డాన్స్ చేయాలంటే పూజ తన ఫిజిక్ ని చాలా కష్టపెడుతుందట. ఇకపోతే ఆలు అర్జున్ తో సినిమా ఒపుకున్నాకే తన డాన్స్ లో ప్రావీణ్యం పెంచుకుందట. మరి పూజ డాన్సుల కోసం చేసిన కష్టం ఊరికే పోలేదు. 'డీజే' ప్రోమో సాంగ్స్ చూసిన వారికి పూజ హెగ్డే, అల్లు అర్జున్ తో బాగానే పోటీ పడి డాన్స్ చేసిందని అర్ధమవుతుంది. అల్లు అర్జున్ కి ఏమాత్రం తగ్గకుండా పూజ డాన్స్ లు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా విడుదల చేసిన 'సీటీమారో' సాంగ్ లో పూజ స్టెప్పులు చూస్తుంటే చాలా స్పీడుగా ఉన్నాయనిపిస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా వున్న ఈ పాటలో పూజ మాస్ స్టెప్స్ అదిరిపోయాయనే కామెంట్స్ పడిపోతున్నాయి. అసలు ఇప్పటివరకు పూజ చేసిన ఏ చిత్రంలోను ఆమెకు సరైన డాన్స్ చేసే అవకాశం దొరకలేదు. ఆమెకు ఇప్పుడు డిజెలో మంచి డాన్స్ ప్లాట్ ఫారం దొరికింది. వచ్చిన అవకాశాన్ని పూజ బాగానే సద్వినియోగం చేసుకుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డీజే చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.... ఈ నెల 23 న విడుదలకు ముస్తాబవుతోంది
https://www.telugupost.com/movie-news/ntr-biopic-balakrishna-70588/
బాలకృష్ణ ఎంతో ప్రతిష్ట్మాకంగా చేపట్టిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు తేజ డైరెక్షన్ బాధ్యతలు వదిలేసి వెళ్లిపోవడంతో అర్థాంతరంగా ఆగిపోయింది. రెండు మూడు రోజులు షూటింగ్ తో హడావిడి చేసిన బాలయ్య కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ని పక్కన పెట్టేశాడనే న్యూస్ ప్రచారంలో ఉంది. ఎందుకంటే మహానటి సినిమాలో సావిత్రి గారి గురించిన విషయాలేమి దాచకుండా నాగ్ అశ్విన్ ప్రేక్షకులకు ఎలా చూపిస్తే అర్ధమవుతుందో అలా చూపించి అందరి మెప్పుని పొందాడు. మరి ఎన్టీఆర్ జీవితంలో కూడా చాలా కాంట్రవర్సీలు, మాసాలు దాగున్నాయి. మహానటిలా ఎన్టీఆర్ బయో పిక్ లో నిజానిజాలెలా చూపించాలో అనే విషయంలో బాలయ్య బాగా కన్ఫ్యూజ్ అవుతున్నాడట. అసలు ఎన్టీఆర్ జీవితంలో చీకటి కోణాన్ని బయటపెట్టేందుకు బాలయ్య మొగ్గు చూపడం లేదని, అసలు ఎన్టీఆర్ బయోపిక్ లో అవన్నీ చూపించాల్సి వస్తుందనే బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ని పక్కన పెట్టేసాడనే గుసగుసలు మొదలయ్యాయి.మహానటితో మారిన సీన్...మరి బయోపిక్ లకు కాలం కలిసొస్తుందా అనే అనుమానం మహానటి విడుదలకు ముందు అనేక మందిలో ఉండేది. కానీ సినిమా విడుదలయ్యాక మహానటిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తుంటే బయోపిక్ ల శకం ఇప్పుడు మాములుగా ఉండదని, అందుకే బాలకృష్ణ మళ్ళీ ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో పునరాలోచన చేస్తే బాగుంటుందని పలువురు బావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ గురించి బాగా రీసెర్చ్ చేసి ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అయిన తేజనే మళ్ళీ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నెత్తినెత్తుకుంటే బాగుంటుందని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారట. ఇక బాలయ్య కూడా మహానటి సినిమా చూశాక తన తండ్రి బయోపిక్ ని తెరమీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టాలని భావిస్తున్నాడట.మళ్లీ తేజనే రప్పించేందుకు....యంగ్ డైరెక్టర్, అసలు పెద్దగా అనుభవం లేని నాగ్ అశ్విన్ మహానటిని మెప్పించగా లేనిది మనం చేయలేమా అనే ఉద్దేశ్యంతో బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ మీద టీమ్ తో చర్చించి తేజని వెనక్కి రాప్పించే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం బాలయ్య తరుపున కొంతమంది తేజ తో మధ్యవర్తిత్వం నడిపేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తుంది. అసలు మధ్యవర్తులెందుకు బాలయ్య పిలిస్తే తేజ కచ్చితంగా వస్తాడనేది పలువురి అభిప్రాయం. మరి బాలయ్యకి, తేజకి మధ్యలో ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి.
https://www.telugupost.com/movie-news/rajinikanth-remuneration-for-darbar-movie-139720/
సౌత్ లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోల్లో ఫస్ట్ ప్లేస్ లో రజినీకాంత్ ఉంటాడు. హిట్స్, ప్లాప్స్ తో సంబంధమే లేకుండా రజినీకాంత్ సినిమాల మార్కెట్ ఉంటుంది. ఇప్పటివరకు వరసగా అరడజను సినిమాలు ప్లాప్ అయినా.. రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే పనులు మానుకుని ఎదురు చూసే పిచ్చి అభిమాన గణం రజిని సొంతం. అందుకే ఆయన క్రేజ్ కూడా కోట్లలోనే ఉంటుంది. తాజాగా రజినీకాంత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన దర్బార్ సినిమా మోషన్ పోస్టర్ తో సినిమాపై భారీ అంచనాలే వచ్చాయి. చాలా స్టైలిష్ గా రజినీకాంత్ దర్బార్ లో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా దర్బార్ సినిమాకి షాకింగ్ బడ్జెట్ పెట్టారని.. అయితే సినిమా బడ్జెట్ కన్నా రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎక్కువ అనే న్యూస్ కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రజినీకాంత్ సినిమాకి 40 నుండి 50 కోట్ల పారితోషకం అందుకుంటాడు. అంటే దర్బార్ బడ్జెట్ రజినీకాంత్ పారితోషకం కన్నా తక్కువ అంటే ఏ 35 నుండి 40 కొట్లో ఉంటుందన్నమాట. అయితే రజినీకాంత్ దర్బార్ సినిమాకి 60 కోట్లు పైనే తీసుకుంటున్నాడని అంటున్నారు. మరి రజిని మార్కెట్ దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు ఆయనకి అడిగింది ఇచ్చేసుకుంటున్నారు. ఇక దర్బార్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసారు.
https://www.telugupost.com/movie-news/pawan-one-man-show-184537/
పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నా, సినిమాల వంక చూడకపోయినా మార్కెట్ లో పవన్ వాల్యూ పడిపోలేదు. రెండున్నరేళ్ల గ్యాప్ తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదనేది ఆయన లేటెస్ట్ ఫిలిం వకీల్ సాబ్ లుక్స్ రిలీజ్ అప్పుడు, టీజర్ ట్రేండింగ్ లోకి వచ్చినప్పుడు అర్ధమైపోయింది. అందుకే దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ నే వాడడం కరెక్ట్ అని భావించినట్లుగా కనబడుతుంది. ఆయన నిర్మించిన షాదీ ముబారక్ ప్రమోషన్స్ కూడా సో సో గా చేసేసి దానిని బాగా లైట్ తీసుకున్నాడు. నేడు ఎలాంటి చప్పుడు లేకుండా షాదీ ముబారక్ రిలీజ్ అయ్యింది. అయితే దిల్ రాజు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పై బాగా కాన్సంట్రేట్ చేసి ముఖ్యంగా పవన్ నే హైలెట్ చేసేలా ప్లాన్స్ చేస్తున్నాడు. అసలు పవన్ కి పింక్ హీరో అమితాబ్ కి పోలిక ఉందా? వకీల్ సాబ్ పోస్టర్ లో కూడా కనీసం హీరోయిన్ ఫోటో పెట్టడం లేదు. కేవలం పవన్ తప్ప. సాంగ్ చూడండి, పోస్టర్ చూడండి, టీజర్ చూడండి అంతా పవన్ హీరోయిజం. ఆయన లాయర్ కోటు తప్ప వకీల్ సాబ్ లో మరో మొహం కనబడితే ఒట్టు. మరి వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పవన్ కి తప్ప మరొకరికి స్థానం లేదా? జనసేనలోను పవన్ ఒక్కరే స్టేజ్ మీద కనబడుతున్నట్టుగా ఇక్కడ వకీల్ సాబ్ ప్రమోషన్స్ లోను పవన్ ఒక్కరే కనిపిస్తున్నారు. మరి వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పబోతున్నారా? అసలు ఫాన్స్ కి నచ్చినట్టుగా ఎంత ఎలాంటి మార్పులు వకీల్ సాబ్ లో చేసారో కానీ.. ప్రస్తుతం వకీల్ సాబ్ అంటే పవన్. పవన్ అంటే వకీల్ సాబ్ అంతే. అంజలి, నివేత థామస్ ఇలా ఎవరికీ ప్రాముఖ్యత అనేది కనిపించడం లేదు.
https://www.telugupost.com/movie-news/young-hero-to-remake-tamil-movie-98514/
హీరో నితిన్ కెరీర్ ప్రస్తుతం అంతగా బాగోలేదు. త్రివిక్రమ్ తో 'అ..ఆ' సినిమా చేసిన తరువాత ఏ సినిమా హిట్ కాలేదు. 'లై', 'ఛల్ మోహన రంగా', 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలతో వరుస ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కు 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల ఓ కథ చెప్పడంతో అది ఓకే చేసాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాకు 'భీష్మ' అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో నితిన్ సరసన రష్మిక మందన కథానాయికగా నటించనుంది.తమిళ సినిమాపై మనస్సు...జనవరి 7వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ నేపథ్యంలో నితిన్ ఓ తమిళ సినిమాపై మనసు పారేసుకున్నాడట. ఆ సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది. తమిళంలో విష్ణు విశాల్ - అమలాపాల్ జంటగా నటించిన 'రాచ్చసన్' అనే మూవీని రామ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. సస్పెన్స్ తో సాగే సైకో థ్రిల్లర్ కథతో ఈ సినిమా అక్కడ అక్టోబర్ 5వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సాధించింది.పోలీస్ పాత్రలో...ఇందులో విష్ణు పోలీస్ పాత్రలో నటించాడు. ఇప్పుటివరకు నితిన్ సరైన పోలీస్ పాత్రలో నటించలేదు. కాబట్టి ఈ సినిమా అయితే తనకు కరెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నాడట. మరి ఈ సినిమాలో నితిన్ నటిస్తాడా? లేదా ప్రొడ్యూస్ చేస్తాడా? అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారు. ఒకవేళ నితిన్ ఇందులో నటిస్తే డైరెక్టర్ ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/kona-venkat-comments-on-srinu-vaitla-152004/
శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన చాలా సినిమాలు సూపర్ హిట్ అవడానికి కారణం అతని దగ్గర రైటర్ గా పని చేసిన కోన వెంకట్ గోపి మోహన్ లు… తర్వాత తర్వాత కోన వెంకట్ శ్రీను వైట్ల కి కథలు అందించడం, మాటలు రాయడం మానేసిన తర్వాత శ్రీను వైట్లకి విజయమనేదే లేదు. ఇక ఇటు కోన్ వెంకట్ నిర్మాతగా దర్శకుడిగా ఓ అన్నంత సక్సెస్ అయితే లేదు. అయ్యితే శ్రీను వైట్లకి – కోన వెంకట్ కి మధ్యన గొడవ ఏమిటనేది ఇప్పటికీ ఎవ్వరికి అంతుబట్టని ప్రశ్నే. తాజాగా కోన వెంకట్ అలీ తో జాలిగా ప్రోగ్రాంలో శ్రీను కి తనకి ఎందుకు క్లాష్ వచ్చిందో అనేది రివీల్ చేసాడు. కోన వెంకట్ ని అలీ శ్రీను వైట్లకి మీకు మధ్యన క్లాష్ ఎందుకు వచ్చింది అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నకి కోన…టీం వర్క్ వల్లే సక్సెస్ వస్తుంది.. కాని ఆ టీం వర్క్ ఎక్కడో బ్రేక్ అయ్యిందని నేను ఫీల్ అయ్యా.. దూరంగా ఉంటే మంచిదని కట్ చేశా.. అంటూ చాలా సింపుల్ గా శ్రీను వైట్లకి తనకి మధ్యన వచ్చిన విభేదాల గురించి చెప్పాడు. ఇక తాను రైటర్ అవడానికి కారణం ఆర్జీవీ అని, దర్శకుడు కావడానికి ఆర్జీవీ అని, ఇక రైటర్ కాకపోవడానికి కారణం కూడా ఆర్జీవినే అంటూ ఫన్నీ కామెంట్స్ చేసాడు. ఇక ఆర్జీవిని తాను చాలా ముద్దుగా పప్పు అని పిలుస్తా అని చెబుతున్నాడు.
https://www.telugupost.com/top-stories/renuka-chowdhury-who-was-in-the-congress-is-back-in-the-active-she-has-increased-her-focus-on-khammam-1361600
ఒకప్పుడు ఫైర్ బ్రాండ్. పార్టీలో ఆమె ఉంటే జోష్ పెరుగుతుందని భావించేవారు. ఎన్టీఆర్ సయితం ఆమెలో ఉన్న ఫైర్ ను గుర్తించి పదవులను కట్టబెట్టారు. ఆమె రేణుకా చౌదరి. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న రేణుక చౌదరి తిరిగి యాక్టివ్ అయ్యారు. ఖమ్మంపై ఆమె ఫోకస్ పెంచారు. అయితే ఎన్నికలకు ముందే రేణుక చౌదరి జనాల్లోకి వస్తుండటం చర్చనీయాంశమైంది. అయితే ఆమె రాకను పార్టీ క్యాడర్ సయితం ఆహ్వానిస్తారా? ఆమెకు నేతలు సహకరిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.వ్యతిరేక వర్గమే....రేణుక చౌదరి ఫైర్ బ్రాండ్ లీడర్. కానీ అది ఒకప్పుడు. ఆమెకు కాంగ్రెస్ లోనే ఒక గ్రూపు సహకరించే పరిస్థితి లేదు. గత లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కూడా రేణుక చౌదరి ఎన్నికల ఫలితాల తర్వాత రచ్చ రచ్చ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మాయమైన రేణుక చౌదరి తిరిగి ఖమ్మంలో హల్ చల్ చేస్తున్నారు. రేణుక చౌదరిని ఖమ్మం జిల్లాలో వ్యతిరేకించే కాంగ్రెస్ నేతలే ఎక్కువగా ఉన్నారు. హైకమాండ్ నే నమ్ముకుని....రేణుక చౌదరి ప్రజలను నమ్ముకోలేదు. అలాగే క్యాడర్ ను ఆమె ఎప్పుడూ విశ్వసించలేదు. కేవలం హైకమాండ్ ను నమ్ముకున్నారు. హైకమాండ్ కు దగ్గరగా ఉండటంతో ఆమె పీీసీసీ నాయకత్వాన్ని కూడా ఎప్పుడూ లెక్క చేయలేదు. వచ్చే ఎన్నికల్లో తిరిగి ఖమ్మం పార్లమెంటు నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. అందుకే గత కొద్దిరోజులుగా రేణుకా చౌదరి ఖమ్మం ప్రాంతంలో పర్యటనలు ప్రారంభించారు. ప్రయత్నాలు ప్రారంభం....అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు రేణుక చౌదరి సరిపోరన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. ఆమెను తిరిగి అభ్యర్థిగా ఎంపిక చేస్తే మరోసారి వర్గ విభేదాలు బయటపడటం ఖాయమంటున్నారు. ఖమ్మంలో కొంత టీడీపీ ఓటు బ్యాంకు ఉంది. అందుకే రేణుక చౌదరి ఏపీలోని మూడు రాజధానుల అంశాన్ని కూడా వ్యతిరేకించారు. అమరావతి రైతులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఇలా రేణుక చౌదరి తిరిగి పోటీ చేయడానికి అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ ఎన్నికల ముందు వచ్చే నేతలకు ఏ మాత్రం ప్రజలు, క్యాడర్ నుంచి ఆదరణ లభిస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/tollywood-hero-sharwanand-engaged-with-rakshita-today-1459358
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల్లో ఒకరైన శర్వానంద్.. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. తాజాగా ఆయన రక్షిత అనే యువతితో నిశ్చితార్థం చేసుకున్నారు. శర్వానంద్, యువతి కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఒకరికొకరు ఉంగరాలు తొడుక్కున్నారు. ఈ వేడుకలో శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్, ఉపాసన పాల్గొని, కాబోయే వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. శర్వానంద్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు కాబోయే భార్య పేరు రక్షిత అని, ఈ అందమైన యువతితో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నా అని శర్వానంద్ ట్వీట్ చేశారు. దాంతో నెటిజన్లంతా.. నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. యువతి విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోందని గతంలో వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందని సమాచారం. తనకు కాబోయే భార్య పేరు రక్షిత అని, ఈ అందమైన యువతితో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నా అని శర్వానంద్ ట్వీట్ చేశారు. "ఒకే ఒక జీవితం" సినిమా తర్వాత.. ఇంతవరకూ శర్వా నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్డేట్ లేదు. బహుశా పెళ్లి తర్వాత కొత్త సినిమా అప్డేట్ ఉండొచ్చని తెలుస్తోంది.👩‍❤️‍👨🥰 pic.twitter.com/tFIoR0MEmc— Sharwanand (@ImSharwanand) January 26, 2023
https://www.telugupost.com/movie-news/నాగ్-తో-ఈ-సారి-శ్రీనివాస-క-24087/
ఈ నెల 10 న భారీ అంచనాల మధ్యన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఓం నమో వెంకటేశాయ చిత్ర ఫలితం అక్కినేని నాగార్జున అభిమానులనే కాక, సామాన్య ప్రేక్షకులని, పరిశ్రమ వర్గాలకి నిరాశ కలిగించింది. అయితే కింగ్ నాగార్జున ఈ రిసల్ట్ పై అప్సెట్ అయినప్పటికీ ప్రస్తుతం తాను ఓంకార్ దర్శకత్వంలో నటిస్తున్న రాజు గారి గది-2 చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. మరో వైపు నిర్మాత దిల్ రాజు అక్కినేని నాగార్జున కోసం ఒక సరికొత్త ఫామిలీ ఎంటర్టైనర్ కథని తయారు చేపించి ఇప్పటికే ఫస్ట్ నేరేషన్ కూడా ఇప్పించారని టాక్. సోగ్గాడే చిన్ని నాయనా వంటి డబల్ బ్లాక్ బస్టర్ ని నాగ్ కి ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ తో బంగారు రాజు అనే చిత్రం ప్లాన్ చేస్తున్న నాగార్జున డేట్స్ ని దిల్ రాజు కబ్జా చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయనకి నాగ్ కోసం సిద్ధం చూపించిన కథపై అంత గురి ఏర్పడిందట.ఈ ఏడాది సంక్రాంతి పండుగకి ఇద్దరు స్టార్ హీరోస్ ప్రతిష్టాత్మక చిత్రాలతో పోటీ పడి కూడా నెగ్గుకు వచ్చి బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్న శతమానం భవతి చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ నాగార్జున కోసం ఈ కథని రచించారు. దొంగల బండి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సతీష్ వేగేశ్న కి తొలి ప్రయత్నం బెడిసి కొట్టటంతో దర్శకుడిగా చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ని బ్రేక్ చేస్తూ దిల్ రాజు శతమానం భవతి తో ఇచ్చిన సదావకాశాన్ని వినియోగించుకుని సూపర్ హిట్ డైరెక్టర్గా నిరూపించుకున్నాడు. దిల్ రాజు నిర్మాణంలోనే తన మూడవ చిత్రం కూడా ఉండబోతుందని ఇప్పటికే ఖరారైనప్పటికీ నాగార్జున అంగీకారం కోసం ఎదురు చూస్తున్నట్టు వినికిడి. ఒకవేళ నాగార్జున ఈ ప్రాజెక్ట్ ని తిరస్కరిస్తే దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎవరితో నిర్మిస్తారో చూడాలి.
