sloka
stringlengths
77
449
verse
int64
1
78
chapter
int64
1
18
audio
stringlengths
59
63
w2w_meaning
stringlengths
213
1.29k
te_translation
stringlengths
127
741
commentry
stringlengths
0
11.1k
అమానిత్వమదంభిత్వమ్ అహింసా క్షాంతిరార్జవమ్ । ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ।। 8 ।। ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ । జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ ।। 9 ।। అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు । నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్టానిష్టోపపత్తిషు ।। 10 ।। మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ । వివిక్తదేశసేవిత్వమ్ అరతిర్జనసంసది ।। 11 ।। అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ । ఏతద్ జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతోఽన్యథా ।। 12 ।।
12
13
https://www.holy-bhagava…/013_008-012.mp3
అమానిత్వం — నమ్రత; అదంభిత్వమ్ — దంభము (కృత్తిమ బుద్ధి) లేకుండా; అహింసా — అహింస; క్షాంతిః — క్షమాగుణము; ఆర్జవమ్ — నిరాడంబరత/సరళత; ఆచార్య-ఉపాసనం — గురు సేవ; శౌచం — శరీర, మనస్సుల యొక్క శుద్ధి; స్థైర్యం — స్థిరత్వము; ఆత్మ-వినిగ్రహః — ఆత్మనిగ్రహము; ఇంద్రియ-అర్థేషు — ఇంద్రియ వస్తువిషయముల పట్ల; వైరాగ్యమ్ — వైరాగ్యము; అనహంకారః — అహంకార రహితముగా; ఏవ చ — మరియు ఇంకా; జన్మ — పుట్టుట; మృత్యు — మరణము; జరా — ముసలితనము; వ్యాధి — వ్యాధి; దుఃఖ — చెడు; దోష — దోషములు; అనుదర్శనమ్ — తెలిసికొనుట (అనుభూతి); అసక్తిః — ఆసక్తి లేకుండా; అనభిష్వంగః — లాలస/తృష్ణ లేకుండా; పుత్ర — పిల్లలు; దార — భార్య (భర్త); గృహ-ఆదిషు — ఇల్లు మొదలగునవి; నిత్యం — ఎల్లప్పుడూ; చ — మరియు; సమ-చిత్తత్వమ్ — సమ చిత్తముతో ఉండుట; ఇష్ట — ఇష్టమైనవి; అనిష్ట — ఇష్టం లేనివి; ఉపపత్తిషు — వాటి ప్రాప్తి చే; మయి — నా పట్ల; చ — మరియు; అనన్య-యోగేన — అనన్య చిత్తముతో ఏకమై ఉండి; భక్తిః — భక్తి; అవ్యభిచారిణీ — నిశ్చలమైన; వివిక్త — ఏకాంత; దేశ — ప్రదేశములు; సేవిత్వమ్ — పట్ల మొగ్గు చూపి; అరతిః — విముఖత; జన-సంసది — ప్రాపంచిక విషయాసక్తులైన సమాజం పట్ల; ఆధ్యాత్మ — ఆధ్యాత్మిక; జ్ఞాన — జ్ఞానము; నిత్యత్వం — ఎల్లప్పుడూ ఉండటము; తత్త్వ-జ్ఞాన — ఆధ్యాత్మిక సిద్ధాంత జ్ఞానము; అర్థ — కోసము; దర్శనమ్ — వేదాంతశాస్త్రము; ఏతద్ — ఇవి అన్ని; జ్ఞాన — జ్ఞానము; ఇతి — ఈ విధంగా; ప్రోక్తమ్ — చెప్పబడినవి; అజ్ఞానం — అజ్ఞానము; యత్ — ఏదైతే; అతః — దీనికి; అన్యథా — విరుద్ధమైన.
BG 13.8-12: నమ్రత; దంభము (కృత్తిమ బుద్ధి) లేకుండా ఉండుట; అహింస; క్షమా గుణము; సరళత; గురు సేవ; శరీర-మనస్సుల పరిశుద్ధత; నిశ్చల బుద్ధి; ఆత్మ-నిగ్రహము; ఇంద్రియభోగ వస్తువిషయములపై అనాసక్తి; అహంకారము లేకుండుట; జన్మ, మృత్యు, జరా, వ్యాధుల దురవస్థను గుర్తుచేసుకోవటం; మమకారరాహిత్యం; భార్య(భర్త), పిల్లలు, ఇల్లు వంటి వాటిని అంటుకొని (యావ) లేకుండా ఉండుట; జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట; నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట; ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి; ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసం; మరియు పరమ సత్యముకై తత్త్వాన్వేషణ - ఇవన్నిటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను, మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానము అని అంటాను.
క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడిని గురించి తెలుసుకునే జ్ఞానము కేవలం ఏదో మానసిక కసరత్తు కాదు. ప్రవర్తనలో మార్పు లేకుండానే, మామూలు పుస్తక జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, కానీ శ్రీ కృష్ణుడు చెప్పే ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో అట్లా కాకుండా, దానికి హృదయంలో పవిత్రత అవసరము. (ఇక్కడ, హృదయము అంటే శరీరంలో ఉన్న అవయవం కాదు. మనోబుద్ధులతో కూడిన అంతఃకరణముని కూడా కొన్నిసార్లు హృదయము అంటారు). జీవితమును పవిత్రం చేసి మరియు దానిని జ్ఞాన వెలుగుతో ప్రకాశింప చేసే - గుణములు, అలవాట్లు, ప్రవర్తన మరియు దృక్పథాలని ఈ ఐదు శ్లోకాలు వివరిస్తున్నాయి. నమ్రత: మనం ఎప్పుడైతే మన క్షేత్రము యొక్క గుణముల పట్ల గర్వముతో ఉంటామో, అంటే అందము, తెలివి, నైపుణ్యము, సామర్థ్యము వంటి వాటి మీద, మనకు ఇవన్నీ ఇచ్చినది ఆ భగవంతుడే అని మర్చిపోతాము. కాబట్టి గర్వము అనేది మన మనస్సుని భగవంతుని నుండి దూరముగా చేస్తుంది. ఆత్మ జ్ఞాన పథంలో, గర్వము అనేది ఒక పెద్ద అవరోధము ఎందుకంటే అది మనోబుద్ధుల గుణములను ప్రభావితం చేసి మొత్తం క్షేత్రమును మలినపరుస్తుంది. కపటత్వం/మిథ్యాచారం లేకుండా ఉండుట: ఓ కపటి, కృత్తిమమైన బాహ్య వ్యక్తిత్వమును పెంపొందించుకుంటాడు. వ్యక్తి అంతర్గతంగా దోషపూరితముగా ఉంటాడు కానీ, బాహ్యంగా మంచి గుణములు ఉన్నట్టు ఒక వేషం సృష్టిస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ, బాహ్యంగా ప్రదర్శించే మంచి గుణములు, పైపైకే ఉంటాయి మరియు ఒక డొల్ల మాత్రమే. అహింస: జ్ఞానమును పెంపొందించుకోవాలంటే సమస్త ప్రాణుల పట్ల గౌరవం ఉండటం అవసరం. దీనికి అహింస యొక్క అభ్యాసం ఆవశ్యకం. అందుకే శాస్త్రాలు ఇలా పేర్కొంటున్నాయి: ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్; ‘ఇతరుల యొక్క ఏ ప్రవర్తన నీకు నచ్చదో, నీవు వారితో ఆ విధముగా ప్రవర్తించకుండా ఉండుము.’ క్షమా గుణము: మనకు అపకారం చేసిన వారి పట్ల కూడా మనము దుర్భావన చేయకపోవటమే క్షమా గుణము. నిజానికి, దుర్భావన మనస్సులో ఉంచుకోవటం, ఎదుటి వాడి కన్నా మనకే ఎక్కువ హాని చేస్తుంది. క్షమా గుణము అభ్యాసం చేయటంచే, వివేకము కలిగిన వ్యక్తి, మనస్సులోని చెడుని అంతా విడిచిపెట్టి మనస్సుని పరిశుద్ధి చేసుకుంటాడు. సరళత: ఇది ఆలోచనలో (మనసా), వాక్కులో (వాచా) మరియు చేతలలో (కర్మణా) కపటత లేకుండా ముక్కుసూటిగా ఉండటము. ఆలోచనా సరళత అంటే, మోసం, ఈర్ష్య, వక్రత వంటి నకారాత్మక తలంపులు లేకుండా ఉండటము. వాక్కులో సరళత అంటే వెక్కిరింత, దూషణ, చాడీలు చెప్పటం, అతిశయోక్తి లేకుండా ఉండటం. చేతలలో సరళత అంటే, సింపుల్‌గా జీవించటం, ప్రవర్తనలో ఋజుత్వము, మొదలైనవి. గురు సేవ: ఆధ్యాత్మిక జ్ఞానము అనేది గురువు ద్వారా లభిస్తుంది. ఈ దివ్య జ్ఞానము అందుకోవాలంటే, శిష్యుడికి గురువు గారి పట్ల అంకితభావము మరియు భక్తి ఉండాలి. గురువుకు సేవ చేయటం ద్వారా, శిష్యుడికి వినయము మరియు నిబద్ధత పెరుగుతాయి; దీనితో గురువు తన శిష్యుడికి జ్ఞానమును ప్రసాదించటానికి వీలవుతుంది. శ్రీ కృష్ణుడు అర్జునుడికి 4.34వ శ్లోకంలో ఇలా వివరించాడు: ‘ఆధ్యాత్మిక గురువు గారి దగ్గరికి వెళ్లి సత్యమును గురించి తెలుసుకొనుము. వినయము/మర్యాదతో ఆయనను అడుగుము మరియు ఆయనకి సేవ చేయుము. అటువంటి జ్ఞానోదయమయిన మహాత్ముడు, తాను స్వయముగా సత్యమును తెలుసుకున్నాడు కాబట్టి, నీకు ఆ జ్ఞానమును ప్రసాదించగలడు.’ శారీరక మరియు మానసిక శౌచము: శుభ్రత అనేది అంతర్గతంగా మరియు బాహ్యంగా రెంటిలో ఉండాలి. శాండిల్య ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: శౌచం నామ ద్వివిధం-బాహ్యమాంతరం చేతి (1.1) ‘పరిశుభ్రత రెండు రకాలుగా ఉంటుంది—అంతర్గతమైనది మరియు బాహ్యమైనది.’ బాహ్యమైన పరిశుభ్రత మంచి ఆరోగ్యము నిలుపుకోటానికి, క్రమశిక్షణ పెంచుకోవటానికి మరియు మనస్సును నిర్మలంగా ఉంచుకోవటానికి దోహదపడుతుంది, కానీ మానసిక స్వచ్ఛత కూడా ఇంకా ఎక్కువ ముఖ్యమైనది, మనస్సుని పరిపూర్ణ పవిత్రుడైన భగవంతునిపై నిలపటంద్వారా దీనిని సాధించవచ్చు. జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు: మాయాధిన్ మలీన్ మన, హై అనాది కాలీన్, హరి విరహానల ధోయ జల, కరు నిర్మల బని దీన్ (భక్తి శతకము 79వ శ్లోకం) ‘ఈ ప్రాకృతిక మనస్సు అనంతమైన జన్మల నుండి మలినమై ఉన్నది. అత్యంత వినయవిధేయత వినమ్రతలను అభ్యాసం చేస్తూ, భగవంతుడిని పొందాలనే తపన ద్వారా దానిని పవిత్రం చేసుకొనుము.’ స్థిరబుద్ధి: ఆత్మ-జ్ఞానము మరియు భగవత్ ప్రాప్తి అనేవి ఒక్క రోజులో సాధించగలిగే లక్ష్యములు కావు. లక్ష్యం సాధించే వరకూ అదే మార్గంలో ఉండే దృఢ సంకల్పమే ఈ స్థిర బుద్ధి. శాస్త్రములు ఇలా పేర్కొన్నాయి: చరైవైతే చరైవతే , చరన్ వై మధు విందతి, ‘ముందుకు సాగుతూనే ఉండు, ముందుకు సాగుతూనే ఉండు. ఎవరైతే పట్టువదలకుండా సాగుతూ ఉంటారో వారికి చివరికి మధురమైన తేనె లభిస్తుంది.’ ఆత్మ-నిగ్రహము: మనోబుద్దులను పాడు చేసే ప్రాపంచిక భోగముల వెనుక పడి పరిగెత్తకుండా, మనస్సు-ఇంద్రియములను నిగ్రహించటమే ఈ ఆత్మ-నిగ్రహము. విలాసభోగములచే మన ప్రాణశక్తి దుర్వ్యయమై పోకుండా ఈ ఆత్మ నిగ్రహము కాపాడుతుంది. ఇంద్రియ వస్తు విషయములపై అనాసక్తి: ఇది, పైన ఉదహరించబడినటువంటి, బలవంతంగా మనల్ని మనము నిగ్రహించుకునే ఆత్మ-నిగ్రహము కంటే ఒక మెట్టు ఎక్కువది. అనాసక్తి అంటే, భగవత్ ప్రాప్తి పథంలో అడ్డంకిగా ఉన్న ఇంద్రియసుఖాల పట్ల అభిరుచి లేకపోవటం. అహంకార రహితముగా ఉండుట: అహంకారము అంటే ‘నేను’, ‘నాకు’, మరియు ‘నాది’ అనే అంతర్గత స్పృహ. ఇది అవిద్య/అజ్ఞానమునకు సూచిక, ఎందుకంటే అది, మనలను మనం ఈ శరీరమే అని భావించే, శారీరక స్థాయి నుండి జనిస్తుంది. దీనినే 'అహం చేతనా' అని కూడా అంటారు. (నేను అన్న స్పృహ నుండి జనించే గర్వము). అందరూ మహాత్ములూ నొక్కివక్కాణించి చెప్పేదేమిటంటే, భగవంతుడిని మన హృదయము లోనికి ఆహ్వానించాలంటే, మొదట మనలో ఉన్న గర్వమును నిర్మూలించుకోవాలి. జబ మై థా తబ హరి నహిఁ, అబ్ హరి హై, మై నాహీఁ ప్రేమ్ గలీ అతి సంకరీ, యా మే ద్వే న సమాహీ (సంత్ కబీర్) “‘నేను’ అన్న భావన ఉన్నప్పుడు, భగవంతుడు అక్కడ ఉండడు; ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, 'నేను' లేను. దివ్య ప్రేమ మార్గము చాలా ఇరుకైనది; దానిలో 'నేను' మరియు 'భగవంతుడు' ఇద్దరూ పట్టరు.” జ్ఞాన యోగ మార్గములో మరియు అష్టాంగ యోగ మార్గములో, ఈ యొక్క 'అహం చేతనా' భావన ను వదిలించుకోవటానికి విస్తృతమైన సాధనా ప్రక్రియలు ఉన్నాయి. కానీ, భక్తి యోగ మార్గములో, అది చాలా సునాయాసముగా వదిలిపోతుంది. మన 'అహం' అన్న పదానికి ముందర 'దాస' (సేవకుడు) అన్న పదం తగిలిస్తాము, దానితో అది దాసోహం (నేను భగవంతుడి సేవకుడిని) గా మారిపోతుంది. ఇక ఇప్పుడు 'నేను' ఏమాత్రం హానికారకం కాదు మరియు ఆత్మ-దృక్పథం అనేది భగవత్-దృక్పథంగా మారిపోతుంది. జన్మ, మృత్యు, జరా, వ్యాధుల యొక్క దురవస్థను సదా గుర్తుంచుకోవటం: ఒకవేళ బుద్ధికి - భౌతిక ప్రగతి లేదా ఆధ్యాత్మిక పురోగతి లలో ఏది ఎక్కువ ముఖ్యమో అనే అయోమయంలో ఉంటే - అప్పుడు దానికి ఆత్మ జ్ఞానమును సంపాదించుకునేందుకు కావలసిన దృఢ సంకల్పమును పెంపొందించుకోవడం కష్టముగా ఉంటుంది. కానీ బుద్ధికి ఈ ప్రపంచం యొక్క వికృతం పట్ల నిశ్చయం కలిగినప్పుడు, అది తన సంకల్పంలో దృఢంగా ఉంటుంది. ఈ దృఢ సంకల్పం పొందటానికి, ఈ భౌతిక లోకంలో, మన ఈ జీవితంలో విడదీయలేనివిగా ఉండే కష్టాలు/దుఃఖాలు/బాధలపై నిరంతర చింతన చేస్తుండాలి. బుద్ధుడిని ఆధ్యాత్మిక పథంలో పెట్టింది ఈ చింతనే. ఆయన ఒక రోగిని చూసి, ‘ఈ ప్రపంచంలో వ్యాధులు అనేవి ఉన్నాయి నేను కూడా ఏదో ఒకరోజు రోగగ్రస్త మవ్వాల్సిందే.’ అని అనుకున్నాడు. తరువాత ఒక వృద్ధుడిని చూసి, ‘ఇక్కడ వృద్ధాప్యం కూడా ఉంది. అంటే నేను కూడా ఏదోకరోజు ముసలివాడిని అయిపోవాలి’ అని అనుకున్నాడు. ఆ తరువాత, ఒక చని పోయిన వ్యక్తిని చూసాడు , ‘ఇది కూడా జీవనంలో భాగమే, అంటే నేను కూడా ఒక రోజు చనిపోవాల్సిందే’ అని తెలుసుకున్నాడు. బుద్ధుడి యొక్క బుద్ధి ఎంత గ్రహణశక్తిగలది అంటే, ఒక్కసారి వీటిని చూసినంతనే అవి ఆయనను ఈ ప్రపంచాన్ని త్యజించేలా చేసాయి. మనకు ఇంకా అంత కుశలత కలిగిన బుద్ధి లేదు కాబట్టి, ప్రపంచం యొక్క వికృతం అవగతం అయ్యే వరకూ, వీటి గురించి నిరంతర చింతన చేస్తూనే ఉండాలి. మమకార-ఆసక్తి రహితంగా ఉండుట: అంటే, ప్రాపంచిక జగత్తు పట్ల అనాసక్తితో ఉండటం. మనకు ఉన్నది ఒక్క మనస్సే మరియు మనం ఆధ్యాత్మిక లక్ష్యములను సాధించాలంటే మనము దాన్ని భౌతిక వస్తువిషయముల నుండి దూరంచేయాలి. సాధకుడు, ప్రాపంచిక మమకార ఆసక్తుల స్థానంలో, వాటికి బదులుగా వాటి స్థానంలో భగవంతుని పట్ల ప్రేమ మరియు మమకారమును స్థాపించుకుంటాడు. భార్య (భర్త), పిల్లలు, ఇల్లు వంటి వాటినే పట్టుకుని ఉండకపోవటం: మనస్సుకి ఈ విషయముల పట్ల సునాయాసముగా మమకారానుబంధము ఏర్పడిపోతుంది. శారీరక స్పృహలో, వ్యక్తి అప్రయత్నంగానే కుటుంబసభ్యులను, ఇంటిని – ‘నావారు, నాది’ అని అనుకుంటాడు. ఇవన్నీ మనసులో తరచుగా తిరుగుతూనే ఉంటాయి మరియు వీటిపై ఆసక్తి మనస్సుని భౌతిక దృక్పథంలోనే కట్టివేస్తాయి. ఆసక్తి/మమకారం అనేది - కుటుంబ సభ్యులు ఇలాగే ఉండాలి, ఫలానా విధంగానే ప్రవర్తించాలి అన్న ఆపేక్షను/కోరిక కలుగచేస్తుంది, మరియు ఈ ఆశలు తీరనప్పుడు, అది మానసిక క్షోభకు దారి తీస్తుంది. మరియు అనివార్యముగా, కుటుంబ సభ్యుల నుండి దూరమవ్వటం కూడా సంభవిస్తుంది, తాత్కాలికంగా వారు వేరే చోటికి వెళ్ళినప్పుడు గానీ, లేదా శాశ్వతంగా, వారు చనిపోయినప్పుడైనా. ఇవన్నీ అనుభవాలు మరియు ఆయా భయాలు మనస్సుపై చాలా భారమును కలిగించి, దానిని భగవంతుని నుండి దూరంగా తీసుకువెళతాయి. కాబట్టి మనము నిత్య శాశ్వతమైన ఆనందాన్ని అన్వేషిస్తుంటే, మనం భార్య (భర్త), పిల్లలు, ఇల్లు - వీటితో వ్యవహరించేటప్పుడు, మన మనస్సు వాటిల్లో చిక్కుకొని పోకుండా ఉండేట్టు, ప్రాజ్ఞతతో ఉండాలి. ఒక నర్సు హాస్పిటల్లో తన విధి నిర్వర్తించినట్టు, లేదా, ఒక టీచర్ తన విద్యార్థుల పట్ల తన విధిని నిర్వర్తించినట్లు, మమకారాసక్తి లేకుండా, వారి పట్ల మన ధర్మ (కర్తవ్యము) నిర్వర్తించాలి. అనుకూల లేదా ప్రతికూల పరిస్థితుల పట్ల సమ-భావనతో ఉండుట: పగలు-రాత్రి లాగా సుఖదాయకమైన లేదా కష్టదాయకమైన పరిస్థితులు పిలవకుండానే వస్తుంటాయి. అదే జీవితం. ఈ ద్వంద్వములకు అతీతముగా ఎదగాలంటే, మనయొక్క ఆధ్యాత్మిక బలాన్ని, ప్రపంచం పట్ల వైరాగ్యం ద్వారా పెంచుకోవాలి. జీవితంలో వ్యతిరేక పరిస్థితులలో కూడా చలించకుండా ఉండే సామర్థ్యాన్ని పెంచుకోవాలి మరియు విజయం ప్రాప్తించినపుడు ఏదో సాధించామని గర్వపడే భావనని కూడా విడిచిపెట్టాలి. నా (కృష్ణుడి) పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి: వైరాగ్యం అంటే కేవలం మనస్సు తప్పుడు దిశలో వెళ్ళటం లేదు అని. కానీ జీవితం అంటే ప్రతికూల పరిస్థితులను కేవలం నివారించటమే కాదు. శ్రేయస్కర విషయాలలో కూడా నిమగ్నమవ్వటమే జీవితం. నిజంగా కోరతగిన జీవిత లక్ష్యము అంటే దాన్ని భగవంతుని యొక్క చరణారవిందముల వద్ద అంకితం చేయటమే. కాబట్టి, శ్రీ కృష్ణుడు దానిని ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొంటున్నాడు. ఏకాంత ప్రదేశాల యందు ఇష్టత: ప్రాపంచిక జనుల్లా కాకుండా, భక్తులు, ఒంటరితనాన్ని అధిగమించటానికి ఇతరుల సాంగత్యాన్ని కోరుకోరు. వారి మనస్సుని భగవంతునితో ఏకం చేయటానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారు సహజంగానే ఏకాంతాన్ని ఇష్టపడుతారు. కాబట్టి వారు సహజంగానే, ఆధ్యాత్మిక తలంపులలో మరింత నిమగ్నమవ్వటానికి ఏకాంత ప్రదేశాలని ఇష్టపడుతారు. లౌకిక ప్రాపంచిక సమాజం పట్ల విముఖత: భౌతిక ప్రాపంచిక మనస్సుకు సూచిక ఏమిటంటే అది ప్రాపంచిక మనుష్యులు మరియు ప్రాపంచిక విషయాల గురించిన మాటల్లో ఆహ్లాదంగా ఉంటుంది. భగవత్ స్పృహ పెంపొందించుకునేవారు, సహజంగానే వీటి పట్ల అయిష్టత పెంచుకుని, ప్రాపంచిక సమాజానికి దూరంగా ఉంటారు; అదే సమయంలో, భగవత్ సేవ కోసం, ప్రాపంచిక జగత్ వ్యవహారాల్లో పాలుపంచుకోవలసి వస్తే, భక్తుడు దానిని స్వీకరిస్తాడు మరియు మానసికంగా దానిచే ప్రభావితం కాకుండా ఉండే సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. ఆధ్యాత్మిక జ్ఞానములో స్థిరముగా ఉండుట: ఏదేని విషయమును కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. కోపము అనేది మంచిది కాదు అని వ్యక్తికి తెలిసి ఉండవచ్చు, కానీ దానికి పదేపదే వశమై పోతూ ఉండవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవనంలో ఆచరణలో పెట్టటం నేర్చుకోవాలి. గంభీరమైన సత్యాలని ఒక్కసారి వినటం ద్వారా ఇది సాధ్యం కాదు. వాటిని విన్న తరువాత, వాటిపై పదేపదే చింతన చేయాలి. దివ్య ఆధ్యాత్మిక యదార్థాలపై నిరంతర చింతనయే ఇక్కడ శ్రీ కృష్ణుడు చెప్తున్న ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరత్వం. పరమ సత్యము కొరకై తత్త్వాన్వేషణ: జంతువులు కూడా శారీరక క్రియలైన తినటం, నిద్రించటం, మైథునం, మరియు రక్షించుకోవటం వంటి పనులను చేస్తాయి. కానీ, భగవంతుడు ప్రత్యేకంగా మనుష్యులకు జ్ఞానాన్ని పెంపొందించుకునే శక్తి ఇచ్చాడు. అది, శారీరక సుఖాలను విలాసంగా అనుభవించటానికి ఇవ్వబడలేదు, ‘నేను ఎవరిని?’, ‘నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను?’, ‘నా జీవిత లక్ష్యము ఏమిటి?, ‘ఈ ప్రపంచం ఎలా సృష్టించబడినది?, ‘ఆ సృష్టి కర్తకి నాకు ఉన్న సంబంధము ఏమిటి?’, ‘నా జీవన ప్రయోజనాన్ని ఎలా సఫలం చేసుకోవాలి?’ అన్న ప్రశ్నలపై చింతన చేయటానికి ఆ శక్తి ఇవ్వబడినది. తత్త్వపరమైన సత్యాన్వేషణ మన ఆలోచనను పశుస్థాయి నుండి ఉన్నతంగా చేసి, మరియు మనలను భగవత్ ప్రాప్తి ఉపదేశమును వినటం మరియు చదవటం దిశగా తీసుకువెళుతుంది. ఈ పైన వివరించబడిన సుగుణములు, అలవాట్లు, ప్రవర్తన, మరియు దృక్పథం మనలను జ్ఞానము, వివేకము పెంచుకునే దిశగా తీసుకువెళుతాయి. వీటికి వ్యతిరేకమైనవి అహంకారము, కపటత్వము, హింసాప్రవృత్తి, ప్రతీకారము, మోసము, గురువు పట్ల అమర్యాద, శరీరమనస్సుల అపరిశుభ్రత, చంచలత్వము, ఆత్మనిగ్రహం లేకుండుట, ఇంద్రియ వస్తువిషయాల పట్ల లాలస, దురభిమానము, భార్య (భర్త), ఇల్లు, పిల్లలు వంటి వాటిపై యావ, మొదలగునవి. ఇటువంటి స్వభావం ఆత్మ-జ్ఞాన ఎదుగుదలను కుంటుపడేస్తుంది. అందుకే శ్రీ కృష్ణుడు వాటిని అజ్ఞానము మరియు చీకటి అని అంటున్నాడు.
జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే । అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ।। 13 ।।
13
13
https://www.holy-bhagava…udio/013_013.mp3
జ్ఞేయం — తప్పకుండా తెలుసుకోబడదగినది; యత్ — ఏదైతే; తత్ — అది; ప్రవక్ష్యామి — ఇప్పుడు నీకు తెలియచేస్తాను; యత్ — అది; జ్ఞాత్వా — తెలుసుకున్న తరువాత; అమృతం — అమరత్వము; అశ్నుతే — పొందురు; అనాది — ఆది (మొదలు) లేని; మత్-పరం — నాకు ఆధీనమై; బ్రహ్మ — బ్రహ్మన్; న — కాదు; సత్ — ఉన్నది; తత్ — అది; న — కాదు; అసత్ — లేనిది; ఉచ్యతే — అంటారు.
BG 13.13: ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో, దాన్ని నీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను, అది తెలుసుకున్న తరువాత, వ్యక్తి అమరత్వం పొందుతాడు. అదియే, సత్, అసత్ లకు అతీతముగా ఉండే ఆదిరహిత బ్రహ్మన్.
పగలు-రాత్రి అనేవి ఒకే నాణెమునకు రెండు పక్కల వంటివి, ఒకటి లేనిదే ఇంకొకటి ఉండజాలదు. ఒకచోట పగలు ఉంది అని చెప్పాలంటే అక్కడే రాత్రి కూడా ఉండాలి. కానీ, అక్కడ రాత్రి అనేదే లేకపోతే అక్కడ పగలు లేనట్లే; అక్కడ ఎడతెగని వెలుగు మాత్రమే ఉన్నట్టు. అదే విధముగా, బ్రహ్మన్ విషయంలో, ‘సత్ (ఉన్నది)’ అనే పదం దాన్ని సంపూర్ణంగా వివరించదు. బ్రహ్మన్ యొక్క అస్తిత్వము సత్-అసత్ రెంటికీ అతీతమైనది, అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. బ్రహ్మన్ అంటే, జ్ఞానులు ఉపాసించే నిర్గుణ, నిరాకార తత్త్వము. తన యొక్క సాకార రూపములో, భగవంతుడిగా, అది భక్తులకు ఆరాధ్య యోగ్యము. దేహములో నివసించి ఉంటున్న, అదే అస్తిత్వానికి ‘పరమాత్మ' అని పేరు. ఇవన్నీ కూడా, ఒకే సర్వోన్నత పరమతత్త్వము యొక్క మూడు అస్తిత్వాలు. తదుపరి 14.27వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఇలా పేర్కొన్నాడు: బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్, ‘నిరాకార బ్రహ్మన్‌కు కూడా నేనే ఆధారము.’ ఈ విధంగా, నిరాకార బ్రహ్మము మరియు భగవంతుని సాకార రూపము రెండూ కూడా ఒకే సర్వోత్కృష్ట అస్తిత్వ స్వరూపాలు. రెండూ కూడా సర్వత్రా ఉంటాయి, అందుకే రెంటినీ సర్వ వ్యాప్తము అని అనవచ్చు. వీటిని ఉదహరిస్తూ, శ్రీ కృష్ణుడు భగవంతునిలో ప్రకటితమయ్యే పరస్పర విరుద్ధ గుణములను తెలియపరుస్తున్నాడు.
సర్వతః పాణిపాదం తత్సర్వతోఽక్షిశిరోముఖమ్ । సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ।। 14 ।।
14
13
https://www.holy-bhagava…udio/013_014.mp3
సర్వతః — అన్నీ చోట్లా; పాణి — చేతులు; పాదం — పాదములు; తత్ — అది; సర్వతః — అన్నీ చోట్లా; అక్షి — కన్నులు; శిరః — శిరస్సులు; ముఖమ్ — ముఖములు; సర్వతః — అంతటా; శ్రుతి-మత్ — చెవులు కలిగి; లోకే — జగత్తులో; సర్వం — సమస్తము; ఆవృత్య — వ్యాపించి; తిష్ఠతి — ఉంటుంది;
BG 13.14: సర్వత్రా ఆయన చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు, మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు.
తరచుగా జనులు, భగవంతునికి చేతులు, పాదములు, కన్నులు, చెవులు, మరియు ఇతర శరీర అవయవాలు ఉండజాలవు అని వాదిస్తుంటారు. కానీ, భగవంతునికి ఇవి అన్నీ ఉన్నాయి మరియు అసంఖ్యాకంగా ఉన్నాయి అని అంటున్నాడు, శ్రీ కృష్ణుడు. మన పరిమితమైన జ్ఞానంతో భగవంతునికి ఒక పరిధిని నిర్ణయించటమనే తప్పు చేయకూడదు. ఆయన ‘కర్తుమకర్తుం అన్యథా కరతుం సమర్థః’, “ఆయన సాధ్యం అయ్యేది చేయగలడు, సాధ్యం కానిదీ చేయగలడు, సాధ్యమయ్యే దానికి విరుద్ధంగా కూడా చేయగలడు.’ అటువంటి సర్వ శక్తిమంతుడైన భగవంతుడికి, చేతులు మరియు కాళ్ళు, ఉండజాలవు అని చెప్పటం, ఆయనపై ఒక పరిమితిని విధించినట్టే. గుర్తుంచుకోవాల్సివ విషయం ఏమిటంటే, భగవంతుని అంగములు మరియు ఇంద్రియములు దివ్యమైనవి, మనవి ప్రాకృతికమైనవి. భౌతికమైన వాటికీ మరియు అలౌకికమైన వాటికి భేదము ఏమిటంటే మనకు ఇంద్రియముల సముదాయము ఒక్కటే ఉంటే, భగవంతునికి అనంతమైన చేతులు, కాళ్ళు, కన్నులు, మరియు చెవులు ఉంటాయి. మన ఇంద్రియములు ఒక్క చోటనే ఉంటే భగవంతుని ఇంద్రియములు సర్వత్రా ఉంటాయి. అందుకే, జగత్తులో జరిగే ప్రతీదీ ఆయన చూస్తూనే ఉంటాడు, మరియు అనబడిన ప్రతిమాట వింటూనే ఉంటాడు. ఇది ఎలా సాధ్యమంటే, సృష్టిలో ఆయన సర్వ వ్యాప్తి అయినట్టే, ఆయన కన్నులు మరియు చెవులు కూడా అంతటా ఉంటాయి. ఛాందోగ్య ఉపనిషత్తు ఇలా పేర్కొంటుంది: సర్వం ఖల్విదం బ్రహ్మ (3.14.1) ‘బ్రహ్మన్ అంతటా ఉన్నాడు’. కాబట్టి, జగత్తులో ఎక్కడ తనకు ఆహారం నివేదించబడినా దానిని స్వీకరిస్తాడు; తన భక్తులు ఎక్కడున్నా సరే వారి ప్రార్థనని వింటాడు, ముల్లోకాలలో జరిగే ప్రతి సంఘటనకూ ఆయన సాక్షి. కోట్ల మంది భక్తులు ఆయన్ను ఒకేసారి స్తుతించినా, అందరి ప్రార్థనలను మన్నించటం ఆయనకు సమస్య కాదు.
సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ । అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ।। 15 ।।
15
13
https://www.holy-bhagava…udio/013_015.mp3
సర్వ — అన్ని; ఇంద్రియ — ఇంద్రియములు; గుణ — ఇంద్రియ-వస్తువిషయములు; ఆభాసం — గ్రహించేవాడు/అనుభవించేవాడు; సర్వ — అన్ని; ఇంద్రియ — ఇంద్రియములు; వివర్జితమ్ — లేకుండా; అసక్తం — ఆసక్తి రహితముగా; సర్వ-భృత్ — అన్నింటిని సంరక్షించి పోషించేవాడు; చ — అయినా; ఏవ — నిజముగా; నిర్గుణం — ప్రకృతి త్రిగుణములకు అతీతముగా; గుణ-భోక్తృ — ప్రకృతి యొక్క త్రిగుణములకు భోక్తగా; చ — అయినా సరే.
BG 13.15: ఇంద్రియ వస్తువిషయములను అన్నింటినీ ఆయన గ్రహించగలిగినా, ఆయన ఇంద్రియ రహితుడు. ఆయనకు దేనిపట్ల కూడా మమకారానుబంధము లేదు, అయినా ఆయనే అన్నింటిని సంరక్షించి పోషించేవాడు. ఆయన నిర్గుణుడు అయినా, ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆయనే.
భగవంతుని ఇంద్రియములు అంతటా ఉన్నాయి అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు ఇప్పుడు సరిగ్గా దానికి విరుద్ధంగా, ఆయనకు ఎటువంటి ఇంద్రియములు లేవని చెప్తున్నాడు. దీనిని మనం లౌకిక తర్కము ద్వారా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే, ఇది పరస్పర విరుద్ధమైనదిగా అనిపిస్తుంది. ‘భగవంతునికి అనంతమైన ఇంద్రియములు ఉండి మరియు ఆయన ఇంద్రియములు లేకుండా కూడా, రెండూ ఎలా సాధ్యం?’ అని అనిపిస్తుంది. కానీ, ఇలాంటి లౌకిక తర్కము మనోబుద్ధులకు అతీతమైన ఆయన పట్ల వర్తించదు. భగవంతుడు అనంతమైన పరస్పర విరుద్ధమైన గుణములు ఒకే సమయంలో కలిగి ఉంటాడు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం: విరుద్ధ ధర్మో రూపొసా వైశ్వర్యాత్ పురుషోత్తమాః ‘పరమేశ్వరుడు అసంఖ్యాకమైన పరస్పర విరుద్ధ గుణములకు నిలయము.’ ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, భగవంతునికి ఉన్న అనంతమైన పరస్పర విరుద్ధ గుణములలో కొన్నింటిని ఇక్కడ పేర్కొంటున్నాడు. ఆయనకు మనకున్నటువంటి ప్రాకృతిక ఇంద్రియములు ఉండవు, అందుకే ఆయనకు ఇంద్రియములు లేవు అని చెప్పటం సమంజసమే. సర్వేంద్రియ వివర్జితమ్ అంటే ‘ఆయనకు ప్రాకృతిక ఇంద్రియములు లేవు.’ అని అర్థం, కానీ, ఆయనకు సర్వత్రా ఉండే దివ్యమైన ఇంద్రియములు ఉన్నాయి, అందుకే భగవంతుని యొక్క ఇంద్రియములు సర్వవ్యాప్తమై ఉన్నాయి అని అనుకోవటం కూడా సమంజసమే. 'సర్వేంద్రియ గుణాభాసం' అంటే ‘ఇంద్రియములకు ఉండే స్వభావాన్ని వ్యక్తపరిచి ఇంద్రియ వస్తు-విషయములను గ్రహిస్తాడు.’ ఈ రెండు లక్షణములను పొందుపరుస్తూ, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: అపాణిపాదో జవనో గ్రహీతా పశ్యత్యచక్షుః స శృణోత్యకర్ణః (3.19) ‘భగవంతునికి ప్రాకృతిక చేతులు, పాదములు, కళ్ళు, మరియు చెవులు ఉండవు. అయినా సరే ఆయన అన్నీ అవగాహన చేసుకుంటాడు, నడుస్తాడు, చూస్తాడు, మరియు వింటాడు.’ అంతేకాక, శ్రీ కృష్ణుడు తానే ఈ సృష్టిలోని జగత్తు అంతటినీ పోషించి, సంరక్షించేవాడిని, అయినా దాని నుండి విడిగా ఆసక్తి రహితంగా ఉంటానని చెప్తున్నాడు. తన యొక్క విష్ణుమూర్తి స్వరూపంలో, శ్రీ కృష్ణ భగవానుడు సమస్త సృష్టిని పోషిస్తూ నిర్వహిస్తూ ఉంటాడు. సర్వ భూతముల హృదయములో స్థితుడై ఉండి, వారి కర్మలను నోట్ చేసుకుంటూ, వాటివాటి ఫలితములను అందిస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి అధిపత్యమునకు లోబడి బ్రహ్మ దేవుడు, విశ్వమును నిలకడగా నిర్వహించటానికి, లౌకిక భౌతిక శాస్త్ర సూత్రములను మార్పు చేస్తూ ఉంటాడు. ఇంకా, విష్ణుమూర్తి ఆధిపత్యములోని దేవతలు మనకు వాయువు, భూమి, నీరు, వర్షము మొదలైన, మన మనుగడకు అవసరమైన వాటిని సమకూరుస్తూ ఉంటారు. అందుకే, భగవంతుడే అన్నింటికీ నిర్వాహకుడు/పోషకుడు. అయినా, ఆయన తనకు తానే పరిపూర్ణుడు అందుకే అందరితో విడివడి ఆసక్తిరహితముగా ఉంటాడు. వేదములు ఆయనను 'ఆత్మారాముడు' అని అంటాయి, అంటే ‘తనలో తానే రమించిపోయేవాడు, ఇంకా ఏ ఇతర అన్య బాహ్యమైనవి అవసరం లేనివాడు’ అని అర్థం. భౌతిక శక్తి అనేది భగవంతునికి యొక్క అధీనములో ఉండేది, అది ఆయనకు సేవ చేస్తూ ఆయన ప్రీతి కోసమే పనిచేస్తుంది. అందుకే ఆయన ప్రకృతి త్రిగుణముల యొక్క భోక్త. అదే సమయంలో, ఆయన నిర్గుణుడు (త్రిగుణములకు అతీతుడు), ఎందుకంటే ఈ గుణములు ప్రాకృతికమైనవి, కానీ భగవంతుడు దివ్యమైన వాడు.
బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ । సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ ।। 16 ।।
16
13
https://www.holy-bhagava…udio/013_016.mp3
బహిః — బాహ్యముగా; అంతః — ఆంతరములో; చ — మరియు; భూతానామ్ — సర్వ ప్రాణులు; అచరం — కదలనివి; చరం — కదిలేవి (చరములు); ఏవ — నిజముగా; చ — మరియు; సూక్ష్మత్వాత్ — సూక్ష్మమైనది కావున; తత్ — అతడు; అవిజ్ఞేయం — అర్థం కాని; దూర-స్థం — చాలా దూరముగా ఉండి; చ — మరియు; అంతికే — చాలా దగ్గరగా; చ — మరియు; తత్ — అతడు.
BG 13.16: ఆయన సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. ఆయన సూక్ష్మమైన వాడు, కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము. చాలా దూరంగా ఉన్నాడు కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు.
శ్రీ కృష్ణుడు ఇక్కడ వివరించిన రీతిగానే, సరిగ్గా అలానే భగవంతుని గురించి చెప్పే ఒక వేద మంత్రము ఉన్నది. తద్ ఏజతి తన్ నైజతి తద్దూరే తద్వంతికే తద్ అంతర్ అస్య సర్వస్య తదుసర్వస్యాస్య బాహ్యతః (ఈశోపనిషత్తు, 5వ మంత్రము) ‘పర బ్రహ్మన్ నడవడు, అయినా నడుస్తాడు; చాలా దూరంలో ఉంటాడు అయినా దగ్గరగా కూడా ఉంటాడు. అన్నింటి లోపల ఉన్నాడు, కానీ ఆన్నింటి బయట కూడా ఉన్నాడు.’ ఇంతకు క్రితం 13.3వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, భగవంతుని గురించి తెలుసుకోవటమే నిజమైన జ్ఞానము అని చెప్పి ఉన్నాడు. కానీ, ఇక్కడ పరమాత్మ తత్త్వము అర్థంకానిది అని అంటున్నాడు. ఇది కూడా ఒక పరస్పర విరుద్ధమైన విషయంగానే అనిపిస్తుంది. ఇక్కడ ఆయన అర్థం ఏమిటంటే, భగవంతుడు ఈ ఇంద్రియములు, మనస్సు, మరియు బుద్ధిలచే తెలుసుకోబడలేడు. మన బుద్ధి భౌతిక శక్తిచే తయారు చేయబడినది, కాబట్టి అది దివ్యమైన భగవంతుడిని చేరుకోలేదు. కానీ, భగవంతుడే స్వయముగా తన కృపను ఎవరిమీదైనా ప్రసాదిస్తే, ఆ భాగ్యశాలి అయిన జీవాత్మ ఆయనను తెలుసుకోగలుగుతుంది.
అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ । భూతభర్తృ చ తద్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ।। 17 ।।
17
13
https://www.holy-bhagava…udio/013_017.mp3
అవిభక్తం — విభజించవీలుగాని; చ — మరియు; భూతేషు — ప్రాణుల యందు; విభక్తమ్ — వేర్వేరుగా విభక్తుడై; ఇవ — కనపడుతూ; చ — మరియు; స్థితమ్ — స్థితుడై; భూత-భర్తృ — సమస్త ప్రాణులను పోషించి సంరక్షించేవాడు; చ — మరియు; తత్ — అది; జ్ఞేయం — తెలుకొనదగినవాడు; గ్రసిష్ణు — లయముచేసేవాడు; ప్రభవిష్ణు — సృష్టికర్త; చ — కూడా.
BG 13.17: ఆయన విభజించుటకు వీలులేని వాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే, సమస్త భూతములకు (ప్రాణులకు) సంరక్షకుడు-పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము.
భగవంతుని వ్యక్తిత్వము ఆయన యొక్క సమస్త శక్తులతో కూడి ఉంటుంది. సమస్త వ్యక్త అవ్యక్త పదార్థములు కూడా ఆయన యొక్క శక్తి స్వరూపమే. అందుకే, ఉన్నదంతా ఆయనే అని చెప్పవచ్చు. ఈ విధంగా, శ్రీమద్ భాగవతం ప్రకారం: ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ వాసుదేవాత్ పరో బ్రహ్మన్ న చాన్యోఽర్థోఽస్థి తత్త్వః (2.5.14) ‘సృష్టి యొక్క విభిన్నమైన అంశములు - కాలము, కర్మ, ప్రతి ఒక్క ప్రాణి స్వభావము మరియు భౌతిక సృష్టి యొక్క మూల పదార్థాలు - ఇవన్నీ కూడా శ్రీ కృష్ణ పరమాత్మలో భాగమే. ఆయన కానిది వేరేది ఏదీ లేదు.’ భగవంతుడు తన సృష్టిలోని వస్తువులలో వేర్వేరుగా విభజించబడి ఉన్నట్లుగా అగుపించవచ్చు, కానీ ఉన్నదంతా ఆయనే కాబట్టి, ఆయన అవిభక్తముగా ఉండిపోతాడు కూడా. ఉదాహరణకు ఆకాశము (స్పేస్, ఖాళీ జాగా) తనలో ఉండే వస్తువుల మధ్య విభజింపబడి ఉన్నట్టుగా అగుపిస్తుంది. అయినా, అన్ని వస్తువులు కూడా, సృష్టి ప్రారంభంలో వ్యక్తమయిన ఒకే ఆకాశపు అస్తిత్వంలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, నీటి గుంటలలో సూర్యుని పరావర్తనం వేర్వేరుగా కనిపించినా, సూర్యుడు మాత్రం అవిభక్తముగా ఒక్కడే. ఎలాగైతే సముద్రము ఎన్నో అలలను సృష్టించి మళ్ళీ వాటన్నిటినీ తనలోకే తీసుకుంటుందో, అదే విధముగా భగవంతుడు ఈ జగత్తుని సృష్టిస్తాడు, సంరక్షిస్తాడు మరియు తనలోకే లయం చేసుకుంటాడు. కాబట్టి, ఆయనే సమస్త జగత్తుకి సృష్టి, స్థితి, లయ కారకుడు అని భావించవచ్చు.
జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే । జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ।। 18 ।।
18
13
https://www.holy-bhagava…udio/013_018.mp3
జ్యోతిషామ్ — ప్రకాశవంతమైన వాటన్నిటిలో; అపి — కూడా; తత్ — అది; జ్యోతిః — వెలుగు; తమసః — చీకటి; పరమ్ — అతీతమైన; ఉచ్యతే — అంటారు; జ్ఞానం — జ్ఞానము; జ్ఞేయం — జ్ఞానవస్తువు; జ్ఞాన-గమ్యం — జ్ఞానము యొక్క లక్ష్యము; హృది — హృదయములో; సర్వస్య — సమస్త ప్రాణులలో; విష్ఠితమ్ — స్థితమై ఉండును.
BG 13.18: అన్ని ప్రకాశవంతమైన వాటిల్లో ప్రకాశానికి మూలము ఆయనే, మరియు ఆయన అజ్ఞానపు చీకటికి పరమ అతీతుడు. జ్ఞానము ఆయనే, జ్ఞాన విషయము ఆయనే, మరియు జ్ఞాన లక్ష్యము ఆయనే. ఆయన సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు.
ఇక్కడ, శ్రీ కృష్ణుడు భగవంతుని యొక్క సర్వోన్నత స్థానమును వివిధ రకాలుగా వివరిస్తున్నాడు. సృష్టిలో చాలా రకాల ప్రకాశవంతమైన వస్తువులు ఉన్నాయి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, అగ్ని, మరియు మణులు మొదలైనవి. వీటిలో వేటికీ కూడా స్వయం ప్రకాశక శక్తి లేదు. ఎప్పుడైతే భగవంతుడు తన శక్తిని వాటికి అందిస్తాడో, అప్పుడే అవి ప్రకాశవంతమవుతాయి. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి (2.2.15) ‘అన్ని తేజోవంతమైన వాటిని సృష్టించేది భగవంతుడే. ఆయన యొక్క తేజస్సు వల్లనే అన్ని తేజోవంత వస్తువులు వెలుగునిస్తాయి.’ వేదములు ఇలా పేర్కొంటున్నాయి: సూర్యస్తపతి తేజసేంద్రః (వేదములు) ‘ఆయన యొక్క తేజస్సు చేతనే సూర్యచంద్రులు వెలుగునిస్తున్నారు.’ వేరే మాటల్లో చెప్పాలంటే, సూర్యచంద్రుల యొక్క తేజస్సు, భగవంతుని నుండి అరువు తెచ్చుకున్నదే. అవి తమ తేజస్సుని ఏదో ఒకరోజు కోల్పోవచ్చు, కానీ భగవంతుడు ఎన్నటికీ తన తేజస్సును కోల్పోడు. భగవంతునికి మూడు ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి: వేద-కృత్, వేద-విత్, మరియు వేద-వేద్య. ఆయన 'వేద-కృత్' అంటే ‘వేదములను ప్రకటించినవాడు’, ఆయనే ‘వేద-విత్’, అంటే, ‘వేదములను తెలిసినవాడు’ అని అర్థం. ఆయనే 'వేద-వేద్య' అంటే ‘వేదముల ద్వారా తెలుసుకొనదగినవాడు’ అని అర్థం. ఇదే విధముగా, శ్రీ కృష్ణుడు, ఆ సర్వోన్నత తత్త్వమును - జ్ఞేయ (తెలుసుకొనదగిన వాడు), జ్ఞాన-గమ్య (సమస్త జ్ఞానము యొక్క లక్ష్యము) మరియు జ్ఞానము (నిజమైన జ్ఞానము) - అని వివరిస్తున్నాడు.
ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః । మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ।। 19 ।।
19
13
https://www.holy-bhagava…udio/013_019.mp3
ఇతి — ఈ విధముగా; క్షేత్రం — క్షేత్ర స్వభావము; తథా — మరియు; జ్ఞానం — జ్ఞానము; జ్ఞేయం — జ్ఞాన విషయము; చ — మరియు; ఉక్తం — తెలియచేయబడినది; సమాసతః — సంక్షిప్తముగా; మత్-భక్తః — నా భక్తుడు; ఏతత్ — ఇది; విజ్ఞాయ — తెలుసుకొని; మత్-భావః — నా దివ్య స్వభావము; ఉపపద్యతే — పొందును.
BG 13.19: ఈ ప్రకారముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమును, జ్ఞానము యొక్క అర్థమును, మరియు జ్ఞాన విషయమును, నేను తెలియచేసాను. నా భక్తులు మాత్రమే దీనిని యదార్థముగా అర్థం చేసుకోగలరు, అలా చేసిన పిదప, వారు నా దివ్య స్వభావమునే పొందుతారు.
శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు క్షేత్రమును మరియు జ్ఞాన విషయమును గురించి తన యొక్క వివరణకు, దీనిని తెలుసుకోవటం వల్ల వచ్చే ఫలమును (ఫలస్తుతి) చెప్పటంతో ముగింపు ఇస్తున్నాడు. అయినా, మరల ఒకసారి, భక్తి గురించి చెప్పటం అవసరం అనుకున్నాడు; మరియు కేవలం తన భక్తులు మాత్రమే ఈ జ్ఞానమును యదార్థముగా అర్థం చేసుకోగలరు అని అంటున్నాడు. కర్మకాండ, జ్ఞానోపాసన, అష్టాంగము మొదలైనవి అభ్యాసం చేసే వారు, వారికి వారే అంతా అర్థమయిపోయింది అనుకున్నా, భక్తి రహితంగా ఉంటే, భగవద్ గీత యొక్క యదార్థమైన భావమును అర్థం చేసుకోలేరు. భక్తి అనేది, భగవత్ జ్ఞానం దిశగా వెళ్లే ప్రతి ఒక్క మార్గములో తప్పని సరిగా ఉండవలసినదే. జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ దీనిని చాలా చక్కగా చెప్పారు: జో హరి సేవా హేతు హో, సోఇ కర్మ బఖాన జో హరి భగతి బడావే, సోఇ సముఝియ జ్ఞాన (భక్తి శతకము, 66వ శ్లోకం) ‘భగవంతుని పట్ల భక్తి యుతంగా చేసిన పనే నిజమైన కర్మ; మరియు భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించే విషయమే నిజమైన జ్ఞానము.’ భక్తి అనేది మనకు భగవంతుని గురించి తెలుసుకోవటానికి సహకరించేది మాత్రమే కాదు, అది భక్తుడిని భగవంతునిలా కూడా చేస్తుంది, కాబట్టి, భక్తులు తన స్వభావాన్ని పొందుతారు అని అంటున్నాడు శ్రీ కృష్ణుడు. ఇదే విషయం వైదిక శాస్త్రాలలో పదే పదే చెప్పబడింది. వేదములు ఇలా పేర్కొంటున్నాయి: భక్తిరేవైనం నయతి భక్తిరేవైనం పశ్యతి భక్తిరేవైనం దర్శయతి భక్తి వశః పురుషో భక్తిరేవ భూయసీ (మాథర్ శృతి) ‘కేవలం భక్తి మాత్రమే మనలను భగవంతుని దగ్గరికి తీస్కువెళ్లగలదు. భక్తి ఒక్కటే మనలకు భగవంతుడిని దర్శింపచేయగలదు. భక్తి ఒక్కటే మనలను భగవంతుని సన్నిధికి చేర్చగలదు. భగవంతుడు భక్తికి వశమై పోతాడు. కాబట్టి అనన్య భక్తి సాధన చేయుము.’ ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: ఉపాసతే పురుషం యే హ్యకామా-స్తే శుక్రమేతదతివర్తంతి ధీరాః (3.2.1) ‘భౌతిక ప్రాపంచిక కోరికలను విడిచి, దివ్య మంగళ పరమేశ్వరుని పట్ల భక్తితో నిమగ్నమైన వారు, జనన-మరణ చక్రము నుండి విముక్తి పొందుతారు.’ ఇంకా, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్తా ప్రకాశంతే మహాత్మనః (6.23) ‘ఎవరికైతే, భగవంతుని పట్ల నిశ్చలమైన భక్తి ఉంటుందో, అదే విధమైన భక్తి గురువు పట్ల ఉంటుందో, అటువంటి సత్పురుషుల హృదయములో, భగవంతుని కృపవలన, వేద శాస్త్రముల జ్ఞానములన్నీ అనాయాసముగా తెలియచేయబడును.’ ఇతర వైదిక శాస్త్రాలు కూడా ఇదే విషయాన్ని నొక్కివక్కాణిస్తున్నాయి: న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్ధవ న స్వాధ్యాయస్త పస్త్యాగో యథా భక్తిర్మమోర్జితా (భాగవతం 11.14.20) శ్రీకృష్ణుడు ఇలా పేర్కొంటున్నాడు: ‘ఉద్ధవా, నేను అష్టాంగ యోగము ద్వారా కానీ, సాంఖ్య శాస్త్ర పఠనము వలన కానీ, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చేత కానీ, తపస్సుల చేత కానీ, లేదా సన్యాసం చేత గాని, పొందబడను. కేవలం భక్తి చేత మాత్రమే నేను పొందబడుతాను.’ భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని పదేపదే చెప్తాడు - 8.22 శ్లోకం, 11.54 శ్లోకం మొదలైనవాటిలో. 18.55వ శ్లోకంలో ఆయన అంటాడు: ‘కేవలం ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే యదార్థముగా నేను ఏమిటో తెలుసుకోగలరు. తదుపరి, భక్తి ద్వారా నా స్వభావమును తెలుసుకున్న పిదప, జనులు నా దివ్య ధామమునకు చేరుకుంటారు.’ రామాయణము కూడా ఇలా పేర్కొంటున్నది: రామహి కేవల ప్రేము పిఆరా, జాని లేఉ జో జాననిహారా ‘సర్వోన్నతుడైన శ్రీరామచంద్ర ప్రభువు కేవలం ప్రేమ చేత మాత్రమే పొందబడుతాడు. తెలుసుకోదలచిన వారందరికీ ఈ నిజము తెలియనీ.’ నిజానికి, ఇతర మత ధర్మాల్లో కూడా ఈ సూత్రం ధృవీకరించబడింది. యూదు తోరా (Jewish Torah) లో ఇలా వ్రాయబడినది, ‘నీ దేవుడైన ప్రభువును సంపూర్ణ హృదయ పూర్వకముగా, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణశక్తితోను ప్రేమించవలెను (ద్వితీయోపదేశకాండము 6.5)’ (You shall love the Lord your God with all your heart, and with all your soul, and with all your might (Deuteronomy 6.5)). ఇదే విషయాన్ని నజరేయుడైన యేసు, క్రైస్తవ కొత్త నిబంధనలో, అత్యంత ప్రధానమైన సూత్రముగా, ఈ ఆజ్ఞను పునరావృతం చేస్తున్నాడు (మార్క్ 12.30). గురు గ్రంథ్ సాహిబ్ ఇలా పేర్కొంటున్నది: హరి సమ జగ మహాన్ వస్తు నహీఁ, ప్రేమ పంథ సో పంథా సద్గురు సమ సజ్జన్ నహీఁ, గీతా సమ నహీఁ గ్రంథ ‘భగవంతుని వంటి వ్యక్తిత్వము ఇంకేదీ లేదు; భక్తి మార్గానికి సమానమైన మార్గము లేదు; గురువుకు సమానమైన మనిషి లేడు; మరియు భగవద్గీతకు సాటి వచ్చే శాస్త్రగ్రంథము ఇంకోటి లేదు’
ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి । వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్ ।। 20 ।।
20
13
https://www.holy-bhagava…udio/013_020.mp3
ప్రకృతిం — భౌతిక ప్రకృతి; పురుషం — జీవాత్మలు; చ — మరియు; ఏవ — నిజముగా; విద్ధి — తెలుసుకొనుము; అనాదీ — మొదలు (ఆది) లేని; ఉభౌ — రెండునూ; అపి — కూడా; వికారాన్ — మార్పులు/వికారములు (శరీరము యొక్క); చ — మరియు; గుణాన్ — ప్రకృతి త్రిగుణములు; చ — మరియు; ఏవ — నిజముగా; విద్ధి — తెలుసుకొనుము; ప్రకృతి — భౌతికశక్తి; సంభవాన్ — చే ఉత్పన్నమగును.
BG 13.20: ప్రకృతి (భౌతిక ప్రకృతి) మరియు పురుషుడు (ఆత్మలు) రెండూ కూడా అనాదియైనవి (సనాతనమైనవి). శరీరములోని అన్ని మార్పులూ మరియు ప్రకృతి త్రిగుణములూ కూడా, భౌతిక శక్తి చే సంభవిస్తున్నాయని తెలుసుకొనుము.
భౌతిక ప్రకృతినే మాయ అంటారు. అది భగవంతుని శక్తి స్వరూపమే కాబట్టి, ఆయన ఉన్నప్పటి నుండీ అది కూడా ఉంది; ఇంకోలా చెప్పాలంటే, అది సనాతనమైనది. ఆత్మ (జీవుడు/జీవాత్మ) కూడా సనాతనమైనదే, మరియు ఇక్కడ దీనిని పురుషుడు అని పేర్కొనబడినది. (జీవమున్న అస్తిత్వము), అదే సమయంలో భగవంతుడు స్వయముగా పరమ పురుషుడు (సర్వోత్కృష్ట జీవ అస్తిత్వము) అని పిలవబడుతాడు. ఆత్మ కూడా భగవంతుని శక్తి స్వరూపమే. శక్తిత్వేనైవాంశత్వం వ్యంజయంతి (పరమాత్మ సందర్భ 39.1), ‘ఆత్మ అనేది భగవంతుని యొక్క జీవశక్తి యొక్క అంశయే’. భౌతిక ప్రకృతి, జడమైన (జీవములేని) శక్తి, జీవశక్తి చైతన్యము ఉన్న శక్తి. అది దివ్యమైనది మరియు పరివర్తనం చెందనిది. అది వేర్వేరు జన్మల్లో మరియు ఒకే జన్మలోని వివిధ దశలలో మార్పు చెందకుండా ఉంటుంది. శరీరం ఒక జన్మలో ఆరు దశలుగా మార్పుకు లోనవుతుంది : అస్తి (గర్భాశయములో ఉండుట), జాయతే (పుట్టుక), వర్ధతే (పెరుగుదల), విపరిణమతే (పునరుత్పత్తి), అపక్షీయతే (కృశించిపోవుట), వినశ్యతి (మరణము). శరీరంలో ఈ మార్పులను భౌతిక శక్తి కలుగచేస్తుంది, దానినే ప్రకృతి లేదా మాయ అంటారు. అది ప్రకృతి త్రి-గుణములను సృష్టిస్తుంది - సత్త్వము, రజస్సు, తమస్సు - మరియు వాటియొక్క అసంఖ్యాకమైన మేళనములు (combinations).
కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే । పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ।। 21 ।।
21
13
https://www.holy-bhagava…udio/013_021.mp3
కార్య — కార్యము; కారణ — కారణము; కర్తృత్వే — ఉత్పన్నము చేయుటలో; హేతుః — హేతువు; ప్రకృతిః — భౌతిక శక్తి; ఉచ్యతే — చెప్పబడును; పురుషః — జీవాత్మ; సుఖ-దుఃఖానాం — సుఖ దుఃఖముల యొక్క; భోక్తృత్వే — అనుభవించుటలో; హేతుః — హేతువు; ఉచ్యతే — అంటారు.
BG 13.21: సృష్టి యందు కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని; సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో, జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడినది.
బ్రహ్మ దేవుని నిర్దేశం అనుసరించి, భౌతిక శక్తి, ఈ సృష్టిలో ఎన్నెన్నో విభిన్నమైన జీవన మూలపదార్థములను మరియు జీవ రాశులను సృష్టిస్తుంది. బ్రహ్మ దేవుడు బృహత్ పథకాన్ని రచిస్తాడు, దానిని భౌతిక శక్తి అమలుపరుస్తుంది. భౌతిక జగత్తులో 84 లక్షల జీవరాశులు ఉన్నట్టు వేదములు పేర్కొంటున్నాయి. ఈ శారీరక స్వరూపాలు అన్నీ కూడా భౌతిక శక్తి యొక్క రూపాంతరాలే. కాబట్టి ప్రకృతియే జగత్తులోని కారణము మరియు కార్యములకు మూలహేతువు. ఆత్మకు ఈ శరీర రూపము (క్షేత్రము) దాని యొక్క పూర్వ జన్మల కర్మ ఫలముగా లభిస్తుంది, మరియు అది తనను తానే ఈ శరీరము, మనస్సు, మరియు బుద్ధి అనుకుంటుంది. అందుకే అది శారీరక సుఖముల కోసం ప్రయత్నిస్తుంది. ఇంద్రియములు, ఇంద్రియవస్తు విషయములతో సంపర్కము చెందినప్పుడు, మనస్సు ఒక ఆనందకర అనుభూతిని పొందుతుంది. ఆత్మ, మనస్సుతో అనుసంధానం అయి ఉన్నకారణంగా, ఆత్మ పరోక్షంగా ఈ సుఖాన్ని అనుభవిస్తుంది. ఈ విధంగా, ఆత్మ అనేది, ఇంద్రియమనోబుద్ధుల ద్వారా సుఖదుఃఖములను అనుభవిస్తుంది. దీనిని ఒక కలతో పోల్చవచ్చు. ఏహి బిధి జగ హరి ఆశ్రిత రహఈ. జదపి అసత్య దేత దుఃఖ అహఈ (రామచరితమానస్) జౌం సపనేం సిర కాటఇ కోఈ. బిను జాగేఁ న దూరి దుఖ హోఈ (రామచరితమానస్) ‘ఈ జగత్తు భగవంతునిచే నిర్వహించి పోషించబడుతున్నది. అది ఒక భ్రాంతిని కలుగచేస్తుంది, అది, అసత్యమైనా, ఆత్మని యాతనకి గురి చేస్తుంది. ఇది ఎలాగంటే, స్వప్నంలో వ్యక్తి తల తెగిపోతే, ఆ యాతన, ఆ వ్యక్తి నిద్రలేచి, కలలు కనటం ఆపేంతవరకూ కొనసాగుతూనే ఉంటుంది.’ శరీరముతోనే అనుసంధానం చేసుకున్న ఈ యొక్క ప్రస్తుత స్వప్న స్థితిలో కూడా, ఆత్మ తన యొక్క పూర్వ మరియు ప్రస్తుత కర్మల పరంగా సుఖదుఃఖములను అనుభవిస్తూనే ఉంటుంది. ఫలితంగా, రెండు రకాల అనుభూతులకు కూడా అదే కారణము అని చెప్పబడుతుంది.
పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ । కారణం గుణసంగోఽస్య సదసద్యోనిజన్మసు ।। 22 ।।
22
13
https://www.holy-bhagava…udio/013_022.mp3
పురుషః — జీవాత్మ; ప్రకృతి-స్థః — ప్రకృతిలో స్థితమై ఉండి; హి — నిజముగా; భుంక్తే — భోగించ దలచి; ప్రకృతి-జాన్ — భౌతిక శక్తి (ప్రకృతి) జనితమైన; గుణాన్ — త్రిగుణములు; కారణం — కారణము; గుణ-సంగః — గుణములతో సంగము (మమకారాసక్తి); అస్య — దాని యొక్క; సత్-అసత్-యోని — ఉఛ్చమైన-నీచమైన-గర్భములో; జన్మసు — పుట్టుట.
BG 13.22: ఎప్పుడైతే ప్రకృతిలో (భౌతిక శక్తి) లో స్థితమై ఉన్న పురుషుడు (జీవాత్మ) త్రిగుణములను సుఖించదలచాడో, వాటి పట్ల మమకారాసక్తియే, ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలకు కారణమగును.
ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, పురుషుడు (ఆత్మ) యే సుఖదుఃఖానుభూతులకు బాధ్యుడు అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు అలా ఎందుకో వివరిస్తున్నాడు. ఈ శరీరమే తాను అనుకుని, ఆత్మ, శారీరక సుఖాల దిశగా దానిని ఉత్తేజపరుస్తుంది. శరీరము మాయచే తయారుచేయబడినది కావున, అది త్రిగుణాత్మకమైన - సత్వము, రజస్సు, మరియు తమస్సు లచే ఉన్న – భౌతిక ప్రకృతినే అనుభవించాలని చూస్తుంది. అహంకారము వలన, ఆత్మ తానే కర్తను, మరియు శరీరమును అనుభవించేవాడను అని అనుకుంటుంది. శరీరము, మనస్సు, మరియు బుద్ధి అన్ని పనులను చేస్తుంటాయి, కానీ వాటన్నిటికీ జీవాత్మయే బాధ్యుడు. ఇది ఎలాగంటే, ఒక బస్సుకు ప్రమాదం జరిగితే, దాని యొక్క చక్రాల మరియు స్టీరింగ్ లపై నింద ఉండదు; ఆ బస్సు యొక్క డ్రైవర్ దానికి బాధ్యత వహించాలి. అదే విధంగా, ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి - ఆత్మ చే ప్రేరేపితమై (శక్తినివ్వబడి) దాని ఆధీనంలో ఉంటాయి. అందుకే, శరీరము చే చేయబడిన అన్ని పనుల కర్మలను కూడబెట్టుకునేది ఆత్మయే. అసంఖ్యాకమైన జన్మలలో ప్రోగుచేయబడిన ఈ యొక్క కర్మరాశి , ఆత్మకి, ఉన్నతమైన లేదా నీచ గర్భములలో పదే పదే జన్మను కలుగచేస్తుంది.
ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః । పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః ।। 23 ।।
23
13
https://www.holy-bhagava…udio/013_023.mp3
ఉపద్రష్టా — సాక్షి; అనుమంతా — ఆనతి నిచ్చేవాడు; చ — మరియు; భర్తా — భర్త (పోషకుడు); భోక్తా — అలౌకిక భోక్త; మహా-ఈశ్వరః — సర్వోత్కృష్ట నియంత్రకుడు/అధికారి; పరమ-ఆత్మా — పరమాత్మ; ఇతి — అది; చ అపి — ఇంకా కూడా; ఉక్తః — చెప్పబడును; దేహే — దేహము లోయందు; అస్మిన్ — ఇది; పురుషః-పరః — సర్వోత్కృష్ట భగవానుడు.
BG 13.23: దేహముయందే ఆ సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు. ఆయన సర్వసాక్షి, సర్వ నియామకుడు, ధరించి పోషించేవాడు, అలౌకిక భోక్త, సర్వోత్కృష్ట నిర్వాహకుడు మరియు పరమాత్మ, అని చెప్పబడుతాడు.
దేహములోని జీవాత్మ యొక్క స్థితిని ఇందాక శ్రీ కృష్ణుడు వివరించాడు. ఇక ఈ శ్లోకంలో, శరీరములోనే స్థితమై ఉన్న పరమాత్మ యొక్క స్థాయి గురించి చెప్తున్నాడు. ఇంతకు పూర్వమే 13.3వ శ్లోకంలో కూడా పరమాత్మ గురించి చెప్పి ఉన్నాడు; ఆ సందర్భంలో, ఒక జీవాత్మ తన దేహము (క్షేత్రము) గురించి మాత్రమే ఎఱుంగును, అదే సమయంలో పరమాత్మ అనంతములైన సమస్త శరీరములను (క్షేత్రములను) ఎఱుంగును అని చెప్పి ఉన్నాడు. అందరిలోనూ ఉన్న, అ పరమాత్మ, తన సాకార రూపములో విష్ణుమూర్తిగా వ్యక్తమవుతాడు. విష్ణుమూర్తి రూపములో ఉన్న ఆ పరమేశ్వరుడే సమస్త జగత్తుకి స్థితికారకుడు (సంరక్షించి, పోషించేవాడు). ఆయన, బ్రహ్మాండముపైన తన సాకార రూపములో, క్షీర సాగరములో (పాలసముద్రం) లో నివసిస్తాడు. ఆయనే సర్వ భూతముల హృదయములలో పరమాత్మ స్వరూపంలో వ్యాప్తి నొంది ఉంటాడు. లోపలే కూర్చుని, వారు చేసే పనులను గమనిస్తూ, కర్మలను నోట్ చేసుకుంటూ, వాటివాటి ఫలములను సరియైన సమయంలో అందచేస్తాడు. ప్రతి జన్మలో కూడా జీవాత్మతో పాటే, దాని వెంటే, అది ఏ శరీరంలోనికి వెళితే దానిలోకి వెళ్లి ఉంటాడు. ఒక పాము శరీరంలో నైనా, ఒక పంది శరీరమైనా, లేదా ఒక పురుగు శరీరమైనా తాను వసించడానికి వెనుకాడడు. ముండకోపనిషత్తు ఈ విధంగా పేర్కొంటున్నది. ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్యనశ్నన్నన్యో అభిచాకశీతి సమానే వృక్షే పురుషో నిమగ్నో ఽనీశయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యత్యన్యమీశమస్య మహిమానమితి వీతశోకః (3.1.1-2) ‘రెండు పక్షులు ఒక చెట్టు (శరీరము) యొక్క గూటిలో (హృదయములో) నివసిస్తున్నాయి. అవి ఒకటి జీవాత్మ, మరియొకటి పరమాత్మ. ఈ జీవాత్మ ఆ పరమాత్మకు విముఖంగా (వీపు చూపిస్తూ) ఉన్నది; మరియు ఆ చెట్టు యొక్క పండ్లు (శరీరంలో ఉన్నంత వరకు తనకు అందే కర్మఫలములు) తినటంలో నిమగ్నమై ఉన్నది. తియ్యని పండు వస్తే, అది సంతోషపడుతుంది; చేదు పండు వస్తే, అది దుఃఖిస్తుంది. పరమాత్మ, ఆ జీవాత్మకి మిత్రుడే, కానీ ఆయన జోక్యం చేసుకోడు; కేవలం కూర్చుని అన్నీ గమనిస్తుంటాడు. ఒకవేళ జీవాత్మ కనుక పరమాత్మ కేసి యూటర్న్ తిరిగితే, దాని యొక్క సమస్త బాధలూ సమిసిపోతాయి.’ జీవాత్మకి స్వేఛ్చాచిత్తము ఇవ్వబడినది. అంటే, భగవంతుని వైపుగా లేదా భగవంతునికి దూరంగా వెళ్ళే స్వేచ్ఛ ఉంటుంది. ఆ యొక్క స్వేచ్ఛా చిత్తముని దుర్వినియోగం చేయటం వలన జీవాత్మ బంధనములో ఉంది. మరియు దాని యొక్క సరియైన ఉపయోగమును నేర్చుకోవటం ద్వారా, అది నిత్య శాశ్వత భగవత్ సేవను పొందవచ్చు మరియు అనంతమైన ఆనందమును అనుభవించవచ్చు.
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ । సర్వథా వర్తమానోఽపి న స భూయోఽభిజాయతే ।। 24 ।।
24
13
https://www.holy-bhagava…udio/013_024.mp3
యః — ఎవరైతే; ఏవం — ఈ విధముగా; వేత్తి — అర్థంచేసుకున్న; పురుషం — పురుషుడు; ప్రకృతిం — భౌతిక ప్రకృతి; చ — మరియు; గుణైః — ప్రకృతి త్రిగుణములు; సహ — తో; సర్వథా — అన్ని విధముల; వర్తమానః — స్థితమై; అపి — అయినాకూడా; న — కాదు; సః — వారు; భూయః — మరల; అభిజాయతే — పుట్టుట.
BG 13.24: పరమాత్మ, జీవాత్మ, భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యదార్థమును అర్థం చేసుకున్న వారు, మళ్ళీ ఇక ఇక్కడ పుట్టరు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలాఉన్నా వారు విముక్తి చేయబడతారు.
అజ్ఞానము వలననే ఆత్మ, ప్రస్తుత సంకట స్థితిలోకి వచ్చింది. భగవంతుని యొక్క అణుఅంశముగా తన యొక్క దివ్య అస్తిత్వమును మర్చిపోయి, అది భౌతిక దృక్పథం లోనికి పడిపోయింది. కాబట్టి, ప్రస్తుత స్థాయి నుండి తిరిగి తనను తాను పునరుజ్జీవింపజేసుకోవటానికి, జ్ఞానము ప్రధానము. శ్వేతాశ్వతర ఉపనిషత్తు సరిగ్గా ఇదే విషయాన్ని పేర్కొంటున్నది: సంయుక్తం ఏతత్ క్షరం అక్షరం చ వ్యక్తావ్యక్తం భరతే విశ్వం ఈశః ఆనీశశ్ చాత్మా బధ్యతే భోక్తృభావాజ్ జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశై: (1.8) ‘సృష్టిలో మూడు ప్రధానమైన తత్త్వములు ఉన్నాయి - నిత్యమూ మారుతూ ఉండే భౌతిక ప్రకృతి, మార్పులేని ఆత్మలు, ఈ రెంటికీ అధిపతి అయిన భగవంతుడు. ఈ అస్తిత్వముల అజ్ఞానమే ఆత్మ యొక్క బంధనమునకు కారణము, వాటి గురించిన జ్ఞానము, మాయ యొక్క బంధనములను త్రుంచివేయుటకు దోహదపడుతుంది.’ శ్రీ కృష్ణుడు ఇక్కడ ఉదహరించే జ్ఞానము కేవల పుస్తక జ్ఞానం కాదు, స్వయముగా అనుభవములోనికి వచ్చిన విజ్ఞానము. జ్ఞానము అనేది ఎప్పుడు స్వీయ అనుభవ విజ్ఞానముగా మారుతుందంటే, మొదట ఈ మూడు తత్త్వములపై, పుస్తక సైద్ధాంతిక జ్ఞానమును గురువు ద్వారా మరియు శాస్త్ర పఠనం ద్వారా తెలుసుకోవాలి, మరియు తద్విధముగా ఆధ్యాత్మిక సాధనచేయాలి. కొన్ని ఈ ఆధ్యాత్మిక సాధనల గురించి తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.
ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా । అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ।। 25 ।।
25
13
https://www.holy-bhagava…udio/013_025.mp3
ధ్యానేన — ధ్యానము ద్వారా; ఆత్మని — హృదయములో; పశ్యంతి — దర్శించెదరు; కేచిత్ — కొందరు; ఆత్మానం — పరమాత్మ; ఆత్మనా — మనస్సుచే; అన్యే — ఇతరులు; సాంఖ్యేన — జ్ఞాన సముపార్జన ద్వారా; యోగేన — యోగ పద్ధతి; కర్మ-యోగేన — కర్మ ఆచరణ ద్వారా భగవంతునితో ఏకమవ్వటం; చ — మరియు; అపరే — మరికొందరు.
BG 13.25: కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు; మరియు ఇతరులు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు, ఇంకా మరికొందరు ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు.
వైవిధ్యము అనేది భగవంతుని సృష్టి అంతటా ఉన్న లక్షణము. ఒకే చెట్టుకు ఉన్న ఏ ఒక్క రెండు ఆకులు కూడా ఒక్క లాగే ఉండవు; ఏ ఇద్దరి వ్యక్తుల వ్రేలి ముద్రలు కూడా ఒక్కలా ఉండవు; ఏ రెండు మానవ సమాజాలు కూడా ఒకే విధంగా ఉండవు. అదే విధంగా, అన్ని ఆత్మలు విభిన్నమైనవే మరియు వాటి వాటి ప్రత్యేక జనన-మరణ చక్ర ప్రయాణంలో ఆపాదించుకున్న విలక్షణమైన స్వభావాలు వాటికి ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో కూడా అందరూ ఒకే రకమైన అభ్యాసమునకు ఇష్ట పడరు. భగవద్గీత మరియు వైదిక శాస్త్రముల అద్భుతమైన గొప్పతనం ఏమిటంటే అవి మనుష్యులలో ఉన్న ఈ అంతర్లీన వైవిధ్యాన్ని అర్థంచేసుకుని మరియు తమ ఉపదేశాలలో వారందరికీ తగిన సూచనలను అందిస్తాయి. ఇక్కడ, శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, కొందరు సాధకులు తమ మనస్సుతో పోరాడి దానిని నియంత్రణ లోనికి తేవటంలో అత్యంత ఆనందాన్ని అనుభవిస్తారు. వారు తమలోనే స్థితమై ఉన్న భగవంతుడి పై ధ్యానం చేయటానికి ఆకర్షితమౌతారు. వారి మనస్సు వారిలోనే ఉన్న భగవంతుని పై ఆశ్రయం పొంది నిలకడగా ఉన్నప్పుడు, వారు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు. మరికొందరు తమ బుద్ధితో కసరత్తు చేయటంలో తృప్తి పొందుతారు. ఆత్మ మరియు శరీరము-మనస్సు-బుద్ధి-అహంకారము వేరనే విషయము, వారిని చాలా ఉత్తేజపరుస్తుంది. ఆత్మ-భగవంతుడు-మాయ అనే ఈ మూడు అస్తిత్వాల గురించి, శ్రవణము, మననము, నిధిధ్యాసన (వినటం, చింతన చేయటము, దృఢ విశ్వాసంతో నమ్మటం) ప్రక్రియల ద్వారా జ్ఞాన సముపార్జన చేసుకోవటం వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా కొందరు అర్థవంతమైన కార్యములు చేయటంలో అత్యంత ఉత్సాహాన్ని అనుభవిస్తారు. భగవంతుడు వారికి ఇచ్చిన శక్తిసామర్థ్యములను ఆయన కొరకు పనిచేయటంలోనే ఉపయోగిస్తారు. తమ శక్తిలో చిట్ట చివరి భాగాన్ని కూడా భగవత్ సేవకే వినియోగించినప్పుడు పొందిన తృప్తి మరింక దేనిలోనూ పొందరు. ఈ ప్రకారంగా, అన్ని రకాల సాధకులు తమతమ వ్యక్తిగత సహజస్వభావాలను ఆ పరమ పురుషుడిని ఆచరణలో తెలుసుకోవటానికి వాడతారు. జ్ఞానము, కర్మ, ప్రేమ లతో కూడి ఉన్న ఏ ప్రయాస అయినా పరిపూర్ణత సాధించాలంటే దానితో భగవత్ ప్రీతికై ఉన్న భక్తిని జత చేయాలి. శ్రీమద్ భాగవతము ప్రకారం: సా విద్యా తన్-మతిర్ యయా (4.29.49) ‘భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవటానికి సహకరించే జ్ఞానమే నిజమైన జ్ఞానము. భగవత్ ప్రీతి కోసము చేసినప్పుడే కర్మ యొక్క పరిపూర్ణత సిద్ధిస్తుంది.’
అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే । తేఽపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః ।। 26 ।।
26
13
https://www.holy-bhagava…udio/013_026.mp3
అన్యే — ఇతరులు; తు — ఇంకా; ఏవం — ఈ విధముగా; అజానంతః — తెలియని వారు (ఆధ్యాత్మిక మార్గముల గురించి); శృత్వా — వినటం ద్వారా; అన్యేభ్య — ఇతరుల నుండి; ఉపాసతే — పూజించటం ప్రారంభిస్తారు; తే — వారు; అపి — కూడా; చ — మరియు; అతితరంతి — దాటిపోవుదురు; ఏవ — కూడా; మృత్యుమ్ — మృత్యువు; శృతి-పరాయణాః — భక్తితో వినటం (మహాత్ముల ద్వారా).
BG 13.26: ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియనివారు, వాటి గురించి ఇతరుల దగ్గర విని, ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించటం మొదలుపెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత, వారు కూడా క్రమక్రమంగా ఈ జనన-మరణ సంసార సాగరాన్ని దాటగలరు.
సాధనా పద్ధతులు తెలియని వారు కూడా ఉంటారు. కానీ, ఏదో విధముగా వారు ఇతరుల ద్వారా విని ఆధ్యాత్మిక పథం వైపు ఆకర్షితమవుతారు. నిజానికి, ఆధ్యాత్మికత వైపు వచ్చిన వారు చాలా మంది ఈ విధంగా వచ్చిన వారే. వారికి ఆధ్యాత్మిక విషయాల పట్ల శిక్షణ లేకపోయినా, వారికి ఏదో రకంగా దాని గురించే చదివే లేదా వినే అవకాశం వస్తుంది. దానితో వారికి భగవత్ భక్తి యందు ఆసక్తి పెరిగి వారు ఆ మార్గంలో ముందుకెళతారు. వైదిక ఆచారంలో, మహాత్ముల వద్ద వినటం అనేది ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు ఉన్న ఒక శక్తి వంతమైన సాధనముగా ఉద్ఘాటించబడినది. శ్రీమద్ భాగవతంలో, పరీక్షిత్ మహారాజు, శుకుడిని ఈ ప్రశ్న అడిగాడు, ‘ఏ విధంగా మనం మన హృదయంలో ఉన్న అవాంఛితములైన కామము, కోపము, దురాశ, ఈర్ష్య, మరియు ద్వేషము వంటి వాటిని నిర్మూలించవచ్చు?’ అని. శుకదేవుడు ఇలా సమాధానం ఇచ్చాడు: శృణ్వతాం స్వ-కథాః కృష్ణః పుణ్య-శ్రవణ-కీర్తనః హృద్యన్తః స్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతామ్ (భాగవతం 1.2.17) ‘పరీక్షిత్ మహారాజా! సాధుపురుషుల ద్వారా భగవత్ నామములను, రూపములను, లీలలను, గుణములను, ధామములను మరియు భగవత్ భక్తుల గురించీ కేవలం వింటూ ఉండుము. ఇది హృదయములో అనంతమైన జన్మల నుండి ఉన్న మలినములను సహజంగానే నిర్మూలిస్తుంది.’ మనం సరియైన చోటనుండి విన్నప్పుడు, విశ్వసనీయమైన ప్రామాణిక ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. అంతేకాక, ఏ మహాత్ముని నుండి వింటున్నామో, ఆ సత్పురుషునికి ఉన్న దృఢ విశ్వాసము నమ్మకము మనకు కూడా రావటం ప్రారంభమవుతుంది. సత్పురుషుల నుండి వినటం అనేది మన విశ్వాసమును పెంచుకోవటానికి ఉన్న అత్యంత సరళమైన విధానము. ఇంకా చెప్పాలంటే, ఆ ఆధ్యాత్మిక కార్యముల పట్ల మహాత్మునికి ఉన్న ఉత్సాహము మనకు కూడా అంటుకుంటుంది. సాధకుడికి, భౌతిక దృక్పథం యొక్క జడత్వాన్ని వదిలించుకొని మరియు సాధనా పథంలో అడ్డంకులను తొలగించుకోవటానికి, భక్తి పట్ల ఉత్సాహము, చాలా శక్తిని ఇస్తుంది. ఉత్సాహము మరియు విశ్వాసము అనేవి భక్తి అనే భవనం నిలిచి ఉండే పునాదులు.
యావత్సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్ । క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్ తద్విద్ధి భరతర్షభ ।। 27 ।।
27
13
https://www.holy-bhagava…udio/013_027.mp3
యావత్ — అన్ని; సంజాయతే — వ్యక్తమయిన; కించిత్ — ఏదైనా సరే; సత్త్వం — ప్రాణి; స్థావర — స్థావరములు (కదలనివి); జంగమమ్ — కదిలేవి; క్షేత్ర — క్షేత్రము; క్షేత్రజ్ఞ — క్షేత్రజ్ఞుడు (క్షేత్రము యొక్క జ్ఞాత); సంయోగాత్ — సంయోగము వలన; తత్ — అది; విద్ధి — తెలుసుకొనుము; భరత-ఋషభ — భరత వంశీయులలో శ్రేష్ఠుడా.
BG 13.27: ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, ఈ సమస్త చరాచర ప్రాణులు, ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క సంయోగము వలననే ఉన్నాయని నీవు తెలుసుకొనుము.
శ్రీ కృష్ణుడు ఇక్కడ 'యావత్ కించిత్' అన్న పదాలను వాడాడు, అంటే, ‘ఏ రకమైన జీవప్రాణి అయినా’ అని, ఎంత పెద్దది లేదా ఎంత సూక్ష్మమైనది అయినా సరే, అవన్నీ, క్షేత్రజ్ఞుడు మరియు క్షేత్రము యొక్క కలయిక వలననే జనించాయి. అబ్రహామిక్ ఆచారాలు, మానవులలో ఆత్మ ఉన్నది అని ఒప్పుకుంటాయి కానీ, ఇతర జీవరాశులు కూడా ఆత్మను కలిగి ఉంటాయి అన్న విషయాన్ని ఒప్పుకోవు. ఈ దృక్పథం ఇతర జీవ భూతముల పట్ల హింసను మన్నిస్తుంది. కానీ, వైదిక శాస్త్రము ప్రకారం, ఎక్కడెక్కడైతే చైతన్యం ఉంటుందో, అక్కడ ఆత్మ ఉండవలసినదే. ఆత్మ లేకుండా చైతన్యము ఉండదు. 20వ శతాబ్దం ప్రారంభంలో, ఆచార్య జె. సి. బోస్, స్థావర జీవములైన మొక్కలు కూడా, భావోద్వేగాలు అనుభూతి చెంది, వాటికి ప్రతిస్పందిస్తాయని ప్రయోగాల ద్వారా నిరూపించాడు. ఆహ్లాదకరమైన సంగీతం మొక్కల పెరుగుదలను ఇనుమడింపచేస్తుంది అని ప్రయోగాల ద్వారా నిరూపించాడు. వేటగాడు ఒక చెట్టుపై కూర్చున్న పక్షిని కొట్టినప్పుడు, ఆ చెట్టులో జరిగే ప్రకంపనలు పక్షి కొరకై ఆ చెట్టు విలపించటాన్ని సూచిస్తాయి. ఎప్పుడైతే ఒక ప్రేమించే తోటమాలి తోటలోకి వచ్చినప్పుడు, చెట్లు చాలా సంతోషపడుతాయి. చెట్టులో జరిగే ప్రకంపనలు, చెట్టుకి కూడా చైతన్యము ఉంది, అది కూడా భావోద్వేగాలకు లోనవుతుంది అన్న విషయాన్ని తెలియచేస్తాయి. ఈ పరిశీలనలు అన్నీ - సమస్త జీవస్వరూపాలు చైతన్యమును కలిగి ఉంటాయి అని శ్రీ కృష్ణుడు చెప్పిన విషయాన్ని దృఢపరుస్తున్నాయి. అవన్నీ, చైతన్యమును కలిగించే నిత్య సనాతన జీవాత్మ మరియు భౌతిక శక్తిచే తయారుచేయబడ్డ జడ శరీరముల యొక్క కలయిక వలన ఏర్పడ్డవే.
సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ । వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ।। 28 ।।
28
13
https://www.holy-bhagava…udio/013_028.mp3
సమం — సమానముగా; సర్వేషు — సమస్త; భూతేషు — ప్రాణులలో; తిష్ఠంతం — వసిస్తూ; పరమ-ఈశ్వరమ్ — పరమాత్మ; వినశ్యత్సు — నశించేవాటిలో; అవినశ్యంతం — నాశములేనిదిగా ఉండి; యః — ఎవరైతే; పశ్యతి — చూచెదరో; సః — వారు; పశ్యతి — చూసినట్టు.
BG 13.28: సమస్త ప్రాణులలో, ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసినవాడే, మరియు ఆ రెంటినీ ఈ నశ్వరమైన శరీరంలో అనశ్వరమైన వాటిగా చూసినవాడే, నిజముగా చూసినట్టు.
శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం కూడా 'యః పశ్యతి స పశ్యతి' (అలా చూడగలిగినవారే, నిజముగా చూసినట్టు) అన్నపదాలు వాడిఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేహంలో కేవలం ఆత్మను చూస్తే సరిపోదు, భగవంతుడు పరమాత్మ స్వరూపంలో అన్ని దేహములలో స్థితమై ఉన్నాడు అని కూడా గమనించాలి. సర్వ భూతముల హృదయములో కూర్చుని ఉన్నాడు అని ఇంతకు క్రితం ఈ అధ్యాయం 13.23వ శ్లోకంలో చెప్పబడినది. అది భగవద్గీత 10.20వ మరియు 18.61వ శ్లోకాల్లో, మరియు ఇతర వేద శాస్త్రాల్లో కూడా చెప్పబడినది: ఏకో దేవః సర్వభూతేషు గూఢాః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా (శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.11) ‘భగవంతుడు ఒక్కడే. ఆయన సర్వ భూతముల హృదయములో ఉంటాడు. ఆయన సర్వ వ్యాపి. ఆయన సమస్త ఆత్మలకు పరమాత్మ.’ భవాన్ హి సర్వ-భూతానాం ఆత్మా సాక్షీ స్వ-దృక్ విభో (భాగవతం 10.86.31) ‘భగవంతుడు అన్ని జీవ ప్రాణుల యందు, సాక్షిగా, స్వామిగా స్థితమై ఉంటాడు.’ రామ బ్రహ్మ చినమయ అబినాసీ, సర్బ రహిత సబ ఉర పుర బాసీ (రామచరితమానస్) ‘సర్వోన్నత భగవానుడు శ్రీ రామ చంద్ర ప్రభువు, నిత్యుడు మరియు అన్నింటికీ అతీతుడు. సమస్త ప్రాణుల హృదయములో నివసిస్తూ ఉంటాడు.’ జీవాత్మ తన జనన-మరణ చక్ర ప్రయాణంలో ఒక శరీరం నుండి ఇంకొక శరీరం లోనికి వెళ్ళినప్పుడల్లా, పరమాత్మ దానితో పాటుగా వెళుతూ ఉంటాడు. సర్వ భూతములలో ఆ పరమాత్మను దర్శించటం సాధకుని జీవితాన్ని ఎలా మార్చివేస్తుందో శ్రీ కృష్ణుడు ఇప్పుడు పేర్కొంటున్నాడు.
సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ । న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ।। 29 ।।
29
13
https://www.holy-bhagava…udio/013_029.mp3
సమం — సమానముగా; పశ్యన్ — దర్శించి; హి — నిజముగా; సర్వత్ర — అన్ని చోట్లా; సమవస్థితమ్ — సమముగా స్థితమై ఉన్న; ఈశ్వరమ్ — పరమాత్మగా ఉన్న భగవంతుడు; న — చేయడు; హినస్తి — దిగజార్చుకొనుట; ఆత్మనా — మనస్సు చేత; ఆత్మానం — ఆత్మను; తతః — తద్వారా; యాతి — చేరును; పరాం — సర్వోన్నత; గతిం — గమ్యము
BG 13.29: సర్వ ప్రాణులలో సమానముగా, పరమాత్మగా ఉన్న ఆ భగవంతుడిని చూసేవారు, తమ మనస్సుచే తమను తామే దిగజార్చుకోరు. తద్వారా, వారు పరమ పదమునకు చేరుకుంటారు.
మనస్సు అనేది స్వతహాగా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటుంది, భౌతిక ప్రాపంచిక శక్తి చే తయారు చేయబడినది కావున, సహజంగానే భౌతిక సుఖాల వైపు మొగ్గు చూపుతుంది. మన మనస్సు యొక్క ఆలోచనలను అనుసరిస్తే, మనం ఇంకా ఇంకా భౌతిక ప్రాపంచికత లోతుకు దిగబడుతాము. ఈ మరింత క్రిందిక్రిందికి దిగజారిపోవటాన్ని నిరోధించాలంటే మనస్సుని బుద్ధి యొక్క సహాయంతో నియంత్రించాలి. దీనికోసం బుద్ధిని యదార్థమైన జ్ఞానంచే శక్తివంతం చేయాలి. ఎవరైతే, భగవంతుడిని పరమాత్మ స్వరూపంలో సర్వ భూతములలో దర్శిస్తారో, వారు ఈ జ్ఞానమునకు అనుగుణంగా బ్రతుకుతారు. ఇతరులతో తమకున్న సంబంధం నుండి వ్యక్తిగత లాభము మరియు స్వార్థ సుఖానుభవములను పొందటానికి ఆశింపరు. వారు చేసిన మంచి చేత వారిపట్ల మమకారం పెంచుకోరు, లేదా వారు చేసిన కీడు వల్ల వారిని ద్వేషింపరు. అంతేకాక, ప్రతివ్యక్తినీ భగవంతుని అంశముగా చూస్తూ, అందరి పట్ల చక్కటి ఆదరాన్ని, సేవా భావమును చూపుతారు. సహజంగానే వారు, అందరిలో ఉన్న భగవంతుడిని చూసినప్పుడు, ఇతరులను దుర్భాషలాడటం, మోసం చేయటం, లేదా అవమానించటం వంటి పనులను చేయరు. మరియు, మానవ జనితములైన వివక్షలు - జాతీయత, మతము, కులము, లింగ భేదము, హోదా, వర్ణము – వంటి వన్నీ అసందర్భమైనవిగా అయిపోతాయి. ఈ విధంగా వారు అందరిలో భగవంతుడిని దర్శించటం ద్వారా తమ మనస్సులను ఉన్నత స్థాయికి తీసుకు వెళతారు మరియు చిట్టచివరికి సర్వోత్కృష్ట లక్ష్యమును చేరుకుంటారు.
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః । యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి ।। 30 ।।
30
13
https://www.holy-bhagava…udio/013_030.mp3
ప్రకృత్య — ప్రకృతి స్వభావము చేత; ఏవ — నిజముగా; చ — మరియు; కర్మాణి — కర్మలు; క్రియమాణాని — చేయబడును; సర్వశః — అన్నీ; యః — ఎవరైతే; పశ్యతి — చూచెదరో; తథా — కూడా; ఆత్మానమ్ — జీవాత్మ; అకర్తారం — అకర్త (ఏమీ చేయదు); స — వారు; పశ్యతి — చూసినట్టు.
BG 13.30: (శరీరము యొక్క) అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే, దేహమునందున్న జీవాత్మ నిజానికి ఏపనీ చేయదు, అని అర్థంచేసుకున్నవారు నిజముగా చూసినట్టు.
తంత్ర భాగవతం ఇలా పేర్కొంటున్నది: ఆహంకారాత్ తు సంసారో భవేత్ జీవస్య న స్వతః, ‘ఈ శరీరమే నేను అనుకునే అహంకారము మరియు కర్తను (చేసేది) నేనే అన్న గర్వము , జీవాత్మని జనన-మరణ సంసారములో బంధించివేస్తాయి.’ భౌతిక దృక్పథంలో, అహంకారము అనేది మనలను మనం ఈ శరీరమే అనుకునేలా చేస్తుంది, అందుకే మనం శరీర కార్యములను, ఆత్మకు ఆపాదించి, ‘నేను ఇది చేస్తున్నాను... నేను అది చేస్తున్నాను’ అని అనుకుంటూఉంటాము. కానీ, జ్ఞానోదయమయిన జీవాత్మ, భుజించేటప్పుడు, త్రాగే టప్పుడు, మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు మరియు మిగతా అన్నీ పనులు చేసేటప్పుడు, శరీరమే ఈ పనులు అన్నీ చేస్తున్నది అని గమనిస్తుంది. అయినా, శరీరము చేసే పనులతో నాకు సంబంధం లేదు అని అది భావించరాదు. ఎలాగైతే, ఒక దేశం యుద్ధానికి వెళ్ళటానికి తీస్కున్న నిర్ణయానికి, ఆయనే స్వయంగా యుద్ధం చేయకపోయినా, ఆ దేశ అధిపతి బాధ్యుడో, ఆ విధంగానే, జీవప్రాణులు చేసే పనులకు, అవన్నీ శరీరం, మనస్సు, బుద్ధి లచే చేయబడినా, ఆత్మదే బాధ్యత. అందుకే ఆధ్యాత్మిక సాధకుడు ఈ రెండు పక్కలను మనస్సులో ఉంచుకోవాలి. వశిష్ఠ మహర్షి రాముడికి ఈ విధంగా ఉపదేశం చేసాడు. ‘రామా, పని చేసేటప్పుడు, ఫలితములు నీ పరిశ్రమ మీదనే ఆధారపడి ఉన్నట్లు పరిశ్రమించుము; కానీ మనస్సులో మాత్రం చేసేది నీవు కాదు అని గుర్తుంచుకో.’
యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి । తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ।। 31 ।।
31
13
https://www.holy-bhagava…udio/013_031.mp3
యదా — ఎప్పుడైతే; భూత — ప్రాణులు; పృథక్-భావమ్ — విభిన్నమైన రకాలు; ఏక-స్థం — ఒకచోటనే స్థితమై ఉన్నట్టు; అనుపశ్యతి — చూచెదరో; తతః — ఆ తదుపరి; ఏవ — నిజముగా; చ — మరియు; విస్తారం — జనించిన; బ్రహ్మ — బ్రహ్మాం; సంపద్యతే — (వారు) పొందెదరు; తదా — అప్పుడు.
BG 13.31: విభిన్న వైవిధ్యములతో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు, మరియు అవన్నీ దానినుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు, వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు.
