sloka
stringlengths
77
449
verse
int64
1
78
chapter
int64
1
18
audio
stringlengths
59
63
w2w_meaning
stringlengths
213
1.29k
te_translation
stringlengths
127
741
commentry
stringlengths
0
11.1k
అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ । పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ ।। 29 ।।
29
10
https://www.holy-bhagava…udio/010_029.mp3
అనంతః — అనంతుడు (ఆదిశేషుడు); చ — మరియు; అస్మి — నేను; నాగానాం — నాగ జాతివారిలో; వరుణః — వరుణుడు (సముద్ర దేవత); యాదసాం — నీటి యందు వసించే జీవులలో; అహం — నేను; పితౄణాం — పితృ దేవతలలో (కాలం చేసిన పూర్వీకులు); అర్యమా — అర్యముడను; చ — మరియు; అస్మి — నేను; యమః — యమధర్మరాజును (మృత్యు దేవత); సంయమతామ్ — న్యాయ పాలన అందించే వారిలో; అహం — నేను.
BG 10.29: నాగులలో నేను అనంతుడను; నీటిలో వసించే వాటిలో వరుణుడను. పితృగణములలో నేను అర్యముడను; న్యాయ-ధర్మ పాలన అందిచే వారిలో నేను యమధర్మరాజుడను.
అనంతుడు (ఆది శేషుడు) అంటే విష్ణుమూర్తి శయనించే నాగుపాము. ఆయనకి పదివేల పడగలు ఉన్నాయి. ఆయన ప్రతియొక్క తలతో, భగవంతుని మహిమలను సృష్టి ప్రారంభం నుండి గానం చేస్తున్నాడు కానీ ఆ వివరణ ఇంకా పూర్తి అవ్వలేదు అని చెప్పబడుతున్నది. వరుణుడు అంటే సముద్ర దేవత. అర్యముడు అంటే అదితి యొక్క మూడవ పుత్రుడు. ఆయనని పితృగణముల నాయకునిగా పూజిస్తారు. యముడు అంటే మృత్యు దేవత. మరణించిన పిదప శరీరము నుండి ఆత్మను తీసికెళ్ళే వ్యవహారం చూసుకుంటాడు. ఈ జన్మలో ఆత్మ చేసిన వాటికి అనుగుణంగా వచ్చే జన్మలో శిక్షలను లేదా ఉత్తమగతులను, భగవంతుని తరఫున అందిస్తాడు. అవి ఎంత భయంకరముగా, బాధాకరముగా ఉన్నా తన ధర్మం నుండి కొద్దిగా కూడా తప్పడు. సంపూర్ణ దోషరహిత న్యాయము అందించే వానిగా ఆయన భగవంతుని యొక్క మహిమను/విభూతిని ప్రకటిస్తున్నాడు.
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ । మృగాణాం చ మృగేంద్రోఽహం వైనతేయశ్చ పక్షిణామ్ ।। 30 ।।
30
10
https://www.holy-bhagava…udio/010_030.mp3
ప్రహ్లాదః — ప్రహ్లాదుడు; చ — మరియు; అస్మి — నేను; దైత్యానాం — దైత్యులలో (రాక్షసులలో); కాలః — కాలము; కలయతాం — నియంత్రించే వాటి అన్నిటిలో; అహం — నేను; మృగాణాం — మృగములలో; చ — మరియు; మృగ-ఇంద్రః — సింహము; అహం — నేను; వైనతేయ — గరుత్మంతుడు; చ — మరియు; పక్షిణామ్ — పక్షులలో.
BG 10.30: దైత్యులలో నేను ప్రహ్లాదుడను; అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును. నేనే, మృగములలో సింహమును మరియు పక్షులలో గరుత్మంతుడను అని తెలుసుకొనుము.
మహాశక్తి శాలి అయిన రాక్షస రాజు హిరణ్యకశిపుడి పుత్రుడిగా ప్రహ్లాదుడు జన్మించాడు. కానీ, అతను అతి గొప్ప విష్ణు భక్తులలో ఒకనిగా అయ్యాడు. అందుకే, రాక్షసులలో ప్రహ్లాదుడు భగవంతుని యొక్క విభూతిని ప్రకటిస్తున్నాడు. కాలము అనేది విశ్వములోని అత్యంత బలమైన, గొప్ప అస్తిత్వాలను కూడా లోబరుచుకుంటుంది. గంభీరమైన సింహము అడవికి రారాజు, మరియు జంతువులలో భగవంతుని యొక్క శక్తి సింహములో వ్యక్తమవుతుంటుంది. గరుడుడు (గరుత్మంతుడు) విష్ణుమూర్తి యొక్క దివ్య వాహనము మరియు పక్షులలో కెల్లా గొప్ప వాడు.
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ । ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ।। 31 ।।
31
10
https://www.holy-bhagava…udio/010_031.mp3
పవనః — వాయువు; పవతామ్ — పవిత్రమొనర్చే వాటిలో; అస్మి — నేను; రామః — రాముడను; శస్త్ర-భృతామ్ — శస్త్రములు కలిగున్నవారిలో; అహం — నేను; ఝషాణాం — జల జీవులలో; మకరః — మొసలి; చ — మరియు; అస్మి — నేను; స్రోతసామ్ — ప్రవహించే నదులలో; అస్మి — నేను; జాహ్నవీ — గంగా నదిని.
BG 10.31: పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును; శస్త్రధారులలో రాముడను. జల జంతువులలో మకరమును (మొసలి), మరియు ప్రవహించే నదులలో గంగా నదిని.
ప్రకృతిలో, వాయువు (గాలి) పవిత్రమొనర్చే పనిని చక్కగా నిర్వర్తిస్తుంది. అది మలినమైన నీటిని నీటి ఆవిరిగా చేస్తుంది; భూమిపై ఉండే ఏదేనీ దుర్గంధమును తీస్కువెల్లిపోతుంది; ఆక్సిజన్ (ప్రాణవాయువు) ను ఇచ్చి అగ్నిని మండేట్టుగా చేస్తుంది. ఈ విధంగా అది ప్రకృతిలో ఒక గొప్ప పవిత్రమొనర్చే పదార్థము. శ్రీరామచంద్రప్రభువు భూమిపై అత్యంత శక్తివంతులైన యోధులలో ఒకడు ఆయన విల్లు అత్యంత ప్రాణాంతకాయుధము. అయినా ఆయన ఒక్కసారి కూడా తన శాసించే ఉన్నత స్థాయిని దుర్వినియోగం చేయలేదు. తను ఆయుధం ఉపయోగించినప్పుడల్లా, అది మంచి కోసం మాత్రమే. అందుకే ఆయన శస్త్రధారులలో సర్వోన్నతుడు. రాముడు భగవంతుని అవతారము కూడా, అందుకే శ్రీ కృష్ణుడు ఆయనను తనగా సూచిస్తున్నాడు. భగవంతుని పాదముల నుండి పుట్టిన గంగానది ఒక పవిత్రమైన నది. అది స్వర్గ లోకముల నుండి భూమి పైకి దిగినది. ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులు ఆ నది యొక్క ఒడ్డున తపస్సు ఆచరించారు, ఇది దాని నీటి పవిత్రతను మరింత ఇనుమడింపచేసింది. సాధారణ నీటి లాగా కాకుండా, గంగా నది యొక్క నీళ్ళని ఒక బిందెలో పట్టిఉంచితే, అది ఎన్ని సంవత్సరాలయినా పాడుకాదు. పూర్వ కాలంలో ఇది ఎంతో ప్రస్ఫుటంగా గమనించదగేటట్టుగా ఉండేది, ఇప్పటి కాలంలో కోట్ల లీటర్ల కాలుష్యకారకాలని గంగానదిలో కలిపేయటం వలన ఈ ప్రభావం కొంచెం తగ్గింది.
సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున । అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ ।। 32 ।।
32
10
https://www.holy-bhagava…udio/010_032.mp3
సర్గాణామ్ — సమస్త సృష్టిలో; ఆదిః — మొదలు (ఆది); అంతః — చివర; చ — మరియు; మధ్యం — మధ్య; చ — మరియు; ఏవ — నిజముగా; అహం — నేను; అర్జున — అర్జునా; అధ్యాత్మ విద్యా — ఆధ్యాత్మిక విద్య; విద్యానాం — విద్యలలో; వాదః — తర్కబద్ధ నిర్ణయము; ప్రవదతామ్ — వాదన లో; అహం — నేను.
BG 10.32: ఓ అర్జునా, నేనే సమస్త సృష్టికి ఆది, మధ్య, మరియు అంతము అని తెలుసుకొనుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని, మరియు సంవాదములలో తర్కబద్ధ నిర్ణయమును నేనే.
ఇంతకు క్రితం 20వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు తానే సర్వ ప్రాణుల ఆది, మధ్యము, మరియు అంతము అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు, అదే విషయాన్ని సమస్త సృష్టికి చెప్తున్నాడు: ‘సృష్టి చేయబడినది అంతా - ఆకాశము, గాలి, అగ్ని, నీరు, మరియు భూమి కలిపి సర్గ అంటారు. నేనే వీటన్నిటికీ సృష్టికర్త (ఆది), స్థితికర్త (మధ్య), మరియు లయకర్తను (అంతము). కాబట్టి, సృష్టి, స్థితి, మరియు లయ ప్రక్రియలపై, అవి నా విభూతులుగా ధ్యానం చేయవచ్చు. విద్యా అనేది ఒక వ్యక్తి సంపాదించుకునే శాస్త్రపరమైన జ్ఞానము. శాస్త్రములు పద్దెనిమిది రకముల విద్యలను విశదీకరించాయి. వాటిలో, ప్రాధానమైనవి పద్నాలుగు: అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః. పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహ్యేతాశ్చతుర్దశ ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వశ్చైవ తే త్రయః అర్థశాస్త్రం చతుర్థం తు విద్యా హ్యష్టాదశైవ తాః (విష్ణు పురాణం 3.6.27-28) ‘శిక్షా, కల్ప, వ్యాకరణం, నిరుక్తి, జ్యోతిషం, ఛందస్సు - ఈ ఆరింటిని వేదాంగములు (వేదముల యొక్క అంగములు) అంటారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము - ఇవి నాలుగు వేద శాఖలు. మీమాంస, న్యాయ, ధర్మ శాస్త్రములు, మరియు పురాణములు కలిపి మొత్తం పద్నాలుగు ప్రధాన విద్యలు.’ ఈ విద్యలు అధ్యయనం చేయటం బుద్ధిని పెంపొందించి, జ్ఞానాన్ని వృద్ధి చేసి మరియు ధర్మ మార్గ అవగాహన పెంచుతాయి. అంతేకాక, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనుష్యులను భౌతిక ప్రాపంచిక బంధాలనుండి విముక్తి చేసి వారికి అమరత్వం ప్రసాదిస్తుంది. ఈ విధంగా, ఇది ఇంతకు ముందు చెప్పిన విద్యల కంటే ఉన్నతమైనది. ఇదే విషయం శ్రీ మద్భాగవతంలో కూడా చెప్పబడింది: సా విద్యా తన్మతిర్యయా (4.29.49వ శ్లోకం) ‘భగవంతుని పాదారవిందముల పట్ల బుద్ధికి అనురక్తిని కలిగించేదే అత్యుత్తమ విద్య.’ వాదోపవాదములు మరియు తర్కములో, జల్ప అంటే, తన అభిప్రాయం స్థిరపరచటం కోసం ఎదుటివాని యొక్క మాటలలో లోపము పట్టుకోవటం. వితండము అంటే సత్యముపై సరియైన చర్చకు అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటూ అర్థంపర్థం లేకుండా వాదించటం. వాదము అంటే చర్చకు తర్కబద్ధమైన ముగింపు ఇవ్వటం. ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవటానికి, సత్యమును స్థిరపరచటానికి తర్కమే ప్రధాన ఆధారము. మానవ సమాజంలో జ్ఞానాన్ని సునాయాసంగా పెంపొందించుకోవటానికి మరియు ఉపదేశించటానికి తర్కబద్ధమైన స్పృహయే మూలాధారం. విశ్వవ్యాప్త మైన తర్కబద్ధ సూత్రములే భగవంతుని శక్తికి నిదర్శనం.
అక్షరాణామకారోఽస్మి ద్వంద్వః సామాసికస్య చ । అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః ।। 33 ।।
33
10
https://www.holy-bhagava…udio/010_033.mp3
అక్షరాణాం — అన్ని అక్షరములలో కెల్లా; అ-కారః — అ-కారము; అస్మి — నేను; ద్వంద్వః — ద్వంద్వమును; సామాసికస్య — సమాసములలో; చ — మరియు; అహం-ఏవ — నేనే; అక్షయః — తరిగిపోని; కాలః — కాలము; ధాతా — సృష్టికర్తలలో; అహం — నేను; విశ్వతః-ముఖః — బ్రహ్మ.
BG 10.33: అక్షరములలో అ-కారమును; సమాసములలో ద్వంద్వ సమాసమును. నేనే అపరిమితమైన కాలమును, మరియు సృష్టికర్తలలో బ్రహ్మను.
సంస్కృతములో అన్ని అక్షరములు కూడా సగం అక్షరాన్ని ‘అ’ కారముతో కలిపి ఏర్పరచబడ్డాయి. ఉదాహరణకి, ‘క్ + అ = క’ (क् + अ = क ; k + a = ka). కాబట్టి, అ-కారము అనేది సంస్కృత అక్షరమాలలో చాలా ప్రాముఖ్యమైనది. ‘అ’ అనేది అక్షరమాలలో మొదటి అచ్చు, అంతేకాక అచ్చులను హల్లుల కంటే ముందే రాస్తారు కాబట్టి ‘అ’ అనేది మొట్టమొదట వచ్చే అక్షరం. సంస్కృతము అనేది చాలా ప్రాచీనమైన భాష అయినా, అది అత్యంత నాగరికమైనది మరియు అధునాతనమైనది. సంస్కృత భాషలో ఒక సాధారణమైన ప్రక్రియ ఏమిటంటే, కొన్ని పదాలు కలిపి ఒక సమాసపదముగా చేయటం. ఒక మిశ్రమ పదము తయారుచేయటంలో రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ పదాలు ఏకమైతే, ఆ వచ్చే పదాన్ని సమాస-పదము అంటారు. ప్రముఖంగా ఆరు రకాల సమాసములు ఉన్నాయి: 1) ద్వంద్వ, 2) బహువ్రీహి, ౩) కర్మ ధారయ, 4) తత్పురుష, 5) ద్విగు, 6) అవ్యయీ భావ. వీటిలో ద్వంద్వము శ్రేష్ఠమయినది, ఎందుకంటే రెండు పదాలకి సమాన ప్రాధాన్యత ఉంటుంది, వేరే వాటిలో, ఒక పదమే ప్రధానంగా ఉంటుంది లేదా రెండు పదాలు కలిసి మూడో పదానికి అర్థం ఇస్తుంది. రాధా-కృష్ణ అనేది ద్వంద్వ పదానికి ఒక ఉదాహరణ. శ్రీ కృష్ణుడు అది తన విభూతిగా ప్రముఖంగా ప్రకటిస్తున్నాడు. సృష్టి అనేది అత్యత్భుతమైనది మరియు వీక్షించటానికి అబ్బురపరిచే ఒక ప్రక్రియ. మానవ జాతి యొక్క అత్యంత అధునాతన సాంకేతిక ఆవిష్కరణలు కూడా జగత్ సృష్టితో పోల్చితే అత్యల్పముగా అనిపిస్తాయి. కాబట్టి, సమస్త జగత్తును తయారుచేసిన బ్రహ్మయే, తన సృజనాత్మకతతో, అందరి సృష్టికర్తలలో కెల్లా, భగవంతుని మహిమను అద్భుతంగా ప్రదర్శించాడు అని శ్రీ కృష్ణ పరమాత్మ అంటున్నాడు.
మృత్యుః సర్వహరశ్చాహమ్ ఉద్భవశ్చ భవిష్యతామ్ । కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ।। 34 ।।
34
10
https://www.holy-bhagava…udio/010_034.mp3
మృత్యుః — మరణము; సర్వ-హరః — సర్వమును కబళించే; చ — మరియు; అహం — నేను; ఉద్భవః — మూలమును; చ — మరియు; భవిష్యతామ్ — భవిష్యత్తులో వచ్చేటివి; కీర్తిః — కీర్తి; శ్రీః — సిరి; వాక్ — చక్కటి వాక్కు; చ — మరియు; నారీణాం — స్త్రీ లక్షణములలో; స్మృతిః — జ్ఞాపకశక్తి; మేధా — మేధస్సు; ధృతిః — ధైర్యము; క్షమా — క్షమాగుణము.
BG 10.34: సర్వమునూ కబళించే మృత్యువును, నేనే, ఇకముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తిస్థానమును. స్త్రీ లక్షణములో నేను కీర్తిని, సిరిసంపదను, చక్కటి వాక్కును, జ్ఞాపకశక్తిని, మేధస్సు, ధైర్యము, మరియు క్షమాగుణమును.
ఆంగ్లములో ఒక నానుడి ఉంది ‘యాస్ ష్యూర్ యాస్ డెత్’ (as sure as death) ‘మరణమంత ఖచ్చితముగా’ అని. పుట్టిన వాడికి మరణము తప్పదు. సమస్త జీవము తప్పకుండా మరణముతోనే ముగుస్తుంది, అందుకే ఆంగ్లంలో ‘డెడ్ ఎండ్’ (dead end) అనే మాట కూడా ఉంది. భగవంతుడు కేవలం సృష్టి చేసే శక్తి కలవాడే కాదు; ఆయనే నాశనం చేసే శక్తి కూడా. సమస్తమునూ మృత్యు రూపంలో కబళించి వేస్తాడు. జనన-మరణ చక్రంలో, చనిపోయిన వారు మరల పుడుతారు. ఇక ముందు వచ్చే వాటికి కూడా వ్యూహకర్తను తానే అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. కొన్ని లక్షణములు స్త్రీల వ్యక్తిత్వానికి అలంకారముగా చెప్పబడుతాయి, మరికొన్ని గుణములు పురుషులలో ప్రత్యేకంగా మెచ్చదగినవిగా చెప్పబడుతాయి. నిజానికైతే అసలు, ఈ రెండు రకాల గుణములు కలిగి ఉండటమే సంపూర్ణ వ్యక్తిత్వము. ఇక్కడ, శ్రీ కృష్ణుడు - కీర్తి, సిరిసంపద, మంచి వాక్కు, జ్ఞాపక శక్తి, మేధస్సు, ధైర్యము, మరియు క్షమాగుణము - అనే లక్షణములు స్త్రీలను గొప్పవారిగా చేస్తాయి అంటున్నాడు. ఇందులో మొదటి మూడు గుణములు బాహ్యంగా వ్యక్తమవుతాయి, మరియు తరువాతి నాలుగు ఆంతర భూషణములు. ఇవే కాక, మానవ జాతికి మూలపురుషుడైన ప్రజాపతి దక్షుడుకి ఇరవైనాలుగు మంది కుమార్తెలు. ఇందులో ఐదుగురు ఉత్తమ స్త్రీలగా పరిగణించబడుతారు - కీర్తి, స్మృతి, మేధ, ధృతి, మరియు క్షమ. శ్రీ అనే ఆమె భృగు మహర్షి కూతురు. వక్ అనే ఆమె బ్రహ్మ యొక్క కుమార్తె. వీరి వీరి పేర్లకు అనుగుణంగా ఈ ఏడుగురు స్త్రీలు, ఈ శ్లోకంలో చెప్పబడిన ఏడు గుణములకు అధ్యక్ష దేవతలు. ఇక్కడ, శ్రీ కృష్ణుడు ఈ గుణములను తన విభూతిగా పేర్కొంటున్నాడు.
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ । మాసానాం మార్గశీర్షోఽహమ్ ఋతూనాం కుసుమాకరః ।। 35 ।।
35
10
https://www.holy-bhagava…udio/010_035.mp3
బృహత్-సామ — బృహత్సామము; తథా — కూడా; సామ్నాం — సామ వేద మంత్రములలో; గాయత్రీ — గాయత్రీ మంత్రము; ఛందసామ్ — ఛందస్సులలో; అహం — నేను; మాసానాం — పన్నెండు నెలలలో; మార్గ-శీర్షః — మార్గ శీర్ష మాసము (నవంబరు-డిసెంబరు నెలలలో ఉండేది); అహం — నేను; ఋతూనాం — ఋతువులలో; కుసుమ-ఆకరః — వసంత ఋతువును.
BG 10.35: సామవేద మంత్రములలో నేనే బృహత్సామము అని తెలుసుకొనుము; ఛందస్సులలో గాయత్రీఛందస్సు నేనే. హైందవ పంచాంగంలో మార్గశీర్ష మాసమును, మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును.
ఇంతకు పూర్వం శ్రీ కృష్ణుడు వేదములలో, అద్భుతమైన కీర్తనలను కలిగి ఉన్న సామవేదము తానే అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు, సామవేదములో తానే శ్రేష్ఠమైన మాధుర్యము మెండుగా కలిగిన బృహత్సామమును అని అంటున్నాడు. సాధారణంగా దీనిని మధ్యరాత్రి సమయంలో పాడుతారు. సంస్కృత భాష, ఇతర భాషల్లో లాగా, పద్యాలు రాయటానికి విలక్షణమైన ప్రాస మరియు ఛందస్సు కలిగి ఉంది. వేదాల్లోని శ్లోకాలు/పద్యాలు ఎన్నెన్నో ఛందస్సులలో ఉన్నాయి. వీటిలో గాయత్రీ ఛందస్సు చాలా ఆకర్షణీయమయినది మరియు మధురమైనది. ఈ ఛందస్సులో ఉన్న చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక మంత్రము గాయత్రీమంత్రము. చాలా నిగూఢమైన భావము కలిగినది ఈ మంత్రము: భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యమ్ భర్గో దేవస్య ధీమహి ధీయో యో నః ప్రచోదయాత్ (ఋగ్వేదము 3.62.10) ‘ముల్లోకాలనూ ప్రకాశింప చేయుచున్న, ఆరాధ్యుడైన ఆ భగవంతుని పై మేము ధ్యానం చేస్తాము. ఆయనే సకల పాపములనూ నిర్మూలించేవాడు మరియు అజ్ఞానమును నశింపచేసేవాడు. ఆయనే మా బుద్ధిని సరియైన మార్గంలో ప్రచోదనం చేయుగాక.’ గాయత్రీ మంత్రము అనేది మగపిల్లల ఉపనయన సంస్కారములో ఒక భాగము, దీన్ని ప్రతిరోజూ సంధ్యావందన సమయంలో జపిస్తారు. వేదములలో - దేవీ గాయత్రి, రుద్ర గాయత్రి, బ్రహ్మ గాయత్రి, పరమహంస గాయత్రి మరియు ఇంకా చాలా ఇతర గాయత్రీ మంత్రములు కూడా మనకు కనిపిస్తాయి. మార్గశీర్షము అనేది హైందవ పంచాంగములో తొమ్మిదవ మాసము. అది నవంబరు-డిసెంబరు మాసాల్లో వస్తుంది. భారత దేశంలో ఆ సమయంలో ఉష్ణోగ్రత మరీ అంత వేడిగా ఉండదు లేదా మరీ అంత చల్లగా ఉండదు. వ్యవసాయ క్షేత్రాలలో పంట కోత సమయమది. అందుకే ఇది చాలామంది జనులకు ఇష్టమైన మాసము. వసంత ఋతువును, ఋతు-రాజు అంటారు (the king of seasons). ప్రకృతి, ఆహ్లాదకరంగా తన జీవత్వాన్ని ప్రస్ఫుటంగా చూపించే కాలము అది. వాతావరణం లోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ వసంత ఋతువులో చాలా పండుగలు జరుపుకుంటారు. ఈ విధంగా, ఋతువులలో వసంత ఋతువు భగవంతుని యొక్క విభూతిని/ఐశ్వర్యమును చక్కగా వ్యక్తీకరిస్తుంది.
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ । జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ।। 36 ।।
36
10
https://www.holy-bhagava…udio/010_036.mp3
ద్యూతం — జూదము; ఛలయతామ్ — మోసగాళ్ళలో; అస్మి — నేను; తేజః — తేజస్సు; తేజస్వినాం — తేజోవంతులలో; అహం — నేను; జయః — జయము; అస్మి — నేను; వ్యవసాయః — దృఢ సంకల్పమును; అస్మి — నేను; సత్త్వం — సద్గుణము; సత్త్వవతామ్ — ధార్మికులలో; అహం — నేను.
BG 10.36: మోసగాళ్ళలో జూదమును నేను; తేజోవంతులలో తేజస్సును నేను. విజయులలో విజయమును నేను మరియు సంకల్పము కలవారిలో దృఢసంకల్పమును, ధర్మపరాయణులలో సద్గుణమును నేనే.
శ్రీ కృష్ణుడు సద్గుణాలే కాక దుర్గుణమును కూడా తన విభూతియే అని పేర్కొంటున్నాడు. జూదము అనేది ఒక ప్రమాదకరమైన చెడు అలవాటు, అది కుటుంబాలని, వ్యాపారాలని, మరియు జీవితాలని నాశనం చేస్తుంది. జూదం పట్ల యుధిష్ఠిరుడి బలహీనతే మహాభారత యుద్ధానికి దారి తీసింది. మరిక జూదము కూడా భగవంతుని మహిమే అయితే అది హానికరం కాదా, మరి అది ఎందుకు నిషేధించబడ్డది? దీనికి సమాధానం ఏమిటంటే భగవంతుడు తన శక్తిని జీవాత్మకి ప్రసాదిస్తాడు, దానితో పాటుగా, నచ్చిన పని చేయటం ఎంచుకోవటానికి స్వేచ్ఛ కూడా ఇస్తాడు. మనం ఆయనను మర్చిపోవటం ఎంచుకుంటే, మరిచిపోయే శక్తిని ఇస్తాడు. ఇది ఎలాగంటే, విద్యుత్ శక్తిని ఇంటిని వెచ్చచేయటానికి లేదా చల్లబరచటానికి రెంటికీ వాడుకోవచ్చు. వినియోగదారుడు ఆ విద్యుత్-శక్తిని ఎలా వాడుకోవాలో వాని ఇష్టం. కానీ, ఆ విద్యుత్తును సరఫరా చేసిన విద్యుత్ కేంద్రానికి, ఆ శక్తిని వినియోగదారుడు సద్వినియోగం చేసినా లేదా దుర్వినియోగం చేసినా, దానితో సంబంధం లేదు. అదే విధంగా, జూదగానికి కూడా భగవంతుడు ఇచ్చిన తెలివితేటలు, సామర్థ్యము ఉంటాయి. కానీ, భగవంతుడు ప్రసాదించిన ఆ కానుకని దుర్వినియోగం చేస్తే, ఆ పాపపు పనులకు భగవంతుడిది బాధ్యత కాదు. ప్రతివారికి విజయం సాధించటం ఇష్టం; అది భగవంతుని మహిమను తెలియపరుస్తుంది. అంతేకాక, శ్రీ కృష్ణుడు దృఢ సంకల్పము అనే గుణానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది ఇంతకు క్రితం 2.41వ, 2.44వ, మరియు 9.30వ శ్లోకాలలో చెప్పబడింది. సత్పురుషులలో ఉండే మంచితనం కూడా భగవంతుని శక్తికి నిదర్శనమే. అన్ని సద్గుణాలు, కార్యసిద్ధి, కీర్తి, విజయము మరియు దృఢసంకల్పము - ఇవన్నీ భగవంతుని నుండి ఉద్భవించినవే. వీటిని మనవే అని అనుకోకుండా, అవి భగవంతుని నుండే వచ్చినవి అని గమనించాలి.
వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాండవానాం ధనంజయః । మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ।। 37 ।।
37
10
https://www.holy-bhagava…udio/010_037.mp3
వృష్ణీనాం — వృష్ణి వంశస్థులలో; వాసుదేవః — కృష్ణుడు, వసుదేవుని తనయుడు; అస్మి — నేను; పాండవానాం — పాండవులలో; ధనంజయః — అర్జునుడు, సంపదలని జయించేవాడు; మునీనాం — మునులలో; అపి — కూడా; అహం — నేను; వ్యాసః — వేద వ్యాసుడను; కవీనాం — తత్త్వవేత్తలు/జ్ఞానులలో; ఉశనా — శుక్రాచార్యుడు; కవిః — జ్ఞాని.
BG 10.37: వృష్ణి వంశస్థులలో నేను కృష్ణుడను మరియు పాండవులలో అర్జునుడిని. మునులలో వేద వ్యాసుడను అని తెలుసుకొనుము మరియు గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను.
శ్రీ కృష్ణ భగవానుడు భూ-లోకంలో వృష్ణి వంశములో వసుదేవుని పుత్రునిగా జన్మించాడు. ఏ జీవాత్మయైనా భగవంతుడిని కంటే మించినది కాదు కాబట్టి, సహజంగానే, వృష్ణి వంశములో, ఆయనే అత్యంత మహిమాన్వితుడైన వ్యక్తి. పాండవులు అంటే పాండు రాజు యొక్క ఐదుగురు పుత్రులు - యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, మరియు సహదేవుడు. వీరిలో అర్జునుడు సాటిలేని ప్రతిభావంతుడైన విలుకాడు మరియు శ్రీ కృష్ణుడి యొక్క సన్నిహిత భక్తుడు. భగవంతుడిని తన ప్రియ మిత్రునిగా భావించాడు. వేద వ్యాసుడు మునులలో విశేషమైన ప్రాముఖ్యత కలవాడు. ఆయనకు ‘బాదరాయణుడు’ మరియు ‘కృష్ణ ద్వైపాయనుడు’ అని కూడా పేర్లు కలవు. ఆయన వైదిక జ్ఞానాన్ని ఎన్నో రకాలుగా ప్రకటితం చేసాడు మరియు ఎన్నో పురాణాలను మానవుల సంక్షేమం కోసం వ్రాసాడు. నిజానికి, వేద వ్యాసుడు, శ్రీ కృష్ణుడి అవతారమే, ఇంకా శ్రీమద్ భాగవతంలో పేర్కొనబడిన అవతారాలలో వేద వ్యాసుడు ఒకరు. శుక్రాచార్యుడు ఏంతో పాండిత్యం కలిగిన ముని; నీతి/ఆచార శాస్త్రాలలో ప్రావీణ్యంతో ఖ్యాతి గడించాడు. దయాళువై, రాక్షసులని తన శిష్యులుగా చేసుకుని వారి పురోగతికై దిశానిర్దేశం చేసాడు. ఆయన ప్రావీణ్యం వలన ఆయన ఒక భగవంతుని విభూతి అని చెప్పబడ్డాడు.
దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ । మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ।। 38 ।।
38
10
https://www.holy-bhagava…udio/010_038.mp3
దండః — దండము; దమయతామ్ — న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో; అస్మి — నేను; నీతిః — సత్ప్రవర్తన; అస్మి — నేను; జిగీషతామ్ — విజయము సాధించాలనే అభిలాష కలవారికి; మౌనం — మౌనము; చ — మరియు; అస్మి — నేను; గుహ్యానాం — రహస్యములలో; జ్ఞానం — జ్ఞానము; జ్ఞాన-వతామ్ — జ్ఞానులలో; అహం — నేను.
BG 10.38: న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్దమైన శిక్షను, జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తనను. రహస్యములలో నేను మౌనమును. జ్ఞానులలో జ్ఞానమును నేనే.
మానవ స్వభావం ఎలాంటిదంటే, జనులలో మంచి నడవడిక కోసం కేవలం ధర్మోపదేశం మాత్రమే సరిపోదు. సరియైన సమయంలో న్యాయబద్ధంగా ఇవ్వబడిన దండన, పాపిష్ఠి ప్రవర్తన యొక్క సంస్కరణకు, మరియు మంచి నడవడిక శిక్షణకు, సహకరించే ముఖ్యమైన ఉపకరణము. దీని లక్ష్యాల్లో ఒకటేమిటంటే, సమాజంలో చెడు పనులను చేయటం వైపు మొగ్గు చూపే వారిని నిరోధించుట. ఒక్క నిమిషమైనా ఇవ్వబడిన సరియైన దండన లేదా ఒక్క నిమిషం అయినా ఇవ్వబడిన పారితోషకం జనుల ప్రవర్తనను ఎలా సంస్కరిస్తుందో ఆధునిక మేనేజ్మేంట్ సిద్ధాంతం మనకు వివరిస్తున్నది. విజయం కోసం ఉండే కోరిక విశ్వవ్యాప్తమైనది, కానీ నిశ్చలమైన సత్ప్రవర్తన కలవారు దాని కోసం నీతి/నిజాయితీలను పణంగా పెట్టరు. ధర్మబద్ధమైన మార్గంలో సాధించిన విజయం భగవంతుని శక్తికి నిదర్శనం. రహస్యము అంటే ఒక ప్రయోజనం కోసం సాధారణంగా అందరి జనులకు తెలియకుండా ఉంచబడిన విషయం. ఆంగ్ల భాషలో ఒక నానుడి ఉంది, ‘రహస్యం ఒక్క మనిషికే తెలిస్తే అది రహస్యం; ఇద్దరికి తెలిసిన రహస్యం ఇక అది రహస్యం కాదు; మరియు ముగ్గురికి తెలిసిన రహస్యం అంటే మిగతా ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పబడిన వార్త లాంటిది.’ ఈ విధంగా అత్యంత రహస్యం ఏమిటంటే మౌనములో దాగి ఉన్నదే. ఆధ్యాత్మిక జ్ఞానము పరిణితి చెందిన కొద్దీ, ఆత్మ లేదా భగవత్ ప్రాప్తి ద్వారా వ్యక్తికి నిజమైన జ్ఞానము వస్తుంది. ఇది ప్రసాదించబడిన వ్యక్తి - అన్నీ సంఘటనలను, మనుష్యులను, మరియు వస్తువులను భగవత్ సంబంధముగా చూస్తాడు. ఇటువంటి జ్ఞానము వ్యక్తిని పవిత్రం చేస్తుంది, పరిపూర్ణుడిని, సంతుష్టుడిని చేసి, వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి చేరుస్తుంది. అది జీవితానికి చక్కటి దిశానిర్దేశం చూపిస్తుంది, సుఖదుఃఖాలని ఒడుదుడుకులని తట్టుకునే శక్తిని ఇస్తుంది. అంతిమ లక్ష్యము సాధించేవరకు పట్టుదలతో ఉండే సంకల్ప బలాన్ని ఇస్తుంది. జ్ఞానులలో ప్రకటితమయ్యే జ్ఞానము తానే అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున । న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ ।। 39 ।।
39
10
https://www.holy-bhagava…udio/010_039.mp3
యత్ — ఏదైతే; చ — మరియు; అపి — కూడా; సర్వ-భూతానాం — సర్వ భూతముల యొక్క; బీజం — బీజమును; తత్ — అది; అహం — నేను; అర్జున — అర్జున; న, తత్ ఆస్తి — అది ఉండదు; వినా — లేకుండా; యత్ — ఏది; స్యాత్ — ఉండునో; మయా — నేను; భూతం — భూతములు (ప్రాణులు/జీవులు); చర-అచరమ్ — కదిలేవైనా కదలనివి అయినా.
BG 10.39: సర్వ భూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే, అర్జునా. చరాచర ప్రాణి ఏదీ కూడా నేను లేకుండా ఉండలేదు.
సమస్త సృష్టికి నిమిత్త కారణము (efficient cause) మరియు ఉపాదాన కారణము (material cause) రెండూ కూడా శ్రీ కృష్ణుడే. నిమిత్త కారణము (efficient cause) అంటే జగత్తుని సృష్టించి వ్యక్తపరచటానికి కావలసిన పని చేసే సృష్టికర్త ఆయనే. ఉపాదాన కారణము (material cause) అంటే సృష్టికి కావాల్సిన పదార్థము వచ్చేది ఆయన నుండే అని. 7.10వ మరియు 9.18వ శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు తనను తాను ‘సనాతన బీజమును’ అని ప్రకటించుకున్నాడు. మరల ఇక్కడ తనే ‘ఉత్పాదక బీజమును’ అని కూడా పేర్కొంటున్నాడు. తనే సమస్తమునకూ మూలహేతువు, మరియు ఆయన శక్తి లేకుండా దేనికీ అస్తిత్వము ఉండదు అని ఆయన వక్కాణిస్తున్నాడు. ప్రాణులు నాలుగు రకాలుగా జన్మిస్తాయి: అండజములు — గుడ్లనుండి జన్మించేవి, అంటే పక్షులు, పాములు, మరియు బల్లులు వంటివి; జరాయుజములు — తల్లిగర్భము నుండి జన్మించేవి, అంటే మనుష్యులు, ఆవులు, కుక్కలు మరియు పిల్లులు వంటివి; స్వేదజములు — స్వేదము (చెమట) నుండి పుట్టేవి, అంటే పేలు వంటివి; ఉద్భిజములు — భూమి నుండి జనించేవి అంటే చెట్లు, తీగలు, గడ్డి, మరియు మొక్కజొన్న వంటివి. ఇవికాక వేరే జీవరూపాలు కూడా ఉన్నాయి, దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు వంటివి. శ్రీ కృష్ణుడే వీటన్నిటికీ మూల ఉత్పత్తి స్థానము.
నాంతోఽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప । ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా ।। 40 ।।
40
10
https://www.holy-bhagava…udio/010_040.mp3
న, అంతః, అస్తి — అంతము లేదు; మమ — నా యొక్క; దివ్యానాం — దివ్యమైన; విభూతీనాం — విభూతులకు; పరంతప — అర్జునా, శత్రువులను జయించేవాడా; ఏషః — ఈ; తు — కానీ; ఉద్దేశతః — ఒక్క చిన్న భాగము మాత్రమే; ప్రోక్తః — చెప్పబడినది; విభూతేః — (నా) విభూతుల యొక్క; విస్తరః — విస్తారమైన ; మయా — నా చేత.
BG 10.40: నా దివ్య విభూతులకు అంతము లేదు, ఓ పరంతపా. నేను ఇప్పటివరకు చెప్పింది నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగము మాత్రమే.
శ్రీకృష్ణుడు ఇక ఇప్పుడు తన విభూతుల విషయమును ముగిస్తున్నాడు. 20వ శ్లోకము నుండి 39వ శ్లోకం వరకు, తన అనంతమైన విభూతులలో ఎనభైరెండింటిని వివరించాడు. ఈ మొత్తం విషయం (విస్తరః) లో కేవలం ఒక భాగము (ఉద్దేశతః) మాత్రమే చెప్పినట్టుగా పేర్కొంటున్నాడు. సర్వమూ ఈశ్వర విభూతి అయితే, అప్పుడు అసలు ఈ విషయాలు చెప్పే అవసరం ఏమిటి అన్న సందేహం రావచ్చు? దీనికి సమాధానం ఏమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడిని, ఆయనను ఎలా స్మరించుకోవాలి/గుర్తుచేసుకోవాలి అని అడిగి ఉన్నాడు, అనంతరం ఈ వైభవములు (విభూతులు) వివరించటం జరిగింది. మనస్సు అనేది సహజంగానే అపురూపమైనవాటి వైపు ఆకర్షితమవుతుంది, అందుకే భగవంతుడు తన వైభవములో ఉన్న ప్రత్యేకతలను తెలియపరిచాడు. ఎప్పుడైనా మనము ఏదేని అత్యద్భుతమైన విశేషము ఎక్కడైనా ప్రకటితమవ్వటం చూసినప్పుడు దానిని భగవంతుని తేజస్సుగా గమనిస్తే, మనస్సు సహజంగానే భగవంతుని వద్దకు వెళ్తుంది. కానీ, స్థూల దృక్పథంలో గమనిస్తే, చిన్నదైనా, పెద్దదైనా ప్రతి వస్తువులో కూడా భగవంతుని వైభవము ఉంది కాబట్టి, మన భక్తి వృద్ధిచేసుకోవటానికి, ఈ జగత్తు మొత్తం అసంఖ్యాకమైన దృష్టాంతములను మనకు అందిస్తూఉన్నది అని మనం భావించాలి. భారత దేశంలో ఒక పెయింట్ వ్యాపారసంస్థ ఈ విధంగా అడ్వర్టయిజ్మెంటు ఇచ్చేది, ‘Whenever you see colors think of us.’ అంటే, ‘మీకు రంగులు కనిపించినప్పుడల్లా మమ్మల్ని తలచుకోండి’, అని. ఈ ప్రస్తుత విషయంలో శ్రీ కృష్ణుడు చెప్పేది ఎలా అర్థంచేసుకోవచ్చంటే, ‘ఎక్కడైనా నీవు అద్భుతమైనది ఏదైనా గమనిస్తే, నన్ను గుర్తుచేసుకో.’ అని.
యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా । తత్తదేవావగచ్చ త్వం మమ తేజోఽoశసంభవమ్ ।। 41 ।।
41
10
https://www.holy-bhagava…udio/010_041.mp3
యత్ యత్ — ఏదైనా; విభూతిమత్ — ఐశ్వర్యవంత; సత్త్వం — ప్రాణి/వస్తువు; శ్రీ మత్ — అందమైన; ఊర్జితం — తేజోవంతమయిన; ఏవ — కూడా; వా — లేదా; తత్ తత్ — అవిఅన్ని; ఏవ — నిజముగా; అవగచ్చ — తెలుసుకొనుము; త్వం — నీవు; మమ — నా యొక్క; తేజః — తేజస్సు; అంశ — అంశతో; సంభవం — ఉద్భవించినది.
BG 10.41: నీవు ఏదైనా అందమైన దాన్ని కానీ, అద్భుతమైన దాన్ని కానీ, లేదా శక్తివంతమైన దాన్ని కానీ చూస్తే, అది కేవలం నా శోభ యొక్క తళుకుగా తెలుసుకొనుము.
స్పీకర్లో ప్రవహించే కరెంటు దానిలో నుండి శబ్దమును జనింపచేస్తుంది. కానీ, అది ఎలా పనిచేస్తుందో దాని వెనుక ఉన్న సూత్రం తెలియనివారు, ధ్వని ఆ స్పీకర్ నుండే వస్తోంది అని అపోహ పడవచ్చు. అదే విధంగా, మనం ఎప్పుడైనా అత్యద్భుతమైన వైభవాన్ని ఎక్కడైనా గమనిస్తే, మరియు ఏదేని విశేషఘటన మనలను ఆశ్చర్యచకితులను చేస్తే, పారవశ్యమునకు గురి చేస్తే, అమితానందమును కలుగజేస్తే, అది భగవంతుని వైభవము యొక్క తళుకుగా అర్థంచేసుకోవాలి. సౌందర్యము, యశస్సు, శక్తి, జ్ఞానము, మరియు ఐశ్వర్యము అనంత పరిమాణంలో కలవాడు భగవంతుడు. సర్వ ప్రాణులకు, సమస్త పదార్థములకు వాటి వాటి శోభను చేకూర్చిపెట్టేది ఆయన శక్తిసామర్థ్యములే. ఈ విధంగా, సర్వ-ఐశ్వర్యమునకు మూలఉత్పత్తి స్థానమైన భగవంతుడినే మనం మన ఆరాధనా విషయంగా చేసుకోవాలి.
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున । విష్టభ్యాహమిదం కృత్స్నమ్ ఏకాంశేన స్థితో జగత్ ।। 42 ।।
42
10
https://www.holy-bhagava…udio/010_042.mp3
అథవా — లేదా; బహునా — వివరముగా; ఏతేన — ఈ యొక్క దానిచే; కిం — ఏమి?; జ్ఞాతేన తవ — నీవు తెలుసుకొని; అర్జునా — అర్జున; విష్టభ్య — వ్యాపించి పోషిస్తూ; అహం — నేను; ఇదం — ఈ యొక్క; కృత్స్నం — సమస్త; ఏక — ఒకే ఒక్క; అంశేన — అంశచే; స్థితః — స్తితుడనై; జగత్ — సృష్టి.
BG 10.42: ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం, ఓ అర్జునా? ఇంత మాత్రం తెలుసుకో చాలు, కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశచేతనే, సమస్త జగత్తు యందు వ్యాపించి మరియు దాన్ని పోషిస్తూ/నిర్వహిస్తూ ఉన్నాను.
ప్రశ్నకు ఇంతకుక్రితమే సమాధానం చెప్పేసాను అన్న అర్థాన్ని శ్రీకృష్ణుడి మాటలు సూచిస్తున్నాయి. ఇప్పుడు, తనే స్వంతముగా, ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాడు. తన యొక్క ఎన్నో అద్భుతమైన విభూతులని తెలియచేసిన పిదప, ఆయన చెప్పిన దాన్నంతా కలిపినా తన యొక్క వైభవముల విస్తారాన్ని గణించలేమని అంటున్నాడు, ఎందుకంటే అనంతకోటి బ్రహ్మాండముల సృష్టిని తన యొక్క చిన్న అంశము యందే కలిగి ఉన్నాడు, శ్రీ కృష్ణుడు. తన యొక్క చిన్న అంశమును ఇక్కడే ఎందుకు ఉదహరిస్తున్నాడు? కారణం ఏమిటంటే, అనంతమైన బ్రహ్మాండములు కలిగి ఉన్న మొత్తం భౌతిక జగత్తు, భగవంతుని సమస్త సృష్టిలో కేవలం 1/4వ వంతు మాత్రమే; మిగిలిన 3/4వ వంతు ఆధ్యాత్మిక దివ్యజగత్తు. పాదోఽస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి (పురుష సూక్తం, 3వ మంత్రం) ‘భౌతిక శక్తిచే తయారుచేయబడిన ఈ యొక్క తాత్కాలికమైన జగత్తు పరమేశ్వరుని వ్యక్తిత్త్వం యొక్క ఒక్క భాగము మాత్రమే. మిగతా మూడు భాగాలు, జనన-మరణములకు అతీతమైన ఆయన యొక్క దివ్య ధామములు.’ ఆసక్తికరంగా, శ్రీ కృష్ణుడు అర్జునుడి ముందే, ఈ లోకం లోనే, ఉన్నాడు, అయినా సమస్త భౌతిక జగత్తు తనయొక్క ఒక్క అంశముయందే ఉన్నది అంటున్నాడు. ఇది గణేశుడు మరియు శివుని కథ లాగా ఉంది. ఒకసారి, నారద మహర్షి శివునికి ఒక ప్రత్యేకమైన పండు ఇచ్చాడు. శంకర భగవానుని ఇద్దరు కుమారులైన, కార్తికేయుడు మరియు గణేశుడు ఇద్దరూ దానికోసం పోటీపడ్డారు. తను వారిలో ఏ ఒక్కరికైనా ఇస్తే, రెండవవారు తమ తండ్రి పక్షపాతముగలవాడని అనుకుంటారని శంకరుడు తలచాడు. కాబట్టి శంకర భగవానుడు తన ఇద్దరు పిల్లలకి ఒక పోటీ ఏర్పాటు చేసాడు. ఎవరైతే ఈ బ్రహ్మాండమును ప్రదక్షిణ చేసి, తిరిగి తన దగ్గరికి మొదట వస్తారో వారికే ఈ పండు అని అన్నాడు. ఇది విన్న కార్తికేయుడు వెంటనే బ్రహ్మాండమును ప్రదక్షిణ చేయటానికి బయలుదేరాడు. ఆయన చక్కటి దేహధారుడ్యం కలవాడు కావున దానిని ఉపయోగించుకోదలచాడు. ఈయనతో పోలిస్తే, గణేశుడు ఊబకాయుడు మరియు తన సోదరునితో పోటీ పడటానికి సరితూగను అనుకున్నాడు. కాబట్టి, వినాయకుడు (గణేశుడు) తన బుద్ధి ద్వారా దీనిని సాధించాలనుకున్నాడు. శివపార్వతులు అక్కడే నిలబడి ఉన్నారు. గణేశుడు వారికి మూడుసార్లు ప్రదక్షిణ చేసి, ‘నాన్నగారూ, నేను చేసేసాను, దయచేసి ఇక ఆ పండు ఇవ్వండి’ అన్నాడు, శివుడు అన్నాడు ‘కానీ, నువ్వు మాతోటి ఇక్కడే ఉన్నావు కదా, బ్రహ్మాండము చుట్టూ ఎలా తిరిగావు?’ అని. గణేశుడు అన్నాడు, ‘తండ్రి గారు, మీరే ఈశ్వరుడు, సమస్త బ్రహ్మాండము మీయందే ఉన్నది. నేను మీకు ప్రదక్షిణ చేస్తే సమస్త బ్రహ్మాండమును చుట్టి వచ్చినట్టే.’ అని. తన పుత్రుడు గణేశుడు చాలా తెలివైన వాడని శంకర భగవానుడు ఒప్పుకోవలసి వచ్చింది మరియు నిజంగానే గణేశుడు ఆ పోటిలో నెగ్గాడు. ఎట్లయితే శివుడు ఒక ప్రదేశంలోనే నిల్చున్నా, బ్రహ్మాండమంతా తనయందే కలిగి ఉన్నట్టు, అదే విధంగా, అనంతమైన భౌతిక బ్రహ్మాండములను కలిగిఉన్న సమస్త సృష్టి, తన యొక్క ఒక్క అంశముయందే కలిగిఉన్నట్టు శ్రీ కృష్ణుడు అర్జునుడికి ప్రకటిస్తున్నాడు.