https://www.telugupost.com/top-stories/kavita-was-interrogated-by-enforcement-directorate-officials-cm-kcr-is-under-some-tension-for-the-past-three-days-1468282
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగతి భవన్‌కే పరిమితమయ్యారు. తన కుమార్తె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తున్న మూడు రోజులు కేసీఆర్ కొంత టెన్షన్‌లోనే ఉన్నారంటున్నారు. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలను కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను కూడా పట్టించుకోవడం లేదు. కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు వెళుతుంటే ఆమె వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ సంతోష్ లను కూడా పంపారు. కవితకు ధైర్యం చెప్పాలని, ఇలాంటివి రాజకీయాల్లో సర్వ సాధారణమని, ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే నిలబడగలమని కవితకు ఫోన్ లో కూడా చెప్పిపంపినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎంతైనా తండ్రి మనసు కదా. మనసులో బాధను ఎంతటి వారైనా దిగమింగుకోలేరు. ఎవరికీ ఇలాంటి...నిజానికి కేసీఆర్ కుటుంబంలో ఎవరికీ ఇలాంటి అనుభవాలు లేవు. ఉద్యమ సమయంలో కేసులు, జైళ్లు పాలు కావడం మినహా ఇటువంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. కేవలం అవినీతి ఆరోపణలు వచ్చినా అరెస్ట్ వరకూ వెళతారన్న భయమూ ఇంతవరకూ పడలేదు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు చూసి ఆయన కొంత అసహనానికి లోనయినట్లు చెబుతున్నారు. రాజకీయంగా పార్టీకి లాభమైనప్పటికీ కుటుంబ పరంగా క్షోభను అనుభవించాల్సి వస్తుందన్నది ఆయన ఆలోచన. అందునా ఒక ఆడపిల్ల మీద లిక్కర్ స్కామ్ ముద్ర పడటం కూడా కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలా బాధపడలేదని సన్నిహితులతో ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. కేసీఆర్ ఆదేశంతోనే మంత్రులంతా ఢిల్లీకి పయనమయ్యారని చెబుతున్నారు.ఎన్నికలను అసలు లెక్కే...కేసీఆర్ ఎన్నికలను ఎప్పుడూ లెక్క చేయరు. ఆయన వ్యూహాలు కరెక్ట్‌గా అమలవుతాయి. ఎప్పుడు ఏ అస్త్రం ప్రయోగించాలో ఆయనకు కొట్టిన పిండి. రాజకీయాల వ్యూహాలను వేయడంలో ఆయన దిట్ట. బీఆర్ఎస్ ను మూడోసారి కూడా అధికారంలోకి తెచ్చే సత్తా తనకు ఉందని నమ్మకం కలిగిన నేత కేసీఆర్. పొలిటికల్ గేమ్ లో పావులు సులువుగా కదపగలిగిన కేసీఆర్ కవిత ఇష్యూతో కొంత డీలా పడ్డారని సమాచారం. ఎప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్లిన నేతలతో కేసీఆర్ ఫోన్ లో సంప్రదింపులు జరుపుతూనే న్యాయ నిపుణులను ఎవరిని కలుసుకోవాలన్నది కూడా సూచిస్తున్నారు. ఆయన నిరంతరం కవిత ఇష్యూను ఫాలో అప్ చేస్తూనే ఉన్నారని చెబుతున్నారు. ఈ మూడు రోజులు...అందుకే కవిత ఢిల్లీ వెళ్లిన మూడు రోజుల పాటు పూర్తిగా కార్యక్రమాలను వదిలేసినట్లు చెబుతున్నారు. కొంత అన్యమనస్కంగా ఉన్న కేసీఆర్ ను కలిసేందుకు ఉన్నతాధికారులు సయితం వెనకడగు వేశారంటున్నారు. పంట నష్టం వంటి వివరాలపై కూడా ఆయనకు సమాచారం అందించేందుకు అధికారులు జంకినట్లు తెలిపారు. తన కుమార్తె కవిత ఏ తప్పు చేయలేదని, కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని జాతీయ స్థాయి నేతలకు కూడా కేసీఆర్ వివరించినట్లు తెలిసింది. అందుకే తొలిసారి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖను విడుదల చేశారంటున్నారు. మొత్తం మీద మూడు రోజుల విచారణ పూర్తికావడంతో కేసీఆర్ కూడా కొంత టెన్షన్ ఫ్రీ అయ్యారు.
https://www.telugupost.com/movie-news/కుటుంబ-పర్మిషన్-తోనే-వచ్-53045/
చిరంజీవి ఫ్యామిలీ నుండి సినిమాల్లోకి కోకొల్లలుగా హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు.. టెక్నీకల్ గా కూడా పని చేసేవాళ్ళు ఉన్నారు. అందులో చిరంజీవి పెద్ద కూతురు తన తండ్రి చిరు సినిమాలకు అలాగే తమ్ముడు చరణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది. సుష్మిత ఎప్పటినుండో ఈ రంగంలో ఉన్నా కూడా బాగా హైలెట్ అయ్యింది మాత్రం చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 తోనే. ఎందుకంటే ఈ సినిమా కాస్ట్యూమ్స్ విషయంలోనే గొడవ జరిగి ఐటెం సాంగ్ చెయ్యాల్సిన కేథరిన్ ఆ సినిమా నుండి తప్పుకోవడం .. కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత వల్లననే అనే ప్రచారం బాగా జరిగి సుష్మత హైలెట్ అయ్యింది. అసలు సుష్మిత ఈ సినిమా రంగంలోకి ఎలా, ఎందుకు వచ్చిందో అనే విషయాన్నీ ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. గతంలోనే అంటే సుష్మిత తన తండ్రి ఇంద్ర సినిమా చేసినప్పుడే ఆమె ఈ రంగంలోకి కాస్ట్యూమ్ డిజైనర్ గా అడుగుపెట్టింది. అప్పటినుండి అందరివాడు, శంకర్ దాదా చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సుష్మిత తర్వాత పిల్లలు పుట్టడంతో గ్యాప్ తీసుకుని మళ్ళీ ఖైదీ నెంబర్ 150 కి, తన తమ్ముడు చరణ్ చేసిన ధృవ సినిమాలకు పూర్తిస్థాయి కాస్ట్యూమ్ డిజైనర్ గా మారిందట. అయితే అలా పిల్లలు ఒక స్టేజ్ కి వచ్చాక మళ్ళీ ఈ రంగంలోకి కొనసాగే క్రమంలో తన అత్తామామలు, భర్త పర్మిషన్ తీసుకునే మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యిందట.ఖైదీ నెంబర్ 150 సినిమాకి చరణ్... నాన్నకి డిజైనర్ గా చెయ్యమని అడిగినప్పటికే ముంబై నుండి వచ్చిన షబీనా ఖాన్ అనే హై ప్రొఫైల్ డిజైనర్ ఉన్నపటికీ ఆమెకి నాన్న డ్రెస్సింగ్ స్టైల్ గురించిన అవగాహన తక్కువ ఉండడంతో మళ్లీ నేనే కాస్ట్యూమ్ డిజైనర్ గా చెయ్యాల్సి వచ్చింది అని చెబుతున్న చిరు పెద్ద కూతురు సుష్మిత ఇప్పుడు సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో వస్తున్న రంగస్థలం మూవీ కి కూడా రామ్ చరణ్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. అలా రంగస్థలంలో షూటింగ్ లో దిగిన చరణ్, సుష్మితల పిక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.
https://www.telugupost.com/movie-news/payal-rajputh-movie-career-122784/
ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజపుట్.. ఆ సినిమా హిట్ తో తెగ బిజీ అవుతుంది అనుకుంటే… ఎక్కడా పాయల్ పేరు కూడా వినబడలేదు. అదిగో పాయల్ ఆ సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమా లో నటిస్తుందని రూమర్స్ తప్ప పాయల్ రాజపుట్ కి అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలు లేదు. హాట్ హీరోయిన్ కి యంగ్ హీరోలు అవకాశమివ్వకపోయినా… సీనియర్ హీరోలు పిలిచి అవకాశాలిస్తున్నారు. ఇప్పటికే వెంకీమామలో వెంకటేష్ సరసన నటిస్తున్న ఈ హీరోయిన్ కి మన్మధుడు 2లో అవకాశం వచ్చినట్టే వచ్చి పోయింది. ఆ అవకాశం రకుల్ తన్నుకుపోయింది. ఇక బాలకృష్ణ సరసన పాయల్ అన్నారు కానీ కంఫర్మేషన్ లేదు. ఆ పాట ఎందుకు ఒప్పుకుందో..? తాజాగా పాయల్ రాజపుట్ స్పెషల్ సాంగ్ చేసిన సీత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీత సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాలేదు. ఈ సినిమాలో పాయల్ బుల్ రెడ్డి అనే స్పెషల్ సాంగ్ లో గ్లామర్ ఒలకబోస్తూ చిందులేసింది. కానీ సీత సినిమాలో ఆ సాంగ్ ఎందుకు పెట్టారో కూడా అర్ధం కాదు. పాయల్ ఎందుకు ఈ సాంగ్ ఒప్పుకుందో తెలియదు. అధిక పారితోషకం ఇస్తాను అన్నారేమో అందుకే పాయల్ ఆలా టెంప్ట్ అయ్యిందిలే అని సోషల్ మీడియాలో పాయల్ పై సెటైర్స్ పడుతున్నాయి. ఏదో సీత సినిమా హిట్ అయినా బాగుండేది. కాస్తో కూస్తో పాయల్ కి పేరొచ్చేది. పాపం పాయల్ రాజపుట్. కేవలం సీనియర్ హీరోల దృష్టిలో పడుతూ స్పెషల్ సాంగ్స్ అయినా చేసుకుందామంటే అది వర్కౌట్ అవలేదు.
https://www.telugupost.com/crime/custody-of-minors-including-saduddin-malik-in-the-jubilee-hills-gangrape-case-ended-today-1374087
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సాదుద్దీన్ మాలిక్ తో సహా మైనర్ల కస్టడీ నేటితో ముగిసింది. కస్టడీలో అనేక విషయాలను పోలీసులు రాబట్టినట్లు తెలిసింది. కార్పొరేటర్ కుమారుడు ప్రోత్సహించడం వల్లనే బాలికపై అత్యాచారం చేశామని పోలీసులకు మైనర్లు చెప్పినట్లు తెలిసింది. మైనర్లకు బెంజ్ కారు ఇచ్చిన ఎమ్మెల్యే కుమార్తెపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బెంజ్ కారు నడిపిన మైనర్ కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశారు.వీడియో షూట్ చేసిన..మరోవైపు ఇన్నోవా కారును వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కు ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి వాహనాన్ని కేటాయించలేదని పోలీసులు చెబుతున్నారు. ఆయన సొంత కారుపైనే గవర్న్‌మెంట్ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారన్నారు. ఇంటి నుంచి మాత్రం డ్రైవర్ ఇన్నోవా కారును పబ్ కు తీసుకెళ్లాడని తేల్చారు. కాన్సో బేకరీ వద్ద డ్రైవర్ ను దింపేసి మైనర్లు ఇన్నోవా కారును తీసుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు. వీడియో షూట్ చేసిన మైనర్ పై మిగిలిన నిందితులు ఆగ్రహం వ్యక్తం చేశారని, వీడియో షూట్ వల్లనే కేసుల్లో చిక్కుకున్నామని మిగిలిన నిందితులు అతనిపై చేయి చేసుకున్నారని కూడా పోలీసులు చెబుతున్నారు.
https://www.telugupost.com/top-stories/top-bjp-leaders-are-planning-to-expand-the-cabinet-to-limit-the-congress-party-to-himachal-pradesh-alone-1455155
ఎన్నికలు వస్తున్నప్పుడు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగడం మామూలే. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలకు ముందు కూడా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఆ రాష్ట్రంలో కొందరికి సామాజికవర్గాలకు అనుగుణంగా కేబినెట్ లో చోటు కల్పించారు. వచ్చే ఏడాది కర్ణాటకతో పాటు, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు సంబంధించిన వారికి కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించాలన్న ఉద్దేశ్యంతో పార్టీ హైకమాండ్ ఉంది. కాంగ్రెస్ పార్టీని ఒక్క హిమాచల్ ప్రదేశ్ కే పరిమితం చేసేలా మంత్రి వర్గ విస్తరణను బీజేపీ అగ్రనేతలు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.ఈ నాలుగు రాష్ట్రాల్లో...మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ లలో గత ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయింది. అయితే మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కొందరు ఎమ్మెల్యేలు రావడంతో తిరిగి ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వాన్ని స్థాపించగలిగారు. మధ్యప్రదేశ్ లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంది. రాజస్థాన్ లో ప్రస్తుతం బీజేపీకి ఆశలున్నాయి. ఆ రాష‌్ట్ర సంప్రదాయం ప్రకారం ఒకసారి గెలిచిన పార్టీ మరొక సారి గెలిచే అవకాశం లేదు. కర్ణాటకతో పాటు...ఛత్తీస్‌ఘడ్ లోనూ ఈసారి గెలవాల్సిన అవసరం ఉంది. మూడు రాష్ట్రాలను కైవసం చేసుకోగలిగితే కాంగ్రెస్ ను దేశంలో ఎక్కడా అధికారంలో లేకుండా చేయవచ్చన్న ఆలోచనతో బీజేపీ హైకమాండ్ ఉంది. ఇటీవల గెలిచిన హిమాచల్ ప్రదేశ్ తప్పించి ఈ మూడు కోల్పోతే రాష‌్ట్రంలో ఎక్కడా కాంగ్రెస్ అధికారంలో ఉండదు. కర్ణాటకలో కూడా అంతే. కాంగ్రెస్, జేడీఎస్ కూటమితో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి రాగలిగింది. మరోసారి కర్ణాటకలోనూ అధికారంలోకి రావాలనుకుంటుంది.సీనియర్లను కూడా పక్కన పెట్టి...ఇలా కాంగ్రెస్ ను పూర్తిగా వాష్ అవుట్ చేయాలంటే మంత్రి వర్గ విస్తరణ తప్పదని బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది. అందుకోసమే ఈ నాలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రి మండలిలో అధిక ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే అగ్రనేతలు కసరత్తులు ప్రారంభించారని చెబుతున్నారు. సామాజికవర్గాల వారీగా, ఎన్నికలకు ఉపయోగపడేలా విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత విస్తరణ ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విస్తరణలో కొందరు సీనియర్లను కూడా పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనితీరు ఆధారంగా కొందరిని తప్పించనున్నారని తెలిసింది. గత ఏడాది జులైన మంత్రివర్గ విస్తరణ జరిగింది. అప్పుడు కూడా సీనియర్లను పక్కన పెట్టారు. 2024 ఎన్నికలకు కొత్త టీంను ఈ విస్తరణ ద్వారా ఎంపిక చేయనున్నారని చెబుతున్నారు.
https://www.telugupost.com/movie-news/dil-raju-film-hit-talk-105720/
దిల్ రాజు బ్యానర్ సినిమాలు చేస్తే తమకి హిట్ రావడం ఖాయమని.. చాలా మంది యంగ్ ప్లాప్ హీరోలు గత ఏడాది దిల్ రోజునే నమ్ముకుని సినిమాలు చేశారు. మరి వాళ్ల బ్యాడ్ లక్ దిల్ రాజుకి అంటుకుందో.. లేదంటే… డైరెక్టర్స్ బ్యాడ్ లక్కో లేదా దిల్ రాజుకి టైం బాలేకనో కానీ… దిల్ రాజు నిర్మాణంలో కుర్ర హీరోలు నటించిన సినిమాలన్ని దెబ్బేసాయి. నితిన్, రామ్, రాజ్ తరుణ్.. ఇలా ఏ హీరో చూసినా దిల్ రాజుకి ప్లాపులే అంటగట్టారు. అయితే హీరోల మాట ఎలా ఉన్నా.. దిల్ రాజు మాత్రం వారేదో ప్లాప్స్ లో ఉన్నారు.. వారికి హిట్ ఇవ్వడానికే వారి కోసమే సినిమా చేసానని.. దిల్ రాజు ఆయా హీరోల సినిమా ఈవెంట్స్ లో గొప్పగా మాట్లాడాడు. కానీ దిల్ రాజు గొప్పలు ఆయా హీరోల సినిమాలు ఫ్లాప్ అవడంతో గాలి తీసేసినట్లు అయ్యింది. ఏడాది మొదట్లోనే హిట్… రాజ్ తరుణ్ లవర్ తో… నితిన్ శ్రీనివాస కళ్యాణంతో, రామ్ హలో గురు ప్రేమ కోసమే చిత్రాలు దిల్ రాజుని బాగా దెబ్బతీశాయి. మరి కుర్ర హీరోలు ఫ్లాపులిస్తే ఏమిటి… ఇప్పుడు సీనియర్ హీరో దిల్ రాజుకి మంచి హిట్ అందించాడు. కుర్ర హీరో వరుణ్ తేజ్ – సీనియర్ హీరో వెంకటేష్ కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా ఈ శనివారం విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. వరుణ్ కామెడీ కన్నా ఎక్కువగా.. వెంకటేష్ కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారనేది ఎఫ్ 2 టాక్ తోనే తెలుస్తుంది. ఎఫ్ 2 సినిమాకి ప్రేక్షకులు, రివ్యూ రైటర్స్ నుండి పాజిటివ్ మార్కులు పడ్డాయి. అందులోనూ వెంకీ కామెడీ టైమింగ్ కి ప్రేక్షకుడు ఫిదా అంటున్నారు. ఈ ఏడాది మొదట్లోనే దిల్ రాజుకి ఎఫ్ 2తో వెంకటేష్ మంచి హిట్ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది ఎఫ్ 2తో హిట్ అందుకున్న దిల్ రాజు.. మహెష్ తో చేస్తున్న మహర్షి సినిమాతో కూడా హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు.