సముద్రము తానే అలలుగా, నురగగా, సుడులుగా, తరంగములగా మార్చుకుంటుంది. ఎవరికైనా ఇవన్నీ వేర్వేరుగా మొదటిసారి చూపిస్తే, వారు ఇవన్నీ వేర్వేరు అని అనుకుంటారు. కానీ, సముద్రము గురించి తెలిసిన వ్యక్తి, ఆ విభిన్నమైన వాటన్నిటిలో అంతర్లీనంగా ఉన్న ఏకత్వమును చూస్తాడు. అదే విధంగా, అతిచిన్న అమీబా నుండి అత్యంత శక్తివంతులైన దేవతల వరకూ, ఎన్నెన్నో రకాల జీవ రాశులు ఉన్నాయి. అవి అన్నీ కూడా ఒకే సత్యము పై స్థితమై ఉన్నాయి - అదే జీవాత్మ, అది భగవంతుని అంశము; అది భౌతిక శక్తితో తయారుచేయబడిన శరీరము యందు కూర్చుని ఉంటుంది. ఇన్ని రూపముల వైవిధ్యము వచ్చినది, ఆత్మ వలన కాదు, అది భౌతిక శక్తిచే తయారుచేయబడిన విభిన్న శరీరముల వలన మాత్రమే. జన్మించే సమయంలో, సమస్త ప్రాణుల శరీరములు, భౌతిక శక్తిచే సృష్టించబడతాయి, మరిణించిన పిదప అవి అన్నీ మళ్లీ దానిలోనే కలిసిపోతాయి. విభిన్నములైన జీవరాశులు అన్నీ ఒకే భౌతిక శక్తి యందు స్థితమై ఉన్నట్టు గమనించినప్పుడు, మనం ఈ భిన్నత్వం వెనుక ఉన్న ఏకత్వమును తెలుసుకోవచ్చు. మరియు ప్రకృతి స్వభావము భగవంతుని శక్తి కావున ఇటువంటి జ్ఞానము, ఒకే ఆధ్యాత్మిక అస్తిత్వము జగత్తు అంతటా వ్యాప్తమై ఉన్నది, అని గ్రహించేటట్లు మనలను చేస్తుంది. ఇది బ్రహ్మ పరిజ్ఞానమునకు దారి తీస్తుంది.
అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః । శరీరస్థోఽపి కౌంతేయ న కరోతి న లిప్యతే ।। 32 ।।
32
13
https://www.holy-bhagava…udio/013_032.mp3
అనాదిత్వాత్ — అనాది అయినది; నిర్గుణత్వాత్ — ఎటువంటి భౌతిక గుణములు లేకుండా; పరమ-ఆత్మా — పరమాత్మ; అయం — ఇది; అవ్యయః — నాశరహితుడు; శరీర-స్థ — శరీరములో నివసిస్తూ; అపి — అయినా సరే; కౌంతేయ — అర్జునా, కుంతీ దేవి తనయుడా; న కరోతి — ఏమీ చేయడు; న లిప్యతే — ఏమీ అంటదు.
BG 13.32: ఓ కుంతీ తనయుడా, పరమాత్మ నాశములేనిది, అనాదియైనది, భౌతిక లక్షణములు ఏవీ లేనిది. దేహములోనే స్థితమై ఉన్నా, అది ఏమీ చేయదు, మరియు, భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితము కాదు.
సమస్త ప్రాణుల హృదయములలో పరమాత్మగా స్థితమై ఉన్న భగవంతుడు, ఎప్పుడూ శరీరముతో అనుసంధానం కాడు, లేదా దేహము యొక్క స్థితిగతులచే ప్రభావితం కాడు. భౌతిక శరీరంలో ఉన్నంత మాత్రాన, ఆయన ఏ కోశానా భౌతిక పరంగా అవ్వడు, ఆయన కర్మ సిద్ధాంతమునకు అతీతుడు మరియు జనన మరణ చక్రమునకు లోబడి ఉండడు, కానీ ఇవి జీవాత్మకు అనుభవంలోకి వస్తాయి.
యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే । సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ।। 33 ।।
33
13
https://www.holy-bhagava…udio/013_033.mp3
యథా — ఎలాగైతే; సర్వ-గతం — అన్నింటిలో వ్యాప్తమై ఉన్న; సౌక్ష్మ్యాత్ — సూక్ష్మమైనది కావున; ఆకాశం — ఖాళీ జాగా; న-ఉపలిప్యతే — కళంకితము కాదో; సర్వత్రా — అన్ని చోట్లా; అవస్థితః — స్థితమై ఉండునో; దేహే — దేహము; తథా — అదే విధముగా; ఆత్మా — ఆత్మ; న ఉపలిప్యతే — కళంకితము కాదు.
BG 13.33: ఆకాశము (ఖాళీ జాగా) అన్నింటిని తనలోనే కలిగిఉంటుంది, కానీ సూక్ష్మమైనది కావటం వలన, తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితముకాదు. అదే విధముగా, దేహములో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్నా, ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు.
తాను దేహమే అన్న అనుభూతిని కలిగించే అహంకారము వలన, ఆత్మ - నిద్రపోవటం, నడవటం, అలసట, ఉల్లాసం మొదలైన స్థితిగతులని అనుభవిస్తుంటుంది. శరీరములో జరిగే పరిణామాలు ఆత్మను ఎందుకు ప్రభావితం చేయవు అన్న సందేహం మనకు రావచ్చు. శ్రీ కృష్ణుడు దీనిని ఆకాశము యొక్క ఉదాహరణతో వివరిస్తున్నాడు. అది అన్నింటినీ కలిగి ఉంటుంది మరియు దేనిచే ప్రభావితం కాదు, ఎందుకంటే అది తనలో ఉండే స్థూలవస్తువులకన్నా సూక్ష్మమైనది. అదే విధముగా, ఆత్మ అనేది చాలా సూక్ష్మమైన శక్తి స్వరూపము. భౌతిక శరీరముతో అనుసంధానమై ఉన్నా అది తన దివ్యత్వమును అలాగే ఉంచుకుంటుంది.
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః । క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ।। 34 ।।
34
13
https://www.holy-bhagava…udio/013_034.mp3
యథా — ఎలాగైతే; ప్రకాశయతి — ప్రకాశింపచేయుట; ఏకః — ఒకటి; కృత్స్నం — సమస్త; లోకం — సౌరకుటుంబము; ఇమం — ఇది; రవిః — సూర్యుడు; క్షేత్రం — శరీరము; క్షేత్రీ — ఆత్మ (జీవాత్మ); తథా — అదేవిధంగా; కృత్స్నం — మొత్తం; ప్రకాశయతి — ప్రకాశింపచేయును; భారతః — అర్జునా, భరత వంశీయుడా.
BG 13.34: ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌరకుటుంబమును ప్రకాశింపచేయునో, అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును (చైతన్యము చే) ప్రకాశింపచేయును.
ఆత్మ, తను ఉన్న దేహమును చైతన్యముచే తేజోమయం చేసినా, అది మాత్రం చాలా చాలా చిన్నది. ఏషో ఽణురాత్మా (ముండకోపనిషత్తు 3.1.9) ‘ఆత్మ అనేది పరిమాణంలో చాలా చాలా చిన్నది.’ శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: బాలాగ్రశతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవః స విజ్ఞేయః స చానంత్యాయ కల్పతే (5.9) ‘ఒక వెంట్రుక యొక్క చివరిభాగాన్ని వంద భాగాలుగా విభజిస్తే, మరియు దాని యొక్క ఒక్కొక్క ముక్కని ఇంకా వంద భాగాలుగా చేస్తే, మనకు ఆత్మ యొక్క పరిమాణం తెలుస్తుంది. ఈ ఆత్మలు అసంఖ్యాకమైనవి ఉన్నాయి.’ ఆత్మ యొక్క సూక్ష్మత్వం చెప్పటానికి ఇదొక ఉదాహరణ. ఇటువంటి అత్యంతసూక్ష్మమైన ఆత్మ, మరి ఇంత పెద్ద శరీరమును ఎలా శక్తివంతం చేస్తుంది? శ్రీ కృష్ణుడు దీనిని సూర్యుని ఉపమానముతో వివరిస్తున్నాడు. ఒక్క చోటనే స్థితమై ఉన్నా, సూర్యుడు తన ప్రకాశంతో సమస్త సౌరకుటుంబమును ప్రకాశితం చేస్తున్నాడు. అదే విధముగా, వేదాంత దర్శనం ఇలా పేర్కొంటున్నది: గుణాద్వా లోకవత్ (2.3.25) ‘ఆత్మ, హృదయ స్థానంలోనే స్థితమై ఉన్నా, తన యొక్క చైతన్యమును శరీర క్షేత్రమంతా వ్యాపింపచేస్తుంది.’
క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమ్ అంతరం జ్ఞానచక్షుషా । భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్ ।। 35 ।।
35
13
https://www.holy-bhagava…udio/013_035.mp3
క్షేత్ర — శరీరము; క్షేత్రజ్ఞయోః — శరీరమును తెలిసినవాడు; ఏవం — ఈ విధంగా; అంతరం — తేడా; జ్ఞాన-చక్షుషా — జ్ఞాన చక్షువులచే (జ్ఞానమనే కళ్ళతో); భూత — ప్రాణి; ప్రకృతి-మోక్షం — భౌతిక ప్రకృతి నుండి విముక్తి; చ — మరియు; యే — ఎవరైతే; విదుః — తెలుసుకొంటారో; యాంతి — చేరుకుందురు; తే — వారు; పరమ్ — సర్వోన్నత స్థాయిని.
BG 13.35: జ్ఞాన-చక్షువులచే, ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భేదమును గ్రహించేవారు, మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసినవారు, పరమ పదమును చేరుకుంటారు.
తనదైన సహజ శైలిలో శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క విషయమును, ఇప్పటివరకూ చెప్పిన దాని సారాంశము చెపుతూ ముగిస్తున్నాడు. నిజమైన జ్ఞానము అంటే, భౌతికమైన క్షేత్రము మరియు అలౌకికమైన క్షేత్రజ్ఞుడు గురించి తెలుసుకోటమే. ఇటువంటి విచక్షణా పూర్వక జ్ఞానము కలిగినవారు తమను తాము భౌతిక శరీరము అనుకోరు. తమ యొక్క ఆధ్యాత్మిక అస్తిత్వమును జీవాత్మగా మరియు భగవంతుని యొక్క అంశము లాగా గుర్తించుకుంటారు. కాబట్టి, వారు ఆధ్యాత్మిక పురోగతి పథమునే కోరుకొని, భౌతిక ప్రకృతి నుండి విముక్తిని కోరుకుంటారు. ఆ తర్వాత, ఆధ్యాత్మిక జ్ఞానోదయ మార్గంలో పయనించి, అటువంటి వివేకవంతులు, వారి యొక్క అత్యున్నత లక్ష్యమైన భగవత్ ప్రాప్తిని పొందుతారు.
శ్రీ భగవానువాచ । పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ । యద్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ।। 1 ।।
1
14
https://www.holy-bhagava…udio/014_001.mp3
శ్రీ-భగవాన్-ఉవాచ — భగవానుడు ఇలా పలికెను; పరం — సర్వోన్నత; భూయః — మరల; ప్రవక్ష్యామి — నేను వివరిస్తాను; జ్ఞానానాం — అన్ని జ్ఞానములోకెల్లా; జ్ఞానమ్-ఉత్తమమ్ — సర్వోన్నత జ్ఞానము; యత్ — ఏదైతే; జ్ఞాత్వా — తెలుసుకున్న పిదప; మునయః — మునులు; సర్వే — అందరూ; పరాం — అత్యున్నత; సిద్ధిమ్ — పరిపూర్ణతను (సిద్ధిని); ఇతః — దీని ద్వారా; గతాః — పొందినారు.
BG 14.1: శ్రీ భగవానుడు పలికెను: నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్ఠమైన విద్యను, అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమును నీకు వివరిస్తాను; ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు.
ఇంతకు క్రితం అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, ఆత్మ మరియు భౌతిక పదార్థ మేళనముతోనే సమస్త జీవ భూతములు తయారైనాయి అని చెప్పి ఉన్నాడు. భౌతిక ప్రకృతియే పురుషుని (ఆత్మ) కొరకు క్షేత్రమును సృష్టిస్తుంది అని కూడా వివరించి ఉన్నాడు. ఇది తనకు తానే స్వతంత్రముగా జరిగిపోదు, ప్రాణుల దేహములోనే స్థితమై ఉన్న పరమేశ్వరుడైన భగవంతుని దిశానిర్దేశం ప్రకారమే జరుగుతుంది అని కూడా చెప్పాడు. ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు ప్రకృతి త్రిగుణముల గురించి విస్తారముగా వివరిస్తాడు. ఈ జ్ఞానమును తెలుసుకొని మరియు అంతఃకరణలో ఆచరణాత్మక విజ్ఞానముగా స్థిరపరుచుకున్న పిదప, మనము అత్యున్నత పరిపూర్ణతకు ఎదగవచ్చు.
ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః । సర్గేఽపి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ ।। 2 ।।
2
14
https://www.holy-bhagava…udio/014_002.mp3
ఇదం — ఈ యొక్క; జ్ఞానమ్ — జ్ఞానము; ఉపాశ్రిత్య — ఆశ్రయించి; మమ — నా యొక్క; సాధర్మ్యం — అటువంటి స్వభావము; ఆగతాః — పొందిన పిదప; సర్గే — సృష్టి సమయంలో; అపి — కూడా; న ఉపజాయంతే — జన్మించరు; ప్రలయే — ప్రళయ కాలమున; న-వ్యథంతి — వేదనకు గురి కారు; చ — మరియు.
BG 14.2: ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వారు, సృష్టి సమయంలో మరలా జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు.
తను అనుగ్రహించబోయే ఈ జ్ఞానమును అర్థం చేసుకున్నవారు, పదేపదే ఒక తల్లి గర్భములో ఉండవలసిన అవసరం ఉండదు అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి హామీ ఇస్తున్నాడు. వారు, ప్రళయ కాలంలో భగవంతుని ఉదరములో అచేతావస్థలో ఉండిపోవల్సిన అవసరం కానీ, లేదా, తదుపరి సృష్టి క్రమంలో మళ్లీ పుట్టటం కానీ, జరుగదు. ఈ ప్రకృతి త్రిగుణములే యదార్థముగా బంధనమునకు కారణము, మరియు వాటి యొక్క జ్ఞానము ఈ కర్మబంధనము నుండి విముక్తి మార్గాన్ని ప్రకాశింపఁజేస్తూ సుగమం చేస్తుంది. శ్రీ కృష్ణుడు, తన శిష్యుడిని ఏకాగ్రతతో వినేట్టు చేయటం కోసం, తను ఉపదేశంచేయబోయే దాని యొక్క ఫలమును పదేపదే పేర్కొనటం చేస్తుంటాడు. 'న వ్యథంతి' అంటే ‘వారు దుఃఖాన్ని అనుభవించరు’ అని అర్థం. 'సాధర్మ్యం' అంటే వారు భగవంతుని లాంటి, ‘అదే రకమైన దివ్య స్వభావాన్ని’, పొందుతారు అని అర్థం. ఎప్పుడైతే జీవాత్మ భౌతిక శక్తి నుండి విడుదల చేయబడుతుందో, అది భగవంతుని యొక్క దివ్య యోగమాయా శక్తి ఆధీనములోనికి వస్తుంది. ఆ దివ్య యోగమాయా శక్తి, జీవాత్మకు భగవంతుని యొక్క దివ్య జ్ఞానమును, ప్రేమను, మరియు ఆనందమును అందిస్తుంది. తద్వారా, ఆ జీవాత్మ, భగవంతుని లాగా అయిపోతుంది - అది ఇక దైవీ గుణములను పొంది ఉంటుంది.
మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహమ్ । సంభవః సర్వభూతానాం తతో భవతి భారత ।। 3 ।। సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః । తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా ।। 4 ।।
3
14
https://www.holy-bhagava…/014_003-004.mp3
మమ — నా యొక్క; యోనిః — గర్భము; మహత్ బ్రహ్మ — సమస్త భౌతిక పదార్థము, ప్రకృతి; తస్మిన్ — దానిలో; గర్భం — గర్భము; దధామి — ప్రవేశపెట్టెదను; అహం — నేను; సంభవః — పుట్టుట; సర్వభూతానాం — సమస్త ప్రాణులు; తతః — ఆ విధముగా; భవతి — జరుగును; భారత — అర్జునా, భరత వంశీయుడా; సర్వ — సమస్త; యోనిషు — జీవ రాశులు; కౌంతేయ — అర్జునా, కుంతీ దేవి పుత్రుడా; మూర్తయః — రూపములు; సంభవంతి — సంభవించును (జనించును); యాః తాసాం — అవి అన్నింటిలో కూడా; బ్రహ్మ-మహత్ — ఈ గొప్ప భౌతిక ప్రకృతి; యోనిః — గర్భము; అహం — నేను; బీజ-ప్రదః — బీజమును ఇచ్చే; పితా — తండ్రి.
BG 14.3-4: ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి, గర్భము. దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడుతాను, ఆ విధంగా సమస్త జీవభూతములు జనిస్తాయి. ఓ కుంతీ పుత్రుడా, పుట్టిన సమస్త జీవ రాశులకు, ఈ భౌతిక ప్రకృతియే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని.
7వ మరియు 8వ అధ్యాయములలో వివరించినట్టుగా, భౌతిక జగత్తు, సృష్టి-స్థితి-లయము అనే చక్రమును అనుసరిస్తుంది. లయకాలములో, ఈశ్వరునికి విముఖమై ఉన్న ఆత్మలు, శ్రీమహా విష్ణు శరీరములో అచేతనావస్థలో పడి ఉంటాయి. భౌతిక శక్తి, ప్రకృతి, కూడా భగవంతుని మహోదరములో అవ్యక్తముగా నిలిచి ఉంటుంది. భగవంతుడు సృష్టి చక్రమును ప్రారంభించటానికి సంకల్పించినప్పుడు, ఆయన ప్రకృతి వైపు దృష్టి సారిస్తాడు. దానితో అది విచ్చుకోవటం ప్రారంభమవుతుంది, మరియు ఒకదాని తర్వాత ఒకటి మహత్తు, అహంకారము, పంచ-తన్మాత్రలు మరియు పంచ-మహాభూతములు సృష్టించబడతాయి. అంతేకాక, ద్వితీయ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సహకారంతో, భౌతిక శక్తి విభిన్నములైన జీవ స్వరూపములను సృష్టిస్తుంది, మరియు భగవంతుడు ఆత్మలను వాటి పూర్వ కర్మల అనుసారం, వాటిని సముచితమైన శరీరాలలో ప్రవేశపెడుతాడు. ఈ విధంగా, ప్రకృతి, గర్భము వంటిది మరియు ఆత్మలు (జీవులు) రేతస్సు వంటిది అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. ప్రకృతి తల్లి గర్భములో ఆయన ఆత్మలను ప్రవేశపెట్టడం ద్వారా అనేకానేక జీవరాశులు పుడుతున్నాయి. మహర్షి వేద వ్యాసుడు కూడా శ్రీమద్ భాగవతంలో ఇదే విధముగా వివరించి ఉన్నాడు. దైవాత్ క్షుభిత-ధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరః పుమాన్ ఆధత్త వీర్యం సాసూత మహత్తత్త్వం హిరణ్మయమ్ (3.26.19) ‘భౌతిక ప్రకృతి గర్భములో పరమేశ్వరుడు జీవాత్మలను ప్రవేశపెడుతాడు. ఆ తర్వాత ప్రతి ఒక్క జీవాత్మకు వాటివాటి కర్మరాశి అనుగుణంగా, ప్రకృతి, వాటికి తగిన దేహములను తయారుచేస్తుంది.’ ఆయన అన్ని ఆత్మలను ఈ భౌతిక జగత్తు లోనికి ప్రవేశపెట్టడు, కేవలం ఈశ్వర విముఖమైన వాటినే తెస్తాడు.
మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహమ్ । సంభవః సర్వభూతానాం తతో భవతి భారత ।। 3 ।। సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః । తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా ।। 4 ।।
4

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః । నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ।। 5 ।।
5
14
https://www.holy-bhagava…udio/014_005.mp3
సత్త్వం — సత్త్వ గుణము; రజః — రజో గుణము; తమః — తమో గుణము; ఇతి — ఈ విధముగా; గుణాః — గుణములు; ప్రకృతి — భౌతిక ప్రకృతి; సంభవాః — కలిగి ఉండును; నిబధ్నంతి — బంధించును; మహాబాహో — గొప్ప బాహువులు కలవాడా; దేహే — దేహములో; దేహినమ్ — జీవాత్మ; అవ్యయం — సనాతనమైన.
BG 14.5: ఓ మహా బాహువులు కల అర్జునా, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది - సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణము. ఈ గుణములే నాశములేని నిత్య జీవాత్మను నశ్వర దేహమునకు బంధించును.
పురుషుడు మరియు ప్రకృతి చేతనే సమస్త జీవ రాశులు ఉద్భవించాయి అని చెప్పిన శ్రీ కృష్ణుడు ఇక తదుపరి పద్నాలుగు శ్లోకములలో ప్రకృతి జీవాత్మను ఎలా బంధించివేస్తుందో వివరిస్తాడు. ఆత్మ, దివ్యమైనది అయినా, తననుతాను శరీరమే అనుకుంటుంది కావున అది భౌతిక ప్రకృతికి కట్టివేయబడుతుంది. భౌతిక శక్తి మూడు గుణములను కలిగి ఉంటుంది - సత్త్వము, రజస్సు, మరియు తమస్సు. కాబట్టి ప్రకృతిచే తయారుచేయబడిన శరీరము, మనస్సు, మరియు బుద్ధి, ఈ మూడింటికి కూడా త్రిగుణములు ఉంటాయి. మూడు రంగులతో చేసే ప్రింటింగ్‌ని ఉదాహరణగా చూడండి. ఒకవేళ ఏదో ఒక రంగు కాస్త ఎక్కువగా పేపర్ మీదకు పంపబడితే, కాగితం పై బొమ్మ, ఆ రంగుతో కనబడుతుంది. అదే విధంగా, ప్రకృతి ఈ మూడు రంగుల సిరా కలిగి ఉన్నది. వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలు, బాహ్య పరిస్థితులు, పాత సంస్కారములు మరియు ఇతర అంశాలపై ఆధారపడి, వీటిలో ఏదో ఒక గుణము ఆ వ్యక్తిలో ప్రబలంగా కనిపిస్తుంది. ఏ గుణము ఎక్కువ ప్రభావంగా ఉంటూ ఉంటుందో, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వముపై ఆ రంగు ప్రభావము ప్రబలముగా ఉంటుంది. కాబట్టి, జీవాత్మ ఈ మూడు గుణములచే ప్రభావితం అవుతుంది. శ్రీ కృష్ణుడు ఇప్పుడు జీవులపై ఈ గుణముల ప్రభావమును ఇక వివరిస్తాడు.
తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ । సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ।। 6 ।।
6
14
https://www.holy-bhagava…udio/014_006.mp3
తత్ర — వీటిలో; సత్త్వం — సత్త్వ గుణము; నిర్మలత్వాత్ — అతి పవిత్రమైనది కావున; ప్రకాశకం — ప్రకాశవంతమయినది; అనామయమ్ — ఆరోగ్యవంతమయినది మరియు క్షేమదాయకమైనది; సుఖ — సుఖము; సంగేన — మమకారాసక్తి; బధ్నాతి — బంధించివేయును; జ్ఞాన — జ్ఞానము; సంగేన — మమకారాసక్తి; చ — మరియు; అనఘ — అర్జునా, పాపరహితుడా.
BG 14.6: వీటిలో సత్త్వ గుణము మిగతావాటి కంటే పవిత్రమైనది కావుటచే, ఇది ప్రకాశకమైనది మరియు చాలా క్షేమదాయకమైనది. ఓ పాపరహితుడా, సుఖానుభవము మరియు జ్ఞానము పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించివేస్తుంది.
ప్రకాశకం అంటే ‘ప్రకాశింపచేసేది’ అని అర్థం. అనామయం అంటే ‘ఆరోగ్యవంతము మరియు సంపూర్ణ క్షేమదాయకము’ అని అర్థం; దీనినే పొడిగింపుగా, బాధ, అసౌకర్యము, మరియు దుఃఖములు ఏవీ లేకుండా, ‘ప్రశాంత స్వభావము’ అని కూడా అనవచ్చు. సత్త్వ గుణము నిర్మలమైనది మరియు ప్రకాశింపచేసేది. ఈ విధంగా, సత్త్వ గుణము అనేది మనిషి యొక్క వ్యక్తిత్వములో సద్గుణమును పెంపొందించి, బుద్ధిని జ్ఞానముచే ప్రకాశింపచేయును. అది వ్యక్తిని నిర్మలంగా, తృప్తితో, దానగుణముతో, కారుణ్యంతో, సహాయకారిగా, స్థిమితముగా, మరియు ప్రశాంతముగా చేస్తుంది. అది చక్కటి ఆరోగ్యమును మరియు వ్యాధుల నుండి విముక్తినీ ఇస్తుంది. సత్త్వ గుణము ప్రశాంతతను మరియు సుఖమును ఇస్తుంది కానీ, వీటి పట్ల మమకారాసక్తియే ఆత్మను భౌతిక ప్రకృతికి కట్టివేస్తుంది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థంచేసుకుందాం. ఒక బాటసారి అడవి గుండా ప్రయాణిస్తున్నప్పుడు ముగ్గురు బందిపోటు దొంగలు దాడిచేశారు. మొదటి వాడు, ‘వీడిని చంపేసి వాడి సొమ్మంతా దోచేద్దాం’ అన్నాడు. రెండవ వాడు, ‘వద్దు, వాడిని చంపొద్దు, కేవలం కట్టిపడేసి వాడి దగ్గర ఉన్నవి అంతా తీసుకెళ్లిపోదాం’ అన్నాడు. ఆ రెండవ దొంగ చెప్పిన సలహా ప్రకారం, బాటసారిని కట్టేసి అతని సొమ్మంతా దోచుకున్నారు. వారు కొంత దూరం వెళ్ళిపోయిన తరువాత, మూడవ దొంగ తిరిగొచ్చాడు. వాడు ఆ బాటసారి కట్లు ఇప్పేసి, అడవి చివర వరకూ తీసుకువెళ్లి , బయటకి దారి చూపించి, ఇలా అన్నాడు ‘నేను బయటకురాలేను, కానీ నీవు ఈ మార్గంలో వెళ్తే అడవి బయటకు వెళ్లగలవు.’ అని. ఈ ఉదాహరణలో, మొదటి బందిపోటు తమో-గుణము. అది ఆత్మను, సోమరితనం, నిర్లక్ష్యము మరియు అజ్ఞానంతో నిజంగానే చంపటానికి ప్రయత్నిస్తుంది. రెండవ బందిపోటు, రజో-గుణము, అది ప్రాణులలో ఆవేశఉద్వేగాలను జనింప చేస్తుంది, మరియు ఆత్మను అసంఖ్యాకమైన ప్రాపంచిక కోరికలతో బంధించివేస్తుంది. మూడవ బందిపోటు, సత్త్వ గుణము, అది జీవుల దుష్టగుణములను తగ్గిస్తుంది, భౌతిక అసౌఖ్యమును తగ్గిస్తుంది మరియు ఆత్మను సంక్షేమ మార్గంలో పెడుతుంది. అయినా , సత్త్వ గుణము కూడా భౌతిక ప్రకృతి యొక్క పరిధి లోనే ఉన్నది. మనము దాని పట్ల మమకారాసక్తి తో ఉండకూడదు; పైగా, అలౌకిక స్థాయికి చేరుకోవటానికి దానిని ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలి. ఈ మూడింటికి అతీతముగా, శుద్ధ-సత్త్వ గుణము ఉంటుంది, ఇది అలౌకిక సత్త్వ గుణము. అది భౌతిక శక్తికి అతీతమైన భగవంతుని యొక్క దివ్యమైన శక్తి యొక్క గుణము. ఎప్పుడైతే ఆత్మ భగవత్ ప్రాప్తి పొందుతుందో, ఆయన యొక్క కృపచే, భగవంతుడు ఆ జీవాత్మకు శుద్ధ సత్వమును ప్రసాదిస్తాడు, దానితో ఆయొక్క ఇంద్రియమనోబుద్ధులు దివ్యమైనవిగా అవుతాయి.
రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ । తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ।। 7 ।।
7
14
https://www.holy-bhagava…udio/014_007.mp3
రజః — రజో గుణము; రాగ-ఆత్మకం — మోహావేశ స్వభావము; విద్ధి — తెలుసుకొనుము; తృష్ణా — కోరికలు; సంగ సముద్భవమ్ — సంగము చే ఉద్భవించును; తత్ — అది; నిబధ్నాతి — బంధించేవేయును; కౌంతేయ — అర్జున, కుంతీ పుత్రుడా; కర్మ-సంగేన — కామ్య కర్మల పట్ల ఆసక్తి వలన; దేహినమ్ — జీవాత్మ.
BG 14.7: ఓ అర్జునా, రజో గుణము మోహావేశ ప్రవృత్తితో కూడినది. అది ప్రాపంచిక కోరికలు మరియు మమకారముల వల్ల జనిస్తుంది మరియు ఆత్మను కామ్యకర్మల పట్ల ఆసక్తిచే బంధించివేస్తుంది.
శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు రజో గుణము యొక్క పనితీరును, అది జీవాత్మను భౌతిక అస్తిత్వమునకు ఎలా కట్టివేస్తుందో వివరిస్తున్నాడు. భౌతిక ప్రాపంచిక వ్యవహారములే రజో గుణము యొక్క ప్రధానమైన ప్రకటితము అని పతంజలి యోగ దర్శనం వివరిస్తుంది. ఇక్కడ, శ్రీ కృష్ణ పరమాత్మ, దానియొక్క ప్రధానమైన వ్యక్తీకరణ, మమకారాసక్తి మరియు కోరికలు అని చెప్తున్నాడు. రజో గుణము అనేది ఇంద్రియ భోగముల కోసం ఉన్న కామమును మరింత పెంచుతుంది. అది శారీరక మరియు మానసిక వాంఛలను ప్రజ్వలింప చేస్తుంది. అది ప్రాపంచిక విషయముల పట్ల మమకారాసక్తులను పెంచుతుంది. రజో గుణముచే ప్రభావితమైన వ్యక్తులు - హోదా, ప్రతిష్ఠ, వృత్తిలో విజయం, కుటుంబము మరియు ఇల్లు - వంటి ప్రాపంచికమైన వాటి పట్ల నిమగ్నమై ఉంటారు. వీటిని ఆనంద కారకములుగా భావించి, వాటి కొరకై నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటారు. ఈ విధంగా, రజో గుణము కోరికలను మరింత పెంచుతుంది మరియు ఈ కోరికలు రజో గుణమును మరింత పెంచుతాయి. ఇవి, పరస్పరం ఇనుమడింపచేసుకుని, జీవాత్మను ప్రాపంచిక జీవితంలో కట్టి వేస్తాయి. కర్మయోగ ఆచరణచే దీనిని ఛేదించి బయటపడవచ్చు. అంటే, మన కర్మల యొక్క ఫలములను భగవంతునికే అర్పించటం ప్రారంభించటం అన్నమాట. ఇది ప్రపంచం పట్ల అనాసక్తి (మమకారరాహిత్యము) ని కలుగచేస్తుంది, మరియు రజో గుణము యొక్క తీవ్రతను శాంతింపజేస్తుంది.
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ । ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ।। 8 ।।
8
14
https://www.holy-bhagava…udio/014_008.mp3
తమః — తమో గుణము; తు — కానీ; అజ్ఞాన-జం — అజ్ఞానము వలన జనించిన; విద్ధి — తెలుసుకొనుము; మోహనం — భ్రమ; సర్వ-దేహినామ్ — సమస్త బద్ధ జీవాత్మలకు; ప్రమాద — నిర్లక్ష్యము; ఆలస్య — సోమరితనము; నిద్రాభిః — మరియు నిద్ర; తత్ — అది; నిబధ్నాతి — బంధించి వేయును; భారత — అర్జునా, భరత వంశీయుడా.
BG 14.8: ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది.
తమో గుణము సత్త్వ గుణమునకు విరుద్ధమైనది. దానిచే ప్రభావితమైన జనులు నిద్ర, సోమరితనము, మత్తు, హింస, మరియు జూదముచే ఆనందమును అనుభవిస్తారు. ఏది మంచి లేదా ఏది చెడు అన్న విచక్షణను వారు కోల్పోతారు; మరియు తమ స్వార్థ ప్రయోజనం కోసం అనైతికమైన పనులు చేయటానికి వెనుకాడరు. వారి కర్తవ్యమును వారు చేయటమే వారికి భారంగా అవుతుంది మరియు వారు దానిని నిర్లక్ష్యం చేస్తారు, మరియు మరింత సోమరితనానికి, నిద్రకు అలవాటైపోతారు. ఈ ప్రకారంగా, తమో గుణము జీవాత్మను అజ్ఞానపు చీకటి లోనికి మరింత నెట్టివేస్తుంది. జీవాత్మ, తన యొక్క దివ్య అస్తిత్వమును, జీవిత లక్ష్యమును మరియు పురోగతికై మానవ జన్మ ఇచ్చే అపూర్వ అవకాశమును పూర్తిగా విస్మరిస్తుంది.
సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత । జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ।। 9 ।।
9
14
https://www.holy-bhagava…udio/014_009.mp3
సత్త్వం — సత్త్వ గుణము; సుఖే — సుఖములకు; సంజయతి — కట్టివేయును; రజః — రజో గుణము; కర్మణి — కర్మల పట్ల; భారత — అర్జునా, భరత వంశీయుడా; జ్ఞానం — జ్ఞానము; ఆవృత్య — ఆవరించివేయును; తు — కానీ; తమః — తమో గుణము; ప్రమాదే — భ్రమ/మోహములో; సంజ యతి — బంధించేవేయును; ఉత — నిజముగా.
BG 14.9: సత్త్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది; రజో గుణము జీవాత్మకు కర్మల పట్ల ఆసక్తి కలిగిస్తుంది; మరియు తమో గుణము జ్ఞానమును కప్పివేసి వ్యక్తిని మోహభ్రాంతికి బంధించివేస్తుంది.
సత్త్వ గుణములో భౌతిక జీవన క్లేశములు తగ్గుతాయి, మరియు ప్రాపంచిక కోరికలు తగ్గుముఖం పడతాయి. ఇది వ్యక్తి యొక్క స్థితిలో ఒకలాంటి సంతుష్టిని కలుగచేస్తుంది. ఇది మంచిదే, కానీ దీనితో ఒక ఇబ్బంది కూడా ఉంది. ఉదాహరణకు, ప్రపంచంలో క్లేశములకు గురైనవారు మరియు మనస్సులో ప్రాపంచిక కోరికలతో సతమతమై పోయేవారు వారి సమస్యలకై పరిష్కారమును వెదుకుతూ ఉంటారు, ఈ ప్రయత్నమే కొన్నిసార్లు వారిని ఆధ్యాత్మికత వైపు తెస్తుంది. కానీ, సత్త్వ గుణములో ఉన్నవారు ఒకలాంటి నిశ్చింతమైన తృప్తితో ఉండిపోయి, అలౌకిక స్థాయికి చేరుకోవటానికి ఉత్సాహం చూపరు. మరియు, సత్త్వ గుణము బుద్ధిని జ్ఞానముచే ప్రకాశవంతము చేస్తుంది. దీనితో పాటుగా ఆధ్యాత్మిక వివేకము లేకపోతే, జ్ఞానముతో గర్వము పెరిగి, ఆ గర్వము భగవత్ భక్తిలో అడ్డుగా వస్తుంది. దీనిని మనము తరచుగా శాత్రవేత్తలు, విద్యావేత్తలు, పండితులు మొదలైన వారిలో గమనించవచ్చు. వీరిలో సత్త్వ గుణము సాధారణంగా ఎక్కువ ప్రభావశీలంగా ఉంటుంది, ఎందుకంటే వారి యొక్క సమయాన్ని, శక్తిని జ్ఞాన సముపార్జనలో వినియోగిస్తారు. అయినా, వారికి ఉన్న జ్ఞానము వారిని తరచుగా గర్వితులను చేస్తుంది, మరియు వారి బుద్ధికి అతీతముగా ఇంకేదీ పరమ సత్యము లేదని అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా, వారు శాస్త్రముల పట్ల లేదా భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ముల పట్ల విశ్వాసాన్ని పెంచుకోలేకపోతారు. రజో గుణములో, జీవులు తీవ్ర పరిశ్రమ దిశగా ప్రేరణ పొందుతారు. ప్రపంచం పట్ల వారి అనురక్తి, మరియు సుఖాలు, హోదా, సంపద, మరియు శారీరక సౌకర్యాల పట్ల వారి యొక్క ఆసక్తి, తమ ఆశయాలను సాధించే దిశగా పరిశ్రమించేటట్లు వారిని ప్రేరేపిస్తుంది; అవే వారికి జీవితంలో అత్యంత ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. రజో గుణము స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ పెంచుతుంది, మరియు కామమును పెంచుతుంది. ఈ కామమును తృప్తిపర్చుకోవటానికి పురుషుడు-స్త్రీ వైవాహిక సంబంధంలోకి ప్రవేశించి ఒక గృహమును కలిగిఉంటారు. ఆ గృహమును నిర్వహించుకోవటానికి సంపద అవసరము, కాబట్టి వారి ఆర్థిక అభ్యున్నతి కోసము పరిశ్రమిస్తుంటారు. తీవ్ర వ్యవహారములు చేస్తుంటారు కానీ, ఆ ప్రతి-ఒక్క పని మరిన్ని కర్మలను సృష్టిస్తుంది, మరియు అవి వారిని మరింత భౌతిక అస్తిత్వ బంధనములో బంధించివేస్తాయి. తమోగుణము, ప్రాణుల బుద్ధిని మబ్బుకప్పేస్తుంది. సుఖాల కోసం వాంఛ, ఇక ఇప్పుడు వక్రమైన తప్పుడు విధాలుగా పరిణమిస్తుంది. ఉదాహరణకి, సిగరెట్టు తాగటం హానికరమని అందరికీ తెలుసు. ప్రతి ఒక్క సిగరెట్టు పాకెట్ మీద ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరిక కూడా ఉంటుంది. సిగరెట్టు త్రాగేవారు దానిని చదువుతారు, అయినా వారి ధూమపానం ఆపరు. ఇది ఎందుకు జరుగుతుందంటే, బుద్ధి తన విచక్షణా శక్తిని కోల్పోయి, తనకు హాని జరిగినా ఆ ధూమపాన సుఖాన్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. ఒకరెవరో హాస్యాస్పదంగా అన్నట్టు, ‘సిగరెట్టు అంటే ఒక చివర నిప్పు మరొక చివర మూర్ఖుడు ఉండే ఒక పైపు’ అని. ఇదే తమోగుణము యొక్క ప్రభావము, ఇది ఆత్మను అజ్ఞానపు చీకటిలో బంధించివేస్తుంది.
రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత । రజఃసత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ।। 10 ।।
10
14
https://www.holy-bhagava…udio/014_010.mp3
రజః — రజో గుణము; తమః — తమో గుణము; చ — మరియు; అభిభూయ — ఓడించి; సత్త్వం — సత్త్వ గుణము; భవతి — ఉండును; భారత — అర్జునా, భరత వంశీయుడా; రజః — రజో గుణము; సత్త్వం — సత్త్వ గుణము; తమః — తమో గుణము; చ — మరియు; ఏవ — నిజముగా; తమః — తమో గుణము; సత్త్వం — సత్త్వ గుణము; రజః — రజో గుణము; తథా — కూడా.
BG 14.10: ఓ అర్జునా! ఒక్కోసారి రజస్తమోగుణములపై సత్త్వముది పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి సత్త్వతమోగుణములపై రజో గుణము ఆధిపత్యంతో ఉంటుంది; మరియు ఇంకాకొన్ని సార్లు సత్త్వరజో గుణములను తమోగుణము ఓడిస్తుంది.
ఒకే వ్యక్తి యొక్క ప్రవృత్తి, ఈ మూడు గుణములలో ఎలా మారుతూఉంటుందో, శ్రీ కృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. భౌతిక శక్తి యందు ఈ మూడు గుణములు ఉన్నాయి మరియు మన మనస్సు ఇదే శక్తితో తయారైనది. అందుకే, ఈ మూడు గుణములు మన మనస్సులో కూడా ఉన్నాయి. ఒకరితో ఒకరు తలపడే ముగ్గురు మల్లయోధులతో వీటిని పోల్చవచ్చు. ప్రతి ఒక్కడు మిగతా ఇద్దరిని క్రిందికి పడవేస్తుంటాడు, కాబట్టి ఒక్కోసారి మొదటివాడు పైనుంటాడు, ఒక్కోసారి రెండోవాడు, మరింకోసారి మూడవవాడిదే పైచేయి అవుతుంది. ఇదే విధంగా, ఈ మూడు గుణములు వ్యక్తి యొక్క ప్రవృత్తి పై ఒక్కోటి ఒక్కోసారి ఎక్కువ ప్రభావంతో ఉంటాయి. బాహ్యమైన పరిస్థితులు, అంతర్లీన చింతన, మరియు పూర్వ జన్మ సంస్కారములపై ఆధారపడి ఒక్కో గుణము ఒక్కోసారి ప్రబలమై ఉంటుంది. ఎంతసేపు ఆ ప్రభావం ఉంటుంది అన్న దానికి ఏమీ నియమం లేదు - ఒక గుణము మనోబుద్ధులపై ఒక క్షణం నుండి ఒక గంట వరకు ఉండవచ్చు. సత్త్వ గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, వ్యక్తి ప్రశాంతముగా, తృప్తిగా, దయాళువుగా, నిర్మలంగా, ప్రసన్నంగా ఉంటాడు. రజో గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, వ్యక్తి ఉద్వేగంతో, లక్ష్యమును సాధించాలనే తపనతో, ఇతరుల విజయం పట్ల అసూయతో, ఇంద్రియ సుఖముల పట్ల ఆసక్తితో ఉంటాడు. తమో గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, విపరీత నిద్ర, సోమరితనము, ద్వేషము, కోపము, రోషము, హింస మరియు అపనమ్మకంతో ఉంటాడు. ఉదాహరణకి, మీరు ఒక గ్రంథాలయములో (లైబ్రరీ) లో కూర్చుని చదువుకుంటున్నారనుకోండి . అక్కడ ఏమీ ప్రాపంచిక గందరగోళం లేదు, మరియు మీ మనస్సు సాత్త్వికముగా అయింది. మీరు చదువుకోవటం అయిపోయిన తరువాత టీవీ చూడటం మొదలు పెడితే , అందులో చూసే అన్నింటి వలన మనస్సు రాజసికమైపోతుంది, మరియు ఇంద్రియ సుఖాల పట్ల యావను పెంచుతుంది. మీకిష్టమైన ఛానల్ చూస్తుంటే, మీ కుటుంబ సభ్యుడు వచ్చి, ఆ ఛానల్ మార్చితే, ఈ అల్లరి, మనస్సులో తమో గుణమును పెంచుతుంది, మరియు మీరు కోపంతో నిండిపోతారు. ఈ విధంగా, మనస్సు ఈ మూడు గుణమల మధ్య ఊగుతూనే ఉంటుంది మరియు వాటి యొక్క స్వభావాలను అపాదించుకుంటుంది.
సర్వద్వారేషు దేహేఽస్మిన్ ప్రకాశ ఉపజాయతే । జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత ।। 11 ।। లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా । రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ।। 12 ।। అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ । తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ।। 13 ।।
11
14
https://www.holy-bhagava…/014_011-013.mp3
సర్వ — అన్ని; ద్వారేషు — ద్వారముల గుండా; దేహే — శరీరము; అస్మిన్ — దీనిలో; ప్రకాశః — ప్రకాశము; ఉపజాయతే — వ్యక్తమై; జ్ఞానం — జ్ఞానము; యదా — ఎప్పుడైతే; తదా — అప్పుడు; విద్యాత్ — తెలుసుకొనుము; వివృద్ధం — ప్రబలమగును; సత్త్వం — సత్త్వ గుణము; ఇతి — ఈ విధముగా; ఉత — ఖచ్చితముగా; లోభః — లోభము (దురాశ); ప్రవృత్తిః — ప్రవృత్తి; ఆరంభః — పరిశ్రమ; కర్మణామ్ — కామ్య కర్మల కోసం; అశమః — వ్యాకులత; స్పృహా — యావ; రజసి — రజో గుణము యొక్క; ఏతాని — ఇవి; జాయంతే — పెరుగును; వివృద్ధే — ప్రబలమైనప్పుడు; భరత-ఋషభ — భరతులలో శ్రేష్ఠుడా, అర్జునా; అప్రకాశః — అజ్ఞానం; అప్రవృత్తిః — జడత్వం; చ — మరియు; ప్రమాదః — నిర్లక్ష్యము; మోహః — మోహము; ఏవ — నిజముగా; చ — మరియు; తమసి — తమోగుణము; ఏతాని — ఇవి; జాయంతే — కనిపించును; వివృద్ధే — ప్రబలమైనప్పుడు; కురు-నందన — కురునందనా, అర్జునా.
BG 14.11-13: దేహములోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు, అది సత్త్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. రజో గుణము ప్రబలినప్పుడు, ఓ అర్జునా, లోభము (దురాశ), ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత, మరియు యావ పెంపొందుతాయి. ఓ అర్జునా – అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము, మరియు మోహము - ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు.
శ్రీ కృష్ణుడు మళ్ళీ ఒకసారి, త్రిగుణములు వ్యక్తి యొక్క ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తున్నాడు. సత్త్వ గుణము సద్గుణములను పెంపొందించుకునేటందుకు, మరియు జ్ఞానము ప్రకాశితము అవ్వటానికి దారితీస్తుంది. రజో గుణము దురాశకి, ప్రాపంచిక సంపత్తి కోసం అతిప్రయాస మరియు మనస్సు యొక్క వ్యాకులతకు దారి తీస్తుంది. తమో గుణము చిత్తభ్రాంతికి, సోమరితనానికి, మరియు మత్తుపదార్ధాలకు మరియు హింసా ప్రవృత్తి దిశగా తీసుకువెళుతుంది. నిజానికి, ఈ గుణములు, భగవంతుడు మరియు ఆధ్యాత్మిక మార్గముల పట్ల మన దృక్పథాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణతో చెప్పటానికి, మనస్సులో సత్త్వ గుణము ప్రధానముగా ఉన్నప్పుడు, మనము ఇలా అనుకోవచ్చు, ‘నాకు గురువు గారి నుండి ఎంతో కృప లభించింది. నా సాధనలో త్వరితగతిన పురోగతి సాధించటానికి కృషి చేయాలి, ఎందుకంటే మానవ దేహము అనేది దుర్లభము మరియు దానిని లౌకికమైన వాటి సముపార్జన కోసం వ్యర్థం చేసుకోవద్దు.’ రజో గుణము ప్రధానముగా ఉన్నప్పుడు, మనము ఇలా అనుకోవచ్చు, ‘నేను తప్పకుండా ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి, కానీ అంత తొందర ఏమున్నది? ప్రస్తుతం, నాకు చాలా బాధ్యతలు ఉన్నవి, అవి దీనికన్నా ఇంకా ముఖ్యమైనవి.’ ఎప్పుడైతే తమో గుణము ప్రబలంగా ఉంటుందో, మనం ఇలా అనుకోవచ్చు, ‘ఏమో, భగవంతుడు ఉన్నాడో లేడో నమ్మకం లేదు, ఎవరూ ఆయనను చూడలేదు. ఎందుకు సాధనా కోసం సమయం వృధా చేయాలి?’ అని. భక్తిలో ఒకే వ్యక్తి యొక్క ఆలోచనలు ఎంత ఉన్నత స్థాయి నుండి, ఎంత తక్కువ స్థాయికి ఊగిసలాడతాయో మనం గమనించవచ్చు. ఈ త్రిగుణములచే మనస్సు ఊగిసలాడటం, చాలా సహజమే. కానీ, ఈ స్థితిగతులచే మనం నిరాశ చెందవద్దు, పైగా, ఇలా ఇది ఎందుకు అవుతుందో అర్థం చేసుకోవాలి, మరియు దానికి అతీతంగా ఎదగటానికి పరిశ్రమించాలి. సాధన అంటే, మనసులో ఈ త్రిగుణముల యొక్క ప్రవాహంతో పోరాడుతూ, దానిని గురువు మరియు భగవంతుడు పట్ల భక్తితో ఉండటానికి అభ్యాసము చేయటమే. ఒకవేళ మన యొక్క స్మృతి అత్యంత ఉన్నతమైన స్థాయిలో రోజంతా ఉండి ఉంటే, అప్పుడు సాధన యొక్క అవసరం లేదు. మనస్సు యొక్క సహజమైన భావనలు ప్రపంచం వైపు మొగ్గు చూపినా, బుద్ధి యొక్క సహాయంతో, దానిని ఆధ్యాత్మిక రంగం వైపు మరల్చాలి. ప్రారంభంలో ఇది కష్టతరముగా అనిపించవచ్చు, కానీ అభ్యాసముచే అది చాలా సులువుగా అయిపోతుంది. కారు నడపటం మొదట్లో చాలా కష్టమైనదిగా అనిపించినా, అభ్యాసముచే అది అలవాటై సహజముగా అయిపోతుంది. శ్రీ కృష్ణుడు ఇక ఈ త్రిగుణములచే ప్రసాదింపబడే గమ్యములను చెప్పటం ప్రారంభిస్తున్నాడు, మరియు వాటికి అతీతముగా అవ్వాల్సిన మన లక్ష్యము యొక్క అవసరం చెప్తున్నాడు.

యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ । తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ।। 14 ।। రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే । తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ।। 15 ।।
14
14
https://www.holy-bhagava…/014_014-015.mp3
యదా — ఎప్పుడైతే; సత్వే — సత్త్వగుణములో; ప్రవృద్ధే — ప్రబలంగా ఉంటుందో; తు — నిజముగా; ప్రలయం — మరణము; యాతి — చేరును; దేహభృత్ — జీవాత్మ; తదా — అప్పుడు; ఉత్తమ విదాం — ఉత్తములైన జ్ఞానులు; లోకాన్ — లోకములు; అమలాన్ — పవిత్రమైన; ప్రతిపద్యతే — పొందును; రజసి — రజో గుణము; ప్రలయం — మరణము; గత్వా — పొందును; కర్మ-సంగిషు — కర్మాసక్తులైన మానవులు; జాయతే — పుట్టెదరు; తథా — అదే విధముగా; ప్రలీనః — మరణిస్తూ; తమసి — తమో గుణము; మూఢ-యోనిషు — జంతువుల జాతిలో; జాయతే — పుట్టెదరు.
BG 14.14-15: సత్త్వ గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు, జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను (రజస్సు, తమస్సు లేనటువంటివి) చేరుకుంటారు. రజో గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు; తమో గుణ ప్రభావంతో ఉంటూ మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు.
జీవాత్మల భవితవ్యం వాటి వ్యక్తిత్వ గుణముల మీద ఆధారపడి ఉంటుంది అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. భగవంతుని శాసనంలో, కర్మ సిద్ధాంతం ప్రకారం, మనకు ఏది పొందటానికి అర్హత ఉన్నదో అదే లభిస్తుంది. ఎవరైతే సద్గుణములు, జ్ఞానము, మరియు ఇతరుల పట్ల సేవా భావాన్ని పెంపొందించుకున్నారో, వారు, ధర్మాత్ములు, పండితులు, లేదా సమాజ సేవకుల కుటుంబములలో జన్మిస్తారు లేదా వారు ఉత్తమ లోకాలకు వెళతారు. ఎవరైతే దురాశ, ధనదాహము, మరియు ప్రాపంచిక అభ్యుదయేచ్ఛలకు లొంగిపోయారో, వారు తీవ్రమైన భౌతిక లౌకిక వ్యవహారములు నడిపే కుటుంబములలో, తరచుగా వ్యాపార కుటుంబాలలో జన్మిస్తారు. ఎవరైతే మత్తు-పదార్థములు, హింస, సోమరితనం, మరియు కర్తవ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం - వీటి పట్ల మొగ్గు చూపిస్తుంటారో, వారు తాగుబోతులు మరియు చదువురాని వారి కుటుంబములలో జన్మిస్తారు. లేదా, వారు నిమ్నస్థాయి జీవరాశులలో, జంతువులలో జన్మిస్తారు. చాలా మంది జనులకు ఒక సందేహం ఉంటుంది, ఒకసారి మానవ రూపము వచ్చిన తరువాత, తిరిగి నీచ స్థాయి జాతులలో పడిపోవటం సంభవమేనా అని. ఆత్మకు మానవ దేహము శాశ్వతముగా ఇచ్చివేయబడినది కాదు అని ఈ శ్లోకము తెలియచేస్తున్నది. ఎవరైతే దానిని సరిగ్గా వాడుకోరో వారు జంతువులలోకి వెళ్లిపోవాల్సిన ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా, అన్ని మార్గాలు అన్ని సమయాల్లో తెరిచే ఉంటాయి. తనకు ఉండే గుణముల తీవ్రత మరియు తరచుదనం బట్టి, ఆత్మ - ఆధాత్మిక పురోగతిలో పైకి వెళ్ళవచ్చు, లేదా అదే స్థాయిలో ఉండిపోవచ్చు లేదా ఇంకా తక్కువ స్థాయికి పడిపోవచ్చు.

కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ । రజసస్తు ఫలం దుఃఖమ్ అజ్ఞానం తమసః ఫలమ్ ।। 16 ।।
16
14
https://www.holy-bhagava…udio/014_016.mp3
కర్మణః — కర్మ యొక్క; సు-కృతస్య — పవిత్రమైన; ఆహుః — చెప్పబడును; సాత్త్వికం — సత్త్వ గుణము; నిర్మలం — స్వచ్ఛమైన; ఫలం — ఫలితము; రజసః — రజో గుణము; తు — నిజముగా; ఫలం — ఫలము; దుఃఖం — దుఃఖము; అజ్ఞానం — అజ్ఞానము; తమసః — తమో గుణము; ఫలం — ఫలితము.
BG 14.16: సత్త్వ గుణములో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజో గుణములో చేసిన పనులు, దుఃఖాలను కలుగ చేస్తాయి, మరియు, తమో గుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగచేస్తాయి.
సత్త్వ గుణము ప్రధానముగా ఉన్నవారు, స్వచ్ఛత, సద్గుణము, జ్ఞానము, మరియు నిస్వార్థముతో ఉంటారు. కాబట్టి, వారి యొక్క పనులు మిగతావారి తో పోల్చితే పవిత్రమైన ఉద్దేశంతో ఉంటాయి మరియు ఆ యొక్క ఫలితములు ఉద్ధరించేవిగా మరియు తృప్తినిచ్చేవిగా ఉంటాయి. రజో గుణముచే ప్రభావితమయ్యేవారు తమ మనస్సు-ఇంద్రియముల యొక్క కోరికలచే ఉద్వేగానికి గురౌతుంటారు. వారి యొక్క పనుల వెనుక ప్రధానోద్దేశం సొంత-గొప్పలు మరియు తమ యొక్క, తమ వారి యొక్క ఇంద్రియ-తృప్తి, ఉంటుంది. ఈ విధంగా వారి యొక్క పనులు ఇంద్రియ భోగానుభవము కోసం ఉంటాయి, అవి ఇంద్రియ వాంఛలను మరింత విజృభింప చేస్తాయి. తమో గుణము ప్రబలంగా ఉన్నవారికి, శాస్త్ర ఉపదేశాల పట్ల మరియు మంచి నడవడిక (సత్ప్రవర్తన) పట్ల ఏ మాత్రం గౌరవం ఉండదు. వారు పాపపు పనులు చేస్తూ వక్రబుద్ధితో భోగవిలాసాలను అనుభవిస్తుంటారు, ఇది వారిని మరింత మోహభ్రాంతి లోనికి నెట్టివేస్తుంది.
సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ । ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ ।। 17 ।।
17
14
https://www.holy-bhagava…udio/014_017.mp3
సత్త్వాత్ — సత్త్వ గుణము నుండి; సంజాయతే — కలుగును; జ్ఞానం — జ్ఞానము; రజసః — రజో గుణము నుండి; లోభః — లోభము (అత్యాశ); ఏవ — నిజముగా; చ — మరియు; ప్రమాద — నిర్లక్ష్యము; మోహౌ — మోహము (భ్రాంతి); తమసః — తమో గుణము నుండి; భవతః — పుట్టును; అజ్ఞానం — అజ్ఞానము; ఏవ — నిజముగా; చ — మరియు.
BG 14.17: సత్త్వ గుణముచే జ్ఞానము, రజో గుణముచే లోభము(దురాశ), మరియు తమో గుణముచే నిర్లక్ష్యము మరియు మోహము (భ్రాంతి) జనించును.
త్రి-గుణముల వలన సంభవించే ఫలితములలో వైవిధ్యమును వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు దీనికి వెనుక కారణమును చెప్తున్నాడు. సత్త్వ గుణము జ్ఞానమును పెంపొందించుతుంది, దీనివలన మంచి-చెడు మధ్య విచక్షణ తెలుస్తుంది. అది ఇంద్రియ లౌల్యమును కూడా తగ్గిస్తుంది, మరియు అదే సమయంలో తృప్తి మరియు సంతోషమును కలుగ చేస్తుంది. సత్త్వగుణ ప్రధానంగా ఉన్నవారు, జ్ఞాన సముపార్జన మరియు ధార్మిక ఆలోచనల వైపు మొగ్గు చూపిస్తారు. ఈ విధంగా, సత్త్వగుణము వివేకవంతమైన పనులను ప్రోత్సహిస్తుంది. రజో గుణము ఇంద్రియములను ఉద్రేకపరుస్తుంది, మరియు మనస్సుపై నియంత్రణ తప్పేట్టు చేస్తుంది, ఏదో సాధించాలనే కోరికల వలయంలో త్రిప్పివేస్తుంది. ఇది జీవుడిని కోరికలతో బంధించివేసి, సుఖసంపదల కోసం తీవ్రంగా పరిశ్రమించేటట్టు చేస్తుంది, కానీ ఇవి ఆత్మ దృక్పథంలో వ్యర్థమైనవి. తమో గుణము, జీవుడిని జడత్వం మరియు అజ్ఞానములో కప్పివేస్తుంది. అజ్ఞానముతో ఆవరించబడి, వ్యక్తి తప్పుడు మరియు పాపపు పనులు చేసి, వాటి యొక్క ఫలితములను అనుభవిస్తాడు.
ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసాః । జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః ।। 18 ।।
18
14
https://www.holy-bhagava…udio/014_018.mp3
ఊర్ధ్వం — ఉన్నత స్థాయి; గచ్ఛంతి — చేరుకుంటారు; సత్త్వ-స్థాః — సత్త్వ గుణములో స్థితమై ఉన్నవారు; మధ్యే — మధ్య స్థాయిలో; తిష్ఠంతి — ఉండిపోవుదురు; రాజసాః — రజో గుణములో నుండే వారు; జఘన్య — అసహ్యమైన; గుణ — గుణముల; వృత్తి-స్థాః — కార్యములలో నిమగ్నమైన వారు; అధః — నీచ; గచ్ఛంతి — వెళ్లెదరు; తామసాః — తమో గుణములో ఉండేవారు.
BG 14.18: సత్త్వ గుణములో స్థితమై ఉన్నవారు ఉన్నత స్థాయికి వెళతారు; రజో గుణములో స్థితమై ఉండేవారు మధ్యస్థాయి లోనే ఉండిపోతారు; తమో గుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలౌతారు.
జీవాత్మల పునర్జన్మ, వాటి వ్యక్తిత్వంలో ప్రబలంగా ఉండే గుణముల మీద ఆధారపడి ఉంటుందని, శ్రీ కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ప్రస్తుత జన్మ ప్రయాణాన్ని పూర్తి చేసిన పిదప, జీవులు వారివారి గుణములకు అనుగుణంగా ఉండే లోకాలకు చేరుకుంటాయి. విద్యార్థులు ఉన్నత-పాఠశాల చదువులు పూర్తయిన తరువాత కళాశాలకు దరఖాస్తు చేయటంతో దీనిని పోల్చవచ్చు. దేశంలో చాలా కళాశాలలు ఉంటాయి. పాఠశాల స్థాయిలో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు మంచిపేరున్న కళాశాలలో సీటు వస్తుంది; కానీ బొటాబొటి మార్కులే వఛ్చిన వారికి తక్కువ స్థాయి కళాశాలలలోనే సీటు ఇస్తారు. ఈ ప్రకారంగానే, భాగవతం లో ఇలా పేర్కొనబడినది: సత్త్వే ప్రలీనాః స్వర్ యాంతి నర-లోకం రజో-లయాః తమో-లయాస్ తు నిరయం యాంతి మామ్ ఏవ నిర్గుణాః (11.25.22) ‘సత్త్వ గుణములో ఉన్నవారు స్వర్గాది ఊర్ధ్వలోకములకు వెళ్లెదరు; రజో గుణములో ఉండేవారు భూలోకమునకు తిరిగి వస్తారు; మరియు తమో గుణములో ఉండేవారు నరక లోకములకు వెళతారు. మరియు త్రిగుణాతీతులైనవారు నన్నే పొందుదురు.’
నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి । గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగఛ్చతి ।। 19 ।।
19
14
https://www.holy-bhagava…udio/014_019.mp3
న-అన్యం — వేరే ఏవీ కాదు; గుణేభ్యః — గుణముల కంటే; కర్తారం — చేసేది; యదా — ఎప్పుడైతే; ద్రష్టా — చూసేవాడు; అనుపశ్యతి — చూస్తాడో; గుణేభ్యః — ప్రకృతి గుణముల కన్నా; చ — మరియు; పరం — అతీతమైన; వేత్తి — తెలుసుకొనుము; మత్-భావం — నా దివ్య స్వభావము; సః — వారు; అధిగచ్చతి — పొందెదరు.
BG 14.19: అన్ని కార్యములలోనూ, కర్తలు ఈ త్రి-గుణములే తప్ప వేరే ఇతర ఏవీ లేవు, అని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో, మరియు నన్ను ఈ గుణములకు అతీతునిగా తెలుసుకుంటారో, వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు.
ఈ మూడు గుణముల యొక్క సంక్లిష్టమైన పనితీరుని వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు వాటి బంధనము నుండి ముక్తిపొందటానికి సరళమైన ఉపాయమును చెప్తున్నాడు. జగత్తు లోని సమస్త జీవ భూతములు ఈ మూడు గుణముల బంధనములో ఉన్నాయి, కాబట్టి ఈ గుణములే జగత్తులో జరిగే కార్యములన్నింటిలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. కానీ, సర్వోన్నత భగవానుడు వాటికి అతీతుడు. కాబట్టి, ఆయనను త్రి-గుణాతీతుడు (భౌతిక ప్రకృతి యొక్క గుణములకు అతీతుడు) అని అంటారు. అదే విధంగా, భగవంతుని యొక్క అన్ని గుణములు - ఆయన నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, మరియు పరివారము – ఇవన్నీ త్రి-గుణాతీతములే. ఒకవేళ మన మనస్సుని త్రి-గుణముల యొక్క పరిధి లోనే ఉన్న ఏ ఒక్క వ్యక్తి లేదా వస్తువు పట్ల అనుసంధానం చేసినా, ఆ సంబంధిత గుణ-ప్రభావం మన మనోబుద్ధులపై పెరుగుతుంది. కానీ, మన మనస్సుని దివ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రములోనే ఉంచితే, అది త్రిగుణములకు అతీతముగా దివ్యమైనదిగా అవుతుంది. ఈ సూత్రమును అర్థం చేసుకున్నవారు, ప్రాపంచిక వస్తువులు, మనుష్యుల పట్ల తమ సంబంధాన్ని తగ్గించుకుంటూ, భక్తి ద్వారా, భగవంతుడు మరియు గురువు పట్ల సంబంధాన్ని బలపరుచుకుంటారు. ఇది వారికి త్రిగుణములకు అతీతముగా అవ్వటానికి సహాయకారిగా మరియు భగవంతుని యొక్క దివ్య స్వభావాన్ని పొందటానికి సహాయకారిగా ఉంటుంది. ఈ విషయం 14.26వ శ్లోకంలో మరింత విశదీకరించబడినది.
గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ । జన్మమృత్యుజరాదుఃఖైః విముక్తోఽమృతమశ్నుతే ।। 20 ।।
20
14
https://www.holy-bhagava…udio/014_020.mp3
గుణాన్ — త్రిగుణములు; ఏతాన్ — ఇవి; అతీత్య — అతీతమై; త్రీన్ — మూడు; దేహీ — జీవాత్మ; దేహ — శరీరము; సముద్భవాన్ — ఉద్భవించిన; జన్మ — పుట్టుక; మృత్యు — మరణము; జరా — వృద్ధాప్యము; దుఃఖైః — దుఃఖము; విముక్తః — విముక్తి; అమృతమ్ — అమరత్వము; అశ్నుతే — పొందును.
BG 14.20: శరీర సంబంధిత ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన, వ్యక్తి, జన్మ, మృత్యువు, వృద్ధాప్యము, మరియు దుఃఖముల నుండి విముక్తి పొంది, అమరత్వం పొందుతాడు.
మనం ఒకవేళ పాడుబడ్డ బావి నుండి నీళ్ళు తాగితే, మనకు తప్పకుండా కడుపునొప్పి వంటివి వస్తాయి. అదే విధంగా, మనం ఈ త్రిగుణములచే ప్రభావితం అయితే మనం వాటి యొక్క పరిణామాలను అనుభవించాలి, అంటే, పదేపదే ఈ భౌతిక జగత్తులో పుట్టటం, వ్యాధి, వృద్ధాప్యం, మరియు మరణం వంటివి. ఈ నాలుగే భౌతిక జగత్తులో ప్రధానమైన క్లేశములు. వీటిని చూసిన తరువాతే బుద్ధుడు ఈ ప్రపంచం దుఃఖములకు నిలయమని తెలుసుకున్నాడు, ఆ తర్వాత ఈ క్లేశములకు పరిష్కారం వెదికాడు. వేదములు ఎన్నెన్నో నియమములను, సామాజిక విధులను, పూజాది కర్మ కాండలను, మరియు నిబంధనలను మానవులకు విధించాయి. ఈ చెప్పబడిన విధులు మరియు నియమనిబంధనలు అన్నింటిని కలిపి కర్మ ధర్మాలు అంటారు లేదా వర్ణాశ్రమ ధర్మములు అంటారు లేదా శారీరక ధర్మములు అంటారు. అవి మనలను తమో గుణము నుండి రజో గుణమునకు, దానినుండి సత్త్వ గుణమునకు, ఉన్నతమైనవిగా చేస్తాయి. కానీ, సత్త్వ గుణమును చేరుటయే సరిపోదు; అది కూడా ఒకలాంటి బంధనమే. సత్త్వ గుణమును బంగారు సంకెళ్ళతో కట్టివేయబడటంతో పోల్చవచ్చు. మన లక్ష్యము ఇంకా ముందుంది — ఈ భౌతిక జగత్తు అనే జైలు నుండి బయట పడాలి. మనము ఈ త్రి-గుణములకు అతీతముగా అయినప్పుడు, జీవాత్మలను ఇక మాయ బంధించదు అని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఈ విధంగా, జీవాత్మ జనన మరణ చక్రము నుండి విముక్తి నొంది అమరత్వం పొందుతుంది. నిజానికి, ఆత్మ అనేది ఎల్లప్పుడూ నిత్యమే. కానీ, అది తనకు తాను ఈ భౌతిక శరీరమే అనుకోవటం వలన, అది జన్మ-మృత్యువు అనే మిథ్యా దుఃఖమును అనుభవింప చేస్తుంది. ఈ మిథ్యానుభవము తన యొక్క సనాతన అస్తిత్వ స్వభావానికి వ్యతిరేకమైనది; జీవాత్మ దీనినుండి విముక్తికై ప్రయత్నిస్తుంటుంది. కాబట్టి, భౌతిక ప్రాపంచిక మిథ్య సహజంగానే మన అంతర్గత అస్తిత్వానికి ఇబ్బందికరమే, మరియు లోలోపల, మనమందరమూ అమరత్వాన్ని రుచి చూడాలనే అనుకుంటాము.
అర్జున ఉవాచ । కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో । కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ।। 21 ।।
21
14
https://www.holy-bhagava…udio/014_021.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు ఇలా అడిగెను; కైః — ఎటువంటి; లింగైః — లక్షణములు; త్రీన్ — మూడు; గుణాన్ — ప్రకృతి గుణములు; ఏతాన్ — ఇవి; అతీతః — అతీతులైన వారు; భవతి — ఉందురు; ప్రభో — ప్రభూ; కిం — ఏమిటి? ఆచారః — నడవడిక; కథం — ఎట్లా; చ — మరియు; ఏతాన్ — ఇవి; త్రీన్ — మూడు; గుణాన్ — ప్రకృతి గుణములు; అతివర్తతే — అతీతులు అవుతారు.
BG 14.21: అర్జునుడు ఇలా అడిగాడు: ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి, ఓ ప్రభూ? వారు ఏవిధంగా ప్రవర్తిస్తారు? వారు త్రి-గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు?
అర్జునుడు శ్రీ కృష్ణుడి నుండి త్రి-గుణములకు అతీతులవటం గురించి విని ఉన్నాడు. అందుకే, ఇప్పుడు ఈ త్రి-గుణముల విషయమై మూడు ప్రశ్నలను అడుగుతున్నాడు. 'లింగైః' అంటే 'లక్షణములు' అని అర్థం. అతని మొదటి ప్రశ్న ఏమిటంటే, ‘ఈ త్రిగుణాతీతుల లక్షణములు ఎలా ఉంటాయి?’ అని. ‘ఆచారః' అంటే 'ప్రవర్తన' అని అర్థం. అర్జునుడి రెండవ ప్రశ్న ఏమిటంటే: ‘ఈ త్రిగుణాతీతుల ప్రవర్తన ఎలా ఉంటుంది?’ అని. 'అతివర్తతే' అంటే 'అతీతులైపోవటం'. మూడవ ప్రశ్న ఏమిటంటే: ‘ఈ త్రి-గుణములకు అతీతులము కావటం ఎలా?’ అతని ప్రశ్నలకు పద్ధతిప్రకారం సమాధానం చెప్తున్నాడు, శ్రీ కృష్ణుడు.
శ్రీ భగవానువాచ । ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ । న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ।। 22 ।। ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే । గుణా వర్తంత ఇత్యేవం యోఽవతిష్ఠతి నేంగతే ।। 23 ।।
22
14
https://www.holy-bhagava…/014_022-023.mp3
శ్రీ భగవాన్-ఉవాచ — శ్రీ భగవానుడు ఇలా పలికెను; ప్రకాశం — ప్రకాశము; చ — మరియు; ప్రవృతిం — క్రియాకలాపములు; చ — మరియు; మోహం — మోహము (భ్రమ); ఏవ — అయినా; చ — మరియు; పాండవ — అర్జునా, పాండు పుత్రుడా; న ద్వేష్టి — ద్వేషించరు; సంప్రవృత్తాని — ఉన్నప్పుడు; న నివృత్తాని — లేనప్పుడు; కాంక్షతి — వాటి కోసం తాపత్రయపడడు; ఉదాసీన-వత్ — ఉదాసీనముగా ఉంటూ (తటస్థముగా); ఆసీనః — స్థితమై ఉండి; గుణైః — ప్రకృతి గుణములు; యః — ఎవరైతే; న విచాల్యతే — కలతచెందరో; గుణా — ప్రకృతి త్రి-గుణములు; వర్తంతే — ప్రవర్తించుతున్నవి; ఇతి ఏవం — అని తెలుసుకుని; యః — ఎవరైతే; అవతిష్ఠతి — ఆత్మ యందే స్థితమై ఉండి; న ఇంగతే — చలించకుండా ఉంటారు.
BG 14.22-23: శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, ఈ త్రిగుణములకు అతీతులైనవారు - (సత్త్వ గుణ జనితమైన) ప్రకాశమును కానీ, (రజో గుణ జనితమైన) కార్యకలాపములను కానీ, లేదా (తమో గుణ జనితమైన) మోహభ్రాంతిని కానీ - అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా, అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా, ఉదాసీనంగా ఉండి, వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని వారు నిశ్చలముగా ఆత్మ యందే స్థితమై ఉంటారు.
శ్రీ కృష్ణుడు ఇప్పుడు ఈ యొక్క త్రిగుణములకు అతీతులైన వారి యొక్క లక్షణములను వివరిస్తున్నాడు. ప్రపంచంలో ఈ త్రి-గుణములు ప్రవర్తిల్లటం చూసినప్పుడు, వాటి ప్రభావం మనుష్యులలో, వస్తువులలో మరియు వాటి చుట్టూ ఉండే పరిస్థితులలో వ్యక్తమైనప్పుడు వారు చలింపరు. జ్ఞానోదయమైన వారు అజ్ఞానమును చూసినప్పుడు దానిని ద్వేషింపరు, లేదా దానిలో చిక్కుకోరు. ప్రాపంచిక మనస్తత్వం కలవారు ఈ ప్రపంచ స్థితిగతులపై మరీ ఎక్కువగా చింతిస్తూఉంటారు. వారి యొక్క సమయాన్ని మరియు శక్తిని ప్రపంచం లోని పరిస్థితులపై తలపోస్తూ గడుపుతారు. జ్ఞానోదయమైన మహాత్ములు కూడా మానవ సంక్షేమం కోసమే పని చేస్తుంటారు, కానీ వారు అలా ఎందుకు చేస్తారంటే అది వారి సహజ స్వభావం కాబట్టి. అదే సమయంలో, ఈ జగత్తు అంతా భగవంతుని నియంత్రణలో ఉన్నది అని కూడా వారికి తెలుసు. కేవలం తమ శక్తానుసారం పని చేయాలి మరియు మిగతాది ఆ భగవంతునికే విడిచిపెట్టాలి అని వారికి తెలుసు. ఈ భగవంతుని యొక్క జగత్తు లోనికి వచ్చిన తరువాత మన యొక్క ప్రధానమైన కర్తవ్యం మన అంతఃకరణ శుద్ధి కోసం పరిశ్రమించటమే. ఆ తదుపరి, శుద్ధమైన పవిత్రమైన అంతఃకరణతో మనం సహజంగానే, ప్రపంచ పరిస్థితులు మనలను తీవ్రంగా ప్రభావితం చేయనీయకుండా, ప్రపంచంలో సత్కార్యములు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు, ‘మీరు ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పును మీతోనే ప్రారంభించండి’ (Be the change that you wish to see in the world.) జ్ఞానోదయమయిన మహాత్ములు, త్రి-గుణములు చేసే పనులకు తాము అతీతులమని తెలుసుకున్నవారు, ప్రకృతి యొక్క త్రిగుణములు జగత్తులో వాటివాటి సహజ స్వభావ పనులు చేస్తుంటే, హర్షమునకు కానీ లేదా శోకమునకు కానీ గురికారు. నిజానికి, వారి మనసులోనే ఈ గుణములను గమనించినా, వారు కలత చెందరు. ఈ మనస్సు భౌతిక శక్తిచే తయారుచేయబడినది, అందుకే దానికి ప్రకృతి సహజమైన మాయా త్రి-గుణములు ఉంటాయి. కాబట్టి, మనస్సు సహజంగానే ఈ గుణములచే మరియు వాటివాటి అనుగుణముగా వచ్చే తలంపులచే ప్రభావితం అవుతుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే, శారీరక దృక్పథంలో, మనము మన మనస్సుని మనకంటే వేరుగా చూడము. కాబట్టి, మనస్సు ఏదైనా కలవరపరిచే ఆలోచనను సృష్టిస్తే, మనము ఇలా అనుకుంటాము, ‘ఓ, ఇలాగ నేను చెడుగా ఆలోచిస్తున్నాను.’ అని. ఆ విషపు ఆలోచనలను మనవే అనుకుంటాము, వాటిని మనయందే ఉండనించి అది మన అధ్యాత్మికతని దెబ్బ తీసేటట్లు చేసుకుంటాము. ఒకవేళ మనస్సు భగవంతుడు లేదా గురువు పట్ల కూడా వ్యతిరేక ఆలోచనను పుట్టిస్తే, ఆ ఆలోచన మనదే అనుకుంటాము. ఒకవేళ, ఆ సమయంలో, మనం, మనస్సుని మనకంటే వేరుగా పరిగణిస్తే, మనము అటువంటి విషపు ఆలోచన నుండి దూరం జరిగిపోవచ్చు. అప్పుడు మన మనస్సు యొక్క ఆలోచనను తిరస్కరిస్తూ ఇలా అనుకోవచ్చు, ‘నా భక్తికి సహకరించే విధంగా ఉండని ఏ ఆలోచనతో కూడా నాకు సంబంధం లేదు’ అని. అలౌకికమైన స్థితిలో ఉండే మహాత్ములు, గుణముల ప్రభావం వలన తమ మనస్సులో పుట్టే అన్ని చెడు తలంపుల నుండి తమను తాము దూరం చేసుకునే కళను బాగా అభ్యసించిన వారే.

సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః । తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః ।। 24 ।। మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః । సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ।। 25 ।।
24
14
https://www.holy-bhagava…/014_024-025.mp3
సమ — ఒకేరీతిగా; దుఃఖ — దుఃఖము; సుఖః — సంతోషము; స్వ-స్థః — ఆత్మయందే స్థితమై ఉండి; సమ — సమానముగా; లోష్టా — మట్టి ముద్ద; అశ్మ — రాయి; కాంచనః — బంగారము; తుల్య — ఒకే విలువగా; ప్రియ — ప్రియమైనవి; అప్రియః — అప్రియమైనవి; ధీరః — స్థిరముగా; తుల్య — ఒక్కటిగానే; నిందా — నింద; ఆత్మ-సంస్తుతిః — పొగడ్త; మాన — గౌరవము; అపమానయో — అగౌరవము; తుల్యః — సమానముగా; తుల్యః — సమానముగా; మిత్ర — మిత్రుడు; అరి — శత్రువు; పక్షయోః — పక్షముల పట్ల; సర్వ — అన్ని; ఆరంభ — యత్నములను; పరిత్యాగీ — విడిచిపెట్టిన వాడు; గుణ-అతీతః — గుణములకు అతీతులైన; సః — వారు; ఉచ్యతే — అని చెప్పబడుతారు.
BG 14.24-25: సుఖదుఃఖాలలో ఒక్క రీతిగానే ఉండేవారు; ఆత్మ భావన యందే స్థితమై ఉండేవారు; మట్టిముద్ద, రాయి, మరియు బంగారము వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు; అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారు; తెలివైన వారు; నిందాస్తుతులను రెంటినీ సమముగా స్వీకరించేవారు; గౌరవమును, అవమానమును ఒక్క రీతిగానే తీసుకునేవారు; శత్రువుని, మిత్రుడిని ఒకలాగే చూసేవారు; అన్ని యత్నములను విడిచిపెట్టినవారు - వీరు త్రిగుణములకు అతీతులైనవారు అని చెప్పబడుతారు.
భగవంతుని లాగానే, ఆత్మ కూడా త్రిగుణాతీతమయినదే. శారీరక దృక్పథంలో, మనము మనలను శరీరము యొక్క సుఖ-దుఃఖాలతో అనుసంధానం చేసుకుంటాము, అందుకే, హర్షము లేదా శోకము వంటి భావోద్వేగాల మధ్య ఊగిసలాడుతాము. కానీ, ఆత్మ భావము యందే స్థితమైనవారు, శరీరము యొక్క సుఖము లేదా దుఃఖముచే ప్రభావితం కారు. ఇటువంటి ఆత్మజ్ఞానులు జగత్తు యందలి ద్వంద్వములను గమనిస్తారు కానీ, వాటిచే ప్రభావితం కారు. అందుకే, వారు నిర్గుణులైపోతారు (గుణముల ప్రభావమునకు అతీతమైపోతారు). ఇది వారికి సమత్వ దృష్టిని ఇస్తుంది, దానితో వారు, ఒక రాయిని లేదా మట్టి ముద్దని, బంగారాన్ని, అనుకూల-ప్రతికూల ప్రరిస్థితులని, విమర్శని మరియు ప్రశంసని ఒక్కలాగే చూస్తారు.

మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే । స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ।। 26 ।।
26
14
https://www.holy-bhagava…udio/014_026.mp3
మాం — నన్ను; చ — మాత్రమే; యః — ఎవరైతే; అవ్యభిచారేణ — నిష్కల్మషమైన; భక్తి-యోగేన — భక్తి ద్వారా; సేవతే — సేవ చేస్తారో; సః — వారు; గుణాన్ — ప్రకృతి యొక్క త్రి-గుణములు; సమతీత్య — అతీతులై పోవుదురు; ఏతాన్ — ఈ; బ్రహ్మ-భూయాయ — బ్రహ్మన్ యొక్క స్థాయికి; కల్పతే — చేరుదురు.
BG 14.26: నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు ప్రకృతి త్రిగుణములకు అతీతులై పోవుదురు మరియు బ్రహ్మన్ స్థాయికి చేరుతారు.
ప్రకృతి త్రి-గుణములకు అతీతులైన వారి యొక్క లక్షణములను వివరించిన పిదప శ్రీ కృష్ణుడు ఇప్పుడు ఈ త్రిగుణములకు అతీతమై పోవటానికి ఉన్న ఏకైక పద్ధతిని వివరిస్తున్నాడు. ఆత్మ యొక్క జ్ఞానము మరియు దానికీ శరీరమునకు ఉన్న భేదమును కేవలం తెలుసుకుంటే సరిపోదు, అని ఈ యొక్క పై శ్లోకము వివరిస్తున్నది. భక్తి యోగము ద్వారా, మనస్సుని ఆ పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ పరమాత్మపై లగ్నం చేయాలి - అప్పుడు మాత్రమే మన మనస్సు నిర్గుణుడైన శ్రీకృష్ణుడి వలె, నిర్గుణ (మూడు గుణములకు అతీతమైన) స్థాయికి చేరుతుంది. చాలా మంది జనులు, మనస్సుని సాకార రూప భగవంతుని పై నిమగ్నం చేస్తే, అది అలౌకిక స్థాయికి చేరుకోలేదు, అని అనుకుంటారు. దానిని నిరాకార బ్రహ్మన్‌పై నిమగ్నం చేస్తేనే మనస్సు త్రి-గుణములకు అతీతమవుతుంది, అని. కానీ, ఈ శ్లోకం ఆ అభిప్రాయాన్ని ఖండిస్తున్నది. సాకార రూప భగవంతుడు అనంతమైన గుణములను కలిగి ఉన్నా, అవి అన్నీ దివ్యమైనవి మరియు ప్రకృతి గుణముల కన్నా అతీతమైనవి. కాబట్టి, సాకార రూప భగవానుడు నిర్గుణుడు (భౌతిక గుణముల కన్నా అతీతుడు). పద్మ పురాణంలో, మహర్షి వేద వ్యాసుడు, ఈ విషయాన్ని ఇలా వివరిస్తున్నాడు: యస్తు నిర్గుణ ఇత్యుక్తః శాస్త్రేషు జగదీశ్వరః ప్రాకృతైర్హేయ సంయుక్తైర్గుణైర్హీనత్వముచ్యతే (పద్మ పురాణం) ‘శాస్త్రములు ఏవైనా భగవానుడు నిర్గుణుడు (గుణములు లేనివాడు) అని అంటే, వాటి అర్థం ఆయనకి ప్రాకృతిక గుణములు లేవు అని. ఐనప్పటికినీ, ఆయన యొక్క దివ్య వ్యక్తిత్వము గుణరహితము కాదు - ఆయనకు అనంతమైన దివ్య గుణములు ఉన్నాయి’ ధ్యాన విషయం ఏది శ్రేష్ఠమో కూడా ఈ శ్లోకము తెలియచేస్తున్నది. ట్రాన్సిండెంటల్ మెడిటేషన్ (Transcendental meditation) అంటే ఏదో శూన్యం పై ధ్యానం చేయటం కాదు. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములకు అతీతమైన అస్తిత్వము, భగవంతుడు. కాబట్టి, మన ధ్యాన విషయం భగవంతుడు అయినప్పుడే దానిని నిజమైన ట్రాన్సిండెంటల్ మెడిటేషన్ (transcendental meditation) అని అనవచ్చు.
బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్ అమృతస్యావ్యయస్య చ । శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ ।। 27 ।।
27
14
https://www.holy-bhagava…udio/014_027.mp3
బ్రహ్మణః — బ్రహ్మంమునకు; హి — నిజముగా; ప్రతిష్ఠా — ఆధారము; అహమ్ — నేను; అమృతస్య — అమృతత్వమునకు; అవ్యయస్య — నాశరహితుడైనవానికి; చ — మరియు; శాశ్వతస్య — సనాతనమైనవానికి; చ — మరియు; ధర్మస్య — ధర్మమునకు; సుఖస్య — ఆనందమునకు; ఐకాంతికస్య — అఖండమైన; చ — మరియు.
BG 14.27: అనశ్వరమైన, అవ్యయమైన నిరాకార బ్రహ్మమునకు, సనాతనమైన ధర్మమునకు మరియు అఖండమైన దివ్య ఆనందమునకు, నేనే ఆధారమును.
ఇంతకు క్రితం శ్లోకం, శ్రీ కృష్ణుడికి మరియు నిరాకార బ్రహ్మంమునకు ఏమిటి సంబంధము అన్న ప్రశ్నను కలుగచేయవచ్చు. సర్వశక్తిమంతుడైన భగవానుడు, తన అస్తిత్వంలో, నిరాకార తత్త్వమును మరియు సాకార రూపమును, రెంటినీ కలిగి ఉన్నాడు, అని ఇదివరకే చెప్పబడినది. జ్ఞానులు ఉపాసించే బ్రహ్మన్ అనేది, భగవంతుని యొక్క సాకార రూపము నుండి జనించే ప్రకాశమే అని ఇక్కడ శ్రీ కృష్ణుడు తెలియపరుస్తున్నాడు. పద్మ పురాణం ఇలా పేర్కొంటున్నది: యన్నఖేందురుచిర్బ్రహ్మ ధ్యేయం బ్రహ్మాదిభిః సురైః గుణత్రయమతీతం తం వందే వృందావనేశ్వరం (పాతాల ఖండము 77.60) ‘బృందావనేశ్వరుడైన శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క పాద నఖముల(గోరు) నుండి వెలువడే కాంతియే, జ్ఞానులు, ఇంకా దేవతలు ధ్యానించే అలౌకిక బ్రహ్మము’. అదేవిధంగా చైతన్య మహాప్రభు ఇలా అన్నాడు: తాంహార అంగేర శుద్ధ కిరణ-మండల ఉపనిషత్ కహే తాన్రే బ్రహ్మ సునిర్మల (చైతన్య చరితామృతము, ఆది లీల 2.12) ‘భగవంతుని యొక్క దివ్య దేహము నుండి వెలువడే తేజస్సే ఉపనిషత్తులలో బ్రహ్మన్‌గా చెప్పబడినది’. ఈ విధంగా, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు స్పష్టముగా సందేహానికి తావు లేకుండా చెప్పేదేమిటంటే - పరమేశ్వరుని సాకార రూపము పట్ల నిశ్చలమైన భక్తితో నిమగ్నమవ్వటమే, త్రిగుణముల యొక్క వ్యాధుల సర్వరోగనివారిణి, అని రూఢీగా చెపున్నాడు.
శ్రీ భగవానువాచ । ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ । ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।। 1 ।।
1
15
https://www.holy-bhagava…udio/015_001.mp3
శ్రీ భగవానువాచ — శ్రీ భగవానుడు పలికెను; ఊర్ధ్వ-మూలం — వేర్లు పైకి; అధః — క్రిందికి; శాఖం — కొమ్మలు; అశ్వత్థం — రావి చెట్టు; ప్రాహుః — అని అంటారు; అవ్యయమ్ — సనాతనమైన; ఛందాంసి — వేద మంత్రములు; యస్య పర్ణాని — దేని ఆకులో; యః — ఎవరైతే; తం — అది; వేద — తెలుసుకుందురో; సః — అతను; వేదవిత్ — వేదములు ఎఱిగిన వాడు.
BG 15.1: శ్రీ భగవానుడు పలికెను : వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు. దాని యొక్క ఆకులు వేద మంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు.
అశ్వత్థ అన్న పదానికి అర్థం, ఉన్నది ఉన్నట్టుగా ఒక్కరోజు కూడా (మరుసటి రోజువరకు కూడా) ఉండనిది అని అర్థం. ఈ జగత్తు కూడా అశ్వత్థ మే, ఎందుకంటే ఇది కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. సంస్కృత నిఘంటువు ఈ జగత్తుని ఇలా నిర్వచించింది, సంసరతీతి సంసారః ‘నిరంతరం మారుతూ ఉండేదే ఈ సంసారము’. గచ్ఛతీతి జగత్, ‘ఎల్లప్పుడూ కదులుతూ ఉండేదే జగత్తు’. ఈ జగత్తు ప్రతినిత్యం మారుతూ ఉండటమే కాక, అది ప్రళయ వినాశనం చేయబడి తిరిగి భగవంతునిలోనికి ఒక రోజు తీసుకొనబడుతుంది. అందుకే దానిలో ఉండేది అంతా తాత్కాలికమైనదే, అంటే అశ్వత్థమే. అశ్వత్థ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది - రావి చెట్టు అని. ఆత్మకు, ఆ భౌతిక జగత్తు ఒక చాలా విశాలమైన అశ్వత్థ వృక్షము వంటిది అని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. సాధారణంగా వృక్షములకు వేర్లు క్రిందికి మరియు కొమ్మలు పైకి ఉంటాయి. కానీ ఈ వృక్షమునకు వేర్లు పైకి ఉంటాయి (ఊర్ధ్వ మూలం), అంటే అది భగవంతుని నుండి ఉత్పన్నమైనది, ఆయన యందే స్థితమై ఉన్నది మరియు ఆయనచేతనే పోషించి/నిర్వహించబడుతున్నది. ఆ చెట్టుబోదె, శాఖలు/కొమ్మలు క్రిందికి (అధః శాఖం) విస్తరించి ఉన్నాయి, వాటియందే భౌతిక జగత్తు లోని లోకాల సమస్త జీవరాశులు స్థితమై ఉన్నాయి. కర్మ కాండలు మరియు వాటి ఫలములు చెప్పే వేద మంత్రములు (ఛందాంసి) ఈ వృక్షము యొక్క ఆకులు. ఈ భౌతిక అస్తిత్వమనే వృక్షమునకు అవి పోషకములు. వేదమంత్రములలో చెప్పబడిన ఫలాపేక్ష గల యజ్ఞ కర్మ కాండలు చేయటం వలన ఆత్మ, స్వర్గ భోగములను అనుభవించటానికి స్వర్గాది లోకములకు వెళుతుంది; కానీ ఆ పుణ్యము క్షయమై పోయినప్పుడు తిరిగి క్రిందన భూలోకానికి చేరుతుంది. ఈ విధంగా, ఆ చెట్టు యొక్క ఆకులు దానిని నిరంతరం జనన-మరణ చక్రంలో ఉంచుతూ పోషిస్తాయి. ఈ జగత్తు రూపంలో ఉండే వృక్షము సనాతనమైనది (అవ్యయం) అంటారు, ఎందుకంటే దాని ప్రవాహం నిరంతరంగా జరుగుతుంటుంది మరియు దాని యొక్క ఆది మరియు అంత్యము జీవాత్మల అనుభవంలోకి రాదు. ఎలాగైతే నిరంతర ప్రక్రియలో, సముద్రము యొక్క నీరు ఆవిరై మేఘములాగా మారి, మరల వానలాగా భూమిపై పడి అంతిమముగా తిరిగి సముద్రం చేరుతుందో, ఈ జనన-మరణ చక్రము కూడా నిరంతరం సాగుతూ ఉంటుంది. వేదములు కూడా ఈ వృక్షమును పేర్కొన్నాయి: ఊర్ధ్వమూలోఽవాక్ శాఖ ఏషోఽశ్వత్థ సనాతనః (కఠోపనిషత్తు 2.3.1) ‘వేర్లు పైకి మరియు శాఖలు క్రిందికి ఉన్న అశ్వత్థ వృక్షము సనాతనమైనది’ ఊర్ధ్వమూలం అర్వాక్ శాఖం వృక్షం యో సంప్రతి న స జాతు జనః శ్రద్దయాత్ మృత్యుత్యుర్మా మారయదితి (తైత్తిరీయ ఆరణ్యక్ 1.11.5) ‘ఈ యొక్క వేర్లు పైకి మరియు శాఖలు క్రిందికి ఉన్న వృక్షమును ఎరిగినవారు, మృత్యువు వారిని అంతం చేస్తుంది అని విశ్వసించరు’ వేదములు ఈ వృక్షమును గురించి వివరించేది దానిని ఖండించటానికి ప్రయత్నించమని చెప్పటానికే. అందుకే, శ్రీ కృష్ణుడు, ఈ సంసార వృక్షమును ఖండించాలనే రహస్యమును తెలిసినవారు, వేదములు తెలిసినవారు (వేద విత్) అని అంటున్నాడు.
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః । అధశ్చమూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే ।। 2 ।।
2
15
https://www.holy-bhagava…udio/015_002.mp3
అధః — క్రిందికి; చ — మరియు; ఊర్ధ్వం — పైకి; ప్రసృతాః — విస్తరించి; తస్య — దాని యొక్క; శాఖా — కొమ్మలు; గుణ — ప్రకృతి గుణములు; ప్రవృద్ధాః — పోషించబడి; విషయ — ఇంద్రియ విషయములు; ప్రవాలాః — చిగుర్లు ; అధః — క్రిందికి; చ — మరియు; మూలాని — వేర్లు; అనుసంతతాని — పెరుగుతూనే ఉంటాయి; కర్మ — కర్మలు; అనుబంధీని — బంధించివేయును; మనుష్య-లోకే — మానవ లోకములో.
BG 15.2: త్రి-గుణములచే పోషించబడి, ఈ చెట్టు యొక్క శాఖలు, పైకి మరియు క్రిందికి విస్తరించి ఉంటాయి, ఇంద్రియ విషయములు వాటికి చిగుర్ల వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి, చెట్టు యొక్క వేర్లు క్రిందికి వ్రేలాడుతూ ఉంటాయి. క్రిందిన, దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి, మనుష్య లోకములో కర్మలను కలుగచేస్తాయి.
భౌతిక జగత్తుని అశ్వత్థ వృక్షముతో పోల్చటాన్ని శ్రీ కృష్ణుడు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. చెట్టు యొక్క ప్రధాన మొండెము, ఆత్మ తన కర్మలు చేసేటువంటి మానవ స్వరూపము. వృక్షము యొక్క శాఖలు క్రిందికి (అధః) మరియు పైకి (ఊర్ధ్వ) కూడా విస్తరించి ఉంటాయి. ఒకవేళ ఆత్మ పాపిష్టి పనులు చేస్తే అది జంతువులలో లేదా నరకలోకాలలో పుడుతుంది. ఇవి క్రిందికి ఉండే శాఖలు. ఒకవేళ ఆత్మ పుణ్య కార్యములు చేస్తే అది స్వర్గ లోకాలలో గంధర్వుడిలాగా, దేవత లాగా, లేదా మరేదైనా జీవిలా పుడుతుంది. ఇవి పైకి ఉన్న శాఖలు. ఒక వృక్షము నీటితో పోషింపబడ్డట్టుగా, ఈ భౌతిక ఆస్థిత్వపు జగత్తు ప్రకృతి త్రిగుణములచే పోషించబడుతుంది. ఈ త్రిగుణములు ఇంద్రియ వస్తువిషయములను సృష్టిస్తాయి, అవి వృక్షమునకు చిగుర్లవంటివి (విషయ-ప్రవాలాః). చిగుర్ల యొక్క ప్రయోజనం ఏమిటంటే, అవి అంకురించి మరింత విస్తరిస్తాయి. ఈ అశ్వత్థ వృక్షము మీద చిగుళ్లు మొలకెత్తి, భౌతిక వాంఛలను కలుగ చేస్తాయి, అవి చెట్టు ఊడల వంటివి. రావి (మఱ్ఱి) చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే అవి శాఖలనుండి ఊడలను నేల వద్దకు పంపిస్తాయి. దీనితో, ఊడలు ద్వితీయ స్థాయి బోదెలుగా మారతాయి; దీనితో ఆ రావి చెట్టు విస్తరించి చాలా విశాలంగా పెరుగుతుంది. మనకు తెలిసిన అతిపెద్ద మఱ్ఱి చెట్టు, కొలకత్తా లోని బొటానికల్ గార్డెన్ లోని “ది గ్రేట్ బన్యన్” (The Great Banyan). ఈ చెట్టు విస్తరించిన వైశాల్యం సుమారుగా నాలుగు ఎకరాలు. చెట్టు యొక్క ప్రధాన ఉపరితల భాగం (crown of the tree) చుట్టుకొలత సుమారుగా 485 మీటర్లు, మరియు దానికి సుమారుగా 3700 ఊడలు, నేలను తాకినవి ఉన్నాయి. అదే విధంగా, అశ్వత్థ వృక్షము యొక్క ఉపమానంలో, భౌతిక జగత్తులో ఇంద్రియ వస్తువిషయములు చెట్టుకు ఉన్న చిగుళ్లు. అవి అంకురించి, వ్యక్తిలో ఇంద్రియ భోగముల పట్ల కోరికలను జనింపచేస్తాయి. ఈ కోరికలు ఆ వృక్షము యొక్క ఊడల వంటివి. అవి ఈ చెట్టు పెరుగుతూనే ఉండటానికి పోషకములను ఇస్తుంటాయి. భౌతిక భోగముల పట్ల కోరికలచే ప్రేరేపించబడి జీవ ప్రాణి కర్మలను చేస్తుంది. కానీ, ఇంద్రియ వాంఛలు ఎన్నటికీ తీరవు; పైగా వాటిని సంతృప్తి పరచాలని చూసే కొద్దీ, అవి మరింత పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి కోరికలను తీర్చుకోవటానికి చేసే కర్మలు, వాటిని మరింత పెంచుకోవటానికి మాత్రమే దోహద పడతాయి. ఈ విధంగా, ఈ ఉపమానముగా చెప్పబడిన వృక్షము యొక్క ఊడలు పరిమాణంలో, సంఖ్యలో అలా అంతులేకుండా పెరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా అవి జీవాత్మను మరింత భౌతిక దృక్పథం లోనే కట్టివేస్తాయి.