అర్జున ఉవాచ । మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ । యత్త్వయోక్తం వచస్తేన మోహోఽయం విగతో మమ ।। 1 ।।
1
11
https://www.holy-bhagava…udio/011_001.mp3
అర్జునః ఉవాచ — అర్జునుడు పలికెను; మత్-అనుగ్రహాయ — నా మీద దయ ఉంచి; పరమం — సర్వోన్నతమైన; గుహ్యం — రహస్యమైన; అధ్యాత్మ-సంజ్ఞితమ్ — ఆధ్యాత్మిక జ్ఞానము గురించి; యత్ — ఏదైతే; త్వయా — నీ చే; ఉక్తం — చెప్పబడెనో; వచః — వాక్యములు; తేన — దానిచే; మోహః — మోహము; అయం — ఇది; విగతః — పటాపంచలయినది; మమ — నా యొక్క.
BG 11.1: అర్జునుడు పలికెను: నా మీద దయచే నీవు తెలియపరచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత, నా మోహము ఇప్పుడు తొలగిపోయినది.
శ్రీ కృష్ణుడి విభూతులను, మరియు పరమేశ్వరుని గురించిన జ్ఞానమును విన్న పిదప అర్జునుడు ఆనందముతో ఉప్పొంగిపోయాడు, అంతేకాక, తన యొక్క భ్రమ నశించిపోయినదని తెలుసుకున్నాడు. శ్రీ కృష్ణుడు కేవలం తన ప్రియ మిత్రుడు మాత్రమే కాదని, ఆయన జగత్తులోని సర్వ ఐశ్వర్యములకు మూలమైన సర్వోత్కృష్ట పరమేశ్వరుడే అని అంగీకరించాడు. ఇప్పుడు, అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియపరచటం ద్వారా చూపిన శ్రీ కృష్ణుడి ఆదరణని, కృతజ్ఞతా పూర్వకంగా అంగీకరించంతో ఈ అధ్యాయమును ప్రారంభిస్తున్నాడు.
భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా । త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ।। 2 ।।
2
11
https://www.holy-bhagava…udio/011_002.mp3
భవ — ఉత్పత్తి; అప్యయౌ — అవ్యక్తమవటము; హి — నిజముగా; భూతానాం — సర్వ ప్రాణుల; శ్రుతౌ — విన్నాను; విస్తరశః — విస్తారముగా; మయా — నా చేత; త్వత్తః — నీ నుండి; కమల-పత్ర-అక్ష — తామర వంటి కన్నులు కలవాడా; మాహాత్మ్యం — గొప్పతనము; అపి — కూడా; చ — మరియు; అవ్యయమ్ — నిత్యమైన.
BG 11.2: సర్వ ప్రాణుల ఉత్పత్తి మరియు అవ్యక్తమైపోవటము విషయము గురించి విస్తారముగా నీ నుండి విన్నాను, ఓ తామర వంటి నేత్రములు కలవాడా, నిత్య శాశ్వతమైన నీ మహాత్మ్యము కూడా విన్నాను.
సమస్త భౌతిక జగత్తు సృష్టికి మరియు లయమైపోవటానికి మూల కారణమైన శ్రీ కృష్ణుడి అత్యున్నత స్థాయిని విశ్వసిస్తూ అర్జునుడు, శ్రీ కృష్ణుని మహాత్మ్యమును ప్రశంసించటం కొనసాగిస్తూనే ఉన్నాడు. శ్రీ కృష్ణుడిని కమల-పత్రాక్ష, అని సంబోధిస్తున్నాడు అంటే, ‘పెద్దవిగా, సుతిమెత్తగా, అందముగా మరియు మాధుర్యము, సౌకుమార్యము వంటి గుణములు కలిగిన తామర పూవు వంటి నేత్రములు కలవాడా అని అర్థం.’ ఈ శ్లోకంలో అర్జునుడు అనేదేమిటంటే, ‘ఓ శ్రీ కృష్ణా, నీ యొక్క నిత్య-శాశ్వతమైన మహాద్భుతమైన మహిమలను నీ నుండి విన్నాను. నీవు అందరిలోనే ఉన్నా, నీవు వాటి యొక్క దోషములకు అతీతుడవు (అవి నీకు అంటవు). నీవే సర్వోన్నత నియామకుడవు అదే సమయంలో, నీవు అకర్తవు మరియు మా యొక్క కర్మలకు నీవు బాధ్యుడువి కావు. నీవే మా కర్మ ఫలితములను అందించేవాడవు అయినా నీవు నిష్పక్షపాతమైనవాడివి మరియు అందరికీ సమానుడవు. నీవే సర్వసాక్షివి మరియు కర్మ ఫలాలను అందించేవాడివి. అందుకే నీవే సర్వ ప్రాణులకూ ఆరాధ్యుడవు అని విశ్వసిస్తున్నాను.’
ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర । ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ ।। 3 ।।
3
11
https://www.holy-bhagava…udio/011_003.mp3
ఏవం — ఈ విధముగా; ఏతత్ — ఇది; యథా — ఎలాగైతే; ఆత్థ — చెప్పబడినట్టు; త్వం — నీవు; ఆత్మానం — నీవే; పరమేశ్వర— పరమేశ్వరుడవు; ద్రష్టుం — చూడాలని; ఇచ్చామి — కోరుతున్నాను; తే — నీ యొక్క; రూపం — రూపము; ఐశ్వరం — దివ్యమైన; పురుష-ఉత్తమ — శ్రీ కృష్ణా, సర్వోత్కృష్ట పరమ పురుషా.
BG 11.3: ఓ ప్రభూ, నీవెవరో నీవే చెప్పినట్టు, నీవు సరిగ్గా అటువంటి దివ్య స్వరూపానివే. ఇప్పుడు నాకు, నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది, ఓ పురుషోత్తమా.
అర్జునుడు శ్రీకృష్ణుడిని ‘అత్యంత గొప్ప వ్యక్తి’ అని సంబోధిస్తున్నాడు, ఎందుకంటే ఆయనతో సమానమైన వ్యక్తిత్వం ఏదీ లేదు. తరచుగా పండితులు, వారి శుష్కమైన మేధో విశ్లేషణ ఆధారంగా, భగవంతుడిని సాకార రూపంలో అంగీకరించటానికి ఒప్పుకోరు, వారు భగవంతుడిని, గుణములు, లక్షణములు, స్వభావములు, రూపములు మరియు లీలలు లేని - ఒక నిరాకార కాంతిగా మాత్రమే భావించాలని కోరుకుంటారు. అయితే, మనం సూక్ష్మమైన ఆత్మలమే ఒక రూపాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆ పరమేశ్వరుడిని నిరాకారుడు అని ఎందుకు అనుకోవాలి? ఆయన వ్యక్తిత్వం మాత్రమే కాదు, అత్యుత్తమ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు కూడా. అందువల్లనే, అతను సర్వోన్నత దివ్య వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వానికి మరియు భగవంతుని వ్యక్తిత్వానికి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, అతను పరిపూర్ణ వ్యక్తి మాత్రమే కాదు ఆయన నిర్గుణ, నిరాకార, సర్వవ్యాప్త తత్త్వాన్ని కూడా కలిగి ఉన్నాడు. అర్జునుడు శ్రీ కృష్ణుడి దివ్య వ్యక్తిత్వపు యథార్థమును, ఆయన చెప్పినట్టుగానే అంగీకరిస్తున్నట్టు ప్రకటిస్తున్నాడు. అర్జునుడికి ఆయన యొక్క సాకార స్వరూపముపై పూర్తి విశ్వాసము ఉంది అయినా, శ్రీ కృష్ణుడి యొక్క సర్వ ఐశ్వర్యములతో కూడిన విశ్వరూపమును చూడగోరుతున్నాడు. తన స్వంత కళ్ళతోనే దాన్ని చూడాలని అభిలషిస్తున్నాడు.
మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో । యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ।। 4 ।।
4
11
https://www.holy-bhagava…udio/011_004.mp3
మన్యసే యది — ఒకవేళ నీవు అనుకుంటే; తత్ — అది; శక్యం — సాధ్యమే అని; మయా — నా చేత; ద్రష్టుం — దర్శించబడుటకు; ఇతి — ఈ విధంగా; ప్రభో — ఓ ప్రభూ; యోగ-ఈశ్వరా — సమస్త యోగ విద్యల ప్రభువు; తతః — అప్పుడు; మే — నాకు; త్వం — నీవు; దర్శయ — తెలియచేయుము (చూపించుము); ఆత్మానం — నీవే; అవ్యయం — నిత్య శాశ్వతమైన.
BG 11.4: ఓ యోగేశ్వరా, నాకు దాన్ని దర్శించగలిగే శక్తి ఉంది అని నీవు అనుకుంటే, దయచేసి ఆ యొక్క నిత్య శాశ్వతమైన విశ్వ రూపమును నాకు చూపించుము.
ఇంతకు క్రితం శ్లోకంలో, అర్జునుడు సర్వేశ్వరుని యొక్క విశ్వ రూపమును చూడగోరాడు. ఇప్పుడు ఆయన యొక్క అనుమతి అడుగుతున్నాడు. ‘ఓ యోగేశ్వరా, నా కోరిక నీకు తెలియచేసాను. నేను దానికి అర్హుడనని నీవు అనుకుంటే, నీ కృప చే, నీ యొక్క విశ్వ రూపమును నాకు చూపించుము మరియు నాకు నీ యొక్క యోగ-ఐశ్వర్యమును చూపించుము.’ అంటున్నాడు. యోగం అంటే జీవాత్మను పరమాత్మతో ఏకం చేసే శాస్త్రము, మరియు ఈ శాస్త్రాన్నిఅభ్యాసం చేసే వారే యోగులు అంటే. యోగేశ్వరుడు అంటే ‘యోగులందరికీ ప్రభువు’ అని కూడా అర్థం. అందరు యోగులూ అంతిమంగా లక్ష్యం ఆ పరమాత్మయే కాబట్టి, శ్రీ కృష్ణుడు యోగేశ్వరుడు అవుతాడు. ఇంతకు క్రితం 10.17వ శ్లోకంలో అర్జునుడు భగవంతుడిని ‘యోగి’ అని సంబోధించాడు, అంటే ‘యోగంలో నిష్ణాతుడా’ అని. కానీ ఇప్పుడు, శ్రీ కృష్ణుడి మీద పెరిగిన గౌరవం దృష్ట్యా దానిని ‘యోగేశ్వరా’ అని మార్చాడు.
శ్రీ భగవానువాచ । పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః । నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ।। 5 ।।
5
11
https://www.holy-bhagava…udio/011_005.mp3
శ్రీ భగవానువాచ — శ్రీ భగవానుడు పలికెను; పశ్య — తిలకించుము; మే — నా యొక్క; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; రూపాణి — రూపములు; శతశః — వందలలో; అథ — మరియు; సహస్రశః — వేలలో; నానావిధాని — వివిధ రకముల; దివ్యాని — దివ్యమైన; నానా — రకరకాల; వర్ణ — రంగుల; ఆకృతీని — ఆకృతులలో; చ — మరియు.
BG 11.5: శ్రీ భగవానుడు ఇలా పలికెను: వివిధములైన ఆకృతులు, పరిమాణములు, మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను, ఇదిగో తిలకించుము ఓ పార్థ.
అర్జునుడి ప్రార్థనలను విన్న తరువాత, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు తన యొక్క విశ్వ-రూపమును తిలకించమని అంటున్నాడు. శ్రీ కృష్ణుడు 'పశ్య' అన్న పదం వాడాడు, అంటే ‘ఇదిగో చూడుము/తిలకించుము/దర్శించుము’ అన్న అర్థం ఉంటుంది; అంటే ఇది అర్జునుడు సావధానతతో చూడాలని సూచిస్తున్నది. ఆ రూపము ఒకటే అయినా, దాని యందు అసంఖ్యాకమైన విశేషతలు ఉన్నాయి, మరియు విలక్షణమైన రంగులు, వివిధ ఆకృతులతో కూడిఉన్న అనంతమైన వ్యక్తిత్వాలు ఉన్నాయి. శ్రీ కృష్ణుడు 'శతశో ఽథ సహస్రశః' అన్న పదాలు వాడాడు, అంటే అసంఖ్యాకమైన రకాలుగా మరియు ఎన్నెన్నో విలక్షణమైన రీతులలో ఉన్నాయి అని అర్థం. అనంతమైన ఆకృతులు మరియు వర్ణములతో కూడిఉన్న తన విశ్వరూపమును, అర్జునుడిని చూడమన్న పిదప, శ్రీ కృష్ణుడు ఇప్పుడిక, అర్జునుడిని ఆ విశ్వ రూపములో ఉన్న దేవతలను మరియు ఇతర అద్భుతములను గమనించమంటున్నాడు.
పశ్యాదిత్యాన్వసూన్రుద్రానశ్వినౌ మరుతస్తథా । బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ।। 6 ।।
6
11
https://www.holy-bhagava…udio/011_006.mp3
పశ్య — తిలకించుము; ఆదిత్యాన్ — అదితి పుత్రులు (పన్నెండుగురు); వసూన్ — వసువులు (ఎనిమిది మంది); రుద్రాన్ — రుద్రులు (పదకొండుగురు); అశ్వినౌ — ఇద్దరు అశ్వినీ కుమారులు; మరుతః — మరుత్తులు (నలభైతొమ్మిది); తథా — మరియు; బహూని — చాలా; అ-దృష్ట — ఎప్పుడూ కనిపించని; పూర్వాణి — ఇంతకు క్రితం; పశ్య — తిలకించుము; ఆశ్చర్యాణి — ఆశ్చర్యము గోలిపేవి; భారత — అర్జునా, ఓ భరత వంశస్థుడా.
BG 11.6: నాలో పరికించుము ఓ భరత వంశీయుడా, (పన్నెండుగురు) అదితి పుత్రులను, (ఎనిమిది మంది) వసువులను, (పదకొండు) రుద్రులను, (ఇద్దరు) అశ్వినీ కుమారులను, అంతే కాక, (నలభైతొమ్మిది) మరుత్తులు మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచబడని అద్భుతములను కూడా చూడుము.
భగవంతుని విశ్వ-రూపము కేవలం భూలోకంలో ఉన్న అద్భుతాలే కాక పైలోకాల్లో ఉన్న అద్భుతాలను కూడా కలిగి ఉంటుంది; ఈ విధంగా అన్నీకూడి ఉన్న స్వరూపము ఇంతకు మునుపు ఎప్పుడూ దర్శించబడలేదు. స్వర్గాది దేవతలు తన దివ్య స్వరూపము లోని అతిచిన్న భాగములే అని కూడా చెప్తున్నాడు; పన్నెండుగురు ఆదిత్యులను, ఎనిమిదిమంది వసువులను, పదకొండుగురు రుద్రులను, ఇద్దరు అశ్వినీ కుమారులను మరియు నలభైతొమ్మిది మరుత్తులను తనయందే చూపిస్తున్నాడు. అదితి యొక్క పన్నెండుగురు పుత్రులు వీరే: ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వన, పుష, సవిత, త్వష్ట, మరియు వామన. ఎనిమిది (అష్ట) వసువులు వీరే : దార, ధ్రువ, సోమ, ఆహ, అనిల, అనల, ప్రత్యూష, మరియు ప్రభాస. పదకొండు మంది రుద్రులు వీరే: హర, బహురూప, త్రయంబక, అపరాజిత, వృసకపి, శంభు, కపర్ది, రైవత, మృగవ్యాధ, సర్వ, మరియు కపాలి. ఇద్దరు అశ్వినీ కుమారులు అనేవారు కవలలైన దేవతా వైద్యులు. నలభైతొమ్మిది మరుత్తులు (వాయు దేవతలు) వీరే: సత్త్వజ్యోతి, ఆదిత్య, సత్యజ్యోతి, తిర్యగ్జ్యోతి, సజ్యోతి, జ్యోతిష్మన, హరిత, రితజిత, సత్యజిత, సుశేణ, సేనాజిత, సత్యమిత్ర , అభిమిత్ర, హరిమిత్ర, కృత, సత్య, ధృవ, ధార్త, విధార్త, విధారయ, ధ్వాంత, ధుని, ఉగ్ర, భీమ, అభియు, సాక్షిప, ఇద్రిక, అన్యద్రిక, యద్రిక, ప్రతికృత, ఋక్, సమితి, సంరంభ, ఇద్రిక్ష, పురుష, అన్యద్రిక్ష, చేతస, సమిత, సమిద్రిక్ష, ప్రతిద్రిక్ష, మారుతి, సరత, దేవ, దిశ, యజుః, అనుద్రిక, సమ, మానుష, మరియు విష.
ఇహైకస్థం జగత్ కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ । మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి ।। 7 ।।
7
11
https://www.holy-bhagava…udio/011_007.mp3
ఇహ — ఇక్కడ; ఏక-స్థం — ఒకే చోట కూడియున్న; జగత్ — జగత్తు; కృత్స్నం — సమస్తము; పశ్య — దర్శించుము; అద్య — ఇప్పుడు; స చర అచరమ్ — చరాచరములతో కూడి ఉన్న; మమ — నా యొక్క; దేహే — ఈ రూపము యందు; గుడాకేశ — అర్జునా, నిద్రను జయించిన వాడా; యత్ — ఏదైతే; చ — మరియు; అన్యత్ — వేరే ఇతర; ద్రష్టుమ్ — చూడాలి అని; ఇచ్ఛసి — కోరుకున్నావో.
BG 11.7: ఒక్కచోటే కూడిఉన్న సమస్త చరాచరములను కలిగిఉన్న జగత్తును, నా విశ్వ రూపము యందే దర్శించుము ఇప్పుడు ఓ అర్జునా. ఇంకా మరేదైనా చూడదలుచుకున్నా వాటన్నిటినీ నా విశ్వ రూపము యందే తిలకించుము.
తన స్వరూపమును తిలకించమని చెప్పిన కృష్ణుని ఆదేశం విన్నతరువాత, అర్జునుడికి ఎక్కడ ఇవన్నీ చూడాలి అన్న సందేహం కలిగింది. పరమేశ్వరుని దివ్య మంగళ స్వరూప శరీరము యందే వాటిని దర్శించమని అంటున్నాడు, శ్రీ కృష్ణుడు. అనంతమైన బ్రహ్మాండములను, వాటివాటి సమస్త చరాచర ప్రాణుల/పదార్థములతో సహా, వాటిని అక్కడే అర్జునుడు చూస్తాడు. సర్వమూ ఆ విశ్వ రూపములో ఉంటుంది, భూత/భవిష్యత్ సంఘటనలు కూడా ఉంటాయి. అర్జునుడు తద్వారా, విశ్వ పరిణామ ఆవిష్కరణ ప్రణాళికలో భాగంగా, పాండవుల విజయాన్ని మరియు కౌరవుల పరాజయాన్ని చూడగలుగుతాడు.
న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా । దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ।। 8 ।।
8
11
https://www.holy-bhagava…udio/011_008.mp3
న — కాదు; తు — కానీ; మాం — నన్ను; శక్యసే — నీవు చేయగలవు; ద్రష్టుమ్ — చూచుట; అనేన — వీటితో; ఏవ — అయినా; స్వ-చక్షుషా — నీ ప్రాకృతిక కళ్ళతో; దివ్యం — దివ్యమైన; దదామి — నేను ప్రసాదించెదను; తే — నీకు; చక్షుః — కనులు; పశ్య — చూడుము; మే — నా యొక్క; యోగం-ఐశ్వరమ్ — యోగ ఐశ్వర్యమును.
BG 11.8: కానీ, నా యొక్క విశ్వ రూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు. కాబట్టి, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము.
పరమేశ్వరుడైన భగవానుడు ఈ లోకంలోకి అవతరించినప్పుడు, ఆయనకి రెండు రకాల స్వరూపాలు ఉంటాయి — ఒకటి ప్రాకృతిక కళ్ళతో చూడగలిగే భౌతికమైన స్వరూపము, మరొకటి దివ్య దృష్టితో మాత్రమే చూడగలిగే దివ్య స్వరూపము. ఈ విధంగా, మనుష్యులు ఆయనను భూలోక అవతార సమయంలో తప్పకుండా దర్శిస్తారు కానీ ఆయన యొక్క ప్రాకృతిక రూపంలోనే చూస్తారు. ఆయన యొక్క దివ్య స్వరూపము వారియొక్క ప్రాకృతిక కన్నులకు కనపడదు. ఈ కారణం వల్లనే ఈ భౌతిక ప్రపంచపు జీవాత్మలు, భగవంతుడు ఈ భూలోకంలో అవతరించినప్పుడు, ఆయనను గుర్తించలేరు. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని 9వ అధ్యాయం, 11వ శ్లోకంలో చెప్పిఉన్నాడు: ‘నేను నా సాకార రూపంలో అవతరించినప్పుడు అజ్ఞానులు నన్ను గుర్తించలేరు. వారికి సర్వ భూతములకు ఈశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము తెలియదు.’ జనులు చూసేది కేవలం దివ్య అవతారము యొక్క భౌతిక స్వరూపము మాత్రమే. ఇదే సూత్రము ఆయన యొక్క విశ్వ రూపమునకు వర్తిస్తుంది. ఇంతకు క్రితం రెండు శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు అర్జునుడిని తన యొక్క విశ్వ రూపమును చూడమని అడిగాడు, కానీ అర్జునుడికి ఏమీ కనపడలేదు ఎందుకంటే అతనికి ప్రాకృతిక కన్నులే ఉన్నాయి. ఈ యొక్క ప్రాకృతిక కళ్ళు ఆ విశ్వ రూపమును దర్శించటానికి సరిపోవు మరియు సామాన్యమైన బుద్ధికి అది అర్థం కాదు. అందుకే, అర్జునుడు అపూర్వ వైభవముతో ఉన్న విశ్వ రూపమును దర్శించటానికి సాధ్యమయ్యేటట్టుగా, శ్రీ కృష్ణుడు, ఆయనకి దివ్య దృష్టిని ఇప్పుడు ప్రసాదిస్తాను అని అంటున్నాడు. ఆధ్యాత్మిక దృష్టి ప్రసాదించటం అనేది ఒక భగవంతుని కృప. ఆయన కృప చేతనే, భగవంతుడు తన దివ్య చక్షువులను జీవాత్మ యొక్క ప్రాకృతిక కనులకు అందిస్తాడు; తన దివ్య మనస్సుని జీవాత్మ యొక్క ప్రాకృతిక మనస్సుకు అందిస్తాడు; తన దివ్య బుద్ధిని జీవాత్మ యొక్క ప్రాకృతిక బుద్ధికి అందిస్తాడు. తదుపరి, ఈ భగవంతుని దివ్యమైన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి కలిగిఉన్న జీవాత్మ ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని చూడగలుగుతుంది, స్మరించగలుగుతుంది మరియు దాన్నిఅర్థం చేసుకోగలుగుతుంది.
సంజయ ఉవాచ । ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః । దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ।। 9 ।।
9
11
https://www.holy-bhagava…udio/011_009.mp3
సంజయః ఉవాచ — సంజయుడు పలికెను; ఏవం — ఈ విధంగా; ఉక్త్వా — పలికిన పిదప; తతః — అప్పుడు; రాజన్ — రాజా; మహా-యోగ-ఈశ్వరః — సర్వోన్నత యోగేశ్వరుడు; హరిః — శ్రీ కృష్ణుడు; దర్శయామ్-ఆస — చూపించెను; పార్థాయ — అర్జునుడికి; పరమం — దివ్యమైన; రూపమ్ ఐశ్వరమ్ — వైభవోపేత రూపమును.
BG 11.9: సంజయుడు పలికెను: ఓ మహారాజా, ఇట్లు పలికిన పిదప, ఆ యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు, తన యొక్క దివ్యమైన మరియు వైభవోపేతమైన రూపమును అర్జునుడికి చూపెను.
అర్జునుడు శ్రీ కృష్ణుడిని 11.4వ శ్లోకంలో ‘యోగేశ్వర’ అని సంబోధించాడు. ఇక ఇప్పుడు, సంజయుడు ఆయనను ‘మహా-యోగేశ్వరా’ అని అంటున్నాడు, యోగేశ్వరుడికి ‘మహా’ అన్నఅతిశయోక్తి జత చేసాడు. సంజయునికి తన గురువు వేద వ్యాసునిచే దూర దృష్టి వరం ఇవ్వబడింది. కాబట్టి, ఆయన కూడా భగవంతుని విశ్వ-రూపమును అర్జునుడు చూసిన విధముగానే చూసాడు. ఇక తదుపరి నాలుగు శ్లోకాలలో, సంజయుడు దృతరాష్ట్రునుకి, అర్జునుడు ఏమి చూసాడో అది చెప్తున్నాడు. భగవంతుని విశ్వరూపము ఆయన ఐశ్వర్యములతో నిండి ఉంటుంది, మరియు అది చూసేవారిలో భయాన్ని, ఆశ్చర్యాన్ని, మరియు పూజ్యభావాన్ని కలిగిస్తుంది.
అనేకవక్త్రనయనమనేకాద్భుతదర్శనమ్ । అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ।। 10 ।। దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ । సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖమ్ ।। 11 ।।
10
11
https://www.holy-bhagava…/011_010-011.mp3
అనేక — అనేకములైన; వక్త్ర — ముఖములు; నయనం — కన్నులు; అనేక — అనేకములగు; అద్భుత — అద్భుతమైన; దర్శనమ్ — దర్శనములు (దృశ్యములు); అనేక — అనేకములగు; దివ్య — దివ్యమైన; ఆభరణం — ఆభరణములు; దివ్య — దివ్యమైన; అనేక — అనేకములగు; ఉద్యత — చేపట్టిలేపిన; ఆయుధం — ఆయుధములు; దివ్య— దివ్యమైన; మాల్య — దండలు; ఆంబర — వస్త్రములు; ధరం — ధరించిన; దివ్య — దివ్యమైన; గంధ — సుగంధములతో; అనులేపనమ్ — అలంకరించి ఉన్న; సర్వ — సర్వమూ; ఆశ్చర్య-మయం — మహాద్భుతముగా ఉన్న; దేవమ్ — ప్రభువు; అనంతం — అనంతములైన; విశ్వతః — అన్ని దిక్కులా; ముఖం — ముఖము.
BG 11.10-11: ఆ యొక్క విశ్వరూపములో, అర్జునుడు అనంతమైన ముఖములు మరియు కనులను దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరంపై అనేక మాలలను కలిగి ఉంది మరియు దివ్య సుగంధ పరిమళభూరితమై గుబాళిస్తున్నది. మహాద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖముతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు.
శ్రీ కృష్ణుడి యొక్క దివ్య మంగళ విశ్వరూపమును, సంజయుడు, 'అనేక' మరియు 'అనంత' అన్న పదాలతో విశదీకరిస్తున్నాడు. సమస్త సృష్టి, భగవంతుని విశ్వరూప శరీరమే, అందుకే అది అసంఖ్యాకమైన ముఖము, కళ్ళు, నోర్లు, ఆకృతులు, వర్ణములు, మరియు రూపములను కలిగి ఉంటుంది. మనుష్య బుద్ధికి, పరిమితమైన కాలము, ప్రదేశము, మరియు రూపములకు లోబడి ఉన్న వాటినే అవగతం చేసుకోగలిగే అలవాటు/సామర్థ్యం, ఉన్నది. భగవంతుని విశ్వ రూపము - అసాధారణమైన అద్భుతములు, వింతలు, మరియు ఆశ్చర్యములను - అన్ని దిక్కులా ప్రకటించింది; అది కాల-ప్రదేశ పరిమితులను అధిగమించినదిగా అలౌకికమైనదిగా ఉన్నది; అందుకే దానిని మహాద్భుతము, నమ్మశక్యంగానిది అనటం సమంజసమే.

దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా । యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః ।। 12 ।।
12
11
https://www.holy-bhagava…udio/011_012.mp3
దివి — ఆకాశములో; సూర్యః — సూర్యులు; సహస్రస్య — వేల కొలది; భవేత్ — ఉండి; యుగపత్ — ఒకేసారి; ఉత్థితా — ఉదయించుట; యది — ఒకవేళ; భాః — ప్రకాశిస్తూ; సదృశీ — ఆ విధముగా అగుపిస్తూ; సా — అది; స్యాత్ — ఉన్నది; భాసః — ప్రకాశిస్తూ; తస్య — వాటి యొక్క; మహా-ఆత్మనః — ఆ మహోన్నత రూపము.
BG 11.12: ఆకాశములో వెయ్యి మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించినా, ఆ మహోన్నత రూపము యొక్క తేజస్సుకు సాటి రావు.
సంజయుడు ఇప్పుడు ఆ విశ్వ రూపము యొక్క తేజస్సును వివరిస్తున్నాడు. కన్నులు మిరుమిట్లు గొలిపే ఆ ప్రకాశము ఎంతటిదో అవగాహన ఇవ్వటానికి, దానిని వెయ్యి సూర్యులు ఒక్కసారే మధ్యాహ్న ఆకాశంలో వెలిగితే వచ్చే కాంతితో పోల్చుతున్నాడు. నిజానికి, భగవంతుని తేజస్సు అనంతమైనది; దానిని సూర్యుని వెలుగు యొక్క ప్రమాణంతో కొలవటం సాధ్యం కాదు. అయినా, తరచుగా కథకులు, మనకు తెలియనిదానిని అర్థం చేపించటం కోసం ఏదో ఒక తెలిసిన దాని యొక్క ఉదాహరణని హెచ్చించి చెప్తుంటారు. ఈ వెయ్యి సూర్యుల ఉపమానము అనేది, ఆ విశ్వ రూప తేజస్సుకు మరేదీ సాటిలేదు అన్న సంజయుని అభిప్రాయమును సూచిస్తున్నది.
తత్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తమనేకధా । అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా ।। 13 ।।
13
11
https://www.holy-bhagava…udio/011_013.mp3
తత్ర — అక్కడ; ఏక-స్థం — ఒక్క చోటనే స్థితమై; జగత్ — ఈ జగత్తు అంతా; కృత్స్నం — సమస్తమూ; ప్రవిభక్తం — వేరువేరుగా; అనేకధా — అనేకములైన; అపశ్యత్ — తిలకించెను; దేవ-దేవస్య — దేవ దేవుని యొక్క; శరీరే — శరీరము యందు; పాండవః — అర్జునుడు; తదా — అప్పుడు.
BG 11.13: అక్కడ, ఆ దేవదేవుని శరీరము యందు, సమస్త బ్రహ్మాండములన్నీ ఒక్క చోటే ఉన్నట్టు అర్జునుడు దర్శించాడు.
ఆ విశ్వరూపములోని మహాద్భుతమైన ఆశ్చర్యములను వివరించిన పిదప, సంజయుడు ఈ జగత్తు అంతటిని అది తన యందే కలిగి ఉన్నదని పేర్కొంటున్నాడు. ఇంకా ఆశ్చర్యముగా అర్జునుడు జగత్తు యొక్క సమస్త అస్తిత్వమునూ శ్రీ కృష్ణుడి శరీర భాగములోనే చూసాడు. అనంతమైన బ్రహ్మాండములను, వాటి యొక్క నక్షత్ర మండలములు మరియు గ్రహ-సమూహాలను ఆ పరమేశ్వరుని చిన్న అంశముగా దర్శించాడు. తన చిన్ననాటి లీలలలో, శ్రీ కృష్ణుడు తన విశ్వ రూపమును తల్లి యశోదకు కూడా చూపించాడు. ఆ సర్వేశ్వరుడు తన దివ్య వైభవములను మరుగున దాచి, భక్తుల ఆనందం కోసం ఒక చిన్నపిల్లవానిలా నటించాడు. శ్రీ కృష్ణుడు తన పుత్రుడే అనుకుంటూ, ఎన్ని సార్లు వద్దని చెప్పినా మన్ను తింటున్నాడని, ఒకసారి యశోదమాత, బాలుడిని గట్టిగా మందలించింది. నోట్లో పరీక్షించటానికి బాల కృష్ణుడిని నోరు తెరవమని అడిగింది. కానీ, కృష్ణుడు నోరు తెరిచినప్పుడు, ఆ తల్లికి సంభ్రమాశ్చర్యంగా, ఆయన తన యోగమాయా శక్తిచే, దానిలో విశ్వరూపమును చూపించాడు. యశోదమ్మ తన చిన్ని బాలకుని నోటిలో అనంతమైన బ్రహ్మాండములు, అద్భుతములు చూసి పూర్తిగా భ్రమకు లోనయ్యింది. ఆ యొక్క మహాశ్చర్యాన్ని తట్టుకోలేక ఆమె మూర్చిల్లబోయింది, శ్రీ కృష్ణుడు ఆ తల్లిని ముట్టుకుని మరలా మామూలు మనిషిని చేసాడు. యశోదామాతకి చూపించిన అదే విశ్వ రూపమును, భగవంతుడు, తన మిత్రుడైన అర్జునుడికి ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇప్పుడిక సంజయుడు విశ్వ రూపమును దర్శించిన అర్జునుడి ప్రతిస్పందనను తెలియ చేస్తున్నాడు.
తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః । ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత ।। 14 ।।
14
11
https://www.holy-bhagava…udio/011_014.mp3
తతః — అప్పుడు; సః — అతడు; విస్మయ-ఆవిష్టః — విస్మయముతో; హృష్ట-రోమా — వెంట్రుకలు నిక్కబోడుచుకున్నవాడై; ధనంజయః — అర్జునుడు, సిరిసంపదలను జయించేవాడు; ప్రణమ్య — ప్రణమిల్లి; శిరసా — శిరస్సుతో; దేవం — భగవంతునికి; కృత-అంజలిః — చేతులు జోడించి; అభాషత — ఇలా పలికెను.
BG 11.14: అప్పుడు, పరామాశ్చర్యమునకు లోనయ్యి, రోమములు నిక్కబోడుచుకున్నవాడైన అర్జునుడు, చేతులు జోడించి తలవంచి నమస్కరిస్తూ, భగవంతుడుని ఈ విధంగా స్తుతించాడు.
ఆ యొక్క మహాద్భుతమును చూసిన అర్జునుడు విస్మయమునకు మరియు గాఢమైన పూజ్యభావమునకు లోనయ్యాడు. దానితో అతని హృదయములో భక్తి భావలను పెళ్లుబికి, ఆనందముతో ఉప్పొంగిపోయాడు. భక్తి భావముతో కలిగిన మహానందము ఒక్కోసారి భౌతిక లక్షణములతో వ్యక్తమవుతూ ఉంటుంది. భక్తి శాస్త్రములు ఇటువంటి ఎనిమిది లక్షణాలను వివరిస్తాయి, వాటినే ‘అష్ట సాత్విక భావములు’ అంటారు, ఇవి ఒక్కోసారి, వారి హృదయంలో భక్తి ఉప్పొంగినప్పుడు, భక్తులలో మనకు కనిపిస్తాయి: స్తమ్భః స్వేదో ఽథ రోమాంచః స్వరభేధో ఽథ వేపథు: వైవర్ణ్యమశ్రు ప్రలయ ఇత్యష్టౌ సాత్త్వికాః స్మృతాః (భక్తి రసామృత సింధు) ‘స్తబ్ధుడై పోవటము, చెమటలు పట్టటము, గగుర్పాటు, గొంతు బొంగురు పోవటము, వణుకు, పేలగా మారటము, కన్నీరు కారటము, మూర్ఛపోవటము - ఈ శారీరక లక్షణములు ద్వారా ఒక్కోసారి హృదయములోని గాఢమైన ప్రేమ కొన్నిసార్లు బయటకు వ్యక్తమవుతుంది.’ తన రోమములు నిక్క బోడుచుకున్నప్పుడు అర్జునుడు అనుభూతి చెందినది ఇదే. పూజ్యభావముతో చేతులు జోడించి వంగి, అర్జునుడు చెప్పిన వాక్యములు ఇక తదుపరి పదిహేడు శ్లోకములలో వివరించబడ్డాయి.
అర్జున ఉవాచ । పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్ ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ।। 15 ।।
15
11
https://www.holy-bhagava…udio/011_015.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; పశ్యామి — దర్శించితిని; దేవాన్ — సర్వ దేవతలను; తవ — నీ; దేవ — భగవంతుడు; దేహే — శరీరము యందే; సర్వాన్ — సర్వమూ; తథా — మరియు; భూత విశేష-సంఘాన్ — విశేషమైన ప్రాణిసమూహమును; బ్రహ్మాణo — బ్రహ్మ దేవుడు; ఈశం — శివుడు; కమల-ఆసన-స్థం — తామర పూవు యందు కూర్చుని ఉన్న; ఋషీం — ఋషులు; చ — మరియు; సర్వాన్ — సర్వ; ఉరగాన్ — సర్పములు; చ — మరియు; దివ్యాన్ — దివ్యమైన.
BG 11.15: అర్జునుడు ఇలా చెప్పెను, ఓ శ్రీ కృష్ణా, నీ దేహము యందు నేను సకల దేవతలనూ, ఎన్నెనో ప్రాణికోటి సమూహములను దర్శిస్తున్నాను. కమలము యందు కూర్చుని ఉన్న బ్రహ్మ దేవుడిని, శివుడిని, అందరు ఋషులను, మరియు దివ్య సర్పములను చూస్తున్నాను.
స్వర్గాది లోకములలో ఉండే దేవతలతో సహా, ముల్లోకముల యొక్క సమస్త ప్రాణులను, తాను చూడగలుగుతున్నానని అర్జునుడు ప్రకటిస్తున్నాడు. కమలాసనస్థమ్ అన్న పదం బ్రహ్మ దేవుడికి వర్తిస్తుంది; ఆయన బ్రహ్మాండము యొక్క కమలము మధ్యలో కూర్చుని ఉంటాడు. శంకర భగవానుడు, విశ్వామిత్రుడు మొదలగు ఋషులు, మరియు వాసుకి వంటి సర్పములు అన్నీ కూడా ఆ యొక్క విశ్వ రూపంలో కనిపించాయి.
అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోఽనంతరూపమ్ । నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ।। 16 ।।
16
11
https://www.holy-bhagava…udio/011_016.mp3
అనేక — అసంఖ్యాకమైన; బాహు — చేతులు; ఉదర — ఉదరములు; వక్త్ర — ముఖములు; నేత్రం — కన్నులు; పశ్యామి — చూస్తున్నాను; త్వాం — నీవు; సర్వతః — అన్ని దిక్కులలో; అనంత-రూపమ్ — అనంతమైన రూపములు; న అంతం — అంతము లేదు; న మధ్యం — మధ్యభాగము లేదు; న-పునః-తవ-ఆదిం — మరల నీ యొక్క మొదలు లేదు; పశ్యామి — చూచుతున్నాను; విశ్వ-ఈశ్వర — విశ్వమునకు ప్రభువు; విశ్వ-రూప — విశ్వ రూపము.
BG 11.16: అసంఖ్యాకమైన చేతులతో, ఉదరములతో, ముఖములతో, మరియు కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములను అన్ని దిశలలో చూస్తున్నాను. ఓ విశ్వేశ్వరా, విశ్వమే నీ యొక్క స్వరూపముగా కలవాడా, నీ యందు ఎటువంటి ఆదిమధ్యాంతరములు చూడలేకున్నాను.
అర్జునుడు ఇక్కడ రెండు సంబోధనలు  వాడుతున్నాడు — విశ్వేశ్వర, అంటే ‘విశ్వమును నియంత్రించేవాడా’ అని అర్థం; మరియు ‘విశ్వరూప’ అంటే ఆంగ్లములో ‘universal form.’ అర్జునుడు సూచించేదేమిటంటే, ‘ఓ శ్రీ కృష్ణా, ఈ విశ్వమంటే మరేమిటో కాదు, ఇదంతా నీ యొక్క స్వరూపమే, మరియు దాని సర్వోన్నత ప్రభువువు కూడా నీవే.’ అంతేకాక, ఈ రూపము ఎంత పెద్దగా ఉందో చెప్పటానికి, తను ఏ దిశగా చూసినా అది ఎక్కడ వరకు ఉందో, దాని అంతం ఏమిటో అవగతం కావటం లేదు - అని చెప్తున్నాడు అర్జునుడు. అది ఎక్కడి నుండి ప్రారంభమైనదో చూద్దామంటే అది దొరకటం లేదు. దాని యొక్క మధ్య ఎక్కడ ఉందో చూద్దామంటే అది కూడా సాధ్యం కావటం లేదు, మరియు దాని యొక్క చివర ఎక్కడ ఉందో గమనిద్దామంటే, తన ఎదుటే ఆవిష్కృతమైన ఆ మహాద్భుతమైన రూపానికి అంతమే లేకుండా ఉన్నది.
కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్ పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్ దీప్తానలార్క ద్యుతిమప్రమేయమ్ ।। 17 ।।
17
11
https://www.holy-bhagava…udio/011_017.mp3
కిరీటినం — కిరీటముతో అలంకరించబడి; గదినం — గదతో; చక్రిణం — చక్రములతో; చ — మరియు; తేజః-రాశిం — తేజోమయముగా; సర్వతః — అంతటా; దీప్తి-మంతమ్ — వెలుగుతూ; పశ్యామి — నేను చూచుతున్నాను; త్వాం — నిన్ను; దుర్నిరీక్ష్యం — చూడటానికి కష్టముగా; సమంతాత్ — అనీ దిశలా; దీప్త-అనల — రగిలే అగ్ని; అర్క— సూర్యుని వంటి; ద్యుతిమ్ — తేజస్సు; అప్రమేయం — అపరిమితమైన.
BG 11.17: కిరీటముతో, చక్ర-గద ఆయుధములు కలిగి సర్వత్రా ప్రకాశించుచున్న నీ యొక్క ఆశ్చర్యచకిత స్వరూపమును దర్శిస్తున్నాను. సూర్యునిలా అన్ని దిశలలో అగ్నిని విరజిమ్ముతున్న నీ తేజస్సుచే నిన్ను చూడటానికి కష్టతరంగా ఉన్నది.
ఏదేని అత్యంత ప్రకాశంతో ఉన్న వస్తువును చూస్తే ప్రాకృతిక కన్నులు బైర్లు కమ్ముతాయి. అర్జునుడి ముందు ఉన్న విశ్వ రూపము, వెయ్యి సూర్యుల తేజస్సు కంటే మించిన ప్రకాశంతో ఉంది. సూర్యుడు కన్నులను మిరుమిట్లు గొలిపినట్టు, ఆ విశ్వ రూపము కూడా చూడటానికి మహాతేజస్సుతో ఉన్నది. భగవంతుని నుండి దివ్యదృష్టి అందినది కాబట్టే అతను దానిని దర్శించగలుగుతున్నాడు. ఆ విశ్వరూపము యందు, అర్జునుడు చతుర్భుజములతో ఉన్న విష్ణు మూర్తి స్వరూపాన్ని దర్శించాడు; అది సుపరిచితమైన నాలుగు చిహ్నములను కలిగిఉన్నది - గద, శంఖము, చక్రము, మరియు తామర పువ్వు.
త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే ।। 18 ।।
18
11
https://www.holy-bhagava…udio/011_018.mp3
త్వమ్ — నీవు; అక్షరం — వినాశనములేని; పరమం — సర్వోన్నతమైన వాడివి; వేదితవ్యం — తెలుసుకోవలసిన వాడవు; త్వమ్ — నీవు; అస్య — ఈ యొక్క; విశ్వస్య — సృష్టికి; పరం — సర్వోన్నత; నిధానమ్ — ఆధారము; త్వం — నీవు; అవ్యయః — నిత్యశాశ్వతమైన; శాశ్వత-ధర్మ-గోప్తా — సనాతనమైన ధర్మమును పరిరక్షించేవాడవు; సనాతనః — సనాతమైన; త్వం — నీవు; పురుషః — దివ్య పురుషుడవు; మతః మే — నా యొక్క అభిప్రాయము.
BG 11.18: నీవే అనశ్వరమైన పరమేశ్వరుడవు అని, వేదములచే ప్రతిపాదింపబడిన పరమ సత్యము అని తెలుసుకున్నాను. నీవే సమస్త సృష్టికి ఆధారము; నీవే సనాతన ధర్మమునకు నిత్య రక్షకుడవు; నీవే నిత్య శాశ్వతమైన సర్వోత్కృష్ట భగవంతుడవు.
పరమేశ్వరునిగా శ్రీ కృష్ణుడి సార్వభౌమాధికారాన్ని తను గుర్తిస్తున్నట్టుగా అర్జునుడు ప్రకటిస్తున్నాడు; ఆయనే సమస్త సృష్టికి ఆధారము, అన్నీ వేద శాస్త్రముల ద్వారా తెలుసుకోవలసినది ఆయననే. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: సర్వే వేదా యత్ పదమామనంతి (1.2.15) ‘సర్వ వేద మంత్రముల యొక్క ప్రధాన లక్ష్యము మనలను భగవంతుని దిశగా తీస్కువేళ్లటమే. వేదశాస్త్ర అధ్యయన లక్ష్యము, ఉద్దేశ్యము ఆయనే.’ శ్రీమద్ భాగవతము ఈ విధముగా పేర్కొంటున్నది. వాసుదేవ-పరా వేదా వాసుదేవ-పరా మఖాః (1.2.28) ‘వైదిక జ్ఞానమును సంపాదించుకునే ప్రక్రియ యొక్క లక్ష్యము భగవంతుడిని చేరుకోవటమే. సర్వ యజ్ఞములు కూడా ఆయన ప్రీతి కోసమే.’ తన ఎదుటే నిల్చొని ఉన్న భగవంతుని సాకార స్వరూపమే, సమస్త వేదముల యొక్క విషయంగా ఉన్న పరమ సత్యమని అర్జునుడు తన యొక్క విజ్ఞానమును, శ్రీ కృష్ణుడిని స్తుతిస్తూ తెలియపరచాడు.
