link
stringlengths 46
153
| text
stringlengths 1
18.7k
|
---|---|
https://www.tupaki.com//entertainment/article/does-mahesh-know-who-parashuram-is/328719 | 'గీతగోవిందం' హిట్ తో దర్శకుడు పరశురాం ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. కథాబలంతోనే సినిమా 100 కోట్ల వసూళ్లని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ చూసే సూపర్ స్టార్ మహేష్ 'సర్కారు వారి పాట' కి పనిచేసే అవకాశం కల్పించారు అన్నది వాస్తవం. లేదంటే మహేష్ సక్సెస్ లు లేని వారిని అస్సలు దగ్గరకి కూడా రానివ్వరు.సక్సెస్ లు ఇచ్చి ఫెయిలైన వారిని సైతం దరి చేరనివ్వరు. ఈ లిస్ట్ లో పూరి జగన్నాధ్..శ్రీను వైట్లని చెప్పుకొవచ్చు. కేవలం సక్సెస్ లు..ఫామ్ ని కొనసాగించే మేకర్స్ కే మహేష్ అవకాశం ఇస్తారు. అలా పరశురాం మహష్ కాంపౌండ్ లో వచ్చి చేరారు అన్నది వాస్తవం. అంతకు ముందు పరశురాం గీతా ఆర్స్ట్ లో రెండు సినిమాలకు పనిచేసారు. శిరీష్ తో 'శుభమస్తు'.. విజయ్ తోనూ సినిమా చేసాడు. అప్పటి నుంచి ఆ సంస్థతో ...అల్లు అరవింద్ తో మంచి రిలేషన్ కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో పరశురాం బన్నీతో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారంలోకి వచ్చింది. బన్నీ కి కొన్ని కథలు చెప్పాడనని కానీ అతనికి నచ్చపోవడంతో తగ్గాల్సి వస్తోందని...ఆ క్రమంలోల సర్కారు వారి కథ కూడా బన్నికి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. తాజాతా ఈ ప్రచారాన్ని పరశురాం కొట్టి పారేసారు. ఇది కేవలం మహేష్ ని ఓన్ చేసుకుని రాసుకున్న కథ. ఎవరికీ చెప్పలేదు.''ఈ కథ విన్న ఒకే ఒక్కడు మహేష్. ఆయనకి కథ నచ్చింది. అందుకే సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేసారు. ఆయన మాత్రమే చేయగల పాత్ర. ఆయన కోసమే పుట్టిన కథ ఇది. నిజానికి మహష్ కి -నాకు అస్సలు పరిచయమే లేదు. నేను అప్పాయింట్ మెంట్ తీసుకునే సరికి నేను ఎవర్నో అతనికి తెలియదు. కేవలం నా కథ నచ్చి ఆయన సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అని తెలిపారు. మహేష్ తో సినిమా చేయడం పరశురాం కల.పూరి జగన్నాధ్ ని స్పూర్తిగా తీసుకుని పరశురాం పరిశ్రమకి వచ్చారు. తొలుత పూరి వద్దనే సహాయ దర్శకుడిగా పనిచేసారు. కొంత ప్రావీణ్యం వచ్చిన తర్వాత వేర్వేరు దర్శకుల వద్ద పనిచేసి మేకర్ గా పట్టుసాధించారు. అటుపై దర్శకుడిగా చిన్న సినిమాలతో ప్రయాణం మొదలు పెట్టి నేడు మహేష్ నే డైరెక్ట్ చేసారు. ఈ జర్నీలో ఎన్నో సాదకబాధకాలున్నాయి.పరశురాం తదుపరి ప్రాజెక్ట్ యువ సామ్రాట్ నాగచైతన్యతో ఉంటుంది. వాస్తవానికి 'గీతగోవిందం' పూర్తయిన వెంటనే చై ప్రాజెక్ట్ నే సెట్స్ పైకి తీసుకెళ్లాలి. కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు చై కోసం రాసుకున్న కథతోనే ముందుకు వెళ్లబోతున్నారు పరశురాం. |