న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా । అశ్వత్థమేనం సువిరూఢమూలమ్ అసంగశస్త్రేణ ధృడేన ఛిత్త్వా ।। 3 ।। తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః । తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ।। 4 ।।
3
15
https://www.holy-bhagava…/015_003-004.mp3
న రూపమ్ — రూపము లేకుండా; అస్య — దీని యొక్క; ఇహ — ఈ లోకములో; తథా — ఆ విధముగా; ఉపలభ్యతే — కనిపించును; న అంతః — అంతము లేని; న చ ఆదిః — మొదలు లేకుండా; న చ సంప్రతిష్ఠా — మూలం లేకుండా; అశ్వత్థమ్ — రావి చెట్టు; ఏనం — ఇది; సు-విరూఢ-మూలం — లోతైన మూలములు గల; అసంగ-శస్త్రేణ — అనాసక్తి/వైరాగ్యము అనే గొడ్డలి చే; ధృడేన — బలమైన; ఛిత్త్వా— ఛిద్రం చేసి; తతః — ఆ తరువాత; పదం — ప్రదేశము; తత్ — అది; పరిమార్గితవ్యం — వెతకాలి; యస్మిన్ — ఎక్కడికైతే; గతాః — వెళ్లిన పిదప; న నివర్తంతి — తిరిగిరారు; భూయః — మరల; తమ్ — ఆయనకి; ఏవ — ఖఛ్చితముగా; చ — మరియు; ఆద్యం — మూలమైన; పురుషం — పరమేశ్వరుడు; ప్రపద్యే — ఆశ్రయించుము; యతః — ఎక్కడి నుండి అయితే; ప్రవృత్తిః — ఈ వ్యవహారము; ప్రసృతా — ఉద్భవించినదో; పురాణీ — అతి ప్రాచీనమైన.
BG 15.3-4: ఈ వృక్షము యొక్క నిజ స్వరూపము ఈ జగత్తులో గ్రహింపబడదు, దాని యొక్క మొదలు, చివర, లేదా సనాతన అస్తిత్వము కూడా అర్థం కావు. కానీ, ఈ యొక్క లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును అనాసక్తి/వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించివేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి, అదియే ఆ భగవంతుడు, ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తరువాత మళ్ళీ మనం ఈ జగత్తు లోనికి రాము.
సంసారములో, అంటే ఎడతెగని జనన-మరణ చక్రములో మునిగి ఉన్న బద్దులైన జీవాత్మలు, ఈ యొక్క అశ్వత్థ వృక్షము యొక్క స్వభావమును తెలుసుకోలేకున్నారు. వారికి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు చాల ఆకర్షణీయముగా అనిపిస్తాయి, అంటే, వారు ఇంద్రియ వస్తు విషయముల పట్ల ఆకర్షితమవుతారు మరియు వాటి పట్ల కోరికలను పెంచుకుంటారు. ఈ కోరికలను తీర్చుకోవటానికి, వారు ఎంతో శ్రమిస్తుంటారు. కానీ, వీరి శ్రమ అంతా ఇంకా ఆ వృక్షము మరింత పెరగటానికి దోహద పడుతుంది అని తెలుసుకోరు. ఎప్పుడైతే కోరికలు తీరుతాయో, అవి మరింత ఉధృతంగా అత్యాశ రూపంలో తిరిగి వస్తాయి. కోరికలను అడ్డుకున్నప్పుడు, అవి క్రోధమునకు దారితీస్తాయి, అది బుద్ధిని మరింత భ్రమకు గురి చేసి మరింత అజ్ఞానము లోకి నెట్టి వేస్తుంది. ఈ అశ్వత్థ వృక్షము యొక్క నిగూఢ మర్మమును కొద్ది మందే అర్థం చేసుకుంటారు అని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఆత్మ కేవలం ‘నేను రాంప్రసాద్ ని, హరిప్రసాద్ కొడుకుని; నేను ఈ ఫలానా దేశంలో ఫలానా పట్టణంలో నివసిస్తున్నాను. నా సుఖాన్ని ఇంకాఇంకా పెంచుకోవాలి. కాబట్టి నేను ఈ శారీరక దృక్పథంతోనే పనులు చేస్తుంటాను, కానీ, ఆనందము అనేది నాకు చిక్కటం లేదు దానితో నాకు అంతా అయోమయంగా ఉన్నది.’ అని అనుకుంటుంది. ఈ వృక్షము యొక్క మొదలు లేదా దాని అసలు స్వభావము తెలుసుకోకుండా, జీవుడు వ్యర్థమైన పనులు చేయటం లేదా ప్రయాసలు పడటం చేస్తుంటాడు. తన యొక్క భౌతిక కోరికలను తీర్చుకోవటం కోసం, మానవుడు ఒక్కోసారి పాపపు పనులు చేస్తూ, నిమ్నస్థాయి జీవులలోకి, అధోలోకాలలోనికి ప్రవేశిస్తాడు. ఒక్కోసారి, భౌతిక భోగములు అనుభవించాలనే కోరిక వ్యక్తిని ఆ చెట్టు యొక్క ఆకుల పట్ల ఆకర్షితం చేస్తుంది, అవే వేదములలో చెప్పబడిన కామ్య కర్మ కాండలు. ఈ కార్యములను చేయటం వలన, వ్యక్తి స్వర్గాది పై లోకములకు వెళతాడు, కానీ పుణ్య క్షయము అయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి చేరుతాడు. అందుకే చైతన్య మహాప్రభు ఇలా అన్నాడు: కృష్ణ భులి ఽసేఇ జీవ అనాది-బహిర్ముఖ అథైవ మాయా తారే దేయ సంసార-దుఃఖ కబు స్వర్గే ఉఠాయ, కభు నరకే డుబాయ దండ్య-జనె రాజా యేన నదీతే చుబాయ (చైతన్య చరితామృతము, మధ్య లీల 20.117-118) ‘ఆత్మ సనాతనముగా భగవంతునికి విముఖమై ఉన్నందున, భౌతిక శక్తి దానిని ప్రాపంచిక క్లేశములకు గురి చేస్తున్నది. కొన్ని సార్లు, అది ఆత్మను స్వర్గాది లోకములకు పైకి తీస్కువెళుతుంది, మరియు మరి కొద్ది సార్లు, దానిని నరక లోకాలకు పడవేస్తుంది. ఇది పూర్వ కాలంలో రాజులు పెట్టే హింస వంటిది.’ ఒకలాంటి హింసా విధానంలో, ప్రాచీన రాజులు, వ్యక్తి తలను నీళ్ళలో ఊపిరి ఆడనంత వరకు ముంచేవారు, మరల కొద్దిగా శ్వాస తీసికోవటానికి బయటకు తీసేవారు, కానీ, మరల నీళ్ళలో తల ముంచేసేవారు. ఆత్మ యొక్క పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. అది స్వర్గాది లోకాలలో తాత్కాలికమైన ఉపశమనం పొందుతుంది, కానీ భూలోకంపై మరల త్రోసివేయబడుతుంది. ఈ ప్రకారంగా అనంతమైన జన్మలు గడిచిపొయినాయి. భౌతిక భోగముల కోసం ఆత్మ చేసే ప్రయాసలన్నీ కేవలం ఆ వృక్షమును మరింత పెంచుతూ మరిన్ని వేర్లను (ఊడలను) నేల మీదికి పంపించటానికే పనికొస్తున్నాయి. కానీ, శ్రీ కృష్ణుడి ప్రకారం, వైరాగ్యమే, ఈ చెట్టుని కొట్టివేయటానికి ఉన్న గొడ్డలి. 'అసంగము' అంటే అనాసక్తి/వైరాగ్యము, అని అర్థం. ఈ గొడ్డలి ఆత్మ జ్ఞానముచే తయారుచేయబడాలి, ‘నేను నిత్య శాశ్వత సనాతనమైన ఆధ్యాత్మిక జీవుడను, ఈ శరీరమును కాదు. నేను వెతికే శాశ్వతమైన దివ్య ఆనందము, ఎన్నటికీ ఈ భౌతిక వస్తువుల నుండి లభించదు. నేను ఈ శరీరమే అని అనుకుని కోరుకునే ఈ భౌతిక ప్రాపంచిక కోరికలు, ఈ జనన-మరణ చక్ర సంసారములో (జగత్తులో) నా అస్తిత్వమును మరింత పొడిగిస్తాయి. ఈ దిశలో ఎటువంటి ఉపశమనం లేదు.’ అని తెలుసుకోవాలి. వ్యక్తి వైరాగ్యం పెంచుకున్నప్పుడు, ఈ వృక్షము యొక్క మరింత పెరుగుదల ఆగిపోతుంది మరియు ఆ చెట్టు కృశించి పోవటం మొదలవుతుంది. ఆ తరువాత మనము ఆ వృక్షము యొక్క మొదలు కోసం వెతకాలి, అది దాని యొక్క వేర్ల కన్నా పై భాగములో మిగతా అన్నింటి కన్నా ఉన్నత స్థానంలో ఉంటుంది. ఆ మూలమే భగవంతుడు, శ్రీ కృష్ణుడు ఇంతకు పూర్వం ఇలా చెప్పినట్టు: ‘నేనే భౌతిక మరియు ఆధ్యాత్మిక సృష్టికి మూలమును. సర్వమూ నా నుండే జనిస్తాయి. ఇది సంపూర్ణముగా తెలిసినవారు నన్ను గొప్ప విశ్వాసముతో మరియు భక్తితో ఆరాధిస్తారు.’ (శ్లోకం 10.8) ఈ విధంగా, వృక్షము యొక్క అసలు మూలము తెలుసుకున్నాక, దానికి ఈ శ్లోకంలో చెప్పబడినట్టు శరణాగతి చేయాలి: ‘ఎవరి నుండి సనాతన కాలం క్రితమే ఈ జగత్తు ఆవిర్భవించినదో, అతనికి నేను శరణాగతి చేస్తున్నాను.’ అని. ఈ ప్రకారంగా, ఇంతకూ పూర్వము అర్థంకానిది, అంతులేనిదిగా ఉన్న వృక్షమును మనము అధిగమించవచ్చు. శ్రీ కృష్ణుడు ఇంతకు పూర్వమే, ‘ప్రకృతి త్రిగుణములను కలిగి ఉన్న నా దైవీ శక్తి, మాయ, అధిగమించటానికి చాలా కష్టతరమైనది. కానీ, ఎవరైతే నాకు శరణాగతి చేస్తారో వారు దానిని సునాయాసముగా దాటి పోతారు. (శ్లోకం 7.14) అని చెప్పాడు. కాబట్టి, ఆ భగవంతుడిని ఆశ్రయించిన పిదప, ఈ అశ్వత్థ వృక్షము కొట్టివేయబడుతుంది. మనము మళ్లీ ఈ భూలోకమునకు రావలసిన అవసరం లేదు, మరియు మనం మరణించిన పిదప ఆయన యొక్క దివ్య ధామమునకు చేరుకుంటాము. శ్రీ కృష్ణుడు తదుపరి శ్లోకంలో ఈ శరణాగతి ప్రక్రియ అంటే ఏమిటో చెప్తున్నాడు.

నిర్మానమోహా జితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః । ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ।। 5 ।।
5
15
https://www.holy-bhagava…udio/015_005.mp3
నిః — లేకుండా; మాన — అహంకారం/గర్వము; మోహాః — మోహము; జిత — జయించి; సంగ — సంగము (మమకారాసక్తి); దోషాః — దోషములు; అధ్యాత్మ-నిత్యాః — నిరంతరం ఆత్మ, భగవంతుని యందే స్థితమై ఉండి; వినివృత్త కామాః — ఇంద్రియ భోగ కోరికల నుండి పూర్తిగా స్వేచ్ఛ పొందినవారు; ద్వంద్వైః విముక్తాః — ద్వంద్వముల నుండి విముక్తులైనవారు; సుఖ-దుఃఖ సంజ్ఞైః — సుఖదుఃఖములు అనబడే; గచ్ఛంతి — పొందెదరు; అమూఢాః — వివేకవంతులు; పదం — ధామము; అవ్యయం — నిత్య సనాతనమైన; తత్ — అది.
BG 15.5: దురభిమానము మరియు మోహము లేకుండా ఉన్నవారు, మమకారాసక్తియనే అరిష్టాన్ని జయించినవారు, సతతమూ ఆత్మ, భగవంతుని చింతనలోనే ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేని వారు, సుఖదుఃఖములనెడి ద్వంద్వములకు అతీతులై ఉన్నవారు, ఇటువంటి ముక్తజీవులు నా పరమపదమును చేరుకుంటారు.
శ్రీ కృష్ణుడు ఇప్పుడు ఇక ఆ వృక్షము యొక్క మూలాధారమైన, భగవంతునకు ఎలా శరణాగతి చేయాలో వివరిస్తున్నాడు. ప్రప్రథమంగా అజ్ఞానము వల్ల జనించిన అహంకారమును మరియు గర్వమును విడిచిపెట్టాలి అని అంటున్నాడు. భ్రాంతికి లోనైన జీవాత్మ ప్రస్తుతం ఇలా అనుకుంటుంది, ‘నాకున్న దానికంతా నేనే యజమానిని, ఇంకా భవిష్యత్తులో, మరింత సంపాదించుకుంటాను. ఇదంతా నా భోగవిలాసానికి మరియు సంతోషానికే ఉన్నది.’ అని. మనము అజ్ఞానము వలన జనించిన ఈ అహంకారముచే మోహితులమై ఉన్నంత వరకు, మనమే ప్రకృతిని అనుభవించేది అని అనుకుంటాము. ఇటువంటి పరిస్థితిలో, మనము ఆ భగవంతుడిని పక్కకుపెడతాము మరియు ఆయన సంకల్పానికి శరణాగతి చేయటానికి వాంఛించము. మనమే వీటన్నిటినీ అనుభవించేది అన్న దృక్పథం జ్ఞాన సహకారంతో నిర్మూలించబడాలి. ఈ భౌతిక శక్తి భగవంతునికి చెందినది కాబట్టి ఆయన సేవ కోసమే ఉన్నది అని గ్రహించాలి. ఆత్మ కూడా భగవంతుని యొక్క సేవకుడే, కాబట్టి ప్రస్తుతమున్న భోగించే దృక్పథాన్ని సేవా దృక్పథముగా మార్చాలి. దీని కోసం, మనము మనస్సుని భగవంతుని నుండి దూరంగా, ప్రాపంచికత్వం వైపు మరల్చే భౌతిక బంధాలను నిర్మూలించుకోవాలి. బదులుగా, ఆత్మ అనేది భగవంతుని యొక్క సనాతన నిత్య దాసుడే అని అర్థం చేసుకుని, మనస్సుని నిస్వార్థ సేవా దృక్పథంలో భగవంతుని యందే అనుసంధానం చేయాలి. పద్మ పురాణం ఇలా పేర్కొంటున్నది: దాస భూతమిదం తస్య జగత్ స్థావర జంగమం శ్రీమన్నారాయణ స్వామీ జగతాంప్రభురీశ్వరః ‘సర్వోన్నత ప్రభువు నారాయణుడు సమస్త జగత్తుకు ప్రభువు, ఆయనే నియంత్రకుడు. అన్ని స్థావర-జంగమములు (కదిలేవి మరియు కదలని ప్రాణులు) మరియు సృష్టిలో సమస్త పదార్థములు ఆయన సేవకులే’. అందుకే భగవంతుని సేవచెయ్యాలని ఎంత ఎక్కువగా కోరిక పెంచుకుంటే, అంత మాత్రము ఈ ప్రకృతిని అనుభవించేది నేనే అన్న భ్రాంతి నిర్మూలించబడుతుంది మరియు హృదయము పరిశుద్ధమవుతుంది. జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్, అంతఃకరణ శుద్ధి కోసము దీనినే అన్నింటికన్నా ప్రధానమైనదిగా పేర్కొన్నాడు. సౌ బాతన కీ బాత ఇక, ధరు మురళీధర ధ్యాన, బఢవహు సేవా-వాసనా, యహ సౌ జ్ఞానన జ్ఞాన (భక్తి శతకము 74వ శ్లోకము) ‘అంతఃకరణ శుద్ధి కోసం ఉన్న వందల సలహాలలో, అత్యంత ముఖ్యమైనది ఇదే. మీ మనస్సుని ఆ దివ్య మంగళ మురళీధరుడైన శ్రీ కృష్ణ పరమాత్మ యందే నిమగ్నం చేయండి; మరియు ఆయనకు సేవ చేయాలనే వాంఛను పెంచుకోండి. ఈ ఉపదేశము ఇటువంటి వంద దివ్య జ్ఞాన రత్నాల కంటే ఎక్కువ ముఖ్యమైనది.’ ఒకసారి మనము అంతఃకరణ శుద్ధి యందు విజయం సాధించి, భగవంతుని పట్ల ప్రేమ యుక్త భక్తిలో నిమగ్నమైతే, అప్పుడు ఏమవుతుంది? ఇటువంటి పరిశుద్ధ జీవులు శాశ్వతముగా ఆ పరమ పదమును చేరుకుంటారు అని శ్రీ కృష్ణుడు ఈ పై శ్లోకములో వివరిస్తున్నాడు. భగవత్ దృక్పథములోనే జీవించే స్థితికి వచ్చేసినప్పుడు ఈ భౌతిక జగత్తు యొక్క అవసరం ఇక ఉండదు. ఆ జీవాత్మ ఇక భగవంతుని యొక్క దివ్య ధామములో, ఇతర భగవత్ ప్రాప్తి నొందిన జీవులతో, నివసించటానికి అర్హత పొందినట్టే. ఎలాగైతే ఒక నగర వైశాల్యంలో, ఒక జైలు చిన్న భాగమే అయినట్టు, ఆ భౌతిక జగత్తు కూడా అలాంటిదే. అది భగవంతుని యొక్క సమస్త సృష్టిలో ఒక నాలుగవవంతు (1/4th) మాత్రమే, ఆధ్యాత్మిక జగత్తు మూడు వంతులు. (3/4th). వేదములు ఇలా పేర్కొంటున్నాయి: పాదో ఽస్య విశ్వా భూతాని, త్రిపాదస్య అమృతం దివి (పురుష సూక్తం, 3వ మంత్రం) ‘భౌతిక శక్తిచే తయారుచేయబడిన ఈ తాత్కాలికమైన జగత్తు, సృష్టిలో ఒక వంతు మాత్రమే. మిగతా మూడు వంతులు, జనన మరణములకు అతీతముగా ఉండే భగవంతుని యొక్క నిత్యసనాతన ధామము.’ శ్రీ కృష్ణుడు తదుపరి శ్లోకంలో ఆ నిత్యసనాతన ధామ లక్షణాన్ని వివరిస్తున్నాడు.
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః । యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ।। 6 ।।
6
15
https://www.holy-bhagava…udio/015_006.mp3
న — కాదు; తత్ — అది; భాసయతే — ప్రకాశింపచేయును; సూర్యో — సూర్యుడు; న శశాంకో — చంద్రుడు కూడా కాదు; న పావకః — అగ్ని కూడా కాదు; యత్ — ఎక్కడికైతే; గత్వా — వెళ్లిన పిదప; న నివర్తంతే — తిరిగి రారో; తత్-ధామ — ఆ ధామము; పరమం — సర్వోన్నతమైనది; మమ — నాది.
BG 15.6: సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవేవీ నా పరం ధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన పిదప, జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.
ఇక్కడ, శ్రీ కృష్ణుడు దివ్య లోక స్వభావాన్ని సంక్షిప్తముగా వివరిస్తున్నాడు. దానిని ప్రకాశింపచేయటానికి, సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని అవసరం లేదు, ఎందుకంటే అది సహజంగానే స్వయంప్రకాశితము. భౌతిక జగత్తు అనేది భౌతిక శక్తి, మాయ ద్వారా తయారుచేయబడినది కానీ, దివ్య లోకము ఆధ్యాత్మిక శక్తి యోగమాయచే తయారు చేయబడినది. అది భౌతిక జగత్తు యొక్క ద్వంద్వములు మరియు దోషములకు అతీతమైనది మరియు సంపూర్ణ దోషరహితమైన ప్రదేశము. అది సత్-చిత్-ఆనందము, అంటే, అమరత్వము, జ్ఞానము, మరియు ఆనందముతో పూర్ణముగా నిండి ఉంటుంది. దివ్య లోకము, పరవ్యోమము అనే ఆధ్యాత్మిక ఆకాశమును కలిగిఉంటుంది. దానిలో, దైవీ ఐశ్వర్యములు, అద్భుతములతో నిండిన ఎన్నెన్నో ధామములు ఉంటాయి. సమస్త నిత్య సనాతన భగవత్ స్వరూపములైన, కృష్ణుడు, రాముడు, నారాయణుడు వంటి వారు వారి వారి ధామములను ఆ ఆధ్యాత్మిక ఆకాశములో కలిగిఉంటారు. అక్కడ వారు నిత్య శాశ్వతముగా తమ భక్తులతో నివసిస్తూ తమ దివ్య లీలలలో వారితో గడుపుతూ ఉంటారు. బ్రహ్మదేవుడు తన శ్రీ కృష్ణుడి ప్రార్థనలో ఇలా పేర్కొన్నాడు: గోలోక-నామ్ని నిజ-ధామ్ని తలే చ తస్య దేవీ మహేశ-హరి-ధామసు తేషు తేషు తే తే ప్రభావ-నిచయా విహితాశ్చ యేన గోవిందం ఆది-పురుషం తం అహం భజామి (బ్రహ్మ సంహిత, 43వ శ్లోకము) ‘ఆధ్యాత్మిక ఆకాశములో గోలోకము ఉంది, ఇది శ్రీ కృష్ణుడి యొక్క తనదైన స్వధామము. ఆ ఆధ్యాత్మిక ఆకాశము లో నారాయణుడు, శివుడు, దుర్గా మాత మొదలైన వారి ధామములు కూడా ఉంటాయి. ఎవరి (విభూతి) ఐశ్వర్యముచే ఇది అంతా సాధ్యమై నిలుస్తున్నదో, ఆ సర్వోత్కృష్ట దివ్య భగవానుడైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను.’ శ్రీ కృష్ణుడి ధామమైన గోలోకము గురించి బ్రహ్మ ఇంకా ఇలా చెప్తున్నాడు: ఆనంద-చిన్మయ-రస-ప్రతిభావితాభిస్ తాభిర్ య ఏవ నిజ-రూపతయా-కలాభి: గోలోక ఏవ నివసతి అఖిలాత్మ-భూతో గోవిందం ఆది-పురుషం తం అహం భజామి (బ్రహ్మ సంహిత, 37వ శ్లోకము) ‘సర్వోత్కృష్ట దివ్య భగవానుడైన గోవిందుడిని నేను పూజిస్తాను, ఆయన గోలోకములో తన నిజస్వరూపమే అయిన రాధతో కలిసి నివసిస్తుంటాడు. వారి నిత్య పరివారము, సఖి గణము, నిత్య-ఆనంద ఆధ్యాత్మిక శక్తిచే ప్రేరణ పొందుతూ ఉంటారు, వారు అరవై నాలుగు కళల మూర్తీభవించిన స్వరూపములు.’ భగవత్-ప్రాప్తి నొందిన భక్తులు, ఆయన యొక్క పరంధామమునకు చేరుకుని, ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణతతో నిండిపోయిన దివ్య లీలలలో పాలుపంచుకుంటారు. అక్కడకు చేరుకున్న జీవులు, ఈ జనన-మరణ సంసారమును దాటిపోతారు అని శ్రీ కృష్ణుడు, అర్జునుడికి హామీ ఇస్తున్నాడు.
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః । మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ।। 7 ।।
7
15
https://www.holy-bhagava…udio/015_007.mp3
మమ — నా యొక్క; ఏవ — మాత్రమే; అంశా — అంశములు; జీవ-లోకే — భౌతిక ప్రపంచములో; జీవ-భూతః — జీవాత్మలు; సనాతనః — సనాతనమైన; మనః — మనస్సు; షష్ఠాని — ఆరు; ఇంద్రియాణి — ఇంద్రియములు; ప్రకృతి-స్థాని — ప్రకృతి స్వభావముచే బంధించివేయబడి; కర్షతి — శ్రమ పడుతున్నారు.
BG 15.7: భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశములు. కానీ, భౌతిక శక్తిచే కట్టివేయబడి, వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాస పడుతున్నారు.
శ్రీ కృష్ణుడు ఇంతకు పూర్వం ఆయన ధామమునకు చేరిన జీవులు ఇక మళ్ళీ తిరిగి రారు అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు, భౌతిక జగత్తు లోనే ఇంకా ఉండిపోయిన జీవుల గురించి చెప్తున్నాడు. మొదట, వీరు కూడా తన అంశములే అని మళ్ళీ ధైర్యం చెప్తున్నాడు. కాబట్టి, భగవంతుడికి ఉన్న వివిధ అంశములను అర్థం చేసుకుందాం. ఇవి రెండు రకాలుగా ఉన్నాయి: స్వాంశలు. వీరు భగవంతుని అవతారములు, రాముడు, నృసింహ, వరాహ మొదలైనవారు. వారు శ్రీ కృష్ణునికి అభేదములు అందుకే వారిని స్వాంశలు అంటాము, అంటే ఏకీకృతమైన అంశములు అని అర్థం. విభిన్నాంశములు. వీరు భగవంతునికి భిన్నములైన అంశములు. వారు నేరుగా భగవంతుని అంశములు కాదు, అయినా, వారు ఆయన యొక్క జీవ శక్తి యొక్క అంశములు. ఈ కోవలోకే జగత్తులో ఉన్న ఆత్మలు అన్నీ వస్తాయి. ఇది శ్రీ కృష్ణుడిచే 7.5వ శ్లోకంలో చెప్పబడినది. ‘భౌతిక శక్తి కన్నా ఉన్నతమైనది, ఓ మహా బాహువులు కల అర్జునా, ఇంకొక ఉత్కృష్ట మైన శక్తి కూడా ఉన్నది. అదే ఈ ప్రపంచంలో జీవరాశికి మూలమైన జీవాత్మలు.’ ఇంతేకాక, విభిన్నాంశ ఆత్మలు మూడు రకాలు: నిత్య సిద్ధులు: వీరు ఎప్పుడూ విముక్తులైన వారే కాబట్టి భగవంతుని యొక్క దివ్య ధామములో, ఆయన దివ్య లీలలలో పాలుపంచుకుంటూ, సనాతన కాలం నుండి ఉన్నవారు. సాధన సిద్ధులు: ఈ జీవాత్మలు మనలాగే ఒకప్పుడు భౌతిక జగత్తులో ఉండేవారే, కానీ వారు తమ సాధనా అభ్యాసం ద్వారా ఆ భగవంతుడిని చేరుకున్నారు. ఇక ఇప్పుడు వారు దివ్య భగవత్ ధామము లోనే శాశ్వతంగా ఉంటూ భగవంతుని దివ్య లీలలలో పాలుపంచుకుంటూ ఉంటారు. నిత్య బద్ధులు: వీరు సనాతన కాలం నుండి భౌతిక జగత్తు లోనే ఉండిపోయినవారు. వీరు ఐదు ఇంద్రియములు మరియు మనస్సుచే కట్టివేయబడినారు, కాబట్టి వారు ప్రయాస పడుతున్నారు. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: ‘పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూః’ "(2.1.1) ‘సృష్టికర్త బ్రహ్మ, ఇంద్రియములను బహిర్ముఖంగా, ప్రపంచంవైపు మర్లేటట్టు తయారుచేసాడు.’ ఈ యొక్క విభిన్నాంశలైన నిత్య బద్ద అంశముల గురించి, శ్రీ కృష్ణుడు, వారు మనస్సు ఇంద్రియములను తృప్తిపరచటానికి ప్రయాసపడుతూ, ఆ క్రమంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అని అంటున్నాడు. ఇక తదుపరి శ్లోకంలో, ఆత్మ మరణ సమయంలో ఇంకొక శరీరమునకు వెళ్ళినప్పుడు మనస్సు ఇంద్రియములకు ఏమవుతుందో శ్రీ కృష్ణుడు వివరిస్తాడు.
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః । గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ ।। 8 ।।
8
15
https://www.holy-bhagava…udio/015_008.mp3
శరీరం — శరీరము; యత్ — ఎలాగైతే; అవాప్నోతి — తీసుకువెళుతుందో; యత్ — అలాగే; చ అపి — కూడా; ఉత్క్రామతి — విడిచివెళ్లును; ఈశ్వరః — జీవాత్మ, భౌతిక శరీరము యొక్క ప్రభువు; గృహీత్వా — తీసుకుని; ఏతాని — వీటిని; సంయాతి — వెళ్ళును; వాయుః — గాలి; గంధాన్ — సువాసనను; ఇవ — అలాగే; ఆశయాత్ — స్థానము నుండి.
BG 15.8: ఎలాగైతే గాలి, సుగంధమును ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీస్కువెళుతుందో, జీవాత్మ కూడా, పాత శరీరమును విడిచి, కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు, మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళుతుంది.
ఆత్మ ఒక శరీరము నుండి ఇంకొక శరీరము లోకి వెళ్లే ప్రక్రియ ఇక్కడ వివరించబడినది. వీచేగాలి, పుష్పముల సువాసనను ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీసుకెళ్లటం ఇక్కడ ఉదాహరణగా చెప్పబడినది. అదే విధముగా, మరణ సమయంలో ఆత్మ దేహమును విడిచి వెళ్ళేటప్పుడు అది స్థూల శరీరమును విడిచి పెడుతుంది. కానీ, తనతో పాటుగా సూక్ష్మ మరియు కారణ శరీరములను తీసుకుని వెళుతుంది; వీటిలోనే మనస్సు-ఇంద్రియములు ఉంటాయి. (ఈ మూడు రకముల శరీరములు 2.28వ శ్లోకములో వివరించబడ్డాయి). ఆత్మకు ప్రతి జన్మలో ఒక కొత్త శరీరము వచ్చినా, మనస్సు మాత్రం పూర్వ జన్మలనుండి అదే వస్తుంటుంది. పుట్టుకతోనే గుడ్డివాళ్ళు కూడా కలలు ఎందుకు చూడగలుగుతారో దీని వలన మనకు తెలుస్తుంది. మామూలుగా అయితే మనం మెలకువగా ఉన్న సమయంలో చూసిన దృశ్యాలు, ఆలోచించిన తలపుల వికారములే నిద్రలో/కలలో మళ్ళీ మరోలా అగుపిస్తాయి. ఉదాహరణకి, ఎవరైనా ఒక పక్షి ఎగరటం చూసి ఇలా అనుకోవచ్చు, ‘నేను పక్షినైతే ఎంత బాగుండేది..’ అని. కలలో ఆ వ్యక్తి మానవ శరీరంతోనే ఎగురుతూ తనకు తానే అగుపించవచ్చు. ఇది ఎందుకంటే అతను మెలకువగా ఉన్నప్పటి ఆలోచనలు, చూసిన దృశ్యాలు ఒకలా వికారంచెంది మరల స్వప్న స్థితిలో అగుపిస్తాయి. కానీ, పుట్టుగ్రుడ్డి వాడు ఎప్పుడూ ఎలాంటి రూపములు ఆకారములూ చూసిఉండడు, కానీ ఆ వ్యక్తి కూడా స్వప్నములు చూస్తాడు ఎందుకంటే మెలకువగా ఉన్నప్పటి అనుభూతులు అనంతమైన పూర్వ జన్మల నుండీ మనస్సులలో ముద్రించబడి ఉంటాయి. ఆత్మ వెళ్లిపోయేటప్పుడు తనతోపాటు మనస్సు-ఇంద్రియములను తీసుకువెళుతుంది అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు అది వాటితో ఏమి చేస్తుందో ఇక తదుపరి వివరిస్తాడు.
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ । అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ।। 9 ।।
9
15
https://www.holy-bhagava…udio/015_009.mp3
శ్రోత్రం — చెవులు; చక్షుః — కన్నులు; స్పర్శనం — స్పర్శ; చ — మరియు; రసనం — నాలుక; ఘ్రాణమ్ — ముక్కు; ఏవ — కూడా; చ — మరియు; అధిష్ఠాయ — చుట్టూ ఉండి; మనః — మనస్సు; చ — మరియు; అయం — అవి; విషయాన్ — ఇంద్రియ విషయములు; ఉపసేవతే — ఆస్వాదించును.
BG 15.9: మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములు - చెవులు, కన్నులు, చర్మము, నాలుక మరియు ముక్కు - వీటి యొక్క గ్రహణశక్తితో, జీవాత్మ ఇంద్రియ వస్తువిషయములను ఆస్వాదిస్తుంటుంది.
ఆత్మ దివ్యమైనది కావున, అది సూటిగా రుచి చూడటం, స్పర్శించటం, అనుభవించటం, వాసనచూడటం లేదా వినటం చేయలేదు, మరి అది ఎలా ఈ అనుభూతులను ఆస్వాదించవచ్చు? దీనికి సమాధానం ఏమిటంటే, దానికి ఇంద్రియములు, మనస్సు సహాయం చేస్తాయి. ఇంద్రియములు, మనస్సు నిజానికి జడమైనవి, కానీ అవి ఆత్మ శక్తిచే చైతన్యవంతం అయ్యి మరియు ప్రాణం ఉన్నట్టుగా అవుతాయి. కాబట్టి, అవి వస్తువులు, పరిస్థితులు, ఆలోచనలు మరియు వ్యక్తుల ద్వారా సుఖదుఃఖాలను అనుభవిస్తాయి. అహంకారముచే ఆత్మ తన మనసేంద్రియములతో అనుసంధానమై పరోక్షంగా ఆ యొక్క సుఖాలను అనుభవిస్తుంటుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఆత్మ స్వయంగా దివ్యమైనది అయినా, అది ఈ విధంగా అనుభవించే ఆనందము, ప్రాకృతికమైనది. ఈ విధంగా ఇంద్రియములు-మనస్సు ఎంత ఆనందాన్ని తెచ్చి ఇచ్చినా ఆత్మకు అసంతృప్తి గానే ఉంటుంది. ఇంకా తన లక్ష్యమును చేరుకోలేదు అన్న భావన ఉండిపోతుంది, మరియు తనను యదార్థముగా తృప్తి నొందించే ఆ సంపూర్ణ ఆనందము కోసము అన్వేషిస్తూనే ఉంటుంది. అమెరికన్ తత్త్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్ దీనిని చాలా అద్భుతంగా పేర్కొన్నాడు: ‘మానవ జీవితం క్లేశములతో కూడుకున్నది అని అనుకుంటాము. అది దుఃఖకరమైనది అని ఎట్లా తెలుసుకున్నాము? ఈ అసౌకర్యానికి, సనాతన అసంతృప్తికి ఆధారం ఏమిటి ? సర్వత్రా ఉండే ఈ అజ్ఞానము మరియు తాపత్రయం ఏమిటి? ఆత్మ చేసే ఈ దావా కి మూలమేమిటి? (We grant that human life is mean. But how did we find out that it is mean? What is the ground of this uneasiness, of this old discontent? What is this universal sense of want and ignorance, but the fine innuendo by which the soul makes its enormous claim?) ఇంకొక ప్రఖ్యాత తత్త్వవేత్త మయిస్టర్ ఎఖార్ట్ (Meister Eckhart) ఇలా వ్రాసాడు: ‘జీవాత్మలో ఏదో ఉంది, అది ఆ ప్రాణి కంటే ఉన్నతమైనది, దివ్యమైనది మరియు సరళమైనది. ఆ ప్రకాశత్వం, ఒక మహోన్నత అస్తిత్వం తోటే తృప్తి చెందుతుంది” (There is something in the soul which is above the living being, divine and simple. This light is only satisfied with the supra essential essence) ఆత్మ ఆశించే ఆ యొక్క, అనంతమైన, నిత్యమైన మరియు దివ్య ఆనందము, భగవంతుని నుండే లభిస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాత, బంధనమునకు కారణమయిన అవే ఇంద్రియ-మనస్సులను, భగవంతుని దిశగా మరల్చి, భక్తి యందు ఉపకరణములుగా వాడుకోవచ్చు. ఈ విషయంలో, హిందీ రామాయణము రచించిన సంత్ తులసీదాసు ఒక మంచి ఉదాహరణ. తన యుక్త వయస్సులో, అతనికి భార్య పట్ల అమితమైన మమకారానురాగాలు ఉండేవి. ఒకసారి ఆమె తన తల్లిదండ్రుల దగ్గర ఉండటానికి కొద్ది రోజులు వారింటికి వెళ్ళింది, అప్పుడు ఒకనాడు తులసీదాసుకు ఆమెను చూడాలనిపించింది. ఆయన తన మామగారి ఇంటికి నడవటం ప్రారంభించాడు, కానీ దారిలో ఒక వాగు ఉంది, అప్పుడు పెద్ద వర్షం పడుతుండటంతో పడవవాళ్ళు ఎవరూ ఆ వాగుని దాటించటానికి ఒప్పుకోలేదు. అదే సమయంలో నీటిలో తేలుతూ ఒక శవం అక్కడకు కొట్టుకు వచ్చింది. తన భార్యను కలవాలని తీవ్ర వాంఛతో ఉన్న తులసీదాసు దానిని ఒక దూలము అనుకున్నాడు. దానిని ఒడిసిపట్టుకుని ఆ వాగుని దాటాడు. వాళ్ళ ఇంటిలో రెండవ అంతస్థులో ఉన్న భార్యను కలవాలనే కోరిక ఆయనను పూర్తిగా ఆవరించి ఉంది. ఒక పాము ఆ ఇంటి గోడకు వ్రేలాడుతూ ఉంది, తులసీదాసు దానిని జాగ్రత్తగా చూడలేదు, దానిని ఒక తాడు అనుకున్నాడు. కాబట్టి, ఇంటి ప్రధాన ద్వారం వద్ద తలుపు కొట్టి సమయం వృధా చేయకూడదనుకుని, ఆ పాముని పట్టుకుని పైకి ఎగబాకాడు. ఆయన కిటికీ గుండా లోనికి ప్రవేశించినప్పుడు, ఆయన భార్య ఆశ్చర్య పోయింది. ఆయన ఎలా ఆ నదిని దాటాడో, ఎలా ఆ గోడ ఎక్కాడో అని ఆమె అడిగింది. అప్పుడాయన తాను పొరపాటుగా అనుకున్న దూలమును, త్రాడుని చూపించాడు. ఆమె శవాన్ని మరియు పామును చూసి అదిరిపోయింది. అప్పుడామె ఆశ్చర్యముతో అన్నది, ‘మీకు ఈ రక్తమాంసాలతో ఉన్న శరీరము అంటే అంత కోరిక ఉన్నది. ఇంత గాఢముగా మీరు ఆ భగవంతుడినే కోరుకుని ఉంటే, మీరు మరల ఈ జగత్తులో పుట్టవలసిన అవసరమే ఉండదు!’ అని. తన భార్య యొక్క మాటలు ఆయనను ఎంత బలంగా తాకాయి అంటే, ఆయన తన తప్పుని తెలుసుకుని, విరక్తుడై పోయాడు. గృహస్తు జీవితాన్ని విడిచి పెట్టి, భక్తిలో నిమగ్నమవటానికి వెళ్ళిపోయాడు. తనను ఇంతకు క్రితం ఇబ్బంది పెట్టిన అవే మనస్సు-ఇంద్రియముల కోరికలను భగవత్ దిశగా మరల్చి వేసాడు. ఈ విధంగా, భక్తి మార్గ ప్రక్రియ ద్వారా తనను తాను పవిత్రం చేసుకుని గొప్ప ప్రఖ్యాత రచయిత సంత్ తులసీదాసు అయ్యాడు. తరువాతి కాలంలో ఆయన ఇలా వ్రాసాడు: కామిహి నారి పిఆరి జిమి లోభిహి ప్రియ జిమి దామ, తిమి రఘునాథ నిరంతర ప్రియ లాగహు మోహి రామ (రామచరితమానస్) ‘ఒక కాముకుడు, అందమైన స్త్రీని వాంఛించినట్టుగా; మరియు ఒక లోభి, ధనమును కాంక్షించినట్టుగా; నా ఇంద్రియ మనస్సులు నిరంతరం శ్రీ రామచంద్ర ప్రభువునే కోరుకోవాలి.’
ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్ । విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః ।। 10 ।।
10
15
https://www.holy-bhagava…udio/015_010.mp3
ఉత్క్రామంతం — వెళ్ళిపోతున్నప్పుడు; స్థితం — ఉన్నప్పుడు; వా అపి — అయినా కానీ; భుంజానం — భోగమును ఆనందిస్తూ; వా — లేదా; గుణ-అన్వితమ్ — భౌతిక ప్రకృతి యొక్క గుణములచే లోబడిపోయి; విమూఢాః — అజ్ఞానులు; న అనుపశ్యంతి — గమనించరు; పశ్యంతి — దర్శిస్తారు; జ్ఞాన చక్షుషః — జ్ఞాన నేత్రములు కలవారు
BG 15.10: అది ఇంద్రియ వస్తువిషములను ఆనందిస్తూ దేహములోనే ఉన్నప్పుడు కానీ లేదా అది దేహమును విడిచివెళ్లినప్పుడు కానీ, జీవాత్మను అజ్ఞానులు గమనించరు. కానీ జ్ఞాన నేత్రములు కలవారు దానిని దర్శించగలరు.
ఆత్మ దేహములోనే స్థితమై ఉండి తన మనస్సు, ఇంద్రియముల యొక్క అనుభూతులను ఆస్వాదిస్తూ ఉన్నా, దానిని అందరూ గుర్తించలేరు. దీనికి గల కారణం ఏమిటంటే ఆత్మ అనేది ప్రాకృతికమైనది కాదు, అందుకే అది భౌతిక ఇంద్రియములచే చూడబడలేదు లేదా స్పర్శించబడలేదు. శాస్త్రజ్ఞులు దానిని తమ ప్రయోగశాలలో తమ ఉపకరణాలతో గుర్తించలేరు, కాబట్టి వారు తప్పుగా ఈ శరీరమే మనము అని అంటారు. ఇది, ఒక మెకానిక్కు, కారు ఎలా కదులుతుందో తెలుసుకుందామని ప్రయత్నించినట్టుగా ఉంటుంది. అతను టైర్ల కదలిక ఎక్కడినుండి వస్తుందో చూసి ఎక్సిలేటర్, కీ, స్టీరింగ్ చక్రం వరకు గమనిస్తాడు. వీటినే కారు యొక్క గమనానికి కారణములు అని అనుకుంటాడు, కానీ, ఒక డ్రైవరు వీటన్నిటిని నియంత్రిస్తున్నాడు అని తెలుసుకోడు. అదే విధంగా, ఆత్మ ఉందనే జ్ఞానం లేకపోతే, శరీరశాస్త్రజ్ఞులు, శరీరములోని వివిధ భాగములే కలిపి ప్రాణమునకు మూలము అని అనుకుంటారు. కానీ, ఆధ్యాత్మిక మార్గం లో పయనించిన వారు, ఆత్మయే ఈ అన్ని శరీర భాగములను జీవింపచేస్తుంది అని తమ జ్ఞాన నేత్రములచే తెలుసుకుంటారు. అది వెళ్ళిపోయిన తరువాత, భౌతిక శరీరము యొక్క అన్ని భాగములు, గుండె, మెదడు, ఊపిరితిత్తులు వంటివి అన్నీ అక్కడే ఉన్నా, వాటిలో చైతన్యం ఉండదు. చైతన్యము అనేది ఆత్మ యొక్క లక్షణము. ఆత్మ ఉన్నంత వరకే శరీరములో చైతన్యము ఉంటుంది; ఆత్మ వెళ్ళిపోయినప్పుడు అదికూడా ఉండదు. జ్ఞాన నేత్రములు కలవారే దీనిని చూడగలరు. అజ్ఞానులు, తమ స్వంత దివ్య అస్తిత్వము తెలియక, ఈ భౌతిక కాయమే తాము అని అనుకుంటారు, అని శ్రీ కృష్ణుడు ఇక్కడ అంటున్నాడు.
యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ । యతంతోఽప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః ।। 11 ।।
11
15
https://www.holy-bhagava…udio/015_011.mp3
యతంతః — గట్టిగా ప్రయత్నించే; యోగినః — యోగులు; చ — కూడా; ఏనం — దీనిని (ఆత్మ); పశ్యంతి — చూచెదరు; ఆత్మని — శరీరములో; అవస్థితం — స్థితమై ఉన్న; యతంతః — పరిశ్రమిస్తూ; అపి — కూడా; అకృత-ఆత్మనః — అంతఃకరణ శుద్ధి లేని వారు; న ఏనం పశ్యతి — దీనిని గమనించలేరు; అచేతసః — అజ్ఞానులు.
BG 15.11: గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు. కానీ, ఎంత ప్రయత్నించినా, అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు.
జ్ఞానము కోసం ప్రయత్నించటం మాత్రమే సరిపోదు; మన పరిశ్రమ సరియైన దిశలో కూడా ఉండాలి. మనుష్యులు తరచుగా ఈ తప్పు చేస్తుంటారు - ఈ ప్రపంచ విషయాలని తెలుసుకున్న పద్ధతి ద్వారానే, దివ్యమైన అస్తిత్వములను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వారు తమ భౌతిక ఇంద్రియ గ్రహణశక్తి మరియు తమ బుద్ధి యొక్క శక్తి ఆధారముగా, జ్ఞానములలో ఏది సరియైనదో ఏది తప్పైనదో నిర్ణయిస్తారు. ఏదేని పదార్థమును, తమ ఇంద్రియములు చూడలేకపోతే మరియు తమ బుద్ధి అర్థం చేసుకోలేకపోతే, అప్పుడు ఆ పదార్థము లేదు అని ఊహించుకుంటారు. 'ఆత్మ' అనేది ఇంద్రియములచే గ్రహింపబడలేదు కాబట్టి, వారు అటువంటి పదార్థమేదీ లేదని నిశ్చయిస్తారు. ఈ విషయాన్ని వివరిస్తూ, అలెక్సిస్ కారేల్ (Alexis Carrel) తన పుస్తకం ‘మాన్ ది అన్‌నోన్’ (Man the Unknown) లో ఇలా పేర్కొన్నాడు: ‘మన మనస్సు సహజంగానే మన కాలంలో ఉన్న తత్త్వ సిద్ధాంతాలకు లేదా శాస్త్రీయ సిద్ధాంతాలకు అతీతంగా ఉన్నవాటిని తిరస్కరించటానికే మొగ్గు చూపిస్తుంది. అంతిమంగా, శాస్త్రవేత్తలు కూడా మనుష్యులే. వారి పరిసరస్థితులు మరియు కాలంలో ఉన్న పూర్వభావనలతో నిండిపోయి ఉంటారు. ప్రస్తుతమున్న సిద్ధాంతములు వివరించలేని నిజాలు అసలు లేనేలేవు అని వారు మనస్ఫూర్తిగా నమ్ముతుంటారు. ప్రస్తుతం, శాస్త్రజ్ఞులు టెలీపథీ మరియు ఇతర పారలౌకిక ఘటనలను, ఊహాజనితములుగా అనుకుంటారు. ఆచార విరుద్ధంగా ఉన్న ప్రత్యక్షంగా కనిపించే నిజాలు అణచివేయబడుతాయి. (Our mind has a natural tendency to reject the things that do not fit into the frame of scientific or philosophical beliefs of our time. After all, scientists are only human. They are saturated with the prejudices of their environment and epoch. They willingly believe that facts which cannot be explained by current theories do not exist. At present times, scientists still look upon telepathy and other metaphysical phenomena as illusions. Evident facts having an unorthodox appearance are suppressed) న్యాయ దర్శనం ఇటువంటి ఆలోచనను కూప-మండూక-న్యాయము (నూతిలో కప్ప యొక్క తర్కము) అని పేర్కొంటుంది. ఒక నూతిలో ఒక కప్ప ఉండేది; దానికి తన నివాసం యొక్క పరిసర కొలతలు బాగా తెలుసు. ఒక రోజు, ఒక రానా కాంక్రివోరా (Rana Cancrivora) అంటే సముద్రములో నివసించే కప్పల జాతి చెందిన ఒక కప్ప, ఆ బావిలోకి దుమికింది. అవి రెండూ మాట్లాడుకోవటం మొదలు పెట్టాయి. బావి-కప్ప, ఆ సముద్ర-కప్పను ఇలా అడిగింది, ‘నీవు వచ్చిన సముద్రం ఎంత పెద్దది?’ అని. ఆ సముద్ర-కప్ప ఇలా బదులిచ్చింది, ‘అది చాలా పెద్దది.’ ‘అది ఈ బావి కన్నా ఐదు రెట్లు పెద్దదా?’ ‘లేదు, ఇంకా చాలా పెద్దది.’ ‘ఈ బావి కన్నా పది రెట్లు పెద్దదా?’ ‘కాదు, ఇంకా పెద్దది’ ‘వంద రెట్లు పెద్దదా?’ ‘లేదు, లేదు అంత చిన్నది కాదు, అది చాలా చాలా పెద్దది.’ ‘నువ్వు అబద్దం చెప్తున్నావు’ అన్నది ఆ బావి-కప్ప, ‘నా బావి కన్నా వంద రెట్లు పరిమాణం పెద్దది ఉండటం ఎట్లా సాధ్యం?’ అని అన్నది. జీవితాంతం ఆ బావి లోనే ఉండటంతో దాని బుద్ధి ఒక పరిమితితో అయిపోయింది, కాబట్టి అది ఆ మహా సముద్రమును అర్థం చేసుకోలేక పోయింది. అదే విధంగా, తమ అల్ప-బుద్ధిచే పరిమితమైపోయి, భౌతిక దృక్పథంలో ఉన్న జనులు, భౌతికము కానటువంటి ఆత్మ ఉన్నది అన్న విషయాన్ని ఒప్పుకోరు. కానీ, ఆధ్యాత్మిక పథంలో ప్రయాణించేవారు, తమ భౌతిక బుద్ధి పరిమితి కంటే పరమైన (అతీతమైన) జ్ఞానము ఉంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటారు. వినయంతో మరియు విశ్వాసంతో ఆధ్యాత్మిక పథాన్ని అనుగమించటం ప్రారంభిస్తారు మరియు తమ అంతఃకరణ (హృదయమును) పవిత్రం చేసుకోవటాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. ఎప్పుడైతే మనస్సు శుద్ధి అవుతుందో అప్పుడు వారికి ఆత్మ యొక్క ఉనికి సహజంగానే తెలిసిపోతుంది. ఆ తదుపరి, శాస్త్రముల యొక్క యదార్థమును, జ్ఞానోదయము ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఎలాగైతే ఇంద్రియములు, ప్రారంభంలో, ఆత్మను తెలుసుకోలేవో, భగవంతుడు కూడా, ఇంద్రియ పరిధిలో లేడు, కాబట్టి జ్ఞాన నేత్రములచే చూడబడాలి. తదుపరి శ్లోకములలో , శ్రీ కృష్ణుడు భగవంతుని అస్తిత్వమును తెలుసుకునే పద్ధతిని వివరిస్తున్నాడు.
