sloka
stringlengths 77
449
| verse
int64 1
78
| chapter
int64 1
18
| audio
stringlengths 59
63
| w2w_meaning
stringlengths 213
1.29k
| te_translation
stringlengths 127
741
| commentry
stringlengths 0
11.1k
|
---|---|---|---|---|---|---|
అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః । దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ।। 5 ।। కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః । మాం చైవాంతఃశరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్ ।। 6 ।। | 6 | 17 | అశాస్త్ర-విహితం — శాస్త్ర విరుద్ధమైన; ఘోరం — అతికఠినమైన; తప్యంతే — ఆచరిస్తారు; యే — ఎవరైతే; తపః — తపస్సులు; జనాః —జనులు; దంభ — దంభము/కపటత్వము; అహంకార — అహంకారము; సంయుక్తాః — ఆవరింపబడి; కామ — కోరికలు; రాగ — మమకారాసక్తి; బల — బలము; అన్వితాః — ప్రేరేపింపబడి; కర్షయంతః — యాతనకు గురిచేయుట; శరీర-స్థం — శరీరములో ఉన్న; భూత-గ్రామమ్ — శరీర అవయవాలు; అచేతసః — బుద్ధిహీనతతో; మాం — నన్ను; చ — మరియు; ఏవ — కూడా; అంతః — లోనున్న; శరీర-స్థం — శరీరములోని నివసిస్తున్న; తాన్ — వారు; విద్ధి — తెలుసుకొనుము; ఆసుర-నిశ్చయాన్ — ఆసురీ సంకల్పము కలవారు. | BG 17.5-6:
కొంతమంది జనులు, అత్యంత కఠినమైన తపస్సులను, శాస్త్రవిరుద్ధమైనా, తమ దంభం(కపటత్వం) మరియు అహంకారముచే ప్రేరితులై చేస్తారు. కామము మరియు మమకారముచే ప్రేరితులై, వారు తమ శరీర అవయములనే కాక, వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడతారు. ఇటువంటి బుద్ధిహీనులు ఆసురీ గుణసంకల్పంతో ఉన్నవారని తెలుసుకొనుము. | ఆధ్యాత్మికత పేరుమీద, జనులు మూర్ఖపు నిష్ఠ/తపస్సులు చేస్తుంటారు. కొందరు, ఈ ఘోరమైన ఆచారాల్లో భాగంగా, భౌతిక ఉనికి పై ఆధిపత్యము కోసం, ముళ్ల పరుపుల మీద పడుకుంటారు లేదా శరీరంలో చువ్వలను గుచ్చుకుంటారు. మరికొందరు, ఏవో గూఢమైన సిద్ధులకోసం, ఒక చేతిని సంవత్సరాల తరబడి పైకే లేపే ఉంచుతారు. కొంతమంది సూర్యుడి వంకే ఆపకుండా చూస్తుంటారు, అది కంటి చూపుకు ఎంత హానికరమో గమనించకుండా. మరికొందరు ఏవో భౌతిక ప్రతిఫలాల కోసం తమ శరీరములను శుష్కింపచేస్తూ దీర్ఘ కాలం ఉపవాసాలు చేస్తుంటారు. శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు: ‘ఓ అర్జునా, నీవు అడిగావు కదా, శాస్త్ర ఉపదేశాలను పాటించకుండా, అయినా, విశ్వాసంతో పూజించేవారి స్థితి ఎలా ఉంటుంది అని. నేను చెప్పేదేమిటంటే, శ్రద్ధ/నమ్మకము అనేవి తీవ్ర నియమ నిష్ఠలను ఆచరించేవారిలో కూడా కనపడుతుంది, కానీ, అది సరియైన జ్ఞాన-ఆధారముగా లేనిది. ఇటువంటి జనులు తమ పద్ధతి పట్ల ప్రగాఢ నమ్మకంతో ఉంటారు, కానీ వారి నమ్మకం తామసికమైనది. ఎవరైతే తమ భౌతిక శరీరమును దుర్వినియోగం చేస్తూ చిత్రహింసకు గురి చేస్తారో వారు తమ దేహములోనే ఉన్న పరమాత్మను అగౌరవ పరిచినట్టే. ఇవన్నీ శాస్త్ర విధివిధానాలకు విరుద్ధంగా ఉన్నట్టు.’ మూడు రకములైన శ్రద్ధావిశ్వాసాలను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, ఈ మూడింటికి సంబంధించిన, ఆహారము, కార్యకలాపములు, యజ్ఞములు, దానములు మొదలైనవాటిని వివరిస్తున్నాడు. |
|
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః । యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ।। 7 ।। | 7 | 17 | ఆహారః — ఆహారము; తు — నిజముగా; అపి — కూడా; సర్వస్య — అన్నింటిలో; త్రివిధః — మూడురకములు; భవతి — ఉండును; ప్రియః — ప్రియమైన; యజ్ఞః — యజ్ఞము; తపః — తపస్సు; తథా — మరియు; దానం — దానము; తేషాం — వారికి; భేదం — భేదము; ఇమం — ఇది; శృణు — వినుము. | BG 17.7:
వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు కూడా వారియొక్క ప్రవృత్తి బట్టి ఉంటాయి. ఇప్పుడిక ఈ భేదముల గురించి వినుము. | మనస్సు మరియు శరీరము ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటాయి. కాబట్టి, మనుష్యులు తినే ఆహారము వారి స్వభావమును ప్రభావితం చేస్తుంది మరియు వారి స్వభావము వారి ఆహార ఇష్ట-అయిష్టములను ప్రభావితం చేస్తుంది. ఛాందోగ్య ఉపనిషత్తు ప్రకారం, మనం తినే వాటిలో ముతక(స్థూల) పదార్థం మలముగా బయటకు వచ్చేస్తుంది; మెత్తనిది మాంసముగా అవుతుంది; మరియు సూక్ష్మమైనది మనస్సుగా అవుతుంది (6.5.1). అది ఇంకా ఇలా పేర్కొన్నది: ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః (7.26.2) ‘స్వచ్ఛమైన ఆహారం తినటం వలన, మనస్సు పవిత్రమవుతుంది.’ అలాగే దీనికి విపర్యయం కూడా సత్యమే - పవిత్రమైన మనస్సుతో ఉండేవారు పవిత్రమైన ఆహారాన్ని ఇష్టపడుతారు. |
|
ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః । రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ।। 8 ।। | 8 | 17 | ఆయుః సత్త్వ — ఆయుష్షును పెంచేందుకు దోహద పడేవి; బల — బలము; ఆరోగ్య — ఆరోగ్యము; సుఖ — సుఖము; ప్రీతి — తృప్తి; వివర్ధనాః — పెంచేవి; రస్యాః — రసముతో ఉండి; స్నిగ్ధాః — చిక్కటి రసభరితమై; స్థిరాః — పోషకములతో ఉండేవి; హృద్యాః — మనస్సుకు ప్రీతి కలిగించేవి; ఆహారాః — ఆహారము; సాత్త్విక-ప్రియాః — సత్త్వ గుణము ప్రధానముగా ఉండేవారికి ప్రియమైనవి. | BG 17.8:
సత్త్వగుణ ప్రధానముగా ఉండేవారు, ఆయుష్షుని పెంచేవి, మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, మరియు తృప్తిని పెంచేవాటిని ఇష్టపడుతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై, మరియు సహజంగానే రుచిగా ఉంటాయి. | 14వ అధ్యాయము, 6వ శ్లోకములో, శ్రీ కృష్ణుడు, సత్త్వ గుణము స్వచ్ఛమైనది, తేజోవంతమయినది, మరియు ప్రశాంతమైనది అని మరియు అది ఒకలాంటి సంతోషమును మరియు తృప్తిని కలుగచేస్తుంది అని చెప్పి ఉన్నాడు. సాత్త్విక ఆహారము కూడా ఇదే విధమైన ప్రభావమును కలిగి ఉంటుంది. ఈ పై శ్లోకములో, ఈ రకమైన ఆహారములు 'ఆయుః సత్త్వ' అంటే, ‘ఆయుష్షును పెంచేవి’ అని చెప్పబడ్డాయి. అవి మంచి ఆరోగ్యమును, సద్గుణములను, ఆనందమును, మరియు సంతుష్టిని కలుగ చేస్తాయి. ఇటువంటి ఆహారములు రసభరితంగా, సహజంగానే రుచిగా, ఘాటుగా లేకుండా మరియు మేలుకలిగించేవిగా ఉంటాయి. ధాన్యములు, పప్పులు, బీన్స్, పండ్లు, కూరగాయలు, పాలు, మరియు ఇతర శాఖాహార పదార్థములు వంటివి. కాబట్టి, శాఖాహార భోజనము ఆధ్యాత్మిక జీవనానికి అనుగుణముగా సత్త్వ గుణము పెంపొందించుకోవటానికి వీలుగా ఉంటుంది. ఎంతోమంది సాత్త్విక (సత్త్వ గుణ ప్రధానముగా ఉన్నవారు) మేధావులు మరియు తత్త్వవేత్తలు ఈ భావాన్నే వ్యక్తీకరించారు: మానవుడు మాంసం తినే జంతువుగా ఉండటం ఒక కళంకం కాదా? నిజమే, మనిషి ఇతర జంతువులను చంపి జీవనం సాగించే శక్తి ఉన్నవాడే, అలాగే చేస్తున్నాడు కూడా; కానీ ఇది చాలా హేయమైన పద్ధతి... మానవ జాతి భవితవ్యంలో, దాని యొక్క క్రమేపి జరిగే పరిణితి క్రమంలో – మరింత నాగరిక సమాజంతో సంపర్కం జరిగిన పిదప, అడవి జాతులు ఒకరినొకరు తినటం ఆపేసినట్టు, మనుష్యులు జంతువులను తినటం విడిచిపెట్టేస్తారు - అనటంలో నాకు ఎటువంటి సంశయం లేదు; — వాల్డెన్ లో హెన్రీ డేవిడ్ థోరో నేను మాంసం తినడానికి నిరాకరించడం అప్పుడప్పుడూ అసౌకర్యాన్ని కలిగించేది, మరియు నా విలక్షణత్వం వల్ల చీవాట్లు తినాల్సివచ్చేది, కానీ, ఈ తేలికైన ఆహారంచేత, మానసిక స్పష్టత మరియు శీఘ్ర గ్రహణశక్తికి సంబంధించి, నేను గొప్ప పురోగతిని సాధించాను. మాంసం తినటం అనేది అకారణ హత్యయే. — బెంజమిన్ ఫ్రాంక్లిన్. శాఖాహారము మనల్ని మానసికంగా చేతకానివాళ్లను, స్తబ్ధంగా, లేదా అచేతనముగా తయారుచేసింది అన్న తప్పుడు భావనను మనం సరిదిద్దటం ఆవశ్యకం. మాంసాహారము ఏ పరిస్థితులలోనైనా అవసరము అని నేను భావించటంలేదు. — మహాత్మా గాంధీ. ‘ప్రియజనులారా, మీ శరీరములను పాపిష్టి ఆహారంతో అపవిత్రం చేయవద్దు. మనకు మొక్కజొన్న మరియు ఆపిల్ పళ్ళు , తమ బరువుతో శాఖలను క్రిందికి వంచి ఉన్నాయి. పొయ్యి మీద ఉడికించి మృదువుగా చేసుకొనగలిగే కూరగాయలు ఉన్నాయి. ఈ భూమి మనకు ఏంతో వైభవోపేతమయిన, సున్నితమైన ఆహారములు ఇవ్వగలదు; ఎటువంటి రక్తపాతం లేని విందులను ఏర్పాటుచేయగలదు. క్రూర-పశువులు మాత్రమే ఇలా మాంసంతో తమ ఆకలిని తీర్చుకుంటాయి. పశువుల్లో కూడా అన్నీ మాంసం తినవు, ఎందుకంటే గుర్రాలు, గొడ్లు, మరియు గొఱ్ఱెలు గడ్డి మాత్రమే తింటాయి. — పైథాగరస్. నా పొట్టను, చచ్చిన జంతువుల స్మశానం చేయటం నాకు ఇష్టం లేదు. — జార్జ్ బెర్నార్డ్ షా జంతువుల పట్ల హింసలో కూడా, ఆవు (గోవు)ని సంహరించటం అత్యంత హేయమైనది. ఆవు మానవుల కోసం పాలు ఇస్తుంది, కాబట్టి అది మానవులకు తల్లి (అమ్మ) వంటిది. అది పాలు ఇవ్వలేని పరిస్థితిలో అయినప్పుడు, అమ్మ లాంటి ఆవుని సంహరించటం అనేది అమానుషము, మొరటుపని, మరియు కృతజ్ఞతలేని పని. |
|
కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః । ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః ।। 9 ।। | 9 | 17 | కటు — చేదు; ఆమ్ల — పుల్లని; లవణ — ఉప్పగా ఉన్న; అతి-ఉష్ణ — చాలా వేడిగా ఉన్న; తీక్ష్ణ — ఘాటుగా ఉన్న; రూక్ష — ఎండిపోయిన; విదాహినః — కారంగా ఉన్న; ఆహారాః — ఆహారము; రాజసస్య — రజో గుణ ప్రధానంగా ఉండేవారికి; ఇష్టాః — ఇష్టము; దుఃఖ — బాధ; శోక — శోకము; ఆమయ — రోగము; ప్రదాః — కలుగచేయును. | BG 17.9:
అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్థములు రజో గుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధను, శోకమును మరియు వ్యాధులను కలుగ చేస్తాయి. | ఎప్పుడైతే శాకాహార పదార్థములను మితిమీరిన కారం/మిరపకాయలు, చెక్కెర, ఉప్పు వంటివి వేసి వండుతారో అవి రాజసికమైనవి అవుతాయి. వీటిని వివరించేటప్పుడు, 'చాలా' అన్న పదమును అన్ని విశేషణములకు ఉపయోగించవచ్చు. ఈ విధంగా, చాలా చేదైన, చాలా పుల్లని, చాలా ఉప్పగా, చాలా వేడిగా, చాలా ఘాటుగా, చాలా ఎండిన, చాలా కారంగా మొదలైనవి అన్నమాట. అవి అనారోగ్యమును, ఉద్వేగమును, మరియు నిస్పృహను కలుగచేస్తాయి. రజో గుణములో ఉండేవారు, అటువంటి ఆహారమును ఇష్టపడుతారు కానీ, అటువంటి ఆహారము సత్త్వ గుణములో ఉన్నవారికి వికారమైనవిగా అనిపిస్తాయి. ఆహారాన్ని భుజించటం అనేది నాలుకతో ఏదో ఆనందాన్ని అనుభవించటానికి కాదు, అది శరీరమును ఆరోగ్యముగా మరియు బలముగా ఉంచటానికి ఉపయోగపడాలి. ఒక ప్రాచీన నానుడి ఇలా పేర్కొంటుంది : ‘బ్రతకటానికి తినండి; తినటానికి బ్రతకొద్దు.’ అని. ఈ విధంగా, వివేకవంతులు చక్కటి ఆరోగ్యమునకు అనుగుణముగా ఉండే మరియు మనస్సుపై శాంతియుత ప్రభావం కలిగించే ఆహారాన్నే తీసుకుంటారు, అంటే సాత్త్విక ఆహారము అన్నమాట. |
|
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ । ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ।। 10 ।। | 10 | 17 | యాత-యామం — ఎండిపోయిన ఆహారము; గత-రసం — రుచిలేని; పూతి — మురిగి పోయిన; పర్యుషితం — కలుషితమైన; చ — మరియు; యత్ — ఏదైతే; ఉచ్ఛిష్టం — మిగిలిపోయిన; అపి — కూడా; చ — మరియు; అమేధ్యం — అపరిశుద్దమైన; భోజనం — ఆహారము; తామస — తమోగుణములో ఉన్నవారికి; ప్రియం — ఇష్టమైనవి. | BG 17.10:
ఎండిపోయిన/మాడిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము - తామసీ గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియముగా ఉంటాయి. | వండిన పదార్థము ఒక జాము (మూడు గంటలు) కంటే ఎక్కువగా నిలువ ఉంటే అది తామసిక ఆహారము అయిపోతుంది. అపరిశుద్దమైన ఆహారము, చెడురుచి లేదా చెడువాసన వచ్చే పదార్థములు ఇవే కోవకు వస్తాయి. అన్ని రకాల మాంసాహారము ఈ అపవిత్ర/అపరిశుద్ధ ఆహారము కోవకే వస్తాయి. ప్రకృతి ఈ మానవ దేహమును శాకాహారమునకే నిర్మాణం చేసింది. మానవులకు, మాంసాహార జంతువుల లాగా, మాంసం చీల్చటానికి కోరపళ్ళు (canine teeth) కానీ, వెడల్పైన దవడ కానీ ఉండవు. మాంసభక్షక జంతువులకు , త్వరగా కుళ్లిపోయే చనిపోయిన జంతుమాంసం, కొద్ది కాలమే కడుపు లోపల ఉండేవిధంగా, అది త్వరగా బయటకు వెళ్లిపోవటానికి పొట్టి (తక్కువ పొడుగు) పేగులు ఉంటాయి. దీనికి విరుద్ధంగా, శాఖాహార పదార్థములను నెమ్మదిగా మరియు చక్కగా జీర్ణం చేసుకోవటానికి, మనుష్యులకు పొడవాటి జీర్ణ వ్యవస్థ ఉంటుంది. మాంసాహార జీవుల కడుపులో ఆమ్ల తీవ్రత మనుష్యులలో కంటే ఎక్కువగా ఉంటుంది, అది వాటికి పచ్చి మాంసం జీర్ణం చేసుకోవటానికి దోహదపడుతుంది. ఆసక్తికరంగా, మాంసాహార జంతువులు చర్మరంధ్రాల నుండి చెమట కార్చవు. అవి శరీర తాపమును నాలుక ద్వారా నియంత్రిస్తాయి. అదే సమయంలో, శాఖాహారులు మరియు మనుష్యులు తమ శరీర తాపమును చర్మరంధ్రాల ద్వారా వచ్చే చెమట (స్వేదము) ద్వారా నియంత్రిస్తాయి. త్రాగేటపుడు మాంసాహార జీవులు నీటిని గతుకుతాయి (నేరుగా పీల్చవు). కానీ, శాఖాహార జంతువులు నీటిని గతకవు, పీల్చుతాయి. మనుష్యులు కూడా నీరు త్రాగేటప్పుడు నీటిని పీల్చుతారు. ఇవన్నీ మానవ శరీరము యొక్క భౌతిక లక్షణములు, భగవంతుడు మనుష్యులను మాంసభక్షక జంతువులలా తయారుచేయలేదని మనకు తెలియచేస్తున్నాయి, అందుకే మాంసము మనుష్యులకు అశుచి/అపవిత్ర మైనదిగా పరిగణించబడుతుంది. మాంస భక్షణ పాడు ఖర్మను కూడా కలుగచేస్తుంది. మను స్మృతి ప్రకారం: మాంస భక్షయితా ముత్ర యస్య మాంసం ఇహాద్మ్యహం ఏతన్ మాంసస్య మాంసత్వం ప్రవదన్తి మనీషిణః (5-55) ‘మాంసము అంటే అర్థం "నేను దేనినైతే ఇక్కడ తింటున్నానో, నన్ను అది వచ్చే జన్మలో తింటుంది." అని. ఈ కారణం చేతనే మాంసమునకు ఆపేరు వచ్చింది అని అంటారు. (మళ్ళీ జరిగే పని: నేను దాన్ని తింటాను, అది నన్ను తింటుంది).’ |
|
అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే । యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః ।। 11 ।। | 11 | 17 | అఫల-ఆకాంక్షిభిః — ప్రతిఫలము ఏమీ ఆశించకుండా; యజ్ఞః — యజ్ఞము; విధి-దృష్టః — శాస్త్రములు ఉపదేశించిన విధముగా; యః — ఏదైతే; ఇజ్యతే — చేయుదురో; యష్టవ్యమ్-ఏవ-ఇతి — కర్తవ్యముగా చేయవలసినదే అని; మనః — మనస్సు; సమాధాయ — దృఢ సంకల్పముతో; సః — అది; సాత్త్వికః — సాత్విక స్వభావము తో చేసినట్టు. | BG 17.11:
ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధినియమములను పాటిస్తూ, ఇది చేయవలసిన కర్తవ్యము అని మనస్సులో దృఢ సంకల్పముతో చేసిన యజ్ఞము సత్త్వ గుణముతో చేయబడినట్టు. | యజ్ఞము చేసే ప్రవృత్తి కూడా త్రిగుణముల ప్రకారముగానే ఉంటుంది. శ్రీ కృష్ణుడు, సత్త్వ గుణములో చేసే యజ్ఞ పద్ధతిని మొదటగా వివరిస్తున్నాడు. ‘అఫల-ఆకాంక్షిభిః’ అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా యజ్ఞమును చేయబడాలి. ‘విధి దృష్టః’ అంటే, అది వేద శాస్త్రములలో చెప్పబడిన నియమముల ప్రకారంగా చేయబడాలి. ‘యష్టవ్యమ్ ఏవైతి’ అంటే, శాస్త్రముల్లో ఆదేశింపబడినట్టు, ఈశ్వర ఆరాధన నిమిత్తమే చేయబడాలి. ఎప్పుడైతే యజ్ఞము ఈ విధముగా చేయబడినదో, అది సత్త్వ గుణముతో చేయబడినట్టు. |
|
అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ । ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ।। 12 ।। | 12 | 17 | అభిసంధాయ — ప్రేరేపింపబడి; తు — కానీ; ఫలం — ప్రతిఫలం; దంభ — దంభము (గర్వము); అర్థం — కోసము; అపి — కూడా; చ — మరియు; ఏవ — నిజముగా; యత్ — ఏదైతే; ఇజ్యతే — చేయబడునో; భరత-శ్రేష్ఠ — అర్జునా, భరతులలో శ్రేష్ఠుడా; తమ్ — అది; యజ్ఞం — యజ్ఞము; విద్ధి — తెలుసుకొనుము; రాజసమ్ — రజో గుణములో ఉన్న. | BG 17.12:
ఓ భరత శ్రేష్ఠుడా, ప్రాపంచిక లాభము కోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము, రజోగుణములో ఉన్నట్టు తెలుసుకొనుము. | అట్టహాసముగా, ఆడంబరముగా చేసినా, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం, ‘నాకు ప్రతిఫలముగా ఏమి దక్కుతుంది?’ అన్న స్వార్థ పూరితభావనతో ఉన్నప్పుడు, ఆ యజ్ఞము అనేది భగవంతునితో వ్యాపారం చేసినట్టు అవుతుంది. శుద్ధ భక్తి అంటే వ్యక్తి తనకు తిరిగి ఏ ప్రతిఫలాన్ని ఆశించనిది. శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, యజ్ఞమును ఒక గొప్ప క్రతువుగా చేయవచ్చు, కానీ అది పేరుప్రతిష్ఠ లేదా సొంతగొప్ప వంటి వాటి కోసం చేస్తే అది రాజసిక స్వభావముతో చేసినట్టు అవుతుంది అని. |
|
విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ । శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ।। 13 ।। | 13 | 17 | విధి-హీనమ్ — శాస్త్ర ఉపదేశముల ప్రకారంగా కాకుండా; అసృష్ట-అన్నం — ప్రసాద వితరణ లేకుండా; మంత్ర-హీనమ్ — వేద మంత్రములు జపించకుండా; అదక్షిణమ్ — పురోహితులకు దక్షిణ ఇవ్వకుండా; శ్రద్ధా విరహితం — శ్రద్ధ లేకుండా; యజ్ఞం — యజ్ఞము; తామసం — తమోగుణములో; పరిచక్షతే — పరిగణించబడును. | BG 17.13:
శ్రద్ధావిశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా, ప్రసాదవితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా, మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము, తమో గుణములో ఉన్నది అని పరిగణించబడును. | జీవితంలో అనుక్షణం, వ్యక్తులకు ఏ పనులు చేయాలి అన్న విషయంలో ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. మన సమాజానికి మరియు మన సంక్షేమానికి దోహదపడే మంచి పనులు ఉంటాయి. అదే సమయంలో, ఇతరులకు, మనకు హానికరమైన తప్పుడు పనులు కూడా ఉంటాయి. కానీ, ఏది ప్రయోజనకరమైనది మరియు ఏది హానికరమైనది అని ఎవరు నిర్ణయించాలి? అంతేకాక, ఏదేని వివాదం తలెత్తితే దానిని దేని ఆధారంగా నివృత్తి చేసుకోవాలి? ప్రతివారు తమ స్వంత నిర్ణయం తీసుకుంటే, అదొక గందరగోళ పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి శాస్త్ర ఉపదేశాలు మార్గదర్శకాలుగా ఉపయోగపడుతాయి మరియు ఎక్కడెక్కడైతే సంశయం తలెత్తుతుందో, మనం ఈ శాస్త్రముల ఆధారంగా ఏది సరియైన పనో నిర్ణయించుకోవచ్చు. కానీ, తమో గుణములో ఉన్నవారికి శాస్త్రముల పట్ల విశ్వాసం ఉండదు. వారు కర్మ కాండలను చేస్తారు కానీ, శాస్త్రములలో చెప్పబడిన ఉపదేశములను లెక్క చేయరు. భారత దేశంలో, ప్రతి పండుగ సమయంలో, ఆయా సంబంధిత ప్రత్యేకమైన దేవుళ్ళు, దేవతలకు ఎంతో ఆర్భాటముతో, వైభవంతో పూజలు చేస్తారు. తరచుగా ఈ బాహ్యమైన అంగరంగ వైభవం - రంగురంగుల అలంకరణలు, మిరుమిట్లుగొలిపే దీపాలు, పెద్ద సంగీతం - వెనుక ఉన్న ఉద్దేశ్యం, ఆయా జనావాసాల నుండి డబ్బులు సేకరించటమే. అంతేకాక, యజ్ఞం నిర్వహించే పురోహితులకు, కృతజ్ఞత మరియు మర్యాద కోసం, వారికి దక్షిణ ఇవ్వవలెను అన్న శాస్త్ర ఉపదేశము కూడా పాటించరు. శాస్త్ర నియమ-నిబంధనలను పక్కకుపెట్టి, సోమరితనంతో, అలసత్వంతో, లేదా వైరబుద్ధితో, తమకు నచ్చినట్టు చేసే యజ్ఞము, తమో గుణములో ఉన్నట్టు. ఇటువంటి శ్రద్ద, నిజానికి భగవంతుని పట్ల మరియు శాస్త్రముల పట్ల విశ్వాసరాహిత్యమే. |
|
దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ । బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ।। 14 ।। | 14 | 17 | దేవ — పరమేశ్వరుడు; ద్విజ — బ్రాహ్మణులు; గురు — ఆధ్యాత్మిక గురువు; ప్రాజ్ఞ — పెద్దలు; పూజనం — పూజ చేయుట; శౌచం — శౌచము; ఆర్జవం — సరళత; బ్రహ్మచర్యం — బ్రహ్మచర్యము; అహింసా — అహింస; చ — మరియు; శారీరం — శరీరము యొక్క; తప — తపస్సు; ఉచ్యతే — అని చెప్పబడినది. | BG 17.14:
పరమేశ్వరుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, జ్ఞానులు, మరియు పెద్దలు - వీరి ఆరాధన, శుచి, నిష్కాపట్యము, బ్రహ్మచర్యం, అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడుతాయో - అది శారీరక తపస్సు అని చెప్పబడును. | ‘తపః’ అంటే ‘వేడిమిని పెంచటం’ ఉదాహరణకి, అగ్నిపై ఉంచటం. మలినములను నిర్మూలించే ప్రక్రియలో, లోహములు వేడి చేసి కరిగించబడుతాయి, ఈ ప్రక్రియలో మలినములు పైకి వచ్చినప్పుడు నిర్మూలించబడుతాయి. బంగారమును అగ్నిపై ఉంచినప్పుడు, దానిలో ఉన్న మలినములు కాలిపోయి దాని యొక్క తేజస్సు పెరుగుతుంది. అదే విధముగా, ఋగ్వేదము ఈ విధముగా పేర్కొంటున్నది: అతప తనుర్మతదా మోశ్నుతే (9.83.1) ‘శరీరమును తపస్సుచే పవిత్రం చేయకుండా మనిషి యోగములో అంతిమ స్థాయిని చేరుకోలేడు.’ శారీరక తపస్సుని త్రికరణశుద్ధిగా అభ్యాసం చేస్తే, మానవులు తమ జీవితమును, ప్రాపంచికత్వం నుండి భగవత్ పరంగా ఉన్నతముగా మార్చుకోగలరు. ఇటువంటి తపస్సు అనేది ఆర్భాటం లేకుండా, సద్భావనతో, శాంతియుతముగా, గురువు మరియు శాస్త్రముల ఉపదేశ ప్రకారంగా ఉండాలి. శ్రీ కృష్ణుడు ఇటువంటి తపస్సుని మూడు రకాలుగా వర్గీకరిస్తున్నాడు — శారీరక తపస్సు, వాక్కు యొక్క తపస్సు, మరియు మనస్సు యొక్క తపస్సు. ఈ శ్లోకములో కృష్ణుడు శారీరక తపస్సు గురించి వివరించాడు. ఎప్పుడైతే శరీరము పవిత్రమైన, సాధుపురుషుల సేవలో వినియోగించబడుతుందో, మరియు ఇంద్రియ భోగములు, ప్రత్యేకంగా లైంగిక భోగములు త్యజించబడినప్పుడు, అది శారీరక తపస్సు అని చెప్పబడుతుంది. ఇటువంటి తపస్సు శౌచముతో, సరళముగా, మరియు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా చేయబడాలి. ఇక్కడ, ‘బ్రాహ్మణులు’ అంటే, ఏదో పుట్టుకతో తమను తాము బ్రాహ్మణులు అనుకునేవారు కాదు, 18.42వ శ్లోకంలో చెప్పబడినట్టు సాత్త్విక గుణములు కలవారు అని అర్థం. |
|
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ । స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే ।। 15 ।। | 15 | 17 | అనుద్వేగ-కరం — ఉద్వేగమును కలిగించనివి; వాక్యం — మాటలు; సత్యం — సత్యములు; ప్రియ-హితం — ప్రయోజనకరమైన/లాభకారి; చ — మరియు; యత్ — ఏదైతే; స్వాధ్యాయ-అభ్యసనం — వేద శాస్త్రముల అధ్యయనం; చ ఏవ — మరియు ఇంకా; వాజ్ఞ్మయం — వాక్కుకు సంబంధించిన; తప — తపస్సు; ఉచ్యతే — అని పేర్కొనబడును. | BG 17.15:
ఉద్వేగమును కలిగించనివి, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది. | వాక్కు యొక్క తపస్సు అంటే, సత్యములైన వాటినే మాట్లాడటం, ఎదుటివారికి ఉద్వేగమును కలిగించనివి, వినేవారికి ప్రియముగా, మరియు ప్రయోజనకారిగా ఉండే మాటలు మాట్లాడటమే. వేద మంత్ర పారాయణ అభ్యాసము కూడా వాక్కు సంబంధ తపస్సులోనే చెప్పబడినది. పూర్వీకుడైన మనువు ఇలా పేర్కొన్నాడు: సత్యం భ్రూయాత్ ప్రియం బ్రూయాన్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాద్ ఏష ధర్మః సనాతనః (మను స్మృతి 4.138) "సత్యమునే పలుకుము, అది కూడా, వినేవారికి ప్రియముగా పలుకుము. సత్యమే అయినా ఇతరులకు బాధ/హాని కలిగించే విధముగా మాట్లాడవద్దు. ప్రియముగా ఉన్నా సరే ఎప్పుడూ కూడా అసత్యము పలకవద్దు. ఇదే మన సనాతన నీతి మరియు ధర్మ మార్గము.’ |
|
మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః । భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే ।। 16 ।। | 16 | 17 | మనః-ప్రసాదః — ఆలోచనలో ప్రశాంతత; సౌమ్యత్వం — సౌమ్యముగా ఉండటము; మౌనమ్ — మౌనము; ఆత్మ-వినిగ్రహః — ఆత్మ నిగ్రహము; భావ-సంశుద్ధిః — భావములో పవిత్రత; ఇతి — ఈ విధముగా; ఏతత్ — ఇవన్నీ; తపః — తపస్సు; మానసమ్ — మనస్సు యొక్క; ఉచ్యతే — చెప్పబడినవి. | BG 17.16:
ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మ-నిగ్రహము మరియు ఉద్దేశ్య పవిత్రత - ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పేర్కొనబడినాయి. | మనస్సు యొక్క తపస్సు అనేది శరీరము మరియు వాక్కు యొక్క తపస్సుల కంటే ఉన్నతమైనది. ఎందుకంటే, మనస్సుని గెలువ గలిగితే, శరీరము మరియు వాక్కు వాటంతట అవే స్వాధీనములోనికి వస్తాయి. కానీ, శరీరము, వాక్కులను గెలిస్తే మనస్సు ఖచ్చితంగా నియంత్రణ లోనికి వచ్చినట్టు చెప్పలేము. నిజానికి, మనస్సు యొక్క స్థితియే వ్యక్తి యొక్క స్థాయి/దృక్పథమును నిర్ణయిస్తుంది. శ్రీ కృష్ణుడు 6.5వ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడు, ‘నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకొనుము, అంతేకాని మరింత పతనం కావద్దు, ఎందుకంటే మనస్సు మన మిత్రుడుగా ఉండవచ్చు లేదా మన శత్రువుగా అయిపోవచ్చు.’ మనస్సుని ఒక పూదోటతో పోల్చవచ్చు, దానిని తెలివిగా సాగు చేసుకోవచ్చు లేదా దాన్ని అలా విశృంఖలంగా వదిలేయచ్చు. పండ్లు, పువ్వులు మరియు కూరగాయలు పండించుకోవటానికి తోటమాలులు తమ నేలని సాగు చేస్తారు. అదే సమయంలో, వారు కలుపుమొక్కలు పెరగకుండా కూడా జాగ్రత్త పడతారు. అదే విధముగా, మన స్వంత మనస్సుని ఉన్నత తలంపులతో, పవిత్రమైన భావాలతో నింపుకుంటూ, అదే సమయంలో ప్రతికూల, వినాశకర తలంపులను ఏరిపారేస్తూ ఉండాలి. ఒకవేళ మనము క్రోధపూరిత, ద్వేశపూరిత, దూషణభరిత, ప్రతీకారేచ్ఛతో కూడిన, విమర్శక, మరియు నిందించే తలంపులను మన మనస్సులో ఉండనిస్తే, అవి మన వ్యక్తిత్వం పైన తీవ్ర వినాశకర ప్రభావం చూపుతాయి. మనస్సుని నియంత్రించటం నేర్చుకుని, దానిని క్రోధము, ద్వేషము, అయిష్టత వంటి వాటి నుండి ప్రభావితం కాకుండా చూసుకోనంతవరకూ, మన మనస్సు నుండి ప్రయోజనకారక పని ఏదీ మనకు లభించదు. భగవంతుని కృప మన హృదయములలో వ్యక్తమవ్వటాన్ని అడ్డుకునే కలుపుమొక్కలు ఇవే. జనులు, వారి తలంపులు రహస్యమైనవని మరియు అవి వారి మనస్సులోనే ఉంటూ ఇతరులకు ఏమాత్రం తెలియనివి కాబట్టి వాటికి ఎటువంటి బాహ్యమైన పరిణామం ఉండదు అని అనుకుంటారు. ఈ ఆలోచనలే వారి యొక్క అంతర్గత స్వభావాన్ని మరియు బాహ్య వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మనం ఎవరినైనా చూసినప్పుడు, ‘ఆయన చాలా మంచివాడిగా, నమ్మకస్తుడిగా ఉన్నట్టు అనిపిస్తున్నది’ అని అనుకుంటాము. ఇంకొక వ్యక్తి పట్ల, ‘ఆమె చాలా ప్రమాదకారిగా, మోసగత్తె లాగా అగుపిస్తున్నది, ఆమె నుండి దూరంగా ఉండు’ అని మనం అంటాము. ప్రతి ఒక్కరి విషయంలో కూడా, వారి వారి ఆలోచనలు/తలంపులే వారి స్వరూపాన్ని నిర్ణయిస్తాయి. రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్ ఈ విధంగా అన్నాడు: ‘మన చూపులలోనే, మన నవ్వులోనే, మన అభివాదనలోనే, మన చేతి పట్టు లోనే, అంతా తెలిసి పోతుంది. మనం చేసుకున్న పాపం మనలను అంటుకునే ఉంటుంది, మంచి వ్యక్తిత్వాన్ని కళంకితం చేస్తుంది. మనలను ఎందుకు నమ్మరో తెలియదు. దుష్టగుణము కళ్ళను కప్పివేస్తుంది, బుగ్గలను తగ్గిస్తుంది, ముక్కును నొక్కుతుంది, మరియు, ‘ఓ మూర్ఖుడా, మూర్ఖుడా!’ అని రాజు గారి నుదుటిపై వ్రాస్తుంది తలంపులను వ్యక్తిత్వంతో జోడిస్తూ ఇంకొక గొప్ప లోకోక్తి ఉన్నది: నీ ఆలోచనలను గమనించు, అవే నీ మాటలు అవుతాయి (Watch your thoughts, for they become words.) నీ మాటలను గమనించు, అవే నీవు చేసే పనులు అవుతాయి (Watch your words, for they become actions.) నీవు చేసే పనులను గమనించు, అవే నీ అలవాట్లు అవుతాయి (Watch your actions, for they become habits.) నీ అలవాట్లను గమనించు, అవే నీ వ్యక్తిత్వం అవుతాయి (Watch your habits, for they become character.) నీ వ్యక్తిత్వాన్ని గమనించు, అదే నీ భవితవ్యము అవుతుంది (Watch your character, for it becomes your destiny.) మన మనస్సులో ఉన్న ప్రతి ఒక్క ప్రతికూల/ద్వేషభావ ఆలోచనతో మనం మనలకే హాని చేకూర్చుకుంటున్నాము, అని మనం తెలుసుకోవటం చాలా ముఖ్యం. అదే సమయంలో, ప్రతిఒక్క మంచి ఆలోచనతో మనలను మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాము. హెన్రీ వాన్ డైక్ తన కావ్యం ‘థాట్స్ ఆర్ థింగ్స్’ (Thoughts are things) లో దీనిని చాలా స్పష్టముగా వివరించాడు: I hold it true that thoughts are things; They’re endowed with bodies and breath and wings That which we call our secret thought Speeds forth to earth’s remotest spot, Leaving its blessings or its woes, Like tracks behind as it goes. We build our future, thought by thought. For good or ill, yet know it not, Choose, then, thy destiny and wait, For love brings love, and hate brings hate. మనలో ఉండే ప్రతి ఒక్క తలంపుకి దాని పరిణామాలు ఉంటాయి, ఒక్కొక్క ఆలోచనతో మనం మన భవిష్యత్తుని ఎంచుకుంటాము. ఈ కారణం చేత, మనస్సుని చెడు/ప్రతికూల తలంపుల నుండి దూరంగా చేస్తూ, దానిని సద్భావనతో ఉన్న తలంపులలో ఉంచటం అనేది, మనస్సు యొక్క తపస్సు అని చెప్పబడుతుంది. |
|
శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః । అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ।। 17 ।। | 17 | 17 | శ్రద్ధయా — శ్రద్ధతో; పరయా — అలౌకికమైన; తప్తం — చేయబడిన; తపః — తపస్సు; తత్ — అది; త్రి-విధం — మూడు విధములైన; నరైః — వ్యక్తుల చే; అఫలా-ఆకాంక్షిభిః — భౌతిక ఫలాపేక్ష లేకుండా; యుక్తైః — అచంచలమైన; సాత్త్వికం — సత్త్వ గుణములో ఉన్నట్టు; పరిచక్షతే — పరిగణించబడును. | BG 17.17:
భక్తి-శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులను, భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే, వాటిని సాత్త్విక తపస్సులు అని అంటారు. | శారీరక, వాక్కు, మరియు మనస్సులకు సంబంధించిన తపస్సులను వేరుగా స్పష్టముగా వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక వాటి సత్త్వ గుణములో చేసే లక్షణములను వివరిస్తున్నాడు. భౌతిక ప్రతిఫలములను ఆశించి చేయబడితే, తపస్సు, దాని యొక్క పవిత్రతను కోల్పోతుంది. అది నిస్వార్థ చిత్తముతో, ఫలాసక్తి లేకుండా చేయబడాలి. అంతేకాక, అది విజయవంతమైనా లేదా విఫలమైనా, ఆ తపస్సు యొక్క విలువ పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలి; సోమరితనం వల్ల కానీ, అసౌకర్యముగా ఉందని కానీ, దాని యొక్క ఆచరణను ఆపకూడదు. |
|
సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ । క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ।। 18 ।। | 18 | 17 | సత్-కార — కీర్తిప్రతిష్టలు; మాన — గౌరవము; పూజా — ఆరాధన; అర్థం — కోసము; తపః — తపస్సు; దంభేన — దంభముతో (బడాయి); చ — కూడా; ఏవ — నిజముగా; యత్ — ఏదయితే; క్రియతే — చేయబడునో; తత్ — అది; ఇహ — ఈ లోకములో; ప్రోక్తం — చెప్పబడినది; రాజసం — రజో గుణములో; చలం — అస్థిరమైనవి; అధ్రువం — తాత్కాలికమైన. | BG 17.18:
కీర్తిప్రతిష్టలు, గౌరవము, మరియు గొప్పల కోసం, ఆడంబరంగా చేసే తపస్సు/యజ్ఞములు రజో గుణములో ఉన్నట్టు. దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి, మరియు తాత్కాలికమైనవి. | తపశ్చర్య అనేది ఆత్మ-శుద్ధి కోసమున్న అత్యంత ప్రయోజనకరమైన ఉపకరణమే అయినా, దానిని అందరూ పవిత్రమైన ఉద్దేశంతో ఉపయోగించుకోరు. ఒక రాజకీయవేత్త రోజులో ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ చాలా పరిశ్రమిస్తాడు, అది కూడా ఒక లాంటి తపస్సే, కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం పదవి, హోదా పొందటము. అదే విధముగా, ఎవరైనా ఆధ్యాత్మిక కార్యకలాపాలలో, గౌరవం లేదా ప్రశంస, కోసం నిమగ్నమయితే - మార్గం వేరయినా, దాని ఉద్దేశ్యం కూడా, అంతే సమానమైన భౌతికపరమైనదే అవుతుంది. గౌరవం కోసం, పదవి కోసం, లేదా ఏ ఇతర భౌతిక ప్రాపంచిక ప్రతిఫలం కోసం చేసినా, ఆ తపస్సు, రజో గుణ తపస్సుగా పరిగణించబడుతుంది. |
|
మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః । పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ।। 19 ।। | 19 | 17 | మూఢ — అయోమయ భావాలతో ఉన్నవారు; గ్రాహేణ — శ్రమతో కూడి; ఆత్మనః — తమకు తామే; యత్ — ఏదైతే; పీడయా — బాధపెట్టి; క్రియతే — చేయబడునో; తపః — తపస్సు; పరస్య — ఇతరుల; ఉత్సాదన-అర్థం — హాని చేయటానికి; వా — లేదా; తత్ — అది; తామసమ్ — తమో గుణములో; ఉదాహృతమ్ — అని పేర్కొనబడినది. | BG 17.19:
అయోమయ భావాలతో, తమని తామే హింసపెట్టుకుని లేదా ఇతరులకు హాని కలిగించటం కోసం చేయబడే తపస్సు, తమో గుణములో ఉన్నట్టు చెప్పబడినది. | మూఢ-గ్రాహేణాత్ అంటే - అయోమయ ఉద్దేశ్యంతో ఉన్న జనులు అని, తపస్సు అనే పేరు మీద, శాస్త్ర విధివిధానాలను పట్టించుకోకుండా లేదా శరీర పరిమితులను అర్థం చేసుకోకుండా అనవసరముగా తమను తాము హింసించుకుని, లేదా ఇతరులకు హాని చేసేవారు అని అర్థం. ఇటువంటి తపస్సులు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు. అవి శారీరక దృక్పథంతో చేయబడినట్టు మరియు మొరటు వ్యక్తిత్వాన్ని చాటుకునేందుకే చేస్తారు. |
|
దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే । దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ।। 20 ।। | 20 | 17 | దాతవ్యం — దానము చేయాలి కాబట్టి; ఇతి — ఈ విధముగా; యత్ — ఏదైతే; దానం — దానము; దీయతే — ఇవ్వబడునో; అనుపకారిణే — మళ్ళీ తిరిగి ఇవ్వలేని వానికి; దేశే — సరియైన ప్రదేశంలో; కాలే — సరియైన సమయంలో; చ — మరియు; పాత్రే — పాత్రత కలిగిన వానికి; చ — మరియు; తత్ — అది; దానం — దానము; సాత్త్వికం — సత్త్వ గుణములో ఉన్న; స్మృతమ్ — అని పేర్కొనబడినది. | BG 17.20:
దానము చేయుట తన కర్తవ్యము అని భావించి, తగిన పాత్రత ఉన్నవారికి, ప్రతిఫలాపేక్ష లేకుండా, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్త్వగుణ దానము అని చెప్పబడుతుంది. | మూడు విధముల దానములు ఇక ఇప్పుడు వివరించబడుతున్నాయి. శక్తానుసారం దానము ఇవ్వటం అనేది మన కర్తవ్యముగా చేయాలి. భవిష్య పురాణం ఇలా పేర్కొంటున్నది: దానమేకం కలౌ యుగే , ‘కలి కాలంలో దానం చేయటమే అంతఃకరణ శుద్ధికి మార్గము.’ రామాయణం కూడా ఇలా పేర్కొంటున్నది: ప్రగట చారి పద ధర్మ కే కలి మహుఁ ఏక్ ప్రధాన జేన కేన బిధి దీన్హేం దాన కరఇ కల్యాన ‘ధర్మమునకు నాలుగు మూలసూత్రములు ఉన్నాయి, వాటిలో ఒకటి కలియుగములో అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే - ఏ రూపంలోనైనా/పద్ధతిలో అయినా దానం చేయుము - అని.’ దాన ప్రక్రియ ఎన్నో మంచి ఫలితములను ఇస్తుంది. అది ఇచ్చే వాడికి భౌతిక ప్రాపంచిక వస్తువులమీద మమకారాసక్తిని తగ్గిస్తుంది; అది సేవా దృక్పథమును పెంచుతుంది; విశాల హృదయమును ఇస్తుంది; మరియు ఇతరుల పట్ల వాత్సల్య భావమును పెంచుతుంది. కాబట్టి, చాలా మతాల సిద్ధాంతాలు, వ్యక్తి సంపాదనలో పదవవంతు దానము చేయమని ఉపదేశిస్తున్నాయి. స్కంధ పురాణము ఈ విధముగా పేర్కొంటున్నది: న్యాయోపార్జిత విత్తస్య దశమాంశేన ధీమతః కర్తవ్యో వినియోగశ్చ ఈశ్వరప్రీత్యర్థమేవ చ ‘నీవు న్యాయముగా సంపాదించిన దానిలో నుండి, పదవవంతు పక్కకు తీసి, మరియు అది నీ కర్తవ్యముగా భావించి, దానిని దానం చేయుము. నీ దానమును ఈశ్వర ప్రీతి కోసమే అర్పితం చేయుము.’ దానము సక్రమమైనదా లేదా, ఉన్నతమైనదా నీచమైనదా, అనేది శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పిన లక్షణాలను బట్టి నిర్ణయించబడుతుంది. అది ఎప్పుడైతే హృదయపూర్వకంగా అర్హతగల పాత్రుడికి, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో ఇవ్వబడుతుందో అప్పుడు అది సత్త్వ గుణ దానము అని చెప్పబడుతుంది. |
|
యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః । దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ।। 21 ।। | 21 | 17 | యత్ — ఏదయితే; తు — కానీ; ప్రతి-ఉపకార-అర్థం — ఏదో ఉపకారము ఆశించి; ఫలమ్ — ఫలము; ఉద్దిశ్య — ఆశించి; వా — లేదా; పునః — మళ్ళీ; దీయతే — ఇవ్వబడుట; చ — మరియు; పరిక్లిష్టం — అయిష్టముగా; తత్ — అది; దానం — దానము; రాజసం — రజో గుణము లో; స్మృతమ్ — అని చెప్పబడినది. | BG 17.21:
కానీ, అయిష్టముగా ఇవ్వబడిన దానము, ఏదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము, రజో గుణములో ఉన్నదని చెప్పబడినది. | అడగక ముందే ఇవ్వటమే, దానము చేయుటకు అతిశ్రేష్ఠమైన పద్ధతి. అలాచేయకపోతే, ద్వితీయ శ్రేణి శ్రేష్ఠపద్ధతి ఏమిటంటే, అడిగినప్పుడు సంతోషముగా ఇవ్వటం. మూడవ స్థాయి దానం చేసే స్వభావం ఏమిటంటే, అడిగినప్పుడు అయిష్టముగా ఇవ్వటం, లేదా ఇచ్చిన తరువాత, ‘అంత ఎందుకు ఇచ్చానా? కొంచెం తక్కువ ఇస్తే సరిపోయేది’ అని విచారించటం. శ్రీ కృష్ణుడు ఇటువంటి దానమును రజోగుణ దానము అని పేర్కొంటున్నాడు. |
|
అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే । అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ।। 22 ।। | 22 | 17 | అదేశ — తప్పు ప్రదేశంలో; కాలే — తప్పు సమయంలో; యత్ — ఏదైతే; దానం — దానము; అపాత్రేభ్యః — పాత్రత లేని వారికి; చ — మరియు; దీయతే — ఇవ్వబడునో; అసత్-కృతం — మర్యాద లేకుండా; అవజ్ఞాతం — చులకనగా; తత్ — అది; తామసమ్ — తమోగుణములో (అజ్ఞానములో); ఉదాహృతమ్ — పరిగణించబడును. | BG 17.22:
అనుచిత ప్రదేశంలో, సరికాని సమయంలో, అర్హతలేనివారికి (అపాత్రులకు), మర్యాద చూపకుండా, లేదా చులకనగా ఇవ్వబడిన దానము, తామసిక దానముగా పరిగణించబడుతుంది. | సరియైన ప్రదేశము, పాత్రత కలిగిన వ్యక్తి, సరైన దృక్పథముతో లేదా సరైన కాలమును చూసుకోకుండా చేసే దానము, తమోగుణ దానము. దానివల్ల ఎటువంటి ప్రయోజనమూ కలుగదు. ఉదాహరణకు, ఒక తాగుబోతుకి డబ్బు ఇస్తే, దానితో అతడు తాగిన మత్తులో ఎవరినైనా హత్య చేస్తే, ఆ హత్య చేసినవాడు కర్మ సిద్ధాంతము అనుసరించి శిక్షింపబడుతాడు, కానీ, ఆ దానము ఇచ్చినవాడు కూడా ఈ పాపంలో భాగస్వామి అవుతాడు. పాత్రత లేనివానికి ఇవ్వబడిన, తామసిక దానమునకు, ఇది ఒక ఉదాహరణ. |
|
ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః । బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ।। 23 ।। | 23 | 17 | ఓం తత్ సత్ — సర్వోత్కృష్ట అలౌకికమును సూచించే పదములు; ఇతి — ఈ విధముగా; నిర్దేశః — సూచికగా నిర్దేశింపబడిన; బ్రహ్మణః — సర్వోన్నత పరమ-సత్యము; త్రి-విధః — మూడు విధములుగా; స్మృతః — పేర్కొనబడినవి; బ్రాహ్మణాః — బ్రాహ్మణులు; తేన — వారి నుండి; వేదాః — శాస్త్రములు; చ — మరియు; యజ్ఞాః — యజ్ఞము; చ — మరియు; విహితాః — జనించినవి; పురా — సృష్టి ఆరంభము నుండి. | BG 17.23:
‘ఓం తత్ సత్’ అన్న పదములు, సృష్టి మొదలు నుండి, పరబ్రహ్మమునకు సూచికగా నిర్దేశించబడినవి. వాటి నుండే పురోహితులు, శాస్త్రములు, మరియు యజ్ఞములు ఏర్పడినవి. | ఈ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు ప్రకృతి త్రిగుణముల పరంగా, మూడు విధములైన యజ్ఞములు, తపస్సులు, మరియు దానముల గురించి వివరించి ఉన్నాడు. ఈ మూడు గుణములలో, తమో గుణము అనేది ఆత్మను అజ్ఞానము, నిర్లక్ష్యము, మరియు సోమరితనపు స్థితికి దిగజారుస్తుంది. రజో గుణము అనేది జీవులను ఉద్వేగపరిచి, దానిని అసంఖ్యాకమైన కోరికలతో బంధించివేస్తుంది. సత్త్వ-గుణము ప్రశాంతమైనది మరియు ప్రకాశవంతమయినది, మరియు సద్గుణములు పెంపొందించుకోవటానికి దోహదపడుతుంది. అయినాసరే, సత్త్వ గుణము కూడా మాయా పరిధిలోనే ఉంటుంది. దాని పట్ల మనము మమకారాసక్తితో ఉండకూడదు; బదులుగా, సత్త్వగుణమును ఒక మెట్టుగా ఉపయోగించుకుని, అలౌకిక స్థాయిని చేరుకోవాలి. ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఈ మూడు గుణములకు అతీతముగా వెళుతున్నాడు; మరియు పరమ సత్యము యొక్క వివిధ స్వరూపాలను సూచించే , ఓం తత్ సత్, అన్న పదాలను వివరిస్తున్నాడు. తదుపరి శ్లోకాలలో కృష్ణుడు ఈ మూడు పదముల విశిష్టతని వివరిస్తాడు. |
|
తస్మాద్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః । ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ।। 24 ।। | 24 | 17 | తస్మాత్ — కాబట్టి; ఓం — పవిత్ర శబ్దము 'ఓం' ; ఇతి — ఈ విధముగా; ఉదాహృత్య — పలకటం ద్వారా; యజ్ఞ — యజ్ఞము; దాన — దానము; తపః — తపస్సు; క్రియాః — చేయుట; ప్రవర్తంతే — ప్రారంభంలో; విధాన-ఉక్తాః — వేద నియమముల ప్రకారం; సతతం — ఎల్లప్పుడూ; బ్రహ్మ-వాదినామ్ — వేదముల మంత్రములను పఠించువారు. | BG 17.24:
కాబట్టి, యజ్ఞములు చేసేటప్పుడు, దానము చేసేటప్పుడు, లేదా తపస్సులు ఆచరించటంలో – వేద-విదులు, వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ 'ఓం' అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు. | ‘ఓం’ అనే శబ్దము భగవానుని నిరాకార అస్తిత్వమునకు సూచిక. అదే నిరాకార బ్రహ్మమునకు పేరు అని కూడా చెప్పబడుతుంది. అది ఈ విశ్వమంతా వ్యాప్తించి ఉన్న సనాతన శబ్దము. దాని యొక్క సరియైన ఉచ్చారణ ఏమిటంటే: ‘ఆ..’ అంటూ నోరు పెద్దదిగా అని, ‘ఓ...’ అని పెదవులు ముడుతచేసి అంటూ, మరియు "మ్.." అని పెదవులు దగ్గరగా మూసి అనటం. ఈ ‘ఓం’ కారమును వేద మంత్రముల ప్రారంభంలో బీజ మంత్రముగా, మంగళకరమైనదిగా ఉపయోగిస్తారు. |
|
తదిత్యనభిసంధాయ ఫలం యఙ్ఞతపఃక్రియాః । దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః ।। 25 ।। | 25 | 17 | తత్ — తత్ అన్న పదము; ఇతి — ఈ విధముగా; అనభిసంధాయ — ఆశించకుండా; ఫలం — ఫలమును; యఙ్ఞ — యజ్ఞము; తపః — తపస్సు; క్రియాః — పనులు; దాన — దానము; క్రియాః — క్రియలు; చ — మరియు; వివిధాః — వివిధములైన; క్రియంతే — చేయబడును; మోక్ష-కాంక్షిభిః — భౌతిక బంధముల నుండి విముక్తి కోరుకునేవారు. | BG 17.25:
ప్రతిఫలములను ఆశించని వారు, కానీ, ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయిత్నించే వారు, తపస్సు, యజ్ఞము, మరియు దానము చేసేటప్పుడు ‘తత్’ అన్న పదమును ఉచ్చరిస్తారు. | సమస్త కర్మల ప్రతిఫలములు ఆ భగవంతునికే చెందుతాయి, కాబట్టి, ఏ యజ్ఞమయినా, తపస్సు అయినా, లేదా దానమైనా, ఆ పరమేశ్వరుని ప్రీతికోసమే కోసమే అర్పించి, పవిత్రం చేయబడాలి. ఇక ఇప్పుడు శ్రీ కృష్ణుడు, బ్రహ్మన్‌ను సూచించే ‘తత్’ అన్న పద శబ్దము యొక్క విశిష్టతను వివరిస్తున్నాడు. యజ్ఞము, తపస్సు మరియు దానము చేసేటప్పుడు, ‘తత్’ అన్న పదమును ఉచ్చరించటం - అది భౌతిక ప్రతిఫలం కోసము కాకుండా, అది భగవత్ ప్రాప్తి ద్వారా ఆత్మ యొక్క శాశ్వత సంక్షేమం కోసము - అని సూచిస్తుంది. |
|
సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే । ప్రశస్తే కర్మణి తథా సఛ్చబ్దః పార్థ యుజ్యతే ।। 26 ।। యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే । కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ।। 27 ।। | 26 | 17 | సత్-భావే — నిత్య సనాతన అస్తిత్వము మరియు మంగళప్రద భావనచే; సాధు-భావే — శుభప్రద ఉద్దేశముతో; చ — మరియు; సత్ — ‘సత్’ అనే శబ్దము; ఇతి — ఈ విధముగా; ఏతత్ — ఇది; ప్రయుజ్యతే — ఉపయోగించబడును; ప్రశస్తే — మంగళకరమైన; కర్మణి — కర్మ; తథా — మరియు; సత్-శబ్దః — ‘సత్’ అనే శబ్దము; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; యుజ్యతే — ఉపయోగించబడును; యజ్ఞే — యజ్ఞములో; తపసి — తపస్సులో; దానే — దానములో; చ — మరియు; స్థితిః — స్థిరముగా; సత్ — ‘సత్’ అన్న పదము; ఇతి — ఈ విధముగా; చ — మరియు; ఉచ్యతే — ఉచ్చరించబడును; కర్మ — పని; చ — మరియు; ఏవ — నిజముగా; తత్-అర్థీయం — ఇటువంటి ప్రయోజనాల కోసం; సత్ — సత్ అన్న పదము; ఇతి — ఈ విధముగా; ఏవ — నిజముగా; అభిధీయతే — అని వివరించబడినది. | BG 17.26-27:
‘సత్’ అన్న పదానికి అర్థం - సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని. ఓ అర్జునా, అది శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ ‘సత్’ అన్న పదము వివరిస్తుంది. కావున, ఈ ప్రయోజనముతో ఉన్న ఏ పని అయినా ‘సత్’ అనబడుతుంది. | ఇక ఇప్పుడు ‘సత్’ అన్న పదము యొక్క మంగళప్రద గుణము శ్రీకృష్ణుడిచే కీర్తించబడుతున్నది. ‘సత్’ అన్న పదమునకు ఎన్నో అర్థాలు ఉన్నాయి, మరియు ఈ రెండు పై శ్లోకాలు వాటిలో కొన్నింటిని వివరిస్తున్నాయి. ‘సత్’ అన్న శబ్దము నిత్య సనాతన శుభమును మరియు మంగళదాయకమును సూచించుటకు ఉపయోగించబడుతుంది. దానితో పాటుగా, శుభకరమైన యజ్ఞము, తపస్సు, మరియు దానము చేయుట కూడా ‘సత్’ అని సూచించబడుతుంది. "సత్" అంటే ఎల్లప్పుడూ నిత్యముగా ఉండేది, అంటే, సనాతన సత్యము అని కూడా. శ్రీమద్ భాగవతము ఇలా పేర్కొంటున్నది: సత్య-వ్రతం సత్య-పరం త్రి-సత్యం సత్యస్య యోనిమ్ నిహితం చ సత్యే సత్యస్య సత్యం ఋత-సత్య-నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః (10.2.26) ‘ఓ ఈశ్వరా, నీ సంకల్పం సత్యము, నీవే పరమ సత్యము, సమస్త జగత్తు యొక్క మూడు స్థితులలో - సృష్టి, స్థితి, మరియు లయము - లలో నీవే పరమ సత్యము. నీవే సమస్త సత్యమునకు మూలము మరియు అంతము. నీవే సమస్త సత్యమునకు సారము. నీవే సత్యమును చూపగలిగే నేత్రములుగా ఉన్నావు. కాబట్టి, మేము నీకు శరణాగతి చేస్తున్నాము, సత్, సర్వోన్నత పరమ సత్యమా, దయచేసి మాకు అభయమివ్వుము.’ |
|
సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే । ప్రశస్తే కర్మణి తథా సఛ్చబ్దః పార్థ యుజ్యతే ।। 26 ।। యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే । కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ।। 27 ।। | 27 | 17 | సత్-భావే — నిత్య సనాతన అస్తిత్వము మరియు మంగళప్రద భావనచే; సాధు-భావే — శుభప్రద ఉద్దేశముతో; చ — మరియు; సత్ — ‘సత్’ అనే శబ్దము; ఇతి — ఈ విధముగా; ఏతత్ — ఇది; ప్రయుజ్యతే — ఉపయోగించబడును; ప్రశస్తే — మంగళకరమైన; కర్మణి — కర్మ; తథా — మరియు; సత్-శబ్దః — ‘సత్’ అనే శబ్దము; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; యుజ్యతే — ఉపయోగించబడును; యజ్ఞే — యజ్ఞములో; తపసి — తపస్సులో; దానే — దానములో; చ — మరియు; స్థితిః — స్థిరముగా; సత్ — ‘సత్’ అన్న పదము; ఇతి — ఈ విధముగా; చ — మరియు; ఉచ్యతే — ఉచ్చరించబడును; కర్మ — పని; చ — మరియు; ఏవ — నిజముగా; తత్-అర్థీయం — ఇటువంటి ప్రయోజనాల కోసం; సత్ — సత్ అన్న పదము; ఇతి — ఈ విధముగా; ఏవ — నిజముగా; అభిధీయతే — అని వివరించబడినది. | BG 17.26-27:
‘సత్’ అన్న పదానికి అర్థం - సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని. ఓ అర్జునా, అది శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది. యజ్ఞము, తపస్సు, మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ ‘సత్’ అన్న పదము వివరిస్తుంది. కావున, ఈ ప్రయోజనముతో ఉన్న ఏ పని అయినా ‘సత్’ అనబడుతుంది. | ఇక ఇప్పుడు ‘సత్’ అన్న పదము యొక్క మంగళప్రద గుణము శ్రీకృష్ణుడిచే కీర్తించబడుతున్నది. ‘సత్’ అన్న పదమునకు ఎన్నో అర్థాలు ఉన్నాయి, మరియు ఈ రెండు పై శ్లోకాలు వాటిలో కొన్నింటిని వివరిస్తున్నాయి. ‘సత్’ అన్న శబ్దము నిత్య సనాతన శుభమును మరియు మంగళదాయకమును సూచించుటకు ఉపయోగించబడుతుంది. దానితో పాటుగా, శుభకరమైన యజ్ఞము, తపస్సు, మరియు దానము చేయుట కూడా ‘సత్’ అని సూచించబడుతుంది. "సత్" అంటే ఎల్లప్పుడూ నిత్యముగా ఉండేది, అంటే, సనాతన సత్యము అని కూడా. శ్రీమద్ భాగవతము ఇలా పేర్కొంటున్నది: సత్య-వ్రతం సత్య-పరం త్రి-సత్యం సత్యస్య యోనిమ్ నిహితం చ సత్యే సత్యస్య సత్యం ఋత-సత్య-నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః (10.2.26) ‘ఓ ఈశ్వరా, నీ సంకల్పం సత్యము, నీవే పరమ సత్యము, సమస్త జగత్తు యొక్క మూడు స్థితులలో - సృష్టి, స్థితి, మరియు లయము - లలో నీవే పరమ సత్యము. నీవే సమస్త సత్యమునకు మూలము మరియు అంతము. నీవే సమస్త సత్యమునకు సారము. నీవే సత్యమును చూపగలిగే నేత్రములుగా ఉన్నావు. కాబట్టి, మేము నీకు శరణాగతి చేస్తున్నాము, సత్, సర్వోన్నత పరమ సత్యమా, దయచేసి మాకు అభయమివ్వుము.’ |
|
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ । అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ।। 28 ।। | 28 | 17 | అశ్రద్ధయా — శ్రద్ధవిశ్వాసములు లేకుండా; హుతం — యజ్ఞము; దత్తం — దానము; తపః — తపస్సు; తప్తం — ఆచరించి; కృతం — చేయబడిన; చ — మరియు; యత్ — ఏదైతే; అసత్ — నశించిపోయేవి; ఇతి — ఈ విధముగా; ఉచ్యతే — అని చెప్పబడును; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; న — కాదు; చ — మరియు; తత్ — అది; ప్రేత్య — పరలోకములో; నో – కాదు; ఇహ — ఈ లోకములో. | BG 17.28:
ఓ ప్రిథ పుత్రుడా, అశ్రద్దతో చేయబడిన యజ్ఞములు కానీ, దానములు కానీ, లేదా తపస్సులు కానీ, ‘అసత్’ అని చెప్పబడును. అవి ఈ లోకమున కానీ లేదా పరలోకమున కానీ ఎటువంటి ప్రయోజనాన్నీ చేకూర్చవు. | సమస్త వైదిక కర్మలు, శ్రద్ధావిశ్వాసములతో చేయబడాలి అన్న ఉపదేశమును స్థిరపరచటానికి, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, అది లేకుండా చేయబడే వైదిక కర్మలు ఎంత వ్యర్థమో ఇక చెప్తున్నాడు. శాస్త్రముల పట్ల విశ్వాసము లేకుండా కార్యములు చేసేవారు, ఈ లోకంలో మంచి ఫలితాలు పొందరు ఎందుకంటే వారి కర్మలు సక్రమ పద్ధతిలో చేసినవి అయిఉండవు. అంతేకాక, వేద శాస్త్రముల నియమముల అనుసారం చేయలేదు కాబట్టి వారికి తదుపరి జన్మలో కూడా మంచిఫలములు లభించవు. ఈ విధముగా, మన స్వంత మనోబుద్ధుల ఆధారముగా నమ్మకం (విశ్వాసం) ఉండకూడదు. బదులుగా, మన శ్రద్దావిశ్వాసములు నిర్వివాదమైన వైదిక శాస్త్రములు మరియు గురు ఉపదేశము ఆధారముగానే ఉండాలి. పదిహేడవ అధ్యాయం యొక్క ఉపదేశసారం ఇదే. |
|
అర్జున ఉవాచ । సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ । త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన ।। 1 ।। | 1 | 18 | అర్జునః ఉవాచ — అర్జునుడు పలికెను; సన్న్యాసస్య — కర్మలు త్యజించటములో; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; తత్త్వమ్ — సత్యము; ఇచ్ఛామి — కోరుతున్నాను; వేదితుమ్ — తెలుసుకొనుటకు; త్యాగస్య — కర్మ ఫలములను భోగించాలనే కోరికను త్యజించటం యొక్క; చ — మరియు; హృషీకేశ — కృష్ణా, ఇంద్రియములకు ప్రభూ; పృథక్ — భేదమును; కేశి-నిషూదన — కృష్ణ, కేశి అనే రాక్షసుడను సంహరించినవాడా. | BG 18.1:
అర్జునుడు పలికెను : ఓ మహాబాహువులు కల కృష్ణా, 'సన్యాసము' (కర్మలను త్యజించటము) మరియు 'త్యాగము' (కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించటము) ల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ హృషీకేశా, వాటి మధ్య భేదమును కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది, ఓ కేశినిషూదనా. | అర్జునుడు శ్రీ కృష్ణుడిని ‘కేశి-నిషూదనా’ అని సంబోధించాడు, అంటే ‘కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా’ అని అర్థం. ఒక భయంకరమైన గుఱ్ఱం రూపంలో వచ్చి, వ్రజభూమిలో ఉత్పాతం సృష్టించిన, కేశి అనే రాక్షసుడిని, తన భూలోక దివ్య లీలలలో, శ్రీ కృష్ణుడు, సంహరించాడు. సంశయము అనేది కూడా మనస్సులో ఉరకలు వేస్తూ భక్తి అనే తోటను నాశనం చేసే ఒక అడవి గుఱ్ఱము లాంటిదే. అర్జునుడు ఇలా సూచిస్తున్నాడు, ‘ఏ విధంగా అయితే కేశి అనే రాక్షసుడిని సంహరించావో, దయచేసి నా మనస్సులో ఉన్న సంశయమును కూడా హరించివేయుము’ అని. అతని ప్రశ్న చాలా నిశితమైనది మరియు తీక్ష్ణమైనది. అతను సన్యాసము యొక్క స్వభావమును తెలుసుకోగోరుతున్నాడు, అంటే, ‘కర్మలను త్యజించటము’ అనే దాన్ని గురించి అన్నమాట. ఆయన ‘త్యాగము’ యొక్క స్వభావాన్ని కూడా తెలుసుకోగోరుతున్నాడు, అంటే, ‘కర్మ ఫలములను భోగించాలనే కోరికను వదిలి వేయటం’ అన్నమాట. అంతేకాక, ‘పృథక్’ అన్న పదాన్ని కూడా వాడుతున్నాడు. అంటే ‘భేదము/తేడా’ అని అర్థం; అర్జునుడు ఈ రెండు పదముల అర్థం యొక్క తేడాని కూడా తెలుసుకోగోరుతున్నాడు. అర్జునుడు, శ్రీ కృష్ణుడిని హృషీకేశా అని కూడా సంబోధిస్తున్నాడు, అంటే ‘ఇంద్రియములకు అధిపతి’ అని అర్థం. అర్జునుడి లక్ష్యం ఏమిటంటే అత్యున్నత విజయం సాధించటమే, అదే మనో-ఇంద్రియములను నియంత్రణ లోనికి తెచ్చుకోవటం. ఈ విజయమే పరిపూర్ణ శాంతిని ప్రసాదించగలుగుతుంది. సర్వోన్నత భగవానుడైన శ్రీ కృష్ణ పరమాత్మ, ఇంద్రియములకు అధిపతిగా, తానే ఆ పరిపూర్ణ సిద్ధికి ఉదాహరణ. ఈ విషయం ఇంతకు పూర్వం అధ్యాయములలో కూడా వివరించబడినది. శ్రీ కృష్ణుడు సన్యాసము గురించి 5.13వ మరియు 9.28వ శ్లోకాలలో మరియు త్యాగము గురించి 4.20వ మరియు 12.11వ శ్లోకాలలో వివరించియున్నాడు. కానీ ఇక్కడ ఈ విషయమును ఇంకొక కోణంలో నుండి వివరిస్తున్నాడు. ఒకే సత్యము, తాను చాలా దృక్కోణముల నుండి వివరింపబడటానికి, వెసులుబాటు ఇస్తుంది; మరియు ప్రతి ఒక్క కోణము తనదైన ప్రత్యేక వివరణను మనకు అందిస్తుంది. ఉదాహరణకు, ఒక పూదోట లోని వేర్వేరు ప్రదేశాలు, చూసేవారికి వేర్వేరు అనుభూతులను ఇస్తాయి, మరియు మొత్తంగా పూదోటను ఒకేమారు చూస్తే, అది మరియొక అనుభూతిని ఇస్తుంది. భగవద్గీత కూడా సరిగ్గా ఇలాంటిదే. ప్రతిఒక్క అధ్యాయము ఒక ప్రత్యేక యోగము గా చెప్పబడినది, అదే సమయంలో పద్దెనిమిదవ అధ్యాయము వీటన్నిటి సారాంశముగా పరిగణించబడుతుంది. ఈ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు, పూర్వపు పదిహేడు అధ్యాయములలో చెప్పబడిన నిత్యసనాతనమైన సూత్రములను మరియు శాశ్వత సత్యమును క్లుప్తముగా సంగ్రహించి చెప్పి, మరియు, వాటన్నిటి యొక్క క్రోడీకరించిన సంగ్రహమును ధృవీకరిస్తున్నాడు. సన్యాసము మరియు వైరాగ్యము అనే విషయములను వివరించిన పిదప, ఆయన త్రి-గుణముల యొక్క స్వభావమును మరియు అవి జనుల యొక్క స్వాభావిక ప్రవృత్తిని ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తాడు. సత్త్వ గుణము మాత్రమే మనము పెంపొందించుకోవలసిన గుణము అని తిరిగి వక్కాణిస్తున్నాడు. భక్తి, అంటే, భగవంతుని పట్ల అనన్యమైన ప్రేమయుక్త అనురాగమే అత్యున్నత కర్తవ్యము అని, దానిని పొందటమే మానవ జీవనం యొక్క లక్ష్యము అని ముగిస్తున్నాడు. |
|
శ్రీ భగవానువాచ । కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః । సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ।। 2 ।। | 2 | 18 | శ్రీ-భగవానువాచ — శ్రీ భగవానుడు పలికెను; కామ్యానాం — కోరికలచే ప్రేరేపితమై ఉన్న; కర్మణాం — కర్మల యొక్క; న్యాసం — త్యజించుట; సన్న్యాసం — సన్యాసము అని (కర్మలను త్యజించుట); కవయః — జ్ఞాన సంపన్నులు; విదుః — అర్థం చేసుకొనుట; సర్వ — సమస్త; కర్మ-ఫల — కర్మ ఫలముల; త్యాగం — కర్మ ఫలములను భోగించు కోరికను త్యజించుట; ప్రాహుః — చెప్పబడినవి; త్యాగం — కర్మ ఫలములను భోగించు కోరికను త్యజించుట అని; విచక్షణాః — వివేకవంతులు. | BG 18.2:
శ్రీ భగవానుడు ఇలా పలికెను : కోరికలచే ప్రేరితమైన కర్మలను త్యజించటమే సన్యాసము అని జ్ఞానసంపన్నులు అన్నారు. సమస్త కర్మల ఫలములను విడిచిపెట్టటమే పండితులు త్యాగము అని అన్నారు. | కవయః అంటే పండితులు/జ్ఞానసంపన్నులు. సన్యాసము అంటే కర్మలను విడిచిపెట్టడము అని పండితులు పేర్కొంటారు, అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. భౌతిక భోగముల కోసము పనులు చేయటం విడిచిపెట్టి, సన్యాసాశ్రమం లోకి ప్రవేశించినవారిని కర్మ సన్యాసులు అంటారు. వారు కొన్ని నిత్య కర్మలు (శరీర పోషణ కోసం కొన్ని రోజువారీ పనులు) చేస్తూనే ఉంటారు కానీ కామ్య కర్మలు (సంపద, సంతానము, హోదా, పదవి, అధికారం వంటి వాటి కోసం చేసే కర్మలు) విడిచిపెడతారు. ఇటువంటి కామ్య కర్మలు జీవాత్మను కర్మ చక్రములో మరింత బంధించివేస్తాయి మరియు ఈ జనన-మరణ సంసారములో పదేపదే పునర్జన్మకు కారణమౌతాయి. 'విచక్షణాః' అంటే తెలివి/వివేకము కలవారు. శ్రీ కృష్ణుడు అనేదేమిటంటే, వివేకవంతులు త్యాగమునకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు, అని. అంటే, ‘అంతర్గత సన్యాసము’ అన్నమాట. దీనర్థం ఏమిటంటే, వేద విహిత కర్మలను త్యజించకుండా, వాటి వలన వచ్చే ఫలములను భోగించాలనే కోరికను త్యజించుట. కాబట్టి, కర్మ ఫలముల పట్ల ఆసక్తిని విడిచిపెట్టే దృక్పథాన్నే త్యాగము అంటారు, అదేసమయంలో, పనులను త్యజించటాన్ని సన్యాసము అంటారు. జ్ఞానోదయ భగవత్ ప్రాప్తి కోసం సన్యాసము మరియు త్యాగము రెండూ కూడా చక్కటి పద్ధతులే అనిపిస్తాయి. ఈ రెండు మార్గాలలో, దేనిని శ్రీకృష్ణుడు సిఫారసు చేస్తున్నాడు? ఈ విషయంపై మరింత స్పష్టతను శ్రీ కృష్ణుడు తదుపరి శ్లోకాలలో మనకు అందచేస్తాడు. |
|
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః । యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే ।। 3 ।। | 3 | 18 | త్యాజ్యం — విడిచిపెట్టవలసినదే (త్యజింపదగినదే); దోష-వత్ — దోషపూరితములు; ఇతి — అని; ఏకే — కొందరు; కర్మ — కర్మలు; ప్రాహుః — ప్రకటిస్తారు; మనీషిణః — విద్వాంసులు; యజ్ఞ — యజ్ఞము; దాన — దానము; తపః — తపస్సు; కర్మ — కర్మలు; న త్యాజ్యమ్ — ఎన్నడూ విడిచిపెట్టకూడదు; ఇతి — అని ఈ విధముగా; చ — మరియు; అపరే — ఇతరులు. | BG 18.3:
కొంతమంది విద్వాంసులు కర్మలు అన్నియూ దోషభూయిష్టమైనవి అని, వాటిని విడిచిపెట్టాలి అంటారు, అదే సమయంలో మరికొంతమంది, యజ్ఞములు, దానములు, మరియు తపస్సులను ఎన్నడూ విడిచిపెట్టవద్దు అంటారు. | కొంతమంది తత్త్వవేత్తలు, ఉదాహరణకు సాంఖ్య సిద్ధాంతమునకు చెందిన వారు, ప్రాపంచిక జీవితాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా త్యజించాలి అంటారు. కోరికలచే ఉత్పన్నమైనవి కాబట్టి అన్ని కర్మలూ విడిచిపెట్టబడాలి, ఎందుకంటే అవి జీవున్ని జనన-మరణ చక్రములో మరింత బంధించివేస్తాయి, అనే అభిప్రాయముతో ఉంటారు. అన్ని కర్మలూ కూడా, పరోక్ష హింస వంటివాటిచే ఎంతోకొంత దోషయుక్తముగా ఉంటాయి, అని వాదిస్తారు. ఉదాహరణకు, దీపం వెలిగిస్తే, అనుకోకుండా పురుగులు దానిలో పడి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే వారు, శరీర నిర్వహణకు అవసరమయ్యే వాటిని తప్ప, మిగతా అన్ని కర్మలను త్యజించే మార్గమును బోధిస్తారు. ఇతర తత్త్వవేత్తలు, ఉదాహరణకు మీమాంస శాస్త్రమునకు చెందినవారు, వేదవిహిత కర్మలను ఎన్నటికి త్యజించరాదు అని అంటారు. ఎక్కడెక్కడైతే వేదాల్లో రెండు విరుద్ధమైన ఉపదేశాలు ఉంటాయో, ఒక ప్రత్యేకమైన ఉపదేశం ప్రముఖంగా ఉంటే, అది సామాన్యమైన ఉపదేశాన్ని కొట్టివేస్తుంది, అని వాదిస్తారు. ఉదాహరణకి, వేదములు, మా హింస్యాత్ సర్వా భూతాని, ‘ఏ ప్రాణి పట్ల కూడా హింసకు పాల్పడరాదు’ అని చెప్పాయి. ఇది సామాన్యంగా వర్తించే సూత్రము. అదే వేదములు మనలను అగ్నితో యజ్ఞములను కూడా చేయమని చెప్తాయి. ఇది ఒక ప్రత్యేకమైన ఆదేశము. ఈ యజ్ఞాచరణలో కొన్ని రకాల ప్రాణులు అనుకోకుండా అగ్నిలో పడి చనిపోవచ్చు. కానీ మీమాంసకులు (మీమాంస తత్త్వ సిద్ధాంతమును అనుసరించేవారు), ఈ యొక్క యజ్ఞమును చేయమనే ప్రత్యేకమైన ఉపదేశమే ఉన్నతమైనది; అది 'హింసకు పాల్పడవద్దు' అనే సామాన్య ఉపదేశమునకు విరుద్ధంగా ఉన్నాసరే, దానిని పాటించాలి అని వాదిస్తారు. కాబట్టి, మేలు కలిగించే కార్యములైన యజ్ఞము, దానము, మరియు తపస్సులను మనము ఎప్పుడూ త్యజించకూడదు అని మీమాంసకులు అంటారు. |
|
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ । త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః ।। 4 ।। | 4 | 18 | నిశ్చయం — అంతిమ నిర్ధారణ; శృణు — వినుము; మే — నా యొక్క; తత్ర — ఆ విషయంలో; త్యాగే — కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించుట గురించి; భరత-సత్-తమ — భరతులలో శ్రేష్ఠుడా; త్యాగః — కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించుట; హి — నిజముగా; పురుష-వ్యాఘ్ర — పురుషులలో శ్రేష్ఠుడా; త్రివిధః — మూడు రకముల; సంప్రకీర్తితః — పేర్కొనబడినవి. | BG 18.4:
త్యాగము అన్న విషయముపై ఇక ఇప్పుడు నా తుది నిర్ణయమును వినుము, ఓ పురుషవ్యాఘ్రమా, త్యాగము అనేది మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పబడినది. | త్యాగము అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే అది ఉన్నతమైన జీవనానికి నాంది. నీచ స్థాయి కోరికలను త్యజించటం ద్వారా మాత్రమే మనం ఉన్నతమైన ఆశయాలను పెంపొందించుకోగలము. అదే విధముగా, క్రింది స్థాయి పనులను విడిచిపెట్టడం ద్వారానే మనము ఉన్నతమైన విధులను మరియు కార్యకలాపముల పట్ల అంకితం కావచ్చు మరియు జ్ఞానోదయ దిశగా ముందుకెళ్ళవచ్చు. కానీ, ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణుడు యదార్థముగా సన్యాసము అంటే ఏమిటి అన్న విషయము పై భిన్నమైన అభిప్రాయలు ఉన్నాయి అని తెలియచేసాడు. ఇంతకు క్రితం శ్లోకంలో రెండు విరుద్ధమైన దృక్కోణాలను పేర్కొన్నపిదప శ్రీ కృష్ణుడు ఇక తన యొక్క అభిప్రాయమును చెప్తున్నాడు, ఇదే ఈ విషయముపై అంతిమ తీర్పు. త్యాగము అన్న విషయమును, దానిని మూడు రకాలుగా వర్గీకరిస్తూ (7 నుండి 9వ శ్లోకం వరకు) వివరిస్తాను అని అంటున్నాడు. అర్జునుడిని 'వ్యాఘ్రా' అంటే 'పురుషులలో పులి వంటి వాడా’ అని అర్థం, ఎందుకంటే త్యాగానికి సాహాసోపేత హృదయము కావాలి. సంత్ కబీర్ ఇలా పేర్కొన్నారు: తీర తలవార్ సే జో లడఇ, సో శూరవీర నహి హోయ మాయా తజి భక్తి కరే, శూరా కహావఇ సోయ ‘సాహసవంతుడు అంటే ఏదో కత్తులతో లేదా బాణాలతో యుద్ధం చేసేవాడు కాదు; మాయను విడిచిపెట్టి, భక్తిలో నిమగ్నమైన వాడే నిజమైన ధైర్యశాలి.’ |
|
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ । యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ।। 5 ।। | 5 | 18 | యజ్ఞ — యజ్ఞము; దాన — దానము; తపః — తపస్సు; కర్మ — కర్మలు; న త్యాజ్యం — ఎప్పుడూ కూడా త్యజించకూడదు; కార్యం ఏవ — తప్పకుండా చేయబడాలి; తత్ — అది; యజ్ఞ — యజ్ఞము; దానం — దానము; తపః — తపస్సు; చ ఏవ — మరియు నిజముగా; పావనాని — పావనం చేయును; మనీషిణామ్ — బుద్ధిమంతులకు. | BG 18.5:
యజ్ఞము, దానము, మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు; అవి తప్పకుండా చేయబడాలి. నిజానికి యజ్ఞము, దానము, మరియు తపస్సు అనేవి బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి. | మనము ఎప్పుడూ మనలను ఉద్ధరించే మరియు మానవ జాతికి హితకరమైన కర్మలను త్యజించకూడదు అని శ్రీ కృష్ణుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఇటువంటి పనులను, సరియైన దృక్పథంలో చేసినప్పుడు, అవి మనలను బంధించివేయవు, పైగా అవి మనలను ఉన్నత స్థితికి ఉద్ధరిస్తాయి. ఒక గొంగళిపురుగు ఉదాహరణను తీసుకోండి. తనను తాను రూపాంతరము చేసుకోవటానికి, అది తన చుట్టూ తన పరిణామము కోసం ఒక గూడుకట్టుకుంటుంది మరియు తననుతాను దానిలో బంధించుకుంటుంది. అది ఒకసారి సీతాకోకచిలుకగా మారిపోయినప్పుడు, అది ఆ గూడుని చీల్చుకుని ఆకాశంలో ఎగిరిపోతుంది. ఈ జగత్తులో మన పరిస్థితి కూడా ఈవిధంగానే ఉంటుంది. ఆ వికృతమైన గొంగళిపురుగులా, మనం ప్రస్తుతం ఈ భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తులమై, సద్గుణ రహితముగా ఉన్నాము. మనం కోరుకునే అంతర్గత పరిణామము (మార్పు) కోసం, స్వీయ-సాధన, మరియు స్వీయ-శిక్షణలో భాగంగా, మనము కర్మలు చేయవలసి ఉంటుంది. యజ్ఞము, దానము, మరియు తపస్సు అనేవి మన ఆధ్యాత్మిక ఉన్నతికి, వికాసానికి దోహదపడే పనులు. ఒక్కోసారి, ఇవి కూడా బంధనకారకములే అని అనిపిస్తాయి, కానీ అవి గొంగళిపురుగు యొక్క గూడువంటివి. అవి మన మలినములను హరిస్తాయి, అంతర్గతముగా మనలను అందంగా చేస్తాయి, మరియు ఈ భౌతిక అస్తిత్వపు సంకెళ్లను ఛేదించటానికి సహకరిస్తాయి. కాబట్టి, ఇటువంటి పవిత్రమైన కార్యములను ఎప్పుడూ విడిచిపెట్టకూడదు అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో ఉపదేశిస్తున్నాడు. ఇక ఇప్పుడు వీటిని ఎటువంటి సరియైన దృక్పథం తో చేయాలో చెప్తున్నాడు. |
|
ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ । కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ।। 6 ।। | 6 | 18 | ఏతాని — ఇవి; అపి తు — ఖచ్చితముగా; కర్మాణి — కర్మలు (పనులు); సంగం — సంగము (మమకారాసక్తి); త్యక్త్వా — త్యజించి; ఫలాని — ఫలములు; చ — మరియు; కర్తవ్యాని — కర్తవ్యము అని అనుకుని చేయబడాలి; ఇతి — ఈ విధముగా; మే — నా యొక్క; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; నిశ్చితం — ఖఛ్చితమైన; మతం — అభిప్రాయము; ఉత్తమం — సర్వోత్కృష్టమైన. | BG 18.6:
ఫలములపై మమకారాసక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు, ఓ అర్జునా. | యజ్ఞము, దానము, మరియు తపస్సులు పరమేశ్వరుని పట్ల భక్తియుక్త భావముతో చేయబడాలి. ఆ దృక్పథం ఇంకా రానప్పుడు, వాటిని తప్పకుండా అవి తన కర్తవ్యము అన్న భావనతో, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. ఒక తల్లి, తన స్వార్థ సుఖాలను త్యజించి బిడ్డ పట్ల తన విధిని నిర్వర్తిస్తుంది. తన స్తనము లోని పాలను బిడ్డకు ఇచ్చి, బిడ్డను పోషిస్తుంది. బిడ్డకు ఇవ్వటం వలన ఆమెకు పోయేదేమీ లేదు, పైగా తన మాతృత్వమును చాటుకుంటుంది. అదే విధముగా, ఒక ఆవు రోజంతా గడ్డి మేసి, తన పొదుగులో పాలను దూడకు ఇస్తుంది. తన విధిని నిర్వర్తించటం ద్వారా ఆ ఆవు ఏమీ తరిగిపోదు; పైగా జనులు దానికి ఎంతో గౌరవిస్తారు. ఈ పనులు అన్ని నిస్వార్థముగా చేయబడినవి కాబట్టి, అవి పవిత్రమైనవిగా పరిగణించబడుతాయి. వివేకవంతులు పవిత్రమైన మరియు సంక్షేమ కార్యములను అదే నిస్వార్థ చిత్తముతో చేయాలి అని ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. ఇక ఇప్పుడు ఈ మూడు రకముల త్యాగమును గూర్చి తదుపరి మూడు శ్లోకములలో వివరిస్తున్నాడు. |
|
నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే । మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః ।। 7 ।। | 7 | 18 | నియతస్య — విధింపబడిన కర్తవ్యముల యొక్క; తు — కానీ; సన్న్యాసః — సన్యాసము; కర్మణః — కర్మలు; న ఉపపద్యతే — ఎప్పుడూ చేయకూడదు; మోహాత్ — మోహవశులై; తస్య — దానికి; పరిత్యాగః — త్యాగము; తామసః — తామసికము; పరికీర్తితః — అని చెప్పబడినది. | BG 18.7:
విధింపబడిన కర్తవ్య కర్మలను ఎన్నటికీ త్యజించరాదు. ఇటువంటి అయోమయ త్యాగము తామసిక త్యాగము అని చెప్పబడును. | నిషిద్ధ కర్మలను మరియు అనైతిక పనులను త్యజించటం సరియైనదే; కర్మ ఫలాపేక్షను త్యజించటం కూడా సరియైనదే; కానీ విహిత (చేయవలసిన) కర్మలు విడిచిపెట్టటం ఎన్నటికీ సరియైనది కాదు. విహిత కర్మలు మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికి ఉపయోగపడుతాయి మరియు అవి మనలను తమోగుణము నుండి రజో గుణమునకు దానినుండి సత్త్వ గుణమునకు ఉద్ధరించుకోవటానికి దోహదపడుతాయి. వాటిని త్యజించటం అనేది అవివేకమును ప్రదర్శించుకోవటమే అవుతుంది. సన్యాసము పేరుతో విహితకర్మలను (చేయవలసిన పనులను) విడిచిపెట్టటం అనేది తామసిక సన్న్యాసము అవుతుంది. ఈ లోకంలోకి వచ్చిన పిదప, మనకందరికీ కర్తవ్య విధులు ఉంటాయి. వాటిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తిలో ఎన్నో గుణములు వృద్ధి చెందుతాయి – బాధ్యత తీసుకోవటం, మనోఇంద్రియముల క్రమశిక్షణ, బాధలను-కష్టాలను సహించటం, మొదలైనవి. అజ్ఞానముతో వీటిని త్యజించటం ఆత్మ పతనానికి దారి తీస్తుంది. ఈ కర్తవ్య కర్మలు ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థాయిని బట్టి మారుతాయి. ఒక సామాన్య వ్యక్తికి, డబ్బు సంపాదించటం, కుటుంబాన్ని పోషించటం, స్నానం చేయటం, భుజించటం మొదలైన దైనందిన పనులన్నీ కర్తవ్య విధులే. వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదిగిన కొద్దీ, ఈ కర్తవ్య కర్మలు మారుతాయి. మాహాత్ములకి, యజ్ఞము, దానము మరియు తపస్సు అనేవి కర్తవ్య విధులు. |