https://www.telugupost.com/movie-news/అక్కడ-కూడా-భారీగా-కొల్లగ-35441/
తమిళనాడు లో రజినీకాంత్ తర్వాత అత్యంత ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న స్టార్ అజిత్. అజిత్ సినిమాలంటే అభిమానులకు పిచ్చ క్రేజ్. తాజాగా 'వీరం’ ఫేమ్ శివ డైరెక్ట్ డైరెక్షన్ లో అజిత్ నటిస్తున్న 'వివేగం' చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఈ చిత్రంలో అజిత్ కి జోడిగా కాజల్ నటిస్తుంది. ఇప్పటికే 'వివేగం' టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేసింది. అలాగే 'వివేగం' ఫస్ట్ సింగిల్ 'సుర్వివ' కూడా యూట్యూబ్ రికార్డులను బద్దలుకొడుతుంది. అయితే అజిత్ కి తమిళంతోపాటే తెలుగులోనూ మంచి మార్కెట్ వుంది. అందుకే తమిళంలో తన సినిమాలన్నీ తెలుగులో డబ్బింగ్ చేస్తూ మార్కెట్ ని పెంచుకున్నాడు. అయితే ఇప్పుడు అజిత్ మరో రాష్ట్రం మార్కెట్ పై కూడా కన్నేశాడట. తమిళనాట కాకూండా ఇతర రాష్ట్రాల్లో తన సినిమా మార్కెట్ ని విస్తరించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడట. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా నటిస్తున్న 'వివేగం' చిత్రంతోనే ఆ పనిని అజిత్ స్టార్ట్ చేసేసాడట. ప్రస్తతం 'వివేగం 'చిత్రాన్ని కేరళలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ములకుప్పడం ఫిలిమ్స్ సుమారు నాలుగు కోట్ల రూపాయలకు హక్కులను కొనుగోలు చేసింది.మరి కేరళలో సినిమా ని విడుదలచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న చిత్ర యూనిట్ ఆ రాష్ట్రంలో 'వివేగం' కి సంబందించిన పబ్లిసిటీని కూడా భారీ లెవల్లో చెయ్యాలని చూస్తుందట. 'వివేగం' ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహించి మంచి ఓపెనింగ్స్ రాబట్టాలని చూస్తుందట. ఇక దీంతో కేరళలో అజిత్ మార్కెట్ఇదివరకటి కంటే మెరుగయ్యే అవకాశముంటుందని సినీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక 'వివేగం' చిత్రం ఆగష్టు 10 న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు .
https://www.telugupost.com/movie-news/ఢీలా-పడ్డ-మెగా-ప్రిన్సెస-5533/
మెగా బ్రదర్స్ లో మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ తాను సంపాదించుకునే ప్రయత్నం ఎప్పుడూ కొణిదల నాగ బాబు చెయ్యలేదు. కానీ తన వారసులకు మెగా అభిమానుల అండ ఉండాలని మాత్రం మొదటి నుంచి శ్రమిస్తూనే ఉన్నారు. అయితే నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ మెగా అభిమానుల వ్యక్తిగత అంచనాలకు విరుద్ధంగా కంచె వంటి గొప్ప చిత్రంలో నటించి రెండవ చిత్రానికే ఎనలేని కీర్తి సంపాదించాడు. ఆ చిత్రం వరుణ్ తేజ్ ని అగ్ర హీరోల జాబితాకు ఎక్కించకపోయినా విమర్శకుల దగ్గర వరుణ్ కి మంచి మార్కులనే సాధించి పెట్టింది.ఇక నాగ బాబు దిగులాల్లా ఆయన కుమార్తె నిహారిక కొణిదల విషయం లోనే. బుల్లి తెర పై వయోక్త గా అనతి కాలం లోనే గొప్ప స్థానం సంపాదించుకున్న నిహారికకు సినిమా మోజు ఉండటంతో వెండి తెర పై మెరిసే అవకాశాలు ఎన్ని వచ్చినా జల్లడ పట్టి మరీ ఒక మనసు చిత్రాన్ని ఎంచుకుంది కొణిదల కుటుంబం. మాస్ ఎలెమెంట్స్ ఉన్న కథ అయితే విజయవంతమైనా హీరో మరియు దర్శకులకే పేరు వస్తుంది అని, కాబట్టి మెగా ప్రిన్సెస్ కి పరిచయ చిత్రంగా ఒక మనసు సరైన చిత్రం అని భావించారు నాగ బాబు. ఆ చిత్ర చిత్రీకరణ సమయంలోనే అనేక అవకాశాలు నిహారికకు వెల్లువెత్తటంతో వాటిలో కొన్ని చిత్రాలకు సంతకం చేసింది.కానీ ఒక మనసు ఘోర పరాభవంతో నిహారిక తో ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలు అందరూ ఇప్పుడు మొఖం చాటేస్తున్నారు. దాంతో నిహారికకు అటు బుల్లి తెర అవకాశాలు తగ్గి, ఇటు వెండి తెర అవకాశాలు లేక ఢీలా పడిపోయింది అంట పాపం.
https://www.telugupost.com/movie-news/samantha-akkineni-to-replace-nayanatara-in-a-tamil-movie-126643/
నయనతార కోలీవుడ్ లో లేడి సూపర్ స్టార్ రేంజ్ లో దూసుకుపోతుంది. పెళ్లి అనే పదాన్ని దగ్గరకి రాకుండా… ప్రియుడు విగ్నేష్ శివన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా ఈ భామ అటు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తోనూ, ఇటు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గాను, మరోపక్క కోలీవుడ్ కుర్ర హీరోలకు నయన్ బెస్ట్ ఆప్షన్ గా ఉంది. ఆ రేంజ్ లో సినిమాలు చేస్తున్న నయనతార ని స్టార్ హీరోలతో పోలుస్తూ లేడి సూపర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేసారు. అటు గ్లామర్ గాను, ఇటు నటన పరంగాను నయనతారే నెంబర్ వన్ అన్న రేంజ్ లో ఉంది ఆమె చేసే సినిమాలు చూస్తుంటే. నయనతార లా ఇప్పుడు టాలీవడ్ హీరోయిన్ సమంత కూడా లేడి ఒరింటెడ్ మూవీస్ తో దూసుకుపోతుంది. నయనతార గతంలో తమిళంలో అరామ్ అనే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో నటించింది. ఆసినిమాలో కలెక్టర్ పాత్రలో నయనతార నటన సింప్లి సూపర్బ్. దర్శకుడు గోపి నైనార్ తెరకేకించిన ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అదే చిత్రం తెలుగులో కర్తవ్యమ్ పేరుతొ విడుదలై హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయాలనుకున్నది గోపి నైనార్. అయితే ఈ సినిమాలో నయన్ నటించే ఛాన్స్ లేదట. ఎందుకంటే నయనతార ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్తోనూ, అలాగే మరో రెండు సినిమాల్తో బిజీగా ఉండడంతో.. నయన్ ప్లేస్ లోకి ప్రస్తుతం టాప్ క్రేజ్ ఉన్న సమంత ని తీసుకుందామని ఆలోచనలో గోపి నైనార్ ఉన్నట్లుగా సమాచారం. ఎలాగూ సమంత కి కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉండడంతో… అరామ్ సీక్వెల్ కి సమంతానే ఫైనల్ చేసే యోచనలో దర్శకుడు ఉన్నట్లుగా తెలుస్తుంది.
https://www.telugupost.com/crime/worst-incident-happened-in-nalgonda-district-father-who-poisoned-two-children-committed-suicide-1345273
నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులకు విషమిచ్చిన తండ్రి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా దామచరల్ల మండలం నూనావత్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నూనావత్ తండాకు చెందిన కిషన్ నాయక్ వ్యవసాయం చేస్తుండే వాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. అయితే గత కొద్ది రోజులుగా కుటుంబంలో మనస్పర్థలు తలెత్తాయి. భార్యతో విభేదాలు చోటు చేసుకున్నాయి.కుటుంబ కలహాలు.....దీంతో కిషన్ నాయక్ తన ఇద్దరు కొడుకులు హర్షవర్థన్ (8), అఖిల్ (6) లకు విషమిచ్చాడు. అభం శుభం తెలియని చిన్నారులు తండ్రి ఇచ్చిన కూల్ డ్రింక్ తాగి మరణించారు. అనంతరం కిషన్ నాయక్ కూడా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుటుంబ కలహాలతోనే కిషన్ నాయక్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/95th-oscar-awards-function-starts-with-natu-natu-song-in-america-1466682
95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక ఈరోజు ఉదయం 5.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) అట్టహాసంగా ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ వేడుక ఆరంభమైంది. ఈ వేడుక మన తెలుగు పాటతో మొదలవ్వడం చెప్పుకోదగిన విషయం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కోసం వేచి చూస్తున్న RRR నాటు నాటు పాటను సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ విశ్వవేదికపై ఆలపించారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరచగా.. యావత్ ప్రపంచాన్నీ ఈ పాట ఉర్రూతలూగించింది.ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో ఎన్టీఆర్- రామ్ చరణ్ కలిసి వేసి స్టెప్పులు అందరినీ ఓ ఊపు ఊపేశాయి. ఆస్కార్ ఈవెంట్ ని మొదలు పెడుతూ హోస్ట్ గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్ ఆస్కార్ గురించి మాట్లాడిన తరువాత ప్రోగ్రామ్ మొదలయ్యే ముందు స్టేజి పై మరికొందరు డాన్సర్స్ నాటు నాటు స్టెప్పు వేశాడు. దీంతో నాటు నాటు తో ఆస్కార్ వేడుక మొదలైంది. విశ్వవేదికపై తెలుగు పాటకు ఇంతటి గౌరవాన్ని కలిగించినందుకు గాను రాజమౌళి అండ్ టీమ్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక ఈ పాటకు ఆస్కార్ వస్తుందా లేదా అనేది మరికొద్దిసేపటిలో తేలనుంది..@jimmykimmel ❤️‍🔥❤️‍🔥❤️‍🔥 #Oscars95 #Oscars #RRRMovie #NaatuNaatu pic.twitter.com/FoITckdJBa— RRR Movie (@RRRMovie) March 13, 2023
https://www.telugupost.com/movie-news/ధ్రువ-వరల్డ్-వైడ్-క్లోసి-19369/
ప్రాంతం షేర్ (కోట్ల లో)నైజాం 15.35సీడెడ్ 6.60వైజాగ్ 5.25ఈస్ట్ గోదావరి 3.10వెస్ట్ గోదావరి 2 .60క్రిష్ణ 2 .90గుంటూరు 3.40నెల్లూరు 1.35కర్ణాటక 6 .80ఓవర్ సీస్ 6.95రెస్ట్ ఆఫ్ ఇండియా 1 .20వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్ 55.50
https://www.telugupost.com/movie-news/అస్సలు-రెస్ట్-లేకుండా-48232/
పూరి జగన్నాధ్ బాలకృష్ణతో తీసిన పైసా వసూల్ చిత్రం తేడా కొట్టినప్పటికీ... ఏమాత్రం లేట్ చెయ్యకుండా తన కొడుకు ఆకాష్ ను హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో బాగా బిజీగా వున్నాడు. తన కొడుకుని హీరోగా పెట్టి పూరి జగన్నాథ్ 'మెహబూబా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ని చాలా స్పీడు గా కానిచ్చేస్తున్నారు పూరి. మొన్నటివరకు గడ్డకట్టే చలిలో హిమాచల్ ప్రదేశ్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. 'మెహబూబా' సినిమా అక్కడే ప్రారంభమై... అక్కడే మొదటి షెడ్యూల్ లో భాగంగా చాలా సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంది.ఇక ఇప్పుడు 'మెహబూబా' యూనిట్ మొత్తం హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ షెడ్యూల్ కు ప్యాకప్ చెప్పేసి.. అక్కడినుండి పంజాబ్ కు బయలుదేరింది. మొదటి షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న చిత్ర బృందం కూసింత రెస్ట్ కూడా తీసుకోకుండా వెంటనే పంజాబ్ లో వాలిపోయింది. పంజాబ్, పాకిస్థాన్ బోర్డర్ లో 'మెహబూబా' సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. 1971 ఇండోపాక్ యుద్ధం నేపథ్యంలో మెహబూబా సినిమా పూరి జగన్నాధ్ తన సొంత బ్యానర్ పై పూరి జగన్నాధ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఈ చిత్రంలో ఆకాష్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నాడు
https://www.telugupost.com/crime/three-married-womens-dies-in-hyderabad-within-24-hours-1476660
కడదాకా తోడుంటానని మాటిచ్చి మనువాడినోళ్లే.. కట్టుకున్న భార్యల పాలిట కాలయముళ్లయ్యారు. భాగ్య నగరంలో 24 గంటల్లో వేర్వేరు ఘటనలు కలకలం సృష్టించాయి. ఎస్సార్ నగర్ పీఎస్ పరిధిలో ఓ భర్త భార్యను చంపి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేపీహెచ్ బీలో ఒకరు, కొందుర్గులో మరొక వివాహిత భర్త దాష్టీకానికి బలయ్యారు.వివరాల్లోకి వెళ్తే..ఎల్లారెడ్డిగూడకు చెందిన ఆగమయ్య కుమారుడు జనార్థన్ (40) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూముకుంటకు చెందిన ప్రేమలత (35)తో 2004లో వివాహమైంది. వీరికి కుమారుడు బాలాజీ (17) కుమార్తె లిఖిత (16) ఉన్నారు. ప్రేమలత కూకట్ పల్లిలోని ఓ డెంటల్ క్లీనిక్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. భర్త జనార్థన్ ఏ పనీ చేయకుండా మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రేమలత తల్లిదండ్రులు లక్ష్మి, యాదయ్యల పెళ్లిరోజు వేడుక సోమవారం మే(15) తూముకుంటలో జరిగింది. ఈ వేడుకకు దంపతులిద్దరూ హాజరయ్యారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలిద్దరినీ అమ్మమ్మ ఇంటివద్దే వదిలి తిరిగి ఇంటికి వచ్చారు.మంగళవారం ఎంత పొద్దెక్కినా తలుపులు తీయకపోవడంతో.. జనార్థన్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గొళ్లెం బద్దలుకొట్టి చూడగా.. ప్రేమలతో నోట్లో గుడ్డకుక్కి రక్తపుమడుగులో పడి కనిపించింది. జనార్థన్ సీలింగ్ ఫ్యాన్ ఉరికి వేలాడుతూ ఉన్నాడు. భార్యను ఇనుపరాడ్ తో మోది చంపి ఆపై తాను కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సార్ నగర్ పోలీసులు నిర్థారించారు.రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం బూసిరెడ్డిపల్లికి చెందిన సాధిక్ అలీ(37)కి మూసాపేటకు చెందిన మున్నీబేగం (35)తో 17 ఏళ్లక్రితం వివాహమైంది. వీరికి 15,9 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలున్నారు. వారి ఆలనా పాలనా మున్నీబేగం తల్లిదండ్రులే చూస్తున్నారు. పిల్లలిద్దరూ అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. మున్నీబేగం, సాధిక్ లు ఫోరం మాల్ ఎదురుగా ఉన్న వంతెన కింద నివాసముంటున్నారు. మద్యానికి బానిసైన అతడు సోమవారం రాత్రి 7 గంటలకు మున్నీతో గొడవ పడ్డాడు. 9 గంటల సమయంలో ఒక రాయితో మున్నీబేగం తల, ముక్కుపై కొట్టి గాయపరచగా.. స్థానిక ఆటోడ్రైవర్లు ఆమెను రాందేవ్ రావు ఆస్పత్రికి తరలించారు. కానీ మున్నీ అప్పటికే మరణించడంతో.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.రంగారెడ్డిజిల్లా కొందుర్గు మండల కేంద్రానికి చెందిన జాల వెంకటయ్య కుమార్తె మమత (30)ను 2008లో అదే గ్రామానికి చెందిన సున్నాల యాదయ్యకు ఇచ్చి పెద్దలు వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు సంతానం. యాదయ్య కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా దురలవాట్లకు బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ భార్యతో గొడవ పడుతూ మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. సోమవారం కూడా గొడవ పడ్డాడు. మంగళవారం మమత మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులకు సమాచారం రావడంతో.. వారు మమత శరీర భాగాలపై గాయాలున్నట్లు గుర్తించారు. భర్త ఆమె విద్యుద్ఘాతానికి గురై మరణించిందని నమ్మబలికాడు. కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/mega-fans-vinaya-vidheya-rama-2019-99714/
దాదాపు దశాబ్దం పాటు సినిమాలకి దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150 ' తో రీఎంట్రీ ఇచ్చి తన అభిమానుల్లో మునుపటి ఉత్తేజాన్ని నింపారు. ఆ తరువాత వెంటనే లేట్ చేయకుండా 'సైరా' ను స్టార్ట్ చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు మెగా అభిమానులు. మొదట ఈ సినిమాను వచ్చే ఏడాది 2019 సమ్మర్ లో రిలీజ్ అనుకున్నారు. కానీ అప్పుడు వచ్చే సూచనలు కనిపించడం లేదు. 2019 దసరాకు వచ్చే అవకాశముందని తెలుస్తుంది.2020 సంక్రాంతికేనా..?అయితే నిర్మాత రామ్ చరణ్ మాత్రం బడ్జెట్ ను పెంచుకుంటూ పోతున్నాడని.. ఎక్కడా కంప్రమైజ్ కాకుండా తీయాలని... రిలీజ్ డేట్ విషయం పట్టించుకోకుండా పని చేయాలని డైరెక్టర్ కి చెప్పాడట. దాంతో ఈ సినిమాకు డెడ్ లైన్ ఏమీ పెట్టకుండా కావాల్సినంత సమయం తీసుకొమ్మని దర్శకుడు సురేందర్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా 2019 దసరాకి కూడా కాదు 2020 సంక్రాంతి వచ్చే అవకాశం ఉందని సమాచారం.మెగా ఫ్యాన్స్ కి నిరాశే...మరోపక్క రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో #RRR లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అదే ఏడాది అంటే 2020 సమ్మర్ లో వస్తుందని ముందుగానే అనౌన్స్ చేసారు. కాబట్టి 2019లో మెగా ఫ్యాన్స్ కు రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ' తప్ప ఇంకో సినిమా లేదన్న మాట మరింత నిరాశకు గురి చేస్తోంది. అల్లు అర్జున్ ఇంకా తన నెక్స్ట్ సినిమాను కంఫర్మ్ చేయలేదు.
https://www.telugupost.com/movie-news/savyasachi-postpone-reason-78710/
ప్రస్తుతం నాగ చైతన్య రెండు సినిమాలతో మన ముందుకు వస్తున్న‌ సంగతి తెలిసిందే. చందూ మొండేటి డైరెక్షన్ లో ‘సవ్యసాచి’ అనే ఒక సినిమా, ఇంకోటి మారుతీ డైరెక్షన్ ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈ రెండు సినిమాలు వచ్చే నెలలోనే రిలీజ్ అవుతున్నాయి అని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.రెండు సినిమాలు వ‌ద్ద‌ని...అయితే తాజా సమాచారం ప్రకారం ‘సవ్యసాచి’ విడుదల వాయిదా పడినట్లుగా సమాచారం వస్తుంది. గ్రాఫిక్స్ పనుల కారణంగా ఆగష్టు రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు చిత్ర నిర్మాతలు. అదే నెల 31న చైతు ఇంకో సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’ కూడా రిలీజ్ ఉండటంతో..‘సవ్యసాచి’ ని వాయిదా వేయమని కోరారట నాగార్జున. అందుకు ఆ చిత్ర సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. మరి సెప్టెంబర్ లో నాగ్, నానిలు నటిస్తున్న’దేవదాస్ ‘చిత్రం ఉంది. సెప్టెంబ‌ర్ విడుద‌ల‌కు నాగ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఈ సినిమాపై క్లారిటీ వస్తే ‘సవ్యసాచి’ పై క్లారిటీ వస్తుంది. చూద్దాం నాగ్ ఏం చేస్తాడో.