https://www.tupaki.com//entertainment/article/nani-remuneration/206103 | స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. స్టార్ల రెమ్యూనరేషన్ విషయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే..నిర్మాతలకు వచ్చే లాభనష్టాలతో సంబంధం లేకుండా వారి రెమ్యూనరేషన్లు పైపైకి ఎగబాకుతుంటాయి. టాప్ లీగ్ స్టార్లే కాదు.. మీడియం లీగ్ లో టాప్ పొజిషన్లో ఉన్న న్యాచురల్ స్టార్ నాని రెమ్యూనరేషన్ ఈమధ్య ఒక హాట్ టాపిక్ అయింది.న్యాచురల్ స్టార్ రెమ్యూనరేషన్ ఎంత ఉండొచ్చని అనుకుంటున్నారు? ప్రస్తుతం చేస్తున్న 'జెర్సీ' సినిమాకు నాని రూ. 10 కోట్లు + ప్రాఫిట్స్ లో 30% షేర్ తీసుకుంటున్నాడని టాక్. 'జెర్సీ' సినిమాకు ఉన్న డిమాండ్ ను బట్టి.. జరిగే బిజినెస్ ను బట్టి ఆ 30% షేర్ దాదాపుగా రూ. 4 కోట్ల వరకూ ఉండొచ్చని సమాచారం. అంటే ఓవరాల్ గా 'జెర్సీ' సినిమాతో నాని రూ. 14 కోట్లు తన పాకెట్లో వేసుకుంటున్నట్టు లెక్క. సినిమా సూపర్ హిట్ అయినా నిర్మాతకు ఈ రేంజ్ రెవెన్యూ ఉంటుందో లేదో తెలియదు.నాని ఒక సినిమా రెమ్యూనరేషన్ ఇది. సినిమాలు చేయడంలో నాని జెట్ స్పీడ్ అని అందరికీ తెలిసిందే. సంవత్సరానికి నాని మినిమం రెండు సినిమాలు చేస్తాడు. ఒక్కోసారి మూడు సినిమాలు కూడా చేస్తాడు. రెండు సినిమాలు కనుక చేస్తే నాని దాదాపుగా 27 నుండి 28 కోట్లు వస్తాయి. ఇక మూడు సినిమాలైతే దానికి ఇంకో 13-14 కోట్లు కలపాలి. ఈ లెక్కన సినిమాల ద్వారా నాని సంపాదించేది సూపర్ స్టార్ మహేష్ బాబు సంపాదన కంటే ఎక్కువ. ఎందుకంటే మహేష్ ఒక ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనం. ఒక్కోసారి సినిమా పూర్తి చేయడానికి ఒకటిన్నర ఏడాది కూడా తీసుకుంటాడు. మహేష్ రెమ్యూనరేషన్ ప్రాజెక్టును బట్టి రూ. 20 నుండి 25 కోట్లు ఉంటుంది. యాడ్స్ ద్వారా మహేష్ కు వచ్చే రెవెన్యూ పక్కనబెట్టి సినిమా రెమ్యూనరేషన్ మాత్రమే చూసుకుంటే ఒక ఏడాదికి సూపర్ స్టార్ కంటే న్యాచురల్ స్టార్ సంపాదించేది ఎక్కువ. నాని గారి వరస అలా ఉంది! |
https://www.tupaki.com//entertainment/article/heroines-in-nagarjuna-ram-gopal-varma-movie/171713 | ఓ సినిమాలో హీరో - హీరోయిన్ అనగానే.. వాళ్లిద్దరి మధ్యా రొమాన్సులు.. పాటలు ఊహించేసుకోవడంలో ఆశ్చర్యం లేదు. పైగా అక్కినేని నాగార్జున లాంటి మన్మథుడి సినిమాలో అంటే.. ఈ డోస్ ఇంకొంచెం ఎక్కువగానే ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు నాగ్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున కొత్త సినిమా స్టార్ట్ అయింది. ఓ 10 రోజుల పాటు షూటింగ్ కూడా చేసేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ పై రకరకాల న్యూస్ వినిపిస్తున్నాయి. మొదటగా టబును హీరోయిన్ గా తీసుకుంటారని అన్నారు. టబు ఇప్పుడు బాగా సీనియర్ అయిపోవడంతో.. నాగ్ కు బాగా అచ్చొచ్చిన అనుష్కను ఫిక్స్ చేశారనే టాక్ కూడా వినిపించింది. ఇప్పుడు లేటెస్ట్ గా యూనిట్ నుంచి వినిపిస్తున్న మాటేమిటంటే.. ఈ సినిమాలో అసలు నాగార్జునకు హీరోయిన్ ఉండదట. పోలీస్ పాత్రలో కనిపించే నాగార్జునకు.. రొమాంటిక్ సన్నివేశాలే ఉండవని అంటున్నారు.అలాగని ఈ సినిమాలో హీరోయిన్ ఉండదని కాదు. ఆ రోల్ ఉంటుంది కానీ.. నాగార్జునకు జోడీగా మాత్రం ఉండదట. సినిమాకి అత్యంత కీలకమైన పాయింట్ ఇదేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రోల్ కోసం ఓ టాప్ హీరోయిన్ ను తీసుకునేందుకు వర్మ ట్రై చేస్తున్నాడు. పైగా ఈ సినిమాలో పాటలకు కూడా ఇంపార్టెన్స్ ఉండదని.. ఒక్క ఐటెం సాంగ్ తో సరిపెట్టేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. |
https://www.tupaki.com//entertainment/article/samantha-shakunthalam-movie/320630 | సమంత టైటిల్ పాత్రలో శాకుంతలం తెరకెక్కిన సంగతి తెలిసిందే. పురాణేతిహాసంలో కీలక ఘట్టానికి సంబంధించిన కథతో ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా సామ్ ఫస్ట్ లుక్ విడుదల కాగా వైరల్ గా దూసుకెళ్లింది. అసలు ఈ మూవీకి స్ఫూర్తి ఏదీ? అన్నది తెలుసుకునేందుకు జనం ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు.శతాబ్ధాల క్రితం మహాకవి కాళిదాసు నాటకం ఆధారంగా శకుంతల కథ పుట్టింది. దుష్యంత రాజుపై ఆమె ప్రేమకు సంబంధించిన కథ ఇది. గూగుల్ లేదా యూట్యూబ్ లో చూసినప్పుడు 1966లో విడుదలైన లెజెండరీ ఎన్‌టి రామారావు - సరోజా దేవి నటించిన `శకుంతల` అనే తెలుగు చిత్రం ఇమేజెస్ కనిపిస్తున్నాయి. వీకీలోనూ సమాచారం ఉంది. ఈ పౌరాణిక డ్రామా పూర్తి కథ ఏమిటో తెలుసుకోవడానికి ప్రజలు ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఇంకాస్త పూర్వపు రోజుల్లోకి వెళితే 1941లో దిగ్గజ దర్శకనటుడు శాంతారామ్ ఈ కథను సినిమాగా తీశారు. ఇందులో జయశ్రీ శకుంతలగా కనిపించింది. ప్రస్తుతం చాలా మంది తెలుగు ప్రేక్షకులు యూట్యూబ్ లో ఈ రెండు సినిమాలను చూస్తున్నారు. శాకుంతలం గురించిన లోతైన కథని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏది ఏమైనా సమంతా చిత్రం ఈ రెండు పాత క్లాసిక్ సినిమాల కోసం వెతికేందుకు కారణమైంది.