అనాదిమధ్యాంతమనంతవీర్యమ్ అనంతబాహుం శశిసూర్యనేత్రమ్ । పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతమ్ ।। 19 ।।
19
11
https://www.holy-bhagava…udio/011_019.mp3
అనాది-మధ్య-అంతం — మొదలు మధ్య చివర లేకుండా; అనంత — అనంతమైన; వీర్యమ్ — శక్తి; అనంత — అసంఖ్యాకములైన; బాహుం — చేతులు; శశి — చంద్రుడు; సూర్య — సూర్యుడు; నేత్రమ్ — కన్నులుగా; పశ్యామి — దర్శిస్తున్నాను; త్వాం — నీవు; దీప్త — ప్రజ్వలిస్తూ; హుతాశ — విరజిమ్ముతూ; వక్త్రం — నోటి (ముఖము) నుండి; స్వ-తేజసా — నీ తేజస్సు చే; విశ్వం — విశ్వము; ఇదం — ఈ యొక్క; తపంతమ్ — తపింపచేయు.
BG 11.19: నీవు ఆది-మధ్య-అంతము లేనివాడవు; నీ శక్తి అపరిమితమైనది. నీకు అనంతమైన బాహువులు కలవు; సూర్యచంద్రులు నీ నేత్రముల వంటివి మరియు అగ్నినీ నోరు వంటిది. సమస్త సృష్టిని నీ తేజస్సుచే వెచ్చగా ఉత్తేజ పరుచుతున్నటువంటి నిన్ను, నేను దర్శిస్తున్నాను.
పదహారవ శ్లోకంలో, భగవంతుని విశ్వరూపమును చూసిన అర్జునుడు, దానికి ఆది-మధ్య-అంతము లేవు అన్నాడు. దాన్ని చూస్తున్న ఉద్వేగంలో, అదే విషయాన్ని కేవలం మూడు శ్లోకాల తరువాతే మరలా చెప్తున్నాడు. ఏదేని ఒక వాక్యాన్ని తన్మయత్వంలో పదేపదే పలికితే, దానిని విస్మయాన్ని వ్యక్తీకరించటం అనుకోవాలే తప్ప సాహిత్యపరమైన తప్పుగా పరిగణించరాదు. ఉదాహరణకి, ఒక పాముని చూసినప్పుడు, వ్యక్తి ఇలా అరవచ్చు, ‘అదిగో, పాము! పాము! పాము!’ అని. అదే విధంగా అర్జునుడు ఇక్కడ ఆశ్చర్యములో అన్నదే మళ్లీ అంటున్నాడు. భగవంతుడు యదార్థముగానే ఆది, అంత్యము లేని వాడు. ఇది ఎలాగంటే, ఆకాశము, కాలము మరియు కారణబలము అన్నీ ఆయన యందే ఉన్నాయి. కాబట్టి ఆయన వాటన్నిటికీ అతీతుడు. ఆయనను పరిమాణములో కానీ, కాలములో కానీ లేదా కారణత్వములో కానీ బంధించలేము (ఇంత అని చెప్పలేము). అంతేకాక, సూర్యచంద్రులు, నక్షత్రములు తమ శక్తిని ఆయన నుండే పొందుతాయి. ఈ విధంగా, ఈ విశ్వమునకు వేడిమిని వీటి ద్వారా ఇచ్చేది ఆయనే.
ద్యావాపృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః । దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ।। 20 ।।
20
11
https://www.holy-bhagava…udio/011_020.mp3
ద్యావా-పృథివ్యో — దివి నుండి భువి వరకు; ఇదం — ఈ యొక్క; అంతరం — మధ్య ప్రదేశమంతా; హి — నిజముగా; వ్యాప్తం — వ్యాపించి ఉండి; త్వయా — నీ చే; ఏకేన — ఒక్కడివే; దిశః — దిశలలో; చ — మరియు; సర్వాః — సర్వమూ; దృష్ట్వా — చూస్తూ; అద్భుతం — అద్భుతమైన; రూపమ్ — రూపము; ఉగ్రం — ఉగ్రమైన; తవ — నీ యొక్క; ఇదం — ఇది; లోక — లోకములు; త్రయం — మూడు; ప్రవ్యథితం — వణుకుచున్నవి; మహా-ఆత్మన్ — మహాత్ముడా.
BG 11.20: దివి నుండి భువి వరకు గల మధ్య ప్రదేశమంతా మరియు అన్ని దిశలలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. ఓ మహత్మా, నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన స్వరూపమును దర్శిస్తూ, ముల్లోకములూ భయంతో కంపించిపోవటం నేను గమనిస్తున్నాను.
అర్జునుడు ఇలా అంటున్నాడు, ‘ఓ సర్వాంతర్యామియైన ప్రభూ, నీవు దశ దిశలలో, భూగోళమంతా, ఆకాశమంతా, ఆ మధ్యనున్న ప్రదేశమంతా వ్యాపించి ఉన్నావు. సమస్త ప్రాణులు నీవంటే భయముతో వణికి పోతున్నాయి.’ అని. ముల్లోకములు, దానిని చూడనే లేదు మరి ఆ విశ్వ రూపము ముందు వణికి పోవటం ఎందుకు? అర్జునుడి ఉద్దేశ్యం ఏమిటంటే ప్రతిఒక్కరు కూడా భగవంతుని చట్టానికి భయపడే పనిచేస్తారు. అందరూ ఆయన శాసనములకు లోబడి ఉండవలసినదే. కరమ ప్రధాన బిస్వ కరి రాఖా , జో జస కరఇ సో తస ఫల చాఖా (రామచరితమానస్) ‘ప్రపంచమంతా కర్మ సిద్ధాంతం ప్రకారమే పని చేస్తుంది. మనము చేసే ప్రతి దానికీ కర్మ ఫలితములను అనుభవించాల్సిందే.’ ఈ కర్మ సిద్ధాంతము లాగానే, అసంఖ్యాకములైన నియమములు/చట్టములు ఉన్నాయి. ఏంతో మంది శాస్త్రవేత్తలు ప్రకృతి యొక్క భౌతిక సూత్రాలు కనుక్కుంటూ, సిద్ధాంతీకరిస్తూ తమ జీవనం గడుపుకుంటున్నారు; కానీ వారు, ప్రకృతి చట్టాలను ఏవీ సృష్టించలేరు. భగవంతుడే సర్వోన్నతమైన శాసనాలు తయారు చేసేవాడు, మరియు ప్రతి ఒక్కరూ ఆయన చట్టములకు లోబడి ప్రవర్తించవలసినదే.
అమీ హి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి । స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ।। 21 ।।
21
11
https://www.holy-bhagava…udio/011_021.mp3
అమీ — ఇవి; హి — నిజముగా; త్వాం — నిన్ను; సుర-సంఘా — దేవతల సమూహము; విశంతి — ప్రవేశిస్తున్నారు; కేచిత్ — కొంతమంది; భీతాః — భయముతో; ప్రాంజలయః — చేతులు జోడించి; గృణంతి — కీర్తిస్తూ; స్వస్తి — మంగళకరమైన; ఇతి — ఈ విధముగా; ఉక్త్వా — గానం చేస్తూ; మహా-ఋషి — మహర్షులు; సిద్ధ-సంఘాః — సిద్ధ పురుషులూ; స్తువంతి — కీర్తిస్తున్నారు; త్వాం — నిన్ను; స్తుతిభిః — స్తోత్రములతో; పుష్కలాభిః — కీర్తనలతో.
BG 11.21: దేవతలందరూ నీలో ప్రవేశిస్తూ నీ యొక్క ఆశ్రయం పొందుతున్నారు. కొందరు భీతులై చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు మంగళకరమైన స్తోత్రములతో, కీర్తనలతో నిన్ను స్తుతిస్తున్నారు.
అర్జునుడు ఇక్కడ శ్రీ కృష్ణుడి కాల రూపమును చూస్తున్నాడు, అంటే సర్వమునూ భక్షించే కాలము యొక్క రూపము. అనుక్షణం ముందుకెళ్ళే కాలము అనేది దేవతలతో సహా గొప్పగొప్ప వ్యక్తులను కూడా హరించివేస్తుంది. వారు అంజలి ఘటిస్తూ, భగవంతుని కాల రూపమునకు దాసోహమై విశ్వ రూపము లోనికి ప్రవేశించటం అర్జునుడు చూస్తున్నాడు. అదే సమయంలో, మహర్షులు మరియు సిద్ధులు కూడా భగవంతుడిని తమ తలపులతో, వాక్కులతో, మరియు కర్మలతో స్తుతించటం చూస్తున్నాడు.
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా విశ్వేఽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ । గంధర్వయక్షాసురసిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే ।। 22 ।।
22
11
https://www.holy-bhagava…udio/011_022.mp3
రుద్ర — శంకర భగవానుని ఒక స్వరూపము; ఆదిత్యాః — ఆదిత్యులు; వసవః — వసువులు; యే — ఈ; చ — మరియు; సాధ్యాః — సాధ్యులు; విశ్వే — విశ్వదేవతలు; అశ్వినౌ — అశ్వినీ కుమారులు; మరుతః — మరుత్తులు; చ — మరియు; ఉష్మ-పాః — పూర్వీకులు; చ — మరియు; గంధర్వ — గంధర్వులు; యక్ష — యక్షులు; అసుర — అసురులు; సిద్ధ — సిద్ధులు; సంఘా — సమూహములు; వీక్షంతే — తిలకిస్తున్నారు; త్వాం — నిన్నే; విస్మితాః — సంభ్రమాశ్చర్యములతో; చ — మరియు; ఏవ — యథార్థముగా; సర్వే — అందరూ.
BG 11.22: రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీ కుమారులు, మరుత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు, మరియు సిద్ధులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యములతో నిన్నే తిలకిస్తున్నారు.
వీరందరూ గణములూ తమతమ స్థానములను భగవంతుడి అనుగ్రహ శక్తి ద్వారానే పొందారు మరియు తమ తమ కర్తవ్యములను సృష్టి యొక్క నియమముల ప్రకారంగానే నిర్వర్తిస్తుంటారు. అందుకే వారందరూ కూడా విశ్వ రూపమును ఆశ్చర్యముతో దర్శిస్తున్నారని పేర్కొనబడ్డారు.
రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదమ్ । బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ ।। 23 ।।
23
11
https://www.holy-bhagava…udio/011_023.mp3
రూపం — రూపము; మహత్ — అద్భుతమైన; తే — నీ యొక్క; బహు — చాలా; వక్త్ర — నోర్లు; నేత్రం — కన్నులు; మహా-బాహో — గొప్ప బాహువులు కల ప్రభూ; బహు — అనేకములైన; బాహు — చేతులు; ఊరు — తొడలు; పాదమ్ — కాళ్ళు; బహు-ఉదరం — ఎన్నెన్నో ఉదరములు (బొజ్జలు); బహు-దంష్ట్ర — అనేకములైన దంతములు (పళ్ళు); కరాళం — భయంకరమైన; దృష్ట్వా — చూచుతూ; లోకాః — సమస్త లోకములు; ప్రవ్యథితాః — భయకంపితములై; తథా — అట్లే కూడా; అహం — నేను.
BG 11.23: ఓ మహాప్రభూ, ఎన్నెన్నో నోర్లు, కళ్ళు, చేతులు, ఊరువులు, కాళ్ళు, ఉదరములు, మరియు భయంకరమైన పళ్ళతో ఉన్న నీ మహాద్భుతమైన స్వరూపము పట్ల పూజ్యభావంతో, సమస్త లోకములు మరియు నేను కూడా భయకంపితమైఉన్నాము.
భగవంతుని అసంఖ్యాకములైన చేతులు, కాళ్ళు, ముఖములు, మరియు ఉదరములు అంతటా ఉన్నాయి. శ్వేతాశ్వాతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వాత్యతిష్ఠద్దశాఙ్గులమ్ (3.14) ‘సర్వోత్కృష్ట భగవానుడికి వేలకొలదీ తలలు, వేల కళ్ళు, మరియు వేల పాదములు ఉన్నాయి. ఆయన విశ్వమును ఆవరించి ఉన్నాడు, కానీ దాని కన్నా అతీతుడు. అందరు మనుష్యులలో నాభి (బొడ్డు) నుండి పది వేళ్ళ పైన, హృదయాంతరాళంలో ఆయన ఉన్నాడు.’ ఆయనను దర్శించేవారు, ఆయనచే దర్శించబడేవారు, భీతిల్లి పోయేవారు మరియు భయం పుట్టించేవారు అందరూ కూడా ఆ భగవంతుని విశ్వ రూపము యందు భాగమే. మరల, కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: భయాదస్యాగ్నిస్తపతి భయాత్ తపతి సూర్యః భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః (2.3.3) ‘భగవంతుడు అంటే భయం చేతనే, అగ్ని మండుతున్నది మరియు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆయన అంటే భయము వలననే గాలి వీస్తున్నది, మరియు ఇంద్రుడు వర్షాలను కురిపిస్తున్నాడు. మృత్యు దేవత యమధర్మరాజు కూడా ఆయన ముందు వణికిపోతాడు.’
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ । దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో ।। 24 ।।
24
11
https://www.holy-bhagava…udio/011_024.mp3
నభః-స్పృశం — ఆకాశాన్ని తాకుతూ; దీప్తం — తేజస్సుతో వెలుగుతూ; అనేక — చాలా; వర్ణం — రంగులతో; వ్యాత్తా — తెరిచిఉన్న; ఆననం — నోర్లు; దీప్త — ప్రజ్వలిస్తూ; విశాల — విశాలమైన; నేత్రమ్ — కన్నులు; దృష్ట్వా — చూచుతున్న; హి — నిజముగా; త్వాం — నిన్ను; ప్రవ్యథితాంతర-ఆత్మా — నా హృదయము భయముతో వణికిపోవుతున్నది; ధృతిం — బలము; న విందామి — తెలవటం లేదు; శమం — మానసిక ప్రశాంతత; చ — మరియు; విష్ణో — విష్ణు మూర్తి.
BG 11.24: హే విష్ణో! ఆకాశమును తాకుతూ, ఎన్నెన్నో వర్ణములతో ప్రకాశిస్తూ, పెద్దగా తెరిచిఉన్న నోర్లతో, విశాలమైన అగ్ని గుండముల వంటి నీ కన్నులతో ఉన్న నీ స్వరూపమును చూస్తున్న నాకు, భయముతో గుండె అదిరిపొతున్నది. నేను ధైర్యమును మరియు మానసిక ప్రశాంతతను కోల్పోయాను.
విశ్వ రూపమును చూడటం అర్జునుడికి శ్రీ కృష్ణుడి పట్ల ఉన్న సంబంధము యొక్క స్వభావాన్ని మార్చివేసింది. ఇంతకు మునుపు శ్రీ కృష్ణుడిని సన్నిహిత స్నేహితునిగా చూసాడు మరియు ఆయన పట్ల ప్రియ మిత్రునిలా వ్యవహరించాడు. అతనికి శ్రీ కృష్ణుడే భగవంతుడు అన్న అవగాహన ఉండేది కానీ, అతని హృదయములో ఉన్న ఉప్పొంగే ప్రేమ, శ్రీకృష్ణుడి యొక్క పరమేశ్వర తత్త్వమును మరిచి పోయేటట్టు చేసింది. తన సఖుడు శ్రీ కృష్ణుడిని ప్రపంచంలో అన్నింటి కన్నా మిన్నగా ప్రేమించటం ఒక్కటే ఆయనకు గుర్తుంది. ప్రేమ యొక్క స్వభావమే అలాంటిది. అది మనస్సుని ఎంత గాఢంగా నిమగ్నం చేస్తుందంటే భక్తుడు తను ప్రేమించిన భగవంతుడి యొక్క స్థాయిని మర్చిపోతాడు. ఒకవేళ ఆ అధికార స్థాయి మర్యాద ఉండిపోతే, ప్రేమ అనేది సంపూర్ణముగా వ్యక్తమవ్వదు. ఉదాహరణకి, ఒక భార్య తన భర్తని గాఢంగా ప్రేమిస్తుంది. ఆయన రాష్ట్ర గవర్నర్ అయినా, భార్య మాత్రం ఆయనను భర్తగానే చూస్తుంది, అందుకే ఆయనతో సన్నిహితంగా ఉండగలుగుతుంది. ఒకవేళ ఆమె తన మదిలో, భర్త రాష్ట్రానికి గవర్నర్ అన్న భావననే ఉంచుకుంటే, అయిన వఛ్చిన ప్రతిసారీ, లేచి నిలబడి నమస్కారం పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా, ప్రియతముని యొక్క అధికార స్థాయి అనేది ప్రేమ భావనలో మరుగున పడిపోతుంది. ఇదే పరిణామం భగవత్ భక్తిలో కూడా చోటు చేసుకుంటుంది. వ్రజ భూమి యొక్క గోపబాలురు శ్రీ కృష్ణుడిని తమ ప్రియతమ మిత్రునిగా చూసారు. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు, ఆ గోపబాలురు శ్రీ కృష్ణుడితో గడిపిన లీలలను, చాలా మధురంగా విశదీకరించారు: దేఖో దేఖో రీ, గ్వాల-బాలన యారీ రిఝవత ఖేల జితాయ సఖన కో, ఘోడా బని బని బనవారీ (ప్రేమ రస మదిరా, రసియా మాధురి, 7వ పదము) ‘చూడండి, శ్రీ కృష్ణుడు మరియు ఆ గోపబాలుర మధ్య మధురమైన అన్యోన్య సహచర్యాన్ని! వారు కలిసి ఆడుకుంటున్నారు, మరియు శ్రీ కృష్ణుడు ఓడిపోయినప్పుడు, ఆయన గుర్రంలా వంగితే ఆయన స్నేహితులు ఆయనపై స్వారీ చేస్తున్నారు.’ ఒకవేళ ఆ గోపబాలురు గనక శ్రీకృష్ణుడే భగవానుడు అని గుర్తుంచుకుంటే వారు ఎప్పటికీ ఆయనతో అలా వ్యవహరించి ఉండేవారు కాదు. ప్రియ మిత్రునిగా చూసే అటువంటి భక్తుల సన్నిహిత సహచర్యాన్ని భగవంతుడు కూడా ఎంతో ఆనందంతో అనుభవిస్తాడు. ప్రఖ్యాతమైన గోవర్ధన లీలను శ్రీకృష్ణుడు భూలోకంలో చూపించాడు; వర్షములు కురిపించే దేవత మరియు దేవరాజైన ఇంద్రుడు కురిపించే కుండపోత వానల నుండి వ్రజ భూమి వాసులను రక్షించటానికి, గోవర్ధన గిరిని ఆయన తన ఎడమ చేతి చిటికెన వ్రేలితో పైకెత్తి పట్టుకున్నాడు. కానీ, శ్రీ కృష్ణుడి సఖులైన గోపబాలురికి ఈ విషయం ఏంటో పొసగలేదు. వారి దృష్టిలో, కృష్ణుడు కేవలం ఒక ప్రియమిత్రుడే అందుకే వారు కృష్ణుడు ఒక పర్వతాన్ని ఎత్తాడు అంటే నమ్మలేదు. జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ గారు ఈ పై శ్లోకాన్ని కొనసాగిస్తూ ఇలా పేర్కొన్నాడు: నఖ ధార్యో గోవర్ధన-గిరి జబ, సఖన కహ్యో హమ గిరిధారీ (ప్రేమ రస మదిరా, రసియా మాధురి, 7వ పదము) ‘శ్రీ కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తినప్పుడు, ఆయన యొక్క మిత్రులు గోపబాలురు, వారే నిజంగా కొండను ఎత్తినట్టుగా, తమ తమ కర్రలను ఆ గిరి క్రిందిభాగంలో ఒడిసి పెట్టారు.’ చివరికి ఇంద్రుడు తన ఓటమిని అంగీకరించి, తన తెల్లని ఏనుగు ఐరావతముపై కూర్చుని వచ్చాడు. శ్రీ కృష్ణుడి సర్వోత్కృష్ట స్థానమును గుర్తించకుండా, అంతటి కుండపోత వర్షం కురిపించినందుకు క్షమాపణ చెప్పాడు. ఇప్పుడిక, గోపబాలురు ఎప్పుడైతే స్వర్గాధిపతి అయిన ఇంద్రుడే వచ్చి తమ స్నేహితుడు కృష్ణుడికి వందనములు సమర్పించటం చూసారో, అప్పుడు శ్రీకృష్ణుడే భగవానుడు అని తెలుసుకున్నారు. ఇక, భయంతో ఆయన్ను కొంత దూరంగా ఉండే చూడటం మొదలు పెట్టారు. వారి భక్తి భావన, స్నేహం నుండి పూజ్యభావము మరియు గౌరవంగా మారటం చూసి శ్రీ కృష్ణుడు ఇలా విచారించాడు, ‘అయ్యో , మేము ఎంతో ఆనందించే ఆ యొక్క ప్రేమ పూర్వక సాన్నిహిత్యం పోయింది. వాళ్ళు ఇప్పుడు నన్ను దేవుడు అని భావిస్తున్నారు.’ అని. అందుకే తన యోగమాయా శక్తి చే, వారు తాము చూసినదాని గొప్పతనాన్ని మర్చిపోయేటట్లుగా చేసాడు, దానితో వారందరూ మరల శ్రీకృష్ణుడు కేవలం తమ స్నేహితుడే, ఇంకేమీ కాదు అనుకున్నారు. 'సఖ్య భావము' లో అర్జునుడు కూడా శ్రీ కృష్ణుడి భక్తుడే. శ్రీకృష్ణుడిని తన మిత్రునిగానే భావించేవాడు. అందుకే శ్రీకృష్ణుడిని తన రథసారథిగా ఒప్పుకున్నాడు. ఒకవేళ అతని భక్తి, శ్రీకృష్ణుడే సమస్త సృష్టికి పరమేశ్వరుడు అన్న దృక్పథంతో ఉండి ఉంటే, అర్జునుడు అటువంటి నిమ్న స్థాయి పనిని చేపించుకునేవాడే కాదు. కానీ ఇప్పుడు, ఆయన యొక్క అనంతమైన వైభవాలను మరియు అతీంద్రియమైన ఐశ్వర్యములను చూసిన పిదప అర్జునుడికి స్నేహభావం పోయి భయము కలుగుతున్నది.
దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని । దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస ।। 25 ।।
25
11
https://www.holy-bhagava…udio/011_025.mp3
దంష్ట్రా — దంతములు (పళ్ళు); కరాళాని — భయంకరమైన; చ — మరియు; తే — నీ యొక్క; ముఖాని — నోర్లు; దృష్ట్వా — చూసిన పిదప; ఏవ — నిజముగా; కాల-అనల — ప్రళయాగ్ని; సన్నిభాని — అటువంటి; దిశః — దిక్కులు; న జానే — తెలియదు; న లభే — పొందలేకున్నాను; చ — మరియు; శర్మ — శాంతి; ప్రసీద — కృప చూపించుము; దేవ-ఈశ — దేవ దేవుడు; జగత్-నివాస — విశ్వమునకు ఆశ్రయము అయిన వాడా.
BG 11.25: ప్రళయ కాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా, భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను, చూసిన పిదప, నేను ఎక్కడున్నానో మరియు ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను. ఓ దేవదేవా, నీవే జగత్తుకి ఆశ్రయము; దయచేసి నామీద కృప చూపుము.
అర్జునుడు చూస్తున్న ఈ యొక్క శ్రీ కృష్ణుని విశ్వ రూపము శ్రీ కృష్ణుడి యొక్క ఇంకొక వ్యక్తిత్వమే మరియు అది శ్రీకృష్ణుడి కన్నా అభేదమే. అయినా ఆ స్వరూపము అర్జునుడికి శ్రీ కృష్ణుడి పట్ల ఇంతకుముందు ఉన్న సఖ్యభావమును హరించి వేసింది, అంతేకాక, అర్జునుడికి ఆయనంటే భయం కలుగుతోంది. ఎన్నెన్నో అద్భుతమైన మరియు భీతిని కలిగించే రూపములలో దేవదేవుడు కనిపించేసరికి, అర్జునుడు ఇప్పుడు బెదిరిపోయాడు మరియు తన పట్ల శ్రీకృష్ణుడు కోపంతో ఉన్నాడని అనుకుంటున్నాడు, అందుకే తనపై దయ చూపించమని ప్రార్థిస్తున్నాడు.
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః। భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః ।। 26 ।। వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని । కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ।। 27 ।।
26
11
https://www.holy-bhagava…/011_026-027.mp3
అమీ — ఇవి; చ — మరియు; త్వాం — నీవు; ధృతరాష్ట్రస్య — ధృతరాష్ట్రుని యొక్క; పుత్రాః — పుత్రులు; సర్వే — అందరూ; సహ — కూడి; ఏవ — ఇంకా; అవని-పాలా — వారి యొక్క అనుబంధిత రాజులు; సంఘైః — సంఘము; భీష్మః — భీష్ముడు; ద్రోణః — ద్రోణుడు; సూత-పుత్రః — కర్ణుడు; తథా — మరియు; అసౌ — ఈ; సహ — కూడి; అస్మదీయైః — మన వైపు నుండి; అపి — కూడా; యోధ-ముఖ్యైః — ముఖ్యమైన యోధులు; వక్త్రాణి — నోర్లు; తే — నీ యొక్క; త్వరమానాః — త్వరపడుచూ; విశంతి — ప్రవేశిస్తున్నారు; దంష్ట్రా — దంతములు; కరాళాని — భయంకరమైన; భయానకాని — భీతిని గొలిపే; కేచిత్ — కొంతమంది; విలగ్నాః — చిక్కుకొని పోయి; దశన-అంతరేషు — పళ్ళ (దంతముల) మధ్యలో; సందృశ్యంతే — కనబడుతున్నారు; చూర్ణితైః — చితికిపోయి; ఉత్తమ-అంగైః — శిరస్సులతో.
BG 11.26-27: ధృతరాష్ట్రుడి కుమారులందరూ, వారి సహచర రాజులతో సహా, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తలకిందులుగా నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ భీకరమైన పళ్ళ మధ్యలో చితికిపోయినట్టు నేను చూస్తున్నాను.
అర్జునుడు చెప్పే ఈ భగవంతుని యొక్క దంతములు అంటే ఏంటి? ఇంతకు క్రితం శ్లోకంలో కూడా వీటిని గురించి చెప్పాడు. మనం మన పళ్ళను ఆహారాన్ని నమలటానికి వాడుతాము. భగవంతుని దంతములు అంటే, అవి అందరినీ కాల క్రమంలో మృత్యువు దిశగా చూర్ణం చేసే శక్తి స్వరూపములు. అమెరికన్ కవి, హెచ్. డబల్యూ. లాంగ్‌ఫెల్లో (H. W. Longfellow) ఆంగ్లంలో ఇలా వ్రాసాడు. Though the mills of God grind slowly, Yet they grind exceeding small; Though with patience he stands waiting, With exactness grinds he all. గొప్పగొప్ప కౌరవ యోధులు — భీష్ముడు, ద్రోణాచార్యుడు, మరియు కర్ణుడు — మరియు మరెందరో పాండవ పక్షయోధులు కూడా, భగవంతుని నోటిలోనికి తలకిందులుగా త్వరగా వేగగతిన పోయి, ఆయన పళ్ళ మధ్య నలిగి పోవటం అర్జునుడు గమనించాడు. అతి త్వరలో జరగబోయే పరిణామాలని ఆ భగవంతుని యొక్క విశ్వరూపములో దర్శిస్తున్నాడు. భగవంతుడు కాల పరిమితికి అతీతుడు కాబట్టి, భూత-వర్తమాన-భవిష్యత్తులన్నీ ఆయనయందు ఇప్పుడే కనిపిస్తుంటాయి. కౌరవులకు మరియు పాండవులకు పితామహుడైన భీష్ముడు, శంతను మహారాజు మరియు గంగాదేవి యొక్క పుత్రుడు. తన తండ్రి పునర్వివాహం కోరిక సఫలం చేయటానికి వీలుగా భీష్ముడు సింహాసన హక్కుని త్యజించాడు, అంతేకాక, ఆజన్మ బ్రహ్మచర్యం శపథం చేసాడు. కానీ, దుర్యోధనుడు చెడ్డవాడు మరియు పాండవుల రాజ్య హక్కుని అన్యాయంగా లాక్కుంటున్నాడు అని తెలిసి కూడా భీష్ముడు దుర్యోధనుడి వైపే ఉన్నాడు. అందుకే, ఈ యొక్క ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరిగే యుద్ధంలో ఆయనకు చావు రాసిపెట్టే ఉంది. భీష్ముడు తన చివరి సమయంలో అంపశయ్య (బాణములతో తయారుచేయబడ్డ మంచము) మీద పరుండి, భగవంతునికి ఆయన చేసిన స్తుతిని, శ్రీమద్ భాగవతము, ఇలా పేర్కొంటున్నది: సపది సఖి-వచో నిశమ్య మధ్యే నిజ-పరయోర్ బలయో రథం నివేశ్య స్థితవతి పర-సైనికాయుర్ అక్ష్ణా హృతవతి పార్థ-సఖే రతిర్ మమాస్తు (1.9.35) ‘తన స్నేహితుని ఆదేశాన్ని శిరసావహించి, రథాన్ని ఉభయ సేనల మధ్యకి నడిపించిన అర్జునుడి ప్రియ మిత్రుడైన శ్రీకృష్ణుడిపై నేను ధ్యానం చేస్తున్నాను. అక్కడ శత్రుపక్షపు యోధుల జీవిత కాలాన్ని కేవలం తన చూపుతో తగ్గించివేసాడు.’ కాబట్టి, పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానునికి వ్యతిరేకంగా పోరాడితే మరణం తప్పదని భీష్ముడికి తప్పకుండా తెలుసు. కౌరవులకు మరియు పాండవులకు కూడా ద్రోణాచార్యుడు సైనిక విద్యాగురువు. ఆయన ఎంత నిష్పక్షపాతమైన మనిషి అంటే తన కొడుకు అశ్వత్థామ కంటే అర్జునుడికే ఎక్కువ యుద్ధవిద్య నేర్పించాడు. కానీ, తన జీవన పోషణ కోసం దుర్యోధనునిపై ఆధార పడ్డాడు కాబట్టి తప్పనిసరై దుర్యోధనునికి సహాయం చేయవలసి వచ్చింది. అందుకే ద్రోణాచార్యుడికి కూడా ఈ యుద్ధంలో మరణం రాసిపెట్టి ఉంది. అయినా, ఆయన యొక్క ధీరత్వం ఎలా కొలవచ్చు అంటే, యుద్ధంలో పాండవులు ఆయనను ఏవిధంగానూ సంహరించలేకపోయి, ఆయననే సలహాకోసం సంప్రదిస్తే, తానే వారికి పరిష్కారాన్ని సూచించాడు. కర్ణుడు దుర్యోధనుని ప్రియ మిత్రుడు కాబట్టి కర్ణుడు కౌరవుల పక్షానే యుద్ధం చేసాడు. ఆయన కూడా వీరుడే. శ్రీ కృష్ణుడు ఎప్పుడైతే కర్ణుడు కుంతీ దేవి యొక్క జ్యేష్ఠ పుత్రుడు అని, నిజానికి పాండవులు ఆయన సోదరులు అని ఆయనకు తెలియచేసాడో, అప్పుడు కర్ణుడు ఈ రహస్యాన్ని యుధిష్ఠిరునికి చెప్పవద్దు అంటాడు, లేకపోతే యుధిష్ఠిరుడు కర్ణుడిని సంహరించటానికి ప్రయత్నించకుండా యుద్ధంలో ఓడిపోతాడు అంటాడు. కర్ణుడు దుర్యోధనుడి పక్షము తీస్కున్నాడు కాబట్టి ఆయన కూడా మరణించటం తథ్యమే.

27

యథా నదీనాం బహవోఽమ్బువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి । తథా తవామీ నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ।। 28 ।। యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగాః। తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ।। 29 ।।
28
11
https://www.holy-bhagava…/011_028-029.mp3
యథా — ఎలాగైతే; నదీనాం — నదుల యొక్క; బహవః — ఎన్నెన్నో; అంబు-వేగాః — నీటి తరంగాలు; సముద్రం — సముద్రము; ఏవ — నిజముగా; అభిముఖాః — దాని వైపు; ద్రవంతి — వేగంగా ప్రవహిస్తూ; తథా — అదే విధముగా; తవ — నీ యొక్క; అమీ — ఈ; నర-లోక-వీరా — నర లోక వీరులు; విశంతి— ప్రవేశిస్తున్నారు; వక్త్రాణి — నోర్లు; అభివిజ్వలంతి — ప్రజ్వలిస్తూ; యథా — ఏ విధముగా; ప్రదీప్తం — ప్రజ్వలిస్తూ; జ్వలనం — అగ్ని; పతంగాః — పురుగులు; విశంతి — ప్రవేశిస్తాయో; నాశాయ — నశించిపోవటానికి; సమృద్ధ వేగాః — గొప్ప వేగముతో; తథా ఏవ — అదే విధముగా; నాశాయ — నశించిపోవటానికి; విశంతి — ప్రవేశిస్తున్నారు; లోకాః — ఈ జనులు; తవ — నీ యొక్క; అపి — కూడా; వక్త్రాణి — నోర్లు; సమృద్ధ వేగాః — గొప్ప వేగముతో.
BG 11.28-29: ఎన్నో నదుల నీటి తరంగాలు సముద్రములోనికి వేగంగా పారుతూ వచ్చి కలిసి పోయినట్లు, ఈ గొప్పగొప్ప యోధులు అందరూ నీ ప్రజ్వలించే నోర్ల లోనికి ప్రవేశిస్తున్నారు. అగ్గిపురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి మంటలో పడి నాశనం అయిపొతాయో, ఈ యొక్క సైన్యములు కూడా నీ నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు.
యుద్ధ రంగంలో ఏంతో మంది ఉత్తమ రాజులు మరియు యోధులు ఉన్నారు. వారందరూ అది తమ కర్తవ్యముగా పరిగణించి యుద్ధంలో పోరాడారు మరియు యుద్ధరంగంలో తమ ప్రాణములను విడిచి పెట్టారు. అర్జునుడు వారిని నదులు తమకుతామే వచ్చి సముద్రములో కలిసిపోవటంతో పోల్చుతున్నాడు. ఇంకా చాలామంది ఇతరులు స్వార్థం కోసం మరియు దురాశతో యుద్ధ రంగానికి వచ్చారు. అర్జునుడు వారిని, అమాయకత్వంతో ఎర చూపబడి, అగ్నిలో పడి కాలిపోయే పురుగులతో పోల్చుతున్నాడు. ఈ రెంటిలో కూడా, ఆసన్నమైన మృత్యువు వైపు, వారు వడివడిగా పరుగులు పెడుతున్నారు.

లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః । తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ।। 30 ।।
30
11
https://www.holy-bhagava…udio/011_030.mp3
లేలిహ్యసే — నీవు నాకుతున్నావు; గ్రసమానః — కబళించే వాడివై; సమంతాత్ — అన్ని వైపులా; లోకాన్ — లోకములు; సమగ్రాన్ — సమస్తమూ; వదనైః — ముఖములతో; జ్వలద్భిః — ప్రజ్వలిస్తూ; తేజోభిః — తేజస్సుతో; ఆపూర్య — నిండి పోయిన; జగత్ — జగత్తు; సమగ్రం — సమస్తమూ; భాసః — కాంతులు; తవ — నీ యొక్క; ఉగ్రాః — ఉగ్రమైన; ప్రతపంతి — తపింపచేసే; విష్ణో — ఓ మహావిష్ణు.
BG 11.30: నీ యొక్క భయంకరమైన నాలుకలతో అన్ని దిక్కులా ఎన్నెన్నో ప్రాణులను గ్రసించివేస్తూ నీ యొక్క ప్రజ్వలిత నోళ్ళతో వారిని కబళించి వేస్తున్నావు. హే విష్ణో! నీవు సమస్త జగత్తును నీయొక్క భయంకరమైన, సర్వ వ్యాప్తమైన తేజో కిరణాలతో తపింపచేయుచున్నావు.
భగవంతుడు సమస్త జగత్తును మహా శక్తులైన సృష్టి, స్థితి, మరియు లయములచే నియంత్రిస్తూ ఉంటాడు. ప్రస్తుతం, అన్ని దిక్కులా తన మిత్రులను, శ్రేయోభిలాషులు అందరినీ గ్రసిస్తూ ఉన్న, సర్వ భక్షక శక్తిగా, ఇప్పుడు అర్జునుడికి అగుపిస్తున్నాడు. ఆ యొక్క విశ్వరూపములో, భవిష్యత్తులో జరిగే సంఘటనల దివ్యదర్శనంలో, ప్రారంభంకానున్న యుద్ధములో, తన శత్రువులు నిర్మూలించబడటం అర్జునుడు చూస్తున్నాడు. ఏంతో మంది తమ పక్షం వారు కూడా మృత్యువు పట్టులో ఉండటం గమనించాడు. తను చూసే అద్భుతమైన స్వరూపం వల్ల భయంలో బిగిసిపోయి, అర్జునుడు తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడి ఎదుట ప్రణమిల్లుతున్నాడు.
ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోఽస్తు తే దేవవర ప్రసీద । విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ।। 31 ।।
31
11
https://www.holy-bhagava…udio/011_031.mp3
ఆఖ్యాహి — చెప్పుము; మే — నాకు; కః — ఎవరు? భవాన్ — నీవు; ఉగ్ర-రూపః — ఉగ్ర రూపము; నమః-అస్తు — నేను ప్రణమిల్లుతున్నాను; తే — నీకు; దేవ-వర — దేవ దేవుడా; ప్రసీద — దయ చూపించుము; విజ్ఞాతుమ్ — తెలుసుకొనుటకు; ఇచ్ఛామి — కోరుతున్నాను; భవంతమ్ — నిన్ను; ఆద్యం — ఆదిపురుషుడవైన; న హి ప్రజానామి — తెలుసుకోలేకున్నాను; తవ — నీ యొక్క; ప్రవృత్తిమ్ — వ్యవహారమును.
BG 11.31: నీవెవరో తెలియచేయుము ఓ భయంకర రూపము కలవాడా. ఓ దేవదేవా, నీ ముందు ప్రణమిల్లుతున్నాను; దయచేసి నాపై కృప చూపుము. సమస్త సృష్టికీ ముందే ఉన్న నీ గురించి, నీవెవరో తెలుసుకోగోరుతున్నాను, ఎందుకంటే నీ స్వభావము మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకున్నాను.
ఇంతకు క్రితం అర్జునుడు, విశ్వ రూపమును చూడాలని ప్రార్థించాడు. తదుపరి, శ్రీ కృష్ణుడు దానిని చూపించినప్పుడు, అర్జునుడు భీతిల్లిపోయి అయోమయానికి గురి అయ్యాడు. నమ్మకశ్యం కాని మహాద్భుతమును చూసిన పిదప అతను భగవంతుని యొక్క యదార్థ స్వభావమును మరియు సంకల్పమును తెలుసుకోదలిచాడు. అందుకే, ఇలా అడుగుతున్నాడు, ‘నీవెవరు, నీవు ఎందుకున్నావు?’ అని.
శ్రీ భగవానువాచ । కాలోఽస్మి లోకక్ష్యయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః । ఋతేఽపి త్వాం న భవిష్యంతి సర్వే యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ।। 32 ।।
32
11
https://www.holy-bhagava…udio/011_032.mp3
శ్రీ భగవానువాచ — శ్రీ భగవానుడు పలికెను; కాలః — కాలము; అస్మి — నేను; లోక-క్ష్యయ-కృత్ — లోక వినాశమునకు హేతువు; ప్రవృద్ధః — విజృంభించిన; లోకాన్ — లోకములు; సమాహర్తుమ్ — ప్రళయకాల వినాశము; ఇహ — ఈ లోకము; ప్రవృత్తః — ప్రమేయము; ఋతే — లేకుండా; అపి — అయినా; త్వాం — నీవు; న భవిష్యంతి — బ్రతికి ఉండరు; సర్వే — అందరూ; యే — ఎవరైతే; అవస్థితాః — నిలిచిఉన్న; ప్రతి-అనీకేషు — ప్రతిపక్షమున ఉన్న; యోధాః — యోధులు.
BG 11.32: శ్రీ భగవానుడు ఇలా పలికెను : నేనే మహాకాలమును, సమస్త లోకములను సర్వనాశనము చేసే మూలకారణమును. నీ యొక్క ప్రమేయం లేకున్ననూ, ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు (నశిస్తారు).
నీవెవరు? అన్న అర్జునుడి ప్రశ్నకు సమాధానముగా, శ్రీ కృష్ణుడు తన ప్రవృత్తిని సర్వ శక్తివంతమైన కాల స్వరూపముగా, విశ్వ వినాశకారిగా తెలియచేస్తున్నాడు. 'కాల' అన్న పదం 'కలయతి' అన్న పదం నుండి వచ్చింది, అదే సమాన అర్థం 'గణయతి' అన్న పదానికి కూడా ఉంది, అంటే 'లెక్కించుట' అని అర్థం. సమస్త ప్రకృతి ఘటనలు అన్నీ కాలంలో కలిసిపోతాయి. మొట్టమొదటి అణుబాంబు తయారీలో పనిచేసిన ఒప్పెన్హైమర్ (Oppenheimer), హిరోశిమా, నాగాసాకిల విధ్వంసం చూసిన పిదప, శ్రీ కృష్ణుడి ఈ శ్లోకాన్ని ఈ విధంగా అన్నాడు : ‘కాలము… సమస్త ప్రపంచాలనీ నాశనం చేసేది నేనే.’ (Time…I am the destroyer of all the worlds). కాలము అనేది ప్రతి ఒక్క జీవప్రాణి యొక్క జీవితకాలాన్ని లెక్కిస్తుంది మరియు నియంత్రిస్తుంది. భీష్ముడు, ద్రోణాచార్యుడు, మరియు కర్ణుడు వంటి గొప్పవారు సైతం ఎప్పుడు అంతమై పోవాలో అదే నిర్ణయిస్తుంది. అర్జునుడు ఆ యుద్ధంలో పాలుపంచుకోకపోయినా సరే, కాలము అనేది శత్రు పక్షంలో బారులు తీరి ఉన్న వారందరినీ నశింపచేస్తుంది, ఎందుకంటే, భగవంతుడు ప్రపంచం పట్ల తన బృహత్ ప్రణాళికలో భాగంగా, అది అలాగే అవ్వాలని సంకల్పించాడు. ఒకవేళ శత్రు యోధులు అందరూ మరణించినట్టే అయితే మరి అర్జునుడు ఎందుకు యుద్ధం చేయాలి? తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఇది వివరిస్తున్నాడు.
తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ।। 33 ।।
33
11
https://www.holy-bhagava…udio/011_033.mp3
తస్మాత్ — కాబట్టి; త్వమ్ — నీవు; ఉత్తిష్ఠ — లెమ్ము; యశః — యశస్సు/కీర్తి; లభస్వ — పొందుము; జిత్వా — జయించుము; శత్రూన్ — శత్రువులను; భుంక్ష్వ — అనుభవించుము; రాజ్యం — రాజ్యమును; సమృద్ధమ్ — సిరిసంపదలతో ఉన్న; మయా — నాచే; ఏవ — నిజముగా; ఏతే — వీరు; నిహతాః — సంహరింపబడినారు; పూర్వం — ఇంతకు క్రితమే; ఏవ నిమిత్త మాత్రం — కేవలం ఒక పనిముట్టుగా; భవ — ఉండుము; సవ్య-సాచిన్ — అర్జునా, రెండు చేతులతో కూడా బాణములను సంధించగలవాడా.
BG 11.33: కాబట్టి, ఓ సవ్యసాచీ, లెమ్ము, కీర్తిని పొందుము! శత్రువులను జయించుము మరియు సర్వసంపదలతో ఉన్న సామ్రాజ్యమును అనుభవించుము. ఈ యోధులు ఇంతకు పూర్వమే నా చే సంహరింపబడి ఉన్నారు, కేవలం నా పనిలో ఒక పనిముట్టుగా ఉండగలవు.
కౌరవులు నశించిపోవాలి మరియు హస్తినాపుర సామ్రాజ్యము పాండవులచే ధర్మబద్ధంగా పరిపాలింపబడాలి అన్న సంకల్పాన్ని శ్రీ కృష్ణుడు అర్జునుడికి తెలియచేసాడు. శ్రీ కృష్ణ పరమాత్మ ఇంతకు మునుపే అధర్మపరుల వినాశనాన్ని మరియు ధర్మాత్ముల విజయాన్ని, యుద్ధము యొక్క పరిణామముగా నిశ్చయించాడు. లోకసంక్షేమం కోసం ఆయన వేసిన పథకాన్ని ఏ శక్తి కూడా మార్చలేదు. ఇప్పుడు, అర్జునుడు నిమిత్త మాత్రునిగా (కేవలం ఆయన చేతిలో పనిముట్టుగా) ఉండడమే తను కోరుకుంటున్నానని, శ్రీ కృష్ణుడు అతనికి చెప్తున్నాడు. భగవంతునికి తన పని యందు ఒక మానవుని సహాయం ఏమీ అవసరం లేదు, కానీ మనుష్యులు ఆయన సంకల్పాన్ని నేరవేర్చటానికి పని చేస్తే అది వారికి నిత్య శాశ్వత సంక్షేమం కలిగిస్తుంది. భగవంతుని ప్రీతి కొరకు పని చేసే అవకాశాలు అనేవి, చాల చాలా అరుదుగా మనకు తారసపడే అనుగ్రహాలు. ఈ అవకాశాలను సద్వినియోగము చేసుకోవటం ద్వారానే భగవంతుని విశేష కృపకు మనము పాత్రులం అవ్వగలుగుతాము, మరియు మనం భగవత్ సేవకులగా, మన యొక్క నిత్య శాశ్వత స్థాయి సాధించగలుగుతాము. విలుకాడిగా సాటిలేని ప్రతిభని తన కృపచే పొందిన విషయాన్నిఅర్జునుడికి గుర్తు చేస్తూ, తన చేతిలో పనిముట్టుగా ఉండమని అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. అందుకే అర్జునుడిని 'సవ్య సాచి' అని సంబోధిస్తున్నాడు, అంటే నిష్ణాతుడైన విలుకాడు అని, ఏలనన అర్జునుడు రెండు చేతులతో కూడా సమాన వేగము/ప్రతిభతో బాణములను సంధించగలడు.
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ । మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ।। 34 ।।
34
11
https://www.holy-bhagava…udio/011_034.mp3
ద్రోణం — ద్రోణాచార్యుడు; చ — మరియు; భీష్మం — భీష్ముడు; చ — మరియు; జయద్రథం — జయద్రథుడు; చ — మరియు; కర్ణం — కర్ణుడు; తథా — మరియు; అన్యాన్ — ఇతరులు; అపి — కూడా; యోధ-వీరాన్ — వీర యోధులు; మయా — నా చేత; హతాన్ — ఇప్పటికే చంపబడ్డారు; త్వం — నీవు; జహి — సంహరింపుము; మా వ్యథిష్ఠా — వ్యాకులపడకుము; యుధ్యస్వ — పోరాడుము; జేతా అసి — నీవు విజయుడవు అవుతావు; రణే — యుద్ధములో; సపత్నాన్ — శత్రువులపై.
BG 11.34: ద్రోణాచార్యుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇంకా ఇంతర వీరయోధులు అందరూ నాచే ఇప్పటికే సంహరింపబడ్డారు. కాబట్టి, వ్యాకుల పడకుండా వారిని అంతం చేయుము. కేవలం పోరాడుము, నీవు ఈ యుద్ధములో శత్రువులపై విజయం సాధిస్తావు.