https://www.telugupost.com/movie-news/top-heroines-in-tollywood-135380/
మన టాలీవుడ్ లో హీరోయిన్స్ కి పెద్ద కొరత ఏమి ఉండదు. కావాల్సినంత మంది ఉన్నారు. కాకపోతే చాలా తక్కువ మంది క్లిక్ అవుతున్నారు. వారిలో ఈ మధ్య ఎక్కువగా క్లిక్ అయిన హీరోయిన్స్ రాశిఖన్నా, రష్మిక, పూజా హెగ్డే. ప్రస్తుతం వీరికి చేతి నిండా సినిమాలే. సమంత, అనుష్క సెలెక్టెడ్ సినిమాలు చేయడంతో వీరికి ఆఫర్స్ వస్తున్నాయి. అలానే తమన్నా, రెజినా ఓల్డ్ అయిపోవడంతో వీరికి ఇంకా ప్లస్ అయింది. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాతో పాటు అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ వస్తున్న సినిమా, అలానే ప్రభాస్ తో జాన్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ తో వాల్మీకి చేసి మంచి సక్సెస్ అందుకుంది. సరినీకెవ్వరూ లో….. రష్మిక కూడా మహేష్ సరిలేరు నీకెవ్వరూ, నితిన్ భీష్మ, అల్లు అర్జున్ – సుకుమార్ సినిమాలో నటిస్తూ బాగా బిజీగా వుంది. ఇక రాశి ఖన్నా కూడా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో వెంకీమామ తో పాటు సాయిధరమ్ తేజ్ సరసన ప్రతిరోజూ పండగే, విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూడు సినిమాలే కాదు తమిళంలో కూడా 2 సినిమాలు కమిట్ అయ్యి ఖాళీ లేకుండా గడిపేస్తుంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా వీరిద్దరికి సినిమా అవకాశాలు రావడం విశేషం.
https://www.telugupost.com/movie-news/prabhas-fans-requests-for-prashant-180335/
తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాతో కనబడకుండా పోయిన శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. తర్వాత పెళ్లి పెళ్లి అంటూ బ్రేకప్ చేసుకుని సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ రవితేజ క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. పవన్ వకీల్ సాబ్ సినిమాలో నటించింది. అయితే శృతి హాసన్ రీసెంట్ లుక్స్ పై రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో రేజ్ అవుతున్న తరుణంలో ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రభాస్ – నాగ శ్విన్ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా ఎంపిక కాగా.. ఆదిపురుష్ లో ప్రభాస్ పాత్ర కి హీరోయిన్ వేటలో ఉంది ఆదిపురుష్ బృందం.అయితే ఇప్పుడు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ మూవీ చేస్తున్న ప్రభాస్ కోసం సలార్ డైరెక్టర్ శృతి హాసన్ ని సంప్రదించబోతున్నారట. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. అయితే హీరోయిన్ కేరెక్టర్ కి అంతగా నిడివి లేకపోయినా.. హీరోయిన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతుంది. అలాగే శృతి హాసన్ ఇంతవరకు అలాంటి పాత్ర టచ్ కూడా చెయ్యని కారణమగానే ప్రభాస్ – శృతి జోడి బావుంటుంది అని ప్రశాంత్ నీల్ ఆలోచనగా చెబుతుంటే.. మాకొద్దు ఈ ప్లాప్ హీరోయిన్ అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. చిన్న పాత్రైనా క్రేజీ హీరోయిన్ తో చేయించండి కానీ.. శృతి హాసన్ వద్దు అంటూ ప్రశాంత్ నీల్ కి ప్రభాస్ ఫాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారట.
https://www.telugupost.com/crime/google-engineer-ends-his-life-jumps-to-his-death-from-office-building-in-nyc-1475124
గూగుల్ ప్రధాన కార్యాలయం పై నుండి దూకి యువ టెక్కీ ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్ నగరంలో ఈ ఘటన జరిగింది. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(31) 14వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం (మే 4) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గూగుల్ ప్రధాన కార్యాలయం వద్ద ఓ వ్యక్తి అచేతనంగా పడి ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.నేలపై పడి ఉన్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గూగుల్ కార్యాలయం 14వ అంతస్తు అంచుపై టెకీ చేతి వేలి ముద్రలు లభించడంతో అతడు బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కొద్ది నెలల క్రితం కూడా ఓ గూగుల్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రాట్ (33) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకున్నాడు. వరుసగా గూగుల్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో.. అందుకు కారణం ఏమై ఉంటుందోనన్న చర్చ మొదలైంది.
https://www.telugupost.com/movie-news/drishyam-sequel-162620/
మలయాళంలో మోహన్ లాల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన దృశ్యం సినిమా అక్కడ దాదాపుగా 50 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. దానితో తెలుగులోనే కాదు.. ఆ సినిమాని తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ చేసారు. తెలుగులో వెంకటేష్ దృశ్యం రీమేక్ చేస్తే… తమిళంలో కమల్ హాసన్ రీమేక్ చేసాడు. ఇక హిందీలో అజయ్ దేవగన్ దృశ్యం రీమేక్ చేస్తే.. అన్ని భాషల్లోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు మలయాళంలో దృశ్యం సీక్వెల్ అంటూ వార్తలు రావడం మాత్రమే కాదు.. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే అక్కడ ఆ సినిమా సీక్వెల్ రావడమే.. ఇక్కడ వెంకీ ఆ సినిమా ని రీమేక్ చేస్తాడని అంటున్నాడు. అసలే రీమేక్ రాజా.. అందులోను దృశ్యం తో బంపర్ హిట్ కొట్టాడు. అలాంటిది దాని సీక్వెల్ మాత్రం వదులుతాడా అని అంటున్నారు. అయితే దృశ్యం సీక్వెల్ దృశ్యం సినిమా ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడ నుండే దాని సీక్వెల్ మొదలు కాబోతుందట. కేసు క్లోజ్ అయ్యింది అనుకున్న కేసును మళ్లీ ఓ స్పెషల్ పోలీస్ అధికారి తిరగదోడడంతో హీరో చిక్కుల్లో పడే నేపథ్యంలో ఈ దృశ్యం సీక్వెల్ కథ నడుస్తుందని మలయాళ దర్శకుడు జీతు ఇప్పటికే క్లూ కూడా ఇచ్చాడు. మలయాళం లో ఆ సినిమా తెరకెక్కుతుంది అనగానే.. ఇప్పడు ఇతర భాషల రీమేకపై అందరిలో ఊహాగానాలు మొదలైతే.. ఇప్పడు మళయాళంలోనే కాదు.. దర్శకుడు జీతూ ఈ సినిమాని పాన్ ఇండియా ఫిలిం గా మార్చిన మార్చేస్తాడేమోలే అంటున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లో పాన్ ఇండియా క్రేజ్ నడవడం, దృశ్యం అన్ని భాషల్లో రీమేక్ అయ్యి సూపర్ అవడంతో.. ఎలాగూ క్రేజ్ ఉంటుంది కాబట్టి పాన్ ఇండియా గా మార్చేద్దామని జిత్తు అనుకున్నా అనుకోవచ్చనే అంటున్నారు.
https://www.telugupost.com/movie-news/vijay-sarkar-records-97541/
విజయ్ - మురుగదాస్ కాంబోలో వచ్చిన సర్కార్ భారీగా అంచనాలతో దీపావళి కానుకగా విడుదలైంది. సినిమా విడుదలైన మొదటి షోకే డివైడ్ టాక్ సొంతం చేసుకున్న సర్కార్ సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే సినిమా విడుదలైన రెండో రోజే సర్కార్ సినిమా సమస్యల వలయంలో చిక్కుకుంది. ఒక విధంగా ఆ సమస్యలు కూడా విజయ్ సినిమా సర్కార్ కి కలిసొచ్చి సినిమా వసూళ్లు పెరగడానికి కారణమయ్యాయి. సర్కార్ సినిమా ఓపెనింగ్ రోజే తెలుగు, తమిళంలో రికార్డుల మోత మోగించింది. విజయ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రంగా సర్కార్ నిలిచింది.రంగస్థలం రికార్డు బ్రేక్...ఇక విడుదలైన నాలుగు రోజులకే సర్కార్ 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టడం... తర్వాత విజయ్ మెర్సెల్ సినిమా కలెక్షన్స్ ని ఈ సర్కార్ క్రాస్ చెయ్యడం తెలిసిందే. సౌత్ లోనే బాహుబలి తర్వాత రోబో, కబాలి, మెర్సిల్, రంగస్థలం సినిమాలు 200 కోట్ల క్లబ్ లోకి చేరిన వాటిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు విజయ్ సర్కార్ కూడా 200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడమే కాదు.. రంగస్థలంకి వచ్చిన రికార్డులను చెరిపేస్తుంది. రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం 215 కోట్ల గ్రాస్ వసూలు చేయగా... సర్కార్ ఇంతవరకూ 217 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.వివాదాలతోనే కలెక్షన్లు...ఈ ఎడాది దక్షిణాదిన అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన చిత్రంగా విజయ్ సర్కార్ నిలిచింది. అసలు మొదట్లో డివైడ్ టాక్ సొంతం చేసుకున్న సర్కార్ సినిమా ఇలా అనూహ్యంగా కలెక్షన్స్ మోత మోగించడం మాత్రం స్పెషల్ గా చెప్పొచ్చు. ఇక ఈ వసూళ్లు రావడానికి సర్కార్ మీద వివాదాలు ఒక కారణమైతే మరో కారణం విజయ్ క్రేజ్.
https://www.telugupost.com/crime/rats-ate-the-dead-body-eye-in-madhya-pradesh-1458650
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. పేషంట్లు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో.. ఉన్న రోగులను బెంబేలెత్తించాయి ఎలుకలు. ఓ రోగిని ఎలుకలు పీక్కుతినగా.. రెండ్రోజులు హడావిడి చేశారు అంతే. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. కాగా.. తాజాగా మధ్యప్రదేశ్ లో అలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది ఇటీవల ఓ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మరుసటి రోజు ఆ మృతదేహాన్ని సిబ్బంది పరిశీలించగా.. కన్ను పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో కనిపించింది. వెంటనే వాళ్లు వైద్యులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన మార్చురీకి చేరుకున్న వైద్యులు, అధికారులు మృతదేహాన్ని పరిశీలించారు. కన్నును ఎలుకలు తిన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. కాగా.. అది ఎంత వరకూ నిజమన్నది తెలియాల్సి ఉంది. ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. గతంలో ఇదే ఆస్పత్రిలో ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరికి తిన్నాయి. కాగా.. తాజాగా జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/saira-trailer-release-yesterday-134050/
నిన్న సాయంత్రం 5.30 గంటలకు సైరా ట్రైలర్ ని రిలీజ్ మేకర్స్. రామ్ చరణ్ అండ్ సురేంద్ర రెడ్డి ఈ ట్రైలర్ ని అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం చిరు నట విశ్వరూపం అండ్ విజువల్ వండర్ అని అర్ధం అవుతుంది. ట్రైలర్ లో కేవలం సినిమాలో పాత్రలు, విషయం మాత్రమే పరిచయం చేసినట్టు కనిపిస్తుంది. ఆ పాత్రలేంటీ…… సినిమాలో కీలకమైన విషయాలు, పాత్రలు దాచారు. ముఖ్యంగా అనుష్క పాత్రని దాచారు. అసలు సినిమా స్టార్ట్ అవ్వడమే అనుష్క ( ఝాన్సీ లక్ష్మీబాయి ) పాత్ర తో స్టార్ట్ అవుతుంది. ఆ పాత్ర సినిమాలో అయితే కిక్ ఇస్తుందని అందుకే దాన్ని హైడ్ చేసినట్టు తెలుస్తుంది. అలానే సినిమాలో కీలకం అయినా అండర్ వాటర్ సీన్, అలాగే నదిలో పడవల సీన్ ఈ రెండూ ట్రయిలర్ లో టచ్ చేయలేదు. రెండు కారణాలు… ట్రైలర్ మొత్తం అసలు సినిమా ఏ జోనర్? పాత్రలు ఏంటి? అనేవి తెలిసేలా చేసారు. ఇలా చేయడానికి రెండు కారణాలు ఉండి ఉండవచ్చు. ఒకటి సినిమా మీద మరీ ఎక్కువ క్రేజ్ పెంచేయకుండా వుండడం, అలాగే ట్రైలర్ లోనే అన్ని చూపించేస్తే సినిమా చూసినప్పుడు ఫీల్ పోతుందని భావించి ఇలా కట్ చేసి ఉండొచ్చు. చూద్దాం అక్టోబర్ 2 న ఈ మూవీ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో అని.
https://www.telugupost.com/movie-news/nandamuri-photo-78592/
గత కొంతకాలం నుండి ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ ల మధ్య అనుబంధం ఎక్కువైందనే చెప్పాలి. ఏ ఈవెంట్స్ కి వెళ్లిన ఇద్దరు కలిసి వెళ్లడం..ఒకరి ఫంక్షన్స్ కి ఒకరు గెస్ట్ లు గా వెళ్లడం.. ఒకరు బర్త్ డేలు మరొక్కరు సెలెబ్రేట్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఈ పరిణామాలు నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. నిన్న కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య బర్త్ డేని ఘనంగా సెలబ్రేట్ చేశాడు. కళ్యాణ్ తో కేక్ కట్ చేయించి తినిపించాడు. ఈ ఫోటోలో ఎన్టీఆర్...కళ్యాణ్ రామ్ ల తో పాటు ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇద్దరూ సినిమాలతో బిజీగా...కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కేవీ గుహాన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ మూవీలో నివేదా థామస్ - షాలినీ పాండే కథానాయకులుగా నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్.. 'ఆరవింద సమేత' చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
https://www.telugupost.com/movie-news/prabhas-nag-ashwin-update-180106/
ప్రభాస్ ఎప్పుడూ స్లోగా రెండేళ్ళకి పైగా ఒక సినిమా చేస్తూ ఫాన్స్ కి అగ్ని పరీక్షా పెట్టేవాడు. బాహుబలి దగ్గరనుండి ప్రభాస్ చాలా స్లోగా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ వరస సినిమాల కమిట్మెంట్స్ చూస్తే ఏ 2025 కో పూర్తవుతాయని ఫిక్స్ అవుతారు. కానీ ప్రభాస్ మాత్రం అలాంటిదేం లేదు.. 2022 కల్లా నాలుగు సినిమాలు ప్రేక్షకులకు అందిస్తానంటూ వరస సర్ప్రైజ్ లు ప్లాన్ చేసి ఫాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది.. రిలీజ్ కి కాస్త టైం అపడుతుంది అనగానే కన్నడ డైరెక్టర్ తో సలార్ షూటింగ్ కి సిద్దమవుతూ.. సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలని ఓ రేంజ్ లో మొదలు పెట్టాడు ప్రభాస్. అది అలా అయ్యిందో లేదో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ లైన్ లోకొచ్చేసి ఆదిపురుష్ అప్ డేట్ ఇచ్చేసి అందరికి షాక్ ఇచ్చేసాడు. ఫిబ్రవరి నుండి ఆదిపురుష్ పట్టాలెక్కబోతుంది అని. ఇక నాగ్ అశ్విన్ అయితే సంక్రాంతికి అప్ డేట్ ఇస్తా అంటూ ఊరించాడు. కానీ నాగ్ అశ్విన్ అప్ డేట్ ఆలస్యమవడంతో ప్రభాస్ ఫాన్స్ నాగ్ అశ్విన్ కి ట్వీట్స్ వెయ్యడం మొదలు పెట్టారు. మాకు అప్ డేట్ కావాలి అంటూ.. దానితోనాగ్ అశ్విన్ కూడా హడావిడిగా లైన్ లోకొచ్చాడు. ఇంతకుముందే హీరోయిన్ గా దీపికా పదుకొనే, అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ప్రభాస్ సినిమాలో నటించబోతున్నారంటూ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్ ఇప్పుడు మరో శుభవార్త చెప్పాడు. జనవరి 29 కానీ, ఫిబ్రవరి 26 కానీ ప్రభాస్ కొత్త సినిమా అప్ డేట్ ఉండబోతుంది అంటూ డేట్స్ తో సహా ఇచ్చేసరికి ప్రభాస్ ఫాన్స్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. ప్రభాస్ వరస సర్ప్రైజ్ లు చూసిన వారు అబ్బ ప్రభాస్ అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదుగా అంటున్నారు.
https://www.telugupost.com/movie-news/సురేష్-సామాన్యుడు-కాదండో-40496/
మీనా హీరోయిన్ గా ఒకవెలుగు వెలిగి కాస్త లేట్ గానే పెళ్లి చేసుకుని ఒక కూతుర్ని కన్నాక కూడా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో, సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా మళ్ళీ ఫామ్ లోకొచ్చింది. అయితే మొన్న మధ్యన 'దృశ్యం'లో ఇద్దరు పిల్లలకి తల్లిగా కూడా నటించించి మెప్పించింది. ఇప్పుడు మరొకసారి మీనా అలాంటి రోల్ లోనే టాలీవడ్ చిత్రంలో కనబడబోతుందంటూ చెబుతున్నారు.ఇక బెల్లంకొండ సురేష్ తన కొడుకు కోసం భారీ నటీనటుల్ని అతని సినిమాలో నటింపచేయడానికి అన్నిటికి సిద్ధపడతాడు. వారిని భారీ రెమ్యునరేషన్ తో పడేస్తుంటారు. నిన్నటికి నిన్న 'జయ జానకి నాయక' కోసం రకుల్, ప్రగ్య, కేథరిన్, శరత్ కుమార్, జగపతి బాబు, వాణి విశ్వనాద్ వంటి టాప్ స్టార్స్ ని తీసుకొచ్చిన బెల్లంకొండ సురేష్ ఇప్పుడు శ్రీవాస్ డైరెక్షన్ లో శ్రీనివాస్ చెయ్యబోయే చిత్రం కోసం పూజ హెగ్డేని హీరోయిన్ గా దించుతూనే మరో సీనియర్ హీరోయిన్ మీనాని శ్రీనివాస్ కి తల్లిగా ఏరికోరి సెలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు.దర్శకుడు శ్రీవాస్ - హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రంలో హీరో తల్లి పాత్రకు మీనాను తీసుకున్నట్లు ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లు చెబుతున్నారు. సినిమా కథలో హీరో చిన్ననాటి ఎపిసోడ్ లో తల్లి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండడంతో... ఆ పాత్రకి మీనా లాంటి స్టార్ మదర్ అయితే బాగుంటుందని దర్శకుడు శ్రీవాస్ భావించి.... సురేష్ ద్వారా ఆమెని అప్రోచ్ అయ్యి ఆమెకు కథ చెప్పి ఒప్పించారట. అయితే ఇప్పటికే హీరోగారి చిన్ననాటి ఎపిసోడ్ షూటింగ్ పూర్తయినట్లు చెబుతున్నారు. కేవలం చిన్ననాటి ఎపిసోడ్ కే మూడున్నర కోట్లు ఖర్చు పెట్టారంటే ఆ చైల్డ్ ఎపిసోడ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉండి ఉంటుంది. అందుకే మీనా కూడా మారు మాట్లాడకుండా ఒప్పుకుని ఉంటుందంటున్నారు. మరి 'జయ జానకి నాయక' లో వాణి విశ్వనాధ్ కోసం భారీగా ఖర్చుపెట్టిన బెల్లంకొండ సురేష్ ఇప్పుడు మీనాకెంత ఇవ్వబోతున్నాడో అనేది హాట్ టాపిక్ గా మరింది.