సాంకేతికంగా ఇప్పుడు అంతా మారింది. వీఎఫ్ ఎక్స్ తో పాటు సౌండ్ సిస్టమ్ అంతా అడ్వాన్స్ డ్ గా ఉంది. టెక్నికల్ గా విజువల్ ఎఫెక్ట్స్ సపోర్ట్ గుణశేఖర్ కి పెద్ద ప్లస్. కేవలం కాస్ట్యూమ్స్ స్టోరీలైన్ కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం కంటే లుక్ అండ్ ఫీల్ కోణంపై ఎక్కువ దృష్టి పెట్టి సమంత నుంచి అద్భుత నటనను రాబట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. భారతదేశంలోని ఫాంటసీ సినిమాలు కేవలం గ్రాఫిక్స్ తో మాత్రమే నడిపించేయలేం.. చక్కని విజువల్స్ నాటకీయత ఎమోషన్స్ ఇవన్నీ వర్కవుటైతేనే జనాన్ని పదే పదే థియేటర్లకు రప్పించగలరు. ఇక సాంకేతికతపై మక్కువ ఉన్న గుణశేఖర్ `ట్రాయ్` రేంజులో అద్భుత విజువల్స్ ని చూపిస్తారనే అభిమానులు ఆశిస్తున్నారు. |
https://www.tupaki.com//entertainment/sreeleelacareer-1332282 | డాక్టర్ కుటుంబం నుంచి వచ్చి యాక్టరైంది శ్రీలీల. అమ్మడు అమెరికన్ పౌరురాలు. అక్కడే పుట్టి పెరిగింది. ఆమె తల్లి స్వర్ణలత పేరున్న గైనకాలజిస్ట్. అమెరికాలో స్థిరపడ్డ కుటుంబం. కానీ శ్రీలీల మాత్రం బెంగుళూ రు నుంచి తెరంగేట్రం చేసింది. తొలుత అక్కడ 'కిస్' అనే సినిమాలో నటించింది. అటుపై తెలుగులో 'పెళ్లి సందడి' సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత అమ్మడి కెరీర్ ఎంతలా పుంజుకుందో తెలిసిందే.
వరుస విజయాలతో తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా ప్రమోట్ అయింది. అయితే సినిమాలపై ఎంత ఆసక్తిగా ఉందో? చదువు అన్నా అంతే ఆసక్తి. అందుకే డాక్టర్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మడు డాక్టర్ కావాలనుకుంది. ఈ నేపథ్యంలో చదువుని ఎక్కడా అశ్రద్ద చేయలేదు.ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎంబీబీఎస్ పూర్తిచేసే పనిలో ఉంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చివరి ఏడాది పరీక్షలకు సన్నదం అవుతుంది.
ఈ నెల 18 నుంచి 24 వరకూ పైనల్ ఇయర్ పరీక్షలు ఉన్నాయిట. ఈ నేపథ్యంలో శ్రీలీల అలజడి టాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదంటున్నారు. ప్రస్తుతం పరీక్షల కోసం ముంబైలో ఉందని...ఆమె తల్లి కూడా ముంబై వచ్చిందని సమాచారం. పరీక్షలకు అవసరమైన సూచనలు...సలహాలు తీసుకుంటూ తుదిగా ఎగ్జామ్ హాల్ కి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఆ మధ్య 'భగవంత్ కేసరి' ఆన్ సెట్స్ లో నే అమ్మడు ఎంబీ బీఎస్ పుస్తకాలతో కుస్తీ పట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత శ్రీలీల తల్లితో కలిసి బెంగుళూరులోనూ సొంతంగా ఆసుపత్రి ప్రారంభించే ఆలోచనలో ఉన్నారుట. అయితే అంతకు ముందే హయ్యర్ స్టడీస్ కి వెళ్లాలా? లేక సినిమాలు కొనసాగిస్తూ ఆసుపత్రి బాధ్యతలు నిర్వర్తించాలా? అన్నది ఇంకా ఆలోచించుకులేదని ఆమె సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా... రష్యా వెళ్తే గనుక శ్రీలీల సినిమా కెరీర్ వదులుకోవాల్సిందే. |