కౌరవుల పక్షమున ఉన్న చాలా మంది యోధులు ఇప్పటివరకూ యుద్ధములో అజేయులే. జయద్రథుడికి ఒక వరము ఉంది; ఎవరైనా ఆయన తల భూమిపై పడేటట్టు చేస్తే, తక్షణం అలా చేసిన వారి తలే ముక్కచెక్కలై పోతుంది అని. కర్ణుడికి ఇంద్రునిచే ఇవ్వబడిన ‘శక్తి’ అనే అస్త్రము ఉంది; అది ఎటువంటి వారిపై ఉపయోగించినా అది వారిని సంహరిస్తుంది. కానీ, ఒక్కసారి మాత్రమే దానిని ఉపయోగించాలి, కాబట్టి కర్ణుడు దానిని అర్జునుడిపై పగ తీర్చుకోవటానికి దాచుకున్నాడు. ద్రోణాచార్యుడు సమస్త అస్త్ర-శస్త్రముల జ్ఞానాన్ని మరియు వాటిని నిర్వీర్యం చేసే ఉపాయాలని, భగవత్ అవతారమైన పరుశారాముని నుండి నేర్చుకున్నాడు. భీష్ముడికి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం వచ్చేటట్టు ఒక వరం ఉంది. అయినాసరే, భగవంతుడు వారందరూ చనిపోవాలి అని సంకల్పిస్తే, వారిని మరేదీ కాపాడలేదు. ఒక నానుడి ఉంది: వింధ్య న ఈంధన పాఇయే, సాగర జుడయి న నీర పరయి ఉపాస కుబేర్ ఘర, జ్యోఁ విపక్ష రఘుబీర ‘శ్రీ రామచంద్ర ప్రభువే నీకు వ్యతిరేకంగా ఉంటే, నీవు వింధ్యాచల అడవులలో ఉన్నా, నీకు అగ్ని రాజుకోవటానికి కలప కూడా దొరకదు. సముద్రము నీ పక్కనే ఉన్నా, వాడుకోవటానికి నీళ్ళు దొరకవు; మరియు సర్వసంపదల ప్రభువు కుబేరుని ఇంట్లోనే నివసిస్తున్నా, నీ భోజనానికి తగినంత దొరకదు.’ అందుకే, భగవంతుడు సంకల్పిస్తే, రక్షణ కోసం ఎంత పెద్ద ఏర్పాట్లు చేసినా అవి ఒక వ్యక్తి యొక్క మృత్యువును తప్పించలేవు. అదే విధంగా, తను ఇంతకు క్రితమే యుద్ధం యొక్క ఫలితాన్ని నిర్ణయించేసాను, కానీ అది సాధించటానికి అర్జునుడిని ఒక పనిముట్టులా ఉండి, తద్వారా వచ్చే కీర్తి ప్రతిష్ఠలను ఫలముగా పొందాలి, అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. భక్తులు ఎలాగైతే భగవంతుడిని కీర్తించాలని కోరుకుంటారో, అలాగే భగవంతుని స్వభావము కూడా తన భక్తులకు కీర్తిని ఆపాదించాలి అని అనుకుంటాడు. కాబట్టి, ఆ గొప్పతనం తనకు రావాలని కోరుకోడు శ్రీకృష్ణుడు; యుద్ధం తరువాత జనులు అందరూ, ‘అబ్బో అర్జునుడు ఎంత గొప్పగా యుద్ధం చేసాడో చూసారా, ఆయనే పాండవులకు విజయం సాధించి పెట్టాడు.’ అని అనుకోవాలి, అని కోరుకున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా సాధకులు తరచుగా, వారి యొక్క క్రోధము, లోభము, ఈర్ష్య, కామము, గర్వము వంటి వాటిని నిర్మూలించ లేకున్నప్పుడు వారి గురువుగారు ఈ విధంగా ఉత్సాహపరుస్తాడు. ‘నిరాశ పడకు, నీ మనస్సులో ఉన్న శత్రువులపై పోరాడుతూనే ఉండుము, ఎందుకంటే, భగవంతుడు నీవు విజయం సాధించాలని కాంక్షిస్తున్నాడు. నీ పరిశ్రమ చాలా ప్రధానం, అదే సమయంలో భగవంతుడు కూడా తన కృపచే నీ విజయాన్ని సఫలం చేస్తాడు.’ అని. కార్యోన్ముఖుడివి కమ్మని చెప్పిన భగవంతుని పిలుపుకి ఇక అర్జునుడి ప్రతిస్పందన ఎలా ఉంది? తదుపరి శ్లోకంలో ఇది పేర్కొనబడినది.
సంజయ ఉవాచ। ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ । నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య ।। 35 ।।
35
11
https://www.holy-bhagava…udio/011_035.mp3
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; ఏతత్ — ఈ విధముగా; శృత్వా — విన్న తరువాత; వచనం — మాటలను; కేశవస్య — శ్రీ కృష్ణుడి (కేశవుని) యొక్క; కృత-అంజలిః — చేతులు జోడించి; వేపమానః — వణుకుతూ; కిరీటీ — అర్జునుడు, కిరీటము ధరించినవాడు; నమస్కృత్వా — నమస్కరిస్తూ; భూయః — మళ్ళీ; ఏవ — నిజముగా; ఆహ — పలికెను; కృష్ణం — శ్రీ కృష్ణుడితో; స-గద్గదం — గద్గద స్వరముతో; భీత-భీతః — భయముతో భీతిల్లిపోయి; ప్రణమ్య — నమస్కరించి.
BG 11.35: సంజయుడు పలికెను : కేశవుడు పలికిన మాటలు విన్న తరువాత అర్జునుడు భీతితో వణికిపోయాడు. చేతులు జోడించి, శ్రీ కృష్ణుడి ఎదుట వంగి నమస్కరిస్తూ భయము ఆవరించి గద్గద స్వరముతో ఇలా పలికెను.
ఇక్కడ, అర్జునుడు ‘కిరీటి’ (కిరీటధారి) అని సంబోధించబడ్డాడు; ఒకానొక సమయంలో అతను ఇద్దరు రాక్షసులను సంహరించటంలో ఇంద్రుడికి సహాయం చేసాడు. దానితో ప్రీతి చెందిన ఇంద్రుడు, ఒక మిరుమిట్లుగొలిపే కిరీటమును ఆయన శిరస్సుపై ఉంచాడు. ఈ శ్లోకంలో, సంజయుడు అర్జునుడి శిరస్సున ఉన్న కిరీటమును సూచిస్తున్నాడు. అదే సమయంలో, కిరీటము అనేది రాజ్యాధికారమునకు గుర్తు, అందుకే సంజయుడు, వృద్ధుడైన ధృతరాష్ట్రునుకి, జరగబోయే యుద్ధంలో ఆయన పుత్రులైన కౌరవులు సింహాసనాన్ని పాండవులకు ఓడిపోతారని సూచిస్తూ, కావాలనే ఆ పదం వాడుతున్నాడు.
అర్జున ఉవాచ । స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః ।। 36 ।।
36
11
https://www.holy-bhagava…udio/011_036.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; స్థానే — ఇది సముచితము; హృషీక-ఈశ — శ్రీ కృష్ణుడా, ఇంద్రియములకు అధిపతి; తవ — నిన్ను; ప్రకీర్త్యా — కీర్తించుచూ; జగత్ — జగత్తు అంతా; ప్రహృష్యతి — ఆనందముతో ఉప్పొంగిపోవుతున్నది; అనురజ్యతే — అనురాగముతో నిండిపోయింది; చ — మరియు; రక్షాంసి — రాక్షసులు; భీతాని — భీతిల్లిపోయి; దిశః — అన్ని దిక్కులలో; ద్రవంతి — పారిపోతున్నారు; సర్వే — అందరూ; నమస్యంతి — నమస్కరిస్తున్నారు; చ — మరియు; సిద్ధ-సంఘాః — సిద్ధగణముల వారు అందరూ.
BG 11.36: అర్జునుడు పలికెను : హే హృషీకేశా (ఇంద్రియములకు అధిపతి), సమస్త జగత్తు నిన్ను కీర్తించుచూ ఆనందహర్షములతో ఉన్నది, మరియు నీ పట్ల ప్రేమతో నిండిపొయినది. ఇది సముచితమే. రాక్షసులు భయముతో భీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోవుతున్నారు మరియు ఎంతో మంది సిద్ధగణములు నీకు ప్రణమిల్లుతున్నారు.
ఈ శ్లోకంలో, ఇంకా తదుపరి పది శ్లోకాలలో, అర్జునుడు శ్రీ కృష్ణుడి యశోవైభవమును ఎన్నో రకాలుగా కీర్తిస్తున్నాడు. 'స్థానే' అన్న పదం వాడాడు అంటే, 'ఇది సముచితమే' అని అర్థం. ఒక మహారాజు గారి సార్వభౌమాధికారాన్ని అంగీకరించిన ఆ రాజ్య ప్రజలు, ఆ రాజు గారిని కీర్తించటంలో సంతోషాన్ని అనుభవించటం సహజమే. ఆ రాజు గారిపట్ల శతృత్వం ఉన్న వారు భయంతో ఆయన వద్ద నుండి పారిపోవటం కూడా సహజమే. ఆ మహారాజు గారి ఆప్తులైన మంత్రివర్గము ఆయన పట్ల అత్యంత భక్తిభావనతో ఉండటం కూడా సహజమే. ఇదే విషయం ఉపమానంగా అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు - జగమంతా ఆ భగవంతుడిని కీర్తిస్తుంది, రాక్షసులు ఆయన అంటే భయపడుతారు, మరియు సిద్ధసాధువులు ఆయనకు భక్తియుక్త ఆరాధన సమర్పిస్తారు.
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే । అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ ।। 37 ।।
37
11
https://www.holy-bhagava…udio/011_037.mp3
కస్మాత్ — ఎందుకు; చ — మరియు; తే — నీకు; న నమేరన్ —నమస్కరించ కూడదు; మహా-ఆత్మన్ — ఓ మహాత్మా; గరీయసే బ్రహ్మణ — బ్రహ్మను మించిన వారు; అపి — కూడా; ఆది-కర్త్రే — మూల సృష్టికర్త; అనంత — అనంతమైన వాడా; దేవ-ఈష — దేవతలకి ప్రభువా; జగత్-నివాస — జగత్తుకి ఆశ్రయమైన వాడా; త్వం — నీవు; అక్షరం — నాశము లేని; సత్-అసత్ — వ్యక్తమయినది మరియు అవ్యక్తమయినది; తత్ — అది; పరం — అతీతమైన; యత్ — ఏదైతే.
BG 11.37: ఓ మహాత్మా, మూల సృష్టికర్తయైన బ్రహ్మదేవుని కంటే ఉన్నతమైన వారు కూడా నీ ముందు ఎందుకు ప్రణమిల్లకూడదు? ఓ అనంతుడా, ఓ దేవతల ప్రభూ, ఓ జగత్తుకి ఆశ్రయమైన వాడా, నీవు వ్యక్త-అవ్యక్తములకూ అతీతమైన అక్షరుడవు.
ఇంతకు క్రితం చెప్పిన శ్లోకంలో విధంగా చేయటాన్ని నాలుగు శ్లోకాలలో సమర్థిస్తూ, అర్జునుడు, ‘కస్మాచ్చ తేన’ అన్న పదాలు వాడుతున్నాడు అంటే ‘ఎందుకు అలా చేయకూడదు’ అని అర్థం. సమస్త సృష్టి ఆయన నుండే ఉద్భవించినప్పుడు, ఆయన చేతనే సంరక్షింపబడి, నిర్వహించబడుతున్నప్పుడూ, మరియు ఆయన యందే చివరికి లయమై పోతుంది కూడా కాబట్టి, సర్వ ప్రాణులు ఆ భగవంతునికే తమ తమ వినయ పూర్వక వందనములను ఎందుకు అర్పించకూడదు? సృష్టిలో వ్యక్తమయినదంతా ఆయన శక్తియే. ఇంకనూ అవ్యక్త రూపములో ఉన్నది కూడా ఆయన నిగూఢశక్తియే. అయినా ఆయన వ్యక్త-అవ్యక్తముల రెంటికీ కూడా అతీతుడు ఎందుకంటే ఆయన సర్వోత్క్రుష్ట శక్తిమంతుడు - సమస్త శక్తులకు మూల శక్తి మరియు వాటిని తన అధీనంలో కలవాడు. కాబట్టి, భౌతిక ప్రాకృతిక శక్తి కానీ లేదా జీవ శక్తి (జీవాత్మలు) కానీ ఆయనను ఏవిధంగానూ ప్రభావితం చేయలేరు, ఆయన ఈ రెంటికీ అతీతుడు. అర్జునుడు ప్రత్యేకించి, ద్వితీయ స్థాయి సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుని కంటే శ్రీ కృష్ణుడే గొప్పవాడు అని అంటున్నాడు, ఎందుకంటే బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండంలో అందరికన్నా ప్రథముడు. సమస్త ప్రాణులు కూడా బ్రహ్మదేవుని సంతానము లేదా ఆయన నుండి వచ్చిన వారి సంతానమే. కానీ, బ్రహ్మ దేవుడు కూడా స్వయముగా శ్రీ కృష్ణుడి స్వరూపమేయైన విష్ణు మూర్తి నాభి నుండి వచ్చిన పద్మము నుండి ఉద్భవించాడు. ఈవిధంగా బ్రహ్మయే జగత్తు అంతటికీ పితామహుడు అనుకున్నా, శ్రీ కృష్ణుడు ఆ బ్రహ్మకే పితామహుడు. అందుకే, బ్రహ్మ కూడా శ్రీ కృష్ణుడికి ప్రణమిల్లటం సముచితము.
త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప ।। 38 ।।
38
11
https://www.holy-bhagava…udio/011_038.mp3
త్వం — నీవు; ఆది-దేవః — ఆది దేవుడవు; పురుషః — పురుషుడు; పురాణః — సనాతమైన; త్వం — నీవు; అస్య — ఈ యొక్క; విశ్వస్య — విశ్వము యొక్క; పరం — సర్వోన్నత; నిధానమ్ — ఆశ్రయము; వేత్తా — తెలిసినవాడివి; అసి — నీవు; వేద్యం — తెలుసుకోబడవలసిన వాడవు; చ — మరియు; పరం — సర్వోన్నత; చ — మరియు; ధామ — ధామము; త్వయా — నీ చేత; తతం — వ్యాప్తించబడి ఉన్నాయి; విశ్వం — విశ్వమంతా; అనంత-రూప — అనంతమైన రూపములు కలవాడా.
BG 11.38: నీవే సనాతనమైన భగవంతుడవు మరియు ఆది దేవుడవు; నీవే విశ్వమంతటికీ ఉన్న ఒకేఒక్క ఆధారము, ఆశ్రయము. నీవు సర్వజ్ఞుడవు మరియు తెలుసుకోబడవలసిన వాడవు. నీవే పరంధామము. ఓ అనంతరూపా, నీవే సమస్త జగత్తుయందు వ్యాపించి ఉన్నవాడవు.
అర్జునుడు శ్రీ కృష్ణుడిని ఆది దేవుడని, సర్వకారణ కారకుడని అంటున్నాడు. ప్రతి ఒక్క వస్తువునకు మరియు ప్రతి ఒక్క వ్యక్తిత్వమునకు అది జనించిన మూల కారణం, లేదా ఒక మూల ఉత్పత్తిస్థానం ఉంటుంది. విష్ణుమూర్తికి కూడా ఒక కారణం ఉన్నది. ఆయన కూడా ఒక భగవత్ స్వరూపమే అయినా, ఆయన శ్రీ కృష్ణుడి యొక్క వ్యాప్తిగా వచ్చినవాడే. కానీ, శ్రీ కృష్ణుడు మాత్రం ఎవ్వరినుండీ రాలేదు. తనకంటూ కారణం లేకుండా, సమస్త జగత్తుకూ మూలకారకుడు. అందుకే, బ్రహ్మ దేవుడు ఇలా ప్రార్థించాడు: ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాది గోవిందః సర్వ కారణ కారణం (బ్రహ్మ సంహిత 5.1) ‘శ్రీ కృష్ణుడు ఆ సర్వోత్కృష్ట భగవానుని యొక్క అసలైన మూల స్వరూపము. ఆయన సర్వజ్ఞుడు మరియు పరమానంద స్వరూపుడు. ఆయనే అన్నింటికీ మూలాధారము కానీ ఆయనకి ఏదీ మూలము లేదు మరియు ఆయన సర్వ కారణ కారకుడు.’ శ్రీ కృష్ణుడు సర్వజ్ఞుడు—అంటే సమస్తమూ తెలిసినవాడు. అంతేకాక, సర్వ జ్ఞాన విషయమూ ఆయనే. శ్రీమద్ భాగవతం ప్రకారం (4.29.49) : ‘సా విద్యా తన్మతిర్ యయా’, ‘భగవంతుడిని తెలుసుకోవటానికి ఉపయోగపడేదే నిజమైన జ్ఞానము.’ జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ గారు ఇలా పేర్కొన్నారు: జో హరి సేవా హేతు హో, సోఈ కర్మ బఖాన్ జో హరి భగతి బఢావే, సోఈ సముఝియ జ్ఞాన (భక్తి శతకము, 66వ శ్లోకము) ‘భగవత్ సేవగా చేయబడిన ఏ పని అయినా, అదే నిజమైన కర్మ అని తెలుసుకొనుము. ఏ జ్ఞానం అయినా సరే, అది భగవంతుని పట్ల ప్రేమను పెంచేది అయితేనే అది నిజమైన జ్ఞానము.’ కాబట్టి, శ్రీ కృష్ణుడు సర్వజ్ఞుడు మరియు జ్ఞాన-విషయము కూడా.
వాయుర్యమోఽగ్నిర్వరుణః శశాంకః ప్రజాప్రతిస్త్వం ప్రపితామహశ్చ । నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోఽపి నమో నమస్తే ।। 39 ।।
39
11
https://www.holy-bhagava…udio/011_039.mp3
వాయుః — వాయు దేవుడు; యమః — యముడు, మృత్యు దేవుడు; అగ్నిః — అగ్ని దేవుడు; వరుణః — వరుణ దేవుడు (నీటి దేవుడు); శశ-అంకః — చంద్రుడు; ప్రజాప్రతిః — బ్రహ్మ; త్వం — నీవు; ప్రపితామహః — ప్రపితామహుడవు; చ — మరియు; నమః — నమస్కారములు; నమః — నమస్కారములు; తే — నీకు; అస్తు — అలా ఉండు గాక; సహస్ర-కృత్వః — వేల సార్లు; పునః-చ — మళ్ళీ; భూయః — మరల; అపి — కూడా; నమః — నా నమస్కారములు; నమస్తే — నా నమస్కారములు సమర్పిస్తున్నాను.
BG 11.39: నీవే వాయుదేవుడవు, యమధర్మరాజువు, అగ్ని దేవుడవు, వరుణ దేవుడవు మరియు చంద్రుడవు. నీవే సృష్టికర్త బ్రహ్మవు మరియు సర్వ భూతముల ప్ర-పితామహుడవు. నీకు నేను వేలసార్లు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను!
శ్రీ కృష్ణుడి పట్ల అత్యంత పూజ్యభావమును అనుభవిస్తూ అర్జునుడు పదే పదే వందనములను సమర్పిస్తున్నాడు సహస్రకృత్వః (వేల వేల సార్లు). భారత దేశంలో దీపావళి సంబరాలల్లో భాగంగా పంచదారతో చేసిన తీపి వస్తువులను ఎన్నో ఆకృతులలో తయారు చేస్తారు - ఏనుగు, గుఱ్ఱము, అబ్బాయి, అమ్మాయి, కుక్క వంటివి. కానీ వాటన్నిటిలో ఉన్న మూల పదార్థము పంచదారనే. అదే విధంగా దేవతలందరికీ, ఈ జగత్తుని నిర్వహించటంలో తమ తమ ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు మరియు వేర్వేరు బాధ్యతలు ఉన్నాయి. కానీ, వారందరిలో కూర్చుని ఉన్న ఒకే భగవంతుడు, వారికున్న విభిన్న ప్రత్యేకమైన సామర్థ్యములను కలుగజేస్తాడు. ఇంకొక ఉదాహరణ గమనించండి. బంగారంతో ఎన్నో రకాల ఆభరణాలను తయారుచేస్తారు. వాటన్నిటికీ వేర్వేరు అస్తిత్వాలు ఉన్నాయి, అయినా అవి అన్నీ బంగారమే. కాబట్టి, బంగారము అనేది ఒక ఆభరణము కాకపోయినా, ఆభరణాలన్ని బంగారపువే. ఇదే ప్రకారంగా, అందరు దేవతలు భగవంతుడే కానీ దేవతలు భగవంతుడు కాదు. కాబట్టి, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడే వాయుదేవుడు, యమరాజు, అగ్ని దేవుడు, వరుణ దేవుడు, చంద్రుడు, మరియు బ్రహ్మ దేవుడు కూడా అని అర్జునుడు అంటున్నాడు.
నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ । అనంతవీర్యామితవిక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః ।। 40 ।।
40
11
https://www.holy-bhagava…udio/011_040.mp3
నమః — నమస్కారములు; పురస్తాత్ — ముందునుండి; అథ — మరియు; పృష్ఠతః — వెనుక నుండి; తే — నీకు; నమః అస్తు — నమస్కారములు సమర్పిస్తున్నాను; తే — నీకు; సర్వతః — అన్ని వైపులనుండి; ఏవ — నిజముగా; సర్వ — అన్నీ; అనంత-వీర్య — అనంతమైన శక్తి; అమిత-విక్రమః — అపరిమితమైన పరాక్రమము, శక్తి; త్వం — నీవు; సర్వం — అన్నింటినీ; సమాప్నోషి — వ్యాపించి; తతః — ఈ విధంగా; అసి — (నీవు) ఉన్నావు; సర్వః — అన్నింటిలో.
BG 11.40: అనంతమైన శక్తిసామర్థ్యములు కల ప్రభూ, నీకు ఎదురుగా ఉండి మరియు వెనుక నుండి కూడా నమస్కరిస్తున్నాను, నిజానికి అన్ని వైపులనుండీ నమస్కరిస్తున్నాను! నీవు అనంతమైన సామర్థ్యము, పరాక్రమము కలిగినవాడివై అన్నింటా వ్యాపించి ఉన్నావు, అందుకే సమస్తమూ నీ స్వరూపమే.
శ్రీ కృష్ణుడిని ‘అనంత-వీర్య’ (అనంతమైన సామర్థ్యములు కలవాడు) మరియు ‘అనంత-విక్రమః’ (అపరిమితమైన పరాక్రమము కలవాడు) అని ప్రకటిస్తూ అర్జునుడు కృష్ణుడిని కీర్తించటం కొనసాగిస్తూనే ఉన్నాడు. విభ్రాంతిచే ఉప్పొంగిపోయి, శ్రీ కృష్ణుడికి పదే పదే, నమః! నమః! అంటూ అన్ని వైపుల నుండి వందనములు సమర్పిస్తున్నాడు.
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి । అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ప్రణయేన వాపి ।। 41 ।। యచ్చావహాసార్థమసత్కృతోఽసి విహారశయ్యాసనభోజనేషు । ఏకోఽథ వాప్యచ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ।। 42 ।।
41
11
https://www.holy-bhagava…/011_041-042.mp3
సఖా — మిత్రుడు (సఖుడు); ఇతి — అలా; మత్వా — అనుకుంటూ; ప్రసభం — మూర్ఖముగా; యత్ — ఏదేని; ఉక్తం — సంబోధించి; హే కృష్ణ — ఓ శ్రీ కృష్ణా; హే యాదవ — ఓ శ్రీ కృష్ణ, యదు వంశములో జన్మించిన వాడా; హే సఖే — ఓ ప్రియ మిత్రమా; ఇతి — ఈ విధముగా; అజానతా — అజ్ఞానములో; మహిమానం — మహిమను; తవ — నీ యొక్క; ఇదం — ఇది; మయా — నా చేత; ప్రమాదాత్ — నిర్లక్ష్యముతో; ప్రణయేన — ప్రేమతో; వా అపి — లేదా; యత్ — ఏదయినా; చ — మరియు; అవహాస-అర్థం — పరిహాసము కొరకై; అసత్-కృతా — అమర్యాదతో; అసి — నీవు ఉన్న; విహారా — ఆడుతున్నప్పుడు; శయ్యా — శయనించి ఉన్నప్పుడు; ఆసనా — కూర్చున్నప్పుడు; భోజనేషు — భోజనం చేస్తున్నప్పుడు; ఏకః — ఒక్కడివే ఉన్నప్పుడు; అథవా — లేదా; అపి — కూడా; అచ్యుతా — కృష్ణా, దోషములు లేనివాడా; తత్-సమక్షం — ఇతరుల ముందు; తత్ — అవన్నీటిని; క్షామయే — క్షమించమని ప్రార్థిస్తున్నాను; త్వాం — నీ నుండి; అహం — నేను; అప్రమేయం — అపరిమితమైన.
BG 11.41-42: నీవు నా సఖుడవు (మిత్రుడవు) అనుకుంటూ, అతి చనువుతో నిన్ను, ‘ఓ కృష్ణా’, ‘ఓ యాదవా’, ‘ఓ నా ప్రియ మిత్రమా’ అని పిలిచాను. నీ మహత్త్వము తెలియక, నిర్లక్ష్యముగా, అతి చనువుతో ప్రవర్తించాను. ఆడుకుంటున్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఏకాంతముగా ఉన్నప్పుడు కానీ లేదా ఇతరుల సమక్షంలో కానీ, ఒకవేళ నీ పట్ల హాస్యానికైనా నేను అమర్యాదతో ప్రవర్తించినట్లయితే — వాటన్నిటికీ నేను క్షమాపణలను వేడుకుంటున్నాను.
భగవంతుని యొక్క సాటిలేని సర్వోన్నత స్థాయిని ప్రకటిస్తూ, అన్ని వేద శాస్త్రాలు కూడా ఇలా పేర్కొంటున్నాయి: అహం ఏవాసం ఏవాగ్రే నాన్యత్ కించాంతరం బహిః (భాగవతం 6.4.47) ‘నేను, సర్వేశ్వరుడైన భగవంతుడను, జగత్తులో ఉన్నదంతా నేనే. నాకన్నా అతీతమైనది ఏదీ లేదు మరియు నాకన్నా ఉన్నతమైనదీ ఏది లేదు." (భాగవతం 6.4.47) త్వం ఓంకారః పరాత్పరః (వాల్మీకి రామాయణం) ‘సనాతనమైన ప్రణవ నాదము ఓం కారము నీ యొక్క స్వరూపమే. నీవు అత్యున్నతమైన వాటికంటే కూడా ఉన్నతుడవు.’ వాసుదేవః ప్రః ప్రభుః (నారద పంచరాత్ర) ‘శ్రీ కృష్ణుడే సర్వోన్నత సర్వోత్క్రుష్ట భగవానుడు’ న దేవః కేశవాత్ పరః (నారద పురాణం) ‘శ్రీ కృష్ణ పరమాత్మను మించిన దేవుడు ఎవరూ లేరు.’ విద్యాత్ తం పురుషం పరం (మను స్మృతి 12.122) ‘భగవంతుడే అత్యున్నత, సర్వోన్నత పరమపురుషుడు.’ కానీ, ఇంతకు క్రితం 11.24వ శ్లోక వ్యాఖ్యానంలో చెప్పినట్టుగా, ప్రేమ ఉప్పొంగిపోయినప్పుడు, అది ప్రేమించేవాడిలో, ప్రేమించబడే వాని యొక్క అధికార స్థాయిని మర్చిపోయేటట్లు చేస్తుంది. ఈ విధంగా, శ్రీ కృష్ణుడి పట్ల తన యొక్క గాఢమైన ప్రేమలో, ఆయన యొక్క పరతత్వాన్ని మర్చిపోయి, అర్జునుడు ఆయనతో ఎంతో మధురమైన సన్నిహితమైన సమయాన్ని గడిపాడు. భగవంతుని యొక్క విశ్వ రూపమును చూసిన పిదప, అర్జునుడికి ఇప్పుడు, శ్రీ కృష్ణుడు కేవలం తన సఖుడు, మిత్రుడుయే కాక - దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మరియు ఇతర గణములు కూడా ఆరాధించే సర్వోన్నత దివ్య పురుషుడు అని పూర్తిగా తెలిసింది. అందుకే, తెలియనితనంలో, కేవలం మిత్రుడే కదా అనే ధైర్యంతో, తానేమైనా కృష్ణుడి పట్ల అమర్యాదతో ప్రవర్తించి ఉన్నానేమో అనుకొని దానికి పశ్చాత్తాప పడుతున్నాడు. గౌరవింపబడేవారు, కేవలం వాడుక నామ పేరుతో పిలవబడరు, అది వారిపట్ల మర్యాదను సూచిస్తుంది. తనకున్న దగ్గరి సాన్నిహిత్యం వలన, తనను భగవంతునితో సమానంగా ఊహించుకుని, అతిచనువుగా, ‘మిత్రమా’, ‘ప్రియసఖా’, మరియు ‘ఓ కృష్ణ’ అన్న పిలుపులతో కృష్ణుడిని సంబోధించాడని కలవర పడుతున్నాడు అర్జునుడు. అందుకే శ్రీ కృష్ణుడి దివ్య పరతత్వ వ్యక్తిత్వాన్ని మర్చిపోయిన స్థితిలో తనవలన ఏమైనా తప్పు జరిగిఉంటే దానికి క్షమాభిక్షను అర్థిస్తున్నాడు.

పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ । న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ।। 43 ।।
43
11
https://www.holy-bhagava…udio/011_043.mp3
పితా — తండ్రివి; అసి — నీవు; లోకస్య — సమస్త లోకమునకు; చర — కదిలేవి; అచరస్య — స్థిరముగా ఉండేవి; త్వమ్ — నీవు; అస్య — వీటి యొక్క; పూజ్యః — ఆరాధింపబడదగిన; చ — మరియు; గురుః — గురువు; గరీయాన్ — మహోన్నతమైన; న — కాదు; త్వత్-సమః — నీ తో సమానులు; అస్తి — ఉండేవారు; అభ్యధికః — అధికులు; కుతః — ఎవరున్నారు?; అన్యః — ఇతరులు; లోక-త్రయే — ముల్లోకాలలో; అపి — కూడా; అప్రతిమ-ప్రభావ — సాటిలేని శక్తి కలవాడా.
BG 11.43: నీవే సమస్త విశ్వమునకు, చరాచర ప్రాణులన్నిటికీ తండ్రివి. నీవే సర్వశ్రేష్ఠమైన ఆరాధ్య యోగ్యుడవు మరియు సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక గురుడవు. ఓ అసమానమైన శక్తి కలిగినవాడా, ముల్లోకాలలో నీకు సమానులే లేనప్పుడు, నిన్ను మించిన వారు మాత్రం ఎవరుంటారు?
శ్రీ కృష్ణుడే సర్వోన్నతుడు మరియు అందరికంటే పెద్దవాడు అని అంటున్నాడు అర్జునుడు. తండ్రి ఎప్పటికీ పుత్రుని కన్నా పెద్దవాడే. అందరు తండ్రులకీ తండ్రియైన వానికి శ్రీకృష్ణుడు తండ్రి. అదే విధంగా, అందరు ఆధ్యాత్మిక గురువుల గురువుకే, శ్రీ కృష్ణుడు, గురువు. మొట్టమొదటి ఆధ్యాత్మిక గురువు, సృష్టికర్త బ్రహ్మ, ఆయన తన శిష్యునికి జ్ఞానమును అందించాడు, ఆ సంప్రదాయం అలా తదుపరి కొనసాగింది. కానీ, బ్రహ్మ దేవుడు కూడా వైదిక జ్ఞానాన్ని శ్రీకృష్ణుడి ద్వారా పొందాడు. శ్రీమద్ భాగవతం (1.1.1) ఇలా పేర్కొంటున్నది: తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే, ‘శ్రీ కృష్ణుడు వేద జ్ఞానాన్ని ప్రథముడైన బ్రహ్మ దేవుని హృదయంలో ప్రవేశపెట్టాడు.’ అందుకే, ఆయన సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక గురువు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే (6.8) ‘భగవంతునికి ఎవ్వరూ సమానులు లేరు, ఆయన కంటే గొప్పవారూ ఎవరూలేరు.’ వేదములలో చెప్పబడినటువంటి పరమేశ్వరుడు శ్రీకృష్ణుడే అని తెలుసుకున్న అర్జునుడు ఈ యొక్క పైన చెప్పిన గుణములను ఆయన పట్ల ప్రకటిస్తున్నాడు.
తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ । పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ।। 44 ।।
44
11
https://www.holy-bhagava…udio/011_044.mp3
తస్మాత్ — కాబట్టి; ప్రణమ్య — నమస్కరిస్తూ; ప్రణిధాయ — సాష్టాంగముగా పడిన; కాయం — శరీరముతో; ప్రసాదయే — ప్రార్థించుచూ; త్వామ్ — నిన్ను; అహం — నేను; ఈశం — పరమేశ్వరుడివైన; ఈడ్యమ్ — ఆదరణీయమైన; పితా — తండ్రి; ఇవ — లాగా; పుత్రస్య — పుత్రుడితో; సఖా — మిత్రుడు; ఇవ — వలె; సఖ్యుః — మిత్రునితో; ప్రియః — ప్రేమించువాడు; ప్రియాయాః — ప్రియురాలి తో; అర్హసి — తగినవాడవు; దేవ — ప్రభూ; సోఢుమ్ — క్షమించుము.
BG 11.44: అందుకే ఓ ప్రభూ, నీకు ప్రణమిల్లుతూ సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ, నీ కృప వేడుకుంటున్నాను. ఒక తండ్రి కొడుకుని సహించినట్టుగా, ఒక మిత్రుడు తన మిత్రుడిని క్షమించినట్టుగా, మరియు ప్రేమించినవారిని ప్రేమికులు మన్నించినట్టుగా, దయచేసి నా అపరాధములను మన్నింపుము.
తన యొక్క ప్రవర్తన భగవత్ అపచారముగా పరిగణించుకుంటూ, అర్జునుడు క్షమాపణ వేడుకుంటున్నాడు. కృష్ణుడితో సన్నిహితంగా మెలిగేటప్పుడు—ఆడుతూ, భోజనం చేస్తూ, హాస్యంచేస్తూ, మాట్లాడుతూ, మరియు విశ్రమిస్తూ—అర్జునుడు ఒక సర్వోత్కృష్ట భగవంతుని పట్ల చూపించవలసిన మర్యాద చూపలేదు. కానీ, ఎదుటి వ్యక్తి మీద ఉన్న దగ్గరి సాన్నిహిత్యం మరియు ప్రేమతో చేసిన అపరాధములను ఎవ్వరూ పట్టించుకోరు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా దేశ రాష్ట్రపతితో పరిహాసం చేసే వీలు ఉండదు. అయినా, ఆ రాష్ట్రపతి యొక్క బాల్య మిత్రుడు ఆయనతో పరిహాసం ఆడతాడు, సన్నిహితంగా ఉంటాడు మరియు ఒక్కోసారి అరుస్తాడు కూడా. దాని కోసం రాష్ట్రపతి ఏమీ అనుకోడు, సరికదా, తన క్రింది ఉద్యోగులు చూపించే మర్యాద కంటే ఆ మిత్రుని పరిహాసమునే ఎక్కువ ఇష్ట పడుతాడు. ఒక సైనికాధికారికి ఎంతో మంది సెల్యూట్ చేస్తారు కానీ వారెవరూ కూడా ఆయన మనస్సుకు తన పక్కనే అన్యోన్యముగా కూర్చుని ఉన్న భార్య కంటే ప్రియమైన వారు కాదు. అదేవిధంగా, శ్రీ కృష్ణుడితో అర్జునుడి యొక్క సన్నిహితమైన వ్యవహారాలు, అపచారాలు కావు; ఒక సఖుడిగా మిత్రునిగా అతని ప్రేమ యుక్త భక్తి యొక్క లోతును తెలియచెప్పే అభివ్యక్తములు. అయినా, భక్తులు స్వాభావికంగా ఎంతో వినయపూర్వకంగా ఉంటారు కాబట్టి నమ్రత కొద్దీ, అర్జునుడు ఏదో తప్పుచేశానని అనుకుంటున్నాడు, కాబట్టి శ్రీకృష్ణుడిని క్షమాపణ వేడుకుంటున్నాడు.
అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే । తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస ।। 45 ।।
45
11
https://www.holy-bhagava…udio/011_045.mp3
అదృష్ట-పూర్వం — ఇంతకు పూర్వం ఎప్పుడూ చూడబడని; హృషితః — గొప్ప ఆనందము; అస్మి — నేను; దృష్ట్వా — చూసిన పిదప; భయేన — భయముతో; చ — ఇంకా; ప్రవ్యథితం — వణుకుచున్నది; మనః — మనస్సు; మే — నా యొక్క; తత్ — అది; ఏవ — నిజముగా; మే — నాకు; దర్శయ — చూపుము; దేవ — భగవత్; రూపం — రూపమును; ప్రసీద — దయచేసి కృప చూపించి; దేవ-ఈశ — దేవతలకే ప్రభువా; జగత్-నివాస — జగత్తుకే ఆశ్రయమైనవాడా.
BG 11.45: ఇంతకు మునుపెన్నడూ చూడని నీ యొక్క విశ్వ రూపమును చూసిన పిదప, నేను పరమానందమును అనుభవిస్తున్నాను. అయినా సరే, నా మనస్సు భయముతో వణుకుచున్నది. దయచేసి నాపై కృప చేయుము మరియు తిరిగి మరల నీ యొక్క ప్రసన్నమైన స్వరూపమును చూపుము, ఓ దేవదేవా, ఓ జగత్తుకు ఆశ్రయమును ఇచ్చేవాడా.
భక్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది - ఐశ్వర్య భక్తి మరియు మాధుర్య భక్తి. ఐశ్వర్య భక్తిలో భక్తుడు భగవంతుని యొక్క సర్వశక్తి తత్త్వాన్ని ధ్యానం చేస్తూ భక్తిలో నిమగ్నమౌతాడు. ఐశ్వర్య భక్తిలో ప్రధానంగా ఉండే భావము గౌరవము మరియు భక్తిపూర్వక భయము. ఇటువంటి భక్తిలో, భగవంతుని నుండి దూరంగా ఉండే భావన మరియు ప్రవర్తనలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండటం అనేవి ముఖ్యముగా ఉంటాయి. ద్వారకా వాసులు మరియు అయోధ్య వాసులు ఈ యొక్క ఐశ్వర్య భక్తికి ఉదాహరణలు; వారు శ్రీకృష్ణుడిని మరియు శ్రీరాముడిని తమ మాహారాజులుగా కొలిచారు. సామాన్య ప్రజలు తమ రాజుగారి పట్ల చాలా మర్యాద మరియు అణకువతో ఉంటారు, కానీ వారు రాజుగారి పట్ల సాన్నిహిత్య భావనలో ఉండలేరు. మాధుర్య భక్తిలో భక్తుడు భగవంతునితో అన్యోన్యమైన వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరుచుకుంటాడు. దీనిలో ప్రధానంగా ఉండే భావన ఏమిటంటే, ‘శ్రీ కృష్ణుడు నా వాడు మరియు నేను ఆయనకే చెందిన వాడిని’ అని. కృష్ణుడిని తమ తోటి స్నేహితునిగా ప్రేమించిన బృందావన గోప బాలురు, శ్రీకృష్ణుడిని తమ బిడ్డలా ప్రేమించిన యశోద మాత మరియు నందబాబా, తమ ప్రియుడిగా కృష్ణుడిని ప్రేమించిన గోపికలు, మాధుర్య భక్తికి ఉదాహరణలు. మాధుర్య భక్తి అనేది ఐశ్వర్య భక్తి కంటే అనంతమైన రెట్లు ఉన్నతమైనది. కాబట్టి, జగద్గురు శ్రీకృపాలు జీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు: సబఇ సరస రస ద్వారికా మథురా అరు బ్రజ మాహీఁ మధుర, మధురతర, మధురతమ రస బ్రజరస సమ నాహీఁ (భక్తి శతకం, 70వ శ్లోకం) ‘భగవంతుని యొక్క దివ్య ఆనందము అన్ని రూపాల్లో కూడా అత్యంత మధురమైనది. అయినా అందులోకూడా స్థాయిలు ఉన్నాయి—ఆయన యొక్క ద్వారకా లీలల ఆనందము మధురమైనది, ఆయన యొక్క మథురా లీలల ఆనందము ఇంకా మధురమైనది, మరియు, ఆయన యొక్క వ్రజ (బృందావన) లీలల ఆనందము అత్యంత మధురమైనది.’ మాధుర్య భక్తిలో, భక్తులు భగవంతుని యొక్క పరమేశ్వర తత్త్వాన్ని మర్చిపోయి, శ్రీకృష్ణుడి పట్ల నాలుగు రకాల అనుబంధాలను పెంచుకుంటారు: దాస్య భావము — శ్రీకృష్ణుడు నా స్వామి మరియు నేను ఆయన యొక్క సేవకుడిని, అని. శ్రీకృష్ణుడి వ్యక్తిగత సేవకులైన రక్తకుడు, పత్రకుడు వంటి వారి భక్తి ఈ దాస్య భావములో ఉంది. భగవంతుడు మన తండ్రి లేదా తల్లి అనేది ఈ యొక్క భావన యొక్క రూపాంతరమే, అది దీనిలో భాగమే. సఖ్య భావము — శ్రీ కృష్ణుడు మన స్నేహితుడు (సఖుడు) మరియు నేను ఆయన యొక్క సన్నిహిత సఖుడను. శ్రీదాముడు, మధుమంగళుడు, ధన్సుఖుడు, మన్సుఖుడు వంటి బృందావన గోప బాలుర యొక్క భక్తి ఈ సఖ్య భావ కోవకు చెందినది. వాత్సల్య భావం — శ్రీకృష్ణుడు మన బిడ్డ మరియు నేను ఆయన తల్లి/తండ్రిని. యశోద మరియు నందబాబాల యొక్క భక్తి ఈ వాత్సల్య భావము లోనిది. మాధుర్య భావము — శ్రీకృష్ణుడు మా ప్రియసఖుడు మరియు నేను అతని ప్రియురాలిని. బృందావన గోపికల యొక్క భక్తి ఈ మాధుర్య భావములో ఉన్నది. అర్జునుడు సఖ్యభావములో ఉన్న భక్తుడు మరియు భగవంతునితో సుహృద్భావంగల సంబంధాన్ని ఆస్వాదించేవాడు. భగవంతుని యొక్క విశ్వ రూపాన్ని చూసిన పిదప, అర్జునుడు మహోన్నతమైన ఆశ్చర్యానికి మరియు పూజ్య భావానికి లోనయ్యాడు, అయినా తను ఎప్పుడూ అనుభవించే సఖ్యభావము యొక్క మాధుర్యాన్నే కోరుకున్నాడు. కాబట్టి, ఆయన ఇప్పుడు చూస్తున్న విశ్వరూపమును ఉపసంహరించి మరలా మానవ స్వరూపాన్ని చూపించమని కృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు.
కిరీటినం గదినం చక్రహస్తమ్ ఇచ్ఛామి త్వామ్ ద్రష్టుమహం తథైవ । తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే ।। 46 ।।
46
11
https://www.holy-bhagava…udio/011_046.mp3
కిరీటినం — కిరీటము ధరించి; గదినం — గదను పట్టుకుని; చక్ర-హస్తమ్ — చక్రమును చేతి యందు కల; ఇఛ్చామి — కోరుచున్నాను; త్వామ్ — నిన్ను; ద్రష్టుమ్ — చూచుటకు; అహం — నేను; తథా-ఏవ — అదే విధముగా; తేన-ఏవ — దానిలో; రూపేణ — రూపము; చతుః-భుజేన — నాలుగు భుజములతో; సహస్ర-బాహో — వెయ్యి చేతులు ఉన్నవాడా; భవ — ఉండుము; విశ్వ-మూర్తే — ఓ విశ్వ రూపా.
BG 11.46: ఓ వెయ్యి చేతులు కలవాడా, నీవే మూర్తీభవించిన జగత్తుయైనా, కిరీటము ధరించి, చక్రమును, గదను కలిగిఉన్న నీ యొక్క చతుర్భుజ రూపములో నిన్ను చూడగోరుతున్నాను.
విశేషమైన కృప వలన, అర్జునుడికి విశ్వ రూపము దర్శింపచేయబడినది; ఇది సులభంగా ఎవరుపడితేవారికి లభించేది కాదు. శ్రీకృష్ణుడు కేవలం తన సఖుడు మాత్రమే కాదు అని అర్జునుడికి ఇప్పుడు బోధపడింది. ఆయన యొక్క దివ్య-వ్యక్తిత్వము అనంతమైన విశ్వములను తనలోనే కలిగి ఉన్నది. అయినా అర్జునుడు ఆ యొక్క అనంతములైన ఐశ్వర్యములకు ఆకర్షితము కాలేదు మరియు భగవంతుని పట్ల ఐశ్వర్య భక్తి యందు నిమగ్నమవటానికి ఆసక్తి చూపలేదు. అంతేకాక, తాను ఎప్పటిలాగానే సఖుడిగా ఆయనతో కలిసి ఉండటానికి ఆ పరమేశ్వరుడైన భగవంతుడిని మానవ రూపంలోనే చూడటానికే మొగ్గు చూపుతున్నాడు. శ్రీకృష్ణుడిని సహస్ర-బాహో అంటే వెయ్యి చేతులు కలవాడా అని సంబోధిస్తూ, అర్జునుడు ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన యొక్క చతుర్భుజ రూపమును (నాలుగు చేతులు కల రూపము) ను చూపించమని అడుగుతున్నాడు. తన చతుర్భుజ-రూపములో శ్రీ కృష్ణుడు అర్జునుడి ముందు మరియొక సందర్భములో కూడా అగుపించాడు. అర్జునుడు, ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను సంహరించిన అశ్వత్థామను బంధించి, వాడిని ఆమె ముందుకు తెచ్చినప్పుడు కూడా శ్రీ కృష్ణుడు తనను తాను చతుర్భుజ రూపములో ప్రకటించుకున్నాడు. నిశమ్య భీమ-గదితం ద్రౌపద్యాశ్చ చతుర్భుజః ఆలోక్య వదనం సఖ్యుర్ ఇదమాహ హసన్నివ (శ్రీమద్ భాగవతం 1.7.52) ‘భీముడు, ద్రౌపది ఇంకా ఇతరులు చెప్పిన మాటలను చతుర్భుజుడైన శ్రీ కృష్ణుడు విన్నాడు. ఆ తరువాత తన ప్రియ మిత్రుడైన అర్జునుడి వంక చూసి చిరునవ్వు నవ్వాడు.’ శ్రీ కృష్ణుడిని చతుర్భుజ రూపములో దర్శనం ఇవ్వమని అడుగుతూ అర్జునుడు, భగవంతుని చతుర్భుజ రూపము మరియు ద్విభుజ రూపము రెండూ అభేదమే (ఒక్కటే) అని నిరూపిస్తున్నాడు.
శ్రీ భగవానువాచ । మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ । తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ ।। 47 ।।
47
11
https://www.holy-bhagava…udio/011_047.mp3
శ్రీ-భగవాన్-ఉవాచ — శ్రీ భగవానుడు పలికెను; మయా — నా చేత; ప్రసన్నేన — ప్రసన్నుడనై; తవ — నీ చే; అర్జున — అర్జునా; ఇదం — ఇది; రూపం — రూపము; పరం — దివ్యమైన; దర్శితం — చూపించబడెను; ఆత్మ-యోగాత్ — నా యోగమాయా శక్తి చేత; తేజః-మయం — తేజోవంతమైన; విశ్వం — విశ్వము; అనంతం — అనంతమైన; ఆద్యం — ఆదిమూలమైన; యత్ — ఏదైతే; మే — నా యొక్క; త్వత్ అన్యేన — నీవు తప్ప; న దృష్ట-పూర్వం — ఇంకెవరూ ఇంతకు క్రితం చూడలేదు.