https://www.telugupost.com/movie-news/samantha-performance-in-oh-baby-telugu-movie-126511/
పెళ్లి తర్వాత హీరోయిన్స్ కి అవకాశాలు ఉండవు.. అందుకే హీరోయిన్స్ పెళ్లి అంటేనే వెనుకాడతారనే విషయం చూస్తూనే ఉన్నాం. ఏళ్ళు పైబడినా పెళ్లి చేసుకోవడానికి హీరోయిన్స్ భయపడుతూనే ఉంటారు. అయితే టాలీవుడ్ లో ఒక హీరోయిన్ మాత్రం టాప్ పొజిషన్ లో ఉండగానే హీరో నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తర్వాత సమంత ఎప్పటిలాగే నటిస్తుందని చైతు ఎప్పుడో చెప్పాడు. ఇక సమంత కూడా టాప్ హీరోలతో ఆఫర్స్ రాకపోయినా.. మెల్లగా కమర్షియల్ చిత్రాలకు దూరమయినా కూడా లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటుతుంది. పెళ్లి తో ఫ్యామిలీలోను, కెరీర్ లో హిట్స్ తోనూ సమంత దూసుకుపోతుంది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యు టర్న్ తాజాగా వచ్చిన ఓ బేబీ. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా తెరకెక్కిన ఓ బేబీ నిన్న శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సమంత నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సమంత తన నటనతో సినిమాని నిలబెట్టిందంటున్నారు. 70 ఏళ్ళ బామ్మ 25 ఏళ్ళ పడుచుపిల్లగా మారిన తర్వాత తన లైఫ్ లో వచ్చే మార్పులంటే.. వయసు చిన్నగా కనిపించినా 70 ఏళ్ళ బామ్మలా హావభావాలు పలికించడంలో సమంత సూపర్ సక్సెస్ అయ్యింది. కామెడీ విషయంలో ఎలా మెప్పించిందో.. భావోద్వేగాలు పండించడంలోనూ అంతే ఆకట్టుకుంది సమంత. బేబీ పాత్రలో ఆమె అభినయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలాంటి పాత్రలు, సినిమాలు అందరికీ దొరకవు. దొరికినా అందరూ సమంతలా రాణించలేరు. ఇక సమంత కూడా ఓ బేబీ సినిమా హిట్ అవుతుందని చాలా గట్టిగా నమ్మింది. సమంత నమ్మకాన్ని ఓ బేబీ నిలబెట్టినట్లే. మరి కేవలం తెలుగులోనే కాదు అటు తమిళంలో కూడా సమంత తన హవాని పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుంది.
https://www.telugupost.com/crime/man-stabs-younger-brother-to-death-in-faridabad-accused-absconding-1344955
మానవ సంబంధాలు రోజు రోజుకీ ఎంత దారుణంగా తయారవుతూ ఉన్నాయో తెలిపే ఘటన ఇది. మద్యం మత్తు మనిషిని మరింత నీచాలకు పాల్పడేలా చేస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన గొడవలో ఓ వ్యక్తి తన తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఘటన అనంతరం నిందితుడు పారిపోయి పరారీలో ఉన్నాడు. మృతుడి బంధువు తెలిపిన వివరాల ప్రకారం చనిపోయిన వ్యక్తిని 20 సంవత్సరాల విష్ణు గా గుర్తించారు. అతని అన్న సోను తమ్ముడిని హత్య చేసి ఆ తర్వాత పరారీలో ఉన్నాడు.తల్లి కళ్లముందే..ఓ కొడుకు చనిపోగా.. మరో కొడుకు జైలు పాలవ్వబోతున్నాడని తెలిసి వారి తల్లి భోరున విలపించింది. తన కుమారులిద్దరూ మద్యం సేవించారని.. ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది ఆమె తెలిపింది. గొడవను ఆమె ఆపడానికి ప్రయత్నించగా అది వీలు పడలేదు. వారిద్దరి మధ్య గొడవ మరింత పెరిగింది. తిట్టుకోవడం కొట్టుకోవడం దగ్గర నుండి ఏకంగా కత్తితో చంపుకునే దాకా వెళ్ళింది. తల్లి ముందే ఆ అన్న తమ్ముడిని కత్తితో పొడిచి పారిపోయాడు.ఇంకా ఫిర్యాదు చేయని బంధువులురక్తపు మడుగులో ఉన్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించాడని వైద్యులు ధృవీకరించారు. బాద్ షాఖాన్ సివిల్ హాస్పిటల్ నుండి ఈ ఘటనపై సమాచారం అందిందని ఏసీపీ సత్పాల్ యాదవ్ తెలిపారు. అన్నదమ్ములిద్దరూ ఘర్షణ పడ్డారని.. తమ్ముడిని హత్య చేసిన అన్న ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయాడని విచారణలో తేలిందని అన్నారు. ప్రస్తుతం మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఏసీపీ తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన తర్వాతే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాద్‌షా ఖాన్ సివిల్ హాస్పిటల్ మార్చురీలో ఉంచామని ఏసీపీ తెలిపారు.
https://www.telugupost.com/movie-news/hero-actor-vishal-accident-in-shooting-115846/
నటుడు విశాల్ షూటింగ్ లో గాయపడ్డాడు. అప్రమత్తం అయిన టీం అయనను వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అయితే విశాల్ కి దెబ్బలు తగిలింది ఇక్కడ కాదు. టర్కీలో. సుందర్ డైరెక్షన్ లో విశాల్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించి షూటింగ్ టర్కీలో జరుగుతుంది. అక్కడ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసాడు డైరెక్టర్ సుందర్. సీక్వెన్స్ లో భాగంగా బైక్‌పై వేగంగా వెళ్తున్న విశాల్ అనుకోకుండా బైక్ పై నుండి పడిపోయారు. వెంటనే టీం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆగిపోయిన షూటింగ్ గాయాలు కొంచెం బలంగా తగలడంతో కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు సమాచారం. దాని వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే విషయం తెలుసుకున్న విశాల్ కాబోయే భార్య వెంటనే టర్కీ వెళ్లడానికి ట్రై చేసింది. కానీ గాయాలు చిన్నవే అని కుటుంబసభ్యులు చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే విశాల్ అక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటారా లేక ఇండియా వచ్చేసి రెస్ట్ తీసుకుంటారా అని తెలియాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/మంచి-ఆఫర్-కొట్టేసిందా-అమ-20289/
బుల్లితెర మీద గ్లామర్ షోతో అనసూయ, రష్మీ లు యాంకరింగ్ చేస్తూనే వెండితెర మీద అవకాశాలు పెట్టేస్తున్నారు. అయితే వీరిలాగే మరో యాంకర్ శ్రీముఖి కూడా వెండితెర మీద గట్టి ఛాన్స్ పట్టేయ్యాలని ఎదురు చూస్తుంది. ఇప్పటిదాకా కొని చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన శ్రీముఖి ఏదైనా ఒక చిత్రంలో హీరోయిన్ గా చెయ్యాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇక శ్రీనివాస్ అవసరాల హంటర్ చిత్రంలో ఒక పాత్ర పోషిస్తున్నప్పటికీ అందులో కూడా మరో హీరోయిన్ తో స్క్రీన్ పంచుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు శ్రీముఖి కి హీరోయిన్ గా అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. దర్శకుడిగా మారబోతున్న రైటర్ కమ్ నటుడు హర్షవర్ధన్ తాను తీసే మొదటి చిత్రంలో శ్రీముఖి కి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. మంచి రైటర్ గా, ఒక మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న హర్షవర్ధన్ తెరకెక్కించబోయే కొత్త చిత్రంలో హీరోయిన్ గా శ్రీముఖి ఛాన్స్ కొట్టేసిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా దర్శకత్వ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలనే కోరికతో హర్షవర్ధన్ ఒక డిఫరెంట్ కథని రెడీ చేసుకున్నాడని... ఇక ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ఆ చిత్ర టైటిల్ కొత్తగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే టైటిల్‌ను హర్షవర్ధన్ తన సినిమా కోసం రిజిష్టర్ చేయించాడనే ప్రచారం జరుగుతోంది. మరి టైటిలే ఇంట వెరైటీగా ఉంటే ఇంకా సినిమా ఎంత వెరైటీ గా ఉంటుందో అని అందరూ అనుకుంటున్నారు.మరి బుల్లితెర మీద రష్మీ, అనసూయలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న శ్రీముఖి ఇప్పుడు వారికి వెండితెర మీద కూడా పోటీ ఇవ్వడానికి సిద్ధమైందనే కామెంట్స్ వినబడుతున్నాయి. మరి ఈ చిత్రంతోనైనా శ్రీముఖి కల నెరవేరుతుందో? లేక మళ్ళీ వెండితెర అవకాశాల కోసం పడిగాపులు కాయాల్సి ఉంటుందో? చూద్దాం.
https://www.telugupost.com/movie-news/mohan-babu-responds-on-manoj-and-mounikas-marriage-1468532
ఇటీవల కాలంలో మోహన్ బాబు సినిమాలను చాలా తగ్గించేశారు. తన పరిధికి తగిన పాత్రలను ఎంచుకుంటూ.. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. పేరుకి ఆయన ఓ పార్టీ వైపు ఉన్నా.. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. మంచు మనోజ్ - మౌనిక ల పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఆది నుంచి ఆయనకు వారిద్దరి వివాహం ఇష్టంలేదన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అలాంటి ప్రశ్నే ఆయనకు ఎదురైంది.అందుకు మోహన్ బాబు.. "మనోజ్ నా దగ్గరికి వచ్చి, డాడీ.. ఇదీ పరిస్థితి.. పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు. ఆలోచించారా అన్నాను. లేదు డాడీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అన్నాడు. అయితే అలాగే కానీ.. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను. కాదని ఎందుకు అంటాను? ఈ విషయంలో ఎవరో ఏదో రాశారనీ .. ఏదో అనుకుంటున్నారని ఆలోచించడం నాకు అలవాటు లేదు. వాడేం అనుకుంటున్నాడో .. వీడేం అనుకుంటున్నాడో అని పట్టించుకుంటూ కూర్చుంటే నన్ను నేను మరిచిపోతాను. ఏనుగు వెళుతుంటే కుక్కలెన్నో మొరుగుతూ ఉంటాయి .. మొరగనీ. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు .. సుఖంగా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రేమించుకున్నారు? వంటి విషయాల్లోకి డీప్ గా వెళ్లొద్దు. నేను హ్యాపీగా ఉన్నాను కనుకనే పెళ్లికి వెళ్లాను" అని బదులిచ్చారు.
https://www.telugupost.com/movie-news/మిడిల్-రేంజ్-హీరోస్-లో-వీ-48288/
టాలీవుడ్ లో టాప్ హీరోస్ ని పక్కన పెట్టి చుస్తే..మిడిల్ రేంజ్ హీరోస్ మాత్రం పది మంది పైనే వున్నారు. వీళ్ళ మధ్య పోటీ కూడా బాగా ఉందని చెప్పుకోవొచ్చు. అయితే ఈ స్థాయి హీరోల్లో అత్యంత నిలకడ చూపిస్తోన్నది మాత్రం నాని, శర్వానంద్‌లే. ఏ కొత్త దర్శకుడు అయినా వీళ్లతో సినిమా తీయాలనుకుంటాడు. నిర్మాతల సంగతి సరేసరి. వీరి డేట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు.మంచి కథ ఉంటే చాలు.. వీళ్లకి చెప్పాకే.... వాళ్లు కాదంటే మిగతా హీరోస్ దగ్గరకి ఆ కథ వెళ్తుంది అంటే నమ్మాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి రేంజ్ ఆలా వుంది. అంతేనా వాళ్ల మార్కెట్ కూడా అలానే వుంది. వేగంగా సినిమాలు తీస్తూ వుంటారు కాబట్టి వీళ్ల కోసం నిర్మాతలు, దర్శకులు ఏడాది వేచి చూడడానికి కూడా వెనకాడడం లేదు. శర్వానంద్‌వి ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలు రిలీజయ్యాయి. నాని సినిమాలు ఆల్రెడీ రెండు విడుదలయ్యాయి. మరొకటి డిసెంబర్‌లో రానుంది.మంచి కథలుంటే నాని, లేదా శర్వానంద్‌ మాత్రమే దర్శకులకి గుర్తొస్తున్నారు. దీంతో మిగతా హీరోలు తమకి దొరికిన కథలు, మిగిలిన దర్శకులతోనే చేసుకోవాల్సి వస్తోంది. వీళ్ల సక్సెస్ రేట్ బాగుండటంతో.. మిగతా వాళ్లు దర్శకులు కోసం, కథలు కోసం తెగ తంటాలు పడుతున్నారు
https://www.telugupost.com/movie-news/అమలాపాల్‌కు-విడాకులు-24017/
సినీ నటి అమలాపాల్‌, ఆమె భర్త విజయ్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.కెరీర్‌ తారా స్థాయిలో ఉండగానే విజయ్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న అమలాపాల్‌ వైవాహిక జీవితం అంతా సాఫీగా సాగలేదు. జ్యూడీషియల్‌ సెపరేషన్‌లో భాగంగా గత ఆర్నెల్లుగా విడివిడిగా ఉంటున్న వీరికి మంగళవారం విడాకులు మంజూరయ్యాయి. 2014 జూన్‌ 12న వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు.సినిమాలు వద్దన్నందుకే...అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలన్న అత్తింటి వారి నిబంధనను అమల పాటించకపోవడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ జంట వివాహమైన కొంత కాలానికే విడిపోవాలని నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించింది. వివాహ బంధానికి దూరమైన తర్వాత ఈ ఇద్దరూ తమ తమ కెరీర్‌లపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. అమల చేతిలో ఇప్పటికే అరడజను ఆఫర్లు ఉండగా.. విజయ్‌ కూడా రెండు సినిమాలను డైరెక్ట్‌ చేస్తున్నాడు.
https://www.telugupost.com/movie-news/light-man-died-in-ar-rahman-film-studio-1458240
ప్రముఖ గాయకుడు, స్వరకర్త, సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కు చెందిన ఫిలిం స్టూడియోలో ప్రమాదం జరిగింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడి కవిరపెటలో ఆయనకు సొంత ఫిలిం స్టూడియో ఉంది. దానిని షూటింగ్ లకు రెంట్ కి ఇస్తుంటారు రెహమాన్. అక్కడ రెగ్యులర్ గా సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం ఆ స్టూడియోలో తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం 30 అడుగుల ఎత్తులో లైట్ బిగిస్తుండగా.. కుమార్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు క్రింద పడ్డాడు.వెంటనే అతడిని.. సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ.. బాగా ఎత్తు నుండి పడటంతో.. అతను మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఫిలిం స్టూడియోలో జరిగిన ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/మహేష్-అరుదైన-రికార్డ్-53049/
మహేష్ బాబు సోషల్ మీడియా లో ఓ అరుదైన రికార్డు నమోదు చేసాడు. ట్విట్టర్ లో మనవాడి ఫాలోవర్ల 5 మిలియన్.... అంటే 50 లక్షలు ఫాలోవర్స్ అన్న మాట. తెలుగులో మరే హీరోకూ సాధ్యం కాని రీతిలో ట్విట్టర్లో 5 మిలియన్ మార్కును అందుకున్నాడు మహేష్. సౌత్ ఇండియన్ స్టార్స్ లో ఇప్పటిదాకా 5 మిలియన్ మార్కును దాటింది ఇద్దరే కావడం విశేషం. ఒకరు ధనుష్ 6.4 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకోగా..సమంత 5.71 మిలియన్ ఫాలోవర్లతో ఉంది.తెలుగు లో మహేష్ బాబు స్థానం తర్వాత కింగ్ నాగార్జున 4.5 మిలియన్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. నాగార్జున తర్వాత దగ్గుబాటి రానాకు 4.48 మిలియన్ ఫాలోవర్లున్నారు. కొంచం లేటుగా వచ్చినా పవర్ స్టార్ కు 22 లక్షలు మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాజమౌళి 3.75 మిలియన్ ఫాలోవర్లతో కొనసాగుతున్నాడు. రెండేళ్ల కిందట ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ వెనుక 17 లక్షల మంది ఉన్నారు.
https://www.telugupost.com/movie-news/actress-hema-chaudhary-hospitalized-condition-critical-1510533
ప్రముఖ సీనియర్ నటి హేమా చౌదరి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆమె బెంగుళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం హేమ చౌదరికి బ్రెయిన్‌ హెమరేజ్‌కు గుర‌య్యార‌ని నివేదిక‌లు పేర్కొన్నాయి. తీవ్ర అనారోగ్యం పాలైన‌ ఆమెను వెంట‌నే ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. హేమ కొడుకు ఐర్లాండ్‌లో ఉన్నాడు. అత‌డి రాక కోసం ఎదురుచూస్తున్నారు. చికిత్సకు ఆమె శరీరం స్పందించడం లేదని నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఈ విష‌య‌మై వైద్య బృందం నుంచి స్ప‌ష్ట‌త రావాల్సివుంది. హేమ అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నటి లీలావతి జయంతిని 18వ తేదీన నేలమంగళలోని సోలదేవనహళ్లిలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి హేమా చౌదరి హాజర‌య్యారు. ఆ తర్వాత అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నటి హేమా కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో 180కి పైగా చిత్రాల్లో నటించారు. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ బాబు, మలయాళ సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్, అనంత్ నాగ్, శంకర్ నాగ్, రవిచంద్రన్ వంటి చాలా మంది అగ్ర‌ నటులతో హేమా చౌదరి స్క్రీన్ షేర్ చేసుకుంది. 2011లో కన్నడ టెలివిజన్‌లో పాపులర్ సీరియల్ 'అమృతవర్షిణి'లో ప్రధాన పాత్ర పోషించి ప్రజల హృదయాలను గెలుచుకుంది.
https://www.telugupost.com/movie-news/aliya-bhutt-most-desirable-women-122694/
రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న #RRR సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు క్యారెక్టర్ లో, ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ భారీ క్రేజున్న ప్రాజెక్ట్ లో అల్లూరి పాత్రధారి రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న అలియా భట్ ఇప్పుడు #RRR లో నటిస్తూ సౌత్ నుండి కూడా క్రేజీ హీరోయిన్ అనిపించుకుంటుంది. అందరినీ వెనక్కునెట్టి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అలియా భట్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉన్న అలియా భట్ ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా గౌరవాన్ని అందుకుంది. బాలీవుడ్ లో టాప్ రేంజ్ హీరోయిన్స్ ని సైతం వెనక్కి నెట్టి మరీ ఇలాంటి గౌరవాన్ని అలియా భట్ సొంతం చేసుకుంది. మొత్తం 50 మందితో కూడిన ఈ జాబితాలో అలియా భట్ మొదటి స్థానం సొంతం చేసుకోగా తరువాత స్థానాల్లో మీనాక్షి చౌదరి, కత్రినా కైఫ్, దీపికా పదుకొనె, గాయత్రి భరద్వాజ్, అదితీరావు లాంటి వారు ఉన్నారు.