https://www.tupaki.com//entertainment/article/yamini-bhaskar-latest-photoshoot/229870 | యామిని భాస్కర్ తెలుసు కదా? ఇప్పటి వరకూ యామిని నటించిన సినిమాల లిస్టు చూస్తే 'కొత్తగా మా ప్రయాణం'.. 'భలే మంచి చౌక బేరం' లాంటివి ఉన్నాయి. ఇవి కాకుండా 'రభస' లో కూడా నటించింది. వీటిలో మీరు ఏ సినిమానైనా చూసి ఉంటే యామిని పరిచయం ఉండే ఉంటుంది. అయితే యామిని కెరీర్లో ఇంకా హిట్ దక్కలేదు. అందుకే పెద్దగా క్రేజ్ కూడా రాలేదు. అలా అని ఊరుకుంటే ఎలా? అందుకే హాట్ ఫోటో షూట్లతో రచ్చను షురూ చేసింది. యామినికి గ్లామర్ విషయంలో మొహమాటాలు తక్కువే.. అందుకే ఫోటోలు కాస్త హాటుగానే ఉంటాయి.రీసెంట్ గా తన ఇన్‌స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "ప్రకృతి చిరునవ్వులే రంగులు" అంటూ ఒక ఫసాక్ క్యాప్షన్ ఇచ్చింది. బ్యూటీ అనగానే పెద్దగా మేథస్సు ఉండదని.. మగవారికే అది ఉంటుందని.. అందులోనూ లాల్చీలు ధరించి.. గడ్డాలు గుబురుగా పెంచి చే గువేరా.. మార్క్స్.. లెనిన్ పేర్లు చెప్తేనే మేథావులు అనే ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఇలా ప్రకృతిలోని చిరునవ్వులు గుర్తించడానికి ఎంత గొప్ప హృదయం.. మేథస్సు అవసరమో చెప్పండి? ఫోటో విషయానికి వస్తే ఒక వింత డ్రెస్ ధరించింది.. ఒక పూల డిజైన్ ఉన్న కలర్‌ఫుల్ లెహెంగా .. పైనేమో టాపో ఇన్నర్ వేరో అర్థం కాని ఒక దిశా పటాని బీరువాలలో మాత్రమే ఉండే వస్త్రం ధరించింది. నడుము మీద చెయ్యి వేసుకొని మరో చేత్తో శిరోజాలను సవరించుకుంటూ ఆకాశంలోకి చూస్తుంది. పాప అందంగానే ఉంది కానీ డ్రెస్ మాత్రం కొంచెం తేడాగానే ఉంది.ఈ ఫోటోకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "టాప్ ఎక్కడ యామిని?".. "నీకు చలి లేదా?".."ఏంది అమ్మాయి ఈ అందం.. ఊపిరి పీల్చుకునేది ఎట్లా??" ఇలా రెచ్చిపోయారు. ఈ కామెంట్లు అన్నీ బాగానే ఉన్నాయి కానీ వీటితో యామినికి ఏమీ ఉపయోగం ఉండదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు. అలా కాకుండా ఎవరైనా టాలీవుడ్ ఫిలిం మేకర్ ఈ ఫోటోలు చూస్తేనే యామిని హాటు వ్రతానికి తగ్గ ఫలితం దక్కేది! |
https://www.tupaki.com//entertainment/chiranjeevi157movie-1316482 | బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సన్నీడియోల్ దశాబ్ధ కాలంగా పూర్తి స్తబ్ధుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఖాన్ ల త్రయానికి ధీటుగా ఓ వెలుగు వెలిగిన ఈ సీనియర్ నటుడి కెరీర్ చాలా సంవత్సరాలుగా డైలమాలో ఉంది. హిట్టు నడిపించే పరిశ్రమలో అది దక్కకపోతే ఎలా ఉంటుందో సన్నీడియోల్ ఒక ఉదాహరణ. ఒక్క బ్లాక్ బస్టర్ హిట్టుతో ఇదే పరిశ్రమలో ఎంత జోష్ వస్తుందో కూడా అర్థం చేసుకోవడానికి సన్నీడియోల్ ఎగ్జాంపుల్. ఆయనకు వెల్లువెత్తుతున్న ఆఫర్లను చూస్తే అసలు విషయం తెలిసిపోతుంది.