BG 11.47: శ్రీ భగవానుడు పలికెను: అర్జునా, నీ చేత ప్రసన్నుడనై, నా యోగమాయా శక్తి ద్వారా, నా యొక్క తేజోవంతమయిన, అనంతమైన, మరియు సనాతనమైన మూల విశ్వ రూపమును నేను నీకు చూపించితిని. నీ కంటే ముందు ఈ రూపమును ఎవ్వరూ చూడలేదు.
అర్జునుడు భీతిల్లిపోయి, విశ్వ రూపమును ఉపసంహరించమని వేడుకోవటం వలన, శ్రీ కృష్ణుడు ఇప్పుడు అతనిని భయపడనవసరం లేదని శాంతింపజేస్తున్నాడు. తన యొక్క విశ్వరూప దర్శనమును అర్జునుడిపై కృపతో ప్రసాదించాడు, అంతేకానీ శిక్షించటానికి కాదు, ఆ రూపాన్ని అర్జునుడి పట్ల చాలా ప్రీతి చెంది చూపించాడు. ఆ విశ్వ రూపమును చూడటంలో అర్జునుడే మొట్టమొదటి వాడు అని, అది ఎంత అరుదైన విషయమో అని వక్కాణించటంలో అతిశయోక్తితో చెప్పాడు. దుర్యోధనునికి మరియు యశోదమ్మకూ కూడా ఈ విశ్వ రూపమును కొద్దిగా చూపించాడు కానీ, మరీ ఇంత అద్భుతంగా, ఇంత విస్తారంగా, ఈ పరిమాణంలో కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టిని తన యోగామాయా శక్తి ద్వారా ప్రసాదించాడు. ఇది భగవంతుని యొక్క సర్వ శక్తివంతమైన శక్తిస్వరూపము. దీనిని ఎన్నో చోట్ల ఉదహరించాడు, 4.6వ శ్లోకంలో మరియు 7.25వ శ్లోకంలో మొదలైన చోట్ల. ఈ యొక్క యోగమాయా శక్తి ద్వారానే, భగవంతుడు, ‘కర్తుమకర్తుమ్ అన్యథా కరతుమ్ సమర్థః’ అయ్యాడు; అంటే, ఈ యోగామాయా శక్తి ద్వారా సాధ్యమయ్యేవి చేయగలడు, సాధ్యం కానివి చేయగలడు, ఒకేసారి పరస్పర విరుద్ధమైనవి కూడా చేయగలడు.’ ఈ యొక్క దివ్యమైన శక్తి ఒక సాకార రూపంలో కూడా ప్రకటితమౌతుంది మరియు హిందూ ధర్మంలో అది విశ్వ మాతగా, రాధ, దుర్గ, లక్ష్మీ, కాళీ, సీత, పార్వతి, వంటి రూపాలలో ఆరాధించబడుతుంది.
న వేద యజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవంరూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ।। 48 ।।
48
11
https://www.holy-bhagava…udio/011_048.mp3
న — కాదు; వేద-యజ్ఞ — యజ్ఞముల వలన; అధ్యయనైః — వేద అధ్యయనం వలన కానీ; న దానైః — దానముల వలన కానీ; న చ క్రియాభిః — కర్మకాండల వలన కానీ; న తపోభిః — తపస్సులచే కానీ; ఉగ్రై — తీవ్రమైన; ఏవం-రూపః — ఈ రూపములో; శక్యః — సాధ్యము; అహం — నేను; నృలోకే — ఈ మర్త్య లోకములో; ద్రష్టుం — చూడబడటం; త్వత్ — నీవు కాక; అన్యేన — ఇతరుల చే; కురు-ప్రవీర — కురు యోధులలో శ్రేష్ఠుడా.
BG 11.48: వేదముల అధ్యయనం వలన కానీ, యజ్ఞయాగాదులు చేయటం వలన కానీ, తపస్సులు, దానాల వలన కానీ, తీవ్ర నియమ-నిష్ఠలను ఆచరించటం వలన కానీ, ఏ మానవుడు కూడా నీవు చూసిన దాన్ని ఇప్పటివరకు చూడలేదు, ఓ కురు యోధ శ్రేష్ఠుడా.
స్వీయ శక్తి ఎంత ఉపయోగించినా, అంటే — వేద శాస్త్ర అధ్యయనము, కర్మ కాండలు, తీవ్ర నియమ నిష్ఠలు, ఉపవాసాలు, లేదా దాన-ధర్మాలు — ఇవేవీ కూడా భగవంతుని యొక్క విశ్వ రూపమును దర్శింపచేయలేవు. అది ఆయన యొక్క దివ్యకృప వలన మాత్రమే సాధ్యము. ఇదే విషయం వేదములలో కూడా చాలా సార్లు చెప్పబడింది: తస్య నో రాస్వ తస్య నో ధేహి (యజుర్వేదము) ‘పరమేశ్వరుడైన భగవంతుని యొక్క కృపా కటాక్షామృతము లేనిదే ఆయనను చూడటం ఎవరికీ సాధ్యం కాదు.’ దీని వెనుక ఉన్న తర్కము చాలా సరళమైనది. మన యొక్క భౌతికమైన కన్నులు ప్రాకృతిక పదార్థముతో తయారు చేయబడ్డాయి, కాబట్టి మనము కేవలం భౌతిక పదార్థమునే చూడగలుగుతాము. పరమేశ్వరుడు భౌతికమైన వాడు కాదు, ఆయన దివ్యమైన వాడు. ఆయన దివ్య రూపమును దర్శించటానికి మనకు దివ్య చక్షువులు కావాలి, అప్పుడే మనము వాటిని చూడగలుగుతాము. ఎప్పుడైతే భగవంతుడు తన యొక్క కృపను ఆ జీవాత్మపై ప్రసాదిస్తాడో, ఆయన తన యొక్క దివ్య చక్షువులను మన భౌతికమైన కన్నులకు అందిస్తాడు, ఆ తర్వాతే మనము ఆయనను చూడగలము. మనకు ఒక సందేహము రావచ్చు, దైవానుగ్రహముతో అర్జునుడు చూసిన ఆ విశ్వరూపమును మరి సంజయుడు ఎలా చూడగలిగాడు అని. మహాభారతము ప్రకారం, సంజయుడికి కూడా తన గురువు, భగవత్ అవతారమైన వేదవ్యాసుని ద్వారా దివ్యదృష్టి లభించింది. యుద్ధం ప్రారంభం కాక ముందు తన శిష్యుడైన సంజయుడికి వేదవ్యాసుడు, ధృతరాష్ట్రునికి యుద్ధ విశేషాలు చెప్పటం కోసం, దివ్యదృష్టిని ప్రసాదించాడు. కాబట్టి సంజయుడు కూడా అర్జునుడు చూసిన విశ్వరూపమునే చూసాడు. కానీ తరువాత కాలంలో, దుర్యోధనుడు మరణించిన పిదప, సంజయుడు తీవ్ర దుఃఖానికి లోనయ్యి తన దివ్యదృష్టిని కోల్పోయాడు.
మా తే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ । వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య ।। 49 ।।
49
11
https://www.holy-bhagava…udio/011_049.mp3
మా తే — నీకు ఇది కూడదు; వ్యథా — భయము; మా — కాదు; చ — మరియు; విమూఢ-భావః — అయోమయ స్థితి; దృష్ట్వా — చూసిన పిదప; రూపం — రూపము; ఘోరం — భయంకరమైన; ఈదృక్ — ఈ విధమైన; మమ — నా యొక్క; ఇదం — ఇది; వ్యపేత-భీః — భయరహితముగా; ప్రీత-మనాః — ప్రసన్న చిత్తముతో; పునః — మరల; త్వం — నీవు; తత్ ఏవ — ఆ యొక్క; మే — నా యొక్క; రూపం — రూపము; ఇదం — ఇది; ప్రపశ్య — తిలకించుము.
BG 11.49: నా యొక్క ఈ భయంకర రూపమును చూసి భయపడవద్దు, భ్రాంతికి లోను కావద్దు. భయరహితముగా ప్రసన్నచిత్తముతో మరొకసారి నా యొక్క స్వరూపమును చూడుము.
అనవసరముగా భయపడకుండా, నిజానికి అర్జునుడు విశ్వరూప దర్శన అనుగ్రహం లభించినందుకు గర్వపడాలి అని చెప్తూ, అర్జునుడిని సముదాయించటం శ్రీకృష్ణుడు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. అంతేకాక, తన యొక్క మామూలు రూపమును తిరిగి చూసి ఇక భయమును వదిలి వేయమంటున్నాడు, శ్రీ కృష్ణుడు.
సంజయ ఉవాచ । ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః । ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా ।। 50 ।।
50
11
https://www.holy-bhagava…udio/011_050.mp3
సంజయ ఉవాచ — సంజయుడు ఇలా పలికెను; ఇతి — ఈ విధముగా; అర్జునం — అర్జునునికి; వాసుదేవః — కృష్ణుడు, వసుదేవుని తనయుడు; తథా — ఆ విధముగా; ఉక్త్వా — పలికిన పిదప; స్వకం — తన వ్యక్తిగత; రూపం — రూపమును; దర్శయామ్-ఆస — చూపించెను (దర్శింపచేసెను); భూయః — మరల; ఆశ్వాసయామ్-ఆస — ఊరడించాడు; చ — మరియు; భీతం — భీతిల్లిన; ఏనం — అతనికి; భూత్వా — అగుతూ; పునః — మరల; సౌమ్య-వపు: — సౌమ్యమైన రెండు చేతుల రూపము; మహా-ఆత్మా — దయాళువు.
BG 11.50: సంజయుడు ఇలా పలికెను: ఈ విధముగా పలికిన పిదప దయాళువైన వసుదేవుని తనయుడు తన యొక్క (చతుర్భుజ) సాకార రూపమును మరల చూపించెను. తదుపరి, సౌమ్యమైన (రెండు భుజముల) రూపమును స్వీకరించి, భీతిల్లిన అర్జునుడిని మరింత శాంతింపచేసెను.
శ్రీ కృష్ణుడు తన యొక్క విశ్వరూపమును దాచిపెట్టి (ఉపసంహరించి), బంగారు కిరీటముతో, చక్రము, గద, మరియు తామర పువ్వుతో అలంకరించబడి ఉన్న చతుర్భుజ రూపములో అర్జునుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అది రాజసము, సర్వజ్ఞత, సర్వశక్తిత్వము వంటి సమస్త దివ్య ఐశ్వర్యములకు నెలవు. శ్రీ కృష్ణుడి యొక్క చతుర్భుజ రూపము విస్మయము మరియు గౌరవము వంటి భావాలను కలుగచేస్తుంది; ఇది ప్రజలకు ఆ దేశ మహారాజు పట్ల ఉండే భావన వంటిది. కానీ, అర్జునుడు శ్రీకృష్ణుడి సఖుడు (మిత్రుడు), అందుకే పూజ్య భావము మరియు గౌరవము ప్రధానంగా ఉన్న భక్తి ఆయనను తృప్తి పరచలేదు. ఆయన శ్రీకృష్ణుడితో ఆడుకున్నాడు, కలిసి తిన్నాడు, తన యొక్క ఆంతరంగిక రహస్యాలను చెప్పుకున్నాడు, మరియు ప్రేమతోడి మధుర క్షణాలను ఆయనతో పంచుకున్నాడు. ఇటువంటి పరమానందదాయకమైన సఖ్య భావము (భగవంతుడిని సఖుడిగా భావించే భక్తి) ఐశ్వర్య భక్తి (భగవంతుడిని కాస్త దూరముగా ఈశ్వరునిగా భావించే భక్తి) కంటే అనంతమైన రెట్లు మధురమైనది. కాబట్టి, అర్జునుడి భక్తి భావమునకు సరిపోయేటట్లు, శ్రీకృష్ణుడు అంతిమంగా తన చతుర్భుజ స్వరూపమును కూడా దాచిపెట్టి, తన అసలైన రెండు భుజముల స్వరూపములోకి మారిపోయాడు. ఒకసారి బృందావన అడవిలో, శ్రీకృష్ణుడు గోపికలతో ప్రేమతోడి లీలలు చేస్తూ, అకస్మాత్తుగా వారిమధ్య నుండి మాయమై పోయాడు. గోపికలు ఆయనను తిరిగి కనిపించమని వేడుకున్నారు. వారి విన్నపమును మన్నించిన శ్రీకృష్ణుడు మరల తన చతుర్భుజ రూపములో దర్శనమిచ్చాడు. గోపికలు ఆయనను విష్ణు మూర్తి అనుకోని తమ వందనములు సమర్పించారు. కానీ వారు ఆయన యందు ఆకర్షితం కాక ఆయనతో సమయం గడపలేక అక్కడ నుండి ముందుకెళ్ళిపోయారు. వారు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడిని తమ ఆత్మసఖునిగా చూడటానికి అలవాటు పడిపోయారు, మరియు వారిని, ఆయన యొక్క విష్ణుమూర్తి స్వరూపము ఆకట్టుకోలేదు. అదే సమయంలో అక్కడికి రాధారాణి వచ్చింది, మరియు ఆమెను చూసిన పిదప, శ్రీకృష్ణుడు ప్రేమతో ఉప్పొంగిపోయి, తన యొక్క చతుర్భుజ రూపమును ఉంచుకోలేకపోయాడు. ఆయన యొక్క రెండు చేతులు వాటికవే మాయం అయిపోయాయి మరియు తన రెండు చేతుల రూపమును తిరిగి స్వీకరించాడు. ఈ శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు తన యొక్క అత్యంత ఆకర్షణీయమైన ద్విభుజ రూపమునకు తిరిగివచ్చేసాడు.
అర్జున ఉవాచ । దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన । ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః ।। 51 ।।
51
11
https://www.holy-bhagava…udio/011_051.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; దృష్ట్వా — చూసిన పిదప; ఇదం — ఈ; మానుషం — మనుష్య; రూపం — రూపము; తవ — నీ యొక్క; సౌమ్యం — సౌమ్యమైన; జనార్దన — జనుల బాగోగులు చూసుకునేవాడా, శ్రీ కృష్ణా; ఇదానీమ్ — ఇప్పుడు; అస్మి — నేను; సంవృత్తః — కుదుటపడి; స-చేతాః — మనస్సులో; ప్రకృతిం — నా మామూలు స్థితిని; గతః — పొందాను.
BG 11.51: అర్జునుడు ఇలా అన్నాడు : ఓ శ్రీ కృష్ణా, నీ యొక్క సౌమ్యమైన (రెండు చేతుల) మనుష్య రూపము చూసి, నా ప్రశాంతతను మళ్ళీ పొందాను మరియు నా మనస్సు సహజ స్థితికి వచ్చినది.
శ్రీ కృష్ణుడి యొక్క అత్యంత సౌందర్యమైన రెండు చేతుల రూపము చూసేసరికి, అర్జునుడి యొక్క సఖ్య భావము మరల దృఢపడింది. అందుకే, అర్జునుడు తన మనస్సు కుదుటపడింది మరియు తాను మామూలు స్థితికి వచ్చాను అని అంటున్నాడు. పాండవులతో శ్రీకృష్ణుడి యొక్క లీలలను దర్శించిన దేవర్షి నారదుడు, ఇంతకు మునుపు అర్జునుడి పెద్దన్న యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు: గూఢం పరం బ్రహ్మ మనుష్య లింగం (భాగవతం 7.15.75) "శ్రీకృష్ణుడు మీ ఇంటిలోనే ఉంటున్నాడు మరియు మీ తోడబుట్టినవాడిలా కలిసి ఉంటున్నాడు.’ ఈ విధంగా, అర్జునుడు భగవంతుడితో ఒక సోదరుడిలా, ఒక మిత్రుడిలా సన్నిహితంగా ఉండే అదృష్టానికి అలవాటు పడ్డాడు.
శ్రీ భగవానువాచ । సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ । దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ।। 52 ।। నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా । శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ।। 53 ।।
52
11
https://www.holy-bhagava…/011_052-053.mp3
శ్రీ-భగవాన్-ఉవాచ — పరమేశ్వరుడైన భగవానుడు ఇలా పలికెను; సు-దుర్దర్శమ్ — దర్శన భాగ్యము దుర్లభము; ఇదం — ఇది; రూపం — రూపము; దృష్టవాన్-అసి — నీవు చూస్తున్నది; యత్ — ఏదైతే; మమ — నా యొక్క; దేవాః — దేవతలకు; అపి — కూడా; అస్య — ఇది; రూపస్య — రూపము; నిత్యం — నిత్యమూ; దర్శన-కాంక్షిణః — దర్శించుటకు కాంక్షిస్తారు (కోరుకుంటారు); న — కాదు; అహం — నేను; వేదైః — వేద అధ్యయనము వలన; న — కాదు; తపసా — తపస్సు ల చేత; న — కాదు; దానేన — దానములచేత; న — కాదు; చ — మరియు; ఇజ్యయా — పూజాది కార్యముల చేత; శక్యః — ఇది సాధ్యము; ఏవం-విధః — ఈ విధముగా; ద్రష్టుమ్ — చూడటానికి; దృష్టవాన్ — చూస్తూ; అసి — నీవు; మాం — నన్ను; యథా — ఇలా.
BG 11.52-53: శ్రీ భగవానుడు పలికెను: నీవు చూసే నా ఈ యొక్క రూపము దర్శనం పొందటం ఎంతో దుర్లభమయినది. దేవతలు కూడా దీనిని చూడాలని ఆకాంక్షిస్తుంటారు. వేదాధ్యయనము వలన కానీ, తపస్సులవలన కానీ, దానధర్మాల వలన కానీ, లేదా యజ్ఞముల వలన కానీ, నేను, నీవు ఇందాక చూసినట్టుగా కనిపించను.
అర్జునుడికి విశ్వరూపమును చూపించిన పిదప, ఆ విశ్వరూపము అతనికి తప్ప వేరెవరికీ దర్శనం కాలేదని చెప్పిన తర్వాత, శ్రీకృష్ణుడు అర్జునుడికి తన యొక్క మనుష్య రూపము పట్ల ప్రేమ బలంగానే, స్థిరంగానే ఉండాలని భావించాడు. కాబట్టి, అర్జునుడు ఈ విధముగా భగవంతుడిని చూడటం కూడా చాలా అరుదు అని అంటున్నాడు, శ్రీకృష్ణుడు. దేవతలు కూడా, భగవంతుడిని ఈ అర్జునుడు ముందు ఉన్న రెండు చేతుల రూపములో దర్శించటానికి ఎంతో తహతహలాడుతుంటారు అని వక్కాణిస్తున్నాడు. ఎంత వేదాధ్యయనం చేసినా, తపస్సులు, యజ్ఞములు చేసినా ఇది సాధ్యము కాదు. మన స్వంత ప్రయత్నం ద్వారా భగవంతుడిని తెలుసుకోలేము అనేది ప్రాథమిక ఆధ్యాత్మిక సూత్రము. కానీ, ఆయన పట్ల భక్తిలో నిమగ్నమయ్యే వారు ఆయన కృపను పొందగలరు. ఆ తరువాత, ఆయన కృప వల్ల, వారు దేవుడిని సునాయాసముగా తెలుసుకోగలరు. ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన (3.2.3) ‘ఆధ్యాత్మిక ప్రవచనాల వలన కానీ, లేదా, మన బుద్ధి చేత కానీ, చాలా రకాల ఉపదేశాలను వినటం వలన కానీ, భగవంతుడు తెలుసుకోబడలేడు.’ ఇవేవీ వ్యక్తిగత రూపంలో ఉన్న భగవత్ ప్రాప్తికి ఉపయోగపడకపోతే, మరి ఆయనను ఈ రూపంలో ఎలా దర్శించగలము? ఇక ఇప్పుడు ఈ రహస్యం చెప్తున్నాడు.
శ్రీ భగవానువాచ । సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ । దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ।। 52 ।। నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా । శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ।। 53 ।।
53
11
https://www.holy-bhagava…/011_052-053.mp3
శ్రీ-భగవాన్-ఉవాచ — పరమేశ్వరుడైన భగవానుడు ఇలా పలికెను; సు-దుర్దర్శమ్ — దర్శన భాగ్యము దుర్లభము; ఇదం — ఇది; రూపం — రూపము; దృష్టవాన్-అసి — నీవు చూస్తున్నది; యత్ — ఏదైతే; మమ — నా యొక్క; దేవాః — దేవతలకు; అపి — కూడా; అస్య — ఇది; రూపస్య — రూపము; నిత్యం — నిత్యమూ; దర్శన-కాంక్షిణః — దర్శించుటకు కాంక్షిస్తారు (కోరుకుంటారు); న — కాదు; అహం — నేను; వేదైః — వేద అధ్యయనము వలన; న — కాదు; తపసా — తపస్సు ల చేత; న — కాదు; దానేన — దానములచేత; న — కాదు; చ — మరియు; ఇజ్యయా — పూజాది కార్యముల చేత; శక్యః — ఇది సాధ్యము; ఏవం-విధః — ఈ విధముగా; ద్రష్టుమ్ — చూడటానికి; దృష్టవాన్ — చూస్తూ; అసి — నీవు; మాం — నన్ను; యథా — ఇలా.
BG 11.52-53: శ్రీ భగవానుడు పలికెను: నీవు చూసే నా ఈ యొక్క రూపము దర్శనం పొందటం ఎంతో దుర్లభమయినది. దేవతలు కూడా దీనిని చూడాలని ఆకాంక్షిస్తుంటారు. వేదాధ్యయనము వలన కానీ, తపస్సులవలన కానీ, దానధర్మాల వలన కానీ, లేదా యజ్ఞముల వలన కానీ, నేను, నీవు ఇందాక చూసినట్టుగా కనిపించను.
అర్జునుడికి విశ్వరూపమును చూపించిన పిదప, ఆ విశ్వరూపము అతనికి తప్ప వేరెవరికీ దర్శనం కాలేదని చెప్పిన తర్వాత, శ్రీకృష్ణుడు అర్జునుడికి తన యొక్క మనుష్య రూపము పట్ల ప్రేమ బలంగానే, స్థిరంగానే ఉండాలని భావించాడు. కాబట్టి, అర్జునుడు ఈ విధముగా భగవంతుడిని చూడటం కూడా చాలా అరుదు అని అంటున్నాడు, శ్రీకృష్ణుడు. దేవతలు కూడా, భగవంతుడిని ఈ అర్జునుడు ముందు ఉన్న రెండు చేతుల రూపములో దర్శించటానికి ఎంతో తహతహలాడుతుంటారు అని వక్కాణిస్తున్నాడు. ఎంత వేదాధ్యయనం చేసినా, తపస్సులు, యజ్ఞములు చేసినా ఇది సాధ్యము కాదు. మన స్వంత ప్రయత్నం ద్వారా భగవంతుడిని తెలుసుకోలేము అనేది ప్రాథమిక ఆధ్యాత్మిక సూత్రము. కానీ, ఆయన పట్ల భక్తిలో నిమగ్నమయ్యే వారు ఆయన కృపను పొందగలరు. ఆ తరువాత, ఆయన కృప వల్ల, వారు దేవుడిని సునాయాసముగా తెలుసుకోగలరు. ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన (3.2.3) ‘ఆధ్యాత్మిక ప్రవచనాల వలన కానీ, లేదా, మన బుద్ధి చేత కానీ, చాలా రకాల ఉపదేశాలను వినటం వలన కానీ, భగవంతుడు తెలుసుకోబడలేడు.’ ఇవేవీ వ్యక్తిగత రూపంలో ఉన్న భగవత్ ప్రాప్తికి ఉపయోగపడకపోతే, మరి ఆయనను ఈ రూపంలో ఎలా దర్శించగలము? ఇక ఇప్పుడు ఈ రహస్యం చెప్తున్నాడు.
భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోఽర్జున । జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప ।। 54 ।।
54
11
https://www.holy-bhagava…udio/011_054.mp3
భక్త్యా — భక్తి చేత; తు — మాత్రమే; అనన్యయా — అనన్యమైన; శక్యః — సాధ్యము; అహం — నేను; ఏవం-విధః — ఈ విధముగా; అర్జున — అర్జునా; జ్ఞాతుం — తెలుసుకోబడుట; ద్రష్టుం — చూడబడుట; చ — మరియు; తత్త్వేన — యదార్థముగా; ప్రవేష్టుమ్ — ప్రవేశించుటకు (నాతో ఏకమై పోవుటకు); చ — మరియు; పరంతప — శత్రువులను పీడించే వాడా.
BG 11.54: ఓ అర్జునా, అనన్యమైన భక్తి చేత మాత్రమే నేను నీ ముందే నిల్చుని ఉన్న నన్నుగా యదార్థముగా తెలుసుకోబడుతాను. ఓ పరంతపా, అందువలన నా దివ్య దృష్టిని పొందిన పిదప నాతో ఏకీభావ స్థితిని పొందవచ్చు.
ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు తనను చేరుకోవటానికి, భక్తి యొక్క ప్రాముఖ్యతని వక్కాణిస్తున్నాడు. ఇంతకు క్రితం 11.48వ శ్లోకములో, విశ్వరూపము కేవలం భక్తి ద్వారా మాత్రమే చూడబడచ్చు అని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో, అర్జునుడి ముందు ఉన్న ఈ తన ద్వి-భుజ (రెండు చేతుల) స్వరూపమును దర్శించటం కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధ్యమని శ్రీ కృష్ణుడు దృఢంగా ప్రకటిస్తున్నాడు. వేద శాస్త్రాలలో ఇది పదే పదే చెప్పబడింది: భక్తిరేవైనం నయతి భక్తిరేవైనం పశ్యతి భక్తిరేవైనం దర్శయతి భక్తి వశః పురుషో భక్తిరేవ గరీయసీ (మాథర్ శృతి) ‘భక్తి మాత్రమే మనలను భగవంతునితో ఏకం చేస్తుంది; భక్తి మాత్రమే ఆయనను దర్శించటానికి మనకు సహాయం చేస్తుంది; భక్తి మాత్రమే ఆయనను పొందటానికి సహాయపడుతుంది; భగవంతుడు నిజమైన భక్తికి దాసుడై పోతాడు, ఇదే అన్ని మార్గాల్లో కెల్లా అత్యుత్తమ మార్గము.’ న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్ధవ న స్వాధ్యాయస్ తపస్ త్యాగో యథా భక్తిర్ మమోర్జితా (భాగవతం 11.14.20) ‘ఉద్ధవా, నేను నా భక్తుల ఆధీనముకు లోబడి ఉంటాను మరియు వారికి దాసుడనై పోతాను. కానీ, భక్తిలో నిమగ్నం కాని వారు - అష్టాంగ యోగ అభ్యాసముచే కానీ, సాంఖ్య, ఇతర తత్త్వ శాస్త్ర పఠనం వల్ల కానీ, పుణ్యకార్యాలు మరియు తపస్సులవలన కానీ, లేదా సన్యాసం తీసుకోవటం వలన కానీ - నన్ను పొందలేరు.’ భక్త్యాహం ఏకయా గ్రాహ్యః శ్రద్ధయాత్మా ప్రియః సతామ్ (భాగవతం 11.14.21) ‘నేను భక్తిచే మాత్రమే పొందబడుతాను. విశ్వాసముతో నా యందు భక్తితో నిమగ్నమైన వారు నాకు చాలా ప్రియమైన వారు.’ మిలహి న రఘుపతి బిను అనురాగా, కిఏ జోగ తప గ్యాన బిరాగా (రామచరితమానస్) ‘అష్టాంగ యోగము, తపస్సులు, జ్ఞానము, మరియు వైరాగ్యము వంటి వాటిని ఎంత అభ్యాసము చేసినా భక్తి లేకుండా, భగవంతుడిని ఎవరూ పొందలేరు.’ తదుపరి శ్లోకంలో, శ్రీ కృష్ణుడు భక్తి అంటే ఏమిటో వివరిస్తాడు.
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః । నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ ।। 55 ।।
55
11
https://www.holy-bhagava…udio/011_055.mp3
మత్-కర్మ-కృత్ — నా కోసమే విధులను నిర్వర్తిస్తూ; మత్-పరమః — నన్నే సర్వోన్నతముగా పరిగణిస్తూ; మత్-భక్తః — నా భక్తుడుగా ఉంటూ; సంగ వర్జితః — మమకారాసక్తులు వదిలి; నిర్వైరః — వైరభావము లేకుండా; సర్వ-భూతేషు — సర్వ భూతముల పట్ల; యః — ఎవరైతే; సః — అతడు; మాం — నన్ను; ఏతి — పొందును; పాండవ — ఓ అర్జునా, పాండు రాజు తనయుడా.
BG 11.55: ఎవరైతే అన్ని కర్మలనూ నా కొరకే చేస్తారో, నా పైనే ఆధారపడతారో మరియు నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకుండా ఉంటారో, సర్వ భూతముల పట్ల విరోధభావము లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు.
తొమ్మిదవ అధ్యాయం చివరన, శ్రీకృష్ణుడు అర్జునుడికి మనస్సు తనయందే లగ్నం చేసి, తన పట్ల భక్తితో ఉండమని చెప్పి ఉన్నాడు. ఆ యొక్క భక్తిని ఇనుమడింపచేయటానికి, తన గురించి ఇంకా కొన్ని రహస్యాలను పది, పదకొండు అధ్యాయాలలో తెలియచేసాడు. ఇంతకు క్రితం శ్లోకంలో, కృష్ణుడు, భక్తి మార్గము యొక్క ఔన్నత్యాన్ని మరల తెలియచేసాడు. ఇక ఇప్పుడు ఈ అధ్యాయాన్ని, తన పట్ల అనన్య భక్తితో ఉండేవారి ఐదు లక్షణములను తెలియచేస్తూ ముగిస్తున్నాడు: వారు తమ యొక్క అన్ని పనులను నా కోసమే చేస్తారు: కృతార్థులైన భక్తులు తమ పనులను ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక (material and spiritual) అనే రకాలుగా విభజించరు. ప్రతి పనినీ భగవంతుని ప్రీతి కోసమే చేస్తారు. తమ ప్రతి ఒక్క పనిని ఆయనకే సమర్పిస్తారు. సంత్ కబీర్ ఇలా పేర్కొంటున్నాడు: జహాఁ జహాఁ చలూ కరూ పరిక్రమా, జో జో కరూ సో సేవా జబ సోవూ దండవత్ , జానూ దేవ న దూజా ‘నేను నడుస్తున్నప్పుడు ఆ భగవంతునికి ప్రదక్షిణ చేస్తున్నానని భావిస్తాను; నేను పని చేస్తున్నప్పుడు, ఆ భగవంతునికి సేవ చేస్తున్నానని భావిస్తాను; మరియు నేను పడుకున్నప్పుడు, ఆ భగవంతునికి ప్రణామం అర్పిస్తున్నానని భావిస్తాను. ఈ విధంగా, ఆయనకు నివేదించని ఏ పనిని కూడా నేను చేయను.’ వారు నా మీదే ఆధారపడుతారు: ఎవరైతే భగవంతుడిని చేరటానికి తమ ఆధ్యాత్మిక సాధనపై ఆధార పడుతారో వారు ఆయన మీద అనన్యముగా ఆధార పడినట్టు కాదు. అది ఎందుకంటే, ఆయన తన కృప వలననే పొందబడుతాడు, ఆధ్యాత్మిక సాధనలచే కాదు. ఆయన యొక్క అనన్య భక్తులు, ఆయనను పొందటానికి వారి యొక్క భక్తి మీద కూడా ఆధారపడరు. సరికదా, వారి భక్తిని ఆయన కృపను ఆకర్షించే ఉపాయముగా మాత్రమే చూస్తూ, వారి యొక్క సంపూర్ణ విశ్వాసం ఆయన కృప మీదనే ఉంచుతారు. వారు నా పట్ల భక్తివిశ్వాసాలతో ఉంటారు: భక్తులకు ఏ ఇతర ఆధ్యాత్మిక సాధనలను కూడా చేయాలనే అవసరం అనిపించదు; ఉదాహరణకు, సాంఖ్య శాస్త్ర జ్ఞానము పెంపొందించుకోవడం, అష్టాంగ యోగ అభ్యాసము, యజ్ఞయాగాదులు చేయటం, మొదలైనవి. ఈ విధంగా, వారు తమ సంబంధమంతా భగవంతునితో మాత్రమే ఉందని కోరుకుంటారు. సమస్త వస్తువులలో మరియు వ్యక్తులలో/ప్రాణులలో తమ ప్రియతమ భగవంతుడినే దర్శిస్తారు. వారు మమకారాసక్తి రహితముగా ఉంటారు: భక్తికి మనస్సు నిమగ్నం చేయవలసిన అవసరం ఉంది. ప్రాపంచికత్వం నుండి మనస్సుని తీసివేస్తే కానీ ఇది సాధ్యం కాదు. కాబట్టి అనన్య భక్తులు అన్ని ప్రాపంచిక అనుబంధాలకు దూరంగా ఉంటారు మరియు తమ మనస్సుని భగవంతుని యందే లగ్నం చేస్తారు. వారు సర్వ ప్రాణుల యందు దుర్భావన లేకుండా ఉంటారు: ఒకవేళ మనసులో దుర్భావన నిండి ఉంటే అది మరల భగవంతుని పట్ల అనన్య ఏకాగ్రతతో ఉండదు. అందుకే అనన్య భక్తులు ఎవ్వరి మీద కూడా దుర్భావనతో ఉండరు, తమకు హాని చేసిన వారిపట్ల కూడా అలా ఉండరు. అంతేకాక, భగవంతుడు సర్వ భూతముల హృదయ స్థానములో ఉన్నాడని విశ్వసిస్తూ, అన్ని వ్యవహారాలు కూడా ఆయన నుండే జనిస్తున్నాయి భావిస్తూ వారు తమకు అపకారం చేసిన వారిని కూడా క్షమిస్తారు.
అర్జున ఉవాచ । ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే । యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ।। 1 ।।
1
12
https://www.holy-bhagava…udio/012_001.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; ఏవం — ఈ విధముగా; సతత — స్థిరముగా; యుక్తా — భక్తితో; యే — ఎవరైతే; భక్తాః — భక్తులు; త్వాం — నిన్ను; పర్యుపాసతే — ఆరాధిస్తారో; యే — వారు; చ — మరియు; అపి — కూడా; అక్షరం — నాశము లేని; అవ్యక్తం — నిరాకార బ్రహ్మము; తేషాం — వారు; కే — ఎవరు?; యోగ-విత్-తమాః — యోగములో ఎక్కువ శ్రేష్ఠులు
BG 12.1: అర్జునుడు ఇలా అడిగెను: నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మన్ ను ఉపాసించే వారు – వీరిలో, యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు?
క్రితం అధ్యాయంలో అర్జునుడు, సమస్త జగత్తునూ తన యందే కలిగి ఉన్న భగవంతుని యొక్క విశ్వ రూపమును చూసాడు. అది చూసిన తరువాత, భగవంతుడి స్వభావములు, గుణములు, లీలలను, మరియు పరివారమును కలిగున్న సాకార రూపములోనే దర్శించాలనుకున్నాడు. కాబట్టి, ఇప్పుడు ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని కుతూహలంగా ఉన్నాడు — భగవంతుడిని సాకార రూపములో పూజించే భక్తులా లేక నిరాకార బ్రహ్మం ను ఆరాధించే వారా అని. భగవంతుడికి, సర్వ-వ్యాప్తి అయిన నిరాకార తత్త్వము మరియు సాకార రూపము, ఈ రెండు అస్తిత్వాలూ ఉన్నట్టు అర్జునుడి ప్రశ్న మళ్లీ ఒకసారి నిరూపిస్తున్నది. భగవంతుడికి సాకార రూపము లేదనేవారు ఆయనకు ఒక పరిమితిని విధించినట్టే, అదే విధంగా భగవంతుడు సాకార రూపములో మాత్రమే ఉంటాడు అనేవారు కూడా ఆయనను తక్కువ చేసినట్టే. భగవంతుడు సమగ్రమైనవాడు మరియు పరిపూర్ణుడు, కాబట్టి ఆయన నిరాకారుడు మరియు రూపములు కూడా కలవాడు. మనం జీవాత్మలం కూడా ఈ రెండు అస్తిత్వాలనూ కలిగి ఉన్నాము. ఆత్మ అనేది నిరాకారమైనది, అయినా అది ఒక శరీరమును తీసుకున్నది, ఒకసారి కాదు ఎన్నెన్నో పూర్వ జన్మలలో అసంఖ్యాకమైనన్నిసార్లు. అత్యల్పమైన (మనం) ఆత్మలకే ఒక రూపము తీసుకునే శక్తి ఉంటే, సర్వ శక్తివంతుడైన భగవంతునికి మాత్రం, ఆయన సంకల్పించినపుడల్లా ఒక రూపము తీస్కునే శక్తి ఉండదా? జ్ఞాన యోగము యొక్క గొప్ప ప్రతిపాదకుడైన జగద్గురు శంకరాచార్యులు కూడా ఇలా పేర్కొన్నాడు: మూర్తం చైవామూర్తం ద్వే ఏవ బ్రహ్మణో రూపే, ఇత్యుపనిషత్ తయోర్వా ద్వౌ భక్తౌ భగవదుపదిష్టౌ, క్లేశాదక్లేశాద్వా ముక్తిస్యాదేరతయోర్మధ్యే ‘పరమేశ్వరుడు, సాకారుడు మరియు నిరాకారుడు, రెండూ. ఆధ్యాత్మిక పథంలో అభ్యాసం చేసేవారు కూడా రెండు రకాలుగా ఉంటారు — నిరాకార బ్రహ్మన్ ను ఆరాధించేవారు, మరియు భగవంతుని సాకార రూప భక్తులు. కానీ, నిరాకార ఉపాసన మార్గము చాలా కఠినమైనది.’
శ్రీ భగవానువాచ । మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే । శ్రద్ధయా పరాయోపేతాస్తే మే యుక్తతమా మతాః ।। 2 ।।
2
12
https://www.holy-bhagava…udio/012_002.mp3
శ్రీ-భగవాన్-ఉవాచ — శ్రీ భగవానుడు పలికెను; మయి — నా యందు; ఆవేశ్యా — నిమగ్నమై; మనః — మనస్సు; యే — ఎవరైతే; మాం — నన్ను; నిత్య యుక్తః — ఎల్లప్పుడూ లగ్నం చేసి; ఉపాసతే — పూజిస్తారో/ఆరాధిస్తారో; శ్రద్ధయా — శ్రద్దా-విశ్వాసములతో; పరయా — అత్యుత్తమ; ఉపేతాః — కలిగియున్న; తే — వారు; మే — నా చేత; యుక్త-తమాః — యోగములో ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టు; మతాః — నేను భావిస్తాను.
BG 12.2: శ్రీ భగవానుడు ఇలా పలికెను: నా పైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతమూ నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను.
భగవంతుడిని దూరంనుండి, కొంచెం దగ్గర నుండి, అతి సమీపం నుండీ, ఇలా ఎన్నో రకాల సామీప్యతలలో అనుభవించవచ్చు. దీనిని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము. మీరు రైలు పట్టాల పక్కన నిల్చున్నారనుకోండి. ఒక రైలు దూరం నుండి దాన్ని హెడ్ లైటు వేసుకుని వస్తుంటుంది. అది మీకు ఏదో ఒక లైటు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ రైలు కొంచెం దగ్గరగా వస్తుందో, ఆ లైటుతో పాటు ఏదో ఒక రూపము చూచాయిగా అగుపిస్తుంది. చివరికి, అది వచ్చి ప్లాటుఫారం మీద ఆగినప్పుడు, మీరు ‘ఓ! ఇదొక రైలు, దీని కంపార్టుమెంట్ల లోపల కూర్చొని, బయటకు తొంగి చూసే వారందరినీ చూడగలుగుతున్నాను.’ అని తెలుసుకుంటారు. ఇదే ట్రైను దూరం నుండి ఒక లైటు మాదిరిగానే కనిపించింది. అది కొంచెం దగ్గరగా వచ్చినప్పుడు లైటుతో పాటు ఏదో మెరుస్తూఉన్న ఒక రూపముతో కనిపించింది. అది ఇంకా దగ్గరగా రాగానే అదొక రైలు అని మీకు తెలిసి పోయింది. రైలు అదే, కానీ దానికి దగ్గరగా ఉండే కొలదీ దాని యొక్క వివిధ లక్షణములైన - రూపము, రంగు, ప్రయాణీకులు, బోగీలు, తలుపులు, మరియు కిటికీల - గురించి మీ యొక్క అవగాహన పెరిగింది. అదే విధముగా, భగవంతుడు దోష-రహితుడు, పరిపూర్ణుడు, మరియు అనంతమైన శక్తులను కలిగి ఉన్నవాడు. ఆయన యొక్క వ్యక్తిత్వము - దివ్య నామములు, రూపములు, లీలలు, గుణములు, పరివారము, మరియు ధామములతో - నిండి ఉన్నది. కానీ, ఆయనను విభిన్న సామీప్యతా స్థాయిలలో అనుభవించవచ్చు, బ్రహ్మన్ లాగా (భగవంతుని యొక్క నిరాకార సర్వ వ్యాప్త అస్తిత్వము), పరమాత్మ లాగా (సమస్త ప్రాణుల హృదయములలో కూర్చుని ఉన్న పరమాత్మ, ఇది జీవాత్మ కంటే వేరైనది) మరియు భగవాన్ లాగా ( భూ-లోకమునకు దిగి వచ్చిన భగవంతుని సాకార రూపము). భాగవతము ఇలా పేర్కొంటున్నది: వదన్తి తత్తత్త్వవిదస్తత్త్వం యజ్-జ్ఞానమద్వయమ్ బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్ద్యతే (1.2.11) ‘ఉన్నది ఒకే ఒక పరమేశ్వర తత్త్వము అని పరమ సత్యమును ఎరిగిన వారు ఇలా చెప్పారు; అదే జగత్తులో మూడు రకాలుగా వ్యక్తమవుతోంది — బ్రహ్మన్, పరమాత్మ, మరియు భగవానుడు అనే విధాలుగా.’ వీరు మూడు వేరు వేరు దేవుళ్ళు కారు; సర్వశక్తిమంతుడైన భగవంతుని యొక్క మూడు రకాల ప్రకటితములు. కానీ, వీరి యొక్క గుణములు భిన్నములు. ఇది ఎలాగంటే, నీరు, నీటి-ఆవిరి మరియు మంచుగడ్డ ఈ మూడూ కూడా ఒకే హైడ్రోజన్ డయాక్సైడ్ పదార్థపు అణువులను కలిగి ఉంటాయి, కానీ వాటి యొక్క భౌతిక గుణములు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ బాగా దాహంతో ఉన్న వ్యక్తి నీటి కోసం అడిగితే, అతనికి మనం మంచుగడ్డ ఇస్తే, దానితో అతని దాహం తీరదు. మంచుగడ్డ మరియు నీరు ఒకే పదార్థమయినా వాటి యొక్క భౌతిక లక్షణములు భిన్నములు. అదే విధముగా, బ్రహ్మన్, పరమాత్మ, మరియు భగవానుడు అనేవారు ఒకే సర్వోన్నత ఈశ్వరుని యొక్క ప్రకటితములు కానీ వాటి వాటి గుణములు భిన్నములు. బ్రహ్మన్ అంటే ఈశ్వరుని యొక్క సర్వ-వ్యాప్త స్వరూపము, ఇది అంతటా ఉంటుంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఈ విధంగా పేర్కొంటున్నది : ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా (6.11) ‘ఉన్నది ఒకే ఒక పరమేశ్వర తత్త్వము. ఆయనే అన్నింటిలోపలా మరియు అందరి లోపల కూర్చుని ఉన్నాడు.’ ఈ యొక్క ఈశ్వరుని యొక్క సర్వ వ్యాప్త అస్తిత్వమునే బ్రహ్మన్ అంటారు. అది, నిత్యశాశ్వతత్వము, జ్ఞానము, మరియు ఆనందములతో నిండి ఉన్నది. కానీ, ఈ యొక్క అస్తిత్వములో, భగవంతుడు తన అనంతమైన గుణములను, మనోహరమైన సౌందర్యమును, మరియు మధురమైన లీలలను వ్యక్తపరచడు. ఆయన ఒక దివ్య కాంతి వలె నిర్గుణ (గుణములు లేకుండా), నిర్విశేష (లక్షణములు లేకుండా), నిరాకార (రూపము లేకుండా) అస్తిత్వములో ఉంటాడు. జ్ఞాన యోగ మార్గమును అనుసరించేవారు ఈ యొక్క అస్తిత్వమునే ఉపాసిస్తారు. ఇది, ఇందాక ఉదాహరణలో రైలుని దూరం నుండి ఒక లైటు లాగా అనుభవించిన మాదిరిగా, ఈశ్వరుడిని నిరాకార కాంతి వలె దూరం నుండి తెలుసుకున్నట్టు ఉంటుంది. పరమాత్మ అంటే అందరి హృదయములలో కూర్చుని ఉన్న ఈశ్వర స్వరూప తత్త్వము. 18.61వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు: ‘పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు, ఓ అర్జునా. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.’ మనలోనే నివసిస్తూ ఈశ్వరుడు మన యొక్క అన్ని తలంపులను మరియు కర్మలను నోటు చేసుకుంటాడు, వాటి లెక్క వ్రాసుకుంటాడు మరియు సరియైన సమయములో వాటి ఫలములను అందచేస్తూ ఉంటాడు. మనము ఏం చేసామో మనము మర్చిపోవచ్చు, కానీ భగవంతుడు మర్చిపోడు. ఆయన మనం పుట్టినప్పటి నుండి మన యొక్క అన్ని తలంపులను, మాటలను, మరియు చేష్టలను గుర్తుంచుకుంటాడు. ఇంకా ఈ ఒక్క జన్మ లోనే కాదు! అనంతమైన జన్మలలో, మనం ఎక్కడికి వెళ్లినా, భగవంతుడు మనతోపాటే వెళ్ళాడు. ఆయన ఎంత చక్కటి మిత్రుడంటే మనలను ఒక్క క్షణం కూడా వదలడు. మనలోనే స్థితమై ఉన్న ఈ యొక్క ఈశ్వరుని అస్తిత్వమే పరమాత్మ. పతంజలి మహర్షి, యోగ దర్శనములో తెలియపరిచిన అష్టాంగ యోగ మార్గము, మనయందే స్థితమై ఉన్న ఈశ్వరుడిని అనుభవము లోనికి తేవటానికి పరిశ్రమిస్తుంది - అది ఈశ్వరుని యొక్క పరమాత్మ రూప అస్తిత్వమును అనుభవములోనికి తెస్తుంది. ఇందాకటి ఉదాహరణలో, దూరం నుండి లైటులా కనపడిన రైలు, కాస్త దగ్గరకు రాగానే కొంతమేర వెలిగే రూపముతో కనపడినట్టు, పరమేశ్వర తత్త్వమును పరమాత్మ లాగా తెలుసుకోవటం అనేది నిరాకార బ్రహ్మన్ ను కొంత దగ్గరగా తెలుసుకోవటమే. భగవానుడు అంటే ఈశ్వరుని యొక్క సాకార రూప ప్రకటితము. శ్రీమద్ భాగవతము ఇలా పేర్కొంటున్నది: కృష్ణం ఏనం అవేహి త్వం ఆత్మానం అఖిలాత్మనాం జగద్-ధితాయ సోఽ ప్యత్ర దేహీవాభాతి మాయయా (10.14.55) ‘సకల ఆత్మలకు పరమాత్మయైన సర్వోత్కృష్ట ఈశ్వరుడు, ఈ భూమిపై తన సాకార రూపములో, లోక-సంక్షేమం కోసం శ్రీకృష్ణుడిలా అవతరించాడు.’ ఈ యొక్క భగవానుని అస్తిత్వంలో, ఈశ్వరుడు తన యొక్క నామములు, రూపములు, గుణములు, ధామములు, లీలలు, మరియు పరివారముల యొక్క సమస్త మాధుర్యమును, వ్యక్త పరుస్తాడు. ఈ యొక్క గుణములు బ్రహ్మన్ మరియు పరమాత్మ అస్తిత్వములలో కూడా ఉంటాయి, కానీ అవి బయటపడకుండా అంతర్గర్భితమై ఉంటాయి. ఇది ఎలాగంటే, ఒక అగ్గిపుల్లలో అగ్ని దాగి ఉంటుంది, మరియు దాని లోని అగ్ని, పెట్టెకు గీసినప్పుడే వ్యక్తమౌతుంది. అదే విధముగా, భగవానుడి స్వరూపములో, ఈశ్వరుని యొక్క అన్నీ శక్తులు మరియు లక్షణములు, ఇతర రూపములో అంతర్గర్భితమై ఉన్నటువంటివి, ప్రకటితమవుతాయి. భక్తి మార్గము అనేది ఈశ్వరుని యొక్క భగవానుని స్వరూపము యొక్క అనుభవమునకు దారి తీస్తుంది. ఇది దేవుని అత్యంత దగ్గరి అనుభవము. ఇందాకటి ఉదాహరణలో, ట్రైను యొక్క వివరములు, అది చూసేవాడి ముందే దగ్గరగా వచ్చి ఆగి ఉన్నపుడు స్పష్టంగా కనిపించినట్టు అన్నమాట. కాబట్టి 18.55వ శ్లోకములో, శ్రీ కృష్ణుడు ఈ విధంగా పేర్కొంటున్నాడు: ‘కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్థముగా నేను ఎవరో (ఎంతటి వాడనో) తెలుకోవచ్చును.’ ఈ విధముగా, శ్రీ కృష్ణుడు అర్జునుడి యొక్క ప్రశ్నకు, తన సాకార వ్యక్త రూపమును ఆరాధించే భక్తుడే అత్యున్నతమైన యోగి అని వివరణ ఇస్తున్నాడు.
యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే । సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ ।। 3 ।। సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః । తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః ।। 4 ।।
3
12
https://www.holy-bhagava…/012_003-004.mp3
యే — ఎవరైతే; తు — కానీ; అక్షరం — అనశ్వరమైన/నిత్యమైన; అనిర్దేశ్యం — నిర్వచించుటకు వీలుకాని; అవ్యక్తం — అవ్యక్తమైన; పర్యుపాసతే — ఆరాధిస్తారో; సర్వత్ర-గం — సర్వ వ్యాప్తి అయిన; అచింత్యం — మనోబుద్ధులకు అతీతుడు (ఊహింపశక్యము కాని); చ — మరియు; కూట-స్థమ్ — మారని; అచలం — కదిలించలేని; ధృవం — సనాతనమైన ; సన్నియమ్య — నిగ్రహించి; ఇంద్రియ-గ్రామం — ఇంద్రియములు; సర్వత్ర — అంతటా; సమ-బుద్ధయః — సమ బుద్ధితో ఉండి; తే — వారు; ప్రాప్నువంతి — పొందుతారు; మాం — నన్ను; ఏవ — కూడా; సర్వ-భూత-హితే — సమస్త ప్రాణుల సంక్షేమం కోసం; రతాః — నిమగ్నుడై.
BG 12.3-4: నాశరహితుడూ, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తమూ, సర్వవ్యాపి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పు లేనివాడు, నిత్యశాశ్వతుడూ, మరియు నిశ్చలమైన వాడునూ - అయిన పరమ సత్యము యొక్క నిరాకార తత్త్వాన్ని - ఇంద్రియములను నిగ్రహించి, సర్వత్రా సమబుద్ధితో ఉంటూ, సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ - ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు.
సాకార రూపమును ఆరాధించుటయే ఉత్తమమని చెప్పిన పిదప, శ్రీకృష్ణుడు, నిరాకార తత్త్వాన్ని ఆరాధించటాన్ని తానెక్కడా తిరస్కరించటం లేదని వివరణ ఇస్తున్నాడు. సర్వవ్యాప్త, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, మనోబుద్ధులకు అతీతమైన, నాశరహిత, నిశ్చల, నిత్యసనాతన బ్రహ్మన్ పట్ల భక్తితో నిమగ్నమయ్యే వారు కూడా ఈశ్వరుడిని పొందుతారు. మనుష్యులు (జీవ రాశులు) అనంతమైన విభిన్న స్వభావాలతో ఉంటారు. ఈ భిన్నత్వమును సృష్టించిన పరమేశ్వరుడు కూడా ఎన్నో విభిన్న విలక్షణమైన స్వభావాలు కలిగిఉంటాడు. మనకు పరిమితమైన అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి, భగవంతుని యొక్క అనంతమైన అస్తిత్వాలని/అవతారాలని/స్వరూపాలనీ కొన్ని విభాగాలలోకి వర్గీకరించుకుంటాము. ఆ ప్రకారంగానే, ఇంతకు క్రితం శ్లోక వ్యాఖ్యానంలో పేర్కొన్నట్టుగా, వేద వ్యాసుడు భగవంతుని యొక్క వేర్వేరు ప్రకటితములను మూడు రకాలుగా వర్గీకరణం చేసారు - బ్రహ్మన్, పరమాత్మ, మరియు భగవానుడు. మనం వీటిలో ఏ రకమైన ఈశ్వర తత్త్వమునైనా ఆరాధించవచ్చు, కానీ, మనకు నచ్చిన/అర్థమయిన ఈశ్వర స్వరూపమే సరియైనది, ఇతరులు అనుసరించే విధానం తప్పు అని ఎట్టిపరిస్థితులలో కూడా భావించరాదు. 4.11వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఇలా పేర్కొన్నాడు: ‘నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో, నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా, తెలియకపోయినా, అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు, ఓ అర్జునా (ప్రిథ తనయుడా).’ ఇక్కడ, శ్రీ కృష్ణుడు, నిరాకార బ్రహ్మన్ ను ఆరాధించేవారు కూడా ఆయననే చేరుతారు అని వక్కాణిస్తున్నాడు. నిర్గుణ నిరాకార అస్తిత్వంతో ఏకమై పోవటమే వారి యొక్క అభిలాష కాబట్టి ఈశ్వరుడు వారిని అవ్యక్త, సర్వ-వ్యాప్త బ్రహ్మన్ గానే కలుస్తాడు.

క్లేశోఽధికతరస్తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్ ।। అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ।। 5 ।।
5
12
https://www.holy-bhagava…udio/012_005.mp3
క్లేశః — కష్టములు/ఇబ్బందులు; అధిక-తర — ఎక్కువగా; తేషాం — వారికి; అవ్యక్త — అవ్యక్త రూపము పట్ల; ఆసక్త — ఆసక్తులై ఉన్న; చేతాసాం — మనస్సు కలవారు; అవ్యక్తా — అవ్యక్తము; హి — నిజముగా; గతిః — మార్గము; దుఃఖం — చాలా కష్టతరముగా; దేహవద్భిః — శరీర బద్దులైన వారికి (జీవాత్మ); అవాప్యతే — పొందెదరు.
BG 12.5: మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి, సిద్ధి పథము చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తమును ఆరాధించటం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది.
తన యొక్క భిన్నమైన స్వరూపములను ఆరాధించే వారందరినీ ఆదరించిన శ్రీ కృష్ణుడు, తన సాకార రూపమును పూజించటమే శ్రేష్ఠమని మరల ఒకసారి చెప్తున్నాడు. నిరాకార బ్రహ్మన్ ను ఆరాధించటం చాలా కష్టసాధ్యమైన మార్గమని అది ఎన్నో క్లేశములతో కూడినదని అంటున్నాడు. నిరాకార బ్రహ్మన్ ను ఆరాధించటం ఎందుకు అంత కష్టమైనది? దీనికి ప్రప్రథమమైన మరియు ప్రధానమైన కారణం ఏమిటంటే, మనకు (మనుష్యులకు) కూడా ఒక ఆకారం ఉంది మరియు అనంతమైన జన్మలలో, రూపమున్న వాటితో అనుబంధం ఏర్పరుచుకోవటం మనకు అలవాటైంది. అందుకే, భగవంతుని పై ప్రేమను పెంపొందించుకునే ప్రయాసలో కూడా, మనకొక మనోహరమైన ఆకర్షణీయమైన రూపము అందుబాటులో ఉంటే, మనస్సు సునాయాసముగా దానిపై లగ్నం చేసి భగవంతుని పై మమకారానుబంధం పెంచుకుంటుంది. కానీ, నిరాకార తత్త్వ ఉపాసనలో, మన బుద్ధి దానిని అందుకోలేదు, మరియు మనస్సుకి, ఇంద్రియములకి అనుబంధం పెంచుకోవటానికి ఒక స్పర్శనీయమైన (tangible) వస్తువు అంటూ ఏదీ ఉండదు. కాబట్టి ఈశ్వరునిపై ధ్యానం చేయటానికి, మరియు ఆయనపై మనస్సుతో అనుబంధం పెంచుకోవటానికీ, ఈ రెండు ప్రయత్నాలూ కఠినంగా అనిపిస్తాయి. నిరాకార బ్రహ్మన్ ను ఆరాధించటం అనేది సాకార భగవంతుడిని ఆరాధించటం కంటే కష్టము గా ఉండటానికి ఇంకొక కారణము ఉంది. ఈ రెండు రకాల మార్గాలని, మర్కట-కిషోర న్యాయము (కోతి పిల్ల తర్కము) మరియు మార్జార-కిషోర న్యాయము (పిల్లి పిల్ల తర్కము) ఉదాహరణతో అర్థంచేసుకోవచ్చు. కోతిపిల్ల తనే తన తల్లి పొట్టని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది; ఈ విషయంలో తల్లి కోతి నుండి ఎలాంటి సహాయము లభించదు. తల్లి-కోతి ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మ మీదికి దూకినప్పుడు, తల్లి-కోతిని గట్టిగా పట్టుకునే ఉండే బాధ్యత పిల్ల-కోతిదే, ఒకవేళ అది అలా చేయలేకపోతే, అది పడిపోతుంది. అదే సమయంలో, పిల్లిపిల్ల చాలా చిన్నగా, సున్నితముగా ఉంటుంది; కానీ తల్లి-పిల్లి ఆ పిల్లను ఒకచోటి నుండి ఇంకొక చోటికి మార్చే బాధ్యత తనే తీసుకుంటుంది; అది జాగ్రత్తగా పిల్లిపిల్లను మెడ వెనుక నోటితో పట్టి లేపి తీస్కువెళుతుంది. ఈ పోలికలో, నిరాకార బ్రహ్మన్ యొక్క భక్తులను కోతిపిల్ల తో పోల్చవచ్చు మరియు సాకార రూపము యొక్క భక్తులను పిల్లి పిల్లతో పోల్చవచ్చు. నిరాకార బ్రహ్మన్ ను ఉపాసించేవారు, ఆ మార్గంలో పురోగతి సాధించే భారాన్ని తామే మోయవలసి ఉంటుంది, ఎందుకంటే బ్రహ్మన్ వారిమీద కృప చూపించలేదు; ఏలనన, బ్రహ్మన్ నిరాకారమే కాదు, అది గుణరహితము కూడా. అది నిర్గుణ (గుణములు లేని), నిర్విశేష (లక్షణములు లేని), మరియు నిరాకార (ఆకారము లేని) అని వివరించబడినది. దీనిచే, మనకు తెలిసేదేమిటంటే, బ్రహ్మన్, కృప అనే లక్షణమును చూపలేదు అని. ఈశ్వరుడిని నిర్గుణ, నిర్విశేష, నిరాకార ముగా ఆరాధించే వారు, పురోగతి కోసం పూర్తిగా తమ సొంత పరిశ్రమ మీదనే ఆధారపడాలి. మరో పక్క, భగవంతుని సాకార రూపము, కరుణ మరియు కృపా సముద్రము. కాబట్టి, సాకార రూప భక్తులు తమ సాధన లో దైవీ సహకారం పొందుతారు. భగవంతుడు భక్తులపై ప్రసాదించే రక్షణ ఆధారముగానే శ్రీ కృష్ణుడు, 9.31వ శ్లోకంలో: ‘ఓ కుంతీ పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నశింపడు అని ధైర్యముగా ప్రకటించుము.’ అని పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని తదుపరి రెండు శ్లోకాలలో మళ్ళీ చెప్తున్నాడు.
యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః । అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ।। 6 ।। తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ । భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసామ్ ।। 7 ।।
6
12
https://www.holy-bhagava…/012_006-007.mp3
యే — ఎవరైతే; తు — కానీ; సర్వాణి — సమస్త; కర్మాణి — పనులు; మయి — నాకు; సన్న్యస్య — సమర్పిస్తూ; మత్ పరః — నన్నే పరమ లక్ష్యముగా పరిగణిస్తూ; అనన్యేన — అనన్యమైన; ఏవ — ఖచ్చితముగా; యోగేన — భక్తితో; మాం — నన్ను; ధ్యాయంతః — ధ్యానము చేస్తూ; ఉపాసతే — ఆరాధిస్తారో; తేషామ్ — వారికి; అహం — నేను; సముద్ధర్తా — ఉద్ధరించేవాడిని; మృత్యు-సంసార-సాగరాత్ — జనన-మరణ సంసార సాగరము నుండి; భవామి — అగుదును; న, చిరాత్ — త్వరగానే; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; మయి — నా తోటి; ఆవేశిత-చేతసామ్ — నాతోనే ఏకమైన (నాయందే లగ్నమైన) మనోబుద్ధులు కలవారికి.
BG 12.6-7: కానీ, తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ, నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ, నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసే వారిని, ఓ పార్థా, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యుసంసారసాగరము నుండి విముక్తి చేస్తాను, ఏలనన వారి అంతఃకరణ నా యందే ఏకమైపోయి ఉంటుంది.
తన భక్తులు తనను త్వరగానే చేరుకుంటారు అని శ్రీ కృష్ణుడు మరల ఇంకోసారి చెప్తున్నాడు. మొదట తన సాకార రూపమును వారి భక్తికి ఆధారముగా చేసుకుని, వారు తమ మనస్సు, ఇంద్రియములను సునాయాసముగా ఆయన మీద కేంద్రీకరిస్తారు. తమ నాలుక మరియు చెవులను భగవంతుని యొక్క దివ్య నామములను జపించటానికి మరియు వినటానికి వాడతారు, వారి కన్నులను ఆయన యొక్క దివ్య మంగళ స్వరూపమును చూడటానికి, తమ శరీరమును ఆయన ప్రీతి కోసం పనులను చేయటానికి, తమ మనస్సును ఆయన యొక్క అద్భుతమైన లీలలను మరియు గుణములను గురించి స్మరించటానికి, మరియు బుద్ధిని ఆయన మహిమలను గురించి ధ్యానించటానికి/ఆలోచించటానికి ఉపయోగిస్తారు. ఈ విధంగా, వారు త్వరగా తమ మనోబుద్ధులను (అంతఃకరణ) ను భగవానునితో ఏకం చేస్తారు. అంతేకాక, అటువంటి భక్తులు ఎడతెగని భక్తితో నిరంతరం తమ హృదయములను సమర్పిస్తారు కాబట్టి, భగవంతుడు త్వరగానే ఆయన కృపను వారిపై అనుగ్రహిస్తాడు మరియు వారి మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు. తనతో అన్యోన్య సంబంధము కలిగి ఉన్నవారికి, వారి అజ్ఞానమును జ్ఞాన దీపముచే పారదోలుతాడు. ఈ విధంగా, భగవంతుడే స్వయంగా తన భక్తుల రక్షకుడై వారిని మృత్యు సంసార సాగరము (జనన-మరణ చక్రము) నుండి ఉద్ధరిస్తాడు.

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ । నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః ।। 8 ।।
8
12
https://www.holy-bhagava…udio/012_008.mp3
మయి — నా మీద; ఏవ — మాత్రమే; మనః — మనస్సు; ఆధత్స్వ — లగ్నము చేసి; మయి — నా మీదే; బుద్ధిం — బుద్ధి; నివేశయ — అర్పించి/శరణాగతి చేసి; నివసిష్యసి — నీవు ఎప్పుడూ నివసిస్తావు; మయి — నా లో; ఏవ — మాత్రమే; అతః ఊర్ధ్వం — ఇక ఆ తరువాత; న సంశయః — సంశయము లేదు.
BG 12.8: నీ మనస్సుని నామీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తరువాత, నీవు సర్వదా నాలోనే నివసిస్తావు. దీనిపై ఎలాంటి సంశయము వద్దు.
సాకార రూపమును ఆరాధించటమే ఉత్తమము అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు, ఇక తనను ఎలా ఆరాధించాలో వివరిస్తున్నాడు. అర్జునుడిని రెండు పనులు చేయమంటున్నాడు — మనస్సుని భగవంతుని యందే లగ్నము చేయాలి మరియు బుద్ధిని ఆయనకు అర్పించాలి. మనస్సు యొక్క లక్షణము ఏమిటంటే అది కోరికలను, ఆకర్షణలను, మరియు ద్వేషములను సృష్టిస్తుంటుంది. బుద్ధి యొక్క పని ఆలోచించటం, విశ్లేషించటం, మరియు మంచి-చెడు నిర్ణయించటం. మనస్సు యొక్క ప్రాముఖ్యత వైదిక శాస్త్రాలలో చాలా చోట్ల చెప్పబడింది: చేతః ఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే (భాగవతం 3.25.15) ‘మాయలో బంధనము లేదా దాని నుండి విముక్తి పొందటం అనేది మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అది ప్రాపంచికత్వం పట్ల ఆసక్తితో ఉంటే, వ్యక్తి బంధనములో ఉన్నట్టే, ఒకవేళ మనస్సు ప్రపంచం నుండి విడివడి ఉంటే, వ్యక్తి ముక్తిని పొందుతాడు.’ మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః (పంచదశి) ‘బంధనము లేదా మోక్షము అనేది మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది.’ కేవలం శారీరక యాంత్రిక భక్తి సరిపోదు; మనస్సుని భగవత్ ధ్యాసలో నిమగ్నం చేయాలి. ఇది ఎందుకంటే, మనస్సును లగ్నం చేయకుండా, కేవలం ఇంద్రియ కార్యక్రమాల వలన ఏమీ లాభము లేదు. ఉదాహరణకి, మనము చెవులతో ఒక ఉపదేశము విన్నాము అనుకోండి, కానీ మన మనస్సు ఏటో వెళ్ళిపోతే, ఏమి చెప్పబడినదో అర్థం కాదు. మాటలు చెవులలో పడతాయి కానీ అవి గుర్తుండవు/అవగతం కావు. దీనివలన మనకు ఏమర్థమవుతుందంటే మనస్సు అనుసంధానం కాకపొతే ఇంద్రియముల పని వ్యర్థమే అని. అదే విధంగా, మనస్సు అనేది ఎలాంటిదంటే దానిలోనే అన్ని ఇంద్రియములు సూక్ష్మ రూపములో ఉంటాయి. అందుకే, ఇంద్రియ కార్యములు లేకున్నా, దృష్టి, వాసన, రుచి, స్పర్శ, మరియు వినికిడి వంటివాటిని తెలుసుకునే గ్రహణశక్తి మనస్సుకు ఉంటుంది. ఉదాహరణకి, రాత్రి పూట మనం నిద్రిస్తున్నప్పుడు మన ఇంద్రియములు అచేతనముగా ఉంటాయి. అయినా కలలు వస్తే, మన మనస్సు ఈ ఇంద్రియ విషయ-వస్తువులను అనుభవిస్తుంది. స్థూల ఇంద్రియములు లేకున్నా మనస్సుకి అన్ని ఇంద్రియ కార్యములు చేసే సామర్థ్యము ఉన్నది, అన్న విషయం దీనితో నిరూపించబడుతున్నది. కాబట్టి, మన కర్మలను నోట్ చేసుకుంటున్నప్పుడు భగవంతుడు మన మానసిక పనులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ ఇంద్రియాలతో చేసే శారీరక పనులకు కాదు. మనస్సు కంటే ఉన్నతమైనది బుద్ధి. బుద్ధిని భగవంతుడికి సమర్పణ (శరణాగతి) చేసినప్పుడే మనము భగవంతుని పై మనస్సుని నిలపగలము. ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా, మన బుద్ధికన్నా మించిన పరిస్థితి ఎదురైనప్పుడు, మనము మనకన్నా ఎక్కువ వివేకము/బుద్ధి కల వారి మార్గనిర్దేశన అడుగుతాము. ఉదాహరణకి, మనకు వ్యాధి సంక్రమిస్తే వైద్యుడి దగ్గరకు వెళతాము. మనకు వైద్య శాస్త్రము గురించి ఏమీ తెలియదు, కాబట్టి మనము ఒక యోగ్యుడైన వైద్యుడి దగ్గరకు వెళతాము. ఆ వైద్యుడు మన రోగలక్షణములు గమనించి, మన వైద్య పరీక్షల రిపోర్టులు చూసి, రోగనిర్ణయము చేసి మనకు మందులని రాసిస్తాడు. మన బుద్ధిని శరణాగతి చేసి ఆయన రాసిన చీటీ ప్రకారం మందులను తీసుకుంటాము. అదే విధంగా, మనం ఏదైనా న్యాయ వివాదాల్లో చిక్కుకుంటే, ఒక న్యాయవాది సహాయం తీసుకుంటాము. మన న్యాయవాది, మనకు ప్రతిపక్షం తరఫు న్యాయవాది అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో నేర్పిస్తాడు. మనకు న్యాయశాస్త్రం పట్ల ఎలాంటి అవగాహన లేదు కాబట్టి మన బుద్ధిని ఆయనకు అర్పించి ఆ న్యాయవాది చెప్పినట్టుగానే చేస్తాము. అదే విధముగా, ప్రస్తుతం మన బుద్ధి ఎన్నో దోషాలతో కూడి ఉంది. శ్రీకృష్ణుడిని బృందావనం నుండి మథురకి తీస్కెళ్ళటానికి వెళ్ళిన అక్రూరుడు, ఈ బుద్ధికి ఉన్న దోషాలను శ్రీమద్ భాగవతంలో (10.40.25) లో ఇలా చెప్పాడు: అనిత్యానాత్మ దు:ఖేషు విపర్యయ మతిర్హ్యహం ; అక్రూరుడు ఇలా అన్నాడు: ‘మన బుద్ధి తప్పుడు జ్ఞానంతో ఉన్నది. మనము నిత్య శాశ్వతమైన ఆత్మలమైనా, మనం మనల్ని ఈ నశ్వర శరీరమే అనుకుంటాము. సమస్త ప్రపంచపు వస్తువులన్నీ నశ్వరమైనవే అయినా అవి ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి అనుకుంటాము, అందుకే, వాటిని రాత్రీపగలూ పోగుచేసుకుంటాము. ఇంద్రియ భోగముల కోసం పరిశ్రమ అనేది అంతిమంగా దుఃఖహేతువే అయినా, అదేదో ఆనందము లభిస్తుంది అనుకుని వాటి కోసం ప్రయాస పడుతూనే ఉంటాము.’ బుద్ధిలో ఉన్న ఈ మూడు దోషములను విపర్యయములు అంటారు, అంటే భౌతిక మాయ వల్ల అయిన జ్ఞాన నష్టము. అసంఖ్యాకమైన పూర్వ జన్మలలో మన బుద్ధి చేసిన ఈ దోషపూరిత చింతన వలన మన సమస్య యొక్క తీవ్రత మరింత జఠిలమవుతున్నది. మన జీవితాలను మన బుద్ధి చెప్పిన ప్రకారం నడిపించుకుంటే మనం ఖఛ్చితంగా ఆధ్యాత్మిక పథంలో ముందుకు పోలేము. ఈ విధంగా, మనం మనస్సుని భగవంతుని యందే అనుసంధానం చేస్తూ ఆధ్యాత్మిక పథంలో పురోగతి సాధించాలనుకుంటే, మనం బుద్ధిని ఆయనకు సమర్పించి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. బుద్ధిని సమర్పించటం అంటే, శాస్త్రములు మరియు ప్రామాణిక గురువుల ద్వారా, భగవంతుని నుండి లభించిన జ్ఞానము ప్రకారం చింతన/ఆలోచన చేయటం. శరణాగతి చేసిన బుద్ధి యొక్క లక్షణములు 18.62వ శ్లోకంలో వివరించబడ్డాయి.
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ । అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ ।। 9 ।।
9
12
https://www.holy-bhagava…udio/012_009.mp3
అథ — ఒకవేళ; చిత్తం — మనస్సు; సమాధాతుం — లగ్నము చేయుటకు; న శక్నోషి — నీకు సాధ్యం కాకపోతే (చేయలేకపోతే); మయి — నా యందు; స్థిరమ్ — నిశ్చలముగా; అభ్యాస-యోగేన — నిరంతర ప్రయత్నం (అభ్యాసం) ద్వారా భగవతునితో ఏకమై; తతః — అప్పుడు; మాం — నన్ను; ఇచ్చా — కోరిక; ఆప్తుం — పొందుటకు; ధనంజయ — అర్జునా, సిరి సంపదలను జయించేవాడా.
BG 12.9: ఒకవేళ నీవు మనస్సును నా యందే నిశ్చలముగా లగ్నం చేయలేకపోతే, ఓ అర్జునా, మనస్సును నిరంతరం ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ, నన్ను భక్తితో స్మరించటడానికి అభ్యాసము చేయుము.
మనస్సుని శ్రీ కృష్ణుడి యందే లగ్నం చేసి ఉంచుటచే, సాధన (ఆధ్యాత్మిక అభ్యాసము) యందు అంతిమ పరిపూర్ణ స్థాయి చేరుకోవచ్చు. కానీ ఈ మార్గం లో ప్రయాణం మొదలు పెట్టగానే, మనం పరిపూర్ణ సిద్ధి సాధిస్తాము అని అనుకోవద్దు. కాబట్టి, ఇంకా భగవంతునిపై సంపూర్ణముగా మనస్సు నిలుపలేని వారు ఏమి చేయాలి? వారు ఆయనను భక్తితో గుర్తుచేసుకోవటానికి (స్మరించటం) పరిశ్రమించాలి అని, శ్రీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. ఓ ఆంగ్ల నానుడి ప్రకారం, ‘అభ్యాసము ద్వారా పరిపూర్ణ సిద్ధి సాధించవచ్చు’ (Practice makes perfect). దీనినే అభ్యాస యోగము అంటారు, అంటే ‘నిరంతర ప్రయత్నం (అభ్యాసం) ద్వారా భగవంతుని తో ఏకమవ్వటం.’ ఇతర వస్తువులు, తలంపుల వైపు మనస్సు వెళ్ళిపోయినప్పుడల్లా, భక్తుడు దానిని తిరిగి భగవంతుని వైపు తేవటానికి పరిశ్రమించాలి; దీనిని ఆయన నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, మరియు పరివారము లను గుర్తుచేసుకోవటం (స్మరించటం) ద్వారా సాధించవచ్చు. జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్, సాధకులకు తాను చెప్పే ఉపదేశాలలో, ఈ నిరంతర ప్రయత్నానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు: జగత తే మన కో హఠా కర, లగా హరి మేఁ ప్యారే ఇసీ కా అభ్యాస పుని పుని, కరు నిరంతర ప్యారే (సాధనా కరు ప్యారే) ‘ఓ ప్రియమైన సాధకుడా, మనస్సుని ప్రాపంచికత్వం నుండి తీసి, భగవంతుని యందే లగ్నం చేయుము. దీనినే పదే పదే నిరంతర అభ్యాసం చేయుము!’
అభ్యాసేఽప్యసమర్థోఽసి మత్కర్మపరమో భవ । మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి ।। 10 ।।
10
12
https://www.holy-bhagava…udio/012_010.mp3
అభ్యాసే — అభ్యాసములో; అపి — ఒకవేళ; అసమర్థః — అసమర్థత (అశక్యత); అసి — నీవు; మత్-కర్మ-పరమః — భక్తితో నాకోసమే పని చేయుము; భవ — ఉండుము; మత్-అర్థం — నా కోసమే; అపి — కూడా; కర్మాణి — కర్మలు; కుర్వన్ — ఆచరింపుము; సిద్ధిం — సిద్ధి (పరిపూర్ణత); అవాప్స్యసి — నీవు పొందగలవు.
BG 12.10: నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నాకోసమే పనులు చెయ్యటానికి ప్రయత్నం చేయుము. ఈ విధంగా భక్తి యుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు.
భగవంతుణ్ణి స్మరించటాన్ని అభ్యాసం చేయండి, అని చెప్పటం తేలిక కానీ అనుసరించటం కష్టం. మనస్సు అనేది భౌతిక శక్తి మాయతో తయారైనది మరియు అది సహజంగానే భౌతిక ప్రాపంచిక వస్తువిషయముల వైపు పరుగు పెడుతుంది, అదే సమయంలో దాన్ని భగవంతుని వైపు తీస్కువెళ్ళటానికి ప్రయత్నపూర్వకమైన దృఢ పరిశ్రమ అవసరం. భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి అన్న ఉపదేశం మనము వినే ఉంటాము, మనకు దానిని ఆచరించాలనే ఉంటుంది కానీ, మనం మన పనిలో నిమగ్నమై పోయినప్పుడు, మనస్సు భగవంతుడిని మర్చిపోతుంది. కాబట్టి, భగవంతుడిని రోజంతా స్మరిస్తూ ఉండటం అనేది కష్టతరముగా ఉన్నవారు మరి ఏంచేయాలి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని శ్రీ కృష్ణుడు పై శ్లోకంలో ఇస్తున్నాడు. భగవంతుణ్ణి నిరంతరం స్మరించలేని వారు ఆయన కోసం పని చేయటం అనేదాన్ని అభ్యాసం చేయాలి. వారు చేసే పని ఏదయినా, తాము చేసేది భగవత్ ప్రీతి కోసమే అన్న భావన, 9.27వ మరియు 9.28వ శ్లోకాలలో చెప్పినట్టుగా, అలవాటు చేసుకోవాలి. గృహస్తు జీవితంలో ఉన్నప్పుడు, చాల మటుకు సమయం కుటుంబ పోషణ మరియు నిర్వహణ కోసమే గడిచిపోతుంది. ఆయా పనులు చేస్తూనే ఉండాలి కానీ అంతర్గత భావన మార్చుకోవాలి. వారి మీద ఉన్న శారీరక మమకారానురాగం కోసం కాకుండా, కుటుంబ సభ్యులందరూ భగవంతుని బిడ్డలే అని, భగవంతుని ప్రీతి కోసమే వారందరి బాగోగులు చూసుకునే బాధ్యత ఉందని భావించాలి. తన జీవనోపాధి ఆర్జించటం చేస్తూనే ఉండాలి, కానీ, ఆ పని చేస్తున్న అంతర్గత భావన మార్చుకోవాలి. ప్రాపంచిక భోగాల కోసం డబ్బులు సంపాదిస్తున్నాము అనుకోకుండా, ఇలా అనుకోవచ్చు ‘నన్ను, నా కుటుంబ సభ్యులను పోషించుకోవటానికి, తద్వారా మేమంతా భక్తిలో నిమగ్నమవ్వటానికి ఇది అవసరం. మరియు ఏదైనా మిగుల్చుకుంటే, నేను భగవత్ సేవకి దానిని దానము చేస్తాను.’ అని. అదేవిధముగా, శారీరక క్రియలైన తినటం, నిద్రపోవటం, స్నానం చేయటం వంటి వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇక్కడ కూడా భగవత్ దృక్పథం అలవాటు చేసుకోవాలి. ‘నేను నా శరీరమును ఆరోగ్యముగా ఉంచుకోవాలి, ఎందుకంటే దానితో నేను భగవత్ సేవ చేసుకోవాలి. అందుకే, దాని నిర్వహణ కోసం అవసరమయ్యే పనులను జాగ్రత్తగా చేసుకుంటాను.’ అని భావించాలి. మనం భగత్ ప్రీతి కోసం పనిచేయటం అభ్యాసం చేస్తున్నప్పుడు, సహజంగానే మనము స్వార్థ పూరిత పనులను చేయటం ఆపివేస్తాము మరియు భగవత్ సేవా దృక్పథంలో ఉన్న పనులను చేయటం మొదలుపెడుతాము. ఈ విధంగా, సమస్త కార్యములను (పనులను) శ్రీ కృష్ణ పరమాత్మ ప్రీతి కోసమే చేస్తుంటే, మన మనస్సు నిశ్చలముగా ఉంటుంది మరియు త్వరగానే ఆయన మీదనే ధ్యాస ఉంచగలుగుతాము. ఆ తర్వాత క్రమేపీ, భగవంతుని పై ప్రేమ మన హృదయములో ప్రకటితమౌతుంది, మరియు ఆయన గురించే నిరంతరం స్మరించటంలో పురోగతి సాధిస్తాము.
అథైతదప్యశక్తోఽసి కర్తుం మద్యోగమాశ్రితః । సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ।। 11 ।।
11
12
https://www.holy-bhagava…udio/012_011.mp3
అథ — ఒకవేళ; ఏతత్ — ఇది; అపి — కూడా; ఆశక్తః — అశక్తుడవైతే (చేయలేకపోతే); అసి — నీవు; కర్తుమ్ — పనిచేయుట; మద్-యోగం — నా పట్ల భక్తితో; ఆశ్రితః — ఆశ్రయించి; సర్వ-కర్మ — సమస్త కర్మల (అన్ని పనుల); ఫల-త్యాగం — ఫల త్యాగము; తతః — అప్పుడు; కురు — చేయుము; యత-ఆత్మ-వాన్ — ఆత్మయందే స్థితుడవై.
BG 12.11: ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పని చేయుట కూడా చేయలేకపోతే, నీ కర్మ ఫలములను త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితుడవై ఉండుము.
12.8వ శ్లోక ప్రారంభము నుండి, శ్రీ కృష్ణుడు అర్జునుడి సంక్షేమం కోసం మూడు పద్ధతులను చెప్పాడు. మూడవ దానిలో, అర్జునుడిని తన కోసం పని చేయమన్నాడు. కానీ, దానికి కూడా స్వచ్ఛమైన మరియు దృఢసంకల్ప బుద్ధి అవసరము. భగవంతునితో తమకున్న సంబంధం పట్ల ఇంకా పూర్తి నమ్మకం కలుగని వారు, ఇంకా భగవత్ ప్రాప్తి తమ లక్ష్యముగా చేసుకోని వారు, ఆయన ప్రీతి కోసం పనిచేయటాన్ని అసంభవముగా చూస్తారు. కాబట్టి, శ్రీ కృష్ణుడు ఒక నాలుగవ ప్రత్యామ్న్యాయమును చూపిస్తున్నాడు. ఆయన ఇలా అంటాడు, ‘అర్జునా, ఇంతకు మునుపు లాగానే నీ పనులు చేస్తూ ఉండుము, కానీ ఆ పనుల యొక్క ఫలముల/ఫలితముల పట్ల అనాసక్తత/వైరాగ్యము తో ఉండుము.’ ఇటువంటి వైరాగ్యము/అనాసక్తత అనేది మన మనస్సుని తమో గుణము మరియు రజో గుణము నుండి పరిశుద్ధం చేసి మనస్సుని సత్త్వ గుణము వైపు తీసుకువస్తుంది. ఈ విధంగా, మన కర్మల/ప్రయత్నముల ఫల త్యాగము అనేది మన మనస్సు నుండి ప్రాపంచికత్వమును నిర్మూలించి బుద్ధిని పటిష్టంగా చేస్తుంది. ఆ తరువాత, పరిశుద్ధము చేయబడిన బుద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానమును సునాయాసముగా అర్థం చేసుకోగలుగుతుంది, మరియు మనము 'సాధన’ యందు ఉన్నతమైన స్థాయికి పురోగతి సాధించగలము.
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే । ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ।। 12 ।।
12
12
https://www.holy-bhagava…udio/012_012.mp3
శ్రేయః — శ్రేష్ఠతరమైనది; హి — నిజముగా; జ్ఞానం — జ్ఞానము; అభ్యాసాత్ — (యాంత్రికమైన) అభ్యాసము కంటే; జ్ఞానాత్ — జ్ఞానము కంటే; ధ్యానం — ధ్యానము; విశిష్యతే — శ్రేష్ఠమయినది; ధ్యానాత్ — ధ్యానము కంటే; కర్మ-ఫల-త్యాగః — కర్మ ఫలముల త్యాగము; త్యాగాత్ — త్యాగము; శాంతిః — శాంతి; అనంతరమ్ — తక్షణమే.
BG 12.12: యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది; జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్ఠమయినది. ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము మెరుగైనది, ఎందుకంటే ఇటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభించును.
చాలామంది జనులు యాంత్రికమైన అభ్యాసము చేసే దశలో ఉన్నారు. తమతమ మత/ఆచారాలలో చెప్పినట్టుగా కర్మకాండలను చేస్తుంటారు, కానీ భగవంతుని యందు మనస్సు లగ్నం చేయరు. కొత్త ఇల్లు లేదా కొత్త కారు కొన్నప్పుడు, పూజారిని పిలిచి పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు. పూజారి పూజ చేస్తూ ఉన్నప్పుడు, వారు వేరే గదిలో కూర్చొని ఏదో మాట్లడుకోవటమో లేదా కప్పు టీ తాగటమో చేస్తుంటారు. వారికి భక్తి అంటే ఏదో యాంత్రికమైన కర్మ చేయటమే. తరచుగా అది ఆచార అలవాటుగా, తల్లిదండ్రుల నుండి, పెద్దల నుండి అందించబడుతుంది. యాంత్రికముగా పూజాది కార్యక్రమాలు చేయటం అనేది ఏమీ చెడు పని కాదు, ఎందుకంటే, ఏమీ చేయక పోవటం కన్నా ఏదో ఒకటి చేయటం మంచిది. కనీసం, బాహ్యంగానైనా భక్తిలో నిమగ్నమౌతారు. కానీ, శ్రీ కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యాంత్రికమైన అభ్యాసము కన్నా ఆధ్యాత్మిక జ్ఞానము పెంపొందించుకొనుట మంచిది. జీవితపు లక్ష్యము భగవత్ ప్రాప్తి అని, భౌతిక ప్రాపంచిక పురోగతి కాదన్న విషయాన్ని ఆధ్యాత్మిక జ్ఞానము ప్రసాదిస్తుంది. జ్ఞానమును బాగా తెలుసుకున్న వ్యక్తి, కేవలం యాంత్రిక కర్మ కాండల కంటే అంతఃకరణ శుద్ధి కోసమే వాంఛ పెంచుకుంటాడు. కానీ, కేవలం జ్ఞానం కూడా అంతఃకరణ శుద్ధి చేయలేదు. అందుకే, జ్ఞాన సముపార్జన కంటే కూడా మనస్సుని భగవంతుని యందే ధ్యానంలో నిమగ్నం చేయటం ఉన్నతమైనది. మనస్సుని ధ్యానం ద్వారా నిజముగా నియంత్రణ చేయటం వలన మనకు ప్రాపంచిక భోగముల పట్ల అనాసక్తత/వైరాగ్యం కలుగుతూ ఉంటుంది. అనాసక్తి/వైరాగ్య లక్షణము మనస్సులో ఒకమేర పెరిగిన తరువాత, మనము తదుపరి స్థాయిని అభ్యాసం చేయవచ్చు, అదే కర్మ-ఫల-త్యాగము. ఇంతకు క్రితం శ్లోకంలో వివరించబడినట్టు, మనస్సు నుండి ప్రాపంచికత్వం నిర్మూలించటం మరియు ఇంకా ముందున్న ఉన్నత స్థాయిల కోసం బుద్ధిని బలోపేతం చేయటం కోసం, ఇది దోహదపడుతుంది.
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ । నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ।। 13 ।। సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః । మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః ।। 14 ।।
13
12
https://www.holy-bhagava…/012_013-014.mp3
అద్వేష్టా — ద్వేష భావము లేకుండా; సర్వ-భూతానాం — సమస్త ప్రాణుల పట్ల; మైత్రః — మైత్రీ భావము; కరుణ — కారుణ్యము; ఏవ — నిజముగా; చ — మరియు; నిర్మమః — ప్రాపంచిక వస్తువిషయములపై మమకార/ఆసక్తి లేకుండా; నిరహంకారః — అహంకార రహితముగా; సమ — సమత్వ బుద్ధితో; దుఃఖ — దుఃఖములు/కష్టాలు; సుఖః — సుఖములు; క్షమీ — క్షమాగుణము కలిగి; సంతుష్టః — తృప్తితో ఉంటూ; సతతం — ఎల్లప్పుడూ; యోగీ — భక్తితో ఏకమై; యత-ఆత్మా — ఆత్మ-నిగ్రహము కలిగి; దృఢ-నిశ్చయః — దృఢసంకల్పము/నిశ్చయముతో; మయి — నాకు; అర్పిత — అర్పితము చేసి; మనః — మనస్సు; బుద్ధిః — బుద్ధి; యః — ఎవరైతే; మత్-భక్తః — నా భక్తులు; సః — వారు; మే — నాకు; ప్రియః — చాలా ప్రియమైనవారు.
BG 12.13-14: ఏ భక్తులైతే, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి/ధనముపై మమకార/ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, దృఢ-సంకల్పంతో, మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.
తన యొక్క సాకార రూపము పట్ల భక్తియే శ్రేష్ఠమని చెప్పిన పిదప శ్రీ కృష్ణుడు ఇప్పుడు 13వ నుండి 19వ శ్లోకం వరకు, తన యొక్క ప్రేమయుక్త భక్తుల లక్షణములను వివరిస్తున్నాడు. సర్వ భూతముల పట్ల ద్వేషరహితముగా ఉండుట: సమస్త ప్రాణులు కూడా భగవంతుని యొక్క అణు-అంశములని భక్తులు తెలుసుకుంటారు. ఒకవేళ వారు ఇతరుల పట్ల ఈర్ష్యా భావము పెంచుకుంటే అది స్వయంగా భగవంతుని పట్ల ఈర్ష్య పడినట్లే లెక్క. కాబట్టి తమకు హాని చేసే వారిపట్ల కూడా శతృ/ద్వేష భావముతో ఉండరు. స్నేహపూర్వకంగా మరియు కారుణ్య భావముతో ఉండుట: భక్తి అనేది సమస్త ప్రాణుల పట్ల ఏకత్వ భావమును కలిగిస్తుంది, ఎందుకంటే అవన్నీ కూడా ఒకే భగవంతుని యొక్క బిడ్డలే. భక్తిలో ఇతరులను తన కంటే వేరనే భావనలో చూడటం సమసిపోతుంది. ఇది భక్తులలో దయ/మర్యాదని పెంచుతుంది మరియు ఇతర ప్రాణుల కష్టాల పట్ల సానుభూతిని పెంచుతుంది. ఆస్తిపాస్తుల పట్ల మమకారాసక్తి లేకుండా, అహంకార రహితముగా ఉండుట: భక్తికి ఉన్న ప్రధాన శత్రువు, గర్వము. నేను-నాది అనే భావనను నిర్మూలించుకుంటేనే వ్యక్తికి ఆధ్యాత్మిక పథంలో పురోగతి లభిస్తుంది. సూక్ష్మబుద్ధిగల భక్తులు సహజంగానే వినయపూర్వకంగా అవుతారు మరియు గర్వమును, యాజమాన్య భావన (ఇది నాది అన్న భావన) ను మరియు తమని తాము ఈ శరీరమే అని తప్పుగా అనుకోవటాన్ని నిర్మూలిస్తారు. కష్టాల్లో మరియు సుఖాల్లో సమత్వ బుద్ధితో ఉండటం. కేవలం తమ పరిశ్రమ మాత్రమే తమ చేతుల్లో ఉందని, కానీ, తద్వారా వచ్చే ఫలితాలు మాత్రం భగవంతుని చేతిలో ఉన్నాయి అని దృఢ-విశ్వాసంతో ఉంటారు భక్తులు. కాబట్టి ఎలాంటి ఫలితములు వారికి అందినా వాటిని భగవత్ సంకల్పముగా పరిగణిస్తారు మరియు వాటిని సమభావము తో స్వీకరిస్తారు. ఎల్లప్పుడూ క్షమించే మనస్సుతో ఉండటం. తప్పుచేసిన వారిని, తమ మనోవికారసంతృప్తి కోసం దండించాలని, భక్తులు ఎప్పటికీ కోరుకోరు. ఇతరుల పట్ల ఇటువంటి ప్రతికూల భావనలను మనస్సులో ఉంచుకుంటే మన యొక్క భక్తి నాశనమై పోతుంది. కాబట్టి పరిపక్వమైన భక్తులు తమ మనస్సులో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రూరమైన భావనలు ఉంచుకోరు మరియు తప్పు చేసిన వారిని శిక్షించే పని ఆ భగవంతునికే విడిచిపెడతారు. సర్వదా తృప్తితో ఉండటం. తృప్తి అనేది మనకున్న ఆస్తిపాస్తులను పెంచుకుంటే రాదు, మన కోరికలను తగ్గించుకుంటే వస్తుంది. భక్తులు ఇక భౌతిక వస్తువులలో ఆనందాన్ని వెతుక్కోరు, అందుకే వారికి ఉన్నదానితో తృప్తిగా ఉంటారు. భక్తితో నాతోనే నిశ్చలముగా ఏకమై ఉండటం. ఇంతకు క్రితం చెప్పినట్లు, ‘యోగము’ అంటే ఏకమైపోవటం. భక్తులు యోగులు అవుతారు ఎందుకంటే వారి అంతఃకరణ భగవంతుని యందే నిమగ్నమై ఉంటుంది. ఈ ఐక్యమగుట (ఏకీభావము) అప్పుడప్పుడూ వచ్చి పోయేది కాదు, అది నిరంతరం ఎడతెగక ఉండేది; ఎందుకంటే వారు భగవంతునితో తమకున్న సంబంధంలో స్థిరముగా ఉంటారు. ఆత్మనిగ్రహముతో ఉండటం. భక్తులు తమ మనస్సులను ప్రేమయుక్త భక్తితో ఈశ్వరునితో అనుసంధానం చేస్తారు. ఈ విధంగా అది ప్రపంచం నుండి విడివడుతుంది మరియు వారికి మనోఇంద్రియముల పై అధిపత్యము లభిస్తుంది. దృఢ నిశ్చయముతో ఉండుట. దృఢ సంకల్పము అనే లక్షణము స్థిరమైన బుద్ధి ద్వారా వస్తుంది. భక్తులు తమ బుద్ధిని శాస్త్రాలలో ఉన్న జ్ఞానముతో మరియు గురువు ఉపదేశములతో అనుసంధానం చేస్తారు, కాబట్టి, అది ఎంత దృఢ నిశ్చయంతో ఉంటుందంటే మొత్తం ప్రపంచం వారిని వేరే విధంగా మార్చటానికి ప్రయత్నించినా వారు ఒక్క ఇసుమంత కూడా తమ స్థానం (నిర్ణయం) నుండి కదలరు. మనోబుద్దులు నాకు అంకితము చేయబడి ఉండుట. జీవుడు (జీవాత్మ) తన సహజ స్వభావముచే భగవంతుని యొక్క దాసుడు; ఈ జ్ఞానాన్ని అవగతం చేసుకుంటే, మనం సహజంగానే మనలను ఆ పరమేశ్వరునికి సమర్పించుకుంటాము. ఈ శరణాగతి (సమర్పణ) లో మనోబుద్ధులే ప్రధానమైనవి. వాటిని భగవంతునికి సమర్పణ చేసినప్పుడు, మిగతా దేహమంతా - శరీరము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రాపంచిక ఆస్తులు మరియు ఆత్మ - ఇవన్నీ సహజంగానే ఆయన సేవకే అంకితం అయిపోతాయి. ఈ లక్షణములు ఉండే భక్తులు తనకు చాలా ప్రియమైన వారు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః । హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియ: ।। 15 ।।
15
12
https://www.holy-bhagava…udio/012_015.mp3
యస్మాత్ — ఎవరిచే కూడా; న ఉద్విజతే — ఉద్వేగమునకు గురి కాకుండా; లోకః — జనులు; లోకాత్ — జనుల చేత; న ఉద్విజతే — ఉద్రేకపడకుండా; చ — మరియు; యః — ఎవరైతే; హర్ష — సంతోషము; అమర్ష — బాధ; భయ — భయము; ఉద్వేగః — ఆందోళన; ముక్తః — లేకుండా; యః — ఎవరైతే; సః — వారు; చ — మరియు; మే — నాకు; ప్రియః — చాలా ప్రియమైనవారు.