|
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్యజేత్ । స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ।। 8 ।। | 8 | 18 | దుఃఖం — కష్టదాయకమైనది; ఇతి — ఈ విధముగా; ఏవ — నిజముగా; యత్ — ఏదయితే; కర్మ — విధులు; కాయ — శారీరక; క్లేశ — అసౌకర్యము; భయాత్ — భయముతో; త్యజేత్ — త్యజించుట; సః — వారు; కృత్వా — చేయటం వల్ల; రాజసం — రజో గుణములో; త్యాగం — కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించటం; న — కాదు; ఏవ — నిజముగా; త్యాగ ఫలం — త్యాగఫలము (కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించుట యొక్క ఫలము); లభేత్ — పొందుట. | BG 18.8:
విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను, అవి కష్టముగా ఉన్నాయని లేదా శారీరక అసౌకర్యమును కలిగిస్తున్నాయని తలచి, వాటిని విడిచిపెట్టటాన్ని, రజో గుణ త్యాగము అంటారు. అటువంటి త్యాగము ఎప్పటికీ క్షేమదాయకమైనది కాదు మరియు మన ఉన్నతికి దోహదపడదు. | జీవితంలో పురోగతి అంటే మన బాధ్యతలను విస్మరించటం కాదు, పైగా మన బాధ్యతలను పెంచుకోవటం అవసరమౌతుంది. కొత్తగా ఆధ్యాత్మిక పథంలోకి వచ్చిన వారు, తరచుగా ఈ నిజాన్ని అర్థంచేసుకోరు. కష్టాన్ని తప్పించుకోవాలని మరియు పరిస్థితుల నుండి పారిపోయే దృక్పథంతో, ఆధ్యాత్మిక ఆశయాలని ఒక కారణం లాగా చూపి, వారి యొక్క కర్తవ్య విధులను విడిచిపెడతారు. కానీ, జీవితం అంటే ఎటువంటి కష్టాలు లేకుండా ఉండదు. ఉన్నతమైన సాధకులు అంటే, ఏమీ చేయకపోవటం వలన నిశ్చలంగా ఉన్నవారు కాదు. పైగా, ఎంతో పెద్ద బాధ్యతను భుజాలపై మోస్తున్నా, వారు వారి యొక్క ప్రశాంతతను కాపాడుకుంటారు. అవి కష్టతరముగా ఉన్నాయని తమ విధులను త్యజించటము అనేది రజోగుణ త్యాగము అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో పేర్కొన్నాడు. ప్రారంభం నుండీ కూడా, భగవద్గీత అనేది, ‘కర్మను ప్రేరేపించేదే’ అంటే ఆంగ్లంలో 'is a call for action' అన్నమాట. అర్జునుడు తన కర్తవ్యమును అప్రియమైనదిగా మరియు చికాకైనదిగా భావించాడు, అందుచే యుద్ధభూమి నుండి పారిపోవాలని అనుకున్నాడు. శ్రీ కృష్ణుడు దీనిని అజ్ఞానము మరియు బలహీనతగా అభివర్ణించాడు. అర్జునుడికి అది కష్టతరముగా అనిపించినా సరే, తన కర్తవ్యమును కొనసాగించమనే చెప్పాడు; అదే సమయంలో ఒక అంతర్గత మార్పుని చేసుకోమన్నాడు. దీనికోసం, అర్జునుడికి ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించి, అర్జునుడుకి జ్ఞాన నేత్రములు పెంపొందేలా సహకరించాడు. భగవద్గీత విన్న పిదప అర్జునుడు తన వృత్తిని మార్చుకోలేదు, కానీ, తను చేసే పనులను ఏ దృక్పథంతో చేయాలో ఆ దృక్పథాన్ని మార్చుకున్నాడు. ఇంతకు క్రితం, తన కీర్తి మరియు సౌలభ్యం కొరకు హస్తినాపుర రాజ్యమును జయించాలనే కోరికతో యుద్ధానికి వచ్చాడు; తర్వాత కూడా తన కర్తవ్యమును కొనసాగించాడు, కానీ ఇప్పుడు దానిని భగవంతుని పట్ల భక్తిగా చేసాడు. |
|
కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేఽర్జున । సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః ।। 9 ।। | 9 | 18 | కార్యం — ఒక కర్తవ్యముగా; ఇతి — అలా; ఏవ — నిజముగా; యత్ — ఏదయితే; కర్మ నియతం — చేయవలసిన (విహిత) కర్మలు; క్రియతే — చేయబడునో; అర్జున — అర్జునా; సంగం — మమకారాసక్తి; త్యక్త్వా — త్యజించి; ఫలం — ప్రతిఫలము; చ — మరియు; ఏవ — నిజముగా; సః — అటువంటి; త్యాగః — కర్మఫలములను భోగించాలనే వాంఛను విడిచిపెట్టుట; సాత్త్వికః — సత్త్వగుణములో ఉన్నది; మతః — అని పరిగణించబడును. | BG 18.9:
అర్జునా, కర్తవ్యమునకు అనుగుణంగా ఎప్పుడైతే కర్మలు చేయబడుతాయో, మరియు ఫలాపేక్ష త్యజించబడుతుందో, దానిని సత్త్వగుణ త్యాగము అంటారు. | శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు అత్యున్నత రకమైన త్యాగమును వివరిసున్నాడు; దీనిలో మన విహిత కర్మలను అన్నింటిని చేస్తూనేఉంటాము, కానీ కర్మ ఫలముల పట్ల ఆసక్తిని విడిచిపెడతాము. సత్త్వగుణములో స్థితమై ఉన్న దీనిని అత్యున్నత త్యాగముగా శ్రీ కృష్ణుడు అభివర్ణిస్తున్నాడు. సన్న్యాసము అనేది ఆద్ధ్యాత్మిక పురోగతికి ఖచ్చితముగా అవసరమయ్యేదే. ఇక్కడ సమస్య ఏమిటంటే, జనులకు సన్న్యాసము అంటే ఏమిటో సరిగ్గా తెలియదు మరియు సన్న్యాసమంటే బాహ్యమైన కర్మలను త్యజించటము అనుకుంటారు. ఇటువంటి త్యాగము ఒక అయోమయ కపట స్థితికి దారి తీస్తుంది, అంటే, ఏదో బయటకి కాషాయి బట్టలు కట్టుకున్నా, అంతర్గతముగా వ్యక్తి ఇంద్రియ వస్తువిషయముల పట్లే చింతన చేస్తుంటాడు. భారత దేశంలో ఎంతో మంది సాధువులు ఈ రకమైన కోవకే చెందుతారు. వారు భగవత్ ప్రాప్తి కోసము అనే సదుద్దేశముతోనే ప్రపంచాన్ని విడిచిపెడతారు, కానీ వారి మనస్సు ఇంకా ఇంద్రియ వస్తువిషయముల నుండి విడివడకపోవటం చేత, వారి సన్యాసము ఆశించిన ఫలితములను ఇవ్వలేదు. అందుచేత, వారు చేసిన పని వారిని ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవన స్థాయికి తీసుకుపోలేదు. ఇక్కడ లోపం, వారు చేసిన పనుల యొక్క క్రమంలో ఉంది - మొదట వారు బాహ్యమైన సన్యాసముకై ప్రయత్నించారు మరియు తరువాత అంతర్గత సన్యాసముకై ప్రయత్నించారు. ఈ శ్లోకం యొక్క ఉపదేశం ఆ క్రమమును త్రిప్పివేయమనే - మొదట అంతర్గత వైరాగ్యమును పెంచుకోవాలి తరువాత బాహ్యంగా సన్యసించవచ్చు. |
|
న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే । త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ।। 10 ।। | 10 | 18 | న — కాదు; ద్వేష్టీ — ద్వేషము; అకుశలం — నచ్చనివి; కర్మ — పనులు; కుశలే — అనుకూలమైనవి/ఇష్టమైనవి; న అనుషజ్జతే — ఆశించకుండా ఉంటాడో; త్యాగీ — కర్మఫలములను భోగించాలనే వాంఛను విడిచిపెట్టినవాడు; సత్త్వ — సత్త్వ గుణము యందు; సమావిష్టః — సంపన్నుడైన; మేధావీ — తెలివికలవాడు; ఛిన్నసంశయః — ఎటువంటి సంశయములు లేని వారు. | BG 18.10:
నచ్చని పనులు తప్పించుకోటానికి యత్నించకుండా లేదా ఇష్టమైన/అనుకూలమైన పనుల కోసం ఆశించకుండా ఉండే వారు నిజమైన త్యాగులు. వారు సత్త్వగుణ సంపన్నులు మరియు వారు ఎటువంటి సంశయములు లేనివారు (కర్మ స్వభావం గురించి). | సత్త్వగుణ త్యాగములో ఉండేవారు, ప్రతికూల పరిస్థితులలో కృంగిపోరు లేదా అనుకూల పరిస్థితులయందు ఆసక్తితో ఉండరు. వారు, అన్ని పరిస్థితులలో, కేవలం తమ కర్తవ్యమును చేస్తూ పోతుంటారు; అంతా బాగున్నప్పుడు అత్యుత్సాహ పడరు, లేదా జీవన గమనం కష్టమైనప్పుడు నిరాశ చెందరు. వారు ఎండుటాకులా వీచే ప్రతి పిల్లగాలికి అక్కడిక్కడికి విసిరివేయబడరు. బదులుగా, వారు సముద్ర రెల్లు మొక్కల వంటివారు, వారి సమచిత్తత పోగొట్టుకోకుండా, క్రోధమునకు, దురాశకు, ఈర్ష్యకు, లేదా మమకారాసక్తికి వశపడకుండా, పడిలేచే ప్రతి అలతో అనుగుణముగా వ్యవహారమును కుదుర్చుకుంటారు. తమ చుట్టూ పడి లేచే పరిస్థితుల అలలకు సాక్షిగా నిలిచిపోతారు. బాల గంగాధర తిలక్, ఒక భగవద్గీత పండితుడు మరియు ప్రఖ్యాత కర్మయోగి. మహాత్మా గాంధీ గారు రాకముందు, ఆయనే భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఏ పదవి తీసుకుంటారు - ప్రధాన మంత్రా లేక విదేశీవ్యవహార మంత్రా? అని ఆయనను అడిగినప్పుడు, ‘నాకు, డిఫరేన్సియల్ కాల్‌క్యులస్, (Differential Calculus) పై ఒక పుస్తకం వ్రాయాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. దానిని పూర్తిచేస్తాను.’ అని ఆయన అన్నాడు. ఒకసారి, పోలీసులు ఆయనను అశాంతి కలుగచేసాడన్న నెపంపై అరెస్టు చేశారు. ఆయన తన స్నేహితుడిని, తనమీద ఏ అభియోగంపై అరెస్టు చేశారో కనుక్కోమన్నాడు. ఓ గంట సేపటి తరువాత ఆ స్నేహితుడు జైలుకు వెళ్తే అక్కడ తిలక్ జైల్లో హాయిగా నిద్రపోతున్నారు. ఇంకొకసారి, ఆయన ఆఫీసులో పనిచేసుకుంటున్నప్పుడు, ఆయన పెద్దకొడుకు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు అని అక్కడి గుమాస్తా చెప్పాడు. ఆయన భావోద్వేగానికి లోను కాకుండా, గుమస్తాని ఒక వైద్యుడిని పిలిపించమని చెప్పి, తన పనిలో నిమగ్నమైపోయాడు. ఓ అరగంట తరువాత, ఆయన స్నేహితుడు వచ్చి అదే వార్తను చెప్పాడు. అప్పుడాయన అన్నాడు, ‘వాడిని చూడటానికి వైద్యుడిని పిలిపించాను కదా, ఇంకేమి చేయాలి?’ అని. ఎంత తీవ్ర ఒత్తిడి పరిస్థితిలో ఉన్నా ఆయన తన మానసిక ప్రశాంతత ని ఎలా పదిలంగా ఉంచుకున్నాడో ఈ సంఘటనల వలన తెలుస్తున్నది. తన యొక్క అంతర్గత స్థిమితత్వం వలన ఆయన తన కార్యకలాపములను చేసుకోగలిగాడు; ఒకవేళ ఆయన భావోద్వేగానికి లోనయ్యి ఉంటే ఆయన జైలులో నిద్రపోయి ఉండేవాడే కాదు లేదా కార్యాలయంలో తన పని మీద ఏకాగ్రతను నిలుపుకునేవాడే కాదు. |
|
న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః । యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ।। 11 ।। | 11 | 18 | న — కాదు; హి — నిజముగా; దేహ-భృతా — శరీరధారులకు; శక్యం — సాధ్యము; త్యక్తుం — త్యజించుట; కర్మాణి — కర్మలు; అశేషతః — పూర్తిగా; యః — ఎవరైతే; తు — కానీ; కర్మ-ఫల — కర్మ ఫలములను; త్యాగీ — కర్మఫలములను భోగించాలనే ఉన్న సమస్త కోరికలను త్యజిస్తారో; సః — వారు; త్యాగీ — కర్మఫలములను భోగించాలనే ఉన్న సమస్త కోరికలను విడిచిపెట్టినవాడు; ఇతి — ఈ విధముగా; అభిదీయతే — చెప్పబడును. | BG 18.11:
దేహమును కలిగున్న ఏ జీవికి కూడా, కర్మలను పూర్తిగా త్యజించటం శక్యము కాదు. అందుకే, తన కర్మ ఫలములను త్యజించినవాడే నిజమైన త్యాగి అని చెప్పబడును. | కర్మ ఫలములను త్యజించటం కన్నా అసలు కర్మలనే పూర్తిగా త్యజించటమే మేలు కదా అని కొందరు వాదించవచ్చు, దానితో ఇక ధ్యానమునకు మరియు ఆధ్యాత్మిక చింతనకు ఎలాంటి అవరోధము ఉండదు అనుకోవచ్చు. శ్రీ కృష్ణుడు అది ఆచరణకు సాధ్యంకానిదని తిరస్కరిస్తున్నాడు, ఎందుకంటే శరీరధారులకు పూర్తిగా ఎటువంటి కర్మలు చేయకుండా ఉండటం సాధ్యం కాదు. శరీర నిర్వహణకు అవసరమయ్యే పనులు అంటే, భుజించటం, నిద్రపోవటం, స్నానం చేయటం, మొదలైనవి అందరూ చేయవలసినదే. అంతేకాక, నిల్చోవటం, కూర్చోవటం, ఆలోచించటం, నడవటం, మాట్లాడటం వంటి పనులు కూడా చేయకుండా ఉండలేము. ఒకవేళ మనము త్యాగము/సన్న్యాసము అంటే బాహ్యమైన పనులు విడిచిపెట్టటం అనుకుంటే, నిజంగా సన్యసించిన వారెవరూ ఉండరు. కానీ, శ్రీ కృష్ణుడు ఇక్కడ అనేదేమిటంటే, కర్మఫలములను త్యజిస్తే, అది పరిపూర్ణ త్యాగము అవుతుంది, అని. |
|
అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ । భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ ।। 12 ।। | 12 | 18 | అనిష్టం — అయుష్టములు; ఇష్టం — ఇష్టమైనవి; మిశ్రం — ఈ రెండూ మిశ్రమమైనవి; చ — మరియు; త్రి-విధం — మూడు విధములైన; కర్మణః ఫలం — కర్మఫలములు; భవతి — ఉండును; అత్యాగినాం — వ్యక్తిగత ప్రతిఫలము పట్ల ఆకర్షితమయ్యేవారు; ప్రేత్య — మరణించిన పిదప; న — కాదు; తు — కానీ; సన్యాసినాం — కర్మలను త్యజించినవారు; క్వచిత్ — ఎప్పటికీ. | BG 18.12:
స్వప్రయోజనము పట్ల ఆసక్తితో ఉండేవారికి, మరణించిన పిదప కూడా - సుఖము, దుఃఖము, మరియు ఈ రెంటి మిశ్రమము - ఈ మూడు విధములుగా కర్మ ప్రతిఫలములు ఉండును. కానీ, కర్మఫల త్యాగము చేసిన వారికి అటువంటి ఫలములు ఈ లోకములో కానీ, పరలోకములో కానీ ఉండవు. | మరణించిన పిదప, ఆత్మ మూడు రకముల ఫలములను అనుభవిస్తుంది, అవి 1) ఇష్టం, స్వర్గ లోకాలలో ఆనందకర అనుభవాలు, 2) అనిష్టం, అంటే నరక లోకాలలో బాధాకర అనుభవాలు. మరియు 3) మిశ్రమం, అంటే మానవ రూపంలో భూలోకంలో మిశ్రమమైన అనుభవాలు. పుణ్య కర్మలు చేసినవారికి స్వర్గాది లోకములు ప్రసాదించబడుతాయి; పాప కర్మలు చేసినవారికి నిమ్న లోకాలలో జన్మ ఇవ్వబడుతుంది; మరియు పుణ్య-పాప కర్మలు రెండింటినీ చేసినవారికి మానవ జన్మ ఇవ్వబడుతుంది. కానీ, కర్మలను ఫలాపేక్షతో చేసినవారికే ఇది వర్తిస్తుంది. ఇటువంటి ఫలాపేక్షను విడిచి, కేవలం భగవంతుని పట్ల విధిగా మాత్రమే చేస్తే, మన కర్మలకు ఇటువంటి ఏ ఫలమూ అంటదు. ఇదే రకమైన సూత్రము ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఉంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపితే అది హత్యగా పరిగణించబడుతుంది, మరణశిక్ష కూడా విధింపబడే నేరము. కానీ, ఒకవేళ ప్రభుత్వమే ఎవరినైనా ఘోర హంతకుడు, అతను “సజీవంగానయినా, నిర్జీవంగా అయినా పట్టుబడాలి” (‘wanted dead or alive’) అని ప్రకటిస్తే, అప్పుడు అటువంటి వ్యక్తిని చంపటం న్యాయవ్యవస్థ దృష్టిలో నేరముగా పరిగణించబడదు. పైగా, ఆ పనికి ప్రభుత్వంచే బహుమానం కూడా ఇవ్వబడుతుంది, మరియు ఆ చంపిన వ్యక్తి, దేశంలో హీరోగా గౌరవించబడుతాడు. అదేవిధముగా, మన పనులలో స్వార్థ చింతనను విడిచి పెడితే, అప్పుడు కర్మల యొక్క మూడు రకముల ఫలములు దానికి అంటవు. |
|
పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే । సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ।। 13 ।। | 13 | 18 | పంచ — ఐదు; ఏతాని — ఇవి; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; కారణాని — కారణములు; నిబోధ — వినుము; మే — నా నుండి; సాంఖ్యే — సాంఖ్య శాస్త్రము యొక్క; కృత-అంతే — కర్మల ప్రతిచర్యను ఆపే; ప్రోక్తాని — వివరించును; సిద్ధయే — సాధించుటకు; సర్వ — సమస్త; కర్మణామ్ — కర్మల యొక్క. | BG 18.13:
ఓ అర్జునా, ఏ కార్యము చేయబడాలన్నా వాటి వెనుక ఉన్న ఐదు కారకముల గురించి సాంఖ్య శాస్త్రము ప్రకారం ఏమి చెప్పారో ఇప్పుడు చెప్తాను వినుము, అది కర్మ ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో వివరిస్తుంది. | ప్రతిఫలాల పట్ల మమకారాసక్తి లేకుండా కర్మలు చేయవచ్చు అని తెలుసుకున్న పిదప, ఒక సహజమైన ప్రశ్న కలుగుతుంది: ‘కర్మలను పుట్టించే హేతువులు ఏమిటి?’ అని. శ్రీ కృష్ణుడు తాను ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం వివరిస్తాను అని అర్జునుడికి ప్రకటిస్తున్నాడు, ఎందుకంటే ఈ జ్ఞాన విషయము కర్మ ఫలముల పట్ల అనాసక్తి పెంపొందించుకోవటానికి దోహదపడుతుంది. అదే సమయంలో, ఈ కర్మ యొక్క ఐదు అంగముల వివరణ కొత్త విశ్లేషణ కాదు, ఇది ఇంతకు పూర్వమే సాంఖ్య శాస్త్రములో కూడా చెప్పబడినది అని వివరిస్తున్నాడు. ‘సాంఖ్య’ అనేది మహర్షి కపిలుడు ప్రతిపాదించిన తత్త్వశాస్త్రము. కపిలుడు, కర్దమ ముని మరియు దేవహూతిల కుమారుడిగా వచ్చిన భగవంతుని అవతారము. ఆయన ప్రతిపాదించిన సాంఖ్య సిద్ధాంతము ఒక విశ్లేషాత్మక హేతుబద్ధత పై ఆధారపడి ఉంది. అది శరీరములోని మరియు ప్రపంచములోని వివిధ అంగముల విశ్లేషణ ద్వారా, ఆత్మ జ్ఞానమును పెంపొందిస్తుంది. కర్మ యొక్క వివిధ అంగముల విశ్లేషణ ద్వారా కారణము మరియు దాని ప్రభావము (cause and effect) ల స్వభావములను కూడా నిర్ధారణచేస్తుంది. |
|
అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ । వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ।। 14 ।। | 14 | 18 | అధిష్ఠానం — దేహము; తథా — మరియు; కర్తా — కర్త/చేయునది (జీవాత్మ); కరణం — ఇంద్రియములు; చ — మరియు; పృథక్-విధమ్ — వేర్వేరు రకాల; వివిధాః — చాలా; చ — మరియు; పృథక్ — భిన్నమైన; చేష్టా — ప్రయత్నములు; దైవం — దైవానుగ్రహము; చ ఏవ అత్ర — ఇవి ఖచ్చితముగా (కారణములు); పంచమమ్ — ఐదు. | BG 18.14:
శరీరము, కర్త (జీవాత్మ), వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము - ఇవే కర్మ యొక్క ఐదు అంగములు. | ఈ శ్లోకంలో అధిష్టానం అంటే, ‘నివసించే స్థానము’ అని, అంటే శరీరము అన్నమాట, ఆత్మ శరీరములో ఉన్నపుడే కర్మలు చేయటానికి సాధ్యమవుతుంది. 'కర్తా' అంటే 'చేసేవాడు', అంటే 'జీవాత్మ' అన్నమాట. ఆత్మ తనంతట తానే కర్మలు చేయకపోయినా, అది శరీర-మనో-బుద్ధుల వ్యవస్థను జీవప్రాణముతో కర్మలు చేయటానికి ఉత్తేజింపచేస్తుంది. అంతేకాక, అహంకార ప్రభావం వల్ల, ఆ కర్మలు చేసేది తానే, అని అనుకుంటుంది. అందుకే, శరీరముచే చేయబడిన పనులకు అది బాధ్యత వహించవలసి ఉంటుంది, మరియు ఆత్మ 'తెలిసినవాడు' మరియు 'చేసేవాడు' అని పరిగణించబడుతుంది. ప్రశ్నోపనిషత్తు ఇలా పేర్కొంటుంది: : ఏష హి ద్రష్టా స్ప్రష్టా శ్రోతా ఘ్రాతా రసయితా మంతా బోద్ధా కర్తా విజ్ఞానాత్మా పురుషః స పరే ఽక్షర ఆత్మని సంప్రతిష్ఠతే (4.9) ‘చూసేది, స్పర్శించేది, వినేది, అనుభవించేది, రుచి చూసేది, ఆలోచించేది, మరియు అర్థంచేసుకునేది - ఆత్మయే. అందుకే ఆత్మను, కర్మలను 'తెలిసినది' మరియు 'చేసేది' అని పరిగణించాలి.’ బ్రహ్మ సూత్రములు కూడా ఇలా పేర్కొంటాయి: జ్ఞో ఽత ఏవ (2.3.18) ‘యథార్థంగా ఆత్మయే జ్ఞాత’. మరల, బ్రహ్మ సూత్రములు ఇలా పేర్కొంటున్నాయి: కర్తా శాస్త్రార్థవత్త్వాత్ ‘ఆత్మయే అన్ని పనులను చేసేది, ఇది శాస్త్రములలో ధృవీకరించబడింది.’ ఈ పై వాక్యముల ద్వారా మనకు, కర్మలు చేయటంలో, జీవాత్మ కూడా ఒక భాగమే అని స్పష్టమవుతున్నది. కర్మలు చేయటంలో ఇంద్రియములు ఉపకరణములలా సహకరిస్తాయి. ఇంద్రియములు లేకుండా, ఆత్మ - రుచి, స్పర్శ, చూపు, వాసన, మరియు శబ్దము వంటి వాటిని అనుభవించలేదు. వీటితోపాటుగా, ఐదు కర్మేంద్రియములు కూడా ఉన్నాయి - చేతులు, కాళ్ళు, వాక్కు, జననేంద్రియములు, మరియు గుదము. వీటన్నిటి సహకారంతోటే ఆత్మ వివిధ రకాల పనులను చేస్తుంటుంది. అందుకే, కార్యములను సాధించటానికి ఇంద్రియములు కూడా కారకములగా పేర్కొనబడ్డాయి. కర్మ కొరకు అన్నీ ఉపకరణములు ఉన్నా, వ్యక్తి తన ప్రయత్నం చేయకపోతే, ఏ పనీ అవ్వదు. నిజానికి, మన పరిశ్రమ/ప్రయత్నం ఎంత ముఖ్యమైనది అంటే, చాణక్య పండితుడు తన నీతి సూత్రములలో ఇలా పేర్కొన్నాడు : ఉత్సాహవతాం శత్రవోపి వశీభవంతి, ‘తగినంత పరిశ్రమతో దుర్భాగ్యమును కూడా గొప్ప అదృష్టముగా మార్చుకోవచ్చు.’ నిరుత్వాహాద్ దైవం పతిత, ‘తగినంత పరిశ్రమ లేకపోతే మంచి అదృష్టము కూడా దురదృష్టముగా మారిపోవచ్చు.’ కాబట్టి, చేష్టా (పరిశ్రమ) అనేది కర్మ యొక్క మరియొక అంగము. భగవంతుడు ప్రాణుల శరీరములో సాక్షిగా స్థితమై ఉంటాడు. వాటి వాటి పూర్వ కర్మానుసారం, వివిధ జనులకు కర్మలు చేయటానికి భిన్నభిన్న సామర్థ్యములను ఇస్తుంటాడు. దీనినే మనము దైవానుగ్రహము అనవచ్చు. ఉదాహరణకు, కొందరికి గొప్ప ఐశ్వర్యము, డబ్బు సంపాదించే శక్తి/తెలివి ఉండవచ్చు. వారి యొక్క, జటిలమైన పరిస్థితుల యొక్క ఆర్థిక విశ్లేషణ శక్తిని చూసి వారి స్నేహితులు/సహోద్యోగులు చాలా ఆశ్చర్యపడవచ్చు. వారు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు అన్నీ వారికి అనుకూలంగానే రావచ్చు. ఈ యొక్క విశేషమైన తెలివి, వారికి భగవంతుడు ఇచ్చినదే. అదేవిధముగా, మరికొందరికి, భగవత్ ప్రసాదితమైన ప్రతిభ క్రీడల్లో, సంగీతంలో, లలితకళలలో, రచనల్లో.. మొదలైన వాటిలో ఉండవచ్చు. భగవంతుడే వీరందరికీ విశేష ప్రతిభ, సామర్థ్యములను వారివారి పూర్వ కర్మానుసారం ప్రసాదిస్తాడు. ప్రస్తుత కర్మల ఫలితములను కూడా ఆయన ప్రసాదిస్తాడు. కాబట్టి, భగవంతుడు కూడా కర్మ యొక్క అంగములలో ఒకటిగా పేర్కొనబడ్డాడు. |
|
శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః । న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ।। 15 ।। తత్రైవం సతి కర్తారమ్ ఆత్మానం కేవలం తు యః । పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః ।। 16 ।। | 15 | 18 | శరీర-వాక్-మనోభిః — శరీరము, వాక్కు, లేదా మనస్సు; యత్ — ఏదయితే; కర్మ — పని; ప్రారభతే — చేస్తారో; నరః — వ్యక్తి; న్యాయ్యం — సరియైన (మంచిపని); వా — లేదా; విపరీతం — సరికానిది అయినా (చెడుపని); వా — లేదా; పంచ — ఐదు; ఏతే — ఇవి; తస్య — వాటి; హేతవః — హేతువులు; తత్త్ర — అక్కడ; ఏవం సతి — అయినా సరే; కర్తారమ్ — చేసేది; ఆత్మానం — ఆత్మ; కేవలం — కేవలము; తు — కానీ; యః — ఎవరైతే; పశ్యతి — చూస్తారో; అకృత-బుద్ధిత్వాత్ — మలినమైన బుద్ధితో; న స పశ్యతి — వారు చూడనట్టు; దుర్మతి: — మూర్ఖులు. | BG 18.15-16:
శరీరము, వాక్కు, లేదా మనస్సులచే ఏ కర్మ/కార్యము జరిగినా, అది మంచిదయినా లేదా చెడయినా, ఈ ఐదు దానికి కారకములు. ఇది అర్థంకాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలినబుద్ధి తో ఉన్న అటువంటివారు యథార్థమును గ్రహింపలేరు. | మూడు రకములైన కర్మలు ఏమిటంటే - కాయిక (శరీరముచే చేయబడినవి), వాచిక (వాక్కు/మాటలచే చేయబడినవి), మరియు మానసిక (మనస్సుచే చేయబడినవి). వీటిలో ప్రతిఒక్క వర్గంలో కూడా, పుణ్య కర్మలు చేసినా లేదా పాప కర్మలు చేసినా, ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పబడిన ఐదు కారకములే బాధ్యులు. అహంకారము చేత మనమే ఈ పనులు చేసేది అనుకుంటాము. ‘నేనే ఇది చేసాను.’, ‘నేనే అది సాధించాను’, ‘నేను ఇది చేస్తాను’, ఇటువంటి మాటలు మనమే కర్త అన్న భ్రమలో అంటాము. ఈ జ్ఞాన విషయం తెలియచేయటంలో శ్రీ కృష్ణుడి ఉద్దేశం ఏమిటంటే, ఆత్మ యొక్క కర్తృత్వ-అహంకారమును నాశనం చేయటమే. ఈ విధంగా, కేవలం ఆత్మ మాత్రమే కర్మలను చేసేది అని అనుకునేవారు యదార్థమును చూడలేనట్టే. ఒకవేళ భగవంతుడు ఆత్మకు శరీరమును ఇవ్వకపోతే, అది ఏమీ చేసి ఉండగలిగేది కాదు. అంతేకాక, భగవంతుడు శరీరమును ప్రాణముతో శక్తివంతము చేయకపోతే, అది కూడా ఏమి చేసి ఉండగలిగేది కాదు. కేనోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: యద్వాచానభ్యుదితం యేన వాగభ్యుద్యతే (1.4) ‘వాక్కుచే బ్రహ్మన్ వర్ణింపబడలేడు. దాని (బ్రహ్మం) ప్రేరణచేతనే, స్వరమునకు మాట్లాడే శక్తి వస్తుంది.’ యన్మనసా న మనుతే యేనాహుర్మనో మతం (1.5) ‘మనోబుద్ధులచే బ్రహ్మన్ అర్థం చేసుకోబడలేడు. దాని (బ్రహ్మం) శక్తి చేతనే, మనోబుద్ధులు పనిచేస్తాయి’ యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూంశి పశ్యతి (1.6) ‘కళ్ళతో బ్రహ్మన్ చూడబడలేదు. దాని (బ్రహ్మం) ప్రేరణ చేతనే, కళ్ళు చూడగలుగుతాయి.’ యచ్ఛ్రోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతమ్ (1.7) ‘చెవులకు బ్రహ్మన్ వినపడదు. దాని (బ్రహ్మం) శక్తి చేతనే చెవులు వింటాయి.’ యత్ ప్రాణేన న ప్రణితి యేన ప్రాణః ప్రణీయతే (1.8) ‘ప్రాణ-వాయువులచే బ్రహ్మము ప్రేరేపింపబడలేదు. దాని ప్రేరణ చేతనే, ప్రాణవాయువులు పనిచేస్తాయి.’ అంటే, కర్మలు చేయటంలో జీవాత్మకు ప్రమేయం లేదు అని అర్థం కాదు. అది కారులో డ్రైవర్ లాంటిది, అది స్టీరింగ్ చక్రమును తిప్పుతూ, ఎక్కడ పక్కకి తిప్పాలి, ఎంత వేగంతో నడపాలి అని నిర్ణయిస్తుంది. అదే విధముగా, ఆత్మ కూడా శరీరమనోబుద్ధులను నియంత్రిస్తుంది, కానీ చేనేది తానే అన్న భావమును అది కలిగి ఉండరాదు. ఒకవేళ మనమే, కర్మకు ఉన్న ఒకేఒక కారణం అనుకుంటే, మనమే ఆ కర్మల ప్రతిఫలమును అనుభవించాలి అని అనుకుంటాము. కానీ, కర్తృత్వ భావన (చేసేది నేనే భావన) ను నిర్మూలించుకుని, ఇదంతా భగవంతుని కృప వలెనే, ఆయన ఇచ్చిన ఉపకరణముల వలననే సాధ్యమయినది అని భావిస్తే, మనము మన కర్మ ఫలములకు భోక్తలముకాము అని మరియు అన్ని పనులు ఆయన ప్రీతికోసమే ఉన్నాయని తెలుసుకుంటాము. తదుపరి శ్లోకంలో వివరించబడినట్టు, మనం చేసే ప్రతి యజ్ఞము, దానము, మరియు తపస్సు ఆయనకే సమర్పించటానికి మరియు వాటిని భక్తితో చేయటానికి, ఈ జ్ఞానము ఎంతగానో తొడ్పడుతుంది. |
|
శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః । న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ।। 15 ।। తత్రైవం సతి కర్తారమ్ ఆత్మానం కేవలం తు యః । పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః ।। 16 ।। | 16 | 18 | శరీర-వాక్-మనోభిః — శరీరము, వాక్కు, లేదా మనస్సు; యత్ — ఏదయితే; కర్మ — పని; ప్రారభతే — చేస్తారో; నరః — వ్యక్తి; న్యాయ్యం — సరియైన (మంచిపని); వా — లేదా; విపరీతం — సరికానిది అయినా (చెడుపని); వా — లేదా; పంచ — ఐదు; ఏతే — ఇవి; తస్య — వాటి; హేతవః — హేతువులు; తత్త్ర — అక్కడ; ఏవం సతి — అయినా సరే; కర్తారమ్ — చేసేది; ఆత్మానం — ఆత్మ; కేవలం — కేవలము; తు — కానీ; యః — ఎవరైతే; పశ్యతి — చూస్తారో; అకృత-బుద్ధిత్వాత్ — మలినమైన బుద్ధితో; న స పశ్యతి — వారు చూడనట్టు; దుర్మతి: — మూర్ఖులు. | BG 18.15-16:
శరీరము, వాక్కు, లేదా మనస్సులచే ఏ కర్మ/కార్యము జరిగినా, అది మంచిదయినా లేదా చెడయినా, ఈ ఐదు దానికి కారకములు. ఇది అర్థంకాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలినబుద్ధి తో ఉన్న అటువంటివారు యథార్థమును గ్రహింపలేరు. | మూడు రకములైన కర్మలు ఏమిటంటే - కాయిక (శరీరముచే చేయబడినవి), వాచిక (వాక్కు/మాటలచే చేయబడినవి), మరియు మానసిక (మనస్సుచే చేయబడినవి). వీటిలో ప్రతిఒక్క వర్గంలో కూడా, పుణ్య కర్మలు చేసినా లేదా పాప కర్మలు చేసినా, ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పబడిన ఐదు కారకములే బాధ్యులు. అహంకారము చేత మనమే ఈ పనులు చేసేది అనుకుంటాము. ‘నేనే ఇది చేసాను.’, ‘నేనే అది సాధించాను’, ‘నేను ఇది చేస్తాను’, ఇటువంటి మాటలు మనమే కర్త అన్న భ్రమలో అంటాము. ఈ జ్ఞాన విషయం తెలియచేయటంలో శ్రీ కృష్ణుడి ఉద్దేశం ఏమిటంటే, ఆత్మ యొక్క కర్తృత్వ-అహంకారమును నాశనం చేయటమే. ఈ విధంగా, కేవలం ఆత్మ మాత్రమే కర్మలను చేసేది అని అనుకునేవారు యదార్థమును చూడలేనట్టే. ఒకవేళ భగవంతుడు ఆత్మకు శరీరమును ఇవ్వకపోతే, అది ఏమీ చేసి ఉండగలిగేది కాదు. అంతేకాక, భగవంతుడు శరీరమును ప్రాణముతో శక్తివంతము చేయకపోతే, అది కూడా ఏమి చేసి ఉండగలిగేది కాదు. కేనోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: యద్వాచానభ్యుదితం యేన వాగభ్యుద్యతే (1.4) ‘వాక్కుచే బ్రహ్మన్ వర్ణింపబడలేడు. దాని (బ్రహ్మం) ప్రేరణచేతనే, స్వరమునకు మాట్లాడే శక్తి వస్తుంది.’ యన్మనసా న మనుతే యేనాహుర్మనో మతం (1.5) ‘మనోబుద్ధులచే బ్రహ్మన్ అర్థం చేసుకోబడలేడు. దాని (బ్రహ్మం) శక్తి చేతనే, మనోబుద్ధులు పనిచేస్తాయి’ యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూంశి పశ్యతి (1.6) ‘కళ్ళతో బ్రహ్మన్ చూడబడలేదు. దాని (బ్రహ్మం) ప్రేరణ చేతనే, కళ్ళు చూడగలుగుతాయి.’ యచ్ఛ్రోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతమ్ (1.7) ‘చెవులకు బ్రహ్మన్ వినపడదు. దాని (బ్రహ్మం) శక్తి చేతనే చెవులు వింటాయి.’ యత్ ప్రాణేన న ప్రణితి యేన ప్రాణః ప్రణీయతే (1.8) ‘ప్రాణ-వాయువులచే బ్రహ్మము ప్రేరేపింపబడలేదు. దాని ప్రేరణ చేతనే, ప్రాణవాయువులు పనిచేస్తాయి.’ అంటే, కర్మలు చేయటంలో జీవాత్మకు ప్రమేయం లేదు అని అర్థం కాదు. అది కారులో డ్రైవర్ లాంటిది, అది స్టీరింగ్ చక్రమును తిప్పుతూ, ఎక్కడ పక్కకి తిప్పాలి, ఎంత వేగంతో నడపాలి అని నిర్ణయిస్తుంది. అదే విధముగా, ఆత్మ కూడా శరీరమనోబుద్ధులను నియంత్రిస్తుంది, కానీ చేనేది తానే అన్న భావమును అది కలిగి ఉండరాదు. ఒకవేళ మనమే, కర్మకు ఉన్న ఒకేఒక కారణం అనుకుంటే, మనమే ఆ కర్మల ప్రతిఫలమును అనుభవించాలి అని అనుకుంటాము. కానీ, కర్తృత్వ భావన (చేసేది నేనే భావన) ను నిర్మూలించుకుని, ఇదంతా భగవంతుని కృప వలెనే, ఆయన ఇచ్చిన ఉపకరణముల వలననే సాధ్యమయినది అని భావిస్తే, మనము మన కర్మ ఫలములకు భోక్తలముకాము అని మరియు అన్ని పనులు ఆయన ప్రీతికోసమే ఉన్నాయని తెలుసుకుంటాము. తదుపరి శ్లోకంలో వివరించబడినట్టు, మనం చేసే ప్రతి యజ్ఞము, దానము, మరియు తపస్సు ఆయనకే సమర్పించటానికి మరియు వాటిని భక్తితో చేయటానికి, ఈ జ్ఞానము ఎంతగానో తొడ్పడుతుంది. |
|
యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే । హత్వాఽపి స ఇమాఁల్లోకాన్న హంతి న నిబధ్యతే ।। 17 ।। | 17 | 18 | యస్య — ఎవరైతే; న అహంకృతః — కర్తృత్వ భావమును విడిచి; భావో — స్వభావము; బుద్ధిః — బుద్ధిః; యస్య — ఎవరైతే; న లిప్యతే — మమకారాసక్తి లేకుండా; హత్వా — సంహరించినా; అపి — కూడా; సః — వారు; ఇమాన్ — ఈ; లోకాన్ — ప్రాణులు; న హంతి — చంపినట్టు కాదు; న నిబధ్యతే — దానిచే బంధింపబడరు. | BG 18.17:
కర్తృత్వ అహంకార భావమును (చేసేది నేనే అన్న భావమును) విడిచిపెట్టి, బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండే వారు, ప్రాణులను సంహరించినా సరే, వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధనములకు లోనుకారు. | గత శ్లోకంలో మూఢబుద్ధిని వివరించిన శ్రీ కృష్ణుడు, ఇక ఇప్పుడు స్వచ్ఛమైన బుద్ధిని వివరిస్తున్నాడు. పవిత్రమైన బుద్ధి కలవారు, చేసేది తామే (కర్తృత్వ భావన) అన్న అహంకారమును విడిచి పెట్టి ఉంటారు. తమ కర్మ యొక్క ఫలములను భోగించాలనే కోరికతో కూడా ఉండరు. ఆ విధంగా వారు తాము చేసిన పనుల యొక్క కర్మ బంధనములలో చిక్కుకోరు. ఇంతకు క్రితం 5.10వ శ్లోకంలో కూడా, కర్మఫలాసక్తిని విడిచిపెట్టిన వారు పాపముచే కళంకితులు కారు అని చెప్పి ఉన్నాడు. భౌతిక దృక్పథం పరంగా, వారు పనిచేస్తున్నట్లే ఉంటారు కానీ ఆధ్యాత్మిక కోణంలో, వారు స్వార్థ ప్రయోజనాలకు అతీతముగా ఉంటారు, కాబట్టే వారు కర్మఫలములకు బందీలు కారు. భారత చరిత్రలో, మొఘల్ సామ్రాజ్య కాలంలో, రహీమ్ ఖాన్‌ఖనా, ఒక ప్రఖ్యాత కవి, సాధువు. జన్మతహా ఇస్లామ్ మతస్థుడైనా, ఆయన శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క గొప్ప భక్తుడు. ఆయన ఎప్పుడైనా దానములో భిక్ష ఇస్తే, తన కళ్ళు క్రిందికి వంచేవాడు. ఆయన ఈ అలవాటు గూర్చి ఒక మధురమైన సంఘటన ఉంది. సంత్ తులసీదాసుకి ఈ రహీమ్ యొక్క దానమిచ్చే పద్ధతి తెలిసి, ఆయనను ఇలా అడిగారు : ఐసీ దేనీ దేన జ్యూఁ, కిత సీఖే హో సైన జ్యోఁ జ్యోఁ కర ఊంచ్యో కరో, త్యోఁ త్యోఁ నీచే నైన ‘అయ్యా, ఈ దానం ఇచ్చే పద్ధతిని మీరు ఎక్కడ నేర్చుకున్నారు?. మీ చేతులు పైకి ఉన్నా మీ కళ్ళు క్రిందికి ఉన్నాయి.’ అని. దీనికి రహీం చాలా అందంగా ఎంతో వినమ్రతతో ఇలా బదులిచ్చాడు: దేనహార కోఇ ఔర్ హై, భేజత హై దిన రైన లోగ భరమ హమ పర కరేఁ, యాతే నీచే నైన ‘అసలు ఇచ్చేవాడు వేరే ఉన్నాడు, పగలు, రాత్రి ఇస్తున్నాడు. కానీ, ప్రపంచం నేను ఇచ్చాను అనుకుంటున్నది, అందుకే నేను నా కళ్ళను క్రిందికి దించుకుంటున్నాను.’ అని. మనము సాధించినవాటన్నిటికీ కేవలం మనమొక్కళ్ళమే కారణము అన్న భావన విడిచిపెడితే, అది మనలను కర్తృత్వ అహంకార భావన నుండి విముక్తి చేస్తుంది. |
|
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా । కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః ।। 18 ।। | 18 | 18 | జ్ఞానం — జ్ఞానము; జ్ఞేయం — జ్ఞాన విషయము; పరిజ్ఞాతా — తెలుసుకొనువాడు (జ్ఞాత); త్రివిధా — మూడు విధములు; కర్మ-చోదనా — కర్మను ప్రేరేపించునవి; కరణం — కర్మకు ఉన్న ఉపకరణములు; కర్మ — కర్మ (పని); కర్తా — కర్త (చేసేవాడు); ఇతి — ఈ విధముగా; త్రి-విధః — మూడు రకముల; కర్మ-సంగ్రహః — కర్మ యొక్క అంగములు. | BG 18.18:
జ్ఞానము, జ్ఞేయము (జ్ఞాన విషయము), జ్ఞానమును ఎఱింగినవాడు - ఇవి మూడు కర్మను ప్రేరేపించును. కర్మ యొక్క ఉపకరణం, క్రియ, కర్త - ఈ మూడు కర్మ యొక్క అంగములు. | కర్మ శాస్త్రము విషయంపై, ఒక చక్కటి పద్ధతి ప్రకారం ఉన్న తన విశ్లేషణలో, శ్రీ కృష్ణుడు దాని యొక్క అంగములను వివరించి ఉన్నాడు. చేసే పనుల యొక్క కర్మ ప్రతిఫలములను కూడా వివరించాడు మరియు కర్మ ప్రతిచర్యల నుండి ఎలా విముక్తి అవ్వచ్చో కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు, కర్మను ప్రేరేపించే మూడు రకముల కారకములను వివరిస్తున్నాడు. అవి, జ్ఞానము, జ్ఞేయము (జ్ఞాన విషయము), మరియు జ్ఞాత (జ్ఞానమును తెలిసినవాడు). ఈ మూడింటినీ కలిపి, 'జ్ఞాన త్రిపుతీ' అని అంటారు. ‘జ్ఞానము’ అనేది కర్మకు ప్రధానమైన ప్రేరణను ఇచ్చేది; అది ‘జ్ఞాత’కు, ‘జ్ఞేయము’ను గూర్చి అవగాహన కల్పిస్తుంది. ఈ మూడు కలిపి కర్మను ప్రేరేపిస్తాయి. ఉదాహరణకి, పనిచేసే సంస్థ ఇచ్చే జీతము యొక్క జ్ఞానమే, ఉద్యోగులకు పనిచేసే ప్రేరణ ఇస్తుంది; ప్రపంచంలో ఎన్నో చోట్ల, బంగారము లభిస్తున్నదనే సమాచారమే ఎంతో మంది కూలీలు ఆయా ప్రాంతాలకు వలసపోయేటట్లు చేసింది; ఒలింపిక్స్ లో పతకం గెలవటం యొక్క ప్రాముఖ్యత తెలవటం వలననే ఎంతో మంది ఆటగాళ్ళు సంవత్సరాల తరబడి అభ్యాసం చేసేందుకు ప్రేరణను కలిగిస్తుంది. పని యొక్క నైపుణ్యం పై కూడా ఈ జ్ఞాన ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి, ప్రముఖ విద్యాసంస్థ నుండి పొందిన పట్టాకి ఉద్యోగ వేటలో ఎక్కువ విలువ ఉంటుంది. ఉన్నత స్థాయి జ్ఞానం కలవారు పనిని చక్కగా చేస్తారు అని పారిశ్రామిక సంస్థలు తెలుసుకున్నాయి. అందుకే, ప్రఖ్యాత సంస్థలు తమ ఉద్యోగుల జ్ఞాన అభ్యున్నతికి బాగా ఖర్చు పెడతాయి, ఉదాహరణకి ఉద్యోగులను, వారి నైపుణ్యం పెంచుకోవటానికి ఉన్నత-శిక్షణా తరగతులకు (developmental seminars) పంపిస్తూ ఉంటాయి. రెండవ సమూహాన్ని, 'కర్మ త్రిపుతీ' అని అంటారు. దానిలో ఉండేవి - కర్త (చేసేవాడు), కారణము (కర్మ యొక్క ఉపకరణము), మరియు కర్మ (ఆ పని). ఈ మూడు కలిపి కర్మ అంగములు అని అనుకోవచ్చు. 'కర్త' అనేవాడు 'కారణము' ను ఉపయోగించుకొని, 'కర్మ' ను చేస్తాడు. కర్మ యొక్క అంగములను వివరించిన పిదప శ్రీ కృష్ణుడు ఇక వాటిని ప్రకృతి త్రిగుణములతో అనుసంధానం చేస్తాడు; జనులు ఒకరి కంటే ఇంకొకరు భిన్నముగా తమ కర్మలలో, ప్రేరణలో వివిధ రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తారో ఇది మనకు తెలియచేస్తుంది. |