గదర్ 2తో డియోల్ బంపర్ హిట్ కొట్టాడు. బాలీవుడ్ మొత్తం ఇప్పుడు సన్నీడియోల్ ని పొగడ్తల్లో ముంచెత్తుతోంది. ప్రముఖ హీరోలంతా ఇప్పుడు సన్నీడియోల్ ని కలిసి అభినందిస్తున్నారు. తనకు శత్రువులుగా ఉన్న చాలామంది హీరోలు గదర్ 2 విజయం సాధించాక సన్నీడియోల్ ని కలిసి మరీ అభినందించారు. ఒక్క బ్లాక్ బస్టర్ తో వీళ్లంతా తిరిగి స్నేహితులయ్యారు. ఇది వింతైన రంగల ప్రపంచం అనడానికి ఇది చాలు.
ఇప్పుడు అలాంటి ఒక బ్లాక్ బస్టర్ టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి అవసరం. పాన్ ఇండియా ట్రెండ్ లో సరైన బ్లాక్ బస్టర్ పడాల్సిన సందర్భం ఇదే. అంతేకాదు.. నేటితరం పాన్ ఇండియా స్టార్లతో పోటీపడుతూ మెగాస్టార్ 500కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాలని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే చిరు అలాంటి ఒక అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నారా? అంటే అవుననే టాక్ కూడా వినిపిస్తోంది.
మెగాస్టార్ నటించిన క్లాసిక్ హిట్ చిత్రం `జగదేక వీరుడు అతిలోక సుందరి` సీక్వెల్ గురించి చాలా కాలంగా చర్చ సాగుతూనే ఉంది. కానీ దీనికి సీక్వెల్ తీసేందుకు వైజయంతి మూవీస్ సంస్థ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కుదరలేదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ భోళా శంకర్ లాంటి ఫ్లాప్ తర్వాత కెరీర్ ని రీవ్యాంప్ చేసేందుకు ఇలాంటి ఒక క్లాసిక్ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆగస్ట్ 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన `మెగా157` బహుశా ఒక సీక్వెల్ సినిమా అంటూ ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం ఒక ఫాంటసీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. ఆకట్టుకునే కథ-కథనం ఊహాత్మక అంశాలతో నిండిన కథతో చిరంజీవి తిరిగి కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నారన్న గుసగుస వినిపిస్తోంది. కొందరు దీనిని 1990లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి సీక్వెల్ అని కూడా ప్రచారం చేస్తున్నారు.
ఫాంటసీ ఫిక్షన్ నేపథ్యంలో కథాంశాన్ని ఎంపిక చేసుకుని ఐశ్వర్యారాయ్ లాంటి అందగత్తెను ఎంపిక చేయాలని యువి క్రియేషన్స్ బ్యానర్ ప్రయత్నించడం వంటి అంశాలు నిజంగానే ఇది జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ అయి ఉంటుందన్న సందేహాల్ని రేకెత్తించాయి. అయితే దీనిపై మెగా కాంపౌండ్ ఎలాంటి లీకులు ఇవ్వలేదు. ఇది నిజంగానే నాటి మేటి క్లాసిక్ హిట్ కి సీక్వెల్ అయితే ఎంత బావుంటుందో అంటూ అభిమానులు ఆశగా ఉన్నారు. కానీ దీని గురించి అధికారికంగా చిరు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ సినిమా కథాంశం పటిష్టంగా ఉందని, దర్శకుడు వశిష్ట విజయవంతంగా స్క్రిప్ట్‌ను రూపొందించారని సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ చిత్రం చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనుందని తెలుస్తోంది.