https://www.telugupost.com/top-stories/mlc-elections-in-andhra-pradesh-are-going-to-be-held-soon-parties-are-entering-the-ring-without-alliances-in-this-election-1462477
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. వీటిలో మూడు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కడప, అనంతపురం, కర్నూలుతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు స్థాానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్ ఎమ్మెల్సీ, కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నా అవి అధికార పార్టీ సొంతమవుతాయి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో వైసీపీదే మెజారిటీ కావడంతో ఆ స్థానాలు ఖచ్చితంగా ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడతాయి.వైసీపీకి మాత్రం...ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. ఉపాధ్యాయులు సహజంగానే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, జీతాలు సకాలంలో జమ చేయకపోవడం, పీఆర్సీ తదితర సమస్యలను పరిష‌్కరించకపోవడంతో ఉపాధ్యాయులు అధికార పార్టీకి దూరంగానే ఉంటారన్న అంచనాలు అయితే ఉన్నాయి. అది నిజం కూడా టీచర్ ఎమ్మెల్సీల్లో గెలుపు సాధించడం అధికార వైసీపీకి అంత సులువు కాదు. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు పంపుతున్న బహుమతులు కూడా వెనక్కు పంపుతున్నారు. ఈ ఎన్నికలలో మాత్రం...ఇక పొత్తులతో 2024లో బరిలోకి దిగుతామంటున్న పార్టీలు కూడా ఈ ఎన్నికల విషయంలో కిమ్మనడం లేదు. ఈ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదు అంటే అలా అనుకోవడానికి లేదు. టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలిచే అవకాశాలు విపక్షాలుకు పుష్కలంగా ఉన్నాయి. గతంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీకి చెందిన మాధవ్ గెలిచారు. తిరిగి అక్కడి నుంచే గెలిచేందుకు మాధవ్ మరసారి బరిలోకి దిగుతున్నారు. కానీ జనసేన ఇంత వరకూ మాధవ్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. కానీ బీజేపీ మాత్రం తమతో జనసేన కలసి వస్తుందని చెప్పుుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావడంతో యువత ఓట్లు ఎక్కువగా ఉండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేత ఒక ప్రకటన చేయించాలని కమలనాధులు భావిస్తున్నారు.పెదవి విప్పని పవన్...కానీ పవన్ కల్యాణ‌్ మాత్రం ఆ ఎన్నికలపై పెదవి విప్పలేదు. ఎక్కాడా తమ అభ్యర్థులను బరిలోకి దించలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చబోమని పదే పదే చెబుతున్న జనసేనాని ఈ ఎన్నికల్లో మాత్రం మిన్నకుండి పోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ బీజేపీని కలుపుకుని వెళ్లాలనుకుంటుంది. కానీ బీజేపీ మాత్రం జనసేనతో మాత్రమే కలసి వెళ్లాలనుకుంటుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో మద్దతును కోరితే ఇవ్వడానికి టీడీపీ రెడీగా ఉన్నా, కమలనాధులు ఆ పని చేయడం లేదు. జనసేనతోనే తమ ప్రయాణమని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ పోస్టుకు మాత్రం టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. ఇటు అధికార పార్టీ మాత్రం ఈ ఎన్నికలకు కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. సరే.. విజయం ఎవరిదైనా విపక్షాలు మాత్రం ఈ ఎన్నికలకు ఏకం కాకపోవడం చర్చనీయాంశమైంది.
https://www.telugupost.com/crime/jubilee-hills-girl-gangrape-case-has-created-a-sensation-six-of-the-accused-have-been-arrested-by-the-police-1373202
జూబ్లీ హిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు సంచలనం సృష్టించింది. ఇందులో ఆరుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితులు వినియోగించిన ఇన్నోవా కారుపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆ ఇన్నోవా కారు ఎవరిది? ఎక్కడి నుంచి మైనర్లు తీసుకు వచ్చారన్నది పోలీసులు బయటపెట్టలేదు. అయితే ఈ ఇన్నోవా కారు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుటుంబానిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.దినాజ్ పేరుతో....వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుటుంబానికి చెందిన దినాజ్ పేరుతో ఈ ఇన్నోవా రిజిస్టర్ అయింది. కారును వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుటుంబమే కొనుగోలు చేసింది. ఏడాదిన్నరగా వాహనాన్ని వినియోగిస్తున్నారు. అయితే ఈ నెల 28వ తేదీన పబ్ కు డ్రైవర్ తో ఈ కారులో వక్ఫ్ బోర్డుఛైర్మన్ కుమారుడు వెళ్లినట్లు కూడా పోలీసులు నిర్థారించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వాహన యజమానులపై కేసులు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/cine-actor-banerjee-was-moved-to-tears-that-mohan-babu-had-insulted-him-during-the-movie-artist-association-elections-204067/
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో తనను మోహన్ బాబు బూతులు తిట్టారని నగుడు బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. పోలింగ్ కేంద్రంలోనే తనను మోహన్ బాబు ఇష్టమొచ్చినట్లు తిట్టారని, ఎవరూ ఆయనను ఆపే ప్రయత్నం చేయలేదని బెనర్జీ అన్నారు. చివరకు తనను కొట్టేందుకు కూడా మోహన్ బాబు వచ్చారని బెనర్జీ అన్నారు. కుటుంబ సభ్యులను కించపర్చేలా మాట్లాడారని బెనర్జీ విలపించారు. నరేష్ కూడా….. తాను బాధను దిగమింగుకుని మా ఎన్నికల పోలింగ్ లో పాల్గొన్నానని, మూడు రోజుల నుంచి ఆ బాధ తనను కలచి వేస్తుందని బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. నరేష్ కూడా తనను తూలనాడాడని, ముఠా నాయకుడని తనను నరేష్ దూషించాడని బెనర్జీ పేర్కొన్నారు. తాను రాజీనామా చేసిన తర్వాత బాధ కొంచెం తగ్గిందని బెనర్జీ బోరున విలపించారు.
https://www.telugupost.com/movie-news/allu-arjun-trivikram-heroine-105487/
అల్లు అర్జున్ గత ఏడాది ఏప్రిల్ లో నా పేరు సూర్యతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. కొత్త దర్శకుడితో సినిమా చేసి మరీ చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ మంచి కథతో సినిమా చెయ్యడానికి.. దర్శకుడిని ఎన్నుకోవడానికి అల్లు అర్జున్ కి చాలా రోజులే పట్టింది. తాజాగా త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ కమిట్ అయ్యాడు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది కాని.. సినిమా మాత్రం మొదలయ్యేది ఫిబ్రవరిలోనే అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో త్రివిక్రమ్ కాస్త బిజీగా ఉన్నాడు. హారిక హాసిని తో కలిసి గీత ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్, బన్నీ సినిమా కథపై కూర్చుకున్నాడు. అయితే త్రివిక్రమ్, అల్లు అర్జున్ తో తియ్యబోయే సినిమాని హాలీవుడ్ సినిమా కథ నుండి ఇన్స్పైర్ అయ్యి సినిమా చేస్తున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. లిస్ట్ లో చేరిన రష్మిక ఇక అల్లు అర్జున్ సరసన మహేష్, రామ్ చరణ్ ల పక్కన నటించిన కైరా అద్వానీ ఫిక్స్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. టాలీవుడ్ లోకి ఎంట్రినే టాప్ స్టార్స్ తో ఇచ్చినా కైరా ఇప్పుడు అల్లు అర్జున్ పక్కన కూడా ఛాన్స్ కొట్టేసిందంటున్నారు. ఇక కైరా కూడా నా చేతిలో మరో బిగ్ ప్రాజెక్ట్ ఉందంటుంది కానీ… అల్లు అర్జున్ సినిమాకే అని కమిట్ అవ్వడం లేదు. తాజాగా అల్లు అర్జున్ పక్కన మరో భామ పేరు వినబడుతుంది. అదే ఛలో, గీత గోవిందం హీరోయిన్ రష్మిక పేరు కూడా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్స్ లిస్ట్ లో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా రష్మికది గోల్డెన్ హ్యాండ్. అలాంటి క్రేజున్న హీరోయిన్ తమ సినిమాలో నటిస్తే సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని త్రివిక్రమ్ – బన్నీ ఆలోచనలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి వినయ విధేయ రామ టాక్ లో తేడా వస్తే కైరాని తప్పించి రష్మికని తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. చూద్దాం అల్లు హీరో సరసన కైరానా లేదంటే రష్మికనా అనేది.
https://www.telugupost.com/movie-news/రామ్-గోపాల్-వర్మ-లో-మార్ప-5467/
తన సినీ కెరీర్ ఆరంభ దశలో మీడియా ప్రభావం చాలా తక్కువ ఉన్న రోజులలోనూ వార్తల్లో నానుతూనే ఉండేవాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తెలుగు సినిమా ని మూస ధోరణి బాట నుంచి కొత్త శైలిలోకి తీసుకెళ్తూ, హీరోయిజం అనే పదానికి కొత్త అర్ధం చెప్పిన మొదటి చిత్ర శివ దగ్గర నుంచి తాజాగా వంగవీటి వరకు ఆయన నిత్యం వార్తల్లో ముఖ్యంగా వివాదాల్లో ఉంటూనే ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన ఎంచుకునే కథాంశం వివాదాస్పదం కాగా, మరి కొన్ని సార్లు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలూ ఆయన ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేసి వివాదపు వ్యాఖ్యలలో భాగం అవుతుంటారు.రామ్ గోపాల్ వర్మ వివాదం సృష్టించదలచుకుంటే ఆయనకు చిరంజీవి 150 వ చిత్రం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, కె.సి.ఆర్ అందం, వినాయకుడి ఆకారం, రాముడి అరణ్యవాసం ఇలా దేని గురించి ఐనా ఆయన వ్యక్తిగత అభిప్రాయలు వ్యక్త పరిచి, దానివల్ల ఎవరి మనోభావాలు ఐనా దెబ్బతిని ఉంటే తనకు సంబంధం లేదు అని నిక్కచ్చి గా చెప్పే వ్యక్తి, ఇప్పుడు జాతీయ సమస్యగా నిలిచిన సర్జికల్ స్ట్రైక్స్ విషయమై ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందిస్తూ దేశ ప్రజల తరపున మాట్లాడారు. తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కేజ్రీవాల్ తలకు మఫ్లర్తో కనిపిస్తే కోతిలా అనిపించేవాడు అని, ఇప్పుడు దేశం పట్ల ఆయన తీరును చూస్తుంటే నిజంగానే కేజ్రీవాల్ కోతే అని వ్యాఖ్యానించారు వర్మ. ఇలా మొదటి సారి ప్రజల మనోభావాలకు అతని అభిప్రాయాలకు సఖ్యత కుదరటంతో వర్మ మారిపోయాడు అని నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. కానీ మరో అంశం పై వర్మ స్పందిస్తే ఆయన నిలకడ ఏమిటో అర్ధం అయిపోతుంది.రామ్ గోపాల్ వర్మ తాజా గా విడుదల చేసిన వంగవీటి చిత్ర ప్రచార చిత్రానికి అమితమైన స్పందన వస్తుంది. అతి త్వరలో ప్రేక్షకులకు వంగవీటి చూసే భాగ్యం కలిపించి తాను ముంబైలో మకాం పెడతానని అంటున్నాడు వర్మ.
https://www.telugupost.com/gossip/mahesh-babu-sarileru-nekevvaru-business-139991/
ప్లాప్ దర్శకుడు మెహర్ రమేష్ గత కొన్నాళ్లుగా మహేష్ కాంపౌండ్ లోనే ఉంటున్నాడు. మహేష్ భార్య నమ్రతని నమ్ముకుని మహేష్ ఫ్యామిలీతో పాటుగా తిరుపతి, ఇంకా చాలా చోట్లకి తిరగడమేగాకుండా మహేష్ సినిమా ఓపెనింగ్స్ అప్పుడు కూడా మెహర్ రమేష్ హడావిడి చేస్తున్నాడు. అయితే ఈ ప్లాప్ దర్శకుడు మహేష్ ఫ్యామిలీ తో బాగా క్లోజ్ అవడంతో.. చాలామంది ఈ ప్లాప్ దర్శకుడుకి ఇక్కడేం పని.. అసలు మహేష్ అవకాశం ఇస్తాడని ఈ కాంపౌండ్ పట్టుకుని తిరుగుతున్నాడా.. అంటూ చాలా రకాల కామెంట్స్ పడ్డాయి. అయితే తాజాగా మహేష్ ని నమ్ముకుని అక్కడే ఉన్నందుకు మెహర్ రమేష్ కి ఓ ఫెవర్ జరిగినట్లుగా చెబుతున్నారు. మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ చివరి దశలోఉంది. సంక్రాతి రిలీజ్ అవడంతో.. సినిమా ప్రమోషన్స్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ సినిమా బిజినెస్ కూడా అంచనాలకు మించి జరిగుతుంది. అయితే సరిలేరు నీకెవ్వరూ సినిమా గుంటూరు హక్కులు మెహెర్ రమేష్ చేతికి వచ్చాయని.. మహేష్ ని నమ్ముకుని ఉన్నందుకు మెహర్ రమేష్ కి నమ్రత రికమండేషన్ మీద సరిలేరు గుంటూరు హక్కులు మెహర్ కి దక్కినట్టుగా ప్రచారం జరుగుతుంది
https://www.telugupost.com/movie-news/boyapati-srinivas-ram-charan-movie-69729/
ఈమధ్యన బోయపాటి సినిమాల్లో ఒక హీరోయిన్ ఏదో ఒక కేరెక్టర్ లో అయినా.. లేదా ఒక ఐటెం సాంగ్ లో అయినా కనబడుతుంది. ఆ హీరోయిన్ సరైనోడు సినిమాలో యంగ్ ఎమ్యెల్యేగా, నేనే రాజు నేనే మంత్రితో న్యూస్ ఛానల్ ఎండి కమ్ రీడర్ గా రానా ని ప్రేమలో పడేసే కేరెక్టర్ లో నటించి మెప్పించిన కేథరిన్ థెరిస్సా. బోయపాటి సరైనోడు సినిమాలో కేథరిన్ కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. అయినా కేథరిన్ యంగ్ ఎమ్యెల్యేగా గ్లామర్ డాల్ లా ఇరగదీసింది. అలాగే బోయపాటి మళ్ళీ కేథరిన్ కి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో ఐటెం సాంగ్ లో అవకాశమిచ్చాడు. ఇక ఆ సినిమాల ఆ ఐటెం లో కేథరిన్ అందాలకు అందరూ షాకైపోయారు.అయితే తాజాగా బోయపాటి శ్రీను కేథరిన్ కి తాను చేస్తున్న చరణ్ సినిమాలో కూడా ఐటెం లో చిందులు వేసే అవకాశం ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. జయ జనాకి నాయక లో చేసిన ఐటెం కి మాస్ ఆడియన్స్ పడిపోయారు,. అందుకే చెర్రీ తో తాను చెయ్యబోయే సినిమా కోసం బోయపాటి మళ్ళీ కేథరిన్ కి ఈ అవకాశం ఇచ్చాడట. ఇక బోయపాటి - చరణ్ సినిమా కోసం ఐటెం లో ఆడిపాడేందుకు కేథరిన్ ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటుంది. మరి చరణ్ పక్కన మాస్ స్టెప్స్ వేయాలంటే అమ్మడుకున్న ప్రస్తుతం డాన్స్ ప్రాక్టీస్ సరిపోదు.ఇక బోయపాటి - చరణ్ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ తర్వాత కేథరిన్ ఐటెం సాంగ్ చిత్రీకరణ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి చరణ్ పక్కన మాస్ స్టెప్స్ కోసం కేథరిన్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. ఇక కేథరీన్ ఇలా ఐటమ్స్ చేసుకుంటూనే కాలం గడిపెయ్యాలేమో.. ఎందుకంటే.. కేథరిన్ కి సెకండ్ హీరోయిన్స్ ఛాన్సులు కూడా ప్రస్తుతానికి లేవు. ఇక ఇలా ఐటమ్స్ తో అలా కాలం వెళ్లబుచ్చాల్సిందే అంటున్నారు సినీప్రియులు.
https://www.telugupost.com/movie-news/v-movie-to-be-removed-184386/
నాని – సుధీర్ బాబు కాంబోలో ఇంద్రగంటి తెరకెక్కించిన వి సినిమా ఎక్కువగా నాని 25 వ సినిమాగా ప్రోజెక్ట్ అయ్యింది. వి టీం కూడా నాని మూవీ గానే పబ్లిసిటీ చేసి సినిమా మీద భారీ క్రేజ్ పెంచేసిన వి సినిమా కి ముందుగానే లాక్ డౌన్ దెబ్బ పడింది. సుధీర్ బాబు హీరో గా నాని విలన్ గా ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన వి సినిమా కరోనా లాక్ డౌన్ కన్నా ముందే విడుదల కావాల్సి ఉంది. అయితే థియేటర్స్ బంద్ అవడంతో నాని 25 వ సినిమా కాస్తా ఓటిటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలయిన వి సినిమా సో సో టాక్ తెచ్చుకుని ప్లాప్ లిస్ట్ లో చేరింది. ఓకె.. అయ్యింది ఏదో అయ్యింది అనుకుంటే.. ఆఖరికి బుల్లితెర మీద వి సినిమాకి వీక్ టీఆర్పీ రావడంతో ఓవరాల్ గా వి సినిమా డిజాస్టర్ లిస్ట్ లోకి చేరింది. వి సినిమా ప్లాప్ విషయంలో వి టీం సైలెంట్ గానే ఉంది. వి సినిమా నిర్మాతలు వి డిజాస్టర్ తో దిగులు పడ్డారు. అయినా వి నిర్మాతలకు వి సినిమాకి ఇంకా కష్టాలు తొలగలేదు. కారణం బాలీవుడ్ నటి ఒకరు తన ఫోటో ని అనుమతి లేకుండా వి సినిమాలో వాడుకున్నారంటూ కోర్టుకెక్కింది. బాలీవుడ్ నటి సాక్షి మాలిక్.. వి సినిమాలో తన అనుమతి లేకుండా ఓ సందర్భంలో మొబైల్ ఫోన్‌లో తన ఫోటో ని కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా చూపించారని.. తన అనుమతి లేకుండా తన ఫొటోను వాడి తన పరువుకు భంగం కలిగించారని సాక్షి మాలిక్ ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు.. వి నిర్మాతలపై పరువు నష్టం దావా వేస్తూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణలో ఆమె అనుమతి లేకుండా సాక్షి ఫోటో వాడడం ముమ్మాటికీ పరువు నష్టం కలిగించే అంశమే అంటూ.. ఓటిటి నుండి వి సినిమాని వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
https://www.telugupost.com/movie-news/maharshi-new-look-90013/
కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో యంగ్ సీఎంగా అదరగొట్టేసాడు. మహేష్ అందానికి సీఎం లుక్ లో ఎలా ఉంటాడో అనుకుంటే.. సినిమా చూసిన వాళ్లు యంగ్ సీఎం, స్టైలిష్ సీఎం అంటూ పొగిడేశారు. తాజాగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహేష్ 25వ సినిమా మహర్షి సినిమాలో మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా ఇరగదీస్తాడనే టాక్ ఉంది. కేవలం టాక్ మాత్రమే కాదు.. మహర్షి టీజర్ లోనూ మహేష్ బుక్స్ చేతిలో పట్టుకుని కాలేజ్ లో అలా నడిచొస్తుంటే... ఆ స్టైలిష్ నడక, అందానికే అమ్మాయిలు పడిపోతారనిపిస్తుంది. మరి కాలేజ్ లో అల్ల్లరి నరేష్ తో స్నేహం చేసే మహేష్ బాబు తర్వాత విదేశాలకు వెళ్లిపోతాడని ఒక స్టోరీ ప్రచారంలోఉంది.ఫారిన్ షెడ్యూల్ లో...అది నిజం కాకపోతే.. మహర్షికి సంబంధించిన భారీ షెడ్యూల్ ఒకటి అమెరికాలో ప్లాన్ చేసాడు వంశీ పైడిపల్లి. కానీ కొన్ని కారణాలతో మహేష్ మహర్షి టీం యూఎస్ షెడ్యూల్ లేట్ అవుతూ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 2వ వారం నుంచి మహర్షి ఫారిన్ షెడ్యూల్ షూటింగును అమెరికాలో ప్రారంభించనున్నారు. 25 రోజుల పాటు అక్కడ జరగనున్న షూటింగులో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు, రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అయితే నిన్నటివరకు మహేష్ స్టూడెంట్ గురించే డిస్కర్షన్ జరిగింది. తాజగా మహేష్ బాబు మహర్షిలో స్టూడెంట్ మాత్రమే కాకుండా ఓ కంపెనీకి సీఈవో గా కూడా కనిపించబోతున్నాడట.సీఈవో లుక్ లో...ఒక ఐటి కంపెనీ లో మహేష్ బాబు సీఈవో గా కనిపిస్తాడని.. యూఎస్ లో జరిగే షూటింగ్ లో మహేష్ ఐటి కంపెనీ, సీఈవో సీన్స్ నే వంశీ పైడిపల్లి చిత్రీకరించబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. మరి ఇప్పటికే మహేష్ బాబు స్టూడెంట్ లుక్ లో ఇరగదీసాడు. ఇక యంగ్ సీఈవో లుక్ లో ఎలా ఉండబోతున్నాడో అంటూ మహేష్ ఫ్యాన్స్ అప్పుడే... ఊహించేసుకుంటున్నారు. ఇకపోతే పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.