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ । యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ।। 12 ।।
12
15
https://www.holy-bhagava…udio/015_012.mp3
యత్ — ఏదైతే; ఆదిత్య-గతం — సూర్యునిలో; తేజః — తేజస్సు; జగత్ — సౌర కుటుంబము; భాసయతే — ప్రకాశింపచేయునో; అఖిలమ్ — సమస్త; యత్ — ఏదైతే; చంద్రమసి — చంద్రునిలో; యత్ — ఏదైతే; చ — మరియు; అగ్నౌ — అగ్నిలో; తత్ — అది; తేజః — తేజస్సు; విద్ధి — తెలుసుకొనుము; మామకమ్ — నా యొక్క.
BG 15.12: సమస్త సౌర మండలమును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సుని నేనే అని తెలుసుకొనుము. చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నానుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకొనుము.
మన మానవ నైజం ఎలాంటిదంటే మనకు ఏది ప్రముఖమైనది అని అనిపిస్తుందో దాని పట్ల ఆకర్షితమవుతాము. శరీరము, భార్య/భర్త, పిల్లలు, మరియు సంపద అనేవి ముఖ్యము అనుకున్నప్పుడు, మనం వాటి పట్ల ఆకర్షితమౌతాము. ఈ శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు, తన శక్తియే సృష్టిలో ఉన్న అన్ని ప్రముఖమైన వాటిలో వ్యక్తమవుతున్నది అని వివరిస్తున్నాడు. సూర్యుని యొక్క తేజస్సుకి తానే మూలకారణము అని అంటున్నాడు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ప్రతి క్షణానికి, సూర్యుడు, కొన్ని కోట్ల అణు విద్యుత్ కేంద్రాలు జనింపచేసే శక్తికి సమానమైన శక్తిని విడుదల చేస్తున్నది. ఈ ప్రకారంగా అది కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి ఇలా చేస్తూనే ఉన్నది, అయినా అది ఏమాత్రం తరిగిపోలేదు మరియు దాని వ్యవస్థ లో ఏ లోపమూ రాలేదు. ఇటువంటి మహాద్భుతమైన ఖగోళ వస్తువైన సూర్యుడు ఏదో యాదృచ్ఛికంగా, బిగ్ బాంగ్ మహా విస్ఫోటం (big bang) వలన వచ్చింది అనుకోవటం అమాయకత్వమే అవుతుంది. సూర్యుడు ఈ విధంగా ఇలా ఉన్నాడు అంటే దానికి కారణం భగవంతుని మహిమనే. అదే విధముగా చంద్రుడు కూడా రాత్రి పూట ఆకాశమును వెలిగిస్తూ ఒక అద్భుతమైన పని చేస్తుంటాడు. లౌకిక బుద్ధి ద్వారా, చంద్రుని కాంతి కేవలం సూర్యుని కాంతిని పరావర్తనం చేయటం వలన వస్తున్నదని అని ఈ కాలం సైన్సు ప్రకారం చెప్పవచ్చు. కానీ, ఈ యొక్క మహాద్భుతమైన వ్యవస్థ భగవంతుని మహిమ వల్లే సాధ్యమవుతున్నది; ఇంకా చెప్పాలంటే, చంద్రుడు భగవంతుని యొక్క ఎన్నెన్నో విభూతులలో ఒకటి. ఈ సందర్భంలో కేనోపనిషత్తులో ఒక కథ ఉన్నది: ఒకప్పుడు దేవతలకు, దైత్యులకు దీర్ఘకాలం యుద్ధం జరిగింది; దానిలో చివరకు దేవతలే విజయం సాధించారు. కానీ వారి విజయం గర్వానికి దారి తీసింది, వారు తమ శక్తిసామర్థ్యముల వల్లనే ఈ విజయం సాధించాము అని అనుకున్నారు. వారి గర్వ-భంగము చేయటానికి భగవంతుడు ఒక యక్షుడి రూపంలో వచ్చి స్వర్గ-ఆకాశంలో స్థితమై నిలబడ్డాడు. ఆయన రూపము అత్యంత తెజోవంతముగా ఉంది. దేవరాజు ఇంద్రుడు అతన్ని మొదట గమనించి, కేవలం ఒక యక్షుడు తన కన్నా తేజోవంతముగా ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇంద్రుడు అగ్ని దేవుడిని, ఆయనెవరో తెలుసుకు రమ్మని పంపించాడు. అగ్ని దేవుడు ఆ యక్షుడి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు , ‘నేను అగ్ని దేవుడను, నాకు సమస్త జగత్తుని ఒక్క క్షణంలో కాల్చివేసే శక్తి ఉన్నది, ఇప్పుడిక దయచేసి నీవెవరో తెలియ చెప్పవలసినది’ అని. యక్షుడి రూపంలో ఉన్న భగవంతుడు, ఒక గడ్డి పరకను ఆయన ముందు ఉంచి, ‘దయచేసి దీనిని కాల్చుము’ అన్నాడు. దాన్ని చూసి అగ్ని దేవుడు బిగ్గరగా నవ్వి, ‘ఈ అల్పమైన గడ్డిపరక నా అనంతమైన శక్తి ముందు నిలుస్తుందా?’ అన్నాడు. కానీ, అగ్ని దేవుడు దీనిని భస్మం చేయటానికి సిద్ధమైనప్పుడు, భగవంతుడు ఆయన లోనుండి శక్తిమూలమును ఆర్పివేసాడు. పాపం అగ్ని దేవుడు తానే చలితో వణకటం ప్రారంభించాడు; ఇక వేరొకదాన్ని కాల్చివేసే అవకాశం ఏది? ఇవ్వబడిన పనిని చేయటంలో విఫలమై సిగ్గుపడుతూ, అగ్ని దేవుడు మళ్లీ ఇంద్రుని వద్దకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇంద్రుడు, ఆ యక్షుడు ఎవరో, ఆయన గురించి తెలుసుకొనిరమ్మని వాయు-దేవుడిని పంపించాడు. వాయు-దేవుడు వెళ్లి యక్షుడితో, ‘నేను వాయు-దేవుడను, నేను తలుచుకుంటే ఈ ప్రపంచాన్నంతా ఒక్క క్షణంలో తలక్రిందులు చేయగలను, ఇప్పుడు దయచేసి నీవెవరో తెలియచేయుము’ అని అన్నాడు. మరల ఆ యక్షుడి రూపంలో ఉన్న భగవంతుడు, ఒక గడ్డి పరకను ఆయన ముందు ఉంచి, ‘దయచేసి దీనిని త్రిప్పివేయుము.’ అని అడిగాడు. ఆ గడ్డి పరకను చూసి వాయుదేవుడు నవ్వాడు. అత్యంత వేగంతో దానివైపుకు దూసుకెళ్ళాడు కానీ, భగవంతుడు ఆయన మూలశక్తిని కూడా లోనుండి ఆర్పివేసాడు. పాపం ఆ వాయుదేవుడు తన కాళ్లను ఈడ్చుకుంటూ నడవటానికి కూడా కష్టపడాల్సి వచ్చింది; మరిక ఇంకొక దాన్ని ఎగరగోట్టే ప్రశ్నెక్కడుంది? చివరికి ఇంద్రుడే స్వయముగా ఆ యక్షుడేవరో తెలుసుకోవటానికి వెళ్ళాడు, కానీ, ఇంద్రుడు రాగానే భగవంతుడు అంతర్ధానమయ్యాడు, ఆయన స్థానంలో ఆయన దివ్య యోగమాయా శక్తి, ఉమ, కూర్చుని ఉంది. ఆ యక్షుడి గురించి ఇంద్రుడు ఆమెను అడిగినప్పుడు, ఉమ, ఇలా సమాధానమిచ్చింది, ‘ఆయన మీ యొక్క సర్వోన్నత తండ్రిగారు, ఆయన నుండే మీ దేవతలందరూ మీ యొక్క శక్తి సామర్థ్యములను పొంది ఉన్నారు. మీ గర్వమును పోగొట్టడానికే ఆయన అలా రావటం జరిగింది.’ అని.
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా । పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ।। 13 ।।
13
15
https://www.holy-bhagava…udio/015_013.mp3
గాం — భూమి; ఆవిశ్య — వ్యాపించి; చ — మరియు; భూతాని — జీవ రాశులు; ధారయామి — పోషిస్తూ; అహం — నేను; ఓజసా — శక్తి; పుష్ణామి — పోషిస్తూ; చ — మరియు; ఔషధీ — మొక్కలు; సర్వాః — సమస్త; సోమః — చంద్రుడు; భూత్వా — ఉంటూ; రస-ఆత్మకః — జీవ రసములను అందిస్తూ.
BG 15.13: పృథ్వి యందు అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి, నేను సమస్త ప్రాణులను నా శక్తి చే పోషిస్తుంటాను. చంద్రుడిగా ఉండి, సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను.
‘గాం’ అంటే నేల/భూమి అని అర్థం మరియు ‘ఓజసా’ అంటే, శక్తి అని అర్థం. ఈ పృథ్వి (నేల) జడ పదార్థమైనా, అది భగవంతుని శక్తిచే, ఆవాసయోగ్యమై, విభిన్న స్థావరజంగమముల జాతుల జీవరాశులను పోషిస్తున్నది. ఉదాహరణకి, మన చిన్నతనం నుండి, సముద్రపు నీరు ఎందుకు ఉప్పగా ఉన్నదో అనుకున్నాము. నిజానికి, అది ఒకవేళ ఉప్పగా లేకపోతే, అది ఎన్నెన్నో రకాల వ్యాధులను వృద్ధిచేస్తూ ఆవాసయోగ్యం కాకుండా అయిపోయేది. కాబట్టి, ఎటువంటి భౌతిక కారణాల వల్ల అది అలా ఉందనుకున్నా సరే, అంతిమంగా భగవంతుని సంకల్పం వల్లనే, సముద్ర నీరు ఉప్పగా ఉంది. జార్జి వాల్డ్, ఒక నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త తన పుస్తకం ‘ఎ యూనివర్స్ దట్ బ్రీడ్స్ లైఫ్’ (A Universe that Breeds Life) లో ఇలా పేర్కొన్నాడు. ‘ఈ బ్రహ్మాండంలో ఉన్న అనేకమైన భౌతిక లక్షణములలో, ఏ ఒక్కటి అయినా అది ఇలా ఇప్పుడు ఉన్నట్టుగా లేకపోతే, మనకు ఇంత ప్రబలంగా కనిపించే జీవరాశి, ఇక్కడ కానీ లేదా మరెక్కడకానీ ఉండటం అసాధ్యం.’ (If any one of the considerable number of the physical properties of our universe were other than they are, then life, that now appears to be so prevalent, would be impossible, here or anywhere) శ్రీ కృష్ణుడి మాటల ప్రకారం చూస్తే, భగవంతుని శక్తియే, ఈ భూ-మండలము యొక్క జీవరాశిని పోషించగలిగే సామర్థ్యమునకు మూలాధారము. అంతేకాక, చంద్రుని కాంతి, అమృత గుణములు కలదై, ఓషధులు, కూరగాయలు, పండ్లు, ధాన్యములు వంటి సమస్త వృక్ష జీవరాశికి పుష్టిని కలిగించి పోషిస్తుంది. ఈ యొక్క పోషక గుణములను చంద్రకిరణములకు అందించేది తానే అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః । ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ।। 14 ।।
14
15
https://www.holy-bhagava…udio/015_014.mp3
అహం — నేను; వైశ్వానరః — భోజనము జీర్ణించు/అరిగించు అగ్ని (జఠరాగ్ని); భూత్వా — అయిఉండి; ప్రాణినాం — సర్వ ప్రాణులలో; దేహం — శరీరము; ఆశ్రితః — ఉన్నవాడినై; ప్రాణ-అపాన — ప్రాణ-అపానములు (బయటకువెళ్ళే మరియు లోనికి వచ్చే శ్వాస); సమాయుక్తః — సమముగా ఉంచుతూ; పచామి — జీర్ణము చేయుదును; అన్నం — ఆహారములు; చతుః-విధం — నాలుగు రకముల.
BG 15.14: నాలుగు రకాల ఆహారమును జీర్ణము చేసుకుని మరియు ఒంటబట్టించుకొనటానికి, సమస్త జీవుల ఉదరములలో ప్రాణాపానసంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను.
పిత్తాశయము, క్లోమము, కాలేయము మొదలైనవి సృజించే జీర్ణరసాయనాలే, జీర్ణశక్తికి కారణం అని శాస్త్రవేత్తలు అంటారు. కానీ, ఇటువంటి ఆలోచన చాలా అమాయకమైనది అని ఈ శ్లోకం తెలియచేస్తున్నది. ఇవన్నీ జీర్ణరసముల వెనుక, భగవంతుని శక్తి ఉంది, అదే ఈ జీర్ణవ్యవస్థను పనిచేపిస్తుంది. వైశ్వానర అంటే, ‘జఠరాగ్ని’, (ఆహారమును జీర్ణము చేసే అగ్ని), అది భగవంతుని శక్తి చే రగులుతుంది. బృహదారణ్యక ఉపనిషత్తు కూడా ఇలా పేర్కొంటుంది: అయం అగ్నిర్ వైశ్వానరో యో ఽయం అంతః పురుషే యేనేదం అన్నం పచ్యతే (5.9.1) ‘జీవ ప్రాణులు ఆహారమును జీర్ణము చేసుకునేందుకు వాటి కడుపులో ఉన్న జఠరాగ్ని ఆ భగవంతుడే.’ ఈ శ్లోకములో సూచించబడిన నాలుగు రకముల (చతుర్విధమ్) ఆహారములు ఇవి: 1. భోజ్యములు: ఇవి పంటితో నమిలే ఆహారములు, అంటే, బ్రెడ్డు, రొట్టె వంటివి. 2. పేయములు: ఇవి మ్రింగబడేవి, పాలు, పండ్లరసములు వంటివి 3. కోష్యములు: ఇవి పీల్చబడే ఆహారములు, అంటే చెఱకు మొదలైనవి 4. లేహ్యములు. ఇవి నాకబడే ఆహారములు, అంటే, తేనె, ఐస్-క్రీమ్ మొదలగునవి. 12 నుండి 14వ శ్లోకం వరకు, శ్రీ కృష్ణుడు జీవఅస్తిత్వానికి కావలసినవన్నీ సమకూర్చేది భగవంతుడే అని చెప్పి ఉన్నాడు. ఆయనే ఈ భూమండలమును శక్తివంతం చేసి దానిని ఆవాసయోగ్యముగా చేసేది. చంద్రుడికి సమస్త వృక్షసంతతిని పోషించగలిగే శక్తిని ఇచ్చేది ఆయనే, మరియు ఆయనే జఠరాగ్నిగా మారి నాలుగు రకాల ఆహారములను జీర్ణం చేసేది. ఇక ఇప్పుడు, తానే సమస్త జ్ఞానమునకు లక్ష్యము అని చెప్తూ ఈ విషయాన్ని తదుపరి శ్లోకంతో ముగిస్తున్నాడు.
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ । వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ ।। 15 ।।
15
15
https://www.holy-bhagava…udio/015_015.mp3
సర్వస్య — సమస్త ప్రాణులలో; చ — మరియు; అహం — నేను; హృది — హృదయములో; సన్నివిష్టః — స్థితమై ఉండి; మత్తః — నానుండి; స్మృతిర్ — స్మృతి; జ్ఞానమ్ — జ్ఞానము; అపోహనం — విస్మృతి (మతిమరుపు); చ — మరియు; వేదైః — వేదముల చే; చ — మరియు; సర్వైః — అన్ని; అహం — నేను; ఏవ — మాత్రమే; వేద్యః — తెలుసుకొనబడవలసిన వాడను; వేదాంత-కృత్ — వేదాంతములను రచించినవాడను; వేద-విత్ — వేదార్ధములను తెలిసినవాడను; ఏవ — ఒక్కడినే (మాత్రమే); చ — మరియు; అహం — నేను.
BG 15.15: నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను, నా నుండే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మరియు విస్మృతి (మర్చిపోవుట) కలుగుతాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే, వేదాంత రచయితను నేనే, మరియు వేదముల అర్థమును తెలిసినవాడను నేనే.
భగవంతుడు మనలో జ్ఞానము మరియు స్మృతి (జ్ఞాపకశక్తి) అనే మహాద్భుతమైన ఉపకరణములను సృష్టించాడు. మెదడు దాని యొక్క హార్డువేర్, మరియు మనోబుద్ధులు దాని సాఫ్ట్-వేర్ వంటివి. మనం తరచుగా దీనికి చాలా మామూలుగా తీస్కుంటాము. శస్త్రచికిత్సా వైద్యులు ఒక్కోసారి మెదడు మార్పిడి ప్రక్రియ చేస్తారు మరియు వారు చేసిన దానికి చాలా గర్వపడతారు, కానీ, వారు అసలు ఈ అద్భుతమైన మెదడు యొక్క వ్యవస్థ ఎలా సృష్టిచేయబడినదో అని తలంచరు. చాలా విషయాలలో, శాస్త్రీయ పరిజ్ఞానం ఎంత ముందుకు వెళ్ళినా, కంప్యూటర్లు లేదా యంత్రాలు, మనుష్యుల మెదడుతో సరితూగలేకున్నాయి. ఉదాహరణకి, మనుష్యుల ముఖములను గుర్తుపట్టగలిగే సాంకేతిక పరిజ్ఞానం కోసం సాఫ్ట్-వేర్ ఇంజినీర్లు ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు. అదే సమయంలో, మనుష్యులు మాత్రం జనుల ముఖములు మారినా వారిని సునాయాసముగా గుర్తుపట్టగలుగుతున్నారు. అందుకే, మనం ‘మిత్రమా, చాలా రోజుల తరువాత నిన్ను కలుసుకోవటం చాలా సంతోషముగా ఉన్నది. ఇంతకు పూర్వం కలిసినప్పటికీ, ఇప్పటికి చాలా మారిపోయావు!’ అనే మాటలు తరచుగా వింటుంటాము. దీని వలన మనకు, మనుష్యుల మెదడు, జనుల ముఖములను, అవి సంవత్సరాల తరబడి మారినా సరే గుర్తుపట్టగలుగుతున్నది, అదే సమయంలో కంప్యూటర్లు మాత్రం మారని ముఖములను కూడా పూర్తిగా గుర్తుపట్టలేకున్నాయి, అని అవగతం అవుతున్నది. ఇప్పటికీ, శాస్త్రవేత్తలు, చేతివ్రాతతో రాసిన అక్షరాలను తప్పులు లేకుండా గుర్తుపట్టే స్కానర్ యంత్రముల కోసం శ్రమిస్తున్నారు, అదే సమయంలో మనుష్యులు మాత్రం ఇతరులు వ్రాసిన కాస్త గజిబిజిగా ఉన్న చేతివ్రాతను కూడా గుర్తుపట్టగలరు. జ్ఞాపక శక్తి మరియు జ్ఞానము అనే పరమాద్భుతమైన సామర్థ్యములు తన నుండే వచ్చాయి అని శ్రీ కృష్ణుడు ఇక్కడ పేర్కొంటున్నాడు. అంతేకాక, విస్మృతి (మర్చిపోయే శక్తి), కూడా తనదే అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. ఎలాగైతే అవసరం లేని పత్రాలు చింపివేయబడుతాయో, ప్రాణులు, అవసరం లేని జ్ఞాపకాలను స్మృతినుండి తీసివేస్తాయి, అదేకనక లేకపోతే, సమాచారంతో అది నిండిపోతుంది. శ్రీమద్ భాగవతంలో ఉద్ధవుడు శ్రీ కృష్ణునితో ఇలా అన్నాడు: త్వత్తో జ్ఞానం హి జీవానాం ప్రమోషస్ తే ఽత్ర శక్తితః (11.22.28) ‘నీ నుండే జీవప్రాణుల యొక్క జ్ఞానము ఉద్భవించినది, మరియు నీ శక్తి వలననే ఆ జ్ఞానము తీసివేయబడుతుంది.’ మనలో అంతర్గతంగా ఉన్న ఈ యొక్క విజ్ఞాన వ్యవస్థయే కాక, వేదములు అనేవి, బాహ్యంగా ఉన్న జ్ఞాన సంపద, మరియు శ్రీ కృష్ణుడు తన విభూతులను ఆ పరిధిలో కూడా తెలియచేస్తున్నాడు. సృష్టి ప్రారంభంలో వేదములను ప్రకటితం చేసినది ఆయనే. భగవంతుడు దివ్యమంగళ స్వరూపుడు మరియు మన బుద్ధికన్నా అతీతుడు కాబట్టి, వేదములు కూడా దివ్యమైనవి. ఆయన మాత్రమే వాటి యొక్క నిజమైన అర్థము తెలిసినవాడు, మరియు ఆయన తన కృపను ఎవరిమీదైనా ప్రసాదిస్తే, ఆ భాగ్యశాలియైన జీవాత్మ కూడా వేదములను ఎరుంగును. భగవంతుని అవతారమైన వేద వ్యాసుడు, వేదాంత దర్శనమును వ్రాసాడు. అందుకే, శ్రీ కృష్ణుడు తానే వేదాంతమును వ్రాసాను అని అంటున్నాడు. చివరగా, వేదములు అసంఖ్యాకమైన భౌతిక మరియు ఆధ్యాత్మిక ఉపదేశములను కలిగి ఉన్నా, సమస్త వేదజ్ఞానమునకు లక్ష్యము భగవంతుడిని తెలుసుకోవటమే అని అంటున్నాడు. కామ్య కర్మ కాండలు కూడా వేదాల్లో ఒక ప్రయోజనం కోసం ఉన్నాయి. భౌతిక ప్రపంచం పట్ల తీవ్రమైన మమకారాసక్తులు కలిగిఉన్నవారిని ఆకర్షించి, వారికి ఒక మధ్యంతర మెట్టుగా పనిచేసి, తరువాత వారిని కూడా భగవంతుని వైపుగా మరల్చివేస్తాయి. కఠోపనిషత్తు (1.2.15) ఇలా పేర్కొంటున్నది : ‘సర్వే వేదా యత్ పదమామనంతి”, ‘సమస్త వేద మంత్రములు నిజానికి భగవంతుడి దిశగానే సూచిస్తున్నాయి.’ మనం అన్ని వేద మంత్రాలను కంఠస్థం చేయవచ్చు, చక్కటి రాగతాళయుక్తంగా వాటిని పాడవచ్చు, అన్ని పూజాది కర్మ కాండలను బాగా చేయవచ్చు, ధ్యానంలో నిమగ్నమవ్వచ్చు, మరియు కుండలినీ శక్తిని కూడా ఉత్తేజింపచేయవచ్చు, అయినా, భగవంతుని గురించి తెలుసుకోలేకపోతే, వేదముల యొక్క యదార్థ తత్త్వం అర్థం కానట్టే. అదే సమయంలో, భగవంతుని పట్ల ప్రేమను పెంచుకున్నవారు, అనాయాసముగానే సమస్త వేద శాస్త్రముల ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నట్టే. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు: సర్వ శాస్త్ర సార యహ గోవింద రాధే, ఆఠోఁ యాం మన హరి గురు మే లగా దే (రాధా గోవింద గీతము) ‘అన్ని వేద శాస్త్రముల సారము ఏమిటంటే, రాత్రింబవళ్ళు మనస్సుని హరి, గురువు పట్ల ప్రేమపూర్వక భక్తిలో నిమగ్నము చేయటమే.’ ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు జగత్సృష్టి వృక్షమును వివరించాడు. ఇక ఇప్పుడు ఈ విషయాన్నిముగిస్తూ, ఆ జ్ఞానాన్ని సరియైన దృక్పథంలో పెట్టడానికి, శ్రీ కృష్ణుడు, క్షరము, అక్షరము, మరియు పురుషోత్తమ అన్న పదాలను, తదుపరి రెండు శ్లోకాలలో వివరిస్తున్నాడు.
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ । క్షరః సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే ।। 16 ।।
16
15
https://www.holy-bhagava…udio/015_016.mp3
ద్వౌ — రెండు; ఇమౌ — ఇవి; పురుషౌ — ప్రాణులు; లోకే — సృష్టిలో; క్షరః — క్షరములు (నశించిపోయేవి); చ — మరియు; అక్షరః — అనశ్వరమైనవి; ఏవ — అయినా; చ — మరియు; క్షరః — క్షరములు; సర్వాణి — సమస్త; భూతాని — భూతములు; కూట-స్థః — విముక్తి నొందిన; అక్షరః — నాశనం కానివి; ఉచ్యతే — చెప్పబడుతున్నవి.
BG 15.16: సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నాయి, క్షరములు (నశించేవి) మరియు అక్షరములు (నశించనివి). భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు. అక్షరములు అంటే మోక్షము పొందిన జీవులు.
భౌతిక జగత్తులో, మాయ అనేది జీవాత్మను ఈ భౌతిక శరీరమునకు కట్టివేస్తుంది. ఆత్మ అనేది నిత్యసనాతనమైనది అయినా కూడా, అది పదేపదే శరీరము యొక్క జననము మరియు మరణములను అనుభవిస్తూ ఉంటుంది. అందుకే, శ్రీ కృష్ణుడు భౌతిక జగత్తులో బద్ద జీవులను క్షరములు (నశించిపోయేవి) అని అంటున్నాడు. అతిచిన్న పురుగుల నుండి ఉన్నతమైన దేవతల వరకూ ఈ కోవకు చెందినవారే. వీటికన్నా వేరుగా, భగవంతుని ధామములో, ఆధ్యాత్మిక జగత్తు లో ఉన్న జీవులు కలరు. ఈ జీవులకు మరణంలేని శరీరములు ఉంటాయి; వాటి యందు వారు మరణమును అనుభవించరు; అందుకే వారు అక్షరములు (నాశరహితులు) అని పేర్కొనబడ్డారు.
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః । యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ।। 17 ।।
17
15
https://www.holy-bhagava…udio/015_017.mp3
ఉత్తమః — సర్వోత్కృష్ట; పురుషః — దివ్య పురుషుడు; తు — కానీ; అన్యః — వేరొక; పరమ-ఆత్మా— పరమాత్మ; ఇతి — ఈ విధముగా; ఉదాహృతః — చెప్పబడెను; యః — ఎవరైతే; లోక త్రయమ్ — మూడు లోకములు; ఆవిశ్య — ప్రవేశించి; బిభర్తి — పోషించును; అవ్యయః — నాశనరహితమైన; ఈశ్వరః — నియామకుడు.
BG 15.17: ఇవే కాక, నాశరహితమైన పరమాత్మయైన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడు ఉన్నాడు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి, సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు.
జగత్తు మరియు జీవాత్మల గురించి చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక, ఆ రెండు లోకాలకు మరియు క్షర, అక్షర ప్రాణులకు, అతీతమైన భగవంతుని గురించి చెప్తున్నాడు. శాస్త్రాలలో, ఆయనే పరమాత్మగా చెప్పబడ్డాడు. 'పరం' అన్న విశేషణం, అది, ఆత్మ (జీవాత్మ) కంటే వేరైనది అని సూచిస్తున్నది. ఈ శ్లోకము, ఆత్మయే పరమాత్మ అని చెప్పే అద్వైత వాదుల యొక్క సిద్ధాంతము అసత్యమని స్పష్టముగా నిరూపిస్తున్నది. జీవాత్మ అత్యల్పమైనది మరియు అది వసించిఉన్న శరీరము యందు మాత్రమే వ్యాపించి ఉంటుంది. కానీ, పరమాత్మ సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాడు. వాటి కర్మలను నోట్ చేసుకుంటాడు, వాటి ఖాతా ఉంచుకుంటాడు, మరియు వాటి ఫలములను సరియైన సమయంలో ఇస్తూ ఉంటాడు. ఆత్మ జన్మ జన్మలలో, ఏ శరీరము తీసుకుంటే ఆ శరీరము లోనికి తాను కూడా ప్రవేశిస్తాడు. ఒకవేళ, ఆత్మకి ఒకానొక జన్మలో కుక్క శరీరము ఇవ్వబడితే, పరమాత్మ కూడా దానిలోకి ప్రవేశిస్తాడు మరియు పూర్వ జన్మల కర్మఫలములను అందిస్తాడు. ఈ విధముగా, కుక్కల అదృష్టంలో కూడా ఎంతో తేడా ఉంటుంది. కొన్ని వీధి కుక్కలు ఇండియాలో దుర్భరమైన జీవితం గడుపుతుంటాయి, మరికొన్ని పెంపుడు కుక్కలు అమెరికాలో ఐశ్వర్యంలో విలాసంగా జీవిస్తుంటాయి. ఇంత తేడా వాటివాటి కర్మరాశి ఫలితంగా సంభవిస్తుంది, మరియు ఆ పరమాత్మయే కర్మఫలములను అందిస్తూ ఉంటాడు. సర్వ భూతముల హృదయములలో స్థితుడై ఉండే ఆ పరమాత్మ, తన సాకార రూపములో, చతుర్భుజుడై క్షీరోదక్షాయి విష్ణు (సర్వ సాధారణంగా ‘విష్ణువు’ అని పిలవబడే) రూపములో ఉంటాడు. హిందీలో ఒక జనాదరణ పొందిన నానుడి ఉంది: ‘మారనే వాలే కే దో హాథ్, బచానే వాలే కే చార్ హాథ్’, ‘చంపటానికి వచ్చే వాడికి రెండు చేతులు ఉంటే, లోపలే కూర్చుని ఉన్న రక్షకుడికి నాలుగు చేతులు ఉన్నాయి.’ అని. ఇక్కడ సూచింపబడే చతుర్భుజ రూపము ఆ యొక్క పరమాత్మయే.
యస్మాత్ క్షరమతీతోఽహమక్షరాదపి చోత్తమః । అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ।। 18 ।।
18
15
https://www.holy-bhagava…udio/015_018.mp3
యస్మాత్ — కాబట్టి; క్షరం — నశ్వరమైన దాని కంటే; అతీతః — అతీతుడను; అహం — నేను; అక్షరాత్— నాశరహితుడైన వాటి కంటే; అపి — కూడా; చ — మరియు; ఉత్తమః — అతీతుడను (ఉన్నతుడను); అతః — కాబట్టి; అస్మి — నేను; లోకే — ఈ జగత్తులో; వేదే — వేదములలో; చ — మరియు; ప్రథితః — ప్రసిద్ధుడను; పురుష-ఉత్తమః — సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా.
BG 15.18: నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్థముకంటెనూ, మరియు నాశరహితమైన జీవాత్మ కంటెనూ కూడా అతీతమైనవాడను. కాబట్టి వేదములలో మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా కీర్తింపబడ్డాను.
ఇంతకు క్రితం కొన్ని శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు ప్రకృతిలో ఉన్న మహాద్భుతమైనవన్నీ తన యొక్క విభూతుల ప్రకటితములే అని వివరించాడు. కానీ, ఆ కనిపించే జగత్తుని సృష్టించడానికే తానే స్వయముగా శ్రమకు లోనవ్వడు. ఆయన యొక్క అలౌకిక వ్యక్తిత్వము భౌతిక ప్రకృతికి మరియు దివ్య ఆత్మలకు కూడా అతీతమైనది. ఇక్కడ తన దివ్య వ్యక్తిత్వమును పురుషోత్తమ అని అంటున్నాడు. శ్రీ కృష్ణుడు మరియు ఈ పురుషోత్తముడు ఒక్కడేనా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. ఇటువంటి ఎలాంటి సందేహలు రాకుండా/లేకుండా తీసివేయటానికి శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో తననే ఏకవచనంలో సంబోధించుకుంటున్నాడు. అంతేకాక, వేదములు కూడా ఈ తరహాలోనే పేర్కొంటున్నాయి అని చెప్తున్నాడు. కృష్ణ ఏవ పరో దేవస్ తం ధ్యాయేత్ తం రసయేత్ తం యజేత్ తం భజేద్ (గోపాల తాపని ఉపనిషత్తు) ‘శ్రీ కృష్ణుడే సర్వోన్నత భగవానుడు. ఆయనమీదే ధ్యానం చేయుము, ఆయన భక్తినే ఆస్వాదించుము, మరియు ఆయనను ఆరాధించుము.’. ఇంకా: యో ఽసౌ పరం బ్రహ్మ గోపాలః (గోపాల తాపని ఉపనిషత్తు) ‘గోపాలుడు (శ్రీ కృష్ణుడు) సర్వోత్కృష్ట పురుషుడు.’ మరి అయితే విష్ణుమూర్తి, శ్రీ రామ చంద్రుడు, శంకరుడు - వీరి స్థాయి ఏమిటి అన్న సందేహం రావచ్చు. వారందరూ ఆ సర్వోన్నతుని స్వరూపములే మరియు వారందరూ ఒకరికొకరు అభేదములే. అంటే, వారందరూ భగవంతుని, అంటే సర్వోత్కృష్ట దివ్య పురుషుని ప్రకటితములే.
యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ । స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ।। 19 ।।
19
15
https://www.holy-bhagava…udio/015_019.mp3
యః — ఎవరైతే; మాం — నన్ను; ఏవం — ఈ విధముగా; అసమ్మూఢః — సంశయము లేకుండా; జానాతి — తెలుసుకుని; పురుష-ఉత్తమమ్ — సర్వోత్కృష్ట దివ్య పురుషుడు; సః — వారు; సర్వ-విత్ — సంపూర్ణ జ్ఞానము కలవారు; భజతి — పూజిస్తారు; మాం — నన్ను; సర్వ-భావేన — సంపూర్ణముగా/మనఃస్ఫూర్తిగా; భారత — అర్జునా, భరత వంశీయుడా.
BG 15.19: ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు. ఓ అర్జునా, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు.
శ్రీమద్ భాగవతం ప్రకారం భగవంతుడిని మూడు రకాలుగా తెలుసుకోవచ్చును: వదంతి తత్ తత్త్వ-విదస్ తత్త్వం యజ్ జ్ఞానం అద్వయమ్ బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్ద్యతే (1.2.11) ‘సర్వోన్నత తత్త్వము ఒక్కటే, అది జగత్తులో, బ్రహ్మన్, పరమాత్మ, మరియు భగవానుడు, అనే మూడు విధములుగా వ్యక్తమవుతుంది అని, పరమ సత్యమును ఎరింగిన వారు చెప్పారు.’ ఇవి మూడు వేర్వేరు అస్తిత్వములు కావు, ఒకే సర్వోన్నత తత్త్వము యొక్క మూడు స్వరూపాలు. ఉదాహరణకి, నీరు, మంచు, మరియు నీటిఆవిరి మూడు విభిన్న పదార్థములగా అగుపిస్తాయి, కానీ అవి ఒకే పదార్థము యొక్క మూడు విభిన్న రూపాలు. అదేవిధంగా, బ్రహ్మన్ అంటే, భగవంతుని యొక్క నిరాకార, సర్వ వ్యాప్త అస్తిత్వము. జ్ఞాన యోగమును అనుసరించే వారు, భగవంతుని యొక్క బ్రహ్మన్ అస్తిత్వాన్ని ఆరాధిస్తారు. పరమాత్మ అంటే, సమస్త ప్రాణుల హృదయములో స్థితమై ఉన్న ఆ సర్వోన్నత తత్త్వము యొక్క అస్తిత్వము. అష్టాంగ యోగ మార్గము, దేవుని యొక్క పరమాత్మ రూపమును దర్శింపచేస్తుంది. భగవానుడు అంటే, పరమేశ్వరుని యొక్క సాకర రూపము మరియు ఆ రూపంలో ఆయన ఎన్నో మధురమైన లీలలను చేస్తాడు. భక్తి మార్గము మనకు, ఈశ్వరుడిని భగవానుని రూపంలో భగవత్ ప్రాప్తి కలిగిస్తుంది. ఇదే విషయము ఇంతకు పూర్వము 12.2వ శ్లోకములో వివరించబడినది. ఈ అధ్యాయములో, 12వ శ్లోకము మొదలు, శ్రీ కృష్ణుడు ఈ అన్నీ మూడు భగవత్ తత్త్వములనూ వివరించాడు. 12 నుండి 14 శ్లోకముల వరకు సర్వ వ్యాప్తి అయిన బ్రహ్మన్ లక్షణం వివరించబడినది, 15వ శ్లోకం పరమాత్మ తత్త్వాన్ని, మరియు 17, 18వ శ్లోకాలు భగవానుని గురించి పేర్కొన్నాయి. మరిప్పుడు, వీటిలో ఏది అన్నింటికన్నా ఉన్నతమైనది మరియు పరిపూర్ణమైనది? ఈ ప్రశ్నకు ఆయన సమాధానం ఇక్కడ ఇస్తున్నాడు - తనను భక్తి ద్వారా భగవానునిగా, సర్వోన్నత దివ్య పురుషోత్తమునిగా, తెలుసుకున్నవారు, యదార్థముగా ఆయన పట్ల పూర్తి జ్ఞానముతో ఉన్నట్టు. భగవానుని రూపంలో తెలుసుకొనటం ఎందుకు సర్వోన్నతమైనదో , జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ తన భక్తి శతకంలో విస్తారంగా వివరించారు. పైన చెప్పబడిన శ్రీమద్ భాగవతంలోని శ్లోకాన్ని ఉదహరిస్తూ ఇలా ప్రారంభించారు. తీన రూప్ శ్రీకృష్ణ కో, వేదవ్యాస్ బతాయ, బ్రహ్మ ఔర పరమాత్మా, అరు భగవాన్ కహాయ (భక్తి శతకము, 21వ శ్లోకం) ‘ఈశ్వరుడు మూడు రకాలుగా ప్రకటితమౌతాడు అని వేద వ్యాసుల వారు పేర్కొన్నారు — బ్రహ్మన్, పరమాత్మ, మరియు భగవానుడు.’ ఆ తరువాత పరమ సత్యము యొక్క ఈ మూడు అస్తిత్వములను వివరించారు. సర్వశక్తి సంపన్న్ హో, శక్తి వికాస న హోయ, సత్ చిత్ ఆనంద రూప్ జో, బ్రహ్మ కహావే సోయ (భక్తి శతకము, 22వ శ్లోకం) ‘బ్రహ్మన్ అస్తిత్వంలో, ఈశ్వరుని యొక్క అనంతమైన శక్తులు గుప్తముగా ఉంటాయి. ఆయన కేవలం నిత్య జ్ఞానమును మరియు ఆనందమును ప్రదర్శిస్తాడు.’ సర్వ శక్తి సంయుక్త హో, నామ రూప్ గుణ హోయ లీలా పరికర రహిత్ హో, పరమాత్మా హై సోయ (భక్తి శతకము, 23వ శ్లోకం) ‘పరమాత్మ అస్తిత్వంలో ఈశ్వరుడు తన రూపమును, నామమును, మరియు గుణమును చూపిస్తాడు. కానీ, లీలలను ప్రదర్శించడు, ఇంకా, పరివారమును కలిగి ఉండడు.’ సర్వ శక్తి ప్రాకట్య హో, లీలా వివిధ ప్రకార, విహరత పరికర సంగ్ జో, తేహి భగవాన్ పుకార (భక్తి శతకము, 24వ శ్లోకం) ‘తన సర్వ శక్తులను ప్రకటితం చేస్తూ, మరియు, భక్తులతో ఎన్నెన్నో మధురమైన లీలలను చేస్తూ, ఉండే ఈశ్వరుని అస్తిత్వమే భగవానుడు.’ జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారి ఈ శ్లోకాలు, బ్రహ్మన్ మరియు పరమాత్మ అస్తిత్వములలో ఈశ్వరుడు తన సర్వ శక్తులను ప్రకటించడు అని స్పష్టంగా చెప్తున్నాయి. ఈశ్వరుడు భగవానుడి రూపములో సంపూర్ణముగా ఉంటాడు, దానిలో తన యొక్క - నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు మరియు పరివారము అన్నింటినీ ప్రకటిస్తాడు. (ఇది కూడా 12.2వ శ్లోకములో ఒక రైలు ఉదాహరణ ద్వారా వివరించబడినది) అందుకే, ఆయనను భగవానుని లా తెలుసుకున్నవారు యదార్థముగా సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉన్నట్టు.
ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ । ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత ।। 20 ।।
20
15
https://www.holy-bhagava…udio/015_020.mp3
ఇతి — ఇవి; గుహ్య-తమం — అత్యంత రహస్యమైన; శాస్త్రం — వైదిక శాస్త్రము; ఇదం — ఇది; ఉక్తం — చెప్పబడినది; మయా — నా చేత; అనఘ — అర్జునా, పాప రహితుడా; ఏతత్ — ఇది; బుద్ధ్వా — అర్థంచేసుకుని; బుద్ధిమాన్ — జ్ఞాని; స్యాత్ — అగును; కృత-కృత్యః — సాధించవలసినది పూర్తి చేసినవాడు; చ — మరియు; భారత — అర్జునా, భరత వంశజుడా.
BG 15.20: ఓ పాపరహితుడా, అర్జునా, అత్యంత రహస్యమైన వేద శాస్త్ర మూలతత్త్వమును నేను నీకు తెలియచేసాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు, మరియు సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు.
ఈ అధ్యాయము యొక్క చిట్టచివరి శ్లోకము 'ఇతి' అన్న పదంతో మొదలౌతున్నది; అంటే 'ఇవి' అని అర్థం. శ్రీ కృష్ణుడు ఇలా సూచిస్తున్నాడు: ‘ఈ ఇరవై శ్లోకాలలో నేను వేద శాస్త్రాల సారాన్ని తెలియచేసాను. ఈ జగత్తు యొక్క స్వభావాన్ని, భౌతికపదార్థము మరియు ఆత్మ మధ్య భేదాన్ని, మరియు చివరగా పరమ సత్యము యొక్క సర్వోన్నత జ్ఞానమును ఆ దివ్య మంగళ పురుషోత్తమునిగా తెలియచేసాను. ఎవరైతే ఈ జ్ఞానమును స్వీకరించి అంగీకరిస్తారో వారు యదార్థముగా జ్ఞానోదయం పొందుతారు అని ఇప్పుడు, నేను నీకు హామీ ఇస్తున్నాను. ఇటువంటి జీవాత్మ, సమస్త కార్యముల, కర్తవ్యముల లక్ష్యము అయిన భగవత్ ప్రాప్తిని సాధిస్తుంది.
శ్రీ భగవానువాచ । అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః । దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ।। 1 ।। అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునమ్ । దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ।। 2 ।। తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా । భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత ।। 3 ।।
1
16
https://www.holy-bhagava…/016_001-003.mp3
శ్రీ భగవానువాచ — శ్రీ భగవానుడు పలికెను; అభయం — నిర్భయత్వము; సత్వ-సంశుద్ధిః — అంతఃకరణ శుద్ధి; జ్ఞాన — జ్ఞానము; యోగ — ఆధ్యాత్మిక; వ్యవస్థితిః — దృఢ సంకల్పము; దానం — దానము; దమః — ఇంద్రియ నిగ్రహము; చ — మరియు; యజ్ఞః — యజ్ఞము చేయుట; చ — మరియు; స్వాధ్యాయః — ప్రవిత్ర గ్రంథ అధ్యయనము; తపః — తపస్సు; ఆర్జవమ్ — నిష్కాపట్యము; అహింసా — అహింస; సత్యం — సత్యసంధత; అక్రోధః — కోపములేకుండుట; త్యాగః — త్యాగము; శాంతిః — శాంతి; అపైశునమ్ — దోషములు వెతకకుండా ఉండుట; దయా — దయ; భూతేషు — సమస్త జీవ రాశులపట్ల; అలోలుప్త్వం — దురాశ లేకుండుట; మార్దవం — సౌమ్యత; హ్రీః — అణకువ; అచాపలమ్ — చపలత్వం లేకుండుట; తేజః — దృఢసంకల్పం; క్షమా — క్షమాగుణము; ధృతిః — మనఃస్థైర్యము; శౌచము — పరిశుభ్రత; అద్రోహః — ఎవరి మీదా శత్రుత్వ భావన లేకుండుట; న — కాదు; అతి-మానితా — గొప్పవాడినన్న అభిమానము; భవంతి — ఉందురో; సంపదం — గుణములు; దైవీమ్ — దైవీ; అభిజాతస్య — కలిగిఉన్నవారు; భారత — భరత వంశీయుడా.
BG 16.1-3: శ్రీ భగవానుడు పలికెను : ఓ భరత వంశీయుడా, దైవీ సంపద కలవాని లక్షణములు ఇవిగో - నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢసంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, పవిత్ర గ్రంథ పఠనం, తపస్సు మరియు నిష్కాపట్యం; అహింస, సత్య సంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వ ప్రాణులపట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అణకువ, మరియు నిశ్చలత్వము; బలము, క్షమాగుణము, మనఃస్థైర్యము, పరిశుభ్రత, ఎవరిపట్లా శత్రుత్వం లేకుండుట, మరియు దురభిమానం లేకుండుట.