|
జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః । ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి ।। 19 ।। | 19 | 18 | జ్ఞానం — జ్ఞానము; కర్మ — కర్మ; చ — మరియు; కర్తా — కర్త; చ — మరియు; త్రిధా — మూడు రకముల; ఏవ — ఖచ్చితముగా; గుణ-భేదతః — ప్రకృతి త్రి-గుణముల పరముగా విభిన్నముగా; ప్రోచ్యతే — అని చెప్పబడినవి; గుణ-సంఖ్యానే — భౌతిక ప్రకృతి త్రి-గుణములను వివరించే సాంఖ్య తత్త్వ శాస్త్రము; యథా-వత్ — అవి ఉన్నదున్నట్టుగా; శృణు — వినుము; తాని — వాటిని; అపి — కూడా. | BG 18.19:
జ్ఞానము, కర్మ, మరియు కర్త - ఇవి ప్రకృతి త్రి-గుణముల పరముగా ఒక్కోటి మూడు రకాలుగా ఉంటాయని సాంఖ్య శాస్త్రము పేర్కొంటున్నది. నేను ఈ వ్యత్యాసాలు నీకు ఇప్పుడు చెప్తాను వినుము. | శ్రీ కృష్ణుడు మళ్లీ ఒకసారి ప్రకృతి త్రి-గుణములను ఉదహరిస్తున్నాడు. 14వ అధ్యాయములో ఈ మూడు గుణములను మొదట ఒకసారి వివరించాడు మరియు అవి ఆత్మను జనన-మరణ సంసారచక్రమునకు ఎలా బంధించివేస్తాయో వివరించిఉన్నాడు. తదుపరి, 17వ అధ్యాయములో జనులు పెంపొందించుకునే విశ్వాసము/నమ్మకములు మరియు వారు ఎంచుకునే ఆహారములని ఈ త్రిగుణములు ఎలా ప్రభావితం చేస్తాయో విస్తారముగా వివరించి ఉన్నాడు. మూడు రకములైన యజ్ఞము, దానము, మరియు తపస్సులను కూడా వివరించిఉన్నాడు. ఇక్కడ, త్రిగుణముల ప్రకారముగా, భగవంతుడు - జ్ఞానము, కర్మ, మరియు కర్తలను వివరిస్తాడు. భారత తత్త్వశాస్త్రాల్లో ఉన్న ఆరింటిలో, సాంఖ్య శాస్త్రము (దీనినే పురుష ప్రకృతి వాదము అంటారు). అది ఆత్మను పురుషుడిగా (ప్రభువు) పరిగణిస్తుంది, కాబట్టి చాలా మంది పురుషులు ఉన్నట్టు నిర్ధారిస్తుంది. ప్రకృతి అంటే భౌతిక శక్తి , దానిచే తయారు చేయబడిన అన్ని వస్తువులు అందులోకే వస్తాయి. సాంఖ్య శాస్త్రము ప్రకారము, పురుషునికి ప్రకృతిని భోగించాలనే కోరికయే, దుఃఖానికి మూల కారణం. ఈ భోగలాలస తగ్గిపోయినప్పుడు, పురుషుడు ఈ భౌతిక ప్రకృతి యొక్క బంధనముల నుండి విముక్తి చేయబడి, నిత్య శాశ్వత పరమానందమును పొందుతాడు. సాంఖ్య శాస్త్రము పరమ పురుషుడు, లేదా పరమాత్మ యొక్క అస్తిత్వమును ఒప్పుకోదు, అందుకే అది పరమ సత్యమును తెలుసుకొనుటకు సరిపోదు. అయినా కానీ, భౌతిక ప్రకృతి యొక్క జ్ఞానమును తెలుసుకొనుటలో మాత్రం ఇదే మనకు ప్రమాణము అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. |
|
సర్వ భూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే । అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్వికం ।। 20 ।। | 20 | 18 | సర్వ-భూతేషు — సమస్త ప్రాణుల యందు; యేన — దేనిచేతనైతే; ఏకం — ఒక్కటే; భావం — స్వభావము; అవ్యయమ్ — అనశ్వరమైన; ఈక్షతే — చూడవచ్చు; అవిభక్తం — అవిభక్తమైన; విభక్తేషు — భిన్నత్వములో; తత్ — అది; జ్ఞానం — జ్ఞానము; విద్ధి — అర్థం చేసుకొనుము; సాత్త్వికం — సత్త్వగుణములో ఉన్నట్టు. | BG 18.20:
ఏ జ్ఞానముచేతనైతే, సమస్త విభిన్నమైన జీవరాశులలో ఒకే అవిభక్తమైన అనశ్వరమైన అస్తిత్వము ఉన్నట్టు తెలుసుకోబడుతుందో ఆ జ్ఞానము సత్త్వ గుణములో ఉన్నట్టు. | ఈ సృష్టి, మనకు విభిన్నమైన రకరకాల జీవరాశుల, భౌతిక వస్తువుల సమూహముగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ మొత్తం కనిపించే భిన్నత్వానికి వెనుక ఉన్నపదార్థము ఆ పరమేశ్వరుడే. ఎలాగైతే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు, అన్ని విద్యుత్ ఉపకరణములలో ప్రవహించేది ఒకే విద్యుత్తు అని ఎట్లా గమనిస్తాడో; ఒక కంసాలి, అన్ని ఆభరణములలో ఉండేది ఒకే బంగారము అని ఎలాగైతే గమనిస్తాడో, ఈ జ్ఞాన దృష్టి కలవారు ఈ సృష్టిలో ఉన్న భిన్నత్వం వెనుక ఏకత్వమును చూస్తారు. శ్రీమద్ భాగవతం ప్రకారం, వదంతి తత్ తత్త్వ-విదస్ తత్త్వం యజ్ జ్ఞానం అద్వయం (1.2.11) ‘రెండవది లేకుండా, ఉన్నది అంతా ఒక్కటే అని, సత్యమును ఎఱింగిన వారు పేర్కొన్నారు.’ చైతన్య మహాప్రభు, ఈ క్రింది నాలుగు సూత్రముల ఆధారముగా, భగవంతుడిని శ్రీ కృష్ణ రూపములో, అద్వయ జ్ఞాన తత్త్వముగా పరిగణించాడు, (అంటే, రెండవది ఏదీ లేక ఉన్నది ఒకటే, సృష్టిలో ఉన్న ఒకేఒకటి మరియు సమస్తము అదే, అని). 1. సజాతీయ భేద శూన్యము. (సజాతీయమైన వాటికంటే వెరైనది కాదు): రాముడు, శివుడు, విష్ణువు వంటి వేరే ఇతర అన్ని భగవత్ స్వరూపములకు శ్రీ క్రిష్ణుడు అభేదము. ఎందుకంటే వీరందరూ ఒకే భగవంతుని యొక్క భిన్నమైన వ్యక్తములు. శ్రీ కృష్ణుడు, ఆత్మలకు కూడా అభేదమే, అవి ఆయన యొక్క అణు-అంశములే. ఎలాగైతే అగ్ని జ్వాలలు, అగ్ని యొక్క చిన్న భాగాలో, అంశము అనేది దాని యొక్క పరిపూర్ణ భాగమునకు అభేదము. 2. విజాతీయ భేద శూన్యము. (విజాతీయమైన వాటి కంటే భేదము లేని వాడు): భగవంతునికి విజాతీయమైనది మాయ; అది జడమైనది, భగవంతుడు చైతన్యవంతుడు. కానీ, మాయ కూడా భగవంతుని యొక్క శక్తి స్వరూపమే, ఎలాగైతే అగ్ని యొక్క శక్తులైన వేడిమి-వెలుగు, దానికంటే అభేదమో, శక్తి మరియు శక్తిమంతుడు కూడా అభేదములే. 3. స్వగత భేద శూన్యము (తనయొక్క వేర్వేరు అంగములు ఆయనకు అభేదము): భగవంతుని శరీరము యొక్క మహాద్భుతమైన లక్షణము ఏమిటంటే, దానిలో అన్ని అంగములు మిగతా అన్ని అంగముల పని చేస్తాయి. బ్రహ్మ సంహిత ఇలా పేర్కొంటున్నది: అంగాని యస్య సకలేంద్రియ-వృత్తి-మంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి (5.32) ‘తన శరీరము యొక్క అన్ని అంగములతో భగవంతుడు చూడగలడు, వినగలడు, మాట్లాడగలడు, వాసన చూడగలడు, తినగలడు, మరియు ఆలోచించగలడు. అందుకే భగవంతుని యొక్క అన్ని అంగములు ఆయనకు అభేదములే. 4. స్వయం సిద్ధము. (తనకు వేరే ఏ ఇతరమైన వాటి ఆధారము అవసరం లేదు): మాయ మరియు ఆత్మ రెండూ కూడా తమ అస్తిత్వం కోసం భగవంతుని పైనే ఆధారపడి ఉన్నాయి. ఆయనే గనక ఆయన వాటిని శక్తివంతము చేయకపోతే, వాటికి అస్తిత్వం లేదు (వాటికి మనుగడ లేదు). అదే సమయంలో, భగవంతుడు సర్వ స్వతంత్రుడు మరియు తన మనుగడ కోసం ఏ ఇతరమైన వాటి ఆధారం ఆయనకు అవసరం లేదు. సర్వోన్నతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ ఈ పై నాలుగు లక్షణములను కలిగి ఉన్నాడు. అందుకే ఆయన అద్వయ జ్ఞాన తత్త్వము; వేరే మాటల్లో చెప్పాలంటే, సృష్టిలో ఉండే ప్రతీదీ ఆయనే. ఈ అవగాహనతో, సమస్త సృష్టిని ఆయనతో ఏకత్వముతో చూస్తే, అది సాత్త్విక జ్ఞానమవుతుంది. మరియు ఈ జ్ఞానంతో ఉన్న ప్రేమ, జాతికీ దేశానికీ అతీతమైన విశ్వప్రేమ. |
|
పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ । వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసమ్ ।। 21 ।। | 21 | 18 | పృథక్త్వేన — వేర్వేరయిన (ఒకదానితో ఒకటి సంబంధము లేనట్టు); తు — కానీ; యత్ — ఏదయితే; జ్ఞానం — జ్ఞానము; నానా-భావాన్ — ఎన్నో రకములైన; పృథక్-విధాన్ — భిన్నములైన; వేత్తి — పరిగణించి; సర్వేషు — అన్నింటిలో; భూతేషు — భూతములు; తత్ — అది; జ్ఞానం — జ్ఞానము; విద్ధి — తెలుసుకొనుము; రాజసం — రాజసికమైన. | BG 18.21:
ఏ జ్ఞానము చేతనయితే, భిన్నభిన్న దేహములలో ఉన్న నానా రకాల ప్రాణులు వేర్వేరుగా, ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా చూడబడుతాయో, ఆ జ్ఞానము రాజసికమని (రజోగుణములో ఉన్న) గ్రహించుము. | శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు రాజసిక జ్ఞానమును వివరిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ జగత్తు భగవత్ సంబంధముగా చూడబడదో, కావున ప్రాణులు వేర్వేరుగా తమతమ జాతి, తెగ, కులము, వర్గము, జాతీయత వంటి వాటిచే భిన్నముగా గ్రహించబడుతాయో ఆ జ్ఞానము రజోగుణ జ్ఞానము అని చెప్పబడుతుంది. అటువంటి జ్ఞానము ఒకే మానవ జాతిని ఎన్నో రకాలుగా విభజిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానము అందరినీ దగ్గరికి తెస్తుందో (ఐక్యత) ఆ జ్ఞానము సత్త్వగుణప్రధానమైనది; విభజించే జ్ఞానము, రజోగుణ ప్రధానమయినది. |
|
యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ । అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ।। 22 ।। | 22 | 18 | యత్ — ఏదైతే; తు — కానీ; కృత్స్న-వత్ — సమస్తమును కలిగి ఉన్నది అదే అని; ఏకస్మిన్ — ఒక్కటిగా; కార్యే — కార్యము; సక్తం — నిమగ్నమై; ఆహైతుకం — కారణం లేకుండా (తర్కబద్ధముగా లేకుండా); అతత్త్వ-అర్థ-వత్ — సత్యము ఆధారంగా లేనిది; అల్పం — వేర్వేరు భాగములగా; చ — మరియు; తత్ — అది; తామసం — తామసిక (తమోగుణములో ఉన్న); ఉదాహృతం — అని చెప్పబడును. | BG 18.22:
సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్నభిన్న భాగములే అన్న విషయంలో పూర్తిగా మనిషిని తనమునకలై పోయేట్టు చేసి, తర్కబద్ధముగా లేకుండా మరియు సత్య దూరముగా ఉండే జ్ఞానము, తామసిక జ్ఞానము అని చెప్పబడుతుంది. | ఎప్పుడైతే బుద్ధి తమోగుణ ప్రభావముచే మందకొడిగా అయిపోతుందో, అప్పుడది, భిన్నత్వమే సంపూర్ణ సత్యము అన్న భావనను పట్టుకుని ఉంటుంది. అటువంటి అవగాహన దృక్పథంలో ఉన్నవారు తరచుగా వారికి సరిఅనిపించిన పరమ సత్యము పట్ల అతిమూర్ఖాభిమానముతో ఉంటారు. వారి జ్ఞానము తరచుగా కనీసం తర్కబద్ధముగా కూడా ఉండదు, యదార్థమునకు దూరంగా మరియు శాస్త్రఉపదేశాలకు విరుద్ధంగా ఉంటుంది, అయినాసరే వారు మిక్కిలి పట్టుదలతో తమ నమ్మకాన్ని ఇతరులపైకి రుద్దటానికి ప్రయత్నిస్తారు. తమని తామే భగవత్ అనుచరులమని, ధర్మ-సంరక్షకులమని, అనుకునే మతమూఢులను ఎంతోమందిని మానవ జాతి చరిత్ర చూసిఉన్నది. వారు మూర్ఖముగా ఉన్మత్తులై మతమార్పిడి ద్వారా అదే రకం బుద్ధి ఉన్న కొంతమంది అనుచరులను సంపాదించి, గుడ్డి వాడు గుడ్డివాళ్లకు దారి చూపిన రీతిలో ప్రవర్తిస్తారు. భగవంతుడికీ, మతధర్మమునకు సేవ చేస్తున్న పేరుతో/నెపంతో, సామాజిక అశాంతికి మరియు దానియొక్క సామరస్యపూర్వకమైన అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారు. |
|
నియతం సంగరహితం అరాగద్వేషతః కృతమ్ । అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్త్వికముచ్యతే ।। 23 ।। | 23 | 18 | నియతం — శాస్త్ర బద్ధముగా; సంగ-రహితం — మమకారాసక్తి లేకుండా; ఆరాగ-ద్వేషతః — రాగ ద్వేషములు లేకుండా; కృతం — చేయబడి; అఫల-ప్రేప్సునా — ఫలాపేక్ష లేకుండా; కర్మ — కర్మ; యత్ — ఏదైతే; తత్ — అది; సాత్త్వికం — సాత్వికము; ఉచ్యతే — అని చెప్పబడును. | BG 18.23:
ఏదైతే కర్మ - శాస్త్రబద్ధముగా చేయబడినదో, రాగద్వేష రహితముగా ఉన్నదో, మరియు ఫలాపేక్ష లేకుండా చేయబడినదో, అది సత్త్వగుణములో ఉన్నట్టు అని చెప్పబడినది. | మూడు రకములైన జ్ఞానములను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు మూడు విధములైన కర్మలను వివరిస్తున్నాడు. చరిత్ర గమనంలో ఎంతోమంది సామాజిక శాస్త్రవేత్తలు మరియు తత్త్వవేత్తలు ఏది మంచి కర్మ(పని) అనే విషయంపై తమతమ అభిప్రాయాలను వివరించి ఉన్నారు. వారిలో కొంతమంది ప్రముఖులు మరియు వారి సిద్ధాంతాలు ఇక్కడ పేర్కొనబడినవి. గ్రీకు ఎపిక్యూరియన్లు (క్రీస్తు పూర్వం ౩వ శతాబ్దం), ‘తినండి, త్రాగండి, మరియు హాయిగా ఉండండి’ అనే పద్ధతి సక్రమమని నమ్మినారు. దీనికంటే ఇంకా కొంచెం మెరుగ్గా ఉన్నటువంటిది, హాబ్స్ ఆఫ్ ఇంగ్లాండ్ (Hobbs of England) (1588 – 1679) మరియు హెల్విషెస్ ఆఫ్ ఫ్రాన్స్ (Helvetius of France) (1715 – 1771) యొక్క సిద్ధాంతం. వారు అన్నదేమిటంటే, అందరూ స్వార్థపరులై, ఎవరూ ఇతరుల గురించి ఆలోచించకపోతే, ప్రపంచంలో అది ఒక అస్తవ్యస్త స్థితికి దారి తీస్తుంది. కాబట్టి వ్యక్తిగత ఇంద్రియ సంతృప్తితో పాటు మనం ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. ఉదాహరణకి, ఒకవేళ భర్త అనారోగ్యంతో ఉంటే, భార్య అతనిని చూసుకోవాలి; ఒకవేళ భార్య అనారోగ్యంతో ఉంటే, భర్త ఆమెను చూసుకోవాలి. ఒకవేళ గనక ఇతరులకు సహాయం చేయటం, స్వీయప్రయోజనానికి విరుద్ధంగా ఉంటే, సొంత ప్రయోజనానికే మనం మొగ్గు చూపాలి అని వారు అభిప్రాయపడ్డారు. జోసెఫ్ బట్లర్ (1692 – 1752) యొక్క సిద్ధాంతం దీనికంటే ఇంకా ముందుకు వెళ్ళింది. ఆయన ఏమన్నాడంటే, మన స్వీయ-ప్రయోజనం తరువాతనే ఇతరులకు సేవ చేయటం, అనే ఆలోచన తప్పు అని. ఇతరులకు సేవ చేయటం సహజమైన మానవ సద్గుణము. ఒక తల్లి-సింహము కూడా తాను ఆకలితో ఉన్నా తన పిల్లలకు ఆహారం అందిస్తుంది. కాబట్టి, ఇతరుల సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ, బట్లర్ యొక్క సేవా దృక్పథం కేవలం భౌతికమైన దుఃఖ నివృత్తికి మాత్రమే పరిమితమయినది; ఉదాహరణకి, ఒక వ్యక్తి ఆకలితో ఉంటే, అతనికి అన్నం పెట్టాలి. కానీ ఇది సమస్యను నిజంగా నిర్మూలించదు ఎందుకంటే ఆరు గంటల తరువాత ఆ వ్యక్తికి మళ్ళీ ఆకలి వేస్తుంది. బట్లర్ తరువాత జెరెమీ బెంథాం (1748 – 1832) మరియు జాన్ స్టుఆర్ట్ మిల్ (1806 – 1873) వచ్చారు. వారి యొక్క ఉపయోగితావాదంలో, అధికసంఖ్యలో జనులకు ఏది హితమైనదో ఆ పనే చేయాలి అని చెప్పారు. ఏది సరియైన పనో నిర్ణయించటానికి అత్యధికులు దేనిని మంచి అంటారో దానిని ఎంచుకోమన్నది. కానీ ఒకవేళ అధికసంఖ్యాక జనులు అనుకున్నది తప్పయినా లేదా వారు తప్పుడుబాటలో ఉన్నా ఈ సిద్ధాంతం వీగిపోతుంది, ఎందుకంటే వెయ్యిమంది అజ్ఞానులు ఉన్నా, ఒక్క వివేకవంతుని అలోచనా సామర్థ్యమునకు వారు సరితూగజాలరు. ఇంకా మరికొందరు తత్త్వవేత్తలు అంతరాత్మ చెప్పిన విధముగా అనుసరించమని చెప్తారు. అదే మనకు ఏది సరియయిన ప్రవర్తనో చెప్పటానికి ఉత్తమమైన మార్గదర్శి అని సూచించారు. కానీ, సమస్య ఏమిటంటే ప్రతిఒక్కని అంతరాత్మ వేర్వేరు విధములుగా మారదర్శకం చేస్తుంది. ఒకే కుటుంబములో, ఇద్దరు పిల్లలకి విభిన్న విలువలు, అంతరాత్మ ఉంటాయి. అంతేకాక, ఒకే వ్యక్తి యొక్క అంతరాత్మ కూడా కాలంతో పాటు మారుతుంది. ఒక హంతకుడుని, తను జనులను చంపటం పట్ల పశ్చాత్తాపం పడుతున్నాడా అని అడిగితే, అయన ఇలా అనవచ్చు, ‘మొదట్లో చెడుపని చేస్తున్నట్టు అనిపించేది, కానీ క్రమక్రమంగా, అదేదో దోమలను చంపటం లాగ మామూలు పని అయిపోయింది. నాకేమీ పశ్చాత్తాపం లేదు.’ అని. యుక్తమైన పని ఏది అన్న విషయంలో, మహాభారతం ఇలా చెప్తున్నది: ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్ శృతిః స్మృతిః సదాచారః స్వస్య చ ప్రియమాత్మనః (5.15.17) ‘ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నీకు ఇష్టం ఉండదో, నీవు కూడా వారి పట్ల అలా ప్రవర్తించకు. కానీ, నీ ప్రవర్తన ఎల్లప్పుడూ శాస్త్ర సమ్మతంగా ఉండేలా చూసుకో.’ ఇతరులు నీపట్ల ఎలా ఉండాలి అని నీవు ఆశిస్తావో నీవు వారిపట్ల అలా ఉండుము. బైబిల్ కూడా ఇలా పేర్కొంటున్నది, "“Do to others as you would have them do to you.” (Luke 6.31) ‘ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుకుంటావో నీవు వారికి అదే చేయుము’. అదే మాదిరిగా, శాస్త్రములు చెప్పిన విధముగా తన కర్తవ్యమును చేయటమే సత్త్వ గుణములో ఉన్న కర్మ (పని) అని ఇక్కడ శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. అంతేకాక, అటువంటి పని రాగద్వేష రహితముగా ఉండాలి, మరియు ఫలాపేక్ష లేకుండా కూడా ఉండాలి అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. |
|
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః । క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్ ।। 24 ।। | 24 | 18 | యత్ — ఏదయితే; తు — కానీ; కామ-ఇప్సునా — స్వార్థ కోరికతో ప్రేరితమై ఉన్నదో; కర్మ — కర్మ; స-అహంకారేణ — దురభిమానముతో; వా — లేదా; పునః — మళ్లీ; క్రియతే — చేయబడినదో; బహుళ-ఆయాసం — శ్రమతో కూడి; తత్ — అది; రాజసం — రాజసము; ఉదాహృతం — అని చెప్పబడినది. | BG 18.24:
స్వార్థ కోరికచే ప్రేరేపితమై, అహంకారముచే చేయబడినట్టి, మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణములో ఉన్నదని చెప్పబడును. | రజో గుణము యొక్క స్వభావము ఏమిటంటే అది భౌతిక సంపత్తి కోసము మరియు ఇంద్రియ భోగముల కొరకు తీవ్రమైన వాంఛను సృష్టిస్తుంది. కాబట్టి, రజోగుణ కర్మ - పెద్ద ఆశయముచే ప్రేరేపితమై తీవ్ర పరిశ్రమతో - కూడి ఉంటుంది. అది చాలా శ్రమతో ఉండి, ఎంతో శారీరక మానసిక అలసటను కలుగచేస్తుంది. రాజసిక జగత్తు యొక్క ఒక ఉదాహరణ నేటి కార్పొరేట్ ప్రపంచం. ఉన్నతోద్యోగులు తరచుగా ఒత్తిడి గురౌతున్నామని ఫిర్యాదు చేస్తుంటారు. ఇది ఎందుకంటే వారి కర్మలు సాధారణంగా గర్వము/అహంకారముచే మరియు మితిమీరిన అధికార దాహం, హోదా మరియు సంపత్తిచే ప్రేరణచెంది ఉంటాయి. రాజకీయ వేత్తల, అతిగా ఆందోళన చెందే తల్లిదండ్రుల యొక్క, మరియు వ్యాపరవేత్తల, ప్రయాస కూడా తరచుగా రజోగుణ కర్మల కోవకే చెందుతాయి. |
|
అనుబంధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్ । మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే ।। 25 ।। | 25 | 18 | అనుబంధం — పరిణామాలు; క్షయం — నష్టము; హింసాం — హాని/హింస; అనపేక్ష్య — పట్టించుకోకుండా; చ — మరియు; పౌరుషం — తన స్వంత సామర్థ్యము; మోహాత్ — భ్రాంతి/మోహముచే; ఆరభ్యతే — ప్రారంభించబడి; కర్మ — కర్మ; యత్ — ఏదైతే; తత్ — అది; తామసం — తమోగుణములో ఉన్నట్టు; ఉచ్యతే — చెప్పబడును. | BG 18.25:
మోహభ్రాంతి వల్ల ప్రారంభించబడి, తమ యొక్క స్వ-శక్తి ఏమిటో తెలుసుకోకుండా, మరియు పరిణామాలు, జరిగే నష్టము, మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా చేసే కర్మను తామసిక కర్మ అని అంటారు. | తమో-గుణములో ఉన్న జనుల బుద్ధి అజ్ఞానముచే ఆవరింపబడి ఉంటుంది. వారు ఏది మంచి లేదా ఏది చెడు అన్న దానిగురించి ఆలోచించరు, పట్టించుకోరు; కేవలం తమ గురించి మరియు తమ స్వార్థ ప్రయోజనం కోసమే చూసుకుంటారు. వారు తమదగ్గర ఎంత ధనం లేదా ఇతర వనరులు ఉన్నాయి అని చూసుకోరు, పైగా ఇతరులకు కలిగే ఇబ్బందిని కూడా పట్టించుకోరు. ఇటువంటి పని, వారికి, ఇతరులకు హాని చేకూరుస్తుంది. శ్రీ కృష్ణుడు 'క్షయ' అన్న పదం వాడాడు, అంటే, అంటే క్షీణించిపోవటం. తామసిక కర్మ వ్యక్తి యొక్క ఆరోగ్యమును మరియు శౌర్యమును క్షీణింప చేస్తుంది. అది, ఉత్త దండగ శ్రమ, సమయ వృధా (టైం వేస్టు), మరియు వనరులు కూడా వృథాయే. ఇటువంటి పనులకి ఉదారహణలు కొన్ని ఏమిటంటే, జూదము, దొంగతనం, భ్రష్టాచారం, తాగుడు వంటి దుర్గుణములు. |
|
ముక్త సంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః । సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ।। 26 ।। | 26 | 18 | ముక్త-సంగః — ప్రాపంచిక మమకారాసక్తి లేనివారు; అనహం-వాదీ — అహంకార రహితముగా ఉన్నవారు; ధృతి — దృఢ సంకల్పము; ఉత్సాహ — ఉత్సాహము; సమన్వితాః — కలిగి ఉండి; సిద్ధి-అసిద్ధ్యో — జయము-అపజయములలో; నిర్వికారః — ప్రభావితం కాకుండా; కర్తా — కర్త (కర్మలు చేయువాడు); సాత్త్వికః — సత్త్వ గుణము యందు; ఉచ్యతే — చెప్పబడును. | BG 18.26:
అహంకార-మమకార రహితముగా ఉన్నవారు, మరియు ఉత్సాహము, దృఢసంకల్పము కలవారు, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారు, సత్త్వగుణ కర్తలు అని చెప్పబడ్డారు. | శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం, జ్ఞానము, కర్మ, మరియు కర్తలు మూడు రకములుగా ఉంటారు అని వివరించి ఉన్నాడు. జ్ఞానము మరియు కర్మ - ఈ రెండింటిని వివరించిన పిదప - ఇక ఇప్పుడు మూడు రకములైన కర్తలను గురించి చెప్పటం ప్రారంభిస్తున్నాడు. సత్త్వ గుణ సంపన్నులు సోమరితనంతో ఉండరు అని అంటున్నాడు; పైగా వారు ఉత్సాహముతో మరియు దృఢచిత్తముతో పని చేస్తారు. తేడా ఏమిటంటే వారు పని చేసే దృక్పథం వేరుగా ఉంటుంది. సాత్త్విక కర్తలు 'ముక్తసంగులు', అంటే, ప్రాపంచిక మమకారాసక్తిచే వస్తువిషయముల పట్ల సంగముతో ఉండరు; మరియు ప్రాపంచిక వస్తువులు ఆత్మకు తృప్తిని ఇవ్వగలవు అని విశ్వసించరు. అందుకే వారు ఉత్తమ ఆశయాలతో పనిచేస్తారు. మరియు వారి యొక్క ఉద్దేశాలు పవిత్రమైనవి కావటంచే, వారు ఉత్సాహము మరియు దృఢచిత్తముచే పరిశ్రమిస్తారు. పనిచేస్తున్నంత సేపూ వారి ఉత్తమమైన మానసిక దృక్పథం వల్ల, తక్కువ శక్తి వినియోగింపబడుతుంది. అందుకే, అలసట లేకుండా వారు తమ ఉన్నత ఆశయాలను నిర్వర్తించగలుగుతారు. వారు గొప్ప కార్యములు సాధించినా, వారు 'అనహం వాదీ' అంటే అహంకార రహితముగా ఉంటారు, తమ గెలుపు యొక్క గొప్పతనమంతా ఆ భగవంతునికే ఆపాదిస్తారు. |
|
రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఽశుచిః । హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ।। 27 ।। | 27 | 18 | రాగీ — వాంఛతో; కర్మ-ఫల — కర్మ ఫలము; ప్రేప్సుః — ఆశిస్తూ; లుబ్ధః — దురాశతో; హింసాత్మకః — హింసా-ప్రవృత్తి తో; అశుచిః — అపవిత్రమైన; హర్ష-శోక-అన్వితః — హర్షము-శోకముచే ప్రభావితమౌతూ; కర్తా — కర్త; రాజసః — రాజసిక గుణములో; పరికీర్తితః — అని పేర్కొనబడినది. | BG 18.27:
కర్మఫలముల పట్ల ఆసక్తితో ఉంటూ, దురాశగలవాడై, హింసా-ప్రవృత్తి కలిగి, అపవిత్రతతో ఉండి, మరియు హర్ష-శోకములచే ప్రభావితమౌతూ ఉండే కర్త రజోగుణములో ఉన్నట్టు పరిగణించబడుతాడు. | రాజసిక కర్తలు ఇక్కడ వివరించబడుతున్నారు. సాత్త్విక కర్తలు ఆధ్యాత్మిక పురోగతిచే ప్రేరణ పొందితే, రాజసిక కర్తలు భౌతిక వస్తువిషయ సంపాదన కొరకు అత్యంత అభిలాష/ఆసక్తితో ఉంటారు. ఇక్కడున్న ప్రతీదీ తాత్కాలికమైనదే అని మరియు అన్నింటిని ఇక్కడ ఏదో ఒకరోజు వదిలి వేయాలి అని అర్థంచేసుకోరు. మితిమీరిన రాగముతో (మనో-ఇంద్రియముల మమకారాసక్తులు) భావోద్వేగానికి లోనవుతూ, వారు ఆలోచనలో పవిత్రత కలిగి ఉండరు. వారు కోరుకునే ఆనందము ఈ ప్రాపంచిక వస్తువులలో ఉన్నదని నమ్మికతో ఉంటారు. అందుకే, వారికి అందిన దానితో తృప్తి చెందక, వారు 'లుబ్దః' అంటే, ఇంకా కావాలనే దురాశతో ఉంటారు. ఇతరులు తమకన్నా ఎక్కువ సాధిస్తూ లేదా ఎక్కువ భోగిస్తూ ఉంటే వారు హింసాత్మకముగా (ఈర్ష్యతో హాని తలపెట్టుట) మారతారు. వారి ప్రయోజనం సిద్ధించటానికి, వారు ఒక్కోసారి నైతికతని విడిచిపెట్టటం వలన, అశుచిః, అంటే అపవిత్రముగా అయిపోతారు. వారి కోరికలు తీరినప్పుడు అతి సంతోష పడతారు, అవి తీరకపోతే నిరాశ చెందుతారు. ఈ విధంగా, వారి జీవితాలు హర్ష-శోక అన్వితః , అంటే హర్షము, శోకముల మిళితముగా ఉంటుంది. |
|
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః । విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ।। 28 ।। | 28 | 18 | అయుక్తః — క్రమశిక్షణ రహితంగా; ప్రాకృతః — అసభ్యమైన; స్తబ్ధః — మూర్ఖమైన; శఠః — కపటమైన; నైష్కృతికః — నిజాయితీలేని (లేదా) నీచమైన; అలసః — అలసత్వం (సోమరితనంతో); విషాదీ — సంతోషములేని మరియు కోపముతో; దీర్ఘ-సూత్రీ — నిర్లక్ష్యంతో కాలయాపన చేసేవాడు; చ — మరియు; కర్తా — కర్త (చేసేవాడు); తామసః — తమోగుణములో; ఉచ్యతే — అని చెప్పబడుదురు. | BG 18.28:
క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు, తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్ధకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో కాలవిలంబన చేసే కర్తలను, తమోగుణ కర్తలు అంటారు. | శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు తామసిక కర్తలని వివరిస్తున్నాడు. వారి మనస్సు చెడు భావములలో నిమగ్నమై పోవుట వలన వారు అయుక్త, అంటే, క్రమశిక్షణ తప్పి ఉంటారు. ఏది సరియైనదో ఏది చెడుమార్గమో చెప్పే ఉపదేశాలను శాస్త్రములు మనకు అందిస్తాయి. కానీ తమోగుణ పనివారు 'స్తబ్ధః' అంటే మూర్ఖ చిత్తులు, వారు తమ చెవులను మరియు మనస్సుని సరియైన తర్కబద్ధ విషయములను గ్రహించటానికి సిద్ధముగా ఉంచరు. అందుకే వారు తరచుగా, శఠః, అంటే, మోసప్రవృత్తి కలవారై, మరియు నైష్కృతిక, అంటే నిజాయితీ లేని నీచ ప్రవృత్తి కలవారై ఉంటారు. వారు ప్రాకృతః, అంటే అసభ్యకరంగా ఉంటారు, ఎందుకంటే, వారు తమ పశు-బుద్ధిని నియత్రించుకోవటం యొక్క అవసరం గ్రహింపరు. వారు చేయవలసిన కర్తవ్యములు ఉన్నా వారు ఆ పరిశ్రమను కష్టతరమైనదిగా మరియు దుఃఖకరమైనదిగా పరిగణిస్తారు, మరియు అందుకే వారు 'అలసః' (సోమరితనం) తో మరియు 'దీర్ఘ-సూత్రీ' (కాలయాపన చేయుట) గా ఉంటారు. వారి యొక్క తుచ్ఛమైన నీచ ఆలోచనలు, అందరికన్నా వారినే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి; అవి వారిని 'విషాదీ', అంటే, దుఃఖపూరితంగా మరియు చికాకుగా చేస్తాయి. శ్రీమద్భాగవతము కూడా కర్మలు చేసే వివిధ రకాల వారి గురించి ఇలా వివరిస్తున్నది: సాత్వికః కారకో ఽసంగీ రాగంధో రాజసః స్మృతః తామసః స్మృతి-విభ్రష్టో నిర్గుణో మద్-అపాశ్రయః (11.25.26) ‘అసంగము (మమకారాసక్తి రహితముగా) తో ఉన్నవాడు సాత్విక కర్త; కర్మ పట్ల, కర్మ ఫలముల పట్ల మితిమీరిన ఆసక్తితో ఉండేవాడు రాజసిక కర్త; విచక్షణా రహితముగా ఉండేవాడు తామసికుడు. కానీ నాకు శరణాగతి చేసినవాడు ఈ త్రి-గుణములకు అతీతుడు.’ |
|
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు । ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ।। 29 ।। | 29 | 18 | బుద్ధేః — బుద్ధి యొక్క; భేదం — భేదములను; ధృతేః — దృఢ సంకల్పం యొక్క ; చ — మరియు; ఏవ — నిజముగా; గుణతః త్రి-విధం — ప్రకృతి త్రివిధముల ప్రకారముగా; శృణు — వినుము; ప్రోచ్యమానం — వివరించబడిన; అశేషణ — విస్తారముగా; పృథక్త్వేన — వేరువేరుగా; ధనంజయ — ధనసంపత్తిని జయించేవాడా, అర్జునా. | BG 18.29:
ఇక వినుము ఓ అర్జునా, ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా బుద్ధి మరియు ధృతిల యందు భేదమును విస్తారముగా వివరిస్తాను. | గత తొమ్మిది శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు కర్మ యొక్క అంగములను వివరించియున్నాడు మరియు ఈ మూడు అంగములు ఒక్కోటి కూడా మూడు రకాలుగా ఉంటాయని చెప్పియున్నాడు. ఇక ఇప్పుడు ఈ పని (కర్మ) యొక్క శ్రేష్ఠత మరియు పరిమాణములను (quality and quantity) ప్రభావం చేసే రెండు విషయములను వివరిస్తున్నాడు. అవి కర్మను ప్రేరేపించటమే కాక, దానిని నియంత్రిస్తూ, దిశానిర్దేశం కూడా చేస్తాయి. ఇవే బుద్ధి మరియు ధృతి. బుద్ధి అంటే, ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల విచక్షణా సామర్థ్యం. ధృతి అంటే - తీసుకున్న పనిని, కష్టాలు, అవరోధాలు ఉన్నా, ఎట్టి పరిస్థితిలోనైనా సాధించాలనే అంతర్లీనంగా ఉండే సంకల్ప బలం. ఈ రెండూ కూడా ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా, మూడు రకాలుగా ఉంటాయి. శ్రీ కృష్ణుడు ఇప్పుడు ఈ రెండు అంగములను మరియు వాటి త్రిగుణాత్మక వర్గములను ఇక ఇప్పుడు వివరిస్తున్నాడు. |
|
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే । బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ।। 30 ।। | 30 | 18 | ప్రవృత్తిం — కార్యకలాపాలు; చ — మరియు; నివృత్తిం — కార్యకలాపాలు విడిచిపెట్టటం; చ — మరియు; కార్య — చేయవలసిన విహిత కర్మలు; అకార్యే — నిషిద్ధ కర్మలు; భయ — భయము; అభయే — నిర్భయంగా; బంధం — బంధ కారకము; మోక్షం — మోక్ష దాయకము; చ — మరియు; యా — ఏదైతే; వేత్తి — అర్థంచేసుకున్న; బుద్ధిః — బుద్ధి; సా — అది; పార్థ — ప్రిథ పుత్రుడా; సాత్త్వికీ — సత్త్వ గుణములో ఉన్నట్టు. | BG 18.30:
ఓ పార్థా, ఏది సరియైన పని, ఏది చెడు పని; ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు; దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు; ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు, బుద్ధి సత్త్వగుణములో ఉన్నది అని చెప్పబడును. | మనం నిరంతరం మన స్వేచ్ఛా చిత్తమును ఉపయోగించుకుని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము, మరియు మన ఈ నిర్ణయముల ఎంపికే, మనం జీవితంలో ఎటువెళతామో నిర్ణయిస్తుంది. రాబర్ట్ ఫ్రాస్ట్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తన కవిత ‘ది రోడ్ నాట్ టేకెన్’ ('The Road Not Taken') లో వివరించాడు. I shall be telling this with a sigh Somewhere ages and ages hence; Two roads diverged in a wood, and I, I took the one less traveled by, And that has made all the difference. సరైన నిర్ణయాలు తీసుకోవటానికి, ఒక అభివృద్ధి చెందిన ఉన్నతమైన విచక్షణా సామర్థ్యము అవసరం. అర్జునుడికి సరైన విచక్షణా జ్ఞానమును అందించటానికే, భగవద్గీత అతనికి ఉపదేశించబడినది. మొదట్లో, అర్జునుడు తన కర్తవ్యము పట్ల అయోమయంలో ఉన్నాడు. తన బంధువుల పట్ల విపరీతమైన మమకారాసక్తి అతనిని ఏది సరైన పనో ఏది కాదో అన్న నిర్ణయంపట్ల అయోమయానికి గురి చేసింది. బలహీనంతో మరియు భయంతో, తీవ్ర అయోమయంలో, ఆయన భగవంతునికి శరణాగతి చేసి మరియు ఆయనను తన కర్తవ్యం పట్ల జ్ఞానోపదేశం చేయమని వేడుకున్నాడు. ఈ భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి విచక్షణా జ్ఞానమును పెంపొందించుకోవటానికి దోహదపడ్డాడు, చిట్ట చివరికి ఇలా ముగించాడు: ‘నేను నీకు పరమ రహస్యాలలోకే రహస్యమైన ఈ జ్ఞానముని వివరించాను. దీనిపై లోతుగా ఆలోచించుము, మరియు నీకు ఇష్టమైనరీతిలో చేయుము.’ (18.63వ శ్లోకం). సత్త్వ గుణము, బుద్ధిని జ్ఞానముచే ప్రకాశింపచేస్తుంది, అది, వస్తువులు, పనులు, మరియు భావాలలో, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగే విచక్షణని పెంపొందింప చేస్తుంది. ఏ రకమైన పని (కర్మ) చేయాలి, ఏ రకమైన పని విడిచిపెట్టాలి; దేనికి భయపడాలి, దేనిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు - అన్న జ్ఞానాన్ని మనకు సత్త్వ గుణ బుద్ధిః ఎఱుకలోకి తెస్తుంది. అది మన వ్యక్తిత్వములోని లోపాల యొక్క కారణాన్ని మరియు వాటికి పరిష్కారాన్ని తెలియచేస్తుంది. |
|
యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ । అయథావత్ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ।। 31 ।। | 31 | 18 | యయా — దేనిచేతనయితే; ధర్మం — ధర్మము; అధర్మం — అధర్మము; చ — మరియు; కార్యం — సరియైన ప్రవర్తన; చ — మరియు; అకార్యం — తప్పుడు ప్రవర్తన; ఏవ — నిజముగా; చ — మరియు; అయథా-వత్ — అయోమయముతో; ప్రజానాతి — తారతమ్యము గుర్తించు; బుద్ధిః — బుద్ధి; సా — అది; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; రాజసీ — రాజసికము | BG 18.31:
ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరియైన ప్రవర్తన ఏది తప్పుడు ప్రవర్తన అని తెలుసుకోలేకపోతుందో అప్పుడు ఆ బుద్ధి, రజోగుణములో ఉన్నట్టు. | వ్యక్తిగత మమకారాసక్తుల వలన రాజసిక బుద్ధి మిశ్రితమై పోతుంది. కొన్ని కొన్ని సార్లు స్పష్టముగా చూడగలుగుతుంది, కానీ స్వార్థ ప్రయోజనం కలగాలనుకున్నప్పుడు అది కళంకితమై అయోమయంలో పడిపోతుంది. ఉదాహరణకి, కొంతమంది వారి వృత్తులలో అత్యంత నైపుణ్యం కలిగి ఉంటారు కానీ కుటుంబపు సంబంధాలలో పరిణితిలేని ప్రవర్తనతో ఉంటారు. వారు వృత్తివ్యాపారాలలో ఏంతో విజయం సాధిస్తారు కానీ ఇంటి/కుటుంబ వ్యవహారాలలో ఘోర వైఫల్యం చెందుతారు, ఇది ఎందుకంటే, వారి యొక్క మమకారాసక్తియే వారిని సరైన దృక్పథం మరియు నడవడికతో ప్రవర్తించకుండా చేస్తుంది. రాజసిక బుద్ధిః రాగద్వేషములు, ఇష్టాఇష్టములచే ప్రభావితమైపోయి, ఏది మంచి, ఏది చెడు అన్న విషయాన్ని సరిగ్గా తెలుసుకోలేదు. ఏది ముఖ్యము ఏది అనావశ్యకము, ఏది నిత్యము ఏది తాత్కాలికము, ఏది విలువైనది మరియు ఏది అల్పమైనది అన్న విషయంలో అది అయోమయంలో ఉంటుంది. |
|
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా । సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ।। 32 ।। | 32 | 18 | అధర్మం — అధర్మము; ధర్మం — ధర్మము; ఇతి — ఈ విధముగా; యా — ఏదైతే; మన్యతే — ఊహిస్తారో (భావిస్తారో); తమస-ఆవృతా — చీకటిలో కప్పివేయబడి; సర్వ-అర్థాన్ — అన్ని విషయములలో; విపరీతాన్ — విరుద్ధముగా; చ — మరియు; బుద్ధిః — బుద్ధి; సా — అది; పార్థ — ప్రిథ పుత్రుడా; తామసీ — తామసిక గుణములో ఉన్నట్టు; | BG 18.32:
ఓ పార్థా! చీకటితో ఆవృత్తమై ఉండి, అధర్మమునే ధర్మము అనుకుంటూ, అసత్యమును సత్యము అని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి. | తామసిక బుద్ధి అనేది పవిత్రమైన జ్ఞానముచే ప్రకాశితమై ఉండదు. కాబట్టి అది అధర్మమునే తప్పుగా ధర్మము అని అనుకుంటుంది. ఉదాహరణకు, ఒక త్రాగుబోతు ఆ మద్యం యొక్క మత్తు పట్ల ఆసక్తి/అనుబంధంతో ఉంటాడు. కాబట్టి, అతని యొక్క అల్పబుద్ధి, అంధకారముచే కప్పివేయబడినదై, తనకు తానే స్వయంగా చేసుకునే తీవ్ర హానిని కూడా గ్రహించలేడు, ఇది ఎంత బలీయంగా ఉంటుందంటే ఇంకొక మద్యంసీసా కోసం తన ఆస్తిని కూడా అమ్మటానికి వెనుకాడడు. తామసిక బుద్ధిలో, విచక్షణా జ్ఞానము మరియు తర్కబద్ధ వివేచన అనేవి కోల్పోబడుతాయి. |
|
ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః । యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ।। 33 ।। | 33 | 18 | ధృత్యా — నిర్ధారణచేయుటచే; యయా — ఏదైతే; ధారయతే — వహించునో; మనః — మనస్సు యొక్క; ప్రాణ — ప్రాణ వాయువులు; ఇంద్రియ — ఇంద్రియములు; క్రియాః — కార్యకలాపాలు; యోగేన — యోగము ద్వారా; అవ్యభిచారిణ్యా — ఎటూచలింపని; ధృతిః — దృఢ సంకల్పము; సా — అది; పార్థ — అర్జునా, ప్రిథ యొక్క పుత్రుడా; సాత్త్వికీ — సత్త్వ గుణములో ఉన్నట్టు. | BG 18.33:
యోగము ద్వారా పెంపొందించుకున్న దృఢ చిత్త సంకల్పము; మరియు మనస్సు, ప్రాణ వాయువులు, ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్ని, సత్త్వ గుణ దృఢమనస్కత అంటారు. | ధృతి (దృఢ సంకల్పము) అనేది, కష్టాలు-అవరోధాలు ఎదురైనా మన మార్గంలోనే పట్టువిడువకుండా ఉంచగలిగే, మన మనోబుద్ధుల యొక్క అంతర్గత సామర్థ్యము. మనం మన లక్ష్యంపై చూపును కేంద్రీకరిస్తూ, శరీరమనోబుద్ధులలో దాగిఉన్న శక్తిని వెలికితీసి, కష్టసాధ్యమైన అవరోధాలని కూడా అధిగమించే సామర్థ్యాన్ని - ధృతియే కలుగచేస్తుంది. శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు మూడు రకములైన దృఢ సంకల్పములను వివరించబోతున్నాడు. యోగాభ్యాసము ద్వారా, మనస్సు క్రమశిక్షణతో అయిఉండి, శరీరేంద్రియములపై ఆధిపత్యంతో ఉండగలిగే సామర్ధ్యాన్ని పెంపొందించుకుంటుంది. ప్రాణవాయువులను నియంత్రించి, ఇంద్రియములను అధీనము లోనికి తెచ్చుకుని, మనస్సుని నియంత్రించగలిగినప్పుడు కలిగే దృఢ చిత్తమునే - సాత్త్విక ధృతి (సత్త్వ గుణములో ఉన్న దృఢ సంకల్పము) అని అంటారు. |
|
యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేఽర్జున । ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ।। 34 ।। | 34 | 18 | యయా — దేనిచేతనైతే; తు — కానీ; ధర్మ-కామ-అర్థాన్ — కర్తవ్యము, సుఖాలు, మరియు సంపద; ధృత్యా — దృఢ సంకల్పము ద్వారా; ధారయతే — కలిగిఉంటారో; అర్జున — అర్జునా; ప్రసంగేన — మమకారాసక్తి చేత; ఫల-ఆకాంక్షీ — ఫలములపై ఆసక్తి; ధృతిః — దృఢ నిశ్చయము; సా — అది; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; రాజసీ — రాజసికము. | BG 18.34:
ఫలాపేక్షచే ప్రేరితమై ధర్మము (విధులు), కామము (సుఖములు), మరియు అర్థము(సంపద) పట్ల ఆసక్తితో ఉండే స్థిరచిత్తము రాజసిక ధృతి అని చెప్పబడును. | ధృతి అనేది కేవలం యోగులలోనే ఉండదు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్న జనులు కూడా తమతమ ఆశయసాధనలో అత్యంత దృఢ సంకల్పముతో ఉంటారు. కానీ, వారి సంకల్పం అనేది వారి యొక్క పరిశ్రమ యొక్క ఫలములను భోగించాలనే కోరికచే ప్రేరేపితమై ఉంటుంది. ఇంద్రియ సుఖాలను భోగించాలి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి వంటి విషయాలపై వారి మనస్సు కేంద్రీకృతమై ఉంటుంది. మరియు, డబ్బు అనేది వీటన్నిటిని పొందటానికి సాధనం కాబట్టి ఇటువంటి మనుష్యులు జీవితాంతం డబ్బునే పట్టుకుని వ్రేళ్ళాడతారు. కర్మఫలములను భోగించాలనే కోరికచే ప్రేరేపితమైన సంకల్పము, రాజసిక (రజో గుణములో ఉన్న) సంకల్పముగా చెప్పబడినది. |
|
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ । న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ ।। 35 ।। | 35 | 18 | యయా — ఏదయితే; స్వప్నం — కలలుకంటూ; భయం — భయపడుతూ; శోకం — శోకిస్తూ; విషాదం — నిరాశ; మదం — దురహంకారము; ఏవ — నిజముగా చ — మరియు; న విముంచతి — వదిలిపెట్టక; దుర్మేధా — తెలివిలేని; ధృతిః — సంకల్పము; సా — అది; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; తామసీ — తామసికము (తమో గుణములో ఉన్న) | BG 18.35:
విడువకుండా పగటికలలు కంటూ, భయపడుతూ, శోకిస్తూ, నిరాశకు లోనౌతూ మరియు దురహంకారముతో ఉండే అల్పబుద్ధి సంకల్పమునే తమోగుణ ధృతి అంటారు. | సంకల్పము/దృఢ చిత్తము అనేది అవివేకులు మరియు అజ్ఞానులలో కూడా కనిపిస్తుంది. కానీ ఆ మూర్ఖత్వం/మొండితనం భయము, నిరాశ, మరియు దురహంకారముచే జనిస్తుంది. ఉదాహరణకి, కొంతమంది అస్తమానం భయపడే లక్షణంతో ఉంటారు, అదేదో తమ వ్యక్తిత్వములో భాగము అన్నట్టుగా, వారు దానినే పట్టుకొని ఉండటం ఒక ఆసక్తికరమైన గమనించదగ్గ విషయం. మరికొందరు, ఏదో గతంలో జరిగిన నిరాశా సంఘటననే అస్తమానం పట్టుకునే ఉండి, దానిని విడిచిపెట్టక, తమ జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. అది వారిపై ఎంత దుష్ప్రభావం కలుగచేస్తుందో గమనించి కూడా అలాగే ఉంటారు. కొందరు తమ అహంభావమును దెబ్బ తీసిన వారందరితో తగవు పెట్టుకోకుండా ఉండలేరు. ఇటువంటి నిరర్థకమైన తలపుల పట్ల ఉన్న మూర్ఖపు పట్టుపై ఆధారపడిఉన్న ధృతి తామసికము (తమోగుణములో ఉన్న) అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. |
|
సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ । అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి ।। 36 ।। | 36 | 18 | సుఖం — సుఖము; తు — కానీ; ఇదానీం — ఇప్పుడు; త్రి-విధం — మూడు విధముల; శృణు — వినుము; మే — నా నుండి; భరత-ఋషభ — అర్జునా, భరతులలో శ్రేష్ఠుడా; అభ్యాసాత్ — అభ్యాసముచే; రమతే — రమించెదరు; యత్ర — దేనిలోనైతే; దుఃఖ-అంతం — సర్వ దుఃఖముల నివృత్తి; చ — మరియు; నిగచ్ఛతి — చేరుకుంటారు. | BG 18.36:
ఇక ఇప్పుడు నా నుండి వినుము, ఓ అర్జునా, దేహముయందున్న జీవాత్మ రమించే మూడు విధముల సుఖముల గురించి, మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించి. | ఇంతకు క్రితం శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు కర్మ యొక్క అంగములను వివరించి ఉన్నాడు. ఆ తరువాత కర్మలను ప్రేరేపించి, నియంత్రించే కారకములను వివరించి ఉన్నాడు. ఇక ఇప్పుడు కర్మ యొక్క లక్ష్యము గురించి చెప్తున్నాడు. జనుల కర్మల వెనుక ఉన్న అంతిమలక్ష్యం ఆనందం కోసం అన్వేషణే. ప్రతిఒక్కరూ ఆనందంగా/సుఖంగా ఉండాలనే కోరుకుంటారు, మరియు వారి పనులచే (కర్మలచే) వారు తుష్టిని, శాంతిని, మరియు సంతృప్తిని పొందటానికి ప్రయత్నిస్తారు. కానీ, ప్రతిఒక్కరి కర్మలు వాటివాటి అంతర్గత కారక స్వభావములచే భిన్నముగా ఉండటం వలన, వాటి ద్వారా వచ్చే సుఖము కూడా వేర్వేరుగా ఉంటుంది. శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు మూడు రకముల ఆనందము/సుఖముల గురించి వివరిస్తున్నాడు. |
|
యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ । తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధిప్రసాదజమ్ ।। 37 ।। | 37 | 18 | యత్ — ఏదైతే; తత్ — అది; అగ్రే — ప్రారంభంలో; విషం-ఇవ — విషములా; పరిణామే — చివరికి; అమృత-ఉపమమ్ — అమృతము వలె; తత్-సుఖం — అటువంటి సుఖము; సాత్త్వికం — సాత్త్వికమని; ప్రోక్తమ్ — చెప్పబడినది; ఆత్మ-బుద్ధి — ఆత్మ జ్ఞానం లో స్థితమై; ప్రసాద-జమ్ — శుద్ధమైన బుద్ధిచే జనింపచేయబడిన. | BG 18.37:
మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతంలా ఉండే సుఖమే సత్త్వ గుణ సుఖము. అది ఆత్మ-జ్ఞానం యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది. | భారతదేశ ఉసిరికాయ (ఆమ్లా) ఆరోగ్యానికి లాభకారియైన అత్యుత్తమ ఆహారపదార్థములలో ఒకటి. దానిలో 10 నారింజ పళ్ళకన్నా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. కానీ, పిల్లలకు అది ఇష్టం ఉండదు, ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది. ఉత్తర భారత దేశంలో, తల్లిదండ్రులు తమ పిల్లలను దాన్ని తినమని ప్రోత్సహిస్తూ ఇలా అంటారు: ఆమ్లే కా ఖాయా ఔర్ బడోం కా కహా, బాద్ మే పతా చల్తా హై, అంటే ‘ఉసిరికాయ (ఆమ్లా) తినటం మరియు పెద్దల సలహా - ఈ రెండింటి ప్రయోజనం భవిష్యత్తులో తెలుస్తుంది’ అని. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఉసిరికాయ తిన్నతరువాత, రెండు నిమిషాల వ్యవధిలోనే, పుల్లని రుచి పోయి, తియ్యని రుచి అనుభవంలోకి వస్తుంది. అంతేకాక, సహజమైన విటమిన్ సి తీసుకోవటంలో నిస్సందేహముగా అనేక దీర్ఘకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పై శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, సత్త్వ గుణ సుఖము సరిగ్గా ఇటువంటిదే అని; అది ప్రస్తుతానికి చేదుగా అనిపించినా, అంతిమంగా అమృతంలాగా ఉంటుంది. వేదములు ఈ యొక్క సత్త్వ గుణ సుఖాన్ని 'శ్రేయస్సు' అని చెప్పాయి, అంటే ప్రస్తుతానికి ఇబ్బందిగా ఉన్నా, అంతిమంగా అది చాలా మంచిది. దీనికి వ్యతిరేకం 'ప్రేయస్సు', అది ప్రస్తుతానికి సుఖంగా ఉన్నా, అంతిమంగా హానికారకమే. ఈ శ్రేయస్సు మరియు ప్రేయస్సు గురించి, కఠోపనిషత్తు ఈ విధంగా పేర్కొన్నది: అన్యఛ్చ్రెయో ఽన్యదుతైవ ప్రేయస్తే ఉభే నానార్థే పురుషం సినీతః తయో శ్రేయః ఆదదానస్య సాధు భవతి హీయతేఽర్థాద్య ఉప్రేయోవృణీతే శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత స్తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోఽభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే (1.2.1-2) ‘రెండు మార్గాలు ఉన్నాయి - ఒకటి “మేలుకలిగించేది” ఇంకొకటి “సుఖంగా” ఉండేది. ఈ రెండూ మనుష్యులను రెండు భిన్నమైన గమ్యాలకు చేరుస్తాయి. సుఖంగా ఉండేది మొదట్లో హాయిగా అనిపిస్తుంది, కానీ, అది బాధతో ముగుస్తుంది. అజ్ఞానులు ఈ సుఖాలలో చిక్కుకుపోతారు మరియు చివరకు నశించిపోతారు. కానీ, వివేకవంతులు ఈ ఆకర్షణలచే మోసపోరు; అందుకే, వారు ప్రయోజనకరమైనదాన్ని ఎంచుకుంటారు మరియు సుఖానందాన్ని పొందుతారు.’ |
|
విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమమ్ । పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ ।। 38 ।। | 38 | 18 | విషయ — ఇంద్రియ విషయములతో; ఇంద్రియ — ఇంద్రియముల; సంయోగాత్ — సంపర్కము చేత; యత్ — ఏదైతే; తత్ — అది; అగ్రే — మొదట్లో; అమృత-ఉపమమ్ — అమృతము వలె; పరిణామే — చివరికి; విషం-ఇవ — విషము లాగా; తత్ — అది; సుఖం — సుఖము; రాజసం — రాజసికమైనది (రజో గుణములో ఉన్న); స్మృతమ్ — అని చెప్పబడును. | BG 18.38:
ఇంద్రియములతో ఇంద్రియ వస్తువిషయముల సంపర్కముచేత కలిగిన సుఖమును రాజసిక (రజో గుణ) సుఖము అని అంటారు. ఈ సుఖానందము మొదట్లో అమృతంలా ఉన్నా చివరికి విషంలా ఉంటుంది. | రాజసిక సుఖము అనేది ఇంద్రియములకు ఇంద్రయవస్తువిషయ సంపర్కము కలిగినప్పుడు అనుభవించే అనుభూతి; కానీ ఆ కలయిక మాదిరిగానే సుఖానందము కూడా తాత్కాలికమే; ఈ ప్రక్రియలో అది దురాశ, ఆందోళన, అపరాధభావన, మరియు మరింత భౌతిక భ్రాంతిని కలుగచేస్తుంది. భౌతిక జగత్తులో కూడా, అర్థవంతమైన పురోగతి సాధించాలంటే, రాజసిక సుఖాన్ని త్యజించవలసి ఉంటుంది. తక్షణమే లభించేవి కానీ తప్పుదారి పట్టించే సుఖాల నుండి తనను తాను దూరంగా ఉంచుకోవటానికి, భారత దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి, జవహర్ లాల్ నెహ్రు, ‘స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నోఇ ఈవినింగ్’ (Stopping by Woods on a Snowy Evening) అనే కవితలోని కొన్ని ఈ క్రింది వాక్యాలను తన బల్లపై ఉంచుకునే వాడు. The woods are lovely, dark, and deep, (ఆరుబయట చాలా అందంగా ఉంది) But I have promises to keep, (కానీ, నేను ఎన్నో వాగ్దానాలను నెరవేర్చాల్సి ఉంది) And miles to go before I sleep, (విశ్రాంతి తీస్కునేముందు ఇంకా ఎంతో పయనించాల్సి ఉంది) And miles to go before I sleep. (విశ్రాంతి తీస్కునేముందు ఇంకా ఎంతో పయనించాల్సి ఉంది) నిత్య శాశ్వతమైన దివ్య ఆనందం కోసం ఉన్న మార్గము - భోగాలను అనుభవించటంలో లేదు - కానీ, త్యాగము, తపస్సు, మరియు క్రమశిక్షణ లోనే ఉన్నది. |
|
యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః । నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ।। 39 ।। | 39 | 18 | యత్ — ఏదయితే; అగ్రే — ప్రారంభం నుండి; చ — మరియు; అనుబంధే — చివరి వరకూ; చ — మరియు; సుఖం — ఆనందము; మోహనం — భ్రమింపజేయునట్టి; ఆత్మనః — ఆత్మ యొక్క; నిద్రా — నిద్ర; ఆలస్య — సోమరితనము; ప్రమాద — నిర్లక్ష్యము; ఉత్తం — ఉద్భవించినదై; తత్ — అది; తామసం — తామసిక; (తమో-గుణములో ఉన్న); ఉదాహృతం — అని చెప్పబడినది. | BG 18.39:
ఏదైతే ఆనందము - ఆత్మ యొక్క స్వభావాన్ని పూర్తిగా మొదలు నుండి చివర వరకు కప్పివేసి, మరియు నిద్ర, సోమరితనము, మరియు నిర్లక్ష్యము నుండి ఉద్భవించినదో - అది తామసిక ఆనందము అని చెప్పబడును. | తామసిక సుఖము అన్నింటికన్నా నిమ్న స్థాయికి చెందినది, అది మొదటనుండీ చివర వరకూ మూర్ఖమయినది. అది ఆత్మను అజ్ఞానపు చీకటిలో విసిరివేస్తుంది. అయినాసరే దానిలో ఒక స్వల్పమాత్ర సుఖము ఉండటం చేత, జనులు దానికి బానిసై పోతారు. అందుకే సిగరెట్టు త్రాగేవారు, అది తమకు చాలా హానికారి అనితెలిసి కూడా, ఆ అలవాటుని వదిలిపెట్టటానికి కష్టతరంగా భావిస్తారు. ఆ దురలవాటు నుండి లభించే సుఖాన్ని త్యజించలేకపోతారు. నిద్ర, సోమరితనము, మరియు నిర్లక్ష్యం ద్వారా జనించిన ఇటువంటి సుఖానందాలు, తమోగుణము లో ఉన్నట్టు - అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. |
|
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః । సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః ।। 40 ।। | 40 | 18 | న — కాదు; తత్ — అది; అస్తి — ఉండుట; పృథివ్యాం — భూమిపై; వా — లేదా; దివి — పైనున్న స్వర్గాది లోకాలు; దేవేషు — దేవతలలో; వా — లేదా; పునః — మరల; సత్త్వం — ఉండుట; ప్రకృతి-జైః — ప్రకృతి త్రిగుణముల ద్వారా జనించిన; ముక్తం — విముక్తి పొందిన; యత్ — అది; ఏభిః — వీటి ప్రభావం నుండి; స్యాత్ — ఉండును; త్రిభిః — మూడు; గుణైః — ప్రకృతి గుణములు. | BG 18.40:
ఈ భౌతిక జగత్తు యందు - భూమిపై కానీ, లేదా, ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో కానీ - ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు. | భౌతిక శక్తి అయిన - మాయ - మూడు వర్ణములలో ఉంటుంది అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు పేర్కొంటున్నది: అజామేకాం లోహిత-శుక్ల-కృష్ణాం బహ్వీః ప్రజాః సృజమానాం స-రూపాః అజోహ్వేకో జుషమాణో ఽనుశేతే జహాతి ఏనాం భుక్త-భోగాం అజోన్యః (4.5) ‘భౌతిక ప్రకృతి మూడు వర్ణములలో ఉంటుంది - తెలుపు, ఎరుపు, మరియు నలుపు, అంటే, దానికి మూడు గుణములు ఉంటాయి - సత్త్వము, రజస్సు, మరియు తమస్సు. విశ్వములోని అసంఖ్యాకమైన జీవులకు అది మాతృ-గర్భము వంటిది. పుట్టుకలేని, సంపూర్ణ జ్ఞాన స్వరూపుడైన ఆ భగవంతునిచే అది అస్తిత్వములోనికి తీసుకురాబడి, ఆయనచే నిర్వహించబడుతున్నది. కానీ, భగవంతునికి ఈ భౌతిక శక్తి అంటదు. ఆయన తనకుతాను వేరుగా అలౌకిక లీలానందమును రమిస్తుంటాడు. కానీ, జీవుడు దానిని భోగిస్తూ తద్వారా బద్ధుడై పోతాడు.’ నరక లోకాల నుండి బ్రహ్మ లోకం వరకూ మాయ యొక్క పరిధి ఉంటుంది. ప్రకృతి త్రిగుణములు - సత్త్వము, రజస్సు, మరియు తమస్సులు, మాయ యొక్క అంతర్లీన గుణములు కాబట్టి, అవి అన్ని భౌతిక లోకాలలో ఉంటాయి. అందుకే, ఈ లోకాలలో ఉండే సమస్త జీవ రాశులు, వారు మానవులైనా లేదా దేవతలైనా, ఈ త్రి-గుణముల ప్రభావంలోనే ఉంటారు. ఉన్న తేడా అంతా ఈ గుణములు ఉండే పాళ్ళు వేర్వేరుగా ఉండటమే. నిమ్న లోకాలలో నివసించేవారు తమోగుణము ప్రధానంగా కలిగి ఉంటారు; భూలోకంలో ఉండేవారు రజోగుణ ప్రధానంగా ఉంటారు; మరియు స్వర్గాది లోకాలలో ఉండేవారు సత్త్వ గుణ ప్రధానంగా ఉంటారు. ఇక ఇప్పుడు ఈ మూడు చలరాశుల పరంగా, మానవులు ఎందుకు భిన్నమైన స్వభావములను కలిగి ఉంటారో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. |
|
బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప । కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ।। 41 ।। | 41 | 18 | బ్రాహ్మణ — బ్రాహ్మణులలో; క్షత్రియ — యోధులు మరియు పరిపాలకుల తరగతి; విశాం — వ్యాపారులు మరియు వ్యవసాయదారుల తరగతి; శూద్రాణాం — కాయకష్ట పని చేసేవారు; చ — మరియు; పరంతప — అర్జునా, శత్రువులను వశపరుచుకునే వాడా; కర్మాణి — విధులు; ప్రవిభక్తాని — కేటాయించబడినవి; స్వభావ-ప్రభవైః-గుణైః — వ్యక్తి యొక్క గుణములు మరియు స్వభావమునకు అనుగుణముగా ఉన్న పని. | BG 18.41:
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు - వీరి యొక్క విధులు వారివారి లక్షణములకు అనుగుణంగా, వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి. (పుట్టుక పరంగా కాదు). | సరిగ్గా సరిపోయే వృత్తి దొరకటం అంటే సరిగ్గా సరిపోయే జీవిత భాగస్వామి దొరకటం లాగానే అని ఎవరో చాలా బాగా చెప్పారు. కానీ, మనకు సరిగ్గా సరిపోయే వృత్తి మనమే ఎలా దొరికిచ్చుకోవాలి? ఇక్కడ, శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, జనులకు వారి వారి గుణముల ప్రకారంగా వారి వ్యక్తిత్వాన్ని ఏర్పరిచే విభిన్నమైన స్వభావాలు ఉంటాయి, అందుకే విభిన్న వృత్తిపర విధులు వారి వారికి అనుగుణముగా ఉంటాయి. ఈ యొక్క 'వర్ణాశ్రమ ధర్మములు' అనేవి, 'స్వభావ-ప్రభావైర్ గుణైః' , (వ్యక్తి యొక్క స్వభావ గుణములు ఆధారంగా ఉన్న పని) అనుసరించి ఉన్న ఒక శాస్త్రీయమైన సామాజిక ఏర్పాటు. ఈ వర్గీకరణ పద్ధతిలో, నాలుగు ఆశ్రమాలు ఉంటాయి (జీవిత స్థాయిలు) మరియు నాలుగు వర్ణములు (వృత్తులు) ఉంటాయి. జీవిత ఆశ్రమాలు ఇవి: 1) బ్రహ్మచర్య ఆశ్రమం (విద్యార్థి జీవితం), అంటే, పుట్టుక నుండి 25 సంవత్సరముల వయస్సు వరకు ఉండేది. 2) గృహస్థ ఆశ్రమం (కుటుంబపర జీవనం), సాధారణ వైవాహిక జీవితం, అంటే 25 సంవత్సరముల వయస్సు నుండి 50 వరకు 3) వానప్రస్థ ఆశ్రమం (పాక్షిక సన్న్యాస జీవనం) అంటే 50 సంవత్సరముల వయస్సు నుండి 75 సంవత్సరముల వయస్సు వరకు, ఈ స్థితిలో కుటుంబములో ఉంటూనే సన్న్యాసమును అభ్యాసం చేయటం. 4) సన్యాస ఆశ్రమం, అంటే, 75 ఏళ్ల సంవత్సరాల వయస్సు నుండి ఆ పైకి, ఇందులో వ్యక్తి అన్ని కుటుంబపర విధులను త్యజించి, ఒక పవిత్ర ప్రదేశంలో (పుణ్య క్షేత్రం) నివసిస్తూ, మనసుని భగవంతుని యందే నిమగ్నం చేసేవారు. బ్రాహ్మణులు (పౌరోహిత్యం చేసేవారు), క్షత్రియులు (యోధులు మరియు పరిపాలన చేసేవారు), వైశ్యులు (వ్యాపారం మరియు వ్యవసాయం చేసేవారు) మరియు శూద్రులు (కాయకష్టం చేసేవారు) అనేవి నాలుగు వర్ణములు (వృత్తి ధర్మములు). వర్ణములు అనేవి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఎప్పుడూ పరిగణింపబడలేదు. సమాజం మొత్తం భగవంతుని చుట్టూ, ఆయన సేవార్థమే ఉండేది కాబట్టి, అందరూ తమను మరియు సమాజాన్ని పోషించేందుకు తమ స్వాభావిక సహజ గుణముల ప్రకారంగా పని చేసేవారు; తద్వారా భగవత్ ప్రాప్తి దిశగా ముందుకెళ్లి, జీవితాన్ని సఫలం చేసుకునేవారు. ఈ విధంగా వర్ణాశ్రమ వ్యవస్థలో, భిన్నత్వంలో ఏకత్వం ఉండేది. ప్రకృతిలో భిన్నత్వం అనేది అంతర్గతంగా ఎల్లప్పుడూ ఉండేదే, దానిని పూర్తిగా నిర్మూలించలేము. మన శరీరంలోనే విభిన్నమైన అంగములు ఉన్నాయి, అవన్నీ వేర్వేరు పనులు చేస్తుంటాయి. అన్ని అంగములూ ఒకే పని చేయాలి అని ఆశించటం అవివేకం. వాటన్నిటినీ భిన్నముగా చూడటం అజ్ఞానం కాదు, అది వాటి యొక్క యదార్థ ప్రయోజనాన్ని చూడటమే. అదే విధంగా, మానవులలో ఉండే వైవిధ్యాన్ని కూడా మనం విస్మరించలేము. సమత్వమే ప్రధాన సూత్రం గా ఉన్న కమ్యూనిస్టు దేశాల్లో కూడా - సిద్ధాంతాలను, చట్టాలను ప్రతిపాదించే పార్టీ నాయకులు ఉంటారు; ఆయుధాలు ధరించి దేశాన్ని కాపాడే సైనికులు/సైన్య బలం ఉంటుంది; వ్యవసాయం చేసుకునే రైతులు ఉంటారు; శారీరక పనిచేసే ప్రారిశ్రామిక కార్మికులు ఉంటారు. ఎంత సమానంగా ఉంచాలని చూసినా ఈ నాలుగు రకాల వృత్తుల వారు అక్కడ కూడా ఉంటారు. వర్ణాశ్రమ వ్యవస్థ, మనుష్యులలో ఉన్న వైవిధ్యాన్ని గుర్తించింది మరియు వారివారి స్వభావాల అనుగుణంగా వారికి సరిపోయే వృత్తులను శాస్త్రీయంగా సిఫారసు చేసింది. కానీ, కాలక్రమంలో, వర్ణాశ్రమ వ్యవస్థ భ్రష్టమైపోయింది, మరియు వర్ణము అనేది వ్యక్తి యొక్క గుణ-స్వభావం పై కాక, వాని యొక్క పుట్టుక పై ఆధారమైపోయింది. బ్రాహ్మణుల పిల్లలు, వారికి ఆ గుణాలు ఉన్నా-లేకున్నా, వారికి వారే బ్రాహ్మణులమని చెప్పుకోవటం మొదలు పెట్టారు. అంతేకాక, ఉన్నత, కులము తక్కువ కులము అన్న భావము ప్రబలిపోయింది, తక్కువ కులం వారిని చిన్నచూపు చూడటం మొదలయ్యింది. ఎప్పుడైతే ఈ వ్యవస్థ బిరుసుగా, పుట్టుక ఆధారంగా అయిపోయిందో, అది అస్తవ్యస్థమై పోయింది. ఈ సామాజిక దోషం కాలంలో ప్రబలింది, కానీ ఇది వర్ణాశ్రమ వ్యవస్థ యొక్క అసలు ఉద్దేశ్యం కాదు. తదుపరి కొన్ని శ్లోకాలలో, దాని అసలైన వర్గీకరణ ప్రకారంగా, శ్రీ కృష్ణుడు, వ్యక్తుల గుణములను వారి యొక్క సహజ వృత్తి లక్షణములతో అనుసంధానం చేసి వివరిస్తాడు. |
|
శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ । జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ ।। 42 ।। | 42 | 18 | శమః — ప్రశాంతత; దమః — (ఇంద్రియ) నిగ్రహణ; తపః — తపస్సు; శౌచం — స్వచ్ఛత; క్షాంతి — సహనము; ఆర్జవమ్ — చిత్తశుద్ధి; ఏవ — నిజముగా; చ — మరియు; జ్ఞానం — జ్ఞానము; విజ్ఞానమ్ — విజ్ఞానము; ఆస్తిక్యం — పునర్జన్మ-పరలోకం యందు విశ్వాసం; బ్రహ్మ — బ్రాహ్మణ వర్గం యొక్క; కర్మ — పని; స్వభావ-జమ్ — సహజ-స్వభావ గుణములచే జనించిన. | BG 18.42:
శమము (ప్రశాంతత), దమము (ఇంద్రియ నిగ్రహణ), తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము, మరియు ఇహపరలోకములపై విశ్వాసము - ఇవి బ్రాహ్మణుల సహజసిద్ధ స్వభావ కర్మ లక్షణములు. | సాత్త్విక స్వభావము ప్రధానంగా కలవారు బ్రాహ్మణులు. వారి యొక్క ప్రధానమైన విధులు తపస్సు ఆచరించటం, అంతఃకరణ శుద్ధి అభ్యాసం చేయటం, భక్తి మరియు ఇతరులకు తమ నడవడికచే స్పూర్తినివ్వటం. ఈ విధంగా, వారు సహనంతో, వినమ్రతతో, మరియు ఆధ్యాత్మిక చిత్తముతో ఉంటారని అందరూ ఆశిస్తారు. తమ కోసం మరియు ఇతర వర్గాల కోసం కూడా వైదిక కర్మకాండలను చేస్తారని అందరూ ఆశిస్తారు. వారి సహజ స్వభావం వారిని జ్ఞాన-సముపార్జన పట్ల ఆసక్తిగా చేస్తుంది. కాబట్టి, ఉపాధ్యాయ వృత్తి - జ్ఞానాన్ని పెంపొందించుకుని మరియు దానిని ఇతరులతో పంచుకునే వృత్తి - కూడా వారికి అనుకూలంగా ఉండేది. వారు తామే స్వయంగా ప్రభుత్వ పరిపాలనలో పాలుపంచుకోకపోయినా, అధికారులకు దిశానిర్దేశం చేసేవారు. మరియు వారికి శాస్త్ర పరిజ్ఞానం ఉండేది కాబట్టి, సామాజిక మరియు రాజకీయ విషయాలపై వారి అభిప్రాయానికి చాలా విలువ ఉండేది. |
|
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ । దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ।। 43 ।। | 43 | 18 | శౌర్యం — శౌర్యము; తేజః — బలము; ధృతి — ధైర్యం; దాక్ష్యం యుద్ధే — ఆయుధ విద్యలో నైపుణ్యం; చ — మరియు; అపి — కూడా; అపలాయనమ్ — పారిపోకుండా ఉండటం; దానం — విశాల హృదయం కలిగి ఉండటం; ఈశ్వర — నాయకత్వ లక్షణాలు; భావః — గుణములు; చ — మరియు; క్షాత్రం — యోధులు మరియు పరిపాలనా వర్గమునకు చెందిన; కర్మ — పని; స్వభావ-జమ్ — సహజ స్వభావంచే జనించిన. | BG 18.43:
శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధంలోనుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము, మరియు నాయకత్వ సామర్థ్యము - ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు. | క్షత్రియులు ప్రధానంగా రాజసిక లక్షణములతో ఉంటారు, కొద్దిగా సత్త్వగుణ మిశ్రమంతో ఉంటారు. అది వారిని, రాజసంతో, వీరత్వంతో, ధైర్యంతో, నాయకత్వ లక్షణాలతో, మరియు దానగుణంతో ఉండేలా చేస్తుంది. వారి లక్షణములు వారికి సైనిక పరమైన మరియు నాయకత్వ పనులకు అనుకూలంగా చేస్తాయి, మరియు వారు దేశాన్ని పాలించే పాలక వర్గముగా ఉంటారు. అయినా వారు బ్రాహ్మణులంత పవిత్రంగా, వారంత పాండిత్యంతో ఉండము అని గ్రహించారు. అందుకే వారు బ్రాహ్మణులను గౌరవించేవారు మరియు సైద్ధాంతిక, ఆధ్యాత్మిక మరియు విధానపరమైన విషయాల్లో బ్రాహ్మణుల నుండి సలహా తీసుకునేవారు. |
|
కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మస్వభావజమ్ । పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ।। 44 ।। | 44 | 18 | కృషి — వ్యవసాయం; గౌ-రక్ష్య — పాల ఉత్పత్తి; వాణిజ్యం — వర్తకవ్యాపారం; వైశ్య — వైశ్యుల యొక్క; కర్మ — పని; స్వభావ-జమ్ — సహజస్వభావముచే జనించినవి; పరిచర్యా — పనులచే సేవ చేయటం; ఆత్మకం — సహజమైన; కర్మ — విధి; శూద్రస్య — శూద్ర తరగతి యొక్క; అపి — మరియు; స్వభావ-జమ్ — వారి సహజస్వభావముచే జనించినవి | BG 18.44:
వ్యవసాయం, పాడిపంటలు, మరియు వర్తకవాణిజ్యాలు అనేవి వైశ్య గుణములు ఉన్నవారికి సహజ సిద్ధమైన పనులు. పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజమైన విధి. | రాజసిక స్వభావం ప్రధానంగా ఉండి, దానిలో తమోగుణ మిశ్రమంగా కలవారు, వైశ్యులు. కాబట్టి వారు వాణిజ్యం మరియు వ్యవసాయం ద్వారా ఆర్థిక సంపత్తిని వృద్ధిచేసి దానిని కలిగివుండటం వైపు మొగ్గు చూపిస్తారు. వారు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తూ, ఇతర వర్గాల వారికి ఉద్యోగాలను కల్పించారు. పేదల కోసం ధార్మిక పనుల నిమిత్తం వారు తమ యొక్క సంపదలో కొంత భాగాన్ని వెచ్చించాలని అందరూ కోరుకునేవారు. శూద్రులు అంటే తామసిక స్వభావం కలిగిఉండేవారు. వారు చదువు/పాండిత్యం పట్ల, పరిపాలన పట్ల, లేదా వాణిజ్య కార్యకలాపాల పట్ల కానీ, ఆసక్తి చూపేవారు కాదు. వారి యొక్క పురోగతికి సరియైన మార్గమంటే, సమాజానికి వారికి నచ్చిన రీతిలో సేవ చేయటమే. చేతిపనుల వారు, వృత్తిపనుల వారు, రోజు-కూలీలు, దర్జీలు, శిల్పులు, క్షురకులు వంటి వారు ఈ వర్గంలో చేర్చబడ్డారు. |
|
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః । స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు।। 45 ।। | 45 | 18 | స్వే స్వే — వారి వారి; కర్మణి — కర్మలు (పనులు); అభిరతః — నిర్వర్తిస్తూ; సంసిద్ధిం — పరిపూర్ణ సిద్ధి; లభతే — పొందవచ్చు; నరః — వ్యక్తి; స్వ-కర్మ — తనకు విధింపబడిన కర్మ; నిరతః — నిమగ్నమై; సిద్ధిం — సిద్ధి; యథా — ఆ విధంగా; విందతి — పొందును; తత్ — అది; శృణు — వినుము. | BG 18.45:
స్వభావసిద్ధ జనితమైన వారి వారి విధులను నిర్వర్తించటం ద్వారా, మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధింపబడిన విధులను ఆచరిస్తూ/నిర్వర్తిస్తూ పరిపూర్ణతను ఎలా సాధించగలడో ఇక ఇప్పుడు నానుండి వినుము. | స్వ-ధర్మ అంటే, మన గుణములు మరియు జీవిత స్థాయి (ఆశ్రమం) ని బట్టి విధింపబడిన కర్తవ్యములు. వాటిని నిర్వర్తించటం వలన మన శారీరక మరియు మానసిక సామర్థ్యాన్ని నిర్మాణాత్మకంగా మరియు ప్రయోజనకరంగా వాడుకోవటం జరుగుతుంది. ఇది పరిశుద్దికి మరియు పురోగతికి దారి తీస్తుంది; ఇది మనకు మరియు సమాజానికి కూడా మంగళకరమైనది. మరియు విహిత కర్మలు మన సహజస్వభావానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి, వాటిని నిర్వర్తించటంలో మనం సుఖప్రదంగా మరియు నిలకడగా ఉంటాము. ఆ తరువాత, మన యోగ్యత/సమర్థత పెంచుకున్న కొద్దీ, స్వ-ధర్మము కూడా మారుతుంది మరియు మనం తదుపరి ఉన్నత స్థాయిలోకి వెళతాము. ఈ రకంగా, మన బాధ్యతలను శ్రద్ధతో నిర్వర్తించటం వలన మనం పురోగతి సాధిస్తూ ఉంటాము. |
|
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ । స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ।। 46 ।। | 46 | 18 | యతః — ఎవని నుండయితే; ప్రవృత్తిః — ఇదంతా జనించినదో; భూతానాం — సర్వ ప్రాణుల యొక్క; యేన — ఎవరి ద్వారా అయితే; సర్వం — సమస్తమూ; ఇదం — ఇది; తతమ్ — నిండినిబిడీకృతమైనదో ; స్వ-కర్మణా — స్వకర్మ చేత (సహజసిద్ధ వృత్తి చేత); తమ్ — ఆయనను; అభ్యర్చ్య — ఆరాధించటం చేత; సిద్ధిం — సిద్ధి; విందతి — పొందును; మానవః — మనుష్యుడు. | BG 18.46:
తన సహజస్వభావ వృత్తిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తి - సమస్త భూతములూ ఎవని నుండి ఊద్భవించాయో మరియు ఎవ్వనిచే ఈ జగమంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో - వానిని ఆరాధించినట్టు. ఇటువంటి పనులు చేయటం ద్వారా వ్యక్తి సునాయాసముగానే సిద్ధిని పొందుతాడు. | భగవంతుని సృష్టిలో ఏ ఒక్క ఆత్మ (జీవి) కూడా అనావశ్యకమైనది ఉండదు. సమస్త జీవుల యొక్క క్రమబద్ధమైన పురోగతి కోసమే ఆయన యొక్క దివ్య ప్రణాళిక రచించబడినది. భారీ చక్రంలో చిన్ని పళ్ళచక్రంలా మనమందరమూ ఆయన బృహత్ పథకంలో భాగాలమే. ఆయన మనకిచ్చిన సామర్థ్యము కంటే ఎక్కువ మననుండి ఏమీ ఆయన ఆశించడు. కాబట్టి మనం కేవలం మన స్వభావం మరియు స్థాయికి అనుగుణముగా మన స్వధర్మాన్ని నిర్వర్తిస్తే, మనం ఆయన దివ్య ప్రణాళికలో మన అంతఃకరణ శుద్ధి కోసం పాలుపంచుకున్నట్టే. ఎప్పుడైతే మనం భక్తి యుక్త దృక్పథంలో పని చేస్తామో మన పనే ఒక ఈశ్వర-ఆరాధన అవుతుంది. ఏ విధి కూడా అసహ్యకరమైనది మరియు అపవిత్రమైనది కాదు, దాన్ని ఏ దృక్పథం తో చేస్తున్నామనే దాని మీదనే ఆ పని యొక్క విలువ ఉంటుంది, అన్న విషయాన్ని వివరిస్తూ, మార్కండేయ ముని యుధిష్ఠిరుడికి మహాభారతంలోని వన-పర్వంలో ఒక కథ చెప్పి ఉన్నాడు. అది ఇలా సాగుతుంది... ఒక యువ సన్యాసి అడవిలోకి వెళ్లి అక్కడ చాలాకాలం ధ్యానము మరియు తపస్సులు ఆచరించాడు. అలా కొద్ది సంవత్సరములు గడచిన తర్వాత, ఒకరోజు, ఆయన పైనున్న చెట్టు నుండి ఒక కాకి రెట్ట ఆయనపై పడింది. ఆయన కోపంతో ఆ పక్షి వంక చూసాడు, దాంతో అది చచ్చిపడిపోయింది. తనకు తపశ్చర్యల ద్వారా అతీంద్రియ శక్తులు ప్రాప్తించినట్టు ఆ సన్యాసి తెలుసుకున్నాడు. మరియు చాలా గర్వపడ్డాడు. కొద్దికాలం తరువాత ఆయన ఒక ఇంటికి బిక్ష అడగటానికి వెళ్ళాడు. ఆ ఇంటి ఆవిడ తలుపు దగ్గరకు వచ్చి, తన అనారోగ్యంతో ఉన్న భర్తకు సపర్యలు చేస్తున్నందున, ఆ సన్యాసిని కొద్దిసేపు వేచి ఉండమని ప్రార్థించింది. దీనితో ఆ సన్యాసి కోపగ్రస్తుడై, ఆమె వంక కోపంగా చూస్తూ, ఇలా మనసులో అనుకున్నాడు, ‘ఓ అధమురాలా, ఎంత ధైర్యం నన్ను వేచి ఉండమని చెప్పటానికి! నా శక్తులు ఏమిటో నీకు తెలియదు.’ అని. ఆయన మనస్సులో ఉన్నది గ్రహించి, ఆ స్త్రీ ఈ విధంగా అన్నది , ‘నా పట్ల అలా కోపముగా చూడకు, నేనేమి కాకిని కాదు, నీ కోపంతో చూసిన చూపుకు భస్మమై పోవటానికి.’ అని. ఆ సన్యాసి ఆశ్చర్యచకితుడై పోయాడు, ఆ సంఘటన గూర్చి ఆమెకెలా తెలుసు అని అడిగాడు. ఆ ఇంటిఆవిడ తాను ఏమీ తపస్సులు చేయలేదు కానీ, తన విధుల్ని భక్తితో మరియు శ్రద్ధతో చేసాను అని చెప్పింది. అందుచే, ఆవిడకు తేజస్సు ప్రాప్తించి, ఆయన మనస్సులో ఉన్నది తెలుసుకోగలిగింది. ఆ తరువాత అతనిని మిథిలా నగరంలో ఉండే ఒక ధర్మాత్ముడైన కసాయివాడిని కలవమని చెప్పింది, మరియు ఆయన ఇతని యొక్క ధర్మసందేహాలకు జవాబు చెప్పగలడు అని చెప్పింది. ఆ సన్యాసి మొదట్లో ఆ తక్కువ స్థాయి కసాయివాడితో మాట్లాడటానికి తనకు కలిగిన సంకోచాన్ని అధిగమించి, మిథిలా నగరానికి వెళ్ళాడు. ధర్మాత్ముడైన ఆ కసాయివాడు, అప్పుడు, మనకందరికీ మన పూర్వజన్మ కర్మలు, మరియు సామర్థ్యమును అనుసరించి స్వ-ధర్మములు ఉన్నాయని చెప్పాడు. అయినా, మనం స్వార్థ చింతనను విడిచి, మనకొచ్చే సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటూ, మన సహజ స్వభావ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే, మనం మనల్ని పరిశుద్ధి చేసుకుని, పై మెట్టు ధర్మ స్థాయికి చేరుకుంటాము. ఈ విధంగా, కర్తవ్య విధులను, వాటి నుండి పారిపోకుండా నిర్వర్తిస్తే, జీవాత్మ క్రమక్రమంగా తన ప్రస్తుత మొరటు దృక్పథం నుండి దివ్యమైన ఆధ్యాత్మిక చైతన్యం వైపు పురోగమిస్తుంది. ఆ కసాయివాడు చెప్పిన ఉపదేశమే మహాభారతంలో వ్యాధ గీత అని అంటారు. ఈ ఉపదేశం ప్రత్యేకంగా అర్జునుడికి బాగా వర్తిస్తుంది, ఎందుకంటే, కష్టతరం మరియు బాధాకరం అని భావించి, అర్జునుడు తన స్వ-ధర్మము నుండి పారిపోదలచాడు. తన స్వధర్మాన్ని సరైన దృక్పథంలో చేయటం ద్వారా అర్జునుడు ఈశ్వరుణ్ణి ఆరాధించినట్టే అని, తద్వారా పరిపూర్ణ సిద్ధిని సునాయాసంగా సాధించవచ్చు అని, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. |
|
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ । స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ।। 47 ।। | 47 | 18 | శ్రేయాన్ — శ్రేష్ఠమైనది; స్వ-ధర్మః — తన స్వంత విహిత వృత్తి ధర్మలు; విగుణః — సరిగ్గా చేయకపోయినా; పర-ధర్మాత్ — ఇతరుల ధర్మలు; సు-అనుష్ఠితాత్ — చక్కగా చేసినా; స్వభావ-నియతం — వ్యక్తి యొక్క స్వభావము అనుసరించి; కర్మ — కర్తవ్యము; కుర్వన్ — చేయుటవలన; న-ఆప్నోతి — పొందరు; కిల్బిషమ్ — పాపము. | BG 18.47:
పర (ఇతరుల) ధర్మమును సరిగ్గా చేయుటకంటే కూడా, సరిగా చేయలేకపోయినా సరే, తన స్వ-ధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్ఠము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో, వ్యక్తికి పాపము అంటదు. | మనం మన స్వ-ధర్మమును (విధింపబడిన వృత్తి ధర్మములు) పాటిస్తున్నప్పుడు, రెండు విధాల ప్రయోజనం ఉంటుంది. అది మన స్వభావానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి, పక్షికి ఎగరటంలా లేదా చేపకు ఈదటంలా, అది మన వ్యక్తిత్వానికి సహజంగా ఉంటుంది. రెండవది ఏమిటంటే, మనస్సుకు సౌకర్యముగా ఉంటుంది కాబట్టి, అప్రయత్నంగానే మనం దాన్ని నిర్వర్తించవచ్చు, దానితో భక్తిలో నిమగ్నమవ్వటానికి అంతఃకరణ స్వేచ్ఛగా ఉంటుంది. బదులుగా, అవి దోషపూరితముగా ఉన్నాయని మనం మన ధర్మములను విడిచిపెట్టి, మన స్వభావానికి అనుకూలంగా లేని ఇంకొకరి ధర్మములు ఎత్తుకుంటే, మనం మన సహజ సిద్ధ ప్రవృత్తికి విరుద్ధంగా ప్రయాసపడవలసి ఉంటుంది. అర్జునుడి పరిస్థితి సరిగ్గా ఇదే. అతని క్షత్రియ స్వభావము, సైనిక మరియు పరిపాలనా కార్యకలాపాల పట్ల మొగ్గు చూపుతుంది. పరిస్థితులు ఆయనను ధర్మయుద్ధంలో పాలుపంచుకునే అవసరం వైపు తీసుకువచ్చాయి. తన కర్తవ్యం నుండి తప్పించుకుని, అడవిలో తపస్సు కోసం, యుద్ధభూమి నుండి వెనుతిరిగితే అది అతని ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడదు; ఎందుకంటే, అడవిలో కూడా తన సహజ స్వభావం తన వెంటే ఉంటుంది. అక్కడ కూడా బహుశా, తను అడవిలో ఆటవికులని కూడగట్టుకుని వారికి నాయకుడిగా (రాజుగా) అయిపోవచ్చేమో. బదులుగా, తన స్వభావ సిద్ధంగా జనించిన విధులను నిర్వర్తిస్తూ ఉండి, తన కర్మ ఫలాలను అర్పించటం ద్వారా భగవత్ ఆరాధన చేయటమే మేలు. ఎప్పుడైతే వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడో, అప్పుడు స్వ-ధర్మము మారుతుంది. అది ఇక శారీరక స్థాయిలోనే ఉండిపోదు; అది ఆత్మ స్థాయి ధర్మము గా మారిపోతుంది, అంటే భగవత్ భక్తి. ఆ స్థాయిలో, వ్యక్తి తన వృత్తి ధర్మములను త్యజించి, పూర్తిగా భక్తిలోనే నిమగ్నమవ్వటం తప్పు కాదు, ఎందుకంటే అదే అప్పుడు అతని సహజ స్వ-ధర్మమవుతుంది. అటువంటి అర్హత కలిగిన వ్యక్తులకు శ్రీ కృష్ణుడు అంతిమ ఉపదేశాన్ని భగవద్గీత చివర్లో ఇస్తాడు: ‘అన్ని రకాల ధర్మములను విడిచిపెట్టి, కేవలం నాయందే శరణుపొందుము’ (18.66). కానీ, ఆ స్థాయి వచ్చేవరకూ, ఈ శ్లోకంలో చెప్పిన ఉపదేశం వర్తిస్తుంది. అందుకే శ్రీమద్భాగవతం ఇలా పేర్కొంటుంది: తావత్ కర్మాణి కుర్వీత న నిర్విద్యేత యావతా మత్-కథా-శ్రవణాదౌ వా శ్రద్ధా యావన్ న జాయతే (11.20.9) ‘శ్రవణం, కీర్తనం, మరియు భగవత్ లీలల పై ధ్యానముచే భక్తి అంటే అభిరుచి వృద్ధి చెందనంతవరకూ, మనం మనకు విధింపబడిన వృత్తి ధర్మములను నిర్వర్తిస్తూనే ఉండాలి.’ |
|
సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ । సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ।। 48 ।। | 48 | 18 | సహ-జం — సహజ స్వభావంచే జనితమైన; కర్మ — కర్తవ్యము; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; స-దోషం — దోషములతో కూడి ఉన్న; అపి — అయినాసరే; న త్యజేత్ — విడిచిపెట్టవద్దు; సర్వ-ఆరంభాః — అన్ని ప్రయత్నాలు; హి — నిజముగా; దోషేణ — దోషపూరితమై; ధూమేన — పొగతో; అగ్నిః — అగ్ని; ఇవ — అలాగా; ఆవృతాః — ఆవరింపబడి. | BG 18.48:
తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను, వాటిలో దోషాలు ఉన్నాసరే వాటిని వ్యక్తి ఎన్నటికీ విడిచిపెట్టరాదు, ఓ కుంతీ పుత్రా. అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు, నిజానికి సమస్త కర్మ ప్రయాసలూ, ఏదోఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి. | ఏదో దోషము చూడటం వలన జనులు కొన్నిసార్లు తమ కర్తవ్యము నుండి వెనుతిరుగుతారు. అగ్నిపై సహజంగానే పొగ ఆవరింపబడి ఉన్నట్టు ఏ పని కూడా సంపూర్ణ దోషరహితముగా ఉండదని ఇక్కడ శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. ఉదాహరణకి, కోట్లాది సూక్ష్మ క్రిములను చంపకుండా మనం శ్వాస కూడా తీసుకోలేము. ఒకవేళ నేల దున్ని వ్యవసాయం చేస్తే అసంఖ్యాకమైన సూక్ష్మ జీవులని నాశనం చేస్తాము. వ్యాపారంలో పోటీకి ఎదుర్కొని విజయం సాధిస్తే, ఇతరులకు సంపద లేకుండా చేస్తాము. ఒకవేళ మనం భుజిస్తే, ఇంకొకరికి ఆహారం లేకుండా చేసినట్టవుతుంది. స్వ-ధర్మము అంటే కార్యకలాపాలు చేయటం కాబట్టి అది సంపూర్ణ దోషరహితముగా ఉండజాలదు. కానీ స్వ-ధర్మ పాలన యొక్క ప్రయోజనాలు దాని దోషములకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. అన్నింటికన్నా ముఖ్య ప్రయోజనం ఏమిటంటే, అది మనుష్యులకు, తమ పరిశుద్ధికి మరియు ఉన్నతికి, ఒక సహజమైన అనాయాస మార్గమును అందిస్తుంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఆచార్యుడు మార్క్ అల్బియాన్ (professor Mark Albion), తన పుస్తకం మేకింగ్ ఎ లైఫ్, మేకింగ్ ఎ లివింగ్, (Making a Life, Making a Living) లో 1500 మంది, 1960-1980 కాలంలో బిజినెస్ కోర్సు పూర్తిచేసిన పట్టభద్రుల వారి జీవన ప్రగతి అధ్యయనం చేసిన విశేషాలను పొందుపరిచారు. ప్రారంభం నుండి, పట్టభద్రులను రెండు రకాల వర్గములుగా వేరుచేశారు. A-వర్గం లో వారు మొదట డబ్బులు సంపాదించి, ఆర్థిక అవసరాలు తీరిన పిదప, ఆ తరువాత వారికి నిజంగా నచ్చిన పని చేస్తామని చెప్పారు. 83% మంది ఈ వర్గంలోకే వచ్చారు. B-వర్గంలో వారు, మొదట తమ ఆసక్తి ఉన్న, నచ్చిన ఆశయాలను కొనసాగిస్తాము, డబ్బులు వాటికవే వస్తాయి అని చెప్పారు. 17% మంది ఈ వర్గం లోకి వచ్చారు. 20 సంవత్సరముల తరువాత, మొత్తం 101 మంది కోటీశ్వరులయ్యారు. అందులో A-వర్గం వారినుండి (మొదట డబ్బు సాధిస్తాం అన్నవారు) ఒకరు, మిగతా 100 మంది B-వర్గం (మొదటినుండే తమకు ఇష్టమైన దాన్ని చేసినవారు) వారు ఉన్నారు. ధనవంతులు అయిన వారిలో అత్యధిక మంది, తమకు బాగా నచ్చిన/సరిపోయే వృత్తిని ఎంచుకోవటం వల్లనే ఆ సాఫల్యం సాధించగలిగారు. మార్క్ అల్బియాన్ చివరగా ఏమని ముగించాడంటే, చాలామందికి పని మరియు ఆట(వినోదం) వేర్వేరుగా ఉంటుంది. కానీ, వారికే నచ్చే పని చేస్తుంటే, అప్పుడు పనే ఒక ఆట(వినోదము) అయిపోతుంది, మరియు ఏరోజూ నిజముగా 'పని' చేయనవసరం లేదు. ఇదే శ్రీ కృష్ణుడు అర్జునుడిని చేయమని చెప్పేది - తన స్వభావానికి బాగా సరిపోయే పనిని విడిచిపెట్టవద్దు అని అంటున్నాడు; దానిలో దోషములు ఉన్నాసరే, తన సహజమైన స్వభావానికి అనుగుణంగా కర్మలు చేయమంటున్నాడు. కానీ, ఉన్నతి కావాలంటే పనిని, తదుపరి శ్లోకములో వివరించిన సరియైన దృక్పథంలో చేయాలి. |
|
అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః । నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి ।। 49 ।। | 49 | 18 | అసక్త-బుద్ధిః — ఎవరి బుద్ధి అయితే ఆసక్తిరహితంగా ఉంటుందో; సర్వత్ర — అంతటా; జిత-ఆత్మా — మనస్సుని అధీనములోనికి తెచ్చారో; విగత-స్పృహః — కోరికలు లేకుండా; నైష్కర్మ్య-సిద్ధిం — కర్మరహిత స్థితి; పరమాం — అత్యున్నతమైన; సన్న్యాసేన — సన్యాస అభ్యాసముచే; అధిగచ్ఛతి — పొందుతారు. | BG 18.49:
ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సుని జయించారో మరియు సన్న్యాస అభ్యాసముచే కోరికలను త్యజించారో, వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు. | ఈ చివరి అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితమే చెప్పిన ఎన్నో సూత్రాలను మరోసారి చెప్తాడు. ఈ అధ్యాయం మొదట్లో, కేవలం జీవిత బాధ్యతల నుండి పారిపోవటం సన్న్యాసము కాదు, అది త్యాగము కూడా కాదు, అని అర్జునుడికి చెప్పి ఉన్నాడు. ఇక ఇప్పుడు కర్మ రహిత స్థితి, అంటే, నైష్కర్మ్య-సిద్ధి స్థితిని వివరిస్తున్నాడు. ప్రపంచం యొక్క నిరంతరం మారుతున్న స్థితి గతుల మధ్యకూడా, మనలను మనమే ప్రపంచ సంఘటనలు, పరిణామాలకు దూరంగా, ఆసక్తి రహితముగా ఉంచుకొని, కేవలం మన కర్తవ్య నిర్వహణ పట్ల మాత్రమే ధ్యాస ఉంచట ద్వారా, ఈ నైష్కర్మ్య -సిద్ధి స్థితిని, సాధించవచ్చు. ఇది ఎలాగంటే, ఒక వంతెన క్రింది నుండి నీరు ఒకవైపునుండి వచ్చి ఇంకొక వైపు నుండి వెళ్ళిపోవటం లాంటిది. ఆ వంతెన ఆ నీటిని తీసుకోదు లేదా నీటిని సరఫరా చేయదు; ఆ నీటి ప్రవాహంచే ఏమాత్రం ప్రభావితం కాదు. అదే విధంగా, కర్మయోగులు తమ కర్తవ్యాన్ని చేస్తుంటారు, కానీ నిరంతరం జరిగే పరిణామాల పట్ల ఉదాసీనంగా ఉంటారు. భగవత్ ఆరాధన లాగా, వారు తమ కర్తవ్య నిర్వహణలో చక్కటి పరిశ్రమ చేస్తారు, కానీ అంతిమ ఫలితాన్ని ఆ భగవంతునికే వదిలేస్తారు, తద్వారా వారు ఎల్లప్పుడూ తృప్తితో మరియు ఏది జరిగినా ప్రశాంతంగానే ఉంటారు. దీనిని వివరించటానికి ఒక చక్కటి కథ ఉంది. ఒకాయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు; మొదటమ్మాయికి ఒక రైతుతో వివాహమయ్యింది మరియు రెండవ అమ్మాయికి ఒక ఇటుకబట్టి యజమానితో వివాహమయ్యింది. ఒకరోజు, ఆ తండ్రి మొదటమ్మాయికి ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కున్నాడు. ఆమె అన్నది, ‘నాన్నా, మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. మంచి వర్షాలు పడాలని మాకోసం దేవుణ్ణి ప్రార్థించు.’ అని. ఆయన తరువాత రెండవ అమ్మాయికి ఫోన్ చేసాడు, ఆమె అన్నది ‘నాన్నా, మాకు డబ్బులు అయిపోతున్నాయి, ఈ సంవత్సరం వానలు పడొద్దని దయచేసి దేవుణ్ణి ప్రార్థించు, బాగా ఎండ కాస్తే, మాకు మంచి ఇటుకల ఉత్పత్తి జరుగుతుంది.’ అని. తండ్రి తన కూతుర్ల నుండి విరుద్ధమైన విన్నపాలు విన్నాడు మరియు ఇలా అనుకున్నాడు, ‘ఆ భగవంతునికే తెలుసు ఏది మంచిదో, ఏది సరియైనదో, ఆయననే చేయనీ." అని. ఈశ్వర సంకల్పానికి ఇటువంటి శరణాగతి అనేది, ప్రపంచంలో నిరంతరం జరిగే వ్యవహారములలో తలమునకలై ఉన్నాసరే, వాటివాటి ఫలితములపట్ల అనాసక్తిని కలుగచేస్తుంది. |
|
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే । సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ।। 50 ।। | 50 | 18 | సిద్ధిం — పరిపూర్ణ-సిద్ధి; ప్రాప్తః — పొందిన పిదప; యథా — ఎట్లా; బ్రహ్మ — బ్రహ్మన్; తథా — కూడా; ఆప్నోతి — పొందును; నిబోధ — వినుము; మే — నా నుండి; సమాసేన — క్లుప్తముగా; ఏవ — నిజముగా; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; నిష్ఠా — నిష్ఠతో; జ్ఞానస్య — జ్ఞానము యొక్క; యా — ఏదైతే; పరా — అలౌకికమైన. | BG 18.50:
ఓ అర్జునా, పరిపూర్ణ సిద్ధిని (కర్మ సన్న్యాసములో) పొందిన వ్యక్తి, ఏ విధముగా, అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము యందే స్థితమై ఉండటం ద్వారా, బ్రహ్మన్ ను కూడా ఎలా పొందగలడో - వివరిస్తాను, నా నుండి క్లుప్తముగా వినుము. | పుస్తక జ్ఞానాన్ని చదవటం ఒక ఎత్తయితే, ఆ జ్ఞానాన్ని ఆచరణలో అనుభవపూర్వకంగా తెలుసుకోవటం మరో ఎత్తు. మంచి సలహాలు పైసకు పది వస్తాయి, కానీ వాటిని ఆచరణలో పెట్టకపోతే అవన్నీ వ్యర్థమే. పుస్తక జ్ఞానం ఉన్న పండితులకు బుర్రలో సర్వ శాస్త్రముల జ్ఞానం ఉంటుంది, కానీ వాటి విజ్ఞానం అవగతం కాకపోవచ్చు. మరోపక్క, కర్మ యోగులకు ప్రతినిత్యం, శాస్త్ర సత్యాలను ఆచరణలో అభ్యాసం చేసే అవకాశాలు వస్తుంటాయి. అందుకే, కర్మ యోగము యొక్క నిరంతర అభ్యాసము మనకు ఆధ్యాత్మిక జ్ఞానమును హృదయములో విజ్ఞానముగా వికసింపచేస్తుంది. మరియు ఎప్పుడైతే వ్యక్తి నైష్కర్మ్య సిద్ధితో (అంటే పని చేస్తూ కూడా కర్మ రహితముగా) ఉండగలడో, అప్పుడు అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము నిజమైన అనుభవంగా తెలుస్తుంది. ఆ జ్ఞానంలో స్థితమై ఉన్నప్పుడు, కర్మ యోగి భగవత్ ప్రాప్తిలో పరిపూర్ణత సాధిస్తాడు. ఇది ఎలా జరుగుతుందో శ్రీ కృష్ణుడు ఇక తదుపరి కొన్ని శ్లోకాలలో వివరిస్తున్నాడు. |
|
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ । శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ।। 51 ।। వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః । ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ।। 52 ।। అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ । విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే ।। 53 ।। | 51 | 18 | బుద్ధ్యా — బుద్ధి; విశుద్దయా — శుద్ధి చేయబడి; యుక్తః — కలిగి ఉండి; ధృత్యా — దృఢ సంకల్పముచే; ఆత్మానం — బుద్ధి; నియమ్య — నిగ్రహించి; చ — మరియు; శబ్ద-ఆదీన్ విషయాన్ — శబ్దము మొదలైన ఇంద్రియ విషయములు; త్యక్త్వా — త్యజించి; రాగ-ద్వేషౌ — రాగ-ద్వేషములు; వ్యుదస్య — విడిచిపెట్టి; చ — మరియు; వివిక్త-సేవీ — ఏకాంతంలో వసిస్తూ; లఘు-ఆశీ — మితముగా భుజిస్తూ; యత — నియంత్రిస్తూ; వాక్ — వాక్కు; కాయ — శరీరము; మానసః — మరియు మనస్సు; ధ్యాన-యోగ- పరః — ధ్యానములో నిమగ్నమై; నిత్యం — ఎల్లప్పుడూ; వైరాగ్యం — వైరాగ్యము; సముపాశ్రితః — ఆశ్రయించి; అహంకారం — అహంకారము; బలం — హింస; దర్పం — దురహంకారము; కామం — కామము (కోరికలు); క్రోధం — కోపము; పరిగ్రహమ్ — స్వార్థము; విముచ్య — విడిచి; నిర్మమః — ఇది నాది అన్న భావన లేకుండా; శాంతః — శాంతితో; బ్రహ్మ-భూయాయ — బ్రహ్మతో మమేకము; కల్పతే — పాత్రుడు/అర్హుడు అగును. | BG 18.51-53:
వ్యక్తి ఎప్పుడైతే - ఇంద్రియములను చక్కగా నిగ్రహించి పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో, శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి, రాగ ద్వేష రహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మంను పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడుతాడు, మితంగా తింటాడు, శరీరమనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యమూ ధ్యానములో నిమగ్నమౌతాడు, మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్థము - లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై, బ్రహంతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు. (అంటే, పరమ సత్యమును బ్రహ్మన్ రూపంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవటం). | మన విధులను సరైన దృక్పథంలో చేయటం ద్వారా మనం పరిపూర్ణ సిద్ధిని ఎలా పొందవచ్చో శ్రీ కృష్ణుడు చెప్తూవచ్చాడు. ఇక ఇప్పుడు బ్రహ్మన్-సాక్షాత్కారానికి కావలసిన శ్రేష్ఠత గురించి వివరిస్తున్నాడు. ఆ యొక్క పరిపూర్ణ సిద్ధి స్థితిలో మనకు అలౌకిక ఆధాత్మిక జ్ఞానంలోనే స్థితమై ఉన్న విశుద్ధ బుద్ధి పెంపొందుతుంది అని అంటున్నాడు. ఇష్టాలు మరియు అయిష్టాల భావనల యందు ఆసక్తిలేకుండా ఉండటంచేత మనస్సు నియంత్రించబడుతుంది. ఇంద్రియములు నిగ్రహించబడుతాయి మరియు శరీర-వాక్కుల ఉద్రేకాలు గట్టిగా నిగ్రహించబడుతాయి. శరీర నిర్వహణ కోసం ఉన్న - భుజించటం మరియు నిద్ర వంటి పనులు వివేకముతో మితంగా క్రమబద్ధీకరించబడుతాయి. అటువంటి యోగి ధ్యానపరుడై ఉంటాడు, అందుకే ఏకాంతాన్ని ఇష్టపడుతాడు. అహంకారము మరియు దానికున్న అధికార-హోదాల కోసం తపన నిర్మూలించబడుతుంది. నిరంతరం మనస్సుని పరమాత్మ ధ్యానం లో నిమగ్నం చేస్తూ, ఆ యోగి ప్రశాంతముగా మరియు కామ, క్రోధ, లోభముల బంధము నుండి స్చేచ్ఛతో ఉంటాడు. అటువంటి యోగి, పరమ సత్యమును, బ్రహ్మన్ రూపంలో తెలుసుకుంటాడు. |
|
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ । శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ।। 51 ।। వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః । ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ।। 52 ।। అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ । విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే ।। 53 ।। | 52 | 18 | బుద్ధ్యా — బుద్ధి; విశుద్దయా — శుద్ధి చేయబడి; యుక్తః — కలిగి ఉండి; ధృత్యా — దృఢ సంకల్పముచే; ఆత్మానం — బుద్ధి; నియమ్య — నిగ్రహించి; చ — మరియు; శబ్ద-ఆదీన్ విషయాన్ — శబ్దము మొదలైన ఇంద్రియ విషయములు; త్యక్త్వా — త్యజించి; రాగ-ద్వేషౌ — రాగ-ద్వేషములు; వ్యుదస్య — విడిచిపెట్టి; చ — మరియు; వివిక్త-సేవీ — ఏకాంతంలో వసిస్తూ; లఘు-ఆశీ — మితముగా భుజిస్తూ; యత — నియంత్రిస్తూ; వాక్ — వాక్కు; కాయ — శరీరము; మానసః — మరియు మనస్సు; ధ్యాన-యోగ- పరః — ధ్యానములో నిమగ్నమై; నిత్యం — ఎల్లప్పుడూ; వైరాగ్యం — వైరాగ్యము; సముపాశ్రితః — ఆశ్రయించి; అహంకారం — అహంకారము; బలం — హింస; దర్పం — దురహంకారము; కామం — కామము (కోరికలు); క్రోధం — కోపము; పరిగ్రహమ్ — స్వార్థము; విముచ్య — విడిచి; నిర్మమః — ఇది నాది అన్న భావన లేకుండా; శాంతః — శాంతితో; బ్రహ్మ-భూయాయ — బ్రహ్మతో మమేకము; కల్పతే — పాత్రుడు/అర్హుడు అగును. | BG 18.51-53:
వ్యక్తి ఎప్పుడైతే - ఇంద్రియములను చక్కగా నిగ్రహించి పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో, శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి, రాగ ద్వేష రహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మంను పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడుతాడు, మితంగా తింటాడు, శరీరమనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యమూ ధ్యానములో నిమగ్నమౌతాడు, మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్థము - లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై, బ్రహంతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు. (అంటే, పరమ సత్యమును బ్రహ్మన్ రూపంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవటం). | మన విధులను సరైన దృక్పథంలో చేయటం ద్వారా మనం పరిపూర్ణ సిద్ధిని ఎలా పొందవచ్చో శ్రీ కృష్ణుడు చెప్తూవచ్చాడు. ఇక ఇప్పుడు బ్రహ్మన్-సాక్షాత్కారానికి కావలసిన శ్రేష్ఠత గురించి వివరిస్తున్నాడు. ఆ యొక్క పరిపూర్ణ సిద్ధి స్థితిలో మనకు అలౌకిక ఆధాత్మిక జ్ఞానంలోనే స్థితమై ఉన్న విశుద్ధ బుద్ధి పెంపొందుతుంది అని అంటున్నాడు. ఇష్టాలు మరియు అయిష్టాల భావనల యందు ఆసక్తిలేకుండా ఉండటంచేత మనస్సు నియంత్రించబడుతుంది. ఇంద్రియములు నిగ్రహించబడుతాయి మరియు శరీర-వాక్కుల ఉద్రేకాలు గట్టిగా నిగ్రహించబడుతాయి. శరీర నిర్వహణ కోసం ఉన్న - భుజించటం మరియు నిద్ర వంటి పనులు వివేకముతో మితంగా క్రమబద్ధీకరించబడుతాయి. అటువంటి యోగి ధ్యానపరుడై ఉంటాడు, అందుకే ఏకాంతాన్ని ఇష్టపడుతాడు. అహంకారము మరియు దానికున్న అధికార-హోదాల కోసం తపన నిర్మూలించబడుతుంది. నిరంతరం మనస్సుని పరమాత్మ ధ్యానం లో నిమగ్నం చేస్తూ, ఆ యోగి ప్రశాంతముగా మరియు కామ, క్రోధ, లోభముల బంధము నుండి స్చేచ్ఛతో ఉంటాడు. అటువంటి యోగి, పరమ సత్యమును, బ్రహ్మన్ రూపంలో తెలుసుకుంటాడు. |
|
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ । శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ।। 51 ।। వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః । ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ।। 52 ।। అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ । విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే ।। 53 ।। | 53 | 18 | బుద్ధ్యా — బుద్ధి; విశుద్దయా — శుద్ధి చేయబడి; యుక్తః — కలిగి ఉండి; ధృత్యా — దృఢ సంకల్పముచే; ఆత్మానం — బుద్ధి; నియమ్య — నిగ్రహించి; చ — మరియు; శబ్ద-ఆదీన్ విషయాన్ — శబ్దము మొదలైన ఇంద్రియ విషయములు; త్యక్త్వా — త్యజించి; రాగ-ద్వేషౌ — రాగ-ద్వేషములు; వ్యుదస్య — విడిచిపెట్టి; చ — మరియు; వివిక్త-సేవీ — ఏకాంతంలో వసిస్తూ; లఘు-ఆశీ — మితముగా భుజిస్తూ; యత — నియంత్రిస్తూ; వాక్ — వాక్కు; కాయ — శరీరము; మానసః — మరియు మనస్సు; ధ్యాన-యోగ- పరః — ధ్యానములో నిమగ్నమై; నిత్యం — ఎల్లప్పుడూ; వైరాగ్యం — వైరాగ్యము; సముపాశ్రితః — ఆశ్రయించి; అహంకారం — అహంకారము; బలం — హింస; దర్పం — దురహంకారము; కామం — కామము (కోరికలు); క్రోధం — కోపము; పరిగ్రహమ్ — స్వార్థము; విముచ్య — విడిచి; నిర్మమః — ఇది నాది అన్న భావన లేకుండా; శాంతః — శాంతితో; బ్రహ్మ-భూయాయ — బ్రహ్మతో మమేకము; కల్పతే — పాత్రుడు/అర్హుడు అగును. | BG 18.51-53:
వ్యక్తి ఎప్పుడైతే - ఇంద్రియములను చక్కగా నిగ్రహించి పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో, శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి, రాగ ద్వేష రహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మంను పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడుతాడు, మితంగా తింటాడు, శరీరమనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యమూ ధ్యానములో నిమగ్నమౌతాడు, మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్థము - లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై, బ్రహంతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు. (అంటే, పరమ సత్యమును బ్రహ్మన్ రూపంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవటం). | మన విధులను సరైన దృక్పథంలో చేయటం ద్వారా మనం పరిపూర్ణ సిద్ధిని ఎలా పొందవచ్చో శ్రీ కృష్ణుడు చెప్తూవచ్చాడు. ఇక ఇప్పుడు బ్రహ్మన్-సాక్షాత్కారానికి కావలసిన శ్రేష్ఠత గురించి వివరిస్తున్నాడు. ఆ యొక్క పరిపూర్ణ సిద్ధి స్థితిలో మనకు అలౌకిక ఆధాత్మిక జ్ఞానంలోనే స్థితమై ఉన్న విశుద్ధ బుద్ధి పెంపొందుతుంది అని అంటున్నాడు. ఇష్టాలు మరియు అయిష్టాల భావనల యందు ఆసక్తిలేకుండా ఉండటంచేత మనస్సు నియంత్రించబడుతుంది. ఇంద్రియములు నిగ్రహించబడుతాయి మరియు శరీర-వాక్కుల ఉద్రేకాలు గట్టిగా నిగ్రహించబడుతాయి. శరీర నిర్వహణ కోసం ఉన్న - భుజించటం మరియు నిద్ర వంటి పనులు వివేకముతో మితంగా క్రమబద్ధీకరించబడుతాయి. అటువంటి యోగి ధ్యానపరుడై ఉంటాడు, అందుకే ఏకాంతాన్ని ఇష్టపడుతాడు. అహంకారము మరియు దానికున్న అధికార-హోదాల కోసం తపన నిర్మూలించబడుతుంది. నిరంతరం మనస్సుని పరమాత్మ ధ్యానం లో నిమగ్నం చేస్తూ, ఆ యోగి ప్రశాంతముగా మరియు కామ, క్రోధ, లోభముల బంధము నుండి స్చేచ్ఛతో ఉంటాడు. అటువంటి యోగి, పరమ సత్యమును, బ్రహ్మన్ రూపంలో తెలుసుకుంటాడు. |
|
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి । సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ।। 54 ।। | 54 | 18 | బ్రహ్మ-భూతః — బ్రహ్మన్ భావములో స్థితమై ఉన్నవాడు; ప్రసన్న-ఆత్మా — మానసిక ప్రశాంతతతో; న శోచతి — శోకింపడు; న కాంక్షతి — కాంక్షింపడు; సమః — సమ భావముతో; సర్వేషు — అన్నింటిపట్ల; భూతేషు — ప్రాణులు (భూతములు); మత్-భక్తిం — నా యందు భక్తిని; లభతే — పొందును; పరామ్ — సర్వోత్కృష్టమైన. | BG 18.54:
పరబ్రహ్మంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి మానసికంగా ప్రశాంతచిత్తముతో ఉంటాడు, దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వ భూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ, అటువంటి యోగి నా పరాభక్తిని పొందును. | సంపూర్ణ సిద్ధి స్థాయి యొక్క తన వివరణను శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు ముగిస్తున్నాడు. బ్రహ్మ-భూతః అంటే బ్రహ్మన్ ను తెలుసుకున్న స్థితి. దాని యందే స్థితమై ఉండి, వ్యక్తి 'ప్రసన్నాత్మా', అంటే సంక్లిష్టమైన మరియు బాధాకరమైన పరిస్థితులలో కూడా ప్రశాంతముగా మరియు వాటిచే ప్రభావితం కాకుండా ఉంటాడు. 'న శోచతి' అంటే వ్యక్తి దేనికీ శోకింపడు లేదా ఎటువంటి కొరతని తలంచడు. ‘న కాంక్షతి' అంటే, వ్యక్తి తన ఆనందం కోసం ఎటువంటి భౌతిక వస్తువును కాంక్షింపడు. అటువంటి యోగి, అన్నింటిలో ఉన్నది బ్రహ్మమే అని గ్రహించి, సర్వ భూతములను సమ దృష్టిచే చూస్తాడు. ఈ స్థితిలో, వ్యక్తి అంతర్గత విజ్ఞాన జ్ఞానోదయ స్థితిలో ఉంటాడు. కానీ, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకాన్ని ఒక చక్కటి మలుపుతో ముగిస్తున్నాడు. ఇటువంటి జ్ఞానోదయ స్థితి/స్థాయిలో, వ్యక్తి భగవంతుని పరాభక్తి (దివ్య ప్రేమ) ను పొందుతాడు అని అంటున్నాడు. భక్తి అనేది, బ్రహ్మన్-జ్ఞానోదయమునకు ఒక మధ్యమ మెట్టుగా మాత్రమే చేయతగినదని జ్ఞానులు తరచుగా అంటుంటారు. భక్తి అనేది అంతఃకరణ శుద్ధికి మాత్రమే ప్రయోజనకారి అని, మరియు ఈ పథంలో చివరికి కేవలం జ్ఞానమే మిగిలిపోతుందని అంటుంటారు. అందుకే, దృఢమైన బుద్ధి, వివేకము ఉన్నవారు, భక్తిని పక్కకుపెట్టి కేవలం జ్ఞానమునే పెంపొందించుకోవాలి అని సిఫారసు చేస్తారు. కానీ, ఈ పై శ్లోకం ఇటువంటి దృక్పథాన్ని ఖండిస్తుంది. అత్యున్నతమైన జ్ఞానోదయాన్ని పొందిన తరువాత, వ్యక్తి పరా భక్తిని పెంపొందించుకుంటాడు. వేద వ్యాసుడు ఇదే విషయాన్ని శ్రీమద్భాగవతంలో పేర్కొన్నాడు. ఆత్మారామాశ్చ మునయో నిర్గ్రంథా అపి ఉరుక్రమే కుర్వంతి ఆహైతుకీం భక్తిం ఇత్థం-భూత-గుణో హరిః (1.7.10) ‘ఆత్మారాములు (ఆత్మ యందే రమించేవారు), ఆత్మ జ్ఞానములోనే స్థితమై, భౌతిక బంధాలనుండి విముక్తులైనవారు - ఇటువంటి సిద్ధులైన జీవులు కూడా భగవంతుని పట్ల భక్తిని కలిగిఉండాలని కోరుకుంటారు. భగవంతుని మహాద్భుతమైన గుణములు ఎటువంటివి అంటే అవి ముక్త-జీవులను కూడా ఆకర్షిస్తాయి.’ ఆత్మ జ్ఞానాన్ని పొంది, నిరాకార బ్రహ్మన్ ను ఆచరణలో తెలుసుకున్న స్థితిలో ప్రఖ్యాత జ్ఞానులు ఎందరో ఉన్నారు. కానీ, వారికి ఎప్పుడైతే వారికి అలౌకికమైన భగవంతుని దివ్య గుణముల క్షణదర్శనము లభించిందో, వారు సహజంగానే భక్తి మార్గంలో ఆకర్షితులయ్యారు. నాలుగు యుగాలలో ప్రతి యుగం నుండీ ఉన్న ఇటువంటి జ్ఞానుల ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి. సత్య యుగపు మహా జ్ఞానులు బ్రహ్మ గారి నలుగురు కుమారులు - సనత్ కుమార్, సనాతన కుమార్, సనక్ కుమార్, మరియు సనందన కుమార్. వారు పుట్టుకతోనే ఆత్మజ్ఞాన సంపన్నులు, మరియు వారి మనస్సులు నిత్యమూ నిరాకార బ్రహ్మన్ యందే నిమగ్నమై ఉండేవి. ఈ నలుగురు కుమారులు ఒకసారి విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠాన్ని సందర్శించారు. అక్కడ భగవంతుని యొక్క పాదారవిందముల వద్ద నుండి తులసి ఆకుల పరిమళం వారి ముక్కుపుటాలను తాకింది, అది వారి హృదయంలో అమితమైన ఆనందాన్ని రేకెత్తించింది. తక్షణమే, నిర్గుణ బ్రహ్మం పై వారి ధ్యానం అంతమై పోయింది మరియు వారు విష్ణుమూర్తి యొక్క దివ్య ప్రేమానందములో మునిగి పోయారు. వారు ఒక వరం కోసం వేడుకున్నారు: కామం భవః స్వ-వృజినైర్నిరయేషు నః స్తాత్ చేతోఽలివద్యది ను తే పదయో రమేత (భాగవతం 3.15.49) ‘ఓ స్వామీ, నీ పాదారవిందముల నుండి జాలువారే దివ్య ప్రేమానందమును గ్రోలే అవకాశం మా మనస్సుకు లభించినంత కాలం, నీవు మమ్ములను నరకానికి పంపినా మాకు సమ్మతమే.’ ఒక్కసారి ఊహించండి, నిరాకార బ్రహ్మంను అనుభవించిన తరువాత కూడా, ఈ వరిష్ఠమైన జ్ఞానులు, భగవంతుని సగుణ రూపము యొక్క ఆనందమును అనుభవించుటకు, నరకములో కూడా ఉండటానికి వెనుకాడలేదు. ఇక ఇప్పుడు త్రేతాయుగమునకు వద్దాము. ఈ యుగపు మాహా జ్ఞాని, జనక మహారాజు. ఆయన శ్రీరామ చంద్ర ప్రభువు యొక్క నిత్యసఖి సీతమ్మవారి త్రండ్రి గారు. ఆయనకే విదేహుడు అనే పేరు కూడా ఉన్నది, అంటే శారీరక దృక్పథానికి అతీతుడు అన్నమాట. ఆయన మనస్సు నిత్యమూ నిరాకార బ్రహ్మం పట్లనే రమిస్తూ ఉండేది. కానీ, ఒకరోజు, విశ్వామిత్ర మహర్షి ఆయనను కలవటానికి శ్రీ రామచంద్రుడు మరియు లక్ష్మణుడుతో సహా వచ్చాడు. అప్పుడు ఏమయ్యిందో రామాయణంలో వివరించబడినది. ఇన్హహి బిలోకత అతి అనురాగా, బరబస బ్రహ్మసుఖహి మన త్యాగా ‘రామచంద్ర ప్రభువుని చూసిన జనక మహారాజు నిరాకార బ్రహ్మన్ యొక్క ఆనందము పై ఆసక్తిని కోల్పోయాడు, మరియు భగవంతుని సాకార రూపము పట్ల గాఢంగా ఆసక్తుడై పోయాడు.’ ఈ విధంగా, తేత్రాయుగపు మోహోన్నత జ్ఞాని, భక్తి పథంలోకి వచ్చాడు. ద్వాపర యుగపు మహోన్నత జ్ఞాని, వేద వ్యాసుని పుత్రుడు, శుకదేవుడు. ఆయన ఎంత ఉన్నతుడు అంటే, బయటకు వస్తే, భౌతిక శక్తి, మాయ, తనను వశపరుచుకుంటుందని, తల్లి గర్భంలోనే పన్నెండు సంవత్సరములు ఉన్నాడు అని పురాణములు మనకు చెపుతున్నాయి. చివరికి, నారద మహర్షి వచ్చి, తల్లి చెవుల ద్వారా ఆయనతో మాట్లాడి, బయటకు వస్తే ఏమీ కాదులే అని హామీ ఇచ్చి, తనను తల్లి గర్భం నుండి బయటకు రమ్మని వేడుకున్నాడు. ఆ తరువాత, ఆయన బయటకు వచ్చి తన యోగ శక్తి చే, తన శరీరాన్ని పన్నెండు సంవత్సరముల బాలుడిగా పెద్దదిగా చేసుకుని, ఇంటిని వదిలి, సన్యసించి అడవిలో నివసించటానికి వెళ్లిపోయాడు. అక్కడ, త్వరితగతిన అత్యున్నత సమాధి స్థితికి చేరుకున్నాడు. అలా సంవత్సరములు గడచిన పిదప, వేద వ్యాసుని శిష్యులు అడవిలో కట్టెలు కొడుతూ, ఆయనను సమాధి స్థితిలో చూసారు. వారు తిరిగివెళ్ళి వేదవ్యాసునికి ఆ విషయం చెప్పారు. ఆయన శుకదేవుని చెవిలో, శ్రీ కృష్ణుడి స్వరూప అందాన్ని వివరించే ఒక శ్లోకం చెప్పమని చెప్పాడు: బర్హాపీడం నట-వర-వపుః కర్ణయోః కర్ణికారం బిభ్రద్ వాసః కనక-కపిశం వైజయంతీం చ మాలాం రంధ్రాన్ వేణోరధర-సుధయాపూరయన్ గోప-వృందైర్ వృందారణ్యం స్వ-పద-రమణం ప్రావిశద్ గీత కీర్తిః (భాగవతం 10.21.5) ‘శ్రీ కృష్ణుడు శిరస్సుపై నెమలి పింఛముతో ఉన్న కిరీటముతో అలంకరింపబడి ఉన్నాడు, తన స్వరూపాన్ని గొప్ప నర్తకుడిగా చూపిస్తున్నాడు. ఆయన చెవులు నీలి కర్ణికా పుష్పములచే అలంకరింపబడి ఉన్నవి. ఆయన శాలువా బంగారు వర్ణముతో మెరిసిపోవుచున్నది. ఆయన వైజయంతీ పూసల మాలను మేడలో ధరించి ఉంటాడు. తన వేణువు యొక్క రంధ్రములను తన అధరామృతముతో నింపేస్తాడు. ఆయన బృందావనము చేరగానే, గోపబాలురచే చుట్టుముట్టబడి, కీర్తించబడుతాడు. ఆయన పాద గుర్తులు ఆ నేల సౌందర్యాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి.’ ఈ శ్లోకము తన చెవులలోనికి ప్రవేశించిన సమయంలో, శుకదేవుడు నిరాకార బ్రహ్మన్లో లీనమై ఉన్నాడు. అకస్మాత్తుగా, ఆయన ధ్యాన విషయం, మైమరిపించే శ్రీ కృష్ణ భగవానుని స్వరూపంపైకి మారింది. భగవంతుని సాకార రూపం పట్ల ఎంత గాఢంగా ఆకర్షింపబడ్డాడంటే, తన సమాధిని వదిలి, తండ్రి వేద వ్యాసుని దగ్గరకి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర నుండి, సంపూర్ణ భక్తి మాధుర్యముతో నిండినటువంటి, శ్రీమద్ భాగవతమును విన్నాడు; తదుపరి కాలంలో, గంగానది తీరంలో, అర్జునుడి మనువడైన, పరీక్షిత్ మహారాజుకి దాన్ని చెప్పాడు. ఈ విధంగా, ద్వాపర యుగపు అత్యున్నత జ్ఞాని, భక్తి పథంలో ఆకర్షింపబడ్డాడు. చివరికి, ఇక కలి-యుగానికి వద్దాము. జగద్గురు శంకరాచార్య కలియుగపు అత్యున్నత జ్ఞానిగా పరిగణించబడుతాడు. అద్వైత వాద తత్త్వమును ప్రాచుర్యం లోనికి తెచ్చినది ఈయనే అని చెప్పబడుతాడు; దీనిలో వారు చెప్పినదేమిటంటే, సృష్టిలో ఉన్నది ఒక్కటే అని, అదే నిర్గుణ (గుణములు లేకుండా ఉన్నది), నిర్విశేష (లక్షణములు లేకుండా), నిరాకార (ఆకారము లేకుండా) బ్రహ్మము అని చెప్పారు. కానీ, ఎంతోమందికి తెలియని విషయం ఏమిటంటే, ఆయన ఇరవై సంవత్సరాల వయస్సు నుండి ముప్పైరెండు సంవత్సరముల వయస్సులో శరీరాన్ని విడిచిపెట్టే వరకు, ఆయన, శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరామ చంద్ర ప్రభువు, శివుడు, మరియు దుర్గామాత లపై వందల శ్లోకాలని రచించారు. నాలుగు ధామాలను (చార్-ధామ్) కూడా దర్శించి, భగవంతుని యొక్క సాకార రూప విగ్రహాలను కూడా ఆరాధించారు. ప్రబోధ సుధాకరంలో ఆయన ఇలా వ్రాసారు: కామ్యోపాసనయార్థయన్త్యనుదినం కించిత్ ఫలం స్వేప్సితం కేచిత్ స్వర్గమథాపవర్గమపరే యోగాదియజ్ఞాదిభిః అస్మాకం యదునందనాంఘ్రియుగళధ్యానావధానార్థినాం కిం లోకేన దమేన కిం నృపతినా స్వర్గాపవర్గైశ్చ కిమ్ (250వ శ్లోకము) ‘స్వర్గాది లోకాల ప్రాప్తి కోసం పుణ్యకర్మలు చేసేవారు ఆ విధంగా చేసుకోవచ్చు. జ్ఞాన మార్గంలో లేదా అష్టాంగ యోగ మార్గంలో మోక్షం కోసం కోరుకునేవారు, ఆ విధంగా చేసుకోవచ్చు. నాకు మాత్రం, ఇవేవీ మార్గాలు వద్దు. కేవలం శ్రీ కృష్ణుడి పాదారవిందముల అమృతములో నిమగ్నమైపోవటాన్నే నేను కోరుకుంటాను. నాకు స్వర్గలోక లేదా ఈలోక ప్రాపంచిక సుఖాలు వద్దు. మోక్షం కూడా అక్కరలేదు. దివ్య ప్రేమానందమును ఆస్వాదించే రసికుడను నేను.’ నిజానికి శంకరాచార్యులవారు ఒక గొప్ప కృష్ణ భక్తుడు. ఆయన యొక్క భాష్యంలో చెప్పబడిన విషయం ఆ యొక్క కాల పరిస్థితులలో ఆవిధంగా అవసరమైనది. ఆయన ఈ భూమిపై అవతరించినప్పుడు, భారత దేశంలో బౌద్ధ మతం పూర్తిగా వ్యాపించి ఉంది. అటువంటి పరిస్థితిలో, భౌద్ధులకు మళ్లీ వేదములపై విశ్వాసం కలిగించటానికి, తనభాష్యాలు వ్రాసే టప్పుడు భక్తిని ప్రక్కకు పెట్టాడు. కానీ, తరువాత, సాకార భగవంతుని పై ఎన్నో స్తుతులను వ్రాయటంలో, తనలోనవున్న భక్తిని తెలియపరిచారు. ఈ విధంగా, మహోన్నత జ్ఞానోదయ స్థితికి చేరినవారు, ఆ తదుపరి, భక్తిలో నిమగ్నమయ్యారు అనటానికి, కలియుగంలో శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ. |
|
భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః । తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ ।। 55 ।। | 55 | 18 | భక్త్యా — ప్రేమయుక్త భక్తిచేత; మాం — నన్ను; అభిజానాతి — తెలుసుకుంటారు; యావాన్ — ఎంతటి వాడో; యః చ అస్మి — నేను ఉన్నట్టుగా; తత్త్వతః — యదార్థముగా; తతః — అప్పుడు; మాం — నన్ను; తత్త్వతః — యదార్థ స్వరూపంలో; జ్ఞాత్వా — తెలుసుకుని; విశతే — ప్రవేశిస్తారు; తత్-అనంతరమ్ — ఆ తరువాత. | BG 18.55:
కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్థముగా నేను ఎవరో (ఎంతటి వాడనో) తెలుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప, నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును. | అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానములో స్థితుడై ఉన్న పిదప వ్యక్తి భక్తిని పొందుతాడు అని ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీ కృష్ణుడు చెప్పి ఉన్నాడు. ఇక ఇప్పుడు, కేవలం భక్తి చేత మాత్రమే భగవంతుని యొక్క యదార్థ స్వరూపమును తెలుసుకోవచ్చు అని అంటున్నాడు. ఇంతకు క్రితం, జ్ఞాని భగవంతుడిని నిర్గుణ, నిర్విశేష, నిరాకార, బ్రహ్మన్ గా ఆచరణలో తెలుసుకుని ఉన్నాడు. కానీ, జ్ఞాని, భగవంతుని యొక్క సాకార రూపమును అనుభవించలేదు. ఆ సాకార రూప రహస్యము - కర్మ, జ్ఞానము, అష్టాంగ యోగము, మొదలైన ప్రక్రియల ద్వారా తెలుసుకోబడలేదు. కేవలం ప్రేమ మాత్రమే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది మరియు అందని దానిని అందిస్తుంది. భగవంతుని యొక్క రూపము, గుణములు, లీలలు, ధామములు, మరియు పరివారముల యొక్క నిగూఢత, ఆయన పట్ల అనన్య భక్తి ద్వారానే తెలుసుకోబడతాయి. ప్రేమ దృష్టి ఉండటం చేతనే భక్తులు భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతారు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి పద్మ పురాణంలో ఒక చక్కటి కథ ఉంది. జాబాలి అనే ఋషి ఒకసారి అడవిలో, ధ్యానం చేస్తున్న ఒక అత్యంత తేజోవంతమయిన మరియు ప్రశాంతమైన కన్యను చూసాడు. తనెవరో, తాను ఎందుకు ధ్యానం చేస్తున్నదో తెలియ చేయమని ఆమెను ఆ ఋషి ప్రార్థించాడు. ఆమె ఇలా సమాధానం ఇచ్చింది: బ్రహ్మవిద్యాహమతులా యోగీమ్ ద్రైర్య చ మృగ్యతే సాహం హరి పదాంభోజ కామ్యయా సుచిరం తపః చరామ్యస్మిన్ వనే ఘోరే ధ్యాయంతి పురుషోత్తమం బ్రహ్మానందేన పూర్ణాహం తేనానందేన తృప్తధీః తథాపి శూన్యమాత్మానం మన్యే కృష్ణరతిం వినా ‘నేను బ్రహ్మ విద్యని (ఆత్మ గురించి తెలుసుకునే శాస్త్రము, అది అంతిమంగా భగవంతుని యొక్క బ్రహ్మన్ అస్తిత్వమును ఎఱుకలోకి తెస్తుంది). గొప్ప గొప్ప యోగులు, సాధువులు నన్ను తెలుసుకొనుటకు తపస్సులు చేస్తుంటారు. కానీ, సాకార రూప భగవంతుని పాదారవిందముల పట్ల భక్తి పెంపొందించుకోవటానికి నేనే స్వయంగా కఠినమైన తపస్సు ఆచరిస్తున్నాను. నేను బ్రహ్మానందములో తృప్తిగా మరియు నిండుగా ఉన్నాను. అయినా, శ్రీ కృష్ణుడి పట్ల ప్రేమానుబంధం లేకపోతే, వెలితిగా శూన్యంగా అనిపిస్తుంది.’ అని. ఈ విధంగా, కేవలం జ్ఞానం మాత్రమే ఉంటే అది భగవంతుని సాకార రూప ఆనందాన్ని ఆస్వాదించటానికి సరిపోదు. భక్తి ద్వారా మాత్రమే ఎవరైనా ఆ రహస్యం తెలుసుకోవచ్చు మరియు సంపూర్ణ భగవత్ భావనను పొందవచ్చు. |
|
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః । మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ।। 56 ।। | 56 | 18 | సర్వ — సమస్త; కర్మాణి — పనులు; అపి — కూడా; సదా — ఎల్లపుడూ; కుర్వాణః — నిర్వర్తిస్తూ; మత్-వ్యపాశ్రయః — నన్నే పూర్తిగా ఆశ్రయించి; మత్ ప్రసాదాత్ — నా కృప చే; అవాప్నోతి — పొందుతారు; శాశ్వతం — నిత్యమైన; పదమ్ — ధామము; అవ్యయమ్ — అనశ్వరమైన. | BG 18.56:
సర్వ కార్యములు చేస్తూనే ఉన్నా, నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్యశాశ్వతమైన మరియు అనశ్వరమైన ధామమును పొందుతారు. | భక్తి ద్వారా భక్తులు తన యొక్క సంపూర్ణ ఏకీభావ స్థితిలోకి వస్తారని ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీ కృష్ణుడు చెప్పియున్నాడు. ఈ దృక్పథంలో, వారు ప్రతిదాన్నీ ఈశ్వర సంబంధముగా చూస్తారు. తమ శరీర, మనోబుద్ధులను భగవంతుని శక్తిగా పరిగణిస్తారు; వారి భౌతిక సంపత్తిని భగవంతుని సొత్తుగా చూస్తారు; వారు సర్వ భూతములను భగవంతుని అంశములుగానే పరిగణిస్తారు; మరియు తమనితాము భగవత్ సేవకులుగా పరిగణించుకుంటారు. ఆ దివ్య దృక్పథంలో, వారు పనిని విడిచిపెట్టరు, కానీ కర్తృత్వ భావనను మరియు కర్మఫలభోక్తలమనే భావనను విడిచిపెడతారు. అన్ని పనులను ఈశ్వర సేవగా చూస్తారు మరియు వాటిని చేయటానికి ఆయన మీదనే ఆధారపడుతారు. ఆ తర్వాత, దేహమును విడిచిపెట్టిన పిదప, భగవంతుని దివ్య ధామమును చేరుకుంటారు. ఏ విధంగానైతే ఈ భౌతిక జగత్తు భౌతిక శక్తితో తయారు చేయబడినదో, దివ్య లోకాలు ఆధ్యాత్మిక దివ్య శక్తిచే తయారుచేయబడినవి. కాబట్టి, అది భౌతిక స్వభావం యొక్క దోషములకు అతీతమయినది మరియు సంపూర్ణ దోషరహితమైనది. అది సత్-చిత్-ఆనందం, అంటే నిత్యశాశ్వతత్వము, జ్ఞానము, మరియు ఆనందములచే నిండి ఉన్నది. తన దివ్య ధామము గురించి, శ్రీ కృష్ణుడు 15.6వ శ్లోకం లో చెప్పి ఉన్నాడు. ‘సూర్యుడు కానీ, చంద్రుకు కానీ, అగ్ని కానీ - నా సర్వోత్కృష్ట పరంధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన తరువాత, జీవులు, మరల ఈ భౌతిక జగత్తుకు తిరిగి రారు.’ భగవంతుని యొక్క వివిధమైన స్వరూపాలకు, ఆధ్యాత్మిక జగత్తులో వారి వారి స్వీయ ధామములు ఉన్నాయి; అక్కడ వారు తమ భక్తులతో నిత్య ప్రేమయుక్త లీలలలో నిమగ్నమై ఉంటారు. ఎవరైతే ఆయన పట్ల నిస్వార్థ ప్రేమయుక్త భక్తి సేవలో పరిపూర్ణత సాధిస్తారో వారు ఆయొక్క ఆరాధించిన భగవత్ స్వరూప ధామమునకు చేరుకుంటారు. ఈ విధంగా, శ్రీ కృష్ణుడి భక్తులు గోలోకమునకు, విష్ణుభక్తులు వైకుంఠమునకు, రామ భక్తులు సాకేతలోకమునకు, శివ భక్తులు శివలోకమునకు, దుర్గామాత భక్తులు దేవీలోకమునకు చేరుకుంటారు. ఈ దివ్య ధామములకు చేరుకున్న భక్తులు, ఆయనను చేరిన తరువాత, ఆధ్యాత్మిక శక్తితో పరిపూర్ణమైన ఆయన దివ్య లీలలలో పాలుపంచుకుంటారు. |
|
చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః । బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ।। 57 ।। | 57 | 18 | చేతసా — అంతఃకరణచే; సర్వ-కర్మాణి — సమస్త కర్మలను; మయి — నాకు; సన్న్యస్య — సమర్పిస్తూ; మత్పరః — నన్నే పరమ లక్ష్యముగా చేసుకుని; బుద్ధి-యోగం — బుద్ధిని భగవంతునితో ఏకం చేసి; ఉపాశ్రిత్య — ఆశ్రయించి; మత్-చిత్తః — చిత్తమును నా యందే లగ్నం చేసి; సతతం — ఎల్లప్పుడూ; భవ — ఉండుము. | BG 18.57:
నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని, నీ యొక్క ప్రతి కర్మను నాకే సమర్పించుము. బుద్ధి యోగమును ఆశ్రయించి, నీ చిత్తమును నా యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుము. | ‘యోగము’ అంటే ఏకమైపోవుట, మరియు బుద్ధి యోగము అంటే, ‘బుద్ధిని భగవంతునితో ఏకం చేయుట’ అని. సమస్త పదార్థములూ, జీవులూ భగవంతుని నుండే జనించాయి, ఆయనతో అనుసంధానమై ఉన్నాయి, మరియు ఆయన ప్రీతికోసమే ఉన్నాయి - అని ఎప్పుడైతే బుద్ధి దృఢ నిశ్చయంతో ఉంటుందో, అప్పుడు బుద్ధి భగవంతునితో ఏకమై పోతుంది. మనలో ఉన్న అంతర్గత వ్యవస్థలో బుద్ధి యొక్క స్థాయిని ఒకసారి అర్థం చేసుకుందాము. మన శరీరంలో సూక్ష్మమైన అంతఃకరణ ఉంటుంది, మనం దానినే సామాన్యంగా 'హృదయము' అంటుంటాము. దానికి నాలుగు అస్తిత్వాలు ఉంటాయి. అది ఆలోచనలను సృష్టిస్తే, దానిని మనం 'మనస్సు' అంటాము. అది విశ్లేషించి, నిర్ణయం తీసుకుంటే దానిని 'బుద్ధి' అంటాము. అది ఒక వస్తువుకు లేదా వ్యక్తికి పట్ల మమకారానురాగంతో ఉంటే దానిని 'చిత్తము' అంటాము. అది తనను తాను దేహసంబంధ గుణములతో అనుసంధానం చేసుకుని మరియు గర్వంతో ఉంటే, దానిని మనం 'అహంకారము' అంటాము. ఈ యొక్క అంతర్గత వ్యవస్థలో, బుద్ధి యొక్క స్థాయి ఉన్నతమైనది. అది నిర్ణయం తీసుకుంటే, మనస్సు ఆ నిర్ణయాల ప్రకారం తన కోరికలను కోరుతుంది, మరియు చిత్తము ఆయా వస్తువిషయముల పట్ల మమకారాసక్తితో ఉంటుంది. ఉదాహరణకి, బుద్ధి గనక మనకు సెక్యూరిటీ (భద్రత) యే చాలా ప్రధానమైనది అని నిర్ణయిస్తే, మనస్సు ఎల్లప్పుడూ జీవితంలో సెక్యూరిటీ (భద్రత) కోసమే ప్రాకులాడుతుంది. హోదా/ప్రతిష్ఠలే జీవితంలో ఆనందానికి మూలం అని గనక బుద్ధి నిర్ణయిస్తే, మనస్సు ఎల్లప్పుడూ ‘ప్రతిష్ఠ.., ప్రతిష్ఠ..., ప్రతిష్ఠ..’ అని ప్రాకులాడుతుంది. రోజంతా, మనం మనుష్యులం మనస్సుని బుద్ధిచే నియంత్రిస్తుంటాము. అందుకే, క్రోధమనేది క్రిందివారి పట్లే ప్రదర్శించబడుతుంది. సీ.ఈ.ఓ. గారు డైరెక్టర్ ని అరుస్తాడు. ఆ డైరెక్టర్ తిరిగి సీ.ఈ.ఓ. పై అరవడు, ఎందుకంటే అలా చేస్తే ఉద్యోగం పోతుందని ఆయన బుద్ధి తెలుసుకుంటుంది. ఆయన తన కోపాన్ని మేనేజర్ మీద చూపిస్తాడు. డైరెక్టర్ ఎంత చికాకు పెట్టినా, మేనేజర్ తనను తాను కంట్రోల్ చేసుకుని, తన చికాకుని ఫోర్మన్ మీద చూపిస్తాడు. ఫోర్మన్ అదంతా పనివాడిమీద వెళ్లదీస్తాడు. ఆ పనివాడు తన భార్యపై అరుస్తాడు. ఆ భార్య పిల్లలపై అరుస్తుంది. ఈ ప్రతి ఉదంతంలో, ఎక్కడ కోపం ప్రదర్శిస్తే ప్రమాదకరమో, ఎక్కడ ఫరవాలేదో బుద్ధి నిర్ణయిస్తుంది. మానవులలో బుద్ధి అనేది మనస్సుని నియంత్రించగలదు అని ఈ ఉదాహరణ మనకు తెలియచేస్తున్నది. ఈ విధంగా, మనం బుద్ధిని సరియైన జ్ఞానంచే పెంపొందించుకోవాలి మరియు దానిని మనస్సుని సరియైన దిశలో పెట్టడానికి ఉపయోగించుకోవాలి. శ్రీ కృష్ణుడు చెప్పే బుద్ధి యోగము అంటే ఇదే - అన్ని వస్తువులు మరియు పనులు భగవంతుని ప్రీతికోసమే, ఆయన సంతోషం కొరకే ఉన్నాయనే, దృఢ సంకల్పము బుద్ధి యందు పెంపొందించుకోవటం అన్నమాట. దృఢ సంకల్పబుద్ధి ఉన్న ఇటువంటి వ్యక్తి యొక్క చిత్తము, సునాయాసముగానే భగవంతుని పట్ల అనుసంధానమైపోతుంది. |
|
మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి । అథ చేత్ త్వమహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి ।। 58 ।। | 58 | 18 | మత్-చిత్తః — ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ; సర్వ — అన్ని; దుర్గాణి — అవరోధములను; మత్-ప్రసాదాత్ — నా కృపచే; తరిష్యసి — నీవు అధిగమించవచ్చు; అథ — కానీ; చేత్ — ఒకవేళ; త్వమ్ — నీవు; అహంకారాత్ — దురహంకారముచే; న శ్రోష్యసి — వినకపోతే; వినంక్ష్యసి — నాశనమై పోతావు. | BG 18.58:
నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే, నా కృపచే అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు. కానీ ఒకవేళ, అహంకారముచే, నా సలహా వినకపోతే, నీవు నాశనమైపోతావు. | ఏమి చెయ్యాలో, ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇక ఇప్పుడు తన ఉపదేశాన్ని పాటిస్తే వచ్చే లాభాన్ని/ప్రయోజనాన్ని చెప్తున్నాడు మరియు పాటించకపోతే కలిగే పరిణామాలని వివరిస్తున్నాడు. జీవాత్మ ఎన్నటికీ, తాను భగవంతుని కంటే స్వతంత్రుడను అన్న భావనలో ఉండకూడదు. మనస్సుని పూర్తిగా భగవంతుని యందే నిమగ్నం చేసి, మనం భగవంతుడినే పూర్తిగా ఆశ్రయిస్తే, ఆయన కృపచేత అన్ని అవరోధాలు మరియు కష్టాలు తీరిపోతాయి. కానీ, గర్వముచే, సనాతన భగవత్ జ్ఞానము మరియు శాస్త్రముల కంటే మనకే ఎక్కువ తెలుసు అనుకుని, ఆయన ఉపదేశాన్ని పెడచెవిన పెడితే, మనం మానవ జన్మ యొక్క ప్రధాన లక్ష్యాన్ని సాధించటంలో విఫలం అవుతాము, ఎందుకంటే భగవంతుని కంటే ఉన్నతమైదేమీ లేదు మరియు ఆయన ఉపదేశాన్ని మించిన సందేశమూ లేదు. |
|
యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే । మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ।। 59 ।। | 59 | 18 | యత్ — ఒకవేళ; అహంకారమ్ — అహంకారము చే ప్రేరితమై; ఆశ్రిత్య — ఆశ్రయిస్తే; న యోత్స్యే — నేను యుద్ధం చేయను; ఇతి — ఈ విధంగా; మన్యసే — నీవు అనుకుంటే; మిథ్యా-ఏషాః — ఇదంతా అబద్ధము; వ్యవసాయః — దృఢ సంకల్పము; తే — నీ యొక్క; ప్రకృతిః — భౌతిక స్వభావము; త్వాం — నీవు; నియోక్ష్యతి — నిమగ్నమౌతావు. | BG 18.59:
ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై, ‘నేను యుద్ధం చేయను’ అని అనుకుంటే, నీ నిర్ణయం ఎలాగూ వ్యర్థమై పోతుంది. ఎందుకంటే, నీ యొక్క స్వంత (క్షత్రియ) భౌతిక స్వభావమే నిన్ను యుద్ధం చేయటానికి పురికొల్పుతుంది. | మందలిస్తున్న తరహాలో మాట్లాడుతూ, శ్రీ కృష్ణుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మనకు ఏది నచ్చితే అది చేయటానికి మనకు పూర్తి స్వేచ్ఛ ఉందని మనం ఎన్నడూ అనుకోకూడదు. ఆత్మ అనేది పూర్తి స్వతంత్రమమైన అస్తిత్వమును కలిగి ఉండదు. అది భగవంతుని సృష్టిపై ఎన్నో విధాలుగా ఆధారపడి ఉంటుంది. భౌతిక బద్ధ స్థితిలో, అది ప్రకృతి త్రిగుణముల ఆధీనములో ఉంటుంది. ఈ గుణముల సంయోగమే మన స్వభావాన్ని ఏర్పరుస్తుంది, మరియు అది ఆదేశించినట్టుగా మనం ప్రవర్తించవలసి ఉంటుంది. కాబట్టి, మనకు ‘నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను’ అని అనే పరిపూర్ణ స్వేచ్ఛ లేదు. భగవంతుని యొక్క మరియు శాస్త్రముల సత్-సందేశాన్ని లేదా ప్రకృతి యొక్క బలవంత ఒత్తిడిని ఈ రెంటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవల్సి ఉంటుంది. వ్యక్తి స్వభావంపై ఒక ఆఖ్యానం ప్రాచుర్యంలో ఉంది: ఒక సైనికుడు ముప్పై సంవత్సరముల సర్వీసు తరువాత తన సొంత ఊరికి వచ్చాడు. ఒక రోజు, ఆయన కాఫీ దుకాణంలో నిల్చుని ఓ కప్పు టీ త్రాగుతూ ఉండగా, ఆయన స్నేహితుడు ఒక పరిహాసం చేద్దామనుకున్నాడు. ఆయన వెనుక ఉండి, ‘అటెన్షన్!’ అని గట్టిగా అరిచాడు. ఆ పిలుపుకి బదులివ్వటం ఆ సైనికుడి సహజ స్వభావమైపోయింది. అప్రయత్నంగానే, చేతిలో నుండి కప్పు పడేసి, నిటారుగా చేతులు పక్కకుపెట్టి నిల్చున్నాడు. స్వభావసిద్ధంగా అర్జునుడు ఒక యోధుడు, ఒకవేళ గనక అహంకారముతో, మంచి సలహాని పాటించను అని ఆయన నిర్ణయించుకున్నా, అతని యొక్క క్షత్రియ స్వభావము ఆయనను తప్పకుండా యుద్ధానికి ప్రేరేపిస్తుంది. |
|
స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా । కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోఽపి తత్ ।। 60 ।। | 60 | 18 | స్వభావ-జేన — వ్యక్తి యొక్క సహజసిద్ధ ప్రకృతి స్వభావముచే జనించిన; కౌంతేయ — అర్జునా, కుంతీ దేవి పుత్రుడా; నిబద్ధః — బంధింపబడి; స్వేన — నీ స్వంత; కర్మణా — కర్మలు; కర్తుం — చేయుటకు; న ఇచ్ఛసి — నీవు కోరుకోకపోతే; యత్ — ఏదైతే; మోహాత్ — మోహముచే; కరిష్యసి — నీవు చేస్తావు; అవశః — వశమైపోయి; అపి — అయినా కూడా; తత్ — అది. | BG 18.60:
ఓ అర్జునా, మోహభ్రాంతిచే నీవు ఏదైతే పనిని చేయను అని అంటున్నావో, నీ యొక్క సహజప్రకృతి స్వభావముచే జనించిన ప్రేరణచే, ఆ పనినే చేయటానికి ప్రేరేపింపబడుతావు. | తన యొక్క హెచ్చరింపు మాటలని కొనసాగిస్తూ, శ్రీ కృష్ణుడు ఇంతకుక్రితం చెప్పిన విషయాన్నే మరింత విశదీకరిస్తున్నాడు. ఆయన అనేదేమిటంటే, ‘నీ యొక్క పూర్వ జన్మ సంస్కారాల వలన, నీకు క్షత్రియ స్వభావము ఉన్నది. నీ యొక్క సహజ గుణములైన - వీరత్వము, పరాక్రమము, మరియు దేశభక్తి నిన్ను యుద్ధం చేయటానికే పురికొల్పుతాయి. నీకు పూర్వ జన్మలలో మరియు ఈ జన్మలో కూడా, ఒక యోధుడిగా నీ కర్తవ్యమును నిర్వర్తించటానికే శిక్షణ ఇవ్వబడినది. నీ కళ్ళ ముందే ఇతరులకు అన్యాయం జరుగుతుంటే ఊరికే ఉండటం నీకు సాధ్యమవుతుందా? నీ స్వభావము మరియు లక్షణాలు ఎలాంటివంటే నీవు ఎక్కడ దుర్మార్గాన్ని చూసినా దానిని తీవ్రంగా అడ్డుకుంటావు. కాబట్టి, నీ సహజ స్వభావంచే ప్రేరేపితమై చేసేకన్నా, నా ఉపదేశం అనుసరించి యుద్ధం చేయటమే నీకు మేలు.’ |
|
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి । భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ।। 61 ।। | 61 | 18 | ఈశ్వరః — పరమేశ్వరుడు; సర్వ-భూతానాం — సమస్త ప్రాణుల యందు; హృత్-దేశే — హృదయములలో; అర్జున — అర్జునా; తిష్ఠతి — నివసించును; భ్రామయన్ — తిప్పుతాడు; సర్వ-భూతాని — సమస్త జీవులను; యంత్ర-ఆరూఢాని — యంత్రములో కూర్చునిఉన్న; మాయయా — భౌతిక శక్తిచే తయారుచేయబడిన; | BG 18.61:
పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు, ఓ అర్జునా. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు. | భగవంతునిపై జీవాత్మ యొక్క పరాధీనతని (ఆధారపడి ఉండటాన్ని) వక్కాణిస్తూ, శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు, ‘అర్జునా, నేను చెప్పినట్టు విన్నా, వినకపోయినా, నీవు ఎల్లప్పుడూ నా ఆధీనంలోనే ఉంటావు. నీవు వసించిఉండే ఈ శరీరము నా భౌతిక శక్తిచే తయారు చేయబడినది. నీ యొక్క పూర్వ కర్మల ప్రకారం, నీకు తగిన శరీరమును ఇచ్చాను. నేను కూడా దానిలోనే కూర్చుని ఉన్నాను, మరియు నేను నీ సమస్త ఆలోచనలను, మాటలను, మరియు చేష్ఠలను నోట్ చేసుకుంటున్నాను. కాబట్టి, నీవు ప్రస్తుతం చేసే దానిని బట్టి, నీ భవిష్యత్తు ఎలా ఉండాలి అని కూడా నిర్ణయిస్తాను. నీవు నాకంటే స్వతంత్రుడవని ఎన్నడూ తలంచకు. కాబట్టి అర్జునా, నీ శ్రేయస్సు కోసమే నీవు నాకు శరణాగతి చేయటమే మంచిది.’ |
|
తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత । తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ।। 62 ।। | 62 | 18 | తమ్ ఏవ — ఆయనకు మాత్రమే; శరణం గచ్ఛ — శరణాగతి చేయుము; సర్వ-భావేన — సంపూర్ణ హృదయపూర్వకముగా; భారత — అర్జునా, భరత వంశీయుడా; తత్-ప్రసాదాత్ — ఆయన కృపచేత; పరాం — సర్వోత్కృష్ట; శాంతిం — శాంతి; స్థానం — స్థానము/ధామము; ప్రాప్స్యసి — నీవు పొందెదవు; శాశ్వతం — నిత్యశాశ్వతమైన. | BG 18.62:
సంపూర్ణ హృదయ పూర్వకముగా కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము, ఓ భరతా. ఆయన కృపచే, నీవు పరమ శాంతిని మరియు నిత్యశాశ్వత ధామమును పొందెదవు. | భగవంతునిపైనే ఆధారపడి ఉన్న జీవాత్మ, తన ప్రస్తుత దురవస్థ నుండి బయట పడటానికి మరియు సర్వోన్నత పరమ లక్ష్యమును సాధించటానికి, కూడా, భగవత్ కృప పైనే ఆధారపడి ఉండాలి. కేవలం సొంత ప్రయత్నం మాత్రమే దీనికి సరిపోదు. కానీ, భగవంతుడు తన కృపను ప్రసాదిస్తే, ఆయన తన దివ్య జ్ఞానమును మరియు దివ్య ఆనందమును ఆ జీవాత్మకు ప్రసాదిస్తాడు మరియు దానిని భౌతిక శక్తి యొక్క మాయా బంధనముల నుండి విడిపిస్తాడు. తన కృపచేత వ్యక్తి నిత్య శాశ్వత మోక్షమును మరియు అనశ్వరమైన ధామమును పొందుతాడు అని శ్రీ కృష్ణుడు వక్కాణిస్తున్నాడు. కానీ, ఆ కృపను పొందటానికి, జీవాత్మ, భగవత్ శరణాగతి ద్వారా అర్హత సంపాదించుకోవాలి. ఒక ఈ లోకం తండ్రి కూడా, తన కొడుకు ప్రయోజకుడై వాటిని బాధ్యతతో సన్మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే వరకూ, తన విలువైన సంపత్తిని, అతనికి అప్పచెప్పడు. అదే విధంగా, భగవత్ కృప అనేది ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు, దానిని ప్రసాదించటానికి సంపూర్ణ సహేతుక తర్కబద్ధ నియమాలు ఆధారంగా ఉన్నాయి. ఒకవేళ భగవంతుడు తన కృపను ప్రసాదించటంలో నియమాలు పాటించకపోతే, జనుల విశ్వాసము దెబ్బతింటుంది. ఉదాహరణకు ఇలా అనుకోండి: ఒకాయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. సాగు కాలం కాబట్టి ఇద్దరినీ పొలంలో కష్టపడి పనిచేయమని ఆయన పంపించాడు. ఒక కొడుకు, ఎండలో రోజంతా శ్రమించి చెమటోడ్చి పనిచేస్తాడు. రాత్రికి అతడు తిరిగొచ్చినప్పుడు, ఆ తండ్రి ఇలా అంటాడు, ‘చాలా బాగా పనిచేసావు నాయనా, నీవు కష్టపడ్డావు, చెప్పినట్టు విన్నావు మరియు విశ్వాసంతో పని చేసావు. నీ బహుమానం ఇదిగో, ఈ రూ.1000 తీసుకుని నీ ఇష్టానికి వాడుకో.’ అని. అదే సమయంలో, ఇక రెండవ కొడుకు ఏమీ చేయడు — రోజంతా మంచంపై పడుకుంటాడు, త్రాగుతూ, ధూమపానం చేస్తూ, మరియు తండ్రిని దూషిస్తూ ఉంటాడు. ఒకవేళ రాత్రికి ఆ తండ్రి ఇలా అన్నాడనుకుందాం, ‘పోనీలే, ఏదేమైనా నీవు కూడా నా కొడుకువే కదా, ఇదిగో రూ.1000 తీసుకో, నీ ఇష్టప్రకారం వాడుకో’ అని. దీని పరిణామం ఏమైతుందంటే, ఆ మొదటి కొడుకు యొక్క కష్టపడి పనిచేసే తత్త్వం, ఉత్సాహం నాశనమైపోతుంది. అతను అంటాడు, ‘నా తండ్రి యొక్క ప్రతిఫలమిచ్చే విధానం ఈ రకంగా ఉంటే, నేను కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఏముంది? నేను కూడా ఏమీ చేయకుండా ఉంటా, నాక్కూడా రూ. 1000 ఎలాగూ వస్తుంది.’ అని. అదే విధంగా, భగవంతుడు తన కృపను, మనకు అర్హత లేకుండానే ప్రసాదిస్తే, ఇంతకు క్రితం మహాత్ములైన వారు కూడా ఇలాగే అంటారు, ‘ఏమిటిది? మేము ఎన్నో జన్మల తరబడి మమ్ములను మేము పరిశుద్ధి చేసుకోవటానికి కష్టపడ్డాము, ఆ తదుపరి భగవంతుని కృప లభించింది. కానీ ఈ వ్యక్తి తనను తాను యోగ్యుడిగా చేసుకోకముందే ఆయనకి కృప లభించినది. అలా అయితే ఆత్మ-ఉద్ధరణ కోసం మా పరిశ్రమ అంతా అర్థరహితమైనది.’ అని. భగవంతుడు అంటాడు, ‘నేను ఇలా అస్తవ్యస్తంగా వ్యవహరించను. నేను కృప ప్రసాదించటానిని నాదొక సనాతనమైన నియమం ఉన్నది. నేను దీనిని అన్ని శాస్త్రాలలో తెలియచేసాను.’ అని. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మ-బుద్ధి-ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే (6.18) ‘ఆ బ్రహ్మ దేవుడిని మరియు ఇతరులను సృష్టించిన ఆ సర్వోత్కృష్ట తత్త్వమును ఆశ్రయిస్తున్నాము. ఆయన కృపచేతనే ఆత్మ మరియు బుద్ధి జ్ఞానప్రకాశితమౌతాయి.’ శ్రీమద్భాగవతం ఇలా పేర్కొంటున్నది: మాం ఏకం ఏవ శరణం ఆత్మానం సర్వ-దేహినామ్ యాహి సర్వాత్మ-భావేన మయా స్యా హి అకుతో-భయః (11.12.15) ‘ఓ ఉద్ధవా! సమస్త ప్రాపంచిక సామాజిక ఆచారాలనూ విడిచిపెట్టి, కేవలం, అన్ని ఆత్మలకు పరమాత్మ అయిన నాకు, శరణాగతి చేయుము. అప్పుడే నీవు ఈ భౌతిక భవ సాగరాన్ని దాటి, భయరహితుడవు కావచ్చు.’ శ్రీ కృష్ణుడు భగవద్గీతలో 7.14వ శ్లోకంలో ఇలా పేర్కొన్నాడు: ‘ప్రకృతి త్రిగుణములతో కూడి ఉన్న నా యొక్క దైవీ శక్తి, మాయ, అధిగమించటానికి చాలా కష్టతరమైనది. కానీ నాకు శరణాగతి చేసినవారు, దానిని సునాయాసముగా దాటిపోగలరు.’ రామాయణం కూడా ఇలా పేర్కొంటున్నది: సనముఖ హోఇ జీవ మోహి జబహీఁ, జన్మ కోటి అఘ నాసహీఁ తబహీఁ ‘భగవత్ శరణాగతి చేసిన మరుక్షణం, జీవాత్మకు, దాని అనంతమైన పూర్వ జన్మల పాపరాశి, ఆయన కృపచే, భస్మమై పోతుంది.’ ఈ పై భగవద్గీత శ్లోకములో, శ్రీ కృష్ణుడు , జీవుడు తన కృపకు పాత్రుడు కావటానికి, తనకు శరణాగతి చేయటం ఎంత ఆవశ్యకమో మళ్ళీ పేర్కొన్నాడు. ఈ శరణాగతి చేయటం అంటే, నిజానికి ఏమి చేయాలో అనే వివరాలు, హరి భక్తి విలాస్, భక్తి రాసామృత సింధు, వాయు పురాణం, మరియు అహిర్బుధ్ని సంహిత లో ఈ క్రింది విధంగా చెప్పబడినది: ఆనుకూల్యస్య సంకల్పః ప్రతికూల్యస్య వర్జనం రక్షిశ్యతీతి విశ్వాసో గోప్తృత్వే వరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతిః (హరి భక్తి విలాస్ 11.676) ఈపై శ్లోకం భగవత్ శరణాగతి యొక్క ఆరు అంగములను వివరిస్తున్నది: 1. భగవంతుని సంకల్పమునకు అనుగుణముగానే కాంక్షించుట: సహజ సిద్ధంగానే, మనం ఆ భగవంతుని సేవకులము, మరియు తన స్వామి కోరికని తీర్చటమే, సేవకుని కర్తవ్యము. కాబట్టి, శరణాగతి చేసిన భగవత్ భక్తులగా, మన సంకల్పాన్ని, దివ్య భగవత్ సంకల్పంతో ఏకం చేయాలి. ఒక ఎండుటాకు, వీచేగాలికి లొంగిపోతుంది (శరణాగతి) చేస్తుంది. ఆ వీచేగాలి, దాన్ని పైకిలేపినా, ముందుకు లేదా వెనుకకు పడవేసినా, లేదా నేలపై పడవేసినా – అదేమీ ఫిర్యాదు చేయదు. అదేవిధంగా, మనం కూడా భగవంతుని ఆనందమే మన ఆనందం అని ఉండటం నేర్చుకోవాలి. 2. భగవంతుని ఇష్టానికి (సంకల్పమునకు) వ్యతిరేకంగా కోరుకోకుండా ఉండుట: మన జీవితంలో మనకు లభించింది అంతా మన పూర్వ, ప్రస్తుత కర్మల అనుసారమే ఉంటుంది. కానీ, కర్మ ఫలములు వాటంతట అవే రావు. భగవంతుడు వాటిని నోట్ చేసుకుని వాటి ఫలములను సరైన సమయంలో ఇస్తుంటాడు. భగవంతుడే స్వయంగా ఈ ఫలములను ఇస్తుంటాడు కాబట్టి, మనం వాటిని ప్రశాంత చిత్తముతో స్వీకరించటం నేర్చుకోవాలి. సాధారణంగా, జనులు తమకు సంపద, కీర్తి, ఆనందము, మరియు విలాసాలు లభించినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పటం మర్చిపోతారు. కానీ, కష్టాలు ఎదురైనప్పుడు, భగవంతుడిని నిందిస్తారు, ‘ఎందుకు భగవంతుడు ఇలా చేసాడు?’ అని. రెండవ సూత్రం ఏమిటంటే, భగవంతుడు మనకు ఇచ్చిన దాని పట్ల ఎటువంటి అసంతృప్తి/ఫిర్యాదులు ఉండకపోవటం. 3. భగవంతుడు మనలను రక్షిస్తున్నాడు అన్న దృఢ విశ్వాసం కలిగి ఉండుట: భగవంతుడు మన సనాతనమైన నిత్య శాశ్వత తండ్రి. సృష్టిలోని సమస్త ప్రాణుల సంక్షేమం చూసుకుంటూనే ఉంటాడు. ఈ భూమిపై కొన్ని వేల కోట్ల చీమలు ఉన్నాయి, అవన్నీ సమయానుసారం ఆహారం తీసుకోవలసినదే. మన తోటలో కొన్నివేల చీమలు ఆకలితో చనిపోయి ఉండటం అనేది ఎప్పుడైనా జరిగిందా? వాటన్నిటికీ భగవంతుడు ఆహారం సమకూర్చిపెడుతూనే ఉంటాడు. అదేసమయంలో మరో పక్క, ఏనుగులు కిలోలకొద్దీ ఆహారం ప్రతి రోజూ తీసుకోవాలి. భగవంతుడు వాటి అవసరాలు కూడా తీరుస్తుంటాడు. ఈ లోకపు తండ్రి కూడా తన బిడ్డల అవసరాలు అన్నీ తీరుస్తాడు. మరైతే, మన నిత్యసనాతన తండ్రి అయిన భగవంతుడు మన సంరక్షణ చూసుకోడు అన్న సందేహం ఎందుకు? ఆయనిచ్చే రక్షణ పట్ల సంపూర్ణ దృఢ విశ్వాసం కలిగి ఉండటం, శరణాగతి యొక్క మూడవ అంగము. 4. భగవంతుని పట్ల కృతజ్ఞతా భావమును కలిగి ఉండుట: మనం భగవంతుని నుండి ఎన్నో అమూల్యమైన బహుమానాలను పొంది ఉన్నాము. మనం నడిచే నేల, చూసే సూర్యుని వెలుగు, పీల్చే గాలి, త్రాగే నీరు - ఇవన్నీ భగవంతుడు మనకు ఇచ్చినవే. నిజానికి ఆయన వలననే మనం ఇలా ఉండగలుగుతున్నాము; మనకు ప్రాణ శక్తినిచ్చి, మన ఆత్మకు చైతన్యమును ప్రసాదించినది ఆయనే. వీటికి ప్రతిగా ఆయనకు మనం ఏమీ పన్నులు (టాక్స్) కట్టడంలేదు, కానీ కనీసం ఆయన ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞతా భావముతో ఉండాలి. ఇదే ఉపకారస్మృతి, కృతజ్ఞతా భావము. దీనికి విరుద్ధమైనది, కృతజ్ఞతలేనితనము. ఉదాహరణకి, ఓ తండ్రి తన బిడ్డ కోసం ఎంతో చేస్తాడు. ఆ బిడ్డకి తండ్రి పట్ల కృతజ్ఞతతో ఉండమని చెప్తారు. కానీ, ఆ పిల్లవాడు ఇలా అంటాడు, ‘నేనెందుకు కృతజ్ఞతతో ఉండాలి? ఆయన తండ్రి ఆయనను చూసుకున్నాడు, ఈయన నన్ను చూసుకుంటున్నాడు.’ అని. ఇది ఈ లోకపు తండ్రి పట్ల కృతజ్ఞత లేకపోవటం. మనకు ఆయన ప్రసాదించిన అన్నింటి పట్ల, మన నిత్య శాశ్వత తండ్రి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞతా భావము కలిగి ఉండటమే, శరణాగతి యొక్క నాలుగవ అంశము. మనకున్నదంతా ఆయన సొత్తుగా పరిగణించుట: భగవంతుడు ఈ సమస్త జగత్తుని సృష్టించాడు; అది మనం పుట్టకముందు నుండీ ఉన్నది, మరియు మన తరువాత కూడా ఉంటుంది. కాబట్టి, ఈ సృష్టిలో సమస్తానికి ఆయనే నిజమైన యజమాని. మనం ఏదైనా వస్తువు మనకే చెందినది అని అనుకుంటే భగవంతుని యొక్క యజమానిత్వమును మర్చిపోయినట్టే. మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి. ఆ వచ్చిన ఆయన మీ బట్టలు వేసుకున్నాడు, రెఫ్రిజిరేటర్ నుండి పదార్ధాలు తీసుకున్నాడు, వాటిని ఆరగించి, మరియు మీ మంచం పై పడుకున్నాడు అనుకోండి. తిరిగి వచ్చాక, మీరు ఆగ్రహంతో అంటారు , ‘మా ఇంట్లో ఏం చేస్తున్నావు?’ అని. ఆయన అంటాడు, ‘నేను ఏమీ పాడు చేయలేదు. నేను కేవలం అన్నింటిని సరిగ్గా వాడుకున్నాను అంతే. దానికే ఎందుకింత ఇదై పోతున్నావు?’ అని. మీరు అంటారు, ‘నీవు ఏమీ పాడు చేయకపోయి ఉండవచ్చు, కానీ ఇదంతా నాకు చెందినది. నా అనుమతి లేకుండా వాడుకుంటే, నీవు దొంగవే అవుతావు.’ అని. అదే విధంగా, ఈ జగత్తు మరియు దానిలో ఉన్నదంతా భగవంతునికే చెందినది. ఈ విషయం గుర్తుంచుకుని మన యజమానిత్వమును విడిచి పెట్టటం, శరణాగతి యొక్క ఐదవ అంగము. 6. శరణాగతి చేసాను అన్న అహంకారమును కూడా విడిచిపెట్టుట: ఒకవేళ మనం చేసిన మంచి పనుల పట్ల గర్వపడితే, అహంకరిస్తే, ఆ గర్వం మన హృదయాన్ని మలినం చేస్తుంది మరియు మనం చేసిన మంచి పని యొక్క ఫలితాన్ని నిర్మూలిస్తుంది. అందుకే నమ్రత మరియు విధేయత ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. ‘నేను ఏదైనా మంచి పని చేయగలిగాను అంటే, అది కేవలం భగవంతుడు నా బుద్ధిని సరియైన దిశలో ప్రేరేపించాడు కాబట్టే. నామటుకు నేనే అయితే నేను ఎప్పటికీ ఇది సాధించేవాడిని కాదు.’ అని. ఇటువంటి వినమ్రతా దృక్పథాన్ని కలిగి ఉండటమే శరణాగతి యొక్క ఆరవ అంగము. ఒకవేళ మనం శరణాగతి యొక్క ఈ ఆరు అంగములను పరిపూర్ణముగా అమలుపరిస్తే, మనం భగవంతుని యొక్క షరతులను పూర్తిచేసినట్టే, మరియు అయన మనపై తన కృప ప్రసాదిస్తాడు. |
|
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా । విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ।। 63 ।। | 63 | 18 | ఇతి — ఈ విధముగా; తే — నీకు; జ్ఞానం — జ్ఞానము; ఆఖ్యాతం — వివరించబడినది; గుహ్యాత్ — రహస్య జ్ఞానము కంటే; గుహ్య-తరం — ఇంకా రహస్యమైన జ్ఞానము; మయా — నా చేత; విమృశ్య — బాగా ఆలోచించి; ఏతత్ — దానిపై; అశేషేణ — పూర్తిగా; యథా — ఎట్లయితే; ఇచ్ఛసి — ఇష్టమైతే; తథా — ఆ విధముగా; కురు — చేయుము. | BG 18.63:
ఈ విధంగా, నేను నీకు అన్ని రహస్యాలకంటే పరమ రహస్యమైన జ్ఞానమును తెలియచేసాను. దీనిపై లోతుగా ఆలోచించుము, మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము. | రహస్యము అంటే అందరికీ సామాన్యముగా అందుబాటులో లేని జ్ఞానము అని అర్థం. భౌతిక శాస్త్రము (ఫిజిక్స్) యొక్క చాలా మటుకు సిద్ధాంతాలు కొన్ని శతాబ్దాలవరకూ రహస్యముగా ఉండేవి, ఇంకా చాలా సూత్రాలు రహస్యముగానే ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానమనేది చాలా నిగూఢమయినది, అది ప్రత్యక్ష అనుభూతి ద్వారా తెలుసుకోబడలేనిది. దానిని గురువు మరియు శాస్త్రముల ద్వారా నేర్చుకోవాలి. కాబట్టి, అది రహస్యము అని చెప్పబడినది. రెండవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు ఆత్మ జ్ఞానమును తెలియచేసాడు, అది 'గుహ్యము' అంటే రహస్య జ్ఞానము. 7వ మరియు 8వ అధ్యాయాలలో, తన శక్తిసామర్థ్యాల యొక్క జ్ఞానమును తెలియచేసాడు, అది 'గుహ్యతరం', అంటే మరింత రహస్యమైనది. 9వ మరియు తదుపరి అధ్యాయాలలో, తన భక్తి గురించి తెలియచేసాడు, అది 'గుహ్యతమం' అంటే అత్యంత రహస్యమైనది. ప్రస్తుత అధ్యాయములో, 55వ శ్లోకములో, తనను తన సాకార రూపములో తెలుసుకోవటం కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధ్యము అని తెలియచెప్పాడు. శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు భగవద్గీతను ముగిస్తున్నాడు. అత్యంత రహస్యములతో కూడిన జ్ఞానాన్ని అర్జునుడికి తెలియ చేస్తూ, 18 అధ్యాయాలలో చాలా మేర తానే మాట్లాడిన శ్రీకృష్ణుడు, ఇక ఇప్పుడు, ఏమి చేయాలి అనే నిర్ణయాన్ని అర్జునుడికే వదిలేస్తున్నాడు. ఆయన అంటున్నారు, ‘నేను నీకు గంభీరమైన మరియు గోప్యమైన జ్ఞానమును అందించాను. ఇక ఇప్పుడు నీ ఇష్టం.’ అని. అయోధ్యావాసులకు, శ్రీ రామచంద్ర ప్రభువు సుమారుగా ఇటువంటి మాటలే చెప్పాడు. ఓసారి ఆయన వారందరినీ తన ప్రవచనానికి పిలిచాడు. ఆ ఉపదేశంలో, రాముడు వారందరికీ, మానవ జీవిత లక్ష్యం ఏమిటి మరియు దానిని ఎలా సాధించాలి అని చెప్పాడు. చివరికి ఇలా ముగించాడు నహీఁ అనీతి నహీఁ కఛు ప్రభుతాఈ, సునహు కరహు జో తుమ్హహి సోహాఈ (రామాయణం) ‘నేను మీకు చెప్పిన ఉపదేశంలో తప్పు లేదు మరియు నిర్బంధంగా దానిని పాటించాల్సిన అవసరం లేదు. దానిని జాగ్రత్తగా వినండి, ఆలోచించండి, ఆ తరువాత మీకు నచ్చిన రీతిలో చేయండి.’ అందుబాటులో ఉన్నవాటిలో దేనిని ఎంపిక చేసుకోవాలి అనే, ఈ యొక్క స్వేచ్ఛాచిత్తమును (ఎంచుకొనే స్వేచ్ఛ) భగవంతుడు, జీవునకు ఇచ్చాడు. ఈ స్వేచ్ఛాచిత్తమునకు పరిమితులు ఉన్నాయి. ఎవరైనా, ‘నేను ప్రపంచంలో అత్యంత తెలివికల వ్యక్తిగా ఉందామనుకుంటున్నాను.’ అని వారికివారే నిర్ణయించుకోలేరు. మన పూర్వ మరియు ప్రస్తుత కర్మలచే, మనకున్న ఎంపిక పరిధి లోనివి (options) పరిమితంగా ఉంటాయి. కానీ, మనకు ఖచ్చితంగా కొంతమేర ఎంచుకొనే స్వేచ్ఛ ఉంది, ఎందుకంటే మనం భగవంతుని చేతిలో యంత్రాలము కాము. కొన్నిసార్లు జనులు ఏమంటారంటే, భగవంతుడు మనకు స్వేచ్ఛాచిత్తమును అసలు ఇవ్వకపోతే, మనం ఏమీ చెడుపనులు చేసి ఉండేవాళ్ళం కాదుకదా అంటారు. అలాఐతే, మనం ఏమీ మంచి కూడా చేసి ఉండేవాళ్ళం కాదు. మంచి చేసే అవకాశం ఎప్పుడూ చెడు చేసే ప్రమాదంతోనే కూడి ఉంటుంది. మరీ ముఖ్యంగా, భగవంతుడు, మనం ఆయనను ప్రేమించాలని కోరుకుంటాడు మరియు స్వేచ్ఛాచిత్తఎంపిక ఉన్నప్పుడే ప్రేమ సాధ్యమవుతుంది. ఒక యంత్రము అనేది ఎప్పుడూ ప్రేమించలేదు ఎందుకంటే దానికి స్వేచ్ఛాచిత్తము ఉండదు. భగవంతుడు మనలను స్వేచ్ఛాచిత్తము తోటే సృష్టించాడు మరియు ఎన్నో విషయాలను/పద్ధతులను ఎంచుకునే అవకాశాలను కలిగించాడు; ఇదంతా మనం ఆయననే ఎంచుకుని, ఆయన పట్ల మన ప్రేమను తెలియపరుచు కోవటానికే. సర్వ శక్తిమంతుడయిన భగవానుడు కూడా, జీవుడిని (జీవాత్మ) తనను ప్రేమించి, తనకు శరణువేడుకునే విధంగా బలవంతం చేయలేడు. ఆ నిర్ణయం, జీవుడే స్వయముగా తీసుకోవాలి. ఇక్కడ, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి అతని యొక్క స్వేచ్ఛాచిత్తమును గుర్తుచేస్తూ, అర్జునుడిని ఎంచుకోమని చెప్తున్నాడు. |
|
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః । ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ।। 64 ।। | 64 | 18 | సర్వ-గుహ్య-తమం — అన్నిటి కన్నా రహస్యమైన; భూయః — మరల; శృణు — వినుము; మే — నా చే; పరమం — సర్వోత్కృష్ట; వచః — ఉపదేశము; ఇష్టః-అసి — నీవు ప్రియమైనవాడవు; మే — నాకు; దృఢమ్ — చాలా; ఇతి — ఈ విధంగా; తతః — ఎందుకంటే; వక్ష్యామి — నేను పలుకుతున్నాను; తే — నీ యొక్క; హితమ్ — హితము (క్షేమము) కోరి. | BG 18.64:
నా యొక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము, అది సమస్త జ్ఞానములో కెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము కోరి దీనిని తెలియచేస్తున్నాను, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి కాబట్టి. | ఒక ఉపాధ్యాయుడికి నిగూఢమైన రహస్యం తెలిసి ఉండవచ్చు, కానీ ఆయన దానిని తప్పకుండా విద్యార్థికి చెప్తాడు అని నమ్మకం లేదు. దానిని చెప్పేముందు, ఆయన చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటాడు, అంటే, విద్యార్థి యొక్క యోగ్యత, దానిని అర్థం చేసుకునే సామర్థ్యం, మరియు దాని నుండి ప్రయోజనం పొందగలగటం మొదలైనవి. భగవద్గీత ప్రారంభంలో, అర్జునుడు తన ముందున్న సమస్యచే ఆందోళన పడి, శ్రీకృష్ణ పరమాత్మను దారిచూపమన్నాడు. భగవంతుడు చాలా జాగ్రత్తగా, సావధానంగా అతని యొక్క జ్ఞానాన్ని క్రమక్రమంగా, పద్దెనిమిది అధ్యాయాల ద్వారా, వృద్ధి చేసాడు. అర్జునుడు ఆ ఉపదేశాన్ని చక్కగా నేర్చుకోవటం చూసి, శ్రీ కృష్ణుడికి ఇక ఇప్పుడు తన యొక్క అంతిమ అత్యంత నిగూఢమైన జ్ఞానమును, అర్జునుడు అర్థంచేసుకోగలడు, అన్న ధైర్యం వచ్చింది. అంతేకాక, ‘ఇష్టోఽసి మే దృఢమితి’ అన్నాడు, అంటే, ‘నీవు నా ప్రియమిత్రుడవి, నీ క్షేమాన్ని కోరుకుంటున్నాను మరియు నీకు ఎప్పుడూ మంచి జరగాలనే ఆశిస్తాను, కావున, దీనిని నేను నీకు చెప్తున్నాను.’ అని అర్థం. |