https://www.telugupost.com/movie-news/heroin-in-naga-chaitanya-film-98632/
'నిన్నుకోరి' లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మనకు అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య - సమంత నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ రెండు రోజుల కిందటే వైజాగ్ లో పూర్తి చేసుకుంది. మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సమంతతో పాటు మరో హీరోయిన్ కూడా ఇందులో నటిస్తుందంట. తాజా సమాచారం ప్రకారం సెకండ్ హీరోయిన్ కూడా ఉందంట. ఆమె పేరు 'దివ్యాన్షా కౌశిక్'. ఫస్ట్ హాఫ్ మొత్తం నాగ చైతన్యతో రొమాన్స్ చేయనుంది 'దివ్యాన్షా కౌశిక్'. సమంత మెయిన్ హీరోయిన్ అయితే ఈమె సెకండ్ హీరోయిన్ అవుతుంది.తెలుగుతెరకు కొత్త హీరోయిన్ గా...ఈమె పాత్ర కోసం దర్శకనిర్మాతలు చాలామందిని చూశారు కానీ ఎవరు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అయితే ఒక ఆడిషన్ లో సమంతనే ఈ అమ్మాయిని ఎంపిక చేసిందట.ఈనెల 26వ తేదీ నుంచి మరో షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఇందులో దివ్యాన్షా కౌశిక్ జాయిన్ కానుందని చెబుతున్నారు. మరి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఈ అమ్మడుకి మరిన్ని అవకాశాలు రావాలని ఆశిద్దాం. ఈమె పాత్ర సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని చెబుతున్నారు.
https://www.telugupost.com/politics/mp-vemireddy-flexis-were-removed-by-unidentified-persons-1365612
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం మరింత ముదురుతోంది. మంత్రి కాకాణి గోవర్థన్ ఫ్లెక్సీ తొలగింపు గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది అనుకుంటుండగా.. మరో ఘటన జరిగింది. గత రాత్రి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు. వేమిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. మద్దతుదారులు నెల్లూరులోని ముత్తుకూరు రోడ్ సర్కిల్ లో ఫ్లెక్సీ పెట్టారు.ఆ ఫ్లెక్సీలను ఎవరో చింపేయడంతో ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ఇటీవల మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దాంతో ఆయన మద్దతుదారులు ఫ్లెక్సీలు పెట్టగా.. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తొలగించారు. వైసీపీలో అంతర్గత విబేధాల కారణంగా మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరులే వాటిని తొలగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఫ్లెక్సీ వివాదం ఎంతదూరం వెళ్తుందో.. ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.
https://www.telugupost.com/movie-news/అవి-అన్ని-ఫేక్-న్యూస్-61187/
మొదటి నుండి 'సాహో' చిత్రం ఏదొ ఒక వార్త వచ్చి ఫ్యాన్స్ ని ఖంగారు పెట్టిస్తోంది. దుబాయ్ లో షూటింగ్ చేయాలనుకున్న 'సాహో' టీంకు ఇంకా పర్మిషన్ రాలేదని దాని వల్ల షూటింగ్ లో మరింత జాప్యం జరగవచ్చు అనే వార్తలు కొన్ని వెబ్ సైట్స్ లో రావడంతో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది.విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ చిత్ర షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడం అనుమతులు రాకపోవడం గాని ఏది జరగలేదు. అవ్వని ఫేక్ న్యూస్ అని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. అనుకున్నట్టుగానే మార్చ్ 20 నుంచి యూరప్ - దుబాయ్ లలో సాహో షూటింగ్ నిర్విరామంగా జరగబోతోంది. షెడ్యూల్ లో కొద్ది మార్పులు జరిగాయి తప్ప ప్లానింగ్ లో ఎటువంటి మార్పు ఉండదని సమాచారం.ఓ రెండు పాటల చిత్రీకరణ కూడా ఇందులోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో చాలా కీలకమైన యాక్షన్ సన్నివేశాలు దర్శకుడు సుజిత్ షూట్ చేయబోతున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ ఎహ్సాన్ లాయ్ మొదటిసారి తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారు
https://www.telugupost.com/movie-news/mahanati-savitri-movie-68094/
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సావిత్రి బయో పిక్ 'మహానటి' సినిమా వచ్చేనెల 9 నే విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు.. తమిళనాడు ప్రేక్షకులు మహా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తే.. మిగతా కేరెక్టర్స్ కోసం కూడా స్టార్ నటులే నటించారు. సమంత, నాగ చైతన్య, షాలిని పాండే, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు వంటి నటీనటులు ఈ సినిమాలో భాగమైనప్పటికీ అందరి చూపు కీర్తి సురేష్ అంటే సావిత్రి పాత్రధారి మీదే ఉంటుంది. అయితే ఈ సినిమా చెయ్యడానికి నాగ్ అశ్విన్ చాలా రీసెర్చ్ చేసాడు. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరిని కలిసి సావిత్రి గారి గురుంచిన విషయాలు తెలుసు కోవడమే కాదు... ఇంకా సావిత్రితో పాత పరిచయాలున్న చాలామందిని కలిసి నాగ్ అశ్విన్ 'మహానటి' కోసం సమాచారం సేకరించాడు.అయితే కొంతమంది సినిమాలు చేస్తున్నప్పుడు కొంతమంది రైటర్ దగ్గరనుండి అయినా ... లేదంటే ఏదన్నా నవల నుండి అయిన కథ తీసుకుంటే.. అందుకోసం కథ హక్కుల కింద కొంత డబ్బు వారికీ ఇస్తుంటారు. మరి ప్రస్తుతం సావిత్రి మీద రాసిన పుస్తకాల హక్కులకు ఎంతో కొంత రాయల్టీ ఆమె కూతురు చాముండేశ్వరి కి ఇస్తూనే ఉంటారు. అయితే సావిత్రి బయో పిక్ గా సినిమా తీస్తే మరి ఆమెకి ఎంతో కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మహానటి నిర్మాత స్వప్న దత్ సావిత్రి బయో పిక్ చేస్తునందుకు గాను విజయ చాముండేశ్వరి డబ్బేమ్ ఇచ్చినట్టు లేదనే టాక్ వినబడుతుంది. మరి సినిమాపై ఉన్న అంచనాలో మంచి లాభాలు వస్తే ఎమన్నా సావిత్రి గారి కూతురుకి స్వప్న దత్ వాళ్ళు డబ్బిస్తారేమో చూడాలి.మహానటి సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే మహానటి సినిమా ఎంతో ఘనంగా తెరకెక్కినా... జమున వంటి వాళ్ళు మాకు కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా సావిత్రి బయో పిక్ ని ఎలా తీస్తారంటూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక కీ రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా మహానటి సావిత్రి గారి గురించి మాట్లాడుతూ.. సావిత్రి మనసు చాలా సున్నితం .. అసలు సావిత్రి గారు ఎవరికీ భయపడేవారు కాదు. కష్టాల్లో వున్నవారికి తనవంతు సాయం చేశారు. ఆమె ప్రేమించాలనుకున్నారు .. ప్రేమను పొందాలనుకున్నారు .. ఆ తరువాతే సూపర్ స్టార్ కావాలనుకున్నారు. కానీ ఆమెను చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. అలా ఆమెను తిట్టిన వాళ్లంతా నా దగ్గరికి వస్తే .. మహానటి సినిమా ఆడియో లాంచ్ పాస్ లు ఇస్తాను. తనని విమర్శించిన వాళ్లు ఈ వేడుకకి వస్తే సావిత్రి ఆత్మ సంతోషిస్తుంది అంటూ సెటైరికల్ గా మట్లాడాడు.
https://www.telugupost.com/movie-news/no-movies-scheduled-to-release-for-dashara-festival-169097/
ఎప్పుడూ దసరా కి సినిమాల హడావిడి మాములుగా ఉండేది కాదు. భారీ సినిమాల దగ్గరనుండి చిన్న చితక సినిమాల వరకు దసరా సెలవలని టార్గెట్ చేసేవి. ఏపీ, తెలంగాణ లలో దసరా సెలవలు ఎలా లేదన్నా 15 రోజులుంటాయి. పిల్లలు ఖాళీ కాబట్టి పేరెంట్స్ చచ్చినట్టుగా సినిమాకి వెళ్లాల్సిందే. అందుకే పెద్ద సినిమాలు ఎక్కువగా దసరనే టార్గెట్ చేస్తుంటాయి. కానీ ఈ దసరా మాత్రం కరోనా కాలంలో కొట్టుకుపోయింది. సినిమాలన్ని ఇప్పుడు దసరా పండగ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. థియేటర్స్ దసరాకి ఓపెన్ చేస్తారనే న్యూస్ ఉన్నప్పటికీ.. కరోనా తో ఎంతమంది థియేటర్స్ కి వస్తారో తెలియదు. అందులోనూ థియేటర్స్ ఓపెన్ చేసినా ఆక్యుపెన్సీ ఉండదు. కరోనా టైం లో థియేటర్స్ ని మాటిమాటికి శానిటైజ్ చేసి శుభ్రంగా ఉంచాలంటే తలకు మించిన భారం. అందుకే ఇప్పుడు చాలామంది దర్శకనిర్మాతలు కరోనా టీకా వచ్చే వరకు ఆగలేనివారు తమ సినిమాలను ఓటిటికి బేరం పెడుతున్నారు. కానీ మా సినిమా ఎలాగైనా థియేటర్స్ లో విడుదల చేద్దామనుకునేవారు మాత్రం సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాయి. దసరా వదిలి వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి ఎన్ని సినిమాలు పోటీ ఉన్నా లెక్క చెయ్యం మేము మాత్రం థియేటర్స్ లో వస్తామంటున్నారు. ఎలాగూ డిసెంబర్ కల్లా కరోనా వ్యాక్సిన్ ఓ కొలిక్కి వస్తుంది. దానితో ప్రేక్షకులు భయం లేకుండా బయటకు వస్తారు. అందుకే దసరా ని పక్కనపడేసి ఇప్పుడు అందరూ సంక్రాంతే ముద్దుగా అంటున్నారు. సో వచ్చే సంక్రాతి సినిమాల హడావిడి మాత్రం ఓ రేంజ్ లోనే ఉండబోతుంది. ఇక సంక్రాతి బారి అనే మాట వింటున్నది మాత్రం నితిన్ రంగ్ దే, పవన్ వకీల్ సాబ్ , తమిళంలో విజయ్ మాస్టర్ సినిమాల్తో పాటు అప్పటికి మరెన్ని లిస్ట్ లోకోస్తాయో చూడాలి.
https://www.telugupost.com/movie-news/డోనరుడి-పోస్ట్-ప్రొడక్షన-5202/
హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోన‌రుడా..!. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో రాని వీర్య‌దానం అనే కాన్సెప్ట్‌తో సినిమా రూపొందుతుండ‌టం సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ఈ చిత్రంలో ఇన్‌ఫెర్టిలిటీ డాక్ట‌ర్ ఆంజ‌నేయులుగా త‌నికెళ్ల‌భ‌ర‌ణి సంద‌డి చేస్తున్నారు. ప‌ల్ల‌వి సుభాష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా...చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ - ''నరుడా డోన‌రుడా సినిమా కాన్సెప్ట్ తెలుగు ఆడియెన్స్‌కు చాలా కొత్త‌గా ఉంటుంది. నాగార్జున‌గారు విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌, మ‌హేష్ బాబు విడుద‌ల చేసిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు టు మిలియ‌న్ వ్యూస్ రావ‌డం ఆనందంగా ఉంది. ఈ రెస్పాన్సే సినిమాపై ఆడియెన్స్ ఎంత ఆస‌క్తిగా ఉన్నార‌నే విష‌యాన్ని తెలియజేస్తుంది. సుమంత్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణిగారు, ప‌ల్ల‌వి సుభాష్‌, సుమ‌న్‌శెట్టి స‌హా ప్ర‌తి పాత్ర విల‌క్ష‌ణంగా ఉంటుంది. సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. వీలైనంత త్వ‌ర‌గా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.ఈ చిత్రంలో శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ శేషు, సుంక‌ర‌ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సినిమాటోగ్ర‌ఫీః షానియల్ డియో, మ్యూజిక్ః శ్రీర‌ణ్ పాకాల‌, ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్ః రామ్ అర‌స‌వెల్లి, డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః డా. అనిల్ విశ్వ‌నాథ్‌, నిర్మాత‌లుః వై.సుప్రియ‌, సుధీర్ పూదోట‌, ద‌ర్శ‌క‌త్వంః మ‌ల్లిక్ రామ్‌.
https://www.telugupost.com/movie-news/love-track-between-the-contestants-in-bigg-boss-season-5-has-not-started-yet-202099/
బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ల మధ్య ఇంకా లవ్ ట్రాక్ ప్రారంభం కాలేదు. అయితే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ మాత్రం తన లవ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. నాగార్జునకు కొందరు కంటెస్టెంట్లు షణ్ముఖ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. షణ్ముఖ్ దిండుపైన అతని లవర్ పేరు ఉంటుందని చెప్పారు. ఎవరు నీ లవర్ అని నాగ్ ప్రశ్నించగా దీప్తి అని సమాధానమిచ్చాడు. గత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ అయిన దీప్తి సునయనతో షణ్ముఖ్ జస్వంత్ లవ్ లో పడ్డాడు. కొన్ని ఏళ్లుగా సాగుతున్న ఈ లవ్ బ్రేకప్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ షణ్ముఖ్ జస్వంత్ మాత్రం తన లవర్ దీప్తి సునయన అని చెప్పి వదంతులకు తెరదించాడు.
https://www.telugupost.com/top-stories/campaign-that-the-ys-jagan-government-will-issue-orders-to-prevent-the-cbi-from-entering-apl-has-gained-momentum-1472474
అవును .. ఇప్పుడు ఇదే ప్రచారం. సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. జగన్ ప్రభుత్వం సీబీఐని ఏపీలోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. వైఎస్ వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు జగన్ ను సీబీఐని బ్యాన్ చేసే దిశగా ఆలోచింప చేస్తున్నాయని చెబుతున్నారు. కేవలం ఏకపక్షంగా సీబీఐ విచారణ జరుగుతుందని వైసీీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వాస్తవాలను పట్టించుకోకుండా కొందరి మాటలను నమ్మి సీబీఐ అధికారులు ఏకపక్షంగా విచారణ చేయడాన్ని జగన్ కూడా తప్పు పట్టినట్లు తెలిసింది. ఈ మేరకు ముఖ్య నేతల వద్ద ఆయన సీబీఐ పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైసీపీ నేతలు సీబీఐ మీద చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే సీబీఐని ఏపీలోకి రాకుండా నిషేధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.ముఖ్యులతో భేటీ...ఈ నేపథ్యంలోనే జగన్ డీజీపీతోనూ ప్రభుత్వ సలహాదారులతోనూ సమావేశమై సీబీఐ పనితీరుపై చర్చించారని చెబుతున్నారు. గత చంద్రబాబు పాలనలో సీబీఐని రాకుండా ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని భావించి సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జగన్ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత ఆ జీవోను తొలగించింది. ఏపీలో సీబీఐ అధికారుల విచారణకు అనుమతిచ్చింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో జగన్ కూడా చంద్రబాబు తరహాలోనే సీబీఐని బ్యాన్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. లేని పోని చికాకులను కల్గించే లక్ష్యంతోనే సీబీఐ పనిచేస్తుందని వైసీపీ నేతలు కూడా నమ్ముతున్నారు.తెలంగాణలో ఇప్పటికే...ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో సీబీఐని బ్యాన్ చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైరం పెట్టుకున్న తర్వాత అనవసర కేసులు చుట్టుముడుతాయేమోనని కేసీఆర్ సర్కార్ సీబీఐని తెలంగాణలో నిషేధించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అక్కడ కేసు నమోదు కావడంతో వారు కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు విచారించారు. అంతే తప్ప తెలంగాణలో నమోదయిన కేసులపై విచారణ చేయడానికి వీలులేదు. ఇక అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తే తప్ప. ఇలా తెలంగాణలోనూ సీబీఐ నిషేధానికి గురయింది. సీబీఐ అధికారులు విచారణ చేయాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఫాంహౌస్ లో ఎమ్మెల్యే కొనుగోలు విషయంలోనూ కోర్టు ఆదేశించినప్పటికీ సీబీఐకి సిట్ అధికారులు దాని వివరాలను అందించలేదు. ఇంకా నిర్ణయం...?ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కాదు. రానున్న ఏడాది కాలంలో మరెన్నో ఇలా బయటకు వచ్చి తమను రాజకీయంగా ఇబ్బంది పెడతాయని భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోనూ జగన్ కు సంబంధాలు అంతగా మంచిగా లేవన్న ప్రచారమూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీబీఐని రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉత్తర్వులు జారీ చేయడంపై పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. ' సీబీఐని ఇప్పటికిప్పుడు బ్యాన్ చేస్తే కేవలం వివేకా హత్యకేసు కోసమే చేసినట్లవుతుందన్న సంశయమూ లేకపోలేదు. అలాగే చంద్రబాబుకు తనకు తేడా ఉండదని అనుకుంటే జగన్ ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చని అంటున్నారు. అయితే దీనిపై కసరత్తు మాత్రం వైసీపీ సర్కార్ లో జరుగుతుందని తెలిసింది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
https://www.telugupost.com/movie-news/allu-arjun-pushpa-movie-actor-jagadish-is-arrested-news-details-1507948
Pushpa Jagadish : అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో హీరో పక్కన స్నేహితుడిగా 'కేశవ' అనే పాత్రలో నటించి మంచి ఫేమ్ ని సంపాదించుకున్న నటుడు జగదీశ్. తాజాగా ఈ నటుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారని సమాచారం. జగదీశ్ కారణంగా ఒక మహిళ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. అసలు ఏమైంది..?హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక మహిళ జూనియర్ ఆర్టిస్ట్ ని జగదీష్ బెదిరింపులకు గురి చేశాడట. గత నెల 27న ఆ మహిళ ఒక వ్యక్తితో ఉన్న సమయంలో.. జగదీశ్ ఆమెకు తెలియకుండా కొన్ని ఫోటోలు తీశాడట. ఆ ఫోటోలను చూపిస్తూ ఆమెను బెదిరిస్తూ వచ్చాడట. దీంతో ఆ మహిళ తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందట.మహిళ మరణంతో జగదీశ్ పరారీ అయ్యాడట. అయితే పోలీసులు అతని కనిపెట్టి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప సినిమాతో ఓవర్ నైట్ గుర్తింపుని సంపాదించుకున్న జగదీశ్.. ఇలా ఒక మహిళ మరణానికి కారణం అవ్వడం ఏంటి..? అసలు నిజంగా ఏం జరిగిందని అందరూ అరా తీస్తున్నారు.కాగా పుష్ప 2 సినిమా షూటింగ్ కి ఇటీవలే కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఈ మూవీలో జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ అమ్మోరు గెటప్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ గెటప్ తో డాన్స్ వేయడంతో పాటు పవర్ ఫుల్ ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్ కూడా చేయనున్నారు. మూవీలో ఈ సీక్వెన్స్ హైలైట్ కావడంతో.. అల్లు అర్జున్ గంటల తరబడి ప్రాక్టీస్ చేశారట. రెస్ట్ లేకుండా ప్రాక్టీస్, వెంటనే షూటింగ్ లో పాల్గొనడంతో అల్లు అర్జున్ కి తీవ్రమైన వెన్ను నొప్పి వచ్చిందట. దీంతో డాక్టర్స్ రెస్ట్ అవసరం అని చెప్పడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.