BG 12.15: లోకమున ఎవ్వరినీ బాధ(క్షోభ) పెట్టని వాడు మరియు ఎవరి చేత ఉద్వేగమునకు గురి కాని వాడు, సుఖాల్లో-బాధల్లో ఒక్కలాగే ఉంటూ, మరియు భయము, ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు.
ఆత్మ అనేది సహజంగా స్వచ్ఛమైనది మరియు నిర్మలమైనది. సమస్య ఏమిటంటే ఇప్పుడు అది మలినమైన మనస్సుచే కప్పబడి ఉంది. ఒకసారి ఈ మలినములు నిర్మూలించబడిన తరువాత ఆత్మ సహజంగానే ప్రకాశిస్తుంది. శ్రీమద్ భాగవతము ఇలా పేర్కొన్నది: యస్యాస్తి భక్తిర్భగవత్యకించనా  సర్వైర్గుణైఃస్ తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణాః మనోరథేనాసతి ధావతో బహిః (5.18.12) ‘పరమేశ్వరుని పట్ల భక్తితో అంకిత భావముతో ఉన్న వారిలో దేవతల యొక్క అద్భుతమైన గుణములన్నీ వ్యక్తమవుతాయి. కానీ ఎవరైతే భక్తిలో నిమగ్నం కాకుండా ఉంటారో, వారు తమ మనస్సు అనే రథంపై పరిగెడుతూనే ఉంటారు (వారిని వారు ఉద్ధరించుకోవాలనే ఎన్ని ప్రయత్నాలు చేసినా).’ ఇక్కడ, తన భక్తులలో ప్రకటితమయ్యే ఇంకా కొన్ని గుణములను వివరిస్తున్నాడు. ఎవ్వరికీ ఇబ్బంది కలిగించేట్టుగా ఉండరు: భక్తి అనేది హృదయమును కరిగించి, సున్నితముగా చేస్తుంది. కాబట్టి భక్తులు సహజంగానే ఇతరుల పట్ల వ్యవహారంలో మృదువుగా వ్యవహరిస్తారు. అంతేకాక, ప్రతి ఒక్కరిలో భగవంతుడు కూర్చుని ఉన్నట్టుగా మరియు వారందరిని ఆయన యొక్క అణు-అంశములుగా దర్శిస్తారు. కాబట్టి, ఎవ్వరికీ కూడా హాని తలపెట్టడాన్ని తలచలేరు. ఎవ్వరి వలన ఉద్వేగమునకు గురి కారు: భక్తులు ఎవ్వరికి హాని తలపెట్టకపోయినా, ఇతరులు వారికి హాని తలపెట్టరని కాదు. ప్రపంచం మొత్తం మీద మహాత్ముల చరిత్ర చూస్తే, వారి జీవితకాలంలో వారు చేసిన సంక్షేమ కార్యములు మరియు ఉపదేశముల వల్ల భయపడ్డవాళ్లు తరచుగా వారిని వేధించారు. కానీ, మహాత్ములు ఎప్పుడూ తమకు హాని తలపెట్టిన వారి పట్ల కూడా కారుణ్య భావన తోనే ఉన్నారు. అందుకే, నజరేయుడైన యేసు (Jesus of Nazareth) శిలువపై ఇలా ప్రార్థించాడు, ‘తండ్రీ, వారిని క్షమింపుము ఎందుకంటే వారేమి చేస్తున్నారో వారికి తెలియదు’ (Father, forgive them for they know not what they do. (Luke 23.34)) సంతోషము మరియు బాధలలో సమానముగా ఉండుట: భక్తులు శాస్త్ర పరిజ్ఞానము యొక్క ఎరుకతో ఉంటారు. కాబట్టి, జీవన క్రమంలో, వచ్చిపోయే ఎండాకాలం, శీతాకాలం లాగా కష్టాలు, సుఖాలు రెంటినీ తప్పించుకోలేము అన్న వివేకముతో ఉంటారు. ఈ విధంగా, తరిగిపోని సకారాత్మక దృక్పథంతో, వారు రెండింటిలో కూడా భగవత్ అనుగ్రహమునే చూస్తారు మరియు అన్ని పరిస్థితులను తమ భక్తిని పెంపొందించుకోవటానికే వాడుకుంటారు. భయాందోళనల రహితముగా ఉండుట: భయము మరియు ఆందోళనల యొక్క మూల కారణము మమకారాసక్తియే. మనకు మమకారాసక్తి ఉన్న వస్తువు కోసం తపిస్తాము మరియు అది దూరమై పోతుందేమో అని భయానికి లోనవుతాము. మనము ప్రాపంచిక వస్తువులు-వ్యక్తుల పట్ల అనాసక్తత పెంచుకుంటే మనము భయరహితముగా అవుతాము. భక్తులు ఆసక్తి రహితముగా ఉండటమే కాక భగవంతుని సంకల్పంతో ఏకీభావముతో ఉంటారు. కాబట్టి, వారు భయము లేదా ఆందోళనకు గురి కారు.
అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః । సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః ।। 16 ।।
16
12
https://www.holy-bhagava…udio/012_016.mp3
అనపేక్షః — ప్రాపంచిక లాభాల పట్ల అనాసక్తత ఉండి; శుచిః — స్వచ్ఛముగా; దక్షః — నేర్పుగల; ఉదాసీనః — ఉదాసీనంగా (చింతలేకుండా); గత-వ్యథః — కలతలు లేకుండా; సర్వ-ఆరంభ — అన్ని ప్రయత్నములను; పరిత్యాగీ — పరిత్యజించిన వాడై; సః — ఎవరైతే; మత్-భక్తః — నా భక్తుడు; సః — అతడు; మే — నాకు; ప్రియః — చాలా ప్రియమైన వాడు.
BG 12.16: ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతతో ఉండి, బాహ్యాంతరములలో పవిత్రంగా ఉండి, దక్షతతో, ఉదాసీనంగా, కలతలు లేకుండా, మరియు అన్ని వ్యవహారములలో స్వార్థచింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు.
ప్రాపంచిక లాభాల పట్ల అనాసక్తతతో ఉండుట: ఒక బహు పేదవానికి రూ. 1000 వచ్చినా లేదా పోయినా అది ఎంతో ముఖ్యమైన విషయము, అదే విషయాన్ని ఒక కోటీశ్వరుడు చాలా చిన్న విషయముగా తీస్కుని అంతగా ఆలోచించడు. భక్తులు భగవంతుని దివ్య ప్రేమలో సంపన్నులు, వారికి అదే అత్యంత ఐశ్వర్యవంత సంపద. వారు భగవంతుని పట్ల ప్రేమయుక్త సేవకే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కూడా. కాబట్టి వారు ప్రాపంచిక లాభాల పట్ల అనాసక్తతతో ఉంటారు. బాహ్యముగా మరియు ఆంతరములో స్వచ్ఛముగా ఉండుట: వారి యొక్క మనస్సులు నిరంతరం పరమ-పవిత్రమైన భగవానుని యందు నిమగ్నమై ఉండుట వలన భక్తులు అంతర్గతంగా కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, అహంకారము వంటి దోషముల నుండి పరిశుద్ధి చేయబడుతారు. ఈ యొక్క మానసిక స్థితిలో వారు బాహ్య శరీరమును మరియు పరిసరాలను శుభ్రముగా ఉంచుకోవటానికే సహజంగా మొగ్గు చూపిస్తారు. ఈ విధంగా, ఈ ప్రాచీన ఆంగ్ల నానుడి ప్రకారం ‘Cleanliness is next to Godliness’ (పరిశుభ్రత అనేది దైవత్వం వంటిది), వారు బాహ్యముగా కూడా శుచిగా ఉంటారు. నిపుణత: భక్తులు తమ అన్ని పనులను ఈశ్వర సేవకు అవకాశములాగా చూస్తారు. కాబట్టి, తమ పనులను అత్యంత శ్రద్ధ మరియు సావధానతతో చేస్తారు. ఇది వారిని సహజంగానే నిపుణులుగా చేస్తుంది. చింత లేకుండా ఉండుట: తమ శరణాగతికి అనుగుణంగా భగవంతుడు తమలని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడనే విశ్వాసంతో వారు చింత లేకుండా ఉంటారు. కలతలు లేకుండా ఉండుట. భక్తులు ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేసి ఉంటారు కాబట్టి వారు తమ అన్ని వ్యవహారములలో తమ శాయశక్తులా పనిచేస్తారు మరియు ఫలితాన్ని ఈశ్వరుని చేతిలోనే పెడతారు. అందుకే, తమ సంకల్పాన్ని ఈశ్వర సంకల్పమునకు లోబరిచి ఉంచి, ఫలితం ఏదైనా వారు కలత చెందరు. సర్వ కార్యములలో స్వార్థ చింతన లేకుండుట: సేవా దృక్పథము అనేది వారిని అల్పమైన స్వార్థ చింతనకు అతీతముగా చేస్తుంది.
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి । శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః ।। 17 ।।
17
12
https://www.holy-bhagava…udio/012_017.mp3
యః — ఎవరైతే; న హృష్యతి — ఆనందపడరు; న ద్వేష్టి — నిరాశ చెందరు; న శోచతి — దుఃఖించరు; న కాంక్షతి — లాభంకోసం ఆశపడరో; శుభ-అశుభ-పరిత్యాగీ — శుభ అశుభములు పరిత్యజించి; భక్తి-మాన్ — భక్తితో నిండి; యః — ఎవరైతే; సః — ఆ వ్యక్తి ; మే — నాకు; ప్రియః — చాలా ప్రియమైన.
BG 12.17: ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధ పడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధ పడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ-అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు, భక్తితో నిండి ఉన్న వారు నాకు చాలా ప్రియమైనవారు.
వారు లౌకిక సుఖముల పట్ల ఆనందించరు లేదా ప్రాపంచిక దుఃఖాల పట్ల నిరాశ చెందరు: మనం చీకటిలో ఉన్నప్పుడు ఎవరైనా దీపము చూపించి సహాయం చేస్తే, సహజంగానే మనం ఆనంద పడుతాము. తరువాత, ఎవరైనా దీపాన్ని ఆర్పేస్తే మనము ఆందోళన చెందుతాము. కానీ, అదే మనకు మధ్యాహ్న సూర్యుని క్రింద ఉన్నప్పుడు, ఎవరైనా దీపము చూపించినా లేదా ఆర్పినా మనకు ఏమీ తేడా పడదు. అదే విధముగా, భగవంతుని యొక్క భక్తులు, భగవానుని యొక్క దివ్య ప్రేమలో సంతుష్టి చెంది, ప్రాపంచిక ఆనందానికి, నిరాశకీ అతీతముగా ఎదుగుతారు. నష్టము పట్ల శోకించరు లేదా లాభము కోసం ఆరాటపడరు: ఇటువంటి భక్తులు సంతోషకరమైన ప్రాపంచిక పరిస్థితుల కోసం ప్రాకులాడరు లేదా ప్రతికూలమైన పరిస్థితుల పట్ల శోకించరు. నారద భక్తి దర్శనం ఈవిధంగా పేర్కొంటున్నది: యత్ప్రాప్య న కించిత్ వాంఛతి, న శోచతి, న ద్వేష్టి, న రమతే, నోత్సాహి భవతి (5వ సూత్రము) ‘భగవంతుని పట్ల దివ్య ప్రేమని పొందిన తరువాత, భక్తులు ఆహ్లాదకర వస్తువిషయముల పట్ల యావ చూపరు లేదా వాటిని నష్టపోతే బాధపడరు. వారికి హాని చేసే వారి పట్ల ద్వేషభావముతో ఉండరు. వారికి ప్రాపంచిక సుఖముల పట్ల ఎలాంటి ఇష్టము ఉండదు. వారి యొక్క ప్రాపంచిక సామాజిక స్థాయిని పెంచుకోవాలనే ఆశ వారికి ఉండదు.’ భక్తులు భగవంతుని యొక్క ఆనందమును అనుభవిస్తూ ఉంటారు కాబట్టి, దానితో పోల్చితే ప్రాపంచిక వస్తువుల ఆనందము వారికి అత్యల్పంగా అనిపిస్తుంది. శుభ-అశుభ కార్యములన్నిటినీ త్యజిస్తారు: భక్తులు సహజముగానే చెడు పనులు (వికర్మలు) విడిచిపెడతారు, ఎందుకంటే అవి ప్రకృతికి విరుద్ధమైనవి మరియు భగవంతునికి అప్రియమైనవి. శ్రీ కృష్ణుడు ఇక్కడ చెప్పే మంచి పనులు అంటే శాస్త్ర విహిత కర్మ కాండలు. భక్తులు చేసే ప్రతి పని కూడా అకర్మ అవుతుంది. ఎందుకంటే అవి ఏ స్వార్థ పూరిత ఉద్దేశ్యముతో చేయబడినవి కావు, మరియు అవి భగవత్ అర్పితము చేయబడినవి. అకర్మ యొక్క విషయము 4.17వ శ్లోకం నుండి 4.20వ శ్లోకం వరకు సవివరముగా విశదీకరించబడినది. భక్తితో నిండి ఉంటారు: భక్తిమాన్ అంటే ‘భక్తితో నిండి ఉంటారు’ అని. భగవంతుని దివ్య ప్రేమ స్వభావము ఎలాంటిదంటే, అది నిత్యమూ పెరుగుతూనే ఉంటుంది. భక్తి విషయ కవులు ఇలా పేర్కొన్నారు: ప్రేమ్ మేఁ పూర్ణిమా నహీఁ, (prem meñ pūrṇimā nahīñ) ‘చంద్రుడు ఒక దశ వరకు పెరిగి మరల ఎలా క్షీణిస్తాడు, కానీ, దివ్య ప్రేమ అనేది పరిమితి లేకుండా పెరుగుతూనే ఉంటుంది.’ కాబట్టి, భక్తుని హృదయము భగవంతుని పట్ల అంతులేని ప్రేమను కలిగి ఉంటుంది. అటువంటి భక్తులు తనకు ఎంతో ప్రియమైన వారు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః । శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః ।। 18 ।। తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ । అనికేతః స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః ।। 19 ।।
18
12
https://www.holy-bhagava…/012_018-019.mp3
సమః — ఒకేలాగా; శత్రౌ — శత్రువు పట్ల; చ — మరియు; మిత్రే — మిత్రుని పట్ల; చ తథా — మరియు ఇంకా; మాన-అపమానయోః — గౌరవము, అపమానముల యందు; శీత-ఉష్ణ — చలి మరియు వేడిమిలో; సుఖ-దుఃఖేషు — సుఖదుఃఖముల యందు; సమః — ఒక్కలాగే ఉంటూ; సంగ-వివర్జితః — చెడు సాంగత్యము విడిచి; తుల్య — ఒకేలాగా పరిగణిస్తూ; నిందా-స్తుతి — దూషణ మరియు పొగడ్త; మౌనీ — మౌనముగా చింతన; సంతుష్టః — తృప్తిగా ఉంటూ; యేన కేనచిత్ — దేనితో అయినా; అనికేతః — నివాస స్థానము పై మమకారఆసక్తి లేకుండా; స్థిర — స్థిరముగా; మతి — బుద్ధి; భక్తి-మాన్ — భక్తితో నిండి ఉన్నవాడు; మే — నాకు; ప్రియః — చాలా ప్రియమైన; నరః — వ్యక్తి.
BG 12.18-19: ఎవరైతే, మిత్రులపట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము-అపమానముల ఎడ, చలి-వేడిమి పట్ల, సుఖ-దుఖఃముల పట్ల సమబుద్ధితో ఉంటారో, మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో; దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాసస్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నా యందే లగ్నమై ఉన్నదో, మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో, అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైనవారు.
శ్రీ కృష్ణుడు ఇక్కడ ఇంకా పది లక్షణములను విశదీకరిస్తున్నాడు. శత్రువు మరియు మిత్రుని పట్ల ఒక్కలాగే ఉండుట. భక్తులు అందరిపట్ల మంచి భావనతోనే ఉంటారు, శత్రుత్వము లేదా మిత్రుత్వము యొక్క భావనలతో ఉద్వేగపడరు. ఈ విషయంలో ప్రహ్లాదుని గురించి ఒక కథ ఉంది: ఒకసారి ఆయన పుత్రుడు విరోచనుడు, ప్రహ్లాదుని గురువుగారి పుత్రుడైన సుధన్వుడుతో వాగ్వివాదానికి దిగాడు. విరోచనుడు అన్నాడు, ‘నేనే నీకన్నా గొప్పవాడిని ఎందుకంటే నేను ఒక మహారాజు గారి కొడుకుని.’ సుధన్వుడు అన్నాడు, ‘నేనే గొప్ప ఎందుకంటే నేను ఒక ఋషి పుత్రుడను.’ వారిద్దరూ చిన్నవారే, వారి క్షణికావేశంలో పందెం వేసుకున్నారు. వారిద్దరూ ఇలా అనుకున్నారు, ‘ఎవరు గొప్పవాడని తేలితే వారే బ్రతకాలి రెండవ వాడు చనిపోవాలి.’ అని. మరిక దీనికి న్యాయనిర్ణేత ఎవరు? సుధన్వుడు విరోచనునితో ఇలా అన్నాడు, ‘మీ తండ్రి గారు ప్రహ్లాదుడే దీనికి న్యాయ నిర్ణేత.’ విరోచనుడు ఆశ్చర్యంతో అన్నాడు, ‘నిజంగానా! కానీ ఆయన పక్షపాతంతో వ్యవహరించాడని అంటావేమో.’ ‘కాదు, మా తండ్రి గారు అంగీర ఋషి చెప్పాడు, మీ తండ్రి ప్రహ్లాదుడు సంపూర్ణ నిష్పక్షపాతి, ఆయన మిత్రునికి శత్రువుకి తేడా చూపించడు.’ అని అన్నాడు సుధన్వుడు. ఆ ఇద్దరు పిల్లలూ ప్రహ్లాదుని వద్దకు వెళ్లారు. విరోచనుడు అడిగాడు, ‘తండ్రీ, నేను గొప్పవాడినా లేక సుధన్వుడా?’ అని. ప్రహ్లదుడు, ‘ఈ ప్రశ్న అసలు ఎందుకు వచ్చింది?’ అని అడిగాడు. విరోచనుడు అన్నాడు, ‘నాన్నా, మేమిద్దరం పందెం వేసుకున్నాము, ఎవరు గొప్పవాడు అని తేలితే వాడు బ్రతికి ఉండాలి, రెండవ వాడు చనిపోవాలి అని.’ ప్రహ్లాదుడు నవ్వి ఇలా అన్నాడు,’నీ మిత్రుడు సుధన్వుడే గొప్పవాడు ఎందుకంటే ఆయన నీ తండ్రి యొక్క గురువు గారి పుత్రుడు, కాబట్టి.’ ప్రహ్లాదుడు తన సేవకులకు ఇలా ఆదేశం ఇచ్చాడు, ‘నా పుత్రుడిని ఉరికంబం దగ్గరికి తీసుకెళ్లి ఉరి వేయండి’ అని. ఆ సమయంలో సుధన్వుడు జోక్యం చేసుకున్నాడు. ‘ఆగండి!’ అన్నాడు ప్రహ్లాదునితో. ‘నాకొక రెండవ ప్రశ్న ఉంది, నేను మీకన్నా గొప్పవాడినా?’ ప్రహ్లాదుడు ఇలా జవాబు ఇచ్చాడు , ‘నేను రాక్షస వంశములో జన్మించాను, నీవేమో ఒక ఋషి కుమారుడవు. ఆయన నా గురువు గారు కూడా, అందుకే నీవే గొప్పవాడివి’ అని. సుధన్వుడు, ‘అదే నిజమైతే మరి నా యొక్క ఆజ్ఞ ను పాటిస్తారా?’, అని మరల అడిగాడు. ‘తప్పకుండా’ అన్నాడు ప్రహ్లాదుడు. ‘సరే, అయితే విరోచనుడిని విడిచిపెట్టండి’ అన్నాడు సుధన్వుడు. ప్రహ్లాదుడు, ఏవిధంగానయితే, ‘నా పుత్రుడిని ఉరికంబం దగ్గరికి తీసుకెళ్లి ఉరి వేయండి’ అని అన్నాడో , అదే విధంగా తన భటులను, ‘అతన్ని వదిలి పెట్టండి’ అని ఆజ్ఞ ఇచ్చాడు. దేవతలు ఆయన సభలో పూల వాన కురిపించి, ప్రహ్లాదుని యొక్క న్యాయ శ్రేష్ఠతని కొనియాడారు. ఈ యొక్క న్యాయ దృక్పథం ప్రహ్లాదునికి సహజంగానే వచ్చింది ఎందుకంటే ప్రహ్లాదుడు ఒక పరిపూర్ణమైన భగవత్ భక్తుడు; స్నేహితుడు, శత్రువు, బంధువు, దగ్గరివాడు లేదా పరాయివాడు - వీరందరి పట్ల అతడు ఒక్కలాగే ఉన్నాడు. గౌరవము లేదా అవమానము పట్ల సమత్వబుద్ధితో ఉండుట: భక్తులు తమకు మర్యాద జరిగినా లేదా అవమానము జరిగినా పట్టించుకోరని కూడా శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. ఇది ఎలాగంటే, ఒక వ్యక్తి అక్రమ సంబంధము ప్రారంభిస్తే, ఎవరైనా ఇతరులు గమనిస్తున్నారేమో అని ఆ వ్యక్తి చూస్తుంటాడు, కానీ ఆ సంబంధము గాఢంగా మారిన తరువాత, ఆ వ్యక్తి అది తనకు తెచ్చే అపకీర్తి గురించి ఇక పట్టించుకోడు. ఇదే విధంగా, భక్తుని హృదయములో దివ్య ప్రేమాగ్ని ఎంత ప్రకాశవంతంగా వెలుగుతుందంటే, అతనికి ప్రాపంచిక మాన-అపమానములు విలువలేకుండా ఉంటాయి. శీతోష్ణములలో మరియు సుఖదుఃఖాలలో ఒక్కలాగే ఉండటం: భక్తులు అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులలో ఒక్కలాగే ఉంటారు. ఇవేవీ శాశ్వతమైనవి కావు అని వారికి తెలుసు. అవి పగలు-రాత్రి లాగా వచ్చి పోతూ ఉంటాయి, కాబట్టి భగవంతుడి నుండి తమ మనస్సుని దూరం చేసి, వాటి మీద ఆలోచించటం దండగ అని వారి అభిప్రాయం. రామకృష్ణ పరమహంస గారి జీవితం లోని ఒక సంఘటన సాధువుల స్వభావం గురించి మనకు తెలియచేస్తుంది. ఆయనకి పెద్ద వయస్సులో గొంతు క్యాన్సర్ వచ్చింది. జనులు ఆయనను కాళీమాతని ఆయన వ్యాధి నయంచేయమని ప్రార్థించమని అడిగారు. ఆయన ఇలా అన్నారు, ‘నా మనస్సు కాళీ మాత పట్ల ప్రేమతో నిండి ఉన్నది, దానిని అమ్మవారి నుండి దూరం చేసి ఈ యొక్క శారీరక క్యాన్సర్ వైపు ఎందుకు మళ్లించాలి? భగవంతుని సంకల్పము ఎలా ఉంటే అలాగే కానివ్వండి.’ అన్నాడు. ప్రతికూల సాంగత్యమును విడిచి ఉండుట: వ్యక్తులు లేదా వస్తువులతో సాంగత్యమునే ‘సంగము’ అంటారు. రెండు రకాల ‘సంగము’ లు ఉన్నాయి. మన మనస్సుని లౌకిక ప్రాపంచిక విషయాల దిశగా తీసుకెళ్లే సాంగత్యమును ‘కుసంగము’ (చెడు/ప్రతికూల సాంగత్యము) అంటారు, మరియు మనస్సుని ప్రపంచము నుండి వేరుగా, భగవంతుని దిశగా తీసుకువెళ్లే సాంగత్యమును ‘సత్సంగము’ (అనుకూల/మంచి సాంగత్యము) అంటారు. భక్తులు ప్రాపంచిక తలంపులను ఆస్వాదించరు కాబట్టి సహజంగానే కుసంగము విడిచి పెట్టి, సత్సంగములో నిమగ్నమౌతారు. పొగడ్త మరియు దూషణని ఒక్కలాగే తీసుకొనుట: బాహ్యమైన వాటి నుండి ప్రేరణ లభించే వారికి, ఇతరుల నుండి లభించే ప్రశంస లేదా తిరస్కారము చాలా ప్రధానంగా అనిపిస్తాయి. కానీ, భక్తులకు వారు పాటించే ఆదర్శాల వల్ల, అంతర్గతంగా లోనుండే ప్రేరణ లభిస్తుంది. కాబట్టి, ఇతరుల మెచ్చుకోలు లేదా విమర్శ వారిలో ఏమీ తేడా చూపించదు. మౌనముగా ధ్యానము/చింతన చేసుకొనుట: కాకులు మరియు హంసలు పూర్తి విరుద్ధమైన అభిరుచులు కలిగి ఉంటాయి. కాకులు చెత్త కుప్పల పట్ల ఆకర్షితమయితే, హంసలు ప్రశాంతమైన కొలనుల పట్ల ఆకర్షితమౌతాయి. అదే విధముగా ప్రాపంచిక వ్యక్తుల మనస్సులు భౌతిక ప్రాపంచిక విషయముల పట్ల మాట్లాడుకోవటంలోనే ఆనందాన్ని అనుభవిస్తాయి. కానీ, సాధు-భక్తులు స్వచ్ఛమైన మనస్సులను కలిగి ఉంటారు, అందుకే ప్రాపంచిక విషయములు వారికి చెత్త కుప్పలు ఎంత ఆకర్షణీయముగా ఉంటాయో అంతే ఆకర్షణీయముగా ఉంటాయి. అంటే వారి ఏమీ మాట్లాడరు అని అర్థం కాదు. కొలనులపట్ల హంస ఆకర్షితమైనట్టు, వారి మనస్సులు భగవంతుని యొక్క నామములు, రూపములు, లీలలు, మరియు మహిమల పట్ల ఆసక్తితో ఉంటాయి. తమకు లభించిన దానితో తృప్తిగా ఉండుట: భక్తుల యొక్క అవసరాలు కేవలం శరీర నిర్వహణ కోసం కావలసినంత మాత్రమే ఉంటాయి. సంత్ కబీర్ తన ప్రఖ్యాత పద్యంలో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. మాలిక్ ఇతనా దీజియే, జామే కుటుంబ సమాయ మైఁ భీ భూకా న రహుఁ, సాధు న భూఖా జాయ ‘ఓ భగవంతుడా, నా కుటుంబ శరీర పోషణకు సరిపోయేంత, మరియు ఇంటికి వచ్చిన సాధువుకు పెట్టగలిగే అంత మాత్రమే నాకు ప్రసాదించుము.’ నివాస స్థానము పట్ల మమకార-అనురాగం లేకుండుట: ఈ భూలోకంపై ఏ ఇల్లు కూడా ఆత్మకు శ్శాశ్వత నివాస స్థానం కాజాలదు, ఎందుకంటే మరణ సమయంలో అన్నింటినీ విడిచిపెట్టేయాలి. మొగలు సార్వభౌముడు అక్బర్, రాజధాని ఫతేపూర్ సిక్రి నిర్మించినప్పుడు, ఈ క్రింది సూత్రాన్ని ప్రధాన గేటుపై చెక్కించాడు: ‘ఈ ప్రపంచం ఒక వంతెన; దాని దాటివెళ్ళు కానీ దానిపై ఇల్లు కట్టకు.’ (The world is a bridge; cross over it but build no house on it.) అని. ఇదే అర్థంలో కృపాలు జీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు: జగ మేఁ రహో ఐసే గోవింద రాధే, ధర్మశాలా మేఁ యాత్రీ రహేఁ జ్యోఁ బతా దే (రాధా గోవింద గీతము) ‘ఒక బాటసారి దారిపక్క హోటల్లో బస చేసినట్టు (మరుసటి ఉదయం దాన్ని ఖాళీ చేయాలి అని గ్రహించి) , నీవు ఈ ప్రపంచంలో నివసించుము.’ ఈ మాటల్లోని నిజాన్ని తెలుసుకున్న పిదప, భక్తులు తమ ఇంటిని ఒక తాత్కాలికమైన నివాస స్థానముగానే పరిగణిస్తారు. బుద్ధి నా యందే స్థిరముగా నిలిపి ఉంచుట. జగత్తులో భగవంతుని యొక్క అత్యున్నత స్థానము మరియు భగవంతునితో తమకు ఉన్న సంబంధము పట్ల భక్తులకు దృఢవిశ్వాసం ఉంటుంది. ప్రేమతో శరణాగతి చేస్తే, భగవత్ కృపచే వారు అత్యున్నత స్థాయిని పొందుతాము అన్న గట్టి నమ్మకం వారికి ఉంటుంది. అందుకే వారు ఒక ఆకర్షణ నుండి ఇంకొక ఆకర్షణకు లేదా ఒక మార్గము నుండి ఇంకో మార్గముకు పోరు. ఇటువంటి దృఢ సంకల్పము కల భక్తులు తనకు ఎంతో ప్రియమైన వారు అని శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు.

యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే । శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేఽతీవ మే ప్రియాః ।। 20 ।।
20
12
https://www.holy-bhagava…udio/012_020.mp3
యే — ఎవరైతే; తు — నిజముగా; ధర్మ — జ్ఞానమనే; అమృతం — అమృతము; ఇదం — ఇది; యథా — ఇలా; ఉక్తం — చెప్పబడిన; పర్యుపాసతే — అనన్య భక్తితో సేవిస్తారో; శ్రద్ధధానాః — విశ్వాసముతో; మత్-పరమాః — నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ; భక్తాః — భక్తులు; తే — వారు; అతీవ — అత్యంత; మే — నాకు; ప్రియాః — ప్రియమైన వారు.
BG 12.20: ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి, నాపై విశ్వాసముతో మరియు నేనే పరమ లక్ష్యముగా భక్తితో ఉంటారో, వారు నాకు అత్యంత ప్రియమైన వారు.
అర్జునుడి ప్రశ్నకు తన సమాధానమును సారాంశంగా చెప్తూ శ్రీ కృష్ణుడు ఈ అధ్యాయమును ముగిస్తున్నాడు. ఈ అధ్యాయ ప్రారంభంలో అర్జునుడు కృష్ణుడిని, ఎవరు ఉన్నతమైన వారు అని అడిగాడు — తన సాకార రూపమును భక్తి యోగము ద్వారా పూజించేవారా లేక నిరాకార బ్రహ్మన్‌ను జ్ఞాన యోగము ద్వారా ఆరాధించేవారా అని. శ్రీ కృష్ణుడు రెండవ శ్లోకంలో దానికి సమాధానం చెప్తూ, తన సాకార రూపము పట్ల నిశ్చలమైన భక్తితో ఉండేవారినే అత్యున్నత యోగులని చెప్పి ఉన్నాడు. తదుపరి, భక్తి విషయం మీద మరింత చెపుతూ, భక్తి చేసే విధానాన్ని చెప్పిన తరువాత భక్తుల యొక్క లక్షణములను వివరించాడు. ఇక ఇప్పుడు మరొక సారి, అత్యున్నత ఆధ్యాత్మిక మార్గము భక్తియే అని వక్కాణిస్తున్నాడు. ఎవరైతే పరమేశ్వరుడినే తమ లక్ష్యముగా చేసుకుని, దృఢ విశ్వాసముతో భక్తిని పెంపొందించుకుని, ఇంతకు క్రితం శ్లోకాలలో చెప్పబడిన సద్గుణములను కలిగిఉంటారో, అటువంటి భక్తులు భగవంతునికి అత్యంత ప్రియమైనవారు.
అర్జున ఉవాచ । ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ । తద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ ।। 1 ।।
1
13
https://www.holy-bhagava…udio/013_001.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; ప్రకృతిం — భౌతిక ప్రకృతి; పురుషం — పురుషుడు (సుఖించేవాడు); చ — మరియు; ఏవ — నిజముగా; క్షేత్రం — క్షేత్రము; క్షేత్ర-జ్ఞమ్ — క్షేత్రమును తెలిసినవాడు; ఏవ — అయినా; చ — మరియు; ఏతత్ — ఇది; వేదితుం — తెలుసుకొనుటకు; ఇచ్ఛామి — కోరుతున్నాను; జ్ఞానం — జ్ఞానము; జ్ఞేయం — జ్ఞానము యొక్క లక్ష్యము; చ — మరియు; కేశవ — కృష్ణ , కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా.
BG 13.1: అర్జునుడు ఇలా అన్నాడు, ‘ఓ కేశవా, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమి? అని తెలుసుకోగోరుచున్నాను. నిజమైన జ్ఞానము ఏమిటి మరియు అటువంటి జ్ఞానము యొక్క లక్ష్యము ఏమిటి? అని కూడా తెలుసుకోగోరుచున్నాను.’
శ్రీ భగవానువాచ । ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే । ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ।। 2 ।।
2
13
https://www.holy-bhagava…udio/013_002.mp3
శ్రీ భగవానువాచ — శ్రీ భగవానుడు ఇలా పలికెను; ఇదం — ఇది; శరీరం — శరీరము; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; క్షేత్రం — క్షేత్రము; ఇతి — ఈ విధముగా; అభిధీయతే — చెప్పబడినది; ఏతత్ — దీని గూర్చి; యః — ఎవరికైతే; వేత్తి — తెలుసునో; తం — ఆ వ్యక్తి; ప్రాహుః — చెప్పబడును; క్షేత్ర-జ్ఞః — క్షేత్రమును తెలిసినవాడు; ఇతి — ఈ విధముగా; తత్-విదః — సత్యాన్ని స్పష్టముగా తెలుసుకున్నవారు.
BG 13.2: సర్వోత్కృష్ట దివ్య భగవానుడు ఇలా పలికెను: ఓ అర్జునా, ఈ దేహము క్షేత్రము అని, మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన వానికి క్షేత్రజ్ఞుడు అని - ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది.
ఇక్కడ, శ్రీ కృష్ణుడు శరీరమునకు, ఆత్మకు భేదము చెప్పటం ప్రారంభిస్తున్నాడు. ఆత్మ అనేది దివ్యమైనది మరియు అది తినలేదు, చూడలేదు, వాసన చూడలేదు, వినలేదు, రుచిచూడలేదు లేదా స్పర్శ తెలుసుకోలేదు. అది, ఇవన్నీ పనులను శరీరము-మనస్సు-బుద్ధి అమరిక ద్వారా పరోక్షంగా అనుభవిస్తుంది, అందుకే దీనిని క్షేత్రము (కార్యకలాపాలు జరిగే స్థలము) అని అంటారు. ఆధునిక సైన్సులో మనకు ఫీల్డ్ అఫ్ ఎనర్జీ (‘field of energy’) వంటి పదాలు ఉన్నాయి. ఒక అయస్కాంతమునకు దాని చుట్టూ అయస్కాంత క్షేత్రము ఉంటుంది; అది వేగవంత కదలిక ద్వారా విద్యుత్తుని పుట్టిస్తుంది. విద్యుత్ చార్జికి దాని చుట్టూ ఒక శక్తి క్షేత్రం ఉంటుంది. ఇక్కడ, జీవుని కార్యకలాపాలకు శరీరము ఒక ఆధార స్థానము. కాబట్టి, దానిని క్షేత్రము (కార్యకలాపాల ప్రదేశము) అంటారు. ఆత్మ అనేది శరీరమనోబుద్ధుల కంటే వేరైనది, కానీ, తన యొక్క దివ్య స్వభావమును మర్చిపోయి, అది తనను తాను ఈ ప్రాకృతిక పదార్థములతో అనుసంధానం చేసుకుంటుంది. అయినా, దానికి దేహము యొక్క జ్ఞానము ఉండటం చేత దానిని క్షేత్రజ్ఞుడు (శరీరమును తెలిసినవాడు) అని అంటారు. ఇంద్రియాతీతముగా, ఆత్మ తత్త్వము యందే స్థితులై ఉండి, దేహము కన్నా వేరుగా ఉన్న తమ యొక్క విలక్షణమైన గుర్తింపుని తెలుసుకున్న ఆత్మ-జ్ఞానులైన ఋషులచే ఈ పరిభాష (terminology) ఇవ్వబడినది.
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత । క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ ।। 3 ।।
3
13
https://www.holy-bhagava…udio/013_003.mp3
క్షేత్ర-జ్ఞం — క్షేత్రమును తెలిసినవాడు; చ — మరియు; అపి — మాత్రము; మాం — నన్ను; విద్ధి — తెలుసుకొనుము; సర్వ — సమస్త; క్షేత్రేషు — వ్యక్తిగత క్షేత్రముల; భారత — భరత వంశీయుడా; క్షేత్ర — క్షేత్రము; క్షేత్ర-జ్ఞయోః — క్షేత్రజ్ఞుని గురించి; జ్ఞానం — తెలుసుకొనుట; యత్ — ఏదైతే; తత్ — అది; జ్ఞానం — జ్ఞానము; మతం — అభిప్రాయము; మమ — నా యొక్క.
BG 13.3: ఓ భరత వంశీయుడా, నేను కూడా ప్రతి ఒక్క క్షేత్రమును ఎఱింగిన వాడినే. ఈ శరీరమును క్షేత్రమని (కార్యకలాపాలు జరిగే స్థానము) మరియు ఆత్మ, పరమాత్మ క్షేత్రజ్ఞులని (క్షేత్రమునెరింగినవారు) తెలుసుకోవటమే, నిజమైన జ్ఞానముగా నేను పరిగణిస్తాను.
ఆత్మకు తన ఒక్క శరీర క్షేత్రము గురించే తెలుసు. ఈ పరిమితమైన పరిధిలో కూడా, తన క్షేత్రము గురించి ఆత్మకున్న జ్ఞానము అసంపూర్ణమైనది. భగవంతుడు, సర్వ భూతముల హృదయములలో పరమాత్మగా స్థితుడై ఉండి సమస్త ఆత్మల క్షేత్రములు తెలిసినవాడు. అంతేకాక, ప్రతి ఒక్క క్షేత్రము గురించి ఉన్న భగవంతుని జ్ఞానము సంపూర్ణమైనది మరియు దోషరహితమైనది. ఈ తారతమ్యాలను చెప్పటం ద్వారా - భౌతిక శరీరము, ఆత్మ, మరియు పరమాత్మ - ఈ మూడింటి మధ్య తేడాలు, మరియు ఒకదానితో మరొకదానికున్న సంబంధాన్ని, శ్రీ కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. పై శ్లోకంలో రెండవ పాదంలో, జ్ఞానము అంటే ఏమిటో నిర్వచనం చెప్తున్నాడు. ‘నిజమైన జ్ఞానమంటే ఆత్మ, పరమాత్మ, శరీరములు అంటే ఏమిటో తెలుసుకొనటమే కాక, వాటిమధ్య తారతమ్యము ఏమిటి అని కూడా తెలుసుకోవటము’. ఈ దృక్పథంతో చూస్తే, పి‌హెచ్‌డిలు (PhDs) లు మరియు డిలిట్ట్ లు (DLitts) చేసినవారు తమనితామే విద్యావంతులమని అనుకోవచ్చు, కానీ వారికి శరీరము, ఆత్మ, మరియు భగవంతుడు (పరమాత్మ) లమధ్య తేడా, వాటి గురించి స్పష్టత లేకపోతే, శ్రీ కృష్ణుడి నిర్వచనం ప్రకారం వారికి నిజముగా ఏమీ తెలియనట్లే.
తత్ క్షేత్రం యచ్చ యాదృక్చయద్వికారి యతశ్చ యత్ । స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ।। 4 ।।
4
13
https://www.holy-bhagava…udio/013_004.mp3
తత్ — అది; క్షేత్రం — క్షేత్రము; యత్ — ఏదైతే; చ — మరియు; యాదృక్ — దాని స్వభావము; యత్-వికారి — దానిలో మార్పులు/కదలికలు ఎలా సంభవిస్తాయో; యతః — దేని నుండి; చ — మరియు; యత్ — ఏది; సః — అతడు; చ — మరియు; యః — ఎవరు; యత్-ప్రభావః — అతని ప్రభావ సామర్థ్యము ఏమిటో; చ — మరియు; తత్ — అది; సమాసేన — సంక్షిప్తముగా; మే — నా నుండి; శృణు — వినుము
BG 13.4: వినుము, క్షేత్రము అంటే ఏమిటో దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టించబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తిసామర్థ్యము ఏమిటో కూడా వివరిస్తాను.
శ్రీ కృష్ణుడే తానే స్వయముగా ఇప్పుడు చాలా ప్రశ్నలు సంధిస్తున్నాడు, మరియు అర్జునుడిని జాగ్రత్తగా వాటి సమాధానములను వినమని అంటున్నాడు.
ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ । బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ।। 5 ।।
5
13
https://www.holy-bhagava…udio/013_005.mp3
ఋషిభిః — మహర్షుల చే; బహుధా — చాలా రకాలుగా; గీతం — పాడబడినది; ఛందోభిః — వేద మంత్రములలో; వివిధైః — వివిధములైన; పృథక్ — వేర్వేరుగా; బ్రహ్మ-సూత్ర — బ్రహ్మ సూత్రములు; పదైః — శ్లోకములు; చ — మరియు; ఏవ — ప్రత్యేకముగా; హేతు-మద్భిః — తర్కముతో (సహేతుకంగా); వినిశ్చితైః — నిశ్చయాత్మకముగా.
BG 13.5: మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును పెక్కువిధముల వివరించి ఉన్నారు. ఎన్నోవేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది, ప్రత్యేకముగా బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది.