|
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు । మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే ।। 65 ।। | 65 | 18 | మత్-మనా — నన్ను స్మరిస్తూ; భవ — ఉండుము; మత్-భక్తః — నా భక్తుడిగా; మత్-యాజీ — నన్నే పూజింపుము; మాం — నాకు; నమస్కురు — నమస్కరించుము; మామ్ — నన్ను; ఏవ — నిజముగా; ఏష్యసి — చేరెదవు; సత్యం — సత్యముగా; తే — నీకు; ప్రతిజానే — వాగ్దానం చేస్తున్నాను; ప్రియః — ప్రియమైనవాడివి; అసి — నీవు; మే — నాకు. | BG 18.65:
ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి. | 9వ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి అత్యంత రహస్యమైన జ్ఞానమును తెలియచేస్తానని వాగ్దానం చేసాడు, మరియు ఆ తర్వాత భక్తి యొక్క ప్రాశస్త్యమును చెప్పాడు. ఇక్కడ, తన పట్ల భక్తితో నిమగ్నమవ్వమని చెప్తూ, 9.34వ శ్లోకం యొక్క మొదటి పాదాన్ని తిరిగి పేర్కొన్నాడు. శ్రీ కృష్ణుడి పట్ల గాఢమైన ప్రేమను పెంపొందించుకుని మరియు తన యొక్క మనస్సు సతతమూ అనన్య భక్తితో ఆయన యందే నిమగ్నం చేయటం వలన, అర్జునుడు ఖచ్చితంగా సర్వోన్నత గమ్యమును చేరుకోగలడు. సంపూర్ణముగా భక్తిలో నిమగ్నమైనవానికి ఉన్న ఒక చక్కటి ఉదాహరణ, అంబరీష మహారాజు. శ్రీమద్భాగవతం ఇలా వివరిస్తుంది: స వై మనః కృష్ణ-పదారవిందయోః వచాంసి వైకుంఠ-గుణానువర్ణనే కరౌ హరేర్ మందిర-మార్జనాదిషు శ్రుతిం చకారాచ్యుత-సత్-కథోదయే ముకుంద-లింగాలయ-దర్శనే దృశౌ తద్-భృత్య-గాత్ర-స్పర్శే అంగసంగమం ఘ్రాణం చ తత్-పాద-సరోజ-సౌరభే శ్రీమత్-తులస్యా-రసనాం తద్-అర్పితే పాదౌ హరేః క్షేత్ర-పదానుసర్పణే శిరో హృషీకేశ-పదాభివందనే కామం చ దాస్యే న తు కామ-కామ్యయా యథోత్తమశ్లోక-జనాశ్రయా రతిః (9.4.18-20) ‘అంబరీషుడు తన మనస్సును శ్రీ కృష్ణుడి పాదారవిందముల మీదనే నిమగ్నం చేసాడు; తన వాక్కుని భగవంతుని గుణములను కీర్తించటానికే వాడాడు, తన చేతులను దేవాలయమును శుభ్రం చేయటానికే వాడాడు, తన చెవులను భగవత్ దివ్య లీలలను వినటానికే వాడాడు. తన కన్నులను దివ్యమంగళ విగ్రహాలను దర్శించటంలోనే నిమగ్నం చేసాడు. తన శరీర అంగములను భక్తుల సేవకే వాడాడు, తన ముక్కుని భగవంతుని పాదార విందముల వద్ద అర్పించిన తులసీ దళములను ఆఘ్రాణించటానికే వాడాడు, మరియు తన నాలుకను భగవత్ ప్రసాదమును రుచి చూడటానికే వాడాడు. తన కాళ్ళను పుణ్య ప్రదేశాలకు వెళ్ళటానికి, తన శిరస్సుని భగవత్ పాదార విందముల వద్ద ప్రణమిల్లటానికి ఉపయోగించాడు. పూల దండలూ, చందనము వంటి సరంజామా అంతటినీ, భగవత్ సేవకే వాడాడు. ఇవన్నీ ఏదో స్వార్థ ప్రయోజనం కోరి కాకుండా, చిత్తశుద్ధి ద్వారా, కేవలం, శ్రీ కృష్ణుడి నిస్వార్థ సేవ పొందటానికే చేసాడు.’ హృదయ పూర్వకముగా భక్తిలో నిమగ్నమవ్వమని చెప్పే ఉపదేశమే, సమస్త శాస్త్రముల యొక్క సారాంశము మరియు సమస్త జ్ఞానము యొక్క సారము. అయినా, శ్రీ కృష్ణుడు పేర్కొన్న, అత్యంత గోప్యమైన జ్ఞానము ఇది కాదు, ఎందుకంటే దీనిని కృష్ణుడు ఇంతకు పూర్వమే చెప్పి ఉన్నాడు. ఇక ఇప్పుడు తన అత్యున్నత రహస్యమును తదుపరి శ్లోకంలో చెప్తున్నాడు. |
|
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ । అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ।। 66 ।। | 66 | 18 | సర్వ-ధర్మాన్ — అన్ని విధములైన ధర్మములనూ; పరిత్యజ్య — విడిచిపెట్టి; మామ్ — నా యందు; ఏకం — మాత్రమే; శరణం — ఆశ్రయం; వ్రజ — పొందుము; అహం — నేను; త్వాం — నిన్ను; సర్వ — సమస్తమైన; పాపేభ్యః — పాప ప్రతిచర్యలనుండి; మోక్షయిష్యామి — విముక్తి చేసెదను; మా శుచః — భయపడకుము. | BG 18.66:
అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను; భయపడకుము. | ఇప్పటివరకూ, శ్రీ కృష్ణుడు అర్జునుడిని ఒకేసమయంలో రెండు పనులు చేయమన్నాడు - మనస్సుని భక్తిలో నిమగ్నం చేయాలి మరియు శరీరాన్ని తన ప్రాపంచిక క్షత్రియ ధర్మమును నిర్వర్తించటంలో వాడాలి. ఈ విధంగా అర్జునుడిని తన క్షత్రియ ధర్మమును విడిచిపెట్టమని చెప్పలేదు, దానితో పాటుగా భక్తి చేయమన్నాడు. ఇదే 'కర్మయోగ' సిద్ధాంతము. ఇక ఇప్పుడు, శ్రీ కృష్ణుడు ఈ ఉపదేశానికి విరుద్ధంగా చెప్తూ, ప్రాపంచిక ధర్మములను నిర్వర్తించుట కూడా అవసరంలేదు అని అంటున్నాడు. అర్జునుడు సమస్త ప్రాపంచిక ధర్మములను విడిచిపెట్టి, కేవలం భగవంతునికి శరణాగతి చేయవచ్చు అన్నాడు. ఇది కర్మ సన్న్యాస సిద్ధాంతము. ఇక్కడ, ఒక సందేహం రావచ్చు, మనం మన భౌతిక ధర్మములను అన్నింటినీ విడిచి పెడితే, మనకు పాపం కలుగదా? శ్రీ కృష్ణుడు అర్జునుడికి భయపడవద్దని చెప్తున్నాడు; ఆయన అర్జునుడిని సమస్త పాపముల నుండి విముక్తి చేస్తాడు, మరియు భౌతిక అస్తిత్వం నుండి విముక్తి చేస్తాడు. శ్రీ కృష్ణుడి యొక్క ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకోవటానికి, మనం 'ధర్మము' అన్న పదానికి అర్థం తెలుసుకోవాలి. అది 'ధృ' అన్న ధాతువు నుండి వచ్చింది, అంటే ‘ధారణ్ కరనే యోగ్య’ '(dhāraṇ karane yogya') అంటే ‘మనకు సముచితమైన/చేయవలసిన బాధ్యతలు, విధులు, తలంపులు, మరియు కర్మలు.’ యధార్థముగా మనకు రెండు రకాల ధర్మములు ఉన్నాయి - భౌతిక ధర్మములు మరియు ఆధ్యాత్మిక ధర్మములు. ఈ రెండు రకాల ధర్మములు, ‘నేను’ అంటే ఏమిటో ఉన్న, రెండు వేర్వేరు విధములైన అవగాహన నుండి జనించాయి. మనం మనల్ని ఈ శరీరమే అనుకుంటే, మన ధర్మం అనేది, మన శారీరక హోదా, కర్తవ్యాలు, విధులు మరియు ఆచారాల వల్ల నిర్ణయించబడుతుంది. కాబట్టి, శారీరక తల్లిదండ్రుల సేవ, సమాజ పర బాధ్యతలు, దేశం పట్ల కర్తవ్యాలు, మొదలైనవి అన్నీ శారీరక ధర్మములు అంటారు. దీనినే 'అపర ధర్మ' లేదా ప్రాపంచిక ధర్మ అంటారు. దీని పరిధిలోనే, బ్ర్రాహ్మణ ధర్మ, క్షత్రియ ధర్మ, మొదలైనవి అన్నీ ఉంటాయి. కానీ, ఎప్పుడైతే మనం మనల్ని ఆత్మ అనుకుంటామో, మనకు ఇక భౌతికమైన వర్ణాశ్రమ గుర్తింపులు ఉండవు. ఆత్మ యొక్క తండ్రి, తల్లి, మిత్రుడు, సఖి/సఖుడు, మరియు ఆశ్రయము అన్నీ భగవంతుడే. కాబట్టి, మనకున్న ఏకైక ధర్మ, ప్రేమయుక్త భగవత్ సేవయే అవుతుంది. దీనినే పర-ధర్మ లేదా ఆధ్యాత్మిక ధర్మ అంటారు. ఒకవేళ వ్యక్తి తన భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెడితే, కర్తవ్య ఉపేక్ష చేత, అది పాపముగా పరిగణించబడుతుంది. కానీ ఎవరైనా భౌతిక ధర్మమును విడిచిపెట్టి, ఆధ్యాత్మిక ధర్మమును ఆశ్రయిస్తే అది పాపము కాదు. శ్రీమద్ భాగవతము ఇలా పేర్కొంటున్నది: దేవర్షి-భూతాప్త-నృణాం పితౄణాం న కింకరో నాయం ఋణీ చ రాజన్ సర్వాత్మనా యః శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తమ్ (11.5.41) ఈ శ్లోకం ఏమి చెప్తున్నది అంటే, భగవంతునికి శరణాగతి చేయనివారికి, ఐదు రకాల రుణాలు ఉంటాయి: దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ఇతర మానవులకు, మరియు ఇతర ప్రాణులకు. వర్ణాశ్రమ వ్యవస్థ, మనలని మనం ఈ ఐదు రుణముల నుండి విడిపించుకోవటానికి వివిధ పద్ధతులను కలిగి ఉంది. కానీ, మనం భగవంతునికి శరణాగతి చేస్తే, మనం అప్రయత్నపూర్వకంగానే (ఆటోమేటిక్‌గా) ఈ అన్ని ఋణాల నుండి విముక్తి చేయబడుతాము; ఇదిఎలాగంటే, ఒక చెట్టు వేరులో నీరు పోస్తే, దాని యొక్క అన్ని శాఖలు, చిగుర్లు, ఆకులు, పుష్పాలు, మరియు కాయలు అన్నిటికీ నీరు అందుతుంది. అదే విధముగా, భగవంతుని పట్ల మన కర్తవ్యమును నిర్వర్తిస్తే, మనం అప్రయత్నంగానే అందరి పట్ల మన విధి నిర్వర్తించినట్టే. కాబట్టి, మనం సముచితంగా ఆధ్యాత్మిక ధర్మంలో స్థితమై ఉంటే భౌతికప్రాపంచిక ధర్మమును విడిచిపెట్టినా పాపం అంటదు. నిజానికి, అత్యున్నత లక్ష్యము ఏమిటంటే, మనం సంపూర్ణముగా, మరియు మనసారా ఆధ్యాత్మిక ధర్మంలో నిమగ్నమవ్వటమే. శ్రీమద్ భాగవతము ఇలా పేర్కొంటున్నది : ఆజ్ఞాయైవం గుణాన్ దోషాన్ మయాదిష్టాన్ అపి స్వకాన్ ధర్మాన్ సంత్యజ్య యః సర్వాన్ మాం భజేత స సత్తమః (11.11.32) ‘శారీరక ధర్మమును పాటించటం గురించి, వేదములలో, నేను అసంఖ్యాకమైన ఉపదేశాలను ఇచ్చి ఉన్నాను. కానీ, ఎవరైతే వీటిలో ఉన్న అసంపూర్ణతను గమనించి, అన్ని కర్తవ్య విధులను త్యజించి, కేవలం నా యందు భక్తి యుక్త సేవలో నిమగ్నమైతే, వారిని నేను ఉత్తమ సాధకులుగా పరిగణిస్తాను’. రామాయణములో, లక్ష్మణుడు ఏ విధంగా, సమస్త ప్రాపంచిక ధర్మములను విడిచి, రాముడితో పాటు అడవికి ఎలా వెళ్ళాడో మనం చదివి ఉన్నాము. ఆయన అన్నాడు: గురు పితు మాతు న జానహు కాహూ, కహహు సుభాఉ నాథ పతియాఊ మోరె సబహీఁ ఏక తుమ స్వామీ, దీనబంధు ఉర అంతరయామీ ‘ఓ ప్రభూ, నన్ను దయచేసి నమ్మండి, నాకు ఎటువంటి గురువు, తండ్రి, తల్లి, బంధువులు ఎవరూ లేరు. నాకు సంబంధించినంత వరకూ, దీనబంధువు, మనస్సు ఎఱిగినవాడవు అయిన నీవే, నా స్వామివి మరియు నా సర్వస్వమూ నీవే.’ అదే విధంగా, ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు: మాతా నాస్తి పితా నాస్తి నాస్తి మే స్వజనో జనః ‘నాకు ఎవరూ తల్లి, తండ్రి, లేదా బంధువులు ఎవరూ లేరు (భగవంతుడే నాకు అన్నీ).’ భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి క్రమక్రమంగా ఉన్నతమైన ఉపదేశాలను ఇచ్చాడు. ప్రారంభంలో అర్జునుడికి కర్మ చేయమని చెప్పాడు, అంటే, క్షత్రియ యోధుడిగా తన భౌతికప్రాపంచిక ధర్మము (2.31వ శ్లోకం). కానీ, భౌతిక ధర్మ అనేది భగవత్ ప్రాప్తిని కలుగచేయలేదు; అది స్వర్గాది లోకములనే ఇవ్వగలదు, మరియు పుణ్యక్షయం అయిపోయినప్పుడు జీవుడు మరల తిరిగి రావలసినదే. కాబట్టి, శ్రీ కృష్ణుడు తదుపరి, అర్జునుడికి కర్మ యోగమును చేయమని చెప్పాడు, అంటే, శరీరముతో భౌతిక ధర్మము మరియు మనస్సుతో ఆధ్యాత్మిక ధర్మము. శరీరంతో యుద్ధం చేస్తూ మనస్సుతో భగవంతుడిని స్మరిస్తూ ఉండమన్నాడు. (8.7వ శ్లోకం). ఈ కర్మయోగ ఉపదేశమే భగవత్ గీత యొక్క అతిపెద్ద భాగము. ఇక చిట్ట చివరికి, శ్రీ కృష్ణుడు అర్జునుడిని కర్మ సన్యాసము చేయమని చెప్పాడు, అంటే, సమస్త భౌతిక ధర్మములనూ విడిచి, కేవలం ఆధ్యాత్మిక ధర్మ, అంటే భగవత్ ప్రేమను పాటించమన్నాడు; అందుకే, యుద్ధం చేయాలి, కానీ అది తన క్షత్రియ ధర్మము కాబట్టి కాదు, భగవంతుడు తనను అలాగే చేయమంటున్నాడు కాబట్టి. మరైతే, శ్రీ కృష్ణుడు ఈ ఉపదేశాన్ని ప్రారంభంలోనే ఎందుకు చెప్పలేదు? ఎందుకు స్పష్టంగా దీనికి విరుద్ధంగా 5.2వ శ్లోకములో కర్మ సన్యాసము కంటే, కర్మ యోగము ఉన్నతమైనది అని చెప్పాడు? శ్రీ కృష్ణ భగవానుడు దీనిని స్పష్టంగా తదుపరి శ్లోకంలో వివరిస్తున్నాడు. |
|
ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన । న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి ।। 67 ।। | 67 | 18 | ఇదం — ఇది; తే — నీ చేత; న — కూడదు; అతపస్కాయ — తపస్సంపన్నులు కాని వారికి; న — కూడదు; అభక్తాయ — భక్తులు కాని వారికి; కదాచన — ఎప్పుడూ; న — కూడదు; చ — మరియు; అశుశ్రూషవే — వినటానికి (ఆధ్యాత్మిక విషయాలు) ఏవగింపు కలిగేవారికి; వాచ్యం — చెప్పుట; న — ఎప్పుడూకూడదు; చ — మరియు; మాం — నా పట్ల; యః — ఎవరైతే; అభ్యసూయతి — అసూయ/ఈర్ష్య కలవారికి. | BG 18.67:
ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నులు కాని వారికి, లేదా భక్తి లేని వారికి చెప్పకూడదు. (ఆధ్యాత్మిక విషయములు) వినటం పట్ల ఏవగింపు కలవారికి కూడా దీనిని చెప్పకూడదు, మరియు ముఖ్యంగా, నాపట్ల అసూయ కలవారికి దీనిని చెప్పకూడదు. | భగవంతుని పట్ల ప్రేమయుక్త భక్తిలో నిమగ్నమైన వారు ప్రాపంచిక ధర్మములను విడిచిపెట్టినా పాపం లేదు అని ఇంతకు క్రితం శ్లోకంలో వివరించబడినది. కానీ, ఈ ఉపదేశంలో ఒక సమస్య ఉన్నది. ఒకవేళ మనం ఇంకా భగవంతుని పట్ల ప్రేమలో స్థిరంగా లేకపోతే, మరియు తొందరపడి ముందరగానే భౌతికప్రాపంచిక ధర్మములను విడిచి పెడితే, మనం అటూ ఇటూ కాకుండా పోతాము. అందుకే, కర్మ సన్న్యాసం అంటే, దానికి తగిన అర్హత ఉండాలి. మనకు దేనికి అర్హత ఉన్నదో మన గురువు గారు నిర్ణయిస్తారు, ఆయనకే మన సామర్థ్యము మరియు ఆయా మార్గాల్లో ఉండే కాఠిన్యములు తెలుస్తాయి. ఒకవేళ ఒక విద్యార్థి పట్టభద్రుడు కావాలనుకుంటే, నేరుగా వెళ్లి స్నాతకోత్సవంలో కూర్చుంటే కుదరదు. ఒకటో తరగతి నుండి క్రమక్రమంగా మొదలుపెట్టాలి. అదే విధంగా, అత్యధిక జనులకు కర్మ యోగమునకే అర్హత ఉంటుంది, మరియు తొందరపడి అకాలముగా కర్మ సన్యాసము తీసుకొనుట, పెద్ద తప్పే అవుతుంది. తమ శారీరక ధర్మములను నిర్వర్తిస్తూనే, దానితో పాటుగా భక్తిని అభ్యాస సాధన చేయమని చెప్పటమే మంచిది. అందుకే, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, తాను చెప్పిన ఈ రహస్య జ్ఞానము అందరికోసం కాదు అని చెప్తున్నాడు. ఇతరులతో పంచుకునే ముందు, ఈ ఉపదేశం అందుకోవటానికి, వారి యొక్క అర్హతను పరీక్షించాలి. ఈ హెచ్చరిక, మరింత ప్రత్యేకంగా ఇంతకు క్రితం శ్లోకానికి వర్తిస్తుంది మరియు సాధారణంగా భగవద్గీత మొత్తానికి కూడా వర్తిస్తుంది. ఒకవేళ దీనిని, శ్రీ కృష్ణుడు అంటే అసూయ/ఈర్ష్య కలిగిన వారికి చెప్తే, ఆ వ్యక్తి ఇలా అనవచ్చు, ‘శ్రీ కృష్ణుడు చాలా దురహంకారముగలవాడు. అర్జునుడిని పదేపదే తనను కీర్తించమని చెప్తున్నాడు.’ అని. ఈ ఉపదేశాలను తప్పుగా అర్థం చేసుకుని, విశ్వాసరహితుడు, ఈ దివ్య ఉపదేశం వలన ఇంకా హాని పొందుతాడు. పద్మ పురాణం కూడా ఇలా చెప్తున్నది: అశ్రద్ధధానే విముఖే ఽపి అశృణ్వతి యష్ చోపదేశః శివ-నామాపరాధః ‘విశ్వాసం లేనివారికి మరియు భగవంతుని పట్ల ఏవగింపు కలవారికీ, అలౌకిక ఆధ్యాత్మిక ఉపదేశాలను ఇవ్వటం ద్వారా వారిని అపరాధులుగా చేసినట్టు అవుతుంది.’ కాబట్టి, శ్రీ కృష్ణుడు, వినేవారికి ఉండే అనర్హతలని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. |
|
య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి । భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ।। 68 ।। | 68 | 18 | యః — ఎవరైతే; ఇదం — ఈ యొక్క; పరమం — సర్వోత్కృష్ట; గుహ్యం — రహస్యమైన జ్ఞానమును; మత్-భక్తేషు — నా భక్తులలో; అభిధాస్యతి — ఉపదేశిస్తారో; భక్తిం — అత్యున్నత ప్రేమ; మయి — నా పట్ల; పరాం — అలౌకికమైన; కృత్వా — చేస్తూ; మామ్ — నన్ను; ఏవ — నిజముగా; ఏష్యతి — చేరుకుంటారు; అసంశయః — సందేహము లేకుండా. | BG 18.68:
ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో, వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు. వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు. | శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు భగవద్గీతను సరియైన పద్ధతిలో బోధిస్తే కలిగే పరిణామాలను ప్రకటిస్తున్నాడు. అటువంటి బోధకులు ప్రథమంగా ఆయన పరాభక్తిని పొందుతారు, ఆ తర్వాత ఆయననే పొందుతారు. భక్తిలో నిమగ్నమవ్వటానికి లభించే అవకాశం అనేది భగవంతుని యొక్క విశేషమైన కృప, అదే సమయంలో, ఇతరులను కూడా భక్తిలో నిమగ్నం చేసే అవకాశం అనేది ఇంకా ఎక్కువ అనుగ్రహము, అది భగవంతుని యొక్క విశేష కృపను ఆకర్షిస్తుంది. మనం ఎప్పుడైనా ఇతరులతో ఒక మంచిదాన్ని పంచుకుంటే, మనం కూడా దాని నుండి ప్రయోజనాన్ని పొందుతాము. మన దగ్గర ఉన్న ఏదేని జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటే, భగవత్ అనుగ్రహం వలన మన జ్ఞానం కూడా ఎంతో పెంపొందుతుంది. ఇతరులకు అన్నం తరచుగా పెట్టడం వలన, మనమెప్పుడూ ఆకలితో ఉండే అవసరం రాదు. సంత్ కబీర్ ఇలా అన్నాడు: దాన దియే ధన నా ఘటే, నదీ ఘటే న నీర అపనే హాథ దేఖ లో, యోం క్యా కహే కబీర ‘దానం ఇవ్వటం వలన సంపద ఎప్పుడూ తరిగిపోదు; జనులు నీరు తీసుకున్నా, నది ఎన్నడూ తరిగిపోదు. నేనేమీ ఆధారంలేకుండా ఇది చెప్పటం లేదు; నీవే స్వయంగా ఈ ప్రపంచంలో దీన్ని గమనించవచ్చు.’ ఈ విధంగా, భగవద్ గీత యొక్క ఆధ్యాత్మిక జ్ఞానమును ఇతరులకు పంచే వారు, తామే అత్యున్నత అనుగ్రహాన్ని పొందుతారు. |
|
న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః । భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి ।। 69 ।। | 69 | 18 | న — కాదు; చ — మరియు; తస్మాత్ — వారిని మించిన; మనుష్యేషు — మనుష్యులలో; కశ్చిత్ — ఎవరైనా; మే — నాకు; ప్రియ-కృత్-తమః — మరింత ప్రియమైనవారు; భవితా — ఉండబోరు; న — కాదు; చ — మరియు; మే — నాకు; తస్మాత్ — వారి కంటే; అన్యః — వేరొకరు; ప్రియ-తరః — ప్రియమైనవారు; భువి — ఈ భూమిపై. | BG 18.69:
వారి కంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు; వారి కంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరూ ఉండబోరు. | ఇతరులకు మనం ఇచ్చే అన్ని బహుమతులకన్నా, ఆధ్యాత్మిక జ్ఞాన బహుమతి అనేది అత్యంత ఉన్నతమైనది, ఎందుకంటే, ఆ జ్ఞానమును అందుకున్న వాడిని శాశ్వతంగా మార్చివేసే సామర్థ్యం దానికి ఉన్నది. జనక మహారాజు తన గురువుని ఇలా అడిగాడు, ‘ఈ అలౌకిక ఆధాత్మిక జ్ఞానమును నాకు ప్రసాదించినందుకు మీకు ఏంతో రుణపడి ఉన్నాను. మీకు ప్రతిగా ఏమి ఇవ్వగలను?’ అని. గురువు అష్టావక్రుడు ఇలా సమాధానం ఇచ్చాడు, ‘ఈ రుణాన్ని తీర్చగలిగినది ఏదీ నీవు ఇవ్వలేవు. నేను ఇచ్చిన జ్ఞానము దివ్యమైనది, నీ దగ్గర ఉన్నది అంతా భౌతికమైనది. భౌతిక వస్తువులు ఎప్పుడూ దివ్యమైన జ్ఞానమునకు వెలకట్టలేవు. కానీ, నీవు ఒక పని చేయవచ్చు. నీకు ఎవరైనా ఈ జ్ఞానము కోసం పరితపిస్తున్నవారు తారసపడితే, దీనిని వారికి తెలియజేయుము.’ శ్రీ కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, భగవద్ గీత యొక్క జ్ఞానమును ఇతరులకు పంచటం అనేది, భగవంతునికి చేయగలిగే అత్యున్నత ప్రేమయుక్త సేవ, అని తన అభిప్రాయము అని. కానీ, భగవద్ గీత యొక్క జ్ఞానమును ప్రవచించేవారు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు గర్వపడకూడదు. నిజమైన ఉపాధ్యాయుని దృక్పథం ఏమిటంటే తనను తాను భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగానే చూసుకోవాలి, మరియు గొప్పతనాన్ని అంతా ఆ భగవత్ కృపకే ఆపాదించాలి. |
|
అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః । జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః ।। 70 ।। | 70 | 18 | అధ్యేష్యతే — పఠించుట; చ — మరియు; యః — ఎవరైతే; ఇమం — ఇది; ధర్మ్యం — పవిత్రమైన; సంవాదమ్ — సంవాదము; ఆవయోః — మన యొక్క; జ్ఞాన — జ్ఞానము; యజ్ఞేన-తేన — జ్ఞాన యజ్ఞము ద్వారా; అహం — నేను; ఇష్టః — పూజింపబడుట; స్యామ్ — అవుతాను; ఇతి — ఇది; మే — నా యొక్క; మతిః — అభిప్రాయము. | BG 18.70:
మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు, జ్ఞాన యజ్ఞముచే (తమ బుద్ధిచే) నన్ను ఆరాధించినట్టు అని నేను ప్రకటిస్తున్నాను; ఇదే నా అభిప్రాయము. | అర్జునుడికి తన బుద్ధిని, ఆయనకు సమర్పించమని శ్రీ కృష్ణుడు పదేపదే చెప్పి ఉన్నాడు. (శ్లోకాలు 8.7, 12.8). దీని అర్థం మన బుద్ధిని ఉపయోగించు కోవటం మానేయమని కాదు; మన బుద్ధిని మన చేతనయినంతవరకూ ఆయన సంకల్పమును పూర్తి చేయుటకు ఉపయోగించమని. భగవద్ గీత యొక్క ఉపదేశము ద్వారా ఆయన సంకల్పము ఏమిటో మనకు అర్థం అవుతుంది. కాబట్టి, ఈ పవిత్రమైన సంవాదమును అధ్యయనం చేసేవారు, భగవంతుడిని తమ బుద్ధిచే ఆరాధించినట్టు అవుతుంది. |
|
శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః । సోఽపి ముక్తః శుభాల్లోకాన్ ప్ర్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ।। 71 ।। | 71 | 18 | శ్రద్ధా-వాన్ — శ్రద్ధ/విశ్వాసము కలవారు; అనసూయః — అసూయ లేకుండా; చ — మరియు; శృణుయాత్ — వింటే; అపి — ఖచ్చితంగా; యః — ఎవరైతే; నరః — వ్యక్తి; సః — ఆ వ్యక్తి; అపి — కూడా; ముక్తః — విముక్తి పొంది; శుభాన్ — శుభకరమైన; లోకాన్ — లోకములు; ప్ర్రాప్నుయాత్ — పొందును; పుణ్య-కర్మణామ్ — పుణ్యాత్ముల. | BG 18.71:
శ్రద్ధా విశ్వాసముతో, అసూయ లేకుండా, ఈ జ్ఞానాన్ని కేవలం విన్న వారు కూడా పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు. | శ్రీ కృష్ణుడికి, అర్జునుడికి మధ్య జరిగిన ఈ సంభాషణను అర్థం చేసుకునే వివేక సామర్థ్యము అందరికీ ఉండకపోవచ్చు. అటువంటి వారు కేవలం శ్రద్ధావిశ్వాసముతో దీనిని కేవలం విన్నాసరే, వారు కూడా లాభపడతారు అని శ్రీకృష్ణుడు హామీ ఇస్తున్నాడు. వారిలోనే స్థితమై ఉన్న భగవంతుడు, వారి నిష్కపటమైన ప్రయాస గమనించి వారిని తగినరీతిలో సత్కరిస్తాడు. జగద్గురు శంకరాచార్యుల గారి, ఒక శిష్యుడు, సనందుడు, గురించి ఉన్న ఒక కథ, ఈ విషయాన్ని చక్కగా వివరిస్తుంది: సనందుడు అంతగా చదువురానివాడు, గురువు గారి ఉపదేశాన్ని, ఇతర శిష్యులలా అర్థం చేసుకోలేక పోయేవాడు. కానీ, శంకరాచార్యుల వారు ప్రవచనం చెపుతుంటే అత్యంత శ్రద్ధతో మరియు గొప్ప విశ్వాసంతో వినేవాడు. ఒక రోజు, అతను గురువు గారి బట్టలను నదికి ఆవల ఒడ్డున ఉతుకుతున్నాడు. ఉపదేశం చెప్పే సమయం అయింది, మరియు ఇతర శిష్యులు ఇలా అభ్యర్థించారు, ‘గురువుగారూ, దయచేసి ఉపదేశం ప్రారంభించండి.’ అని. శంకరాచార్యులు, ‘కాసేపు ఆగుదాం; సనందుడు ఇక్కడ లేడు.’ అని బదులిచ్చారు. ‘కానీ గురువుగారూ, అతనికేమీ అర్థం కాదు’ అని అభ్యర్థించారు మిగతా శిష్యులు. ‘అది నిజమే; కానీ అతను అత్యంత శ్రద్ధావిశ్వాసంతో వింటాడు, కాబట్టి అతనిని నిరాశ పరచదలుచుకోలేదు’, అన్నాడు శంకరాచార్యుల వారు. ఆ తర్వాత, శ్రద్ధ యొక్క మహిమని చూపించటానికి, శంకరాచార్యుల వారు ఇలా పిలిచారు, ‘సనందా! దయచేసి ఇలా రా.’ అని. గురువు గారి మాటలు విన్న సనందుడు, ఏమాత్రం సంకోచించలేదు. నీటిపైనే పరిగెత్తాడు. వృత్తాంతం ప్రకారం, ఆయన పాదాలు పెట్టిన చోటల్లా, తామర పూవులు పైకొచ్చి ఆయనకు ఆధారంగా నిలబడ్డాయి. అలా, ఆవలి ఒడ్డుకి వెళ్లి, గురువు గారికి నమస్కరించాడు. అదే సమయంలో, చక్కటి సంస్కృతంలో, ఒక గురు స్తుతి ఆయన నోటినుండి వెలువడింది. మిగతా శిష్యులు దీనిని వింటూ ఆశ్చర్యానికి గురయ్యారు. తామర పూవులు ఆయన పాదాల క్రింద వచ్చాయి కాబట్టి, ఆయన పేరు ‘పద్మపాదుడు’ అయింది, అంటే, పాదముల క్రింద తామర పూలు కలవాడు అని అర్థం. ఆయన శంకరాచార్యుల వారి నలుగురి ప్రధాన శిష్యులలో ఒకడిగా అయ్యాడు, మిగతా వారు - సురేశ్వరాచార్య, హస్తామలక, మరియు త్రోటకాచార్య. ఈ పవిత్ర సంభాషణను కేవలం విన్న వారు కూడా క్రమక్రమంగా పరిశుద్ధి అవుతారు అని ఈ పై శ్లోకములో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి హామీ ఇస్తున్నాడు. |
|
కచ్చిదేతఛ్చ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా । కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ ।। 72 ।। | 72 | 18 | కచ్చిత్ — జరిగినదా? ఏతత్ — ఇది; శ్రుతం — వినుట; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; త్వయా — నీచేత; ఏక-అగ్రేణ-చేతసా — ఏకాగ్ర చిత్తముతో; కచ్చిత్ — అయినదా? అజ్ఞాన — అజ్ఞానము; సమ్మోహః — మోహము/భ్రమ; ప్రణష్టః — నిర్మూలించబడుట; తే — నీ యొక్క; ధనంజయః — అర్జునా, సంపదను జయించే వాడా. | BG 18.72:
ఓ అర్జునా, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము, మోహభ్రాంతి నిర్మూలించబడినవా? | శ్రీ కృష్ణుడు అర్జునుడి గురువు స్థానములో ఉన్నాడు. గురువు గారు సహజంగానే, తన శిష్యుడు విషయాన్ని అంతా బాగా అర్థం చేసుకున్నాడా లేదా అని అడుగుతాడు. ఇలా అడగటం వెనుక ఉన్న కృష్ణుడి ఉద్దేశ్యం ఏమిటంటే, ఒకవేళ అర్జునుడు గనక అర్థం చేసుకోలేకపోతే, తను మళ్ళీ చెప్పటానికి లేదా ఇంకా అర్థ వివరణ చేయటానికి సిద్ధంగా ఉన్నానని తెలియచేయటమే. |
|
అర్జున ఉవాచ । నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత । స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ।। 73 ।। | 73 | 18 | అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; నష్టః — నిర్మూలించబడినది; మోహ — భ్రాంతి; స్మృతిః — స్మృతి; లబ్దా — తిరిగిపొందాను; త్వత్-ప్రసాదాత్ — నీ కృపచే; మయా — నా చేత; అచ్యుత — శ్రీ కృష్ణ, దోషరహితుడా; స్థితః — స్థితమై ఉండి; అస్మి — నేను; గత-సందేహః — సందేహములు లేకుండా; కరిష్యే — నేను చేస్తాను; వచనం — ఉపదేశములు; తవ — నీ యొక్క. | BG 18.73:
అర్జునుడు పలికెను: ఓ అచ్యుతా (దోషరహితుడా), నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది, మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు, మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను. | ప్రారంభంలో, అర్జునుడు ఒక విస్మయ పరిస్థితిని ఎదుర్కొన్నాడు, మరియు ఆ పరిస్థితిలో తన కర్తవ్యము పట్ల అయోమయానికి గురయ్యాడు. దుఃఖము/శోకముచే నిండిపోయి, ఆయుధాలు విడిచి తన రథంలో కూలబడిపోయాడు. తన శరీర ఇంద్రియములపై దాడి చేసిన శోకానికి, ఎటువంటి ప్రత్యుపాయం దొరకడంలేదు అని ఒప్పుకున్నాడు. కానీ, ఇప్పుడు తనకు తానే పూర్తిగా మారిపోయినట్లుగా తెలుసుకున్నాడు, మరియు తనకు జ్ఞానోదయమయినది అని, ఇక ఏమాత్రమూ గందరగోళమైన చిత్తం లేదు అని ప్రకటిస్తున్నాడు. భగవత్ సంకల్పానికి తనను తాను అర్పించుకొని, ఇక శ్రీ కృష్ణుడు చెప్పిన విధముగా చేస్తానని ప్రకటిస్తున్నాడు. ఇదే అతనిపై భగవత్ గీత ఉపదేశం చూపిన ప్రభావము. కానీ, త్వత్ ప్రసాదాన్ మయాచ్యుత, అంటున్నాడు; అంటే, ‘ఓ శ్రీ కృష్ణా, కేవలం నీ ఉపదేశం కాదు, నిజానికి నీ కృపయే నా అజ్ఞానమును తొలగించింది.’ అని. భౌతిక జ్ఞాన సముపార్జనకు కృప అవసరం లేదు. మనం ఆ విద్యాలయానికి కానీ, ఉపాధ్యాయునికి కానీ, డబ్బు కట్టి, ఆ జ్ఞానమును తెలుసుకోవచ్చు. కానీ, ఆధ్యాత్మిక జ్ఞానమును కొనలేము లేదా అమ్మలేము. అది కృప ద్వారా ఇవ్వబడుతుంది మరియు విశ్వాసము, వినమ్రత ద్వారా అందుకోబడుతుంది. కాబట్టి, మనం భగవద్గీతని అహంకార దృక్పథంతో చేరితే, ‘నేను చాలా తెలివికలవాడిని, ఈ ఉపదేశం యొక్క విలువ ఏమిటో వెలకడతాను’ అని అనుకుంటే, భగవద్గీతను ఎన్నటికీ అర్థం చేసుకోలేము. అలాంటి దృక్పథంలో ఉంటే, మన బుద్ధి ఆ శాస్త్రములో ఏదో తప్పు అనిపించే దాన్ని పట్టుకొని దాని మీదే అలోచించి, దాని వల్ల ఆ మొత్తం శాస్త్రాన్నే తప్పని తిరస్కరిస్తుంది. భగవద్ గీతపై ఎన్నెన్నో వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి, మరియు గత ఐదు వేల సంవత్సరాలలో ఈ దివ్య ఉపదేశం యొక్క అసంఖ్యాకమైన పాఠకులు కూడా ఉన్నారు, కానీ వీరిలో ఎంతమందికి అర్జునుడిలా జ్ఞానోదయమయింది? ఒకవేళ మనం నిజంగా ఈ జ్ఞానాన్ని అందుకోదలిస్తే, మనం కేవలం చదవటమే కాదు, విశ్వాసము మరియు ప్రేమయుక్త శరణాగతి ద్వారా, శ్రీ కృష్ణుడి కృపను ఆకర్షించాలి. ఆ తరువాత మనకు భగవత్ గీత యొక్క సారాంశం, ఆయన కృపచే, అర్థమవుతుంది. |
|
సంజయ ఉవాచ । ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః । సంవాదమిమమశ్రౌషమ్ అద్భుతం రోమహర్షణమ్ ।। 74 ।। | 74 | 18 | సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; ఇతి — ఈ విధంగా; అహం — నేను; వాసుదేవస్య — శ్రీ కృష్ణుడి యొక్క; పార్థస్య — అర్జునుడు; చ — మరియు; మాహా-ఆత్మనః — మాహాత్ముడు; సంవాదం — సంవాదము; ఇమం — ఇది; అశ్రౌషం — విన్న పిదప; అద్భుతం — అద్భుతమైన; రోమ-హర్షణం — రోమములు (వెంట్రుకలు) నిక్కబొడుచుకునేలా చేసే. | BG 18.74:
సంజయుడు పలికెను: ఈ విధంగా నేను, వసుదేవుని పుత్రుడైన శ్రీ కృష్ణుడికి మరియు మహాత్ముడు, ప్రిథ పుత్రుడూ అయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి. | ఈ విధంగా సంజయుడు, భగవద్గీత అనే దివ్య ఉపదేశమును విన్నవించుటను ముగిస్తున్నాడు. అర్జునుడిని మహాత్ముడు అని అంటున్నాడు, ఎందుకంటే అతను శ్రీ కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని మరియు సలహాని పాటించాడు, దానిచే మిక్కిలి వివేకవంతుడు అయినాడు. సంజయుడు ఇక ఇప్పుడు, ఆ దివ్య సంవాదమును వింటూ, తాను ఎంత ఆశ్చర్యానికి మరియు సంభ్రమానికి గురయ్యాడో చెప్తున్నాడు. రోమాలు నిక్కబొడుచు కోవటం అనేది గాఢమైన భక్తికి ఉన్న ఒక లక్షణం. భక్తి రసామృత సింధు ఇలా పేర్కొంటున్నది:స్థంభ స్వేద ఽథ రోమాంచః స్వర భేదోఽథ వేపథుఃవైవర్ణ్యమశ్రుః ప్రలయ ఇత్యష్టౌ సాత్త్వికాః స్మృతాః‘భక్తి తన్మయత్వంలో వచ్చే ఎనిమిది లక్షణాలు ఏమిటంటే: కదలిక లేకుండా స్థంభించిపోవటం, చెమట పట్టడం, రోమములు నిక్కబొడుచు కోవటం, స్వరం గద్గదమై పోవటం, వణకటం, మొఖం రంగు పీలగా అయిపోవటం, కన్నీరు కారటం, మరియు మూర్ఛ పోవటం.’ సంజయుడు ఇటువంటి గాఢమైన భక్తి యుక్త భావములను అనుభూతి చెందుతున్నాడు, అందుకే ఆయన రోమములు దివ్యఆనందంచే నిక్కబొడుచుకున్నాయి.ఎక్కడో దూరంగా జరిగే యుద్ధంలో జరుగుతున్న సంభాషణను సంజయుడు ఎలా వినగలిగాడు అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. అది ఎలాగో తదుపరి శ్లోకంలో తెలియచేస్తున్నాడు. |
|
వ్యాసప్రసాదాఛ్చ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్ । యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ।। 75 ।। | 75 | 18 | వ్యాస-ప్రసాదాత్ — వేద వ్యాసుని కృప చేత; శ్రుతవాన్ — విన్నాను; ఏతత్ — ఇది; గుహ్యం — గోప్యమైన; అహం — నేను; పరం — సర్వోత్కృష్ట; యోగం — యోగము; యోగ-ఈశ్వరాత్ — యోగేశ్వరుని నుండి; కృష్ణాత్ — శ్రీ కృష్ణుడి నుండి; సాక్షాత్ — ప్రత్యక్షముగా; కథయతః — పలుకబడిన; స్వయం — స్వయంగా ఆయన చేతనే. | BG 18.75:
వేదవ్యాసుని అనుగ్రహం చేత, నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును, స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి నుండి తెలుసుకున్నాను. | శ్రీ కృష్ణ ద్వైపాయన వ్యాసదేవుడు, ఆయననే మహర్షి వేద వ్యాసుడు అని కూడా అంటారు; ఆయన సంజయుని యొక్క ఆధ్యాత్మిక గురువు. తన గురువు గారి అనుగ్రహం చేత, సంజయుడు హస్తినాపుర రాజమందిరము లోనే కూర్చుని, కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరిగేదంతా తెలుసుకోవటానికి, అతనికి దివ్యదృష్టి ప్రసాదించబడింది. తన గురువు గారి కృప వలననే, తనకు సర్వోన్నత యోగ శాస్త్రమును స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి ద్వారా వినే అవకాశం లభించింది అని ఇక్కడ సంజయుడు ఒప్పుకుంటున్నాడు. బ్రహ్మ సూత్రములు, పద్దెనిమిది పురాణములు, మహాభారతము, ఇంకా ఇతర గ్రంథాలను వ్రాసిన వేద వ్యాసుడు, ఒక భగవత్ అవతారము, మరియు ఆయనకి దివ్యదృష్టి వంటి శక్తులు ఉన్నాయి. ఈ విధంగా ఆయన కేవలం శ్రీ కృష్ణుడికి, అర్జునుడికి మధ్య సంభాషణనే కాక, సంజయుడికీ మరియు ధృతరాష్ట్రుడికి మధ్య జరిగిన సంభాషణను కూడా విన్నాడు. అందువలన, ఆయన భగవద్గీత లో ఈ రెండు సంభాషణలను పేర్కొన్నాడు. |
|
రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్ । కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ।। 76 ।। | 76 | 18 | రాజన్ — రాజా; సంస్మృత్య సంస్మృత్య — పదే పదే స్మరిస్తూ; సంవాదమ్ — సంవాదము; ఇమం — ఇది; అద్భుతమ్ — అద్భుతమైన; కేశవ-అర్జునయోః — శ్రీ కృష్ణ పరమాత్మ మరియు అర్జునుడి మధ్య జరిగిన; పుణ్యం — పవిత్రమైన; హృష్యామి — ఆనందిస్తున్నాను; చ — మరియు; ముహుః -ముహుః — పదే పదే. ఫ్రెడ్ | BG 18.76:
సర్వోత్కృష్ట శ్రీ కృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదేపదే గుర్తుచేసుకుంటూ, ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను. | ఆధ్యాత్మిక అనుభవము అనేది సమస్త భౌతిక ఆనందాలని ఒక్కచోట కూర్చినదానికన్నా ఎక్కువ హర్షమును, తృప్తిని కలిగించే ఆనందముని ఇస్తుంది. సంజయుడు అటువంటి ఆనందమును అనుభవిస్తూ, తన అనుభవాన్ని అంధుడైన ధృతరాష్ట్రునితో పంచుకుంటున్నాడు. ఈ అద్భుతమైన సంవాదముని గుర్తుచేసుకుంటూ, ఆయన దివ్య ఆనందమును అనుభవిస్తున్నాడు. ఈ గీతా శాస్త్రములో ఉన్న జ్ఞానము యొక్క మహనీయతను మరియు సంజయుడు చూసిన లీలల యొక్క దైవత్వమును, ఇది సూచిస్తున్నది. |
|
తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః । విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః ।। 77 ।। | 77 | 18 | తత్ — అది; చ — మరియు; సంస్మృత్య సంస్మృత్య — పదేపదే గుర్తుచేసుకుంటూ; రూపమ్ — విశ్వ రూపము; అతి-అద్భుతం — అత్యత్భుతమైన; హరేః — శ్రీ కృష్ణుడి యొక్క; విస్మయః — విస్మయంతో; మే — నా యొక్క; మహాన్ — గొప్పదైన; రాజన్ — రాజు; హృష్యామి — ఆనందముతో పులకించిపోతున్నాను; చ — మరియు; పునః పునః — మళ్ళీ మళ్ళీ. | BG 18.77:
మరియు ఆ శ్రీ కృష్ణుడి అత్యద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వ రూపమును గుర్తుచేసుకుంటూ, ఆశ్చర్యచకితుడనై, పదేపదే మహదానందముతో పదేపదే పులకించి పోతున్నాను. | మహోన్నత యోగులకు కూడా అరుదుగా కనిపించే భగవంతుని విశ్వ రూప దర్శన భాగ్యము, అర్జునుడికి కలిగింది. అర్జునుడు ఆయన యొక్క భక్తుడు మరియు స్నేహితుడు, అందుకే చాలా ప్రియమైన వాడు కావున, ఆయనకు తన విశ్వరూపమును చూపిస్తున్నానని శ్రీ కృష్ణుడు చెప్పాడు. సంజయుడు కూడా ఆ విశ్వ రూపమును చూసాడు, ఎందుకంటే భగవంతుని దివ్యలీలలలో పాలు పంచుకునే భాగ్యము ఆయనకు కథకుడిగా లభించింది. ఊహించని అనుగ్రహము మన దారిలో ఒక్కోసారి వస్తుంటుంది. దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే, మనం సాధనలో అత్యంత వేగంతో ముందుకెళ్లవచ్చు. సంజయుడు పదేపదే తాను చూసిన దానిని గుర్తుచేసుకుంటున్నాడు మరియు భక్తి ప్రవాహంలో ఓలలాడి పోతున్నాడు. |