https://www.telugupost.com/movie-news/పాట‌ల-చిత్రీక‌ర‌ణ‌లో-ప్-29149/
ప్ర‌తి మ‌నిషి కి కెరీర్ మీద కాన్సెంట్రేషన్ వుండాలి. అలాఅని మ‌న లైఫ్ లో కెరీర్ ఒక భాగం మాత్రమే. అనే విషయాన్ని విలువలతో తెలియ‌జెప్పే కుటుంబ కథా చిత్రం ప్రేమతో మీ కార్తీక్. రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్లో గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. రిషి ఈ చిత్రానికి దర్శకుడు. కార్తికేయ, సిమ్రత్, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పృథ్వీ, ప్రగతి, సుమిత్ర, రఘు కారమంచి, శత్రు, మధునందన్, ఝాన్సీ, ప్రియ, జయవాణి, ఫణి, నర్సింహరాజు, కోటేశ్వరరావు, రాఘవ తదితరులు నటించారు. చిత్ర షూటింగ్ పూర్తయింది.ప్రస్తుతం పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అతిత్వ‌ర‌లో టీజ‌ర్, ఆడియో లు విడుద‌ల చేయ‌నున్నారు.ఈ సందర్భంగా లైన్ ప్రోడ్యూస‌ర్ అశోక్‌రెడ్డి గుమ్మ‌కొండ‌ మాట్లాడుతూ...." ప్రేమతో మీ కార్తీక్ చిత్రాన్ని దర్శకుడు రిషి అందమైన కథతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు. కెరీర్, ప్రేమ, కుటుంబాల మధ్య ఉండే సంబంధాల్ని చక్కగా చూపించారు. ఈ చిత్రంతో మంచి దర్శకుల లిస్టులో రిషి చేరతాడని భావిస్తున్నాం. భలే భలే మగాడివోయ్ తర్వాత మురళీ శర్మ అంత అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ చేశారు. గొల్లపూడి మారుతి రావు గారు చాలా కాలం తర్వాత ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. సంసారం ఓ చ‌ద‌రంగం చిత్రం త‌రువాత ఆ రేంజి పాత్ర‌లో ఆయ‌న క‌నిపిస్తున్నారు. మలయాళంలో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రెహమాన్ అందించిన పాటలు హైలైట్ గా నిలుస్తాయి. సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సినిమాటోగ్రఫీ మరో హైలైట్ గా ఉంటుంది. ప్ర‌స్తుతం పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. అతిత్వ‌ర‌లో టీజ‌ర్ ని ఆడియో ని విడుద‌ల చేసి చిత్రాన్ని వేస‌వి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం." అని అన్నారు.నటీనటులు - కార్తికేయ, సిమ్రత్, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పృథ్వీ, ప్రగతి, సుమిత్ర, రఘు కారమంచి, శత్రు, మధునందన్, ఝాన్సీ, ప్రియ, జయవాణి, ఫణి, నర్సింహరాజు, కోటేశ్వరరావు, రాఘవ తదితరులు నటించారు.సాంకేతిక నిపుణులుసంగీతం - షాన్ రెహమాన్సినిమాటోగ్రఫి - సాయి ప్రకాష్ ఉమ్మడి సింగుఎడిటర్ - మధుఆర్ట్ - హరి వర్మ,మేకప్ - నాగు తాడలకాస్ట్యూమ్స్ - నాగురమణ శ్రీ ఆర్ట్స్సమర్పణ- గీతా మన్నంలైన్ ప్రొడ్యూసర్ - అశోక్ రెడ్డి గుమ్మకొండనిర్మాతలు - రమణ శ్రీ గుమ్మ కొండ, రవీందర్ గుమ్మకొండరచన, దర్శకత్వం - రిషి
https://www.telugupost.com/crime/disha-app-helping-anganwadi-teacher-in-andhrapradesh-east-godavari-district-1510859
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపదలో ఉన్న మహిళలను దిశ యాప్ కాపాడుతున్న సంఘటనల గురించి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. తాజాగా దిశ యాప్ తూర్పు గోదావరి జిల్లాలో అంగన్వాడి టీచర్ ను వేధించిన ఆగంతకుడిని కటకటాల పాలు చేసింది. నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని వెంకటకృష్ణ గా గుర్తించారు. వెంకటకృష్ణ పై 354 A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు రంగంపేట పోలీసులు.దొంతమూరు గ్రామంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. బాధిత మహిళ దిశ యాప్ కు కాల్ చేసి సహాయం కోరింది. కేవలం ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే దొంతమూరు గ్రామానికి దిశా పోలీసులు చేరుకున్నారు. బాధిత అంగన్వాడీ టీచర్ ఇచ్చిన వివరాల ప్రకారం విచారణ చేసిన పోలీసులు స్థానికంగా నివాసముండే వెంకటకృష్ణ అనే వ్యక్తి వేధింపులకు పాల్పడినట్టు తెలుసుకున్నారు. అంగన్వాడి టీచర్, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంపేట పోలీసులు వెంకటకృష్ణ పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 354 A కింద వెంకటకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. దిశా పోలీసులు ధైర్యం చెప్పి భరోసా కల్పించారని బాధిత మహిళ తెలిపింది. నిందితునిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేశారని వివరించింది. అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్న సమయంలో దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని అనేకమందికి సూచించానని.. ఇప్పుడు తనకు అదే దిశ యాప్ రక్షణ కవచంలా ఉపయోగపడిందని సంతోషం వ్యక్తం చేసింది.
https://www.telugupost.com/andhra-pradesh/is-telugu-desam-party-will-adopt-a-dual-stance-in-the-matter-of-party-defections-1551433
చాలా అవాంతరాలు, ఒడిదుడుకుల నడుమ ఎట్టకేలకు టీడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.... ఒకానొక సందర్భంలోటీడీపీ పార్టీ భూస్థాపితం అవటం ఖాయమని అందరూ అనుకున్నారు...కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ....2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని, చరిత్ర సుష్టించింది...ఈ నేపథ్యంలో... చంద్రబాబు పార్టీ ని కట్టుదిట్టమైన విధానాలతో ముందుకు నడిపిస్తున్నారు... ఇంతకుముందు ప్రభుత్వం చేసిన తప్పులను సరి దిద్దుతూ... తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు...!! ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో.... ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు... వేరే ఏ పార్టీ నుండి అయినా తమ పార్టీకి రావాలనుకునే నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు.., ముందు తమ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరాలని అల్టిమేటం జారీ చేశారు.దానికి అనుగుణంగానే....ఇతర పార్టీల నుండి వచ్చే నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీ వైపు రావడానికి మొగ్గు చూపుతున్నారు.ఎందుకంటే... పార్టీ ఫిరాయింపుల విషయంలో...2014-19 చంద్రబాబు ప్రభుత్వం లో ఒక మాయని మచ్చ పడిపోయింది...2019 లో పార్టీ దారుణంగా ఓటమి పాలై..23 స్థానాలకి పడిపోయినపుడు .., అప్పట్లో చాలా మంది పార్టీ ఫిరాయింపులు కూడా ఒక రకమైన కారణంగా చెప్పేవారు..!!23 మందిని పార్టీ నుండి లాక్కున్నారు కాబట్టే...23 స్థానాలకు పార్టీని కుదించుతూ ప్రజాక్షేత్రంలో తీర్పును అందించారు అని 2019 లో అత్యధికంగా 151 స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఐదేళ్ల పాటు టీడీపీ పార్టీ ని ట్రోల్ చేశారు..!!వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను, రాజీనామా చేయించ కుండానే... టీడీపీ పార్టీ లోకి తీసుకున్నారు..!!ఈ విషయాన్ని ప్రతిపక్ష వైసిపి పార్టీ తమకి అనుకూలంగా మార్చుకుని, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంపొందించే విషయంలో సఫలీకృతం అయ్యారు.. కానీ ఇప్పుడు చంద్రబాబు అటువంటి అవకాశం విపక్షాలకు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకొనే క్రమంలో.... పార్టీ లోకి ఎవరైనా రావాలి అనుకుంటే.... రాజీనామా చేసి రావాలని పిలుపునిచ్చారు..!! కాగా తాజాగా జరిగిన పరిణామాలు చూస్తుంటే... పార్టీ పిరాయింపుల విషయంలో తెలుగు దేశం పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందా...అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి..!!తాజాగా జగ్గయ్యపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఛైర్మెన్ రంగాపురం రాఘవేంద్ర ని రాజీనామా చేయించకుండా,కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడమే....!!!!రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులను రాజీనామా చేసి టీడీపీ లోకి వచ్చేలా ఒక రూల్..,స్థానిక స్థాయి ప్రజాప్రతినిధులను రాజీనామా చేయకుండానే టీడీపీ లోకి కండువా కప్పి ఆహ్వానించడం...ఇది మరో రూల్..!!మొత్తానికి పార్టీ ఫిరాయింపుల విషయంలో తెలుగు దేశం పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని జనాలు భావిస్తున్నారు...!!!
https://www.telugupost.com/movie-news/అభిమానుల-తాకిడికి-రామ్-చ-30374/
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. విల‌క్ష‌ణ చిత్రాల దర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం పోల‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ, ' 'ఖైదీ నంబ‌ర్ 150'వ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది అంటే కార‌ణం ప్రేక్ష‌కాభిమానులే. 100 రోజులు సినిమా ఆడ‌టం అనేది ఎప్పుడో పోయింది. కానీ 'ఖైదీ నంబ‌ర్ 150'వ సినిమా 100 రో జులు ఆడింది. అది మీవ‌ల్లే. నాన్న‌గారి 151వ సినిమా ఆగ‌స్టులో ప్రారంభం అవుతుంది. ఇంత వ‌రకూ ఆయ‌న ఇలాంటి పాత్ర‌లో క‌నిపించ‌లేదు. ఓ గొప్ప పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జ‌ర‌గ‌నుంది. క‌చ్ఛితంగా పెద్ద విజ‌యం సాధిస్తుంది. అలాగే నా 'ధృవ' సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అప్పుడు దేశం డీమానిటైజేష‌న్ స‌మ‌స్య‌ లో ఉంది. అలాంటి స‌మ‌యంలో కూడా భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి అంటే కార‌ణం అభిమానులే. అందుకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయ‌న స‌మ్మ‌ర్ ను సైతం లెక్క చేయ‌కుండా అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు. అందుకు ఆయ‌న‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. బాబాయ్ ఏ కార్య‌క్ర‌మం చేసినా ఆయ‌న వెన్నంటే ఉండాలి. రాజ‌కీయ ప‌రంగానైనా..ఇంకేదైనా. భార‌త‌దేశంలో మెగా అభిమానులంతా భారీ ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. చాలా గొప్ప సేవ చేస్తున్నారు. మేము ఇంత ఎత్తుకు ఎదిగామంటే కార‌ణం మీరే. నేను హైద‌రాబాద్ లో ఉండి సినిమా షూటింగ్ చేసుకోవ‌చ్చు. కానీ మిమ్మ‌ల్ని అల‌రించాలనే క్లిష్ట‌ప‌రిస్థితులు ఎదురైనా సినిమా షూటింగ్ కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నాం. నా సినిమా విష‌యానికి వ‌స్తే .. సుకుమార్ చాలా మంచి క‌థ చెప్పారు. క‌థ‌, క‌థ‌నాలు చాలా డిఫ‌రెంట్ గా ఉన్నాయి. అందుకే సినిమాకు క‌మిట్ అయ్యా. మీ అంద‌ర్నీ అల‌రించే విధంగా సినిమా ఉంటుంది' అని అన్నారు.మెగాఫ్యాన్స్ జాతీయ అధ్య‌క్షుడు ర‌మ‌ణం స్వామినాయుడు మాట్లాడుతూ, '-గ‌త 26 రోజులు నుంచి పోల‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో, అన‌గా కొత్తూరు, టేకూరు మ‌రియు గిరిజన ప్రాంతాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌ని ప్ర‌దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. హైద‌రాబాద్ కంటే భారీ ఉష్ణోగ్ర‌త‌లు న‌మొద‌య్యే ప్రాంతాల‌లో వేడిమిని త‌ట్టుకుని చిత్ర యూనిట్ షూటింగ్ చే్స్తున్నారు. అదే విధంగా అక్క‌డ ఉన్న అద్భుత‌మైన అందాల న‌డుమ షూటింగ్ చేస్తున్నారు. క‌థ‌కు సంబంధించిన పురాతన‌మైన గ్రామాలు దొర‌క‌డం వ‌ల్ల సుకుమార్ ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. అందుకు హీరో రామ్ చ‌ర‌ణ్ ఏ మాత్రం కాద‌న‌కుండా ఎంత క‌ష్ట‌మైనా చేద్దామ‌ని టీమంతా క‌లిసి ఇక్క‌డే షూటింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి సెల్ ఫోన్లు ప‌నిచేయ‌వు. మ‌ధ్య‌లో రెండు రోజులు కొల్లేరు ప్రాంతంలో షూటింగ్ జ‌రిపారు. ఈ ప్రాంతంలో షూటింగ్ స‌మ‌యంలో భారీగా వీరాభిమానులు త‌ర‌లి రావ‌డం వ‌ల్ల వాళ్ల ధాటికి త‌ట్టుకోలేక షూటింగ్ క్యాన్సిల్ చేశారు. త‌ర్వాత కొత్తూరు లో నిన్న‌టి రోజున (ఆదివారం 23వ తేదీన‌) మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో కూడా అభిమానుల తాకిడి ఎక్కువ కావ‌డంతో షూటింగ్ ర‌ద్దు చేశారు. రోజు రోజుకి మారుమూల గ్రామాల నుంచి అభిమానులు భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. షూటింగ్ చూడ‌టానికి వ‌చ్చిన ఓ అభిమాని కుటుంబం త‌మ బాబుకి కిడ్నీ సంబంధింత వ్యాదితో బాధ ప‌డుతుంటే, ఎన్ని ఆసుప‌త్రులు తిరిగినా స‌రైన వైద్యం కుద‌ర‌కపోవ‌డంతో స్వ‌యంగా హీరో చ‌ర‌ణ్ వైద్య స‌దుపాయాలు క‌ల్పించారు. అలాగే షూటింగ్ చూడ‌టానికి వ‌చ్చిన అభిమానులంద‌రికీ ఆయ‌న భోజ‌న వ‌స‌తులు క‌ల్పించారు. వారం రోజుల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ర్టాల‌కు కొత్త అధ్య‌క్షుల‌ను కె. నాగేంద్ర‌బాబు నియ‌మించారు. ఏపీ అధ్య‌క్షుడిగా కె. రామ‌కృష్ణ (త‌ణుకు), తెలంగాణ రాష్ర్ట అధ్య‌క్షుడిగా ఏ.నంద‌కిషోర్ (సూర్యాపేట‌) ఎంపిక‌య్యారు. వారిద్ద‌ర్నీ అశేష అభిమానుల స‌మ‌క్షంలో చ‌ర‌ణ్ ప్ర‌తిపాదించి అభినందించారు' అని తెలిపారు
https://www.telugupost.com/movie-news/బాలయ్య-సరసన-నేనా-నో-నో-46428/
బాలకృష్ణ - కె ఎస్ రవికుమార్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే టాక్ వుంది. ఇకపొతే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతానికి ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ మూసాపేట్ లోని కంటైనర్ యార్డ్ లో బాలకృష్ణ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ పార్ట్ షూట్ చేశారు. ఈనెల 5న మొదలైన ఈ క్లైమాక్స్ ఎపిసోడ్.... 15 వరకు జరిగింది. తాజా షెడ్యూల్ తో సినిమాకు సంబంధించి 60శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా బాలయ్య సరసన నటిస్తున్నారు. అందులో ఒక హీరోయిన్ నటాషా దోషిని ఎంపిక చేసిన చిత్ర బృందం... మూడో హీరోయిన్ గా హరిప్రియను తీసుకుందని అంటున్నారు. అయ్యితే ఈముగ్గురు హీరోయిన్స్ మాత్రమే కాకుండా బాలయ్య సరసన నాలుగో హీరోయిన్ ఉందంటూ వార్తలొచ్చాయి. ఇక ఆ హీరోయిన్ కూడా రెజినా అని.. రెజీనా ని కూడా చిత్రం బృందం ఎంపిక చేసినట్లుగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.అయితే రెజినా... బాలయ్య సినిమాలో నటిస్తుందని వార్తలను రెజీనా ఖండించింది. తనని బాలయ్య చిత్రంలో నాలుగో హీరోయిన్ గా తీసుకున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తాను ఆ సినిమాలో నటించడం లేదని స్పష్టం చెయ్యడమే కాదు... చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది. ఇక బాలకృష్ణ చిత్రానికి కర్ణ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా... ఈ చిత్రాన్ని సంక్రాతి బరిలో నిలపడానికి బాలయ్యతో పాటే దర్శకుడు రవికుమర్ కూడా కృషి చేస్తున్నారు.