ఇక్కడ శ్రీ కృష్ణుడు దైవీ స్వభావం యొక్క ఇరవై ఆరు గుణములను వివరిస్తున్నాడు. అత్యున్నత లక్ష్యం దిశగా వెళ్ళటానికి మన ఆధ్యాత్మిక సాధనలో భాగంగా వీటిని మనం పెంపొందించుకోవాలి. నిర్భయత్వం: వర్తమాన కాలంలో మరియు భవిష్యత్తులో ఉండే కష్టాల మీద చింతన నుండి విముక్తి భావమే ఇది. దేనిమీదైనా మితిమీరిన మమకారాసక్తియే ఈ భయాన్ని కలుగ చేస్తుంది. ధనం మీద వ్యామోహం డబ్బులు పోతాయేమో అన్న భయాన్ని కలుగచేస్తుంది; సామాజిక కీర్తిప్రతిష్ఠల మీద మక్కువ, అపఖ్యాతి అంటే భయాన్ని కలుగచేస్తుంది; దుర్గుణములపై మక్కువ పాపభీతిని కలుగచేస్తుంది; శారీరక సుఖాలపై ఆసక్తి అనారోగ్యం అంటే భయాన్ని కలుగచేస్తుంది, మొదలైనవి. వైరాగ్యము మరియు భగవంతునికి శరణాగతి - మన హృదయములో సర్వ భయాలను నిర్మూలిస్తాయి. అంతఃకరణ శుద్ధి: ఇది ఆంతర పరిశుభ్రత. మనస్సు అనేది ఆలోచనలను, ఇష్టాయిష్టాలను, రాగద్వేషాలను, భావోద్వేగాలను పుట్టిస్తుంది మరియు వాటిపై చింతన చేస్తుంది. ఇవి ఎప్పుడైతే నైతికంగా, మంచి దృక్పథంతో, సకారత్మకంగా మరియు ఉన్నతమైనవిగా ఉంటాయో అప్పుడు మనస్సు పవిత్రంగా ఉన్నది అనుకోవచ్చు; అవి ఎప్పుడైతే అనైతికంగా, తక్కువస్థాయిలో ఉంటాయో అప్పుడు మనస్సు మలినమైనదిగా భావించాలి. రజో గుణము మరియు తమోగుణములలో ఉన్న వస్తువిషయముల పట్ల అనుబంధమే మనస్సుని మలినం చేస్తుంది. అదే సమయంలో, భగవంతునితో అనుబంధము మనస్సుని శుద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానములో స్థిరత్వం: తత్త్వ విస్మరణాత్ భేకివత్ అని చెప్పబడినది. అంటే, ‘ఎప్పుడైతే మానవులు ఏది మంచో ఏది చెడో మర్చిపోయినప్పుడు వారు పశువుల వలె అయిపోతారు.’ అందుకే, శాస్త్ర ఉపదేశాల పట్ల దృఢ సంకల్పంతో ఉండటమే ధర్మ మార్గములో పయనించటానికి మూలాధారము. దానము: దానము అంటే మన సంపదను ఒక మంచి పనికోసం లేదా అది అవసరమైన వారి కోసం ఇచ్చివేయటం. నిజమైన దానం ఏమిటంటే, ఏదో ఇస్తున్నామనే గర్వముతో కాకుండా, భగవత్ సేవలో పాలుపంచుకునే అవకాశం లభించిందనే కృతజ్ఞతతో ఇవ్వటం. శారీరక సంక్షేమం కోసం చేసే భౌతికపరమైన దానం ఇతరులకు తాత్కాలికంగా దోహదపడుతుంది. ఆత్మ స్థాయిలో చేసే ఆధ్యాత్మిక దానము, సమస్త క్లేశముల మూల కారణమైన, భగవత్ విముఖత, నుండి విముక్తికి దోహదపడుతుంది. అందుకే, ఇది భౌతిక దానం కంటే ఉన్నతమైనదిగా పరిగణించబడుతుంది. ఇంద్రియ నిగ్రహణ: మనస్సుని మరింత ప్రాపంచిక మోహము లోనికి పడవేయటానికి ఇంద్రియములు ఎంత శక్తివంతమైనవో మన అందరికీ తెలుసు. అవి జీవులను తక్షణ సుఖాల కోసం ప్రేరేపిస్తాయి. కానీ, ఆధ్యాత్మిక ధర్మ మార్గంలో పయనిస్తూ, ఉన్నతమైన లక్ష్యమును సాధించటానికి, నిమ్నస్థాయి ఇంద్రియ సుఖాలను విడిచిపెట్టడం చాలా అవసరం. అందుకే, ఇంద్రియ నిగ్రహణ అనేది భగవత్ మార్గంలో పయనించటానికి ఒక ఆవశ్యకమైన సద్గుణము. యజ్ఞము చేయటం: అంటే, అంత ఆహ్లాదకరంగా లేకపోయినా మన యొక్క వైదిక ధర్మాలను, సామాజిక విధులను నిర్వర్తించుట. నిజమైన యజ్ఞము అంటే భగవంతుని ప్రీతి కోసము చేయబడినదే. పవిత్ర గ్రంథ పఠనం: శాస్త్రములలో ఉండే ఉన్నతమైన జ్ఞానమును బుద్ధికి అందించటము అనేది దైవీ గుణము పెంపొందించుకోనే ప్రక్రియలో ఒక ముఖ్యమైన పని. ఎప్పుడైతే బుద్ధి నిజమైన జ్ఞానముచే ప్రకాశితమవుతుందో, ఆ వ్యక్తి యొక్క కార్యములు సహజంగానే పవిత్రమవుతాయి. తపస్సు: శరీరము-మనస్సు-ఇంద్రియములు ఎటువంటివంటే, వాటిని గారాబం చేస్తే, అవి సుఖాసక్తి కలిగి ఉంటాయి, కానీ వాటిని నిగ్రహిస్తే, అవి క్రమశిక్షణ కలిగి ఉంటాయి. అందుకే, తపస్సు అంటే, శరీర-మనోబుద్ధులను శుద్ధి చేయటానికి స్వచ్ఛందంగా కష్టాలను స్వీకరించటం. సరళత్వము/నిష్కపటత: మాటల్లో మరియు నడవడికలో సరళత అనేది మనసులో అక్కరలేని గజిబిజిని తొలగిస్తుంది మరియు ఉత్తమమైన ఆలోచనలను జనింపచేస్తుంది. ఈ ఇంగ్లీష్ నానుడి, ‘సింపుల్ లివింగ్, హై థింకింగ్’ (simple living, high thinking), మనకు నిష్కపటత యొక్క ప్రయోజనాన్ని తెలియచేస్తున్నది. అహింస: అంటే ఇతర ప్రాణుల పురోగతికి మనసా, వాచా, లేదా కర్మణా ఇబ్బంది పెట్టకుండా ఉండటం. సత్యసంధత: మన స్వార్థం కోసం నిజాలను వక్రీకరించకపోవటమే సత్యసంధత. భగవంతుడే పరమ సత్యము, కాబట్టి సత్యసంధత అనేది మనలను ఆయన దిశగా తీసుకువెళుతుంది; అదే సమయంలో, అసత్యము మనకు అనుకూలంగా ఉన్నా, అది మనల్ని భగవంతుని నుండి దూరముగా తీసుకువెళుతుంది. క్రోధము లేకుండుట: కోపము అనేది ప్రాకృతిక మనస్సు యొక్క వికారము. ఆనందాన్ని అనుభవించాలనే కోరికలకు అవరోధం కలిగినప్పుడు లేదా వారు అనుకున్నట్టు జరగనప్పుడు, ఈ క్రోధము వ్యక్తమవుతుంది. వైరాగ్యం పెంచుకోవటం ద్వారా మరియు భగవత్ సంకల్పానికి శరణాగతి చేయటం ద్వారా ఈ క్రోధమును అధిగమించవచ్చు. త్యాగము: ఈ భౌతిక శక్తి అంతా భగవంతుని సొత్తు మరియు ఇది ఆయన ప్రీతి కోసమే ఉన్నది. కాబట్టి, ఈ జగత్తు యొక్క వైభవములు మన సుఖానుభూతి (ఏంజాయ్మెంట్) కోసం లేవు, అవి భగవంతుని సేవలోనే ఉపయోగించబడాలి. ఈ భావనలో స్థితమై ఉండటమే త్యాగము. శాంతి: సద్గుణములు పెంచుకోవాలంటే మానసిక ప్రశాంతత అవసరం. శాంత స్వభావం అంటే, బాహ్యంగా కల్లోల పరిస్థితులు ఉన్నా అంతర్గతంగా నిశ్చలముగా ఉండటమే. తప్పులు వెదకకుండా ఉండటం: ఈ ప్రపంచమంతా మరియు దానిలో ఉన్నదంతా మంచి-చెడు గుణముల సమ్మేళనమే. ఇతరుల దోషాల మీద దృష్టిపెడితే, మన మనస్సు మలినమవుతుంది, అదే సమయంలో వారి మంచిగుణములపై దృష్టి పెట్టడం శుద్ధి చేస్తుంది. తనలోని లోపాలను చూసుకుంటూ , ఇతరుల లోని మంచి గుణాలను గమనించటం సాధు జనుల లక్షణం. సర్వ భూతముల పట్ల దయ: వ్యక్తులు ఆధ్యాత్మికంగా ఎదిగిన కొద్దీ, వారు సహజంగానే తమ స్వార్ధం కంటే ఉన్నతంగా ఎదిగి, సమస్త ప్రాణుల పట్ల కరుణాస్వభావమును పెంచుకుంటారు. ఇతరుల కష్టాలు చూసినప్పుడు కలిగే గాఢ సానుభూతినే దయ అంటారు. అలోలుప్త్వం (దురాశ లేకుండుట): దురాశ అంటే న్యాయపరంగా శారీరక నిర్వహణకు కావలసిన దానికన్నా పోగుచేసువాలనే వాంఛయే దురాశ. దీనికి వశమైనవారు, తాము మరణ సమయంలో అంతా ఇక్కడే వదిలివేయాలి అని తెలిసి కూడా, భారీ స్థాయిలో ఆస్తులు, సంపదలు ప్రోగు చేసుకుంటారు. ఇటువంటి దురాశ నుండి విముక్తి సంతుష్టికి మరియు ఆంతరంగిక ప్రశాంతతకి దారితీస్తుంది. సౌమ్యత: ఇతరుల మనస్సు కష్టపెడతామనే భావన కలగకపోవడం వలన కొందరు మొరటుగా ప్రవర్తిస్తారు. కానీ, వ్యక్తులు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ, సహజంగానే వారు ప్రవర్తనలో మొరటుతనాన్ని విడిచిపెడతారు. సౌమ్యత (మృదుత్వం) అనేది ఆధ్యాత్మిక సంస్కారానికి సూచిక. సిగ్గు (లజ్జ): హ్రిః అంటే ‘శాస్త్రములు ఉపదేశించిన దానికి లేదా సమాజానికి విరుద్ధంగా చేయటానికి సంకోచము (లేదా తప్పుచేస్తున్నామనే భావన) కలగటము’. సత్పురుష స్వభావము అనేది, పాపపు పనులు చేసేటప్పుడు అపరాధ భావనను కలిగించే బలమైన అంతర్గత అంతరాత్మను ఇస్తుంది; చపలత్వం లేకుండుట: మనము మంచి ఉద్దేశంతో ప్రారంభించవచ్చు, కానీ మనం దురాకర్షణ మరియు కష్టాల వలన పెడదారి పడితే, మనం ఈ ప్రయాణాన్ని పూర్తిచేయలేము. ధర్మ పథంలో విజయం అనేది, ఎన్ని అవాంతరాలు వచ్చినా, లక్ష్యం దిశగా అచంచలమైన సంకల్పంతో పరిశ్రమిస్తేనే సాధ్యము. దృఢసంకల్పం. స్వచ్ఛమైన మనస్సు నుండి మనము విలువలు మరియు విశ్వాసానికి అనుగుణముగా ప్రవర్తించాలి అన్న గాఢమైన దృఢ సంకల్పము వస్తుంది. కాబట్టి, సాధు పురుషులు వారు చేయదలుచుకున్న పనుల పట్ల చాలా శక్తిని మరియు పట్టుదలని తీసుకువస్తారు. క్షమాగుణము లేదా ఓర్పు. ప్రతీకారేచ్ఛ లేకుండా, ఇతరుల తప్పిదాలను సహించే గుణమే ఈ క్షమ. క్షమాగుణము ద్వారా, వ్యక్తి, ఇతరుల వలన కలిగిన మానసిక గాయాలను మాన్పివేయగలడు. అలాచేయకపోతే, అవి మనస్సులో చికాకు కలిగించి అశాంతిని కలుగచేయగలవు. మనఃస్థైర్యము. మనసేంద్రియములు ప్రతికూల పరిస్థితుల వల్ల అలసిపోయినా, లక్ష్యమును సాధించుటలో ఉన్న మనో బలము మరియు స్థైర్యమే ఇది. సాధిస్తామనే ఆశ ఏమాత్రం లేకపోయినా, నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్న వారే, ఈ ప్రపంచంలో గొప్పగొప్ప విజయాలు సాధించారు. శ్రీ ఆరోబిందో దీనిని చాలా చక్కగా అభివర్ణించారు: ‘సమస్య కంటే ఎక్కువ పట్టుదలతో నీవు ఉండాలి; వేరే ఇతర మార్గమేదీ లేదు.’ పరిశుభ్రత. ఇది అంతర్గత మరియు బాహ్యమైన స్వచ్ఛతను సూచిస్తుంది. సాధు పురుషులు బాహ్యమైన శుభ్రతని కోరుకుంటారు ఎందుకంటే అది అంతర్గత స్వచ్ఛతకి అనుకూలంగా ఉంటుంది. జార్జి బెర్నార్డ్ షా ఇలా అన్నారు, - ‘నిన్ను నీవు స్వచ్ఛముగా ఉంచుకోవటమే మేలు; ఎందుకంటే ఏ కిటికీ గుండా నీవు ప్రపంచాన్ని చూడాలో అది నీవే’ (Better keep yourself clean and bright; you are the window through which you must see the world.) ఎవరిపట్ల కూడా శత్రుత్వం లేకుండుట. ఇతరుల పట్ల శత్రుత్వం కలిగి ఉండటం, మన మనస్సునే విషపూరితం చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక పురోగతికి అవరోధంగా ఉంటుంది. వారు కూడా మనలాంటి వారే, అందరిలోనూ భగవంతుడు ఉంటాడు అన్న భావన పెంపొందించు కోవటం ద్వారా, ఇతరుల పట్ల శత్రుత్వ/ద్వేష భావన నిర్మూలించబడుతుంది. దురభిమానం లేకుండుట. ఆత్మ-స్తుతి, గొప్పలు చెప్పుకోవటం, ఆడంబర ప్రదర్శన — మొదలైనవన్నీ గర్వము వలన జనిస్తాయి. సాధు జనులు గర్వ పడటానికి వారిలో వారికి ఏమీ కనిపించదు, అదే సమయంలో వారిలో ఉన్న సద్గుణములకు వారు భగవతునిపట్ల కృతజ్ఞతతో ఉంటారు. ఆ విధంగా వారు సొంత-గొప్పలకు దూరంగా ఉంటారు.

దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ । అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ ।। 4 ।।
4
16
https://www.holy-bhagava…udio/016_004.mp3
దంభః — దంభము; దర్పః — దురహంకారము; అభిమానః — అహంభావం; చ — మరియు; క్రోధః — కోపము; పారుష్యం — మొరటుతనము; ఏవ — నిజముగా; చ — మరియు; అజ్ఞానం — అజ్ఞానము; చ — మరియు; అభిజాతస్య — కలిగి ఉండేవారు; పార్థ — అర్జునా, ఓ ప్రిథ పుత్రుడా; సంపదం — గుణములు; ఆసురీమ్ — ఆసురీ (రాక్షస).
BG 16.4: ఓ పార్థా, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావముకల వారి గుణములు.
శ్రీ కృష్ణుడు ఇప్పుడు, ఆసురీ స్వభావము కలవారి ఆరు లక్షణములను వివరిస్తున్నాడు. వారు - కపటులు, అంటే, బాహ్యముగా ఏదో ఇతరుల మెప్పు కోసం సాధువులాగ ప్రవర్తించినా, వారికి అంతర్గతంగా దానికి సరిపోయే సంస్కారం ఉండదు. ఇది ఒక కృత్తిమమైన జెకిల్ అండ్ హైడ్ వ్యక్తిత్వమును (Jekyll and Hyde personality) సృష్టిస్తుంది; అది అంతర్గతంగా మలినమైనదే అయినా, బయటకు మాత్రం స్వచ్ఛమైన దానిగా కనిపిస్తుంది. ఆసురీ స్వభావము కల జనుల ప్రవర్తన ఇతరుల పట్ల గర్వంతో మరియు అమర్యాదతో ఉంటుంది. తమ యొక్క సంపద, విద్య, అందము, హోదా వంటి శారీరక సంపత్తి మరియు పదవులను చూసుకొని గర్వ పడుతారు. వారికి మనస్సు మీద నియంత్రణ లేక, వారి దురాశ మరియు వాంఛలు తీరనప్పుడు వారికి కోపము వస్తుంటుంది. వారు క్రూరముగా మరియు మొరటుగా ప్రవర్తిస్తూ ఉంటారు; మరియు తమ వ్యవహారములలో ఇతరులకు కలిగే ఇబ్బంది/కష్టాలను పట్టించుకోరు. వారికి ఆధ్యాత్మిక విషయముల పట్ల ఏమాత్రం అవగాహన ఉండదు మరియు పాపిష్టి పనులను కూడా ధార్మికమైనవే అని అనుకుంటారు.
దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా । మా శుచః సంపదం దైవీమభిజాతోఽసి పాండవ ।। 5 ।।
5
16
https://www.holy-bhagava…udio/016_005.mp3
దైవీ — దివ్యమైన; సంపత్ — గుణములు; విమోక్షాయ — మోక్షము దిశగా; నిబంధాయ — బంధనము దిశగా; ఆసురీ — ఆసురీ గుణములు; మతా — అని చెప్పబడును; మా శుచః — శోకించకు; సంపదం — గుణములు; దైవీమ్ — దైవీ; అభిజాతః — జన్మించినావు; అసి — నీవు; పాండవ — అర్జునా, పాండు పుత్రుడా.
BG 16.5: దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి, కానీ, ఆసురీ గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమౌతాయి. శోకింపకుము అర్జునా, నీవు దైవీ గుణములతోనే జన్మించినవాడవు.
ఈ రెండు స్వభావాలను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక ఈ రెండింటి పరిణామాలను వివరిస్తున్నాడు. ఆసురీ గుణములు వ్యక్తిని జన్మ-మృత్యు సంసారానికి కట్టివేస్తాయి అని చెప్తున్నాడు. అదే సమయంలో, సాధు (దైవీ) గుణములను పెంపొందించు కోవటం, మాయా బంధనము నుండి విముక్తి పొందటానికి దోహదం చేస్తుంది. ఆధ్యాత్మిక మార్గాన్ని విజయవంతముగా అనుసరిస్తూ, చివరి వరకూ దానిలోనే ఉండటంలో, సాధకుడు చాలా విషయాల పట్ల జాగరూకతతో ఉండాలి. గర్వము, కపటత్వము, వంటి ఒక్క ఆసురీ గుణము వ్యక్తిత్వములో ఉండిపోయినా, అది ఓటమికి కారణం కావచ్చు. అదే సమయంలో, మనము దైవీ గుణములను పెంపొందించుకోవాలి, ఎందుకంటే పవిత్ర గుణములు లేకుంటే, మన ఆధ్యాత్మిక పురోగతి మళ్లీ కుంటుపడవచ్చు. ఉదాహరణకి, మనోస్థైర్యము లేకపోతే, కష్టంగా అనిపించినప్పుడు ఈ ప్రయాణాన్ని విడిచిపెడతాము; క్షమా గుణము లేకుంటే, మనస్సు ఎప్పుడూ ద్వేష భావన తోనే ఉండిపోయి, అది భగవంతునిలో నిమగ్నమై ఉండలేదు. కానీ, శ్రీ కృష్ణ పరమాత్మ పేర్కొన్న ఈ దైవీ గుణములను పెంపొందించుకుంటే, వేగంగా పురోగతి సాధించే సామర్థ్యం మరియు మార్గంలో ఎదురయ్యే అవరోధాలను ఎదుర్కునే శక్తి పెరుగుతాయి. ఈ విధంగా, మంచి గుణములను పెంపొందించుకోవడం మరియు చెడు గుణములను నిర్మూలించుకోవటం అనేవి ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన భాగమే. ఒక వ్యక్తిగత డైరీ వ్రాసుకోవటం అనేది మన బలహీనతలను నిర్మూలించుకోవటానికి మరియు సద్గుణములను పెంచుకోవటానికి చాలా దోహదపడుతుంది. ఎంతో మంది గొప్ప వారు, తాము విజయానికి అవసరం అనుకున్న సద్గుణములను పెంపొందించుకోవటానికి డైరీలు, నోట్స్ లు వ్రాసుకున్నారు. మహాత్మా గాంధీ మరియు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇద్దరూ ఇటువంటి పద్ధతులు వాడినట్టు వారి స్వీయచరితములలో పేర్కొన్నారు. మనం భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకుంటూ ఉంటే, మనం సహజంగానే కాలక్రమేణా ఈ శ్రీ కృష్ణుడు పేర్కొన్న దైవీ గుణములను ఆర్జించుకోవచ్చు అని కొందరు వాదిస్తారు. నిజానికి ఇది యదార్థమే, కానీ, మనం ప్రారంభంలోనే సంపూర్ణ భక్తితో, ఏ చెడు గుణములూ లేకుండా మొదలిడుతాము అన్నది కష్టమే. వాటిలో ఏ ఒక్కటి అయినా మన భక్తి పురోగతిలో తీవ్ర అవరోధం కలిగించవచ్చు. చాలా శాతం జనులు, భక్తిని క్రమక్రమంగా అభ్యాసం ద్వారా పెంపొందించుకోవాలి. దైవీ గుణములను పెంపొందించుకోవటం మరియు ఆసురీ గుణములను నిర్మూలించుకోవటం ద్వారా అభ్యాసములో విజయం సాధించవచ్చు. కాబట్టి, భక్తిలో మన పరిశ్రమలో భాగంగా, శ్రీ కృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్పిన దైవీ గుణములను పెంపొందించుకోవటం మరియు ఆసురీ గుణములను త్యజించటం ద్వారా మనలను మనమే నిరంతరం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటాన్ని కొనసాగిస్తూనే ఉండాలి.
ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ ఆసుర ఏవ చ । దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ।। 6 ।।
6
16
https://www.holy-bhagava…udio/016_006.mp3
ద్వౌ — రెండు; భూత-సర్గౌ — సృష్టించ బడిన ప్రాణులలో; లోకే — ఈ లోకంలో; అస్మిన్ — ఇది; దైవః — దివ్య (దైవీ); ఆసురః — ఆసురీ; ఏవ — నిజముగా; చ — మరియు; దైవః — దివ్యమైన; విస్తరశః — విస్తారముగా; ప్రోక్తః — చెప్పాను; ఆసురం — ఆసురీ; పార్థ — అర్జునా, ప్రిథ తనయుడా; మే — నా నుండి; శృణు — వినుము.
BG 16.6: ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు - దైవీ గుణములు కలిగిఉన్నవారు మరియు ఆసురీ స్వభావము కలిగి ఉన్నవారు. నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను, ఓ అర్జునా, ఆసురీ స్వభావమును గురించి చెప్తాను, వినుము.
అన్ని జీవాత్మలు తమతమ పూర్వ జన్మల నుండి వస్తూఉన్న స్వభావాలను కలిగి ఉంటాయి. ఆ ప్రకారంగానే, గత జన్మలలో దైవీ గుణములను పెంపొందించుకున్నవారు మరియు పుణ్య కార్యములను చేసిన వారు, ఈ జన్మలో దైవీ గుణములతో పుడతారు. కానీ, గత జన్మలలో పాపపు పనులు చేసిసవారు, తమ మనస్సులను అపవిత్రం చేసుకున్నవారు, ఈ జన్మలో కూడా అవే స్వభావాలను కలిగిఉంటారు. ఈ ప్రపంచంలో జీవులకు అందుకే విభిన్న రకములైన స్వభావాలు ఉంటాయి. దైవీ మరియు ఆసురీ గుణములు రెండు పూర్తి పరస్పర విరుద్ధ స్వభావములు. స్వర్గాది లోకాలలోఉన్న జీవులు ప్రధానంగా దైవీ గుణములను కలిగి ఉంటారు, అలాగే, ఆసురీ గుణములు క్రింది లోకాలలో ఎక్కువగా ఉంటాయి. మానవులు దైవీ, ఆసురీ గుణములను రెంటినీ కలిగి ఉంటారు. ఏంతో క్రూరమైన కాసాయి వాడికి కూడా, అతనికి వ్యక్తిగత జీవితంలో దయాగుణము ఉన్నట్టు మనము గమనించవచ్చు. అలాగే, ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకులలో కూడా, మనకు గుణ దోషములు కనపడతాయి. సత్య యుగములో దేవతలు, రాక్షసులు వేర్వేరు లోకాలలో ఉండేవారు అని చెప్తారు; త్రేతా-యుగములో వారు ఒకే లోకంలో ఉండేవారు; ద్వాపర యుగములో, ఒకే కుటుంబంలో ఉండేవారు; మరియు కలి యుగంలో, ఒకే వ్యక్తి హృదయంలో దైవీ, ఆసురీ గుణములు కలిసే ఉంటాయని చెప్తారు. అదే మానవ జీవితంలో ఉండే సందిగ్ధావస్థ. ఉన్నత అస్తిత్వము మనల్ని భగవంతుని వైపు పైకి తీసుకువెళితే, నిమ్న స్థాయి అస్తిత్వము మనల్ని క్రిందికి గుంజుతుంటుంది. దైవీ గుణములను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు, ఇక ఇప్పుడు నీచ స్వభావాలని వివరించటం మొదలుపెడతాడు, ఇది మనకు అటువంటి గుణాల్ని గుర్తించి వాటిని నిర్మూలించటానికి దోహదపడుతుంది.
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః । న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ।। 7 ।।
7
16
https://www.holy-bhagava…udio/016_007.mp3
ప్రవృత్తిం — మంచి నడవడిక; చ — మరియు; నివృత్తిం — చెడు నడవడిక; చ — మరియు; జనాః — జనులు ; న, విదుః — అర్థం చేసుకోరు; ఆసురాః — ఆసురీ స్వభావము కలవారు; న శౌచం — స్వచ్ఛత లేకుండా; న — కాదు; అపి — కూడా; చ — మరియు; ఆచారః — నడవడిక; న — కాదు; సత్యం — సత్య సంధత; తేషు — వారిలో; విద్యతే — ఉండును.
BG 16.7: ఆసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు. అందుకే వారు పవిత్రత కానీ, లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధత కూడా కానీ కలిగి ఉండరు.
ధర్మము అంటే ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధతకు మరియు సర్వ భూతముల సాధారణ సంక్షేమానికి దోహదపడే నియమములు. అధర్మము అంటే దిగజారిపోవటానికి దారితీసే మరియు సమాజానికి హాని చేసే, నిషేధింపబడ్డ పనులు. ఆసురీ స్వభావము అనేది జ్ఞానము యందు మరియు శాస్త్ర విజ్ఞానము పట్ల విశ్వాసరాహిత్యముగా ఉంటుంది. కాబట్టి, దాని ప్రభావంలో ఉన్నవారు, ఏది ఒప్పో ఏది తప్పో తెలియని అయోమయ స్థితిలో ఉంటారు. పాశ్చాత్య తత్త్వశాస్త్రములో ప్రస్తుత పరిణామాలే దీనికి ఒక విశిష్ట ఉదాహరణ. ‘రేనైసెన్స్’ తరువాత, ఎన్లైటెన్మెంట్, హ్యుమనిసం, ఏమ్పిరిసిసం, కమ్యూనిసం, ఎక్సిస్టేన్సియలిసం, మరియు స్కెప్టిసిసం (Enlightenment, Humanism, Empiricism, Communism, Existentialism, and Skepticism) వంటి సిద్ధాంతాలను దాటి ఎదిగిన తరువాత, ప్రస్తుతం ఉన్న పాశ్చాత్య తత్త్వ-సిద్ధాంతాన్ని ‘పోస్ట్-మోడరనిసం’ (Post-modernism) అంటున్నారు. ఈ యొక్క పోస్ట్-మోడరనిస్ట్ తత్త్వములో సర్వ సాధారణముగా అనేదేమిటంటే, పరమ సత్యము అనేది ఏమీ లేదు అని. పరమ సత్యము అనేది ఒకటి ఉంటుంది అనే భావనను జనులు తిరస్కరించారు. ‘అంతా సాపేక్షమే’ (All is relative) అనేది పోస్ట్-మోడరనిస్ట్ కాలము యొక్క పిలుపుగా అయిపోయింది. మనము తరచుగా , ‘అది నీకు సత్యమే కావచ్చు కానీ, నాకు కాదు’ అని వింటుంటాము. సత్యము అనేది ఒక వ్యక్తి యొక్క పరిధి లోబడి ఉండే వ్యక్తిగత అభిరుచి లేదా భావము అనే పరిస్థితి వచ్చింది. ఈ దృక్పథం, ఏది ఒప్పు ఏది తప్పు అని నిర్ణయించే నైతికధర్మాలపై చాలా ప్రగాఢమైన ప్రభావం చూపుతుంది. ఒకవేళ పరమ సత్యము అన్నది ఏమీ లేకపోతే, అంతిమంగా ఏది నైతిక ఒప్పు ఏది తప్పు అనేది, ఏ విషయం పైనా స్థిరంగా ఉండదు. అప్పుడు, జనులు ఈ విధంగా అనటం సరియైనది అయిపోతుంది, ‘అది నీకు ఒప్పు కావచ్చు, అంత మాత్రం చేత అది నాకు ఒప్పు అవ్వాల్సిన అవసరం లేదు.’ అని. ఇటువంటి ఆలోచన చాలా మందికి బాగా నచ్చుతుంది, కానీ దాని యొక్క తర్కమును లోతుగా తీసుకెళితే అది అసంబద్ధమైనది మరియు ప్రమాదకరమైనది అని రుజువుఅవుతుంది. ఉదాహరణకు, ఎవరికైనా ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటించకపోవడం ఒప్పుగానే అనిపిస్తే, ఆ వ్యక్తి, తాను ఒప్పు అనుకున్నది చేయటం వలన, ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పెడతాడు. తనకు శత్రువులు అనిపించిన వారి జనసమ్మర్దం ఉన్న ప్రదేశంలో ఆత్మాహుతి దాడి చేయటం, ఎవరికైనా ఒప్పుగా అనిపిస్తే ఎలా? అతనికి మటుకు తాను చేసేది చాలా చాలా సరియైనదే అని అనిపించవచ్చు. కానీ, ప్రపంచానికి ఏమైనా అది సమంజసమే అని అనిపిస్తుందా? పరమ సత్యము అనేది ఏమీ లేకపోతే, ఎవరూ కూడా ‘ఇతను ఇలా చెయ్యాలి’ లేదా ‘ఈమె ఇలా చేయకూడదు’ అని గట్టిగా చెప్పలేరు. మహాఅయితే ఇలా చెప్పగలరు, ‘చాలా మంది జనులు ఈ పనిచేయటం మంచిది అనుకోరు.’ అని. ఈ యొక్క సాపేక్ష (relative) దృక్పథంలో, వ్యక్తి ఇలా బదులు ఇవ్వచ్చు, ‘అది నీకు సత్యమే కావచ్చు , కానీ మాకు మాత్రం ఖచ్చితంగా సత్యము కాదు.’ అని. పరమ సత్యమును తిరస్కరిస్తే, జరిగే అత్యంత ప్రమాదకరమైన పరిణామాలు ఇవి. ఆసురీ స్వభావము అనేది ఏది మంచి ఏది చెడు, అన్న విషయంపై అయోమయ స్థితిలో ఉంటుంది, అందుకే వారిలో స్వచ్ఛత/పవిత్రత కానీ, సత్యము కానీ, సరియైన నడవడిక కానీ అగుపించవు అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. తదుపరి శ్లోకంలో, అటువంటి మనుష్యుల దృక్పథం ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు.
అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ । అపరస్పరసంభూతం కిమన్యత్ కామహైతుకమ్ ।। 8 ।।
8
16
https://www.holy-bhagava…udio/016_008.mp3
అసత్యం — పరమ సత్యము లేకుండా; అప్రతిష్ఠం — ఎటువంటి ఆధారము లేకుండా; తే — వారు; జగత్ — ఈ ప్రపంచము; ఆహుః — అంటారు; అనీశ్వరమ్ — ఈశ్వరుడు లేడని; అపరస్పర — కారణం లేకుండా; సంభూతం — ఉద్భవించినది; కిం — ఏమిటి? అన్యత్ — వేరే ఇతర; కామ-హైతుకమ్ — లైంగిక తృప్తి కోసమే.
BG 16.8: వారు ఇలా అంటారు, ‘ఈ జగత్తులో పరమ సత్యము అనేది ఏదీ లేదు, ఏ రకమైన (నైతిక నియమ) ఆధారము లేదు, మరియు భగవంతుడు (దీనిని సృష్టించింది లేదా నిర్వహించేది) అనేవాడు ఎవరూ లేడు. ఇదంతా స్త్రీ-పురుష సంయోగము వల్లనే ఉద్భవించినది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు.’ అని.
అనైతిక ప్రవర్తన నుండి దూరంగా ఉండటానికి రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది సంకల్ప బలం ద్వారా అధార్మికత నుండి దూరంగా ఉండటం. రెండవది భగవంతుని భయం వల్ల పాపిష్టి పనులకు దూరంగా ఉండటం. కేవలం సంకల్ప బలం వల్ల మాత్రమే పాపపు పనులకు దూరంగా ఉండేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎక్కువ శాతం మంది దండన/శిక్ష భయం వలననే తప్పుడు పనులు చేయటానికి వెనకాడుతారు. ఉదాహరణకు, జాతీయ రహదారిపై పోలీసు వాహనం కనబడగానే అందరూ వేగ పరిమితికి లోబడి తమ వేగాన్ని తగ్గించుకుంటారు, కానీ వారికి పట్టుబడతామనే ప్రమాదం ఏమీ కనపడనప్పుడు, వేగ పరిమితి మించి వెళ్ళటానికి వెనుకాడరు. ఈ విధంగా, భగవంతుడిని గట్టిగా నమ్మితే, ఆయన భయం చేత అనైతిక ప్రవర్తనకు దూరంగా ఉంటాము. మరో పక్క, భగవంతుని పైన విశ్వాసం లేకపోయినా, ఆయన చట్టాలు మాత్రం అన్నీ మనకు వర్తిస్తాయి, మరియు మన చెడు ప్రవర్తన యొక్క పరిణామాలను మనం అనుభవించాల్సిందే. ఆసురీ స్వభావములు కలవారు, భగవంతుని మీద విశ్వాసంతో వచ్చే, ఈ యొక్క, భగవత్ అజమాయిషీని మరియు నియమబద్ధ ప్రవర్తనను అంగీకరించటానికి ఒప్పుకోరు. బదులుగా, అసలు భగవంతుడు అనేవాడు లేడు, మరియు నైతిక ప్రవర్తనకు ఈ ప్రపంచంలో ఆధారం లేదు అన్న దృక్పథాన్నే అవలంభిస్తారు. వారు ‘బిగ్ బ్యాంగ్ థియరీ’ (Big Bang Theory) వంటి వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు; అవి ఈ జగత్తు అంతా ఒక అసంకల్పిత విస్ఫోటం ద్వారా కాలము ప్రారంభమైనప్పుడు సృష్టిచబడింది అని; అందుకే దీనినంతా నిర్వహించే భగవంతుడు అనేవాడు లేనేలేడు అని చెప్తుంటాయి. సంశయము లేకుండా లేదా పరిణామాల మీద భయం లేకుండా, వారికి ఇంద్రియములను తృప్తి పరచటంలో నిమగ్నమవ్వటానికి ఇటువంటి సిద్ధాంతాలు అనుకూలంగా ఉంటాయి. వివిధములైన ఇంద్రియ తృప్తులలో, లైంగిక భోగము తీవ్రమయినది. ఇది ఎందుకంటే, ఈ భౌతిక జగత్తు అనేది ఆద్ధ్యాత్మిక జగత్తు యొక్క ఒక వక్రీకరించబడిన పరావర్తనం వంటిది. ఆధ్యాత్మిక జగత్తులో, ముక్తి నొందిన జీవుల యొక్క కార్యకలాపాలకు మరియు వారు భగవంతునితో చేసే వ్యవహారాలకు, దివ్య ప్రేమ అనేదే మూలాధారము. భౌతిక జగత్తులో, దానియొక్క వక్ర ప్రతిబింబమైన కామమే, భౌతికంగా బద్దులైన జీవుల మనస్సులో ప్రధానంగా ఉంటుంది, మరీ ముఖ్యంగా రజో గుణ ప్రభావంలో ఉన్నవారికి. అందుకే, ఆసురీ మనస్సు కలవారు లైంగిక కార్యకలాపములే మానవ జీవన ప్రయోజనము అని అనుకుంటారు.
ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః । ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః ।। 9 ।।
9
16
https://www.holy-bhagava…udio/016_009.mp3
ఏతాం — ఈ విధమైన; దృష్టిమ్ — దృక్పథము; అవష్టభ్య — కలిగిఉండి; నష్ట — తప్పుదారిపట్టిన; ఆత్మనః — ఆత్మలు; అల్ప-బుద్ధయః — అల్ప బుద్ధులు; ప్రభవంతి — పూనుకుంటారు; ఉగ్ర — క్రూరమైన; కర్మాణః — పనులు; క్షయాయ — వినాశనము; జగతః — జగత్తు యొక్క; అహితాః — శత్రువులు.
BG 16.9: ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి, ఈ తప్పుదోవపట్టిన జీవాత్మలు, అల్ప బుద్ధితో మరియు క్రూర (ఉగ్ర) కార్యములతో, ప్రపంచానికి శత్రువులుగా మారి దానిని విధ్వంసం చేయభయపెడుతారు.
నిజమైన ఆత్మ-జ్ఞానం లేకుండా, ఆసురీ ప్రవృత్తి కలవారు వారి యొక్క మలినమైన బుద్ధిచే యదార్థసత్యము యొక్క వక్రీకరించబడిన దృక్పథాన్ని పుట్టిస్తారు. చార్వాక సిద్ధాంతము దీనికి ఒక ఉదాహరణ; ఈయన భారత దేశ చరిత్రలో ఒక ప్రాచుర్యం పొందిన ఓ భౌతిక వాద తత్త్వవేత్త. ఆయన ఇలా అన్నాడు: యావజ్జీవేత సుఖం జీవేత్, ఋణం కృత్వా ఘృతం పివేత్ భస్మీ భూతస్య దేహస్య పునరాగమనం కుతః ‘బ్రతికినంత కాలం సుఖిస్తూ బ్రతుకు. ఒకవేళ నెయ్యి త్రాగటం ఇష్టమైతే, అప్పుచేసైనా సరే అలాగే చెయ్యి. ఈ శరీరము భస్మమైపోయిన తరువాత, నీవు ఇక ఉండవు, మరియు ఈ లోకం లోకి మళ్లీ రావు (అంటే నీ యొక్క చేష్టల కర్మ ప్రతిక్రియ పరిణామాల గురించి చింతించకు)’ అని. ఈ ప్రకారంగా, ఆసురీ-మనస్తత్త్వం కలవారు, ఆత్మ యొక్క నిత్య శాశ్వత అస్తిత్వమును మరియు కర్మ ఫల ప్రతిచర్యను తిరస్కరిస్తారు; దీనితో వారికి ఏ సంకోచం లేకుండా స్వార్థ పనులలో నిమగ్నమై, ఇంకా, ఇతరుల పట్ల క్రూరంగా కూడా ప్రవర్తించటానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ వారికి ఇతరులపై అధికారం ఉంటే, వారిపై కూడా ఈ తప్పుడుదారి పట్టిన భౌతిక దృక్పథాన్ని రుద్దుతారు. ఇతరులకు బాధ కలిగించి అయినా లేదా ప్రపంచాన్ని నాశనం చేసి అయినా, వారి యొక్క స్వార్థ పూరిత లక్ష్యము సాధించటానికి, సంకోచించరు. చరిత్రలో, హిట్లర్, ముస్సోలిని, స్టాలిన్ వంటి నిరంకుశత్వ ఉన్మాదులు మరియు చక్రవర్తులను మానవజాతి చాలా సార్లు ప్రత్యక్షముగా చూసింది; వారు సత్యము యొక్క తమ స్వంత పాపిష్టి దృక్పథంచే ప్రేరేపితమై, ప్రపంచానికి చెప్పలేని దుఃఖాన్ని మరియు వినాశనాన్ని కలుగ చేశారు.
కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః । మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తంతేఽశుచివ్రతాః ।। 10 ।।
10
16
https://www.holy-bhagava…udio/016_010.mp3
కామం — కామము; ఆశ్రిత్య — ఆశ్రయించి; దుష్పూరం — తృప్తిపరచలేని; దంభ — కపటత్వం; మాన — అహంకారము; మద-అన్వితాః — తప్పుడు సిద్ధాంతాలను అవలంబిస్తూ; మోహాత్ — మోహమునకు గురైనవారు; గృహీత్వా — ఆకర్షితులై; అసత్ — తాత్కాలికమైన; గ్రాహాన్ — విషయములు; ప్రవర్తంతే — ప్రవర్తించెదరు; అశుచి-వ్రతాః — అపవిత్ర సంకల్పంతో.
BG 16.10: తృప్తిపరచలేని కామముతో ఉంటూ, దంభము, దురభిమానము, మరియు గర్వముతో నిండిపోయి, ఈ ఆసురీ లక్షణములు కలవారు తప్పుడు సిద్ధాంతములను పట్టుకునివుంటారు. ఈ విధంగా మోహితులై, వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు.
తృప్తిపరచలేని కామ కోరికల తుష్టి కోసం ప్రయత్నిస్తూ ఆసురీ స్వభావముకలవారు అత్యంత అపవిత్ర హృదయంతో ఉంటారు. కపట బుద్ధితో నిండిపోయి ఏదో మంచి వారిలాగా నటిస్తుంటారు. వారి మోహపూరితమైన బుద్ధి తప్పుడు ఆలోచనలను పాటిస్తుంది మరియు వారి గర్వము, తమ కంటే తెలివికలవారు ఎవరూ లేరు, అన్న భావన కలిగిస్తుంది. తాత్కాలికమైన ఇంద్రియ సుఖముల పట్ల ఆకర్షితులై, వారి బుద్ధి, నీచంగా, స్వార్థ పూరితంగా మరియు గర్విష్ఠిగా అవుతుంది. ఈ విధంగా, వారు శాస్త్ర ఉపదేశాలను పట్టించుకోకుండా, ఏదైతే ధర్మబద్ధమైన, సత్యవంతమైన నడవడికనో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు.
చింతామపరిమేయాం చ ప్రలయాంతాముపాశ్రితాః । కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ।। 11 ।।
11
16
https://www.holy-bhagava…udio/016_011.mp3
చింతాం — చింతలు/ఆందోళనలు; అపరిమేయాం — అంతులేని; చ — మరియు; ప్రలయ-అంతాం — మరణించే వరకూ; ఉపాశ్రితాః — ఆశ్రయించిన వారు; కామ-ఉపభోగ — విషయభోగాలంపటులై; పరమాః — జీవిత ప్రయోజనము; ఏతావత్ — అయినా సరే (ఇంకా ఇదే); ఇతి — ఈ విధముగా; నిశ్చితాః — సంపూర్ణ నిశ్చయముతో ఉందురు.
BG 16.11: వారు అంతులేని చింతలు/ఆందోళనలచే సతమతమై పోతుంటారు, అవి చివరికి మరణం తోనే ముగుస్తాయి. అయినా సరే, వాంఛల సంతుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు.
భౌతిక దృక్పథంలో ఉన్న జనులు తరచుగా ఆధ్యాత్మిక మార్గాన్ని - అది కష్టతరమైనది మరియు భారమైనది అని, మరియు అంతిమ లక్ష్యం చాలా దూరమైనది - అని తిరస్కరిస్తారు. త్వరగా ఫలితాలను ఇచ్చే, ఈ ప్రాపంచిక మార్గాన్నే వారు అనుసరిస్తారు, కానీ, ఆ ప్రాపంచిక మార్గంలో ఇంకా ఎక్కువ బాధలు పడుతుంటారు. భౌతిక సంపాదనలకై ఉన్న వారి కోరికలు వారిని క్షోభకి గురిచేస్తుంటాయి మరియు వారి ఆశయాలను పూర్తిచేసుకోవటానికి ఏవేవో పెద్ద పెద్ద ప్లానులు (ప్రణాళికలు) వేసుకుంటారు. వారు కోరుకున్న వస్తువు పొందగానే, కాసేపు ఉపశమనం పొందినా, వెంటనే కొత్త క్షోభ మొదలవుతుంది. వారు సంపాదించిన వస్తువును ఇతరులెవరైనా తీస్కుంటారేమో అన్న ఆందోళనతో, దానిని కాపాడుకోవటానికి శ్రమిస్తుంటారు. చిట్టచివరికి, ఆ మమకారాసక్తి ఉన్న వస్తు-విషయంతో అనివార్యమైన ఎడబాటు సంభవించినప్పుడు, మిగిలేది దుఃఖమే. అందుకే ఇలా పేర్కొనబడినది: యా చింతా భువి పుత్ర పౌత్ర భరణవ్యాపార సంభాషణే యా చింతా ధన ధాన్య యశసాం లాభే సదా జాయతే సా చింతా యది నందనందన పదద్వంద్వార విందేక్షణం కా చింతా యమరాజ భీమ సదన్ద్వారప్రయాణే విభో (సూక్తి సుధాకరం) ‘ఈ ప్రపంచంలో జనులు చెప్పలేని బాధలను మరియు ఒత్తిడిని, ప్రాపంచిక ప్రయాసలో అనుభవిస్తుంటారు - బిడ్డలను, మనుమళ్లను పెంచటం, వ్యాపారం చేయటం, ఆస్తి-పాస్తులను కూడబెట్టడం, మరియు కీర్తిప్రతిష్ఠ సంపాదించుకోవడం వంటివి. వారు గనక ఇదే విధమైన అనురాగము, శ్రద్ధ ఆ శ్రీ కృష్ణుడి పాదారవిందముల వద్ద ప్రేమను పెంచుకోవటంలో చూపిస్తే, వారు ఇక ఎన్నటికీ ఆ మృత్యు దేవత, యమరాజు గురించి చింతించవలసిన అవసరం ఉండదు. (ఎందుకంటే వారు ఈ జనన-మరణ చక్రము నుండి విముక్తి చేయబడతారు).’ కానీ, ఆసురీప్రవృత్తి కలవారు ఈ పచ్చినిజాన్ని ఒప్పుకోవటానికి తిరస్కరిస్తారు, ఎందుకంటే, ఈ ప్రాపంచిక సుఖాలే అత్యున్నత ఆనందము అని వారి బుద్ధులు నిశ్చయంతో ఉంటాయి. వారిని నికృష్ట లోకాలకు తీసుకుపోవటానికి మరియు మరింత దుఃఖపూరిత తదుపరి జన్మలలోకి తీసుకువెళ్ళటానికి మృత్యువు ఓర్పుతో నిరీక్షిస్తున్నది అని కూడా తెలుసుకోలేరు.
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః । ఈహంతే కామభోగార్థమ్ అన్యాయేనార్థసంచయాన్ ।। 12 ।।
12
16
https://www.holy-bhagava…udio/016_012.mp3
ఆశా-పాశ — కోరికలనే పాశములు; శతైః — వందల కొద్దీ; బద్ధాః — బద్ధులై; కామ — కామము; క్రోధ — కోపము; పరాయణాః — పరాయణులై; ఈహంతే — శ్రమిస్తారు; కామ — కామము; భోగ — ఇంద్రియ తృప్తి; అర్థం — కోసము; అన్యాయేన — అన్యాయముగా; అర్థ — సంపద (డబ్బు); సంచయాన్ — ప్రోగు చేయటానికి.
BG 16.12: వందల కొద్దీ కోరికలచే కట్టివేయబడి, మరియు కామ క్రోధములచే ఆవరించబడి, వారు అన్యాయ పద్ధతులలో సంపదను ప్రోగుచేయటానికి శ్రమిస్తారు, ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే.
ఈ ప్రపంచమును భోగించటానికి డబ్బు ఒక సాధనం. అందుకే అంతులేని కోరికలతో భౌతిక దృక్పథం లో ఉన్న జనులు, డబ్బు సంపాదించటానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు. వారు అన్యాయ పద్ధతులలో డబ్బు ప్రోగుచేసుకోవటానికి కూడా సంకోచించరు. అందుకే, వారి అనైతిక ప్రవర్తనకు రెట్టింపు శిక్ష ఉంటుంది. భాగవతం ఇలా పేర్కొంటుంది: యావద్ భ్రియేత జఠరం తావత్ స్వత్వం హి దేహినాం అధికం యో అభిమన్యేత స స్తేనో దండం అర్హతి (7.14.8) ‘వ్యక్తి జీవన నిర్వహణకు సరిపోయినంత సంపద మాత్రమే ఆ వ్యక్తికి ఉంచుకునే అర్హత ఉంది. (మిగిలినది అంతా దానంలో ఇచ్చేయాలి). ఒకవేళ ఎవరైనా తన అవసరాని కన్నా ఎక్కువ ప్రోగుచేసుకుంటే, భగవంతుని దృష్టిలో అతను దొంగ, మరియు అందుకు శిక్షింపబడుతాడు.’ ఏమిటి ఆ శిక్ష? మొదటగా, మరణ సమయంలో, ప్రోగు చేసుకున్న సంపద మనతో పాటుగా రాదు, అది తీసివేయబడుతుంది. అంతేకాక, కర్మ సిద్ధాంతము అనుసరించి, ఈ సంపత్తి ప్రోగుచేసిన వ్యవహారాల్లో చేసిన పాపములకు శిక్షింపబడుతాడు. ఇది ఎలాగంటే, ఒక దొంగరవాణాదారు (స్మగ్లర్) పట్టుబడితే, అతని సామాను జప్తుచేయబడుతుంది మరియు చట్టాన్ని ఉల్లఘించినందుకు అతనికి శిక్ష కూడా పడుతుంది.
ఇదమద్య మయా లబ్దమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ । ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ।। 13 ।। అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి । ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్ సుఖీ ।। 14 ।। ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా । యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ।। 15 ।।
13
16
https://www.holy-bhagava…/016_013-015.mp3
ఇదం — ఇది; అద్య — ఈనాడు; మయా — నా చేత; లబ్దమ్ — పొందబడెను; ఇమం — ఇది; ప్రాప్స్యే — నేను ఆర్జిస్తాను; మనః-రథమ్ — కోరిక; ఇదం — ఇది; అస్తి — ఉన్నది; ఇదం — ఇది; అపి — కూడా; మే — నాదే ; భవిష్యతి — భవిష్యత్తులో; పునః — మళ్లీ; ధనం — ధనము; అసౌ — ఆ (అతను); మయా — నా చేత; హతః — సంహరింపబడెను; శత్రుః — శత్రువు; హనిష్యే — నేను నాశనం చేసెదను; చ — మరియు; అపరాన్ — ఇతరులను; అపి — కూడా; ఈశ్వరః — ఈశ్వరుడు; అహం — నేను; అహం — నేను; భోగీ — భోగించేవాడిని; సిద్దః — శక్తివంతుడను; అహం — నేను; బల-వాన్ — బలవంతుడను; సుఖీ — సుఖముగా ఉన్నాను; ఆఢ్య — ధనవంతుడను; అభిజన-వాన్ — గొప్ప హోదాలో కల బంధువులు; అస్మి — నాకు; కః — ఎవరు?; అన్యః — ఇతరులు; అస్తి — ఉన్నారు; సదృశః — అటువంటి వారు; మయా — నాకు; యక్ష్యే — యజ్ఞములు చేసెదను; దాస్యామి — దానములు ఇచ్చెదను; మోదిష్యే — ఆనందించెదను; ఇతి — ఈ విధముగా; అజ్ఞాన — అజ్ఞానముతో; విమోహితాః — మోహితులై; (భ్రమలో).
BG 16.13-15: ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు, ‘నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను, నా ఈ కోరికను తీర్చుకుంటాను. ఇదంతా నాదే, రేపు నాకు ఇంకా వస్తుంది. ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు, మరియు నేను మిగతావారిని కూడా నాశనం చేస్తాను! నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని, నేనే ఇదంతా భోగించేది, నేను దోశరహితుడను, నేను శక్తిమంతుడను మరియు నేను ఆనందంగా ఉన్నాను. నేను ధనవంతుడను మరియు గొప్ప హోదాల్లో ఉన్న బంధువులు నాకు ఉన్నారు. నాకు ఇక సాటి ఎవరు? నేను (దేవతలకు) యజ్ఞములు చేస్తాను; దానములు ఇస్తాను; ఆనందిస్తాను.’ ఈ విధంగా, వారు అజ్ఞానముచే భ్రమపడుతుంటారు.