స్పష్టముగా, సూటిగా మరియు తర్కబద్దముగా చెప్పినప్పుడు జ్ఞానము అనేది మన మనస్సుకు హత్తుకునేలా ఉంటుంది. అంతేకాక, అది దోషరహితముగా స్వీకరించబడాలి అంటే అది దోషరహితమైన ప్రమాణముచే నిర్దారించబడాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ద్రువీకరించటానికి వేదములే ఆధారము. వేదములు: ఇవి ఏవో పుస్తకముల పేర్లు కావు; ఇవి సనాతనమైన భగవంతుని యొక్క జ్ఞానము. భగవంతుడు జగత్తుని సృష్టించినప్పుడల్లా, ఆయన వేదములను జీవుల (ఆత్మల) సంక్షేమం కోసం ప్రకటిస్తాడు. బృహదారణ్యక ఉపనిషత్తు (4.5.11) ఇలా పేర్కొంటున్నది: నిఃశ్వసితమస్య వేదాః, ‘వేదములు భగవంతుని శ్వాస నుండి ప్రకటితమయినాయి.’ అవి ప్రారంభంలో ప్రప్రథమంగా జన్మించిన బ్రహ్మ దేవుని హృదయంలో తెలియపరచబడినాయి. అక్కడ నుండి, వాక్ సాంప్రదాయం పరంగా ముందుతరాలకు అందించబడినాయి, అందుకే వాటికున్న ఇంకొక పేరు శృతి, ‘చెవి ద్వారా అందుకోబడిన జ్ఞానము’. కలియుగ ప్రారంభంలో, స్వయంగా భగవత్ అవతారమైన వేద వ్యాసుడు, వేదములను పుస్తక రూపంలో పొందుపరిచాడు, మరియు ఒక్కటిగా ఉన్న జ్ఞాన భాండాగారమును నాలుగు విభాగాలుగా విభజించాడు - ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, మరియు అథర్వ వేదము. అందుకే, ఆయనకు వేద వ్యాసుడు అన్న పేరు వచ్చింది, అంటే ‘వేదములను విభజించినవాడు’ అని అర్థం. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, వేద వ్యాసుడు వేదములను రచించాడు అని చెప్పబడటం లేదు, ఆయన వాటిని కేవలం విభజించాడు. కాబట్టి, వేదములను అపౌరుషేయములు అని కూడా అంటారు, అంటే ‘ఏ వ్యక్తి చేత సృష్టించబడినవి కావు.’ అవి ఆధ్యాత్మిక జ్ఞానమునకు పవిత్రమైన దోషరహితమైన ప్రమాణముగా గౌరవించబడుతాయి. భూతం భవ్యం భవిష్యం చ సర్వం వేదాత్ ప్రసిధ్యతి (మను స్మృతి 12.97) ‘ఏ ఆధ్యాత్మిక సూత్రమయినా అది వేద ప్రమాణముగా ఆమోదించబడాలి.’ వేదముల ఈ యొక్క జ్ఞానమును విశదీకరించటానికి, ఎంతో మంది ఋషులు గ్రంథాలను రచించారు మరియు అవి వేద ప్రమాణమునకు లోబడి ఉంటాయి కాబట్టి అవి వైదిక వాఙ్మయంలో భాగంగానే అనాదిగా పరిగణించబడ్డాయి. కొన్ని ముఖ్యమైన వైదిక గ్రంథాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి. ఇతిహాసాలు: ఇవి చారిత్రాత్మక గ్రంథాలు, ఇవి రెండు, రామాయణము మరియు మహాభారతము. భగవంతుని యొక్క రెండు ముఖ్యమైన అవతారముల గురించి ఉన్న చరిత్రలను ఇవి తెలియచెపుతాయి. రామాయణము, వాల్మీకి మహర్షిచే రచించబడినది; ఇది శ్రీ రామచంద్ర భగవానుని యొక్క లీలలను వివరిస్తుంది. ఆశ్చర్యముగా, శ్రీ రామచంద్రుడు తన లీలలను ప్రదర్శించక పూర్వమే, ఇది వాల్మీకిచే రచించబడినది. గొప్ప కవి అయిన ఈ ఋషికి దివ్య దృష్టి ప్రసాదించబడినది, దీనితో, శ్రీ రామచంద్రుడు ఈ భూలోకంపైకి వచ్చినప్పుడు చేసే లీలలను ఆయన చూడగలిగాడు. ఈ విధంగా ఆయన ఇరవై నాలుగు వేల మనోహరమైన సంస్కృత శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు. విభిన్న సామాజిక పాత్రలలో, అన్న/తమ్ముడు, కొడుకు, భార్య, రాజు, మరియు భార్యాభర్తలు మొదలగు వాటిలో మనం ఎలా నడుచుకోవాలో కూడా ఈ శ్లోకాలు మనకు ఉపదేశం ఇస్తాయి. రామాయణము ఎన్నో భారతీయ ప్రాంతీయ భాషల్లో రచించబడినది, దీనితో ఈ కావ్యం యొక్క ప్రజాదరణ మరింత పెరిగింది. వీటిల్లో అత్యంత ప్రజాదరణ పొందినది, హిందీ రామాయణము, 'రామచరిత్ మానస్'; ఇది శ్రీ రాముడి గొప్ప భక్తుడైన సంత్ తులసీదాస్‌చే రచించబడినది. మహాభారతము వేద వ్యాస మహర్షిచే రచించబడినది. అది లక్ష శ్లోకాలు కలిగున్నది మరియు ప్రపంచములో కెల్లా అతి పెద్ద కావ్యముగా పరిగణించబడుతున్నది. శ్రీ కృష్ణ భగవానుని యొక్క దివ్య లీలలు మహాభారతము యొక్క ముఖ్యమైన ఇతివృత్తం. మనుష్య జీవనానికి సంబంధించి ఉన్న వివిధ దశలలో చేయవలసిన వేర్వేరు ధర్మముల గురించి, మరియు భగవత్ భక్తికి సంబంధించి ఎంతో జ్ఞానాన్ని ఇది ప్రతిపాదిస్తున్నది. భగవద్గీత అనేది మహాభారతములో అంతర్గతంగా ఉన్న భాగము. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన హైందవ గ్రంథము ఎందుకంటే, శ్రీ కృష్ణ భగవానుడే స్వయముగా, అత్యంత మనోహరముగా వివరించిన ఆధ్యాత్మిక జ్ఞాన సారాంశము ఇందులో నిక్షిప్తమై ఉంది. ఇది ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదించబడినది. భగవద్గీత పై అసంఖ్యాకమైన వ్యాఖ్యానాలు కూడా రచించబడ్డాయి. పురాణాలు : పురాణములు పద్దెనిమిది, ఇవి వేద వ్యాసునిచే రచింపబడ్డాయి. వీటన్నిటిలో మొత్తం కలిపి నాలుగు లక్షల శ్లోకాలున్నాయి. ఇవి విభిన్న భగవత్ స్వరూపాల యొక్క దివ్య లీలలను మరియు ఆయన భక్తులను వివరిస్తాయి. పురాణములు తత్త్వ జ్ఞానముతో కూడా నిండి ఉంటాయి. అవి - జగత్తు యొక్క సృష్టి, దాని లయము, పునఃసృష్టి, మానవ జాతి చరిత్ర, దేవతల మరియు ఋషుల వంశానుచరితములను వివరిస్తాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది భాగవత పురాణము లేదా శ్రీమద్భాగవతము. ఇది వేద వ్యాసునిచే రచింపబడిన చిట్ట చివరి పురాణము. దానిలో, సర్వోన్నత ధర్మమైన, భగవంతుని పట్ల నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమను, వర్ణించబోతునట్టుగా ఆయన పేర్కొంటాడు. తత్త్వపరంగా భగవత్ గీత ఎక్కడ ముగుస్తుందో అక్కడ శ్రీమద్ భాగవతం ప్రారంభమౌతుంది. షడ్-దర్శన్ : వైదిక గ్రంథాలలో తదుపరి ప్రాముఖ్యత వీటికి ఉంది. హైందవ వేదాంతశాస్త్రములో ఒక్కొక్క ప్రత్యేకమైన విషయంపై ఆరుగురు ఋషులు ఆరు గ్రంథాలను రచించారు. ఇవి షడ్-దర్శన్ గా ప్రాచుర్యం పొందాయి, అంటే ఆరు తత్త్వ శాస్త్రాలు అని అర్థం. ఇవి: — మీమాంస: ఇది జైమిని మహర్షి చే రచించబడినది, ఇది కర్మ కాండ విధులను మరియు పూజాది కార్యాలను వివరిస్తుంది. — వేదాంత దర్శన్: ఇది మహర్షి వేదవ్యాసునిచే రచించబడినది, ఇది పరమ సత్యము యొక్క స్వభావాన్ని వివరిస్తుంది. — న్యాయ దర్శన్: ఇది గౌతమ మహర్షిచే రచించబడినది. ఇది జీవితమును మరియు పరమ సత్యమును అర్థం చేసుకోవటానికి ఒక తర్కబద్ధమైన పద్ధతిని ప్రతిపాదిస్తుంది. — వైశేషిక దర్శన్: ఇది కణాద మహర్షిచే రచించబడినది. విశ్వనిర్మాణ శాస్త్రమును మరియు సృష్టిని, దాని యొక్క మూలద్రవ్యముల పరంగా విశ్లేషిస్తుంది. — యోగ దర్శన్ : ఇది మహర్షి పతంజలిచే రచించబడినది. శారీరక భంగిమలతో మొదలుపెట్టి, ఇది భగవంతునితో ఏకమవ్వటానికి ఎనిమిది స్థాయిల మార్గమును వివరిస్తుంది. — సాంఖ్య దర్శన్ : ఇది కపిల మహర్షిచే రచించబడినది. భౌతిక శక్తి యొక్క ప్రాథమిక స్వరూపమైన ప్రకృతి నుండి విశ్వము జనించే విషయమును ఇది వివరిస్తుంది. ఈ పైన వివరించబడినవే కాక, హైందవ ధర్మంలో ఎన్నోవందల శాస్త్రాలు ఉన్నాయి. వాటన్నిటిని ఇక్కడ వివరించటం అసాధ్యం. వైదిక గ్రంథాలు అనేవి, భగవంతునిచే మరియు ఋషులచే, సమస్త మానవజాతి సంక్షేమానికి తెలియచేయబడిన విశాలమైన దివ్య జ్ఞాన భాండాగారాలు అని తెలుసుకుంటే సరిపోతుంది. ఈ యొక్క శాస్త్ర గ్రంథాలలో, బ్రహ్మ సూత్రములు (వేదాంత దర్శనము) అనేది - ఆత్మ, భౌతిక శరీరము మరియు భగవానుడు - వీటికి మధ్య ఉన్న వైవిధ్యాన్ని స్పష్టంగా తెలియచేయటంలో అత్యంత ప్రామాణికముగా పరిగణించబడుతుంది. అందుకే, శ్రీ కృష్ణుడు దీనిని ప్రత్యేకంగా ఈ పై శ్లోకంలో పేర్కొంటున్నాడు. ‘వేద్’ అంటే వేదములు మరియు ‘అంత్’ అంటే ‘ముగింపు’ అని. కావున, ‘వేదాంతము’ అంటే ‘వైదిక జ్ఞానమునకు ముగింపు’ అని అర్థం. వేదాంత దర్శనమును వేద వ్యాస ఋషి రచించినా, చాలా మంది పండితులు దానిని తత్త్వ సిద్ధాంతానికి ప్రామాణికంగా పరిగణించి, ఆత్మ మరియు భగవంతుని తత్త్వములపై తమ యొక్క విలక్షణమైన అభిప్రాయాన్ని స్థాపించటానికి దానిపై వ్యాఖ్యానాలు రచించారు. వేదాంత దర్శన్ పై జగద్గురు శంకరాచార్య గారి భాష్యాన్ని 'శారీరక భాష్యము' అంటారు; ఇది అద్వైత వాద సిద్ధాంతానికి పునాది వేస్తున్నది. ఆయన శిష్యులు ఎంతో మంది, వాచస్పతి మరియు పద్మపాదుడు వంటి వారు ఆయన భాష్యాన్ని మరింత విస్తారంగా వివరించారు. జగద్గురు నింబర్కాచార్య గారు 'వేదాంత పారిజాత సౌరభము' అనే గ్రంథాన్ని రచించారు; అది ద్వైత-అద్వైత వాదమును వివరిస్తుంది. జగద్గురు రామానుజాచార్య గారి వ్యాఖ్యానాన్ని ‘శ్రీ భాష్యము’ అంటారు; ఇది విశిష్ట-అద్వైత వాద సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నది. జగద్గురు మధ్వాచార్య గారి వ్యాఖ్యానాన్ని 'బ్రహ్మ సూత్ర భాష్యము' అంటారు; ఇది ద్వైత వాద సిధ్ధాంతానికి మూలాధారము. వల్లభాచార్య మహాప్రభు 'అణు భాష్యము' ను రచించారు, దీనిలో వారు శుధ్ధఅద్వైత వాద తత్త్వమును ప్రతిపాదించారు. వీరే కాక, మిగతా ప్రఖ్యాత వ్యాఖ్యాతలైన - భట భాస్కర, యాదవ ప్రకాశ, కేశవ, నీలకంఠ, విజ్ఞానభిక్షు, మరియు బలదేవ విద్యాభూషణుడు కూడా ఉన్నారు. చైతన్య మహాప్రభు, తానే స్వయముగా ఒక మహోన్నత వేద పండితుడైనా, తాను వేదాంత దర్శనం పై వ్యాఖ్యానం రచించలేదు. ఆయన అభిప్రాయంలో, వేదాంత దర్శనం వ్రాసిన వేద వ్యాసుడే స్వయముగా, తన యొక్క చిట్టచివరి పురాణము శ్రీమద్ భాగవతమే, దానిపై ఒక చక్కటి సంపూర్ణ వ్యాఖ్యానము, అని అన్నాడు. అర్థోయం బ్రహ్మసూత్రాణమ్ సర్వోపనిషదామపి ‘శ్రీమద్ భాగవతము అనేది వేదాంత దర్శనము మరియు సర్వ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మరియు అర్థాన్ని వివరిస్తుంది.’ కాబట్టి, వేద వ్యాసునిపై ఉన్న అపారమైన గౌరవం కొద్దీ, చైతన్య మహాప్రభు, వేదాంత దర్శనం పై ఇంకొక భాష్యమును రచించటం అవసరం లేదు అని భావించాడు.
మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ । ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః ।। 6 ।।
6
13
https://www.holy-bhagava…udio/013_006.mp3
మహా-భూతాని — (పంచ) మహా భూతములు; అహంకారః — అహంకారము; బుద్ధిః — బుద్ధి; అవ్యక్తమ్ — ఆవ్యక్తమైన మూల ప్రకృతి; ఏవ — నిజముగా; చ — మరియు; ఇంద్రియాణి — ఇంద్రియములు; దశ-ఏకం — పదకొండు; చ — మరియు; పంచ — ఐదు; చ — మరియు; ఇంద్రియ-గో-చరాః — (ఐదు) పంచేద్రియముల గ్రాహ్య విషయములు.
BG 13.6: పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, పదకొండు ఇంద్రియములు (ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు), మరియు ఐదు ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము కూడి ఉన్నది.
క్షేత్రములో ఉండే ఇరవైనాలుగు అంశములు ఏమిటంటే: పంచ-మహాభూతములు (భూమి, నీరు, అగ్ని, వాయువు, మరియు ఆకాశము), పంచ తన్మాత్రలు (ఐదు ఇంద్రియ గ్రాహ్యములు - రుచి, స్పర్శ, వాసన, దృష్టి, మరియు శబ్దము), ఐదు కర్మేంద్రియములు (కంఠము, చేతులు, కాళ్ళు, జననాంగములు, మరియు గుదము), ఐదు జ్ఞానేంద్రియములు (చెవులు, కళ్ళు, నాలుక, చర్మము, మరియు ముక్కు), మనస్సు, బుద్ధి, అహంకారము, మరియు ప్రకృతి (భౌతిక శక్తి యొక్క ఆదిమ స్వరూపము). శ్రీ కృష్ణుడు దశైకం (పది+ఒకటి) అన్న పదాన్ని పదకొండు ఇంద్రియములను సూచించటానికి ఉపయోగిస్తున్నాడు. వీటిలో, ఐదు జ్ఞానేద్రియములు, ఐదు కర్మేంద్రియములు లతో పాటు మనస్సుని కూడా కలిపి చెప్పాడు. ఇంతకు క్రితం 10.22వ శ్లోకంలో, ఇంద్రియములలో తానే మనస్సుని అని కృష్ణుడు చెప్పి ఉన్నాడు. ఐదు ఇంద్రియ గ్రాహ్యములు బాహ్యమైనవి అయినా, వాటిని క్షేత్రములో కలిపి ఎందుకు చెప్పాడు అని ఎవరైనా అనుకోవచ్చు. ఇది ఎందుకంటే, మనస్సు ఇంద్రియ విషయములపై చింతన చేస్తుంటుంది, మరియు ఈ ఇంద్రియ గ్రాహ్యములు సూక్ష్మ రూపములో మనస్సులో ఉంటాయి. అందుకే, మనం నిద్ర పోతున్నప్పుడు, మనస్సుతో కలలు కంటుంటే, మన యొక్క స్థూల ఇంద్రియములు మంచం పైనే ఉన్నా, ఆ కలలో మనము చూస్తాము, వింటాము, అనుభూతి చెందుతాము, రుచి చూస్తాము మరియు వాసన కూడా చూస్తాము. దీని వలన మనకు అర్థం అయ్యేది ఏమిటంటే, స్థూల ఇంద్రియ విషయములు సూక్ష్మ రూపంలో మనస్సులో కూడా ఉంటాయి అని. ఆత్మ యొక్క సమస్త క్షేత్రమును ఇక్కడ విశదీకరిస్తున్నాడు కాబట్టి, శ్రీ కృష్ణుడు వాటిని ఇక్కడ పేర్కొన్నాడు. వేరే ఇతర కొన్ని గ్రంథాలు, శరీరమును వివరించటంలో, ఐదు ఇంద్రియ గ్రాహ్యములను కాకుండా బదులుగా, పంచ ప్రాణములను పేర్కొంటాయి. దీనిని కేవలం వర్గీకరణ విషయంగా మాత్రమే చూడాలి కానీ తత్త్వ విరుద్ధత పరంగా చూడకూడదు. ఇదే జ్ఞానము కోశముల పరంగా కూడా వివరించబడినది. ఈ శరీర క్షేత్రములో, లోనున్న ఆత్మను ఆవరించి ఐదు కోశములు ఉంటాయి: అన్నమయ కోశము. ఇది పంచ మహా భూతములతో (భూమి, నీరు, అగ్ని,వాయువు మరియు ఆకాశము) తయారైన స్థూల కోశము. ప్రాణమయ కోశము. ఇది ఐదు ప్రాణ వాయువులతో (ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన) ఉన్న ప్రాణ-వాయు కోశము. మనోమయ కోశము. ఇది మానసిక కోశము, ఇది మనస్సు మరియు ఐదు కర్మేంద్రియములను కలిగి ఉంటుంది (కంఠము, చేతులు, కాళ్ళు, జననాంగాలు, మరియు గుదము). విజ్ఞానమయ కోశము. ఇది బుద్ధికి సంబంధించిన కోశము, దీనిలో బుద్ధి, మరియు ఐదు జ్ఞానేంద్రియములు (చెవులు, కళ్ళు, నాలుక, చర్మము, మరియు ముక్కు) ఉంటాయి. ఆనందమయ కోశము. ఈ ఆనందమయ కోశములో, శరీరము-మనస్సు-బుద్ధి అమరిక యొక్క స్వల్ప-ఆనందము తో మనలను అనుసంధానం చేసే అహంకారము ఉంటుంది.
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః । ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ।। 7 ।।
7
13
https://www.holy-bhagava…udio/013_007.mp3
ఇచ్ఛా — కోరిక; ద్వేషః — ద్వేషము; సుఖం — సుఖము; దుఃఖం — దుఃఖము; సంఘాతః — ఇవన్నీ కలిపి; చేతనా — చైతన్యము; ధృతిః — మనశ్శక్తి; ఏతత్ — ఇవి అన్ని; క్షేత్రం — క్షేత్రము; సమాసేన — తో కూడి; స-వికారమ్ — మార్పులతో; ఉదాహృతమ్ — చెప్పబడినవి.
BG 13.7: వాంఛ మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము — ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు (వికారములు) అనబడుతాయి.
శ్రీ కృష్ణుడు ఇప్పుడు క్షేత్రము యొక్క గుణములను మరియు దాని యొక్క వికారములను (మార్పులను) ఇక వివరిస్తున్నాడు. శరీరము. ఈ దేహము అనేది క్షేత్రము యొక్క అంతర్భాగమే, కానీ దానిలో ఇంకా చాలా ఉంటాయి. మరణించే వరకు శరీరము ఆరు మార్పులకు లోనవుతుంది — అస్తి (ఒక ఉనికి రావటము), జాయతే (పుట్టుక), వర్ధతే (పెరుగుదల), విపరిణమతే (పునరుత్పత్తి), అపక్షీయతే (వయస్సుతో పాటు శుష్కించి పోవుట), వినశ్యతి (మరణించుట). భౌతిక జగత్తు యందు కానీ లేదా భగవంతుని యందు కానీ, ఆత్మ నిర్దేశించిన రీతిలో, ఆత్మకు ఆనంద అన్వేషణ లో శరీరము సహకరిస్తుంది. చైతన్యము. ఆత్మలో ఉండే ప్రాణ శక్తియే ఈ చైతన్యము, మరియు ఆత్మ ఉన్నంత కాలము, అది ఉన్న శరీరానికి చైతన్యమును ఆపాదిస్తుంది. ఇది ఎలాగంటే, అగ్నికి వేడిమిని కలిగించే సామర్థ్యము ఉన్నది, మరియు దానిలో ఇనప చువ్వని పెడితే , ఆ చువ్వ కూడా, అగ్ని నుండి అందిన వేడిమికి, ఎర్రగా వేడిగా అయిపోతుంది. అదే విధముగా, ఆత్మ అనేది శరీరానికి చైతన్యమును కలిగించి, ప్రాణమును కలిగిఉన్న దానిలా చేస్తుంది. శ్రీ కృష్ణుడు అందుకే చైతన్యమును క్షేత్రము యొక్క లక్షణముగా పేర్కొన్నాడు. మనోబలము. ఇది శరీరములోని వేరువేరు అంశములను చురుకుగా మరియు ఒక దిశగా ఏకాగ్రతతో ఉంచే దృఢ సంకల్పము. ఆత్మ తన క్షేత్రము ద్వారా తన యొక్క లక్ష్యమును సాధించటానికి ఈ సంకల్పమే కారణము. సంకల్పబలం అనేది, ఆత్మయొక్క శక్తితో ప్రేరేపితమైన బుద్ధి యొక్క లక్షణము. సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణముల యొక్క ప్రభావముచే సంకల్పంలో జరిగే మార్పులు 18.33వ శ్లోకం నుండి 18.35వ శ్లోకం వరకు వివరించబడ్డాయి. కోరిక (ఇచ్ఛ). ఇది మనోబుద్ధుల ఒక వ్యవహారము, ఇది ఒక వస్తువును లేదా పరిస్థితిని లేదా ఒక వ్యక్తిని, లేదా మరోదాన్ని పొందాలనే తపనను సృష్టిస్తుంది. శరీరమును గురించి వివరించేటప్పుడు, కోరిక అనేదాన్ని మనము చాలా సామాన్యమైనదిగా తీసుకుంటాము, కానీ ఒక్కసారి ఊహించండి, కోరిక అనేది లేకపోతే జీవితం ఎలా ఉండి ఉండేదో! కాబట్టి, ఈ క్షేత్రమును రూపకల్పన చేసి, దానియందే కోరికను కూడా ఉంచిన పరమేశ్వరుడు, సహజంగానే కోరిక గురించి ప్రత్యేకంగా పేర్కొంటాడు. బుద్ధి అనేది ఒక వస్తువు యొక్క వాంఛనీయతను విశ్లేషిస్తుంది, మరియు మనస్సు దానిపై కోరికను పెంపొందించుకుంటుంది. వ్యక్తికి ఆత్మ-జ్ఞానోదయమైనప్పుడు, సమస్త భౌతిక ప్రాపంచిక కోరికలు నశించిపోతాయి, మరియు పరిశుద్ధమైన మనస్సు భగవంతునికై కోరికను పెంపొందించుకుంటుంది. భౌతిక కోరికలు బంధనమునకు కారణము మరియు ఆధ్యాత్మిక కోరికలు మోక్షమునకు దారి తీస్తాయి. ద్వేషం. ఇది ప్రతికూల వస్తువుల, వ్యక్తుల, మరియు పరిస్థితుల పట్ల వ్యతిరేకతను సృష్టించే మనోబుద్దుల స్థితి, వాటిని తప్పించటానికి ప్రయత్నిస్తుంది. సంతోషము. ఇది అనుకూల పరిస్థితుల వల్ల మరియు కోరికలు తీరటం వలన మనస్సులో కలిగే ఒక సుఖానుభూతి. మనస్సు సంతోష భావనను అనుభూతి చెందటం వలన, దానితో అనుసంధానం అవటంచే ఆత్మ కూడా అదే భావన పొందుతుంది. కానీ, భౌతిక ప్రాపంచిక సుఖసంతోషాలు, ఆత్మ యొక్క తపనను తీర్చలేవు, భగవంతుని యొక్క అనంతమైన దివ్య ఆనందాన్ని పొందే వరకూ అది అసంతృప్తి తోనే ఉంటుంది. దుఃఖము. ఇది ప్రతికూల పరిస్థితుల వలన మనస్సులో కలిగే బాధ. జ్ఞానమును పెంపొందించుకోవటానికి, తద్వారా మానవ దేహ క్షేత్రము యొక్క ప్రయోజనాన్ని సిద్దింపచేసుకోవటానికి అవసరమయ్యే సుగుణములు మరియు లక్షణములను ఇప్పుడు ఇక తదుపరి శ్రీ కృష్ణుడు వివరించబోతున్నాడు.
అమానిత్వమదంభిత్వమ్ అహింసా క్షాంతిరార్జవమ్ । ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ।। 8 ।। ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ । జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ ।। 9 ।। అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు । నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్టానిష్టోపపత్తిషు ।। 10 ।। మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ । వివిక్తదేశసేవిత్వమ్ అరతిర్జనసంసది ।। 11 ।। అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ । ఏతద్ జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతోఽన్యథా ।। 12 ।।
8
13
https://www.holy-bhagava…/013_008-012.mp3
అమానిత్వం — నమ్రత; అదంభిత్వమ్ — దంభము (కృత్తిమ బుద్ధి) లేకుండా; అహింసా — అహింస; క్షాంతిః — క్షమాగుణము; ఆర్జవమ్ — నిరాడంబరత/సరళత; ఆచార్య-ఉపాసనం — గురు సేవ; శౌచం — శరీర, మనస్సుల యొక్క శుద్ధి; స్థైర్యం — స్థిరత్వము; ఆత్మ-వినిగ్రహః — ఆత్మనిగ్రహము; ఇంద్రియ-అర్థేషు — ఇంద్రియ వస్తువిషయముల పట్ల; వైరాగ్యమ్ — వైరాగ్యము; అనహంకారః — అహంకార రహితముగా; ఏవ చ — మరియు ఇంకా; జన్మ — పుట్టుట; మృత్యు — మరణము; జరా — ముసలితనము; వ్యాధి — వ్యాధి; దుఃఖ — చెడు; దోష — దోషములు; అనుదర్శనమ్ — తెలిసికొనుట (అనుభూతి); అసక్తిః — ఆసక్తి లేకుండా; అనభిష్వంగః — లాలస/తృష్ణ లేకుండా; పుత్ర — పిల్లలు; దార — భార్య (భర్త); గృహ-ఆదిషు — ఇల్లు మొదలగునవి; నిత్యం — ఎల్లప్పుడూ; చ — మరియు; సమ-చిత్తత్వమ్ — సమ చిత్తముతో ఉండుట; ఇష్ట — ఇష్టమైనవి; అనిష్ట — ఇష్టం లేనివి; ఉపపత్తిషు — వాటి ప్రాప్తి చే; మయి — నా పట్ల; చ — మరియు; అనన్య-యోగేన — అనన్య చిత్తముతో ఏకమై ఉండి; భక్తిః — భక్తి; అవ్యభిచారిణీ — నిశ్చలమైన; వివిక్త — ఏకాంత; దేశ — ప్రదేశములు; సేవిత్వమ్ — పట్ల మొగ్గు చూపి; అరతిః — విముఖత; జన-సంసది — ప్రాపంచిక విషయాసక్తులైన సమాజం పట్ల; ఆధ్యాత్మ — ఆధ్యాత్మిక; జ్ఞాన — జ్ఞానము; నిత్యత్వం — ఎల్లప్పుడూ ఉండటము; తత్త్వ-జ్ఞాన — ఆధ్యాత్మిక సిద్ధాంత జ్ఞానము; అర్థ — కోసము; దర్శనమ్ — వేదాంతశాస్త్రము; ఏతద్ — ఇవి అన్ని; జ్ఞాన — జ్ఞానము; ఇతి — ఈ విధంగా; ప్రోక్తమ్ — చెప్పబడినవి; అజ్ఞానం — అజ్ఞానము; యత్ — ఏదైతే; అతః — దీనికి; అన్యథా — విరుద్ధమైన.
BG 13.8-12: నమ్రత; దంభము (కృత్తిమ బుద్ధి) లేకుండా ఉండుట; అహింస; క్షమా గుణము; సరళత; గురు సేవ; శరీర-మనస్సుల పరిశుద్ధత; నిశ్చల బుద్ధి; ఆత్మ-నిగ్రహము; ఇంద్రియభోగ వస్తువిషయములపై అనాసక్తి; అహంకారము లేకుండుట; జన్మ, మృత్యు, జరా, వ్యాధుల దురవస్థను గుర్తుచేసుకోవటం; మమకారరాహిత్యం; భార్య(భర్త), పిల్లలు, ఇల్లు వంటి వాటిని అంటుకొని (యావ) లేకుండా ఉండుట; జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట; నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట; ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి; ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసం; మరియు పరమ సత్యముకై తత్త్వాన్వేషణ - ఇవన్నిటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను, మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానము అని అంటాను.
క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడిని గురించి తెలుసుకునే జ్ఞానము కేవలం ఏదో మానసిక కసరత్తు కాదు. ప్రవర్తనలో మార్పు లేకుండానే, మామూలు పుస్తక జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, కానీ శ్రీ కృష్ణుడు చెప్పే ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో అట్లా కాకుండా, దానికి హృదయంలో పవిత్రత అవసరము. (ఇక్కడ, హృదయము అంటే శరీరంలో ఉన్న అవయవం కాదు. మనోబుద్ధులతో కూడిన అంతఃకరణముని కూడా కొన్నిసార్లు హృదయము అంటారు). జీవితమును పవిత్రం చేసి మరియు దానిని జ్ఞాన వెలుగుతో ప్రకాశింప చేసే - గుణములు, అలవాట్లు, ప్రవర్తన మరియు దృక్పథాలని ఈ ఐదు శ్లోకాలు వివరిస్తున్నాయి. నమ్రత: మనం ఎప్పుడైతే మన క్షేత్రము యొక్క గుణముల పట్ల గర్వముతో ఉంటామో, అంటే అందము, తెలివి, నైపుణ్యము, సామర్థ్యము వంటి వాటి మీద, మనకు ఇవన్నీ ఇచ్చినది ఆ భగవంతుడే అని మర్చిపోతాము. కాబట్టి గర్వము అనేది మన మనస్సుని భగవంతుని నుండి దూరముగా చేస్తుంది. ఆత్మ జ్ఞాన పథంలో, గర్వము అనేది ఒక పెద్ద అవరోధము ఎందుకంటే అది మనోబుద్ధుల గుణములను ప్రభావితం చేసి మొత్తం క్షేత్రమును మలినపరుస్తుంది. కపటత్వం/మిథ్యాచారం లేకుండా ఉండుట: ఓ కపటి, కృత్తిమమైన బాహ్య వ్యక్తిత్వమును పెంపొందించుకుంటాడు. వ్యక్తి అంతర్గతంగా దోషపూరితముగా ఉంటాడు కానీ, బాహ్యంగా మంచి గుణములు ఉన్నట్టు ఒక వేషం సృష్టిస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ, బాహ్యంగా ప్రదర్శించే మంచి గుణములు, పైపైకే ఉంటాయి మరియు ఒక డొల్ల మాత్రమే. అహింస: జ్ఞానమును పెంపొందించుకోవాలంటే సమస్త ప్రాణుల పట్ల గౌరవం ఉండటం అవసరం. దీనికి అహింస యొక్క అభ్యాసం ఆవశ్యకం. అందుకే శాస్త్రాలు ఇలా పేర్కొంటున్నాయి: ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్; ‘ఇతరుల యొక్క ఏ ప్రవర్తన నీకు నచ్చదో, నీవు వారితో ఆ విధముగా ప్రవర్తించకుండా ఉండుము.’ క్షమా గుణము: మనకు అపకారం చేసిన వారి పట్ల కూడా మనము దుర్భావన చేయకపోవటమే క్షమా గుణము. నిజానికి, దుర్భావన మనస్సులో ఉంచుకోవటం, ఎదుటి వాడి కన్నా మనకే ఎక్కువ హాని చేస్తుంది. క్షమా గుణము అభ్యాసం చేయటంచే, వివేకము కలిగిన వ్యక్తి, మనస్సులోని చెడుని అంతా విడిచిపెట్టి మనస్సుని పరిశుద్ధి చేసుకుంటాడు. సరళత: ఇది ఆలోచనలో (మనసా), వాక్కులో (వాచా) మరియు చేతలలో (కర్మణా) కపటత లేకుండా ముక్కుసూటిగా ఉండటము. ఆలోచనా సరళత అంటే, మోసం, ఈర్ష్య, వక్రత వంటి నకారాత్మక తలంపులు లేకుండా ఉండటము. వాక్కులో సరళత అంటే వెక్కిరింత, దూషణ, చాడీలు చెప్పటం, అతిశయోక్తి లేకుండా ఉండటం. చేతలలో సరళత అంటే, సింపుల్‌గా జీవించటం, ప్రవర్తనలో ఋజుత్వము, మొదలైనవి. గురు సేవ: ఆధ్యాత్మిక జ్ఞానము అనేది గురువు ద్వారా లభిస్తుంది. ఈ దివ్య జ్ఞానము అందుకోవాలంటే, శిష్యుడికి గురువు గారి పట్ల అంకితభావము మరియు భక్తి ఉండాలి. గురువుకు సేవ చేయటం ద్వారా, శిష్యుడికి వినయము మరియు నిబద్ధత పెరుగుతాయి; దీనితో గురువు తన శిష్యుడికి జ్ఞానమును ప్రసాదించటానికి వీలవుతుంది. శ్రీ కృష్ణుడు అర్జునుడికి 4.34వ శ్లోకంలో ఇలా వివరించాడు: ‘ఆధ్యాత్మిక గురువు గారి దగ్గరికి వెళ్లి సత్యమును గురించి తెలుసుకొనుము. వినయము/మర్యాదతో ఆయనను అడుగుము మరియు ఆయనకి సేవ చేయుము. అటువంటి జ్ఞానోదయమయిన మహాత్ముడు, తాను స్వయముగా సత్యమును తెలుసుకున్నాడు కాబట్టి, నీకు ఆ జ్ఞానమును ప్రసాదించగలడు.’ శారీరక మరియు మానసిక శౌచము: శుభ్రత అనేది అంతర్గతంగా మరియు బాహ్యంగా రెంటిలో ఉండాలి. శాండిల్య ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: శౌచం నామ ద్వివిధం-బాహ్యమాంతరం చేతి (1.1) ‘పరిశుభ్రత రెండు రకాలుగా ఉంటుంది—అంతర్గతమైనది మరియు బాహ్యమైనది.’ బాహ్యమైన పరిశుభ్రత మంచి ఆరోగ్యము నిలుపుకోటానికి, క్రమశిక్షణ పెంచుకోవటానికి మరియు మనస్సును నిర్మలంగా ఉంచుకోవటానికి దోహదపడుతుంది, కానీ మానసిక స్వచ్ఛత కూడా ఇంకా ఎక్కువ ముఖ్యమైనది, మనస్సుని పరిపూర్ణ పవిత్రుడైన భగవంతునిపై నిలపటంద్వారా దీనిని సాధించవచ్చు. జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు: మాయాధిన్ మలీన్ మన, హై అనాది కాలీన్, హరి విరహానల ధోయ జల, కరు నిర్మల బని దీన్ (భక్తి శతకము 79వ శ్లోకం) ‘ఈ ప్రాకృతిక మనస్సు అనంతమైన జన్మల నుండి మలినమై ఉన్నది. అత్యంత వినయవిధేయత వినమ్రతలను అభ్యాసం చేస్తూ, భగవంతుడిని పొందాలనే తపన ద్వారా దానిని పవిత్రం చేసుకొనుము.’ స్థిరబుద్ధి: ఆత్మ-జ్ఞానము మరియు భగవత్ ప్రాప్తి అనేవి ఒక్క రోజులో సాధించగలిగే లక్ష్యములు కావు. లక్ష్యం సాధించే వరకూ అదే మార్గంలో ఉండే దృఢ సంకల్పమే ఈ స్థిర బుద్ధి. శాస్త్రములు ఇలా పేర్కొన్నాయి: చరైవైతే చరైవతే , చరన్ వై మధు విందతి, ‘ముందుకు సాగుతూనే ఉండు, ముందుకు సాగుతూనే ఉండు. ఎవరైతే పట్టువదలకుండా సాగుతూ ఉంటారో వారికి చివరికి మధురమైన తేనె లభిస్తుంది.’ ఆత్మ-నిగ్రహము: మనోబుద్దులను పాడు చేసే ప్రాపంచిక భోగముల వెనుక పడి పరిగెత్తకుండా, మనస్సు-ఇంద్రియములను నిగ్రహించటమే ఈ ఆత్మ-నిగ్రహము. విలాసభోగములచే మన ప్రాణశక్తి దుర్వ్యయమై పోకుండా ఈ ఆత్మ నిగ్రహము కాపాడుతుంది. ఇంద్రియ వస్తు విషయములపై అనాసక్తి: ఇది, పైన ఉదహరించబడినటువంటి, బలవంతంగా మనల్ని మనము నిగ్రహించుకునే ఆత్మ-నిగ్రహము కంటే ఒక మెట్టు ఎక్కువది. అనాసక్తి అంటే, భగవత్ ప్రాప్తి పథంలో అడ్డంకిగా ఉన్న ఇంద్రియసుఖాల పట్ల అభిరుచి లేకపోవటం. అహంకార రహితముగా ఉండుట: అహంకారము అంటే ‘నేను’, ‘నాకు’, మరియు ‘నాది’ అనే అంతర్గత స్పృహ. ఇది అవిద్య/అజ్ఞానమునకు సూచిక, ఎందుకంటే అది, మనలను మనం ఈ శరీరమే అని భావించే, శారీరక స్థాయి నుండి జనిస్తుంది. దీనినే 'అహం చేతనా' అని కూడా అంటారు. (నేను అన్న స్పృహ నుండి జనించే గర్వము). అందరూ మహాత్ములూ నొక్కివక్కాణించి చెప్పేదేమిటంటే, భగవంతుడిని మన హృదయము లోనికి ఆహ్వానించాలంటే, మొదట మనలో ఉన్న గర్వమును నిర్మూలించుకోవాలి. జబ మై థా తబ హరి నహిఁ, అబ్ హరి హై, మై నాహీఁ ప్రేమ్ గలీ అతి సంకరీ, యా మే ద్వే న సమాహీ (సంత్ కబీర్) “‘నేను’ అన్న భావన ఉన్నప్పుడు, భగవంతుడు అక్కడ ఉండడు; ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, 'నేను' లేను. దివ్య ప్రేమ మార్గము చాలా ఇరుకైనది; దానిలో 'నేను' మరియు 'భగవంతుడు' ఇద్దరూ పట్టరు.” జ్ఞాన యోగ మార్గములో మరియు అష్టాంగ యోగ మార్గములో, ఈ యొక్క 'అహం చేతనా' భావన ను వదిలించుకోవటానికి విస్తృతమైన సాధనా ప్రక్రియలు ఉన్నాయి. కానీ, భక్తి యోగ మార్గములో, అది చాలా సునాయాసముగా వదిలిపోతుంది. మన 'అహం' అన్న పదానికి ముందర 'దాస' (సేవకుడు) అన్న పదం తగిలిస్తాము, దానితో అది దాసోహం (నేను భగవంతుడి సేవకుడిని) గా మారిపోతుంది. ఇక ఇప్పుడు 'నేను' ఏమాత్రం హానికారకం కాదు మరియు ఆత్మ-దృక్పథం అనేది భగవత్-దృక్పథంగా మారిపోతుంది. జన్మ, మృత్యు, జరా, వ్యాధుల యొక్క దురవస్థను సదా గుర్తుంచుకోవటం: ఒకవేళ బుద్ధికి - భౌతిక ప్రగతి లేదా ఆధ్యాత్మిక పురోగతి లలో ఏది ఎక్కువ ముఖ్యమో అనే అయోమయంలో ఉంటే - అప్పుడు దానికి ఆత్మ జ్ఞానమును సంపాదించుకునేందుకు కావలసిన దృఢ సంకల్పమును పెంపొందించుకోవడం కష్టముగా ఉంటుంది. కానీ బుద్ధికి ఈ ప్రపంచం యొక్క వికృతం పట్ల నిశ్చయం కలిగినప్పుడు, అది తన సంకల్పంలో దృఢంగా ఉంటుంది. ఈ దృఢ సంకల్పం పొందటానికి, ఈ భౌతిక లోకంలో, మన ఈ జీవితంలో విడదీయలేనివిగా ఉండే కష్టాలు/దుఃఖాలు/బాధలపై నిరంతర చింతన చేస్తుండాలి. బుద్ధుడిని ఆధ్యాత్మిక పథంలో పెట్టింది ఈ చింతనే. ఆయన ఒక రోగిని చూసి, ‘ఈ ప్రపంచంలో వ్యాధులు అనేవి ఉన్నాయి నేను కూడా ఏదో ఒకరోజు రోగగ్రస్త మవ్వాల్సిందే.’ అని అనుకున్నాడు. తరువాత ఒక వృద్ధుడిని చూసి, ‘ఇక్కడ వృద్ధాప్యం కూడా ఉంది. అంటే నేను కూడా ఏదోకరోజు ముసలివాడిని అయిపోవాలి’ అని అనుకున్నాడు. ఆ తరువాత, ఒక చని పోయిన వ్యక్తిని చూసాడు , ‘ఇది కూడా జీవనంలో భాగమే, అంటే నేను కూడా ఒక రోజు చనిపోవాల్సిందే’ అని తెలుసుకున్నాడు. బుద్ధుడి యొక్క బుద్ధి ఎంత గ్రహణశక్తిగలది అంటే, ఒక్కసారి వీటిని చూసినంతనే అవి ఆయనను ఈ ప్రపంచాన్ని త్యజించేలా చేసాయి. మనకు ఇంకా అంత కుశలత కలిగిన బుద్ధి లేదు కాబట్టి, ప్రపంచం యొక్క వికృతం అవగతం అయ్యే వరకూ, వీటి గురించి నిరంతర చింతన చేస్తూనే ఉండాలి. మమకార-ఆసక్తి రహితంగా ఉండుట: అంటే, ప్రాపంచిక జగత్తు పట్ల అనాసక్తితో ఉండటం. మనకు ఉన్నది ఒక్క మనస్సే మరియు మనం ఆధ్యాత్మిక లక్ష్యములను సాధించాలంటే మనము దాన్ని భౌతిక వస్తువిషయముల నుండి దూరంచేయాలి. సాధకుడు, ప్రాపంచిక మమకార ఆసక్తుల స్థానంలో, వాటికి బదులుగా వాటి స్థానంలో భగవంతుని పట్ల ప్రేమ మరియు మమకారమును స్థాపించుకుంటాడు. భార్య (భర్త), పిల్లలు, ఇల్లు వంటి వాటినే పట్టుకుని ఉండకపోవటం: మనస్సుకి ఈ విషయముల పట్ల సునాయాసముగా మమకారానుబంధము ఏర్పడిపోతుంది. శారీరక స్పృహలో, వ్యక్తి అప్రయత్నంగానే కుటుంబసభ్యులను, ఇంటిని – ‘నావారు, నాది’ అని అనుకుంటాడు. ఇవన్నీ మనసులో తరచుగా తిరుగుతూనే ఉంటాయి మరియు వీటిపై ఆసక్తి మనస్సుని భౌతిక దృక్పథంలోనే కట్టివేస్తాయి. ఆసక్తి/మమకారం అనేది - కుటుంబ సభ్యులు ఇలాగే ఉండాలి, ఫలానా విధంగానే ప్రవర్తించాలి అన్న ఆపేక్షను/కోరిక కలుగచేస్తుంది, మరియు ఈ ఆశలు తీరనప్పుడు, అది మానసిక క్షోభకు దారి తీస్తుంది. మరియు అనివార్యముగా, కుటుంబ సభ్యుల నుండి దూరమవ్వటం కూడా సంభవిస్తుంది, తాత్కాలికంగా వారు వేరే చోటికి వెళ్ళినప్పుడు గానీ, లేదా శాశ్వతంగా, వారు చనిపోయినప్పుడైనా. ఇవన్నీ అనుభవాలు మరియు ఆయా భయాలు మనస్సుపై చాలా భారమును కలిగించి, దానిని భగవంతుని నుండి దూరంగా తీసుకువెళతాయి. కాబట్టి మనము నిత్య శాశ్వతమైన ఆనందాన్ని అన్వేషిస్తుంటే, మనం భార్య (భర్త), పిల్లలు, ఇల్లు - వీటితో వ్యవహరించేటప్పుడు, మన మనస్సు వాటిల్లో చిక్కుకొని పోకుండా ఉండేట్టు, ప్రాజ్ఞతతో ఉండాలి. ఒక నర్సు హాస్పిటల్లో తన విధి నిర్వర్తించినట్టు, లేదా, ఒక టీచర్ తన విద్యార్థుల పట్ల తన విధిని నిర్వర్తించినట్లు, మమకారాసక్తి లేకుండా, వారి పట్ల మన ధర్మ (కర్తవ్యము) నిర్వర్తించాలి. అనుకూల లేదా ప్రతికూల పరిస్థితుల పట్ల సమ-భావనతో ఉండుట: పగలు-రాత్రి లాగా సుఖదాయకమైన లేదా కష్టదాయకమైన పరిస్థితులు పిలవకుండానే వస్తుంటాయి. అదే జీవితం. ఈ ద్వంద్వములకు అతీతముగా ఎదగాలంటే, మనయొక్క ఆధ్యాత్మిక బలాన్ని, ప్రపంచం పట్ల వైరాగ్యం ద్వారా పెంచుకోవాలి. జీవితంలో వ్యతిరేక పరిస్థితులలో కూడా చలించకుండా ఉండే సామర్థ్యాన్ని పెంచుకోవాలి మరియు విజయం ప్రాప్తించినపుడు ఏదో సాధించామని గర్వపడే భావనని కూడా విడిచిపెట్టాలి. నా (కృష్ణుడి) పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి: వైరాగ్యం అంటే కేవలం మనస్సు తప్పుడు దిశలో వెళ్ళటం లేదు అని. కానీ జీవితం అంటే ప్రతికూల పరిస్థితులను కేవలం నివారించటమే కాదు. శ్రేయస్కర విషయాలలో కూడా నిమగ్నమవ్వటమే జీవితం. నిజంగా కోరతగిన జీవిత లక్ష్యము అంటే దాన్ని భగవంతుని యొక్క చరణారవిందముల వద్ద అంకితం చేయటమే. కాబట్టి, శ్రీ కృష్ణుడు దానిని ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొంటున్నాడు. ఏకాంత ప్రదేశాల యందు ఇష్టత: ప్రాపంచిక జనుల్లా కాకుండా, భక్తులు, ఒంటరితనాన్ని అధిగమించటానికి ఇతరుల సాంగత్యాన్ని కోరుకోరు. వారి మనస్సుని భగవంతునితో ఏకం చేయటానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారు సహజంగానే ఏకాంతాన్ని ఇష్టపడుతారు. కాబట్టి వారు సహజంగానే, ఆధ్యాత్మిక తలంపులలో మరింత నిమగ్నమవ్వటానికి ఏకాంత ప్రదేశాలని ఇష్టపడుతారు. లౌకిక ప్రాపంచిక సమాజం పట్ల విముఖత: భౌతిక ప్రాపంచిక మనస్సుకు సూచిక ఏమిటంటే అది ప్రాపంచిక మనుష్యులు మరియు ప్రాపంచిక విషయాల గురించిన మాటల్లో ఆహ్లాదంగా ఉంటుంది. భగవత్ స్పృహ పెంపొందించుకునేవారు, సహజంగానే వీటి పట్ల అయిష్టత పెంచుకుని, ప్రాపంచిక సమాజానికి దూరంగా ఉంటారు; అదే సమయంలో, భగవత్ సేవ కోసం, ప్రాపంచిక జగత్ వ్యవహారాల్లో పాలుపంచుకోవలసి వస్తే, భక్తుడు దానిని స్వీకరిస్తాడు మరియు మానసికంగా దానిచే ప్రభావితం కాకుండా ఉండే సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. ఆధ్యాత్మిక జ్ఞానములో స్థిరముగా ఉండుట: ఏదేని విషయమును కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. కోపము అనేది మంచిది కాదు అని వ్యక్తికి తెలిసి ఉండవచ్చు, కానీ దానికి పదేపదే వశమై పోతూ ఉండవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవనంలో ఆచరణలో పెట్టటం నేర్చుకోవాలి. గంభీరమైన సత్యాలని ఒక్కసారి వినటం ద్వారా ఇది సాధ్యం కాదు. వాటిని విన్న తరువాత, వాటిపై పదేపదే చింతన చేయాలి. దివ్య ఆధ్యాత్మిక యదార్థాలపై నిరంతర చింతనయే ఇక్కడ శ్రీ కృష్ణుడు చెప్తున్న ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరత్వం. పరమ సత్యము కొరకై తత్త్వాన్వేషణ: జంతువులు కూడా శారీరక క్రియలైన తినటం, నిద్రించటం, మైథునం, మరియు రక్షించుకోవటం వంటి పనులను చేస్తాయి. కానీ, భగవంతుడు ప్రత్యేకంగా మనుష్యులకు జ్ఞానాన్ని పెంపొందించుకునే శక్తి ఇచ్చాడు. అది, శారీరక సుఖాలను విలాసంగా అనుభవించటానికి ఇవ్వబడలేదు, ‘నేను ఎవరిని?’, ‘నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను?’, ‘నా జీవిత లక్ష్యము ఏమిటి?, ‘ఈ ప్రపంచం ఎలా సృష్టించబడినది?, ‘ఆ సృష్టి కర్తకి నాకు ఉన్న సంబంధము ఏమిటి?’, ‘నా జీవన ప్రయోజనాన్ని ఎలా సఫలం చేసుకోవాలి?’ అన్న ప్రశ్నలపై చింతన చేయటానికి ఆ శక్తి ఇవ్వబడినది. తత్త్వపరమైన సత్యాన్వేషణ మన ఆలోచనను పశుస్థాయి నుండి ఉన్నతంగా చేసి, మరియు మనలను భగవత్ ప్రాప్తి ఉపదేశమును వినటం మరియు చదవటం దిశగా తీసుకువెళుతుంది. ఈ పైన వివరించబడిన సుగుణములు, అలవాట్లు, ప్రవర్తన, మరియు దృక్పథం మనలను జ్ఞానము, వివేకము పెంచుకునే దిశగా తీసుకువెళుతాయి. వీటికి వ్యతిరేకమైనవి అహంకారము, కపటత్వము, హింసాప్రవృత్తి, ప్రతీకారము, మోసము, గురువు పట్ల అమర్యాద, శరీరమనస్సుల అపరిశుభ్రత, చంచలత్వము, ఆత్మనిగ్రహం లేకుండుట, ఇంద్రియ వస్తువిషయాల పట్ల లాలస, దురభిమానము, భార్య (భర్త), ఇల్లు, పిల్లలు వంటి వాటిపై యావ, మొదలగునవి. ఇటువంటి స్వభావం ఆత్మ-జ్ఞాన ఎదుగుదలను కుంటుపడేస్తుంది. అందుకే శ్రీ కృష్ణుడు వాటిని అజ్ఞానము మరియు చీకటి అని అంటున్నాడు.