ఇటీవలి వార్తల ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించేందుకు ఐశ్వర్యరాయ్‌ని సంప్రదించారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని, వారిలో ఐశ్వర్యరాయ్ ఒకరు అని కూడా ప్రచారం జరుగుతోంది. అనుష్క శెట్టి - మృణాల్ ఠాకూర్ ఎంపికయ్యారని కూడా టాక్ ఉంది. తారాగణానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంగీతం ఎం. ఎం. కీరవాణి స్వరాలు సమకుర్చనున్నారు.
మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన `భోలా శంకర్` తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే ఇప్పుడు ఘనమైన కంబ్యాక్ కోసం చిరు తనవంతు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇది కచ్ఛితంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ అయితే బావుంటుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ దీనిపై వైజయంతి మూవీస్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ క్లాసిక్ సీక్వెల్ తీయాలంటే కచ్ఛితంగా ఈ ప్రాజెక్ట్ వైజయంతి బ్యానర్ లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇక యువి క్రియేషన్స్ సంస్థ ఎంపిక చేసిన ఫాంటసీ స్క్రిప్టు యూనిక్ గా ఉంటుందా? లేదా చిరు నటించిన క్లాసిక్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి ప్యారలల్ గా ఉంటుందా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత స్పష్ఠత అవసరం. |
https://www.tupaki.com//entertainment/article/pv-sindhu-on-jfw-cover-page/140918 | పివి సింధు.. రీసెంట్ గా ఇండియాస్ బిగ్గెస్ట్ సెన్సేషన్. తన కంటే ర్యాంకింగ్స్ లో బెటర్ గా ఉన్న ప్లేయర్లు.. ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ప్లేయర్స్ ను దాటేసి మరీ.. ఒలిపింక్స్ లో మెడల్ సాధించిన తర్వాత సింధు డిమాండ్ బాగా పెరిగిపోయింది. క్రేజ్ విషయంలో ఈ ప్లేయర్ ని రీచ్ అవడం సీనియర్ ప్లేయర్లకు కూడా కష్టంగానే ఉంది. తాజాగా వైజాగ్ స్టీల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా సైన్ చేసిన సింధు.. ఇప్పుడో కవర్ పేజ్ లు కూడా ఎక్కేస్తోంది. జే.ఎఫ్.డబ్ల్యూ.. జస్ట్ ఫర్ విమెన్ మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజ్ పై పీవీ సింధు దర్శనం ఇచ్చేసింది. ఫ్లయింగ్ హై.. లైఫ్ ఆఫ్టర్ రియో అంటూ ఓ సుదీర్ఘమైన ఆర్టికల్ ను ఈమె గురించి ప్రచురించారు. అయితే.. కవర్ పేజ్ పై మాత్రం స్పోర్ట్స్ ప్లేయర్ గానే కాదు.. స్టైల్ ఐకాన్ గా కూడా సింధు మారిపోయింది. స్లీవ్ లెస్ టాప్.. ఫ్లవర్ డిజైన్ నెట్టెడ్ షార్ట్ బాటమ్.. నడుం కనిపించేలా డ్రసింగ్.. అబ్బో,, ఇలా డిస్క్రిప్షన్ ఇస్తే.. ఒక్క హై లెవెల్ మేకప్ లో తప్ప హీరోయిన్లకు.. మోడల్స్ కు ఏ మాత్రం తగ్గలేదు. ఒక సినిమా సక్సెస్ తో అర డజన్ కవర్ పేజ్ లు ఎక్కే హీరోయిన్స్ తో పోల్చితే.. ఏళ్ల తరబడి ఎంతో కఠోర సాధన చేసి.. అంతర్జాతీయ స్థాయి పోటీలయిన ఒలింపిక్స్ లో పతకం గెలిచిన పీవీ సింధు.. ఆ స్థానాన్ని ఆక్రమించడంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే హీరోయిన్స్ కంటే ప్లేయర్స్ నుంచే ఎక్కవగా ఇన్ స్పిరేషన్ జనాలకు అందుతుంది మరి <|hyperlink|> /Tupakidotcom/ |