నైతికత్వాన్ని పూర్తిగా విస్మరిస్తూ, తమకేది నచ్చితే దానిని అనుభవించే హక్కు తమకుంది అని ఆసురీ లక్షణములు కలవారు అనుకుంటారు. తన స్వప్రయోజనాలు నెరవేరటం కోసం పరిస్థితులను తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వైదిక కర్మ కాండలు తమకు భౌతిక సంపత్తిని కలుగచేస్తాయి అని తెలుసుకుని, వారు కీర్తి సంపదల కోసం యజ్ఞయాగాదులు కూడా నిర్వహిస్తుంటారు. కానీ, ఎట్లైతే రాబందు ఎత్తులో ఎగిరినా దాని చూపు క్రిందికే నిమగ్నమై ఉంటుందో, ఆసురీ స్వభావము కలవారు కొన్నిసార్లు సమాజంలో ఉన్నతహోదాకి ఎదుగుతారు, కానీ వారి పనులు నీచమైనవిగా మరియు నిమ్నస్థాయిలో ఉంటాయి. ఇటువంటి వారు అధికారాన్ని గౌరవిస్తారు మరియు ‘అధికారంతో ఏమైనా చేయొచ్చు’ (might is right) అన్న సూత్రాన్ని నమ్ముతారు. కాబట్టి, వారి కోరికలను తీర్చుకునేందుకు ఉన్న అవరోధాలను తొలగించటానికి ఇతరులకు హాని చేయటానికి లేదా గాయపరచటానికి కూడా వెనుకాడరు. సూక్తి సుధాకరం నాలుగు రకాలైన మనుష్యులను పేర్కొంటుంది: ఏకే సత్పురుషాః పరార్థ ఘటకాః స్వార్థాన్‌ పరిత్యజ్య యే సామాన్యాస్తు పరార్థముద్యమభృతః స్వార్థావిరోధేన యే తే ఽమీ మానవ రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి యే యే తు ఘ్నంతి నిరర్థకం పరహితం తే కే న జానీమహే ‘మొదటి రకం మనుష్యులు సాధు పురుషులు, వారు ఇతరుల సంక్షేమం కోసం తమ స్వార్థ-ప్రయోజనాన్ని వదిలి పెడతారు. రెండవ రకం మనుష్యులు, సాధారణమైన వారు, వీరు, తమకు హాని/నష్టం కలగనంత వరకూ, ఇతరుల సంక్షేమం కోసం పనిచేస్తారు. మూడవ రకం మనుష్యులు ఆసురీ గుణాలు కలవారు, వారి స్వార్థ-ప్రయోజనం నెరవేరుతుంది అంటే, ఇతరులకు హాని చేయటానికి వెనుకాడరు. ఇక, నాల్గవ రకం మనుష్యులు కూడా ఉంటారు, అకారణంగా ఇతరులను బాధ పెడ్తుంటారు (శాడిస్టిక్ ఆనందం). వారికి సరిపోయే పేరు కూడా లేదు.’ శ్రీ కృష్ణుడు నీచమైన ఆసురీ ప్రవృత్తి గల వారిని ఇక్కడ స్పష్టముగా వివరిస్తున్నాడు. గర్వముతో కళ్ళు మూసుకుపోయి, వారు ఈ విధముగా అనుకుంటారు: ‘నేను ఒక ఐశ్వర్యవంత రాజరిక కుటుంబంలో పుట్టాను. ధనవంతుడను మరియు బలవంతుడను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. భగవంతుని ముందు మ్రోకరిల్లాల్సిన అవసరమూ నాకు లేదు ఎందుకంటే నేనే దేవుడి లాంటి వాడిని’ అని. చాలా సందర్భాలలో, జనులు ‘నేను’ అన్నప్పుడు, అది వారి అహంకారము మాట్లాడుతున్నట్టు, వారు కాదు. ఈ అహంకారము అనేది అభిప్రాయాలు, బాహ్య వేషధారణ, కోపావేశాలు వంటి వాటితో వ్యక్తిగత అనుసంధానం అయి ఉంటుంది. ఈ అహంకారము అనేది దానికే ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటుంది, దాని ప్రభావముచే, జనులు తలంపులు, భావోద్వేగాలు, మరియు జ్ఞాపకాలతో అనుసంధానమై ఉంటారు మరియు వాటిని తమలో భాగమే అనుకుంటారు. ఈ అహంకారమే ‘ఇది నాది’ (యజమానత్వము) అన్న భావన కలిగి ఉంటుంది, కానీ ఈ యజమానత్వము తాత్కాలికమైనదే. దానిలోనే దాగి ఒక ‘ఇది చాలదు’ అన్న గాఢమైన అసంతృప్తి భావన ఉంటుంది. ఈ యొక్క తీరని కోరికే వ్యాకులతని, కలవరపాటుని, విసుగుని, ఆందోళనని మరియు అసంతృప్తిని కలుగ చేస్తుంది. పర్యవసానంగా, యదార్థము యొక్క మరింత వికృతమైన అనుభూతి కలుగుతుంది, అది నిజమైన ఆత్మ నుండి ‘నేను’ ని మరింత దూరం చేస్తుంది. ఈ అహంకారమే మన జీవితంలో అత్యంత పెద్ద అబద్దాన్నిసృష్టిస్తుంది, మనం-కాని దాన్ని మనముగా చూపిస్తుంది. ఈ విధంగా, ధర్మమార్గంలో పురోగతి కోసం, సమస్త మతధర్మాలూ మరియు సాధువులు, మన అహంకార పూరిత ఆలోచనా పరంపరను విధ్వంసం చేయాలని, వేడుకుంటారు. టాఓ తే చింగ్ (The Tao Te Ching) ఇలా పేర్కొన్నారు: ‘పెద్ద పర్వతంగా ఉండటానికి ప్రయత్నించే బదులు, విశ్వపు లోయగా ఉండండి’ (Instead of trying to be the mountain, be the valley of the Universe. (Chapter 6)) నజరేతు యేసు ప్రభువు (Jesus of Nazaret) కూడా ఇలా పేర్కొన్నాడు: ‘మీరు ఆహ్వానించబడినప్పుడు, వెళ్లి అతితక్కువ స్థాయి ప్రదేశంలో కూర్చోండి, తద్వారా హోస్ట్ (యజమాని) వచ్చినప్పుడు, మిత్రమా, పైకి రండి అని అతను మీతో చెప్పవచ్చు. తనను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గించబడును, తనను తాను తగ్గించుకొను ప్రతివాడును హెచ్చింపబడును.’ (లూకా 14:10-11).’(When you are invited, go and sit in the lowest place so that when the host comes, he may say to you, friend, move up higher. For everyone who exalts himself will be humbled, and everyone who humbles himself will be exalted.” (Luke 14:10-11)). సంత్ కబీర్ దీనిని చాలా చక్కగా పేర్కొన్నాడు: ఊంచే పానీ న ఠికే, నీచే హి ఠహరాయే నీచా హోయ సో భరి పీ, ఊంచా ప్యాసా జాయ ‘నీరు ఎత్తులో ఉండిపోదు; అది సహజంగానే పల్లమునకు పారుతుంది. అణకువగా నమ్రతగా ఉన్నవారు (భగవంతుని కృపను) తనివితీరా త్రాగుతారు, అదే సమయంలో గొప్పతో, దంభముతో ఉన్నవారు దాహంతోనే ఉండిపోతారు.’

అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః । ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ ।। 16 ।।
16
16
https://www.holy-bhagava…udio/016_016.mp3
అనేక — చాలా; చిత్త — ఊహలు/తలంపులు; విభ్రాంతాః — ఏటో త్రోవతప్పి; మోహ — భ్రమ; జాల — వల; సమావృతాః — ఆవరింపబడి; ప్రసక్తాః — వ్యసనానికి బానిసై; కామ-భోగేషు — ఇంద్రియ సుఖాల తృప్తి కై; పతంతి — పతనమై; నరకే — నరకానికి; అశుచౌ — శుచి లేని.
BG 16.16: ఇటువంటి ఊహలు, తలంపులతో తప్పుదారి పట్టి, చిత్తభ్రాంతి వలలో చిక్కుకుపోయి, మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసైపోయి, వారు అధోః నరకాలకు పతనమై పోతారు.
అహంకారపు పట్టులో, జనులు తమని తాము తమ యొక్క మనస్సుతో అనుసంధానం చేసుకుని దానియొక్క భ్రష్టుపట్టిన మరియు నిరంతరంగా వచ్చే ఆలోచనా పరంపరకు బానిసై పోతారు. పూర్తిగా తమ మనస్సు యొక్క ఆధీనము లోనికి వెళ్ళిపోతారు, ఏదో పాడైపోయిన టేపురికార్డర్ లా అది పదే పదే తిరుగుతుంటుంది; మరియు వారి మనస్సు సృష్టించిన జగత్తులో నివసిస్తుంటారు. అపవిత్రమైన మనస్సుకి ఇష్టమైన ఇటువంటి ఒక పని ఏమిటంటే, అస్తమానం ఫిర్యాదు చెయ్యటం. అది ఎప్పుడూ మనుష్యుల పట్లే కాక, పరిస్థితుల పట్ల కూడా సణుగుతూ, కోపంతో ఉంటూ ఉంటుంది. దీని యొక్క పరిణామం ఏమిటంటే, ‘ఇలా కాకూడదు’, ‘నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు’, ‘నాకు సరిగా మర్యాద ఇవ్వటం లేదు’, మొదలైనవి. మనకున్న ప్రతి ఒక్క అసంతృప్తి/ఫిర్యాదు మన మనస్సు సృష్టించినదే, మరియు వ్యక్తి దాన్ని గుడ్డిగా పూర్తిగా నమ్మేస్తాడు. తలకాయలో ఉన్న స్వరం, మన జీవితం గురించి దుఃఖపూరిత, ఆందోళనకర, లేదా క్రోధపూరిత కథలను చెప్తుంటుంది. పాపం ఆ వ్యక్తి, అహంకారము యొక్క పట్టులో ఉండి, ఆ చెప్పబడే దానిని నమ్ముతాడు. ఈ అసంతృప్తి/ఫిర్యాదు తీవ్రమైనప్పుడు, అది ఆక్రోశముగా మారుతుంది. ఆక్రోశము అంటే దుఃఖంతో, కోపంగా, వేదనతో, మనస్సు నొప్పించబడినట్టు ఉండటం. ఈ ఆక్రోశము చాలా కాలం ఉండిపోతే, అది వ్యధగా మారుతుంది. వ్యధ అంటే, భూతకాలంలో జరిగిన ఏదేని ఒక సంఘటనతో అనుసంధానమై, పదేపదే ‘నాపట్ల వారు ఇలా చేసారు’ అనే దాని గురించే ఆలోచిస్తూ దానిని మనస్సులోనే ఉంచుకున్న, ఒక తీవ్రమైన, ప్రతికూల భావోద్వేగము. ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అనేదేమిటంటే, అహంకారముచే సృష్టించబడిన, మోహ భ్రాంతి వలలోనే ఉండాలని నిర్ణయించుకున్న ఆసురీ ప్రవృత్తి మనుష్యులు, ఎన్నెన్నో నీచమైన అలోచనలచే సతమతమై పోతుంటారు. అందువలన, వారి భవిష్యత్తుని చీకటి చేసుకుంటారు. మానవులు తమ స్వంతచిత్తముతో కర్మలు చేయటానికి వారికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది, కానీ వారు చేసిన కర్మల యొక్క ఫలితములు వారే నిర్ణయించుకునే అధికారం లేదు. కర్మసిద్ధాంతమును అనుసరించి కర్మఫలములను ఆ భగవంతుడే వారికి ప్రసాదిస్తాడు. రామాయణము ఇలా పేర్కొంటున్నది: కరమ ప్రధాన బిస్వ కరి రాఖా, జో జస కరఇ సో తస ఫల ఛాఖా ‘ఈ జగత్తులో కర్మలు ప్రధానమైనవి. జనులు ఏ కార్యములు చేసినా వాటి ఫలములను అనుభవిస్తారు.’ పర్యవసానంగా, తాము చేసిన కర్మల ప్రతిక్రియలను ప్రతిఒక్కరూ ఎదుర్కోవాల్సిందే. బైబిలు కూడా ఈ విధంగా చెపుతుంది: ‘నీవు చేసుకున్న పాపం నిన్ను తప్పకుండా వెతికిపట్టుకుంటుంది’ (Be sure your sin will find you out. (Numbers 32.23)) . ఆసురీ స్వభావమును ఎంచుకున్న వారిని, వారి తదుపరి జన్మలలో, భగవంతుడు నిమ్ననీచ స్థాయి జీవనం లోనికి పంపించివేస్తాడు. ఈ సూత్రం చాలా సరళమైనది: ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణ వృత్తిస్థా అధో తిష్టంతి తామసాః (గరుడ పురాణం) ‘సాత్త్విక బుద్ధితో ప్రవర్తించేవారు ఉన్నత స్థాయికి వెళతారు; రాజసిక ప్రవృత్తితో వ్యవహరించేవారు మధ్యమ స్థాయిలోనే ఉండిపోతారు; తామసిక మనస్తత్వం తో పనిచేసేవారు మరియు పాపిష్టి పనులపై మొగ్గు చూపేవారు నిమ్న స్థాయి లోకాలకు పడిపోతారు.’
ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః । యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ ।। 17 ।।
17
16
https://www.holy-bhagava…udio/016_017.mp3
ఆత్మ-సంభావితాః — తమకు తామే దురహంకారముగలవారై; స్తబ్ధాః — మూర్ఖులై; ధన — ధనము; మాన — గర్వము; మద — దురహంకారము; అన్వితాః — భరితమైన; యజంతే — యజ్ఞములు చేసెదరు; నామ — పేరుకు మాత్రమే; యజ్ఞైః — యజ్ఞములు; తే — వారు; దంభేన — అట్టహాసముగా; అవిధి-పూర్వకం — శాస్త్ర విధులను ఏమాత్రం పట్టించుకోకుండా.
BG 16.17: ఇటువంటి దురహంకారముతో మరియు మొండిపట్టుదల గల మనుషులు, తమ ధనము, సంపదచే గర్వము, అహంకారముతో నిండి, శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు.
సాధుపురుషులు యజ్ఞములను ఆత్మశుద్ధి కోసం మరియు భగవంతుని ప్రీతి కోసం చేస్తారు. ఇక్కడ జరిగే అపహాస్యం ఏమిటంటే, ఆసురీ స్వభావము కల జనులు కూడా యజ్ఞములు చేస్తారు, కానీ అది అపవిత్ర ఉద్దేశ్యంతో ఉంటుంది. వారు చాలా వైభవోపేత యజ్ఞ కర్మ కాండలు చేస్తారు కానీ అదంతా సమాజం దృష్టిలో పుణ్యాత్ములుగా కనిపించటానికే. వారు, శాస్త్ర ఉపదేశాలను పాటించరు, మరియు తమ స్వార్థ వ్యక్తిగత గొప్ప కోసం మరియు ఏదో చూపించుకోవటానికే చేస్తారు. కానీ, శాస్త్ర ఉపదేశం ఏమిటంటే: గూహితస్య భవేద్ వృద్ధిః కీర్తితస్య భవేత్ క్షయః (మహాభారతం) . మనం చేసిన ఏదేని మంచి పని గురించి గొప్పలు చెప్పుకుంటే, దాని ఫలం తగ్గిపోతుంది; దానిని గోప్యంగా ఉంచితే, దాని ఫలము ఎన్నో రెట్లు పెరుగుతుంది.’ ఆసురీ స్వభావము కలవారు చేసే యజ్ఞ కర్మకాండలను, అవి తప్పుపద్ధతిలో చేయబడతాయని చెప్తూ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు వాటిని తిరస్కరిస్తున్నాడు.
అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః । మామాత్మపరదేహేషు ప్రద్విషంతోఽభ్యసూయకాః ।। 18 ।।
18
16
https://www.holy-bhagava…udio/016_018.mp3
అహంకారం — అహంకారము; బలం — బలము; దర్పం — పొగరుబోతుతనము; కామం — కోరిక; క్రోధం — కోపము; చ — మరియు; సంశ్రితాః — ఆవరింపబడి; మామ్ — నన్ను; ఆత్మ-పర-దేహేషు — తనలో మరియు ఇతరుల దేహములో ఉన్న; ప్రద్విషంతః — దుర్భాషలాడుతూ/ద్వేషిస్తూ; అభ్యసూయకాః — ఆసురీ స్వభావము కలవారు.
BG 16.18: అహంకారము, బలము, గర్వము, కామము, మరియు కోపముచే కళ్ళుమూసుకుపోయి, ఈ అసురీ ప్రవృత్తి కలవారు, తమ దేహములో మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ/ద్వేషిస్తూ ఉంటారు.
ఇక్కడ, శ్రీ కృష్ణుడు, ఆసురీ స్వభావము కలిగిన వారి యొక్క మరింత స్పష్టమైన గుణములను వివరిస్తున్నాడు. వారు పాపిష్ఠివారు, ద్వేషపూరితమైన వారు, క్రూరమైన వారు, జగడమాడు స్వభావముగలవారు మరియు పొగరుబోతులు. స్వయముగా వారికి ఏ మంచి గుణములు లేకపోయినా, ఇతరులలో తప్పులు వెదకటంలో ఆనందిస్తుంటారు. వారికి వారే చాలా ప్రాముఖ్యత ఇచ్చుకుంటారు, ఈ యొక్క సొంత గొప్పలకు పోయే ప్రవృత్తి వలన, వారు ఇతరుల విజయం పట్ల అసూయతో ఉంటారు. ఎప్పుడైనా వారి ప్రణాళికకు అవరోధం కలిగితే, వారికి ఆగ్రహం పెల్లుబికుతుంది, మరియు ఇతరులకు కూడా యాతనకలుగ చేస్తారు, తమకు కూడా హాని కలుగచేసుకుంటారు. పర్యవసానంగా, వారు తమ హృదయంలోని మరియు ఇతరుల హృదయంలోని స్థితమై ఉన్న పరమాత్మను ఉపేక్షించి, తిరస్కరిస్తారు.
తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ । క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ।। 19 ।। ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని । మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్ ।। 20 ।।
19
16
https://www.holy-bhagava…/016_019-020.mp3
తాన్ — ఇవి; అహం — నేను; ద్విషతః — ద్వేషపూరితమైన; క్రూరాన్ — క్రూరమైన; సంసారేషు — ఈ భౌతిక జగత్తులో; నర-అధమాన్ — నరులలో నీచులు అధములు; క్షిపామి — విసిరివేస్తాను; అజస్రమ్ — పదే పదే; అశుభాన్ — అశుభమైన; ఆసురీషు — అసురీ ప్రవృత్తి కలవారు; ఏవ — నిజముగా; యోనిషు — గర్భములలోనికి; ఆసురీం — ఆసురీ ప్రవృత్తికలవారు; యోనిమ్ — గర్భములు; ఆపన్నాః — పొంది; మూఢా — మూఢులు; జన్మని జన్మని — జన్మజన్మలకు; మాం — నన్ను; అప్రాప్య — చేరుకోలేక; ఏవ — కనీసం; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; తతః — ఆ తరువాత; యాంతి — వెళ్లెదరు; అధమాం — హేయమైన; గతిమ్ — గమ్యము.
BG 16.19-20: క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు, అధములు, నీచ నరులను, నేను, భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో, పదే పదే అటువంటి ఆసురీ స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఆసురీ గర్భములలోనే జన్మిస్తుంటాయి. నన్ను చేరుకోలేక, ఓ అర్జునా, అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి.
శ్రీ కృష్ణుడు మళ్ళీ ఒకసారి ఆసురీ మనస్తత్వం యొక్క పరిణామాలను వివరిస్తున్నాడు. వారి యొక్క తదుపరి జన్మలలో, వారికి అదే రకం మనస్తత్వం ఉన్న వారి కుటుంబాలలో జన్మనిస్తాడు, అక్కడ వారికి సరిపోయే విధంగా తమ నీచ స్వభావాన్ని స్వేచ్ఛగా ప్రదర్శించుకునేందుకు వీలైన వాతావరణం ఉంటుంది. ఈ శ్లోకం నుండి, మనం ఇంకా ఏమి చెప్పొచ్చు అంటే, ఎక్కడ పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి, ఏ వాతావరణంలో పుట్టాలి అనేది ఆత్మ చేతిలో ఉండదు. వ్యక్తి యొక్క కర్మను, స్వభావాన్ని బట్టి భగవంతుడే ఆ నిర్ణయం చేస్తాడు. ఈ విధంగా, ఆసురీ గుణములు కలవారు, నిమ్న స్థాయి మరియు నీచ గర్భములలోనికి పంపబడుతారు, దుష్ట బుద్ధి కలవారికి సరిపోయే, పాములు, బల్లులు, మరియు తేళ్లుగా కూడా.

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః । కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ।। 21 ।।
21
16
https://www.holy-bhagava…udio/016_021.mp3
త్రి-విధం — మూడు రకాలైన; నరకస్య — నరకమునకు; ఇదం – ఇది; ద్వారం — ద్వారములు; నాశనం — నాశనము; ఆత్మనః — ఆత్మ; కామః — కామము; క్రోధః — క్రోధము; తథా — మరియు; లోభః — లోభము; తస్మాత్ — కాబట్టి; ఏతత్ — ఇవి; త్రయం — మూడు; త్యజేత్ — త్యజించవలెను (విడిచిపెట్టాలి).
BG 16.21: ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు మూడు ఉన్నాయి - కామము, క్రోధము, మరియు లోభము. కాబట్టి, అందరూ వీటిని విడిచిపెట్టాలి.
శ్రీ కృష్ణుడు ఇప్పుడు ఇక ఈ ఆసురీ స్వభావము యొక్క మూలకారణములను వివరిస్తున్నాడు; కామము (కోరిక), క్రోధము (కోపము), మరియు లోభము (దురాశ) లు దీనికి కారణములు అని సూటిగా చెప్తున్నాడు. ఇంతకు క్రితం 3.36వ శ్లోకములో, అర్జునుడు కృష్ణుడిని, ఎందుకు జనులు వారికి అయిష్టముగానైనా, ఏదో బలీయమైన శక్తి చేపించినట్టు, పాపము చేయటానికి ప్రేపరేపింపబడుతారు? అని అడిగి ఉన్నాడు. శ్రీ కృష్ణుడు దానికి సమాధానంగా, దానికి కారణం కామమే అని, అది తదుపరి కోపముగా మారుతుంది అని, అదే అన్నింటినీ నాశనం చేసే ప్రపంచ శత్రువు అని చెప్పి ఉన్నాడు. 2.62వ శ్లోక వ్యాఖ్యానములో దురాశ (లోభము) కూడా కామము యొక్క మరొక రూపాంతరమే, అని విస్తారముగా వివరించబడినది. కామము, క్రోధము, మరియు లోభము కలిసి ఆసురీ ప్రవృత్తి యొక్క మూలఆధారములుగా ఉంటాయి. అవి మనస్సులో సలుపుతూ, పెరుగుతూ ఉండి, మిగతా అన్ని దుర్గుణములకు పెరిగే అవకాశం ఇస్తాయి. అందుకే, శ్రీ కృష్ణుడు వాటిని నరకమునకు ద్వారములు అని పేర్కొంటున్నాడు మరియు ఆత్మ వినాశనం నుండి కాపాడుకోవటానికి వాటిని దూరంగా ఉంచాలి అని గట్టిగా చెప్తున్నాడు. సంక్షేమం కోరుకునే వారు వీటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి మరియు వాటిని తమ వ్యక్తిత్వం నుండి దూరంగా ఉంచాలి.
ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః । ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిమ్ ।। 22 ।।
22
16
https://www.holy-bhagava…udio/016_022.mp3
ఏతైః — వీటి నుండి; విముక్తః — విముక్తి పొంది; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; తమః-ద్వారైః — చీకటికి ద్వారములు; త్రిభిః — మూడు; నరః — నరుడు; ఆచరతి — శ్రమిస్తారు; ఆత్మనః — ఆత్మ; శ్రేయః — శ్రేయస్సు/సంక్షేమం; తతః — దానిచే; యాతి — పొందుదురు; పరాం — సర్వోన్నత; గతిమ్ — లక్ష్యమును.
BG 16.22: చీకటి దిశగా ఉన్న ఈ మూడు ద్వారముల నుండి ముక్తి పొందిన వారు, ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు, తద్వారా వారు పరమ లక్ష్యమును పొందుతారు.
ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఈ కామ, క్రోధ, లోభములను త్యజించటం వలన జరిగే ఫలితమును వివరిస్తున్నాడు. ఇవి ఉన్నంతకాలం, వ్యక్తులు 'ప్రేయస్సు', అంటే, ప్రస్తుతానికి సుఖంగా అనిపించి, చివరకి చేదుగా ఉండే ఆనందము, వైపు ఆకర్షించబడుతారు. కానీ, భౌతిక పరమైన కోరికలు తగ్గిపోయినప్పుడు, భౌతిక రజోగుణము నుండి స్వేచ్ఛ పొందిన తరువాత, బుద్ధి, ఈ ప్రేయస్సు మార్గంలో ఉండే అవివేకముని గమనించగలుగుతుంది. ఆ తరువాత వ్యక్తి శ్రేయస్సు వైపు తిరుగుతాడు, అంటే, ప్రస్తుతానికి కష్టముగా అనిపించినా చివరికి మధురముగా ఉండే ఆనందము. ఈ శ్రేయస్సు వైపు ఆకర్షితమయ్యేవారికి, జ్ఞానోదయ మార్గము తెరుచుకుంటుంది. దానితో తమ నిత్య శాశ్వత ఆత్మ సంక్షేమం కోసం పరిశ్రమిస్తారు, దానిచే పరమ లక్ష్యం దిశగా ముందుకెళతారు.
యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః । న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ।। 23 ।।
23
16
https://www.holy-bhagava…udio/016_023.mp3
యః — ఎవరైతే; శాస్త్ర-విధిం — శాస్త్ర నియమములను; ఉత్సృజ్య — విస్మరిస్తూ; వర్తతే — ప్రవర్తిస్తే; కామ-కారతః — కామమునకు వశమై; న — కాదు; సః — వారు; సిద్ధిం — పరిపూర్ణత (సిద్ధి); అవాప్నోతి — పొందెదరు; న — కాదు; సుఖం — సుఖము; న — కాదు; పరాం — పరమ; గతిం — గతి (లక్ష్యము).
BG 16.23: ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని, కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో, వారు పరిపూర్ణ సిద్ధిని కానీ, సుఖాన్ని కానీ, చివరకి జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు.
శాస్త్రములు అనేవి మానవులకు జ్ఞానోదయ దిశలో ప్రయాణించటానికి ఇవ్వబడిన మార్గదర్శక పటముల వంటివి. అవి మనకు జ్ఞానమును మరియు అవగాహనను అందిస్తాయి. అవి మనకు, ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదు అనే ఉపదేశాలను కూడా చెపుతాయి. ఈ ఉపదేశములు రెండు రకాలుగా ఉంటాయి - విధి మరియు నిషేధము. కొన్ని చేయవలసిన కార్యములను చెప్పే వాటిని 'విధి' అంటారు. చేయకూడని పనులను చెప్పే వివరణను 'నిషేధం' అంటారు. ఈ రెండు ఉపదేశములను శ్రద్ధతో పాటించటం ద్వారా మానవులు పరిపూర్ణత (సిద్ధి) సాధించవచ్చు. కానీ ఆసురీ గుణములు కలవారు, శాస్త్ర ఉపదేశములు చెప్పిన దాని విరుద్ధంగా ప్రవర్తిస్తారు. నిషేధింపబడిన పనులను చేస్తూ చేయవలసిన విధులను విస్మరిస్తూ ఉంటారు. ఇటువంటి జనులను ఉదహరిస్తూ, శ్రీ కృష్ణుడు - కామ ప్రేరణచే మోహితులై, ఎవరైతే అనుమతింపబడిన మార్గమును త్యజించి, తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తారో, వారు, యదార్థమైన జ్ఞానమును పొందలేరు, పరిపూర్ణ ఆనంద సిద్ధిని పొందలేరు మరియు భౌతిక బంధనము నుండి విముక్తిని కూడా పొందలేరు - అని అంటున్నాడు.
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ । జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ।। 24 ।।
24
16
https://www.holy-bhagava…udio/016_024.mp3
తస్మాత్ — కాబట్టి; శాస్త్రం — శాస్త్రములు; ప్రమాణం — ప్రమాణములు; తే — నీకు; కార్య — విధులు (చేయవలసినవి); అకార్య — నిషేధింపబడిన కార్యములు; వ్యవస్థితౌ — నిర్ణయించుకోవటానికి; జ్ఞాత్వా — తెలుసుకొన్న పిదప; శాస్త్ర — శాస్త్రముల; విధాన — ఉపదేశము; ఉక్తం — తెలియచేయబడిన విధముగా; కర్మ — కర్మలు; కర్తుమ్ — చేయుట; ఇహ — ఈ జగత్తులో; అర్హసి — అర్హుడవు.
BG 16.24: కాబట్టి, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము. శాస్త్ర విధివిధానాలు, ఉపదేశాలను తెలుసుకొనుము మరియు ఆవిధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము.
శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు ఈ అధ్యాయము లోని తన ఉపదేశము యొక్క అంతిమ ముగింపును ఇక్కడ ఇస్తున్నాడు. దైవీ మరియు ఆసురీ గుణములను పోల్చిచూపి, తేడాలను వివరించిన పిదప, ఆసురీ గుణములు ఏ విధంగా నరక లోకాలకు దారి తీస్తాయో వివరించాడు. ఈ విధంగా, శాస్త్ర విధివిధానములను తిరస్కరిస్తే మనకు వచ్చే లాభం ఏమీ లేదు అని ధృవీకరించాడు. ఇప్పుడు, ఏ ఒక్క పని (కార్యము) యొక్క ఔచిత్యం (మంచో చెడో) నిర్ణయించాలన్నా వేద శాస్త్రములే ప్రమాణములు అని గట్టిగా చెప్తున్నాడు. కొన్నికొన్ని సార్లు, మంచి ఉద్దేశ్యంతో ఉన్నవారు కూడా, ‘నేను ఏ నియమాలు పట్టించుకోను, నా మనస్సు చెప్పినట్టే వింటాను, నాకు నచ్చినట్టు చేస్తాను’ అని అంటుంటారు. మనస్సు చెప్పినట్టు అనుసరించటం మంచిదే అనుకున్నా, వారి మనస్సు వారిని తప్పుదోవ పట్టించటం లేదు అన్న గ్యారంటీ లేదుగా? ఇలా ఒక నానుడిలో చెప్పినట్టు, ‘నరకానికి మార్గం మంచి భావాలతోనే వేయబడి ఉంటుంది’ (The road to hell is paved with good intentions) అందుకే, మన మనస్సు మనలను సరియైన దిశలోనే తీసుకువెళుతున్నదా లేదా అనేదాన్ని శాస్త్రములతో పరీక్షించి సరిచూసుకోవాలి. మనుస్మృతి ఇలా పేర్కొంటున్నది: భూతం భవ్యం భవిష్యం చ సర్వం వేదాత్ ప్రసిధ్యతి (12.97) ‘భూత, వర్తమాన, భవిష్యత్తులలో ఏ ఆధ్యాత్మిక సూత్రము యొక్క ప్రామాణికత అయినా వేదము ఆధారంగానే నిర్ణయింపబడాలి.’ కాబట్టి, శాస్త్రముల ఉపదేశం అర్థం చేసుకుని, తద్విధముగానే నడుచుకొమ్మని అర్జునుడికి చెప్తూ ఈ అధ్యాయమును ముగిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు.
అర్జున ఉవాచ । యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః । తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ।। 1 ।।
1
17
https://www.holy-bhagava…udio/017_001.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; యే — ఎవరైతే; శాస్త్ర-విధిం — శాస్త్రములలో విధింపబడిన నియమములను; ఉత్సృజ్య — విస్మరించి (త్యజించి); యజంతే — పూజలు చేస్తుంటారో; శ్రద్ధయా-అన్వితాః — శ్రద్ధ-విశ్వాసములతో; తేషాం — వారి యొక్క; నిష్ఠా — విశ్వాసము; తు — నిజానికి; కా — ఏమిటి?; కృష్ణ — కృష్ణా; సత్త్వం — సత్త్వము; ఆహో — లేదా; రజః — రజో గుణము; తమః — తమో గుణము.
BG 17.1: అర్జునుడు ఇలా అన్నాడు : ఓ కృష్ణా, శాస్త్ర విధులను త్యజించి (విస్మరించి) ఉండి, అయినా శ్రద్ధావిశ్వాసములతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క విశ్వాసము సత్త్వ గుణంలో ఉన్నట్టా లేదా రజో, తమో గుణములలో ఉన్నట్టా?
ఇంతకు క్రితం అధ్యాయములో, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి, ఏ ఏ సద్గుణములను పెంపొందించుకోవాలి మరియు ఎలాంటి వ్యక్తిత్వ లక్షణాలను త్యజించాలి అని అర్థం చేపించటానికి, దైవీ మరియు ఆసురీ స్వభావముల మధ్య తేడా వివరించి ఉన్నాడు. ఆ అధ్యాయం చివరలో, ఎవరైతే శాస్త్ర ఉపదేశాలను విస్మరిస్తూ, శారీరక ఉత్తేజాలను, మనస్సు యొక్క వెర్రితలంపులను అవివేకముగా అనుసరిస్తారో, వారు పరిపూర్ణత (సిద్ధి) లేదా సుఖాన్ని లేదా జనన-మరణ చక్రమునుండి విముక్తిని పొందజాలరు అని పేర్కొన్నాడు. అందుకే ఆయన జనులకు, శాస్త్ర ఉపదేశాలను అనుసరిస్తూ, తద్విధముగా ప్రవర్తించమని చెప్పాడు. ఆ ఉపదేశమే ఈ ప్రస్తుత ప్రశ్నకు దారి తీసింది. వేద శాస్త్రముల ఉపదేశాలు పట్ల విశ్వాసం లేకుండా పూజలు చేసే వారి యొక్క విశ్వాసము ఎలాంటిదో అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ప్రత్యేకంగా, దీనికి సమాధానాన్ని, భౌతిక ప్రకృతి త్రిగుణముల పరంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు.
శ్రీ భగవానువాచ । త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా । సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ।। 2 ।।
2
17
https://www.holy-bhagava…udio/017_002.mp3
శ్రీ భగవాన్-ఉవాచ — పరమేశ్వరుడు ఇలా పలికెను; త్రి-విధా — మూడు విధములుగా; భవతి — ఉండును; శ్రద్ధా — శ్రద్ధ/విశ్వాసము; దేహినాం — జీవాత్మలకు; సా — ఏదైతే; స్వ-భావ-జా — వ్యక్తి యొక్క సహజ సిద్ధ స్వభావము నుండి పుట్టినదై; సాత్త్వికీ — సత్త్వ గుణములో; రాజసీ — రజో గుణము యందు; చ — మరియు; ఏవ — నిజముగా; తామసీ — తమోగుణము; చ — మరియు; ఇతి — ఈ విధముగా; తాం — దీని గురించి; శృణు — వినుము.
BG 17.2: శ్రీ భగవానుడు ఇలా పలికెను : ప్రతి ఒక్క మానవుడు తన సహజసిద్ధ శ్రద్ధ/విశ్వాసము తో జన్మిస్తాడు, ఇది, సాత్త్వికము, రాజసము, లేదా తామసము అనే మూడు విధములుగా ఉండవచ్చును. ఇప్పుడు ఇక ఈ విషయాన్ని వివరించెదను, వినుము.
ఎవ్వరూ కూడా శ్రద్ధ/విశ్వాసము లేకుండా ఉండరు, ఎందుకంటే అది మానవ నైజము యొక్క విడదీయలేని భాగము. వేద శాస్త్రముల పట్ల నమ్మకం లేని వారు కూడా, శ్రద్ధ లేకుండా ఉండరు. వారి యొక్క శ్రద్ధ వేరే చోట ఉంటుంది. అది వారి బుద్ధి కుశలత పైన గాని, వారి ఇంద్రియ అనుభూతి పట్ల గాని, లేదా, వారు నమ్మిన సిద్ధాంతాల పట్ల గాని ఉంటుంది. ఉదాహరణకి, ఎప్పుడైతే జనులు ఇలా అన్నప్పుడు, ‘నేను భగవంతుడిని నమ్మను ఎందుకంటే నేను ఆయనను చూడలేకున్నాను’ అని, - వారికి భగవంతుని పట్ల విశ్వాసం లేదు కానీ, వారి కళ్లపై విశ్వాసం ఉంది. కాబట్టి, వారు తమ కళ్ళకు ఏదైనా కనిపించకపోతే అది లేదు అనుకుంటారు. ఇది కూడా ఒకలాంటి విశ్వాసమే. ఇతరులు ఇలా అంటారు, ‘ప్రాచీన శాస్త్రముల ప్రామాణికత పట్ల నాకు నమ్మకం లేదు. కానీ, ఆధునిక సైన్స్ యొక్క సిధ్ధాంతాలను నమ్ముతాను’ అని; ఇది కూడా ఒకలాంటి శ్రద్ధయే, ఎందుకంటే గడిచిన శతాబ్దాలలో సైన్స్ సిద్ధాంతాలు ఎలా మారుతూ వచ్చాయో మనం చూస్తూనే ఉన్నాము. మనం నిజమని నమ్మే ప్రస్తుత సైన్స్ సూత్రాలు కూడా భవిష్యత్తులో తప్పని నిరూపితం కావచ్చు. ఇవి సత్యమే అని స్వీకరించటం కూడా ఒకలాంటి విశ్వాసమే. ఫిజిక్స్‌లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న, ప్రొఫెసర్ చార్లెస్ హెచ్. టౌన్స్ (Prof. Charles H. Townes), దీనిని చాలా చక్కగా వివరించాడు: ‘సైన్స్ అంటేనే దానికి విశ్వాసం అవసరం. మన తర్కము (లాజిక్) కరెక్టో కాదో మనకే తెలియదు. నీవు అసలు ఉన్నావోలేవో అని నాకు తెలియదు, నేను ఉన్నానో లేనో నీకు తెలియదు. ఏమో మనం ఇదంతా ఊహించుకుంటున్నామో ఏమో. ఈ జగత్తు అంతా ఇక్కడ కనిపించినట్టుగానే ఉన్నది అని నాకు నమ్మకం, అందుకే నీవు ఉన్నావని నమ్ముతున్నాను. నేను దీనికి ఏమీ రుజువు చూపించలేను.... కానీ, నేను వ్యవహారం చేయటానికి ఏదో ఒక ఆధారాన్ని ఒప్పుకోవాలి. “మతం అంటే నమ్మకం” మరియు “సైన్స్ అంటే విజ్ఞానం” (“religion is faith” and “science is knowledge”) అని అనుకోవటం చాలా తప్పని అనుకుంటాను. మనం శాస్త్రజ్ఞులం ఈ బాహ్య ప్రపంచం ఉందని మరియు మన సిద్ధాంతం/తర్కము నిజము అని నమ్ముతాము. దీనిని చాలా సహజంగా తీసుకుంటాము. కానీ, ఇవి కూడా విశ్వాసంతో చేసే పనులు. వీటిని నిరూపించలేము.’ భౌతిక శాస్త్రవేత్త అయినా, లేదా సామాజిక శాస్త్రవేత్త అయినా, లేదా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయినా, విజ్ఞానాన్ని ఒప్పుకోవటానికి నమ్మకంతో వేసే అడుగు చాలా ముఖ్యమైనది. శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు ఎందుకు వేర్వేరు మనుష్యులు వేర్వేరు ప్రదేశాలలో తమ నమ్మకం ఉంచుతారో వివరిస్తున్నాడు.
సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత । శ్రద్ధామయోఽయం పురుషో యో యఛ్చ్రద్ధః స ఏవ సః ।। 3 ।।
3
17
https://www.holy-bhagava…udio/017_003.mp3
సత్త్వ-అనురూపా — తమ తమ మానసిక స్వభావమునకు అనుగుణముగా; సర్వస్య — అందరూ; శ్రద్ధా — విశ్వాసము తో; భవతి — ఉందురు; భారత — అర్జునా, భరత వంశీయుడా; శ్రద్ధామయాః — శ్రద్ధ కలిగి ఉండి; అయం — ఆ; పురుషః — పురుషుడు; యః — ఎవరైతే; యత్-శ్రద్ధాః — వారికి ఏ విధమైన శ్రద్ధ ఉన్నా; సః — వారి యొక్క; ఏవ — నిజముగా; సః — వారు.
BG 17.3: అందరు మనుష్యులు తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటారు. అందరికీ శ్రద్ధావిశ్వాసములు ఉంటాయి, మరియు వారి విశ్వాసము ఎట్టిదో అదే వారి వ్యక్తిత్వముగా ఉంటుంది.
ఇంతకు క్రితం శ్లోకంలో, మన విశ్వాసము ఎక్కడో ఒక చోట ఉంటుంది అని వివరించబడినది. మనం దేనిమీద నమ్మకం కలిగి ఉంటామో, మరియు దేని పట్ల శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటామో అదే ఖచ్చితంగా మన జీవన గమనాన్ని నిర్ణయిస్తుంది. ఎవరైతే డబ్బే జగత్తులో లో అత్యంత ప్రధానము అని విశ్వసిస్తారో, వారు తమ పూర్తి జీవితాన్ని డబ్బుని ప్రోగు చేసుకోవటానికి ఉపయోగిస్తారు. ఎవరైతే కీర్తి ప్రతిష్ఠలే అన్నింటికన్నా ప్రధానము అని అనుకుంటారో వారి సమయాన్ని మరియు శక్తిని రాజకీయ పదవులు మరియు సామాజిక హోదాల కోసం వెచ్చిస్తారు. ఎవరైతే ఉత్తమ విలువల పట్ల విశ్వాసంతో ఉంటారో వారు వాటి కోసం మిగతా అన్నింటినీ త్యజిస్తారు. మహాత్మా గాంధీ గారికి, సత్యము మరియు అహింస యొక్క ప్రాముఖ్యత పట్ల అంతులేని విశ్వాసం ఉండేది; అందుకే, తన నమ్మిక యొక్క బలం ఆధారంగా, ఆయన అహింసా ఉద్యమాన్ని (non-violent movement) ప్రారంభించాడు, ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారత దేశం నుండి తరిమివేయటానికి సహకరించింది. ఎవరైతే భగవత్ ప్రాప్తి యొక్క అతి ముఖ్యమైన ప్రాధాన్యత పట్ల గాఢమైన శ్రద్ధ పెంపొందించుకుంటారో, వారు భగవత్ అన్వేషణ కోసం ప్రాపంచిక జీవితాన్ని వదిలివేస్తారు. ఈ విధంగా, మన శ్రద్ధావిశ్వాసపు స్వభావమే, మన జీవిత దిశను నిర్ణయిస్తుంది; మరియు, మన విశ్వాసము మన మానసిక స్వభావముపై ఆధారపడి ఉంటుంది - అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. ఈ విధంగా, అర్జునుడి ప్రశ్నకు సమాధానముగా, శ్రీ కృష్ణుడు శ్రద్ధావిశ్వాసములు ఏ ఏ రకాలుగా ఉంటాయో చెప్పటం ప్రారంభిస్తున్నాడు.
యజంతే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః । ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః ।। 4 ।।
4
17
https://www.holy-bhagava…udio/017_004.mp3
యజంతే — పూజిస్తారు; సాత్త్వికా — సాత్త్విక భావనలో ఉండేవారు; దేవాన్ — దేవతలు; యక్ష — యక్షులు (శక్తిని మరియు సంపదను కలిగిఉండే గణములు); రక్షాంసి — ఇంద్రియ భోగములు, ప్రతీకారము మరియు క్రోధమును కలిగిఉండే శక్తివంత జీవులు; రాజసాః — రజోగుణ ప్రధానముగా ఉండేవారు; ప్రేతాన్-భూత-గణాన్ — భూతప్రేత గణములు; చ — మరియు; అన్యే — ఇతరులు; యజంతే — ఆరాధిస్తారు; తామసాః — తమో గుణ ప్రధానముగా ఉండేవారు; జనాః — జనులు.
BG 17.4: సత్త్వ గుణములో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు; రజోగుణములో ఉండేవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు; తమో గుణములో ఉండేవారు భూత ప్రేతములను ఆరాధిస్తారు.
మంచివారు మంచి విషయముల పట్ల మరియు చెడ్డ వారు చెడు విషయముల పట్ల ఆకర్షింపబడుతారు అని అంటుంటారు. తమోగుణములో ఉండేవారు, అవి క్రూరమైన దుష్ట స్వభావము కలవి అని తెలిసి కూడా భూతప్రేతముల పట్ల ఆకర్షితమవుతారు. రజోగుణములో ఉండేవారు, యక్షులు మరియు రాక్షసుల పట్ల ఆకర్షితమవుతారు. ఈ అధమ జీవులను శాంతింపజేయడానికి వారు జంతువుల రక్తాన్ని కూడా సమర్పిస్తారు, అటువంటి నిమ్నస్థాయి పూజల యొక్క ఔచిత్యంపై విశ్వాసం కలిగి ఉంటారు. సత్త్వ గుణ ప్రధానముగా ఉండేవారు, దేవతల ఆరాధన పట్ల ఆకర్షితమవుతారు; దేవతలలో వారికి మంచి గుణములు కనిపిస్తాయి. కానీ, భగవత్ అర్పితముగా చేసే పూజయే సరియైన దిశలో ఉన్నట్టు.
అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః । దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ।। 5 ।। కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః । మాం చైవాంతఃశరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్ ।। 6 ।।
5
17
https://www.holy-bhagava…/017_005-006.mp3
అశాస్త్ర-విహితం — శాస్త్ర విరుద్ధమైన; ఘోరం — అతికఠినమైన; తప్యంతే — ఆచరిస్తారు; యే — ఎవరైతే; తపః — తపస్సులు; జనాః —జనులు; దంభ — దంభము/కపటత్వము; అహంకార — అహంకారము; సంయుక్తాః — ఆవరింపబడి; కామ — కోరికలు; రాగ — మమకారాసక్తి; బల — బలము; అన్వితాః — ప్రేరేపింపబడి; కర్షయంతః — యాతనకు గురిచేయుట; శరీర-స్థం — శరీరములో ఉన్న; భూత-గ్రామమ్ — శరీర అవయవాలు; అచేతసః — బుద్ధిహీనతతో; మాం — నన్ను; చ — మరియు; ఏవ — కూడా; అంతః — లోనున్న; శరీర-స్థం — శరీరములోని నివసిస్తున్న; తాన్ — వారు; విద్ధి — తెలుసుకొనుము; ఆసుర-నిశ్చయాన్ — ఆసురీ సంకల్పము కలవారు.
BG 17.5-6: కొంతమంది జనులు, అత్యంత కఠినమైన తపస్సులను, శాస్త్రవిరుద్ధమైనా, తమ దంభం(కపటత్వం) మరియు అహంకారముచే ప్రేరితులై చేస్తారు. కామము మరియు మమకారముచే ప్రేరితులై, వారు తమ శరీర అవయములనే కాక, వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడతారు. ఇటువంటి బుద్ధిహీనులు ఆసురీ గుణసంకల్పంతో ఉన్నవారని తెలుసుకొనుము.
ఆధ్యాత్మికత పేరుమీద, జనులు మూర్ఖపు నిష్ఠ/తపస్సులు చేస్తుంటారు. కొందరు, ఈ ఘోరమైన ఆచారాల్లో భాగంగా, భౌతిక ఉనికి పై ఆధిపత్యము కోసం, ముళ్ల పరుపుల మీద పడుకుంటారు లేదా శరీరంలో చువ్వలను గుచ్చుకుంటారు. మరికొందరు, ఏవో గూఢమైన సిద్ధులకోసం, ఒక చేతిని సంవత్సరాల తరబడి పైకే లేపే ఉంచుతారు. కొంతమంది సూర్యుడి వంకే ఆపకుండా చూస్తుంటారు, అది కంటి చూపుకు ఎంత హానికరమో గమనించకుండా. మరికొందరు ఏవో భౌతిక ప్రతిఫలాల కోసం తమ శరీరములను శుష్కింపచేస్తూ దీర్ఘ కాలం ఉపవాసాలు చేస్తుంటారు. శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు: ‘ఓ అర్జునా, నీవు అడిగావు కదా, శాస్త్ర ఉపదేశాలను పాటించకుండా, అయినా, విశ్వాసంతో పూజించేవారి స్థితి ఎలా ఉంటుంది అని. నేను చెప్పేదేమిటంటే, శ్రద్ధ/నమ్మకము అనేవి తీవ్ర నియమ నిష్ఠలను ఆచరించేవారిలో కూడా కనపడుతుంది, కానీ, అది సరియైన జ్ఞాన-ఆధారముగా లేనిది. ఇటువంటి జనులు తమ పద్ధతి పట్ల ప్రగాఢ నమ్మకంతో ఉంటారు, కానీ వారి నమ్మకం తామసికమైనది. ఎవరైతే తమ భౌతిక శరీరమును దుర్వినియోగం చేస్తూ చిత్రహింసకు గురి చేస్తారో వారు తమ దేహములోనే ఉన్న పరమాత్మను అగౌరవ పరిచినట్టే. ఇవన్నీ శాస్త్ర విధివిధానాలకు విరుద్ధంగా ఉన్నట్టు.’ మూడు రకములైన శ్రద్ధావిశ్వాసాలను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, ఈ మూడింటికి సంబంధించిన, ఆహారము, కార్యకలాపములు, యజ్ఞములు, దానములు మొదలైనవాటిని వివరిస్తున్నాడు.